అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే.. | How Aamir Khan Reconnected With Gauri Spratt After 25 Years And Found Love Again, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Aamir Khan And Gauri Spratt : అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే..

Jul 5 2026 3:36 PM | Updated on Jul 5 2026 4:39 PM

 Aamir Khan Gauri Spratts decades long connection blossomed into love

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్‌ ఖాన్‌ తన చిరకాల ప్రేయసి గౌరీ స్ప్రాట్‌ని ఇవాళ జూలై 5న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో చిన్న వేడుకుగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి పరిచయం ఎలా మొదలైంది. అదికాస్తా పెళ్లి పీటల వరకు ఎలా చేరింది వంటి విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

అక్కడే తొలి పరిచయం..
అమిర్‌ ఖాన్‌, గౌరీ స్ప్రాట్‌ దాదాపు 25 ఏళ్ల క్రితం బెంగళూరులో మొదటిసారి కలుసుకున్నారు. అప్పట్లోనే పరిచయం ఏర్పడినప్పటికీ..జీవితం వారిని వేర్వేరు దారుల్లోకి తీసుకెళ్లడంతో వారి మధ్య సంబంధం సమాసిపోయింది. మళ్లీ 2023లో అమిర్‌ కుటుంబ సభ్యుల ద్వారా ఒకరికొకరు పరిచయమై కలుకున్నారు. అలాగే నటుడు అమిర్‌ ఖాన్‌ కూడా తన పుట్టినరోజున మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో తాము యాదృచ్చికంగా మళ్లీ కలుసుకున్నామని, అప్పటి నుంచి టచ్‌లో ఉన్నామని అమిర్‌ చెప్పారు. 

అలా వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని అన్నారు. ఆ తర్వాత ఈ జంz డేటింగ్‌ చేయడం ప్రారంభించారు. 2025లో తమ బంధాన్ని బహిర్గతం చేయడానికి ముందు, దాదాపు 18 నెలల పాటు తాము ప్రేమలో ఉన్నమాని అమిర్‌ వెల్లడించారు. అమిర్‌ తన 60వ పుట్టినరోజు వేడుకల సమయంలోనే మీడియాకు గౌరీస్ప్రాట్‌ను పరిచయం చేశారు. తమకు దాదాపు 25 ఏళ్లుగా పరిచయం ఉందని, సుమారు ఏడాదిన్నర క్రితం మళ్లీ కలుసుకున్నామని అప్పుడే ఆయన తెలిపారు. 

ఇదంతా సహజంగా జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత నుంచి అమిర్‌ తోపాటు గౌరీ కూడా కనిపించడం మొదలు పెట్టారు. అలా ఆమె అమిర్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి తమ పిల్లలు, మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌ రావులు కూడా మద్దతుగా నిలిచారని అమిర్‌నే స్వయంగా వెల్లడించారు. ఇక ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు కూడా. 

కాగా, అమిర్‌ 1986 నుంచి 2002 వరకు రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇరా, జునైద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు జన్మించగా, 2021లో వారు విడిపోయారు. ఇక గౌరీకి కూడా గత వివాహం ద్వారా ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. 

(చదవండి: ఎవరీ డాక్టర్‌ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్‌ గురించి..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement