వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం | BMS student dies by suicide after campus Rumours and harassment | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం

Apr 3 2026 4:05 PM | Updated on Apr 3 2026 4:35 PM

BMS student dies by suicide after campus Rumours and harassment

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో  తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్‌లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది.  లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్‌తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌లో స్వాధీనం చేసు​కున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది.  వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.

మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు  క్లాస్‌మేట్స్  తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్‌తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement