గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు? | Zomato Swiggy Hike Gig Workers Know The Details Here | Sakshi
Sakshi News home page

గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు?

Dec 31 2025 5:31 PM | Updated on Dec 31 2025 5:57 PM

Zomato Swiggy Hike Gig Workers Know The Details Here

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.., కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా ఉండేదుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన స్విగ్గీ & జొమాటోలు పీక్ అవర్స్.. సంవత్సరాంతపు రోజులలో డెలివరీ కార్మికులకు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి.

జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలలో డెలివరీ వర్కర్ యూనియన్లు సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాల ప్రకటన వెలువడింది.  సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ భాగస్వాములకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 చెల్లింపులను ఆఫర్ చేసినట్లు కార్మికులు.. ఈ విషయం తెలిసిన వ్యక్తులకు పంపిన సందేశాలు చెబుతున్నాయి.

తాజా ప్రోత్సాహకాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు సగటున 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాన్సిలేషన్లు లేదా ఆర్డర్‌ తీసుకోకపోయిన సందర్భాల్లో సాధారణంగా విధించే పెనాల్టీలను కూడా అమలు చేయబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిద్వారా.. ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు పనికి రావాలని సంస్థలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా, స్విగ్గీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 12 గంటల మధ్య రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని ప్రకటిస్తోంది.

ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!

ఇకపోతే.. డిసెంబర్ 25న సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు.. మరోమారు ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మెరుగైన చెల్లింపులు, మెరుగైన పని పరిస్థితులను మాత్రమే కాకుండా.. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement