ప్రకృతి వ్యవసాయం లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

ప్రకృ

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

అయిజ: పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో భూములు, గాలి, నీరు కలుషితమవుతున్నాయని.. ప్రకృతి వ్యవసా యంతో పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నా రు. మంగళవారం మండల కేంద్రంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ) ఆధ్వర్యంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌)పై వ్యవసాయశాఖ సహకారంతో కృషి సఖిలకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మంచి లాభాలు ఉండటంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందన్నారు. రైతులు ప్రకృతి సేద్యంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం పంటల సాగులో యాజమాన్య పద్ధతులను వివరించారు. స్థానిక రైతువేదికలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన రైతులతో కలిసి పాల్గొన్నారు. అదే విధంగా ఫర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏడీఏ సక్రియా నాయక్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జగ్గునాయక్‌, ఏడీఏ సంగీతలక్ష్మి, సాంకేతిక అధికారి శ్రీలత, ఏఓ జనార్దన్‌ ఉన్నారు.

సంఘాల లావాదేవీలు డిజిటలైజేషన్‌

గద్వాల(గట్టు): స్వయం సహాయక మహిళా సంఘాల లావాదేవీలన్నీ ఇక నుంచి డిజిటలైజేషన్‌ చేస్తున్నట్లు అడిషనల్‌ డీఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గట్టు మండల సమాఖ్య భవనంలో విలేజ్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా సంఘాల లావాదేవీలను డిజిటలైజేషన్‌ చేయడంలో లోకోస్‌ మొబైల్‌ యాప్‌ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ యాప్‌పై గ్రామ సహాయకులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సంఘాల సభ్యుల వివరాలు, పొదుపు, రుణాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో యాంకర్‌పర్సన్‌ రూప, ఇన్‌చార్జి ఏపీఎం దేవదాసు, సిబ్బంది జ్యోతి, శేఖర్‌, తిమ్మక్క, శివకుమార్‌ పాల్గొన్నారు.

నేడు బీజేపీ

జాతీయ అధ్యక్షుడి రాక

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బూత్‌ స్థాయి కార్యకర్తల దగ్గరి నుంచి జిల్లా నాయకులు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అన్ని శాఖలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిపి దాదాపు 25వేల మందితో ఈ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కార్యకర్తలు సమావేశ స్థలం దగ్గరకు చేరుకోవాలని, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జరగనున్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

● మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రరెడ్డి పరిశీలించారు. సమావేశం నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.

పాలమూరులోని ఎంవీఎస్‌

కళాశాలలో కార్యకర్తల సమావేశం

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం 
1
1/2

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం 
2
2/2

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement