షియాపరెల్లీ దుస్తుల్లో ఇషా అంబానీ స్టైలిష్‌ లుక్‌..: 'సమ్‌థింగ్ బ్లూ'కు.. | Isha Ambani : Something Blue a Couture Makeover in Custom Schiaparelli | Sakshi
Sakshi News home page

Isha Ambani: షియాపరెల్లీ దుస్తుల్లో ఇషా అంబానీ స్టైలిష్‌ లుక్‌..: 'సమ్‌థింగ్ బ్లూ'కు..

Jul 6 2026 1:06 PM | Updated on Jul 6 2026 1:09 PM

Isha Ambani : Something Blue a Couture Makeover in Custom Schiaparelli

ఇషా అంబానీ ఏ రెడ్‌కార్పెట్‌పైన అయినా..తనదైన ఫ్యాషన్‌ శైలితో స్టైలిష్‌ కనిపిస్తారు. తల్లి నీతాల ఫ్యాషన​్‌కి ఐకాన్‌లా తన వస్త్రధారణ అత్యంత విలక్షణంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈసారి కూడా అలానే అత్యంత స్టైలిష్‌ లుక్‌లో మెరిసింది.   తన తాజా 'అవుట్ ఆఫ్ ది నైట్' (OOTN) కోసం షియాపరెల్లీ ఫ్యాషన్‌ హౌస్‌ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్లకు సంబందించిన డిజైనర్‌వేర్‌లో తళుక్కుమంది. 

ఈ బ్రాండెడ్‌ డిజైనర్‌వేర్‌లు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటూనే..అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది . ఫార్మల్‌ దుస్తులు కూడా స్టైలిష్‌ కనిపించేలా చేయొచ్చు అన్నట్లుగా ఉంటుంది దీని డిజైన్‌. ఇక ఇషా లుక్‌ విషయానికి వస్తే..న్యూడ్-టోన్డ్ బేస్‌పై రూపొందించబడిన షియాపరెల్లీ సూట్ సెట్ ఏమాత్రం శరీరాన్ని బహిర్గతం చేయకుండానే..ఒక అందమైన లుక్‌ని ఇస్తుంది. షియాపరెల్లీ ప్రత్యేకత ఏమిటంటే, కాలర్‌బోన్ మీదుగా భుజాలను తాకుతూ విస్తరించిన లేయర్డ్, ట్యూల్ ఓంబ్రే నెక్ లైన్ ఆ డ్రైస్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. 

అందులోనూ ఇక్కడ నీలి రంగు కాంట్రాస్ట్‌ని ఇంచుకుని ఆ డ్రెస్‌కి ఒక గంభీరమైన శక్తిని అందించింది. సింపుల్‌గా చెప్పాలంటే..ఎవ్వరైనా ఆమె డ్రెస్‌ వంక కన్ను ఆర్పకుండా చూసేలా చేసింది ఈ డిజైనింగ్‌. దీన్ని సూక్ష్మమైన బంగారు రంగు వెల్వెటీన్‌తో తయారు చేశారు. ఇక్కడ షియాపరెల్లీ తన డిజైనర్‌ వేర్‌ లుక్‌ని  'బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్' పక్షుల రంగులను ప్రేరణగా తీసుకుని రూపొందిస్తుంది. అలాగే ఇషా గతంలో కూడా ఈ రాయల్‌ బ్లూ షియాపరెల్లీ డిజైనర్‌వేర్‌లో మెరిసింది. తన సోదరుడు అనంత్‌ అంబానీ-రాధికల సంగీత వేడుకలో ఆమె పూర్తిగా నీలి రంగు చీర గౌనులో అద్భుతంగా కనిపించింది. 

 

 

(చదవండి: రాజసం ఉట్టిపడే ఊదా రంగు పట్టు చీరలో నీతా స్టన్నింగ్‌ లుక్‌..!)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement