ఒడిశాలో ఎన్‌కౌంటర్: అంతర్రాష్ట్ర దొంగకు గాయాలు | Champua Police Encounter Interstate thief Mohammad Nafis Injured | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఎన్‌కౌంటర్: అంతర్రాష్ట్ర దొంగకు గాయాలు

Jul 6 2026 10:00 AM | Updated on Jul 6 2026 10:14 AM

Champua Police Encounter Interstate thief Mohammad Nafis Injured

చంపూవా: ఒడిశాలోని కేందుఝర్, మయూర్‌భంజ్ ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్న జార్ఖండ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మహమ్మద్ నాఫిస్‌ను చంపూవా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దొంగతనం చేసిన సొత్తును నాఫిస్ చంపూవా సమీపంలోని పతలా అడవిలో దాచిపెట్టాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, దొంగతనపు సొత్తును స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఉదయం పతలా అడవికి తీసుకెళ్లారు.

ఉదయం సుమారు 5 గంటల సమయంలో, నాఫిస్ అక్కడ ముందే దాచి ఉంచిన నాటు తుపాకీతో పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కుడి మోకాలికి గాయమైంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం చంపూవా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేందుఝర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుడి నుంచి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. చంపూవా పోలీస్ స్టేషన్‌లో నిందితునిపై కేసు నమోదు చేశారు. కాగా నిందితుని సహచరులు, నేర నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: ‘కలల నగరం’ కథలే వేరు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement