లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాసం | No-confidence motion against Lok Sabha Speaker fails | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాసం

Mar 11 2026 6:30 PM | Updated on Mar 11 2026 6:38 PM

No-confidence motion against Lok Sabha Speaker fails

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు. అయినప్పటీకీ అవిశ్వాస తీర్మాణానికి కావాల్సిన సభ్యుల బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement