పీఎఫ్‌తో కార్మికులకు ప్రయోజనం
అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్‌తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ పీఎఫ్ కార్యాలయ అధికారి రుధీర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో సమావేశమై ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన, ఎంప్లాయి ఎన్‌రోల్‌మెంట్ కాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్ అందేలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పొబ్బతి అశోక్, సిబ్బంది మహేష్‌తో తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం
రోడ్డెక్కిన రైతులు
పాన్‌గల్: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని ఓ పక్క అధికారులు చెబుతుండగా.. మరోపక్క తమకు అందడం లేదని మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం వచ్చి వరుసలో నిలబడి ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ అందజేసినా యూరియా అందకపోవడంతో ఆగ్రహించిన వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం సింగిల్‌విండో అధికారులను పిలిపించి జిరాక్స్ ప్రతులు అందజేసిన వారికి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించి సింగిల్‌విండో కార్యాలయానికి చేరుకున్నారు.
పుర కార్యాలయం
ఎదుట కార్మికుల ధర్నా
కొత్తకోట: బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ స్థానిక పుర కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నిక్సన్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు చెల్లించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏడాదిగా పీఎఫ్ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, కార్మికుల చదువు, వృత్తి నైపుణ్యాలను గుర్తించి జవాన్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వాలని, పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని కోరారు. ఫిబ్రవరి 12న జరగనున్న ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జె.ఎర్రన్న, కొండన్న, బాలస్వామి, రమేష్, పెద్దరాజు, ఎర రాజు, శిరీష, సుశీల, మణెమ్మ, సుగుణమ్మ, నయోమి తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్‌తో కార్మికులకు ప్రయోజనం
పీఎఫ్‌తో కార్మికులకు ప్రయోజనం


