breaking news
Extra
-
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్‌ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్‌తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?) -
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్‌లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్‌లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. లీప్ ఇయర్‌ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్‌నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్‌ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్‌ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్‌ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?) -
యూత్... ప్రాణాలు కాపాడేందుకు మీరు రెడీనా?
485... దేశంలో ఒకే ఒక్క రోజులో రోడ్ యాక్సిడెంట్స్‌లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇది. ఇంకోలా చెప్పాలంటే రోజుకు ఒక కాలేజీలోని విద్యార్థులు లేకుండా పోతున్నారు. ఏటికేడాదీ పెరిగిపోతున్న ఈ ప్రాణనష్టాన్ని కొత్త ఏడాదిలోనైనా తగ్గించాలని కంకణం కట్టుకుంది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. అందుకే 2026లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా యువతకు ఓ పోటీ పెడుతోంది. ఈ సమస్యకు వినూత్న, వెంటనే వాడగల పరిష్కారాలను చూపించాలని డిగ్రీ విద్యార్థులకు పిలుపునిచ్చింది. ఉత్తినే కాదు లెండి... మీరు సూచించిన పరిష్కారం ఎంపికైతే రూ.2.5 లక్షల బహుమానం కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివ్ మైండ్‌కు పదునుపెట్టండి.. రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చో చూపించండి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘అతివేగం హానికరం’’, మొబైల్ఫోన్లు వాడుతూ వాహనాలు నడపొద్దు.. అని రకరకాలుగా ప్రమాదాల విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గడం లేద సరికదా.. ఏటికేడాదీ పెరిగిపోతూనే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన 2020ను మినహాయిస్తే గత ఐదేళ్లలో ఏటా కనీసం నాలుగున్నర లక్షల ప్రమాదాలు జరుగుతూండగా కొంచెం అటు ఇటుగా ఏటా 1.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హైవేలు, రహదారి రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో 45 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ‘సేఫ్ జర్నీ’ కార్యక్రమం కింద దేశ యువతకు ఈ పోటీ ఏర్పాటు చేసింది. విద్యార్థి బృందాలకే చోటు..సియామ్ ఏర్పాటు చేసిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఇద్దరి నుంచి నలుగురు డిగ్రీ విద్యార్థులున్న బృందాలకే చోటు. గుర్తింపు పొందిన కళాశాలల అధ్యాపకులు ఈ బృందాలకు ఓకే చెప్పిన తరువాత మాత్రమే పోటీలో పాల్గొనవచ్చు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఏం చేయవచ్చు? అన్నదానిపై 15 నుంచి 20 స్లైడ్స్ ఉన్న ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేసి సమర్పించాలి. గదిలో కూర్చుని రెడీ చేయడం కాకుండా.. ఫీల్డ్‌వర్క్ కూడా చేయాలి. అవసరమైతే ప్రొటోటైప్‌లు సిద్ధం చేయాలి. ఎవరెవరితో మాట్లాడింది తెలపాలి. మీ ఐడియాను ప్రదర్శించేందుకు రెండు నిమిషాల వీడియో కూడా సిద్ధం చేయవచ్చు.పరిష్కార మార్గాల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలపై డ్రైవర్లను అప్రమత్తం చేసే అప్లికేషన్లతపాటు సురక్షిత ప్రయాణానికి మెరుగైన పరికరాల ఆలోచనలూ ఉండవచ్చు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ లోపు విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవచ్చునని సియామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కె.బెనర్జీ తెలిపారు. విజేతకు రూ.2.5 లక్షల నగదు బహుమతితోపాటు 2026 సేఫ్ సదస్సులో తగిన గుర్తింపు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ వినూత్న పోటీకి దేశీ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్స్ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. -
ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..?
డెస్టినేషన్ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్‌లు, రాజుల కాలంనాటి ఫేమస్ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్ వెడ్డింగ్ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు. ఈ ప్రముఖ రాజస్థాన్ ప్యాలెస్‌లో లగ్జరీ రిసార్ట్లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్‌లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న ఇలాంటి ప్యాలెస్‌లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్‌పూర్ ప్యాలెస్ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.పీవీ సింధు రాఫెల్స్ ఉదయ్‌పూర్ సూట్లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్నెస్ చికిత్సలు, ఆయుర్వేద సెషన్ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్ బైకింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందట.'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు..పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌ని బుక్ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.లేక్‌షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 77,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 81,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 87,000రాఫెల్స్ లేక్‌షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్, రాత్రికి రూ. 97,000రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట. View this post on Instagram A post shared by Raffles Udaipur (@rafflesudaipur) (చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్‌గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం) -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు) -
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్‌లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్‌ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
ఆ దేశంలో న్యాప్ కేఫ్‌లు ఉంటాయి!
దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్‌లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.ఫిబ్రవరి మాసంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి. క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్‌ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ. View this post on Instagram A post shared by Santosh Jha (@career_first_) (చదవండి: వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్) -
పర్యాటకం: ఫ్లెమింగో! పింక్ సీజన్..ఫుల్ స్వింగ్..!
పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నేలంతా పరుచుకున్న పచ్చదనం చూసి ముగ్దులవుతుంటాం. కానీ, ఈ సీజన్లో ప్రత్యేకంగా నేలంతా గులాబీ రంగుపరుచుకున్నట్టుగా.. అలల్లా ఎగిసిపడుతున్న ఆ అందం చూడాలంటే మన దేశంలోనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వీకెండ్లో ఈ పింక్ సీజన్.. మీలో ఫుల్ స్వింగ్‌ను ఇట్టే తెచ్చేస్తుంది. అతిథులుగా విచ్చేసి, సందడి చేస్తున్న పింక్ ఫ్లెమింగోలు బారులు బారులుగా తేరు కట్టి, తీరుగా మనల్ని అలరిస్తున్నాయి. ఆ అందాల ఆనందాన్ని తిలకించడానికి ముందుగా ముంబై మీదుగా ప్రయాణిద్దాం... భారతదేశంలో అధికారికంగా ఫ్లెమింగో సీజన్ వచ్చేసింది. పిలవకుండా వచ్చే ఈ శీతాకాలపు అతిథులు ముంబైతోపాటు నవీ ముంబైలలోని కొన్ని బెస్ట్ సైట్ సీయింగ్ ఫ్లెమింగో ప్రదేశాలు ఉన్నాయి. పొడవాటి కాళ్ళు, వంగిన మెడలు, విలక్షణమైన కిందికి వంగిన ముక్కులతో సొగసైన ఈ నీటి పక్షులు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను గులాబీ రంగుతో చిత్రించడం ప్రారంభించాయి. ప్రతి యేటా అక్టోబర్ చివరి నుండి మే మొదటి వారం వరకు ఫ్లెమింగోలు భారతదేశానికి వలస వస్తుంటాయి. ఫిబ్రవరి నుండి మార్చి వరకు వీటి సంఖ్య గరిష్టస్థాయిలో ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ కొంచెం పెరగడంతో ఈ పక్షుల రాకలో కొంచెం ఆలస్యం జరిగిందని పక్షి పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, ఈ అద్భుతమైన పక్షుల మొదటి గుంపు ముంబై, నవీ ముంబై అంతటా ఐకానిక్ ప్రదేశాలలో వచ్చి చేరాయి. దీంతో వీక్షకుల ఉత్సాహం మిన్నంటుతోంది. థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంపక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామమే. ఈ అభయారణ్యం ఐరోలి, వాషి మధ్య విస్తరించింది. ఉల్హౌస్ నది సల్సెట్ ద్వీపం ఈశాన్య మూలలో రెండు ఉపనదులుగా విడి΄ోతుంది. మరొకటి వాసాయి క్రీక్. ఈ రెండూ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. క్రీక్ సాల్సెట్ ద్వీపం తూర్పు సరిహద్దును ఏర్పరచడం, కొంకణ్ ప్రధాన భూభాగం నుండి ద్వీపాన్ని వేరు చేస్తుంది. దీనినే థానే క్రీక్ అంటారు. ఈ ్ర΄ాంతం వివిధ ఏవియన్ జాతులకు నిలయంగా ఉండటంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ముఖ్యమైన పక్షి ప్రాంతంగా గుర్తించబడింది. ముఖ్యంగా ఇది ఫ్లెమింగోలు, అనేక ఇతర వలస, నీటి పక్షుల జనాభాకు నిలయంగా ఉంది. ఫ్లెమింగోలను దగ్గరి నుంచి వీక్షించడానికి కోస్టల్ – మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ నుండి ప్రసిద్ధ బోట్ సఫారీ ఉంది.సేవిరి మడ్ ఫ్లాట్స్ ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ΄ోషకాలతో కూడిన బురద ఫ్లాట్లు వేలాది ఫ్లెమింగోలను ఆకర్షిస్తాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇక్కడ గైడెడ్ వాక్‌లు మరియు ఫ్లెమింగో–వాచింగ్ ఈవెంట్లను నిర్వహిస్తుంది.భండప్ పంపింగ్ స్టేషన్తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేకి దూరంగా ఉన్న ఈ క్రీక్సైడ్ స్పాట్ పక్షులను చూసేవారికి, ముఖ్యంగా సూర్యోదయ– సూర్యాస్తమయ సమయంలో చాలా ఇష్టమైనది. ఈ ప్రాంతం మడ అడవులతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల నీటి బాతులు, వలస పక్షులను ఆకర్షిస్తుంది.డీపీఎస్ ఫ్లెమింగో సరస్సుఇప్పుడు నవీ ముంబైలోని నెరుల్ ప్రాంతంలో ఒక పరిరక్షణ అభయారణ్యం, ఈ సరస్సు సూర్యోదయం– సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది ఫొటోగ్రాఫర్ల కంటికి కళల దృశ్యమై కనువిందు చేస్తుంది. ఇది నగరంలో ప్రశాంతమైన ప్రదేశం, ప్రకృతి నడకలు, పక్షుల ఫోటోగ్రఫీకి అనువైనది.కరావే ఫ్లెమింగో పాయింట్నవీ ముంబైలోని సీవుడ్స్లో టీఎస్ చాణక్య సమీపంలో, సుందరమైన వెట్ల్యాండ్స్లో నడుస్తూ ఫ్లెమింగోలను చూడొచ్చు. ప్రశాంతమైన పరిసరాలు, కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు, పర్యావరణ పర్యాటకానికి గొప్ప ప్రదేశంగా మారాయి. ఫ్లెమింగో గుంపులను దగ్గర నుంచి చూసేందుకు సీజనల్ బోట్ రైడ్లు అందుబాటులో ఉంటాయి.భిగ్వాన్లోని ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్స్తరచుగా మహారాష్ట్ర భరత్పూర్ అని పిలువబడే భిగ్వాన్ పక్షి ప్రేమికులకు అంతగా తెలియని రత్నం. పూణే సమీపంలోని యశ్వంత్ సాగర్ జలాశయం ఫోటోగ్రాఫర్లకు మరొక హాట్‌స్పాట్.కర్నాల పక్షుల అభయారణ్యం ముంబైకి సమీపంలో ఉన్న ఈ అభయారణ్యం ట్రెక్కింగ్ ట్రైల్స్, ఇతర వలస జాతులతో పాటు ఫ్లెమింగోలను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చారిత్రాత్మక కర్నాల కోటకు నిలయం. అంతేకాదు, పక్షులను చూడటానికి గొప్ప ప్రదేశం.నందూర్ మధమేశ్వర్ పక్షుల అభయారణ్యం : నాసిక్‌లోని ఒక ముఖ్యమైన చిత్తడి నేల ఇది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు అనువైనది. ఈ అభయారణ్యం రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది, శీతాకాలంలో వేలాది వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి కోయ్నా వన్యప్రాణుల అభయారణ్యం, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌తోపాటు మహారాష్ట్ర నేచర్ పార్క్‌లను కూడా సందర్శించవచ్చు. ఫ్లెమింగోలను చూడటం అనేది కేవలం దృశ్యాలను వీక్షించే కార్యక్రమం కాదు. వేగవంతమైన ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండే అందమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను మనసులో ముద్రించుకోవచ్చు. నిశ్శబ్దంలో నీటి అలలు, తెల్లవారుజామున ఆకాశంలో మెత్తటి రెక్కల శబ్దంలో నవీ ముంబై విలువైన అరుదైన సహజ విహారయాత్రను అందిస్తుంది.సూర్యోదయం–సూర్యాస్తమయాలు అత్యుత్తమం...ఉదయం 7 నుండి 9 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 4 నుండి 6 గంటల మధ్య, పక్షులు చురుకుగా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ విహరించవచ్చు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50, గైడెడ్ బోట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.500..పడవ ప్రయాణానికి..ఈ ప్రదేశాలలో స్థానిక మత్స్యకారులు నేచర్ లవర్స్‌కి సూర్యోదయ పడవ ప్రయాణాలను అందిస్తారు. పక్షులకు దాణా వేయడం, వాటిని అందుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు ఎగరడం.. ఆహ్లాదంగా అనిపించే ఉదయాలే దీనికి ఉత్తమ సమయం. అభయారణ్యం వెలుపల పడవ ప్రయాణాలు సాధారణంగా ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పడవ ప్రయాణానికి సీజన్, వ్యక్తుల సమయాన్ని బట్టి వ్యక్తికి రూ.900 – రూ.1,500 మధ్య ఖర్చవుతాయి.ఇలా చేరుకోవచ్చు...హైదరాబాద్ ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి రెండు గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. తరువాత రైలు లేదా టాక్సీ ప్రయాణం ద్వారా నవీ ముంబైకి వెళ్లచ్చు. వాషి, నెరుల్, సీవుడ్స్లో వసతి సదుపాయం లభిస్తుంది.మన దేశానికి అరుదెంచే వలస పక్షుల సమయాలు...పింక్ ఫ్లెమింగోలు శీతాకాలంలో దాదాపు నవంబర్ నుండి మే వరకు భారతదేశానికి వస్తాయి. జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా సందడి చేస్తాయి. ఫ్లెమింగో సీజన్ మాత్రం నవంబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. కాక΄ోతే వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ సీజన్లో నివాసి లెస్సర్ ఫ్లెమింగోలు, వలస వచ్చిన గ్రేటర్ ఫ్లెమింగోలు రెండూ కనిపిస్తాయి. ట్రావెల్ ట్రెండ్స్జెన్ ఏఐ వోవర్ అడ్మిన్ రాబోయే కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగబోతోంది. ప్రయాణికులు ఇప్పటికే ట్రావెల్ ప్లాన్, బుకింగ్‌ల కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ కూడా రంగంలోకి దిగడంతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులువు అయింది. ప్రయాణాలకు సంబంధించి ఏఐ సాంకేతికతను వాడుకోవడానికి సంబంధించి మంచితోసాటు చెడు కూడా ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఆల్గోరిథమిక్ సిఫారసులు వోవర్ టూరిజానికి కారణం అవుతాయని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రయాణానికి సూచిస్తాయని, ట్రావెల్ స్కామ్స్ జరగడానికి కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ప్రయాణాల కోసం ఏఐ సాధనాలను వాడుకోవడానికి సంబంధించి ఎన్నో పరిమితులు ఉన్నాయి’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మీన్ బినా.ఇతర రాష్ట్రాలలోనూ...మహారాష్ట్రలోని చిత్తడి నేలలు, సరస్సులతోపాటు గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్, ఒడిశాలోని చిలికా సరస్సు వంటి తీర్ర΄ాంతాలలో ఫ్లెమింగోలు అద్భుతమైన అందాలలో కనువిందు చేస్తాయి. మహారాష్ట్రలో భిగ్వాన్ ‘దక్షిణ భారత్పూర్‘ అని పిలుస్తారు, ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్ ఫ్లెమింగో గుంపుకు ప్రసిద్ధి చెందింది.గుజరాత్లో...అతిపెద్ద లెస్సర్ ఫ్లెమింగో బ్రీడింగ్ గ్రౌండ్ (ఫ్లెమింగో సిటీ) కు నిలయం. నల్ సరోవర్, థాల్ లేక్ పక్షుల కేంద్రం, ఖిజాదియా పక్షుల అభయారణ్యంలో శీతాకాలంలో ఫ్లెమింగోలు పుష్కలంగా కనువిందు చేస్తాయి. చేరుకోవడానికి ప్రయాణ మార్గం...విమానంలో... హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్ ΄ోర్ట్ నుంచి అహ్మదాబాద్ లేదా జామ్ నగర్‌కు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి నల్ సరోవర్, థాల్ ్ర΄ాంతాలకు కారు లేదా లోకల్ ట్రైన్లో చేరుకోవచ్చు. కచ్‌కు విమానంలో లేదా రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకొని తర్వాత రాన్‌కు ప్రయాణించవచ్చు. రాజస్థాన్సాంబార్ సరస్సు ఫ్లేమింగోలకు శీతాకాలపు విడిది ప్రదేశం. హైదరాబాద్ నుండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది సాంబార్ లేక్. విమానం /రైలు మార్గాల్లో వయా జైపూర్‌కు చేరుకొని వెళ్లాలి. రైలు మార్గంలో నాగ్‌పూర్, ఫులేరా కు చేరుకోవచ్చు. ఒడిశాభారతదేశంలోని అతిపెద్ద తీర్రప్రాంత సరస్సు అయిన చిలికా సరస్సు వేలాది మందిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ నుంచి చిలికా సరస్సు రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్/ ట్రెయిన్/ బస్ మార్గాల ద్వారా విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా చేరుకోవచ్చు. భువనేశ్వర్‌కి విమానంలో వెళ్లి అక్కణ్ణుంచి టాక్సీ లేదా ట్రెయిన్ ద్వారా సరస్సుకు చేరుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
ఈశ్వరీ..జగదీశ్వరీ..
బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది. 12 ఏళ్ల వయసులోనే... ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు. 14 ఏళ్లు తపస్సు చేసి... బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. మఠాధీశులై... తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.సజీవ సమాధి ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.భారీగా భక్తుల రాకదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.ఆరాధనోత్సవాలు నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి. 14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం 15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. – వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం) -
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్‌ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. ధరల వివరాలు..టిన్ కవర్‌తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలిపోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన స్టాంప్‌లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్‌కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..) -
అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..
సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.నాడ మూసివేత అంటే..నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్‌గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్‌పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.(చదవండి: పులిమేడు రూట్లో భక్తుల రద్దీ) -
16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.
సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!) -
శబరిమల అయ్యప్పకు అర్పించే నైవేద్యాలివే..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!) -
భగవద్గీత బోధించే ప్రశాంత జీవన రహస్యం ఇదే..!
భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది. ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు. భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు. “కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.” దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:“ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.” జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం. 3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు. “సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:“నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను భారతదేశంలోను స్థాపించారు. ఆయన విశిష్ట గ్రంథం, ఒక యోగి ఆత్మకథ (autobiography of a yogi), లక్షలాది మందికి యోగమును, ధ్యానాన్ని— ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను,— దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా— కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను — పనిచేయడం, కానీ ఫలితాల కోసం ప్రాకులాడకుండా ఉండటం. యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది—వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.(చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!
సాక్షి ఎరుమేలి: దేవస్వం బోర్డు యాత్రికుల వాహనాల పార్కింగ్‌పై ఫిర్యాదుల కలకలం. దేవస్వం బోర్డు ఒప్పందం కుదుర్చకున్న మొత్తం కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తక్కణమే రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మండిపడితున్నారు యాత్రికులు. నిజానికి దేవస్వం బోర్డు ప్రయాణికులు వాహనాల పార్కింగ్ ఫీజును రూ. 75గా నిర్ణయించగా, కర్ణాటకు చెందిన యాత్రికుల వాహనాలకు అధిక మొత్తంలో రూ. 250 వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హిందూ సంస్థలు, పోలీసులు జోక్యం మేరకు అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అదీగాక కొంతమొంది యాత్రికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ కంట్రోల్ రూమ్ బృందానికి ఫోన్ చేశారని, అలాగే వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారే గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందూ సంస్థ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి ఎస్. మనోజ్ నేతృత్వంలో కొందరూ సంఘటన స్థలానికి చేరుకుని అధిక రుసుములు వసూలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక రుసుములు వసూలు చేసినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సింది తాము కాదని చెప్పడం గమనార్హం. అదీగాక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనా చర్యలు తీసుకుంటామనేది పోలీసుల వాదన. గత వారంన్నర కాలంలో యాత్రికుల వాహనాల నుంచి సుమారు మూడు రెట్లు పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం దేవస్వం బోర్డు సైతం చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఆఖరికి తిరిగి వెళ్లేటప్పుడూ కూడా ..దేవస్వం బోర్డు మైదానంలోని కాంట్రాక్టర్లు బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. పైగా దేవస్వం బోర్డు ఒప్పందం ప్రకారం, పార్కింగ్ రుసుముకు రశీదు ఇవ్వాలి. అంతేగాదు దోపిడీ పెరగడంతో, దేవస్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీలు వేసిన రశీదును జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా. అదీగాక వాహనాలు పార్కింగ్ మైదానంలోకి ప్రవేశించిన వెంటనే రశీదు జారీ చేయాలన్న ఆదేశం. అయితే అందుకూ విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ మైదానం నుంచి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు డబ్బు వసూలు చేస్తున్నాట్లు సమాచారం.నోటీసులు జారీ ..యాత్రికుల వాహనాలకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో కాంట్రాక్టర్‌కు దేవస్వం బోర్డు నోటీసులు జారీ చేస్తుంది. అలాగే ఒప్పంద ఉల్లంఘనకు గానూ తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. (చదవండి: బుకింగ్ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..! హైకోర్టు) -
బుకింగ్ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..!
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే శబరిమలలోకి అనుమతించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాగే పాస్‌లోని తేదీ, సమయాన్ని అనుసరించాలని జస్టిస్ వి రాజా విజయరాఘవన్, జస్టిస్ కే వి జయకుమార్లతో కూడిన దేవస్వం బెంచ్ కూడా ఆదేశించింది. అధిక రద్దీ కారణంగా ఏదైనా అనుచిత ఘటన జరిగితే సహించబోయేది లేదని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుని, పోలీసులను గట్టిగా హెచ్చరించింది ధర్మాసనం. పరిపాలన నిర్లక్ష్యం లేదా అమలులో లోపాల కారణంగా నివారించదగిన అత్యవసర పరిస్థితులకు లక్షలాదిమంది యాత్రికులును బలి చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే నకిలీ పాస్‌లతో వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కూడా ఆదేశించింది. కనీసం తేదీని పాటించకుండా వచ్చేవారిని సన్నిధానంలోకి కూడా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బుకింగ్ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంది. నిజానికి వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా సుమారు లక్ష మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారనే శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదిక ఆధారంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఆదేశాలు జారీ చేసింది. అదీగాక హైకోర్టు కూడా యాత్రికుల సంఖ్యపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వర్చువల్ క్యూ బుకింగ్‌లు 70,000, స్పాట్ బుకింగ్‌లు 5000 వద్ద ఉన్నాయని, కానీ తనిఖీ చేసేటప్పుడూ..సుమారు 7877 పాస్‌లపై స్పష్టమైన సమాచారం లేదని, స్పెషల్ కమిషనర్ హైకోర్టుకి నివేదించారు. అలాగే కొందరు నకిలీ పాస్‌లతో వస్తున్నట్లుకూడా హైకోర్టుకి సమాచారం అందింది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా వచ్చే చాలామంది యాత్రికుల వద్ద పాస్‌లు లేవని, అమికస్ క్యూరీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు స్వయంగా ఈ కేసుని పరిగణలోనికి తీసుకుని విచారించి ఇలా ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ సేవలకు అనుమతి) -
సజ్జన సాంగత్య ఫలం... బలం
ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు. ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితేనేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేదిలేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే తాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మ్రాన్పడిపోగా, తపశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగి΄ోతుంది’’ అని చెప్పాడు. విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమేకాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధార΄ోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.ఇందులోని నీతి ఏమిటంటే... మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. అదే సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఎంతో బలం..ఫలం.– భాస్కర్ -
మూలధార చక్రం..కార్తికేయ స్థానం..!
మన సూక్ష్మ శరీరంలో శ్రీ కార్తికేయుని స్థానం కుడివైపు మూలాధార చక్రంలో ఉంటుంది. మన లోపల కుండలినీ శక్తి కుడివైపు మూలాధార చక్రాన్ని దాటి పైకి రావాలంటే, మనలో శ్రీ కార్తికేయుని గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు ఏమిటో, కుడివైపు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ శ్రీ కార్తికేయుని ఆశీస్సులను పొందడమెలానో శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల నుంచి తెలుసుకుందాం.శ్రీ గణేశుడు గణాలన్నింటికీ రాజు అయితే శ్రీ కార్తికేయుడు సర్వ సైన్యాధ్యక్షుడు. అతను మన కుడివైపు ఉండే పింగళా నాడిని ప్రభావితం చేసే శక్తికి ప్రతీకగా ఉంటాడు. ఈ శక్తి మన ప్రాణ శక్తితో అనుసంధానింపబడి ఉంటుంది. శ్రీ కార్తికేయుని అనుగ్రహం దడం వలన మానవులకు పసిపిల్లల అమాయకత్వంతో కూడిన తేజస్సు, చక్కటి క్రియాశీలత, చెడును అంతమొందించ గల అంతర్గత దైవ శక్తి లభిస్తాయి. భగవంతుని పట్ల వినయ విధేయతలు, నాయకత్వ లక్షణాలు, అందరికీ మార్గ దర్శకత్వం చేయగల శక్తి, దైవికమైన జ్ఞానం, వివేకం లభిస్తాయి.శ్రీ కార్తికేయుని నివాసం కుడివైపు మూలాధార చక్రమే అయినా కుడివైపు నాడి అయిన పింగళా నాడి మొత్తంపై అతని ప్రభావం ఉంటుంది. అందువలనే అతనికి ‘సుపింగళా’ అనే నామం ఏర్పడింది. మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు, కుడివైపు ఉండే పింగళా నాడి మొత్తం శుభ్రమవుతుంది. మన లోపల మూలాధార చక్రం, ఆజ్ఞా చక్రం ఒకదానితో మరొకటి పరిపూర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే కుడివైపు మూలాధార చక్రం శుభ్రమైనప్పుడు కుడివైపు ఆజ్ఞా చక్రం కూడా శుభ్రపడి మనలో అహంకారాన్ని నియంత్రించే శక్తిని మెరుగుపరుస్తుంది. ‘అహం కరోతి ఇతి అహంకారః’ అన్నారు మన పెద్దలు. అంటే ‘నేను చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం‘. నిజానికి మన ద్వారా జరిగే ప్రతీ పనినీ మన లోపల ఉండే భగవంతుని శక్తి జరిపిస్తుంది. ఆ నిజాన్ని విస్మరించి మన ద్వారా ఏదైనా గొప్ప పని జరిగినప్పుడు అది మనమే చేశామనుకొని భ్రమ పడితే, అప్పుడు అది మన సూక్ష్మ శరీరంలో అహంకారమనే బుడగను ఏర్పరుస్తుంది. ఈ అహంకారమనే బుడగ మన ఆజ్ఞా చక్రం ఎడమవైపు అవరోధంగా నిలిచి మన కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రమును దాటకుండా అడ్డుకుంటుంది. శ్రీ కార్తికేయుని ధ్యానము వలన అహంకారము తగ్గి మన లోపల శ్రద్ధ నెలకొంటుంది. మన మెదడులో దైవికమైన విచక్షణా శక్తి ఏర్పడి జ్ఞానంతో ప్రకాశిస్తుంది. భగవంతుని సంహారక శక్తి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. శ్రీ భైరవనాథుడు మన ఎడమ వైపు ఉండే ఇడా నాడి మొత్తం సంచరిస్తూ, అక్కడ ఏమైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని నరకానికి తరిమేస్తారు. అవి తిరిగి మన మీద దాడి చేయకుండా ఉండడానికి శ్రీ కార్తికేయుడు నరకలోక ద్వారాన్ని మూసివేస్తాడు. కావున కుడివైపు మూలాధార చక్రం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో, వారు ఎడమవైపు దుష్ట శక్తుల బారిన పడకుండా ఉంటారు. ఆ విధంగా శ్రీ కార్తికేయుని ప్రభావం ఎడమవైపు ఇడా నాడి మీద కూడా ఉంటుంది. మానవులలో ఉండే మొండితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, రాక్షసత్వం వంటి గుణాలు కుడివైపు మూలాధార చక్రాన్ని బలహీన పరుస్తాయి. మనలోని రాక్షస గుణాలు అంతం కావాలంటే మన అంతర్గత సూక్ష్మ శరీరంలో కార్తికేయుని స్థానమైన కుడి మూలాధార చక్రం బలంగా ఉండాలి. – డా. పి. రాకేశ్(పరమపూజ్య మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా...) (చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!) -
ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!
హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం...లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.ఐదువారాల అద్భుత వ్రతం...మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. ఒకవేళ ఏ కారణం వల్లనైనా మొదటి గురువారం లేదా మధ్యలో మరేదైనా గురువారం నాడు ఈ వ్రతం చేయలేనివారు కూడా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రతవిధానంముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని శ్రద్ధతో సమర్పించాలి. ‘ ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ ‘అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం అట్లు, తిమ్మనంమూడోవారం అప్పాలు, పరమాన్నమునాలుగోవారం చిత్రాన్నం, గారెలు నివేదించాలి. ఐదోవారం నాడు అమ్మవారిని ఈ వ్రతానికి పూర్ణ ఫలాన్నిమ్మని ప్రార్థిస్తూ పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని ΄ాటించాలనేది పండితుల ఉవాచ.నియమనిష్ఠలు కీలకంగురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదుర΄ోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైన పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళ ద్రవ్యాలను సమర్పించడం ఆమె అనుగ్రహాన్ని ΄÷ందే మార్గాలలో ఒకటైన సులభ మార్గం. – డి.వి.ఆర్. (చదవండి: సర్వం పర్వదినాలే..! మార్గాన్ని చూపేది కాబట్టి..) -
ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!
మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!
కర్ణాటక టూర్ కన్నడ దేశంలో ఏమేమి ఉన్నాయి?విస్తారమైన అరేబియా సముద్ర తీరం ఉంది.నిశ్శబ్దంగా ధ్వనించే మెత్తటి అలలున్నాయి.సముద్రతీరాన శివుడి సిగ్నేచర్ స్టాచ్యూ ఉంది.సముద్రంలో తేలిన సెయింట్ మేరీ దీవులున్నాయి.ఉడుపి శ్రీకృష్ణుడున్నాడు... గోకర్ణ ఈశ్వరుడున్నాడు. వ్యాసుడు ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి ఉంది. ఆది శంకరుడు స్థాపించిన శారదపీఠం ఉంది. పక్షిధామం పిలికుల బయలాజికల్ పార్క్ ఉంది. ఐఆర్సీటీసీ ఒకే టూర్లో వీటన్నింటినీ చూపిస్తోంది.1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళూరులో దిగిన తర్వాత ఎయిర్΄ోర్ట్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ప్రయాణం ఉడుపికి సాగుతుంది. ఉడుపిలో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్స్ విహారం. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయ దర్శనం తర్వాత రాత్రి భోజనం బస ఉడుపిలో.ఇది జియో టూర్ఎకో టూర్, స్పిరుచువల్ టూర్లు మనకు పరిచయమే. ఇది జియో టూర్. ప్రకృతి సహజమైన అద్భుతాలను చూశాం, చారిత్రక అద్భుతాలను చూస్తుంటాం. ఇది భౌగోళిక అద్భుతం. పర్వతం పేలిన తరవాత పెల్లుబికిన లావా సముద్రం పైకి తేలి బలపాలను వరుసగా పేర్చినట్లు అచ్చులు అచ్చులుగా ఘనీభవించడంతో ఏర్పడిన దీవులివి. వీటికి సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అనే పేరు పెట్టింది వాస్కోడి గామా. మనదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ΄ోర్చుగీసు నావికుడు. కేరళలో క΄్పాడ్ బీచ్ దగ్గర మనదేశంలో నేల మీద అడుగు పెట్టాడు. అంతకు ముందు ఈ దీవుల మీద సేదదీరాడు. అరేబియా సముంద్రలో ఉడిపి దగ్గర ఉన్న నాలుగు దీవుల సమూహం. మేరీ మాత గౌరవార్థం ఈ దీవులకు సెయింట్ మేరీస్ ఐలాండ్స్గా నామకరణం చేశాడు. స్థానికులు థోన్సేపార్ అని పిలుస్తారు.అరేబియా తీరాన ఓ సాయంత్రంఉడుపిలో శ్రీకృష్ణుడి దర్శనం ప్రధాన ఆకర్షణ. శ్రీకృష్ణుని దర్శనం తర్వాత కృష్ణుని బంగారు రథాన్ని చూడడం మర్చి΄ోవద్దు. ఉడుపి కృష్ణుని ఆలయ నిర్మాణం దానికదే ప్రత్యేకం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. కృష్ణుడిని దర్శించుకున్న తరువాత సాయంత్రాన్ని మాల్పే బీచ్‌లో ఆహ్లాదంగా గడపవచ్చు. సూర్యోదయానికి బంగాళాఖాతం, సూర్యాస్తమయానికి అరేబియా సముద్రాలు ప్రకృతి మనదేశానికి ఇచ్చిన వరాలు. ఉడుపి, మాల్పే బీచ్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఆటలు పిల్లలకు మధురానుభూతి. భోజన ప్రియులకు ఉడుపి అనగానే రుచికరమైన ఉపాహారాలు గుర్తుకు వచ్చి నోరూరిస్తాయి. కన్నడిగుల చేతి రుచిని బీచ్‌లో ఉన్న స్టాల్స్‌లో టేస్ట్ చేయవచ్చు. 2వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోరనాడుకు ప్రయాణం. అన్నపూర్ణేశ్వరి ఆలయ దర్శనం తర్వాత శృంగేరికి ప్రయాణం. శృంగేరి ఆలయ దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి ఉడుపికి ప్రయాణం. ఈ రాత్రి బస కూడా ఉడుపిలోనే.అన్నం పెట్టే తల్లిహోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం భద్ర నది తీరాన ఉంది. మనం తుంగ– భద్ర నదిగా పిలిచే రెండు నదుల్లో భద్ర నది అన్నమాట. హోరనాడు ప్రదేశం స్వచ్ఛంగా అచ్చమైన ప్రకృతి ఒడి. పచ్చటి పంటచేలు, మంద్రంగా ప్రవహించే భద్ర నది, ధీరగంభీరగా ఆకాశాన్ని తాకడానికే ఎదిగినట్లున్న పశ్చిమ కనుమల సౌందర్యం... వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ఆధ్యాత్మికతను మది నిండా నింపుకోగలిగిన ప్రదేశం ఇది. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి సస్యశ్యామలమైన పొలాలను చూసిన వ్యాసుడు సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్న పంటలకు ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించాడేమో అనిపిస్తుంది.అక్షరమిచ్చే బంగారు తల్లిశృంగగిరి మఠాన్ని ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం స్థాపించాడు. వ్యవహారంలో అది శృంగేరిగా మారిపోయింది. శృంగేరి శారదాపీఠం అనుబంధ మఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ గురు పరంపరలో తెలుగు వ్యక్తి విధుశేఖర భారతి ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం చదువుల తల్లి సరస్వతీ మాత కొలువై ఉన్న శ్రీశారదాంబ ఆలయం. ఆలయ శిల్పసౌందర్య వీక్షణం, సరస్వతీదేవి దర్శనం జీవితకాలం గుర్తుండే మధురానుభూతి. ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన సరస్వతీ మాత విగ్రహం చందన శిల్పం. ఆ తర్వాత విజయనగర రాజులు బంగారు విగ్రహం చేయించారు.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గోకర్ణకు ప్రయాణం. గోకర్ణం బీచ్, మురుదేశ్వర్ ఆలయ దర్శనం తర్వాత కొల్లూరుకు ప్రయాణం. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరిగి ఉడుపికి ప్రయాణం. మూడవ రోజు రాత్రి బస కూడా ఉడుపిలోనే.అరేబియా తీరాన మహేశ్వరులుశివుడు... మురుదేశ్వరుడి పేరుతో పూజలందుకుంటున్న ప్రదేశం పేరే మురుదేశ్వర్. అరేబియా తీరాన ధ్యానముద్రలో శివుడి విగ్రహం మురుదేశ్వర్కి సిగ్నేచర్ పిక్చర్. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద శివుడి విగ్రహాలలో మురుదేశ్వర్ విగ్రహానిది మూడవ స్థానం. ఈ ఆలయంలో 20 అంతస్థుల రాజగోపురం స్పెషల్ అట్రాక్షన్. బంగారు గోపురం సంధ్యా కిరణాలకు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. కైలాసనాథ మహాదేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇక్కడి శివలింగం భూమి మీద ప్రతిష్ఠించింది కాదనీ, భూగర్భం నుంచి ఉద్భవించినదని, కైలాసం నుంచి రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం అని చెబుతారు. ఇక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరన గోకర్ణ తీర్థం ఉంది. అందులోని శివుడు మహాబలేశ్వరుడు. ఇక్కడి లింగాన్ని కూడా ఆత్మలింగం అనే చెబుతారు. ఈ ఆలయాలకు వెళ్లేటప్పుడు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. హిందూ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. భుజాలు, మోకాళ్లను కవర్ చేస్తున్న దుస్తులతోనే అనుమతిస్తారు. జీన్స్, స్లీవ్‌లెస్, షార్ట్స్ వంటి వస్త్రధారణ నిషిద్ధం. కాబట్టి జర్నీ ప్లానింగ్‌లో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చందమామ కథల నేలకన్నడిగులకు కొల్లూరుతో గొప్ప అనుబంధం ఉంది. మనం చందమామ కథల్లో చదివిన మూకాంబిక అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం కొల్లూరు. మహాశక్తివంతమైన దేవతగా విశ్వసిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఆదిశంకరాచార్యులు కేరళలోని కుదజాద్రి కొండల్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో మూకాంబిక దేవి ప్రత్యక్షమైంది. ఆది శంకరుని కోరిక మేరకు ఆమె అతడిని అనుసరిస్తూ వెనుకే నడిచింది. ఆది శంకరుడు వెనక్కి చూసిన క్షణంలో అక్కడే ఆగి΄ోతానని షరతు కూడా పెట్టింది. అలా చేర రాజ్యం నుంచి వారి ప్రయాణం మొదలైంది. కొల్లూరు పరిసరాలకు వచ్చేటప్పటికి ఆది శంకరాచార్యునికి ఆమె పాదమంజీరాల సవ్వడి వినిపించలేదు. అప్పుడతడు వెనక్కి చూశాడని, మూకాంబిక తన షరతు ప్రకారం అక్కడే ఆగిపోయిందని, అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారని చెబుతారు. చేర రాజ్యం నుంచి వచ్చిన దేవత కాబట్టి ఉత్తర కేరళ వాళ్లు తమ ఇంటి ఆడపడుచుగా భావించి మూకాంబిక దర్శనానికి వస్తారు. అందుకే ఇక్కడ కన్నడ వాళ్లతోపాటు మలయాళీలు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.4వ రోజు..బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, ధర్మస్థలకు ప్రయాణం. మంజునాథ ఆలయ దర్శనం తర్వాత కుక్కెకి ప్రయాణం. రాత్రి భోజనం చేసిన తర్వాత కుక్కెలో బస.శివుడు– గోమఠేశ్వరుడుధర్మస్థల ఇటీవల వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివాదాలను పక్కన పెడితే కన్నడ సంస్కృతి– జైన సంప్రదాయాల మేళవింపుకు ప్రతీక అయిన ఈ ఆలయం చూడాల్సిన ప్రదేశమే. ఎనిమిది వందల ఏళ్ల నాటి నిర్మాణం. శివుడు ఇక్కడ మంజునాథుడిగా పూజలందుకుంటున్నాడు. మహాశివరాత్రికి శివుడికి ఉత్సవాలు, జైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడ కొలువై ఉన్న గోమఠేశ్వరుడికి మహామస్తకాభిషేకం వైభవంగా జరుగుతాయి. 5వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుని తిరిగి హోటల్‌కు వచ్చి హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం మంగళూరుకు సాగుతుంది. మంగళూరులో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం తన్నేరు బావి బీచ్ విహారం. కద్రోలి గోకర్ణనాథ ఆలయ దర్శనం. రాత్రి బస మంగళూరులో.ఊరిపేరే దేవుడి పేరుమనదేశంలో శైవం, వైష్ణవం పోటాపోటీగా విస్తరిస్తున్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆలయాలకు లెక్కేలేదు. కర్నాటకలో వీరశైవం ప్రభావంతో శివుడు, శివుడి కుటుంబ సభ్యుల ఆలయాలు ఎక్కువ కనిపిస్తాయి. శివపార్వతుల కుమారులిద్దరూ గణేశుడు, కార్తికేయుడిగా పూజలందుకుంటుంటారు. కార్తికేయుడిని సుబ్రహ్మణ్యంగా కొలుస్తారిక్కడ. స్థలపురాణం కూడా శైవం– వైష్ణవాల ఆధారంగానే ఉంటుంది. విష్ణుమూర్తి వాహనమైన గరుట్మంతుడి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి వాసుకి ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చెబుతారు. ఈ గ్రామం పేరు సుబ్రహ్మణ్య. అందుకే ఇక్కడి దేవుడు సుబ్రహ్మణ్యస్వామిగా వ్యవహారంలోకి వచ్చాడు.బంగారు తీరం తన్నేరు బావి అరేబియా తీరంలో అలలు మంద్రంగా చిరుసవ్వడితో ఆలరిస్తుంటాయి. తన్నేరు బావి దగ్గర అరేబియా సముద్రజలంలో కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లో ఇసుక పసుపురంగులో బంగారం రాశి΄ోసినట్లుంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది మంచి ప్రదేశం. పర్యాటక రంగం ఏర్పాటు చేసిన సౌకర్యాలతో ఈ బీచ్‌లో టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గుర్రం మీద విహరించనూవచ్చు. 6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. మంగళాదేవి ఆలయం, మంజునాథ ఆలయ దర్శనం తర్వాత పిలికుల బయోలాజికల్ పార్క్ వీక్షణం. టూర్ నిర్వహకులు పర్యాటకులను సాయత్రం మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వీడ్కోలు చెబుతారు. విమానం ఎక్కి హైదరాబాద్ చేరడంతో టూర్ పూర్తవుతుంది.మంగళాదేవి ఊరుమంగళాదేవి ఆలయం ఉండడంతోనే ఆ ఊరికి మంగళూరుకు అనే పేరు వచ్చింది. మంగళాదేవి ఆలయం ఏటవాలు ఎర్ర పై కప్పుతో కేరళ వాస్తుశైలిలో ఉంటుంది. ఇందుకు కారణం దీనిని కట్టిన రాజు పేరు కుందవర్మన్. తుళునాడు, మలనాడు ్ర΄ాంతాల ΄ాలకుడు. ఈ సమ్మిళిత శైలి ఈ ఆలయం నిర్మాణంలో కనిపిస్తుంది. అందమైన పక్షిధామంపిలికుల బయలాజికల్ పార్క్ మల్టీ డైమన్షన్లు కలిగిన టూరిస్ట్ ప్లేస్. ఎకో టూరిజమ్, ఎడ్యుకేషనల్ టూరిజమ్, ఆహ్లాదకరమైన విహార ప్రదేశం కూడా. కన్నడంలో దీని పేరు పిలికుల నిసర్గ ధామ. నాలుగు వందల ఎకరాల పార్కులో కోర్ ఏరియా 150 ఎకరాలుంటుంది. ఇక్కడి పక్షులు మాత్రం రెక్కల్లోని వైవిధ్యత అంతా ఒక చోటకు చేర్చి ప్రదర్శనకు పెట్టినట్లు కనువిందు చేస్తాయి. ఆస్ట్రిచ్, ఈము కోళ్లు, రియా కొంగలు, చిలుకలు, బ్లాక్ స్వాన్, పెలికాన్, గినియా ఫౌల్ (గిన్ని కోళ్లు), నైట్ హోరన్, గుడ్లగూబలు, లవ్ బర్డ్స్... ఇలా రకరకాల పక్షులను చూడవచ్చు. రకరకాల జాతుల కొంగలు సున్నితంగా అడుగులు వేస్తూ ఆహ్లాదపరుస్తాయి. భూమ్మీద ఉన్న పక్షి జాతులన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది. టీనేజ్ పిల్లలకు ఈ పార్క్ ఒక ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి, వాటిని కచ్చితంగా అమలు పరుస్తారు కూడా. కాబట్టి పర్యాటకులు విధిగా పాటించి తీరాలి. జంతువులకు చిరాకు కలిగించే పనులు చేయరాదు. వాటికి తినుబండారాలు పెట్టకూడదు. అడవుల్లో పర్యటించేటప్పుడు జంతువులను ఏదో చూశామంటే చూసేశాం అన్నట్లు చూడకూడదు. ప్రతి జంతువునీ దానికంటూ ఉండే ప్రత్యేకత కదలికలను గమనించాలి. కొన్నింటికి తోక ఊపడంలో వైవిధ్యత, కొన్నింటికి కొమ్ములను విదిలించడం, కొన్ని అడుగులు వేసేటప్పుడు మట్టిలో పాదముద్రలు పడనంత సున్నితంగా నడుస్తుంటాయి. ఈ టూర్లో ఎంట్రీ టికెట్‌తో పాటు కెమెరా టికెట్ కూడా తీసుకుంటే కొమ్మల మీద కూర్చుని కువకువలాలడే పక్షలను, గురుపుర నదిలో నీరు తాగుతున్న జింకలను, నేల మీద జరజరపాకే సరీసృపాలను రికార్డ్ చేసుకోవచ్చు.ప్యాకేజ్ పేరు..డివైన్ కర్ణాటక, ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 08. ఈ ఆరు రోజుల టూర్ హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కే చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో హోరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి, గోకర్ణ, మురుదేశ్వర్, కొల్లూరు, ధర్మస్థల, మంజునాథ్ ఆలయం, తన్నేరు బావి బీచ్, కుద్రోలి గోకర్ణాథ టెంపుల్, మంగళాదేవి, కద్రి మంజునాథ, పిలికుల బయోలాజికల్ ΄ార్క్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా..సింగిల్ ఆక్యుపెన్సీ 45,950 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 34,850 రూపాయలు. ప్రయాణం ఎప్పుడు? 21.01.2026, ఉదయం 05.50 గంటలకు 6ఈ 7549 నంబరు విమానం హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్టు నుంచి బయలుదేరి ఉదయం 07.35 గంటలకు మంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 26.01.2026. రాత్రి 21.55 గంటలకు 6ఈ 7241 విమానం మంగళూరు నుంచి బయలుదేరి 23.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.ప్యాకేజ్‌లో...విమానం టికెట్లు, హోటల్ బస, ఆరు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు డిన్నర్లు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు ప్రయాణానికి ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలుంటాయి.లంచ్, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి– ఎయిర్΄ోర్ట్ నుంచి ఇంటికి రవాణా, పర్యాటక ప్రదేశాల్లో దర్శనాల టికెట్లు, డ్రైవర్లకిచ్చే టిప్పులు, ఇతర పానీయాలు, లాండ్రీ, మెనూలో లేన పదార్థాలను ఆర్డర్ చేసుకుంటే ఆ బిల్లులు, పర్యాటక ప్రదేశాల్లో గైడ్ సర్వీస్‌లు ప్యాకేజ్‌లో వర్తించవు.బుకింగ్ కోసం..జోనల్ ఆఫీస్,ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్‌ఫోర్డ్ ΄్లాజా,ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040–27702407, 82879 32229ఐఆర్సీటీసీ – టూరిజమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్,విజయవాడ రైల్వే స్టేషన్ఫోన్ నంబరు: 92810 30714, 82879 32312– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!
ఒకప్పుడు వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. సాధారణంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత..ఉన్నత చదువుల రీత్యా లేదా మరేదైనా కారణాల వల్ల విడిపోవడం అనేది కామన్. అలానే ఈస్నేహితులు వారి లక్ష్యాల దృష్ట్యా వేరయ్యారు ఆ మిత్రులు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు శబరిమల సన్నిధానంలో తారసపడి..వేర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరు భద్రతా బాధ్యతలైతే మరొకరు స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.ఆ స్నేహితులే ప్రసాద్ నంబూద్రి, షోజులు. ఎరన్నూర్లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి, మేలూర్కి చెందిన షోజులిద్దరూ. 1997 నుంచి 99 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం పై చదువుల దృష్ట్యా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కట్ చేస్తే..26 ఏళ్లకు అదే స్నేహితులు అయ్యప్పస్వామి సేవలో తరిస్తుండటం చూస్తే..ఎవరిని ఎప్పుడూ కలపాలో అప్పుడే కలుపుతాడు అనేందుకు ఈ ఫ్రెండ్సే ఉదాహరణ. ఈ ఇద్దరు యాదృచ్ఛికంగా శబరిమలలోనే విధులు నిర్వరిస్తుండటం అత్యంత ఆసక్తికర అంశం. ఇక్కడ షోజు ఏఎస్ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూసుకుంటే..నంబూద్రి యాత్రికులను నియంత్రించడం, స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ షోజు తన స్నేహితడు మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్న నంబూద్రికే భద్రత కల్పిస్తూన్నాడు. ప్రస్తుతం షోజు త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుండగా, అదేసమయంలో నంబూద్రి శబరిమల మేల్శాంతిగా ఎన్నికయ్యారు. దాంతో ఆయనకు సెక్యూరిటీగా యాదృచ్ఛికంగా చిన్ననాటి స్నేహితుడు షోజునే నియమాకం అయ్యాడు. అలాగే నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ పదివిలో కొనసాగనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత విధుల రీత్యా ఒకచోటే ఆ ఇద్దరు నేస్తాలు కలిసి ఉండటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాదు కదూ..!. తంత్రి, మేల్శాంతి అంటే..'తంత్రి', 'మేల్శాంతి' అనే పదాలు ఆలయ పూజలో అత్యున్నత స్థానాలను సూచిస్తాయి. ముఖ్యంగా శబరిమల వంటి ఆలయాలలో. 'తంత్రి' అంటే ప్రధాన పూజారి. ఆయన ఆలయ నిర్వహణ, నియామకాల తోపాటు ముఖ్యమైన క్రతువులకు బాధ్యత వహిస్తారు. 'మేల్శాంతి' అంటే ప్రధాన పూజారి సహాయకుడు లేదా ముఖ్య పూజారి అని అర్థం. ఈయన ప్రధాన పూజారి సమక్షంలో రోజువారీ పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.Source: manorama news(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
Margasira Masam 2025: సర్వం పర్వదినాలే..
పరమ పవిత్రమైన కార్తిక మాసం నేటితో ముగుస్తోంది. రేపటినుంచి విష్ణుప్రీతికరమైన మార్గశిర మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం.మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పెద్దల మాట. మార్గశిర మాసం మాసాలలోకెల్లా ’శీర్షం’ అంటే’ శిరసు’ వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర కాబట్టి ఈ మాసానికే మార్గశిరమని పేరు.రోజుకో పర్వం...మార్గశిర మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. అసలు ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడంతో ఈ మాసంంలోని పర్వదినాల పరంపర ప్రారంభం కానుంది. ఈ రోజు గంగాస్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి వంటి విశేష పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే.మార్గశిర గురువార వ్రతంకేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. ఐదువారాల అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువార లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.మార్గశిర గురువారం వ్రతంసాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడూ ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని విశ్వాసం.ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదం.ద్వాదశినాడు పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించడం విశిష్ట ఫలప్రదం. శ్రీ విష్ణుతోపాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయ నమః, ఓ నమో నారాయణాయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని వృత్తికతో, తులసి ఆకులను తీసికొని ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించడం వల్ల సర్వ విపత్తులూ తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు. – డి.వి.ఆర్. -
అయ్యప్ప భక్తులకు అలర్ట్..! శబరిమలలో మళ్లీ..
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..సన్నిధానం, పంబా, నీలక్కల్‌లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందిఅలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలుభారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!) -
స్త్రీగా ఉండటం అంటే అదే..!: మానికా విశ్వకర్మ
థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలో మానికా విశ్వకర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం జరిగిన చైన్రియాక్షన్ ప్రశ్న సెషన్లో ఇతర పోటీదారుల తోపాటు మానికా విశ్వకర్మ కూడా పాల్గొన్నారు. ఆ రౌండ్లో ఒక ఇంటర్వ్యూర్ మానికాను మాజీ మిస్ యూనివర్స్ (1994) సుష్మితా సేన్ అడిగిన ప్రశ్ననే అడగడం విశేషం. అందుకు చాలాచక్కగా సమాధానం ఇచ్చి..తాను వేషధారణతోటే కాదు, తెలివితేటలతో కూడా మెప్పించగలనని చెప్పకనే చెప్పింది.అప్పుడు మిస్‌యూనివర్స్ ఫైనల్ సుష్మితా సేన్‌ని 'మీకు స్త్రీగా ఉండటంలో సారాంశం ఏమిటి?' అనే ప్రశ్న ఎదురైంది. అదే ప్రశ్న మళ్లా ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల మానికాకు యాధృచ్ఛికంగా ఎదురైంది. అయితే మానికా ఏం సమాధానం ఇచ్చిందంటే..నాడు సుష్మితా చాలా సింపుల్‌గా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్త్రీగా ఉండటం అంటే జీవితాన్ని పోషించగల సామర్థ్యం, మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పోషించగల సామర్థ్యం అని చెప్పగా, మానికా ఇలా చెప్పింది. "మహిళలను సమాజం తరుచుగా పలు పాత్రల్లో చూస్తుంటుంది. అయితే మహిళలు మాత్రం తాము ఒక వ్యక్తిగా మానవుడిగా చూడాలని కోరుకుంటారు. మాకు పెంచే సామర్థ్యం, జీవితాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. అంతేగాదు మా చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని అందంగా తీర్చిద్దిగల సామర్థ్యం కూడా మాకు ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే స్త్రీగా ఉండటం అంటే అదే. కేవలం ప్రతి వస్తువు అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, దానిని స్వీకరించి.. విస్తరించగల సామర్థ్యం కూడా ఆమెకు ఉంది. అంటే స్త్రీగా ఉండటం అంటే..అనంతంగా ఉండటమే దాని సారాంశం." అని మానికా అత్యద్భుతంగా సమాధానమిచ్చింది. కాగా ఢిల్లీలో నివశిస్తున్న మానికా విశ్వకర్మ ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతోందామె. ఈ ఏడాది ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ 74వ మిస్ యూనివర్స్ పోటీ నవంబర్ 21న థాయిలాండ్‌లోని నోంతబురిలోని పాక్ క్రెట్లోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. View this post on Instagram A post shared by SUMMER SMITH (@crownsisters) (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!
శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది. దీనిలో బంగారు పూతతో కూడిన పైకప్పుతో ప్రధాన ఆలయం (గర్భగుడి), దాని పైన నాలుగు గోపురాలు, రెండు మండపాలు (గాజెబో లాంటి నిర్మాణాలు), బలిపీఠం (యజ్ఞ శిలా పీఠాలు), బలికల్పుర (పూజా నైవేద్యాలు చేయడానికి రాతి నిర్మాణం) బంగారం తాపడం చేసిన ధ్వజస్తంభం తదితరాలు ఉంటాయి. అలాగే ఈ సన్నిధానానికి దారితీసే పతినెట్టాంపడి లేదా పద్దెనిమిది మెట్లు బంగారంతో తాపడం చేసి ఉంటాయి. పద్దెనిమిది మెట్ల అడుగు భాగంలో ఇద్దరు ద్వారపాలకులు - వలియ కడుత స్వామి, కరుప్ప స్వామి ఉంటారు. వావర్ నడ కూడా దీనికి సమీపంలోనే ఉంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని దర్శంన చేసుకునేందుకు పెద్దసంఖ్య మాలధారులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందనేది అధికారిక వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో యాత్రికుల పూజ, వసతి నిమిత్తమై ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటాయి వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!. శబరిమల సన్నిధానం వద్ద వసతి సౌకర్యాలు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే దేవస్వం బోర్డు గుర్తింపు పొందిన కేంద్రాలలో స్పాట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు ఆన్లైన్లో దర్శనం స్లాట్లు, పూజలు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సమీపంలో అనేక హోటళ్ళు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి కూడా.శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాలుసన్నిధానంలో యాత్రికుల బస కోసం వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి.శబరి గెస్ట్ హౌస్‌లో మాత్రమే 56 గదులు ఉన్నాయి, వీటితో పాటు 5 కాటేజీలు, 12 విడిషెడ్లు ఉన్నాయి.వివిధ విభాగాల అధికారులకు మొత్తం 146 గదులు కేటాయించగా, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక బ్యారక్ నిర్మించారు.ఎలా బుక్ చేసుకోవాలంటే..www.onlinetdb.com ద్వారా ఆన్లైన్లో గదులు, ప్రసాదాలను (వాళిపాడు) బుక్ చేసుకోవచ్చు.దాంతోపాటు పూజకు సంబంధించి.. ఇలాంటి ఆఫర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే..ఉదయాస్తమాన పూజపడి పూజసహస్రకలసంకలశాభిషేకంఉష పూజఉచ్ఛ పూజఅథాళ పూజనెయ్యాభిషేకంవీటిని వర్చువల్ క్యూ టికెట్ తోపాటు బుక్ చేసుకోవచ్చు.ముఖ్య గమనిక: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బుకింగ్ అవసరం లేదు.దర్శన సమయాలుదర్శనం కోసం ఆలయం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుచుకుంటుంది.ఉచ్ఛ పూజ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది.మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి తెరుచుకుంటుంది.రాత్రి 11:00 గంటలకు హరివరాసనం పారాయణంతో చివరి ముగింపు.ఈ ఆలయం రోజుకు 18 గంటలు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయం మూసివేసినప్పుడూ.. అలాగే రాత్రి మూసివేత తర్వాత కూడా..అప్పటికే క్యూలో ఉన్న యాత్రికులు 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయం దర్శనం కోసం తిరిగి తెరిచినప్పుడు వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశారు.యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు..గుండెపోటు ఉపశమన పథకంతీర్థయాత్ర సమయంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే యాత్రికుల కుటుంబాలకు దాదాపు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ క్యూ బుకింగ్‌లో రూ.5 రుసుము అదనంగా జోడించారు. అయితే ఈ చెల్లింపు తప్పనిసరి కాదు.కేరళ అంతటా బీమా కవరేజ్వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఎటువంటి ప్రీమియం లేకుండా రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా కవరేజ్ లభిస్తుంది.ఒక యాత్రికుడు మరణిస్తే :కేరళలో అంబులెన్స్ ఖర్చులు: రూ. 30,000 వరకుఇతర రాష్ట్రాలకు అంబులెన్స్ ఖర్చులు: రూ. 1,00,000 వరకు ఈ ఖర్చులను దేవస్వం బోర్డు భరిస్తుంది.నీలక్కల్ వద్ద పార్కింగ్ పంప నుంచి 23 కి.మీ దూరంలో ఉన్న నీలక్కల్ శబరిమల యాత్రికులకు ప్రధాన పార్కింగ్ హబ్. ఇక్కడ సుమారు 8,500 వాహనాలకు స్థలం ఉంది.పంపా వద్ద , హిల్స్ స్టాప్, చక్కుపాలెం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది.ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థనిలక్కల్ , చక్కుపాలెం, హిల్‌టాప్ వద్ద పార్కింగ్ ఫీజులను ఫాస్టాట్యాగ్ ద్వారా చెల్లించవచ్చు:బస్సులు: రూ. 100మినీ బస్సులు: రూ. 7514 సీట్ల వరకు వాహనాలు: రూ. 504 సీట్లు రూ. 30ఆటో - రిక్షాలు: రూ.15చివరగా శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం.గదిని ఆన్లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి. అలాగే ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఒకే సమయంలో ఎక్కువమంది వెబ్సైట్లో లాగిన్ అవ్వడం వల్ల ఒక్కోసారి సర్వర్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్ని భక్తులందరు గమనించగలరు అంటూ..ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విన్నవించింది. (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
పగడపు దీవులకు.. పడవ ప్రయాణం!
అరేబియా సముద్రంలో దాగిన రత్నం... భారతదేశపు బ్లూ లగూన్... అండర్ వాటర్ అడ్వెంచర్లకు కేరాఫ్... ఇలా చెప్పుకుంటూపోతే... పర్యాటకులకు అదొక స్వర్గం. మోదీ అక్కడ అడుగుపెట్టాక క్రేజ్ ఓ రేంజ్లో పెరిగింది. మీరు ఊహించింది కరెక్టే.. బీచ్ ప్రేమికులకు లక్షదీవులు ఇప్పుడు హాటెస్ట్ డెస్టినేషన్. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ ప్లేస్మా బకెట్ లిస్ట్‌లోకి చేరింది. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ ప్లాన్ చేశాం. అయితే, విమానంలో వెళ్లడం రొటీన్ అనిపించి.. కొలంబస్‌లా సముద్రంపై సాహసయాత్ర చేస్తే పోలా అనే ఐడియా వచ్చింది? కట్ చేస్తే.. మా గుండెజారి అరేబియా సీలో గల్లంతయ్యింది. దేశంలో తొలి లగ్జరీ క్రూయిజ్లైనర్ ‘కార్డీలియా క్రూయిజెస్’లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నాం. మరి అంతపెద్ద ‘ఎంప్రెస్’ క్రూయిజ్‌లో సీ జర్నీ ఎలా ఉంటుంది? అందులో వింతలు విశేషాలేంటి? ఆ అద్భుతమైన కోరల్ ఐల్యాండ్స్‌ను షిప్లో చుట్టేసి రావాలంటే ఎంత ఖర్చవుతుంది? నేచర్ లవర్స్‌ను రా రమ్మని ఊరిస్తున్న లక్షదీవుల కథేంటో తెలుసుకోవాలనుందా? అబ్బురపరిచే పగడపు దీవుల్లో అలా ఈత కొట్టొద్దాం పదండి. లెట్స్క్రూయిజ్!!కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి! అంటూ ముంబై రైలెక్కేశాం. మా లక్షదీవుల నౌకా యాత్ర నాలుగు రాత్రులు.. ఐదు రోజులు. 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో ఎంజాయ్ చేస్తూ.. అరేబియా సముద్రంలో 1200 కిలోమీటర్ల సాహసయానం చేసి, అద్భుతమైన పగడపు దీవులను చేరుకుంటామని ఊహించుకుంటేనే రాత్రంతా నిద్రపట్టలేదు. ఎట్టకేలకు ముంబైలోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌లో అడుగుపెట్టాం. క్రూయిజ్ బోర్డింగ్ ఎయిర్΄ోర్టులాగే ఉంటుంది. బోర్డింగ్ పాస్, ఆధార్ వెరిఫికేషన్, బ్యాగేజీ సెక్యూరిటీ చెకప్ పూర్తయ్యాక టర్మినల్ నుండి ‘ఎంప్రెస్’ క్రూయిజ్ ఉన్న బెర్త్‌పైకి అడుగుపెట్టాం. రాజహంసలా సేదతీరుతున్న అంతపేద్ద షిప్‌ను చూసేసరికి ఫోటోలు, సెల్ఫీలతో సందడే సందడి.అది అరబిక్ కడలందం...షిప్లో అడుగుపెట్టగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్ కోర్ట్ (ఏట్రియం) నిజంగా హైలైట్. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్‌లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో మయసభను తలపిస్తుంది. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు ముంబైకి గుడ్‌బై చెబుతూ ‘ఎంప్రెస్’గంభీరంగా కదిలింది. క్రూయిజ్ టాప్ డెక్ (11వ అంతస్తు) నుంచి ఒకపక్క సముద్రం, మరోపక్క మిలమిల మెరిసే ముంబై స్కైలైన్‌ను చూస్తే.. ఎవరైనా సరే ‘అది అరబిక్ కడలందం’ అనాల్సిందే! క్రూయిజ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే స్విమ్మింగ్‌పూల్ పక్కన ‘తెరే కాలా చష్మా’అంటూ సెయిల్ ఎవే పార్టీ డ్యాన్సులతో ఫ్లోర్ మొత్తం ఊగిపోతోంది. సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి చిల్అవుతూ డీజే పార్టీని ఎంజాయ్ చేశాం. స్టార్‌లైట్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని టెర్రస్‌పైకి అడుగుపెట్టగానే ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్ కదులుతుంటే... చూసేందుకు రెండు కళ్లూ చాలవు!!ఫన్ .. అన్లిమిటెడ్!క్రూయిజ్ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్ అద్భుతం. రెండంతస్తుల్లో 900 మంది కూర్చోవచ్చు. అరే, రోజు అప్పుడే గడిచిపోయిందా అనిపించేలా క్రూయిజ్‌లో అన్లిమిటెడ్ వినోదం ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్, మ్యూజిక్షోలతోపాటు లైవ్ బ్యాండ్స్, డీజే సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. షిప్ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్‌తో ఏదో తెలియని వైబ్ మనల్ని ఉరకలేయిస్తుంది. 24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్‌లో ఉన్నంతసేపూ ఏదో తిరనాళ్లలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగింది. మెగా హౌసీ, ట్రెజర్‌హంట్.. మ్యాజిక్‌షో.. వీడియో గేమ్స్.. లైబ్రరీ.. కిడ్స్ అకాడమీ.. ఫోటో షూట్స్.. టేబుల్‌టెన్నిస్.. స్నూకర్.. జిమ్.. స్పా.. స్విమ్మింగ్ పూల్.. రాక్వాల్ క్లయింబింగ్.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్’ రారమ్మంటుంది.సన్‌రైజ్, సన్‌సెట్.. వావ్!!క్రూయిజ్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడనివి సన్‌రైజ్, సన్‌సెట్. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! ఎర్రని బంతిలా భానుడు అస్తమించే సన్‌సెట్ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం.. మధ్యలో క్రూయిజ్ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్ లవర్స్ గుండెజారి అరేబియా సముద్రంలో గల్లంతవ్వాల్సిందే!!తిన్నోళ్లకు తిన్నంత..!కార్డీలియా ‘ఎంప్రెస్’లో ఫుడ్.. భోజనప్రియులకు పండగే! ఉదయం బ్రేక్పాస్ట్ నుంచి లంచ్, స్నాక్స్, డిన్నర్ వరకూ అన్నీ ఫ్రీ. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండి΄ోయేలా మెనూ ఉంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలు.. నోరూరించే డెసర్ట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ స్టాండర్డ్ బెవరేజెస్ ప్యాకేజీ (హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కాక్టెయిల్స్, మాక్టెయిల్స్, పళ్ల రసాలు) కూడా అన్ని ప్యాకేజీల్లో భాగం.∙∙ దాదాపు 36 గంటల పాటు (రెండు రాత్రులు) క్రూయిజ్ జర్నీ చేశాక గేట్ వే ఆఫ్ లక్షద్వీప్‌గా పిలిచే అగట్టి ఐల్యాండ్‌కు చేరుకున్నాం. ఇక్కడ సముద్ర జలాల కిందంతా కోరల్ రీఫ్స్ పరుచుకుని ఉండటం వల్ల తీరంలో భారీ షిప్‌లు నిలిపేందుకు వీలుపడదు. ఎంప్రెస్‌కు సముద్రంలో అల్లంత దూరాన లంగరు వేసి.. టూరిస్టులను టెండర్బోట్లలో తీరంలోని జెట్టీ వద్దకు చేర్చారు. ఏపుగా ఎదిగిన కొబ్బరి చెట్ల మధ్య నుండి మూడు నిమిషాల్లోనే అవతలి ఒడ్డుకు క్యాబ్‌లో చేరుకున్నాం. అక్కడ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ లక్షదీవుల సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శన ‘పరిచకలి’ ఏర్పాటు చేశారు. మేము కూడా కత్తి, డాలు పుచ్చుకుని వారితో కలిసి స్టెప్పులేసి బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం. అంతే, నోట మాటలేదు. రెప్ప వేయకుండా అలాగే చూస్తుండిపోయాం. అడుగేస్తే మాసి΄ోతుందా అనేంత తెల్లగా మెరిసి΄ోతున్న ఇసుక తిన్నెలను స్వచ్ఛమైన సముద్రపు కెరటాలు తాకుతుంటే దాన్ని వర్ణించడానికి నిజంగా మాటలు చాలవు! క్రిస్టల్ క్లియర్‌గా ఉన్న నీలి సంద్రాన్ని చూసి ఆనందంతో గంతులేశాం. ఆర్టిస్ట్ కుంచె నుండి జాలువారిన వాటర్ కలర్ పెయింటింగ్‌లా ఉంది ఆ దృశ్యం. లేలేత నుండి ముదురు వర్ణం వరకు రకరకాల నీలి రంగు షేడ్లలో ఉన్న అలాంటి సముద్రాన్ని మారిషస్, మాల్దీవుల్లాంటి చోట షూట్ చేసే సినిమా పాటల్లో, వీడియోల్లో చూడటమే తప్ప.. ప్రత్యక్షంగా చూసింది లేదు. ఒక్కసారిగా అలాంటి ప్రకృతి పెయింటింగ్‌ను చూసేసరికి నోరెళ్లబెట్టాం. లక్షదీవుల సముద్రం కింద పగడపు దిబ్బలు (కోరల్స్ రీఫ్స్) 4,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉండటం వల్ల సముద్రపు నీరు అత్యంత స్వచ్ఛంగా మైమరపించే నీలి, ఆకుపచ్చ వర్ణంలో పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఎటు చూసినా బ్లూ లగూన్స్ కనువిందు చేస్తాయి.పేరులో లక్ష ఉన్నా...పేరులో లక్షణంగా లక్ష ఉన్నా మొత్తం దీవులు 36 మాత్రమే. అందులోనూ 10 దీవుల్లోనే ప్రజలు నివశిస్తున్నారు. కేరళ తీరానికి 220–480 కిలోమీటర్ల దూరంలో ముత్యాల్లా పరుచుకున్న దీవుల సమూహమిది. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా వీటి మీదుగానే! హిడెన్ జెమ్ ఆఫ్ అరేబియా సీగా పిలిచే ఈ కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుత జనాభా కేవలం 70,000. లక్షదీవుల్లో అడుగుపెట్టాలంటే స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. ప్యాకేజీ బుక్ చేసుకుంటే వారే అరేంజ్ చేస్తారు. ఇక్కడంతా ముస్లింలే. ఎక్కువగా మాట్లాడే భాష మలయాళం, ఆ తర్వాత తమిళం, ఇంగ్లీష్ కూడా నడుస్తుంది. అయితే, జెసేరి అనే ప్రత్యేకమైన స్థానిక భాష వీరికి ఉంది. ఇదీ మలయాళంలాగే అనిపించినా ద్రావిడ భాషలన్నీ కలగలిపి ఉంటుంది. లక్షదీవుల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. టూర్‌కు సరైన సమయమిది.అగట్టి అంతా కాలినడకనే..లక్షదీవుల్లో మేము అగట్టి ఐల్యాండ్‌ను పూర్తిగా చుట్టేశాం. మొత్తం దీవుల్లో పొడవైనది (7.6 కి.మీ) ఇదే కావడంతో ఇక్కడ మాత్రమే ఎయిర్‌పోర్టు కట్టారు. దీని వెడల్పు కిలోమీటరే. ఐల్యాండ్ అంతా నడుచుకుంటూ తిరిగేయొచ్చు. పైనంతా నీలాకాశం.. తెల్లగా మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. ఎటుచూసినా పచ్చని కొబ్బరి చెట్ల తోరణం.. కనువిందు చేసే స్వచ్ఛమైన నీలి సముద్రం, దట్టంగా అల్లుకున్న సుగంధ ద్రవ్యాల వృక్షాలతో ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గం. సముద్రపు కెరటాల చిరు సవ్వడి తప్ప మరే చప్పుడు వినిపించదు. రంగు రంగుల కోరల్ ఫిష్ ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. లక్షదీవుల్లో దొరికే ట్యూనా చేపలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఫిషింగ్ తర్వాత కొబ్బరి పరిశ్రమ ఇక్కడ ప్రధానమైనది. రిసార్టులు, హోటళ్లతో టూరిజం అభివృద్ధి చెందుతోంది. మరో విచిత్రమేంటంటే, ఎక్కడా పక్షులు కనిపించలేదు. సముద్రపు పక్షులు కొన్ని జనావాసం లేని దీవుల్లో (పిట్టి) ఉంటాయట. అందుకే దీన్ని బర్డ్ శాంక్చరీగా ప్రకటించారని గైడ్ చెప్పారు.నీలిసంద్రంలో కోరల్స్ లోకం..స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్.. బనానా బోట్ రైడ్.. గ్లాస్ బోటమ్ బోట్.. కయాకింగ్.. వాటర్ స్కీయింగ్.. విండ్ సర్ఫింగ్.. ఇలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బొలెడున్నాయి. బీచ్‌లో కాసేపు ఆడుకున్నాక ముందుగా మేము బనానా బోట్ రైడ్ చేశాం. గాలితో నింపిన ట్యూబ్‌పై లైఫ్ జాకెట్లు వేసుకుని కూర్చోవాలి. దీన్ని మరో స్పీడ్ బోటు తాళ్లతో సముద్రంలోకి లాక్కెళ్తుంది. పావు గంట రైడ్ తర్వాత, వేగంగా వెనక్కి తీసుకొచ్చి ఫ్లిప్ చేస్తారు. సముద్రంలో పడి΄ోవడం భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దీని తర్వాత కోరల్స్ లోకంలోకి డైవ్ చేశాం. రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యనున్న ఫ్లోటింగ్ జెట్టీ వరకు బోట్లో వెళ్లాలి. అక్కడ లైఫ్ జాకెట్, ఫేస్ మాస్క్ తొడుక్కుని సముద్రంలోకి దూకేయడమే. నీటిపైన తేలుతూ ముఖాన్ని సముద్రంలో ముంచి కిందికి చూడమని డైవర్ చెప్పాడు. అంతే, ఒక్కసారిగా మైండ్ బ్లాంక్. కళ్లముందు అద్భుత సాగరలోకం ప్రత్యక్షమైంది. క్రిస్టల్ క్లియర్ వాటర్‌లో రంగురంగుల కోరల్ ఫిష్ గుంపులు గుంపులుగా తిరుగుతుంటే... సముద్రం అడుగున నెమ్మదిగా పొదల్లా ఊగే కలర్‌ఫుల్ కోరల్ రీఫ్ప్... అది మరో ప్రపంచం. బ్లూ లగూన్స్లో దాగిన పగడపు లోకాన్ని తొలిసారి చూసేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా. అక్కడ లోతు 5 మీటర్లే. కోరల్స్ మధ్యలో సముద్రం అడుగున పెద్ద తలతో ఉన్న కోరల్ ఫిష్ ఇసుకలో పొర్లుతోంది. ఆకుపచ్చ, నీలం రంగు ప్యారట్ ఫిష్ ఒకటి నా మాస్క్‌ను ముద్దాడటం మధురానుభూతి. ఇక స్కూబా డైవింగ్ వేరే లెవెల్. ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ జాకెట్లు, కాళ్లకు ఫ్లాప్స్ ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని, జలచరాల్లా చక్కర్లు కొడుతూ కోరల్స్ ప్రపంచంలో ఈదులాడుతుంటే దాన్ని మాట్లలో వర్ణించలేం!!బొండం రూ.80.. లిక్కర్ బ్యాన్యాక్టివిటీలన్నీ అయ్యాక లంచ్‌లో పూర్తిగా స్థానిక వంటకాలను రుచి చూశాం. ప్యారట్ ఫిష్, బటర్ ఫ్లై ఫిష్‌తోపాటు పీతలు కూడా ఇక్కడ సీఫుడ్‌లో ఫేమస్. రెండు అరచేతులంత ప్యారట్ ఫిష్ (గ్రిల్)ను లొట్టలేసుకుంటూ లాగించేశాం. వంటకాలన్నీ కేరళ స్టయిల్లోనే ఉన్నాయి. దీవులన్నీ కొబ్బరి చెట్లతో నిండి ఉన్నా.. బొండం రేటు రూ.80 అనడంతో అవాక్కయ్యాం. స్థానికంగా ఏదీ పండించరు. ఉప్పు, పప్పు నుంచి సర్వం మెయిన్ ల్యాండ్ కేరళ నుంచే వస్తాయి. అందుకే రేటు ఘాటుగానే ఉంటుంది. పంచదార కిలో రూ.80 అంట! వారానికోసారి కొచ్చి నుంచి కార్గో షిప్లో అన్నీ దిగుమతి అవుతాయి. ఇక్కడ లిక్కర్ పూర్తిగా బ్యాన్. అయితే, అగట్టీకి దగ్గరలోని బంగారం ఐల్యాండ్, రాజధాని కవరట్టిలో మాత్రమే రిసార్టుల్లో టూరిస్టులు, ప్రభుత్వాధికారులకు విక్రయిస్తారు. బహిరంగంగా తాగడం, బయటి నుంచి తీసుకురావడం కూడా నేరమే. రోజంతా రకరకాల జలక్రీడల్లో మునిగితేలి రాత్రి 10 గంటలకు తిరిగి క్రూయిజ్‌లోకి చేరి΄ోయాం. అరగంటలో తిరుగు ప్రయాణం మొదలైంది. మర్నాడు మళ్లీ రోజంతా క్రూయిజ్‌లో ఎంటర్టైన్మెంట్ షోలు, స్విమ్మింగ్, రాక్క్లయింబింగ్ వంటి యాక్టివిటీలతో గడిచిపోయింది.∙∙ ఇలా టన్నులకొద్దీ మధుర స్మతులను నింపుకుని, అరేబియా సముద్రమంత లోతైన జ్ఞాపకాలను మూటగట్టుకొని ముంబైలో క్రూయిజ్ దిగుతుంటే.. ఐదు రోజుల టూరు ఐదు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. ఎలాంటి రణగొణ ధ్వనులు.. కిక్కిరిసిన పర్యాటకులు... బార్లు.. పబ్‌ల వంటివేవీ అక్కడ లేవు. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. అంతే స్వచ్ఛమైన నీలి సంద్రాన్ని.. అందులో దాగున్న అబ్బురపరిచే కోరల్ ప్రపంచాన్ని.. రంగురంగుల జలచరాలను చూసి మైమరచిపోవాలనుకునే నేచర్ లవర్స్‌కు లక్షదీవులు లక్షలాది మధురానుభూతులను అందిస్తుంది! ఇండియాలో ఏకైక బ్లూ లగూన్లో రకరకాల జల క్రీడల్లో మునిగి తేలాలంటే ఈ పగడపు దీవులకు లగేజీ సర్దేయాల్సిందే. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవి లాంటి క్రూయిజ్‌లో అలా చక్కర్లు కొడుతూ నేచర్‌ను ఆస్వాదించడం కూడా జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుంది! అంటే ఒకే ట్రిప్‌లో రెండు డెస్టినేషన్లన్నమాట!! మరింకెందుకు ఆలస్యం గెట్ సెట్ క్రూయిజ్!!ప్యాకేజీల సంగతిదీ..మధ్యతరగతి నుండి సంపన్నుల దాకా లగ్జరీ క్రూయిజ్ జర్నీ చేసేలా రకరకాల రూమ్‌లు, డిస్కౌంట్లు, గ్రూప్ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది. స్టేట్రూమ్లకు విండో ఉండదు. ముంబై – లక్షదీవుల రౌండ్ ట్రిప్.. ఇద్దరు పెద్దవాళ్లకు 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజీ ధరలు చూస్తే (జీఎస్టీ కాకుండా)...ఇంటీరియర్ స్టేట్‌రూమ్ స్టాండర్డ్: రూ. 1,14,098ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్రీమియర్: రూ. 1,32,610ఓషన్వ్యూ స్టాండర్డ్: రూ. 1,46.850ఓషన్ వ్యూ ప్రీమియర్: రూ. 1,65,362మినీ సూట్: రూ.1,90,994సూట్: రూ.3,05,626చైర్మన్ సూట్: రూ.4,82,202అంటే ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్ రూమ్‌కు ఒక్కో వ్యక్తికి రూ.67,317 చార్జీ (ఫుడ్, ఎంటర్టైన్మెంట్, అన్ లిమిటెడ్ బెవరేజెస్ ప్యాకేజీ, జీఎస్టీతో కలిపి) పడుతుంది. ఫైఫ్స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతితో పాటు లక్షదీవుల్లో ఎంజాయ్ చేసి రావచ్చు. నేరుగా కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises.com) లేదా అథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సంఖ్య, జర్నీ ఎప్పుడు అనే దాన్ని బట్టి డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. కొచ్చి, గోవా నుంచి 3 నైట్స్, 4 డేస్ ప్యాకేజీలు (ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్ రూమ్ ఒక్కో వ్యక్తికి రూ.52,000) కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకుంటే రేటు ఇంకా తగ్గుతుంది. 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత జర్నీ (బేస్ ఫేర్ మినహాయిస్తారు, సర్ ఛార్జీ, పన్నులు చెల్లించాలి), గ్రూప్ బుకింగ్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. గమ్యస్థానాల్లో షోర్ ఎక్స్కర్సన్ (గ్రూప్ టూర్ ప్యాకేజీ)లకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. లేదంటే మనం సొంతంగా కూడా రోజంతా తిరిగి మళ్లీ రాత్రికి క్రూయిజ్‌లోకి చేరుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. – శివరామకృష్ణ మిర్తిపాటి (చదవండి: ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం?
సిరిసంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం. దీని వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో వచ్చింది. అందుకే ఆమెను ‘క్షీర సాగర కన్య’ అని, అలాగే కమలంతో ముడిపడి ఉంది కాబట్టి ‘పద్మ’ ‘కమల’ ‘పద్మప్రియ’ వంటి పేర్లతో పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు. వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురదలోని ఒక్క అణువు కూడా కమలాన్ని అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది.ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే. సంపద, ధనం అనేది ‘బురద’ వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ, ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే, ఈ ప్రపంచంలో ఉన్నా, దానికి అంటకుండా పరిశుద్ధంగా, నిర్లిప్తంగా జీవించాలి. ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి ‘‘నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు’’ అని పరోక్షంగా చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది. (చదవండి: Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!) -
ఆత్మీయత.. అనురాగమే ఔషధంగా...వనభోజనాలు
అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన భోజనాల వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది. బయటకు చాలా సరదాగా కనిపిస్తునే, లోపల చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఈ పిక్నిక్ యొక్క పరమార్థమేమిటో శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల నుంచి తెలుసుకోవచ్చును.మన ప్రాచీన భారత దేశంలో ఋషులు, మునులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు అన్నీ మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి జాగృతి కోసం, చక్ర నాడుల శుద్ధి కోసం ఉద్దేశించి చేసినవే. నైమిశారణ్యంలో సూత మహాముని తన తోటి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వన భోజనాలు చేసినట్లుగా పురాణాలలో ఉంది.అంతే కాకుండా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కూడా గోపాలురతో కలిసి వనభోజనాలు చేసినట్లుగా మన పురాణాలలో ఉంది. దేవతల ఆరాధన కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆనందిస్తూ, గౌరవిస్తూ ఆరాధించడం ముఖ్యమని చె΄్పారు. గోవర్ధన గిరిని పైకి ఎత్తి ఈ ప్రకృతి మనకు ఏ విధంగా గొడుగులా రక్షణగా నిలుస్తుందో చూపించారు. ఈ గోవర్ధన పూజ పర్వదినం కూడా కార్తీక మాసంలోనే శుక్ల పక్ష పాడ్యమి నాడు వస్తుంది. మన చుట్టూ ఉండే ప్రకృతిని, గోవులను శ్రీ కృష్ణ భక్తులందరూ గౌరవించి, పూజలు చేస్తారు. అదే గౌరవ భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రతి నిత్యం ప్రకృతి పట్ల మనం కలిగి ఉండాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని వంటిది. ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా కాస్తాయి. ’సి’ విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇది మన జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. ఉసిరిలో ఆరు రుచులలో ఒక్క లవణం (ఉప్పు) తప్ప మిగలిన ఐదు రుచులూ ఉంటాయి. అంటే మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కషాయం(వగరు), కటువు(కారం), తిక్తం(చేదు) ఈ ఐదు రుచుల సంగమం. ముఖ్యంగా ఉసిరిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది.. కనుక దీనిని ఆమ్లా లేదా ఆమలకము అని పిలుస్తారు కూడా. కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలుస్తోంది. ఈ నెల నుంచి శీతాకాలం మొదలు అవుతుంది. దీంతో రుతు సంబంధ వ్యాధుల తోపాటు దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ నెలలో ఉసిరిని తినడం.. లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి. సకల మానవాళిని రక్షిస్తుందని.. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరక సంహిత పేర్కొంది. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే ఐదు మూలకాలతో తయారవుతుంది. ఈ పంచ భూతాల తత్త్వాల తోనే మన సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు రూపొందాయి. ఉదాహరణకు మన సూక్ష్మ శరీరంలో మొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం భూతత్త్వంతో ఏర్పడుతుంది. ఈ శక్తి కేంద్రంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, మనం భూమి మీద కూర్చొని, రెండు చేతులూ భూమి మీద పెట్టి సహజ యోగ పద్ధతిలో ధ్యానం చేస్తే, ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆ విధంగా పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవుల సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను చైతన్య పరిచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వన భోజనాల ద్వారా సమకూరే మరో ప్రయోజనం సహజ యోగులలో సామూహిక జీవనం మరింతగా బలపడుతుంది.మానవుడు సంఘజీవి. సామూహికంగా అందరూ కలిసి జరుపుకునే పిక్నిక్ ల వలన సహజ యోగుల మధ్య అభి్ర΄ాయ భేదాలు, మనస్పర్థలు ఏమైనా ఉంటే తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ కలిసి సహకరించుకోవడం వలన మనుష్యుల మధ్య ప్రేమ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అహంకార, ప్రత్యహంకారాలు కరిగి΄ోయి హృదయం విశాలమవుతుంది. అటువంటి వాతావరణం పెరుగుతున్న పిల్లల మీద సానుకూల ప్రభావాన్ని చూపించి, వారిలో సానుకూల దృక్పథం ఏర్పడేటట్లు చేస్తుంది. మన విశుద్ధి చక్రం ఆకాశ తత్త్వాన్ని కలిగి ఉంటుంది. వన భోజనాల వంటి సామూహిక కార్యక్రమాలలో ΄ాలుపంచుకొన్నప్పుడు, మన విశుద్ధి చక్రం అభివృద్ధి చెంది చక్కటి సంభాషణా చాతుర్యం అలవడి అందరితో సత్సంబంధాలను పెంపొందించుకొనగలుగుతాం. మన లోపల గల షట్చక్రాలు సహజమైన ప్రకృతిలో లభించే పంచ భూతాల తత్త్వాలతో చాలా వేగంగా స్పందిస్తాయి. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారి ఇలా కార్తీక మాసంలో వన భోజనాల ద్వారా అయినా ప్రకృతి ఒడిలో అందరూ మమేకమై, ధ్యానంతో, భజనలతో ఆట పాటలతో హాయిగా సేద తీరితే, సహజకుటుంబాల సామూహికత మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం. – డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా) (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
రూ. 240 కోట్ల విజేత: అమ్మానాన్నల కలలు తీరుస్తా...
యుఎఇ లాటరీలో తొలిసారిగా దిర్హామ్ 100 మిలియన్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిన తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా తన అదృష్టాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్ ఐటీ రంగంలో పనిచేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం అబుదాబికి వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు, తరువాత ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లే ముందు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుకున్నాడో గుర్తుచేసుకుంటూ’ఒక టికెట్ నా జీవితాన్ని మార్చివేసింది’ అని ఈ లాటరీ విజేత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనందంగా చెప్పాడు. తనకు విజయాన్ని అందించిన టికెట్ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందని, ఎందుకంటే దానిలో తన తల్లి పుట్టిన తేదీని నంబర్ కాంబినేషన్లో చేర్చారని అన్నాడు. తన తల్లిదండ్రులు సోదరుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలించడం తన తొలిప్రాధాన్యత అని అనిల్ చెబుతున్నాడు.యుఎఇ లాటరీ లో దాదాపు ఒక సంవత్సరం గా పాల్గొంటున్న బొల్లా, గత అక్టోబర్ 18 డ్రా కోసం 12 టిక్కెట్లను కొనుగోలు చేశానని, వాటిలో ఒకటి తనను దిర్హామ్‌ల 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను పొందిన మొదటి వ్యక్తిగా నిలిపిందని చెప్పాడు. రాబోయే తన సంపదను ఎలా నిర్వహించాలనుకుంటున్నాడో చెబుతూ తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ‘ఈ మొత్తాన్ని నేను ఎలా పెట్టుబడి పెట్టాలి – దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను‘ అని అనిల్ అన్నాడు. ‘గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు మాత్రమే ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పుడు ఇక నా ఆలోచనలు సరైన మార్గంలో ఉండాలి. ఏదైనా భారీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.‘ అన్నాడు.తనకు వ్యక్తిగత కలలు ఉన్నాయని, కానీ వాటిని కుటుంబ ప్రాధాన్యతలతో కలిపి సమతుల్యం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘నాకు సూపర్ కారు కొనాలనే కల ఉంది.అలాగే గొప్ప రిసార్ట్‌లో లేదా సెవెన్ స్టార్ హోటల్లో నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి వారితో కలిసి నా జీవితాంతం ఆనందించాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్నవి చాలా చాలా చిన్న కలలు , నేను వారి కలలన్నింటినీ నెరవేర్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను’’ అని వివరించాడు. అంతేకాకుండా బహుమతిలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వాలనే ప్రణాళికలను కూడా వెల్లడించాడు. ‘‘విరాళాలు నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులకు చేరుతాయని నమ్ముతున్నాను కాబట్టి నేను ఛారిటీకి కొంత డబ్బును ఇవ్వాలి అనుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నాడు. తన ప్రయాణం ఇతరులకు ప్రేరణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు ‘‘ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆటగాడు ఆడుతూనే ఉండాలని సూచిస్తున్నాను. ఏదో ఒక రోజు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’’ అంటూ ఉద్భోధిస్తున్నాడు.మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి తమ కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, భూలక్ష్మి ఈ వార్త విన్న తర్వాత తమ కుటుంబం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.‘లాటరీ గెలుపొందినట్లు మేం విన్నాము. మేం చాలా సంతోషంగా ఉన్నాము,‘ అని ఆమె అంటున్నారు. -
అదిగదిగో భద్రాద్రి..!
ఒక ఊర్లో ఒక ముసలవ్వ ఉండేది. ఆమెకు చిన్నప్పటినుంచీ భద్రాచలం వెళ్లాలని, గోదావరిలో మునిగి శ్రీసీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక. అయితే సంసార సాగరంలో మునిగి తేరుకునేలోగా ఆమెకు వయసు అరవై దాటింది.ఒకరోజు తన మనవడితో అదే విషయం చెప్పింది. ‘‘రాముణ్ణి చూడటానికి అంతదూరం పోవాలా? మన ఊరి గుడిలో రాములవారి పటం ఉంది కదా, రోజూ దాన్ని చూస్తూ పూజ చేసుకుంటే పోలేదా?’’ అని ఎదురు ప్రశ్న వేశాడు. అతడికి ఎలా సర్ది చెప్పాలో ముసలవ్వకు అర్థం కాలేదు. నెలలు గడిచాయి. ఆమె వయసు అరవై ఆరుకు చేరుకుంది. కోరిక తీరకుండానే ఫోటోకి పూలమాల వేయించుకోవాల్సి వస్తుందేమోనని అవ్వకు అనుమానం వేసింది. గట్టిగా మాట్లాడి మనవడిని ఒప్పించాలనుకుంది. ఒక నిండు పౌర్ణమినాడు మనవడు ఇంటికి వచ్చాడు. భద్రాచలం విషయం అడిగింది. ‘నువ్వు ఇప్పుడు భద్రాచలం వెళ్ళి రాముణ్ణి చూడకపోతే ఏమీ కాదు, ఇదిగో... రామకోటి రాసుకో. రాముణ్ణి చూసిన పుణ్యం కలుగుతుంది’’ అని చెప్పి పుస్తకం ఆమె చేతికి ఇచ్చాడు. పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. భోజనం చేద్దామని వంటగదిలోకి వచ్చాడు. ‘‘ఆకలిగా ఉంది, అన్నం పెట్టు’’ అని అడిగాడు. గడసరి అయిన అవ్వ ‘‘అన్నం, అని వందసార్లు ఈ తెల్ల కాగితం మీద రాయి, ఆకలి పోతుంది’’ అని చెప్పి తెల్లకాగితం, పెన్ను ఇచ్చింది. ‘‘అన్నం తింటే ఆకలి తీరుతుంది కానీ లక్షసార్లు రాస్తే కడుపు నిండదు, అన్నం తినాల్సిందే’’ అన్నాడు.‘‘మరి శ్రీరాముణ్ణి చూడాలని నేను ఎన్నో ఏండ్లుగా ప్రాధేయపడుతూ ఉంటే రామకోటి రాయమని చెబుతావేమి?’’ అని నిలదీసింది. తప్పు తెలుసుకున్నాడు. వీలు చూసుకుని పోదామన్నాడు. అవ్వ మురిసిపోయింది. అభిమానంగా పప్పూ నెయ్యి కలిపిన బువ్వ కడుపు నిండా పెట్టింది. తృప్తిగా తిన్నాడు.ఆరు నెలల తర్వాత ఇద్దరూ భద్రాచలం బస్సు ఎక్కారు. అప్పటికే ఆ ముసలవ్వ రాత్రింబగుళ్ళూ మేలుకుని రామకోటి పుస్తకం పూర్తి చేసింది. ‘రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము’ పాట పాడుకుంటూ ఇద్దరూ శ్రీ సీతారాములవారి దర్శనం చేసుకున్నారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..) -
వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..
అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది. ఇరుముడిని తలపై పెట్టుకుని.. ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామిఅండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….'పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియేపళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయిస్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే'అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా వనయాత్ర సమయంలో, "స్వామియే శరణం అయ్యప్ప" అని భక్తులు చెప్పే ఒక నినాదమే ఈ "కల్లుం ముల్లుం కాలికి మెత్తై". దీని అర్థం ఈ కఠినమైన వనయాత్ర మార్గంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు కూడా అయ్యప్ప దీక్షలోని భక్తి, శ్రద్ధ వల్ల వారికి మెత్తగా అనిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ యాత్రలో భాగంగా పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని భక్తిపారవశ్యంతో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతుంటారు..వాస్తవానికి మాలధారులు అయ్యప్ప దర్శనంకోసం పెద్దపాదం మార్గంలో కొందరు..చిన్నపాదం మార్గంలో మరికొందరు వెళతారు. అయితే ఈ పెద్దపాదం మార్గం భక్తులకు పలు సవాళ్లును విసురుతుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది భక్తి, ఓర్పు, ఆత్మనిర్భరత ప్రాముఖ్యతలను తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా పేర్కొనవచ్చు. మరి పెద్దపాదంగా పిలిచే ఈ వనయాత్ర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!నిజానికి అయ్యప్ప భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటుంటారు. పెద్దపాదం అంటేనే వనయాత్ర. ఇది ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవి గుండా సాగే పెద్దపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లితే ఆ ఫీల్ వేరేలెవెల్.ఎందుకు వనయాత్ర చేయాలంటే..ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు. రాళ్లు విసరడానికి రీజన్..పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. పురాణాల ప్రకారం..నిజానికి ఈ మార్గంలో భక్తులు పెరూర్‌తోడు, కాలైకట్టి వంటి ప్రదేశాలను దాటుతారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు కాలైకట్టి వద్ద నిలబడి చూశారని ఇతిహాసం. ఆ నేపథ్యంలోనే భక్తులు అళుదా నదిలో స్నానం చేసి, అక్కడ లభించిన ఒక రాయిని తమతో తీసుకువెళ్లి, మహిషి కళేబరాన్ని పూడ్చిన "కళిడం కుండ్రు"లో వేస్తారుఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం..ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నిస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి మకర జ్యోతి తర్వాత పెదపాదం మార్గం మూసివేస్తారు.ఈసారి గట్టి భద్రతతోపాటు అసౌకర్యానికి ఆస్కారం లేకుండా..ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ని కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన సన్నహాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలినడకన వచ్చే భక్తులకు ఈ అటవీ మార్గాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవీ రేంజ్ ఆఫీసర్ హరిలాల్ తెలిపారు. అంతేగాదు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటaల వరకు ప్రయాణానికి అనుమతి ఉంది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అటవీ సంరక్షణ కమిటీ (VSS, పర్యావరణ అభివృద్ధి కమిటీ(EDC) నేతృత్వంలో అటవీ శాఖ పర్యవేక్షణలో వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈసారి దారిలో ఆక్సిజన్ పార్లర్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కలయకెట్టులో ఆరోగ్య శాఖ చికిత్సా కేంద్రం ప్రారంభిస్తామని తెలిపింది. గత సీజన్లలో పాములు, సరీసృపాల దాడుల కారణంగా చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. ఈసారి అలాంటివి తలెత్తకుండా తక్షణ వైద్య సాయం అందేలా పర్యవేక్షించనున్నారు అధికారులు. కలయకెట్టూ, అలుదాలో ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం వల్ల సత్వర చికిత్స అందక భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారనేది వాదన. అదీగాకుండా ఎరుమేలి ఆసుపత్రికి తరలించడానికి సత్వరమే వాహనం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. (చదవండి: శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!) -
డెసర్ట్ టూర్: పర్యాటక మెరుపు వీచిక..!
నగరాలలో చారిత్రక సౌందర్యం. కోటలలో నిర్మాణ నైపుణ్యం. రాజమందిరాల్లో శిల్పచాతుర్యం. థార్ ఎడారిలో రాజస లాంఛనం. రాజస్థాన్‌కు మణిమకుటాలు. చిత్రమైన పిచ్వాయ్ కృష్ణుడు. నాథ్‌ద్వారా స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. గోల్డెన్ సాండ్స్ టూర్ ఆకర్షణలు. పర్యటనలో మెరుపు వీచికలు.హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయ్‌పూర్ చేరడం. ఉదయ్‌పూర్‌లో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. లంచ్ తర్వాత సిటీప్యాలెస్, లేక్ పిచోలా సందర్శనం. బస ఉదయ్‌పూర్‌లో. లేక్ సిటీ విహారం ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నగర చారిత్రక సౌందర్యం మెరుపు వీచికలుగా కనువిందు చేస్తుంటుంది. సిటీ ఆఫ్ లేక్స్ అని ఎందుకంటారో నగరంలో ఓ అరగంట ప్రయాణంలోనే తెలుస్తుంది. ఫతే సాగర్, పిచోలా, స్వరూప్ సాగర్, రంగ్ సాగర్, దూద్ తలాయ్ సరస్సులు ప్రధానమైనవి. ఈ సరస్సుల్లో కనీసం రెండయినా అరగంట ప్రయాణంలో కనిపిస్తాయి. వాటి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇక చారిత్రక కట్టడాల్లో ఆరు కిలోమీటర్ల సిటీ వాల్, నగరంలో ప్రవేశించడానికి సూర్జా΄ోల్, చాంద్΄ోల్, ఉదయ్΄ోల్, హాథీ΄ోల్, అంబా΄ోల్, బ్రహ్మపోల్, దిల్లీ గేట్, కిషన్పోల్ పేర్లతో ద్వారాలున్నాయి. ఇవి కూడా తారసపడతాయి. ఎయిర్పోర్ట్ నుంచి నగరంలో హోటల్ గదికి చేరే లోపే రెండు లేక్‌లు, రెండు ద్వారాలు, చేతక్ సర్కిల్ పర్యాటకులను చరిత్రయుగంలోకి తీసుకెళ్తాయి. పిచోలా సరస్సు ఒడ్డున సిటీ ప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్‌లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. కొంతకాలంగా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్ ఐకాన్ గోమాత ప్రింట్. ఫ్యాషన్ డిజైనర్లు చీరలు, చుడీదార్ల మీద గోమాత బొమ్మను డిజిటల్ ప్రింట్ చేస్తున్నారు. ఈ గోమాత చిత్రలేఖనం జగ్మందిర్ గోడల మీద కనిపిస్తుంది. లేక్‌కు మరొక ఒడ్డున దర్బార్‌హాల్ ఉంది. బొమ్మలతో కొలువు దీరిన దర్బార్‌హాల్ నాటి రాజకొలువును తలపిస్తుంది.2వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత సజ్జన్‌గఢ్ ఫోర్ట్ విజిట్. ఆ తర్వాత హల్దీఘాటీకి ప్రయాణం. మహారాణా ప్రతాప్ మ్యూజియం సందర్శనం తర్వాత నాథ్‌ద్వారాకు ప్రయాణం. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ విజిట్ తర్వాత హోటల్ గదికి చేరడం. బస ఉదయ్‌పూర్‌లోనే.సినీ ప్యాలెస్సజ్జన్గఢ్ ప్యాలెస్‌కు ప్రయాణం మొదలైన తరవాత ఉదయ్‌పూర్ నగర శివారు నుంచి మలుపు తిరగ్గానే జనసమ్మర్దం కొరవడుతుంది. దూరంగా కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తులో చిన్న నిర్మాణం కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అక్కడ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించడానికి జరిగిన ఏర్పాట్లు అర్థమవుతాయి. అటవీ ప్రదేశం మధ్యలో వాహనం వెళ్లడానికి మార్గం ఉంది. వెకేషన్‌కి వచ్చిన వాళ్లు ఒకరోజు ఈ ట్రెకింగ్‌కు కేటాయించవచ్చు. మేవార్ రాజు సజ్జన్‌సింగ్ ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం నిర్మించిన ప్యాలెస్ ఇది. సజ్జన్‌సింగ్ మరణం తర్వాత ఆ ఉద్దేశం నెరవేరలేదు. అటవీ ప్రదేశం నేపథ్యంలో ఒక కోట కేంద్రంగా కథ నడిచే సినిమాల్లో ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. జేమ్స్ బాండ్ సినిమా అక్టోపసీ సినిమాలో రోజర్మూర్ ఈ కోట నుంచి పారిపోయే సన్నివేశం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ద చీటా గర్ల్స్ వంటి మరికొన్ని సినిమాలకు కూడా ఈ ప్యాలెస్... విజువల్ రిచ్నెస్నిచ్చింది. రాణాప్రతాప్ పోరుగడ్డమేవార్ రాజ్యానికి మొఘల్ పాలకులకు మధ్య యుద్ధం జరిగిన పోరుగడ్డ హల్దీఘాటీ. మేవార్ రాజ్యం తరఫున రాణా ప్రతాప్, మొఘల్ సామ్రాజ్యం తరఫున మాన్సింగ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉదయ్‌పూర్ నుంచి ఈ ప్రదేశానికి వెళ్లే మార్గం ఒక అడ్వెంచరస్ టూర్‌ని తలపిస్తుంది. కొండల నడుమ కనుమ గుండా దట్టమైన అడవి మధ్యలో సాగుతుంది ప్రయాణం. దాదాపుగా 30 కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిలో ఎర్రదనం తగ్గుతూ పసుపు చారలు మొదలవుతాయి. కొంతదూరం వెళ్లేసరికి నేల గోరంత పసుపురాసుకున్నట్లు ఉంటుంది. యుద్ధభూమికి చేరే లోపు చేతక్ స్మారకం పాలరాతి నిర్మాణం కనిపిస్తుంది. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం, ఎన్నో విజయాలను సాధించి పెట్టిన గుర్రం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి బరువెక్కిన గుండెతో హల్దీఘాటీకి చేరతాం. యుద్ధక్షేత్రానికి చేరే లోపే ఆకాశమంత ఎత్తులో ఠీవిగా సింహాసనం మీద ఆసీనుడైన రాణాప్రతాప్ కంచు విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన భారీ మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. హల్దీఘాటీలో జరిగిన యుద్ధంలో రాణాప్రతాప్ తన రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు. రాజస్థాన్ కృష్ణుడుఇక్కడ శ్రీకృష్ణుడిని శ్రీనాథ్‌గా పిలుచుకుంటారు. వల్లభాచార్యుడి సంప్రదాయం శుద్ధ అద్వైతాన్ని ఆచరిస్తారు. స్థానికులు గోవర్ధన గిరిధారి రూపంలో ఉన్న కృష్ణుడిని కొలవడమే కాదు, ఇక్కడ చిత్రకారులు కూడా ఈ రూపంలో కృష్ణుడి బొమ్మలో వేయడంలో నిష్ణాతులు. వీరిది ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రాలను పిచ్వాయ్ పెయింటింగ్స్ అంటారు. మేవార్‌లో విస్తరించిన చిత్రలేఖనాల శైలి ఇది. ఈ టూర్ గుర్తుగా ఒక పెయింటింగ్ కొనుక్కోవడం మరువద్దు. నాథ్‌ద్వారాకు మరొక టూరిస్ట్ అట్రాక్షన్ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ శివుడి విగ్రహం. విశ్వాస స్వరూపం పేరుతో 369 అడుగుల శివుడి విగ్రహాన్ని 2022లో ప్రతిష్ఠించారు. ప్రపంచంలోని శివుడి విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన రూపం ఇదే.3వ రోజుబ్రేక్ఫాస్ట్ త్వరగా ముగించుకుని గది చెక్ అవుట్ చేసి జయ్ సల్మేర్‌కు బయలుదేరాలి. జయ్సల్మేర్లో డెసర్ట్ క్యాంప్‌లో చెక్ ఇన్. రాత్రి భోజనం, బస అక్కడే.జీవిస్తున్న కోటజయ్సల్మేర్ కోట ఒక ఊరంత... కాదు, పట్టణమూ కాదు, ఓ మోస్తరు నగరమంత ఉంటుంది. ఈ కోటను క్రీ.శ 12వ శతాబ్దంలో రాజపుత్ర పాలకుడు రావల్ జయ్సల్ నిర్మించాడు. అందుకే ఈ కోటకు జయ్‌సల్మేర్ అని పేరు. ఇది మన వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి కాలానిది. యునెస్కో ఈ రెండింటినీ వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది. జయ్‌సల్మేర్ కోట లివింగ్ ఫోర్ట్. అంటే ఈ కోటలో జనజీవనం కొనసాగుతోంది. జనజీవితం కొనసాగుతున్న ప్రాచీన కోటలు అరుదుగా ఉంటాయి. జయ్ సల్మేర్ కోట గోడలు పసుపురంగు రాతితో నిర్మించడంతో దీనిని గోల్డెన్ ఫోర్ట్రెస్ అంటారు. ఈ కోటలోని పాలరాతి ఆలయాలు, రాజమందిరాల గోడలకు చెక్కిన గవాక్షాల డిజైన్లను ఎంత సేపు చూసినా ఇంక చాలు అనే సంతృప్తి కలగదు. ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది. కలంకారీ అద్దకాలు, స్క్రీన్ ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో కనిపించే ట్రెండింగ్ డిజైన్లు ఈ గోడల మీదవే. బాలీవుడ్ ఇండస్ట్రీకి గొప్ప లొకేషన్ ఇది. హమ్ దిల్ దే చుకే సనమ్, షోలే, ద ఫాల్, భజరంగ్ భాయీ జాన్‌తోపాటు తెలుగు సినిమా కొండపల్లి రాజాలో ఒక పాట చిత్రీకరణ జయ్‌సల్మేర్ కోటలో జరిగింది.ఎడారిలో ఓ రాత్రిరాజపుత్రుల రిచ్ లైఫ్‌స్టైల్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే థార్ ఎడారి డెసర్జ్ క్యాంప్‌లో గడపాలి. సాయంత్రం నీరెండలో బంగారు రజను రాశిపోసినట్లున్న ఎడారి ఇసుకలో జీప్ సఫారీ ఒక రకమైన సంతోషం. ఒంటె మీద విహారం లయబద్ధంగా కదులుతూ ముందుకు సాగుతుంటే మరో లెవెల్ ఎంజాయ్మెంట్. ఇక ఎడారిలో ఆధునిక సౌకర్యాలతో గుడారాలు, చలిమంట, నాటలు, డాన్సులు, రాజస్థానీ రుచులతో చక్కటి భోజనాలు పూర్తయిన తర్వాత గుడారంలో నిద్ర. తెల్లవారే సరికి అంతా కలలోలాగ గడిచిపోతుంది.4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత డెసర్ట్ క్యాంప్ బస నుంచి చెక్ అవుట్ అయి జయ్ సల్మేర్ కోటకు ప్రయాణమవ్వాలి. కోట తర్వాత పట్వోన్ కీ హవేలీ, గాడిసర్ లేక్ విహారం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, బస జయ్‌సల్మేర్ సిటీలో.శిలకు పూచిన పూలుజయ్ సల్మేర్ కోటలో ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం ఈ హవేలీ. దూరం నుంచి చూస్తే గోడల నిండుగా పెయింటింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే అవన్నీ గోడకు పూసిన పూలే. కొన్ని శిలకు చెక్కిన విరిశిల్పాలు, మరికొన్ని కట్టడంలో గోడకు పూలతీగలు, విరిసిన పూలను నిర్మించారు. వాటికి రంగులద్దారు. భవనంలో విరిసిన ఉద్యానవనం విరిసినట్లుంది. ఈ హవేలీ క్రీ.శ 18వ శతాబ్దం నాటి నిర్మాణకౌశలానికి నిలువెత్తు నిదర్శనం. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జో«ద్‌పూర్‌కు ప్రయాణం. మెహరాన్‌గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, రాత్రి బస జోద్‌పూర్‌లో.విజయద్వారాల కోటఉదయ్పూర్ నగరంలో ద్వారాలున్నట్లే ఇక్కడ కూడా ద్వారాలున్నాయి. అయితే ఇవి కోట నిర్మాణ సమయంలో కట్టినవి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో నిర్మించినవి. జయ్΄ోల్ను జయ్‌పూర్, బికనీర్ రాజ్యాలతో యుద్ధం చేసి గెలిచిన సందర్భంలో మహారాజా మాన్సింగ్ కట్టాడు. మొఘలుల మీద గెలిచినప్పుడు ఫతేపోల్ నిర్మాణం జరిగింది. లోహ΄ోల్ దగ్గర గోడ మీద మహిళల చేతి ముద్రలను చూడగానే మనసు బరువెక్కుతుంది, స్త్రీలకు జరిగిన అన్యాయానికి సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన నేపథ్యం అది. భర్తను కోల్పోయిన రాణులు, యువరాణులు సతిలో పాల్గొనే ముందు తమ చేతిముద్రలను గోడకు అద్దేవారు. నాటి దురాచానికి నిదర్శనంగా ఆ ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. మెహరాన్‌గఢ్ కోటలోపల మోతీమహల్, ఫూల్ మహల్, శీష్ మహల్లు అందమైన నిర్మాణాలు. ఇక్కడ మ్యూజయంలో బంగారు పల్లకి ఉంది. కోట పై భాగంలో పెద్ద ఫిరంగిని చూడగానే కొద్దిగా భయం వేస్తుంది. మనసు కుదుటపరుచుకున్న తర్వాత అక్కడి నుంచి చూస్తే నగరం వ్యూ అందంగా ఉంటుంది.6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమైద్ భవన్ ΄్యాలెస్ మ్యూజయం వీక్షణం తర్వాత మధ్యాహ్నం జో«ద్‌పూర్ ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేస్తారు. విమానం సాయంత్రం ఐదున్నరకు బయలుదేరి ఏడున్నరకు హైదరబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఉపాధి హామీ భవనంరాజపుత్రుల కోటలు, ప్యాలెస్‌లలో ఉమైద్ భవన్ ప్యాలెస్ కొత్తదనే చెప్పాలి. ఇది 20వ శతాబ్దపు నిర్మాణం. ఇది అత్యంత ఆధునికమైన నిర్మాణం. క్రీ.శ 1929లో మొదలై, 1943లో పూర్తయింది. అప్పటికే దేశంలో బ్రిటిష్ వలస పాలన వేళ్లూనుకుని ఉంది. వలస పాలకులు వద్దంటూ స్వాతంత్య్రం కోసం పోరాటం కూడా ఊపందుకుని ఉంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడానికి కారణం అనావృష్టి. అవును వరుసగా మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు వేసే అవకాశం లేక పొలాలు బీళ్లుగా మారాయి. రైతులకు పని లేదు. అలాంటి సమయంలో ఉపాధి కల్పన కోసం మహారాజా ఉమైద్ సింగ్ ఈ నిర్మాణాన్ని తలపెట్టాడు. రోజూ రెండు నుంచి మూడు వేల మంది పని చేసేవారు. మఖరానా మార్బుల్, బర్మా టేకుతో నిర్మాణపరంగా ప్రత్యేకమైనదే. ప్రస్తుతం ఇది తాజ్ హోటల్స్ నిర్వహణలో ఉంది. కోటలో కొంత భాగం, మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతిస్తారు.ప్యాకేజ్ పేరు: గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్.ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 20. ఇందులో ప్రధానంగా ఉదయ్‌పూర్, జై సల్మీర్, జోద్పూర్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 49,650 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 38 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 36,550 రూపాయలు. ప్రయాణం ఎప్పుడు? ఆరు రోజుల ఈ పర్యటన నవంబర్ 22వ తేదీన మొదలయ్యి 27వ తేదీతో ముగుస్తుంది. ఇదే టూర్ 23 నుంచి మరొక ట్రిప్ మొదలవుతుంది. అది 28వ తేదీ పూర్తవుతుంది. 22వ తేదీ ఉదయం 8.45 గంటలకు 6ఈ 846 విమానం హైదరాబాద్‌లో మొదలవుతుంది. 10. 25 గంటలకు ఉదయ్‌పూర్‌కి చేరుతుంది (23వ తేదీ ట్రిప్‌కి కూడా ఇదే నంబరు విమానం, ఇదే టైమ్)తిరుగుప్రయాణం 27వ తేదీన జో«ద్‌పూర్ నుంచి 6ఈ 6816 విమానం సాయంత్రం 17. 30 గంటలకు బయలుదేరి, 19.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.ప్యాకేజ్‌లో ఏమేమి వర్తిస్తాయి?విమానం టికెట్లు (హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్, జోద్పూర్ నుంచి హైదరాబాద్) హోటల్ బస(4 రోజులు), డెసర్ట్ క్యాంప్ బస (ఒకరోజు) బ్రేక్‌ఫాస్ట్‌లు 5, లంచ్ 1, డిన్నర్లు 5 n సైట్ సీయింగ్‌కి (ఐటెనరీలో ప్రకటించిన ప్రదేశాలకు మాత్రమే) ఏసీ బస్సు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ప్యాకేజ్లో ఇవి వర్తించవు!భోజనంలో మెనూలో లేకుండా అదనంగా ఆర్డర్ చేసుకున్న పదార్థాలు, పానీయాలు ఫ్లయిట్లో ఆర్డర్ చేసుకున్న ఆహారం సైట్ సీయింగ్‌లో ఇతర ప్రదేశాల వీక్షణం వంటివి (ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆలయాలు, ప్రార్థనమందిరాలు, ఆసక్తి కలిగించే ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి రవాణా, ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్ల వంటివి ప్యాకేజ్‌లో వర్తించవు) టిప్‌లు, గైడ్, లాండ్రీ ఖర్చులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో ముగుస్తుంది. కాబట్టి హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కి చేరడానికి, ఎయిర్పోర్ట్ నుంచి రవాణా ఇందులో వర్తించవు. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!) -
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!
శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. రోజుకు గరిష్టంగా దాదాపు 20 వేల మంది స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ కేంద్రాల వివరాలు..ఎరుమేలి (Erumeli)అయ్యప్ప భక్తుల యాత్రలో ఆచారప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం.వండిపెరియార్ – పుల్మేడు (Vandiperiyar - Pulmedu)నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు.నీలక్కల్ (Nilakkal)యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ.పంబ (Pamba)ఆలయానికి ఎక్కే మెట్లు ప్రారంభమయ్యే ముందు ఉన్న చివరి యాత్రా కేంద్రం.గుర్తించుకోవాల్సినవి..రోజుకు పరిమత స్థానాలు: కేవలం 20,000 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.గుర్తింపు కార్డు: చెల్లుబాలు అయ్యే గుర్తింపు పత్రం(ఆధార్ కార్డ్ తప్పనిసరి)బుకింగ్ సమయం: ఆన్లైన్ స్లాట్ల రోజువారీ కోటా ఫుల్ అయిన తర్వాత మాత్రమే స్పాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.(చదవండి: ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్) -
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్
మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాత్రి ఈ నియామకం ఖరారయ్యింది. కేరళలోని సీపీఎం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో తుది రౌండ్లో ఐదు పేర్టను షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో జయకుమార్‌కు అగ్రప్రాధ్యానత్య లభించింది. దేవస్వం మంత్రి విఎన్ వాసనవన్ పతనం తిట్ట నుంచి సతీషన్‌ను సిఫార్సు చేయగా, పార్టీ ముఖ్యమంత్రి ఎంపికనే ఫైనల్ చేయాలని నిర్ణయించింది. దాంతో మాజీ ఐఏఎస్ అధికారి నియామకానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా టీడీపీ చీఫ్ సెక్రటరీగా, వైస్ ఛాన్సలర్‌గా, ప్రత్యేక కమిషనర్‌గా, అలాగే శబరిమల మాస్టర్ ప్లాన్ చైర్మన్‌గా పనిచేసిన ఒక పరిపాలనాధికారి(ఐఏఎస్ అధికారి) ఇలా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకి అధ్యుకుడిగా బాధ్యతలు స్వీకరించడం టీడీబీ చరిత్రలోనే తొలిసారి. ఈ మేరకు మాజీ ఐఏఎస్ అధికారి జయకుమార్ మాట్లాడుతూ..శబరిమలలో తనకున్న పూర్వ అనుభవాన్ని చెబుతూ..శబరిమల పనితీరు తనకు బాగా తెలుసని చెప్పారు. భక్తులు సంతృప్తికరంగా ఆలయాన్ని సందర్మించేలా చూస్తానని అన్నారు. అలాగే రాజకీయ జోక్యం లేకుండా దేవస్వం బోర్డు వ్వవస్థ మొత్తాన్ని పునరవ్యవస్థీకరించి శబరిమల, టీడీపీపై ప్రతి అయ్యప్ప భక్తుడికి నమ్మకం, విశ్వాసం కలిగేలా గట్టి చర్యలు తీసుకుంటానని నమ్మకంగా చెప్పారు.(చదవండి: Pulmedu Sabarimala forest path: శబరిమలకు వెళ్లే.. ఈ రూటు ఎన్నో విశిష్టతలకు ఆలవాలం..!) -
పర్వతమే పరమేశ్వరుడు..!
కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.ఆలయ విశేషాలుతిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.ఎలా వెళ్ళాలంటే..?కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.గిరి ప్రదక్షిణఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది. (చదవండి: Kashi Manikarnika Ghat Mystery: కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..? దాగున్న ఆధ్యాత్మిక రహస్యం) -
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా..?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చె΄్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు.ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు. ‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు? ’ అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్‌కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..?
కాశీ లేదా బనారస్‌గా పిలిచే వారణాసిని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాశీ, వారణాసి రెండు వేర్వేరు కాదు. వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే గంగానది ఒడ్డునే జీవన్మరణాలు కలిసే పవిత్ర స్థలం ఉంది. అదే అత్యంత ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక ఘాట్. ఇక్కడే శవాలను దహనం చేసేది. ఇది హరిశ్చంద్రుల కాలం నుంచే నిరంతరం మండుతూనే ఉన్నట్లు చెబుతుంటారు. అంతేగాదు దీన్ని ప్రపంచంలోని అత్యంత మర్మమైన దహన సంస్కార ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఇక్కడ అంత్యక్రియల అనంతరం జరిగే ఒక తంతు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అక్కడ చితి చల్లారక ప్రజలు బూడిదపై 94 సంఖ్యను రాస్తారట. అలా ఎందుకు రాస్తారు..దానిలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇక్కడ వారణాసిలో ఎన్నో ఇతర ఘాట్లు ఉన్నా.. ఈ మర్ణికఘాట్కే అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ముందుగా ఈ ప్రదేశానికే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..మర్ణికఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..హిందూ పురాణాల ప్రకారం సతీదేవి చెవి ఆభరణం(కర్ణ కుండలం) పడిపోయిన ప్రదేశం కాబట్టి ఈ ఘాట్‌కి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అలాగే మరో పురాణ కథనం ప్రకారం శివుడు సుదీర్ఘ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడూ..విష్ణువు తన సుదర్శన చక్రంతో ఇక్కడ పవిత్ర చెరువుని సృష్టించాడని, ఆ చెరువులో శివుడు స్నానం చేసి వచ్చినప్పుడూ అతని చెవిపోగు((మణికర్ణిక) జారిపడి అదృశ్యమైందని అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారని చెబుతుంటారు. అంతేగాదు దీన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అగ్నిజ్వాలలు నిరంతరం ఎగిసిపడుతూనే ఉంటాయట. పగలు, రాత్రి అనునిత్యం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయట. ఇది విముక్తిని ప్రసాదించే ప్రవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారట.బూడిదపై 94 రాయడానికి కారణం..ఈ మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు చేసిన వ్యక్తి..అంటే ఆ కార్యక్రమం జరిపే కుటుంబ సభ్యుడు అగ్ని చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాస్తారట. ఈ చర్య అక్కడ స్థానిక సంప్రదాయంలో భాగమట. ఈ సంఖ్య మరణించిన వ్యక్తి ఆత్మ విముక్తి కోరికను సూచిస్తుందట. మోక్ష మంత్రంగా '94'ఈ సంఖ్యను అక్కడ స్థానికులు ముక్తి మంత్రంగా పిలుస్తారట. ఆ సంఖ్యను వ్రాసిన తర్వాత అతడికోసం దుఃఖిస్తున్న కుటుంబ సభ్యుడు ఆత్మను స్వర్గం వైపు నడిపించమని శివుడిని ప్రార్థిస్తాడట. తర్వాత చితిపై నీటి కుండను పగలు కొడతాడు. ఇది అంత్యక్రియల ఆచారం ముగింపుని సూచిస్తుంది.ఈ సంఖ్యలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం..హిందూ శాస్త్రాల ప్రకారం మానవుడి జీవితాన్ని 100 కర్మలు నడిపిస్తాయట. వాటిలో 94మనిషి చేతుల్లో ఉన్న కర్మలు. మిగిలిన ఆరు మాత్రం దైవాధీనంలో ఉంటాయి. జీవితం, మరణం, లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి అనే ఆరు కర్మలు బ్రహ్మచే ముందే నిర్ణయించబడినవి, పైగా మానవ నియంత్రణకు మించినవట. మిగిలిన 94మనిషి చేతితో నిర్మించిన మార్గాలగా చెబుతారు. అంటే మనిషి ఆలోచనలు, చర్యలు, ధర్మం, పాపం లాంటి ఈ 94 సంఖ్యల్లో ఉంటాయి. మణికర్ణిక ఘాట్‌లో దహనమవుతున్నప్పుడు ఆ కర్మలు అగ్నిలో కరిగిపోతాయని, మిగిలేది దేవుని నిర్ణయమని నమ్మకం. అందుకే ఆ సంఖ్యను రాయడం అనేది దివ్య సమర్పణతో పాటు జీవన సమీకరణం కూడా అని స్థానిక పండితులు చెబుతున్నారు.అందువల్లే చితి చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాసి.. ఈ మానవ లక్షణాలకు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కోరూతూ..శివుడిని ప్రార్థిస్తారట. ఈ ఆచారం కేవలం మణికర్ణిక ఘాట్‌లోని దహన సంస్కాల వద్ద మాత్రమే అనుసరిస్తారట. దీని గురించి ఏ హిందూ గ్రంథంలోనూ ప్రస్తావించలేదట. అక్కడ స్థానికుల నుంచి పరంపరగా సాగుతన్న సంప్రదాయమట. అంతేగాదు. ఈ సంఖ్య'94' రాయడం అనేది మోక్షానికి ప్రతీకాత్మక అభ్యర్థన అని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
ఆ నియామకం మీ హక్కు కాకున్నా... మీరు ఆ ఉద్యోగానికి అర్హులే!
మా అమ్మగారు ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేవారు. ఇంకో 3 సంవత్సరాలు సర్వీసు ఉండగానే ఆమె చనిపోయారు. ఇది జరిగి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆయనకి 68 ఏళ్లు. మా అమ్మగారు పోయాక మనస్తాపంతో ఆయన వ్యాపారం సరిగా చేయలేక΄ోతున్నారు. రేపో మాపోవ్యాపారం మూతపడేలా ఉంది. నేను డిగ్రీ చదివాను కానీ నిరుద్యోగిని. అందువల్ల మా అమ్మగారి ఉద్యోగం నాకు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఇది జరిగి ఏడాదిపైనే అయినప్పటికీ ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే ఏదో ఒక కారణం చూపి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు. మా అమ్మ గారి ఉద్యోగం నాకు వస్తుందా? –హరికృష్ణ, రాజమండ్రి సానుభూతి లేదా కారుణ్య నియామకం (Compassionate Appointment) అనేది మానవతా దృక్పథంతో ఇచ్చే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ, అది ఎవరి వారసత్వ హక్కు కాదని జస్టిస్ దీ΄ాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. అంతేకాక, సానుభూతి నియామకాలలో పరిగణించవలసిన అంశాలను, 10 న్యాయ సూత్రాలను కూడా సూచించింది. అందులో భాగంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు : సానుభూతి నియామకం అనేది ప్రజా ఉ;eధికి (అందరికీ సమానంగా రావాల్సిన ఉద్యోగ అవకాశాలకు) ఒక మినహాయింపే తప్ప హక్కు కాదు.సానుభూతి నియామకం కోసం ప్రభుత్వం లేదా ఆ యాజమాన్యం/సంస్థ చట్టబద్ధమైన – నిర్దిష్టమైన నియమాలు, ఆదేశాలు జారీచేయాలి. అవి లేకుండా నియామకం చేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం లేదా ఆరోగ్య కారణాలతో పనిచేయలేకపోవడం (మెడికల్ అన్ ఫిట్) వల్ల కుటుంబం పడే ఆర్థిక సంక్షోభాన్ని తీరుస్తుందే తప్ప, ఇతర సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి నియామకాలు ఆలస్యం కాకుండా త్వరగా ఇవ్వాలి, ఎందుకంటే కుటుంబం ఎదుర్కొనే కష్టాలకు తక్షణ ఉపశమనమే దీని ఉద్దేశ్యం. ∙ఇది ‘‘సైడ్ డోర్ ఎంట్రీ’’గా పరిగణించబడుతుంది కాబట్టి, నియమాలను కఠినంగా అమలు చేయాలి. ఇది శాశ్వత హక్కు కాదు. అభ్యర్థి సంబంధిత నియమాల్లో ఉన్న అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ∙కుటుంబం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేదా అన్నదే ప్రధానం. కుటుంబ పరిస్థితిని పరిగణించకుండా ఇచ్చే నియామకాలు చట్టబద్ధం కావు. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఆ ఉద్యోగి మరణం లేదా అశక్తత తర్వాత తక్షణమే ఇవ్వాలి. సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబానికి తక్షణ అవసరం లేదన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. నియమాలు అనుమతిస్తే తప్ప, చిన్నవాడైన అభ్యర్థి పెద్దవాడయ్యేవరకు ఉద్యోగాన్ని అలాగే ఉంచరాదు. ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య బీమా వంటి పెన్షన్ బెనిఫిట్ స్కీం కింద లభించే నెలవారీ చెల్లింపులు సానుభూతి నియామకానికి అడ్డం కావు.పైన చెప్పిన నియామకాల్లో మీకు ప్రతికూలంగా ఏమీ లేవు. ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్ని మీ దరఖాస్తులో ప్రస్తావించారనే అనుకుంటున్నాను. పైగా మీరు మీ అమ్మగారు మరణించిన వెంటనే దరఖాస్తు కూడా చేసుకున్నారు. పైన పేర్కొన్న నియమాలలో మీరు సరిపోకపోతే తప్ప, మీకు ఉద్యోగాన్ని తిరస్కరించే హక్కు ఆ సంస్థవారికి లేదు. ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే, త్వరితగతిన మీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీరు హైకోర్టును ఆశ్రయించటం ఉత్తమం.ఇదీ చదవండి: దిగుబడుల్లో అంతరాలెందుకుశ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ఘనంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట
కోకాపేటలోని ఏఎస్బీఎల్ స్పైర్లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి) -
శబరిమలలో రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి
శబరిమల యాత్రా కాలం ప్రారంభానికి ముందే నీలక్కల్లో రూ.6.12 కోట్లతో అధునాతన స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఆసుపత్రిని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) కేటాయించిన స్థలంలో నిర్మించనున్నారు. మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సౌకర్యం నివాసితులకు, ఆలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిజానికి ఈ ఆస్పత్రి ఏర్పాటు శబరిమల యాత్రికుల శ్రేయస్సుని నిర్థారించడంలో ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. సుమారు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఔట్ పేషెంట్ గదులు, అత్యవసర విభాగం, ఐసియు,నర్సుల స్టేషన్ , ఇసిజి గది, ఫార్మసీ వంటివి ఉంటాయన్నారు. మొదటి అంతస్థులో ఎక్స్‌రే, బహుళ ఆపరేటింగ్ స్క్రభ్ స్టేషన్ తదితరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీలక్కల్ బేస్ క్యాంప్‌కు రోడ్డు మార్గంలో వచ్చే యాత్రికులకు అత్యవసర,సాధారణ వైద్య సహాయాన్ని ఈ ఆస్పత్రి గణనీయంగా బలోపేతం చేస్తుందని మంత్రి వీణా జార్జ్ అన్నారు. నీలక్కల్ ఆలయ సమపంలోనే ఈ ఈ ఆస్పత్రి నిర్మాణ ప్రారంభోత్సవం జరగునుంది. దీనికి ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ , ఎంపీ ఆంటో ఆంటోనీ , డిప్యూటీ స్పీకర్ చిత్తయం గోపకుమార్ , జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జార్జ్ అబ్రహం , టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తదితరులు హాజరు కానున్నారు. కాగా, నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండు నెలల వార్షిక తీర్థయాత్ర కాలంలో భారతదేశం, విదేశాల నుంచి వేలాది భక్తులు శబరిమలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!
కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే. ఆఖరున శబరిమల వెళ్లి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష ముగించడం జరగుతుంది. సాధారణంగా అయ్యప్ప ఆలయం నవంబర్, జనవరి మధ్య కాలంలోనే తెరుస్తారనే విషయం తెలిసిందే. అది కూడా మండలదీక్ష పూర్తి చేసుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక విశిష్ణ పూజ నిమిత్తం ఐదు రోజులు తెరిచే ఉంచుతారు. అది శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా ఆ పండుగ విశేషాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.ఆ పండుగే చిత్తిర అట్టవిశేషం (అత్తతిరునాల్) ఇది శబరిమలలో జరుపుకునే ప్రత్యేక పండుగ. ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారట. ఆయన గౌరవార్ధం ఈ వేడుకను నిర్వహిస్తారు. అప్పటి పందళం రాజవంశం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్కు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే ఈవేడుకను ఆలయన నిర్వహాకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆయన పుట్టిన రోజున 1942లో చితిర తిరునాళ్ మహారాజు తన కుటుంబంతో శబరిమల సందర్శించినందుకు గుర్తుగా కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మహారాజు తమ్ముడు ఉత్రాడం తిరునాల్ మార్తాండ వర్మ శబరిమల దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అది ఇప్పటికీ నెట్టింట వైరల్ ఫోటోగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేడుకను మహారాజు జన్మదినమైన తులా మాసంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున నిర్వహిస్తారు. చెప్పాలంటే సాధారణంగా ఆ పండుగ అక్టోబర్ నెలాఖరు-నవంబర్ మొదటి వారంలో జరుగుతుంటుంది.చిత్తిర అట్టవిశేషం విశిష్టత..అత్తతిరునాల్ పూజ కోసం అయ్యప్ప ఆలయం దాదాపు 29 గంటలు తెరిచి ఉంటుంది. ఈ వేడుకను అచ్చం మళయాళుల జరుపుకునే సంవత్సరాది వేడుక మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ పండుగ రోజు ఉదయ 5 గంటలకు ఊరేగింపు, అభిషేకం జరుగుతాయి. దాంతోపాటు నెయ్యాభిషేకం, అష్టద్రవ్య మహాగణపతి హోమం, ఉష పూజ వంటి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే..తిరువనంతపురంలోని కవడియార్ ప్యాలెస్ నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం తీసుకొచ్చిన ప్రత్యేక నెయ్యిని అయ్యప్పస్వామికి అభిషేకం చేస్తారు. అంతేగాదు ఈ ప్రత్యేక రోజున, అయ్యప్పన్ సన్నిధిలో ఉదయం సాయంత్రాల్లో పూజ, అష్టాభిషేకం, లక్షార్చనే, సహస్రకలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రి భోజనాల అనంతరం భస్మానికి అభిషేకం చేసి 10 గంటలకు హరివరాసన గానంతో ఊరేగిస్తారు. ఈ ‘చిత్తిర అట్టవిశేషం’ వేడుకల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు మండలం(మండల దీక్ష) కోసం తిరిగి నవంబరు నుంచి మూడు మాసాల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలోనే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..) -
చుక్క నెత్తురు రాలకుండా...
బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 5న ప్రవేశపెట్టిన ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ దరిమిలా భారత దేశంలో విభజన అల్లర్లు ఒక్కసారిగా ఊపందు కున్నాయి. మరోవైపు స్వతంత్రంగా ఉన్న 562 సంస్థానాలను సర్దార్ వల్ల భాయి పటేల్ ఆధ్వర్యంలో ‘స్టేట్స్ డిపార్ట్మెంట్’ ఒకటి ఏర్పాటుచేసి ‘ఇన్స్ట్రు మెంట్ ఆఫ్ యాక్సెషన్’ (విలీన ఒప్పందం) ద్వారా ఇండియాలో విలీనం చేయనారంభించారు. ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, కశ్మీర్, జూనాగఢ్ మినహా మిగతా రాజ్యాలు చాలావరకు భారత దేశంలో కలసిపోయాయి. హైదరాబాదుతో పాటు భోపాల్,రాంపూర్, మహమూదాబాద్ వంటి 11 సంస్థానాలు ముస్లిం నవాబుల అధీనంలో ఉండేవి. కశ్మీరు, హైదరా బాదు అలీనంగా ఉండదలచుకుని విలీన పత్రంపైసంతకం చేయలేదు. కానీ, గుజరాత్‌లోని జూనాగఢ్ నవాబు మహబత్ ఖాన్ మాత్రం తన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపనున్నట్లు ఆగస్ట్ 14న వెల్లడించారు. జూనాగఢ్ దీవాన్ (ప్రధాని) షానవాజ్ భుట్టో (పాకిస్తాన్ మాజీ అధ్య క్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి), ముస్లిం లీగ్ నేత జిన్నాను సంప్రదిస్తూనే ఉన్నారు. వేరావలి పోర్టు నుండి పాకిస్తాన్ యుద్ధ సామగ్రి జూనాగఢ్ చేరు తున్న వార్తలు రావటంతో, ఇండియన్ నేవీ నౌకలను పర్యవేక్షణ కోసం అటు పంపా లనే పటేల్ సలహాను భారత నౌకాదళానికి చెందిన బ్రిటిష్ అధికారి అడ్మిరల్ జాన్ టి. హాల్ తోసిపుచ్చారు. ఆ తిరస్కారాన్ని పటేల్ సహించలేక పోయారు. నెహ్రూ తటస్థ వైఖరి కూడా ఆయనకు నచ్చలేదు. ‘24 గంటల్లో జూనాగఢ్‌కు భారత్ మిలిటరీ వెళ్లకుంటే, నేను కేబినెట్ నుండి తప్పుకుంటా’ అని ప్రధాని నెహ్రూకు అల్టిమేటం ఇచ్చారు. ఇంతలో హిందూ–ముస్లిం అల్లర్లు రాజుకున్నాయి. పటేల్ తీసుకున్న రాజ కీయ నిర్ణయంతో ఆ రోజు రాత్రి నెహ్రూ, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరుసటి రోజు జూనాగఢ్ సరిహద్దుప్రాంతాల్లోని భావనగర్, పోర్బందర్, నవానగర్లకు భారత సైన్యం, నౌకా బలగాలు చేరుకున్నాయి. ఇక ఏ క్షణంలోనైనా జూనాగఢ్ ప్యాలెస్ ముట్టడి జర గొచ్చు. పరిస్థితిని అర్థం చేసుకున్న నవాబ్ మహబత్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 1947 అక్టోబరు 24న ప్రత్యేక విమానంలో కరాచీ వెళ్ళి పోయారు. నవంబరు 1న ఇండియన్ ఆర్మీ జూనాగఢ్ చేరుకుంది. తర్వాత దివాన్ షానవాజ్ భుట్టో రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని భారత్‌కు అప్పగించి పాకిస్తాన్ చేరుకున్నాడు. పటేల్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఏ రక్తపాతం లేకుండా జూనాగఢ్ భారత్‌లో కలిసిపోయింది. (జాన్ జూబ్రిజీకి రచన ‘డీత్రోన్’ ఆధారంగా)– జిల్లా గోవర్ధన్ ‘ మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై(రేపు (31 October) సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ) -
అవరోధాలనే అవకాశాలుగా..!
మానవ జీవిత గమనంలో గమ్యం చేరుకునే దారిలో అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం. పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు. ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు. అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి. కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. – కె.వి.లక్ష్మణరావు (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.) -
గాలిలో దీపమైన భద్రత
అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నాయి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సు లోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుఃస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ, అలాంటి ప్రమాదం ఏర్పడ టానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్లీ మళ్లీ అలాంటి దురదృష్టకర సంఘటనలు పెచ్చరిల్లుతాయి. ఈ దుర్ఘటన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 360కి పైగా అతిక్రమణలు గుర్తించారు. నలభై బస్సుల్ని సీజ్ చేశారు. కళ్లెదుట ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణించే బస్సులు ఒక్కరోజు తనిఖీలోనే పదుల సంఖ్యలో ప్రయా ణింప వీలుగాని కండిషన్లో ఉన్నా యంటే వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. మితిమీరి లాభాలు పొందడా నికి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గడ్డి కరి చినా, వాటిని నియంత్రించే వ్యవస్థకు ఏమైంది? ఆల్ఇండియా పర్మిట్లు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకోవడం, బళ్ళు ఇక్కడ తిప్పడంలోనే అవినీతి జాడ లున్నాయి. సిటింగ్‌కి అనుమతి తీసుకుని, స్లీపర్‌గా మార్చి ప్రయాణికుల రక్షణను రోడ్డున పడేస్తే, అధికారులు గమనించలేక పోతున్నారా? అగ్నిమాపక నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసీచూడనట్లు వది లేయడం ఎంత దారుణం! గత రెండు రోజుల్లో నమోదైన అతిక్రమణల కేసులు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే నిబంధనలు పాటించే వారికన్నా అతిక్రమించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనో, అవినీతితోనో కళ్లు మూసుకొంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావిడి రెండ్రోజుల తర్వాత పూర్తిగా అటకెక్కుతుంది. తర్వాత షరా మామూలే! పాడె మారువేషంలో స్పీడుగా తిరుగుతుంది రోడ్ల మీద!!ఇదీ చదవండి : బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనల్ని నిక్కచ్చిగా పాటించేలా చూడాలి. స్పీడు అతిక్రమించితే బైక్‌నైనా సీజ్ చెయ్యాలి. భారీగా పెనాల్టీ వెయ్యాలి. ప్రజా రవాణా వాహనాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కండిషన్లో ఉండేలా నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాల్ని కోల్పోతున్నాం. సరైన చర్యల ద్వారా వాటిని బాగా తగ్గించగలం. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి.– డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ -
చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..
కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్టించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్టించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్టితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.తూర్పున కోలంక ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. పడమర వెంటూరు ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది.దక్షిణాన కోటిపల్లి అష్ట సోమేశ్వరాలయాల్లో గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడు స్వయం ప్రతిష్ఠగా వెలసిన సోమే శ్వరుడిని పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ద్రాక్షారామ నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యముంది.ఈశాన్యంలో పెనుమళ్ల ద్రాక్షారామకు ఈశాన్యంలోని కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వరస్వామి కొలువయ్యారు. కార్తిక మాసంలో స్వామివారి ఆలయం వద్ద భక్తులు దర్శనం చేసుకుని తరిస్తుంటారు. ద్రాక్షారామతో పాటు, గొల్లపాలెం నుంచి ఆటోల్లో పెనుమళ్ల చేరుకోవచ్చు.ఉత్తరాన వెల్ల ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారికి ఉత్తరాన రామచంద్రపురం మండలంలోని వెల్లలో బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం. రామచంద్రపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని వెల్ల చేరుకోవడానికి ఆటో సదుపాయం ఉంది. నైరుతిన కోరుమిల్లి ద్రాక్షారామకు నైరుతిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం అష్ట సోమేశ్వరాలయాల్లో ఒకటి. ద్రాక్షారామ, రామచంద్రపురం, మండపేట నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులతో పాటు, ఆటోల సదుపాయముంది. వాయవ్యం సోమేశ్వరంలో.. ద్రాక్షారామ ఆలయానికి వాయవ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం అష్ట సోమేశ్వరాలయా ల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రామచంద్రపురం నుంచి ఆర్టీసీ బస్సులో మాచవరంలో దిగి, సోమేశ్వరం చేరుకోవాలి. ఆటో సదుపాయమూ ఉంది. ఆగ్నేయం దంగేరు ద్రాక్షారామకు ఆగ్నేయంగా కె.గంగవరం మండలం దంగేరులో కొలువైన ఉమాసోమేశ్వరాలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి. కార్తిక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మేలని చెబుతుంటారు. ద్రాక్షారామ–మసకపల్లి ఆర్టీసీ బస్సుతో పాటు, ఆటోల సౌకర్యం ఉంది.(చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం) -
భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!
మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.భారత్‌లో నివశిస్తున్న జపనీస్ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది. యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్‌లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు. బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి దయతో జీవించే ఆర్ట్‌ని నేర్పింస్తుందనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Nozomu Hagihara (Nono)萩原望 (@india_nono_) (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
మళెనాడు దీపావళి చాలా స్పెషల్
దీపావళి పండుగ ముగిసినా..ఆ టపాసులు, చిచ్చుబుడ్డుల ఆనందోత్సాహం మాత్రం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఈ పండుగను దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు జరపుకునే విధానంలో విభిన్న సంస్కృతులు కనబడతాయి. అందులోనూ కన్నడ నాట ఈ పండుగ వ్యవసాయ మూలాలను గుర్తుకుతెచ్చేలా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ పండుగ సమయంలోనే దీపావళి బొనాంజాలా కర్ణాటకలోని ఓ గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన కాంతార మూవీ ఏ రైంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఎప్పటికీ మన మూలాలుతో కూడిన సినిమా అయినా పండుగైనా..అదరహో అనేలా అందర్నీ ఆకర్షిస్తుంది, కట్టిపడేస్తుంది. అందుకు ఉదాహరణే కర్ణాటకలోని మలేనాడు గ్రామంలో జరిగే దీపావళి పండుగ. ఇక్కడ ఈ వేడుక ఏవిధంగా జరుగుతుందంటే..పశ్చిమ కనుమల ప్రాంతమైన కర్ణాటకలో మళెనాడులో దీపావళి పండుగ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా జరుగుతంది. వ్యవసాయ ఆధారిత దేశమైన మన మూలాన్ని గుర్తుకుతెచ్చే సంప్రదాయబద్ధంగా జరపుకుంటారు అక్కడి ప్రజలు. అక్కడ దీపావలిని మూడు రోజుల పండుగలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.తొలిరోజు: బూరే హబ్బా, పశువుల పూజమళెనాడు దీపావళి ప్రారంభాన్ని బూరే హబ్బా సూచిస్తుంది. అంటే ఇది మన ఆరోగ్యం కోసం చేసే ధన్వంతరి పూజ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలు, మూలికలను గ్రామస్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ దీపావలి రోజు మంచి అమూల్యమైన మూలికలను, ఔషధాలను సేకరించి వాటిని కొత్త కొండలో నింపుతారు. ఆ తర్వాత వ్యవసాయానిక ఆధారమైన పశువులను పూజిస్తారు. ఇక కుండలో సేకరించిన మూలికలలోకి..ఆ రోజు రాత్రి అప్పుడే తీసుకువచ్చిన నీటితో నింపడమే కాకుండా స్నానపు పెద్దకుండను కూడా నీటితో నిప్పుతారు. ఇది శుద్ధి చేసే ప్రక్రియ అన్నమాట. ఇది ఆరోగ్యం, పరిశుభ్రత విలువలను నేర్పించేలా సాగుతుంది తొలి రోజు పండుగ.రెండోరోజు లక్ష్మీ పూజ, నూనె స్నానాలురెండో రోజు ఇంటిని రంగవల్లులతో అలంకరించి మట్టి దీపాలు, అరటి ఆకులతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. అలాగే నూనెతో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ లక్ష్మీ పూజ చేసేరోజు ఆరోగ్య ప్రదంగా ఉండేలా నూనె స్నానాలు చేసి ఇంటిల్లాపాది లక్ష్మీ పూజ చేస్తారు. ఆఖరి రోజుచివరి రోజు వివిధ పిండి వంటలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, బాణసంచా కాల్చడం వంటివి ఉంటాయి. అయితే గ్రామస్తులు ముఖ్యంగా చేసే వంటకాలేంటంటే హోలిగే(బొబ్బట్లు), చక్కులి(జంతికలు), కడుబు(బియ్య పిండితో చేసి కుడుములు మాదిరి ) వంటకాలను తప్పనిసరిగా చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మలెనాడులో ప్రత్యేకంగా తీర్థహాళ్లి ప్రాంతంలో ఈ దీపావళి రోజున దీపాలను వెలిగించడంతో తోపాటు బలి మహారాజును స్వాగతించే తంతు ఉంటుంది. అందుకోసం కాగాడాలను పంట్టుకుని చేలగట్ల వద్దకు వస్తారు. దీపావళి అమవాస్య మరునాడు బలిపాఢ్యమి..ఆ రోజు ఆయన భూమ్మీదకు వచ్చి సందర్శిస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరగా పట్టణాల్లో జరిగే ఆధునిక శోభతో జరిగే దీపావళి పండుగలా కాకుండా మలెనాడులో ప్రకృతితో మమేకమై వ్యవసాయంతో ముడిపడిన పండుగగా జరుపుకోవడం విశేషం. ఇక్కడ ఆధ్యాత్మికతతో తోపాటు, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతిని మిళితం చేసేలా ఈ వెలుగుల పండుగును జరుపుకుంటారు. The deepavali celebrated on Malenadu area especially Thirthahalli, putting Deepada stock , and welcoming Bali maharaj to see his land ,it's a symbolic lighting arrangements to show our native to Bali maharaj , as we belive he visits at the time of Deepavali Bali Padyami.… pic.twitter.com/JQ5WzqCzL1— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) October 22, 2025 (చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..) -
సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం
ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలిగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉన్నది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయ ద్వారం పట్టనంత. స్థల పురాణం ప్రకారం ఆ కథ ఇలా ఉంది...శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్నకు వివాహమై ఎంతో కాలం గడిచినా సంతానం లేదు. దాంతో సంతానం కోసం స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకవెళ్లలేక పోయాడు. దీంతో ఆ గోలేన్ని ఆలయ ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఎంతో దుఃఖిస్తూ గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా అక్కడే వదిలి ఇంటికి వెల్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు.న్యాయమైన కోర్కెలు తీర్చే నాగాభరణుడుఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలేం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్ది కాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం.కార్తీక మాసం ప్రత్యేక పూజలుమన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల వారికి కార్తీక మాసంలో ఎక్కువగా దైవచింతన, గుడులు, తీర్ధయాత్రలు చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగంలో ఈ నెల రోజులపాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ మాసంలో శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుని మొక్కులు మొక్కుకుని వెళుతుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు విచ్చేస్తుంటారు. – సుంకరి శాంత భాస్కర్,సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా (చదవండి: సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ) -
సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనం గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నాగుల చవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటే కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి జరుపుకుంటారు. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగి΄ోతాయని ప్రతీతి. ఈ నాగుల చవితి నాడు నాగులను పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుపాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ము’ ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ‘శ్రీమహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువు గా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ పుట్టలో పాలు పోయటంలోగల ఆంతర్యమని పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం తొలగుతుంది. కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ శనివారం(అక్టోబర్ 25న) నాగుల చవితి సందర్భంగా..(చదవండి: అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ) -
అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రక్షాబంధనం పండుగ తర్వాత చెప్పుకోదగినది యమ విదియ లేదా భగినీ హస్తభోజనం.. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. తమ తోబుట్టువుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటారు. కొందరు సోదరులకు పెట్టరు కానీ, సోదరులే తమ అక్కచెల్లెళ్లకు చీర, సారె పెడతారు. ఈ సంప్రదాయం మొదలవడానికి కారణం యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమి (యమున). దీనికి సంబంధించిన ఒక ఇతిహాస గాథ ఉంది. అదేమిటో చూద్దాం.రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. ‘భయ్యా ధూజీ’ లేదా ‘భాయి ధూజ్’ అనే పేరుతో ఉత్తరదేశంలో ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. దీనికి యమ విదియ అని, భగినీ హస్త భోజనమనీ పేరు. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. దీనికి సంబంధించిన కథ ఇలా చెప్పుకుంటారు.యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమున లో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! అందువల్ల సోదర సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. (చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే) -
రావణుడు... మా ఊరి అల్లుడు!
దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు! (చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!
దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిఠాయిలకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. స్వీట్స్‌లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం.. పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్‌పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి. – కిరణ్ కుమార్ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్ -
బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!
దీపావళి వేడుక అంటే..మోద మోగిపోవాల్సిందే.. ఆ పండుగ సంబంరం అలా ఇలా ఉండదు. టపాసులు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతూ..అదిరిపడే శబ్దాలతో ఆనంద హేళిలా సాగిపోతుంది. అలాంటి వేడుకలో కాల్చే బాణసంచా కాల్చడం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇదెలా వాడుకలోకి వచ్చింది, ఎలా మొదలైంది అంటే..ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బాణసంచా మ్యూజియం. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ర్యోగోకు జిల్లాలో ఉంది. ‘ర్యోగోకు హనాబి’ పేరుతో సుమిదా నది ఒడ్డున ఈ మ్యూజియం 1733 సంవత్సరంలో ఏర్పాటైంది. జపాన్‌లో పదహారో శతాబ్ది నుంచి బాణసంచా వాడుక మొదలైంది. పలు వేడుకల్లో జపాన్ ప్రజలు బాణసంచా కాలుస్తుంటారు. (చదవండి: ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!) -
పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!
పండగలకు, సంప్రదాయ వేడుకలకూ నిండైన హుందాతనాన్ని తీసుకువచ్చేలా కట్టూ బొట్టు విషయంలో అతివలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దీపావళి వేళ మరింత స్పెషల్‌గా కనిపించాలనుకునే వారికోసం బెంగాలీ చీరకట్టు ఆధునికతనూ అద్దుకొని కొంగొత్తగా మెరిసి΄ోతుంది. సెలబ్రిటీ లూ ముచ్చటపడే ఈ కట్టుకు వారు జోడించే హంగులు ఇవి... పండగలు, ఇతర సంప్రదాయ వేడుకలలో బెంగాలీ స్టైల్ చీర కట్టును దేశవ్యాప్తంగా మహిళలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఉత్తేజాన్ని కలిగించే ఎరుపు–తెలుపు కాంబినేషన్లో ఉండే ఈ చీర కట్టు, నుదుటన పెద్ద బిందీ, శంఖం ఆకృతిలో నెక్ డిజైన్, చీర పల్లూకున్న అందమైన డిజైన్.. ఇవన్నీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దుర్గాపూజల సమయాల్లో ఈ రంగు చీరలను బెంగాలీలు ప్రత్యేకంగా ధరిస్తారు. ఆ స్టైల్ కట్టును ఇప్పుడు లక్ష్మీ పూజలు, వివాహ వేడుకల సమయాల్లో ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కట్టును మనం అనుసరించాలంటే మాత్రం ఈ సూచనలు తప్పక అవసరం.ఎంపికలో సరైన చీరపూజలు, నోములు, వ్రతాల సమయంలో ఎరుపు అంచుతో ఉన్న తెలుపు లేదా ఆఫ్–వైట్ బేస్ చీరను ఎంచుకోవాలి. అంచు ఉన్న కాటన్, పట్టు లేదా టస్సర్ చీరలు ఈ బెంగాలీ లుక్కు సరైనవి. వీటిలో మనవైన చేనేతలు కూడా ఉండవచ్చు. ఈ చీరకట్టు సౌకర్యంగా ఉండటమే కాకుండా పూజ, పండగల సమయాల్లో రోజంతా ధరించడం సులభం కూడా.కట్టుతో కట్టడిబెంగాలీ స్టైల్లో నిజమైన ఆకర్షణ దాని డ్రేపింగ్ శైలిలోనే ఉంటుంది. చీర కుచ్చిళ్ల నుంచి ఎడమ వైపుగా, పొడవాటి పల్లూను ఛాతీ మీదుగా భుజం వరకు తీసుకుంటూ వెళ్లాలి. పొడవాటి పల్లూ భాగాన్ని కుడి చేతి భుజం కిందుగా తీసి, పైకి అంచు భాగం కనిపించేలా బ్లౌజ్‌కు జత చేయాలి. పొడవుగా తీసుకున్న కొంగు భాగాన్ని కుడి చేత్తో ముందుకు తీసుకువచ్చి పట్టుకోవడం కూడా ఈ కట్టులో అందంగా కనిపిస్తుంది. భుజం మీదుగా తీసిన పల్లూని కొప్పుకు అటాచ్ చేసి, ఎడమ భుజం కిందుగా తీసుకురావచ్చు. ఈ కట్టు లలనల రూపాన్ని మరింత సంప్రదాయంగా మారుస్తుంది. డ్రేపింగ్ చేసేటప్పుడు, కుచ్చుల భాగం మడతలు లేకుండా సెట్ చేసి, పల్లూ చాలా తేలికగా ఉన్నట్టు చూసుకోవాలి.నగలపై ప్రత్యేక శ్రద్ధపెద్ద పెద్ద చెవి΄ోగులు, గాజులు, నెక్లెస్‌లు ఈ స్టైల్ చీరకట్టుకు రాయల్ టచ్‌ను జోడిస్తాయి. హెవీగా ఆభరణాలు అక్కర్లేదు అనుకుంటే పెద్ద చెవి΄ోగులు, గాజులు ఈ అలంకరణకు సరి΄ోతాయి.గుండ్రని వెడల్పాటి బిందీబెంగాలీ స్టైల్ డ్రేపింగ్ సంపూర్ణం కావాలంటే నుదుటన పెద్ద, గుండ్రని ఎరుపు బిందీ తప్పక ఉండాలి. ఇది పండుగల రోజుల్లో మొత్తం మేకప్‌ను పూర్తి చేస్తుంది. నుదుటిపై బిందీతో పాటు సిందూర్ చుక్కలను కూడా అదనంగా పెట్టడం వల్ల లుక్ మరింత మెరుగవుతుంది. ఈ లుక్‌కి ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు బిందీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.హెయిర్ స్టైల్– మేకప్హెయిర్ స్టైల్ కోసం ఒక బన్ తయారు చేసి, దానిని మల్లె పువ్వులు లేదా ఎరుపు, తెలుపు పువ్వులతో అలంకరించవచ్చు. పువ్వులతో కాకున్నా హెయిర్ బన్‌కు హెయిర్ పిన్ జ్యువెలరీని జోడించడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు. మేకప్ కోసం ఎరుపు లిప్‌స్టిక్, తేలికపాటి ఐ మేకప్ సరిపోతాయి. ధరించిన చీరకు మేకప్ సెట్ అవుతుందా అనేది సరి చూసుకుంటే చాలు. మెడలోనూ, చేతులకు ఎక్కువ నగల లేకుండా చూసుకుంటే చాలు. మీ రూపం ఆధునికతను అద్దుకున్న సంప్రదాయంతో కొంగొత్తగా మెరిసిపోతుంది. (చదవండి: బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.) -
ఛిద్రమవుతున్న బాల్యం
18 ఏళ్ల లోపు బాలబాలికలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టం 2012 (POCSO Act 2012)నవంబర్ 14 నుండి అమల్లోకి వచ్చింది. నేరస్థుడు పురుషుడు, మహిళ లేదా మూడవ జెండర్ కూడా కావచ్చు. కేంద్ర న్యాయ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో 725 కోర్టులు ఈ కేసులను విచారిస్తున్నాయి, 2 లక్షల పైగా కేసులు పెండింగులో ఉన్నాయి, ఇప్పటి వరకూ 3,34,213 కేసులు పరిష్కారమైనాయి. బంధు వులు, పొరుగింటివారు, యజమానులు, బాగా పరిచయమున్నవారు కూడా బాలలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని జరుగు తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసుల దాకా వెళ్ళకుండా నిందితులతో రాజీ చేసుకునే కేసులు, నిందితు లకు భయపడి మౌనంగా ఉండే కేసులు ఎన్నో ఉంటాయి. ఈ నేరాన్ని ప్రేరేపించిన వారు కూడా నిందితులు అవుతారు. నేరం రుజువైతే జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు జరిమానాకు అర్హులు.ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రత్యేక సెషన్స్ కోర్టుల ముందు ‘ఇన్ కెమెరా’ పద్ధతిలో విచారణ జరుగుతుంది. నేర అభియోగపత్రం రిజిస్టరైన తేదీ నుండి ఏడాది లోపులో తీర్పు వెలువరించాలని చట్టం చెప్తోంది. ఎగతాళి, సామాజిక బహిష్కరణ, వేధింపుల నుండి నివారణ కోసం లైంగిక వేధింపులకు గురైన బాలల పేరు, చిరునామా, ఫొటోలను బహిర్గతం చేయరాదు. బహిర్గతం చేసినట్లయితే ఏడాది పాటు శిక్షకు గురవుతారు. అంతెందుకు, విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం, అప్పిలేటు న్యాయస్థానం కూడా తమ తీర్పుల్లో బాధిత బాలుడు లేదా బాధిత బాలికగానే పేర్కొనాలి తప్ప పేరును బహిర్గతం చేయకూడదు. సాక్ష్యాలను నమోదు చేసే సమయంలో బాధిత బాలలు నింది తుడికి కనిపించకుండా ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరె న్సింగ్, సింగిల్ విజిబిలిటీ మిర్రర్లు, పరదా లేదా ఏదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి, భయాందోళనలకు గురి కాకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించి పిల్లల వాఙ్మూలాన్ని రికార్డ్ చేయాలి. అదే సమయంలో నిందితుడు బాధిత బాలల వాఙ్మూలాన్ని వినగలిగే, అతని న్యాయవాదితో సంభాషించ గలిగే స్థితిలో ఉండాలి. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండటం గమనార్హం. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వెబ్సైట్ల సంఖ్య పెరుగుతోంది. వీటి దుష్ప్రభావాల నుంచి రక్షించడంలో భాగంగా పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అలాంటిది తేవడానికి అవకాశం ఉందేమో మన ప్రభుత్వాలూ పరిశీలించాలి. చికిత్సకు ముందే వ్యాధి నివారణకై ఆలోచించటం ఉత్తమం.-తడకమళ్ల మురళీ ధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది.. బస్ టికెట్ కొనాలన్నా.. వాటర్ బాటిల్ కొనాలన్నా.. అన్నింటికీ యుపిఐ పేమెంట్సే.. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడుతోంది.. ప్రతి కొనుగోలుకీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటైపోయింది. నూటికి 60 శాతం పైగా పేమెంట్స్ ఈ తరహాలోనే నడుస్తున్నాయి. దీంతో అత్యవసరమైన చోట ఖర్చు చేసేందుకు కూడా జేబులో రూ.10 ఉండని పరిస్థితి. ఈ ప్రభావం దేవాలయాలపై భారీగా కనిపిస్తోంది. దీంతో ఈ సమస్యకు ప్రత్యామ్నాంగా దేవాలయాల్లోనూ ఇటీవల కాలంలో హుండీ ఆదాయం గణనీయంగా పడిపోతోందని దేవాదాయ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, మహంకాళి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఈ–హుండీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా నగరంలోనే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ ఆలయంలో ఈ–హుండీ ఏర్పాటైంది. సోమవారం నుంచి భక్తులకు ఈ–హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇక్కడ స్కాన్ చేసి కానుకలను నేరుగా ఆలయ అకౌంట్లోకి పంపించవచ్చు. మొదటి రోజు ఈ విధానానికి భారీ స్పందన లభించింది. మిగతా ఆలయాల్లోనూ ఈ–హుండీలను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయా ఆలయాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
చూసే దృష్టిని బట్టే మంచైనా..చెడైనా..!
తమిళనాడు రాష్టం తిరుచ్చిలోని ఒక ఆడిటర్‌కి ఇద్దరు మగపిల్లలు. కవలలైన వారిద్దరూ ఫిజియో థెరపీ కోర్సు చేశారు. స్వంతంగా క్లినిక్ ప్రారంభించాలని అనుకున్నారు. లక్షలు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించారు.క్లీనిక్ ప్రారంభించేముందు తిరుమలకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల బయలుదేరారు. కొండమీద ఇసుక రాలనంత జనం ఉంది. వరాహస్వామి దర్శనం చేసుకుని ఓపికగా క్యూలో నిలబడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో దేవస్థానం వారు అందించిన వేడివేడి పాలు తాగారు. చిన్న చిన్నగా క్యూ కదిలింది.‘కష్టపడి చదివాము, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది’ అని కొడుకులిద్దరూ తండ్రితో చె΄్పారు. ‘‘ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని బదులిచ్చాడు తండ్రి.ఇంతలో జనం తోసుకోవడం ప్రారంభమయ్యింది. మహాద్వారం వరకు ఒక్కటిగా వచ్చిన ముగ్గురూ వేరయ్యారు. విడివిడిగా దర్శనానికి వెళ్ళారు.ఆరోజు గురువారం కావడంతో మూలవిరాట్టు పైన నగలేమీ లేవు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చకర్పూరపు నామాన్ని అర్చకులు బాగా తగ్గించి ఉన్నారు. అందువల్ల భక్తులకు శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి ఉచిత ప్రసాదం ఇచ్చే చోట ముగ్గురూ కలిశారు. చిన్న లడ్డులు అందుకున్నారు.‘‘ఎలా జరిగింది దర్శనం?’’ అని తండ్రి ఇద్దరినీ అడిగాడు. పెద్దబ్బాయి ముఖం నల్లగా పెట్టి ‘‘దర్శనమైతే అయ్యింది కానీ, జనం నన్ను తొక్కేశారు. ఒళ్లంతా హూనమయ్యింది’’ అని బదులిచ్చాడు. చిన్నబ్బాయి మెరుపు ముఖంతో ‘‘స్వామి దర్శనంతోపాటు ఒళ్ళంతా ఫిజియో థెరపీ చేసుకున్నట్లయ్యింది. ఇప్పుడు నా శరీరం తేలికగా ఉంది’’ అన్నాడు. వెంటనే తండ్రి ‘‘గులాబీ తోటలోకి వెళ్ళిన కొందరు అందమైన గులాబీ పూలను చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్ళను చూస్తారు. అలాగే మన జీవితాన్నీ, వృత్తినీ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే, చెడ్డగా ఆలోచిస్తే అంతా చెడ్డే’’ అన్నాడు. నాన్న చెప్పిన మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులిద్దరూ లడ్డు తింటూ మనసులోనే గోవింద నామస్మరణలు చేస్తూ చిన్నగా గుడి బయటికి వచ్చారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
Diwali 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..
దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!.. దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్‌లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట. మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..ఎలుక కారణంగా దూరమైన పండుగ..పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట. దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.(చదవండి: చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..) -
చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..
గండ శిలతో చెక్కిన శిల్పాలను చూస్తాం.పూరీ చెక్కుకున్న దారు శిల్పాలను చూస్తాం.చంద్రభాగలో సైకత శిల్పాలను కూడా చూస్తాం. అశోకుడి తొలి బౌద్ధచిహ్నం ధవళగిరి స్థూపం...దేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు చిలకాలేక్.శిల్పరాజాలు కందగిరి... ఉదయగిరి గుహలు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజ్ టూర్లో చూస్తాం. అది కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూర్. ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది?డిసెంబర్ 1 నుంచి 5 వరకు...టూర్‌కి టికెట్ బుక్ చేసుకుందాం.ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025. ఇది 15వ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఈవేడుకలకు వేదిక ఒడిశా రాష్ట్రం, కోణార్క్‌లోని చంద్రభాగ బీచ్. 1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు చేరాలి. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణం. దారిలో ధౌలి స్థూప వీక్షణం. పూరికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అవడం, రాత్రి బస.ధవళ గిరి స్థూపంకొండ మీద తెల్లటి స్థూపం. భువనేశ్వర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన పూరీకి వెళ్లే దారిలో ఉంటుంది. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిర్మించిన తొలి స్థూపం ఇది. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో మనసు కకావికలమైన అశోకుడు బౌద్ధం వైపు మరిలిన సంగతి తెలిసిందే. అశోకుడు శాంతి మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్థూపం కావడంతో దీనికి శాంతి స్థూపం అని పేరు. బౌద్ధ సన్యాసులు ఈ స్థూపాన్ని సభక్తిగా దర్శించుకుంటారు.2వ రోజుతెల్లవారు జామున బయలుదేరి జగన్నాథుని దర్శనానికి వెళ్లాలి. ఇది ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు తమకు తాముగా వెళ్లి రావాలి. దర్శనం తర్వాత హోటల్‌కు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టూర్ సత్పద వైపు సాగిపోతుంది. చిలకా సరస్సు వీక్షణం తర్వాత తిరిగి పూరీకి చేరాలి. రాత్రి బస పూరీలోనే.జగన్నాథపురిపూరీ అని పిలిచే పట్టణానికి ఆ పేరు రావడానికి జగన్నాథుని ఆలయమే ప్రధానం. జగన్నాథపురి అనే పేరు నుంచి పురి అనే పేరు వ్యవహారంలో పూరీగా మారిపోయింది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు పూజలందుకునే దైవాలు. బలరాముడు, శ్రీకృష్ణుడు, వారి చెల్లెలు సుభద్ర విగ్రహాలు దారుశిల్పాలు. విగ్రహాల రూపం అసంపూర్తి రూపాలతో విచిత్రంగా ఉంటుంది. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే వంటకాలు తయారు చేసే గది ‘రోసాఘర’ను కూడా చూడాలి. 56 రకాల పదార్థాలను వండుతారు. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.సముద్రమంత సరస్సుచిలకా సరస్సు 11 వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనదేశంలో తీర్ర΄ాంతంలో విస్తరించిన పెద్ద తీర సరస్సు ఇది. దయా నది, భార్గవి నది, మకర, మాలగుని, లునా నదుల నీరు బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోట ఆటు΄ోట్లకు సముద్రపు నీరు వెనక్కు తోసుకు రావడంతో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది. మన తెలుగు రాష్ట్రంలో పులికాట్ సరస్సు కూడా అలాంటిదే. పులికాట్ సరస్సుకు వచ్చినట్లే ఖండాంతరాల నుంచి పక్షులు ఇక్కడికి కూడా ఏటా వలస వస్తాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తమతో తీసుకెళ్లిపోతాయి. చిలకా సరస్సు మరో ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి విదేశీ వర్తక వాణిజ్యాలు జరిగిన ప్రదేశం ఇది. యునెస్కో సంస్థ చిలకా సరస్సును వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. సత్పద అనే ప్రదేశంలో సరస్సు మీద కొంత దూరం వెళ్ల్లడానికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఉంటుంది. నీటి మీద విహారాన్ని ఆస్వాదించవచ్చు. 3వ రోజుబ్రేక్ఫాస్ట్, హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత కోణార్క్‌కు ప్రయాణం. కోణార్క్ సూర్యదేవాలయ వీక్షణం, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ఆస్వాదించడం. సాయంత్రం భువనేశ్వర్‌కు ప్రయాణం. హోటల్ చెక్ ఇన్. రాత్రి బస భువనేశ్వర్‌లో.రథచక్రాలయంకోణార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. సూర్యదేవాలయాన్ని చూడడం అంటే ఖగోళశాస్త్రాన్ని శిల్పాల రూపంలో తెలుసుకోవడం. ఆలయం ప్రాంగణంలోని సన్టెంపుల్ మ్యూజియాన్ని చూడడం మర్చి΄ోవద్దు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ఏటా అలరించేది. ఇప్పుడు సైకత శిల్ప కళల వేడుక కూడా తోడవడంతో కోణార్క్ పర్యాటకధామంగా మారింది.ఇసుక బొమ్మల కొలువుకోణార్క్లోని చంద్రభాగ బీచ్‌లో సాండ్ ఆర్ట్ కొలువు దీరి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశ విదేశాల సాండ్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ప్రపంచ శాంతి, ప్రకృతి పరిరక్షణ వంటి థీమ్‌లతో ఒక్కొక్క ఆర్ట్ ఒక్కో సందేశాన్నిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ సరదాగా మొదలు పెట్టిన సైకత శిల్పకళకు చక్కటి ఆదరణ లభించింది. ఎంతగా అంటే... ముఖ్యమైన సందర్భాలు, సామాజిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ అంశాన్ని పట్నాయక్ ఎలా రూపొందించాడో చూడడానికి టెలివిజన్ వార్తలను ఫాలో అయ్యేంతగా. ఇప్పుడు సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతడి బాటలో ఈ తరం యువతీయువకులు సాండ్ ఆర్ట్‌లో శిక్షణ పొంది, ఒకరిని మించి మరొకరు చక్కటి సైకత శిల్పాలకు రూపమిస్తున్నారు.4వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జాజ్‌పూర్‌కు ప్రయాణం. బిరజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత రత్నగిరి బౌద్ధక్షేత్ర వీక్షణం. తిరిగి భువనేశ్వర్‌కు చేరాలి. రాత్రి బస భువనేశ్వర్‌లోనే.బిరజాదేవి ఆలయంఒడిశాలో బిరజ అనే పదానికి అసలు ఉచ్చారణ విరజ. గిరిజాదేవినే ఒడియా వాళ్లు బిరజాదేవి అంటారు. ఇది దుర్గాదేవి శక్తిపీఠం. విరజ క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూసే ఆలయం 13వ శతాబ్దం నాటిది. రత్నగిరి బౌద్ధక్షేత్రం ఒక పురాతత్వగని. తవ్వేకొద్దీ విషయాలను వెల్లడిస్తోంది. రత్నగిరి బౌద్ధ క్షేత్రమే కాని ఇక్కడ హిందూ పౌరాణిక పాత్రల శిల్పాలు అనేకం ఉంటాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని నిర్మాణాలు ఐదవ శతాబ్దం నుంచి మొదలై పదవ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో నిర్ధారణ అయింది. 16వ శతాబ్దంలో వరదల్లో కప్పబడి పోవడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణాలున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయారు. తవ్వకాల్లో దొరికిన శిల్పాలతో ఈ ప్రాంగణంలో మ్యూజియం ఉంది. రత్నగిరి, లలిత్‌గిరి, ఉదయగిరి గుహలను కలిపి డైమండ్ ట్రయాంగిల్‌గా పిలుస్తారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్, గది చెక్ అవుట్ చేసిన తర్వాత లింగరాజ ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, రాజారాణి టెంపుల్ వీక్షణం. మధ్యాహ్నం తర్వాత కందగిరి గుహలు, ఉదయగిరి గుహల్లో విహారం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు టూర్ నిర్వహకులు పర్యాటకులను భువనేశ్వర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.ఆలయాల భువనంభువనేశ్వర్లో ఏమి చూడాలని అడిగితే లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్, రాజారాణి ఆలయాలు అని ఒక్కమాటలో చెప్పవచ్చు. భువనేశ్వర్ గొప్పశిల్ప నిలయం. లింగరాజ ఆలయాన్ని దర్శించిన వాళ్లు, ఆలయం గురించి వివరించేటప్పుడు మొదటి మాటగా నిర్వహణ లోపాన్ని ప్రస్తావిస్తారు. చాలా మురికిగా ఉంటుందని ఆవేదన చెందుతారు. భారీ నిర్మాణం. ఆలయ నిర్మాణకౌశలం ప్రత్యేకంగా ఉంటుంది. మన దక్షిణాది నిర్మాణాలు, ఉత్తరాది నిర్మాణాలకు భిన్నమైన కళింగ నిర్మాణశైలి ఇది. ముక్తేశ్వర్ ఆలయంలో ఏకరాతి శిలాతోరణ ద్వారం గొప్ప శిల్పచాతుర్యమనే చె΄్పాలి. భువనేశ్వర్‌లోని రాజారాణి ఆలయం కూడా పుణ్యక్షేత్రమే. ఈ ఆలయ నిర్మాణం అంతా పసుపు, ఎరుపు సాండ్‌స్టోన్‌ల కలయిక. ఈ రెండు రంగుల రాళ్లను రాజారాణి రాళ్లుగా పిలుస్తారు. అందుకే ఇది శివాలయమే అయినా రాజారాణి ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది.కందగిరి ఉదయగిరి గుహలుకొండలను గుహలుగా తొలచడమే ఒక అద్భుతం అనుకుంటే గుహల్లోపల గోడల నిండుగా రకరకాల థీమ్‌లతో శిల్పాలుంటాయి. స్థూలంగా చూసినప్పుడు శిల్పాలన్నీ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే పౌరాణిక కథల సన్నివేశాలు కళ్లకు కడుతాయి. చేతికందే ఎత్తులో ఉన్న శిల్పాలు యుద్ధానంతర దాడుల్లో ధ్వంసమైన వైనం కూడా అవగతమవుతుంది. ఉదయగిరి గుహల్లో గణేశ గుహను గమనించడం మర్చిపోవద్దు. పదడుగుల ఎత్తున్న కొండను తొలిచి వరండాలాగ మలిచారు. ఎదురుగా చెరుకు తింటున్న ఏనుగులు, ద్వార΄ాలకుల్లాగ సైనికులు, వరండా పైకప్పుకి స్తంభాల్లాగ చెక్కిన రాతిని కలుపుతూ నమస్కార ముద్రలో ఉన్న సాలభంజికలు... చూడ చక్కగా ఉంటాయి.టూర్ వివరాలివిఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ పేరు ‘కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్’. ప్యాకేజ్ కోడ్ : ఎస్హెచ్ఏ42. ఇది ఐదు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో చిలకా లేక్, కోణార్క్ టెంపుల్, బిరజాదేవి ఆలయం, భువనేశ్వర్ ప్రదేశాలకు కవర్ అవుతాయి.నవంబర్ 30వ తేదీ 12.35 గంటలకు ‘6ఈ 6911’ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 14.10 గంటలకు భువనేశ్వర్‌కు చేరుతుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ‘6ఈ 631’ ఫ్లైట్ 22.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి రాత్రి 23.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.టికెట్ ధరలిలాగ:సింగిల్ ఆక్యుపెన్సీలో 43,950 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,800 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 32,650 రూపాయలు. బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407– వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
కథ: రాతి రథం
విదర్భ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. దైవభక్తి కలిగిన ఆయన రాజ్యం మధ్యలో పెద్ద వైష్ణవాలయాన్ని కట్టించాడు. స్వామికి రాతి రథం చేయించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అందుకు తగ్గ శిల్పి దొరకడం లేదు. చివరకు నారాయణాచారి అనే శిల్పి గురించి చంద్రసేనుడికి తెలిసింది. ఆయన రాతిరథం అద్భుతంగా తయారు చేయగలడని చంద్రసేనుడు భావించాడు. వెంటనే నారాయణాచారిని ఆస్థానానికి పిలిపించి ఆలయానికి రాతి రథం చేయమని కోరాడు. ‘రాజా! శిల్ప కళ నాదే అయినా, నాకు ఆ కళను ప్రసాదించింది ఆ భగవంతుడు. నేను ఇంటికి వెళ్లి భగవంతుణ్ని ధ్యానిస్తాను. ఆయన అనుమతి ఇస్తే తప్పక రథం చేస్తాను. లేదంటే నేను ఆ పని చేయలేను’ అని చె΄్పాడు నారాయణాచారి. చంద్రసేనుడు సరేనన్నాడు. ఇంటికి వెళ్లిన నారాయణాచారి భగవత్ ధ్యానంలో మునిగి΄ోయాడు. మూడు రోజులు గడిచినా ఆయన ధ్యానం నుంచి బయటకు రాలేదు. ఆయన చెప్పే సమాధానం కోసం చంద్రసేనుడు ఎదురుచూస్తున్నాడు. నాలుగో రోజు నారాయణాచారి ధ్యానంలోనుంచి బయటకు వచ్చాడు. నేరుగా చంద్రసేనుడి దగ్గరకు వెళ్లి రాతి రథం చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో రాజు సంతోషించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. మూడు నెలలు శ్రమించి నారాయణాచారి రాతి రథం తయారు చేశాడు. నాలుగు అంతస్తుల ఎత్తులో భారీగా ఉన్న ఆ రథాన్ని రాచవీధిలో ఉంచారు. ప్రజలంతా ఆ రథాన్ని చూస్తూ నారాయణాచారి ప్రతిభను గొప్పగా పొగిడారు. చంద్రసేనుడు సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. నారాయణాచారి దగ్గరికి వెళ్లి ‘రథం తయారు చేసినందుకు ఏం కావాలో కోరుకోండి సమర్పిస్తాను’ అని వినమ్రంగా అడిగాడు. ‘ఏదడిగినా కాదనకూడదు’ అని శిల్పి షరతు పెట్టాడు. ‘నా రాజ్యం మొత్తం ఇమ్మన్నా ఇచ్చేస్తాను. మాట తప్పను’ అని చంద్రసేనుడు వాగ్దానం చేశాడు. ‘అయితే రథాన్ని ప్రారంభించే రోజు అడుగుతాను’ అన్నాడు నారాయణాచారి.రథాన్ని ప్రారంభించేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. రథాన్నిప్రారంభించే ముందు చంద్రసేనుడు నారాయణాచారిని ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘ఈ ఒక్క రోజు ఈ రాజ్యానికి నేను రాజుగా ఉండాలి’ అని అడిగాడు శిల్పి. ఆ మాటతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చంద్రసేనుడు మాత్రం తాను ఇచ్చిన మాట తప్పను అంటూ నారాయణాచారిని ఆ ఒక్క రోజు తన రాజ్యానికి రాజుగా ప్రకటించారు. రథం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి రథాన్ని ముందుగా లాగాలి. ఆ తర్వాత ప్రజలంతా లాగి పురవీధుల్లో తిప్పుతారు. దీంతో ఆ ఒక్క రోజు రాజుగా ఉన్న నారాయణాచారి రథానికున్న తాడును పట్టుకుని ముందుకు లాగాడు. ఆయన వెంట ప్రజలంతా ఆ తాడు పట్టుకొని ముందుకు కదిలారు. భారీ రథం ముందుకు కదిలింది. కొద్దిదూరం వెళ్లగానే చక్రాలు అదుపు తప్పి రథం ప్రజల మీదకు దూసుకెళ్లింది. రథానికి ముందుగా ఉన్న నారాయణాచారి కింద పడగా ఆయన మీద నుంచి రథం వెళ్లి ఆగిపోయింది. హుటాహుటిన ఆయన్ను పక్కకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఆయన చంద్రసేనుణ్ని పిలిచి ‘రాజా! నాకు శిల్పకళతోపాటు జోతిష్యం కూడా తెలుసు. ఈ రథాన్ని ్ర΄ారంభించిన రోజే ఈ రాజ్యప్రభువు మరణిస్తాడని కనుగొన్నాను. అందుకే ఈ ఒక్క రోజు నేను రాజుగా ఉంటానని కోరాను. నా కోరికను మీరు మన్నించారు. మీవంటి రాజు దేశానికి, ప్రజలకు ఎంతో అవసరం. మిమ్మల్ని కాపాడుకున్నానన్న తృప్తితో కన్ను మూస్తున్నాను’ అంటూ నారాయణాచారి మరణించారు. ఆయన త్యాగనిరతికి కన్నీరు పెట్టిన చంద్రసేనుడు ఆ రాతి రథంపై నారాయణాచారి పేరు చెక్కించి ఆయనను కలకాలం గుర్తుంచుకునేలా చేశారు. -
గిట్టుబాటులేక రోడ్డు మీదే.. పూల రైతుకు మిగిలింది కన్నీరే
కోలారు: బెంగళూరులోని కోలారు ప్లవర్ మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 ధర పలికిన బంతిపూల ధరలు మళ్లీ పాతాళానికి దిగజారాయి. దీంతో గిట్టుబా టుకాక రైతులు తాము పండించిన బంతి పూలను రోడ్డుపై పారబోసి వెళుతున్నారు. శ్రావణ మాసంలో వరుసగా పండుగలు రావడంతో పూల ధరలు ఆశాజనకంగా ఉండే వి. అనంతరం ఆశ్వీయుజ మాసంలో దనరా పండుగ కారణంగా బంతిపూలకు మంచి ధరలే లభించాయి. అయితే దసరా అనంతరం డిమాండ్ బాగా తగ్గింది. కిలో బంతిపూలు రూ.10, చేమంతులు కిలో రూ.40, గులాబీలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. మంగ ళవారం మార్కెట్‌కు తీసుకు వచ్చిన పూలకు సరైన ధరలు లభించక రైతులు వాటిని బంగారుపేట-కోలారు రోడ్డు పక్కనే పారబోసి వెళ్లారు. పూలు విడిపించడానికి, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా మిగ లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు పూల కోతకోయకుండా పాలంలో అలాగే వదిలేస్తున్నారు. కాగా అక్టోబర్ నెలలో పెద్ద ప్రమాణంలో బంతి పూల కోతకు రావడంతో డిమాండ్ తగ్గి ధరలు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. -
మోదీ లాంటి నాయకుడుండటం మన భాగ్యం : తెగ పొగిడేసిన ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవాన్ని నడిపించే నాయకుడిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమంటూ కొనియాడారు.బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2025)కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, భారతి గ్రూప్ సునీల్ భారతి మిట్టల్ ఇతర కార్పొరేట్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాష్ అంబానీ పీఎం మోదీ నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసించారు, మోదీ లాంటి నాయకుడిని కలిగి ఉండటం ఇండియా అదృష్టమన్నారు, మోదీ విజన్ గత పాతికేళ్లుగా దేశ సాంకేతిక , ఆర్థిక ప్రయాణాన్ని నిర్దేశించిందనీ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ఆయన పాత్ర కీలకమైనదని అభివర్ణించారు.#WATCH | Delhi: On PM Modi's 25 years of serving as head of a government, Chairman of Reliance Jio Infocomm Limited, Akash Ambani says, "It has been an absolutely revolutionary mode for India and we are lucky to have a leader like him." pic.twitter.com/R8i5gdwddx— ANI (@ANI) October 8, 2025అలాగే స్టార్టప్‌లు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నాయకుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా మారే దిశగా దేశం పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అంబానీ అన్నారు. చిప్ తయారీ నుండి ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సిస్టం, తదుపరి తరం వైర్లెస్ కనెక్టివిటీ వరకు, తాము పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఇది భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థకుగర్వకారణమైన క్షణం, దేశం ప్రపంచ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉండ బోతోందన్నారు.ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుసెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ SP కొచ్చర్ మాట్లాడుతూ, ఐఎంసీ భారతదేశం అధునాతన కనెక్టివిటీ, డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త దశ అన్నారు. దేశీయ సాంకేతిక పురోగతి సమర్థుల చేతుల్లో ఉందనీ మెరుగైన కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ,భద్రత, ఆవిష్కరణ, సహకారంపై నిరంతర దృష్టి కారణంగా దేశం చాలా వేగంగా గ్లోబల్ డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా అవతరించనుందన్నారు.చదవండి: నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే -
విశ్రాంత పాత్రికేయులకేదీ భరోసా?
సంక్షేమంలో ఛాంపియన్లుగా పేరుపొందిన తెలుగు రాష్ట్రాలు పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం పక్కన పెడుతున్నట్లున్నది! 1,000 నుంచి 2,500 రూపా యల పీఎఫ్ పెన్షన్ మాత్రమే అందుకొంటూ విశ్రాంత జీవితాన్ని నానాపాట్లూ పడుతూ గడుపుతున్న 60 ఏళ్లు పైబడిన విశ్రాంత పాత్రికేయులను పట్టించు కోవడం లేదని... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తూ, పీఎఫ్ చందాలు కడుతూ పాత్రికేయులకు అండగా, ఆలంబనగా నిలుస్తున్న సంస్థలు పరి మితమే. ఉద్యోగ భద్రత, నెలవారీగా వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేకుండా జీవితాన్ని గడిపే పాత్రికేయులే ఇప్పడు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు రిటైరైన తర్వాత కూడా కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడిన పాత్రికేయులు రిటైరయ్యాక ఎవరూ పట్టించుకోని దైన్యస్థితిలో బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్ష రాన్నే నమ్ముకుని ఉన్న వేలాదిమంది పాత్రికే యుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే తీసికట్టుగా తయారైంది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?నిజానికి, తెలుగు రాష్ట్రాలు తప్ప దేశంలో మరో 19 రాష్ట్రాలు విశ్రాంత పాత్రికేయులకై పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా నెలకు రూ. 20 వేల చొప్పున పెన్షన్‌ను 60 ఏళ్ళు పైబడిన పాత్రికేయులకు అందజేస్తోంది. అసోం నెలకు రూ. 5 వేలు, ఛత్తీస్‌గఢ్ 10 వేలు, గోవా 10 వేలు, హరియాణా 10 వేలు, మన పొరుగునే ఉన్న కర్ణాటక 10 వేలు, కేరళ 11 వేలు చెల్లిస్తున్నాయి. పంజాబ్‌లో 12 వేలు, రాజస్థాన్‌లో 15 వేలు, తమిళనాడులో 12 వేలు, త్రిపురలో 10 వేల చొప్పున విశ్రాంత జీవితం గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్‌గా అందచేస్తున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుతెలుగు రాష్ట్ర్రాలు వందల కోట్ల నిధులతో లక్షలమందికి సామాజిక పెన్షన్లు అందచేస్తున్నాయి. అయితే అరకొర ఆదాయంతో రిటైర్మెంట్ జీవి తాన్ని గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్ వసతి కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పాత్రికేయులకు పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆ వాగ్దానాన్ని గుర్తుచేశారు విశ్రాంత పాత్రికేయులు. త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలనూ కలిసి వినతిపత్రం సమర్పించ నున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం కావాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం తీర్మానం చేసింది. అక్షరాన్ని నమ్ముకొని, సమాజానికి మార్గదర్శనం చేసిన వయోధికులకు పాలకులు అండనివ్వాలి. – చొప్పరపు కృష్ణారావుపాత్రికేయుడు 84668 64969 -
యంత్రం సాగుకు తంత్రం
యంత్రం.. సాగుకు తంత్రం అన్న విషయాన్ని ఉమ్మడి శామీర్‌పేట రైతులు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేలైన దిగుబడులను రాబడుతున్నారు. ఎకరాకు గంటల సమయం పట్టే మందుల పిచికారీకి డ్రోన్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దుక్కుల నుంచి మొదలు కోతల వరకూ అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లకు రైస్ ట్రాన్స్ ప్లాంటర్, డ్రమ్ సీడర్, మందు పిచికారీకి డ్రోన్లు, స్ప్రేయర్లు వంటివి వినియోగిస్తున్నారు. – శామీర్‌పేట ఉమ్మడిశామీర్పేట మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయల సాగు పెరిగింది. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటకు కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తున్నాయి. చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందులు కూడా వృథా కావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కూలీలు చేసే పని ఒక్క డ్రోన్ చేస్తుంది. దీంతో ఇటు సమయం.. ఆటు డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నిమిషాలు.. డ్రోన్ సహాయంతో ఎకరా పంటకు 10 నిమిషాల్లో మందులు పిచికారి పూర్తవుతుంది. నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. దీనికి యూరియా స్ప్రే చేయించాలంటే ఇద్దరు కూలీలు ఒక రోజంతా కష్టపడాలి. డ్రోన్ సాయంతో నాలుగు ఎకరాలకు గంటలో పూర్తిచేశాం. ఎకరాకు డ్రోన్ అద్దె రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. – సంజీవరెడ్డి, రైతు, అలియాబాద్ వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. పొరుగు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలపై అధారపడాల్సి వస్తోంది. డ్రోన్ స్ప్రే ద్వారా ఎకరాకు 10 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదాతో పాటు కూలీల సమస్య తీరుతుంది. డ్రోన్ అద్దెకు తీసుకోవడంతో ఖర్చులు తగ్గుతాయి. – రమేష్ వ్యవసాయ అధికారి, శామీర్‌పేట -
సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) వివాహం గురించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా ముక్కలు కానుందా? తాజా వార్తలు ఈ ఊహాగానాలనే బలపరుస్తున్నాయి. భార్య, నటి సనా జావేద్ (Sana Javed)తో విభేదాల కారణంగా విడాకుల బాట పట్టినట్టు వార్తలొస్తున్నాయి.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)తో 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి సనా జావేద్‌ను వివాహం చేసున్నాడు షోయబ్. అప్పటినుంచి చెట్టాపట్టా లేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవలదూరంగా ఉంటున్నారట. తాజా మీడియా నివేదిక ప్రకారం, మనస్పర్థలతో షోయబ్-సనా జంట విడాకులకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Voice Of Netizens (@voiceofnetizens) ఇటవలి ఒక సందర్భంగా షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా మొఖం తిప్పుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా ఉండటం ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ దూరం దూరంగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో మూడో పెళ్లి ముచ్చట కూడా మూణ్నాళ్లే.. ఇద్దరి మధ్య మాటల్లేవా అంటూ కొందరు, భార్యభర్తల మధ్య ఇలాంటివి మామూలే అని కొందరు నెటిజన్లు కమెంట్స్ చేశారు. అయితే, అటు షోయబ్ గానీ, ఇటు సనా గానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కాగా షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న, హైదరాబాద్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి కొడుకు (ఇజాన్) పుట్టాడు. విభేదాల కారణంగా 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. -
పెళ్లిలో బ్రహ్మ ముడి ఎందుకు వేస్తారంటే..
పెళ్లిలో వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. దానిలో ఏమైనా విశేషార్థం ఉందా? – సంకా పవన్ కుమార్, హైదరాబాద్మనకు వివాహంలో తలంబ్రాల అనంతరం జరిగే ప్రక్రియ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి వేసేటప్పుడు వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. వారి బంధాన్ని పటిష్ఠపరిచే చర్య ఇది. ఇప్పటికీ ఏదైనా విడదీయరాని బంధం ఏర్పడితే బ్రహ్మముడి పడిందిరా అని అంటూ ఉంటారు. దీనినే బ్రహ్మగ్రంథి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు. ఇద్దర్ని కలిపి కొత్త వ్యక్తిని సృష్టించడం. రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకమవ్వడమన్నది ఇక్కడ పరమార్థం. ఇది కేవలం రెండు వస్త్రాలని కలపటం కాదు. ఇంటి ఇల్లాలిగా అన్నీ తీర్చిదిద్దడానికి నా ఇంటికి రా. ఒక యజమానురాలిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించు అని అర్థం.ఇద్దరు వ్యక్తులను కలిపి కొంగొత్త ఆకారాన్ని సృష్టించడమే దీని లక్ష్యం. నీది అని ఏమీ లేదు. ఎవరు సంపాదించినా దాని మీద అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఆదాయం, ఖర్చు, ప్రణాళిక కలిపి ఉమ్మడిగా చెయ్యవలసిన పనులని భావం. (చదవండి: ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..) -
ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..
‘దసరా అంటేనే మహిళల అపూర్వ శక్తికి పట్టం కట్టే అద్భుతమైన పండుగ. అందుకే ప్రతీ మహిళా ఈ పండుగతో మనసారా మమేకమవుతుంది’ అంటున్నారు ప్రముఖ సినీనటి అర్చన. దసరా పండుగ నేపథ్యంలో ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నాకు అమ్మవారి పట్ల ఉన్న ఎనలేని భక్తి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దుర్గామాత, సరస్వతీ దేవి రూపాలు అంటే చాలా ఇష్టం. సినిమాల్లో దేవీ పాత్రలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఈ దసరా నాకెందుకు ప్రత్యేకం అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మస్థలం అనే సినిమా. ఈ సినిమా కోసం నేను గతంలో ఎన్నడూ చేయని విధంగా అమ్మవారి ఉగ్రరూపం ధరించి తాండవం చేశాను. మహిషాసుర మరి్ధని మూర్తి ఎదురుగా చేసిన ఆ నాట్యం మరిచిపోలేని అనుభూతి అందించింది. మాతా తుల్జాభవాని తాకిన చీరను నాకు ఆ సన్నివేశంలో ధరింపజేశామని ఆ సినిమా యూనిట్ ఆ తర్వాత నాకు చెప్పారు. (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
తెలంగాణ సాంస్కృతికోత్సవం.. అలయ్ బలయ్
అలయ్ బలయ్.. ఒక ఆలింగన వేడుక.. అందరం బాగుండాలనే ఆకాంక్ష.. కులమతాలకు అతీతంగా, పారీ్టలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగ.. ఆనందోత్సాహాలతో చేసుకొనే దసరా ఉత్సవాలకు ముగింపు వేడుక.. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల మాదిరే అలయ్ బలయ్ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే కళారూపాలకు వేదికగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 20వ సంవత్సర అలయ్‌బలయ్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుత హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఘనంగా నిర్వహించే అలయ్ బలయ్ ఉత్సవాలకు ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆరేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది..ఈ ఉత్సవం ‘మాయమైపోతున్న మనిషిని’ నిలబెట్టింది. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న సామాజిక బంధాలకు, అనుబంధాలకు విలువనిచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఉద్యమకారులు, రాజకీయ పారీ్టలు, నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు అలయ్‌బలయ్ ఎంతో దోహదం చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ క్రియాశీలమైన నేతగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న బండారు దత్తాత్రేయ పారీ్టలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ ‘దత్తన్న’గా చేరువయ్యారు. ఆ సమైక్యతాభావాన్ని సంఘటితం చేయాలనేదే దత్తన్న ఆకాంక్ష కూడా.. అందుకే ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కనీసం 10 వేల మందిని ఆయన సాధరంగా ఆహ్వానిస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా స్వాగతిస్తారు.600 మందికి పైగా కళాకారులు.. అలయ్‌బలయ్ 20 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆలయ్బలయ్ కార్యనిర్వాహక కమిటీ నెల రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 600 మందికి పైగా కళాకారులు తరలి వస్తారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదర్ ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈసారి వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశాం. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు వడ్డించనున్నాం. తెలంగాణకే ప్రత్యేకమైన అంబలి, జొన్న గట్క, సర్వపిండి, మలీదముద్దలు, తలకాయ, బోటి, మటన్, చికెన్‌లలో రకరకాల వెరైటీలతో పాటు పచ్చిపులుసు, రకరకాల ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహార వంటలను కూడా వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – బండారు విజయలక్ష్మి (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..
దేశవ్యాప్తంగా నాటక సమాజంలో దుర్గాదేవి పాత్రలో అనేక మంది ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ‘మహిషాసుర మర్దిని’ నాటకంలో బుచ్చి లక్ష్మి చేసిన అభినయం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా సురభి కమలాబాయి, సురభి రమణ వంటివారు దేవి శక్తిరూపాన్ని రంగస్థలంపై జీవంతో నింపారు. గ్రామీణ జాతర, యక్షగానం, బుర్రకథలు, హరిదాసు పాటల్లోనూ దుర్గమాత రూపాన్ని అనేక మంది మహిళలు అత్యంత భక్తితో ప్రదర్శించారు. సినీమాల్లోనూ పెద్ద హీరోయిన్లు అమ్మవారి పాత్రలను పోషించి పాత్రలో జీవించారు. నాట్యకళల్లో (కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ) పలువురు మహిళా నర్తకీమణులు దుర్గమ్మ ప్రతిరూపాలుగా మెరిశారు. కూచిపూడిలో ‘మహిషాసుర మర్థిని’ తారంగములో దుర్గాదేవి ఆవిష్కరణ చేశారు. దేవి శక్తిరూపాన్ని శిల్పసుందరంగా, ఆధ్యాత్మికంగా ప్రదర్శించిన వారిలో శోభానాయుడు, అలేఖ్య పుంజల, యామిని కృష్ణమూర్తి తదితరులు ఎందరో దుర్గామాత శక్తి, వీరత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప నర్తకీమణులుగా పేరొందారు. వెండితెర ‘వేల్పులు’.. ‘మాయాబజార్’ ‘చూడామణి’ ‘శకుంతల’ వంటి చిత్రాల్లో భక్తిపాత్రలు పోషించిన అంజలీదేవి దేవి, శక్తి రూపంలో కూడా తెరపై జీవించారు. అదేవిధంగా బి.సరోజాదేవి, జమున, కాంచనమాల పురాణ గాధా చిత్రాలలో దుర్గాదేవి పాత్రలు ధరించారు. ఆ తర్వాతి తరంలో శ్రీవిద్య, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రాధ, భానుప్రియ వంటి హీరోయిన్లు అమ్మవారిలా భక్తుల మనసులు గెలుచుకున్నారు. సౌందర్య, మీనాక్షి శేషాద్రి కూడా నవరాత్రి, మహిషాసుర మర్దిని అంశాలతో రూపొందిన పాటలు, సన్నివేశాలలో శక్తిమాత రూపాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు పూనినట్టే.. సురభి కళాకారిణిగా పాతాళభైరవి అనే నాటకంలో అమ్మవారి పాత్ర పోషించడం మరుపురాని జ్ఞాపకం. ఆ పాత్ర అభినయం అయిపోయిన తర్వాత చాలాసేపు అదే భావనలో ఉండిపోయా.. అంతగా లీనమవ్వడం మరే పాత్రలోనూ జరిగేది కాదు. – నిర్మల, సురభి నాట్యకళాకారిణి.ఆ అనుభూతి సాటిలేనిది... నర్తనశాల, భక్త ప్రహ్లాద, మహిషాసుర మర్దిని.. ఇలా ఎన్నో నాటకాల్లో అమ్మవారి పాత్రలు పోషించాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రదర్శనల్లో పాల్గొన్నాను. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో నా ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 100కిపైగా నాటకాల్లో అమ్మ రూపాలను అభినయించాను. ఎన్నిసార్లు ఆ పాత్ర పోషించినా, తనివి తీరదు ఆ అనుభూతిని వర్ణించలేం. – వెంగమాంబ, రంగస్థల నటి (చదవండి: శ్రీ శారదాంబికా నమోస్తుతే!) -
శ్రీ శారదాంబికా నమోస్తుతే!
భారతదేశంలో ఉన్న అపురూపమైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాదేవి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయపీఠం శృంగేరి. ఈ పీఠాధిష్ఠాత్రి కూడా ఆమే. శారదాదేవి ఇక్కడ నెలకొని ఉండటానికి ఒక వృత్తాంతం ఉంది. ఒక శాపవశాత్తూ బ్రహ్మా సరస్వతులిద్దరూ మండనమిశ్ర, ఉభయభారతులై భూమిపై జన్మించారు. ఆదిశంకరులతో జరిగిన వాదంలో మండనమిశ్రులవారు ఓడిపోయి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే పేరిట శృంగేరీ పీఠాధిపతిగా ఆదిశంకరులవారిచే నియమితులయ్యారు. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతీస్వరూపమని తెలిసి ఉన్న శంకరులవారు ఆమెను అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.శంకరుల విన్నపంతో ఉభయభారతీదేవి శారదాదేవిగా శృంగేరీలో కొలువు తీరింది. నిజానికి ఈ అమ్మవారి మూలరూపం చందనవిగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని విద్యాశంకరుల ఆలయంలో ప్రతిష్ఠించి, తరువాతి కాలంలో ఇక్కడ స్వర్ణవిగ్రహరూపంలో పూజలందుకుంటోంది. శారదాదేవి రూపం స్వస్తికాసనంలో కూర్చుని కుడిచేతితో చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి ఉంటుంది.వెనుక కుడిచేత్తో జపమాలను, ఎడమచేత్తో అమృతకలశాన్ని ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారికి వెనుక చిలుక కూడా ఉంటుంది. అఖండ విద్యాప్రదాయిని అయిన ఈ దేవి దర్శనంతో మనలోని అజ్ఞానపు మాలిన్యాలు తొలగి విజ్ఞానపు కాంతులు వెలుగొందుతాయి. చిన్ముద్ర, పుస్తకం, జపమాల, అమృత కలశం మొదలైనవన్నీ క్షయం లేనివనీ అవిద్యను రూపుమాపే విజ్ఞానపు సాధనాలనీ తెలుసుకోవాలి.– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి (చదవండి: పైడితల్లికి ప్రణమిల్లి..!) -
పైడితల్లికి ప్రణమిల్లి..!
విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపం లో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో ఉన్న చదురుగుడిని అమ్మవారి మెట్టినిల్లుగా పిలుస్తున్నారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలు (బిందెలు, కుండలు) ఉంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్ధంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దాని కిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.అమ్మే దారి చూపిస్తుంది...ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని ఒక నమ్మకం. ఇది తప్పనిసరిగా చింతచెట్టు అయి ఉంటుంది. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుకు సాక్షాత్కరించింది. అదే గ్రామంలో ఇరుసుమానును గుర్తించారు. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు తరలించారు. అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్దం చేస్తున్నారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. అనేక జానపద వేష ధారణలు సిరిమాను ముందు నడువగా, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి.సందడంతా తొలేళ్ల సంబరానిదే...సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత పూజారికి బోనాలు వాళ్లు అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలు చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. తెలంగాణా ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవంలో వినిపించే భవిష్యవాణì మాదిరిగానే ఇక్కడ కూడా పైడిమాంబ మాటగా పూజారి భవిష్యవాణిని వినిపిస్తారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది.రాబోయే ఏడాదికాలంలో జరిగే మంచి ,చెడులను అమ్మపలుకుతుంది. పంటల విషయంలోనూ, పాడి సంపదల్లోనూ ఈ ప్రాంతం అభివృద్ది ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు అమ్మ పలికిస్తుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. అందరికీ ఉపయోగపడే ఆ భవిష్యత్ వాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయనేది రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిరు వ్యాపారులు వందలాది దుకాణాలు ఏర్పాటు చేస్తారు. రంగుల రాట్నం దగ్గర్నుంచి అనేక ఆట΄ాటలను అందుబాటులోకి తెస్తారు.ఏటా విజయదశమి తర్వాతే సిరిమానోత్సవం...పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో ప్రతిష్టించినది విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం రోజున అని ప్రతీతి. అందుకే ప్రతీ ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు. దాదాపు 40 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మదీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు.అద్భుతాలెన్నో....సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా అమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో మహారాజ కోట పశ్చిమ భాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు. సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమాను కు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై విసురుతూ ఉంటారు. దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ΄ాటు సిరిమానోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగుబంగారమై ఉత్తరాంధ్ర ప్రజలను చల్లగా కాపాడుతోంది శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి రాష్ట్రాలు, ఖండాలు దాటి వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేక పండగగా ప్రసిద్థి చెందింది. పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కష్టాలే ఎరుగలేదన్న విశ్వాసం గట్టిగా ఉంది. ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అ΄ార కరుణకు నిదర్శనంగా ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.సిరిమానుకు దారిలాపైడితల్లి అ్మమవారి కృపాకటాక్షాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. దేశ, విదేశాల నుంచి విమానయానం ద్వారా రావాలనుకున్న వారు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక పక్కనే ఉన్న ఒడిశా నుంచి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరంతా వాహనాలు, రైళ్లు ద్వారా నేరుగా విజయనగరం చేరుకోవచ్చు. ఒడిశా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఆటో, కారు, ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో పైడితల్లిని దర్శించుకుని తరించి అమ్మవారి కృప పొందవచ్చు.ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబరు 12న పందిరిరాటతో శ్రీకారం చుట్టారు. ఆ రోజు చదురగుడి, వనం గుడి వద్ద పందిరి రాట వేశారు. అదేరోజు అమ్మవారి మండల దీక్షలను చదురగుడి వద్ద ప్రారంభించారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష మొదలుపెట్టారు. అక్టోబర్ 6, సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7, మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం వనం గుడి నుంచి కలశజ్యోతి ఊరేగింపు, 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, అమరావతి, ఫొటోలు: డి. సత్యనారాయణ మూర్తి -
స్త్రీ శక్తే విజయ దశమి..
అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభప్రదంగా... జయకరంగా ఉంటుందని శాస్త్రోక్తి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనీ, వారికి సృష్టిస్థితి లయకారులనీ పేరు. వీరు ముగ్గురూ తామే ఆ కార్యక్రమాలని నిరాటంకంగా చేసేస్తున్నారా అంటే వారికి విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే కలుగుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బ్రహ్మకి గుడి, పూజలు లేకపోయినా, ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే ఆయనను పూజిస్తారు.అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం కోసమే. అంటే కేవలం ధనం కోసమే కాదు... అది పదవి, అధికారం, జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం అదేవిధంగా శక్తి లేని శివుడు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. అందుకే వీరికి త్రిశక్తులని పేరు. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు? శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనంజమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాథ చె΄్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లేటపుడు తమ ఆయుధాలను, ధనుర్బాణాలను శవాకారంలో మూటలా కట్టి ఆ మూటను శమీవృక్షం పై ఉంచి తాము అజ్ఞాత వాసం వీడే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడాలని జమ్మి చెట్టుకు నమస్కరించి వెళ్ళారట. తిరిగి అజ్ఞాత వాసం వీడిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేసి చెట్టు పై నుండి ఆయుధాలు తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించారని మహా భారతకథ చెపుతోంది. నాటి నుండి నేటి వరకు విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని అందరి నమ్మకం. విజయ దశమి రోజున నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి పైన పేర్కొన్న శ్లోకం చదివి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెంపుకుని పెద్ద వారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.ఆయుధ పూజలోని ఆంతర్యం?అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాండవ మధ్యముడు విజయుడు జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూజలో పెట్టడం ఆనవాయితీ. ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం కాని పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం, ఏదైనా కొత్త అంశాలను ఆరంభించడం ఈనాటి ఆచారాలలో ఒకటి. పాలపిట్ట దర్శనం ఎందుకు?పురాణ గాథల్లోకి వెళితే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కావడం జరిగిందని, నాటి నుండి వారి కష్టాలు తొలగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారట. అందుకే పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికి కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు లపిట్ట దర్శనం కోసం గ్రామాల్లో సాయంత్రం వేళ జమ్మి పూజ అనంతరం పంట పొలాల వైపు ప్రజలు ఆడ, మగ తండోపతండాలుగా వెళతారు. పాలపిట్ట దర్శనం చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. – డి.వి.ఆర్.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 బిలియనీర్లు.. కళ్లు చెదిరే విషయాలు
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది. ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలుM3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్‌కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో బిలియనీర్‌గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు. -
ఆయన మార్గం నిత్యనూతనం
‘నువ్వు ఏం చేయాలి అని సందిగ్ధానికి లోనయినప్పుడు, జీవితంలో నీకు తారసపడ్డ అత్యంత నిరుపేద, నిస్సహాయుడి ముఖాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నీవు తలపెట్టిన పని అతనికి ఏవిధంగా నైనా సాయపడుతుందా? తన బ్రతుకు తాను బ్రతకడానికీ, తన జీవితం సఫలం చేసుకోవడానికీ నువ్వు చేయబోయే పని అతని కేమైనా ఊతమిస్తుందా అని ఆత్మావలోకన చేసుకో, కర్తవ్యం నీకు బోధపడుతుంద’న్న గొప్ప జీవన సందేశాన్ని ఇచ్చినవారు మహాత్మా గాంధీజీ. గాంధీజీ ప్రత్యేకత ఏమిటంటే... తాను చెప్పిన విషయాన్ని తాను స్వయంగా ఆచరించిన తర్వాతనే చెప్పేవారు. ఇతరులు ఎలాంటి వారైనా, మన పట్ల ఎంతటి ద్వేషభావన కలిగి ఉన్నా... మన ప్రవర్తన ద్వారా ఎదుటివారిలో మానవతను కలిగించేలా నడుచుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రకారమే పాలకులలో పరి వర్తన తీసుకురావడానికి ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘సత్యం’ అనే మూడు ప్రధాన ఆయుధాలను ఉపయోగించుకొని జాతీయో ద్యమాన్ని మరో మలుపు తిప్పారు.అహింసాయుతంగా, మౌనంగా పోలీసులు లాఠీలతో కొడుతున్నా భరిస్తూ తమ నిరసనను తెలియజేసే ‘సత్యాగ్రహం’ ఆయుధాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రయోగించి అనేక విజయాలు సాధించారు. గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు దేశంలో అప్పటికే కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనడానికి భారత దేశానికి గాంధీజీ తిరుగు ప్రయాణం అయినప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన సైనికాధికారి జనరల్ ‘గిల్బల్ట్ ముర్రే’ బ్రిటీష్‌వారిని ఇలా హెచ్చరించాడు: ‘గాంధీకి సుఖాపేక్ష లేదు, ధనాపేక్ష లేదు; కామం, మోహం లేవు. తాను ధర్మం అని నమ్మిన దానిని ఆచరించడానికి ఎంత దూరమైనా వెళతాడు. అందువల్ల గాంధీ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అటువంటి వ్యక్తి దేహంపై మీరు విజయం సాధించవచ్చునేమో గానీ, అతని వ్యక్తిత్వాన్ని జయించడం అసాధ్యం. గాంధీ మీకు ప్రమాదకరమైన చిక్కులు తెచ్చి పెట్టే శత్రువు అవుతాడు’. గిల్బర్ట్ చేసిన ఈ హెచ్చరిక ఎంత నిజమో ఆ తర్వాత కాలంలో భారతదేశంలోని బ్రిటిష్ పాలకులకు అనుభవంలోకి వచ్చింది.ఒక సందర్భంలో గాంధీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఇలా రాశారు: ‘‘నా భావాలు మారుతూ ఉంటాయి. సత్యాన్వేషణలో నేను అనేక విశ్వాసాలను వదులుకొన్నాను. కొత్త విశేషాలు తెలుసు కొన్నాను. సత్యమే నా దేవుడు. అందువల్ల ‘వెనుక చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉన్నదే...’ అని నన్ను విమర్శించే బదులు, నేను ఇటీవల చెప్పిన మాటనే గ్రహించమని కోరుతున్నాను’ అంటూ వివరణ ఇచ్చారు. నిరాడంబరతకు చిహ్నంగా నిలిచారు గాంధీజీ. 1921 సెప్టెంబర్ 27న గాంధీజీ ఇతర దుస్తులన్నీ విసర్జించి భారతీయులుధరించే కొల్లాయిగుడ్డ, ఉత్తరీయానికి తన దుస్తుల్ని పరిమితం చేసుకొన్నారు. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చలు జరప డానికి ఇంగ్లాండ్‌కు అదే వేషధారణతో వెళ్లిన గాంధీని బ్రిటీష్ పాలకులు ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న సన్యాసి) అని అవహేళన చేసినప్పుడు గాంధీ చిరునవ్వు నవ్వి ‘మీరు చూడాల్సింది నా దుస్తులు కాదు... నేను మోసుకొచ్చిన కోట్లాది భారతీయుల ఆకాంక్ష’ అని చెప్పి, వారు సిగ్గుతో తలవంచుకొనేలా చేశారు. గాంధీజీ ప్రవచించి ఆచరించిన ఉన్నత మార్గాలలో ‘అహింసా మార్గం’ ఒక్కటే ‘ప్రపంచశాంతిని’ నెలకొల్పగలదని అన్ని సందర్భా లలో రుజువయ్యింది. గాంధీ బోధనలు, సత్యాన్వేషణకై ఆయన వేసిన మార్గాలు ఎప్పటికీ నిత్యనూతనం!– డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యులు( అక్టోబరు 2- గాంధీ జయంతి) -
అక్షరాన్ని అందిస్తూ...
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుందిచదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకుయూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్‌కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం) -
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్‌తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్‌లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..!
దుర్గా పూజ హిందూ పండుగ అని తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం హిందూ–ముస్లిం మత సామరస్యంతో జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కొంటైలోని కిషోర్‌నగర్ గర్ రాజ్‌బరి వద్ద జరుపుకుంటున్న స్వర్ణదుర్గాదేవి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మొదటగా అక్కడి పీర్లకు ఇస్తారు. ఆ తర్వాతే రాజకుటుంబీకులు స్వీకరిస్తారు. భక్తులకు పంచిపెడతారు. ఇలా దాదాపు 300 సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ పూజకు దూర్రప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. హిందూ–ముస్లిం సామరస్యం ఒక ప్రధాన లక్షణం, ఇక్కడ విగ్రహ నిమజ్జనానికి ముందు ముస్లిం పీర్లకు దేవత ప్రసాదాన్ని అందిస్తారు. ముందుగా పూజ సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవంలో కూడా స్థానిక హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొంటారు. వీరితోపాటు ఇతర మతాల వారు కూడా పూజలోపాలు పంచుకుంటారు, స్వర్ణదుర్గమ్మకు జీడిపప్పు భోగంపూజ సమయంలో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలను నివేదిస్తారు. వీటితోపాటు వేయించిన జీడిపప్పు, ఇంట్లో తయారు చేసిన జున్ను, చక్కెరతో వండిన ప్రత్యేక భోగాన్ని నివేదిస్తారు.(చదవండి: ‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!
సాధారణంగా అమ్మవారికి భక్తులు రకరకాల నైవేద్యాలను వండి ప్రసాదాలను సిద్ధం చేయడం సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారు తన నైవేద్యాన్ని తనకు నచ్చిన విధంగా తానే వండుకుంటుంది. అందుకోసం నాణ్యమైన సరుకులు, మసాలా దినుసులు, వంట చెరకు, వంటపాత్రలు సమకూరిస్తే సరి΄ోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పశ్చిమ బెంగాల్ ఝార్‌గ్రామ్‌లోని చిల్కిగఢ్ రాజభవనంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం ఇది.స్థానికంగా ‘విరామ భోగ్‘ అని పిలుచుకునే అష్టమి రోజున అమ్మవారు తనకు సమర్పించిన నైవేద్యాన్ని తానే స్వయంగా వండుతుందని నమ్ముతారు. చిల్కిగఢ్ రాజభవనంలో, అష్టమి పూజ పూర్తయిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి ఒక కొత్త మట్టి కుండలో నీరు, బలి మాంసం, ఇతర పదార్థాలను నింపుతాడు. పూజారి మేక బలి మాంసంతో ఏకాంతంగా వంటగదిలోకి ప్రవేశిస్తాడు. సంప్రదాయం ప్రకారం, మాంసాన్ని కొత్త మట్టి కుండలో ఉంచుతారు. దానిలో వివిధ మసాలా దినుసులు కలుపుతారు. తరువాత, మూడు కట్టెలను పొయ్యిలో ఉంచుతారు. ఆ మట్టి కుండను సాల్ చెట్టు ఆకులతో కప్పి, గదిలో పొయ్యిపై పెట్టి, కుండ పక్కన ఒక కొయ్య గరిటె ఉంచుతారు. పొయ్యిలో మూడు కట్టెలు వెలిగించిన తర్వాత, గది బయటి నుండి తాళం వేస్తారు. నవమి రోజు ఉదయం, పూజారి రాజభవనం నుండి తాళం తీసుకుని వచ్చి, ఆ వంటగది తలుపు తెరిచి చూసి, అమ్మవారికి ‘భోగ్‘గా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు. అమ్మవారే స్వయంగా వచ్చి ఈ భోగ్‌ను వండుకుంటుందని విశ్వాసం. ఈ విషయాన్ని చిల్కిగఢ్ రాజ్‌బరి ప్రస్తుత వారసుడు తేజసచంద్ర దేవ్ ధబల్దేవ్ స్వయంగా తెలియజేశారు. అమ్మవారు తమ పూర్వికులకిచ్చిన సూచనల మేరకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలియజేశారు. (చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
96 ఏళ్లుగా కళాప్రదర్శన
ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. అక్టోబర్ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్ ఉత్సవ్ జరుగుతుంది, తరువాత గిర్గామ్ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్పర్సన్ మితాలి పోద్దార్ అన్నారు. ‘కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. ఇది భవిష్యత్ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్షిప్లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంఆ పేరు రావడానికి కారణం..ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. విచిత్రమైన బలి ..ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది. దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం) -
భాగ్యనగరంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
శరన్నవరాత్రుల సందర్భంగా పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సోమవారం(సెప్టెంబర్ 29, 2025) నుంచి మూడు రోజుల పాటు నవరాత్రి హోమాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు స్వామి సూర్యపాద, స్వామి శ్రద్ధానందల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 28వ తేదీ ఆదివారం ఉదయం గం. 8.30 ల నుంచి శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, వాస్తుహోమం అనంతరం ప్రసాద వితరణ తదితరాలను ఘనంగా జరిగాయి. కాగా, ఈ రోజు సాయంత్రం 5గం.ల నుంచి స్వామి సూర్యపాద గారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయి. అలాగే ఈ వేడుకులో పాల్గొనదలిచని భక్తులందరికీ ఉచితప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. (చదవండి: చిత్తూ చిత్తుల బొమ్మ..శివుని ముద్దుల గుమ్మ) -
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.. రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే.. రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన.. వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే.. వెంకటేశుడెదురాయే నమ్మో.. అంటూ సాగే తెలంగాణ బతుకమ్మ పాటలు వింటే.. ఎన్ని తరాలు మారినా బతుకమ్మ పండుగ సంస్కృతిని ప్రతిబింబించడంలో తన ప్రశస్తిని చాటుకుంటూనే ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ.. క్రమంగా భాగ్యనగరంలో తన ఘనతని చాటుకుంటూ.. ప్రకృతి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. నగరంలో బతుకమ్మ అంటే ప్రతి పువ్వూ, ప్రతి ఆకూ.. ఊరి నుంచే తరలి రావాలి.. అంటే పల్లెకూ.. పట్నానికీ మధ్య సాంస్కృతిక వారధిగా మన బతుకమ్మ నిలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం బతుకమ్మ సంస్కృతిని తనలో ఇముడ్చుకుంది. ఇక్కడి విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ బతుకమ్మ పాటలకు శృతి కలుపుతున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులే కాకుండా సినీతారలు, ఇతర రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సారి వేడుకల్లో మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత బతుకమ్మ ఆడడం విశేషం. ఈ పండుగ ముగింపుకు చేరడంతో సోషల్ మీడియా కూడా పూలు, పట్టు పరికిణి కట్టుకున్నట్టుగానే కలర్‌పుల్ సందడి కనిపిస్తోంది. బతుకమ్మ ఆటల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో, విల్లాల్లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకప్పటిలా నగరం మూగబోకుండా సాంస్కృతిక సందడిని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. (చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..) -
పాటతల్లికి పెద్దకొడుకు
గోరటి వెంకన్న(GoratiVenkanna) సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కర లేని పేరు. ఆట పాటలతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. ‘హంస’ అవార్డు గ్రహీత. ‘కాళోజీ పురస్కార’ సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ వంటి పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలవు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటీ చెప్పనక్కర లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలి విడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్ అది. ‘వాగు ఎండిపాయెరో’, ‘నల్లతుమ్మ’, ‘సంత’, ‘అద్దాల అంగడి’, ‘కంచెరేగి తీపివోలె’, ‘యలమంద’, ‘గల్లీ సిన్నది గరీబోల్ల కత పెద్దది’, ‘ఇద్దరం విడిపోతె’, ‘తరమెల్లిపోతున్నదో’... ఇత్యాది పాటలన్నీ ప్రతి శ్రోతకూ కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసు కుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న! దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్ – అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. అమెరికన్ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్ జి. బ్రౌన్ వ్యాఖ్యానించినట్టు ఆయన పాటలు లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొక చేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తం లేని రాజయోగిలా ఉండు / ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.తాను పుట్టి పెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలు కొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ’క్వాట్రైన్స్ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘన కవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తుకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశారు.అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్‌కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహు మతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితో పాటు సరికొత్త వస్తువునూ జోడించి, ఎపిక్ హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో!– డా.బెల్లి యాదయ్య(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘గౌరవ డాక్టరేట్’ అందుకుంటున్న సందర్భంగా) -
శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..
మహా సముద్రంలో నీటిబొట్టంత దేశం. అందులో రాముడు కట్టిన శివాలయం. రాజుకు ఆశ్రయమిచ్చిన దంబుల్లా గుహలు. కశ్యపుని రాజ్రప్రసాదం సిగిరియా కోట. క్యాండీ బుద్ధుని దంతావశిష్ట ఆలయం. అశోకవాటిక నువారా సీతా ఎలియాలు. మూడు నిలువులెత్తు ధీర హనుమాన్. రథమెక్కిన పంచముఖ ఆంజనేయుడు. సీతమ్మ అగ్నిపరీక్ష సాక్షి దివురుంపోలా. విభీషణుడి పట్టం కట్టిన కెలానియ తీరం. ఇవన్నీ శ్రీలంక రామాయణ యాత్రలో. 1 వరోజుహైదరాబాద్ నుంచి శ్రీలంకకు ప్రయాణం. ఉదయం పదిన్నరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్కు చేరుకుని టూర్ ఆపరేటర్లకు రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం 13.30 గంటలకు యుఎల్178 విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 15.25 గంటలకు కొలంబోకు చేరుతుంది. ఫ్లయిట్ దిగిన తర్వాత చిలా లోని మునీశ్వర ఆలయ దర్శనం, ఆ తర్వాత మనవేరి ఆలయ దర్శనం చేసుకుని దంబుల్లాలో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. రాత్రి బస. రాముడు మొక్కిన శివుడు మునీశ్వర ఆలయం ఉన్న ప్రదేశం పేరు చిలా. రామాయణం కథనం ప్రకారం రావణ సంహారం తర్వాత రాముడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో ఆగి శివుడిని ప్రార్థించాడు. రాముడికి దీవెనలిచ్చిన శివుడు నాలుగు శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పాడని విశ్వాసం. ఆ మాట కోసం రాముడు నిర్మించిన ఆలయం 16వ శతాబ్దంలో పూర్తిగా ధ్వంసమైంది. అప్పుడు రాజు మొదటి రాజసింఘె పునర్నిర్మించాడు. దానిని 17వ శతాబ్దంలో ΄ోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూసే అందమైన ఆలయాన్ని స్థానికులు నిర్మించుకున్నారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న మనవెరి ఆలయం కూడా స్వయంగా రాముడు నిర్మించినదేనని అందుకే దీని పేరు రామలింగం అని స్థలపురాణం.2వ రోజుదంబుల్లా నుంచి క్యాండీకి ప్రయాణం. హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దంబుల్లా కేవ్ టెంపుల్, సిగిరియా ఫోర్ట్రెస్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత క్యాండీ ప్రవేశం. పెరడేనియాలోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ సందర్శనం, సాయంత్రం క్యాండీ కల్చరల్ షో వీక్షణం, రాత్రి బస క్యాండీలో. రాజుకు ఆశ్రయమిచ్చిన గుహలు దంబుల్లా క్రీస్తుపూర్వం నుంచి నివాస ప్రదేశం. ఇందులోని భారీ కొండను బౌద్ధ భిక్షువులు తమకు నివాసం కోసం గుహలుగా తొలుచుకున్నారు. అనూరాధపురాను పాలించిన వత్తగామిని అభయ క్రీ.పూర్వంలో ఒకటవ శతాబ్దంలో 14 ఏళ్ల పాటు రాజ్య బహిష్కరణకు గురయిన సందర్భంలో అతడికి బౌద్ధ భిక్షువులు ఇక్కడే ఆశ్రయమిచ్చారు. తిరిగి అనూరాధపురకు వెళ్లి రాజ్య సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న వత్తగామిని బౌద్ధభిక్షువుల పట్ల కృతజ్ఞతతో ఈ గుహలను మరింత చక్కగా మెరుగులు దిద్దించాడు. అద్భుతమైన ఈ గుహాలయాలను ఫొటో తీయడానికి అనుమతి ఉండదు. కాబట్టి మనోఫలకం మీద ముద్రించుకోవడమే. సిగిరియా దుర్గం సిగిరియా దుర్గం ప్రాచీనమైన రాతి కోట. దంబుల్లాకు సమీపాన ఉంది. ఈ నిర్మాణం యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. కోట ఒక కొండ మీద ఉంటుంది. ఆశ్చర్యమేమిటంటే రాజస్థాన్ కోటలు కూడా ఎక్కువ భాగం కొండల మీదనే ఉన్నాయి. కానీ ఈ సిగిరియా కోట ఉన్న కొండ నిటారుగా ఉంటుంది. మొక్కలను రకరకాల ఆకారాల్లో ప్రూనింగ్ చేసినట్లు ఈ కొండను కోట నిర్మాణానికి తగినట్లు చెక్కినట్లు ఉంటుంది.శత్రుదుర్బేధ్యంగా నిర్మించడంలో ఇదొక పద్ధతి. శ్రీలంక రాజు కశ్యపుని కోసం నిర్మించిన రాజ్రప్రసాదం ఇది. శ్రీలంకలో బౌద్ధం విస్తరించిన నేపథ్యంలో కశ్యపుని తర్వాత ఈ రాజ్రప్రాసాదం బౌద్ధుల అధీనంలోకి వెళ్లింది. ప్రాచీన నగర నిర్మాణశైలికి నిదర్శనం ఈ రాజ్రప్రాసాదం. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్‌కు ఒక పాఠ్యగ్రంథం వంటిది. రాయల్ బొటానికల్ గార్డెన్ ఈ గార్డెన్ క్యాండీ నగరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాదాపుగా 150 ఎకరాల్లో విస్తరించిన ఈ గార్డెన్లో నాలుగు వేల రకాల మొక్కలున్నాయి. ఇక్కడ పర్యటిస్తుంటే మ్యాప్‌లో కనిపించే గోరంత దీవిలో చూడాల్సిన ప్రదేశాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. నీటిబుగ్గ వంటి దీవి కావడంతో ఏడాదంతా పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. శ్రీలంక సాంస్కృతిక కళల ప్రదర్శన చూడకుండా వెనుదిరిగితే ఆ దేశం ఆత్మను అర్థం చేసుకోవడంలో విఫలమైనట్లే. క్యాండీ నగరంలోని లేక్ క్లబ్లో రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి శ్రీలంక సంస్కృతి సంప్రదాయాలను, ఆ దేశ చరిత్రను వ్యక్తీకరిస్తూ నాట్యప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. మన దక్షిణ భారత కళారూ΄ాలకు కొనసాగింపుగా ఉంటాయి. వాటిని మనసు పెట్టి వీక్షించాలి. 3వరోజుక్యాండీ నుంచి నువారా ఎలియాకు ప్రయాణం. ఉదయం త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. క్యాండీలోని బుద్ధుడి దంతావశిష్టం ఆలయ దర్శనం తర్వాత రంబోదాలో భక్త హనుమాన్ టెంపుల్ దర్శనం, టీ ఫ్యాక్టరీ విజిట్. అశోక వాటిక సందర్శనం తర్వాత నువారా ఎలియాలో హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస. క్యాండీ బౌద్ధ విశిష్టం శ్రీలంకలోని హెరిటేజ్ సైట్లలో కాండీ నగరం ఒకటి. సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉందీ నగరం. క్యాండీలో బుద్ధుడి దంత ధాతువుని ప్రతిక్షేపించిన నిర్మించిన ఆలయం (టూత్ రిలిక్ టెంపుల్) ఉంది. ఇక్కడి నేషనల్ మ్యూజియం ప్రపంచదేశాల్లోని బౌద్ధం అంతటినీ ఒక చోట రాశిపోసినట్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రం అమరావతి బౌద్ధ స్థూపం నమూనాల నుంచి చైనాలోని లాఫింగ్ బుద్ధ ప్రతిమలతోపాటు భవిష్యత్తులో పుట్టబోయే బుద్ధుడి ఊహాశిల్పం కూడా ఉంది. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యలెస్లున్నాయి. ఆలయం, రాజ్రప్రాసాదాలు ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారి΄ోవడానికే ఇలాంటి ఏటవాలు కప్పు నిర్మాణాలు. ఈ నగరంలో పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు గుర్రాలు నడవడానికి అనువైన నేలతో కలోనియల్ ఫీల్‌ను కలిగిస్తుంటాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సు ఒడ్డున ఉన్న ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని ఈ సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. రంబోదా హనుమాన్ శ్రీలంక అనగానే మన భారతీయులకు గుర్తొచ్చే పేర్లలో రాముడు, సీత, రావణాసురుడి తర్వాత హనుమంతుడిదే. ఇంత గొప్ప పౌరాణిక గ్రంథంలో హనుమంతుడే లేక΄ోతే రామాయణమే లేదన్నంతగా శ్రీలంకకు హనుమంతుడితో బంధం ముడివడి ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంక మొత్తాన్ని చుట్టేసిన హనుమంతుడు అలసి΄ోయినప్పుడు రంబోదా అనే ప్రదేశంలో విశ్రమించాడని విశ్వాసం. ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ఎత్తు 18 అడుగులు. శ్రీలంకలో ఉన్న హనుమంతుడి విగ్రహాల్లో పెద్ద విగ్రహం ఇదే. అన్నట్లు ఈ ఆలయంలో డ్రెస్ కోడ్ ఉంది. దుస్తులు భుజాలు కప్పుతుండాలి, మోకాళ్ల కిందకు ఉండి తీరాలి. క్యాండీ నుంచి నువారా ఎలియా వెళ్లే దారి మొత్తం దాదాపుగా టీ తోటలే. దమ్రో టీ ఫ్యాక్టరీ, సిలోన్ టీ ఫ్యాక్టరీ వంటి అనేక ఫ్యాక్టరీలున్నాయి. టీ తోట నుంచి సేకరించిన ఆకు కప్పులో టీ గా మారే ప్రక్రియను చూడవచ్చు. రకరకాల ఫ్లేవర్ టీలను రుచి చూసి, నచ్చిన టీ పొడులు కొనుక్కోవచ్చు. సీతా ఎలియా నువారా ఎలియా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సీతా ఎలియా. దీన్నే అశోకవాటిక అంటారు. సీతాదేవి వనవాసం చేసిన ప్రదేశం అని చెబుతారు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి ఇష్టపడక΄ోవడంతో ఆమె ప్రకృతి ప్రేమికురాలని గ్రహించి ఈ ఉద్యానవనంలో నివాసానికి ఏర్పాట్లు చేశాడని చెబుతారు. అశోకవాటిక మధ్యలో సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. ఆ శిల్పం నేపథ్యంలో ఫొటో తీసుకోవడం మర్చిపోవద్దు. సీతా అమ్మన్ ఆలయం దక్షిణాది ఆలయాల నిర్మాణశైలిలో ఉంటుంది. కానీ మనదేశంలో శిల్పాలతో పోలిస్తే ఈ శిల్పాలలో మానవ శరీర నిర్మాణం మరికొంత దృఢంగా కనిపిస్తుంది. 4వరోజు నువారా ఎలియా నుంచి కతరగామకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నువారా ఎలియా సైట్ సీయింగ్. దివురుం΄ోలా ఆలయం, గాయత్రిపీఠం, గ్రెగరీ లేక్ విహారం తర్వాత కతరగామ టెంపుల్ దర్శనం, కతరగామలో హోటల్ గది చెక్ ఇన్, రాత్రి బస. బ్రిటిష్ జ్ఞాపకాలు శ్రీలంకలో ఎత్తైన ప్రదేశం నువారా ఎలియా. ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో ఉంటాయి. వేసవిలో కూడా ఏసీ సిక్స్‌టీన్‌లో పెట్టి స్వింగ్ పెట్టినట్లు గాలి తెమ్మెరలు ఒంటిని తాకుతూ ఉంటాయి. ఇక్కడ ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన పెట్టిన లోకల్ వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తే కళ్లప్పగించి చూడండి. ఎందుకంటే ఇక్కడి క్యాబేజీ మూడు నుంచి నాలుగు కేజీలు తూగుతుంది. కూరగాయలు, పండ్లు అన్నీ కంటికి ఇంపుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి ముందు కూరగాయల తోట ఉంటుంది. సుమారు ఐదు వందల గజాల స్థలంలో మూడు వందల గజాలు కూరగాయల కోసం వదిలి మిగిలిన ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటారు. బ్రిటిష్ పాలన ప్రభావం ఇక్కడి క్వీన్స్ కాటేజ్ వంటి కొన్ని నిర్మాణాల్లో కనిపిస్తుంది. అగ్ని ప్రవేశం ఇక్కడే దివురుంపోలా అంటే ఒట్టు పెట్టిన ప్రదేశం అని అర్థం. ఇది సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం అని చెబుతారు. ఇక్కడ కట్టిన ఆలయ ప్రాంగణంలో ఒక రాతి నిర్మాణం ఉంది. అరుగు మీద బౌద్ధ స్థూపం, అరుగుకు ముందు బుద్ధుడి చిన్న విగ్రహం ఉన్నాయి. ఆలయంలో రాముడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. మొత్తానికి ఇది రాయామణం, బౌద్ధం సమ్మేళనంగా కనిపిస్తుంది. ఇక గాయత్రి టెంపుల్ పరిశుభ్రంగా, ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. గ్రెగరీ లేక్‌లో పడవ విహారం జీవితకాలపు మధురానుభూతిగా మిగులుతుంది. ఇక కతరగామ టెంపుల్‌కి వస్తే... ఇది కుమారస్వామి –వల్లీ దేవిని కలిసిన ప్రదేశమని చెబుతారు. శ్రీలంలోని తమిళులు, సింహళీయుల ఐక్యత జీవించిన రోజులకు ప్రతిబింబం ఈ ఆలయం. అలాగే వర్తక వాణిజ్యాలకు, రాజ్య విస్తరణకు శ్రీలంకలో అడుగుపెట్టిన అనేక మతాలు కూడా ఈ ఆలయాన్ని తమదిగానే స్వీకరించాయి. దాంతో అనేక మతాల చిహ్నాల సమ్మేళనంగా మారింది. 5వరోజు కతరగామ నుంచి కొలంబోకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొలంబోకు ప్రయాణం. కెలానియా బుద్ధ టెంపుల్, పంచముగ ఆంజనేయ టెంపుల్, కొలంబో సిటీ టూర్, హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస కొలంబోలో. విభీషణుడి పట్టాభిషేకం ఇక్కడే! కేలనియా మహా విహారాయ కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘కేలని గంగా నది’ తీరాన ఉంది. ఈ ఆలయం ప్రాచీన శిల్పకళ, అద్భుతమైన చిత్రకళా నైపున్యానికి ప్రతీక. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఈ చిత్రాల్లో విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. ప్రస్తుతం ఇది బౌద్ధ క్షేత్రం. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ చిత్రాల్లో కనిపిస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఆంజనేయునికి రథం శ్రీలంకలో రాముడు, సీతతోపాటుగా ఆంజనేయ స్వామికి గౌరవం ఉంటుంది. ఆంజనేయుడికి ఆలయాలు కూడా ఉన్నాయి. కానీ పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఇదొక్కటే. ఆంజనేయుడి కోసం ప్రత్యేకంగా రథం ఉండడం ఇక్కడి మరో విశేషం. ఇక కొలంబో సిటీని ఒక రౌండ్ చుట్టేస్తే యూకే, యూఎస్, చైనా, ఇండియాలో ముంబయి, చెన్నై నగరాలు ఒకదాని తర్వాత మరొకటి రీల్ కళ్ల ముందు తిరిగినట్లు ఉంటుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఆనవాళ్లు కొలంబో నగరంలో ఎక్కడా కనిపించవు. ఇది చాలా సంపన్న నగరం. హిందూమహాసముద్ర తీరం గాలే బీచ్ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఎకరాల్లో విస్తరించిన గ్రీనరీ అందంగా ఉంటుంది. రొయ్యల వడలు ఇక్కడ రుచి చూడాల్సిన వంటకం. ఇక్కడ గాలే ఫేస్ హోటల్ బ్రిటిష్ పాలన కాలం నాటిది. సాయంత్రాలు ఓపెన్ రెస్టారెంట్లో కూర్చుని సముద్రపు అలలను చూస్తూ గడపడం గొప్ప అనుభూతి. పౌర్ణమి రాత్రి ఇక్కడి సీ వ్యూ టేబుల్‌కి డిమాండ్ ఎక్కువ. 6వరోజుశ్రీలంక నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్΄ోర్టుకు ప్రయాణం. 29వ తేదీ ఉదయం 07.25 గంటలకు యుఎల్ 177 విమానం కొలంబోలో బయలుదేరి 09.20 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరడంతో టూర్ పూర్తవుతుంది. శ్రీలంక... పచ్చల పాపిడి బొట్టు! శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో నీటిబొట్టును పోలి ఉన్న చిన్న భూభాగం. వధువు నుదుటన మెరిసే పచ్చల పాపిడి బొట్టులా ఉంటుంది. ఈ దీవిలో ఎత్తైన పర్వతశిఖరాలు, అగాధాలను తలపించే సరస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడి రోడ్ల నిర్మాణం బాగుంటుంది. వాహనాల డ్రైవర్లు చక్కటి క్రమశిక్షణ పాటిస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు వాహనం వేగం ఒక్కసారిగా ఇరవై కిలోమీటర్లకు తగ్గిపోయిందంటే అది స్కూల్ జోన్ అన్నమాటే. స్కూలు మొదలయ్యే సమయం, వదిలే సమయం కాక΄ోయినప్పటికీ ఈ నియమాన్ని పాటించి తీరుతారు. శ్రీలంకలో గొప్ప హిందూ ఆలయాలు, చర్చ్‌లు, మసీదులు, బౌద్ధ స్థూపాలు దేనికది గొప్ప శోభతో వెలుగొందుతూ ఉంటాయి. సముద్రంలో ఓ చిన్న దీవిలో ప్రతి అంగుళమూ పచ్చదనమే, ఏడాదంతా సస్యశ్యామలమే. కొబ్బరి తోటలు, పోక చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ. అన్నట్లు ఇక్కడ మామిడి ఏడాదికి రెండు కాపులు కాస్తుంది. దేశం పరిశుభ్రంగా ఉంటుంది. మనుషులు సౌమ్యంగా ఉంటారు. చాలా దుకాణాల్లో మన భారతీయ రూపాయలు తీసుకుంటారు. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే. అయితే మూడు రూపాయిలు మన ఒక రూపాయికి దాదాపుగా సమానం. ఆ రోజు ఎక్సేంజ్‌ని బట్టి తీసుకుంటారు. మిగులు నాలుగైదు రూపాయలు వదిలేసినా కూడా చాలా సంతోషిస్తారు. శ్రీలంక ఆహార సంక్షోభం హోటళ్లలో కనిపిస్తుంది. ఫైవ్ స్టార్ హోటల్లో కూడా వెరైటీల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఆహారాన్ని వృథా చేయవద్దని సూచన బోర్డు ఉంటుంది. ఆహారం మన దక్షిణాది రుచిని కలిగి ఉంటాయి. కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది. రామాయణ లంక శ్రీలంక రామాయణ యాత్ర ఎక్స్ హైదరాబాద్ టూర్. ఇది ఆరు రోజుల యాత్ర. అక్టోబర్ 24వ తేదీ మొదలవుతుంది. ప్యాకేజ్ కోడ్ ‘ఎస్హెచ్ఓ10’. ఇందులో కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఎలియా, కతరగామ ప్రదేశాలు కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలివి సింగిల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 90 వేల రూపాయలు (ఇండియన్ రూపీస్). డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 65 వేలు, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 64 వేల వరకు ఉంటుంది. ఇవేవీ వర్తించవు! ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి రవాణా ఖర్చులు. లాండ్రీ ఖర్చులు, మద్యం, మెనూలో లేని ఇతర ఆహారాల ఖర్జులు, డ్రైవర్లకు – గైడ్లకు టిప్‌లు. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలి! పాస్‌పోర్ట్ (ప్రయాణం చేసే నాటికి కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి) పాన్ కార్డు కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సాఫ్ట్‌కాపీ ఎవరిని సంప్రదించాలి? ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్, 9–1–129 /1 /302, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ : 040– 27702407వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!
మనలోని పది రకాల దుర్గుణాలను నాశనం చేసి, విజయానికి గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు. మన జీవితాల్లోని ప్రతికూలతను నాశనం చేయడానికి, మంచితనాన్ని స్వీకరించడానికి ఆహ్వానించే రోజు. అంతటి ప్రత్యేకతలు గల రోజులలో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి, మన ఇంటిని స్వర్గధామంగా మార్చే కొన్ని సులువైన దసరా అలంకరణలివి..1. పూల తేరుఏ పండగలోనైనా అలంకరణలో ప్రధానంగా మన కళ్లకు కట్టేది పూల తోరణాలు. పూలనే తేరుగా చేసే బతుకమ్మ వేడుకలు కాబట్టి, ఇంట్లోనూ వివిధ రకాల పూల అమరిక వేడుక రోజులను హైలైట్ చేస్తుంది. 2. థీమ్ ప్రాజెక్ట్దసరా రోజుల్లో మనకు ప్రధానంగా కనిపించేది అమ్మవారి అలంకరణ. ఎరుపు, పసుపు, పచ్చ రంగులు వచ్చేలా సృజనాత్మకతను దశ విధాల థీమ్ ప్రాజెక్ట్‌తో గృహాలంకరణను చేపట్టవచ్చు. 3. జత చేసిన రంగుల ఫ్యాబ్రిక్ కాటన్, సిల్క్, బాందినీ, గోటా పట్టీ.. ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన హ్యాంగింగ్స్, బీడ్స్, కర్టెన్స్.. వంటివి అలంకరణలో ఉపయోగించవచ్చు. 4. అద్దాలుడైమండ్, స్క్వేర్, చిన్నా పెద్ద అద్దాలను అమర్చిన వాల్ హ్యాంగింగ్స్‌ను అలంకరించవచ్చు. అట్టముక్కలను కట్‌చేసి, రంగు కాగితాలను, అద్దాలను అతికించి, ఈ డిజైన్స్ ఏర్పాటు చేయవచ్చు. 5. ఫర్నిషింగ్ రాజస్థానీ, గుజరాతీ హస్తకళా వైభవాన్ని తలపించే ఫర్నిషింగ్ అంటే కుషన్ కవర్స్, టేబుల్ రన్నర్స్‌ను ఈ వేడుకకు సరైన కళను తీసుకువస్తాయి. 6. దాండియా కళ నవరాత్రి రోజుల్లో దాండియా వేడుకను తలపించేలా ప్లెయిన్ వాల్‌పైన కాగితంతో దాండియా బొమ్మలు, వుడెన్ స్టిక్స్‌తో అలంకరించవచ్చు. 7. కార్నర్ కళలివింగ్రూమ్ లేదా డైనింగ్ హాల్లో ఒక కార్నర్ ప్లేస్‌ను ఎంపిక చేసుకొని, ఆ ప్రాంతాన్ని బొమ్మల కొలువు, దేవతామూర్తుల విగ్రహాలు, పువ్వులు, దీపాలతో అలంకరణను ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇంటికి పండగ కళ ఇట్టే వస్తుంది.8. ఇత్తడి, రాగి పాత్రలుపండగ రోజుల్లో కుటుంబ వారసత్వంగా వచ్చిన ఇత్తడి, రాగి పాత్రలు, కలప వస్తువులను అలంకరణలో ఉపయోగించవచ్చు. 9. రంగోలీ మ్యాట్స్పండగ రోజుల్లో ఇంటి ముందు, లోపల అందమైన రంగోలీని తీర్చిదిద్దడం చూస్తుంటాం. రంగోలీని తీర్చిదిద్దేంత సమయం లేదనుకునేవారు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన రంగోలీ మ్యాట్స్‌ను ఇంటి లోపల, గోడల పక్కన అలంకరించవచ్చు. 10. టెర్రకోట బొమ్మ లేదా ఇండోర్ ప్లాంట్స్టెర్రకోటతో తయారైన అమ్మవారి తల ఉన్న బొమ్మలు తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తాయి. వీటిని సెంటర్ టేబుల్ లేదా కార్నర్ టేబుల్‌పైన ఉంచి, పువ్వులను అలంకరించవచ్చు. ఇండోర్ ప్లాంట్స్తోనూ అలంకరణలో ప్రత్యేకత తీసుకు రావచ్చు. ఎన్నార్ (చదవండి: ఈ బామ్మ రూటే వేరు..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
షహీద్ భగత్ సింగ్ : స్వాతంత్య్ర విప్లవ జ్వాల
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. 1907 సెప్టెంబర్ 28న నేడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోష లిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందూ, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి... మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో కచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. తనకు గురు తుల్యుడు, తండ్రి సమానులైన లాలా లజపత్ రాయ్ ‘హిందూ మహాసభ’కు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్‌సింగ్ కార్య కలాపాలపై లాలా కూడా విరుచుకు పడ్డారు. నన్ను లెనిన్ లా మార్చడానికి భగత్‌సింగ్ ప్రయత్నిస్తున్నాడనీ, అతను రష్యన్ ఏజెంట్ అనీ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్‌సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. ‘విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. పరిస్థితుల్లో మార్పు తేవడమనే ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి’ అంటూ వివరించారు. మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్ సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థు లను శత్రువులుగా భావిస్తున్నారనీ, రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం అనీ, మతం వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనీ భగత్‌సింగ్ అన్నారు. మతతత్వాన్ని నిర్మూ లించడానికి ఏకైక మార్గం వర్గచైతన్యమే అని అన్నారు. ‘పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం. కానీ, సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?’ అని ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలో భగత్ సింగ్ ప్రస్తావించారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక శక్తులు భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్య పరచాలి.– నాదెండ్ల శ్రీనివాస్ మధిర -
ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..
దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరభారతదేశం ఢిల్లీ తప్పనిసరిగా రాంలీలా ప్రదర్శన జరుగుతుంది. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ఇతిహాసం చెడుపై మంచి ఎప్పటికైనా గెలవాల్సిందే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాదు సత్ప్రవర్తనతో మెలిగేందుకు దోహదపడుతోంది. అలాంటి రాంలీల ప్రదర్శన ఎప్పుడు మొదలైంది..? ఎవరు ప్రారంభించారు..? అంటే..ఈ రాంలీలా 485 ఏళ్ల క్రితమే కాళీలో ప్రారంభమైందట. వారణాసిలో జరిగే చిత్రకూట్ రాంలీలా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాంలీలా అట. 16వ శతాబ్దంలో 1540 ఆ సమయంలో జరిగిందట. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోందట. 16వ శతాబ్దంలో తులసీదాస్ రామచరితమానస్‌ని అవధి భాషలో రాశారు. ఆయన వారణాసిలో కూర్చొని రామ ధ్యానం, ఆయన కథ వినిపిస్తుండేవాడట. తనకు రామదర్శనం ఎప్పుడవుతుందని కుతుహలంగా ఎదురుచూసేవాడట. ఒకనొక సందర్భంలో అస్సీఘాట్‌లో తులసీదాస్ రామకథ చెబుతుండగా రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా వెళ్తున్నట్లు దర్శనం పొందుతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యుడు మేఘ భగవత్ ఈ రాంలీలా ప్రదర్శన సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జనులంతా తులసీదాసు మాదిరిగా రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాలనే ఉద్ధేవ్యంతో భగవత్ దీన్ని ప్రారంభించాట. వాస్తవానికి మేఘ భగవత్ రాంలీలా ప్రదర్శన వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింపబడినప్పటికీ.. రాంలీలాని సంస్కృతంలోనే ప్రదర్శిస్తారట. అందువల్లే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రసిద్ధికెక్కిందని చరిత్రకారులు చెబుతున్నారు.ఎన్నో విశేషాలు..ఇక్కడ రాంలీలా సుమారు 22 రోజులపాటు కొనసాగుతుందట. ముకుట్ పూజతో ప్రారంభమవుతుందట. రాముడు, లక్ష్మణుడు, సీత, ధరించే (ముకుట్)కిరీటాలకి పూజ చేయడంఓత ప్రారంభమవుతుంది. అంతేగాదు ఆ కిరీటాలు శతాబ్దాల నాటివని చెబుతుంటారు. అక్కడ ఈ వేకుడ కోసం చాలా పెద్ద ఆచారాన్ని నిర్వహిస్తారు అక్కడ. ఆ కిరీటాలను అలా పూజ చేసి పవిత్రంగా మార్చడంతో వాటిని ధరించిన మానవులు దేవతా స్వరూపులుగా కనిపిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. మరో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే..నక్కటైయగా పిలిచే ఊరేగింపు. ఇది 12వ రోజు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ ఎపిసోడ్‌ని ప్రదర్శిస్తారు. పంచవటిలో రాముడి అందానికి మోహవశురాలైన ఘట్టం అత్యంత ముగ్ధమనోహరంగా జరుగుతుందట. అక్కడ కాశీ వీధులన్ని తిరుగుతూ నిర్వహిస్తారట ఆ సన్నివేశాన్ని. అంతేగాదు ఈ రాంలీలా నాటక ప్రదర్శన కోసం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ప్రజలంతా గుమిగూడి మరి తిలికిస్తారట. అంత విశేషాలతో కూడుకున్నది అ చిత్రకూట్ రాంలీలా. (చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..) -
ఇదిగో ఇ–రిక్షా సోషల్ మీడియా సెంటర్!‘
అప్పు చేసి ఇ–రిక్షా కొన్నాడు సుమిత్ తండ్రి. ఆ అప్పు తీరకుండానే ఆయన మంచం పట్టాడు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్ ప్రజాపతి( Sumit Prajapati) కు ఇ–రిక్షాయే దిక్కు అయింది. దిక్సూచి అయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 22 సంవత్సరాల సుమిత్ ప్రజాపతి ఇ–రిక్షాను సోషల్ మీడియా సెంటర్‌గా చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు...గ్యాస్‌స్టవ్ వెలిగించే క్రమంలో సుమిత్ తండ్రి అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం వల్ల అతడు రిక్షా నడపలేని పరిస్థితి. మరోవైపు రిక్షా కోసం చేసిన అప్పులు. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తూనే ‘ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.పేదరికం వల్ల చిన్నప్పుడు పొలం పనులు, కూలీ పనులు చేశాడు సుమిత్. కార్లు కడిగాడు. కూరగాయలు అమ్మాడు. తన పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదని ఎన్నో పనులు చేశాడు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అయితే విధి నిర్ణయం మరోలా ఉంది’ అంటాడు సుమిత్.తండ్రికి ఆసరాగా ఉండడానికి ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరాడు. చెప్పిన జీతంలో సగం జీతం కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగం మానేయ్యడమే కాదు ఇక ఎప్పుడూ ఉద్యోగం చేయకూడదనుకున్నాడు. చాలామంది యువకులలాగే సుమిత్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు. తండ్రి ప్రమాదానికి గురి కావడంతో ఇ–రిక్షా నడపాలనుకున్నాడు సుమిత్. ‘ఇ–రిక్షా, సోషల్ మీడియాను ఒకేచోట చేరిస్తే’ అనే దిశలో ఆలోచించాడు. కార్లు, బైక్‌లపై కంటెంట్‌ను క్రియేట్ చేసేవారు ఉన్నారు. ఇ–రిక్షాపై ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది అనుకున్నాడు. View this post on Instagram A post shared by Sumit Prajapati (@sumit_prajapati87) ‘నా రిక్షాను స్టార్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను’ నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుమిత్. కంటెంట్ క్రియేటర్‌గా అతడి వైరల్ మూమెంట్ గురించి చెప్పుకోవాలంటే...తన కుటుంబసభ్యులు ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ వచ్చాయి.‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వీడియోలు ఏమిటి! నిన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వెక్కిరిస్తారు’ అని తండ్రి అన్నాడు. కొన్ని అనుభవాల తరువాత ఆయన మాటలు వాస్తవం అనే విషయం అర్థమైంది. ‘ప్రజలు చిన్న చూపు చూడకుండా, అభిమానించేలా కంటెంట్ క్రియేషన్ చేయాలి’ అనుకున్నాడు. నవ్వించడానికి ఒకప్పుడు ఏవేవో వీడియోలు చేసిన సుమిత్ ఆ తరువాత రూట్ మార్చాడు. వ్యక్తిత్వవికాస వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రాండ్లకు సంబంధించి రిక్షాలో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.‘ఏ పనీ చిన్నది కాదు. మనం చేసే ప్రతి పని పెద్దదే. గౌరవనీయమైనదే’... ఇలాంటి మాటలెన్నో తన వ్యక్తిత్వ వికాస వీడియోల్లో వినిపిస్తుంటాడు సుమిత్. తాజా విషయానికి వస్తే...తనకు వచ్చే ఆదాయంతో సుమిత్ కుటుంబ అప్పులన్నీ తీర్చాడు. చెల్లిని చదివిస్తున్నాడు. సుమిత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 87వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.చదవండి : ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీమొదట చిన్న లక్ష్యాలు... ఆ తరువాత పెద్ద లక్ష్యాలు ఇక నా పనిఅయిపోయినట్లే’ అని నేను ఎప్పుడూ నిరాశపడలేదు. నిలదొక్కుకోవడం కోసం ఎంత చిన్న పనైనా చేయాలనుకున్నాను. కూలి పనులు కూడా చేశాను. ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాను. అప్పుల భారంతో మా సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి ఆ ఇంటిని కొనాలనేది నా కల. – సుమిత్ ప్రజాపతి -
ఇలా చేస్తే... ఉద్యోగం మీదే!
జాబ్ మార్కెట్లో విపరీతంగాపోటీ ఉండడం వల్ల ఉద్యోగం రావడం అంతా ఆషామాషీ విషయం కాదు. కాని కొందరికి మాత్రం ఇట్టే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారిలో షారన్ మెల్జర్ (Sharon Melzer) ఒకరు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉద్యోగాన్ని సొంతం చేసుకొని ‘వావ్’ అనిపించింది. తన విజయరహస్యం (success secret) గురించి ‘లింక్డ్ ఇన్’లో పంచుకుంది.‘ఒక ఉద్యోగానికి మనం దరఖాస్తు చేసుకున్నామంటే ఈ ఉద్యోగం (Job) కచ్చితంగా నాదే’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటుంది షారన్ మెల్జర్.ఒక సోషల్ మీడియాలో కమ్యూనిటీ మేనేజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంది షారన్. దరఖాస్తు చేసుకున్న వారిని కొత్త ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌కు సంబంధించి కంటెంట్ స్ట్రాటజీని సబ్మిట్ చేయాల్సిందిగా కంపెనీ అడిగింది. చాలామంది బేసిక్ డాక్యుమెంట్‌ను సమర్పించారు. షారన్ మాత్రం రెండు అడుగులు ముందు వేసింది. అత్యంత వివరంగా, సృజనాత్మకంగా కంటెంట్ ప్లాన్ తయారుచేసింది. తన ఐడియాలకు సంబంధించి వీడియో ప్రెజెంటేషన్‌ను రూ పొందించింది. మిగిలిన రెజ్యూమ్‌లతో పోల్చితే షారన్ రెజ్యూమ్ ప్రత్యేకంగా కనిపించింది. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేసింది. ‘ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఎప్పుడూ మంచిదే’ అంటుంది షారన్.చదవండి: ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ -
చేనేతపై పెనుభారమే!
మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు. వ్యవసాయరంగం తరువాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధార పడ్డ రంగం చేనేత రంగం. కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా చేనేత, టెక్స్టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జీఎస్టీని విధించడంతో ఆ రంగంపై పెను భారం పడనుంది. రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 5 శాతం, ఆ ధర కంటే ఎక్కువ ధర ఉండే చేనేత వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని ఇప్పటివరకు విధించారు. నూతన జీఎస్టీలో భాగంగా 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతర వస్త్రాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాల ధరలు పెరిగి 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్‌లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ లేకుండా పోతోంది. చదవండి: ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ఫలితంగా ఆదాయం కోల్పోయి చాలా కుటుంబాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచు కుంటున్నాయి. ఇప్పుడు జీఎస్టీని కొన్ని దుస్తులకు పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చేనేత వస్త్రాలు కేవలం రూ. 2,500 లోపే మార్కెట్లో దొరుకుతాయా? ఎటు వంటి శారీరక శ్రమతో పనిలేకుండా కృత్రిమ దారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం నుండి5 శాతానికి తగ్గించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ వస్త్రాలు తక్కువధర లకు లభించడంతో వినియోగదారులు వాటిపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు వచ్చే అవకాశంఉంది. నిజానికి చేనేత వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కావు. అవి భార తీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులపై జీఎస్టీని తీసివేయాలి.లేదా ధరల సీలింగ్ లిమిట్‌ను హేతుబద్ధీకరించాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటున్న కేంద్ర ప్రభుత్వం... స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంపై పునఃసమీక్ష చేయాలి.ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ– డా.రామకృష్ణ బండారుకామర్స్ అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ -
అక్కడ దసరా విజయదశమి నుంచే ..
మన దేశంలో ఈ దసరా పండుగ పలు సంప్రదాయాలకు అనుగుణంగా విభిన్నంగా చేసుకుంటుంటారు. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే పండుగ పర్యాటక ప్రేమికులు ఇష్టపడే హిమచల్‌ప్రదేశ్ కులుమనాలిలోని కులు లోయలో ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు. ఈ పండుగను అక్కడ అత్యంత విచిత్రంగా నిర్వహిస్తారు. అన్నిచోట్ల నవరాత్రులు విజయదశమితో ముగిస్తే..అక్కడ ఆ రోజు నుంచి మొదలవుతాయట. ఇదేంటని అనుకోకండి. ఎందుకంటే అందుకు ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చకచక చదివేయండి..కులు లోయలో జరిగే ఈ పండుగ ప్రపంచంలోని ప్రత్యేకమైన పండుగలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మనకు దసరా పాడ్యమి నుంచి మొదలై విజయ దశమితో మగుస్తాయి. కానీ ఈ కులు లోయలో విజయదశమి రోజు నుంచి మొదలై.. సరిగ్గా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 375 ఏళ్ల నాటి పండుగ అట. సింపుల్‌గా చెప్పాలంటే సుమారు 17వ రాజా జగత్ సింగ్ ఆధ్వర్యంలో రూపుదొద్దుకుందట. అలా అప్పటి నుంచి అదే ఆచారంలో నిర్వహిస్తున్నారట ఈ దసరా వేడుకని. ఈ పండుగ వెనుకున్న ఆసక్తికర కథేంటంటే..శాపం నుంచి వచ్చిన పండుగ..పురాణ కథనాల ప్రకారం..దుర్గా దత్ అనే బ్రహణుడు వద్ద ముత్యాల గిన్నె ఉంది. అది అందరిని అమితంగా ఆకర్షించేది. గిన్నె గురించి కులు లోయ రాజు రాజా జగత్ సింగ్‌కి తెలుస్తుంది. అలాంటి వస్తువులు తనలాంటి వాళ్ల వద్ద ఉండాలన్న అహకారంతో తన భటులకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు సైనికులు ఆ దుర్గా దత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ధౌర్జన్యం చేసి మరి తీసుకువెళ్లే సాహసం చేస్తారు భటులు. దాంతో ఆ బ్రహ్మణుడు కోపంతో ఆ భటులతో ఆ గిన్నె కోసం ఆ రాజే స్వయంగా వచ్చి తీసుకోవాలని చెబుతాడు. దీని కోసం మా రాజు గారు రావాలంటావా నీకెంత ధైర్యం అంటూ ఆ బ్రహ్మణుడిని అతడి కుటుంబాన్ని అతడి ఇంటిలోనే సజీవదహనం చేసేస్తారు సైనికులు. అయితే ఆ బ్రహ్మణుడు దుర్గాదత్ చనిపోతూ.. నీ దురాశకు తగిన ఫలితం అనుభవిస్తావంటూ రాజుని శపిస్తాడు. అది మొదలు రాజు జగత్సింగ్కి ఆ బ్రహ్మణుడి కుటుంబ సభ్యుల ఆత్మలు కలలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఫలితంగా రాజుకి కంటిమీద కునుకు కరువై రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ వార్త రాజ్యమంతా దావానలంలా వ్యాపిస్తుంది. ఇది తెలుసుకున్న కృష్ణ దత్(పహారి బాబా) అనే బైరాగి రాజుని కలిసి తక్షణమే రాముడి శరణు కోరమని సూచిస్తాడు. దాంతో రాజు రఘనాథుడుని ఆహ్వానించేందుకు కులు లోయ చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరిని ఆహ్వానిస్తాడు. ఆ గ్రామ దేవతలను సుమారు 300కి పైగా పల్లకిలపై ఘనంగా తీసుకువచ్చి సమావేశపరిచి..రాముడి కరుణ పొందుతాడు. అలా ఏటా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజారంజకంగా పాలన సాగించాడు. అలా ఆ రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ రాజు ఈ పండుగను సరిగ్గా విజయ దశమి రోజున నుంచి గ్రామ దేవతలను ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆచారం నేటికి నిరాటంకంగా అదే సంప్రదాయంలో జరుగుతుండటం విశేషం. ఎలా జరుగుతుందంటే..ఈ పండుగను వారం రోజులపాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి మొదలై ఈ నెల 8తో ముగుస్తుంది. అంటే విజయదశమి రోజున ప్రారంభమై, ఒక వారం తర్వాత కులులోని ధల్పూర్ మైదానంలో ముగుస్తుంది. కాలినడకన పల్లకీల్లో చుట్టుపక్కల గ్రామ దేవతలను తీసుకురావడం అనేది రోజుల తరబడి సాగుతుందట. అది కూడా డ్రమ్స్, నృత్యాలతో సాదరంగా ఆ గ్రామ దేవతల్ని కులు రాజ్యానికి తీసుకువచ్చి దేవతలందరి సమావేశ పరిచి రాముడని ఘనంగా సత్కరిస్తారట. అన్ని చోట్ల విజయదశమి రోజున రావణ దహనం వంటివి నిర్వహిస్తే..ఇక్కడ రాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకునేందుకు గ్రామదేవతలను పిలవడం విశేషం. (చదవండి: కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..) -
దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు
దేవీ నవరాత్రులు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులూ భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి నృత్య గానాలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. అయితే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాదు, తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నవరాత్రులలో ఇప్పటికే రెండు రోజులు గడచిపోయాయి. మిగిలిన రోజుల్లో అయినా అమ్మవారిని ఆమెకు ఇష్టమైన రంగులతో అలంకరిద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. 1. శైలపుత్రి: మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. శైలపుత్రి అలంకారం బలానికి, శక్తికి ప్రతీక అయితే, ఎరుపు రంగు అభిరుచికి, ధైర్యానికి సూచిక. నైవేద్యం: పులిహోర, కట్టు పొంగలి2. బ్రహ్మచారిణి: నీలం రంగునీలవర్ణం నిశ్శబ్దానికి, ప్రశాంతతకు, భక్తికి ప్రతీక అయితే, బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడేలా చేసి, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. నైవేద్యం: కొబ్బరి అన్నం, పాయసాన్నం3. చంద్రఘంట: భక్తులు చంద్రఘంటాదేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మను ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజున సంతోషానికి, సానుకూల భావనలకు చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు4. కూష్మాండ: ఈ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తూ ఈ విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అలవడతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించే ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ వృద్ధికి, ఉపశమనానికి సంకేతంగా నిలుస్తుంది. నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం5. స్కందమాత: స్కందుడు అంటే కార్తికేయుడు అంటే కుమారస్వామి. అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతోపాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి ధూమ్రవర్ణం అంటే బూడిదరంగు ఇష్టం. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకూ చిహ్నం. నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం6. కాత్యాయని: ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడంతో΄ాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. కాత్యాయనీ దేవికి ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకూ ప్రతీక. నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం7. కాళరాత్రి: దుర్గాదేవి రౌద్రరూపానికి ప్రతీకగా కాలరాత్రి అమ్మవారిని సంభావిస్తారు. ఈ అమ్మవారి ఆరా«దనతో భయాలు తొలగి, దేనినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం కలుగుతుందంటారు. ఈమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకూ ప్రతీక. నైవేద్యం : కదంబం, శాకాన్నం8. మహాగౌరి: సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రాలను ధరించడం వల్ల కరుణ భావనలు కలుగుతాయి. మనసుకు ప్రశాంత చేకూరుతుంది. నైవేద్యం : చక్కెర పొంగలి9. సిద్ధిదాత్రి: ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని, విజ్ఞానం, సంపద చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఈమెకు ప్రీతికరమైన ఊదారంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకూ తోడ్పడుతుంది, నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు.రంగులు.. మానసిక ప్రభావంఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున వాడటం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలతోపాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతారు. – డి.వి.ఆర్. (చదవండి: 'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో..
విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్‌ను తలపిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. కన్నడిగుల అష్టమి కడాయి.. దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. ఉపవాసం అనంతరం.. తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. బెంగాలీలకు ఐదు రోజులే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు. అగర్వాల్ ఉపవాస దీక్షలు.. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. ఐక్యతకు నిదర్శనం.. మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. – పంకజ్ కుమార్ అగర్వాల్, హైదరాబాద్ కుంభమేళా అగర్వాల్ సమితి అధ్యక్షులు కోల్‌కతా మాదిరిగానే.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – జగన్నాథ్ అడక్, బెంగాలీ యంగ్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షులుకలిసి మెలిసి ఉత్సవాలు ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. – డాక్టర్ నాగ్నాథ్ మాశెట్టి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు -
రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్!
మైసూరు ప్యాలెస్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు. ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్ బహుపరాక్ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు. నవగ్రహ పూజ:ముందుగా దర్బార్ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్ని నిర్వహించారు. చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు. ఫలపుష్ప ప్రదర్శన మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్‌లో ఏర్పాటైన ఈ ఫ్లవర్ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు. (చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా మస్తీ..
లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలతో ఈ సారి ‘దాండియా మస్తీ–2025’ నగర వాసులను సందడి చేస్తోంది.. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నానకరాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా వేడుకలు సోమవారం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్, డాన్స్ లైక్ నెవర్ బిఫోర్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు దీపికా బాజీ రెడ్డి, నటి అరియానా గ్లోరీ, నటుడు రామ్ కార్తిక్, డీజే కిమ్, డీజే ఫ్లోజా, డీజే వినీష్, డీజే రిషి, డీజే హరీష్, డీజే వివాన్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. దాండియా మస్తీ 2025లో ప్రత్యేక ఆకర్షణలుగా లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ భాగస్వాములుకానున్నారు. గర్బా మ్యూజిక్, బాలీవుడ్ ట్విస్ట్, స్టేజ్ సెటప్, థీమ్ డెకర్, స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్, ఓపెన్ అరేనాతో పాటు లైవ్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దీపికా బాజీ రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ బెస్ట్ డ్రెస్, బెస్ట్ డ్యాన్సర్ విజేతలకు సిల్వర్ కాయిన్స్ బహుమతులు, పిల్లలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. మహిళలకు 1+1 టికెట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాండియా మస్తీ టికెట్లు బుక్ మై షో, 95533 06329, 77023 99188, 97040 0162 నంబర్లలో పొందవచ్చు. ‘ఆరో రియాలిటీ’లో బతుకమ్మ..నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని కోహినూర్ ఆరో రియాలిటీ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పలువురు ఔత్సాహిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. (చదవండి: వయసులకు అతీతం.. ఆధ్యాత్మిక పర్యాటకం..) -
భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..!
మన దేశంలో పర్యటించి.. ఇక్కడి విభిన్నమైన సంస్కృతిక సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడాలనుకున్న ఎందరో విదేశీయుల మనోభావాలను విన్నాం. ఇప్పుడూ తాజాగా ఓ విదేశీ యువతి భారత్‌లో పర్యటించాలంటే ఈ తప్పులు చేయకండి..ఈ నేల తప్పక చూడాల్సిన ఎన్నో ప్రదేశాలకు నెలవు అంటూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక్కడ కొన్ని పర్యటనల్లో పాశ్చాత్య దేశాల కట్టుబొట్టు తీరుని అనుసరించపోవడమే మేలు. పైగా కొన్ని రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతికి మీకు తెలియకుండానే ఆటోమేటిగ్గా కట్టుబడిపోతుంటారని అంటోంది. మరి ఇంతకీ ఆమె పర్యటించేటప్పుడూ ఏ తప్పులు చెయ్యొందంటోంది? ఎవరామె?ఎమ్మా అనే విదేశీ యువతి(Foreigner) భారత్(India)లో పర్యటించేటప్పుడూ ఈ తప్పిదాలు అస్సలు చేయొద్దంటూ టూరిస్ట్‌లకు సూచనలిచ్చే వీడియో నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది కూడా. భారతదేశం పర్యటించడానికి అనువైన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటని అభివర్ణించింది. తొలిసారిగా భారత్‌లో పర్యటించేటప్పుడూ తరచుగా అందరూ ఇలాంటి తప్పిదాలే చేస్తుంటారని అవి అస్సలు చేయొద్దని సూచించిందామె. చాలామంది భారత్ పర్యటన అనగానే ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి పర్యాట ప్రదేశాలనే ఎంచుకుంటారు. అవి పర్యాటకులు రద్ధీగా ఉండే ప్రదేశాలని, వాటికంటే ప్రకృతి రమ్యతకు నెలవైనా ముగ్ధమనోహర ప్రదేశాలు చాలానే ఉన్నాయని అంటోంది. చేయకూడని ఏడు తప్పిదాలు..గోల్డెన్ ట్రయాంగిల్ (ఢిల్లీ, ఆగ్రా, జైపూర్) సందర్శించడం మాత్రమే అద్భుతమైని అనుకోకండి. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది. ముఖ్యంగా కేరళ, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలను అస్సలు మిస్ అవ్వద్దు.నిరాడంబరమైన దుస్తులను ధరించొద్దు. ముఖ్యంగా దేవాలయాల్లో, గ్రామీణ ప్రాంతాలు భుజాలు, మోకాళ్లను కవర్ చేసే దుస్తులు ధరిస్తే గౌరవప్రదంగా చూస్తారని, ఇబ్బందికరమైన చూపులు ఎదురవ్వవని అంటోంది.ప్రయాణ సమయాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అదీగాక గూగుల్ మ్యాప్ మీకు ఐదు గంటలని చూపిస్తే..సులభంగా ఎనిమిది గంటలు పడుతుందని అర్థం. దూరం తక్కువే అయినా, రోడ్లు ట్రాఫిక్ మయం అనే విషయం జ్ఞప్తికి ఉంచుకోండి.కుళాయి నీరు తాగొద్దు బాటిల్ వాటర్‌కే ప్రాధాన్యత ఇవ్వండి.అలాగే వీధి ఆహారాల జోలికి వెళ్లొద్దు. ప్రజలు రద్దీగా ఉన్న ఫుడ్స్టాల్స్కి ప్రాధాన్యత ఇవ్వండి.ముందుగానే రైళ్లను బుక్‌చేసుకోండి. ఎందుకంటే భారతీయ రైల్వేల్లో టికెట్లు వేగంగా అమ్ముడైపోతాయి. ముందుగానే ప్లానే చేసుకుంటేనే మంచిదిఅలాగే భారత్‌లో పాశ్చాత్య టైమింగ్స్‌ని ఫాలో అవ్వద్దు. భారతదేశ సమయానుకూలంగా ప్రవర్తించండి. విశ్రాంతి తీసుకోండి, అలాగే కాస్త కన్ఫ్యూజన్ని కూడా ఓర్చుకోండి. ఎమ్మా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారడమే కాదు ఆమె సూచనలకు ధన్యావాదాలు అంటూ పోస్టులు పెట్టారు. ప్రతి టూరిస్ట్ పొందే అనుభవమే ఇది అని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు కొందరు. కాగా, ఎమ్మా భారత్ పర్యటన తనను పూర్తిగా మార్చేసిందని, కేరళ తనను అణుకువగా ఉండటం ఎలా అనేది ప్రోత్సహించింది, ఆలోచింపచేసిందని, ఇక్కడి సంస్కృతికి బాగా కనెక్ట్ అయ్యిపోయా అంటూ తన పోస్ట్‌ని ముగించిందామె. View this post on Instagram A post shared by Gems in Asia 💎🌎 (@gemsinasia) (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..) -
ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే 2025
అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం 2025 సందర్భంగా, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్( HCL Tech) ఒకవిశిష్ట కార్యక్రమాన్ని చేపట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా HCL Foundation నేతృత్వంలో భారతదేశంలోని ఆరు రాష్ట్రాలలో - ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా , పశ్చిమ బెంగాల్ - తీరప్రాంత శుభ్రపరిచే ప్రచారానికి నాయకత్వం వహించింది.అంతర్జాతీయ తీరప్రాంతాలను శుభ్రపరిచే దినోత్సవం 2025ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో స్థానికులు, HCL Tech ఉద్యోగులు , భాగస్వామ్య సంస్థలను సమీకరించింది, ఫలితంగా 5 వేలకు పైగా వాలంటీర్లు సుమారు 20 వేల కిలోల సముద్ర వ్యర్థాలను తొలగించారు. భారతదేశంలోని తీరప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ తననిబద్ధతను పునరుద్ఘాటించింది.ఈ సంవత్సరం ప్రచారం యానిమల్ వెల్ఫేర్ కన్జర్వేషన్ సొసైటీ, రీఫ్వాచ్ మెరైన్ కన్జర్వేషన్, స్పాండన్, MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ రీసెర్చ్ కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ సెంటర్, Plan@tEarth, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ట్రస్, ట్రీ ఫౌండేషన్ వంటి ప్రముఖ పర్యావరణ సంస్థలతో సహకారం అందించారు. గత నాలుగేళ్ల కాలంలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ దాని భాగస్వాములు భారతదేశ తీరప్రాంత జలాల నుండి 5లక్షల 6వేల కొలో పైగా గోస్ట్ నెట్స్, సముద్ర శిధిలాలను విజయవంతంగా తొలగించారు.2024లో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ది హాబిటాట్స్ ట్రస్ట్ (THT) భారతదేశ సముద్ర జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే ఉద్దేశంతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయడం,సముద్ర పరిరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. స్థితిస్థాపకమైన మరియు సమ్మిళిత సమాజాలను నిర్మించాలనే మా లక్ష్యంలో పర్యావరణ స్థిరత్వం ప్రధానమైందని HCLTech గ్లోబల్ CSR SVP, HCLFoundation డైరెక్టర్ డాక్టర్ నిధి పుంధీర్ అన్నారు." మన తీరప్రాంత శుభ్రపరిచే చొరవ వ్యర్థాల తొలగింపునుకు మించి ఉంటుంది - ఇది సమిష్టి బాధ్యతను గుర్తు చేస్తుంది. పర్యావరణ నిర్వహణ సంస్కృతిని పెంపొందిస్తుంది. మా భాగస్వామ్యాల ద్వారా, భారతదేశ సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి మేము ప్రయత్నాలను బలోపేతం చేస్తున్నామన్నారు.అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని సెప్టెంబర్ మాసంలోని మూడవ శనివారం జరుపు కుంటారు. సముద్రపు చెత్త సమస్య గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. ఇది బీచ్‌లు, తీర ప్రాంతాలు, నదులు, మడుగులు మరియు ఇతర జలమార్గాలపై స్థానిక శుభ్రపరిచే చర్యలను ప్రోత్సహించే ప్రపంచవ్యాప్త కార్యక్రమం. -
మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ శరత్ సిటీమాల్లోని స్నో కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్‌లు, బ్లాక్ సీల్స్, ఇగ్లూ, ఓక్ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు. అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు. (చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!) -
సరదా పాటలు..దాండియా ఆటలు..!
దాండియా ఆటలు.. ఆడ.. సరదా పాటలు పాడ అంటూ నగర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలకు ఏర్పాటు జరుగుతున్నాయి. వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు పలువురు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఈవెంట్స్‌కు భిన్నంగా మొత్తం 10 రోజుల పాటు సందడి కొనసాగడమే నవరాత్రి సంబరాల ప్రత్యేకత. ఈ 10 రోజులూ దాండియా–గర్భా నృత్యాల హోరులో నగరవాసులు మునిగితేలనున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ డీజేలు, ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఫ్లీ మార్కెట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సంప్రదాయంతో పాటు ఆధునికతనూ కలగలిపి డిజైన్ చేస్తున్న ఈవెంట్స్ సకుటుంబ సపరివార సమేతంగా అలరించనున్నాయి. క్లబ్స్‌తో పాటు, ఫంక్షన్ హాల్స్, ఉద్యానవనాలు, ఓపెన్–ఎయర్ వేదికలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఈ దాండియా/గర్భా ఈవెంట్స్‌కు వేదికలుగా మారనున్నాయి. ప్రధానంగా బ్యాండ్ ప్రదర్శనలు, డీజే, ఫుడ్ స్టాల్స్, వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. టికెట్ ధరల విషయానికి వస్తే కొన్ని ఈవెంట్స్ బడ్జెట్–ఫ్రెండ్లీగా ఉంటే, సగటున రూ.500 ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీ ప్రదర్శనలు ఉంటే లేదా ప్రీమియం వేదిక అయితే ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఈవెంట్స్ సెపె్టంబర్ 20 నుంచి ప్రారంభమై, నవరాత్రి ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో జరిగే కొన్ని కార్యక్రమాల గురించిన సమాచారం ఇది.. ఓపెన్ ఎయిర్ వేడుక.. నగరంలోని అతిపెద్ద ఓపెన్–ఎయిర్ వేదిక అయిన జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ దాండియా ఉత్సవ్ జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు నృత్యం, సంగీతం సహిత వేడుకలను అందిస్తుంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఓపెన్–ఎయిర్ సెటప్, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, మొత్తం ఫెస్టివ్ అలంకరణతో ప్రాంగణం కనువిందు చేస్తుంది. ఈ బేగంపేట్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్లో ఎస్కే నవరాత్రి ఉత్సవ్ పేరిట ఈ నెల 22న రాత్రి 7గంటల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఢమాల్‌గా నిర్వాహకులు అభివరి్ణస్తున్న ఈ ఈవెంట్లో డీజే డాన్ సింగ్ ఓ ఆకర్షణ. ఫుడ్, పానీయాలు, బహిరంగ వినోద వేదికలు.. సిద్ధం చేశారు. ఈమాదాపూర్లోని యూలో ఎరీనాలో నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ డీజే మ్యూజిక్ అందిస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పీర్జాదిగూడలోని శ్రీ పలణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22న దాండియా మహోత్సవ్ సీజన్ 3 పేరిట నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా అలరించేలా తమ ఈవెంట్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.ఈసారి ఈ ఈవెంట్‌ను ఫ్లీ మార్కెట్‌తో మేళవించి అందిస్తున్నారు. బైరమల్గూడలోని ఎడుకంటి రామ్ రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే రస్ గర్భా వాల్యూమ్ 7 ఫ్లీ మార్కెట్ అండ్ ఎక్స్పో.. ఓ వైపు నవరాత్రి సంబరాల నృత్యాలతో పాటు షాపింగ్, ఫుడ్.. వంటివి మేళవిస్తోంది. మొత్తం 3 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవం ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.ఈ ఉప్పల్‌లోని శ్రీ పళణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22 రాత్రి 7గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ దాండియా సంబరాలు కొనసాగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సంబరాల్లో లైవ్ ఢోల్, డీజే షోస్, ఫుడ్ స్టాల్స్, సెలబ్రిటీల రాక.. వంటివి ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. ఈనోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, డీజేలు, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలకు పేరొందిన నామ్ధారి గౌరవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నవరాత్రి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరంగ్ నైట్స్ పేరిట దాండియా నైట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కానుంది. గర్భా, దాండియా నృత్యాలు, ఫొటోగ్రఫీ అవకాశాలు.. ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ గర్భాను డిస్కో లైట్లు, ఆధునిక సంగీతంతో మిళితం చేసే డిస్కో దాండియా ఏఎమ్ఆర్ ప్లానెట్ మాల్లో జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యూజన్ ఈవెంట్ అని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఈ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షలో 11 రోజుల పాటు డోలా రే డోలా పేరిట నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. బుకింగ్స్.. ప్లానింగ్స్..ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. కుటుంబ సమేతంగా హాజరయ్యేవారు వేదికల సమాచారం, పార్కింగ్ సౌకర్యం, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలు ముందుగా సరిచూసుకుని ప్లాన్ చేయడం అవసరం. ఈ నృత్యాలు చేసే అలవాటు ఉంటే అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి దగ్గరలోని ఈవెంట్ ఎంచుకుంటే బెటర్.ఈ కొన్ని ఈవెంట్స్‌లో థీమ్ నైట్లు ఉంటాయి. కాబట్టి హాజరయ్యే ఈవెంట్‌కి సంబంధించి థీమ్/డ్రెస్ కోడ్ ఉంటే వాటి వివరాలు ముందుగా తెలుసుకోవడం అవసరం.ప్రస్తుతం వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈవెంట్ రద్దయ్యే పరిస్థితుల్లో సందర్శకులకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి.టికెట్ కొనుగోలుకు బుక్ మై షో, హై యాపె, డిస్టిక్ట్, టిక్కెట్స్ 99 వంటి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం మేలు. స్ట్రీట్ కాజ్ పేరిట 21న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా నైట్స్ జరుగనుంది. 22 నుంచి అక్టోబర్ 2 వరకు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో ఢోలా రే ఢోలా పేరిట మెగా ఫెస్ట్. నాగోలు శ్రీరాంగార్డెన్స్లో 27, 28 తేదీల్లో దాండియా ఢోల్ భాజే పేరిట వేడుకలు. నగరంలోని టీబీఏ వేదికగా 22న నవరాత్రి బతుకమ్మ, దాండియా నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమాజీగూడ ది పార్క్ హోటల్లో 24 నుంచి అక్టోబర్ 2 వరకు డిస్కో దాండియా. నాగోలు శుభం కన్వెన్షన్ సెంటర్లో 27న నాచో దాండియా పేరిట నవరాత్రి ఉత్సవాలు. బేగంపేట చిరాన్పోర్ట్లో 22 నుంచి అక్టోబర్ 2 వరకూ పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ్ పేరిట హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ధమాల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!) -
నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..
భారతదేశం అంతటా దుర్గమ్మ నవరాత్రుల సంభరాలతో కోలహలంగా మారింది. ఎటుచూసిన శరన్నవరాత్రుల సందడే కనిపిస్తుంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. ఇక తొలిరోజు నుంచి దశమి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి, వెల్లుల్లిని లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవాని మాలధారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతలానో కఠిననియమాలను అనుసరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారో తెలిసిందే. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో అక్కడ మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలనే నైవేద్యంగా నివేదించడమే కాదు అవే తింటారట ఆ తొమ్మిది రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ అదెంత ఎక్కడో తెలుసా..!.పశ్చిమబెంగాల్లో ఈ విభిన్నమైన ఆచార సంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుంటుంబాలన్నీ నాన్‌వెజ్ వంటకాలతో ఘమఘమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ భాదురి చెబుతున్నారు. బెంగాల్‌లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉంటుందట. ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపమైన కాళి ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకుని తింటారట. అంతేగాదు వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుందట. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే..అక్కడ మాంసాహార సమర్పణను పవిత్రంగా భావిస్తారట. ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..కోషా మాంగ్షో - నెమ్మదిగా వండిన మటన్ కర్రీ, ముదురు, రిచ్ అండ్ లూచీస్ (డీప్-ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్) తో జత చేసింది. ఇలిష్ మాచ్ - ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం. బంగాళాదుంపలతో చికెన్ కర్రీ - ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగం. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్‌కతాలో బంగాళాదుంప ముక్కతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట.చేపల ఫ్రై, పులుసు: నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం, భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా. (చదవండి: ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ) -
ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ
ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా నాటక ప్రదర్శన ఎంతో వైభోవపేతంగా జరుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాటకంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, నటులు ఇందులో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అదరమో అని బిరుదుల అందుకుంటుంటుంది. ఈసారి కూడా అలానే నటులు, గాయకులతోపాటు రాజకీయ నాయకులు కూడా పాల్లొనడం విశేషం. ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో రామ్‌లీలకు సంబంధించిన లవ్‌కుశ అనే నాటికను ప్రదర్శించనున్నారు. అందులోని పరుశురాముడి పాత్రలో బీజేపీ ఎంపీ , భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ నటించనున్నారు. విఘ్ణువు ఆరవ అవతారంగా భావించి పరుశురాముడిలా ఒదిగిపోనున్నారు ఎంపీ తివారీ. ఆయన గతేడాది కూడా ఇదే పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలందుకున్నారు. పౌరాణిక పురాణాల ప్రకారం పరుశురాముడు కలియుగం చివరిలో కల్కి గురువుగా కనిపిస్తాడని చెబుతుంటారు. ఇక రాముడి పాత్రలో నటుడు కిన్షుక్ వైద్య, నటుడు ఆర్య రావణుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే గాయకుడు శంకర్ సాహ్నే గతేడాది పోషించిన పాత్రలోనే ఒదిగిపోనున్నారు. రామ్‌లీలా నాటక విశిష్టత..యునెస్కో జాబితాలో కూడా ఈ రామలీలా నాటకం చోటుదక్కించుకుంది. యునెస్కో ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ వెబ్సైట్ ప్రకారం..అక్షరాల రామాయణ ఇతిహాసానికి సంబంధించిన రాముడి నాటిక ఇది. ఇందులో కథనం, పారాయణం, సంభాషణలు ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశం అంతటా దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఏడాది శరదృతువులో ఈ నాటకంను ప్రదర్శిస్తారు. దీన్ని తులసీదాస్ విరచిత రామచరిత మానస్ ఆధారంగా రూపొందిస్తారు. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన రామ్‌లీల నాటిక వారణాసిలోని చిత్రకూట్ రామ్‌లీల ప్రదర్శితమవుతోంది. ఇక్కడ ఇది సుమారు 485 సంవత్సరాల క్రితం నుంచి ప్రదర్శిస్తున్నారట.(చదవండి: బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం) -
బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం
తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’.. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు. సద్దుల్లో పోషకాలు.. బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచి్చందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. నువ్వుల ముద్దలు.. బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెసర ముద్దలు.. పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి. కొబ్బరి పొడి... కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. పల్లిపిండి.. పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి.పోషకాలు పుష్కలం బతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ. – దండె రాజు, ఆర్ఎంవో, గోదావరిఖని జీజీహెచ్ -
శోకసంద్రంలో సింగర్ భార్య: ఆ తప్పిదమే ప్రాణాలు తీసింది!
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మికమరణం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.సింగపూర్‌లో శుక్రవారం జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. అయితే జుబీన్మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లనే అతని చనిపోయినట్టు తెలిపారు. జుబీన్ గార్గ్‌ను లైఫ్‌గార్డులు లైఫ్ జాకెట్ ధరించమని కోరినా వినలేదని, ఈ విషయాన్ని జుబీన్ సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తనకు చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించారు. యాచ్ సిబ్బంది , గార్డులు గార్గ్ దానిని ధరించాలని పట్టుబట్టారు. గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించాడు, కానీ కొన్ని సెకన్ల తర్వాత, దాని సైజ్ సరిపోకపోవడంతో అతనికి ఈత కొట్టడం కష్టంగా ఉందని పేర్కొంటూ దానిని తీసివేసాడట. దీంతో గార్గ్‌తో సహా 18 మంది స్కూబా డైవింగ్ వెళ్లారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించని జుబీన్మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాడు. లైఫ్‌గార్డ్‌లు వెంటనే CPR ఇచ్చి, గార్గ్‌ను సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారని,అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. గాయకుడితో పాటు వచ్చిన వారిని సింగపూర్ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గార్గ్ భార్యకు, కుటుంబానికి సంతాపం తెలిపారు. জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025కన్నీరుమున్నీరుగా భార్యసంగీత పరిశ్రమకు జుబీన్ అందించిన సేవలు, కృషి సాటిలేనిది. హిందీ, బెంగాలీ , అస్సామీ భాషలలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జుబీన్ అభిమాని అయిన గరిమా 2002లో అతణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రమాదంలో జరగకపోయి ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అకాల మరణం అభిమానుల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. జుబీన్ భార్య గరిమా సైకియా శోకం వర్ణనాతీతం. ఆయన పెంపుడుకుక్క కూడా విషణ్ణ వదనంతో కనిపించింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో అభిమానులను మరింత విషాదంలోకి నెట్టేశాయి. -
మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా? ఈ ప్రశ్న అవసరమా?
సాధారణంగా ఏదైనా ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం చేసే ఇంటర్వ్యూలు అభ్యర్థి నైపుణ్యాలు, అర్హతలు, ఆ సంస్థలో వారిని తీసుకోవాలనుకుంటున్న హోదాకు తగిన అర్హతను అంచనా వేయడం పైనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిగత రంగంలోకి వెళతాయి. ఇటీవల ఓ అభర్థి ఎదుర్కొన్న అలాంటి ఒక ప్రశ్న – ‘మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా?’ అది విన్న ఆ అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికిది ఎటువంటి ఇబ్బందీ కలిగించని ప్రశ్నే అయినప్పటికీ కొంతమంది రిక్రూటర్లు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది. నిజమే కదా... ఎందుకు అడుగుతారు? ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒకరిద్దరు అభ్యర్థులు వేర్వేరు ఇంటర్వ్యూయర్లు తమని తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా అని అడిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి ఇది జరిగినప్పుడు, కంపెనీ తరువాత ఉద్యోగ ఆఫర్‌ను పొడిగించింది, కానీ అభ్యర్థి దానిని తిరస్కరించాడు. తరువాతి ఇంటర్వ్యూలో, మరొక రిక్రూటర్ ఆ ప్రశ్నను పునరావృతం చేసి, ఆపై ఇతర ఉద్యోగ ఆఫర్ల వివరాల కోసం, వాటిని తిరస్కరించడానికి గల కారణాల కోసం ఒత్తిడి చేశాడు.ప్రశ్న సముచితమైన దేనా అని ఖచ్చితంగా తెలియదని, అభ్యర్థి ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడతాడా? లేక అతనిపై తల్లిదండ్రుల సంరక్షణ భారం ఎంతమేరకు పడుతుందా అని అంచనా వేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వచ్చిందని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారంటే తక్కువ ఖర్చులు అని రిక్రూటర్లు భావించవచ్చని, తగ్గిన జీతాన్ని మేనేజ్ చేయడం సులభం అవుతుందని వారి అంచనా. నియామక ప్రక్రియలో అసమతుల్యతపై వారు నిరాశ వ్యక్తం చేశారు, ఇంటర్వ్యూయర్లు ఉద్యోగ పనితీరుకు సంబంధం లేని విషయాలను కూడా పరిశీలించవచ్చు. అర్థరహిత వ్యాఖ్యతో, కృత్రిమ మేధస్సు అటువంటి పద్ధతులను పూర్తిగా భర్తీ చేయగలదా అని అభ్యర్థి ఆశ్చర్యపోయాడు.చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియోకమ్యూనిటీ స్పందనఇలాంటి ప్రశ్నలు ఆఫర్ ఎంత తక్కువగా ఉంటుందో నిర్ణయించే ప్రయత్నాన్ని సూచిస్తాయన్నారు. కుటుంబంతో కలసి ఉండటం వల్ల అభ్యర్థిపైన తక్కువ ఆర్థిక ఒత్తిడి పడుతుందని వాళ్ల ఉద్దేశంగా భావించ వచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి?ఈ పరిస్థితులను నిర్వహించడానికి అనేక మంది వినియోగదారులు తమ ఆలోచనలను ఇలా పంచుకున్నారు, వాటిలో ‘‘మీరు ఎందుకు అడుగుతారు?’’ అనే ఆసక్తితో స్పందించడం లేదా ప్రశ్నలోని అసంబద్ధతను ఎత్తి చూపడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగ భృతి లేదా వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి యజమానులు అడిగిన ఇలాంటి అనుభవాలను కొందరు వివరించారు. ఈ చర్చ ఒక సాధారణ భావనను నొక్కి చెప్పింది: కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం గురించి తక్కువగా ఉండవచ్చు లేదా తమ సంస్థలో వీలైనంత తక్కువ ప్యాకేజీకే ఒప్పించేందుకు తగిన అవకాశాలను గుర్తించడం గురించి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారంటే వారు బాధ్యతతో పని చేస్తారని ఇంటర్వ్యూయర్లు భావించవచ్చు. ఇదీ చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్ -
SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025, అర్హతలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) SBI ఫౌండేషన్, SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025ను ప్రకటించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. తద్వారా తరువాతి తరం నాయకులు, దేశ నిర్మాతలను తయారు చేయాలనేది లక్ష్యం. దేశంలోని యువతకు మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా SBI FY26లో స్కాలర్షిప్ కోసం రూ.90 కోట్లను కేటాయించింది.2022లో స్థాపించబడిన SBI ఆశా స్కాలర్షిప్ కింద యువ భారతీయుల కలలు , ఆకాంక్షలను తీర్చనుంది. ఉన్నత విద్యను వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారి అభివృద్దితోపాటు, దీర్ఘకాలికంగా దేశ నిర్మాణంపై కూడా దృష్టినిఇది ప్రతిబింబిస్తుంది.ఈ స్కాలర్షిప్ 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వరకు విద్యార్థులకు వర్తిస్తుంది, స్కాలర్ ఎంపిక చేయబడిన కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15,000 నుండి రూ.20,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. పాఠశాల విద్యార్థులు (9–12 తరగతి)NIRF టాప్ 300 లేదా NAAC A రేటింగ్ పొందిన సంస్థలు / కళాశాలలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుIIT,IIM స్కాలర్స్వైద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులువిదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులుటాప్ 200 QS ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాలలో విదేశాలలో మాస్టర్స్ , ఉన్నత విద్యను అభ్యసిస్తున్న SC/ST విద్యార్థులుస్కాలర్షిప్కు అర్హతలు దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA పొంది ఉండాలిపాఠశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.కళాశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలిదీనిపై ఎస్బీఐ, చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చొరవ ద్వారా ఉన్నత విద్యనభ్యసించాలనే విద్యార్థులకు మద్దుతోపాటు, 2047 నాటికి విక్షిత్ భారత్ దార్శనికతకు అర్థవంతంగా దోహదపడేలా వారిని శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.దరఖాస్తు విండో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అధికారిక పోర్టల్: www.sbiashascholarship.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వివరాలు , కేటగిరీ వారీగా ప్రయోజనాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం ఏదంటే..
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,యో వేదాదౌ స్వరప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. (చదవండి: కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..) -
కొలిచిన వారికి 'బంగారు తల్లి'
‘పెద్దమ్మతల్లి అంటేనే అందరికీ పెద్దదిక్కు.. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది’ ఇదీ భక్తుల నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం అయితే వేల సంఖ్యలోనే వస్తారు. కొత్తగూడెం–భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) ఆలయం ఉంటుంది. ఆ రహదారి పై వెళ్లే ప్రతి ఒక్కరూ అమ్మవారికి నమస్కరించనిదే వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఇంతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం స్థలపురాణంలోకి వెళితే...పూర్వం ఇక్కడి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల మధ్యలో ఖమ్మం–భద్రాచలం వెళ్లే రాజమార్గం సమీపంలో ఒక పెద్దపులి సంచరిస్తూ ఉండేది. ఆ పెద్దపులి రాజమార్గం సమీపంలో గల ఒక చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సమీప గ్రామ ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా సాధు జంతువులా సంచరిస్తూ ఉండేది. ఈ పెద్దపులిని గ్రామ ప్రజలు, బాటసారులు రాజమార్గాన ప్రయాణించే వాహనదారులు వనదేవతగా, శ్రీకనకదుర్గ అమ్మవారి వాహనంగా భావించి భక్తితో పూజించేవారు. అలా ప్రణమిల్లిన వారి మనోభావాలు, వాంఛలు నెరవేరుస్తూ కాలక్రమంలో ఆ పులి అదృశ్యం కావడంతో చింతచెట్టు కింద అమ్మవారి ఫొటోను పెట్టి గ్రామప్రజలు పూజించేవారు. 1961–62లో శ్రావణపు వెంకటనర్సయ్య అమ్మవారి దేవాలయం నిర్మించేందుకు కొంత స్థలం దానం ఇవ్వగా.. కంచర్ల జగ్గారెడ్డి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ పెద్దమ్మతల్లికి దేవాలయం నిర్మించి శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాటినుంచి స్మార్త సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా వనదేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆది, గురువారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివాహాది శుభకార్యాలు ఏవైనా ఇక్కడే..శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి)లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తుంటారు. అంతేకాక ప్రతియేటా అమ్మవారి ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ కార్యక్రమాలు... ఇలా ఏ శుభకార్యమైనా అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తుండడం ఆనవాయితీ. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక ‘పొంగల్ షెడ్’తోపాటు ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న వివిధ ఫంక్షన్ హాళ్లలో నిత్యం ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి.నవరాత్రులు ప్రత్యేకం..పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల΄ాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి.. అన్ని రకాల పూజలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ మంగళ గౌరీదేవి, శ్రీ మహిషాసుర మర్థనీదేవి అలంకారాలు నిర్వహించి.. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామసేవ, శమీపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎవరు వాహనం కొనుగోలు చేసినా ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజ చేయించాల్సిందే. నవరాత్రుల సమయంలో ఆయుధపూజ రోజున ప్రత్యేకంగా వేలాది వాహనాలకు పూజలు చేయించడం విశేషం. ఇక్కడ పూజలు చేయిస్తే ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ప్రయాణం సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమీప ప్రాంత రైతులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు.ఆలయ విశేషాలు..అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉంటాయి. ఈ మహావృక్షాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షానికి ఊయలకట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని మహిళలు గర్భం దాలుస్తారని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. బస్సు మార్గం..హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్లే ప్రతి బస్సు అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్తాయి. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు డి΄ోలకు చెందిన బస్సులు ప్రతినిత్యం ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. రైలు మార్గం..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం(భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్) వరకు రైలు సౌకర్యం ఉంది. ఖమ్మం వరకు రైలు మార్గం ఉంది. ఖమ్మం నుంచి 100 కి.మీ., కొత్తగూడెం నుంచి నుంచి 20 కి.మీ. దూరంలోగల అమ్మవారి ఆలయం మీదుగా నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.– గగనం శ్రీనివాస్, సాక్షి, పాల్వంచ రూరల్(చదవండి: ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..! ఏకంగా పదకొండు అలంకరాలు..) -
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్‌ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్‌లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్‌కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.1వ రోజుఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 2వ రోజు ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్‌కు చేరుతుంది. హోటల్లో రిఫ్రెష్మెంట్, బ్రేక్‌ఫాస్ట్ తరవాత కార్బెట్కు ప్రయాణం. కార్బెట్కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.3వ రోజుతెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్‌కి వచ్చి బ్రేక్‌ఫాస్ట్, రిఫ్రెష్మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్‌కు ప్రయాణం. నైనితాల్‌లో హోటల్లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.వేటగాడి జ్ఞాపకం!చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు. ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్‌లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగులుతుంది. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్‌లో.ప్రకృతి అద్భుతం ఈ నయనం!నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్‌లోని మాల్ రోడ్లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్‌కు చేరాలి. రాత్రి బస నైనితాల్‌లో.ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.అదిగో మంచుకొండ ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.6వ రోజుబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.లోహరహిత నిర్మాణంఅక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి. పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.7వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుతుబ్‌మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుతుంది.ఏనాటిదో ఈ మినార్!కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.ధ్యాన కలువప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్‌డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్‌లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్‌లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్‌లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..
దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్బాగ్చా (Lalbaugcha Raja) గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 9.35గంటల సమయంలో పూర్తయ్యింది. సుమారు నిర్దేశించిన సమయం కంటే దాదాపు 13 గంటలు ఆలస్యంగా నిమజ్జనం పూర్తయ్యింది. ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిమజ్జనం ఊరేగింపు తంతు మొత్తం..ఆది నుంచి అన్నీ ఆటంకాలతోనే ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే..నిమజ్జనంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30కు లాల్బాగ్చా గణపతి ఊరేగింపు మొదలయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటలకు నిమజ్జనం చేసే గిర్గావ్ చౌపటీ బీచ్‌కు చేరుకుంది. అనంతరం మత్స్యకారుల పడవలతో ప్రత్యేకంగా నిర్మించిన తెప్ప (Raft) సాయంతో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ తెప్పలో సాంకేతిక సమస్యలు తలెత్తి..నిర్ణయించుకున్నమయం కంటే 10-15 నిమిషాలు ఆలస్యంగా బీచ్‌కు రావడం, అంచనాల కంటే ముందస్తుగానే ఆటుపోట్లు ప్రారంభం కావడం సమస్యగా మారింది.దాంతో నిర్వాహకులు ఆటుపోట్లు తగ్గేవరకు వేచి చూడాల్సి వచ్చింది. అనేక ప్రయత్నాల అనంతరం సాయంత్రం 4.45గంటలకు రాఫ్ట్‌పైకి తరలించారు. వేలాది మంది భక్తులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అయినప్పటికీ సముద్రంలో ప్రతికూల వాతావరణంతో ఆటుపోట్లు తగ్గేవరకు వేచిచూడాలని నిర్వాహకులు నిర్ణయించారు. చివరకు సాయంత్రం 7-8గంటల సమయంలో రాఫ్ట్ తేలడంతో సముద్రంలోపలికి తరలించారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.35గంటల ప్రాంతంలో జరిగింది. అందులోనూ ఆరోజు చంద్రగ్రహణం పైగా ఆ సమయం సూతక్ కాలం కావడంతో ఇది సంప్రదాయన్ని ఉల్లఘించడమే అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి 18 అడుగుల పొడవైన విగ్రహం ఊరేగింపు అనంత చుతర్ధశినాడు ప్రారంభమవుతుంది. అంటే నిమజ్జనం చివరి రోజు కానీ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ ఏడాది కూడా అలాగే జరిగేలా ప్లాన్ ఉండగా...విగ్రహాన్ని తరలించే పడవలో సాంకేతిక లోపం, మరోవైపు సముద్ర అలలు తదితరాల కారణంగా లాల్బాగ్చా రాజా(వినాయకుడి విగ్రహం) గిర్గావ్ చౌపట్టి వద్ద కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.మండిపడుతున్న మత్స్యకారులువినాయకుడు అందరి దేవుడని, అయితే ఆలయ నిర్వాహకులు మమల్ని దర్శించుకునే అవకాశం లేకుండా పక్కనపెట్టారంటూ మండిపడుతున్నారు మత్స్యకారులు. 1934లో, మత్స్యకారులు వద్ద డబ్బులు లేనప్పడు, చేపలు అమ్మడానికి మార్కెట్లో సమస్యలు వచ్చినప్పుడు గణపతి బప్పాకు మత్స్యకారులు గట్టిగా మొక్కుకున్నారట. తమ సమస్య తీరితే ప్రతి ఏడాది లాల్బాగ్చా రాజాని గణేశ్ చతుర్థి రోజున ఘనంగా పూజించి, నిమజ్జనం కార్యక్రమంలో తమ వంతు సహకారం అందిస్తామని గణపతికి మొక్కుకున్నారు. అయితే ఈ ఏడాది నిర్వాహకులు వీఐపీ దర్శనాలతో వారికి ఇచ్చిన ఒక్క రోజు దర్శనం అవకాశంలో కొన్ని గంట వ్యవధి తగ్గిపోయింది. దీంతో వారంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, వీఐపీలకు ప్రాధాన్యాత ఇస్తూ..సామాన్య భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని పక్కనపెట్టేశారంటూ లాల్బాగ్చా ఆలయ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు తమ గోడుని నేరుగా లాల్బాగ్చా రాజాను స్థాపించిన పూర్వీకుల వారసులకు తెలియజేసేలా మా తరుఫున ఒక ప్రతినిధిని సంస్థలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. విఘ్నాలను హరించే ఆ వినాయకుని దర్శనం చేసుకోలేకపోయామన్న భక్తుల అసంతృప్తి, మరోవైపు సాంకేతి లోపాలు, సముద్ర అలలు అన్ని కలగలసి ఈ ఏడాది లాల్బాగ్చా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని మరింత ఆలస్యంగా పూర్తి అయ్యేలా చేశాయి. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి 32గంటల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తికావడం గమనార్హం(చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ
ఆది శంకరుడు సౌందర్యలహరి రాసిన చోటు. రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన కథనాల నేల. సోన్మార్గ్ మంచు మీద వెండి వెన్నెల విహారం. గుల్మార్గ్ కేబుల్ కార్లో విహంగ వీక్షణం. పహల్గామ్ కుంకుమ పువ్వు తోటల ప్రయాణం. ఐదు వేల అడుగుల ఎత్తులోదాల్ లేక్ శికార్ రైడ్.నీటి మీద నడిచే రాజమందిరం హౌస్‌బోట్ స్టే. షాలిమార్ గార్డెన్స్‌లో గిలిగింతల పర్యాటకం. ఆరు రోజుల్లో వీటన్నింటినీ చూపించే టూర్ ఇది.1వ రోజుహైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 14.40 గంటలకు 6ఈ–6253 విమానంలో శ్రీనగర్‌కి ప్రయాణం. సాయంత్రం 17.40 గంటలకు విమానం శ్రీనగర్‌కు చేరుతుంది. శ్రీనగర్ ఎయిర్΄ోర్టులో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ తర్వాత సాయంత్రం ఫ్రీ టైమ్. పర్యాటకులు ఎవరికి వారు సిటీలో నచ్చిన ప్రదేశంలో విహరించవచ్చు. రాత్రి బస శ్రీనగర్‌లో.2వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి టూరిస్ట్ బస్సులో సోన్‌మార్గ్‌కు ప్రయాణం. సోన్మార్గ్ పర్యటన పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి శ్రీనగర్‌కు రావాలి. రాత్రి బస శ్రీనగర్‌లో. సోన్‌మార్గ్‌కు చేరిన తర్వాత టూరిస్ట్ బస్ ఒక పాయింట్లో ఆగుతుంది. పర్యాటకులు బస్సు దిగి స్థానికంగా ఉన్న పోనీ (చిన్న గుర్రం)లను సొంత ఖర్చుతో అద్దెకు తీసుకుని పర్యటించాలి.వెండి వెన్నెలసోనామార్గ్కు రోడ్డు మార్గంలో ప్రయాణం ఆద్యంతం కళ్లు మిరుమిట్లు గొలుపుతుంది. శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్ల దూరాన ఉంది సోనామార్గ్. ఈ ప్రదేశం తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంది. కొండల మీద తెల్లటి మంచు పొడి పొడిగా పై నుంచి బియ్యప్పిండి పోసినట్లు ఉంటుంది. మంచు మీద పడిన సూర్యుడి కిరణాలు సప్తవర్ణాలను ప్రతిఫలిస్తుంటాయి. మంచు మీద వెండి వెన్నెల విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ పర్యటనకు మే నుంచి అక్టోబర్ వరకు వెళ్లగలం. శీతాకాలంలో మంచు కురుస్తుంటుంది. తజివాస్ గ్లేసియర్ శీతాకాలంలో గడ్డకట్టి వేసవి కాలంలో కరిగి ప్రవహిస్తుంది. సోనామార్గ్ నుంచి ఈ ప్రదేశానికి పోనీల మీద వెళ్లవచ్చు. ఇక్కడ ట్రెకింగ్ చేయవచ్చు. పోనీలు నడిపే వాళ్లను అడిగితే జల΄ాతాల దగ్గరకు కూడా తీసుకువెళ్తారు.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి గుల్మార్గ్కు ప్రయాణం. గుల్మార్గ్లో గోండాలా కేబుల్ కార్ రైడ్ టికెట్లను పర్యాటకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆసక్కి ఉన్న వారు గుల్మార్గ్ నుంచి కిలాన్మార్గ్కు కి ట్రెక్కింగ్ చేయవచ్చు. సాయంత్రం టూరిస్ట్ బస్ గుల్మార్గ్ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరుతుంది. రాత్రి బస శ్రీనగర్‌లో.గుల్మార్గ్ మంచు తివాచీగుల్మార్గ్ పెద్ద స్కీయింగ్ స్పాట్. శ్రీనగర్ నుంచి 50 కిమీల దూరాన ఉంది. మంచు అంటే అలా ఇలా కాదు, అర అడుగు మందంలో తెల్లటి తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇక్కడ గోండాలా కేబుల్ కార్లో ప్రయాణిస్తూ విహంగ వీక్షణం చేయవచ్చు. కిందకు చూస్తే తెల్లగా పరుచుకున్న మందపాటి మంచు మిలమిల మెరుస్తూ ఉంటుంది. స్కీయింగ్‌లో నిష్ణాతులు కాకపోయినప్పటికీ హెల్పర్స్ సహాయంతో ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మహారాణి టెంపుల్, సెయింట్ మేరీస్ చర్చ్ ఉన్నాయి. గుల్మార్గ్ ప్రాచీన నామం గౌరీమార్గ్. గౌరీదేవి మార్గంగా పిలిచేవారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఇక్కడ పూలతోటలను పెంచడంతో గుల్మార్గ్గా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న గోల్ఫ్ కోర్స్, స్కీ జోన్ వంటి ఆధునిక సౌకర్యాలన్నీ బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసినవే. వారు ఈ ప్రదేశాన్ని వేసవి విడిదిగా, విహార కేంద్రంగా ఆస్వాదించేవాళ్లు. గుల్మార్గ్ ఎనిమిది వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి కేబుల్ కార్లో దాదాపు 14 వేల అడుగుల ఎత్తున్న మౌంట్ అఫర్వాత్ శిఖరానికి చేరడం ఓ గిలిగింత. ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు చిన్నప్పుడెప్పుడో చూసిన హిందీ సినిమాలు గుర్తుకు వస్తే మీ జ్ఞాపకశక్తికి సలామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డింపుల్ కపాడియా, రిషీకపూర్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘బాబీ’ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాలు ఈ లొకేషన్లో విజువల్ రిచ్‌నెస్‌ని ఉపయోగించుకున్నాయి. గుల్మార్గ్లో మరో వింత ఇగ్లూ కేఫ్. ఇగ్లూ అంటే మంచు ఖండంలో మంచుతో కట్టే ఇల్లు. ఇగ్లూ రెస్టారెంట్లో భోజనం చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. భోజన సమయం కాక΄ోతే ఇగ్లూ కేఫ్‌లో కాఫీ, టీ తాగడం మరిచి΄ోవద్దు.4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి పహల్గామ్కు ప్రయాణం. పహల్గామ్లో టూరిస్ట్ బస్ దిగిన తర్వాత సొంత ఖర్చులతో ప్రైవేట్ జీపులు, పోనీలతో పగలంతా పహల్గామ్ పర్యటన పూర్తి చేసుకోవాలి. సాయంత్రం బస్ హోటల్‌కు బయలుదేరుతుంది. హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస పహల్గామ్లో.స్విస్ కాదు ఇండియానే!పహల్గామ్కు పర్యాటక ప్రాధాన్యం మాత్రమే కాదు, ప్రాచీన పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది. శివుడు తన వాహనం నందిని ఇక్కడ వదిలాడని కథనం. ఇక్కడ ఉన్న లిద్దర్ వ్యాలీ, బైసరన్ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ ఆరు వ్యాలీలు ఒకదానిని మించి మరొకటి ప్రకృతి సౌందర్యాన్ని వైవిధ్యతను ఇముడ్చుకున్నాయా అనిపిస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఉన్నామా భారత్‌లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది కూడా. ఇంత అందమైన ప్రదేశాలు మనదేశంలో ఉండగా ఇక పాశ్చాత్యదేశాల విహారం ఎందుకు... అనిపిస్తుంది. కుంకుమ పువ్వు తోటల మధ్య ప్రయాణం సాగుతుంది. చెట్లు ఎత్తుగా ఆకాశాన్ని తాకడానికే ఎదుగుతున్నట్లుంటాయి. అతి శీతల వాతావరణం కావడంతో కొమ్మలు పక్కలకు విస్తరించవు. చెట్ల ఆకుల మీద ముగ్గు చల్లినట్లు మంచు రేణువులు వాలి ఉంటాయి. సూర్యకిరణాలకు ఆవిరవుతూ సాయంత్రం నుంచి మళ్లీ కొత్త మంచు చేరుతూ ఉంటుంది. పహల్గామ్లో పర్యటిస్తున్నప్పుడు ఇదేదో సినిమాలో చూసిన ప్రదేశంలా ఉందేంటబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుంది. అరువ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వారీ వ్యాలీలను చూడవచ్చు. లిద్దర్ వ్యాలీలో గోల్ఫ్ కోర్స్ ఉంది. ఆడే సమయం లేక΄ోయినా చూసి రావచ్చు. ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక విషయం గుర్తుకు వచ్చి ఉండాలి. అదే... పహల్గామ్, బైసరన్ వ్యాలీ. ఈ రెండు పదాలకు కలిపి చదువుకుంటే ఏప్రిల్‌లో టీఆర్ఎఫ్ ఉగ్రదాడి గుర్తుకు వస్తుంది. 28 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న సంఘటన కళ్ల ముందు మెదలుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి. బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత పహల్గామ్ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణం. శంకరాచార్య ఆలయ దర్శనం. సాయంత్రం దాల్ లేక్‌లో శికారా రైడ్, దాల్ లేక్ అలల మీద సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం, ఫ్లోటింగ్ గార్డెన్స్ మధ్య విహారం, సాయంత్రం హౌస్‌బోట్‌లో చెక్ ఇన్. రాత్రి భోజనం, బస హౌస్‌బోట్‌లో.కల్హణుడు చెప్పాడు ఇది శంకరాచార్య టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ పూజలందుకునే దేవుడు శివుడు. ఆది శంకరాచార్యుడు భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అంతే కాదు సౌందర్యలహరిని ఇక్కడే రాశాడని కూడా చెబుతారు. రాజతరంగిణి గ్రంథంలో కల్హణుడు ఈ ఆలయం గురించి అనేక విషయాలను పొందుపరిచాడు. శ్రీనగర్ అంతటినీ ఓ పది నిమిషాల్లో చూడాలంటే ఆది శంకరాచార్య ఆలయమే రైట్ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే దాల్ లేక్, జీలం నది, హరిపర్బత్ వంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కనిపిస్తాయి.ఐదు వేల అడుగుల ఎత్తులో శికారా రైడ్శికారా అంటే పై కప్పు ఉన్న చెక్కతో చేసిన పడవ. ఈ సరస్సు ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంది. దాల్ లేక్‌లో శికారా రైడ్ ఒక మధురానుభూతి. శీతాకాలంలో నీరు గడ్డకడుతుంది. దాల్‌లేక్ నీరు మరీ ఎక్కువగా గడ్డకట్టినప్పుడు ఆ మంచు మీద వాహనాలను నడపడం, క్రికెట్ ఆడడం వంటి సరదాలు చేస్తుంటారు. అయితే ఏటా ఈ స్థాయిలో నీరు గడ్డకట్టదు. శికారాతోపాటు హౌస్‌బోట్ విహారం, బస కూడా ఎక్స్‌పీరియెన్స్ చేసి తీరాలి. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హౌస్బోట్లకు హాలీవుడ్, యంగ్ హాలీవుడ్, క్వీన్స్ లాప్ వంటి పేర్లు పెడతారు. ఈ హౌస్బోట్లు ఏదో రాత్రి బస కోసం చేసిన చిన్న ఏర్పాటులా ఉండదు. రాజమందిరంలాగ ఉంటుంది. నీటి మీద తేలుతున్న రాజభవనంలో బస చేసినట్లు ఉంటుంది. దాల్ లేక్‌లో ఫ్లోటింగ్ గార్డెన్స్ మాత్రమే కాదు ఫ్లోటింగ్ ఏటీఎమ్ కూడా ఉంది. ఫ్యాబ్రికేటెడ్ వాల్స్‌తో చేసిన గదిలో ఎస్బీఐ ఏటీఎమ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇక్కడ పర్యటిస్తుంటే ఆమ్స్టర్డామ్లోని ఫ్లోటింగ్ ఫ్లవర్ మార్కెట్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. కశ్మీర్‌ను ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని ఎందుకంటారో ఇక్కడ విహరిస్తే అవగతమవుతుంది. కేరళలో బోట్‌హౌస్‌లో బస, విహారం చేసిన వాళ్లు శ్రీనగర్ హౌస్‌బోట్ కూడా అలాగే ఉంటుందని లైట్ తీసుకోవద్దు. దేనికదే ప్రత్యేకమైన అనుభూతి.6వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హౌస్‌బోట్ చెక్ అవుట్ చేయాలి. మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్స్ సందర్శనం తర్వాత శ్రీనగర్ ఎయిర్΄ోర్టుకు చేర్చి, టూర్ నిర్వహకులు వీడ్కోలు పలుకుతారు. సాయంత్రం 18.20 గంటలకు 6ఈ– 6255 విమానంలో శ్రీనగర్ నుంచి ప్రయాణం, ఈ విమానం రాత్రి 21.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.ఉద్యావనాల కశ్మీరంకశ్మీర్లోని మొఘల్ గార్డెన్స్ ఆరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ నిజానికి మొఘలులు మనదేశంలోకి రావడానికి రెండు వందల ఏళ్ల ముందు నుంచే ఉన్నాయి. పర్షియా నుంచి కశ్మీర్‌కు వచ్చిన పాలకులు, పర్షియన్ ప్రభావం ఉన్న పరిసర ప్రదేశాల పాలకులు ఇక్కడ చక్కటి ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. నిషాద్ బాగ్, షాలిమార్ బాగ్, అచల్బాల్ బాగ్, చష్మా షాహీ, పరి మహల్, వెరినాగ్ అలా ఏర్పడినవే. మొఘలులు మనదేశానికి వచ్చిన తర్వాత అక్బర్, జహంగీర్, షాజహాన్‌లు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేశారు. అందమైన పూలతోటల మధ్య రాజవంశస్తుల విడిది భవనాలుంటాయి. ఈ గార్డెన్స్‌లో పర్యటన అక్టోబర్ నుంచి పూలు విచ్చుకోవడం మొదలవుతుంది. మార్చి వరకు పూలు సువాసనలు విరజిమ్ముతుంటాయి. నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను కూడా చక్కగా మెయింటెయిన్ చేస్తుంటారు. శీతల పవనాల మధ్య చక్కగా విరిసిన పూలు, మెత్తగా రాలిపడుతున్న పూల రెక్కల మధ్య విహారం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అనే చె΄్పాలి.శ్రీనగర్ టూర్ ప్యాకేజ్ప్యాకేజ్ పేరు ‘మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్’. ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఏ11. ఇది ఆరు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తయ్యే ఈ టూర్లో కశ్మీర్‌లోని శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ కవర్ అవుతాయి.ఈ పర్యటనలు అక్టోబర్ ఆరవ తేదీన మరియు నవంబర్ 13వ తేదీన మొదలవుతాయి. ఎవరికి సాధ్యమైన ట్రిప్‌లో వారు బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ ధరలిలాగ ఉన్నాయి. సింగిల్ ఆక్యుపెన్సీలో 45,100 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,950, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,510 రూపాయలు. ప్యాకేజ్‌లో... విమానం టికెట్లు, నాలుగు రోజులు హోటల్ బస, ఒక రోజు హౌస్‌బోట్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్‌లు, రాత్రి భోజనాలు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు రవాణా, టూర్ ఎస్కార్ట్ సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజు, పన్నులు వర్తిస్తాయి. పర్యాటక ప్రదేశాల ఎంట్రీ ఫీజులు, మధ్యాహ్న భోజనాలు, ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు రవాణా, విమానంలో కొనుక్కునే ఆహారపదార్థాలు– డ్రింకులు, పర్యాటక ప్రదేశాల్లో లోకల్ రవాణా, రైడ్ల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. పర్యాటకులు విడిగా భరించాలి.గోండాలా కేబుల్ కార్ బుక్ చేసుకోవడానికి లింక్:https://www.jammukashmircablecar.comవాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం) -
విష్ణు సేనాపతి విష్వక్సేనుడు
శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు, పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠసేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు.వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారు వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ్ర΄ాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు.విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు.విష్ణు స్వరూ΄ానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది.– కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కేరళ సంస్కృతికి దర్పణం ఈ పండుగ..!
కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే పర్వదినాలలో ఇది ఒకటి. వితరణ శీలి, ప్రజానురంజక పాలకుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఇది 12 రోజులపాటు జరుపుకునే పండుగ. ఇది ఎంతో చరిత్ర, సంంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ సంవత్సరం ఓనం పండుగను సెప్టెంబరు 5, శుక్రవారం జరుపుకోనున్నారు. తిరువోణం అని పిలువబడే రోజునే బలి వస్తాడంటారు. ఆ రోజే ప్రధానవేడుకను చేసుకుంటారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఓనం. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీలు ఈరోజున తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలీలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖీర్, పులిస్సేరి వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తారు. ప్రతి కుటుంబం ఓనం సద్యను తయారు చేస్తాయి. ఈ శాకాహార భోజనంలో 20కిపైగా వంటకాలు ఉంటాయి.ఈ పండుగను పురస్కరించుకుని కథాకళి నృత్యం, వల్లం కలి(బోట్ రేస్) వంటివి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు కైకొట్టికలి, తుంబి తుల్లాల్ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈరోజున మగవారు చొక్కా, ముండు అని పిలువబడే లుంగీ ధరిస్తారు. స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఓనం కేరళలో వ్యవసాయ పండుగ. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు కూడా ఇస్తారు.పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య) వంటి ఆటల్లో పాల్గొంటారు.ఓనం పండుగ ముఖ్య తేదీలుసెప్టెంబర్ 4, 2025 – ఉత్రాదం రోజు, మొదటి ఓనం (ఉత్రడప్పచ్చిల్)సెప్టెంబర్ 5, 2025 – తిరువోణం రోజు, రెండవ ఓణం (ప్రధాన వేడుక)సెప్టెంబర్ 6, 2025 – అవిట్టం రోజు, మూడవ ఓనం, త్రిస్సూర్ పులికలిసెప్టెంబర్ 7, 2025 – చాతాయం రోజు, నాల్గవ ఓనం (చదవండి: గణేశ నిమజ్జనం ఆంతర్యం..!) -
గణేశ నిమజ్జనం ఆంతర్యం..!
అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వమయిన పవిత్రత, వివేకం, అబోధితత్వం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణా భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి. అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతగా వ్యాపించి వున్న గణేశశక్తి.అంతటి మహత్తు, మహిమాన్వితుడిని నిమజ్జనానికి తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో, మేళ తాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో సాగనంపాలి. ఆయన జన్మించిన భాద్రపద శుక్ల చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది.మట్టినుంచి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత నిమజ్జనం కార్యక్రమాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి తప్పించి అశ్లీలతకు, నిందారోపణలకు, ఘర్షణలకు దారితీసే వాతావరణంలో కాదు. – డా. పి.రాకేశ్(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాలు ఆధారంగా) -
రాజస్థాన్ రాయల్ టూర్..!
ఇది రాజకోట రహస్యం చిత్రం కాదు. అచ్చంగా రాజపుత్రులు ఏలిన కోటలు. దుర్బేధ్యమైన కోటలు... చక్కని ప్యాలెస్‌లు. ఉదయ్ సింగ్ కట్టించిన సిటీ ప్యాలెస్. సజ్జన్‌సింగ్ మాన్సూన్ ప్యాలెస్. మహారాణా పోరుగడ్డ హల్దీఘాటీ. రాథోడ్ జోధా కట్టిన మెహరాన్‌గఢ్. యూరోపియన్ స్టైల్ ఉమేద్భవన్. బ్రహ్మకు ఆలయం కట్టిన పుష్కర్. జయ్‌పూర్ పాలకుల అమేర్ ఫోర్ట్. సిటీ ప్యాలెస్... హవామహల్... ఇవన్నీ రాజస్థాన్‌లో సాగే రాయల్ టూర్లో.1వ రోజు: హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్‌కి ప్రయాణం. టూర్ నిర్వహకులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకుంటారు. హోటల్ గదికి వెళ్లి చెక్ ఇన్ కావడం, హోటల్లో లంచ్ తర్వాత సిటీ ΄్యాలెస్ సందర్శనం, పిచోలా లేక్‌లో విహారం, రాత్రి డిన్నర్, బస ఉదయ్‌పూర్‌లోనే.ఉదయ్‌పూర్ రాజమందిరంసిటీ ప్యాలెస్‌గా వ్యవహారంలో ఉన్న ఈ భవనం ఉదయ్‌పూర్ రాజుల పాలన, నివాస మందిరం. సిసోడియా రాజవంశం రాజులు అనేక మంది ఈ భవనం నుంచే పాలన సాగించారు. ప్రస్తుతం ప్యాలెస్‌లో కొంత భాగంలో సిసోడియా రాజకుటుంబ వారసుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ నివసిస్తున్నాడు. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. రాణి వంటగది, రాజు యుద్ధ సామగ్రి, యుద్ధం సమయంలో రాజు ధరించే కవచాన్ని పరిశీలనగా చూడాలి. రాజు కవచం సైజును బట్టి రాజు ఎత్తు అంచనాకు వస్తుంది. అలాగే రాణాప్రతాప్ గుర్రం చేతక్ యుద్ధం సమయంలో ధరించే కవచం కూడా ఉంది. చేతక్ నమూనా గుర్రాన్ని తయారు చేయించి ఆ కవచాన్ని ధరింపచేశారు. ఆ గుర్రం తెల్లగా ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. ఇక రాణి మందిరం విషయానికి వస్తే మందిరం ముందు రాజు వేచి ఉండే పాలరాతి బల్లను చూడాలి. రాజు ఒక వేళ రాణి అలంకరణ పూర్తయ్యే లోపే వస్తే అలంకరణ పూర్తయ్యే వరకు ఆ పాలరాతి బల్ల మీద కూర్చుని ఎదురు చూసేవాడని చమత్కారంగా చెబుతారు గైడ్లు. ఏనుగుల బలప్రదర్శన గోడను చూడాలి. గోడకు అవతల ఒక ఏనుగు, ఇవతల ఒక ఏనుగు ఉంటాయి. తొండాలను మెలి వేసి వెనక్కు లాగుతాయి. తనను తాను ఆపుకోలేక ముందుకు వచ్చి గోడను తాకిన ఏనుగు ఓడిపోయినట్లు. పిచోలా సరస్సు ఒడ్డున ఉంది సిటీప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్‌లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. లేక్‌కు మరొక ఒడ్డున దర్బార్‌హాల్ ఉంటాయి. దర్బార్‌హాల్‌లో నాటి రాజకొలువు బొమ్మలతో కొలువు దీరి ఉంటుంది.2వ రోజు: బ్రేక్‌ఫాస్ట్ తరవాత హోటల్ నుంచి బయలుదేరి సజ్జన్‌గఢ్ ప్యాలెస్‌కు ప్రయాణం. ప్యాలెస్ సందర్శనం తర్వాత ప్రయాణం హల్దీఘాటికి. హల్దీఘాటిలో మహారాణా ప్రతాప్ మ్యూజియం చూసిన తర్వాత సాయంత్రం నథ్‌ద్వారా కోట సందర్శనం. రాత్రి బస ఉదయ్‌పూర్‌లోనే.ఎడారి మేఘంసజ్జన్గఢ్ ప్యాలెస్ నిర్మాణాన్ని మహారాణా సజ్జన్ సింగ్ ఓ గొప్ప ఆలోచనతో మొదలుపెట్టాడు. జయ్‌పూర్‌లో జంతర్మంతర్లాగా ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం నిర్మించాలనుకున్నాడు. అలాగే మేవార్ రాజధాని నగరం ఉదయ్‌పూర్ మొత్తం కనిపించే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండ మీద నిర్మించాడు. ఐదంతస్థుల ఈ ప్యాలెస్ పైనుంచి చూస్తే ఉదయ్‌పూర్‌లోని సరస్సులు కనిపిస్తాయి. వర్షాకాలంలో రాజు ఇక్కడ కొద్దిరోజులు విడిది చేసి రాజ్యంలో నీటి నిల్వలను గమనించేవాడని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేవార్ పాలకులు ఉదయ్‌పూర్‌ని రాజధాని చేసుకోక ముందు చిత్తోర్‌గఢ్ నుంచి పాలన సాగించేవారు. సజ్జన్ గఢ్ ప్యాలెస్ నుంచి చిత్తోర్‌గఢ్ కోట కూడా కనిపించే విధంగా డిజైన్ చేసుకున్నారు. కానీ సజ్జన్‌సింగ్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన పాలకులు ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు కానీ ఖగోళ అధ్యయనం దిశగా పనులు సాగలేదు. మూడు ప్రధాన ఉద్దేశాల్లో రెండు ఉద్దేశాలు మాత్రమే నెరవేరాయి. ఈ ప్యాలెస్‌లోకి పర్యాటకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాహనాల్లో వెళ్లాలి. సజ్జన్గఢ్ను సూర్యాస్తమయం సమయంలో చూడగలిగితే బంగారు రంగులో మెరుస్తూ అందంగా ఉంటుంది.ఆత్మాభిమాన పోరుహల్దీఘాటీ అనే ప్రదేశం పేరుకు తగ్గట్లే పసుపు రంగులో ఉంటుంది. మట్టి, రాయి, రప్ప అంతా నేలకు పలుచగా పసుపు అద్దినట్లు, పసుపు నీటితో కళ్లాపి చల్లినట్లు ఉంటుంది. ఉదయ్‌పూర్ జిల్లా నుంచి రాజ్‌సమంద్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో వస్తుంది. ప్రధాన రహదారి నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రదేశంలో ప్రయాణించాలి. హల్దీఘాటీలో యుద్ధభూమిని చేరేలోపు చేతక్ స్మారకం కనిపిస్తుంది. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం చేతక్. యుద్ధంలో రాణా ప్రతాప్ గాయపడడంతో ఆ సంగతి తెలుసుకున్న చేతక్ యజమానిని కాపాడుకోవడానికి యుద్ధరంగం నుంచి పరుగులంఘించుకుంది. మధ్యలో ప్రహిస్తున్న బాణాస్ నదిని దాటడానికి ఒక్క ఉదుటున దుమికింది. అప్పుడది గాయపడి ఆ తర్వాత కొద్ది దూరం ప్రయాణించి నేలకొరిగింది. చేతక్ జ్ఞాపకార్థం రాణా ప్రతాప్ నిర్మించిన స్మారకం అది. ఇది కాకుండా ఉదయ్‌పూర్ నగరంలో తెల్లటి చేతక్ విగ్రహంతో చేతక్ సర్కిల్ కూడా ఉంది. ఇక హల్దీఘాటీలో మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. ఈ యుద్ధంలో మొఘల్ ప్రతినిధిగా మాన్సింగ్, మేవార్ పాలకుడిగా మహారాణా ప్రతాప్ తలపడ్డారు. భీకర యుద్ధం జరిగింది కానీ రాణాప్రతాప్ తన మేవార్ రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు.3వ రోజు: ఉదయ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి జోద్పూర్ వైపు సాగిపోవాలి. జద్పూర్లో మెహరాన్‌గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస జో«ద్‌పూర్‌లో.సూర్యుడి కోటమెహరాన్గఢ్ అంత పెద్దది ఇంత విశాలమైనది అని చెప్పడం కంటే... పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించిన నిర్మాణాల సముదాయం అని ఒక్క మాటలో చెప్పాలి. ఇంగ్లిష్ రచయిత రడ్యార్డ్ క్లిప్పింగ్ ఈ కోటను వర్ణిస్తూ ‘దిగ్గజ భవన నిర్మాత నిర్మించిన కోటకు ఉదయించే సూర్యుడు రంగులద్దినట్లు ఉంది’ అన్నాడు. ఈ భవనం పేరు కూడా సూర్యుడి పేరుతోనే వచ్చింది. మిహిర్‌ఘర్ అంటే సూర్యుని కోట అని, అదే పదాన్ని రాజస్థానీ భాషలో మెహరాన్‌గఢ్ అంటారు. రాథోర్ రాజవంశం నిర్మించిన కోట ఇది. రాథోర్లు సూర్యుడి ఆరాధకులు. దాంతో కోటను ఉదయించే సూర్యుని కిరణాలతో ప్రభవించేటట్లు డిజైన్ చేశారు. ఈ కోటను రావు జోధా అనే రాజు నిర్మించాడు. అతడి పేరుతోనే ఈ రాజ్యానికి జో«ద్‌పూర్ అనే పేరు వచ్చింది. ఇందులోని బంగారు పల్లకి దగ్గర ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.4వ రోజు: జోద్పూర్ నుంచి పుష్కర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమేద్ భవన్ ΄్యాలెస్ సందర్శనం తర్వాత పుష్కర్‌కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, రాత్రి బస పుష్కర్‌లో.ఇండో–యూరోపియన్ ప్యాలెస్రాజస్థాన్ రాష్ట్రం కోట తెలుగు వారికి సుపచిరితమైన ప్రదేశం. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహారావ్ రెండవ ఉమేద్ సింగ్ నిర్మాణం మొదలుపెట్టాడు. అతడి పేరుతోనే ఉమేద్ భవన్ ప్యాలెస్‌గా వాడుకలోకి వచ్చింది. ఇతర రాజస్థాన్ నిర్మాణాలతో పోల్చి చూసినప్పుడు ఇందులో కొంత వైవిధ్యంగా యూరోపియన్ నిర్మాణశైలి కనిపిస్తుంది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సామ్యూల్ స్విన్టన్ చేత దీనిని డిజైన్ చేయించాడు ఉమేద్ సింగ్. నిర్మాణం ఇరవయ్యవ శతాబ్దం వరకు సాగింది. ఇందులో కోట రాజవంశం నివసిస్తోంది. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. ఇది ఇప్పుడు హెరిటేజ్ హోటల్.ఆలయాల నిలయం పుష్కర్పుష్కర్ అనగానే పుష్కర్ సరస్సు గుర్తొస్తుంది. ఈ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం ఇది. ఈ సరస్సులో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆలయాలను లెక్క చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు. నాలుగు వందల వరకు ఉంటాయని అంచనా. సిక్కులకు కూడా ఇది పవిత్రస్థలం. పుష్కర్ యాత్రికులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఇక్కడ ధూమపానం, మద్యపానం, మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. ఇక్కడ ఏటా కార్తీక మాసంలో జరిగే కామెల్ ఫెయిర్ ప్రసిద్ధి. ఈ వేడుక కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశీయులు కూడా వస్తారు.5వ రోజు: పుష్కర్ నుంచి జయ్‌పూర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, బ్రహ్మ మందిర దర్శనం తర్వాత జయ్‌పూర్‌కి ప్రయాణం. జయ్‌పూర్‌లో సిటీ ప్యాలెస్ వీక్షణం, హవామహల్ మీదుగా హోటల్‌కు ప్రయాణం. గదిలో చెక్ ఇన్, రాత్రి బస జయ్‌పూర్‌లో.బ్రహ్మ మందిరంభూమ్మీద బ్రహ్మకు ఆలయం లేని లోటును తీరుస్తోంది పుష్కర్. ఇక్కడి బ్రహ్మమందిరాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడని చెబుతారు. విశ్రామిత్రుడు బ్రహ్మ కోసం యజ్ఞం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాడనేది స్థల పురాణం. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు పునరుద్ధరించాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయ రూపం 14వ శతాబ్దంలో మహారాజా జవత్రాజ్ నిర్మాణం.జయ్‌పూర్ సిటీ ప్యాలెస్మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించిన ప్యాలెస్ ఇది. అమేర్ నుంచి రాజధానిని జయ్‌పూర్‌కు మారుస్తూ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. అప్పటి నుంచి రాజకుటుంబం సిటీ ప్యాలెస్‌లో నివసించేది. రాజకుటుంబ పరివారం ఐదు వందల కుటుంబాలు ప్యాలెస్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర భవనాల్లో నివసించేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజాస్థానాలు దేశంలో విలీనమయ్యే వరకు జయ్‌పూర్ అధికారిక రాజభవనం ఈ సిటీ ప్యాలెస్. ఇప్పుడిది గొప్ప పర్యాటక ప్రదేశం. ఇందులో సవాయ్ రెండవ మాన్సింగ్ మ్యూజియం ఉంది. రాణి పద్మిని ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాజా సవాయ్ మాన్సింగ్ మ్యూజియం ట్రస్ట్ ను ప్రస్తుతం యువరాణి దియాకుమారి నిర్వహిస్తోంది. శోభానివాస్లో గ్లాస్ వర్క్, ఛావీ నివాస్‌లో నీలిరంగు గదిలో ఉన్న కళాత్మకతకు నాటి ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హవామహల్ మీదుగానే ప్రయాణం సాగుతుంది. శ్రీకృష్ణుడి కిరీటం ఆకారంలో ఉన్న హవామహల్ సౌందర్యాన్ని ఆస్వాదించాలి.6వ రోజు: జయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత బిర్లా టెంపుల్ వీక్షణం, ఆమేర్ ఫోర్ట్సందర్శనం తర్వాత టూర్ నిర్వహకులు సాయంత్రం జయ్‌పూర్ ఎయిర్΄ోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. విమానం రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.అమేర్... మాన్సింగ్ మందిరంజయ్పూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరాన ఉంది అమేర్ ఫోర్ట్. ఇది కొండ మీద ఉంది. ఆరావళి పర్వతశ్రేణుల్లో విస్తరించిన రాజపుత్రుల రాజ్యంలో కోటలు, ప్యాలెస్‌లన్నీ నిర్మాణ అద్భుతాలే. రాజధానిని సిటీ ప్యాలెస్‌కు మార్చకముందు ఈ కోట నుంచే పాలన సాగింది. సామాన్య ప్రజలు రాజును కలవడానికి దివానీ ఆమ్, మంత్రివర్గంతోపాటు ఇతర ప్రముఖులు రాజుతో సమావేశమయ్యే దివానీ ఖాస్లు నాటి పరిపాలనను చాటి చెప్పే నిదర్శనాలు. రాజా మాన్సింగ్ ఇందులోనే నివసించాడు. ఈ నిర్మాణంలో పై అంతస్తులో మాన్సింగ్ బెడ్రూమ్, అతడి గది నుంచి కింది అంతస్థులో పన్నెండు మంది రాణుల బెడ్రూమ్లకు వెళ్లే మెట్ల నిర్మాణాన్ని పరిశీలించడం మరిచిపోవద్దు.‘రాయల్ రాజస్థాన్’ టూర్ ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఏ12. ఈ ఆరు రోజుల పర్యటన హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి 14.9.2025న మొదలవుతుంది. ఈ టూర్లో ఉదయ్‌పూర్, జోద్పూర్, పుష్కర్, జయ్‌పూర్ కవర్ అవుతాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 7.40 గంటలకు ‘6 ఈ 6323’ విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 9.25 గంటలకు ఉదయ్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం 19వ తేదీ రాత్రి 8.50 గంటలకు ‘6ఈ 816’ విమానం జయ్‌పూర్ నుంచి బయలుదేరి 10 .55 గంటలకు హైదరాబాద్‌కి చేరుతుంది.ప్యాకేజ్ ధరలిలాగ: కంఫర్ట్ కేటగిరీ సింగిల్ ఆక్యుపెన్సీలో 42, 450 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,900, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 32,450 రూపాయలు.తెలుసుకోవాల్సిన మరికొన్ని సంగతులు:విమాన ప్రయాణ సమయాల్లో అవసరాన్ని బట్టి కొద్ది మార్పులు జరిగే అవకాశం ఉంది. టూర్ ఐటెనరీ ΄్లానింగ్లో ఆలయ దర్శనానికి తగిన సమయం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. పూజాదికాలు నిర్వహించాలంటే సదరు పర్యాటకులు పూజ తర్వాత తమకు తాముగా హోటల్ గదికి చేరాల్సి ఉంటుంది. టూరిస్ట్ ప్యాకేజ్ బస్ పూజ పూర్తయ్యే వరకు ఎదురు చూడడం సాధ్యం కాదు. ఆలయాలకు కొన్ని చోట్ల పెద్ద బస్సు వెళ్లే అవకాశం ఉండదు, అలాంటి చోట్ల పర్యాటకులు కొంత మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్లు స్థానికంగా ఆటోలు తమకు తాముగానే పెట్టుకోవాలి.చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!పర్యాటకులు తమ ఆరోగ్య కారణాల రీత్యా పార్సిల్ ఫుడ్ వెంట పెట్టుకోవాలి. ఎనర్జీనిచ్చే చాక్లెట్లు, బిస్కట్, డ్రైఫ్రూట్స్, వేరుశనగ పప్పు వంటివైనా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఈ టూర్ ఐటెనరీలో జయ్‌పూర్‌లో జంతర్‌మంతర్, హవామహల్ లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి.ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి:హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్‌కి, జయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కి విమానం టిక్కెట్లు. ఉదయ్‌పూర్‌లో 2 రాత్రులు, జో«ద్‌పూర్‌లో ఒక రాత్రి, పుష్కర్‌లో ఒక రాత్రి, జయ్‌పూర్‌లో ఒక రాత్రి హోటల్ బస. 5 రోజులు బ్రేక్‌ఫాస్ట్, ఒక లంచ్, 5 రోజులు రాత్రి భోజనం. సైట్ సీయింగ్‌కి ఏసీ 35 సీటర్ బస్ ప్రయాణం. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్. – వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
గణేశ్ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. !
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ ఇంట ఏ పండుగైనా ఏ రేంజ్లో జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రథమ పూజలందుకునే గణేశ్ చతుర్థి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, బాలీవుడ్ తారాగణమే కదలివచ్చి మరీ ఈ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అలానే ఈ ఏడాది ఆగస్టు 27న ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పాను అంబానీ కుటుంబం ఘనంగా ఆహ్వానించింది. ఆ గణపతి విగ్రహాన్ని ముఖేశ్-నీతా దంపుతుల తోపాటు వారి చిన్న కుమారుడు అనంత్ -రాధికలు స్వయంగా ఇంటికి తీసుకు వచ్చారు. గణేశ్ చతుర్థిని ధూమ్ ధామ్‌గా జరుపుకున్నారు. ఆగస్టు 28న గణపతి నిమజ్జనం ఆచారాలు నిర్వహించారు. ఆ పండుగ తాలుకా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గణపతి నిమజ్జనం వేడుకలో రాధిక గులాబి రంగు అనార్కలిలో మెరిసింది. బంధానీ నమునా కుర్తా, గుండ్రని స్ప్లిట్ నెక్న్, క్వార్టర్లెంగ్త్ స్లీవ్‌లు, ఎంబ్రాయిడరీ టాసెల్స్‌తో ఆకర్షనీయంగా ఉండే డిజైనర్‌వేర్‌లో సింపుల్ లుక్‌లో కనిపించింది రాధిక. ఆ డ్రెస్‌కి తగ్గ చెప్పులు, బంగారు గాజులు, డైమండ్ ఇయర్ స్టడ్స్‌తో సాధారణ అమ్మాయిలా ఆశ్చర్యపరిచారు. అయితే ఈ గణేశ్ నిమజ్జనం ఆచారాలన్నింటిని అనంత్ రాధికాలు కలిసి నిర్వహించారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) అనంతరం రాధిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓర్హాన్ అవత్రమణి, అకా ఓర్రీ, మరికొందరు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలసి ట్రక్కు లోపల కూర్చొని ఉన్నారు. ఇక అనంత్ తన భద్రతా బృందం, ఇతరులతో కలిసి వాహనం వెనుక నడిచి ఆనందరకరమైన ఆ సంబరాన్ని జరుపకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాదు రాధిక అనంత్ అంబానీపై సరదాగా పువ్వులు విసురుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాధిక చేసిన పనికి అనంత్ నవ్వుతూ కనిపించడం చూడొచ్చు. కాగా, గణేష్ నిమజ్జనం 2025 సెప్టెంబర్ 6న వస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం ముందుగా చేయాలనుకునే వారు చతుర్థి తిథి మరుసటి రోజు (ఒకటిన్నర రోజుల తర్వాత) అంటే ఆగస్టు 28న చేయవచ్చు. ఇది గణేష్ నిమజ్జనంకు ప్రసిద్ధి చెందిన రోజులలో ఒకటి. ఆ రోజు మధ్యాహ్నం గణేష్ పూజ చేసిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర..) -
అగ్నిపర్వతంపై విఘ్ననాయకుడు! 700ఏళ్ల గణపతి ఎక్కడో తెలుసా?
విఘ్నాధిపతి గణపతి నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నిజానికి ఈ ఉత్సవాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మారాయి. పలు దేశాలలోనూ గణేశ్ చతుర్ధి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ పూజలు, వేడుకల విశేషాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి విశేషాల్లో అనేకమందిని ఆకట్టుకుంటున్న వైవిధ్య భరిత ఉత్సవం ఓ అగ్నిపర్వతం మీద జరుగుతుండడం విశేషం. అది కూడా మన దేశంలో కాకపోవడం మరో విచిత్రం.ఇండోనేషియాను ‘రింగ్ ఆఫ్ ఫైర్‘ అని పిలుస్తారు ఏకంగా 141 అగ్నిపర్వతాలను కలిగి ఉండి వాటిలో 130 ఇప్పటికీ బాగా చురుకుగా ఉండడంతో ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అలా ఇండోనేషియాలో చురుకుగా ఉన్న అగ్నిపర్వతాల్లో వీటమౌంట్ బ్రోమో కూడా ఒకటి. ఇది దాని సహజ సౌందర్యం సాంస్కృతిక ప్రాముఖ్యత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. ‘బ్రోమో‘ అనే పేరు హిందూ దైవం బ్రహ్మ అనే పేరును జావానీల ఉచ్చారణ నుంచి ఉద్భవించింది.ఇది ఈ ప్రదేశపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత థృఢంగా చేస్తుంది. మౌంట్ బ్రోమో బ్రోమో పర్వతం టెంగర్ సెమెరు నేషనల్ పార్క్‌లో ఒక భాగం, ఇది 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. మొత్తం 2,392 మీటర్ల ఎత్తులో ఇతర ఇండోనేషియా శిఖరాలతో పోలిస్తే దాని ఆకర్షణ యాత్రికులను, పర్యాటకులను కట్టిపడేస్తుంది.ఇండోనేషియాలోని ఈ మౌంట్ బ్రోమో అంచున ఓ గణేష్ విగ్రహం. ఉంది. ఇది 700 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని స్థానికులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర గణపతి మూర్తి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా దాని చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతకు కూడా పేరొందింది. టెంగర్ తెగకు చెందిన ప్రజలు స్థాపించిన ఈ గణపతి చాలా విశిష్టత కలదని విశ్వసిస్తారు. ఈ తెగ అగ్నిపర్వతానికి సమీపంలో నివసిస్తోంది. తరతరాలుగా, వారు రక్షణ కోసం గణేష్‌ను పూజించడం చుట్టూ పలు సంప్రదాయాలను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా స్థానికులను ఇది అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు, అందుకే ఈ వల్కనో వినాయకుడికి పూలు పండ్లను అర్పించే ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ పూజల వల్లనే అందమైన బ్రోమో టెంగర్ సెమెరు జాతీయ ఉద్యానవనంలో ఉన్న ఈ ప్రదేశం విశ్వాసం, వారసత్వం సహజ సౌందర్యాన్ని సంపూర్ణంగా మిళితం చేస్తూ ఒక ప్రత్యేకమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా అవతరించింది. ఇక్కడ గణేష్ చతుర్థి సమయంలో జరిగే వేడుకలు ఇండోనేషియా వెలుపల కూడా భక్తులను ఆకర్షిస్తాయి, ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన సహజ పరిస్థితులలో వర్ధిల్లే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది మారింది. ఇండోనేషియాలో హిందూ సమాజం చాలా కాలంగా బలమైన ఉనికి కలిగి ఉంది వినాయకునికి పూజలు చేసే లెక్కలేనన్ని దేవాలయాలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే మౌంట్ బ్రోమో వద్ద ఉన్న గణేష్ విగ్రహం అగ్నిపర్వతం అంచున ఉండటం వల్ల అసాధారణమైనదిగా పేరొందింది. స్థానిక సంప్రదాయం ప్రకారం, ఈ విగ్రహం దైవిక శక్తులను కలిగి ఉంది, చుట్టుపక్కల గ్రామాలను విస్ఫోటనాలు ఈ గణపతి రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. ఈ ప్రాంతంలో నిరంతర భద్రత సామరస్యాన్ని వర్ధిల్లజేయడానికి ప్రార్థనలు, పువ్వులు పండ్లు అందిస్తారు. ఈ ప్రదేశంలో నిర్వహించే రోజువారీ ఆచారాలు సమాజ రక్షణ, భాగస్వామ్య భక్తి శాశ్వత ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తాయి.(చదవండి: గణేశ్ చతుర్థి బహిరంగ వేడుకలు అలా మొదలయ్యాయి..!) -
గణేశ్ చతుర్థి బహిరంగ వేడుకలు అలా మొదలయ్యాయి..!
భాద్రపదమాసంలోని శుక్లపక్షంలో చతుర్థి (చవితి)ని 'వినాయక చవితి' పర్వదినంగా మనం జరుపుకొంటున్నాం. ఈ చవితి నాడే గణపతి ఆవిర్భవించాడు. ఈనాడు చేసే పూజలు, ఉపాసనలు అధికఫలాలను ప్రసాదిస్తాయని పురాణ వచనం. భాద్రపద శుద్ధ చతుర్థినాడే శివుడు వినాయకునికి విఘ్నాలపై ఆధిపత్యమిచ్చాడు. ఈ దేవునికి గణేశోత్సవాలు అన్న పేరుతో తొమ్మిది రోజులు విశేష పూజలు జరుగుతాయి. అంతేగాదు జనులు 'అవిఘ్నమస్తు' అంటూ తొలుత విఘ్నేశ్వరుణ్ణి పూజించడమనే సంప్రదాయం వేద కాలం నుంచి వచ్చింది. అంతటి మహిమాన్వితమైన వినాయక చవితి పండుగను బహిరంగంగా జరపడం ఎప్పటి నుంచి మొదలైంది. ఈ ఆచారం ఎలా వచ్చింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.1893లో ఇలా గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా చేయాలని ప్రస్థావన వచ్చిందట. అందుకు బీజం వేసింది భారత జాతీయవాద నాయకుడు లోకమాన్య తిలక్. ఆయన బ్రిటిష్ పాలన మగ్గిపోతున్న భారత ప్రజలను ఏకం చేసి ఐక్యతతో స్వతంత్రం సంపాదించుకునే దిశగా నడిపించే మార్గంగా ఈ గణేశ్ పండుగను వినియోగించుకోవాలనుకున్నాడట. పైగా ఆ రోజుల్లో ప్రజా సమావేశాలు నిషిద్ధం. ఇది బ్రిటిష్ వారు విధించిన అనేక ఆంక్షలలో ఒకటి. ఆ నేపథ్యంలో ఈ పండుగను బహిరంగా పెద్ద ఎత్తున చేసుకుని ఒకరికి ఒకరుగా ఒకతాటిపై నిలిచి ఐక్యతను చాటేలా చేయడం మొదలైంది.అలా మహారాష్ట్రలో మొదలైన ఈ బహిరంగా వేడుకలు..మిగతా అన్ని రాష్ట్రాలకు విస్తరించిందట. గణపతిని ఉద్దేశించి చేసే ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు శ్రమాధిక్య ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ కారణంగానే భిన్న భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఒక్కటిగా చేరి వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ సమైక్యతకు, మతసామరస్యానికి వేదికగా ఈ గణేశ్ ఉత్సవాలు నిలిచాయి. అంతేగాదు వసుధైక కుటుంబానికి అసలైన అర్థమే ఈ పండుగ. (చదవండి: ఆ గ్రామాల్లో వినాయక చవితి పండుగను చేసుకోరు...!) -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్‌కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!
భారతదేశం గర్వించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్... దేశం కోసం ప్రాణాలర్పించిన జలియన్‌వాలా బాగ్.సైనిక వందనంతో గౌరవించే వాఘా– అట్టారి సరిహద్దు... పంజాబ్ ప్రాణత్యాగాల నిలయం జంగ్ ఈ ఆజాదీ.వ్యర్థాలను అర్థవంతం చేసిన చండీగఢ్ రాక్ గార్డెన్... భగవద్గీత బోధనక్షేత్రం హరియాణా కురుక్షేత్రం.బహాయీ ధ్యానమందిరం ఢిల్లీ లోటస్ టెంపుల్... భారతీయ లోహ ప్రావీణ్యత చిహ్నం ఐరన్ పిల్లర్.కృష్ణుడు పుట్టిన మధుర... ఆడిపాడిన బృందావనం... భారతీయుల ప్రేమ పొందిన ప్రపంచవింత తాజ్‌మహల్. ఉత్తర భారత వారసత్వాన్ని వారంలో ఒడిసి పట్టుకోవచ్చు.1వ రోజు :హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం తర్వాత 3.50 గంటలకు 6ఈ 167 విమానం బయలుదేరి సాయంత్రం ఆరున్నరకు అమృత్‌సర్‌కు చేరుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహకులు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవడం, విశ్రాంతి, రాత్రి బస.2వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత వాఘా బోర్డర్ విజిట్, రాత్రి బస అమృత్‌సర్‌లోనే.బంగారు మందిరంగోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తొచ్చే ప్రదేశం అమృత్ సర్. ఇటీవల తమిళనాడులో మరో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది. కానీ ఇది 443 ఏళ్ల నాటి నిర్మాణం. దేశమెరిగిన బంగారపు మందిరం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆలయం కూడా. సిక్కుల ప్రార్థనామందిరం రాజకీయ సంక్లిష్టతలకు నెలవైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇందిరాగాంధీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆమె హత్యకు దారి తీశాయి. ఈ గురుద్వారాని రోజుకు లక్షా యాభై వేల మంది సందర్శిస్తారని అంచనా. గురుద్వారా కమిటీ నిర్వహించే లంగార్ (భోజనశాల)లో భోజనం చేయాలి. ఇక్కడో విషయం లంగార్లో అందరూ సమానమే. సహపంక్తి భోజనం చేయాలి. ఎంతమంచి వచ్చినా, కాదనకుండా వడ్డిస్తారు. ఎంత తిన్నా పెడతారు కానీ వడ్డించుకున్న పదార్థాన్ని వృథా చేస్తే ఒప్పుకోరు. పూర్తిగా తినేవరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలుచుంటారు. భోజనాన్ని గౌరవించాలనేది వారి నియమం. భోజనంతోపాటు వారి నియమాన్ని కూడా గౌరవించడం పర్యాటకుల ధర్మం. బంగారు గోపురం ఉన్న ప్రధాన ఆలయం సరోవరం మధ్యలో ఉంటుంది. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వంతెన మీద రావాలి. ఈ గురుద్వారా పేరు హర్మందిర్ సాహిబ్. ఈ మందిర నిర్మాణాల సమూహం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ మందిరంలో జాతిరత్నాలు పొదిగిన పై కప్పును కూడా పరిశీలనగా చూడాలి.బుల్లెట్ గాయాల గోడబ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్లు తగిలి చిల్లులు పడిన గోడ ఉంటుంది. ఆ గోడకు 36 బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 1919, ఏప్రిల్ నెల 13వ తేదీ, బైశాఖీ పండుగరోజు జరిగిందా దుర్ఘటన. డయ్యర్ భారతీయుల మీద కాల్పులు జరపడానికి ముందు బయటకు వెళ్లడానికి అనుమతించిన చిన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు. ఆ కాల్పుల్లో మరణించిన వారి స్మారక నిర్మాణం, అమర జ్యోతి చుట్టూ దేశం కోసం ప్రాణాలొడ్డిన వారి ముఖాల అమరిక అద్భుతంగా ఉంటుంది. వారిని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆ ఘటనలో మరణించిన వారిలో 120 మంది మృత దేహాలు ఒక బావిలో లభించాయి. ఏడు ఎకరాల ప్రదేశంలో అడుగడుగునా స్వాతంత్య్ర పోరాటంలో చోటు చేసుకున్న మౌనరోదనకు ఆనవాలుగా కనిపిస్తుంది.వాఘా– అట్టారి సరిహద్దు ద్వారంభారత్– పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఇది. అమృత్ సర్నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉంది. వాఘా బోర్డర్ అని వాడుకలో అంటుంటాం. కానీ దీని పేరు వాఘా– అట్టారి బోర్డర్. వాఘా అనే గ్రామం భారత్– పాక్ సరిహద్దు రేఖ రెడ్‌క్లిఫ్ లైన్‌కు ఆవల ఆరు వందల మీటర్ల దూరాన ఉంది. భారత సరిహద్దు గ్రామం అట్టారికి మూడు కిలోమీటర్ల దూరం. రోజూ సాయంత్రం ఇక్కడ వాఘా– అట్టారి బోర్డర్ సెరిమనీ జరుగుతుంది. 1959 నుంచి రోజూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలల్లో సందర్శకులు వస్తారు. ఇక్కడి నుంచి అర కిలోమీటరు దూరాన వాఘా రైల్వేస్టేషన్ ఉంది. భారత్– పాక్ మధ్య నడిచే రైలును చూడాలంటే వెళ్లవచ్చు.3వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి జలంధర్‌కు ప్రయాణం. జంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత చండీగఢ్‌కు ప్రయాణం. రాక్ గార్డెన్ విజిట్ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస.సమర జ్ఞాపకంజంగ్ ఈ ఆజాదీ అనే ప్రదేశాన్ని చరిత్ర పాఠంలో చదివి మర్చిపోయి ఉంటాం. ఇది స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ప్రదేశం. ఈ స్మారక భవనం పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరానికి సమీపంలో కర్తార్‌పూర్ పట్టణంలో ఉంది. భారత స్వాతంత్య్ర సమరంలో పంజాబ్ వాసులు నిర్వహించిన పాత్ర, వారి ప్రాణత్యాగాలకు గౌరవ చిహ్నంగా పదేళ్ల కిందట నిర్మించారు. చరిత్రకారులు, పాత్రికేయులు, మేధావులు సమగ్రంగా అధ్యయనం చేసి దీనికి రూపకల్పన చేశారు.రాకింగ్ రాక్స్వేస్ట్ మేనేజ్మెంట్ అవసరాన్ని తెలియచేసే ప్రదేశం ఇది. నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్లో పరిశ్రమల వ్యర్థాలు, ఇంట్లో వాడి పారేసిన వస్తువులతో ఆకర్షణీయమైన కళారూపాలను తయారు చేశారు. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా మానవ నిర్మితమే. సృజనాత్మకత, ఆచరణాత్మకత ఉంటే ఏ వస్తువూ వ్యర్థం కాదు, వృథాగా పారేయడం ఉండదు. అందమైన కళాఖండం అవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ గార్డెన్ అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాడకుండా అటకమీద పెట్టిన వస్తవులకు ఒక రూపమిచ్చే ఆలోచనలు మెదడులో పూస్తాయి.4వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి కురుక్షేత్రకు ప్రయాణం. శ్రీ కృష్ణ మ్యూజియం సందర్శనం. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస ఢిల్లీలో.గీత బడి కురుక్షేత్రంశ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేల ఇది. కురుక్షేత్ర అనగానే కురు– పాండవుల యుద్ధక్షేత్రంగానే గుర్తొస్తుంది. కురుక్షేత్రలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని స్థానికులు ధర్మక్షేత్రగా చెప్పుకుంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించిన ప్రదేశంలో ప్రస్తుతం మ్యూజియం ఉంది. కురుక్షేత్ర పట్టణం హరియాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, కురుక్షేత్ర పనోరమ అండ్ సైన్స్ సెంటర్, శ్రీకృష్ణ మ్యూజియం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీష్మకుండ్, కర్ణ లేక్, కల్పనా చావ్లా ప్లానిటేరియమ్, సూఫీ సన్యాసి షేక్ చిల్లీ టూంబ్ ముఖ్యమైనవి. ఇతడు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సోదరుడు దారాషుకో గురువు. తన ఆధ్మాత్యిక గురువు గౌరవార్థం దారాషుకో దీనిని నిర్మించాడు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ΄ోలిన నిర్మాణం కావడంతో దీనిని హరియాణా తాజ్‌మహల్ అంటారు. 5వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్ విజిట్. సాయంత్రం అక్షరధామ్ దర్శనం. రాత్రి బస ఢిల్లీలోనే.లోటస్ టెంపుల్నిశ్శబ్దంమైన ఆలయం ఇది. టెంపుల్ అంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహమూ ఉండదు. ధ్యానం చేసుకోవడమే ప్రధానంగా రూపొందిన బహాయీ ప్రార్థన మందిరం. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మతం అనే గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఏర్పడిన మతం ఇది. బహాఉలాహ్ అనే తత్వవేత్త ఇరాన్లో 19వ శతాబ్దంలో రూపొందించిన భావజాలం ఇది. అందుకే దీనికి బహాయి మతంగా పేరు వచ్చింది. అరవిరిసిన కలువపువ్వును తలపిస్తుంది. కాబట్టి లోటస్ టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఇది ఒక నిర్మాణ అద్భుతం. 2500 సీటింగ్ కె΄ాసిటీ ఉన్న విశాలమైన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ ఉండదు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. మతాలు, కులాలు, స్థాయీ బేధాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లాలి. ధ్యానం చేసుకుని బయటకు రావాలి. పర్యాటకులకు ధ్యానం చేసుకోగలిగినంత సమయం ఉండదు. కాబట్టి పది నిమిషాల సేపు కళ్లు మూసుకుని ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేసి రావడమే జురుగుతుంది.ఢిల్లీ పేరిలా వచ్చింది!కుతుబ్ మినార్ను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. ఢిల్లీ శివారులోని మెహ్రౌలీలో ఉంది. లాల్ కోట శిథిలాల మీద నిర్మించిన కట్టడం అని చెబుతారు. ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో లాల్ కోట ఉండేదని, అది ఢిల్లిక రాజ్య రాజధాని అని చెబుతారు. అదే దిల్లీగా వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ ఉచ్చారణలో డిల్లీగా మారింది. కుతుబ్‌మినార్ ప్రాంగణం అంతా తిరిగి చూస్తే ఒక భారీ కోట ఉండేదని నమ్మక తప్పదు. భారీ ప్రాకారాలు, గోడలు, వాటి నిర్మాణశైలి ప్రాచీనతకు అద్దం పడతాయి. కుతుబ్‌మినార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ పిల్లర్ చారిత్రక ప్రాధాన్యం కలిగినది మాత్రమే కాదు. మనదేశంలో ప్రాచీనకాలంలోనే లోహశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియచేసే ప్రత్యక్ష ఉదాహరణ. శతాబ్దాలపాటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఐరన్ పిల్లర్కి తుప్పు పట్టలేదు. పేరుకు ఐరన్ పిల్లరే కానీ అనేక లోహాల మిశ్రమం. ఏ లోహాన్ని ఎంత మోతాదులో మిశ్రమం చేశారనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదింకా. గుప్తుల కాలం నాటిది ఈ ఐరన్ పిల్లర్.అక్షరధామ్ఇది స్వామి నారాయణ్ ఆలయం. నిర్మాణ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం తిరిగి చూడాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. అభిషేక మండపంలో నీటి చెంబులు వరుసగా ఉంటాయి. టికెట్ తీసుకున్న వాళ్లు వరుసలో వెళ్లి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఇది ఢిల్లీలో యమునా నది తీరాన ΄ాండవ నగర్లో ఉంది. శిల్పసౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇతర ధార్మిక క్రతువులేవీ ఉండవు. దర్శనం, ధ్యానం, ఉల్లాసంగా గడపడమే ప్రధానం. పిల్లలు ఊయలలూగుతూ ఆడుకోవడానికి ఆటస్థలం కూడా ఉంది. విస్తారమైన గార్డెన్‌లున్నాయి. భారత్ ఉ΄ావన్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలున్నాయి. అక్షరధామ్లోపలకు స్మార్ట్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయితే బ్యాక్‌డ్రాప్‌లో ఆలయ గోపురం కనిపించేటట్లు ఫొటో పాయింట్ ఉంది. అక్కడ కెమెరామన్ ఉంటాడు. ఈ టూర్ జ్ఞాపకంగా ఒక ఫొటో తీయించుకోవడం మరిచిపోవద్దు. 6వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి మధురకు ప్రయాణం. శ్రీ కృష్ణ జన్మభూమి సందర్శనం తర్వాత బృందావన వీక్షణం. సాయంత్రం ఆగ్రాకు ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస ఆగ్రాలో.మధుర మసీదుమధుర ప్రయాణం ఆసక్తిగా సాగుతుంది. కానీ మధురకు చేరిన తర్వాత కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని, భక్తుల విశ్వాసాలకు తగినంత ప్రాధాన్యం పాలకులు ఇవ్వలేదనిపిస్తుంది. ఆలయం లోపల ఒక మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి. దేవకీవసుదేవులను కంసుడు బంధించి ఉంచినట్లు చెప్పే చెరసాల కూడా ఇక్కడే ఉంది. భూగర్భంలో నిర్మించిన రాతి గోడల కట్టడంలోకి ఇరుకు మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలన్నీ ధ్వంసం అవుతూ, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను నిక్షిప్తం చేసుకుంటూ పునర్నిర్మాణమవుతూ వచ్చింది. మొఘలు పాలకుడు ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థాన భవనాన్ని ఆనుకుని నిర్మించిన పెద్ద మసీదును కూడా చూడవచ్చు.యమునాతటిలో నల్లనయ్యబృందావనమది అందరిదీ! గోవిందుడు అందరివాడే... అని ఆడుకోవడానికి ఆడుకోవడానికి అందమైన ప్రదేశం బృందావనం. గోవిందుడు సంచరించిన నేల మీద పర్యటన అనే భావనలోనే ఓ గొప్ప గిలిగింత ఉంటుంది. యమునానది తీరాన విస్తరించిన ఈ నేల మీద ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు, బలరాముడు అనే పుణ్య పురుషుల బాల్యం గడిచిందని భక్తుల విశ్వాసం. ఇస్కాన్ నిర్మించిన భారీ ఆలయాలలో పౌరాణిక కథనాల్లో చోటుచేసుకున్న నాటి జ్ఞాపకాలకు నేటి రూపాలను మనం చూడగలుగుతున్నాం. మధుర నుంచి బృందావనానికి 15 కిమీల దూరం. మరో పది కిలోమీటర్ల దూరాన గోకులం ఉంది. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోసం ఇక్కడ కొంత కాలం నివసించవచ్చు. స్థానికులు మాట్లాడేది హిందీయే అయినా ఆ డైలక్ట్ దక్షిణాది వాళ్లు పుస్తకాల్లో నేర్చుకున్న హిందీకి ఏ మాత్రం సరి΄ోలదు. మెల్లగా అలవాటు చేసుకోవాలి.7వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్. తాజ్ వీక్షణం తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. 16 తేదీ సాయంత్రం 4.40 గంటలకు 6ఈ 6478 విమానం ఆగ్రాలో బయలుదేరి 6. 45 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.భారతీయుల ప్రేమకు చిహ్నంతాజ్మహల్ ను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడవచ్చనిపించే అద్భుతం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి కొన్ని వివరాలు మిగిలే ఉంటాయి. ఓ పాతికేళ్ల కిందట... ‘తాజ్‌మహల్ గొప్ప నిర్మాణమే కానీ ఫొటోలో కనిపించినంత అందంగా డైరెక్ట్‌గా చూసినప్పుడు కనిపించదు’ అనేవారు. అది నాటి మాట. యూపీలో యమునానది తీరాన ఫ్యాక్టరీలున్నప్పుడు వాటి కాలుష్యం కారణంగా తెల్లటి పాలరాయి పసుపు రంగులోకి మారింది. ఫ్యాక్టరీలను తొలగించిన తర్వాత ప్రమాదం తగ్గినప్పటికీ దశాబ్దంపాటు తాజ్‌మహల్ పసుపు వర్ణంలోనే ఉండింది. అలాగే ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో స్థానం పొందింది కూడా. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (తొలి దఫా) మనదేశంలో పర్యటించడానికి ముందు తాజ్‌మహల్ పాలరాయికి పాలిష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తాజ్ మహల్ తెల్లగా మెరుస్తోంది. తాజ్ మహల్ 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు వైపులా ఉన్న తోటలను పరిశీలనగా చూస్తే చార్బాగ్ ఏర్పాటులో మొఘలులు ఎంత నిశితంగా ఉండేవారో అర్థమవుతుంది. మొక్కలు, గుబుర్ల వరుస స్కేలు పెట్టి గీచినట్లు ఉంటుంది. మనకు తాజ్‌మహల్ అంటే ఎంత ప్రేమంటే... 2007లో జరిగిన న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో తాజ్‌మహల్‌కు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇది షాజహాన్ ప్రేమకు మాత్రమే కాదు, ఇది భారతీయుల ప్రేమకు కూడా చిహ్నమే. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి అంగుళమూ ఓ అద్భుతం. అన్నట్లు ఫొటోలు తీసుకునేటప్పుడు తాజ్ మహల్ ముందు మాత్రమే కాదు, వెనుక వైపు యమునా నది బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు తీసుకోవడం మరువద్దు. తాజ్‌మహల్‌తోపాటు ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశం రెడ్‌ఫోర్ట్. దీనిని ఆగ్రాఫోర్ట్ అంటారు. అక్బర్ ఎక్కువకాలం రాజ్యపాలన చేసింది ఈ ఎర్ర కోట నుంచే.హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ ఏడు రోజుల టూర్ పేరు ‘నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా’,టూర్ కోడ్ ఎస్హెచ్ఏ 52. సెప్టెంబర్ 10వ తేదీన మొదలయ్యే ఈ పర్యటనలో అమృతసర్, చండీగఢ్, ఢిల్లీ, మధుర, ఆగ్రా కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలకు..ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ కాంటాక్ట్ నంబరు: 91 97013 60701ప్యాకేజ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో 52,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 39,800 అవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 37,300 రూపాయలు. (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది
భారతీ సింగ్.. హాస్యప్రియులకు సుపరిచితమైన పేరు! దేశంలోని తొలి తరం మహిళా స్టాండప్ కమేడియన్లలో ఒకరు.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ ఫేమ్, రియాలిటీ షోస్ పార్టిసిపెంట్ అండ్ హోస్ట్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తన పేరుకు ముందు ఇన్ని విశేషణాలున్న భారతీ సింగ్ వాళ్లింట్లో అన్వాంటెడ్ చైల్డ్ అట. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అన్న, అక్క తర్వాత ఆమె. మనసులో మాట విన్నట్టుగా దేవుడు ఒక కొడుకు, కూతురుని ఇచ్చాడు.. ఇంక సంతానం చాలు అనుకుందట భారతీ వాళ్లమ్మ. కానీ మూడోసారీ గర్భం దాల్చింది. మూడో నెల వచ్చేదాకా ఆమెకు తెలీలేదు. తెలియగానే గాభరా పడిందట. ఎందుకంటే భారతీ సింగ్ తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. ముగ్గురు పిల్లలను పెంచేంత ఆర్థిక స్థోమత లేదని ఇద్దరు పిల్లలే చాలనుకుంది భారతీ సింగ్ వాళ్లమ్మ. అందుకే మూడో బిడ్డ కడుపులో పడిందని తెలియగానే గర్భస్రావం కోసం చెట్ల మందుల నుంచి, బొప్పాయి, ఖర్జూర పళ్లను తెగ తిన్నదట. బరువైన పనులు చేస్తే గర్భస్రావం అవుతుందని ఉదయం నుంచి రాత్రి దాకా వంచిన నడుము ఎత్తకుండా పనిచేసిందట. అయినా గట్టి పిండం.. భూమ్మీద పడింది. ఆసుపత్రికి వెళితే ఖర్చని.. ఇంట్లోనే కన్నదట. బొడ్డుతాడు కత్తిరించడానికి మంత్రసానిని మాత్రం పిలిపించిందట. అందుకు ఆ మంత్రసాని అరవైరూపాయలు తీసుకుందట అంతే! అందుకే భారతీ సింగ్ అంటుంది ‘కేవలం అరవై రూపాయల ఖర్చుతో నేను పుట్టాను’ అని... రానీయకుండా చేద్దామనుకుంది కానీ.. పుట్టాక నన్నే ఎక్కువ గారంగా చూసింది. నా రెండో ఏటనే నాన్న చనిపోయాడు. అయినా మా ముగ్గురికీ ఏ లోటూ తెలియనివ్వలేదు. తల్లీతండ్రీ తానై కష్టపడి పెంచింది. అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం’ అని చెబుతుంది భారతీ సింగ్. ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకుంది అమృత్సర్ వాసి భారతీ. ‘మూడో సంతానం వద్దనుకున్న అమ్మ .. అబార్షన్‌తో నన్ను భూమ్మీదకు రాకుండా చేద్దామనుకుంది. నా జోకులతో జనాలను చావగొట్టే రాత రాసుంది కాబట్టి.. వచ్చాను. వద్దనుకున్న బిడ్డకు ఆసుపత్రి ప్రసవం ఎందుకని కేవలం 60 రూపాయల ఖర్చుతో నాకు జన్మనిచ్చింది. కానీ నేను అమ్మకు ఇప్పుడు కోటీ అరవై లక్షల రూపాయల ఖరీదు చేసే ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చాను.. నన్ను కన్నందుకు కృతజ్ఞత గా... అని సగర్వంగా చెబుతుంది. (చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
చవితి రుచులు చవిచూడాల్సిందే!
వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేవి కమ్మని వంటకాలు! ఉండ్రాళ్ళు, పులిహోరా, తాలికలు ఇలా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రుచులతో వేడుక మొదలవుతుంది. మరి మన బొజ్జగణపయ్యకు ఇష్టమయ్యే రుచులను సులభంగా ఇలా చేసుకుందామా?బెల్లం తాలికలుకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, బియ్యప్పిండి– అర కప్పు, నీళ్ళు– ఒకటిన్నర కప్పులుబెల్లం తురుము– ఒక కప్పు (కావాలంటే పెంచుకోవచ్చు), ఏలకుల పొడి– అర టీస్పూన్నెయ్యి– 2 టీస్పూన్లు, గోధుమపిండి– ఒక టీస్పూన్, బాదం, జీడిపప్పు –కొద్దికొద్దిగాతయారీ: ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ముద్దలా అయ్యాక, చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, చేతితో సన్నని తాలికల్లా చుట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి, అవి మరుగుతున్నప్పుడు తాలికలను కొద్దికొద్దిగా వేసుకోవాలి. తాలికలు విరిగిపోకుండా సున్నితంగా గరిటెతో కలపాలి. తాలికలు పాలలో ఉడికిన తర్వాత, చిన్న గిన్నెలో గోధుమపిండిని కొద్దిగా నీటితో కలిపి, పాలలో వేసి గరిటెతో కలుపుకోవాలి. అనంతరం బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకుని నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులను కలుపుకుంటే చాలు.పులిహోరకావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి)చింతపండు గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నిమ్మరసం కూడా వాడుకోవచ్చు)పల్లీలు– పావు కప్పుశనగపప్పు– ఒక టేబుల్ స్పూన్మినపప్పు, ఆవాలు– ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర– అర టీస్పూన్ఎండుమిర్చి– 3 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 3 (సన్నగా చీల్చినవి), కరివేపాకు– కొద్దిగాపసుపు– అర టీస్పూన్ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి)నూనె– తగినంత, ఉప్పు– రుచికి సరిపడాతయారీ: ముందుగా పెద్ద పాత్ర తీసుకుని అన్నంలో కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. ఈలోపు మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. చింతపండుతో అయితే, వేగిన పోపులో చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకోవాల్సి ఉంటుంది. అదే నిమ్మకాయ పులిహోర అయితే, పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, అందులో నిమ్మకాయ రసం కలుపుకుని, ఆ పోపు మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.దద్ధోజనంకావలసినవి: అన్నం– రెండున్నర కప్పులుగడ్డ పెరుగు– రెండు కప్పులు, పాలు– అర కప్పు(కాచి చల్లార్చినవి)ఉప్పు– సరిపడా, నూనె– ఒక టేబుల్ స్పూన్ఆవాలు– ఒక టీస్పూన్, కరివేపాకు– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాఅల్లం తురుము– అర టీస్పూన్తయారీ: ముందుగా అన్నం వండి, చల్లారనివ్వాలి. చల్లారిన అన్నంలో పాలు, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు దోరగా వేగించాలి.అభిరుచిని బట్టి పప్పులు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవచ్చు ఇప్పుడు ఆ పోపును పెరుగు అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.ఉండ్రాళ్ళుకావలసినవి: బియ్యప్పిండి–ఒక కప్పునీళ్ళు– ఒకటిన్నర కప్పులుఉప్పు– సరిపడానూనె– 2 టీ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి తురుము, అల్లం తురుము, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు– కొద్దికొద్దిగాతయారీ: ఒక పాత్రలో నీళ్ళు, ఉప్పు, నూనె వేసి మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా తయారయ్యాక, స్టవ్ ఆపేసి మూత పెట్టి ఐదు నిమిషాలుంచాలి. పిండి కొద్దిగా చల్లారాక, చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఈ ఉండ్రాళ్ళను పెట్టి, ఆవిరిపై ఉడికించి ప్రసాదంగా పెట్టొచ్చు. అభిరుచి బట్టి ఈ ఉండ్రాళ్ళకు తాలింపు కూడా వేసుకోవచ్చు. అదెలా అంటే, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన పోపులో ఈ ఉడికించిన ఉండ్రాళ్ళను వేసి సున్నితంగా కలుపుకుని, కొబ్బరితురుమును కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: గణేశుడే అలంకరణ) -
గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్‌తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్‌బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని, ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్‌రూమ్‌లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్‌తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్‌లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్ లోడ్ చేసి, హెడ్సెట్ లేదా ఫుల్‌స్క్రీన్‌లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్‌తో భక్తి ప్లస్డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్‌లు, స్విచ్‌లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్‌లతో మండపం ఫుల్ పార్టీ మూడ్‌లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్‌తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్ ’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్‌గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్‌లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్ , పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది. ఒక్క బాక్స్‌లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! .(చదవండి: బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...) -
బంగారు శంఖం అంటూ రూ. 10 లక్షలు కుచ్చు టోపీ
ఒడిశా, జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్‌లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. వ్యాపారికి దుండగులుఇచ్చిన నకిలీ బంగారు శంఖంతర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..
దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును చాలామంది సమర్థించగా పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ధర్మాసనం పునః పరిశీలించి.. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్‌లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా.. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశ రాజధానిలో శునకాల పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని చోట్ల కుక్కలు దాడి చేయడం గానీ, కుక్క గాటుకి గురైన దాఖలు లేని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..!. అంతేగాదు అక్కడ శునకాన్ని ఆరాధ్య దైవంగా పూజలు చేస్తారట. ఆ శునక దేవుడిని భక్తులు కొలిచే విధానం నుంచి సమర్పించే నైవేద్యం వరకు ప్రతీది అత్యంత ప్రత్యేకమే. మరి ఆ విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ఆ ప్రదేశమే కేరళలోని పరస్సిని మడప్పుర ఆలయం. కేరళలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రకృతి సహజ సౌందర్యానికి ఆలవాలమైన ఈ కేరళలోని పరస్సిన మడప్పురలో కొలువైన శ్రీ మతుత్తప్పన్ ఆలయం కుక్కలకు స్వాగతం పలుకుతుంది. అక్కడ వాటిని దైవంగా పూజిస్తారు భక్తులు. విశ్వాసానికి పేరుగాంచిన శునకమే దైవం, పైగా కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ ప్రజలు కొలుస్తుండటం మరింత విశేషం. ఆ శునకాన్ని విష్ణు, శివుడి అంశంగా భావించి కొలుస్తారట కేరళ వాసులు. ఇది కేరళలోని కన్నూర్ నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది. పురాణ కథనం ప్రకారం..ముత్తప్పన్ అనే పిల్లవాడు నిబంధనలు ధిక్కరించి స్వేచ్ఛయుతంగా జీవించే మనస్తత్వం కలవాడు. అతనికి వేటాడటం, కల్లు తాగడం, పేదలకు సహాయం చేయడం వంటి మంచి సద్గుణాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికి తలవంచిన ఆ ముత్తప్పన్ వ్యక్తిత్వం కారణంగా అతని కుటుంబం బహిష్కరణకు గురైంది. దాంతో అతడు ఉన్నటుండి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత గ్రామాస్తులు అతడు దైవాంశ సంభూతడని భావించి..అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే కాంస్య కుక్క విగ్రహాలు తమ ఊరికి రక్షగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ ఆలయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించే అంశం నివేదించే ప్రసాదం.నాయూట్టు ఆచారం..కుక్కలకు పెట్టే ఆహారాన్ని కేరళలో నాయూట్టు ఆచారం అంటారు. ఆ ఆలయంలో కుక్కే దైవం కాబట్టి..ఆ స్వామికి ఎండు చేపలు, ఉడికించిన నల్లబీన్స్, టీ నేవేద్యంగా సమర్పిస్తారట. ఆ తర్వాత ఆ ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే శునకానికి ఆ ప్రసాదం పెట్టాక..భక్తులకు వితరణ చేస్తారట. ఆలయంలో సుందరి అనే శునకం, దాని పిల్లలను ఆలయ సిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకుంటారట.ఆశ్చర్యకరమైన విషయం..ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇక్కడ కుక్క కాటు లేదా దాడి చేయడం వంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవట. ఇది అక్కడ భక్తుల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది.రెండు రకాల తెయ్యంలు..తెయ్యం (Theyyam) అనేది కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన జానపద నృత్యం. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యం. ఇక్కడ “తెయ్యం” అంటే దైవం అని అర్థం. వన్నన్ తెగ సభ్యులు దీన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముత్తప్పన్లా వేషాధారణ వేసుకున్న వ్యక్తి కల్లు తాగడం అనే ఆచారం ఉంటుంది. దీని ఉద్దేశ్యం ఆ వ్యక్తిగత స్ప్రుహను మరిచిపోయేలా చేసి, ఆ వ్యక్తిని దైవంలా ప్రవర్తించేలా చేస్తుందట. ఈ తెయ్యంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనవచ్చు..ఆ తంతును వీక్షించి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందచ్చు.ఆలయ నిర్మాణం ఆలయం మూడు అంతస్తుల తెల్లటి నిర్మాణం. సాంప్రదాయ కేరళ ఆలయ రూపకల్పనకు నిలువెత్తు నిదర్శనం. ఫోటోగ్రఫీకి కూడా అనుమతిస్తారు. అయితే కొన్ని ఆచారాలను చిత్రించడం నిషిద్ధం.ఆలయ వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా జరిపించుకోవచ్చు.చేరుకునే మార్గం..రోడ్డు మార్గంకన్నూర్, తాలిపరంభ, సమీప పట్టణాల నుంచి సాధారణ బస్సులు మరియు టాక్సీలు ద్వారా చేరుకోవచ్చు.రైలు ద్వారాసమీప రైల్వే స్టేషన్లు కన్నూర్, పయ్యనూర్. రెండు స్టేషన్ల నుంచి, స్థానిక బస్సులు, ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి. అయితే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. కన్నూర్ స్టేషన్ నుంచి దాదాపు 45 నిమిషాలు పడుతుంది.విమాన మార్గంకన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగిన తర్వాత టాక్సీ లేదా బస్సు సాయంతో చేరుకోవచ్చు. చివరగా ఎలాగో కేరళ వస్తున్నారు కాబట్టి ఈ ఆలమం సమీపంలో ఉండే ప్రసిద్ధ పరస్సినికాడవు తాలిపరంబాలోని రాజరాజేశ్వర ఆలయం, పయ్యనూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించేలా టూర్ ప్లాన్ చేసుకుంటే కేరళ సహజ అందాలను వీక్షించే అవకాశం దక్కుతుందట.(చదవండి: మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!) -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్‌ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్‌టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు -
వంశధార చెంత.. తాగునీటికి చింత..!
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం: కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి ని«ధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం రెండు కి.మీ నడుస్తున్నాం : గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలంపట్టించుకోవడం లేదు : మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి.– లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లువరదలు వస్తే ఒడిశా వెళ్లాలి{ వర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం -
మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!
మేఘాలయ టూర్ మేఘాల్లో విహరించినట్లే ఉంటుంది. సముద్ర మట్టానికి ఆరువేల ఐదువందల అడుగుల ఎత్తు. ఆకాశపుటంచులను తాకుతున్నట్లు సాగే ప్రయాణాలు. షిల్లాంగ్ బసలతో చిల్ అవుతూ సాగే పర్యటన ఇది.ఈశాన్య సంస్కృతి దర్పణం డాన్‌బాస్కో మ్యూజియం. వాన జల్లులతో పర్యాటకులను పలకరించే చిరపుంజి. జలధారలను కలిపి జడ అల్లినట్లు ఎలిఫెంట్ ఫాల్స్. ప్రకృతి అద్భుతాన్ని ఒట్టేసి చెప్పే మావ్ స్మాయ్ కేవ్స్. గాల్లో ఉన్నట్లు భ్రమ కల్పించే ఉమ్న్గోట్ పడవ విహారం. నన్ను చూసి నేర్చుకోండి అంటున్న మావ్ లిన్నాంగ్ గ్రామం. చెరగని చరిత్రకు శిలాజ్ఞాపకం నార్తియాంగ్ మోనోలిథ్పార్క్. బోనస్‌గా... కామాఖ్య సందర్శనం... బ్రహ్మపుత్ర విహారం. కంచె ఆవల ఉన్న బంగ్లాదేశ్‌లోకి తొంగిచూడవచ్చు కూడా. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ వీటిని చూపిస్తుంది. 1వ రోజుగువాహటి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ నుంచి (ఈ ప్యాకేజ్‌లో టూర్ బుక్ చేసుకున్న పర్యాటకులు రైలు, విమాన మార్గాల్లో ఏ మార్గాన గువాహటికి చేరుతున్నారనే వివరాలను నిర్వహకులకు ముందుగా తెలియచేయాలి) రిసీవ్ చేసుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు విశ్రాంతిగా గడపడం, రాత్రి భోజనం, బస అక్కడే. ఆసక్తిని బట్టి తమకు తాముగా సాయంత్రం నగర విహారానికి వెళ్లవచ్చు.అసోమ్ నుంచి టూర్ షురూ!గువాహటిలో పగలు చూడాల్సిన ప్రదేశాల్లో కామాఖ్య ఆలయం, పీకాక్ ఐలాండ్, ఉమానంద ఆలయం, నెహ్రూపార్క్, అస్సాం స్టేట్ జూ, స్టేట్ మ్యూజియం, పోబితోరా వైల్డ్‌లైఫ్ సాంక్చురీ ఉన్నాయి. సాయంత్రం బ్రహ్మపుత్ర రివర్‌ఫ్రంట్ షికార్ బాగుంటుంది. షాపింగ్‌కి ఫ్యానీ బజార్‌కు వెళ్లవచ్చు. రెండవ రోజు టూర్ షెడ్యూల్లో కామాఖ్య ఆలయం, ఆరవ రోజు బ్రహ్మపుత్ర నదిలో విహారం ఉన్నాయి. కాబట్టి మొదటి రోజు చేతిలో ఉన్న కొద్ది సమయంలో చూడగలిగినవి, సమీపంలో ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి.2వ రోజుగువాహటి నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కామాఖ్య దర్శనానికి వెళ్లాలి. దర్శనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం. షిల్లాంగ్‌లో హోటల్ చెక్ ఇన్, డాన్ బాస్కో మ్యూజియం వీక్షణం, లేడీ హైదరీపార్క్లో విహారం, సాయంత్రం విశ్రాంతి, రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్లోనే. ఆసక్తి ఉన్న వాళ్లు సాయంత్రం విశ్రాంతి సమయంలో సొంతంగా నగర పర్యటన చేయవచ్చు.సాహిత్య కథనంకామాఖ్య ఆలయం గురించి జనబాహుళ్యంలో అనేక కథనాలు ఉన్నాయి. కామదేవ్ అనే రాజు దీనిని నిర్మించాడని చెబుతారు. అంతకంటే ముందు బిశ్వకర్మ శిల్పచాతుర్యంతో మహాగొప్ప నిర్మాణం చేశాడని పై భాగం విధ్వంసానికి గురైందని చెబుతారు. దేవీ భాగవతం, దేవీ పురాణం, కాళికా పురాణం, యోగిని తంత్ర, హేవజ్ర తంత్ర సాహిత్యాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది. శైవం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయం ప్రాభవం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలోని రాజ్యాన్ని పాలించిన నరక అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడనే కథనం కూడా ఉంది. చారిత్రక ఆధారాలు పెద్దగా లేకపోవడంతో సాహిత్యం, వ్యవహారికంలో ఉన్న కథనాలే ఆధారం.ఏడంతస్థుల మ్యూజియంషిల్లాంగ్లో నెలకొల్పిన మ్యూజియానికి మూలం రోమ్ నగరం. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతోపాటు వారు అనుసరించే జీవనశైలిలో దాగిన శాస్త్రీయతను అధ్యయనం చేసిన మీదట వాటిని ప్రోది చేస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన బ్రిటిష్ పాలకులకు వచ్చింది. ఏడంతస్థుల భారీ నిర్మాణంతో మ్యూజియానికి ఏర్పాట్లు జరిగాయి. అందులో స్థానిక జాతుల భాషల వివరాలతో లైబ్రరీ కూడా ఉంది. ఆదివాసీ జీవితం కళ్లకు కట్టే విధంగా చిత్రాలు, శిల్పాల అమరిక ఉంది. మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న చర్చ్ కూడా ఉంది. పదేళ్ల కిందట ఈ మ్యూజియాన్ని ఏడాదికి 70 వేల మంది సందర్శించేవారు. ఆ నంబరు ఏడాదికేడాదికీ పెరుగుతూ ఇప్పుడు లక్ష దాటింది.3వరోజుషిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజికి విహారయాత్ర. దారిలో ఎలిఫెంటా ఫాల్స్, ద్వాన్ సైయిమ్ వ్యూ పాయింట్, నోహ్ కలైకాల్ ఫాల్స్, మావ్ స్మాయ్ గుహలు, సెవెన్ సిస్టర్ జలపాతాల విహారం తర్వాత రాత్రికి తిరిగి షిల్లాంగ్ చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లో.ఐదు వందల ఏళ్ల వంతెనచిరపుంజి అనగానే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగానే మనకు పరిచితం. కానీ ఈ ప్రదేశం లివింగ్ బ్రిడ్జిలు కూడా ప్రసిద్ధి. అంటే బతికున్న వంతెనలు. చెట్ల వేళ్లతో అల్లిన వంతెనలన్నమాట. చెట్ల నుంచి వేళ్లను వేరు చేయరు, అలాగే సాగదీసి తాడులా అల్లుతారు. ఆ వేరు అలాగే ముందుకు పెరుగుతూ ఉంటుంది. దానిని కూడా అల్లికలో కలుపుతూ ఉంటారు. ఒక వంతెన ఏర్పడాలంటే పది నుంచి పదిహేనేళ్లు పడుతుంది. ఇలాగ ఐదు వందల ఏళ్ల నాటి వంతెన నేటికీ ఉంది. ఈ వంతెనలు ఒక్కోచోట రెండంతస్థుల వంతెనలు కూడా ఉంటాయి. ఇంతకీ ఇక్కడ ఇంత స్థాయిలో వర్షం కుండపోతగా కురవడానికి కారణం ఏమిటంటే... బంగాళాఖాతం నుంచి ఆవిరైన నీటితో ఏర్పడిన మబ్బులు ప్రయాణించే దారిలో ఎత్తుగా ఉన్న ఖాశి పర్వత శ్రేణులను తాకుతాయి. మబ్బులను గాలి బలంగా తోస్తూ ఉంటుంది. ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా పర్వత శ్రేణి అడ్డుకుంటుంది. దాంతో మబ్బులు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తాయి.ఏనుగు జలపాతంషిల్లాంగ్ నగరం దాటిన తర్వాత పది కిలోమీటర్ల దూరాన ఉందీ జలపాతం. షిల్లాంగ్ వాసులకు వీకెండ్ పిక్నిక్లాంటిదన్నమాట. ఈ జలపాతం విశాలంగా ఉంటుంది. కర్నాటకలోని హోగెనక్కల్ జలపాతం పాయలు పాయలుగా విడిపోయి ఊరంత విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మేఘాలయలోని ఈ జల΄ాతం జలధారలన్నీ ఒకే చోట చేరినట్లు ఉంటుంది. ఒత్తైన జుత్తు వీపంతా పరుచుకున్నట్లు నల్లటి రాళ్ల మీద పరుచుకున్న తెల్లటి జలధారలివి. ఇక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండడంతో దీనికి బ్రిటిష్ వాళ్లు ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారు. అంతకంటే ముందు స్థానికు ఖాసీ తెగ వాళ్లు తమ ఖాసీ భాషలో దీనికి పెట్టుకున్న పేరు ‘కా కై్షద్ లాయ్ పతెంగ్ ఖోసియో’.ఒట్టు బండఖాసీ భాషలో మావ్ స్మాయ్ అంటే ‘ఒట్టు బండ’ అని అర్థం. ఈ గుహలకు పేరు స్థిరపడింది. ఈ గుహలకు వెళ్లాలంటే చిరపుంజి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇవి మన కర్నూలులో ఉన్న బెలుం గుహలు, అరకులో ఉన్న బొర్రా గుహల్లాంటి స్టాలక్టైట్, స్టాలగ్మైట్ గుహలు. అయినప్పటికీ ఇలాంటి ప్రకృతి వింతలను ఎన్నిసార్లయినా చూడాల్సిందే.4వ రోజుషిల్లాంగ్ నుంచి డావ్కీ కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యటన డావ్కీ వైపు సాగుతుంది. ఆ తర్వాత మావ్లీన్నాంగ్ గ్రామ సందర్శనం. సాయంత్రానికి తిరిగి షిల్లాంగ్‌కి చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్లో.గాల్లో పడవఇక్కడున్న ఫొటో చూడండి. నీటి మీద ఉండాల్సిన పడవ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. గూగుల్‌లో దొరికిన ఈ ఫొటో మీద ముచ్చటపడి పీసీ డెస్క్‌టాప్ పిక్ గా, ఫోన్లో స్క్రీన్ పిక్‌గా పెట్టుకుంటుంటాం. ఇది మేఘాలయలోని ఉమ్న్గోట్ నది. నీటి స్వచ్ఛతకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫొటో. నీటి అడుగున నేల స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ నది డావ్కీ పట్టణంలో ఉంది. ఈ పట్టణం మనదేశ సరిహద్దు. పట్టణ శివారులో కంచె ఉంటుంది. కంచె ఆవల బంగ్లాదేశ్. ఇందులో పడవ ప్రయాణం చేసి, రెండంతస్థులుగా ఉన్న వేళ్ల వంతెన మీద నడిచి, ఇండో–బంగ్లా ట్రేడ్ రూట్ చూసి, బోర్డరులో కంచె దగ్గర నిలబడి ఫొటో తీసుకుంటే టూర్లో థ్రిల్ సగం సొంతమైనట్లే.స్వచ్ఛమైన గ్రామంమావ్ లిన్నాంగ్ గ్రామం మనదేశంలో మాత్రమే కాదు ఆసియా ఖండంలోనే రికార్డు సృష్టించిన గ్రామం. ‘డిస్కవర్ ఇండియా’ మ్యాగజైన్ నిర్వహించిన పోటీలో క్లీనెస్ట్ విలేజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలో తొమ్మిది వందల మంది నివసిస్తున్నారు. 90 శాతం అక్షరాస్యత సాధించిన గ్రామం. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్లే అందరూ. గ్రామం మొత్తం తిరిగి చూస్తే ఎక్కడా ఒక్క ఆకు నేల మీద కనిపించదు. రోడ్లు అద్దంలా మెరుస్తుంటాయి. ఇది కూడా ఇండో– బంగ్లా సరిహద్దులో ఉన్న గ్రామమే. 5వ రోజుషిల్లాంగ్ నుంచి జోవాయ్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాణం జాంతియా హిల్స్ వైపు సాగుతుంది. తడ్లాస్కీన్ సరస్సు, తైరిషి ఫాల్స్, క్రాంగ్సురీ ఫాల్స్, దుర్గా మందిరం, నార్తియాంగ్ మోనోలిథ్ పార్క్ చూసుకుని సాయంత్రం షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లోనే.స్మారక శిలలువ్యక్తులు, రాజుల జ్ఞాపకార్థం కానీ గౌరవార్థంగా కానీ సమాధులు నిర్మిస్తారు. స్మారక భవనాలను నిర్మిస్తారు. ఈజిప్టులో పిరమిడ్లు నిర్మిస్తారు. మేఘాలయలో కనిపించే మోనోలిథ్, మెగాలిథ్లు కూడా ఇలాంటి స్మారకాలే. జాంతియా రాజ్యాన్ని పాలించిన రాజుల స్మారకంగా ప్రతిష్టించిన ఏకశిల, బృహత్ శిలలివి. వీటిలో రాజులు తమ విజయాలకు చిహ్నంగా ప్రతిష్ఠించిన శిలలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రతి ఏకశిల, బృహత్ శిల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. నార్తియాంగ్ అనే ప్రదేశంలో ఉన్న మోనోలిథ్, మెగాలిథ్లు అత్యంత ఎత్తైనవిగా గుర్తింపు పొందాయి.ముత్యాల జలపాతంక్రాంగ్షురి జలపాతం ఓ అద్భుతం. అద్భుతం అనడం ఎందుకంటే జలపాతపు నీరు మడుగులో కనిపించే టర్కోయిస్ నీలిరంగే ఆ అద్భుతం. నీరు నేలను తాకి తటాకంగా మారినప్పుడు కనిపించే నీలిరంగు ఇక్కడ కనిపించదు. ఏ జలపాతానికైనా జలధారలు ముత్యాల వానను తలపిస్తుంటాయి. నేలను తాకిన తర్వాత తటాకం చిక్కటి నీలవర్ణంలో లేదా ఆకుపచ్చటి రంగులో కనిపిస్తుంది. మేఘాలయలో కొండల నుంచి జాలువారిన నీరు అత్యంత స్వచ్ఛమైనది. 6వ రోజుషిల్లాంగ్ నుంచి గువాహటికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. గువాహటికి చేరే మధ్యలో ఉమియుమ్ లేక్‌లో విహారం. గువాహటికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్. మధ్యాహ్నం తర్వాత బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ విహారం (ఇది ప్యాకేజ్‌లో వర్తించదు). సాయంత్రం గువాహటి లోకల్ మార్కెట్లో షాపింగ్. హోటల్ గదికి చేరి రాత్రి భోజనం, బస.బ్రహ్మపుత్రలో విహారంబ్రహ్మపుత్ర నదిలో విహరించకుండా మేఘాలయ, అస్సామ్ టూర్ ముగిస్తే ఆ టూర్‌కి దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చె΄్పాలి. బ్రహ్మపుత్ర నదికి దానికంటూ ఓ గొప్పదనం ఉంది. ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఇదొకటి. హిమాలయ శ్రేణుల్లో టిబెట్ దగ్గర పుట్టి ఇండియాలో విస్తరించి బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడి సంస్కృతి వీక్షణానికి అన్ని సౌకర్యాలున్న క్రూయిజ్‌లో బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించడం సులువైన మార్గం. వైవిధ్యమైన బౌద్ధ నిర్మాణాల ఆర్కిటెక్చర్, హిందూ ఆలయాల నిర్మాణశైలి, ఇస్లాం, క్రైస్తవ ప్రార్థనమందిరాలతోపాటు సామాన్యులు నివసించే ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. సంప్రదాయ నిర్మాణాలతోపాటు ఆధునిక నిర్మాణాల్లో కూడా స్థానిక ప్రత్యేకతలు కనిపిస్తాయి. 7వ రోజుబ్రేక్ఫాస్ట్,గది చెక్ అవుట్ తర్వాత పర్యాటకులు తిరుగు ప్రయాణానికి చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం నిర్వహకులు రైల్వే స్టేషన్, ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేయడంతో పర్యటన పూర్తవుతుంది.ఇది మేఘాలయ టూర్. ఏడు రోజుల పర్యటన. ప్యాకేజ్ పేరు ‘ఎసెన్స్ ఆఫ్ మేఘాలయ గ్రూప్ ప్యాకేజ్ ఎక్స్ గువాహటి’. ఈ ప్యాకేజ్‌లో గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ కవర్ అవుతాయి. ఇది వీక్లీ టూర్. శనివారం మొదలై శుక్రవారంతో పూర్తవుతుంది. ప్యాకేజ్ కోడ్ : https://irctctourism.com/ pacakage_ description? packageCode= EGH05టికెట్ ధరలిలాగ: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో దాదాపుగా 28 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 26 వేలవుతుంది. ఇది గువాహటి నుంచి మొదలై గువాహటికి చేరడంతో పూర్తవుతుంది. పర్యాటకులు తాము ఉన్న ప్రదేశం నుంచి గువాహటికి చేరడం, గువాహటి నుంచి తిరిగి తమ ప్రదేశానికి చేరే ప్రయాణ ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.గమనిక: కామాఖ్య దర్శనం కోసం వీఐపీ పాస్‌లు కావాలనుకునే వాళ్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీఐపీ టికెట్ ధర 501 రూపాయి. లింక్ https://mkdonline.in– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
సెలబ్రిటీల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, రాంచరణ్, ప్రగ్యా, ఇంకా..!
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను భారత దేశం ఘనం నిర్వహించుకుంటోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ భారతీయుడు దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగుర వేసి వేడుకలను చేసుకుంటున్నారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ఇండిపెండెన్స్ డే వేడుకల వివరాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు, అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాంటివాటిలో కొన్నింటిని చూద్దాం.టాలీవుడ్ హీరో రాంచరణ్ తన కుమార్తె క్లింకారాతో కలిసి వేడుకలను నిర్వహించారు. తిరంగా జెండాకు సెల్యూట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు.. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)నటి ప్రగ్వాజైశ్వాల్ అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా,మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు, అందుకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన లెక్కలేనన్ని ప్రాణాలకు కృతజ్ఞత తెలుపుదాంఅంటూ పోస్ట్ చేసింది. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌లో అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన ధైర్యవంతులను గుర్తు చేసుకున్నారు.. మన ప్రశాంత జీవనానికి తోడ్పడుతున్న ప్రతి సైనికుడికి. మన సాయుధ దళాలకు, లక్షలాది మందికి సెల్యూట్ చేసింది. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇన్‌స్టాలో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఒక ఫోటోను షేర్ చేశారు. -
ఎందరో త్యాగధనులు : దేశభక్తిని రగిలించే స్వాతంత్ర్య సూక్తులు
Independence Day 2025 Inspiring Quotes: ఆగస్టు 15న దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం చేయనున్నారు. భరతమాత స్వేచ్ఛకోసం ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారు. వారి అమరత్వాన్ని, మరెందో త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ సమరయోధులు చెప్పిన గొప్ప సూక్తులను, నినాదాలను మననం చేసుకుందాం.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులు, స్వాతంత్య్రం గురించి వారు చెప్పిన కొన్ని అభిప్రాయాలుబాలగంగాధర్ తిలక్ : ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను.’మహాత్మా గాంధీ: స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం కాదు, ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం కూడా.జవహర్లాల్ నెహ్రూ: ‘స్వాతంత్య్రం అనేది ఒక అవకాశం, ఒక బాధ్యత. మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి.’ సర్దార్ వల్లభాయ్ పటేల్: ‘ఒకే దేశంగా ఉండాలంటే ఐక్యత ముఖ్యం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఐక్యతను కాపాడు కోవాలి.’సుభాష్ చంద్ర బోస్: ‘మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను.’ రాజగోపాలాచారి: ‘స్వాతంత్య్రం అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవడం, మన విధి విధానాలను మనమే నిర్ణయించు కోవడం.’భగత్ సింగ్: ‘నా జీవితం దేశం కోసం, నా మరణం కూడా దేశం కోసమే. నా మరణం తర్వాత కూడా నా ఆశయం బ్రతికే ఉంటుంది.’జైహింద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం ఇప్పటికీ ప్రతి భారతీయుడి పెదవులపై ఉంటుంది.వందేమాతరం : బంకించంద్ర ఛటర్జీ రాంప్రసాద్ బిస్మిల్ : స్వాతంత్య్రం కోరిక ఇప్పుడు మన గుండెల్లో ఉంది, ఆ పక్క ఎంత బలం ఉందో చూడండి. చంద్రశేఖర్ ఆజాద్ : శత్రువుల తూటాలను ఎదుర్కొంటాం, మనం స్వేచ్ఛగా ఉంటాం. భగత్ సింగ్ : బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు, విప్లవ ఖడ్గానికి ఆలోచనల అంచున పదును పెడతారు - లాల్ బహదూర్ శాస్త్రి : త్రివర్ణ పతాకం మనకు గర్వకారణం, భారతీయులకు గర్వకారణం.జై జవాన్ జై కిసాన్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్: ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత, వెయ్యి జీవితాల్లో అవతరించుతుంది. -
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
దేశంలో ఎటు చూసినా.. పంద్రాగస్టు సంబరాల కోలహలమే. చారిత్రక ప్రదేశాల్లో ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులతో సందడిగా ఉంది. ఎందరో అమర వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఆ సమరయోధుల అందర్నీ స్మరిస్తూ..సగర్వంగా ఈ వేడుకుని జరుపుకోనుంది భారతదేశం. ఈ వేడుక ఢిల్లీ ఎర్రకోటలో మరింత ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవానికి అర్థంపట్టేలా విభిన్న శకటాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయుధ దళాల సాహస విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ కట్టిపడేసేలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదీగాక ఈ వేడుకల్లో దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొంటారు. వారందరి సమక్షంలో ఈ వేడుకలను తిలకిస్తే కలిగే ఆ అనుభవం వేరెలెవెల్ . పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరువేసిన తదనంతరం ఇచ్చే స్పీచ్‌ని ప్రత్యక్షంగా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీ స్పీచ్‌ని వీక్షించాలనుకుంటే జస్ట్ ఇలా చేయండి చాలు..ఎర్రకోట వద్ద జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. టిక్కెట్ల అమ్మకాలు ఆగస్టు 13, 2025 నుండి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్లలో ప్రారంభమవుతాయి. అదెలాగంటే..ఆన్లైన్ ప్రక్రియ..అధికారిక వెబ్సైట్ aamantran.mod.gov.in లేదా e-invitations.mod.gov.in. సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం 2025 టికెట్ బుకింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి. వివరాలను ఇలా పూరించాలి..పేరు, మొబైల్ నంబర్, టిక్కెట్ల సంఖ్య పూర్తి చేయాలివెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో IDని డౌన్లోడ్ చేసుకోండి.టికెట్ కేటగిరీని ఎంచుకోవాలి: రూ. 20 (జనరల్ కేటగిరీ), రూ. 100 (మధ్యతరగతి), రూ. 500 (ప్రీమియం కేటగిరీ)ఆ తర్వాత ఆన్లైన్లో చెల్లింపు చేసి QR కోడ్ సీటింగ్ వివరాలతో ఇ-టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఫోన్లో డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ కాపీని ఉంచండి — అది గేట్ వద్ద అవసరం.ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఎలాప్రస్తుతం అంతా ఆన్లైన్ సేవలే వినియోగిస్తున్నప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 10, 12 తేదీల్లో ఎంపిక చేసిన ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దీన్ని సాధారణంగా ప్రభుత్వ భవనాలు, వార్తాపత్రికలు, అధికారికి వెబ్సైట్లో ప్రకటిస్తుందిఆఫ్లైన్ బుకింగ్ కోసం..చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి (ఆధార్, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్) తీసుకెళ్లాలి.టికెట్ ధరను (రూ. 20, రూ. 100, లేదా రూ. 500) నగదుగా లేదా డిజిటల్ చెల్లింపుల్లో చెల్లించండి.టిక్కెట్‌ను తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆఫ్‌లైన్ టికెట్లు పరిమిత సంఖ్యలో దొరకుతాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.ఏవిధంగా చేరుకోవాలంటే..ఎర్రకోట చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అత్యంత అనుకూలమైన మార్గం. అందుకోసం లాల్ ఖిలా లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్రో సేవలు ఉదయం: 4.00 గంటలకు ప్రారంభమవుతాయి. కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6:30–7:00 గంటల మధ్య చేరుకునేలా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలి. ప్రవేశానికి ముందు చాలా కఠినతరమైన భద్రత ఉంటుందనేది గుర్తు ఎరగాలి. చివరగా ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం త్వరితగతిన టికెట్లు బుక్ చేసుకుని టైమ్‌కి చేరుకునేలా చక్కగా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలనేది గ్రహించండి.(చదవండి: Goa Tourism 2025 Rules: గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...) -
మీరు నమ్మాలేగానీ...అవే నిజమైన ఆస్తి
ఒకప్పుడు పుస్తకం కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోతే లైబ్రరీల బాట పట్టేవారు. చదువుకోడానికి సరైన వసతి లేకపోయినా, పఠనాసక్తి కలిగిన వారు గ్రంథాలయాలనే ఆశ్రయించేవారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం విద్యార్థులను లైబ్రరీల నుంచి దూరం చేసింది. ఏ విషయం కావాలన్నా గూగుల్‌లో వెతకడం సులభమైపోయింది. కానీ గ్రంథాలయాలలోనే మనసుకు ప్రశాంతత, చదువుకు ఏకాగ్రత లభిస్తాయి. అందుకే నేటి తరాన్ని గ్రంథాలయానికి మళ్లించాల్సిన అవసరం ఉంది.చరిత్రలో మొదటి గ్రంథాలయంగా అసుర్బానిపాల్ లైబ్రరీ (క్రీ.పూ. 7వ శతాబ్దం, నినెవె, ఇరాక్) ప్రసిద్ధి చెందింది. ఇందులో మట్టి పలకలపై క్యూనీఫార్మ్ లిపిలో రాసిన సుమారు 30,000 హస్త ప్రతులు ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద లైబ్రరీ కలకత్తా పబ్లిక్ లైబ్రరీ. 1836 మార్చి 21న ద్వారకానాథ్ టాగూర్ ప్రారంభించిన ఈ లైబ్రరీ, స్వాతంత్య్రం తర్వాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా మారి ఇప్పుడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధీనంలో నడుస్తోంది. ఇక్కడ 25 లక్షల పుస్తకాలు ఉండగా, బెంగాల్ శాస్త్రవేత్త ఆశుతోష్ ముఖర్జీ ఒక్కడే 80,000 పుస్తకాలు దానం చేశారు. మరో విశిష్ట గ్రంథాలయం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబయి. 1833లో జేమ్స్ మాకింతోష్ దీన్ని ప్రారంభించారు.ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి 192 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లైబ్రరీలో లక్షకు పైగా పుస్తకాలు ఉండగా, 15,000 అరుదైన గ్రంథాలు మాణిక్యాల్లా మెరుస్తున్నాయి. ఆధునికతకు అనుగుణంగా, ఇక్కడి అన్ని పుస్తకాలు, లిఖిత ప్రతులు, పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చి ‘గ్రంథ్ సంజీవనీ వెబ్సైట్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు.నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ‘సోషల్ మీడియా కోసం కాదు, సొంత మెరుగుదలకు చదువుదాం!’ అనే ప్రతిజ్ఞ తీసుకుందాం.– అర్జునరావు రాజనాల, అరోరా పీజీ కళాశాల గ్రంథాలయ విభాగాధి పతి -
మర్రిపాలెం బుల్లోడు : షార్ట్‌ఫిల్మ్స్ టు ఆస్కార్స్ గోల్డ్ఫెలోషిప్
బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ప్రకృతి, మూగజీవులపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించాడు శ్రీహరి వర్మ(Sagi Sree Hari Varma). మూగజీవులు స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో వివరిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థలో వాలంటీర్‌గా చేరి మూగ జీవులపై డాక్యుమెంటరీ రూపొందించాడు. మూగ జీవులపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిమ్స్‌ను రష్యాలోని విజీఐకె ఫిల్మ్ స్కూల్‌కు పంపిచాడు. రష్యా ప్రశంసలురష్యా ప్రభుత్వం తమ దేశ ప్రగతి, సంస్కృతి, అభివృద్ధిని చాటిచెప్పే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేయగా మన దేశం నుంచి శ్రీహరి వర్మకు మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళ్ళకు కట్టినట్టుగా ‘గో మారడోవియా’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించి రష్యా ప్రతినిధుల నుండి ప్రశంసలు పొందాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ‘స్కూల్ ఆఫ్ సినిమా టెక్ ఆర్ట్స్’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. హాలీవుడ్ సినిమా చిత్రీకరణపై అవగాహన పెంచుకున్నాడు. శిక్షణా సమయంలోనే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు (పీస్‌కీపింగ్ ఫోర్సెస్) పై డాక్యుమెంటరీ రూపొందించాడు. (Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు)ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్ఫస్ట్ ఇండియన్షార్ట్ ఫిలిమ్స్‌తో మొదలైన శ్రీహరివర్మ ప్రస్థానం ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ వరకు వెళ్ళింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ అందజేస్తుంది. దీని కోసం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్‌కు 2019లో ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు శ్రీహరివర్మ. ఫెలోషిప్‌లో భాగంగా యువ దర్శకులు, ప్రముఖ హాలీవుడ్ దర్శకులతో కలసి పనిచేసే అవకాశం పొందాడు. గేమ్ ఆఫ్లైఫ్, హెడ్ అండ్ ఫిగర్స్, అమెరికన్ డ్రీమర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్ మెల్ఫీ దగ్గర శిక్షణ పొందాడు.చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం సినీ–మదమారెలో అవకాశంఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ (సినీ మదమారె)లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరివర్మకు అవకాశం లభించింది. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి యువ దర్శకుల ప్రతిభను గుర్తించడానికి ఇటాలియన్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. సిని మదమారెలో శ్రీహరి వర్మ 4 విభిన్న షార్ట్ ఫిలిమ్స్‌ను చిత్రీకరించాడు.విశాఖ నగరం, మర్రిపాలెంకు చెందిన సాగి శ్రీహరివర్మ షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రారంభించి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో స్థానం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ఇటలీలో జరిగిన వేసవి చలన చిత్ర నిర్మాణ కార్యక్రమం (సినీ మదమారె)లో పాల్గొని తన సత్తా చాటాడు... -
రక్షా బంధన్.. పోషణ బంధం
ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అంటూ పోషణ బంధం రాఖీ.. వ్యసనాలకు లోనుకాకు, మత్తువదులూ అంటూ సోదరబంధం రాఖీలతో కొత్త రాఖీలకు శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ. పోషకాహారం, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో సరికొత్త మార్గంలో రాఖీ వేడుకలకు సన్నద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ (poshan abhiyaan) పథకంలో భాగంగా చిన్నారులకు పోషణ బంధం రాఖీల పంపిణీ.. ప్రభుత్వ కళాశాలల్లోని యువతకు మిషన్ పరివర్తన నషాముక్త్భారత్ అభియాన్ పథకంలో భాగంగా సోదరబంధం రాఖీలు పంపిణీ చేసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించనుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ వీటికి సోదరబంధం, పోషణ బంధం రాఖీలుగా నామకరణం చేసి ఈ ఏడాది ప్రతీ అంగన్వాడీ బడిలోనూ, కళాశాలల్లోనూ రాఖీ వేడుకలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే! -
గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...
దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్‌లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్‌లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్‌లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు బ్రాండ్ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి. బల్క్ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు కో–ప్రాసెసర్లు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి గెజిట్–నోటిఫైడ్ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్ స్పోర్ట్స్ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్‌లలో వాహనాలను నడపడం రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్..(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..) -
సెలవంటే పండగ..ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బూ ఆదా ఇలా!
సెలవొచ్చిందంటే సువెన్ చక్ర ఇల్లు సందడిగా ఉంటుంది. బంధువులో, స్నేహితులో వస్తారని కాదు. సెల‘వంటే’ ఆ ఇంట పండగ. అవును.. వంటల పండగ. ఆ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు, సరుకులు పొద్దున్నే తెచ్చుకోవడం మొదలు.. భోజనం అయ్యేదాకా ఇంటిల్లిపాది చేయిపడాల్సిందే. ‘అమ్మ చేతి వంట. భార్య చేతి వంట ఎప్పుడూ ఉండేదే.. రెస్టారెంట్‌కు వెళ్లి విందు ఆరగించడం, నిమిషాల్లో ఇంటికొచ్చే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లూ కొత్త కాదు. వారంలో ఒక్కరోజే అందరూ కలిసి ఉండేది. కాబట్టి సెల‘వంటే’ పండగ అని అంటారు చక్ర.సెలవు రోజును ఎలాగైనా ప్రత్యేకంగా మలుచుకోవాలి. ఆ మధుర క్షణాలు వారమంతా గుర్తుండాలి. సెలవు మళ్లీ ఎప్పుడొస్తుందా అని కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూడాలి. ఇదంతా సాధ్యం చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్.. అందరూ కలిసి ‘వంట’ చేయడమే. యస్.. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పైగా వారం వారం కొత్త రుచులను ఆస్వాదించే చాన్స్ వస్తే ఎవరు కాదనుకుంటారు? ఇంటర్నెట్ వచ్చాక వంట చేయడం చాలా సులభం అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విహరించి కొత్త వంటకం నిర్ణయిస్తాం. ఉద్యోగం చేసే మగవాళ్లు సెలవు రోజు వంట చేయడం పాత కాన్సెప్ట్. ఇంటిల్లిపాదీ కలిసి వంట చేయడంలో కొత్త ట్రెండ్.అందరూ కలిసి..ఆడవాళ్లే వంట చేయాలన్న మూస పద్ధతికి స్వస్తి పలకాల్సిందే. కుటుంబం అంటేనే సమిష్టి బాధ్యత. కనీసం సెలవు రోజైనా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వంట చేస్తే? ఒక్కసారి చేసి చూడండి. ఆదివారం, సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం మీ వంతు అవుతుంది. ఇలా అందరూ కలిసి వంట చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.తినేది తెలుస్తుందిబంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనూ, వారాంతాలు, పండుగలప్పుడు రెస్టారెంట్లకు వెళ్లడం పరిపాటి అయింది. వంట చేసే సమయం లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నారు. మనకు నచ్చినవి తింటున్నాం సరే.. ఆ ఆహారం ద్వారా చక్కెరలు, నూనెలనూ పరిమితికి మించి తీసుకుంటున్నాం. అలా కాకుండా మనమే వంట చేస్తే ఈ పదార్థాలను మితంగా వాడొచ్చు. ఇంట్లోని పిల్లలు, పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వంట చేస్తాం. అవసరమైతే ఉప్పూ, కారం తక్కువగా ఉన్నవి ముందు తీసిపెడతాం. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వాడకం మన చేతుల్లో ఉంటుంది. మితంగానూ వాడొచ్చు.. పూర్తిగా వాడకుండానూ ఉండొచ్చు. ఇంటిల్లిపాదికీ ఎంత ఆరోగ్యం!ఆరోగ్య ప్రయోజనాలుబయట ఎక్కువగా తిన్నా, ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఆర్డర్ చేసినా.. ఆ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ ఫుడ్‌లో రుచి కోసం ఏం కలిపారో తెలియదు. తాజాగా చేసిందో.. వేడి చేసి పంపిందో తెలీదు. ఏ నూనెలు వాడారో తెలియదు. అదే, ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే.. ఇంట్లో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా.. పిల్లలకు కూడా నచ్చినట్టుగా.. మనమే జాగ్రత్తగా ‘స్వయంపాకం’ చేసుకోవచ్చు. ఇంట్లోని అందరూ నిర్భయంగా ఇంటి ఫుడ్‌ని తీసుకోవచ్చు. అందరితో ఎంజాయ్ చేస్తూ రుచులు ఆస్వాదించొచ్చు.పరిమితాహారంఎంత రుచికరంగా ఉన్నా మితంగా తినాలన్నది పెద్దల మాట. మనం రెస్టారెంట్‌కి వెళ్లేటప్పుడు తెలియ కుండానే అపరిమితంగా తినేస్తాం. డబ్బులు పెట్టాం కదా అని టేబుల్ మీద మిగిలిన ఆహారాన్ని, లేదా స్విగ్గీ /జొమాటో ద్వారా ఇంటికి వచ్చిన ఫుడ్‌ను పాడేయకుండా ఆ కాస్తా మనమే లాగించేస్తాం. అంటే మన స్థాయికి మించి అతిగా తింటాం అన్నమాట. దాంతో అనారోగ్య సమస్యలూ మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఇంట్లో వంట అయితే ఎంత తినాలనేది మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా వండుకుంటాం. వృథా పోదు.. అపరిమితంగా మన పొట్టలోకీ పోదు.ఖర్చు తగ్గుతుందిరెస్టారెంట్లు గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. వినూత్న వంటకాలు, రుచులతో ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయి. ఖర్చూ అలాగే ఉంటోంది. నలుగురున్న కుటుంబానికి ఓ మోస్తరు రెస్టారెంట్లో భోజనానికి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిందే. కానీ, కాస్త మనసు పెట్టి.. ఇంట్లోని అందరూ తలో చేయి వేసి వండిన భోజనం.. అంతకు మించిన రుచి అందిస్తుంది. పైగా రెస్టారెంట్లో అయిన ఖర్చులో సగం కూడా కాదు. ప్రతీవారం రెస్టారెంట్‌కు వెళ్లే కుటుంబం నెలకు ఎంతకాదన్నా ఓ రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చన్న మాట.బంధాలు బలంగాఈ సెల‘వంట’ద్వారా అందే అతి ముఖ్యమైన రహస్య పోషకాహారం.. బంధాలు మరింత బలపడటం. భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో వంట చేయడం, కలిసి తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఒకవేళ అప్పటివరకూ నామమాత్రంగా ఉంటే.. బలంగా అతుక్కోవడం మొదలవుతుంది. పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఇదో మంచి స్ట్రెస్ బస్టర్ అవుతుంది. పిల్లలకు పనులు అలవాటవుతాయి. కూరగాయలు, సరుకులపై అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు కరువవుతున్న నేటి రోజుల్లో.. ప్రతివారం వంటతో పండగ చేసుకుంటే.. కుటుంబ బలం పెరుగుతుంది.షరతు: వంట చేస్తున్నంతసేపూ.. దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తున్నంతసేపూ.. స్మార్ట్ ఫోన్‌ని (వంటల కోసం చూడాల్సి వస్తే తప్ప) దూరంగా పెడితే.. ఈ వంటకి మరింత ప్రేమానుభూతుల ‘రుచి’ చేకూర్చిన వాళ్లవుతారు. ఇదీ చదవండి: లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిశె గింజలు అద్భుతః -
బుస్ బుస్..స్నేక్ వెరైటీల్లో టాప్ 10 దేశాలివే...
ఇది వానాకాలం...సిటీలో ఉన్నవారికి ఈ సీజన్లో ఏవేవో గుర్తు రావచ్చు గానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రం వెంటనే గుర్తొచ్చేవి, వారిని అప్రమత్తం చేసేవి పాములు అని చెప్పాలి. ఈ సమయంలో పాములు పొలాల్లో నుంచి ఇళ్లలోకి కూడా ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామీణులు, నగర శివార్లలో ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు ప్రపంచంలో పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఎన్నెన్ని జాతులు పాములు ఉన్నాయి? మన దేశం ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి పరిశీలిస్తే...పాముల సంఖ్యలో తొలిస్థానం మెక్సికో దేశం దక్కించుకుంటోంది. ఈ దేశంలో దాదాపుగా 400కిపైగా సర్ప జాతులు ఉన్నట్టు అంచనా. వీటిలో రాటిల్ స్నేక్స్, కోరల్ స్నేక్స్, బోవా పాములు వంటివి ఉన్నాయి.పాముల సంఖ్యలో 2వ స్థానాన్ని దక్కించుకుంది బ్రెజిల్. అయితే జాతుల రీత్యా చూస్తే ఈ దేశంలో 420కిపైగా పాములు ఉన్నట్టు లెక్కించారు. వీటిలో చెట్లలో నివసించే వాటి నుంచి అనకొండ వంటి భారీ సర్పాల వరకూ ఉన్నాయి.ఈ జాబితాలో ఇండోనేసియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సముద్ర సర్పాలు, పైథాన్స్ వంటి రకాలతో కూడిన 376 సర్ప జాతులకు ఈ దేశం నిలయంగా ఉంది.పామును దైవంగా కొలిచే కోట్లాది మంది ప్రజలున్న మన భారత దేశం ఈ లిస్ట్‌లో 4వ ప్లేస్ దక్కించుకుంది. కోబ్రాలు, పచ్చని పల్లి పాములు, క్రైట్స్ సహా 305 సర్ప జాతులు మన దేశంలో ఉన్నాయట.దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలకు చిరునామా అయిన కొలంబియా మన తర్వాత 5వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 305 రకాల స్నేక్ వెరైటీలు ఉన్నాయి. బుష్ మాస్టర్స్, కోరల్ స్నేక్స్ వంటి పాముల జాతులకు ఈ దేశం పేరొందింది.జనాభాలో నెం2గా ఉన్న చైనా పాముల జనాభాలో 6వ స్థానం చేజిక్కించుకుంది. పిట్ వైపర్స్ వంటి అరుదైన జాతులతో సహా 246 వెరైటీలు చైనాలో ఉన్నాయి.సైజులో చిన్న అయినా పాముల పాప్యులేషన్లో పెద్ద దేశాల సరసన చోటు సంపాదించింది ఈక్వడార్. ఈ దేశంలో అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్స్ వంటివి పాముల నిలయాలుగా మారి 241 సర్పజాతులకు ఈ దేశాన్ని అడ్రెస్‌గా మార్చాయి.మొత్తం 226 సర్ప జాతులతో వియత్నాం 8వ స్థానం అందుకుంది. కోబ్రాలు, కీల్ బ్యాక్స్ వంటి వెరైటీలతో ఈ దేశంలోని అడవులు సర్ప నిలయాలుగా పేరొందాయి.ప్రకృతి సౌందర్యంతో, పర్యాటకుల ఆకర్షణలో ముందున్న మలేషియా 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో రంగురంగుల పాములు ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా 216 స్నేక్ వెరైటీలు ఉన్నాయట.టాప్ 10లో చివరి దేశంగా నిలిచిన ఆస్ట్రేలియాలో 215 సర్పజాతులు ఉన్నాయని లెక్కించారు. అత్యంత ప్రమాదకరమైన టైపాన్స్, బ్రౌన్ స్నేక్స్, టైగర్ స్నేక్స్‌కు ఈ దేశం కేరాఫ్‌గా ఉంది. -
ఏ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవాలి..?
సాధారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పున్నమి ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1 శుక్రవారం చేసుకోవాలా? లేక ఆగస్టు 8న వచ్చే శుక్రవారం చేసుకోవాలా... అన్న సందేహం సహజం. చాలామంది పంచాంగ కారులు 8వ తేదీని పున్నమి అయినా ఆ వేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణం, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవేవరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పింది కాబట్టి మంచి సంçపద, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పున్నమికి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. ఒకవేళ పున్నమిరోజునే శుక్రవారం వస్తే.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఆగస్టు 8నే వరవలక్ష్మీవ్రతం చేసుకోవాలనే సంకేతం కదా! ఒకవేళ ఏ కారణం చేతనైనా 8 వతేదీ ఆటంకం కలుగుతుందేమో అని అనుకొనే వారు ఆగస్టు 1న వచ్చే రెండవ శుక్రవారం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. (చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?) -
శ్రావణ మాసంలో మహిళలు ఆకుపచ్చని గాజులే ఎందుకు ధరిస్తారంటే..?
శ్రావణ మాసం అంటేనే పండుగలు, కళ్యాణ వైభోగాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉండే మన ఆచార వ్యవహారాలు సైన్సుకే అందని విషయాలను వివరిస్తాయి. ప్రతిదాంట్లో సంప్రదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంల వరాలిచ్చే వరలక్ష్మీ దేవిని కొలిచే మహిళల కట్టు, బొట్టు, తినే ఆహారం ఇలా ప్రతిదాంట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలా ఎందుకో సవివరంగా తెలుసుకుందామా.!.శ్రావణ మాసంలో భారతీయ వివాహితలు ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. ఇది వారి సంతోషకరమైన, సుసంపన్నమైన వైవాహిక స్థితిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభప్రదమని, సంతానోత్పత్తికి సంబంధించినదని వారి నమ్మకం. అంతేకాదు, తమ శ్రేయస్సుకు, అదృష్టానికి, ప్రకృతి పునరుద్ధరణకు ప్రతీకగా ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. వర్షాకాలంలో వాతావరణం ప్రశాంత శక్తితో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగ సమతౌల్యతను కలిగిస్తుంది. అన్యోన్యతకు సూచికగా, సంప్రదాయం, ఆరోగ్యం, భక్తిని ఒకే వరసక్రమంలో పరిచయం చేసే శక్తి ఆకుపచ్చ రంగుకు ఉంటుంది. గాజుల శబ్దం ప్రతికూలతను దూరం చేస్తుందని నమ్మకం. శివ–శక్తి దైవిక ఐక్యతను ప్రతిబింబించే సామరస్యాన్ని కూడా సూచిస్తుందనే భావన దీనిలో ఇమిడి ఉంది.ఫలవంతమైన ఎంపికశ్రావణ మాసం వర్షాకాలం కనుక అలెర్జీలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సి–విటమిన్ సమృద్ధిగా లభించే పండ్లు తీసుకోవాలి. అలాగే, జీర్ణక్రియకు మేలు చేసేవీ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. నారింజలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రసాయనాల గాఢత లేని వాటిని ఎంచుకోవడం మేలు. అరటిపండు శక్తినిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయపడుతుంది. ఈ మాసంలో అరటిపండు వాడకం విరివిగా కనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి మలబద్ధక నివారిణిగా కూడా పనిచేస్తుంది. (చదవండి: బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..) -
ఇదేనా ఆధునిక నాగరికత?
హిందూ పురాణాలు, భారతీయుల నమ్మకం ప్రకారం... జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ( Goddess Saraswati) పుస్తక రూపంగా భావిస్తారు. పుస్తకం జీవన దీపికగా, నిత్యం మనకు సత్యా– అసత్యాల వాస్తవ మార్గాన్ని చూపిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే దారిగా నిలుస్తుంది. సంస్కృతంలో ప్రసిద్ధమైన మాట ‘పుస్తకం హస్త భూషణం’. అంటే పుస్తకం చేతికి అలంకారమని అర్థం. పుస్తకం ఉత్తమ మిత్రుడు, గురువు, తత్వవేత్త కూడా. ‘అపరిమితంగా చదివినవాడే గొప్ప వాగ్ధాటి గల వక్త కాగలడు’ అన్న మాట పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. నిస్సందేహంగా, ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అమోఘం. రాతియుగం నుండి నేటి జనరేటివ్ ఏఐ యుగం వరకు మనల్ని నడిపించింది పుస్తకం. ఇది మన నాగరికత, శాస్త్రీయ పురోగతికి పునాది వేసినది.అయితే నేడు పుస్తకాలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పుస్తకాలను నగరాల్లోని ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై అమ్మడం తెలిసిందే. కానీ పాదరక్షలను ఎయిర్ కండిషన్డ్ షోరూమ్‌లలో ఉంచి అమ్ముతున్నారు. ఇది చేదు వాస్తవం అయినప్పటికీ, ఎవ్వరూ ఖండించలేని పచ్చి నిజం. విద్యాసంస్థలు దేవాలయాలు అయితే, గ్రంథాలయాలు సాక్షాత్తూ గర్భగుడులే. గర్భగుడిలో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. అందువల్ల పుస్తకాలను గౌరవంగా ప్రార్థన గదిలో కాకపోయినా, పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా గౌరవించాలి. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనఈ మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నాగరికతా? సంస్కృతా?ఆధునికీకరణ పేరుతో, మనం స్నానపు గదిలో వంట చేయలేము; వంట గదిలో స్నానం చేయలేము అనే కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఈ కార్యకలా పాలన్నీ ఇంట్లో వాటికి కేటాయించిన ప్రదేశాలలో జరగాలి. విలాసాలు, వినోదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు కానీ వంద రూపాయలు ఖర్చుచేసి ఒక పుస్తకం కొనడానికి సంకోచిస్తున్నాడు మనిషి. పుస్తకాలకు (జ్ఞానానికి) మళ్ళీ తగిన స్థానం కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని ‘విద్యావంతులైన మూర్ఖులు’గా చరిత్ర పుటల్లో గుర్తుంచుకుంటాయి.– రెడ్డి శేఖర్ రెడ్డి గుడిశ ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు -
హిరాకుద్ జలాశయానికి వరదపోటు
ఒడిశా, భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్‌కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. #ହୀରାକୁଦର_୨୦ଟି_ଗେଟ୍_ଖୋଲା👉ହୀରାକୁଦରୁ ୨୦ଟି ଗେଟ୍ ଦେଇ ବନ୍ୟାଜଳ ନିଷ୍କାସନ ଜାରି👉୬୦୯.୩୯ଫୁଟ୍ ରହିଛି ଜଳଭଣ୍ଡାରର ଜଳସ୍ତର#HirakudDam #Sambalpur #Odisha #GateOpen pic.twitter.com/vR9RNEZh7B— Mukesh Kumar Sahu (@Anchor_Mukesh) July 26, 2025 -
గిరాయిపల్లి అమరుల స్ఫూర్తి
గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది. 1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు. ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు(గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు) -
బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంట
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తర టెక్సాస్‌లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణంఈ జంట ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్‌చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్‌ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.చదవండి:


