రెనాల్ట్ కంపెనీ.. కొత్త తరం డస్టర్ కారును భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అంతకంటే ముందే సంస్థ దీనిని టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఈ కారుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కొత్త డస్టర్ కారును.. రెనాల్ట్ కంపెనీ 2026 జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇది కొత్త డిజైన్, ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఏముంటుందనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనిని ప్రత్యర్థులకు పోటీగా.. వాహన వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్మించనున్నట్లు అర్థమవుతోంది.
ఒకప్పుడు దేశీయ మార్కెట్లో.. మంచి అమ్మకాలతో, వివిధ ఉత్పత్తులను లాంచ్ చేసిన రెనాల్ట్ కంపెనీ.. ప్రస్తుతం కైగర్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు సంస్థ.. తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా కొత్త కారును ప్రవేశపెడుతోంది. ఇందులో వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు గ్రిల్ బోల్డ్ RENAULT అక్షరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
రాబోయే రెనాల్ట్ డస్టర్ కారు.. అనేక పవర్‌ట్రెయిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కలిపి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, మొత్తం 128.2 hp ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. 1.2kWh బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జతచేసిన 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 138 hp గరిష్ట ఉత్పత్తిని అందిస్తుంది. అదనంగా, 98.6 hpని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్-LPG ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుందని సమాచారం.


