breaking news
Jogulamba
-
మురుగు పాలిటీలు..!
జిల్లా కేంద్రమైన గద్వాలలో పడకేసిన పారిశుద్ధ్యం ● చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు నిండి రోడ్లపైకి చేరుతున్న మురుగు ● రోజుల తరబడి కాల్వల్లో పేరుకుపోతున్న పూడిక ● కంపుకొడుతున్న కాలనీలు గద్వాలటౌన్: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షం, వరద నీరు సాఫీగా వెళ్లడానికి నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలతోపాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంలో సమస్య జఠిలంగా మారింది. మున్సిపాలిటీలోని 37 వార్డులతోపాటు ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీలు నిర్మించిన తీరు చూస్తే ఆయా ప్రాంతవాసులు ఆగ్రహించే పరిస్థితి నెలకొంది. కృష్ణవేణి చౌరస్తా నుంచి సత్యసాయి మందిరం వరకు ఉన్న పెద్ద డ్రెయినేజీలో పూడిక పేరుకుపోయింది. కుంటవీధిలోని డ్రెయినేజీల పరిస్థితి సరేసరి. దీంతో ఆ పరిసరాలు దుర్గంధంగా మారాయి. సుంకులమ్మమెట్టు, కుంటవీధి, ఓంటెలపేట, గంటగేరి, వడ్డేగేరి, చింతలపేట తదితర ప్రాంతాల్లో పూడిక, వ్యర్థాపదార్థలు పేరుకపోయాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న కందకం మురుగుకూపంగా మారింది. -
ప్రజాస్వామ్య రక్షణే జై సంవిధాన్ లక్ష్యం
పాన్‌గల్: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీ, జై సంవిధాన్ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంటలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అర్హులందరికీ రైతు భరోసా.. రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని.. గ్రామాల వారీగా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు అర్హత ఉన్న రైతు భరోసా రాలేదని.. మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్లు తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.81 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల గదులను మంత్రి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయం చాలా విలువైందని, వినియోగించుకొని లక్ష్యానికి అనుగుణంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని.. సమయం విలువ, గెలుపు సాధించే వరకు విశ్రమించకూడదని తెలిపే పాటలను సెల్ఫోన్లో విద్యార్థులకు వినిపించారు. ప్రతి విద్యార్థికి ఈత తప్పక వచ్చి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్‌సాగర్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఈఓ అబ్దుల్ ఘనీ, జీసీడీఓ సుబ్బలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసులు, తహసీల్దార్ అబ్రహంలింకన్, ఎంపీడీఓ గోవింద్రావు, ఎస్ఓ హేమలత, ఏపీ ఎం వెంకటేష్‌యాదవ్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
ఉండవెల్లి: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని, ప్రతి రైతు ఇది పాటించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా పప్పు ధాన్యాలు, తృణధాన్యాల మినీ కిట్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కందుల పాకెట్లను రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈమేరకు నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన రైతులకు కందుల మినీ బ్యాగులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఏఈఓలు పంటలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని, లేదంటే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని.. మేలు చేసే విధంగా వ్యవహరించాలని, రైతులకు సహకరించాలని తెలిపారు. రైతులందరు వేసిన పంటను వెయ్యకుండా జాగ్రత్తలు పాటించి, పంట మార్పిడి చేయ్యాలని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రకాల కందులను రైతులు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓలు అనిత, రవి, నాగర్జున, పీఎసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిస్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలిగద్వాల: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు విస్తృతం చేయాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా సర్ జీన్ హెన్రీ డ్యూ నాంట్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు అత్యంత అభినందనీయమైనవి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, కో– ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సోసైటీ చైర్మన్ రమేష్, రాష్ట్ర ఈ.సి మెంబర్ మోహన్‌రావు, వైస్ చైర్మన్ తాహిర్, తదితరులు ఉన్నారు. -
డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు
డ్రెయినేజీలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం లేదు. ఒక చోట శుభ్రం చేస్తూ మరోచోట వదిలేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయాన్ని పలుసార్లు పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. వ్యర్థాలు, చెత్తాచెదారంతో డ్రెయినేజీలన్ని పూడకపోయి దుర్గందభరితంగా మారాయి. – రమణ, గద్వాల ఎప్పటికప్పుడు చర్యలు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. డ్రెయినేజీ, పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పూడికతీయడానికి అవసరమైన డ్రైన్లు గుర్తించడం జరిగింది. – దశరథ్, కమిషనర్, గద్వాల ● -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా కలెక్టర్ సంతోష్‌కు అందించారు. ఈసందర్భంగా ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వచ్చిన సమస్యలను ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 67 ఫిర్యాదులు వచ్చిన్నట్లు వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 18 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 18 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితుల నుంచి ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం చేకూరుస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ ప్రజావాణికి 67 ఫిర్యాదులు -
జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 73.521 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 86.948 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రెండు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 160.469 మి.యూ విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి ఉపయోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. రామన్‌పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 150 క్యూసెక్కుల నీరు పారుతుండగా.. సమాంతర కాల్వకు సరఫరా లేదన్నారు. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 610 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
‘సమాలోచన సదస్సు’ను జయప్రదం చేయాలి
ఎర్రవల్లి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నో రంగాల్లో శాశ్వత వెనుకబాటుతనాన్ని కలిగి ఉందని దీనిపై సమాలోచన చేసేందుకు గాను జులై 5న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సును జయప్రదం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఇక్బాల్ పాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు రెండు పార్లమెంట్, 14 శాసనసభ స్థానాలతో ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాను నేడు అద్దాన్ని పగలకొట్టినట్లు ఏడు జిల్లాలోకి చెదరగొట్టిన ప్రాంతంగా మిగిలిందన్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా ప్రజలకు త్రాగునీరు, పంటలకు సాగునీరు సక్రమంగా అందడంలేదన్నారు. ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మధ్యలోనే వదిలేశాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పాలమూరు ఎన్నో రంగాల్లో పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య వి/్ఞానకేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్ నందు ఏర్పాటు చేసిన సమాలోచన సదస్సుకు కవులు, మేధావులు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై పాలమూరు సమస్యలపై చర్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పాలమూరులో నెలకొన్న పలు సమస్యలకు సంభందించిన వాల్ పోస్టర్లను స్థానిక నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోకన్వీనర్ హనుమంతు, జేఏసీ చైర్మన్ రాగన్న, రాగన్న, కృష్ణ, శాంతన్న, నాగన్న, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆరోగ్య శ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లా వైద్య సంస్థలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఎన్ఎంసీ మెడికల్ కళాశాలను ఆన్లైన్ విధానంలో పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం తీసుకోరావడం జరిగిందన్నారు. మెడికల్ కళాశాలలో వసతులు, సౌకర్యాలు, నిర్వహణ తదితర అంశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిల్లో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ పరంగా రోగులకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోందని, దీనికి తమ వంత సహకారం అందజేస్తానని తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్ధులతో ఆయన మాట్లాడారు. ఆరోగ్య శ్రీ సేవల అంశాలను జిల్లా అసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు, అశోక్, వెంకటేష్, ప్రభాకర్‌లను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్, ప్రిన్సిపల్ నాగశేఖర్, రమాదేవి, అసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరా తదితరులు ఉన్నారు. -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. -
‘పెట్టుబడిదారి దోపిడీతో దేశంలో అసమానతలు’
అలంపూర్: పెట్టుబడిదారి సమాజం తన దోపిడీని కొనసాగించడంతోనే దేశంలో అసమానతలు పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. అలంపూర్‌లో సీపీఎం రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం జరిగాయి. ముగింపు సమావేశానికి ఎండీ అబ్బాస్, రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్ హాజరై మాట్లాడారు. సకల సమస్యలకు ప్రధాన కారణం దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక రాజకీయ సామాజిక అంతరాలే అన్నారు. ఆర్థిక, రాజకీయ సామాజిక, అంతరాలు లేని సామ్యవాద సమాజ స్థాపనతోనే సమాజంలో ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు.● పాలకులు సంపదను కేంద్రీకరించి ఆర్థిక అసమానతలు పెంచుతున్నారన్నారు. రాజకీయాలను వ్యాపారీకరణ చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారన్నారు. పార్లమెంట్లో రాజకీయ అవకాశలను దూరం చేస్తున్నారని, వివక్ష అంటరానితనం పెంచి సమాజంలో విభజన రాజకీయాలకు ప్రోత్సహస్తున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. అనంతరం ఆర్. శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. సీపీఎం ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తోదన్నారు.ఆర్డీఎస్ను ఆధునీకరించాలి..సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ను ఆధునీకరించి పూర్తి స్థాయి నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని, మల్లమ్మకుంట, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వార చివరి ఆయకుట్టు వరకు సాగు నీరు అందించాలన్నారు. జూరాల ప్రాజెక్టు మరమ్మతు తక్షణమే చేపట్టి మూడు పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలో కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. 2009 వరద బాదితులకు ప్లాట్లు, ఇండ్లు ఇస్తామని ఇప్పటికి కార్యాలయాల చూట్టు తిప్పుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు జి. రాజు, రేవల్లె దేవదాసు, జీకే ఈదన్న, పరంజ్యోతి, మద్దిలేటి, వివి నరసింహ్మా, నరసింహ, నర్మద పాల్గొన్నారు.జోగుళాంబ సన్నిధిలో సినీ హీరోయిన్అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ ఆలయాన్ని సినీ హిరోయిన్ సుమయ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా ఆలయ ఆధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. -
కమిషనర్ల బదిలీల వివరాలిలా..
అలంపూర్: జిల్లాలోని మున్సిపాలిటీలకు కమిషనర్ల గండం వెంటాడుతుంది. ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరు ఏడాదిలోపే బదిలీపై వెళ్తున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉండగా.. అలంపూర్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. గద్వాల మున్సిపాలిటీ పాతది కాగా.. అలంపూర్, వడ్డేపల్లి, అయిజకు ఆతర్వాత మున్సిపాలిటీ హోదా దక్కాయి. కొత్తగా ఏర్పడ్డ మూడు మున్సిపాలిటీల్లో కమిషనర్ల మార్పు నిత్యకృత్యంగా మారింది. ఏ కమిషనర్ ఎప్పుడు బదిలీ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాది గడవక ముందే వివిధ కారణాలతో కమిషనర్లకు స్థాన చలనం కలుగుతుంది. దీంతో మున్సిపాలిటీల్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతోంది. బదిలీలపై సందేహాలెన్నో.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కమిషనర్ల బదిలీలు అనేక సందేహాలకు దారితీస్తున్నాయి. రాజకీయ కారణాలతోపాటు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి ఇమడలేక పైస్థాయి పైరవీలతో వెళ్తున్నారనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతుంది. దీనికితోడు రెండు వర్గాలు, రాజకీయాలు సైతం కమిషనర్ల బదిలీలకు కారణంగా చెప్పుకొంటున్నారు. అయిజ మున్సిపాలిటీలో అత్యధికంగా 33 మంది బదిలీ కాగా అలంపూర్‌లో 14 మంది బదిలీ అయ్యారు. వడ్డేపల్లిలోనూ 11 మంది కమిషనర్లు మార్పు జరిగింది. మూడు మున్సిపాలిటీల్లో 58 మంది కమిషనర్లు బదిలీ కావడం గమనార్హం. ఇదిలాఉండగా, పురపాలికల్లో తరచూ కమిషనర్లు బదిలీ అవుతుండడంతో ఇన్‌చార్జ్‌లే అధికంగా పాలన సాగించారు. అయిజ 2012లో మున్సిపాలిటీగా మారగా.. అప్పటి నుంచి ఇన్‌చార్జ్‌ల పాలనే అధికంగా సాగింది. 33 మందిలో 18 మంది ఇన్‌చార్జ్‌లే ఉన్నారు. ఇక అలంపూర్ మున్సిపాలిటీ 2018లో ఏర్పడింది. తొలి కమిషనర్‌గా తహసీల్దార్ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. కానీ అదే రోజు ఎంపీడీ మల్లికార్జున్‌కు బాధ్యతలు మార్పు చేశారు. ఆయన 6 నెలల 16 రోజులు ఇన్చార్జ్గా ఉన్నారు. కమిషనర్ మున్సిపాలిటీ బాధ్యతల బదిలీ పనిచేసిన కాలం స్వీకరణ అయ్యింది జి.రాజు అలంపూర్ 15.04.21 30.06.21 45 రోజులు ఎస్.నిత్యానంద్ అలంపూర్ 30.6.21 12.10.23 2 ఏళ్ల 3 నెలలు జి.నర్సయ్య అలంపూర్ 12.10.23 14.2.24 4 నెలలు పి. సరస్వతి అలంపూర్ 15.2.24 28.10.24 8 నెలల 14 రోజులు ఎస్.రాజయ్య అలంపూర్ 17.11.24 28.01.25 2 నెలల 11 రోజులు పి.చంద్రశేఖర్‌రావు అలంపూర్ 29.1.25 23.6.25 4 నెలల 23 రోజులు శ్రీరాములు అలంపూర్ 27.06.25 వెంకటయ్య అయిజ 9.3.19 30.4.19 50 రోజులు టి.కృష్ణాసింగ్ అయిజ 14.11.19 20.11.19 6 రోజులు సీహెచ్ వేణు అయిజ 21.9.20 10.11.20 49 రోజులు ఎన్. వేణుగోపాల్ అయిజ 1.2.21 31.8.21 8 నెలలు జీ. నర్సయ్య అయిజ 1.9.21 12.10.23 2 ఏళ్ల 2 నెలు నిత్యానంద్ అయిజ 13.10.23 13.2.24 4 నెలలు సీ. సత్యబాబు అయిజ 14.2.24 31.7.24 4 నెలల 15 రోజులు సైదులు అయిజ 29.1.25 5 నెలలు వరుణ్‌కుమార్ వడ్డేపల్లి 27.1.20 31.03.20 2 నెలల 27 రోజులు వరుణ్‌కుమార్ వడ్డేపల్లి 1.4.21 01.521 30 రోజులు వేణుగోపాల్ వడ్డేపల్లి 2.5.21 13.5.21 11 రోజులు పీ.పల్లారావు వడ్డేపల్లి 14.5.21 30.11.21 6 నెలల 14 రోజులు ఎస్.నిత్యానంద్ వడ్డేపల్లి 1.12.21 11.10.23 23 నెలల 10 రోజులు లక్ష్మారెడ్డి వడ్డేపల్లి 11.10.23 28.10.24 వరకు 12 నెలలు ఎస్.రాయయ్య వడ్డేపల్లి 28.10.24 8 నెలలుగా.. నత్తనడకన అభివృద్ధి పనులు తరచూ కమిషనర్ల బదిలీలు జరుగుతుండడంతో మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల పాలక వర్గం పదవీకాలం ముగిసి దాదాపు 6 నెలలు పూర్తి కావస్తుంది. అధికారులపైనే మున్సిపల్ అభివృద్ధి ఆధారపడి ఉంది. కానీ మున్సిపాలిటీల నిర్వహణలో కీలక బాధ్యతలు పోషించే అధికారులు తరచు బదిలీలు అవుతున్నారు. దీంతో పురపాలికల్లో అభివృద్ధి ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. సమీకృత మార్కెట్ యార్డులు, మున్సిపల్ భవనాలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు, పట్టణ సుందరీకరణ, డివైడర్ నిర్మాణాలు.. ఇలా ఏ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కమిషనర్ల బదిలీలు, అభివృద్ధిపై సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. స్థిరత్వం లేని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు లేని పురపాలికపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోతున్న అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కారం కాక ప్రజలకు తప్పని ఇబ్బందులు అయిజ పురపాలికలో అత్యధికంగా 33 మంది కమిషనర్ల బదిలీ అలంపూర్‌లో 15 మంది, వడ్డేపల్లిలో 12 మంది కమిషనర్ల మార్పుపై సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్స్ -
సమస్యలు పరిష్కరించాలి..
గ్రామాల్లో భూ సర్వేకు సంబంధించిన సమస్యలతోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్, సబ్ డివిజన్ సర్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. రీ సర్వే చేసి రికార్డులు, మ్యాపులు కొత్తవి సిద్ధం చేయాలి. పూర్తిస్థాయిలో సర్వేయర్లను నియమించి రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే సమస్యలను పరిష్కరించాలి. – మల్లేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు, హన్వాడ మండలం లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నాం. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం. ఎఫ్‌లైన్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూస్తాం. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణ సర్వే పనుల్లో సర్వేయర్లు ఉండటంతో కాస్త ఆలస్యం జరుగుతుంది. – కిషన్‌రావు, సర్వే ల్యాండ్ ఏడీ, మహబూబ్‌నగర్ ● -
సోమశిలకు సొబగులు
● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం ● జటప్రోలు, కొల్లాపూర్‌లోని పురాతన ఆలయాల అనుసంధానం ● కృష్ణాతీరంలోని సుందర ప్రాంతాలు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిలో సిద్ధమవుతున్న లాంచీ – సాక్షి, నాగర్కర్నూల్సోమశిల కేంద్రంగా టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చెందితే మరింత విస్తృతంగా స్థానికులకు ఆదాయం సమకూరేందుకు అవకాశం కలగనుంది. ఇప్పటికే సోమశిలలో హోం స్టే విధానంలో తమ ఇళ్లను తీర్చిదిద్దుకున్నారు. పదుల సంఖ్యలో రిసార్ట్‌లతో పాటు వందకు పైగా ఇళ్లను హోంస్టేకు అనువుగా మలచుకున్నారు. తమ ఇళ్లలో ఉండేందుకు వసతులు కల్పించడంతో పాటు రుచికరమైన ఇంటి భోజనాన్ని పర్యాటకులకు అందిస్తున్నారు. ఆర్డర్‌పై చేపల పులుసు, కూరలు, రొట్టెలు, అన్నం ఇతర వంటకాలను పర్యాటకులకు అందిస్తున్నారు. సోమశిల గ్రామానికి వీకెండ్స్‌లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నెలలో కనీసం 15 రోజుల పాటు స్థానికులు ఆదాయం పొందుతున్నారు. తమ ఇళ్లను హోంస్టేలుగా మార్చి అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎకో టెంపుల్ టూరిజం ఒకేచోట కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాలైన సోమశిల, అమరగిరి ద్వీపం, నార్లాపూర్ గ్రామాల్లో కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, కనెక్టింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అలాగే నల్లమలలోని ఈగలపెంటలో అరైవల్ జోన్, రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ పేరుతో టూరిజం క్లస్టర్ ఏర్పాటు, కొల్లాపూర్‌లోని మాధవస్వామి ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తారు. సోమశిల సర్క్యూట్లోనే ఫారెస్ట్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకోసం అమరగిరి ద్వీప ప్రాంతంలో 18 కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, స్విమ్మింగ్‌పూల్, కేఫేటేరియా, స్పా అండ్ వెల్నెస్ సెంటర్, ఇన్డోర్, అవుట్ డోర్ గేమ్స్, వాటర్‌స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కొల్లాపూర్ పట్టణంలోని రాజావారి ప్యాలెస్‌ను సైతం సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. పురాతన భవనాల నిర్మాణ శైలి తో పాటు బంగ్లాలోని పురాతన ఫర్నిచర్, అలనాటి వైభవం, నిర్మాణ ఆకృతులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. కొల్లాపూర్‌లో రాజా వారి ప్యాలెస్ హోంస్టేల ద్వారా స్థానికులకు ఆదాయం.. -
వామ్మో దోమలు..
గద్వాలటౌన్: ప్రస్తుత వర్షాకాలంలో దోమలు విజృంభిస్తున్నాయి. నిల్చున్నా.. పడుకున్నా.. దోమకాట్లు తప్పడం లేదు. దోమల సైర్వవిహారం ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దోమల నివారణ చర్యలకు మున్సిపాలిటీ పరంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఫాగింగ్, కాలువల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నట్టు అప్పుడప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పని తీరును పర్యవేక్షించకపోవడంతో పట్టణాలలోని కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ప్రాంతాల్లో డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలు, మలేరియా, చికెన్ గున్యా వంటి భయాలు ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపల్ పట్టణాలలో ఇదే పరిస్థితి నెలకొంది. పూడిక తీయకపోవడంతో.. ప్రధానంగా ఆయా పట్టణాలలోని కాలనీల్లో ఉన్న అంతర్గత కాలువలతో పాటు, కందకాలలో పేరుకపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గద్వాల పట్టణంలో సగభాగం కందకాలు విస్తరించి ఉన్నాయి. చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న కాలువల నుంచి వచ్చే మురుగునీరంతా కందకంలో కలుస్తున్నాయి. సక్రమంగా పూడిక తీయకపోవడంతో కందకాలన్ని చెత్త చెదారాలతో నిండిపోయ్యాయి. ప్రస్తుతం అడపదడపా వర్షాలు కురవటంతో ఈ కందకాల నుంచి నీరు దిగువకు పారేందుకు, సుంకులమ్మ మెట్టు వెనక భాగాన ఉన్న అవుట్‌లేట్ దగ్గర అనువైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇటీవల పట్టణంలోని ప్రధాన డ్రైనేజీలలో చేపట్టిన పూడికతీత పనులు నామమాత్రంగా సాగాయి. అయిజ, శాంతినగర్ వంటి పట్టణాలలో ప్రధానంగా మురుగు కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు నిండుకున్నాయి. దాంతో మురుగునీరు పారకుండా అవి అడ్డుకుంటున్నాయి. పట్టణంలోని చాలా డ్రైయిన్లు పూడికతో నిండి మురుగు పారుదలకు ఇబ్బందిగా ఏర్పడింది. నీరు ఎటూ కదలని పరిస్థితి నెలకొంటోంది. దాంతో ఎక్కడ నీరు అక్కడే నిలచిపోవటంతో దోమల ఉద్దృతి పెరిగిపోతోంది. గద్వాలలో ఓ మోస్తారుగా... మిగిలిన అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాలలో దోమల నివారణ చర్యలు మచ్చుకై న కనిపించవు. ఇళ్ల మధ్య మురుగునీరే ఆవాసాలు పొంచి ఉన్న రోగాల భయం.. వణుకుతున్న జనం కాల్వలను శుభ్రం చేయించాలి దోమలను లార్వా దశలో ఉన్నప్పుడే నిర్మూలించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సమస్యాత్మక ప్రాంతాలలో క్రమం తప్పకుండా యాంటీలార్వా ఆపరేషన్ చేయించాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, డంపింగ్ యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. దోమల విజృంభణతో విషజ్వరాల భారిన పడే ప్రమాదం పొంచి ఉంది. – శ్రీధర్, గద్వాల దోమల నివారణ చర్యలు చేపడతాం డ్రైనేజీలో పూడుకుపోయిన వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ కవర్లను తొలగించే చర్యలను ఇటీవల చేపట్టడం జరిగింది. దోమల నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాం. కాలనీలలో ఫాగింగ్ యంత్రాలను వినియోగించడంతో పాటు దోమల నివారణ మందులను చల్లుతున్నాం. – దశరథ్, కమిషనర్, గద్వాల -
జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్‌కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి వాకిటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టు భద్రంగా ఉందని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో అనవసరంగా ఆందోళన కలిగించే ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టుతో గద్వాల ప్రాంతం సస్యశ్యామలంగా ఉందన్నారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు అర్థంలేని అసత్యపు ప్రచారం చేస్తున్నారని.. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వారి మాటలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయి నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఈఎన్సీ శ్రీనివాస్, సీఈ ప్రమీల, సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు ఉన్నారు. -
సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్
కృష్ణానదిలో విహారం కోసం ఇప్పటికే పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు జాలరులు ప్రైవేటుగా బోటు విహారాన్ని కల్పిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వచ్చే నెలలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ క్రూయిజ్ ప్రయాణాన్ని పర్యాటకశాఖ అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ఇప్పటికే లాంచీ క్రూయిజ్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి లాంచీ క్రూయిజ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాంచీ అందుబాటులోకి వస్తే కృష్ణానదిలో ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తూ ఆరుగంటల పాటు నదిలో ప్రయాణించేందుకు వీలు కలుగనుంది. కృష్ణానదిలో బోటులో విహారం చేస్తున్న పర్యాటకులు -
ఇంటర్లో అడ్మిషన్లు పెంచాలి
మానవపాడు: గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తప్పకుండా 120 అడ్మిషన్లు పూర్తిచేయాలని జిల్లా నోడల్ ఆఫీసర్ హృదయరాజ్ తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని శ్రీ గంగు వెంకటకృష్ణరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళాశాలలో ప్రస్తుతం 60 అడ్మిషన్లు వచ్చాయని, తప్పకుండా మొత్తం 120 అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు. మానవపాడులో అడ్మిషన్ల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు అడిగారని, వారు కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాల గదిలో ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల హాజరుశాతం ఎక్కువగా ఉండాలని సూచించారు. విద్యార్థులకోసం మానవపాడు, అమరవాయి, చెన్నిపాడు, జల్లాపురం, బోరవెల్లి తదితర గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తామని, డిపో మేనేజర్‌తో సోమవారం నుంచి బస్సులు తిరిగే విధంగా చూస్తామన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్స్‌పల్ పద్మావతి, వెంకటకృష్ణరెడ్డి, లక్ష్మణరావు, శ్రీనివాసులు, మహేందర్‌గౌడ్, ఫౌజియా, సతీష్‌కుమార్, కృష్ణ, బాలకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రేపు రెడ్‌క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశం గద్వాల: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీన సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. చట్టబద్ధ రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అలంపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర నాయకులు ఆర్. శ్రీరాంనాయక్ అన్నారు. అలంపూర్ పట్టణంలో సీపీఎం రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. సీపీఎం రాష్ట్ర నాయకులు ఆర్. శ్రీరామ్ నాయక్, పిట్టల రవీందర్ హాజరై ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజకీయ శిక్షణ తరగతుల్లో శ్రీరామ్‌నాయక్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలతో చట్టబద్ధమైన, రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు విధ్వంసం అవుతున్నాయని విమర్శించారు. బీజేపీ 11 ఏళ్ల పాలన నిరంకులశ, అప్రజాస్వామిక విధానాలతో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. బీజేపీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని ఇబ్బందులకు గురి చేస్తూ అణిచివేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఏక కేంద్ర రాజ్యాంగంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. అనంతరం రవీందర్.. మతం– మతోన్మాదం అనే అంశాలపై మాట్లాడుతూ.. దోపిడీని కొనసాగించడానికి మూఢ బావాలు పెంపొందిస్తున్నారని, ప్రజలు మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలన్నారు. పార్టీ కార్యకర్తలు సమాజంలో జరుగుతున్న అంశాలను శాస్రియ కోణంలో అధ్యయనం చేయాలని, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రసాద్, ఏ.వెంకటస్వామి, జి. రాజు, రేపల్లె దేవదాసు, జి కే,ఈదన్న, పరం జ్యోతి, మద్దిలేటి, నరసింహ, ఉప్పేర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు, గోత్రనామార్చనలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆయన రూటే సపరేటు
సివిల్ సప్లయ్ శాఖలో ఓ అధికారి దందాల పర్వం 59 వేల మెట్రిక్ టన్నులు కేటాయింపు రబీలో ధాన్యం దిగుబడులు అధికంగా ఉన్న నేపథ్యంలో గతం కంటే ఈసారి రికార్డు స్థాయిలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో జిల్లాలోని 37 రైస్ మిల్లర్లకు 59,507.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. అయితే ఇప్పటి వరకు అన్ని రైస్ మిల్లర్ల నుంచి సీఎమ్మార్ రైస్ రూపంలో కేవలం 15.43శాతం మాత్రమే బియ్యాన్ని తిరిగి అందించారు. వాస్తవానికి ధాన్యం కేటాయించిన అనంతరం సివిల్ సప్లయ్ శాఖ అధికారులు నిరంతరం రైస్‌మిల్లులలో తనిఖీలు నిర్వహిస్తూ లక్ష్యం మేర సీఎమ్మార్ బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లాలో అలాంటిదేమి జరగడం లేదు. దీనిపై పూర్తి బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారే చిక్కడు.. దొరకడు తరహాలో వ్యవహరిస్తుంటే ఇక రైస్‌మిల్లుల నుంచి సీఎమ్మార్ బియ్యం రావడం ఎలా సాధ్యపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గద్వాల: సివిల్‌సప్లయ్ శాఖలో ఓ ముఖ్యఅధికారి రూటే సప‘రేటు’. సదరు అధికారి జిల్లాకు వచ్చి ఏడాది కాలం గడచినా ఇప్పటివరకు ఆఫీసుకు వచ్చింది.. కుర్చీలో కూర్చున్నది తక్కువే. కార్యాలయానికి రాకుండానే అన్ని దందాలు చక్కపెట్టేస్తాడు. అడిగిన ‘రేటు’ కడితే నిబంధనలను తుంగలో తొక్కేసి పనులు చేసిపెడతాడు. ఈ క్రమంలోనే జిల్లాలో రెండు రైస్‌మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యం కేటాయింపులు చేయగా ఫలితంగా రూ.7 లక్షలు జేబులో వేసుకున్నట్లు బాహటంగానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తూ.. చర్యలకు వెనకంజ వేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల రెండు మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యం కేటాయింపులు కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీనే దర్శనం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు శూన్యం -
సామాజిక భద్రతకు పింఛన్
గద్వాల: పింఛన్లు ప్రజలకు సామాజిక భద్రతను కల్గిస్తాయన్న దృష్టితో వాటి అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్లో చేయూత పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత ఫించన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఫించన్ అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన ఫించన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో పింఛన్‌పై ఎక్కువ ఫిర్యాదుల రావడంతో ఈ అంశంపై పూర్తిగా దృష్టిని సారించి, అన్ని సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో కనీసం 20 అర్హులైన కుటుంబాలను గుర్తించి, వారికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన ఫించన్‌దారుల వివరాలు సేకరిస్తే, వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఫించన్ మంజూరును పరిశీలిన జరిపి, ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని, గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని, ప్రతి పథకంలో వారి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం ఇందిరమ్మ ఇళ్ల మార్క్‌అవుట్ నుంచి బేస్మెంట్ వరకు ప్రతి దశను వేగవంతంగా నాణ్యంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి మంగళవారం చీఫ్ సెక్రటరీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇళ్ల పురోగతిలో గత వారం జిల్లా స్థానం 30వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 15వ స్థానానికి చేరుకోవడం సంతోషకరమన్నారు. ఈ దశలో మంచి పురోగతి సాధించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇక ముందు కూడా సమన్వయంతో పని చేస్తూ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు,రాష్ట్ర సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటి ఫించన్ల పంపిణి సంచాలకులు గోపాలరావు, డీపీఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నిబంధనలు తుంగలో తొక్కి..
వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సాగైన ధాన్యం దిగుబడులను దృష్టిలో ఉంచుకుని రైస్‌మిల్లుల సామర్థ్యం కంటే రెండింతలు ధాన్యం కేటాయించాలని సివిల్‌సప్లయ్ శాఖనుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనినే సాకుగా చేసుకున్న సదరు అధికారి తనకు రేటు కట్టిన అయిజ, కేటీ దొడ్డి మండలాల్లోని రెండు మిల్లులకు నిబంధనలను తొక్కేసి అధికంగా ధాన్యం కేటాయింపులు చేశారు. అయిజలోని ఓ రైస్‌మిల్లు రెండు టన్నుల కెపాసిటీ ఉండగా దానిని 6 టన్నుల కెపాసిటీకి పెంచి 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు కేటాయించాడు. రూ.3 లక్షలు రేటు కట్టి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కేటీదొడ్డి మండలంలోని ఓ నాయకుడి మిల్లుకు 6 టన్నుల కెపాసిటీ నుంచి 10 టన్నుల కెపాసిటీకి పెంచి 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు కేటాయించాడు. ఇక్కడ కూడా రూ.4 లక్షల రేటు కట్టి వసూళ్లు చేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
గద్వాల: కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గద్వాల పట్టణంలో హత్యకు గురైన సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా తేజేశ్వర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లాలో ఇటీవలి కాలంలో నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణమామన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరువు తీసేవిధంగా ఉన్నాయని, మరోసారి జరుగకుండా ఉండాలంటే నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా తీర్పులు రావాలని, అందుకోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఎంతో అవసరమన్నారు. కేటి.దొడ్డి మండలం, గద్వాలపట్టణంలో జరిగిన రెండు కేసుల్లో నిందితులను పోలీసులు త్వరితగతిన పట్టుకోవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా కోర్టులో దోషులకు శిక్షపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో గడ్డంకృష్ణారెడ్డి, బండారి భాస్కర్, బాబర్, మురళి, కృష్ణ, రాజశేఖర్, వెంకటేష్; సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ పీయూలో 4వ కాన్వకేషన్‌కు సిద్ధమవుతున్న అధికారులు ● హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం ● యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్‌మెడల్స్ ● రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇచ్చే అవకాశం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు గవర్నర్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గవర్నర్ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. స్పాన్సర్లకు అవకాశం.. కాన్వకేషన్‌లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్‌ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. 88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. -
గతంలో రూ.100 కోట్ల ధాన్యం మాయం
గతంలో జిల్లాలో సుమారు రూ.100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు మాయం చేసి ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటన సంచలనం రేపగా.. దీనిపై రికవరీ చేయాల్సిన అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారుల ఉదాసీనత వ్యవహారంతో మరోసారి అదే తరహాలో మోసం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు మేలుకుని చర్యలు తీసుకుని సదరు ఽఅధికారిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. విచారించి చర్యలు చేపడతాం సివిల్‌సప్లయ్ శాఖ నుంచి అన్ని రైస్‌మిల్లులకు ఉన్న సామర్థ్యానికి రెండింతలు ధాన్యం కేటాయించాలని ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించడం జరిగింది. ఆరోపణలు వస్తున్న ఆ రెండు రైస్‌మిల్లులో క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. అధికారి వ్యవహార శైలిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ -
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో సంచలనంగా మారిన తేజేశ్వర్ మిస్సింగ్, హత్య కేసును జిల్లా పోలీసు శాఖ వారం రోజుల వ్యవఽధిలోనే ఛేదించి, నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించడంపై రాష్ట్ర డీజీపీ అభినందించారన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా మరింత పటిష్టం చేయాలని, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. అదే విధంగా డ్రగ్ రహిత సమాజ స్థాపన లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా ఎస్పీ పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ మొగిల య్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐ లు, కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసు లు, మల్లేష్, శ్రీహరి, నందికర్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ అలంపూర్: అలంపూర్ మున్సిపల్ కమిషనర్‌గా శ్రీరాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కమిషనర్‌గా ఇక్కడికి వచ్చారు. కమిషనర్‌ను మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాతో సత్కరించారు. అదేవిధంగా నూతన కమిషనర్‌ను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ భర్త వెంకటేష్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకులు మద్దిలేటి స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సామేల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్ రాక గద్వాల: జూరాల ప్రాజెక్టు సందర్శన నిమిత్తం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం రానున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించిన ఇనుప రోప్‌ల తాళ్లు తెగిపోయిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు స్థితిగతులను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. 5న సాగునీటి సమస్యపై సదస్సు పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సాగునీరు సమస్యలపై జూలై 5న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం మహబూబ్‌నగర్‌లోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందని తెలిపారు. కానీ కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు ఉన్న కావాల్సిన నీరు లేక చాలా వరకు భూములు బీడుగా మారుతున్నాయని, ఇప్పటికీ పాలమూరులో వలసలు తగ్గడం లేదని వాపోయారు. -
‘హనీమూన్ మర్డర్’లా పోలీసులకు చిక్కొద్దని..
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. మేఘాల య హనీమూన్ మర్డర్ తరహాలో హత్య చేయించి.. అక్కడిలా తాము పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అనంతరం లడాఖ్ లేదా అండమాన్‌కు వెళదామని ప్రియుడు, ప్రేయసి ప్లాన్ వేశారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన తేజేశ్వర్ హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. తేజేశ్వర్‌తో ఐశ్వర్య పరిచయం ఇలా..గద్వాలలోని గంటవీధికి చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్. సుజాత కర్నూలులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్. ఈమె కూతురే ఐశ్వర్య అలియాస్ సహస్త్ర. తల్లీకూతురు తరచూ గద్వా లలోని బంధువుల ఇంటి వచ్చేవారు. ఈ క్రమంలోనే తేజేశ్వ ర్తో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి కులాలు ఒక్కటే కావడంతో పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగా, సుజాతకు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తిరుమలరావు ఐశ్వర్యతోనూ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యాన్ని దాచి ఎలాగైనా తన కూతురికి పెళ్లి చేయాలని సుజాత అనుకుంది. తేజేశ్వర్‌తో ఐశ్వర్య నిశ్చితార్థం చేయించింది. ఇది ఇష్టంలేని ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. దీంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకు న్నారు. కొన్ని రోజుల తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్య ఫోన్ లో మాట్లాడుకొని పెద్దల సమక్షంలో మే 18న బీచుప ల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కూడా ఐశ్వర్య తిరుమలరావుతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గ్రహించిన తేజేశ్వర్ భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఐశ్వర్య, తిరుమలరావు కలిసి తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు.నమ్మించి.. హత్య చేశారిలా..: తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు కర్నూలు జిల్లా కృష్ణానగర్‌కు చెందిన సుపారీగ్యాంగ్ కుమ్మరి నాగేష్, చాకలి పరుశరాముడు, చాకలి రాజుతో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నా రు. దీంతో ఆ గ్యాంగ్ ఫోన్ ద్వారా తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకుంది. మీ జిల్లాలో తక్కువ ధరలకు భూములు ఉంటే చూపించండి అందుకు తగిన పారితోషికం ఇస్తామని నమ్మించారు. సర్వేయర్ కావడంతో తేజేశ్వర్ వారితో పలుమార్లు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన భూములు కొనుగోలు చేస్తామని సుపారీ గ్యాంగ్ ఏపీ 39 యూకే 3157నంబర్ గల కారులో గద్వాలకు వచ్చారు. కారులో తేజేశ్వర్ ఎక్కించుకొని పలు ప్రాంతాలు తిరిగి వస్తుండగా, పథకంలో భాగంగా గద్వాల మండలం వీరాపురం శివారులో పరుశరాముడు మొదట కొడవలితో తేజేశ్వర్‌పై దాడి చేశాడు. ఆ వెంటనే చాకలి రాజు, కుమ్మరి నగేష్ కొడవలి, కత్తితో విచాక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తేజేశ్వర్ కారులోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని నగేష్ వాట్సప్ కాల్ ద్వారా తిరుమలరావుకు చెప్పగా, మృతదేహాన్ని పంచలింగాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ వద్దకు తీసుకు రావాల్సిందిగా ఆదేశించాడు. బీచుపల్లి బ్రిడ్జి మీదుగా వస్తున్న క్రమంలో తేజేశ్వర్ ఫోన్, ల్యాప్‌టాప్ బ్యాగ్ ను కృష్ణానదిలో పడేశారు. అక్కడకు వచ్చాక తిరుమ లరావు తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి నిర్ధారించుకు న్నాడు. అనంతరం వారికి రూ.లక్ష అందజేశాడు. అనంతరం సుపారీ గ్యాంగ్ నంద్యాల సమీపంలోని పాణ్యం మండలంలోని గాలేరు నగరి కెనాల్ సమీపంలోని జమ్ములో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేడి కర్నూలుకు వచ్చారు. తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ద్వారా 19, 20 తేదీల్లో 2.50 లక్షల నగదు తీసుకున్నారు జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. నిఘా పెట్టితేజేశ్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు యత్నించింది. ఈ క్రమంలోనే తిరుమలరావు జీపీఎస్ ట్రాకర్‌ను కొనుగోలు చేసి ఓ ఇన్ఫార్మర్ సహాయంతో తేజేశ్వర్ బైక్‌కు అమర్చారు. అప్పటి నుంచి తేజేశ్వర్ విషయాలను నిత్యం తిరుమలరావు ఐశ్వర్యతో తెలుసుకుంటూ ఓ పథకం వేసుకున్నారు. తేజేశ్వర్‌ను హత్య చేసిన తర్వాత లడాఖ్ లేదా అండమాన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.నిందితులను పట్టుకున్నారిలా..నన్నూర్ టోల్‌ప్లాజా వద్ద కారు వెళుతున్న సీసీ ఫుటేజీ, గద్వాలలో కారులో తేజేశ్వర్‌ను తీసుకెళ్లిన ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గురువారం పుల్లూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తిరుమలరావు, నగేష్, పరుశరాముడు, చాకలి రాజు కారులో హైదరాబాద్‌కు పారిపోతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గద్వాలలో ఉంటున్న ఐశ్వర్య, మోహన్, కర్నూలు ఉంటున్న తిరుపతయ్య, సుజాతలను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి హత్యకు వినియోగించిన కారు, రెండు కొడవళ్లు, 10 సెల్ఫోన్లు, రూ.1.20 లక్షలు, కత్తి, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరుశరాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 మోహన్, ఏ7 తిరుపతయ్య , ఏ8 సుజాత ఉన్నారు. హత్య కేసు విచారణలో పాల్గొన్న డీఎస్పీ మొగిలయ్య, గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, మల్లేష్, నందికర్, శ్రీనువాసులు, అబ్దుల్షుకుర్, సిబ్బంది చంద్రయ్య, కిరణ్‌కుమార్, రాజుయాదవ్, వీరేష్, రామకృష్ణను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
చర్యలు తీసుకోరా..?
రాజోళి: సంతకాలు ఫోర్జరీ చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్న వారిపై అధికారులు ఫోకస్ పెడుతున్నారా లేదా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ లో ఆధారాలతో సహా నకిలీగాళ్ల గురుంచి కథనాలు వస్తే ఇంతవరకు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పచ్చర్ల గ్రామానికి చెందిన తామేష్గౌడ్ ఇంటిని విక్రయించేందుకు చేసిన ఫోర్జరీ చేసిన మాన్‌దొడ్డికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరితో మాట్లాడగా ఆ సర్టిఫికేట్ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. ఆ సంభాషణ అంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయినా కూడా అధికారులు ఆ వ్యక్తి ద్వారా ఇతరుల ప్రమేయాన్ని రాబట్టి చర్యలు తీసుకోవడంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధారాలు ఉంటే బాధితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఆర్డీఓ నర్సింగ్‌రావ్ ‘సాక్షి’ ద్వారా జిల్లా ప్రజలకు తెలిపారు. దీంతో గురువారం పచ్చర్లకు చెందిన బాధితుడు తామేష్ రాజోళి ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. జీవనోపాధి కోసమని భార్య పిల్లలతో కలిసి ఇతర గ్రామానికి వెళితే ఇలా నా ఆస్తినే అమ్ముకుంటే నాకు దిక్కేది అని బాధితుడు వాపోయాడు. ఫోర్జరీ చేసిన వ్యక్తి తానే చేశానని, ఇంకా ఏమైనా ఉన్నా చేస్తానని ధైర్యంగా చెప్పిన ఫోన్ రికార్డింగ్ బయటకు వస్తే కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాడు. నకిలీ సర్టిఫికేట్ తయారైన సమయంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా ఆ సంతకంతో, సర్టిఫికెట్తో తమకు సంబంధం లేదని చెప్పాక కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అధికారులకు విన్నవించిన బాధితులు సంతకాలు ఫోర్జరీ చేసి ఆస్తులు తారుమారు -
మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
గద్వాలటౌన్: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పాటుపడాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కె ర్యాలీని ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట సాగిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంపై మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. విద్యా సంస్థలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత నడుం బిగించాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యువత డ్రగ్స్ బారినపడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో పోలీసుశాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు సునంద, సిద్దప్ప, డీఎస్పీ మొగులయ్య పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన ఎంపిక పోటీలను డీవైఎస్ఓ జితేందర్ ప్రారంభించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, కేజీ మెడిసిన్ బాల్పుట్, 300 మీటర్లు ఫ్లయింగ్ స్టార్ట్, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు వంటి తొమ్మిది క్రీడా విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 72 మంది విద్యార్థులు ఎంపిక పోటీలలో పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ బీఎస్ జితేందర్ విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు జైరాకేష్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, భరత్‌కుమార్, నగేష్‌బాబు, హైమావతి, సుహాసిని, బీసన్న, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమేలా..?
జోగుళాంబ గద్వాలశుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్‌లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని..ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్‌గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్‌గేట్లకు ఉన్న ఇనుప రోప్‌లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
ఆవాజ్ మహాసభలను జయప్రదం చేయండి
ఆత్మకూర్: ఆవాజ్ సంఘం మూడో మహాసభలు జులై 13, 14 తేదీల్లో గద్వాలలో కొనసాగుతాయని.. అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర నాయకులు జబ్బార్, మహమూద్, గయాసుద్దీన్ కోరారు. గురువారం పట్టణంలోని ఎంజీ గార్డెన్స్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం జరిగే మహాసభలకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ గనీ, ఖాజాపాషా, షాహీద్, బట్టి పాషా, ఇస్మాయిల్, యూనీస్, ఖలీల్ అహ్మద్, ఇస్మాయిల్, బషీర్, సుల్తాన్, జబ్బార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
పొంచి ఉన్న ముప్పు..
జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్‌గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్‌శాఖ ● -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్‌లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్‌గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్‌లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
లక్ష్యం మేర రైతులకు రుణాలివ్వాలి
గద్వాల: ఈ ఏడాది 2025–26 సంవత్సరానికి గాను జిల్లాకు వార్షిక రుణప్రణాళిక రూ.6,472.29కోట్లు నిర్ధేశించినట్లు, లక్ష్యం మేర రైతులకు పంటరుణాలను అందజేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు రుణాలను బ్యాంకర్లు అందించాలని ప్రధానంగా ఉపాధి, యూనిట్ల స్థాపన, చిన్న, మధ్యతరహా, విద్యా, గృహ సంబంధ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రుణాలను అర్హులైన వారికి మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా పంటరుణాలు వ్యవసాయ మౌళిక వసతుల రుణాల మంజూరీలో వేగం పెంచాలన్నారు. వ్యవసాయానికి ఉపయోకరంగా ఉన్న ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు వంటి వాటికి రుణాలు అందించాలన్నారు. అదేవిధంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద జిల్లాలో మంజూరైన 18యూనిట్లకు 35శాతం చొప్పున రాయితీ డబ్బులను రూ.27.60లక్షలను వెంటనే చెల్లించాలన్నారు. చిన్నచిన్న వ్యాపార యూనిట్లుకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించాలని, ప్రతిబ్యాంకులో అన్ని రంగాలకు కలిపి అర్హులైన వారికి 75శాతంపైగా రుణాలు మంజూరీ చేయాలన్నారు. ఈ ఏడాది రుణప్రఽణాళిక గతేడాది కంటే రూ.1221.21కోట్లను ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు. ఇందులో అధికంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4945.14కోట్లు, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు రూ.606కోట్లు, ప్రాధానేతర రంగాలకు రూ.192.84కోట్లు, విద్యరుణాలు రూ.16.80కోట్లు, గృహరుణాలు రూ.124.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎల్డీఎం శ్రీనివాస్‌రావు, నాబార్డ డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్బీఐ ఏటీఎం చేతన్, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వర్‌గౌడ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సోలార్ పవర్‌ప్లాంట్ పనుల పరిశీలన కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న సోలార్ పవర్‌ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన పనులతీరును పరిశీలించారు. కలెక్టరేట్లో వాహనాల పార్కింగ్ కోసం 39.5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈషెడ్ వాహనాలు నిలిపేందుకు అనుకూలంగా నిర్మించాలన్నారు. సోలార్‌తో కూడిన షెడ్నిర్మాణం చేపట్టడం ద్వారా విద్యుత్తు వినియోగ వ్యయం కూడ ఆదా అవుతుందన్నారు. బ్యాంకర్లకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశం వార్షిక రుణప్రణాళిక రూ.6,472.29 కోట్లుగా నిర్దేశం -
తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
జోగులాంబ గద్వాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు చేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమల రావుతో పాటు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఏ 1గా తిరుమల రావు, ఏ 2గా ఐశ్వర్య, ఏ8 సుజాతలను చేర్చారు. కాగా, పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
‘ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యానికి మచ్చ
గద్వాల: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అమలు చేస్తూ తీసుకున్న నియతృత్వ నిర్ణయం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్సెన్సీ విధించారు. ఈనిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసహక్కులను కాలరాస్తూ నియతృత్వ పాలన సాగించారు. ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులను అరెస్టు చేయించడం, వార్తాపత్రికలపై నియంత్రణ, ఎన్నికల వాయిదా, ప్రభుత్వ వ్యతిరేకతను అణివేయడం వంటి చర్యలను చేపట్టారన్నారు. అనంతరం ఎమర్జెన్సీ విధించిన అప్పటి సన్నివేశాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించి వీక్షించారు. కార్యక్రమంలో నాయకులు రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవి, శివారెడ్డి, దేవదాస్, ఇసాక్, రవికుమార్ పాల్గొన్నారు. -
డయాలసిస్ రోగులు జాగ్రత్తలు పాటించాలి
అలంపూర్: డయాలసీస్ రోగులు ఆహారపు ఆలవాట్లలో జాగ్రత్తలు పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ పాష అన్నారు. బుధవారం అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అపెక్స్ డయాలిసిస్ సెంటర్లో అధ్వర్యంలో పేషెంట్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. డయాలిసిస్ రోగులు క్రమం తప్పకుండా వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాలని, బీపీ, షుగర్, కిడ్నీ సంబందించిన మందులు వాడాలన్నారు. కావాల్సిన ఇంజెక్షన్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతామన్నారు. డయాలసిస్ సెంటర్ ఇన్చార్జ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కిడ్నీ సంబందిత రోగులు అధిక సంఖ్యలో డయాలసిస్ మీదకి వస్తున్నారని, అందుకు గల కారణాలను వివరించారు. కిడ్నీ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. -
యాసంగి నాటికి ‘చిన్నోనిపల్లి’ పూర్తిచేయండి
అలంపూర్: రాబోయే యాసంగి సీజన్ నాటికి చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాల పనుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. యాసంగి సీజన్ నాటికి చిన్నోనిపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా సాగు నీరు అందించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. అలంపూర్ మండలంలోని బుక్కాపురం ఎత్తిపోతల పథకానికి కొత్త మోటార్లు, పంపుసెట్లు ఇవ్వాలని, ఊట్కూరు– 1, క్యాతూరు, గుందిమల్ల, అలంపూర్ లలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేసి రబీ సీజన్‌కు మోటార్లను అందుబాటులో ఉంచాలని కోరారు. వీరితోపాటు నాయకులు అశోక్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రఘు రెడ్డి తదితరులు ఉన్నారు. -
నిమ్మతోట సాగు చేశా
ప్రభుత్వం పండ్ల తోటలను సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని అందిస్తుందని చెప్పారు. నేను రెండు ఎకరాలు నిమ్మ తొటను సాగుచేసి ఆరు నెలలు అవుతోంది. ఇంతవరకు నాకు సబ్సిడీ అందజేయలేదు. రైతులకు సబ్సిడీ త్వరగా అందజేస్తే వెసులుబాటుగా ఉంటుంది. – జగన్నాథ రెడ్డి, రైతు, అయిజ సబ్సిడీ శాతం పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు సాగుచేసే రైతులకు 40 శాతం సబ్సిడీని ప్రకటించింది. అయితే సబ్సిడీ శాతం 90కు పెంచితే అనేకమంది పేద రైతులు కూడా పండ్ల తోటలను సాగుచేస్తారు. రైతుకు మేలు చేకూరడంతో పాటు పర్యావరణం మెరుగుపడుతుంది. – దర్శల్లి, రైతు, అయిజ పండ్ల తోటలతో అనేక లాభాలు రైతులు ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీని సద్వినియోగంచేసుకొని పండ్ల తోటలు సాగుచేస్తే అనేక లాభాలు పొందవచ్చు. తొటలు కాపుకు వచ్చినప్పటి నుంచి పండ్ల తోటల రకాలను బట్టి సుమారు 20 నుంచి 30 సంవత్సరా లవరకు పంట దిగుబడి వస్తుంది. కూలీల అవసరం చాలావరకు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. – ఎంఏ అక్బర్ బాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ● -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
గద్వాల కాంగ్రెస్‌లో అదే తీరు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్‌జాన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వాళ్లకే పనులు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ పేరుకు అధికార పార్టీ నాయకులమే కానీ.. పనులన్నీ బీఆర్ఎస్కు చెందిన నాయకులకే జరుగుతున్నాయని బాహాటంగానే ఆరోపించినట్లు తెలిసింది. పరిశీలకులు ఇది వరకే రెండుసార్లు వచ్చారని.. ఇది మూడోసారని.. అయినా నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పరిశీలకులకు ఉదాహరణలతో వివరించినట్లు సమాచారం. 2, 3 రోజుల్లో శుభవార్త.. సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్‌లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. అన్యాయం అంటూ సరిత.. తాము పార్టీని నమ్ముకుని ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నామని.. కానీ, తమకు తీరని అన్యాయం జరుగుతోందని పరిశీలకుల ఎదుట సరిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు మొదలుకొని.. ప్రభుత్వ శాఖలలో అన్ని రకాల పనుల వరకు తమకు భంగపాటు ఎదురవుతోందని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా నా వర్గం అని తెలుసుకుని పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీస్ కే సులు నమోదవుతున్నాయని, ప్రతిరోజు పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎదురుకాదని.. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో.. హరిత హోటల్లో సరిత వర్గంతో.. చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు సీఎం సహకారంతో ముందుకు.. తనకు న్యాయం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధే ధేయ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారమందిస్తానని చెప్పినట్లు తెలిసింది. -
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్దకల్: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు మెరుగైన విద్యాబోధన చేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని జి ఇంటర్మీడియెట్ విద్యాధికారి హృదయరాజు సూచించారు. బుధవారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల హాజరు రిజిష్ట్రర్లను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులు, కళాశాలకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. చదువుతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పని సరిగా చదివించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ నర్సింహులు, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్, గోవర్దన్శేట్టి, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.రైతులకు స్థిర ఆదాయం అందేలా చర్యలుకేటీదొడ్డి: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు స్ధిర ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మామిడి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు నీటి సరఫరా, తోటల నిర్వహణ, పని నాణ్యత తదితర అంశాలపై సమీక్షింరు. ప్రతి మొక్కపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టి రైతులకు దీర్గాకాలిక ఆదాయం అందేలా చూడాలని, ఉపాధి హామీ పథకం కేవలం ఉపాధి నిచ్చే కార్యక్రమంగా కాకుండా వ్యవసాయ ఆధారిత రైతుకు స్థిర ఆదాయ మార్గంగా మారలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని అని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించి పంటలతో పాటు ఉద్యాన పంటలు, తోటల అభివృద్ధి గ్రామీణ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. -
ప్రోత్సాహం
ఉద్యాన పంటలకుఅయిజ: రైతులను ఉద్యాన పంటల సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పంటల సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అవగాహన సదస్సులు ఇదివరకే నిర్వహించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకాలను అమలు చేస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీని అందించి రైతులను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టింది. సబ్సిడీని మూడు విడతలుగా రైతులకు అందించనుంది. ప్రభుత్వం ఈ యేడాది (2025–26 ఆర్థిక సంవత్సర) 252 యూనిట్లు మంజూరు చేసింది. దానికోసం రూ.1,07,86,000 నిధులు మంజూరు చేసింది. ఇదిలాఉండగా, ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగుచేయవచ్చు. అదేవిధంగా ఈ పంటల సాగుకు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలు ఆర్జించవచ్చు. దీంతో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు మంజూరైన యూనిట్ల వివరాలిలా.. పంట యూనిట్లు యూనిట్ రాయితీ ధర (రూ.లక్షల్లో) బత్తాయి 110 52.80 2.00 మామిడి 40 19.20 2.00 డ్రాగన్ ఫ్రూట్ 10 16,20,000 6.75 బొప్పాయి 25 4,50,000 75 వేలు జామ 6 2,88,000 2.00 దానిమ్మ 5 2,40,000 2.00 కోకో 20 2,40,000 50 వేలు అవకాడో 5 1,50,000 1.25 సీతాఫలం 5 90,000 75 వేలు ఉసిరి 3 54,000 75 వేలు నేరేడు 3 54,000 75 వేలు పూల తోటలు 20 4,00,000 50 వేలు బి.తిమ్మాపూర్ శివారులో సాగుచేసిన నిమ్మతోట ఎంఐడీహెచ్ నుంచి చేయూత సాగుకు మొగ్గుచూపుతున్న రైతులు జిల్లాకు 141 యూనిట్లు.. రూ.1.07 కోట్లు మంజూరు -
అలంపూర్ ఆలయాల్లో చండీహోమాలు
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో వెలసిన జోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని బుధవారం చండీహోమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు హోమాల్లో పాల్గొన్నట్లు ఈఓ పురేందర్‌కుమార్ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. ఇదిలాఉండగా, అమావాస్య నేపథ్యంలో ఆలయాలనికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నిత్య అన్నదాన సత్రంలో అన్నదానం చేశారు. బీచుపల్లిలో అమావాస్య పూజలు ఎర్రవల్లి: అమావాస్య నేపథ్యంలో బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆకు పూజ, అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈఓ రామన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
తేజేశ్వర్ కేసు.. ఎట్టకేలకు తిరుమలరావు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్‌తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే..జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు
ఽదరూరు: ఆయిల్‌పాం తోటల సాగులో రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలహళ్లి తదితర గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ పద్ధతులను వివరించారు. ఆయిల్‌పాం తోటల సాగుకు సంబంధించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు రాజారెడ్డి, మండల ఫీల్డ్ ఆఫీసర్ శివ, అశోక్ పాల్గొన్నారు.చేనేత రుణమాఫీకి అర్హుల గుర్తింపురాజోళి: చేనేత కార్మికుల రుణమాఫీ పథకంలో అర్హులైన వారిని గుర్తించేందుకు చేనేత, జౌళి శాఖ అధికారులు మంగళవారం రాజో ళిలోని యూనియన్ బ్యాంకుకు వచ్చారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన క్రమంలో ఏడీ గోవిందయ్య ఆధ్వర్యంలో బ్యాంకులో ఉన్న చేనేత కార్మికుల వివరాలను పరిశీలించారు. నిరుపేద కార్మికులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం చేసిన రుణమాపీ పథకం ద్వారా బ్యాంకులో ఉన్న 600 ఖాతాల్లో అర్హులెవరో తేల్చేందుకు కార్మికుల పత్రాలను పరిశీలించారు. పత్రాల పరిశీలన అనంతరం నివేదికను పైఅధికారులకు అందజేయన్నునట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర పాల్గొన్నారు.అన్నివర్గాలకుసమప్రాధాన్యంధరూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల పక్షపాతి అని.. దేశంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు బీజేపీ జిల్లా ఇన్చార్జి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం మండలంలోని భీంపురం, ఉప్పేరు గ్రామాల్లో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ఉజ్వల పథకంతో గ్యాస్ సిలిండర్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో నిరుపేదలకు పక్కా గృహాలు, ప్రతినెలా ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు.ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్నిధి, పంటలకు మద్దతు ధర పెంపు వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బొటే, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, నాయకులు రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, రాజేశ్, హన్మంతరాయ, రఘుగౌడ్, శేఖర్‌రెడ్డి, వేమారెడ్డి, మోతీలాల్, పాండు ఉన్నారు.కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలుఎర్రవల్లి: మండలంలోని జింకలపల్లి సమీపంలో ఉన్న ఎస్ఎన్ఎస్ స్టార్చ్ కంపెనీలో మంగళవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ సురేశ్‌బాబు, శాస్త్రవేత్త విద్యులత తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో సమీపంలోని వ్యవసాయ పొలాలతో పాటు చెరువు కలుషితమవుందని ఇటీవల రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు కంపెనీలో తనిఖీలు చేపట్టడంతో పాటు వ్యవసాయ పొలాల్లో నీటి శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని.. రిపోర్టుల ఆధారంగా కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ
నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్త బదిలీలలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందరు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం కలగగా, మరికొందరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేవారు. ఇప్పటివరకు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (గ్రేడ్ –2)గా పనిచేస్తున్న టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మహేశ్వర్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. వనపర్తి జిల్లాలోని అమరచింత కమిషనర్ (గ్రేడ్–1)గా పనిచేస్తున్న ఎం.రవిబాబును నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయింది. ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సీహెచ్.నాగరాజు పదోన్నతిపై వస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కమిషనర్ (గ్రేడ్–2) గా పనిచేస్తున్న బి.నరేష్‌బాబును మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీ అయిన దేవరకద్రకు పంపిస్తున్నారు. అక్కడికి మేడ్చల్ నుంచి నాగిరెడ్డి (గ్రేడ్–2) కమిషనర్‌గా వెళ్తున్నారు. అలంపూర్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్ పదోన్నతిపై కొల్లాపూర్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టి.శ్రీనివాసన్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అలంపూర్‌కు ఎవరినీ నియమించలేదు. మక్తల్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్.శంకర్‌నాయక్‌ను అక్కడే రెగ్యులర్ అధికారిగా పదోన్నతి కల్పించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డి.మురళిని కమిషనర్‌గా (గ్రేడ్–3) పదోన్నతిపై అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేసిన జి.యాదయ్య కోస్గికి మేనేజర్‌గా వెనక్కి వెళ్తున్నారు. మేడ్చల్‌లో రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ)గా పనిచేస్తున్న ఖాజా ఆరీఫొద్దీన్ను పదోన్నతిపై వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కమిషనర్ (గ్రేడ్–3)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్.అశోక్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఎంసీగా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్‌ను కమిషనర్ (గ్రేడ్–2)గా పదోన్నతిపై ముడుచింతలపల్లికి పంపిస్తున్నారు. ఇక్కడికి ఏఎంసీగా ఎ.రాజన్న పదోన్నతిపై వస్తున్నారు. అలాగే పాలమూరులో శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న యు.గురులింగం పదోన్నతిపై ఆందోల్–జోగిపేట మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–3) గా, డి.వాణికుమారి జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్‌గా, కె.రవీందర్‌రెడ్డిని నల్లగొండ మున్సిపాలిటీ ఏఎంసీ కమిషనర్ (గ్రేడ్–3) గా పంపించారు. నలుగురు ఎస్ఐలకు గ్రేడ్–3 కమిషనర్లుగా పదోన్నతి వెయిటింగ్ లిస్ట్‌లో మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసన్, అశోక్‌రెడ్డి నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా నాగిరెడ్డి -
డబ్బులు జమ కాలేదు..
నాకు కేటీదొడ్డి గ్రామ శివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వరిపంట సాగుచేస్తున్నా. నాకు రైతుభరోసా డబ్బులు రాలేదు. దీనిపై అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. బ్యాంక్‌కు వెళ్తే అక్కడ సమాధానం చెప్పేవారు లేరు. నాకు రైతుభరోసా డబ్బులు వచ్చేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలి. – తాయప్ప, రైతు, కేటీదొడ్డి రెండెకరాలకే వచ్చాయి.. ఈసారి కాస్తు విస్తీర్ణాన్ని తగ్గించి రైతు భరోసా వేశారు. నాకు 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో కేవలం రెండెకరాలకు రైతుభరోసా డబ్బు లు నా ఖాతాలో జమయ్యా యి. మిగతా 2.14 ఎకరాల భూమికి డబ్బులు పడలేదు. నాకున్న మొత్తం విస్తీర్ణంలో కందులు వేశాం. సర్వే నిర్వహించి మాకు న్యాయం చేయాలి. – బాలకిష్టయ్య, రైతు, వింజమూరు, కోయిలకొండ మండలం -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విషయం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబితా రూపొందించి కలెక్టర్‌కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
ఆకలి బాధ తీరేనా?
జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజన పథకం ● ఉత్తమాటగా మారిన ప్రభుత్వ ప్రకటన ● ఈ ఏడాదైనా అమలు చేయాలని వేడుకోలు వెంటనే అమలు చేయాలి.. మాది కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామం. 15 కి.మీ. దూరంలో ఉన్న ధరూర్ కళాశాలకు ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి కళాశాలకు బయల్దేరాల్సి వస్తోంది. ఉదయం సరిగ్గా తినాలనిపించదు. కొన్నిసార్లు వీలుపడక టిఫిన్ బాక్సులు తెచ్చుకోవడం లేదు. ఇంటికి వెళ్లే వరకు ఆకలికి తట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదననను అమలుచేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – సురేశ్, ఇంటర్ విద్యార్థి ఎంతో మేలు చేసినట్లవుతుంది జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు ద్వారా పేద, గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు భోజనం లేకుండా ఉండటం వల్ల చదువుపై కూడా దృష్టి సారించలేకపోతున్నాం. మాది గట్టు మండలం ఆలూరు గ్రామం. బస్సులు కూడా సమయానికి లేకపోవడంతో త్వరగా బయల్దేరాల్సి వస్తోంది. – శ్రావణి, ఇంటర్ విద్యార్థిని ●గద్వాలటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆకలి బాధ తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఉత్తమాటగానే మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి కు టుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఇతర గ్రామాల నుంచి కళాశాలలకు వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోవడంతో రోజంతా పస్తులతో ఉంటున్నారు. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం.. జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే ప్రతి ఏడాది ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆ ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీ కడుపులతోనే.. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మాదిరిగా జూనియర్ కళాశాలలు అందుబాటులో లేవు. జిల్లా కేంద్రం లేదా మండల కేంద్రాల్లో ఏదో ఒకచోట ఉన్నాయి. దీంతో గ్రామీణ విద్యార్థులు 15 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కళాశాలలకు వస్తున్నారు. ఉదయం 9 గంటలకల్లా కళాశాలకు చేరుకోవాలంటే ఇంటి నుంచి 7 గంటలకే బయల్దేరాలి. ఈ నేపథ్యంలో ఇంట్లో వారు వేకువజామునే లేచి వంట చేయాలి. అయితే కళాశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది రైతులు, కూలీల పిల్లలే ఉన్నారు. దీంతో వారు తల్లిదండ్రుల ఇబ్బందులను అర్థం చేసుకొని ఉన్నంతలో సర్దుకొని భోజనం తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు తెచ్చుకునే వీలుకాక ఖాళీ కడుపులతోనే తరగతుల్లో కూర్చుంటున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమలు చేస్తే మెరుగైన ఫలితాలు.. మధ్యాహ్న భోజనం తెచ్చుకోని కొందరు విద్యార్థులు ఉదయం తరగతులకు హాజరై.. మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కళాశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏ ర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. ఉత్తర్వులు అందలేదు.. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ఈ విద్యా సంవత్సరంలో భోజన పథకంపై ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పథకం అమలైతే గ్రామీణ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. – హృదయరాజు, డీఐఈఓ విద్యార్థుల సంఖ్య 3,862 జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 08 -
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్‌కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్‌ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్‌ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్‌ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్‌కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్‌ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్‌కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్‌లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కేసు నేపథ్యం ఇదే.. జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్‌రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. -
ఆస్తి కొట్టు
ఫోర్జరీ పెట్టు..జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు ●చర్యలు తీసుకోవాలి నా స్వగ్రామం పచ్చర్ల. అయితే జీవనోపాధి కోసం నేను, భార్యపిల్లలు ధర్మవరంలో ఉంటున్నాం. గ్రామంలో మా నాన్న నాకు పంచిన వాటాను నా తమ్ముడు ఆంజనేయులు వాటాగా చూపి, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నా వాటాను ఇతరులకు అమ్మేశాడు. ఇంటినే కాదు, వ్యవసాయ భూమిని కూడా అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది. దీని వల్ల అన్నదమ్ములకు తగదాలు ఏర్పడుతున్నాయి. ఫోర్జరీ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – తామేష్ గౌడ్, పచ్చర్ల (అసలైన ఇంటి వాటాదారుడు,బాధితుడు) రాజోళి: జిల్లాలో కొందరు కేటుగాళ్లు నయా దందాకు తెరలేపారు. ఇళ్లు, స్థలం, భూమి ఇలా దేనినైనా విక్రయించాలంటే కుటుంబసభ్యులు (ఆస్తిలో వాటాదారులు) అందరి సంతకాలు ఉండాలి. కొన్ని సందర్భాల్లో యాజమాన్య ధ్రువీకరణ పత్రం, పన్ను రశీదులతో కూడా ఒకరి నుంచి మరొకరికి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇందులోని కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని పంచాయతీ సెక్రటరీల సంతకాలు ఫోర్జరీ చేసి.. వాటి ఆధారంగా యాజమాన్య ధ్రువీకరణ పత్రం పొందుతున్నారు కేటుగాళ్లు. అటు పంచాయతీ సెక్రటరీ సంతకం.. ఇటు కుటుంబసభ్యుల్లో మిగతా వారి సంతకాలు ఇలా మొత్తం ఫోర్జరీ చేసి ఒకరిపై రిజిస్ట్రేషన్ చేసి అందినకాడికి డబ్బులు వెనకేసుకుంటున్నారు. రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఒకరిపై మరొకరు దాడులకు దిగేలా పరిస్థితులు మారుస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బయటకు వచ్చిన వాటిలో.. జిల్లాలోని గట్టు మండలం తప్పెట్లమొర్సులో ఒక వ్యక్తి ఇంటిని గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో కూడా 2021లో గ్రామ పంచాయతీ సంతకం ఫోర్జరీ చేసి అన్నకు చెందిన ఆస్తిని తమ్ముడికి రిజిస్ట్రేషన్ చేయించారు. దీని వివరాలను ‘సాక్షి’ ఆరా తీయగా.. పచ్చర్ల గ్రామానికి చెందిన ఖాసీంగౌడ్కు ముగ్గురు కుమారులు కాగా.. తన ఇంటిని ముగ్గురికి వాటాలు పంచాడు. పెద్ద కుమారుడైన తామేష్గౌడ్ జీవనోపాధి కోసం ఇటిక్యాల మండలం ధర్మవరానికి వెళ్లి అక్కడే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడైన అంజనేయులుగౌడ్ పేరుపైన 10–05–2021లో యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తూ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో(ఫోర్జరీ) ధ్రువీకరణ పత్రాన్ని చూపించి, అదే గ్రామానికి చెందిన ఉరుకుందమ్మకు జనవరి 21–2025 నాడు అమ్మకం చేశారు. ఇంటిలో అసలు వాటాదారుడైన తామేష్ గౌడ్‌కు ఇప్పుడు విషయం తెలిశాక అసలు మోసం వెలుగు చూసింది. అయితే ఇందులో సాక్షులుగా ఉన్న కుర్వ హుస్సేన్‌కు సంతకం రాదని, వేలి ముద్రనేని, కాని ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి అమ్మకాలు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆస్తిని వాటాలు చేసిన ఖాసీంగౌడ్కు కూడా సంతకం చేయడానికి రాదని, ఆయన కూడా వేలి ముద్రేనని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం ఒక వ్యక్తి ఫోర్జరీ సంతకాలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇవే కాక జిల్లాలో చాలా గ్రామ పంచాయతీ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేసి ఇదే విధంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో చేస్తున్నా వారిపై అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఏమన్నారంటే.. 2021 సంవత్సరంలో జారీ చేసిన ఈ ధ్రువీకరణ పత్రంపై అప్పటి పంచాయతీ సెక్రటరీలను ‘సాక్షి’ వివరణ కోరింది. 2021లో ఉన్న ధనుంజయరెడ్డి దీనిపై మాట్లాడుతూ.. పచ్చర్లలో తాను ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఎవ్వరికీ ఇవ్వలేదని తెలిపారు. జనార్ధన్‌తో మాట్లాడగా.. తాను ఇప్పటిదాకా ఎవరికీ యాజమాన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని, అసలు ఆ పత్రంలో ఉన్నది పంచాయతీ సెక్రటరీల సంతకాలే కాదని, అది ఫోర్జరీనే అని తెలుస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరుపైకి ఆస్తి మార్పిడి తాజాగా వెలుగు చూసిన ఘటనలు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. ఎప్పటి నుండో గ్రామాల్లో ఉంటున్న తమ ఇళ్లను తమ పిల్లల పేరు మీద చేయించేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అయితే కొందరు తమ పిల్లలకు ఉన్న ఇంటిని బాగాలు చేసి అందులో నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తారు. దాన్ని క్రమంగా గ్రామ పంచాయతీలో పన్నులు చెల్లిస్తూ తమ పేరును క్రమబద్ధీకరించుకుంటారు. అదే క్రమంలో మరి కొందరు నేరుగా తమ పేరు మీదకే రిజిష్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాని కోసం ఎవరైతే గత కొంత కాలంగా గ్రామ పంచాయతీలో పన్నులు చెల్లిస్తున్నారో.. వారు యాజమాన్య ధ్రువీకరణ పత్రం, పన్ను రశీదులు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకుంటారు. ఇదే అదునుగా కొందరు దళారులు, పైరవీకారులు రెచ్చిపోయి డబ్బు పోగేసుకునేందుకు నానా రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రం సృష్టించి దాని సాకుగా గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఒకరి బాగానికి వచ్చిన ఆస్తిని వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో అసలు యజమానులు తాము ఎప్పుడు తమ ఇంటిని అమ్ముకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా అన్నదమ్ముల మధ్య ఇలాంటివి జరగడంతో వారు కేసులని కోర్టులని వారి మధ్య తగాదాలు పెంచుకుని అవి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు క్షుణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 68 ఫిర్యాదులు అందగా ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 24 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 24 అర్జీలు అందాయి. జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి బాధితులు ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 24 మంది ఫిర్యాదులు చేశారు. అనంతరం ఎస్పీ బాధితులతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణ గద్వాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 2025–26 సంవత్సరానికి గాను సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రమేష్‌బాబు ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 23వ తేదీనుంచి జూలై 7వ తేదీ వరకు http.tsstudycircle.co.in లోదరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 040–23546552, 8121626423 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. జూలై 1 నుంచి విద్యార్థులకు క్విజ్ పోటీలు గద్వాల: జూలై 1వ తేదీ నుంచి విద్యార్థులకు పర్యావరణ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్ఓ భాస్కరపాపన్న తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ–2025 పోస్టర్‌ను అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ వాతావరణ మార్పుల పర్యవసనాల నుంచి రక్షణకు విద్యార్థులలో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి చేయాల్సిన అవరముందన్నారు. మొక్కలు నాటడం, నీటిసరంక్షణ, వ్యర్థాలు వేరుచేసే అలవాట్లు విద్యార్థులలో అలవరచాల్సిన అవసరముందన్నారు. ఈకార్యక్రమంలో శ్రీధర్, రాధాకృష్ణారెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు కలిసికట్టుగా కృషి గద్వాల: మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవం వారోత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణ కోసం అన్ని శాఖల సమన్వయంతో కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రధానంగా యువత భవిష్యత్‌ను పక్కదారి పట్టింస్తుందని, ఈసంక్షోబాన్ని పకడ్బందీగా అరికట్టాల్సిన అవసరముందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు మండల, జిల్లా కేంద్రాలలో పాఠశాలలు, కాలేజీలు, గ్రామపంచాయతీలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలన్నారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పప్రభావలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్గించాలన్నారు. ఏదేని మత్తుపదార్థల కార్యకలాపాలు గమనిస్తే 144461001908 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం మాదకద్రవ్యాలను నిరాకరించండి అనే సందేశంతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద, సీఐ నాగేశ్వర్‌రెడ్డి, నోడల్అధికారి హృదయరాజు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ రన్
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరుగులో పాల్గొన్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, జిల్లా ఒలింపిక్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జితేందర్ హాజరయ్యారు. క్రీడాజ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి పరిగెత్తి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట ఒలింపిక్ పరుగు సాగింది. జిల్లా కేంద్రంలో ఉదయం క్రీడాకారులు, చిన్నారుల సందడితో రహదారులు కిక్కిరిసాయి. జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులు ఒలింపిక్ కాగడా పట్టుకుని పరుగులో పాల్గొన్నారు. క్రీడాకారులనుద్దేశించి డీవైఎస్ఓ జితేందర్ మాట్లాడుతూ.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగిన కాలంలో విశ్వశాంతి, స్నే హహస్తం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని భావించిన ప్రజలు ఆనాడు క్రీడా జ్యోతితో ఒలింపిక్ పరుగును ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించి నజరానా అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఒలింపిక్ డే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ శ్రీహరి, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్, పీఈటీలు బీసన్న, రజనికాంత్, విజయ్ క్రికెట్ కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు కసరత్తు
వివరాలు 8లో uసాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వం సన్నద్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటి ఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్‌కర్నూల్‌లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమో దం తెలిపి పార్లమెంట్‌కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ప్రధాన పార్టీల సమావేశాలతోవేడెక్కుతున్న రాజకీయ వాతావరణం -
శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం
గద్వాలటౌన్ : జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ పండిట్ నెహ్రూ క్యాబినెట్లో విదేశాంగ మంత్రిగా సేవలందించారని, అనంతరం జన్‌సంఘ్ పార్టీని స్థాపించి దేశాభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారన్నారు. దేశం గర్వించదగిన నేతల్లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఒకరని కొనియాడారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వార్డుల వారిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్, బండల వెంకట్రాములు, రమాదేవి, జయశ్రీ, నర్సింహులు, దేవదాసు, అనిల్, చిత్తారికిరణ్, శ్రీనివాసులు, నర్సింహా,కృష్ణ, మోహన్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత గృహం కల్పించాలనే సదుద్ధేశంలో ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, అందులో ధరూరు మండలానికి 830 మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్దతుల్లో జరుగుతోందని, నిరాఇ్మణం ప్రారంభం నుంచి లబ్ధిదారుల స్థలాలను గూగుల్ మ్యాప్, ఫొటోలు, రికార్డుల ఆధారంగా దశల వారీగా బిల్లులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. గతంలో మండలంలో 10వ తరగతికే పరిమితం కాగా.. నేడు ఇంటర్, డిగ్రీ ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించి విద్యార్థులకు సమస్య లేకుండా చేశామని, పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులను కల్పించి సమస్యలు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీడీ మంజుల, నాయకులు జంబు రామన్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో జీవితం అంధకారం
గద్వాల క్రైం: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని రైల్వే పోలీసు అధికారి ధర్మారావు, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది కృష్ణయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం గద్వాల రైల్వే స్టేషన్ ఆవరణలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రయాణికులకు అవగాహన సూచించారు. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ వారిని బానిసలుగా మారుస్తు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు మంచి అలవాట్లతో ముందుకు సాగాలని సూచించారు. -
వందల టీఎంసీలు దిగువకు..
గతంలో సుంకేసుల డ్యాం నుంచి దిగువకు, కేసీ కెనాల్ ద్వారా కర్నూల్‌తో పాటు ఏపీలోని ఇతర జిల్లాల ఆయకట్టుకు నీరు అందుతుండగా నది పక్కనే ఉన్నా కూడా జిల్లాలో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కష్టాలను తప్పించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడం, రిజర్వాయర్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుమ్మిళ్ల లిఫ్టు లేనందుకు నీరు సుంకేసుల, కేసీ కెనాల్ ద్వారా దిగువకు పోతున్నాయన్న నాయకులు.. ప్రస్తుతం సుంకేసులకు ఎగువన బ్యాక్ వాటర్ ఉండే తుమ్మిళ్ల దగ్గర లిఫ్టు ఏర్పాటు చేస్తే దాని వల్ల నీరు స్టోరేజీ చేసుకోలేకపోతున్నామని, దీని వల్ల వందల టీఎంసీల నీరు ఇప్పటీకి దిగువకు వెళ్తున్నాయని అంటున్నారు. గత ఏడాది (జూన్ 2024 నుంచి మార్చి 2025)వరకు ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని తుమ్మిళ్ల మీదుగా సుంకేసుల డ్యాం నుంచి 300 టీఎంసీల నీటిని దిగువన ఉన్న శ్రీశైలంకు విడుదల చేశారు. డ్యాంకు అనుసంధానంగా ఉన్న కేసీ కెనాల్ నుంచి 35 టీఎంసీల నీటిని కర్నూల్ తదిదర జిల్లాల ఆయకట్టుకు అందించారు. బ్యాక్ వాటర్ నిలిచి ఉండే తుమ్మిళ్ల ద్వారా కేవలం 3.529 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. -
నీటిని ఆపేదెలా..?
నీటి ప్రవాహం ఉన్నా స్టోరేజీకి చోటు లేని వైనం ●రాజోళి: నిండా నీరున్నా వాడుకోలేని దుస్థితి జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు పరిదిలో నెలకొంది. గతంలో కర్ణాటక పరిదిలో నుంచి వచ్చే ఆర్డీఎస్ కెనాల్ నీటిపై ఆధారపడిన రైతులకు ప్రస్తుతం దాంతో పాటుగా తుమ్మిళ్ల లిఫ్టు నుంచి వచ్చే నీరు కూడా తోడు కావడంతో కొద్దిగా ఊరట కలిగిందని ఆశించారు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికంగానే ఉపశమనిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సీజన్లో తుమ్మిళ్ల లిఫ్టుపై ఆశలు పెట్టుకుంటే.. అది అక్కరకు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో నీటిని విడుదల చేస్తే దాని వల్ల ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో ప్రశ్నార్థకంగా.. తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా రైతులకు తాత్కాలిక ప్రయోజనమే కలుగుతుంది. తుంగభద్ర నదిలో వరద ఉన్న సమయంలోనే తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా నీటిని తీసుకునే అవకాశముంటుంది. కానీ అదే సమయంలో వర్షాలు కురుస్తుంటాయి. ఆ నీటిని రైతులు ఏం చేసుకోవాలో తెలియని దుస్థితి. అదే స్టోరేజీకి అవకాశముంటే, వర్షాలు కురుస్తున్న సమయంలో, వర్షపు నీటిని, నదిలో ఉన్న వరదను నిలుపుకుని రైతులకు నీరు లేని సమయంలో విడుదల చేస్తే ఆయకట్టుకు శాశ్వత ప్రయోజనం అందించే వీలుంటుంది. అయినా కూడా దాని వైపు అధికారులు అడుగులు వేయడం లేదు. ప్రస్తుతం సీజన్ మొదలు కావడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని ఏ రకంగా ఒడిసి పట్టుకునే అవకాశం లేకపోవడంతో తుమ్మిళ్ల లిఫ్టు అందించే ప్రయోజనం తాత్కాలిక ఉపశమనంగానే మారుతుంది. వర్షాలు కురిస్తే రైతులకు ఆర్డీఎస్ నీరు ఎక్కువగా అవసరం ఉండకపోవడంతో, ఆ సమయంలో అధికారులు తుమ్మిళ్ల మోటార్లు కూడా ఆన్ చేయరు. కానీ అప్పటికే సుంకేసుల డ్యాం ద్వారా వందల టీఎంసీల నీరు దిగువకు వెళ్తుంది. వర్షాలు లేని సమయంలో ఆర్డీఎస్కు నీరు అందించేందుకు తుమ్మిళ్ల మోటార్లకు సరిపడే నీరు నదిలో లేకపోవడంతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆ పరిస్థితి రాకుండా చర్యలు చేపడతారనుకుంటే ఈ ఏడాది కూడా నీటిని కాపాడుకోలేకపోతున్నామని ఆర్డీఎస్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా ఆర్డీఎస్ కెనాల్‌కు విడుదల అవుతున్న నీరు ఈ ఏడాది కూడా స్టోరేజీ లేదు.. నీరున్నా.. వాడుకోలేకున్నాం సుంకేసుల డ్యాం దిగువకు ప్రతి ఏటా వందల టీఎంసీల నీరు తుంగబద్ర నది నుంచి తరలిపోతున్నాయి. నది చెంతనే ఉన్న ఆర్డీఎస్ రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. తుమ్మిళ్ల లిఫ్టు వచ్చాక రైతులకు కొంత ఊరట లభించినప్పటికీ, నదిలో ఉన్న వరద నీటిని ఒడిసిపట్టుకునే రిజర్వాయర్లే ప్రశ్నార్థకంగా మారాయి. దీని వల్ల నీటిి వసతి ఉన్నా జిల్లా రైతులు వాడుకోలేకపోతున్న దుస్థితి నెలకొంది. – శ్రీను, రైతు, పచ్చర్ల కష్టకాలంలో పంటలను కాపాడుకోవచు్చ తుంగభద్ర నది నిండుగా ప్రవహిస్తుంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుంటాయి. అదే సమయంలో తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా నీటిని వదిలితే రైతులకు ప్రయోజనం ఏముంటుంది. అదే వరద నీటిని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకుంటే పంటలు ఎండే సమయంలో, ఎగువ నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు రాని సమయంలో నీటిని అందించి పంటలను కాపాడుకోవచ్చు. – బానుప్రసాద్, రైతు, శాంతినగర్ మల్లమ్మకుంటపై నీలినీడలు గతేడాది సుంకేసుల నుంచి 300 టీఎంసీలు దిగువకు కేసీ కెనాల్‌కు 35 టీఎంసీలు తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా వాడింది 3.529 టీఎంసీలు మాత్రమే.. ప్రతి ఏటా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు తుమ్మిళ్ల లిఫ్టులో ప్రధానమైన రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి వృథా జరుగుతుంది. వందల టీఎంసీలు సుంకేసుల నుంచి దిగువకు వెళ్తున్నాయంటే, బ్యాక్ వాటర్ నిలిచే తుమ్మిళ్ల దగ్గర ఎంత స్థాయిలో వరద ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఆ వరద నీటిని ఒడిసి పట్టుకొనే సౌక్యరాలు లేక నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తుంది. లిఫ్టు ప్రారంభమైనప్పటి నుండి కేవలం మోటార్లు రన్ చేసి నీటిని నేరుగా ఆర్డీఎస్ కెనాల్లోకి విడుదల చేస్తున్నారే తప్పా నీటిని నిల్వ చేసుకునేందుకు చర్యలను వేగవంతం చేయడం లేదనే వాదన ఆర్డీఎస్ రైతులు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ల నిర్మాణంపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులు వేగంగా చేపట్టాల్సింది ఉండగా.. దానిపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. -
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్‌గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్‌లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
నందికొట్కూరు టు అలంపూర్
అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి కొత్తగా ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో నది అవతలి వైపు ఉన్న గ్రామాల వరకే ఉన్న సేవలు ప్రస్తుతం అలంపూర్ వరకు చేరుకున్నాయి. ఏపీ రాష్ట్రంలోని నందికొట్కూరు డిపో నుంచి అలంపూర్‌కు ఆదివారం ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి నందికొట్కూరు డిపో నుంచి అలంపూర్ మండలంలోని సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు వరకు ఆర్టీసీ సేవలు కొనసాగేవి. రాష్ట్ర విభజన తర్వాత ఈ మూడు గ్రామాల రోడ్లు అధ్వానంగా మారడంతో బస్సుల రాకపోకలకు కష్టంగా మారడం నిలిపివేశారు. స్థానికుల వినతి మేరకు నందికొట్కూరు ఆర్టీసీ అధికారులు ఇన్నాళ్లకు తిరిగి సర్వీసులు ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు నందికొట్కూరు నుంచి బస్సు ప్రారంభమై కర్నూల్ జిల్లాలోని బ్రహ్మణకొట్కూరు, కోళ్ల బావాపురం, పూడురు మన ప్రాంతంలోని ర్యాలంపాడు మీదుగా 9.50కి అలంపూర్‌కు చేరుకుంటుందని, ప్రతి రోజు నాలుగు ట్రిప్పులు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నందికొట్కూరుకు బస్సు సేవలను అందించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేత్రానికి బస్సు మార్గం ద్వారా చేరుకునే భక్తులు.. శ్రీశైలం వెళ్లడానికి ఈ బస్సు సర్వీస్‌లు దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి ఆర్టీసీ నూతన బస్సు సర్వీసు ప్రారంభం -
‘ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మానవపాడు: ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలోనే దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపి మండలాధ్యక్షుడు మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో అనేక చారిత్రాక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, శ్రీరామ మందిరం, త్రిబుల్ తలాక్, ఎస్సీ వర్గీకరణ, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి కిసాన్, ఆపరేషన్ సిందూర్, విశ్వకర్మ యోజన, మేకిన్ ఇండియా, స్వదేవీ వస్తువుల వాడకం, యూపీఐ వంటి సేవలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో దేశాన్ని నిలిపిందన్నారు. ఎన్నో పథకాలతో కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా ప్రదానకార్యదర్శి రవికుమార్, నాయకులు అక్కల రమాదేవి, స్వప్న, నాగేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌శర్మ, లక్ష్మినారాయణ, కురుమన్న, రాఘవయ్య, తిమ్మప్ప, రామాంజి, రాజు, మదన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.‘భగవద్గీత మత గ్రంథం కాదు’వనపర్తి రూరల్: భగవద్గీత మత గ్రంఽథం కాదని.. సర్వ మానవుల జీవితాలను ఉద్దరించే గ్రంఽథమని కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. ఎల్వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి పట్టణ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో భగవద్గీత విజయభేరి నిర్వహించగా.. ఆయన హాజరై భగవద్గీత శ్లోకాలు చదివి వాటి సారాంశం వివరించారు. సృష్టి ఉన్నంత వరకు ప్రపంచానికి నిదర్శనంగా నిలబడి ఉండే సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోని ఎన్నో గ్రంథాల సారాంశం భగవద్గీతలో ఇమిడి ఉందని వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పట్టణ పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు ఒమేష్గౌడ్, నిర్వాహకులు వెంకటస్వామి, బీచుపల్లి, పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షుడు రామకృష్ణ, మాస్టర్ పాండురంగయ్య, రుక్మానందం తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటంవనపర్తి: విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎన్ఎస్యూఐ విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హమ్ బదిలేంగే కార్యక్రమానికి ఆయనతో పాటు ఇతర నాయకులు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఉజ్వల భవిష్యత్‌కు విభాగం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్చార్జ్ రావడం సంతోషంగా ఉందని.. విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, నాయకులు కోట్ల రవి, ఆదిత్య, ఎత్తం చరణ్‌రాజ్, మన్యంకొండ, కృష్ణబాబు, చంద్రమౌళి, వెంకటేష్, రఘుయాదవ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బాదుడు
కిలోమీటర్ల రౌండప్ చార్జీలతో అదనపు భారం నారాయణపేట రూరల్: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగగా అందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు సైతం కనీసం నిల్చొనే చోటు లేక ఇక్కట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్రయాణం చేస్తున్న పురుషుల సంగతి సరేసరే. ఈ తరుణంలో పాఠశాల, కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారాలకు రెగ్యులర్ ప్రయాణం చేస్తున్నవారు, ఇతర ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యం అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాలతో స్థానిక అధికారులు పెంచిన చార్జీలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు కొందరు పురుష ప్రయాణికులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటు, టోల్ ప్లాజా పేర్లతో.. ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు కిలోమీటర్ల రౌండ్ ఫిగర్‌తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్‌ప్రెస్ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్‌కి లెక్కించి టికెట్ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరుతో టికెట్ ధరలను రౌండప్ పేరుతో పెంచారు. తాజాగా మరోసారి కిలోమీటర్లను సర్దుబాటు చేస్తున్నామనే పేరుతో రూ.10 పెంచేశారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం పడనుంది. దీనికితోడు టోల్గేట్ దాటి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆయా మార్గాల్లోని ప్రయాణికులపై గరిష్టంగా రూ.20 భారం పడినట్లయ్యింది. నెలవారి విద్యార్థి పాసుల పెంపు ఇలా.. 2024– 25లో ఇచ్చిన బస్‌పాస్‌ల వివరాలిలా.. టోల్గేట్ దాటితే మరో రూ.10 వడ్డింపు మహిళలకు ఉచిత ప్రయాణంతో తీవ్రమైన ఇబ్బందులు ఇప్పటికే సీట్లు దొరకక పురుష ప్రయాణికుల అసహనం తాజాగా ధరల పెంపుతో మరింత పెరిగిన అయిష్టత ఇష్టారీతిగా పెంచడం సరికాదు గతంలో చిల్లర సమస్య పేరుతో చార్జీలను రౌండ్ ఫిగర్ చేసి భారం మోపిన ఆర్టీసీ తాజాగా కిలోమీటర్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నట్లు అసంబద్ధంగా ఇష్టారీతిగా చార్జీలు పెంచడం సరికాదు. ప్రతి టికెట్‌పై రూ.10, టోల్గేట్ దాటితే అదనంగా మరో రూ.10 వసూలు చేస్తున్నారు. సీజన్ పాస్ నెలకు మరో రూ.400 చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – సందీప్, ప్రయాణికుడు, నారాయణపేట పేద విద్యార్థులపై ఆర్థిక భారం.. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆర్టీసీ బస్సుల్లో పట్టణాలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరికాదు. రూ.75 నుంచి ఏకంగా రూ.275 చొప్పున నెలవారి రాయితీ పాసుల ధరలను పెంచడం ఆయా కుటుంబాలకు మోయలేని భారంగా మారుతుంది. బాలురకు సైతం ఉచితంగా పాసులు అందించి ఆదుకోవాలి. – నరేష్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్, నారాయణపేట 20 రోజుల చార్జీతో.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే నెలవారీ రూట్‌పాస్ చార్జీలను సైతం ఆర్టీసీ పెంచింది. 20 రోజుల చార్జీతో నెల రోజులపాటు ప్రయాణం చేయడానికి అందించే సీజన్ పాసులపై రూ.400 అదనంగా వసూలు చేయనున్నారు. ఇక 12 సంవత్సరాలు నిండిన బాలురకు పల్లె వెలుగు బస్సుల్లో అందించే రాయితీ బస్ పాస్ ధరలను సైతం అమాంతం పెంచారు. 5 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల మధ్య విద్యార్థి ఇంటి నుంచి విద్యాసంస్థ వరకు ప్రయాణం చేస్తారు. దీనికి రూ.150 నుంచి మొదలయ్యే పాస్ ధర కనిష్టంగా నెలకు రూ.75 నుంచి గరిష్టంగా రూ.275 వరకు ఉంది. స్వల్పంగా పెరిగింది.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్గేట్ ధరలను పెంచుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అందుకు అనుగుణంగా ప్రయాణికుల టికెట్‌పై ఆ భారాన్ని సరిచేస్తారు. ఈసారి కొంత ఆలస్యంగా వాటిని అమలు చేశాం. ఇక పల్లె వెలుగు మాదిరి ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం రౌండప్ కిలోమీటర్లకు టికెట్ ధరను సరిచేయడంతో కొన్ని స్టేజీలకు టికెట్‌పై స్వల్పంగా ధర పెరిగింది. – సంతోష్‌కుమార్, రీజినల్ మేనేజర్, మహబూబ్‌నగర్ -
యోగా దినచర్యగా పాటించాలి
ఎర్రవల్లి: ప్రతి ఒక్కరికి యోగా దినచర్యగా పాటించాలని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం బీచుపల్లి పదో బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి యోగా ఆసనాలను వేశారు. యోగా వల్ల మనస్సుకు శాంతి కలగడమే గాక శరీర దృఢత్వం పెరుగుతుందని, ఆవేశం కలగకుండా ఓర్పును ఇచ్చే గొప్ప విద్య యోగానే అని అన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, పటాలం ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
గద్వాలటౌన్: చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉదయం ఆరు గంటలకు ముందే యోగా సాధనకు తరలివచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం యోగా శిక్షణకు హాజరై స్ఫూర్తి కలిగించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ, పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్టు, కలెక్టరేట్ కార్యాలయం, గద్వాల లయన్స్ క్లబ్, గద్వాల వాకర్స్ గ్రూప్, స్మృతివనం సభ్యులు, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో వేరువేరుగా ఆయా ప్రాంతాలలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగింది. ● కలెక్టరేట్ కార్యాలయంలో, స్మతివనంలో జరిగిన యోగా దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పాల్గొని అధికారులు, ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పురుషులు, మహిళలు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ● ధరూర్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్మృతివనంలో మహిళలు, వాకర్స్ పెద్ద సంఖ్యలో హాజరై యోగాసానాలు వేశారు. క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడాకారులు యోగా శిక్షణ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగ శిక్షణ ఇచ్చారు. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వారి వారి పరిధిలో యోగా శిబిరాలు నిర్వహించారు. ●పలువురు శిక్షకులు యోగాపై మెలకువలు వివరించారు. రుగ్మతలను దూరం చేసే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే ప్రాణాయామం.. మనస్సును నియంత్రించే ధ్యాస.. ధ్యానం సాధనలతో జిల్లా వాసులు ఉషోదయాన సేదతీరారు. శిక్షకులు వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్యానికి అవి ఎలా.. ఉపయోగపడతాయో సవివరంగా తెలియజేశారు. ఔత్సాహికులచే ఆసనాలు వేయించారు. యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు.. ఈ క్రమంలోనే ప్రాథమికంగా యోగా శిక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు. సుమారు రెండు గంటల పాటు యోగా సాధన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని ఔత్సాహికులు కోరారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు. ఉత్సాహంగా యోగా శిక్షణ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతో మానసిక ఒత్తిడి దూరం.. గద్వాల క్రైం: మానసిక ఒత్తిళ్లు.. నిలకడ లేని ఆలోచనల నుంచి బయటపడాలంటే యోగాతోనే సాధ్యమవుతుందని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత, ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా కోర్టు, పోలీసు పరేడ్ గ్రౌండ్ ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు తీవ్ర వేదన, చిరాకు, ఒత్తిళ్లు, ఆందోళనకు కుంగిపోతున్నారన్నారు. స్థిరత్వం లేని ఆలోచనలు, క్షణికావేశంతో చేస్తున్న పొరపాటు ద్వారా సమస్యలకు నిలయంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రతి జఠిలమైన సమస్యల నుంచి విజయం సాధించాలంటే క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. మానసిక ప్రశాంతతా, ఆనందం, సమయానుకులంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేస్తున్న పనుల్లో సంతోషం ఉంటుందన్నారు. అన్ని వయస్సుల వారు యోగా చేయడం ఆరోగ్యదాయకమన్నారు. -
వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..
నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. – గెంటెల హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు రైతులను ప్రోత్సహించాలి.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలవయ్య, మన్ననూర్, అమ్రాబాద్ సంతతి పెంచేందుకు కృషి.. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ● -
ఉద్యాన పంటల పరిశీలన
ధరూరు: మండల పరిదిలోని పారుచుర్ల గ్రామ శివారులో రైతులు సాగు చేసిన ఉద్యాన పంటలను అదనపు కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. శనివారం డ్రాగాన్ ఫ్రూట్స్ పండ్ల తోటను పరిశీలించి రైతు శారదమ్మను ప్రభుత్వం నుంచి అందిన ఫలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ పంటలను సాగు చేసుకోవచ్చు అన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పరికాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయానుకూలంగా పంటకు ఎరువులు, నీళ్లు పెట్టి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ శరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మస్తాన్, టీఏ అలీన్ పాష, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి
మానవపాడు: బాల్యవివాహలను ముందస్తుగానే గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, వీటి అడ్డుకట్టకు అందరూ సమష్టిగా కృషి చేయాలని డీడబ్ల్యూఓ సునంద సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఏడు మండలాల అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణిల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, 9 నెలల వరకు వివిధ దశలలో జరిగే పిండం అభివృద్ధి గురించి వివరించారు. పుట్టిన పిల్లల్లో రెండేళ్ల వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ 75శాతం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా పిల్లల ఎత్తు, బరువు సరిగా కొలవాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, సూపర్వైజర్ ఆస్మా, లక్ష్మిదేవి, నర్గీస్, పుష్ప, జయమ్మ, బాలమ్మ, లక్ష్మి పరమేశ్వరి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ సురేష్, అంగన్వాడీ టీచర్లు తదితరులు న్నారు. -
తెలంగాణ బ్రాండ్‌గా తూర్పుజాతి పశుసంపద
● నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు ● మన్ననూర్ గిత్తకు వందేళ్లకు పైగా చరిత్ర ● ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ ● ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అటవీ మేతతో దృఢంగా ఉండటం.. 20–25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం వీటి సొంతం. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడ్మిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వట్టువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. మన్ననూర్ గిత్తగా నామకరణం.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే)లో ఈ ప్రాంత రైతులతో కలిసి తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన, పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల వరకు మాత్రమే ఉన్నాయి. ఏటేటా ఈ అరుదైన పశుజాతి తగ్గిపోతోంది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనేవారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతరాలతో పశుగ్రాసం కొరత ఏర్పడి.. పశుపోషణ భారంగా మారి చాలామంది వీటిని వదులుకుంటున్నారు. కోడే దూడలకు డిమాండ్.. వ్యవసాయ అనుబంధమైన పశుపోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశుసంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి.. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతుంటారు. గతంలో జత గిత్తలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖుల ప్రత్యేక పూజలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు చల్లా ఆగస్త్యారెడ్డి, హరిప్రసాద్ రెడ్డితో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారి చంద్రయ్య ఆచారి ఉన్నారు. ‘సదరం’ క్యాంపు షెడ్యూల్ విడుదల గద్వాల: జిల్లాలో దివ్యాంగులకు నూతన సర్టిఫికెట్లు, రెన్యూవల్ కొరకు సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 15వ తేదీవ వరకు నిర్వహించే క్యాంపుల్లో ముందస్తుగా మీ–సేవా కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్నవారు నిర్ణయించిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని తెలిపారు. హాజరు కాని వారిని తిరస్కరించనున్నట్లు, హాజరైన వారికి అదే రోజు సదరం సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 23, 30, జూలై 2,5,7,9,14 తేదీల్లో శారీరక వికలత్వం గల వారికి, జూలై 1, 8, 15తేదీల్లో కంటి, శారీరక వికలత్వం గల వారికి, జూలై 3, 10 తేదీల్లో శారీరక మానసిక వికలత్వం, 4,11 తేదీల్లో చెవిటి, మూగ,శారీరక వికలత్వం గల వారికి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో రూ.206.70 కోట్లు జమ గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరకు 1,57,250 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రూ.206.70కోట్లు నేరుగా జమ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా పథకం కేవలం ఆర్థిక సాయమే కాకుండా రైతుల భవిష్యత్‌పై ఆశను నింపే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకోసం అవసరమైన పెట్టుబడి భారం నుంచి రైతులకు విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు జిల్లాలో అర్హులైన 1,57,250మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.206,70,04,561లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన అర్హత గల రైతులకు త్వరలోనే సాయం అందుతుందని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ గద్వాల: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చేనేతజౌళి శాఖ ఏడీ గోవిందయ్య ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో 1–4–2017 తేదీ నుంచి 31–3–2024వరకు రుణాలకు మాఫీ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రొఫార్మా 1ఏ మరియు 1బీ బ్యాంకుల్లో నుంచి వచ్చిన మిగిలిన బ్యాంకులు మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు చేనేత శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈనెల 24వ తేదీలోగా ఇవ్వాలని, బ్యాంకులు సమర్పించిన రుణ వివరాలను డీఎల్సీ అనుమతితో ఈనెల 28వ తేదీలోపు ఎస్ఎల్బీసీ కి సమర్పించబడునని, లేనిచో సంబంధిత బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం మెయిల్ అడ్రస్ jogulambadtex@gmail.com అని, బ్యాంకర్లు కార్మికుల రుణమాఫీ పథకానికి సహకరించాలని తెలిపారు. 26న జాబ్‌మేళా మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 26న అప్రెంటిషిప్, జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ కౌసర్‌జహాన్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కో కన్వీనర్ నర్సింహులుతో కలిసి ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2023, 2024, 2025 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. గురువారం ఉయదం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. -
ఆయకట్టుకు సాగునీరు
నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగుకు ఆసక్తి చూపుతున్నారు. 100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు... జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తున్నారు. జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కేటీదొడ్డి: ఎన్నో ఏళ్లుగా పేదలు సొంతిళ్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారని, అలాంటి పేదలందరికీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఖర్చు చేసి ఇందిరమ్మ ఇంటిని కట్టించి వారి కలను నిజం చేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కేటీదొడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, మండలానికి 378 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించి ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలను విడతల వారీగా అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఏదైనా అభివృద్ధి ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, జంబురామన్ గౌడు, రాజశేఖర్, రామకృష్ణనాయుడు, ఉరుకుందు, టీచర్ గోవిందు, కొండన్న, యుగందర్, రఘుకుమార్ శేట్టి, నాసీర్, తదితరులు ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పెంపు
గద్వాల: ప్రజల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని అక్రమ లేఅవుట్లను 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పెంచిందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని జిల్లాలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి 19,485 మంది సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. https//lrs.telangana. gov.in ద్వారా నేరుగా తమ దరఖాస్తులు సరిచూసుకొని ఫీజు చెల్లింపు చేయవచ్చని, ఫీజు కట్టిన వారికి L1,L2,L3 లాగిన్ లలో వెరిఫికేషన్ చేసి వెంటనే ప్రొసీడింగ్ కూడా జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్లాట్ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
‘సీజనల్’పై అప్రమత్తం
వానాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు ●పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలిసీజనల్ వ్యాధులు ప్రబలకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం, దోమల నివారణ, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాం. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం తగ్గనట్లయితే వెంటనే సమీప ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కడా మందుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ హాస్టల్స్, కార్యాలయాలలో పరిశుభ్రత, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త చర్యలు చేపడతాం. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి గద్వాల క్రైం: వానాకాలం వచ్చేసింది.. చిన్నపాటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు.. డ్రైయినేజీలు.. మురుగుకుంటలు.. ఇంటి సమీప కుంటల్లో నీరు నిలిచి దోమల వృద్ధి అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలో 31 డెంగీ కేసులు నమోదవడం.. మరెన్నో టైఫాయిడ్, మలేరియా కేసులు.. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాల భారినపడిన నేపథ్యంలో ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. దోమతెరలు వాడాలని.. కాచి చల్లార్చిన నీరు తాగాలని.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. నిల్వ నీటిని పారబోయాలని.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్వం సిద్ధం చేశారు. గద్వాల, మల్దకల్, మానవపాడు, కేటీదొడ్డి, గట్టు, ఇటిక్యాల, అలంపూర్, శాంతినగర్, రాజోళి తదితర మండలాల్లో షెడ్యూల్ రెడీ చేశారు. మరో వైపు కలెక్టర్ సంతోష్షకుమార్ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిలో నమోదైన కేసులు, ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు సీజనల్ వ్యాధులు ప్రధానంగా కలుషిత నీరుతాగడం, దోమకాటుతోనే సంక్రమిస్తాయి. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈక్రమంలో నీరు కలుషితం కాకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని వివరిస్తున్నారు. బయటి ఆహారాలకు దూరంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని, వేడి ఆహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని పిలుపు నిస్తున్నారు. కూలర్లు, కొబ్బరిబోండాలు, పాత టైర్లు, పూలకుండీలు, డ్రమ్ములలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. టీహబ్‌లో రక్తపరీక్షలు.. రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో రక్త నమూనాలను సేకరించి, టీ హబ్ వాహనం ద్వారా పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు. పరీక్ష ఫలితాలను సంబంధిత వ్యక్తి మొబైల్‌కు సందేశం రూపంలో పంపిస్తున్నారు. దీంతో రోగికి మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను త్వరగా నిర్ధారించి, వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడింది. జ్వర బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. దీంతోపాటు ప్రత్యేక బృందాలు, ఆశ కార్యకార్తలు గ్రామాల్లో పర్యటిస్తూ.. జ్వరం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. కేసులు అధికంగా నమోదైతే ఆయా గ్రామాల్లోనే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్యశాఖ చర్యలు చేపట్టింది. 2024లో జిల్లాలో డెంగీ కేసుల వివరాలిలా.. మండలం కేసులు గద్వాల 4 గద్వాల పట్టణం 3 మానవపాడు 1 ధరూరు 3 రాజోలి 2 గట్టు 2 అలంపూర్ 7 మల్దకల్ 4 అయిజ 2 ఇటిక్యాల 1 వడ్డేపల్లి 1 కేటీదొడ్డి 1 దోమలు వృద్ధి చెందకుండా.. పరిశుభ్రతపై ఊరూరా ప్రజలకు అవగాహన వ్యాధులు ప్రబలితే తక్షణమే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు గతేడాది జిల్లాలో 31 డెంగీ కేసులు నమోదు లోతట్టు, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి -
43,047 అర్జీలు
1,282 గ్రామాలు..ఉమ్మడి జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 15,599 దరఖాస్తులు ● నారాయణపేటలో అత్యల్పంగా 4,052 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో తప్పులను సవరిస్తూ.. మార్పులు, చేర్పులతో భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. నిర్దేశిత గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 1,282 గ్రామాలకు సంబంధించి 43,047 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 15,559 అర్జీలు రాగా.. నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 4,052 వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా ఇలా.. ● మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 1,317 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 2,348, భూ విస్తీర్ణంలో తప్పులపై 966, భూ యజమాని పేర్లలో తప్పులు సవరించాలని 435 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● నారాయణపేట జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు జరగగా.. నారాయణపేట మండలంలో అత్యధికంగా 1,230 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 1,284, భూ విస్తీర్ణంలో తప్పులపై 776, పేర్లలో తప్పులు సవరించాలని 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గద్వాల మండలంలో అత్యధికంగా 1,324 అర్జీలు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు సవరించాలని 832, పెండింగ్ సక్సేషన్లపై 750, అసైన్డ్‌మెంట్ ల్యాండ్‌లపై 640, గెట్ల పంచాయితీలపై 200 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 15,559 దరఖాస్తులు వచ్చాయి. కొల్లాపూర్ మండలం నుంచి అత్యధికంగా 2,138 అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 3,921, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,062, పేర్లలో తప్పులు సవరించాలని 478 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● వనపర్తి జిల్లాలో అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 1,555 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 1,135, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,064, పేర్లలో తప్పులకు సంబంధించి 824 దరఖాస్తులు వచ్చాయి.జిల్లాల వారీగా సదస్సులు, దరఖాస్తుల వివరాలు.. జిల్లా సదస్సులు వచ్చిన నిర్వహించిన దరఖాస్తులు గ్రామాలు మహబూబ్‌నగర్ 293 9,610 జోగుళాంబ గద్వాల 198 5,800 నాగర్‌కర్నూల్ 338 15,559 నారాయణపేట 234 4,052 వనపర్తి 219 8,026 -
సమస్యలు పరిష్కరించాలని దీక్ష
అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ, గ్రామీణ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హాజరై దీక్షను ప్రారంభించారు. బీజేపీ నాయకులు శరత్ బాబు, గొంగళ్ల ఈశ్వర్‌తోపాటు పలువురు బీజేపీ నాయకులు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టిసారించడం లేదన్నారు. రోడ్లు అధ్వానంగా మారిన కనీస మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణాలు జరగాయన్నారు. జిల్లాలోని ఏ గ్రామ రోడ్డు చూసిన అధ్వానంగా మారిందన్నారు. అయినప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీల్లోని అంతర్గత రోడ్లు సైతం అధ్వానం మారాయని, ప్రభుత్వం తక్షణమే 2009 వరద బాధితులకు నష్టపోయిన అలంపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిచి మౌళిక వసతులు కల్పించాలన్నారు. మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. కాశీపురం గ్రామ రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మధురవాణి, రాజగోపాల్, రాజశేఖర శర్మ, నాగమల్లయ్య, నాగేశ్వర రెడ్డి, అబ్దుల్లా, రంగస్వామి, నరేష్, జగన్మోహన్ రెడ్డి, మద్దిలేటి, ప్రదీప్ స్వామి, వినీత్, మహేష్, రమేష్ రెడ్డి, రాజశేఖర్, భాస్కర్, పరుశురాం, కృష్ణ, సత్యారెడ్డి, ప్రవీన్, అంజీ తదితరులు ఉన్నారు. -
సాధించిన పతకాలు..
వనజారెడ్డి 2007 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది వైజాగ్‌లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం సాధించారు. 2023 ఏపీ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో, 2024లో పలుచోట్ల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంది. సిద్దిపేటలో యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వనజారెడ్డి ప్రతిభచాటి ప్రథమస్థానంలో నిలిచారు. అదేవిధంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పతకాలు సాధిస్తూ ప్రతిభచాటుతున్నారు. వనజారెడ్డి, కీర్తనారెడ్డి యోగా విన్యాసాలు -
‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం
మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్హెచ్ఓ సక్రమంగా మానిటరింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్ డీఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్బీ, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్ అప్లికేషన్ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్‌రావు, యోగేష్ గౌతం పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల అతి జాగ్రత్త వల్లే తప్పిదం జరిగింది మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
జోగుళాంబ ఆలయంలో ట్రైనీ ఐఏఎస్‌లు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని శుక్రవారం నలుగురు ట్రైనీ ఐఏఎస్‌లు దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు తహసీల్దార్ మంజుల, ఆర్ఐ దుర్గా సింగ్ తదితరులు ఉన్నారు. పీజీ కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన గద్వాలటౌన్: నదీ అగ్రహారం సమీపంలో ఉన్న ప్రభుత్వ పీజీ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పీజీ కళాశాలలో గత ఐదు రోజుల నుంచి వంట మాస్టర్ లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. వంట మాస్టర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళాశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలవురు విద్యార్థులు మాట్లాడారు. వంట మాస్టర్ లేకపోవడం వలన విద్యార్థులే వంట వండుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు వివరించినా ఫలితం లేదన్నారు. పీజీ కళాశాలలో 105 మంది విద్యార్థులు వివిధ కోర్సులలో చదువుతున్నారని వివరించారు. కళాశాలలో వంట మాస్టర్‌తో పాటు వార్డెన్ సైతం లేడన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి వంట మాస్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. భూసార పరీక్షలు తప్పనిసరి ఇటిక్యాల: భూమిలో పోషకాలు, ఇతర గుణాలు తెలుసుకోవడానికి భూసార పరీక్షలు తప్పనిసరి అని, ప్రతి రైతు విత్తనాలు వేసే ముందు ఈ పరీక్షలు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఉదండాపురం, సాతర్ల గ్రామాలను ఆయన సందర్శించి సహజ పద్ధతిలో సాగుచేసే రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని, ఏ పంట సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకోవాలని సూచించారు. పంటకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార పరీక్షలు ఎంతో మేలు చేస్తాయని ఆయన వివరించారు. పంటలను సాగు చేసేందుకు రైతులు సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో రైతు రిజిస్టేషన్, రైతు భరోసా కార్యక్రమాల అమలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
మురిసిన పెద్దధన్వాడ
రాజోళి: ఇథనాల్ చిచ్చు వద్దంటూ పోరాడిన రైతుల లోగిళ్లలో పచ్చ తోరణాలు గడపలకు పెనవేసుకున్నాయి. గురువారం రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏరువాక సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న రైతులు, 12 గ్రామాల ప్రజలు ఈ నెల 4న పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దని తమ గొంతుకను వినిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు విధితమే. దీంతో 42 మందిపై కేసు నమోదు కాగా..12 మంది రైతులను 5వ తేదీన రిమాండ్‌కు తరలించారు. రైతులంతా ఉంటేనే పండుగ చేసుకోవాలంటూ.. ఈ నెల 11న చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామస్తులంతా బహిష్కరించారు. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం పండుగ నిర్వహించారు. సంబురంగా రైతు పండుగ ఏరువాక పౌర్ణమి అంటే నడిగడ్డలో అతి పెద్ద పండుగ. అందులోనూ రైతులు జరుపుకొనేది. పెద్దధన్వాడలో ఉదయం నుండే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు, వాకిళ్లను తోరణాలతో అలంకరించారు. పిండి వంటలను ఒకరి ఇంటి దగ్గరకు వెళ్లి తయారు చేసి, ఆ తర్వాత మరొకరి ఇంటికి వెళ్లి చేసుకుంటూ సరదాగా గడిపారు. మరోవైపు రైతులు తమ ఎద్దులను తీసుకొని తుంగభద్ర నదికి వెళ్లి స్నానాలు చేయించి, అందంగా అలంకరించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి వంటలను, తీసుకుని ఆలయానికి వెళ్లారు. సుంకులమ్మ తల్లి దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. పిండి వంటలు, బక్షాలు,ఇతర నైవేద్యాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా చూడాలని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయం కోసం రైతులు ఇప్పటికే సేద్యాలు పూర్తి చేసుకోగా అనుకోకుండా జరిగిన పరిణామాల కారణంగా సాగు ఆలస్యమైంది. వాటిని అధిగమిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు రైతులు ఇదిలాఉండగా, బెయిల్‌పై విడుదలైన రైతులు గురువారం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు రిమాండ్‌కు వెళ్లే క్రమంలో వారి నుంచి పోలీసులు సెల్ఫోన్లు తీసుకోగా.. వాటి కోసం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కానీ కేసు నమోదు చేసిన ఎస్ఐ జగదీశ్ బదిలీ కావడం, శాంతిగనర్ సర్కిల్ సీఐ టాటా బాబు బందోబస్తులో ఉండటంతో వారి ఫోన్లపై స్పష్టత రాలేదు. ఇదే విషయమై సీఐ టాటాబాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. 12 మంది కండిషనల్ బెయిల్‌పై ఉన్నారని, వారి సెల్ఫోన్లపై విచారించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంబరాన్నంటిన ఏరువాక సంబరం పిండి వంటలతో సుంకులమ్మకు మొక్కులు చెల్లింపు ఇథనాల్ ఘటనతో గతంలో ‘ఏరువాక’ బహిష్కరణ -
ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి
గద్వాలటౌన్: ప్రైవేటు పాఠశాలల్లో విద్య వ్యాపారంగా మారిందని, ధనార్జనే ధ్యేయంగా విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని, తక్షణమే ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం చదువులంటూ విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. చాలా ప్రైవేటు పాఠశాలలో అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పాఠాలు బోధిస్తున్నారని చెప్పారు. విద్యా హక్కు చట్టం అమలు చేసి, ప్రతి పాఠశాలలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట్ల విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. సమావేశంలో ఐద్వా నాయకులు వినోద, అమ్ములు, శిరీష, కై రున్ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి
ఇటిక్యాల: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నర్సరీ, క్యాటిల్షెడ్ను ఆయన పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలను పెంచే నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలని, నర్సరీలోని మొక్కలను ఎండ నుంచి సంరక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా నర్సరీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం షాబాద్ గ్రామంలో రైతుల సాగు చేసిన ఆయిల్‌పామ్, బత్తాయి (నారింజ) తోటలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట శ్రీను, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఓ శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, టి ఎలు కృష్ణ, ప్రవీణ్, పురేందర్, ఎఫ్ఎ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన ఎంపిక పోటీలను డీవైఎస్ఓ జితేందర్ ప్రారంభించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, కేజీ మెడిసిన్ బాల్పుట్, 300 మీటర్లు ఫ్లయింగ్ స్టార్ట్, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు వంటి తొమ్మిది క్రీడా విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ జితేందర్ విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, ఫిజికల్ డైరెక్టర్లు హైమావతి, బీసన్న, అనూష, నరేష్, కవిత, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బీచుపల్లిలో మంత్రి రాజనర్సింహ పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సందర్శించారు. అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్ గౌడ్ శేష వస్త్రాలతో సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, నాయకులు గట్టు తిమ్మప్ప, గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్ ఉన్నారు. జోగుళాంబ సన్నిధిలో ఎస్పీ అలంపూర్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలను ఎస్పీ శ్రీనివాస్‌రావు సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు సీఐ రవిబాబు, ఎస్ఐ శేఖర్, ఆలయ అధికారి చంద్రయ్య ఆచారి తదితరులు ఉన్నారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,277 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,227, కనిష్టంగా రూ.1,500 ధర పలికింది. వేరుశనగకు రూ.3,566 బకే ధర, ధాన్యం హంస రకం గరిష్టంగా రూ.1,841, కనిష్టంగా రూ.1,649, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,119, కనిష్టంగా రూ.1,689 ధరలు లభించాయి. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
గట్టు: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గట్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. గట్టు మండలానికి 780 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు 45 రోజుల్లో పనులను ప్రారంభించి, ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలను విడతల వారీగా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రైతు భరోసా కింద 4 ఎకరాలపైగా ఉన్న రైతులకు ఇప్పటివరకు రూ.140 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గట్టు మండలం విద్యారంగంలో వచ్చిన మార్పు ప్రశంసనీయమని కొనియాడారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, ఎంపీడీఓ చెన్నయ్య, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లభ్దిదారులు పాల్గొన్నారు. -
సర్కారు బడి.. సమస్యల ఒడి
గద్వాలలో అంసపూర్తిగా మిగిలిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినిల దుస్థితి. బెంచీలపైనా, బెంచీల కింద ఇరుకిరుకుగా కూర్చొని పాఠాలు వింటున్న ఈ విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని పదో తరగతి వారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు కొనసాగుతున్నాయి. మొత్తం 20 తరగతి గదులకుగాను 14 తరగతి గదులే ఉన్నాయి. 1,152 మంది విద్యార్థినులు విద్యనసిస్తున్నారు. రెండు సెక్షన్లు తెలుగు, రెండు సెక్షన్లు ఇంగ్లీష్ మీడియానికి తరగతి గదులు అవసరం ఉన్నాయి. అయితే తరగతి గదుల కొరత కారణంగా నాలుగు సెక్షన్ల విద్యార్థులను మూడే సెక్షన్లలో సర్డుబాటు చేసి పాఠాలను బోధించాల్సి వస్తోంది. పదో తరగతిలో ఒక్కో సెక్షన్లో 110–120 మంది విద్యార్థి నులు అభ్యసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉండటం వలన తరగతి గదులు సరిపోవడం లేదు. దీంతో ఇలా బెంచీలపైనా, కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. -
మండలాల వారీగా వివరాలిలా..
●వర్షం వస్తే చిత్తడి.. వర్షం వస్తే తరగతి గదుల్లోకి నీరు చేరి చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని చోట్ల గోడలు నెర్రలుబారి ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీటితో పుస్తకాలు తడుస్తున్నాయి. ఇప్పటికై నా గదుల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. – పవన్, పదో తరగతి విద్యార్థి, ఉండవెల్లి నిధులు రాకపోవడంతోనే.. మన ఊరు–మన బడిలో భాగంగా నిర్మించిన పాఠశాల భవనాలకు నిధులు రాలేదు. అనేక మంది కాంట్రాక్టర్లకు వారు చేపట్టిన నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. పాత బిల్లులు చెల్లిస్తేగాని నిర్మాణ పనులు పూర్తిచేయమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నిధులు వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి అసంపూర్తి పనులు పూర్తిచేస్తాం. – నాగరాజు, పంచాయతీరాజ్ ఈఈ అయిజ/ఉండవెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను, సౌకర్యాలను అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు– మన బడి’ పనులు నిధుల కొరతతో కొన్ని చోట్ల ఆగిపోయాయి. కొన్నిచోట్ల పూర్తి కాగా.. మరికొన్నిచోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆయా పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుత ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు పూనుకోగా అవి కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభమైనా.. అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్.. జిల్లాలో మొత్తం 460 పాఠశాలలు ఉండగా 284 పాఠశాలలను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఎంపిక చేశారు. దానికోసం సుమారు రూ.77 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని పనులు ప్రారంభించారు. వాటిలో ముఖ్యంగా నూతన పాఠశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం, బాత్రూంల ఏర్పాటు, సరిపడినన్ని తరగతి గదులు, వంటగదుల నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన బెంచీలు ఏర్పాటు చేయాలని, అన్నింటికంటే ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించాలని ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ నిర్మాణ పనుల్లో 142 పాఠశాలల్లో 49 చోట్ల పనులు పూర్తయ్యాయి. 89 పాఠశాలలు అసంపూర్తిగానే ఉన్నాయి. 4 పాఠశాలల నిర్మాణం ఇప్పటి వరకు ప్రారంభించలేదు. నిర్మాణం చేసిన వాటికి సుమారు రూ.30 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తి చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. నిర్మాణం చేపట్టిన మేరకు బిల్లులు చెల్లిస్తేగాని పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేయమని బీష్మించుకుచున్నారు. సమస్యలతో విద్యార్థుల సతమతం చాలా పాఠశాలల్లో తరగతి గదుల కొరత వేధిస్తోంది. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదుల గోడలు కుంగిపోయి.. వర్షపు గదుల్లోకి చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి అని పలు సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొంటున్నా.. వాస్తవానికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంది. ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఈ సమస్యలే స్వాగతం పలుకుతుండడంతో జంకుతున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి మన ఊరు మన బడి పథకానికి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు.. అసంపూర్తిగా ఉన్న 93 పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలని.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో ‘మన ఊరు – మన బడి’ వివరాలిలా.. ఎంపికై న పాఠశాలలు 142 నిర్మాణం పూర్తయినవి 49అసలు ప్రారంభించనివి 4నిర్మాణ దశలో ఉన్నవి 89మండలం ఎంపికై నవి పూర్తయినవి పురోగతిలో ఉన్నవి.. గద్వాల 23 7 16 అయిజ 19 5 12 ఉండవెల్లి 8 2 6 మానవపాడు 8 5 2 ఇటిక్యాల 18 11 7 మల్దకల్ 13 2 11 అలంపూర్ 11 0 11 ధరూరు 15 0 11 కేటీదొడ్డి 12 9 3 వడ్డేపల్లి 9 2 8 రాజోళి 6 2 4 -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య
గద్వాలటౌన్: ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య అందుతుందని, అధ్యాపకులపై నమ్మకం ఉంచి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. బుధవారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందిస్తుందని అన్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో బోధన అందిస్తారని వివరించారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీతో పాటు కళాశాలలో మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా ఉంటేనే వాళ్లు చదువులో రాణిస్తారన్నారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే వెనకబడి పోవడానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ప్రిన్సిపల్స్ కృష్ణ, వీరన్న కాంగ్రెస్ నాయకులు రామన్‌గౌడ్, వేణుగోపాల్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు వచ్చే.. పండుగ తెచ్చే !
రాజోళి: ‘గ్రామంలోని రైతులు అందరం కలిసి ఉంటేనే ఏరువాక పండుగ చేసుకుంటాం.. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటన నేపథ్యంలో కొందరు రైతులను జైలులో వేశారు.. ఏ ఒక్క రైతు కుటుంబం బాధలో ఉన్నా.. అందరం లేకున్నా.. పండుగ ఎలా చేసుకుంటాం..’ అని వారం క్రితం జరుపుకోవాల్సిన ఏరువాక పండుగను పెద్దధన్వాడ గ్రామస్తులు బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రిమాండ్‌కు వెళ్లిన 12 మందికి బెయిల్ మంజూరు కావడం.. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో సంబరాలు మొదలయ్యాయి. వెంటనే గ్రామంలో అందరూ సమావేశమై గురువారం ఏరువాక పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగకు సిద్ధం ఏరువాక పండుగకు ప్రతి ఏడాది గ్రామ దేవతలకు ప్రత్యేకించి సుంకులమ్మ దేవతకు పూజలు చేసి, మొక్కులు చెల్లిస్తారు. ఈ ఏడాది పండుగ చేసుకునేందుకు ముందు మా గ్రామంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఏరువాక పండుగను బహిష్కరించుకునున్నామని, కానీ మేం మొక్కుకున్న మొక్కులు మా సుంకులమ్మ తల్లి ఆలకించి, తోటి రైతులకు బెయిల్ వచ్చిందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం 12 మందికి బెయిల్ మంజూరు కావడంతో గ్రామంలో పండుగ చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. దీంతో పండుగకు అవసరమైన సరుకులు, కూరగాయలు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రైతులు బబెయిల్పై విడుదల అవుతున్నారని, వారికి ఘనంగా స్వాగతం పలకాలని గ్రామంలో చాటింపు వేశారు. వ్యవసాయ, కూలీల పనులకు వెవెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చిన సమయానికి ఈ చాటింపు వేశారు. దీంతో అందరూ గురువారం పండుగను చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు ఏరువాక పండుగకు పిలుపునిచ్చిన పెద్దధన్వాడ గ్రామస్తులు బుధవారం 12 మందికి బెయిల్ రావడంతో గ్రామంలో సంబరాలు సుంకులమ్మకు మొక్కులు చెల్లించుకోవాలని చాటింపు -
పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుల అరెస్ట్
ఎర్రవల్లి: రాజోళి మండలంలోని ఇథనాల్ ప్రభావిత పెద్దధన్వాడ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి ఎర్రవల్లి కూడలిలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్ సిఐ రవిబాబు సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులను పెద్ద ధన్వాడకు వెళ్లకుండా తిరిగి వెనకకు పంపించేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇటిక్యాల పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీని రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రధానకార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్, ప్రదాన కార్యదర్శి జక్కా బాలయ్య, వెంకటేష్, లక్ష్మినారాయ ఉన్నారు. అరెస్టు అక్రమం.. గద్వాల: ఇథనాల్ ప్రభావిత ధన్వాడ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అక్రమ అరెస్టును పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడలోని ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అక్రమంగా జైల్లో పెట్టడం సరికాదని, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ● ఇథనాల్ ప్యాక్టరీ యజమాన్యానికి అమ్ముడుపోయిన ప్రభుత్వం.. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో పొలీసులు అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు రైతులను తీసుకొచ్చిన సందర్భంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: పాత పెన్షన్, కొత్త పెన్షన్ విభజన అంటూ పాత పెన్షన్‌దారులకు ప్రమాదకరంగా మారిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జిల్లా పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 23న దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్బంగా ‘పెన్షనర్ల పాలిట ఆశనిపాతం’ కరపత్రాలను విడుదల చేశారు. పెన్షనర్ల నుంచి పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించి వాటిని మూడు సెట్లుగా రూపొందించి ప్రధాన మంత్రి కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయానికి, కలెక్టర్‌కు అందించాలని తీర్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు చక్రధర్, హనుమంతు, వెంకట్రాములు, కృష్ణ, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, వీరవసంతరాయుడు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వీట్లు పంచిన ఎమ్మెల్యే విజేయుడు
బెయిల్‌పై విడుదలైన 14మంది రైతులు ఎమ్మెల్యే విజేయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు స్వీట్లు పంచారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, అందుకే వారి వెనక ఉండి, వారి కోసం న్యాయ పోరాటం చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈ పోరాటంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తమతో పాటు ఉండటం చాలా గర్వంగా ఉందని అంటూ రైతులు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వారివెంట కృష్ణారెడ్డి, మహిపాల్ రెడ్డి, భార్గవ్ యాదవ్, నాగేశ్వర్ రెడ్డి తదిదరులు పాల్గొన్నారు. -
ఎఫ్‌సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు పునఃప్రారంభం అయిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,429 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటి వరకు 1,066 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా ఇంకా 363 బస్సులకు పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో ఎంవీఐల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో 30 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం, సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సుకు సంబంధించి ఎఫ్‌సీ (ఫిట్నెస్ సర్టిఫికెట) కచ్చితంగా ఉండాలని, లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని డీటీసీ కిషన్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు -
చదువులు ఎలా..?
జోగుళాంబ గద్వాలబడి ఇలా..గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025వివరాలు 8లో uఇది ఉండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. మరికొన్ని గదుల పరిస్థితి ఇలాగే ఉంది. వర్షం కురిసిన ప్రతి సారి నీరు పైకప్పు నుంచి తరగతి గదుల్లోకి చేరి విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఈక్రమంలో ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఈ పాఠశాలను ఎంపిక చేసి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండేళ్లవుతున్నా బేస్మెంట్ వరకు వచ్చి పనులు నిలిచిపోయాయి. దీంతో వర్షాలు కురిసిన ప్రతిసారి శిథిలావస్థకు చేరిన పాఠశాల గదుల్లోకి నీరు చేరుతుందని, ఇక పాఠాలు ఎలా బోధించాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. అటు భవన నిర్మాణం పూర్తి కాకపోవడం.. ఇటు తరగతి గదుల కొరతతో ఇరుకు గదుల్లోనే ఇబ్బందుల నడుమ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో అసంపూర్తి పనులతో ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులు ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూస్రీల్జిల్లాలో అసంపూర్తిగా ‘మన ఊరు – మన బడి’ పనులు పాఠశాలలు పునఃప్రారంభమైనా పునాది స్థాయిలోనే భవన నిర్మాణాలు రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు శిథిలావస్థకు చేరిన గదులతో విద్యార్థుల అవస్థలు -
రైతుల చేతులకు సంకెళ్లు!
అలంపూర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటనును వ్యతిరేకించే క్రమంలో చోటు చేసుకున్న గొడవతో రిమాండ్‌లో ఉన్న రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనిని పెద్ద ధన్వాడతో పాటు ఆ చట్టూ ఉన్న 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన కంపెనీ నిర్మాణ పనులు ఆరంభించడానికి యాజమాన్యం సామగ్రి సిద్ధం చేసుకుంది. దీన్ని ప్రజలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో 41 మంది రైతులపై రాజోలి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది రైతులను ఈ నెల 5వ తేదీన గద్వాల కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వీరికి సంబంధించి బుధవారం వాయిదా ఉండటంతో అలంపూర్ కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నం పెట్టే రైతన్నల చేతికి కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లు వేయడం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మీడియాలో కథనాలుగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. 17నే బెయిల్ మంజూరు ఎట్టకేలకు విడుదలమహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రైతులకు వాస్తవానికి మంగళవారమే బెయిల్ మంజూరైంది. గద్వాల కోర్టు 12 మంది రైతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైతులు ఒకవైపు కోర్టు వాయిదాకు హాజరు కాగా.. మరోవైపు వారి బెయిల్‌కు సంబంధించిన జామీన్ల ప్రక్రియ కొనసాగింది. చివరకు బుధవారం రాత్రి రైతులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు.ముగ్గురు పోలీస్ అధికారుల సస్పెన్షన్ ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా..ఇందుకు కారణమైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటనలో ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలను సస్పెండ్ చేశామని చెప్పారు. -
అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించండి
గద్వాల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు సురక్షితంగా ఉండే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యలయంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు శుభ్రమైన వాతావరణంలో పూర్తిగా సురక్షితంగా ఉంచాలని, సొంత భవనం అద్దె భవనం అన్న తేడా లేకుండా నిర్మాణ లోపాలు పగుళ్లు ప్రమాదకరమైన పరిస్ధితులు తేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా సంక్షేమ అధికారి సునంద తదితరులు ఉన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించండి ఎర్రవల్లి: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ అన్నారు. మంగళవారం మండల ంలోని కొండేరులో గల అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావుతో కలిసి ఆమె సందర్శించి చిన్నారుల హాజరుశాతం పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. నిత్యం చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం గురించి ఆరా తీసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు బోధించే విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకొని వాటిని కొంతమేరకు పెంచాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అందించే నాణ్యమైన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చిన్నారులకు అందించి వారు ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి గ్రామాలలో స్నేహ కమిటీలు నిర్వహిస్తున్న పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలపై లైంగిక వేధింపుల వంటి అంశాలపై విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీడీ నర్సింములు, సిడిపీఓ సుజాత, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్‌ఖాన్, అంగన్వాడీ సూపర్వైజర్ జయ్యమ్మ, ఏపీఎంలు కోటేశ్వరి, ఎల్లప్ప, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, వైద్య సిబ్బంది, సీసీలు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు. -
మన పాలమూరు ఫస్్ట..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు.. నాకు జన్మనిచ్చిన జిల్లా. మక్తల్ నుంచి ఇక్కడకు కాళ్లతో తిర్లాడిన.. సైకిల్‌పై తిర్లాడిన.. ఆ తర్వాత బండిపై తిర్లాడిన. ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం చెప్పలేని ఆనందంగా ఉంది.’ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, పాడి అభివృద్ధి, క్రీడా, యువజన సర్వీ సుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించగా.. పలు విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితం, పలు పరిణామాలతో పాటు 1991లో ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ఇతర జిల్లాల్లో మంత్రి పదవులకు పోటీ ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నన్ను మంత్రిగా చేయాలని కోరారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఏ లక్ష్యంతోనైతే నాకు మంత్రిగా బాధ్యత కట్ట్టబెట్టారో.. అందుకనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తా. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా. -
సదరం సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్పరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టిన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ స్లట్ బుకింగ్ విధానం పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో విభాగాల వారీగా చేపట్టిన పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది స్లాట్లు బుక్ చేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులను ఎంత మేరకు క్లియర్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఇందిరా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రోత్సాహం ఏది..?
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేధిస్తోన్న పీడీల కొరత ●ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల ఇంటర్ బోర్డుకు నివేదించాం. అందుకు ఇంటర్ బోర్డు సానుకూలంగా స్పందించింది. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిపై వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. – హృదయరాజు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి నియామకాలు చేపట్టాలి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడం వలన క్రీడా ప్రమాణాలు తగ్గుతున్నాయి. పాఠశాల స్థాయిలో క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా.. కళాశాలలకు వచ్చేసరికి ప్రోత్సాహం అందడంలేదు. క్రీడలు సైతం అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. తక్షణమే జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీలను నియమించాలి. – విజయ రాణి, ఇంటర్ విద్యార్థిని, గద్వాల గద్వాల టౌన్: విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రసంగాలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. ప్రభుత్వం డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు. క్రీడలను చదువులో అంతర్భాగం చేసుకోవడమే కాకుండా పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని అటు ప్రభుత్వాలు, ఇటు క్రీడా పండితులు యోచిస్తున్నా అమలులో అడుగు ముందుకు పడలేదు. ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్, మానవపాడు, అలంపూర్, ధరూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులకు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. ఆ తర్వాత గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరుగుతున్నా.. సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నా.. విద్యార్థులకు ప్రోత్సాహం కరువు జిల్లాలోని 8 కళాశాలల్లో ఒక్క పీడీ లేని వైనం అడుగంటుతున్న క్రీడా ప్రమాణాలు డిగ్రీ కళాశాలల్లో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ పోస్టు మంజూరైంది. అయితే, పదేళ్లుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా.. ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు. అంధ విద్యార్థులకు ప్రవేశాలు గద్వాల: 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారిక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నడపబడుతున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంథులైన విద్యార్థినీ విద్యార్థుల ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అంధుల ఆశ్రమ పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకునే అంధులైన విద్యార్థినీ విద్యార్ధులకు ఉచిత భోజనం, 4 జతల దుస్తులు ప్రభుత్వం అందజేస్తుందని, అవసరమైన ఇతర అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకుగాను మహబూబ్‌నగర్ పిల్లలమర్రి రోడ్డులోని అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ సెల్ నం.9618243794 ద్వారా సంప్రదించాలని కోరారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి గద్వాల: గ్రామీణ ప్రాంతాల స్వయం సహయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని.. ఆ ఉద్దేశ్యంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కరోజు ర్యాంపు అవగాహన సదస్సును నిర్వహించినట్లు జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మహిళా సమాఖ్య కార్యాలయంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పేదరిక నిర్మూలన సంస్థతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మహిళలకు 15 రోజల పాటు పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌పై నైపుణ్యభివృద్ధి, ఆచరణీయ పరిశ్రమ రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సహాయం ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య గద్వాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని, ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆర్జేడీ విజయలక్ష్మి సూచించారు. స్థానిక పీజేపీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులలోని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థికి రాయడం, చదవడం తప్పనిసరిగా రావాలని సూచించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాలల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించిందని, ఆదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. బడీడు పిల్లందరూ ప్రభుత్వ పాఠశాలలోనే ఉండాలన్నారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ బడుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత సాఽధిస్తున్నామనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, పిల్లల తల్లిదండ్రులను బాగస్వామ్యం చేయాలన్నారు. ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బడిబాట కార్యక్రమాలు, విద్యార్థుల హజరును ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, సెక్టోరియల్ అధికారులు హంపయ్య, ఎస్తేర్‌రాణి, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అసమగ్ర’ ఐటీడీఏ
సిబ్బంది, నిధులకు నోచుకోని గిరిజనాభివృద్ధి సంస్థ గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మినీ కలెక్టరేట్‌ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళలాడింది. ఐటీడీఏ పీఓతోపాటు గిరిజన, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఉపాధి హామీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. చెంచులు, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఎకనామిక్ సపోర్ట్ స్కీం అమలు చేసేవారు. కానీ, నాలుగేళ్లుగా ఐటీడీఏ ప్రాజెక్ట్‌కు ఎలాంటి నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ పీఓ సహా ఇతర అధికారులు ఎవరూ లేక, సిబ్బంది లేకపోవడంతో చెంచులు, గిరిజనులు సైతం కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నల్లమల లోతట్టు ప్రాంతాల్లోని చెంచులు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలకు నోచుకోలేకపోతున్నారు. వారి జీవనోపాధికి ఉపకరించే పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ సరుకులపై మాత్రమే చెంచులు ఆధారపడి జీవించాల్సి వస్తోంది. చెంచుల ఉపాధి, జీవనాభివృద్ధి కోసం ఉద్దేశించిన గిరివికాసం, ఈఎస్ఎస్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల సేకరణ తదితర పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. గతమెంతో ఘనం.. ● ఒకే ఒక్క ఉద్యోగితో కొనసాగుతున్న మన్ననూరు కార్యాలయం ● ఏళ్లతరబడిగా ఇన్చార్జ్ పీఓతోనే నెట్టుకొస్తున్న వైనం ● అగమ్యగోచరంగా చెంచులు, గిరిజనుల జీవనం ● నల్లమలలోని అడవి బిడ్డలకు అందని ఆర్థిక ప్రోత్సాహకాలు నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ నిధులు, సిబ్బంది లేక నామమాత్రంగా తయారైంది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజన జాతులు (పర్టిక్యూలర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్– పీవీటీజీ), చెంచులు, గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏ ప్రాజెక్ట్‌లో దశాబ్ద కాలంగా రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) లేకపోవడం ఇక్కడి గిరిజనుల పాలిటశాపంగా మారింది. అత్యంత కీలకమైన పీఓ పోస్టు ఖాళీగా ఉండటం, ఏళ్లుగా ఇన్‌చార్జ్‌తోనే నెట్టుకొస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు మందగించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా జిల్లాలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చెంచులకు ఉచితంగా సోలార్ బోర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు కావాలన్నా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం చేపడితేనే అది సాధ్యమవుతోంది. ఏళ్లుగా ఒక్కరే దిక్కు.. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ సున్నిపెంట (శ్రీశైలం) పరిధిలో కార్యకలాపాలు కొనసాగగా.. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్‌లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. అయితే గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వం రెగ్యులర్ పీఓను మాత్రం నియమించలేదు. ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, ఇన్నేళ్లుగా తాత్కాలికంగా, జిల్లాస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తోంది. పీఓతోపాటు కార్యాలయంలో వివిధ విభాగాలకు అధికారులు, కార్యాలయ నిర్వహణకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కేవలం సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడంతో ఐటీడీఏ ప్రాజెక్ట్ నామమాత్రంగా మారింది. పీఎం జన్మన్కే పరిమితం.. చెంచు పెంటల సంఖ్య 150 చెంచుల జనాభా (సుమారు) 18,000 మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలు 3 (మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ) చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిస్సహాయత చాటుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సంబంధించి మన్ననూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కనీసం పూర్తిస్థాయి పీఓకు నోచుకోలేకపోతోంది. దీనికితోడు నిధులు కేటాయించక, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో సదరు కార్యాలయం ఒకేఒక్క ఉద్యోగితో నెట్టుకొస్తోంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య సాగుతున్న ఐటీడీఏ ఇక చెంచు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఏమాత్రం తోడ్పాటునందిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, నాగర్‌కర్నూల్ ప్రభుత్వానికి ప్రతిపాదించాం.. మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ రెగ్యులర్ పీఓ, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం పీఎం జన్మన్ కింద చెంచుల్లోని ప్రతి ఒక్కరికి అవసరమైన పత్రాలను అందించేందుకు కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్యసేవలు ప్రారంభించాం. – రోహిత్ గోపిడి, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, మన్ననూర్ అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు (పీవీటీజీ) గ్రూప్‌నకు చెందిన చెంచులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా పీఎం జన్మన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌలికమైన పత్రాలను ప్రతి ఒక్క చెంచు వ్యక్తికి అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహించి అవసరమైన పత్రాలను అధికారులు అందజేస్తారు. ఈ కార్యక్రమం మినహా గిరిజనుల కోసం ఉద్దేశించిన ఇతర ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. చెంచులు ఉండే మండలాలు 25 -
కష్టంగా కాదు.. ఇష్టంతో చదవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా.. ఇష్టంతో ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం ఇన్చార్జి కమాండెంట్ జయరాజు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో పటాలం సాయుధ చైతన్య పాఠశాలలో ఏర్పాటుచేసిన వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గతేడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందించి అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, శ్రీనివాస్, ఎంఈఓ అమీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు భరోసా
తొలిరోజు 87,496 మంది ఖాతాల్లో రూ.58.18కోట్లు జమ ●డబ్బులు జమయ్యాయి.. నాకు కొండేరు శివారు లో ఎకరన్నర వ్యవసా య భూమి ఉంది. క్ర మం తప్పకుండా వరిపంట సాగుచేస్తాను. ప్ర భుత్వం రైతుభరోసా ప థకం కింద నాకు ఎకరన్నర భూమికి సంబంధించి రూ. 9వేలను ప్రభుత్వ జమ చేసింది. – కృష్ణయ్య, రైతు, కొండేరు, ఎర్రవల్లి మండలం అర్హత ఉన్న ప్రతి రైతుకు.. జిల్లాలో 2024 యాసంగి సీజన్ నాటికి మొత్తం 1,65,763 మంది రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా కొత్తగా మరో 4వేల మందికి పైగా రైతులకు భూభారతి పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చాయి. రైతుభరోసాకు దరఖాస్తు చేసుకొని అర్హత గల రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. – సక్రియా నాయక్, డీఏఓ గద్వాల: వానాకాలం పంటల సాగుకు సిద్ధమైన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సాగు పెట్టుబడుల కోసం సోమవారం నుంచి రైతుభరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి 2023 రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టి.. రూ. 12వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచింది. వానాకాలం రూ. 6వేలు, యాసంగి సీజన్లో రూ. 6వేల చొప్పున రైతులకు అందిస్తోంది. గతేడాది 1,65,763 మంది రైతులకు రైతుభరోసా అందించింది. ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడుల నిమిత్తం రైతుభరోసా సాయాన్ని అందించాలని సోమ వారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం.. సాయంత్రం నుంచే రెండెకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. మొదటి రోజు 87వేల మంది రైతులకు.. జిల్లాలో రెండెకరాల లోపు భూమి ఉన్న 87,496 మంది రైతులకు ఎకరా రూ.6వేల చొప్పున రూ.58,18,86,282 నిధులను బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ నెల 25వ తేదీ వరకు దశల వారీగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను ’రైతుభరోసా’ జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వీరికి ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2018 నుంచి పెట్టుబడి సాయం ఇలా.. జిల్లాలో 165763 మందిరైతులకు లబ్ధి గతేడాది రూ. 234.83 కోట్లు విడుదల కొత్తగా మరో 4వేల మంది అర్హులు -
ముందస్తు వరద
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ముందస్తుగా జూన్‌లోనే వరద వస్తుండటంతో ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ముందుగా కాల్వలకు సాగునీరు విడుదల చేస్తే పొలాలు దుక్కి దున్నడం, కరిగెట చేసుకోవడం వంటి పనులు చేపట్టేందుకు ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి నారుమడులను సిద్ధం చేసుకుంటూ ఎప్పుడు నీరు వదులుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి కేవలం 35 వేల ఎకరాలకే పరిమితం చేసి సాగునీటిని అతి కష్టం మీద అందించగలిగింది. దీంతో పంటలకు దూరంగా ఉన్న చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం సన్నరకం వరిని మాత్రమే సాగు చేసేందుకు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడే పొలాలకు అందిస్తే సాగు పనులు మొదలు పెడతామని.. అధికారులు గుర్తించాలని వేడుకుంటున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో జూన్‌లోనే నిండుకుండను తలపిస్తున్న తరుణంలో ఆయకట్టు సాగుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆయకట్టు పరిధి ఇలా.. జూరాల ఎడమ కాల్వ కింద అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు గత కొంతకాలంగా యాసంగిలో వారబందీ విధానంలో సాగునీరు వదులుతుండటంతో వరితో పాటు చెరుకు సాగుపై రైతులు దృష్టి సారించారు. అధికారుల సూచన మేరకు రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతోంది. ● గతేడాది యాసంగిలో ఎడమ కాల్వ పరిధిలో అధికారులు రామన్‌పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించారు. ఈసారి వానాకాలంలో చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారులకు విన్నవించారు. రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి నీటి పారుదలశాఖ మంత్రి ఆదేశాలతో చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జూరాల ఎడమ కాల్వ పరిధిలో చాలామంది రైతులు ఇది వరకే వరి నారు పోసుకున్నారు. అకాల వర్షాలు, ముందస్తు వానలు కురవడంతో ఎగువ నుంచి జలాశయానికి వరద భారీగా చేరుతుండటంతో ఆయకట్టుకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో రైతులు తమ పొలాలను చదును చేసుకుంటూ నీటిరాక కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానాకాలం పంటల సాగుకు త్వరగా సాగునీరు అందించాలనే ఆలోచనను ఉన్నతాధికారులకు విన్నవించాం. రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా నెలాఖరు నాటికి కాల్వలకు సాగునీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ●నారుమడులు సిద్ధం.. జూరాలకు మొదలైన ప్రవాహం నెలాఖరున కాల్వలకు విడుదల చేసే అవకాశం వానాకాలం వరి సాగుకు ఆయకట్టు రైతులు సన్నద్ధం ప్రాజెక్టులో ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు -
ముందు జాగ్రత్తలతోనే డయేరియా నివారణ
గద్వాల క్రైం: ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియాకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సిద్ధప్ప సూచించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ డయేరియా ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. తల్లుల ఆరోగ్య వివరాలతో పాటు తల్లిపాల ప్రముఖ్యత, పిల్లలకు అందించాల్సిన టీకాలు తదితర ఆరోగ్య విషయాలను వివరించాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. అనంతరం స్టాఫ్ డయేరియా ప్రోగ్రాంకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిరా, వైద్యులు తన్వీర్ రిజ్వానా, ప్రసూన్నరాణి, శ్యామ్, అశోక్ పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 20 ఫిర్యాదులు గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని.. ఇలా 20 మంది ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎస్పీ బాధితులకు భరోసా ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోండి గద్వాల: దివ్యాంగులు అవసరమైన ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి డి.సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు రెట్రోపిటెడ్ మోటారైజ్డ్ వాహనాలు, బ్యాటరీ వీల్‌చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్మెంట్, వీల్‌చైర్, ల్యాప్టాప్స్, 4జీ స్మార్ట్‌ఫోన్స్, ట్రైసైకిల్స్, క్యాలిపర్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, టీచింగ్ లర్నింగ్ మెటీరియల్, ఎంఆర్సీ చప్పల్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమున్న వారు obmms.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారాలతో పాటు సదరం సర్టిఫికెట్, ఆధార్, విద్య, ఆదాయ, కుల ధ్రువపత్రాలు, తెల్లరేషన్‌కార్డు వంటి పత్రాలను కలెక్టరేట్లోని మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 90101 61406 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. ఉచితంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ గద్వాల: సివిల్ సర్వీసెస్–2026పై ఆసక్తిగల అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు www.tgbcstudyc ircle.chg.gov.in వెబ్సైట్లో జూలై 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 25 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు 9 నెలలపాటు కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న 100 మంది అభ్యర్థులకు భోజన వసతి, రవాణా ఖర్చులకు ప్రతినెలా రూ. 5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు లైబ్రరీ వసతి ఉంటుందన్నారు. అర్హత పరీక్ష జూలై 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 08546–293022, 99854 34941 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ‘రైతుభరోసా’కు అవకాశం గద్వాల: కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన వారు రైతుభరోసా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని డీఏఓ సక్రియానాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కొత్తగా 4,451మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చినట్లు గుర్తించామన్నారు. వీరందరూ కూడ భూమి పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌తో ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాలను ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో 55 ఫిర్యాదులు అందగా.. ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తూ.. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రైతునేస్తం ముఖాముఖిలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్లతోటలు, వాణిజ్య పంటలు పండించాలని సూచించారు. పంటల సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూమిని సంరక్షించుకుంటూ.. పర్యావరణానికి హాని కలగకుండా చూడటం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియా నాయక్, ఏఓ ప్రతాప్, తహసీల్దార్ మల్లిఖార్జున్, ఏఈఓ అనూష పాల్గొన్నారు. -
రైతు చెంతకే అధునాతన పరిజ్ఞానం
రైతునేస్తం కేంద్రాలతో సాగులో మెలకువలపై అవగాహన ● జిల్లాలో ఇప్పటికే 12 రైతు వేదికల్లో అందుతున్న సేవలు ● అందుబాటులోకి రానున్న మరో 24 కేంద్రాలు ● ప్రతి మంగళవారం సూచనలు, సలహాలు ఇవ్వనున్న శాస్త్రవేత్తలు ● నేడు రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి ●గద్వాల: పంటల సాగు పెట్టుబడులు పెరగడం, కూలీల కొరత, సంప్రదాయ పంటలకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లేకపోవడం వంటి కారణాలతో వ్యవసాయం నేడు కష్టతరమైంది. ఈ సమస్యలను అధిగమించి వ్యవసాయం రైతులకు లాభాసాటిగా చేయాలనే తలంపుతో ప్రభుత్వం రైతునేస్తం కేంద్రాల ద్వారా సేవలందిస్తూ వస్తుంది. అయితే ఈ సేవలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. ఇందుకోసం ప్రధానంగా గ్రామీణ రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహిస్తే లాభసాటిగా అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం రైతులకు సరైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ అధిక పెట్టుబడులతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయాధికారులను కలిసి పంటల సాగు విధానం గురించి తెలుసుకునేందుకు కష్టతరంగా ఉంది. మరింత పటిష్టం చేసే దిశగా.. సాగులో సమస్యలను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదిక నిర్మించింది. వాటిలో ఏఈఓలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతు వేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ‘రైతునేస్తం’ ద్వారా రైతువేదికలో వీడియో కాన్ఫరెన్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున 12 మండలాల్లో రైతునేస్తం కేంద్రాలు ఉండగా.. తాజాగా మరో 24 రైతునేస్తం కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వీసీ కేంద్రాలను ప్రారంభిస్తుండగా.. జిల్లాలోని 24 వీసీ కేంద్రాలను ప్రారంభిస్తూ మొత్తం 36 కేంద్రాల్లో రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. జిల్లాలోని రైతునేస్తం కేంద్రాల్లో పాల్గొనే అధికారులు, ప్రజాప్రతినిధులు.. సద్వినియోగం చేసుకోవాలి.. రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సులు మంజూరు కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలో ఇప్పటికే 12 మండలాల్లో 12 రైతునేస్తం కేంద్రాల ద్వారా రైతులకు సేవలందిస్తుండగా.. తాజాగా మరో 24 రైతునేస్తం కేంద్రాలు మంజూరయ్యాయి. రైతులు రైతు వేదికల వద్దకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
మోదీ హయాంలోనే సాహసోపేత నిర్ణయాలు
శాంతినగర్: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలోనే దేశానికి, ప్రజలకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వన్ నేషన్– వన్ ఎలక్షన్ ఇన్చార్జ్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో నిర్వహించిన ‘సంకల్పంతో సహకారం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సంకల్పంతో సహకారం కార్యక్రమం మండల స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో బూత్ కమిటీలను, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌లను నియమించాలని సూచించామన్నారు. అనంతరం మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు వివరించారు. పెద్దనోట్ల రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం జరిగిందన్నారు. డిజిటల్ పేమెంట్, ఫోన్ పే, యూపీఐ ద్వారా అనేక లావాదేవీలు, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం, ఆపరేషన్ సిందూర్ వంటి నిర్ణయాలు దేశానికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌గౌడ్, మండలాధ్యక్షుడు నాగరాజు, నాయకులు నర్సింహ, హరికృష్ణ, వెంకట్రాములు, రాఘవేంద్ర, రంగస్వామి, ఏసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి
గద్వాల: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, జనగణనలో కులగణన చేయాలని బహుజన రాజ్యసమితి, బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో బీసీ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. దేశంలో రోజురోజుకూ ప్రభుత్వ రంగం కుదించుకుపోయి ప్రైవేటు రంగం ఆధిపత్యం చెలాయిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. అగ్రకులాలు, పెట్టుబడిదారులు వారి తొత్తులలైన పాలకుల వలన ఈ పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ట్యాక్సులు సామాన్యులతో వసూలు చేస్తున్న ప్రభుత్వం వచ్చిన ప్రజాధనాన్ని కొందరు బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అమానుషమన్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం, బహుజన సమాజానికి పెద్ద ప్రమాదకరంగా మారిందని, అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు వాల్మీకి, వినోద్‌కుమార్, హుస్సేన్, వెంకటేష్, కృష్ణయ్య, వెంకట్రాములు, పల్లయ్య, ఇక్బాల్‌పాషా, వెంకటస్వామి, గోపాల్, నర్సింహులు, సిద్ధార్థ కృష్ణ, దామోదర్, వెంకన్న, ప్రవీణ్, శ్రీనివాసులు, వెంకటేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేతన్నలకు ‘పొదుపు’ పథకం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మర మగ్గాల కార్మికులకు ‘నేతన్న పొదుపు పథకం’ (త్రిఫ్ట్ ఫండ్) పునఃప్రారంభం చేసి నూతన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉందని, ఇతర వివరాల కోసం చేనేత, జౌళి శాఖ ఏడీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన రీజియన్ కమిటీ అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యశీలారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ రహెమాన్ సోఫి, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సత్యన్న ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బసన్న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా సత్యశీలారెడ్డి, కోశాధికారిగా కేకే మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంమూర్తి, ఉపాధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, చీఫ్ అడ్వయిజర్‌గా ఎంకే జోసెఫ్, జాయింట్ సెక్రటరీగా దమ్మాయిపల్లి శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని పది డిపోలకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్‌పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్‌కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 ఒక్కో పాకెట్‌పై రూ.37 పెంపు -
సుదీర్ఘ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు
ఉండవెల్లి: సుదీర్ఘ 60 ఏళ్ల న్యాయ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు కేంద్ర, రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం ఉద్యమంలో కీలకం అని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ పోరాటం మాలలకు వ్యతిరేకం కాదని, అన్ని కులాలకు సమన్వయంగా ఉంటామని అన్నారు. ఆదివారం మండలంలోని కలుగోట్ల గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ విగ్రహావిష్కరణలను మంద కృష్ణతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఐజీ సుమతి ఆవిష్కరించారు. దేశంలో రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ్ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేశారని, గతంలో వర్గీకరణ అంశాన్ని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కమిషన్ వేశారన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయమే అని భావించి.. మాదిగలకు అండగా నిలిచారన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదంటే ఎమ్మార్పీఎస్ పోరాటమే కారణమన్నారు. ఐజీ సుమతి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి విద్యను అభ్యసించేలా పాఠశాల ముందు మహనీయులను ఏర్పాటు చేశారంటే మార్పు మొదలైందని అర్థమవుతుందన్నారు. అందరు సమానత్వంతో, సామరస్యంగా ఉంటేనే గ్రామం బాగుంటుందని, అందరూ ఉన్నత స్థితికి ఎదిగి జీవితాలలో వెలుగులు తేవాలని కోరారు. అన్ని భాషాలు ఉన్న ఈ దేశంలో అందరిని కలిపిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అని ఐజీ కొనియాడారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ గ్రామంలో యువత ఆదర్శంగా తీసుకుని జ్యోతిరావుపూలే, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మస్తాన్, భీమన్న, రాజు, ఎలీషా, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ ●పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు -
రాజీ మార్గంతో సమయం ఆదా
గద్వాల క్రైం/అలంపూర్: రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడంతో సమయం ఆదా అవుతుందని జిల్లా న్యాయమూర్తి ఎన్.ప్రేమలత, అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్‌తేజ అన్నారు. శనివారం గద్వాలలో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 8195 కేసులు, అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో 3701 కేసులు పరిష్కరించారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసుల్లో ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి. లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రెటరీ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ● కోర్టులో కేసులు నడుస్తున్నా రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని జడ్జి మిథున్ తేజ అన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి దూరం అవుతుందన్నారు. క్షక్షిదారులు లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలంపూర్ లోక్ అదాలత్‌లో సివిల్‌కు సంబంధించి ఒక కేసు, క్రిమినల్ కేసులు–31, ఎస్టీసీ కేసులు 3701 పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, సీనియర్ న్యాయ వాదులు నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రావు, సీఐ టాటబాబు, ఏపీపీ, ఏజీపీ, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు. గద్వాల, అలంపూర్ లోక్ అదాలత్‌లో 11,896 కేసులు పరిష్కారం -
నా తండ్రి సహకారంతోనే..
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మ వసుంధర గృహిణి కాగా.. నాన్న శ్రీనివాసులు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ.. మా ముగ్గురిని చదివించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఆ విషయాన్ని మేం గుర్తించకుండా అవసరమైనవి సమకూర్చారు. చిన్నతనం నుంచి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నన్ను నిరుత్సాహపర్చకుండా ఎంత కష్టమైనా డబ్బులు పెట్టి చదివించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం గ్రూప్స్ పరీక్ష రాయగా తాజాగా వచ్చిన ఫలితాల్లో 484.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంకు, మల్టీ జోన్–2లో మూడో ర్యాంకు.. మహిళా కేటగిరిలో రెండో స్థానంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. నా తండ్రి సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. – తల్లిదండ్రులతో వీణ -
జోగుళాంబ గద్వాల
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025రియల్ హీరో.. ‘మా నాన్న రఘునాథ్ గైక్వాడ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. కిరాణ షాపు నిర్వహిస్తూ మా చదువుల కోసం ప్రోత్సహించారు. ఆయన నుంచి కష్టపడే తత్వాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికీ నాన్నే రియల్ హీరోగా ఉంటారు. నాన్న రఘునాథ్ గైక్వాడ్‌తో నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నాన్నంటే ఓ ఆసరా.. ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత.. ఓ ధైర్యం.. నాన్నంటే ఓ స్ఫూర్తి..ఓ ఆర్తి.. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే సూపర్ హీరో. నవ మాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడిస్తాడు. బుడిబుడి అడుగుల నుంచి ప్రతి చోట వెన్నంటి ఉంటాడు. కష్టాల్లో నిర్భరంగా.. ఆపదలో ధైర్యంగా నిలబడేలా భరోసానిస్తాడు. విజయంలో మెట్టుగా మారుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని కళ్లలో దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టి.. తన కోసం ఏదీ దాచుకోకుండా.. కన్న బిడ్డలే సర్వస్వంగా బతుకుతాడు. అందుకే నాన్నంటే ప్రతి కుమారుడు, కుమార్తెకు కొండంత ధైర్యం. తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు ఎందరో ఉన్నారు. ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. – సాక్షి నాగర్‌కర్నూల్/ నారాయణపేట రూరల్/ గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) -
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సాధించి ఐపీఎస్ సాధించారు. మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యశ్వంత్‌నాయక్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. -
నాన్నే.. సూపర్ హీరో
వెన్నుదన్నుగా నిలబడ్డారు.. నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు ● పిల్లల ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ భరోసా ● భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి ● నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం -
పెద్దధన్వాడలో రెవెన్యూ సదస్సు బహిష్కరణ
శాంతినగర్: ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును గ్రామస్తులు బహిష్కరించారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన రెవెన్యూ అధికారులను వెనక్కు వెళ్లాలని, ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని, రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయకుండా, రైతులపై పెట్టిన కేసులు కొట్టివేసేదాక ప్రభుత్వ పరంగా నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహించబోమని తేల్చిచెప్పారు. అంతేగాక తోటి రైతులు జైలు నుండి ఇంటికి వచ్చేదాకా గ్రామంలో ఎలాంటి పండుగలు జరుపుకోబోమని వెల్లడించారు. అనంతరం తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ -
వైద్యుల నిర్లక్ష్యంతోపసికందు మృతి
గద్వాల క్రైం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి సదరు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా.. ధరూర్ మండలం రేవులపల్లికి చెందిన ఆశ్విని.. తన మూడు నెలల పాపకు జ్వరం రావడంతో వైద్య సేవల కోసం గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఈ నెల 11వ తేదీన తీసుకువచ్చింది. వైద్యులు ఆస్పత్రిలో జాయిన్ చేయించుకొని వైద్యం ప్రారంభించారు. కానీ, రోజులు గడుస్తున్నా పసికందు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పసికందు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పసికందు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు పరీక్షించి చెప్పారు. దీంతో రోదిస్తూ రాత్రి గద్వాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి పసికందు కుటుంబసభ్యులు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందినట్లు వైద్యులను నిలదీస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడి శాంతిపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. జ్వరంతో వచ్చిన పసికందుకు మెరుగైన వైద్యం అందించామని, ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని, కానీ, బిడ్డకు తల్లి పాలు ఇవ్వవద్దని సూచించామని, అయినా పాలు ఇవ్వడంతో గొంతులో సమస్య ఏర్పడి పరిస్థితి విషమించిందని అన్నారు. ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యుల ఆందోళన -
మోయలేని భారం!
ఇదీ జరుగుతోంది.. పేద విద్యార్థులకు 25శాతం ఉచిత సీట్లను జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల కేటాయించడం లేదు. ఎక్కడా లాటరీ పద్ధతిలో ప్రవేశాలు జరగడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ స్థాయి పాఠశాలలు బహిరంగంగానే అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్దమే అయినా అడిగేవారు లేరు. పాఠశాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, క్రీడలు, పరీక్ష ఫీజు, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు అధికారుల ఆధ్వర్యంలోని కమిటీ కూర్చుని చర్చించకపోవడం గమనార్హం. ఇక పాఠశాల స్థాయిని బట్టి విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రాధాన్యత తక్కువ ఉన్న పాఠశాలలో ఎల్కేజీకి రూ.10వేలు, ఓ మోస్తరు పాఠశాలలో రూ.15వేలు, డిమాండ్ అధికంగా ఉన్న పాఠశాలలో రూ.20వేల నుంచి రూ.25వేలు వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేలు వసూలు చేస్తున్నారు.దీనికితోడు యూనిఫాం దుస్తులు, పుస్తకాలు, షూస్, టై, బెల్టులను ఆయా పాఠశాలల సమీపంలో అనుబంధంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో విక్రయిస్తున్నారు. పాఠశాల పేరుతో ముద్రించినవి కావడంతో తల్లిదండ్రులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ● సామాన్యుడి ఆదాయంలో 40 శాతం పిల్లల చదువులకే.. ● ఫీజుల నియంత్రణ జీఓ 91 అమలెక్కడ ● విద్యాహక్కు చట్టానికి తూట్లు గద్వాలటౌన్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించే లక్ష్యంగా ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం తెచ్చినా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలు ఈ చట్టాన్ని బేఖాతరు చేస్తున్నాయి. ఫీజులను అడ్డగోలుగా పెంచేస్తున్నా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం రోజురోజుకు అధికమవుతుంది. జిల్లాలో మొత్తం ప్రైవేటు స్కూల్స్ : జీఓ 91పై కొరవడిన నియంత్రణ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం జీఓ 91ని జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో నియంత్రణ కొరవడింది. రోజు కూలి నుంచి ఉన్నత ఉద్యోగుల దాకా తమ పిల్లలను పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలని తపన పడటం సహజం. తల్లిదండ్రుల ఆరాటాన్ని యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫీజుల మోత నాలుగురెట్లు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఫీజులను 20 నుంచి 30శాతం పెంచేశారు. జిల్లాలోని ప్రైవేటు బడుల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 91 విడుదలైంది. దీని ప్రకారం రెండు కేటగిరీల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేరు చేస్తూ రూ.8వేలు, రూ.12వేలు ఫీజులుగా నిర్ణయించారు. కానీ ఈ ఫీజులను జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమానులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఎడాపెడా ఫీజుల మోత 125 -
రైతు హక్కులను బలపరిచే.. కొత్త విత్తన చట్టం
గద్వాలటౌన్: రైతులు ఎదుర్కొంటున్న పత్తి విత్తనాల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా, కంపెనీలపై నియంత్రణతో పాటు రైతు హక్కులను బలపరిచే కొత్త విత్తన చట్టం త్వరలో అమలులోకి రానుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ సంతోష్ అధ్యక్షతన విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు, సమస్యల పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు శ్రమతో సాగుచేస్తున్న పత్తి పంట దేశియంగా మాత్రమే కాకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని చెప్పారు. నడిగడ్డలో పత్తి రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకోవడానికి వచ్చామన్నారు. రైతు విత్తనాలు ఫెయిల్, అఽధిక వడ్దీ రేట్లు, ఆస్తుల తాకట్టుతో అప్పుల్లో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బాధించిందని అన్నారు. జీఓటీ విధానాన్ని సీడ్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుని రైతులను మోసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చట్టాలలో జీఓటీ విధానమే లేదన్నారు. సీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు ములుగు జిల్లాలో మొక్కజొన్న సమస్యపై కమిషన్ స్పందించి ఆదివాసులకు న్యాయం చేశామని, అదే తరహాలో నడిగడ్డలో సీడ్ పత్తి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీడ్ కంపెనీలు చట్టాలను ఉల్లంఘించి ఆర్గనైజర్ వ్యవస్థను ప్రోత్సహించడం తగదని ఆయన అన్నారు. రైతులు పండిస్తేనే సీడ్ కంపెనీలు రూ.కోట్లు ఆర్జిస్తున్నాయని, అలాంటిది సీడ్ కంపెనీలు రైతు నుంచి ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవడం లేదని నిలదీశారు. చట్ట విరుద్ధంగా ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా సీడ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పత్తి రైతులకు అప్పు ఇచ్చే ఆర్గనైజర్లు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలని కలెక్టర్ పరిశీలించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ కంపెనీల నుంచి స్పష్టమైన డేటాను సేకరించి, ఫెయిల్యూర్ అయిన విత్తనాలపై పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మనీ లాండరింగ్ చట్టం, అగ్రిమెంట్లపై స్పష్టత కోసం ఎస్ఓపీ తయారుచేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆర్గనైజర్ల తీరుపై ఆగ్రహంవ్యక్తం చేశారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, కమిషన్ సభ్యులు రాములునాయక్, సునీల్‌కుమార్, రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, భవాని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ తదితరులు పాల్గొన్నారు. వాగ్వాదం.. తోపులాట రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుల బృందం గద్వాల మండలం పుటాన్పల్లి సమీపంలో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటుండగా.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ సీడ్ పత్తి రైతుల సమస్యలను చైర్మన్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విజయ్‌కుమార్ వెంట వచ్చిన వారిపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులతో సైతం వాగ్వాదం జరిగింది. అనంతరం బలవంతంగా విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ధరూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు అమ్ముడుపోయారని విజయ్‌కుమార్ ఆరోపించారు. ఇదిలాఉండగా, విత్తన పత్తి రైతులపై జరుగుతున్న అక్రమాలపై స్పందించాలని, కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. నడిగడ్డలో సీడ్ పత్తి రైతులు పడుతున్న దగాను వివరించారు. అనంతరం కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. నడిగడ్డ సీడ్ పత్తి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం సీడ్ కంపెనీలు ఆర్గనైజర్ వ్యవస్థను ప్రోత్సహించడం సరికాదు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పంటల పరిశీలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్‌తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
మోగిన బడిగంట..!
గద్వాలటౌన్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడి గంట కొట్టగానే పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాలన్నీ పండగ వాతావరణంలో ప్రారంభించారు. కొన్ని పాఠశాలలకు మామిడి తోరణాలను కట్టి అలంకరించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. హాజరైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు. తొలిరోజు.. తడ‘బడి’ ఎంతో ఉత్సాహంగా ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం తడబడుతూ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. ● మానవపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, 12 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ● గోకులపాడు పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు హాజరయ్యాడు. విద్యార్థులు ఒక్కరూ కూడా పాఠశాలకు రాలేదు. అలాగే, కేజీబీవీకి ఆరుగురు ఉపాధ్యాయులు హాజరుకాగా.. విద్యార్థులు ఎవరూ ప్రార్థన సమయం నాటికి హాజరుకాలేదు. ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన కొద్దిమంది విద్యార్థులకు అసౌకర్యాలు దర్శమిచ్చాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బడికి పంపే విషయంలో మరో రెండు రోజులపాటు వేచిచూద్దామన్న ధోరణిలో మరికొంత మంది తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చిన విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. దూరప్రాంత విద్యార్థులు పాఠశాలలకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సు సౌకర్యాలు ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరి, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. నెలన్నర పాటు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు మొదటిరోజు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేశారు. ఆసక్తి చూపని వైనం మొదటి రోజు హాజరు అంతంతే -
రైతు ‘భరోసా’ ఏది ?
పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ●మానవపాడు: రైతులకు చేయూత ఇచ్చేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలుచేసి ఏటా వానాకాలం, యాసంగి పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. 2023 డిసెంబర్లో ఏర్పడిన రైతు బంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది. ఈ పథకంలో ఎకరాకు రూ.7500 ప్రతి పంటకు అందిస్తామని మాట ఇచ్చింది. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభం కావడం, వర్షాలు మే నెలలో విస్తారంగా కురవడంతో రైతుభరోసా సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వార్షకాలం సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో అయినా సాగుకు ముందుసాయం అందించాలని కోరుతున్నారు. గత 15 రోజులుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. గత ఖరీప్, రబీ పంటల మొదళ్లు, వేర్లు తొలగిస్తూ చెత్తాచెదరం కాల్చివేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిన రైతులు దౌర కొడుతూ చేను సారవంతం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మిరప, కందులు, పొగాకు సాగు చేయనున్నారు. యేటా తొలకరి వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్ నెలాఖరులో పత్తి విత్తనాలు వేయడం, వరి నారు పోయడం చేస్తుంటారు. ఈ సారి ముందుగానే వర్షాలు రావడంతో రైతులు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వివరాలిలా.. త్వరగా అందించాలి గత వానాకాలం ఎవరికి రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగిలో ఐదు ఎకరాలలోపు రైతులకు డబ్బులు పడ్డాయి. వర్షాలు ముందు కురుస్తుడటంతో పంట పొలాలను సాగుకు సిద్ధం చేశాం. త్వరగా రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ చేస్తే ఎంతో మేలు చేసినట్లవుతుంది. – గోపాల్, రైతు, గోకులపాడు అప్పులు తప్పుతాయి.. ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చింది. ప్రతి యేడాది విత్తనాలు నాటేందుకు ఆలస్యమయ్యేది. పత్తి వేసుకునేందుకు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నా. ప్రభుత్వం రైతుభరోసా సాయం అందిస్తే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది ఉండదు. లేదంటే అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. – శ్రీకాంత్‌రెడ్డి, రైతు, మానవపాడు ముందస్తు వర్షాలతో పొలం బాట దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు విత్తనాలు, ఎరువులకు ఏర్పాట్లు జిల్లాలో 1,65,763 మంది రైతులు విడతల వారీగా... గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5వేలు చొప్పున అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ఎకరానికి రూ.6వేలు చొప్పున గత యాసంగి నుంచి అందిస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు ఎకరాలోపు, ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఐదు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేసింది. యాసంగి పంటలు దిగుబడి వచ్చే సమయం వరకు నగదు జమ చేస్తూ వచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా సాగు సమయానికి నగదు అందితే ఎంతో మేలు చేకూరుతుందని రైతులు బావిస్తున్నారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
● ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు ● స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం ● ఫిట్నెస్ లేకుండా నడిపితేకేసులు నమోదు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్‌గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టామని డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. -
బాధిత మహిళలకు అండగా నిలవాలి
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా, సఖీ, షీటీం సెంటర్లను గురువారం ఆకస్మికంగా ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లైంగిక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసకున్న చర్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపబడ్డ బాధితులకు భరోసా ఇవ్వాలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, తదితరులు ఉన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అయిజ: మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని వివిధ మెడికల్ షాపులను, మెడికల్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ ఉండాలని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని, ఎమ్మార్పీ ధరలకు మించి కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకోరాదని అన్నారు. మందుల కొనుగోలు విక్రయానికి సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలని అన్నారు. రాజోళి ఎస్ఐ వీఆర్‌కు అటాచ్ గద్వాల క్రైం: బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాజోళి ఎస్ఐను గురువారం వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజోళి మండలం పెద్ద ధన్వాడకి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు తమ వ్యవసాయ పొలం, మరొకరి మధ్య ఉన్న భూ వివాదంపై రాజోళి ఎస్ఐ జగదీష్‌కు ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యం కనబర్చినట్లు ఈ నెల 10వ తేదీన ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎస్ఐని జిల్లా కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఇటీవల పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో జరిగిన పలు తప్పిదాలు సైతం ఉండడంతో ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పలు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. నేడు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రాక గద్వాల: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఈనెల 13వ తేదీ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30గంటలకు గద్వాల మండలంలోని పుటాన్‌పల్లిలో సాగుచేసిన పత్తి విత్తన పంటలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అక్కడే రైతులతో ముఖాముఖి అనంతరం 11:30గంటలకు కలెక్టరేట్లో పత్తి విత్తన పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించనున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదం దురదృష్టకరం గద్వాల: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మాజీ సీఎం విజయ్‌రూపానితో పాటు దేశప్రజలు, విదేశీయులు, చిన్నారులు, మహిళలు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. మృతులకు నివాళి అర్పించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
గద్వాల క్రైం: జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీకాదగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత వెల్లడించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయలోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నేటి లోక్ అదాలత్ కార్యక్రమంలో 4వేల కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్, శోభ తదితరులు ఉన్నారు. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
గద్వాల: బాల కార్మిక వ్యవస్ధను పూర్తిగా నిర్మూలించి జిల్లాను బాల కార్మిక రహిత ప్రాంతంగా మార్చే దిశగా పని చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల కారికార్మిక నిర్మూలన జిల్లా కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు ఉజ్వల భవిష్యత్ కల్పించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీసీపీఓ నర్సింహులు, తదితరులు ఉన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు ధరూరు: భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండలంలోని చింతరేవులలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులపై దరఖాస్తులు స్వీకరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ లోపు భూ భారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేందర్, రెవన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఏరువాకా సాగారో..
ఎర్రవల్లి మండలం జింకలపల్లిలో ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలు నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు.. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి.. ప్రధానంగా ప్రతి రైతుకు సంబంధించి అతిపెద్ద పండుగ ఏరువాక పున్నమి. జిల్లావ్యాప్తంగా రైతులు బుధవారం ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే సేద్యానికి అవసరమైన పరికరాలకు.. ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. గజ్జెలు, గంటలు, పూల దండలతో ఎడ్లను అలంకరించి ఊరేగింపుగా పొలాలకు వెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసి పొలం దున్నడం ప్రారంభించారు. సాయంత్రం గ్రామాల్లో ఏరువాక తోరణాలు పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా రైతులు ఆనందోత్సాహాలతో పరుగులు పెట్టించారు. – సాక్షి నెట్వర్క్ షేకుపల్లిలో బోనం ఎత్తిన చిన్నారులు గట్టులో ఎడ్ల బండ్ల ఊరేగింపు -
బుడి బడి అడుగులు!
గద్వాల టౌన్: బడి.. భవితను తీర్చిదిద్దే చదువులమ్మ ఒడి. జీవిత గమ్యాన్ని నిర్దేశించే దిక్సూచి. నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలన్నరగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించే పనిలో హెచ్ఎంలు నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రముఖులు, జిల్లా ఉన్నతాఽధికారులు ఎందరో ఉన్నారు. వారు తమ పాఠశాల మధుర స్మృతులను పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే... జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాం. తాగునీరు, టాయిలెట్స్, తరగతి గదుల్లో బెంచీలు వంటి వసతులతో పాటు అన్ని పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పాఠశాలలు మొదటిరోజునే విద్యార్థులందరికి యూనిఫామ్‌లు, నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాలు అందించేలా ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేశాం. బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం పోటీపరీక్షలకు అనుగుణంగా విద్యార్థులకు బోధించే విధానంలో నూతన మార్పులు తీసుకొచ్చాం. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు ఐదురోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చేరేలా ఇప్పటికే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఈ సారిప పదో తరగతి ఫలితాల్లో గతంతో కంటే పదిశాతం ఉత్తీర్ణత శాతం పెంచగలిగాం. ఇదే ఒరవడితో ముందుకు వెళ్లి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులకు శిక్షణా ఇవ్వడం జరిగింది. – బీఎం సంతోష్, కలెక్టర్ ఇంట్లో కంటే బడిలో ఉండటమే ఇష్టం ఫస్ట్ డే స్కూల్ అంటే సంబరంగా వెళ్లేవాళ్లం. వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు ఇంటి వద్ద ఉండటంతో స్నేహితులను మిస్ అయ్యేది. వారిని ఎప్పుడెప్పుడు కలుస్తామా అంటూ ఫస్ట్ డే కోసం ఎదురుచూసే వాడ్ని. ఇంటి కంటే బడిలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టంగా ఉండేది. నా పాఠశాల విద్యాభ్యాసం అంతా గద్వాలలోనే సాగింది. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. పాఠశాల విద్య మొత్తం హుషారుగానే గడిచిపోయింది. బీహార్‌లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అప్పుడుప్పుడు గద్వాల పాఠశాల రోజులు గుర్తొస్తాయి. బడీడు పిల్లలందరు బడిలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. – రామచంద్రుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి, బీహార్ నేటినుంచి తెరుచుకోనున్న పాఠశాలలు ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత స్థాయికి చేరిన వారెందరో.. బడిబాట పట్టిన జ్ఞాపకాన్ని నెమరవేసుకున్న ప్రముఖులు -
సర్కారు బడులు.. ప్రగతికి సోపానాలు
మాది వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలోనే సాగింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఖిల్లాగణపురం మండలం మామిడిమాడలో, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖిల్లాగణపురం హైస్కూల్లో.. ఇంటర్, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ కాలేజీ.. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులుంటారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం, సామాజిక స్పృహ, క్రీడలు వంటివి నేర్పిస్తారు. దీనివల్ల జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తరగతి గదుల్లోని పాఠ్యపుస్తకాలిని మాత్రమే కాకుండా సామాజంలో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్కులు, మధ్యాహ్న భోజనం వంటి వసతులు కల్పిస్తున్నారు. విద్యావ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచూపుతూ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. వాటిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలి. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, గద్వాల -
జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
● ఆలయ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు చర్యలు ● 2028 కృష్ణా పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయడమే లక్ష్యం ● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ● ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ సంతోష్ హాజరు అలంపూర్: జోగుళాంబ క్షేత్రం, ఆలయాల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా.. ఆధ్యాత్మికతతోపాటు చారిత్రాత్మకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు.. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. బుధవారం అలంపూర్‌లో కలెక్టర్ బీఎం సంతోష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, హైలెవల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ మాట్లాడుతూ... ఈ పవిత్ర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తుందని, ఈ ప్రణాళిక అమలుకు కలెక్టర్ మూడు సార్లు సమీక్షలు నిర్వహించారన్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 2028లో జరగనున్న కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలయాల నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి సహకారం అందించనుందని తెలిపారు. మ్యూజియాన్ని ఆధునీకరిండానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, పనులు వేగవంతం చేయవచ్చన్నారు. మాస్టర్ ప్లాన్న్లోని పనులకు దాతలు ముందుకు వస్తారన్నారు. అన్నదాన సత్రంను వారం లోపల ప్రారంభించాలని ఈఓ పురేందర్‌ను అదేశించారు. పనులు వేగవంతం చేయాలి రాబోయే పుష్కరాల నాటికి ఈ క్షేత్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, ఈమేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అజయుడు అన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ...క్షేత్ర అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో కలిసి పాపినాశి, సంగమేశ్వర ఆలయాలను పరిశీలించినట్లు తెలిపారు. హైలెవల్ కమిటీతో కలిసి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రణాళికల వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగ్ రావు, రాష్ట్ర టూరిజం శాఖ ఎస్ఈ సరిత, ఆర్డీఓ అలివేలు, దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ కృష్ణవేణి, ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, స్థపతి వాలినాయగం, ఈఓ పురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం వారు జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గద్వాల – అలంపూర్ రోడ్డులో సుందరీకరణ పనులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ... జోగుళాంబ ఆలయం జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో గద్వాల నుంచి అలంపూర్ వరకు రోడ్‌సైడ్‌లో ఆర్చీలు, అవెన్యూ ప్లాంటేషన్, సైన్న్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద శుభ్రమైన వాతావరణం, బస్ స్టాండ్, సౌకర్యవంతమైన గదులు, శుద్ధమైన ఆహారం, పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలంపూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ మంచి సూచనగా భావిస్తున్నట్టు తెలిపారు. రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు సిద్దమవ్వాలన్నారు. -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహాహోమం, స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్‌రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.బీచుపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలుఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 41 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలుమల్దకల్: అంగన్వాడీ టీచర్లు తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారిణి సునంద హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంటలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించగా..ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలందరి గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను తల్లిదండ్రులకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారంలో పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలనెలా గర్భిణీ, బాలింతలు వైద్యపరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. నాగరాణి, మంజుల, లక్ష్మినారాయణమ్మ, అనంతమ్మ, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగానే బడికి
చిన్నప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలో బడికి వెళ్లి స్నేహితులతో ఆడుకోవచ్చని అనుకునే వాడ్ని. కొత్త స్నేహితులు ఎవరెవరూ వస్తారనే ఆసక్తి ఉండేది. ప్రాథమిక విద్య మా స్వగ్రామం బిజ్వారంలో సాగింది. హైస్కూల్ చదువుల కోసం గద్వాలకు వచ్చాం. అప్పుడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష పెట్టి పాఠశాలలో చేర్పించుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా బడికి వెళ్లేందుకు మారం చేయలేదు. అప్పటి గురువుల ప్రోత్సాహం మరువలేనిది. వారి మార్గదర్శనంతోనే నేడు పేద ప్రజలకు వైద్య సేవలు అందించగలుగుతున్నాం. – డాక్టర్ రఘునాథ్‌రెడ్డి, గద్వాల -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ లెక్కన మక్తల్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్‌కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
కేసులు ఎత్తివేసే దాక పండుగలు చేసుకోం
పెద్ద ధన్వాడ రైతుల తీర్మానం అలంపూర్/శాంతినగర్: ‘ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయడమే మాకు పెద్ద పండుగ.. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు ఏ పండుగనూ జరుపుకోం’ అని రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ రైతులు తీర్మానించారు. ఈ నెల 11న రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం గ్రామస్తులు రైతువేదిక వద్ద సమావేశమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఇటీవల ఆందోళన కార్యక్రమం చేపట్టగా.. అనుకోకుండా జరిగిన ఘర్షణలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే. అయితే తోటి రైతులు జైలులో ఉంటే తాము ఎలా పండుగ చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. తోటి రైతులు లేకుండా.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కాకుండా పండుగ నిర్వహించుకునే ప్రసక్తే లేదని ముక్త కంఠంతో తీర్మానించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గ్రామంలోని కూలీలు, ఇతరులు కూడా ఏరువాక పండుగను జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు. కాగా, పెద్ద ధన్వాడ గ్రామస్తులు సమావేశమై పండుగ జరుపుకోరాదని తీర్మానం చేసిన విషయం తెలుసుకున్న చిన్న ధన్వాడ రైతులు సైతం వారికి సంఘీబావంగా తమ గ్రామంలో కూడా ఏరువాక పౌర్ణమిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు తీసుకున్న నిర్ణయానికి సమీప గ్రామాల రైతులు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి.. ఇథనాల్ కంపెనీ కాలుష్యంతో పంటలు పండవని, మనుషులు రోగాల బారిన పడతారని శాంతియుతంగా నిరసన తెలిపితే పట్టించుకోలేదు. ఇథనాల్ కంపెనీని రద్దు చేసేందుకు కృషిచేస్తామని నాయకులు చెబితే నిరసనలు విరమించుకున్నాం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యంతో వచ్చారు. 12 గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే కంపెనీని రద్దు చేయాలని ఆందోళన చేపడితే రైతులపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి. న్యాయం కావాలని ఆందోళన చేపడితే అన్నదాతలను అరెస్ట్ చేయడమేంటి. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – శ్యాంప్రసాద్, పెద్ద ధన్వాడ పండుగలు జరుపుకోం. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుచేస్తే మా గ్రామానికి, రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చేపట్టిన రైతులు జైలులో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు బాధపడుతుంటే తోటి రైతులం మేము ఎలా పండుగ జరుపుకుంటాం. జైలులో ఉన్న రైతులు గ్రామానికి వచ్చే దాక ఏ పండుగనూ జరుపుకోము. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి. అప్పుడే మాకు పెద్ద పండుగ. అందుకే రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాం. – వీరన్న, రైతు, పెద్ద ధన్వాడ ● -
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
గద్వాల: రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ప్రాణాంతకమైన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుచేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాగు భూములను బలవంతంగా లాక్కొని రైతులను రోడ్డుపాలు చేయడమే కాకుండా, భవిష్యత్ తరాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నదులు, సాగుభూములను నాశనం చేసే పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ప్రజలు, రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారని.. తమను తాము కాపాడుకునే క్రమంలో జరిగిన ఆందోళనలో అమాయకులపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. దీనిపై ప్రభుత్వం పట్టుదలకు వెళ్లకుండా ప్రజల కోరికను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధిత గ్రామస్తులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్న నాయకులను ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే చలో పెద్ద ధన్వాడ కార్యక్రమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఇక్బాల్‌పాషా, సుభాన్, రంగన్న, రాజ్‌కుమార్, మోషన్న ఉన్నారు. -
నీలినీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’మేషాలు లెక్కిస్తున్నారు. మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు. ‘మీన’మేషాలు -
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించండి
● అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 62 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. 19 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. మిగతా కేసులకు చార్జీషీట్ వేసినట్లు తెలిపారు. అదే విధంగా ఒక కేసులో నిందితులకు శిక్ష పడినట్లు ఎస్పీ వెల్లడించారు. 32 కేసులకు సంబంధించి రూ. 38.75లక్షల నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు పలు సమస్యలపై బాధితులు వినతిపత్రాలను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబునాయక్, ప్రవీణ్, ఆర్డీఓ అలివేలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌బాబు, డీఎస్పీ మొగులయ్య తదితరులు ఉన్నారు. గద్వాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. దళితుల అణచివేత, అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ రెండు గ్లాసుల విధానం, కులవివక్ష వంటివి కొనసాగడం విచారకరమన్నారు. ప్రతినెలా చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎస్ఐలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రాయపురం గ్రామంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని.. ఆర్డీఓ, డీఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సైతం వారికే కేటాయించాలన్నారు. నిధుల దుర్వినియోగం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై నివేదికను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్య తదితర పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలి.. అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలని రాష్ట్ర ఎస్పీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. అలంపూర్ ఆలయాలను చైర్మన్‌తో పాటు సభ్యులు కుశ్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, రెణికుంట్ల ప్రవీణ్ సందర్శించగా.. ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌బాబు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, తహసీల్దార్ మంజుల, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి సుజాత, సీఐ రవిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలను వివరించారు. కులాంతర వివాహాల కింద 59 దరఖాస్తులు వచ్చాయని.. ఆరు జంటలకు రూ. 15లక్షల చొప్పున ప్రోత్సాహాకాన్ని అందించినట్లు తెలిపారు. మిగతా వారికి నిధులు వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు వివరించారు. -
విత్తన దుకాణాల్లో తనిఖీలు
అయిజ: మండల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సాయిరాం హైబ్రీడ్ సీడ్స్, శింతి సీడ్స్, సాయిరాం సీడ్స్ దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, నిలువలు, బిల్లు బుక్కులు, ఇన్వాయిసులు, సోర్స్ సర్టిఫికెట్లు పరిశీలించారు. నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, విజిలెన్స్ అధికారులు సీఐ గణేష్, ఏసీటీఓ సురేష్. ఎస్సై శ్రీరాము పాల్గొన్నారు. బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని శివుడిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి శివుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి గద్వాల: పేదల సంక్షేమానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని రాజవీదిలో పట్టణ అధ్యక్షురాలు రజకశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో పేదలకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రవి, ఎక్బోటా, వెంకటరాములు తదితరులు ఉన్నారు. ‘గట్టు’లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు గట్టు: యాసంగి సిజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా గట్టు,మాచర్ల, ఆలూరు, పెంచికలపాడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 1,13,617 సంచుల ద్వారా 52.617 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెంకటేశ్ తెలిపారు. గట్టు కొనుగోలు కేంద్రం ద్వారా 369 మంది రైతులకు సంబందించి 49,739 బస్తాలు, మాచర్లలో 320 మంది నుంచి 39,503 బస్తాలు, ఆలూరులో 164 మంది నుంచి 18,868 బస్తాలు, పెంచికలపాడులో 202 మంది నుంచి 23,507 బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకానికి 2330 మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేసింది. దీనికి అదనంగా క్వింటాల్‌కు ప్రభుత్వం 500 బోనస్‌ను చెల్లించనున్నది. దీంతో రైతులు యాసంగిలో పండించిన వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. -
నయా వెట్టి..!
కృష్ణాతీరంలో చేపల వేట కోసం కూలీల అక్రమ రవాణా వ్యాపారులకే లబ్ధి.. నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరోక్షంగా వారు చేపల వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తున్నారు. నిర్బంధ కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎక్కడా వ్యాపారులపై కేసులు నమోదు కావడం లేదు. నెలల తరబడి పనులు చేసిన కార్మికులకు వ్యాపారుల నుంచి జీతాలు ఇప్పించడం లేదు. కేవలం రవాణా చార్జీలు ఇచ్చేసి కార్మికులను తమ స్వగ్రామాలకు పంపిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఒక్కో కార్మికుడిపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారికి మిగులుతున్నాయి. ఇదే బాగుందని కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే అధికారులకు స్వయంగా ఫోన్లు చేసి కార్మికులను అప్పగిస్తున్నారు. ఇదో రకమైన నయా మోసమని కార్మికులు వాపోతున్నారు. ●చిన్నంబావి మండలంలోని కృష్ణా నదీ తీరం నుంచి శ్రీశైలం డ్యాం వరకు పదుల సంఖ్యలో అలివి గుడారాలు ఉంటాయి. ఒక్కొక్క గుడారంలో 20 నుంచి 30 మంది వరకు నిర్బంధ కార్మికులు పనిచేస్తుంటారు. ఈ గుడారాలన్నీ నదీతీరంలో అందరికీ కనిపించే దూరంలోనే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం అక్కడికి వెళ్లరు. ఎప్పుడైనా తనిఖీలు చేయాల్సి వస్తే.. ముందుగానే వ్యాపారులకు సమాచారం అందుతుంది. అధికారులు వచ్చేలోపు వ్యాపారులు తమ స్థావరాలను మరో చోటికి మార్చడం పరిపాటిగా మారింది. ఫిర్యాదులు అందినా.. అలివి వలలతో చేపల వేట నిషేధం. కానీ, కృష్ణానదిలో అలివి వేట విచ్చలవిడిగా సాగుతోంది. చేపల వేట కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొస్తారు. వారి సమాచారం ఎక్కడా నమోదు కాదు. కార్మికులు నదిలో పడి చనిపోయినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కృష్ణాతీరంలోని మల్లేశ్వరం, సోమశిల తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న బాండెడ్ లేబర్ దందాపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులకు విముక్తి ఇలా.. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన గణేశ్‌ను నాలుగు నెలల క్రితం ఓ బ్రోకర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మల్లేశ్వరం తీసుకొచ్చాడు. అక్కడ ఓ చేపల వ్యాపారికి అతడిని అప్పగించాడు. అతడి ఫోన్ లాగేసుకున్నారు. గణేశ్ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడంతో అతడి భార్య భీమవరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ సెంటర్(ఎన్ఏఎస్సీ) సభ్యులను కూడా కలిసింది. వారు నాగర్‌కర్నూల్ జిల్లాలోని తమ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి నదీతీరంలో వెతకగా.. అక్కడ గణేశ్ కనిపించాడు. అతడితోపాటు మరో 39 మంది నిర్బంధ కార్మికులను స్థానిక పోలీసుల సహకారంతో పెంట్లవెల్లి మండల రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో చైన్నె, ఒడిశా, నెల్లూరు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా మల్లేశ్వరం, సంగమేశ్వరం, బోనాసి, మంచాలకట్ట, అమరగరి ప్రాంతాల్లో నిర్బంధంలో ఉన్న కార్మికులు. నాలుగు నెలల క్రితం 28 మంది కార్మికులను కూడా ఇదే తరహాలో అధికారులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో మొత్తం 80 మందికి పైగా కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు.. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు.. కార్మికుల నిర్భందం గురించి రెవన్యూ పరంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నాం. ఇటీవల చాలామంది కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాం. కార్మికులకు రవాణా చార్జీలు ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపిస్తున్నాం. వారి వెంట రెవెన్యూ అధికారులు కూడా వెళ్తున్నారు. కేసుల నమోదు అంశం పోలీసు శాఖ పరిధిలోనిది. దీన్ని కూడా పర్యవేక్షిస్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ చేపల కంపెనీలో ప్యాకింగ్ ఉద్యోగాలని నమ్మిస్తున్న దళారులు నదీతీరంలో వ్యాపారులకు అప్పగిస్తున్న వైనం 18 గంటల పాటు పనులు.. జీతాలు ఇవ్వకుండా వేధింపులు ఇటీవల 80 మంది నిర్బంధ కార్మికులకు విముక్తి -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజలు నేరుగా కలెక్టర్‌కు వినతులు అందించారు. మొత్తం 52 ఫిర్యాదులు రాగా.. ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని బాలభవనంలో జానపద, భరత నాట్యం, కూచిపూడి శాసీ్త్రయ నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం బాలభవన్‌లో నాట్యమయూరి దివ్య నృత్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నృత్యాలు పరిపూర్ణంగా దోహద పడతాయన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. విజయ్, మాదవి, వెంకటేశ్వర్లు, అమరేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
మురిపించి.. ముఖం చాటేసి
●4 ఎకరాల్లో విత్తనాలు వేశాం గత నెలలో వర్షాలు కురవడంతో ముందస్తుగా నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. ఏదో రకంగా పక్క పొలాల్లో నుండి అడపాదడపా నీరు అందిస్తున్నాం. కానీ వర్షం కురిస్తేనే పొలాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దాని వల్ల వేసిన విత్తనం నుండి వచ్చిన మొలక ఎండిపోకుండా, ఆరిపోకుండా ఉంటుంది. ఈ వారంలో వర్షం కురవకపోతే వేల ఎకరాల్లో నష్టం తప్పదు. – శ్రీకాంత్ రైతు, మాన్‌దొడ్డి 14 ఎకరాలు కౌలుకు తీసుకున్నా 14 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు వేశాను. అప్పటి వర్షాలకు మొలకలు వచ్చాయి. నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల రైతులకు నీరు అందడం లేదు. వర్షం కురిస్తేనే మొలకలకు జీవం లభిస్తుంది. చాలా చోట్ల విత్తనాలు వేశారు. ముందస్తుగా వేస్తే తర్వాతి పంటకు అనుకూలంగా ఉంటుందనుకుంటే ఆదిలోనే ఇబ్బందులు తప్పడం లేదు. – వీరస్వామి, రైతు మాన్‌దొడ్డి ఎన్నో ఆశలతో వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు రాజోళి: రైతును ప్రకృతి ఏదో రూపంలో దెబ్బతీస్తూనే ఉంది. ముందస్తుగా వర్షాలు కురవడంతో నాలుగు గింజలు ఎక్కువ పండించుకుందామని ఆశపడితే రైతులకు ఆదిలోనే భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే విత్తనాలు వేసుకున్న రైతులకు ప్రకృతి సహకారం కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కురిస్తే తప్పా ప్రస్తుతం ఉన్న తమ పంట బ్రతకదని ఆవేదన చెందుతున్నారు. 15 రోజుల నుంచే విత్తనాలు గత నెలలో కురిసిన వర్షం, తుఫాను ద్వారా జల్లులకు రైతుల్లో ఆశలు చిగురించి విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట మొదలైన విత్తన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే వేల ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. కాని వరణుడు కరుణించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనేందుకు, సేద్యం పనులకు ఇతర కూలీలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు చివరిదాకా ఈ పంట ఉంటుందా, ఉండదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విత్తనమైతే వేశాము కాని, వాటిని కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్న చోట విత్తనాలకు నీరు అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యం లేని దగ్గర రైతులు వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. ముందుగానే విత్తనం వేసుకుంటే, అనంతరం వేసే పంటకు సమయం అనుకూలంగా, ప్రకృతి కూడా సహకరిస్తుందని భావించిన రైతులకు ఈ 15 రోజులుగా నిరాశే ఎదురవుతుంది. అయితే ఈ వారంలో వర్షం పడకపోతే పెట్టుబడి మొత్తం గాలిలో కలిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భూముల్లో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఒకలా ఉంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందుగానే కౌలు డబ్బులు చెల్లించి, సాగు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇటు కౌలు డబ్బులు చెల్లించి, అటు పెట్టుబడికి ఖర్చు చేసి రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. 15 రోజుల నుంచి కరుణించని వరుణుడు గాలి, ఎండ తీవ్రతతో వాడుతున్న మొలకలు దిక్కుతోచని స్థితిలో అన్నదాత -
ఒక్క వాన కోసం
అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి, రాజోళి, ఉండవెళ్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో రైతులు విత్తనాలు వేశారు. కానీ నేటి వరకు సరైన వర్షాలు లేని కారణంగా మొలకెత్తిన విత్తనాలు పండుతాయా, ఎండుతాయా అని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క వాన కురిస్తే వేలాది ఎకరాలకు జీవం వస్తుందని రైతులు అంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొలకలు ఎండకు వాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. మొత్తానికి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండటతో రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒక వేళ ఈ విత్తనాలు మొలకెత్తకపోతే మొత్తం దున్నేసి మళ్లీ విత్తనాలు వేయాలంటే రెట్టింపు ఖర్చు అవుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. ఒక్క వాన కురిస్తే వేల ఎకరాలకు జీవం వస్తుందని ఈ వారంలో వాన కురుస్తుందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్‌లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. -
ఇసుక రీచ్‌లో.. ఓవర్‌లోడ్ దందా
●గద్వాల క్రైం: రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఇసుక రీచ్‌ను అడ్డాగా చేసుకొని కొందరు ఓవర్‌లోడ్ దందాకు తెరలేపారు. ఒక టిప్పుర్లో 20 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 27 టన్నుల చొప్పున తరలిస్తూ ఒక్కో అదనపు టన్నుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ దందాకు కొందరు అధికారులు సైతం తోడయ్యారు. ఇలా రోజుకు 30 – 40 టిప్పర్ల ఇసుకను అనుమతుల పేరుతో తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. గడిచిన మూడు రోజుల వ్యవధిలో విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 20 టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండడాన్ని గుర్తించడంతో విషయం బయటికి వచ్చింది. కేసులు నమోదు చేసి రూ.1.45 లక్షలు జారిమానా వసూలు చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి దందా.. నడిగడ్డలోని గద్వాల–అలంపూర్ సెగ్మెంట్లలోని ఇసుక కొరత కారణంగా గృహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ద్వారా తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, జిల్లాలోని ఓ మాజీ ఎమ్యెల్యే అంతా తానై ఇసుక దందాకు తెరలేపారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సదరు మాజీ ఎమ్మెల్యే.. ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఈ ఇసుక రీచ్ టెండర్‌ను దక్కించేలా ముఖ్యపాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన అనుచరవర్గంలోని కొందరిని రీచ్ వద్ద ఉంచి ప్రతి టిప్పర్ (ట్రిప్పు)లో 7 టన్నుల ఇసుకను ఎక్కువగా తరలించే ప్రక్రియను చేపట్టారు. ఒక్కో అదనపు టన్ను ఇసుకకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. వాస్తవంగా టిప్పర్‌కు 20 టన్నులు ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుంది. అయితే అదనంగా 7 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున రూ.2.10 లక్షల అక్రమ ఆదాయం వైట్ కాలర్ నాయకులకు చేరుతుంది. తుమ్మిళ్ల ఇసుక రీచ్ అడ్డాగా అక్రమాలు మా దృష్టికి రాలేదు.. తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వం టీజీ ఎండీసీ ద్వారా ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో ఇసుక తరలింపు కొనసాగుతుంది. టిప్పర్‌కు 20 టన్నుల ఇసుక తరలించేందుకు అనుమతి ఉంది. సామర్థ్యానికి మించి ఇసుకను తీసుకెళ్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఒకవేళ తరలిస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయి. తుమ్మిళ్ల రీచ్ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. – వెంకటరమణ, జిల్లా మైనింగ్ అధికారి కేసులు నమోదు చేస్తాం ఇటీవల జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు చేయగా.. సామర్థ్యానికి మించి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మైనింగ్, రవాణాశాఖకు వాహనాలు అప్పగించి జారిమానాలు విధించాం. ప్రభుత్వ అనుమతులు లేకున్నా, వాహనాల్లో ఓవర్‌లోడ్‌గా ఇసుకను తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ బృందం సైతం తనిఖీలు చేపట్టింది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య డీఎస్పీ, గద్వాల ఒక్కో టిప్పర్‌లో ఏడు టన్నులు అధికంగా లోడ్ చేస్తున్న వైనం ట్రిప్పుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వెనకేసుకుంటున్న ఇసుకాసురులు విజిలెన్స్, పోలీసుల తనిఖీలో బహిర్గతం మూడు రోజుల వ్యవధిలో 20 టిప్పర్ల పట్టివేత.. కేసులు నమోదు అంతా తామై.. వెనకుండి నడిపిస్తున్న కొందరు జిల్లా నాయకులు ఇసుక టిప్పర్ల పట్టివేత గద్వాల క్రైం: సామర్థ్యానికి మించి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను గద్వాల పట్టణ, రూరల్ ఎస్ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్ ఆదివారం పట్టుకున్నారు. వివరాలిలా.. రాజోలి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి గద్వాల మీదుగా ఇసుకను టిప్పర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అనుమతి వివరాలపై ఆరా తీశారు. మొత్తం ఏడు టిప్పర్లను తనిఖీ చేయగా.. అందులో సామర్థ్యానికి మించి ఐదు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు టిప్పర్లను మైనింగ్ లేదా రవాణాశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్‌గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్‌లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్‌గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్‌గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి అమ్మమ్మ ఇంట్లో సంబరాలు నారాయణపేట: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, ఆదివారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలోని మంత్రి అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంటా సంబరాలు అంబరాన్నంటాయి. శివమ్మ కుటుంబ సభ్యులు గొడుగుగేరిలోని అంజనేయస్వామి దేవాలయం దగ్గర టపాకులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందంగా డప్పు వాయిస్తూ కేరింతలు కొట్టారు. సత్యనారాయణ చౌరస్తాలో సైతం కుటుంబ సభ్యులందరూ మిఠాయిలను పంపిణీ చేశారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్‌దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), చిత్తరంజన్‌దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్‌కర్నూల్), పులి వీరన్న (మహబూబ్‌నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు.