ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్‌ మందులు ఎందుకు పనిచేయలేదంటే..! | Tanmay Bhat Uses Weight Loss Drugs But It Isnot Working | Sakshi
Sakshi News home page

ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్‌ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..

Feb 26 2026 2:25 PM | Updated on Feb 26 2026 3:04 PM

Tanmay Bhat Uses Weight Loss Drugs But It Isnot Working

ఇటీవల కాలంలో చాలామంది స్లిమ్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కొందరు సహజపద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే..ఇంకొందరు ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు మాత్రం బరువు తగ్గించే టైప్‌2 డయాబెటిస్‌ మందులపై ఆధారపడుతున్నారు. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో.. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గుతుండటం విశేషం. అయితే కొందరిలో ఈ డ్రగ్‌ పనిచేయడం లేదనే విషయం అందరిలోనూ తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. ఎందుకంటే యూట్యూబర్‌, హాస్యనటుడు, రచయిత తన్మయ్‌ భట్‌ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు. నిజంగానే ఈ మెడిసిన్‌ అందరికి ప్రభావవంతంగా పనిచేయదా..? అందుకు గల కారణాల ఏంటి..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

హాస్యనటుడు తన్మయ్‌ భట్‌ టైప్‌2 డయాబెటస్‌ నిర్వహించడానికి ఎఫ్‌డీఏ ఆమోదించిన GLP-1 మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. ఈ సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి GLP-1 మందులు టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడానికి FDA-ఆమోదించిన చికిత్సలు. వీటిని బరువు నిర్వహణకు కూడా వినియోగిస్తారు. తాను GLP-1 మందుల సాయంతో ఆకలి తగ్గించుకోవాలనుకున్నా..కానీ తనకు అంతగా పనిచేయలేదని అన్నారు. తనకు ఆ మందు వినియోగించడంవల్ల ఆకలికి సంబంధించి..బలహీన సంతృప్తి సంకేతాలనే అందించిందని అన్నారు. 

అంతేగాదు తన్మయ్‌ తాను ఈ మందులు వాడక మునుపే నేచురల్‌గా 75 కిలోలుల తగ్గానని అన్నారు. అయితే తనకు కొంగొత్త సాంకేతిక వైద్య విధానాన్ని తెలుసుకోవడం, ‍ప్రయత్నించడం ఇష్టమని ఆ నేపథ్యంలోనే ఈ మెడిసిన్‌ని ప్రయత్నించినట్లు తెలిపారు. ఎందుకు తనకు ఈ మెడిసిన్‌ పనిచేయలేదు ఎవరైన వైద్యులు లేదా నిపుణులు వివరించాలని కూడా కోరారు పోస్ట్‌లో.

నిపుణులు ఏమంటున్నారంటే..
కొందిరిలో ఈ డయాబెటిస్‌ మెడిసిన్‌ బరువు తగ్గడానికి పనిచేయకపోవడానికి పలు విధాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అవన్నీ బేరీజు వేసుకుని గానీ నిర్థారించలేమని చెబుతున్నారు నిపుణులు. 

తక్కువ మోతాదు..
కొన్నిసార్లు వ్యక్తులు GLP-1 మందులతో ఆకలి నియంత్రణలో ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రారంభంలో తక్కువ మోతాదు ఉంటుంది కాబట్టి. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం అవసరం. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతుందని అన్నారు.

ఒక్కోసారి శరీరం స్పందించదు..
కొందరిలో అస్సలు ఈ మెడిసిన్‌ పనిచేయదట. ఎందుకుంటే వారి వారి జన్యు సంబంధిత పరిస్థితతులు, అంతర్లీన జీవక్రియ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందట. అలాగే కొందరు హెల్త్‌ దృష్ట్యా వాడే ఇతర మందుల వల్ల కూడా ఈ మెడిసిన్‌ ప్రభావవంతంగా పనిచేయదని చెబుతున్నారు వైద్యులు.

జీవనశైలి కారణంగా..
అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బాగా తీసుకునే వారిలో ఈ మందుల ప్రభావాన్ని అధిగమిస్తాయట. అలాంటి వారికి అధిక ప్రోటీన్, అధిక ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని జత చేస్తేనే ఈ  GLP-1 మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు .

ఇక్కడ తన్మయ్ భట్ అనుభవం బరువు తగ్గడానికి ఏ విధంగా ఆయన ఈ మెడిసిన్‌ని ఏవిధంగా విరియోగించారనేది అత్యంత ముఖ్యం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల ఈ వెయిట్‌లాస్‌ మందులు వాడాలనుకునేవారు వైద్యులు లేదా నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు ఉపయోగించటమే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి:  అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్‌గా నీతా అంబానీ స్పీచ్‌..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement