జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్‌గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్‌కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు.


