ఆమీర్‌ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం | Narrow escape for Mukesh Ambani as tree falls in front of convoy amid rains | Sakshi
Sakshi News home page

ఆమీర్‌ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం

Jul 6 2026 2:49 PM | Updated on Jul 6 2026 3:04 PM

 Narrow escape for Mukesh Ambani as tree falls in front of convoy amid rains

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుటుంబానికి  తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కుండపోత వర్షాలు, బలమైన గాలుల మధ్య అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు ఒక చెట్టు కూలిపోవడంతో, కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  దీంతో ట్రాపిక్‌లో  కొద్దిసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అంబానీ కుటుంబం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్  మూడో వివాహ వేడుకకు వెళ్లుండగా  ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 

 అంబానీ కుటుంబానికి ఖరీదైన కార్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అనేక విలాసవంతమైన, సౌకర్య వంతమైన కార్లు వారి  సొంతం. పలు భద్రతా ఫీచర్లతో కూడిన లగ్జరీ అంబానీ కాన్వాయ్ సాఫీగా సాగేందుకు గాను , వారి వ్యక్తిగత భద్రతా వాహనాలు ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం కూడా గతంలో చూశాం. అయితే తాజాగా  ముంబైలో భారీ వర్షాలకు, దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి కూడా ఇక్కట్లు తప్పలేదు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'clicksachin' షేర్ చేశారు. దీని ప్రకారం అంబానీ కాన్వాయ్ రోడ్డు మధ్యలో ఆగిపోవడం కనిపిస్తుంది. ముందు వరుసలో రేంజ్ రోవర్ (Range Rover) ఉండగా, దాని వెనుక మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes-Benz S-Class) ఉంది. ఎస్-క్లాస్ వెనుక టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)  ఇతర వాహనాల వరుసను ఈ వీడియోలో చూడవచ్చు. చెట్లు నేలకూలి రోడ్డుపై పడి ఉండటం వల్ల పరిస్థితి  ప్రమాదకరంగా మారింది. ట్రాఫిక్‌ను పూర్తిగి స్తంభించిపోవడంతో కాసేపు అంబానీ కుటుంబం రోడ్డుపైనే ఆగిపోవాల్సి వచ్చింది. అటు  అంబానీ కుటుంబ భద్రతా సిబ్బంది చేయలేకపోయింది.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ బుల్లెట్-రెసిస్టెంట్ (బుల్లెట్ ప్రూఫ్) మెర్సిడెస్-బెంజ్ S680 గార్డ్ సెడాన్. వీడియోలో కనిపిస్తున్న వాహనం బంగారు రంగు (గోల్డ్ షేడ్)లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ కుటుంబం వద్ద ఉన్న నాలుగు S-క్లాస్ గార్డ్ సెడాన్లలో ఇది ఒకటని సమాచారం. ఈ కారు W223 తరానికి చెందినది మరియు VPAM VR10 ధృవీకరణను కలిగి ఉంది; పౌర వినియోగ వాహనాలకు లభించే అత్యున్నత స్థాయి బాలిస్టిక్ రక్షణగా దీనిని పరిగణిస్తారు. ఇది బాలిస్టిక్ ముప్పుల నుండి రక్షణ కల్పించడమే కాకుండా, పేలుడు పదార్థాల (explosive charges) నుండి కూడా కాపాడుతుంది. ఈ సెడాన్‌లో బుల్లెట్ , పేలుడు నిరోధక అద్దాలు (glass) అంబానీ కార్ల ప్రత్యేకత.  Mercedes-Benz S680 Guard శక్తివంతమైన 6.0-లీటర్ V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 612 bhp  పవర్‌ను, 830 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  అలాగే, ఇందులో ప్రత్యేకమైన 'రన్-ఫ్లాట్' టైర్లు పంచర్ అయినప్పటికీ 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేలా సామర్థ్యం వీటి సొంతం.. ఈ నిర్దిష్ట Mercedes-Benz S680 Guard ధర బహిరంగంగా వెల్లడి కానప్పటికీ, దీని ధర రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

కాగా ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. చెట్లు కూలడం, ట్రాఫిక్ జామ్‌లతో సహా వర్షాల కారణంగా ముంబైలో పరిస్థితి  అస్తవ్యస్థంగా తయారైంది. రోడ్డు పక్కన కొన్ని చెట్లు వేళ్లతో సహా పెకిలించుకు పోయి లేదా విరిగి పడిపోయాయి,  పలు చోట్లు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా  పౌర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్‌ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement