బంగ్లాదేశ్‌కు లోక్‌సభ స్పీకర్.. రీజన్ అదే..! | Lok Sabha Speaker to attend Bangladesh PM swearing ceremony | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు లోక్‌సభ స్పీకర్.. రీజన్ అదే..!

Feb 15 2026 7:10 PM | Updated on Feb 15 2026 7:29 PM

Lok Sabha Speaker to attend Bangladesh PM swearing  ceremony

బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార వేడుకకు భారత్ హాజరుకానుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.  ఇండియా తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు.

ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రహ్మాన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారం అక్కడి పార్లమెంటులోని సౌత్‌ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మన దేశంలో సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది.

ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో "బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది." అని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ దేశంలో రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి అధికారం సాధించింది. 297 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగగా 209 సీట్లు సాధించింది.

అయితే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల బీఎన్‌పీ నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు సైతం భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆమె అంతిమ యాత్రకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అయితే బీఎన్‌పీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీ బీఎన్‌పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు. అందుకు ఆ పార్టీ సైతం ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.

అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బంగ్లాదేశ్‌తో సత్సంబంధాల దిశగా ప్రయత్నిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement