breaking news
Jogulamba District Latest News
-
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
మల్దకల్/ గట్టు: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని తాటికుంట, గట్టు మండలంలోని ఆలూరు గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో 2 వేల ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులైన పేదలకు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అపోహలు నమ్మవద్దని, ఇళ్లు నిర్మించుకున్న అందరికీ బిల్లులు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విజయ్, రమేష్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు తిమ్మప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
అలంపూర్ రూరల్: ప్రాంతీయ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలంపూర్ అభివృద్ధి కమిటీ పోరాటం చేస్తుందని అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం అలంపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలంపూర్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పురోగతి, కరువు మండలంగా ప్రకటించాలని, డిగ్రీ కళాశాల ఏర్పాటు, వచ్చేనెలలో రానున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జోగుళాంబ రైల్వేస్టేషన్లో రైలు ఆపేలా వినతిపత్రం అందజేత, క్రీడా మైదానం ఏర్పాటు, మహిళల ఉపాధి కోసం నిరంతర శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కోసం చేయాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్టీలు, కులమతాలకు అతీతంగా నిరంతరం శ్రమిస్తున్న అభివృద్ధి కమిటీ అలంపూర్ పురోగతికి సంబంధించి కీలక అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. సమావేశంలో గౌరవ సలహాదారు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్, కార్యదర్శి రజనీబాబు, కోశాధికారి ముస్తఫా, మాజీ కౌన్సిలర్ సుష్మ, సభ్యులు హరిబాబు, నాగమల్లయ్య, వెంకట్‌నారాయణ, సంజీవనాయుడు, శంకర్, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెంచితే బాగుంటుంది..
ప్రస్తుతం వర్షాలు సరిగా కురువడం లేదు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా నీరు వస్తేనే పంటలు సాగవుతాయి. ఈ రిజర్వాయర్ 15 టీఎంసీలకు పెరిగితే రెండు పంటలు సాగు చేసుకోగలం. వచ్చే ఏడాదికై నా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. – మల్దకల్, ఎక్లాస్పురం పరిహారం చెల్లించాలి ప్రాజెక్టు సామర్థ్యం పెంపు బాగుంది కానీ, ముంపు ప్రాంతంలో పంట పొలాలు, ఇళ్లు మునిగిపోతాయి. కాబట్టి ప్రతి ఎకరాకు సరైన పరిహారం లేదా ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి. గత ప్రాజ్టెల్లో జాప్యాలు జరిగాయి. ఇప్పుడు పారదర్శకంగా వేగంగా, చేస్తేనే రైతులు నమ్మకం పెంచుకుంటారు. – యువతేజేశ్వర్రెడ్డి, గుడ్డెందొడ్డి సర్వే పూర్తవుతోంది.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచే సర్వే పనులు పూర్తి కాకొచ్చాయి. సుమారు 600 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అలాగే జల విద్యుత్ చేసేందుకు కూడా ప్రణాళిక చేశారు. ఈ పనులు పూర్తయితే ఒకసారి రిజర్వాయర్ నిండితే రెండేళ్ల వరకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. – సూర్య, డీఈఈ ● -
ఆలయంలో ఎంపీ పూజలు
గద్వాల: జిల్లాకేంద్రంలోని నల్లకుంటలో దాతల సహకారంతో భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె నల్లకుంటలో ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, కలిసికట్టుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. పెద్దచింతరేవుల అంజన్న సన్నిధిలో.. ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 48వ చాతుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజలకు ఆమె హాజరవగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యారాజేశ్వర శ్రీపాదుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, మద్వాచార్యులు, కిష్టాచార్యులు, ధర్మకర్త గిరిరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయాలి గద్వాల: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత లోపాలు, కేడర్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో అఖండ పారాయణం మహబూబ్‌నగర్ రూరల్: శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభమైంది. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా 24 గంటల పాటు నిరంతరంగా పారాయణం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పారాయణంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
వాస్తవానికి ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.8.50 పడుతుండగా.. సోలార్కు మాత్రం రూ.5.50 చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్‌కు రూ.3 ఆదా అవుతోంది. ప్రతినెలా సరాసరి నాగర్‌కర్నూల్‌లో రూ.24 వేల పైచిలుకు, షాద్‌నగర్ లో రూ.21 వేలు, కొల్లాపూర్‌లో రూ.14 వేలు, మహబూబ్‌నగర్, గద్వాల లో రూ.11 వేల చొప్పున, నారాయణపేటలో రూ.7 వేలు, కల్వకుర్తిలో రూ.4 వేలు, వనపర్తిలో రూ.3 వేల పైచిలుకు చొప్పున ఆర్టీసీకి ఆదా అవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఆరు నెలల క్రితం నిర్వహణ బాధ్యతల నుంచి కార్వీ తప్పుకొంది. దీని స్థానంలో మరో సంస్థకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు బిల్లుల చెల్లింపులకు సంబంధించి లెక్కలు తేల్చకపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్‌కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్‌లో 30 (20+10), మహబూబ్‌నగర్‌లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్‌కర్నూల్‌లో 20 , షాద్‌నగర్‌లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్‌నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్‌కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్‌నగర్ 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
వడివడిగా గుడ్డెందొడ్డి
అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ధరూరు మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలకు ఇటీవల కేబినెట్ ఆమోదం లభించింది. ఇది కేవలం సామర్థ్యం పెంపు మాత్రమే కాకుండా.. జిల్లా వ్యవసాయ భవిష్యత్‌ను మార్చగల మహాత్తర కార్యక్రమం అని నడిగడ్డవాసులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వాయర్ విస్తీర్ణం... గుడ్డెందొడ్డి రిజర్వాయర్ దాదాపు 1,400 ఎకరాల్లో నిర్మించారు. దీని కింద సుమారు 64 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ, సామర్థ్యం తక్కువగా ఉండటంతో వానాకాలంలో వచ్చే వరద నీటిని పూర్తిగా నిల్వ చేసుకోలేకపోతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద ప్రవాహం ఉంటుంది. గుడ్డెందొడ్డి నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తే కేవలం 30 రోజుల్లోనే 15 టీఎంసీల సామర్థ్యం నింపుకోవచ్చు. దీంతో కర్ణాటక నుంచి వచ్చే నీటి విడుదలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. గద్వాల, సంగాలమల్దకల్, తాటికుంట మల్దకల్, నాగర్‌దొడ్డి గట్టు, చిన్నోనిపల్లి1.5 జిల్లాలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు.. టీఎంసీలు 1.5 1.59 0.6 రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపునకు కేబినెట్ ఆమోదం జల విద్యుత్ నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే పనులు పూర్తయితే తొలగనున్న సాగునీటి కష్టాలు జిల్లా వ్యవసాయ భవిష్యత్ సమూల మార్పునకు అవకాశం -
విజ్ఞాన, విహార యాత్ర విజయవంతం
గద్వాల: విద్యార్థుల మేధో వికాసానికి నిర్వహించిన విజ్ఞాన, విహార యాత్రలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి పీఎంశ్రీ పాఠశాలలతోపాటు భవిత కేంద్రాలలో ఉండే 65 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 30 మంది ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు వరంగల్, హైదరాబాద్ విహార యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూపార్కు, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్కు, వరంగల్‌లో వెయ్యిస్తంభాల గుడి, వరంగల్ కోట, వంటివి సందర్శించినట్లు చెప్పారు. -
జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్ / అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్‌సాగర్‌కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది. 153.052 మి.యూ. విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 86.912 మి.యూ., దిగువన 4 యూనిట్ల నుంచి 160 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 153.052 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
జూ.కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. శనివారం మానవపాడు జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, తరగతుల నిర్వహణ, బోధనా పద్ధతులు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన అధ్యాపకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కళాశాల పరిసర గ్రామాల్లో ఇంకా ఇంటర్మీడియట్లో చేరని విద్యార్థుల వివరాలను సేకరించాలని సూచించారు. ఇంటర్ విద్య ప్రాధాన్యతను విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించి.. వారు కళాశాలలో చేరేలా ప్రోత్సహించాలని తెలిపారు. -
వానాకాలం.. వారాబందీ!
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఏర్పడినప్పటి నుంచి ఏటా వానాకాలంలో వరి సాగు కోసం పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసే అధికారులు.. ఈ ఏడాది మాత్రం వారాబందీ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నా.. వానాకాలంలో వారాబందీ ఏమిటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా ఈసారి ఆరుతడి పంటలకే సాగునీరు వదులుతామని అధికారులు ఐడీబీ సమావేశంలో నిర్ణయించారు. వరి నారుమడులు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఎలాగైనా తమ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలాలని వేడుకుంటున్నారు. జలాశయాలు, ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని.. తక్కువ నీటిని వినియోగించాలంటూ గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి సీజన్లో వారాబందీ పద్ధతిన సాగునీటిని అందించిన అధికారులు.. వానాకాలం సీజన్లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిదిలో ఈసారి రబీ పంట సాగుకోసం ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడ్ రిజర్వాయర్‌తో పాటు శంకర సముద్రం, గోపల్‌దిన్నె వరకు అమరచింత ఎత్తిపోతలు, కురుమూర్తి ఎత్తిపోతల ద్వారా వారంలో 4 రోజులు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లా పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల వరకు ఉండగా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ కింద ప్రస్తుత వానాకాలం సీజన్లో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటిని వానాకాలం పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించనున్న నేపథ్యంలో ముందస్తుగా వారాబందీ అమలు చేశారు. ఆరుతడి పంటలకే ప్రాధాన్యమంటున్న అధికారులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్న అన్నదాతలు ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు.. అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది వానాకాలంలో 4 ఎకరాలు వరి సాగుచేశాను. వారాబందీ విధానంలో నీరు వదిలితే పంటకు సరిపడా అందక ఆశించిన స్థాయిలో దిగుబడి రాదేయోనన్న భయం ఉంది. జూరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలి. – మోహన్‌రెడ్డి, సింగంపేట యాసంగి సీజన్లో కేవలం రామన్‌పాడు వరకే నీటిని అందించిన అధికారులు వానాకాలంలో కూడా వారాబందీ అమలు చేయాలని నిర్ణయించడం శోచనీయం. కేవలం ఆరుతడి పంటల సాగుకే నీరందిస్తామని చెప్పడం సరికాదు. మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి (వీపనగండ్ల) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు వానాకాలం సీజన్లో వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నాం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరుతడి పంటలకుగాను వారంలో 4 రోజుల పాటు నీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా వేసవిలో కాల్వల్లో పూడికతీత చేపట్టాం. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
ఊరంతా ఏకమైంది!
చెట్టు కోసం.. గ్రామానికి దిక్సూచిగా.. గ్రామంలో జరుగుతున్న శుభ, అశుభ్ర కార్యక్రమాలకు సాక్షీభూతంగా.. వేసవిలో బాటసారులకు సేదతీర్చే నీడగా.. సభలు, సమావేశాలకు వేదికగా.. ఎన్నో రకాల పక్షులకు గూడుగా.. నిలుస్తున్న తొమ్మిది దశాబ్దాల నాటి రావి చెట్టు.. కాలక్రమేణా కనుమరుగయ్యే రోజులు వచ్చాయి. ఎంతో మందికి నీడనిచ్చిన ఆ చెట్టును కొందరు కబ్జా చేసుకుని వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు పూర్తిగా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో.. స్థానిక యువకులు చెట్టును కాపాడుకునేందుకు ముందుకొచ్చారు. చేయిచేయి కలిపి గ్రామస్తులను చైతన్యం చేసి.. చెట్టు కోసం ఊరంతా ఏకం చేసి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు ఉద్యమబాట పట్టారు. – రాజోళి ●మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే. – కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు మా ఊరిలో ఉండే రావి చెట్టు అంటే చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో ప్రేమ. అటు.. ఇటుగా వెళ్లేవారు సేద తీరడంతో పాటు, గతంలో ప్రజలకు ఇష్టమైన దుర్గమ్మ పాలను తీసుకెళ్లే వేదికగా నిలిచేది. మా ఇళ్లలో పెద్దలు పొలాలకు వెళ్తే.. పిల్లలమంతా ఈ చెట్టు కిందనే ఆడుకుంటూ నిద్రించేవాళ్లం. ఆ సందర్భంలో ఏనాడు చిన్న కీడు కూడా జరగలేదు. – రంగన్న, పెద్దతాండ్రపాడు చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను. – మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు గ్రామంలో చెట్టును కాపాడేందుకు అందరం ఏకమయ్యాం. గ్రామసభ పెడితే కబ్జాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాత్రం రాలేదు. అదే రోజున చెట్టును కాపాడాలని, రచ్చ కట్టను కాపాడుకోవాలని తీర్మానించాం. అయినా కొందరు లోలోపల చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెట్టు కోసం ఎంతటి పోరాటం చేయడానికై నా సిద్ధంగా ఉన్నాం. – బడేసాబ్, పెద్దతాండ్రపాడు రాజోళి మండలం పెద్దతాండ్రపాడులో 80 ఏళ్ల పైబడిన పురాతన రావి చెట్టు జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామానికి వెళ్లగానే గ్రామ నడిబొడ్డులో పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. కొత్తగా గ్రామానికి వచ్చేవారు చెట్టు కింద కూర్చున్న స్థానికులను అడిగి అడ్రస్ తెలుసుకుంటారు. దీంతోపాటు అటు తుమ్మిళ్ల.. ఇటు చింతల్ క్యాంపు, ముండ్లదిన్నె, కొంకల గ్రామాలకు వెళ్లేవారికి దిక్సూచిగా నిలుస్తుంది. దాదాపు 90 ఏళ్ల క్రితం నాటిన ఈ చెట్టు చుట్టూ 12 ఫీట్ల మేర విస్తరించింది. ఈ చెట్టు ఆవరణ ప్రస్తుతం తగ్గుతూ వచ్చింది. చెట్టు చుట్టూ ఉన్న రచ్చబండ లాంటి కట్ట చుట్టూ ప్రజలు రాకపోకలు సాగించేవారు. కానీ, కొందరు ఇల్లు, ప్రహరీ నిర్మించడం, మరోపక్క కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది.ప్రస్తుతం ఉన్న రిజిష్టర్లు, మినిట్స్ కాకుండా.. గతంలో గ్రామస్తుల తీర్మానాలు పెద్దల సమక్షంలో జరిగేవి. అందుకు ఈ చెట్టు కింద రచ్చ కట్టనే వేదికగా ఉండేది. గ్రామంలో పండుగలు, వేడుకలు ఎప్పుడు చేయాలి.. గ్రామంలో విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ప్రస్తావించేందుకు.. చేపట్టాల్సిన కర్తవ్యాలను ఈ రావి చెట్టు సాక్షిగా నిర్ణయం తీసుకునేవారు. ప్రత్యేకించి వేలం పాటలు, కూరగాయల సంత, పశువుల అమ్మకాలు, ఆలయ నిర్వహణ, రైతు సంబరాలు, ఇతరత్రా వ్యవహారాలకు ఈ చెట్టు వేదికగా నిలిచేది. ఇలా ఏళ్ల తరబడి ఎన్నో కార్యక్రమాలు, చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచి.. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ.. ప్రకృతి పరిరక్షణలో ప్రధాన పాత్ర పోసిస్తున్న ఈ చెట్టును తొలగించేందుకు కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పండుగల సమయంలో రావి చెట్టుకు పూజలు చేస్తున్న గ్రామస్తులు (ఫైల్) ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం. – పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల పెద్దతాండ్రపాడులో 9 దశాబ్దాల నాటి పురాతన రావి చెట్టు తరతరాలుగా దేవుళ్లతో సమానంగా పూజిస్తున్న గ్రామస్తులు క్రమంగా కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి 12 ఫీట్ల ఆవరణ ఏకంగా ఇల్లు, ప్రహరీ నిర్మించి ఆక్రమణ కాపాడుకునేందుకు ఏకమైన యువకులు, గ్రామస్తులు -
పసికందు మృతిపై విచారణ
గద్వాల క్రైం: మూడు నెలల పసికందు మృతికి పట్టణంలోని సౌమ్య చిల్డ్రన్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శుక్రవారం రాత్రి చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఘటనపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యాకిరణ్మయి సదరు ఆస్పత్రిని సందర్శించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై వైద్యులు, సిబ్బందిని ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం విచారణ దశలో ఉందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. విచారణలో వైద్యులు ప్రసూన్నరాణి, రాజు, సిబ్బంది తిరుమల్‌రెడ్డి, నర్సయ్య ఉన్నారు. -
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్టాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణమాసం శుక్లపక్షం జేష్ట మూలనక్షత్రం సందర్భంగా ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరమశివుడిని దర్శించుకుని.. రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు. -
బీచుపల్లి క్షేత్రంలో అలంపూర్ సివిల్‌జడ్జి
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం అలంపూర్ సివిల్ కోర్టు జడ్జి నితిన్ తేజ సందర్శించి.. అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అర్చకుడు సందీప్ చారి వివరించారు. న్యాయమూర్తి వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,519 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 256 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,519, కనిష్టంగా రూ. 4,169, సరాసరి రూ. 6,399 ధరలు లభించాయి. 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,219, కనిష్టంగా రూ. 4,579 ధర పలికింది. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
రాజోళి: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి.అర్చన సూచించారు. శనివారం ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల బృందం శ్రీరామ్, మమతలతో కలిసి ఆమె రాజోళిలో పర్యటించి.. వరి, పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. వరి పొలంలో తగినంత నీటిని మాత్రమే నిల్వ ఉంచాలని, 15 నుంచి 20 రోజుల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పత్తి పంటలో జాసిడ్స్, తామర పురుగులు, తెల్లదోమ, గులాబీ రంగు ఉధృతిని గమనించాలని.. ప్రధానంగా గులాబీ రంగు పురుగు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని తెలిపారు. మిరప పంటలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండొద్దన్నారు. కంది పంటలో కలుపు లేకుండా ఉంచుకోవాలని, సమతుల్య ఎరువుల వినియోగం ఉండాలన్నారు. చెరుకు పంటలో తేమను కొనసాగిస్తూ, కాండం తొలుచు పురుగులు, ఎర్ర కుళ్లు సోకిన మొక్కలను తొలగించాలని తెలిపారు. వారి వెంట ఏఓ సురేఖ, బిందు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మల్దకల్: ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. శనివారం మల్దకల్‌లోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్‌లో బుకింగ్ చేసిన తర్వాతే ఎరువులు అందించాలని డీలర్లకు సూచించారు. అలాగే ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని.. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ రాజశేఖర్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా పరిశీలన రాజోళి: క్షేత్రస్థాయిలో బీజేపీ బీఎల్ఏలు ఓటరు జాబితా పరిశీలన చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తపాలా రామాంజనేయులు అన్నారు. శనివారం వడ్డేపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన పార్టీ బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల పేర్లు జాబితాలో గల్లంతు కాకుండా చూడాలన్నారు. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారని.. అలాంటి వారికి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్‌రెడ్డి, నాగమల్లయ్య ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాలన్యూటౌన్: స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏఈడీపీ – బీఎఫ్ఎస్ఐ కోర్సు బోధనకు సంబంధిత అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మీనాక్షి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్ విభాగంలో ఎంకాం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంకాంతో పాటు ఎన్ఈటీ, ఎస్ఈటీ, పీహెచ్డీ అర్హత కల్గిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన వివరాలతో ఈ నెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. -
‘సర్’ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
గద్వాల/ ధరూరు: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు మిగిలి ఉన్న షెడ్యూల్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో గూగుల్ మీట్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో మ్యాపింగ్ జరగని ఓటర్లందరికీ నోటీసులు జారీచేసి నిర్దేశిత తేదీల్లో అవసరమైన డాక్యుమెంట్లతో హియరింగ్‌కు హాజరయ్యేలా చూడాలన్నారు. అనామలిస్ ఓటర్ల విషయంలోనూ ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ముందుకెళ్లాలన్నారు. గ్రామ, వార్డు సభలను నిర్వహించి నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు దివానిర్దేశం చేయాలన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో అసలే తమ పేరులేని అర్హులైన ఓటర్లు తిరిగి ఫాం–6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలన్నారు. శనివారం బీఎల్ఓలు, బీఎల్ఏలతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. సర్ ప్రస్తుత ప్రక్రియపై అవగాహన కలిగించాలన్నారు. బేసిక్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటే అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించడమే కాక తప్పులులేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేదుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ ధరూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి.. సర్ ప్రక్రియపై అధికారులకు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన ధ్రువపత్రాలు స్వీకరించి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ప్రక్రియలో ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిని, ఎంపీడీఓ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని, ఆర్అండ్ఆర్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ, పరిహారం, చెల్లింపులు, ఆర్అండ్ఆర్, అటవీ సమస్యలు, ఆర్థిక అనుమతులు, టోకెన్లు, ఇతర ఆర్థిక ప్రక్రియ పరమైన కారణాలతో సాగునీటి ప్రాజెక్టు ఆలస్యమవుతున్నా సంబంధిత వివరాలను నివేదికను పంపాలన్నారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ఎస్ఈ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ధరలతో ఇబ్బందే..
ఉల్లిని అన్ని రకాల వంటల్లో వాడాల్సి ఉంటుంది. రెండు, మూడు రోజుల నుంచి ఉల్లి ధర బాగా పెరిగింది. ఇప్పటికే చాలా వస్తువుల ధరల పెరుగుదలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉల్లి ధర కూడా పెరుగుతుండటం ఆర్థికంగా మరింత ఇబ్బంది కలిగిస్తోంది. – సుధ, గృహిణి, గద్వాల రేషన్ షాపుల్లో విక్రయించాలి.. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఉల్లి ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువకు ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉల్లిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. – శ్రీరాములు, గద్వాల -
వంటింట్లో ఉల్లి ఘాటు
గద్వాల వ్యవసాయం: ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.20 పెరిగింది. మున్ముందు ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్రలో అధిక వర్షాలకు దిగుబడులు తగ్గిపోవడం, స్థానికంగా దిగుబడులు చేతికి రాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించనున్నాయి. నడిగడ్డలో ఉల్లి సాగు.. నడిగడ్డలో ఏటా వానాకాలం సీజన్లో 1,800 నుంచి 2వేలు, యాసంగిలో 200 నుంచి 300 ఎకరాల్లో వర్షాధారం, బోరు బావుల కింద ఉల్లి సాగు చేస్తారు. వడ్డేపల్లి, అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, కేటీదొడ్డి, గట్టు, అయిజ మండలాల్లో ఎక్కువగా సాగవుతుంది. 110 రోజుల్లో పంట చేతికి వస్తుండగా.. వానాకాలం సీజన్లో ఎన్–53, బల్లారిరెడ్ రకాలను, యాసంగిలో రీసెర్చ్ రకాలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. విత్తనాలతోపాటు కొంతమంది రైతులు నారు కూడా వేస్తారు. వర్షాధారం కింద సాధారణ దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 టన్నులు, బోరుబావుల కింద 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తోంది. అక్కడ అతివృష్టి.. ఇక్కడ అనావృష్టి ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల వానాకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికితోడు భూగర్భజలాలు బాగా తగ్గాయి. ఏటా మే చివరి వారం, లేదా జూన్‌లో ఉల్లి వేస్తారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా వేశారు. అయితే స్థానికంగా వచ్చే ఉల్లి ఉత్పత్తులకు తోడు మహారాష్ట్రలోని నాసిక్ నుంచి జిల్లాకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. అక్కడ పండించే ఉల్లి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. దీంతో సీజన్‌తో సంబంధం లేకుండా ఉల్లిని ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల అక్కడి పంట దెబ్బతింది. ఇదే సమయంలో స్థానికంగా సాగైన ఉల్లి పంట ఇంకా చేతికి రాలేదు. ఉల్లి ధర పెరిగేందుకు ఇవే కారణమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కిలోపై ఒకసారి రూ.10, మరోసారి రూ.10 పెరిగింది. అయితే ఈ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. స్థానికంగా వేసిన ఉల్లి చేతికి రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. దీనికితోడు సాగు విస్తీర్ణం సైతం తగ్గింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక్కట్లు పడుతుండగా.. ఉల్లి ధరలు మరింత భారం కానున్నాయి. జిల్లాలో ఉల్లి సాగు ఇలా.. (ఎకరాల్లో) 2025 వానాకాలంలో సాగైన ఉల్లి 1,900 2026 వానాకాలం సీజన్లో సాగైన ఉల్లి 1,200 వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.20 పెంపు మున్ముందు మరింత పెరిగే అవకాశం మహారాష్ట్ర నుంచి తగ్గిన దిగుబడులే కారణం స్థానికంగా పంట చేతికొచ్చే వరకు ఇదే పరిస్థితి ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బెంబేలు -
ఎస్జీఎఫ్.. క్రీడల సందడి!
మహబూబ్‌నగర్ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీ యస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు మహబూబ్‌నగర్ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలతో పాటు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరో సారి ఎస్జీఎఫ్ క్రీడల సందడి నెలకొననుంది. ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు హైదరాబాద్‌లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ, అండర్– 17, అండర్–19 బాల,బాలికల వాలీబాల్, క్రికె ట్, అండర్–14, అండర్–17, అండర్–19 బా ల, బాలికల హ్యాండ్‌బాల్, అండర్–19 బాల, బాలికల నెట్‌బాల్, అండర్–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్జీఎఫ్ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువు రు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్‌నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లో అండర్–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది. రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రతిపాదనలు అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు అండర్–17 బాలికల జాతీయ క్రికెట్ టోర్నీకి ప్రతిపాదన -
వ్యాపారులకే లాభం..
వర్షాలు లేకపోవడం, బోరులో నీరు తగ్గిపోవడంతో ఈసారి ఉల్లి కొంత ఆలస్యంగా వేశాం. వచ్చే నెలాఖరుకు పంట చేతికి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉల్లిగడ్డకు ఉన్న ధరలు మా పంటలు చేతికి వచ్చిన తర్వాత ఉండవు. మూడేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల వ్యాపారులకే లాభం. – సూరి, ఉల్లి రైతు, గద్వాల ఎల్‌నినో కారణంగానే.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక.. భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో గడిచిన వానాకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి ఉల్లి సాగు తగ్గింది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో ఈసారి ఉల్లి కాస్త ఆలస్యంగా వేశారు. సెప్టెంబర్ రెండు, మూడో వారం నుంచి జిల్లాలో ఉల్లి చేతికి వస్తుంది. స్థానికంగా ఉత్పత్తులు చేతికి వస్తేనే ధర తగ్గి, నియంత్రణలో ఉంటుంది. – రాజ్‌కుమార్, జిల్లా ఉద్యాన శాఖాధికారి -
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అలంపూర్: ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ అలంపూర్ నియోజకవర్గ చైర్మన్ రాంమోహన్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా చుట్టూ కృష్ణా, తుంగభద్ర నదులు పారుతుండగా.. వీటి ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉందన్నారు. కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 30 ఏళ్లుగా ఆర్డీఎస్ నీటి హక్కులను అమలు చేయడంలో పాలకులు విఫలం అవుతున్నారని ఆరోపించారు. తుమ్మిళ్లతో ఓట్లను కొల్లగొట్టి ఆ తర్వాత రైతులను మభ్యపెడుతున్నారన్నారు. జూరాల కుడికాల్వ ద్వారా ఆర్డీఎస్కు లింకు చేసి మానవపాడు మండలంలోని రైతులకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. కానీ, ఆర్డీఎస్ కాల్వలు ఎత్తుగా ఉండటంతో నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. కాల్వలు ధ్వంసం కావడంతో వాటిని దున్ని సేద్యం చేసుకోవాల్సిన పరిస్థితికి తెచ్చారని వాపోయారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న మహబూబ్‌నగర్‌లో ఉమ్మడి జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద
● 11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ● శ్రీశైలానికి తగ్గిన వరద.. 167.87 టీఎంసీల నిల్వ గద్వాల/ఆత్మకూర్/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
నేరాలు అరికట్టడంలో టెక్నాలజీ దోహదం
మానవపాడు: పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా.. ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవాభావం, చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూడిన పవిత్రమైన సేవ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి.. స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బారెక్స్, స్టేషన్ రికార్డుల మెయింటెన్స్, మెన్ యూనిఫాం టర్నౌట్, కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్‌ుడ్స, పరిసరాలను తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న, స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని, బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. రౌడీ, సస్పెక్ట్, హిస్టరీ షీటర్లను చెక్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పాపిలోన్ డివైస్‌ను వినియోగించి అనుమానితుల వేలిముద్రలను చెక్ చేస్తూ పాత నేరస్తులను గుర్తించాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్–2.0, టీఎస్ సీఓపీ, ఈ–సాక్ష్య, సీఈఐఆర్, ఐఆర్‌ఏడీ, డ్రాపాన్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శంకర్, ఎస్ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకు సాగునీరందించాలి
అలంపూర్: ప్రాజెక్టుల కింద ఉన్న చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ కేశవరావుకు రైతులతో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలోని సాగునీటిని పనులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. ప్రాజెక్టులు, కాల్వల పనులు పెండింగ్‌లో ఉండటంతో రైతులకు సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతుందని, తద్వారా చివరి ఆయకట్టు రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ దగ్గర ప్యాకేజీ 99, 100 కింద కాల్వలు సకాలంలో పూర్తి చేయాలని, వీటిని పూర్తిచేస్తేనే చివరి ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే తాటికుంట రిజర్వాయర్‌కు అనుసంధానించే ప్యాకేజీ 106 కింద ఉన్న లింకు చానల్ పనులు అసంపూర్తిగా ఉందని, దీనిని కూడా పూర్తిచేయాలని కోరారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేస్తే ఆయకట్టుకు నీరందడంతోపాటు రైతులకు మేలు జరుగుతుందని విన్నవించారు. అలాగే నెట్టెంపాడు ప్యాకేజీలోని 99, 100, 106లోని కాల్వల్లో పేరుకున్న ముళ్ల పొదులు, గడ్డిని తొలగించాలని కోరారు. -
పప్పుదినుసుల పంటలు సాగు చేయాలి
మానవపాడు/ ఉండవెల్లి/ ఎర్రవల్లి: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి వంటి సంప్రదాయ పంటలు కాకుండా.. లాభదాయకమైన కూరగాయలు, పామాయిల్, పప్పుదినుసులు వంటివి సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్ అన్నారు. గురువారం ఆయన మానవపా సూచించారు. గురువారం ఆయన మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లిలోని పలు గ్రామాల్లో పర్యటించి పామాయిల్ తోటలు, ఇతర పంటలను పరిశీలించారు. అలాగే ఎన్ఎఫ్ఎస్ఎం ద్వారా రాయితీ పొందిన రైతు నాగన్న కంది పంటను, బీచుపల్లి ఆయిల్‌పాం నర్సరీని పరిశీలించారు. జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పనులను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలో సాగవుతున్న ఉద్యాన, వ్యవసాయ పంటలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తరణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. అంతకు ముందు బీచుపల్లి అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప, ఉద్యానవన అధికారి రాజ్‌కుమార్, ఏడీఏ శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాలను కార్యదర్శి సురేంద్రమోహన్ దర్శించుకున్నారు. ముందుగా ఆయన బాలబ్రహ్మేశ్వరస్వామి, తర్వాత జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. అధికారులు వారిని శాలువాతో సత్కరించారు. -
కళాశాలలకు నిధుల జోష్
● 61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు ● విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్‌ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్‌ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలి
ధరూరు/ కేటీదొడ్డి: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా విద్యార్థుల సామర్థ్యాలను మరింత మెరుగుపడాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మండలంలోని అల్వాలపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యా బోధనలో మెలకువలు పాటించి, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి గణిత సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే ఎఫ్ఎల్ఎన్, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్, పీజీఐ ఇండికేటర్స్‌కు సంబంధించిన ఆనర్లైన్ పనులన్నీ ఆన్లైన్లో క్లియర్ చేయాలని కోరారు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏజెన్సీ వారికి సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలన.. కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి రుచికరంగా భోజనం పెట్టాలని సూచించారు. ల్యాబ్, సాధారణ విద్యా విషయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసులు, ఎంఈఓ విజయభాస్కర్, కాంప్లెక్స్ హెచ్ఎం రాఘవేంద్ర, సీఆర్పీలు పాపయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చోరీల పరంపర..
గద్వాల క్రైం: తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు.. ఇంట్లో దాచ్చుకున్న నగదు, బంగారు ఆభరణాలు, వెండి ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. గ్రామం, పట్టణం తేడా లేకుండా అందిన కాడికి దోచుకుంటూ ఇల్లు గుళ్ల చేస్తున్నారు. అయితే జిల్లాలో వరుస చోరీల సంఘటనలకు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో వరుస చోరీల పరంపర కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల్లోనే జిల్లాలో 30కిపైగా చోరీలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. నిమిషాల వ్యవధిలోనే తమ పని కానిస్తూ.. పోలీసు శాఖకు దొంగల ముఠా సవాల్ విసురుతోంది. మరోవైపు సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు అనుమానితుల వివరాలు సేకరిస్తూ కూపీ లాగుతున్నారు. జిల్లాలోని వరుస చోరీ ఘటనలపై పోలీసులు సైతం నిర్విరామంగా కేసుల ఛేదనలో వ్యూవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని జమ్మిచేడ్కాలనీలో తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన మహారాష్ట్రకు చెందిన నిందితుడిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకుని బంగారం రికవరీ చేశారు. అలాగే భీంనగర్కాలనీలోని నివాసం ఉంటున్న కారు డ్రైవర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి, రూ.7 వేల నగదును అపహరించారు. పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని ఎత్తుకెళ్లిన మొత్తం బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన నిందితులుగా పోలీసులు గుర్తించారు. కేసులను సవాల్‌గా తీసుకుని గుర్తుతెలియని దుండగులను కట్టడి చేస్తున్నారు. అయినప్పటికీ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల వ్యవధిలో 17 చోరీల కేసులు నమోదు కాగా మరో 13 ద్విచక్రవాహనాల అపహరణ కేసులు నమోదవడం గమనార్హం. గద్వాల మండలంలోని తుర్కోనిపల్లిలో చోరీ ఘటనపై వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు (ఫైల్) 3.7.2026 వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నందనవనం కాలనీకి చెందిన రైతులు వ్యవసాయ సాగు అవసరాల కోసం 16 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్, కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత రైతులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2.8.2026న గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలోని మునేశ్వరి ఉదయం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి రూ.3.5 లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితురాలు గట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3.8.2026న గద్వాల మండలంలోని తుర్కోనిపల్లి గ్రామానికి చెందిన బొగ్గు మహేశ్వరమ్మ ఇంటికి తాళం వేసి గద్వాలకు వచ్చారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ.10 వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల మధ్యలోనే జన సంచారం ఉన్న కాలనీలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాహనాలు సైతం ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పోలీసు శాఖపై పెద్దఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న జిల్లావాసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలం జిల్లాలో జరుగుతున్న చోరీల ఘటనలపై ఇప్పటికే ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టాం. అలాగే సరిహద్దు ప్రాంతాల వద్ద పటిష్ట తనిఖీలు చేపడుతూ.. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ఆలయాలు, నివాస గృహాలు, పార్క్ చేసిన వాహనాలు అపహరించిన కేసులపై క్లూస్ టీం, ప్రత్యేక బృందాల సభ్యులు దృష్టిసారించాయి. విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను వీలైనంత త్వరగా ఛేదిస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కేటీదొడ్డి: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనులు చేయాలని శిక్షణ కలెక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని నందిన్నె గ్రామాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామంలోని విద్యార్థులు, యువత కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని, స్ధానిక యూపీఎస్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీ కాలనీలో నూతన అంగన్వాడీ కేంద్రం, ఉన్నత విద్య కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల, గ్రామ పాలన సౌకర్యార్థం, నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం శిక్షణ కలెక్టర్ మాట్లాడుతూ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచు నాగమ్మ పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అలంపూర్: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి వైద్యులకు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని ఏరియా (వంద పడకల) ఆస్పత్రిలో గురువారం కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని, గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, సురక్షితమైన ప్రసవాలు చేయాలని సూచించారు. బాలింతలు, చిన్నారులకు వైద్య పరీక్షలు మెరుగుపర్చాలని కోరారు. యుక్త వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్ధేశకాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పీహెచ్‌సీలు అనుబంధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు. అనంతరం డీఎంహెచ్ఓను వైద్యులు శాలువాతో సత్కరించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి ప్రసూనరాణి, కిషోర్, సివిల్ సర్జన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 23న కబడ్డీ జట్టు ఎంపిక మహబూబ్‌నగర్ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మక్తల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నియోజకవర్గంలో రూ.178.84 కోట్లతో 25 అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని కాచ్వార్ టోల్గేట్ వద్ద పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికి బైక్ ర్యాలీగా నల్లజానమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటికి చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వాకిటి తల్లి రాములమ్మను సీతక్క శాలువాతో సన్మానించారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి 25 ఏళ్లు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి ద్వారక ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీడీ విడుదల.. మక్తల్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన రాజకీయం 2001, ఆగస్టు 20న మక్తల్ సర్పంచుగా ప్రారంభమైందన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల అండదండలతో నేడు ఈ స్థాయికి ఎదిగానని.. కార్యకర్తలే దేవుళ్లని.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. మక్తల్, ఆత్మకూర్, నర్వ, మాగనూర్, అమరచింత మండలాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఊట్కూర్ మండంల మల్లేపల్లి వంతెన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశామని పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు.. స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం వైస్ చైర్మన్ నాగరాజు, పుర చైర్పర్సన్ వాకిటి మానస, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ చైర్మన్ రహమతుల్లా, మక్తల్ మార్కెట్ చైర్పర్సన్ గవినోళ్ల రాధమ్మ, నాయకులు పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి, గణేష్‌కుమార్, రవికుమార్‌యాదవ్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, శివరాంరెడ్డి, ఆనంద్‌గౌడ్, చంద్రకాంత్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే విద్యార్థుల్లో సమగ్ర వికాసం
గద్వాల: విద్యార్థుల సమగ్ర వికాసానికి, భవిష్యత్ పునాదులకు చదువే కీలకం అని, పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి.. జిల్లా ర్యాంకును ముందుకు తీసుకురావడానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా ప్రయోగపూర్వకంగా బోధనా పరికరాలు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తు పాఠాలు చెప్పాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతను గుర్తించి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలో ప్రవేశాలు పెంచాలని, యూడైస్ వివరాలు, పోషణ్ యాప్ నమోదు పక్కాగా ఉండాలని ఆదేశించారు. పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరి అని, అవసరమైన చోట విద్యా వలంటీర్లను నియమించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర పరిశీలకులు అభిషేక్, డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలి
అలంపూర్: రైతులకు సాగునీటి కష్టాలను తీర్చాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం నీటిపారుదలశాఖ సీఈ రహీముద్దీన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలోని జూరాల లింక్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు 99వ ప్యాకేజీ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. 106వ ప్యాకేజీ చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఈకి సూచించినట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటిపై భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి గద్వాలన్యూటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూరుస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలతో పాటు అనంతాపురం జెడ్పీహెచ్ఎస్లో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 23న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహిమూద్, రవిశంకర్, రమేశ్, షేక్షావళి, శిరీష, శ్రీకాంత్, యూనుస్ పాషా పాల్గొన్నారు. ‘శక్తి’ పాలసీలో విలీనం సరికాదు గద్వాలన్యూటౌన్: పాల్టెక్నిక్ను శక్తి పాలసీలో విలీనం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పాల్టెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్కిల్ వర్సిటీలో పాల్టెక్నిక్ కళాశాలల విలీనానికి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ పాలసీ వల్ల మూడేళ్లు వృథా అవుతుందన్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ మోడ్‌లో నిర్వహించడం అంటే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నమన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న స్కిల్ వర్సిటీ పరిధిలోకి పోతే ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థుల వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో కిషోర్, భాను, ప్రణయ్, అఫ్రోజ్, రమేష్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,496 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 170 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,496, కనిష్టంగా రూ. 5,902, సరాసరి రూ. 6,389 ధరలు పలికాయి. -
ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం
వనపర్తి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెబ్బేరు మండలం జనంపల్లి శివారులోని రైతుల పొలాలను సందర్శించి పంటల సాగు పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి పంటల సాగు, నీటి లభ్యత, ఎరువుల సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తాను కంది సాగు చేసినట్లు రైతు బాలరాజు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించడంతో సాగు చేపట్టినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామంలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని.. పలువురు రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తాను ఆయిల్‌పాం సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నట్లు మరో రైతు వెంకటస్వామి వ్యవసాయశాఖ కార్యదర్శికి వివరించారు. యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆయనకు తెలియజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని.. ఆసక్తిగల రైతులు దృష్టి సారించాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటస్వామిని అభినందించడంతో పాటు రైతునేస్తం కార్యక్రమంలో భాగస్వామిని చేసి తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఆయిల్‌పాం తోటల్లో ఏయే అంతర పంటలు సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందనే అంశంపై అధికారులు అధ్యయనం చేసి శాసీ్త్రయంగా సూచనలు అందించాలని కోరారు. నీటి లభ్యత, పంటల ఎంపిక, అంతర పంటల సాగు, ఎరువుల వినియోగంపై శాసీ్త్రయ అవగాహన కల్పిస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో రైతులు అవలంబిస్తున్న విధానాలపై క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బీచుపల్లి
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసి.. భక్తులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రత కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. బుధవారం బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించగా.. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్ ఆలయ చరిత్రను వివరించారు. కాగా, ఆలయ ప్రాంగణంలో చెత్తాచెదారం ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం కృష్ణా పుష్కరఘాట్‌ను పరిశీలించారు. కృష్ణానదిలోని నిజాం కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను పర్యాటక శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. నదీ తీరంలో సేవలు అదిస్తున్న గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లు, టార్చిలైట్లు, రక్షణ తాళ్లు, రెస్క్యూ బోట్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరంలో వెంటనే స్పందించేలా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండలంలోని కస్తుర్బాగాంధీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ నరేశ్, కార్యదర్శి అరుణ ఉన్నారు. -
ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దు
● విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలి ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి కందనూలు: జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పకడ్బందీగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత, పోషకాహారం, మాతృత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, శారదాలతో కలిసి కల్వకుర్తి పట్టణంలోని పలు రేషన్ దుకాణాలు, గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించిన పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై పాఠశాల స్థాయిలోనే కాకుండా, సంబంధిత అధికారులు కూడా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం, లబ్ధిదారుల హాజరు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీడబ్ల్యూఓ ఉమాపతి, డీఎంహెచ్ఓ కృష్ణ, డీటీడబ్ల్యూఓ కోటాజీ, డీఆర్డీఓ ఓబులేష్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి పాండు, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, ఎంఈఓ శంకర్‌నాయక్ ఉన్నారు. -
తల్లిదండ్రులు గమనించాలి..
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్‌నగర్ కఠిన చర్యలు.. గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి.. గంజాయిని పట్టుకున్నాం. అదేవిధంగా గంజాయి విక్రేతలను అరెస్టు చేశాం. యువత గంజాయికి బానిసలుగా మారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ -
రైతుల శ్రేయస్సు కోసమే వరుణయాగ పాదయాత్ర
రాజోళి: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలు పండాలని కాంక్షిస్తూ బుధవారం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వరుణయాగ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి నీటిని తీసుకొచ్చి.. శాంతినగర్‌లోని ఈశ్వరమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి డప్పుల మోతల మధ్య కాడెద్దులతో పాదయాత్రను ప్రారంభించారు. జూలకల్ వద్దనున్న శివాలయానికి చేరుకొని పరమశివుడిని నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం రైతులతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని అలంపూర్ నియోజకవర్గ రైతులతో కలిసి వరుణయాగ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. -
ఎవరికీ ప్రయోజనం లేదు..
ఉప్పల్ క్యాంపులో కార్యాలయం ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. ఆయకట్టు మొత్తం ఇక్కడ ఉండగా.. కార్యాలయం దూరాన ఉండటం ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు. అధికారులు రైతులకు అందుబాటులో ఉన్నప్పుడే నీటి విడుదల, ఆయకట్టు సంరక్షణ చర్యలు వీలవుతుంది. – లోకేశ్‌రెడ్డి, రైతు, చిన్నధన్వాడ అందుబాటులో ఉండాలనే డిమాండ్ ఉంది ఆర్డీఎస్ కార్యాలయం ఉప్పల్ క్యాంపులోనే నిర్వహించాలనే డిమాండ్ ఉంది. ఆర్డీఎస్ రైతుల కోరికను ఉన్నతాధికారులకు తెలియజేశాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల డిమాండ్‌ను వినిపించాలని కోరాం. సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. – రామదాసు, ఆర్డీఎస్ అధికారి అనుకూలంగా ఉండేది.. ఉప్పల్ క్యాంపులో ఆర్డీఎస్ కార్యాలయం ఉన్నప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి వెళ్లేవాళ్లం. నీటి విడుదల నిలిచినా, కెనాల్లో నీటి ఇబ్బందులు ఎదురైనా, నీటి చౌర్యం జరిగినా వెంటనే అధికారులను కలిసేవాళ్లం. కర్ణాటక నుంచి నీటి విడుదలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని గ్రామాల్లో రైతులకు తెలిపేవాళ్లం. అధికారులు కూడా రైతులను సులువుగా గుర్తుపట్టి.. తరచుగా సమావేశాలు నిర్వహించే వారు. – పరమేశ్‌గౌడ్, రైతు, పెద్ద ధన్వాడ ● -
సాంకేతిక విద్యను యథావిధిగా కొనసాగించండి
గద్వాలన్యూటౌన్: ప్రస్తుత సాంకేతిక విద్యను యథావిధిగా కొనసాగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేశ్ పటేల్ డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యను పరిరక్షించాలని.. జీఓ నం. 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాల్టెక్నిక్ కళాశాలలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత సాంకేతిక విద్యను కొనసాగిస్తూ, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యావ్యవస్థ అన్నారు. అలాంటి సాంకేతిక విద్యను ప్రైవేటు సంస్థల్లో విలీనం చేసి, ఇంజినీర్ కావాలనే వారి కలల్ని దూరం చేయడమే అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టె ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికీ పాలిటెక్నిక్ కళాశాలలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, విలీనం చేయడం కాకుండా, మరింత బలోపేతం చేయాలన్నారు. మౌలిక వసుతులు, ఆధునిక కోర్సులు, సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్లేస్‌మెంట్స్ కల్పించాల్సింది పోయి.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ పేరుతో ‘శక్తి’ విభాగంలో చేర్చి ఉన్నత విద్యకు లక్షల మంది విద్యార్థులను దూరం చేసి నిధులను దారి మళ్లించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. జీఓం నం.97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నితిన్, నరేంద్ర, సురేష్‌నాయుడు, మంజునాథ్, సాయి హర్ష, శ్రావణి, శ్రీలత, అనుశ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఆర్డీఎస్ ఆయకట్టు అయిజ మండలం సింధనూరులోని 12–ఏ నుంచి మొదలై.. అలంపూర్ చివరిదాక ఉంది. ఆయకట్టు మొత్తం అలంపూర్ నియోజకవర్గంలోనే ఉండగా.. అధికార కార్యాలయాన్ని మాత్రం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. రైతులకు ఆర్డీఎస్ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో కనీస సమాచారం, ఆయకట్టుకు నీరందించే సమయ వివరాలు తెలుసుకునే వీలు లేకుండాపోయింది. ప్రత్యేకించి తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి కూడా నీటి విడుదల ఉంటుండటంతో రైతులకు తగిన సమాచారం అందించాల్సిన అవసరముంది. -
రేపు ఉద్యోగ మేళా
గద్వాల: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రశాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగి.. ఎస్సెస్సీ, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీకాం విద్యార్హత కలిగిన వారితో పాటు హోటల్, హాస్పిటల్ రంగాల్లో అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపికై న వారికి జిల్లా కేంద్రంతో పాటు, అయిజ, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లోని పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 25న వాక్–ఇన్ ఇంటర్వ్యూ గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 38 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ట్యూటర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నెల 25న వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభావాలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రులతో ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. పోస్టుల వివరాలు, వయోపరిమితి వేతనం తదితర పూర్తి నిబంధనల కోసం జిల్లా అధికారిక వెబ్సైట్ www.gadwal.telangana.gov.inను పరిశీలించాలని కలెక్టర్ కోరారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు మల్దకల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి సిబ్బందికి సూచించారు. మంగళవారం మల్దకల్ పీహెచ్సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని గ్రామాలలో వారానికి రెండు మార్లు డ్రై డే కా ర్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఫీవర్ సర్వే ద్వారా విషజ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి.. ఆరోగ్యకేంద్రాలకు పంపించా లని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట డాక్టర్లు ఉషారాణి, జయమ్మ, డీపీహెచ్ఎన్ వరలక్ష్మి, సూపర్వైజర్లు శ్రీధర్, సత్యమ్మ ఉన్నారు. పల్లీ క్వింటా రూ.8,119 గద్వాలవ్యవసాయం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 92 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,119, కనిష్టంగా రూ. 5,380, సరాసరి రూ. 7,682 ధరలు పలికాయి. -
నిరంతరాయంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. మంగళవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 65.849 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 50.600 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 116.449 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. -
ముసాయిదా ఓటరు జాబితా సరిచూసుకోవాలి
గద్వాల: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయి దా ఓటరు జాబితాను ప్రకటించామని.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వారీగా తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా జాబితాలో పేర్లు, పుట్టిన తేదీ లేదా చిరునామాలో తప్పులుంటే సవరించడానికి తగిన వివరాలు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. సందేహాల నివృత్తికి స్థానిక తహసీల్దార్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు. వందశాతం హాజరు తప్పనిసరి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని.. సెలవు కావాల్సిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఐడీఓసీ వీసీ హాల్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెప్టెంబర్ 5వ తేదీలోగా విద్యార్థులందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేయాలని సూచించారు. 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. కాగా, అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మెమోలు, టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండటంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సదరు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీఈఓ విజయలక్ష్మిని ఆదేశించారు. ● బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆహర్నిశలు పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. కలెక్టరేట్లో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు. యూరియా అధిక వాడకంతో నేల సారవంతం తగ్గుతోందని.. యూరియా స్థానంలో నానో యూరియా వాడకాన్ని పెంచేలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని కలెక్టర్ అన్నారు. మల్దకల్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల ధరలు, స్టాక్, రిజిస్టర్లు, పురుగు మందుల నిల్వలను పరిశీలించి.. నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించాలని డీలర్లకు సూచించారు. పెదొడ్డి గ్రామంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఆయ న వెంట డీఏఓ వీరన్న ఉన్నారు. -
ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం
పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ -
సీటుంది.. వసతి లేదు!
ప్రత్యామ్నాయం ఏదీ? కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్‌గా వినియోగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్‌తోపాటు పరిసరాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నా.. వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వసతులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్‌సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేక పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్‌లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉంటుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. లా, ఇంజినీరింగ్‌లో ఖాళీలు లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో 140 సీట్లకు 97 మంది చేరగా.. 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది చేరగా.. 53 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.ఇంజినీరింగ్‌లో 180 సీట్లకు 125 మంది చేరగా.. 55 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 23, డేటా సైన్స్‌లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్‌లో 5 సీట్లు ఉన్నాయి. హాస్టల్ వసతి లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు సీట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వీటిలో చేరే వారికి ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్‌లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు ప్రతినె లా రూ.6వేల రూ.8వేల భారం కొత్త హాస్టళ్లు నిర్మాణంలో.. అప్పటివరకు అవస్థలే!బాలికల హాస్టల్లో 680 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి 190 మందికిపైగా ఉండటంతో గదుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలుగురు ఉండాల్సిన గదుల్లో ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. -
అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
లింగాల: మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రాంబాబు ఇటీవల లంచం తీసుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉద యం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలో అద్దెకు ఉన్న ఓ అధి కారి ఇంట్లో సైతం సో దాలు చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. గత జూలై 23న లింగాల మండలానికి చెందిన కొందరు రైతులు ఎడ్లబండ్లపై వ్యవసాయ పనిముట్లను తీసుకొని వస్తుండగా.. రేంజ్ పరిధిలోని కొర్రమడుగు సమీపంలో బీట్, సెక్షన్ ఆఫీసర్లు అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేశారన్నారు. మొత్తం రూ. 1.50లక్షలు డిమాండ్ చేయగా.. రూ. 50వేలు ముందస్తుగా తీసుకున్నారని బాధిత రైతులు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ సీఐ జిలానీ, సిబ్బంది ఉన్నారు. రైతుల నుంచి లంచం తీసుకున్న ఇద్దరు అధికారుల అరెస్టు -
ఆర్డీఎస్.. ఆపసోపాలు!
రాజోళి: ఆర్డీఎస్ ఆయకట్టు పర్యవేక్షణ లోపిస్తోంది. కాల్వలకు నీటి విడుదల నిలిచినా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా రైతులు సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఇందుకు ఆర్డీఎస్ కార్యాలయం అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. ఆర్డీఎస్ ఆయకట్టు మొత్తం ఒకచోట ఉండగా.. కార్యాలయం మాత్రం జిల్లా కేంద్రంలో కొనసాగుతుండటంతో రైతులు తమ సమస్యలను తెలియజేసేందుకు అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు మరింత ఆగమవుతున్నారు. 59ఏళ్ల క్యాంపు సేవలను వదిలి.. ఆర్డీఎస్ ఆయకట్టు, కెనాల్‌ను పరిగణనలోకి తీసుకుని 1955 ఫిబ్రవరి 15న అయిజ మండలం ఉప్పల్‌లో ఆర్డీఎస్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఉప్పల్ క్యాంపుగా పిలుస్తున్నారు. అయితే 2024లో ఆర్డీఎస్ డివిజన్–4లోకి మారిన తర్వాత ఇక్కడి నుంచి కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో దాదాపు 59ఏళ్ల పాటు ఉప్పల్ క్యాంపులో విధులు నిర్వర్తించిన అధికారులు.. ఆయకట్టు రైతులకు అందుబాటులో లేకుండాపోయారు. ఇక్కడ కార్యాలయం ఉండగా.. ఆయకట్టు రైతులకు ఉన్నతస్థాయి అధికారి నుంచి లస్కర్ వరకు సుపరిచుతులుగా ఉండేవారు. అధికారులకు కూడా రైతులు బాగా తెలిసిన వారిగా ఉండే వారు. రైతును చూడగానే వారి పొలం ఏ డిస్ట్రిబ్యూటరీ కింద ఉందో ఠక్కున చెప్పే వారు. ఎప్పుడూ అధికారుల తనిఖీలు, రైతుల రాకపోకలతో హడావుడిగా ఉండే ఉప్పల్ క్యాంపు ప్రస్తుతం వెలవెలబోతోంది. దాదాపు 32 ఎకరాల్లో నిర్మించిన ఈ క్యాంపులో అధికారులు ఉండేందుకు క్వార్టర్లు కూడా ఉన్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఆయకట్టులో నీటి దోపిడీ, రైతుల తగాదాలు, కెనాల్ కోతలు, మట్టి తవ్వకాలు, కెనాల్ రోడ్డుపై అక్రమ రాకపోకలు, రోడ్ల ధ్వంసం వంటి వాటి విషయాల్లో అధికారులు తనిఖీలు, పర్యవేక్షణ చేసేందుకు అందుబాటులో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయకట్టు అవసరాలు పెరిగిన నేపథ్యంలో అందుబాటులో ఉండాల్సిన అధికారులు జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుండటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయకట్టు మొత్తం ఒకచోట ఉండగా.. కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. ఉప్పల్ క్యాంపులోనే ఆర్డీఎస్ కార్యాలయం కొనసాగించాలని కోరుతున్నారు. ఆయకట్టు ఒకచోట.. కార్యాలయం మరోచోట రైతులకు అందుబాటులో ఉండని అధికారులు సాగునీటి సమస్యల పరిష్కారంలో జాప్యం 32 ఎకరాల్లో నిర్మించిన ఉప్పల్ క్యాంపు వదిలి జిల్లా కేంద్రంలో కార్యకలాపాలు -
గ్రామాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు
ధరూరు: గ్రామాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సమ గ్ర అభివృద్ధి ప్రణాళిక అంశంపై మంగళవారం ధరూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గద్వాల నియోజకవర్గ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. గతంలో పనిచేసిన సర్పంచులకు ధీటుగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి.. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్యంగా అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి సత్వర చర్య లు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రోగ్రాం ఇన్చార్జి సురేశ్‌బాబు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వచ్ఛత పెంపొందించడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ.. గ్రామాభివృద్ధికి పాటుపడాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సూచించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టుతిమ్మప్ప, డీపీఓ శ్రీకాంత్, డీఆర్డీఓ ము షాయిదా బేగం, డీఎల్పీఓ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు విజయ్, రమేశ్ నాయుడు పాల్గొన్నారు. -
రేపు స్పాట్ కౌన్సెలింగ్
గద్వాల: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు, అలంపూర్ బాలికల, ఇటిక్యాల, అయిజ, గద్వాల బాలుర గురుకుల పాఠశాలల్లో 9వ తరగతిలో ఎస్సీ బాలిక/ బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. 8, 9 తరగతుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులన్నారు. స్పాట్ అడ్మిషన్లకు వచ్చే విద్యార్థులు హాల్‌టికెట్, బోనోఫైడ్‌తోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని.. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గట్టులోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల జూనియర్ కళాశాలకు రావాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెరిట్ జాబితా విడుదల గద్వాల: ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా సోమవారం విడుదల చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ షేక్, డీఎంహెచ్ఓ సంధ్య కరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 3, ల్యాబ్ టెక్నీషియన్ 2, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను జిల్లా అధికారిక వెబ్సైట్ https://gadwal.telangana. gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఈ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు గురువారం సాయంత్రం 5 గంటలలోపు లిఖితపూర్వకంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేయాలని సూచించారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీ గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 10 మంది అర్జీదారులు తమ సమస్యలపై ఏఎస్పీ శంకర్‌కు అర్జీలు అందజేశారు. అనంతరం వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 271 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 271 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,470, కనిష్టంగా రూ.5,269, సరాసరిగా రూ.6,820 ధరలు లభించాయి. లా, ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజినీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. -
ప్రజలను తిప్పించుకోవద్దు
తేళ్లను దైవ స్వరూపంగా కొలిచే సంప్రదాయం రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా గురిమిట్కల్ మండలం కందుకూరులో కొనసాగుతోంది. శ్రావణ పంచమి సందర్భంగా సోమవారం కొండమాయి కొండపై తేళ్ల పంచమిని వైభవంగా నిర్వహించారు. కొండమవ్వకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు గుట్టపై రాళ్లను తొలగిస్తూ తేళ్లను పట్టుకున్నారు. జాతర రోజున కొండమాయి అమ్మవారి కృపతో తేళ్లు కుట్టవని భక్తుల విశ్వాసం. అయితే తేలు కాటుకు సంప్రదాయ పద్ధతులను కాకుండా వైద్య చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. – నారాయణపేట ఎర్రవల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ప్రజావాణి ప్రోగ్రామింగ్ రాష్ట్రస్థాయి అధికారి సహదేవుడు అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన సందర్శించి.. ప్రజల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా.. ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడూ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదు పరిష్కరణ అనంతరం సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయడంతోపాటు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అమీర్‌పాష, ఏఓ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మధుమోహన్‌తో కలిసి ప్రజల నుంచి 41 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలన్నారు. అలాగే మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. తమ శాఖల పరిధిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లాలో సీఎం ప్రజావాణికి వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు 244 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 57 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలని, అలసత్వం చూపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఖాకీల్లో అవినీతి ‘చిచ్చు’!
● రోజురోజుకు తెరపైకి వస్తున్న కొత్త అంశాలు ● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ ● వాస్తవాలు తేలాలంటే సమగ్ర విచారణే మార్గం ఎస్ఐ పాత్రపై ఆరోపణలు సదరు ఉన్నతాధికారికి సంబంధించిన పలు వ్యవహారాలను ఆ ఎస్ఐ పర్యవేక్షించేవారని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో గద్వాల–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరా లపై జరిగిన దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంలోనూ ఇద్దరి పాత్రపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అలాగే నెలవారీ వసూళ్ల వ్యవహారంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించేవారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఎస్ఐ గతంలో అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీకి పట్టుబడి.. అనంతరం కొంతకాలం వీఆర్ లో ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే కీలక పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు న్నార ుు. అనంతరం ఓ జిల్లాలో ఏడాది పాటు పనిచేసి, ఆరోపణల నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా అక్కడ రెండు నెలలు పూర్తికాకముందే మరోసారి వనపర్తి జిల్లాకు బదిలీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తీవ్రస్థాయిలో ఆరోపణలపై ఓ ఉన్నతాధికారిపై సీఐడీ విచారణ! గద్వాల/మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది. సీఐడీ విచారణ అంశం తెరపైకి రావడంతో గద్వాల జిల్లాలోనూ గతంలో జరిగిన పలు వ్యవహారాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఓ రేంజ్ స్థాయి అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆయనకు మధ్యవర్తులుగా కొందరు డివిజన్ స్థాయి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారులు వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌శాఖలో విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, నెలవారీ నేర నివేదికలు, సమీక్షలు తదితర అంశాలు అధికారుల పనితీరుకు ప్రామాణికాలుగా ఉంటాయి. అయితే కొందరు అధికారులకు పోస్టింగులు, ఇతర ప్రయోజనాల విషయంలో అనధికారిక లావాదేవీలు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. నెలవారీ మామూళ్ల విషయంలోనూ ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వాటి వాస్తవాలను అధికారిక విచారణలో నిర్ధారించాల్సి ఉంది. గద్వాలపై ప్రత్యేక దృష్టి -
జాబితాలో మీ పేరుందా..!
అచ్చంపేట: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)–2026 ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద జాబితా ప్రదర్శించారు. మృతిచెందిన వారితోపాటు శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓట్లు కలిగిన వారిని జాబితా నుంచి తొలిగించారు. బీఎల్ఓలు 45 రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి.. పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి.. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేశారు. ప్రస్తుతం వెలువడిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. లేదా.. అని వెతికే పనిలో ఓటర్లు పడ్డారు. సరి చూసుకోకపోతే.. ఉమ్మడి జిల్లాలో సర్ ప్రక్రియకు ముందు 32,35,733 మంది ఓటర్లు ఉండగా.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 27,72,578 మంది ఓటర్ల పేర్లను బీఎఓలు డిజిటలైజేషన్ చేశారు. వీరి పేర్లను మాత్రమే ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఫారాలు తిరిగి ఇవ్వని, అన్ కలెక్టబుల్ (అబ్సెంట్), పర్మనెంట్ షిఫ్ట్, డెత్, డూప్లికేట్ (ఎఎస్డీడీ) 4,63,155 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ప్రచురించారు. ముసాయిదా జాబితాలో ఉండే 8,84,030 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు (అనామలిస్) కలిగి ఉండటం, మ్యాపింగ్ జరగకపోవడంతో వారిని అనుమానాస్పద ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరికీ అక్టోబరు 15 వరకు ఎలక్ట్రోరల్ రిజిస్టర్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించిన 4,63,155 మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లు కలిపితే 13,47,185 మంది జాబితాలో తమ పేరు తొలిగింపు ముప్పు ఎదుర్కోనున్నారు. నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లలో 1,21,434 మంది అన్మ్యాప్డ్ ఓటర్లు ఉండగా.. మిగిలిన 7,62,596 మంది ఓటర్లలో వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/ తల్లిదండ్రులు/ వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో పూరించాల్సి ఉండగా.. ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన/ లేక తప్పుడు వివరాలు ఇచ్చిన 1,21,434 మంది ఓటర్లను అన్ మ్యాప్డ్గా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఎన్యూమరేషన్ ఫారంలోని సర్–2002 ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పడం లేదు. తస్మాత్ జాగ్రత్త.. ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు స్థానికంగానే ఉండి జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్లు కచ్చితంగా తమ పేరు ఉందో.. లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని. ముసాయిదా ఓటరు జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 4,63,155 మంది ఓట్ల తొలగింపు 32.35 లక్షల నుంచి 27.72 లక్షలకు తగ్గిన సంఖ్య ముసాయిదాలో పేర్లున్న 8.84 లక్షల మందికి నోటీసులు గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ.. అభ్యంతరాలు, అప్పీల్‌కు నెలరోజుల గడువు నమోదుకు మరో అవకాం.. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయింలు, అభ్యంతరాలపై అందే దరఖాస్తులను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అలాగే అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతతోపాటు ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వారు నిబంధనల ప్రకారం ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫారం–7, ఓటరు పేరు, చిరునామా, ఛాయాచిత్రం తదితర వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం–8 వినియోగిస్తారు. వచ్చిన క్లెయింలు, అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబరు 19న తుది జాబితా ప్రచురిస్తారు. -
బీఆర్ఎస్ పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర
గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హన్మంతునాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాకేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. పాతబస్టాండ్, ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన జీఓ 8ని న్యాయస్థానం నిలిపివేయడం వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. రూ.51 వేల సహాయంతో మొదలై.. రూ.1,00,116 పెంచారని, బీఆర్ఎస్ హయాంలో 13 లక్షల మందికి రూ.13 వేల కోట్ల మేర సాయం అందిందని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలపాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి జీఓ 8పై ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి ద్వారా ఇచ్చే నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు మొత్తానికే ఎగ్గొట్టే కుట్రకు తెరలేపారని విమర్శించారు. పథకాలను మళ్లీ అమలు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కోటేష్, రాఘేంద్రరెడ్డి, ప్రతాప్, శ్యామల పాల్గొన్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాడుతాం
అయిజ: ఏపీలోని రాజమహేంద్రవరంలో హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌లో ఆమె ప్రియాంక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. ఒక సాధారణ పౌరుడు కష్టపడి ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నారని.. ప్రియాంకను డాక్టర్ చేయాలనే లక్ష్యంతో చదివిస్తుంటే, ఇద్దరు దుర్మార్గులు వారి ఆశలన్నింటిని బుగ్గిపాలు చేశారన్నారు. ఈ ఘటనలో కొందరు దోషులను కాపాడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీడియా కదిలించేంత వరకు అక్కడున్న పోలీసులు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎందుకు మాట్లాడలేదని.. సీసీ ఫుటేజీలను ఎందుకు బహిర్గతం చేయలేదని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కుట్ర వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి రక్షణ కల్పించదా అని ప్రశ్నించారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగకుంటే చేనేత సామాజిక వర్గం మొత్తం రాజమహేంద్రవరంలో రోడ్డెక్కుతారని హెచ్చరించారు. బుట్టా రేణుక వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
ఏటీసీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు
● రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిన్నచింతకుంట: యువతకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పల్లమర్రి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మారుమూల ప్రాంత యువతకు సైతం ఆధునిక విద్య, సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో 119 ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసి.. 65 ఐటీఐలను ఆధునికీకరించినట్లు వెల్లడించారు. ఈ సెంటర్ల ద్వారా రోబోటిక్స్ ఆధునిక యంత్రాల నిర్వహణ, ఆగ్రో ప్రాసెసింగ్ తదితర సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏటీసీ కేంద్రాలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఏటీసీ సెంటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత యవతకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. శిక్షణ పొందిన యువతకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీసీని విస్మరించిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కార్మికులను, వారి సంక్షేమాన్ని విస్మరించి మహారాష్ట్రలో రూ.500 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్, జాయింట్ డైరెక్టర్ నరేష్, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి రైతు గోస తీరేనా?
గద్వాల వ్యవసాయం: మిర్చి సాగు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిని నడిగడ్డ రైతులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా అన్ని పంటలను విక్రయించడానికి మార్కెటింగ్ సౌకర్యం.. లేదా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎండుమిర్చి విక్రయాలకు మాత్రం మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. వ్యయ, ప్రయాసాలకోర్చి పండించిన ఎండుమిర్చిని దళారులకు విక్రయిస్తూ.. ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. జిల్లాలో ఏటా వేల ఎకరాల్లో ఎండుమిర్చి సాగు అవుతున్నా.. మార్కెటింగ్ (మిర్చి యార్డు) ఏర్పాటుపై అటు పాలకులు, ఇటు అధికారులు దృష్టి సారించడంలేదు. ఏటా 25వేల నుంచి 65వేల ఎకరాల వరకు.. ఇక్కడి రైతులు 15 ఏళ్లుగా ఎండుమిర్చి సాగుపై మక్కువ చూపుతున్నారు. బోర్లు, బావుల కిందతో పాటు నల్లరేగడి భూముల్లో వర్షాధారంపై మిర్చి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి.. పంట బాగా చేతికొస్తే, పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో రైతులు మిర్చి సాగుపై మక్కువ చూపుతున్నారు. ఏటా 25వేల నుంచి 65వేల ఎకరాల వరకు ఎండుమిర్చి సాగవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ. 60వేల నుంచి రూ. 70వేల వరకు సాగుఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్‌టెన్, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి వానాకాలం జూలై, ఆగస్టు నెలల్లో మిర్చి నారును నాటుతారు. జనవరి చివరి వారం నుంచి పంట చేతికొస్తుంది. రైతులకు తప్పని కష్టాలు.. జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఏటా ఎండుమిర్చి రైతులు కష్టాలు పడుతున్నారు. పంట దిగుబడులు బాగా వచ్చినా.. రైతులు మాత్రం ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేకపోవడమే. రైతులు చేసేదిలేక కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని కర్నూలు, గుంటూరు లేదా హైదరాబాద్‌కు మిర్చిని తీసుకెళ్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయల రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఇది కాదనుకుంటే దళారులకు విక్రయించాలి. పంట చేతికొచ్చిన వెంటనే దళారులు వాలిపోతున్నారు. దూర ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలించలేని కొందరు రైతులు కల్లాల వద్దే విక్రయిస్తున్నారు. ఇక దళారులు మిర్చి రకాన్ని బట్టి మార్కెట్ ధర కన్నా.. క్వింటాకు రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు తక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2023లో గద్వాల మార్కెట్‌యార్డులో వారంలో రెండు రోజులు ఎండుమిర్చి కొనుగోళ్లు జరిపారు. కొన్ని రోజులు మాత్రమే కొనుగోళ్లు కొనసాగాయి. ఇప్పటికే 24 ఎకరాల్లో సాగు.. ఈ ఏడాది ఇప్పటికే 24వేల ఎకరాల్లో మిర్చి వేశారు. ఇంకా చాలాచోట్ల రైతులు బెడ్లలోనే మిర్చి నారు ఉంచారు. నీటి లభ్యత మేరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి.. జిల్లాలో మిర్చియార్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే వ్యాపారులతో మాట్లాడి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే మిర్చి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేక అవస్థలు ఏటా విస్తారంగా ఎండుమిర్చి సాగు దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించేందుకు వ్యయ, ప్రయాసాలు దళారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు ఈ ఏడాదైనా మార్కెట్ సౌకర్యం కల్పించాలని వేడుకోలు -
సర్వేలతోనే సరి
●సానుకూలంగా స్పందించారు.. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు– మన్ననూర్– సిరిగిరిపాడు వరకు జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాముఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ రహదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ ప్రతిపాదనలు పంపించాం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపా దనలు పరిగణలోకి తీ సుకోవడం లేదు. కొత్త రోడ్ల మంజూరు కో రుతూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్త ల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్ అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్‌కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్‌కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. మారిన ప్రతిపాదనలతో.. మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్‌కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి. భూత్పూర్– చించోలి రహదారితో.. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మహబూబ్‌నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు -
ప్రజావాణి మరింత చేరువ!
గద్వాల న్యూటౌన్/అచ్చంపేట: ప్రజా సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా రు. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కేంద్రాల్లోనే వినతులు స్వీకరించడం ద్వారా ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు సమయం, ఖర్చు ఆదా కానుంది. నోడల్ అధికారిగా ఎంపీడీఓ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆయా మండలాల్లో విధులు నిర్వర్తించే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, అటవీ, గృహనిర్మాణ, నీటిపారుదల, ఉద్యానవన, మండల పంచాయతీ అధికారులు, ఐసీడీఎస్, ఎకై ్సజ్, పోలీస్ వంటి ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. పకడ్బందీగా నిర్వహణ.. నోడల్ అధికారి పర్యవేక్షణలో ప్రజావాణి నిర్వహణ పకడ్బందీగా జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లతో పాటు హెల్స్‌డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేయనున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్, వైద్య శిబిరంతో పాటు ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, పిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తగ్గనున్న భారం.. జిల్లాలోని పలు మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణి కి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పింఛన్లు, రేషన్, భూ సమస్యలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై వినతులు ఇవ్వడానికి మండల ప్రజావాణి ఒక వేదికగా ఉపయోగపడనుంది. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రత్యేక ఐడీ ఇవ్వనున్నారు. అలాగే గడువులోగా పరిష్కారించడం, పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. అయితే స్థానికంగా మండల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. అధికారులు హాజరయ్యేనా.. జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే పలు శాఖల అధికారులు గతంలో నిర్వహించిన ప్రజావాణి, మండల సర్వసభ్య సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలకు హాజ రు కాకపోగా.. తమ కిందిస్థాయి సిబ్బందిని పంపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మండల కేంద్రాల్లో వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వెళ్లడానికే ప్రాధాన్యమిచ్చా రు. అయితే ఈసారి మాత్రం కార్యక్రమాన్ని నామమాత్రంగా కొనసాగకుండా.. ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. సంబఽంధిత అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమానికి మండల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు అవుతారో.. లేదో చూడాల్సి ఉంది. ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ వినతుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు వేగవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం -
అసలు సమస్య
అంతరాలే 79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు లేదు 153 స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు? ● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు Iసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా నేటికీ పేదలకు, ధనికులకు మధ్య అంతరాలు తొలగిపోలేదు. దీనికి కారణం ప్రభుత్వంలోని పాలకులే. ప్రధానంగా విద్య, వైద్యం దేశంలో చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు, బడాబాబులకు రెడ్ కార్పెట్ వేస్తూ.. మరోవైపు పేదలకు తీరని అన్యాయం చేస్తున్నాయి. – వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి, గద్వాల గతంతో పోల్చితే.. ప్రస్తుతం పాలకుల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారి తనం కొరవడింది. కేవలం పలుకుబడి ఉన్నవారికే ప్రభుత్వ సంస్థలు, పాలకులు పనిచేస్తున్నారు. అభాగ్యులకు అండగా నిలబడే వారే లేకుండా పోయారు. ఈ పరిస్థితి మారాలంటే పాలకుల ఆలోచన విధానం మారాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారితనం పెరగాలి. అప్పుడే సామాన్య ప్రజలకు నమ్మకం కలుగుతుంది. – షఫిఉల్లా, న్యాయవాది, గద్వాల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడి చినా సమాజంలో అసమాన తలు పూర్తిగా తగ్గలేదు. కుల ం ఆధారంగా అవకాశాల్లో వి వక్ష కొనసాగితే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ప్రతి ఒ క్కరూ ఆత్మవిమర్శ చేసుకుని అవినీతి ని అంతమొందించేందుకు కృషిచే యాలి. ముఖ్యంగా రాజకీయ నా యకులకు 65 ఏళ్లకే పదవీ విరమ ణ విధానం తీసుకొచ్చి.. యువత రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. – కార్తీక్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు 79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? సర్వే సాగిందిలా.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఒక్కో జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 250 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రతి జిల్లాలో 25 మంది పురుషులు, 25 మంది మహిళలను ఎంపిక చేసి మూడు ప్రశ్నలపై సమాధానాలు తీసుకున్నారు.స్వేచ్ఛ–సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా? అవును 31 పేదలకు అన్యాయం.. జవాబుదారితనం లేదు.. అసమానతలు లేని సమాజం కావాలి -
ఆందోళనలో ‘ఆయకట్టు’
● పూర్తికాని కాల్వల నిర్మాణాలు ● చేపట్టని లైనింగ్ పనులు ● లీకేజీలతో వృథా అవుతున్న సాగునీరు అయిజ: నెట్టెంపాడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా జూరాల బ్యాక్‌వాటర్ నుంచి 21.425 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించారు. ఇందులో ప్రధాన రిజర్వాయర్లు గుడెందొడ్డి, ర్యాలంపాడు ఉండగా.. సంగాల, నాగర్‌దొడ్డి, తాటికుంట, ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ర్యాలంపాడు 4 టీఎంసీల సామర్థ్యం కాగా లీకేజీల కారణంగా 2 టీఎంసీలకే పరిమితం చేశారు. పూర్తికాని టెండర్ల ప్రక్రియ.. నెట్టెంపాడు కాల్వల ప్రధాన లైనింగ్ పనులకు 2026 ఫిబ్రవరిలో రూ.373 కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ కాలేదు. ప్రధాన కాల్వల ఫేజ్–1, 2 కలిపి 164 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ, సబ్ డిస్ట్రిబ్యూటరీల్లో సుమారు 100 కి.మీ., లైనింగ్ పనులు పూర్తయితే అదనంగా వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. లైనింగ్ టెక్నాలజీ నీటిని పొదుపు చేసే సాంకేతికత, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల్లో ఇది లేకపోవడంతో నీరు వృథా అవుతోంది. లైనింగ్ పనులు పూర్తయితే ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లతోపాటు, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి, సంగాల, నాగర్‌దొడ్డి, తాటికుంట మినీ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీరు ఎక్కువగా ఆయకట్టు పంట భూములకు అందే అవకాశం ఉంటుంది. లైనింగ్‌తో ఉపయోగాలు.. లైనింగ్ పనులు చేపట్టకపోతే కాల్వల్లో కలుపు మొక్కలు, సిల్ట్, కోతలు ఎక్కువగా వస్తాయి. ప్రతి సీజన్లో శుభ్రం చేయాల్సి ఉంటుంది. లైనింగ్ లేని కాల్వల్లో నీరు నేలలోకి ఇంకిపోతుంది. కాల్వలకు లైనింగ్ పనులు చేయకపోవడంతో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నీరు ప్రతి సంవత్సరం 2 టీఎంసీలకు పైగా వృథా అవుతుందని అధికారుల అంచనా. ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలకు కూడా లైనింగ్ పనులు పూర్తిచేస్తే నీటి వృథా తగ్గుతుంది. అదేవిధంగా నీటి ప్రవాహ వేగం పెరుగుతుంది. మట్టి కాల్వల్లో ఘర్షణ ఎక్కువగా ఉండి ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. లైనింగ్‌తో ఉపరితలం మృదువుగా మారి నీరు వేగంగా ప్రవహిస్తుంది. అదే సమయంలో ఎక్కువ నీరు తక్కువ సమయంలో పంట పొలాలకు చేరుతుంది. నీటి వృథా తగ్గడం వలన అదనపు భూమికి సాగునీరు అందుతుంది. పంట పొలాలకు నాణ్యమైన నీరు లభిస్తుంది. లైనింగ్ పనులకు మొదట ఖర్చు ఎక్కువైనా సరే భవిష్యత్‌లో నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. రైతులకు స్థిరమైన సాగునీరు అందడం వల్లన పంట దిగుబడి పెరిగి.. రైతు లాభపడతారు. ర్యాలంపాడు 4 ముచ్చోనిపల్లి 1.634 నాగర్‌దొడ్డి 0.69 చిన్నోనిపల్లి 1.5 తాటికుంట 0.7 -
17 నుంచి మండల స్థాయి ప్రజావాణి
గద్వాల: మండల స్థాయిలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించిందన్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రజావాణి కొనసాగుతుండగా.. మండల స్థాయిలోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలాల్లోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అక్కడిక్కకడే పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. దీని వల్ల ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతోపాటు సమయం కూడా వృథా కాదన్నారు. మండల స్థాయి ఆపరేటర్లు, సూపరింటెండెంట్లు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజావాణిలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఫిర్యాదులు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా మండల స్థాయి అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శిక్షణలో డీఆర్డీఓ, ఈ–జిల్లా మేనేజర్లు సిబ్బందికి ప్రజావాణి నిర్వహణ, ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. -
గట్టు ఎత్తిపోతల సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు
కేటీదొడ్డి: గద్వాల నియోజకవర్గ రైతాంగం చిరకాల స్వప్నమైన నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దీనికి రూ.1,781 కోట్ల నిధులు మంజూరు చేస్తూ హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కేటీదొడ్డి మండలంలోని రైతులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెంపుతో కేటీదొడ్డి, గట్టు మండలాలతోపాటు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండలాధ్యక్షుడు ఉరుకుందు, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్శెట్టి, యూత్ ప్రెసిడెంట్ మల్లేష్‌గౌడ్, సర్పంచు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పేదింట.. మువ్వన్నెల రెపరెపలు
మక్తల్: మక్తల్ పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్య నర్సప్ప ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈయన 2000 సంవత్సరంలో మృతిచెందగా.. ఆయన వారసులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కడు పేదరికంలో ఉన్న ఈ కుటుంబం తమ పూరి గుడిసె ముందే జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సహాయం అందడం లేదని ఆర్య నర్సప్ప ముగ్గురు కుమారులు వాపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు నారాయణ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పూరిగుడిసెలోనే కాలం వెళ్లదీస్తూ.. జెండా పండుగను జరుపుకొంటున్నారు. తాము బతికినంత కాలం ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని నారాయణ ‘సాక్షి’కి తెలిపారు. -
నిత్యావసరాల ధరలను అరికట్టాలి
గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు పాతబస్టాండులోని వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టి ప్రజలపై భారాన్ని తగ్గించాలని, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అవినీతి, అణచివేత, విద్వేషపూరితమైన బీజేపీ పాలన పోవాలని నినదించారు. మతతత్వ విధానాలు, రాజకీయాలను విడనాడాలని, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక, రైతు, యువజన సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆశన్న, భరత్, నాగార్జున, రాజు, వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, ఆంజనేయులు, వెంకట్రాములు, నారాయణ పాల్గొన్నారు. అఖండ సప్తాహా భజన మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అఖండ సప్తాహ భజనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ భజనలను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. భజన మండలి సభ్యులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని, 2047 నాటికి ఆ లక్ష్యం నెరవేరుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతుందని, దేశ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలన్నారు. దేశభక్తిని చాటుకోవాల్సిన సందర్భం ఇదే అన్నారు. ప్రతిఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, కృష్ణ, జయశ్రీ, మానస తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
విద్యుత్ దీపాలతో ముస్తాబైన కలెక్టరేట్ స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు ఉదయం 9.05 గంటలకు ఎస్పీ శ్రీనివాసరావు చేరుకుంటారు. 9.10 గంటలకు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ వస్తారు. 9.15 గంటలకు ముఖ్య అతిథి ఏపీ జితేందర్‌రెడ్డి హాజరవుతారు. 9.20 గంటలకు ముఖ్య అతిథి జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత.. జాతీయ గీతాలాపన, రాష్ట్ర అధికారిక గీతాలాపన ఉంటుంది. 9.30 గంటలకు పోలీస్ కవాతు నిర్వహిస్తారు. 9.40 గంటలకు ముఖ్య అతిథి జిల్లా ప్రగతి సందేశం వినిపిస్తారు. 10.05 గంటలకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు 10.40 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం 10.45 గంటలకు స్టాళ్ల సందర్శన 11.15 గంటలకు ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాల అందజేత 11.50 గంటలకు వందన సమర్పణతో వేడుకలు ముగుస్తాయి. గద్వాల: జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానాన్ని 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ మేరకు కార్యక్రమ వేదిక, బారికేడింగ్ సీటింగ్ అరెంజ్మెంట్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రెయినీ డీసీ మనోజ్‌కుమార్‌రెడ్డి, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు కార్యక్రమాలు ఇలా.. -
సీఎంఆర్‌పై ఈడీ నజర్!
● మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ● అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ● జిల్లాలో వరుసగా విజిలెన్స్ దాడులు వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ అక్రమాల పుట్ట తొవ్వేకొద్దీ ఊటబావిలోని నీటిలా వెలికి వస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా చేపడుతున్న విజిలెన్స్ దాడులతో రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి రావడం, క్రిమినల్ కేసులు నమోదవుతున్న విషయం విధితమే. కాగా.. కొందరు రైస్‌మిల్లర్లు అవినీతిలో తిమింగలాలతో పోటీపడుతున్నారంటూ వారి విచారణ బాధ్యతలను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా సీఎంఆర్ కోసం చేసిన ధాన్యం కేటాయింపులను మాయం చేయడం, బియ్యం ఇవ్వకుండా వాయిదాలతో కాలం గడుపుతున్న 11 మిల్లుల యాజమాన్యాలపై ఈడీ తనదైన శైలిలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సదరు అక్రమాల్లో అగ్రగనుల చిట్టా ఈడీ చేతికి అందినట్లు తెలుస్తోంది. గత పది సీజన్లలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పెండింగ్ బియ్యం విలువ సుమారు రూ.623.45 కోట్లు. కాగా.. ఇందులో అత్యధికంగా బకాయి ఉన్న 11 మిల్లుల యాజమాన్యాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ.. వీరిపై విచారణ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారాలు ఈడీ చేతికి వెళ్లినట్లు సమాచారం. జిల్లాలో 191 రైస్‌మిల్లులు ఉండగా.. 11 మిల్లుల బకాయిలు భారీ ఎత్తున దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు భావించిన అధికారులు వారు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి స్వప్రయోజనాల కోసం అందుకు సంబంధించిన డబ్బును వినియోగించిట్లు భావించి విచారణ బాధ్యతను ఈడీకి బదలాయించబడినట్లు తెలుస్తోంది. వీరి బ్యాంకు లావాదేవీలు.. వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు.. నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రూ.కోట్ల విలువైన వరి ధాన్యం కేవలం ఒక మిల్లుకు యజమాని అనే కారణంతో రికవరీతో సంబంధం లేకుండా విచ్ఛలవిడిగా కేటాయించడంతో అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లయింది. జిల్లాలో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మిల్లర్లు ఇదే అదునుగా భావించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బయట మార్కెట్‌కు విక్రయించి ఆస్తులు, కొత్త వ్యాపారాలకు పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల మేరకు 11 మిల్లుల యజమానులపై మనీ లాండరింగ్ కోణంలో విచారణకు ఈడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి సేకరించిన వరి ధాన్యం విక్రయించిన మిల్లుల యజమానుల్లో కొందరు పెద్దమొత్తంలో ఇతర వ్యాపారాల్లోకి, ఆస్తుల్లోకి మళ్లించినట్లుగా అనుమానం వచ్చి రాష్ట్ర అధికారులు ఈడీకి అప్పగించారు. కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు.. సీఎంఆర్ అక్రమాలపై కొంతకాలంగా జిల్లాలో వరుసగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం పెబ్బేరులోని ఓ మిల్లులో తనిఖీలు చేపట్టారు. కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూరం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని మిల్లుల్లో వరుస తనిఖీలు చేస్తూ ధాన్యం లోటు ఉన్న మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటం.. భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ విచారణకు సిఫారస్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో నలుగురికి చెందిన 11 మిల్లులకు ఇప్పటి వరకు కేటాయించిన వరి ధాన్యంలో పెండింగ్ సీఎంఆర్ రూ.101.10 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఇదే జిల్లాలో ఒక మిల్లరు రూ.వంద కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. వారి మిల్లుపై ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. -
నిందితులకు కఠిన శిక్ష విధించాలి
అయిజ: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. గురువారం ఆయన ప్రియాంక స్వగ్రామం ఎక్లాస్పూర్ చేరుకొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రియాంక తల్లి చంద్రమ్మ, తండ్రి వెంకటేష్‌లను ఓదార్చారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజే నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నా కానీ, దుర్ఘటన జరిగిన మూడురోజుల వరకు నిందితులు ఎక్కడ దాక్కు న్నారని ఏపీ పోలీసులను ప్రశ్నించారు. మూడురోజులపాటు ఎన్ని సూట్‌కేసులు ఎంతమంది చేతులు మారాయని, ఇవన్నీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. రిటైర్డ్ జడ్జి, సీనియర్ ఐపీఎస్‌తో కూడిన త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే కేసుపై విచారణ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. నిందితులకు నార్కోటిక్ టెస్ట్ చేయించాలన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి డీఎస్పీ సినిమాకు వెళ్లారని, ఈ కేసు గురించి అడిగితే చిన్న ఘటన అని చెప్పడంపై మండిపడ్డారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం గురించి తాను మాట్లాడిన మాటలన్నింటిని మెటాఫికి కంప్లెంట్ పెట్టి డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, ఏపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్లో పెట్టాలని, ప్రియాంకకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా చూడాలని కోరారు. నిందితులను కాపాడే వారెవరో తెలుసుకొని వారికి కూడా శిక్ష విధిస్తే ప్రియాంక లాంటి మరెంతో మంది అమ్మాయిలను కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. వీధికో బెల్ట్ షాప్ ఉందని, ప్రతి వైన్స్ పక్కన ఒక పర్మిట్ రూం ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వమే మద్యం తాగేవారిని ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. అస్వస్థతకు గురైన ప్రియాంక తల్లి మార్గాని భరత్ విలేకరులతో మాట్లాడుతుండగా అక్కడే నిలబడిన ప్రియాంక తల్లి స్పృహతప్పి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రి యాంక మృతిచెందినప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, రోజురోజుకూ ఆమె ఆరో గ్యం క్షీణిస్తుందని భర్త వెంకటేష్ వాపోయారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ -
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆహ్వానితులందరిని ఆహ్వానించాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పతాకావిష్కరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో వేదిక సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, తాగునీరు, ఇతర వైద్యసదుపాయం కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ మంజుల, తహసీల్దార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జెండా ఎగురవేసేది వీరే..
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. బీచుపల్లిలో శ్రీరామనామ భజనలు ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పంచమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం శ్రీరామ జయరామ జయ జయ రామ ఏకాక నామ భజనలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిలాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భజన బృందాలు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ రామనామ భజనలు చేశారు. శ్రీరామనామం జపించడం కానీ.. శ్రీరామ కోటిని రాయడం కానీ ఆచరిస్తే తమ కష్టాలు తొలగిపోయి ఎన్నో శుభాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో 24 గంటలపాటు ఏకదాటిగా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ఇజ్రాయిల్‌లో గృహ ఆధారిత సంరక్షకుడు, సంరక్షకురాలు ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి ప్రశాంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్‌లో కేర్‌గివింగ్ ఉద్యోగాలకు మహిళలు 90 శాతం, పురుషులు 10 శాతం చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అభ్యర్థుల వయసు 25–45 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్ లేదా బీఎస్సీ నర్సింగ్, అలాగే ఇంటర్మీడియట్లో ఆంగ్ల భాషా నైపుణ్యం ఉండడంతోపాటు, గుర్తింపు పొందిన భారతీయ అధికార సంస్థ నుంచి నర్సింగ్‌లో గుర్తింపు పొందిన లేదా పర్యవేక్షణలో ఉన్న డిప్లొమా శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు 5,880.02 ఎన్ఐఎస్ మన కరెన్సీలో రూ.1,86,000 వరకు జీతం లభిస్తుందన్నారు. -
వైద్యుల సలహాలు తప్పనిసరి..
ఇటీవల ఎన్సీడీ ప్రోగాం ద్వారా జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించాం. ఇందులో వివిధ రోగాల బారినపడిన వారిలో 30 ఏళ్లు పైబడిన వారు కూడా ఉండడం వెలుగులోకి వచ్చింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, మద్యం, ఒత్తిళ్లు, ఇతర సమస్యల కారణంగా రక్తపోటు, మధుమేహంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వంశపరంగా వచ్చే సమస్యలు ఉంటున్నాయి. సమ్యసలతో ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లా ఆస్పత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరు నడక లేదా వ్యాయామం చేయాలి. సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించాలి. – సంధ్యాకిరణ్మయి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ● -
ఖాకీల్లో కలవరం
గద్వాల పరిధిలోనూ.. గద్వాల నియోజకవర్గ పరిధిలోని ఠాణాల్లోనూ ఇందుకు అతీతంగా ఏమీ లేదు. ఇక్కడ పనిచేయాలన్నా.. స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకుల ఆశీస్సులు తప్పనిసరే. కాకపోతే ఇక్కడ ముడుపులు తీసుకుని పోస్టింగ్‌లు ఇవ్వరు కాని.. సదరు పలుకుబడి నేతలు చెప్పిన పనులన్నీ తూ.చ. తప్పకుండా చేసి పెట్టాల్సిందే. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారుల తీరు.. పోలీసు బాసుల ఆదేశాల కంటే కూడా సదరు పలుకుబడి గల నేతల ఆదేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్.. ఇటీవల ఇసుక అక్రమంగా రవాణా చేసే వ్యక్తులు, నాయకులు మొదలుకొని.. పోలీసుల వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇవ్వాల్సి వస్తుందో చెబుతూ ఓఆ డియో వైరల్ అయ్యింది. దీనిపై రాష్ట్ర పోలీసు బాస్ గద్వాల జిల్లాలో ఏం జరుగుతుందో అంతర్గతంగా ఆరా తీసినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలోని ఓ అధికారిపై.. జిల్లాలోని పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకుని పైరవీలు చేస్తున్న కొందరు పోలీసు అధికారులపై రాష్ట్ర పోలీసుబాస్ కూపీ లాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలో ఉన్న ఓ ఠాణా అధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ పోలీసు శాఖలో కలవరం రేపుతుంది. సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నం.. అవినీతి, ఆరోపణల నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారిపైనే బదిలీ వేటు పడిందంటే తమపై వేటు ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ పోలీసు అధికారి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏకంగా సదరు అధికారి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని నలుగురు డివిజనల్ స్థాయి అధికారులపై వేటు పడనున్నట్లు సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గద్వాల: జోగుళాంబ జోన్–7 డీఐజీ చౌహాన్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడటం సంచలనం రేపుతుండగా.. మరోవైపు గద్వాల జిల్లా పోలీసు శాఖలో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో కలవరం మొదలైంది. ఎక్కడో మెరిసిన ఉరుము గద్వాలలో ఉన్న మన మీద ఎక్కడ వచ్చి పడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారి టెన్షన్ భరించలేక ఏకంగా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. డీఐజీపై బదిలీ వేటుతో గద్వాల పోలీసు శాఖలో మొదలైన గుబులు ఇటీవల సోషల్ మీడియాలోనూ వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు అంతర్గతంగా విచారణ జరుపుతున్న రాష్ట్ర పోలీసు బాస్ అలంపూర్ పరిధిలో పోస్టింగ్‌ల కోసం జరిగిన పైరవీలపై ఆరా ఠాణాలనే అడ్డాగా చేసుకుని సాగిస్తున్న దందాపై వివరాల సేకరణ తుంగభద్రతో కాసుల పంట.. ప్రఽదానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలంపూర్ నియోజకవర్గంలో పోలీసు ఠాణాలు మొదలుకొని.. సర్కిల్ పరిధిలో పోస్టింగ్ వరకు ఇక్కడి అధికార పార్టీకి చెందిన నాయకుల ఆశీస్సులు ఉంటేనే పోస్టింగులు సాధ్యమవుతాయన్నది బహిరంగ రహస్యం. ఇక్కడ ఎవరు పలుకుబడి ఉంటే వారికి నెల మామూళ్లు ఇచ్చుకోవాల్సిందేనని పుష్కర కాలంగా పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటి ప్రధాన కారణం కాసులు కురిపించే తుంగభద్ర ఇసుక ఉండడమే. ఒక్కసారి అలంపూర్‌లో పనిచేస్తే లైఫ్ టైం సెటిట్ అయ్యేలా కాసులు పోగేసుకోవచ్చనే బలమైన నమ్మకం ఉండటంతో కొందరు ఖాకీలు ముడుపులు ఇచ్చి మరీ పోస్టింగలు తెప్పించుకుంటారని ప్రచారం. అయితే నిజాయితీగా పనిచేసే అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వరా అంటే ఇస్తారు.. కానీ, ఏడాది తిరిగేలోపు.. ఏదో ఒక సాకుతో వారిని బదిలీ చేయడమో.. అటాచ్ చేయడమో సర్వసాధారణంగా మారింది. ఇలా ఆరునెలల వ్యవధిలో బదిలీ అయిన ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి ఇక్కడ ఉద్యోగం చేయాలంటేనే విసుగు వస్తుందని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పైరవీ ఉంటేనో.. నాయకులకు వత్తాసు పలికితేనో పూర్తిస్థాయిలో పనిచేస్తారు.. నిబంధనల ప్రకారం చేసే నాలాంటి వారికి మాత్రం ఆరు నెలల్లో బదిలీని బహుమానంగా ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడి పోలీసు శాఖలో అవినీతిని ఎండగడుతోంది. -
ముమ్మరంగా ఎన్సీడీ సర్వే
గద్వాల క్రైం: జిల్లాలో మధుమేహం.. రక్తపోటు బాధితులు పెరిగిపోతున్నారు. వారికి తెలియకుండానే ఆయా రోగాల బారినపడుతున్నారు. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా జిల్లా ఆరోగ్య శాఖ నిర్వహించిన ఎన్సీడీ (నాన్ మ్యూనికేబుల్ డిసీజెస్) సర్వేలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో బీపీ, డయాబెటిస్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో 43,486 మంది బీపీ, డయాబెటిస్ 22,765 మంది బాధితులు ఉన్నారు. మధుమేహంపైకి పెద్దగా ఎలాంటి లోపాలు కనిపించకుండా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతిస్తున్నాయి. వైద్యులు మాత్రం ఈ వ్యాధి మరెన్నో వ్యాధులకు బీజం వేస్తుందని చెబుతున్నారు. ప్రాథమిక దశలో.. ప్రాథమిక దశలో గుర్తించలేకపోతే ప్రాణాంతక వ్యాధులు మానవాళికి ముప్పు తీసుకువస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రతి కణానికి గ్లూకోజ్ ఎంతో అవసరం. అయితే మనం తీసుకునే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తం ద్వారా శరీరంలోని కణాలన్నింటికీ సరఫరా అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరంలోని కణాలు గ్రహించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఉంటుంది. ఇన్సు లిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోయినా.. ఉత్పత్తి అ యిన దానిని సమర్థంగా వినియోగించకపోయినా రక్తంలోని గ్లూకోజ్ శరీరంలోని కణాలు గ్రహించలేవు. ఈ క్రమంలో గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోవడం కారణంగా మధుమేహానికి దారి తీస్తుంది. పెరుగుతున్న బాధితులు.. సాధారణంగా బీపీ, షుగర్ బాధితులు ధనిక వర్గాలకు మాత్రమే సంక్రమించేదిగా ఉండేది. తాజాగా పట్టణ, పల్లె, పేద, ధనిక తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. జిల్లాకేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ బీపీ, షుగర్‌తో ఇబ్బందులు పడుతున్నారు. వీరి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. సిబ్బంది సర్వేకు వెళ్లిన క్రమంలో ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ మందులు కనిపించడం సర్వసాధారణంగా మారింది. మందుల కొనుగోలు సైతం విపరీతంగా ఉంది. ప్రతిఒక్కరు నెలకు సరిపడా మందులను కొనుగోలు చేస్తున్నారు. ఒత్తిళ్లు.. అలవాట్లు.. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. అలాగే మధుమేహం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు తమ జీవనశైలిలో మార్పులు సరి చేసుకోవాల్సిందిగా వివిధ సందర్భాల్లో వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని, వైద్యుల సూచనలు తీసుకోవాలని వివరిస్తున్నారు. ప్రతిరోజు నడక, వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని పేర్కొంటున్నారు. జంక్ ఫుడ్ కాకుండా పోషకాలు ఉండే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగామించవచ్చని, అనవసర ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు సర్వేలో వెలుగుచూస్తున్న బీపీ, షుగర్ బాధితులు పరీక్షలలో రక్తపోటు.. మధుమేహం సమస్యలే అధికం ఒత్తిళ్లు.. ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న ముప్పు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ -
నిబంధనలు బేఖాతరు!
గద్వాల వ్యవసాయం: నర్సరీలు ఏర్పాటుచేసుకొని ఉద్యాన మొక్కలతో వ్యాపారం నిర్వహించే వారు తప్పనిసరిగా నర్సరీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇందుకోసం మూడేళ్ల క్రితం ఉద్యానశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం మరోసారి నర్సరీ నిర్వాహకులకు నోటీసులు అందించి.. 30 రోజుల గడువు ఇచ్చారు. అయితే నర్సరీలన్నింటికీ రిజిస్ట్రేషన్ అయి.. నర్సరీ చట్టం అమలయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఉద్యాన సాగుపై మక్కువ.. జిల్లాలో ఉద్యాన పంటలకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం సైతం సాధారణంగానే ఉంటుంది. దీంతో ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్లతో కలిపి దాదాపు 10వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటా, బీర, సోరకాయ, కాకర, ఉల్లితో పాటు ఆకుకూరలు సైతం పండిస్తారు. మామిడి, బత్తాయి, జామ, డ్రాగన్, నిమ్మ తదితర పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. వీటితో పాటు బంతి, మల్లె, కనకాంబరం తదితర పూల తోటలు ఉన్నాయి. అనుమతులు లేకుంటే అంతే.. చట్టంలో చెప్పిన విధంగా నర్సరీల నిర్వహణ ఉండాలి. కొనుగోలు చేసిన రైతుకు తప్పక రశీదు ఇవ్వాలి. తద్వారా పంట రాని సమయాల్లో సదరు రైతులకు పరిహారం లభిస్తుంది. లేదంటే ఎలాంటి ఆధారాలు లేక అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు, నారు నుంచి పంటలు ఆశించిన స్థాయిలో రాక రైతులు నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో 37కు పైగా అనుమతులు లేని నర్సరీలు ఉండగా.. అందులో చాలా వరకు చట్టం సూచించిన విధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రైతులు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోసారి నోటీసులు.. నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2023లో ఉద్యానశాఖ అధికారులు నోటీసులు అందించారు. అయితే ఏ ఒక్క నర్సరీ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. కొద్ది రోజుల క్రితం అధికారులు మరోసారి నోటీసు లు అందించారు. ఈసారైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. నో టీసులకు స్పందించని నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు నర్సరీల్లోనే విక్రయం.. అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లకు సంబంధించిన మొక్కలు, నారును ప్రైవేటు నర్సరీల్లోనే విక్రయిస్తుంటారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. నిబంధనలకు అనుగుణంగా నర్సరీలను నిర్వహించేలా ఉద్యాన నర్సరీ రిజిస్ట్రీకరణ, క్రమబద్ధీకరణ చట్టాన్ని 2010లో ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం ప్రకారం సరైన నాణ్యతా ప్రమాణాలతో పండ్లు, కూరగాయలు, పూల మొక్కల ఉత్పత్తి ఉండాలి. మొక్కల పరిమాణం, ప్రమాణాల మేరకు ధర నిర్ణయించబడాలి. పండ్ల మొక్కల ఉత్పత్తి కోసం నాణ్యత గల తల్లి చెట్టు రకాలను కలిగి ఉండాలి. కూరగాయల నారును షెడ్ నెట్లలో చీడపీడలు లేకుండా పెంచాలి. అయితే చట్టంలో సూచించిన ప్రకారం అన్ని ప్రమాణాలను పాటిస్తూ.. నిర్వాహకులు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో, నర్సరీ పూర్తి చిరునామా, భూమి పట్టాదారు పాస్‌పుస్తకం లేదా లీజ్ అగ్రిమెంట్, లేఅవుట్ మ్యాప్, నర్సరీలో ఉన్న వసతులు, భూసార, నీటి నాణ్యత పరీక్షలు, చివరి మూడేళ్ల నర్సరీ మొక్కల ఉత్పత్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను ఉద్యానశాఖ అధికారులు స్వీకరించి.. నర్సరీలో ఉన్న వసతులు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసి, నిర్వహణకు అనుమతి ఇస్తారు. జిల్లాలో ఇష్టానుసారంగానర్సరీల నిర్వహణ అనుమతులు లేకుండానే ఉద్యాన మొక్కల విక్రయాలు అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందన కరువు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరోసారి నోటీసులు -
బీచుపల్లికి పోటెత్తిన భక్తజనం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అభయాంజనేయస్వామి దర్శనానికి క్యూ కట్టారు. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. ఆలయ ప్రధాన అర్చకులు అంజన్నకు ప్రత్యేక పుష్పాలంకరణ, ఆకుపూజ, అభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో వ్యాసరాయల కల్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోక్సో కేసుల్లో నిందితులకు వరుస శిక్షలు
● పోలీసు, న్యాయశాఖ సిబ్బందిని అభినందించిన ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల క్రైం/ఎర్రవల్లి: రెండు నెలల వ్యవధిలోనే నాలుగు పోక్సో కేసుల్లో దోషులకు జైలుశిక్ష అమ లుకు కృషిచేసిన పోలీసు, న్యాయశాఖ సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఆభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలంపూర్, కేటీదొడ్డి, రాజోళి, శాంతినగర్ పోలీస్స్టేషన్ల్లో నమోదైన పోక్సో కేసుల్లోని నిందితులకు న్యాయశాఖ ద్వారా శిక్షలు పడేలా కృషిచేయడం అభినందనీయమన్నారు. బాధితుల తరుఫున వాదనలు వినిపించడం.. సాక్షులను కోర్టులో హాజరుపర్చడంతో నిందితులకు వరుసగా జైలుశిక్షలను ఖరారు చేయడం జరిగిందన్నారు. తద్వారా పోలీ సు, న్యాయశాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని.. భవిష్యత్‌లో నిందితులు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందన్నారు. ఇందుకు కృషిచేసిన పీపీలు విజయ్‌కుమార్, శ్రీని వాస్‌రెడ్డి, సుగుణాదేవి, కోర్టు లైజన్ ఆఫీసర్ జిక్కిబాబు, కానిస్టేబుళ్లు పరమేశ్, సాయిబాబా, శ్రీధర్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్ర మంలో ఏఎస్పీ శంకర్, సీఐ శ్రీను పాల్గొన్నారు. ● బీచుపల్లి ఆభయాంజనేయస్వామిని ఎస్పీ శ్రీని వాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. -
డీఐజీ చౌహాన్‌పై బదిలీ వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ● ఇన్చార్జి డీఐజీగా షాన్వాజ్ ఖాసీం మహబూబ్‌నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి. -
స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల
నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్‌యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు. గతంలో జాప్యం.. ఇప్పుడు వేగం గతంలో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వా రా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, పంచాయతీశాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పి స్తూ మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు.స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్లు మంజూరు మహిళా సంఘాల భవనాలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం -
వారానికి మూడు రోజులివ్వాలి..
జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి రైతులకు వారానికి మూడురోజులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి. వానాకాలం పంటల సాగుకు రాబోయే కొద్దిరోజుల పాటు జూరాల ప్రధాన కుడి కాల్వ నుంచి నీరు వదలాలి. ఎగువ నుంచి వరద ఆశించిన మేర వస్తే.. నిరంతరం సరఫరాకు అధికారులు ప్రయత్నించాలి. – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే వారాబందీ విధానంలో నీటి విడుదల చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేయాలి. ఎల్‌నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. – మధుసూదన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరిసాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. – వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే -
ఆరుతడి పంటలే సాగు చేయాలి
వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్‌నినో కార ణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలో ని జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలో ని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించా రు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్‌నినో ప్రభా వంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపా రు. రూ.వేల పెట్టుబడితో వరిసాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్య లు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాల కు ఎంత నీరు వస్తోంది.. ఎంత వదులుతున్నామ నే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, విజయు డు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్‌బాషా, హేమంత కేశవ్ పాటిల్, వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఐఏబీ సమావేశంలోమంత్రులు జూపల్లి, వాకిటి నీటి విడుదల, పంటల సాగుపైసుదీర్ఘంగా చర్చ పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు -
నిపుణుల సూచనమేరకు సాగు చేయండి..
అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలన్నారు. రూ.వేల పెట్టుబడితో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.. కేఎల్ఐ ప్రాజెక్టు తో నియోజకవర్గ పరిధిలోని రైతుల కు సాగునీరు ఇ వ్వడానికి గల సాఽ ద్యాసాధ్యాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించాలి.నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నీటితో నింపే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులు కొంత సహకరించి నీటిని విడుదల చేస్తే ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. – తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే -
విద్యావ్యవస్థలో దోపిడీని అరికట్టాలి
గద్వాల: విద్యావ్యవస్థలో దోపిడీని అరికట్టినప్పుడే అట్టడగు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య అందుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉపాధి హక్కుల సాధన, శాసీ్త్రయ విద్యావిధానం అమలు కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతర పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా మెరుగైన విద్య అందించే విద్యావిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర్, సురేందర్, గురుస్వామి, భీమరాజు, శివకుమార్, రాఘవేంద్ర, రమేశ్, రాజు, శివ పాల్గొన్నారు. -
అక్టోబర్ 2 లక్ష్యంగా వేగవంతం..
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ఆయా మండలాల్లో కేటాయించిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడుగుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలం ఆమ్లీకుంటలలో కేంద్రబృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అక్టోబర్ 2 డెడ్‌లైన్‌తో పనులు పూర్తి చేసేలా పనుల వేగవంతం చేస్తున్నాం. పైలెట్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నాను. మరో కొన్నిరోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. – మాలిక్, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ పనులపై నిరంతర పర్యవేక్షణ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశానిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూనిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
మండలాల వారీగా నర్సరీలు ఇలా..
ధరూరు5అయిజ 10వడ్డేపల్లి 8కేటీదొడ్డి 2ఎర్రవల్లి 2ఇటిక్యాల 2మల్దకల్ 8 -
ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికలు
గద్వాల: ఏటా ప్రభుత్వమే వరిధాన్యాన్ని కొను గోలు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పక్కా ప్రణాళికలు అవసరమని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్లో ఽఅధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డారు. గత సీజన్లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని సూ చించారు. వానాకాలంలో వరిసాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని మెట్రిక్ టన్నుల ధా న్యం ఉత్పత్తి అవుతుందనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో స్వామికుమార్, డీఎం విమ ల, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రశాంత్, మార్కెటింగ్‌శాఖ అఽఽధికారి పుష్పమ్మ ఉన్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం అయిజ: ఇటీవల మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాజమండ్రి మెడికల్ కళాశాల యాజమాన్యం రూ. 20 లక్షల ఆర్థికసాయం అందజేశారు. బుధవారం వైద్య కళాశాల నుంచి డాక్టర్లు తరుణ్, సాధిక, ప్రొఫెసర్ సుభాషిని మండలంలోని ఎక్లాస్పు రం గ్రామానికి చేరుకొని ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రూ. 20 లక్షల చెక్కు అందించి, భవిష్యత్‌లో కూడా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు గట్టు: గుప్త నిధుల కోసం మళ్లీ తవ్వకాలు చేపట్టారు. మండల కేంద్రంలోని బిచ్చాలపేట మసీదు పక్కనే ఇది వరకు గుప్త నిధుల కోసం తవ్విన ప్రాంతానికి కొద్ది దూరంలోనే మళ్లీ తవ్వకాలు జరిపిన వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తు న గుప్త నిధులు లభించాయని ప్రచారం జరి గింది. అయితే నేతాజీ సర్కిల్ ప్రాంతంలో ఓ పాత ఇంటి గోడను కూలగొడుతున్న క్ర మంలో 1882 కాలం నాటి వెండి నాణెలు, బంగారం బయట పడగా.. కూలీల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో బయటకు పొక్కిన విషయం తెలిసిందే. 72 నాణెల్లో ఇప్పటి వరకు 54 నాణెలతో పాటుగా రెండు బంగారం ము క్కలను పోలీస్, రెవెన్యూ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఇదిలా ఉండగానే.. మళ్లీ బిచ్చాలపేటలో గుప్తనిధుల కోసం పాడుబడిన ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. అయితే పోలీసు లు సరైన విచారణ చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడుతున్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి వేదిక, పారిశుద్ధ్యం, తాగునీరు, సీటింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. వేడుకలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసా పత్రాల ప్రదానం కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా పంపించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం 15వ తేదీన అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించినందున సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్తగా చేయూత పింఛన్లు కూడా అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పింఛన్ల కోసం ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అర్హులందరూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అనదపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు. ● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు మంజుల, ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్‌రెడ్డి, సురేశ్ ఉన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ జరపాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల విక్రేతలపై నిఘా ఉంచి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయడంతో పాటు నిందితులను రిమాండ్‌కు తరలించడంలో సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. ఎవరైనా చట్టవ్యతిరేక వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇందులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం క్షేత్రస్థాయిలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని తెలిపారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా, వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్, శంకర్‌గౌడ్ ఉన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కమనీయం.. రాములోరి కల్యాణం ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం జరిపారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. షాద్‌నగర్‌కు చెందిన గుండ్రాతి స్వామి, స్వరూప కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు గద్వాల: విఽధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ శ్రీకాంత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం గద్వాల మండలం ఈడిగోనిపల్లి, ధరూరు మండలం ఎములోనిపల్లి గ్రామాల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే ఇద్దరు కార్యదర్శులు విధులకు హాజరు కాలేదు. దీనిపై ఆరా తీసిన ఆయన.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డా.ఎస్ఏ సంపత్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అలంపూర్ మండల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ.. ప్రతి గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను వేగంవంతం చేయాలని సూచించారు. అనంతరం అలంపూర్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ర్యాలంపాడు రఫీ, ఉపాధ్యక్షుడిగా కాశీపురం మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా భైరన్‌పల్లి స్వాతిని ఎన్నుకోగా.. సంపత్‌కుమార్ శాలు వాతో సత్కరించారు. సమావేశంలో ఆ సంఘం జి ల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్, సర్పంచులు స్వరూ ప, హరికృష్ణ, మురళీధర్‌గౌడ్, శ్రీపతి నాయుడు, మండల అధ్యక్షుడు రాము ఉన్నారు. -
ప్రభుత్వ కళాశాలలకు నోటుపుస్తకాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా నోటుపుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నోటుపుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు నోటుపుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన నోటుపుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 నోటుపుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు. యూనిఫాంలు కూడా.. నోటుపుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్‌ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన నోటుపుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూడా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలిసారి నోటుబుక్కులతో పాటు, యూనిఫాం పంపిణీ ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు.. 40,382 మంది విద్యార్థులకు లబ్ధి -
ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
గ్యాస్ బుకింగ్‌కు నిర్ణీత సమయం (45 రోజులు) పెట్టారు. కానీ, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొన్ని ఏజెన్సీల వారు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డెలివరీ చేసేందుకు వచ్చేవారు కూడా అధిక ధరలకు అమ్ముకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీ దగ్గరకే వచ్చి తీసుకోవాలంటున్నారు. అదనంగా రవాణా ఖర్చులు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలి. ముందుగా బ్లాక్ ధరలను నియంత్రించాలి. – శ్రీరామ్, శాంతినగర్ ఎదురుచూస్తున్నాం.. రెండో గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. గత వారంలో గ్యాస్ అయిపోయితే ఏజెన్సీల చుట్టూ తిరగలేక విసిగిపోయాను. ఇప్పుడేమో రెండో కనెక్షన్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఏజెన్సీలు సిలిండర్లను పక్కదారి పట్టించకుండా సజావుగా అందిస్తే కొరతను అధిగమించవచ్చు. – శివప్రసాద్, శాంతినగర్ నిఘా పెడతాం.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడం నిలిపేశారు. ఈ సమస్య అంతటా ఉన్నందున కొత్త కనెక్షన్ కాని, రెండో కుండ కాని ఇవ్వడం కుదరదు. పై నుంచి ఆదేశాలు వస్తేనే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ఇక బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. – స్వామికుమార్, డీఎస్ఓ -
లారీ రూటు మార్చిందెవరు?
ఆశన్‌పల్లిలో పట్టుబడిన 580 బస్తాల రేషన్ బియ్యంపై పలు అనుమానాలు నారాయణపేట: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరికల్ సమీపంలోని శ్రీగణేశ్ రైస్‌మిల్ నుంచి వేయింగ్ చేసిన 580 బస్తాల బియ్యాన్ని చంద్రకల్ బఫర్ గోదాంకు తరలించాల్సి ఉండగా.. దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి రైస్‌మిల్ వద్దకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోవాల్సిన గమ్యస్థానం ఒకటైతే.. లారీ చేరిన చోటు మరొకటి కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సూత్రధారులెవరు? చంద్రకల్ బఫర్ గోదాంకు వెళ్లాల్సిన బియ్యం లారీ ఆశన్‌పల్లి రైస్‌మిల్ వద్ద ఎందుకు ఆగింది..? అక్కడికి బియ్యం తరలించాల్సిన అవస రం ఏమొచ్చింది..? లారీకి మార్గమధ్యంలో దారి మళ్లి ంచారా..? లేక ముంద స్తు ప్రణాళికతోనే బి య్యాన్ని మిల్లుకు తరలించారా..? అనే ప్రశ్నలు సివిల్ సప్ల య్ అధికారుల్లోనే త లెత్తడం ఆశ్చర్యంగా ఉందని చెప్పవచ్చు. పట్టుబడిన లా రీ దామరగిద్ద మండలం అయ్యవారిపల్లికి చెందినదిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశన్‌పల్లి ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి వ్యవస్థలోకి చేర్చే రీసైక్లింగ్ దందా జరుగుతోందా.? ఇందులో రైస్‌మిల్లర్లు, డీలర్ల పాత్ర ఏమైనా ఉందా.? ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యం మళ్లిస్తున్నారా.? అనే కోణాల్లో విచారణ జరపాల్సి ఉంది. పంచనామా.. శాంపిల్స్ సేకరణ లారీలోని బియ్యం బస్తాల లాట్ నంబర్లను అధికారులు పరిశీలించారు. పంచనామా నిర్వహించి.. బియ్యం నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నధర్‌పల్లి గోదాం వద్ద నమూనాలను పరిశీలించగా.. వచ్చిన ఫలితాల ఆధారంగా ఆ బియ్యం ఇటీవలే మిల్లింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా తుది నిర్ధారణ కావాల్సి ఉంది. అధికారుల తలోమాట.. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బియ్యం నమూనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టు నారాయణపేట సివిల్ సప్లయ్ టెక్నికల్ అధికారుల ద్వారా దామరగిద్ద పోలీస్‌స్టేషన్, సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు చేరినట్లు సమాచారం. అయితే రిపోర్టు విషయమై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. తలోమాట చెబుతుండటం దాగుడుమూతలను తలపిస్తోంది. రిపోర్టు తమకు వచ్చిందని దామరగిద్ద ఎస్ఐ నరేశ్ చెబుతుండగా.. తమకు ఇంకా అందలేదని డీటీఎఫ్ నాగరాజు, డీఎస్ఓ బాలరాజు పేర్కొన డం కొసమెరుపు. దీంతో అసలు రిపోర్టు ఎవరి వద్ద ఉంది.? ఎప్పుడు వచ్చింది.? ఎవరికి అందింది.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిల్లర్‌పై ఆరోపణలు.. పట్టుబడిన బియ్యం వ్యవహారంలో సంబంధిత రైస్‌మిల్లర్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నా యి. రేషన్ డీలర్లతో కుమ్మకై ్క బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆశన్‌పల్లి రైస్‌మిల్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు.. తాజాగా పట్టుబడిన 580 బస్తాల బియ్యం వ్యవహారాన్ని కలిపి అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. డీలర్లు, మిల్లర్ కుమ్మక్కుపై ఆరోపణలు శాంపిల్ రిపోర్టుపై అధికారుల దాగుడుమూతలు? సమగ్ర విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి..దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి మిల్లు వద్ద పట్టుబడిన లారీలోని బియ్యం శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం. ఇంకా తమకు అధికారికంగా రిపోర్టు రాలేదు. సివిల్ సప్లయ్ ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే ఆ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. – బాల్‌రాజు, డీఎస్ఓ -
ధరూరులో భారీ వర్షం
ధరూరు: మండలంలో సోమవారం సాయంత్రం భారీ కురిసింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో అంతంత మాత్రంగా కురుస్తున్న వర్షాలు పంట సాగుకు అనుకూలంగా ఉండటం లేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకు అరగంటపాటు భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వర్షం ముఖ్యంగా సీడ్ పత్తి సాగు చేసుకునే రైతులకు ఉపగయోగకరంగా మారింది. 12న భీమన అమావాస్య ప్రత్యేక పూజలు ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం భీమన అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలిపారు. ఉత్తరాధి మఠం పీఠాధిపతులచే ప్రత్యేక పూజలు కొనసాగుతాయన్నారు. 18వ శతాబ్దం నాటి ఆంజనేయస్వామి ఆలయంలో భీమన(అత్తి) అమావాస్యను పురస్కరించుకొని బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష సుగంధ ద్ర వ్యాలతో ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ, తమల పాత్ర ఆకు పూజలు, అష్టోత్తర నామా వళి పూజలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాధిమఠం పీఠాధిపతులు, ఉడిపి పలిమారు మఠం 1008 విద్యాధీశతీర్థ శ్రీపాదులు, 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకుని స్వామివారికి కృష్ణానదిలో దండోదక స్నానం, సంస్థాన ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. పోరాటాలతోనే హక్కుల సాధన గద్వాల: పోరాటాలతోనే హక్కులు సాధ్యమవుతాయని, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మిక, రైతు సంఘాల నాయకులు అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పాతబస్టాండులో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు దాసోహం చేయడానికి కోరలు లేని కార్మిక చట్టాలు తెచ్చి నవభారతాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్మిక చట్టాలు అమలైతే దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరుగుతాయని, దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న పెట్టుబడిదారుల మెడలు వంచాలంటే ప్రతిఘటన, సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కాక తప్పదన్నారు. దేశంలో విచ్చలవిడిగా స్వేచ్ఛ వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగించి దేశాన్ని కరువు కాటకాల దేశంగా మారుస్తారా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు తన వాటాను తగ్గించుకుని రాష్ట్రాలపై యూనియన్ గవర్నమెంట్ భారాలు మోపుతుందన్నారు. కార్మిక, రైతాంగ, వ్యవసాయ కూలీలకు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటాలు చేయడం ద్వారానే కార్మికవర్గం తన సమస్యలను పరిష్కరించుకోగలదని పిలుపునిచ్చారు. జైల్‌భరో కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నాయకులు పల్లయ్య మద్దతు తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. -
వైభవంగా సప్తాహ భజనలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తాహ భజనలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండలంలోని బిజ్వారం, చర్లగార్లపాడు, ఆరగిద్ద, సంకాపురం, పారుచర్ల గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భజనలో పాల్గొన్నారు. వారం రోజులపాటు నిరంతరంగా కొనసాగే ఈ సప్తాహా భజనలు మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్.. ముగిసింది
● జిల్లాలో 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి గద్వాల: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ సోమవారం ముగిసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,03,859 ఓటర్లు ఉండగా.. 4,39,552 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ పూర్తి కాగా ఇంకా 60,300 మంది ఓటర్ల వివరాలు లెక్క తేలలేదు. వీరి వివరాలు వివిధ రకాల కారణాలతో అన్ కలెక్టబుల్గా మిగిలాయి. 17న ముసాయిదా జాబితా సర్–2026 కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారి పేర్లు ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా ఓటరు జాబితాలో కనిపించవు. ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలి. దీనికి తోడు సర్–2002 ఓటర్ల జాబితాలో ఉన్న మీ ఓటు లేదా మీ బంధువుల ఓట్ల వివరాలు స్వీయ ధ్రువీకరణ ఫారంలో నింపాల్సి ఉంటుంది. సర్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 9లోగా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతోపాటు ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ వ్యవధిలో ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారికి ఈఆర్ఓ నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. దీనికి హాజరై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ ప్రతాల్లో ఏదో ఒకటి పుట్టిన తేదీ, నివాస చిరునామాగా చూపించాలి. భవిష్యత్‌లో సర్–2026 ఓటర్ల జాబితా ఓటర్లకు కీలక ఆధారంగా మారనుంది. అక్టోబర్ 12న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేరు రాకుంటే భవిష్యత్‌లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2020 ఓటర్ల జాబితా ప్రామాణికంగా.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రెండు ఓట్లు కలిగి ఉండటం నేరం. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో.. ఇప్పుడు డబుల్ ఓట్లకు చెల్లు చీటి ఇస్తూ.. ఒకే ఓటుకు చాన్స్ ఇవ్వడంతో పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు కలిగిన వారిలో చాలామంది సొంతూరిలోనే ఓటు నమోదుకు ఇష్టపడ్డారు. బతుకుదెరువు, వ్యాపారం, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్లిన వారు ఆధార్ కార్డు, 2020 నాటి ఓటర్ల జాబితా ప్రామాణికంగా తీసుకుని, కొత్త ఫొటోను అందించారు. ఆధారాలు స్వీకరించి.. నోటీసులు ఇచ్చి ఓటర్ల నమోదులో దొర్లిన తప్పులను డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత సరిదిద్దనున్నారు. దీనికి వచ్చే రెండు నెలల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటర్ల నుంచి ఆధారాలు స్వీకరించి.. నోటీసులు ఇచ్చి నమోదులో ఉన్న తప్పులను సరిదిద్దుతారు. ప్రధానంగా పేరులో అక్షర దోషాలు, ఇంటి పేరు తప్పు, డీఎస్సీ ఎర్రర్, వయసులో తేడాలు, కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌లో దొర్లే పొరపాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2002లో ఓటరు జాబితాలో ఉన్న పేరుకు ప్రస్తుత పేరుకు కొద్దిపాటి తేడా ఉన్నవి చాలానే ఉన్నాయి. -
రెండో బండకు చెల్లు
రాజోళి: ఇంట్లో గ్యాస్ బండ అయిపోతుందంటే.. రెండోది సిద్ధంగా ఉందిలే అనుకుని ఎలాంటి చింత లేకుండా ఉండే రోజుల నుంచి.. కొత్త కనెక్షన్లు ఇవ్వక, రెండో సిలిండర్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ.. కావు. కొత్త కనెక్షల్లు ఇచ్చి ఏడాది దాటిపోయిందని, రెండో కుండ కోసం ఎదురుచూడబట్టి రెండేళ్లు అవుతుందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోగా.. ఉన్న కనెక్షన్‌కు సిలిండర్ ఇచ్చేందుకు నిర్దేశించిన సమయం దాటినా కూడా సిలిండర్ ఇవ్వకపోతుండంటతో ప్రజలు వంట వండుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రెండో కనెక్షన్‌కు డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో మొదలైన యుద్ధంతో గ్యాస్ కష్టాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గతంలో రెండు సిలిండర్లు ఉండటంతో ఒకటి అయిపోయేలోగా మరొకటి సిద్ధం చేసుకునేవారు. కానీ, ప్రస్తుతం ఒక సిలిండర్ తీసుకున్నాక 45 రోజుల వరకు మళ్లీ సిలిండర్ ఇవ్వకపోవడంతో ప్రజలకు బ్లాక్ ధరలు తప్పడం లేదు. దీంతో రెండో కనెక్షన్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరగడంతోపాటు రెండో కనెక్షన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ, దేశవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోవడం, ప్రస్తుతం గ్యాస్ కోసం పడుతున్న కష్టాలు ఎక్కువగా ఉండటంతో, కొత్త కనెక్షన్ల కోసం అందరూ ఒక్కసారిగా ఎగబడే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాకముందే, ఎక్కువ కాలం కింద గ్యాస్ కనెక్షన్ కోసం, రెండో కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మొదలుపెట్టి కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలా కాని పక్షంలో ఉన్న ఏజెన్సీలపై దృష్టిపెట్టాలని, బ్లాక్ దందాను అరికట్టాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంతోపాటు అయిజ, శాంతిగనర్, రాజోళి తదితర చోట్ల బ్లాక్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొరతను సాకుగా చూపి రూ.2– 3 వేల దాకా అధికంగా అమ్ముకుంటున్నారు. జిల్లా పరిధిలో ఇలా.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కనెక్షన్లకు బ్రేక్ సిలిండర్ కుండ, కొత్త కనెక్షన్ ఇవ్వని ఏజెన్సీలు గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ దందా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు డబుల్ కనెక్షన్లు 35,753సింగిల్ కనెక్షన్లు 85,095 ఉజ్వల ఇతర కనెక్షన్లు 56,329 -
ఎక్లాస్పూర్ కన్నీటి సంద్రం
స్వగ్రామంలో వైద్య విద్యార్థిని ప్రియాంక అంత్యక్రియలు కన్నవారి కలలు.. కల్లలు ఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై తమ ముందు నిలుస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. చెదిరిన.. చదువుల తల్లి ఆశలు బాగా చదువుకోవాలి.. డాక్టర్ కావాలి.. నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి. ఎక్లాస్పూర్.. కన్నీరుమున్నీరు మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్‌లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్పూర్.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగాతిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. బోరుమన్న ఎక్లాస్పూర్.. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్పూర్కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రి వెంకటేష్‌కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయిజలో అంతిమ యాత్ర.. ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు పాడె మోసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తరలివచ్చిన బంధుగణం.. పార్టీలు, సంఘాల నాయకులు -
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
వీపనగండ్ల: సంక్షేమ పథకాల అమలులో మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పుర్గర్‌చర్లలో కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలు లంచం తీసుకున్నారని లబ్ధిదారు తెలుపగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనం, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. భీమా కాల్వ నుంచి శ్రీరంగాపురం రిజర్వాయర్‌కు సరిపడా సాగునీరు అందేవిధంగా కాల్వల విస్తరణకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు రైతులకు అందజేస్తున్న ట్రాన్స్ఫార్మర్లతో పాటు పరికరాల వివరాలను అందజేస్తే రైతులందరికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేలా చూస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేఎల్ఐ, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్పంచ్‌లు మీసాల పార్వతమ్మ, రామన్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి, రాత్లావత్ గోపాల్, బండారు రాములు తదితరులు పాల్గొన్నారు. -
370 వరకు అడ్డగింత..
జిల్లావ్యాప్తంగా ఎనిమిదేళ్ల కాలంలో సుమారుగా 370 బాల్యవివాహాల వరకు బాలల సంరక్షణ అధికారులు అడ్డుకున్నారు. బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంతకు మించి బాల్య వివాహాలను కానిచ్చేస్తున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు బాల్య వివాహాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. ప్రభుత్వం బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండాలనే నిబంధన తప్పనిసరి చేశారు. అయినప్పటికీ ఆధార్ కార్డులో వయసు మార్చుకుని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. -
శుద్ధజలం.. పుష్కలం!
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్‌లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్‌ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్‌ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్‌ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్‌ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. నీటి అవసరాలు ఇలా.. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ఇకపై కేఎల్‌ఐతోపాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ శాశ్వతంగా తీరనున్న తిప్పలు తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. ఇకపై సమస్య ఉండదు.. గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటిి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ -
యునెస్కో గుర్తింపు కల్పించండి
అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి యునెస్కో గుర్తింపు కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్‌లోని పురాతన ఆలయాల సముదాయం గత చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. అదే విధంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రసాద్ స్కీం భవనంలో భక్తులకు అన్నప్రసాద సత్రం, వసతి గృహాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మిక చట్టాల సవరణతో అసమానతలు గద్వాల/ధరూరు: కార్మిక చట్టాల సవరణతో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగి.. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో స్వీపర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వీపర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు ధరూరులో జైల్‌భరోకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతారన్నారు. ఇది సమాజంలో అశాంతికి, కులాధిపత్య ధోరణికి దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, దేవదాసు, మోష, తిమ్మప్ప పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటాం మదనాపురం: రైల్వేలైన్ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తు న్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రసూల్‌బీ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. కొత్తకోట: పట్టణంలోని బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, కిచెన్, పరిసరాల్లో స్వచ్ఛతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలు, భోజన నాణ్యత ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, మెరుగైన వసతులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలికల విద్య, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కొత్తకోటలో నిర్మాణంలో ఉన్న ప్రధాన డ్రైనేజీని పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను కోరారు. -
మూడు ముళ్ల బంధం!
జిల్లాలో ఆగని బాల్యవివాహాలు ● చదువుకన్నా పెళ్లికే ప్రాధాన్యమిస్తున్న తల్లిదండ్రులు ● క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా మారని తీరు ● ఎనిమిదేళ్ల కాలంలో 370 బాల్యవివాహాల అడ్డగింత ●అడ్డుకట్ట వేయాల్సిందే.. బాల్యవివాహాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాల్సిందే. బాల్యవివాహాలతో చిన్నారుల బతుకులు ఆగమవుతాయి. బాలల సంరక్షణ కమిటీల ద్వారా బాల్యవివాహాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కొన్ని చోట్ల బాల్యవివాహం చేస్తున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి నిలిపివేస్తున్నాం. బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. – సునంద, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి కఠినంగా వ్యవహరిస్తాం.. బాల్యవివాహాలపై కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని జిల్లాలో బాల్యవివాహాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. బాల్యవివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు కళా బృందాలు, భరోసా కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. లైంగిక దాడులకు గురైన బాలికలకు రక్షణ కల్పించడంతో పాటు సాధారణ స్థితికి చేరుకునే విధంగా చేయడంతో పాటు న్యాయ సహాయం అందిస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గట్టు: పోటీ ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలు సాధించి కన్నవారికి, పుట్టి పెరిగిన ఊరికి మంచి పేరు తీసుకొద్దామనుకుంటున్న బాలికల కలలను కొందరు మూడు ముళ్లతో ముడి పెట్టేస్తున్నారు. తోటి స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని చెరిపేస్తున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా అమ్మాయికి పెద్ద చదువులెందుకంటూ.. పెళ్లి పేరుతో మరొకరి చేతులో పెట్టేందుకు తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. జిల్లావ్యాప్తంగా బాలల సంరక్షణ అధికారులు గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. బాల్య వివాహాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు దృష్టికి వచ్చిన కొన్ని బాల్య వివాహాలను మాత్రమే అడ్డుకుంటున్నారు. మరికొన్నింటిని గుట్టుచప్పుడు కాకుండా మూడుముళ్ల వేయించేస్తున్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాలు నిర్వహించరాదని ఎంతగా చెబుతున్నప్పటికీ తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు. ఎనిమిదేళ్ల కాలంలో బాల్యవివాహాల అడ్డగింత ఇలా.. 2022 65 2021 70 2019 55 2020 952026 జూన్ వరకు : 20 2025 70 2023 40 2024 55 -
ఎరువుల దుర్వినియోగానికి చెక్
● టాస్క్ ‘ఎఫ్ఎఫ్ఎస్’ యాప్ప్రవేశపెట్టనున్న కేంద్రం ● జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ● ఇప్పటివరకు 73 శాతమే.. ● కౌలు రైతులకు అందని ద్రాక్షలా ఎరువులు అయిజ: ఎరువుల కోసం రైతులు గంటల తరబడి డీలర్ల దుకాణాల వద్ద క్యూలో నిలబడాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 13 నుంచి ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ ఫర్ ఫర్టిలైజర్స్ సేల్) యాప్ ద్వారా యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా రైతులకు అందించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,85,499 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 1,36,283 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని 27 శాతం రైతులకు నూతనంగా ప్రవేశపెట్టనున్న ఎఫ్ఎఫ్ఎస్ ద్వారా ఎరువులు అందని ద్రాక్షలా మిగిలిపోనున్నాయి. అడ్డంకిగా సాంకేతిక కారణాలు.. రైతులకు సంబంధించిన ఆర్ఓఆర్లో భూమి వివరాలు సరిగా లేకపోవడంతో ఫార్మర్ ఐడీ రావట్లేదు. ఆధార్‌లో ఉన్న పేరు, పట్టా పాస్‌బుక్‌లో ఉన్న పేరు కొద్దిగా తేడా ఉంటే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. చనిపోయిన వ్యక్తుల పేరున ఉన్న భూమి వారుసులకు మ్యుటేషన్ కాకపోవడం, పాత రికార్డులు డిజిటల్ కాకపోవడం లేదా తప్పుగా డిజిటల్ కావడం వలన ఫార్మర్ రిజిస్ట్రీ కావడంలేదు. అదేవిధంగా జాయింట్ ఓనర్షిప్లో అందరి పేర్లు సరిగా లింక్ కాకపోవడం, భూమి వివాదాలు, కోర్టు కేసులు, రికార్డులు లాక్ అయి ఉండటం, రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో జాప్యం జరుగుతోంది. మండలం రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ సంఖ్య శాతం అలంపూర్ 10,644 78.21 ధరూర్ 14,831 73.16 గద్వాల 19,599 73.58 గట్టు 19,038 69.47 అయిజ 24,181 68.81 ఇటిక్యాల 10,098 75.89 కేటీ దొడ్డి 12,504 67.83 మల్దకల్ 19,403 74.36 మానవపాడు 11,213 79.53 రాజోళి 11,034 72.10 ఉండవెల్లి 11,567 71.13 వడ్డెపల్లి 11,027 80.32 ఎర్రవల్లి 10,360 79.54 మండలాల వారీగా.. -
చింతరేవుల అంజన్నకు ప్రత్యేక పూజలు
ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఆషాఢ కృష్ణ దశమిని పురస్కరించుకొని అర్చకులు కేశవచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాధి పాలమరి మఠాల పీఠాధిపతులు 1008 విద్యాదేశ తీర్థ శ్రీపాదులు, 1008 విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదులు హాజరై స్వామివారికి సుగంద ద్రవ్యాలతో అభిషేకం, అష్టోత్త, మంగళహారతి పూజలు జరిపారు. స్వామివారిని కొలువడం వల్ల శాంతి, ఐశ్వర్యం, ధైర్యసాహసాలు లభిస్తాయని పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో వ్యాస శేషదాసుల వారు ఈ ప్రతిష్టాపన చేసినట్లు ప్రధాన అర్చకులు కేశవాచార్యులు వివరించారు. శనివారం నుంచి 55 రోజులపాటు భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వామనాచారి, కిష్టాచారి, మద్వాచారి తదితరులు పాల్గొన్నారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందేలా చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
సర్.. రెండు రోజులే!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో దాదాపు పూర్తి కావొచ్చింది. దీనికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బీఎల్ఓలకు ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తేనే ఈ నెల 10 వరకు డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 85.50 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మిగిలినవి 24.50 శాతం కూడా పూర్తిచేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. అయితే శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నప్పటికీ సర్ విధులు నిర్వరిస్తున్న వారు విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. బీఎల్ఓలు వివరాలు ధ్రువీకరించుకుని మరణించి వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపడుతున్నారు. జోగుళాంబ ఫస్ట్.. నాగర్‌కర్నూల్ లాస్ట్ ఉమ్మడి పాలమూరులోని జిల్లాల వారీగా సర్ ప్రక్రియను పరిశీలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 84.43 శాతంతో చివరన ఉంది. ఇక ఐదు జిల్లాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజర్ జాబితాతోపాటు ఇతరులు కలిపి మొత్తం 3,96,927 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైరాజర్ జాబితాలో ఉన్న ఓటర్ల తరపున ఎన్యూమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసీ ఓట్లు ఉన్నవారు, గైర్జాజర్ జాబితాలో అత్యధికంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 85.50 శాతం డిజిటలైజేషన్ వరుస సెలవులు ఉన్నప్పటికీ పూర్తిచేయాలని ఆదేశాలు -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్‌తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. పీయూ అభివృద్ధికి వేగం పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచేవిద్యా ప్రమాణాల పెంపు పోటీ ప్రపంచంలో రాణించాలంటేనాణ్యమైన విద్య తప్పనిసరి పీయూ నేషనల్ సెమినార్ ముగింపుకార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు -
మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు
గద్వాల క్రైం: ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు వీలైనంత వరకు వాహనదారుల్లో మార్పునకు కృషి చేస్తుంది. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం వేరు.. మత్తులో తూగుతూ ప్రమాదానికి గురైన సంఘటనలే జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. గత నెల 26న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత మత్తులో కారు నడుపుతూ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేనంత వేగంగా నడుపుతూ ఎడమ వైపు వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వలస వచ్చిన ఓ యువకుడు అక్కడికక్కడే తల పగిలి మృతిచెందాడు. ప్రమాదం తర్వాత సదరు వ్యక్తి కారు ఆపకుండా అంతే వేగంగా వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఈ నెల 2న ఎస్పీ శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో అత్యధికంగా ఈ కోవలోనే రోడ్డు ప్రమాదాలు తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు వాహనదారులు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు స్వయంగా అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ట చర్యలు -
అడవి మనుషులం సార్.. ఆదుకోండి!
అచ్చంపేట: చుట్టూ దట్టమైన అడవులు.. రాళ్లు, రప్పలతో నిండిన దారులు.. కారు చీకట్లో నెగడి కట్టెల మంటలే దీపపు కాంతులు.. బొడ్డుగుడిసెల్లో జీవనం.. పండ్లు, దుంపలే ఆహారం.. వాగుల నీరే శుద్ధజలం.. ఇదీ నల్లమలలో జీవిస్తున్న చెంచుల పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 80 ఏళ్లు గడుస్తున్నా.. కూడు, గూడు, విద్య, వైద్యానికి నోచుకోక.. క్రూరమృగాలు, విషపు పురుగుల మధ్య సహవాసం చేస్తూ.. దయనీయ స్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎంత మంది ప్రజాప్రతినిధులు హామీలిచ్చినా.. నేటికీ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేకపోతోంది. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నల్లమలలోని చెంచుల దీనావస్థపై ప్రత్యేక కథనం.. పడిపోతున్న జీవన ప్రమాణాలు చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతు న్నాయి. సింహభాగం చెంచులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండి అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. రక్తహీనత, టీబీ, మలేరియా, విషజ్వరాలు, క్యాన్సర్, కడుపులో బల్ల (గడ్డ) వ్యాధులు లేని కుటుంబం అంటూ లేదు. పోషకాహారం లోపంతో మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతుండగా మరికొంత మంది వివిధ వ్యాధులతో అరిగోస పడుతున్నారు. వీరి సగటు జీవితకాలం 40 ఏళ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. పెంటల్లో 14 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తుండగా.. 30 ఏళ్లు వచ్చే సరికి ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తున్నారు. మహిళలు అనారోగ్యం పాలవడానికి ఇదే ప్రధాన కారణం. చెంచుల్లో ఎక్కువ మంది ఆహారం తీసుకోకుండా అడవుల్లో దొరికే పండ్లు తింటారు. మరికొందరు ఆహా రం లేకుండా మద్యం తాగి.. అనారోగ్యాలను బారినపడుతున్నారు. తిండిలేకపోయినా రోజుల తరబడి ఉంటారు తప్ప సారా లేనిది ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెంచుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఆధునిక జీవనశైలిపై అవగాహన కల్పించే వారు లేకపోవడం, పౌష్టికాహార లోపం, రకరకాల వ్యాధులు, బాల్యవివాహాలు తదితర కారణాలతో అడవి బిడ్డల రోదన.. అరణ్యవేదనగా మిగిలిపోతోంది. అభివృద్ధికి దూరంగా.. అటవీ ఉత్పత్తుల సేకరణే వీరి ప్రధాన జీవనాధారం. వీటి ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మినహాయిస్తే.. చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు లేవు. తెలంగాణ వచ్చాక కూడా ఐటీడీఏ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చెంచుల సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతం ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు, కండ్లకుంట, గీచుగండి, ఆగర్లపెంట, పందిబొర్రె పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అందని వైద్యం.. చీకట్లో జీవనం అభయారణ్యంలోని చెంచుపెంటల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకుతున్నారు. కి.మీ.,ల దూరంలో ఉన్న బావులు, కుంటలు, బోర్లు, కాల్వల వద్దకు నడిచివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నల్లమల పెంటల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. పలుచోట్ల సోలార్ వ్యవస్థతో విద్యుత్ దీపాలు అమర్చినా సగానికి పైగా పనిచేయడం లేదు. అయితే ఈ చెంచు పెంటలన్నీ (అప్పాపూర్) ఒకే దగ్గరికి చేర్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారుతోంది. రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మంటలు పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. చెంచులకు వైద్య సేవలు అందడం లేదు. మన్ననూర్ కేంద్రంగా పనిచేసిన సంచార వైద్యశాల మూలకుబడింది. అప్పాపూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా తెరుచుకోవడం. ఫలితంగా చెంచులు అనారోగ్యం పాలైతే వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.దయనీయంగా నల్లమలచెంచుల జీవన విధానం బొడ్డుగుడిసెల్లో సహవాసం.. పండ్లు, దుంపలే ఆహారం రవాణా సౌకర్యం మృగ్యం..అందని వైద్యం నేటికీ కనీస వసతులకు నోచుకోని చెంచుపెంటలు నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం -
ప్రజల భద్రత కోసమే..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మద్యం మత్తులో జరిగే ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపడుతాం. ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలపై ఆరా తీస్తున్నాం. మద్యం తాగి వాహనాలు నడపడం మంచిది కాదు. అలా వాహనాలు నడిపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తాం. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. తనిఖీలు చేస్తున్న క్రమంలో కొందరు తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ప్రజల భద్రత కోసం నిర్విరామంగా సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
పునరుద్ధరణ జరిగేనా?!
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘార ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రారంభం కావడంతో నాలుగో యూనిట్ ప్రారంభానికి జెన్కో అధికారులు సిద్ధం చేశారు. వారం రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జెన్కో అధికారులు గురువారం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం విశేషం. షార్ట్‌సర్క్యూట్ కారణంగా.. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటు చేసుకున్న షార్ట్‌సర్క్యూట్ కారణంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్‌ను పునరుద్దరించే పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనా.. ఎట్టకేలకు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎడమ గట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో యూనిట్లు 6 మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు ఒక యూనిట్లో చేపట్టే విద్యుదుత్పత్తి 150 మెగావాట్లు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం వివరాలిలా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 162.81టీఎంసీలు ప్రస్తుతం ఐదు యూనిట్లలో చేపడుతున్నది 750 మెగావాట్లు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకు ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో సిద్ధం చేస్తున్న నాలుగో యూనిట్ వరదలు వస్తుండటంతో వారంలో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ఆరేళ్లుగా సా..గుతున్న మరమ్మతు పనులు అందుబాటులోకి 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి రూ.14.93 కోట్లతో మరమ్మతు ప్రమాదం జరిగిన తర్వాత 2021లో నాలుగో యూనిట్ పనులు పునరుద్ధరించేందుకు మరమ్మతు చేపట్టిన అధికారులు ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్‌ను రూ.14.93 కోట్లతో మరమ్మతు చేపట్టి.. 2023లో పూర్తి చేసినా.. సాంకేతిక సమస్యలతో 72 గంటలు పనిచేసి మళ్లీ ఆగిపోయింది. దీనిపై జెన్కో అధికారులు కమిటీ వేసి పొరపాట్లు, లోపాలను గుర్తించింది. కాంట్రాక్టు సంస్థ పొరపాట్ల వల్లే ప్రమాదం సంభవించిందని, డిజైన్లోనూ లోపాలున్నాయని కమిటీ తేల్చింది. తిరిగి అదే సంస్థ పనులు చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత గతేడాది మాదిరిగానే మరోసారి మరమ్మతు చేపట్టగా.. మళ్లీ అదే తరహాలో 10 గంటలు పనిచేసి ఆగిపోయింది. అయితే రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జెన్కో అధికారులను ఆదేశించారు. దీంతో ఈసారి కాంట్రాక్టు సంస్థ, జెన్కో ఇంజినీర్ల పర్యవేక్షణలో మరమ్మతు చేపట్టి.. ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లోని 38 షాపుల వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నా యని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. వేలం నిర్వహించడానికి మే 15న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ముందు ఎలాంటి మున్సిపల్ కౌన్సిల్ అనుమతి, తీర్మానం తీసుకోలేదని, రెగ్యులేషన్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ రూల్స్1986లోని తప్పనిసరి నిబంధనలను పాటించకుండా వేలం నిర్వహించారన్నారు. అలాగే వేలం తేదీలను పలుమార్లు మార్చినా ప్రజలకు తగిన సమాచారం ఇవ్వలేదని, అర్హతల పరిశీలనలో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మే 18న టెండర్ నోటిఫికేషన్, జూన్ 20న నిర్వహించిన వేలం వాటి ఆధారంగా జరిగిన అన్ని తదుపరి చర్యలు కేటాయింపులు, లీజు ఒప్పందాలను రద్దుచేసి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో చట్టబద్ధంగా విస్తృత ప్రచారం అనంతరం కొత్తగా వేలం నిర్వహించాలని పిటిషనర్లు హైకోర్టును కోరినట్లు తెలిపారు. ఈ రిట్ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి ఆరోపణలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
మత్స్యకారులకు ఊరట
గద్వాల వ్యవసాయం: మత్స్యకారులకు ఊరట లభించింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చేపల సీడ్‌ను వదలాలని మూడు రోజుల క్రితం జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఈ ఏడాది (2026– 27) చేపపిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా.. అన్న అనుమానాలకు తెరపడింది. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ సైతం ఆరంభించారు. పదిరోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి.. ఈ నెల మూడో వారంలోగా జలాశయాల్లో చేపల పిల్లల సీడ్ వదిలేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల వరకు జలాశయాల్లో సీడ్‌ను వదిలే అవకాశం ఉంది. జిల్లాలో నీటి వనరులు.. జోగుళాంబ గద్వాల జిల్లాలో 96 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,300 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరుకాక మరో 3 వేల మంది దాక వృత్తిదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో తుంగభద్ర, కృష్ణానదులతోపాటు జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్‌వాటర్, ఆరు రిజర్వాయర్లు, 36 నోటిఫైడ్ చెరువులు మొదలుకొని 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు. వీటిని పెంచి విక్రయించి వేలాది మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జలాశయాల్లోకి నీరు.. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని.. కొద్దిరోజుల కిందటి వరకు జలాశయాలు వెలవెలబోయాయి. అయితే ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరదలు పోటెత్తి.. ప్రధాన జలాశయం జూరాలకు భారీగా వరదనీరు చేరింది. ఇక్కడి నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు దానికి అనుబంధంగా ఉన్న రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేస్తుండటంతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వీటితోపాటు నోటిఫైడ్ చెరువులకు సైతం నీరు చేరనుంది. ఎట్టకేలకు జలాశయాల్లోకి నీరు చేరుతుండటంతో ఈ ఏడాది చేపల సీడ్‌ను వదిలేందుకు అవసరమైన కసరత్తు ఆరంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు టెండర్ ప్రక్రియ ఆరంభించారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సీడ్, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం సీడ్‌కు ధరలు నిర్ణయించి, టెండర్ షెడ్యూల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి నాణ్యమైన సీడ్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో వదిలిన చేపల సీడ్ వివరాలు (కోట్లలో) ఈసారి సకాలంలో టెండర్ల ప్రక్రియ షురూ మూడోవారంలో చేప పిల్లల పంపిణీకి ప్రయత్నాలు జిల్లాలో 1.60 కోట్ల నుంచి 2 కోట్ల మేర చేపపిల్లలు వదిలే అవకాశం సుమారు 10 వేల కుటుంబాలకు జీవనోపాధి నాణ్యమైనవి పంపిణీ చేయాలని వేడుకోలు 2017– 18 1.012019– 20 1.022018– 19 0.592020– 21 1.152022– 23 1.692021– 22 1.502023– 24 1.782024– 25 1.302025– 26 1.502026– 27 ? -
గద్వాల చేనేత బ్రాండ్‌ను కాపాడుకుందాం
గద్వాల: పట్టు, కాటన్ సమ్మిళతం చేస్తూ గద్వాల చేనేత జరీ చీరలను నేస్తుంటారని, భౌగోళిక గుర్తింపును పొందిన ఈ బ్రాండ్‌ను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళీశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే సంఘాల ప్రతినిధులు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా జియోట్యాగ్ నంబర్లను ఇప్పించడం జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలు కూడా చేనేత వృత్తిలో ఆర్థిక పురోగతి సాధించేలా గద్వాల చేనేత రంగాన్ని పటిష్టం చేసేందుకు కృషిచేస్తామన్నారు. అదేవిధంగా నేతన్నకు భరోసా, చేయూత, త్రిఫ్టు ఫండ్, బీమా తదితర పథకాలతో ప్రభుత్వం చేనేత కార్మికుల అభ్యున్నతికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహకారాలను అందిపుచ్చుకుని కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఇటీవల జిల్లాకు చెందిన చేనేత కార్మికుల రూ.41.23 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. ఇక్కడి మాస్టర్ వీవర్స్, సహకార సంఘాల ప్రతినిధులు చేనేత కార్మికుల పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు సామాజిక బాధ్యతగా తమవంతుగా తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రతిఒక్కరు గద్వాల చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నూతనంగా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, సీనియర్ చేనేత కార్మికులను సన్మానించారు. అలాగే వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. రూ.85 లక్షల విలువైన నేతన్న భద్రత చెక్కును కార్మికులకు అందించారు. అంతకు ముందు అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వాల్మీకి బోయ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దచింతరేవుల చేరుకున్న ఉడిపి పీఠాధిపతులు
ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నుంచి నిర్వహించనున్న చాతుర్మాస పూజల్లో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు శనివారం ఆలయానికి చేరుకున్నారు. ఉడిపి పలిమారు మఠంకు చెందిన 1008 శ్రీవిద్యాధీశ తీర్థశ్రీపాదులు, 1008 శ్రీవిద్యా రాజేశ్వరతీర్థ శ్రీపాదుల స్వాముల వారు ఆలయానికి చేరుకున్నట్లు ప్రధాన అర్చకులు ఆద్య కేశవాచార్యులు తెలిపారు. వచ్చేనెల 25 వరకు జరిగే ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కుంటల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలి గద్వాల: వర్షాలు తక్కువగా కురుస్తున్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను నిల్వ చేసుకున్న రైతులు పంట కుంటలను నిర్మించునేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి వనరుల వినియోగం, ఉన్న నీటిని వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాలకు నిల్వచేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్‌కార్డులు అందజేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం గద్వాల: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకట్రాములు అన్నారు. శుక్రవారం బీజేపీ నాయకులు జిల్లాకేంద్రంలో ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో ఫీజు బకాయి– బీజేపీ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజులు, స్కాలర్షిప్లు సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి
గట్టు: తల్లిపాలతో బిడ్డకు కావాల్సిన రోగనిరోధక శక్తి లభిస్తుందని ట్రెయినీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం గట్టు రైతువేదికలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం అత్యంత కీలకమన్నారు. మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా వంటిదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయొద్దని సూచించారు. గర్భిణులు క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి నెలవారీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ఐసీడీఎస్, వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, సీడీపీఓ ఆకాశదీప్తి, డీసీపీఓ నర్సింహ, సర్పంచ్ నాగరాజు, సూపర్వైజర్ వాసంతి, కృష్ణవేణి, వల్లి పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు గట్టు/కేటీదొడ్డి: మండలంలోని పెంచికలపాడుకు చెందిన 35 మంది విద్యార్థులు ఆరగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. పెంచిలకపాడు నుంచి ఆరగిద్దకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 10 కి.మీ. నడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు రాశారు. ● కేటీదొడ్డి మండలం పాగుంట విద్యార్థులు సైతం తమ సమస్యలపై హైకోర్టు జడ్జికి పోస్టుకార్డులు పంపించారు. గ్రామంలో 7వ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం 16 కి.మీ. దూరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అయితే సమయానికి బస్సులు లేకపోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్ధితి నెలకొందని వాపోయారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తే మరింత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా కేసుల పరిష్కారం
● ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పనిచేయాలి ● డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ రాజోళి: ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీసు సిబ్బంది పూర్తి అవగాహనతో ముందుకుసాగాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సూచించారు. గురువారం శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన తనిఖీలు చేపట్టారు. ముందుగా డీఐజీకి ఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శంకర్, ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పోలీసు సి బ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంత రం ఆయన స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి తన కర్తవ్యం నిర్వర్తించాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన పరిసరాలు ఉండాలన్నారు. రిసెప్షన్ విధానంలో మార్పులతో కూడుకున్న పనితీరు ఉండాలని.. ఆస్తి సంబంధిత నేరాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 112కు వచ్చే ఫిర్యాదులపై సత్వర స్పందన ఉండాలని.. బ్లూ కోల్ట్స్ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. -
ఇందిరమ్మను మురిపించిన ‘పేట పట్టు’
నారాయణపేటలో 1900 సంవత్సరం నుంచే ఇక్కడి చేనేత కుటుంబాలు మగ్గాలపై పట్టు చీరులు నేస్తూ వస్తున్నారు. తరం మారినా.. మగ్గం మారలేదు. డిజైన్న్ మారినా.. నాణ్యత తగ్గలేదు. అగ్గిపెట్టలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఉంది. మగ్గంపై నేతన్న నేసిన చీర దేశ ప్రధాని ఒంటిపై మెరిసింది. 1983లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ‘పేట’ చీరను కట్టుకున్నారంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. నారాయణపేట, జాజాపూర్, కోటకొండలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వీరు కాలం మారినా మహిళల అభిరుచులకు తగ్గట్లు చీరలు డిజైన్ చేస్తున్నారు. టెంపుల్, చెక్స్, ప్లెయిన్, బార్డర్, బుట్టా, ఫుల్ టర్నింగ్ తదితర డిజైన్లలో చీరలను రూపొందిస్తున్నారు. 2015లో నారాయణపేట చేనేత జియోగ్రాఫికల్ పేటెంట్ హక్కు సంపాదించుకుంది. ఇక్కడ నేసిన చీరలు హైదరాబాద్, బెంగళూరు, రాయచూర్, కలబురగి, యాద్గిర్, ముంబయి, పుణె, సోలాపూర్, సాంగ్లీ, నాగ్‌పూర్, అహ్మదాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఢిల్లీలోనూ పేట పట్టుకు మార్కెట్ ఉండటం విశేషం. -
విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
గద్వాలన్యూటౌన్: నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు నోట్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీసీలో 470 మార్కులకు గాను 468 సాధించి, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని అఖలాబాయ్ని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే బీబీఎం, ఎంబీఏ తదితర కోర్సులను తీసుకొస్తామని తెలిపారు. స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. కాగా, కళాశాలలో 500 మంది విద్యార్థినులు ఉండగా.. తరగతి గదుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,281 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 294 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,281, కనిష్టంగా రూ. 3,479, సరాసరి రూ. 5,775 ధరలు లభించాయి. 6 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టం రూ. 3,969, కనిష్టంగా రూ. 3,709 ధరలు పలికాయి. పేస్కేల్ అమలు చేసేదాక పోరాటం గద్వాల న్యూటౌన్: వీబీ–జీ రామ్‌జీ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేసేదాక పోరాటం కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ రాంప్రసాద్ అన్నా రు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. గ్రామీ ణ ప్రజల జీవనోపాధి మెరుగుదల, సుస్థిర ఆస్తుల కల్పనకు సేవలందిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల పోషణకు సరిపోని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు పేస్కేల్ అమలు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞ ప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలన్నారు. సమావేశంలో జేఏసీ కోకన్వీనర్ శ్రీనివాసులు, శివజ్యోతి, హుస్సేన్, విజయశంకర్ ఉన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం గద్వాలన్యూటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం స్థానిక ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కా లర్షిప్లను సకాలంలో అందించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మద్యతరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదన్నారు. పరీక్షలు రాయడంలో, తదుపరి విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, రవికుమార్, శ్యాంరావు, సమతాగౌడ్, అనీల్, అక్బర్ బాషా, పటేల్, పాండు పాల్గొన్నారు. -
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్‌గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు పెరగనున్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ● -
ఇష్టంగా నేస్తాం
గద్వాల చీరలకు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎప్పటికీ పోరాదన్న ఉద్దేశంతో చాలా ఇష్టంగా చీరలు నేస్తాం. చూడగానే ఇది గద్వాల చీర అని చెప్పేలా ఇక్కడి చీరలు ఉంటాయి. ఇప్పటి మహిళలు నచ్చే, మెచ్చే విధంగా పలు డిజైన్లతో చీరలు రూపొందిస్తున్నాం. గద్వాలకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి చీరల కొనుగోలుకు వస్తుంటారు. – గోరంట్ల నాగలక్ష్మీ, చేనేత కార్మికురాలు, గద్వాల ఆదరణ తగ్గలేదు.. గద్వాల జరీ, పట్టు చీరలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ చీరలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిలో ఉన్నాయి. కాలానుగుణంగా ఇక్కడి కార్మికులు చీరలను వివిధ రకాల డిజైన్లలో నేస్తున్నారు. రంగుల ఎంపికల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాపారులు పవర్‌లూం చీరలకు బదులుగా హ్యండ్లూమ్ చీరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. – మేడం రామకృష్ణ, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
నిండా మునిగినా.. తిరిగి నిలిచారు!
● రాజోళి చేనేత కార్మికుల్లో మొక్కవోని ధైర్యం ● వరదలతో మగ్గాలు మునిగినా వృత్తిని వదలని వైనం రాజోళి: 2009లో వచ్చిన వరదలతో జిల్లాలోని చేనేత కార్మికులు సర్వం కోల్పోయారు. తాము నివసించే ఇళ్లతో పాటు, జీవనం సాగించే మగ్గాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ఎక్కువగా నష్టపోయింది రాజోళిలోని చేనేత కార్మికులే. వరదల సమయంలో 800 కుటుంబాలు చేనేత వృతిపై ఆధారపడి జీవించగా.. 2,500 మంది కార్మికులు వృత్తిలో ఉన్నారు. వరదలతో అపారనష్టం వాటిల్లినప్పటికీ చేనేత కార్మికులు మొక్కవోని ధైర్యంతో తమ వృత్తిని సాగిస్తున్నారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ప్రకారం 1,000 కుటుంబాలు చేనేత వృత్తిలో ఉండగా.. దాదాపు 3వేల మందికి పైగా కార్మికులు వృత్తిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ప్రతి వానాకాలంలో కార్మికుల ఇళ్లలోకి నీరు చేరి.. మగ్గం గుంతలు నీటితో నిండిపోతున్నాయి. రూ.వేలు వెచ్చించి తెచ్చుకున్న ముడిసరుకు తడిసిపోయి పనికి రాకుండా పోతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు సక్రమంగా అందని వారు సైతం ఉన్నారు. అయినప్పటికీ తమ వృత్తికి దూరం కాకుండా.. కష్ట, నష్టాలను తట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
ఏఐపీ హబ్‌గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్‌గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8 లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభు త్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవ తో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్‌నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అను సంధానం చేస్తూ ఏఐపీ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రి య ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్య తో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్‌లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటో మేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అ ధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
గొప్పతనం చాటుతాం..
పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ అరుదైన అవకాశం.. పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. – మధుసూదన్‌రెడ్డి, సెమినార్ కన్వీనర్ ● -
భూ భారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్‌కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌లో స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్ట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళన భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్ రెండు రోజులుగా నిరసన చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం -
ధాన్యం.. మిల్లర్ల భోజ్యం!
గద్వాల: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం పరులపాలవుతోంది. రైస్‌మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సీఎమ్మార్ అందించాల్సి ఉండగా.. పెద్దఎత్తున దోపిడీకి తెరలేపారు. ఐదేళ్ల కాలంలోనే సుమారు రూ. 60కోట్ల విలువైన ధాన్యాన్ని మా యం చేశారు. 2022–23, 2023–24, 2024–25 సంవత్సరాల్లో వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 20కి పైగా మిల్లులు కనీసం 20శాతం కూడ సీఎమ్మార్ బియ్యం పెట్టలేదంటే మిల్లర్లు ఎంతమేర ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓ మిల్లర్ కేటీదొడ్డి మండలంలోని ఎఫ్‌సీఐ గోదాంలో నిల్వచేసిన ధాన్యంలో సుమారు రూ. 30కోట్ల విలువచేసే ధాన్యాన్ని అక్రమంగా కర్ణాటకలో విక్రయించినట్లు తెలిసింది. ఇటీవల ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగుచూడగా.. ప్రతినెలా రిపోర్టు ఇవ్వాల్సిన సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు ఇదేమీ పట్టనట్లు ధాన్యం బస్తాలు గోదాంలోనే నిల్వ ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఐదేళ్లలో రూ.కోట్ల ధాన్యం పక్కదారి.. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం సేకరించిన వరిధాన్యా న్ని జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేటాయింపులు చేయగా.. ఇందులో సుమారు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. ఇందులో 2022–23 సంవత్సరానికి సంబంధించి కేటాయించిన 36,814 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 34 రైస్‌మిల్లర్లకు కేటాయిస్తే.. వాటిలో కేవలం 11శాతం మాత్రమే సీఎమ్మార్ అందించారు. మిగిలిన 23,503 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ రావాల్సి ఉంది. అదే విధంగా 2024–25 యాసంగిలో 1,01,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 39 రైస్‌మిల్లర్లకు కేటాయించగా.. 88 శాతం సీఎమ్మార్ పెట్టారు. తాజాగా 2025–26 యాసంగికి సంబంధించి 1,72,432 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా.. ఇంకా 38,377 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ పెట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం నిల్వలు మిల్లులో ఉండాల్సి ఉండగా.. అక్రమ మార్గంలో బయటకు తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా గుర్తింపు.. కేటీదొడ్డి మండలంలో రూ. 30కోట్ల ధాన్యం మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు.. సంబంధిత అధికారులకు తీవ్రస్థాయిలో చీవాట్టు పెట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ఉన్నతాధికారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో సివిల్ సప్లయ్‌శాఖలో కీలకంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడిన సదరు రైస్‌మిల్లర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో వెలుగు.. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలు సరిగ్గా ఉన్నాయో లేదా అనే విషయంపై ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు జిల్లా సివిల్ సప్లయ్‌శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా తనిఖీలు చేపట్టారు. అయితే కేటీదొడ్డి మండలంలో ఓ రైస్‌మిల్లుకు సంబంధించిన గోదాంలో ఏకంగా సుమారు రూ. 30కోట్ల విలువైన ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా సివిల్ సప్లయ్‌శాఖ అధికారులతో విచారణ చేయగా.. సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కితే ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని బతిమిలాడి జాగ్రత పడినట్లు తెలుస్తోంది. తాజాగా రూ. 30కోట్ల విలువైన వరిధాన్యం మాయం ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో బహిర్గతం సదరు మిల్లర్‌కు అధికారుల వత్తాసు చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు జిల్లాలో ఐదేళ్లుగా సాగుతున్న మిల్లర్ల దోపిడీ -
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
ఎర్రవల్లి: విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. బుధవారం ఎర్రవల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న విద్యాభోదన, వసతి, భోజన సౌకర్య, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, తరగతి గదులు, డార్మెటరీలు, వంటశాల, భోజనశాల తదితర ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్ఓ స్వర్ణలత ఉన్నారు. -
పెండింగ్‌లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అన్యాయం చేయొద్దు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్‌లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి. – రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ● -
లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం
గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికవర్గం అన్యాయానికి గురవుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహ అన్నారు. బుధవారం గద్వాల మండలం మదనపల్లి, శెట్టిఆత్మకూరు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో వ్యవసాయ కార్మికుల ఉపాధి పూ ర్తిగా దెబ్బతిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానలకు వ్యతిరేకంగా ఈ నెల 10న కలెక్టరేట్ వద్ద జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జైల్‌భరోకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సీతారాముడు, ఆనంద్, రామకృష్ణ, భాగ్యమ్మ, అంజిలన్న, రత్నమ్మ, సంజీవులు ఉన్నారు. -
గద్వాల – గట్టు మార్గంలో అండర్‌పాస్ నిర్మించండి
గద్వాల: భారత్‌మాల ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టిన గద్వాల – గట్టు మార్గంలో అండర్‌పాస్ నిర్మించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఎంపీ కలిసి.. జిల్లాలోని గట్టు, రాయపురం గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సోలాపూర్ – కర్నూలు – చైన్నె గ్రీన్ ఫీల్డ్ హైవేలో గట్టు–గద్వాల రహదారి వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ డీకే అరుణ ‘సాక్షి’కి తెలిపారు. చేనేత సమస్యలపై ప్రత్యేక దృష్టి అలంపూర్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమలశాఖ సహాయ సంచాలకురాలు ఇందిర బుధవారం కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలి సి శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా లోని చేనేత రంగ పరిస్థితులు, కార్మికుల సంక్షేమ పథకాలపై చర్చించారు. చేనేత సహకార సంఘాల పర్యవేక్షణపై ఎమ్మెల్యే ఆరా తీశారు. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లు, ప్రోత్సాహకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిరంతర కృషితో లక్ష్యసాధన: డీఐఈఓ ధరూరు: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. బుధవారం ధరూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర కృషితో నిర్దేశిత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. పల్లీ క్వింటా రూ.8,369 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 198 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,369, కనిష్టంగా రూ. 3,369, సరాసరి రూ. 5,066 ధరలు లభించాయి. 22 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 3,150 ధర పలికింది. -
పల్లీ @ రూ.8,100
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 326 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,100, కనిష్టంగా రూ.3,616, సరాసరిగా రూ.5,680 ధరలు లభించాయి. ఆరోగ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యమొద్దు గద్వాల క్రైం: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడంపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి అన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే అన్ని పీహెచ్‌సీల్లో సరిపడా మందులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
గద్వాల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక వసతులు కల్పిస్తూ.. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న లోటుపాట్లను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న సదరం భవనాన్ని ఈ నెల 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సామాజిక భద్రత పెన్షన్లు మంజూరు చేస్తున్న దృష్ట్యా అర్హులైన ప్రతిఒక్క లబ్ధిదారుడికి సకాలంలో సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ట్రెయినీ డీసీలు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఝాన్సీ, పీఆర్ ఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియ గడువు పొడిగింపు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించిందన్నారు. జిల్లాలో మొత్తం 5,03,859 ఎన్యూమరేషన్ ఫారాల్లో 4,38,852 (87.10 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఇంకా 63,488 యూఈఎఫ్‌లు, 1,519 ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అఖిలపక్షం.. ఉద్యమం
అలంపూర్: దేశంలోనే పేరుగాంచిన శక్తి పీఠం.. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతంగా ప్రాచుర్యం.. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి అసెంబ్లీ స్థానం.. మహిమాన్విత అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. కానీ, అలంపూర్వాసుల్లో మాత్రం నిత్యం ఏదో ఒక అలజడి నెలకొంటుంది. అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన మరుక్షణమే ఆటంకాలు వచ్చిపడుతున్నాయి. డివిజన్‌గా ఎదగాల్సిన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలివెళ్లడం ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలి వెళ్తుందనే ఆందోళన స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే దీనిని అడ్డుకునేందుకు అఖిలపక్ష నాయకులు ఉద్యమానికి పూనుకుంటున్నారు. 130 ఏళ్ల చరిత్ర.. అలంపూర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1888 నవంబర్ 2న నిజాం కాలంలో రాయచూరు జిల్లాగా ఉన్న సమయంలో అలంపూర్‌లో సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా నియోజకవర్గంలోని అప్పటి 5, ఇప్పటి 8 మండలాల గ్రామాల భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు కొనసాగేవి. సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గతంలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, ఎర్రవల్లి మండలాల్లోని 97 గ్రామాలు, అయిజ మండలంలోని 3 గ్రామాలు కలిపి మొత్తం 100 గ్రామాలకు చెందిన భూ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. జిల్లాల ఆవిర్భావం తర్వాత సబ్ రిజిస్ట్రార్ పరిధిలో అలంపూర్, ఉండవెల్లి మండలాలకే పరిమితం చేశారు. మిగిలిన మండలాలను గద్వాల సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయానికి అనుసంధానం చేయడం జరిగింది. స్థలం లేదనే సాకుతో.. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంతంలో స్థలం కొరతను సాకుగా చూపుతూ మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ వంద పడకల ఆస్పత్రిని అలంపూర్‌లోనే నిర్మించాలని పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. రెండు దశాబ్దాల క్రితమే సీఐ కార్యాలయం తరలివెళ్లగా.. ఈ ప్రాంతానికి వచ్చిన గురుకుల పాఠశాలలు సైతం అదే తరహాలో తరలించారు. ప్రస్తుతం అదే తంతు జరుగుతుండటంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏకతాటిపైకి నాయకులు.. నియోజకవర్గ కేంద్ర అభివృద్ధిపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు, యువత, రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించవద్దని వినతులు అందించారు. అలాగే మంత్రులు, ఎంపీకి సైతం కార్యాలయం తరలించకుండా చర్యలు తీసుకోవాలని లేఖలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కావాల్సిన స్థలం ఎంపికలోనూ నిమగ్నమయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపును నిరసిస్తూ పోరుబాట కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞాపనలు ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధిపై భవిష్యత్ కార్యాచరణ స్థానికంగానే కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన -
నీటికబురు
–8లో uరైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్‌నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సమీక్ష.. జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్‌లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధానకాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమారు 60వేలకుపైగా ఎకరాల్లో నారు మళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశా రు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద వారం రోజులుగా స్థిరంగా ప్రవాహం జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం -
పత్తి పంట పరిశీలన
ఉండవెల్లి: మండలంలోని బొంకూరు గ్రామంలోని చెరుకుతోటకు పిచికారి చేసిన గడ్డి మందు గాల్లోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న పత్తి పంటలకు వ్యాపించడంతో మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేతలు, జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ఆధ్వర్యంలో పరిశీలించారు. పత్తి పంటలో ఆకులు ఎండిపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్‌రెడ్డి, సుధారాణి, నవత 20 ఎకరాలలో సాగైన పత్తి పంటలను పరిశీలించి.. నమూనాలు సేకరించారు. పూర్తి వివరాలు నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ అనిత తదితరులు పాల్గొన్నారు. 7న జాతీయ చేనేత దిదోత్సవం గద్వాల: జాతీయ చేనేత దినోత్సవంను శుక్రవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏడీ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల వినియోగం, చేనేత కళల పరిరక్షణ, చేనేత వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చేనేత రంగం– భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రోబోటిక్స్ శిక్షణ గద్వాల: తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోహం అకాడమీ రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కలందర్బాష తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడం, సాంకేతికతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సోహం అకాడమీ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలను నేర్చుకుని నైపుణ్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో చంద్రమోహన్, ఐక్యూసీ కోఆర్డినేటర్ రాధిక, సమన్వయకర్త సత్యమ్మ సుబ్రమణ్యం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. టెండర్లు పూర్తి గద్వాల: జిల్లాలోని మైనార్టీ గురుకులాల ఆహార సరఫరా టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సయ్యద్‌పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా కోసం దాఖలైన టెండర్లను మంగళవారం అదనపు కలెక్టర్ మధుమోహన్ సమక్షంలో ఓపెన్ చేసినట్లు వివరించారు. 8న సప్తాహా భజనలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 15 వరకు సప్తాహ భజనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సప్తాహ భజన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. వారం రోజుల పాటు కొనసాగే సప్తాహ భజనలకు భక్తభజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 15, 16 తేదీల్లో ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15, 16 తేదీల్లో ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు మహబూనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్స్‌లో మాత్రమే పోటీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 12వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాల కోసం 98480 85211 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ధరూరు: మండల కేంద్రంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హుస్సేనప్ప సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగి్ల్ష్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో (పీజీ) 55 శాతం మార్కులు, సెట్, నెట్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7న కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్థలాల సంరక్షణకు కృషి అలంపూర్: మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాజేశ్ అన్నారు. స్థానిక 4వ వార్డులోని ప్రభుత్వ స్థలంలో సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఖాళీ స్థలానికి సంబంధించి యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిపై ఎవరికై నా యాజమాన్య హక్కు, స్వాధీనం లేదా ఇతర చట్టబద్ధమైన హక్కులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. పల్లీ క్వింటా రూ.8,600 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 420 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,600, కనిష్టంగా రూ. 3,189, సరాసరి రూ. 8,343 ధరలు పలికాయి. బీచుపల్లి గురుకులంలో ప్రవేశాలకు అవకాశం ఎర్రవల్లి: బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 5 నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బీచుపల్లి గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 81069 63904 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం 11 యూనిట్ల ద్వారా 44.925 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234, దిగువలో 5 యూనిట్లలో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 44.925 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టినట్లు ఎస్ఈ తెలిపారు. డీసీసీబీ సీఈఓగా షఫీ ఉల్లాఖాన్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మహమ్మద్ షఫీ ఉల్లాఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో సహకార బ్యాంకుసేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు
గద్వాల: ప్రజావాణికి వచ్చే అర్జీలను పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజల సమస్యలను స్వయంగా కలెక్టర్ తెలుసుకొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 70 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అనేక ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి బుధవారం ఫిర్యాదులపై సమీక్షించి.. పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే సోమవారంలోగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించాలని.. లేనిచో షోకాజ్ నోటీసులను జారీ చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మండలాల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలని సూచించారు. అనంతరం ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, ఇతర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. విద్యాలయాలు, వసతిగృహాల్లో సంబంధిత అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండలంలో మూడు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నామని.. అక్కడి సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింగ్‌రావు, మధుమోహన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
టెక్నికల్‌గా తగ్గించారా!
లెక్కింపు సమయంలోనే. రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందం తనిఖీల సందర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్ వెరిఫికేషన్) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ వర్గాలతో పాటు రైస్ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది. లోపాయికారిగా సర్దుబాటు? మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్‌తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి.. నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్ సప్లై సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్ సప్లయి డీఎస్ఓ గంప శ్రీనివాస్ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్‌ను జిల్లా మేనేజర్ రవినాయక్‌కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్‌ఓతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు. రైస్ మిల్లర్లలో ముదిరిన పోరు.. తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టిందని.. సయోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీ లక్ష్మీబాలాజీ’లో విజిలెన్స్ తనిఖీల్లో కొత్తకోణం వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం మార్కెటింగ్ సిబ్బందిపై అనుమానాలు లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం ? సివిల్ సప్లై డీఎస్ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న పోరు శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీజన్ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ తనిఖీల్లో బస్తాల సంఖ్యను సరిగ్గా లెక్కించలేదని.. మళ్లీ లెక్కించాలని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పలువురు అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ యూనిట్–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్‌కు చెందిన ఇబ్రహీంబాద్లోని రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్ చేశారు. -
మానసిక ప్రవర్తన గ్రహించాలి..
పిల్లల మానసిక ప్రవర్తనను తల్లిదండ్రులు గ్రహించాలి. కుటుంబ సభ్యులు వ్యవహరించే తీరుకు అనుగుణంగా పిల్లల ధోరణి ఉంటుంది. వారు అనుకునే వాటిని దక్కించుకునేందుకు మొండిగా వ్యవహరించడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. లేని తరుణంలో కౌన్సెలింగ్ చేస్తూ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేయాలి. – సరోజమ్మ, నాగర్‌దొడ్డి, మల్దకల్ మండలం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పిల్లలను గారాబం చేయడం వల్ల వారిలో మొండితనం పెరుగుతుంది. అవసరానికి మించిన డబ్బులు, వస్తువులు ఇస్తూ.. దారి తప్పేలా చేస్తున్నారు. పిల్లలతో స్నేహంగా ఉంటూనే, వారిని గమనిస్తూ ఉండాలి. వారుచేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సరిచేయాలి. క్రమశిక్షణ వారికి రక్షణ కవచంగా ఉండాలి. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించిన, ప్రమాదాలకు కారకులైన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. – మొగిలయ్య, డీఎస్పీ ● -
సర్ ప్రక్రియ వేగవంతం
అలంపూర్: సర్ ప్రక్రియను వేగవంతం చేసి.. నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో మొత్తం 2,42,049 మంది ఓటర్లు ఉండగా.. 2,17,755 ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 89 శాతం ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. ఇంకా 22,994 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. బీఎల్ఏలు బూత్ లెవల్లో సమావేశాలు నిర్వహించి.. వందశాతం పూర్తిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, మార్కెట్‌యార్డులో డవిజన్స్థాయి ప్రజావాణి కొనసాగింది. ఉండవెల్లి మండలం మారమునగాల–2 గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధరణిషా, ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప తదితరులు ఉన్నారు. -
రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్‌తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించండి
గద్వాలన్యూటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేసి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.60లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు సా మాజిక భద్రత కల్పించాలని తెలంగాణ టీచ ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఆర్సీ, డీఏలతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నం. 317 అనుబంధంగా జారీ చేసిన జీఓ నం. 190 ఉపాధ్యాయులకు అమలుచేసి, సర్వీస్ రూల్స్ ను నవీకరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో టీటీ యూ నాయకులు ప్రతాప్, లక్ష్మీనారాయణ, మహబూబ్, గజేంద్ర ఉన్నారు. 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టొద్దు అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్‌కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. -
ఫర్టిలైజర్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు
రాజోళి: మండలంలోని మాన్‌దొడ్డిలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఆదివారం వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డీఏఓ వీరప్ప ఆధ్వర్యంలో ఎరువుల బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 47 డీఏపీ బస్తాలను అధికారులు గుర్తించి.. వాటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించడంతో పాటు ఆ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు. అదే విధంగా తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ సురేఖ, ఎస్ఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రమాదపుటంచున పర్యాటకులు
జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ రెండేళ్ల కిందట మహబూబ్‌నగర్‌కు చెందిన ఐస్‌క్రీం విక్రయదారు జూరాల సందర్శనకు వచ్చి నదిలో స్నానం చేస్తూ గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే ఏడాది మహబూబ్‌నగర్‌కు చెందిన ముస్లిం యువకుడు సైతం కుటుంబ సభ్యుల కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్ప వరద వస్తుందని తెలిసిన మరుక్షణమే దిగువ నదిలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదు. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో ప్రాజెక్టు దిగువ భాగం కళకళలాడుతున్నా.. ఎప్పు డు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భ యాందోళనలు నెలకొంటున్నాయి. క్రస్ట్ గేట్ల నుంచి నురగలు కక్కుతూ దిగువకు పారుతున్న నీటి దృశ్యాలను చూసేందుకు, నది అంచునకు వెళ్లి సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఉహించలేని పరిస్థితి నెలకొంది. ని త్యం పోలీసు పహార ఉండాల్సిన అవసరం ఉన్నా.. కేవలం నామమాత్రపు గస్తీ నిర్వహిస్తూ వెళ్తుండటంతో పర్యాటకులు నది అంచున వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి దిగువకు సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంలో దిగువన ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు ముళ్లకంచె ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రాజెక్టు పైభాగం నుంచే పర్యాటకులను తిలకించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎడమ కాల్వ వద్ద మరీ డెంజర్.. జూరాల ఎడమ కాల్వ వద్ద నీటి ప్రవాహం ఉధృతిని గుర్తించలేని యువత ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే చేప ఫ్రైని తిని ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక కర్ణాటక రాయచూర్ నుంచి కూడా పర్యాటకులు భా రీగా వస్తుంటారు. చేప వంటకాలతో పాటు మద్యం అమ్ముతుండటంతో తాగిన మైకంలో యువకులు కాల్వలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. చూసేందుకు తరలివస్తున్న జనం దిగువ నదిలో సెల్ఫీ ఫోజులు అదుపుతప్పితే ప్రవాహంలో గల్లంతయ్యే ప్రమాదం సూచిక బోర్డులు ఏర్పాటుచేయని ప్రాజెక్టు అధికారులు జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్ రోడ్‌ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు నిలుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ -
క్వింట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జైల్‌భరో
గద్వాల: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఈ నెల 10న చేపట్టనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన హమాలీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కార్మికలోకం సిద్ధం కావాలన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటయోధుల స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్ర వాదులు సమష్టి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. 12ఏళ్ల బీజేపీ పాలనలో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసి.. శ్రమదోపిడీకి ద్వారాలు తెరిచారని విమర్శించారు. కనీస వేతనాలు లేక కార్మికవర్గం అల్లాడుతుంటే.. కార్మిక చట్టాల పేరుతో కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తిరుపతన్న, లక్ష్మన్న, రామకృష్ణ, బాలకృష్ణ, నర్సింహ, ఆంజనేయులు, రంగన్న, వీరేశ్, నర్సింహ పాల్గొన్నారు. -
రుణలక్ష్యం.. నిర్దేశం
ఈ ఏడాది రూ.3,300 కోట్ల పంట రుణాలు ● వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా బ్యాంకులకు లక్ష్యాలు ● నడిగడ్డలో 80–90శాతం సన్న, చిన్నకారు రైతులే ● సకాలంలో రుణాలు అందిస్తేనే ప్రయోజనం –8లో uగద్వాలన్యూటౌన్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి పంటరుణ లక్ష్యం నిర్దేశమైంది. ఈఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోరుబావులను సైతం ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ.. వాటితో పూర్తి పంట పెట్టుబడుల అవసరాలు తీరడం లేదు. దీంతో రైతులంతా బ్యాంకులు అందించే పంట రుణాలతోనే పెట్టుబడులు పెడుతున్నారు. 2026–27 పంట రుణ లక్ష్యం ఇలా.. సీజన్ రైతులు రుణ లక్ష్యం (రూ.కోట్లలో) వానాకాలం 84,000 1,980 యాసంగి 58,200 1,320 ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. అయితే వర్షాలు కురుస్తాయని వందలాది రైతులు మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పత్తి, కంది తదితర పంటలు వేశారు. వర్షాలు లేక ఆ పంటలను తొలగించి.. వాటి స్థానంలో ఆరుతడి పంటలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తద్వారా రైతులు మరోసారి పెట్టుబడులు పెట్టాల్సిందే. అయితే జిల్లావ్యాప్తంగా 80 నుంచి 90శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులే. వీరంతా బ్యాంకు రుణాలపైనే ఆధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. లేనిచో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతారు. పంటలు బాగా రాకపోతే, రైతులు ప్రైవేటుగా తీసుకున్న అప్పులకు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. నెలల తరబడి వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా బలహీన పడిపోయే పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు సకాలంలో రుణాలు అందించి, రైతులకు తోడ్పాటు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని గద్వాల – అయిజ, జమిచెడ్ ప్రధాన రహదారుల్లో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు. రాత్రివేళ బయట తిరుగుతున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. నంబర్ ప్లేట్ లేని ఓ కారును స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమైన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మద్యం మత్తులో వాహనదారులు చేస్తున్న ప్రమాదాలను కట్టడి చేయాలనే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసినట్లు వివరించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. -
పసిప్రాయం.. మానని గాయం!
● జిల్లాలో ఏటేటా పెరుగుతున్న పోక్సో కేసులు ● ఏడు నెలల్లోనే 32 కేసులు నమోదు ● నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నా మారని తీరు ● ఇరు కుటుంబాలకు తప్పని వేదన గద్వాల క్రైం: కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. యుక్త వయసులోని పిల్లలపై ఆదరణ, ప్రేమానురాగాలు చూపించకపోవడం సవాల్‌గా మారుతోంది. కుటుంబ పోషణ కోసమంటూ ఇళ్లు వదిలి కూలీ పనులకు వెళ్తుండటం.. ఇదే క్రమంలో ఒంటరిగా ఉంటున్న బాలికలపై యువకులు వక్రబుద్ధితో లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అత్యాచార ఘటనలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఏటేటా పోక్సో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడు నెలల వ్యవధిలోనే 32 పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెడు వ్యసనాలకు లోనై.. కొందరు యువత ప్రధానంగా మొబెల్స్, మద్యం, గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు చూడటం.. యుక్త వయసులో కలిగే మార్పుల నియంత్రణ లేకపోవడం కారణంగా ఒంటరిగా ఉంటున్న బాలికలపై ప్రేమ పే రుతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అ యితే తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం కూ లీ పనులకు వెళ్లడం సైతం నిందితులకు కలిసి వ స్తుంది. పిల్లలకు వ్యక్తిగత విషయాలు, అభిరుచు లు, మారుతున్న వ్యవస్థకు తగ్గట్టు వివరించకపోవడం కూడా సమస్యగా మారింది. తీరా కేసుల్లో ఇరుక్కొని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కనిపించని మార్పు.. బాలికలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడే పోకిరీలపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. బాధితుల ఫిర్యాదులపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి.. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. కోర్టులో వీలైనంత త్వరగా చార్జీషీట్ దాఖాలుచేసి.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో భరోసా, షీ టీం బృందాల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. పోక్సో కేసులతో జైలుశిక్ష అనుభవించాల్సి రావడంతో పాటు భవిష్యత్ శూన్యంగా మారుతుంది. అయినప్పటికీ కొందరు యువకుల్లో మార్పు రావడం లేదు. సంవత్సరం కేసులు 2024 44 2025 51 2026 32 మొత్తం 127 బాలికలపై చోటుచేసుకునే ఘటనలపై పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేస్తున్నాం. బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో ఎంతో మంది నిందితులకు న్యాయస్థానంలో జైలుశిక్ష తీర్పులు వెల్లువడ్డాయి. ప్రజల్లో మార్పునకు నిత్యం అవగాహన సదస్సుల ద్వారా చైతన్యం కల్పిస్తున్నాం. యువకుల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి కార్యకాలాపాలపై ఆరా తీయాలి. బాలికలను ఒంటరిగా విడచి వెళ్లకుండా.. వారిని సైతం తమ వెంట తీసుకెళ్లాలి. మంచి, చెడ్డును సున్నితంగా వివరించాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ మచ్చుకు కొన్ని ఘటనలు.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలికతో బంధువు వరుస ఉన్న యువకుడు చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సదరు యువకుడు బాలికను నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. ఎవరు లేని ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత బాలికకు కడుపునొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గత నెల 18న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా కేంద్రానికి చెందిన బాలికతో ఓ యువకుడు స్నేహంగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఆ యువకుడు సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత జూన్ 30న పోక్సో కేసు నమోదు చేసి, సదరు యువకుడిని జైలుకు పంపించారు. గత మే 9న మానవపాడు మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు జరిగిన వి షయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకుడిపై పో క్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. ● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు ● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి ● సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు ●శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్ మ్యాప్‌ను ఖరారు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్‌కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్ రతన్‌టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు. – వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్‌గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్‌మెంట్‌ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బుల్లెట్ రైలు (హైస్పీడ్ ట్రెయిన్)కు సంబంధించి రూట్ అలైన్‌మెంట్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉండేలా మార్చాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖను పంపించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన కొత్త రూట్ ప్రకారం శంషాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు మొదటగా ఫ్యూచర్ సిటీ – ఆమన్‌గల్ – మన్ననూరు – శ్రీశైలం – సోమశిల మీదుగా బెంగళూర్ వెళ్తుందన్నారు. వాస్తవానికి శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ చాలా దగ్గరనే ఉంటాయన్నారు. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


