breaking news
gig workers
-
గాడిద చాకిరీ తప్ప ఏం లేదు..గిగ్ వర్కర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పోస్ట్, గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక శారీరక వెతల గురించి చెప్పకనే చెబుతుంది.అతని పోస్ట్‌లోని వివరాల ప్రకారం క్యాబ్ డ్రైవర్‌గా తాను గాడిద చాకిరీ చేస్తున్నా సంతృప్తికర జీవితం గడపలేకపోతున్నానని వాపోయాడు. వ్యాపారంలో నష్టపోయిన కారణంగా అప్పులు మిగిలాయి. దీంతో అందుకే ఖర్చుల నిమిత్తం యల్లో బోర్డు క్యాబ్‌ను అద్దెకు తీసుకుని, ఊబర్ . రాపిడోతో పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు డ్రైవ్ చేస్తాను. సుమారు 4 వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో 1.5 వేలు కారు అద్దెకు, 1.2 వేలు సీఎన్జీకి , ఫుడ్, వాటర్ కోసం 200 రూపాయలు ఖర్చవుతాయి. ఇక తనకు మిగిలిని రోజుకు దాదాపు 1000 రూపాయలు మిగులుతాయి. ఇలా బతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు.తనకు వచ్చే రాబడి పరిస్థితి ఇలా ఉంటే, శారీరక శ్రమ మరింత దారుణంగా ఉంటుందని తెలిపాడు. కాళ్లు నొప్పులు.. ఇక చాలు బాబోయ్.. అని మోకాళ్లు మొరాయిస్తుంటాయి. రోజులో కేవలం 6 గంటల నిద్ర. ఇక తనకు సమయం మిగిలడంలేదనీ, అందుకే సోషల్‌మీడియాలో మధ్య ఏ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండటంలేదని చెప్పాడు. ఇక ఇంధన కోసం పొడవైన క్యూలలో వేచి ఉండాలి.. అసలు ఇది ఒక జీవితమేనా? అనిపిస్తుంటుంది. తమ లాంటి డ్రైవర్లు తాము పనిచేసే యాప్‌ల నుండి నిరంతర ఒత్తిడి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే దీన్ని'గాడిద చాకిరీ' అంటాం. “యాప్ 'ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్' లాగా పనిచేస్తుంది. వచ్చిన రైడ్‌ను త్వరగా, అంటే 5-6 సెకన్లలో అంగీకరించకపోతే, మరొకరు తీసుకుంటారు. రైడ్లనువెంటనే యాక్సెప్ట్ చేయకపోతే రేటింగ్ పడిపోతుంది అని వివరించాడు. ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!ట్రాఫిక్‌లో నానా కష్టాలుపడి ఇంటికి రాగానే, ఎంత అలిసిపోయినా కారు కడగాల్సిందే. ఇంతక చేసినా తమ కష్టానికి ఏమీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాదిమంది ఉద్యోగాల వాస్తవికత ఇదే. అయితే దోపిడీ చేసేవాడు.. లేదా దోపిడీకి గురయ్యేవారు. లేదా దోపిడీ చేసేవాడిగా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవాడిగా ఉండాలి.చౌక శ్రమ వల్లే ఇతరులు ఈ సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై సానుభూతిని ప్రకటించారు. ఏమీ చేయలేని పరిస్తితిలో ఉన్నాం. మీ ప్రతి మాటలో మీ మానసిక,శారీరక బాధను రెండూ అర్థం చేసుకోగలం అంటూ సానుభూతి వ్యక్తంచేశారు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి అని మరికొందరు చెప్పారు. చాలామంది గిగ్ కార్మికులను గౌరవించాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
గిగ్ వర్కర్ల సామాజిక భద్రతే లక్ష్యంగా ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగా భారతదేశంలో గిగ్ (Gig), ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఉపాధి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం పార్ట్-టైమ్ ఆదాయ వనరుగా మొదలైన ఈ రంగం, నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైంది. ఈ నేపథ్యంలో గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం, నిపుణులు ప్రతిపాదిస్తున్న నూతన విధానాలపై కథనం.నీతి ఆయోగ్ అంచనాలునీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం, గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో నైపుణ్యాల విభజన ఆసక్తికరంగా ఉంది.మధ్యస్థ నైపుణ్యాలు: 47%అధిక నైపుణ్యాలు: 22%తక్కువ నైపుణ్యాలు: 31%భవిష్యత్తులో అధిక, తక్కువ నైపుణ్యాలు కలిగిన గిగ్ ఉద్యోగాల వాటా మరింత పెరుగుతుందని అంచనా. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘సామాజిక భద్రతా కోడ్-2020’ గిగ్ కార్మికులను ప్రత్యేక వర్గంగా గుర్తించింది. ఇది వారి ఆదాయం, కెరీర్ మార్గాలకు తగిన రక్షణ కల్పించేందుకు పునాది వేసింది.మౌలిక వసతులుగిగ్ కార్మికుల కోసం కొత్తగా వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న డిజిటల్ మౌలిక వసతులను వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 31.38 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) నంబర్ ద్వారా కార్మికులు తమ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లేదా రాష్ట్రాలు మారినా వారిని ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఈ-శ్రమ్ గుర్తింపును సామాజిక భద్రతా సంస్థలతో అనుసంధానిస్తే కార్మికులు తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగాల్లోకి మారినా రక్షణ వ్యవస్థ కొనసాగుతుంది.ఆర్థిక వృద్ధి, బీమా రక్షణకొన్ని సంస్థల గణాంకాల ప్రకారం, 2021-22 నుంచి 2023-24 మధ్య ఆహార డెలివరీ రంగం చాలా వృద్ధిని సాధించింది. ఇది సుమారు 13.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.1.2 లక్షల కోట్లను దాటింది. ఈ వృద్ధిని సామాజిక భద్రతతో ముడిపెట్టడానికి బీమా రక్షణ ఉత్తమ మార్గమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుతున్న ఈడీఎల్ఐ (రూ.7 లక్షల వరకు జీవిత బీమా) పథకాన్ని గిగ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల సిబ్బంది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కుటుంబానికి భరోసా లభిస్తుంది.చిన్న మొత్తాల్లో కట్ అయ్యేలా..గిగ్ కార్మికులకు స్థిర వేతనం ఉండదు కాబట్టి, ప్రతి రైడ్ లేదా డెలివరీ పూర్తయినప్పుడు చిన్న మొత్తాన్ని (Micro-contribution) ఆటోమేటిక్‌గా కట్ అయ్యే లావాదేవీ ఆధారిత విధానం వీరికి అత్యంత అనుకూలమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు -
10 ని.డెలివరీ నిలిపివేత.. పర్యవేక్షణ కఠినతరం
క్విక్ కామర్స్ రంగంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారాన్ని ప్లాట్‌ఫారమ్‌లు విరమించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గిగ్ వర్కర్ల పరిస్థితిపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిరంతరం నిఘా ఉంచింది.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే లేదా గిగ్ వర్కర్ల శ్రమను దోపిడీ చేసే అగ్రిగేటర్లపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత స్థాయి వర్గాలు హెచ్చరించాయి. బ్రాండింగ్ మార్చినప్పటికీ డెలివరీ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గకపోవడం, ఐడీల బ్లాకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.ముఖ్యమైన అంశాలుగిగ్ వర్కర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో జరిగిన సమావేశం అనంతరం బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు 10 నిమిషాల డెలివరీ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి. కేవలం ప్రకటనల మార్పుతోనే పని ఒత్తిడి తగ్గదని, వ్యాపార నమూనాల్లో మార్పులు రాకపోతే కార్మికులకు ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈఎస్ఐసీ ‘స్ప్రీ’ (SPREE) పథకంగిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ‘స్కీమ్ టు ప్రొమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ (స్ప్రీ)’ పథకం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 1.17 లక్షల మంది కొత్త యజమానులు (Employers) తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనివల్ల సంస్థల స్థాయిలోనే కార్మిక సంక్షేమానికి మార్గం సుగమమైంది. కేవలం యజమానులే కాకుండా, భారీ సంఖ్యలో ఉద్యోగులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1.03 కోట్ల మంది కొత్త ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి చేరడం విశేషం.ప్రస్తుతం ఈ పథకం గడువు 2026 జనవరి చివరి వరకు అందుబాటులో ఉంది. గతంలో నమోదు కాని యజమానులు, ఉద్యోగులు ఎలాంటి జరిమానాలు లేదా శిక్షలు లేకుండా ఒకేసారి రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరిశ్రమ వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ పథకం గడువును పొడిగించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు వైద్య, ఆర్థిక భద్రత చేకూరింది. గిగ్ ఎకానమీలో పారదర్శకత, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! -
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!
జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు. -
మారువేషంలో ఆ ఎంపీ! ఏం చేశాడంటే..
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కొంతమంది మంచి రాజులు మారువేషాలేసుకుని నగర వీధుల్లో తిరిగేవారట!. రాజులు లేరు.. రాజరికం పోయింది. ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మారువేషాలు వేసుకునే ప్రజాప్రతినిధులు అరుదైపోతున్న ఈ కాలంలో ఒక ఎంపీ ఆ దిశగా ఒక అడుగు వేశారు. దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న గిగ్ వర్కర్ల అసలు కష్టాలేమిటో అర్థం చేసుకునేందుకు తానూ రోజుపాటు ఆ పని చేశారు. ఎవరా ఎంపీ.. ఏమా కథ?.. రాఘవ్ చద్దా.. గిగ్ కార్మికుల హక్కులపై ఈ మధ్యకాలంలో గళం వినిపిస్తున్న ఏకైక ఎంపీ. క్విక్ కామర్స్ (Quick commerce) సంస్థల 10 నిమిషాల డెలివరీ వ్యవస్థతో మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. అలాంటిదాన్ని పూర్తిగా నిషేధించాలని మొన్నీమధ్యే రాజ్యసభలోనూ ఆయన మాట్లాడారు. ఆ సమయంలో.. ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన బ్లింకెట్ డెలివరీ బాయ్ ఒక్కరోజు సంపాదనను ప్రముఖంగా ప్రస్తావించారాయన. అంతేకాదు.. ఆ డెలివరీ బాయ్ వివరాలు కనుక్కుని, తన వద్దకు రప్పించుకుని ఆతిథ్యం కూడా ఇచ్చి పంపించారు. ఇప్పుడ మరో అడుగు ముందుకేశారు. గిగ్ కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వేషం మార్చారు. బ్లింకెట్ డెలివరీ ఏజెంట్‌తో కలిసి ఆ అనుభవం ఏంటో చవిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అఫ్కోర్స్.. ఈ చర్యను కూడా విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఇది ఢిల్లీలో చేశారా? పంజాబ్‌లో చేశారా?(ఆయన పంజాబ్ కోటాలో రాజ్యసభ ఎంపీ అయ్యారని) అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఆయన చర్యను మెచ్చుకునేవాళ్లు కూడా కనిపిస్తున్నారు. అయితే.. ఆ పనిలో అనుభవమేంటో ఆయన ఇంకా వివరించాల్సి ఉంది.Away from boardrooms, at the grassroots. I lived their day.Stay tuned! pic.twitter.com/exGBNFGD3T— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026‘‘గిగ్ కార్మికులు రోబోలు కాదు. ఈ విషయంపై సభ ఆలోచన చేయాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది క్రూరత్వం. ఈ పద్ధతికి ముగింపు పలకాలి. వేగంగా సేవలు అందుతున్నాయని వినియోగదారులు ఆశిస్తున్నప్పటికీ.. గిగ్ కార్మికుల సంక్షేమం గురించి చట్టసభ ఆలోచించాలి. రేటింగ్ తగ్గించడం, ప్రోత్సాహకాల్లో కోత, ఐడీ బ్లాక్ వంటి భయాలతో నిర్దిష్ట సమయంలో డెలివరీ చేసేందుకు కార్మికులు (Gig Workers) వేగంగా, సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటితోపాటు కస్టమర్ల వేధింపులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గిగ్ కార్మికులు భారత ఆర్థిక వ్యవస్థకు కనిపించని చక్రాలు. కానీ వాళ్ల పరిస్థితి రోజువారీ కూలీల కంటే దారుణంగా ఉంటోంది:::రాజ్యసభలో రాఘవ్ చద్దా -
10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓ
జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. ఆ తరువాత ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు 10 నిమిషాల డెలివరీపై జొమాటో సీఈఓ.. దీపిందర్ గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.బ్లింకిట్‌లో ఆర్డర్ వచ్చిన తరువాత.. దానిని 2.5 నిమిషాల్లో ప్యాక్ చేస్తారు. ఆ తరువాత రైడర్ 8 నిమిషాలకు 2 కిలోమీటర్ల చొప్పున రైడ్ చేసినా.. గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలడు. ఈ విధానం అర్థం చేసుకోకపోవడం వల్లనే.. దీనిని రిస్క్ అని భావిస్తున్నారు. కాబట్టి దీనిని గిగ్ వర్కర్లు తప్పకుండా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మవద్దని గోయల్ పేర్కొన్నారు.ఇక కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారుOne more thing. Our 10 minute delivery promise is enabled by the density of stores around your homes. It’s not enabled by asking delivery partners to drive fast. Delivery partners don’t even have a timer on their app to indicate what was the original time promised to the…— Deepinder Goyal (@deepigoyal) January 1, 2026 -
గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు?
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.., కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా ఉండేదుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన స్విగ్గీ & జొమాటోలు పీక్ అవర్స్.. సంవత్సరాంతపు రోజులలో డెలివరీ కార్మికులకు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి.జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలలో డెలివరీ వర్కర్ యూనియన్లు సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాల ప్రకటన వెలువడింది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ భాగస్వాములకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 చెల్లింపులను ఆఫర్ చేసినట్లు కార్మికులు.. ఈ విషయం తెలిసిన వ్యక్తులకు పంపిన సందేశాలు చెబుతున్నాయి.తాజా ప్రోత్సాహకాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు సగటున 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాన్సిలేషన్లు లేదా ఆర్డర్ తీసుకోకపోయిన సందర్భాల్లో సాధారణంగా విధించే పెనాల్టీలను కూడా అమలు చేయబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిద్వారా.. ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు పనికి రావాలని సంస్థలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా, స్విగ్గీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 12 గంటల మధ్య రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని ప్రకటిస్తోంది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!ఇకపోతే.. డిసెంబర్ 25న సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు.. మరోమారు ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మెరుగైన చెల్లింపులు, మెరుగైన పని పరిస్థితులను మాత్రమే కాకుండా.. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొన్నాయి. -
10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?
దేశంలోని ప్రధాన నగరాల్లో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లుగా ఉన్న బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. వంటి సంస్థలు పది నిమిషాల్లోనే వస్తువులను ఇంటి ముంగిటకు చేరుస్తున్నాయి. ఒకప్పుడు గంటలు, రోజులు పట్టే డెలివరీ ప్రక్రియ ఇప్పుడు నిమిషాల్లో ముగుస్తుంది. అయితే, ఈ మెరుపు వేగం వెనుక కొన్ని సామాజిక సమస్యలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఇది నిజంగా సాంకేతిక ప్రగతా లేక శ్రామిక దోపిడీకి కొత్త రూపమా? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. అందుకు కొన్ని వర్కర్ యూనియన్లు మద్దతుగా నిలుస్తున్నాయి.ఫాస్ట్ డెలివరీభారతదేశంలో జనసాంద్రత ఎక్కువ. దాంతో శ్రామిక శక్తి చౌకగా లభిస్తుంది. ఈ రెండు అంశాలను పెట్టుబడిగా పెట్టుకుని క్విక్ కామర్స్(Quick Commerce) రంగం దూసుకుపోతోంది. డార్క్ స్టోర్స్.. అంటే కేవలం డెలివరీల కోసం మాత్రమే నిర్వహించే చిన్న గోదాములను నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఈ సంస్థలు 10 నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు చేరవేస్తున్నాయి. 2024-25 నాటికి ఈ రంగం విలువ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.సిబ్బందిపై ఒత్తిడిసాధారణ లాజిస్టిక్స్ వ్యవస్థలో వస్తు పంపిణీ బాధ్యత వ్యవస్థ మొత్తానికి ఉంటుంది. కానీ, ఈ 10 నిమిషాల డెలివరీ మోడల్లో మొత్తం భారం డెలివరీ పార్ట్నర్, డార్క్‌స్టోర్ పికర్(నిర్వాహకులు)లపైనే పడుతోంది. ఇందులో ఒక యాప్ నిర్ణయించే సమయం, రూట్, రేటింగ్స్ రైడర్ల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. చిన్న పొరపాటు జరిగినా జరిమానాలు, ఖాతా నిలిపివేత (Deactivation) వంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించయినా సరే సమయానికి చేరాలనే ఒత్తిడి వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మనిషి ప్రాణం కంటే వేగమే ముఖ్యం అనే ధోరణి ఆందోళనకరం. ఇటీవల హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మె ఈ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. వారి ప్రధాన డిమాండ్లు..అల్ట్రా-షార్ట్ డెలివరీ గడువులను తొలగించాలి.కనీస వేతనం, ప్రమాద బీమా కల్పించాలి.డార్క్ స్టోర్లలో తాగునీరు, వాష్‌రూమ్ వంటి కనీస సౌకర్యాలు ఉండాలి.పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉండాలి.సామాజిక ప్రభావంఈ 10 నిమిషాల డెలివరీ సంస్కృతి వినియోగదారుల్లో ‘తక్షణ సంతృప్తి’(Instant Gratification) అనే అలవాటును పెంచుతోంది. చిన్న వస్తువు కోసం కూడా యాప్‌పై ఆధారపడటం వల్ల ప్రజల్లో ప్రణాళిక నైపుణ్యాలు తగ్గుతున్నాయనే వాదనలున్నాయి. దశాబ్దాలుగా అండగా ఉన్న వీధి చివర కిరాణా దుకాణాలు, మందుల షాపుల ఉనికికి ఇది ముప్పుగా పరిణమిస్తోందని కొందరు చెబుతున్నారు. గతంలో స్థానిక వ్యాపారులు వృద్ధులకు, ఇరుగుపొరుగు వారికి ఆత్మీయంగా సేవలు అందించేవారు, కానీ ఈ కార్పొరేట్ మోడల్ ఆ మానవీయ సంబంధాలను దూరం చేస్తోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.చట్టపరమైన రక్షణలుభారత ప్రభుత్వం నూతన లేబర్ కోడ్ల్లో గిగ్ వర్కర్లను సామాజిక భద్రతా పరిధిలోకి తెచ్చింది. అయితే, 10 నిమిషాల డెలివరీ వంటి అత్యంత వేగవంతమైన పనుల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని నియంత్రించే ప్రత్యేక నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. రాజస్థాన్ వంటి రాష్ట్రాలు గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావడం ఒక ఆశాజనక పరిణామం.కొందరు నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ‘ఒక వస్తువు కోసం 10 నిమిషాలు వేచి ఉండకపోవడం అభ్యంతరకరం. వృద్ధులకు అత్యవసర మందులు అందించడం గొప్ప విషయమే, కానీ ప్రతి చిన్న వస్తువుకూ అదే వేగాన్ని ఆశించడం సమంజసం కాదు. వేగం అనేది బాధ్యతతో కూడి ఉండాలి. మరొక మనిషి ప్రాణాలను పణంగా పెట్టి పొందే సౌకర్యం ఎప్పటికీ పురోగతి అనిపించుకోదు. భారతదేశం ఒక స్థిరమైన, మానవీయమైన పని సంస్కృతిని నిర్మించుకోవాలి. టెక్నాలజీ అనేది మనిషికి సేవ చేయాలి తప్ప, మనిషిని యంత్రంగా మార్చకూడదు’.ఇదీ చదవండి: దిగొచ్చిన కనకం ధరలు.. తులం ఎంతంటే.. -
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇయర్ ఎండ్నాడు.. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉదయం నుంచి డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జోమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో.. ఇవాళ భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంగా ఫుడ్, గ్రాసెసరీలపై అవి ఎక్కువగా ఉండే ఛాన్స్ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు. హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ ఈ సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు సైతం gig workersకు మద్దతుగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని గిగ్‌వర్కర్లు వాపోతున్నారు. బ్రేక్ లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమీషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు.. 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే.. రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.నిజానికి ఈ డిమాండ్లతో.. క్రిస్మస్ రోజునే దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా.. దాదాపు 50 శాతం డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా లక్షా 50వేల మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది.ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానుంది. అలాగే.. సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.సమ్మెతో లాస్ ఎవరికి?.. గిగ్ వర్కర్ల సమ్మె.. అంటే డెలివరీ బాయ్స్ ఆగిపోవడంతో కస్టమర్లకు ఫుడ్, గ్రోసరీ సేవలు నిలిచిపోతాయి. ఈ–కామర్స్ ఆర్డర్లు ఆలస్యం అవుతాయి. లేదంటే రద్దు కూడా కావొచ్చు. తద్వారా లక్షల మందికి ఇయర్ ఎండ్ ప్రణాళికలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. సమ్మె ద్వారా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైనవాటికి భారీగా ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతోంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలు దెబ్బ తినే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) తాత్కాలికంగా ఆదాయం ఆగిపోతుంది. అయితే.. దీర్ఘకాలంలో తమ డిమాండ్లు నెరవేరితే ఉద్యోగ భద్రత, జీతం, బీమా లాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండడంతో.. ఇవాళ వచ్చే అదనపు కమిషన్ల కన్నా సమ్మెకే వాళ్లు మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. వినియోగదారుల అసంతృప్తి, కంపెనీల ఒత్తిడి, కార్మిక సంఘాల డిమాండ్లతో.. వెరసి ఈ సమ్మెలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగైనా.. గిగ్ వర్కర్లను కార్మిక చట్టాల్లో చేర్చే పాలసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
నేడు గిగ్ వర్కర్ల సమ్మె
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులవడమే కాకుండా, సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్సీఆర్, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వారు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని వాపోతున్నారు. పుణె, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు. -
క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆహార పంపిణీ (Swiggy, Zomato), రవాణా (Ola, Uber), నిత్యావసరాల డెలివరీ (Blinkit, Zepto) వంటి సర్వీసులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. అయితే, ఈ సౌకర్యాల డెలివరీలో భాగంగా ఉన్న లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాలు మాత్రం అనేక సవాళ్లతో, అభద్రతతో నిండి ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన నిరసనలు ఈ సమస్యల తీవ్రతను బహిర్గతం చేస్తున్నాయి.గిగ్ వర్కర్ల సమస్యలుసాంప్రదాయ ఉద్యోగులకు ఉండే హక్కులు ఏవీ గిగ్ వర్కర్లకు వర్తించవు. వారిని ఉద్యోగులు అని పిలవకుండా పార్టనర్లు(Partners) అని కంపెనీలు సంబోధిస్తాయి. దీనివల్ల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే..ఆదాయ అస్థిరత.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ప్లాట్‌ఫామ్‌లు ఇచ్చే కమీషన్లు తగ్గుతున్నాయనే వాదనలున్నాయి. దీనివల్ల వారి నికర ఆదాయం పడిపోతోంది. కనీస వేతన గ్యారంటీ లేకపోవడం అతిపెద్ద లోపం.అల్గారిథమ్ నియంత్రణ.. డెలివరీ భాగస్వాములకు ఆర్డర్లు కేటాయించేది ఒక సాఫ్ట్వేర్ అల్గారిథమ్. ఏ కారణం చెప్పకుండానే సడన్‌గా ఐడీ(ID) బ్లాక్ చేయడం వల్ల ఒక్కసారిగా వారి ఉపాధి కోల్పోతున్నారు.పని వేళలు.. రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.క్విక్ కామర్స్ రంగంలో గిగ్‌వర్కర్ల కష్టాలుప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’(Quick Commerce) పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.డిమాండ్లుక్రిస్మస్ (డిసెంబర్ 25) నుంచి న్యూ ఇయర్ (డిసెంబర్ 31) వరకు దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ విభాగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్లు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.కనీస ఆదాయ భద్రత.. పెట్రోల్ అలవెన్స్‌తో కలిపి కిలోమీటరుకు కనీసం రూ.20 చెల్లించాలి.10-మినిట్స్ డెలివరీ రద్దు.. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ఈ మోడల్‌ను ఉపసంహరించుకోవాలి.సామాజిక భద్రత.. ప్రమాద బీమా (Accident Insurance), ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.న్యాయబద్ధమైన ఐడీ బ్లాకింగ్.. సరైన కారణం లేకుండా, వివరణ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఐడీలను బ్లాక్ చేయకూడదు.గిగ్ వర్కర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం, సామాజిక గౌరవం, భద్రత కల్పించినప్పుడే ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. గిగ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం మరింత చర్చించి ఇటు కంపెనీలు, అటు వర్కర్లకు అనువైన నియమాలు అమోదించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
పండగ సీజన్లో గిగ్ వర్కర్ల షాక్ : 7 రోజుల జాతీయ సమ్మె
సాక్షి,ముంబై: జీతం, భద్రతా ప్రమాణాలు, సామాజిక భద్రత డిమాండ్లతో గిగ్ వర్కర్లు (gig workers) జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోని డెలివరీ పార్టనర్స్ డిసెంబర్ 25 నుంచి 31వ తేదీవరకు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. పని పరిస్థితులు, సామాజిక భద్రత పరిస్తితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా "10 నిమిషాల డెలివరీ" లాంటి వాటిని ఉపసంహరించుకోవాలనేది ముఖ్యమైన డిమాండ్.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక యాప్ ఆధారిత వర్కర్స్ యూనియన్‌తో సహా , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మెట్రో, టైర్-2 నగరాల్లో డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశం అంతటా డెలివరీ కార్మికులు అఖిల భారత సమ్మెను ప్రకటించినందున, క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25),నూతన సంవత్సర వేడుకల (డిసెంబర్ 31) నాడు ఆన్లైన్ ఫుడ్, కిరాణా, ఇ-కామర్స్ డెలివరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రతను కల్పించడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, హై-రిస్క్ డెలివరీలు ముఖ్యంగా గరిష్ట డిమాండ్ సమయాల్లో, ప్రాథమిక కార్మిక రక్షణ వ్యవస్థ లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ సర్వీసుతో కార్మికుల్లో ఒత్తిడి తీవ్రమవుతోందంటున్నారు. అంతేకాదు ఇది తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఇతర డిమాండ్లలోయు పారదర్శకమైన ఆర్డర్‌కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు లాంటివి ఉన్నాయి. అదనపు డిమాండ్లలో మెరుగైన భద్రతా చర్యలు, బలమైన సాంకేతిక ,యాప్ మద్దతు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ ప్రయోజనాలు ,కార్యాలయంలో గౌరవప్రదమైన చికిత్స ఉన్నాయి. యూనియన్లలో చేరినందుకు లేదా పని సంబంధిత సమస్యలపై స్వరం పెంచినందుకు కొంతమందిని బ్లాక్మెయిల్, లేదా వేధిస్తున్నారని కూడా కార్మికులు ఆరోపించారు.అలాగే డెలివరీ ఐడిలను ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవడం, రూటింగ్ మరియు చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలు మరియు అల్గారిథమ్ ఆధారిత వివక్ష కారణంగా అస్థిరమైన పని కేటాయింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా చట్రాలను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
ఇది సక్సెస్ కాదు.. గిగ్ కార్మికుల గొడ్డు చాకిరీ!
క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న వైనంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ కార్మికుల ఇబ్బందులను ఇటీవల ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోను ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తాజాగా పోస్ట్ చేశారు.ఇందులో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ శ్రమ దోపిడీకి గురైన వైనాన్ని వివరించారు. రోజంతా దాదాపు 15 గంటలు గొడ్డులా కష్టపడి 28 ఆర్డర్లు డెలివరీలు చేస్తే అతనికి లభించింది కేవలం రూ .763 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తిన చద్దా.. "అధిక పని", "తక్కువ వేతనం"తో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేదని స్పష్టం చేశారు.‘ఇది గిగ్ ఎకానమీ విజయ గాథ కాదు.. డెలివరీ యాప్‌లు, వాటి అల్గోరిథంల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ’ అని అభివర్ణించిన చద్దా.. ప్రతి రోజూ లక్షలాది మంది కార్మికులు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఈ ఒక్క బ్లింకిట్ ఉదంతం తెలియజేస్తోందంటూ ట్వీట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు వేగంగా విస్తరించినప్పటికీ, కార్మికుల రక్షణ మాత్రం విస్మరణకు గురవుతోందన్నారు.రాఘవ్ చద్దా పోస్ట్ ‘ఎక్స్’లో విస్తృత చర్చకు దారితీసింది. కార్మిక చట్టాలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికుల పట్ల "క్రూరత్వం" నివారించడానికి 10 నిమిషాల డెలివరీ సేవలను నిషేధించాలని ఆప్ ఎంపీ గతంలోనే కోరారు. కఠినమైన సమయపాలనను చేరుకోవడానికి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.28 deliveries.15 hours of relentless work.₹763 earned.This is not a “gig economy success story”.This is systemic exploitation hidden behind apps & algorithms.I raised this issue in Parliament recently. Low pay, crushing targets, no job security, no dignity for gig… pic.twitter.com/gLwQbcE1iQ— Raghav Chadha (@raghav_chadha) December 16, 2025 -
లేబర్ కోడ్‌తో వర్కర్లకు ప్రయోజనం
న్యూఢిల్లీ: కొత్తగా నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్స్‌ను స్విగ్గీ, జొమాటో మొదలైన అగ్రిగేటర్లు స్వాగతించాయి. ఈ సంస్కరణలతో లక్షల కొద్దీ వర్కర్లకు మేలు జరుగుతుందని స్విగ్గీ పేర్కొంది. తమ వ్యాపార వ్యయాలపై, దీర్ఘకాలికంగా ఆర్థిక పనితీరుపై ఇందుకు సంబంధించిన భారమేమీ ఉండదని వివరించింది. కంపెనీలపై నిబంధనల భారం తగ్గిస్తూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. మరోవైపు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత మరింత అందుబాటులోకి వస్తుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ పేర్కొంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేస్తూ, గిగ్ వర్కర్ల నిబంధనల్లో ఏకరూపత తెచ్చే దిశగా ఇది సరైన అడుగని తెలిపింది. దీనివల్ల తమ జొమాటో, బ్లింకిట్ వ్యాపార విభాగాలపై ఆర్థిక భారమేమీ ఉండదని వివరించింది. గిగ్ వర్కర్లకు ఇప్పటికే తాము సమగ్ర బీమాతో పాటు ఇతరత్రా ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఎటర్నల్ వివరించింది. -
హైరింగ్ ‘పండగ’!
ఈ ఏడాది పండగ సీజన్లో నియమాకల దుమ్మురేగిపోయింది. సానుకూల కన్జూమర్ సెంటిమెంట్‌కు తోడు ఆకర్షణీయమైన ప్రమోషన్లు, భారీగా విస్తరణ దన్నుతో 2025 ఆగస్ట్–అక్టోబర్ మధ్య భారీగా ఉద్యోగ కల్పన జరిగిందని హైరింగ్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే మొత్తంమీద హైరింగ్ 17 శాతం పెరిగిందని, గిగ్, తాత్కాలిక జాబ్స్ 25 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది. 2025 పండగ సీజన్ మూడు నెలల్లో 2.16 లక్షల గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు లభించినట్లు అంచనా వేసింది. కాగా, తాత్కాలిక జాబ్స్ 37 శాతం వృద్ధి చెందగా, గిగ్ వర్కర్ల నియమాకాలు 15–20 శాతం పుంజుకున్నాయని నివేదిక తెలిపింది.‘ఈ ఏడాది పండగ హైరింగ్‌ను గమనిస్తే, కంపెనీల ఆర్థికపరమైన విశ్వాశం, గిగ్ ఎకానమీ అంతకంతకూ బలోపేతం అవుతోందనే దాన్ని ప్రతిబింబిస్తోంది. నియామకాల సంఖ్య, వేతన చెల్లింపులు గత మూడేళ్ల స్థాయిని అధిగమించాయి. తద్వారా కోవిడ్ తదనంతర సాధారణ స్థాయి తర్వాత అత్యంత పటిష్టమైన ఏడాదిగా 2025 నిలిచింది. ముఖ్యంగా రిటైల్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లలో భారీగా నియామకాలు జరిగాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్, జనరల్ స్టాఫింగ్ హెడ్ దీపేష్ గుప్తా పేర్కొన్నారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తాయి.ప్రారంభ స్థాయి కొలువుల్లో వేతనాలు 12–15 శాతం పెరగ్గా, అనుభవంతో కూడిన విధుల్లో 18–22 శాతం వేతన వృద్ధి నమోదైంది.ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌తో పాటు 2026 మార్చి వరకు హైరింగ్ జోరు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, ట్రావెల్, లాజిస్టిక్స్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో డిమాండ్ జోరుగా ఉంది.ఈ కాలంలో హైరింగ్ వార్షికంగా 18–20 శాతం పెరగవచ్చని అంచనా. ఇందులో సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నగరాల నుంచే జతయ్యే అవకాశం ఉంది.మొత్తం హైరింగ్‌లో దాదాపు 75–80 శాతం ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో సిటీల నుంచే నమోదైంది. అయితే, ద్వితీయ శ్రేణి, వర్ధమాన నగరాల్లో గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల డిమాండ్ 21–25 శాతం ఎగబాకింది. లక్నో, జైపూర్, కోయంబత్తూరు, భువనేశ్వర్, నాగపూర్, మైసూరు వంటి నగరాలు... మెట్రోలను మించి (14 శాతం వృద్ధి) 21 శాతం పెరుగుదలను సాధించాయి. మరోపక్క, కాన్పూర్, కొచ్చి, విజయవాడ, వారణాసితో సహా పలు కొత్త మార్కెట్లు తాత్కాలిక ఉద్యోగాలకు కేంద్రాలుగా ఆవిర్భవించాయి.రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో 28 శాతం హైరింగ్ పెరిగింది. లాజిస్టిక్స్, లాస్ట్–మైల్ డెలివరీ తదితర విధుల్లో తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించి 35–40 శాతం వృద్ధి నమోదైంది.బీఎఫ్ఎస్ఐ రంగంలో పండగ నియామకాలు 30 శాతం ఎగబాకాయి. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫీల్డ్ సేల్స్, క్రెడిట్ కార్డ్, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) కొలువులకు ఫుల్ జోష్ నెలకొంది.హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగం కూడా బాగానే పుంజుకుంది. ఫ్రంట్–ఆఫీస్, ఈవెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సిబ్బందికి డిమాండ్ 25 శాతం మేర పెరిగింది. పండగ ప్రయాణాలకు తోడు, పెళ్లిళ్ల సీజన్ బుకింగ్స్ ఇందుకు దోహదం చేశాయి.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు! -
పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!
దేశవ్యాప్తంగా పండుగ సీజన్లో రిటైలర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండడంతో ఏటా వాణిజ్యం పెరుగుతోంది. ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మరీ అధికంగా ఉంటుంది. వస్తువులపై రాయితీలు, మార్కెటింగ్, వినియోగదారుల సెంటిమెంట్ కలగలిసి ఆర్డర్ వాల్యూమ్‌లు పండుగ సీజన్లో అధికమవుతుంటాయి. అయితే ఇటీవలకాలంలో రిటైలర్ల వద్ద ఆర్డర్లు, ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని డెలివరీ చేసే గిగ్ కార్మికుల కొరత భారీగా ఉందని కొందరు చెబుతున్నారు.గిగ్ వర్కర్ల సంక్షోభంపండుగ సమయంలో భారీగా వస్తున్న ఆర్డర్లను నిర్వహించడానికి ఈ-కామర్స్, క్విక్-కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికులపై అధికంగా ఆధారపడతాయి. ఈ గిగ్ వర్కర్లు గిడ్డంగులు, డార్క్ స్టోర్ల నుంచి వస్తువుల తుది డెలివరీ వరకు కీలక విభాగాల్లో పనిచేస్తారు. ఆన్లైన్ షాపింగ్ చెయిన్‌లో వీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే, ఈ ఏడాది కార్మిక కొరత మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉందని స్టాఫింగ్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. వస్తువుల పంపిణీ కేంద్రాలుగా పనిచేసే డార్క్ స్టోర్లు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. గిడ్డంగులు అసాధారణంగా అధిక అట్రిషన్ రేట్లను (పని మానేసే వారి సంఖ్య) ఎదుర్కొంటున్నాయి. డెలివరీ కార్గో విమానాల సంఖ్య కూడా తగ్గిపోయింది.కార్మికుల కొరతకు కారణాలుతాత్కాలిక సిబ్బందికి మార్కెట్లో డిమాండ్ సంవత్సరానికి 15-20% పెరిగింది. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో వీరి అవసరం అధికమైంది. దాంతో మార్కెట్లో అధిక రాబడి వస్తున్న విభాగాల్లోకి వీరు మారుతున్నారు. గిగ్ పాత్రల్లో ముఖ్యంగా డెలివరీలో నెలకు 35-40% అట్రిషన్ రేట్లు కనిపిస్తున్నాయి. కార్మికులు తరచుగా స్వల్ప వేతన పెంపు కోసం ఇతర ప్లాట్ఫామ్ల్లోకి మారుతున్నారు. సీజన్ తర్వాత వీరు పూర్తిగా ఈ ఫీల్డ్ వదిలేసి నిర్మాణం వంటి ఇతర పనుల కోసం వెళుతున్నారు. తర్వాతి సీజన్లో తిరిగి వస్తున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.గిగ్ కార్మికులకు సరైన రక్షణ వ్యవస్థలు లేకపోవడం, దీర్ఘకాలిక ఒప్పందాలు కరవవ్వడం, కనీస కెరియర్ పురోగతి వంటివి లోపించడం కూడా వీరి సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. భారతదేశ గిగ్ ఆర్థిక వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడంలో కంపెనీలు, ప్రభుత్వ యాంత్రాగాలు విఫలమవుతున్నాయి.టైర్-2, టైర్-3 మార్కెట్ల పెరుగుదలఇండోర్, కొచ్చి, భువనేశ్వర్, నాగ్‌పూర్ వంటి నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి గిగ్ నియామకంలో 30-40% పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో టాలెంట్ పూల్ పరిమితంగా ఉండటం వల్ల కార్మికులను ఆకర్షించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది.తాత్కాలిక పరిష్కారాలుతక్షణ అవసరాలను పూరించడానికి ఈ-కామర్స్ సంస్థలు డిజిటల్ ఫ్లెక్సి-హైరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాఫింగ్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. కళాశాల విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు, పట్టణ వలసదారులతో సహా సాంప్రదాయేతర కార్మిక వర్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, కొత్తగా క్విక్-కామర్స్ రంగంలోకి వస్తున్న కంపెనీలతో వీరికి డిమాండ్ పెరుతోంది.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
కొలువుల పండుగ!
ముంబై: ఈసారి పండుగ సీజన్లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20 శాతం పెరగనున్నాయి. రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, ట్రావెల్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయి. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివిధ వేదికల్లో తమ క్లయింట్లు పోస్ట్ చేసే ఖాళీలు, పరిశ్రమ నివేదికలు మొదలైన డేటా ఆధారంగా అడెకో ఇండియా దీన్ని రూపొందించింది. రాఖీ, దసరా, దీపావళిలాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నియామకాలు పుంజుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. సాధారణం కంటే ఈసారి పండుగ సీజన్ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను కాస్తంత ముందుగానే మొదలుపెట్టాయని వివరించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడటం, సానుకూల వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక పరిస్థితులపై ఆశావహ అంచనాలు నెలకొనడం, సీజనల్ అమ్మకాల విషయంలో కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తుండటం వంటి అంశాలు ఈసారి హైరింగ్‌కి దన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ‘ఈ పండుగ సీజన్లో డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా పరిశ్రమ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో కంపెనీలు సంఖ్యాపరంగా ఎంత మందిని తీసుకున్నాం అనేదే చూసేవి. కానీ ఇప్పుడు, అభ్యర్థ్ధులు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులకు ఎంత వేగంగా సర్దుకోగలరులాంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేశ్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెలాంటి పెద్ద నగరాల్లో సీజనల్ హైరింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే అవకాశాలు 19% అధికం. → లక్నో, జైపూర్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, మైసూరు, వారణాసిలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండ్ 42% పెరిగింది. విజయవాడ, కాన్పూర్, కొచ్చిలాంటి వర్ధమాన హబ్‌లలోనూ హైరింగ్ అంచనాలు మెరుగ్గా న్నాయి. → మెట్రో మార్కెట్లలో వేతనాలు 12–15%, వర్ధ మాన నగరాల్లో 18–22% స్థాయిలో పెరగవచ్చు. → స్వల్పకాలిక ఈ ఏడాది సీజనల్ హైరింగ్‌లో మహిళల వాటా 23 శాతం పెరగనుంది. → పండుగ సీజన్లో డిమాండ్ భారీగా ఉన్న సమయాల్లో కంపెనీలు లాస్ట్–మైల్ కార్యకలాపాలను (కస్టమర్ల ఇంటి దగ్గరకే ఉత్పత్తులను చేర్చడం) కూడా పటిష్టపర్చుకోనుండటంతో లాజిస్టిక్స్, డెలివరీల్లో హైరింగ్ 30–35% ఎగబాకనుంది. → బీఎఫ్ఎస్ఐ రంగాన్ని తీసుకుంటే .. క్రెడిట్ కార్డుల అమ్మకాలు, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) ఇన్స్టాలేషన్ల కోసం (ముఖ్యంగా ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో) కంపెనీలు పెద్ద స్థాయిలో నియామకాలు చేపడుతున్నాయి. ఈ విభాగంలో డిమాండ్ 30 శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. → హాస్పిటాలిటీ, ట్రావెల్ సెగ్మెంట్లలో రిక్రూట్మెంట్ డిమాండ్ 20–25% ఉండొచ్చు. → మొత్తం సీజనల్ ఉద్యోగాల కల్పనలో 35–40% వాటాతో రిటైల్, ఈ–కామర్స్ విభాగాల ఆధిపత్యం కొనసాగనుంది. → డిజిటల్‌పై పట్టు, బహుభాషా సామర్థ్యాలు, కస్టమర్లను హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యాలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నా యి. ఇన్–స్టోర్ సేల్స్, క్రెడిట్ కార్డ్ ప్రమోషన్లు, డెలివరీ ఉద్యోగాల కోసం ఈ నైపుణ్యాలను చూస్తున్నాయి. -
గిగ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్
ముంబై: గతేడాది బ్లూ–కాలర్(ఆఫీసేతర) విభాగంలో గిగ్ ఉద్యోగాలు 92% పెరిగినట్లు బ్లూ, గ్రే కాలర్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్ వర్క్ ఇండియా నివేదిక పేర్కొంది. వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడింగ్ ప్లాట్ఫామ్ల్లో కారి్మకులకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది సంకేతమని సర్వే తెలిపింది. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు కేవలం డిమాండ్ సృష్టించడమే కాదు. నమ్మకమైన ఆదాయ వనరులుగా మారాయి. చాలా మంది అభ్యర్థులకు ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డెలివరీ ఉద్యోగం కేవలం పార్ట్‌టైం జాబ్ మాత్రమే కాకుండా కెరీర్ ఎంపికగా మారింది’’ అని వర్క్ ఇండియా సీఈవో, వ్యవస్థాపకులు నీలేష్ దుంగర్వాల్ తెలిపారు. గిగ్ రోల్స్ ఉద్యోగాలకు ఇప్పటికీ డిమాండ్ బలంగా ఉంది. మొత్తం దరఖాస్తుల పెరుగుదల 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. లాస్ట్ మైల్ లాజిస్టిక్ ఉద్యోగాలకు కేంద్రాలైన ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. -
కన్సల్టెంట్లకు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, జాబ్ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నప్పటికీ తాత్కాలిక ప్రాతిపదికన సేవలందించే కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సల్టెంట్లకు, ప్రాజెక్ట్‌లవారీగా సేవలందించే వారికి డిమాండ్ 38 శాతం పెరిగింది. అంతక్రితం రెండేళ్లు ఇది సగటున 17 శాతంగానే నమోదైంది. వైట్ కాలర్ గిగ్ సరీ్వసుల ప్లాట్‌ఫాం ‘ఫ్లెక్సింగ్ ఇట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాధారణంగా సేవల రంగంలోనే ఫ్రీలాన్సర్లకు ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పారిశ్రామిక, తయారీ రంగాలు కూడా వారి సర్వీసులను పొందడంపై ఆసక్తి చూపుతున్నాయి. గిగ్ వర్కర్లను ఎక్కువగా తీసుకుంటున్న టాప్ –3 రంగాల్లో ఈ రెండూ కూడా వచ్చి చేరాయి. ఎఫ్ఎంసీజీ, కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), హెల్త్‌కేర్ రంగాల్లో డిమాండ్ పటిష్టంగా కొనసాగుతుండగా.. కొత్తగా పరిశ్రమలు, తయారీ రంగాలు కూడా వారి సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తుండటం సానుకూలాంశమని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. మారుతున్న హైరింగ్ తీరు .. కొత్త టెక్నాలజీలు, మారిపోతున్న మార్కెట్ పరిస్థితులకు వ్యాపార సంస్థలు తమను తాము మల్చుకునే క్రమంలో నియామకాలపరమైన అవసరాలు మారుతున్నాయి. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిపుణులను నియమించుకోవడమనేది ప్రత్యర్థి సంస్థలతో పోటీపడటంలో ముందుండేందుకు ఉపయోగపడుతోంది. పలు కంపెనీలు తమ రిక్రూట్మెంట్ విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్రీలాన్సర్ల సేవలు తీసుకుంటున్నాయని వివరించింది. స్పెషలిస్ట్ నైపుణ్యాలున్న వారు అందుబాటులో ఉండటం, వేగవంతంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వెసులుబాటు లభిస్తుండటమనేది ఇందుకు దోహదపడుతోందని పేర్కొంది. ఫ్లెక్సింగ్ ఇట్ ప్లాట్‌ఫాంలో వివిధ నైపుణ్యాలున్న 1,00,000 మంది పైగా కన్సల్టెంట్లు అందుబాటులో ఉన్నారు. రిమోట్ వర్కింగ్ వైపు మొగ్గు.. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేదా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగించాలా అనే అంశాలపై కంపెనీలు ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. ఫ్రీలాన్సింగ్ విషయంలో రిమోట్ వర్కింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ప్రతి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తిగా రిమోట్ ప్రాజెక్టుగా ఉంటోంది. స్ట్రాటెజీ, టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో పట్టున్న భారతీయ కన్సల్టెంట్లు ఎక్కువగా గ్లోబల్ క్లయింట్లకు సరీ్వసులు అందిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అనే దానికన్నా నైపుణ్యాలే కీలకంగా ఉంటుండటంతో రిమోట్ వర్కింగ్‌కి ప్రాధాన్యత ఉంటోంది. టెక్నాలజీలో అత్యధికం ఫ్రీలాన్సర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాల్లో వరుసగా మూడో ఏడాది టెక్నాలజీ విభాగం (25 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. కృత్రిమ మేథ వినియోగం, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, డిజిటల్ పరివర్తన ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ఇక స్ట్రాటెజీ..బిజినెస్ డెవలప్మెంట్ (15 శాతం) రెండో స్థానంలో, ఫైనాన్స్ (11 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీకి మాత్రమే పరిమితం కావడం లేదని, ఇతరత్రా విభాగాల్లోనూ పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనమని ఫ్లెక్సింగ్ ఇట్ తెలిపింది. మరోవైపు, ఫ్రీలాన్సర్ల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో కన్సల్టెంట్ల రిజిస్ట్రేషన్లు 127 శాతం పెరిగాయి. వీరిలో 59 శాతం మందికి పదేళ్ల లోపు అనుభవమే ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకెళ్లడం కన్నా స్వతంత్రతను, రకరకాల ప్రాజెక్టులు చేయడం ద్వారా అనుభవాన్ని గడించేందుకు ప్రొఫెషనల్స్ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ధోరణికి మిలీనియల్స్ శ్రీకారం చుట్టగా, జెన్ జడ్ తరం దాన్ని వేగంగా అందిపుచ్చుకుంటోంది. గతంలో మధ్య స్థాయి, సీనియర్ ప్రొఫెషనల్స్ ఇలా ఫ్రీలాన్సింగ్ బాట పట్టే వారు. కానీ టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న యువత ఫ్రీలాన్సింగ్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్సల్టెంట్లుగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్నవారిలో 38 శాతం మంది మహిళలు ఉన్నారు. -
తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినపుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమే అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినపుడు భర్త రెండోపెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతోపాటు, మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తాం.కానీ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన రెండేళ్ల కూతురిని చూసుకుంటూ డెలివరీలు చేస్తున్న కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది.గురుగ్రామ్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్. భార్య చనిపోయిన తరువాత తన తన రెండేళ్ల కుమార్తె టున్ టున్ తల్లిలేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. టున్‌టున్‌ను వెంటబెట్టుకుని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకుసాయంత్రం తరగతులకు హాజరుకావడంతో పంకజ్‌కు మరే మార్గం కనిపించలేదు. ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగురుగ్రామ్కు చెందిన సీఈవో మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు.మయాంక్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ పంకజ్‌కు కాల్ చేయగా.. అవతలినుంచి ఒక చిన్నారి వాయిస్ కూడా వినిపించడంతో, పైకి రమ్మని చెబుతామని కూడా ఆగిపోయి, స్వయంగా తానే కిందికి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాపాపయి కూడా. దీంతో పంకజ్‌ను ఆరా తీసి, అసలు సంగతి తెసుకుని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు.తన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటేడెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ టున్ టున్ పుట్టగానే భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి అన్నీ తానై అయ్యి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతోపాటే తీసుకెళ్లి, బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ విధులను నిర్వరిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ కానీ పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి. చాలా రిస్క్ బాస్ అంటూ కొందరు విమర్శిస్తుండగా, శభాష్, హాట్సాఫ్ పంకజ్ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కనిపించని కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.చదవండి: పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..! -
గిగ్ వర్క్‌ర్ల సంక్షేమానికి సెస్
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఊతమిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై 5 శాతం సెస్ వసూలు చేసి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమగ్ర గిగ్ వర్కర్స్ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రవేశపెడతామని తెలిపారు.ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, డన్జో సహా 12 ప్రధాన కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. గిగ్ వర్కర్లు సరుకులను డెలివరీ చేయడానికి లేదా సేవలను అందించడానికి ప్రయాణించిన దూరం ఆధారంగా కొంత మొత్తాన్ని ఈ చట్టం కింద ఏర్పాటు చేయబోయే సంక్షేమ నిధికి మళ్లిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఐటీ అండ్ బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తో ఈమేరకు చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.ప్రతిపాదనలు ఇవే..ఈ సమావేశంలో గిగ్ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం; అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా అందుబాటులో లేని ఆరోగ్య బీమా, విద్యా మద్దతు, ఇతర రక్షణలు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం; ఈ-కామర్స్, అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా గిగ్ వర్కర్లకు చేసే చెల్లింపులపై 5 శాతం సెస్‌ను బోర్డుకు కేటాయించడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సామాజిక భద్రత కోడ్ 2020 నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సంక్షేమ పథకాలను నిర్ధారించడానికి ఈ విధానాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు గిగ్ వర్కర్లకు రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఈ చట్టం కింద ప్రతి లావాదేవీకి 1-2 శాతం సెస్‌ను ప్రతిపాదించినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా దీని అమలు రెండుసార్లు నిలిచిపోయింది.ఇదీ చదవండి: క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్లుపారిశ్రామిక వర్గాల ఆందోళనఈ ప్రకటన నాస్కామ్, ఐఏఎంఏఐ వంటి పారిశ్రామిక సంస్థల నుంచి విమర్శలకు దారితీసింది. ఇది ఈ-కామర్స్ సంస్థలపై, ముఖ్యంగా ఇప్పటికే తక్కువ మార్జిన్లతో కొట్టుమిట్టాడుతున్న స్టార్టప్‌లపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటకలో గణనీయమైన కార్యకలాపాలు కలిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని తెలిపాయి. తిరిగి వినియోగదారులపై ఈ భారం పడుతుందని అంచనా వేస్తున్నాయి. -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్‌ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్‌లు, రైడ్ యాప్‌లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. -
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్
ముంబై: ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు (తాత్కాలిక ఉద్యోగులు)/ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్‌కు మద్దతునిచ్చినట్టు తెలిపింది. పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే అవ్సార్ తన ప్లాట్‌ఫామ్‌పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది. లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది. ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్టు, మొత్తం డిమాండ్‌లో ఈ మూడు మెట్రోల నుంచే 53 శాతం ఉన్నట్టు వెల్లడించింది. సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి, టైర్ 2 పట్టణాలకూ విస్తరిస్తున్నట్టు పేర్కొంది. పెరిగిన వేతనాలు: నైపుణ్య మానవవనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెలా రూ.35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాధ్యతలకు రూ.18,000–28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనుల నిర్వహణకు మానవ వనరుల కొరత, సేలకు డిమాండ్ అధిక వేతనాలకు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్లో ఎక్కువ ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం సెప్టెంబర్ త్రైమాసికంలో 6.4%పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 6.4 శాతానికి దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6 శాతంగా ఉండడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) 24వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల చేసింది. పట్టణాల్లో 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ చివరికి 8.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూన్ చివరికి 9 శాతంగా ఉంది. 15 ఏళ్లు నిండిన పురుషులకు సంబంధించి పట్టణ నిరుద్యోగం సెప్టెంబర్ చివరికి 5.7 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6 శాతం కాగా, ఈ ఏడాది జూన్ చివరికి 5.8 శాతంగా ఉంది. జూలై–సెప్టెంబర్ కాలంలో కారి్మకుల భాగస్వామ్య రేటు 50.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఏడాది సెప్టెంబర్ చివరికి ఇది 50.1 శాతంగా ఉంది. -
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పన్ను?
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్‌టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్‌కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్‌గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపురూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి. -
గిగ్ వర్కర్ల కోసం.. టెక్ మహీంద్రా ‘పాప్యులై’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్‌సోర్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్క్రిప్షన్, డేటా అనోటేషన్ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ మహీంద్రా బిజినెస్ హెడ్ (బిజినెస్ ప్రాసెస్ సరీ్వసెస్) బీరేంద్ర సేన్ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్‌ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్‌ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్ చెప్పారు. అలాగే గిగ్ నిపుణులు టాప్ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. -
గిగ్ వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహా పథకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహాలో పథకాన్ని వర్తింప జేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సీఎం, మంత్రివర్గస్థాయిలో గిగ్ వర్కర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక భద్రతతో కూడిన నిధిపై చర్చిస్తామని, తగిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం ఉందని, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు సాయం, సింగిల్ పర్మిట్ పాలసీ, పెండింగ్ చలాన్ 50 శాతం తగ్గింపుతో క్లియరెన్స్ లాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జీహెచ్ఎంసీ పారిశు ధ్య కార్మికులు, గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్ ఆటో, క్యాబ్ డ్రైవర్లు)తో ఆయన ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికుల సమస్య లు, దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా కార్మికులు తమ కష్టాలు ఆయనకు వివరించారు. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పనిచేసి సంపాదించినదంతా డీజిల్, పెట్రోల్‌కే సరిపోతోందని వాపోయారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ పాల్గొన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్!
గిగ్ ఉద్యోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, అర్బన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్రం - సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమైతే డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ ఉద్యోగుల కష్టాలు గట్టెక్కనున్నాయి. దేశంలోని అనధికారిక కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించేలా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన ఈ నాలుగు లేబర్ చట్టాలపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 2022 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి అంశం కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు సంబంధిత నిబంధనల ఆధారంగా వాటిని అమలు కావాల్సి ఉంది. కానీ అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో గిగ్ ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్రం..గిగ్ ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ వారికి బెన్ఫిట్స్ అందించే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 40శాతం మంది కార్మికులు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - 2021 నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం 40శాతం మంది కార్మికులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. అయితే 20% కంటే తక్కువ మందికి యాక్సిడెంటల్ పాలసీ, నిరుద్యోగం, డిజేబిలిటీ ఇన్సూరెన్స్ (disability insurance), వృద్ధాప్య పెన్షన్లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు పొందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఫలానా సమయానికి/ ఫలానా పని కోసం నియమితులయ్యే కార్మికులే గిగ్ వర్కర్లు. తమ పనిగంటలను ఎంపిక చేసుకునే సౌలభ్యం వీళ్లకు ఉంటుంది.నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. గిగ్ ఎకానమీ వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వర్క్ ఫోర్స్‌లో 1. 3 శాతం కంటే ఎక్కువగా ఉంది. చదవండి👉 జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!


