breaking news
Health
-
ఇప్పటికీ ఆశ్చర్యమే..! తన ప్రెగ్నెన్సీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించారు సమంత రాజ్ నిడిమోరులు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ప్రసూతి శెలవులు అనంతరం మరిన్ని హిట్లతో మళ్లీ మీ ముందుకు వస్తానని తన అభిమానులకు హామీ ఇచ్చింది నటి సమంత. ఆ తర్వాత నుంచి తన ప్రగ్నెన్సీకి సంబంధించి ప్రతీ అప్డేట్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ చిల్ అవుతోంది సమంత. ఈ జర్నీలో ప్రతి నెల ఓ అద్భుతం..అలాగే ఈ ప్రెగ్నెన్సీ తనకు ఎప్పటీ ఆశ్చర్యమే ఎందుకంటే..అంటూ తన మాతృత్వపు మధురిమకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు రీత్యా పిల్లలు కలిగే అవకాశం లేదనుకున్నాని, అందుకు తామిద్దరం సిద్ధపడిపోయామని చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగినా ఇద్దరం కలిసి ముందుకు సాగుదాం అని అనుకున్నాం. అలా నిర్ణయించుకున్న తరుణంలో ప్రెగ్నెంట్ అని నిర్థారణ కావడం తనని చాలా ఆశ్చర్యంలో ముంచెత్తిందని సంబరంగా చెబుతోంది సమంత. సరిగ్గా తాను ప్రెగ్నెంట్ అని తెలిసింది మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌ల ‘త త తతస్సాదియ్యా పాట’ షూట చేస్తున్నప్పుడే తెలిసిందని, దాంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని నాటి పరిస్థితిని వివరించింది. తనకి 2022లో ఆటోఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ ఉన్నట్లు నిర్థారణ అయినప్పుడు అవేళ తాను పడ్డా నరకం ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అసలు ఆ టైంలో జీవితమే అయిపోయిందనిపించింది, పైగా లేని ఆత్మవిశ్వాసాన్ని కొని తెచ్చుకున్నట్లుగా నటిస్తున్నట్లుగా అనిపించిందంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. అంతేగాదు ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ఎలా స్పందిస్తాననేది కూడా తన నియంత్రణలో లేనట్లుగా, చాలా బలహీనంగా అయిపోయినట్లు అనిపించిందంటూ కన్నీటిపర్యంతమైంది. కానీ ఆ వ్యాధి నుంచి బయటపడేలా వర్కౌట్లు చేస్తూ..మెరుగ్గా మారి, తిరిగి తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ వ్యాధి తనకు జీవితంలో దృఢచిత్తం, ఆశ, విశ్వాసం వంటి విలువల గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని పేర్కొంది. ఆ తర్వాతే తన నటన, జీవితం మరింత వాస్తవికంగా మారినట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ) -
కొద్దిగా తాగినా మద్యం మద్యమే
మద్యం సేవించడం పట్ల ‘ప్రతిరోజూ అత్యంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు’ అనే అపోహ ఉండేది. కానీ అది మౌత్, బుక్కల్ మ్యూకోసా (బుగ్గ లోపల) క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది. మద్యం సేవనం లాలాజల ప్రవాహాన్ని తగ్గిస్తుంది, మైక్రోబయోమ్ అసమతుల్యతకు దారితీస్తుందని హార్వర్డ్ హెల్త్ ప్రచురించింది. » మద్యం సేవించడంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వంటి ప్రముఖ సంస్థలు స్పష్టం చేశాయి. ఉదాహరణకు రోజుకు ఒక గ్లాసు వైన్, బీర్ లేదా ఒక షాట్ స్పిరిట్స్ తీసుకునే అలవాటు వల్ల ‘నోరు, గొంతు, అన్నవాహిక, రొమ్ము, పేగు, కాలేయం క్యాన్సర్లను దరికి చేరుస్తుందని ఆ సంస్థలు హెచ్చరించాయి.» తక్కువ మోతాదు కూడా ఇంత హాని కలిగిస్తుందా అనే సందేహానికి వారి వివరణ ఒక్కటే. మద్యం (ఇథనాల్) ఎంత పరిమాణంలో ఉన్నా అది కణాలకు నష్టం కలిగిస్తుంది. ప్రాథమికంగా అది జీవసంబంధమైన యంత్రాంగం మీద ప్రభావం చూపిస్తుంది. » శరీరం ఆల్కహాల్‌ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దానిని అసిటాల్డిహైడ్ అనే విషపూరిత రసాయనంగా మారుతుంది. ఇది క్యాన్సర్ కారకం. కణాల మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటుంది. డీఎన్ఏ దెబ్బతింటుంది.» మద్యం ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయులను పెంచుతుంది. అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రోజుకు ఒక్క పెగ్ తీసుకున్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 14 శాతం పెరిగినట్లే.» నోరు, గొంతు నుంచి కడుపులోకి చేరే క్రమంలో ఆల్కహాల్ ఒక ద్రావకంలా పనిచేస్తుంది. పర్యావరణ విషపదార్థాలు కణాల్లోకి సులభంగా చొచ్చుకుని పోయి ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. కణజాలం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. » మద్యాన్ని అధిక మోతాదులో సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు అత్యధికంగా ఉంటాయి. తక్కువ మోతాదు కలిగించే ముప్పు కూడా చిన్నదేమీ కాదు, కాబట్టి క్యాన్సర్ నివారణకు మద్యం సేవించకపోవడమే ఉత్తమమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
క్యాన్సర్‌పై ఢీకి.. ‘రెడీ’యేషన్
రేడియేషన్ చికిత్సలకు ఉన్న చరిత్ర దాదాపు 130 ఏళ్లు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రేడియో యాక్టివ్ మెటీరియల్‌ను కనుగొన్నది 1986లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త. అంటే... ఈ ఏడాదికి 2026 ఏడాదికి ఖచ్చితంగా 130 ఏళ్లు నిండుతాయి. ఇక నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ – పోలోనియం, రేడియమ్ వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుగొన్నాక ఈ చికిత్స ప్రాధాన్యం మరింత పెరిగింది. దాదాపు ఈ దశాబ్దకాలంలో రేడియో యాక్టివ్ మెటీరియల్‌తో క్యాన్సర్‌కు చికిత్సలు చేయడంలో అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది. 1970లకు ముందున్న కాలంలో ఎక్స్–రేల రూపంలో వైద్యరంగానికి సేవలందించిన రేడియేషన్ 1970ల తర్వాత సీటీ, ఎమ్మారై లుగా... ఆ తర్వాత 1980లలో పెట్ స్కాన్ వంటి రూపాలలో వైద్యచికిత్సలకు తోడ్పడుతూ వచ్చింది. అటు తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ (ఐజీఆర్టీ) వంటి ఎన్నో కొత్త పద్ధతుల్లో ఈ రేడియేషన్ వైవిధ్య భరితమైన చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక రేడియేషన్చికిత్సల్లోని అనేక అంశాలను పరిశీలిద్దాం.క్యాన్సర్ రంగంలో అత్యంత పురోగతి తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ వంటి అత్యాధునికమైన చికిత్స ప్రక్రియలు రాకముందే దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన చికిత్స ప్రక్రియలు శస్త్రచికిత్సలూ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు. ఇందులో రేడియేషన్ థెరపీలో అనేక రకాల అడ్వాన్స్మెంట్లు చోటు చేసుకున్నాయి. ఆ పురోగతులూ, వాటి ఫలితాలేమిటో చూద్దాం.రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి?శక్తిమంతమైన ఎక్స్–రే వంటి రేడియేషన్స్‌ను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలపై నిశితంగా ప్రసరించేలా చూసి, ఆ కణాన్ని పూర్తిగా తుదముట్టించే చికిత్స ప్రక్రియను ‘రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ఈ కిరణాలు కణాల్లోని డీఎన్ఏ లేదా కణాల్లోని మౌలికాంశాలను దెబ్బతీసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. దాంతో ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం వల్ల క్యాన్సర్ కూడా తొలగిపోతుంది.తొలి నాళ్లలో రేడియేషన్ అనేది అది క్యాన్సర్ కణమా లేదా ఆరోగ్యకరమైన కణమా అన్న విచక్షణ లేకుండా తాను ప్రసరించిన చోట ఉన్న కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉండటంతో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను సంరక్షిస్తూ, వాటికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రంగంలో వచ్చిన ఆధునిక పురోగతితో కేవలం క్యాన్సర్ కణాలపైనే గురిపెట్టగలిగేంత నిశితంగా రేడియేషన్ ఇవ్వడం సాధ్యమవుతోంది.రేడియేషన్ థెరపీలో కొన్ని ముఖ్యమైన రకాలివి... క్యాన్సర్ కణాలు / క్యాన్సర్ గడ్డ (ట్యూమర్) అనేది గుండె, మెదడు, వెన్నుపాము వంటి అత్యంత సున్నితమైన అవయవాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు రేడియేషన్‌ను మరింత జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు మెదడులోని అనేక ప్రాంతాలు దేహంలోని అనేక అవయవాలను నియంత్రిస్తుంటాయి. శస్త్రచికిత్స చేసే సమయంలో మెదడులోని ఏదైనా కీలకమైన అవయవాన్ని నియంత్రించే భాగం దెబ్బతింటే... ఆ అవయవం అచేతనమయ్యే అవకాశముంటుంది. రేడియేషన్ ప్రసరించినప్పుడు కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ... అత్యంత నిశితంగా కేవలం క్యాన్సర్ కణాన్నే గురిపెట్టి దెబ్బతీసే సాంకేతికతా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రధానంగా చెప్పాలంటే రేడియేషన్‌లో బయటి నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ), లోపలి నుంచి ఇచ్చే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీతో పాటు సిస్టమిక్ రేడియేçషన్ థెరపీ (ఎస్ఆర్టీ) అనే మరో రకమైన రేడియేషన్ ప్రక్రియలను చెప్పవచ్చు. ఈ రేడియేషన్ థెరపీలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ)త్రీడీ కన్ఫార్మల్ రేడియేషన థెరపీ – (3 డీసీఆర్టీ): ఇందులో ముందుగా సీటీ వంటి స్కాన్ల సహాయంతో క్యాన్సర్ కణితి (ట్యూమర్) ఎంత పెద్దది, దాని ఆకృతి ఎలా ఉంది, అది దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది అని తెలుసుకుంటారు. ఆ కణితి ఆకృతికి తగ్గట్టుగా కేవలం దానికే తాకేలా రేడియేషన్ కిరణాలను పంపిస్తారు. మనకు కావాల్సిన మేరకే కాంతి ప్రసరించే ఒక పెన్టార్చ్ లాంటి దాన్ని ఊహిస్తే... ఈ పద్ధతిలో కేవలం మనకు కావాల్సిన చిన్న ప్రాంతంపైనే కాంతి పడినట్టే రేడియేషన్ కూడా పడుతుందని అనుకోవచ్చు. దాంతో రేడియేషన్ అన్నది క్యాన్సర్ గడ్డపైనే పడుతూ... పక్కనున్న ఆరోగ్యకరమైన కణజాలానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తారు. మెదడు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి అనేక క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్టీ) ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా జాగ్రత్తగా చూస్తూ ఇస్తారు. దేహంలో ఊపిరితిత్తులూ, డయాఫ్రమ్ లాంటివి నిత్యం కదులుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అలాంటి కదిలే అవయవాలకు రేడియేషన్ ఇవ్వడానికి ఈ ‘ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ’ ఉపయోగడుతుంది. ఉదాహరణకు ఊపిరితీసుకునే సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతూ, ముడుచుకుంటూ... కదలికలతో ఉంటాయి. ఇలా కదిలే సమయంలో రేడియేషన్ అన్నది క్యాన్సర్ లేని మరో ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని తాకకుండా... అవయవం కదులుతున్నప్పటికీ... ఆ కదలికలకు అనుగుణంగా తన ప్రసరణను తానే నియంత్రించుకుంటూ కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశానికే రేడియేషన్ తాకేలా చూస్తుంది.ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (ఐఎమ్ఆర్టీ) ఇందులో వివిధ దిశల నుంచి అంటే రకరకాల కోణాలనుంచి రేడియేషన్ కిరణాలను క్యాన్సర్ కణితిపైకి పంపుతారు. ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో క్యాన్సర్ ఉన్నచోట తీవ్రమైన రేడియేషన్ తాకేలా, క్యాన్సర్ లేని చోట వీలైనంత తక్కువ రేడియేషన్ ప్రసరించేలా చూసే ఈ పద్ధతినే ‘ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డ మరో కీలకమైన ఆరోగ్యకరమైన అవయవానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు... ఆ ఆరోగ్యకరమైన అవయవానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (వీఎమ్‌ఏటీ) అత్యంత ఖచ్చితమైన రీతిలో రేడియేషన్ ఇచ్చే ఈ ప్రక్రియలో రేడియేషన్ ఇచ్చే మెషిన్ క్యాన్సర్ బాధితుడి చుట్టూ తిరుగుతూ వివిధ కోణాల నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. దాంతో క్యాన్సర్ ఉన్న భాగానికి వీలైనంత ఎక్కువగానూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన అవయవాలకు వీలైనంత తక్కువ రేడియేషన్ తాకేలా చూస్తారు. ప్రోస్టేట్, కాలేయం, ప్రాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.శరీరం లోపల నుంచే రేడియేషన్ ఇచ్చే పద్ధతులుఇప్పటివరకూ చెప్పిన పద్ధతులు కాకుండా... రేడియేషన్ వెలువడే పదార్థాన్ని శరీరంలోనే ఉంచి కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ దేహంలో ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. ఇలా రేడియేషన్ ఇవ్వడాన్ని ‘ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ’ అంటారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు.బ్రాకీథెరపీ : ఈ ప్రక్రియలో రేడియోధార్మిక పదార్థాలను అతి చిన్న మోతాదులో దేహంలోని క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపి క్యాన్సర్ గడ్డకు అతి దగ్గరగా ఉండేలా చూస్తారు. ఈ అత్యంత చిన్న మోతాదులో ఉండే రేడియో యాక్టివ్ పదార్థాలు సాధారణంగా చిన్న ‘సీడ్స్’ (విత్తనాల్లాంటి చిన్న పదార్థాలు) రూపంలో ఉంటాయి. అవి అవి క్యాన్సర్గడ్డకు అతి దగ్గరగా ఉండటంతో ఆ రేడియేషన్ ప్రధానంగా క్యాన్సర్ ఉన్న ప్రాంతంలో ప్రభావవంతంగా ప్రసరిస్తూ, గడ్డను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), ఎండోమెట్రియంతో పాటు కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో దీనిని ఉపయోగిస్తారు.ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ (ఐఓఆర్టీ) ఇది కొంచెం ప్రత్యేకమైన పద్ధతి. క్యాన్సర్గడ్డకు శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలోనే రేడియేషన్ కూడా ఇస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బయటకు కనిపించేలా చేశాక... ఆ ప్రాంతానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తారు. అదే సమయంలో పక్కనున్న ఆరోగ్యకరమైన అవయవాలను రక్షించడానికి ప్రత్యేక రక్షణాత్మకమైన ప్రక్రియలను అనుసరిస్తారు. జీర్ణవ్యవస్థలోని కొన్ని క్యాన్సర్లతోపాటు శస్త్రచికిత్స చేయడం కష్టమైన కొన్ని ఇతర రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్) పేరుకు ఇందులో రేడియోసర్జరీ అని ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స కానే కాదు. ఇందులో కత్తితో కోయడం ఉండదు. కాకపోతే ఇందులో చిన్న చిన్న రేడియేషన్ కిరణాలను ఒకేచోట కేంద్రీకృతంగా పడేలా ప్రయోగిస్తారు. దాంతో చాలా ఎక్కువ మోతాదులో తీక్షణంగా పడేలా చేయడంతో క్యాన్సర్ ప్రాంతంపై అత్యంత ఖచ్చితంగా / నిశితంగా కేంద్రీకరించేలా కిరణాలు ప్రసరిస్తాయి. కీలకమైన మెదడు, తల, మెడ ప్రాంతాల్లోని కొన్ని కణుతులకు ఇది ఉపయోగపడుతుంది. మెదడులోని గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్), పిట్యుటరీ ట్యూమర్స్, మెనింజియోమాస్, అకాస్టిక్ న్యూరోమాస్ వంటి కణుతుల్లో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.బయటే ఉండే మెషిన్ నుంచి రేడియేషన్ ఇవ్వగల మరికొన్ని ఆధునిక ప్రక్రియలివి... ప్రోటాన్ థెరపీ : ఇందులోని సాంకేతికత సాధారణ రేడియేషన్ ప్రక్రియ కంటే కాస్తంత వేరుగా ఉంటుంది. ఇందులో ఎక్స్–రేస్ కాకుండాప్రోటాన్లతో రేడియేషన్ ఇస్తూ... ఈ ప్రోటీన్ బీమ్‌ను క్యాన్సర్ గడ్డ తాలూకు ఆకృతికీ, అది లోపల ఎంత లోతు ఉందో అంతే లోతు వరకు ప్రసరించేలా చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ కంటే లోతులో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ ప్రసరించకుండా జాగ్రత్త తీసుకోడానికి వీలవుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, అన్నవాహిక, మెదడు వంటి క్యాన్సర్లలో దీన్ని ఉపయోగిస్తారు.అయితే ప్రోటాన్ థెరపీ అన్నది ప్రతి క్యాన్సర్ బాధితులకూ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పడానికి కుదరదు. ఏ క్యాన్సర్ గడ్డకు ఏ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని డాక్టర్లు క్యాన్సర్ గడ్డ తాలూకు రకం, ఆ గడ్డ పరిమాణం, దాని ఆకృతి వంటి అనేక అంశాలపై ఆధారంగా నిర్ణయిస్తారు.ఎమ్మారై లీనియర్ యాక్సిలరేటర్ : ఇది మరింత ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రక్రియ. ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలోనే ఎమ్మారై ద్వారా కణితిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అంటే... ఇందులో... ఎమ్మారై సహాయంతో గడ్డను చూస్తూ ఉంటూనే అవసరాన్నిబట్టి రేడియేషన్ ఇస్తున్న తీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మృదువైన కణజాలంలో (సాఫ్ట్ టిష్యూ)లలో ఉండే క్యాన్సర్లకు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (ఎస్‌బీఆర్‌టీ) : ఇది కూడా చాలా ఖచ్చితమైన రీతిలో / చాలా నిశితంగా రేడియేషన్ ఇవ్వగల ప్రక్రియ. దాంతో ఇందులో రేడియేషన్‌ను చాలా ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డపైనే కేంద్రీకృతమయ్యేలా చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడం కుదరని పేషెంట్లకూ లేదా శస్త్రచికిత్సకు అనువుగా ఉండని బాధితులకు ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఊపిరితిత్తులు, కాలేయం, ప్రాంక్రియాస్ క్యాన్సర్లతోపాటు ఎముకలకు వ్యాపించిన మరికొన్ని క్యాన్సర్లలో దీన్ని ఉపయోగించవచ్చు.హైపర్ ఆర్క్‌తో అనేక క్యాన్సర్ కణుతులకు చికిత్స: స్టీరియోటాక్టిక్ రేడియేషన్ విధానాల్లో హైపర్ ఆర్క్ రేడియోథెరపీ వంటి అత్యాధునికమైన ప్రక్రియలో ఇప్పుడు మంచి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇందులో... మెదడులోని పలు కణుతులను లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. మొత్తం మెదడుకు కాకుండా... ఒక్కో కణితిని లక్ష్యంగా చేసుకుని అవసరమైన మోతాదులో రేడియేషన్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి స్కాన్ల ఆధారంగా ఈ చికిత్స ప్రణాళికను రూపొందించాక... ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ దిశల నుంచి రేడియేషన కిరణాలు కణితిపై కేంద్రీకృతమయ్యేలా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!కణితిపై అవసరమైన రేడియేషన్ మోతాదు ప్రసరించాక... ఇక దాని బయట ఉండే చోట్ల రేడియేషన్ కిరణాల వేగం తగ్గేలా ఇందులో చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. ఫలితంగా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలంపై రేడియేషన్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇవీ రేడియేషన్ థెరపీలోని కొన్నిప్రాథమికమైన అంశాలలో కొన్ని ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల తమ కుటుంబంలోని క్యాన్సర్ పేషెంట్ల విషయంలో వారి బంధుమిత్రులకూ, పేషెంట్ తాలూకు అటెండెంట్లకూ ఉండే చాలా అపోహాలూ, సందేహాలూ తొలగిపోయే అవకాశాలెక్కువ.రేడియేషన్‌పై ఆధాపడాల్సిన అవసరమేమిటి? క్యాన్సర్ కణం తన ఉనికి, మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తుంటుంది. పైగా ఆ కణం చాలా చిన్నదిగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు కేవలం ఒక చిన్న కణం మిగిలిపోయినా... అది మళ్లీ పెరిగిపోయే ముప్పు ఉండనే ఉంటుంది. అందుకే రేడియేషన్ ద్వారా కొంత ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతిన్నప్పటికీ, ఏ చిన్నకణమూ మిగిలిపోకుండా సమూలంగా నిర్మూలించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో... శస్త్రచికిత్సకు ముందుగా కూడా రేడియేషన్ / కీమో ఉపయోగించి ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉండేంత చిన్నదయ్యేలా చేశాకే సర్జరీ చేస్తుంటారు. ఇలా కూడా రేడియేషన్ ఉపయోగపడుతుంది.ఎవరికీ ఏ రేడియేషన్, ఎంత ఇవ్వాలో నిర్ణయించడమెలా... క్యాన్సర్ బాధితుల్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన వారిలో ఇది చాలా కీలకమైన అంశం. క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన రేడియేషన్ థెరపీ ఇవ్వడం కుదరదు. అనేక అంశాల ఆధారంగా ఏ తరహా క్యాన్సర్ గడ్డకూ లేదా ఏ బాధితుడికి ఏ తరహా రేడియేషన్ ఇవ్వాలనేది అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు (రేడియేషన్ ఆంకాలజిస్టులు) నిర్ణయిస్తారు. వారు చూసే అంశాలివి... అది ఏరకమైన క్యాన్సర్ గడ్డ దాని పరిమాణం ఎంత (ఎంత పెద్దది) దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది చుట్టుపక్కల ఉన్న అవయవాలేమిటి గడ్డ ఎంతవరకు వ్యాపించి ఉంది బయాప్సీ రిపోర్టులో ఏముంది సీటీ, ఎమ్మారై, పెట్ స్కాన్లలో ఉన్న సమాచారమేమిటి క్యాన్సర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి... వంటి అనేక అంశాలను పరిశీలించి ఇవ్వాల్సిన రేడియేషన్‌ను నిర్ణయిస్తారు. డాక్టర్ వినితా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నిర్వహణ: యాసీన్ -
మతిమరుపు నివారణ ఇలా..!
రక్తపోటు పూర్తిగా అదుపులో ఉండి, మధుమేహం (డయాబెటిస్) లేకుండా, పొగతాగకుండా ఉండేవారు... పై రెండు సమస్యలతోపాటు పొగతాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మతిమరపు (డిమెన్షియా) సమస్య లేకుండా దాదాపు 13 ఏళ్లు ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. సగటున చూసిననప్పుడు పై మూడు అంశాలూ లేనివారు 30.1 ఏళ్ల పాటు డిమెన్షియా లేకుండా ఉంటే... డిమెన్షియాకు కారణమయ్యే ఆ మూడు రిస్క్ఫ్యాక్టర్లూ ఉన్నవారు 17.5 ఏళ్ల పాటే డిమెన్షియాను నివారించగలిగారు. ‘న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అమెరికాకు చెందిన ఓ అధ్యయనంలో సగటున 56 ఏళ్ల వయసున్న 12,409 మంది అడల్ట్స్‌ను సుమారు 28 ఏళ్ల పాటు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో వాళ్లలో 3,008 మందికి డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా ముప్పు తెచ్చిపెట్టే పై మూడు అంశాలు ఉన్నప్పటికీ... సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో డిమెన్షియా తక్కువ. మతిమరపు లేకుండా మహిళలు ఎక్కువకాలం జీవించినట్లు కూడా ఈ అధ్యయనం తెలిపింది.‘‘హైబీపీ, డయాబెటిస్, పొగతాగే అలవాటు ఉన్నవాళ్లలో డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు... ఇతర కారణాలతో చిన్న వయసులోనే చనిపోయే అవకాశమూ ఎక్కువే. అంతేకాదు... ఈ అలవాట్లు ఉన్నవాళ్లలో ఆయు ప్రమాణమే కాదు... దాంతోపాటు జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు పదిలంగా ఉండే సమయమూ తగ్గుతాయం’టూ ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు తెలిపారు.మరో అధ్యయనంలో సైతం ఇలాంటి ఫలితాలే... సరిగ్గా ఇదే అంశంపై స్వీడన్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దాదాపు 500 మంది ఆరోగ్యవంతులైన పెద్దలు పాల్గొన్న ఈ అధ్యయనంలో నాలుగేళ్ల పాటు వారిని పరిశీలించారు. ఈ అధ్యయనం చెబుతున్నదాని ప్రకారం... పొగతాగడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలకూ మెదడులోని చిన్న రక్తనాళాలు, వైట్ మ్యాటర్ దెబ్బతినడంతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇలాంటి మార్పులు చివరకు రక్తనాళాలకు సంబంధించిన డిమెన్షియా (వాస్క్యులర్ డిమెన్షియా)కు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌కు కూడా అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉంటుంది. వయసు, జెండర్, జన్యుపరమైన అంశాలను మనం మార్చలేం. అయితే పొగతాగే అలవాటును మానేయడం లేదా ఆ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం, హైబీపీనీ, డయాబెటిస్‌నూ అదుపులో పెట్టుకోవడం వంటి అంశాలు పూర్తిగా మన చేతుల్లో ఉన్నవే. కాబట్టి కనీసం మధ్య వయసు నుంచైనా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం, ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం వంటివి అలవాటు చేసుకుంటే... వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవెంతో కొంత తోడ్పడవచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట.మతిమరపు లేకుండా అంటే... డిమెన్షియాను రానివ్వకుండా చాలాకాలం నిరోధించాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే చాలు. పైగా అవి చాలా సులభం కూడా. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, పొగతాగకపోవడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటి చాలా సులభమైన జీవనశైలి అలవాట్లతో దీర్ఘకాలం పాటు డిమెన్షియా బారిన పడకుండా ఉండటంట తోపాటు చాలాకాలం పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చంటూ రెండు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ జీవనశైలి అలవాట్లేమిటో చూద్దాం... (చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!) -
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు -
ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే రాజకీయంగా సభలు,సమావేశాతో ఎంత బిజీగా ఉన్నా..తన పిట్‌నెస్‌కి సమయం కేటాయిస్తానని ఆమెనే స్వయంగా చెప్పారు. ఒక్కోసారి తన ఫిట్నెస్ మంత్రాని బ్రేక్ చేస్తానని కూడా నవ్వుతూ చెప్పారు. తను ఒక నాయకురాలిగా ఇంతలా బిజీగా ఉన్న అలసట అన్నది తన దరి చేరదని, ఎల్లప్పుడూ చురుకుగా ఉంటానని అన్నారామె. మరి అంతలా ఫిట్‌గా ఉండే ఆమె ఆరోగ్య రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామాతాను బయటకు వెళ్లేటప్పుడు హాయిగా నడిచేలా షూ ధరిస్తానని చెప్పారామె. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మరిగించిన వేడి నీళ్లు రెండు లీటర్లు తప్పనిసరి అని అంటున్నారామె. తనకు వీలు కుదిరితే సైక్లింగ్, యోగా తప్పనిసరి అని అన్నారామె. ఇవేమి కుదరదు అనుకుంటే వేగంగా నడుస్తానని చెప్పారామె. 50 ఏళ్ల వయసులోనూ ఆమె తరుచుగా చీరలోనే సైకిల్ తొక్కుతానని అన్నారామె. ఐదేళ్లక్రితం వరకు జిమ్‌కి వెళ్తుండేదాన్ని అన్నారు. కానీ ఇప్పుడు బయట ప్రదేశాల్లో వాకింగ్, జాగింక్కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తనకొక చెడ్డఅలవాటు కూడా ఉందన్నారు. సదా ప్రచారాలు, బహిరంగ సమావేశాల కారణంగా తన పిట్నెస్ లక్ష్యం దెబ్బతింటుంటుందని అన్నారామె. ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తుంటానని అన్నారామె. డైట్ కోక్ తాగనిదే రోజు గడవదని అన్నారు. అది తన బలహీనతగా పేర్కోన్నారు. అలాగే తాను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనం తినని, సాధ్యమైనంత వరకు కార్యకర్తల ఇళ్లల్లోలేదా ధాబాలో భోజనం చేస్తుంటానని అన్నారు. తన భోజనంలో ఎక్కువుగా కూరగాయలు, మటన్ లేదా చికెన్, జోన్న భక్రీలు తీసుకుంటానని చెప్పారు. అల్పాహరంగా పళ్లు, బాదం పప్పులు, చిరుతిండిగా రెండు రకాల బిస్కెట్లు తింటుంటానని అన్నారు. అలాగే తనకు వేయించిన ఆహారాలు మహా ఇష్టమని అన్నారు. అయితే టీ,కాఫీలకు మాత్రం బానిస కాలేదన్నారు. అలాగే తాను మంచి ఆహార ప్రియురాలినని, ఎంతలా అంటే మహారాష్ట్రలో ఎక్కడెక్కడ అద్బుతమైన ఫుడ్ దొరకుతుందో ఈజీగా చెప్పేయగలను, ఆ ప్రాంతాల్లో ఏం దొరుకుతుందో ఠక్కున చెప్పేస్తానని ధీమాగా చెబుతున్నారామె. అయితే తన దినచర్యలో నాణ్యమైన నిద్ర లేకపోవడం పెద్ద లోపమని అన్నారామె. ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లిగా ఎప్పుడు ఎక్కువసేపు హాయిగా నిద్రపోయిన రోజు లేనే లేదని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా పెద్దలకు కనీసం ఏడు నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని సూచించింది. ఇది నిజంగానే ఆమె ఎదుర్కొంటున్న కీలక లోపంగా పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్నెస్ పరంగా మిగతావన్నీ సవ్యంగా ఉన్నా..నిద్ర అత్యంత కీలకమైనదని, దీనిపై మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. View this post on Instagram A post shared by Supriya Sule (@supriyasule) (చదవండి: ఆ కారణంతో బారత్‌లో జరగాల్సిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రద్దు..! వెల్లువెత్తున్న విమర్శలు) -
ప్రశ్నిస్తేనే సమాధానం.. లైంగిక ఆరోగ్యంపై యువత మాట్లాడాలి!
ప్రశ్నించినప్పుడే ఏ సమస్య అయినా వెలుగులోకి వస్తుంది. చర్చించినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో జరిగే ప్రతి తప్పిదాన్ని ప్రశ్నించే యువత లైంగిక విషయాలపై చర్చించడానికి మొహమాటపడుతోంది. నేడు ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్) – ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నచ్చిన స్లోగన్లు, పోస్టర్లు పెట్టి రోడ్డు మీదకి వచ్చే యువత... కండోమ్, హెచ్ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీఐ), వంటి అంశాలపై మాట్లాడటానికి సంకోచిస్తోంది. అవగాహన లేకపోవడం వల్లే అపోహలు బలపడతాయి. సెప్టెంబర్ 4న ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్)–ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.ఈ ఏడాది ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం థీమ్ ‘ఎవ్రీ బాడీ’. లైంగిక ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని వ్యక్తి ఆరోగ్యం, గౌరవం, హక్కులు, సమ్మతి, సంబంధాలు, మానసిక శ్రేయస్సుతో ముడిపడిన అంశమని ప్రపంచ లైంగిక ఆరోగ్య సంఘం తెలిపింది.స్మార్ట్‌ఫోన్‌తో...యువతను చేరుకోవడానికి భారత్‌కు ఉన్న అతిపెద్ద అవకాశాల్లో డిజిటల్ ప్రపంచం ఒకటి. యువతలో 97.1 శాతం మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 94.3 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. హెఐవీ పరీక్షలు, ఎస్టీఐలు, కండోమ్ వినియోగం, గర్భనిరోధక పద్ధతులపై శాస్త్రీయమైన, సులభమైన, సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా యువతకు చేరవేయాల్సిన అవసరం ఉందని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ సూచిస్తోంది.యువత ఆరోగ్యమే కీలకంభారత్లో సుమారు 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారే. 15–29 ఏళ్ల వారు దాదాపు 27 శాతం ఉన్నారు. ఇంత పెద్ద యువ జనాభా ఉన్న దేశంలో లైంగికత, పునరుత్పత్తి ఆరోగ్యంపై వారికి సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకం. లైంగిక ఆరోగ్యం కేవలం వైద్య అంశం కాదని.. దేశ భవిష్యత్తుతో ముడిపడిన ప్రజారోగ్య అంశమని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ చెబుతోంది.పీర్ ఎడ్యుకేషన్‌తో...ఆరోగ్య సమస్యలపై యువత తమ వయసువారితో మాట్లాడేందుకు ఎక్కువగా సౌకర్యంగా ఉంటారు. అందుకే పీర్ ఆధారిత అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?’ అనే ప్రశ్నను ఒక యువకుడు వైద్యుడిని అడగడానికి సంకోచించినా, తనలాంటి మరో యువకుడిని అడగడానికి అంతగా వెనుకాడకపోవచ్చు. అందుకే పీర్ ఎడ్యుకేటర్లు ఆరోగ్య వ్యవస్థకు, యువతకు మధ్య వారధులుగా నిలవగలరని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ భావిస్తోంది.– చైతన్య వంపుగాని, సాక్షి, న్యూదిల్లీ.ఇవి కూడా చదవండి: సీరియల్‌గా వద్దు రియల్‌గా ఉందాం -
పదకొండేళ్లుగా ఆ అలవాటు ఎంత పనిచేసిందంటే..! చివరికి కడుపులో..
కొన్ని అలవాట్లను చుట్టూ ఉన్న సన్నిహితులు, స్నేహితులు గమనించకపోతే..ఎంతటి ప్రమాదం కొనితెచ్చుకుంటారో చెబుతోంది ఈ ఉదంతం. ఆమెకు తొమ్మిదేళ్లుగా ఉన్న అలవాటు గురించి 20 ఏళ్ల తర్వాత అనారోగ్యం కారణంగా బయటపడి ఆస్పత్రిపాలుజేసింది. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంంది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యువతికి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. వికారం, పదే పదే వాంతులు అవ్వడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె కడుపు పైభాగం ఉబ్బి ఉండటంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్‌లో ఆమె కడుపులో భారీ పరిమాణంలో హెయిర్‌బాల్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆహారనాళం, కడుపు కలిసే చోట చిన్న ప్రేగులకు వెళ్లే ద్వారం వరకు విస్తరించి ఉండటంతో ఎండోస్కోపీతో తొలగించడం సాధ్యం కాలేదు. దాంతో ఆమెకు సర్జరీ చేయక తప్పలేదు. ఇది సుమారు 1.16 కిలోల పరిమాణంలో ఆంగ్ల అక్షరం ‘జే’ ఆకారంలో ఉంది. ఆమె కడుపు దాదాపు జుట్టుతో నిండిపోయి ఉందని, ఎండోస్కోప్ చేస్తే కడుపు పైపొర దెబ్బతినే అవకాశ ఉన్నందున శస్త్ర చికిత్స చేసి ఆ హెయిర్ బాల్ని తొలగించినట్లు తెలిపారు వైద్యులు.హెయిర్‌బాల్ ఏర్పడటానికి కారణం..ఆహారంలా కాకుండా, మానవ వెంట్రుకలు జీర్ణం కావు. వెంట్రుకలను పదేపదే మింగినప్పుడు, అవి క్రమంగా కడుపులో పేరుకుపోతాయి. కాలక్రమేణా, ఆ పదార్థం గట్టిగా అతుక్కుపోయి, ఆహారాన్ని, ఇతర పదార్థాలని గట్టిగా బంధించి ఒక దట్టమైన బెజోర్గా ఏర్పడుతుంది. చిన్న బెజోర్లను కొన్నిసార్లు ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు, కానీ చాలా పెద్దవి లేదా గట్టిగా అతుక్కుపోయిన ఉండలకు శస్త్రచికిత్స అవసరం.ప్రస్తుతం ఆ యవతి ఆరోగ్యం మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందులా ఆకలి లేకపోవడం, అరగకపోవడం వంటి సమస్యలు ఆమెకు లేవన్నారు. అయితే ఆమె ఏళ్ల తరబడి వెంట్రుకలు తినే అలవాటు ఉందని, ఎవ్వరికీ ఇది తెలియలేదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలా వెంట్రుకలు తినే అలవాటుని ట్రైకోఫాగియా అంటారు. ఈ అలవాటుని నుంచి బయపటడకుండా వెంట్రుకల ఉండను తొలగిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదంటున్నారు. అలాంటి అలవాటు ఉన్నవారిని సైక్రియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్ పోలీస్‌గా!) -
పదే.. పదే..చేసిందే..? ఆ వ్యాధి తీరు అలానే ఉంటుందా?
ఓ ఆలోచన వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది. ‘అబ్బా... ఆ ఆలోచన ఎందుకొచ్చిందో... రాకపోతే బాగుండు’ అని మనసు చెబుతుంది. కానీ ఎంత సముదాయించినప్పటికీ అదే అదే ఆలోచన పదే పదే వస్తుంటుంది. ‘రాకూడదని ఆలోచన కదా ఇదీ, మళ్లీ మళ్లీ ఎందుకొస్తోంది?’ అనే ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళనతో... ఆలోచనా... అలాగే ఆ ఆలోచనతో ఆందోళన... ఇదో విష వలయంలా వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనసుపై మరింత ఒత్తిడి కలుగుతుంది. మరింత పర్ఫెక్ట్గా చేస్తే దాంతో ఆ ఆందోళన తప్పుతుందేమో అని చేసిందే చేస్తుంటారు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ, చేస్తున్న పనే మళ్లీ మళ్లీ చేస్తూ చేస్తూ విసిగిపోతుంటారు. అలసిపోతుంటారు. అయినా ఆ పరంపర ఆగదు. అలాంటి మానసిక రుగ్మత పేరే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. ఈ పేరుకంటే ‘ఓసీడీ’ అనే మాట చాలామందికి అర్థమవుతుంది. అసలీ జబ్బు తీరుతెన్నులేమిటో, అలా పదే పదే చేస్తున్న పనులూ, ఆలోచనలూ ఎన్ని రకాలుగా వస్తుంటాయో, వాటిని అధిగమించడమెలాగో తెలిపేదే ఈ కథనం.గతంతో పోలిస్తే ఇటీవల మానసిక వ్యాధులపై అవగాహన పెరిగి ఓసీడీ చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మహిళలూ, పురుషులూ ఇద్దరిలో కనిపించే ఈ వ్యాధి వ్యాప్తినీ, విస్తృతిని చూస్తే... సాధారణంగా 0.6 నుంచి 1 శాతం మందిలో కనిపించే ఈ మానసిక రుగ్మత విద్యార్థి వర్గాల్లో (స్టూడెంట్స్ గ్రూప్)లో అత్యధికంగా 3.3 శాతం కనిపిస్తుండటం ఆందోళనకరం. అందుకే దీని గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరం కూడా.కుటుంబ సభ్యులకూ వేదనే... ఒక ఓసీడీ బాధితుడి వల్ల కేవలం అతడు మాత్రమే కాదు... వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడుతుంటారు. తాము ఎంత సముదాయించినప్పటికీ వినకుండా... బాధితుడు పదే పదే అదే పని చేస్తుండటంతో వాళ్లు కూడా ఎంతో వేదనకు గురవుతుంటారు. తాము చేస్తున్న పని కుటుంబ సభ్యులనూ, బంధువులనూ, మిత్రుల్నీ ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెడుతోందని గ్రహించాక వాళ్లలో తమ మీద తమకే కోపం పెరుగుతుంది. నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. అయినప్పటికీ ఈ పనుల పరంపరం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా తామూ, కుటుంబసభ్యులూ, మిత్రులూ వేదనకు గురవుతుంటారు.ఓసీడీతో మూఢ నమ్మకాలూ పెరిగే అవకాశం... మామూలుగానే మన సమాజంలో మూఢ నమ్మకాలు చాలా ఎక్కువ. మనం ఒక పని లేదా పూజ లేదా ప్రార్థన లేదా ఇంకేదైనా రిట్యువలిస్టిక్ క్రతువు చేయడం వల్ల మనకు లాభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉందనుకుందాం. ఇక ఆ పని/ పూజ / రిట్యువల్ను చేయడం మొదలు పెడతారు. ముందు చేసిన పని సక్రమంగా చేయలేదేమో అంటూ మళ్లీ మళ్లీ కొనసాగిస్తారు. ఇలా ఓసీడీతో ఉన్నవారిలో రిట్యువలిస్టివ్ బిహేవియర్ పెరుగుతుంది. దానివల్ల చాదస్తం ఎక్కువైనట్లు కనిపిస్తుంది.అవగాహన ఉన్నవారికీ... లేనివారికీ ఇబ్బందే... ఓసీడీ ఉన్నవారిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొందరికి తాము చేస్తున్న పని అంత సరికాదనీ, దాని కారణంగా ఎంతో సమయం వృథా అవుతోందని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాంతో తమ ఇబ్బందిని అధిగమించడానికి నిపుణుల సహాయం తీసుకుంటారు. అయితే మన సమాజంలోనే చాలామందికి ఇది ఒక తీవ్రమైన జబ్బనీ, దీనికి చికిత్స ఉందనే అవగాహన చాలా తక్కువ. ఇలాంటి ఓ జబ్బు ఉందన్న విషయం కొంతమందికి తెలియనే తెలియదు. అలా తెలియక΄ోవడంతో చేసిన పనే చేస్తూ, తమకు ఇబ్బంది కలిగించే ఆ ఆలోచనలను అదేపనిగా కొనసాగిస్తూ తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ జబ్బు తీవ్రతను పెంచుకుంటారు. సాధారణంగా ఇది అవగాహన లేనివారిలో కనిపించే పరిస్థితి.లక్షణాలు... మన సమాజంలో సాధారణంగా కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో కనిపించే ఓసీడీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం కడగడానికీ, పరిసరాలనూ, వస్తువులనూ శుభ్రంగా ఉంచడానికి మాత్రమే కాకుండా అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. వాటిలో కొన్ని చాలా ఆసక్తికరంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం. తీవ్రమైన అబ్సెషన్ : కొందరిలో కొన్ని అంశాల పట్ల తీవ్రమైన భయం ఉంటుంది. ఎవరైనా మనకు హాని చేస్తారేమోననే ఆలోచన వస్తుంటుంది. అది అర్థం లేని ఆలోచన అని తెలిసినప్పటికీ ఆ తరహా ఆలోచనలు అదేపనిగా వస్తూ ఒత్తిడిని పెంచేస్తాయి. దాంతో ఆందోళనా పెరుగుతుంది. మనం మన సంస్కారం కారణంగా ఒక పని ఎప్పటికీ చేయబోమని తెలిసినప్పటికీ అది చేసేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదురుగా ఉండనివ్వదు. ఉదాహరణకు మనం ఎప్పటికీ దొంగతనం చేయం. లేదా అసభ్యంగా ప్రవర్తించబోం. కానీ ఆ పని చేస్తామేమో అనే ఆలోచన వచ్చి అది మనలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. కంటామినేషన్ అబ్సెషన్ : దేనినైనా తాకడం వల్ల మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని కుదిపేస్తుంది. ఉదాహరణకు మనం మూత్రవిసర్జన, మలవిసర్జనలు శుభ్రమైన చోటనే చేసినప్పటికీ.. అక్కడ అపరిశుభ్రత ఉందేమో... ఆ అపరిశుభ్రమైన ప్రదేశంలో విసర్జన చేసినందుకు ఏవైనా వ్యాధులు వచ్చేస్తాయేమోననే ఆందోళన కలుగుతుంది.సెక్స్‌పరమైన అబ్సెషన్ : మనలోని అంతర్గత సెక్స్ ఆలోచనలు, మనం రాకూడదని కోరుకుంటున్న సెక్స్ ఆలోచనలు రావడమే కాకుండా... మనమెంతో గౌరవంగా, పూజనీయంగా చూసేవాళ్ల పట్ల చెడు ఆలోచనలు వస్తూ... అవి ఎంత నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా కొనసాగుతూ మనసును ఒత్తిడికీ, తీవ్రమైన అపరాధభావనకూ గురిచేస్తుంటాయి. దేవుళ్లు, దేవతల గురించి ఆవాంఛిత ఆలోచనలు : కొందరిలో దేవుళ్లు, దేవతల గురించి రాకూడని ఆలోచనలు వస్తుంటాయి. దాంతో తాము ఏదైనా తీవ్రమైన పనికి ఒడిగడుతున్నామేమో అన్న ఆందోళన పెరిగిపోయి వారు మరింత ఉద్విగ్నతకూ, భయానికీ, అపరాధభావనకూ గురవుతుంటారు. పనికిరాని వస్తువులను సేకరించి దాచడం : కొందరు తమకు ఏమాత్రం ఉపయోగపడని వస్తువులను దాచుకుంటూ ఉంటారు. దాంతో తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని తెలిసినా వాటిని వదిలేయలేరు. పారేయలేరు. సిమెట్రీ / ఎగ్జాక్ట్నెస్ : కొందరు తాము ఆఫీస్‌లో చేసే పనుల్లో గానీ లేదా ఇతర పనుల్లో గానీ పూర్తి స్థాయి పర్ఫెక్షన్ ఇంకా సాధించలేదనే అభిప్రాయంతో మరింత పర్ఫెక్షన్ కోసం చేసిందే చేస్తూ, మెరుగులు దిద్దుతూ సమయం వృథా చేస్తుంటారు. సొమాటిక్ అబ్సెషన్ : ఈ సమస్య ఉన్నవాళ్లలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ దేహంలోనో, అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, డాక్టర్లు సమస్య ఏదీ లేదని చెప్పాక కూడా చేయించిన పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తూ... డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు.కంపల్షన్ పనుల జాబితాలో ఇవి కొన్ని... కడిగిందే మళ్లీ మళ్లీ కడగడం తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మాటిమాటికీ చూడటం, స్టవ్ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ వెళ్లి చూస్తుండటం, తాము చేసే పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్ఫర్మ్ చేసుకోడానికి మళ్లీ మళ్లీ చేసిన పనే చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పడేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం), రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం, లెక్కపెట్టిన డబ్బుల్ని మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి.ఓసీడీ కారణంగా దుష్ప్రభావాలివి.. ఓసీడీ వల్ల చాలామందిలో ఒత్తిడీ, ఆందోళనా పెరుగుతాయి. నిరాశ, నిస్పృహలు ఫ్రస్ట్రేషన్ రూపంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. తమపై తమకు నమ్మకమూ, ఆత్మవిశ్వాసం తగ్గి΄ోతాయి. రోజువారీ పనుల్లో సమయం ఎంతగానో వృథాకావడంతో సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలో, జీవితంలోని నాణ్యతనూ, డబ్బునూ, కుటుంబసభ్యులూ, బంధువులూ, స్నేహితులతో తమ మానవ సంబంధాలనూ తీవ్రంగా దెబ్బతీస్తుంది.ఓసీడీకి కారణమిది... మెదడులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మెదడు అనేది ఒక కంప్యూటర్ అనుకుంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు... ఆ ఆలోచనను ఆపేయడానికి ఒక స్విచ్ / సర్క్యూట్ ఉంటుంది. అది పనిచేయనప్పుడు అదే ఆలోచన పదే పదే వస్తూ ఆ ఆలోచన వల్ల వచ్చే పనిని కొనసాగిస్తుంటారు. కొన్ని జన్యుపరమైన మార్పులతో ఇది కుటుంబంలోనూ, వంశపారంపర్యంగా కొందరిలో మెదడులోని సర్క్యూట్స్‌లో లోపాలు కనిపిస్తుంటాయి.నిర్ధారణ... ఓసీడీ జబ్బును వారిలో కనిపించే లక్షణాల ద్వారానూ, బాధితుల పరిస్థితిని బంధువులు, స్నేహితులు చెప్పడం ద్వారా తెలుసుకోవచ్చు.చివరిగా... ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే... ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇటీవల ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన మెరుగుదల కనిపించడమన్నది చాలా సానుకూల అంశం. అసలు ఓసీడీ అంటే ఏమిటంటే...‘ఓసీడీ’ సంక్షిప్త రూపంలోని అక్షరాల్లో... ‘ఓ’ అంటే అబ్సెషన్ అనీ, ‘సీ’ అంటే కంపల్షన్ అనీ, ‘డీ’ అంటే డిజార్డర్ అనే పదాలను సూచిస్తాయి. ఇందులో ‘అబ్సెషన్’ అంటే... ఓ ఆలోచన మనసులోకి వచ్చాక అది... పదే పదే వస్తుండటం. ఆ ఆలోచనను ఎంతగా వదిలించుకోవాలని చూసినా ఆగకుండా మళ్లీ మళ్లీ అదే ఆలోచన రావడం. ఈ ఆలోచన అన్నది ఒక చిత్రం (ఇమేజ్) కావచ్చు లేదా మనం కోరుకోని అంశం కావచ్చు. దాంతో మనసులో తీవ్రమైన అసౌకర్యం, ఇబ్బంది, మనసు మీద ఒత్తిడి పెరుగుతాయి. ఇక కంపల్షన్ (సీ) అంటే... ఆ ఆలోచనను వల్ల వచ్చే ఆందోళనను తగ్గించడానికి తప్పనిసరిగా పదే పదే చేసే పనిని ‘కంపల్షన్’ అంటారు. దాంతో ఒక పనిని మళ్లీ మళ్లీ చేయాల్సి రావడంతో సమయం వృథా అవుతుంది. విసుగు పడుతుంది. అలసిపోయినప్పటికీ ఏదో లోపముందనే ఆలోచనతో... మళ్లీ మళ్లీ పనిచేసేలా ఆ కంపల్షన్ను పురిగొల్పుతుంది. ఇందుకు పాపులర్ ఉదాహరణ ఏమిటంటే.., ఎవరికైనా తమ చేతులు శుభ్రంగా లేవని అనిపించే ఓ ఆలోచన మనసులోకి వస్తే... ఇక వాటిని శుభ్రపరిచేందుకు అతడు పదే పదే చేతుల్ని కడుగుతుంటాడు. ఎంత కడిగినా ఇంకా శుభ్రం కాలేదనే ఆలోచనతో కడిగిన చేతుల్నే మళ్లీ మళ్లీ కడిగిస్తూ ఉంటుంది. ఆ విధమైన ఆలోచనలు... డిప్రెషన్లో కనిపించే ఆత్మహత్యాధోరణులు ఓసీడీలోనూ కనిపిస్తాయి. కొన్ని రకాల ఆలోచనలు అదేపనిగా వస్తుండటంతో అపరాధ భావన (గిల్ట్), ఆందోళనతో వీళ్లలో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు (సూసైడల్ టెండెన్సీస్) పెరుగుతాయి.చికిత్స...ఓసీడీ చికిత్సలో బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ అనే ప్రక్రియలతో బాధితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకే... బాధితుడిని నెమ్మది నెమ్మదిగా గురిచేస్తూ... వాటి వల్ల అతడికి ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడమనేది ఈ చికిత్సల్లో అవలంబించే ఒక పద్ధతి. ఈ సమస్యకు కొన్ని మందులూ అందుబాటులో ఉన్నాయి. ఈ మందులతో దుష్ప్రభావాలు ఉంటాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. వాస్తవానికి అవి ఇతర మందుల్లాగానే చాలా సేఫ్. కానీ అవగాహన లోపం వల్ల చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఎస్ఎస్ఆర్ఐస్, ట్రైస్లైక్లిక్స్ వంటి మందుల్ని ఓసీడీ తగ్గించడానికి వాడుతుంటారు. అయితే ఇతర ఔషధాల్లాగే.. ఈ మందుల్ని డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్ సైకియాట్రిస్ట్నిర్వహణ యాసీన్ (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!) -
తీహార్ జైల్లో అమెరికన్ సైనికుడు.. విడుదలకు కుటుంబ సభ్యుల అభ్యర్థన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుడు, మాజీ సైనికుడు మాథ్యూ వాన్‌డైక్‌కు ప్రాథమిక ఖైదీ హక్కులు లభించడం లేదని, అతని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని, అతడిని స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాన్డైక్ను అరెస్టు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్ 18 కింద ఉగ్రవాద కుట్ర అభియోగాలు నమోదు చేసింది.అనుమతి లేకుండా మిజోరంలో ప్రవేశించి, అక్రమంగా మయన్మార్‌కు వెళ్లినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మయన్మార్‌లోని సాయుధ గ్రూపులకు డ్రోన్ల అసెంబ్లింగ్, ఆపరేషన్, జామర్ల వినియోగం వంటి యుద్ధ శిక్షణ అందించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ గ్రూపులు ఐరోపా నుంచి డ్రోన్లు తెప్పించి, ఈశాన్య భారత నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు చేరవేసేందుకు ప్రణాళిక రచించినట్లు ఆరోపించింది.ప్రస్తుతం తీహార్‌లోని జైలు నంబర్ 8/9లో ఉన్న వాన్‌డైక్ కంటిచూపు మందగించిందని, కాలి గాయంతో నడవలేక వీల్‌చైర్‌కే పరిమితమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు, కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జైలులోని ఆహారం పడక 14 కిలోల బరువు తగ్గాడని, ప్రత్యేక ఆహారం కోసం ఆయన గతంలో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. బాల్టిమోర్‌కు చెందిన వాన్‌డైక్ ‘సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడిగా లిబియా, సిరియా, ఉక్రెయిన్ వంటి యుద్ధ క్షేత్రాల్లో పనిచేశారు. ఆయనకు సీఐఏతో సంబంధాలున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, బహిరంగ ఆధారాలు లేవని తేలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు.ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో.. -
అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేస్తే..బరువు తగ్గగలమా? నటుడు రాజ్‌కుమార్..
బరువు తగ్గడం కోసం ఒక్కోక్కరూ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ల శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి అనుగుణంగా డైట్, వ్యాయామాలు ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు మాత్రం కావాలనుకుంటే బరువు పెరగగలడు, స్లిమ్‌గా మారిపోగలడు. ఒక పాత్ర కోసం శారీరక మార్పులతో సహా తనను తాను పూర్తిగా మార్చుకోగల నటుడు. ఆయన సుభాష్చద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 2017 నాటి వెబ్ సిరీస్ 'బోస్: డెడ్/అలైవ్' (Bose: Dead/Alive) కోసం ఈ నటుడు 13 కిలోల బరువు పెరిగాడు, ఆ తర్వాత ఏడాదే 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' (Fanney Khan) చిత్రం కోసం ఒక్కనెలలో ఏకంగా పది కిలోల బరువు తగ్గారు. తాను బోస్ వెబ్ సిరీస్ తర్వాత బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని తనకు ముందే తెలుసని, అందుకేనే అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేశానని అన్నారు. ఇలా చేస్తే బరువు తగ్గగలమా అంటే..ఇది అత్యంత కష్టమైన విధానం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, ఉండటం అంటే..శరీరాన్ని చాలా కష్టబెట్టడమే కాకుండా బలహీన పడే అవకాశాలు ఎక్కువ. కానీ రాజ్ కుమార్ మాత్రం తాను నేరుగా రాత్రి భోజనం మాత్రమే చేస్తానని, అది కూడా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటానని అన్నారు. మరి ఉదయం ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఉండగలరంటే..నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి ఆకలి బాధ అంతగా అనిపించదని చెబుతున్నారు. అలాగే వ్యాయామాలు విషయానికొస్తే..ప్రతిరోజూ కనీసం మూడు గంటల పాటు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తానని అన్నారు. దీపావలి వంటి పండుగ సమయాల్లో నోరు చాలా కట్టడి చేసుకుంటానని, ఎందుకంటే ఫిట్‌గా ఉండటమే తన ప్రధాన లక్ష్యం కాబట్టి అని చెబుతున్నారు రాజ్‌కుమార్. ప్రస్తుతం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada) మూవీలో కనిపించనున్నారు రాజ్‌కుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.మైదానంలోకి పరిగెత్తే ముందు షర్ట్ లేకుండా తన ఇండియా జెర్సీని ఊపుతూ గంగూలీ కనిపించడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి క్షణాన్ని పోస్టర్ ఫస్ట్‌లుక్‌గా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా, రాజ్ కుమార్ అనుసరించే డైట్ విధానం సరైనదేనా అంటే..అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేస్తే..దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పైగా, బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే భోజనం అన్నేసి గంటలు తీసుకోకపోతే శరీరం "సర్వైవల్ మోడ్" (ఆకలి మోడ్) లోకి వెళ్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం కేలరీలను ఖర్చు చేయడం తగ్గించి, ఫ్యాట్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల మెటబాలిజం రేటు దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఆకలి ఎక్కువ వేసి..నియంత్రణ కోల్పోయేలా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే శరీరం ఆహారం లభించనప్పుడు కొవ్వుని మాత్రమే గాక శక్తి కోసం కండరాలను కూడా కరిగించేలా చేస్తుంది. కండరాలు తగ్గితే శరీరం బలహీనపడి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. అదీగాక రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, తలతిరగడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి పోషకాహార లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దానికి బదులుగా కేలరీలు తక్కువగా ఉండే పోషకాహారం, ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకునేలా కేర్ తీసుకుంటే ఆకలిని నియంత్రించ గలుగుతాం. ఆ తర్వాత ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌కి ప్రాధాన్యతి స్తే కడుపునిండిన అనుభూతిని పొందడమే కాకుండా ఇతర ఆహారాల జోలికి వెళ్లరని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయామాలు, వాకింగ్ వంటివి క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే కాకుండా మళ్లీ యథావిధిగా పెరిగే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..) -
67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..
బరువు తగ్గడం అనేది ఎల్లప్పుడు కాస్త క్లిష్టమైనదే. కాకపోతే దాన్ని ఆస్వాదించేలా ఎంజాయ్ చేసేలా ప్లానే చేసుకుంటేనే తేలికగా బరువు తగ్గగలుగుతారనేది నిపుణుల మాట. ఎప్పుడు కఠికన ఆహార నియమాలు, వర్కౌట్లు మాత్రమే కాదు. సాధారణ అలవాట్లతో కూడా బరువు తగ్గడం సులభమే అని అంటోంది ఈ డైటీషియన్. తన బరువు తగ్గేందుకు ఆ అలవాట్లను దరిచేరనీయకపోవడం వల్లే సాధ్యమైందంటూ..అవేంటో సవివరంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.వార్దా అనే డైటీషియన్ తన వెయిట్‌లాస్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను 67 కిలోల నుంచి 57 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు. అందుకోసం ఎనిమి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. దూరంగా ఉన్న ఆ అలవాట్లు..చాలా వేగంగా తినడంతాను ఐదు నిమిషాల్లో భోజనం ముగించడం మానేసి, తినడానికి సుమారు 15-20 నిమిషాలు తీసుకోవడం ప్రారంభించానని వార్దా చెప్పారు. దీనివల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన అనుభూతి కలిగిందన్నారు.రోటీ, అన్నం మానేయడంకార్బోహైడ్రేట్లను తొలగించడానికి బదులుగా, ఆమె ఆహార పరిమాణాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కొవ్వు తగ్గడం అంటే కేలరీల లోటు, అంతేగానీ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తొలగించడం కాదని అంటోంది“పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం” పాటించడంతాను ఎల్లప్పుడూ పరిపూర్ణంగా తినడానికి ప్రయత్నించలేదని అంటున్నారు. అతిగా తినడానికి దారితీసే స్టిక్ట్‌గా అనుసరించే డైట్‌ని ఫాలో అవ్వలేదని అన్నారు.ప్రతిరోజూ బరువును తనిఖీ చేసుకోవడంశరీర బరువులో నీరు, సోడియం, హార్మోన్ల కారణంగా మార్పులు రావచ్చని వార్దా పేర్కొన్నారు. రోజువారీ బరువు సంఖ్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా, వారంతమే చెక్చేసేదాన్ని అని చెప్పారు.అంతులేని కార్డియో వ్యాయామాలు చేయడంఆమె ఎక్కువసేపు చేసే కార్డియో వ్యాయామాలపై ఆధారపడలేదు. దానికి బదులుగా,నడవడం, ఎక్కువ అడుగులు వేయడం, చురుకుగా ఉండటంతో సహా రోజువారీ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.ఫ్యాట్ బర్నర్లు, డిటాక్స్ డ్రింక్స్ వాడటం..అలాంటి వాటికి దూరంగా ఉంటూ..ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్, సంపూర్ణ ఆహారాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.అపరాధ భావంకి చోటు ఇవ్వకుండా..ఒకసారి అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నంత మాత్రాన మొత్తం వెయిట్‌లాస్ జర్నీ వేస్ట్ అయిందని భావించాల్సిన అవసరం లేదని అంటోంది. ఒక పూట తీసుకునే జంక్‌ఫుడ్ మీ ఆరోగ్య పురోగతికి అంతరాయం కాదని అంటున్నారామె.ఆకలి వేసేంత వరకు ఉండకుండా..రోజులో ముందుగా ఆకలితో ఉండటం కంటే..ముందుగానే కొద్దిగా కొద్దిగా తినేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకుంటే విపరీతమైన ఆకలిలో తినే పరిమాణంపై నియంత్రణ ఉండదని అంటోంది. అలాగే సమతుల్య ఆహారమే తీసుకుంటానని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే, ఈ సాధారణ చిట్కాలను పాటించి చూడండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్‌లాస్ జర్నీ) -
ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?
నా మొదటి ప్రసవం సిజేరియన్ ద్వారా జరిగింది. ఇప్పుడు నాకు తొమ్మిదో నెల నడుస్తోంది. ఈసారి సాధారణ ప్రసవం అయితే త్వరగా కోలుకుంటానని, ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా సులభంగా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందా?– రాధిక, నెల్లూరు. ఒకసారి సిజేరియన్ జరిగినంత మాత్రాన, తర్వాతి ప్రసవం కూడా తప్పనిసరిగా సిజేరియన్ ద్వారానే జరగాలనే నియమం లేదు. సరైన పరిస్థితులు ఉంటే, తర్వాతి గర్భంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఇది ఒకే విధంగా సాధ్యం కాదు. మొదటి సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, గర్భాశయంపై ఎలాంటి కోత పెట్టారు, ప్రస్తుతం తల్లికి లేదా బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా, మొదటిసారి సిజేరియన్ అయిన మహిళలు ఈసారి గర్భం చివరి దశలో సహజంగానే ప్రసవ నొప్పుల్లోకి వెళితే, కొందరిలో సాధారణ ప్రసవం విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ అవకాశం ఉండాలంటే మొదటి సిజేరియన్‌కు కారణం ఏమిటి, ప్రస్తుతం బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, తల్లికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయా, శరీర బరువు సరైన స్థాయిలో ఉందా వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం మంచిది కాదు. ఉదాహరణకు బిడ్డ ఎదుగుదలలో తీవ్రమైన సమస్యలు ఉండటం, తల్లికి అధిక రక్తపోటు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా తల కిందికి కాకుండా వేరే స్థితిలో ఉండటం, మాయ కిందకు ఉండటం వంటి పరిస్థితుల్లో వైద్యులు సిజేరియన్‌ను సూచించవచ్చు. గర్భం ముప్పై ఎనిమిది వారాలు దాటిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తారు. బిడ్డ కదలికలు, గుండె స్పందన, ఎదుగుదల, ఇతర పరీక్షల ఫలితాలు అన్నీ సంతృప్తికరంగా ఉంటే కొంతకాలం వేచి చూసే అవకాశం గురించి వైద్యులు నిర్ణయిస్తారు. అయితే నిర్ణీత సమయానికి సహజంగా ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, తదుపరి మార్గాల గురించి వైద్యులు వివరంగా చర్చిస్తారు. ఒకసారి సిజేరియన్ అయినవారిలో మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా ప్రసవ నొప్పులను ప్రారంభించడం కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రతి మహిళకు ఈ విధానం సరిపోదు. పరీక్షలో ప్రసవానికి అవసరమైన మార్గం అనుకూలంగా ఉంటే, మందులు కాకుండా ప్రత్యేక పద్ధతుల ద్వారా ప్రసవాన్ని ప్రారంభించే అవకాశాన్ని వైద్యులు పరిశీలించవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం సురక్షితం కాదని తేలితే, ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వారాల మధ్య ముందస్తుగా ప్రణాళిక ప్రకారం సిజేరియన్ చేయవచ్చు. తల్లి ఆరోగ్యంగా, ఇతర సమస్యలు లేకుండా ఉంటే కోలుకునే ప్రక్రియ కూడా సాధారణంగానే ఉంటుంది.ముఖ్యంగా, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిలోనే చేయాలి. ప్రసవ సమయంలో బిడ్డ గుండె స్పందనను నిరంతరం గమనించడం చాలా అవసరం. కాబట్టి మీ పరిస్థితిని బట్టి మీ వైద్యులతో అన్ని పరీక్షల ఫలితాలను చర్చించండి. సాధారణ ప్రసవం సాధ్యమేనా, లేక సిజేరియన్ సురక్షితమా అన్నది మీ ఆరోగ్యం, బిడ్డ పరిస్థితిని బట్టి నిర్ణయించాలి.∙ -
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అంబటి చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: బాబూ..! చిరిగిన బ్యాగూ! -
వెన్నెముకకు మేలు చేసే ఈ ఆసనం గురించి తెలుసా?
శరీరాన్ని నిటారుగా, సమతుల్యంగా ఉంచేందుకు యోగా ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయి. అందులో సులభంగా చేయగల ఆసనాల్లో తాడాసనం ఒకటి. క్రమం తప్పకుండా సాధన చేస్తే శరీర భంగిమ, బ్యాలెన్స్‌తో పాటు కండరాల టోన్‌ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.ఎలా చేయాలి?రెండు పాదాలను కలిపి లేదా కొద్దిగా దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.చేతులను శరీరం పక్కన ఉంచాలి.శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు, పైకి తీసుకెళ్లి తలపైకి పెట్టాలి.అరచేతులను కలిపి లేదా ఒకదానికొకటి ఎదురుగా ఉంచి, కాళ్లపై సమంగా బరువు ఉంచి, వెన్నెముకను పైకి పొడిగించాలి.సౌకర్యంగా ఉంటే మడమలను పైకి లేపి పాదాల వేళ్లపై నిలబడాలి.చూపును ఒక స్థిరమైన బిందువుపై ఉంచి, సాధారణంగా శ్వాస తీసుకుంటూ 10–20 సెకండ్లు ఉంచాలి.శ్వాస వదులుతూ మడమలను దించి, చేతులను కిందకు తీసుకురావాలి.ప్రయోజనాలు...శరీర భంగిమను (Post-ure) సరిచేయడంలో సహాయపడుతుంది.బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది.మొత్తం శరీరంలోని కండరాల టోన్‌ను మెరుగుపరుస్తుంది.వెన్నెముకను పొడవుగా చేసి, దానిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.ముందు మూడు లైన్ల స్టార్టింగ్ కథనంతో పాటు అన్నీ ఇవ్వండి– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ఇవి చదవండి: పైసా ఖర్చు లేకుండా చర్మానికి మెరుపు.. ఈ 3 అలవాట్లు చాలు! -
ఒంటరిగా భోజనం చేస్తున్నారా?
కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయడం, సహోద్యోగులతో మధ్యాహ్న భోజనం చేయడం, స్నేహితులతో కలిసి తినడం.. భోజనం పంచుకోవడం సాధారణ సామాజిక కార్యకలాపంగా కనిపిస్తుంది. అయితే కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక అనుబంధానికి మించిన ప్రయోజనాలు ఉంటాయా అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తరచుగా కలిసి భోజనం చేయడం మెరుగైన భావోద్వేగ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. తరచూ ఒంటరిగా భోజనం చేయడం డిప్రెషన్, మెదడు ఆరోగ్యంలో మార్పులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.ఈ భావనను కమెన్సాలిటీ అంటారు. అంటే ఇతరులతో కలిసి ఆహారం తింటూ పంచుకోవడం. ఇతరులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడటం, సంబంధాలను పెంపొందించుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేసే టేబుల్ చుట్టూ కూర్చోవడం వల్ల మాట్లాడుకోవడానికి, పరస్పరం అనుబంధం పెంచుకోవడానికి, సంబంధాలను బలపరచుకోవడానికి, ఒంటరితనం తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న చాలా ఆధారాలు కేవలం సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒంటరిగా భోజనం చేయడం వల్లే డిప్రెషన్, డిమెన్షియా లేదా మెదడులో మార్పులు నేరుగా వస్తాయని నిరూపించలేదు.కలిసి భోజనం చేస్తే మానసిక ఆరోగ్యం కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో కలిసి భోజనం చేయడం, భావోద్వేగ శ్రేయస్సు మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 9,361 మంది మహిళలపై జరిగిన ఒక అధ్యయనంలో, భోజనం సమయంలో టేబుల్ చుట్టూ కూర్చునే వ్యక్తుల సంఖ్యకు డిప్రెషన్ వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వారు ఒంటరిగా నివసిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పరిశోధకులు ఈ సంబంధాన్ని గుర్తించారు.జపాన్‌లో జరిగిన మరో అధ్యయనం 65 నుంచి 74 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించింది. కుటుంబంతో కలిసి నివసిస్తున్నా తరచూ ఒంటరిగా భోజనం చేసే వృద్ధుల్లో, ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలు కనిపించే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం ఒకరితో కలిసి నివసించడం వల్ల లభించే సామాజిక ప్రయోజనం, నిజంగా కలిసి సమయం గడపడం వల్ల లభించే ప్రయోజనంతో సమానం కాకపోవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.మెదడులో ఏం జరుగుతుంది?ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2025లో జపాన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, తరచూ ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో జ్ఞానపరమైన విధులకు సంబంధించిన కొన్ని మెదడు ప్రాంతాల్లో తక్కువ మెదడు పరిమాణం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో హిప్పోకాంపస్, మధ్య టెంపోరల్ లోబ్ ఉన్నాయి. హిప్పోకాంపస్ అంటే జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం వంటి విధుల్లో ముఖ్యమైన మెదడు భాగం.మధ్య టెంపోరల్ లోబ్ అంటే జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి మెదడు విధుల్లో కీలకంగా పనిచేసే ప్రాంతం.ఆహారం కారణంగా ఈ తేడాల్లో కొంత భాగం వివరించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే ఒంటరిగా భోజనం చేసే వ్యక్తులు తక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఆహారం ఈ మొత్తం సంబంధాన్ని వివరించలేకపోయింది.ఇదీ చదవండి: జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్‌లు ఇస్తూ -
డేటాను విశ్లేషించే ఏఐ.. 15 ఏళ్లకే అంతర్జాతీయ గుర్తింపు!
మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ‘జటిలమైన మందులు అవసరం లేదు. మ్యూజిక్ వినండి చాలు’ అంటూ ముందుకు వచ్చింది ఏఐ–ఆధారిత ఆడియో విజువల్ ప్లాట్‌ఫామ్... హార్మోని. ‘హార్మోని’ అనే రిసెర్చ్ ప్రాజెక్ట్ ప్రయోగదశలో సత్ఫలితాలను ఇస్తోంది. ఎంతోమందిని ఒత్తిడికి దూరం చేసింది.వాషింగ్టన్కు చెందిన అనూష అరోరా రీజెనరాన్కి పదిహేనేళ్లు. అనూష వ్యక్తిగత అనుభవం నుంచే ‘హార్మోని’ ఆవిష్కృతమైంది. ఆమె తల్లి ఒత్తిడిగా అనిపించినప్పుడు సంగీతం వినేది. ఫలితంగా ఆమెకు ఎంతో రిలీఫ్‌గా అనిపించిందేని చెప్పేది. అప్పటి నుంచి అనూష సరికొత్త మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్ గురించి ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ సహాయంతో మరింత పర్సనలైజ్ మ్యూజిక్ థెరపీని అందించే దిశలో పరిశోధన చేయడానికి నడుం కట్టింది. తనప్రాజెక్ట్కు ‘హార్మోని’ అని నామకరణం చేసింది.డేటాను అర్థం చేసుకొని...ముందుగా నిర్ణయించిన ప్లే లిస్ట్‌లపై ఆధార పడకుండా వ్యక్తులలోని భావోద్వేగ స్థితిగతులకు అనుగుణంగా స్పందించే ఒక పోర్టబుల్ ప్లాట్‌ఫామ్‌గా ‘హార్మోని’ రూపొందించింది అనూష. వేలి సెన్సార్లు శారీరక సమాచారాన్ని అందిస్తాయి. దానిని ‘హార్మోని సిస్టమ్ విశ్లేషిస్తుంది. ఏఐ మోడల్స్ ఆ డేటాను అర్థం చేసుకొని భావోద్వేగ స్థితికి అనుగుణంగా ఉండే సంగీతాన్ని, దృశ్యాలను అందిస్తాయి.భావోద్వేగాలను గుర్తించడానికి, సంగీతాన్ని రూపొందించడంలో వివిధ అంశాలను సమన్వయం చేయడానికి 11 ఏఐ ప్రోగ్రామ్స్‌ను ‘హార్మోని’ మిక్స్ చేస్తుంది. తద్వారా తన ఔట్‌పుట్‌ను రియల్‌టైమ్‌లో సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఇప్పటికైతే ‘హార్మోని’ ఒక రిసెర్చ్ప్రాజెక్ట్గా మాత్రమే కొనసాగుతోంది. ఏఐ–ఆధారిత మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన అనూష ఐఎస్ఇఎల్ 2026లో ఫ్యామిలీ ప్రైజ్ ఫర్ స్టెమ్ ఎక్స్‌లెన్స్ అవార్డును, 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకుని తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది.ఇవీ చదవండి: ఒక్క మాట.. ఓ కవిత.. ఓ కప్పు టీ.. వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు! -
నటి సమంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్లు..! ఆ టైంలో చేయొచ్చా?
మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్ అందుకున్న నటి సమంత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనేకమంది సెలబ్రిటీలు గర్భధారణ అనేది రెస్ట్ తీసుకునే అనారోగ్యం లాంటిది కాదని, ఈ దశలో కూడా చురుగ్గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా సమంత కూడా చేరిపోయారు. ఆమె జిమ్‌కి వెళ్లడం వరకు మాత్రమే కాదు, వెయిట్‌లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వర్కౌట్లు చేసేస్తోంది. పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారామె. మొదటి వీడియోలో కేబుల్ రో వ్యాయామం చేసింది సమంత. దానికి క్యాప్షన్‌గా ఈ రోజు భిన్నమైన వర్కౌట్ చేశా. అయితే ఎక్కువగా కష్టపడకుండా, శ్రద్ధగా వినడం నేర్చుకున్నా అంటూ రాసింది. రెండొవ వీడియోలు బరువులు ఎత్తుతూ కనపించింది సమంత. ఈ సమయంలో ఎంత మేర ఎంతగలరో అంతే పైకి ఎత్తండి అని క్యాప్షన్ పెట్టింది. అలాగే తదుపరి పోస్ట్‌ల్లో కొన్ని రోజులు బలంగా ఉన్నట్లు భావిస్తా, అందుకే వ్యాయామాలు సవరించుకుంటానని పేర్కొంది. పైగా యోగా మ్యాట్‌పై పడుకుని చేసే వర్కౌట్లే కొన్ని రోజులు హాయిగా అనిపిస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. తన జీవితాంతం జిమ్‌లో మరింతగా చేయడానికి తన పరిమితులను అధిగమించడానికి శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ప్రెగ్నెన్సీ దశలో శరీరాన్ని గౌరవించడం. శరీరం మాట వినడం వంటివి నేర్చుకున్నానని పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే ఈ సమయంలో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసే అత్యంత బలమైన పని అమ్మ అవ్వడమేనని భావిస్తున్నానంటూ పోస్ట్‌ని ముంగించింది. అలాగే తన శక్తి శిక్షణా వ్యాయామాలు గురించి మాట్లాడుతూ..ఇవన్నీ తాను చాలా ఏళ్లుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మరి చేస్తున్నవని, అలాగే గర్భధారణకు అనుగుణంగా సవరించినవేనని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే తన ట్రైనర్స్ ప్రతిష్టాత్మక సంస్థల్లో సర్టిఫికేట్ పొందినవారని, పైగా తన ఆరోగ్యానికి, గర్భధారణకు అనుగుణంగా నిర్ణయించిన వ్యాయామాలని కూడా పేర్కోంది. ఈ క్రమంలో అందరూ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి గర్భం భిన్నంగా ఉంటుందని, అందువల్ల ఇతర ప్రెగ్నెంట్ మహిళలెవ్వరూ తన వర్కౌట్లను అనుకరించొద్దని హెచ్చరించింది సమంత. తనలా వ్యాయామాలు చేయాలనుకుంటే వైద్యుడి సలహా సూచనల మేరకు చేయాలని విజ్ఞప్తి చేసిందామె. కాగా, సమంత రూత్ ప్రభు ఈ ఏడాది జూన్ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అందుకోసమే కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇస్తున్నానని కూడా పేర్కొంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..) -
భారత్‌లో షుగర్ ఎక్కువ.. విదేశాల్లో తక్కువ ఎందుకు?
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి దొంగ పనులు అన్నట్లుగా దిగ్గజ బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. లండన్‌లో విక్రయించే ఒక ఫాంటా క్యాన్‌లో కేవలం 63 క్యాలరీలు, తక్కువ పంచదార ఉంటే అదే మనదేశంలో లభించే పానీయంలో మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా షుగర్‌ను దట్టించి విక్రయిస్తున్నారు. యూరోప్‌లో కృత్రిమ రంగుల (E110 Sunset Yellow) వాడకంపై సీసాల ముందు భాగంలోనే హెచ్చరిక బొమ్మలు తప్పనిసరి చేశారు. కాగా, మన దేశంలో మాత్రం ప్యాకెట్ వెనుక వైపు కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో సరిపెట్టడం గమనార్హం.ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీల వ్యవహారంపై ప్రజారోగ్య నిపుణులు స్పందిస్తూ బాటిళ్ల ముందు భాగంలోనే ఎరుపు, పచ్చ రంగుల నాణ్యతా ముద్రలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ), కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హెచ్చరికల ప్రతిపాదనను పక్కనబెట్టడం తీవ్ర ఆందోళనకరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి రంగులు లేని సాధారణ పట్టికలతో వీటి గుర్తింపును సరిపెడతామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొనడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్పొరేట్ ధోరణులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర ఊబకాయం, మధుమేహ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఇల్లు కొంటున్నారా? -
63 కేజీల నుంచి 55 కేజీల బరువుకు..!నిలకడగా ఆ ఎనిమిది అలవాట్లు..
బరువు తగ్గాలంటే స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వర్కౌట్లుతోనే సాధ్యం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండని అంటోంది ఈ కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్. రోజువారి అలవాటల్లో జస్ట్ చిన్న చిన్ని స్థిరమైన మార్పులతో ఈజీగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతోంది. తాను ఎనిమిది కేజీల బరువుని ఎనిమిది అలవాట్లతో తగ్గించానంటూ తన అనుభవాన్ని పంచుకున్నారామె. అదేంటో చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోకుండానే బరువు తగ్గేందుకు ఉపయోగపడిన ఎనిమిది అవాట్ల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆహారం, వ్యాయామాల పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చుకున్నట్లు వెల్లడించారు. అయితే మార్పులు చేసిన వాటిని నిలకడగా అనుసరించానని అన్నారు. మరి ఆమె వెయిట్‌లాస్ జర్నీలో ఎనిమిది కేజీల బరువుకి చెక్‌పెట్టేందుకు హెల్ప్ అయిన ఎనిమిది అలవాట్లు లేక మార్పులు ఏంటో చూద్దామా..!జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయవద్దుఏదైనా సరే పూర్తిగా మానేయొద్దని అంటోంది. నియంత్రించడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తామని అన్నారు. తినాలి అనిపించినప్పుడూ జాగురకతతో హాయిగా ఆస్వాదించేదాన్ని అని అంటోంది. వాస్తవికంగా సాధ్యమయ్యే అవాట్లతోనే బరువు తగ్గడం అనేది జరగుతుందని చెబుతోంది ఈ ఇన్ఫ్లుయెన్సర్.ప్రతిరోజూ వాకింగ్..ఎల్లప్పుడూ పదివేల అడుగులు నడవాలనే ఒత్తిడి పెట్టుకోకూడదని, ప్రతి రోజు నడిచేలా చూస్తే చాలని అంటోంది. ఎందుకంటే తాను కొన్ని రోజులు తక్కువగానూ మరికొన్ని రోజులు మెరుగ్గా నడిచినట్లు వెల్లడించింది. అది క్రమంగా కొవ్వు తగ్గడానికి ఉపకరించిందని అంటోంది.రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడంరాత్రిపూట అన్నం, రోటీ తీసుకోవడం తగ్గించి..గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్ చేర్చుకున్నట్లు తెలిపింది.నెమ్మదిగా తినడం ప్రారంభించానుగతంలో తాను నిమిషాల్లోనే ఆహారం ముగించేసేదాన్ని అని చెప్పింది. అయితే నిధానంగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఆస్వాదించొచ్చని అంటోంది. ఎందుకంటే..కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపడానికి సుమారు 20 నిమిషాలపైనే పడుతుంది.ప్రతి భోజనానికి ముందు నీళ్ళుఆమె భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకుంది. ఈ చిన్న మార్పు, తినే ఆహార పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని చెబుతోంది. ప్రతిరోజూ బరువు చూడొద్దు..శివాని ప్రతిరోజూ బరువు చూసుకోవడం మానేసినట్లు తెలిపింది. ఎందుకంటే అది మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది.నిద్రవేళలను సరిచేసుకోవడంబరువు తగ్గాలనుకునే వారికి తగిన నిద్ర అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతోంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆకలి కోరికలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అంటోందివాయిదాకు అవకాశం ఇవ్వకుండా..అయితే తినాలనిపించిన వాటిని దూరం పెట్టేలా వాయిదా వేయకుండా..ఒకవేళ్ల స్వీట్స్, లేదా జంక్‌ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లపై మనసు లాగితే..అయ్యే దూరం చేసుకున్నాననే భావం మనుసులో రాకుండా..ధైర్యంగా తినేసి..ముందుకు సాగిపోవడం నేర్చుకోవడం మంచిదని చెబుతోంది. ఎందుకంటే అది బాధకరమైన వెయిట్‌లాస్ జర్నీగా మారదని అంటోంది. ఇక్కడ శివాని చెప్పేది ఆరోగ్యకరమైన అలవాట్లనే హాయిగా తెలివిగా చేస్తే.. బరువు తగ్గడం కూడా ఒక ఎంజాయ్‌మెంట్‌గా మారుతుందని చెబుతోందామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss Tips: జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..) -
షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్‌లో భారత్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పాముకాటు ఘటనల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ‘లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్’ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ప్రపంచంలో ఏటా సుమారు 21 లక్షల నుంచి 70 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, ఒక్క భారతదేశంలోనే ఏటా 4.09 లక్షల నుంచి 13 లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పాముకాటు బాధితులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది.ఈ జాబితాలో 6.66 లక్షల కేసులతో నైజీరియా రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా (4.90 లక్షలు), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (4.67 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 75 శాతం కేవలం 20 దేశాలకే పరిమితమైనట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్ (48,000–162,000), వియత్నాం (33,500–113,000), చైనా (28,900–97,400) కూడా టాప్-20 దేశాల జాబితాలో ఉన్నాయి.'పీఎల్ఓఎస్ మెడిసిన్' (PLOS Medicine) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. జనవరి 2007 నుంచి మార్చి 2025 వరకు 79 దేశాల సమాచారాన్ని పరిశీలించారు. పాముకాటు మరణాల విషయానికి వస్తే, అల్పాదాయ దేశాల్లో తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రపంచవ్యాప్త పాముకాట్లు, మరణాలలో 45 శాతం నమోదవుతున్నాయని, ఇది దక్షిణాసియా కంటే దాదాపు మూడు రెట్లు అధికమని పరిశోధకులు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా పాముకాట్ల కారణంగా ఏటా 2.74 లక్షల నుంచి 5.13 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా వేశారు. అయితే గతంలో వేసిన అంచనాల కంటే వాస్తవ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, వాస్తవంగా పాముకాటు విషప్రభావం మూడు రెట్లు, మరణాల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రధాన పరిశోధకుడు దిలీప ఎదిరివీర పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం! -
ఆస్బెస్టాస్తో ఇంత ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆస్బెస్టాస్.. ఒకప్పుడు నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగించిన పదార్థం. అయితే దీని సూక్ష్మ నారకణాలను పీల్చడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆస్బెస్టాస్ అంటే ఏమిటి? అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం..ఆస్బెస్టాస్ అనేది సహజంగా లభించే ఖనిజ సన్నని నారల సమూహం. ఇవి బలంగా ఉండటంతో పాటు వేడిని, మంటను తట్టుకోగలవు. అందుకే గతంలో సిమెంట్ షీట్లు, పైకప్పులు, సీలింగ్ టైల్స్, గోడలు, పైపులు, ఇన్సులేషన్ వంటి నిర్మాణాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు.అయితే భవనాలు, కట్టడాలు నిర్మించే లేదా కూల్చివేసే సమయంలో ఆస్బెస్టాస్ పదార్థాలు పగిలినా, రాపిడికి గురైనా.. వాటిలోని సూక్ష్మ నారకణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మనుషులు వాటిని పీల్చితే అవి ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే ఉండిపోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో ఆస్బెస్టోసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెసోథెలియోమా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెసోథెలియోమా అనేది ఆస్బెస్టాస్తో ముడిపడి ఉన్న అరుదైన క్యాన్సర్. ముఖ్యంగా ఊపిరితిత్తులను కప్పి ఉండే సన్నని పొరల్లో ఇది ఏర్పడుతుంది. దీని ప్రమాదం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఆస్బెస్టాస్‌కు గురైన వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు. అయితే సంవత్సరాలు గడుస్తున్నాకొద్ది ఈ వ్యాధి తీవ్రత పెరిగి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్బెస్టాస్ను గతంలో సిమెంట్ నిర్మాణ సామగ్రి, రూఫింగ్ షీట్లు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం అనేక దేశాల్లో దీని వినియోగంపై నిషేధాలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అన్ని రకాల ఆస్బెస్టాస్లు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.అయితే ఆస్బెస్టాస్ ఖనిజ సూక్ష్మకణాలు ఎక్కువగా పాత పాఠశాలలు, పాడుబడ్డ ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు వంటి పాత నిర్మాణాల్లో ఉండే అవకాశం ఉంది. ఆస్బెస్టాస్ పదార్థాలు దెబ్బతినకుండా ఉన్నంతవరకు వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పాడుబడ్డ పాత నిర్మాణాల్లోని అనుమానాస్పద పదార్థాలను స్వయంగా పగలగొట్టడం, డ్రిల్ చేయడం లేదా తొలగించడం చేయకూడదు.ముఖ్యంగా ఆస్బెస్టాస్ ఉందని చూసి గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి పదార్థాలు కనిపిస్తే వాటిని తాకకుండా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. -
గర్భిణులూ.. గంటల తరబడి కూర్చోవద్దు! ఎందుకంటే?
గర్భవతులు తాము కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకుని, శారీరకంగా చురుగ్గా ఉండటం వాళ్ల ఆరోగ్యకరమైన గర్భధారణకు (హెల్దీ ప్రెగ్నెన్సీకి) తోడ్పడుతుందని ఒక అమెరికన్ అధ్యయనంలో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ఈ పరిశోధనల వివరాలు ప్రచురితమయ్యాయి.రోజులో 10 గంటలకు పైగా కూర్చునే గర్భిణులను... అంతకంటే తక్కువగా కూర్చునే గర్భవతులతో పోల్చినప్పుడు.. ఎక్కువ సేపు కూర్చుండేవాళ్లలో ప్రతికూలతలూ, అనర్థాలూ దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అవేమిటంటే... గర్భధారణ సమయంలో వచ్చే హైబీపీ, గర్భవతుల్లో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), అధిక రక్తపోటుతో కిడ్నీలు, కాలేయం వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్, నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ముప్పుతో పాటు తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి ప్రతికూలతలు కనిపించే అవకాశాలున్నట్టు తేలింది.ఇలా చాలాసేపు మందకొడిగా ఉండటం అన్నది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం. అంతేకాదు... భవిష్యత్తులో తల్లీబిడ్డలకు గుండెజబ్బులూ, మధుమేహం, ఊబకాయం వచ్చే ముప్పూ ఎక్కువే. ‘‘గర్భధారణలో ఎక్కువసేపు కూర్చోవడం అంత ఆరోగ్యకరం కాకపోవచ్చని మేం ముందుగానే ఊహించాం. అయితే ఆ ప్రమాదం మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అంటూ ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడొకరు తెలిపారు.శారీరకంగా చురుగ్గా ఉండటానికీ, గర్భధారణ ఫలితాలకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ అధ్యయనం కోసం గర్భం... మొదటి మూడు నెలల్లో ఉన్న 470 మంది మహిళలను పరిశోధకులు ఎంపిక చేశారు. వారి సగటు వయసు 30.7 ఏళ్లు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రతి త్రైమాసికంలోనూ మహిళలకు ప్రత్యేక యాక్టివిటీ మానిటర్లను అమర్చారు. అవి... వారు ఎంతసేపు కూర్చుంటున్నారు, ఏ మేరకు చురుగ్గా ఉంటున్నారనే వివరాలను నమోదు చేశాయి.మొత్తమ్మీద వీళ్లలో 174 మంది మహిళలు (37 శాతం) గర్భధారణలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నారు. వీరిలో 86 మందికి (18.3 శాతం) గర్భధారణకు సంబంధించిన అధిక రక్తపోటు సమస్యలు తలెత్తాయి.రోజుకు 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి గర్భధారణలో ప్రతికూల ఫలితాలు కనిపించాయి. అదే రోజుకు సుమారు ఏడు గంటలు కూర్చున్న మహిళల్లో మాత్రం... ప్రతి ఐదుగురిలో ఒకరికే ఇలాంటి సమస్యలు కనిపించాయి.గర్భధారణలో ప్రతికూల ఫలితాల ముప్పును బాగా తగ్గించేందుకు మితంగా వ్యాయామం చేయాలంటూ సాధారణంగా చెబుతున్నప్పటికీ చాలామంది గర్భిణులకు ఇలా వ్యాయామం చేయడం సాధ్యపడకపోవచ్చు.‘‘మా పరిశోధన సూచిస్తున్న విషయం ఏమిటంటే... తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ... తరచూ లేచి, కాసేపు అటూ ఇటూ తిరగడం, కాస్తంత చురుగ్గా కదులుతూ ఉండటమూ గర్భధారణ సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు’’ అంటూ ఓ పరిశోధకుడు తెలిపారు.నిర్వహణ: యాసీన్ -
చేతికి గాయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! లేదంటే?
మానవ నాగరికతా వికాసంలో చేతిది చాలా కీలక భూమిక. చెయ్యి, కన్ను ఈ రెండింటి సమన్వయంతోనే అద్భుతాలన్నీ సాకాఅవుతున్నాయి. ఇంతటి కీలకమైన చెయ్యి గురించి అవగాహన అవసరం. నేడు (ఆగష్టు 23న) ‘నేషనల్ హ్యాండ్ సర్జరీ డే’ సందర్భంగా చేతికి అయ్యే గాయాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...చేతికి అయ్యే గాయాల్లో... కోసుకుపోవడం, విరగడం (ఫ్రాక్చర్స్), డిస్లొకేషన్స్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, తెగిపోవడం, ఇన్ఫెక్షన్స్, కాలడం, పడిపోవడం వల్ల చేతిపై తీవ్ర ఒత్తిడి పడి అయ్యే హై–ప్రెజర్ ఇంజరీస్ ప్రధానమైనవి.చేయి కోసుకుపోయినప్పుడు...పదునైన వస్తువులతో చెయ్యి లోతుగా కోసుకోవడం వల్ల చర్మంతో ΄ాటు టెండన్లు, నరాలు, ధమనులు, సిరలు దెబ్బతినవచ్చు. నొప్పి, రక్తస్రావం, తిమ్మిరి, స్పర్శ తగ్గడం, వేళ్ల కదలిక తగ్గడం, చేతి బలం తగ్గడం, చర్మం ΄ాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే గాయం లోతుగా అయినట్లు భావించాలి. పైపైన కోసుకుపోయినప్పుడు ఆ గాయానికి కుట్లు వేయడం సరిపోవచ్చు. అయితే.. నర్వ్ ఇంజరీ, రక్తనాళం ఇంజరీ లేదా టెండన్ ప్రభావితమైనప్పుడు ప్రత్యేక శస్త్రచికిత్స అవసరం.ఫ్రాక్చర్.. డిస్లొకేషన్లో... చేతి ఎముకలు విరగడం లేదా చేతి ఎముకలూ, జాయింట్స్ డిస్లోకేషన్స్ వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, రంగు మారడం, చేతి ఆకృతిలో మార్పు, కదలిక తగ్గడం, తిమ్మిరి ఏర్పడవచ్చు. ఎక్స్‌రే ద్వారా ఫ్రాక్చర్, డిస్లోకేష¯Œ ను నిర్ధారణ చేస్తారు. గాయాన్ని బట్టి ΄్లాస్టర్ వేయడం, కట్టు కట్టడం స్పి›్లంటింగ్, ఇంటర్నల్ ఫిక్సేషన్ వంటి చికిత్సలు అవసరమవుతాయి.వేళ్లు తెగిపోతే... ఏవైనా ప్రమాదాల్లో చేతివేళ్లు పూర్తిగా తెగిపోవడాన్ని యాంప్యుటేషన్ అంటారు. కొన్ని కేసుల్లో రీ΄్లాంటేషన్ మైక్రోసర్జరీ ద్వారా తెగిపోయిన భాగాన్ని తిరిగి అతికించే అవకాశముంటుంది. ఇలా తెగినప్పుడు పూర్తిగా విడివడిన ఆ భాగాన్ని నేరుగా మంచు (ఐస్)పై ఉంచకూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి, నీరుగానీ, మంచుగానీ లేదా తడిగానీ నేరుగా తగలకుండా ΄్లాస్టిక్ కవర్లో ఉంచి, దాన్ని ఆసుపత్రికి తరలించాలి.ఇన్ఫెక్షన్.. చిన్న గాయంతోనూ ముప్పేచిన్న కోత లేదా గాయం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి చేతిలో ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. నొప్పి, గాయం చుట్టూ వేడి, ఎర్రదనం, వాపు, చీము, చేతి కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.తీవ్రతను బట్టి చికిత్సవేడిపదార్థాలూ, ఏవైనా రసాయనాలు లేదా విద్యుదాఘాతం వల్ల చేతికి కాలిన గాయాలు (బర్న్స్) కావచ్చు. కాలిన గాయాన్ని చల్లటి నీటితో కలగాలి. నేరుగా ఐస్ పెట్టకూడదు. రసాయనాలతో కాలిన గాయాల్లో ఎక్కువ నీటితో కడగాలి.ముఖ్యంగా ఐదు పరీక్షలు... చేతికైన గాయాన్ని ఐదు అంశాల్లో పరీక్ష చేస్తారు. అవి... 1. బటయకు కనిపించే గాయం పరీక్ష2. నరాల పరీక్ష3. వాస్క్యులర్ పరీక్ష4. కండరాలు–టెండన్ల పరీక్ష5. ఎముకలు–జాయింట్ల పరీక్ష. ఈ అంశాల్లోతేడాలేమైనా ఉన్నాయేమో చూస్తారు.ఎక్స్‌రే... ఇతర పరీక్షలుముందుగా గాయాన్నినేరుగా పరిశీలించాక అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. రక్తనాళాలకు గాయాలయ్యాయా వాటి పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోడానికి డాప్లర్ లేదా ఇతర వాస్క్యులర్ ఇమేజింగ్ పరీక్షలు అవసరం కావచ్చు.ప్రథమ చికిత్సలో ఇవీ జాగ్రత్తలు...చేతికి గాయమైనప్పుడు శుభ్రమైన గాజుగుడ్డ లేదా మెత్తటి బట్టతో మెల్లగా కొద్ది΄ాటి ఒత్తిడి పెడుతూ రక్తస్రావాన్ని అరికట్టాలి. లోపలికి చొచ్చుకుపోయిన పెద్ద వస్తువులను ఎవరికి వారు తొలగించకూడదు. ఎముక విరగడం లేదా ఎముక /కీలు పక్కకు తొలగడం వంటి కేసుల్లో చేతిని కదలకుండా గుడ్డతోగానీ లేదా స్క్రేప్బ్యాండ్తో చుట్టాలి.ఎముక బయటకు కనిపించే ఓపెన్ ఫ్రాక్చర్లో ఇలా బయటకు కనిపించే ఎముకను తిరిగి లోపలికి నెట్టకుండా శుభ్రమైన గాజుగుడ్డను కప్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. చెయ్యి తాలూకు అవయవమేదైనా పూర్తిగా తెగిపోయినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు చేతిని పైకి తిప్పి ఉంచాలి. తెగిపోయిన భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి చల్లని పరిస్థితుల్లో భద్రపరచాలి. నేరుగా మంచు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.చివరగా...తీవ్రమైన రక్తస్రావం, తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం, వేళ్లు కదలకపోవడం, బలం తగ్గడం, నొప్పి, వేళ్లు లేదా చేతి భాగం తెగిపోవడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా అత్యవసరంగా డాక్టర్ లేదా హ్యాండ్ సర్జన్‌కు చూపించి తక్షణం వైద్యచికిత్స తీసుకోవడం ముఖ్యం.- డాక్టర్ గోపీనాథ్ భండారి, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో హ్యాండ్ సర్జన్నిర్వహణ: యాసీన్ -
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.పసిపాప ఆరోగ్యానికి అమృతంతల్లిపాలలోని యాంటీబాడీలు చిన్నతనంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం.బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.తల్లి సరైన పోషకాహారం, సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.అవసరమైనప్పుడు ప్రత్యేక పంప్ సహాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు.పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్యఉండే స్పర్శ వల్ల మానసిక బంధం మరింత బలపడుతుంది.వీలైనంత వరకు పాలు తాగించే సీసాలు, పాసిఫైయర్స్ వాడకపోవడమే మంచిది.ప్రతి మూడు గంటలకు ఒకసారి సీసాలోకి పాలు పోసి పాలు ఇవ్వవచ్చు. -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు... వారు తింటున్న ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.ఈ నేపథ్యంలో 2026 మే 11న భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) సంయుక్తంగా ప్రారంభించిన ‘సెహత్’ (సైన్స్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ టాన్స్ఫర్మేషన్) ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయం, పోషకాహారం, ప్రజారోగ్యాన్ని ఒకే వేదిక పైకి తెచ్చి, వ్యవసాయ పరిశోధన ఫలితాలను నేరుగా ప్రజల ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం దీని ప్రధాన లక్ష్యం. జీవ పోషక సమృద్ధి కలిగిన, పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు; వైవిధ్యభరిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు; రైతుల వృత్తిపర ఆరోగ్యం; మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల నివారణ; ఒకే ఆరోగ్యం– ఇవీ దీని ఐదు ప్రధాన దిశలు.పరస్పర విరుద్ధ పరిస్థితిఇది భారతదేశానికి అవసరమైన విధాన మార్పు. ఒకవైపు పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పెరుగుతున్నాయి. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం,దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గడం ఆశాజనకం. కానీ తక్కువ బరువున్న పిల్లలు ఇప్పటికీ 31.8 శాతం ఉన్నారు. అదే సమయంలో 15–49 ఏళ్లమధ్య ఉన్న మహిళల్లో అధిక బరువు/ఊబకాయం జాతీయ స్థాయిలో 30.7 శాతానికి చేరింది. అంటే ఒకే సమాజంలో పోషకా హార లోపం, అధిక పోషణ రెండూ కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ప్రకారం 15–49 ఏళ్ల మహిళల్లో ఏకంగా 47.9 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు; గత ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇది 36.3 శాతం. పురుషుల్లోనూ ఇది 31.1 నుంచి 41.5 శాతానికి పెరిగింది. మహిళల్లో 21.8 శాతం, పురుషుల్లో 24.1 శాతం మంది అధిక రక్త చక్కెర స్థాయులు లేదా మధుమేహ మందుల వినియోగం ఉన్న వర్గంలోకి వస్తున్నారు. అదే సమయంలో పిల్లల్లో ఎదుగుదల లోపం 31.2 నుంచి 24.6 శాతానికి తగ్గడం మంచి పరిణామం.తెలంగాణలోనూ ఇదే చిత్రం దర్శనమిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. కానీ 6–23 నెలల పిల్లల్లో సరిపడా ఆహారం అందుకుంటున్న వారు కేవలం 15.3 శాతమేమే. మరోవైపు మహిళల్లో 36.3 శాతం, పురుషుల్లో 35.5 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. మహిళల్లో రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు లేదా మధుమేహ మందుల వినియోగం చేయవలసిన స్థితిలో ఉన్నవారు 19.6 శాతం ఉండగా, పురుషుల్లో 24.5 శాతం మంది ఉన్నట్లుతేలింది. ఈ గణాంకాలు ఆరోగ్య సమస్యను కేవలం ఆసుపత్రిలో మాత్రమే పరిష్కరించలేమనీ, దానిలో ఒక భాగాన్ని పొలంలోనే పరిష్కరించాల్సి ఉంటుందనీ సందేశం ఇస్తున్నాయి.వైవిధ్యానికి ప్రాధాన్యంఇప్పటివరకు వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా దిగుబడి, ఉత్పత్తి, ధర, రైతు ఆదాయం ఆధారంగా కొలిచాం. ఇకపై పోషక విలువ, ఆహార వైవిధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య ఫలితాలు కూడా వ్యవసాయ ప్రణాళికలో భాగం కావాలి. బియ్యం, గోధుమలతో కేలరీల భద్రత సాధించాం. ఇప్పుడు పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజలు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార వైవిధ్యానికి ప్రాధాన్యంపెంచాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు అపారమైన అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యానవన పంటలు, మత్స్యరంగం, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల్లో బలం ఉంది. తెలంగాణకు చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు, పశుసంపద రంగాల్లో ప్రత్యేక సామర్థ్యం ఉంది. అధిక ఐరన్, జింక్ ఉన్న జీవపోషక సమృద్ధి పంటలు; మంచి మాంసకృత్తుల నాణ్యత కలిగిన పప్పుధాన్యాలు; రక్తంలో తక్కువ చక్కెర ప్రతిస్పందనకు అనుకూలమైన చిరుధాన్యాలు; యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోష కాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు– ఇవన్నీ వ్యవసాయ పరిశోధన, విత్తన వ్యవస్థ, సాగు విస్తరణలో ప్రాధాన్యం పొందాలి. సెహత్ కూడా పోషక విలువలు అధికంగా ఉన్న, జీవపోషక సమృద్ధి పంటలను ప్రత్యేక ప్రాధాన్యంగా గుర్తించింది.రైతు ఆరోగ్యమూ ముఖ్యమే!అయితే రైతు ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు. వ్యవసాయం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే కాకుండా, ఆ ఆహా రాన్ని పండించే రైతు కూడా సురక్షితంగా ఉండాలి. పురుగుమందుల ప్రభావం, తీవ్రమైన వేడి, యంత్ర ప్రమాదాలు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వంటి అంశాలను వ్యవసాయ విస్తరణలో భాగం చేయాలి. ఇదే సెహత్లో వృత్తిపర ఆరోగ్యం, ఏక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఉన్న భావన.ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు కలిసి పనిచేసే కొత్త నమూనా అవసరం. ఒక జిల్లాలోఏ పోషకాహార లోపం లేదా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో ఆరోగ్య శాఖ గుర్తిస్తే... ఆ అవసరానికి తగిన పంటలు, వ్యవసాయ వ్యవస్థలు, ఇంటి తోటలు, పోషకాహార తోటలు,జీవ పోషక సమృద్ధి రకాలను వ్యవసాయ వ్యవస్థ ప్రోత్సహించ వచ్చు. జిల్లా ఆరోగ్య స్థితి వివరాలకు జిల్లా వ్యవసాయ ప్రణాళిక స్పందించాలి. అలాగే ప్రభుత్వ సేకరణ విధానం కూడా మారాలి. పాఠశాల మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీలు, వసతి గృహాలు, ఆసుపత్రుల ఆహారంలో స్థానిక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి వాటికి స్థిరమైన డిమాండ్ సృష్టిస్తే ఒకేసారి రైతుకు మార్కెట్, పిల్లలకు పోషణ లభిస్తాయి.ఇప్పటి వరకు మనం ఆహార భద్రత గురించి మాట్లాడాం.ఇక ఆరోగ్య భద్రత దిశగా అడుగు వేయాలి. మన వ్యవసాయశాస్త్రం ఒకప్పుడు ఆకలిని జయించింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు, ఆహార సంబంధిత వ్యాధులతో పోరాడటంలో కూడా తన పాత్రను విస్తరించాలి. ఆసుపత్రులు అనారోగ్యానికి చికిత్స చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన వ్యవసాయం ఆ అనారోగ్యాన్నే రాకుండా చేయగలదు. సెహత్ ఇచ్చే అసలైన సందేశం ఇదే. పొలం నుంచి పళ్లెం వరకు మాత్రమే కాదు; పళ్లెం నుంచి ప్రజారోగ్యం వరకూ వ్యవసాయ పాత్ర ఉందనిగుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి.-వ్యాసకర్త ఐకార్–అటారి, హైదరాబాద్ డైరెక్టర్-డా‘‘ షేక్ ఎన్. మీరా -
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్‌గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్‌గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్ -
ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?
ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్ అండ్ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. బయోమెడికల్, ఆరోగ్య ఆర్–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం. విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగుఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్ నోడల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
‘నేచర్స్ ఓజెంపిక్’ అంటే..?నిజంగానే బరువు తగ్గిస్తుందా?
ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్‌లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది. View this post on Instagram A post shared by Sarthak Ahuja (@casarthakahuja) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు.. జైలులో కలిసిన భార్య
ఇస్లామాబాద్: ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యవిషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన జైలులోనే మృతిచెందారంటూ ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వ్యాఖ్యలు చేయడంతో పీటీఐ పెద్ద ఎత్తున నిరసనలు చేసింది. ఆయన ఆరోగ్యంపై స్పష్టతనివ్వాలంటూ ఆందోళనలు చేపట్టింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఆయన ఇమ్రాన్ ఖాన్ సుమారు తొమ్మిది నెలల తర్వాత తన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీని అదియాలా జైలులో కలిశారు.ఇటీవల సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ అంశంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్యం, వైద్య సదుపాయాలపై ఆందోళనల నేపథ్యంలో జైలు అధికారులు ఇకపై వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు, కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జైలులో ఆయనను వారి సోదరిణిలు కలిశారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. . నూరీన్ ఇమ్రాన్‌ను సుమారు 15 నిమిషాల పాటు కలిశారు. సుప్రీంకోర్టు ఆయనను షిఫా ఆస్పత్రికి తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఆమె ఇమ్రాన్‌కు వివరించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపైనా చర్చించారు. అనంతరం బుష్రా బీబీతో ఇమ్రాన్ సుమారు 30-35 నిమిషాల పాటు సమావేశమయ్యారు." అని కథనాలు ప్రచురించాయి.అధిక భద్రత కలిగిన రావల్పిండి జైలు నుంచి తనను ఆస్పత్రికి తరలించాలని, తనకు నచ్చిన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలకు ప్రాప్యత రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించిన అంశాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో ఇమ్రాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి, నిపుణులతో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించనుంది.ఈ బోర్డులో ఆయన వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ కూడా ఉంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కంటి సమస్యకు చికిత్స కోసం ఇమ్రాన్‌ను పలుమార్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జనవరి చివర్లో ఆయన కుడి కంటికి సుమారు 85 శాతం చూపు కోల్పోయారని కుటుంబ సభ్యులు చెప్పగా, ప్రభుత్వం ఆ వాదనను ఖండించింది. అనంతరం ఆయనకు సుమారు 70 శాతం చూపు తిరిగి వచ్చిందని, పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు. ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన మద్దతుదారులు అక్కడికి భారీగా చేరి ఇతర రోగులకు ఇబ్బంది కలిగించవద్దని న్యాయవాది రాజా కోరారు.ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్వాగతించింది. ఆయన ఆరోగ్యం, వైద్య సేవలకు ప్రాప్యతపై చాలాకాలంగా ఉన్న ఆందోళనలకు ఈ తీర్పు పరిష్కారం చూపుతుందని పేర్కొంది. అయితే ఇమ్రాన్ వైద్య చికిత్సకు సంబంధించిన కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అజమ్ నజీర్ తరార్ తెలిపారు. -
మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..
కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్‌కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్1 డయాబెటిస్ పేషెంట్ కూడా. దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్‌కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్‌లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్‌లో సిజేరియన్‌చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్‌ని ముగించింది. ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ. Source: పీపుల్స్ డాట్ కామ్ ఆంగ్ల వెబ్సైట్ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. (చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!) -
ఫిట్నెస్ ఈవెంట్లో కుప్పకూలిన ప్రముఖ కోచ్
బ్యాంకాక్: తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్‌లో ‘ఐఏవోటీ క్రాస్‌ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు.పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం.సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత? -
గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్..
ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో సహజంగా లభించే ‘ఆంథోసయానిన్’ అనే జీవక్రియాత్మక సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి, జీవక్రియల మెరుగుదలకు తోడ్పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా బ్లూబెర్రీలు వంటి పండ్లలో ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో, అవి గుండె ఆరోగ్యానికి తొడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ సమగ్ర విశ్లేషణలో 27 ప్రచురణల్లో వెల్లడైన 18 దీర్ఘకాలిక అధ్యయనాలు, అలాగే ఎలాంటి వ్యాధులు లేని పెద్దలపై నిర్వహించిన 65 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌ను పరిశీలించారు. తక్కువ స్థాయిలో ఆంథోసయానిన్లు తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. కలిగే ప్రయోజనాలు..గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 26 శాతం తగ్గింది.గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) ప్రమాదం 18 శాతం తగ్గింది.టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం తగ్గింది.గుండె సంబంధిత కారణాలతో మరణాల ప్రమాదం 9 శాతం తగ్గింది.అధిక రక్తపోటు ప్రమాదం 8 శాతం తగ్గింది.రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్లు తీసుకున్న వారిలో రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు, ఇన్సులిన్ స్థాయిల్లో సానుకూల మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ స్థాయిని సహజంగా రంగులున్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని వారు పేర్కొన్నారు.భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలను చేర్చడం వంటి సమతుల ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్బంగా అమెరికా హైబుష్ బ్లూబెర్రీ కౌన్సిల్ భారత ప్రతినిధి రాజ్ కపూర్ మాట్లాడుతూ, “సహజ రంగులతో కూడిన ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఆంథోసయానిన్లు సమృద్ధిగా ఉండే అమెరికన్ బ్లూబెర్రీల వంటివి కూడా భారతీయ ఆహార అలవాట్లలో సులభంగా చేర్చుకోవచ్చు” అని తెలిపారు.అయితే ఒక్క ఆహార పదార్థం మాత్రమే వ్యాధులను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని ఈ పరిశోధన చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సమతుల ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, సరిపడ నిద్ర, వైద్యుల సూచనలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆంథోసయానిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ ఏడిన్ క్యాసిడీ మాట్లాడుతూ, చిన్న చిన్న ఆహారపు మార్పులు కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనం తేల్చిందన్నారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్ శ్యాక్)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్ ఎక్స్ఛేంజ్’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్ఫ్లమేషన్ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్), వైరస్‌లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.కారణాలు..బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.వైరస్ వల్ల – ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్... వంటి వైరస్‌లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.ఫంగస్ వల్ల కూడా.కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్)ఆల్కహాల్ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.లక్షణాలివే...నిమోనియాలో...జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడంతెమడ / కఫం (ఫ్లెమ్) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.నిమోనియా ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్’ అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగా గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్ పెయిన్) కూడా రావచ్చు.సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే... సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.నిమోనియా ఎవరెవరిలో... నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలోగుండె సమస్యలు ఉన్నవారిలోస్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలోపొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.మరికొన్ని జబ్బులతో కలసి...మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.వ్యాధి నిర్ధారణబాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్‌గా.సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.వీరిలో మరింత జాగ్రత్త అవసరం...బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ...పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.చికిత్సనిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.చిన్నాపిల్లల్లో నిమోనియా!చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.స్ట్రెప్టోకాకస్ నిమోనే, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్ వంటి వైరస్లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.లక్షణాలునిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.తీవ్రమైన జ్వరం.ఆకలి తగ్గడం.తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.నిర్ధారణఛాతీ ఎక్స్‌రే.కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్ బ్లడ్‌గ్యాస్ వంటివి)కళ్లె పరీక్ష (స్ఫుటమ్ కల్చర్) : ఈ పరీక్ష వల్లనే నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.సీటీ స్కాన్ (ఛాతీది)అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.చికిత్స బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.సెకండరీ నిమోనియాపిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్ వంటి ఫ్లుయిడ్స్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్ తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించడం మంచిది. నివారణపిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్ ఫ్లూని నియంత్రించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్నిర్వహణ : యాసీన్ -
విటమిన్లు తగ్గితే మతిమరుపే?
వయసు పైబడు తున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలకు, శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన విటమిన్ల స్థాయిలకు మధ్య అత్యంత బలమైన లంకె ఉందా? అవుననే చెబుతోంది ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనం. వృద్ధుల్లో రక్తంలోని విటమిన్ స్థాయిలు తగ్గడం వల్ల మెదడు పని తీరు మందగించి మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.అంత ర్జాతీయ మెడికల్ జర్నల్ ’న్యూట్రియెంట్స్’లో ప్రచురితమైన ఈ ప్రత్యేక అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన 55–85సంవత్సరాల మధ్య వయసు గల 184 మంది వృద్ధులపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఇందులో తేలిన షాకింగ్ నిజం ఏమిటంటే.. వీరిలో 36.4% మంది అప్పటికే జ్ఞాపకశక్తి తగ్గే ఈ తొలి దశ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.విటమిన్ల లోపమే శాపమా?జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల రక్త నమూనాలను పరీక్షించినప్పుడు వారిలో డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డీ, బీ2, బీ9 విటమిన్లలో లోపాలు వీరిలో అత్యధికంగా కనిపించాయి. శరీరంలో విటమిన్–డీ, బీ6 స్థాయిలు సమృద్ధిగా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, మానసిక పనితీరు, మెదడు చురుకుదనం చాలా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వృద్ధుల్లో కేవలం విటమిన్ల లోపమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అందువల్ల మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.ముందస్తు జాగ్రత్తలువృద్ధాప్యంలో కేవలం వ్యాధుల నియంత్రణపైనే కాకుండా పోషకాహార భద్రతపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో తగినంత మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉండేలా చూసుకోవడం, వయసు పైబడుతున్న వారిలో ప్రారంభ దశలోనే పోషకాహార లోపాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్ఐఎన్ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి, పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. మెదడు చురుకుదనాన్ని నిలుపుకుంటూ ఆరోగ్యకర వృద్ధాప్యాన్ని ఆస్వాదించడానికి ముందస్తు పోషకాహార పరీక్షలు, సకాలంలో తీసుకునే సమతుల్య ఆహారం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. -
147 కేజీల నుంచి 109 కేజీలకు..! ఆ డైట్‌తో 38 కేజీలు..
బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్‌కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్‌లో రాసుకుకొచ్చారు. తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు. అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒమాడ్ డైట్..ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది. అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్‌కు..!) -
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. -
తల్లిపాలే.. తొలి పెట్టుబడి!
నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?– సరస్వతి, నెల్లూరు. తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే.. పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.సహజమైన మెదడు బూస్టర్!తల్లిపాలలో ఉండే డీహెచ్ఏ, ఏఆర్ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.తొలి బంగారు చుక్కలు!పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది. తల్లికి అండగా... సమాజం కూడా!పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
విపరీతంగా భయపడితే పొట్ట గందరగోళం! ఎందుకంటే?
మనం ఏదైనా ఎగ్జామ్‌కి వెళ్లేముందు గానీ, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయేపుడు గానీ మనసులోనే కాకుండా పొట్టలోనూ గాబరాగా అనిపిస్తుంటుంది. అయితే ఇది వట్టి ముచ్చట కాదని.. మన జీర్ణవ్యవస్థ, మెదడు నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పొట్టలో ఉండే బాక్టీరియా ఇచ్చే సంకేతాలే మన భావోద్వేగాలను, ఒత్తిడిని, మూడ్‌ను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం, మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. దీనినే ‘గట్–బ్రెయిన్ ఆక్సిస్’ అని పిలుస్తారు. బ్రెయిన్‌ను, జీర్ణ వ్యవస్థను కలిపే వేగస్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యవస్థ ద్వారా సంకేతాలు మార్పిడి చెందుతుంటాయి. అలాగే మన మనసును సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే రసాయనం మెదడులో కాకుండా ఎక్కువగా జీర్ణ వ్యవస్థలోనే తయారుకావడం విశేషం.మనసు ఎందుకు మారుతుంది?మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం, ఒత్తిడి, ఆల్కహాల్, లేదా ఇతర వ్యాధుల వల్ల పొట్టలో వాపు లేదా సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలలో మార్పులు వస్తాయి.ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసానికి కారణమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పొట్ట ఆరోగ్యాన్ని కా΄ాడుకుంటే మానసిక ప్రశాంతతను కూడా కా΄ాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?
ఇరవైల్లో వచ్చే ఒత్తిడికి, ముప్పైల్లో అనుభవించే ‘బర్నౌట్’కు చాలా తేడా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో వచ్చే అలసట, నిస్సత్తువ కాస్త నిద్రపోతేనో లేదా ఒక వీకెండ్ ట్రిప్ వెళ్తేనో తగ్గిపోతుంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదే లక్షణం తీవ్రమైన, దీర్ఘకాలిక మానసిక సమస్యగా మారుతోంది. అసలు ఈ బర్నౌట్‌కు కారణాలేంటి?బాధ్యతల ఒత్తిడి30 ఏళ్ల వయసులో జీవితంలో ఒకేసారి అనేక బాధ్యతలు వచ్చిపడతాయి. కెరీర్ కోసం పాకులాట, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటితో మనుషులు నలిగిపోతుంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. అందువల్ల ప్రతిరోజూ కాసేపు నడక, ధ్యానం లేదా నచ్చిన పని చేస్తూ శరీరానికి, మెదడుకు కాస్త సమయం ఇవ్వాలి.దొరకని విశ్రాంతి..20ల్లో ఏదైనాప్రాజెక్ట్ కోసం రాత్రుళ్లు జాగారం చేసినా శరీరం త్వరగా కోలుకుంటుంది. కానీ ముప్పైల్లోకి అడుగుపెట్టాక దశాబ్ద కాలంగా పడుతున్న కష్టం, ఒత్తిడి ఒకేసారి బయటపడతాయి. తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వల్ల శరీరం, మనస్సు నిరంతరం నిస్సత్తువలోనే ఉండిపోతాయి.ఆర్థిక ఆందోళనలు‘30 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో సెటిల్ అయిపోవాలి’ అనే సామాజిక ఆలోచన పెద్ద భారంగా మారుతోంది. సొంత ఇల్లు కొన్నానా? రిటైర్మెంట్ సేవింగ్స్ ఉన్నాయా? పిల్లల చదువుల సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సోషల్ మీడియాలో తోటి వారి ప్రగతిని చూసి ‘నేను ఇంకా వెనుకబడే ఉన్నానా?’ అనే అభద్రతా భావం మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అందువల్ల సమాజం నిర్ణయించిన మైలురాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు.జీవక్రియల్లో మార్పులువయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి, కోలుకునే సామర్థ్యం తగ్గుతాయి. ఇరవైల్లో లాగా తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికిప్రాధాన్యతనివ్వాలి.విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట... ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం... నలుగురిలో ఉన్నా ఏదో తెలియని నిరాశ, ఒంటరితనం... ఈ లక్షణాలు ఈ మధ్య మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయా? మీరు ముప్పైలో ఉన్నారా? అయితే మీరు ‘బర్నౌట్’బారిన పడి ఉండవచ్చు.విరామం లేని ‘వర్క్ కల్చర్’స్మార్ట్ఫోన్లు, మెయిల్స్, వర్క్–ఫ్రమ్–హోమ్ సంస్కృతి వల్ల ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. పని వేళలు ముగిసిన తర్వాత కూడా మెయిల్స్‌కు, మెసేజ్‌లకు అందుబాటులో ఉండాల్సి రావడం వల్ల మెదడు ఎప్పుడూ విశ్రాంతి పొందే స్థితిలోకి వెళ్లలేకపోతోంది. అందువల్ల పని వేళలు ముగిశాక వర్క్ మెయిల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. -
135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్ డైట్, జస్ట్ నడకతో..
బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్లు, డిటాక్స్ క్లెన్సింగ్లు, అధిక తీవ్రత గల వర్కౌట్లు వంటి ఎన్నో ట్రెండ్లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు. కానీ అవి కూడా మళ్లీ యథావిధికి వచ్చేలా అమాంతం బరువుని పెంచేస్తాయి. దాంతో స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయలేక చతికిలపడుతుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ట్రెండ్లు ఏం పాటించకుండా కేవలం వాకింగ్‌తోనే ప్రభావవంతంగా బరువు తగ్గొచ్చని నిరూపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 45 కేజీలు తగ్గాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే.. వివేక్ సిద్ధా అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కేవలం వాకింగ్‌తో జస్ట్ 135 రోజుల్లో 45 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకమైన డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు గానీ, షార్ట్కట్లు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. గురుగావ్‌లో పనిచేసే సిద్ధా, ప్రతిరోజూ ఢిల్లీలోని తన ఇంటికి నడిచి వెళ్తానని చెబుతున్నాడు. అతడు పదివేల అడుగులతో ప్రారంభించి..క్రమంగా 20 వేల దాక అడుగులు పెంచుకుంటూ వాక్ చేశానని తెలిపాడు.ఆహారం కూడా అంతే ముఖ్యంఒకప్పుడు సిద్దా 128 కేజీల బరువుతో ఉండేవాడు. అలాంటి ఆయన నడకతో కిలోల కొద్దీ బరువు తగ్గడం విశేషం. ఆయన వాకింగ్ తోపాటు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంపై దృష్టి పెట్టానని చెప్పారు. అందుకోసమే రెండుపూటల భోజనంతో ప్రారంభించి..ఓమాడ్ శైలి దినచర్యకు మారినట్లు తెలిపారు.బరువు తగ్గడానికి నడక ఎంత ప్రభావవంతమైనదంటే..బరువు తగ్గడానికి నడక చాలా ప్రభావవంతమైనది, ఇది అందుబాటులో ఉంటుంది, నిలకడగా చేస్తే..కొవ్వును కరిగించి, లీన్ కండరాలను కాపాడటంలో శక్తిమంతంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలో కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడకను జోడించడం ద్వారా రోజుకు సుమారుగా 150 అదనపు కేలరీలను కరిగించవచ్చు. అయితే, దీని నిజమైన ప్రభావం వేగం, నిలకడ, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు వివేక్.నడక నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.నడక కోరికలను విపరీతంగా పెంచకుండా కేలరీలను దహిస్తుంది.ఇది సురక్షితమేనా?135 రోజుల్లో 45 కిలోలు తగ్గాలంటే, మీరు ప్రతిరోజూ సుమారు 2,567 కేలరీల శక్తి లోటును కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మందికి, వారి మొత్తం జీవక్రియ ఒక రోజులో అన్ని కేలరీలను దహించదు. దీనిని సాధించడానికి దాదాపు పూర్తి ఉపవాసంతో పాటు గంటల తరబడి తీవ్రమైన రోజువారీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే..వేగంగా బరువు తగ్గడం వల్ల... పిత్తాశయ రాళ్లు, కండరాల క్షీణత, జీవక్రియ పతనం, జుట్టు రాలడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సురక్షితమైన 45 కిలోల బరువు తగ్గాలంటే,వాస్తవికంగా 11 నుంచి 22 నెలల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ నెమ్మదైన కాలవ్యవధికి సహనం అవసరమైనప్పటికీ, ఇది కండరాలకు బదులుగా స్వచ్ఛమైన కొవ్వును కోల్పోవడానికి, చర్మం వదులుగా మారడాన్ని నివారించడానికి, అలాగే జీవితాంతం పాటించగలిగే ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by Vivek siddhaa (@the_vivek_siddhaa)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
స్టెమ్‌సెల్స్ మిరాకిల్స్.. ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!
ఒక కొత్తజీవి పుడుతున్నప్పుడు ఏర్పడే మొదటి కణంలాగే మూలకణాలూ తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ అవి భవిష్యత్తులో ఏర్పడబోయే దేహ భాగాలను బట్టి, దేహంలోని వ్యవస్థలను బట్టి వివిధ రకాల కణాలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ కణాలు మరింత విభజన చెందాక టిష్యూస్‌గా ఏర్పడతాయి. అలా చర్మం, రక్తకణాలు, కడుపులోని లోపలి పొరల తాలూకు కణాలు, కాలేయం, మెదడు, వెంట్రుకలు వంటి రకరకాల శరీర భాగాలు ఏర్పడతాయి. మౌలికంగా అవన్నీ కణాలే అయినా అవి చేసే పనిని బట్టి కొద్ది వైవిధ్యంతో ఉంటాయి. అయితే ఇలాంటి వేర్వేరు కణాల్లో ఏ భాగానికి చెందిన లేదా ఏ వ్యవస్థకు చెందిన కణంగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది.అలా మారగలిగే మౌలిక కణాన్నే మూలకణం (ఇంగ్లిష్‌లో స్టెమ్‌సెల్) అంటారు. ఈ స్టెమ్‌సెల్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాధులకు చికిత్సలూ జరుగుతున్నాయి. స్టెమ్సెల్స్పై అవగాహనతో పాటు వేర్వేరు కణాలుగా రూపొందడం ద్వారా అవి ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మౌలిక కణం కదా! మరి అలాంటి ఆ మూలకణాల్లోనూ రకాలుంటాయి. పురుషుడి వీర్యకణం... మహిళలోని అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలుత ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఎంబ్రియోనిక్ సెల్’ (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) అంటారు. ఆ తర్వాత భవిష్యత్తులో ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) విభజన చెందుతూ రకరకాల మూలకణాలు ఏర్పడుతాయి. అటు తర్వాత అవి విభజితమవుతూ తాము భవిష్యత్తులో నిర్వహించాల్సిన వేర్వేరు అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు కణాలుగా రూపొందుతాయి. వీటి తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు.ఇది శాస్త్రవేత్తల ప్రతిభ... ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైన మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. పరిశోధనశాలల్లో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్’ (ఐపీఎస్) అని చెబుతారు. నిజానికి ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ దేహంలో ఎక్కడా ఉండవు. శాస్త్రజ్ఞులు చర్మం కణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎంబ్రియోనిక్ స్టెమ్‌సెల్స్) లాంటివాటిని సృష్టించగలిగారు.మూలకణాలను కనుగొన్న తీరిది... దాదాపు మూడు దశాబ్దాల కిందట... అంటే 1998 ప్రాంతాల్లో... తమ పరిశోధనల్లో శాస్త్రజ్ఞులకు ఎలుకల పిండాలలో తొలిసారిగా మూలకణాలన గుర్తించారు. దాదాపు అదే టైములోనే తమ పరిశోధనల ద్వారా మానవ మూలకణాలను ల్యాబ్‌లో వేరు చేయడంలోనూ శాస్త్రజ్ఞులు విజయం సాధించారు. తొలిదశలో ఈ కణాలను ఉపయోగించి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి పిల్లలు కలిగేలా చేయడం వరకే వారి కృషి పరిమితమైంది. ఆ తర్వాత వాటిని ఉపయోగించడంపై అనేక నైతికపరమైన అభ్యంతరాలు, ప్రశ్నలు వెలువడ్డాయి.ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్స్టెల్స్వైద్యరంగంలో ప్రయోజనాలు అటు తర్వాత జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (ఐపీఎస్)గా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అయినప్పటికీ వీటితో రకరకాల చికిత్స చేయడం ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వాటిని చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. అలా చికిత్స చేయడాన్ని మూలకణం చికిత్స లేదా స్టెమ్‌సెల్ థెరపీగా పేర్కొంటున్నారు.మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అంటే...? శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతింటే అవి మళ్లీ పుట్టవు. దాంతో ఆ దెబ్బతిన్న అవయవంలో గానీ, ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. అయితే స్టెమ్‌సెల్స్ థెరపీ ద్వారా ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేయవచ్చు. అప్పుడవి అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఆ అవయవం కూడా మునుపటిలాగే పని చేయడం ్రపారంభిస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ (సిస్టమ్) కూడా ఎలాంటి లోపం లేకుండా తన పనితీరును కొనసాగిస్తుంది.స్టెమ్‌సెల్ థెరపీ ఎప్పుడంటే...? సాధారణంగా ఇతర సంప్రదాయ వైద్య చికిత్సలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స వంటివి ఫలితాలివ్వని సందర్భాల్లో మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తారు. అందుకే మూలకణాలతో చేసే చికిత్స ప్రక్రియను ‘రీజెనరేటివ్ మెడిసిన్’ అని కూడా అంటారు. మూలకణ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలుంటాయి. ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. ఆ చికిత్స విధానంలో నైపుణ్యం పొందిన చికిత్సకులే ఈ తరహా చికిత్సలు చేయాల్సి ఉంటుంది.మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు... మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో అంత వేగంగా సాగకపోయినప్పటికీ... ఇటీవల ఈ ప్రక్రియలో మంచి పురోగతి ఉంది. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధనశాలల నుంచి ఆసుపత్రులకూ చేరింది. అయినా ఇప్పటికీ దీన్ని ఇంకా ఆవిర్భావ దశలో ఉన్న తొలిదశగానే చెప్పవచ్చు. అంటే ఇంకా ఈ రంగంలో అభివృద్ధి సాధించాల్సింది ఎంతో ఉందని అర్థం.మూలకణ చికిత్సల్లో ఆశారేఖ ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మకదశల్లో చేసిన పరీశీలనల్లో అత్యంత సునిశితమైన ఈప్రక్రియ చాలా సురక్షితమైనదని తెలియడంతో పాటు ఇందులో పూర్తిగా నమ్మదగిన ఫలితాలే వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. అయితే ఇప్పుడీ ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్న మేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్నదాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్ మెడిసిన్’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్‌లోని తొలిగడప మీద ఉన్నామని చెప్పవచ్చు.మూలకణాలతో ఏయే వ్యాధులకు చికిత్స అంటే? ప్రస్తుతానికి మనకు మూలకణ చికిత్సలో ఉన్న పరిజ్ఞానంతో క్యాన్సర్లలోని కొన్ని రకాలైన లుకేమియా (బ్లడ్‌క్యాన్సర్), లింఫోమా, అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతోంది. సాధారణ చికిత్సకు లొంగని క్రిటికల్ లింబ్ ఇస్కిమియా, డయాబెటిక్ ఫుట్ (మధుమేహం వల్ల కాలికి పుండుపడి కుళ్లిపోవడం), డయాబెటిక్ న్యూరోపతి (మధుమేహం వల్ల కాలి లేదా చేతి వేళ్ల చివరలలో మంటలు, తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గడం), స్కీ›్లరోడెర్మా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ట్రోక్ (పక్షవాతం), హార్ట్‌ఫెయిల్యూర్ (గుండెజబ్బులు), కాలేయ వ్యాధులు, డయాబెటిస్ (మధుమేహం), ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్ (ఎముక సంబంధమైన వ్యాధులు), ఫ్రాక్చర్లు, కార్నియల్ డ్యామేజ్ (కంటిలోని నల్లగుడ్డు దెబ్బతినడం), బట్టతల, బొల్లి (విటిలిగో) వంటి వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చు.సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు!మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో దొరకాలంటే మాత్రం అవి బొడ్డు తాడులోని రక్తంలోనే ఎక్కువగా ఉంటాయి. అయితే... ఇప్పటి తరాలతో పోలిస్తే... ఇంతకు ముందున్న తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడం అనే అంశంపై పెద్దగాఆసక్తి లేదు. ఎందుకంటే... అప్పట్లో మూలకణాలతో రకరకాల చికిత్సలు సాధ్యమవుతాయనే విషయమే పెద్దగా తెలియదు.క్రిటికల్ లింబ్ ఇస్కిమియా ఈ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలోని కింది భాగాలు గుండె నుంచి చాలాదూరంగా ఉన్నందువల్ల, అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల చివరి భాగాలకు తగిన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం మొత్తం పనికిరాకుండా పోతుంది. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... బాధితుడు తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేని పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు విజయం సాధించారు.స్క్లీ రోడెర్మా, ల్యూపస్ అండ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ మన సొంత వ్యాధి నిరోధక కణాలు సొంత వ్యవస్థలను పరాయివారిగా గుర్తించి దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ‘ఆటో ఇమ్యూన్ వ్యాధులు’గా పేర్కొంటారు. ఈ వ్యాధుల్లో మన సొంత వ్యాధి నిరోధక శక్తిని కావాలనే తగ్గించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ్రపాణాలకే ముప్పుగా మారవచ్చు. అయితే... మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల ఆగడాలను అరికట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు.బొల్లి (విటిలిగో)కి చికిత్స... చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీని వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తూ... కాస్మెటిక్‌గా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... ఆ ప్రదేశంలో మామూలు రంగునిచ్చే (పిగ్మెంట్ ఉన్న) కణాల్ని పెరిగేలా చేయడంతో కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగు ఉన్నట్లుగా మారిపోతుంది. ఇలా విటిలిగోకు చికిత్స చేయవచ్చని స్టెమ్‌సెల్ బయాలజిస్టుల అభి్రపాయం.ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!వెంట్రుక పుట్టే రోమమూలంలోకి ఈ స్టెమ్‌సెల్స్ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్ ఫాలికిల్ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి. దీంతో మున్ముందు బట్టతల అనే సమస్య పూర్తిగా పరిష్కృతమవుతుందన్నది వైద్యవర్గాల ఆశాభావం.బ్లడ్ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స ఇలా... రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను (బోన్ మ్యారో)ను బాధితుల నుంచి పూర్తిగా తొలగించి... అక్కడ మరో దాత నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూలకణాలను ప్రవేశపెడతారు. దాంతో ఈ కొత్త ఆరోగ్యకరమైన మజ్జ కారణంగా... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. ఇలా చేసే ఈ చికిత్సతో బ్లడ్క్యాన్సర్లూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స సాధ్యమవుతోంది. ఈ రకమైన చికిత్స అనేది ఇప్పటికి... లుకేమియా, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియాలో సాధ్యమవుతుంది.వ్యాధిగ్రస్తుల దగ్గరి సంబంధీకుల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే పుడుతుంటాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ చికిత్సను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఈ చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ముప్పు (రిస్క్) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్క్ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు జరుగుతున్నాయి.డయాబెటిక్ ఫుట్ అండ్ డయాబెటిక్ న్యూరోపతి మధుమేహం ఉన్నవారిలో ఈ దుష్ప్రభావం చాలా సాధారణం. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం మొదలవుతుంది. గ్యాంగ్రీన్గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు బాధితులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్‌సెల్స్ వల్ల డయాబెటిక్ ఫుట్నూ, డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఎక్కువేనని తెలిసింది.ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్) ఎముక సంబంధ వ్యాధుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం, చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగిన ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) దెబ్బతినడం, ఎముకకు రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్ నెక్రోసిస్) వంటివి ఇందులో కొన్ని. ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని వాటిల్లో కూడా... ఇప్పుడు మూలకణ చికిత్సలతో మంచి ఫలితాలే వస్తున్నాయి. ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన 3–4 ఏళ్ల తర్వాత కూడా ఆ భాగం మళ్లీ పునరుజ్జీవంతో మామూలుగానే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో... ఇప్పటికే గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల్లో స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మున్ముందు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చన్నది వైద్య వర్గాల మాట. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలో... చనిపోయిన ఆ కణాలను పునరుజ్జీవించేలా చేసి, హార్ట్ ఫెయిల్యూర్‌ను రివర్స్ చేయవచ్చన్నది పరిశోధనలతో తెలిసివస్తున్న మాట.అలాగే కాలేయం విషయానికి వస్తే... మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ్రపాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే ఆ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కార్నియా, రెటీనా సమస్యలకు... గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ... లేదా దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారమే ఉండేది కాదు. అయితే స్టెమ్‌సెల్స్ వల్ల ఇలా క్రమంగా క్షీణిస్తూ మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వాటి ఆధారంగా కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాలతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అనేక మంది అంధులకు మళ్లీ కంటివెలుగు తెప్పించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్లకు కనిపిస్తున్న ఆశారేఖ.చివరగా... మూలకణ పరిశోధకులు (స్టెమ్‌సెల్ స్పెషలిస్ట్స్), క్లినీషియన్స్ (డాక్టర్లు), కొన్ని సందర్భాల్లో సర్జన్లు (శస్త్రచికిత్సకులు) కలిసి సంయుక్తంగా ఒక బృందంగా ఏర్పడి ఈ చికిత్సలను నిర్వహిస్తుంటారు. మున్ముందు ఈ రంగంలో కనుగొనబోయే చికిత్సలతో వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన మార్పులు రావచ్చన్నది పలువురు పరిశోధకులు, వైద్యవర్గాల భావన.- డాక్టర్ సాదత్ అల్ అలీ, ప్రొఫెసర్ ఆఫ్ రీ జెనరేటివ్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీనిర్వహణ: యాసీన్ -
మూడు రోజుల మౌనం వెనుక..
సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్‌కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్‌లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
సర్జికల్ మెనోపాజ్‌తో పెరిగే మూత్ర సంబంధ సమస్యలు!
సహజంగా మెనోపాజ్ వచ్చిన మహిళలతో పోలిస్తే... శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ (సర్జికల్ మెనోపాజ్) వచ్చిన మహిళల్లో లైంగిక సమస్యలూ, మూత్ర సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా అండాశయాలను తొలగించడం వల్ల వచ్చే మెనోపాజ్ అని అర్థం.మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో... జననేంద్రియాలు, దిగువ మూత్రనాళ వ్యవస్థలో మార్పుల కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలతో కూడిన సిండ్రోమ్‌ను ‘జెనిటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’ (జీఎస్ఎమ్) అంటారు. సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళల్లో జీఎస్ఎమ్ లక్షణాలు చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తేలింది. లైంగిక సమస్యల్లో యోని పొడిబారడం, కలయిక సమయంలో నొప్పి, కోరిక తగ్గడం, కలయిక తర్వాత రక్తస్రావం ప్రధానంగా కనిపించాయి.ఇక మూత్ర సంబంధ సమస్యల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పి కనిపించడం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రాన్ని అదుపులో ఉంచుకోలేక΄ోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళల తాలూకు ఇతర ఫిజికల్ పరీక్షల్లోనూ జీఎస్ఎమ్ తీవ్రతను సూచించే స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?) -
క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH— RT (@RT_com) August 8, 2026అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! -
12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్! ఐతే..
ప్రసవ వేదన అంటేనే భరించలేని నరకం అంటారు. ఇంకో జన్మఎత్తడం లాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాంటిది అంతటి ఉద్విగ్న స్థితిలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం తనకు తానుగా సిజేరియన్ చేసుకుని ప్రసవించింది. వైద్యలు సైతం విస్తుపోయారు. ఒకవేళ అలా చేసినా తల్లీబిడ్డ బతకడం అసాధ్యమని అన్నారు.ఈ మిరాకిల్ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలోని ఓక్సాకాలో ఒక మారుమూల పర్వత గ్రామంలో ఇనెస్ రామిరేజ్ పెరెజ్ అనే మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. అందుకు కారణం ఆమె ఉన్న పరిస్థితులనే చెప్పాలి. నిజానికి ఆమె నిండు గర్భిణీ. ప్రసవించే సమయం దగ్గరపడుతున్న తరుణం. కానీ ఇంట్లో కనీసం కరెంట్ లేదు, ఫోన్ లేదు, నీటి సరఫరా కూడా లేదు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేని ఓ మారమూల పర్వత గ్రామంలో ఉంటుందామె. ఆ టైంలో ఇంట్లో ఆమె భర్త కూడా లేడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అలా ఆమె మొత్తం 12 గంటలు నొప్పులతో నరకం చూసింది. ఇక చూస్తుండగానే తనకు, తన బిడ్డకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గ్రహించి తనకు తానుగా సీజేరియన్ చేసుకునేందుకు సిద్దమైంది. ఎందుకంటే అంతకుమునుపు కూడా ఇలానే ప్రసవవేదన పడి పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఆ వేదన ఆమెకు తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాహసానికి పూనుకుందామె. అందుకోసం ముందుగా తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ఉండేలా కాస్త మద్యం సేవించింది. ఆ తర్వాత తన గర్భాశయం వద్ద ఇంట్లో ఉండే కత్తితో కోసి బిడ్డను బయటకు తీసింది. బొడ్డు తాడుని కత్తెరతో కట్‌చేసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మెలుకువ వచ్చాక..తనకు అందుబాటులో ఉన్న వాటితో గాయానికి చక్కగా కట్టు కట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకుని పిలిచి గ్రామంలోని డాక్టర్‌కి విషయం చెప్పమని పంపింది. ఆ తర్వాత ఆ గ్రామ వైద్యుడు వచ్చి ఆమెను హుటాహుటినా క్లినిక్‌కి తీసుకువెళ్లి..కట్లు వేశాడు. అలాగే తల్లీబిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా తగిన చికిత్స కూడా అందించాడు. అయితే ఇక్కడ వైద్యులు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైందని విస్తుపోయారు. అసలు స్వీయంగా సీజేరియన్ అంటే మాటలు కాదు..ఒకవేళ అలా చేసినా, బతికే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఎందుకంటే తగిన పనిముట్లు, అనుభవం గానీ లేని మహిళ తనకు అందుబాటులో ఉన్నవాటితో ప్రసవం చేసుకోవడం, బతికి బట్టగట్టగలగడం అంటే ఇదోక మిరాకిల్ అని అన్నారు వైద్యులు. ఈ అద్భుతమైన ఘటన మార్చి 05, 2000లలో చోటు చేసుకుంది. అలాగే ఇలాంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించే సాహసం చేయొద్దని హెచ్చరించారు వైద్యులు . ఇక్కడ ఆ మహిళకు మరో గత్యంతర లేక, బిడ్డను కాపాడుకోవడానికి మాతృమూర్తి చేసిన సాహస కృత్యంగా పరిగణించాలని అన్నారు గైనకాలజిస్ట్లు. అయినా ఇంకా కరెంట్ రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు ఉన్నాయా అనే అంశాన్ని లేవనెత్తడమే గాక, అలాంటి చోట్ల ఉండే గర్భిణుల సంరక్షణ ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే వ్యవస్థలోనే లోపాలను ఎత్తి చూపిన ఘటనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.(చదవండి: బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!) -
92 కేజీల నుంచి 60 కేజీలకు..!ఆ ఆహారాలకు 'నో' చెప్పాల్సిందే..
బరువు తగ్గడం అనేది రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్లిమ్ అవుతారు చాలామంది. అంతేగాదు కేవలం తీసుకునే ఆహారాన్ని చాలా తెలివిగా, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకుంటే..బరువు తగ్గడం అసాధ్యమైంది కాదు అని నిరూపించారు పలువురు. చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడం తోపాటు ఉబ్బరాన్ని కూడా తగ్గించుకోవచ్చు అని అంటోంది కంటెంట్ క్రియేటర్ దీప్తి. ఈ మార్పుల తోపాటు క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, కేలరీల లోటుని పాటిస్తే..అద్భతమైన ఫలితాలు సాధించొచ్చని అంటోంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ దీప్తి ఒకప్పుడు 92 కేజీల దాక అధిక బరువుతో ఉండేది. అలాంటి ఆమె అద్భతంగా సుమారు 32 కేజీల బరువు తగ్గారు. తాను ఆ ఐదు ఆహారాలకు దూరంగా ఉండటంతోనే ఇంతలా స్లిమ్‌గా మారినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. కేలరీలు లోటు ఉండాలనేది గుర్తించుకుంటే బరవు తగ్గడం ఏమంత కష్టం కాదని చెబుతోంది. చక్కెర పానీయాలుదీప్తి మొదటగా మానేసింది చక్కెర పానీయాలనే. ఇవి కొవ్వు పేరుకుపోవడానికి, నీరు నిలిచిపోవడానికి దారితీసి, ముఖం ఉబ్బినట్లుగా కనిపించేలా చేస్తాయి. వాటికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్రీన్ టీ వంటి తీసుకోవాలని సూచించింది.వైట్ బ్రెడ్తాను వైట్ బ్రెడ్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా ఇది కొవ్వు సులభంగా పేరుకుపోవడానికి కారణమవుతుందని అన్నారు. వాటికి బదులుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, సోర్‌డౌ, ఓట్స్‌ను ఎంచుకుంది.ప్యాక్ చేసిన స్నాక్స్చిప్స్, ఇతర ప్యాక్ చేసిన స్నాక్స్‌ను కూడా ఆమె మానుకుంది. వాటిలో తరచుగా ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఇది కడుపు ఉబ్బరాన్ని పెంచి, అనవసరమైన ఆకలి కోరికలను ప్రేరేపిస్తుందని అన్నారు. బదులుగా వేయించిన శనగలు, నట్స్, మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తీసుకోవాలని అన్నారువేయించిన ఫాస్ట్ ఫుడ్వేయించిన బర్గర్లు, ఫ్రైస్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కూడా మానుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ ఆహారాలలో సాధారణంగా కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయని, ఇవి అదనపు కేలరీలను జోడించడంతో పాటు మిమ్మల్ని నీరసంగా ఉంచుతాయని అంటోంది. ఆమె బదులుగా ఇంట్లో తయారు చేసిన ర్యాప్‌లు, పనీర్ లేదా చికెన్ టిక్కా, సాధారణ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడింది.అర్ధరాత్రి పూట చిరుతిండిచివరగా కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి పూట అడ్డదిడ్డంగా చిరుతిండి తినడం వంటి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. పడుకునే ముందు అనాలోచితంగా తినడం వల్ల, తెలియకుండానే రోజువారీ క్యాలరీల వినియోగం వేగంగా పెరిగిపోతుందని అన్నారు. అంతగా ఆకలిగా అనిపిస్తే హెర్బల్ టీ తాగి, నిద్రపోండని అన్నారు.అదనంగా, ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగడం, కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం, ప్రతిరోజూ నడవడం వంటి అలవాట్లను కూడా దీప్తి సూచించింది. ఆమె ప్రకారం, కేలరీల వినియోగాన్ని తగ్గించి తినడంతో పాటు ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల, కాలక్రమేణా ముఖం, శరీరంలో స్పష్టమైన మార్పు కనిపించడమే గాక చూక్కని ఆకృతిలో స్లిమ్‌గా కనిపిస్తారని చెబుతోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..) -
'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..
'మాంసాన్ని తినే వ్యాధి' అనే పేరు వినగానే ఎవరికైనా భయం, ఆందోళన కలగడం సహజం. ఈ వ్యాధి శాస్త్రీయ నామం 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్' అని చెబుతున్నారు వైద్యులు. దీనికి చికిత్స సైతం అందుబాటులో ఉందట. వినడానికే భయం కలిగిస్తున్న ఈ వ్యాధి ఏంటో, ఎందువల్ల వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌గా వ్యవహరించి మాంసాన్ని తినే వ్యాధి చర్మం క్రింద ఉండే మృదు కణజాలాన్ని ప్రభావితం చేసే ఒక అరుదైన ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. అత్యంత అరుదైన సందర్భాలలో కళ్ల చుట్టూ కూడా రావొచ్చు. చిన్న కోత, శస్త్రచికిత్స గాయం లేదా కీటకం కాటు వంటి వాటి ద్వారా చర్మంలో ఏర్పడిన గాయం గుండా కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడే వారిలో చాలామందికి బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.లక్షణాలు..చికిత్స..ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా తీవ్రతరమవుతాయి. సులభంగా గుర్తించగలిగే మార్పులు ఇవి:వాపు, ఎర్రబడటంఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి లేదా సున్నితత్వం (స్పర్శకు నొప్పిగా అనిపించడం)అయితే, బయటకు కనిపించే దానికంటే ఆ అసౌకర్యం లేదా నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ అవసరం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు.నివారించడం ఎలా అంటే..నెక్రోటైజింగ్ ఫాసిటిస్ను పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అయితే, దీని ముప్పును తగ్గించడానికి ఇలా చేయండని చెబుతున్నారు వైద్యులు. అవేంటంటే..గాయాలను సబ్బు నీటితో శుభ్రం చేయండి. అవి నయమయ్యే వరకు శుభ్రమైన కట్టుతో (bandage) కప్పి ఉంచండి.ఏదైనా లోతైన కోత లేదా గుచ్చుకున్న గాయం అయినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.చర్మంపై గాయం లేదా కోత ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్ లేదా బయట ఉండే నీటి వనరులలోకి వెళ్లకండి. View this post on Instagram A post shared by Kunal Sood, MD (@doctorsoood) (చదవండి: షాంపూ బదులు.. ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయం ఇదే! వైద్యులు సైతం..) -
'మెకియా వెల్లియనిజం'.. ఈ జీవితం ఎంత నరకమంటే?
డాక్టర్ గారు... మా అమ్మనాన్నలు చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగాను. పదహారేళ్లకే పెళ్లి చేశారు. నా భర్త కాంట్రాక్టరు. మాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం బాగుకోసం అని చెప్పి, నన్ను పై అధికారుల దగ్గరకు పంపేవాడు. ఆ బాధను మర్చిపోవడానికి మద్యం అలవాటు చేశాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు.. పిల్లలు పెద్దయ్యాక, వాళ్లముందే చెడ్డదానిగా నిలబెట్టాడు. కుటుంబం బాగు కోసమే అన్నీ సహించాను. ఇప్పుడు ఒంటరిదానిని అయ్యాను. చనిపోవాలని ఉన్నా నిస్సహాయతలో బతుకుతున్నాను. – ఓ అభాగ్యురాలుమీరు అనుభవించిన నరకం, ఎదుర్కొన్న మోసం, పడిన మానసిక సంఘర్షణ మాటల్లో వ్యక్తపరచలేనివి. ‘కుటుంబం, బతుకుతెరువు’ అనే భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మీ భర్త మిమ్మల్ని ఊబిలోకి నెట్టాడు. ఇది సైకాలజీలో ‘మెకియావెల్లియనిజం’ అని పిలిచే అత్యంత స్వార్థంతో కూడిన క్రూరమైన మనస్తత్వం.మీ డిప్రెషన్‌ను అణచివేయడానికి అతనే మిమ్మల్ని మద్యానికి కూడా అలవాటు చేశాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనలోని నేర భావనను మీపైకి నెట్టేశాడు. సైకాలజీలో దీనినే ప్రొజెక్షన్’ అంటారు. మీరు ధైర్యంగా బతికి చూపించడమే అతనికి సరైన సమాధానం. ప్రస్తుతం మీ భర్త పిల్లల దగ్గర నిజాలు దాచి మిమ్మల్ని చెడుగా చూపిస్తున్నా, కాలం మారినప్పుడు నిజం కచ్చితంగా బయట పడుతుంది.ఆవేశపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఒక మానసిక నిపుణుడిని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. అవసరమైతే మహిళా హెల్ప్ లైన్ లేదా చట్టపరమైన రక్షణ పొందండి. మనం చేసే పనుల వెనుక ఉన్న ‘ఉద్దేశమే’ మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది తప్ప, బలవంతంగా మన చేతచేయించిన పనులు కాదు. ‘నేను బ్రతికి చూపిస్తాను’ అనే ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి.- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆ కారణంగానే గజినీ నటుడు ప్రదీప్ రావత్ ప్రాణం..వృద్ధాప్యంలో ఆ సమస్య తప్పదా?
గజని పలు బ్లాక్‌బస్టర్ మూవీలలో విలన్‌గా తన మార్కుతో మెప్పించి ప్రశంసలందుకున్న నటుడు ప్రదీప్ రావత్ కేన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. మంచి నటుడి పేరుతెచ్చుకున్న రావత్ 74 ఏళ్ల వయసులో కేన్సర్ కారణంగా మృతి చెందినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక్కడ ఈ నటుడి మరణంగా కీలకమైన ఆరోగ్య ప్రశ్నను లేవనెత్తింది. కేవలం వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?, తప్పనిసరిగా వృద్ధాప్యంలో కేన్సర్ వస్తుందా అంటే..వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం కచ్చితంగా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగని వృద్ధాప్యంలో కేన్సర్ అనివార్యమని చెప్పలేమని అన్నారు. జీవితాంతం మన శరీరంలోని కణాలు నిరంతరం విభజన చెందుతూ, తమను తాము బాగు చేసుకుంటాయని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ మన కణాలకు జన్యుపరమైన హాని జరగడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మన శరీరం దెబ్బతిన్న DNAను రోజూ బాగు చేసుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలు చివరికి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అదే సమయంలో అదే సమయంలో, మన రోగనిరోధక వ్యవస్థ అసాధారణ కణాలు కేన్సర్‌గా మారకముందే వాటిని గుర్తించి నాశనం చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఈ జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడంతో, అసాధారణ కణాలు వృద్ధి చెంది కేన్సర్‌గా మారే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఒక వయసు గల ప్రతి ఒక్కరికీ కేన్సర్ వచ్చే ప్రమాదం ఒకేలా ఉంటుందని అపోహ పడుతుంటారు. జీవసంబంధమైన వృద్ధాప్యం, కాలక్రమేణా వచ్చే వృద్ధాప్యానికి భిన్నంగా ఉంటుందని నొక్కి చెబుతున్నారు. జీవనశైలి, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ స్థాయి, నిద్ర నాణ్యత, సాధారణ జీవక్రియ ఆరోగ్యంపై ఆధారపడి, 74 ఏళ్ల వయస్సు గల ఏ ఇద్దరు వ్యక్తులకు కేన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ..క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారికి ఈ సమస్య తక్కువ. అలాకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉంటే కచ్చితం ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. వృద్ధుల్లో ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి రీజన్..వృద్ధులలో కేన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, లక్షణాలను తరచుగా వృద్ధాప్యంలో సాధారణమైనవిగా కొట్టిపారేయడమేనని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం బరువు తగ్గడం, అసాధారణమైన అలసట, మూత్రంలో లేదా మలంలో రక్తం, తగ్గని గడ్డ, మింగడంలో ఇబ్బంది, లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇవే కాకుండా కనిపించే ఇతర లక్షణాలు..మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులుకారణం తెలియని రక్తస్రావంచర్మంపై కొత్త మార్పులునిరంతరం గొంతు బొంగురుపోవడంఆకలి లేకపోవడంరాత్రిపూట చెమటలు పట్టడంఈ లక్షణాలు ఎల్లప్పుడూ కేన్సర్‌ను సూచించనప్పటికీ, ఈ లక్షణాలతో ముందస్తు వైద్య పరీక్షల్లో ఆ వ్యాధిని ముందుగా గుర్తించి సులభంగా బయటపడగలుగుతారని అంటున్నారు. చాలా కేన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తే..సులభంగా చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలను, సకాలంలో చేస్తే.. లక్షణాలు కనిపించకముందే కొన్ని రకాల కేన్సర్లను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు.అలాగే చాలామంది డెబ్బై, ఎనభై ఏళ్ల వరకు జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కేన్సర్ సర్వసాధారణం అయినప్పటికీ..వృద్ధాప్యాన్ని అనివార్య పరిణామంగా పరిగణించకూడదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అందుకే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా కేర్ తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్‌తోనే..
బరువు తగ్గడం అనేది తెలివిగా డైట్ లేదా వ్యాయామాలు చేస్తూ.. సునాయాసంగా తగ్గే ప్రక్రియని పలువురు నిరూపిస్తున్నారు. అందుకు ఫ్యాన్సీ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటే చాలని అంటున్నారు. మంచి పలితాలు అనేవి ప్రతిరోజు పాటించగల సాధారణ అలవాట్లుగా మంచి ఆహారపు అలవాట్లను భాగం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాచీ కూడా అలానే అనుసరించి జస్ట్ మూడేళ్లలో అమాంతం 40 కేజీలు తగ్గింది. అంతేగాదు అంతలా బరువు తగ్గడానికి ఉపకరించిన ఆహారాలను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ అవేంటో చూద్దామా..!.నిజానికి సాచీ 99 కేజీల పైనే బరువు ఉండేది. జస్ట్ ఆ ఐదు భోజనాలతో ఏకంగా 40 కేజీలపైనే బరువు తగ్గింది. తనకు వెయిట్‌లాస్ జర్నీలో ఉపకరించిన ఆ ఐదు ఆహారాల వివరాలు..వాటిని నిలకడగా అనుసరిస్తే కలిగే లాభాలు గురించి షేర్ చేసుకున్నారామె.అవేంటంటే..పాలక్ పనీర్ బౌల్ఈ భోజనంలో 200 గ్రాముల పాలక్ పనీర్, 150 గ్రాముల వండిన అన్నం, 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫైబర్ల సమతుల్య కలయిక. పెరుగు అదనపు ప్రోటీన్‌ను అందిస్తుంది, బీట్రూట్ ఫైబర్,సహజమైన తీపిని ఇస్తుంది.గుడ్లతో రొయ్యల ఫ్రైడ్ రైస్సాచి 200 గ్రాముల రొయ్యల ఫ్రైడ్ రైస్‌ను, ఉల్లిపాయ,క్యాప్సికమ్‌తో వండిన ఒక పూర్తి గుడ్డు, రెండు గుడ్డు తెల్లసొనలు, తరిగిన దోసకాయతో కలిపి తీసుకుంది. ఈ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పైగా ఇందులో కడుపు నిండినట్లు అనిపించడానికి ఇందులో కూరగాయలు కూడా ఉంటాయి.గుడ్లు, పుట్టగొడుగులు, క్రాకర్లుఈ ప్లేట్లో రెండు గుడ్లు, పుట్టగొడుగుల వేపుడు, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, ఉడికించిన ఒక బీట్రూట్, మూడు వాసా క్రాకర్లు ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఒక సాధారణ భోజనం. ఇది కూడా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.ఎయిర్-ఫ్రైడ్ చికెన్ ప్లేట్ఆమె ప్లాన్‌లోని మరొక ఇష్టమైన వంటకంలో 100 గ్రాముల ఎయిర్-ఫ్రైడ్ మసాలా చికెన్, 150 గ్రాముల అన్నం, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, సైడ్‌గా తాజా క్యారెట్, దోసకాయ సలాడ్ ఉంటాయి. ఇది లీన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, తాజా కూరగాయల మిశ్రమం.గ్రీన్ చట్నీ చికెన్ మీల్ఈ చివరి ప్లేట్లో ఎయిర్-ఫ్రైడ్ చేసిన రెండు గ్రీన్ చట్నీ చికెన్ లెగ్స్, 150 గ్రాముల పాలక్ పనీర్, 120 గ్రాముల అన్నం, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్‌ను ఆకుకూరలతో నియంత్రిత పరిమాణంలో అన్నంతో మిళితం చేస్తుంది.సాచీ డైట్ విధానాన్ని చూస్తే..ఆమె ఎక్కడా..అన్నం తినడం మానలేదు లేదా తనకు ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయలేదు. దానికి బదులుగా, ఆమె తగినంత ప్రోటీన్, కూరగాయలు, నియంత్రిత పరిమాణాలతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టింది. అలాగే ఆమెలో ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. అందుకోసం ఆమెకి మూడేళ్లు పట్టింది. తక్షణ ఫలితాలనిచ్చే డైట్ల కంటే చిన్నగా, నిలకడైన అలవాట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని సాచీ వెయిట్‌లాస్ జర్నీ నిరూపించింది. View this post on Instagram A post shared by Saachi | Fat Loss. Real Talk. Pilates. (@saachi.pai)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss: జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..! ఆ ఐదింటితోనే బరువు మాయం..) -
బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది...
తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే ఆనందం మాత్రమే కాదు అదే సమయంలో స్త్రీ తల్లిగా కొత్త జన్మ ఎత్తుతుందని, ఆ జన్మను మరింత దివ్యంగా మార్చుకునే శక్తి ఆమెకే ఉందని ప్రపంచస్థాయిలో ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లికి కుటుంబ మద్దతు, వైద్యుల సూచనలు తప్పనిసరి అవసరం...ఔషధం లాంటి అమ్మపాలు బిడ్డకు అమృతమే. సహజ పోషకాహారం. బిడ్డ ఆరోగ్యకరమైన భావి జీవితానికి ఎంతో విలువైనవి. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో పాటు పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మపాల ్రపాధాన్యత గురించి, బిడ్డకు లభించిన జన్మహక్కు గురించి మరింత వివరంగా తెలుసుకోవడం, తెలియజెప్పడం మన విధి.ఇన్ఫెక్షన్ల నివారిణి...తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలావరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్కా అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శక్తి ప్రదాయిని. సాధారణ సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలొస్ట్రమ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలని, ‘మొదటి గంట’ మరీ కీలకం అని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఇంతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి కారణం శిశువు ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఆ పాలలో ఉంటాయి. ్ర΄÷టీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.తల్లి పాలు ఇవ్వడం ద్వారా... శిశువులోనూ, తల్లిలోనూ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మాతా – శిశు మరణాల రేటు తగ్గించవచ్చు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మేధో పరీక్షలలో మెరుగ్గా రాణిస్తారు. అధికబరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ ∙తల్లిపాలు ఇచ్చే మహిళలకు రొమ్ము, అండాశయ కాన్సర్ల ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. తల్లిపాల పెంపుదలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తల్లిపాలు అందక ఇప్పటికీ ప్రతి వెయ్యి నవజాత శిశువులలో 224 నుంచి 263 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నేటికీ 6 నెలల లోపు శిశువులలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.పని ప్రదేశాలలో తల్లిపాలకు మద్దతుపిల్లల జీవితంలో ఆరోగ్యకరమైన పునాది వేసేది తల్లిపాలు. శిశు, చిన్న పిల్లల పోషణలో అవగాహన మాత్రమే తల్లిపాలు ఇచ్చే శాతాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సంస్థ 16 అధ్యయనాల అంచనాలను క్రోడీకరించి ఆరోగ్య కేంద్రాలు, సంఘాలు, ఇళ్లలో చెప్పడం ద్వారా తల్లిపాలు ఇచ్చే రేటు 58 శాతం పెరిగిందని వివరించింది. ∙15,096 మంది నవజాత శిశువులపై జరిపిన అధ్యయనాలలో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్‌హెచ్‌ఐ) వల్ల శిశువు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చేవారి సంఖ్యలో 45 శాతం పెరిగిందని, ఆ తర్వాత కొనసాగించేవారి సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగిందని వివరించింది ∙మీడియా జోక్యం ద్వారా 17 శాతం తల్లిపాలు పట్టడాన్ని పెంచిందని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది ∙వేతనంతో కూడిన ప్రసూతి సెలవు వల్ల తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తేలింది. పని ప్రదేశంలో శిశువులకు తల్లిపాలు పట్టడానికి మద్దతు ఇచ్చే విధానాలు, కార్యక్రమాలు తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అభి్రపాయపడింది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అమృతం.. ఆరోగ్య కవచం!
తల్లిపాలకు ఎంతో విశిష్టత ఉంది. బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అర గంటలోపు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. నేటి ప్రపంచంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం లేదు. అలాంటి పిల్లల ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పిల్లలకు తల్లిపాల విశిష్టతను తెలియచేసేందుకు ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడంతో పాటు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కలి్పంచనున్నారు.హిందూపురం టౌన్: తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి కూడా సమకూరుతుంది. తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోక కుండా నివారించొచ్చు. మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు, విటమిన్–ఏ పుష్కలంగా ఉంటాయి. శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.తల్లి పాల ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది తల్లికీ ఉపయోగం బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావం అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.శిశు మరణాల నివారణ ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అర గంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.రెండేళ్ల వరకు అందించాలి పుట్టిన పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి, ఏ సమయాల్లో అందించాలి అనే అవగాహన సమాజంలో, తల్లుల్లో పెరగాలి. నెలలోపు పిల్లల మరణాల తగ్గింపు, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుండాలంటే బిడ్డ పుట్టిన గంట నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలు అందించాలి. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బీపీఎన్ఐ ద్వారా పిల్లలకు తల్లిపాల ద్వారా అందే పోషక పదార్ధాలు, పిల్లల పెరుగుదల, తల్లిపాలు అందించకపోవడంతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రిలో పనిచేసే ప్రతి ఆరోగ్య కార్యకర్తకు తల్లిపాలపై నైపుణ్య శిక్షణ ఇప్పించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణి, బాలింతలకు వివరించేలా చేయడం ద్వారా పిల్లల మరణాలు మరింత నివారించవచ్చు.– డాక్టర్ కేశవులు, ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు, బీపీఎన్ఐ జాతీయ అడ్వైజరీ కమిటీ మెంబర్ -
ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత! హాస్టల్లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్, కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో నోబుల్ కాలనీలో ఉన్న షార్కి హోప్ గర్ల్స్ హాస్టల్లో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒంటిపై దద్దుర్లు రావడంతో పాటు చేతులు, కాళ్లు వంకర్లు పోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విద్యార్థినులకు మధ్యాహ్నం సమయంలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 6.30 గంటల తర్వాత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైత్రి ఫౌండేషన్ సంస్థ స్పాన్సర్‌గా అందించిన ఆహారాన్ని వారు తీసుకున్నారు. తదనంతరం ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఘటనకు అసలు కారణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, విద్యార్థినుల అస్వస్థతకు వ్యాక్సిన్ కారణమని హాస్టల్ నిర్వాహకులు ఆరోపిస్తుండగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వర్గాలు, హాస్టల్ నిర్వాహకుల వాదనలు భిన్నంగా ఉండటం చర్చనీయాంశమైంది.విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పేర్ని కిట్టు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
జీయూటీబీ అంటే ఏమిటి? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
ట్యూబర్క్యులోసిస్ అంటే... చదువుకున్నవారికి తప్ప పెద్దగా తెలియని ఈ వ్యాధిని టీబీ అంటే సామాన్యజనం కూడా గుర్తుపడతారు. ఇదెంతో పురాతనమైన వ్యాధి. ఎంత పురాతనమైనదంటే... క్రీ.పూ. 8000 ఏళ్ల కిందట ఈజిప్షియన్ మమ్మీలలోనూ ఈ వ్యాధి తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు... మన స్వాతంత్ర సంగ్రామంలోనూ జైళ్లలో ఉంచే ఖైదీలు కూడా దాదాపు ఈ వ్యాధిబారిన పడే మరణానికి చేరువయ్యేవారు.ఎందుకంటే... చీకటిలో, తేమలో ఈ వ్యాధికి కారణమయ్యే క్రిమి పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ కనుగొనేవరకూ ఇది చికిత్స లేని వ్యాధే. అయితే ధారాళంగా గాలీ, వెలుతురూ వచ్చే చోట ఈ వ్యాధి కారక క్రిమి పెరగదు కాబట్టి అప్పట్లో చికిత్స లేనిరోజుల్లో శానిటోరియమ్ అని పిలిచే గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే చోట ఉంచి బాధితులకు చికిత్స అందించేవారు. సాధారణంగా టీబీ అంటే ఎడతెరిపి లేకుండా విపరీతంగా దగ్గు వస్తూ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధిగా భావిస్తారు. కానీ... ఈ వ్యాధి ప్రధానంగా కేవలం ఊపిరితిత్తులనే కాదు... దేహంలోని అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేయవచ్చు. అలా మూత్రవ్యవస్థ, మూత్రవిసర్జక వ్యవస్థలను దెబ్బతీసే టీబీని ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్’ లేదా ‘జీయూటీబీ’ అంటారు. ఈ నేపథ్యంలో అసలు ‘జీయూటీబీ’ అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో ఇప్పటికీ ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 187 నుంచి 192 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అంచనా. 2015 నాటి గణాంకాలతో పోలిస్తే మన దేశంలో బాధితుల సంఖ్య దాదాపు 21% తగ్గినప్పటికీ... ఇప్పటికీ ప్రపంచంలోని టీబీ బాధితుల్లో 25% మంది (అంటే మొత్తం ప్రపంచంలోని పేషెంట్లలో నాలుగో వంతు) భారత్‌లోనే ఉండటం ఒకింత ఆందోళనగొలిపే అంశమే. అంతేకాదు... ప్రపంచంలోని టీబీ మరణాల్లో దాదాపు 28% అంటే దగ్గర దగ్గర మూడోవంతు మనదేశంలోనే జరుగుతుండటం కూడా టీబీ నివారణా, చికిత్సలపై మనం మరింతగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే అంశం.ఊపిరితిత్తులనే కాదు, ఇతర వ్యవస్థల్లో కూడా... సాధారణంగా టీబీ అనేది ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యవస్థలనే దెబ్బతీస్తుందన్న విషయం దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే అది దేహంలోని మిగతా దేహవ్యవస్థలనూ దెబ్బతీసే అవకాశాలూ ఉంటాయి. ఇలా ఇతర వ్యవస్థలను ప్రభావితం చేసే టీబీని ‘ఎక్స్ట్రా పల్మునరీ టీబీ’గా పేర్కొంటారు. మొత్తం ఎక్స్ట్రా పల్మునరీ కేసుల్లో నాలుగు శాతం జీయూటీబీ కేసులు ఉంటాయన్నది మరో అంచనా.వ్యాప్తి ఇలా / ప్రభావితమయ్యే అవయవాలివి... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అని పిలిచే బ్యాక్టీరియా క్రిమితో వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని సంక్షిప్తంగా టీబీగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. మిగతా సాధారణ టీబీ కేసుల్లోలాగే ఈ ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్’ లేదా ‘జీయూటీబీ’ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి వాప్తి చెందుతుంది. అలా వ్యాపించిన ‘ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్’ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు రక్తంలోకి వ్యాప్తించి అక్కడి నుంచి మూత్రవిసర్జన వ్యవస్థలోకి కూడా వ్యాప్తి చెందుతాయి.మూత్రవ్యవస్థలోని ఏయే అవయవాలపై దుష్ప్రభావాలంటే... మూత్రవ్యవస్థలోకి బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు సాధారణంగా అవి మూత్రపిండా (కిడ్నీ)లను దెబ్బతీస్తాయి. కిడ్నీల నుంచి క్రమంగా మూత్రాశయానికి వచ్చే పైపులైన యూరేటర్స్కూ, అక్కడ్నుంచి మూత్రాశయం (యూరినరీ బ్లాడర్), ప్రోస్టేట్ గ్రంథి, వృషణాల నుంచి శుక్రకణాలను బయటకు తెచ్చే సెమినల్ వెసికిల్స్తో ΄ాటు వృషణాలకూ వ్యాప్తించి, ఆ అన్ని అవయవాలపైనా తమ దుష్ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ జీయూటీబీతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ముప్పు (రిస్క్) ఎవరిలోనంటే... సాధారణంగా అది ఏ తరహా టీబీ అయినప్పటికీ... ఒకసారి దేహంలో టీబీ వచ్చిందంటే వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం. ఎందుకంటే దాదాపు దేశంలోని 85% మందిలో టీబీ క్రిమి అంతర్లీనంగా (డార్మంట్గా) ఉంటుందని అంచనా. అయితే ప్రజల్లో ఉండే వ్యాధి నిరోధక శక్తి కారణంగా అది తన ప్రభావం చూపలేదు. అయితే... సాధారణంగా టీబీ వచ్చిన బాధితుల్లో లేదా ఎక్స్ట్రా పల్మునరీ టీబీ వచ్చిన వాళ్లలోనూ, వ్యాధి నిరోధక శక్తి తగ్గినవాళ్లలో, చాలాకాలం ΄ాటు టీబీతో బాధపడేవారితో సన్నిహితంగా ఉండేవాళ్లలో అన్ని రకాల టీబీలతో ΄ాటు ‘జీయూటీబీ’ కూడా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.నిర్యక్ష్యం తగదు... ఎందుకంటే... ఒకసారి ఈ వ్యాధిని అనుమానించక అలాగే నిర్లక్ష్యం చేస్తే కొందరిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. ఒకసారి కిడ్నీ దెబ్బతిన్నదంటే... అటు తర్వాత అది మళ్లీ మునపటి పనితీరును ప్రదర్శించలేనంతగా దెబ్బతినే అవకాశమూ ఉండవచ్చు. మూత్రాశయం (బ్లాడర్) సామర్థ్యం కూడా తగ్గవచ్చు. అలాగే ఈ సమస్య వచ్చిన కొందరిలో సంతనలేమి (ఇన్ఫెర్టిలిటీ) సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే సాధారణ యాంటీబయాటిక్ కోర్సు ముగిశాక కూడా మూత్రం ఇన్ఫెక్షన్ తగ్గని సందర్భాల్లో చాలా అప్రమత్తంగా ఉండి డాక్టర్ల సలహా మేరకు తగిన పరీక్షలన్నీ చేయించాలి.జీయూటీబీ నిర్ధారణ ఇలా... మామూలు మూత్రపరీక్షలతో ‘జీయూటీబీ’ నిర్ధారణ చేయడం అంతగా కుదరకపోవచ్చు. అందుకే... జీయూటీబీ నిర్ధారణ కోసమే ప్రత్యేకంగా నిర్వహించాల్సిన ‘న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ సాంకేతికత (ఎన్ఏఏటీ) సహాయంతో ‘΄ాలిమరేజ్ చైన్ రీయాక్షన్’ (పీసీఆర్) పరీక్ష చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్ష కూడా నూరు శాతం కేసుల్లో పూర్తిగా సరైన నిర్ధారణ చేయలేకపోవచ్చు. అయినప్పటికీ జీయూటీబీకి చాలావరకు ఇదే మంచి నిర్ధారణ పరీక్ష. అయితే కొన్ని సందర్భాల్లో ‘ఫాల్స్ నెగెటివ్’ ఫలితం కూడా రావచ్చు. అందుకే సాధారణ ఇన్ఫెక్షన్లా కనిపిస్తూ అందరి కనుగప్పే లక్షణాలున్నందున... అనుమానం వచ్చిన కేసుల్లో డాక్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలాగే అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎక్స్–రే పరీక్షలనూ నిర్వహిస్తారు.ఇలా కేవలం... నిర్దిష్టంగా ఒకే పరీక్ష కాకుండా... లక్షణాల ఆధారంగా, ప్రత్యేక పరీక్షలతో ΄ాటు రొటీన్ సీటీ స్కాన్, ఎక్స్–రే పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాధిని నిర్ధారణ చేస్తారు.సూచన: కొందరిలో ఈ వ్యాధి ఖచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్ధారణ సాధ్యం కాకపోవచ్చు. అయితే కొన్ని మార్గదర్శకాల ఆధారంగా సదరు బాధితులు ‘యాంటీ ట్యూబర్కులార్ చికిత్స–ఏటీటీ’కి అర్హులని డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలు..‘జీయూటీబీ’ ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి...చాలా తరచుగా లేదా త్వరత్వరగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.మూత్ర విసర్జన ఫీలింగ్‌ను ఆపుకోలేకపోవడం.కొన్నిసార్లు మూత్రం ఎరుపు రంగులో రావడం.ఈ లక్షణాలతో కొన్ని సందర్భాల్లో ‘జీయూటీబీ’ని మూత్రంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్ (జనరల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–యూటీఐ)గా పొరబడే అవకాశాలు ఉంటాయి. లేదా తరచూ మూత్రవిసర్జనకు వెళ్తుండటంతో ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అని కూడా పొరబడే అవకాశాలూ ఎక్కువే.మూత్రపరీక్ష నిర్వహించినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలియవచ్చు. అయితే అది నిర్దిష్టంగా ఫలానా ఇన్ఫెక్షన్ అని తెలియకపోవచ్చు. అలాంటి ఇన్ఫెక్షన్ను ‘స్టెరైల్ పైయూరియా’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దాన్ని మామూలుగానే ఇన్ఫెక్షన్గానే పరిగణంచి డాక్టర్లు సాధారణంగా ‘యాంటీబయాటిక్స్’ వాడతారు.అయితే సమస్య జీయూటీబీ కావడం వల్ల ఆ యాంటీబయాటిక్స్‌తో ఎలాంటి ప్రయోజనమూ కనిపించదు. కొందరిలో కొన్ని సూచనలు ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఉదాహరణకు... చాలా తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, బరువు బాగా తగ్గిపోవడం, సాయంత్రాలు ఒళ్లు వెచ్చబడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటి ఆధారంగా ‘జీయూటీబీ’ని అనుమానించాల్సి ఉంటుంది.చికిత్స...∙అది జీయూటీబీ అని నిర్ధారణ అయ్యాక ‘యాంటీ ట్యూబెర్క్యులార్ చికిత్స’ (ఏటీటీ)ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇది కొన్ని మందుల కాంబినేషన్లతో (మల్టీ డ్రగ్ థెరపీ) రూపంలో ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ రోజుల ΄ాటు డాక్టర్లు చికిత్స కొనసాగిస్తారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీబీకి ప్రత్యేకంగానూ, ఉచితంగానూ మందులు ఇస్తుంటారు.కొన్ని కేసుల్లో ‘యాంటీ ట్యూబెర్క్యులార్ చికిత్స’... అంటే ఏటీటీ ట్రీట్మెంట్ అందిస్తూనే... కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేందుకు, వాటి పనితీరును సంరక్షించడానికి తాత్కాలిక స్టెంట్లు వేయడం, శస్త్రచికిత్స చేయాల్సి రావడం వంటి చికిత్సలూ చేయాల్సి రావచ్చు.మరికొందరు బాధితుల్లో... మిగతా సాధారణ టీబీ లాగానే ఈ జీయూటీబీ కూడా.. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ పెరగడంతో వ్యాధి బాగా ముదిరిపోతుంది. దాంతో వాళ్లలో మూత్రవిసర్జక వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఇలాంటి కొందరిలో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అరుదుగా కొందరిలో కిడ్నీల నుంచి మూత్ర విసర్జనకు తోడ్పడే యురేటర్స్ను పునర్నిర్మించడం వంటి శస్త్రచికిత్సలూ అవసరం పడవచ్చు. మరికొందరిలో మూత్రాశయం దెబ్బతిన్నప్పుడు... మూత్రాశయాన్నీ, వారి చిన్నపేగులను అనుసంధానిస్తూ చేసే ‘ఆగుమెంటేషన్ సిస్టో΄్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. మూత్రాశయం పనితీరును మెరుగుపరచడానికి ఈ చికిత్స చేయాల్సివస్తుంది.కొన్ని ప్రభుత్వ కార్యకలా΄ాలు కూడా... ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్: కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా / చికిత్స ప్రణాళికల ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు టీబీని పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా టీబీని పూర్తిగా నిరోధించే లక్ష్యంతో ‘ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ అభియాన్’ అనే కార్యక్రమం మొదలైంది. మరిన్ని కొత్తమందులతో చికిత్సా ప్రణాళికలు (న్యూ డ్రగ్ రెజిమెన్స్) : మిగతా టీబీల్లాగే ఈ టీబీలోనూ మందులు వాడటం మొదలుపెట్టగానే లక్షణాలన్నీ క్రమంగా తగ్గడం, మటుమాయం కావడం జరుగుతుంటుంది. దాంతో చాలామంది తమకు నయమైపోయిందనే భావనతో పూర్తి కోర్సు వాడకుండానే మందులు మానేస్తుంటారు. అయితే టీబీ సూక్ష్మజీవి ఆ మందులకు తన నిరోధకత పెంచుకుని మళ్లీ విజృంభిస్తుంది. దాంతో మునుపు వాడిన మందుల ప్రభావం అంతగా కనిపించదు. ఇలాంటివారికి ‘బీపీయేఎల్ ఎమ్’ అనే ప్రత్యేక మందుల కోర్సు ప్రణాళిక (రెజిమెన్)ను డాక్టర్లు సిఫార్సు చేస్తారు.వినూత్న సాంకేతికతతో: ఇటీవల టీబీపై పూర్తి అదుపు సాధించడానికి ఎక్స్–రేలూ, ఇతర రేడియాలజీ ఇమేజింగ్ చిత్రాలను విశ్లేషించడానికి కృత్రిమ మేధ (ఏఐ)తో అనుసంధానం చేయడం, ఖచ్చితంగా జీయూటీబీని గుర్తించడం వంటి వినూత్న సాంకేతికతను అవలంబిస్తున్నారు.చివరగా... మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ –యూటీఐ) కనిపించినప్పుడు సాధారణ యాంటీబయాటిక్స్‌తో లక్షణాలు తగ్గకపోతే... నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా జీయూటీబీని అనుమానించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.- డాక్టర్ ఎ.వి. రవికుమార్, సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్ – ఆండ్రాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..!ఆ ఐదింటితోనే బరువు మాయం..
బరువు తగ్గడం అనేది కాలంతో చేసే పరుగులాంటిది. కేవలం నిలకడైన మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఓర్పు, సహనం, పట్టుదలతోనే సాధ్యమవుతుంది. అదే నిరూపించింది ఈ మహిళ. ఏకంగా వంద కేజీలపైనే బరువు ఉన్న ఈ మహిళ అద్భుతంగా వెయిట్‌లాస్ అయ్యి స్ఫూర్తిగా నిలిచింది. ఏకంగా 47 కేజీలపైనే బరువు తగ్గడం విశేషం.హేలీ అనే మహిళా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మూడేళ్లలో ఈ ఫలితాన్ని అందుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదట తాను 116 కేజీలపైనే అధిక బరువుతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. మూడేళ్ల పాటు నిలకడగా చక్కటి జీవనశైలి మార్పులను అనుసరించి బరువు తగ్గినట్లు తెలిపారు. అందుకోసం అనుసరించిన ఐదు ముఖ్యమైన ఆహారపు మార్పులు గురించి పంచుకున్నారు. బరువు తగ్గడం కోసం..వాకింగ్..దీన్ని చాలా తేలిగ్గ చూస్తుంటాం. కానీ తాజా గాలిలో జస్ట్ ఓ 30-45 నిమిషాలు నడవడం మన ఆలోచనలను మార్చి అద్భుతమైన మార్పుని తీసుకొస్తుందని అన్నారు.తగినంత నీరు తాగడంక్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం ఆహార కోరికలను నియంత్రిస్తుందని అన్నారు. అలాగే తన పనులకు అవసరమైన శక్తి అంతా తిరిగి లభిస్తుందని చెప్పుకొచ్చింది. నీటి తోపాటు ప్రతిరోజూ ఒక గ్లాసు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని కూడా సూచించారామె.ప్రోటీన్ తీసుకోవడంప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని అన్నారు. దీనివల్ల కడుపు నిండిన అనుభూతి తోపాటు కండరాలను కోల్పోమని అన్నారు. కొవ్వుని కరిగించడం సులభమవుతుందని అన్నారు.ఉదయపు అలవాట్లుఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం లేదా ధ్యానం చేయాలని, అలాగే కనీసం 30 నిమిషాల పాటు ఫోన్లకు దూరంగా ఉండాలని ఆ మహిళ సూచించారు. ఇలా రెండు వారాలు పాటించి చూస్తే ఒత్తిడి మాయం అయ్యి మంచి నిద్ర పడుతుందని అన్నారు. అలాగే మానసిక స్పష్టత, ఏకాగ్రత, ప్రశాంతత తదితరాల్లో మెరుగుదలను చూస్తారని చెబుతోంది.ఫైబర్ వినియోగంఎక్కువ ఫైబర్ ఉన్న మూడు రకాల కూరగాయలను తినమని సూచిస్తోంది. ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేసి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడే కాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని అంటోంది. చివరగా శరీరం చెప్పే మాట వింటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సాకులకు తావివ్వకుండా అనుసరిస్తే బరువు తగ్గడం సులభమని చెబుతోందామె.ఆమె సిఫార్సు చేశారు, ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేయడానికి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి మరియు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..) -
ఈ గ్యాడ్జెట్ ఉంటే సెలూన్ అవసరమే లేదు!
తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్ హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే ఇది జుట్టు కుదుళ్ల వరకు మసాజ్ చేస్తుంది.ఇందులోని సిలికాన్ బ్రష్ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, జుట్టుపై సున్నితంగా పనిచేస్తుంది. ఐదు రకాల వైబ్రేషన్ మోడ్స్‌లో ఇది పనిచేస్తుంది. ఈ మసాజర్ రక్తపోటును అదుపుచేసి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మైగ్రేన్ సహా రకరకాల తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలపై చర్మంలో సహజమైన తేమ ఆరిపోకుండా చేసి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించిన ఈ పరికరాన్ని ఎక్కడికైనా ఇట్టే తీసుకుపోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని తక్కువ సమయంలోనే చార్జ్ చేసుకోవచ్చు.ఇలా చేస్తే కళ్లకు కొత్తందం!అమ్మాయిల ముఖంలో మొదటి చూపులోనే ఆకట్టుకునేవి కళ్ళు. మరి ఆ కళ్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే కేవలం ఆకారం మాత్రమే సరిపోదు, కాంతిమంతంగా అవి మెరుస్తూ ఉండాలి కూడా. ఇందుకోసం చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే చిరునవ్వు, ఆత్మీయత, ఆత్మవిశ్వాసం కళ్ళకు అసలైన అందం.ఇందుకోసం ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కీరాదోస రసంలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను కళ్లపై ఉంచడం ద్వారా కళ్ల అలసట తగ్గి కళ్లు తాజాగా మారుతాయి. వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత వాటిని తరచుగా కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటి వాపు, కళ్లకింద వచ్చే నల్లటి వలయాలు తగ్గుతాయి. విల్లులాంటి కనుబొమ్మలు, ఒత్తయిన కనురెప్పలు కళ్ల రూపాన్ని రెట్టింపు చేస్తాయి. నిద్రించే ముందు కనురెప్పలకు కొద్దిగా ఆముదం రాసుకోవడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం ద్వారా కళ్లు అలసట లేకుండా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు కంటి ఆరోగ్యానికి, అందానికి సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. -
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్‌కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్‌గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్‌ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్‌లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
మీ స్టీల్ బాటిల్ మంచిదేనా?
మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే కాకుండా, ఆ నీటిని నిల్వ ఉంచే పాత్రలపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాల వల్ల శరీరంలోకి చేరే బిస్ఫెనాల్–ఎ (బీపీఏ), సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్స్), అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాల (నానోప్లాస్టిక్స్) ముప్పు నుంచి తప్పించుకోవటానికి చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే అన్ని స్టీల్ బాటిళ్లూ ఆరోగ్యానికి సురక్షితమైనవి కావు. ఏది ఉత్తమమైన స్టీల్? తాగునీటిని నిల్వ చేయడానికి దేశ విదేశాల్లో ‘304’, ‘316’స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్లను అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. 304 లేదా 18/8 గ్రేడ్ స్టీల్‌లో 18% క్రోమియం, 8% నికెల్ ఉంటాయి. ఇది తుప్పు పట్టదు. సహజమైన రుచి, వాసనను మార్చదు. 316 లేదా 18/10 గ్రేడ్ స్టీల్‌లో అదనంగా 2% నుంచి 3% ‘మాలిబ్డినం’అనే లోహం ఉంటుంది. దీనివల్ల బాటిల్‌కు తుప్పు నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ/బత్తాయి రసం, మజ్జిగ, డిటాక్స్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ వంటి ఆమ్ల గుణం ఉన్న పానీయాలను పోసుకోవటానికీ ఇది అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ స్టీల్‌తో ముప్పు నాసిరకం సాధారణ స్టీల్ బాటిళ్లు తాగు నీటిని పోసుకోవటానికి గానీ, పండ్ల రసాలకు గానీ పనికిరావు. తక్కువ ధరకు లభించే బాటిళ్ల తయారీలో 201/202 గ్రేడ్ స్టీల్ వాడతారు. తయారీ వ్యయం తగ్గించడానికి వీటిలో ఖరీదైన నికెల్ వాడకాన్ని తగ్గించి, 5.5%–7.5% వరకు ‘మాంగనీస్’ను కలుపుతారు. ఈ బాటిళ్లలో నీరు లేదా పండ్ల రసాలు పోసినప్పుడు మాంగనీస్ నీటిలో కరుగుతుంది. ఇది రోజూ శరీరంలోకి చేరితే కాలక్రమేణా కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాటిళ్లకు తుప్పును తట్టుకునే శక్తి తక్కువ. కొద్దిరోజులకే లోపల ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడి, నీటిలోకి లోహపు రుచి/వాసన వస్తుంది. నాణ్యతను గుర్తించేదెలా? » భారతీయ ప్రమాణాల ప్రకారం.. స్టీల్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17803:2022’, థర్మోస్/వ్యాక్యూమ్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17526:2021’నిబంధనలు పాటించాలి. ఐఎస్ఐ ముద్రనూ తప్పనిసరిగా బాటిల్‌పై ముద్రించాలి. » అమెరికా ఎఫ్‌డీఏ, యూరోపియన్ ఈఎఫ్ఎస్ఏ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. 304/316 గ్రేడ్ స్టీల్ బాటిల్స్ మాత్రమే సురక్షితమైనవి. మన దేశంలో కొత్త స్టీల్ బాటిల్ కొనేముందు దాని అడుగు భాగంలో లేదా ప్యాకింగ్ బాక్స్‌పై 304 లేదా 316తోపాటు ఐఎస్ఐ మార్కు ఉందో లేదో చూసుకోవాలి. » సాధారణ 201 లేదా 202 గ్రేడ్ స్టీల్ బాటిళ్ల అడుగున లేదా బాక్స్‌పై ఈ అంకెలను రాయొచ్చు లేక రాయకపోవచ్చు. మనమే గమనించుకోవాలి. – (సాక్షి, స్పెషల్ డెస్క్) -
ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.."అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా(actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి. అంతేగాదు మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కొంతకాలం సినిమాలకు దూరమై..నాట్యానికి జీవితానని అంకితం చేశారామె. మళ్లీ ఇటీవల కల్కి మూవితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత నితేష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో కనిపించనున్నారు. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ తల్లి కైకేసి పాత్రను పోషించనుందామె. అలాగే ఆమె చెన్నైలో నృత్య అకాడమీ 'కళాతర్పణ'ను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె 54 ఏళ్లు. ఈ వయసులోనూ అంతే గ్లామర్‌గా పిట్‌గా ఉంటారు శోభనా. తను ఇంతలా ఎనర్జిటిక్‌గా, హెల్దీగా ఉండటానికి కారణం ఏమిటో ఒక ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. మరి ఆమె అనుసరించే ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆమె భారత్‌లోనూ విదేశాల్లోనే నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా ప్రదర్శనలిస్తుంటారామె. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తానని చెప్పారామె. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానన్నారు. ఆమె ప్రోటీన్ షేక్‌లు, డైటింగ్ రెండిటిని పాటిస్తానని చెప్పారు. ఈ విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. అలా ఎందుకంటే తన ఆకలి ఎక్కువగా ఉంటుందని అందుకని ఇలా చేస్తానని అన్నారామె. తన బిజీ షెడ్యూల్‌కి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు రూపొందించుకుంటానని తెలిపారామె. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నందున సమతుల్యమైన ఆహారమే తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఏడాదంతా ఒకేరకమైన డైట్ ప్లాన్‌ని పాటించనని చెప్పారామె. తన శరీరానికి అనుగుణంగా దినచర్యను మార్చుకుంటూ..బరువుని అదుపులో ఉంచడంపై అటెన్షన్ పెడతానని అన్నారామె. ఒక్కోసారి మూడు రోజుల డైట్‌ని పాటిస్తే..మరికొన్నిసార్లు ఏకంగా ఏడుసార్లు డైట్ పాటిస్తానని చెప్పారు. ఒక్కోసారి క్రాష్ డైట్ కూడా పాటిస్తానని ధీమాగా వెల్లడించారు. తను ప్రతిసారా కఠినమైన భోజన ప్రణాళిక అనుసరించకుండా అవసరమైనప్పుడల్లా షెడ్యూల్‌ని సర్దుబాటు చేసుకుంటానని తెలిపింది అందాల శోభన. దూరంగా ఉంచే ఆహారాలు..అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులకు చాలా దూరంగా ఉంటానని అన్నారు. పిజ్జా, బర్గర్లు, పాస్తా, బ్రెడ్, శాండ్విచ్లు, నూనెలో అధికంగా వేయించిన ఆహారాలకు బహుదూరంగా ఉంటానని చెప్పారామె. థాయి వంటకాలు, కొన్ని రకాల డెజర్ట్లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా ఇక్కడ అందాల నటి శోభన కూడా తన శరీరం మాట వింటూ అందుకు అనుగుణంగా డైట్‌ని అనుసరిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఏ డైట్ అయినా గుడ్డిగా కాకుండా శరీరానికి పడేది..అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అని చెప్పకనే చెబుతోంది కదా ఈ నటి డైట్.(చదవండి: ఒంటరిగా ఫ్లైట్ జర్నీ..ఆ మహిళను ఎంతలా మార్చిందంటే?) -
హ్మ్..! చెప్పులు బయట!! పెద్దల హెచ్చరికలో పరమార్థం ఏంటంటే?
కొంతమంది బయట వాడే చెప్పులు, షూ లను ఇంట్లో కూడా వాడేస్తుంటారు. వారు ఇది పాదాల శుభ్రతకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. ఎందుకంటే మీరు షూలను, చెప్పులను మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లరు.. వాటితో పాటుగా లక్షలాది క్రిములను, బ్యాక్టీరియాను కూడా వెంట తీసుకెళ్తుంటారు.బూట్ల అడుగుభాగంలో ఈ.కోలై, సి.డిఫిసిల్, స్టెఫిలోకోకస్ వంటి ప్రమాదకర బాక్టీరియాలు అధిక మొత్తంలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇవి కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ఇది మరింత ప్రమాదకరం. వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోర్ స్లిప్పర్స్ ఉపయోగించాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బయట వాడకూడదు. ఇంటిగుమ్మం వద్దే షూలను వదిలేయడం అనేది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఒక సులభమైన అలవాటు. -
అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..
బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్ డైట్లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్‌గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్ డైట్ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్లతో కడుపు నిండిన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తూ కిలోల కొద్దీ బరువు తగ్గి చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడు ఈ వ్యాపారవేత్త. జస్ట్ నెల రోజుల్లోనే 22 కేజీల పైనే బరువు తగ్గడం విశేషం. ఆ వెయిట్‌లాస్ జర్నీలో హెల్ప్ అయిన ఆహార పదార్థాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆయనే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షిబిన్ మాథ్యు. ఒకప్పుడు దాదాపు 110 కేజీల బరువు ఉండేవారు. కఠినమైన దినచర్య, పటిష్టమైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులు చక్కటి పరివర్తనకు దారితీస్తాయని అన్నారు. క్రమశిక్షణ సవ్యంగా ఉంటే దాని ఫలితమే చెబుతుందని అంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక, చక్కటి జీవనశైలి మార్పులు మంచి రూపుకి దారితీస్తుందని నమ్మకంగా చెప్పారు. తనకు బరువు తగ్గడంలో సహాయపడిన రోజువారి అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఇలా చెప్పుకొచ్చారు. బరువు తగ్గడానికి రోజువారీ ఆహారంఆయన తన రోజును ఒక కప్పు కాఫీ, రెండు గుడ్లు, మిరప నూనెతో కలిపిన రెండు స్కూప్‌ల అధిక ప్రోటీన్ పెరుగుతో ప్రారంభిస్తారు. ఈ భోజనం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు, కెఫిన్, కారమైన కొవ్వులను మిళితం చేస్తుంది. ఈ అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఉదయం పూట వచ్చే నీరసాన్ని నివారిస్తుంది.మధ్యాహ్న భోజనానికి, మాథ్యూ ఎక్కువగా ఒక చికెన్ బ్రెస్ట్‌తో పాటు ఒక గుడ్డు, ఒక స్కూప్ అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు తీసుకునేవాడు. సలాడ్ల కోసం, అతను తాజా దోసకాయలను ఎంచుకున్నాడు. ఈ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి అవసరమైన లీన్ ప్రోటీన్‌ను అందిస్తుంది.బరువు తగ్గడానికి సహాయపడటానికి, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నీటి శాతం ఉన్న తక్కువ కేలరీల కూరగాయలు కూడా ఉంటాయి. శాకాహారులైతే గుడ్లకు బదులుగా అర కప్పు గట్టిగా, ముక్కలుగా చేసి, పెనంపై వేయించిన టోఫును, చికెన్‌కు బదులుగా మసాలాలతో కాల్చిన టెంపే లేదా సీటాన్ను తీసుకోవడం మంచిదని సూచించారు.మధ్యాహ్న భోజనం తర్వాత అతను సాధారణంగా తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేవాడినని అన్నారు. రాత్రి పడుకునే ముందు, అతను ఒక కప్పు కాఫీ.ఒక ఆపిల్‌కు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.తన కఠినమైన డైట్ దినచర్య గురించి వివరిస్తూ అతను ఇలా అన్నాడు, కఠినమైన ఆహార లోటు, అధిక ప్రోటీన్ తోపాటు సాకులకు తావివక్కపోతే..కచ్చితంగా బరువు తగ్గుతారు. నిర్దిష్ట లక్ష్యాల కోసం తీవ్రమైన ఆహార కోత తప్పనిసరని అంటున్నారు.అలాగే ఏ డైట్ రొటీన్‌ను గుడ్డిగా అనుసరించవద్దని, తమ శరీరం చెప్పేది వినాలని హెచ్చిరిస్తున్నారు. అంతేగాదు ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కూడా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Shibin Mathew (@mathewdotin) (చదవండి: Ravi Kishan Weight Loss: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 కేజీలు..) -
జంక్ ఫుడ్ చిన్నారుల ఆరోగ్యంపై ఇంతలా ప్రభావం చూపిస్తుందా?
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే, పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జంక్ ఫుడ్ వినియోగం విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, వారి విద్యా పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది.సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల 13,274 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం జరిగింది. సర్వే ఫలితాల ప్రకారం, వీరిలో 93 శాతం మంది విద్యార్థులు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్యాక్ చేసిన జంక్ ఫుడ్‌ను తింటున్నారు. ఈ గణాంకాలు ఆరోగ్య నిపుణులను కలవరపరుస్తున్నాయి.జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటే..ఏకాగ్రత: జంక్ ఫుడ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు వేగంగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. దీని ఫలితంగా విద్యార్థుల దృష్టి పదేపదే మళ్లుతుంది, చదువుపై దీర్ఘకాలం ఏకాగ్రత నిలపడం కష్టమవుతుంది.జ్ఞాపకశక్తి: కొవ్వు మరియు అదనపు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొంది. దీని వల్ల విద్యార్థులు సమాచారాన్ని గుర్తుంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం కష్టమవుతుంది.శారీరక ఆరోగ్యం: విద్యార్థుల్లో అలసత్వం పెరుగుతోందని సర్వే వెల్లడించింది. పోషకాహార లోపం వల్ల టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా చిన్నారుల్లో కనిపిస్తున్నాయి. అలాగే, ఫైబర్ లోపం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతోంది.మానసిక ఆరోగ్యం: జంక్ ఫుడ్లోని కృత్రిమ రంగులు, అదనపు చక్కెర కారణంగా విద్యార్థుల్లో హైపర్యాక్టివిటీ, చిరాకు, తరచుగా మానసిక కల్లోలం వంటి లక్షణాలు పెరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. బరువు పెరగడం, తదనుగుణ ఆరోగ్య సమస్యల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతోంది.68 శాతం మంది విద్యార్థులు ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని సర్వే తెలిపింది. ఇది ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారం పిల్లల నిత్య జీవితంలో ఎంతగా భాగమైపోయిందో స్పష్టం చేస్తోంది.ఈ ఫలితాలను తీవ్రంగా పరిగణించాలని ఆరోగ్య నిపుణులు తల్లిదండ్రులను, పాఠశాలలను, విధాన నిర్ణేతలను కోరుతున్నారు. పాఠశాల క్యాంటీన్లలో అమ్మే ఆహారంపై నిఘా పెంచాలని, పోషకాహార లేబుళ్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలు ఏమి తింటున్నారు అనేది వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపైనే కాక, పాఠశాలలో వారి పనితీరు, రోజువారీ మానసిక స్థితిపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఈ నివేదిక గుర్తు చేస్తోంది.(చదవండి: తాత గారు వేళకు మందులు వేసుకోవాలని..! టీనేజ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ..) -
తాతయ్య వేళకు మందులు వేసుకునేలా..మనవడి అద్భుత ఆవిష్కరణ!
మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన తాత బాగోగులు కోసం ఈ మనవడు ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి మాకై తన తాత వేళకు మందులు వేసుకునేలా గుర్తు చేయడానికి సహాయపడేలా ఓ యాప్‌ని రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమ ఈ యాప్ రూపకల్పనకు దారితీసిందని చెబుతుండటం విశేషం. ఇటీవలే సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మా కై, జూన్‌లో చైనా జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయిన గావోకావోను రాశాడు.జూలై మధ్యలో షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)కు హాజరైనప్పుడు షాంఘై మార్నింగ్ పోస్ట్ అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు చెందిన ఏఐ కంపెనీ మోడల్బెస్ట్ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అయిన మినీసీపీఎం (MiniCPM)ను ఉపయోగించి తాను ఈ యాప్‌ను రూపొందించినట్లు మా వివరించాడు. ఆ కాన్ఫెరెన్స్‌లో కంపెనీకి చెందిన కొంతమంది నిపుణులు వస్తారని తెలిసి, వారిని ప్రశ్నలు అడగడానికి వచ్చానని అతను చెప్పాడు. తాతగారి కోసం రూపొందించిన యాప్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో కేవలం కొన్ని లైన్ల కోడ్ మాత్రమే ఉందని వెల్లడించాడు. తాను రూపొందించిన యాప్ మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, యూజర్ ప్యాకేజింగ్ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే..మందుల గడువు ముగిసిందో లేదో కూడా ఈ యాప్ తనిఖీ చేయగలదుని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మందుల గడువు ముగిసినట్లయితే వేసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తుందని తెలిపాడు. చిన్ననాటి నుంచి అన్నీ తానై తాతగారే పెంచారని, ఆయనతో ఉన్న అనుబంధం మాటలకందనిదని పంచుకున్నాడు. ప్రస్తుతం 70 ఏల్ల వయసులో ఉన్న ఆయనకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు. తాను కాలేజ్‌కి వెళ్లిపోయినా..ఆయన వేళకు మందులు వేసుకోవాలనే ఆరోగ్య సంరక్షణ నిమిత్తమే ఈ యాప్‌ని రూపొందించానని అన్నాడు. తన తాతగారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోతారేమో లేదా వాటిని తికమక పడతారేమో అని ఆందోళనతోనే ఇలా యాప్‌ని ఆవిష్కరించినట్లు వెల్లడించాడు. పొరపాటున గడువు మందులు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన, భయమే ఈ యాప్‌ని రూపొందించడానికి కారణమని చెప్పాడు. కాగా, తాను వచ్చే నెల సెప్టెంబర్‌లో మరో నగరంలోని విశ్వవిద్యాలయలంకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇష్టమనేది అవతలి వాడి బాధ్యత, సంరక్షణను హ్యాండిల్ చేయడమని తన జీవనశైలితో చాటి చెప్పాడు కదూ..!.(చదవండి: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 కేజీలు..) -
మెలనోమా హెచ్చరిక సంకేతాలు: పుట్టుమచ్చలు డేంజరా?
శరీరంపై పుట్టుమచ్చలు (Moles) ఉండటం సాధారణ విషయం. వీటిలో చాలా వరకు జీవితాంతం ఎలాంటి సమస్య కలిగించవు. అయితే ఒక పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి మెలనోమా అనే తీవ్రమైన స్కిన్ కేన్సర్‌కు ప్రారంభ సంకేతాలు కావచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, బ్రిటన్ NHS సూచనల ప్రకారం, ప్రతి మారిన పుట్టుమచ్చ కేన్సర్ కాదు, కానీ సకాలంలో పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.ప్రతి పుట్టుమచ్చ స్కిన్ కేన్సర్ సంకేతమేనా?క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, NHS ప్రకారం, చాలా పుట్టుమచ్చలు పూర్తిగా సాధారణమైనవి, జీవితాంతం ఎలాంటి సమస్యా కలిగించవు. అయితే కొన్ని సందర్భాల్లో చర్మానికి రంగునిచ్చే కణాలైన మెలనోసైట్లలో అసాధారణ మార్పులు జరిగి మెలనోమా అభివృద్ధి చెందవచ్చు. ఇతర స్కిన్ కేన్సర్లతో పోలిస్తే మెలనోమా తక్కువగా కనిపించినా, ఇది శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని త్వరగా గుర్తించడం చాలా అవసరం.ఏ మార్పులపై వెంటనే దృష్టి పెట్టాలి?అనుమానాస్పద పుట్టుమచ్చలను గుర్తించడానికి వైద్యులు "ABCDE రూల్"ను ఉపయోగిస్తారు:A – Asymmetry (అసమాన ఆకారం): పుట్టుమచ్చలో ఒక భాగం మరో భాగం కంటే భిన్నంగా కనిపించడం.B – Border (అనియమిత అంచులు): అంచులు అస్పష్టంగా, కోతల్లా లేదా అసమానంగా ఉండటం.C – Color (రంగులో మార్పు): ఒకే పుట్టుమచ్చలో నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు లేదా నీలం వంటి అనేక రంగులు కనిపించడం.D – Diameter (పరిమాణం): పుట్టుమచ్చ దాదాపు 6 మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉండటం లేదా వేగంగా పెరగడం.E – Evolving (నిరంతర మార్పు): కాలక్రమేణా ఆకారం, రంగు, ఎత్తు లేదా అనుభూతిలో మార్పు రావడం, లేదా దురద, నొప్పి, రక్తస్రావం మొదలవడం.మెలనోమా ప్రమాదం ఎవరిలో ఎక్కువ?WHO, NHS, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ఈ కారణాలు మెలనోమా ప్రమాదాన్ని పెంచవచ్చు:సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలకు దీర్ఘకాలం గురికావడంపదేపదే సన్బర్న్లు కావడం, ముఖ్యంగా బాల్యం లేదా కౌమార దశలోశరీరంపై చాలా ఎక్కువ లేదా అసాధారణ ఆకారంలో పుట్టుమచ్చలు ఉండటంకుటుంబంలో స్కిన్ క్యాన్సర్ చరిత్ర ఉండటంటానింగ్ బెడ్లను ఉపయోగించడంఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?కింది మార్పులు కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు:పాత పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతి మారడం30 ఏళ్ల వయసు తర్వాత కొత్త పుట్టుమచ్చ కనిపించడంపుట్టుమచ్చ నుంచి రక్తస్రావం, పొక్కు ఏర్పడటం లేదా నిరంతర దురదపుట్టుమచ్చ చుట్టూ నొప్పి, వాపు లేదా ఎరుపు రంగు రావడంశరీరంలోని మిగతా పుట్టుమచ్చలకు పూర్తిగా భిన్నంగా కనిపించే పుట్టుమచ్చ ("Ugly Duckling Sign")చాలా పుట్టుమచ్చలు హానికరం కానప్పటికీ, అసాధారణ మార్పులు కనిపించినప్పుడు సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే మెలనోమాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.(చదవండి: మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 కేజీలు..) -
‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..!
‘రేసుగుర్రం’ మూవీలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో అలరించిన తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ప్రజా నాయకుడిగా మన్ననలను అందుకుంటున్నారు. అలాంటి ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ 57 ఏళ్ల వయసులో చక్కటి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి వెల్లడించారు. తను కావాలంటే బరువు పెరగగలను, అదుపులోనూ ఉంచుకోగలనని అన్నారు. అయితే బరువు తగ్గడం కోసం కఠిన ఆహార నియమాలతో పనిలేదని చెబుతున్నారు. స్థిరమైన జీవనశైలి మార్పులతోనే సులభంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా.!.రవికిషన్ తాను వెయిట్‌లాస్ జర్నీలో తక్షణ పరిష్కారాల కంటే పౌష్టికరమైన భోజనం, క్రమం తప్పని వ్యాయామం, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. తాను ఒకప్పుడు సుమారు 90 కేజీల దాక బరువు ఉండేవాడినని, ప్రస్తుతం 72 కేజీల వరకు తగ్గానని అన్నారు. కండరాలు పెంచుకుంటూ, సన్నబడుతున్నానని అన్నారు. రాజకీయ విధులు, గోరఖపూర్ నియోజకవర్గ పర్యటనలు కారణంగా కొంత బరువు పెరిగానని అన్నారు. దాంతో తను పండ్లతో కూడిన ఆహారం తింటూ స్లిమ్‌గా అయ్యానని అన్నారు. తినే విధానం మార్చుకుంటూ సుమారు 18 కేజీలు దాక తగ్గినట్లు వెల్లడించారు. వెండి తెరపై వచ్చే పాత్రల కారణంగానే ఫిట్‌గా మారాల్సి వచ్చిందన్నారు. తాను "'లాపటా లేడీస్' కోసం బరువు పెరగాల్సి వచ్చిందన్నారు. మళ్లా 'మిర్జాపూర్: ది మూవీ'లో సన్నగా కనిపించగా, 'నాగ్జిల్లా'లో నేను సూపర్-ఫిట్ బాడీతో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే 50 ఏళ్ల వయసులో మాత్రం..ఇదంతా అంత సులభం కాదని అన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులతో దాన్ని ఈజీగా సాధించొచ్చని అన్నారు. మనం తినేది సుమారు 70-80% అని, మిగిలిందంతా వ్యాయామమేనని అన్నారు. ఇక తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ..కేవలం పండ్లకే పరిమతం కానని చెప్పారు. 'వన్ మీల్ ఏ డే' అనే ఓమాడ్ టెక్నిక్‌ని ఫాలో అవుతానని అన్నారు. అంటే..ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం, మధ్యంతర ఉపవాసం లేదా కేవలం పండ్లు మాత్రమే తినడం. రవి కిషన్ అలాంటి డైట్‌ని చేయగలిగే శక్తి ఆ మహాదేవుడు తనకిచ్చిన వరంగా అభివర్ణించారు. అయితే రాజకీయ బాధ్యతలను నిర్వర్తించడానికి దానిలో కొద్దిగా మార్పులు చేస్తుంటానని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో..తన డైట్ విధానం మారిపోతుందట. ఆ రోజుల్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సలాడ్ తీసుకుంటానని అన్నారు. అవసరం అనుకుంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, నెయ్యి కూడా తీసుకుంటానని అన్నారు. తనకు ఇష్టమైన పండ్ల గురించి మాట్లాడుతూ..తన భోజనంలో తప్పనిసరిగా అవకాడో, కివీ, ఆపిల్, అరటిపండ్లు, నారింజ, తాజా పండ్ల రసాలు ఉంటాయని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, కండరాల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలని రవి కిషన్ నొక్కి చెప్పారు.(చదవండి: కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..) -
Health: 'నాలో సమస్య ఉండదు' అనేదే పెద్ద అపోహ!
ఇటీవల సంతానలేమి సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఈ నెల 25న ఐవీఎఫ్ / ఎంబ్రియాలజీ డే సందర్భంగా ‘సాక్షి’ వరుస కథనాలను వెలువరించింది. ప్రత్యేకంగా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వచ్చిన వరుస కథనాల్లో సంతానలేమి కారణాలతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు, అందులోని కాంప్లికేషన్లూ, నైతికాంశాలను విపులంగా చర్చించింది.ఈ నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన హార్మోన్ సైకిళ్లు కొనసాగే మహిళల్లో వచ్చే సమస్యలపై మరింత వివరమైన కథనాలొచ్చాయి. అయితే పురుషుల్లో సంతానలేమికి కారణాలపై చిన్న ప్రస్తావనలకే పరిమితమైనందున ఈ కథనంలో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వ సమస్యలు దంపతుల సంతానలేమికి ఏ మేరకు కారణమవుతున్నాయనే అంశంపై ఓ వివరణాత్మకమైన కథనమిది. నిజానికి దంపతుల్లో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పురుషులే తొలి చొరవ తీసుకోవాలని చెప్పడంతో పాటు... అందుకు కారణాలేమిటో తెలిపే కథనమిది.సంతానలేమి సమస్య ఉన్న దంపతుల్లో మహిళలతో పాటు పురుషులూ అందుకు కారణం కావచ్చు. నిజానికి సంతానలేమికి మహిళలూ, పురుషులూ సమానంగా కారణం కావచ్చని గుర్తించాలి. అయితే పురుషాధిక్యత కారణంగా... ఇంత పురోగతీ, జెండర్ ఈక్వాలిటీ తర్వాత కూడా సమాజం ఇప్పటికీ మహిళలనే ఇందుకు బాధ్యులను చేస్తుండటం గమనించవచ్చు. పురుషులలో సంతాన లేమికి కారణాలుపురుషుల్లో సంతాన లేమికి కారణాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి జీవనశైలికి సంబంధించినవీ, పర్యావరణ కారణాలూ, వైద్యపరమైన అంశాలు. వాటి గురించి వివరంగా... జీవనశైలికి సంబంధించినవి...పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు. (ఇవి శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక (మొటిలిటీ)ని తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా పొగతాగడమనే అలవాటు శుక్రకణాల మొటిలిటీని విపరీతంగా ప్రభావితం చేస్తుంది).కూర్చుని చేసే వృత్తులతో శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం (ఒబేసిటీ)ఆధునిక జీవనశైలిలో ఉండే తీవ్రమైన ఒత్తిడి.ఈ అంశాలన్నీ పురుషుల్లో హార్మోన్లపై దుష్ప్రభావం కలిగించి శుక్రకణాల (స్పెర్మ్) ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి/ చేస్తున్నాయి.పర్యావరణ అంశాలు...కాలుష్యం, వాతావరణంలోని విషపదార్థాలు (టాక్సిన్స్), భారలోహాల (హెవీమెటల్స్) తాలూకు దుష్ప్రభావాలు.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పాదనల ఉపయోగంతో వాతావరణంలోని రేడియేషన్... వంటి అంశాలూ స్పెర్మ్‌పై ప్రతికూలంగా పనిచేస్తుంటాయి. (ఉదాహరణకు సెల్‌ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకోవడం, ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వంటివి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయన్న పరిశీలనలూ, అధ్యయనాలూ ఉన్నాయి).వైద్యపరమైన అంశాలు...వృషణాల్లో రక్తనాళాలు ఉబ్బడం వల్ల కనిపించే వేరికోసీల్.టెస్టోస్టెరాన్ మొదలగు హార్మోన్ సమస్యలు.కొన్ని జన్యుపరమైన అంశాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్లుకారణాలు తెలుసుకోవడం కోసం...పురుషుల్లో సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి దంపతులకు మొట్టమొదటగా డాక్టర్ నుంచి కౌన్సెలింగ్ అవసరం. పరీక్షల కంటే ముందుగా ఇదే ఎందుకు అవసరమంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక అంశాలపై విజ్ఞానం చాలా తక్కువ. పైగా లైంగికపరమైన సమస్యలూ, పరిష్కారాల కోసం నోరుతెరచి ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే దంపతులు మొట్టమొదట తమ మనసు విప్పి డాక్టర్ ఎదుటనైనా మాట్లాడేలా దంపతులను సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత వారి లైంగిక జీవితం పై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. నిజానికి లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి. ఉదాహరణకు ఆ ప్రశ్నలెలా ఉంటాయంటే...పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభన సరిగా ఉందా, లేదా?ఒక నెలలో మహిళకు నెలసరి మొదలైన తర్వాత 10వ రోజు నుంచి 20వ రోజుల్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా రోజూ గానీ లేదా రోజు తప్పించి రోజుగానీ క్రమం తప్పకుండా కలుస్తున్నారా?కలయిక తర్వాత పురుషుడి వీర్యం మహిళలోకి సక్రమంగానే చేరుతోందా అన్నది తెలుస్తోందా?పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉన్నా, ఒకవేళ కలయిక సాధ్యమైనప్పటికీ... వీర్యం సక్రమంగా మహిళలోకి పూర్తిగా ప్రవేశించకపోయినా... ఆ మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ / యూరాలజిస్ట్ ద్వారా ముందుగా పురుషుల విషయంలోనే తెలుసుకోవాలి.సమాజపరంగా అందరి బాధ్యత ఇది... ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒకవేళ పురుషుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ అది కూడా మిగతా సాధారణ ఆరోగ్య సమస్యల్లాంటిదే. నిజానికి దాన్ని లోపంగా కూడా చూడకూడదు. అన్నిసాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స ఎలా చేయిస్తారో, ఈ సమస్యకూ అలాగే చికిత్స అందించాలి. నిజానికి ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.తొలుత భౌతిక పరీక్షల (ఫిజికల్ ఎగ్జామినేషన్స్)తో మొదలు...పురుషులతో మాట్లాడాక... ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌గా పిలిచే కొన్ని భౌతిక అంశాల పరీక్షలు నిర్వహించాలి. ఇందులో... పురుషుల్లో సెకండరీ సెక్సువల్ కారెక్టరస్టిక్స్ అన్నీ సరిగా అభివృద్ధి చెందాయా అని చూడాలి. సెకండరీ సెక్సువల్ కారెక్టరిస్టిక్స్ అంటే... ఆ వ్యక్తికి మీసాలూ గడ్డాలూ బాగానే ఉన్నాయా, అతడి ప్యూబిక్ హెయిర్ పెరుగుదల సాధారణంగానే ఉందా, పురుషాంగం పరిమాణం కనీసంగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాక ఆ తర్వాతి పరీక్షలకు వెళ్తారు.తర్వాత నిర్ధారణ పరీక్షలు...వీర్యపరీక్ష (సెమెన్ ఎనాలసిస్ టెస్ట్) : ఈ పరీక్షలో వీర్యకణాల సంఖ్య (కౌంట్), నాణ్యత (క్వాలిటీ), కదలికలు (మొటిలిటీ), వీర్యకణాల ఆకృతి (మార్ఫాలజీ) వంటి అంశాలు తెలుస్తాయి. ఈ పరీక్షకు ముందుగా కనీసం మూడు రోజుల పాటు కలయికగానీ లేదా హస్తప్రయోగంగానీ కూడదు. ఒక్కోసారి ఒక పరీక్షకూ మరో పరీక్షకూ కూడా పొంతన లేని ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకే కేవలం ఒక పరీక్షతోనే సెమెన్ ఎనాలసిస్‌పై ఒక నిర్ధారణకు రాకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోయి, వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే పూర్తి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అందుకే సెమెన్ టెస్ట్‌లో ఒక్కోసారి కేవలం పరీక్షకే పరిమితమయ్యే బదులు కొన్నిసార్లు డాక్టర్లు ఒకటికి రెండుసార్లు ఈ పరీక్ష చేయించే అవకాశం ఉండవచ్చు.చికిత్స ప్రక్రియలు...ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గితే... యాంటీబయాటిక్స్ ఇవ్వడం.హార్మోన్ల లోపం ఉంటే... దాన్ని భర్తీ చేసేందుకు అందుకు అవసరమైన హార్మోన్ చికిత్స అందిస్తారు.వీర్యంలో అసలు వీర్యకణాలే లేకపోతే : నిజానికి వీర్యం అనేది వీర్యకణాలు జీవిస్తూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక ద్రవపు మీడియం మాత్రమే. దీన్ని ప్రోస్టేట్ గ్రంథి అండ్ సెమినల్ వెసికిల్స్ తయారు చేస్తాయి. సంతానానికి కారణమయ్యే ‘వీర్యకణాలు’ వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ పుట్టిన ఆ కణాలు, వాస్ డిఫరెన్స్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యంలోకి చేరి, అందులో ఈదుతూ ఉంటాయి.పురుషులకే తొలి పరీక్షలు మేలు... నిజానికి సంతాన లేమి సమస్యలు ఉన్నప్పుడు తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. ఇలా చెప్పడానికి అనేక కారణాలతో పాటు అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేమిటంటే... పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. ఖర్చు కూడా చాలా తక్కువ. మొదటే మహిళల్లో సమస్యల కోసం పరీక్షలు చేయిస్తే... పురుషుల విషయంలో చేయించాల్సిన పరీక్షల కన్నా అవి చాలా ఎక్కువ. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో సమస్య ఏదీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం... ఇవన్నీ వృథా అవుతాయి.మన సమాజంలోని పురుషాధిక్యతతో కూడిన వివక్ష, పురుషుడిలో సమస్య ఉందంటే... ముఖ్యంగా పల్లెల్లో పొరుగువారి నుంచి ఎదురయ్యే చిన్నచూపు వంటి అంశాలు పురుషుడు తన సమస్యను కప్పిపెట్టుకునేలా ప్రేరేపిస్తుంటాయి. నిజానికి సంతానలేమికి మహిళల్లో ఎన్ని కారణాలు ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయన్నది వైద్యపరంగా తేలిన సత్యం. అందుకే సంతానం లేని దంపతుల్లో... పురుషులే తొలి పరీక్షలు చేయించుకోవడం అని రకాలా ప్రయోజనకరం.ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.కౌంట్‌ను ప్రభావితం చేసే దురలవాట్లుసిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్రఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ్రపాముఖ్యత ఇస్తుంటారు.లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి.హార్మోన్ పరీక్షలు...ఇందులో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్,ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్. ఈస్ట్రోడియల్ ఈ ఐదు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. (నిజానికి ఒక టెస్టోస్టెరాన్ మినహా మిగతా వైద్య పరీక్షలు మహిళలకే చేస్తారనేది సాధారణ అపోహ. కానీ ఈ హార్మోన్లు మహిళలూ, పురుషుల్లో వేర్వేరు మోతాదుల్లో వెలువడి ఒక క్రమమైన సమతౌల్యతను నిర్వహిస్తుంటాయి. ఆ సమతౌల్యత సక్రమంగానే ఉందా లేక అసమతౌల్యతా ఉందా అని తెలుసుకునేందుకు పురుషులకూ ఈ హార్మోన్ పరీక్షలు చేస్తారు). జన్యుపరమైన పరీక్షలు: సంతానలేమికి ఏవైనా జన్యుపరమైన కారణాలున్నాయా అని తెలుసుకునేందుకు చేసే పరీక్షలివి.ఇమేజింగ్ పరీక్షలు: వీర్యంలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాక్టర్లు ‘స్క్రోటల్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఏమాత్రం నొప్పి ఉండని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ సమస్య ఏదైనా ఉందా అని తెలుస్తాయి.వేరికోసిల్ అంటే...వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం. దీనివల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను ఓ సాధారణ శస్త్రచికిత్సతో చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి.వీర్యకణాలే లేని కండిషన్ ‘అజూస్పెర్మియా’ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో అసలు వీర్యకణాలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. ఈ సమస్య ఉంటే గర్భం రాదు. ఎందుకంటే... 60 లక్షల నుంచి కోటికణాలు ఉండాల్సిన చోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇందుకు కారణాలను కచ్చితంగా కనుగొంటే... దీన్ని అధిగమించడం సాధ్యమే. వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు నిర్ధారణ కోసం ఒక నెల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవని రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందో లేదో అన్నది ఈ పరీక్షతో తెలుసుకుంటారు.వాస్ రిపేర్ (వాసో వాసాస్టమీ) : కొందరిలో వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా ఉంటుంది. టెస్టిక్యులార్ బయాప్సీలో వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉందని తెలిశాక... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్)ని రిపేర్ చేసి, కలయిక సమయంలో అవి బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది కాస్త సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. వృషణాల్లో వీర్యకణాల తయారీ నార్మల్‌గా ఉందని తెలిశాకే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి.టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం : వీర్యకణాల తయరీ బాగుండి, మహిళలకు సమస్యలు ఉన్నప్పుడు... డాక్టర్లు వీర్యకణాల్లో నాణ్యమైన వాటిని సేకరించి, వాటిని ల్యాబ్ ఫ్రిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగిస్తారు. సేకరించిన వీర్యకణలను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్తారు. ఇందులో వీర్యకణాన్ని, అండాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలి; మంచి సమతులాహారం; పరిశుభ్రమైన వాతావరణంలో నివాసం; శారీరకంగా శ్రమ చేస్తూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడంతో పాటు పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, మానసికంగా, శరీరకంగా ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటే... అసలు వైద్యపరీక్షలూ, చికిత్సలేమీ లేకుండానే సంతానాన్ని పొందే అవకాశాలుండవచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న వైద్యవిజ్ఞానంతో దాదాపు ప్రతి సమస్యకూ పరిష్కారముందని పురుషులు గుర్తుంచుకోవడం అవసరం. చాలా ముఖ్యం కూడా.- డా. రాఘవేందర్ కొస్గీ, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో సర్జికల్ యూరో–యాండ్రాలజిస్ట్నిర్వహణ: యాసిన్ -
స్లిమ్‌గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?
సెలబ్రిటీలు, ప్రముఖులు, సాధారణ వ్యక్తుల అసాధారణ వెయిట్‌లాస్ జర్నీలు గురించి విన్నాం. కానీ ఊబకాయంతో బాధపడే వారు..డైట్లు, వర్కౌట్లు చేసినా..అంత సులభంగా బరువు తగ్గక ఇబ్బంది పడుతుండే వారికి ఉపయుక్తమైన ఓ క్రికెటర్ వెయిట్‌లాస్ స్టోరీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇది నిజంగానే ఊబకాయులకు అద్భుతమైన వరమా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరీ వెయిట్‌లాస్ జర్నీ అంటే..ఆయనే శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున్ రణతుంగా. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, కొలంబోలో జరిగిన తొలి కొలంబో సాహిత్య ఉత్సవానికి హాజరైన సందర్భంగా, రణతుంగతో కలిసి దిగిన ఒక ఫోటోను నెట్టింట షేర్ చేయడతో..ఒక్కసారిగా ఆ క్రికెటర్ స్మార్ట్ లుక్‌పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. శశిథరూర్ ఆ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆయన అద్భుతమైన మార్పు కారణంగా, ప్రపంచ కప్ గెలిచిన ఈ మాజీ కెప్టెన్‌ను చాలా మంది క్రికెట్ అభిమానులు గుర్తించలేకపోవచ్చు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న రణతుంగ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని, అప్పటి నుంచి ఆయన చాలా స్లిమ్‌గా మారారని వెల్లడించారు. అంతేగాదు క్రికెట్ దిగ్గజం రణతుంగా క్రికెట్ ఆడే రోజుల్లో మూడు ఓవర్లకే అలిసిపోయేవాడినని, కానీ ఇప్పుడు ఛారిటీ మ్యాచ్‌లలో మూడు గంటల పాటు సునాయాసంగా బ్యాటింగ్ చేయగలనని సరదా అన్నారు. ఇక్కడ రణతుంగా శరీరాకృతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ, దాని ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టిసారించేలా చేసింది.బేరియాట్రిక్ సర్జరీ అంటే?బేరియాట్రిక్ సర్జరీ అనేది శాశ్వత బరువు తగ్గడానికి సహాయపడే వెయిట్‌లాస్ సర్జరీల్లో ఒకటి. ఈ ఆపరేషన్‌లో కడుపు పరిమాణాన్ని తగ్గించడం, అలాగే చిన్న ప్రేగు పోషకాలను గ్రహించే విధానాన్ని మార్చేలా.. జీర్ణవ్యవస్థను సవరిస్తాయి.ఈ విధానం సాధారణంగా తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి, ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, మందులు వంటి జీవనశైలి మార్పులు శాశ్వత ఫలితాలను ఇవ్వడంలో విఫలమైనప్పుడు సిఫార్సు చేయబడుతుంది.బేరియాట్రిక్ సర్జరీ రకాలు:గ్యాస్ట్రిక్ స్లీవ్ (స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ): కడుపులోని పెద్ద భాగాన్ని తొలగించి, ఆహార తీసుకోవడాన్ని పరిమితం చేస్తుంది.గ్యాస్ట్రిక్ బైపాస్ (రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్): ఒక చిన్న కడుపు సంచిని సృష్టించి, చిన్న ప్రేగులోని కొంత భాగాన్ని దారి మళ్లిస్తుంది.వ్యక్తిగత ఆరోగ్య అవసరాలను బట్టి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇతర జీవక్రియ విధానాలను కూడా పరిగణించవచ్చు.బరువు తగ్గడంకి మించి ఆరోగ్య ప్రయోజనాలు..బేరియాట్రిక్ సర్జరీ అనేది సౌందర్య విధానం కాదని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఊబకాయ సంబంధిత సమస్యలను తగ్గించే మెరుగైన ఆరోగ్య విధానం. బారియాట్రిక్ సర్జరీ ఈ క్రింది విషయాలలో సహాయపడుతుందని పరిశోధనలో తేలిందిటైప్ 2 మధుమేహాన్ని మెరుగుపరచడం లేదా పూర్తిగా నయం చేయడంఅధిక రక్తపోటును తగ్గించడంగుండె జబ్బులు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించడంస్లీప్ అప్నియాను మెరుగుపరచడంమోకాళ్లు, తుంటిపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడంఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంచలనశీలత, ఓర్పు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంశస్త్రచికిత్స తర్వాత రణతుంగ గంటల తరబడి బ్యాటింగ్ చేయగలగడం అనేది, రోగులు తరచుగా నివేదించే అత్యంత గుర్తించదగిన ప్రయోజనాలలో ఒకటైన - పెరిగిన శారీరక ఓర్పు, మెరుగైన ఫిట్నెస్ను ప్రతిబింబిస్తుంది.ఎవరికి మంచిదంటే..నిపుణుల ప్రకారం, బారియాట్రిక్ సర్జరీ సాధారణంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న పెద్దలకు సిఫార్సు చేస్తారు.బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 40 లేదా అంతకంటే ఎక్కువBMI 35 లేదా అంతకంటే ఎక్కువ ఉండి, మధుమేహం, అధిక రక్తపోటు లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి ఊబకాయ సంబంధిత సమస్యలు ఉన్నవారుశస్త్రచికిత్సకు ముందు, ఈ ప్రక్రియ సరైనదేనా అని నిర్ధారించడానికి రోగులకు వివరణాత్మక వైద్య, పోషకాహార మానసిక అంచనాలు నిర్వహిస్తారు.ముమ్మాటికీ షార్ట్‌కట్ కాదుబారియాట్రిక్ సర్జరీని ఎప్పుడూ తక్షణ పరిష్కారంగా చూడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక విజయం అనేది శాశ్వత జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా సమతుల్యమైన, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన విటమిన్, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, జీవితాంతం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వంటివి ఉంటాయి.ఈ మార్పులు చేయకపోతే, రోగులు తిరిగి బరువు పెరగవచ్చు, పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు. ఇక్కడ రణతుంగ రూపాంతరం ఊబకాయం అనేది కేవలం రూపానికి సంబంధించిన విషయం కాదని, అది ఒక దీర్ఘకాలిక వైద్య సమస్య అని వెల్లడైంది. అలాంటప్పుడు సమర్థవంతమైన చికిత్స అనేది ఆరోగ్యం, జీవననాణ్యతను గణనీయంగా మెరుపరుస్తుందని ఈ క్రికెటర్ వెయిట్‌లాస్ జర్నీ తెలుపుతోంది. అలాగే ఇది ఊబకాయాన్ని చక్కగా నిర్వహిస్తూనే ఆరోగ్యంగా ఉండే చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ అప్రమత్తం చేశారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మీడియాతో రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందన్నారు. గుండెపోటుతో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్ ఉందన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.సుదర్శన్‌రెడ్డి చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరారు. -
98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్ అయిన డైట్‌ప్లాన్..
అధిక బరువు కొందరికీ జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్‌లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్డౌన్ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్‌తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళే..ఆనంద్ భార్గవ్. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్‌కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్‌లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు. దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్ ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్ ప్లాన్‌ని కూడా పంచుకుంది. ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లుమధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్‌తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగుసాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రారాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్‌లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుందామె.(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం) -
ఓఆర్ఎస్ ఇస్తే... విరేచనాలు తగ్గిపోతాయా?
మా రెండేళ్ల బాబుకు నిన్నటి నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఇంట్లో పెద్దలు తిండి ఆపేయాలని నీళ్లు తక్కువగా ఇవ్వాలని చెప్తున్నారు. మెడికల్ షాప్‌లో ఓఆర్ఎస్ పొడి, జింక్ మాత్రలు తీసుకోమన్నారు. నిజంగా ఇవి ఎంత అవసరం. ఓఆర్ఎస్ ఇస్తే విరేచనాలు వెంటనే తగ్గిపోతాయా?– కావ్య, చిత్తూరు. ఈ సందేహం మీ ఒక్కరిదే కాదు. దాదాపు ప్రతి పేరెంట్ మనసులో ఇదే ప్రశ్న ఉంటుంది. కానీ ముందుగా ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లలకు వచ్చిన అసలైన ప్రమాదం విరేచనాలు కావు. శరీరంలో నీరు, లవణాలు వేగంగా తగ్గిపోవడమే (డీహైడ్రేషన్) పెద్ద ముప్పు. సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదం నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను కాపాడిన అద్భుతమైన మార్గమే ఓఆర్ఎస్. అందుకే ప్రతి ఏడాది జూలై ఇరవై తొమ్మిదిని ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సందేశం ‘ఓఆర్ఎస్: చిన్న పరిష్కారం– ఆరోగ్యమైన భవిష్యత్తు’ ఇక ప్రజారోగ్య నినాదం అయితే, ‘తెలివిగా తాగండి, బలంగా ఉండండి. ఓఆర్ఎస్ను ఎంచుకోండి’. అందుకే, ముందుగా ప్రతి తల్లిదండ్రులు ఓఆర్ఎస్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చెప్తాను. ఓఆర్ఎస్ అంటే ఏమిటి?ఓఆర్ఎస్ అనేది చక్కెర, ఉప్పు, ఇతర శరీరానికి అవసరమైన లవణాల సరైన మిశ్రమం. చాలామంది అనుకునేలా ఇది విరేచనాలను ఆపే మందు కాదు. ఇది విరేచనాల వల్ల శరీరం కోల్పోయిన నీరు, సోడియం, పొటాషియం వంటి లవణాలను తిరిగి భర్తీ చేసి పిల్లలను డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. అందుకే, చాలామంది డాక్టర్లు విరేచనాలు మొదలైన వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వడం ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గుతుందని సూచిస్తారు. జింక్ ఎందుకు అవసరం?విరేచనాల సమయంలో పిల్లల శరీరంలో జింక్ స్థాయి తగ్గిపోతుంది. జింక్ ఇవ్వడం వలన పిల్లలు త్వరగా కోలుకుంటారు. అలాగే, విరేచనాలు ఉండే రోజులు తగ్గుతాయి. మళ్లీ విరేచనాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పేగులు త్వరగా బలపడతాయి. శరీర రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఎన్ని రోజులు ఇవ్వాలి? ఆరు నెలల లోపు పిల్లలకు రోజుకు పది మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు, ఆరు నెలలు దాటిన పిల్లలకు రోజుకు ఇరవై మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు చాలు. లేదంటే, వైద్యుడి సూచించిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి.ఎలా ఇవ్వాలి?బిడ్డ ఒకేసారి ఎక్కువగా తాగలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒకటి లేదా రెండు చెంచాల చొప్పున ఇవ్వండి. ఒకటి లేదా రెండు నిమిషాలకు ఒకసారి నెమ్మదిగా తాగించండి. వాంతి చేసినా ఐదు నుంచి పది నిమిషాలు ఆగి మళ్లీ ప్రారంభించండి. ఈ చిన్న చిన్న గుక్కిళ్లు పిల్లలకు పెద్ద రక్షణ.ఓఆర్ఎస్ ఎలా తయారు చేయాలి? ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను ఒక లీటరు శుభ్రమైన నీటిలో మాత్రమే పూర్తిగా కలపాలి. ముఖ్యంగా పాలు, పండ్లరసం లేదా సోడా పానీయాల్లో అసలు కలపకూడదు. తయారు చేసిన ద్రావణాన్ని ఇరవై నాలుగు గంటల్లోపు ఉపయోగించాలి. మిగిలిన ద్రావణాన్ని మళ్లీ వాడకుండా పారేయాలి.విరేచనాలు ఉన్నప్పుడు పిల్లలకు తిండి పెట్టాలా? తప్పకుండా పెట్టాలి. చాలామంది చేసే పెద్ద పొరపాటు తిండి పూర్తిగా ఆపేయడం. అలా చేయకండి. తల్లిపాలు, పెరుగన్నం, గంజి, అరటిపండు, ఇడ్లీ, ఖిచిడీ, సాధారణ ఇంటి ఆహారం ఇలా ఇవన్నీ పిల్లలకు ఇవ్వవచ్చు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలు నీళ్లు తాగలేకపోతే, పదేపదే వాంతులు అవుతుంటే, కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తే, నోరు పూర్తిగా పొడిగా ఉంటే, మూత్రం చాలా తగ్గిపోతే, చాలా నీరసంగా లేదా మత్తుగా ఉంటే, మలంలో రక్తం కనిపిస్తే, ఆరు నెలల లోపు శిశువుకు తరచు విరేచనాలు వస్తే, అధిక జ్వరం. ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినా ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించండి.చివరగా ఒక చిన్న ఓఆర్ఎస్ ప్యాకెట్, ఒక చిన్న జింక్ మాత్ర, ఒక తల్లి సరైన నిర్ణయం... ఈ మూడు కలిసి ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడగలవు. అందుకే, ఈ జూలై ఇరవై తొమ్మిది ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఓఆర్ఎస్ గురించి తెలుసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. అవసరం వచ్చిన వెంటనే ఉపయోగించాలి. ఎందుకంటే ఓఆర్ఎస్ సాధారణ ద్రావణం కాదు. లక్షలాది చిన్నారుల ప్రాణాలను కాపాడిన నమ్మకమైన జీవరక్షక మిత్రుడు. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ (చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..) -
జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నీట్-యూజీ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న ఆందోళనకారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత, వర్షం, రద్దీతో కూడిన వాతావరణంలో ఆందోళన కొనసాగిస్తుండటంతో పలువురు విద్యార్థులలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, గాయాలతో తల్లడిల్లిపోతూ వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వాలంటీర్ వైద్యులు తెలిపారు.నిరసనకారులు రోజంతా బహిరంగ ప్రదేశాల్లోనే గడుపుతూ, నేలపైనే నిద్రపోతున్నారని, సరైన విశ్రాంతి, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ‘ఫైవ్ రివర్స్ హార్ట్ అసోసియేషన్’ వాలంటీర్ డాక్టర్ శిల్ప మాట్లాడుతూ, ఇప్పటికే 200 మందికి పైగా జ్వరం, గొంతునొప్పి, తలనొప్పికి మందులు అందించినట్లు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న వృద్ధులు కొందరు తమ దీర్ఘకాలిక మందులను పోగొట్టుకోవడంతో, మధుమేహం, రక్తపోటు సమస్యలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కిక్కిరిసిన జనసమూహం మధ్య దగ్గు, తుమ్ములు వంటి వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్య బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.భోజనం సరిగా చేయకపోవడం వల్ల ఆందోళనకారులలో నీటి శాతం తగ్గిపోయి (డీహైడ్రేషన్) వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి వాలంటీర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సమీప వైద్య కళాశాలల వైద్యులు కూడా తమ విధులను ముగించుకుని ఇక్కడ సేవలు అందిస్తున్నారు. పౌరులు సైతం మందులు, ప్రథమ చికిత్స సామగ్రిని విరాళంగా అందజేస్తున్నారు.మరోవైపు తొక్కిసలాటల్లో గాయపడిన వారు, నొప్పులతో వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జూలై 20 నాటి నిరసనలో గాయపడిన కొందరు వెంటనే చికిత్స తీసుకోకపోవడంతో గాయాలు ఇన్ఫెక్షన్గా మారినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. -
పెస్కటేరియన్ డైట్‌తో స్థూలకాయం దూరం!
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. అందువల్ల పెస్కటేరియన్ డైట్ అనుసరించడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.పెస్కటేరియన్ డైట్ అంటే...?శాకాహారంలో చేపలు, రొయ్యలు సంబంధిత సీఫుడ్లను చేర్చుకోవడాన్ని పెస్కటేరియన్ డైట్ అంటారు. శాకాహారంలోని పోషకాలతో పాటు చేపలలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి లభించడం ఈ డైట్ ప్రత్యేకత.ఈ డైట్ పాటించడం వల్ల...స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది.ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.శరీరంలో అంతర్గత వాపులు, మంటలను తగ్గించి కణాల జీవక్రియను వేగవంతం చేస్తుంది.మాంసాహారులతో పోలిస్తే, పెస్కటేరియన్ విధానాన్ని పాటించేవారిలో అకాల మరణ ముప్పు దాదాపు 18% తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులకు, స్థూలకాయంతో బాధపడేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. -
డ్రాగన్ ఫ్రూట్‌తో... సీజనల్ వ్యాధులకు చెక్!
చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ పోషకాల గని. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్‌ని ముఖ్యంగా వర్షాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు...డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షించి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోకుండా కాపాడుతుంది.ఈ పండులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో సాధారణంగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.వర్షాకాలంలో చాలామందిని వేధించే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం. ఇందులో ఉండే పీచుపదార్థం ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, అస్తమా, అలర్జీల వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.వాతావరణంలో పెరిగే తేమ, కాలుష్యం వల్ల చర్మం జీవం కోల్పోకుండా ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచుతాయి. -
మధుమేహాన్ని తగ్గించే పరివృత్త త్రికోణాసనం..
శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.చేసే విధానం...ముందుగా మ్యాట్‌పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.ప్రయోజనాలు...బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.వెన్నెముకకు మంచి ట్విస్ట్ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.కాళ్లు, తుంటి, హ్యామ్‌స్ట్రింగ్స్ బలపడతాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లభిస్తుంది.నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.జాగ్రత్తలు...తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ ఉన్నవారు చేయ కూడదు.మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.2–3 రౌండ్లు సాధన చేయాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్‌తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్‌లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను..
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్‌తో ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాలో నటించిన సనా సయిద్ ‘నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలియజేసింది. ‘బులీమియా అంటే ఏమిటి?’ అనే ఆసక్తిని ఎంతోమందిలో రేకెత్తించింది....చాలా చిన్న వయసు నుంచే తనకు బులీమియా ఉన్నట్లు తెలియజేసింది సనా సయిద్. ‘నాకు బులీమియా అనే ఈటింగ్ డిజార్డర్ ఉన్నట్లు చాలా సంవత్సరాల వరకు తెలియదు. బులీమియా అనే మాట ఎప్పుడూ వినలేదు. అయితే ఒకానొక రోజు బులీమియా గురించి ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏంజరుగుతుందో మొదటిసారి అర్థమైంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనే భయం వల్ల చాలా కాలం పాటు నా సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేదు’ అంటుంది సనా సయిద్.సాధారణ బరువుతోనే కనిపించడం వల్ల బులీమియాను గుర్తించడం అతి పెద్ద సవాలు. జన్యుపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిడిలాంటి సమస్యలు...మొదలైనవి బులీమియాకు కారణం అవుతాయి. బులీమియా ఉన్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కొన్ని లక్షణాలు...భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లడం.తమ శరీర బరువు, ఆకారంపై ఎప్పుడూ ఆందోళనతో ఉండడం.పదే పదే కఠినమైన ఆహార నియమాలను పాటించి ఆపై అతిగా తినడం.తిన్న తరువాత బరువు పెరగకుండా నిరోధించడానికి స్వయంగా వాంతులు చేసుకోవడం.మార్గం ఉంది...సనా సయిద్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నేను బులీమియా సమస్యతో బాధ పడ్డాను అని బహిరంగంగా చెప్పుకోవడానికి కారణం... ఇలాంటి సమస్యతో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సతమతమవుతుంటారు. తమకు పేరు కూడా తెలియని సమస్యతో బాధ పడుతూ ఉండవచ్చు. దానికి ఒక పేరు ఉందనే విషయం వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదు. సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. మీరు ఇబ్బంది పడుతుంటే దయచేసి వైద్యులను సంప్రదించండి.నాకు ఈటింగ్ డిజార్డర్ ఉందని అంగీకరంచడం అత్యంత కష్టం కావచ్చు. కానీ తప్పదు. సమస్యను దాచివేస్తే, భయపడితే ఆ సమస్యతో మనం పోరాడలేము’ అంటుంది సనా సయిద్.బులీమియా అంటే...తక్కువ సమయంలో అసాధారణంగా, అధిక మొత్తంలో ఆహారం పదే పదే తీసుకునే రుగ్మతను బులీమియా నెర్వోసా అంటారు. బులీమియా ఉండే వ్యక్తులు తీవ్రమైన సిగ్గు, అపరాధ భావంతో ఉంటారు. ఎవరికీ చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచబడే మానసిక ఆరోగ్య సమస్యలలో బులీమియా ఒకటి. -
బరువు తగ్గడంలో పురుషులే ఫాస్ట్!
బరువు తగ్గే విషయంలో పురుషులకు, మహిళలకు పోటీ పెడితే.. విజేతలుగా నిలిచేది మగాళ్లే. ఔనండి.. మహిళల కంటే పురుషులే త్వరగా బరువు తగ్గుతారట. స్త్రీ, పురుషులిద్దరు ఒకే షెడ్యూల్లో ఒకే డైట్, ఒకే వ్యాయామం పాటించినా సరే.. పురుషులే వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ విషయంలో మహిళల తప్పిదం ఏమీ లేదు. ఇందుకు కొన్ని జీవ సంబంధిత కారణాలు ఉన్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. పురుషులు బరువును కోల్పోవడంలోనే కాదు.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనట. మరి, పురుషులే త్వరగా బరువు తగ్గేందుకు గల కారణాలేమిటో చూద్దామా!బరువు తగ్గించడమంటే.. శరీరంలోని క్యాలరీని కరిగించడమే. అసలు విషయం ఏమిటంటే.. ఇతరులతో పోల్చితే ఎక్కువ సన్నని కండరాలు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచాలంటే మహిళలు.. పురుషులు కంటే ఎక్కువసేపు శ్రమించాల్సి ఉంటుంది.బరువు తగ్గడంలో జీవక్రియ కూడా భారీ పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియ కూడా సన్నని కండరాల వల్లే ప్రభావితమవుతుంది. పురుషులు ఎక్కువ సన్నని కండరాలను కలిగి ఉన్నందున వారు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఫలితంగా మహిళలతో పోలిస్తే వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.పురుషులు, మహిళల్లో వేర్వేరు ్రపాంతాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇది కూడా ఇరువురి బరువులపై ప్రభావం చూపుతంది. పురుషులకు ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. మహిళలకు తొడలు, పిరుదుల్లో కొవ్వు పెరుగుతుంది. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వుతోనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం. అయితే, దీన్ని కరిగించడం సులభమే. తక్కువ వ్యాయామంతోనే త్వరగా పొట్టను తగ్గింవచ్చు.రోజూ ఎంత సేపు నడిస్తే మంచిదంటే..హార్మోన్ల వల్ల కూడా స్త్రీలు.. పురుషులు కంటే ఆలస్యంగా బరువు తగ్గుతారు. పురుషుల కంటే మహిళల్లో 6 నుంచి 11 శాతం కొవ్వు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల భోజనం తర్వాత క్యాలరీలు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతే బరువు పెరుగుతారు. పురుషులతో పోల్చితే మహిళలు తగిన డైట్ ΄్లాన్ పాటించలేరు. తమకు ఇష్టమైన ఆహారాన్ని చూడగానే కంట్రోల్ చేసుకోలేరు. అయితే, అత్యధిక శాతం మంది పురుషులు శ్రద్ధగా డైట్ పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా మహిళల కంటే వేగంగా పురుషులు బరువు తగ్గుతారు. -
84 కేజీల నుంచి 54 కేజీలకు..! ఈజీగా చేసే కార్డియో వ్యాయామాలివే..
బరువు తగ్గడం అంటే తక్షణ పరిష్కారాల కోసం చూడకుండా.. బదులుగా నిలకడగా చేయగలిగే అలవాట్లను అనుసరించడం అని నొక్కి చెబుతుంటారు ఫిట్నెస్ నిపుణులు. అందుకోసం సక్రమమైన జీవనశైలి, చక్కటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిందే. అలాగని కష్టతరమైనవి కాకుండా తేలిగ్గా చేసే వర్కౌట్లు, రిపిటేషన్స్ ప్రధానం అని అంటోంది ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంజలి సచెన్. చేసే వ్యాయామాలు సెట్స్ వారిగా రిపిటేషన్ చేస్తే చాలు..కష్టతరమైన వాటి జోలికి పోనవసరం లేదంటోంది. అంతేగాదు తేలిగ్గా చేసే కార్డియో వ్యాయమాల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. అవేంటంటే..అంజలి సచెన్ అనే ఈ మహిళ, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను 84 కేజీల నుంచి 54 కేజీలకు తగ్గినట్లు తెలిపింది. అందుకోసం ఎలాంటి కార్డియో వ్యాయామాలు చేసేదో వెల్లడించారామె. అదనపు కొవ్వుని తగ్గించుకోవడానికి సహాయపడే వ్యాయామాలు ఇవే..హై నీస్ (మోకాళ్లకు వ్యాయామం)ఆమె 20 రెప్స్‌తో నాలుగు సెట్లు హై నీస్ చేయడంతో ప్రారంభించారు. ఈ డైనమిక్ కార్డియో వ్యాయామంలో, మోకాళ్లను తుంటి ఎత్తుకు తీసుకువస్తూ..చేతులను పంప్ చేస్తూ ఒకే చోట పరుగెత్తాలి లేదా నడవాలి. ఇది హృదయ స్పందన రేటును పెంచడానికి, శరీర దిగువ భాగం శక్తిని పెంపొందించడానికి, కోర్‌ను ఉత్తేజపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం.జంపింగ్ జాక్స్తరువాత, ఆమె జంపింగ్ జాక్స్‌ను 50 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామంలో, ఆమె తన మోకాళ్లను కొద్దిగా వంచి గెంతింది, తన కాళ్లను బయటకు చాస్తూ, చేతులను బయటకు ఊపుతూ వాటిని ఒక వంపులో పైకి లేపింది.కిక్బ్యాక్స్ఆమె సిఫార్సు చేసిన తదుపరి వ్యాయామం కిక్బ్యాక్స్. ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని ఆమె సలహా ఇచ్చింది. ఆమె తన చేతులను తుంటిపై ఉంచి నిలబడి, తన కాళ్లను వెనక్కి తన్ని, చేతులను తాకడానికి ప్రయత్నించింది.జంపింగ్ స్క్వాట్స్ఈ జంపింగ్ స్క్వాట్స్‌ను కూడా 12 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామం ఒక ప్రామాణిక బాడీవెయిట్ స్క్వాట్ను నిలువు జంప్‌తో మిళితం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతూ కాళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.జంపింగ్ లంజెస్సాధారణ లంజెస్ కు బదులుగా, జంపింగ్ లంజెస్లో కాళ్ళను రెండుగా చాపి నిలబడి, నిలువుగా పైకి ఎగిరి గాలిలోనే కాళ్ళ స్థానాలను మార్చుకుని, వేగంగా తిరిగి లోతైన లంజ్ భంగిమలోకి దిగాలి. ఈ వ్యాయామాన్ని 10 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆ ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఇచ్చారు.మౌంటెన్ క్లైంబర్స్చివరి వ్యాయామంగా, మౌంటెన్ క్లైంబర్స్‌ను 15 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆమె సిఫార్సు చేశారు. ఆమె సాధారణ 'ప్లాంక్' (plank) భంగిమలోకి వచ్చి, ఒక మోకాలిని తన ఛాతీ వైపునకు లాగి, వెంటనే తిరిగి మొదటి స్థితికి తీసుకువచ్చింది. ఈ వ్యాయామం శరీర మధ్య భాగం (కోర్) బలాన్ని,భుజాల స్థిరత్వాన్ని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చివరగా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరంగా కనిపించేలా చేస్తాయని ఆమె పేర్కొంది. వీటికి బదులుగా, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పాలకూర, అవకాడోలు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రని అనుసరించి.వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం చేయడం ఉత్తమం. (చదవండి: వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!) -
76 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్‌గా రాకేశ్ రోషన్..! ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం..
బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్‌ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్‌లోనూ అంతలా ఎలా స్లిమ్‌గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు. వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్‌గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు. తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్‌లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు. అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్‌కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు. View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్
సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ సంబంధిత కేసులో ఆయన పేరును ఏ3గా చేర్చి.. సెక్షన్లను మార్చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారని అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని భార్య శ్రీదేవి మండిపడ్డారు. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చడం బాధాకరమన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇటు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పీఎస్‌లోనే సీదిరి అప్పలరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటుండడంతో కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు అప్పలరాజును బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆయన్ని చొక్కా పట్టుకుని లాక్కెల్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే రాత్రంత కాశీబుగ్గ స్టేషన్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.వైద్య పరీక్షల కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి..మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీదిరిని ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీస్ బృందం. వైద్య పరీక్షల తర్వాత సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అప్పలరాజు తరలింపుతో పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు.. సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించలేదు.పలాసలో ఉద్రిక్తతఅప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్‌కు నిరసనగా పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు పలాసకు చేరుకుంటున్నారు.‘వైద్యం అవసరమైన సమయంలో అరెస్ట్ చేశారు’‘‘రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసును నేరపూరిత హత్య కేసుగా మార్చడం బాధాకరం. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు’’ అని అప్పలరాజు భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడిపై కావాలనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.వైఎస్ జగన్ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారని, అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.కేసు విషయంలో రాజకీయ దుమారంరోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులోనే అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా.. ఇది కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ అంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పలరాజు ఆరోగ్యం, అరెస్ట్ పరిణామాలు, పలాసలో కొనసాగుతున్న నిరసనలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..
బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్, కష్టతరమైన వ్యాయామాలు, అధిక సమయం జిమ్ సెషన్ అనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొందరు అవేమీ అవసరం లేకుండా రోజువారీ సరదాగా చేసే వర్కౌట్లతోనే సాధ్యమని చూపిస్తారు. అయితే వాటి ఏదో ఒక్కసారి కాకుండా ఇన్నిసార్లు అని చేస్తే చాలు అధిక సంఖ్యలో కేలరీలు, కొవ్వుని తగ్గించుకోవచ్చని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ ఘంగాస్. ఆ వ్యాయామాలు ఒక నిమిషంలోనే గరిష్ట కేలరీలను తగ్గించగలదని అంటున్నారు. తాను సుమారు 155 కేజీల బరువు ఉండేదాన్ని అన్ని క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలతోటే ఇంతలా బరువు తగ్గానంటూ తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాదు రోజువారి దినచర్యలో సులభంగా చేర్చుకోగలిగే ఒక ఐదు సాధారణ కదలికల వ్యాయామాలను గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది. బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి గడపడం కాదు, క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా అని అంటున్నారామె. చురుకుగా ఉంచడానికి, ఫిట్‌నెస్‌ని మెరుగుపరుచుకోవడానికి, కేలరీలను కరిగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారామె. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేలా చూసుకోవడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి వాటితోనే స్మార్ట్‌గా మారిపోవచ్చిన చెబుతోంది. తాను చెప్పబోయే చిన్న పాటి వర్కౌట్లు ఎంతటి బిజీ షెడ్యూల్లో అయినా సులభంగా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అలా చేసే తాను సుమారు 67 కిలోలు పైనే తగ్గినట్లు తెలిపింది. అవేంటంటే..జంపింగ్ జాక్స్: పాదాలను కలిపి, చేతులను పక్కన ఉంచి నిలబడండి. కాళ్ళను దూరంగా చాపుతూ, చేతులను తల పైకి ఎత్తుతూ గెంతండి. తిరిగి ప్రారంభ స్థానానికి గెంతి, మళ్ళీ చేయండి.ఇలా కొద్దిసేపు రిపీట్ చేయాలి.హై నీ క్లాప్: నిటారుగా నిలబడి, ఒక మోకాలిని ఛాతీ వైపుకు పైకి లేపుతూ, పైకి లేపిన మోకాలి కింద లేదా పైన చేతులతో చప్పట్లు కొట్టండి. వేగంగా రెండు కాళ్ళ మధ్య మార్చి మార్చి చేయండి.స్టాండింగ్ క్రాస్-బాడీ క్రంచ్: మీపాదాలను భుజాల వెడల్పులో ఉంచి నిలబడి, చేతులను తల వెనుక ఉంచండి. ఒక మోకాలిని పైకి లేపుతూ, దానికి ఎదురుగా ఉన్న మోచేతిని దాని వైపుకు తీసుకురండి. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చి, రెండవ వైపున కూడా చేయండి.ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్: మపాదాలను కలిపి నిలబడండి. రెండు పాదాలతో ముందుకు గెంతి, వెంటనే తిరిగి ప్రారంభ స్థానానికి గెంతండి. మెత్తగా కింద పడటానికి మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచండి.స్పాట్ జాగింగ్: ఒకే చోట నిలబడి, ముందుకు కదలకుండా జాగింగ్ చేయండి. కదలికను సున్నితంగా, స్థిరంగా ఉంచడానికి, మచేతులను సహజంగా ఊపుతూ పాదాలను సౌకర్యవంతమైన వేగంతో పైకి లేపండి.చురుకుగా ఉండటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండనవసరం తన వర్కౌట్లతో చెప్పకనే చెప్పింది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ. క్రమం తప్పకుండా చేసే కొన్ని సాధారణ కదలికలు కూడా ఫిట్నెస్ అలవాటును పెంపొందించుకోవడాన్ని సులభతరం చేస్తాయి. వ్యాయామం చేయడం కొత్తగా ప్రారంభిస్తున్నట్లయితే, నెమ్మదిగా మొదలుపెట్టి, సరైన భంగిమపై దృష్టి సారించి, శక్తి సామర్థ్యాలు మెరుగుపడే కొద్దీ రౌండ్ల సంఖ్యను పెంచుకోడం మంచిదని సూచిస్తోంది. కాబట్టి మరింత కష్టతరమైన మార్గం కాకుండా సులువుగా సునాయాసంగా చేసే వర్కౌట్లను ఎంచుకుని కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు రెడీ అవుదామా మరి..!. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..!పాపం ఆ వధువు స్నేహితురాలు..) -
నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత విద్యార్థి నిరసనలో పాల్గొంటున్నప్పుడు బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్వల్ప అనారోగ్య సమస్యకు గురైనట్లు సమాచారం. నిరసన ప్రదర్శన వీడియోలలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది ఆ 75 ఏళ్ల నటికి సహాయం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ రద్దీగా ఉన్న పరిసరాలలో మద్దతుదారులు ఆమెకు విసనకర్రతో విసురుతుండగా, ఆమె విశ్రాంతి తీసుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ఆ నటి ఆరోజు అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. వాటిలో నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి ట్రక్కులో తోటి నిరసనకారులతో ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా పంచుకున్నారామె. ఈ ప్రదర్శన శాంతియుతంగా, విద్యా సంస్కరణకు మద్దతుగా జరిగిందని పునరుద్ఘాటించారు కూడా. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకస్మికంగా తలతిరగడానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడించినప్పటికీ..తరుచుగా నిర్లక్ష్యంగా చూసే ఈ ఆరోగ్య లక్షణం గురించి వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి సాధారణ సమస్యే కానీ..ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు ఆకస్మిక తలతిరుగుడు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.ఆకస్మిక తలతిరుగుడు అంటే..తల తేలిపోతున్నట్లుగా అనిపించి, స్పృహతప్పి పడిపోవడం, సమతుల్యత కోల్పోవడం అని అంటారు. లేదా చుట్టూ ఉన్న పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించడం వంటి అనుభూతులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వృద్ధులలో అత్యంత వైద్య సంరక్షణ కోరడానికి అత్యంత సాధారణ కారణాలలో ఈ ఆరోగ్య సమస్య కూడా ఒకటి. చాలా సందర్భాలలో తల తిరగడం తాత్కాలికమే. అందుకోసం కేవలం విశ్రాంతి, తగినంత నీరు తాగడం లేదా మూల కారణానికి చికిత్స చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా మారుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే..ఎక్కువసేపు ఆరుబయట కార్యకలాపాలు చేసేటప్పుడు లేదా రద్దీగా ఉండే కార్యక్రమాలలో ఇలా జరుగుతుందిడీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం, తగినంత ద్రవపదార్థాలు తీసుకోకపోవడం వల్ల రరక్తపోటు పడిపోయి, ఇది తల తిరగడానికి కారణమవుతుంది.ఎక్కువసేపు ఆరుబయట ఉండటం వల్ల హీట్ ఎగ్జాషన్ (వేడి అలసట) కలగవచ్చు. దీని లక్షణాలలో తల తిరగడం, అలసట, తలనొప్పి, వికారం, అధికంగా చెమట పట్టడం వంటివి ఉంటాయి.రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం - ముఖ్యంగా వేగంగా నిలబడిన తర్వాత - మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, తల తేలిపోవడానికి దారితీస్తుంది.భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, నీరసం, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.లోపలి చెవి రుగ్మతలు కారణంగా కూడా ఇలా జరగొచ్చు.రక్తపోటు మందులు, నిద్రమందులు కొన్ని యాంటీడిప్రెసెంట్లతో సహా కొన్ని రకాల మందులు వృద్ధులలో తల తిరగడానికి కారణం కావొచ్చు. వైద్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు పరిగణిస్తారు..ఛాతీ నొప్పిఅకస్మాత్తుగా నీరసించడం లేదా తిమ్మిరిమాట్లాడటంలో ఇబ్బందితీవ్రమైన తలనొప్పిస్పృహ కోల్పోవడందృష్టి మసకబారడం లేదా రెండుగా కనిపించడంనిరంతర వాంతులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఎలా నివారించాలి?సాధారణ జీవనశైలి చర్యలు ప్రమాదాన్ని తగ్గించగలవు.ముఖ్యంగా వేడి వాతావరణంలో, తగినంత నీరు తాగండి.విరామం లేకుండా ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి.కూర్చున్న లేదా పడుకున్న స్థితి నుంచి నెమ్మదిగా లేవండి.వెచ్చని వాతావరణంలో తేలికపాటి దుస్తులు ధరించండి.అత్యధిక వేడిలో నీడ లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను ఆశ్రయించండి.తల తిరగడం తరచుగా జరుగుతుంటే, వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..) -
Health: తప్పొప్పుల ఉప్పు..
మనం ప్రతిరోజూ ఉప్పు వాడకుండా అస్సలు ఉండం. ఇందులో ఉండే రసాయనం పేరే ‘సోడియమ్ క్లోరైడ్’. సాంకేతికంగా సంక్షిప్తంగా ఎన్ఏసీఎల్ అంటూ చెబుతారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు దొరుకుతున్నాయి. వాటి ప్రయోజనాలూ, ప్రతికూలతలూ పరిశీలిద్దాం. ఉప్పు మోతాదు ఎక్కువైనా తక్కువైనా ముప్పు అన్న విషయాన్నీ తెలుసుకుందాం.- మన సంస్కృతిలో ఉప్పు భూమిక తక్కువేమీ కాదు.- మన వాడుకలో ఉప్పు వాడకం చిన్నదేమీ కాదు. అందుకే అది...- ‘ఉప్పు’కప్పురంబు అంటూ పద్యాల్లో ఉంటుంది. - పదునగు మంచికూర నలపాకం చేసి... అందు ‘ఉప్పు’ లేక రుచిపుట్టగ నేర్చునా అంటూ శతకాల్లో ఉంటుంది. - ఎంతటి ధనవంతుడైనా ఉప్పు భోజనమే తప్ప మెరుగుబంగారం మింగబోడంటూ జాతీయాల్లో ఉంటుంది. - ఒకప్పుడు వేతనం ఉప్పు రూపంలో ఉండటంతో ‘‘మీ ఉప్పు తిని బతికాం’’ అంటూ నుడికారాల్లోనూ ఉంటుంది. - ఉప్పు లేని కూర... చప్పిడి భోజనం అంటూ సామెతల్లోనూ ఉంటుంది. - వీటన్నింటికీ తోడు మన వంటల్లో ఎలాగూ ఉంటుంది. - సంస్కృతిలోనే కాదు... ఆరోగ్యం పేరిట ఇప్పుడు వంట దినుసుగా కూడా ఎన్నెన్నో రకాలుగా దొరుకుతోంది. ఆ ‘ఉప్పు’ స్వరూపాలేమిటో, వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.1. ఫ్లేక్ సాల్ట్..ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అయితే ఇది స్ఫటికాలలా కాకుండా చాలా పలుచని రేకుల్లా, తేలిగ్గా విరిగే (బ్రిటిల్) పొరలు పొరల రేకుల్లా, కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండే పిరమిడ్‌లా కూడా ఉంటుంది. దీన్ని ఖరీదైన రెస్టారెంట్లలో వాడుతుంటారు. వంట చివర్లో చల్లుతారు.లాభాలు / లోపాలు ఫ్లేక్ సాల్ట్‌ను రుచి కోసం కంటే మంచి టెక్స్చర్ కోసం ఎక్కువగా వాడతారని చెప్పవచ్చు. వంటల్లో త్వరగా కరిగిపోతుంది. ఇది మినహా మిగతాదంతా దాదాపుగా టేబుల్ సాల్ట్ లాగే ఉంటుంది.2. స్మోక్డ్ సాల్ట్..ఇది కొన్ని ప్రత్యేకమైన కలప / చెక్కను కాల్చి ఆ పొగతో పొగచూరేలా చేసిన ఉప్పు. నిర్దిష్టమైన కొన్ని రకాల చెక్క బెరడును కాలుస్తూ ఆ పొగను దాదాపు 14 రోజుల పాటు పొగచూరేలా చేశాక ఆ ఉప్పు ఒక రకమైన (సు)వాసన వస్తుంటుంది. ఇలా ఉప్పును ‘స్మోక్డ్’ ఉప్పుగా మార్చడం కోసం సాధారణంగా ఓక్, ఆపిల్ ఉడ్, ఆల్డర్, హికరీ, మెస్క్వైట్ వంటి చెక్కలను కాలుస్తారు. ఇలా సరికొత్త ఫ్లేవర్‌తో రూపొందడంతో ఈ తరహా ఉప్పు బార్బెక్యూ వంటలకు బాగా సరిపోతుంది.లాభాలు / లోపాలుదీని వాడకం వల్ల జీర్ణక్రియ కొంత మెరుగుపడుతుందనే భావన ఉంటుంది. ఇందుకు శాస్త్రీయమైన రుజువులు పెద్దగా లేవు. అయితే పరిమితంగా వాడినప్పుడు అలాంటి ఫీలింగ్ కొంతమందిలో కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల కడుపు ఉబ్బరం వంటి ప్రతికూలతలు కనిపిస్తాయి. ఎక్కువగా వాడితే సాధారణ ఉప్పు వల్ల ఉండే దుష్పరిణామాలే ఉంటాయి.3. పొటాషియం ఉప్పు..(పొటాషియమ్ ఉప్పు) లేదా ‘లో–సోడియం సాల్ట్’ (సోడియమ్ తక్కువ మోతాదులో ఉండే ఉప్పు) ఇందులో సోడియం మోతాదును కొంత తగ్గించి పొటాషియం క్లోరైడ్ కలుపుతారు. ఎందుకంటే సోడియమ్ క్లోరైడ్‌కు బదులు పూర్తిగా పొటాషియమ్ క్లోరైడ్ ఉంటే అది ఒకరకమైన చేదైన రుచితో ఉండవచ్చు.లాభాలు / లోపాలుసాధారణంగా సోడియమ్ లవణాలు రక్తపోటు (బీపీ)ను పెంచితే... దీనికి భిన్నంగా పొటాషియమ్ బీపీని తగ్గిస్తుంది. అందుకే బీపీ ఉన్నవారికి ప్రయోజనకరంగా దీన్ని కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా వాడటం వల్ల రక్తంలో పొటాషియమ్ మోతాదు పెరిగి ‘హైపర్కెలామియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం కలగవచ్చు. దీనికి తోడు కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీని వాడకంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.4. సెలరీ సాల్ట్సెలరీ గింజల పొడిని ఉప్పుతో కలిపి బ్లెండ్ చేయడం వల్ల వచ్చే ‘ఉప్పు’ను ‘సెలరీ సాల్ట్’గా పేర్కొంటారు. ఇది పూర్తిగా మామూలు ఉప్పు లాంటిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాల్లో ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా బేకరీ ఐటమ్స్ అయిన హాట్‌డాగ్‌లు, కొన్ని మాక్‌టెయిల్ పానియాల్లో, అలాగే కొన్ని రకాల సలాడ్స్‌లో దీన్ని వాడతారు. ఇక కొన్ని సూపులూ, రోస్టెడ్ వెజిటబుల్స్లోనూ ఉపయోగిస్తారు. సెలరీ గింజలను కలపడం తప్ప దీని మిగతా గుణాగణాలన్నీ సాధారణ ఉప్పువే.5. వెల్లుల్లి ఉప్పు (గార్లిక్ సాల్ట్) మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండిన వెల్లుల్లి ΄ûడర్‌ను కలిపి తయారు చేసేదే ఈ గార్లిక్ సాల్ట్. వంటల్లో మంచి రుచికోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా మంచి రుచి కోసం మాంసాహారాలూ, కొన్ని రకాల శాకాహారాలతో పాటు ముఖ్యంగా పాప్‌కార్న్ తయారీలో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది మినహా దాదాపుగా ఇది సాధారణ ఉప్పు లాంటిదే.6. ఉల్లి ఉప్పు (ఆనియన్ సాల్ట్)వెల్లుల్లి ఉప్పులో వెల్లుల్లి కలిపినట్టే... ఇందులో మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండబెట్టిన ఉల్లి ΄ûడర్‌ను కలిపి దీన్ని తయారు చేస్తారు. కాస్తంత మంచి ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. ఇది మినహా ఇందులోనూ దాదాపు టేబుల్ సాల్ట్‌లో ఉండే గుణగణాలూ, లాభనష్టాలే ఉంటాయి. 7. అయోడైజ్డ్ సాల్ట్సాధారణ టేబుల్ సాల్ట్‌కు అయోడిన్ కలిపితే వచ్చేదే ఐయోడైజ్డ్ సాల్ట్. కొన్నేళ్ల నుంచి మనదేశంలో సామాజిక, సామూహిక ఆరోగ్యం కోసం వాడుతున్న ఉప్పు ఈ అయోడైజ్డ్ ఉప్పు.లాభాలు..- ఒకప్పుడు మన దేశంలో లక్షలాది మందికి అయోడిన్ లోపం వల్ల... గాయిటర్, థైరాయిడ్ సమస్యలు- పిల్లల్లో మెదడు ఎదుగుదలలో లోపాలు... కనిపించేవి. అందుకే మన ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయోడైజ్డ్ ఉప్పుకు ప్రాధాన్యం,ప్రోత్సాహం దొరికింది. దాంతో పిల్లలూ, పెద్దల్లో ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి.లోపాలు..ఒక్క అయోడిన్ కలపడం మినహా ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అందుకే ఎక్కువ మోతాదులో వాడితే బీపీ పెరగడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. రక్తం వడపోత సమయంలో మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు కనపడతాయి.8. సీజనింగ్ సాల్ట్ ఇందులో సాధారణ ఉప్పుకు మిరియాల ΄ûడర్, వెల్లుల్లి ΄ûడర్, ఉల్లి ΄ûడర్, కొన్ని సందర్భాల్లో అజినమోటో వంటి (ఎమ్ఎస్జీ) ΄ûడర్, పాప్రికా (ఇది ఒకరకం కలరింగ్ అండ్ ఫ్లేవర్ ఏజెంట్)తో పాటు ఇతర రకాల మసాలాలు కలిపి తయారు చేస్తారు. మంచి రుచి కోసం వాడే ఉప్పు ఇది. ఇందులోనూ ప్రధానంగా రుచి కోసం కలిపే పదార్థాల గుణాలు తప్ప... ఎక్కువ మోతాదు సాధారణ ఉప్పే ఉంటున్నందున... పరిమితికి మించి వాడితే దానివల్ల కలిగే దుష్పరిణామాలే కనిపిస్తాయి.9. అజినోమోటో (ఎమ్ఎస్జీ)ఇది చైనీస్ వంటకాల్లో వాడే ఉప్పు అని చాలామందికి తెలిసిన విషయమే. సాధారణ ఉప్పులో ఉండే రసాయనం సోడియమ్ క్లోరైడ్ అయితే ఇందులో మోనో సోడియమ్ గ్లుటామేట్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల సా«ధారణంగా మనకు తెలిసిన తీపి, ఉప్పు, చేదు, వగరు రుచులకు తోడుగా ‘ఉమామీ’ అనే ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఈ ప్రత్యేక రుచి కోసం జపనీయులు, కొరియన్లు... మరీ ముఖ్యంగా చైనీస్ తమ వంటకాల్లో ఈ తరహా ‘ఉప్పు’ను వాడుతుంటారు.10. పిక్లింగ్ సాల్ట్దీన్ని ఊరగాయల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో అయోడిన్, యాంటీ–కేకింగ్ పదార్థాలు ఉండవు కాబట్టి ఊరగాయ రంగు మారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.11. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్)ఇది దాదాపు మనందరమూ ప్రతిరోజూ కూరల్లో, వంటకాల్లో... భోజనం అయ్యాక పెరుగులో రోజూ వాడే తెల్లని ఉప్పు. ఇందులో ఉండేవి...- 97–99% సోడియం క్లోరైడ్.- ఉప్పు గడ్డకట్టకుండా ఉండటం కోసం కొద్దిగా యాంటీ–కేకింగ్ ఏజెంట్లు వాడతారు.- కొంతకాలం కిందటి నుంచి అయోడిన్ కలుపుతున్నారు. - లాభాలు.. చాలా చవక, దాదాపు చాలావరకు పరిశుభ్రంగా ఉంటుంది.- అయోడిన్ కలిపితే అయోడైజ్డ్ రూపంలో దొరుకుతుంది.- లోపాలు.. సోడియం మోతాదు ఎక్కువ. ఎక్కువగా తినడం వల్ల హై–బీపీ రావచ్చు. (బీపీ పెరగవచ్చు)12. రాక్ సాల్ట్ (సైంధవ లవణం)ఇది కూడా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే అయినా ఇది లభ్యమయ్యేది గనుల నుంచే. అందుకే కొన్ని ఇతర లవణాలు కలవడం వల్ల దీన్ని రంగు కాస్త వేరుగా ఉండవచ్చు. సాధారణంగా దీని రంగు... తెలుపు, గులాబీ, లేత బూడిద.- ప్రత్యేకత : ఇందులో కొద్ది మోతాదులో కొన్ని సహజ ఖనిజాలు ఉంటాయి. కానీ వాటి మోతాదు చాలా చాలా తక్కువ. అందువల్ల ‘రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల దేహానికి కాల్షియం, మెగ్నీషియం బాగా అందుతాయి’ అనే మాటలో పెద్దగా వాస్తవం లేదు.13. కోషర్ సాల్ట్ ఇది పూర్తిగా సాధారణ ఉప్పులాంటిదే. అయితే దీని స్ఫటికాల సైజు, వాటి సాంద్రత వేరుగా ఉంటాయి. ఇందులో అయోడిన్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఉండవు.దీని ప్రత్యేకతలు..- దీని లభ్యత పెద్ద స్ఫటికాల రూపంలో.- చేతితో చల్లడానికి సులువుగా ఉంటుంది.- మాంసానికి బాగా అంటుతుంది. సాధారణ ఉప్పతో పోలిస్తే ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన తేడా ఏమీ ఉండదు.14. బ్లాక్ సాల్ట్ (కాలా నమక్)ఇది భారతదేశంలో బాగా ప్రసిద్ధి. తెలుగులో దీన్ని ‘నల్ల ఉప్పు’ / ‘నల్లుప్పు’ అని పిలుస్తారు. ఇందులో గంధకం (సల్ఫర్) సమ్మేళనాలు ఉండటం వల్ల కొద్దిగా ఉడికించిన గుడ్డులాంటి వాసన లేదా కాస్తంత ఘాటైన వాసన వస్తుంటుంది. దీన్ని చాట్ మసాలాలు, పెరుగుచట్నీ (రాయితా), పండ్లపై చల్లుతారు.15. హిమాలయన్ పింక్ సాల్ట్ఇది కూడా ఒక రకం రాక్ సాల్టే. కాకపోతే ఇది హిమాలయ సానువులనుంచి లభ్యమయ్యే లవణం. దీనికి గులాబీ రంగు రావడానికి కారణం ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్. అయితే దీన్ని మార్కెట్ చేసే కొన్ని కంపెనీలు ఇందులో ‘84 రకాల ఖనిజలవణాలు (మినరల్స్) ఉన్నాయంటూ పేర్కొంటుంటాయి. ఇది వాస్తవమే అయినప్పటికీ... నిజానికి ఆ మోతాదులు చాలా చాలా తక్కువ. ఆ 84 ఖనిజాలన్నీ చాలా సూక్ష్మ పరిమాణాల్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల వాటి ద్వారా ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని చెప్పే మాటలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.16. సముద్రపు ఉప్పు (సీ సాల్ట్)దీన్ని సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రపు ఒడ్డున మడిలాగా చేసి అనేక మడులలో సముద్రపు నీటిని ప్రవహింపజేసి, ఆ నీరు క్రమంగా ఇగిరిపోయేలా / ఆవిరైపోయేలా చూస్తారు. ఇలా మడిలా చేసి తీస్తారు కాబట్టి దీన్ని సముద్రం నుంచి పండించే ‘‘ఉప్పు పంట’’గా అభివర్ణిస్తారు.ఇందులో ‘సోడియం క్లోరైడ్’తో పాటు ఉండేవి... మెగ్నీషియం – కాల్షియం ∙పొటాషియం... అనే ఈ లవణాలన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదుల్లో ఉంటాయి. ఈ లవణాల కారణంగా రుచి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఇది దాదాపు టేబుల్ సాల్ట్‌తో సమానమే. ఇందులోని అనుకూలతలూ, ప్రతికూలతలూ సాధారణ టేబుల్ సాల్ట్‌తో సమానం.ఇదొక ఉప్పు కాని ఉప్పు..వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు ఉప్పు లాంటిది కాదు. ఈ మోనోసోడియం గ్లూటామేట్ రసాయనంలో గ్లూటామేట్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్లనే ఉమామీ అనే కొత్త రుచి వస్తుంది. ఈ తరహా ఉప్పు కాని ఉప్పులో కొన్ని రకాల మష్రూమ్ (పుట్టగొడుగుల) పొడి, సముద్రపు ఆల్గే తాలూకు పొడి, ఎండిన టమాటా, ఈస్ట్ నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ల వంటివి కలిపి తయారు చేస్తారు. దీన్ని కొన్ని రకాల వంటల్లో ఒక సీజనింగ్ మిశ్రమాలతో తయారైన ‘ఉమామీ సాల్ట్’గా వాడుతుంటారు. అందుకే దీన్ని ఉప్పు అనడం కంటే... ఇదొక అనేక రకాల ఫ్లేవర్లను ఇచ్చే పదార్థాల ఒక ప్రత్యేకమైన మిశ్రమంగా చెప్పవచ్చు.ఒక సూచన: దీన్ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యపరమైన అనర్థాలు ఎక్కువే. అందుకే దీన్ని చాలా పరిమితంగా మాత్రమే... అందునా చాలా అరుదుగా వాడటమే మంచిది.ఉప్పు... ముప్పు! చాలా కంపెనీలు తమ ఉత్పాదన తాలూకు ఉప్పులో 70 రకాల ఖనిజాలు, 84 ఖనిజాలు, ప్రాచీన సముద్రాల ఉప్పు‘, ‘డిటాక్స్ సాల్ట్’, ‘మినరల్ సాల్ట్‘ వంటి ఆకర్షణీయమైన పదాలతో ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా వాటితో అంతగా ప్రయోజనం ఉండదన్న విషయం తెలుసుకోవాలి. అది ఏ రకమైన ఉప్పు అయినప్పటికీ అందులోని సోడియం మోతాదు ఎక్కువైతే అధిక రక్తపోటు, గుండె–రక్తనాళాల సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే మనం ఏ రకమైనది అయినప్పటికీ ‘ఉప్పు పెరిగితే ముప్పు’ అని గుర్తుంచుకోవాలి.ఒక ముఖ్యమైన విషయం... సాధారణ ప్రజలలందరూ వాడుకోతగినది అయోడైజ్డ్ ఉప్పు. ఇక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లో–సోడియం (పొటాషియం) ఉప్పు వాడుకోవచ్చు. అలాగే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి వాటిని రుచి లేదా వంట అవసరాల కోసం వాడవచ్చుగానీ అవేవో ఆరోగ్యపరంగా అద్భుతాలు చేస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. చివరగా... ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే... ఉప్పు (సోడియం క్లోరైడ్)లోని అయాన్ల వల్లనే మన మెదడు నుంచి కండరాలకు కదలికల కోసం అవసరమైన సంకేతాలు అందుతుంటాయి. ఈ ఉప్పు అనేదే లేకపోతే మన నరాల నుంచి విద్యుత్ తరంగాల రూపంలో సంకేతాలు అందవు. అప్పుడు కండరాలు కదలవు, గుండె సక్రమంగా కొట్టుకోదు. అందుకే ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో ఉప్పు వాడాల్సిందే. అది ప్రతివ్యక్తికి రోజుకు 5 గ్రాములు మించకూడదు (డబ్ల్యూహెచ్ఓ ప్రకారమైనా లేదా మన ఐసీఎమ్ఆర్ సూచనల ప్రకారమైనా) అని గుర్తుంచుకోండి. అంతేతప్ప పూర్తిగా ఉప్పు మానేస్తే ‘హైపో నైట్రీమియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.- ఎస్. స్వాతి, క్లినికల్ డైటీషియన్నిర్వహణ: యాసీన్ -
అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్.. కంటి చికిత్సకు సలహా!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ కంటి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసు విచారణ సందర్భంగా ఈ అభ్యర్థన తెరపైకి వచ్చింది.న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య ఈ విజ్ఞప్తిని తిరస్కరించి, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజీ వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా అమెరికాలో కంటి చికిత్స పొందుతున్నట్లు బెనర్జీ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ఈ విదేశీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు.దీంతో ఎస్ఎస్కేఎం ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం అధిపతితో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి, వారి నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి అక్టోబరు వరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.ఇది కూడా చదవండి: పాక్‌లో మరింత పేదరికం.. ప్రతి10 మందిలో ముగ్గురు.. -
వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.లక్ష్యాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్లో మెసేజ్‌లు చూడటం.. ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్-ఫోకస్డ్ మైండ్‌సెట్’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్ బ్రేక్, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్‌ఫుల్ ఈటింగ్’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?. -
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్‌లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!) -
‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
కండలవీరుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన ఆయన తాజా లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే సల్మాన్.. ఈసారి కాస్త సన్నగా, ముఖం మొత్తం పాలిపోయి కనిపించడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అక్కడ ఆధునిక డేటా కలెక్షన్, వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సల్మాన్ ఆరోగ్యంపై అభిమానుల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఆయన బాగా సన్నబడ్డారని, అలసటగా కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరేమో వయసు పైబడడం వల్లేనేమో అని చర్చించుకున్నారు.Is everything ok with Salman Khan and his health ..? 😳😳 pic.twitter.com/dSSPmz0OCX— Yo Yo Funny Singh (@moronhumor) July 19, 2026సల్మాన్ ఖాన్(60) గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు. తీవ్రమైన ముఖ నొప్పిని కలిగించే ఈ వ్యాధిని సాధారణంగా సూసైడ్ డిసీజ్ “Suicide Disease” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా తాను ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. విదేశాల్లో చికిత్స సైతం తీసుకున్నానని ఆయన సల్మాన్ గతంలో తెలిపారు. అలాగే మెడకు సంబంధించిన సమస్యలు, నొప్పుల కారణంగా కూడా ఆయన గతంలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన తాజా లుక్కు ఈ ఆరోగ్య సమస్యలే కారణమా? అనే చర్చా జోరందుకుంది. అయితే సల్మాన్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అంటూ ఆయన అభిమానులను పలకరించారు. తాజాగా కనిపించిన లుక్‌తోనే ఆయన బ్లాక్ అండ్ వైట్‌లో స్టైలిష్ ఫొటో షూట్ ఫొటోలను పోస్ట్ చేసి మరీ ఆ ప్రశ్న వేశారాయన. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అభిమానులు కూడా స్పందిస్తూ.. “ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యంపై అధికారికంగా ఆయన బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన కూడా నేరుగా స్పందించలేదు. అయితే ఆయన తాజా లుక్, ఆ తర్వాత చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “భాయ్ జాగ్రత్తగా ఉండండి”, “మీ ఆరోగ్యం ముఖ్యం” అంటూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వయసు పెరుగుతున్నా సహజంగా కనిపించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. చిత్తరంగదా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈద్ 2027 సందర్భంగా నయనతారతో ఓ కొత్త ప్రాజెక్ట్‌లోనూ సల్మాన్ కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. -
ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం: వాంగ్‌చుక్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తొలిసారిగా ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. జూలై 20న జరగనున్న ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఆయన ‘భారతదేశపు రెండో స్వాతంత్ర్య పోరాటం’గా అభివర్ణించారు. అన్యాయం, భయం, పేపర్ లీకులు, అక్రమ నిర్బంధం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసనను విజయవంతం చేసి, న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.ఆదివారం (జూలై 19) ఉదయం 8:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని విఎంఎంసి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగ్చుక్కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన నాడి, రక్తపోటు,ఇతర కీలక ఆరోగ్య సూచికలు సాధారణంగా ఉన్నాయి. అయితే, సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన రక్త పరీక్షల నివేదికలలో కొన్ని మార్పులు కనిపించాయి. ఆయన శరీరంపై ఉపవాస ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకే నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్యమరోవైపు, సోనమ్ వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. తన భర్తను ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, అక్కడ అందుతున్న చికిత్సపై తమకు నమ్మకం లేదని ఆమె ఆరోపించారు. అనేకసార్లు అభ్యర్థించినా, ఆసుపత్రి యాజమాన్యం ఆయనను డిశ్చార్జ్ చేయడం లేదని లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!
మా ఐదేళ్ల బాబు రాత్రంతా నోరు తెరిచే నిద్రపోతాడు. గురక కూడా బాగా పెడుతున్నాడు. చిన్నపిల్లలకు ఇది సహజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆందోళనగా ఉంది. – కీర్తి, నంద్యాలపిల్లల్లో తరచు గురక పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం సాధారణం కాదు. ఇవి శ్వాస మార్గంలో ఉన్న సమస్యకు సంకేతాలు కావచ్చు.ఈ సమస్య ఎందుకు వస్తుంది?సాధారణంగా మనం ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. ముక్కు గాలిని శుభ్రపరచి, తేమను కలిపి, సరైన ఉష్ణోగ్రతకు మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. కానీ ముక్కు మూసుకుపోయినప్పుడు పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.1. అలర్జీ: దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, డస్ట్‌మైట్స్ లేదా పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల ముక్కులో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.2. అడినాయిడ్స్ పెరగడం: ముక్కు వెనుక భాగంలో ఉండే అడినాయిడ్స్ అనే కణజాలం చిన్నపిల్లల్లో ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే తరచు ఇన్ ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా ఇవి పెద్దవై గాలి వెళ్లే మార్గాన్ని ఇరుకుగా చేస్తాయి. దీంతో పిల్లలు నోటి ద్వారానే శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారినప్పుడు గాలి ప్రవాహం వల్ల కంపనం ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల గురక అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, శ్వాసకు ఆటంకం ఏర్పడుతోందని శరీరం ఇస్తున్న హెచ్చరిక.నిర్లక్ష్యం చేయకండి...కొంతమంది పిల్లల్లో గురకతో పాటు నిద్రలో కొద్ది క్షణాలు శ్వాస కూడా ఆగిపోవచ్చు. దీనివల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక, దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం అలసటగా లేవడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అతి చురుకుదనం, ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకునే పిల్లల్లో దవడ, పళ్ల అమరిక, ముఖ ఆకృతిలో కూడా మార్పులు రావచ్చు.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?మీ బిడ్డ గురకను లేదా నోరు తెరిచి నిద్రపోవడాన్ని కేవలం ఒక అలవాటుగా భావించకండి. ప్రతిరోజూ నోరు తెరిచి నిద్రపోవడం, వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం, పగటిపూట ఎక్కువ నిద్రమత్తుగా ఉండడం, తరచూ చెవి ఇన్ ఫెక్షన్లు రావడం, ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం లేదా ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని సంప్రదించాలి. శస్త్రచికిత్స అవసరమా?అసలు అవసరం లేదు. ఇది చాలా పెద్ద అపోహ. చాలామంది పిల్లల్లో అలర్జీని నియంత్రించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి సెలైన్ నాసల్ డ్రాప్స్, నాసల్ స్ప్రేలు, అలర్జీ మందులు సూచిస్తారు. అలాగే దుమ్ము, పొగ, సిగరెట్ పొగ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. అయితే నిద్రలో శ్వాస ఆగిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో పదేపదే ద్రవం చేరడం లేదా మందులతో ప్రయోజనం లేకపోతే అడినాయిడ్స్‌ను తొలగించే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.తల్లిదండ్రులకు సూచనలుగురకను చిన్న విషయంగా తీసుకోవద్దు.నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ఒక అలవాటు కాదు, అది ఒక లక్షణం.తరచూ జలుబు లేదా ముక్కు మూసుకుపోవడం ఉంటే అలర్జీ ఉందేమో పరీక్ష చేయించండి.పిల్లలకు ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని కల్పించండి. నిద్రకు ముందు మొబైల్, ట్యాబ్ లేదా ఇతర స్క్రీన్ ల వినియోగాన్ని తగ్గించండి.సమస్య కొనసాగితే పిల్లల వైద్యుడు లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని ఆలస్యం చేయకుండా సంప్రదించండి.పిల్లల నవ్వు, చదువు, ఎదుగుదల ఎంత ముఖ్యమో; వారి నిద్ర కూడా అంతే ముఖ్యం.గురక అనేది నిద్రలో వచ్చే శబ్దం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం గురించి శరీరం పంపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక.సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పిల్లల నిద్ర, ఎదుగుదల, ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడతాయి. మంచి నిద్రే ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మొదటి మెట్టు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
సిటీ లైఫ్‌తో పరేషాన్!
భారత్‌లో టైఫాయిడ్, మలేరియా వంటి అంటువ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (జాతీయ గణాంక కార్యాలయం) నిర్వహించిన తాజా ఆరోగ్య సర్వేలో వెల్లడయిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు గత పదేళ్లలో దేశంలో విపరీతంగా పెరిగినట్లు ఎన్ఎస్వో సర్వేలో స్పష్టమయ్యింది. ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు సగం మంది గుండె సంబంధిత సమస్యలు, మెటబాలిక్ లోపాలతో బాధపడుతున్నారు. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 31 శాతంగా మాత్రమే ఉండేది.గణాంకాల ప్రకారం.. 2017–18 నాటి సర్వేలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు 16.7 శాతం మాత్రమే ఉండగా.. నేడు అది 25.6 శాతానికి పెరిగిపోయింది. అలాగే థైరాయిడ్, మధుమేహం వంటి జీవనశైలి సమస్యలు గతంలో 15 శాతం మాత్రమే ఉండగా నేడు 24.2 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ నాన్ కమ్యూనికేబుల్ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017–18లో 32 శాతంగా ఉన్న ఇన్ఫెక్షన్ల రేటు, 2025 నాటికి 15 శాతానికి పడిపోయింది.మహిళల్లో పెరుగుతోన్న అనారోగ్యం..దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. భారతీయుల్లో మొత్తం అనారోగ్య స్థాయిలు గత సర్వేతో పోల్చినపుడు విపరీతంగా పెరిగాయి. గత సర్వేలో 7.5 శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం 13.1 శాతానికి పెరిగింది. ఇందులో పురుషుల శాతం 11.8 శాతం ఉండగా, మహిళల శాతం 14.4 శాతంగా ఉంది. అంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే వయసు పైబడిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో అనారోగ్య రేటు 27.7% నుండి 43.9%కి పెరిగింది. అలాగే వైద్య ఖర్చులు కూడా తీవ్రంగా పెరిగినట్లు ఎన్ఎస్ఓ అధ్యయనాలు తెలిపాయి. -
వెన్నుకు దన్నుగా... శలభాసనం!
శలభం అంటే మిడత. ఈ ఆసనంలో శరీర ఆకారం మిడతలా కనిపిస్తుంది కాబట్టి దీనిని శలభాసనం అంటారు. శలభాసనం అనేది పొట్టపై పడుకుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను బలపరచి, శరీరానికి స్థిరత్వాన్ని, శక్తిని అందించడంలో సహాయపడుతుంది.చేసే విధానం...- మ్యాట్‌పై బోర్లా (పొట్టపై) పడుకోవాలి.- రెండు కాళ్లను నిటారుగా ఉంచి, చేతులను తొడల కింద ఉంచాలి.- గడ్డాన్ని లేదా నుదుటిని నేలపై ఆనించాలి.- శ్వాసను లోపలికి తీసుకుంటూ రెండు కాళ్లను మోకాళ్లు వంచకుండా పైకి ఎత్తాలి.- తొడలు, నడుము కండరాలను బిగించి 10–30 సెకన్లు అదే స్థితిలో ఉంచాలి.- శ్వాసను వదులుతూ నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి.- 3–5 సార్లు పునరావృతం చేయాలి.జాగ్రత్తలు...- గర్భిణులు ఈ ఆసనం వేయకూడదు.- ఇటీవల కాలంలో పొట్ట లేదా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నవారు చేయకూడదు.- తీవ్రమైన నడుము నొప్పి, స్లిప్ డిస్క్, హెర్నియా ఉన్నవారు వైద్యుడు లేదా యోగా నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి.- అధిక రక్తపోటు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.- కాళ్లను ఒక్కసారిగా పైకి ఎత్తకుండా, నెమ్మదిగా శ్వాసతో సమన్వయం చేసుకుంటూ చేయాలి.- నొప్పి అనిపిస్తే వెంటనే ఆసనం ఆపాలి.ప్రయోజనాలు... - వెన్నెముకను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.- నడుము కండరాలు, తొడలు బలపడతాయి.- పొట్ట అవయవాలకు మసాజ్ లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.- వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది (సరైన మార్గదర్శకత్వంలో చేస్తే).- శరీర భంగిమ మెరుగుపడుతుంది.- రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.- అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.- కోర్ కండరాలను బలపరుస్తుంది.- మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
నైంటీ.. అయితే ఏంటి?
ఫిట్నెస్ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్‌కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆకాష్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.‘జిమ్ అనేది కేవలం సిక్స్ ప్యాక్ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం. -
అమ్మను కొంచెం యంగ్‌గా...
చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్‌గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా?అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా పెద్ద అయినా, చాలామందిలో నాన్నే యంగ్‌గా.. యాక్టివ్‌గా ఉంటే అమ్మలేమో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అందుకు వారి జీన్స్ ఒక్కటే కారణం కాదు. మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్ కారణంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ కొంచెం వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు. 40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు మందగించడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా స్త్రీ శరీరాన్ని త్వరగా బలహీన పరిచే కారకాలు.అన్నింటికన్నా ముఖ్యంగా... చాలా మంది మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. దాని ఫలితంగానే తొందరగా వయసు మీదపడ్డట్లు కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్ ఇ,సి,డి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం.ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీ బయాటిక్స్ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలాపదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలు పాటిస్తే అమ్మ కూడా నాన్న లాగే ఆరోగ్యంగా, యంగ్‌గా ఉటుంది.అమ్మ యాక్టివ్‌గా ఉండాలంటే..?వయసు పైబడ్డట్టు కనిపించే మాటెలా ఉన్నా... ఈ వయసులో వారు యాక్టివ్‌గా ఉండాలంటే మాత్రం వారి బరువుకు తగ్గట్టు రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఎముకలు, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. -
ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..
వెయిట్‌లాస్ జర్నీలో చాలామంది సునాయాసంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో విజయం సాధిస్తారు కూడా. అయితే ఆ బరువునే మెయింటైన్ చేయడం అతి పెద్ద సవాలు. మళ్లీ యథాస్థితికి రాకుండా..అంతే స్మార్ట్‌గా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని అంటోంది ఇషితా లంబా అనే మహిళ. చాలామంది బరువు తగ్గగలరు అంతే..కొందరే దాన్ని నిలబెట్టుకోగలరు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో తన వెయిట్ లాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.తాను ఎలాంటి క్రాష్డైట్లపై ఆధారపడకుండా నిలకడగా 20 వాస్తవిక అలవాట్లను పాటించి సునాయాసంగా 15 కిలోలు వరకు బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఐదేళ్ల పాటు నిలకడగా నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ వెయిట్‌లాస్ జర్నీలో బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని తగ్గిన బరువుని మెయింటైన్ చేయడమే అతిపెద్ద సవాలని పేర్కొంది. అందుకోసం తాను ఏం చేసిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవేంటంటే..అతిగా తిన్న తర్వాత పస్తులుండాల్సిన పనిలేదు..ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాం. దాంతో సాధారణంగా మరుసటి రోజు పస్తులుండే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాను అలా చేయనని, తన సాధారణ దినచర్యకు తిరిగి వచ్చేస్తానంటోంది. అంటే ఇదివరకటి సాధారణ ఆహారపు అలవాట్లను యథావిధిగా ఫాలో అయితే చాలు అని అంటోంది. అంతేగాదు తన ప్రతి భోజనం తర్వాత రెండు వేల అడుగులు వేస్తానని చెబుతోంది. కేలరీల పరిమితి కంటే ప్రోటీన్‌కు ప్రాముఖ్యతన ఇస్తానని నొక్కి చెప్పారు. సాధ్యమైనంత వరకు తక్కువ తినడం కంటే ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోవడంపైనే ఫోకస్ పెడతానని తెలిపింది. అంతేగాదు తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2-1.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. బరువులు ఎత్తడం, తగినంత నీరు తీసుకోవడం..వ్యాయామం కోసం ఇషితా తాను వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తుతానని, వారానికి రెండుసార్లు కార్డియో చేస్తానని పంచుకున్నారు. దాంతోపాటు వాలుగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి చేస్తానని అన్నారు. అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు కూడా తాగుతానని చెప్పింది. ఇఇ జీర్ణక్రియకు సహాయపడుతుందని, మంచి నిద్ర పట్టేలా చేస్తుందని వెల్లడించింది. అలాగే వ్యాయామం చేయాలని అనిపించని రోజున దానికి బదులుగా మ్యూజిక్ వింటూ వాక్ చేస్తుంటానని అన్నారామె. తాను ఇప్పటికీ పిజ్జా, డెజర్ట్‌లు, బర్గర్లు తింటానని, అయితే ప్రతిరోజూ కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ డ్రింక్ చేయాలనిపిస్తే ముందుగా భోజనం చేసి, చక్కెర కలిపిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడూ ప్రోటీన్ బార్లు లేదా ఆరోగ్యకరమైన కుకీలను, ఉప్పగా తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారుచేసిన వేయించిన మఖానాను తీసుకుంటానని చెప్పుకొచ్చింది. నిలకడగా దినచర్యను పాటించాలంటే..నచ్చిన ఆహారాలను తినడమే మంచిదని అంటోంది. ప్రయాణాలు చేసేటప్పడు నడుస్తానని, వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కుతానని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి వ్యాయామం చేసే తీరిక దొరక్కపోతే..కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా చూస్తానని వెల్లడించింది. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటానని తెలిపింది. చివరగా బరువు తగ్గడం అంటే తీవ్రమైన డైటింగ్లు చేయడం కాదని..దీర్ఘకాలం పాటు కొనసాగించ గల అలవాట్లనే ఎంచుకుంటే ఈజీగా బరువు తగ్గగలరని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మామ్ వెయిట్‌లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..) -
వైరల్ ఫ్లూలా భావించి..ఆ వ్యాధిని జయించా..!: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలక్షణమైన నటనకు పేరుగాంచిన హీరో. సంజు బాబాగా పిలిచే ఆయన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన స్టేజ్ 4 లంగ్ కేన్సర్‌ని జయించిన వారియర్ కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ స్వయంగా తాను ఈ కేన్సర్‌ని ఎలా జయించానో వెల్లడించారు. అంతేగాదు అందరూ ఇలానే పోరాడాలంటూ కేన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. సంజయ్ దత్‌కు 2020 ఆగస్టులో స్టేజ్ 4 ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ద్రవంచ చేరడంతో శ్వాస తీసుకోవడలో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2020లోనే కేన్సర్ నుంచి బయటపడ్డారు కూడా. దాంతో ఒక్కసారిగా కుటంబసభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేన్సర్‌ని జయించడంలో తను ఎలాంటి మానసిక ధైర్యంతో ఉన్నానో పంచుకున్నారు. తాను ఆ సమయంలో కేన్సర్‌ని వైరల్ ఫ్లూ వ్యాధిలా చూశానని, అన్నారు. ఎప్పుడూ మనం పోరాట యోధులుగా ఉండాలే తప్ప.. అంత సులభంగా వదిలేయకూడదని అన్నారు. అనారోగ్య సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా పోరాడలని అన్నారు. కేన్సర్ బాధితులు ఎవరైనా..ఆ వ్యాధికి లొంగిపోకూడదని, బదులుగా ఇతర అనారోగ్యాల మాదరిగా చూడాలని హితవు పలికారు. నిజానికి అది కష్టమని తనకు తెలుసని..అయినప్పటికీ మనం నవ్వుతూనే పోరాడలన్నారు. కేన్సర్ నుంచి కోలుకుంటున్నప్పుడూ ఎదురయ్యే శారీరక బాధలు గురించి తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నారు. అదే సమయంలో తనకు సూదులంటే ఎంత భయమో కూడా చెప్పారు. తను యోగా లేదా ధ్యానం వంటివి చేయనని, కానీ జిమ్‌లో వర్కౌట్లు చేస్తానని చెప్పారు. అలాగే తను శివ భక్తుడనని, తనకు శివుడే సర్వస్వం అని చెప్పారు. చివరగా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాల్సిందేనని అన్నారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. పుట్టినప్పుడు మొదటగా ఆక్సిజన్ కోసం పోరాడతాం, ఆ తర్వాత ఆరోగ్యం లేదా వ్యక్తిగత సమస్యల కోసం పోరాడతామని అన్నారు. ఒక్కటి గుర్తించుకోండి సమస్యను ఎదుర్కోండి తప్ప పారిపోకండని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా సమస్యను ఎదుర్కోవడం మొదలుపెడితే..ఆటోమేటిగ్గా పరిష్కరించుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. అందుకే ఏ సమస్యనైనా ఎదుర్కోండి తప్ప పారిపోయే ప్రయత్నం చేయకండి దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంతే గానీ దానికి పులిస్టాప్ పడదంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ప్రేమ కోసం సైకిల్‌పై భారత్ నుంచి స్వీడన్‌కు..! ట్విస్ట్ ఏంటంటే..) -
8 కిలోలు తగ్గిన సోనమ్.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!
విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు ప్రకటిస్తూ, జూన్ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!ఇంతలా వాంగ్‌చుక్ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలో 67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. అదీగాక వాంగ్‌చుక్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..దీర్ఘకాలిక ఉపవాస సమయంలో ఏం జరుగుతుందంటే..శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్‌పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..అలసట, తీవ్రమైన బలహీనతతల తిరగడం, స్పృహ కోల్పోవడంఏకాగ్రత లోపంనిరంతర తలనొప్పిచిరాకు, మానసిక స్థితిలో మార్పులుకండరాల నొప్పులుడీహైడ్రేషన్ (నిర్జలీకరణం)వాంగ్‌చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు..వాంగ్‌చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా, ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయితక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయికండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహావిటమిన్, ఖనిజ లోపాలురోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుందిడీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలుదీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడితప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!) -
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై హైకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయనను ఆస్పత్రికి తరలించాలని, బలవంతంగానైనా పోషకాహారం అందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.న్యాయవాది రాకేష్ కుమార్ సైనీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాంగ్‌చుక్ కండరాల క్షీణతతో తీవ్రమైన బాధలో ఉన్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనకు తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, ద్రవ రూపంలో పోషకాలను అందించాలని కోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది.మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు దీక్ష విరమించాలని వాంగ్చుక్ను కోరారు. ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి వాంగ్‌చుక్ మద్దతు ప్రకటిస్తూ, దీక్షకు దిగారు. -
ఏ'మీ మాంస'కృత్తులు?
సాక్షి స్పెషల్ డెస్క్ : ప్రొటీన్ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం. ఫిట్నెస్ ప్రియులు మొదలుకుని అంతోఇంతో ఆరోగ్య స్పృహ ఉన్నవారు సైతం ప్రొటీన్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. కొందరు వైద్యులు కూడా ఈ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. మధుమేహానికి మూల కారణమైన కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించాలని, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. ప్రొటీన్ కండరాల పెరుగుదలకు, బలమైన ఎముకలకు దోహద పడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకోవడానికి మార్కెట్ శక్తులు పావులు కదుపుతున్నాయి. ప్రొటీన్ కోసం ఏం తినాలి అనే విషయంలో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రొటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాల మీదకు దృష్టిని పోనివ్వకుండా తక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ‘సూపర్ ఫుడ్’పేరిట ప్రాచుర్యంలోకి తేవడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్ విషయంలో కొన్ని అపోహలు, అసలు వాస్తవాలను ఒకసారి తెలుసుకుందాం. అపోహలు, వాస్తవాలుఅపోహ: శాకాహారం అంత ప్రభావవంతంగా ఉండదు వాస్తవం: శాకాహారం నుంచి అందే ప్రొటీన్లతో కండరాలను పెంచుకోవడం సాధ్యం కాదని, ఆరోగ్య పరిరక్షణకు అంతగా దోహదపడదనే అభిప్రాయంలో ఏ మాత్రం నిజం లేదు. మొక్కల ప్రోటీన్లు అసంపూర్ణంగా (అన్ని రకాల అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడే ప్రాథమిక అణువులు) లేకపోవడం) ఉంటాయనేది నిజమే. కానీ అన్ని రకాల అమైనో ఆమ్లాలను ఒకే ఆహార పదార్థం నుండి పొందవలసిన అవసరం లేదు. ధాన్యాలు, పప్పుధాన్యాలు, నట్స్ (గింజలు), విత్తనాలను కలిపి లేదా మార్చి మార్చి వినియోగించడం ద్వారా సంపూర్ణమైన అమైనో యాసిడ్లను పొందవచ్చు. అపోహ: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే కండరాలు వాటంతట అవే పెరుగుతాయి వాస్తవం: ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతు, జీవక్రియలకు మూలమే. కానీ అది ఒక్కటే సరిపోదు. ప్రొటీన్‌తో పాలు అవసరమైన మేరకు కేలరీలు, వ్యాయామం కూడా అవసరం. అపోహ: శరీరం ఒక భోజనంలో కేవలం 30 గ్రాముల ప్రొటీన్ మాత్రమే తీసుకోగలుగుతుంది వాస్తవం: మనిషి తీసుకునే ప్రొటీన్ అంతటినీ శరీరం గ్రహిస్తుంది. అయితే కండరాల ప్రొటీన్ సంశ్లేషణ విషయంలో మాత్రమే 30 నుంచి 40 గ్రాముల పరిమితి ఉంది. కానీ కండరాల ఉత్తేజితానికి పోగా మిగతా ప్రొటీన్ శరీర క్రియల నిర్వహణ, కణజాలం పరిరక్షణతో పాటు పని చేయడానికి అవసరమైన శక్తిగా ఉపయోగపడుతుంది. అపోహ: ప్రొటీన్ తీసుకుంటే సరిపోతుంది.. వాస్తవం: ప్రొటీన్ తీసుకోవడం మంచిదే అయినా అది ఒక్కటే సరిపోదు. పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారం కూడా అవసరం. అపోహ: బాదం గింజలు తీసుకుంటే చాలు. రోజూ ఉదయం గుప్పెడు బాదం పప్పులు తింటే శరీరానికి తగినంత ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్), సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కానీ వీటిలో ప్రొటీన్ ఒక మోతాదులోనే ఉంటుంది. సమృద్ధిగా ఉండదు. వందగ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే 570 మైక్రోగ్రాములకు పైగా కేలరీలు, 50 గ్రాముల కొవ్వులు కూడా ఉంటాయి. శరీరానికి అవసరమైన 30 గ్రాముల ప్రొటీన్ బాదం గింజల ద్వారా అందాలంటే ఆ బాదంతో పాటు అందిన 800 కేలరీలను వ్యాయామం లేదా ఇతర దైనందిన కార్యకలాపాల ద్వారా ఖర్చు చేయాలి. అపోహ: వ్యాయామం తర్వాత టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తింటే ప్రొటీన్ సమృద్ధిగా అందుతుంది. వాస్తవం: పొట్టుతీయని గింజలతో పోలిస్తే పీనట్ బటర్ కొవ్వు నిండిన ఆహారం అనే చెప్పాలి. టేబుల్ స్పూన్ పీనట్ బటర్లో 3.5 లేదా 4 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అదే సమయంలో దాదాపు 100 కేలరీలు, 8 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఇది మంచి శక్తినిచ్చే ఆహారమే, కానీ ప్రొటీన్ పుష్కలంగా లభించే ఆహారం కాదు. అపోహ: స్మూతీల్లో ఒక స్పూన్ చియా విత్తనాలు కలిపితే శరీరానికి తగినంత ప్రొటీన్ అందినట్లే. వాస్తవం: చియా సీడ్స్ పోషకాల పరంగా ఒక అద్బుతం. అయితే ఇందులో బాగా ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జీర్ణమయ్యే పీచు, క్యాల్షియం. టేబుల్ స్పూన్ (సుమారు 12 గ్రాములు) చియా సీడ్స్‌లో కేవలం 2 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి కానీ ప్రొటీన్ కోసం కాదు. అపోహ: మాంసం కంటే బ్రోకలీలో ప్రొటీన్ ఎక్కువ. వాస్తవం: ఇది అందమైన పదాలతో తప్పుదోవ పట్టిస్తున్న సమాచారం. బ్రోకలీలో కేలరీలు, ప్రొటీన్ల నిష్పత్తిని బేరీజు వేస్తూ చెబుతుంటారు. కానీ నిజా నికి బ్రోకలీలో కేలరీలు దాదాపుగా లేనట్లే. అలాగని 30 గ్రాముల ప్రొటీన్ల కోసం బ్రోకలీ తినాలంటే రోజుకు కిలోకు పైగా పచ్చి బ్రోకలీ తినాలి. బ్రోకలీని విటమిన్లు, పీచు కోసం తినాల్సిందే. ప్రొటీన్ కోసం బ్రోకలీ అనేది హాస్యాస్పదం. అపోహ: వరి అన్నం బదులు క్వినోవా అన్నం తినడం వల్ల ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: క్వినోవా 9 రకాలైన అమైనో యాసిడ్లు అందే ప్లాంట్ ప్రొటీన్ ఉన్న అద్భుతమైన ఆహారం. గింజల్లో ఇలా సమగ్రమైన ప్రొటీన్ అరుదు. కానీ ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆహారం. వంద గ్రాముల క్వినోవా అన్నంలో 4.4 గ్రాముల ప్రొటీన్ ఉంటే 21 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. దేనిలో ఎంత ప్రొటీన్ ఉంది? 1. చికెన్ ఛాతీ: వంద గ్రాముల చికెన్ (ఛాతీ) బ్రెస్ట్‌లో 31 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. 2. పనీర్: వంద గ్రాముల పనీర్‌లో 18 నుంచి 23 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 3. పెద్ద కోడిగుడ్డు: ఇందులో ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. తెల్లసొనలో ప్రొటీన్, పసుపు సొనలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. 4. సోయా ముక్కలు: వందగ్రాముల ఎండిన సోయా ముక్కల్లో (చంక్స్/మీల్మేకర్) 52 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. 5. పప్పుధాన్యాలు: ఉడికించిన వందగ్రాముల పప్పులో పీచుతో కూడిన ప్రొటీన్ 9 గ్రాములు ఉంటుంది. ఏం తింటే మంచిది? మార్కెట్ మాయాజాలంలో పడకుండా ఆహారంలో ఏమేమి ఉండేలా చూసుకోవాలనేది.. ఎవరికి వారు తమ దైనందిన కార్యకలాపాలు, వ్యాయామం, వయసు, శరీరం తీరు, జీవక్రియల తీరు ఆధారంగా నిర్ణయించుకోవాలి » కొవ్వు లేని మాంసం, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు (సోయా పనీర్), సోయా తగిన పాళ్లలో ఉండాలి. » గింజలు, కాయధాన్యాలు, క్వినోవా, ఆకు కూరలు, కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, సమగ్రమైన కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
ఆ డీఆర్డీఓ శాస్త్రవేత్త అడిగిన ఒకే ఒక్క ప్రశ్న..లైఫ్‌నే మార్చేసింది!
ఒక్కోసారి మనకు పరిచయమై వ్యక్తులు ఎంతగా ప్రభావితం చేస్తుంటారంటే..మనం విస్మరిస్తున్న వాటిని గుర్తు చేస్తారు. అంతేగాదు అన్నింటకంటే ఏది ముఖ్యమో చెప్పే శ్రేయోభిలాషులని ఆ తర్వాత గానీ తెలియదు. ఇప్పుడిదంతా ఎందుకంటే..అలాంటి అనుభవమే ఈ సీఈవోకి ఎదురైంది. లింక్డ్ఇన్లో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. మనం సదా సంపాదన చుట్టూ తిరుగుతూ మర్చిపోతున్న అసలైన సంపదను గుర్తు చేసింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ పోస్ట్‌లో ఈమార్ ఇండియా సీఈవో కళ్యాణ చక్రవర్తి ఇలా రాసుకొచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కు చెందిన ఒక సీనియర్ శాస్త్రవేత్త తనను అడిగిన ఒక ప్రశ్న ఏళ్ల తరబడి తన మదిలో అలానే నిలిచిపోయిందని అన్నారు. 2014లో, ప్రయాణమంతా నిద్రపోవాలనే ఉద్దేశంతో తాను బెంగళూరు-ఢిల్లీ విమానం ఎక్కానని పంచుకున్నారు. కానీ మరుసటి రోజు కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రధానిని కలవడం కోసం వెళ్తున్న డీఆర్డీఓతో మాటలు కదిపినట్లు తెలిపారు. ఆ శాస్త్రవేత్త మొదటగా, మీరు జీవనోపాధి కోసం ఏమి చేస్తారు అని ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లో మేనేజింగ్ పార్టనర్ అని చెప్పగా, ఎవరడిగారు దాని గురించి అని ఆయన అన్నారు. దాంతో ఆశ్చర్యపోయిన తాను ఒక్కక్షణం ఆయన అలా ఎందుకు అన్నారో ఆలోచించాను. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త తాను వృత్తి గురించి అడగలేదని అన్నారు. తాను ఆరోగ్యం, ఆనందం కోసం ఏం చేస్తుంటారని అడిగానని తాపీగా అన్నారు. దాంతో తాను గర్వంగా సాయంత్రం సమయంలో 45 నిమిషాలు వాకింగ్ చేస్తానని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అది విని ఆయన ఆహా ఎంత సమయం వృధా చేస్తున్నారు మీరు అని తేలిగ్గా అనేశారు. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త పరుగెత్తడం వల్ల తన ఫిట్నెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. తాను అలా 34 ఏళ్లుగా పరుగెత్తుతున్నానని, తన రోజుని ఉదయం 4.30 గంటలకు ప్రారంభింస్తానని చెప్పారు. తన దినచర్యలో వారమంతా 15 కి.మీ ఆదివారం ఒక్కరోజు 35 కి.మీ పరుగు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా మారథాన్లు పూర్తి చేశానని అన్నారు. ఆ తర్వాత లెక్కించడమే మానేశానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు కళ్యాన్ చక్రవర్తి. చివరగా ఆయన ఒక మంచి జత బూట్లు కొనుక్కుని పరిగెత్తడం మొదలుపెట్టు మిగతాదంతా నువ్వు పరిగెడుతూ తెలుసుకుంటావ్ అని ఆయన ఇచ్చిన సలహాని ఎప్పటికీ మర్చిపోనన్నారు. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్నను ఇంత సూటిగా అడగలేదని కూడా అన్నారు. దాంతో తాను మరసుటి రోజు నుంచి ఆయన సలహాను తూచా తప్పకుండా పాటించినట్లు తెలిపారు. మొదటి రోజు జస్ట్ 50 మీటర్లు నడిచి అలిసిపోయి వెనక్కి వచ్చేశానన్నారు. ఆ తర్వాత 100 మీటర్లు..అలా ఒక కిలోమీటరుగా మారింది. మూడు నెలల్లో వేలాది మంది ఇతర రన్నర్లతో పాటు ఎయిర్టెల్ ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రారంభ రేఖ వద్ద నిలబడ్డాను, పూర్తి చేశాను కూడా అని సగర్వంగా చెప్పారు. చివరగా ఆయన మిమ్మల్ని ఎవరూ అడగని ప్రశ్నే కొన్ని సార్లు మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రశ్నగా మారిపోతుంది అంటూ పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు కూడా ఇది చాలా నిజం, మనం వ్యాపారాలను నిర్మించడం, సంపాదన పోగు చేయడం వంటి వాటితో మునిగిపోతాం. మనకు కావాల్సిని అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం అనే సంపదను విస్మరిస్తాం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన) -
‘అన్యురిజమ్’ అంటే..! బ్రెయిన్లో రావడానికి రీజన్..
దేహంలోని రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల పొరల నిడివి అంతటా ఒకే లాంటి మందం కలిగి ఉండకపోవచ్చు. ఆ రక్తనాళాల్లో కొన్ని కొన్నిచోట్ల బలహీనమైన చోట్లు / ప్రదేశాలు ఉండవచ్చు. మెదడులోనూ అల్లుకున్న రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఉబ్బిపోయి... ఆ రక్తనాళపు పొర మరింత బలహీనపడ్డవేళ ఒక్కోసారి అది ఒక్కసారిగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’ అంటారు. ఆ బలహీనమైన రక్తనాళ పొర అకస్మాత్తుగా చిట్లిపోవడం జరిగితే అది ఆ వ్యక్తికి అదిప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి... అది చిట్లిపొవడం ఎందుకు, అలా రక్తనాళపు పొరలు బలహీనపడి ‘అన్యురిజమ్’గా దారితీసే పరిస్థితులేమిటి లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.దాదాపు 30 నుంచి 40 ఏళ్ల కిందట ‘అన్యురిజమ్స్’పై వైద్యవర్గాల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పేషెంట్ ఆకస్మికంగా చనిపోతే అది ఎందువల్లనో తెలియని పరిస్థితే ఎక్కువగా ఉండేది. సుమారు 30 ఏళ్ల కిందట ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది అన్యురిజమ్స్తో చనిపోయినా... అప్పట్లో ఆ మరణాలకు కారణం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే పేషెంట్ మరణించే పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఈ అన్యురిజమ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం.మెదడులో వచ్చే అన్యూరిజమ్లు (సెరిబ్రల్ ఎన్యురిజమ్స్)మెదడు అన్యూరిజమ్ (సెరిబ్రల్ / ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్) అనేది మెదడులోని ఒక ధమని (ఆర్టరీ) గోడలోని లోపలి పొర బలహీనపడటం వల్ల ఆ రక్తనాళం ఒక చిన్న బుడగ (బ్లిస్టర్) లాగా ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిన భాగం క్రమంగా చాలా పలుచగా మారి ఎలాంటి సూచనగానీ హెచ్చరికగానీ ఇవ్వకుండానే చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్యూరిజమ్ చిట్లిపోయినప్పుడు మెదడు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తస్రావం జరుగుతుంది. దీనిని సబ్ అరాక్నాయిడ్ హీమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఇటువంటి రక్తస్రావాలలో సుమారు 90% అన్యూరిజమ్ చిట్లిపోవడం వల్లే సంభవిస్తాయి. ఇది పక్షవాతం (స్ట్రోక్), కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.మెదడు అన్యూరిజమ్ ఏర్పడడానికి కారణాలు- అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)- పొగతాగడం (సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లాంటి అలవాట్లు)- పుట్టుకతో వచ్చే (జన్యుపరమైన) కారణాలతో.- రక్తనాళాలకు గాయం లేదా దెబ్బతగలడం- కొన్ని రకాల బ్లడ్ ఇన్ ఫెక్షన్ల కారణంగా వచ్చే పరిణామాలతో.అన్యూరిజమ్ ఎలా చిట్లుతుందంటే... - అన్యూరిజమ్ సంచిలో (స్యాక్) చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు అది చిట్లినట్లుగా భావిస్తారు. - రంధ్రం చిన్నదైతే కొద్దిపాటి రక్తం మాత్రమే లీక్ అవుతుంది.- రంధ్రం పెద్దదైతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది.- చిట్లని అన్యూరిజమ్ (అన్ రప్చర్డ్ అన్యురిజమ్) అంటే ఇంతకుముందు ఎప్పుడూ రక్తం లీక్ కాని అన్యూరిజమ్.పగలని (అన్ రప్ఛర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- పక్షవాతం (స్ట్రోక్ ) – 37%- తలనొప్పి – 37%- ఫిట్స్ (మూర్ఛ) – 18%- చూపు సమస్యలు – 29%పగిలిన (రప్చర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- జీవితంలో ఎన్నడూ / ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి- స్పృహ కోల్పోవడం- పక్షవాతం (స్ట్రోక్) - మాట్లాడలేకపోవడం, నోరు ఒకవైపు వంగిపోవడం - ఫిట్స్ (మూర్ఛ)చికిత్స విధానాలు...- ఔషధ చికిత్స (మెడికల్ / నాన్ సర్జికల్ థెరపీ) - శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్) ∙ఎండోవాస్క్యులర్ చికిత్స (ఎండోవాస్క్యులార్ కాయిలింగ్)- అవసరమైతే స్టెంట్ లేదా బెలూన్ సహాయంతోమన దేశంలోని పరిస్థితి ఇది... ప్రతి ఏటా మన దేశంలో ప్రతి లక్షమందికి పది నుంచి పన్నెండు మందికి పైగా అన్యురిజమ్ బారిన పడుతున్నట్లు ఓ అంచనా. ఇటీవల వీరి సంఖ్య పెరిగినట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మంది మృతిచెందుతుంటారు. బతికి బయటపడ్డ వారిలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రకమైన వైకల్యం లేదా అవయవలోపం కలుగుతుంది. అంటే వారు ఏదో ఒక రకమైన న్యూరలాజికల్ డెఫిసిట్‌తో బాధపడాల్సిన పరిస్థితి. మెదడులో రక్తస్రావమై... అది అవయవాలను నియంత్రించే సెంటర్లపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.కొందరిలో జీవితకాలంలో బయటపడకపోవచ్చు...అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు కొంత బలహీనంగా ఉండవచ్చు. చాలా బలహీనంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటి జెయింట్ అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి అకస్మాత్తుగా పక్షవాతం రావచ్చు.నిర్ధారణ కోసం సెరిబ్రల్ ఏంజియోగ్రామ్...గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్ష లాగే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒకరకమైన రంగు పదార్థాన్ని (డై అని పిలిచే రంగుపదార్థం) మెదడులోని రక్తనాళాల్లోకి వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో చేరి ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్ను) స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి చిత్రాలను చూపించే ప్రక్రియను ‘ఫ్లోరోస్కోప్’గా చెబుతారు. ఈ చిత్రాల సహాయంతో మెదడులోని ఏయే ప్రాంతాల్లో అన్యురిజమ్స్ ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.అన్యురిజమ్ మెదడులోనే వస్తాయా?అన్యురిజమ్స్ అంటే బలహీనమైన చోట్లలో రక్తనాళాలు ఉబ్బడం. అది దేహంలోని ఏ ప్రాంతలో ఉన్న రక్తనాళల్లోనైనా జరగవచ్చు. అయితే... దేహంలోని మిగతా ప్రాంతాల్లో అలా ఉబ్బు రావడం లేదా చిట్లడం వల్ల తక్షణ ప్రమాదంగానీ లేదాప్రాణాపాయంగానీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మెదడు విషయంలో అలా కాదు. మెదడులో రక్తస్రావం జరిగితే... శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలనూ, అలాగే దేహ భాగాలను నియంత్రించే నాడులు అక్కడే ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినిప్రాణాపాయం కలిగే అవకాశాలెక్కువ. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్ను తేలికగా తీసుకోకూడదు. ఇలా మెదడులో వచ్చే అన్యురిజమ్స్ను ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’గా చెబుతారు. మిగతా చోట్ల వచ్చే వాటిని దేహంలోని ఆ ప్రదేశం పేరుతో చెబుతారు. ఉదాహరణకు ఛాతీ ప్రాంతంలో వస్తే వాటిని థొరాసిక్ అన్యురిజమ్స్ అని పేర్కొంటారు.1. మందులతో చేసే చికిత్స (మెడికల్ థెరపీ) ఈ చికిత్స సాధారణంగా చిట్లిపోని (అన్ రప్చర్డ్) అన్యూరిజమ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ప్రధానంగా...- పొగతాగే అలవాటు పూర్తిగా మానేయడం- రక్తపోటును నియంత్రణలో ఉంచడం- వైద్యుడు సూచించిన ఆహార నియమాలు పాటించడం- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఈ చర్యలే అన్యూరిజమ్ ఏర్పడటం, పెరగడం లేదా చిట్లుపోవడం వంటి ముప్పులను తప్పించడానికి దోహదపడేవిగా నిరూపితమయ్యాయి.అలాగే, అన్యూరిజమ్ పరిమాణం లేదా పెరుగుదలను గమనించేందుకు డాక్టర్లు అవసరాన్ని ఎమ్మారై, సీటీ స్కాన్ లేదా సంప్రదాయ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని సూచించవచ్చు.2. శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్)ఈ విధానంలో క్రేనియోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో చిన్న రంధ్రం చేసి మెదడును, అలాగే ప్రభావితమైన రక్తనాళాల వరకు చేరుకుంటారు. అన్యూరిజమ్ను గుర్తించిన తర్వాత, చుట్టూ ఉన్న మెదడు కణజాలం నుంచి దాన్ని (అన్యురజమ్ను) జాగ్రత్తగా వేరుచేస్తారు.తర్వాత టైటానియంతో తయారు చేసిన చిన్న మెటల్ క్లిప్‌ను అన్యూరిజమ్ వచ్చిన ప్రాంతంలో (దీన్ని సాధారణంగా నెక్ అని వ్యవహరిస్తారు) వద్ద అమర్చుతారు. దీంతో అన్యూరిజమ్లోకి రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మెదడులో సాధారణ రక్తప్రసరణ తిరిగి కొనసాగుతుంది.3. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ఈ విధానంలో కాలులోని ఫెమొరల్ ఆర్టరీ ద్వారా ఒక క్యాథెటర్‌ను ప్రవేశపెట్టి, దాని ద్వారా చిన్న మైక్రోక్యాథెటర్ను అన్యూరిజమ్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అన్యూరిజమ్ లోపల ప్రత్యేకమైన మెటల్ కాయిల్స్ వేస్తారు. దీంతో అన్యూరిజమ్లో రక్తప్రవాహం ఆగి అది మూసుకుపోతుంది.ఈ చికిత్సలో తల / పుర్రె (స్కల్)ను తెరవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.మత్తుమందు (అనస్థీషియా) అవసరం కూడా తక్కువే. చాలా వేగంగా కోలుకుంటారు.4. స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్కొన్ని సంక్లిష్టమైన అన్యూరిజమ్లలో... మరీ ముఖ్యంగా వెడ్ నెక్డ్ అన్యురిజమ్ అనే అన్యురిజమ్స్లో లేదా పెద్ద లేదా అతి పెద్ద (లార్జ్ అండ్ జెయింట్ అన్యురిజమ్) వంటి సందర్భాల్లో స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాయిల్స్ ప్రధాన రక్తనాళంలోకి జారిపోకుండా నివారించవచ్చు. లేదంటే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం ఉంటుంది.బెలూన్–అసిస్టెడ్ కాయిలింగ్లో, కాయిల్స్ వేస్తున్న సమయంలో అన్యూరిజమ్ నెక్ ప్రాంతంలో బెలూన్ ను తాత్కాలికంగా ఉబ్బించి ఉంచుతారు.5. ఫ్లో డైవర్షన్ అన్యూరిజమ్ చికిత్స కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఫ్లో డైవర్టర్ (ఎఫ్డీ) స్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్యూబ్ ఆకారంలో ఉండే ప్రత్యేక స్టెంట్లు. ఇవి రక్తప్రవాహాన్ని అన్యూరిజమ్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి. దీంతో అన్యూరిజమ్ స్యాక్లోకి వెళ్లే రక్తప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా అన్యూరిజమ్ నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోయి, కాలక్రమేణా సహజంగా నయమవుతుంది.చికిత్సలో ఎదురయ్యే సవాళ్లుచిట్లిన లేదా చిట్లని... ఇలా రెండు రకాల మెదడు అన్యూరిజమ్ల చికిత్సలు ఇటు పేషెంట్కూ, అటు డాక్టర్లకూ ఓ పెద్ద సవాలుగా మారడం చాలా సాధారణం.గుండెపోటు లాగే అన్యురిజమ్ కూడా... అన్యురిజమ్స్తో వచ్చే పరిణామాలను మనం గుండెజబ్బు అనంతర పరిణామాలతో పోల్చవచ్చు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగానే అన్యురిజమ్స్ కూడా అంతే అకస్మాత్తుగా రావచ్చు. గుండెపోటు విషయంలో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక చేరినందువల్ల అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే... అన్యురిజమ్స్ విషయంలో మాత్రం మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలే పెద్ద రిస్క్ ఫ్యాకర్లు.మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా... శరీర నిర్మాణానికి దోహదపడే కొన్నిప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి అన్యురిజమ్స్ ఉండటం, కోకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్‌కు రిస్క్‌ఫ్యాక్టర్లు.గ్లాస్గో కోమా స్కేల్‌పై తీవ్రత కొలతతో గ్రేడింగ్... అన్యురిజమ్స్ కారణంగా కానీ లేదా ఇతరత్రాగానీ... ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే స్కేల్‌ను గ్లాస్గో కోమా స్కేల్‌గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ మాటలకు పేషెంట్ స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ పేషెంట్ నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు పేషెంట్ స్పందిస్తున్న కొద్దీ గ్లాస్గో కోమా స్కేల్‌పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది పేషెంట్ నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అని అర్థం. అదే స్కోర్ పెరుగుతూ... అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. ఈ స్కోర్‌ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు పేషెంట్లో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది).హేమరేజ్ జరిగిన కేసుల్లో పేషెంట్ తాలూకు గ్లాస్గో కోమా స్కేల్‌పై కొలతల గ్రేడ్... - స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి.- స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు.- స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి.- స్కోరు 3 – 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.చివరగా... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కాస్త ఎక్కువగా కనిపించే ఈ కేసులు ఇటీవల మన దేశంలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అంతగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడా పరీక్షలు, వాటితో పాటు సరికొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో మన దగ్గర కూడా ఆ పేషెంట్ల వివరాలు తెలియడంతో పాటు చాలామందిని రక్షించడమూ ఇప్పుడు సాధ్యమవుతోంది.- డా. కిశోర్ కుమార్, సీనియర్ న్యూరో సర్జన్- నిర్వహణ: యాసీన్ -
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్‌ను నిర్థారించగలదా?
టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్‌ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎండోమెట్రియోసిస్ అంటే..ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.లక్షణాలు..నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పిరుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పిఅధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.సాధారణ స్కాన్లు గుర్తించలేకపోవడానికి రీజన్..ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్‌వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు. అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్‌లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్‌ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్‌ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్‌తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్‌ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: కేన్సర్‌తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..) -
కేన్సర్‌తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..
బాలీవుడ్ నటి, మోడల్ నఫీసా అలీ కేన్సర్ వారియర్. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్‌ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. బాలీవుడ్ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్జాకి' షూటింగ్ సమయంలోనే స్టేజ్ 3 కేన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్‌తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. ఆమె ముందు క్రీడాకారిణి..కోల్‌కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్‌లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్ రవీందర్ సింగ్ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్‌గా ఉండేవారు. 1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi) (చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే) -
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్‌ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్‌లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్‌ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్‌ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్‌ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్‌లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్‌ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్‌ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్‌ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్‌లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్‌లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్‌కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్‌పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్‌కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్‌లో వైరల్ అయ్యే "షుగర్‌కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సజ్జనుడు – దుర్జనుడు
జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.నియంత్రణ తప్పడమే మ్యుటేషన్ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్ మ్యుటేషన్ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్ స్టేటస్)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్ కణంగా మారుతుంది.షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్ ఎడిక్షన్’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్) ఆంకోజీన్ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్... ఆంకోజీన్గా మారి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
యాంటీ'భయో'టిక్స్!?
సాక్షి, హైదరాబాద్: సమాజంలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ)కి వచ్చిన ప్రతి నలుగురు పిల్లల్లో ముగ్గురికి యాంటీబయాటిక్స్ సూచించడం..వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే పెద్దల్లో 83 శాతం మందిలో ఏఎంఆర్ బ్యాక్టీరియా ఉందని ఏఐజీ పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా జ్వరం, జలుబు, గాయం, ఒళ్లు నొప్పులకు ఓవర్ది కౌంటర్లో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇవి వినియోగించడం, కోర్సు పూర్తి చేయకపోవడం, ఇతర కారణాలతో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతుంది. రోగం వచ్చినపుడు ప్రాణాలు కాపాడాల్సిన మందులు పనిచేయకుండా ఏఎంఆర్ అడ్డుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఓపీలో పిల్లలకు ఇచ్చే ప్రిస్కిప్షన్లలో 76 శాతం మందికి వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారని కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. 891 మంది పిడియాట్రిక్ ఔట్ పేషెంట్ల (ఓపీ) వివరాలను విశ్లేíÙంచగా అందులో 65.8 శాతం బాలురు, 34.2 శాతం బాలికలు ఉన్నారు. అధ్యయనం చేసిన పిల్లల్లో శ్వాసకోస ఇన్ఫెక్షన్లు (49.6) అత్యంత సాధారణంగా ఉన్నాయి. 678 మంది ప్రిస్కిప్షన్లలో 96.9 శాతం ఒకే రకమైన యాంటీబయాటిక్ ఉండగా, 3.1 శాతం మరో రెండు రకాలు ఉన్నాయి. అత్యధిక భాగం బ్రాండెడ్ మందులే ఉండగా కేవలం 2.4 శాతం మాత్రమే జనరిక్ మందులు రాస్తున్నారని కళాశాల ప్రాక్టీస్ హెచ్ఓడీ సత్యనారాయణ వివరించారు.83 శాతం మంది రోగుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉంటోందని ఏఐజీ ఆసుపత్రి పరిశోధనల్లో తేలింది. ఇది మందులు పనిచేయకుండా అడ్డుకుంటుందని, ఈ పరిస్థితిని నియంత్రించకపోతే భవిష్యత్తులో వైద్యం ఖర్చులు పెరగడంతో పాటు, హై డోస్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొంటున్నారు. అయినా ఖచ్చితంగా రోగం నయం అవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేమన్నారు.బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు..శరీరంలో వైరస్, ఫంగల్, ప్యారాసైట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అతిగా యాంటీబయాటిక్స్ వినియోగం మానవ ఆరోగ్యానికి కీడు చేస్తుంది. దీనిపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఫొటో కేఎస్ అని ఉంటుంది. ‘కోర్సు’ మేర మందులు వాడాలి..మెదడు, ఉదరం, యూరిన్, శ్వాసకోశ వ్యవస్థ.. ఇలా శరీరంలోని అవయవాలకు యాంటీబయాటిక్ మోతాదు ఉంటుంది. దీన్ని మించి ఇవ్వకూడదు. యాంటీబయాటిక్ ఇవ్వండని తల్లిదండ్రులే అడుగుతున్నారు. అడినోవైర్తో వచ్చే జ్వరం 15 రోజులు ఉంటుంది. డెంగీ, కోవిడ్, మలేరియా వంటి రోగాలకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. సీబీపీ, సీఆర్పీ, యూరిన్ వంటి చిన్నచిన్న పరీక్షల ఆధారంగా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎంత డోస్, ఎన్ని రోజులు వినియోగించాలో చెబుతారు. కోర్సు పూర్తి చేయాలి. మధ్యలో ఆపేసినా రెసిస్టెన్స్ పెరుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో రోగాలను నయం చేయడం కష్టంగా మారుతుంది.– డా. కావలి సత్యనారాయణ, రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి -
Health: నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా?
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అరుదైన సార్కోమా క్యాన్సర్.. గుర్తించడం ఎలా?
క్యాన్సర్ అనగానే మనకు సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు లేదా ప్రేగుల క్యాన్సర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే శరీరంలోని అనుసంధాన కణజాలాలలో (connective tissues) వచ్చే ‘సార్కోమా’ అనే అరుదైన క్యాన్సర్‌ను త్వరగా గుర్తించలేం. ఫలితంగా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సార్కోమా క్యాన్సర్లు ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి (cartilage), రక్తనాళాలు, నరాలు, ఇతర మృదువైన కణజాలాలలో (soft tissues) ఉత్పన్నమవుతాయి. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, ఇవి అటు పిల్లలపై, ఇటు పెద్దలపై కూడా ప్రభావం చూపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా, నొప్పి లేకుండా ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతున్నది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.సార్కోమా అంటే ఏమిటి?మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ ఖత్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సార్కోమా అనేది ఒక అసాధారణ క్యాన్సర్. ఇది స్పష్టమైన కారణం లేకుండానే వస్తుంది. ‘సార్కోమా బారిన పడిన చాలామందికి అది తమకు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. చాలా కేసులలో దీనికి నిర్దిష్టమైన జీవనశైలి అలవాట్లు గానీ లేదా బాహ్య కారణాలు గానీ బాధ్యత వహించవు’ అని ఆయన వివరించారు. సార్కోమాలో 100 కంటే ఎక్కువ ఉప రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అందుకే దీని నిర్ధారణ, చికిత్స చాలా సవాలుతో కూడుకున్నవి. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు.ప్రమాద కారకాలు సార్కోమాను సాధారణంగా నివారించలేనప్పటికీ, దీని ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు. అవి.. ‘లి-ఫ్రౌమెని సిండ్రోమ్’ వంటి వంశపారంపర్య జన్యుపరమైన సమస్యలు. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1.. గతంలో ఇతర క్యాన్సర్ల కోసం రేడియేషన్ థెరపీ తీసుకోవడం. దీర్ఘకాలంగా ఉండే లింఫెడెమా (lymphoedema - వాపు సమస్య). కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు సుదీర్ఘకాలం గురికావడం.ఉపేక్షించకూడని హెచ్చరిక సంకేతాలుసార్కోమా ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం.. దీని ప్రాథమిక లక్షణం నొప్పి లేని గడ్డలా కనిపించడమే. క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరంతరం పెరుగుతూ ఉండే గడ్డ, ఐదు సెంటీమీటర్ల కంటే పెద్దగా (సుమారుగా ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో) ఉండే వాపు, కండరాల లోపల లోతుగా ఉండే గడ్డ, ఎటువంటి గాయం కాకపోయినా ఎముకలలో నిరంతరం నొప్పి రావడం, రాత్రి వేళల్లో ఎముకల నొప్పి మరింత తీవ్రం కావడం, తగ్గకుండా పదే పదే వచ్చే వాపు. శరీరంలో వచ్చే చాలా గడ్డలు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఏదైనా వాపు తగ్గకుండా ఉన్నా లేదా పరిమాణం పెరుగుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షించుకోవాలి.వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు?అనుమానాస్పదంగా ఉన్న గడ్డలను పరీక్షించడానికి వైద్యులు సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్లు, పెట్-సిటి ఇమేజింగ్, ముందస్తు ప్రణాళికతో చేసే బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్, జన్యుపరమైన పరీక్షలు, నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సార్కోమా చికిత్సలో అనుభవజ్ఞులైన కేంద్రాలలోనే బయాప్సీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నివారించడం సాధ్యమేనా?మిగతా సాధారణ క్యాన్సర్లలా కాకుండా, సార్కోమా రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి దీనిని నివారించడానికి నిర్దిష్టమైన మార్గాలేవీ లేవు. అయితే, అనవసరమైన రేడియేషన్‌కు గురికాకపోవడం, ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, వంశపారంపర్య క్యాన్సర్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో తగ్గని గడ్డలు లేదా ఎముకల నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సోషల్ మీడియా డైట్ మేనియా
‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్’‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’ఇవన్నీ సోషల్ మీడియాలో మార్మోగిపోయే మాటలు. యూట్యూబ్ తెరిచినా, ఇన్‌స్ట్రాగ్రామ్ తెరిచినా ఉచిత ఆరోగ్య, ఆహార సలహాలతో ఊదరగొట్టే మహానుభావులు కనిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటనే దానిపై వీరెవరికీ ఏకాభిప్రాయం ఉండదు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. ఒకరు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినాలంటారు. ఇంకొకరు ఆకులు అలములు మొలకలతోనే అద్భుతమైన ఆరోగ్యం సాధ్యమని ప్రవచిస్తారు. మరొకరు ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చని నమ్మకంగా చెబుతారు.‘నా సలహా పాటిస్తే డయాబెటిస్, బీపీ దగ్గరకే రావు; మీ గుండె ఉక్కు గుండులా మారుతుంది’ అని చెబుతారొకరు. ‘నేను చెప్పే ఆహార పద్ధతిని పాటిస్తే క్యాన్సర్ కూడా పరారవుతుంది’ అని సవాలు చేస్తారొకరు. ‘నేను చెప్పిన కషాయాలు తాగుతూ, ఆకులు అలములు మొలకలు తింటే అరవైలోనూ ఇరవైలా ఉరకలేస్తారు’ అని ఢంకా బజాయిస్తారు మరొకరు. సోషల్ మీడియాలో వీళ్ల వీడియోలు చూసే జనాలు గందరగోళంలో పడుతుండటం మామూలుగా మారింది. ముందు వెనుకలు ఆలోచించకుండా, నిపుణులను సంప్రదించకుండా, సోషల్ మీడియాలో ఊదరగొట్టే ఆహారారోగ్య ప్రవాచకుల సలహాలు పాటించడం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలను ఊదరగొట్టేవారిలో అత్యధికులు వైద్యులు కాదు. కనీసం అర్హత కలిగిన న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా కాదు. వీళ్లంతా స్వయంప్రకటిత నిపుణులు. వీళ్లలో కొందరు కేవలం తోచిన సలహాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా; డాక్టర్లను, ఆధునిక వైద్యరంగాన్ని పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రబలుతోంది.థంబ్‌నెయిల్ ప్రచారాలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఈ సలహాలు చెప్పేవారిలో చాలామందికి పోషకాహార శాస్త్రంలో గాని, వైద్యశాస్త్రంలో గాని ఎలాంటి అర్హతలూ ఉండవు. అర్హులైన వారి వీడియోల కంటే అనర్హుల వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా వీడియోలు ‘స్వయంప్రకటిత’ నిపుణులవే! సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలు చెబుతూ వీడియోలు చేసేవారిలో అర్హులైన న్యూట్రిషనిస్టులు, వైద్యులు 30 శాతానికి లోపే ఉంటున్నారు.‘సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే ఆహార ఆరోగ్య సలహాలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. వీటిలో ఉండేది చాలావరకు తప్పుడు సమాచారమే’ అని కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలోని మెడిసిన్ రీసెర్చ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లీ కేహిల్ తన అధ్యయనంలో వెల్లడించారు. ‘సోషల్ మీడియాలోని వీడియోలు చూస్తూ, రకరకాల ఆహార ప్రయోగాలు చేయడం వల్ల సమస్యల బారినపడ్డ వారు చాలామంది నా వద్దకు వస్తుంటారు. సోషల్ మీడియాలో చూసే సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వారే చేయాలి. పోషకాహారం గురించి, ఆరోగ్య సమస్యల గురించి సాధికారికమైన సమాచారాన్ని అందించే వెబ్సైట్లు, వీడియోలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల గుండె సమస్యలతో బాధపడేవారు ఉత్తపుణ్యానికి పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’ అని కెనడాలోని ఒటావాకు చెందిన రిజిస్టర్డ్ డైటీషియన్ వెరోనికా రోజ్ చెబుతున్నారు. పోషకాహారం గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను తొలగించి, శాస్త్రీయంగా వాస్తవాలను వెల్లడించడానికి తాను కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు.‘ఇన్స్టాగ్రామ్’లో ఆహార సలహాలు ఇచ్చేవారి వీడియోల్లో దాదాపు సగానికి సగం తప్పుడు సమాచారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ (ఐపీఏఎన్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన వారి ఖాతాలనే నమూనాగా తీసుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించే అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై జనాలకు అందుతున్న సమాచారంలో కచ్చితత్వం, ప్రామాణికత కొరవడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. సోషల్ మీడియా ద్వారా అర్హతలు లేకుండానే పోషకాహార, ఆరోగ్య సలహాలు ఇచ్చేవారిని కొన్ని ఫుడ్ సప్లిమెంట్ బ్రాండ్లు తమ ప్రచారం కోసం కూడా వాడుకుంటున్నాయి’ అని ఈ అధ్యయనం జరిపిన రీసెర్చ్ స్కాలర్ ఎమిలీ డెన్నిస్ తెలిపారు. సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు ఇచ్చే ఆహార ఆరోగ్య సలహాపైన, వారు ప్రచారం చేసే ఫుడ్ సప్లిమెండ్ బ్రాండ్లపై జనాలు అప్రమత్తంగా ఉండాలని ఎమిలీ హెచ్చరిస్తున్నారు.తప్పుడు సమాచారానికి ఉదాహరణలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్యాల గురించి ప్రమాదకరమైన స్థాయిలో తప్పుడు సమాచారం వచ్చి పడుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు ప్రచారం గురించి కొన్ని ఉదాహరణలు, వాస్తవాలు...ప్రచారం: చక్కెర పూర్తిగా విషం. వాస్తవం: చక్కెర విషమేమీ కాదు. చక్కెర తక్షణ శక్తిదాయకం. పరిమిత మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు.ప్రచారం: ఆల్కలైన్ వాటర్‌తో అన్నీ నయమైపోతాయి.వాస్తవం: ఆల్కలైన్ వాటర్ శరీరంలోని పీహెచ్ స్థాయిని మార్చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నా, ఇది పూర్తి అవాస్తవం. శరీరం తన పీహెచ్ స్థాయిని తానే నియంత్రించుకుంటుంది. ఆల్కలైన్ వాటర్ వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి అమాంతం మారిపోదు. దాని వల్ల వ్యాధులు నయం కావు.ప్రచారం: గ్లూటెన్ చాలా హానికరం.వాస్తవం: గోధుమలు, బార్లీ వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. వీటి పిండితో తయారు చేసే రొట్టెలు, బిస్కట్లు తదితర పదార్థాల్లో ఉండే గ్లూటెన్ కొద్దిమందికి సరిపడదు. ఈ పరిస్థితిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ అంటారు. ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ లేనివారికి గ్లూటెన్ వల్ల జరిగే హాని ఏమీ ఉండదు.ప్రచారం: ఈ ఆహారాలతో క్యాన్సర్ నయమవుతుంది.వాస్తవం: సీతాఫలం గింజలు, లక్ష్మణఫలం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు క్యాన్సర్‌ను నయం చేస్తాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతోను, ప్రత్యేక ఆహార పద్ధతులతోనే క్యాన్సర్‌ను నయం చేయడం అసాధ్యం. క్యాన్సర్‌కు కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.ప్రచారం: మా డైట్ ప్లాన్‌తో వారం రోజుల్లోనే పదికిలోల బరువు తగ్గవచ్చువాస్తవం: ఎలాంటి డైట్ ప్లాన్‌తోనైనా తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అందుకు ప్రయత్నించినా, శరీరంలో పోషక లోపాలు ఏర్పడి అనర్థాలు తలెత్తవచ్చు.ప్రచారం: డీటాక్స్ డ్రింక్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తాయి.వాస్తవం: నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ సహా పలు డీటాక్స్ డ్రింక్స్ లివర్, కిడ్నీల పనిని పూర్తిగా భర్తీ చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో లివర్, కిడ్నీలు సహజంగానే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. ఇవి పాడైనప్పుడు తగిన వైద్య చికిత్స తప్పనిసరి.ప్రచారం: డయాబెటిస్‌కు మందులు అక్కర్లేదు.వాస్తవం: డయాబెటిస్‌కు మందులు వాడటం అనవసరమని; వేపాకు, నేరేడు ఆకు, మెంతాకు వంటి ఆకులు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొన్నిరకాల ఆకులు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్వల్పంగా అదుపులోకి వచ్చినా, ఇవేవీ డయాబెటిస్ చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం కావు.ప్రచారం: నూనెలు, నెయ్యి, ఇతర కొవ్వులతోనే ఆరోగ్య సమస్యలువాస్తవం: సమతుల పోషకాహారంలో కొవ్వులు కూడా తప్పనిసరి భాగంగా ఉండాలి. కొవ్వులను, నూనెలను పూర్తిగా మానేస్తే పోషక లోపాలు ఏర్పడతాయి. కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్ల లోపం ఏర్పడి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, కొవ్వులను తగిన మోతాదులో వాడాలి.ప్రచారం: ఎంత కొవ్వు తిన్నా హానిలేదు.వాస్తవం: వెన్న, నెయ్యి, కొబ్బరినూనె ఎంత తిన్నా ఏమీ కాదని, వీటితో బరువు తగ్గవచ్చని కొందరి ప్రచారం. ఇవి మితిమీరితే బరువు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఎక్కువ. పైగా ఒంట్లో కొవ్వు మితిమీరితే అధిక బరువు మొదలుకొని గుండెజబ్బుల వరకు రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రచారం: కీటో డైట్‌తో డయాబెటిస్ పూర్తిగా నయమవుతుంది.వాస్తవం: కీటో డైట్ తీసుకుంటే, డయాబెటిస్ మందులతో పని ఉండదని కొందరి ప్రచారం. కీటో డైట్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కొంత మెరుగుపడవచ్చు. అలాగని డాక్టర్లు సూచించిన మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి విషమించే ప్రమాదాలు ఉంటాయి.తప్పుడు సమాచారం ఉచ్చులో యువతరంసోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి యువతరమే ఎక్కువగా ప్రభావితమవుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియని స్థితిలో ఉండే 18–25 ఏళ్ల లోపు వయసువారు ఈ వీడియోల ద్వారా ప్రభావితమై, కనీసం నిపుణులను సంప్రదించకుండా రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని న్యూజీలండ్కు చెందిన ‘సెంటర్ ఫర్ న్యూట్రిషనల్ సైకాలజీ’ అధ్యయనం వెల్లడించింది.శరీరాకృతి, చర్మం తీరు, జుట్టు తీరు వంటి చిన్న చిన్న అంశాల్లో అపనమ్మకంగా ఉండే యువత సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో చెప్పేవారి సలహాలు విని, వాటిని పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమతో స్వయంగా ప్రయోగాలు చేస్తున్నారని, అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లను మార్చుకుని చిక్కుల్లో పడుతున్నారని ఈ అధ్యయనం జరిపిన బృందానికి నేతృత్వం వహించిన జాక్ ఆర్.హెచ్.కూపర్ చెబుతున్నారు.‘కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాల పట్ల తేలికగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటిలో వచ్చే వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే సలహాలు పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మి ఆహార పద్ధతులపై ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు ఊదరగొట్టే స్థాయిలో ఫలితాలు రాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’ అని కూపర్ వెల్లడించారు.నియంత్రణ లోపమే అసలు సమస్యపోషకాహార సలహాలు, ఆరోగ్య సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. ఇతరేతర రంగాల్లో డిగ్రీలు ఉన్నవాళ్లు కూడా సోషల్ మీడియాలో స్వయంప్రకటిత పోషకాహార ఆరోగ్య నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శరీరనిర్మాణ శాస్త్రం, పోషకాహార శాస్త్రం వంటి అంశాల్లో అవగాహన లేకుండానే, తాము నమ్మిన విషయాలనే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద ఏర్పడిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార ఉత్పత్తులు, ఫుడ్ సప్లిమెంట్ల నాణ్యత ప్రమాణాలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంది.ఆహార ఆరోగ్య సలహాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఎలాంటి నియంత్రణ లేదు. ఆహార ఆరోగ్యాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని నియంత్రించడానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేవు. మన దేశం నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆహార ఆరోగ్య అంశాలపై ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా వస్తున్న వీడియోల్లో దాదాపు 80 శాతం వరకు గుర్తింపు కలిగిన అర్హతలు లేనివారు చెబుతున్నవేనని ఒక అంచనా.ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఆధునిక వైద్యంలోను; ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి తదితర వైద్య విధానాల్లోను; న్యూట్రిషన్, డైటెటిక్స్ విధానాల్లోను డిగ్రీలు కలిగిన వారు సుమారు 20 శాతం వరకు మాత్రమే ఉంటున్నారు. అయితే, అర్హతలు లేనివారి వీడియోలకు కూడా లక్షలాది ఫాలోవర్లు ఉంటుండటమే ఆందోళన కలిగించే అంశం.తప్పుడు ప్రచారానికి కారణాలు...సోషల్ మీడియాతో ప్రచారం మాత్రమే కాదు, డబ్బు కూడా దండిగా వస్తుంది. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఎక్కువమంది చూసే కంటెంట్‌ను మరింత ఎక్కువమందికి చూపిస్తాయి. దీనివల్ల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. ప్రకటనల ఆదాయంలో కొంత వీటిలో వీడియోలు పెడుతున్నవారికి వస్తుంది. దీనికితోడు సప్లిమెంట్లు, డైట్ కోర్సుల అమ్మకాలకు కూడా సంబంధిత కంపెనీలు ‘స్వయంప్రకటిత’ నిపుణులను సాధనంగా ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా కూడా వారికి ఆదాయం వస్తుంది. ప్రచారానికి ప్రచారం, ఆదాయానికి ఆదాయం అప్పనంగా దొరుకుతుండటంతో కొందరు తమ చదువుకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అకస్మాత్తుగా ఆహార ఆరోగ్య నిపుణులుగా సోషల్ మీడియాలో అవతారమెత్తుతూ జనాలను గందరగోళంలో ముంచుతున్నారు. కొంచెం దృష్టిపెడితే, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో అసలైనవేవో, తప్పుడు ప్రచారంతో కూడినవేవో తేలికగానే కనిపెట్టవచ్చు. ‘డాక్టర్లు దాచిన రహస్యం!’, ‘ఫార్మసీ మాఫియా’, ‘శాస్త్రవేత్తలకే తెలియని ఆరోగ్య రహస్యం’, ‘వారం రోజుల్లో ఫ్యాటీ లివర్ నయం’, ‘క్యాన్సర్‌ను ఈజీగా తగ్గించవచ్చు’, ‘ఈ తైలంతో పక్షవాతం నయం’ వంటి థంబ్‌నెయిల్స్‌తో వచ్చే కంటెంట్‌లో చాలావరకు అవాస్తవాలే ఉంటాయి. వీటిని ప్రచారంలోకి తెచ్చేవారికి ఆహార, ఆరోగ్య, వైద్య శాస్త్రాలపై కనీస అవగాహన కూడా ఉండదు. సోషల్ మీడియాలో కొద్ది శాతమైనా అర్హులైన వైద్యులు కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కంటెంట్‌కు, పోస్ట్ చేసిన వారి అర్హతలను బేరీజు వేసుకుని ఈ వీడియోలను చూడటం క్షేమం.∙పన్యాల జగన్నాథదాసు -
93.95 కోట్లు దాటిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు
భారతదేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ (ఏబీడీఎం) ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ల్లో ఒకటిగా అవతరించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.95 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు (ఆబా) జనరేట్ అయ్యాయని, వీటికి అనుబంధంగా 105 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా లింక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ మూడో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణ (రోడ్‌మ్యాప్)పై చర్చించారు.రికార్డు స్థాయిలో డిజిటల్ నమోదుదేశంలో వైద్య సేవలను పారదర్శకంగా, వేగవంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీల్లో భారీగా నమోదు ప్రక్రియ సాగుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం..ఆరోగ్య ఖాతాలు (ఆబా) 93.95 కోట్లు దాటాయి.లింక్ అయిన హెల్త్ రికార్డులు 105 కోట్లకు పైగా ఉన్నాయి.నమోదైన ఆరోగ్య సౌకర్యాలు (హాస్పిటల్స్/క్లినిక్స్) 5.33 లక్షలు.నమోదైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (డాక్టర్లు/నర్స్ లు) 9.85 లక్షల మంది.2.72 లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏబీడీఎం సాఫ్ట్వేర్ సాంకేతికతను వాడుతున్నాయి.ఆసుపత్రుల్లో ఓపీడీ కోసం క్యూలైన్ బాధలు తప్పించే ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ విధానం ద్వారా దాదాపు 24 కోట్ల టోకెన్లను జనరేట్ చేశారు.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్రనాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సామాన్యుడికి సైతం చేరవేయడంలో, పౌరుల ఆరోగ్య రికార్డులను అత్యంత సురక్షితంగా భద్రపరచడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టం చేశారు. ‘సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది. ప్రతి పౌరుడికి సులభంగా, పారదర్శకంగా వైద్య సేవలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని నడ్డా చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
మెన్స్ట్రువల్ లీవ్.. ఓ చర్చ! బలమా... బలహీనతా?
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇచ్చే మెన్ స్ట్రువల్ లీవ్ పాలసీపై సానుకూల, ప్రతికూల కోణాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. సుప్రీంకోర్టు, పలువురు మేధావులు మహిళలకు పీరియడ్స్ లీవ్స్ తప్పనిసరి చేయడం వల్ల వారు ఉపాధి రంగంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉండటమే కాదు, ప్రాజెక్ట్ డెడ్లైన్లు, వ్యాపార ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సంస్థలు పురుషులకేప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సెలవుల వల్ల పురుషులతో సమానంగా గుర్తింపు, వేతనం కోసం మహిళలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు నీరుగారిపోయి, మహిళలను శారీరకంగా బలహీనులుగా చూసే పాతకాలపు మూస పద్ధతులు మళ్లీ బలపడతాయని ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.కాబట్టి మహిళల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాలను రూ΄÷ందించాలి. అంటే ‘ఆ రోజుల్లో’ ఇంటినుంచి పనిచేసే సౌలభ్యం ఇవ్వడం, మెడికల్ లీవ్స్ పెంచడం, పనిగంటల్లో వెసులుబాటు... వంటివి. దీనివల్ల యాజమాన్యాలకు నష్టం జరగకుండా.. పని ఉత్పాదకత లో మార్పు లేకుండా ఉంటుంది. మహిళలకూ ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ లీవ్ అనే ప్రత్యేక లేబుల్ లేకుండా.. మహిళల గోప్యతకు భంగం లేకుండా కూడా ఉంటుందని పలువురి అభిప్రాయం. -
Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..
‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్ సేఫ్ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..సేఫ్ పీరియడ్ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్ యాప్ లేదా క్యాలెండర్‌ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్స్ట్రువల్ క్యాలెండర్‌ని ఏర్పాటు చేసుకోవాలి.ప్యాడ్స్ పడేయడమూ సమస్యే!రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్ వస్తాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్ కప్స్ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్ సేఫ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.అవగాహన తప్పనిసరి..పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్‌ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్‌కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – డాక్టర్ మనోరమ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్సొంత నిర్ణయాలు వద్దు..చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా పాటించడం సురక్షితమైన మార్గం.– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్ -
సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..
నవ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీతల్లిదండ్రి నాధులతోడన్నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.‘మనసునందు మాలిన్యంబు మానకుండామాటలందు మైత్రి నాటింపనేలలోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్లవిశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వుదానహీను జూచి ధనము నవ్వుకదన భీతు జూచి కాలుండు నవ్వును ‘ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
నీళ్లు తాగితే ఇరుక్కుపోతాయేమోనని.. తాగడమే మానేశా!
నాకు 24 ఏళ్లు. నేను బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతిమీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్ ఫారింజియస్’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్ సింప్టమ్’ అంటారు.రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్‌లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్ ఫిజీషియన్ ను ఎలా కలుస్తామో... మనసులో ఆందోళన ఎక్కువైతే సైకియాట్రిస్ట్‌ను అలాగే కలవాలి, ఇందులో సంకోచించడానికేం లేదు.మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న మంచి మానసిక వైద్యుణ్ణి కలవండి, మీ ఆందోళన తగ్గడానికి వారు కొన్ని సురక్షితమైన మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు, దీనివల్ల గొంతు కండరాలు రిలాక్స్ అయి, మింగడం మళ్లీ మామూలైపోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు త్వరగా కోలుకుంటేనే, మీ కుటుంబానికి మీరు అనుకున్నట్లుగా ఆసరాగా నిలబడగలుగుతారు. మంచి వైద్యం అందుబాటులో ఉన్న ఈ చిన్న సమస్యను, అనవసరమైన అపోహలతో పెద్దది చేసుకోకండి, మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉద్యోగంలో స్థిరపడాలని ఆశిస్తున్నాను, మీకు అంతా మంచే జరుగుతుంది!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్‌కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్‌లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్‌లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్‌లోని చైనా ఎంబసీ స్పోక్స్‌పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్‌కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్‌కు ముందర ఇక్కడ హైదరాబాద్‌లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్‌లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్‌కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్‌గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్‌లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్‌తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్‌తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్‌గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్‌బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్‌ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్‌ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్‌గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
జంతువులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: మనుషులు, జంతువుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. మనుషులకు మేలు చేయడంతోపాటు హాని కలిగించడంలో కూడా జంతువుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలోనే ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహిస్తారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచంలో వెలుగుచూస్తున్న అంటువ్యాధుల్లో దాదాపు 60 శాతం జూనోటిక్ వ్యాధులేనని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువులను నేరుగా తాకడం, మూత్రం, విసర్జనలు, వెంట్రుకలు, లాలాజలం ద్వారా అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. వాటి నుంచి తయారయ్యే పాలు, మాంసం, గుడ్లు వంటి ఉత్పత్తుల ద్వారా కూడా పలు వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబిస్‌పై అప్రమత్తత అత్యవసరం జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైనది. లక్షణాలు బయటపడిన తర్వాత దాదాపు 100 శాతం ప్రాణాంతకమైన ఈ వ్యాధిని, సకాలంలో వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తిగా నివారించొచ్చు. భారత్‌లో వీధి కుక్కలే రేబిస్ వైరస్‌కు ప్రధాన వాహకాలుగా ఉన్నాయి. బహిరంగంగా చెత్త వేయడం, ఎక్కడపడితే అక్కడ కుక్కలకు ఆహారం వేయడం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కలతోపాటు కోతులు, గబ్బిలాలు, ఎలుకలు కరిచినా వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి. ఎవరెవరికి ఇబ్బంది.. రైతులు, పశువుల పెంపకందారులు, పశు వైద్యులు, మాంసం కోసే కార్మికులు, ప్రయోగశాల సిబ్బంది, తోలు, ఉన్ని పరిశ్రమల్లో పనిచేసేవారు జూనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిట్టాకోసిస్, ఆర్నిథోసిస్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమంటున్నారు. పందులు కూడా అనేక వైరస్‌లకు నిలయంగా ఉండటంతో వాటి నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి. పాలు, మాంసం, గుడ్లతోనూ ప్రమాదం » సరిగ్గా పాశ్చరైజ్ చేయని పాలు, పాల ఉత్పత్తులతో బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తుంది. » కలుషితమైన లేదా సరిగ్గా ఉడికించని మాంసం ద్వారా ఆంథ్రాక్స్, టేప్‌వార్మ్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. » వ్యాధి సోకిన కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకున్నా అనారోగ్యమే. » సూపర్ మార్కెట్లలో నిల్వ ఉంచిన క్యాన్డ్ పానీయాలపై ఎలుకల మూత్రం పడితే వాటి ద్వారా లెప్టోస్పిరోసిస్ వ్యాపిస్తుంది. ఎలుకలు, కుక్కల మూత్రంతో కలుషితమైన నీరు, పరిశుభ్రంగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్స్, బయ ట నిల్వ చేసే చెరుకు రసం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. » పిల్లుల నోరు, గోళ్ల వద్ద ఉండే సూక్ష్మజీవుల వల్ల క్యాట్ స్క్రాచ్ ఫీవర్, రేబిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లుల వెంట్రుకల వల్ల కొందరిలో అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నివారణే ఉత్తమ మార్గం » జూనోటిక్ వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. వాటికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. » జంతువులను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. » పాలు, మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించి తీసుకోవాలి. » క్యాన్డ్ పానీయాలను శుభ్రం చేసిన తర్వాతే తాగాలి. » జంతువులు కరిచినా లేదా గాయపరిచినా వెంటనే వైద్యసేవలు పొందాలి. -
Beauty Tips: ఈ మాస్క్‌తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్‌లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్‌తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
మోకాలు పట్టేస్తోందా?
మెనిస్కస్ అంటే... అది మోకాలి జాయింట్ దగ్గర పైన ఉండే తొడ ఎముక (ఫీమర్)కూ, కిందనుండే కాలి ఎముక (టిబియా)కూ మధ్యన ‘సి’ ఆకారంలో ఉండే కార్టిలేజ్ అని పిలిచే మృదులాస్థి. నడుస్తున్నప్పుడూ, పరుగెడుతున్నప్పుడూ... కాలితో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఇది ఈ రెండు ఎముకల మధ్య ఓ కుషన్‌లా, షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంటుంది. కాలిపై పడే ప్రతి ఒత్తిడిని తాను తీసుకుంటూ ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు, కీళ్లను రక్షించేందుకు ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ఏదైనా కారణాల వల్ల ఇది దెబ్బతినడాన్ని ‘మెనిస్కస్ టియర్’ అంటారు. ఇది ఏయే సందర్భాల్లో జరుగుతుంటుంది, అప్పుడు కనిపించే లక్షణాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...మోకాలి నొప్పి, వాపు, నడిచేటప్పుడు ఇబ్బంది లేదా మోకాలు ఒక్కసారిగా ‘లాక్‘ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి మోకాలి దగ్గరి మృదులాస్థి ‘మెనిస్కస్ టియర్’ సమస్యకు సూచనలు కావచ్చు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొన్ని ్ర΄ాథమికమైన జాగ్రత్తలతో... శస్త్రచికిత్స అవసరం లేకుండానే కోలుకునే అవకాశం ఎక్కువ. ఆ వివరాలను తెలుసుకుందాం. మెనిస్కస్ టియర్ సమస్య ఎందుకు వస్తుందంటే..? ఆటల్లో మోకాలు ప్రమాదవశాత్తూ ఆకస్మికంగామెలితిరగడం ప్రమాదాల్లో గానీ లేదా ఇతరత్రా మోకాలి దగ్గర బలమైన దెబ్బ తగలడం వయస్సు పెరగడంతో మెనిస్కస్ అరుగుదలకు లోనై బలహీనపడడం మెట్లు ఎక్కడం లేదా బరువులు ఎత్తేటప్పుడు మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడడంప్రధాన లక్షణాలు... మోకాలి నొప్పి , వాపు మోకాలు లాక్ అయినట్లు అనిపించడం నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది మోకాలు పూర్తిగా వంచలేకపోవడం లేదా చాపలేకపోవడం కదిలించినప్పుడు ‘క్లిక్‘ లేదా ‘పాప్‘ శబ్దం వినిపించడం మోకాలిలో ఇబ్బందిగా అనిపించడంనిర్థారణ ఇలా... డాక్టర్లు చాలావరకు బాధితులు చెప్పే లక్షణాలను బట్టి శారీరకంగా (ఫిజికల్‌గా) పరీక్షించి... ఈ సమస్యను చాలావరకు అంచనా వేయగలుగుతారు. అవసరమైతే ఎమ్మారై స్కాన్ ద్వారా మెనిస్కస్ టియర్‌ను ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారు. నివారణ కోసం జాగ్రత్తలివి... వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం ∙తొడ అలాగే మోకాలి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం ∙అధిక బరువును నియంత్రించుకోవడం ∙ఆటల్లో స్వీయభద్రత కోసం తగిన ఉపకరణాలూ, పరికరాల ఉపయోగం ∙మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే డాక్టర్‌ను సంప్రదించడం. డాక్టర్‌ను సంప్రదించాల్సిందెప్పుడు? మోకాలి నొప్పి కొన్ని రోజుల పాటు తగ్గకపోయినా, మోకాలి దగ్గర వాపు ఎక్కువైనా, మోకాలు లాక్ అవుతున్నా లేదా నడవడం కష్టంగా ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే మోకాలి దగ్గరి కీళ్లకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.చికిత్స ఇలా... మోకాలి దగ్గర అయ్యే చిన్న΄ాటి గాయాలకు ‘రైస్’ అనే తేలిగ్గా గుర్తుంచుకునే యాక్రనిమ్ సహాయంతో సులభంగా చికిత్స అందించుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు ‘ఆర్’ అంటే రెస్ట్ (విశ్రాంతి), ‘ఐ’ అంటే ఐస్ (ఐస్‌తో కోల్డ్ కాపడం పెట్టడం), ‘సి’ అంటే కంప్రెషన్ (అంటే ఒత్తిడి కలిగించేలా క్రేప్ బ్యాండ్ చుట్టడం), ‘ఈ’ అంటే ఎలివేషన్... అంటే మోకాలిని ఓ తలగడ సహాయంతో మిగతా దేహ భాగం కంటే కాస్త పైన ఉండేలా చూసుకోవడం ద్వారా సులభంగా చికిత్స అందించవచ్చు. తొలిదశల్లో ఇది శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎవరికి వారు ఇంట్లోనే తీసుకోగల జాగ్రత్తలుగా అనుకోవచ్చు. ఇక మెనిస్కస్ టియర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని మందులు, ఫిజియోథెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. అయితే ఈ మృదులాస్థి తాలూకు టియర్ చాలా తీవ్రంగా ఉండి మోకాలు లాక్ అవుతున్నా లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే ఆర్థ్రోస్కోపీ (కీహోల్) శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అతి చిన్న కోతలతో చికిత్స చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉండి, బాధితులు చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.చివరగా... మోకాలి నొప్పి, అక్కడ వాపు లేదా లాక్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా అవి మెనిస్కస్ టియర్‌కు సంకేతాలుగా భావించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సకాలంలో నిర్ధారణ, సరైన చికిత్స తీసుకుంటే మోకాలి పనితీరును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ పి.ఆర్. వినయ్ కిషోర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఎంత వరకు సేఫ్?
ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా అన్నిచోట్లా ఫోన్ ఎలా కామన్ అయిందో వైర్లెస్ ఇయర్‌బడ్స్ కూడా అదేవిధంగా మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే వీటి వాడకం మంచిదేనా కాదా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.నిజానికి వైర్లెస్ ఇయర్‌బడ్స్ చాలా తక్కువ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్ హెడ్ ఫోన్లు కేబుల్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ రాదు. అలాగని అవసరం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మంచిది కాదు.. ఇది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువసేపు పాటలు వినేటప్పుడు వైర్డ్ హెడ్ ఫోన్లు వాడటం మంచిది. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏకనాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అనారోగ్యం బారినపడి, శనివారం థానేలోని జుపిటర్ ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన స్వల్ప జ్వరం, నీరసం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యుల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.అధిక పనిభారమే కారణంప్రాథమిక సమాచారం ప్రకారం.. గత కొన్ని రోజులుగా పర్యటనలు, రాజకీయ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం, తీవ్రమైన పనిభారం కారణంగానే షిండే అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు జ్వరం వచ్చి, తీవ్ర నీరసానికి గురైనట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా షిండే శనివారం నాటి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయను చికిత్స నిమిత్తం థానేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే షిండే ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని శివసేన వర్గాలు తెలిపాయి.మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాల్లో షిండే చురుగ్గా పాల్గొన్నారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలతో పాటు ముంబయి శాసనమండలి సభ్యుడు సచిన్ అహిర్.. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ ‘ఆపరేషన్ టైగర్’ వ్యూహంలో షిండే కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పలుమార్లు ఢిల్లీ పర్యటనలు కూడా చేశారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. -
అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.ఎవరిలో ఫెమో ఉంది?1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.ఏం చేయాలి?1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.3. స్క్రీన్ టైమ్‌కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. -
సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!
డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.చేసే విధానం (20 నుంచి 30 సార్లు)నేలపై యోగా మ్యాట్‌పై కూర్చోవాలి.రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉంచాలి.శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.ప్రయోజనాలు...పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలు...మోకాలి లేదా హిప్‌కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.-అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
అంటార్కిటికాలో ఆశాకిరణం..
క్యాన్సర్ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (యూఎస్ఎఫ్) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది.అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్ సీ స్క్విర్ట్ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు.‘సీ స్క్విర్ట్’ను అసిడియన్స్ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్ డిఫెన్స్) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు.క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్ డీఎన్ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఆ మహిళ బ్రెయిన్లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..
ఒక విదేశీ మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడింది. ఆమె సాధారణ తలనొప్పి అనుకుంది కానీ..అది చూస్తుండగానే బుర్ర బద్దలైపోయేంతట విపరీతమైన నొప్పి..మూర్చ, మతిస్థిమతం వంటివి అటాక అయ్యి..కుప్పకూలిపోయింది. అప్పటిదాక బాగానే ఉన్న ఆమెకు ఆకస్మికంగా ఇలా ఎందుకు జరిగిందని విచారిస్తే..అసలు విషయం బయటపడింది. అలాగే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులకే నోట మాటరాలేదు. అయితే ఇలాంటి సమస్య ఆ దేశంలో అత్యంత అరుదు కావడంతో ఎలా వచ్చింది అని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటమే గాక..ఆమె ఈ సమస్య నుంచి బయటపడటానికి పడరాని నరకం అనుభవించింది. ఇంతకీ ఎవారా ఆ మహిళంటే..యూకేకు చెందిన లోరీ డెన్మాన్ అనే మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ..మూర్చ వంటి సమస్యలు ఎదుర్కొంది. రాను రాను సమస్య మరింత దిగజారిపోయింది. ఒకరోజు ఉన్నట్లుండి కుప్పకోలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి హుటాహుటినా తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులే కంగుతిన్నారు. చివరికి తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోవడమే కాదు..రోజురోజుకి ఆమె మరింత దిగజారి ప్రాణాంతకంగా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని విచారించగా తాను భారత్ పర్యటకు వెళ్లానని..ఆ టూర్‌కి వెళ్లి ఇప్పటికీ మూడేళ్లు అవతుందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఒక రోజు మలవిసర్జనలో టేప్వామ్ని చూసి విస్తుపోయానని చెప్పింది. ఆ తర్వాత నుంచి పరిస్థతి నార్మల్‌గా ఉండటంతో లైట్ తీసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి తనలో ఈ బద్దెపురుగులు ఉన్నాయా అని వైద్యలును ప్రశ్నించింది లోరి. అయితే వైద్యులు పలు టెస్ట్‌లు చేసి శరరీంలో ఎక్కడ ఈ సమస్య లేదని, కేవలం బ్రెయిన్లోనే ఏకంగా 38 టేప్‌వార్మ్‌లు ఉన్నాయని అన్నారు. దీన్ని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారని అన్నారు. యూకేలో ఈ సమస్య చాలా అరుదని, ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లే ఈ సమస్య బారిన పడతారని అనడంతో కంగుతింది లోరీ.న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది పంది టేప్‌వార్మ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక పరాన్నజీవి సంక్రమణ. సరిగ్గా ఉడకని ఆహారం, ముఖ్యంగా పంది మాంసం తినడం వల్ల మనుషులు ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు. అలాగే టేప్‌వార్మ్ గుడ్లతో కలుషితమైన నీటి ద్వారా కూడా ఇది సంభవిస్తుందని తెలిపారు వైద్యులుఈ వ్యాధిని గుర్తించిన తర్వాత లోరీకి పరాన్న జీవి నిరోధక మందులు, స్టెరాయిడ్లు ఇచ్చారు. అవి మొదట్లో బాగానే పనిచేశాయి. కానీ రాను రాను దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. గందరగోళానికి గురవ్వడం, శరీరంలో తిమ్మిర్లు, జలదరింపు, బ్రాంతి వంటి మానసిక రుగ్మతలు బారినడపడింది. రోజురోజుకి పరిస్థితి మరింత దిజగారిపోయింది. చూడటానికి ఒక చిన్నపిల్ల మాదరి ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలా ఆమె కోలుకుని యథాస్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం 42 ఏళ్లు ఉన్న ఆమె జీవితాంతం మూర్చ వ్యాధి మందులు వాడుతూనే ఉండాల్సి రావడం బాధకరం. అంతేగాదు ఆమెకు సర్జరీ చేయకుండానే ఆ పరాన్నజీవులను మట్టుబెట్టారు. అవి మెడిసిన్ ప్రభావంతో బ్రెయిన్లోనే గట్టిపడిపోతాయని చెప్పారు వైద్యులు. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడమే కాదు.. ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. పైగా తనలా ఎవ్వరూ ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోందామె.(చదవండి: లక్షల జీతం వదులుకుని వెయిటర్‌గా..! ఎందుకంటే..) -
నా చేతి రాత మారి.. నా బతుకు రాతను మార్చేసింది!
నా వయసు 45 సంవత్సరాలు. నేను ఒక రచయితను, నా రచనలన్నీ చేత్తోనే రాసుకోవడం నా అలవాటు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి సరిగా రాయలేక పోతున్నాను. కొంచెంసేపు రాసేటప్పటికి, వేళ్ళు విపరీతంగా నొప్పులు పుట్టి, అక్షరాలు చిన్నవిగా, వంకరగా మారిపోయి, ఇతరులకు అర్థం కావడం లేదు. పదినిమిషాలు వరుసగా రాస్తే మళ్ళీ పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటే గానీ రాయలేకపోతున్నాను. దీనివల్ల ఈ మధ్య నా రచనా వ్యాసంగంలో బాగా వెనుకబడ్డాను. అదే నా బతుకు దెరువు. మా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే, దీనికి చికిత్స లేదంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో రాస్తున్నాను. – సుబ్రహ్మణ్యం. అమలాపురంమీరు ‘రైటర్స్ క్రాంప్’ అనే ఒక అరుదైన సమస్యతో బాధ పడుతున్నారు. మానసిక, నాడీ మండలానికి సంబంధించిన ఈ సమస్యతో బాధపడేవారిలో, రాసే సమయంలో చేతివేళ్లు పట్టేయడం, వంకర్లు తిరిగిపోవడం, విపరీతమైన నొప్పితో కొంతసేపు రాసిన వెంటనే ఆగిపోవడం ఈ సమస్య లక్షణం. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు అంటే టైపిస్టులు, ఎక్కువగా పెన్నుతో రాసేవారు, ఏదైనా సంగీత వాద్యాన్ని, వేళ్ళతో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యను చూస్తుంటాము. దీనివల్ల మొదట్లో కొన్ని వాక్యాలు బాగా రాసినా, సడన్‌గా చేతివేళ్ళు పట్టేసి, చేతిరాత అధ్వానంగా మారిపోతుంది.నొప్పితో΄ాటు, చేతిలో వణుకు కూడా రావచ్చు. కొంత విరామం తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి రావచ్చు. ఈ సమస్య వల్ల కొంత టెన్షన్‌కు లోనై, పోనుపోను బటన్స్ పెట్టుకోవడం, షేవింగ్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. గతంలో టెలిగ్రామ్ పంపే పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేవారు, చేత్తో తీరికలేకుండా టైపు చేయడం ద్వారా కూడా వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చేది. అసలు సమస్యతో ΄ాటు దీనివల్ల పనిలో వెనుకబడి, మానసిక ఒత్తిడికి గురై ఈ సమçస్య మరింత జటిలమవుతుంది.ఈ సమస్యకు కూడా చికిత్స ఉందనేది చాలామందికి తెలియక, ఉద్యోగాలు మానేసిన వారు కూడా ఉన్నారు. ‘బొటాక్స్’ ఇంజక్షన్’ ద్వారా ఈ సమస్యను చాలా వరకు నయం చేయవచ్చు. ‘సుపినేటా రైటింగ్’ అనే ఒక ప్రత్యేక మానసిక చికిత్సా పద్ధతితో΄ాటు, ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని మందులు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ‘రైటర్స్ క్రాంప్’ సమస్యను నయం చేయవచ్చు. మీరు అధైర్యపడకుండా దగ్గర్లోని సైకియాట్రిస్టును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.- మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్‌ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్‌ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్‌ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్‌పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్‌పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్‌ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్‌పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్‌కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
వైఎస్ జగన్‌కు ఎప్పటీకీ రుణపడి ఉంటాం: ముద్రగడ గిరి
సాక్షి, తాడేపల్లి: తన తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని.. ప్రజల అందరి ఆశీస్సులతో తన తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ముద్రగడ గిరి అన్నారు. తన తండ్రి అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ప్రతిరోజూ ముద్రగడ ఆరోగ్యంపై వివరాలుఅడిగి తెలుసుకుంటున్నారన్నారు.‘‘డాక్టర్లతోనూ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. స్పెషల్ కేర్ తీసుకోవాలని డాక్టర్లతో చెప్పారు’’ అని గిరి తెలిపారు. నాన్నకు వైఎస్ జగన్ చేసిన సాయం మరిచిపోలేమని.. మేం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని గిరి తెలిపారు. -
స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..
ఈ ఏడాది జనవరిలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రామ్‌చరణ్ పెద్ది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ నేపథ్యంలో జరిగి సక్సెస్ మీట్లో ఉపాసన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఐదు నెలలే అయినా ఎంత స్మార్ట్‌గా మారింది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఒక్కరికి జన్మనిచ్చిన తల్లులు బరువు తగ్గడమే కష్టం అలాంటిది ఇద్దర పిల్లలకు జన్మనిచ్చిన తల్లలు బరువు తగ్గడం మరింత సవాలుగా ఉంటుంది. అలాంటిది ఉపాసన ఐదు నెలల్లోనే చాలా నాజుగ్గా ఆకర్షణీయంగా మారారు. అసలు ట్విన్స్ తర్వాత బరువు తగ్గడం ఎలా?, అది సాధ్యమేనా? అంటే..ఒక గర్భంతో పోలిస్తే.. కవలల గర్భం తర్వాత బరువు తగ్గడం చాలా కష్టమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అధికంగా బరువు పెరుగుతారు. వారి శరీరాలు మరిన్నీ శారీరక, హార్మోనల్ మార్పులకు లోనవ్వుతాయి. శరీరం కోలుకోవడం కోసం కండరాల బలం తిరిగి నిర్మించుకోవడానికి, ఇద్దరు పిల్లల సంరక్షణ ఇదంతా ఒక పెద్ద సవాలుగా పేర్కొన్నారు. కొత్త తల్లులు యథావిధిగా ఇదివరకటిలా నార్మల్ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. అయితే ప్రసవానంతరం కోలుకోవడం అనేది పరుగుపందెం లాంటిది కాదని గ్రహించాలన్నారు. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని అన్నారు అందువల్ల ఆరోగ్యకరంగా స్థిరంగా బరువు తగ్గేందుకే ప్రయత్నించాలని అన్నారామె. బరువు తగ్గాలంటే..ప్రసవానంతరం బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర, సమతుల్య భోజనం, తగినంత నీరు, తగిన కదలికలు ఉండాలన్నారు. కొత్త తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించొద్దని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చేవాళ్లకు మరింత ప్రమాదమని అన్నారు. శరీరం ఆ స్థితి నుంచి కోలుకోవడానికి, శక్తి కోసం తగిన పోషకాలు అవసరం. ఈ టైంలో కేలరీలు లెక్కించడం మానేసి, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పౌష్టికరమైన భోజనంపై దృష్టి సారించమని సూచిస్తున్నారు. ఆ తప్పులు అస్సలు చెయ్యొద్దు..సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు పోషకాహర నిపుణులు, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో ఆయా డైట్ విధానాలు అనుసరిస్తారు కాబట్టి గుడ్డిగా అనుసరించొద్దని అన్నారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించొద్దని చెప్పారు. తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు కొన్ని వారాల్లో మాయమవ్వాలంటే తీవ్రమైన డైటింగ్, భోజనం మానేయడం, అతిగా వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే సప్లిమెంట్లపై ఆధారపడటం వంటివి పూర్తి స్థాయిలో కోలుకోవడాన్ని ఆటంక పరుస్తుందని అన్నారు.కొత్త తల్లులూ ఇది మరవద్దు..ప్రసవానంతరం ఫిట్నెస్ అంటే బలాన్ని తిరిగి నిర్మించుకోవడం అంతేతప్ప మాటిమాటికీ బరువు చెక్‌చేస్తూ..నెంబర్ని వెంబడించడం కాదు. ఆరోగ్యకరమైన శరీరం, స్థిరమైన పురోగతి, బిడ్డను చూసుకోవడానికి తగినంత శక్తిమంతంగా ఉండటం అనేవి ప్రధానం అని గ్రహించండి. ఏ క్రాష్ డైట్ ఈ సమయంలో అస్సలు పనికిరాదు. కేవలం ఓర్పు, నిలకడతో పాటించే మంచి అలవాట్లతోనే సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అనురాగ్ కశ్యప్ వెయిట్‌లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?) -
అనురాగ్ కశ్యప్ వెయిట్‌లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్‌లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్‌లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్‌కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్‌ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్‌డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో ఉద్యోగం!) -
అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!
చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్‌లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్‌గా అక్షరంపైన స్టైల్‌గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్‌గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్ నుంచీ యువతీయువకులందరి కోరిక.ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్‌గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.జుట్టు ఎలా పెరుగుతుందంటే... ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.అనాజెన్ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్‌గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్‌గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.జుట్టు రాలడానికి కారణాలు శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. పరిష్కారం ఇలా : తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.ప్రోటీన్ లోపాలతో : ప్రోటీన్లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.విటమిన్–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ విటమిన్–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.పరిష్కారం ఇలా : విటమిన్–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్ అయిన టెస్టో స్టెరాన్ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.పరిష్కారం ఇలా : పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా చెబుతారు. ఉదాహరణకు...పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి.లైకెన్ ΄్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్),కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు,యాంటీ డిప్రెసెంట్స్నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్ (బ్లడ్ థిన్నర్స్),యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,కీమోథెరపీ మందులు.మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,ఇంటర్‌ఫెరాన్స్,వేగంగా మారిపోయే మూడ్స్‌ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు,స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు.పరిష్కారం ఇలా...మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారాకీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్‌ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.స్కారింగ్ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా ఉండి, ఆ ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్‌లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లైకెన్ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు... స్కారింగ్ అలొపేషియాకు కారణమవుతాయి.జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్‌ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది ఫంగస్ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.చికిత్స : యాంటీబయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.సెబోరిక్ డర్మటైటిస్ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్ (జడ్‌పీటీఓ), తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...లూజ్ అనాజెన్ సిండ్రోమ్ : దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.ట్రాక్షన్ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్‌గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్మెంట్) ఇవ్వడం అవసరం. చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.తొలి రోమం పుట్టేదిలా... బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.వెంట్రుక నిర్మాణం ఇలా... వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్ అలాగే షాఫ్ట్ అని రెండు భాగాలుంటాయి.బల్బ్ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్‌లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్) కండిషనర్‌లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.మందుల వల్ల...రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్నే కాకుండా కార్టెక్స్నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్‌ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... హైపోట్రైకోసిస్ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.ట్రైయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.- డా. విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ -
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్‌గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్‌అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్‌పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్‌లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్‌రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే) -
హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..
దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్ ప్యాక్ (ఐస్ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. ఐస్‌ప్యాక్ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల అక్కడి (లోకల్) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్–హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ప్యిక్ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్ క్యూబ్స్‌ను నేరుగా అద్దడం కంటే... టవల్‌లోగాని, లేదా ఏదైనా కవర్లోగాని పెట్టి ఐస్ప్యిక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో) / తాజా గాయాలు (ఫ్రెష్ ఇంజరీస్) అయినప్పుడు. హాట్ ప్యాక్ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్తోగాని, ఎలక్ట్రిక్ హీట్‌ప్యాక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్‌పెయిన్) / డిస్క్ప్లాప్స్ / సయాటికా. -
రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
డాక్టర్ గారు, నా రెండేళ్ల బాబుకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చాలాసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తోంది. అతని రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?– రమణి, నెల్లూరు. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల వయసులో పిల్లలకు సంవత్సరానికి ఆరు నుంచి పదిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం కాదు. ఈ వయసులోనే పిల్లల రోగనిరోధక వ్యవస్థ వివిధ సూక్ష్మక్రిములను ఎదుర్కొంటూ క్రమంగా బలపడుతుంది. అయితే తరచుగా యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయనిపిస్తే, పిల్లల వైద్యుడిని సంప్రదించి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా జలుబులు, వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అందుకే, వారి ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి 7 బంగారు సూత్రాలు ఉన్నాయి.1. రంగురంగుల ఆహారంప్రతి రోజు పిల్లల ప్లేట్లో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయి, జామ, నారింజ, క్యారట్, టొమాటో, పాలకూర వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.2. ప్రొటీన్ తప్పనిసరిరోగనిరోధక కణాలు, యాంటీబాడీలు తయారవ్వడానికి ప్రొటీన్ కీలకం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, చికెన్ లేదా చేపలు వంటి ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అవసరం.3. తగినంత నిద్రనిద్రలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకుంటుంది. అందుకే, రెండేళ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.4. బయట ఆడుకోవడంప్రతిరోజూ కనీసం గంటసేపు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. సూర్యరశ్మి ద్వారా విటమిన్–డి లభించడంతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.5. అన్ని టీకాలు సమయానికి వేయించండిటీకాలు పిల్లల శరీరానికి వివిధ వ్యాధులను ఎదుర్కోవడం నేర్పించే రక్షణ కవచంలాంటివి. అన్ని టీకాలను సమయానికి వేయించడం కూడా చాలా అవసరం. దీంతో అనేక తీవ్రమైన అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.6. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండిచాక్లెట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్‌ను పరిమితం చేయాలి. కడుపు నిండటం ఒకటి అయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అందడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి.7. చేతుల పరిశుభ్రత అలవాటు చేయండిఅనేక ఇన్ఫెక్షన్లు చేతుల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే, చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను నేర్పించాలి. భోజనం ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అయితే సంవత్సరానికి పదిసార్లకుపైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, తరచూ న్యూమోనియా బారిన పడటం, బరువు సరిగా పెరగకపోవడం, నోటిలో పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యేక ఇమ్యూనిటీ పరీక్షలు చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచే మంత్రం లాంటి సిరప్ లేదా టానిక్ ఏదీ లేదు. సమతుల ఆహారం, తగిన నిద్ర, పూర్తి టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే పిల్లల రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయి. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
మూత్రపిండం ప్రాణగండం
మన దేహంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ప్రతి క్షణం మన రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి రక్తంలోని విషపదార్థాలనూ, వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి. ఈ కండిషన్‌నే ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ) అంటారు. ఇది కొంత ప్రమాదకరమైన పరిస్థితే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో బాధితులకు తగిన చికిత్స అందక΄ోతే కొన్ని గంటలు లేదా రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, దీనికి కారణాలేమిటి, దీనికి నివారణ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.కొంతమందిలో యూరిన్ పాస్ చేస్తున్న సమయంలో మూత్రం తక్కువగా రావడం జరుగుతుండవచ్చు. అలా మూత్రం పరిమాణం తగ్గడం అంత మంచి సూచన కాదు. అలాగే దేహంలో ముఖం లేదా కాళ్లూ చేతుల్లో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్) వంటి లక్షణాలను చిన్న సమస్యగానే అనుకుని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ లక్షణాలన్నీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే తొలి సంకేతాలు కావచ్చు. సమయానికి చికిత్స తీసుకోక΄ోతే దేహంలో విషపదార్థాలు పేరుకు΄ోయి గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుంది. చికిత్స ఇలా... అక్యూట్ కిడ్నీ ఇంజరీ (ఏకేఐ)కి కారణమైన సమస్యను వెంటనే గుర్తించి, దానికి తక్షణ చికిత్స అందించడమన్నది ఏకేఐ చికిత్సలో అత్యంత కీలకం. ఉదాహరణకు డీ–హైడ్రేషన్ వల్ల దేహంలో ద్రవాలు తగ్గితే వెంటనే సెలైన్ ఎక్కించడం ద్వారా శరీరంలో నీటిమోతాదు సమతుల్యంగా ఉండేలా చూడాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ముప్పు వాటిల్లినట్టు తెలిస్తే దాన్ని తగ్గించడం కోసం అవసరమైన చికిత్స ఇవ్వడం, కిడ్నీలకు హానికరమైన మందులను నిలిపివేయడం, అవసరమైతే తాత్కాలికంగా డయాలసిస్ చేయడం ద్వారా కిడ్నీలు తిరిగి కోలుకునేలా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే... ఏకేఐలో అందుకు కారణాన్ని బట్టి తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. చివరగా... మూత్రం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం చిన్న విషయం కాదు. అది కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని దేహం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలనూ... ఒక్కోసారి ప్రాణాలనూ కాపాడుకోవచ్చని గుర్తుంచుకోవాలి.డాక్టర్ అరుణ్‌కుమార్ దొనకొండ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ – కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..) -
ఏఐ కాలం 'మాయరోగం'
‘సైబర్‌కాండ్రియా’ మనుషులను కుదురుగా ఉండనివ్వడంలేదు. వ్యాధుల వల్ల వచ్చే బాధలను మించిన భయాలను రేకెత్తించి, కంటికి కునుకు పట్టనివ్వడంలేదు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితులు తమ ఆరోగ్యంపై లేనిపోని అనుమానాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, పదేపదే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ బెంగతో కుదేలైపోతున్నారు. డాక్టర్లు వారించినా, మనసులోని శంకలు తీరక రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం; పెద్ద ఇబ్బందేమీ లేదని అనుభవజ్ఞులైన డాక్టర్లు నచ్చచెప్పినా, వినిపించుకోకుండా డాక్టర్లనే పదేపదే మార్చేస్తూ, లేని రోగాల ఆనవాళ్లు కనిపెట్టడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. వీరి కారణంగా ఉత్పాదకతకు భారీనష్టం వాటిల్లుతోంది. ‘సైబర్‌కాండ్రియా’ సహా ఆరోగ్య సంబంధమైన రకరకాల మానసిక ఆందోళనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 1 ట్రిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘సైబర్‌కాండ్రియా’ మరింతగా పెరిగింది. చిన్న చిన్న శారీరక లక్షణాలనే పెద్దగా అనుమానించడం; అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్యపక్రియల్లోనూ చికిత్స ప్రయోగాలు చేయడం; వైద్యులను తరచుగా మార్చడం; వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రమాదకర సంకేతాలు ఏవీ లేనప్పటికీ పదేపదే పరీక్షలు చేయించుకోవడం; ఈ లక్షణాలతో బాధపడే ఉద్యోగులు తరచుగా విధులకు సెలవు పెట్టడం వంటివి చేస్తున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ వల్ల విలువైన పనిగంటలకు, ఉత్పాదకతకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.కాస్త తలనొప్పిగా ఉన్నా, కొంచెం ఒళ్లు వెచ్చబడి జ్వరంగా ఉన్నా ఇదివరకటి జనాలు పెద్దగా కంగారు పడేవారు కాదు. తలనొప్పిగా ఉంటే నొవాల్జిన్ మాత్ర, జ్వరంగా ఉంటే పారాసిటమాల్ మాత్ర వేసుకుని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేవారు. ఎప్పుడైనా అజీర్తిచేసి కడుపు గడబిడ చేస్తే, వంటింటి చిట్కాలు పాటించేవారు. అప్పటికీ నయం కాకుంటే, డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. ఇంట్లో చిన్నా పెద్దా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, ఇంట్లోని పెద్దలు అనుభవ వైద్యం చేసేవారు. ఇంటి వైద్యానికి కుదరని సమస్యలకైతే ఫ్యామిలీ డాక్టర్లు ఆపద్బాంధవుల్లా తగిన చికిత్స అందించేవారు. జబ్బూ జట్రా సర్వసాధారణంగా ఉన్నా, జనాలు వాటి గురించి బెంగ పెట్టేసుకోకుండా నిక్షేపంగా బతికేసేవారు. ఇప్పుడలా కాదు, ఒంటికి ఏ బాధ వచ్చినా వెంటనే ఏఐ వైపు చూస్తున్నారు. సర్వసాధారణంగా వచ్చే బాధలకు పెద్దపెద్ద వ్యాధులను ఊహించుకుని భయపడుతున్నారు.తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమరేమోనని; కడుపునొప్పి వస్తే బొవెల్ క్యాన్సరేమోనని; దగ్గు వస్తే లంగ్ క్యాన్సరేమోనని; నడుంనొప్పి వస్తే డిస్క్ జారిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. ఈ అర్థంలేని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టేస్తున్నారు. ఏఐ ముందు తమ సందేహాల చిట్టా విప్పుతున్నారు. ఇదంతా ఏఐ కాలం తెచ్చిన మాయరోగం. దీనికి అంతర్జాతీయ వైద్యనిపుణులు సైబర్‌కాండ్రియా అని పేరు పెట్టారు.మొదటి స్థానంలో భారత్కొన్ని ఘనతలకు సంబంధించి మొదటి స్థానంలో నిలవడం దేశానికి గర్వకారణంగా ఉంటుంది. కాని, కొన్ని ప్రతికూల అంశాల్లో మొదటి స్థానానికి చేరడం విచారించదగ్గ విషయమవుతుంది. డబ్ల్యూహెచ్ఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మన భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువమంది చదువుకున్నవారు, పట్టణ, నగర ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాల పరిస్థితి ఇదీ... అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ‘కోవిడ్–19’ కాలం నుంచి భారత్‌లో సైబర్‌కాండ్రియా బాధితుల్లో సుమారుగా 120% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల అమెరికాలో 80%, బ్రిటన్‌లో 70%, ఇటలీలో 60%, స్పెయిన్‌లో 50% మేరకు పెరుగుదల నమోదైంది. ‘కోవిడ్–19’ మహమ్మారి ఫలితంగా జనాల్లో ఆరోగ్యం పట్ల అతిజాగ్రత్తలు, వాటితో పాటు ఆరోగ్య స్థితిగతులపై అర్థంలేని అనుమానాలు కూడా బాగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 560 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉంటే, వారిలో దాదాపు 190 కోట్ల మంది ఏదో ఒక స్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితులే! వీరిలో దాదాపు 55 కోట్ల మంది తీవ్రస్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ లక్షణాలతో బాధపడుతున్నారని ‘సైబర్‌కాండ్రియా సివియారిటీ స్కేల్’ ఆధారంగా అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువగా యువతరం వారే ఎక్కువగా ఉంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం వివిధ వయసుల వారిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల వివరాలు...ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే...‘సైబర్‌కాండ్రియా’ విషవలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఇంటర్నెట్ వాడే చిన్నా పెద్దా అందరూ కొంత సంయమనంతో కూడిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండటానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవీ...చేయాల్సినవి» ఏఐని ప్రాథమిక సమాచారం కోసమే వాడాలి» ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ మార్గాల ద్వారా తనిఖీ చేసుకోవాలి » శరీరంలో అసౌకర్యం కలిగితే ఆ లక్షణాలను వివరంగా రాసుకుని, వైద్యులను సంప్రదించాలిచేయకూడనివి» ఏఐ ఆధారంగా స్వీయ వ్యాధినిర్ధారణ తగదు» ఏఐ ఆధారంగా స్వీయ వైద్యం ప్రారంభించవద్దు.» ఏఐ సమాచారం ఆధారంగా ప్రాణాంతక వ్యాధులు సోకినట్లుగా లేనిపోని భయాలు పెట్టుకోవద్దు.వివిధ వయసుల వారిలో...‘సైబర్‌కాండ్రియా’ మూలకారణం ఇంటర్నెట్– దానివల్ల అందుబాటులోకి వచ్చిన సోషల్‌మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్ అయినా, అంతర్జాతీయ అధ్యయనాలు వేర్వేరు వయసుల వారిలో వేర్వేరు కారణాలను ప్రధానంగా గుర్తించాయి. సోషల్ మీడియాకు కొత్తగా పరిచయమైన 13–17 ఏళ్ల వయసు వారిలో ఆరోగ్య సమస్యలపై అరకొర అవగాహన; శరీరంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వెదుకులాట సాగించి, అందులో దొరికే సమాచారం చదివి లేనిపోని భయాలు పెంచుకోవడం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడుతున్నారు.కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లే 18–24 ఏళ్ల వయసు వారు మితిమీరి సోషల్ మీడియాకు అలవాటు పడటం, ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్, ఏఐపై ఆధారపడటం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బాధితులవుతున్నారు. కొత్తగా కెరీర్ ప్రారంభించి, కెరీర్లో నిలదొక్కుకునే దశలో ఉన్న 25–44 ఏళ్ల వయసువారు తమ ఆరోగ్య సందేహాల కోసమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై సమాచారం తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగా పదేపదే వైద్యపరీక్షలు జరిపించుకోవడం, డాక్టర్లను సంప్రదించడం చేస్తున్నారు. డాక్టర్లు ఒకవేళ ఏమీ లేదని చెప్పినా, తృప్తిపడకుండా డాక్టర్లను తరచు మారుస్తున్నారు. ఇక 45–64 ఏళ్ల వయసు వారిలో చాలామందికి నిజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలై ఉంటాయి. వీటిలో బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలపై తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో వెదుకులాట సాగిస్తున్నా, డాక్టర్లపై కూడా కొంత నమ్మకం ఉంచుతున్నారు. అయితే, సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే సమాచారం వల్ల గందరగోళానికి లోనై ఆందోళన పెంచుకుంటున్నారు.చివరిగా 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల్లో ‘సైబర్‌కాండ్రియా’ తక్కువే! వీరిలో సంప్రదాయ పద్ధతులపై ఇంకా పూర్తిగా సడలిపోని నమ్మకమే ఇందుకు కారణం. ఈ వయసు వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఆరోగ్య సమాచారం కోసం సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై వెదుకులాట సాగిస్తున్నారు. అయినా, వీరిలో ఎక్కువమంది ఇంకా డాక్టర్లనే నమ్ముకుంటూ ఉండటం కొంత ఊరట.ఏఐ వైద్యునికి ప్రత్యామ్నాయం కాదుఏఐలో ఎలాంటి సమాచారమైనా ఉండవచ్చు. అదంతా ఏఐకి మనుషులు ఇచ్చినదే! ఏఐలో ఏ అంశంపై వెదుకులాట సాగించినా, నిమిషాల్లోనే బోలెడంత సమాచారాన్ని మన ముందు పోగు పెడుతుంది. ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, అది అనుభవం, నైపుణ్యం ఉన్న వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యల గురించి ఏఐలో వెదుకులాట సాగించేవారు ఈ సంగతిని గుర్తెరగాలి. ఏఐకి, నిపుణుడైన డాక్టర్‌కు తేడా చాలానే ఉంటుంది. ఆ తేడా ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...ఛాతీనొప్పిఏఐగుండెపోటు కావచ్చువైద్యుడురోగి వయసు, ఎత్తు, బరువు, జన్యు చరిత్ర తెలుసుకుంటారు. ఈసీజీలాంటి ప్రాథమిక పరీక్షలు జరిపి, పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారు.కడుపు ఉబ్బరం, మంటఏఐఅల్సర్ కావచ్చువైద్యుడురోగి ఆహారపు అలవాట్లు, అరుగుదల పరిస్థితిని తెలుసుకుంటారు. ఇతర జీర్ణ సంబంధ కారణాలను పరిశీలించి, తగిన మందులు సూచిస్తారు.కీళ్లనొప్పులుఏఐఆర్థరైటిస్ కావచ్చు.వైద్యుడునొప్పి ఉన్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ఆ భాగంలో కదలికలు ఎలాఉన్నాయో పరిశీలిస్తారు. తగిన మందులు సూచిస్తారు.తలనొప్పిఏఐబ్రెయిన్ ట్యూమర్ కావచ్చువైద్యుడుతలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తోందో, ఏ పరిస్థితుల్లో వస్తోందో తెలుసుకుని, అవసరమైన వైద్యం చేస్తారు.బరువు పెరుగుదలఏఐథైరాయిడ్ సమస్య కావచ్చు.వైద్యుడురోగి జీవనశైలిని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందులు ఏవైనా తీసుకుంటున్నారా అనేది కనుక్కుని, తగిన చికిత్స చేస్తారు.అలసట, నీరసంఏఐక్యాన్సర్ కావచ్చువైద్యుడురోగి నిద్ర, ఒత్తిడి, ఆహారం, అనీమియా, థైరాయిడ్ వంటి కారణాలను పరిశీలిస్తారు. కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.గుండెదడఏఐగుండెజబ్బు కావచ్చువైద్యుడురోగి నాడి పరిశీలిస్తారు. కెఫీన్ మోతాదు ఎక్కువైందేమో తెలుసుకుంటారు. అవసరం అనిపిస్తే ఈసీజీ చేయిస్తారు. అప్పుడు తగిన చికిత్స చేస్తారు.బయటపడాలంటే..?‘సైబర్‌కాండ్రియా’ నుంచి బయటపడటం కొంత కష్టమే అయినా, అసాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) నిపుణులు చెబుతున్న ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడినవారు శరీరంలో ఏ చిన్న అసౌకర్యం కలిగినా, వెనువెంటనే ఆన్లైన్లో వెదకడం, ఏఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం మానుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ వైద్య సంస్థల వెబ్సైట్లను చూడవచ్చు. ఆన్లైన్లో సమాచారం వెదుకులాట కోసం సమయం వృథా చేసుకుని, లేనిపోని భయాలు పెట్టుకునే బదులు సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చే వీడియోలను చూడటం మానుకోవాలి. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్య చికిత్సల్లో వందశాతం ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుందని గ్రహించాలి. కొన్ని వ్యాధులకు ఇప్పటికీ శాశ్వత చికిత్స అందుబాటులో లేదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. వైద్యంలో కూడా అనిశ్చితి సహజమే! దానిని ఆమోదించగలిగి ఉండాలి. క్రమం తప్పని వ్యాయామం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ ఆందోళన తగ్గకుంటే, మానసిక వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స పొందాలి.‘సైబర్‌కాండ్రియా’ విషవలయం లాంటిది. ఒకసారి మొదలైతే, అది ఆగకుండా ఆరోగ్యం పట్ల లేనిపోని భయానుమానాల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీని నుంచి బయటపడటం కష్టమని అంతర్జాతీయ మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ చక్రం ఎలా మొదలవుతుందంటే?... -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్‌ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్‌దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్‌ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డే ఉత్తమం అని వాదిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు.మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కబెడుతూ డైట్ ఫాలో అవుతుంటే, నిస్సందేహంగా ఉడకబెట్టిన గుడ్డుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న కొవ్వులు లేదా అదనపు క్యాలరీలు ఉండే అవకాశం అస్సలు లేదు. అయితే, కూరగాయలతో పక్కాగా తయారుచేసిన ఆమ్లెట్కు మరో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ ఉంది. రెండు గుడ్లకు ఎక్కువ కూరగాయలు కలిపి వేసుకునే ఆమ్లెట్ ఎక్కువ క్వాంటిటీని ఇస్తుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచివేసి, జంక్ ఫుడ్స్ తినకుండా నియంత్రిస్తుంది. ఇందుకే చాలా మంది న్యూట్రిషనిస్టులు మీ డైట్ అవసరాలను బట్టి రోజు మార్చి రోజు ఈ రెండింటినీ మార్చుకుంటూ తినాలని సలహా ఇస్తుంటారు.చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి హెల్తీ డైట్లో ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ రెండూ కూడా అద్భుతమైన భాగాలే. మీ జీవనశైలికి, మీ రుచికి ఏది కంఫర్ట్‌గా ఉంటే దానిని సరైన పద్ధతిలో వండుకుని తినడమే అత్యుత్తమం. -
సానుకూల శక్తికి విపరీత కరణి ఆసనం..
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.ప్రయోజనాలు...ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.జాగ్రత్తలు....తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
90 డేస్ టీ చాలెంజ్! ఏం‘టీ’ నిజమా?
రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?మొదటివారంలో..టీలో ఉండే కెఫీన్‌కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.2–4 వారాల్లో...టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆందోళనకి దూరంటీలోని కెఫీన్ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.ఏం‘టీ’ నిజమా?ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ.టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.బ్రిటీషర్లు భారత్‌కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.వైట్ టీ తెలుసా?బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది. -
వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి?
‘వయసు కేవలం ఒక సంఖ్య’ అంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం అందుకు భిన్నం. క్యాలెండర్ మీ వయసు 25 లేదా 30 ఏళ్లు అయినా... మీ శరీరం మాత్రం 35 లేదా 40 ఏళ్ల వ్యక్తిలా పని చేస్తుండచ్చట! తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.అమెరికాలోని పరిశోధకులు లక్షలాది మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించగా.. నేటి తరం యువత శరీరాలు గత తరాలతో పోలిస్తే మరింత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనినే ‘బయోలాజికల్ ఏజింగ్’ అంటారు. అంటే పుట్టిన తేదీ ప్రకారం వచ్చే వయసు కన్నా శరీరం లోపల జరిగే మార్పుల వల్ల ఎంత వేగంగా ముసలితనం వస్తుందనేదే అసలు విషయం.వయసుదేముందిలే అని సరిపెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఈ అకాల, అనూహ్య, వేగవంతమైన వృద్ధాప్యం వల్ల 50 ఏళ్లలోపే క్యాన్సర్ బారినపడే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కనిపిస్తోందని తెలి΄ారు.అయితే దీనికి ఇతమిత్థంగా ఇదీ కారణం అని చెప్పలేమనీ, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి శరీరాన్ని వయసు కంటే ముందే బలహీనపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగని ఇది అంత భయపడాల్సిన విషయం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.తరచు నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. వాటర్ తాగడం పెరిగితే, మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికలతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మనం సాధారణంగా విటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా పొందుతాం. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.– నిర్వహణ: డి.వి.ఆర్ -
మీ పాప టీనేజ్‌లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!
చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్‌గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.శుభ్రతా ముఖ్యమే... ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.తగ్గ ఆహారం... ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్‌లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్‌వర్క్ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు.అంతేకాకుండా, టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.హార్మోన్లలో మార్పులు...టీనేజ్‌లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.అర్థం అయేలా చెప్పాలి...రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.వ్యాయామంతో...సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్‌ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. -
కండ కలిగితే ఆయుష్షు కలదోయ్!
ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దీంతోపాటు అప్పుడప్పుడూ కండలు పెంచేందుకు బరువులెత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కండలు ప్రదర్శనకు మాత్రమే కాదు...నాలుగు కాలాలు ఎక్కువ బతికేందుకూ సాయపడతాయట. ఇదేదో ఆషామాషిగా చేసిన అధ్యయనం కాదండోయ్. అమెరికాలో సుమారు 30 ఏళ్లుగా 1.5 లక్షల మంది నర్సులను పరిశీలించి చేసుకున్న నిర్ధారణ. రెండేళ్లకు ఒకసారి వీరి నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. వారంలో 90 – 120 నిమిషాలపాటు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు (బరువులు, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, డంబెల్స్, బార్బెల్స్) చేస్తే చేయని వారితో పోలిస్తే అకారణంగా మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు తేలింది. అలాగే గుండెజబ్బులతో మరణించే చాన్స్ 19%, నాడీ సమస్యలతో చావు ముప్పు 27% తక్కువైనట్లు తెలిసింది. బరువులు ఎత్తితే ఆరోగ్యమన్నారు కదా అని అతిగా చేయొద్దని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి రెండు గంటల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసినా అదనపు ప్రయోజనం ఏదీ లభించలేదు. మరో విషయం.. ఏరోబిక్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రెండు చేస్తే లాభమెక్కువ. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రెండున్నర గంటలు చేసిన వారిలో చావు ముప్పు 26 నుంచి 43 % తక్కువగా ఉన్నట్లు స్పష్టం కాగా... స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు జోడిస్తే ముప్పు మరింత తగ్గింది. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే... కేన్సర్ ఉన్న వాళ్లు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు కొంత తగ్గించడం అవసరం. వారంలో గంటపాటు చేసినా మెరుగైన ఫలితాలుంటాయి. కండలతో దీర్ఘాయుష్షు ఎలా...? శరీరం మొత్తమ్మీద జీవక్రియల పరంగా బాగా చురుకుగా ఉండేవి కండల్లోని కణజాలాలు. అందువల్లనే కండలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజు నియంత్రణ సాధ్యమవుతుంది. మధుమేహం నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. ఇది కాస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలు ముడుచుకుపోయినప్పుడు విడుదలయ్యే మైయోకైన్స్ అనేక జబ్బులకు దారితీయగల ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)లను తగ్గిస్తుంది. కండలు కాలేయం, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఎముకలు, మెదళ్లకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రక్తపోటును తగ్గించడమే కాకుండా.. రక్తనాళాలు పెళుసు బారకుండా చేస్తాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండలు గట్టిగా ఉంటే పట్టు బాగా ఉంటుంది కాబట్టి పడిపోవడం, ఎముకలు విరగడం వంటివి తక్కువగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం...జిమ్‌కు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇంట్లోనే రోజూ కాసేపు బరువులు ఎత్తేయండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మీకు మీరే దీవించేసుకోండి! –సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతే మత్తును చిత్తు చేయాలి
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (ఆడిక్షన్ ). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాఇ 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.హాలుసినోజెన్లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు. ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.డిస్అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి. నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు.డ్రగ్ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. ప్రస్తుతం గంజాయి వినియోగం కూడా ఎక్కువ అయింది. సిటీల్లో రేవ్ పార్టీల సంస్కృతి పెరుగుతుంది. పిల్లలు తల్లి తండ్రుల వద్ద ఉండకుండా చిన్న తనం నుంచి వారికి దూరం ఉండి చదువుకోవడం, ఒత్తిడిని తట్టుకునేందుకు డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. గట్టి కార్యాచరణ ద్వారానే వీటిని నియంత్రణ చేయవచ్చు.మాచన రఘునందన్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
మామ్ వెయిట్‌లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు..
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.కంటెంట్ క్రియేటర్ దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్ అవుట్‌గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్‌లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలుదీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్5 కేజీల డంబెల్‌ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్‌ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.వర్కౌట్ 3: స్క్వాట్స్స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లుఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడంతన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
తగ్గినట్టే తగ్గి..మళ్లీ యథావిధిగా! స్ట్రిక్ట్ డైటింగ్ చేసినా ఎందుకిలా అంటే..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్‌లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట. దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు. అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు గ్లోబల్ హెడ్ రేంజ్‌కు!) -
అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..
పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. ఆహారంలోని ప్రోటీన్ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుంటే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఆస్టియోపొరోసిస్ అంటే..ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్‌ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అలా చూసినప్పుడు తలనొప్పి చాలా సాధారణ సమస్య. అయితే కొన్ని జబ్బులకు తలనొప్పి ఒక సూచనలా, ఒక లక్షణంగా కూడా కనిపించవచ్చు. అందుకే తరచూ తలనొప్పితో బాధపడేవారిలో దాని కారణం కనుగొనడం కూడా డాక్టర్లకూ తలనొప్పే. తలనొప్పుల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల కారణాలతోనూ వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి తలనొప్పి కనిపించినా లేదా ఏదైనా ప్రత్యేక కారణంతో అప్పుడప్పుడూ వచ్చే తలనొప్పుల గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదుగానీ... కొన్ని తలనొప్పులను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అసలు స్థూలంగా చూసినప్పడు తలనొప్పులను ఎలా విభజించుకోవచ్చు. ఏయే సందార్భాల్లో తలనొప్పుల సీరియస్‌గా తీసుకోవాలో చూద్దాం.గతంతో పోలిస్తే ఇప్పుడు తలనొప్పులు మరింత తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఒకప్పుడు కాస్త పెద్దవయసువారిలో తరచూ కనిపించే ఈ తలనొప్పులు ఇటీవల చిన్నవయసువారిలోనూ కనిపిస్తున్నాయి. ఇక కొన్ని తలనొప్పులు జీవనశైలి మార్పుల వల్ల వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేగాటన కట్టడమూ సరికాదు. ఇలా చిన్నవయసు వారిలో తలనొప్పులు కనిపించగానే కళ్ల డాక్టర్‌తో కళ్లను పరీక్షింపజేసుకోవడమూ మామూలే. అలాగని మొత్తం కేసులను కళ్ల సమస్య ఖాతాలోనూ వేయడం సరికాదు. అందుకే తరచూ వస్తున్న తలనొప్పులను... అవి వచ్చే వేళలనూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో అంటే ఏదైనా వాసనలు పీల్చినప్పుడో లేదా ఏవైనా కాలుష్యాలకు గురైనప్పుడో వస్తుంటే వాటిని డాక్టర్లకు వివరించడమూ అవసరం. అప్పుడవి ఏ కారణంగా వస్తున్నాయో అంచనా వేయడానికీ డాక్టర్లకు అవకాశముంటంది.తలనొప్పుల గురించి విపులంగా...ప్రైమరీ తలనొప్పులు : సాధారణంగా ఇవన్నీ మెదడులోని రసాయనాల సమతౌల్యత తప్పడం వల్ల తలలో ఉద్భవించే తలనొప్పులని చెప్పవచ్చు. వీటిలో ప్రధానమైనవి...మైగ్రేన్...తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందునా యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. సాధారణంగా ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ... అది వచ్చినప్పుడు నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటూ చాలా ఎక్కువగా బాధిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వయసులో ఉన్న చాలా మందిలో వాళ్ల పనిగంటలనూ, స్కూలు పిల్లలూ, విద్యార్థుల్లో వాళ్లు చదివే సమయాన్ని ఎక్కువగా వృథాచేసే తలనొప్పి ఇదే.లక్షణాలు...ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చాలాచోట్ల దీన్ని ‘పార్శ్వపు నొప్పి’ అని కూడా అంటుంటారు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని సార్లు ఇది తలకు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు రెండు నుంచి నాలుగు గంటలు మొదలుకొని... కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకూ రావచ్చు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూడలేకపోవడం, వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలనిపించడం... లేదా చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి విపరీతంగా పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఆరా / ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.కారణాలు... మైగ్రేన్‌కు చాలా కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు... తీవ్రమైన ఒత్తిడీ, యాంగై్జటీ; తమకు సరిపడని పదార్థాలేవైనా తినడం (ఉదాహరణకు చాక్లెటు, ఛీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పండ్లు వంటివి... ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితోనే ఉండిపోవడం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాతా, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలూ లేదా కొన్ని రసాయనాలతో తయారుచేసిన సెంట్ల నుంచి వచ్చే బాగా ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్‌వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్ (ముఖ్యంగా చైనా సాల్ట్ వాడిన పదార్థాలు), యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతైన హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి.ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్...ఇవే కాకుండా కొందరిలో వారికి మాత్రమే ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేయవచ్చు. అంటే మైగ్రేన్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోకారణం వల్ల వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మైగ్రేన్ రావడానికి ముందు 6– 12 గంటల వ్యవధిలో ఏమైనా తిన్నారా, దేనికైనా ఎక్స్పోజ్ అయ్యారా వంటి అంశాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దీని ద్వారా నిర్దిష్టంగా తలనొప్పి ఏ కారణంగా వస్తుందో తెలుస్తుంది. ఈ కారణాలను మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా చెబుతారు.నిర్ధారణ ఇలా...మైగ్రేన్ నిర్ధారణకు నిర్దిష్టంగా వైద్య పరీక్ష అంటూ ఏదీ ఉండదు. అంటే మైగ్రేన్ అనేది నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షలోనూ తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని పట్టి ఇచ్చే ΄్యాటర్న్ అంటూ ఏదీ ఉండదు. అందుకే... తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఏ లోపమూ కనిపించకపోవడంతో పాటు... మైగ్రేన్‌లో కనిపించే ఒకవైపు తలనొప్పి లేదా దాని లక్షణాలతో అది తరచూ అదేపనిగా వస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి లక్షణాలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.చికిత్స..మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదటిది... తలనొప్పి తీవ్రతను వెంటనే తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. రెండోది... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకు ఇచ్చే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం డాక్టర్ల సలహా మేరకు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముందులు వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్‌కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇటీవల మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు బొటాక్స్ ఇంజెక్షన్‌ను ఉపయోగించి కూడా చికిత్స చేస్తున్నారు. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.క్లస్టర్ హెడేక్... మైగ్రేన్‌తో పోలిస్తే... ఇది కాస్తంత అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో ఇది మొదలవుతుంది. రెండు మూడు గంటలపాటు తీవ్రంగా బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు మళ్లీ రాకపోవచ్చు. అయితే... ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.చికిత్స...దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ముక్కు ద్వారా పీల్చే ట్రి΄్టాన్ మందులను ఇస్తారు. ఇలా మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక ఆ తర్వాత ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి ఉంటుంది.టెన్షన్ హెడేక్ : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ నొప్పి తలకు ఇరువైపుల గానీ లేదా కొన్నిసార్లు తలలో అన్నివైపులా ఉంటుంది. కొన్ని సార్లు చాలాకాలం (దీర్ఘకాలం పాటు) వస్తుంటుంది. ఒత్తిడి తీవ్రతను బట్టి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులూ, నెలల తరబడి కనిపించడం కూడా జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతోనే దీన్ని తగ్గించుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ ఒత్తిడి తగ్గించుకోడానికి అవలంబించే మార్గాలతో ఈ తలనొప్పి కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది.క్రానిక్ డైలీ హెడేక్... దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. మాత్ర వాడగానే మొదట్లో తలనొప్పులు తగ్గినప్పటికీ ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తూ ఉంటుంది.ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్... తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలనూ అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావడానికి అవకాశముంది.ప్రైమరీ స్టాబింగ్ హెడేక్... తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.ప్రైమరీ హెడేక్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావ్రపాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొపనలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు సూచిస్తారు.హిప్నిక్ హెడేక్... ఈ తరహా తలనొప్పి నిద్రలో మొదలై... నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు వస్తూనే ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.తలనొప్పులు స్థూలంగా ఎన్ని రకాలంటే...తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలూ, ఇతరత్రా చాలా అంశాల ఆధారంగా తలనొప్పులను చాలారకాలుగా విభజించవచ్చు. అయితే... తలనొప్పులు ఎందుకొస్తున్నాయనే కారణాలూ లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...1. ప్రైమరీ తలనొప్పులు : ఈ తలనొప్పులు నేరుగా తలలోనే పుడతాయి. అంటే... ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాటి రిఫరల్ పెయిన్ తలకు పాకడం వల్ల ఇవి రావడం లేదనీ... ఇవి నేరుగా తలలోనే పుడుతున్నాయని అర్థం.2. సెకండరీ తలనొప్పులు: ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతోగానీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా గానీ వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు రావచ్చు. అందుకే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.3. క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు : తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.సెకండరీ తలనొప్పులు...నేరుగా తలలో పుట్టే నొప్పులు కాకుండా... ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులివి. వీటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని ప్రధానమైన తలనొప్పులు.మెనింజైటిస్... ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది. ఇందులోని లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.బ్రెయిన్ ట్యూమర్... మెదడులో ఏర్పడే గడ్డల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పిలో.... మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో తలనొప్పితో పాటు వాంతులూ కావచ్చు. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి మరింత పెరుగుతుంది.ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు... తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరగవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులూ కనిపించవచ్చు. ఈ తరహా తలనొప్పిని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.టెంపోరల్ ఆర్టిరైటిస్... ఇది సాధారణంగా 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.గ్లకోమా హెడేక్... కంట్లో ఇంట్రా ఆక్యూలార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య నెమ్మదినెమ్మదిగా క్రమక్రమంగా బాధితులకు తెలియకుండానే చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. ఇవే గాక... పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు, మన దేహం భంగిమ (పోష్చర్) సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి.క్రేనియల్ న్యూరాల్జియా...మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. వీటి నుంచి వచ్చే తలనొప్పులను ‘క్రేనియల్ న్యూరాల్జియా’ అంటారు. న్యూరా.. అంటే నరం అనీ, అలాగే ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. అందుకే ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అని చెబుతుంటారు.ఆక్సిపెటల్ న్యూరాల్జియా... ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.ట్రైజెమినల్ న్యూరాల్జియా... ట్రైజెమినల్ నర్వ్ అని పిలిచే ఈ నరం... నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది. ఇది తీవ్రంగా ఉద్రిక్తమైనపుపడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇందులో ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లటి భాగాన్ని కూడా నమలలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నొప్పితో చాలాసార్లు బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.ఒక అపోహ – వాస్తవం... కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. నిజానికి హైబీపీ కారణంగా తలనొప్పి రావాలంటే బీపీ కొలత 180 / 110 ఉండాలి. అప్పుడు హైబీపీ కారణంగా తలనొప్పి వస్తుంది.తలనొప్పిని తీవ్రంగా పరిగణించి, ఎప్పుడు చికిత్సకు వెళ్లాలంటే...జీవితంలో మొట్టమొదటిసారే అయినప్పటికీ అది భరించలేనంత తీవ్రమైన తలనొప్పిగా వస్తున్నప్పుడు. మొదలు కావడమే తలబద్ధలైపోతూ భరించలేనంతగా తలనొప్పి వస్తున్నప్పుడు.సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా అసలేమీ తగ్గకుండా తలనొప్పి తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు.తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్/ చేయి లేదా కాలిలో బలహీనత వచ్చి కళ్లు మసకబారుతున్నప్పుడు.పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి వస్తుంటే.నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయించాల్సి ఉంటుంది.సాధారణ తలనొప్పి నివారణ ఇలా...తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి రాకపోయినా భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఇవే జాగ్రత్తలు పనికివస్తాయి. అవి...కంప్యూటర్‌పై పనిచేసేతవారు కంటిపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం. అలాగే ప్రతి గంటకోమారు అయిదు నిమిషాల పాటు రిలాక్స్ కావడం. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా తదేకంగా స్క్రీన్‌ను చూడటం సరికాదు.కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్ల అల్లకం పని చేస్తుండేవారు తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే న్యూరాలజిస్టుతో పాటు కంటి వైద్యులనూ సంప్రదించడం మంచిది.రోజూ ప్రశాంతంగా కంటినిండా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొంతమందికి వారి వ్యక్తిగత నిద్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా నిద్రపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రించడం మంచిది.మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయడం.ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయడం మేలు.కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలకు దూరంగా ఉండటం మంచిది.ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసుకోవడం సరికాదు.ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం మంచిదికాదు.తీవ్రమైన చప్పుళ్లకూ, చెవులు బద్దలు కొట్టే రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలారకాల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు.ఇతర రకాల తలనొప్పులు... ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్‌క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. అంటే దేహంలో ఒకచోట వచ్చిన నొప్పి మరోచోటికి పాకుతుంది. రిఫరింగ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు తలనొప్పి రూపంలో కనిపిస్తుంటాయి.తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొనేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి. తెలిసిన కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి.చివరగా... ముందుగా చెప్పినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి కనిపించకమానదు. అయితే మంచి జీవనశైలి (లైఫ్ స్టైల్) అలవాట్లతో చాలా రకాల తలనొప్పులను మాత్రమే కాదు... చాలా రకాల జబ్బులనూ నివారించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం నిద్రలేవగానే కనిపించే తలనొప్పలూ, వాటితో పాటు వాంతులు, వికారం, స్పృహ తప్పిపడిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలని తప్పక గుర్తుపెట్టుకోవాలి.- డా. ఎస్. రమేశ్, సీనియర్ న్యూరోసర్జన్ నిర్వహణ : యాసీన్ -
పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రంపండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్‌యూ) కోడ్‌లోనే అసలు రహస్యం ఉంది.4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్‌వో) పండ్లు. భారత్‌లో నిషేధం.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్‌ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్‌లో నిషేధం.స్టిక్కర్ కోడ్ చెక్ చేయండికొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఏవి?భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్‌లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్‌లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్‌ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్‌ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్‌లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్‌గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్‌లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్‌లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్‌లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్‌ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్‌ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్‌ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్‌ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్‌లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్


