ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్– ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్–2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను https://polycetap.ap.gov. in లో సమర్పించవచ్చు.


