టోల్‌గేట్‌పై దూసుకొచ్చిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ : నలుగురు మృతి | LPG Tanker Goes Out Of Control Crashes Into UP Toll Booth, 4 Killed | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్‌పై దూసుకొచ్చిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ : నలుగురు మృతి

Jul 3 2026 12:10 PM | Updated on Jul 3 2026 12:34 PM

LPG Tanker Goes Out Of Control Crashes Into UP Toll Booth, 4 Killed

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి)లోడ్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగు  చూడటంతో  వైరల్‌గా మారింది.

24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అకస్మాత్తుగా అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ  ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు  సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.మంటలను అదుపులోకి తీసుకు రావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.

 

ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్‌ మదర్‌ సునీత సక్సెస్‌ స్టోరీ

ఈ ఘటనలో ధర్మేంద్ర దుబే (40)  డ్రైవర్,  అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాలోని పలువురు ఇతర కార్మికులు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి  కొద్దిసేపు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఒక టెక్నికల్‌ టీంను  ఏర్పాటు చేశారు.

 

ఇదీ చదవండి: 16 పత్రాలిచ్చినా; సిటిజెన్‌షిప్‌పై గౌహతి కోర్టు సంచలన తీర్పు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement