క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న వైనంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ కార్మికుల ఇబ్బందులను ఇటీవల ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోను ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తాజాగా పోస్ట్ చేశారు.
ఇందులో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ శ్రమ దోపిడీకి గురైన వైనాన్ని వివరించారు. రోజంతా దాదాపు 15 గంటలు గొడ్డులా కష్టపడి 28 ఆర్డర్లు డెలివరీలు చేస్తే అతనికి లభించింది కేవలం రూ .763 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తిన చద్దా.. "అధిక పని", "తక్కువ వేతనం"తో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేదని స్పష్టం చేశారు.
‘ఇది గిగ్ ఎకానమీ విజయ గాథ కాదు.. డెలివరీ యాప్‌లు, వాటి అల్గోరిథంల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ’ అని అభివర్ణించిన చద్దా.. ప్రతి రోజూ లక్షలాది మంది కార్మికులు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఈ ఒక్క బ్లింకిట్ ఉదంతం తెలియజేస్తోందంటూ ట్వీట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు వేగంగా విస్తరించినప్పటికీ, కార్మికుల రక్షణ మాత్రం విస్మరణకు గురవుతోందన్నారు.
రాఘవ్ చద్దా పోస్ట్ ‘ఎక్స్’లో విస్తృత చర్చకు దారితీసింది. కార్మిక చట్టాలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికుల పట్ల "క్రూరత్వం" నివారించడానికి 10 నిమిషాల డెలివరీ సేవలను నిషేధించాలని ఆప్ ఎంపీ గతంలోనే కోరారు. కఠినమైన సమయపాలనను చేరుకోవడానికి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
28 deliveries.
15 hours of relentless work.
₹763 earned.
This is not a “gig economy success story”.
This is systemic exploitation hidden behind apps & algorithms.
I raised this issue in Parliament recently. Low pay, crushing targets, no job security, no dignity for gig… pic.twitter.com/gLwQbcE1iQ— Raghav Chadha (@raghav_chadha) December 16, 2025


