breaking news
middle
-
42 మంది ఉద్యోగులు,40 కోట్ల యూజర్లు,700 కోట్ల డాలర్లు, రహస్యం ఇదే!
పెద్ద కార్పొరేట్ కంపెనీ, బిలియన్ల డాలర్ల ఆదాయం అంటే ఏం ఊహించుకుంటాం. ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక కంపెనీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే చాలా తక్కువ మంది ఉద్యోగులకు కంపెనీని నడిపిస్తోంది. కేవలం 42 మంది పూర్తి కాల ఉద్యోగులకు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎలా? పదండి మరి ఆ కంపెనీ రహస్యం ఏంటో తెలుసుకుందాం.ఆ కంపెనీ పేరే ఓన్లీఫ్యాన్స్. ఇది అనేది లండన్, ఇంగ్లాండ్‌లో ఉన్న సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫామ్. పోర్న్ రచనలకు ఎక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ, అథ్లెట్లు, సంగీతకారులు , హాస్యనటులతో సహా ఇతర కంటెంట్ సృష్టికర్తలను కూడా హోస్ట్ చేస్తుంది. 2016 దీన్ని స్థాపించారు. దీని సీఈవో కైలీ బ్లెయిర్.కంపెనీ కావాలనే తక్కువ మంది ఉద్యోగులకు నియమించుకుంది. ముఖ్యంగా నిపుణులైన సీనియర్లతో పాటు, ఉద్యోగం చేయాలని తపన ఉన్న జూనియర్లే ఈ కంపెనీకి ఆయువు పట్టు. మిడిల్మేనేజ్మెంట్ లేకుండా చేసి, ఉద్యోగులకు స్వేచ్ఛ నివ్వడమే తమ కంపెనీ విజయ రహస్యమంటారు. సీఈవో కైలీ బ్లెయిర్. నవంబర్‌లో లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో మాస్టర్స్ ఆఫ్ స్కేల్ పాడ్‌కాస్ట్ హోస్ట్ జెఫ్ బెర్మాన్తో సంభాషణ సందర్భంగా బ్లెయిర్ ఈ విధానం గురించి చర్చించారు.ఘోమంచి మిడిల్ మేనేజర్ ఉండనే ఉండడుతమ కంపెనీ కేవలం 42 మంది పూర్తి-సమయ సిబ్బందితో మాత్రమే పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ టీంతోనే తమ కంపెనీ వార్షికంగా 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు చెప్పారు. చాలా పవర్ ఫుల్ టీం అని బెర్మాన్ ప్రశంసించగా, ఆ టీం సామర్థ్యాన్ని పర్యవేక్షించే మరో టీం లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది. నియామక తత్వంపై ఆమె ఇంకా ఇలా వివరించారు. నియామకంలో అనుభవం కంటే వైఖరి, ఆప్టిట్యూడ్ చూస్తాము. మనస్తత్వం , సామర్థ్యానికి ప్రాధాన్యత తప్ప ఓన్లీ ఫ్యాన్స్‌లో మిడిల్ మేనేజ్మెంట్ పొర ఉండదు. ఎందుకంటే తన అనుభవంలో ఎవరికీ నిజంగా మంచి మిడిల్ మేనేజర్ లేడు అని ఆమె స్పష్టం చేయడం విశేషం.ఎంత మంది వ్యక్తులను పర్యవేక్షిస్తారనే బట్టి లీడర్స్‌ను అంచనా వేసే సాధారణ కార్పొరేట్ పద్ధతికి తాను వ్యతిరేకినని బ్లెయిర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులుగతంలో న్యాయవాదిగా పనిచేసిన బ్లెయిర్ 2022 జనవరిలో లండన్‌కు చెందిన కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ , ఆపరేషన్స్ ఆఫీసర్‌గా చేరారు.తరువాత 2023లో కంపెనీకి సీఈఓగా మారింది. ఈప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. సుమారు 40 లక్షల కంటెంట్ క్రియేటర్లను హోస్ట్ చేసింది సృష్టికర్తలకు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రధాన సాంకేతిక సంస్థలలో కంపెనీ మిడిల్-మేనేజ్మెంట్ స్థానాలను తగ్గించిన నిర్మాణ విస్తృత ధోరణిని ఇది ప్రతిధ్వనిస్తుందని కూడా ఆమె చెప్పడం విశేషం. ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ -
ఒక రోడ్డు... కొన్ని చెట్లు
పట్నా: నల్లగా నిగనిగా మెరిసిపోతున్న సువిశాలమైన, నున్నని తారు రోడ్డు. చూద్దామన్నా ఎక్కడా ఒక్క గుంత కూడా లేదు. రెండువైపులా ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న చెట్లు. అలాంటి రోడ్డుపై యమా స్పీడుతో దూసుకుపోవాలని ఎవరికి మాత్రం ఉండదు! అలా వెళ్లే క్రమంలో ఆ చెట్లే ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైతే? బిహార్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. పట్నాకు కేవలం 50 కి.మీ. దూరంలోని జెహానాబాద్‌లో రూ.100 కోట్ల వ్యయంతో ఓ రోడ్డును సువిశాలంగా విస్తరించారు. కానీ ఏడున్నర కి.మీ. పొడవైన ఆ రోడ్డు మధ్య ఒకచోట ఏపుగా పెరిగిన చెట్లను ఇదుగో, ఇలా వదిలేశారు. ఇదేం అనాలోచితమైన పనంటారా? దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ దాగుంది. ఈ చెట్లను తొలగిస్తామంటూ రోడ్డు నిర్మాణ సమయంలో జిల్లా యంత్రాంగం అటవీ శాఖను సంప్రదించింది. అందుకు శాఖ తొలుత అనుమతి నిరాకరించింది. పదేపదే కోరిన మీదట, ఏకంగా 14 హెక్టార్ల మేరకు అటవీ భూమికి సమానమైన పరిహారం కోరింది. అంత మొత్తం సమర్పించుకోవడం తమవల్ల కాదంటూ జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. అలాగని ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కూడా మనసు రాలేదు. దాంతో అటవీ నిబంధనలను ఉల్లంఘించకుండా చెట్లను ఇలా రోడ్ల మధ్యే వదిలేస్తూ పని పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం జనానికి అక్షరాలా ప్రాణాంతకంగా మారింది. ఎందుకంటే ఆ చెట్లు రోడ్డుపై కనీసం ఒక వరుసలో కూడా కాకుండా ఇక్కడొకటి, అక్కడొకటి అన్నట్టుగా చెల్లాచెదురుగా ఉండిపోయాయి. వాటిగుండా పోవాలంటే వాహనాలను నానా వంపులూ తిప్పుతూ విచిత్రమైన ఫీట్లు చేయాల్సిందే. ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. దాంతో చూస్తుండగానే ఇది మృత్యుమార్గంగా మారిపోయింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఈ చెట్ల బెడదను తప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. మన దేశంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమికి ఇది మరో తిరుగులేని ఉదాహరణ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
వంతెన మధ్యలో మొరాయించిన రైలు.. ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లు
ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది.బీహార్‌లోని సమస్తీపూర్‌లో రైలు ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్‌లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని ఏదో వాల్వ్ నుంచి ఎయిర్ ప్రజర్ లీక్ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లూ ఇంజిన్‌లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్‌పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా ఎయిర్ ప్రజర్ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.ఈ సందర్భంగా సమస్తీపూర్ డీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు. -
మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!
ఈ రోజుల్లో సాటి మనుషులపై, జంతువులపై దయ, ప్రేమ చూపేవారు చాలా అరుదైపోయారు. ఆపదలో ఉన్న జంతువులను, మనుషులను కనీసం పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇతరులకు తోచిన సహాయం చేస్తూ కనిపించినప్పుడు జనం ఆ వ్యక్తిని అమితంగా గౌరవిస్తారు. ఇతరుల మీద దయ, ప్రేమలను ఎవరైనా చూపిస్తే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుక్కను కాపాడుతూ కనిపించాడు. ‘ఎక్స్’లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్లను చేరుకునేందుకు ఆ వ్యక్తి ట్రాఫిక్‌ను ఎంతో ధైర్యంగా దాటాడు. ఆ కుక్కకు ప్రేమతో కూడిన స్పర్శను అందించాడు. ఈ అద్భుతమైన క్లిప్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 43 వేలకు మించిన వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియో మూగజీవాలపై చూపాల్సిన సానుభూతి గురించి తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? An angel saving another angel This kind soul spotted an abandoned puppy on a busy freeway and rushed to save him from a certain injury or worse. The herododges traffic and approaches the dog gently to gain his trust, petting him sweetly. pic.twitter.com/MtmxPQ8f77 — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 1, 2023 -
వెంకటేష్ తో అర్దాంతరంగా సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే...
-
‘ఆమె జాక్‌పాట్ కొట్టింది’
వాషింగ్టన్ : జూలీ బ్రిస్క్‌మాన్.. అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యవేలు చూపించి తన అసహనాన్ని ప్రకటించిన మహిళ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. రెండువారాల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్జీనియాలో గోల్ఫ్ ఆడి తిరిగి వెళుతున్న సమయంలో జూలీ.. ఆయన కాన్వాయ్‌ని వెంబడించి మరీ మధ్య వేలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జూలీని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆమెకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఆమెకు ఆర్థిక అవసరాల నిర్వహణ కోసం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న అకిమా.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను సేకరించడం మొదలు పెట్టారు. ట్రంప్‌కు జూలీ మధ్యవేలు చూపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం..అదే సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో నెటిజన్లకు జూలీ మీద అభిమానం పొంగింది. దీంతో కేవలం 7 రోజుల్లోనే 70 వేల డాలర్ల ఫండ్ సమకూరాయి. ఈ మొత్తాన్ని కేవలం 3 వేల మంది దాతలు అందించడం విశేషం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా లక్ష డాలర్లు సేకరించి ఆమెకు అందిస్తున్నట్లు అకిమా తెలిపారు. -
సముద్రంలో మత్స్యకారుల పడవలో మంటలు
-
ప్రధాని మోదీ ఇప్పటికీ టాపరే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య తరగతి ప్రజల దృష్టిలో నేటికీ టాపర్ అంటున్నాయి తాజా సర్వేలు. భారత్ లోని ప్రధాన ఏడు నగరాల్లో జరిపిన సర్వేలలో మోదీనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వేలో వెల్లడి అయ్యాయి. నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓ బలమైన మెజారిటీ తో అధికారాన్ని కైవసం చేసుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. అయిప్పటికీ మోదీనే అధిక మద్దతు కలిగి ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వే లెక్కలు నిరూపిస్తున్నాయి. ఆయన అజెండాలో కీలక అంశాల సంస్కరణలో వైఫల్యం చెందడంతోపాటు, అనేక వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రేటింగ్స్ లో ఫస్ట్ మార్కును మాత్రం కోల్పోలేదని తాజా సర్వేలు తేల్చి చెప్పాయి. ఆర్థిక పనితీరులో 86 శాతం, ఉద్యోగ సృష్టిలో 62 శాతం, భవిష్యత్ ప్రణాళికల విషయంలో 58 శాతం మోదీ ప్రభుత్వం మార్కులు కొట్టేసిందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. అచ్చేదిన్ ఆనేవాలా హై అంటూ నమ్మకంగా చెప్పే మోదీ ప్రజల్లో నేటికీ మొదటి స్థానంలోనే ఉన్నారని ఈటీ-టీఎన్ఎస్ సర్వే చెప్తోంది. -
ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు!
మేలి ముసుగు వేసుకొని తెల్లని బ్రైడల్ ఫ్రాక్‌తో మెరిసిపోతున్న 12 ఏళ్ల వధువు... సూటూ బూటూ వేసుకొని.. చూసేందుకు ఆమెకు తాతలా కనిపిస్తున్న వరుడు.. సముద్ర తీరంలో జరిగిన ఆ వివాహ వీడియో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. చిన్నారి పెళ్లి కూతురికి... అంత పెద్ద వరుడితో పెళ్లి చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి వీడియో చాలా మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ వాళ్లిద్దరూ యాక్టర్లు అన్న సంగతి తెలిసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. విడుదలైన క్షణాల్లోనే ఆ పెళ్లి వీడియో సుమారు 20 లక్షల మందిని ఆకట్టుకుంది. అందులో కనిపించే దృశ్యం కథే అయినా.. లెబనాన్, సిరియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లకు బలవుతున్న వేలమంది చిన్నారుల జీవితాల వాస్తవిక గాధ అది. ఈ వీడియోనే కాదు... అందులోని విషయం కూడా షాక్‌కు గురి చేసేదేనని వీడియో ప్రచారకర్త మాయా అమ్మర్ అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్ల వయసు రాకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఎనిమిదేళ్ల వయసులోపు బాలికలు సుమారు కోటిన్నర మందికి 60-70 ఏళ్ల వయసువారితో బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. యుఎన్ఎఫ్ పిఏ లెక్కల ప్రకారం 2050 నాటికి ఆ లెక్కలు 120 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాల్య వివాహాలను నిషేధించడంలో భాగంగా తాజాగా లెబనాన్ ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి వివాహం రిజిస్టర్ కావడంతో బాల్య వివాహాలు అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం 14 సంవత్సరాలు వచ్చేవరకూ బాలికలకు వివాహానికి అనుమతి లేకపోయినా.. తల్లిదండ్రులు తొమ్మిదేళ్ళు వచ్చేసరికల్లా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలను పరిశీలిస్తే చట్ట ప్రకారం బాలికల పెళ్ళి వయసు కనీసం 12 ఏళ్ళుగా తెలుస్తోంది. ట్రినిడాడ్, తొబాగోల్లో 12 ఏళ్ళు, సిరియాలో 13 ఉంది. కాగా కనీసం 14 ఉండాలని కెనాన్ చట్టం చెప్తోంది. కాంగోలో 15, వెనెజులాలో 18 ఉండగా అక్కడి తల్లిదండ్రులు మాత్రం 14 లోపు వయసువారికే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలాగే బొలీవియాలో చట్టప్రకారం బాలికల పెళ్ళి వయసు 21 ఉండగా... కుటుంబీకులు 14 నుంచి 16 ఏళ్ళ వయసులోపు బాలికలను వివాహానికి అనుమతిస్తున్నారు. దీంతో మైనర్లే గర్భవతులుగా కూడ మారుతున్నారు. అలాగే ఇరాన్ లో అబ్బాయిలకు 15, అమ్మాయిలకు 13 ఏళ్ళ వయసును చట్టప్రకారం నిర్ణయించినా.. అంతకన్నా ముందే కుటుంబీకులు వివాహాలకు అనుమతిస్తున్నారు. ఇరాక్, సిరియా, యెమన్లలోనూ సుమారు 18 సంవత్సరాల వయసులో పెళ్ళి చేయాలని చట్టం చెప్తుంటే 13 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు బాలికలకే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో మాత్రం అబ్బాయికి 18, అమ్మాయికి 16 ఏళ్ళు ఉండాలని చట్టం చెప్తోంది. అయితే అంతకన్నా ముందు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే శిక్షార్హులవుతారని కూడా చట్టం హెచ్చరిస్తోంది. లిబియాలో చట్టబద్ధమైన వయసు మహిళలు, పురుషులకు 20 సంవత్పరాలుగానే ఉన్నా... అంతకు ముందు చేసుకోవాలనుకున్నవారిని కోర్టులు అనుమతిస్తున్నాయి. జోర్దాన్ లో ఎటువంటి అనుమతి అవసరం లేకుండా పెళ్ళికి ఇద్దరికీ 18 సంవత్సరాలు ఉండాలని చట్టం ఉండగా... షరియాలో అబ్బాయిలు మినహా.. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే 15 ఏళ్ళ బాలికలకు వివాహం చేసేందుకు కోర్టులు అనుమతిస్తున్నాయి. -
కూరగాయలు కొనలేం!


