ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ | Parliament Winter Session 2025 Day-7 Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాల అప్‌డేట్స్‌: ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ

Dec 9 2025 10:48 AM | Updated on Dec 9 2025 7:02 PM

Parliament Winter Session 2025 Day-7 Live Updates

Parliament Session Updates.. 

లోక్‌సభలో ఎస్‌ఐఆర్‌పై చర్చ.. రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే..

  • ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్‌ గాంధీ
  • క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్‌ గాంధీ

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ గాంధీ ఘాటు విమర్శలు

ఆర్‌ఎస్‌ఎస్‌ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్‌ గాంధీ

ఎన్నికల వ్యవస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతుల్లోనే ఉంది

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరం

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు

రాహుల్‌ గాంధీ అనవసరంగా పార్లమెంట్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ టాపిక్‌ లేవనెత్తుతున్నారు: కిరెణ్‌ రిజిజు

రాహుల్‌ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తత

విపక్షాల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం

స్పీకర్‌ చెయిర్‌ను మీరు బెదిరించలేరు: స్పీకర్‌ ఓం బిర్లా

  • నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్‌ గాంధీ
  • నేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్‌ గాంధీ
  • ఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్‌ గాంధీ
  • సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్‌ గాంధీ
  • విద్యావ్యవస్థను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్‌ గాంధీ
  • ఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్‌ గాంధీ
  • మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్‌ గాంధీ
  • ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్‌ గాంధీ
  • ఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్‌ గాంధీ
  • ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో ఓట్‌చోరీ జరిగింది: రాహుల్‌ గాంధీ
  • ఫేక్‌ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్‌ గాంధీ
  • ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్‌ చేసింది: రాహుల్‌ గాంధీ

 

 

  • లోక్‌సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చ
  • ప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్‌ గాంధీ

 

సర్‌ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి

  • ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో చర్చ
  • చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
  • ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి
  • అనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయి
  • ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చని అనేకమంది టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు
  • పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు  నిర్వహించాలి
  • పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి
  • అందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్  తో మాకు  ఎలాంటి ఇబ్బంది లేదు
  • అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి
  • వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి
  • ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే   మా అభిమతం
  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది
  • సాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి    
  • మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు
  • విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది
  • ఈవీఎంలో  చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు
  • వివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు
  • వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు
  • ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు
  • హిందూపురం  పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు  472 ఓట్లు వస్తే,  అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది
  • ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు
  • అభివృద్ధి చెందిన దేశాల్లో  సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు
  • పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు  నిర్వహించాలి
  • పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి
  • అందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్  తో మాకు  ఎలాంటి ఇబ్బంది లేదు
  • అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి
  • వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి
  • ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే   మా అభిమతం

 

SIRపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ

  • ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్‌ అభ్యంతరం
  • ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్‌ఐఆర్‌ చేస్తున్నారు: కాంగ్రెస్‌
  • ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్‌

ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్‌ తివారీ

  • ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ.
  • కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ కామెంట్స్​..
  • బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగాలి.
  • అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.
  • ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.
  • ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.
  • ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. 

 

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లను వాడాలి: అఖిలేష్‌

  • ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్
  • అఖిలేష్‌ కామెంట్స్‌..
  • ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
  • ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.
  • బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలి

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్‌ షా కౌంటర్‌..

  • రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.
  • కొందరు బెంగాల్‌ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.
  • బెంగాల్‌ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.
  • కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.
  • ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. 

రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తి

  • ఇండిగో విమానాల రద్దుపై లోక్‌సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
  • రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తి
  • తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్

ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ..

  • చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ.
  • రాజీవ్‌ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.
  • వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ గురించి చర్చ జరుగుతోంది. 

 

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

  • ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదు
  • వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలు
  • ఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు
  • ఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్‌ రిజిజు

నేడు లోక్‌సభలో ఎస్ఐఆర్‌పై చర్చ

  • విపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
  • ఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలు
  • ఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వం
  • ఎస్ఐఆర్‌తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలు
  • ఎస్ఐఆర్‌తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలు
  • పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలు
  • ప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్
  • వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డి

రాజ్యసభలో వందేమాతరంపై చర్చ

  • నేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చ
  • వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.


కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..

  • కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలు
  • ఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement