తమిళ ప్రముఖ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ కరాటే బాబు. 'డాడా' ఫేమ్ గణేష్ కె బాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అయితే ఈ మూవీతో తమిళనాడు మాజీ డీజీపీ శంకర్ జివాల్ కూతురు హీరోయిన్‌గా పరిచయమవుతుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్)
మాజీ డీజీపీ కుమార్తె పేరు దౌదీ జివాల్. ఇకపోతే ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, వీటివీ. గణేష్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. సుందర్ ఆరుముగం నిర్మాత. ఇంతకుముందు ఈయన రవి మోహన్‌తో అఖిలన్, బ్రదర్ లాంటి మూవీస్ తీశారు. ఇది మాత్రం రాజకీయ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించారు.
ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయని అయితే వాటికి పూర్తి భిన్నంగా 'కరాటే బాబు' ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం, బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే కథ చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా శాసనసభ్యుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే రాజకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కించారట.శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఎళిల్ అరసు.కె ఛాయాగ్రహణం అందించారు.
(ఇదీ చదవండి: సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్)


