ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్‌లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్‌కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్ చేసుకున్నారామె.
భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్‌గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్‌లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..
ఎముకలకు బలం..
రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.
మధుమేహం రోగులకు..
డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి.
రక్తహీనతకు..
రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
మితంగానే మంచిది..
ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది


