breaking news
Amaravati
-
ఇక తల్లీబిడ్డ పేరుతో దోపిడీ!
నాడుకాంట్రాక్ట్ సంస్థ 500 మారుతి ఈకో వాహనాలను సమకూర్చింది. ప్రతి వాహనంలో ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు రూ.895 చొప్పున వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది. నేడుఇప్పుడు కూడా మారుతి ఈకో వాహనాలే. ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్ సహా నాటికీ, నేటికీ వాహనంలోని సౌకర్యాల్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు ఏకంగా రూ.1,640 చొప్పున చంద్రబాబు సర్కార్ ఇవ్వబోతోంది.సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల స్వరూపం ఏ మాత్రం మారకపోయినా ప్రాజెక్ట్ వ్యయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దల కమీషన్ దాహమేనని తేటతెల్లం అవుతోంది. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి, జనం సొమ్ము కాంట్రాక్టర్లకు మళ్లించి, వారి నుంచి సొమ్ము చేసుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సైతం వదలడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్లు పిలిచి, ఒక్కో ట్రిప్పుకు రూ.895 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఆ కాంట్రాక్ట్ సంస్థే 2022 నుంచి సోమవారం వరకు సేవలు అందించింది. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్‌పై కీలక ప్రజాప్రతినిధి కన్నేశారు. ట్రిప్పు ట్రిప్పునకు పెద్ద మొత్తంలో కమీషన్ పొందేలా ఆ ప్రజాప్రతినిధి డీల్ కుదర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థకు అనుకూలమైన నిబంధనలతో గతేడాదే వైద్య శాఖ టెండర్లు పిలిచింది.ఈ క్రమంలో ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థ ఏకంగా ఒక్కో ట్రిప్పునకు రూ.2,300 చొప్పున ధర కోట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధుల లూటీకి స్కెచ్ వేశారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో ఈ దోపిడీకి సహకరించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేయించి, మరోమారు పిలిచారు. రెండోసారి టెండర్లో కుదిరిన రేటురెండోసారి పిలిచిన టెండర్లో అదే సంస్థ ట్రిప్పునకు రూ.1,640 చొప్పున కోట్ చేయగా, ప్రభుత్వం కళ్లు మూసుకుని కాంట్రాక్ట్ కట్టబెట్టేసింది. ఒకే తరహా సేవకు నాలుగేళ్ల వ్యవధిలో 83 శాతం రూ.745 (దాదాపు రెట్టింపు) చొప్పున ట్రిప్పునకు అదనంగా చెల్లించడానికి సిద్ధమైంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నెలకు 15 వేల ట్రిప్‌లు వేస్తున్నాయి.ట్రిప్పునకు రూ.895 చొప్పున నెలకు రూ.1.34 కోట్లు.. ఏడాదికి రూ.15 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. చంద్రబాబు సర్కార్ కొత్తగా ఖరారు చేసిన రూ.1,640 ధరతో నెలకు రూ.2.46 కోట్లు.. ఏడాదికి రూ.30 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటోంది. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏడాదికి రూ.15 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఈ లెక్కన పెరిగిన రేట్ల ప్రకారం చూస్తే మూడేళ్లలో రూ.45 కోట్లు ఖజానాకు గండి పడనుంది.తొలుత 300 వాహనాలతోనే సేవలుటెండర్ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థ ఒకేసారి 500 వాహనాలతో సేవలు ప్రారంభించాల్సి ఉంది. అయితే 500 వాహనాలను ఒకేసారి అందుబాటులోకి తేవడంలో కొత్త కాంట్రాక్టర్ విఫలమైనట్టు వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేవలం 300 వాహనాలను మాత్రమే సమకూర్చడంతో వాటితోనే నేడు అంటే మంగళవారం ప్రభుత్వం సేవలు ప్రారంభిస్తోంది. మిగిలిన 200 వాహనాలు రెండో దశలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కమీషన్ల కోసం సామర్థ్యం, ఆర్థిక స్థోమత లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు 500 వాహనాలతో అందుతున్న సేవలు ఒక్కసారిగా 300కు పరిమితం చేసి, ప్రభుత్వాస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసింది. -
లోకేశ్ మళ్లీ మాయం
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ మాయమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డీఎస్సీలో మెగా కుంభకోణానికి పాల్పడిన కూటమి ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రి లోకేశ్‌పైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. తన శాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన మంత్రి, ఇలా వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. లోకేశ్‌కు రహస్య విదేశీ పర్యటనలు కొత్తేమీ కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకూ సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్లినా ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీఓ జారీ చేయాల్సిందే. లోకేశ్ గత రెండేళ్లుగా ఇప్పటికి చాలాసార్లు అసలు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు. -
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9 వేల కోట్ల బకాయి.. వసతి దీవెన బకాయి వెంటనే చెల్లించాలి. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలి. ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్ చేస్తుంటే, వాటిని డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్లను అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. 10 కార్యక్రమాలకు విశేష మద్దతు‘చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు పూనుకున్నారు. పోలీసు బలంతో అణచి వేయాలని చూశారు. నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన 74 రోజుల్లో రాష్ట్ర గవర్నర్‌ను కలవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మే 29 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు⇒ జూన్ 1 – జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతి పత్రాలు⇒ జూన్ 8, 9 – నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు⇒ జూన్ 12 – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు⇒ జూన్ 18 – రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం⇒ జులై 28 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు⇒ జులై 31 – జిల్లా కలెక్టర్లు జేసీలకు వినతులు⇒ ఆగస్టు 3, 4 – రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు⇒ ఆగస్టు 6, 8 – నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు⇒ ఆగస్టు 10 – రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇంత మంది అడుగుతున్నా నోరు విప్పరా?ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపడం లేదని, లోకేశ్ సమాధానం చెప్పడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన కింద దాదాపుగా రూ.9 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట హామీలు, నెలా నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇవేవీ లేవు. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.08 లక్షలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డారు. ఈ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు తెరవలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యం. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుంది. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు.. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు.. వీళ్లంతా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత నిలదీస్తోంది. చంద్రబాబు స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగులు, విడిచి పెట్టరు. జెన్–జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాలి. అంత వరకు పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. -
పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే
సాక్షి, అమరావతి: పోలవరం రిజర్వాయర్ కానే కాదు... బ్యారేజ్ మాత్రమేనని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాదు.. కనిష్ట నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తిచేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. రాజ్యసభలో ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్ చౌదరి ఈ మేరకు సోమవారం సమాధానం ఇచ్చారు.పోలవరం పనుల కోసం గత ఐదేళ్లలో 2021–22 నుంచి 2025–26 వరకూ రూ.12,620.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేశామని చెప్పారు. స్పిల్ వేలో మట్టి పనులు 96.87, కాంక్రీట్ పనులు 98.84, స్టీల్ పనులు 92.95 శాతం.. ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం), జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే పనుల్లో మట్టి పనులు 75.76, కాంక్రీట్ పనులు 81.99, స్టీల్ పనులు 81.31 శాతం– కుడి, ఎడమ కాలువ పనుల్లో మట్టి పనులు 98.96, కాంక్రీట్ పనులు 88.44, స్టీల్ పనులు 55.68 శాతం పూర్తయ్యాయన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టులో ముంపునకు గుర య్యే గ్రామాల్లో ఇప్పటికే 17,892 నిర్వాసిత కుటుంబాలకు రూ.1,373.01 కోట్లు పరిహారం చెల్లించామని, పునరావాసం కల్పించడానికి రూ.1,581.08 కో ట్లు వ్యయం చేశామన్నారు. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించిందని, గడువు మరో ఏడాది పొడిగించామన్నారు.వరదల సమయంలో 1.98 లక్షల ఎకరాలకే .. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు.. కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు అదీ గోదావరి వరద రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించటానికి అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు.ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లోనే అరకొరగా విద్యుదుత్పత్తికి అవ కాశం ఉంటుందంటున్నారు. అంటే– పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది సుస్పష్టం. 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.25వేల కోట్లకుపైగా అవసరం. అంటే.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకతప్పదు.38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టిన వైఎస్సార్...అదే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు వేగవంతం చేసిన నాటి సీఎం వైఎస్ జగన్.. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), అటవీ పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005లో జలయ/æ్ఞంలో భాగంగా పోలవరం నిర్మాణాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు వెరసి 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పోలవరాన్ని చేపట్టి పనులు వేగవంతం చేశారు. అనంతరం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్ వేను వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తాజా ధరల మేరకు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. కానీ.. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ కేబినెట్లో సభ్యుడిగా ఉన్న టీడీపీ మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ఇక దానిపై చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరానికి చంద్రబాబు సర్కార్ ఉరేసిందంటూ సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. -
విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్ ఆధీనంలో!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేసింది! ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలకు ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కానున్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్ సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీలేని రుణాలను ఇవ్వనుంది.వడ్డీ లేని రుణాలకు ‘వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్’ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్ధల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో నిధులు సమకూర్చనుంది. ఇందుకోసం బడ్టెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్‌లో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందిస్తుంది. పొదుపుగా సేవల వినియోగం..! ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్‌తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం ‘పీపీపీ విధానం 2026’ పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ సంస్ధలు వెచి్చంచిన వ్యయాన్ని వినియోగదారుల నుంచి యూజర్ చార్జీల రూపంలో కచ్చితంగా రాబట్టనున్నట్లు పీపీపీ విధానంలో స్పష్టం చేశారు. పీపీపీ విజయవంతమయ్యేందుకు వినియోగదారుడే చార్జీలు చెల్లించాలనేది కీలకమైన సూత్రమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పొదుపుగా సేవలను వినియోగించుకునేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేసింది! ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలకు ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కానున్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్ సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీలేని రుణాలను ఇవ్వనుంది.వడ్డీ లేని రుణాలకు ‘వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్’ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్ధల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో నిధులు సమకూర్చనుంది. ఇందుకోసం బడ్టెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్‌లో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబులిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందిస్తుంది. పొదుపుగా సేవల వినియోగం..! ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్‌తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం ‘పీపీపీ విధానం 2026’ పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ సంస్ధలు వెచి్చంచిన వ్యయాన్ని వినియోగదారుల నుంచి యూజర్ చార్జీల రూపంలో కచ్చితంగా రాబట్టనున్నట్లు పీపీపీ విధానంలో స్పష్టం చేశారు. పీపీపీ విజయవంతమయ్యేందుకు వినియోగదారుడే చార్జీలు చెల్లించాలనేది కీలకమైన సూత్రమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పొదుపుగా సేవలను వినియోగించుకునేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ.. వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్ చార్జీల విధింపును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ ప్రాతిపదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వయం ప్రతిపత్తి గల సంస్ధలు ఐదేళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండో సారి సింగిల్ బిడ్ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టు ఖరారు చేస్తారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ కోట్ చేయడమే ప్రాతిపదికగా సంస్ధలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. వీజీఎఫ్ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100 శాతం నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాత్ర ఇలా.. ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి పీపీపీ లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్ధారించి ప్రాధాన్యత ఇవ్వడం. పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫార్సులు చేయడం. ప్రాజెక్టు అమలును సులభతరం చేయడంతో పాటు భూసేకరణ, యుటిలిటీల తరలింపు లాంటి సహాయ చర్యలు. పారదర్శకమైన పోటీతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించడం. నిర్మాణం, నిర్వహణ సమయంలో పర్యవేక్షించడంతో పాటు రాయితీ కాలం ముగిసిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. ప్రైవేట్ రంగం పాత్ర ఇలా.. పీపీపీ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అందించడం. పోటీ బిడ్డింగ్ విధానాలను అనుసరించడం. రాయితీ ఒప్పందాన్ని ఖచి్చతంగా పాటించడం. రాయితీ కాలం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆస్తిని బదిలీ చేయడం.పీపీపీ రంగం ప్రాజెక్టులు ఇలా..⇒ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన–ఆహార శుద్ధి అనుబంధ మౌలిక సదుపాయాలు (శీతల గిడ్డంగులతో సహా) టెరి్మనల్ నిల్వ, పంట కోతల అనంతర నిల్వ, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు. ⇒ విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ–గ్రంథాలయాలు. ⇒ విద్యుత్ ఉత్పత్తి (క్యాప్టివ్తో సహా), ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదక, సంప్రదాయేతర శక్తి, ఈవీ చార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్ గ్రిడ్లు ⇒ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస, శిక్షణ కేంద్రాలు. ⇒ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు ⇒ నీటిపారుదల: ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు ⇒ ప్రజా మార్కెట్లు, భవనాలు: మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. ⇒ వినోద, విహార, థీమ్ పార్కులు: హోటళ్లు/రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్–అండ్–సౌండ్ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటకం, మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు. ⇒ రోడ్లు, రోప్‌వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్/ట్రక్ టెరి్మనళ్లు, గిడ్డంగులు, పార్కింగ్ సౌకర్యాలు. ⇒ టౌన్íÙప్ల అభివృద్ధి: ఘన, బయో–మెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ నీటి సరఫరా. ⇒ కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియంలు, హాస్టళ్లు/క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, వ్యాయామశాలలు. ⇒ తక్కువ ధర గృహాలు, అందుబాటు ధరల గృహాలు, కారి్మకుల అద్దె గృహాలు. ⇒ గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్ధ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు. ⇒ టెలికమ్యూనికేషన్ ⇒ నీరు, పారిశుధ్యం: నీటి సరఫరా, శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, ⇒ ఇతర సామాజిక మౌలిక సదుపాయాలువ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ.. వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్ చార్జీల విధింపును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ ప్రాతిపదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వయం ప్రతిపత్తి గల సంస్ధలు ఐదేళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండో సారి సింగిల్ బిడ్ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టు ఖరారు చేస్తారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ కోట్ చేయడమే ప్రాతిపదికగా సంస్ధలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. వీజీఎఫ్ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100 శాతం నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాత్ర ఇలా.. ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి పీపీపీ లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్ధారించి ప్రాధాన్యత ఇవ్వడం. పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫార్సులు చేయడం. ప్రాజెక్టు అమలును సులభతరం చేయడంతో పాటు భూసేకరణ, యుటిలిటీల తరలింపు లాంటి సహాయ చర్యలు. పారదర్శకమైన పోటీతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించడం. నిర్మాణం, నిర్వహణ సమయంలో పర్యవేక్షించడంతో పాటు రాయితీ కాలం ముగిసిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. ప్రైవేట్ రంగం పాత్ర ఇలా.. పీపీపీ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అందించడం. పోటీ బిడ్డింగ్ విధానాలను అనుసరించడం. రాయితీ ఒప్పందాన్ని ఖచి్చతంగా పాటించడం. రాయితీ కాలం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆస్తిని బదిలీ చేయడం.పీపీపీ రంగం ప్రాజెక్టులు ఇలా..⇒ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన–ఆహార శుద్ధి అనుబంధ మౌలిక సదుపాయాలు (శీతల గిడ్డంగులతో సహా) టెరి్మనల్ నిల్వ, పంట కోతల అనంతర నిల్వ, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు. ⇒ విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ–గ్రంథాలయాలు. ⇒ విద్యుత్ ఉత్పత్తి (క్యాప్టివ్తో సహా), ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదక, సంప్రదాయేతర శక్తి, ఈవీ చార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్ గ్రిడ్లు ⇒ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస, శిక్షణ కేంద్రాలు. ⇒ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు ⇒ నీటిపారుదల: ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు ⇒ ప్రజా మార్కెట్లు, భవనాలు: మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. ⇒ వినోద, విహార, థీమ్ పార్కులు: హోటళ్లు/రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్–అండ్–సౌండ్ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటకం, మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు. ⇒ రోడ్లు, రోప్‌వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్/ట్రక్ టెరి్మనళ్లు, గిడ్డంగులు, పార్కింగ్ సౌకర్యాలు. ⇒ టౌన్íÙప్ల అభివృద్ధి: ఘన, బయో–మెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ నీటి సరఫరా. ⇒ కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియంలు, హాస్టళ్లు/క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, వ్యాయామశాలలు. ⇒ తక్కువ ధర గృహాలు, అందుబాటు ధరల గృహాలు, కారి్మకుల అద్దె గృహాలు. ⇒ గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్ధ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు. ⇒ టెలికమ్యూనికేషన్ ⇒ నీరు, పారిశుధ్యం: నీటి సరఫరా, శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, ⇒ ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన రాష్ట్రం.. 'కదం తొక్కిన జనం'
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: దగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుపై యువత భగ్గుమంది. దగా డీఎస్సీకి కారకుడైన మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా పోరు విజయవంతమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం భారీ ర్యాలీల ద్వారా వైఎస్సార్సీపీ శ్రేణులు, యువత కదం తొక్కారు. టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పి ఎన్ని అడ్డంకులు కల్పించినా, మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను విజయవంతం చేసిన జెన్ జీ యువత ర్యాలీలకు సైతం భారీగా తరలి వచ్చింది. మెగా డీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. జెన్ జీ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు పలకడంతో తన కుమారుడి భవితవ్యం ఇబ్బందుల్లో పడుతుందని కలవరపడుతున్న చంద్రబాబు మూడు రోజులపాటు నిర్వహించిన రిలే దీక్షలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పిన సంగతి తెల్సిందే. సోమవారం నిర్వహించిన ర్యాలీలను సైతం అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు, అరెస్టులతో రెచ్చిపోయారు. అయినా ప్రజలు, యువత నిరసన ర్యాలీలకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కదంతొక్కిన నిరుద్యోగులు, యువత అడుగడుగునా చంద్రబాబు సర్కారు జులుండీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ, యువత ఆందోళనలతో బెంబేలెత్తిపోతున్న సీఎం చంద్రబాబు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోమవారం కూడా వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలపై జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులపై డీఎస్పీ మురళీనాయక్ నాయకత్వంలో పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు. కడపలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ను పోలీసులు అడ్డుకోగా, ఆయన ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. భరత్ ఇంటిపై దాడికి టీడీపీ నేతలు దూసుకువచ్చారు. వైఎస్సార్సీపీ ర్యాలీకి పోటీగా కావాలనే టీడీపీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయింపుచిత్తూరులో ర్యాలీకి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చి పడేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స తదితర నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురం జిల్లాలో ముచ్చుకోట వద్ద తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులువిజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పోలీసుల బారికేడ్లు దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జగదాంబ జంక్షన్లో వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకున్నారు. విశాఖ నార్త్‌లో ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుని బైక్‌ల తాళాలు తీసుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్ చేస్తామని భయపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీలు ఇచ్చిన పోలీసులు పలుచోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రికత్త నెలకొంది. చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన టెంట్‌ను పోలీసులు దౌర్జన్యంగా పీకేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవనిగడ్డలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం ట్రంక్ రోడ్డులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న శ్రేణులు బెదిరింపులను ఖాతరు చేయని ప్రజలు కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్వీ విజయ మనోహరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భరత్ ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన చేపట్టారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో ఆయన ఇంటి వద్దే ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో కురసాల కన్నబాబును అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు.సాగు అవసరాల కోసం వెళితే పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు‘మేమంతా సాగు అవసరాల కోసం టెక్కలి వచ్చాం. అయితే మీరంతా ధర్నాకు వెళ్తున్నారని పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు’ అని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం అన్నాపురం రైతులు వాపోయారు. వీరు యూరియా, ఇతర సాగు అవసరాల కోసం ఆటోలో టెక్కలి వస్తుండగా పోలీసులు ఆపేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. భూమి పత్రాలు చూపించినా వదల్లేదు. ఆటోతో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు. గంటల తరబడి స్టేషన్లోనే ఉంచారు.మెరిట్ సాధించినా అన్యాయమేనేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థిని. రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాయడంతో మొదటి మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించా. జిల్లా స్థాయిలో 139వ ర్యాంకు సాధించాను. ఉద్యోగం గ్యారెంటీ అనుకున్న తరుణంలో నా పేరు ఫైనల్ లిస్ట్‌లో లేదు. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాను. తక్కువ జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంది. మానసిక ఆందోళనతో రోజూ ఇబ్బంది పడుతున్నా. నా ప్రతిభకు న్యాయం జరగాలని కోర్టుకు వెళ్దామంటే కనీసం లాయర్ ఫీజులు భరించే ఆర్థిక స్థోమత కూడా నాకు లేదు. మెరిట్ సాధించినా మా లాంటి పేద అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను.– జుత్తుగ శ్రీనివాస్, ఉండ్రాజవరం, నిడదవోలు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లాఫేక్ సర్టిఫికెట్లకే పెద్దపీట కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు చదివి స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా జిల్లా స్థాయిలో 130వ ర్యాంకు సాధించాను. ప్రభుత్వం కేటాయించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో నేను ఉద్యోగానికి అర్హుడిగా నిలిచాను. అయితే నాకంటే తక్కువ అర్హత ఉండి, అక్రమ మార్గంలో ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందిన ఒక అభ్యర్థికి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం కట్టబెట్టారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా, నా వాదనల్లోని నిజాయతీని గుర్తించి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంతో నాలాంటి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.– కరుటూరి వెంకట సతీష్, కాల్దారి, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా -
న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలా..?
సాక్షి, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు చేయడం మాత్రమే కాదని.. వాటిని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ప్రణతి తరఫు న్యాయవాది క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ వ్యాఖ్యలను అప్పీల్ నుంచి తొలగిస్తామని కోర్టుకు విన్నవించారు.కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్లో సింగిల్ జడ్జిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన... ‘అక్రమం, బుర్ర ఉపయోగించకపోవడం, పక్షపాతం, అసందర్భం, అనుచితం, మందబుద్ది, దురుద్దేశాలు’ వంటి పదాలను ధర్మాసనం చదివి వినిపించింది.పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణ రావు కోర్టును క్షమాపణ కోరారు. అప్పీల్ నుంచి వాటిని తొలగిస్తామని చెప్పారు. అలా అయితే సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతకర పదజాలాన్ని తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతిని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.అటు భార్య.. భర్త.. ఇటు ఏసీబీ విచారణ...కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల నిమిత్తం కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు కొంత భూమిని బహుమానంగా ఇచ్చింది. ఈ భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతూ హైకోర్టుకొచ్చారు. దీనిపై స్పందించిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతున్న భూమి తమదేనని, దానిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మాట మార్చింది. ఆ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది కూడా ఆశ్చర్యకరంగా ఆ భూమిపై తాము జోక్యం చేసుకోమని కోర్టుకు వివరించారు. అయితే దీనిని జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తోసిపుచ్చింది. ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు చెప్పాలని తాము ఎన్నడూ తమ న్యాయవాదికి చెప్పలేదని తెలిపింది. వీటన్నింటితో పాటు ఈ కేసులో గతంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున హాజరైన ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున హాజరు కావడం, అలాగే ఆ ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రస్తుతం ప్రణతి భర్త రాహుల్ చౌదరి హాజరుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్, పలు అను మానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు.ఏసీబీ విచారణపై ధర్మాసనం ముందు ప్రణతి అప్పీల్...ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి గురువారం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల తన కెరీర్ తీవ్ర ప్రభావితమవుతుందని, అందువల్ల వాటిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రణతి తన అప్పీల్లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై గత నెల 31న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రణతిపై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రా యాలను, అలాగే ఆమెపై ఏసీబీ విచారణను తదుపరి విచారణ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రణతి సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు...తాజాగా సోమవారం ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఏ పేరాల్లో వ్యక్తిగత ఆరోపణలున్నాయో చెప్పారు. దీంతో ధర్మాసనం ఆ పేరాలను పరిశీలించింది. అనంతరం వాటిని చదివి వినిపించింది. సింగిల్ జడ్జిను ఉద్దేశించి అప్పీల్లో ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని అప్పీల్ నుంచి తొలగిస్తామని ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పడంతో, ఆ మేర అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్‌స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్‌లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్‌స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
సాక్షి,తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.జానకి రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెను ఓదార్చారు. జానకి రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆమె అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్సార్సీపీ కుటుంబం ఎల్లప్పుడూ జానకి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు (జూడాలు) సమ్మెకు సిద్ధమవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అధ్యక్షతన అధికారుల కమిటీ సోమవారం ఏపీ జూడా అసోసియేషన్‌తో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె కార్యాచరణలో ఏపీ జూడా అసోసియేషన్ స్వల్ప మార్పులు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం వచ్చే స్పందన ఆధారంగా సమ్మెపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ ప్రకటించారు. జూడాల స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో వీరంతా సమ్మెకు సిద్ధమ య్యారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకు ఒకసారి స్టైపెండ్‌ను పెంచాల్సి ఉంది. యథావిధిగా నడవాల్సిన ఈ ప్రక్రియను చంద్రబాబు సర్కారు ఆలస్యం చేస్తూ వస్తోంది. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి స్టైపెండ్ పెంచాలని జూడా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు, మంత్రి, సీఎంకు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది.ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఏపీ జూడా అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో జూడా ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె వాయిదా వేసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ క్రమంలో వారం పాటు సమ్మె వాయిదా వేసుకుంటామని, ఆలోగా స్టైపెండ్ పెంపు ఉత్తర్వులు ఇవ్వా లని ప్రభుత్వానికి జూడా అసోసియేషన్ ప్రతినిధులు షరతు పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో జూడాలు సమ్మెకు సిద్ధమైపోయారు. తమిళనాడు విధానం అమలుఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఓసారి 15 శాతం చొప్పున జూడాల స్టైపెండ్ పెంచడం ఆనవాయితీ. ఇలా పెంచుకుంటూపోతే ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని చంద్రబాబు సర్కా రు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తరహాలో 3 శాతం వార్షిక పెంపు విధానం అమలుకు డీఎంఈ నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్/బీడీఎస్ ఇంటర్న్స్‌కు రూ.25,906, పీజీలకు రూ.60 వేల నుంచి రూ.64,767 మేర స్టైపెండ్ ఉంది. ఈ మేరకు 2024లో ఆగస్టులో ప్రభుత్వం స్టైపెండ్పెంపు నిర్ణయం తీసుకుంది. -
10వ తేదీ వచ్చినా వేతనాల్లేవ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రతి నెలా రుజువవుతోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద సేవలు అందించే ఉద్యోగులకు ప్రతి నెల వారం, రెండు వారాల ఆలస్యంగా ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వచ్చినా జూలై నెల వేతనాలు జమ అవ్వని దుస్థితి నెలకొంది.దీంతో తక్కువ వేతనాలకు పనిచేస్తున్న చిరుద్యోగులు ప్రతి నెలా ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ పోషణ, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోందని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా 1న జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్‌బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్‌కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్‌కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్‌కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్‌ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్‌లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 10న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం.నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతునొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు జరుగుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది. -
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్‌జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు. -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్‌కళ్యాణ్.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.మా కడుపు కోతను అర్థం చేసుకోండి‘మా కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్ఫిరేషన్గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. కీలక ఆధారాలు సేకరించాంవైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్ చెన్నైలో బీటెక్ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబురాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వారం రోజులు మృత్యువుతో పోరాడి రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక (28) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్‌తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలి మెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కుండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం, అవుట్ సోర్సింగ్‌పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్ విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ...⇒ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో వైద్య సేవల నాణ్యత మెరుగుదల, ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసింది. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు అగ్ర రాజకీయ నాయకత్వం ప్రాజెక్టుకు స్పష్టమైన ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా సమీక్షలు ఫలితాల సాధనకు దోహదం చేశాయి. తద్వారా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాన్ని సాధించింది.⇒ వైద్య ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మూస విధానాలను పక్కనపెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యత అనే లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ‘సున్నా ఖాళీల విధానం’ (జీరో వేకెన్సీ) పాలసీని అమలు చేశారు. సిబ్బంది నియామకాలను హేతుబద్ధీకరించారు. అడ్డంకులను తొలగించి భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించారు. మారుమూల ప్రాంతాలలో పని చేసినందుకు అదనపు వేతనాన్ని అందచేశారు. అరుదైన నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులను ఆకర్షించేందుకు సాధారణం కంటే ఎక్కువ వేతనాలు ప్రకటించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధత చాటుకున్నారు.⇒ ‘జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్‌సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.⇒ ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్‌సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్‌సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.⇒ 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. ⇒ అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.⇒ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా 2023 ఏప్రిల్‌లో ప్రారంభించారు (2022 అక్టోబర్‌లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్‌తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్‌తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాలలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కొత్త డిజిటల్, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు సూచికలను విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.కోవిడ్‌లో కాపాడారు..!⇒ కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్‌తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు. -
ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి
సాక్షి, అమరావతి : ‘ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. నిమిషానికి మూడు ఓట్లు పడేంత వేగంగా పోలింగ్ ఎలా సాధ్యమైంది? దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజా తీర్పు అనడం కష్టం’ అని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మాయాజాలం–వాస్తవాలు’ అంశంపై ఆదివారం విజయవాడలో జరిగిన సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె. బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ గణాంకాలను విశ్లేషించారు. మే 13న సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించగా, తుది లెక్కల్లో పోలింగ్ 81.79 శాతంగా నమోదైందన్నారు. ముఖ్యంగా రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య 3,500 పోలింగ్ కేంద్రాల్లో 17,19,482 ఓట్లు నమోదయ్యాయని, అంటే ఒక్కో బూత్‌లో సగటున 492 ఓట్లు, నిమిషానికి 3.6 ఓట్లు చొప్పున పోలైనట్లు వివరించారు. పగటి సమయంలో ఒక్కో బూత్‌లో సగటున గంటకు 60.7 ఓట్లు మాత్రమే పోలవగా, అర్ధరాత్రి సమయంలో గంటకు 200కు పైగా ఓట్లు ఎలా నమోదయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఒక్కో ఓటుకు సుమారు 20 సెకన్ల సమయం మాత్రమే పట్టిందని, ఇది సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఒక్క ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకన్ల సమయం పడుతోందని తెలిపారు.ఓటర్ల వీడియోలు బయట పెట్టండిఅర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే, వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టడం లేదని పరకాల ప్రశ్నించారు. పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారా అని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈవీఎంల ద్వారా నమోదయ్యే ఓట్లపై అనుమానాలు ఉన్నాయని, ఓటరు వేసిన ఓటు సరిగ్గా నమోదైందని, అదే లెక్కించబడిందని నిర్ధారించడమే ప్రజాస్వామ్య లక్ష్యమని అన్నారు. జర్మనీ వంటి దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు లెక్కించరు?ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు లెక్కించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. అర్ధరాత్రి భారీగా పోలింగ్ జరిగిందని చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. ఈవీఎంలలో అవకతవకలకు అవకాశం ఉందన్న అంశాన్ని గతంలో చంద్రబాబే ప్రస్తావించారని, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ అంశంపై విచారణ జరిపించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. సర్ పేరుతో చాలా మంది ఓట్లు తీసేస్తున్నారని, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో స్టాలిన్, మమతా బెనర్జీ ఓటమి చెందిన నియోజకవర్గాల్లో అదే జరిగిందని, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ఒక బూత్‌కు చెందిన ఓటర్లను మరో బూత్‌కు తరలించి, గంటల తర్వాత అర్ధరాత్రి వరకు ఓట్లు వేయించిన ఘటనను వివరించారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు పాల్గొన్నారు.రాజ్యాంగ పరిరక్షణకు ప్రజా సైన్యం కావాలి: పరకాలరాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలతో కూడిన ఒక బలమైన సైన్యం తయారు కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజలమైన మనం (వి ద పీపుల్ ఆఫ్ ఇండియా) సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలోని నాస్తిక కేంద్రం (డాక్టర్ సమరం హాస్పిటల్)లో తెలుగు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డీవీవీఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ ‘దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలు–పౌర సమాజం కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగించారు. గతంలో ఐరోపా దేశాల్లో మైనార్టీలు ఎదుర్కొన్న పరిస్థితులను పరకాల ప్రభాకర్ వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎస్ఐఆర్ (సర్) పేరుతో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందని పరకాల ప్రభాకర్ విమర్శించారు. తద్వారా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, నిరుపేదలు, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే వర్గాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, సంస్థ వ్యవస్థాపకులు కటారి శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాస్, మనోరమ, చుండూరి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ జడ్జి అడవాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర, నిరుద్యోగ జేఏసీ కో–కన్వినర్ రామ్ షా మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. అర్హతలు, పరీక్షలు లేకుండానే కొంతమందికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కల్పించేందుకు జీఓ నెం.4ను తీసుకురావడం.. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు.. 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఎందుకింత వివాదానికి తెరలేపారు? ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, జీఓ నెం.4 తెచ్చిన మార్పులు, పేపర్ లీకేజీ అనుమానాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీపై కోర్టులో 330 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 60కి పైగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవే. ఇంత వివాదానికి ఎందుకు తెరలేపారు? ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. అసలు డీఎస్సీలో దాదాపు 32 వేల వినతిపత్రాలు, అభ్యంతరాలు ఎందుకొచ్చాయి? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచారంటేనే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆశపడతారు. కానీ, చివరికి స్పోర్ట్స్ కోటా పేరుతో వారిని బయటకు పంపడం ఎంతవరకు సమంజసం? డీఎస్సీకి సరిగ్గా ఒకరోజు ముందు (ఏప్రిల్ 19న) తీసుకొచ్చిన జీఓ.4 తీవ్ర వివాదాస్పదమైంది. ఎటువంటి పరీక్షలు, అర్హతలు లేకపోయినా సబ్జెక్ట్ టీచర్లుగా పోస్టులిచ్చేలా ఈ జీఓ తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇలా ఎలా మినహాయింపులు ఇస్తారు? రహస్యంగా డీఎస్సీ ప్రక్రియ ముగింపు.. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, సెలెక్షన్ లిస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హెడ్ క్వార్టర్లలో లేదా వెబ్సైట్లో బహిరంగంగా పెట్టలేదు. కేవలం వ్యక్తిగత లాగిన్స్, మొబైల్స్‌కు మాత్రమే సమాచారం పంపి గోప్యంగా ప్రక్రియ ముగించారు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహకుడి భార్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అంతర్గత లింకులు బయటకు రావాలి. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఐక్య కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొని సర్కారుకు తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీసింది. దమనకాండను దాటుకుని రిలే దీక్షలు విజయవంతంమెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని... డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్లను తొలగించేందుకు కుట్ర చేసింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలతో పాశవికంగా దాడులు చేయించడంతోపాటు పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడింది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేయడం, ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినప్పటికీ ఈ దీక్షలు విజయవంతం కావడం, జెన్–జీ(యువత) కదం తొక్కడంతో రోజురోజుకూ ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్లు దీక్షా శిబిరాల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జెన్–జీ మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాల్సిందే... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీలో అక్రమాలకు పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత అభ్యర్థులు వెల్లడిస్తున్నందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ జెన్–జీ, రాష్ట్ర ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబులో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై జెన్–జీ, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు ఆయన కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లుగా చంద్రబాబు చిత్రీకరించారు. అయినా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘పోలీసులతో అడ్డుకున్నా... మాపై అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యవాదులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం’ అని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను సోమవారం వైఎస్సార్సీపీ ప్రకటించనుంది. శాంతియుత ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులుఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆయా నియోజకవర్గ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా చేపట్టే ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని చట్టబద్ధంగా పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. -
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్‌మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్‌ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు. -
చంద్రబాబు శ్వేతపత్రంపై కాకర్ల ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు శ్వేతపత్రంపై ఏపీజీఈఎఫ్ మాజీ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరును ఆయన వివరించారు. శ్వేత పత్రం పేరుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని.. రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని.. డీఏ, పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇక లేనట్టేనని ఎల్లోమీడియా రాస్తోందన్నారు.‘‘హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టు ఎల్లో మీడియా రాసింది. అదే విధంగా ఏపీలో కూడా తగ్గించాలన్నట్టుగా రాశారు. ఇక మీదట జీతాలు ఇస్తే చాలన్నట్టుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూ.55 వేల కోట్లు బకాయి పడింది. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ పెట్టారు. రెండేళ్లుగా ఐఆర్ లేదు’’ అని వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు చేశారని చంద్రబాబే అంగీకరించారు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు ఖర్చు 45 శాతం మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుందనటం పచ్చి అబద్ధం కాదా?. అమరావతి ఆవకాయ, యోగా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అద్దాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇక సీఎం, మంత్రుల విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల మీద ప్రజలకు చెడు అభిప్రాయం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. కొన్ని శాఖల్లో రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారు. ఆంధ్రా యునివర్సిటీ వీసీ రిటైర్మెంట్కు గంట ముందు సస్పెండ్ చేశారు. ఐదేళ్ల క్రితం సెలవు పెట్టారని ప్రతాప్ రెడ్డికి ఛార్జిమెమో ఇవ్వటం దుర్మార్గం’’ అంటూ వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. -
YSRCP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు.. సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆదివాసీలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ.. తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ, తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2026 -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బడా సంస్థలకే ‘పుష్టి’!
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులకు పుష్టికర ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇందులోనూ తన అనుయాయ బడా సంస్థలకే లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు తెరతీసింది. గతంలో ఆయా జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ) ఆధ్వర్యంలో సరుకుల ప్రక్రియ జరిగేది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్లుగా విభజించి భారీ టెండర్లకు సర్కారు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి, చిన్న కాంట్రాక్టర్లను పోటీ నుంచి తప్పించే యత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీబీవీలకు నిత్యావసర వస్తువులను సేకరించి, సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 177.95 కోట్లను వెచ్చించనుంది. దీనికోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లకు గతంలో ఉన్న నిబంధనలను అనేకమార్లు మార్చింది. ఇవన్నీ తన అనుయాయ బడా సంస్థల కోసమేననే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ నిధులు బొక్కేద్దాం: రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో 355 టైప్–3 కేజీబీవీలు పనిచేస్తున్నాయి అలాగే, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లకు అనుబంధంగా బాలికల కోసం మొత్తం 210 టైప్–4 కేజీబీవీలు(బాలికల వసతిగృహాలు) కొనసాగుతున్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించి, టైప్–3 కేజీబీవీల రికరింగ్ గ్రాంటు కోసం ఏకంగా రూ. 352.11 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇందులో కేంద్ర వాటా రూ. 211 కోట్లు. టైప్–4 కేజీబీవీల రికరింగ్ గ్రాంటు కోసం రూ. 84 కోట్ల నిధులు కేటాయించగా, ఇందులో కేంద్ర వాటా రూ. 50.4 కోట్లు. కేంద్ర ప్రభుత్వ నిధులు (75:25 లేదా 60:40 నిష్పత్తిలో) వస్తున్నాయి. దీంతో ఈ నిధులను టెండర్ల పేరుతో బొక్కేసే యత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. బడా సంస్థల కోసం నిబంధనలు మార్పు టెండర్లలో స్థానిక చిన్న వ్యాపారులు, చిరు గుత్తేదారులు పాల్గొనకుండా బడా సంస్థలకు అనుకూలంగా నిబంధనలను అత్యంత వ్యూహాత్మకంగా మార్చారు. జోనల్ స్థాయిలో టెండర్లు ఆహ్వానించారు. కనీసం 20 వేల చదరపు అడుగుల సొంత, లీజు గోడౌన్ సదుపాయం, సరుకుల రవాణా కోసం కనీసం 20 సొంత, లీజు వాహనాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు పెట్టారు. టర్నోవర్, గత అనుభవం పేరుతో నిబంధనలను కేవలం కొన్ని పెద్ద సంస్థలకు మాత్రమే కలిసొచ్చేలా మార్చారు. జోనల్ స్థాయిలో టెండర్ల వల్ల త్వరగా పాడైపోయే పాలు, గుడ్లు వంటి వస్తువుల సరఫరాను బడా సంస్థలు స్థానికంగా చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యలో భారీ శాతం కమీషన్లు పెద్ద కంపెనీలు కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడే ఆస్కారం ఉంది. పైగా జోనల్ స్థాయి నుంచి సరఫరా వల్ల నాణ్యమైన సరుకులు లభించే అవకాశం ఉండదు. కేజీబీవీల్లో సిబ్బంది నాణ్యతపై ఆ కంపెనీలను ప్రశ్నించే ఆస్కారమూ లభించదు. దీనివల్ల విద్యార్థినులకు తీరని నష్టం జరుగుతుంది. మాకేంటి ఈ భారం : ప్రిన్సిపాల్స్ ఆవేదన ఈ టెండర్ ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సరుకుల పంపిణీకి పాత కాంట్రాక్టర్లకు పొడిగింపు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరగాలి. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. జూలై 30న జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆగస్టు మొదటి 15 రోజులకు అవసరమైన ప్రొవిజన్స్‌ను స్థానికంగా కొనాలని కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌కు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒక్కో పాఠశాల రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ముందుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు, గ్యాస్, డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ ప్రిన్సిపాళ్లపై ఈ నిర్ణయం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతోంది.. టెండర్ వ్యవహారం తేల్చకుండా పాఠశాలల నిర్వహణ భారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. -
‘కనీసం’పై బ్యాంకులు భారీ వడ్డన
సాక్షి, అమరావతి: పొదుపు, కరెంటు, ఖాతాల్లో కనీస నిల్వ లేదంటూ బ్యాంకులు ఖాతాదారుల నడ్డి విరుస్తున్నాయి. ఈ చార్జీలు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలకు కనీస నిల్వ చార్జీలు వర్తించవు. ఇక మిగతా పొదుపు, కరెంటు ఖాతాదారులు నెలవారీ కనీస నిల్వ నిర్వహించకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు భారీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిసి కనీస నిల్వ నిర్వహించనందుకు చార్జీల రూపంలో ఏకంగా రూ.27,881.84 కోట్లను వసూలు చేశాయి. బ్యాంకులు ఈ చార్జీలను నిర్వహణ అవసరాలుగా సమర్థించు కుంటున్నప్పటికీ మధ్యతరగతి పరిమిత గృహ పొదుపును హరించివేసి, వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రూ.12,033.39 కోట్లు వసూలు » గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వ నిర్వహించని ఖాతాల నుంచి చార్జీల రూపంలో రూ.12,033.39 కోట్లు వసూలు చేశాయి. అలాగే గత నాలుగేళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ.15,848.45 కోట్లు వసూలు చేశాయి. » ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గత ఐదేళ్లలో అత్యధికంగా కనీస నిల్వ నిర్వహించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా రూ.2027.94 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.1896.38 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.1776.85 కోట్లు వసూలు చేసింది. ఎస్బీఐ కరెంట్ ఖాతాలపై .... » స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాలపై కనీస నిల్వ చార్జీలను ఎత్తివేసినప్పటికీ కరెంటు ఖాతాలపై వసూలు చేస్తోంది. గత ఐదేళ్లలో రూ.1600.77 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ గత నాలుగేళ్లలో అత్యధికంగా రూ.5669.91 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత యాక్సిస్ బ్యాంక్ రూ.3787.30 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1578.29 కోట్లు, కోటక్ మహీంద్ర బ్యాంక్ రూ.998.41 కోట్లు వసూలు చేసింది. -
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలకు పోలీసులు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వావిుక వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. రిలే దీక్షలు ముగిసినా ఈనెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ–2025 అక్రమాలపై న్యాయంచేయాలని కోరుతూ గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీలేదని ఆయన చెప్పారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని.. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.కీలక అధికారులు ఎందుకు బదిలీ అయ్యారు?అలాగే, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధంకావాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి తేల్చిచెప్పారు. అప్పట్లో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు వరుసగా ఎందుకు బదిలీ అయ్యారని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కార్యదర్శి కోన శశిధర్, పీఎస్ గిరీష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఇప్పుడా స్థానాల్లో లేరని.. స్పోర్ట్స్ కోటా, డీఎస్సీ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, శాప్ అధికారులను కూడా ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. ఇక డీఎస్సీపై శాసనసభ, శాసన మండలిలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తీసుకొస్తామని.. మంత్రి లోకేశ్ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక అమరావతిలో అద్దాలు, భవనాల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని అప్పిరెడ్డి ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డీఎస్సీలో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, అధికారులతో పాత వివరణలే ఇప్పిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అధికారులు ఇస్తున్న వివరణకు డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన ఉండటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నేతలు డీఎస్సీ స్కాంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏంటని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామంటే కుదరదని, మంత్రి లోకేశ్ దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని అని అన్నారు.యువత కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరు:వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టంచేశారు. విశాఖ నగరంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 2025 డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ టీచర్ పోస్టులను అమ్ముకుందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వీధిపోరాటాలు కొనసాగుతాయని కేకే రాజు స్పష్టంచేశారు. -
లోకేశ్ తప్పుకోవాల్సిందే
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై మూడవ రోజు శనివారం కూడా చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు విజయవంతం కావడం, జెన్ జీ యువత కదం తొక్కడంతో రోజురోజుకు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టింది. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తన తనయుడి రాజకీయ భవితపై బెంబేలెత్తుతూ ఇప్పటికే పోలీసులు, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి రిలే దీక్షల భగ్నానికి విఫలయత్నం చేస్తున్నారు. అడ్డంకులను అధిగమించి ఉధృతంగా పోరుడీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. వేలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, జెన్‌జీ యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, టీడీపీ శ్రేణుల అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు.. స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ దీక్షా శిబిరాల్లో విన్పించింది. యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జెన్ జీ యువత మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని యువత ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. రోజురోజుకూ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన తీవ్రమైంది. చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యంచిలకలూరిపేటలో రిలే దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యం చేశారు. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. అంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులువైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీయడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామసుబ్బారెడ్డిని తరలించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. క్యారమ్స్ ఆడుతాం.. మాకూ ఉద్యోగాలివ్వండిబాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన నిర్వహించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాట, లూడో ప్రామాణికంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని వినూత్న నిరసన చేపట్టడం ప్రజలను ఆలోచింపజేసింది. రిలే దీక్షా శిబిరం వద్ద క్యారం బోర్డు ఆడుతూ.. ‘మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సర్కారు కుటిలయత్నాలు, కుట్రలను అధిగమించి వైఎస్సార్సీపీ శనివారం మూడవ రోజు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.సంతలో సరుకుల్లా డీఎస్సీ కొలువులు⇒ కూరగాయల బుట్టల్లో పోస్టుల విక్రయాల నాటిక⇒ క్రీడా కోటాకు ‘తొక్కుడు బిళ్ల’ ఆటలతో వినూత్న నిరసన పార్వతీపురం రూరల్: పార్వతీపురం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో మహిళలు, జెన్–జి యువత వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీ టీచర్ పోస్టులను కూటమి నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ దీక్షా శిబిరం వద్ద మహిళలు ప్రదర్శించిన నాటికలు అందరి దృష్టిని ఆకర్షించాయి.కూరగాయల బుట్టల్లో ‘ఎస్జీటీ పోస్టు’, ‘సూ్కల్ అసిస్టెంట్ పోస్టు’ అని బోర్డులు ఉంచి.. ‘రండి బాబు రండి.. రేటు మాట్లాడితే ఉద్యోగం మీదే.. చదువుతో పనిలేదు, డబ్బులిస్తే చాలు’ అంటూ వీధి వ్యాపారుల్లా అరుస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. మహిళలు ‘తొక్కుడు బిళ్ల’ ఆడుతూ, వీధి ఆటలను కూడా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో చేర్చే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుపై గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నిప్పులుచెరిగారు. విజయవాడ వేదికగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నాలుగు గంటలపాటు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు కదంతొక్కడంతో బెజవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. సర్కారు వ్యతిరేక నినాదాలతో మిన్నంటింది. బాబు సర్కారు పనిభారం తీవ్రంగా పెంచేసిందని ఉద్యోగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా పగలూరాత్రీ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. చిరునవ్వుతో ప్రజల ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ సేవలందించే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం చిరునవ్వే లేకుండా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన 22 డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి శ్రీకారంచుడతామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. తమ గోడు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా సర్కారులో చలనం లేకపోవడంతో తప్పక చివరకు ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. జాబ్‌చార్ట్‌ను అమలు చేయడం లేదని, పండగపబ్బం లేకుండా సెలవు రోజుల్లోనూ ఏదోపని అప్పగిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం(ఏఏఎస్), నోçషనల్ ఇంక్రిమెంట్లు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులకు పని లేదు అనే వాళ్లు ఓ మూడు రోజులు మా ఉద్యోగులందరికీ మాస్ లీవ్‌కి అనుమతిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేరును స్వర్ణ శాఖగా మార్చి, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం స్వర్ణమే లేకుండా చేసిందంటూ తూర్పారబట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో పారదర్శకత అన్నదే లేకుండా ఎమ్మెల్యే సిఫార్సులు ఉంటే బదిలీ అన్నట్టు మార్చేసిందని దుయ్యబట్టారు. మహిళా ఉద్యోగులకూ సాయంత్రం ఆరు తర్వాత పనులుగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో 63 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిపైనా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, సాయంత్రం ఆరు తర్వాత కూడా పనులు అప్పగిస్తోందని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఇళ్లకు కరపత్రాలు అంటించే బాధ్యతా అప్పగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలపై సర్వేలతో విసుగుతెప్పిస్తోందని, వివరాల కోసం పదేపదే ఇళ్లకు వెళ్లి ఓటీపీలు అడుగుతుంటే ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని గోడువెళ్లబోసుకున్నారు. ప్రజలు తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ పేరిట ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించి మిగులు ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపి పనిభారం తీవ్రంగా పెంచేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 డిమాండ్లు తేలకుంటే భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటంగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత జాబ్‌చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగులకు సముచిత స్థాయి పదోన్నతులు కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంటు, ఆటోమెటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు, ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత తదితర 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, వాటిని పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు కార్యరూపం దాల్చకుంటే అక్టోబరు 2న సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు ప్రతినిధులు వెస్లీ, ప్రభాకర్, ప్రగతి, సుప్రియ తదితరులు నేతృత్వం వహించారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతోపాటు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. -
అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్?
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పచ్చి అబద్ధాల పుట్ట అని.. వైట్ పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్టుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్ అని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఆధారాలతో తిప్పికొట్టారు. శనివారం బుగ్గన హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. ‘పంటలకు మద్దతు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా బంద్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 ఎవరికిచ్చారు? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఏమైంది? మీ పాలనలో ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడిని అడిగితే చాలు. ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యం అందడం కూడా ఇబ్బందిగా మారింది. రైతులు, యువత, మహిళల జీవితంలో మార్పు కనిపించకుండా ప్రోగ్రెస్ ఎలా వచ్చింది?’ అని బుగ్గన నిలదీశారు. మామిడి, పొగాకు రైతులు, మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే సంక్షేమాభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, ఐదు పూర్తి చేశాం. రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మంది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం. నాడు–నేడు కింద మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వారా రూ.20 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.మీది బూటక ప్రచారం కాదా?అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి రూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది. మా హయాంలో స్థూల ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. పెట్టుబడులు, ఉద్యోగాలపై కూడా తప్పుడు ప్రచారమే. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానమే మీ బూటకపు ప్రచారాన్ని వెల్లడిస్తోంది. అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సమాధానం చెప్పాలి’ అని బుగ్గన మండిపడ్డారు. -
108 వాహనాల్లో పాము కాటుకు ఇంజెక్షన్లు
సాక్షి, అమరావతి: పాము కాటు బాధితుల కోసం 108 అంబులెన్సుల్లో యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్లను అందుబాటులో తెచ్చినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో చక్రధర్‌బాబు శనివారం తెలిపారు. పాముకాటు అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. గతేడాది జూన్ నుంచి 3,104 మంది పాముకాటు బాధితుల తరలింపు కోసం కాల్ సెంటర్‌కు ఫోన్లు వచ్చాయన్నారు. కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి ఈఎంటీలు పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లు అందించినట్టు చెప్పారు. వారికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. -
15 వరకే డెడ్‌లైన్
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే మేం కోరుతున్నాం. గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. హామీల అమలుపై స్పందించకుండా.. మేం ఉద్యమానికి సిద్ధమవుతుంటే బూటకపు లెక్కలతో ప్రజల్లో మాపై తప్పుడు సంకేతాలిస్తారా? గతనెల 22న మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినా నేటికీ నిర్ణయాలు ప్రకటించనే లేదు. ఆగస్టు 15 వరకే ప్రభుత్వానికి డెడ్‌లైన్. ఆలోపు సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే ఏ క్షణమైనా ఉద్యమంలోకి వెళ్తాం.’’ అని చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ అమరావతి జేఏసీ అల్టిమే టం జారీ చేసింది. ఏటా ఉద్యోగుల జీతాల ఖర్చు తగ్గుతుంటే మా కోసమే రాష్ట్ర ఆదాయమంతా సరిపోతోందని సీఎం ఆర్థిక శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు వల్లె వేశారని జేఏసీ నాయకులు నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశమైంది. అనంతరం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. జీతాల ఖర్చు తగ్గుతోంది.. కొత్త నియామకాల్లేవ్.. ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక శ్వేత పత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదన్నారు. ఉద్యోగులకే అంతా ఖర్చయిపోతోందని ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26లో ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం చేసిన ఖర్చు 37.41 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడిలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 59 శాతం ఉందన్నారు. పన్నులతో పాటు, ఇతర రాబడి మొత్తంలో తమ ఖర్చు 47 శాతమే అన్నారు. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 94 శాతం నుంచి 98 శాతం ఖర్చు చేస్తున్నట్టు శ్వేత పత్రంలో ఎలా ప్రకటించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లపై ఖర్చులు భారీగా తగ్గనున్నాయని తెలిపారు. 2024 నుంచి 2026లో ఇప్పటికే 41,321 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారన్నారు. వచ్చే ఐదేళ్లలో 1,51,755 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త నియామకాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల ఖర్చు సగానికిపైగా తగ్గిపోతోందన్నారు. అయితే ఉద్యోగులపై చేస్తున్న ఖర్చు పెరిగిపోతోందని సీఎం ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వం శ్వేత పత్రంలో ప్రకటించిన ఉద్యోగులు, పెన్షనర్ల ఖర్చుల లెక్కలన్నీ బూటకమేనన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు.15వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధుల వైద్య సేవలకు ఒక్క రూపాయి ఖర్చయినా సరే ఆగమేఘాల మీద రీయింబర్స్మెంట్ వచ్చేస్తోందని బొప్పరాజు అన్నారు. అదే ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చేసుకున్నా రీయింబర్స్మెంట్ రాదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) సమస్యలను పట్టించుకోరని మండిపడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై ఉలుకు పలుకు లేదన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను పునఃసమీక్ష చేసి ఆమోద యోగ్యమైన విధానం తెస్తామన్నారని గుర్తు చేశారు.అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారని, వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో గత నెల 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపిందన్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రానిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆగస్టు 15వ తేదీ తదుపరి ఐక్య కార్యాచరణతో ఏ క్షణమైనా ఉద్యమానికి దిగుతామన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి.. ఇప్పుడు ఖర్చు తగ్గిస్తామంటారా?ఉద్యోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. వీటిని పరిష్కరించాలని మేం కోరుతుంటే ఉద్యోగ సంఘాలు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని పలిశెట్టి దామోదర్ పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి ఇప్పుడేమో ఉద్యోగుల కోసం చేసే ఖర్చును తగ్గిస్తామంటారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.50 లక్షల ఉద్యోగులను నియమించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు గుర్తు చేశారు. వైద్య రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 40 వేల మందికిపైగా రిటైర్ అయ్యారన్నారు. ఇప్పుడు సీఎం చెబుతున్న మాటలు వింటుంటే ప్రభుత్వం భవిష్యత్‌లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయబోదనే సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చులపై పూర్తిగా తప్పుడు లెక్కలు వల్లె వేస్తున్నారన్నారు. ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టకుండా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని సూచించారు. -
దోపిడీకి నిలువుటద్దం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్‌ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని షరతు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.ఈ పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్‌ను తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఎస్ఎస్ఆర్ బుట్టదాఖలు ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్)..కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. ⇒ ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లా్లస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్డీఏకు కొటేషన్లు ఇచ్చాయి. ⇒ అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. ⇒ ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగు రూ.20,439.58 ⇒ టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లకు నో.. సబ్ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!⇒ సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. ⇒ కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ⇒ జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. -
రైతు బతుకులో ‘సోలార్’ చీకట్లు
మూడు తరాల నుంచి ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఈ భూమిపై ఇప్పటికే రూ.7 లక్షల పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడేమో సోలార్ వాళ్లు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు. మాకు మా భూమి కావాలి. సోలార్ వద్దే వద్దు. ఉన్న భూమి పోతే మేమెలా బతకాలి? ఊరొదిలి వెళ్లిపోవాలా? – వేడిగింజల అనసూయమ్మసాక్షి, పుట్టపర్తి: రైతుల పొలాల్లో వెలుగులు నింపాల్సిన సోలార్ ప్రాజెక్టు.. అదే అన్నదాతల బతుకుల్లో చీకట్లు నింపుతోంది. పచ్చని పంట పొలాలపై సోలార్ పలకలు పరచేందుకు.. ఏళ్ల తరబడి ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న రైతులను పక్కకు నెట్టేస్తున్నారు. మొత్తం మీద 16,000 ఎకరాలపై కన్నేయగా ముందుగా 600 ఎకరాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జౌకుల గ్రామంలో పరిస్థితి ఇది. 16వేల ఎకరాలలో ఈ సోలార్ ప్రాజెక్టు వస్తోందని చెబుతున్నారు. అందులోభాగంగా తొలిదశలో జౌకుల గ్రామంలో పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పైసా పరిహారమివ్వకుండా భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. అదేమంటే అధికారమదంతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల దన్నుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఓ ప్రైవేటు కంపెనీతో రూ.25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్సుకూడా తీసేసుకున్నారని వినిపిస్తోంది. కదిరి ఆర్డీఓ, పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. సోలార్ ప్లాంటు వల్ల రైతులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు నంబులపూలకుంట మండలంలోని జౌకుల గ్రామాన్ని ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి.ముందుగా 600 ఎకరాలపై..జౌకుల గ్రామ పరిసరాల్లోని భూములపై ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు నీడ పడింది. ఈ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓ ప్రైవేటు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సర్వే నంబరు 179 పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో తొలి దశ పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములను తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఒక్కసారిగా భూముల నుంచి దూరం చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. భూమిని సాగు చేసింది రైతు.. దానిపైనే కుటుంబాన్ని పోషించుకున్నది రైతు.. చివరకు భూమి పోతున్నప్పుడు పరిహారం మాత్రం శూన్యమా? అని నిలదీస్తున్నారు.శ్రీ సత్యసాయి జిల్లా జౌకులలో జేసీబీ యంత్రాలతో చేస్తున్న పనులు ప్రభుత్వ పెద్దల దన్నుతో..ప్రభుత్వ పెద్దల దన్నుతో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విపరీతంగా వ్యవహరిస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో చెలరేగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ ‘ప్రాజెక్టు ఆగదు.. భూములు ఇవ్వాల్సిందే’ అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జౌకులలో ఎకరా రూ.6లక్షల వరకు పలుకుతోంది. 600 ఎకరాలు రూ. 36 కోట్లు. కానీ రైతుల నుంచి భూములు ఇప్పించే విషయంలో సోలార్ కంపెనీకి హామీ ఇచ్చి రూ.25 కోట్ల మేర ఎమ్మెల్యే ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వరకు అడ్వాన్స్‌గా ముట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘రైతులు ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేపట్టినా.. ప్రాణాలు అర్పించినా.. ఉరి వేసుకుని చచ్చిపోయినా అనుకున్న మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు రైతులు చెబుతున్నారు. తమ సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకంటే సోలార్ ప్రాజెక్టే ముఖ్యమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.20 లక్షల పెట్టుబడి అయింది సోలార్ పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. పనులు చేసేందుకు యంత్రాలు వస్తున్నాయి. మొత్తం 10 ఎకరాలలో బోరు బావులు తవ్వించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు నాటి పదేళ్లయింది. దాదాపు రూ.20 లక్షల పెట్టుబడి అయింది.. సోలార్ వద్దు.. మా భూమి మాకు కావాలి. పంటలు సాగు చేసుకుని బతుక్కుంటాం. – రమణస్క్రూటినీ అయ్యింది.. బుక్ ఇవ్వలేదు మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు స్క్రూటినీ కూడా పూర్తయింది. ఈ భూమి లాగేసుకుంటే ఊరొదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి. మండల స్థాయి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. సోలార్ వద్దు. భూమిలో పంట వేసుకుంటాం. – బాబా ఫకృద్దీన్గొర్రెలు ఎలా మేపుకోవాలి? సోలార్ పలకలు ఏర్పాటు చేస్తే గొర్రెలు ఎలా మేపాలి? ఊర్లో చాలా గుంపుల గొర్రెలు ఉన్నాయి. అందరికీ నష్టమే. నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. నాకు 9 ఎకరాల భూమి ఉంది. అది కూడా సోలార్కు లాగేయాలని చూస్తున్నారు. సోలార్ వస్తే బయట ప్రాంతాలకు వెళ్లేందుకు దారి కూడా ఉండదు. – మస్తాన్ వలి30 ఏళ్లుగా సాగులో ఉన్నాం మేం 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నాం. ఇప్పటి వరకు పది బోర్లు వేయించగా, మూడు చోట్ల నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అయ్యింది. బలవంతపు భూమి లాక్కోవాలనుకుంటే ఊరుకునేది లేదు. డబ్బులన్నీ భూమిపై పెట్టాం. భూమి పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. – ఆర్.నగేశ్ఆత్మహత్యలే గతి మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. నిమ్మ సాగు చేస్తున్నాం. ఈ భూమి కూడా లాగేసుకుంటే ఆత్మహత్యలే గతి. రైతులకు పరిహారం చెల్లించకుండా సోలార్కు భూములు లాక్కోవాలని చూస్తే ఊరంతా ఖాళీ అవుతుంది. – ఖాదర్ వలిజీవాలకు గ్రాసమూ ఇబ్బందే.. మా గ్రామానికి ఈ భూములే జీవనాధారం. కొందరు పంటలు వేసుకుంటారు. ఇంకొందరు పశువులు, గొర్రెలు మేపుతుంటారు. సోలార్ ఏర్పాటు చేస్తే చిన్న జీవాలకు గ్రాసం ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం లేదు. ఊరొదిలి వలస వెళ్లాల్సిందే. సోలార్‌ను మా ఊరికి రానివ్వం. – వల్లెపు భారతిమా భూమి ఇచ్చేది లేదు..మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. శెనక్కాయ, వంకాయ, టమాట పంటలు వేస్తుంటాం. అప్పు చేసి బోరు బావి తవ్వించా. నీళ్లు పడ్డాయి. సోలార్కు ఇచ్చే పరిస్థితి లేదు. – వేమల రామచంద్ర -
చాలు బంగారం.. చాలు
సాక్షి, అమరావతి: పసిడి ప్రియులకు పేరొందిన భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయి. 2021–22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025–26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడంతో అమ్మకాలపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం అమ్మడం కూడా దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో స్మగ్లింగ్ పెరుగుతోంది. విలువ పరంగా 58 శాతం పెరుగుదలపరిమాణం పరంగా బంగారం దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2021–22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025–26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లు ఉంటే ఇప్పుడది ఏకంగా 4,200 డాలర్లకు చేరడమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య కదులుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. -
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రచ్చ
సాక్షి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రగడ చోటుచేసుకుంది. స్టాల్స్‌ను తిలకించడానికి వచ్చిన మంత్రి దుర్గేష్‌ను డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గన్‌మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను రఘురామకృష్ణరాజు గన్‌మెన్ పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణ రాజు గన్‌మెన్‌తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందే గొడవ జరిగింది. -
ఏపీ విద్యాశాఖలో రెడ్‌బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
డిజైన్.. ఫీజు దిమ్మతిరిగెన్..
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వ్యయమే కాకుండా, వాటి ఆర్కిటెక్చర్ డిజైన్లను రూపొందించే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ (యూకే) సంస్థకు చెల్లించే మొత్తాన్ని రూ.136.90 కోట్ల నుంచి రూ.206.59 కోట్లకు ప్రభుత్వం పెంచేసింది. హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం పెరగడం, అత్యాధునిక డిజైన్ల కోసం అదనపు నిపుణులను నియమించాల్సి రావడం, డిజైన్లను వేగంగా సమర్పించడం, బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరగడం.. వాటికి జీఎస్టీ కలపడం వల్ల ఫీజు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డిజైనర్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్కు అదనంగా చెల్లించేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.3,975.12 కోట్లు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వాటి నిర్మాణ వ్యయంలో 5.20 శాతాన్ని డిజైన్ల కోసం చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నిలిచే భవనానికే డిజైన్ల వ్యయం దాని నిర్మాణ వ్యయంలో ఒకటి లేదా 1.5 శాతం లోపే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరిగితే మళ్లీ డిజైనర్‌కు చెల్లించే మొత్తం పెరుగుతుందన్నది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పింది. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించే ప్రాంతాన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఏజీసీ మాస్టర్ ప్లాన్‌తోపాటు కొత్త సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను 2016లోనే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.67.86 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు కేవలం హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర డిజైన్ల కోసం ఏకంగా రూ.206.59 కోట్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు శాశ్వత భవనం వ్యయం రూ.2,027.76 కోట్లు » హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. ఈ లెక్కన హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట. » ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీ టీవీ, ఫైర్ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జూన్ 5న రూ.547.07 కోట్లు మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. ఈ భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.9,978లు చొప్పున ఖర్చు చేస్తోంది. » రాజధాని అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్ల వ్యయంతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.17,356.54 » అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. » ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. » అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లు మంజూరు చేసింది. దాంతో అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54 కోట్లకు చేరుకుంది. రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.971 కోట్లతోనే అత్యాధునిక వసతులతో భారత మణిహారంలో కలికితురాయిగా నిలిచేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం గమనార్హం. -
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా సై అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం రూ.1200 కోట్ల టర్నోవర్, వందల కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెర లేపింది. ఈ క్రమంలో టీడీపీకే చెందిన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ను తీవ్రంగా బెదిరించి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసి.. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది. చలసాని డెయిరీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయకూడదంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే అత్యధిక శాతం డైరెక్టర్లు చలసానికి మద్దతు ఇవ్వడంతో గురువారం చలసాని ఆంజనేయులు మరోసారి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారనే విషయం తెలుసుకుని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారధి చలసాని వద్దకు వెళ్లారు. విజయ డెయిరీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కేబినెట్ నుంచి అక్కడికి చేరుకుని మంత్రాంగం నడిపారు. ఆయన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మెజార్టీ డైరెక్టర్లు ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ సూచనల మేరకు పక్కకు తప్పుకోవాలని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చిట్టి నగర్‌లోని డెయిరీ యూనిట్‌కు వెళ్లి మరీ ఆయన్ను బెదిరించారు. ఒకరోజు సమయం ఇస్తే అధిష్టానం చెప్పినట్లు చేస్తానని చెప్పినా, మంత్రులు ఒప్పుకోకుండా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు. తెల్ల పేపర్ ఆయన ఎదుట పెట్టి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసి సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో చలసాని అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యం కొనసాగుతున్నా రాజీనామాకు పట్టువైద్యం కొనసాగుతున్నప్పటికీ సదరు అమాత్యులు ఆయన్ను వదల్లేదు. వీరిద్దరూ కాకుండా.. గట్టిగా నోరేసుకుని విరుచుకుపడే మరో అమాత్యుడు ఏకంగా ఆ ఆస్పత్రి యాజమాన్యానికే ఫోన్ చేసి.. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. అయితే మానవతా దృక్పథంతో ఆ ఆస్పత్రి వైద్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పార్థసారధి శుక్రవారం ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై స్టెంట్ వేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నా, మానవత్వాన్ని కూడా మరిచి రాజీనామా లేఖపై సంతకం చేయించి బలవంతంగా తీసుకున్నారు. ఆ లేఖ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మంత్రి కొల్లు ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం మరోవైపు శుక్రవారం విజయ డెయిరీ డైరెక్టర్లందరినీ మంత్రి కొల్లు రవీంద్ర చర్చల కోసం తన ఇంటికి పిలిపించి నిర్బంధించారు. చలసానికి వారు మద్దతు పలుకుతుండడంతో రాత్రి వరకు అక్కడే ఉంచారు. తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తిపై అవిశ్వాసం ఎలా పెడతామని డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈలోపు చలసాని ఆంజనేయుల్ని బెదిరించారు. డెయిరీ వ్యవహారాలపై విచారణ జరిపించి కేసులు పెడతామని, రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా రాజీనామాకు ఒప్పించాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మరోవైపు అమెరికాలో ఉన్న ఆయన కుమారుడికి ఫోన్ చేసి రాజీనామా చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అధిష్టానం ఆదేశించిందట..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా అధిష్టానం ఆదేశించింది రాజీనామా చేయాలని చలసానిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? బోర్డు మొత్తం చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి బోర్డు సభ్యులను పిలిచి ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో అవిశ్వాసం పెట్టండని అడిగారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన వారిని అదే రోజు రాజీనామా చేయమనడం, అనారోగ్యంతో ఉన్నా వేధించడం మంచి పద్దతి కాదు. – వేమూరి సాయి, డైరెక్టర్హెరిటేజ్ కోసమే!» విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) 1.50 లక్షల కుటుంబాల సంస్థ. ఒక్క విజయవాడలోనే 2.60 లక్షల లీటర్లు, రాష్ట్రమంతా కలిసి 4.60 లక్షల లీటర్ల పాలను ప్రతి రోజూ వినియోగదారులకు అందిస్తోంది. » పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. » బాపులపాడు మండలం వీరవల్లిలో ఇటీవల తన రెండవ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.» ఇది సాకారమైతే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైయిరీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోతుంది. మరోవైపు మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డైయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతుంది. ఇది జరగకూడదనే చలసానిని బలవంతంగా చైర్మన్ పదవి నుంచి తప్పించారని స్పష్టమవుతోంది. » ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసిన చరిత్ర గుర్తుకు తెస్తోందని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. » దీంతో పాటు విజయ డెయిరీకి ఉన్న రూ.వందల కోట్ల ఆస్తులతో పాటు.. గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల భూమిపై పెద్దల కన్ను పడిందని తెలుస్తోంది. » ప్రభుత్వం తీరు సరికాదని విజయ డైరెక్టర్లు విమర్శిస్తున్నారు. బుడమేరు వరద సమయంలో ఏమాత్రం పట్టించుకోలేదని, అసలు సహకార రంగంలో ఉన్న డైయిరీ విషయంలో ఈ బెదిరింపులు ఏమిటని వారు నిలదీస్తున్నారు. » ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విజయ (కృష్ణా మిల్క్ యూనియన్) డెయిరీని హెరిటేజ్ కోసం బలిచేసే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకర రెడ్డిలు తప్పుపట్టారు. -
రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్వర్క్ 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్‌వోఎస్ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది ‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం?ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌వోఎస్ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ డౌన్లోడ్31,607 అత్యవసర కాల్స్ పరిష్కారం18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థ900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు -
అంబులెన్స్ లేక ఆగిన చిన్నారి ప్రాణం
చింతూరు: పోలవరం జిల్లా చింతూరులో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన చిన్నారి ప్రాణం ఆగింది. చింతూరు మండలం పెద్ద శీతనపల్లి గ్రామానికి చెందిన చోడి పాపయ్య కూతురు చోడే లాస్య (4) అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యులు మలేరియాగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వెళ్లాలని సూచించారని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చిన్నారి మృతి చెందిందని వారు వాపోయారు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో శుభమ్ నొఖ్వాల్ బాధిత కుటుంబంతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. -
జగన్ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర
దేవరపల్లి: పొగాకు మార్కెట్లో ధరలో పెరుగుదల కనిపించింది. కిలోకు ఒక్కసారిగా రూ.15లు ఎగబాకింది. ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమేనని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమ సమస్యలను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం ధర పెంచిందని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5వ తేదీన పర్యటించి పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతోపాటు రైతులు కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రైతులు కోరారు. అనంతరం వైఎస్ జగన్ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పొగాకు మార్కెట్లో ధరల పెరుగుదల... జగన్ పర్యటన అనంతరం రెండు రోజులకే పొగాకు మార్కెట్లో ధరలు పెరిగాయి. కిలోకు రూ.15లు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కిలో గరిష్ట ధర రూ.275 ఉండగా, శుక్రవారం రూ.290 పలికింది. జగనన్న పర్యటన ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిలోకు రూ.10 ధర పెరిగిందని, అప్పటి వరకు కిలో గరిష్ట ధర రూ.265 ఉండగా రూ.275కు పెరిగిందని తెలిపారు. పర్యటన అనంతరం కిలోకు రూ.15 పెరిగినట్టు చెబుతూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న పర్యటన వల్ల కిలోకు మొత్తంగా రూ.25లు అదనపు ధర లభించినట్టయిందని తెలిపారు. పొగాకు రైతుల హర్షాతిరేకాలు పొగాకు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, పొగాకు రైతులు సుంకర గంగరాజు, బాలం చంద్రశేఖర్, కవల సత్తిబాబు, పైడికొండల సత్యనారాయణ, కవల శ్రీనివాస్, తేతల బ్రహ్మరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, తేతల వీరకాశీరెడ్డి, పప్పు ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలపార్ట్టైమ్ లెక్చరర్లకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పార్ట్‌టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన అన్ని వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు.అసోసియేషన్ ప్రెసిడెంట్ అరిగ జోషిరావు తదితరులు వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్ ఎయిడెడ్ పోస్టుల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడం లేదని వాపోయారు. ప్రభుత్వం 10+2 విధానంలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ చేపట్టే సమయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పార్ట్ టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వారి సర్వీస్, అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన వెయిటేజీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మినిమమ్ టైమ్ స్కేల్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సర్వీస్, విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారి రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు, డిమాండ్లను సావధానంగా విన్న జగన్.. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్ట్‌టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. -
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 16 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, ఏడుగురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీ స్పెషల్ సీఎస్ (సర్వీసెస్) ఎస్ఎస్ రావత్‌ను పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేశారు. అదనంగా యువజన సర్వీసుల శాఖతోపాటు అదనంగా జీఏడీ సర్వీసెస్, జీపీఎం అండ్ ఆర్ బాధ్యతలు ఇచ్చారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) జె. శ్యామలరావుకు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జీఏడీ–పొలిటికల్ బాధ్యతలు అదనంగా అప్పజెప్పారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ను రవాణా శాఖ కార్యదర్శిగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న నలుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన అధికారుల్లో ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు www.sakshi.com చూడండి. -
క్వాంటమ్ వ్యాలీలో సిండికేట్ స్కామ్!
సాక్షి, అమరావతి: రాజధాని పనుల టెండర్లలో అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లో కుమ్మక్కుతో స్కామ్‌కు పునాదులు పడ్డాయి. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనపు ప్రయోజనం చేకూర్చుతూ.. ప్రజాధనాన్ని దోచిపెడుతూ ముఖ్యనేత సిండికేట్ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీకే ట్విన్ టవర్ల పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. ట్విన్ టవర్ల నిర్మాణ పనులకు రూ.958.40 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రెండేళ్లలో పూర్తి చేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే నిబంధనతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు నిర్వహించింది. కాంట్రాక్టు విలువ కంటే 4.60 శాతం అధిక ధరకు అంటే రూ.1,002.49 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ ఎల్–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీఐసీఎల్ చేసిన ప్రతిపాదనపై ఈనెల 4న సీఆర్డీఏ 64వ సమావేశం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల ఖజానాపై రూ.44.09 కోట్లు అదనంగా భారం పడుతుంది. ఇక మరో రూ.178.1 కోట్లను జీఎస్టీ, సీనరేజీ, మెరిట్, తదితర పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం టెండర్లో పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,180.59 కోట్లకు చేరుకుంది. 4.83 ఎకరాల్లో ట్విన్ టవర్స్రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీలో 4.83 ఎకరాల్లో ట్విన్ (జంట) టవర్ల నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ చేపట్టింది. ఒక్కో టవర్‌ను బీ+జీ+47 అంతస్తులతో నిర్మించాలని నిర్దేశించింది. బీ+జీ నుంచి నాలుగో అంతస్తు వరకూ ఒక్కో అంతస్తును 5 మీటర్లు.. అక్కడి నుంచి 47వ అంతస్తు వరకూ ఒక్కో అంతస్తు 4.2 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. పార్కింగ్ ఏరియాతో పాటు ఒక్కో టవర్ నిర్మిత ప్రాంతం 1,53,708 చదరపు మీటర్లు. రెండు టవర్ల నిర్మిత ప్రాంతం 3,48,406 చదరపు మీటర్లు (37,50,210 చదరపు అడుగులు). అంటే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి నిర్ణయించిన కాంట్రాక్ట్ విలువ రూ.3,148.06. అదీ కేవలం పునాదులు, పిల్లర్లు, బీమ్‌లు, లిప్ట్‌లు, షాప్్టలతో కూడిన భవనం మాత్రమే. ఈ స్థాయి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనంగా చెల్లించేలా కాంట్రాక్టు పనులు అప్పగించినట్లు వెల్లడవుతోంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్‌తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్‌లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్‌రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్‌కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
బాబు సర్కారు వి‘శ్వాస’ ఘాతుకం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే నిరుపేద రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల పలికే నియోనాటల్(నవజాత శిశువు)వెంటిలేటర్‌ను ఏకంగా రూ.30.24 లక్షలకు కొనుగోలు చేసేలా శుక్రవారం వైద్య శాఖ బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్సీ) ఆమోదం తెలిపింది. అధిక ధరలకు వెంటిలేటర్ల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.మూడు కోట్లకుపైనే నేతలు కమీషన్ల రూపంలో బొక్కేయనున్నారని విమర్శలు వస్తున్నాయి.వైద్య పరికరాల కొనుగోళ్లపై కీలక ప్రజాప్రతినిధి 10 శాతం అంతకంటే పైనే కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. దీనికి తోడు వైద్య సేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఐడీసీ)లోని కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఖరారు, పర్చేజింగ్ ఆర్డర్(పీవో) జారీ, బిల్లులు మంజూరు ఇలా వివిధ దశల్లో కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు అందరూ సిండికేటై ఇతర రాష్ట్రాలు, కేంద్ర వైద్య శాఖలకు సరఫరా చేస్తున్న దాని కంటే అత్యధిక ధరలకు ఏపీలో టెండర్లు వేస్తున్నారు. ఏపీలో దోపిడీకి తమిళనాడు ధరలే సాక్ష్యం అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు రెండేళ్లుగా ఎంఎస్‌ఐడీసీలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలుకు కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. ఎల్–1 సంస్థ వియాన్ ఫాబియాన్ హెచ్‌ఎఫ్‌ఓ వెంటిలేటర్‌ను రూ.30.24 లక్షలతో సరఫరా చేసేలా టెండర్ వేసింది. అయితే ఇదే మేక్, మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్‌పై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 38, రెండేళ్ల రేట్ కాంట్రాక్ట్‌తో మరిన్ని వెంటిలేటర్లను ఇదే కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బల్క్ ఆర్డర్ మీద బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గకుండా ఏపీలో మాత్రం రేట్లు అమాంతం పెరుగుతుండటం గమనార్హం. నియోనాటల్ వెంటిలేటర్‌ను రూ.25.50 లక్షలతో కొనుగోలుకు తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రేట్ కాంట్రాక్ట్ ఇదే టెండర్లో డ్రాగర్ బేబీలాగ్ వీఎన్ 600 మోడల్ వెంటిలేటర్‌ను రూ.30.93 లక్షలకు సరఫరా చేసేలా టెండర్ వేసిన మరో సంస్థ ఎల్–2గా నిలిచింది. ఇదే మోడల్ పరికరాన్ని తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రూ.25.50 లక్షలకే కొంటోంది. 2028 జూలై వరకూ ఈ రేట్ కాంట్రాక్ట్ ఉంది. ఇదిలా ఉండగా ఒకే రకం పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.5.50 లక్షల అధిక ధరకు సరఫరా చేసేలా కాంట్రాక్టర్ టెండర్ వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే నేతలకు కమీషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్లు పరికరాల ధరలు అమాంతం ఎలా పెంచేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. నీకు సగం.. నాకు సగం.. పరికరాల కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలను వైద్య శాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధికి కమీషన్లు ముట్టజెప్పేలా రెండు సంస్థలు టెండర్‌కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలు పరికరాల సరఫరాను చెరి సగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ మేరకు కాంట్రాక్ట్ ఖరారుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో, తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్సీలోనూ చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రూ.15 లక్షలతో కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు రూ.7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన వంద పరికరాల కొనుగోళ్లలో ఏకంగా రూ. ఏడు కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. -
దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి : ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..! డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..! అక్రమ పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్‌పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!! మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్‌జీ యువత నినదించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్‌జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు. అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం బొండాగిరీ బాటలోనే బుద్ధా..! బెజవాడలో తొలిరోజు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా మరింత దిగజారిపోయి బాటిల్లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్యాంగ్ వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్చల్ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్ కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..తొండంగిలో టెంట్లు తొలగింపు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్‌ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దీక్షలకు పెరుగుతున్న జెన్ జీ మద్దతు.. మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.స్పోర్ట్స్ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ స్కిట్ పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ ర్యాంక్ సాధించినా నిరాశే..! పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్చార్జీ వైఎస్ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్‌లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. కానీ డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్‌ను తీసేసి 2,217వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్–జెడ్ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? ‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్.. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతి సిమెంట్స్ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్నా కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసుల ఉదాసీనతపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ గుండాలు గత మూడు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి సున్నపురాయి తవ్వకాలను అడ్డుకుంటూ, తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను మొత్తం అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్స్ అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు ‘భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ, సున్నపురాయి గనిని నిర్వహిస్తోంది. కంపెనీ మ్యాన్‌పవర్ కాంట్రాక్టర్ అయిన ‘మెసర్స్ వైష్ణవి అసోసియేట్స్’ ద్వారా పనుల్లోకి వచ్చిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో, కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది.అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతి సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రతిరోజూ 25–30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్‌కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతి సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నపురాయి నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీతన కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది’ అని పిటిషనర్ పేర్కొన్నారు.అధికారం ఉన్నా.. కలెక్టర్ స్పందించడం లేదు‘జిల్లాపై పూర్తి అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ’భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కూడా కలెక్టర్‌కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.ఎస్పీ ఫిర్యాదును తీసుకోవడానికే నిరాకరించారు‘సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ జీఎం (మైన్స్) కె.సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి. వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు తరువాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం సీఐ, కడప డీఎస్పీ, లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం గానీ, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి.’ అని బాలాజీ తన పిటిషన్లో అభ్యర్థించారు. హైకోర్టుకు అభ్యర్థనలు ⇒ కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ⇒ ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. ⇒ మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ⇒ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి, వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలి. ⇒ తద్వారా సిమెంట్ ప్లాంట్‌లో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంట్ ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి. ⇒ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. -
అంతులేని ‘పూలింగ్’
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు భూసమీకరణకు అంతే లేకుండా పోతోంది. అమరావతి రాజధానిలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల సమీకరణకు కేబినెట్ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అందుకు తార్కాణం. ఇప్పటికే 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన బాబు సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల (82.9 చ.కి.మీ.) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడక ప్రాంతంతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో (926.8 చ.కి.మీ.) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్కాముల కోసం..!నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల చంద్రబాబు సర్కారు తేల్చి చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఒక ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది.ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో..! దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా సీఎం చంద్రబాబు చేస్తున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. -
ఊడిగమంతా హుష్‘ఖాకీ’ పోలీస్ నెత్తిపైనా ‘సర్దుబాటు’ పిడుగు..
‘‘డీఏ బకాయిలు చెల్లించలేదు.. ఐఆర్ ప్రకటించలేదు.. పీఆర్సీ ఇవ్వలేదు.. వీటన్నింటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లకే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఉద్యోగులు ఉద్యమ బాట పడుతుండటంతో వారిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా రాçష్టపతి ఉత్తర్వుల (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమలును తెరమీదకు తెచ్చింది.’’ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అమలు భారాన్ని భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్న పోలీసులకే కీలెరిగి వాత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నింది. రక్షక భటుల నెత్తిన సర్దుబాటు పిడుగువేసింది. హామీల అమలు, వేతనాల పెంపు, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి అనేక కీలక అంశాలపై తోటివారితో కలిసి ఖాకీలు నోరెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు సర్కారు ఆగమేఘాలపై ఉద్యోగుల విభజన ప్రక్రియ కిటుకును వాడుకుంటోంది. ప్రభుత్వ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇప్పటికే ఏపీ పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 300 మంది పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సమయం, సందర్భం లేకుండా సరైన మార్గదర్శకాలు లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 27 నెలలు గడువున్నా.. ఇప్పుడెందుకు హడావుడి.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన(సర్దుబాటు) ప్రక్రియకు రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం 27 నెలల గడువు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని మెడమీద కత్తిపెట్టి మరీ ఉద్యోగులను మానసిక వత్తిడికి గురిచేస్తోంది. తగిన సమయం ఇవ్వకుండా, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన తీవ్ర గందరగోళంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975) ముఖ్య ఉద్దేశం ‘స్థానిక అభ్యర్థుల సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను, ఉద్యోగ రక్షణను కల్పించడం’. ఆర్టికల్ 371–డీ కింద ఇచ్చే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. ఉద్యోగుల విభజన పేరుతో అన్యాయం.. వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎక్కడా నిబంధనలేదు. అయినప్పటికీ ఉద్యోగుల విభజన సాకుతో జూలై 13 నుంచి సాధారణ బదిలీలు, పదోన్నతులను, జాబ్ క్యాలెండర్‌ను నిలిపివేయడం చట్ట విరుద్ధం. అనేక శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్, సీనియారిటీ వంటి సమస్యలు పరిష్కారం కాకుండానే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగుల సేవా హక్కులు దెబ్బతింటాయి. ఉద్యోగ నియామకాలపై బ్యాన్ పేరుతో కారుణ్య నియామకాలనూ నిలిపివేయడం బాధాకరం. కారుణ్య నియామకం అనేది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ చర్య అనే బాధ్యతను విస్మరించడం దారుణం. ఉద్యోగుల విభజనలో డిమాండ్లు ఇవి.. ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ఉద్యోగుల విభజనపై ఉద్యోగ వర్గాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలను ముందుగా సేకరించాలి. పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయాలి. సీనియారిటీని పూర్తిగా రక్షించాలి. కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించాలి. ఉద్యోగులకు బదిలీ భత్యం, గృహ వసతి సహాయం అందించాలి. ఉద్యోగుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలి. హడావుడిగా సర్దుబాటుతో ఉద్యోగుల హక్కులకు భంగం..ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును హడావుడిగా చేపట్టడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావిడిగా ప్రభుత్వం ముందుకు వెళితే వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతోపాటు న్యాయపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బలవంతపు బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, కార్యాలయ మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా అయోమయం, సిబ్బంది కొరత, న్యాయపరమైన వివాదాలు, స్థానికత సమస్య, మహిళా ఉద్యోగుల ఇబ్బందులు, వైద్యం, విద్య సౌకర్యాల ఇబ్బందులు వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, మున్సిపల్, విద్య శాఖల్లో ఉద్యోగుల విభజన చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో సీనియర్లలో పురుషులు, జూనియర్లలో మహిళలు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని విభజిస్తే కొత్త జిల్లాలకు అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లను కేటాయించడం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే విధంగా వారి విభజన చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ఈవీ అమ్మకాల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాక్ యుద్ధం మొదలైన తర్వాత ఈవీల అమ్మకాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2025లో మొత్తం 30,908 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనే ఆ సంఖ్య 64,167 దాటింది. దీనిని బట్టి ఏ స్థాయిలో అమ్మకాలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇశ్రాయిల్–ఇరాక్ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడంతోపాటు అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. ఈ ఏడాది ప్రారంభంలో నెలకు 5,000పైగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇప్పుడు రెట్టింపైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తొలిసారిగా జూన్‌లో ఈవీల అమ్మకాలు 10వేల మార్కును దాటడమే కాకుండా, వరుసగా జూలై నెలలో కూడా 11,974 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈవీ అమ్మకాలు మూడు రెట్లకుపైగా పెరిగి తొలిసారి లక్ష మార్కును అధిగమిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే..దేశవ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఈవీల అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది. జూలైలో ఈవీల అమ్మకాలను పరిశీలిస్తే మొత్తం విక్రయాల్లో 4 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. దేశంలో ఈవీ అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 47,062 వాహనాల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి.రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కొరతమన రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచడానికి ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ–2024–29ని తీసుకొచ్చినా మౌలిక వసతులు మాత్రం కల్పించలేదు. దీంతో ఈవీ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగితే ఈవీ అమ్మకాలు మరింత పెరుగుతాయని వ్యాపారాలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో చార్జింగ్ చేసుకునే వారికి యూనిట్‌కు రూపాయికిపైగా సబ్సిడీ ఇస్తున్నారు. అందువల్లే ఆ రాష్ట్రంలో ఈవీల అమ్మకాలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా సోలార్ విద్యుత్ అందుబాటులో ఉన్న సమయంలో ఈవీల చార్జింగ్‌పై రాయితీ ప్రకటించాలని కోరుతున్నారు. -
పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ఎత్తు 45.72 మీటర్లు కాదు.. 41.15 మీటర్లేనని కేంద్రం పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఆమోదించామని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించామని స్పష్టం చేసింది. అందులో 2024–25లో రూ.5,512.40 కోట్లు, 2025–26లో రూ.2,810.22 కోట్లు వెరసి రూ.8,322.62 కోట్లు విడుదల చేశామని తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం గాŠయ్ప్–1, గ్యాప్–2లతోపాటు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తు వరకూ స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్ డ్యాం వంటి సివిల్ పనులు పూర్తి చేసేందుకు అయ్యే వ్యయంతోపాటు.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు), సాంకేతిక పత్రాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ పరిశీలించాకే నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 7.20 లక్షల ఎకరాలకు కాదు 1.98 లక్షల ఎకరాలకే పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు, కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు.. అదీ గోదావరికి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టంగా చెబుతున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపు, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించే అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు. ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే అరకొరగా విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అంటే.. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. పోలవరానికి ఉరేసిన చంద్రబాబు సర్కారుజలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా దీని నిర్మాణం చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొని, అనేక అవకతవకలు, అరకొర పనులతో ప్రాజెక్టును నీరుగార్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును దారిలోకి తెచ్చి , నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్ వేను పూర్తి చేశారు. వైఎస్ జగన్ వినతిమేరకు 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఉరేశారని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదించగా.. అదే కేబినెట్లో సభ్యునిగా ఉన్న టీడీపీ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. -
పచ్చ బ్యాచ్ రౌడీయిజం
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది.. అధికార మదంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు... ఉన్మాదంతో నీచాతి నీచానికి ఒడిగట్టారు... మునుపెన్నడూ లేనివిధంగా నిరసన శిబిరాలపై పాశవిక దాడులకు తెగబడి, దారుణ ఘటనకు పురిగొల్పి విష సంస్కృతికి తెర తీశారు. మహాత్ముడు జన్మించిన దేశంలో నిరసన తెలియ చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును కిరాతకంగా కాలరాశారు. నిరసన శిబిరాలపై దాడులకు తెగబడి దౌర్జన్యం చేయడం.. విజయవాడలో ఏకంగా బాటిల్లో మూత్రం తీసుకొచ్చి పైశాచికంగా శిబిరంలో ఉన్నవారిపై చల్లడం.. నడిరోడ్డుపై రౌడీయిజానికి దిగడం.. కానీ దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం.. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయడం.. యువతకు రెండేళ్లుగా ఎగ్గొడుతున్న నిరుద్యోగ భృతి చెల్లించడం.. మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై సీబీఐతో విచారణ.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు దమనకాండకు పాల్పడింది. మెగా డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అర్హులను వెనక్కి నెట్టి పోస్టులను అమ్ముకోవటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వతేదీ నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమిస్తోంది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ యువజన–విద్యార్థి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండటంతో తన కుమారుడి రాజకీయ భవిత అంధకారంలో పడుతుందని బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులు, పోలీసులను రంగంలోకి దించారు. ఖాకీల అండతో పచ్చమూకలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. పలు ప్రాంతాల్లో నేరుగా శిబిరాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో నిమగ్నమైన పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాయడంపై యువత మండిపడుతోంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను భగ్నం చేసేందుకు యత్నించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు పీకేస్తున్న టీడీపీ మూకలు బ్రాహ్మణనేత మల్లాది శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి!బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో పాల్గొన్న నిరసన దీక్ష శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరిన పచ్చమూక అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా మూత్రం పోసి రెచ్చిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం ఏర్పాటైంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో కలసి దుర్భాషలకు దిగారు. టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏమిటి..? లోకేశ్, చంద్రబాబును తిడితే తోలు తీస్తామంటూ ఎమ్మెల్యే బొండా టెంట్ పీకేయడంతో ఆయన వెంట వచ్చిన అనుచరులు మరింత చెలరేగిపోయారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో శిబిరంలో ఉన్నవారిపై దాడి చేశారు. ముందుగానే బాటిల్లో తెచ్చుకున్న మూత్రాన్ని శిబిరంలో ఉన్నవారిపై చల్లి భీతావహ పరిస్థితి సృష్టించారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే గానీ టీడీపీ మూకలను నిలువరించే యత్నం చేయలేదు. ఓ మహిళా కార్యకర్త టీడీపీ జెండా కర్రతో మల్లాది విష్ణు చేతిపై దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి ధర్నా చౌక్‌కు తరలించడంతో అందులో కూర్చునే సాయంత్రం వరకు నిరసన తెలిపారు.టీడీపీ మూకల దాడిపై వైఎస్సార్సీపీ నిరసన..టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రుహుల్లా, నగర మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్‌లో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత ఆందోళనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ టీడీపీ మూకల నుంచి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబును కలిసిన మర్నాడే బొండా బరి తెగింపు..సీఎం చంద్రబాబు వద్దకు తన కుమారులను వెంటబెట్టుకుని వెళ్లిన మరుసటి రోజే ఎమ్మెల్యే బొండా ఉమ ఈ దమనకాండకు తెగబడటం గమనార్హం. తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితాన్ని రక్షించుకునేందుకే బొండాను ఉసిగొల్పినట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో కాపు నేతలనే చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారు. గతంలో గుడివాడ, మాచర్ల ఘటనల్లోనూ బొండా ఉమను పంపి దాడులకు పురిగొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్‌పై నమోదైన కేసులన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం గమనార్హం. చంద్రబాబు తన రాజకీయ కుతంత్రంతో కాపు యువతను వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.⇒ గుంటూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, తాడిపత్రి, బాపట్ల తదితర ప్రాంతాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించి దీక్షలను అడ్డుకునే యత్నం చేశారు. మాచర్ల, గురజాలలో పోలీసుల ఓవరాక్షన్‌పై వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు బెదిరింపులకు దిగారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించగా.. అక్రమ కేసులకు భయపడేది లేదని పిన్నెల్లి తేల్చి చెప్పారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ⇒ రేపల్లె, పలమనేరు, చిలకలూరిపేట, వేమూరు, పొన్నూరులో రిలే దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాలను తొలగించే యత్నాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరోధించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉదయాన్నే కూల్చి వేశారు. కనిగిరి ఇంఛార్జ్ నారాయణయాదవ్‌ను పోలీసులు ఈడ్చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో దీక్ష టెంట్‌ను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన రిలే దీక్షలను దర్గామిట్ట పోలీసులు అడ్డుకున్నారు. 24 గంటల్లోగా బొండా ఉమాను అరెస్టు చేయాలిలేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉ«ధృతం చేస్తాం: మల్లాది విష్ణు టీడీపీ జెండాతో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, తదితరులపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: పోలీసులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షకు అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? శిబిరం గురించి మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే మాపై దాడికి వస్తున్నట్లు ఒక గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈ విషయం సీఐ సహా పై అధికారులందరికీ చెప్పాం. ధర్నా చేస్తుంటే టెంట్ పీకాల్సిన అవసరం ఏమిటి? రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు వేశారు. మహిళలపై దాడి చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు.. ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాం అంటూ బెదిరింపులు! ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదు. మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు. సీఎంవో డైరెక్షన్లో..ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులు, రౌడీ మూకలతో వచ్చి దాడికి తెగబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, కుళ్లు పట్టిన పదార్థాల్లో మూత్రం పోసి వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలపై విసిరి రాక్షసానందం పొందారు. దాడి చేస్తున్న బొండా ఉమా రౌడీ మూకలను పోలీసులు అడ్డుకోకుండా, మౌనంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా డైరెక్షన్ రావడం వల్లే పోలీసులు దాడిని అడ్డుకోలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యమధర్మరాజు స్కిట్ రూపంలో వినూత్నంగా రిలే నిరాహార దీక్ష.. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఈ దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? డీఎస్సీలో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. శాంతియుత దీక్షపై భౌతిక దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై 24 గంటల్లోగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉ«ధృతం చేస్తాం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు గుండె సుందర్‌పాల్, వరలక్ష్మీ, మాన్యం జగదీష్ ఎస్ఎన్ పురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
వైఎస్ జగన్‌ను ఎలా అడ్డుకుందాం?
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యమంపై బురద చల్లండి..! తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్‌జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి పవన్ డుమ్మామంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. -
ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ‘రెడ్‌బుక్’ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. మెగా డీఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడడం, భారతి సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూపు వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను అధికారమదంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వివరించింది. వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాలివే..పెచ్చుమీరిన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్షసాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత రెండు నెలల్లోనే నాలుగు లాకప్ డెత్‌లు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో భారీ అక్రమాలు టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్‌షాకు వివరించారు. ఆయా అక్రమాలపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. భారతి సిమెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఫ్రెంచ్ గ్రూపు వికాట్, భారతి సిమెంట్స్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అ్రల్టాటెక్ సిమెంట్స్ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై ఆందోళన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరవైందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ, పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీసిందని చెప్పారు. గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధానాంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. -
డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు
సాక్షి,అమరావతి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్ర, శనివారాల్లో (7, 8 తేదీల్లో) అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపునిచి్చంది. అలాగే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 10న నిర్వహించే ర్యాలీలు ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. -
విద్య, వైద్యం ఇక ప్రైవేట్‌కే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్‌కు అప్పగిస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం చట్టం తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పీపీపీ విధానం – 2026 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి అనంతరం మీడియాకు వెల్లడించారు. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో ఉండగా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి వేగంగా పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. కేబినెట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా.. » మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిమిత్తం గతంలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019 ఉపసంహరణకు ఆమోదం. » శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో 2 ఎకరాల భూమి చొప్పున తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున 99 ఏళ్లు అప్పగించేందుకు ఆమోదం. » శాసనసభ, హైకోర్టు భవనాల కోసం కన్సల్టెన్సీ ఫీజుల కింద రూ.206.59 కోట్లు చెల్లించేందుకు సవరించిన పాలనా అనుమతికి ఆమోదం. » 2026–27లో రైతులకు యాన్యుటీల చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.300 కోట్ల రుణాన్ని పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు ఆమోదం. » రాజధానిలో ‘అమరావతి ఐ’ అభివృద్ధి టెండర్ తిరిగి పిలిచేందుకు అనుమతి. » రెండో దశ భూ సమీకరణ కింద పల్నాడు జిల్లా వైకుంఠపురంలో దేవదాయ ఈనాం భూముల వివాదాలను పరిష్కరించేందుకు రూ.122.20 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం. » 2027 గోదావరి పుష్కరాల్లో 238 స్నాన ఘట్టాల పనుల కోసం రూ.210.06 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల భూమిలో, ఎర్రుపాలెం – నంబూరు మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చేపట్టేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి. » శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ కింద 400.500 కి.మీ నుండి 485.300 కి.మీ వరకు ప్రధాన కాలువకు సంబంధించి మిగిలిపోయిన ఐదు పనులకు రూ. 600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు. » అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా ట్విన్ ఆఫీస్ టవర్స్ నిర్మాణాన్ని ఎల్–1 బిడ్డర్‌కు ఇచ్చేందుకు ఆమోదం. » ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్.. హడ్కో మంజూరు చేసిన రూ.680.21 కోట్లు టర్మ్ రుణం పొందేందుకు ఆమోదం. » రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆమ్నిబస్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం, 2026 రూపకల్పనకు ఆమోదం. » ఆక్వా కల్చర్ ఫామ్‌లకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ రాయితీ 01.06.2026 నుంచి పొడిగించేందుకు ఆమోదం. » నూతన జిల్లాల పరిధికి అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. దీంతో పట్టణాభివృద్ది సంస్ధలు 21 నుంచి 23కు పెరగనున్నాయి. » నూతన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను సృష్టించడానికి ఆమోదం. -
ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగానే..!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపుప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఆ శ్వేతపత్రం అబద్ధాల పుట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, ఒక అబద్ధాల పుట్ట అని కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కాగ్, ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో ఇట్టే అర్థం అవుతోందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు విషంకక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. అన్నీ కాకిలెక్కలే.. ‘‘రెండేళ్లలో సూపర్ సిక్స్ పథకాల ఖర్చు రూ.31,483 కోట్లే. వాస్తవంగా ఖర్చు చేయాల్సింది రూ.2,39,628 కోట్లు. అంటే మొత్తం హామీల అమలు ఖర్చులో అది 13 శాతమే. తల్లికి వందనంలో రూ.15 వేలకు బదులు రూ.13 వేలు అంటూ.. రూ.8 – 9 వేలే ఇచ్చారు. డ్వాక్రా రుణ పరిమితి పెరగలేదు. సున్నా వడ్డీకి నిధులివ్వరు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. రూ.14 లక్షల కోట్లు అన్నారు. పుస్తకాల గణాంకాల్లో చూస్తే రూ.6.46 లక్షల కోట్ల అప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వాడేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ రంగం ఆదాయంపైన, తలసరి ఆదాయంపైనా చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు. కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైంది. జీఎస్డీపీ వృద్ధి నాడు వైఎస్సార్సీపీ హయాంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉండేది. అయినా విధ్వంసం అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికే చంద్రబాబు కుట్ర. అందుకే జీతభత్యాలపై అసత్యాలు, తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని అబద్ధాలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఇదే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం కోసం ఏకంగా రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఏపీకి రూ.1.78 లక్షల కోట్లు పీపీపీ విధానంలో వచ్చాయి. ఇందులో 41 శాతం పెట్టుబడులు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. 30 శాతం ప్రీ డీపీఆర్ స్థాయిలో ఉన్నాయి. కేటాయించినవి ఐదు ప్రాజెక్టులు మాత్రమే. మరో రూ.14 వేల కోట్లు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు మాత్రమే. ఇవి ఏ రకంగా మీ ఘనతో చెప్పాలి’’ అని దువ్వూరి పేర్కొన్నారు. ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కంటే చంద్రబాబు ప్రభుత్వమే ఎక్కువ వడ్డీకి రుణాలు తెస్తోందన్నారు. అబద్ధాల శ్వేతపత్రం పేరుతో డ్రామా చేశారని ఆయన వివరించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ గిరిజన నేతలు
సాక్షి, తాడేపల్లి: గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆదివాసీల తరఫున బలమైన ప్రజాగొంతుకగా నిలవాలని పార్టీ ఎస్టీ సెల్ నాయకులకు సూచించారు.వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు పార్టీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికను బహూకరించారు.ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నంబర్–3 పునరుద్ధరణ, 1/70 చట్టంపై గిరిజనేతరులు దాఖలు చేసిన కేసులు, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళన తదితర అంశాలను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. ఆయా అంశాలపై వారితో విపులంగా చర్చించిన వైఎస్ జగన్.. ఆదివాసీల ప్రయోజనాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్–97ను రద్దు చేసి ఆదివాసీల హక్కులకు రక్షణగా నిలిచిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలని వైఎస్ జగన్ సూచించారు. గిరిజనుల చట్టాలు, హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నారు.కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన చట్టాలు, హక్కుల భద్రతపై ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమానికి లభించిన స్పందనే గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ తరఫున నిరంతరం పోరాటం చేయాలని, ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఎక్కడా రాజీపడవద్దని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు ఎస్టీ సెల్ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు.ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదుఅమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం.. వైఎస్ జగన్ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు వివరించారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఎంపీలు.. ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘ఎన్ఆర్ఐ మహిళను వేధించిన ఆ మంత్రిపై చర్యలేవీ?’
సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్‌లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్‌కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..అమెరికాలోని డల్లాస్‌లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు. -
దీక్షా శిబిరంపై బోండా ఉమ దాడి.. డీజీపీ ఆఫీసుకి వైఎస్సార్సీపీ నేతలు
తాడేపల్లి: ఏపీ డీజీపీ కార్యాలయానికి గురువారం వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, తదితరులు ఉన్నారు. విజయవాడలో పార్టీ దీక్షా శిబిరంపై బోండా ఉమ చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులపై నేతలు ఫిర్యాదులు చేయనున్నారు. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల వైఫల్యాలపై కూడా ఫిర్యాదు చేశారు.అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ... ‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై దీక్షలు చేస్తుంటే టెంట్లు పీకేస్తున్నారు. పోలీసులే ఇలా వ్యవహరించటం దారుణం. విజయవాడలో బోండా ఉమ తన మనుషులతో దాడులు చేశారు. కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? రాక్షస పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. నిన్న దేవరపల్లికి జగన్ వస్తే తొలుత అన్ని పర్మిషన్ లు ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రి పోలీసులను విత్ డ్రా చేసుకున్నారు. జగన్ పర్యటనలో ఎక్కడా ఒక్క పోలీసు కూడా లేడు. మాజీ సీఎం పర్యటనకు వెళ్తే ఎందుకు అన్ని కుట్రలు? వీటన్నింటిపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వచ్చాం. లా అండ్ ఆర్డర్ డీజీ ఫకీరప్ప మా వినతి పత్రాన్ని తీసుకున్నారు. డీజీపీకి అందిస్తానన్నారు’’ అని తెలిపారు.టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు..లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోలీసులే మా దీక్షా శిబిరాలను తొలగించటం దుర్మార్గం. కొన్ని చోట్ల టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు. విజయవాడలో మల్లాది విష్ణు రిలే దీక్షలో కూర్చుంటే బోండా ఉమా దాడి చేశారు. దౌర్జన్యం చేసి టెంట్ పీకేశారు. కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. సీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడి జరగటం సిగ్గుచేటు.దీక్షా శిబిరం పైన మూత్రం పోయటం అమానుష చర్య. ఇవన్నీ డీఐజీకి తెలిపాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడటంపై ఫిర్యాదు చేశాం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ఫిర్యాదు చేయటానికి వస్తే డీజీపీ ఎప్పటిలాగే డీజీపీ అందుబాటులోకి రాలేదు. విజయవాడలో దాడి చేసిన వారిని వదిలేసి, మల్లాది విష్ణును అరెస్టు చేశారు. పోలీసులు తప్పుడు మార్గంలో వెళ్లవద్దు. టీడీపీ నేతల మాటలు విని తప్పు చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు.చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయవాడ ఘటన అమానవీయం. మల్లాది విష్ణుపై దాడి దుర్మార్గం. శిబిరంపై మూత్రం పోయటం అమానుష చర్య. ఇలాంటి ఘటనలను ప్రజలు సహించరు. ఈ ఘటనలపై పూర్తి విచారణ జరపాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. శిబిరాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో కనీసం 10 వేల పోస్టులను నోటిఫికేషన్లో చేర్చేలా చూడాలని కోరారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ సీఎంకు విన్నవించారు.జేఏసీ ప్రతినిధుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుందని పునరుద్ఘాటించారు. నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు: లక్ష్మీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమపై ఒత్తిడి చేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ అన్నారు. ‘‘మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. వైఎస్ జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆమె మీడియాకు వివరించారు.ఇవాళ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకులు కలిశారు. వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ జగన్‌కు హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య వివరించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. -
దిశా చట్టం రద్దు.. చంద్రబాబు కేబినెట్ నిర్ణయం
సాక్షి, అమరావతి: దిశా చట్టాన్ని రద్దు చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. దిశా చట్టం ప్రత్యేకంగా అవసరం లేదని రద్దుచేస్తున్నట్టు హోంమంత్రి ప్రకటించారు. దిశ చట్టం లేకుండానే దిశ వ్యవస్థను ఆచరణలో పెట్టినట్టు వెల్లడించారు. బిఎన్ఎస్ చట్టాలు చాలు కాబట్టి దిశ చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలను వేధించే వారికి త్వరగా శిక్షపడేలా గత ప్రభుత్వం దిశా బిల్లు తీసుకొచ్చింది. అయితే, 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును హోంమంత్రి అనిత తప్పుపట్టారు.అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్కాగా, అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,433 ఎకరాల భూ సమీకరణ చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మోతడక గ్రామంలో భూ సమీకరణ చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పేరుతో భూ సమీకరణకు నిర్ణయించింది. హైకోర్టు భవనాన్ని మళ్లీ రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 206 కోట్లతో అదనపు కన్సల్టెంట్‌ను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: పేర్నినాని
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని తెలిపారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనం రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారు. పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారు. గతంలో మేడరమెట్ల, రాప్తాడు, సత్తెనపల్లి పర్యటనల్లోనూ భద్రతా లోపాలు బయటపడ్డాయని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా?ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు!పొగాకు రైతులు గతంలో ఎప్పుడూ చూడని కష్టాలు చూస్తున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘అసలు కొనే నాథుడే లేకుండా పోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు. గత ఏడాది పరిస్థితులు చూసైనా ఈ ఏడు అయినా జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. జగన్ పొగాకు రైతుల ఇబ్బందులపై ప్రశ్నించేందుకు వెళ్లారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న జగన్ భద్రతను హోంశాఖ నిర్లక్ష్యం వహించింది. కానీ ఆయన సభలకు జనం రాకుండా అంచెలంచెలుగా ప్రజలను అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ అన్ని దారుల్లో వస్తున్నారు. దేవరపల్లి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో జనాన్ని లోపలకి రానీయకుండా బారికేడ్లు పెట్టడానికి వందల మంది పోలీసులు ఉంటారు.చంద్రబాబు పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకోవటం దారుణం. డీజీపీ అయినా పోలీసులను మందలించలేదు. ఈ రెండేళ్లలో భద్రతా లోపాలు అనేకసార్లు కేంద్రానికి పంపాం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా డీజీపీ స్పందించలేదు. అనంతపురం జిల్లా లో హెలికాఫ్టర్ దగ్గర భద్రత లేక విండ్ షీల్డ్ పగిలితే పైలెట్లను వేధించారు.గతంలో ఇలాగే చేసి ఉంటే మీరు తిరగ గలిగేవారా? ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందని జనం మాట్లాడుకుంటున్నారు. జగన్ చేస్తుంది రాజకీయ పర్యటనలు కాదు. ప్రజల కష్టాలు చూడటానికే ఆయన వెళ్తున్నారు. సిగ్గులేకుండా బాధ్యత లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనల్లో తొక్కిసలాటలు జరగాలి అని చూస్తున్నారు. జగన్ పర్యటనపై లోకేశ్ ట్వీట్ పెట్టి అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ శ్రేణులు ఒక దుకాణం పగులగొట్టి హిందూ దేవుడి ఫొటో పగులగొట్టారని ట్వీట్ చేశారు.మరి సింహాచలం, తిరుపతి, శ్రీకాకుళం ఘటనల్లో పలువురు మృతి చెందారు.. మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మీ ఆత్రమే తప్ప.. ఈ ప్రభుత్వం బతికేది లేదు. మీ ప్రభుత్వం పోవాలని టీడీపీ కార్యకర్తలే పూజలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో కమ్మలు, కాపులు కూడా ఏడుస్తున్నారు. ఏపీలో అవినీతి చేయటానికి దేన్నీ వదలటం లేదు. దుకాణదారురాలు లక్ష్మీ వైసీపీ అభిమాని కాబట్టి మీ పప్పులు ఉడకలేదు’’ అని తెలిపారు.విజయ్‌కు జనాన్ని దూరం చేయగలిగారా? తమిళనాడులో విజయ్ సభలో ఏదో చేద్దామని ఆయన ప్రత్యర్థులు చూశారని అక్కడ ఏం సాధించారని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘విజయ్‌కు జనాన్ని దూరం చేయగలిగారా? సీఎం కాకుండా ఆపారా ? మీకు కూడా అదే గతి రాదా? సత్తెనపల్లి జగన్ పర్యటనలో కూడా ఇదే తరహాలో చేశారు. రెండేళ్లలో ఓటు వేసిన ప్రభుత్వాన్ని కూల్చే అధికారం లేదు కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు. పోలీసులను జగన్ భద్రతకు వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ మావిగన్ దెబ్బకి అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిపి ఉంచుతాం అంటున్నారు’’ అని తెలిపారు. -
వైఎస్ జగన్‌ని కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు ఇవాళ(గురువారం) కలిశారు. తమ హోటల్ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని హోటల్ నిర్వాహకురాలు లక్ష్మీ ఖండించారు. వైఎస్ జగన్ పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందన్న లక్ష్మీ.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే తమ కుటుంబం లబ్ధిపొందిందని హోటల్ నిర్వాహకులు అన్నారు.టీడీపీ నేతలు మాపై ఒత్తిడి చేశారు. మా షాపులో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది. ఇవాళ వైఎస్ జగన్‌ని కలిసినందుకు ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు. -
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
వైఎస్సార్సీపీ గర్జనతో టీడీపీలో వణుకు
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కూటమి ప్రభుత్వం బెదిరిపోయింది. ఈ క్రమంలోనే.. పోలీసులను ప్రయోగించింది. అయినా పోరాటం ఆగకపోవడంతో నేరుగా టీడీపీ గుండాలను రంగంలోకి దించింది. డీఎస్సీ అవకతకవలపై పోరాటాలను వైఎస్సార్సీపీ ఉదృతం చేసింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ.. నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలతో కలిసి పార్టీ యువజన విభాగం ఆధ్వరంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు ఈ దీక్షలు మొదలయ్యాయి. అయితే లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాల చేశారు. అంతటితో ఆగకుండా.. టెంట్లను సైతం పీకేసి వెళ్లిపోయారు. అయితే.. పలు చోట్ల దీక్షలు సజావుగా సాగడంతో కూటమి ప్రభుత్వం భరించలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలను దీక్షా శిబిరాలపైకి ఉసిగొల్పింది. దీంతో రాష్ట్రంలో పలు దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇందుకు విజయవాడలో జరిగిన దౌర్జన్యకాండే ఉదాహరణగా నిలిచింది. విజయవాడలోని దీక్షా శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా దాడి చేశారు. కొందరు వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేశారు. మహిళా జర్నలిస్టులను, పోలీసులను కూడా వదలకుండా దాడులు చేశారు. మరో అడుగు ముందుకు వేసి.. ఓ అనుచరుడు నీచంగా ప్రవర్తించాడు. దీక్షా శిబిరం పై నుంచి అక్కడున్నవాళ్లపై మూత్రం పోశాడు. ఏపీలో ఇవాళ చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆ సమయాల్లో.. పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న నిరసనలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ప్రేక్షక పాత్ర వహించారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. అయితే.. ఏం జరిగినా తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ అంటోంది. అరెస్టులు.. దాడులు తమని ఆపవని అంటోంది. డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని.. చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని కుండబద్దలు కొడుతోంది. -
అవినీతి ‘సేతు’లతో అనవసర సంతకం
సీతానగరం–కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ 1.1 కి.మీ.ల పొడవున నిర్మాణానికి డీపీఆర్ తయారీకి టెండర్లుఅమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం లక్ష్యమంటూ ప్రభుత్వం అబద్ధాలు!ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్‌లో ప్రకాశం బ్యారేజీకి ఎగువన నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణందానికి ఎగువన అమరావతితో హైదరాబాద్ రహదారిని అనుసంధానిస్తూ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికీ డీపీఆర్ తయారీకోల్కత–చెన్నై రహదారిని రాజధానిని అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణఇక సిగ్నేచర్ బ్రిడ్జి అవసరమేముందని ప్రశ్నిస్తున్న నిపుణులుప్రకాశం బ్యారేజీ దిగువన ఇప్పటికే 1.5 కిమీల పరిధిలో 3 రైల్వే బ్రిడ్జిలు, రెండు రోడ్డు బ్రిడ్జిలుఆరో బ్రిడ్జిగా సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వదిలే వరద ప్రవాహానికి అడ్డంకేనంటున్న నిపుణులుగరిష్ట స్థాయిలో వరద వస్తే.. వెనక్కి ఎగదన్ని బ్యారేజీ భద్రతకే ముప్పు అంటూ హెచ్చరికఅధిక వడ్డీలకు అప్పు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీతఅస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్ల వసూలుకే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారంటూ విమర్శలుసాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై సీతానగరం(కుడి గట్టు)–కనకదుర్గ ఫ్లైఓవర్(ఎడమ గట్టు)ను అనుసంధానిస్తూ సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈనెల 26వ తేది. అదే రోజున సాంకేతిక బిడ్, 27న ఆరి్థక బిడ్ తెరిచి, డీపీఆర్ తయారీ పనులు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనుంది. ఆ డీపీఆర్ తయారీకి మూడు నెలలు గడువు విధించింది. ఆ డీపీఆర్ ఆధారంగా సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణ పనులకుటెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్‌కు అప్పగించనుంది. అమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈ సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతిని కోల్‌కత్–చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)ను అనుసంధానిస్తూ.. సీడ్ యాక్సిస్ రోడ్డును కనకదుర్గ వారధి వరకూ విస్తరించే పనులు ఇప్పటికే చేపట్టింది. ఇటు ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతికి రాకపోకలు సాగించడానికి వీలుగా కరకట్ట రోడ్డు(ఈ–1)ను రెండు వరుసల రహదారిగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశి్నస్తున్నారు. అస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అమరావతికి ఎన్‌హెచ్–65తోనూ ఇప్పటికే అనుసంధానం విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌ను రాజధాని అమరావతి మీదుగానే ఎన్హెచ్ఏఐ నిర్మించింది. ఈ బైపాస్‌లో అంతర్భాగంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన రెండు రెండు వరుసల బ్రిడ్జిలను నిరి్మంచింది. వెస్ట్రన్ బైపాస్ ద్వారా అటు ఎన్‌హెచ్–16.. ఇటు ఎన్‌హెచ్–65(విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి)కి చేరుకోవచ్చు. ఇక రాజధాని అమరావతిని.. ఎన్‌హెచ్ 65ను అనుసంధానిస్తూ.. రాజధానిలో ఎన్–13 రోడ్డును మూలపాడు వద్ద ఎన్‌హెచ్–65తో కలుపుతూ కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికే ఇప్పటికే రూ.4.81 కోట్లు చెల్లించి నిప్పాన్ కోయి సంస్థ ద్వారా డీపీఆర్‌ను ఏజీఐసీఎల్ తయారు చేయించింది. ఆ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్‌హెచ్–65ను రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ కొత్తగా కృష్ణా నదిపై ఎలాంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాజధాని అమరావతిని ఇటు విజయవాడతోనూ అటు ఎన్‌హెచ్–65తోనూ అనుసంధానం చేయడానికి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై బ్రిటిషు సర్కార్ హయాంలో నిరి్మంచిన రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. అది వాడుకలో లేకపోయినా ఆ బ్రిడ్జి స్తంభాలు(పియర్స్) ఇప్పటికీ ఉన్నాయి. రెండు రైల్వే బ్రిడ్జిలను రైల్వే శాఖ నిర్మించింది. వాటికి కొంత దూరంలోనే ఎన్‌హెచ్–16లో అంతర్భాగంగా కృష్ణా నదిపై రెండు రోడ్డు బ్రిడ్జిలను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మంచింది. ఈ ఐదు బ్రిడ్జిలు ప్రకాశం బ్యారేజీ దిగువన 1.5 కిమీల దూరంలోనే విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాదించిన సిగ్నేచర్ బ్రిడ్జి ఆరోది. కృష్ణా నదికి గరిష్ట స్థాయి వరద వచి్చనప్పుడు అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తారు. ఆ వరద ఉద్ధృతికి బ్రిడ్జిల స్తంభాలు అడ్డంకిగా మారుతాయని.. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి మట్టం పెరిగి.. వరద వెనక్కి ఎగదన్నే ప్రమాదం ఉంటుందని.. ఇది ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పుగా మారుతుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం సార్.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు.. గిట్టుబాటు ధరా దక్కడం లేదు.. ఆత్మహత్యలే శరణ్యం సార్..’ అంటూ పొగాకు రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం కారణంగా మద్దతు ధర దక్కక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకుకు కనీస గిట్టుబాటు ధర దక్కక ఇక్కట్లు పడుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడానికి బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడగానే కష్టాలు ఏకరువు పెట్టారు. ‘ఈ పాలన ఏం బాగోలేదన్నా.. మీరొస్తేనే రైతు రాజ్యం వస్తుందన్నా.. మీ హయాం అన్నదాతలకు స్వర్ణ యుగం అన్నా..’ అంటూ తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతల ఆవేదన వారి మాటల్లోనే..మీరొస్తున్నారని రూ.10 పెంచారుపొగాకు రైతులు మిమ్మల్ని అమరావతిలో కలిశాక.. మీరు దేవరపల్లి వస్తున్నారని తెలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం కిలోకు రూ.10 మద్దతు ధర పెంచింది. అయితే గ్రేడింగ్ పేరిట వ్యాపారులు ఆ మేరకు అంటే రూ.10 తగ్గించేశారు. ఈ ప్రభుత్వ మాయాజాలం ఇలా ఉంటోంది. ప్రస్తుతం కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ ధర రూ.230 కూడా రావడం లేదు. ఎకరాకు రూ.3 లక్షలపైనే ఖర్చవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును సైతం కిలో రూ.230కే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సిండికేట్ వ్యాపారులకే మేలు జరుగుతోంది. సామాన్య రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – జక్కుల భద్రం, కౌలు రైతు, దేవరపల్లిమన ప్రభుత్వంలో యావరేజ్ రూ.365 అన్నా.. మన ప్రభుత్వంలో దేవరపల్లి బోర్డు పరిధిలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.385 దక్కింది. యావరేజ్‌గా రూ.365 దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచేసుకుంటున్నారు. కిలోకు ఒక్కోసారి రూ.170 కూడా దక్కడం లేదు. గరిష్టంగా రూ.260 దాటడం లేదు. 20 ఎకరాల్లో పంట సాగు చేశాను. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాను. – సుంకవిల్లి వెంకట శ్రీనివాసరావు, సంగాయి గూడెం, దేవరపల్లి‘వడ్డీ లేని రుణం’ పథకం తీసేశారుమీరు దేవరపల్లి పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు హడావిడిగా రూ.50 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తానని ప్రకటించాడు. ఆ రూ.50 వేలు మూడేళ్లలో ఇస్తారంట. మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.లక్ష వడ్డీ లేకుండా రుణాలిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. రైతులు వ్యవసాయం మానేసేలా చేస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, గోపాలపురంమీరొస్తేనే మంచి రోజులుకేజీ పొగాకు సాగు చేసేందుకు రూ.300 ఖర్చవుతుంటే... ఇక్కడ యావరేజ్‌గా రూ.230కే కొంటున్నారు. లో గ్రేడ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గించేయమంటున్నారు. టొబాకో బోర్డు గతంలో ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లు కొంటామని చెప్పి.. ప్రస్తుతం 20 క్వింటాళ్లే కొంటామంటోంది. వచ్చే ఏడాది పది క్వింటాళ్లే కొంటామంటున్నారు. రైతులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా కోసం వచ్చారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి. – వైఎస్ జగన్‌తో పలువురు రైతులు -
జెన్‌జీ.. ప్రభంజనం దేవరపల్లిలో జన జాతర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనకు ప్రజలు, యువత బ్రహ్మరథం పట్టారు. దేవరపల్లి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.29 గంటలకు దేవరపల్లి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పొగాకు వేలం కేంద్రానికి కేవలం 2.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ మాత్రం దూరానికి 2 గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున యువత, ప్రజలు, అభిమానులు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. పర్యటన సాగిన మార్గమంతా యువత, అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జన సంద్రమే కనిపించింది. దారిపొడవునా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. జగన్ పర్యటనకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. ఉరకలేసిన జెన్ జీ వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జెన్‌జీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే ‘జై జగన్.. సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మిద్దెలు, చెట్లెక్కిన అభిమానం వైఎస్ జగన్‌ను చూసేందుకు యువత, అభిమానులు చెట్లెక్కారు. మహిళలు మిద్దెలెక్కి మరీ జననేతను చూశారు. అడుగో.. జగన్.. అంటూ పిల్లలకు చూపించారు. జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. -
వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతోన్న రీసర్వే ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ (80) భర్త పెద్ద మల్లన్నకు 2.50 ఎకరాల భూమి ఉంది. 1962లో కటకం లక్ష్మయ్య, కటకం నరసింహులు నుంచి పెద్దమల్లన్న 26 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. అయితే 1970లో కటకం నరసింహులు ఆ భూమిని గొల్ల సంజన్నకి కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల గ్రామంలో రీసర్వే జరగ్గా..ఈ 26 సెంట్ల భూమిని గొల్ల సంజన్న కుమారులు నారాయణ, రంగస్వామి, రామాంజనేయుల పేరిట చూపించింది. దీంతో ఈరమ్మ, గొల్ల సంజన్న కుమారుల మధ్య వివాదం తలెత్తింది. 60 ఏళ్ల నుంచి తన ఆధీనంలోనే ఉన్న పొలాన్ని వారికి ఎలా ఇవ్వాలని తహశీల్దార్, వీఆర్వోకు ఈరమ్మ మొరపెట్టుకుంది. ఆమె విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరమ్మ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గొల్ల సంజన్న కుమారులు స్థానిక టీడీపీ నేతలు కావడంతో వారి పేరిట భూమి మార్పిడి చేయాలని తహశీల్దార్‌పై ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు ఈరమ్మ పేరిట ఉన్న భూమిని గొల్ల సంజన్న కుమారులకు మార్పు చేసి పాసు పుస్తకం ఇచ్చేశారు. ఆ భూమిని జూలై 30న ఆక్రమించుకోవడానికి వెళ్లి అక్కడున్న ఈరమ్మను దుర్భాషలాడి..అవమానించి.. పురుగుల మందు ఇచ్చి చావాలని ఎగతాళి చేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై వారిచ్చిన పురుగుల మందు తాగేసింది. దీంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతదేహానికి పంచనామా చేయడంలో తాత్సారం జరుగుతుండటంతో ఈరమ్మ కుటుంబ సభ్యులు బుధవారం ధర్నాకు దిగారు. దీంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి రజకులు, ప్రజా సంఘాల నేతలు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈరమ్మ చావుకు కారణమైన గొల్ల సంజన్న కుమారులు, గోనెగండ్ల తహశీల్దార్, వీఆర్వో, షాడో ఎమ్మెల్యేగా పిలవబడే ఆప్నా బజార్ శేఖర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ అక్కడికి వచ్చి ఈ ఘటనపై ఆదోని ఆర్డీవోతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ప్రతి క్లినిక్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధ, యోగా–ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు వైద్య శాఖ నిబంధనలు రూపొందించింది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడిన ప్రతి ఆయుష్ ప్రైవేట్ వైద్య సంస్థకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. సలహాలు, సూచనలకోసం ముసాయిదా నిబంధనలను ఆయుష్‌శాఖ అధికారిక వెబ్సైట్ ayush.ap.gov.in లో అందుబాటులో ఉంచామని ఆయుష్ కమిషనర్ ఆర్.గోపాలకృష్ణ ప్రకటించారు. commr-apayush@ap.gov.in ద్వారా ప్రజలు, ఆయుష్ వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు రెండు వారాల్లో అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు.ఇప్పటి వరకు అల్లోపతి ప్రైవేట్ వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–2002ను ప్రభుత్వం సవరించింది. చట్టం నంబరు 18/2026 ద్వారా ఆయుష్ వైద్య విధానాలను కూడా దీని పరిధిలోకి తెస్తూ ఏప్రిల్ 10న గెజిట్ నోటిఫికేష్ విడుదల చేసింది. సవరించిన చట్టాన్ని అమలుకు ఏపీ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రూల్స్–2026 పేరుతో ఆయుష్ విభాగం నిబంధనలు తయారు చేసింది.ఏడు విభాగాలుగా వర్గీకరణసింగిల్ డాక్టర్ క్లినిక్, పాలీక్లినిక్, 20 పడకలలోపు ఆస్పత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆస్పత్రులు... ఇలా ఏడు విభాగాలుగా ఆస్పత్రులను వర్గీకరించారు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజులపాటు చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేస్తారు. పది రోజుల్లోపు వైద్య నిపుణులతో కూడిన బృందం సంబంధిత వైద్య సంస్థను తనిఖీ చేస్తుంది. అన్ని ప్రమాణాలు ఉంటే ఐదేళ్ల కాలవ్యవధితో శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించినా, అర్హత లేని వ్యక్తులతో వైద్యసేవలు అందించినా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు రుజువైనా రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా/పూర్తిగా రద్దు చేస్తారు. -
నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డీఎస్సీలో ఉద్యోగాలు నిజమే
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కొందరు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించి డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినమాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం చెప్పారు. ఈ అక్రమాల్లో క్రీడాసంఘాలు ప్రతినిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయ అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీలో అనేక లోపాలు జరిగాయని చెప్పారు. పలు క్రీడాసంఘాలు ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. శాప్‌లో క్రీడాసంఘాల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో వారు చెప్పినట్లే శాప్ కార్యాలయంలో అంతా జరుగుతోందని విమర్శించారు. అందువల్లే నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు గురించి శాప్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు పొందినవారి సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించాలని కోరారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద పండ్లు అమ్మిన రీతిలో క్రీడాసంఘాలకు చెందినవారు క్రీడలతో సంబంధం లేనివారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మారని, ఇది బహిరంగ రహస్యమేనని చెప్పారు. బిహార్‌లో ఇలాగే జరిగితే ఫేక్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని అక్కడి ప్రభుత్వం డిస్మిస్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిందని, ఏడేళ్ల జీతాలను కూడా రికవరి చేసిందని తెలిపారు. శాప్‌ను ప్రక్షాళన చేయాలి శాప్‌లో వివిధ క్రీడాసంఘాల వారి ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. శాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సూచించారు. సమర్థులైన అధికారులను, క్రీడాస్ఫూర్తి ఉన్న వారిని శాప్ చైర్మన్, డైరెక్టర్లుగా నియమిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడాసంఘాలపైన నిషేధం విధించాలని, నకిలీ సర్టిఫికెట్లను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించిన శాప్ అధికారులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఆపరేషన్ గాండీవం అమలులో అవినీతి జరిగిందని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పారు. -
వరి సాగుచేయొద్దు.. నీళ్లు ఇవ్వలేం..!
కోడూరు: ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగాల్సిన వేళ సాగునీటి సమస్యపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీని కలిసి వినతిపత్రం అందించిన రైతులకు ఊహించని సమాధానం ఎదురైంది. నీళ్లు ఇవ్వలేమని, రైతులు ఎవరూ వరి సాగు చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ బాలాజీ బుధవారం కోడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చిన కలెక్టర్‌ను మండలానికి చెందిన పలువురు రైతులు, రైతు సంఘ నేతలు కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీరు పూర్తిగా తాగునీటి అవసరాలకూ సరిపోకపోవచ్చని, పంటలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పారు. సాగునీటి కోసం రైతులు ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. కుటుంబాలను ఎలా పోషించాలి? కలెక్టర్ వ్యాఖ్యలతో తీవ్ర నిరాశకు గురైన రైతులు ‘వరి వేయుద్దని చెబుతున్నారు. సరే. మరి మా కుటుంబాలను ఏవిధంగా పోషించాలి?’ అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఒకవైపు కాలువల వద్ద పూజలు నిర్వహించి నీటి విడుదల కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేస్తూ, మరోవైపు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం ఏమిటని, ఇప్పటికే సాగు ప్రారంభించిన పంటల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం దాటవేశారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుము వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. సాగునీరు అందించే పరిస్థితి లేకపోతే కనీసం పరిహారమైనా ప్రకటించాలని అన్నదాతలు కలెక్టర్‌ను కోరారు. అయితే పరిహారంపై కలెక్టర్ నోరు మెదపకుండా, స్పష్టమైన హామీ లేదా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతు సంఘ జిల్లా నేతలు ఆవుల బసవయ్య, రేపల్లె యోగప్రకాష్ ఉన్నారు.కలెక్టర్ రైతులతో మాట్లాడే సమయంలో వీడియోలు తీయవద్దంటూ విలేకరులకు సిబ్బంది హుకుం జారీ చేయడం గమనార్హం. -
బాబు పాలన 'రైతులకు హానికరం'
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో సుమారు 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.– వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు ధర సగటున రూ.289 ఉంటే ఇప్పుడు రూ.214 మాత్రమే పలుకుతోందని.. ప్రతి కిలోపై రైతు రూ.75 చొప్పున నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ.411 పలికితే.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఉందని, ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పీఐబీ’ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలని తెలిపారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతుంటే.. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదన్నారు. పొగాకు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని.. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగా సర్కారు తీరుతో నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. పొగాకు సాగు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులకు అందుతున్న ధర, ఎదుర్కొంటున్న సమస్యలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఇక్కట్లు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...అన్నింటా విధ్వంసం.. ప్రశ్నిస్తే అరెస్టులు చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు.. మహిళా సాధికారత.. సుపరిపాలన.. అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. బాబు పాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే.. ఎవరైనా అన్యాయానికి గురైన పరిస్థితుల్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే కనిపిస్తాయి. రోడ్డెక్కుతున్న రైతులు.. చంద్రబాబు నాయుడు పార్టీ అంటే.. వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా మిగిలిందా..? అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా..? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ.. చివరకు ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ రోజు నేను దేవరపల్లికి వచ్చి పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. పొగాకు పంటను తీసుకున్నా.. ఇవాళ కనిపిస్తున్నది సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డున పడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు జంగారెడ్డిగూడెం సమీపంలోని బుట్టాయగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు అన్న కుటుంబం నా కళ్ల ఎదుటే నిలబడి ఉంది. ఆ అన్నకు రెండు బ్యారెన్లు ఉన్నాయి. పది ఎకరాల్లో పంట సాగు చేసి.. గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ అన్న భార్య ఈ రోజు నా ఎదుట నిలబడి ఉంది. ఆ అమ్మ ఆక్రందన వినేందుకు, పరామర్శించేందుకు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ వెళ్లలేదు. రేట్లు అన్యాయంగా పడిపోతున్నా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది. నాడు పొగాకుకు అత్యధికంగా రూ.411.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఒక్కసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని గుర్తు చేసుకుందాం. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి పొగాకు సగటు ధర కిలోకు రూ.289 చొప్పున లభించింది. అత్యధిక ధర కిలో రూ.411 చొప్పున కొనుగోలు జరిగింది. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 2025 జనవరి 1న అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన గణాంకాలివీ. ఇవాళ పరిస్థితి చూస్తే.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి రాష్ట్రంలో కిలో పొగాకు సగటు ధర కేవలం రూ.214 మాత్రమే. ఎక్కడ రూ.289?.. ఎక్కడ రూ.214? అంటే.. ఒకప్పుడు రూ.289 వచ్చిన చోట ఇప్పుడు రూ.214 మాత్రమే వస్తోంది. ప్రతి కిలోపై రైతు సుమారు రూ.75 నష్టపోతున్నాడు. ఇదే ఉత్తరాది ప్రాంతంలో, ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు కిలో సగటు ధర రూ.326 పలికింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ సగటు ధర కేవలం రూ.236కి పడిపోయింది. ఖర్చులు పెరిగాయి.. ధరలు పతనం ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తరాదిలో 12 శాతమే కొనుగోలు.. ఈ ఉత్తరాది ప్రాంతంలో సుమారు 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. 105 రోజుల వేలం ముగిసే సమయానికి కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే పండించిన పంటలో సుమారు 12 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. టొబాకో బోర్డు రైతులకు గ్యారెంటీ ఇస్తూ లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. పంట వేయండి, మేం కచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పింది. 49.70 మిలియన్ కిలోలు టార్గెట్‌గా నిర్థారించి కొనుగోలు చేస్తామని చెప్పింది. వాళ్లు కొంటామని చెప్పిన తరువాతే రైతులు పంటలు వేశారు. ఆ హామీని నమ్మి సాగు చేశారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు జరగడం లేదు. దేవరపల్లి వై జంక్షన్ వద్ద వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహినిలో ఓ భాగం పొగాకు రైతులకు దుర్భర పరిస్థితి.. రాష్ట్రంలో రైతులు నమ్మి పంట వేస్తే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టొబాకో బోర్డు లిఖితపూర్వకంగా రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు పంట వేశారు. కానీ చివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే హామీ ఇచ్చిన పరిమాణంలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. 105 రోజుల వేలం ప్రక్రియ ముగిసిపోయినా రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతులకు ఎంతటి దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నా పర్యటన ప్రకటనతో రూ.10 పెంపు నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించిన తర్వాత గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగింది. లేదంటే ఆ పెంపు కూడా ఉండేది కాదు. సిండికేట్ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ అత్యధిక ధర రూ.260 నుంచి రూ.262 వరకు మాత్రమే ఉంది. సగటు ధర రూ.174 వరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతుకుతాడు? ఎలా అప్పులు తీర్చుకుంటాడు? ఎలా మళ్లీ పంట వేస్తాడు? దళారులు సిండికేట్ అయినా నో యాక్షన్.. పొగాకు పంట కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. ‘నో బిడ్స్‘ పేరుతో వేలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దళారీ వ్యవస్థ పేట్రేగిపోయి అంతా సిండికేట్‌గా మారినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారుడిని కూడా బ్లాక్‌లిస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదు. చంద్రబాబు కంటితుడుపు మాటలు.. మరో తమాషా ఏమిటంటే.. పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు ఇప్పుడు గమనించారట! రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు మూడేళ్ల పాటు ఇస్తామని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబునాయుడూ మా ప్రభుత్వ హయాంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ పంట రుణాలు పథకం ఉండేది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీకే అందించాం. 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ కింద ఇచ్చి ఆదుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. మరి మీరు ఏం చేశారు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతులకే కాదు, మహిళలకూ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. అందరినీ రోడ్డు మీద పడేసి.. కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా, రూ.50 వేల వరకు ఇస్తామని, ఇక పండుగ చేసుకోమని డ్రామాలు ఆడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఆదుకుంటాం.. రెట్టింపు సాయం చేస్తాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న లాంటి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అండగా ఉంటాం. ఇది ప్రభుత్వ తప్పిదం కాబట్టి.. ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి.. ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలు ఇవ్వడం లేదు కాబట్టి.. ఇవ్వని కారణంగా, ఆ రూ.7 లక్షలను డబుల్ చేసి, ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తాం. మన ప్రభుత్వంలో ఏం చేశామంటే..అదే మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్‌ఫెడ్‌ను వెంటనే రంగంలోకి దింపాం. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించగానే ప్రతి గ్రేడ్‌కు కనీస ప్రారంభ ధర నిర్ణయించాం. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. రైతులకు మంచి ధర వచ్చింది. రిజెక్ట్‌లు, ‘నో బిడ్స్‘ పరిస్థితి తగ్గింది. ఇదీ గతంలో జరిగింది! అంతే కాదు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది.దేవరపల్లిలో హెలిప్యాడ్ సమీపాన వైఎస్ జగన్‌ను చూడటానికి భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు...ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది ఏమిటంటే.. దళారులతో రాజీ పడింది. నాకింత.. నీకింత అని కంపెనీలతో సర్దుబాట్లు చేసుకుంది. చేసుకుంది కాబట్టే.. మార్క్‌ఫెడ్‌ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్లోకి తీసుకురాలేదు. రైతును పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలకే వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మరో అన్యాయం ఏమిటంటే.. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, ప్రభుత్వం కేవలం 94 మిలియన్ కిలోలకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతోంది. అంటే.. మిగతా పంటను కొనుగోలు చేయబోమని చెప్పకనే చెబుతోంది. కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తోంది. అంటే కంపెనీలు.. ఇప్పుడున్న ధర కంటే రైతులకు మరో రూ.20 తగ్గించి ఇచ్చేందుకు దారులు తెరిచింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పోయి, కంపెనీల ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తోంది. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాలి. ప్రతి గ్రేడ్‌కు కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధానాన్ని అమలు చేసి పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు అదే మార్గం మాత్రమే రైతును కాపాడగలదు.రెండేళ్లుగా రైతులకు దగా..రైతులను రెండేళ్లుగా అన్ని విధాలా చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ‘ పేరుతో ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.60 వేలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేలు ఇవ్వకుండా ఎగరగొట్టారు. పైగా సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం జాబితా నుంచే తొలగించారు. కౌలు రైతులను తీసేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా పథకం నుంచి తప్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం చంద్రబాబు రద్దు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగినా, అదే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మొంథా తుపాను వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు గతంలో అందిన సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయ పరీక్షా ల్యాబ్‌లను బలహీనపర్చారు. రైతులకు అవసరమైన ఎరువుల ధరలు రెండేళ్లలో విపరీతంగా పెంచేశారు. మరోవైపు బ్లాక్‌లో దళారీల వద్ద రైతన్నలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది. ఆ ఒక్క పంటకే గిట్టుబాటు ధర.. సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే.. చంద్రబాబు హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా..? అది గంజాయి!బాబు వింత మాటలు.. అంతా ఢమాల్ చంద్రబాబునాయుడు అంటాడు.. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందట! అందుకే మామిడి పంటను ఢమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులను రోడ్డు మీదకి తెచ్చారు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బ తింటుందట! పొగాకుకు మంచి రేటు వస్తే బాగుండదని చెప్పి, పొగాకు రైతులను కూడా ఢమాల్ చేశాడు. కాబట్టి చంద్రబాబు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం అన్నట్లుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. -
నీ కేబినెట్‌ను శుభ్రం చేసుకో బ్రో
సాక్షి, అమరావతి : ‘మా సంస్థ పేద పిల్లల కోసం పని చేస్తుంది. మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.. అంటే బృందంగా వద్దు.. మీరు మాత్రమే ఒంటరిగా కాఫీ షాప్‌కు రండి. అక్కడ మనిద్దరం మాట్లాడుకుందాం’ అంటూ చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రి వెదవ వేషాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటీ బరితెగింపు అని విస్తుపోతున్నారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు అంటూ టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు.ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా.. అంటూ వాకబు చేస్తున్నారు. లోకేశ్‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదంటే ఆయనకు బాగా కావాల్సిన మంత్రి కాబోలు అంటూ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ శైలా తాళ్లూరి అనే మహిళ ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందిస్తూ, మహిళా సాధికారత పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.భారతదేశంతో పాటు కెన్యా, సియెర్రా లియోన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్యూర్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈమె సేవలకు పలు పురస్కారాలు కూడా లభించాయి. ఈ క్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన నాటా కార్యక్రమంలో డాక్టర్ శైలా తాళ్లూరి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అమాత్యుడు ఆమెను లోబరుచుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె కీలక మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు సదరు మంత్రిని ఉద్దేశించి కూడా నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారంటూ ఓ పోస్టు పెట్టారు.మీరు ఏం పీకారు?‘నారా లోకేశ్.. క్లీన్ అప్ యువర్ కేబినెట్ బ్రో.. నీ మంత్రుల్లో ఒకడి నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు. అన్ని అధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్‌లు పంపారు. బృందంగా వచ్చి కలుస్తామంటే.. కాదు కాదు కాఫీ షాప్‌కు ఒంటరిగా రమ్మన్నాడు. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. అసభ్య మెసేజ్‌లు, ఫొటోలతో నన్ను విసిగించాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేద పిల్లల కోసం వచ్చే సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందనే భయంతో అవమానాన్ని దిగమింగి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. ఇప్పుడిక తప్పడం లేదు. ఆ మంత్రి ఎవరనేది నేను ఫొటో సహా నేరుగా చెబుతాను. కాకపోతే మాకు ఒకమాట చెప్పి ఉండాల్సిందని తర్వాత మీరు అంటారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఫలానా వారికి చెప్పి ఉండాల్సింది కదా.. మాకు చెప్పి ఉండాల్సింది కదా.. అంటారు. అందుకే ఆ మంత్రి ఎవరో ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను. ఒక్క ‘సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్’ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్‌గా అడుగుతున్నాను. ఇలాంటి ఘటనల్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏమి పీకుతున్నారు? పీకారు సో ఫార్??!! ఆ భోగాపురం పీపుల్ బెటర్.. చెట్లు పీకి ఇంకో చోట నాటారు. నా వద్ద ఉన్న చాట్ హిస్టరీ, స్క్రీన్షాట్లు ఆ మంత్రి వద్ద కూడా ఉంటాయి. మీకు ఫోన్లో పేరు చెప్పానుగా.. ఆయన ఫోన్ తీసుకుని చూడండి.. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. మీరు విచారణ నిర్వహిస్తే నా వద్ద ఉన్న ఆధారాలు అన్నీ ఇస్తాను. ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ డాక్టర్ శైలా తాళ్లూరి డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్టుపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. -
17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పలు బిల్లులతో పాటు రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సమావేశాలను వేదికగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. -
ఏపీ కేబినెట్ మంత్రి చిలిపి చేష్టలు.. ఎన్ఆర్ఐ మహిళ వార్నింగ్!
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్ మంత్రిపై లైంగిక ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ కీలక కేబినెట్ మంత్రి తనను లైంగికంగా వేధించారంటూ అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.షైలా అనే పేరుతో ఉన్న సదరు ఎన్ఆర్ఐ మహిళ, మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుస పోస్టులు పెట్టారు. పేద పిల్లలకు సహాయం చేసేందుకు, సామాజిక సేవా కార్యక్రమాల నిమిత్తం తాను మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 'నాటా' వేడుకల సమయంలో సదరు మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించారు.అపాయింట్మెంట్ అడిగితే కాఫీ షాప్‌నకు ఒంటరిగా రావాలని ఒత్తిడి తెచ్చారని, అంతేకాకుండా కాళ్లు, చేతుల ఫోటోలు పంపిస్తూ అసభ్యకరంగా వ్యవహరించారని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వేధింపుల ఉదంతంపై నారా లోకేష్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సదరు మంత్రికి సంబంధించిన ఫోటోలు, ఆయన ఉపయోగించిన ఫోన్ నెంబర్లతో సహా పూర్తి ఆధారాలను బహిర్ఘతం చేస్తానని సదరు ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంపై టీడీపీలో చర్చాంశనీయంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నాయకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి అయి ఉంటారని, గతంలో ఆయన నాటా సదస్సుకు హాజరయ్యారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా సదరు మంత్రి అధికారికంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
‘పంచాయతీ’ కసరత్తు షురూ!
సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలయ్యినట్లు కనిపిస్తోంది. సర్పంచి ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం అన్ని జిల్లాల డిపీవోలు, ఆయా జిల్లాల జడ్పీ సీఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు నెలల క్రితమే సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగు తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలు ఉండగా, 13,151 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేనట్టు పంచాయతీరాజ్ శాఖ తేల్చింది. 2021 ఫిబ్రవరి– మార్చి నెలలో ఎన్నికలు జరిగి ఇటీవల పదవీ కాలం ముగిసిన 13,100 గ్రామ పంచాయతీలతో పాటు అప్పట్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ఆగిపోయిన మరో 51 చోట్ల ఎన్నికల నిర్వహణకు ఏ అడ్డంకులూ లేవని అధికారులు తేల్చారు. విలీన పంచాయతీల్లో పూర్తికాని ప్రక్రియ..పట్టణాలకు సమీపంలో ఉండే 185 గ్రామ పంచా యతీలను ఆయా మున్సిపాలిటీలు, నగర కార్పొ రేషన్ విలీనానికి మున్సిపల్ శాఖ ప్రతిపాదిస్తూ ఆయా చోట్ల సర్పంచి ఎన్నికలు ఆపాలని కోరడంతో వాటిలో అప్పట్లో ఎన్నికలు జరగలేదు. అయితే,ఆ తర్వాత వాటిలో దాదాపు 40కి పైగా గ్రామ పంచా యతీల విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. ఆయా గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి మున్సిపల్ శాఖ అప్పట్లో జారీ చేసిన ఆదేశాలను ఉప సంహరించుకునే పక్షంలో ఆయా చోట్ల ఎన్ని కలకు ముందుకెళ్లే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే బుధ వారం అన్ని జిల్లాల డిపీవోలు, ఆయా జిల్లాల జడ్పీ సీఈవోలతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ కూడా పూర్తికావడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా జిల్లాల వారీగా తయారు చేసి అందజేయా లని ఆయా జిల్లాల డీపీవోలకు, జడ్పీ సీఈవోలకు ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో...మరోవైపు, పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలంతో పాటు మున్సిపాలిటీలలో చైర్మన్, నగర కార్పొరేషన్లలో మేయర్ల పదవీ కాలం ఇప్పటికే ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారుల సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్ పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు ఎస్ఈసీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు..గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జర పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒకే రోజున ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్ మొదలు నామి నేషన్ ప్రక్రియ, అభ్యర్ధుల వివరాలు, పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వరకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్టు ఎస్ఈసీ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో అడ్డ గింతలు వంటి దౌర్జన్యాల కట్టడికి ఆన్లైన్ ప్రక్రియ కొంత మేర దోహదపడుతుందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
రెండు తప్ప అన్నీ చేశా..
సాక్షి, అమరావతి: రెండు హామీలు తప్ప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయలేదని చంద్రబాబు అంగీకరించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చానని, కానీ అమలు చేయలేదని చంద్రబాబు చెప్పారు. రెండేళ్ల పాలన–ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో మీడియాకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిరుద్యోగ భృతి అమలు చేయకపోయినా ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. రెండు హామీలు తప్ప అని చెప్పినా రెండో హామీ ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయా అని ప్రస్తావించలేదు. దానితో పాటు మిగతా హామీల గురించి కూడా చంద్రబాబు మాట్లాడలేదు. ఎప్పటిలాగే రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాలను వివరిస్తూ మరో పక్క గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. సంక్షేమం ఇవ్వండి.. అభివృద్ధి మీ బాధ్యత అనే ధోరణి ప్రజల్లో మారాలన్నారు. ‘‘రోడ్లు వేయండి అంటారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీ బాధ్యత అంటారు.. ఇది కరెక్ట్ కాదు’’ అని చంద్రబాబు అన్నారు.పీపీపీలో మనమే నెంబర్ 1రాష్ట్ర ఆదాయం జీతాలకే సరిపోతోందని, కేంద్రం ఇచ్చే నిధులు అప్పులు, వడ్డీలకు పోతోందని, సంక్షేమానికి అప్పులు చేస్తున్నామని సీఎం చెప్పారు. అందుకే పీపీపీ అంటున్నామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో 390 ప్రాజెక్టులను రూ.1.78 లక్షల కోట్లతో చేపడతామన్నారు. ఇందులో మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయని, వీటికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుందన్నారు. పీపీపీ ప్రాజెక్టుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఇక్కడ పీపీపీ వద్దంటారు. భోగాపురం మాదే అంటారు. అర్ధం చేసుకోకుండా మాట్లాడతారన్నారు. పీపీపీ ప్రాజెక్టుల వల్ల లబ్దిపొందిన వారు కూడా ఆ లబ్దిగురించి మాట్లాడకుండా విమర్శలు చేస్తున్నారని, దేశంలో ఇదే పెద్ద సమస్య అని చంద్రబాబు అన్నారు. ఎకనమిక్ స్టూడెంట్‌ని.. ద్రవ్యలోటంటే కాకిలెక్కలే...ద్రవ్యలోటు పెరిగిందని విలేకరి అడిగిన ప్రశ్నపై సీఎం స్పందిస్తూ నేను ఎకనమిక్ స్టూడెంట్‌నే, ప్రైమరీ, సెకండరీ డెఫిషిట్ అంటే ఒక మిధ్య ఇవన్నీ మనం అంచనాకు తప్ప కాకిలెక్కలే.. ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. అమరావతికే ఎక్కువ వ్యయం చేస్తున్నారనే విమర్శలపై సీఎం స్పందిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నామని, అయినా ప్రజలు నెగిటివ్‌గా ఆలోచించి భవిష్యత్ నాశనం చేసుకుంటే ఏమీ చేయలేం అన్నారు. అమరావతి తొలి దశ పనులకు రూ.51,687 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటికే రూ.40,887 కోట్లు టైఅప్ చేశామని, ఇది రూ.70 వేల కోట్లకు పోతుందన్నారు.రాజధాని తొలి దశ పనులను పూర్తి చేసి 2028లో ప్రధాని చేత ప్రారంభింప చేస్తామన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్ముతామని, తద్వారా డబ్బులు వస్తాయన్నారు. గత రెండేళ్లలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. పీ–4 ద్వారా పేదరిక నిర్మూలనకు ధనవంతులను భాగస్వామ్యం చేస్తున్నామని, 21 లక్షల మంది పేదలను గుర్తించామని, దాతలు ఇప్పటి వరకు 2.40 లక్షల మందిని దత్తత తీసుకున్నారన్నారు. పేద కుటుంబాలను పైకి తెచ్చేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. మూడుప్రాంతాల్లో అభివృద్ధికి ప్లాన్ చేశా..రాష్ట్రంలో మూడు రీజియన్స్‌ను భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయడం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పనకు ప్లాన్ చేసినట్లు కాగితాలపై గ్రాఫిక్స్‌ను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల పూర్తికి ప్లాన్ చేశామన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర జీఎస్డీపీని తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఉద్యోగుల జీతభత్యాలను గత ప్రభుత్వం 110 శాతం పెంచేసిందిగత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని రాష్ట్ర సొంత పన్నురాబడిలో సగటున 110 శాతానికి పెంచేసిందని చంద్రబాబు తప్పుపట్టారు. అంతకు ముందు 2014–19 మధ్య తన పాలనలో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం సొంత పన్ను రాబడిలో సగటున 87 శాతమే ఉందన్నారు. ఇప్పుడు 2024–25, 2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీతభత్యాల వ్యయాన్ని 96 శాతానికి తగ్గించామన్నారు. ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. బాధ్యత లేని గత ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని భారీగా పెంచేసిందన్నారు. ఆదాయాలను పెంచుకోవడం ద్వారా ఉద్యోగుల జీతాల వ్యయాన్ని తగ్గిస్తున్నామన్నారు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇవ్వలేమన్నారు. -
నేటి నుంచి ఆలిండియా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: 2026–27 ఎంబీబీఎస్ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను నేటి నుంచి విద్యార్థులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలు రిజిస్ట్రేషన్‌కు చివరి గడువుగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నిర్దేశించింది. గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అదే రోజు సాయంత్రం ఆరు గంటల్లోపు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు నచ్చిన కళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ నెల 13వ తేదీ వరకూ ఆప్షన్లు లాక్ చేసుకోవడానికి వీలుంటుంది. 13, 16 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రాసెస్ పూర్తి చేసి 17వ తేదీ ఫలితాలను ఎంసీసీ ప్రకటిస్తుంది. ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యేలా ఎంసీసీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర స్థాయి కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌కు విడుదల కాని నోటిఫికేషన్ ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేలా ఎంసీసీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినా, ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి కనీ్వనర్ కోటా కౌన్సెలింగ్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయి కళాశాలగా ఉన్న విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీట్లను ఎస్వీయూ, ఏయూ రీజియన్లకు కేటాయింపుపై ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంది. ఈ జీవో కోసం వర్సిటీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 38 సీట్లు ఆలిండియా కోటాలో ఎంసీసీ భర్తీ చేస్తుంది.మిగిలిన 212 సీట్లలో 15 శాతం 32 సీట్లను అన్ రిజర్వుడ్ కేటగిరీ కింద రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారికైనా అవకాశం ఉంటుంది. మిగిలిన 85 శాతం 180 సీట్లను జనాభా దామాషా ప్రకారం ఏయూ, ఎస్వీయూ రీజియన్లకు విభజించాలి. గతేడాది 65.62:34.38 నిష్పత్తిలో ఏయూ, ఎస్వీయూలకు సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ ఏడాదికి సీట్ల కేటాయింపును ఖరారు కోసం ఇప్పటికే వర్సిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ఉత్తర్వులు వస్తే రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు ఎన్ఆర్ఐ కోటా ప్రవేశాల నిబంధనలను ఈ ఏడాది నుంచి ఎంసీసీ సవరించింది. దూరపు బంధువులు/అసలు బంధుత్వం లేని వ్యక్తుల ద్వారా ఎన్ఆర్ఐ అభ్యర్థిత్వంతో కొందరు ఎంబీబీఎస్ సీట్లను పొందుతున్నారనే విమర్శలున్నాయి. ఈ దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసం విదేశాల్లో ఉండే తల్లిదండ్రులు, రక్త సంబం«దీకుల అభ్యర్థిత్వంతోనే విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా ప్రమాణాలను ఎంసీసీ రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో యాజమాన్య కోటా ప్రవేశాల నిబంధనల్లో మార్పు కోసం ప్రభుత్వానికి వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడాల్సి ఉంది. షెడ్యూల్ ఇలా.. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం: ఆగస్టు 6 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు గడువు: ఆగస్టు 12 సీట్ల కేటాయింపు: ఆగస్టు 13, 16 తుది జాబితా విడుదల: ఆగస్టు 17 -
అందరి నోటా.. ఒకే మాట
సాక్షి, అమరావతి/తాటిచెట్లపాలెం (విశాఖ)/ రాజమహేంద్రవరం: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిమాండ్ వినిపించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాల్లో పార్టీ నేతలు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలివైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి కాంగ్రెస్, సీపీఐ, ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. మార్గాని భరత్ మాట్లాడుతూ..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేందుకు అవకాశం లేదన్నారు. అక్రమాల వల్లే ఉద్యోగం రాలేదు డీఎస్సీలో జరిగిన అవకతవకల వల్ల తనకు రావాల్సిన ఉద్యోగం కోల్పోయానని విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందిన బాధిత అభ్యర్థి సంతోష్ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో కైలాసపురంలోని పి.కన్వెన్షన్‌లో ఏపీ జెన్–జెడ్ వార్ టౌన్‌హాల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డీఎస్సీ–2025లో పీజీటీ ఇంగ్లిష్ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాను. జోన్–1లో 92వ ర్యాంకు వచ్చింది.సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినా సెప్టెంబర్ 15న విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. కారణం తెలుసుకోవడానికి డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు వెళ్లినా జీవో–77 ప్రకారం జరిగిందని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. పీజీటీ ఇంగ్లిష్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ వరి్టకల్ రిజర్వేషన్‌ను తప్పుగా అమలు చేసి.. 852వ ర్యాంకు వచి్చన అభ్యరి్థని ఎంపిక చేశారు. విచారణ చేస్తే అతనికి ఎలాంటి లో–విజన్ లేదని తెలిసింది. అతనే తప్పుడు సరి్టఫికెట్ తెచ్చుకున్నానని, మీకు కూడా అవకాశముంటే అలాంటి సరి్టఫికెట్ తెచ్చుకోమని చెప్పాడు. సెలక్షన్ లిస్ట్ విడుదలైన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 80 మంది డీఎస్సీ బాధిత అభ్యర్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసానికి వెళ్లాం. లోకేశ్‌ను కలిసి మా సమస్య వివరించుకుంటాం. మాలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వండని పోలీసులను వేడుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికైనా డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సంతోష్ పార్వతి విజ్ఞప్తి చేశారు. – డీఎస్సీ బాధిత అభ్యర్థి సంతోష్ పార్వతిడీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలినిరుద్యోగ, యువజన జేఏసీ డిమాండ్మంగళగిరి రూరల్: డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని.. వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని నిరుద్యోగ, యువజన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని విద్యాభవ¯న్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పైగా సబ్జెక్టు టీచర్ పోస్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోటాలో సబ్జెక్టు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దేశంలో ఎక్కడైనా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ రామచంద్ర, వి.వెంకటేశ్, సీహెచ్.అర్జున్, జి.రోసిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులకు ప్రభుత్వం చేసిన హెచ్చరికలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి: డీఎస్సీ 2025లో చోటు చేసుకున్న భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అదనపు ఆధారాలుగా తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల బాధితులుగా మారిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే విషయంలోనూ స్పష్టతనివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం వాదనలు వినిపించారు. మెగా డీఎస్సీ2025 నియామక ప్రక్రియ మొత్తం భారీ స్థాయి వ్యవస్థాగత కుంభకోణమని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని, పిటిషనర్‌కు ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా తాము ఎక్కడా దాచిపెట్టలేదని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బాధిత అభ్యర్థులు ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. డీఎస్సీ అక్రమాలపై ఎవరైనా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో కోర్టుకొచ్చేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని శ్రీరాం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ప్రచురించలేదని, దీంతో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టుకొచ్చారు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, డీఎస్సీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు పడ్డాయని, ఇందులో 69 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఎవరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానిస్తూనే డీఎస్సీ అక్రమాలపై మాట్లాడితే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామన్న ప్రభుత్వ హెచ్చరికలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అదే రీతిలో బాధిత అభ్యర్థులను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చే అంశంపైనా స్పష్టతనివ్వాలని పేర్కొంది. -
పొగాకు రైతులపై సర్కారు పగ.. నేడు కొనుగోలు కేంద్రానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, దారుణ వైఫల్యంతో పొగాకు రైతులకు రెండు సీజన్లలో ఏకంగా రూ.3 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఉరికొయ్యల పాలవుతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వారందరికీ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇప్పటికే అనేక పోరాటాలు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు సర్కారులో ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి మరోమారు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకోనున్నారు. కిలోకు రూ.60 నుంచి రూ.70 చొప్పున నష్టం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో దళారులే రాజ్యమేలుతున్నారు. ఇందుకు గడచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో పతనమైన పొగాకు ధరలే నిదర్శనం. దళారీ వ్యవస్థ రెండేళ్లలో బలంగా వేళ్లూనుకుంది. ఈ సీజన్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాక జూన్ 18, జూలై 8న రెండుసార్లు సమీక్ష నిర్వహించిన సీఎం కేజీకి కనీస ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయినా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సరాసరి ధర రూ.187కే పడిపోయింది. హై క్వాలిటీకి రూ.240, మీడియం రూ.190, లో–గ్రేడ్ రూ. 110 చొప్పున గత నెల 28న ధరలు ప్రకటించారు. 2023–24 సీజన్లో సరాసరి ధర రూ.288.65, 2024–25లో రూ.248.66 ఉండగా.. ఈ ఏడాది 105 వేలం రోజుల్లో 47.39 మిలియన్ కేజీలు అమ్మకం జరగ్గా సరాసరి ధర రూ.214.19. మాత్రమే ఉంది. ఈ లెక్కన రైతులు గత ఏడాది కంటే కిలోకి ఏకంగా రూ.60 నుంచి రూ.70 వరకూ నష్టపోతున్నారు. పదేళ్లుగా ప్రతిరోజూ వేలం ముగిశాక వచ్చిన బేళ్లు, రిజెక్ట్ అయినవి, సరాసరి ధరల వివరాలను రైతు గ్రూపుల్లో పెట్టేవారు. కానీ గత 10–12 రోజుల నుంచి ఈ నివేదికను రైతులకు అందుబాటులో లేకుండా తీసేశారు. నాడు భరోసారైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా నష్టాల పాలవడానికి వీల్లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ జాయింట్ ఎండీలను బాధ్యులను చేసింది. పంటల కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)ను ఆర్బీకేల్లో పొందుపరిచి, బోర్డును ప్రదర్శించింది. ఈ ధరలకన్నా ఏదైనా పంట ధరలు పడిపోతే, ఆర్బీకే పరిధిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) వెంటనే అప్రమత్తమయ్యేవాడు. సీఎం–యాప్ (కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ని అప్రమత్తం చేసేవారు. ఏ ఆర్బీకే పరిధిలో పంట ధర పడిపోయిందో అక్కడ జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగి వెంటనే పంట కొనుగోలు ప్రారంభించేవారు. అలా మార్కెట్లో పోటీ ఏర్పడేది. దీంతో ఏ రైతు నష్టపోయే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడీ వ్యవస్థ మొత్తం పూర్తిగా కనుమరుగైంది. ఈ క్రమంలో దళారులు సిండికేట్‌గా మారి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. -
మునిశాపం.. మరేం చేస్తాం.. 'అబద్ధాల్లో ప్రోగ్రెస్'!
సాక్షి, అమరావతి: అవే అబద్ధాలు.. అవే కుతంత్రాలు.. అవే మోసాలు... ఇదీ సీఎం చంద్రబాబు తీరు!! తన రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు మంగళవారం వివరిస్తూ.. రెండు హామీలు మినహా అన్ని అమలు చేశానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లారప్పకుండా.. కమిట్మెంట్తో ఏకబిగిన మూడున్నర గంటలపాటు అలవోకగా అసత్యాలు వల్లించడంపై అంతా విస్తుపోతున్నారు. అసలు మీ మేనిఫెస్టో మీకు గుర్తుందా బాబూ? అని నిలదీస్తున్నారు. మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ఆడబిడ్డ నిధి హామీ ఏమైంది? 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్న హామీ ఎటుపోయింది? ఒక్క సూపర్ సిక్స్ హామీల కిందే రెండేళ్లలో దాదాపు రూ.2 లక్షల కోట్లకుపైగా ఎగ్గొట్టారు. మరి హామీలు ఎక్కడ అమలు చేశారు? ఎన్నికల హామీలను అమలు చేయకపోగా గతంలో వైఎస్ జగన్ పేదలకు ఇచ్చిన పథకాలను కూడా రద్దు చేశారని సర్వత్రా మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా... వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సూపర్ సిక్స్‌తోపాటు మేనిఫెస్టోలోని 143 హామీలు అమలు చేస్తానంటూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తు’కు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లను రాష్ట్రంలో ఇంటింటా పంపిణీ చేశారు. కానీ.. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారంటూ సీఎం చంద్రబాబుపై విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో కేవలం 26 నెలల్లోనే రూ.3.63 లక్షల కోట్లు అప్పులు చేయడం ద్వారా అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపిన సీఎం చంద్రబాబు.. జీఎస్డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి), పారిశ్రామిక ప్రగతి నుంచి శాంతి భద్రతల వరకూ అన్నింటా అథమ స్థానానికి చేర్చారు. రెండేళ్లలోనే ఏపీ అప్పులు ఏకంగా రూ.3,63,406 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెడ్‌బుక్ వేధింపులు, కప్పం వసూళ్లు భరించలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. పెట్టుబడులు తరలిపోతున్నాయి. అంతులేని అవినీతి, అరాచక పాలనతో 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే.. 2019–24 మధ్య విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో వైఎస్ జగన్ గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపారని, గత 26 నెలలుగా మళ్లీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారంటూ జెన్–జెడ్ తరం నుంచి మేధావుల వరకూ అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీసార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి, కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లో నమోదు చేసి, సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై వివరించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో బెలుం నాగభూషణరెడ్డికి ఏటా రూ.లక్షా నాలుగువేల చొప్పున ఐదేళ్లలో రూ.5,20,000 లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో జారీ చేసిన బాండు ఆ తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్‌సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నెంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించి.. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్‌సహా హామీలన్నీ 2024, జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమ్మబలికారు. ఇప్పుడు ఆ బాండ్లను చూపిస్తూ.. చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తాన్ని లెక్కలు వేస్తూ.. వాటిని తక్షణమే చెల్లించాలంటూ ప్రతి ఇంటా డిమాండ్ వినిపిస్తోంది.ఉద్యోగులకు ఉత్తచెయ్యి..ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. పేదలకు మూడు సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని నమ్మబలికి ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో ఆస్పత్రులు బిల్లులు అందక సేవలు నిలిపివేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టడంలోనూ చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి 5.58 లక్షల మంది పిల్లలు వెళ్లిపోవడం రాష్ట్రంలో విద్యా రంగం దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.సూపర్ సిక్స్ మోసాల ఖరీదు రూ.2,06,744.46 కోట్లు..చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 26 నెలలు కావస్తోంది. కొత్త పథకాలు ఇవ్వకపోగా గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రద్దు చేసింది. వైఎస్ జగన్ సర్కార్ హయాంలో 2024 జనవరి నాటికి 66.34 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే.. ఈనెలలో బాబు సర్కార్ 60.13 లక్షల మందికే పెన్షన్ పంపిణీ చేసింది. అంటే 6.21 లక్షల పెన్షన్లు రద్దు చేశారు.⇒ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2026–27 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారు. అంటే.. ఈ ఏడాదీ నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి రూ.1.08 లక్షల చొప్పున 20 లక్షల మందికి ఇప్పటికే రూ.21,600 కోట్లు బకాయిపడ్డారు.⇒ సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26, 2026–27 బడ్జెట్లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద ఒక్కో మహిళకు రూ.54 వేల చొప్పున 1.80 కోట్ల మంది మహిళలకు రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటూ సీఎం చంద్రబాబు నమ్మబలికారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26, 2026–27 బడ్జెట్లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే మూడు బడ్జెట్లలో రూ.28,800 కోట్లు బకాయిపడ్డారు.⇒ తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఇక 2026–27లోనూ జమ చేస్తున్నది దాదాపు రూ.6,377 కోట్లే. అంటే తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.26,554 కోట్లు బకాయిపడ్డారు. ⇒ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. మూడేళ్లకు కలిపి రూ.32,149.59 కోట్లు ఇవ్వాలి. అంటే.. ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున ఇచ్చారు. 2026–27లో ఇప్పటికి 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పన ఇచ్చారు. అంటే.. ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.23,246.50 కోట్లు బకాయిపడ్డారు.⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు చొప్పున మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. 2026–27 బడ్జెట్లోనూ రూ.2,601 కోట్లే కేటాయించారు. అంటే.. దీపం పథకం కింద మహిళలకు రూ.6143.96 కోట్లు బకాయిపడ్డారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు. వెరసి సూపర్ సిక్స్ పథకాల రూపంలోనే ప్రజలకు చంద్రబాబు రూ.2,06,744.46 కోట్లు ఇప్పటికే బకాయిపడ్డారు.హిస్టారిక్ విధ్వంసం ఎవరిది బాబూ?రెండేళ్లలో రాష్ట్రం అంతటా అథమం!⇒ రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024– 25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైంది. అదే బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా ఉంది.⇒ రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రెడ్‌బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా రూ.6,215 కోట్లు కావడం గమనార్హం.⇒ రెండేళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోయింది. 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీలో 2.20 శాతంగా ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90 శాతానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానానికి పరిమితమైంది. -
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ అరెస్ట్
పట్నంబజారు(గుంటూరు): నిన్నటి వరకు ప్రతిపక్ష బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ పంజా విసిరిన చంద్రబాబు సర్కారు మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబాలను వెంటాడి వేధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి వంటి వారిపైనా అక్రమ కేసులతో అరాచకం సాగించింది. ఇప్పుడు మైనార్టీ నేతలపై కక్షసాధింపులకు దిగి తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు అక్రమ కిడ్నాప్ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుజరాత్లో వీరిద్దరినీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడితో ఆగకుండా గుంటూరు కాకాని రోడ్డులోని ముస్తఫా కుమార్తె, వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నివాసంలోనూ దౌర్జన్యంగా తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. -
గత ఐదేళ్ల కన్నా ఈ రెండేళ్లలోనే ఎక్కువ అప్పులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే తన రెండేళ్ల పాలనలోనే అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజెంటేషన్ వెల్లడించింది. గత రెండేళ్ల ప్రభుత్వ అప్పులకు సంబంధించి మంగళవారం ఆయన సచివాలయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు.గత రెండేళ్లలో బడ్జెట్లో ఎంత.. బడ్జెట్ బయట ఎంత అప్పు చేశారో చెప్పకుండా జీఎస్డీపీలో అప్పుల శాతాన్ని వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ సాగింది. దీని ప్రకారం చూసినా గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీఎస్డీపీలో సగటు అప్పు కన్నా, తన రెండేళ్ల పాలన జీఎస్డీపీలోనే సగటు అప్పు 2.37 శాతం మేర పెరిగినట్లు స్పష్టం చేశారు. 2019–24 మధ్య జీఎస్డీపీలో సగటు అప్పు 33.83 శాతం ఉండగా.. 2024–25, 2025–26.. రెండేళ్లలోనే జీఎస్డీపీలో సగటు అప్పు 36.20 శాతానికి పెరిగింది. -
ఏపీ మత్స్యరంగానికి రూ.2,329 కోట్ల ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యరంగ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2,328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమలశాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద రాష్ట్రానికి రూ.681.38 కోట్ల కేంద్ర వాటా మంజూరు చేయగా, ఇప్పటికే రూ.462.56 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో 2019–23 మధ్య 15 ప్రాజెక్టులు ఆమోదం పొందడం విశేషం. వీటిలో ఏడు ప్రాజెక్టులకు ప్రస్తుతం ప్రభుత్వం షెడ్యూల్ రేట్స్‌ను పరిశీలిస్తుండగా, రెండు ప్రాజెక్టులు వర్క్ ప్రాసెస్‌లో ఉన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. మొత్తం వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యరంగంలో పరుగులు పెట్టిందనేది కేంద్రప్రభుత్వ జవాబుతో స్పష్టమవుతోంది. 97.98 పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సాగర్మాల, బ్లూ రివల్యూషన్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకాల కింద చేపడుతున్న పలు ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రమంత్రి వివరించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.288.80 కోట్లతో 2019–20లో ఆమోదం లభించగా, ప్రస్తుతం 97.98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. చివరిదశ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.138.29 కోట్ల వాటాను ఇస్తుండగా, సాగర్మాల పథకంతో సమన్వయంగా అమలు జరుగుతోందని తెలిపారు. రూ.178.51 కోట్లతో చేపట్టిన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు 53.75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దీన్ని వచ్చే మార్చి 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 400 మెకనైజ్డ్ బోట్ల సామర్థ్యం ఉన్న ఈ హార్బర్లో ఆధునికీకరణ అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలతో చేపల దిగుమతి, నిల్వ, వేలం, కోల్డ్‌చైన్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేలమంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. -
బాబు ‘భోగా’స్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే.. ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దానిని చేసినట్లుగా చెప్పుకుంటూ ‘క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు తమ అధినేత వైఎస్ జగన్ అక్కర్లేదని, తాము సరిపోతామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయం నాలుగు గ్రామాల రైతుల త్యాగం, స్థానిక ప్రజల సహకారం, జగన్ ప్రభుత్వ కృషి ఫలితమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పెమ్మసానివి అసత్య వ్యాఖ్యలు భోగాపురం విమానాశ్రయం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని ఎంపీ గొల్ల బాబూరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్), రైతులకు పరిహారం చెల్లింపు వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2019 నాటికే 2,200 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం సేకరించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పడం అవాస్తవమని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం 2023 జూన్‌లో కుదిరిందని, అదే ఏడాది అక్టోబర్‌లో భూమిని సంస్థకు అప్పగించామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారన్న పెమ్మసాని వ్యాఖ్యలను గురుమూర్తి తప్పుబట్టారు. బాబు భూ దాహంతో భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులే కోర్టులను ఆశ్రయించారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారికి అమిత ప్రజాదరణ గల వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పెమ్మసానిని ఉద్దేశించి ఎంపీ తనూజారాణి వ్యాఖ్యానించారు. స్వయనా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే వైఎస్ జగన్ హయాంలో 86శాతం భోగాపురం విమానశ్రయ పనులు పూర్తయ్యాయని చెప్పారు కదా అని గుర్తుచేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంబోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి రూ.30 కోట్లు ఖర్చు చేశారని, దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని తనూజారాణి ప్రశి్నంచారు. -
మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
సాక్షి, అమరావతి: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కింది కోర్టుల్లో న్యాయవాదులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సీజే దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుల్లో మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్‌లు లేక మహిళా న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సీజే.. ఈ విషయంలో ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంల అవసరం ఉందో వివరాలు తెప్పించుకునే పనిలో ఉన్నానన్నారు. న్యాయవాదులు మరణించినప్పుడు ఏర్పాటు చేసే సంస్మరణ సభలను సాయంత్రం 4.15 గంటలకు మార్చడంపై కింది కోర్టుల న్యాయవాదుల అభ్యంతరాలను బార్ కౌన్సిల్ నూతన సభ్యులు సీజే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న విధంగా ఉదయమే సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై కూడా సీజే సానుకూలంగా స్పందించారు. కోర్టు పని మొదలు కావడానికి ముందే సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బార్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. సీజేను కలిసిన వారిలో అజయ్ కుమార్ చలసాని, కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంత కుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, ఎస్.రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, ఎన్వీ సుమంత్, రవి బెల్లన, బండారు వెంకట రమణ మూర్తి, గంటా రామారావు, కీర్తి రామ జోగేశ్వరరావు, కె. వెంకట్రామిరెడ్డి, మాధవి,కృష్ణమోషన్,అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఉన్నారు. -
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు
సాక్షి,తాడేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు.గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైఎస్సార్సీపీలో చేరారు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్లోసీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, చేరిన ఆయన అనుచరులందరికీ సాదరంగా వైఎస్సార్సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్ (పీటా నాగమోహనకృష్ణ)ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, రేపల్లె నియోజకవర్గంలో మంచి పట్టున్న గూడపాటి పార్టీని వీడటం టీడీపీకి పెద్ద లోటుగా మారగా, వైఎస్సార్సీపీకి అక్కడ రాజకీయంగా మరింత బలం చేకూరినట్లయింది. -
లోకేశ్ అవినీతి విలయతాండవం చేస్తోంది
తిరుపతి మంగళం: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండవం చేస్తున్నాయని, ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదలడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని, మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.టీటీడీ పరిధిలోని ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోళ్లలో అమలులో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేశ్ ఒత్తిడితో పాలక మండలి సడలించడం ద్వారా భారీ అవినీతికి తలుపులు తెరిచారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, పరికరాలు, ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని, దాన్ని ఇప్పుడు రూ.25 కోట్లకు తగ్గించారని, కొన్ని విభాగాల్లో రూ.15 కోట్ల టర్నోవర్ సరిపోతుందని నిర్ణయించడం వెనక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని చెప్పారు.నాసిరకం మందులు, వైద్య సామగ్రి సరఫరా చేసే సంస్థలకు అవకాశం కల్పించి కమీషన్లు దండుకోవడమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యమని తెలిపారు. రోగుల ప్రాణాలతో మంత్రి లోకేశ్ చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.ఏమిటా అజ్ఞాత కమిటీ..? మందుల సరఫరా సంస్థల టర్నోవర్ నిబంధన సడలింపునకు ఒక అజ్ఞాత కమిటీ సిఫారసు చేసిందని టీటీడీ పెద్దలు కల్ల»ొల్లి కబుర్లు చెబుతున్నారని, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని ఆ అజ్ఞాత కమిటీ సిఫారసుల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. అదే డాక్టర్ జగదీ‹Ùకు స్విమ్స్, చిన్నపిల్లల ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.టీటీడీ సభ్యురాలిగా ఉన్న ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ యాజమాన్య ప్రతినిధి ఈ అజ్ఞాత కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, లోకేశ్ ఆదేశాల పేరుతో తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. ఈ తీర్మానంపై కూటమి ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, అసలు కుట్రను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కరుణా కర రెడ్డి డిమాండ్ చేశారు. -
రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్లకు కుచ్చుటోపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను రూ.1,287.64 కోట్లమేర మోసం చేశారు. ఇందులో రికవరీ చేసింది కేవలం రూ.23.56 కోట్లు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 2,436 బ్యాంకు మోసాల ఘటనల్లో రూ.915.68 కోట్లను కాజేయగా ఇందులో కేవలం రూ.15.13 కోట్లను రికవరీ చేశారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకుల్లో 522 మోసాల ఘటనల్లో రూ.371.96 కోట్లను కాజేశారు. ఇందులో కేవలం రూ.8.43 కోట్లను మాత్రమే రికవరీ చేశారు.ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మోసాల ఘటనలను వెంటనే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత పోలీసులు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లకు ఆయా బ్యాంకులు నివేదిస్తాయి. ఈ నేపథ్యంలో మోసాలలో చిక్కుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి నిర్దిష్ట కాలపరిమితుల్లేవని, అయితే ఏజెన్సీలు వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
పులుల సంరక్షణపై ‘గోళ్లు’ గిల్లుకుంటున్న సర్కార్
సాక్షి, అమరావతి: పెద్ద పులుల సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందా, పులుల వరుస మరణాలను పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలకు సమకాలీన పరిస్థితుల నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్ – శ్రీశైలం పరిధిలో పులుల దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. గత నెల 29న నంద్యాల జిల్లా నందికొట్కూరు రక్షిత అటవీ ప్రాంతంలో తొమ్మిదేళ్ల ఆడ పులి కళేబరం లభించగా, రెండు రోజుల వ్యవధిలో మార్కాపురం జిల్లా గుండ్లకమ్మ పరిధిలో మరో పులి మృతదేహం బయటపడడం వాటి దుస్థితిని, ప్రభుత్వ నిర్లకాŠష్య్న్ని బయటపెట్టినట్టయింది. గుండ్లకమ్మ పరిధిలో మృత్యువాతకు గురైన పులి కాళ్లు తెగిపోయి ఉండడం, గోళ్లు మాయం కావడాన్ని పరిశీలిస్తే వేటగాళ్లు పన్నిన ఉచ్చు అని అర్థం కాని అంశమేమీ కాదు.పొంతన లేని పవన్ కళ్యాణ్ ప్రకటన...ఇక అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా గత నెల 29వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ – శ్రీశైలం, శేషాచలంలో కలిపి 68 పులులు, 11 పిల్లలు ఉన్నాయని, ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయని తెలిపారు. పులుల వేటను నివారించేందుకు శిబిరాలను 150కి పెంచుతున్నామని డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఇతర టెక్నాలజీతో నిఘా పటిష్టం చేశామని గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటనకు మరుసటి రోజు నందికొట్కూరు పరిధిలో పులి కళేబరం బయటపడటం గమనార్హం.గతంలో జరిగిన మరో ఘటనలో... నల్లమల ప్రాంతంలో ఏడాది వయసు ఉన్న సఖి అనే పులి పిల్లను చంపి చర్మం తీసుకెళ్లారు. వేటగాళ్లు పులులను చంపడానికి ఉచ్చులు పన్నుతున్నారని అప్పట్లోనే గుర్తించారు. దీని వెనుక పులుల గోళ్లు, చర్మాల స్మగ్లింగ్ రాకెట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.శాఖను సరిదిద్దిన పరిస్థితులు ఏవి...వరుసగా రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి హడావుడిగా విచారణకు ఆదేశించారు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని, ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు తప్ప ముందస్తు నివారణ చర్యలు ఫలితమివ్వలేదని ఒప్పుకున్న దాఖలాలు లేవు.. శాఖను సరిదిద్దిన పరిస్థితులు లేవు.వేట నిరోధక శిబిరాలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు క్షేత్రస్థాయిలో అమలుపై సందేహాలు లేకపోలేదు. బీట్ ఆఫీసర్లు, వాచర్ల కొరత అటవీ శాఖను పట్టిపీడిస్తోంది.రెండు నెలల్లో దీర్ఘకాలిక ప్రణాళిక ఇవ్వాలని కమిటీకి గడువు పెట్టి సర్కారు చేతులు దులుపుకుంది. ఐదు రోజుల కిందట గొప్పగా ప్రకటించిన సంరక్షణ మోడల్, మూడు రోజుల్లోనే ఉత్తిదేనని తేలిపోయింది. దీంతో పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
మద్దతు ధర కోసం పొగాకు రైతుల ఆందోళన
పర్చూరు (చినగంజాం)/కందుకూరు: పొగాకుకు మద్దతు ధర కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా.., బాపట్ల జిల్లా పర్చూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి, రాస్తారోకో చేశారు. పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని, చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు రైతులు సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేశారు. పొగాకు కాడల దండలు చేత పట్టుకొని పర్చూరు బస్టాండ్ సెంటర్ నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేశారు.అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం బొమ్మల సెంటర్లో ధర్నా చేశారు. వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. బొమ్మల సెంటర్ వద్ద పొగాకు రైతులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.రైతులు, మహిళలను వారిని ప్రతిఘటించడంతో పోలీసులు అక్కడి నుంచి తప్పుకొన్నారు. రైతులు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని అన్నారు.కందుకూరులో కొనసాగుతున్న ఆందోళన ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రం వద్ద రైతులు ధర్మ దీక్ష పేరుతో నిరసన దీక్షను కొనసాగించారు. పామూరు రోడ్డులోని రెండో కేంద్రంలో వేలాన్ని అడ్డుకున్న రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు ఏపీ రైతు సంఘం సంఘీభావం ప్రకటించి, ఆందోళనలో పాల్గొంది. పొగాకు బోర్డు ఆర్ఎం వేలం కేంద్రం వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. పొగాకు క్వింటా రూ.30 వేలకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. -
ఇలాగైతే సేవలు కొనసాగించలేం
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్య తరగతి ప్రజల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే చంద్రబాబు సర్కారు కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం తమపై మరింత ఒత్తిడి పెంచుతోందని నెట్వర్క్ ఆస్పత్రులు మండిపడుతున్నాయి. ఇలా అయితే వైద్య సేవలు కొనసాగించలేమంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ఆరోగ్యశ్రీ సీఈవోకు సోమవారం లేఖ రాసింది. ఇప్పుడున్న దుర్భర పరిస్థితిలో సేవలు నిలిపేయడం మినహా తమకు మరే ఇతర మార్గం లేదని ప్రభుత్వానికి ‘ఆశ’ స్పష్టం చేసింది.భారీగా పెండింగ్ బకాయిలు..చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,700 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో యాజమాన్యాలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారితో చర్చలు నిర్వహించిన ప్రభుత్వం బకాయిలన్నీ వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.170 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తామని తెలిపింది. ఈ హామీలతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆరోగ్యశ్రీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు అప్పు చేయించింది. ఆ బిల్లుల మంజూరులోనూ మెలిక పెట్టి నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన దాంట్లో 8 శాతం మేర కోత పెట్టింది. అయితే సమ్మె విరమించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏ నెలా తమకు రూ.170 కోట్లు చెల్లించలేదని ఆశ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రూ.2,500 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతోంది.బకాయిలు చెల్లించకపోగా షరతులు..ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. వర్కింగ్ క్యాపిటల్‌కు అప్పు పుట్టడం లేదని పేర్కొంటున్నాయి. వైద్యులు, సిబ్బంది జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు, రోజువారీ నిర్వహణకు పెద్ద యుద్ధం చేస్తున్నామని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ (హెచ్‌పీఆర్) లేని ఆస్పత్రులకు ఈ నెల 10వతేదీ నుంచి ప్రీ–అథరైజేషన్స్ (రోగులకు చికిత్సలు చేయడానికి పెట్టే ప్రతిపాదన) నిలిపేస్తామని ఇటీవల అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అసలే బకాయిలు చెల్లించకపోగా అదనంగా నిబంధనలు రుద్దుతూ ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితి సృష్టిస్తోందని యాజమాన్యాలు సీఈవోకు రాసిన లేఖలో మండిపడ్డాయి. ప్రభుత్వంతో కలసి పని చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందించగలమని నిలదీస్తున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రుల ప్రధాన డిమాండ్లు ఇవీ..– తక్షణమే రూ.600 కోట్ల బిల్లులు విడుదల చేయాలి.– ఇకపై నెలవారీ చెల్లింపులను క్రమబద్ధంగా చేపట్టాలి.– మిగిలిన బకాయి నిధుల విడుదలకు స్పష్టమైన, కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ఖరారు చేయాలి.– సమస్యల పరిష్కారం కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలి.– పెండింగ్ బకాయిలు చెల్లించే వరకూ హెచ్పీఆర్తో ముడిపడిన ప్రీ–అథరైజేషన్ల నిలిపివేత ప్రతిపాదన వాయిదా వేయాలి. -
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,49,917 క్యూసెక్కులు చేరగా, నీటి నిల్వ 855.1 అడుగులలో 92.04 టీఎంసీలకు చేరుకుంది. ⇒ శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. అయినప్పటికీ అటు హంద్రీ–నీవా, ఇటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేదు. ⇒ ప్రాజెక్టులో ఎడమ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల చొప్పున గత నెల 25 నుంచి (ఆ రోజున 41.46 టీఎంసీలు నిల్వ) తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తూ– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నీటిని సరఫరా చేస్తోంది. ⇒ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు.. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. ⇒ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటికీ ఇబ్బందులున్నప్పటికీ... హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు చంద్రబాబు సర్కార్ నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.ఆల్మట్టిలోకి పెరిగిన వరద..⇒ మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన సోమవారం వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా..స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ⇒ నారాయణపూర్ డ్యామ్‌లోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ⇒ ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో మూడు రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది. -
నేడు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం అవుతోంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు రేషనలైజేషన్ తర్వాత పోలింగ్ స్టేషన్ల వివరాలను రాజకీయపార్టీలకు అందించనున్నారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు న్యాయం చేయాలని, ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. పలువురు డీఎస్సీ బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయిన బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటంకొనసాగిస్తామని వైఎస్సార్సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. -
గ్రామాల్లో కొత్త ఇంటి నమోదుకు ఇక్కట్లే
సాక్షి, అమరావతి: కుటుంబ ఆస్తిగా వచ్చే స్థలాల్లో గ్రామాల్లో కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు ఆ ఇంటిని గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేసుకోవడానికి ఇక మీదట తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. గ్రామాల్లో ఇళ్ల యజమానులు ఏటా చెల్లించే పన్ను రశీదే పెద్ద గుర్తింపుపత్రంగా ఉంటోంది. గ్రామాల్లో కొత్తగా కట్టే ఇళ్లను ఇంటిపన్ను మదింపునకు గ్రామ పంచాయతీ రికార్డులో చేర్చడానికి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. పంచాయతీల్లో ఇంటిపన్ను చెల్లించే ఇళ్ల యజమానుల జాబితాలను ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ చేసింది.ఆన్‌లైన్‌కు ముందు, ఆన్లైన్ తర్వాత ఇప్పటివరకు నోటరీ లేదా అఫిడవిట్ ద్వారా కొత్త ఇళ్లను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ఇల్లు నిర్మించిన స్థలం రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్ లేదా బిల్లిండ్ ప్లాన్ లేదా బిల్లిండ్ ప్రొసీడింగ్స్ ధ్రువీకరణ పత్రాలను కూడ ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే ఆ ఇల్లు పంచాయతీ రికార్డులో నమోదవుతుంది. ఈ మేరకు ఆన్లైన్ పోర్టల్‌లో చేసిన మార్పుల సమాచారాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం క్షేత్రస్థాయి సిబ్బందికి తెలిపింది. ఈ నిబంధనలపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్లు ఉండవని అధికారులే అంటున్నా..గ్రామాల్లో ఎక్కువమంది తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన స్థలాల్లోనే ఇళ్లు నిరి్మంచుకుంటారని, చాలావరకు రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు ఉండవని అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో బిల్డింగ్ ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకునేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆయా డాక్యుమెంట్లు ఉంటేనే పంచాయతీలో నమోదు చేస్తామన్న నిబంధనలు ఇల్లు కట్టుకునేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని చర్చ సాగుతోంది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కట్టుకున్న ఇంటిని కనీసం పంచాయతీ రికార్డులో నమోదు చేయలేని పరిస్థితే ఉంటే ఇక ఆ యజమానికి ఏలాంటి ఆరి్థక ధీమా కలుగుతుందని పలువురు ప్రశి్నస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటిని పన్ను పరిధిలోకి తీసుకు రావాలని పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి నమోదుకే ఇబ్బందులు కలిగించే నిబంధనలు పెట్టడం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీసీ నేతలపై రెడ్‌బుక్
చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా.. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను బాబు టార్గెట్ చేశారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం,సాక్షి ప్రతినిధి, కర్నూలు, ఆలూరు రూరల్: ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తామని మోసపూరిత హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే చంద్రబాబు సర్కారు తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు ఉద్యమ బాట పడుతున్న ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. ఇవి చాలదన్నట్లు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసి స్కామ్‌కు పాల్పడటంతో చంద్రబాబు సర్కారుపై యువత కన్నెర్ర చేస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. జెన్ జీని సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టడంతో చంద్రబాబు యథావిథిగా మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. అనుకున్నదే తడవుగా రెడ్‌బుక్ కుట్రలకు పదును పెట్టి పోలీసులను రంగంలోకి దించారు. ఈసారి వైఎస్సార్సీపీ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు దిగారు. మెగా డీఎస్సీ స్కామ్‌లో సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ బీసీ నేతలు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తుండటంతో చంద్రబాబు సర్కారు పరువు పాతాళానికి దిగజారిపోతోంది. వెనుకబడిన తరగతులకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(బోయ), చింతాడ రవికుమార్ (కాళింగ), మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు (మత్స్యకార), జోగి రమేష్ (గౌడ), మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తదితర వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రమైన నేరాలు మోపుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా.. మూడు ప్రాంతాల్లోను ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను బాబు సర్కారు టార్గెట్ చేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాబు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలైన పోలీస్ వ్యవస్థ మరింత అబాసుపాలవుతోందని పేర్కొంటున్నారు. పరాకాష్టకు చేరుకున్న బాబు సర్కారు బరి తెగింపు కుట్రలు ఇలా ఉన్నాయి...! వారి దుస్తులు వారే చింపుకొని..!కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను టీడీపీ మూకలు బంధించి చితకబాదుతుంటే ప్రాణభయంతో వీడియో కాల్ చేసిన ఓ కార్యకర్త తమను రక్షించాలని ఎమ్మెల్యే విరూపాక్షిని వేడుకున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తను విడిపించేందుకు అక్కడికి వెళ్లిన విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పచ్చముఠాల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు గాయాలయ్యాయి. ఈ కుట్రలు అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటీని తానే చింపేసి దారుణంగా వైఎస్సార్సీపీ నేతలపై నిందలు వేశాడు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం (307) కింద అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఆదివారం తెల్లవారుజామున (రాత్రి 2.45 గంటల సమయంలో) పోలీసు బలగాలు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నాయి. తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విధ్వంస కాండకు ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ హార్డ్ డిస్‌్కలను పోలీసులు దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకున్నారు.చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై విచ్చలవిడిగా అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. మొన్న విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్.. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిద చేశారు! దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య..! కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్‌డెత్..! ఉయ్యూరులో పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగక దంపతుల ఆత్మహత్యా యత్నం..! అనంతపురం జిల్లా మదిగుబ్బ తండాలో టీడీపీ కార్యకర్తల బెదిరింపులతో ఉరి పోసుకుని గిరిజన మహిళ ఆత్మహత్య..! తాజాగా పల్నాడులో ఎస్ఐ వేధింపులు భరించలేక మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్యాయత్నం..! రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఒకపక్క రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోపక్క ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు కుట్రలకు మరింత పదును పెడుతోంది. పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. మెగా డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారు. జోగి రమేష్ కుటుంబంపై తీవ్రమైన కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం! మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర కేసులు నమోదు కావడం వెనుక టీడీపీ నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలున్నాయి. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం లాంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో జోగి రమేష్, కుమారుడు రాజీవ్, సోదరుడు రాము, సోదరి రమతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలో భాగమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వీడియోతో కుట్రలు బట్టబయలు... టీడీపీకి చెందిన మహిళ నైటీని స్వయంగా ఆమె భర్తే చింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలు తమ దుస్తులు తామే చింపుకొని, ఎమ్మెల్యేపై తప్పుడు ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. చివరకు మంత్రులు సైతం వాస్తవాలను మరుగునపరిచి దీన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే యత్నాలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ కుట్రలు బట్టబయలయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తదితరులపై అట్రాసిటీ, హత్నాయత్నం, వాహనం ధ్వంసం కేసులు నమోదు చేసి ఆలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు కర్నూలు జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించారు. ఘటనలో లేని వారిపైనా కేసులా..!మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు శ్రీకాకుళం వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో జన ప్రభంజనాన్ని చూసి కంటిపై కునుకు కరువైన సీఎం చంద్రబాబు తప్పుడు కేసులకు పోలీసులను పురిగొల్పారు. మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దాడి చేసినట్లు ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవితోపాటు మరో 20 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అసలు ఆ రోజు ఘటనా స్థలంలోనే లేని వారిపై కేసులు బనాయించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. తనపై కక్ష సాధించేందుకు కుట్రలకు తెరతీసి అక్కడలేని 20 మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని చింతాడ రవి వీడియో విడుదల చేయడంతో కలకలం రేగింది. ఏ–8గా చూపించిన లాయర్ ధనేటి రామ్మోహనరావు ఘటన సమయంలో ఆమదాలవలస కోర్టులోనే ఉన్నారు. ఆ కేసులో ఏ–9గా ఉన్న ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్‌లోనే లేరు. ఆయన తన కుమార్తెను యూనివర్శిటీలో చేర్చేందుకు పంజాబ్ వెళ్లారు. ఏ–11 డాక్యుమెంట్ రైటర్ సురేష్ ఆ రోజు సబ్–రిజి్రస్టార్ ఆఫీసులోనే ఉన్నారు. ఘటన సమయంలో దూరంగా ఉన్న, సంబంధం లేని వ్యక్తులనూ నిందితులుగా చేర్చడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు తప్పుబడుతున్నారు.రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చేశారు..శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బీసీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన దీన్ని ఏకంగా హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం రాజకీయ కక్షసాధింపు అని ప్రజలు తప్పుబడుతున్నారు. సాధారణ సెక్షన్లతో సరిపెట్టాల్సిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి చదువుకునే యువకుడిని, మాజీ మంత్రిని ఇబ్బందుల పాలుచేసేలా టీడీపీ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం ఏలూరు బలగాల మోహరింపు..గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా అధికారపక్షం ఇదే తరహా రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఓ వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ పోలీసులు తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం? వైఎస్సార్సీపీ నాయకుడు కాబట్టే కేసు పెడతారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏలూరు జిల్లాకు చెందిన పోలీసులు భారీ సంఖ్యలో గుంటూరు చేరుకుని ఐదు బృందాలుగా ఏర్పడి ముస్తఫాను అరెస్టు చేయడానికి చేస్తున్న యత్నాలు రెడ్‌బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనం. -
రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు ఆ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం ఉ.9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలో బయల్దేరి, ఉ.10.30కు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం.. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలు తదితర అంశాలను నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారు. -
ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం (ఆగస్టు5) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. -
పెమ్మసానిపై అంబటి రాంబాబు ఆగ్రహం
సాక్షి, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పే అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి, తలుపులు పగులగొట్టి పోలీసులు తనిఖీలు చేయడమేనా ఆయన తెచ్చే అభివృద్ధి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.నా ఇంటిపై దాడి చేయించారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అంబటి భావోద్వేగానికి గురయ్యారు. "నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు.తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న సమయంలో జరిగిన ఒక అంతర్గత విషయాన్ని అంబటి బయటపెట్టారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? ఒకవేళ ఆయన పోలీసులకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే, నేను ఆయన కాళ్లకు దండం పెడతా అంటూ సవాల్ విసిరారు. పెమ్మసాని మీద తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, కానీ తన ఇంటిపై దాడి చేయించి క్రూరత్వానికి పాల్పడినందుకే తాను తీవ్రమైన కడుపుమంటతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిలో ఇంతవరకు పోలీసులు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. -
టాటా.. బైబై!
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో భారీ ప్రాజెక్టు పారిపోయింది. మీ రాయితీలు.. మీ భూ కేటాయింపులకో దండమంటూ పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. ఇలా చేసింది ఏదో చిన్నా చితకా సంస్థ కాదు. భారతదేశ కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూపునకు చెందిన కంపెనీ. టాటా గ్రూప్ కంపెనీ ఇలా చేసిందంటే రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ, అన్యాయమైన పాలన ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరు వద్ద సోలార్ విద్యుత్ తయారీకి ఉపయోగించే 10 గిగావాట్ల ఇంగాట్, వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి టైలర్‌మేడ్ రాయితీలను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసింది. మరీ విచిత్రమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రాయితీలు ఇస్తున్నా సరేనంటూ ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనినిబట్టి రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కంటే ‘ఈజ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ కంపెనీకి రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో ఏపీ కంటే ఒడిశాయే బెటర్ ఇరు రాష్ట్రాలు ప్రకటించిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులకు ఏపీ కంటే ఒడిశా రాష్ట్రమే అత్యుత్తమైనదంటూ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా టాటా పవర్ సీఈవో పర్వీర్ సిన్హా ప్రకటించారు. పెట్టిన పెట్టుబడిలో దాదాపు 69 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 38.4 శాతం ఇస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒడిశా రాష్ట్రం 30 శాతం మాత్రమే ఇస్తానంది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ఇరు రాష్ట్రాలు 100 శాతం మినహాయింపు ఇచ్చాయి. ఇవికాకుండా ఈ యూనిట్‌కు అవసరమైన మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తానని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా ఇన్ని రాయితీలను ప్రకటించినా కూడా వీటిని కాదనుకుని ఒడిశాకు వెళ్లిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కార్పొరేట్ సంస్థలను భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒడిశాలో వెంటనే యూనిట్‌ను ప్రారంభించడానికి అనువైన వాతావరణం ఉందని, అన్నిరకాల మౌలిక వసతులు ఉండటంతో అక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని జీవో ఇచ్చిన 9 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందంటే రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రచారంలోని డొల్లతనం మరోసారి ప్రపంచానికి తెలిసింది. 2024లో జరిగిన 14వ ఎస్ఐపీబీలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించగా.. 2025 జనవరి10న రాయితీలు, 250 ఎకరాలు భూమి కేటాయింపులు చేస్తూ జీవో 11ను ప్రభుత్వం జారీ చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కనీస భూ సేకరణ చేయకపోవడం, కంపెనీ ప్రతిపాదనలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ తీరుకు విసుగెత్తి టాటా పవర్ పరారైందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీవోలు ఇచ్చాక రూ.12,890 కోట్ల పెట్టుబడులు పరార్ ఒక కంపెనీ పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ), ఆ తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ఎస్‌ఐపీబీకి వస్తాయి. ఎస్ఐపీబీ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఆ నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇలా ఇన్ని దశలు దాటుకుని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు లాగిపెట్టి కొట్టి మీ రాష్ట్రానికో దండమంటూ వెనక్కి వెళ్లిపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత టాటా పవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరు కంపెనీలు భూములు కేటాయించిన తర్వాత కూడా జీవోలను ముఖం మీద విసిరికొట్టి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం, కొనసాగుతున్న అరాచక పాలన దెబ్బకి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి రూ.12,890 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ మధ్యనే లోక్‌సభలో కేంద్ర వాణిజ్య శాఖ గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన వాస్తవ పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అంటే ఈ రెండేళ్లలో రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు కంటే వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ దాదాపు రెట్టింపుగా ఉండటం గమనార్హం. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు కోకో కోలా గుడ్‌బై అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద రూ.1,200 కోట్లతో 6.65 కేఎల్పీఏ సామర్థ్యంతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి హిందుస్థాన్ కోకో కోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అనేక రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నేతల కప్పాలకు భయపడిన ఈ కంపెనీ తన పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు వెళ్లిపోయింది. తమకు కేటాయించిన 50.04 ఎకరాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరుమీద భూ సమీకరణ చేయొద్దంటూ కోకో కోలా కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో 2 ఏడాది ఫిబ్రవరి 27న భూ కేటాయింపులను రద్దుచేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆగిపోయిన ‘ఆజాద్ మొబిలిటీ’ శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు తొలి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,046 కోట్ల పెట్టుబడి 2,381 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ ఈ పెట్టుబడి ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో ఆ కంపెనీకి కేటాయించిన భూములను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాపచుట్టేసిన ఐస్పేస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఐస్పేస్ టెక్నాలజీస్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహారాలతో 6 నెలల్లోనే చాపచుట్టేసింది. హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖçలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి కల్పించేలా ఐటీ క్యాంపస్ నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 2025 నవంబర్ 7న దీనికి ఆమోదముద్ర వేసి ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద పలు రాయితీలు ప్రకటించింది. ఈ క్యాంపస్ కోసం మధురవాడ రుషికొండ హిల్ నంబర్–2లో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రెండెకరాలను కేటాయిస్తూ 2025 నవంబర్ 12న జీవో–58 విడుదల చేసింది. భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి 90 రోజులు దాటినా భూమి విలువ చెల్లించకపోవడంతో ఆ రెండెకెరాలను రద్దు చేస్తూ ఆ భూమిని ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్‌కు కేటాయిస్తూ గత జూన్ లో మరో జీవో విడుదలైందిజిన్ఫ్రా కూడా పరారీ కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలను జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వమే తిరిగి రద్దు చేసింది. కేటాయించిన భూమికి నగదు చెల్లించకపోవడంతో కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్‌తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెల్లెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనకు 7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27 ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి భయపడి వెనక్కి వెళ్లిపోయింది. భూమి కేటాయించి 8 నెలలైనా ఒక్క రూపాయి కూడా కట్టకుండా చివరకు తమకు కేటాయించిన భూములను రద్దు చేయమంటూ జిన్ఫ్రా లేఖ రాయడంతో భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన జూపిటర్ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ సంస్థ రూ.2,700 కోట్లతో 2,216 మందికి ఉపాధి కల్పించే విధంగా వచ్చిన ప్రతిపాదనకు 6వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 142 ఎకరాలను కేటాయిస్తూ జీవో–85ను 2025 మే 23న ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కేటాయించిన ఏడాదిలోనే ఆ భూములు మాకొద్దు ఈ భూములకు ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు తమ పేరు మీద ఉన్న భూ కేటాయింపులను రద్దు చేయాల్సిందిగా కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
గ్రామాల్లో ఇంటిపన్ను.. బాదుడే.. బాదుడు!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలపై పన్నుల మోత మోగుతున్నా, సమస్యల వెత మాత్రం తీరడం లేదు. గత రెండేళ్లలో ఇంటి పన్నులు 40 శాతానికి పైగా పెంచి వసూళ్ల లక్ష్యాన్ని 40 శాతానికిపైగా పెంచిన చంద్రబాబు ప్రభుత్వం, అదే స్థాయిలో గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసూలు చేసిన నిధుల వినియోగంపై ఆంక్షలు విధించడంతో పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటుండగా, పారిశుధ్య నిర్వహణ క్షీణించి అంటువ్యాధులు పెరుగుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. మోయలేని పన్ను భారాలు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను (బకాయిలు కాకుండా ఆ ఏడాది కొత్తగా నిర్ధారించిన) వసూలు లక్ష్యం రూ. 563.40 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆ మొత్తం ప్రతిపాదన రూ.797.03కు పెరిగింది. పెరిగిన ప్రతిపాదన పన్నులే రూ.233.63 కోట్లు. పాత ఇంటిపన్ను బకాయిలతో పాటుగ్రామాల్లో టాప్ కనెక్షన్లు, వ్యాపార షాపుల వసూలు చేసే ఇతర పన్నులు అన్నీ ఈ ఏడాది కొత్త ఇంటి పన్నులతో కలిపి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం పన్ను వసూలు లక్ష్యం రూ.1,233.99 కోట్లుగా పంచాయతీరాజ్ శాఖ నిర్ధారించింది. మురుగుకాల్వల నిర్వహణ శూన్యం గ్రామాల్లో మురుగుకాల్వల పన్నును కూడా ప్రభుత్వం ఇంటి పన్నులోనే కలిపి వసూలు చేస్తోంది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 141.90 కోట్ల పాత బకాయిలతో కలిపి గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం 799.22 కోట్లు ఇంటి పన్నులుగా వసూలు చేస్తే, అందులో 36.87 కోట్లు మురుగునీటి పన్ను పేరు చెప్పి ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేసినవే. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ మురుగు కాల్వ పన్ను రూ. 44.41 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగంలో పన్ను వసూళ్లు భారీగా పెరుగుతున్నా మురుగు కాల్వల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనివల్ల గ్రామాల్లో దోమలు ప్రబలుతున్నాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. టార్గెట్లతో వసూళ్లు... వ్యయాలపై సవాలక్ష ఆంక్షలు గత 2025–26 ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం టార్గెట్లు విధించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు రోజువారీ టార్గెట్లు పెట్టి బకాయిలతో కలిపి ఇంటి పన్ను పేరిట మొత్తం 799.22 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ. 173.41 కోట్లు కలిపి మొత్తం రూ. 1,015 కోట్లు వసూలు చేసింది. కానీ, ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలను అమలు చేస్తోంది. దీంతో చేసిన పనులకు బిల్లుల పెట్టడానికి సైతం అధికారులు భయపడుతున్నారు. ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులు దాదాపు రూ. 800 కోట్ల జనరల్ ఫండ్ నిధులు ఆయా పంచాయతీల సీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో మూలుగుతున్నా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు నాలుగు నెలల కాలంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 951 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ. 54 కోట్ల పనులు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బాదుడు పెరుగుతుందన్న ప్రభుత్వ సంకేతాలు! పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా కొనసాగుతున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఈ జూన్ 1న గ్రామాల్లో ఇంటి పన్నులపై నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, తదితర పన్నులను సరిగ్గా వసూలు చేస్తే రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెరగాలని, గ్రామ పంచాయతీల స్థాయిని బట్టి గ్రామాల్లో వివిధ ఇంటి పన్ను స్లాబ్స్లతో ట్యాక్సులు నిర్ధారించాలని ఆ సమావేశంలో పవన్‌కల్యాణ్ అధికారులకు సూచించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్ను భారం మరింత పెరగనున్నట్టు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇవ్వాల్సిందిపోయి.. గుంజుకుంటున్న సర్కార్ సాధారణంగా గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే నిధులను ఆయా పంచాయతీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పన్ను రూపంలో వసూలు చేసే డబ్బులను వివిధ అవసరాలకు ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఇళ్ల పన్నుగా వసూలు చేసిన మొత్తంలో ఒక శాతం ప్రభుత్వానికి విరాళం (కంట్రిబ్యూషన్)గా చెల్లించాలని జూలై 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాల్సింది పోయి వాటి నుంచే డబ్బు లాక్కోవడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మీ హద్దులు చూసుకోండి బాబూ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ స్థలానికి ఇంతవరకు సర్వే పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాలకు చెందిన స్థలం ఎవరిది ఎక్కడనేదీ ఇప్పటి వరకు తేలనేలేదు. ప్రతిరోజూ ఈ స్థల సర్వే విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెడుతూ భవన్లో ఉన్న నర్సింగ్ హాస్టల్‌ను కూల్చి, అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సర్వత్రా విమర్శలకు గురవుతున్నాయి. తొందరపాటు చర్యలుసీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించేశారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది, దీని నిర్మాణం కోసం రూ.123 కోట్లు కూడా కేటాయింపులు చేశారు. సరిగ్గా, ఇక్కడే కేంద్రం అక్షింతలు వేసింది, అసలు భవన్‌కు సంబంధించి సర్వే పూర్తి చేయకుండా, తగిన రిజిస్ట్రేషన్లు జరక్కుండా ఏరకంగా మీరు భవన్‌ను నిర్మిస్తారంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇక్కడి రాష్ట్ర అధికారులను నిలదీసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ హౌస్ ఆక్రమణల పర్వం!2024, జనవరి నెలలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సర్కార్‌లో ఢిల్లీలోని భవన్‌కు స్థలం కేటాయింపులు జరిగాయి. 60–40 నిష్పత్తిలో ఈ భవన్ స్థలాన్ని విభజించారు. 60 శాతం భూ మిని ఆంధ్రప్రదేశ్‌కు, 40 శాతం భూమిని తెలంగాణకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత అప్పటి నుంచి నేటి వరకూ ఇక్కడ సర్వే అనేది జరగనేలేదు. పైగా, ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఆనుకుని ఉన్న హైదరాబాద్ హౌస్... కొద్దికొద్దిగా భవన్‌కు సంబంధించిన భూమి ని కబ్జా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినా, ఇక్కడి రెండు రాష్ట్రాల అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు లేదు. క్షేత్రస్థాయిలో చేదు అనుభవంఆంధ్రప్రదేశ్ భవన్‌ను రూ.123 కోట్లతో నిర్మిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇందుకు సంబంధించిన పనులను కేంద్ర సంస్థ అయిన ‘ఎన్బీసీసీ’కి అప్పగించింది. కేబినెట్ ఆమోదముద్ర వేసి, నిధులు కేటాయించిన తరువాత క్షేత్రస్థాయిలోకి వచ్చిన ‘ఎన్బీసీసీ’కి చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్దకు వెళ్లి అనుమతులు అడిగిన నేపథ్యంలో.. ఇటు ఎన్బీసీసీకి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. ‘2024లో రెండు భవన్లను పునర్విభజిస్తూ, పంపకాలు జరిగాయి. అయినా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సర్వే పూర్తి చేయలేదు. ఈ సర్వే, సంబంధిత రిజిస్ట్రేషన్లు పూర్తి కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఎలా నిర్మిస్తారు?’అంటూ పట్టణాభివృద్ధిశాఖ నిలదీసింది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులకు, అటు ఎన్బీసీసీ అధికారులకు నోట మాటరాలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. అంతా గొప్పలు కోసమేఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఏదైనా కట్టడం నిర్మించాలంటే ప్రధానమంత్రి కార్యాలయంతో సహా 18 శాఖల నుంచి అధికారిక అనుమతులు రావాలి. ఈ విషయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీలో పనిచేసే ఆయా భవన్లకు చెందిన అధికారులకు తెలిసిందే. ఈనేపథ్యంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ‘అసలు సర్వేనే కాకుండా, అనుమతులు ఎలా వస్తాయి?, తగిన అధికారిక బదలాయింపు ప్రక్రియ పూర్తి కాకుండా కొత్త భవన్ నిర్మాణానికి ఏపీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ని«ధులు కేటాయించడం ఏమిటి? అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం కష్టమనే విషయం ఎన్బీసీసీకి తెలియదా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం చంద్రబాబు తన గొప్పల కోసమే ఇటువంటి బిల్డప్పులు ఇస్తున్నారనే విమర్శలు హస్తిన వేదికగా వ్యాపిస్తున్నాయి. కన్సల్టెంట్ల నియామకంలోనూ అక్రమాలే ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రస్తుతం నలుగురు కన్సల్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి పనిచేసే కన్సల్టెంట్లకు రూ.70 వేల వేతనం మాత్రమే ఆ ప్రభుత్వం ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కన్సల్టెంట్లకు మాత్రం ఒక్కొక్కరికీ రూ.1 లక్ష జీతాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఈ నలుగురి కన్సల్టెంట్ల నియామకంలోనూ భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏ అర్హత లేని ఓ మహిళా ఉద్యోగికి రూ.1 లక్ష ఇచ్చి పనిచేయిస్తున్న వైనంపై విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఇక కన్సల్టెంట్ల పాత్రపైనా చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయడం, అనుమతులు తీసుకురావడం, ని«ధులు రాబట్టడం వంటి విషయాల్లో వీరు ముందుండాలి. అయితే లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్న వీరు ఏమి చేస్తున్నారు? ప్రభుత్వానికి సరైన సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ ఇస్తే సర్వేనే పూర్తి కాకుండా భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయింపులు ఎలా చేసింది? ఇప్పుడు కేంద్రం ముందు నవ్వులు పాలవడం ఏమిటి? వంటి ప్రశ్నలు హస్తిన వేదికగా గుప్పుమంటున్నాయి. -
మా సహనాన్ని పరీక్షించొద్దు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో వరుసగా చర్చలు జరిపిన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల పేరుతో ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడింది. విజయవాడ రెవెన్యూ భవన్లో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ ‘ మా సహనాన్ని పరీక్షించవద్దు. ఉద్యోగుల ఆర్థిక, సేవాపరమైన సమస్యలపై ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలి. అప్పటికీ స్పందన లేకపోతే విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి అదే వారంలో రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. జూలై 10, 11 తేదీల్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో ఆర్థిక, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం జూలై 22న అన్ని ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చలు జరిపింది. అయినప్పటికీ ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు, స్నేహపూర్వకంగా ఉంటామన్న భరోసాకు ప్రస్తుత ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది’ అని విమర్శించారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ పి దామోదరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు తదితరులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారుప్రధాన డిమాండ్లు ఇవీ...» ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.50 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి ఉద్యోగికి లక్షల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉంది. పనిచేసిన కాలానికి చట్టబద్ధంగా రావాల్సిన మా సొమ్మునే మేము అడుగుతున్నాం. » ప్రతి ఆరు నెలలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలను రెండేళ్లుగా ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. » ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ 11వ పీఆర్సీ అమలులోనే కొనసాగుతున్నాం. దీనివల్ల ఉద్యోగులు ఇప్పటికే మూడు పీఆర్సీలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు. » 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి. » ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మూడేళ్లుగా ఐఆర్ ఇస్తున్నా ఏపీలో మాత్రం అది ఇవ్వకపోవడం అన్యాయం. » విశ్రాంత ఉద్యోగులకు గతంలో అమల్లో ఉన్న 70, 75 ఏళ్ల వయసులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలి. పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. » ఉద్యోగుల హెల్త్ కార్డును ఎనిమిది వారాల్లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. » రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరించాలి. -
ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గేదేలే..
సాక్షి, అమరావతి: విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలపై పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు నేటి (సోమవారం) నుంచి మూడోదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. జూన్ 12, జూలై 1 తేదీల్లో రెండుదశల్లో ఉద్యమం చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో.. ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గేదేలేదంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మూడోదశ ఆందోళన చేపడుతున్నారు. గ్రీవెన్స్ డే (పీజీఆర్ఎస్)ని పురష్కరించుకుని సోమవారం అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రికి పంపమని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాలు, రిటైర్డ్, అవుట్ సోర్సింగ్, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రభుత్వ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులను కలిసి మద్దతు కోరనున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని డిపోలు, యూనిట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీస్థాయిలో సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపడతారు. 28న అన్ని జిల్లాల్లో ప్రజారవాణా అధికారి (డీపీటీవో) కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో మహాధర్నాలు నిర్వహిస్తారు. సంస్థ పరిరక్షణ, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే సెపె్టంబర్ 3వ తేదీ నుంచి నాలుగోదశ ఉద్యమ కార్యాచరణను తీవ్రం చేస్తామని జేఏసీ కన్వినర్లు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..» విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ రూ.వేలకోట్ల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను లీజు పేరుతో కట్టబెట్టి దశలవారీగా ప్రైవేట్‌పరం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. » విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేసి నిర్వహించాలి. » విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం బస్సు డిపోలను వెంటనే పునఃప్రారంభించాలి. » స్త్రీశక్తి స్కీం అమలుతో మహిళా ప్రయాణికుల కోసం బస్సులు పెంచాలి. » ఆర్టీసీలో ఉద్యోగుల ఖాళీలు భర్తీచేయాలి. » ప్రతి నెల 7వ తేదీలోపు ఆర్టీసీ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలి. » ఏపీపీటీడీ ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, డ్రైవర్లకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలి. » ఆర్టీసీ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్‌లు, లేబర్ హాలీడేస్, ఫ్యామిలీ హెల్త్‌కార్డులు ఇవ్వాలి. » పదేళ్ల సర్వీస్ దాటినవారిని రెగ్యులర్ చేయాలి. -
ఓట్లు తగ్గాయి.. బూత్‌లు పెరిగాయ్
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోగా పోలింగ్ స్టేషన్ల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. సాధారణంగా ఓటర్ల సంఖ్య తగ్గితే పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గాలి. కానీ దానికి భిన్నంగా 44.89 లక్షల ఓట్లు తగ్గితే.. 3,931 అదనపు పోలింగ్ స్టేషన్లు వచ్చి చేరాయి. సర్‌కు ముందు రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లకు గాను 46,397 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇంటింటి సర్వే తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 44,89,562 తగ్గి 3,71,38,132కి చేరినట్టు ముసాయిదా జాబితాలో ప్రకటించారు. అయితే ఇదే సమయంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,397 నుంచి 50,328కి పెరిగింది. గతంలో కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1,400కిపైగా ఓటర్లు ఉండగా ‘సర్’ అనంతరం అది 1,200 దాటకూడదన్న నిబంధన పెట్టడంతో ఆ మేరకు రేషనలైజేషన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఓటర్ల సంఖ్య తగ్గినా పోలింగ్ స్టేషన్ల సంఖ్య మరో 3,931 పెరిగినట్లు వివరించారు.రెట్టింపైన బీఎల్ఏల సంఖ్యరాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. సర్ కార్యక్రమం మొదలు కాకముందు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సంఖ్య 68,868 కాగా అది ఇప్పుడు 1,27,868కి చేరిందన్నారు. అత్యధికంగా వైఎస్సార్ సీపీ నుంచి 45,973 మంది బీఎల్ఏలు ఉండగా టీడీపీ నుంచి 44,603 మంది ఉన్నారు. బీజేపీ నుంచి 27,583, జనసేన నుంచి 8,988, సీపీఎం నుంచి 364, కాంగ్రెస్ నుంచి 356, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు. -
బాల్టిమోర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి: అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభల్లో భాగంగా ఆదివారం వైఎస్సార్ జయంతి కార్యక్రమం, ఎన్ఆర్ఐలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని ఎన్ఆర్ఐలను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్‌కు మరోసారి అవకాశం కల్పించే దిశగా ప్రతి ఎన్ఆర్ఐ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల సందర్భంగా అమెరికా నలుమూలల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశాలు, పరస్పర చర్చలు, సూచనలు భవిష్యత్తులో పార్టీ సంస్థాగత బలోపేతానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. -
‘ఆత్మ’ సాక్షిగా.. క్రెడిట్ చోరీ కుట్రలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పూసపాటిరేగ: : నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక.. అంటూ నమ్మబలికే ఈనాడు తన నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకుంది! చంద్రబాబు సర్కారుకు భజంత్రీలు వాయించడం, తప్పుడు కథనాలను ప్రచురించడం, పాఠకుల కళ్లకు గంతలు కట్టడం, తిమ్మిని బమ్మి చేయడంలో తనకు సాటి లేదని మరోసారి రుజువు చేసుకుంది! భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో వేసేందుకు తహతహలాడుతూ ‘ఆత్మ’సాక్షిగా దొరికిపోవడం దీనికి పరాకాష్ట! మూడేళ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారంటూ ఈనాడు ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురించిన కథనం సర్వత్రా కలకలం రేపుతోంది. చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి యల్లాజీ అనే రైతు ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చారని, నేడు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారని ఈనాడు మైక్ ముందుకొచ్చి చెప్పినట్లు కథనాన్ని అచ్చోసింది. నిజం ఏమిటంటే.. మైలపల్లి యల్లాజీ 2023 జూలైలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు లోకం మాధవి స్వయంగా యల్లాజీ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. అదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేశారు. మూడేళ్ల క్రితం కన్నుమూసిన వ్యక్తి.. మళ్లీ తిరిగి వచ్చి ఈనాడు ప్రతినిధితో మాట్లాడారని తప్పుడు కథనాలు రాయడం పాఠకులను, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈనాడు వండి వార్చే అబద్ధాలకు ఇదో మచ్చు తునక అని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు బరి తెగింపు సర్వత్రా చర్చనీయాంశం కావడంతో నాలుక కరుచుకుని ఆదివారం అర్ధరాత్రి హడావుడిగా నెట్ ఎడిషన్‌లో ఆ ఫోటో మాత్రమే తొలగించి మరో ఫోటోను చేర్చడం కొసమెరుపు. పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు ప్రచురించి ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఈనాడు నిత్యం విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. నాడు టీడీపీ నేత పట్టాభిని కస్టడీలో పోలీసులు కొట్టారంటూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పాత ఫోటోలను ప్రచురించి ఈనాడు నమ్మించే యత్నం చేసింది. పట్టాభిని కొట్టారంటూ 2023 ఫిబ్రవరి 22న ఈనాడు ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. అయితే అందులో 2021 నాటి ఘటన ఫోటోలను ఈనాడు ప్రచురించింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, అవి పాత ఫొటోలని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వం ఆధారాలను బయటపెట్టడంతో ఈనాడు దుర్భుద్ధి బహిర్గతమైంది. దీంతో గత్యంతరం లేక తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ, చింతిస్తున్నట్లు ఈనాడు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. పట్టాభిని కొట్టారంటూ తొలుత ఈనాడు కథనం వెలువరించగానే కనీసం నిర్ధారించుకోకుండానే వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఆ వార్తను ట్వీట్ చేయడం గమనార్హం. పట్టాభిని కొట్టారంటూ కోర్టులో న్యాయమూర్తులకు కూడా ఆ ఫోటోలు చూపించారు. అనంతరం వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి గాయాలు లేవని, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు. దీంతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ఇప్పుడు కూడా అదే రీతిలో బురద చల్లేందుకు యత్నించి మరోసారి దొరికిపోయింది. -
ఆరోగ్యశ్రీకి కత్తెర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు ఆపద్భాందవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే వెంటిలేటర్ ఎక్కించడమే కాక క్రమంగా కనుమరుగు చేసే కుట్రలు పన్నుతోంది. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పటికే పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేసింది. మరోవైపు ఈ పథకం కింద చికిత్సలను ఎత్తేసే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా ఈ పథకం కింద ఎక్కువ మంది వినియోగించుకునే ప్రొసీజర్లను ఎత్తేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ పరంపరలో సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కంటి సమస్యలకు సంబంధించిన మూడు ప్రొసీజర్లను ఎత్తేసి.. పేద, మధ్య తరగతి ప్రజలపై ఏటా రూ.500 కోట్లకుపైగా భారాన్ని మోపడానికి రంగం చేస్తోందని తెలుస్తోంది.ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రొసీజర్లను కుదించాలని కొద్ది నెలలుగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు మూడు ఆప్తమాలజీ ప్రొసీజర్లను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎత్తేయడం కోసం వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2019–24 మధ్య రాష్ట్రంలో ఏటా 3 లక్షల మేర ప్రసవాలు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదయ్యాయి. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద దాదాపు 2.50 లక్షల మంది వృద్ధులకు కేటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. ఇప్పుడీ ప్రొసీజర్లను ప్రైవేట్‌లో పూర్తిగా ఎత్తేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్లకు పైగా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది.ఆసరా ఎత్తేసి ఇప్పటికే వెన్నుపోటుఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు అందించిన రూ.5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని ఇప్పటికే ఎత్తేశారు. తద్వారా మహిళలకు మరో వెన్నుపోటు పొడిచారు. ఒక్క ఆసరా రూపంలో గత రెండేళ్లలో పేద, మధ్య తరగతి మహిళలు రూ.300 కోట్ల మేర నష్టపోయారు. ఇక్కడితో ఆగకుండా గర్భం దాల్చిన మహిళలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత కాన్పు సేవలు లేకుండా బాబు సర్కార్ అడుగులు వేస్తుండటం వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 3,257 ప్రొసీజర్లు ఏపీలోని ఆరోగ్యశ్రీ పథకంలోనే ఉన్నాయని, ఇన్ని అవసరం లేదని ఇటీవలే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తేల్చి పడేశారు. ఈ క్రమంలో వీటి సంఖ్యను కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎం జేఏవై)లోని 1,949కి కుదించాలని 2024లోనే వైద్య శాఖ కమిటీలు వేసి కసరత్తు చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రతిఘటించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మరో రూపంలో ప్రొసీజర్లను తగ్గించే ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది.ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను అప్పుల ఊబిలోకిస్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో తిరుగుళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటపాటలు, యోగా డే వంటి ఈవెంట్స్, విలాసాలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించి మరి చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. ఇదిలా ఉండగా కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లింపులకు నిధుల్లేమి సాకుతో బాబు సర్కార్ అప్పుల బాట పట్టింది. రాష్ట్ర చరిత్రలో గతమెన్నడూ లేనట్టుగా నెట్వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చి ఇటీవల అరకొరగా బిల్లులు విడుదల చేసింది. ఈ అప్పునకు అయ్యే వడ్డీ కూడా ఆస్పత్రులె చెల్లించాలని బిల్లుల్లో 8 శాతం మేర కోత పెట్టడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. నాడు సంస్కరణలతో ఊపిరి2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్య ఎక్కింది. నాటి టీడీపీ ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోయింది. ఈ బకాయిలు చెల్లిస్తూ, కోవిడ్ వంటి ప్రపంచ విపత్తును అధిగమిస్తూనే వైఎస్ జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. రూ. ఐదు లక్షల వరకు వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో వెయ్యి కొత్త ప్రొసీజర్లతో 2020 జనవరి నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రారంభించారు. దీంతో ఏడాది తిరగకుండానే 1,059 ప్రొసీజర్లను 2059కి పెంచారు. ఇలా 2019–24 మధ్య 3,257కు తీసుకొచ్చారు. 2014–19 మధ్య బాలు పాలనలో రూ.5,177 కోట్లు పథకం కోసం ఖర్చు చేయగా, 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఏకంగా రూ.13 వేల కోట్లపైనే వెచ్చించారు. మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో కొత్త జబ్బులు అనేకం పుట్టుకొస్తున్న క్రమంలో ఇంకా ఈ పథకం కిందకు రాని జబ్బులుంటే వాటిని గుర్తించి పథకంలో చేర్చాల్సిందిపోయి.. చంద్రబాబు సర్కార్ ఏకంగా ఉన్న ప్రొసీజర్లనే ఎత్తేస్తూ పేదల ఆరోగ్య భరోసాకు గండికొట్టే ప్రయత్నం చేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, వ్యాధుల కట్టడికి, బాధితులకు తక్షణ వైద్యం అందించడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలం అవుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ ప్రాథమిక నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు లేవు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రులకు కిట్ల సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కనిపించని వ్యాధి నిర్ధారణ కిట్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లోని విలేజ్ క్లినిక్స్‌లో డెంగీ, కోవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణకు అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న బాధితులకు గ్రామాల్లోనే వ్యాధి నిర్ధారణ ప్రాథమికంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. విలేజ్ క్లినిక్స్‌లోనే కాదు, పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లోను డెంగీ కిట్లు లేని దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల డెంగీ అనుమానిత లక్షణాలతో వచ్చిన రోగులకు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) పరీక్ష చేసి ఆ ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇక చాలా చోట్ల కిట్లు లేవని, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహాకులు డెంగీ ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న డెంగీ జ్వర బాధితులు.. వైద్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డెంగీ జ్వరాల విజృంభణ గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి తొలి 25 వారాల్లో 835 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 932కు పెరిగింది. విశాఖ, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లాలో గత ఏడాది 94 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 85 కేసులు రికార్డు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది తొలి 25 వారాల్లో 43 కేసులు వెలుగు చూడగా, ఈ ఏడాది అదే కాలానికి 65 కేసులు బయటపడ్డాయి. ఇక వైద్య శాఖ లెక్కల్లోకి రాని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. సీజనల్ వ్యాధులను సున్నాకు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను వైద్య శాఖ తగ్గిస్తోందని ఆ శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏడుగురు మృతి.... గిరిజన, మైదాన ప్రాంతాల్లోను మలేరియా జ్వరాల విజృంభణ అధికంగా ఉంటోంది. ఇప్పటికే మలేరియా బారినపడి సరైన వైద్య సేవలు అందక అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, పాడేరులలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గత ఏడాది తొలి 25 వారాల్లో ఇద్దరు మరణించగా, ఈ ఏడాది అదే సమయానికి ఏడుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసులు తగ్గినట్టు వైద్య శాఖ లెక్కలు చూపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఏఎస్ఆర్, పోలవరం, మన్యం వంటి గిరిజన జిల్లాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ప్రతి ఇంట్లో మంచం పట్టిన జ్వర బాధితులు ఉంటూనే ఉన్నారు. -
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం
సాక్షి, అమరావతి: ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో దాడి చేసి.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందంటూ మండిపడ్డారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తూ.. బాధితులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని.. ఆయనను పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి ప్రభుత్వం భయపడి.. ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించి చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన కేసులు పెట్టారంటూ ఎత్తిచూపారు. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? వాటికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల చొప్పున 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు?’’ అని జెన్–జెడ్ తరం ఇవ్వాళ గట్టిగా ప్రశ్నిస్తోందని గుర్తుచేశారు.ఈ ప్రశ్నలకు మీ దగ్గర, మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు.. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.. అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా?‘‘చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? చంద్రబాబు గారూం నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులుశ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా? గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులురాష్ట్రంలోని జెన్–జెడ్ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ కార్యకర్త ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాములు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిసు్క లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్డిసు్కలను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతాంచంద్రబాబు గారూ గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’’ అని జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?చంద్రబాబు… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబు.. సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు.. గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’ అని పునరుద్ఘాటించారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026 -
ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు
అనంతపురం సెంట్రల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్రించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యతి్నంచాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
పట్టణాల్లో వలస ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వలసలు అత్యధికంగా ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముసాయిదా జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 శాతానికి పైగా ఓటర్ల వివరాలు కనిపించని నియోజకవర్గాలు 15 ఉండగా... ఇవన్నీ పట్టణ నియోజకవర్గాలే కావడం గమనార్హం. అత్యధిక ఓటర్లు కనిపించని నియోజకవర్గాల్లో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 30.78 శాతం మంది ఓటర్ల వివరాలు తెలియరాలేదు. తిరుపతి నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లు ఉండగా, వారిలో 90,882 మంది ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. ఇందులో అత్యధికంగా 19.39 శాతం మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. తిరుపతి తర్వాత శాశ్వతంగా వలస వెళ్లిన వారిలో అత్యధికంగా గుంటూరు వెస్ట్, కర్నూలు, కాకినాడ సిటీ, కోవూరు, రాజమండ్రి సిటీ, గుంటూరు ఈస్ట్ వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 10.78 శాతం ఓటర్ల వివరాలు తెలియలేదు రాష్ట్రవ్యాప్తంగా సగటున 10.78 శాతం మంది ఓటర్ల వివరాలు తెలియలేదు. అతి తక్కువ తెలియని ఓటర్ల శాతం ఉన్న నియోజకవర్గాల్లో 4.96 శాతంతో నరసాపురం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఉండి (4.96 శాతం), ఉంగుటూరు (5.02 శాతం), పి.గన్నవరం(5.23 శాతం), రాజానగరం(5.24 శాతం), భీమవరం (5.35 శాతం), ఆచంట (5.5 శాతం) వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా 2026–27 ఎంబీబీఎస్ ఆలిండియా కోటా ఆన్లైన్ కౌన్సెలింగ్ ఈ నెల నాలుగవ తేదీన ప్రారంభం కానుంది. అదే విధంగా రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ 13వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో మొదలు కానుంది. ఈ మేరకు నీట్ యూజీ ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శనివారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాల పరిధిలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లను ఆలిండియా కౌన్సెలింగ్‌లో ఎంసీసీ భర్తీ చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను కూడా ఆలిండియా కోటా కింద పూర్తి చేయనుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటాకు పోను మిగిలిన 85 శాతం సీట్లను, ప్రైవేట్‌లో వంద శాతం (50 శాతం కన్వీనర్+50 శాతం మేనేజ్మెంట్) ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి తరగతులుఆలిండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎంసీసీ నిర్ణయించుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మూడు సాధారణ రౌండ్ల కౌన్సెలింగ్‌ల అనంతరం మిగిలిపోయిన సీట్లన్నీ భర్తీ అయ్యే వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. రెండు రౌండ్ల సాధారణ కౌన్సెలింగ్ ముగిశాక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2026లో 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి 33,220 మంది నీట్లో రాణించారు. ఎంసీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర స్థాయి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్‌ను వచ్చేవారంలో విడుదల చేసే అవకాశం ఉంది. -
జూలైలో 5 శాతం క్షీణించిన జీఎస్టీ ఆదాయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మరోసారి రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఆదాయం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా (సెస్ మినహాయించి) ఉన్న ఆదాయం ఈ ఏడాది 5 శాతం క్షీణించి రూ.3,366 కోట్లకు పరిమితమయ్యింది. రూ.1,993.83 కోట్లు కేంద్ర ఐజీఎస్టీ కింద సెటిల్మెంట్ చేయడంతో మొత్తంమీద నికర జీఎస్టీ ఆదాయంలో వృద్ధి నమోదయ్యిందని రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఐజీఎస్టీ కింద రూ.290.8 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని దీంతో నికర జీఎస్టీ విలువ రూ.2,930 కోట్ల నుంచి రూ.3,268 కోట్లకు చేరిందన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల కాలంలో ఆదాయం ఎటువంటి వృద్ధి లేకుండా రూ.14,954 కోట్లుగా నమోదయ్యింది. వ్యాట్, వృత్తిపన్ను వంటి అన్ని రకాల పన్నుల ఆదాయం కలుపుకుంటే ఈ ఏడాది ఏప్రిల్–జూన్ నెల కాలానికి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.20,466 కోట్లకు చేరుకుంది. -
జలదిగ్బంధంలో 100 గ్రామాలు
సాక్షి, అమరావతి/చింతూరు/వేలేరుపాడు/సాక్షి, అమలాపురం: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 55.3 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉప్పొంగుతోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం రాత్రి 8.40 గంటలకు 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ఉద్ధృతితోపాటు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ మండలాల్లో సుమారు వంద గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద వల్ల సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో వీఆర్‌పురం మండలం శ్రీరామగిరికి చెందిన నాళ్లారపు నవీన్ (32) అనే యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. అతడిని మర పడవపై కూనవరం మండలం కోతులగుట్ట ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకొస్తోంది. పి.గన్నవరం చాకలిపాలెం వద్ద కనకయ్యలంక కాజ్‌వేపై ఐదారు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల సరిహద్దులో రాకపోకలు నిలిచాయి. వరదలో గిరిజనుడు గల్లంతు వేలేరుపాడు మండలం టేకూరుకి చెందిన నూపా ప్రసాద్ శుక్రవారం రాత్రి గోదావరి వరద నీటిలో కొట్టుకుపోయాడు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినా సహించేదిలేదని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది. ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం వేలేరుపాడు సంతకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో గోదావరిని దాటేందుకు యత్నించి గల్లంతయ్యాడు. శనివారం ఉదయం నుంచి గాలిస్తున్నా.. రాత్రి వరకూ ప్రసాద్ జాడ దొరకలేదు. -
ఎన్నికల హామీ ‘రూ.10 వేల స్టైపెండ్’ ఎక్కడ?
విజయవాడ లీగల్: న్యాయవాదుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా జరిగింది. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని, స్టైపెండ్ బకాయిలు చెల్లించాలనే నినాదాలతో ధర్నా చౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ఐలూ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘న్యాయవాదులను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. గత ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించి జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడటానికి రూ.5 వేలు స్టైపెండ్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆ పథకం పేరును న్యాయమిత్రగా మార్చింది. ఇంతవరకు జూనియర్ న్యాయవాదులకు ఎటువంటి స్టైపెండ్ ఇవ్వలేదు. ఎన్నికల వాగ్ధానంలో హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.10 వేలు స్టైపెండ్‌ను, పాత బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలి. అర్హులైన న్యాయవాద కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఐలూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దిగుబాటి రాజగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు కెంగర కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు తదితరులు మాట్లాడారు. -
హంద్రీ–నీవా.. నీళ్లులేవా!
సాక్షి, అమరావతి: కళ్లెదుట కృష్ణమ్మ బిరబిరా కదలివస్తున్నా రాయలసీమలో గుక్కెడు తాగునీళ్లు దొరక్క ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 838 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మల్యాల.. 798 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు ముచ్చుమర్రి పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయవచ్చు. తెలంగాణ సర్కారు తరలిస్తున్నా.. తెలంగాణ సర్కారు శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరక ముందునుంచే (గత నెల 25న 821 అడుగుల్లో 41.46 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటి నుంచే) కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కులు తరలిస్తోంది. ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం చేరకముందే కుడి, ఎడమ కాలువలు, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేయడాన్ని ప్రారంభించిన తెలంగాణ సర్కారు.. ఇటీవల మరింత ఉధృతం చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 842.3 అడుగులకు చేరుకున్నప్పటికీ.. ప్రాజెక్టులోకి 1.28 లక్షల ప్రవాహం చేరుతున్నప్పటికీ మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయకుండా చంద్రబాబు సర్కార్ మీనవేషాలు లెక్కిస్తుండటంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులు దాటగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేయవచ్చు. నీటిమట్టం 842.3 అడుగులకు చేరుకున్నా సరే చంద్రబాబు సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడం లేదు. 248 రోజుల్లో తరలించింది 52 టీఎంసీలే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంఎసీలు తరలించి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చే లక్ష్యంతో 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. వాతావరణంలో మార్పుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజులు తగ్గాయి. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసిపట్టేందుకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల స్థాయిలో కొనసాగిస్తూనే.. రెండో దశలో ప్రధాన కాలువకు లైనింగ్ పనులు చేపట్టి వాటిని అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. నాసిరకంగా పనులు చేయడంతో సిమెంటు కాంక్రీట్ కొట్టుకుపోయింది. గతేడాది 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించినట్లు తేలింది. చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. కానీ, 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను తరలించింది. దీన్నిబట్టి చూస్తే.. ప్రధాన కాలువను వెడల్పు చేసే పేరుతో కాంట్రాక్టర్లు, ముఖ్యనేతలు కలిసి భారీఎత్తున నిధులను దోచేశారంటూ ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.మేల్కొనకపోతే తీవ్ర ఇబ్బందులేవర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది శ్రీశైలానికి వరద ప్రవాహం చేరడంలో తీవ్ర జాప్యం జరిగింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయి 854 అడుగులకు చేరలేదు. కృష్ణా బేసిన్లో ఆగస్ట్, సెపె్టంబర్ నెలల్లోనే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు నెలల్లో ఏమాత్రం వర్షాలు కురుస్తాయి.. ఎన్ని రోజులు శ్రీశైలానికి వరద వస్తుందన్నది సాగునీటిరంగ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. అంటే.. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిలభ్యత కనిష్టస్థాయిలో ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది. గతేడాది తరహాలో 248 రోజులు ఎత్తిపోసేందుకు శ్రీశైలంలో నీటిలభ్యత ఉండదు. హంద్రీ–నీవా కాలువలోకి పూర్తి సామర్థ్యం మేరకు ఎత్తిపోసినా నాలుగు రోజుల్లో ఒక టీఎంసీని మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. కానీ.. ఈ ఏడాది హంద్రీ–నీవా ద్వారా గరిష్టంగా 2,500 క్యూసెక్కులకు మించి తరలించే పరిస్థితి లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా కాలువలోకి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించకపోతే.. తీవ్ర వర్షాభావంతో కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
థ్యాంక్యూ జగన్ అన్నా
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అందించిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పేర్కొంటూ... ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అనే సందేశాన్ని శనివారంపోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్యాగ్ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, అనుబంధ మౌలిక వసతుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పునాది పనులన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేయగా, ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా అదే ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత సీఎం చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోయినా, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని, అందుకే ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అంటూ ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది. -
‘భోగాపురం’ పూర్తి క్రెడిట్ వైఎస్ జగన్‌దే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు...2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్ జగన్. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్ జగన్‌వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు. -
‘భోగాపురం’ ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం....ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. -
దగా డీఎస్సీపై దండయాత్ర
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనల మార్పు, జీవోల మార్పులతో సహా వైఎస్సార్సీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతోపాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. -
మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ... శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమవుతోంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం.. ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా అడుగులు వేశారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. మూలపేట పోర్టు, షిప్ ల్యాండింగ్ సెంటర్లతో తీరానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బాబు పబ్లిసిటీ పీక్స్‌లో..!భూ సేకరణ చేయలేదు.. పునరావాసం ఊసు లేదు.. కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రంలో కొనసాగి, పౌర విమానయాన శాఖ దక్కించుకుని కూడా కనీసం ఎన్వోసీలు తేలేదు..! అయినా సరే భోగాపురం ఎయిర్‌పోర్టును తామే కట్టేశామని ప్రచారం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 – 19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు సాధించలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. భూసేకరణ, ఎన్వోసీలు, ఎటువంటి అనుమతులు లేకుండానే నాడు ఎన్నికల ముందు హడావుడిగా ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్టును అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులను మొదలు పెట్టలేకపోయారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయం చేసిన వైఎస్ జగన్ సర్కారు2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాల్లో నిర్మించే విధంగా 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో వైఎస్ జగన్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం లాంటి కీలక ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో దాఖలైన దాదాపు 130 కేసులను పరిష్కరించి ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. మూడు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను అధునాతనమైన కాలనీలకు తరలించి సరికొత్త ఇళ్లకు యజమానులను చేసింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలంతోపాటు రూ.8.5 లక్షల ఆర్థిక సాయం వెనువెంటనే అందించారు. భూ సేకరణ, పునరావాసం, విద్యుత్, నీరు, రహదారులు లాంటి కీలక మౌలిక వసతుల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లకుపైనే వ్యయం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలకమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని కేంద్రం నవంబర్ 2022లో జారీ చేసింది. ఇలా అన్ని అనుమతులు సాధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2023 మే 3న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో 3,800 మీటర్లు పొడవైన రన్‌వే నిర్మించడంతో బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ–330, ఎయిర్ బస్ ఏ–340 లాంటి అత్యాధునిక భారీ విమానాలను ల్యాండ్ చేసేందుకు వీలుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనుండగా ఆగస్టు 17 నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు మొదలు కానున్నాయి.క్రెడిట్ తండ్రీ, తనయులదే..!‘‘మా ఫస్ట్ ఎయిర్‌పోర్టుకు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేసి.. ఆయనే సీఎంగా ఉండగా నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం..’’ – 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుఎయిర్పోర్టుకు అనుబంధంగా మరిన్ని...» 5,000 చ.మీ విస్తీర్ణంలో లాజిస్టిక్ ఎకో సిస్టం, కార్గో టెర్మినల్ నిర్మాణంతో సరకు రవాణాకు విస్తృత అవకాశాలు» ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్ హాలింగ్ వ్యవస్థల ఏర్పాటు» విమానాశ్రయ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాల కల్పన 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్) -
‘సర్’ ఓటర్లు 3,71,38,182
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అనంతరం ముసాయిదా జాబితాలో 3,71,38,182 మంది ఓటర్లున్నారు. ‘సర్’కు ముందు 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు, మృతులను మినహాయించి 3,71,38,182 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. సర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ఆయన ప్రకటించారు. 89.22 శాతం మంది ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదుకు వచ్చే నెలాఖరు వరకు ఫారం 6 సమరి్పంచవచ్చు. నిజమైన ఓటర్లు డిక్లరేషన్ ఫారమ్‌తో పాటు ఫారం 6 అందచేస్తే ఓటర్ల జాబితాలో తిరిగి చేరే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైతే ఒకచోట మాత్రమే ఉంచుతారు. ఓటర్లలో కర్నూలు టాప్ అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. సర్ అనంతరం 15.22 లక్షల మంది ఓటర్లు (3.66 శాతం) మృతి చెందినట్లు తేలింది. 22.30 లక్షల మంది అంటే 5.33 శాతం శాశ్వతంగా మరో చోటకు తరలివెళ్లడం లేదా గైర్హాజరు అయినట్లు గుర్తించారు. మరో 7.37 లక్షల మంది ఓటర్లు (1.77 శాతం) రెండు లేదా మూడు చోట్ల నమోదైనట్లు వెల్లడైంది. మొత్తం 44,89,512 మంది అంటే 10.78 శాతం ఓటర్లుగా క్లెయిమ్ చేయలేదు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు 1.89 కోట్ల మంది కాగా పురుష ఓటర్ల సంఖ్య 1.82 కోట్లు మాత్రమే. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 18,12,532 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,39,591 మంది ఓటర్లున్నారు. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. సహేతుకమైన అవకాశం ఇస్తామన్నారు. అర్హుడైన ప్రతి పౌరుడిని ఓటర్ల జాబితాలో కొనసాగించడం, అనర్హులను జాబితాలో లేకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 28లోగా పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురిస్తారు. ఏ ఫారం ఎందుకంటే..?ఫారం 6: కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు ఫారం 6ఏ: విదేశీ భారతీయుడిని చేర్చడానికి దరఖాస్తు ఫారం 7: ప్రతిపాదిత చేర్పును వ్యతిరేకించడానికి లేదా ఇప్పటికే ఉన్న నమోదును తొలగించమని కోరడానికి దరఖాస్తు ఫారం 8: ప్రస్తుత ఓటరు నియోజకవర్గం లోపల లేదా వెలుపల నివాసం మార్చడం, వివరాలలో సవరణ కోసం దరఖాస్తు -
బడా బిల్డర్లకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుల భద్రతను గాలికి వదిలేసింది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరిచింది. ఏపీ బిల్డింగ్ రూల్స్–2017కు భారీ సవరణల పేరిట ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓ–161 పూర్తిగా బడా నిర్మాణదారులకు మేలు చేసేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఫైర్ ఎన్ఓసీ లేకుండానే..కొత్త జీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ ఎన్ఓసీ లేకుండానే 24 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు అనుమతులిచ్చింది. ఫీజుల చెల్లింపుల్లోనూ బిల్డర్లకే రాయితీలిచ్చింది. నిర్మాణ ప్రాజెక్టుల్లో జాప్యం నివారణ పేరిట బాబు సర్కారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైరైజ్ భవనాలకు ఒకేసారి కాకుండా దశలవారీగా ఫైర్ క్లియరెన్స్ విధానాన్ని తీసుకురావడం విస్మయం కలిగిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) రాకముందే స్టిల్ట్ ఫ్లోర్‌తో కలిపి 24 మీటర్ల ఎత్తువరకు భవనాన్ని నిర్మించేసుకునేందుకు ప్రభుత్వం బిల్డర్లకు అనుమతిచ్చేసింది. ఒకవేళ నిర్మాణం పూర్తయ్యాక ఫైర్ సేఫ్టీ ప్రమాణాల్లేక ఎన్ఓసీ రాకపోతే ఆ భవనాల పరిస్థితి ఏంటి? అక్కడ ఏమైనా అగ్నిప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు? అనే ప్రశ్నలకు జీఓలో స్పష్టతలేదు. గతంలో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఫైర్ ఎన్ఓసీ అందజేయాల్సి ఉండేది. 18 మీటర్లు, ఆపై ఎత్తు కలిగిన భవనాలను హైరైజ్ కేటగిరీ కింద పరిగణించేవారు.బడా బాబులకు మినహాయింపులు..నిర్మాణ రంగానికి ప్రోత్సాహం పేరుతో బిల్డర్లు చెల్లించాల్సి న ఫీజుల విషయంలో చంద్రబాబు సర్కారు ఉదారంగా వ్యవహరించింది. బడా బిల్డర్లు కట్టాల్సిన సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజును ఒకేసారి కాకుండా మూడేళ్ల వ్యవధిలో ఆరు వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. గడువు ముగిసిన అనుమతుల రెన్యువల్‌కు కూడా సులభ మార్గాలు తెరిచింది. మరోవైపు.. హైరైజ్ పేరిట నిబంధనలు తుంగలోకి తొక్కింది.సెట్ బ్యాక్స్‌కు కోత..24 మీటర్లు, అంత కన్నా ఎత్తు ఉండే భవనాలనే హైరైజ్ భవనాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సెట్ బ్యాక్స్ (భవనం చుట్టూ వదిలే ఖాళీ స్థలం) నిబంధనలను సడలించింది. మరోవైపు.. టీడీఆర్ వినియోగాన్ని విస్తృతం చేస్తూ అదనపు అంతస్తుల నిర్మాణానికి తలుపులు తెరిచేసింది. దీనివల్ల భవనాలకు గాలి, వెలుతురు రాకుండా నగరాలు మరింత ఇరుకుగా, కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పార్కింగ్ ఫ్లోర్లు లెక్కల్లోకి రావు..భవనంలో నిర్మించే పార్కింగ్ ఫ్లోర్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మరిన్ని అంతస్తులు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్విరాన్మెంట్ డెక్, సర్వీసు ఫ్లోర్, స్టిల్ట్ రిసెప్షన్ ఏరియా ఎత్తు లెక్కింపు నుంచి తొలగించి బిల్డర్లకు అదనపు ప్రయోజనాలు ఇచ్చింది. టీడీఆర్ ద్వారా నాన్ హైరైజ్, హైరైజ్ రెండింటికీ అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకోవడానికి మార్గం చూపింది.సాధారణ ఇంజినీర్లపై దెబ్బ..ఇకపై 10 మీటర్లు ఎత్తు దాటిన భవనాలకు స్ట్రక్చరల్ డిజైన్లు లైసెన్స్డ్ ఇంజినీర్ నుంచి సర్టిఫై చేయించుకోవాలి. సాధారణ ఇంజినీర్ ఇచ్చిన డిజైన్లు అనుమతించరు. దీంతో.. తాజా నిబంధనలు తమపాలిట శాపంగా మారాయని సాధారణ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు వాపోతున్నారు. ఉత్తుత్తి మినహాయింపులేనా?..ప్రార్థనా మందిరాలకు ఫీజు మినహాయింపు ప్రకటించిన ప్రభుత్వం అందులోనూ మెలిక పెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగం లేకుంటేనే వర్తింపు అనే షరతు విధించింది. మిగిలిన భవనాల మాదిరిగానే ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు కూడా ఆన్లైన్ దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరి చేసింది. ఈ పరిణామాలు గమనించిన నిపుణులు నిజమైన మినహాయింపులు ఎంత అనేవి ప్రశ్నార్థకమని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈవీ స్టేషన్లునిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించుకోవడానికి బడా బిల్డర్లకు అవకాశం కల్పించిన చంద్రబాబు సర్కారు మరో కొత్త డ్రామాకు తెరతీసింది. 5,000 చదరపు మీటర్లు దాటిన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు, క్రెష్‌లు, ఎన్విరాన్మెంటల్ డెక్ నిర్మించాలని పేర్కొంది. అయితే, ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఎవరు నిర్వహించాలో స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి.. ఇవన్నీ బిల్డర్లు తమ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో నగరాలకు పొంచి ఉన్న ముప్పును నిబంధనల సరళీకరణ ఆపలేదని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పెరుగుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 14.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 5,39,934 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 5,28,934 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 92,709 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.34 టీఎంసీలకు చేరుకుంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి గాలులతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యధికంగా 3.7,ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరం, కాకినాడ జిల్లా ఇంజారంలో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సింగిల్ జడ్జి, ఆ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యంలో ఎవరూ, ఏ రకంగా వాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పులోని అభిప్రాయాలను పలువురు పలు రకాలుగా వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రణతి ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్న ఆమె తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఆ తీర్పు కాపీ పబ్లిక్ డాక్యుమెంట్ అని, అది ఇప్పటికే ప్రజా బాహుళ్యం (పబ్లిక్ డొమైన్)లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అందువల్ల ఆ తీర్పును ఏ రకంగా ఉపయోగించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రణతి విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల అమలును తదుపరి విచారణ వరకు మాత్రమే ధర్మాసనం నిలుపుదల చేసింది. అలాగే ప్రణతిపై ఏసీబీ విచారణను సైతం తదుపరి విచారణ వరకు నిలిపేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ప్రతివాదులుగా ఉన్న జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘానికి, పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కదంతొక్కిన స్కీమ్ వర్కర్లు
సాక్షి, అమరావతి: కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని, సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇతర ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు కదం తొక్కారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన పథకం, యానిమేటర్లు(వీఓఏ), రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ), స్కూల్ స్వీపర్స్, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్లను ముట్టడించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో విజయనగరంలో కలెక్టరేట్ ముట్టడికి విరామం ఇచ్చారు. మిగిలిన 25 జిల్లాల్లో పెద్ద ఎత్తున కలెక్టరేట్లను ముట్టడించిన స్కీమ్ వర్కర్లు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు జిల్లాల్లో స్కీమ్ వర్కర్లను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేశారు. అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు, కృష్ణా తదితర జిల్లాల్లో స్కీమ్ వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకువెళ్లారు. దీంతో వారిని పోలీసులు ఈడ్చిపడేశారు. అనేక మందిని అక్రమంగా అరెస్టు చేశారు. అనకాపల్లిలో రెచ్చిపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వీఓఏ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి చేయి విరిగింది. మరో నలుగురు గాయపడ్డారు. అంగన్వాడీ కార్యకర్త రూపాదేవికి చేయి విరిగింది. కృష్ణా జిల్లాలో పోలీసులు, స్కీమ్ వర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో స్కీమ్ వర్కర్లు రమ, నాంచారమ్మ, లక్ష్మీలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పార్వతీపురంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు.హామీలు అమలు చేయకుండా నిర్బంధమా?హామీలను అమలు చేయాలని కోరితే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి స్కీమ్ వర్కర్లను నిర్బంధించడం, లాఠీ చార్జ్ చేయడంపై స్కీమ్ వర్కర్స్ యూనియన్ల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగునాయుడు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎడిటర్‌పై కేసుకు ఏకంగా జీవో
సాక్షి, అమరావతి: ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మాకు పనిలేదు. మేం చేసే అవినీతి, అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం’ అన్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరింత బరితెగించింది. సాక్షిలో ప్రచురితమైన ఒక కథనానికి సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రధానంగా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టిస్తోంది. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తోంది. ఎడిటర్ పై నెలకు ఒక కేసు నమోదవుతోందంటే అక్రమాలను వెలుగులోనికి తెస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎడిటర్, పబ్లిషర్ తదితరులపై మరో అక్రమ కేసు నమోదుకు అనుమతినిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ ప్రత్యేక జీవోఆర్టీ 1486 జారీ చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన అద్వైక ట్రేడింగ్ కంపెనీ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ వ్యవహారానికి సంబంధించిన కథనంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తరఫున న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఈ జీవో ద్వారా అనుమతి ఇచ్చారు. తగిన ఆధారాలతోనే కథనంవిజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అద్వైక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు, బాధితుల సమస్యలు, కేసు పరిష్కార ప్రక్రియపై తగిన ఆధారాలతోనే సాక్షి లో కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో దర్యాప్తును ప్రభావితం చేశారనే ఆరోపణలు, నిందితులతో అనధికారికంగా పరిష్కారం కుదిరిందనే అనుమానాలు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు కథనంలో ప్రస్తావించింది. ఈ ఆరోపణలు వాస్తవమా? కాదా? అన్నది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలే. ఆరోపణలు నిరాధారమైతే సంబంధిత అధికారులు వాస్తవాలను వెల్లడించి ప్రజలకు స్పష్టత ఇవ్వవచ్చు. అయితే అందుకు బదులుగా పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడమే లక్ష్యంగా కేసు నమోదుకు ఏకంగా జీవోను జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మీడియా గొంతు నులిమేందుకు తప్పుడుదారులుప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని మీడియా ప్రశ్నించడం సహజమైన ప్రక్రియ. ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక మోసాలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత. అయితే ఒక వార్తపై అభ్యంతరం ఉంటే వివరణ ఇవ్వడం, వాస్తవాలను వెల్లడించడం, అవసరమైతే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం సాధారణ ప్రక్రియ. కానీ వార్తా కథనాల కారణంగా మీడియా సంస్థలు, పబ్లిషర్లు, రిపోర్టర్లపై కేసులకు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే. నిజాలను ప్రశ్నించే మీడియా గొంతుకను అణచివేస్తే, ప్రజలకు వాస్తవాలు చేరే మార్గాలు మూసివేయవచ్చనే దురభిప్రాయంతో కూటమి ప్రభుత్వం తప్పుడుదారుల్లో అక్రమ కేసులు పెడుతోంది. రాజకీయ, మీడియా వర్గాల ఖండనపత్రికా స్వేచ్ఛ అణచివేతకు ప్రత్యేక జీవో జారీ చేయడాన్ని రాజకీయ, మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘వార్తలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వడం లేదా ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడం అనేది బాధ్యతగల ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ అది మానేసి, కథనం ప్రచురించిన పత్రికా సంస్థ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలకు అనుమతి ఇవ్వడం ఏమిటి?’ అని పత్రికా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.ఇది ప్రజాస్వామ్యంపై దాడివైఎస్సార్సీపీ నేతలు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీమంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మండిపడ్డారు. సాక్షి దినపత్రిక పబ్లిషర్, రిపోర్టర్‌తో పాటు, వార్త ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీచేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనల్లో ఆక్షేపించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసుకు సంబంధించిన దర్యాప్తు, పరిష్కార ప్రక్రియపై సాక్షి కథనంలో ప్రస్తావించిన అంశాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా ఆ వార్తను ప్రచురించిన పత్రికా ప్రతినిధులపైనే చర్యలకు సిద్ధపడటం అత్యంత దారుణమన్నారు. సమాధానం చెప్పలేక కేసులతో బెదిరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
గ్యాస్ బండకు గుడ్‌బై!
సాక్షి, అమరావతి: దీపం–2 పథకం ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) వినియోగదారులకు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే సమయంలో ఎల్పీజీ వినియోగదారులపై కఠిన నిబంధనలు విధించింది. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇకపై ఎల్పీజీ కనెక్షన్ కొనసాగించే అవకాశం లేకుండా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 11 జారీ చేసింది.పీఎన్జీలోకి మారాల్సిందే.. దీపం–2 పథకం పరిధిని పీఎన్జీ వినియోగదారులకు విస్తరించగా, ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ పీఎన్జీ సబ్వెన్షన్ స్కీమ్‘ అమలు కోసం పాటించాల్సిన విధివిధానాలను అధికారులు ఖరారు చేశారు. ఈ నిబంధనల మేరకు పీఎన్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగ దారులు పీఎన్జీకి మారడంతోపాటు అదే సమయంలో తమ వద్ద ఉన్న ఎల్పీజీ కనెక్షన్‌ను 30 రోజుల్లో తప్పనిసరిగా సరెండర్ చేయాలి. లేదా భవిష్యత్తులో పీఎన్జీ లేని ప్రాంతానికి మారితే ఉపయోగించుకునేందుకు ట్రాన్స్ఫర్ ఓచర్ తీసుకోవాలి. అలాగే పీఎన్జీ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోని ఎల్పీజీ వినియోగదారులకు ప్రత్యేక నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలి. ఒకసారి పీఎన్జీ కనెక్షన్ పొందిన, మారిన తర్వాత ఇక భవిష్యత్‌లో ఎల్పీజీ సిలిండర్ తీసుకోడానికి వీలుండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.3 నెలల్లో ఎల్పీజీ ఫ్రీ జోన్‌గా.. పీఎన్జీ వినియోగదారుల ఆధార్ వివరాలు సేకరించి దీపం–2 డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. అర్హులను గుర్తించి సబ్సిడీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు ఏర్పాటు చేస్తారు.. ఇప్పటికే పీఎన్జీ ఉన్న వారికి, పీఎన్జీ మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలను రానున్న మూడు నెలల్లో ‘ఎల్పీజీ–ఫ్రీ ప్రాంతాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నగర పాలక, పురపాలక సంఘాలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.. మరొక వైపు పీఎన్జీ మౌలిక వసతులను మరింత విస్తరించడంతో పాటు పైప్‌లైన్, పీఎన్జీ, సీఎన్జీ స్టేషన్లకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల కోసం పెండింగ్ దరఖాస్తులను సమీక్షించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీఎన్జీ కనెక్షన్లు, వినియోగంలో లేని కనెక్షన్ల పునరుద్ధరణ, ఎల్పీజీ–ఫ్రీ జోన్ల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.అర్హుల ఎంపిక, డేటా అనుసంధానం, సబ్సిడీ నిధులను ఎస్జీఎస్ డబ్ల్యూకు ముందస్తుగా విడుదల చేసే బాధ్యతను సివిల్సప్లయిస్కు అప్పగించారు.వినియోగదారుల్లో ఆందోళనప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎంపిక చేసుకునే స్వేచ్ఛపై పరిమితులు విధించడం సరికాదని వినియోగదారుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అన్ని ప్రాంతాల్లోనూ పీఎన్జీ సేవలు ఒకే స్థాయిలో అందుబాటులో లేవని, ఇలాంటి సందర్భంలో పీఎన్జీ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ వినియోగించే అవకాశం లేకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. పీఎన్జీ టారిఫ్‌లు భవిష్యత్తులో పెరిగితే వినియోగదారులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడు తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సబ్సిడీ ప్రకటిస్తూనే, మరోవైపు ఎల్పీజీ కనెక్షన్‌ను తప్పని సరిగా వదులుకోవాల్సిన నిబంధన విధించడంపై మండిపడుతున్నారు. -
దేవరపల్లి పొగాకు బోర్డుకు 5న వైఎస్ జగన్ రాక
బుట్టాయగూడెం (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు మద్దతుగా ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారని.. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ.. రైతులు కేజీకి రూ.300 పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే ఆ పంటలను నేడు రూ.170 నుంచి రూ.190 వరకూ అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన సీఎం చంద్రబాబు.. వరికి యూరియా వేస్తే కేన్సర్ వస్తుందని, మామిడికాయ తింటే షుగర్ వస్తుందని, సిగరెట్లు తాగితే కేన్సర్ వస్తుందని, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందని చెబుతూ రైతులను నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. ఏ పంట కూడా ఆరోగ్యకరం కాదంటే రైతులు ఎలా బతకాలని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన పొగాకు రైతుల గర్జన ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి నాందిగా నిలిచిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా రైతులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పరిశీలకులు పాల్గొన్నారు. -
డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్‌ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలిపాడు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. పోలీసులు లంచం డిమాండ్ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్యప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీసినట్లు సమాచారం. -
అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజును సిట్ అధికారులు రెండో రోజూ విచారించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సిట్ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5 గంటల వరకూ విచారించారు. రెండో రోజు కూడా నాగరాజు సహకరించలేదని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఆయన మౌనం దాల్చినట్లు సమాచారం. మరోవైపు.. కానిస్టేబుల్ సురేష్, ఆర్ఎంపీ, ఇతర సిబ్బంది నుంచి తీసుకున్న సమాచారం మేరకు సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే, ప్రతీ దానికి ఆయన ఏమీ తెలీదని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నారని తెలిసింది. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు..అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు.. ఎవరు తెచ్చారు.. అతన్ని ఎక్కడ ఉంచారు.. ఎలా చనిపోయాడు.. ఎప్పుడు చనిపోయాడు.. ఒకవేళ చనిపోతే మృతదేహాన్ని ఏం చేశారు అనేవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విచారణకు ఇంకా ఐదు రోజులే ఉండడంతో గడువు ముగిసేలోపు కేసులో ఏమైనా క్లూ రాబడతారా లేదా అనే సందేహం నెలకొంది. -
రఘురామతో నాకు ప్రాణహాని ఉంది: శ్రీనివాస్
సాక్షి,అమరావతి: గుంటూరులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వర్గం కిడ్నాప్‌కు యత్నించింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శ్రీనివాస్ పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.శుక్రవారం సాయంత్రం మా ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. నన్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. స్వయంగా రఘురామకృష్ణరాజే నాకు ఫోన్ చేశారు. తాను పంపిన వాళ్లతో రావాలని బెదిరించారు. రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలను బ్యాంక్ ఆక్షన్‌లో కొనుగోలు చేశా. రఘురామకృష్ణరాజుతో నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరా’అని వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ తెలిపారు. -
ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్ జగన్‌దే
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు...విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో సమ్మరీ ఇన్ఫర్మేషన్ రివిజన్ (SIR) ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంటే రాష్ట్ర మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఫారాలు ఇచ్చినట్లయ్యింది. జాబితా ప్రక్షాళనలో భాగంగా 7.37 లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్టు ప్రకటించగా, 22.30 లక్షల మంది షిఫ్ట్, గైర్హాజరైనట్లు తెలిపింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 44,89,512 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించాల్సి ఉందని, ప్రస్తుతానికి వారి నుంచి ఫారాలు తీసుకోలేదని ఈసీ స్పష్టం చేసింది.కాగా, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం సిబ్బంది (BLOలు) ప్రతి ఇంటికీ తిరిగి, అక్కడ నివసిస్తున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది.


