రక్తపోటును గుర్తించే పరికరం
టెంపుల్ పేరిట కొత్త ఆవిష్కారం
జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయెల్ ముఖం మీద ఉన్న రహస్య పరికరంపై సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో అతను మాట్లాడుతున్న సమయంలో అతని ముఖంపై అతికించి ఉన్న ఆ చిన్న వస్తువే హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు ఫోన్ చార్జర్ అని, మరి కొందరు బబుల్‌గమ్ అతికించుకుని ఉంటాడని కూడా వ్యంగోక్తులు విసిరారు. ఇంతకీ అందేంటో తెలుసా?
దీపిందర్ అందించిన వివరాల ప్రకారం ఆ పరికరం పేరు టెంపుల్. ఇది మానవ శరీరంలోని రక్త ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ.మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తూ, ఓవరాల్‌గా మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పరికరం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టెంపుల్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. కానీ ఏడాది కాలం నుంచి దీన్ని వినియోగిస్తున్నానని దీపీందర్ చెప్పారు.
ఇది ఎలా పని చేస్తుందంటే..
టెంపుల్ ధరించిన వ్య క్తి తన మెదడులో రక్త ప్రవాహం... వేగం వివరాలు గుర్తించడంతో పాటు... రక్త ప్రసరణ గురించి, మనపై ఏదైనా ఒత్తిడి వచ్చినప్పడు.. శరీరంలో కలిగే మార్పులను ఇది గుర్తించి మనకు తెలియజేస్తుంది. రియల్ టైమ్ లో మన బాడీ పరిస్థితి... అది మెదడును ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాలను పసిగడుతుంది.
ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
అలసట, మనస్సు కేంద్రీకరించకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, వృద్ధాప్య ప్రక్రియలో సమస్యలను గుర్తించి... వాటి నివారణకు కూడా ఈ యంత్రం సహకరిస్తుంది. అయితే ఈ పరికరం మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. ఈ పరికరం పరిశీలన దశలో ఉన్నందున, దీపేందర్ గోయెల్ వ్యక్తిగత పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ దశలో ఉన్న ఈ పరికరం మార్కెట్‌లోకి రావాలంటే చాలా విషయాల్లో క్లీన్‌చిట్ లభించాల్సి ఉంటుంది. దీన్ని వినియోగిస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముందనే వాదన కూడా ఉంది. ధర విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ పరికరం విలువ 25 మిలియన్ డాలర్లు అని నిర్ణయించారు... అంటే మన దేశ కరెన్సీలో సుమారు 200 కోట్ల రూపాయలు.
ఇదీ చదవండి: పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది


