సింగపూర్‌లో కూడా ఉంది యూనివర్సల్‌ స్టూడియోస్‌... | do you know about Universal Studios in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో కూడా ఉంది యూనివర్సల్‌ స్టూడియోస్‌...

Jun 28 2025 6:09 PM | Updated on Jun 28 2025 6:47 PM

do you know about Universal Studios in Singapore

అమెరికాలో యూనివర్సల్‌ స్టూడియోస్‌  (Universal Studios) అందరూ చూస్తారు. అయితే సింగపూర్‌లో ఉన్న యూనివర్సల్‌ స్టూడియో ఇంకా ఇంటెరెస్టింగ్‌గా ఉంటుంది. ఇది సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఉన్న థీమ్‌ పార్క్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు యూనివర్సల్‌ స్టూడియోస్‌ థీమ్‌  పార్కులలో ఇదీ ఒకటి. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. 

2007 ఏప్రిల్‌ 19న ఈ థీమ్‌ పార్క్‌ నిర్మాణం  ప్రారంభించి 2011లో పూర్తి చేశారు.  మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘యూనివర్సల్‌ స్టూడియోస్‌’ ఆసియా ఖండంలో విశిష్టమైనది. మొదటి సంవత్సరంలోనే ఈ  పార్క్‌కు సమారు 30 లక్షలమంది సందర్శించారు. అప్పటి నుండి ఏటా సుమారు 40 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. 

ఈ పార్క్‌లో సందర్శకుల్ని ఆకర్షించేందుకు 17 రకాల జోన్స్‌ ఏర్పాటు చేశారు. అందులో ‘హాలీవుడ్‌’, ‘న్యూయార్క్‌’, ‘స్కైఫై సిటీ’, ‘పురాతన ఈజిప్టు’, ‘జురాసిక్‌ పార్క్‌’.. ఇలా రకరకాల జోన్స్‌ ఉన్నాయి. వాటిలోకి వెళ్తే నిజంగానే అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆయా  జోన్స్‌లోకి వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని సీజనల్‌ కాగా, మరికొన్ని రోజూ ఉంటాయి. ఈ కారణంగా ప్రపంచంలో అనేక దేశాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు.

ఇదీ చదవండి: Today Tip : షుగర్‌ పేషెంట్లు ఎగ్స్‌ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?

Advertisement
 
Advertisement
Advertisement