breaking news
Wanaparthy
-
చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు. -
జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు
● కృష్ణానది తీరాన 108 ఎకరాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. 1.50 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరితే కూలుతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూలేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని.. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశామన్నారు. కృష్ణానది సమీపంలో 108 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో పేదలకు ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్‌ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, మహంకాళి, మార్కెట్ డైరెక్టర్ విష్ణు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ● అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఎం మండల నాయకులు జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రమేష్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. -
అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్‌బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్‌రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్‌తో పరిచయం చేసుకున్నారు. -
రహదారి భద్రతపై విస్తృత అవగాహన
● టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: రహదారి భద్రత వారోత్సవాలు జనవరిలో కొనసాగనున్నాయని.. గ్రామాల్లో రహదారి ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. పోలీస్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి జాతీయ రహదారి, ఆర్అండ్బీ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అంబులెనన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకొని ఉండాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారిపై గుర్తించిన వెల్టూరు, పాలెం, మదర్ థెరిస్సా కూడలి, అమడబాకుల, రంగాపూర్, ఆనందభవన్ తదితర బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కొనసాగడానికి కారణాలు ఏమిటనే విషయాలు అన్వేషించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, వేగం కొలిచే యంత్రాలు వంటివి సిద్ధం చేయాలన్నారు. -
క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరి : ఎస్పీ
వనపర్తి: నేర రికార్డులను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యాలయంలో వివిధ రికార్డులతో పాటు షీ టీం పనితీరు రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో అలసత్వం ఉండరాదని, ప్రతి నమోదు న్యాయ ప్రక్రియకు ఆధారంగా నిలుస్తుందని అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత డీఎస్పీతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, గ్రేవ్ కేసుల పురోగతి, విచారణ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రతి కేసు చట్టబద్ధంగా, బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సాగాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని.. ప్రతి కేసు చట్టబద్ధంగా, నిర్దిష్ట గడువులోగా పక్కా ఆధారాలతో ముందుకు సాగాలన్నారు. రికార్డుల నిర్వహణలో పొరపాట్లు ఉంటే న్యాయస్థానాల్లో కేసులు బలహీనపడతాయని బాధ్యతతో మెలగాలని, బాధితులకు భద్రత, గౌరవం, న్యాయం కల్పించడమే పోలీసుశాఖ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రతి విభాగంలో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆమె వెంట సీఐ కృష్ణయ్య, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి, గోపాల్పేట ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. నేడు కోస్గికి సీఎం రాక కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘ఉపాధి కల్పన’ను వినియోగించుకోవాలి పాన్‌గల్: గ్రామీణ ప్రాంత యువత, మహిళలు, రైతులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మహబూబ్‌నగర్ ప్రాంతీయ అధికారి సైదా, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అబ్బాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. సోమవారం మండలంలోని మల్లాయిపల్లిలో సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా అందే రుణాలకు 25 శాతం, 35 శాతం రాయితీ అందుతుందని వివరించారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
వనపర్తి: పోలీసు బాధ్యతను మానవీయ విలువలతో మేళవిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. సంబంధిత అధికారులతో ఎస్పీ మాట్లాడి బాధితుల సమస్యలు త్వరగా పరిష్కించేలా కృషిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగే వరకు పోలీసుశాఖ బాధ్యతగా పనిచేస్తుందని బాధితులకు భరోసానిచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల నమ్మకమే పోలీసు శాఖ బలమని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని అన్నారు. దివంగత పార్లమెంట్ సభ్యుడు, సామాజిక కార్యకర్త జి.వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికపై ధైర్యంగా ప్రస్తావించిన ప్రజాప్రతినిధి వెంకటస్మామి అని.. ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వు ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పల్లెల్లో నవశకం..
●అమరచింత/మదనాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన అభ్యర్థులు సోమవారం సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో మొత్తం 268 గ్రామ పంచాయతీలకు గాను 267 జీపీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సర్పంచులు తమ పేర్లను ప్రస్తావిస్తూ.. అందరి భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతామని, రాజకీయాలు, వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ సమాన దృష్టితో సంక్షేమ పథకాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాకుండా అక్షరాస్యతలో సైతం తమ గ్రామాలను ముందుంచుతామన్నారు. కాగా, మదనాపురం మండలం కొత్తపల్లిలో సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. పెబ్బేరు మండలం వై శాగాపూర్, తోమాలపల్లె, కంచిరావుపల్లి గ్రామాల్లో కొలువుదీరిన పాలకవర్గాలను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించారు. పండుగ వాతావరణంలో.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు పంచాయతీ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని భవనాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణల్లో టెంట్లు వేయడంతో పండుగ వాతావరణం కనిపించింది. కొన్ని జీపీలకు రంగే లేదు.. జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను నామమాత్రపు ముస్తాబు చేయడంతోనే సరిపెట్టారు. భవనాలకు కొత్తగా పెయింటింగ్ వేయకపోవడంతో పాలకవర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. కొందరు ఇదేం పద్ధతని పంచాయతీ కార్యదర్శులను అడిగితే డబ్బులు లేవని సమాధానం ఇచ్చినట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. జిల్లాలో పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలను పండుగ వాతావరణంలో పూర్తిచేశాం. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు ఆయా గ్రామ పంచాయతీలకు హాజరై సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణం చేయించారు. ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేశాం. – రఘనాథ్‌రెడ్డి, ఇన్చార్జి డీపీఓ రెండేళ్ల తర్వాత పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు జిల్లాలో 268 గ్రామ పంచాయతీలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేశారు. చిన్నచిన్న పొరపాట్లకు సైతం తావివ్వకుండా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. -
రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్‌హాలిడేనా?
● చేతకాని పాలనకు ఇదే నిదర్శనం ● మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్‌హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్‌తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్‌హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ ఉన్నారు. -
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పోలీసు గౌరవ వందనం సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలపై రూపొందించిన స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం, ఫొటో సెషన్లో గవర్నర్ పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన కవులు, కళాకారులతో గవర్నర్ పరిచయ కార్యక్రమం ఉంటుందని.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాశ్ ఉన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 20 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటివరకు 48.96 శాతమే పూర్తి చేశారని.. మరింత వేగవంతం చేసి వందశాతం లక్ష్యం సాధించాలన్నారు. రోజు ప్రతి మండలంలో 100 మందిని మ్యాపింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విషయంపై బూత్‌స్థాయి అధికారులకు సూచనలు చేయాలని.. 10 శాతం కన్నా తక్కువ ఉన్నవారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో బ్లర్‌గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్ఓలతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
మదనపురం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సరళాసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు నిమిత్తం శనివారం సాయంత్రం జలాశయం ఎడమ కాల్వ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసాచారి, డైరెక్టర్ పావని, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, జగదీశ్, అక్కల మహదేవన్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, సాయిబాబా, శ్రీధర్‌రెడ్డి, డీలర్ లక్ష్మయ్య, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
గోపాల్పేట: గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని ఎస్ఈ వెంకట్రామన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆయనతో పాటు శాఖ అధికారులు పర్యటించి నీటి సరఫరాపై ఆరా తీశారు. మిషన్ భగీరథ మంచినీరు సరిగా రావడం లేదని, బోరు నీటినే పైప్‌లైన్ ద్వారా వదులుతున్నారని రేవల్లిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అందరికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జీ రామ్‌జీ బిల్లు రద్దు చేయాలి : సీపీఎం కొత్తకోట: లోక్‌సభలో బలవంతంగా ఆమోదించిన జీ రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కొనసాగించాలని సీపీఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ పాలనలో వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా, అధికార దురహంకారంతో పేర్లు మార్చి కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు రోజువారి వేతనం రూ.600కు పెంచాలని, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నాయకులు వెంకటయ్య, గొల్ల రాములు, యాదయ్య, మల్లేష్, నాగన్న, కురుమయ్య, వెంకటేష్, గోపాల్, శ్రీను, రాములు, గోవర్దన్, మహేష్ పాల్గొన్నారు. ఎన్నికలను డబ్బు, మద్యం శాసిస్తున్నాయి : సీపీఐ అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను ప్రస్తుతం డబ్బు, మద్యం, కులమతాలు ప్రధానపాత్ర పోషిస్తూ శాసిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజకీయ నాయకులు తిలోదకాలు ఇచ్చారని.. యథేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే జంకే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని.. నల్ల చట్టాలు, ఉపాధిహామీ పథకం పేరు మార్పు ఇందులో ఉన్నాయన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని సత్కరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్, కళావతమ్మ, లక్ష్మీనారాయణశెట్టి, శ్రీహరి, శ్యాంసుందర్, కుతుబ్, నర్సింహశెట్టి పాల్గొన్నారు. రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 975 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 60 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 23న జిల్లా పర్యటనకు రానున్నారని.. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ తేదీన 3.30 గంటలకు గవర్నర్ జిల్లాకేంద్రానికి చేరుకొని జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖుల ముఖాముఖిలో పాల్గొంటారని, వారందనీ ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రమణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, వేదిక, సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వ హణకు తగిన ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా విద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.వాహనదారులు రహదారి భద్రత నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని.. విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపార. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు రహదారి నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి మాసోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, డీటీఓ మానస, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, పంచాయత్‌రాజ్‌శాఖ ఈఈ మల్లయ్య, ఐఆర్‌ఏడీ డీఆర్ఎం మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెరుకు తరలింపునకు సహకరించాలని వినతి
ఆత్మకూర్: చెరుకు తరలింపునకు పోలీసుల ఆంక్షలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఎత్తివేసి సహకరించాలని కృష్ణవేణి చెరకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో రైతులు శనివారం ఎస్ఐ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత, ఆత్మకూర్ మండలాల నుంచి కృష్ణవేణి చెక్కర ఫ్యాక్టరీకి నిత్యం వందల సంఖ్యలో చెరుకు ట్రాక్టర్లు, లారీలు వెళ్తుంటాయన్నారు. ఆయా వాహనాల రాకపోకలతో మదనాపురం, ఆత్మకూర్‌లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని పోలీసులు రాత్రి వరకు నిలుపుతున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమయపాలన ఆంక్షలు ఎత్తివేసి నిరంతరం రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, సంజీవరెడ్డి, నారాయణ, వెంకటేష్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్‌గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్‌లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్‌గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్‌లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం యాసంగి సాగుకు ఆయకట్టును కుదించింది. ఎడమకాల్వ పరిధిలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే 15 వేల ఎకరాలకు వారబందీ విధానంలో సాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో యాసంగి సాగుకు నీరు ఇవ్వమంటూ ముందస్తుగా టాంటాం వేయించాం. పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వదులుతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ● -
రాజీమార్గం.. రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో 9,969 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 1,701, ప్రీ లిటిగేషన్ కేసులు 8,268 ఉన్నాయన్నారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. 84 కేసులు పరిష్కారం.. ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరగడంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం 46 క్రిమినల్, 3 ఎకై ్సజ్, 2 ఎస్టీసీ, 10 సీసీ అడ్మీషన్ కేసులకుగాను రూ.43,500.. 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ. 22,500 జరిమానా విధించారు. మొత్తం 84 కేసులు పరిష్కరించి కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. -
గాంధీజీ ఆశయ సాధనకు కృషి
● దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ● డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ● గాంధీచౌక్‌లో కాంగ్రెస్ నిరసన వనపర్తిటౌన్: గాంధీజీ ఆశయ సాధనకు దేశ ప్రజలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేశారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం అభాగ్యులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, గ్రామీణ ప్రజలు ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సామాన్య ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పేదల సంక్షేమానికి యత్నిస్తుండగా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధనవంతులను పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ సంపదంతా అదానీ, అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని.. ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల జరిగిన అక్రమ కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నందిమళ్ల యాదయ్య, శంకర్‌ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు కదిరె రాములు, బి.కృష్ణ, తిరుపతయ్య, బాబా, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు కుదింపు
యాసంగిలో చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవిస్తాం. 15 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతుకు గురికావడంతో వానాకాలంలో కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించా రు. ప్రస్తుతం యాసంగికి సైతం అందించాలి. – సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం, మిట్టనందిమళ్ల మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగిలో కేవలం రామన్‌పాడు వరకే సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించడం శోచనీయం. గతంలో సైతం యాసంగి సాగునీటిని కుదించిన ఆయకట్టుకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరుతడి పంటల సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం దారుణం. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి, వీపనగండ్ల అమరచింత: జూరాల ఆయకట్టులో యాసంగి సాగుకు వారబందీ విధానంలో నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడు రిజర్వాయర్ వరకు అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 10 వేల నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించడం, గురువారం జరిగిన ఐఏబీ సమావేశంలో వారబందీని అమలు చేస్తూ తక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల కిందట ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో నాటి యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించిన అధికారులు.. ప్రస్తుతం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎందుకు నీటిని వదలడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎడమ కాల్వ కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించడం ఏమిటని అంటున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో విస్తరించి ఉండగా కేవలం అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల రైతులకే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రకటించడం సరికాదని అంటున్నారు. యాసంగి విస్తీర్ణం ఖరారు.. ప్రస్తుతం జలాశయం నుంచి 4.690 టీఎంసీల నీటిని వినియోగించేందుకు అవకాశం ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద రామన్‌పాడ్ జలాశయం వరకు మాత్రమే సాగునీటి సరఫరాకు ప్రణాళిక ఖరారు చేశారు. సాగు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న క్రమంలో ముందస్తుగా వారబందీ విధానం అమలు చేస్తున్నారు. గత గురువారం నుంచే వారబందీ అమలు చేస్తూ కాల్వలకు నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో టాంటాం.. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొత్తకోట, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల ఆయకట్టు గ్రామాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు యాసంగిలో సాగునీరు అందదని, దీనిని దృష్టిలో ఉంచుకొని నారుమడులు వేసుకోవాలని దండోరా వేయిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకే సాగునీరు యాసంగిలో వారబందీ విధానం అమలు చివరి ఆయకట్టు గ్రామాల్లో చాటింపు ఆందోళనలో అన్నదాతలు -
లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం : ఎస్పీ
వనపర్తి: జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో ఈ నెల 21న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, బ్యాంకు, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలన్నారు. రాజీయే రాజ మార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయస్థానం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అవగాహన కల్పించాలన్నారు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికొస్తే అప్పుడే సమసిపోతాయని అన్నారు. లోక్ అదాలత్‌తో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి వనపర్తి: జిల్లాలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 1,80,294 కార్డులు, 6,09,645 మంది లబ్ధిదారులుండగా.. ఇప్పటి వరకు 4,23,466 లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన 1,86,179 మంది లబ్ధిదారులు సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి పూర్తి చేసుకోవాలని కోరారు. 5 ఏళ్లలోపు వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. రేషన్ డీలర్లు దుకాణాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు 100 ఈకేవైసీకి సహకరించాలని సూచించారు. తప్పుడు కేసులను సహించం : కాంగ్రెస్ వనపర్తి: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి కొత్తకోట రోడ్‌లోని బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం స్థాపించబడిందని, స్వాతంత్య్రం అనంతరం ఆ పత్రికను ‘యంగ్ ఇండియా’ పేరుతో కొనసాగించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకపోయినా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని.. ఈ కుట్రను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, ఆమె కుటుంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక నెహ్రూ సొంత నిధులతో స్థాపించారని, నేడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఇల్లు కూడా లేదన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని, రాజీవ్‌గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అంతటి విషాదంలోనూ దేశాభివృద్ధి కోసమే సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రధానమంత్రి పదవికి అవకాశం ఉన్నప్పటికీ దేశ హితం కోసం దివంగత నాయకుడు డా. మన్మోహన్సింగ్ను ప్రధానమంత్రిగా నియమించారని తెలిపారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధి కోయిల్‌కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్‌కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్‌గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్‌తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్‌కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దపోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్‌లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్‌లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
ఆఽధిక్యం ఉన్నా.. అసంతృప్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ముందస్తు ప్రణాళికలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయనే చర్చ పల్లెసీమల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం 90 శాతం స్థానాలు తమవే అనుకున్న అఽధికార పార్టీ 54.85 శాతం స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్తో బీజేపీ లోపాయికారిగా జతకట్టి అవసరమైన వారికి మద్దతిస్తూ మరికొన్నిచోట్ల మద్దతు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోల్పోలేదనే అంశాన్ని చాటుకుంది. వనపర్తితో పాటు ఖిల్లాఘనపురం, గోపాల్పేట, దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందడం శోచనీయం. ఇందుకు నేతల ప్రసంగాలే కారణంగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పట్టు కోల్పోయిన అధికారపార్టీ.. జిల్లాలోని గోపాల్పేట, పాన్‌గల్, చిన్నంబావి మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు మినహా.. మిగతా ప్రాంతాల్లోని ప్రధాన గ్రామాల్లో అఽధికార పార్టీ పట్టు సడలినట్లు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. 12 మండలాల్లో కాంగ్రెస్.. మూడింటిలో బీఆర్ఎస్ ఆధిక్యం 3 మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో పట్టుకోల్పోయిన అధికార పక్షం -
ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి
వనపర్తి: వరి ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో డబ్బులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార సంఘం, పౌరసరఫరాలశాఖ అధికారులతో వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు.. ఇంకా ఎంత కేంద్రాలకు రావాల్సి ఉంది.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 50 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా 21 వేల మెట్రిక్ టన్నుల ట్యాబ్ ఎంట్రీలు పెండింగ్‌లో ఉందని, మిల్లర్లు దించుకున్న ధాన్యానికి సంబంధించి వెంటనే రసీదులు ఇవ్వకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని కలెక్టర్ తెలిపారు. మిల్లర్ల నుంచి రసీదు త్వరగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం చేసిన ధాన్యాన్ని తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు పంపించడానికి వీలు లేదని, అధికారి సూచించిన మిల్లుకు మాత్రమే పంపించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సహకార సంఘం అధికారి ఇందిరా, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు ఉన్నారు. జిల్లాలో అసైన్డ్ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాలు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను సర్వేనంబర్ల వారీగా గుర్తించి డేటాను అప్లోడ్ చేయాలన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు సుమారు 5 వేల ఎకరాలు, అసైన్డ్ భూములు 7 వేల ఎకరాలు గుర్తించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, హెచ్‌హెచ్‌ఓ శంకర్ తదితరులు ఉన్నారు. -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్‌రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్‌రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్‌గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి/వనపర్తి రూరల్: జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల పరిధిలోని 268 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. బుధవారం మూడోవిడత ఎన్నికల ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌లో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాసులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి పరిశీలించారు. ఉదయం శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం, శ్రీరంగాపూర్ మండల కేంద్రం, పెబ్బేరు మండలం కంచిరావుపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు, భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకే ఓటువేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడోవిడతలో ఎన్నికలు జరిగిన ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,11,357 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
హస్తగతం..
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు పెబ్బేరు మండలం వై.శాఖాపురంలో విజయోత్సవ ఊరేగింపు జిల్లాల వారీగా పోలింగ్, ఫలితాలు ఇలా.. మహబూబ్‌నగర్: జిల్లాలో మూడో విడతలో 133 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్.. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, జడ్చర్ల మండలాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల్లో 67 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. 52 జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన నలుగురు, తొమ్మిది చోట్ల ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్: జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని 158 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 102 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 37 చోట్ల బీఆర్ఎస్కు చెందిన వారు గెలుపొందారు. ఇతరులు 12, బీజేపీకి చెందిన ఒకరు సర్పంచ్‌గా విజయం సాధించారు. నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ, ఊట్కూరు మండలాల్లో 110 జీపీలకు పోలింగ్ నిర్వహించారు. 59 గ్రామాల్లో హస్తం.. 25 చోట్ల బీఆర్ఎస్, 17 జీపీల్లో బీజేపీకి చెందిన వారు గెలుపొందారు. తొమ్మిది గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. వనపర్తి: జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో 87 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 46 పంచాయతీల్లో హస్తం, 26 జీపీల్లో బీఆర్ఎస్, మూడు చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేశారు. జోగుళాంబ గద్వాల: జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్, ఎర్రవెల్లి, ఇటిక్యాల మండలాల్లో మొత్తం 75 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 25 జీపీల్లో కాంగ్రెస్, 31 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 19 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. అక్కడక్కడ.. ● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్‌లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తుది విడత: 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ఉమ్మడి జిల్లాల్లో 27 మండలాల పరిధిలో తుది విడత ఎన్నికలు జరిగాయి. 563 జీపీల్లో ఏడు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 52 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 504 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. 5,016 వార్డు స్థానాలకు గాను 58 వార్డుల్లో నామినేషన్లు పడలేదు. 942 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరిగింది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తుది విడతలోనూ కాంగ్రెస్‌కే ఆధిక్యం సత్తా చాటిన బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రభావం చూపలేక వాడిపోయిన ‘కమలం’ ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లకు సన్మానాల పర్వం షురూ ‘హస్తం’ శ్రేణుల్లో జోష్.. ‘కారు’ కార్యకర్తల్లోనూ ఉత్సాహం -
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ, మూడు విడతల్లో ఎన్నికలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని.. ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీతరెడ్డి అభినందనలు తెలిపారు. చివరి విడత ఎన్నికల సందర్భంగా ఆమె శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంలో యంత్రాంగం పాత్ర విశేషమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, రాత్రి గస్తీ, ముందస్తు చర్యలు, నిరంతర నిఘా వంటి చర్యలతో ఏ చిన్న ఘర్షణ కూడా పెద్ద సమస్యగా మారకుండా నియంత్రించగలిగామని తెలిపారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి పోలింగ్ కేంద్రంలో బందోబస్తును పరిశీలించిన ఓటర్లతో మాట్లాడారు. -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్‌రాథోడ్ సర్పంచ్‌గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
‘తుది’ పోరుకు సై..
నేడు చివరి విడత సం‘గ్రామం’ ● 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు ● ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ● 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు. -
చివరి విడతకు పటిష్ట భద్రత : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసుశాఖ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడోవిడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల్లో 87 గ్రామపంచాయతీలు ఉండగా.. 6 ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన పంచాయతీల్లో 1,300 మంది అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు విధుల్లో ఉన్న సిబ్బంది సమయస్ఫూర్తి, అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి నిమిషం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్, చెక్‌పోస్టులు నిరంతరం పని చేస్తాయని వివరించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచాకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ఆవిష్కరణలకు ప్రోత్సాహం : కలెక్టర్ వనపర్తి: గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారం గుర్తించడమే ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణస్థాయి ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్స్, ఇన్నోవేటర్లు, యువ ఔత్సాహికులకు వినూత్న ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆవిష్కరణలకు ఆన్ ది స్పాట్ వాలిడేషన్, మెంటర్షిప్, టెక్నికల్ సపోర్ట్ అందిస్తారన్నారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టంను బలోపేతం చేయడం, యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మరిన్ని వివరాలకు pr&tsic@telangana.gov.in సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో టీజీఐసీ ప్రోగ్రాం లీడ్ రమేష్‌గౌడ్, ఐడీసీ మేనేజర్ శ్రీకాంత్, ఈడీఎం వెంకటేష్, డీఎస్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి ని స్వరూప ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. నవంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అత్యంత ప్రతిభ కనబర్చినందుకుగాను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొని ప్రతిభ కనబర్చిందని, కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీ, మధ్యప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. -
‘జూపల్లి’ ఇలాకాలో ఉత్కంఠ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్‌రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం. 2వ విడతలో నువ్వా.. నేనా.. రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం పెద్ద దగడఫలితంపై సర్వత్రా ఆసక్తి కొల్లాపూర్‌లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్లో తుదివిడత ఎన్నికలు ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు.. మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి.. -
సజావుగా ఎన్నికల నిర్వహణ
పాన్‌గల్: గ్రామపంచాయతీ మూడోవిడత ఎన్నికలు సజావుగా జరిగే విధంగా మండలంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సంద ర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూ చనలు, సలహాలిచ్చారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
తుది ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి అఽధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపురంలో చివరి విడత ఎన్నికలు జరగనుండగా.. మంగళవారం మండల కేంద్రాల నుంచి పీఓలు, ఓపీఓలు ఎన్నికల సామగ్రితో ఐదు మండలాల పరిధిలోని 702 పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ఉదయం ఏడుకు ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం స్టేజ్–2 ఆర్ఓ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. తుది విడతలో 87 సర్పంచ్ స్థానాలకుగాను ఏడు ఏకగ్రీవం కాగా.. 80 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 806 వార్డులకు గాను 104 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 702 స్థానాలు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 702 పోలింగ్ కేంద్రాలకు 2,239 మంది పీఓలు, ఓపీఓలను కేటాయించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 1,300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. నేడు జిల్లాలోని ఐదు మండలాల్లో స్థానిక ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సామగ్రి, సిబ్బంది విధుల్లో 2,239 మంది సిబ్బంది బందోబస్తుకు 1,300 మంది పోలీసులు -
పారదర్శకంగా, పకడ్బందీగా పోలింగ్
● సామగ్రి పంపిణీ కేంద్రాలనుపరిశీలించిన కలెక్టర్ ● పాన్గల్లో ఏర్పాట్లు సరిగాలేవని మండలస్థాయి అధికారులపై ఆగ్రహం పాన్‌గల్/వీపనగండ్ల/వనపర్తి రూరల్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం పాన్‌గల్, వీపనగండ్ల, పెబ్బేరులో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రజలు తమ ఓటు హక్కును తమకు నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా వేసుకోవచ్చన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ సామగ్రి తీసుకున్న సిబ్బంది ఫారం–9 ప్రకారం బ్యాలెట్ పేపర్లు సరిచూసుకొని పీఓలకు అప్పగించాలన్నారు. సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి వారి వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్లలో సర్పంచ్, వార్డు సభ్యుల వారీగా పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ● పాన్‌గల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్ల ఏర్పాట్లపై ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూట్లవారీగా సిబ్బందిని కూర్చోబెట్టాల్సింది పోయి ఒకే దగ్గర గుంపులు, గుంపులుగా కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా అధికారులు సూచించిన విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. సామగ్రి పంపిణీ, తరలింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. వీపనగండ్ల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు ఉన్నారు. -
మూడో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: మూడో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న జరిగే పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం అయిందన్నారు. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియాలో ప్రచారం చేయడానికి వీలులేదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి మొదలుకొని పోలింగ్, ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 జీపీల్లో సర్పంచ్ స్థానాలు, 806 వార్డులకు గాను ఇప్పటికే చిన్నంబావి మండలంలో గడ్డబస్వాపూర్, పాన్‌గల్ మండలంలో దేవాజిపల్లి, బహదూర్గూడెం, పెబ్బేర్ మండలంలో పెంచికలపాడు, రామమ్మపేట, రాంపూర్ గ్రామాల సర్పంచులు, 104 వార్డు మెంబర్లు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీసీలో ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య భట్టు, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, డీపీఓ రఘుపతిరెడ్డి, తరుణ్ చక్రవర్తి, సీపీఓ హరికృష్ణ పాల్గొన్నారు. -
మూడో విడత.. రసవత్తరం
● పంచాయతీల్లో పాగా కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు ● రెబల్స్‌తో అధికార పార్టీకి తగ్గుతున్న స్థానాలు ● పొత్తులతో ఢీ అంటున్న బీఆర్ఎస్ ● రాజకీయ వేడిని రాజేస్తున్న నేతల మాటలు వనపర్తి: పంచాయతీ ఫైనల్ పోరుపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తొలి, మలి విడతలో చోటు చేసుకున్న పొరపాట్లతో ఆధిక్యం సాధించినా అసంతృప్తిలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మూడో విడత వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తు వేసే ప్రయత్నంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం ముగియడంతో వలస ఓటర్లు, ప్రత్యర్థుల తరుఫున ఉన్న ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం గడిచిన రెండు విడతల్లో ఆశించిన కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో క్యాడర్లో మరింత జోష్ నింపుతూ.. ఆయా ప్రాంతాల్లో అనుకూలత మేరకు పొత్తులతో అఽధికార పార్టీకి చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైందనే అసహనం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ కారణంగానే చాలా గ్రామాల్లో ఫలితాలు తారుమారయ్యాయని పార్టీ పెద్దలకు చెబుతున్నట్లు తెలిసింది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ఢీ.. జిల్లాలోని పలు జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీలు ఏకం కావడం.. అధికార కాంగ్రెస్‌లో రెబల్స్ సమస్య ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చే అంశాలని చెప్పవచ్చు. ఈ కారణంగా జిల్లాలోని మదనాపురం, వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాల్లో అఽధికార పార్టీకి జీర్ణించుకోలేని ఫలితాలు వెలువడ్డాయి. వాటిని పూడ్చుకునేందుకు పలువురు సర్పంచులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నిమగ్నమైనట్లు తాజా చేరికలతో స్పష్టమవుతోంది. మాటలు తెచ్చిన పొలిటికల్ హీట్.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాయకుల ప్రసంగాలు తెచ్చిన పొలిటికల్ హీట్ కొన్ని ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నేతల వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ.. ఎన్నికల్లో ఆధిక్యం సాధించే ఎత్తుగడలు వేస్తున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో నేతలు, వారి కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికాార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు గుప్పిస్తూ.. చేస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి రూరల్: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీయడంతో పాటు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. నిబంధనల మేరకు ఉన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సేకరించాలని.. ట్యాగ్ చేసిన మిల్లులకు వెంటనే తరలించి, ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని కేంద్రం ఇన్చార్జికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎం జగన్మోహన్ ఉన్నారు. నేడు ఎస్జీఎఫ్బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నేడు (మంగళవారం) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ సాదత్ఖాన్కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 89198 71829 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. 18న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక కందనూలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు కోసం క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌లోని నల్లవెల్లి రోడ్డులో గల క్రికెట్ మైదానంలో ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 10 గంటల వరకు క్రీడా మైదానానికి చేరుకోవాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 26 వరకు 4 లీగ్ మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల క్రీడాకారులు పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 89193 86105, 98854 01701లను సంప్రదించాలని సూచించారు. -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత వనపర్తి: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఓటర్లకు పోలింగ్ సిప్ల్‌లను అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నేరుగా పోల్ చీటీలు అందజేస్తున్నారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్న పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో మరో రెండు రోజుల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం ఈ దిశగా ముందుకు సాగుతోంది. నిరక్షరాస్యులు.. వృద్ధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్ చీటీలు దోహదపడుతాయి. వీటిని గతంలో రాజకీయ పార్టీలే ముంద్రించి ఎన్నికలకు ముందు రోజున ప్రచారం చేసుకుంటూ ఓటర్లకు అందించేవారు. అయితే వీరు ఓటర్లు అందరికీ ఇచ్చేవారు కాదు. దీంతో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ఓటర్లు పోలింగ్ రోజున ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘమే పోల్ చీటీలను అందజేస్తోంది. ఓటర్లు ఇళ్లలో లేకుంటే.. సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్‌లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించిన వారివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తగిన ఆధారం చూపి పోల్ చీటీ తీసుకోవచ్చు. పోల్ చీటీ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు జాబితాలో పేరుంటే ఓటరు వేయవచ్చు. -
ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
చిన్నంబావి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం చిన్నంబావిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండో విడత 78 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయన్నారు. మూడో వంతు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు అంతర్గతంగా సహకారం అందించుకుంటున్నాయని పంచాయతీ ఎన్నికలతో బహిర్గతం అయిందన్నారు. మూడో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. అనంతరం కొప్పునూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమావేశంలో నాయకులు కల్యాణ్‌రావు, బీచుపల్లి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెరుమాల శ్రీనివాసులు, నర్సింహ, వడ్డెమాన్ బిచ్చన్న ఉన్నారు. -
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రలోభాల పర్వం షురూ
వనపర్తి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో పల్లెల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటు కీలకం కావడంతో కొందరు అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. తమ వారు హైదరాబాద్ నుంచి రావాలని.. బస్సులో వస్తే మధ్యాహ్నం 1గంట దాటుతుందని.. వారు కారు తీసుకొని వస్తారని.. కారు కిరాయి, టీ, టిఫిన్, భోజనం, డ్రైవర్ బత్తా కలిసి రూ. 10వేల వరకు అవుతుందని.. వారిని రమ్మంటావా.. వద్దంటావా అని అభ్యర్థులకు చెబుతుండటంతో పరేషాన్లో పడుతున్నారు. ఎవరూ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే.. కొందరు ముంబాయి, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉన్నా రని చెబుతుండటంతో ఖంగుతింటున్నారు. ● పోలింగ్‌కు 48 గంటల ముందుగానే ప్రచార కార్యక్రమాల నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, సమావేశాల నిర్వహణ, స్పీకర్ల వినియోగం, ప్రచారం, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఐదుగురు వ్యక్తులు లేదా గుంపులుగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే మూతపడ్డాయి. -
ప్రశాంతంగా రెండోవిడత ఎన్నికలు
వనపర్తి: జిల్లాలో ఆదివారం జరిగిన రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. నాచహళ్లిలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఉదయం కలెక్టర్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని ఓటర్లకు సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టుతో కలిసి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో నిలిచిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్లు వివరించారు. రెండోవిడత పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో మొత్తం 1,03,406 ఓట్లు.. 87 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్ ఉన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
కొత్తకోట రూరల్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లో పర్యటించి సమస్యాత్మక గ్రామాలైన చిట్యాల, రాజపేట, కానాయిపల్లి, మదనాపురం, జూరాల పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, క్యూలైన్లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హైఅలర్ట్‌లో కొనసాగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. 5 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట వికారాబాద్ రీజినల్ ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, స్పెషల్ బ్రాంచ్ సీఐ న రేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వనపర్తి రూరల్, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్ ఎస్ఐలు జలంధర్‌రెడ్డి, ఆనంద్, శేఖర్‌రెడ్డి, జయన్న ఉన్నారు. -
జిల్లాల వారీగా పోలింగ్ ఇలా..
జిల్లా మొత్తం ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 91,496 93,540 04 1,85,040 80,075 80,209 00 1,60,284 నాగర్‌కర్నూల్ 1,25,402 1,24,832 05 2,50,239 1,05,980 1,04,170 01 2,10,151 జోగుళాంబ గద్వాల 55,710 57,094 03 1,12,807 49,086 49,145 03 98,234 వనపర్తి 58,900 59,890 02 1,18,792 51,803 51,603 00 1,03,406 నారాయణపేట 73,674 76,642 02 1,50,318 62,703 64,065 01 1,26,769 మొత్తం 4,05,182 4,11,998 16 8,17,196 3,49,647 3,49,192 05 6,98,844 అమడబాకులలో.. -
పల్లెలు పోటెత్తాయి!
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 84 శాతం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్‌లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్‌నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. -
చెయ్యెత్తిన పల్లెలు..
2వ విడతలోనూ కాంగ్రెస్ హవా ● 565 జీపీల్లో 327 మంది సర్పంచ్‌లుగా గెలుపు ● 169 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్.. 30 చోట్ల బీజేపీ మద్దతుదారులు.. ● ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున 85.80 శాతం పోలింగ్ ● చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ● 17న చివరి దశ ఎన్నికలు.. నేటితో ప్రచారం సమాప్తం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 565 జీపీల్లో 46 ఏకగ్రీవం పోను మిగిలిన 519 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డు స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఇందులో మొత్తంగా 327 పంచాయతీల్లో ‘హస్తం’ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 169 చోట్ల ‘కారు’ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన 30 మంది, మరో 39మంది ఇతరులు/స్వతంత్రులు గెలుపొందారు. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యంతరాలతో రాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ సర్పంచ్‌గా ‘దోశబండి’ వెంకటేష్ నవాబుపేటలో దోశబండి నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఈయన కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో వెంకటేష్‌కు 471 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు లింగంకు 388 ఓట్లు రావడంతో వెంకటే్‌ష్ 83 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో స్థానికులు దోశబండి వెంకటేష్ ఇకనుంచి సర్పంచ్ వెంకటేష్ అయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో కనీస సౌకర్యాల కల్పన, పాఠశాల అభివృద్ధే లక్ష్యమన్నారు. – నవాబుపేట తమ్ముడిపై అన్న గెలుపు కొల్లాపూర్ మండలం రామాపురంలో సర్పంచ్ స్థానానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొమ్మ నాగరాజు, బీఆర్ఎస్ మద్దతుతో కొమ్మ గోపాల్ సర్పంచ్ బరిలో నిలిచారు. గోపాల్‌కు 876 ఓట్లు రాగా, నాగరాజుకు 570 ఓట్లు వచ్చాయి. దీంతో తమ్ముడిపై అన్న గోపాల్ 306 మెజార్టీతో విజయం సాధించారు. – కొల్లాపూర్ రూరల్ ఓటు కోసం దుబాయి నుంచి ఓటు విలువను గుర్తించిన ఓ వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడానికి ఏకంగా దుబాయ్ నుంచి వచ్చాడు. మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్‌లో స్థిరపడగా మరికల్ సర్పంచ్ అభ్యర్థిగా బంధువులు పోటీ చేశారనే విషయాన్ని తమవారు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో భాస్కర్ రెండు రోజుల క్రితమే దుబాయ్ నుంచి మరికల్‌కు వచ్చి.. గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. – మరికల్ బ్యాలెట్లో కనిపించని గుర్తు.. బవనపర్తి మండలం చిమనగుంటపల్లి 8వ వార్డు పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థికి కేటాయించిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్లో ముద్రించలేదు. వార్డులో 260 ఓట్లుండగా అప్పటికే 50 మంది ఓటు వేశారు. తర్వాత ఓటు వేయడానికి వెళ్లిన ఒకరు సిలిండర్ గుర్తు లేదని చెప్పడంతో బాధిత అభ్యర్థి ఆందోళనకు దిగడంతో గంటపాటు పోలింగ్ నిలిచింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని అప్పటికే ఓట్లు వేసిన బాక్సును సీజ్ చేసి కొత్త బాక్సు ఏర్పాటుచేసి పోలింగ్ ప్రారంభించారు. అప్పటికే ఓటు వేసిన 50 మంది ఓటర్లను తిరిగి ఓటు వేయించడంతో గొడవ సద్దుమణిగింది. కాగా.. సిలిండర్ గుర్తుకు కేవలం 33 ఓట్లు రావడంతో ఆ అభ్యర్థి ఓడిపోయారు. – వనపర్తి రూరల్ 17న చివరి విడత పోలింగ్.. రెండో విడతలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉప సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎన్నుకున్నారు. తుది విడతకు సంబంధించి సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా.. 17న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు.. ● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు. ● నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో బీఆర్ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్‌గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మహబూబ్‌నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్ఎస్ జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్‌కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్: పోటాపోటీ.. జిల్లాలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజీపేట.. కొల్లాపూర్ సెగ్మెంట్లోని పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని 151 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 78 జీపీల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 60 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇతరులు ఏడుగురు, బీజేపీకి చెందిన ఆరుగురు గెలుపొందారు. నారాయణపేట : కాంగ్రెస్‌దే పైచేయి.. జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. వనపర్తి: సగం.. సగం జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట, మదనాపురం, మక్తల్‌లోని ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలో 94 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 55 పంచాయతీల్లో హస్తం, 28 జీపీల్లో బీఆర్ఎస్, రెండింట బీజేపీ మద్దతుదారులు, తొమ్మిది మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. జోగుళాంబ గద్వాల: కాంగ్రెస్ 44.. బీఆర్ఎస్ 24 జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మల్దకల్, అలంపూర్‌లో అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 74 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 44 జీపీల్లో కాంగ్రెస్, 24 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఒక బీజేపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌లుగా గెలుపొందారు. 6,98,844 మంది ఓటేశారు.. ఉమ్మడి పాలమూరులో రెండో విడతలో ఎన్నికల్లో మొత్తంగా 8,17,196 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,05.182, మహిళలు 4,11,998, ఇతరులు 16 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,49,192 మంది, మహిళలు 3,49,192 మంది, ఇతరులు ఐదుగురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 6,98,844 మంది ఓటు వేశారు. మొత్తంగా 85.80 శాతం పోలింగ్ నమోదైంది. అమెరికా టు సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో జరిగే ప్రతి ఎన్నికలోనూ తాను వచ్చి ఓటు వేస్తానని ఆయన పేర్కొన్నారు. – కొత్తకోట రూరల్ -
పెద్దదగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..
ప్రభావిత వర్గాలు.. పురుషులు 1,071 మహిళలు 1,021 మొత్తం ఓటర్లు 2,092యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. -
1,150 మంది సిబ్బందితో బందోబస్తు : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసిస్తూ.. రెండోవిడత విధులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. రెండోవిడతలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లోని 94 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 1,150 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటిస్తూ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసుశాఖ నిషిత పరిశీలన ఉందని.. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచా రం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్పులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. సజావుగా రెండోవిడత ఎన్నికలు మదనాపురం: మండలంలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రూట్ అధికారులు ఉన్నారు. అమరచింతలో ఝార్ఖండ్ బృందం అమరచింత: స్థానిక చేనేత ఉత్పత్తుల సంఘం పనితీరు అద్భుతంగా ఉందని ఝార్ఖండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రతినిధులు కొనియాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘంలో తయారవుతున్న జరీ చీరలు, రెడీమెట్ వస్త్రాల తయారీపై అధ్యయనం చేయడానికి ప్రతినిధుల బృందం రెండ్రోజుల పర్యటనకు వచ్చిందని సంఘం సీఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. సంఘం ఏర్పాటును వారికి వివరించామన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు తమ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో ఇక్కడి క్లస్టర్‌ను సందర్శించామని నోడల్ ఏజెన్సీ కంపెనీ సీఈఓ శ్యాంసుందర్, టెక్నికల్ అడ్వయిజర్ బిష్యుప్రసాద్, మహిళా ప్రతినిధులు తెలిపారు. ఇక్కడి నేత కార్మికుల పనితీరును పరిశీలించామని త్వరలోనే తమ రాష్ట్రంలో ఇలాంటి కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు. నిండుకుండలా రామన్‌పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని.. ఎన్టీఆర్ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
రెండో పోరుకు రెడీ
నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. 520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడతలో ఇలా.. జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది.. మహబూబ్‌గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811 నాగర్‌కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228 నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755 వనపర్తి 94 5 89 294 850 148 702 1,769 జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263 మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826 2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు.. 2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 94,975 96,998 4 1,91,977 నాగర్‌కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749 జో.గద్వాల 55,710 57,094 3 1,12,807 వనపర్తి 61,553 62,726 2 1,24,281 నారాయణపేట 73,674 76,642 2 1,50,318 మహబూబ్‌గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్, హన్వాడ, కోయిల్‌కొండ) నాగర్‌కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజీపేట)నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్) వనపర్తి: 5 (వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత) జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్‌లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. -
స్వగ్రామాలే సవాల్..!
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే ● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● స్వీయ పర్యవేక్షణతో పాటు వేగుల ద్వారా పావులు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి మహిళలు 2,706 పురుషులు 2,658 మొత్తం ఓటర్లు 5,364 ధన్వాడ పంచాయతీ కార్యాలయం ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పురుషులు 4,034 మహిళలు 4,293 మొత్తం ఓటర్లు 8,327 ప్రభావిత వర్గాలు.. పురుషులు 1,369 మహిళలు 1,416 మొత్తం ఓటర్లు 2,785 ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్ పుల్లూరు: ఎవరి ధీమా వారిది తూడుకుర్తి: నువ్వా.. నేనా.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మద్దతుదారు సునీత, కాంగ్రెస్ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్ఎస్కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్‌తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు. -
ఈసీ మార్గదర్శకాలు విధిగా పాటించాలి
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్/అమరచింత/ఆత్మకూర్: పీఓ, ఓపీఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ ఎంపీడీఓ కార్యాలయాలు, అమరచింత ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్నిరకాల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తీసుకొని కేటాయించిన గ్రామపంచాయతీకి రూట్ వారీ బస్సులో తరలివెళ్లారు. కలెక్టర్ వెంట ఎన్నికల సాధారణ జిల్లా పరిశీలకుడు మల్లయ్య బట్టు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
వనపర్తిటౌన్: గెలిచిన అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులను ఆయన శాలువాలు, పూలమాలలతో సత్కరించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులని.. గెలిచిన తర్వాత అందరూ తమవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అధికారం లేదన్న దిగులు వీడి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని భరోసా కల్పించారు. మొదటి విడతలో 34 మంది బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచులు కావడం కాంగ్రెస్ ధౌర్జన్యాలు, అన్యాయానికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి హుండీ లెక్కింపు కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులు కానుకలుగా సమర్పించిన 5 నెలల హుండీ డబ్బులను శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సమక్షంలో లెక్కించారు. ఈ ఏడాది జూన్ 24 నుంచి ఈ నెల 12 వరకు సంబంధించిన డబ్బులను లెక్కించగా.. రూ.10,75,733 ఆదాయం వచ్చింది. అలాగే మిశ్రమ వెండి 1.25 కిలోలు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ జయపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి..
ఆత్మకూర్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ విధుల్లో పాల్గొనాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 37 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రవాహం.. ప్రమాదం
● ఈత సరదా, దుస్తులు శుభ్రం చేసేందుకు వెళ్లి గల్లంతు ● అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు ●ప్రాజెక్టు అధికారులు తమ సిబ్బంది ద్వారా కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని సమీప గ్రామాల ప్రజలు, రైతులకు తెలియపర్చాలి. వారబందీ విధానంలో వారంలో ఎన్ని రోజులు నీటిని వదులుతారు.. ఎన్ని రోజులు నిలిపివేస్తారన్న విషయాలను తెలియజేస్తే ప్రాణహానిని నివారించవచ్చు. – హన్మంతు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, నందిమళ్ల జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట లష్కర్లను నియమించాలి. రోజు కాల్వ గట్లపై తిరుగుతూ అటుగా తిరిగే వారిని హెచ్చరించాలి. వేసవిలో చిన్నారులు, యువత ఈత సరదా కోసం కాల్వలోకి దిగే ప్రయత్నం చేస్తుంటారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేష్, విద్యార్థి సంఘం నాయకుడు నందిమళ్ల నందిమళ్లలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను కాల్వ వద్దకు తీసుకెళ్లరాదని తల్లిదండ్రులకు సూచించాం. తీర గ్రామాల్లోని ప్రజలు కాల్వలోకి దిగరాదని.. అత్యుత్సాహం చూపుతే ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు శోకం మిగిల్చిన వారవుతారని అవగాహన కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ అమరచింత: ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వలో నీటి ప్రవాహ తీవ్రత, ప్రవహించే నీటితో కలిగే నష్టాల గురించి అవగాహన లేక అమాయక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్నారు. నందిమళ్ల సమీప కాల్వలో ఇలాంటి మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రామన్‌పాడు వరకు.. జూరాల ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని క్రమం తప్పకుండా వదులుతుంటారు. కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల, మూలమళ్ల, జూరాల గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోయి రామన్‌పాడు రిజర్వాయర్‌లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారబందీ విధానంలో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలోని ప్రధాన ఎడమ కాల్వ లోతుగా భయంకరంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనన్న ఆందోళనలో ఇక్కడి ప్రజలు కాలం గడుపుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల వరకు ప్రధాన ఎడమ కాల్వ ప్రవహిస్తుండటంతో ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్క నందిమళ్లలోనే.. పదేళ్లలో నందిమళ్ల గ్రామంలోనే 17 మంది సమీపంలోని జూరాల ఎడమ కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందారు. మూడేళ్లలో పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రాణాలు హరిస్తున్న జూరాల ఎడమకాల్వ కృష్ణానది అందాలు తిలకించడానికి వస్తున్న పర్యాటకుల్లో అధికంగా విద్యార్థులు, యువత కాల్వలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కాల్వ పక్కనే చేప వంటకాలు వండి వడ్డించే గుడారాలు ఉండటం, అక్కడే మద్యం దొరకడంతో మత్తులో సరదా కోసం దూకుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా అటు పోలీసులు, ఇటు అబ్కారీశాఖ వారు పట్టించుకోకపోవడంతో జోరుగా సాగుతోంది. -
విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి
వనపర్తి: అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ, సూచనలు, సలహాలు అమలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. ఆయనతో పాటు జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ముందస్తు ఏర్పాట్లు, బాధ్యతలు ఎలా ఉండాలి అనే విషయాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్బాల్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక అధికారులతో ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించి మాక్ వ్యాయామం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అధికారుల బాధ్యత, నిర్వర్తించాల్సిన పనులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ మధ్యకాలంలో తరచూ భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీలు వస్తున్నాయని.. ఆకస్మికంగా వచ్చినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. ఇందుకు మౌలిక సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం, అధికారులకు వారి బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరమని తెలిపారు. అందుకే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాక్‌డ్రిల్ నిర్వహించాలనుకున్నట్లు తెలియజేశారు. -
రెండోవిడత సజావుగా సాగేలా చూడాలి
వనపర్తి: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది గందరగోళానికి గురికాకుండా అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక గ్రామపంచాయతీలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే కౌంటర్లో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పంపిణీ సులభం అవుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తీసుకొని తమ కేంద్రాలకు చేరుకునే వరకు రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టే సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్‌ను మాత్రమే అనుమతించాలని చెప్పారు. మొబైల్ ఫోన్‌కు అనుమతి లేదని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తుతో పాటు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఉదయం 9, 11, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పక్కాగా ఓటింగ్ రిపోర్టులు పంపించేలా ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో కౌంటింగ్ కోసం ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జనరల్‌లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్‌లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
‘విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం’
వనపర్తి: మూడువిడతల గ్రామపంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోనే ఉంటుందని.. గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, ఊరేగింపులు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల తొలివిడత ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎంసీసీ అమలులో ఉన్నంతకాలం ఈ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించే ఏ చర్యనైనా సహించమని, ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యతని.. శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు. చిన్నారెడ్డి మద్దతుదారు విజయం గోపాల్పేట: మండలంలోని జయన్న తిరుమలాపురంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి జ్యోతి ఎమ్మెల్యే మేఘారెడ్డి బలపర్చిన అభ్యర్థి జానమ్మపై 270 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పుట్టపాకల రాజును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని, గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఒక్క ఓటుతో విజయం.. ఖిల్లాఘనపురం: మండలంలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సోళీపురం సర్పంచ్‌గా సింధూజ ఒకేఒక్క ఓటుతో విజయం సాధించారు. సింధూజకు 1,006 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్థి పద్మశ్రీకి 1,005, మరో అభ్యర్థి నవీన్‌కు 42 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా అత్యధికంగా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు ఆగారం పద్మశ్రీ తన సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు కృష్ణవేణిపై 1,476 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెద్దమందడిలో...కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు సూర గంగమ్మ 640 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అత్యల్పంగా మోజర్లలో కాంగ్రెస్ మద్దతుదారు కానాయపల్లి శేఖర్ 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్‌లో బీఆర్ఎస్ గెలుపు సంబురం వనపర్తి: జిల్లాలోని 5 మండలాల్లో గురువారం జరిగిన తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్ సరళిని ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు ఎస్పీ సునీతరెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సకాలంలో ఎన్నికలు పూర్తికాగా.. ఖిల్లాఘనపురం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లందరినీ ఓటు వేయించినట్లు చెప్పారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. తొలివిడతలో ఎన్నికలు జరిగిన ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మొత్తం 1,03,225 ఓట్లు, 84.9 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. వెబ్‌కాస్టింగ్‌లో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓటెత్తారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్‌లో వెనుకపడ్డారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన జీపీ ఎన్నికల్లో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దమందడి పోలింగ్‌కేంద్రం వద్ద వృద్ధురాలిని వీల్‌చైర్‌లో తీసుకొస్తున్న సిబ్బంది జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 83.04 శాతం అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ -
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగాలి
గోపాల్పేట: ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం మండల కేంద్రం, ఏదుల తహసీల్దార్ కార్యాలయాలను ఆయన సందర్శించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తుల పోస్టర్ అతికించాలని సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల అధికారులు అయేషా అంజుం, ఎంపీఓ భవాని, తిలక్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఖర్చు లెక్క పక్కాగా నమోదు చేయాలి
పాన్‌గల్: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు చేస్తున్న ఖర్చును పక్కాగా నమోదు చేసి రికార్డులను అందించాలని, లేనిచో బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఖర్చుల వివరాలు, బిల్లులు, ఓచర్లతో సహా ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో సమర్పించాలని, అందించకుంటే భవిష్యత్‌లో ఏ ఇతర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ ఆడిటర్ లాలయ్య, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
21న జాతీయ లోక్ అదాలత్
● కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ప్రాంగణంలోఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. బుధవారం జిల్లా కోర్టు మందిరంలో న్యాయవాదులు, బ్యాంకు, బీమాసంస్థల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమనే విషయాన్ని కక్షిదారులు గుర్తించాలన్నారు. సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద, చెక్ బౌన్స్, రాజీ కుదుర్చుకోగల క్రిమినల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజీయే రాజమార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏళ్ల తరబడి కొనసాగే కేసులు ఇరువర్గాల రాజీ, ఒప్పందంతో పరిష్కారమవుతాయని చెప్పారు. లోక్ అదాలత్‌లో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదని, దావా వేయడానికి కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి చెల్లిస్తారని వివరించారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన , కె.కవిత, కార్తీక్‌రెడ్డి, నోముల అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కిరణ్‌కుమార్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికలు జరిగే మండలాల్లో సెలవులు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరిగే రోజున ఆయా మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా గురువారం ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాలపేట, ఏదుల, రేవల్లి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ముగిసిన మూడోవిడత ప్రక్రియ వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి ముగిసింది. పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాల్లోని మొత్తం 87 సర్పంచ్, 806 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించగా.. 7 సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 80 సర్పంచ్ స్థానాలకు 248 మంది, 702 వార్డులకు 1,734 మంది బరిలో ఉండగా.. ఈ నెల 17న ఎన్నిక జరగనుంది. సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి పాన్‌గల్: దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీపీఎం ప్రభాకర్ కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకులు కూడా అనేక రకాల రుణాలు అందిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో దివ్యాంగులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఆదర్శంగా నిలిచిన దివ్యాంగుల తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జిల్లా ఏపీఎం రాంబాబు, మండల ఏపీఎం వెంకటేష్‌యాదవ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, సీసీలు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ బీఎస్సీ (హాన్స్) వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ ఇన్ హార్టికల్చర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత అసలు ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీ, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పూర్తి బయోడేటాతో ఈ నెల 15న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. మానవ హక్కులపై అవగాహన వనపర్తిటౌన్: ప్రాథమిక హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీ, నాగవరం, మెట్టుపల్లిలోని పాఠశాల, జూనియర్ కళాశాల, పెబ్బేరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మావన హక్కులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని పట్టణ, రూరల్ పోలీస్స్టేషన్లను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, ప్యానెల్ అడ్వొకేట్లు నిరంజన్ బాబా, శిరీష్ చంద్రప్రసాద్, పారా లీగల్ వలంటీర్లు, ప్రిన్సిపాల్ నరేశ్‌కుమార్, న్యాయ కళాశాల విద్యార్థులు, మహిళాసంఘ సభ్యులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత
● 1050 మంది సిబ్బందితో మూడంచెల భద్రత ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ఎస్పీ సునీతరెడ్డి వనపర్తి: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని ఎస్పీ డి.సునీతరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని దిశా నిర్దేశం చేశారు. గురువారం పెద్దమందడి, ఖిలాఘనపురం, గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని 87 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అందులో 5 ఏకగ్రీవం కావడంతో 82 గ్రామాల్లోఎన్నికలు జరగనున్నాయని, 1,050 మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయమే విధుల్లో చేరి ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు జనం గుమిగూడటం పూర్తిగా నిషేదమని, అనుమానాస్పద వ్యక్తులు, చర్యలు గమనిస్తే వెంటనే స్పందించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పికెటింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు, వీడియో రికార్డింగ్ ఉంటాయన్నారు. కేంద్రాల్లోకి పార్టీ చిహ్నాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడం, ఓటర్లపై ఒత్తిడి తీసుకురావడం, మద్యం, డబ్బుల పంపిణీ చేసినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం విజయోత్సవ ర్యాలీలు నిషేధమని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులుగాని, రాజకీయ పార్టీలనుగాని కించపర్చేలా ప్రచారం చేయొద్దన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
1,650
సర్పంచ్ స్థానాలు పోటీలో ఉన్నవారు ● ఉమ్మడి జిల్లాలో ‘తొలి’ పోరు ఇలా.. ● వార్డులు 3,691.. బరిలో నిలిచిన వారు 9,127 ● మొత్తంగా 58 సర్పంచ్, 1,147 వార్డులు ఏకగ్రీవం ● 2 వార్డు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. తొలి విడత షెడ్యూల్ ప్రకారం 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 58 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 492 సర్పంచ్ పదవులకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 1,650 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా మొదటి విడతలో పోలింగ్ జరగనున్న వార్డు స్థానాల్లో 1,147 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోనూ 3,691 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 9,127 మంది పోటీలో నిలిచారు. గద్వాల, వనపర్తిలో పోటాపోటీ.. తొలి దశ జీపీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు పోటీపడుతున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ప్రధానంగా గద్వాల, వనపర్తిలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన బలమైన నాయకులు సైతం పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ● తొలి విడత ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో వాల్యానాయక్ తండాలో ఆరో వార్డుకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఆ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవం కాగా.. ఆరో వార్డు కు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో ఏడో వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. తొలి విడతలో ఎన్నికల వివరాలు.. జిల్లా జీపీలు ఏకగ్రీవం పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్ జరిగేవి ఉన్నవారు జరిగేవి ఉన్నవారు మహబూబ్‌నగర్ 139 10 129 425 1,188 264 924 2,195 నాగర్‌కర్నూల్ 151 14 137 447 1,326 208 1,118 2,774 జోగుళాంబ గద్వాల 106 15 91 321 974 361 613 1,425 నారాయణపేట 67 14 53 170 572 210 361 1,017 వనపర్తి 87 05 82 287 780 104 675 1,716 మొత్తం 550 58 492 1,650 4,840 1,147 3,691 9,127 -
ఉదయం 7 నుంచే..
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుండగా.. అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్, కౌంటింగ్ నిర్వాహణపై కలెక్టర్ ఆదర్శ్ సురభి, బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ సునీతరెడ్డి పర్యవేక్షణ చేశారు. తొలి విడత ఎన్నికలు జిల్లాలోని ఖిల్లాఘనపురం, గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, ఏదుల మండలాల్లో కొనసాగనుండగా.. 87 సర్పంచ్, 780 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదు సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావటంతో మిగిలిన 82 సర్పంచ్, 675 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 287 మంది.. వార్డు స్థానాలకు 1,716 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గోపాల్పేట మండలం ఏదుట్ల ఏడోవార్డుకు కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఆ వార్డు స్థానానికి ఎన్నిక జరగడం లేదు. ఎన్నికల సిబ్బంది కేటాయింపు ఇలా.. మండలం సిబ్బంది సంఖ్య ఖిల్లాఘనపురం 642 గోపాల్పేట 411 పెద్దమందడి 562 రేవల్లి 225 ఏదుల 235 మండలాల వారీగా వివరాలిలా.. మండలం సర్పంచ్ వార్డుసభ్యులు స్థానాలు అభ్యర్థులు స్థానాలు అభ్యర్థులు ఓటర్లు ఖిల్లాఘనఫురం 27 89 198 540 33,554 పెద్దమందడి 22 82 180 440 32,103 గోపాల్పేట 13 40 119 291 26,970 ఏదుల 11 39 100 243 17073 రేవల్లి 9 37 78 202 13463 ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్.. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫలితాలు వెంటనే వెల్లడించి విజేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. 50 శాతం కోరం ఉంటే ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో 675 పోలింగ్ కేంద్రాలు.. 1,23,163 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణకుగాను 2,125 మంది పోలింగ్ సిబ్బంది, 1,050 పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ మూడంచెల బందోబస్తు కల్పించనున్నారు. బుధవారం రాత్రి వరకు పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలను 27 రూట్లుగా విభజించి సామగ్రి, సిబ్బంది, పోలీసుల తరలింపునకు ప్రైవేట్ స్కూల్ బస్‌లను వినియోగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. ప్రతి కేంద్రంలో పీఓ, ఓపీఓ, 200 పైబడి ఓటర్లున్న కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమిస్తారు. సమస్యాత్మక గ్రామాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 82 సర్పంచ్ స్థానాల బరిలో 287 అభ్యర్థులు 675 వార్డులకు 1,716 మంది... విధుల్లో 2,125 పోలింగ్ సిబ్బంది, 1,050 మంది పోలీసులు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి కేంద్రాలకు చేరిన సామగ్రి, సిబ్బంది -
కాజ్వే.. కానరాదే?
మదనాపురం మండలం దంతనూరు–శంకరమ్మపేట మధ్య రాకపోకలకుగాను శంకరమ్మపేట జలాశయానికి అనుసంధానంగా వాగుపై కాజ్వే నిర్మించారు. గత వర్షాకాలంలో శంకరసముద్రం నుంచి వరద ఉధృతంగా పారడంతో కాజ్వే కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు తాత్కాలిక రహదారి వేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా సురక్షితంగా లేదు. రాత్రివేళలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని.. తక్షణమే స్పందించి శాశ్వత ప్రాతిపదికన కాజ్వే పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – మదనాపురం -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
కొత్తకోట రూరల్/ఖిల్లాఘనపురం: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం మొదటి విడత పోలింగ్ జరిగే పెద్దమందడి, ఖిల్లాఘనపురం ఎంపీడీఓ కార్యాలయాల్లోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్ని ఆయన సందర్శించి సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని తెలిపారు. ఫారం 14 దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎన్నికల విధుల ఆర్డర్ కాపీ, ఓటర్ ఐడీ లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు. ఓటు వేసిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. అంతేగాక పోలింగ్ సమయంలో ఎలాంటి లోపాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉద్యోగుల ను ఆదేశించారు. కలెక్టర్ వెంట పెద్దమందడి తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, ఖిల్లాఘనపురం తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఖర్చు లెక్క పక్కాగా చూపాలి
ఆత్మకూర్/వనపర్తి రూరల్/అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తాము చేస్తున్న ఖర్చుల లెక్కలను పక్కాగా ఎన్నికల పరిశీలకులకు అందించాలని.. లేనిపక్షంలో బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆత్మకూర్, అమరచింత ఎంపీడీఓ కార్యాలయాల్లో సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు ఎన్నికల వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని.. లెక్కల వివరాలు, బిల్లులు, ఓచర్లతోసహా సమర్పించాలని సూచించారు. గెలుపు, ఓటములకు సంబంధం లేదని.. పోటీ చేసే ప్రతి అభ్యర్థి లెక్కలు పూర్తి ఆధారాలతో చూపిచాల్సిందేనని, లేనిపక్షంలో వేటు తప్పదని స్పష్టం చేశారు. ఆత్మకూర్‌లో జరిగిన అసిస్టెంట్ అబ్జర్వర్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, అమరచింతలో జరిగిన కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహులు పాల్గొన్నారు. ● వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రికార్డులను ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎన్నికల వ్యయం పరిమితి, చేసిన ఖర్చును రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఖర్చును మూడుసార్లు పరిశీలిస్తామని వివరించారు. -
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినా.. ఓటు వేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు షెడ్యూల్ ప్రకారం పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. రెండు విడతల ప్రక్రియ పూర్తి.. జిల్లాలో 268 సర్పంచ్, 2,436 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు కొనసాగుతుండగా.. రెండువిడతల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు 10 సర్పంచ్, 252 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడత నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. జిల్లాస్థాయి కమిటీ విచారణ చేసి సంతృప్తి చెందితే.. ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రక్రియ ముందుకుసాగుతోంది. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు.. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం రెండు నుంచి స్టేజ్–2 ఆర్ఓ నిర్ణయం మేరకు సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందజేస్తారు. 50 శాతం కోరం ఉంటేనే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు. దొంగ ఓట్లేస్తే జైలుకే.. ఎవరైనా ఇతరుల ఓటు వేసేందుకు యత్నిస్తే పోలింగ్ కేంద్రం నుంచి నేరుగా జైలుకు పంపిస్తాం. టెండర్డ్ ఓట్లు, ఛాలెంజ్ ఓట్లు వేసేందుకు పీఓలు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తారు. గుర్తింపు కార్డులు తప్పనిసరి.. ప్రతి ఓటరు స్లిప్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు లేకుంటే ఓటు వేసేందుకు అనుమతించరు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు.. ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాం. దివ్యాంగుల కోసం వీల్చైర్లు, మల్టీపర్పస్ వర్కర్లను నియమించాం. ఆరోగ్యశాఖ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు. జిల్లాలో అంధులు, అశక్తుల జాబితాలోకి వచ్చే ఓటర్లు సుమారు 4,500 వరకు ఉన్నారు. వీరు పీఓ అనుమతితో సహాయకుడిని తీసుకెళ్లవచ్చు. పీఓలు సహాయకులుగా వ్యవహరించరు. రాజకీయ నాయకులకు అవకాశం ఉండదు. పోలీసులకు అనుమతి లేదు.. కేంద్రాల వద్ద గస్తీ నిర్వహించే పోలీసులుకు సైతం కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి లేదు. జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, ఓటర్లు మినహా ఎవరినీ లోపలికి అనుమతించరు. జాగ్రత్తగా ఓటు వేయాలి ప్రతి బ్యాలెట్ పేపర్ పీఓ సంతకంతో జారీ చేస్తారు. ఒక ఓటరుకు సర్పంచ్, వార్డుసభ్యుడి బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. గులాబీరంగు బ్యాలెట్ పేపర్ సర్పంచ్ స్థానానికి, తెల్లరంగు బ్యాలెట్ పేపర్ వార్డుసభ్యుడిని ఎంచుకునేందుకు ఉంటాయి. ఓటువేసే సమయంలో జాగ్రత్తగా పూర్తి ముద్ర పడేలా వేయాలి. రెండు, మూడుచోట్ల వేస్తే చెల్లని ఓటుగా పరిగణిస్తారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి ‘సాక్షి’తో కలెక్టర్ ఆదర్శ్ సురభి సిబ్బంది కేటాయింపు.. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని ఎంపిక చేసి రెండు పర్యాయాలు శిక్షణ పూర్తి చేశాం. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, 200 మంది ఓటర్లకు ఒక ఓపీఓ చొప్పున కేటాయించాం. ఖిల్లాఘనపురం, శ్రీరంగాపురం మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో గరిష్టంగా 500 నుంచి 600 మంది ఓటర్లు ఉండటంతో అక్కడ ముగ్గురు ఓపీఓలను నియమించాం. తొలివిడతకు 936 మంది పీఓలు, 1,189 ఓపీఓలు, రెండోవిడతకు 1,020 మంది పీఓలు, 1,273 ఓపీఓలు, మూడోవిడతలో 968 మంది పీఓలు, 1,271 ఓపీఓలను కేటాయించాం. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. ఓటర్లను తరలిస్తే చర్యలు.. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి రహస్య ప్రదేశాల్లో దాచి పోలింగ్ కేంద్రాలకు నిర్బంధంగా తరలిస్తే చర్యలు తప్పవు. మద్యం, డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓటరు హక్కును హరించేలా ప్రవర్తిస్తే సహించేది లేదు. -
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, రైస్‌మిల్లుల్లో నూర్పిళ్లు, రైతులకు డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం సేకరణ, మిల్లింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆయన సోమవారం పలు రైస్‌మిల్లులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే గ్రామంలోని లక్ష్మీనర్సింహ రైస్‌మిల్‌ను తనిఖీచేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా వెంటనే ట్రక్షీట్లు రూపొందించి ధ్రువీకరణ పత్రం అందించాలని యాజమాన్యానికి సూచించారు. పెద్దమందడి మండలం వీరాయిపల్లిలోని మల్లికార్జున రైస్‌మిల్‌ను డిఫాల్ట్‌గా నమోదు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న ధాన్యాన్ని సమీప మిల్లుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలంలోని తిరుమల ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ ఆగ్రోటెక్ రైస్‌మిల్లులో ధాన్యం అనన్లోడింగ్, మిల్లింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ తదితరులు ఉన్నారు. -
బాధ్యతలు చేపట్టిన విద్యుత్‌శాఖ ఎస్ఈ
వనపర్తిటౌన్: జిల్లా విద్యుత్‌శాఖ ఎస్ఈగా వి.తిరుపతిరావు సోమవారం ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పనిచేసిన ఎస్ఈ రాజశేఖరం హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈగా విధులు నిర్వర్తించే తిరుపతిరావు పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎల్పీఓ (లోకల్ పర్చేజ్ ఆర్డర్)లో అవకతవకతలు చోటు చేసుకోకుండా దృష్టి సారిస్తామని, క్షేత్రస్థాయిలో లోటుపాట్లు ఉంటే సరిచేస్తామన్నారు. కొత్తకోట, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంతో పాటు అవసరమైన చోట స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 133, 11కేవీ విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తామని వివరించారు. అధికారుల ఆకస్మిక తనిఖీ గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మండల కేంద్రంతో పాటు రేవల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఏదుల కేంద్రాన్ని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లు, సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అధికారులు ఉండాల్సిన తీరు, ఏ అధికారి తర్వాత ఏ అధికారి ఉండాలి.. అవసరమైన సామగ్రిని ప్రతి ఒక్కరికీ అందించాలని సూచించారు. గోపాల్పేట మండలంలో 44 మంది, ఏదులలో 76 మంది, రేవల్లి మండలంలో 24 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను వినియోగించుకున్నారని ఆయా మండలాల అధికారులు తెలిపారు. నిండుకుండలా రామన్‌పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 390 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 564 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. అలజడులు సృష్టిస్తే చర్యలు ఆత్మకూర్: ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అలజడులు సృష్టిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండలంలోని పిన్నంచర్లలో జిల్లాపరిధిలోని ఎస్ఐలు, ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులతో గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని, గొడవలకు తావివ్వొద్దని కోరారు. -
ఆరుతడికే సాగునీరు
యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు ●చివరి వరకు అందించాలి.. యాసంగి సీజన్లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి. – ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం రిజర్వాయర్లు నింపుతాం.. కేఎల్ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్‌సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదిత ఆరుతడి వరి ఆయకట్టు ఆయకట్టు పంటలు కేఎల్ఐ 3,70,469 2,81,754 2,01,317 80,437 కోయిల్‌సాగర్ 35,600 7,700 7,700 – భీమా లిఫ్ట్–1 82,523 21,690 21,690 – భీమా లిఫ్ట్–2 92,000 10,000 5,350 4,650 జూరాల 1,09,296 26,924 20,014 6,910 నెట్టెంపాడు 1,42,000 22,800 22,800 – ఆర్డీఎస్ 83,998 – – – ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి ప్రణాళిక వివరాలు (ఎకరాల్లో) వారబందీ విధానంలో నీటి విడుదలకు నిర్ణయం కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ఆర్డీఎస్ పరిధిలో పంట విరామం ప్రకటన -
రెండోవిడత.. తేలిన లెక్క
వనపర్తి: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్న విషయం విధితమే. తొలి విడత 87 సర్పంచ్, 780 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఐదు సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండోవిడత నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు ప్రక్రియ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ విడతలో ఐదు గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలు, 148 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 89 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఈ నెల 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. సర్పంచ్ల బరిలో 294 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 1,768 మంది అభ్యర్థులు ఉన్నట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి యాదయ్య వెల్లడించారు. మూడోవిడతలో.. మూడోవిడతలో 87 సర్పంచ్ స్థానాలకు 459 మంది అభ్యర్థులు, 806 వార్డులకు 1,914 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపసంహరణ, ఏకగ్రీవాల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా వెలవడనుంది. మిగిలిన స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు గుర్తుల కేటాయింపు పూర్తి.. 14వ తేదీన పోలింగ్ -
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
వనపర్తి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎన్నికల అఽధికారి యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత ఎన్నికల విధులు నిర్వర్తించే వారు ఈ నెల 8న, రెండోవిడత ఎన్నికలు జరిగే ప్రాంతాల వారికి ఈ నెల 12న, మూడో విడత వారికి ఈ నెల15న ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లుఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫారం–14తో పాటు ఫారం–17పై సంతకం చేసి నిర్దేశిత సమయంలోగా సమర్పించాలని సూచించారు. జీపీఓఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక వనపర్తి రూరల్: జీపీఓఏ (గ్రామపంచాయతీ అధికారుల సంఘం) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గోపాల్‌రావు, జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా సురేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా శివారెడ్డి, వెంకటన్న, కోశాధికారిగా మల్లేష్, మహిళా అధ్యక్షురాలిగా అంజమ్మతో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీజీటీఏ జిల్లా అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంత్, టీఎన్జీఓ ఉపాధ్యక్షుడు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రభావిత ఉద్యమశక్తి జయరాజ్’ వనపర్తిటౌన్: సమాజాన్ని ప్రభావితం చేసిన శక్తి ప్రముఖ కవి, ఉద్యమ గాయకుడు జయరాజ్దేనని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజ్‌ను సాహితి కళావేదిక ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా తన పంతా మార్చుకోకుండా ముందుకు సాగి తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలు రచించి ఉద్యమ నిర్మాణంలో తన భక్తిని చాటారని కొనియాడారు. నిరంతరం పేద, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. జయరాజ్ సాహిత్యం ఎంతోమంది వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జయరాజ్ తను రచించిన పలు పుస్తకాలను పలువురు సాహితీవేత్తలకు అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, నరేష్కుమార్, శ్యాంసుందర్, ఉప్పరి తిరుమల్లేశ్, రచయితలు డా. వీరయ్య, పపద్మావతి, డా. కంటే నిరంజనయ్య, మధుకర్, కిరణ్‌కుమార్, దర్శన్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సైక్లింగ్‌లో సత్తా చాటాలి ఖిల్లాఘనపురం: విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ బి.గోపాలం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం నుంచి వెంకటాంపల్లి వరకు బాలికలకు 5 కిలోమీటర్లు, బాలురకు 8 కిలోమీటర్ల జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో బాలికల విభాగంలో శశి, ప్రియ, మీనాక్షి, ఇందు, చందన, ప్రవస్తి, జ్యోతి, సంజన, పూజ, సంగీత, బాలుర విభాగంలో రాము, ఉదయ్, రక్షిత, యశ్వంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలకు గోపాలం పతకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీలు దేవేందర్, చిట్టి, పాఠశాల ఏఎన్ఎం వెంకటమ్మ, సహాయకులు రజిత, నవీన్ పాల్గొన్నారు. -
వ్యాపార అభివృద్ధికి రుణాలు
వనపర్తిటౌన్: కాలానికి అనుగుణంగా ట్రెండింగ్‌లో ఉన్న వ్యాపారాలు, తయారీరంగాల ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తామని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సునీత తెలిపారు. సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల ఆర్థిక అవసరాలు తెలుసుకోవడానికి ఎంఎస్ఎంఈ సందర్శనలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలో బ్యాంకు అధికారులు, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యాపారులు ఎలా నడుస్తున్నాయి.. ఆర్థికంగా ఊతమిచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గతంలో కొనసాగుతున్న వ్యాపారానికి భిన్నంగా ఏదైనా ఆలోచిస్తున్నారా? రోజు, నెలవారీ ఆదాయం ఎంత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ట్రెండింగ్, తయారీ రంగాలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త విధానంతో జీఎస్టీ, ఐటీ రిటర్న్స్ సకాలంలో దాఖలు చేస్తే రుణ పరిమితి ఎంత వరకు ఉందో గంటల్లోనే వ్యాపారులకు తెలుస్తుందని చెప్పారు. ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే రుణాల కోసం ఎలాంటి సిఫార్సులు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. వ్యాపార అభివృద్ధికి తగినట్లుగా రుణాలు పొందేందుకు వ్యాపారులు చొరవ చూపాలని కోరారు. ఆమె వెంట మెయిన్ బ్రాంచ్ ఛీప్ మేనేజర్ రవీంద్రకుమార్, ఎస్బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ కృష్ణమూర్తి, ఫీల్డ్ అధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘రూ.25 లక్షల పరిహారమిస్తే తప్పుకొంటాం’
ఖిల్లాఘనపురం: ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారమిస్తే సర్పంచ్ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మండలంలోని గట్టుకాడిపల్లి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గట్టుకాడిపల్లి, ఖిల్లాఘనపురంలో కాసేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్ల కిందట ఖిల్లాఘనపురం ఎలా ఉండే.. నేడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడంతో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, సర్పంచ్ అభ్యర్థి క్యామ అజంతా, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నారుమడుల సమయం..
యాసంగి సాగుకు వరి నారుమడులు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం అనురాధ కార్తె ఉండటంతో ఇప్పుడే నారు పోయాలి. కార్తె దాటితే ఆశించిన దిగుబడి రాదు. అధికారులు స్పందించి సాగునీటిని త్వరగా అందించాలి. – లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు, అమరచింత ప్రస్తుతం వానాకాలం పంట కోతలతో పాటు వరి ధాన్యం విక్రయాలు సైతం పూర్తవడంతో పొలాలను చదును చేసుకుంటున్నాం. యాసంగి నారుమడుల కోసం అమరచింత ఎత్తిపోతల ఎడమ కాల్వకు నీటిని అందించాలి. యాసంగి సాగుకు నీరందించి రైతులను ఆదుకోవాలి. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత ● -
రుజువైతే జైలు శిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ● -
తొలి విడత పోలింగ్‌కు తగిన ఏర్పాట్లు
గోపాల్పేట: గ్రామపంచాయతీ మొదటివిడత ఎన్నికలు జరిగే గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో పోలింగ్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను సజావుగా నిర్వహించాలని సూచించారు. తుది జాబితాలో పోటీలో నిలిచిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను తెలిపారా లేదా.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ ఓటు వేసే పోలింగ్ సిబ్బంది నుంచి ఫారం–17 డ్యూటీ ఆర్డర్ కాపీ చూసి బ్యాలెట్ పత్రం ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలని, లేదంటే ఓటు చెల్లుబాటు కాదని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ అయేశా అజుం, తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీఓ భవాని తదితరులు ఉన్నారు. ఈవీఎం గోదాంకు పకడ్బందీ భద్రత వనపర్తి: ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం గోదాం భద్రతను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ బందోబస్తు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. వారి వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్దిరాజు, కొత్తపల్లి శంకర్, కుమారస్వామి, ఎన్.త్రినాథ్, పరమేశ్వరాచారి, జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్‌సాగర్.. జలహోరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో నీటిని విడుదల చేశారు. మే రెండో వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కురిసిన వర్షాలతో ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్లు అధికంగా వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు గేట్లను పలుమార్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు చరిత్రలోనే ఈ ఏడాది ఒక రికార్డుగా నమోదైంది. 1947లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1954లో పనులు పూరయ్యాయి. అలుగుస్థాయి వరకు 26.6 అడుగులుగా ఉన్న ప్రాజెక్టు.. 1984 వరకు 30 ఏళ్ల పాటు అలుగు పారడంతోనే నీటి విడుదల కొనసాగింది. అయితే కరువు కాటకాలతో ప్రాజెక్టు చాలా సార్లు నిండని పరిస్థితులు కూడా వచ్చాయి. 1984లో ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచి.. అలుగుపై 13 గేట్లను ఏర్పాటు చేయడంతో 32.6 అడుగుల స్థాయికి పెరిగింది. ఆనాటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండినప్పుడల్లా గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. 6.5 టీఎంసీలు వృథా.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ వానాకాలం 6.5 టీఎంసీల నీరు వృథా అయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలుగా ఉంది. ఈ ఏడాది వానాకాలంలో 10.2 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఇందులో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలల్లో గేట్లను తెరవడం ద్వారా 6.5 టీఎంసీల నీరు వాగులోకి వృథాగా పారింది. ఇక 1.30 టీఎంసీల నీరు వానాకాలం పంటలకు, తాగునీటి అవసరాలకు వినియోగించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 32.4 అడుగులుగా ఉండగా.. నీటి సామర్థ్యం 2.24 టీఎంసీలుగా ఉంది. భారీగా వరద చేరింది.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు గేట్లను బిగించి 40 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో భారీగా నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు ఇదే. ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్ల నీరు ప్రాజెక్టుకు చేరింది. ఇందులో మూడింతలకు పైగా 6.5 టీఎంసీల నీటిని వాగులోకి వదిలాం. 1.30 టీఎంసీల నీటిని వానాకాలం పంటలకు, తాగునీటికి వాడుకున్నాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.24 టీఎంసీల నీటిమట్టం ఉంది. – ప్రతాప్‌సింగ్ ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో నీటి విడుదల గేట్ల ద్వారా 6.5 టీఎంసీలు దిగువకు సాగు, తాగునీటి కోసం మరో 1.30 టీఎంసీలు వినియోగం ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్లు అధికంగా వరద -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
వనపర్తి రూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిమనగుంటపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ, ధాన్యం నాణ్యత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతి రోజు కచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ ట్యాబ్ఎంట్రీలు తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. కేంద్రంలో ధాన్యం నిల్వ ఉండకుండా తూకం వేసిన వెంటనే కేటాయించిన రైస్‌మిల్లుకు తరలించాలన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, రైతులకు ఇబ్బంది కలిగించినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వ్యయ వివరాల నమోదు తప్పనిసరి
కొత్తకోట రూరల్/గోపాల్పేట: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శ్రీనివాసులు కోరారు. శుక్రవారం పెద్దమందడి ఎంపీడీఓ కార్యాలయం, గోపాల్పేట ఎంపీడీఓ కార్యాలయంలో మొదటివిడత అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రిజిస్టర్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల వ్యయ పరిమితి, చేసిన ఖర్చు వివరాలు ఏ విధంగా రిజిస్టర్లో నమోదు చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు ఎవరెవరు దేనికోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఖర్చును మూడుసార్లు పరిశీలిస్తామని.. షెడ్యూల్ ప్రకారం అందరు అభ్యర్థులు ఖర్చు వివరాలు, బిల్లులు, ఓచర్లతో హాజరుకావాలని సూచించారు. ఎన్నికల వ్యయం చూపించని అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
వనపర్తి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌పై సంబంధిత పీఓ, ఏపీఓల శిక్షణకు ఆయనతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్యబట్టు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. డిసెంబర్ 8న మొదటి విడత మండలాలకు, 12వ తేదీన రెండోవిడత మండలాలకు, డిసెంబర్ 15న మూడోవిడత మండలాలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఫారం 14 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలన్నారు. ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది గుర్తింపు కార్డును విధిగా తనిఖీ చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో శిక్షకులు శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నోడల్ అధికారి అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చివరిరోజు.. నామినేషన్ల జోరు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని శ్రీరంగాపురం, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల్లో ఈ ప్రక్రియ రాత్రి 11.30 సమయంలో ముగియగా.. చిన్నంబావి, పాన్‌గల్ మండలాల్లో అర్ధరాత్రి 12 దాటినా అభ్యర్థులు నామినేషన్ల సమర్పణకు క్యూలైన్లో నిలుచున్నారు. చిన్నంబావి మండలంలోని కొన్ని క్లస్టర్లలో మధ్యాహ్నం మూడు తర్వాత వందకుపైగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు బారులుతీరినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి 12 వరకు అందిన సమాచారం మేరకు వీపనగండ్ల మండలంలోని 14 సర్పంచ్ స్థానాలకు 106 నామినేషన్లు, 130 వార్డు స్థానాలకు 336 నామినేషన్లు.. శ్రీరంగాపురం మండలంలో 8 సర్పంచ్ స్థానాలకు 60, 82 వార్డు స్థానాలకు 211.. పెబ్బేరు మండలంలో 20 సర్పంచ్ స్థానాలకు 144 నామినేషన్లు, 182 వార్డు స్థానాలకు 389 నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. మూడోవిడతలోని 87 సర్పంచ్ స్థానాలు, 806 వార్డు స్థానాలకు దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలు శనివారం ఉదయం అధికారికంగా వెలువడనున్నాయి. అర్ధరాత్రి దాటినా కొనసాగిన పరిశీలన -
గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం
ఖిల్లాఘనపురం: గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను సర్పంచ్‌లు, వార్డుసభ్యులుగా గెలిపించాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన ఆయన నివాసంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తమ పాలనలో నియోజకవర్గంతో పాటు మండల కేంద్రం, గ్రామాలు అభివృద్ధి చేసి ప్రగతిపథంలో నిలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి మండల కేంద్రంలో క్యామ అజంత విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఉద్యాన కళాశాలలో ప్రపంచ నేలల దినోత్సవం కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానాన్ని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్ మాట్లాడుతూ.. పంటలకు విచక్షణారహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగించరాదని, పచ్చిరొట్ట ఎరువులు వాడి నేలసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేలల పరిరక్షణకు కంకణబద్దులై ఉండాలని మృత్తికశాస్త్ర ప్రొఫెసర్ మాధవి విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నజర్ మదనాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, దుప్పల్లి, బౌసింగ్తండా, కొన్నూర్తండాలో ఆయన పర్యటించి భద్రతా చర్యలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలు సృష్టించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ శేఖర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. రామన్‌పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచిపోగా.. సమాంతర కాల్వలో 649 క్యూసెక్కుల వరద చేరిందన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 454 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
ప్రజా రక్షణ కోసమే సిబ్బందికి నైపుణ్య శిక్షణ
ఎర్రవల్లి: ప్రజల రక్షణ కోసమే 10వ బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణకు అందిస్తున్నట్లు కమాండెంట్ జయరాజు తెలిపారు. విపత్తు సమయంలో వేగవంతమైన రక్షణ కోసం బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బందికి యూసుఫ్‌గూడలోని 1వ బెటాలియన్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనపై ప్రత్యేక శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణలో విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగించే ఆధునిక పరికరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్, హైడ్రాలిక్ ర్యామ్ సెట్, ఫ్లోటింగ్ పంప్, ఇన్స్పెక్షన్ హోల్ మేకర్, రోటరీ రెస్క్యూ, కార్బైడ్ టిప్ చైన్స్, డైమండ్ టిప్ చైన్స్ పరికరాల వినియోగం, నిర్వహణ, విపత్తు సమయంలో రక్షణ చర్యలు తీసుకునే పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి, సత్వర చర్యలు చేపట్టడానికి, సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని సూచించారు. -
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, పెబ్బేరులోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఎన్నికల సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుడు పాల్గొని ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. జిల్లాకేంద్రంలోని జరిగిన శిక్షణకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య హాజరై సలహాలు, సూచనలిచ్చారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలో తలెత్తే కీలక అంశాలను క్షుణ్ణంగా వివరించారు. డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీఓలు రవీంద్రబాబు, వెంకటేష్, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, ఎంఈఓ జయరాములు, ఎంపీఓలు, జూనియర్ అసిస్టెంట్ భరత్‌గౌడ్ పాల్గొన్నారు. -
పొత్తుల రాజకీయం!
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్పల్లి, మన్సూర్‌పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు చెందిన వారు సర్పంచ్‌లుగా ఏకగ్రీవమయ్యారు. ● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కంచన్‌పల్లిలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్లో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పల్లె పోరులో చిత్రవిచిత్రాలు గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’ కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనులపండువగా జరిపారు. మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. రథాన్ని బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన ఈ వేడుకను ఉమ్మడి పాలమూరుతో పాటు హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో మక్తల్ రాంలీలా మైదానం మార్మోగింది. – మక్తల్ -
శాంతిభద్రతల పరిరక్షణకే ప్లాగ్‌మార్చ్
కొత్తకోట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకే గ్రామాల్లో ప్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు. ఎస్పీ డి.సునీతరెడ్డి ఆదేశానుసారం గురువారం పెద్దమందడి మండలం వెల్టూర్లో సీఐ, ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగే సమయం సమీపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురికాకుండా తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు, ప్రజలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పడానికి కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో అల్లర్లు సృష్టించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులతో పాటు జిల్లాకేంద్రం నుంచి అదనపు బలగాలు చేరుకుంటాయని తెలిపారు. ప్లాగ్‌మార్చ్‌లో ఏఎస్ఐ ముత్యాలు, హెడ్ కానిస్టేబుల్ ఆవులయ్య, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాకేష్, నరేష్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
వనపర్తిటౌన్: పట్టణంలోని 33 కేవీ ఉపకేంద్రంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఏఈ సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని బాలానగర్, డిగ్రీ కళాశాల రోడ్, మెటర్నిటీ చిల్డ్రన్ ఆస్పత్రి, అప్పాయపల్లి రోడ్, నందిమళ్లగడ్డ, వశ్యనాయక్తండా, పాతబజార్, కుమ్మరిగేరి, సవరంగేరి, కమలానగర్, గాంధీనగర్, రాయిగడ్డకాలనీ, రాంనగర్‌కాలనీ, బ్రహ్మంగారివీధి, శారదనగర్ కాలనీ, చిట్యాలరోడ్, శ్వేతానగర్, తిరుమలకాలనీ, వల్లభ్‌నగర్, పీర్లగుట్ట, బండారునగర్, పానగల్ రోడ్, గాంధీచౌక్, భగత్‌సింగ్‌నగర్, మెట్పల్లి, చిన్నగుంటపల్లి ఫీడర్, గోపాల్పేట్ ఫీడర్, రాజాపేట ఫీడర్‌లోని ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులు సహకరించాలని కోరారు. పౌరసరఫరాలశాఖలో చేతివాటం? ● ఆన్లైన్ చెల్లింపులు చేసినట్లు మిల్లర్ ఫిర్యాదు వనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ విభాగంలో ఆన్లైన్ చెల్లింపుల లొల్లి ముసలం పుట్టిస్తోంది. తన వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, ఆన్లైన్లో చెల్లించినట్లు ఇప్పటికే ఓ మిల్లర్ అధికారిపై కోర్డును ఆశ్రయించగా సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే.. తాజాగా గురువారం 2024, సెప్టెంబర్ నుంచి 2025, మార్చి 28 వరకు పలు దఫాల్లో రూ.55 వేలు పౌరసరఫరాలశాఖ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సిబ్బందికి ఆన్లైన్ చెల్లింపులు చేసినట్లు మరో మిల్లర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ చేపడతారో వేచి చూడాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ‘కోల్డ్‌వార్’.. జిల్లా పౌరసరఫరాలశాఖలోని అధికారులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి లోగుట్టును బయటపెడుతూ అనుకూలమైన వారితో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా అవినితీ ఆరోపణలు.. అక్రమాల విషయాలను బహిర్గతం చేస్తూ శాఖతో పాటు జిల్లా పరువు రచ్చకీడుస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘నిద్రావస్థలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు’ వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక టీ–హబ్‌ను బీసీ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ మాజీ ముఖ్యమంత్రి ఫొటోతోనే సేవల వివరాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. బయో కెమిస్ట్రీ యంత్రం మరమ్మతుకు గురై మూడునెలలు గడుస్తున్నా నేటికీ బాగు చేయించలేదని, దీంతో వైద్య పరీక్షలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. టీ–హబ్ నిర్వాహకులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల వైఖరి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉందన్నారు. ఇప్పటికై నా స్పందించి రోగులకు అన్నిరకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జేఏసీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట, శ్రీరంగాపురం మండలాల అధ్యక్షులు అంజన్న, ధర్మేంద్రసాగర్, చెలిమిళ్ల రామన్‌గౌడ్ పాల్గొన్నారు. మార్మోగిన అంజన్న నామస్మరణ దేవరకద్ర: మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అంజన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి ప్రభోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపై ఊరేగించారు. అనంతరం ప్రభోత్సవ తేరులో స్వామివారు కొలువుదీరగా.. భక్తులు టపాసులు కాలుస్తూ రథాన్ని లాగారు. -
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
వనపర్తి: ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణకు ఆయనతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించడమే కీలకమని, పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోరాదని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కొనసాగుతుందా లేదా అనేది పరిశీలించడం ప్రధాన బాధ్యతన్నారు. పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించి ఇచ్చిన ఫార్మట్‌లోనే నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటల వరకే నిర్దేశిత కేంద్రానికి చేరుకోవాలని, చెక్ లిస్ట్‌ను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ట్రైనర్ శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం.. జిల్లాలో మొదటి విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ డి.సునీతరెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎల్పీఓ రఘునాథ్, సి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి
వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, డీఎంసీఎస్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే జమ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు వానాకాలం సీఎంఆర్ గడువులోగా అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి సీఎంఆర్ అప్పగింతకు ఫిబ్రవరి వరకు గడువు పొడిగించినందున పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వనపర్తి
పాత కొత్త ఒక్కో చోట ఒకలా.. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు -
శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ : ఎస్పీ
వీపనగండ్ల/చిన్నంబావి: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, చిన్నంబావి మండలం పెద్దదగడ, పెద్దమారూర్‌లో నామినేషన్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఓటర్లు ఎన్నికల సిబ్బంది, పోలీసులకు సహకరించినప్పుడే స్థానిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయని తెలిపారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాణి తదితరులు ఉన్నారు. వనపర్తి రూరల్: పెబ్బేరులోని కొల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను బుధవారం ఎస్పీ సునీతరెడ్డి తనిఖీ చేశారు. వాహన తనిఖీలు, వివరాల నమోదు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెక్‌పోస్ట్‌ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలను ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారం రవాణాకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ప్రజలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వరావు, ఎస్ఐ లు యుగంధర్‌రెడ్డి, దివ్య, సిబ్బంది ఉన్నారు. -
పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణ
వనపర్తి రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలం కంభాళాపురం, శ్రీరంగాపురం గ్రామపంచాయతీ కార్యాలయాల్లోని క్లస్టర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బయట ప్రదర్శించిన ఓటరు జాబితాను పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు అన్ని సమర్పిస్తున్నారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాల నివేదికను సకాలంలో జిల్లాకేంద్రానికి పంపించాలన్నారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారిలో ఒకరు లేదా ఇద్దరిని వదలాలని, ఎక్కువ మందిని అనుమతించవచ్చని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు. -
పౌరసరఫరాలశాఖలో కోల్డ్‌వార్!
డీఎస్ఓపై లోకాయుక్తలో ఫిర్యాదు నాపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి సమాచారం లేదు. అక్కడి నుంచి నోటీసులు వచ్చాక అందులో ఏమి ఉందో చూసి తర్వాత స్పందిస్తా. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నా. ఎవరితోనూ వైరం లేదు. మిల్లర్లందరినీ సమానంగానే చూస్తాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వనపర్తి: కొద్దిరోజులుగా జిల్లా పౌరసరఫరాలశాఖలోని కొందరు అధికారులు, మిల్లర్లలోని ఓ వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తాజా పరిస్థితుల ఆధారంగా స్పష్టమవుతోంది. రాజుకున్న విభేదాల నిప్పు లోకాయుక్తలో ఫిర్యాదు వరకు చేరింది. మంగళవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్పై ఓ సంఘం నేత లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సంబంధితశాఖలోని కొందరు అధికారులు నచ్చిన మిల్లర్లతో ఒకలా.. నచ్చని మిల్లర్లపై మరోలా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయింపులు, కేసుల నమోదు వంటి అంశాల్లో ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఏప్రిల్‌లో అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. అధికారులు విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ డీఎస్ఓపై లోకాయుక్తలో ఫిర్యాదుచేసి ఆ ప్రతితో పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా.. పౌరసరఫరాలశాఖ అధికారులు, మిల్లర్లలో రెండు వర్గాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో చాలా విషయాల్లో విభేదాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్లుగా మరుగునపడిన నిబంధనలకు తూట్లు పొడిచి రహస్యాలు సైతం ఇటీవల బయటకు లీకులిచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో తాజాగా వెలుగుచూసిన ఘటనలు.. ● అక్టోబర్ 12న పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని రెండు మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రూ.12.50 కోట్ల పైచిలుకు విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు జిల్లాశాఖ నుంచే ఉప్పందినట్లు ప్రచారం సాగుతోంది. ● పెబ్బేరు మండలం కంచిరావుపల్లి శివారులో ఉన్న ఓ మిల్లుపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి గద్వాల జిల్లాకు చెందిన ధాన్యాన్ని పట్టుకున్నారు. జిల్లాలో తీసుకున్న ధాన్యం సీఎంఆర్ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని, ఇతర ప్రాంతానికి చెందిన ధాన్యం నిల్వ చేశారనే కారణాలతో శాఖాపరమైన చర్యలకు సిఫారస్ చేశారు. డీఎస్ఓ ఉద్దేశపూర్వకంగా కొందరు మిల్లర్లను టార్గెట్ చేస్తున్నారంటూ బీసీ సంఘం నాయకులు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ● మిల్లర్లలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఇచ్చిన చిరునామాలో మిల్లు లేకపోయినా 2022–23 వానాకాలం ధాన్యం కేటాయింపులు చేయడం, అక్కడి నుంచి కొద్దిమేర బియ్యం చెల్లింపులు చేసిన విషయం బయటకు వచ్చింది. మూడురోజుల తర్వాత డీఎస్ఓపై బీసీ సంఘం నాయకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఓ వర్గం మిల్లర్లు.. అధికారుల మధ్య విభేదాలు ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విషయాలు వెలుగుచూస్తున్న వైనం జిల్లాలో సీఎంఆర్, యాక్షన్ ప్యాడీ సుమారు రూ.700 కోట్ల మేర పెండింగ్ రోజుకో ఎత్తుగడతో ధాన్యం తీసుకుంటున్న కొందరు మిల్లర్లు -
వివరాలు నమోదు చేస్తున్నాం..
ఎకరాకు 9 క్వింటాళ్లకు మించి పత్తి పండించిన రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు. రైతు ఇచ్చిన వివరాలు తీసుకొని నేరుగా పొలానికి వెళ్లి దిగుబడి వచ్చిందా లేదా అని తెలుసుకొని ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నాం – అరవింద్, ఏఓ, అమరచింత దళారులకు అమ్ముకోలేక.. పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. ప్రస్తుతం ఎకరాకు 11 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సీసీఐ ద్వారా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోలేక నిల్వ ఉంచా. ప్రస్తుతం సీసీఐ ద్వారా 12 క్వింటాళ్లు కొంటామని చెప్పడం ఆనందంగా ఉంది. – విష్ణువర్ధన్‌యాదవ్, అమరచింత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో.. పత్తి రైతుల ఇబ్బందులను గుర్తించిన కేంద్రం సీసీఐ కేంద్రాల ద్వారా 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు అనుమతినిచ్చింది. జిల్లాలోని పత్తి రైతులకు ఈ విషయాన్ని సంబంధిత ఏఈఓల ద్వారా తెలియపరుస్తూ పంట దిగుబడి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. పత్తి రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాం. – దామోదర్, ఏడీఏ -
చివరిరోజు.. నామినేషన్ల జోరు
● ముగిసిన రెండోవిడత స్వీకరణ ప్రక్రియ వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల రెండోవిడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. రాత్రి పొద్దుపోయే వరకు సమయంలోపు క్లస్టర్ కేంద్రాల్లోకి వచ్చిన వారి నామినేషన్లు స్వీకరించారు. అమరచింత మండలంలో అర్ధరాత్రి 12 దాటినా కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మిగిలిన ఆత్మకూరు మండలంలోని 13 సర్పంచు స్థానాలకు 111 నామినేషన్లు, 118 వార్డు స్థానాలకు 308 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కొత్తకోట మండలంలోని 24 సర్పంచ్ స్థానాలకు 190, 220 వార్డు స్థానాలకు 544.. మదనాపురం మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 125, 162 వార్డు స్థానాలకు 352.. వనపర్తి మండంలోని 26 సర్పంచ్ స్థానాలకు 141, నామినేషన్లు, 230 వార్డు స్థానాలకు 455 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సింగిల్ డిజిట్ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఏయే గ్రామానికి ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. -
సైబర్ భద్రత.. అందరి బాధ్యత
వనపర్తి: ప్రభుత్వం, పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని.. అందరం సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ సునీతరెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాలిటెక్నిక్, జేఎన్టీయూ ఇంజినీరింగ్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ సైబర్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. యువత, విద్యార్థుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించేందుకు 6 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత తమ చేతుల్లోనే ఉందని.. అవగాహనే ఆయుధమన్నారు. సైబర్ నేరాలు, వ్యూహాలు, వాటి నివారణ చర్యలు, బ్లాక్ మెయిలింగ్, డీప్‌ఫేక్‌లు, నకిలీ యాప్‌లు, చిన్నారుల సైబర్ రక్షణ వంటి అంశాల గురించి వివరించారు. సైబర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వారానికి ఒక కార్యక్రమం నిర్వహించాలని, టీజీసీఎస్బీ అందించే పోస్టర్లు, ఆడియో/వీడియో క్లిప్పింగ్స్ రద్దీ ప్రదేశాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. 6 వారాల పాటు పోలీసుశాఖ పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు, ప్రజాస్థలాల్లో సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, సైబర్‌క్రైం ఎస్ఐ రవిప్రకాష్, సైబర్‌క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో లుకలుకలు!
అమాత్యుల ఇలాకాల్లో ‘అంతర్గత’ పోరు ● మక్తల్‌లో తారస్థాయికి ‘కోటరీ’ లొల్లి ● ‘మద్దతు’ నేతలతో మంత్రికి పెరిగిన దూరం ● పట్టించుకోవడం లేదంటూ సెకండ్ కేడర్ కినుక ● ముఖ్యమంత్రి రేవంత్ సభపై ‘అసమ్మతి’ ప్రభావం? ● శ్రీహరి నారాజ్‌తో వెలుగులోకి విభేదాలు ● ‘కొల్లాపూర్’లో సైతం ఇలాంటి పరిస్థితులే.. -
పత్తి రైతుకు ఊరట..
12 క్వింటాళ్ల కొనుగోలుకు సీసీఐ అనుమతి ● ఆన్లైన్ నమోదుకుఏఈఓలకు ఆదేశాలు ● క్వింటా ధర రూ.8,110 ● ఆనందంలో రైతులు అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని మొదట ప్రకటించడంతో మిగిలిన పత్తి ఎక్కడ విక్రయించాలో అర్థంగాక రైతులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ● జిల్లావ్యాప్తంగా 7,150 మంది రైతులు 18,452 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఎకరాకు 9 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగబడి వస్తుంది. ఏఓ, ఏఈఓలకు కపాస్ వెబ్సైట్లో పంట దిగుబడి వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించడంతో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల బాట పట్టారు. ప్రస్తుతం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా పత్తికి రూ.8,110 మద్దతు ధర ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు తాము పండించిన పత్తిని చేరువలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలు 24 గంటల వ్యవధిలో కపాస్ వెబ్సైట్లో నమోదవుతాయని అధికారులు రైతులకు వివరిస్తూ పంట సాగుతో పాటు దిగుబడి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఏదుట్ల 30 శ్రీరంగాపురం 3 పాన్‌గల్ 4 చిన్నంబావి 23 -
21న జాతీయ లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్స్, చెక్‌బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజీయే రాజ మార్గమని.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులు డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని, తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదని, లోక్ అదాలత్ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదని వివరించారు. దావా వేయడానికి కోర్టులో చెల్లించిన కోర్టు ఫీజు వాపస్ చేస్తామని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేతనాలు పెంచాలంటూ కార్మికుల ఆందోళన వనపర్తి రూరల్: తమకు రూ.26 వేలు వేతనం చెల్లించాంటూ మంగళవారం మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కార్యదర్శి గంధం శ్రీను, నర్సింహ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం గంట పాటు విధులు బహిష్కరించి జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గడువు ముగిసిన ఏజెన్సీలను తక్షణమే రద్దుచేసి కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత ఏజెన్సీలనే పొడిగించడంతో కార్మికులకు ఆర్థిక నష్టంతో పాటు పనిభారం పెరుగుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి వేతనాల పెంపుపై స్పష్టత ఇవ్వాలని.. లేనిచో 5వ తేదీన చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు దర్గస్వామి, నరేందర్, కుమార్, శివ, షాబాద్, రవి, కిషోర్, వెంకటయ్య పాల్గొన్నారు. ‘వామపక్షాలతోనే గ్రామాల అభివృద్ధి’ వనపర్తి రూరల్: వామపక్షాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని.. సీపీఎం, సీపీఐ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు ఎం.రాజు అధ్యక్షతన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం నాయకుడు ఎండీ జబ్బారు, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయరాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల నాయకులు చర్చించుకొని గ్రామపంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ నాయకులు నిజాయతీగా ప్రజల కోసం పని చేస్తారని, బూర్జువ పార్టీలు ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఎన్నికల తర్వాత విపరీతంగా సంపాదించుకుంటాయని ఆరోపించారు. ప్రజలు గ్రామాల అభివృద్ధికి కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర వసతిగృహం తనిఖీ మదనాపురం: స్థానిక ప్రభుత్వ బాలుర వసతిగృహాన్ని మంగళవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, నిత్యావసర సరుకుల నాణ్యత, వంటగదిని పరిశీలించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థులకు వేడి భోజనం అందించాలని సిబ్బందికి సూచించా రు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకు న్నారు. ఆయన వెంట వనపర్తి, కొత్తకోట సహా య సంక్షేమ అధికారులు శ్వేత, మల్లేశం వసతిగృహ సంక్షేమ అధికారి బెనర్జీ ఉన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
వనపర్తి: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి కలెక్టర్ తన చాంబర్లో ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, గంధం నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకం
మధనాపురం: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం మదనాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీఓల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పీఓలు, ఏపీఓలు తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మోహన్ తదితరులు ఉన్నారు. -
ఎత్తుకు పైఎత్తు..!
● ఎన్నికల వేళ మారుతున్న రాజకీయ సమీకరణాలు ● గ్రామాల్లో బలమైన నాయకులకు అధికార, ప్రతిపక్ష పార్టీల గాలం ● జిల్లాలో జోరందుకున్న చేరికలు వనపర్తి: పంచాయతీ పోరు పల్లె సీమలో రాజకీయ వేడిని రాజేస్తోంది. గ్రామాల్లో జనబలం ఉన్న నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కుదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఇటీవల ఖిల్లాఘనపురం మండలం తిర్మలాయపల్లిలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా గ్రామానికి చెందిన సుమారు 23 మందిని అధికార కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తాజాగా బీఆర్ఎస్ గోపాల్పేట మండలం బుద్ధారం గామానికి చెందిన కీలక నాయకులను గులాబీ గూటికి లాగేసుకుంది. సోమవారం తాజా మాజీ ఎంపీటీసీ శ్రీదేవి భర్త విష్ణువర్ధన్‌రావు, మాజీ సర్పంచ్ జాంప్లానాయక్ తదితర నాయకులకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓవైపు మలివిడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే.. పార్టీల్లో చేరికలు జోరందుకోవడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. -
దొడ్డురకం మాకొద్దు..!
వనపర్తి: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మిల్లర్లు సన్నాల సేకరణకే మొగ్గు చూపుతున్నారు. దొడ్డు రకం వరిధాన్యం సాగుచేసిన రైతులు దిగుబడుల విక్రయానికి కేంద్రాల్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కలెక్టరేట్ ప్రజావాణిలో రైతులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా.. నేటికీ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభం కాలేదనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మిల్లర్లు దొడ్డు రకం ధాన్యం తీసుకుంటే బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. వారు నిబంధనలు కచ్చితంగా పాటిస్తుండటంతో నాణ్యతలో ఎలాంటి లోపాలున్నా.. అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సీఎస్సీకి అప్పగించే సన్నబియ్యం రీసైక్లింగ్ చేసుకోవచ్చు.. సీఎంఆర్ పాస్ చేయడంలో టెక్నికల్ అసిస్టెంట్లు చూసీచూడనట్లు కానిచ్చేస్తుండటంతో మిల్లర్లు సన్నరకం వరి ధాన్యం దించుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అధికారులు సైతం మిల్లర్లకు సహకరిస్తున్నారనే వదంతులు ఉన్నాయి. జిల్లాలో కొనుగోళ్లు ఇలా.. జిల్లావ్యాప్తంగా మొత్తం 433 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 376 మాత్రమే ప్రారంభమయ్యాయి. అందులో 251 సన్నరకం, 150 వరకు దొడ్డురకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సన్నరకం 91,088 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తే.. దొడ్డురకం కేవలం 7,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించడం గమనార్హం. వానాకాలం సాగు వివరాలిలా.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 2.15 లక్షల ఎకరాల్లో సన్నరకం, 20,276 ఎకరాల్లో దొడ్డు రకం వరి ధాన్యం సాగైనట్లు వ్యవసాయశాఖ అఽధికారుల లెక్కలు చెబుతున్నాయి. సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా. నెల కిందట ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా.. తేమశాతం తగ్గించేందుకు ఆరబెడుతుండటంతో నెమ్మదిగా ప్రారంభమై పుంజుకుంటున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ● వనపర్తి మండలం అంకూరులో ఏర్పాటుచేసిన దొడ్డురకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం బీసీ సంఘం నాయకులు పరిశీలించగా.. రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సుమారు నెలరోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ సమస్యను కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన నిల్వలు కలెక్టరేట్‌కు చేరిన సమస్య.. ప్రజావాణిలో విపక్షాలు, రైతుల ఫిర్యాదు జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 7,700 మె.ట. దొడ్డురకం వరిధాన్యాన్ని ఎక్కువగా బాయిల్డ్ రైస్‌మిల్లులకు కేటాయించాల్సి ఉంటుంది. వారిలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించి అర్హత ఉన్నవారు తక్కువగా ఉన్నారు. సన్నాలతో పాటు దొడ్డురకాలను పంపిస్తున్నాం. వానాకాలం ధాన్యంతో నష్టం వాటిల్లుతుందని మిల్లర్లు విముఖత చూపుతున్నారు. మిల్లర్లు దించుకోకుంటే.. గోదాంలలో నిల్వ చేసేందుకు అనుమతి కోరుతున్నాం. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ -
ఎన్ని నిధులైనా ఇస్తా..
వడ్డించేది నేనే.. పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలు మొదటగా మక్తల్‌లో నిర్వహించాలని మంత్రి వర్గ సహచరులు నిర్ణయించారని సీఎం పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అడగడంతో మక్తల్ నుంచే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ‘కౌన్ పూచేగా మక్తల్ అని పాత నానుడిని కాదని.. సబ్ కుచ్ పూచేగా, సబ్ కుచ్ ఆయేగా మక్తల్’ అని ఇక్కడ విజయోత్సవం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తనకు అండగా నిలబడ్డారని, పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు రెండో సీఎం అయ్యానన్నారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా బూర్గుల రామకృష్ణారావు కాగా.. 75 ఏళ్ల తర్వాత తెలంగా ణకు రెండో ముఖ్యమంత్రిగా మీ బిడ్డ సీఎం అయి మీ ముందు నిలబడ్డానన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ‘పాలమూరు జిల్లాకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ ఘన స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్‌కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ.1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. ‘రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ఇంటింటికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. మహిళలకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేశాం. వచ్చిన పైసలు కరెంట్ బిల్లుకు సరిపోయేదని, దానిని దృష్టిలో పెట్టుకొని ఉచిత కరెంట్ అందిస్తున్నాం. నారాయణపేట మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశాం. మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు 25.35 లక్షల రైతులకు రూ.21,653 కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాదికి రూ.12 వేల రైతు భరోసాను వేశాం. 1.04 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికి నిరంతరం పని చేస్తున్నాం.’ ముఖ్యమంత్రి అన్నారు. ‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్‌నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఆత్మకూర్/అమరచింత: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1గంటకు ఆత్మకూర్‌కు రావాల్సి ఉండగా.. 2:40 గంటలకు చేరుకున్నారు. జాతర మైదానంలోని హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా ప్రత్యేక కాన్వాయ్‌లో పీజేపీ క్యాంపు కాలనీకి బయలుదేరారు. గాంధీ చౌరస్తాకు మధ్యాహ్నం 2:45 గంటలకు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వాహనంపై నిల్చొని కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలు, స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపారు. గాంధీ చౌరస్తాలో 5 నిమిషాల పాటు సీఎం కాన్వాయ్ నిలిచింది. సీఎంను మరింత దగ్గరగా చూడాలని కార్యకర్తలు బారీకేడ్లను తోసుకుంటూ రావడంతో పోలీసులు నిలువరించే యత్నం చేశారు. అనంతరం పీజేపీ క్యాంపు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. 35 నిమిషాల్లో కార్యక్రమాలను ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం పర్యటన సందర్భంగా ఆత్మకూర్ ప్రధాన చౌరస్తాలో మధ్యాహ్నం 3:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మీ ఆశీర్వాదంతోనే సీఎం అయ్యాను.. -
పంచాయతీల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి
‘మంచోడు సర్పంచు అయితే ఊరు బాగుపడుతది. ముంచేటోడికి ఓటు వేస్తే ఊరు పాడవుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే మద్దతుదారులకు ఓటర్లు పట్టం కట్టాలి. మంచి వాళ్లను ఎన్నుకోవాలి. నీళ్లు, నిధులు ఇచ్చే వారికి ఓట్లు వేయాలి. ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు మంజూరు చేసుకునే నాయకులను సర్పంచులుగా గెలిపించుకోవాలి. నిధులు, నీళ్లు, రైతుల పంటకు బోనస్ ఇచ్చే బాధ్యత నాది. మీరందరూ మళ్లీ ఆశీర్వదించాలి. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడే విధంగా అభివృద్ధి చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడితే ఢిల్లీకి వినిపించాలి. సీటీలు కొడితే పాలమూరు జిల్లా ఏకమైందని.. ఢిల్లీలో ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలె.’ అని సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్, సీతా దయాకర్‌రెడ్డి, శివసేనారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, సరిత, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, బీకేఆర్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ఫెయిర్‌తో శాసీ్త్రయ దృక్పథం పెంపు
వనపర్తి రూరల్: చిట్యాల ఎంజేపీ గురుకుల పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు 270 ప్రాజెక్టులు, ఇన్స్పైర్ మనక్ కింద 124 ప్రాజెక్టులు ప్రదర్శించారు. సుిస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక తదితర అంశాలతో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. డీఈఓ అబ్దుల్‌ఘని, డీఎస్ఓ శ్రీనివాసులు పోటీలను పర్యవేక్షించిన వారు మాట్లాడుతూ.. ఈ ప్రయోగాలను న్యాయ నిర్ణేతలు క్షణంగా పరిశీలించి ప్రథమ స్థానంలో జూనియర్ విభాగంలో 7, సీనియర్ విభాగంలో 7 ప్రాజెక్టులు, ఇన్స్పేర్ మనక్ కింద 12 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయని ఆయన తెలిపారు. ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఎస్ఓ శ్రీనివాసులు విజేతలకు షీల్డ్, ప్రశంసాపత్రాలు అందజేశారు. పెబ్బేరు మండలంలోని వై.శాఖాపూర్ జెడ్పీ పాఠశాల గైడ్ టీచర్ కె రాంచందర్ పర్యవేక్షణలో 8వ తరగతి విద్యార్థులు జె హర్షిత, పి.హర్షిత సేవ్ లైఫ్ –ఫ్రం మ్యాన్‌హోల్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల గైడ్ లెక్చరర్ శివగంగ పర్యవేక్షణలో ప్రేమలత, ఇఫ్రా ఫస్ట్ ఇయర్ బైపీసీ, విద్యార్థులు వ్యర్థ పదార్థాలు ప్రకృతికి హానిపై మొదటిస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంతి, జీసీడీఓ శుభలక్ష్మి, ఎంఈఓ మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, మహానంది, మీడి యా కన్వీనర్లు గిరిరాజాచారి, విజయకుమార్, బైరోజు చంద్రశేఖర్, సుజాత పాల్గొన్నారు. -
నేటినుంచి నూతన మద్యం పాలసీ
● ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు ● గుడ్‌విల్ ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారులు మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దర ఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 27న ఆయా జి ల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్‌దారుల ను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు. ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్‌దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్‌విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్‌విల్‌తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్‌విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్‌లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్‌నగర్ 54 1,634 49.02 నాగర్‌కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. వారిదే పైచేయి.. గణనీయంగా అమ్మకాలు ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు బెల్ట్ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్ దుకాణాలతోపాటు పట్టణాల్లో సై తం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి. -
‘నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లు జరగొద్దు’
వనపర్తి/ఆత్మకూర్/మదనాపురం: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం నుంచి వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వనపర్తి మండలంలోని రాజపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మదనాపురం రైతువేదికలో, ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్‌లో అప్డేట్ చేయాలన్నారు. -
చదరంగం ఆటతో మెదడుకు వ్యాయాయం
వనపర్తి టౌన్: చదరంగం ఆట మెదడుకు వ్యాయామమని, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంచుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ కేవలం ఆట మాత్రమే కాదని, జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నేర్పే జీవిత గురువు అని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా చెస్ ఆడాలని, తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని, జీవితంలో ఎలాంటి నిర్ణయాలను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారని చెప్పారు. అబ్బాయిల విభాగంలో చాపింయన్గా ధృవ తోట, ఫస్ట్ రన్నరప్‌గా యోహాన్ యాదవ్ తరల, తిజిల్ సింగ్, అఖిల్ రాపల్లె, మోక్షిత్ పలుసులేటి, లెల్లా దేవాన్ష్, అల్లాది శ్రీవత్సన్, అమ్మాయిల విభాగంలో చాంపియన్‌గా యశస్వి జైన్, రన్నరప్‌గా సాహ్జేదీప్ కౌర, సవిత విజ్జి, శశి హాసిని చింతల, మహాదేవ్ నిషిత హౌజ్, జాన్వి తోటలు విజేతలుగా నిలిచారు. అమ్మాయిల విభాగంలో ఆరుగురు, అబ్బాయిల విభాగంలో ఏడుగురు కలిపి 13 మంది విజేతలుగా నిలిచారని, గెలుపొందిన వారు నేషనల్ లెవల్ పోటీపడతారని పేర్కొన్నారు. అంతకుముందు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి టీపీ కృష్ణయ్య, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ జీపీలు ఏకగ్రీవమే..!
14 గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డులకు ఒక్కో నామినేషన్ అక్కడక్కడ ‘కండువా’ లొల్లి..! ప్రస్తుతం ఏకగ్రీవం దిశగా అడుగులు వేసిన జీపీల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతు దారులేనని తెలుస్తోంది. అయితే చాలాచోట్ల గ్రామాల పెద్దలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని ఏకగ్రీవం దిశగా అ డుగులు వేశారు. ఈ క్రమంలో అక్కడక్కడ ‘కండువాల’ లొల్లి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లిలో సర్పంచ్ గా బంగారయ్య శనివారం ఒక్కరే నామినేషన్ వేయగా.. ఆయన వద్ద కు పలువురు కాంగ్రెస్ నాయకు లు వెళ్లి పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత ఆదివారం బీఆర్ఎస్ నేతలు వెళ్లి గులాబీ కండువా వేశారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ ఊరంతా ఏకమై తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, భవిష్యత్‌లోనూ ఉంటానని మీడియాకు చెప్పారు. టీడీపీ.. కాంగ్రెస్ అంటూ.. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో సర్పంచ్‌గా టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ ఎనిమిది వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ పంచాయతీ లాంచనమే. ఎనిమిదో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ మద్దతుదారు సందమోల్ల శ్రీనివాస్‌ను ఉప సర్పంచ్‌గా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్‌లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్‌లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల 0 మహబూబ్‌నగర్ 2 (అంచన్పల్లి, కాకర్‌జాల్) ఇప్పటి వరకు ఏకగ్రీవమైన జీపీలు ఇవే.. నారాయణపేట 5 (అప్పాయపల్లి, పెద్దతండా, పర్సాపూర్, అప్పిరెడ్డిపల్లి, దామలతండా) వనపర్తి 2 (నాగుల కుంటతండా, లక్ష్మీదేవిపల్లి) పలు జీపీల్లో వార్డుల్లోనేమో సింగిల్.. సర్పంచ్‌కు పోటాపోటీ కొన్నిచోట్ల సీన్ రివర్స్.. ఆయా చోట్ల పెద్దల రాజీ యత్నాలు ఉపసంహరణ నాటికి కొలిక్కి వచ్చే అవకాశం -
నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
● కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ● 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు నారాయణపేట/ మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రూ.558 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల– కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.210 కోట్లతో మక్తల్– నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. అలాగే మక్తల్– పేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సీఎం చేతులమీదుగా అందించనున్నారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు మొత్తం 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనకు ఏర్పాట్లు చేసుకోవాలని, డిసెంబర్ ఒకటో తేదీన అన్ని మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులకు ఓటింగ్ నిర్వహణపై శిక్షణ, అవసరమైన స్థలం, కంప్యూటర్లు, మౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా డిసెంబర్ 4న ఓపీఓలకు శిక్షణ, ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌కు అవసరమైన ఫారం 14, 17 శిక్షణ రోజు ఇచ్చేలా చూడాలన్నారు. పోలింగ్‌కు ముందురోజు బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ కేంద్రాలకు పంపించేందుకు మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థుల నుంచి అనెక్సర్–1పై సంతకం తీసుకోవాలని, ఒక్కరే అభ్యర్థి పోటీలో మిగిలితే అనెక్సర్–2 తీసుకోవాలని సూచించారు. డబుల్ ఓటర్లు, చనిపోయిన ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రిసైడింగ్ అధికారికి ముందుగానే అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎల్పీఓ రఘుపతిరెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ మదన్మోహన్ పాల్గొన్నారు. -
ప్రతిభా పురస్కారాలతో ప్రోత్సాహం
వనపర్తిటౌన్: ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్ సిబ్బందిని పురస్కారాలతో ప్రోత్సహించడంతో తోటి వారు కూడా పోటీ పడేందుకు ఆసక్తి చూపుతారని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సైదులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అక్టోబర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి డిపోని లాభాల బాటలో నడిపేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, రీజియన్ పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. డ్రైవర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఏకాగ్రతతో రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి యాక్సిడెంట్ ఫ్రీ డిపోగా తీర్చిదిద్ది ప్రజల్లో మరింత నమ్మకం కలిగించాలని పేర్కొన్నారు. సూపర్వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి ఆత్మకూర్: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సజావుగా వరి ధాన్యం సేకరణ జరగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ నిర్వాహకులను ఆదేశించారు. శనివారం మండలంలోని దేవరపల్లి, జూరాలలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగడంతో పాటు ప్రమాదాలు జరుగుతాయని, కల్లాల్లో ఆరబోసుకోవాలని సూచించారు. తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తక్షణమే కేటాయించిన రైస్‌మిల్లుకు తరలించాలని ఆదేశించారు. అలాగే స్థానిక బాలాజీ రైస్‌మిల్లును తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం దించుకోవడం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్లును తనిఖీ చేసిన డీఎస్ఓ వనపర్తి రూరల్: పెబ్బేరులోని శ్రీ రామాంజనేయ రైస్‌మిల్ (శ్రీనివాస ట్రేడర్స్)కు 2022–23 వానాకాలం కేటాయించిన వరి ధాన్యం నిల్వలు లేవని పక్కా సమాచారంతో శనివారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022–23లో 38 ఏసీకేల ఽవరి ధాన్యం మిల్లుకు కేటాయించగా 27 ఏసీకేల ధాన్యం మర ఆడించి బియ్యం ప్రభుత్వాన్ని ఇచ్చారన్నారు. ఇంకా 11 ఏసీకేల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా.. తనిఖీల్లో 9 వేల బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. మిల్లు యజమాని కృపాకర్‌రెడ్డిని విచారించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులను అందజేస్తామని చెప్పారు. వారి సూచనల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 లక్షలు : ఎమ్మెల్యే వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులు అందించేందుకు సిఫారస్ చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 780 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
సువర్ణ అధ్యాయం.. దీక్ష దివాస్
వనపర్తి: అహింసతోనే రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేకే దక్కిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో నిర్వహించిన దీక్ష దివాస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిందని.. ఉమ్మడి రాష్ట్రంలో ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ పాలకులు 369 మంది తెలంగాణవాదులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు తీవ్రంగా నష్టపోయిందని బచావత్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. 1996లో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమిస్తే కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ 2000 సంవత్సరంలో కేసీఆర్ తన పదవిని తృణప్రాయంగా త్యాజించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు నడుం బిగించారన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్.. పొత్తు పెట్టుకొని చంద్రబాబు మోసం చేశారన్నారు. దీంతో కేసీఆర్ 2009లో మూడు లక్షల మందితో ఉద్యోగ గర్జన నిర్వహించారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తామన్నారు. రాష్ట్రాన్ని అవగాహన లేని వారు పాలిస్తున్నారని.. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని, వెంటనే పూర్తి చేయాలి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, రమేష్‌గౌడ్, కురుమూర్తి యాదవ్, నందిమళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ ఆరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ అరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్‌గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్‌గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్‌గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
పంచాయతీలు హస్తగతం కావాలి
● ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 లక్షలు వారంలో మంజూరు ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత/ఆత్మకూర్: బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించామని, ప్రజలను మోసగించి తప్పించుకునే నాయకత్వం తమది కాదని.. కాంగ్రెస్‌పార్టి చెప్పిందే చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం అమరచింత, ఆత్మకూర్ మండల కేంద్రాల్లో వేర్వేరుగా నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అమరచింత మండలంలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, మండలంలోని 14 మంది సర్పంచ్‌లను గెలిపిస్తే మరో రూ.200 కోట్లు వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతుదారులను ఏకగ్రీవంగా గెలిపిస్తే ఆయా గ్రామాలకు వారం వ్యవధిలో రూ.20 లక్షలు సొంత నిధులు ఇస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని.. ఇందుకుగాను మండలంలో 20 మందితో కమిటీ వేస్తామని, వారే అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. రిజర్వేషన్ల ప్రకారం కొందరు నాయకులకు అవకాశం రాలేదని.. వారికి భవిష్యత్‌లో మంచి పదవులు ఇప్పించే బాధ్యత తనదన్నారు. వర్గ విభేదాలు వీడి కార్యకర్తలందరూ ఒకే కుటుంబంలా కలిసి ఉంటూ గెలుపునకు పని చేయాలని పిలుపునిచ్చారు. జూరాల ఎడమ కాల్వ వద్ద ఫిషరీష్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడే అధునాతన చేపల మార్కెట్‌ను సైతం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూ.123 కోట్లతో హై లెవల్ వంతెన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పట్టణానికి వస్తున్నారని.. జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హై లెవల్ వంతెన నిర్మాణం, రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్‌యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత కార్మిక సెల్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, మహంకాళి విష్ణు, తిరుమలేష్, పోసిరిగారి విష్ణు, మోహన్, రవికాంత్, కమలాకర్, శ్యాం.. ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, బాలకిష్టన్న, గంగాధర్‌గౌడ్, పరమేష్, శ్రీను, తులసీరాజ్, భాస్కర్, మశ్ఛందర్గౌడ్ పాల్గొన్నారు. -
ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం
● అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ ● మూడు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల పర్వం శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి 12 వరకు ఖిల్లాఘనపురం, గోపాల్పేట, రేవల్లి, పెద్దమందడి మండలాలకు చెందిన నామినేషన్ల వివరాలు అందినట్లు ఇన్చార్జ్ డీపీఓ రఘునాథ్‌రెడ్డి ప్రకటించారు. రేవల్లి మండలంలో 9 సర్పంచ్ స్థానాలకు 76 నామినేషన్లు, 82 వార్డు స్థానాలకు 220 నామినేషన్లు.. గోపాల్పేట మండలంలో 15 సర్పంచ్ స్థానాలకు 104, 136 వార్డు స్థానాలకు 362.. పెద్దమందడి మండలంలో 23 సర్పంచ్ స్థానాలకు 188, 212 వార్డు స్థానాలకు 526.. ఖిల్లాఘనపురం మండలంలో 29 సర్పంచ్ స్థానాలకు 222 నామినేషన్లు, 248 వార్డు స్థానాలకు 614 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. అధికారిక సమాచారం వెల్లడించేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. సాయంత్రం ఐదు వరకు క్లస్టర్లో వేచి ఉన్న వారందరితో నామినేషన్లు స్వీకరించాల్సి ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దాఖలు ప్రక్రియ కొనసాగింది. ● పెద్దమందడి మండలం నాగులకుంటతండా, గోపాల్పేట మండలం అనంతపూర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. గోపాల్పేట: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణ శనివారం చివరిరోజు కొనసాగింది. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో మొత్తం 224 ఓట్లు, నాలుగు వార్డులు ఉండగా.. సర్పంచ్, ఆయా వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలైంది. దీంతో సర్పంచ్‌గా బంగారయ్య, వార్డుసభ్యులుగా మండ్ల కృష్ణమ్మ, గౌరి వెంకటయ్య, అయోధ్య రాములు, గుంటి లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారిక సమాచారం. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఆత్మకూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబర్ 1న పట్టణానికి వస్తున్నందున శుక్రవారం అదనపు ఎస్పీ వీరారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. జాతర మైదానంలోని హెలిప్యాడ్ స్థలం, పీజేపీ క్యాంపు వద్ద నిర్మించనున్న 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ ప్రదేశాన్ని చూశారు. అలాగే జూరాల గ్రామం వద్ద కృష్ణానది పుష్కరఘాట్ వద్ద హైలేవల్ వంతెన నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి బందోబస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట ఎంటీఓ శ్రీనివాసులు, సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న, పుర కమిషనర్ చికినె శశిధర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
పాన్‌గల్: ఽదాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో తప్పక నమోదు చేయాలని, తేమ శాతం పేరుతో ఇక్కట్లకు గురి చేయొద్దని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలు ఎక్కువ సమయం మిల్లుల వద్ద వేచి ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన దొడ్డురకం వరి ధాన్యం తూకం చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని.. సన్నాలతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని కూడా వెంటనే తూకం చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కస్తూర్బా విద్యాలయం సమీపంలో ఉన్న గోదాంను సందర్శించి మిగిలిన వంద శాతం రాయితీ వేరుశనగ విత్తనాలను పరిశీలించారు. బస్తాలకు రంధ్రాలు పడి మిగిలినవి అధికారులు వివరించగా బస్తాల్లో ఎత్తించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, డీటీ అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
స్థానికంలో విజయమే లక్ష్యం : బీజేపీ
వనపర్తి రూరల్: పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ కోరారు. శుక్రవారం శ్రీరంగాపురం, పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నుంచి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. గ్రామాలో సీసీ రహదారులు, డ్రైనేజీలకు కేంద్ర నిధులే వినియోగిస్తున్నారని చెప్పారు. ఆయా అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో ప్రజలకు వివరించి సర్పంచ్, వార్డుసభ్యుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పార్టీ మద్దతుదారులను నిలబెట్టాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, వెంకట్రామారెడ్డి, మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌నాయుడు, నాగరాజుయాదవ్, భగవంతుయాదవ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి వనపర్తిటౌన్: విద్యార్థులు గుడ్, బ్యాడ్ టచ్ మధ్య బేధం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని నాగవరం ప్రాథమిక పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులు మెరుగైన జీవితాన్ని పొందేందుకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. 18 ఏళ్లలోపు బాలలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని.. చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించినా, సహకరించినా శిక్షార్హులవుతారని వివరించారు. విద్యార్థులు వినోదం, సందేశాత్మక, నీతి కథలు తదితర పుస్తకాలు చదవడంతో సమయస్ఫూర్తి పెరుగుతుందని చెప్పారు. ఉచిత న్యాయ సాయం, సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు వనపర్తి రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతులను కేంద్రాల్లో ఎండలో కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా ధాన్యం ఆరబోసుకుంటే కొనే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను చేసి అదనంగా రెండు, మూడు కిలోల తూకంతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పీఏసీఎస్ చైర్మన్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యల ఉందని.. ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ వద్ద సరిపడా లారీలు ఉంటే ఎందుకు త్వరగా తరలించడం లేదని ప్రశ్నించారు. పలుకుబడితో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్ట్ పొందడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. లేదంటే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వీవీగౌడ్, దేవర శివ, వడ్డె రాజు, రమేష్‌గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఆలోచనలకు పదునుపెట్టాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి ● జిల్లాకేంద్రంలో ప్రారంభమైన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన వనపర్తి రూరల్: ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతికపరంగా రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయని.. విద్యార్థులు ఇప్పటి నుంచే అందుకు అనుగుణంగా సైన్స్‌ను అందిపుచ్చుకొని కొత్త ఆలోచనలకు పదునుపెట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శుక్రవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ గురుకుల పాఠశాలలో 53వ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వందేమాతరం గీతం ఆలపించి రిబ్బన్ కట్‌చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కలెక్టర్ ప్రత్యేక చొరవతో విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ పెంచడానికి సైన్స్ ఉపాధ్యాయులతో పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ అంటేనే నిజమని, సైన్స్ ద్వారా ప్రపంచం, ప్రకృతిలో దాగి ఉన్న నిజాలను తెలుసుకోవచ్చని, అలవర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్లగలమని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ఇక్కడి నుంచే ఇతర గ్రహాలపై డ్రోన్లను నడపగలుగుతున్నామని.. అంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందని తెలిపారు. పరిశోధనాత్మక విధానంలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మూడురోజుల పాటు కొనసాగనున్న జిల్లాస్థాయి వైజ్ఙానిక ప్రదర్శనకు 150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 270 సైన్స్ ప్రయోగాలు ప్రదర్శనలో ఉంచారు. కలెక్టర్ వాటిని తిలకిస్తూ పలు ప్రశ్నలు వేయగా విద్యార్థులు వాటికి సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, శిక్షణ కలెక్టర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, జీసీడీఓ శుభలక్ష్మి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ప్రిన్పాల్ ప్రశాంతి, మండల విద్యాధికారి మద్దిలేటి, జయరాములు, నర్సింహ, ప్రధానోపాధ్యాయుడు గణేష్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్‌ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా సహకరించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యభట్టు కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా, సంతోషంగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులను ఉపసంహరణకు ఒత్తిడికి గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ వేయకుండా అడ్డుపడినా, బలవంతంగా ఉపసంహరణ చేయించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తప్పవన్నారు. జిల్లాలో అధికారులతో స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామని, ఉపసంహరణ అనంతరం ఒకే ఒక నామినేషన్ మిగిలితే విచారణ చేపడతామన్నారు. ఉపసంహరణ సమయంలో అభ్యర్థులు ఎవరు బలవంతం చేయలేదు.. ఎలాంటి ఒత్తిడి లేదని ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. నామినేషన్ వేసే ముందు అభ్యర్థి పేరున కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తం ఆ ఖాతానుంచే జరపాలని సూచించారు. 45 రోజుల్లో ఎన్నికల ఖర్చు వివరాలు బిల్లులు, ఓచర్లతో సహా లెక్క చూపించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి రఘుపతిరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్దిరాజు, రహీం, బాలరాజు, ఎల్లస్వామి, రాజేందర్, పరమేశ్వరాచారి, సయ్యద్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
జోరందుకున్న నామినేషన్ల పర్వం
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటివిడత నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం జిల్లాలో జోరందుకుంది. ఐదు మండలాల పరిధిలోని 87 సర్పంచ్ స్థానాలకు 157, 780 వార్డులకు 250 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి తెలిపారు. శనివారం చివరిరరోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం పోటీకి రాజకీయ పార్టీల నాయకులు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో సమీకరణలు, రాజీపర్వాలు సుదీర్ఘంగా చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌పార్టీలో పోటీదారులు ఎక్కువగా ముందుకొస్తున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి వర్గం నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే.. చాలాచోట్ల ఇరువర్గాల వారు కాంగ్రెస్ మద్దతు కోరుతూ.. నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో ఢీసీసీ..!
కుంపటి రాజేసిన జిల్లా అధ్యక్షుల ఎంపిక ● వనపర్తిలో శివసేనారెడ్డికి ఇవ్వడంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి నారాజ్ ● తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు ఎత్తేసిన చిన్నన్న ● అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం ● ఇటు మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ఆశావహ నేతల్లో అసంతృప్తి ● పంచాయతీ ఎన్నికల వేళ పరిణామాలపై ‘హస్తం’ శ్రేణుల్లో గుబులు –8లో u -
వేలం.. ‘ఏకగ్రీవం’!
సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ ● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ ● చక్రం తిప్పుతున్న పెద్దలు.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి ● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం ● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరమంటున్న అధికారులు.. పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నారు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్‌లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడిన వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాట పాడి.. వాయిదా వేసి.. గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్‌కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాటను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
వనపర్తి : అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు..
జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడం.. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా తన వర్గానికి సముచిత స్థానం దక్కకపోవడంపై చిన్నారెడ్డి కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత పార్టీ, ముఖ్య నేతల తీరు పట్ల ఆయన మనోవేదనకు గురై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన ఇంట్లోనే 2018 నుంచి కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా.. బోర్డు తీసేసి పక్కకు వేయించారు. ఆ తర్వాత అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. మరో వైపు వనపర్తిలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమానికి ఆయనతో పాటు చిన్నారెడ్డి హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా శివసేనారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. తనకు ఆహ్వానం ఉందని, బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేదని వెల్లడించారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతామని చెప్పారు. 1980లో యువజన కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ వంటి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఆయనకు పేరుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శివసేనారెడ్డి ఆశించారు. పెద్దమందడి ఎంపీపీగా ఉన్న తూడి మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్యే టికెట్ లొల్లి తారస్థాయికి చేరింది. తొలుత ‘హస్తం’ అధిష్టానం చిన్నారెడ్డి పేరు ప్రకటించినా.. చివరలో మేఘారెడ్డికే బీఫాం ఇచ్చింది. అధిష్టానం నచ్చజెప్పడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంలో ఇరువురి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. తన వర్గానికి చెందిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ చిన్నారెడ్డి తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని, గన్మెన్లను ఉపసంహరించుకున్నారు. తాజాగా రాజుకున్న చిచ్చు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇటు మేఘారెడ్డి, అటు చిన్నారెడ్డి నేరుగా దరఖాస్తు చేసుకోలేదు. కానీ మేఘారెడ్డి తన వర్గానికి చెందిన లక్కాకుల సతీష్.. చిన్నారెడ్డి తన అనుచరుడైన డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కోసం యత్నించారు. అధిష్టానం ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న శివసేనారెడ్డిని ఎంపిక చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో చిచ్చు రాజుకున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బోర్డుఎత్తివేయడంతో.. -
ఈసీ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్‌ప్రెస్ యజమానులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతం అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం–ఏ, బితో పాటు ముద్రించిన 2 కరపత్రాలను జతపర్చి కలెక్టరేట్లో అందజేయాలన్నారు. ముద్రించిన కరపత్రం, గోడపత్రికపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, ఫోన్‌నంబర్ కచ్చితంగా ఉండాలన్నారు. ఎన్ని ముద్రించారు.. అందుకు తీసుకున్న పైకం వివరాలు ఫారం–బిలో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో డీపీఆర్వో పి.సీతారాం, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావివ్వొద్దు కొత్తకోట రూరల్/గోపాల్పేట: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటిదశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉమ్మడి గోపాల్పేట మండలంలోని గోపాల్పేట, బుద్దారం, తాడిపర్తి పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. వీరాయపల్లిలో కలెక్టర్‌తో పాటు ఎన్నికల పరిశీలకుడు మల్లయ్య భట్టు, ఖర్చు అబ్జర్వర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ కేంద్రాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి రోజువారి నామినేషన్ల వివరాలను సాయంత్రం టీపోల్ యాప్‌లో అప్డేట్ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు. అనంతరం ఖర్చు అబ్జర్వర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు నగదు ఖర్చు బుక్లెట్ ఇచ్చినప్పుడు ధ్రువీకరణ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారి వెంట గోపాల్పేట తహసీల్దార్ తిలక్రెడ్డి, ఎంపీడీఓ అయేషా, పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీఓ తాళ్ల పరిణత, ఇతర అధికారులు ఉన్నారు. -
ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
● తొలిరోజు సర్పంచ్‌స్థానాలకు 75.. వార్డు స్థానాలకు 26 దాఖలు ● అత్యధికంగా ఖిల్లాఘనపురంలో 28 నామినేషన్లు వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో పల్లెల్లో కోలాహలం మొదలైంది. మొదటి విడత జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి, ఏదుల పరిఽధిలోని 87 సర్పంచులు, 780 వార్డుసభ్యుల స్థానాలకు గురువారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. తొలిరోజు నామినేషన్ల దాఖలు మొక్కుబడిగానే సాగింది. అత్యధికంగా ఖిల్లాఘనపురం మండలంలో 29 గ్రామపంచాయతీలకుగాను సర్పంచ్ స్థానాలకు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని మామిడిమాడలోనే.. ఏడు నామినేషన్లు రావడం గమనార్హం. ● తొలిరోజు ఐదు మండలాల పరిధిలో సర్పంచ్ స్థానాలకు 75, వార్డు సభ్యుల స్థానాలకు 26 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి వెల్లడించారు. -
ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ
ఖిల్లాఘనపురం: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా, అభ్యర్థులు నామినేషన్లు వేసేలా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు పర్వతాపురం, మామిడిమాడ, సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి తది తర గ్రామాల్లో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల్లోకి గుంపులు గుంపులుగా కాకుంగా అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించాలని, ఎ న్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దా ర్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్ఐ వెంకటేష్, వివిధ గ్రామాల ఆర్ఓలు ఉన్నారు. -
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
కొత్తకోట: సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ, కావడి సేవ అంగరంగ వైభవంగా సాగింది. పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అంబాభవాని ఆలయంలో స్వామివారికి అభిషేకించే కలశాలు, పాల కావడులకు పూజలు చేసి మేళతాళాలు, భాజాభజంత్రీలు, కోలాటాలు, బతుకమ్మలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకొని గణపతి, సుబ్రమణ్య, అయ్యప్పస్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకించారు. సాయంత్రం 6 గంటలకు అయ్యప్పస్వామి మహా పడిపూజ ఘనంగా జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో అయ్యప్ప దీక్షాపరులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు ధూపం నాగరాజు, ప్రధానకార్యదర్శి పొగాకు అనిల్, కోశాధికారి విశ్వనాథం గంగాధర్, ఉపాధ్యక్షుడు లింగేశ్వర్, అర్చకులు జ్యోషి రవికాంత్, జంగం నటరాజ్, అనిల్, గురుస్వాములు ఉమామహేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కవీందర్రెడ్డి, మద్దిగట్ల బాలకృష్ణ, సత్యం సాగర్, వేముల సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రవిరెడ్డి, లక్ష్మీనారాయణ, నరేష్, నితిన్చారి, భీమకిషోర్ తదితర పాల్గొన్నారు. -
భరోసాకు ఎదురుచూపులు..
మా కుటుంబం మొత్తం మగ్గంపై ఆధారపడి జీవిస్తోంది. నెలకు రెండు చీరలు సైతం తయా రు చేయలేకపోతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నకు భరో సా పథకానికి దరఖాస్తు చేసుకున్నా. భరోసా ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు ఆసరా అవుతాయని ఎదురుచూస్తున్నాం. – బుచ్చన్న, నేత కార్మికుడు, అమరచింత సొసైటీలో జియో ట్యాగ్ కలిగిన కార్మికులతో నేతన్నకు భరోసా పథకానికి దరఖాస్తు చేయించాం. ఆరు నెలలుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అందడం లేదు. ఈ విషయాన్ని జిల్లా జౌళిశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించాం. ప్రభు త్వం త్వరితగతిన భరోసా పథకం నిధులు విడుదల చేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, అమరచింత చేనేత సహకార సంఘం జిల్లాలో 380 జియోట్యాగ్ మగ్గాలకు 755 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేతన్నకు భరోసా పథకం నిధులు వచ్చే నెలలో అందనున్నాయి. ఆరు నెలల డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మంజూరు కాగానే ప్రధాన కార్మికుడితో పాటు అనుబంధ కార్మికుడికి అందుతాయి. – గోవిందయ్య, ఏడీ, గద్వాల ● -
మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నే ళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పా టు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమ స్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ము ంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకా లు, చెక్‌డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్‌పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్‌డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్‌పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా పాల్గొన్నారు. -
‘స్థానికం’లో సత్తా చాటుతాం
వనపర్తి: నియోజకవర్గ నేతలమంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత తొలిసారి బుధవారం జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, తాజా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు శంకర్‌ప్రసాద్, పసుపుల తిరుపతయ్య, శంకర్‌నాయక్ తదితరులతో కలిసి ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సముద్రంలాంటి కాంగ్రెస్‌పార్టీలో వర్గపోరు, చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజమని.. వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగుతామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. తనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సమావేశంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ధనలక్ష్మి, జనార్దన్, కురు మూర్తి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక వనపర్తి రూరల్: పార్టీ కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జరగనుందని మాజీ వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. కొన్ని జిల్లాల్లో 3 నుంచి 4 శాతం అమలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూనే.. కాంగ్రెస్‌పార్టీ పాలనలో విఫలమైన విషయాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు రూ.2,500, రూ.4 వేల ఆసరా పింఛన్లు, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, తులం బంగారం, కేసీఆర్ కిట్, ఆటో కార్మికులకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి అమలు కావడం లేదని తెలియజేయాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి, కురుమూర్తియాదవ్, నందిమళ్ల అశోక్, రమేష్‌గౌడ్, మాణిక్యం పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి, సంబంధిత జిల్లా అధికారులు వనపర్తి: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రెండో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి.సునీతరెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లోని 87 గ్రామపంచాయతీలు, 780 వార్డులకుగాను 30 క్లస్టర్లలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను నియమించి గురువారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. రిజర్వేషన్ల వివరాలు ఇప్పటికే టీ–పోల్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశామని.. ఎఫ్ఎస్టీ, సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేగాకుండా 4 చెక్‌పోస్టులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఒకమారు శిక్షణ ఇచ్చామని.. మరోమారు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎల్పీఓ రఘునాథ్‌రెడ్డి, ఎస్హెచ్ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు.. దేశంలోని అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పౌరులు తెలుసుకొని రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, డీపీఆర్వో సీతారాం నాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే సమర్థ సేవలు
వనపర్తి: భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఎస్పీ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ అనే పవిత్ర లక్ష్యాలతో కొనసాగుతున్న పోలీస్ వ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకమని తెలిపారు. ప్రతి అధికారి సమర్థవంతంగా విధులు నిర్వర్తించినప్పుడే సమాజ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ మరింత బలపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీతను బుధవారం ఎస్పీ సునీతరెడ్డి జిల్లా కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణ చర్యలు, కోర్టు, పోలీసు విభాగాల పరస్పర సహకారం, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. -
‘పల్లె’ పోరు.. కసరత్తు జోరు!
● గెలుపు గుర్రాల కోసం వడబోత ● సర్పంచ్ ఆశావహుల చరిష్మా, సేవలపై ఆరా ● పలు గ్రామాల్లో ముందస్తుగానే ఇంటింటి ప్రచారం ● గ్రామాల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వనవర్తి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ● తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలివిడతలో జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్పేట, ఏదుట మండలాల పరిధిలోని 87 గ్రామపంచాయతీ స్థానాల్లో సర్పంచ్‌లు.. 892 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయా జీపీలను 27 క్లస్టర్లుగా విభజించి నామినేషన్లు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం ఐదు లోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎవరికి వారు వ్యూహాలు.. పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఇటూ బీసీ కుంపటి.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కోర్టు అడ్డంకుల నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కాగా.. పార్టీ పరంగా 42 శాతం వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అన్ రిజర్వ్డ్ కేటగిరిలకు సంబంధించి పార్టీ పరంగా ఉమ్మడి జిల్లాలో ఏయే సర్పంచ్, వార్డు స్థానాలను బీసీలకు కేటాయి స్తామనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో పలు జీపీలకు సంబంధించి జనరల్ స్థానాలపై బీసీ ఆశావహ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు చట్టబద్ధంగా 42 శాతం రిజ ర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడంపై బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే దుమ్మెత్తిపోస్తు న్నాయి. తాము 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని.. సాధించే దిశగా చర్యలు చేపడతామని.. అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మీ దారి ఏదని అధికార పార్టీ నేతలు దీటుగా బదులిస్తున్నారు. ఈ లెక్కన పార్టీల్లో బీసీ కుంపటి రాజుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ప్రధాన వ్యూహాలు పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పదవి కోసం పోటీ పడుతుండడం అధికార కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జీపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పలు ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి రూరల్: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే కేటాయించిన రైస్‌మిల్లుకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మార్కెట్‌యార్డు, కంచిరావుపల్లిలోని కొనుగోలు కేంద్రాలను, శ్రీరంగాపురం మండల కేంద్రంలోని లక్ష్మి నర్సింహ రైస్‌మిల్, కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం తేమశాతం పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బీచుపల్లిలోని సప్తగిరి రైస్‌మిల్, సాయిగోపాల్ రైస్‌మిల్ గోదాంలను పరిశీలించి వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వెంటనే దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. అదేవిధంగా 2024–25 యాసంగి సీఎంఆర్ బకాయిలు గడువులోగా ఎఫ్‌సీఐకి అప్పగించాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరు
కొత్తకోట: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని.. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం పట్టణంలో దేవరకద్ర నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వనపర్తి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ అవినీతి పాలన, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామపంచాయతీల్లో వీధిదీపాలు మొదలు శ్మశానవాటికల నిర్మాణం వరకు అన్ని అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్న మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని తెలిపారు. సమావేశంలో బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ము భరత్‌భూషణ్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, పద్మజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, కొండా ప్రశాంత్‌రెడ్డి, దాబా శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, బాలస్వామి, నర్సింహ, స్టార్ బాలు, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: డ్రాయింగ్, టైలరింగ్–ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని.. www. bsetelangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌కు రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్ – ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్‌కు రూ.150, హయ్యర్ గ్రేడ్‌కు రూ.200 రుసుం చెల్లించాలని సూచించారు. దరఖాస్తు గడువు డిసెంబర్ 5తో ముగుస్తుందని తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 12వ తేదీ వరకు, రూ.75 అపరాధ రుసుంతో వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫారాన్ని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. మహిళా చట్టాలపై అవగాహన అవసరం వనపర్తిటౌన్: మహిళలపై జరుగుతున్న దాడులను చట్టపరంగా ఎదుర్కోవాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని నాగవరంలో ఉన్న నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మహిళా చట్టాల అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహహింస, పోక్సో, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తదితర చట్టాల గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఉచిత న్యాయసాయం పొందే హక్కు కలిగి ఉన్నారని గుర్తుచేశారు.అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, పారా లీగల్ వలంటీర్ బాలరాజు పాల్గొన్నారు. నిరంతరం అందుబాటులో ఉండాలి గోపాల్పేట: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం రేవల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏయే కేసులు నమోదు చేశారని ఎస్ఐ రజితను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై దృష్టి సారించాలని, గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 442 క్యూసెక్కులు, సమాంతరం కాల్వ నుంచి 75 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 218 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
కొత్తకోట: ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగుపర్చాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సభ్యుడు డా. భరణి కోరారు. మంగళవారం ఆయన పుర కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఎమ్మార్సీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్న్, ఎల్ఐపీ కార్యక్రమాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి మరింతగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మ్యాథమెటిక్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జె.కృష్ణయ్య, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపోరుకు సై..
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ● షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ● రేపటి నుంచే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ● డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్.. ఫలితాలు వెల్లడి ● ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు గ్రామాల్లో రాజకీయ సందడి.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో నిరాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ఇలా.. ఎన్నికల కోడ్ అమలులోకి .. పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించాలి
వనపర్తి: వికలత్వం శరీరానికి కాని.. మనసుకు కాదని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్దులశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతోపాటు డీఆర్డీఓ ఉమాదేవి, డీవైఎస్ఓ సుధీర్‌రెడ్డి పాల్గొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని.. వారికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


