సక్సెస్ అనుభూతి ఎపుడూ తీయగానే ఉంటుంది. కానీ ఆ సక్సెస్ వెనుక ఎన్నెన్నో చేదు అనుభవాలు, మరెన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఒక్కోసారి వారి మార్గం కూడా అసహ్యించుకునే చూపులతోనే మొదలవు తుంది. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల వ్యవస్థాపకుడు ఊహించని సక్సెస్ గురించి తెలుసుకుంటే ఔరా అనిపించకమానదు.
కాలిఫోర్నియాపారిశ్రామికవేత్త డానియెల్ టామ్ పోర్టబుల్ టాయిలెట్ వ్యాపారంలో గణనీయమైన లాభాలతో సంచలనం సృష్టించారు. దాదాపు 2,000 పోర్టబుల్ టాయిలెట్లను నిర్వహిస్తూ, 2025లో రూ.39 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు నిర్మాణ స్థలాలు, ఈవెంట్‌ల వద్ద మానవుల కనీస అవసరమైన టాయిలెట్ సౌకర్యాన్ని అందిస్తూ తీరుస్తూ విజయవంతమైన తీరు స్ఫూర్తిదాయకం.
అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు టామ్. పోర్టబుల్ పారిశుధ్య వ్యాపారంలో ఉన్నప్పుడు. తొలుత అందరూ అసహ్యించుకున్నారు. కానీ తన వ్యాపారంతోపాటు, అవసరమైన సేవను అందించడంలో సంతృప్తి చాలా ఉంటుంది అంటాడు టామ్. తన వ్యాపార తీరును ఆదాయాన్ని చూసిన తరువాత చాలామందికి ఆసక్తి వచ్చిందంటారు బే ఏరియా శానిటేషన్ యజమాని , నిర్వాహకుడైన డేనియల్ టామ్
డేనియల్ టామ్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సమీపంలోని ఒక శివారు ప్రాంతంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచీ శ్రమను నమ్ముకున్న జీవి. అతని తల్లిదండ్రులు, వారి కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు కోసం విద్య ఒక్కటే మార్గమని గ్రహించాడు.అ లా శారీరక విద్య ఉపాధ్యాయుడిగా మారాలనే ఆశయంతో శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో చేరాడు. మొదట్లో క్రీడలు, ఆరోగ్యం ద్వారా యువతకు స్ఫూర్తినివ్వాలనుకున్నాడు. ఇక్కడే అతని కరియర్ కీలకమైన మలుపు తిరగింది.
ఆ బిజినెస్ అంటే అందరూ అసహ్యించుకున్నారు
స్థానిక పోర్టా-పాటి (పోర్టబుల్ టాయిలెట్‌లను) అద్దెకిచ్చే కంపెనీలో పార్ట్-టైమ్ ఉద్యోగంలో చేరాడు. ఈ సమయంలో పారిశుద్ధ్య పరిశ్రమ, నిర్వహణ తెరవెనుక ఉండే విషయాల గురించి తెలుసుకున్నాడు. చాలా మంది నిర్లక్ష్యం చేసే ప్రజారోగ్యం, దాని విలువ గురించి అవగాహన పెంచుకున్నాడు. పెళ్లిళ్లలు, ఈవెంట్లలో ప్రతి ఒక్కరికీ రెస్ట్‌రూమ్ కావాలి, ప్రాథమిక అవసరమని గుర్తించాడు. దీన్నే అందుబాటులోకి తీసుకొచ్చి, వ్యాపారంగా దీన్ని అభివృద్ధి చేయాలని భావించాడు.
పోర్టబుల్ పారిశుద్ధ్య సంస్థ హాన్సన్ & ఫిచ్‌లో సేల్స్ మేనేజర్‌గా ఏడు సంవత్సరాలు గడిపిన అనుభవం, నైపుణ్యంతో గ్రాడ్యుయేషన్ తర్వాత, 2023లో ఒకే ఒక ట్రక్కు, 100 టాయిలెట్లతో టామ్ Bay Area Sanitation అనే సంస్థను స్థాపించాడు. ఇది స్థానికి నిర్మాణ స్థలాలు , ఈవెంట్లకు సేవలను అందిస్తుంది. ఒక నిర్దిష్టమైన ఆశయం, లక్ష్యంతో వ్యాపారాన్ని కొనసాగించాడు. మొదట్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ వ్యక్తిగత పొదుపు, చిన్న వ్యాపార రుణాలు, కుటుంబ మద్దతు,మంచి వ్యూహంతో మార్కెట్లో నిలదొక్కు కున్నాడు. అసాధారణమైన కస్టమర్ సేవలను అందించి, సంచలన విజయం సాధించాడు. వాక్యూమ్ పంపర్ ట్రక్కులలో ఒకదానితో ప్రతి యూనిట్ నుండి 60 గ్యాలన్ల వరకు వ్యర్థాలను ఖాళీ చేయడంతో సహా, ఆ టాయిలెట్లను అద్దెకు ఇవ్వడం , నిర్వహించడం టామ్ కంపెనీ బాధ్యత.
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంతటా దాదాపు 2 వేల పోర్టబుల్ టాయిలెట్‌లతో కంపెనీ గత ఏడాది అద్భుతమైన 4.3 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ. 39 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 లో కంపెనీ ఆదాయం సుమారు రూ. 28 కోట్లుగా ఉంది. రాబోయే ఐదేళ్లలో 5,000 పోర్టబుల్ టాయిలెట్లకు సామర్థ్యాన్ని పెంచి, 10 మిలియన్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని సాధించాలని డానియెల్ టామ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బే ఏరియా శానిటేషన్ ప్రామాణిక-పరిమాణ పోర్టబుల్ టాయిలెట్లు నెలకు దీర్ఘకాలిక అద్దె 160 డాలర్లు నుండి ప్రారంభమవుతాయి. ఇందులో వీకెండ్ క్లీనింగ్ కూడా ఉంది. స్వల్పకాలిక ధరలు ఒక్కో ఈవెంట్‌కు 239 - 399 డాలర్ల దాకా ఉంటుంది.
నా పనే నాకు గర్వ కారణం
ఆదాయం గురించి వినే వరకు ప్రజలు అసహ్యించుకుంటారు, కృత్రిమ మేధస్సు ద్వారా తమ ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన చెందుతున్న సమయంలో, తక్కువ-సాంకేతికత, AI-ప్రూఫ్ వ్యాపారాన్ని నిర్మించగ లిగాను అని గర్వంగా చెబుతారు డేనియల్. తాను చేసే పనిలో తనకు గర్వ కారణం అంటారు. ప్రతి యూనిట్ 60 గ్యాలన్ల వరకు వ్యర్థాలను నిల్వ చేయగలదు. వారానికి శుభ్రపరచడం, రీస్టాకింగ్ , పంపింగ్ చేస్తారని చెప్పారు. ఇంధనం మరియు సరఫరాలతో సహా అదనపు ఖర్చులతో కంపెనీ ఆదాయంలో దాదాపు 30 శాతం లేబర్ వాటా మాత్రమే ఉందని టామ్ చెప్పారు.
వాసన భరించడం కష్టం కాదా?
ఉదయం 4 గంటలకే నిద్రలేవడంతో ప్రారంభించి, రాత్రి పడుకునేదాకా నిరంతరం శానిటైజేషన్ పని చేసే టామ్ వ్యాపారం బహుశా అందరికీ సరిపోకపోవచ్చు, అయినప్పటికీ తాను కొన్ని భరించలేని విషయాలకు అలవాటు పడ్డానని చెబుతున్నాడు. రోజూచేసే పనికాబట్టి ఆ వాసన పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ చెడి పోయిన పదార్థాలు తిన్నపుడు వారి విసర్జకాల నుంచి వాసన భరించడం తనలాంటి వారికి కూడా కష్టంగా ఉంటుంది అంటారు.
ఐబిఐఎస్‌వరల్డ్ అనే పరిశోధన సంస్థ సెప్టెంబర్ 2025 విశ్లేషణ ప్రకారం, 2025లో అమెరికాలో పోర్టబుల్ టాయిలెట్ల అద్దె పరిశ్రమ సుమారుగా 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది, ఇది 2024తో పోలిస్తే 1.7శాతం ఎక్కువ. బే ఏరియాలో అనేక స్థానిక బహిరంగ కార్యక్రమాలు, పెరుగుతున్న నిర్మాణ రంగం ఉన్నందున, మార్కెట్‌లో పట్టు సాధించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని టామ్ చెబుతున్నాడు.


