2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే! | Renault Sees India as Global Hub Plans 4 New Models Locally Developed | Sakshi
Sakshi News home page

2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే!

Mar 12 2026 6:52 PM | Updated on Mar 12 2026 6:59 PM

Renault Sees India as Global Hub Plans 4 New Models Locally Developed

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్‌ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.

భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.

2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement