breaking news
loksabha speaker
-
ఓం బిర్లా (లోక్‌సభ స్పీకర్) రాయని డైరీ
ఇల్లు, వంటిల్లు చేజారిపోకూడదు. ఇల్లు చేజారితే లోన్లు, ఈఎంఐల స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. వంటిల్లు చేజారితే ఫుడ్ డెలివరీ యాప్‌ల పాలౌతుంది. ఇల్లు అదుపు తప్పితే అప్పులు, వంటిల్లు ఆర్డర్ తప్పితే అనారోగ్యాలు! సభ కూడా చేజారినట్లే నాకు అనిపిస్తోంది. సమావేశాలు 1న మొదలయ్యాయి. 19న ముగుస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని అధికరణాలు, ఆదేశిక సూత్రాలతో పని లేకుండా శీతకాలం వచ్చి వెళ్లినట్లుగానే సమావేశాలూ ఒక రుతువులా మాత్రమే ప్రారంభమై ఒక రుతువులా మాత్రమే పూర్తయ్యే కాలం వచ్చేసిందా?! సెషన్స్ ఇంకో 5 రోజులే ఉన్నాయి. బిల్లులు ఇంకా 10 పెండింగులో ఉన్నాయి. 150 ఏళ్ల వందేమాతరం, ఎస్ఐఆర్, ఈవీఎంలు... ఈ మూడే, సభలో రెండు వారాలుగా డిబేట్లు!బంకిం ఛటర్జీని ప్రధాని ‘‘బంకిం దా’’ అనటం అహంకారం తప్ప మరొకటి కాదని తృణమూల్ ఎంపీలు! బెంగాల్లో అందరూ గౌరవంగా ‘బంకిం బాబు’ అంటారు కనుక ప్రధాని కూడా ‘బంకిం బాబు’ అనే అనాలని వాళ్ల పట్టు. మొత్తానికి ప్రధాని చేత ‘బంకిం బాబు’ అనిపించారు. ఒక సభ్యుడు ‘వందే మాతరం’ అనబోయి రెండుసార్లు ‘వందే భారత్’ అన్నారు. ‘‘మాట్లాడే ముందు నాలుగో తరగతి హిస్టరీ టెక్స్›్ట బుక్ ఒకసారి చూసుకొని రావాలి’’ అని వెక్కిరింపులు! నోరు జారటం, మాట జారటం ఒకటేనా?! మనసులో ఉన్నదే నోట్లోంచి వస్తుంది. మాటగా జారింది మనసు లోనిది ఎలా అవుతుంది?! మాట తడబాట్లను కూడా నవ్వుతూ తీసుకోలేనంత సీరియస్‌గా అయిపోతు న్నామా... చలిలో బిగుసుకుపోయినట్లు, మంచులో కూరుకుపోయినట్లు. సెషన్స్‌లో నేనూ ఒకర్ని హర్ట్ చేయవలసి వచ్చింది! వ్యవసాయ మంత్రి ప్రసంగిస్తుంటే, సభలో ఒక సభ్యుడు ‘లంచ్’ చేస్తూ నాకు కనిపించారు. ‘‘ఇక్కడ ఈటింగ్ ప్రోగ్రామ్ పెట్టకండి. ప్లేట్లు తీసేయండి’’ అని కాస్త హార్ష్ గానే అన్నాను. నిబంధనలు ఎలా ఉన్నా, నేనే కాస్త సౌమ్యంగా చెప్పి ఉండవలసిందా! లంచ్ టైమ్‌లో లంచ్, డిబేట్ టైమ్‌లో డిబేట్, క్వొశ్చన్ అవర్‌లో క్వొశ్చన్స్ ఉండాల్సిందే. కొన్నిసార్లు లంచ్ టైమ్‌లోకి డిబేట్ టైమ్ వచ్చేసి, డిబేట్ టైమ్‌లోకి లంచ్ టైమ్ చొరబడుతుంది.సభలో ఆ సభ్యుడు లంచ్ చేయటం కన్నా, సభలో ఆ సభ్యుడిని అందరి ముందూ ‘‘తినటం ఆపేయండి’’ అని నేను అనటమే సభా మర్యాదను తప్పినట్లుగా అనిపించింది నా మనసుకు. శుక్రవారం సెషన్స్‌లో ఒక సభ్యుడు హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ‘‘మాననీయ్ అధ్య„Š మహోదయ్...’’ అని ఆగారు!‘‘చెప్పండి’’ అన్నాను.‘‘మాననీయ్ అధ్యక్ష్ మహోదయ్... 2019 లోనే భారత ప్రభుత్వం ఇ–సిగరెట్లను బ్యాన్ చేసింది కదా!’’ అన్నారు ఆ సభ్యుడు. ‘‘ఆ... చేసింది’’ అన్నాను. ‘‘భారత ప్రభుత్వం బ్యా¯Œ చేసినప్పటికీ సభలో ఇ–సిగరెట్లు తాగటానికి మీరు గానీ అనుమతి ఇచ్చారా?’’ అని ఆయన ప్రశ్న! ‘‘ఇవ్వలేదు కానీ, మీరు విషయం చెప్పండి’’ అన్నాను.‘‘సభ లోపల టీఎంసీ సభ్యులు కొందరు ప్రతిరోజూ ఇ–సిగరెట్ తాగుతున్నారు. వెంటనే వారిని తనిఖీ చేయించండి’’ అని ఆదేశం! నేను నవ్వాపుకోలేనంతగా నన్ను ఆదేశించారు ఆ సభ్యుడు! స్పీకర్నే సభ్యులు ఆదేశిస్తున్నారంటే, స్పీకర్‌ని పక్కన పెట్టేసి సభ్యులే డిబేట్లు పెట్టేసుకుంటూ సభలో రౌండ్లు కొట్టేస్తున్నారంటే... సభ కూడా చేజారిన ఇల్లుగానో, వంటిల్లుగానో అయిపోతోందా?! ‘హౌస్’ కాస్తా ‘హోమ్’గా మారిపోతోందా?! - మాధవ్ శింగరాజు -
ప్రతిపక్ష పార్టీలపై వివక్ష తగదు: కాంగ్రెస్ ఎంపీ లేఖ
ఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలపై చూపెడుతున్న వివక్షపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారాయన. లోక్‌సభ స్పీకర్‌కు ఆయన రాసిన లేఖలో సారాంశం ఇలా ఉంది.. లోక్‌సభలో ఉపసభాపతి నియామకం జరగకపోవడం2019 నుండి ఉపసభాపతి పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఉపసభాపతి లేకపోవడం ఒక ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది, ఇది సభ నిష్పక్షపాతతను మరియు పనితీరును ప్రభావితం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడంప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత వేదికపై నిలబడినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని పదేపదే పట్టించుకోవడం లేదు. ఇది గత పార్లమెంటరీ ప్రవర్తనలకు భిన్నంగా ఉండటమే కాకుండా, సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తగ్గిస్తుంది. ప్రతిపక్ష నేతలు మరియు ఎంపీల మైక్రోఫోన్లు ఆఫ్ చేయడంప్రతిపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం ఒక సాధారణ ఘటనగా మారిపోయింది, అయితే అధికార పక్ష సభ్యులు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది. సభానిర్వహణ సలహా కమిటీ (BAC) నిర్ణయాలను పట్టించుకోకపోవడంప్రభుత్వం BACలోని ఇతర పక్షాలతో సంప్రదించకుండా, వారికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత వారం గౌరవ ప్రధానమంత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సభలో ప్రవేశపెట్టడం ఇందులో భాగమే.5)బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించడం: ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బడ్జెట్ కేటాయింపులు మరియు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చల నుండి మినహాయిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను తగ్గిస్తోంది.193వ నియమం ప్రకారం చర్చల్లో కోతఅత్యవసరమైన ప్రజా సమస్యలపై ఓటింగ్ లేకుండా చర్చించేందుకు అనుమతించే 193వ నియమాన్ని ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారు.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో జోక్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేసి నిపుణులకు చట్టపరమైన పర్యవేక్షణను అందించాలి. అయితే, స్పీకర్ కార్యాలయం కమిటీ నివేదికల్లో సవరణలు సూచించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాటి స్వతంత్రత దెబ్బతింటోంది.వాయిదా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం మరియు తిరస్కరించడంగతంలో జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే తిరస్కరిస్తున్నారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోంది.ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలను నిర్లక్ష్యం చేయడంప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కార్యనిర్వాహక అధికారానికి బయట ఉన్న ఎంపీలు చట్టాలను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, వీటిపై తగినంత చర్చకు సమయం ఇవ్వకపోవడ వల్ల చట్టసభలో చర్చలు కుదించబడుతున్నాయి.సంసద్ టీవీప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు మరియు ఎంపీలు మాట్లాడినప్పుడు లోక్ సభ అధికారిక టీవీ ఛానల్ సంసద్ టీవీ వారి ముఖాలను చూపకుండా కెమెరా యాంగిల్‌ను మార్చడం ఒక సర్వసాధారణ ఘటనగా మారింది. ఇది పార్లమెంటరీ కార్యకలాపాల పారదర్శకతను దెబ్బతీస్తుంది. సభా కమిటీకమిటీల ఏర్పాటు మరియు ఛైర్మన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సంప్రదింపుల కమిటీ సమావేశాలు: సంప్రదింపుల కమిటీ సమావేశాలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అనేక కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా క్రమం తప్పకుండా సమావేశం కావడం లేదు.ఈ పరిణామాలు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి మరియు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ సవరణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, పార్లమెంటరీ ప్రమాణాలకు కట్టుబడటాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. -
రాహుల్ గాంధీపై ప్రివిలేజ్‌మోషన్
న్యూఢిల్లీ:ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.వాస్తవాలను వక్రీకరించిన భారత్ పరువు పోయేలా మాట్లాడినందుకుగాను రాహుల్‌గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రక్రియ ప్రారంభించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు దూబే స్పీకర్‌కు ఒక లేఖ రాశారు.మేక్ ఇన్ ఇండియా ఫెయిలనందుకే చైనా భారత్‌ను ఆక్రమించిందని రాహుల్ అవాస్తవాలు మాట్లాడారని స్పీకర్‌కు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు.పార్లమెంట్ వేదికగా దేశం పరువు తీసేలా రాహుల్ మాట్లాడరని ఆరోపించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని దూబే గుర్తు చేశారు.కాగా, లోక్‌సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. చైనా భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిందన్నారు. ఇంతేగాక విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనపైనా రాహుల్ విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపైనా రాహుల్ మాట్లాడారు. రాహుల్ ప్రసంగంలోని ఈ అంశాలన్నీ వివాదాస్పదమయ్యాయి.


