త్యాగధనుల కృషితోనే స్వేచ్ఛాయుత వాతావరణం
గద్వాల క్రైం: ఎందరో త్యాగధనుల కృషితోనే ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు దేశం పురోగమిస్తుందని చెప్పారు. అనంతరం పలువురు సిబ్బందికి ఉతృష్ట, అతి ఉతృష్ట సేవా పథకాలు అందజేశారు. అలాగే రవాణా శాఖ కార్యాలయంలో ఇన్‌చార్జి డీటీఓ కృష్ణారెడ్డి తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
నేడు అండర్–16
క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు.
దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
త్యాగధనుల కృషితోనే స్వేచ్ఛాయుత వాతావరణం


