హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం ప్రభావం కనిపించింది.


