పెద్ద కార్పొరేట్ కంపెనీ, బిలియన్ల డాలర్ల ఆదాయం అంటే ఏం ఊహించుకుంటాం. ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక కంపెనీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే చాలా తక్కువ మంది ఉద్యోగులకు కంపెనీని నడిపిస్తోంది. కేవలం 42 మంది పూర్తి కాల ఉద్యోగులకు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎలా? పదండి మరి ఆ కంపెనీ రహస్యం ఏంటో తెలుసుకుందాం.
ఆ కంపెనీ పేరే ఓన్లీఫ్యాన్స్. ఇది అనేది లండన్, ఇంగ్లాండ్‌లో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫామ్. పోర్న్ రచనలకు ఎక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ, అథ్లెట్లు, సంగీతకారులు , హాస్యనటులతో సహా ఇతర కంటెంట్ సృష్టికర్తలను కూడా హోస్ట్ చేస్తుంది. 2016 దీన్ని స్థాపించారు. దీని సీఈవో కైలీ బ్లెయిర్.కంపెనీ కావాలనే తక్కువ మంది ఉద్యోగులకు నియమించుకుంది. ముఖ్యంగా నిపుణులైన సీనియర్లతో పాటు, ఉద్యోగం చేయాలని తపన ఉన్న జూనియర్లే ఈ కంపెనీకి ఆయువు పట్టు. మిడిల్‌మేనేజ్‌మెంట్ లేకుండా చేసి, ఉద్యోగులకు స్వేచ్ఛ నివ్వడమే తమ కంపెనీ విజయ రహస్యమంటారు. సీఈవో కైలీ బ్లెయిర్. నవంబర్‌లో లిస్బన్‌లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో మాస్టర్స్ ఆఫ్ స్కేల్ పాడ్‌కాస్ట్ హోస్ట్ జెఫ్ బెర్మాన్‌తో సంభాషణ సందర్భంగా బ్లెయిర్ ఈ విధానం గురించి చర్చించారు.ఘో
మంచి మిడిల్ మేనేజర్ ఉండనే ఉండడు
తమ కంపెనీ కేవలం 42 మంది పూర్తి-సమయ సిబ్బందితో మాత్రమే పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ టీంతోనే తమ కంపెనీ వార్షికంగా 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు చెప్పారు. చాలా పవర్ ఫుల్ టీం అని బెర్మాన్ ప్రశంసించగా, ఆ టీం సామర్థ్యాన్ని పర్యవేక్షించే మరో టీం లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది. నియామక తత్వంపై ఆమె ఇంకా ఇలా వివరించారు. నియామకంలో అనుభవం కంటే వైఖరి, ఆప్టిట్యూడ్ చూస్తాము. మనస్తత్వం , సామర్థ్యానికి ప్రాధాన్యత తప్ప ఓన్లీ ఫ్యాన్స్‌లో మిడిల్ మేనేజ్‌మెంట్ పొర ఉండదు. ఎందుకంటే తన అనుభవంలో ఎవరికీ నిజంగా మంచి మిడిల్ మేనేజర్ లేడు అని ఆమె స్పష్టం చేయడం విశేషం.ఎంత మంది వ్యక్తులను పర్యవేక్షిస్తారనే బట్టి లీడర్స్‌ను అంచనా వేసే సాధారణ కార్పొరేట్ పద్ధతికి తాను వ్యతిరేకినని బ్లెయిర్ చెప్పారు.
ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
గతంలో న్యాయవాదిగా పనిచేసిన బ్లెయిర్ 2022 జనవరిలో లండన్‌కు చెందిన కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ , ఆపరేషన్స్ ఆఫీసర్‌గా చేరారు.తరువాత 2023లో కంపెనీకి సీఈఓగా మారింది. ఈప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. సుమారు 40 లక్షల కంటెంట్ క్రియేటర్లను హోస్ట్ చేసింది సృష్టికర్తలకు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రధాన సాంకేతిక సంస్థలలో కంపెనీ మిడిల్-మేనేజ్‌మెంట్ స్థానాలను తగ్గించిన నిర్మాణ విస్తృత ధోరణిని ఇది ప్రతిధ్వనిస్తుందని కూడా ఆమె చెప్పడం విశేషం.
ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్


