గ్లోబల్ మార్కెట్లలో అమ్ముడవుతున్న.. మూడు వరుసల SUV కియా సొరెంటో (Kia Sorento) మొదటిసారి భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఎంక్యూ4ఐ అనే కోడ్‌నేమ్‌తో దీనిని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇది మహీంద్రా XUV700, టాటా సఫారీ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
టెస్టింగ్ సమయంలో కనిపించిన కియా కొత్త కారు.. టెస్ట్ మ్యూల్. ఇది 235/55 R19 టైర్లతో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & బాక్సీ సిల్హౌట్ పొందుతుంది. లోపల ఒక రోటరీ గేర్ సెలెక్టర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను సూచిస్తుంది. క్యామోపేజ్ ఉన్నప్పటికీ.. మూడు వరుసల మోడల్ అని స్పష్టంగా తెలుస్తుంది. ముందు భాగంగా నిలువుగా అమర్చిన టీ షేప్ లైటింగ్, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లాంప్‌లు ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. టెస్టింగ్ మోడల్ కారులో ఇవి బహిర్గతం కాలేదు. కానీ 12.3-అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ విండోలు, టెయిల్‌గేట్ కోసం ప్రైవసీ గ్లాస్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే మొదలైనవి ఉండనున్నాయి.
ఇదీ చదవండి: బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
పవర్‌ట్రెయిన్ వివరాలకు కూడా అధికారికంగా వెల్లడికాలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా సోరెంటో మూడు ఇంజన్ ఎంపికల లభిస్తుంది. అవి 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్, 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 2.2-లీటర్ డీజిల్ హైబ్రిడ్ ఇంజిన్లు. అన్ని వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతాయి. అయితే మన దేశంలో లాంచ్ అయ్యే సోరెంటో ఏ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంది.


