breaking news
India
-
మరింత మెరుగైతేనే!
పదేళ్ల తర్వాత దేశంలో అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్ నిర్వహించాలని పట్టుదలగా ఉన్న కేంద్ర ప్రభుత్వం... అప్పటి వరకు దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించాలని భావిస్తోంది. వచ్చే దశాబ్దకాలంలో అంతర్జాతీయ పోటీల్లో నిలకడైన ప్రదర్శనలు చేస్తూ... 2036 ఒలింపిక్స్ కల్లా ప్రపంచంలో టాప్–10 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలవాలని దృఢనిశ్చయంతో ఉంది. కానీ తాజా ఆసియా క్రీడల్లో భారత్‌కు లభించిన పతకాలు, కనబరిచిన ప్రదర్శన చూస్తే మాత్రం లక్ష్యానికి చాలా దూరంలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసారి ఆసియా క్రీడల సన్నాహాల కోసం భారత క్రీడాకారులపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏకంగా రూ. 702 కోట్లు వెచ్చించింది. అందుబాటులో ఉన్న అత్యుత్తమ సౌకర్యాలు కల్పించింది. కోరుకున్న చోట శిక్షణకు పంపించింది. మేటి కోచ్‌లను సమకూర్చింది. దాంతో వరుసగా రెండోసారి పతకాల్లో భారత్ ‘సెంచరీ’ కొడుతుందని అందరూ భావించారు. కానీ భారత క్రీడాకారులు జపాన్ ఆసియా క్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారనే చెప్పాలి.2023 ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 106 పతకాలు సాధించగా... ఈసారి మనకు 85 పతకాలే వచ్చాయి. క్రితంసారి కంటే 21 పతకాలు తక్కువగా వచ్చాయి. షూటర్లు, అథ్లెట్లు, షట్లర్లు అంచనాలను అందుకోలేకపోయారు. క్రితంసారి సాధించిన నాలుగో స్థానాన్ని భారత్ నిలబెట్టుకున్నా... భవిష్యత్‌లో ఆసియాలో టాప్–3లోకి రావాలంటే మాత్రం భారత్ తమ ప్రదర్శనకు మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. –సాక్షి, క్రీడావిభాగం గత ఆసియా క్రీడల్లో పతకాల శతకం నమోదు చేసిన భారత్... తాజా ఏషియన్ గేమ్స్‌లో మాత్రం సెంచరీకి చేరువగా రాలేకపోయింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తంగా 85 పతకాలు సాధించింది. భారత్‌తోపాటు ఉజ్బెకిస్తాన్ కూడా 21 స్వర్ణాలు సాధించినా... రజత, కాంస్య పతకాల్లో భారత్‌దే పైచేయి కావడంతో గత నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. గత ఆసియా క్రీడలతో పోల్చుకుంటే ఈసారి మనకు 21 పతకాలు తక్కువ లభించాయి. కేవలం ఆసియా క్రీడల్లోనే కాకుండా ఒలింపిక్స్‌లోనూ పతకాల పట్టికలో చైనా, జపాన్, దక్షిణ కొరియా దూసుకెళ్తుంటే... 2036 కల్లా ప్రపంచంలోనే టాప్–10కు చేరాలనుకుంటున్న భారత్ మాత్రం ఆశించిన పురోగతి సాధించలేకపోతోంది. ఈసారి క్రీడల్లో మనవాళ్లు 100 పతకాల్లోపే పరిమితం కావడం వెనక ప్రధానంగా అథ్లెటిక్స్, షూటింగ్ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య జపాన్‌లో అడుగుపెట్టిన మన షూటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. 30 మంది షూటర్ల బృందం కేవలం 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో 15 పతకాలకే పరిమితమైంది. హాంగ్జౌ క్రీడల్లో మన షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు సాధించడంతోనే భారత్ సెంచరీ మార్క్ అందుకోగలిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్ రిక్తహస్తాలతో వెనుదిరగగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు. ట్రాప్‌లో నీరూ ధండా మూడు పతకాలతో మెరవడం సంతృప్తినివ్వగా... హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయ్ ఆకట్టుకున్నాడు. ‘పరుగు’ మందగమనం... ఇక అథ్లెటిక్స్‌లో కూడా భారత్ పతక వేట మందగించింది. పోటీలు ప్రారంభానికి ముందే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా ఏషియన్ గేమ్స్‌కు దూరం కాగా... గత రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఈసారి వెండికే పరిమితమయ్యాడు. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, హైజంప్‌లో సర్వేశ్ కుశారే కూడా రజతాలే సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రస్తుత ఆసియా చాంపియన్, క్రితంసారి రజతం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఈవెంట్‌కు ముందురోజు తప్పుకోగా... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పతకం ఆశించిన అవినాశ్ సాబ్లే గాయంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హాంగ్జౌ ఏషియన్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లు 6 స్వర్ణాలతో అదరగొట్టగా... తాజా క్రీడల్లో మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, పూవమ్మ, ప్రాచీ, విత్యా బృందం నెగ్గిన పసిడి మాత్రమే భారత్‌కు లభించిన ఏకైక స్వర్ణం. 9 రజతాలు, 14 కాంస్యాలతో ఓవరాల్‌గా 24 పతకాలు సాధించిన మన అథ్లెట్స్ మరింత మెరుగవ్వాలి. ఆసియా క్రీడల సందర్భంగా క్రీడా గ్రామం లేకపోవడం... సరైన వసతి సదుపాయాలు కల్పించకపోవడం... క్రీడలకు ముందే పూర్తిస్థాయి సన్నద్ధత సాధ్యం కాకపోవడం... పోటీల వేదికకు చేరుకునేందుకు సుదూర ప్రయాణాలు, మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య కోలుకునేందుకు తగినంత సమయం లేకపోవడం ఇలా ఆటల సందర్భంగా ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ... పతకాల సంఖ్య తగ్గడం వెనక స్పష్టమైన కారణాలను మాత్రం నిజాయతీగా విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. » ఆర్చరీలో మాత్రం మనవాళ్లు అంచనాలను అందుకున్నారు. టీనేజ్ సంచలనం కుంకుమ్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం నెగ్గిన భారత ఆర్చర్‌గా రికార్డు సృష్టించగా... ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో మన ఆర్చర్లు 9 పతకాలతో మెరిశారు. గత ఆసియా క్రీడల్లోనూ 9 పతకాలే సాధించారు. » జట్టు క్రీడలైన క్రికెట్, హాకీ, కబడ్డీలో మన పురుషుల, మహిళల జట్లు బంగారు పతకాలతో భళా అనిపించాయి. పనిలోపనిగా హాకీ జట్లు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాయి. బాక్సర్లు 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో ఫర్వాలేదనిపించారు. » రెజ్లింగ్‌లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు దక్కినా... మహిళల విభాగంలో ఒక్క పతకమే రావడం నిరాశ కలిగించింది. » గోల్ఫ్‌లో ప్రణవి రికార్డు పసిడితో మెరవగా... వుషు, కురాశ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, సాఫ్ట్ టెన్నిస్, సెపక్తక్రా, రోయింగ్‌లో ఒక్కో పతకం దక్కింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రజతంతో ఆసియా క్రీడల్లో పతక బోణీ కొట్టింది. » నాలుగు దశాబ్దాలుగా తప్పక పతకం నెగ్గుతూ వస్తున్న టెన్నిస్‌లో మనవాళ్లు ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బ్యాడ్మింటన్‌లో ఈసారి టీమ్ విభాగంలో కాంస్యం దక్కగా... వ్యక్తిగత విభాగంలో ఒక్క పతకం కూడా రాలేదు. 36 ఈ ఆసియా క్రీడల్లో భారత్ బరిలోకి దిగిన క్రీడాంశాలు20 భారత్ పతకాలు గెలిచిన మొత్తం క్రీడాంశాలు16 భారత్ ప్రాతినిధ్యం ఉన్నా ఈసారి ఒక్క పతకం సాధించని క్రీడాంశాలు (స్విమ్మింగ్, కయాకింగ్–కనోయింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఈ–స్పోర్ట్స్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, కరాటే, రగ్బీ, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్, టెన్నిస్, తైక్వాండో, టెక్బాల్, వాలీబాల్)4 భారత్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించిన క్రీడాంశాలు (ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్) -
క్రికెట్ నుంచి హాకీ వరకు స్వర్ణాల మోత
-
హసీనా రాక వెనుక.. భారత్ కీలక వివరణ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టులో తన ప్రభుత్వం కూలిపోవడంతో దేశం విడిచి వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశంగా ఆ సమయంలో హసీనాకు ఆశ్రయం కల్పించడం తమ బాధ్యతేనని ఆయన పేర్కొన్నారు. అప్పటికి హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగానే ఉన్నారని, అందువల్ల భారత్‌కు పెద్దగా ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ఢాకాలో శనివారం జరిగిన ‘బే ఆఫ్ బెంగాల్ కన్వర్సేషన్ 2026’ కార్యక్రమంలో త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ సమయంలో ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగానే ఉన్నారు. పొరుగు దేశంగా వాస్తవ పరిస్థితిని అంగీకరించి, ఆమెకు ఆశ్రయం ఇవ్వడం మా బాధ్యత’ అని ఆయన అన్నారు. ఒకవేళ భారత్ ఆమెకు అనుమతి ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేమన్నారు.చట్టపరమైన ప్రక్రియలో..హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించే విషయంలో భారత్ ఎలాంటి గడువును నిర్ణయించలేదని త్రివేది స్పష్టం చేశారు. ఆమె అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థన ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలో పరిశీలనలో ఉందన్నారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. అప్పగింత ప్రక్రియ చట్టబద్ధమైనదని, నిర్దిష్ట విధానం ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. అందువల్ల హసీనా తిరిగి వెళ్లే తేదీని ఎవరూ నిర్ణయించలేరని పేర్కొన్నారు.2024 ఆగస్టు 5న..షేక్ హసీనాను భారత వాయుసేన లేదా భారత సైన్యం భారత్‌కు తీసుకురాలేదని కూడా త్రివేది స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన విమానం ద్వారా ఆమె భారత్‌కు చేరుకున్నారు. అప్పట్లో నిరసనకారులు ఆమె అధికారిక నివాసం వైపు కదులుతున్న సమయంలో బంగ్లాదేశ్ సైన్యం ఆధ్వర్యంలోని భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తరలించారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న విషాదకర పరిస్థితుల కారణంగానే ఈ పరిణామాలు జరిగాయని, ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా మళ్లీ తలెత్తకూడదని త్రివేది అన్నారు.మహమ్మద్ యూనస్ నేతృత్వంలో..హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం 2024 ఆగస్టు 8న బాధ్యతలు చేపట్టింది. సుమారు ఏడాదిన్నర పాటు అది దేశాన్ని పాలించింది. హసీనా అప్పగింత డిమాండ్, మైనారిటీలపై దాడులపై ఆందోళనలు, చైనాతో బంగ్లాదేశ్ సంబంధాలు పెరగడం వంటి అంశాలతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు యూనస్ ప్రభుత్వ కాలంలో గణనీయంగా దెబ్బతిన్నాయి. 2025లో హసీనాపై ప్రత్యేక న్యాయస్థానం ఆమె గైర్హాజరీలో విచారణ జరిపి మరణశిక్ష విధించింది. ఆమె పార్టీ అవామీ లీగ్‌ను కూడా తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసి, దౌత్యపరమైన నోట్ ద్వారా హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరింది.భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం కూడా అవామీ లీగ్‌పై నిషేధాన్ని కొనసాగిస్తూ, హసీనాను అప్పగించాలని భారత్‌ను పలుమార్లు కోరింది. ఈ అంశం భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతకు కారణమైంది. రెహ్మాన్ భారత్ పర్యటనపై కూడా దీని ప్రభావం పడింది. గత నెల జరిగిన బ్రిక్స్ సదస్సుకు భారత్ రెహ్మాన్‌ను ఆహ్వానించింది. ఫిబ్రవరిలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ ప్రత్యేక ద్వైపాక్షిక ఆహ్వానం ఇచ్చింది. అయితే ఆయన బ్రిక్స్ సదస్సుకు హాజరుకాలేదు. ఇప్పటివరకు న్యూఢిల్లీకి కూడా రాలేదు. ఆయన భారత్ పర్యటనపై చర్చల్లో పురోగతి సాధించేందుకు సానుకూలంగా ఉన్నామని బంగ్లాదేశ్ పేర్కొన్నప్పటికీ, తేదీ ఖరారు కాలేదు.డిసెంబర్లో స్వయంగా బంగ్లాదేశ్‌కు..ఇదిలా ఉండగా, ఆగస్టు 5న న్యూఢిల్లీ నుంచి హసీనా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. డిసెంబర్లో తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రజలతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో స్వదేశానికి వెళ్తానని చెప్పారు. జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ తాను వెనక్కి తగ్గబోనని ఆమె పేర్కొన్నారు. భారత మీడియాకు ఇచ్చిన తొలి టెలిఫోన్ ఇంటర్వ్యూలోనూ హసీనా ఇదే విషయాన్ని వెల్లడించారు. తన అప్పగింతను తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటనతో ముడిపెట్టడాన్ని ఆమె ప్రశ్నించారు. డిసెంబర్లో తానే స్వయంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని చెప్పారు. అలాగే, దేశంలో విద్యుత్, గ్యాస్ కొరత, ఎరువుల కొరత, జీవన వ్యయ సంక్షోభం ఉన్న సమయంలో చైనా నుంచి 2.3 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: నీట్ పేపర్ లీక్‌లో బిగ్ ట్విస్ట్.. అధికారులపై కేసు లేదా? -
భారత్ ప్రతిపాదనను పరిశీలిస్తాం
కీవ్: రష్యాతో కాల్పుల విరమణ విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు. కాల్పుల విరమణ అంశంలో తమకు భారత్, టర్కీ, ఈజిప్‌్ట, అమెరికా నుంచి మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. వాటిలో భారతదేశ ప్రతిపాదన అత్యంత విస్తృతమైనదిగా, ఉపయుక్తమైనదిగా అభివర్ణించారు. ఇంధన మౌలిక సదుపాయాలు, నల్ల సముద్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే కాల్పుల విరమణను పరిశీలిస్తామని అన్నారు. ఏ ఒప్పందమైనా సరే కేవలం పోరాట కార్యకలాపాలనే కాకుండా, ఇంధన, ఓడరేవు మౌలిక సదుపాయాలపై దాడులను, అలాగే నల్ల సముద్రంలోని పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. సిబిహా శుక్రవారం కీవ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేలాది మంది పౌరుల బలైపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. యుద్ధాన్ని ముగించాలంటూ ఉక్రెయిన్, రష్యాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఉక్రెయిన్ ఘర్షణకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
హసీనా అప్పగింతకు భారత్ గడువు ఇవ్వలేదు
ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాను ఫలానా గడువులోగా తిరిగి అప్పగిస్తామంటూ బంగ్లాదేశ్‌కు భారత్ ఎటువంటి హామీని ఇవ్వలేదని ఆ దేశంలో భారత రాయబారి దినేశ్ త్రివేది స్పష్టం చేశారు. హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ పంపించిన వినతిని భారత ప్రభుత్వం న్యాయకోణంలో పరిశీలిస్తోందని వెల్లడించారు. బంగ్లా రాజధాని ఢాకాలో శనివారం ఓ సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదవీచ్యుత ప్రధాని హసీనాను అప్పగించాలంటూ బంగ్లా ప్రభుత్వం భారత్‌ను పదేపదే కోరిన విషయం ప్రస్తావనకు రాగా త్రివేది ఈ మేరకు స్పందించారు. ‘అప్పగింతకు ఒక న్యాయ పరమైన ప్రక్రియ ఉందని, ఆ కోణంలోనే వినతిని పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం కూడా పదే పదే సమాధానమిస్తూనే ఉంది’అని వివరించారు. అంతేకాదు, ఆమెను భారత వైమానిక దళం కానీ, భారత ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్ నుంచి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. ‘ఆ సమయంలో, ఆమె ఇంకా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఆ విషయంలో మాకు వేరే మార్గం లేకపోయింది. పరిస్థితిని బట్టి మనం అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని అంగీకరించడం పొరుగుదేశంగా మా బాధ్యత’అని త్రివేది పేర్కొన్నారు. ‘మాకు వేరే ప్రత్యామ్నాయం ఏముంది? మీరు రావొద్దు. ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వం అని చెప్పి ఉంటే, పరిణామాలు ఎలా ఉండేవో’అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో 2024 ఆగస్ట్‌లో హసీనా(79) ప్రభుత్వం పడిపోయింది. ఆమె అప్పట్నుంచి భారత్‌లో ఉంటున్నారు. -
డ్రగ్స్ స్మగ్లర్ నవప్రీత్ సింగ్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్, డ్రగ్స్ రవాణా ముఠా నాయకుడు నవప్రీత్ సింగ్‌ను దర్యాప్తు సంస్థలు టర్కీ నుంచి భారత్‌కు రప్పించాయి. నవప్రీత్ తరలింపు ఆపరేషన్‌లో పాల్గొన్న దర్యాప్తు సంస్థలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. ఈ ఘటనను డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపడంలో మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయంగా అభివర్ణించారు. నవప్రీత్ నకిలీ గుర్తింపుతో టర్కీలో మకాం వేశాడు. అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌లోకి హెరాయిన్, మెత్ వంటి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన భారత దర్యాప్తు సంస్థలు అతడి నెట్‌వర్క్‌ను ఛేదించాయి. టర్కీలో నకిలీ గుర్తింపును బట్టబయలు చేసి, స్థానిక అధికారుల సహకారంతో భారత్‌కు రప్పించాయి. ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ పోలీసు విభాగం స్పెషల్ సెల్ అతడిని అరెస్టు చేసింది. శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించారు. దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ నెట్‌వర్క్‌పై నిర్వహించిన దర్యాప్తులో నవప్రీత్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున పట్టుబడిన హెరాయిన్ కేసు దర్యాప్తులో నవప్రీత్ సింగ్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. పంజాబ్‌లోని అమృత్సర్ పోలీసులు ఛేదించిన నార్కో–హవాలా రాకెట్‌లోనూ అతడి పాత్ర ఉన్నట్లు తేల్చారు. అమృత్సర్ ఆపరేషన్‌లో 1.10 కిలోల హెరాయిన్, రూ.కోటికి పైగా హవాలా నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసుల మూలాలను వెతుక్కుంటూ వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థలు చివరకు టర్కీలో ఉన్న ప్రధాన సూత్రధారి నవప్రీత్ సింగ్‌ను పట్టుకున్నాయి. 2029 నాటికి డ్రగ్స్ భూతం అంతం దేశంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ భూతాన్ని సమూలంగా నాశనం చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ భద్రత, యువత భవిష్యత్తును కాపాడేందుకు దర్యాప్తు సంస్థలు అహరి్నశలూ శ్రమిస్తున్నాయని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
21 స్వర్ణాలు... 27 రజతాలు... 37 కాంస్యాలు
ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలను అందుకోలేపోయింది. గత క్రీడల్లో సాధించిన 106 పతకాలకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత బృందం నాటికంటే 21 పతకాలు తక్కువగా సాధించింది. స్వర్ణాల సంఖ్య కూడా తగ్గినా... ఓవరాల్‌గా నాలుగో స్థానం నిలబెట్టుకుంటుందా లేక మరో స్థానం తగ్గుతుందా అనేది నేడు తేలనుంది. అయితే ఈ క్రీడల్లో తొలి 11 రోజుల పాటు 6 స్వర్ణాలకే పరిమితమై బాగా వెనుకబడినట్లు అనిపించిన దశలో ఒక్కసారిగా పుంజుకొని వరుస పతకాలు గెలుచుకోవడంతో భారత్‌కు ఊరట దక్కింది. చివరి 3 రోజుల్లోనే మన ఖాతాలో 15 స్వర్ణాలు చేరడం విశేషం. భారత బృందం బరిలోకి దిగిన ఆఖరి రోజు శనివారం కూడా 5 స్వర్ణ పతకాల సంబరాన్ని అందించింది. మహిళల ఆర్చరీ రికర్వ్‌లో కుంకుమ్ మొహద్ చారిత్రాత్మక గోల్డ్ గెలుచుకోగా, రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్, గోల్ఫ్‌లో ప్రణవి బంగారు ఆనందం పంచారు. వీటికి తోడు ఊహించినట్లుగానే క్రికెట్, హాకీ పురుషుల జట్లు పసిడి పతకాలను గెలుచుకున్నాయి. మరో 2 రజతాలు, 2 కాంస్యాలతో మన ఆటకు 9 పతకాలతో ముగింపు లభించింది.హాకీలో ఐదోసారి... ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టు ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. గత ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణం గెలిచిన మన టీమ్ దానిని నిలబెట్టుకోవడంలో తొలిసారి సఫలమైంది. ఫైనల్లో భారత్ 5–1 గోల్స్ తేడాతో మలేసియాను చిత్తు చేసింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 57వ నిమిషాల్లో), జుగ్రాజ్ సింగ్ (23వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (42వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (54వ నిమిషంలో) గోల్స్ సాధించగా... మలేసియా తరఫున షెలో సిల్వరస్ (14వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టాడు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది వరుసగా రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, టీమ్‌లో అందరికంటే సీనియర్ ప్లేయర్ అయిన మన్‌ప్రీత్ సింగ్ మూడోసారి స్వర్ణం నెగ్గిన జట్టులో భాగంగా ఉండటం విశేషం. భారత్ ఆసియా క్రీడల్లో 1966, 1998, 2014, 2023లలో స్వర్ణాలు సాధించింది. తాజా విజయంతో మన టీమ్ 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది. గత రెండు ఒలింపిక్ క్రీడల్లో భారత్ వరుసగా కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టుకు హాకీ ఇండియా (హెచ్ఐ) నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి రూ.11 లక్షలు చొప్పున, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ. 5.50 లక్షల చొప్పున అందించనుంది. -
ముగిసిన ఆసియా గేమ్స్.. భారత్‌కు నాలుగో స్థానం
ఆసియా క్రీడల్లో భారత్ అధ్యాయం ముగిసింది. శనివారంతో అన్ని ఈవెంట్లను పూర్తి చేసుకున్న భారత్ 85 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి గేమ్స్‌ను ముగించింది. ఈ 85 పతకాల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలున్నాయి. అయితే 2023 ఆసియా గేమ్స్‌లో వంద పతకాల మార్క్‌ను దాటిన భారత్ ఈసారి ఆ మార్క్‌కు 15 పతకాల దూరంలో నిలిచిపోయింది. అయితే కబడ్డీ, హాకీ, క్రికెట్లో మాత్రం రెండు విభాగాలు (మహిళలు, పురుషులు) స్వర్ణాలతో మెరవగా, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగంలోనూ మనోళ్లు అదరగొట్టారు. ఇక చివరిరోజైన శనివారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం వచ్చి చేరాయి. 2023లో నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ 106 పతకాలు సాధించింది. ఈసారి కూడా నాలుగో స్థానంలోనే నిలిచినప్పటికీ పతకాలు మాత్రం బాగా తగ్గిపోయాయని చెప్పొచ్చు. ఇక ఈసారి క్రీడల్లో అత్యధిక పతకాలతో చైనా, జపాన్, దక్షిణ కొరియాలు వరసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 85 పతకాలతో భారత్ నాలుగో ప్లేస్లోఉండగా.. 56 మెడల్స్ గెలిచిన ఉజ్బెకిస్థాన్ ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. ఇక 2030లో జరగనున్న ఆసియా గేమ్స్‌కు ఖతార్‌లోని దోహా వేదిక కానుంది.అత్యధిక పతకాలు సాధించిన టాప్-5 దేశాలు..👉చైనా – 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలు – 341 పతకాలు👉జపాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 269 పతకాలు👉దక్షిణ కొరియా – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 150 పతకాలు👉భారత్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 85 పతకాలు👉ఉబ్జెకిస్థాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 56 పతకాలు 🇮🇳 INDIA FINISH 4TH IN THE MEDAL TALLY AT THE ASIAN GAMES 2026! 21 GOLD 🥇27 SILVER 🥈 37 BRONZE 🥉 TOTAL - 85 MEDALS A campaign filled with Olympic quotas, historic moments, heartbreaks and disappointments. But surely, one that we’ll remember for a long time.After a… pic.twitter.com/WBNH9R8Dr7— The Khel India (@TheKhelIndia) October 3, 2026 -
ఆసియా క్రీడల ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం
-
ఆసియా గేమ్స్ లో భారత్ జోరు.. 6 స్వర్ణాలు కైవసం
-
మన ‘బుల్లెట్’ వేగం 250 కిలోమీటర్లే!
సాక్షి, హైదరాబాద్: భారత్ త్వరలో బుల్లెట్ రైలు వసతి ఉన్న దేశాల జాబితాలో చేరనుంది. దేశంలో తొలి బుల్లెట్ రైలు కారిడార్ అహ్మదాబాద్–ముంబై మధ్య వేగంగా సిద్ధమవుతోంది. 95 కి.మీ. నిడివి కలిగిన ఈ కారిడార్‌లో సరిగ్గా మరో పది నెలల్లో బుల్లెట్ రైలు పరుగులెట్టనుంది. అయితే బుల్లెట్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో దూసుకెళతాయని, ప్రతిపాదిత కారిడార్లు సిద్ధమైతే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని అంటున్నా.. ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. త్వరలో పట్టాలెక్కనున్న బుల్లెట్ రైలు గంటకు 250 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించనుంది. దీంతో అటు బుల్లెట్ రైలుకు తక్కువ...ఇటు వందే భారత్‌కు ఎక్కువ అన్న తరహాలో ‘భారత్ బుల్లెట్’పట్టాలెక్కబోతోంది. హైదరాబాద్‌కు మంజూరైన కారిడార్లు సిద్ధమయ్యేందుకు మరో పదేళ్ల సమయం పట్టనుంది. అప్పటి పరిస్థితిని అంచనా వేయటం ఇప్పుడే సాధ్యం కాదు, కానీ 2032 వరకు మాత్రం మన బుల్లెట్ రైలు వేగం 250 కిలోమీటర్లేనని అంటున్నారు. జపాన్ రైళ్లు వద్దనుకోవడంతో.. దేశంలో బుల్లెట్ రైళ్ల యుగం మొదలవుతున్న వేళ.. ‘దేశీ’హైస్పీడ్ రైలు ప్రాజెక్టును కేంద్రం స్లో అండ్ స్టడీ సూత్రంతో ప్రారంభిస్తోంది. తొలుత 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లే రైళ్లను పట్టాలెక్కించాలని భావించినా, పరిస్థితులు కళ్లెం వేశాయి. భారీ వ్యయంతో కూడిన జపాన్ రైళ్లకు బదులు సొంతంగా బుల్లెట్ రైళ్లను తయారు చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై–అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణంలో జపాన్ సాంకేతిక సహాయం అందిస్తోంది. ఈ కారిడార్‌తో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టబోయే కారిడార్లలో జపాన్ రైళ్లను నడపాలని, ఈ మేరకు రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం తొలుత భావించింది. మనకు సరఫరా చేసేందుకు ఆ దేశం ప్రత్యేకంగా షింకన్సెన్–ఈ 10 రైళ్లను తయారీ చేయనున్నట్టు ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 350 కి.మీ.లు కాగా ఆపరేషనల్ వేగం 320 కి.మీ.గా ఉంటుందని పేర్కొంది. అయితే మనం ఒక్కో రైలు సెట్‌ను కొనాలంటే దాదాపు రూ.750 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు దేశంలో వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో కేంద్రం మనసు మార్చుకుంది. వందేభారత్ ఇచ్చిన నమ్మకంతో.. వందేభారత్ పనితీరు ఇచ్చిన నమ్మకంతో సొంతంగా బుల్లెట్ రైళ్ల తయారీ ఆలోచనకొచ్చింది. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగుళూరు భారత్ ఎర్త్ మూవర్స్ లిమెటెడ్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తీసుకున్నాయి. ఇటీవలే రైలు డిజైన్‌కు ఆమోదం రాగా, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో తొలి ప్రొటోటైప్ రైలు సిద్ధమై ట్రయల్స్ ప్రారంభించనుంది. ఈ రైలు తయారీకి ఒక్కో సెట్‌కు రూ.435 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైలు గరిష్ట వేగం 280 కి.మీ. కాగా ఆపరేషనల్ స్పీడ్ 250 కి.మీ.గా తేలింది. తదుపరి ఐదారేళ్ల పాటు ఈ రైళ్లే సేవలందించే అవకాశం ఉంది. ఆ తర్వాత 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బీ35 రకం రైళ్లను కూడా తయారు చేయాలన్నది ఆలోచన. వందేభారత్ విషయంలో మన ప్రయోగం విజయవంతమైనా, అనుకున్న గడువులోపు తయారు చేయటంలో మాత్రం విఫలమయ్యాం. ఇదే పరిస్థితి బుల్లెట్ రైళ్ల విషయంలోనూ జరిగితే, మరికొన్నేళ్లపాటు 250 కి.మీ. వేగంతో ప్రయాణం చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ రైలుతో పెరగనున్న ప్రయాణ సమయం హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్–ముంబై వయా పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్లు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పనుల్లో వేగం అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటే ప్రాజెక్టులు తొందరగానే సిద్ధమవుతాయి. అదే సమయంలో రైళ్ల తయారీ వేగంగా జరగకుంటే, మన కారిడార్లలో కూడా 250 కి.మీ. రైళ్లే పరుగుపెడతాయి. జపాన్ రైళ్లు వస్తాయన్న అంచనాతో ఇప్పటికే ప్రకటించిన ప్రయాణ సమయాలను బేరీజు వేసుకుంటే, హైదరాబాద్–ముంబై సమయం 2.40 గంటలు కాగా భారత్ రైలుతో అది 3.25 గంటలు కానుంది. హైదరాబాద్– బెంగుళూరుకు జపాన్ రైలు ప్రకారం 2 గంటలు అయితే భారత్ రైలు ప్రకారం 2.45 గంటలుగా అవుతుంది. చెన్నై విషయంలో అది 2.15 గంటల నుంచి 2.55 గంటలకు పెరగనుంది. అయితే కారిడార్లు సిద్ధమవటానికి ఇంకా చాలా ఏళ్ల సమయం పట్టనున్నందున ఈ విషయంలో స్పష్టత రావటానికి సమయం పట్టనుంది. -
రెజ్లింగ్...సెయిలింగ్... రెండు రజతాలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. 12వ రోజు గురువారం భారత్ ఖాతాలో మరో ఆరు పతకాలు చేరాయి. పురుషుల గ్రీకో–రోమన్ రెజ్లింగ్‌లో నితేశ్ సివాచ్ రజతంతో మెరవగా...సెయిలింగ్‌లో ఒక రజతం, ఒక కాంస్యం దక్కాయి. మరోవైపు సెమీఫైనల్లో ఓడిన భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు కాంస్య పతకాలతో సంతృప్తి చెందాయి. ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ ఆర్చర్ తిరుమూరు గణేశ్ మణిరత్నం నిలకడైన ప్రదర్శనతో కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం స్వర్ణాల సందడితో పోలిస్తే గురువారం ప్రదర్శన కాస్త నిరాశాజనకమే అయినా... మొత్తం 66 పతకాలతో భారత్ 8వ స్థానం పదిలంగానే ఉంది. 1962 ఆసియా క్రీడల తర్వాత... ఆసియా క్రీడల రెజ్లింగ్ గ్రీకో–రోమన్ విభాగంలో 64 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన నితేశ్ సివాచ్ దురదృష్టవశాత్తూ స్వర్ణాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. గురువారం జరిగిన 97 కేజీల ఫైనల్లో నితేశ్ 0–4 స్కోరుతో యూరీ నకజాటో (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో అతనికి రజత పతకం దక్కింది. 1962 ఆసియా క్రీడల్లో మారుతి మానే రజతం సాధించిన తర్వాత ఈ ఈవెంట్లో మళ్లీ రజతం గెలుచుకున్న తొలి భారత రెజ్లర్‌గా నితేశ్ ఘనత వహించాడు. ఫైనల్లో జపాన్ ప్రత్యర్థి భారత ఆటగాడికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆరంభంలోనే నితీశ్‌ను పడగొట్టి 2–0తో ముందంజ వేసిన నకజాటో...నితేశ్ బలహీన డిఫెన్స్ అదే ప్రదర్శనను పునరావృతం చేసి పూర్తిగా పైచేయి సాధించాడు. మహిళల 62 కేజీల కాంస్య పతక మ్యాచ్‌లో భారత రెజ్లర్ మాన్సి 1–3తో అల్ట్జిన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది.పాలు అమ్ముతూ... పట్టు పడుతూ...హరియాణా రాష్ట్రం పానిపట్ జిల్లాలోని జాగ్సీ గ్రామం నితేశ్ స్వస్థలం. పాలవ్యాపారి అయిన తండ్రి ఆనంద్ సివాచ్ పానిపట్‌లో డెయిరీ నడిపిస్తుంటాడు. జాగ్సీ గ్రామంలో పెద్ద సంఖ్యలో రెజ్లర్లు ఉన్నారు. ప్రతీ ఇంటి నుంచి ఒక పహిల్వాన్ వస్తాడంటూ వారు తమ ఊరి గురించి చెప్పుకుంటారు. ఆనంద్ సివాచ్ స్వయంగా రెజ్లర్ కాకపోయినా... ఆ ఆటపై అతనికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే కొడుకు రెజ్లింగ్‌పై ఆసక్తి చూపిస్తే కాదనలేదు.ఆరంభంలో ఇంటి వద్ద ఉన్న అఖాడాలోనే ప్రాథమికాంశాలు నేర్చుకున్న నితేశ్ 15 ఏళ్ల వయసు వచ్చేవరకు అటు మట్టిలో, ఇటు మ్యాట్‌పై కూడా సాధన చేశాడు. అయితే ఈ క్రమంలో మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. దాంతో తండ్రికి పాల వ్యాపారంలో సహకరించడం మినహా మరో పని లేకపోయింది. ఈ దశలో ఆట వద్దని తండ్రి చెప్పినా అప్పటికే అభిమానం పెంచుకున్న నితేశ్ రెజ్లింగ్‌కు దూరం కాలేకపోయాడు. ఒకవైపు రెజ్లింగ్ చేయాలి, మరోవైపు మోకాలును కాపాడుకోవాలి. దాంతో అతను గ్రీకో–రోమన్ స్టయిల్‌ను ఎంచుకున్నాడు.ఫ్రీస్టయిల్లో శరీరంలోని ఏ భాగంపైనైనా దాడి చేయవచ్చు. కానీ గ్రీకో రోమన్ శైలిలో అలా చేయడం కుదరదు. కొడుకు ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెజ్లింగ్ శిక్షణా కేంద్రంలో అతడిని ఆనంద్ చేర్పించాడు. ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలతో మొదలైన పరంపర నితేశ్ను అంతర్జాతీయ స్థాయి వరకు చేర్చింది. 2018లో అండర్–17 స్థాయిలో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను, తర్వాతి ఏడాది రజతం నెగ్గాడు. 2022లో అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గాడు. గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో అతనికి సీనియర్ విభాగం తొలి అంతర్జాతీయ పతకం (కాంస్యం) దక్కగా, ఈ ఏడాది అదే పోటీల్లో అతను రజతం గెలుచుకోవడం విశేషం. ఇప్పుడు ఆసియా క్రీడల పతకంతో అతని స్థాయి మరింత పెరిగింది. ‘ఫైనల్‌కు చేరినందుకు సంతోషంగా ఉన్నా. మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. సరిగ్గా నా ఓటమికి కారణం ఏమిటో అర్థం కాలేదు. ఇక నా ఆటలో మరింత పట్టు సాధించి రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్, 2028 ఒలింపిక్స్ క్వాలిఫయింగ్పై దృష్టి పెడతా’ అని నితీశ్ చెప్పాడు.గణేశ్ ఖాతాలో మరొకటి... పురుషుల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ తిరుమూరు గణేశ్ మణిరత్నం వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. మూడో స్థానం జరిగిన పోరులో గణేశ్ 149–144తో డాంగ్ కాంగ్ డక్ (వియత్నాం)పై విజయం సాధించాడు. ఐదు సిరీస్‌లలో నాలుగు సార్లు 30/30 స్కోరు నమోదు చేసిన గణేశ్ మరో సిరీస్‌లో 29 స్కోర్ చేశాడు. వియత్నాం ఆర్చరీ పేలవ ప్రదర్శనతో 29, 29, 30, 28, 28 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి ఓటమిపాలయ్యాడు. అంతకుముందు సెమీఫైనల్లో గణేశ్ 144–148తో కిమ్ జోంగో (కొరియా) చేతిలో పరాజయంపాలై ఫైనల్ చేరే అవకాశాలు కోల్పోయాడు. మరోవైపు బుధవారం మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికితకు నిరాశ ఎదురైంది. వ్యక్తిగత విభాగంలో చికిత క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. నూరీసా (ఇండోనేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చికిత 143–144తో ఓడిపోయింది.షూటింగ్లో తడబాటు... చివరిరోజు షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరుకున్నా పతకం నెగ్గలేకపోయాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అనీశ్ 11 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2023 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 22 పతకాలు నెగ్గగా... ఈసారి 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 15 పతకాలే గెలిచింది. -
‘స్కిఫ్’ అందించిన పతకాలు...
సెయిలింగ్‌లో భారత్ రెండు పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. ‘స్కిఫ్’ ఓపెనింగ్ రేస్–9 ఈవెంట్ పురుషుల విభాగంలో భారత్‌కు రజతం, మహిళల విభాగంలో కాంస్యం దక్కాయి. పురుషుల విభాగంలో మొత్తం 9 రేస్‌లలో కలిపి 23 పాయింట్లు సాధించిన భారత ద్వయం ప్రిన్స్ నోబుల్ కురిసిన్కల్–మను ఫ్రాన్సిస్ రెండో స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం తక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. చైనా 16 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా, హాంకాంగ్‌కు కాంస్యం లభించింది. మహిళల విభాగంలో భారత్ 24 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. హర్షిత తోమర్, శీతల్ వర్మ ఇందులో సభ్యులుగా ఉన్నారు. జపాన్ (11)కు స్వర్ణం దక్కగా, హాంకాంగ్ (15)కు రజతం లభించింది. బాల్యమిత్రుల కథ ఒకరికి 20 ఏళ్లు, మరొకరికి 21 ఏళ్లు... ఊహ తెలిసిన దగ్గరి నుంచి ఇద్దరూ కలిసి పడవల్లోనే ప్రయాణిస్తూ పోటీ పడుతున్నారు. పేరుకు వారి మధ్య సోదరసంబంధం (కజిన్స్) ఉంది. కానీ తామిద్దరం అత్యంత ఆత్మీయ స్నేహితులమని వారు చెప్పుకుంటారు. సెయిలింగ్‌లో ప్రదర్శనతో భారత ఆర్మీలో ఉద్యోగం దక్కించుకున్న వీరిద్దరు ఉద్యోగం కూడా ఒకే చోట కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో కలిసి డబుల్స్ జోడీగా రజత పతకం సొంతం చేసుకున్నారు. వారిద్దరే కేరళలోని కొచ్చికి చెందిన ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్. చేపలు పట్టే వృత్తిలో ఉన్న ప్రిన్స్ తండ్రి చిన్నతనంలోనే వరదల్లో చనిపోయాడు. అయినా సరే అతను నీటితో అనుబంధాన్ని వదులుకోలేదు. వారి ఇంటికి సమీపంలోనే అరేబియన్ సముద్రం ఉండటంతో అతను వాటర్ స్పోర్ట్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. నోబుల్‌కు సోదర మిత్రుడు ఫ్రాన్సిస్ జత కలిశాడు. వీరిద్దరు కలిసి ముందుగా కేరళ బ్యాక్ వాటర్స్‌లో సెయిలింగ్ మొదలు పెట్టగా, గత పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తామిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఇద్దరూ మాటలకంటే కూడా ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూనే రేస్‌లో సత్తా చాటుతామని ఇద్దరూ చెబుతున్నారు. ఇప్పటికే ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన వీరికి ఆసియా క్రీడల్లో ఇదే తొలి మెడల్. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో నోబుల్, ఫ్రాన్సిస్ ఉన్నారు. -
పైలట్ వీరత్వం: ‘మచ్చార్’ ఇంటిపేరు వెనుక ఆసక్తికర వివరాలు
కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఇప్పుడు హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ కత్తితో దాడి చేసినా, గాయపడిన స్థితిలో కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేయడంతో స్మిట్ మచ్చార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఘటన తర్వాత ఆయన ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు, ఆయన ఇంటిపేరు ‘మచ్చార్’ గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మచ్చార్ చేసిన సాహసానికి పురస్కారం ఇవ్వాలని పలువురు సామాజిక మాధ్యమాల వినియోగదారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన ఇంటిపేరు అర్థం ఏమిటి? ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కొందరు ఆయన సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన నాగర్ బ్రాహ్మణుడని, మరికొందరు కచ్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు సంబంధించి కథనంలో కచ్చితమైన నిర్ధారణ ఇవ్వలేదు.గుజరాతీ ఇంటిపేర్ల చరిత్రపై నీలకంఠ్ వినోదిని రాసిన ‘గుజరాతీ అటకోనో ఇతిహాస్’ పుస్తకంలో ‘మచ్చార్’ ఇంటిపేరు ప్రస్తావన ఉంది. ‘మచ్చార్’ అనే పేరు గుజరాతీ పదమైన ‘మత్సర్’ నుంచి పరిణామం చెంది ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. ‘మత్సర్’ అంటే అసూయ అని అర్థం. మరో వివరణ ప్రకారం, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించిన ప్రజలకు ఈ పేరు ఏర్పడి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీలో ‘మచ్చర్’ అంటే దోమ.మరెన్నో అర్థాలు గుజరాత్లో జంతువులు, చిన్న జీవుల పేర్లతో కూడిన ఇంటిపేర్లు కూడా కనిపిస్తాయని గుజరాత్ విశ్వవిద్యాలయం మాజీ సామాజిక శాస్త్ర ప్రొఫెసర్ గౌరంగ్ జానీ తెలిపారు. పొడవైన ముక్కు ఉన్నవారికి ‘పోపట్’, అలాగే ‘హాథీ’, ‘మాంకడీ’, ‘బక్రీ’ వంటి ఇంటిపేర్లు సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. ‘మచ్చార్’ అనే పేరు ఎవరినైనా సరదాగా ఆటపట్టిస్తూ పెట్టి ఉండే అవకాశం కూడా ఉందని వినోదిని పేర్కొన్నారు.‘మచ్చార్’ ఇంటిపేరు గుజరాత్‌లోని నాగర్ బ్రాహ్మణులు, లోహానా సమాజాల్లో కనిపిస్తుంది. నాగర్లు సౌరాష్ట్రకు చెందిన బ్రాహ్మణ సమాజం కాగా, లోహానాల చారిత్రక, సాంస్కృతిక మూలాలు కచ్‌లో ఉన్నాయి. లోహానా మచ్చర్లు 19వ శతాబ్దంలో మహారాష్ట్రలోని ముంబైకి వలస వెళ్లారు. వారు వ్యాపారాలు, దుకాణాలు నిర్వహించేవారు. నాగర్ సమాజానికి చెందినవారు ప్రధానంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు. సాహిత్యం, విద్యా రంగాల్లో ఈ సమాజం గణనీయమైన పాత్ర పోషించిందని జానీ తెలిపారు. సాహస ఘటనతో వెలుగులోకి వచ్చిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇంటిపేరు వెనుక ఉన్న ఈ చరిత్ర.. గుజరాత్‌లోని ఇంటిపేర్ల వైవిధ్యంపై మరోసారి ఆసక్తిని పెంచింది. -
విదేశాల్లో యూపీఐ పనిచేస్తుందా? ఈ ఘటనే ఉదాహరణ
సింగపూర్‌లో ప్రయాణిస్తున్న ఓ భారతీయుడికి విమానాశ్రయంలో యూపీఐ ద్వారా చెల్లించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సింగపూర్ చాంగీ విమానాశ్రయంలోని ‘ది కోకో ట్రీజ్’లో గూగుల్ పే ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా చెల్లింపు పూర్తికాలేదు. ఈ ఘటన యూపీఐ విదేశాల్లో వినియోగానికి సంబంధించిన అనుభవాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఎక్స్ యూజర్ నిఖిల్ జార్జ్ ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌ను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. క్యూఆర్ కోడ్‌ను గూగుల్ పేతో స్కాన్ చేసిన తర్వాత లావాదేవీ పూర్తికాలేదు. “మారకపు విలువను పొందలేకపోయాం. మరోసారి స్కాన్ చేయండి” అనే సందేశం కనిపించింది. అంటే మారకపు విలువను పొందలేకపోయామని, మరోసారి స్కాన్ చేయాలని యాప్ సూచించింది. చెల్లింపు ప్రయత్నానికి ముందే అక్కడి నగదు కౌంటర్ సిబ్బంది తనను హెచ్చరించినట్లు జార్జ్ తెలిపారు. అక్కడ యూపీఐ చెల్లింపులు “దాదాపు ఎప్పుడూ పనిచేయవు” అని సిబ్బంది చెప్పినప్పటికీ తాను ప్రయత్నించినట్లు ఆయన వివరించారు. చివరకు చెల్లింపు విఫలమైంది.“యూపీఐ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ, విదేశాల్లో క్షేత్రస్థాయిలో దాని విశ్వసనీయతకు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మీ కార్డులను దగ్గర ఉంచుకోండి” అని జార్జ్ రాశారు.నెటిజన్ల స్పందనఈ పోస్టుపై పలువురు తమ విదేశీ డిజిటల్ చెల్లింపుల అనుభవాలను పంచుకున్నారు. కొందరు విదేశాల్లో భారతీయ కార్డులతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. శ్రీలంకలో పలు ప్రాంతాల్లో తమ యూపీఐ చెల్లింపులు విఫలమయ్యాయని మరో యూజర్ పేర్కొన్నారు. అయితే కొన్ని విదేశీ వ్యాపార సంస్థల్లో యూపీఐ సజావుగా పనిచేస్తోందని మరికొందరు చెప్పారు.సింగపూర్‌లోని ముస్తఫాలో తాను తరచుగా యూపీఐ ఉపయోగిస్తానని ఓ యూజర్ తెలిపారు. అక్కడ యూపీఐ చెల్లింపులపై 10 శాతం తగ్గింపు లభిస్తుందని, కార్డు చెల్లింపులపై విదేశీ మారకపు అదనపు రుసుముతో పోలిస్తే అది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటన విదేశీ ప్రయాణాల్లో యూపీఐ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రతి వ్యాపార సంస్థ వద్ద చెల్లింపు ఒకే విధంగా పనిచేస్తుందని భావించకుండా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని చూపించింది.Tried paying with UPI at The Cocoa Trees in Changi Airport today. The cashier warned me upfront that it almost never works, but I insisted on trying. Scanned the QR using GPay and it just stalled and threw: "Could not get conversion rate. Try scanning again." Despite all the headlines about UPI going global, ground-level reliability abroad still has a long way to go. Keep your cards handy.— nikhil george (@nikhilgeorge) September 27, 2026 -
ఇండియా బంగారాలు వీళ్లే
-
జడలు విప్పనున్న ఎల్ నినో! అక్టోబర్ నుంచే..
అక్టోబర్ రాకతో నైరుతి రుతుపవనాలు ముగిశాయి.. ఇక వాతావరణంలో మరో కీలక మార్పు మొదలుకానుంది. ఎల్‌నినో మరింత బలపడుతున్న వేళ.. అక్టోబర్ నుంచే దాని ప్రభావం కనిపించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈశాన్య సీజన్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో.. చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందట. ఈ మేరకు వాతావరణ ఔట్‌లుక్‌ను తాజాగా విడుదల చేసిన ఐఎండీ.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు అక్టోబర్ నుంచి పుంజుకుని, నవంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశముందని పేర్కొంది. రాబోయే రోజుల్లో.. దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని చెబుతోంది. అయితే వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందట!. నైరుతి మాదిరే.. అక్టోబర్–డిసెంబర్ పోస్ట్ మాన్సూన్ సీజన్లోనూ దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతోపాటు ఉష్ణోగ్రతలపైనా ఐఎండీ కీలక అంచనాలు వెల్లడించింది. అక్టోబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో వర్షాలు తగ్గే పరిస్థితులతోపాటు పగటి వేడి కొనసాగొచ్చని అంచనా.నవంబర్‌లో పీక్స్‌కు..ప్రస్తుతం దేశంలో ఎల్‌నినో పరస్థితులు కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లో మరింత బలపడనున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రకారం.. రాబోయే నెలల్లో ఎల్‌నినో ‘హై’ స్థాయికి చేరే అవకాశముంది. నవంబర్–డిసెంబర్ నాటికి గరిష్ఠ తీవ్రతకు చేరే అవకాశముందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఈ ప్రభావం 2027 ప్రారంభం వరకూ కొనసాగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి జూలైలో ఇచ్చిన సమాధానంలోనూ ఐఎండీ.. అక్టోబర్–డిసెంబర్ 2026లో ఎల్‌నినో మరింత బలపడి ‘వెరీ స్ట్రాంగ్’ కేటగిరీకి చేరొచ్చని తెలిపింది.భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలుల ప్రసరణపై ప్రభావం చూపగలదు. భారత్‌లో ఎల్‌నినో పరిస్థితులు సాధారణంగా రుతుపవన వర్షాలను బలహీనపరిచే అవకాశంతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే భారత వర్షపాతాన్ని ఎల్‌నినో ఒక్కటే నిర్ణయించదు. ఐఓడీ, ఎంఎన్‌జే వంటి ఇతర సముద్ర–వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.13 శాతం లోటుతో నైరుతి..ఇప్పటికే 2026 నైరుతి రుతుపవనాలు 12.6 శాతం లోటుతో ముగిశాయి. జూన్–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 109.2 మిల్లీమీటర్ల లోటు. ఈ లోటుతో 2026 నైరుతి సీజన్ 2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతం నమోదైన సీజన్‌గా నిలిచింది.ఈసారి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. అయితే వర్షపాతాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఎల్నినోతోపాటు అల్పపీడనాలు, మాడెన్–జూలియన్ ఆసిలేషన్ (ఎంఎన్‌జే) వంటి ఇతర వాతావరణ వ్యవస్థలూ ఉన్నాయి. అందువల్ల సీజన్లో నమోదైన లోటును ఎల్‌నినో ఒక్కదానికే ఆపాదించలేమని ఐఎండీ వివరించింది.దక్షిణాదికి కొంత ఊరటదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. దక్షిణ ద్వీపకల్ప భారతానికి కొంత ఊరట ఉంది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఈ ప్రాంతంలో మొత్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ప్రాంతాలవారీగా పరిస్థితుల్లో తేడాలు మాత్రం ఉండొచ్చని తెలిపింది.ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంతటితో పోదు! -
దసరా ముందు వ్యాపారులకు బిగ్ షాక్
-
స్మార్ట్‌ఫోన్‌కు మెమరీ సెగ..!
న్యూఢిల్లీ: మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడటంతో స్మార్ట్ఫోన్ల విడిభాగాల దిగుమతి వ్యయం భారంగా మారింది. దీని ప్రభావంతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల ధరలు సగటున 16 శాతం పెరిగినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. అయితే చైనా బ్రాండ్ వన్‌ప్లస్ ధరలను సగటున 8 శాతమే పెంచిందని పేర్కొంది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో 2026 రెండో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర (ఏఎస్పీ) రికార్డు స్థాయిలో 318 డాలర్లకు చేరినట్లు కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. ధరల పెరుగుదల అన్ని విభాగాల్లో కనిపించినప్పటికీ.. రూ.10 వేలలోపు ఫోన్లపై ప్రభావం అత్యధికంగా ఉంది. చౌక ఫోన్లపై తీవ్ర ప్రభావం మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల ప్రభావం బడ్జెట్ (ఎంట్రీ లెవల్) ఫోన్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా రూ.10,000లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల విభాగంలో ధరలు సగటున 32 శాతం వరకు పెరగడంతో.. ఈ కేటగిరీ షిప్మెంట్లు తొలి అర్ధభాగంలో ఏకంగా 65% పడిపోయాయి. భారత మార్కెట్లో చారిత్రకంగా అతిపెద్ద విభాగాల్లో ఒకటైన రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణి షిప్మెంట్లు కూడా 20 శాతం క్షీణించాయి. అయితే రూ.20 వేలకుపైగా ధర ఉన్న స్మార్ట్ఫోన్ల విభాగం మాత్రం వృద్ధిని కొనసాగించింది. అధిక ప్రారంభ ధరలతో పాటు పాత ఫోన్ మారి్పడి (ట్రేడ్–ఇన్) ఆఫర్లు, నో–కాస్ట్ ఈఎంఐలు ఖరీదైన ఫోన్ల కొనుగోలును సులభతరం చేయడం ఇందుకు దోహదపడినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ‘వన్ ప్లస్’ భిన్న వ్యూహం చాలా బ్రాండ్లు ధరలను పెంచినప్పటికీ.. చైనా బ్రాండ్ వన్‌ప్లస్ మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. పాత, తక్కువ ధరల వద్దే ముందస్తుగా మెమరీ కాంపోనెంట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల వన్‌ప్లస్ తన ధరల పెంపును కేవలం 8 శాతానికే పరిమితం చేయగలిగింది. దీంతో మొత్తం మార్కెట్ రెండంకెల పతనాన్ని నమోదు చేయనున్నప్పటికీ.. వన్‌ప్లస్ షిప్మెంట్లు మాత్రం 5 శాతం వృద్ధి సాధిస్తాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూ.20 వేలకుపైగా ధర ఉన్న విభాగంలో 2026 రెండో త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్లలో టాప్–5 బ్రాండ్లలో వన్‌ప్లస్ అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచినట్లు పేర్కొంది. ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడంతో పాటు విభిన్న ధరల శ్రేణుల్లో విస్తృత పోర్ట్‌ఫోలియో ఉండటం వల్ల వ్యయ ఒత్తిడిని ఒక్క ధరల విభాగంపైనే మోపాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపింది.ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ ప్రభావం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లకు డీఆర్ఏఎం, ఎన్ఏఎన్డీ మెమరీలకు భారీగా డిమాండ్ పెరగడంతో సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. దీనికి తోడు రూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే కాంపోనెంట్ల ధరలు మరింత పెరిగాయి. భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో సుమారు 99 శాతం దేశీయంగానే తయారవుతున్నప్పటికీ.. వాటిలో ఉపయోగించే కీలక కాంపోనెంట్లలో కొన్నింటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి బలహీనత ఈ దిగుమతి వ్యయాన్ని మరింత పెంచింది. ఈ అదనపు వ్యయ భారంలో అధిక భాగాన్ని చాలా బ్రాండ్లు వినియోగదారులపైకి బదిలీ చేశాయి.2028 వరకు ధరలపై ఒత్తిడి అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల ధరలు 2028కు ముందు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూపాయి బలహీనత కూడా దిగుమతి వ్యయాలను పెంచుతుండటంతో.. స్మార్ట్‌ఫోన్ ధరలపై ఒత్తిడి మరికొంత కాలం కొనసాగవచ్చని పేర్కొంది. ‘‘విడిభాగాల ధరలు ఆకస్మికంగా పెరిగినప్పుడు కంపెనీలు సాధారణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ధరలను పెంచకుండా మార్జిన్‌ను వదులుకోవడం లేదా మార్జిన్‌ను కాపాడుకోవడానికి విక్రయాల పరిమాణాన్ని కోల్పోవడం. అయితే వన్‌ప్లస్ ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడం, విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల ఈ ఒత్తిడిని అధిగమించగలిగింది’’ అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. -
'బంగారు' బాణాలు
ఆసియా క్రీడల్లో బుధవారం భారత్‌కు స్వర్ణాల పంట పండింది. ఒకేరోజు మన బృందం నాలుగు బంగారు పతకాలతో మెరిసింది. వీటిలో మూడు ఒక్క కాంపౌండ్ ఆర్చరీలోనే రావడం విశేషం కాగా, షూటింగ్లో మరో గోల్డ్ మన ఖాతాలో చేరింది. రెండు స్వర్ణ పతకాలతో తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత ప్రదర్శన హైలైట్‌గా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కూడా పసిడిని సొంతం చేసుకుంది. హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయ్‌తో కలిసి నీరూ ధండా మరో బంగారాన్ని భారత్‌కు అందించింది.బాక్సింగ్‌లో మూడు కాంస్యాలు, రెజ్లింగ్‌లో ఒక కాంస్యం కూడా మన ఖాతాలో చేరాయి. బుధవారం ఆర్చరీ ప్రదర్శన మరో అరుదైన అవకాశాన్ని కల్పించింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఆర్చర్ కాంపౌండ్ విభాగంలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టగా...చికిత–సాహిల్ స్వర్ణంతో భారత్‌కు ఆ బెర్త్ లభించింది.ఒకరితో పోటీ పడుతూ మరొకరు... మహిళల కాంపౌండ్ విభాగంలో భారత బృందానికి స్వర్ణం లభించింది. తానిపర్తి చికిత, వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్ (మహారాష్ట్ర) సభ్యులుగా ఉన్న టీమ్ ఫైనల్లో 238–234 స్కోరుతో చైనా జట్టుపై విజయం సాధించింది. భారత బృందం నాలుగు సిరీస్‌లలో కలిపి మొత్తం 240 పాయింట్లకుగాను 238 పాయింట్లు (వరుసగా 60, 59, 59, 60) స్కోరు చేసింది. 2023 ఆసియా క్రీడల్లో కూడా ఈ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన భారత జట్టు ఈసారి దానిని నిలబెట్టుకుంది. గత క్రీడల్లో కూడా జ్యోతి సురేఖ జట్టులో భాగంగా ఉండగా, తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న చికిత అద్భుత ప్రదర్శనతో చెలరేగింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో చికిత, సాహిల్ జాధవ్ (మహారాష్ట్ర) కలిసి పసిడి పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్లో భారత ద్వయం ‘షూటాఫ్’లో కొరియాను ఓడించింది. నాలుగు సిరీస్‌ల తర్వాత ఇరు జోడీలు 157–157తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూటాఫ్’ అవసరమైంది. ఇందులో భారత్ 20 పాయింట్లు స్కోర్ చేయగా, కొరియా 19 పాయింట్లే సాధించగలిగింది. దాంతో 1–0తో భారత్ పైచేయి సాధించి స్వర్ణాన్ని అందుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన 21 ఏళ్ల చికిత 2025లో ప్రపంచ యూత్ చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లలో టీమ్ విభాగంలో రెండు రజతాలు సాధించింది. కాంపౌండ్ పురుషుల విభాగంలో కూడా భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. భారత్ 238–237 పాయింట్ల తేడాతో చైనాపై గెలుపొందింది. ఈ టీమ్‌లో సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ (హరియాణా)లతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం కూడా ఉన్నాడు. నాలుగు సిరీస్‌లలో వరుసగా 58, 60, 60, 60 స్కోరు చేసిన భారత బృందం పాయింట్ తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సీనియర్ ‘స్టార్‘ జ్యోతిసురేఖ విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖ దశాబ్దన్నర కాలంగా భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీకి పర్యాయపదంగా నిలిచింది. 2011లో తొలిసారి భారత సీనియర్ జట్టు తరఫున సురేఖ బరిలోకి దిగింది. ఇతర ఆర్చర్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డులు, ఘనతలెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014 నుంచి వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆమె మొత్తంగా 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గింది. ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌ప్‌లో మూడేళ్ల క్రితం స్వర్ణం నెగ్గిన సురేఖ మరో 5 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించింది. షూటింగ్ ప్రపంచకప్లలోనైతే ఏకంగా 11 స్వర్ణాలు గెలిచిన అద్భుత ప్రదర్శన సురేఖ సొంతం. ఆమె కెరీర్లో మిగిలిపోయిన ఏకైక లక్ష్యం ఒలింపిక్ పతకమే. 2028 క్రీడల్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌ను తొలిసారి చేర్చడంతో ఆమె ఒలింపిక్ పతకంపై గురి పెట్టింది. యూత్ ఆర్చరీతో మొదలు... తిరుపతి జిల్లా నాయుడుపేట గణేశ్ స్వస్థలం. పదేళ్ల వయసులో తండ్రి హరిప్రసాద్ ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్నాడు. మూడేళ్ల క్రితం వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో అతనికి గుర్తింపు లభించింది. 2026లో ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించిన టీమ్‌లోనూ గణేశ్ ఉన్నాడు. ఆసియా గ్రాండ్‌ప్రి సర్క్యూట్లో అతను ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గాడు. 2025లో భారత్ స్వర్ణం సాధించడంలో గణేశ్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని స్పారో ఆర్చరీ అకాడమీలో గణేశ్ శిక్షణ పొందుతున్నాడు. సత్తా చాటిన కైనన్–నీరూ షూటింగ్లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కైనన్ చెనాయ్–నీరూ ధండా జోడీ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. నాలుగు సిరీస్‌లలో (6, 10, 10, 8) కలిపి వీరిద్దరు 34 పాయింట్లు సాధించారు. ఖతర్ (32) జంటకు రజత పతకం దక్కగా, చైనా జోడీకి (23) కాంస్యం సాధించింది. నీరూ ధండాకు ఈ ఆసియా క్రీడల్లోనే ఇది మూడో పతకం కావడం విశేషం. ట్రాప్ వ్యక్తిగత, మిక్స్డ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచిన ఆమె...టీమ్ ఈవెంట్లో రజతాన్ని గెలుచుకుంది. 2023 ఆసియా క్రీడల్లో కైనన్ టీమ్ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో ఒక కాంస్యం నెగ్గాడు.నాన్న గన్‌తో కైనన్ గోల్డ్...నాన్న రెండుసార్లు జాతీయ చాంపియన్... చాలా మంది తండ్రుల్లాగే ఆయన కూడా తన కొడుకు తనకంటే రెండు మెట్లు పైన ఉండాలని కోరుకున్నాడు. తండ్రిగా ఆరంభంలో ఆటలో దారి చూపించి ఆపై మరింత ఎత్తుకు ఎదిగేందుకు సరైన రీతిలో సహకారం అందిస్తూ అండగా నిలిచాడు. కొడుకు కూడా ఆయన ఆశలను సరిగ్గా నెరవేరుస్తూ తాను ఎంచుకున్న ఆటలో పెద్ద స్థాయికి చేరుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. ఆ తండ్రి డేరియస్ చెనాయ్ అయితే కొడుకు కైనన్ చెనాయ్. 2023 ఆసియా క్రీడల ట్రాప్‌లో రెండు పతకాలు గెలుచుకున్న కైనన్... ఇప్పుడు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో సత్తా చాటాడు. హైదరాబాద్‌లో పుట్టిన కైనన్ దేశంలోని అత్యుత్తమ పాఠశాల్లో ఒకటైన ఊటీలోనే హెబ్రాన్ స్కూల్లో చదువుకున్నాడు. అక్కడే స్విమ్మింగ్, ఫుట్‌బాల్, హాకీవంటి ఆటలు ఆడినా... సహజంగానే ఇంట్లో వాతావరణంతో షూటింగ్‌పై కొత్తగా ఆసక్తి కలిగింది. 12 ఏళ్ల వయసు ఉన్న తన కుమారుడి ఇష్టాన్ని కాదనలేని డేరియస్ తానే స్వయంగా షూటింగ్లో ప్రాథమికాంశాలతో శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ షూటర్ మన్షేర్ సింగ్ వద్ద కోచింగ్‌తో పూర్తి స్థాయిలో కైనన్ ట్రాప్ ఈవెంట్‌పై దృష్టి పెట్టాడు. 2008 కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణంతో తొలిసారి అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో సీనియర్ స్థాయిలోనూ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న కైనన్ 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా బరిలోకి దిగాడు. గత ఏడాది ప్రపంచకప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన కైనన్ ఖాతాలో ఇంతకుముందే రెండు ఆసియా క్రీడల పతకాలు ఉన్నాయి. తాజాగా సాధించిన ఏషియాడ్ స్వర్ణంలో వాడిన గన్ వెనక ఆసక్తికర కథనం ఉంది. అతని తండ్రి డేరియస్ 30 ఏళ్ల క్రితం వాడిన గన్ బ్యారెల్నే కైనన్ ఇప్పుడు ఉపయోగించాడు. ఈ గన్‌తో డేరియస్ రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవగా, ఇప్పుడు కొడుకు తండ్రి గన్‌లో స్వల్ప మార్పుతో బరిలోకి దిగాడు. నా తొలి ఆసియా క్రీడల్లోనే రెండు స్వర్ణాలు లభించాయి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. మహిళల టీమ్ ఈవెంట్ ముగియగానే మిక్స్‌డ్‌లో పాల్గొనాల్సి వచ్చిం ది. సన్నద్ధతకు తగినంత సమయం లేకపోయినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. షూటౌట్లో నేను ‘10’ స్కోర్ చేసినా లక్ష్యానికి ఆశించినంత దగ్గరగా రాకపోవడంతో కొంత ఉత్కంఠకు లోనైనా చివరకు పసిడి పతకం దక్కింది. –చికిత, భారత ఆర్చర్ -
జైశంకర్ నిర్మొహమాటం
సంక్షోభ కాలంలో తటస్థంగా ఉండటం, మర్యాదలు పాటిస్తూ మంచితనం ఒలకబోయటం కుదరదు. అది అవతలిపక్షానికే లబ్ధి చేకూరుస్తుంది. అమెరికా తీరుపై దౌత్య మార్గాల్లో మన దేశం లోగడ అసంతృప్తి తెలిపిందా అన్నది తెలియదుగానీ... తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ నిర్మొహమాటంగా మాట్లాడారు. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఏఎస్పీఐ) సదస్సులో మన వైఖరేమిటో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడిలో కొచ్చాక మనతో తేడాగా ప్రవర్తిస్తున్నారు. భారత్‌వంటి అతి పెద్ద మార్కెట్ కావాలి. తన ఉత్పత్తులు నచ్చిన ధరకు విక్రయించుకోవాలి. లాభాలు గడించాలి. అదే సమయంలో పాకిస్తాన్‌తో అంటకాగుతూ, ఆకాశానికెత్తుతారు. దాన్ని బుజ్జగిస్తారు. రోగికి పత్యం రుచించనట్టు మనం చెప్పేది ఆయనకు నచ్చదు. నిజానికి ఇది ట్రంప్‌కు మాత్రమే పరిమితమైన వింత కాదు. ఆయన ముందున్న పాలకులు... వారే పార్టీ వారైనా ఇలాగే ప్రవర్తించారు. కాకపోతే దౌత్య మర్యాదలు పెద్దగా తెలియని, ఖాతరుచేయని మనిషి గనుక ట్రంప్ బాహాటంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని భారత్... తనతో కాక నాటి సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా మెలగటం అమెరికాకు కంటగింపైంది. అందుకు విరుగుడుగా పాకిస్తాన్‌ను చేరదీసింది. భారత్, పాక్మధ్య జరిగిన నాలుగు ప్రధాన యుద్ధాల్లోనూ, ఘర్షణల్లోనూ దాని పరోక్ష హస్తం ఉంది. నిజమైన మిత్రదేశంతో ఎలా మెలగాలో అమెరికాకు ఏనాడూ తెలియదు.ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రపై స్పష్టమైన సమాచారం ఉన్నా కంటితుడుపు చర్యగా దానికి విడుదల చేయాల్సిన నిధుల్ని ఆపినట్టు నటించటం, కొన్నాళ్లకే ఏదో ఒక సాకుతో విడుదల చేయటం దశాబ్దాలుగా రివాజైంది. ఆయుధ సామగ్రి విషయంలోనూ అంతే. ఉగ్రవాద చేష్టలతో ఆర్థికవ్యవస్థ సర్వనాశనమై దివాళా స్థితిలో పడిన పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవాల్సిందే. కానీ అందుకు షరతులుండాలి. ఆ నిధుల్ని ఉగ్రవాదానికి ఊతమందించటానికి మళ్లించకూడదు. ఇందువల్ల మనకొస్తున్న ఇబ్బందులేమిటో అమెరికాకు పట్టదు. అలాగే వాణిజ్య ఒప్పందం పేరిట తాను విధించే షరతులు స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేకూర్చగల నష్టం దానికి లెక్కలేదు. ఈ విషయంలో భారత్ అభ్యంతరాలు ఆయన బేఖాతరు చేస్తారు. అంతా తన నిర్దేశానుసారం అమలు కావాల్సిందేనన్నది ట్రంప్ పట్టుదల. వాణిజ్య ఒప్పందం ఖరారైపోయిందంటూ పలుమార్లు ఆయన ఏకపక్షంగా ప్రకటించారు. మొన్న ఫిబ్రవరిలో సైతం ఇక సంతకాలే తరవాయి అన్నారు. కానీ భారత్‌నుంచి స్పందన లేకపోవటంతో అదనపు సుంకాలు విధించారు. ఈ బాపతు సుంకాలకు కోర్టులో చుక్కెదురైంది. కానీ అధిక సుంకాల పాటపాడుతూ బెదిరించడం మానుకోలేదు. మరోపక్క ఉగ్రవాదంవల్ల భారత్ నష్టపోతున్న వైనం తెలిసినా పాక్‌ను కట్టడి చేయరు. మనపట్ల సహానుభూతి చూపటం ధర్మమనుకోరు.భారత్–పాక్‌ల వైరం సంగతలా వుంచి ప్రపంచం ఇంతటి సంక్లిష్ట స్థితికి చేరుకోవటంలో అమెరికా పాత్ర ఎవరికీ తెలియంది కాదు. ఇరాన్‌పై అమెరికా దుందుడుకు చర్యలవల్ల హార్మూజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయింది. ఉక్రెయిన్ను యూరప్ దేశాలద్వారా రెచ్చగొట్టి రష్యాను యుద్ధంలోకి నెట్టింది కూడా అమెరికాయే. ఈ రెండు పరిణామాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింది. ముడి చమురు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి సూపర్ ఎల్‌నినో రూపంలో వచ్చిపడిన ప్రకృతి వైపరీత్యాలు తోడవుతున్నాయి. అందుకే రానున్న కాలంలో ప్రపంచ ప్రజలు కనీవినీ ఎరుగని పెను సంక్షోభం ఎదుర్కొనబోతున్నారని జైశంకర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు నేరుగా మన అసంతృప్తి తెలియజేయటం, చేస్తున్న తప్పుల్ని దిద్దుకోమని చెప్పటం... ప్రపంచం మునుపట్లా లేదని, ఏకచ్ఛత్రాధిపత్యం రోజులు అంతరించాయని చెప్పడం అత్యవసరం. దీన్ని సకాలంలో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, తడబాటులేకుండా తెలిపినందుకు ఆయన్ను అభినందించాలి. -
ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం
ఢిల్లీలో మంగళవారం ఇండి కూటమి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై చర్చించేందుకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టే నోటీసు ముసాయిదాపై కూటమి చర్చించింది.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఇండి కూటమి నేతలం జిల్లా, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతాం. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వరకు పాదయాత్ర నిర్వహిస్తాం. సంస్థలను ఏ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారో రాష్ట్రపతికి తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకులం అందరం అక్టోబర్ రెండవ వారంలో కలవడానికి అపాయింట్మెంట్ కోరుతాం. అక్టోబర్-నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన ర్యాలీలు నిర్వహిస్తాము. ర్యాలీల తేదీలు, వేదికలను త్వరలోనే ఖరారు చేస్తాము. నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తాం. ఓటు చోరీపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ చెప్పే మాటలను ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు’’ అని తెలిపారు.కాగా, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించిన అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఇండి కూటమి నేతలు కోరుతున్నారు. కూటమిలో 21 పార్టీలు పాల్గొన్నాయి. గతంలో 23 పార్టీలుగా ఉన్న ఇండి కూటమి నుంచి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమావేశానికి హాజరుకావడం కాలేదు. ఆయన స్థానంలో ఎంపీలు హరేంద్ర మాలిక్, మొహిబ్బుల్లా నద్వీ పాల్గొన్నారు. సమావేశానికి డీఎంకే దూరంగా ఉన్నప్పటికీ, జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్లో తొలగింపు తీర్మానం వస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ తెలిపారు.ఇదీ చదవండి: అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు -
భారత్‌ను ఆపతరమా!
గువాహటి: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు చూస్తే సిరీస్ ఎలా ఉండబోతోందో అర్థమైంది. ఈ స్థితిలో నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో 296 పరుగుల లక్ష్యాన్ని మరో 50 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా అలవోకగా ఛేదించింది. అంతే కాదు...గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత స్టార్ విరాట్ కోహ్లి గువాహటి రికార్డు కూడా అలాగే ఉంది. ఇక్కడ గతంలో టీమిండియా రెండు వన్డేలు ఆడగా, రెండింటిలోనూ కోహ్లి సెంచరీలు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కెప్టెన్ గిల్ కూడా శతకంతో తానూ సిద్ధంగా ఉండగా, రోహిత్ శర్మ కూడా చెలరేగితో విండీస్‌కు కష్టాలు తప్పవు. మరోవైపు తొలి వన్డేలో సెంచరీ చేసిన జస్టిన్ గ్రీవ్స్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడం విండీస్‌కు పెద్ద దెబ్బ. ఆ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. -
నీరూ బంగారు ‘ట్రాప్’
ఆసియా క్రీడల షూటింగ్లో మంగళవారం పోటీలకు పదో రోజు... ఇప్పటి వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్న టాప్ షూటర్లంతా విఫలం కావడంతో మన దేశానికి ఒక్క వ్యక్తిగత స్వర్ణం కూడా దక్కలేదు. కానీ పదో రోజు ఎట్టకేలకు ఆ సంబరం తీరింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో నీరూ ధండా సత్తా చాటి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో కూడా ఈ ఈవెంట్లో ఇదే తొలి పసిడి పతకం కావడం విశేషం. మరోవైపు నీరూ అత్యుత్తమ ప్రదర్శన కారణంగానే టీమ్ ఈవెంట్లో కూడా భారత్‌కు రజతం లభించింది. ఈ పతకంలో నీరూకు ఆషిమా ఆహ్లావత్, మనీషా కీర్ తోడుగా నిలిచారు. మొత్తంగా ఇప్పటివరకు 14 పతకాలు గెలుచుకున్న మన షూటింగ్ బృందం మిగిలిన రెండు రోజుల్లో మరిన్ని పతకాలపై గురి పెట్టింది.నగోయా: ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ ఖాతాలో తొలి వ్యక్తిగత స్వర్ణం చేరింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటల్ నీరూ ధండా అగ్రస్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకుంది. మొత్తం 30 టార్గెట్లలో ఆమె 28 టార్గెట్లను విజయవంతంగా ఛేదించగలిగింది. సున్ యునాంగ్ (చైనా; 26) రజత పతకం గెలుచుకోగా, హాజర్ అబ్దుల్ మాలిక్ (కువైట్; 21)కు కాంస్యం దక్కింది. మొత్తం ఆరు సిరీస్‌లలో రెండో, ఐదో సిరీస్‌లలో 4 చొప్పున టార్గెట్లను కొట్టిన నీరూ... మిగిలిన నాలుగు సిరీస్‌లలో 5 చొప్పున పూర్తి స్కోర్‌ను ఛేదించింది. ఆసియా క్రీడల పురుషుల ట్రాప్‌లో భారత్ తరఫున 1978లో రణ్‌దీర్ సింగ్, 2010లో రంజన్ సోధి స్వర్ణాలు గెలిచారు. నీరూ ప్రదర్శన ఆమెకు వ్యక్తిగత స్వర్ణాన్ని అందించడంతో పాటు భారత జట్టు రజతం గెలవడంలో కూడా కీలకపాత్ర పోషించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో నీరూ, ఆషిమా, మనీషా సభ్యులుగా ఉన్న జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో నీరూ 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... ఆషిమా 106 పాయింట్లతో 16వ స్థానంతో, మనీషా 104 పాయింట్లతో 23వ స్థానంతో ముగించారు. అయితే ఈ ముగ్గురు కలిసి సాధించిన మొత్తం 328 పాయింట్లతో భారత్‌కు రజతం దక్కింది. చైనా (346 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కువైట్ (325 పాయింట్లు)కు కాంస్యం లభించింది.అనారోగ్యం నుంచి ఆసియా పతకం వరకు..రెండు నెలల క్రితమే షూటింగ్ ప్రపంచకప్‌లో నీరూ ధండా స్వర్ణం గెలిచింది. ట్రాప్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా నిలవడంతోనే ఆమెపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. ఆసియా క్రీడల కోసం జపాన్ చేరడానికి పది రోజుల ముందు నీరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. తీవ్రమైన జ్వరంతో హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలతో ఆమె భోపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు ఏమీ తినలేకపోయింది. అసలు ఆసియా క్రీడలకు వెళతానా లేదా అనే సందేహాలు వచ్చాయి.దాదాపు నాలుగు వారాలు పూర్తిగా శిక్షణకు దూరమైంది. అయితే ఇలాంటి స్థితిలో కోచ్ మన్షేర్ సింగ్ నీరూను ఎంతో ప్రోత్సహించాడు. నువ్వు లక్ష్యం నుంచి దృష్టి మరల్చవద్దు అంటూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. దాంతో అన్నీ వెనక్కి తోసి ఆమె శక్తిని కూడదీసుకుంది. హరియాణాలోని జింద్ జిల్లాలో పుట్టినా ... కుటుంబం మధ్యప్రదేశ్‌లోని శివపురికి వలస వెళ్లడంతో నీరూ అక్కడే పెరిగింది. ఆమె కెరీర్ కూడా మధ్యప్రదేశ్‌లోనే మొదలైంది. 2018 ఆసియా క్రీడల్లో ట్రాప్‌లో రజతం సాధించిన ఆమె కజిన్ లక్షయ్ షెరాన్ ప్రేరణతో నీరూ పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి పెట్టింది. లక్షయ్ తండ్రి ఇచ్చిన గన్‌తోనే ఆమె ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో భోపాల్‌కు చేరి మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో శిక్షణతో తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ నీరూ దూసుకుపోయింది. రైతు అయిన తండ్రి షూటింగ్లాంటి ఖరీదైన క్రీడకు అండగా నిలిచే పరిస్థితి లేకపోయింది. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం అందించిన గన్, ఇతర ఎక్విప్‌మెంట్‌తోనే ఆమె సాధన చేయగలిగింది. ప్రస్తుతం ఆర్మీలో ఆమె నాయబ్ సుబేదార్‌గా పని చేస్తోంది. ‘ఈ విజయం సరిహద్దులోని సైనికులకు అంకితం. వారితో పోలిస్తే నా ఘనత గొప్పదేమీ కాదు. అందరి లక్ష్యం కూడా ఒలింపిక్ పతకమే. అయితే ఈ విజయాలు వాటి వైపు సాగేందుకు పునాదిరాళ్లుగా ఉపకరిస్తాయి’ అని నీరూ వ్యాఖ్యానించింది.‘ట్రాప్’ అంటే...సామాన్యుల భాషలో చెప్పాలంటే ‘ట్రాప్’ ఈవెంట్ సరిగ్గా పక్షులను వేటాడటంలాంటిదే! ఇప్పుడు షూటింగ్ ఈవెంట్లో కూడా లక్ష్యాలను బర్డ్స్ లేదా పీజియాన్స్ అనే పిలుస్తారు. పాత కాలంలో పంజరాల నుంచి పక్షులను విడిచి పెట్టగానే తుపాకీతో వాటిని వేటాడేవారు. ఇప్పుడు మెకానికల్ పద్ధతిలో లక్ష్యాలను నిర్దేశిస్తారు. ట్రాప్ హౌస్‌లో నిలిచి ఉండే షూటర్ సిద్ధం కాగానే... డిస్క్ ఆకారంలో ఉండే మట్టితో తయారు చేసిన ఒక ‘బర్డ్’ దూసుకొస్తుంది. దీనిని షూటర్ కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీల్లో ఐదేసి టార్గెట్ల చొప్పున ఆరు సిరీస్‌లు (మొత్తం 6్ఠ5 = 30 పాయింట్లు) ఉంటాయి. ‘డబుల్ ట్రాప్’లో ఒకేసారి రెండు బర్డ్స్లను కొట్టాల్సి ఉంటుంది. ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్లను ‘షాట్‌గన్’ ఈవెంట్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ట్రాప్, స్కీట్ మాత్రమే ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచే డబుల్ ట్రాప్‌ను తప్పించారు. భారత ఆటగాడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్‌లోనే రజతం గెలిచాడు. -
60 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. 2047 నాటికి 60.4 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం దిగుమతులపరమైన సవాళ్లను పరిష్కరిస్తూ, పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంపొందించడంపై ఫోకస్ చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త జాతీయ ఉక్కు విధానంపై (ఎన్ఎస్పీ) కసరత్తు జరుగుతోందని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు.సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారం రోజుల్లో ఎన్ఎస్పీని బహిరంగపర్చనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం సుమారు 22 కోట్ల టన్నులు. ఉత్పత్తి పెంపునకు, అలాగే అందులో స్పెషల్ స్టీల్, వేల్యూ యాడెడ్ ఉక్కు వాటాను పెంచేందుకు ఉపయోగపడే ప్రణాళిక ఎన్ఎస్పీలో ఉండనుంది. ఎంఎస్ఎంఈలకు రూ.5,000 కోట్లతో పథకంకర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా కార్యకలాపాలను నిర్వహించుకునేలా చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) ఉక్కు యూనిట్లను ప్రోత్సహించేందుకు ’వికసిత్ భారత్ ఇస్పాత్’ పేరిట రూ. 5,000 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కూడా రూపొందిస్తున్నట్లు సందీప్ తెలిపారు. పెద్ద సంస్థల కోసం త్వరలోనే సీసీటీఎస్ (కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్)ను ప్రకటించనున్నట్లు వివరించారు. నాణ్యత లేని చౌక దిగుమతులను కట్టడి చేస్తూ, దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పించేలా సేఫ్‌గార్డ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ మొదలైనవన్నీ కొత్త పాలసీలో ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఎగుమతుల రంగంలో పోటీతత్వమనేది విదేశీ మారకాన్ని ఆర్జించడానికే కాకుండా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యాలను పెంపు, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ప్రపంచ దేశాల రక్షణాత్మక వైఖరుల మధ్య కూడా భారత్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య 11% వృద్ధి చెందాయని చెప్పారు. -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు
ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఐచీ నగోయా వేదికగా భారత మహిళల రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కిరణ్ పహల్, మచెట్టిర పూవమ్మ, ప్రాచీ, విద్య రామ్‌రాజ్‌లతో కూడిన జట్టు 4*400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది.మంగళవారం నాటి పోటీలో 3:29.69 నిమిషాల వ్యవధిలో భారత మహిళలు ఈవెంట్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. బహ్రెయిన్ అథ్లెట్లు 3:30.21, చైనా బృందం 3:31.02 సెకన్ల వ్యవధిలో పరుగు పూర్తి చేసి వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. రిలే మహిళల స్వర్ణంతో తాజా ఏషియన్ గేమ్స్‌లో భారత్ పసిడి పతకాల సంఖ్య ఆరుకు చేరింది.హాఫ్ సెంచరీ దాటేశాముమరోవైపు.. 4*400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో తాజా ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య ఇప్పటికి 52 (6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు)కి చేరింది.విద్య రామ్రాజ్కు మూడో పతకంవిద్యా రామ్రాజ్ ఇప్పటికే మిక్స్డ్ 4*400 మీటర్ల రిలేలో వెండి, 400 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకాలు గెలిచింది. తాజాగా మహిళల 4*400 రిలేలో ఏకంగా స్వర్ణం సాధించింది. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఆరు పసిడి పతకాలు👉మహిళల క్రికెట్ జట్టు👉పురుషుల కబడ్డీ జట్టు👉మహిళల కబడ్డీ జట్టు👉నీరూ ధండా- షూటింగ్ (ట్రాప్ వుమెన్ సింగిల్)👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్- షూటింగ్👉4*400 మీటర్ల రిలే (మహిళలు)చదవండి: చరిత్ర సృష్టించిన గుల్వీర్ -
భవిష్యత్తులో యుద్ధం ఇలా ఉంటుంది: కళ్లకు కట్టినట్లు చెప్పిన సీడీఎస్
న్యూఢిల్లీ: భవిష్యత్ యుద్ధాలకు సాయుధ దళాలు సాంకేతికంగా సిద్ధం కావాల్సిన అవసరాన్ని వివరించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. ముఖ్యంగా బహుళ రంగాల సమన్వయ యుద్ధం, కృత్రిమ మేధ, డేటా ఆధారిత నిర్ణయాలు, నమ్మకమైన సమాచార వ్యవస్థలు కీలకమని చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి మాట్లాడుతూ.. భవిష్యత్ యుద్ధంలో భూ, సముద్ర, గగన, అంతరిక్ష, సైబర్ తదితర రంగాలను విడివిడిగా కాకుండా ఒక సమగ్ర వ్యవస్థగా అనుసంధానించి పనిచేయాలి అన్నారు. శత్రువు స్పందించేలోపే వివిధ రంగాల నుంచి సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రభావం చూపడం కీలకమన్నారు. ఉపగ్రహాలు శత్రువును గుర్తిస్తే.. గగన, సముద్ర, భూ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు ఆ సమాచారాన్ని దాదాపు తక్షణమే పంచుకోవాలని చెప్పారు.శత్రువు సమాచార వ్యవస్థలను అడ్డుకునే పరిస్థితుల్లోనూ పనిచేసే విశ్వసనీయమైన, ప్రత్యామ్నాయ సమాచార నెట్‌వర్క్‌లు అవసరమన్నారు. కృత్రిమ మేధను భవిష్యత్ యుద్ధాల్లో ఉపయోగించకుండా ఏ సైనిక దళమూ కొనసాగలేదని జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహణి స్పష్టం చేశారు. అయితే తుది నిర్ణయం మాత్రం కమాండర్దే కావాలని అన్నారు.కొత్త సాంకేతికతను కొనుగోలు చేస్తే సరిపోదు సైనిక డేటాను వివిధ విభాగాలు విడిగా దాచుకోవడం కాకుండా, భద్రతా చర్యలతో పరస్పరం పంచుకోవాలని జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహణి సూచించారు. భవిష్యత్ పోరాటాల్లో భౌతిక ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేయకుండానే వాటి నెట్‌వర్క్‌లు, డేటా, సమాచార సేకరణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తే ఒక సంస్థ పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని వివరించారు. కేవలం కొత్త సాంకేతికతను కొనుగోలు చేయడం సరిపోదని, దానికి అనుగుణంగా యుద్ధ విధానం, వ్యూహం, సైనిక నిర్మాణాన్ని మార్చుకోవాలని జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహణి చెప్పారు. భవిష్యత్ యుద్ధాల్లో ముందుండేది మొదటగా సాంకేతికతను అందిపుచ్చుకున్న దళం కాదని, దాన్ని వేగంగా నేర్చుకుని, అనుసరించి, తనను తాను మార్చుకోగల దళమే అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా, జనరల్ చౌహాన్ ప్రసంగంలో “ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రభావాల వైపు, నెట్వర్క్ ఆధారిత యుద్ధం నుంచి డేటా ఆధారిత యుద్ధం వైపు” మారాల్సిన అవసరాన్ని ప్రధానంగా వివరించారు. -
రష్యా చమురుతో భారత్ సరికొత్త గేమ్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా నుంచి భారీ సుంకాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. కొత్తగా తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ మరో రెండు వారాల్లో ఆచరణలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇక్కడే రష్యా చమురు రంగంలో భారత కంపెనీలకు ఉన్న భారీ వాటా తెరపైకి వస్తోంది. రష్యా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ అనుబంధ సంస్థ అయిన వాంకోర్‌నెఫ్ట్‌లో భారత ప్రభుత్వ రంగ సంస్థలకు కలిపి 49.9 శాతం వాటా ఉంది. ఓఎన్జీసీ విదేశ్కు 26 శాతం వాటా ఉండగా.. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోరిసోర్సెస్ కలిసి వాంకోర్ ఇండియా ద్వారా మరో 23.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన 50.1 శాతం రోస్నెఫ్ట్ వద్ద ఉంది.అంటే.. భారత్ రష్యా నుంచి చమురును కేవలం బయట నుంచి కొనుగోలు చేయడమే కాదు. రష్యాలోని చమురు ఉత్పత్తి ఆస్తిలోనే భారత కంపెనీలకు వాటా ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ వాటా ఆధారంగా భారత్ తనకు వచ్చే చమురును ‘భారత చమురు’గా చూపించి అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోగలదా?రష్యా చమురు.. భారత్దిగా మారుతుందా?కానే కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక భారత కంపెనీకి రష్యా చమురు క్షేత్రంలో వాటా ఉన్నంత మాత్రాన.. అక్కడి నుంచి వెలికితీసిన ముడిచమురు భారత మూలం గల చమురుగా మారదు. చమురు ఎక్కడ వెలికితీశారన్నదే దాని మూలాన్ని నిర్ణయిస్తుంది. రష్యాలో ఉత్పత్తి అయితే అది రష్యా మూలం గల క్రూడ్గానే ఉంటుంది. ఒకవేళ భారత కంపెనీలు తమ వాటాకు అనుగుణంగా చమురును నేరుగా తీసుకుని భారత్‌కు తరలించినా ఇదే వర్తిస్తుంది. మూడో దేశం మీదుగా పంపినా దాని మూలం మారదు. కాబట్టి 49.9 శాతం వాటా ఉండటం వాణిజ్యపరంగా భారత్‌కు ప్రయోజనం కావచ్చు కానీ.. అమెరికా ఆంక్షల నుంచి ఆటోమేటిక్‌గా మినహాయింపు మాత్రం ఇవ్వదు.మరి ఈ వాటాతో..ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత కంపెనీలకు వాంకోర్‌నెఫ్ట్‌లో వాటా ఉండటం వల్ల ఉత్పత్తిపై ఆర్థిక హక్కు ఉంటుంది. సాధారణంగా రష్యా కంపెనీ నుంచి మార్కెట్లో చమురు కొనుగోలు చేసే బదులు.. వాటాదారుగా ఉత్పత్తిలో తమ వాటాకు సంబంధించిన హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒప్పందాలు, చెల్లింపులు, మధ్యవర్తులు, రవాణా వంటి వ్యవహారాల్లో మార్పులు రావచ్చు. అలాగని ఇది అమెరికా ఆంక్షలను తప్పించే ప్రత్యేక మినహాయింపు అని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏ లావాదేవీకి ఆంక్షలు వర్తిస్తాయన్నది ఉత్పత్తి చేసే సంస్థ, లావాదేవీలోని భాగస్వాములు, చెల్లింపుల విధానం, షిప్పింగ్, బీమా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాంకోర్.. వోస్టోక్ ఆయిల్‌కు సంబంధమేంటి?ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. భారత కంపెనీల 49.9 శాతం వాటా మొత్తం వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో కాదు.. వాంకోర్‌నెఫ్ట్‌లో ఉంది. వాంకోర్ చమురు క్షేత్రాలు మాత్రం భారీ వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. రష్యా సెప్టెంబర్‌లో వోస్టోక్ ఆయిల్ నుంచి వాణిజ్య చమురు ఎగుమతులను ప్రారంభించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ భారీ ప్రాజెక్టును రష్యా భవిష్యత్తులో కీలక చమురు ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. దీంతో వాంకోర్‌నెఫ్ట్‌లో భారత కంపెనీల వాటా మరోసారి చర్చలోకి వచ్చింది. అమెరికా ఆంక్షల మాటేంటి?ఈ పరిణామాలతో అమెరికా ఆంక్షల గండం భారత్‌కు తప్పినట్లేనా?. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన విషయం. భారత్‌కు రష్యా చమురు ఉత్పత్తి ఆస్తిలో 49.9 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఆ చమురు రష్యాలోనే వెలికితీస్తున్నారు. అందువల్ల దాని మూలం రష్యాదే. కాబట్టి భారత వాటాను చూపించి అమెరికా కొత్త చట్టం కింద వచ్చే సుంకాలు, ఆంక్షల నుంచి పూర్తిగా బయటపడే మార్గం ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. అంటే.. భారత్ చేతిలో ఉన్న 49.9 శాతం వాటా ఒక కీలక వాణిజ్య బలం కావచ్చు. కానీ అదే అమెరికా ఆంక్షలకు కవచంగా మారుతుందా అన్నది మాత్రం అమెరికా నిబంధనల అమలు, లావాదేవీ నిర్మాణం, భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: ట్రంప్‌ని ఎంత పెద్ద మాట అన్నాడు సర్? -
ఒక్కసారిగా అదృష్టం తలుపు తెరిచింది.. ఊహించనంత డబ్బు దక్కింది..
అబుదాబి: సెప్టెంబర్ మూడో వారపు బిగ్ టికెట్ ఎలక్ట్రానిక్ డ్రాలో భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు ప్రవాసులు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికి 25,000 దిర్హామ్‌ల (సుమారు రూ.6.5 లక్షల) చొప్పున మొత్తం 1,00,000 దిర్హామ్‌ల (రూ.26.1 లక్షలు) నగదు బహుమతి లభించింది. విజేతల్లో తమిళనాడుకు చెందిన మెషీన్ల నిర్వాహకుడు, కేరళకు చెందిన డ్రైవర్, బంగ్లాదేశ్‌కు చెందిన పెయింటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు.తమిళనాడుకు చెందిన అయ్యలు స్వామి (41) గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం భారత్‌లోనే ఉంటోంది. బిగ్ టికెట్లో తరచుగా పాల్గొనే ఆయన ఈసారి ఒంటరిగానే టికెట్ కొనుగోలు చేసి, నంబర్‌ను యాదృచ్ఛికంగా ఎంచుకున్నారు. విజయం సాధించిన విషయం ఫోన్ ద్వారా తెలియగానే చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. వచ్చిన డబ్బును భారత్‌లో ఉన్న తన కుటుంబం కోసం వినియోగిస్తానని తెలిపారు. భవిష్యత్తు డ్రాల్లోనూ పాల్గొంటానన్నారు.మిగతా వారు ఎవరు? ఏమన్నారు? బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బషర్ (56) షార్జాలో గత 34 ఏళ్లుగా నివసిస్తున్నారు. తన సోదరుడి ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకున్న ఆయన ప్రస్తుతం 20 మంది స్నేహితులతో కలిసి పాల్గొంటున్నారు. గెలిచిన బహుమతిని బృంద సభ్యుల మధ్య పంచుకోనున్నారు. తన వాటాను కుటుంబానికి పంపడంతో పాటు కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని అబుల్ చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహమ్మద్ షహాదత్ హుస్సేన్ (38) గత 16 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నారు. ఈసారి 13 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా నంబర్‌ను ఎంచుకోకుండా కనిపించిన మొదటి నంబర్‌నే తీసుకున్నారు. వచ్చిన బహుమతిని బృంద సభ్యులతో పంచుకుని, తన వాటాను బంగ్లాదేశ్‌కు పంపాలని భావిస్తున్నారు. ఇకపై ప్రతి నెలా పాల్గొని గ్రాండ్ ప్రైజ్ గెలిచే వరకు ప్రయత్నిస్తానని చెప్పారు. కేరళకు చెందిన డ్రైవర్ ఎల్డో మాథ్యూ (30) గత 8 ఏళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్నారు. 25 మంది సభ్యులతో కలిసి బిగ్ టికెట్లో పాల్గొంటున్న ఆయన బృందానికి 25,000 దిర్హామ్‌ల బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని 25 మందితో పంచుకోనున్నారు. తన వాటాను ఎలా వినియోగించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ఎల్డో తెలిపారు. అయితే భవిష్యత్తులోనూ బిగ్ టికెట్లో పాల్గొని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి -
మంచంపై తొలిసారి నిద్రపోతున్నానంటూ పట్టలేని ఆనందం
తన జీవితంలో తొలిసారి మంచంపై నిద్రపోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్ యూజర్ విశాల్ స్వామి పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సొంతంగా సంపాదించిన డబ్బుతో మంచం కొనుక్కున్న అనంతరం ఆయన ఈ ప్రత్యేక అనుభూతిని వీడియోలో షేర్ చేసుకున్నారు. విశాల్ స్వామి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఈ అనుభూతిని నేను మాటల్లో వివరించలేను” అని పేర్కొన్నారు. వీడియోలో కొత్తగా కొనుగోలు చేసిన మంచాన్ని చూపించిన ఆయన.. దానిపై కూర్చొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు.వీడియోలో “నా జీవితంలో తొలిసారి ఈ రాత్రి మంచంపై నిద్రపోతున్నాను. జీవితంలో ఇది ఎంతో అందమైన అనుభూతి” అనే సందేశం కనిపించింది. సాధారణంగా కనిపించే మంచం తనకు మాత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా మారిందని ఈ వీడియో ద్వారా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలిఈ పోస్టుపై పలువురు సామాజిక మాధ్యమ యూజర్లు స్పందించారు. “దేవుడు ఇచ్చిన సౌకర్యాల విలువను అవి కోల్పోయే వరకు మనం గుర్తించం” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. మరో వ్యక్తి “ఏదో ఒక రోజు మీరు ఒక భవనంలో నిద్రపోవాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఇంకొకరు “అభినందనలు. పార్టీ ఎప్పుడు?” అని సరదాగా స్పందించారు. “ఏదో ఒక రోజు మీరు చాలా ధనవంతులు అవుతారని నమ్ముతున్నాను”, ‘‘సంతోషంగా ఉంది”, “మీకు అభినందనలు” అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Vishal swami (@vishalswami.12) -
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
ఇప్పటికే నిఘా.. బోయింగ్ విమానాలకే ఎందుకిలా?
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. తన విమానాల్లో ఓ సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌కు ముందు విమానం అనుకున్న మార్గాన్ని మార్చాల్సిన ప్రత్యేక పరిస్థితిలో.. ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమస్య భారత్‌లో నడుస్తున్న 96 విమానాలకు వర్తించనుంది. మరి ఈ సాఫ్ట్వేర్ లోపం నిజంగా అంత ఆందోళన చెందాల్సిన విషయమేనా?ఈ సమస్యపై గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా 737 విమానాలు నడుపుతున్న అన్ని ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చినట్లు బోయింగ్ తెలిపింది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్పై పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అయితే దీనివల్ల విమానాన్ని మాన్యువల్‌గా నడపలేని పరిస్థితి మాత్రం ఉండదని బోయింగ్ స్పష్టం చేసింది. భారత్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద సుమారు 53, ఆకాశ ఎయిర్ వద్ద 43 బోయింగ్ 737 మ్యాక్స్(MAX) విమానాలు ఉన్నాయి. సమస్య ఏంటంటే.. ఈ సమస్య కాక్‌పిట్ సాఫ్ట్‌వేర్‌లోని ఓ అప్డేట్ కారణంగా తలెత్తినట్లు సమాచారం. సాధారణంగా విమానం ఒక నిర్దిష్ట మార్గంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుంది. అయితే ఏదైనా కారణంతో ల్యాండింగ్ సాధ్యం కాక మిస్డ్ అప్రోచ్ తీసుకోవాల్సి వస్తే.. ఆ తర్వాతి ప్రయత్నంలో మొదట అనుకున్న మార్గానికి భిన్నంగా విమానాన్ని తీసుకెళ్లాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితిలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ డిసెంగేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది. అంటే ఆటోమేషన్ సహాయం తగ్గిపోతుంది. అయితే దీనివల్ల విమానానికి వచ్చిన ప్రమాదం ఏం ఉండని.. గాలిలో అదుపు తప్పడం లేదంటే పైలట్లు విమానాన్ని నడపలేని పరిస్థితి ఎదురుకాదని బోయింగ్ చెబుతోంది.ఈ పరిస్థితిని పైలట్లు సురక్షితంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న విధానాలను పాటించాలని సూచించింది. మిస్డ్ అప్రోచ్ తర్వాత సిస్టమ్‌ను రీసెట్ చేయాలని కూడా బోయింగ్ సూచించినట్లు సమాచారం. సమస్యను పూర్తిగా తొలగించేందుకు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ సిద్ధం చేస్తోంది.భారత విమానాలపై ప్రభావంబోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడుపుతున్న భారత విమానయాన సంస్థల్లో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. తాజా పరిణామంపై సదరు ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఆకాశ ఎయిర్ ఈ సమస్యపై బోయింగ్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. తమ విమానాల కార్యకలాపాల భద్రతపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారమే విమానాలను సురక్షితంగా నడుపుతున్నామని పేర్కొంది. అయితే తమ విమానాల్లో ఏదైనా ఈ సమస్యను ఎదుర్కొందా అనే విషయాన్ని ఆకాశ ఎయిర్ వెల్లడించలేదు.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వెంటనే స్పందన రాలేదు. ఈ సమస్యపై భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలన చేపట్టిందా? విమానయాన సంస్థలకు ఏదైనా ప్రత్యేక సూచన జారీ చేసిందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బోయింగ్‌పై ఇప్పటికే నిఘాకిందటి ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత భారత విమానయాన రంగంలో బోయింగ్ విమానాల భద్రతపై మరింత దృష్టి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ లండన్–బెంగళూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాన్ని పైలట్ నివేదించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సమస్య కారణంగా గ్రౌండ్ చేశారు. అయితే బోయింగ్ తర్వాత చేసిన పరీక్షల్లో ఎలాంటి అసాధారణత కనిపించలేదని ప్రభుత్వం తెలిపింది.అయితే ఆ రెండు ఘటనలు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించినవి కాగా.. ఇప్పుడు బయటపడిన సాఫ్ట్వేర్ సమస్య 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించినది. అయితే భారత్‌లో బోయింగ్ విమానాలపై భద్రతా పరిశీలన కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త సాఫ్ట్వేర్ సమస్య వెలుగు చూడడం గమనార్హం.ఎందుకు అంత ప్రాధాన్యం?ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2,400కు పైగా 737 MAX విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. అయితే ఈ విమానాలు గతంలో రెండు ఘోర ప్రమాదాల కారణంగా వార్తల్లోకి ఎక్కాయి. 2018లో ఇండోనేషియాలో లయన్ ఎయిర్ 737 MAX 8 ప్రమాదంలో 189 మంది, 2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 MAX 8 ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ రెండు ప్రమాదాల తర్వాత ఈ మోడల్ విమానాల సేవల్ని ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం నిలిపివేశారు. తిరిగి ప్రారంభం అయ్యాక కూడా.. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో వార్తల్లోకి ఎక్కాయి. 2024 జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 విమానంలో గాల్లో ఉండగానే డోర్ ప్లగ్ ఊడిపోవడంతో మరోసారి ఈ మోడల్ తయారీ, నాణ్యత నియంత్రణపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సమస్య మాత్రం ప్రత్యేక ల్యాండింగ్ పరిస్థితిలో ఆటోమేషన్ తగ్గిపోయే సాఫ్ట్వేర్ లోపం. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు బోయింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఇరాన్ వార్నింగ్.. వారంలో ఏదైనా జరగొచ్చన్న ట్రంప్ -
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
న్యూఢిల్లీ: ఉగ్రవాద భూతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులను కఠినంగా అణచివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. టెర్రరిజంపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఉగ్రవాద దాడుల వల్ల కలిగిన వేదనకు భారత్ ఇచ్చిన నిర్ణయాత్మక సమాధానమే ‘2016 నాటి సర్జికల్ దాడులు’ అని పునరుద్ఘాటించారు. భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానానికి అవి ఒక కొత్త ఉదాహరణగా నిలిచాయని, నూతన ప్రమాణాన్ని(బెంచ్‌మార్క్) నెలకొల్పాయని అన్నారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మన లక్ష్యం ‘డ్రగ్స్ రహిత భారత్’ ‘‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. నషా ముక్త్ యువ అభియాన్‌లో భాగంగా ఇటీవల లక్షలాది మంది యువత డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో యువత చురుగ్గా పాలుపంచుకోవాలి. అక్టోబర్ 2న గాం«దీజీ జయంతిని నిర్వహించుకోబోతున్నాం. అనేక మార్గదర్శక సూత్రాలను గాం«దీజీ అందించారు. నేను ఇటీవల అనేక స్ఫూర్తిదాయకమైన పరిశుభ్రతా కార్యక్రమాలను చూశా. మధ్యప్రదేశ్‌లో యువకులు నదిని శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత వారసత్వ సంపదను పునరుద్ధరిండానికి సాయం అందిస్తున్నారు. పాత మెట్ల బావులను శుభ్రం చేస్తున్నారు’’ అని చెప్పారు. అలాంటి వారు కనుమరుగైపోయారు ‘‘ఈ ఏడాది సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను ఘనంగా నిర్వహించుకున్నాం. 1,000 ఏళ్ల క్రితం మహ్మద్ గజనీ సోమ్‌నాథ్ ఆలయాన్ని మొదటిసారిగా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ను నాశనం చేసి, భారతదేశ అస్థిత్వాన్ని తుడిచిపెట్టడానికి వచ్చిన వారు ఇప్పుడు కనుమరుగైపోయారు. కానీ, సోమ్‌నాథ్ ఆలయం మాత్రం సముద్ర తీరాన ఇప్పటికీ వైభవంగా నిలిచి ఉంది. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పస్తున్నా. ఆయన తన జీవితంలో తగినంత గుర్తింపునకు నోచుకోలేదు. రామమందిర ఉద్యమంతో పాటు సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. లక్షలాది మంది ఆయన అభిమానుల తరఫున అశోక్ సింఘాల్‌కు నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. -
మరింత ఉన్నతస్థాయికి భారత్, కెనడా సంబంధాలు
ఐక్యరాజ్యసమితి: తమ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్, కెనడా సన్నద్ధమవుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. అమెరికాలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ఆయన సమావేశమయ్యారు. భారత్, కెనడా సంబంధాలపై వారు చర్చించారు. కెనడా విదేశాంగ మంత్రితో భేటీ కలవడం సంతోషదాయకమని జైశంకర్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆమెతో ఫలప్రదమైన చర్చ జరిగిందని వెల్లడించారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మాట్లాడుతూ... భారత్‌తో వాణిజ్య చర్చల్లో కెనడా మంచి పురోగతి సాధిస్తోందని చెప్పారు. -
హెల్త్‌కేర్.. ‘షేర్’ ఎవరిది?
హెల్త్‌కేర్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చేది ఆసుపత్రులు... ఫార్మా కంపెనీలే. మరి డయాగ్నస్టిక్స్... వైద్య పరికరాలు... హెల్త్‌టెక్.. ఆరోగ్య బీమా... టెలీ టూరిజం.. టెలీ మెడిసిన్ వీటి సంగతేంటి? వీటి చుట్టూ అల్లుకున్న వందలాది అనుబంధ రంగాల మాటేంటి? గత ఏడాది ఏకంగా 600 బిలియన్ డాలర్లను దాటేయటంతో పాటు ఏటా 22.5 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని నమోదు చేస్తోందంటే భారత హెల్త్‌కేర్ రంగం ఎంత పెద్దదో తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు. పైపెచ్చు 2023లో దేశ జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హె ల్త్‌కేర్ ఖర్చు 2030 నాటికి 5 శాతాన్ని మించిపోతాయనేది ఆర్థిక సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో ఎక్కువ వృద్ధిని నమోదు చేసే పరిశ్రమలేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్ లీడర్లెవరు? ఏ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఎక్కువ రాబడులొస్తాయి? దీనిపై ‘సాక్షి వెల్త్’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి కథనమిది. దశాబ్దాలుగా దేశంలో హెల్త్‌కేర్ అంటే ఫార్మా సంస్థలే. హెల్త్‌కేర్ వృద్ధిపై ఇన్వెస్టర్లు ఏం మాట్లాడినా మందుల తయారీ కంపెనీలు... జనరిక్ మందులు... ఏపీఐల గురించే. కానీ పరిస్థితి మారింది. మన హెల్త్‌కేర్ ఎకానమీలో ఇపుడు ఆసుపత్రులు, ఆరోగ్య బీమా, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజ్‌లు, స్పెషాలిటీ కేర్, హెల్త్‌టెక్, మెడికల్ టూరిజం, హోమ్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా చేరాయి. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆవిష్కృతమయ్యింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. మరి జనం ఖర్చులు పెరగటం వల్లే ఇదంతా సాధ్యమయ్యిందా? కానే కాదు. జనం ఆయుష్షు పెరిగింది. జీవనశైలి మారింది. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రివెంటివ్ కేర్‌పై శ్రద్ధ... బీమా కవరేజీ పెరిగాయి. స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల బదులు చాలామంది వ్యవస్థీకృత ప్రయివేటు ఆసుపత్రులకు మళ్లారు. ఆసుపత్రుల పడకలు పెరిగాయి. వైద్యపరీక్షల్లో ఆధునికత పెరిగింది. వైద్య పరికరాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ హెల్త్‌కేర్ ప్రతిదశలోకీ డిజిటల్ టెక్నాలజీ చొచ్చుకుపోయింది. వీటన్నిటి ఫలితమే సమగ్ర హెల్త్‌కేర్ ఎకానమీ. హెల్త్ డెలివరీ @ రూ.10 లక్షల కోట్లు! హెల్త్‌కేర్ పరిశ్రమపై తాజాగా సెబీ నిర్వహించిన సమావేశంలో 2025లో హెల్త్‌కేర్ డెలివరీ పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల రెవెన్యూను నమోదు చేసినట్లు అంచనా వేశారు. ఇది 2028 ఆర్థిక సంవత్సరానికల్లా 10–12 శాతం వార్షిక వృద్ధితో 9.8 లక్షల కోట్లను చేరుతుందని పేర్కొన్నారు. అదే సమావేశంలో... మెడికల్ డివైజెస్, డయాగ్నస్టిక్స్ మార్కెట్లు గత ఏడాది రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చూశాయని, ఇవి 11–12 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని అంచనా వేశారు. ఇక ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, సర్జికల్స్, హెల్త్‌టెక్, స్పెషాలిటీ కేర్, రిహాబిలిటేషన్, హోమ్ హెల్త్‌కేర్, మెడికల్ టూరిజంలను కూడా కలిపితే ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు ఏదో ఒక రంగంలో కాకుండా మొత్తం వ్యవస్థలో అవకాశాలు ఎక్కువన్నది అర్థమవుతుంది. మందులొక్కటే కాదు... మొత్తం వ్యవస్థపై ఖర్చు మనం ఎక్కువగా ఏ మందులు వాడుతున్నామన్నది గతంలో ఇన్వెస్టర్లు చూసిన కోణం. కానీ ఇపుడు... దేనిపై ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యం. ఆరోగ్య బీమాతో మొదలుపెడితే... ఒక పేషెంట్ తన వ్యాధి నుంచి బయటపడేందుకు ఆసుపత్రి... డయాగ్నస్టిక్ సెంటర్... సీటీ/ఎంఆర్ఐ/పెట్ స్కాన్... మెడికల్ డివైజ్... సర్జికల్ ఇంప్లాంట్.. కన్సూమబుల్స్... ఫార్మసీ... ఫాలో అప్ పరీక్షలు.. హోమ్ హెల్త్‌కేర్... డిజిటల్ పర్యవేక్షణ .. వీటన్నింటిపై ఖర్చుచేస్తాడు. ఆ పేషెంట్ నుంచి వీటన్నిటికీ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ మొత్తం వ్యవస్థను చూడాల్సి ఉంటుంది. హెల్త్‌కేర్ ఎందుకు పెరుగుతోందంటే...ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ అనారోగ్యం బారిన పడకుండా ప్రివెంటివ్ పరీక్షలు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ సేవలు, ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవటంపై మన వాళ్లలో బాగా శ్రద్ధ పెరుగుతోంది. తాజా ఎన్ఎస్ఓ హెల్త్ సర్వేలో... 2017–18తో పోలిస్తే త మకు వ్యాధులున్నాయని చెప్పినవారి సంఖ్య 2025లో బాగా పెరిగింది. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను వినియోగించుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. దీనర్థం హెల్త్‌కేర్ మార్కెట్ పెరుగుతోందనే. జీవనశైలి వ్యాధులు దేశంలో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి సాధారణంగా ఒకసారి వైద్యం చేస్తే సరిపోదు. ఏళ్ల తరబడి... దశాబ్దాల తరబడి హెల్త్‌కేర్ వినియోగం అవసరం. ఉదాహరణకు మధుమేహంతో ఉన్న వ్యక్తి తరచూ డాక్టర్ని కలవాలి. రక్త పరీక్షలు చేయించాలి. రెగ్యులర్‌గా మందులు తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలం పర్యవే„ý ణ అవసరమైన వ్యాధి ఇది. అందుకే ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్ డిమాండూ పెరుగుతుంది. పెరిగిన ఆయుఃప్రమాణం హెల్త్‌కేర్ ఎకానమీతో జనం ఆయుఃప్రమాణం పెరిగింది. ఆసుపత్రులు, చికిత్సల కోసం యువత ఎక్కువ ఖర్చు చేయకున్నా వయసు మళ్లినవారికి తప్పటం లేదు. గుండె, కేన్సర్, కీళ్లు, కళ్లు, కిడ్నీ, రిహాబిలిటేషన్, దీర్ఘకాల మందులు, హోమ్ హెల్త్‌కేర్, సహాయకులపై వీరు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ ఆసుపత్రులను దాటి అవకాశాలు పెరుగుతున్నాయి. మున్ముందు హెల్త్‌కేర్ అనేది పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటంతోనే ఆగిపోదు. హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, రిమోట్ పర్యవేక్షణ పెరుగుతాయి. ఈ రంగంలో భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను గుర్తించవచ్చు కూడా. బీమా.. సమగ్ర మార్పు ఆసుపత్రి బిల్లు కోసం అప్పులపాలై జీవితాంతం ఇబ్బందులు పడ్డ దృష్టాంతాలు ఇప్పటికీ ఉన్నా... గతంకన్నా తగ్గాయి. కారణం... బీమాపై అవగాహన పెరగటం. ఇపుడు హెల్త్‌కేర్‌పై చేస్తున్న ఖర్చులు అత్యధికం బీమా కంపెనీల నుంచో, ప్రభుత్వ స్కీముల నుంచో చేస్తున్నవే తప్ప వ్యక్తుల నుంచి కాదు. అందుకే 2013–14లో 1.3 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఖర్చు 2022–23 నాటికి 3.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య రంగంపై పెడుతున్న ఖర్చులో ప్రభుత్వ వాటా 28 శాతం నుంచి 43.7 శాతానికి పెరగ్గా... వ్యక్తులు సొంతంగా చేస్తున్న ఖర్చు 64 శాతం నుంచి 43.4 శాతానికి పడిపోయింది. ఆర్థికంగా ఇది అత్యంత ప్రాధాన్యమున్న పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ లేదా బీమా కవరేజీ ఉన్న సందర్భాల్లో జనం చికిత్స విషయంలో పెద్దగా వెనకాడరు. త్వరగా నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల మొత్తం ఆరోగ్య ఎకానమీపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. విస్తరణ అవకాశాలెక్కువే... జాతీయ హెల్త్ పాలసీ ప్రకారం ప్రతి వెయ్యి మందికి రెండు ఆసుపత్రి పడకలుండాలి. కానీ ఇపుడున్నది 1.4 మాత్రమే. అందులో ప్రభుత్వానిది 0.6. ఈ గ్యాప్‌తో విస్తరణకు ఎంత అవకాశముందో అర్థమవుతుండగా ప్రయివేటు రంగం దీన్ని అందుకోవటానికి వేగంగా అడుగులేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 18 ప్రముఖ ఆసుపత్రులో మరో 34వేల పడకలు జత చేయనున్నాయనేది తాజా ‘ఇక్రా’ అ«ంచనా. కాకపోతే ఇలా పడకలు పెరుగుతున్న కొద్దీ... ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు కూడా మరింత పెరుగుతుంది. వీటివల్ల ప్రధానం ఆసుపత్రి భవనం.. మెడికల్, ఐసీయూ, డయాగ్నస్టిక్ పరికరాలు, సర్జికల్ ఉత్పత్తులు, డాక్టర్లు, నర్సులు, ఫార్మసీ, బీమా, హెల్త్‌కేర్ ఐటీ... ఇలా అన్నీ పెరుగుతాయి. అందుకే ఆసుపత్రి ఆదాయం ఒక్కటే కాకుండా ఆసుపత్రి విస్తరణ వల్ల మొత్తం హెల్త్‌కేర్ ఎకానమీపై ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆరోగ్య రంగ దిగ్గజాలను ఇలా చూడొచ్చు...ఆసుపత్రులు 2026 హెల్త్‌కేర్ రివ్యూ ప్రకారం ఆసుపత్రుల రెవెన్యూ 15 శాతం వృద్ధి చెందుతోంది. బెడ్ ఆక్యుపెన్సీ 60–75 శాతం వరకూ ఉంది. → అపోలో హాస్పిటల్స్ → మ్యాక్స్ హెల్త్‌కేర్ → ఫోరి్టస్ హెల్త్‌కేర్ → ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ → మెదాంతా/ గ్లోబల్ హెల్త్ → నారాయణ హృదయాలయ → కిమ్స్ → రెయిన్బో చిల్డ్రన్స్ → యథార్థ్ హాస్పిటల్స్ డయాగ్నస్టిక్స్ కన్సాలిడేషన్, విస్తరణ, హోమ్ కలెక్షన్, డిజిటల్ బుకింగ్, ప్రత్యేక పరీక్షలతో వ్యవస్థీకృత డయాగ్నస్టిక్ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇవి 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 25 శాతానికిపైగా ఎబిటా మార్జిన్లను సాధించాయి. → డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ → మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ → విజయ డయాగ్నస్టిక్స్ → థైరోకేర్ → క్రిస్నా డయాగ్నస్టిక్స్ → సురక్షా డయాగ్నస్టిక్స్ మెడికల్ డివైజెస్, సర్జికల్ ప్రొడక్ట్స్ ఈ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ అన్‌లిస్టెడ్‌గానే ఉన్నాయి. కాబట్టి ఇందులో లిస్టయ్యే కంపెనీలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. → పాలీ మెడిక్యూర్ → ప్రివెస్ట్ డెంట్ప్రో → న్యురెకా → జీకేబీ ఆప్తాల్మిక్స్ → శ్రీ పేస్ట్రానిక్స్ → హేమంత్ సర్జి్కల్ ఆరోగ్య బీమా హెల్త్‌కేర్‌కు ఫైనాన్సింగ్ ఇంజిన్‌గా పనిచేస్తున్న ఈ రంగం... ప్రివెంటివ్ కేర్‌పై పెరుగుతున్న అవగాహన కారణంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో స్టాండలోన్ కంపెనీలు తక్కువే. → స్టార్ హెల్త్ → నివా బూపా → ఐసీఐసీఐ లాంబార్డ్ (డైవర్సిఫైడ్) సీఆర్ఓ/ సీడీఎంఓ భారత ఫార్మా ఎగుమతులిపుడు జనరిక్ మందులకే పరిమితం కాదు. డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ రీసెర్చ్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ, స్పెషాలిటీ కెమిస్ట్రీ, బయాలాజిక్స్ వంటి రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు భారత సంస్థలపై ఆధారపడుతున్నాయి. దీంతో సీఆర్ఓ/సీడీఎంఓ అవకాశాలు పెరుగుతున్నాయి. → సింజీన్ ఇంటర్నేషనల్ → అరాజెన్ లైఫ్‌సైన్సెస్ → సాయి లైఫ్ సైన్సెస్ → ఆంథెమ్ బయోసైన్సెస్ → న్యూలాండ్ ల్యా»ొరేటరీస్ → గ్లాండ్ ఫార్మా → పిరమల్ ఫార్మా → లారస్ ల్యాబ్స్ → దివీస్ ల్యాబొరేటరీస్ హెల్త్‌టెక్, డిజిటల్ హెల్త్ పేషెంట్ రికార్డులు, డయాగ్నస్టిక్ చిత్రాలు, ల్యాబ్ రిపోర్ట్లు, బిల్లింగ్, బీమా క్లెయిమ్‌లు, ప్రిస్క్రిప్షన్లు... ఇలా అన్నింటికీ డిజిటల్ సేవలు అవసరమే. → టాటా ఎలక్సీ → పెర్సిస్టెంట్ సిస్టమ్స్ → కొఫోర్జ్ → ఇన్ఫోసిస్ → టీసీఎస్ → విప్రో → ఎంఫసిస్ ఇంకా హోమ్ హెల్త్‌కేర్, వృద్ధుల సంరక్షణ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నా వీటిలో లిస్టెడ్ కంపెనీలు ప్రత్యేకంగా ఏమీ లేవు. చాలా ఆసుపత్రులు ఈ సేవల్ని అందిస్తుండగా... కొన్ని స్టార్టప్‌లు సైతం వేగంగా ఎదుగుతున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో అవకాశాలను, మార్పులను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి.తదుపరి భాగంలో... ఆసుపత్రుల కేరాఫ్ ఎవరిది? అపోలో.. మాక్స్.. ఫోర్టిస్.. ఆస్టర్.. మెదాంతా.. నారాయణ.. కిమ్స్.. రెయిన్బో.. యథార్థ్ ఇవన్నీ అగ్రశ్రేణి ఆసుపత్రులే. మరి వీరిలో బాగా లబ్ధి పొందేదెవరు? ఎవరి ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉండబోతోంది? తదుపరి 50వేల పడకల్లో ఎవరి వాటా ఎంత? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి?.. వచ్చేవారం ‘సాక్షి వెల్త్’లో తెలుసుకుందాం. రమణమూర్తి మంథా -
శతక మోత
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించిన విరాట్ కోహ్లి... వెస్టిండీస్‌పై విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పరుగుల దాహం ఇంకా తీరలేదని నిరూపించుకున్నాడు. కోహ్లి దూకుడుకు సారథి శుబ్‌మన్ గిల్ శతకం తోడవడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా విజయఢంకా మోగించింది. తిరువనంతపురం: విరాట్ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో రెచ్చిపోవడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (108 బంతుల్లో 101; 12 ఫోర్లు) సెంచరీ సాధించగా... జాన్ క్యాంప్‌బెల్ (60 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అమిర్ జంగూ (43 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి, గిల్ సెంచరీల మోత మోగించగా... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఇరు జట్ల మధ్య బుధవారం గువాహటిలో రెండో వన్డే జరగనుంది. సిక్స్‌లతో రెచ్చిపోయిన ‘కింగ్’ రెండు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన ‘కింగ్’ కోహ్లి... తనకు అలవాటైన రీతిలో రెచ్చిపోయాడు. సాధారణంగా సిక్స్‌ల కంటే ఫోర్లు ఎక్కువ కొట్టే అలవాటున్న కోహ్లి... ఆదివారం అభిమానులకు భారీ సిక్సర్లతో విందు భోజనం పెట్టాడు. ఓపెనర్లు రోహిత్, గిల్ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభం అందించగా... కోహ్లి ఎదుర్కొన్న నాలుగో బంతికే సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ఇక అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్ ముగిసేంత వరకు విరాట్ వీరవిహారం కొనసాగింది. కోహ్లికి మరో ఎండ్ నుంచి గిల్ చక్కటి సహకారం అందించడంతో భారత ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో గిల్ 49 బంతుల్లో, విరాట్ 40 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన ‘చేజ్ మాస్టర్’ అల్జారీ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. వన్డేల్లో పదో సెంచరీ అనంతరం గిల్ అవుట్ కాగా... కోహ్లి 74 బంతుల్లో శతకం ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అతడికి 55వ సెంచరీ కాగా... ఓవరాల్‌గా 86వది. మూడంకెల స్కోరు అందుకున్న తర్వాత మరింత దూకుడు పెంచిన విరాట్... మోతీ ఓవర్లో 6,4, అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, కార్టీ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో మరో 50 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.విరాట్ @ 15,000ఈ మ్యాచ్ ద్వారా ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి మరో ఘనత ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 15,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ ప్రస్తుతం 315 మ్యాచ్‌ల్లో 15,080 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర (14,234), పాంటింగ్ (13,704), జయసూర్య (13,430) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లి ఒక దేశంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి భారత్‌లో 7,006 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ (భారత్‌లో 6976 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.55 వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్లో అతడిదే అగ్రస్థానం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక అన్నీ ఫార్మాట్లలో కలిసి సచిన్ 100 సెంచరీలు చేయగా... ప్రస్తుతం కోహ్లి 86 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. 9 ఈ మ్యాచ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్‌లు. ఒక వన్డేలో అతడికివే అత్యధికం. 2023లో శ్రీలంకతో వన్డేలో కోహ్లి 8 సిక్స్‌లు బాదాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) ప్రసిధ్ (బి) కుల్దీప్ 62; గ్రీవ్స్ (ఎల్బీ) (బి)కుల్దీప్ 101; కార్టీ (సి) గిల్ (బి) ప్రసిధ్ 13; హోప్ (సి) జడేజా (బి) కుల్దీప్12; అమిర్ జంగూ (నాటౌట్) 58; జెవెల్ ఆండ్రె (సి) రోహిత్ (బి) కుల్దీప్ 0; చేజ్ (బి) ప్రసిధ్ 24; ఫోర్డ్ (సి) నమన్ (బి) నితీశ్ రెడ్డి 7; మోతీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1–135, 2–176, 3–195, 4–198, 5–198, 6–250, 7–288. బౌలింగ్: ప్రసిధ్ కృష్ణ 10–0–60–2; నితీశ్ రెడ్డి 5–0–45–1; బ్రార్ 10–0–60–0; జడేజా 10–0–54–0; నమన్ ధీర్ 5–0–33–0; కుల్దీప్ 10–1–40–4. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆండ్రె (బి) అల్జారీ జోసెఫ్ 32; గిల్ (సి) ఆండ్రె (బి) చేజ్ 110; కోహ్లి (నాటౌట్) 139; రుతురాజ్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (41.4 ఓవర్లలో 2 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–74, 2–225. బౌలింగ్: జైడెన్ సీల్స్ 7–0–32–0; మాథ్యూ ఫోర్డ్ 5–0–39–0; అల్జారీ జోసెఫ్ 9–1–81–1; గుడాకెశ్ మోతీ 10–0–66–0; రోస్టన్ చేజ్ 10–0–64–1; కార్టీ 0.4–0–17–0. -
ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం
-
రజతంతో సరిపెట్టుకున్న భారత స్క్వాష్ స్టార్
రజతంతో సరిపెట్టుకున్న భారత స్క్వాష్ స్టార్భారత స్క్వాష్ స్టార్ అభయ్ సింగ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో యోవ్ చేతిలో ఓటమి పాలై స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు.తొలి రెండు గేమ్‌లను కోల్పోయి 0-2తో వెనుకబడిన అభయ్.. మూడో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. వరుస పాయింట్లు సాధిస్తూ 4-2 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే యోవ్ తన అనుభవాన్ని ఉపయోగించి తిరిగి పుంజుకుని స్కోరును 4-4తో సమం చేశాడు.ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. స్కోరు 5-5తో సమమైన సమయంలో యోవ్ కీలక పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చాడు. అక్కడి నుంచి దూకుడుగా ఆడి గేమ్‌ను 11-5తో ముగించాడు. దీంతో యోవ్ స్వర్ణ పతకం సాధించగా, అభయ్ సింగ్ రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.నిరాశపరిచిన సింధు.. క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమణభారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏషియన్ గేమ్స్‌లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూఫీ చేతిలో మూడు గేమ్‌ల పోరులో ఓటమి పాలైంది.తొలి గేమ్‌లో సింధు అద్భుతంగా ఆడి 21-11తో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత చెన్ యూఫీ పుంజుకుంది. రెండో గేమ్‌ను 21-18తో, నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 21-10తో గెలుచుకుంది. సింధు ఓటమితో భారత్‌కు ఈ విభాగంలో పతకం దక్కే అవకాశం చేజారింది.ఆర్చరీలో భారత్ వరల్డ్ రికార్డు సమం.. పతకాల వేటలో మను బాకర్ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఇవాళ (ఎనిమిదో రోజు) మరిన్ని పతకాలపై కన్నేసింది. స్క్వాష్‌లో అబయ్ సింగ్, అనాహత్ సింగ్ తమ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. ఫైనల్లో విజయం సాధిస్తే ఆ పతకాలు స్వర్ణంగా మారనున్నాయి.డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ చివరి ఐదు ఈవెంట్లలో పోటీ పడనున్నాడు. అథ్లెటిక్స్‌లోనూ భారత్ పతకాలపై ఆశలు పెట్టుకుంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నిరాశపరిచిన తర్వాత, మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకాలు సాధించాలని మను బాకర్, ఈషా సింగ్ ఆసక్తిగా ఉన్నారు.ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. మహిళల జట్టు ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. పురుషుల జట్టు రౌండ్ ఆఫ్ 16లో యూఏఈని, క్వార్టర్ఫైనల్లో భూటాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. మహిళల జట్టు రౌండ్ ఆఫ్ 16లో మంగోలియాను, క్వార్టర్ఫైనల్లో కజకిస్థాన్‌ను ఓడించింది.మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ ఓటమి పాలైంది.ఇదీ చదవండి: వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..! -
మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?
అది 1955 నాటి ఉత్తరప్రదేశ్... చిన్న పట్టణం ఛత్తా. అందులో సువిశాలమైన ఓ పెంకుటిల్లు... తల్లి తన నాలుగున్నరేళ్ల కుమారుడు ప్రకాశ్ వర్ణ్షేకి గోరుముద్దలు తినిపిస్తోంది. రెండు ముద్దలు తిన్న ఆ బాలుడు– మూడో ముద్ద పెడుతుంటే తల్లి చేతిని వెనక్కి నెట్టేశాడు. ‘‘నన్ను నా ఇంటికి తీసుకెళ్లండి. నా కోసం కోసికలాన్‌లో నా వాళ్లు ఎదురుచూస్తున్నారు’’ అనేసరికి తల్లి బిత్తరపోయింది.ఆ రాత్రి నిద్రలో నుంచి లేచిన బాలుడు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. తల్లిదండ్రులు ఎంత ఆపినా వినకుండా ఒకటే ఏడుపు. ‘‘నేను ఇక్కడివాడిని కాదు. కోసికలాన్‌లో నా ఇల్లు ఉంది. నా పేరు ప్రకాశ్ కాదు, నిర్మల్. వెంటనే నన్ను అక్కడకు తీసుకెళ్లండి’’ అని మారాం చేశాడు.నాలుగున్నరేళ్ల బాలుడు కోసికలాన్ గురించి మాట్లాడటమేంటి? అసలు ఆ ఊరి పేరు ఈ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ ఎత్తలేదే! అని తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకాశ్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారసాగింది. తన తండ్రి పేరు బోలానాథ్ అని, ఆయనకు నాలుగు దుకాణాలు ఉన్నాయని చెప్పేవాడు. పాత ఇంటికి తీసుకెళ్లాలని గట్టిగా పట్టుబట్టేవాడు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచి, ‘‘నా కడుపు మండిపోతోంది. మంచం చుట్టూ జనం ఉన్నారు. నేను చనిపోతున్నాను!’’ అంటూ భయంతో వణికిపోయేవాడు.కోసికలాన్ తీసుకెళ్తే తప్ప తమ కుమారుడి విషయంలో మార్పు రాదని భావించిన తల్లిదండ్రులు 1956లో బాలుడిని తీసుకుని కోసికలాన్ వెళ్లారు. అయితే, ఆ సమయంలో బోలానాథ్ లేకపోవడం వల్ల కలవకుండానే వెనక్కి వచ్చేశారు. కానీ ప్రకాశ్ జ్ఞాపకాలు మాత్రం కోసికలాన్కు ప్రయాణిస్తూనే ఉన్నాయి. పలుమార్లు కొసికలాన్కు వెళ్లడానికి విఫలయత్నాలు చేశాడు.ఓరోజు పెద్ద మేకును పట్టుకుని కోసికలాన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. ప్రకాశ్ నాన్న వెంటనే గమనించి ఆపాడు. చేతిలో ఉన్న మేకు ఏమిటని అడిగితే– ‘‘ఇది నా ఇనప్పెట్టె తాళం చెవి’’ అని చెప్పాడు. ప్రకాశ్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి కోసికలాన్ గురించి మరింత మారాం చేస్తుండటంతో 1961లో మళ్లీ అతడిని తీసుకుని వెళ్లారు. బస్సు దిగీదిగగానే వడివడిగా నడవడం మొదలుపెట్టాడు. ఆ వెనుకే అతడి తల్లిదండ్రులు కూడా అనుసరించారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాత డాబా ఇంటి ముందు ఆగాడు.‘‘ఇదే నా ఇల్లు!’’ అన్నాడు గట్టిగా.ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళను చూడగానే ప్రకా‹శ్ కళ్లు చెమ్మగిల్లాయి. ‘అమ్మా!’ అంటూ ఆమెను హత్తుకున్నాడు. పక్కనే నిలబడిన ఓ యువకుడిని ‘‘నువ్వు నా తమ్ముడు దేవేంద్ర కదా’’ అని అడిగాడు. ‘‘తారక్క ఎక్కడుంది?’’ అని ప్రశ్నించాడు. ఇది చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. బోలానాథ్ జైన్ కుమారుడు నిర్మల్ నిజంగానే ఉన్నాడని, 1950లో సుమారు పదేళ్ల వయసులో మశూచితో మరణించినట్లు తెలిసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.ప్రకాశ్ అంతటితో ఆగలేదు. ఆ ఇల్లంతా తిరిగాడు. ఏ గది ఎక్కడుందో, వెనుక పెరట్లో ఏముందో చెప్పాడు.ఇవన్నీ చూసిన నిర్మల్ తల్లి కన్నీటిపర్యంతమైంది. మరోవైపు తమ బిడ్డ తమకు దక్కకుండా పోతాడేమోనని ప్రకాశ్ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూశారు. ఆ క్షణంలో ఆ వాకిట్లో నిశ్శబ్దం ఆవరించింది. రెండు కుటుంబాల మధ్య మమకారాలు, అనుమానాలు, అంతుచిక్కని కాలచక్రపు రహస్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. చివరకు, బాలుడి భవిష్యత్తు కోసం ప్రకాశ్‌ను అతడి తల్లిదండ్రులతోనే పంపాలని అందరూ నిర్ణయించుకున్నారు.ఈ విషయం పునర్జన్మలపై అధ్యయనం చేస్తున్న అమెరికా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్కు తెలిసింది. దీంతో ఆయన 1961లో భారత్‌కు వచ్చారు. ప్రకాశ్, అతడి కుటుంబం, జైన్ కుటుంబం, స్థానిక సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. 1964లో మరోసారి భారత్‌కు వచ్చి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన దృష్టిని ఆకర్షించిన అంశం భౌగోళిక దూరం. ప్రకాశ్ కుటుంబం నివసించే ఛత్తా, నిర్మల్ కుటుంబం నివసించే కోసికలాన్ పట్టణాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్ల లోపే! పైగా రెండు కుటుంబాలకు ముందుగా పరిచయం కూడా లేదు. డాక్టర్ స్టీవెన్సన్ ఈ కేసును ‘పునర్జన్మ కేసు’గా పరిగణించారు.ప్రకాశ్ చెప్పిన పేర్లు, కుటుంబ సంబంధాలు, దుకాణాల వివరాలు, ఇంటి నిర్మాణం వంటి కొన్ని అంశాలు జైన్ కుటుంబానికి సంబంధించిన సమాచారంతో సరిపోలినట్లు గుర్తించారు. పునర్జన్మలపై తాను రాసిన పుస్తకంలో ప్రకాశ్ ఉదంతం గురించి వివరంగా రాశారు. కాలం గడిచేకొద్దీ ప్రకాశ్ సాధారణ జీవితంలోకి వెళ్లాడు. అయితే బాల్యంలో తనకు కలిగిన నిర్మల్ జ్ఞాపకాల ప్రభావం పూర్తిగా మాయం కాలేదు.ఒక చిన్నారి తనకు తెలియని మరో కుటుంబం, మరో ఊరు, మరో వ్యక్తి పేరు ఎందుకు చెప్పాడు? ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు కొన్ని వ్యక్తులను, ప్రదేశాలను గుర్తించినట్లు ఎందుకు ప్రవర్తించాడు? అతడు చెప్పిన కొన్ని వివరాలు అక్కడి వాస్తవాలతో ఎలా సరిపోయాయి? ఇవన్నీ పునర్జన్మకు సాక్ష్యాలేనా? లేక ఇప్పటికీ పూర్తిగా అర్థంకాని బాల్య జ్ఞాపకాలు, సమాచార మార్పిడి, మానసిక ప్రక్రియల ఫలితమా?ప్రకాశ్ వర్ణే›్ష ఉదంతం ఈ ప్రశ్నలకు తుది సమాధానం ఇవ్వకపోయినా, ‘మరణం తర్వాత కూడా జ్ఞాపకం కొనసాగుతుందా’ అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు! -
కలిసొచ్చిన శనివారం.. 30 పతకాల మార్క్ దాటిన భారత్
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 30 పతకాల మార్క్‌ను టచ్ చేసింది. గత ఆసియా క్రీడల్లో సెంచరీ మార్క్‌ను దాటిన భారత్ ఈసారి అన్ని పతకాలు సాధించడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అథ్లెటిక్స్‌లో భారీగా పతకాలు వస్తాయనే ఆశలను మన అథ్లెట్లు నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 30 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలున్నాయి. శనివారం కబడ్డీలో రెండు స్వర్ణాలు రాగా, అథ్లెటిక్స్ విభాగం నుంచి మూడు పతకాలు వచ్చి చేరాయి. కాగా స్వ్కాష్‌లో మహిళల విభాగంలో అనాహత్, పురుషుల విభాగంలో అభయ్ సింగ్‌లు ఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేశారు. ఇక హాకీలో భారత పురుషుల జట్టు శనివారం ఆతిథ్య జపాన్ను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.షాట్‌పుట్‌లో రజతంమహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం నెగ్గగా.. తాజాగా పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం గెలుచుకున్నాడు. ఇవాళ జరిగిన పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ తన ఐదో ప్రయత్నంలో షాట్‌పుట్‌ను 20.64 మీటర్ల దూరం విసిరి బెస్ట్ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు రజతం ఖాయం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన మొహమ్మద్రెజా తయబైస్ 20.81 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించాడు.ప్రాచీకి కాంస్యంమహిళల 400 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరీ కాంస్యం ఒడిసిపట్టింది. నగోయా వేదికగా జరిగిన ఫైనల్ రేసులో ప్రాచీ 53.21 సెకన్లలో గమ్యాన్ని చేరింది. బహ్రెయిన్‌కు చెందిన సాల్వా నాసర్ 49.20 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకోగా, ఇరాన్‌కు చెందిన జహ్రా జరేయి 52.38సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం సాధించింది. మరో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ 53.41 సెకన్లలో గమ్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.Heartiest congratulations to Prachi Choudhary on winning the Bronze Medal in the Women’s 400m at the Asian Games 2026.#Cheer4Bharat pic.twitter.com/wXXhElJ2ux— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 26, 2026REDEMPTION FOR TOOR!Tajinderpal Singh Toor fights back to win Asian Games SILVER with a best throw of 20.64m.Down in third after Round 4, he delivered when it mattered most — 20.64m in Round 5 to climb onto the podium.Just 17cm off GOLD.And now: THREE STRAIGHT ASIAN GAMES…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 26, 2026ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు -
దేశంలో వెల్లుల్లి నగరం ఎక్కడుందో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. చట్నీలు, తాలింపులు, మసాలా పేస్టులు ఇలా ఎన్నో రకాల వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే దేశంలో ఓ ప్రాంతంలో వెల్లుల్లి సాధారణ పంట మాత్రమే కాదు.. అక్కడి రైతుల ఆర్థిక వ్యవస్థతో, ప్రాంతం గుర్తింపుతో ముడిపడిపోయింది. అదే మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్. దీనినే ‘భారత్‌లో వెల్లుల్లి నగరం’ గా పిలుస్తారు.వెల్లుల్లి నగరంగా మంద్సౌర్మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ జిల్లాను కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వెల్లుల్లిని ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ పంట స్థానిక రైతులకు కీలక ఆదాయ వనరుగా మారింది. మంద్‌సౌర్‌లో పండించే వెల్లుల్లికి ఘాటైన రుచి, వాసన, మంచి నాణ్యత ఉంటాయని చెబుతారు. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు వెల్లుల్లి సాగుకు అనుకూలంగా ఉండటంతో పంటకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని స్థానిక రకాల వెల్లుల్లిని ఎక్కువ కాలం నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.మధ్యప్రదేశ్ దేశంలోని ప్రముఖ వెల్లుల్లి ఉత్పత్తి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. అందులో మంద్సౌర్ కీలక సాగు ప్రాంతంగా ఉంది. జిల్లాలో విస్తృతంగా వెల్లుల్లి సాగు జరుగుతుండటంతో ఈ పంట స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మంద్సౌర్ వెల్లుల్లిని పంటగా మాత్రమే విక్రయించరు. వెల్లుల్లి పొడి, వెల్లుల్లి నూనె, పేస్ట్, ఊరగాయలు, డీహైడ్రేటెడ్ ఫ్లేక్స్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. దీంతో రైతులు, వ్యాపారులకు కూడా వాణిజ్యపరమైన అవకాశాలు పెరుగుతున్నాయి.ఇదీ చదవండి: 21 గంటల ఊరేగింపు.. కడలికేగిన లాల్బాగ్చా రాజా -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మహిళల కబడ్డీలో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ భారత్ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది.ఫైనల్లో భారత జట్టు తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామ సమయానికి 22-16తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఇరాన్ గట్టిగా పోరాడింది. ఆ దశలో ఇరాన్ 18-15తో ఆధిక్యం సాధించినప్పటికీ.. తొలి అర్ధభాగంలో భారత్ సాధించిన ఆరు పాయింట్ల ఆధిక్యం కీలకంగా మారింది.చివరి నిమిషాల్లో ఇరాన్ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయితే భారత డిఫెన్స్ కీలక సమయంలో పట్టు కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరికి 37-34తో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్ నాలుగో స్వర్ణ పతకం సాధించింది. 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో మాత్రమే భారత్ స్వర్ణాన్ని కోల్పోయింది. ఆ ఏడాది ఇరాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్ స్వర్ణం సాధించింది. తాజాగా ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.విజయం అనంతరం భారత క్రీడాకారిణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ‘వందే మాతరం’ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.కాగా, మహిళల కబడ్డీలో పతకంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు -
ఆసియా క్రీడల్లో భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
-
భారత్‌ను రెండుగా చీల్చి.. జపాన్ దాకా క్లౌడ్ హైవే!
ఒకవైపు ఆకాశమంతా దట్టమైన మేఘాలు.. మరోవైపు అసలు మేఘాల జాడే కనిపించని ప్రాంతాలు! ఎందుకిలా ఉందని అనుకుంటున్న వేళ.. మరో అసాధారణ దృశ్యం కళ్లముందుకొచ్చింది. అంతరిక్షం నుంచి చూస్తే మన దేశాన్ని రెండుగా చీల్చినట్లుగా భారీ మేఘాలు కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇన్శాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహం తన కెమెరాలో బంధించింది.అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తే వాతావరణం రెండు భాగాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. తూర్పు, ఈశాన్య, దక్షిణ భారత ప్రాంతాలపై దట్టమైన మేఘాలు కమ్ముకోగా.. పశ్చిమ, వాయవ్య భారత్ మాత్రం చాలావరకు మేఘరహితంగా కనిపించింది. సెప్టెంబర్ 25న ఇన్శాట్-3డీఎస్ తీసిన చిత్రంలో బంగాళాఖాతం నుంచి తూర్పు, ఈశాన్య భారత్ మీదుగా విస్తరించిన భారీ మేఘ సమూహం స్పష్టంగా కనిపించింది. దక్షిణ ద్వీపకల్పం, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లోనూ మేఘాల పొరలు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఆకాశం చాలావరకు నిర్మలంగా కనిపించింది.ఉపగ్రహం 10.83 మైక్రోమీటర్ల తరంగదైర్ఘ్యంలోని థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఛానల్ ద్వారా ఈ చిత్రాన్ని తీసింది. ఈ సాంకేతికతతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేఘాల కదలికలు, విస్తరణను వాతావరణ నిపుణులు పరిశీలించగలరు.అసలు కారణం ఏంటంటే..ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలోకి ప్రవేశిస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం, మధ్య భారత ప్రాంతాల్లో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు వర్షాలను ప్రభావితం చేస్తున్నాయి. తూర్పు, ఈశాన్య భారత్‌పై కనిపిస్తున్న దట్టమైన మేఘాలకు తేమతో కూడిన గాలులు, అల్పపీడన వ్యవస్థలు, ఇతర వాతావరణ పరిణామాలు కారణమై ఉండొచ్చని నిపుణుల అంచనా.ఇదే మేఘాలు.. జపాన్ దాకా!ఇదిలా ఉండగా.. మరో తాజా ఉపగ్రహ చిత్రంలో భారత్ నుంచి జపాన్ వరకు విస్తరించిన భారీ మేఘాల పట్టీ కనిపించింది. తూర్పు, ఈశాన్య భారత్ నుంచి ప్రారంభమైన మేఘ సమూహాలు హిమాలయ ప్రాంతం, చైనా మీదుగా కొరియా ద్వీపకల్పం, జపాన్ వైపు విస్తరించినట్లు చిత్రాల్లో కనిపిస్తోంది.బంగాళాఖాతం, తూర్పు భారత్ ప్రాంతాల్లో తేమతో కూడిన గాలులు భారీగా మేఘాలను ఏర్పరుస్తున్నాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు చైనా దిశగా విస్తరించిన మేఘాల పట్టీ.. తూర్పు ఆసియా వరకు కొనసాగుతున్నట్లు కనిపించింది. అందుకే ఈ భారీ మేఘ సమూహాన్ని ‘క్లౌడ్ హైవే’గా అభివర్ణిస్తున్నారు.మరోసారి రుతుపవనాల జోరుప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మధ్య, తూర్పు భారతంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశముంది.దీనికి పశ్చిమ గాలుల వ్యవస్థ (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) తోడైతే హిమాలయాల దిగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులపై అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనప్పటికీ.. వాతావరణ వ్యవస్థల ప్రభావంతో మరోసారి భారీ మేఘాలు, వర్షాలు దేశంలోని పలు ప్రాంతాలను పలకరిస్తున్నాయి. అంతరిక్షం నుంచి తీసిన ఈ చిత్రాలు మాత్రం భారత్‌లోని వాతావరణ వైవిధ్యాన్ని, ఆసియా స్థాయిలో మేఘాల విస్తరణను ఒక్కసారిగా కళ్లముందు ఉంచుతున్నాయి.ఇదీ చదవండి: ఉప ఎన్నికల వేళ.. విజయ్ కామెంట్లకు అర్థమేంటి? -
గత ఎడిషన్ రికార్డును భారత్ ఈసారి బద్దలు కొట్టేనా..?
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేట నిదానంగా కొనసాగుతోంది. ఏడో రోజు ఉదయానికి భారత్ ఖాతాలో కేవలం 25 పతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడిషన్ మరో ఎనిమిది రోజుల్లో (అక్టోబర్ 4) ముగియనున్న నేపథ్యంలో భారత్ గత ఎడిషన్ పతకాల రికార్డును తాకగలుగుతుందా అన్న చర్చ మొదలైంది.2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించింది. భారత్ ఆసియా క్రీడల చరిత్రలోనే ఇదే అత్యధికం (పతకాల పరంగా). అయితే ఈసారి భారత్ మళ్లీ 100 పతకాల మార్క్‌ను దాటగలదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.భారత్ క్రితంసారి రికార్డును సమం చేయాలంటే ఇంకా 82 పతకాలు సాధించాలి. 100 మార్క్‌ను దాటాలంటే కనీసం 76 పతకాలు రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పై రెండు లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదనే అనిపిస్తుంది. పలు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో భారత్ ఇప్పటికే పలు పతకాలు చేజార్చుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇకపై పతక అవకాశమున్న ప్రతి ఈవెంట్లో సత్తా చాటినా, భారత్ 107 పతకాల మార్కును తాకడం కష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది అసాధ్యమైతే కాదు. ఎందుకంటే భారత్‌కు ఆ మార్కును దాటడానికి ఇంకా వీలైనన్ని అవకాశాలు ఉన్నాయి.కొన్ని ఈవెంట్లలో ఇంకా క్వాలిఫికేషన్ దశనే నడుస్తుండటం భారత్ పతకాల వేగం నిదానించడానికి కారణం. తర్వాతి దశలో భారత్ షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, స్క్వాష్, కబడ్డీ, హాకీ వంటి విభాగాల్లో మరిన్ని పతకాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.ఎక్కడి నుంచి ఎక్కువ పతకాలు రావొచ్చు..?గత ఎడిషన్‌లో భారత్‌కు అత్యంత ఫలవంతమైన విభాగాల్లో షూటింగ్ ప్రధానమైంది. ఈసారి కూడా భారత్ ఈ క్రీడపై చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పలు పతకాలు కూడా సాధించింది. మిగిలిన రోజుల్లో షూటింగ్లో భారత్ మరిన్ని పతకాలు సాధించవచ్చు.అథ్లెటిక్స్:సావన్ బర్వాల్ రజతం (మారథాన్) ఇప్పటికే భారత్ ఖాతాలో చేరింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇంకా పలు ఈవెంట్లు మిగిలి ఉన్నాయి. గత ఎడిషన్‌లో భారత్ అథ్లెటిక్స్‌లో ఏకంగా 29 పతకాలు సాధించింది.ఆర్చరీ: కంపౌండ్, రికర్వ్ విభాగాల్లో భారత్‌కు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో అవకాశాలు ఉన్నాయి. ఏడో రోజు నుంచే క్వాలిఫికేషన్ రౌండ్లు కొనసాగుతున్నాయి.కబడ్డీ: పురుషులు, మహిళల జట్లు రెండూ పతక పోటీలో ఉన్నాయి. ఇవాళే (సెప్టెంబర్ 26) ఈ రెండు ఫైనల్స్ జరగనున్నాయి. ఈ రెండు ఈవెంట్లలో భారత్ స్వర్ణ పతకాలు ఆశిస్తుంది.స్క్వాష్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ: నాకౌట్ దశల్లో భారత్‌కు మరిన్ని పతక అవకాశాలు ఉన్నాయి.ఇదీ చదవండి: షూటింగ్లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య -
ఆసియా క్రీడల్లో రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
-
చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!
రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన.. తిరిగొచ్చాక చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.‘చైనాలోని సాధారణ నగరాలను సందర్శించి తిరిగి భారత వీధుల్లోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, మొత్తం వ్యవస్థ మనల్ని ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుంది’ అంటూ భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్ రాజేశ్వరి అయ్యర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్టుకు భారీగా లైక్స్, షేర్లు, కామెంట్లు వచ్చాయి. చైనాలోని నగరాల దృశ్యాలతో కూడిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.‘ఇలాంటి పోస్టులు పెడితే పరువునష్టం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘చైనా అభివృద్ధిని మెచ్చుకునేవాళ్లు.. అక్కడి నియంత్రణల గురించి కూడా మాట్లాడాలి’ అని మరో వ్యక్తి బదులిచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘చైనాలో ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఉదయానికే కనిపించరు. భారత్‌లో మాత్రం యువత రోడ్డెక్కి నిరసనలు తెలిపేంత స్వేచ్ఛ.. ఇంత ప్రజాస్వామ్యం ఉంది’ అని వ్యాఖ్యానించారు.Once you visit random cities in China and come back to Indian streets, you realize how much you’ve been scammed by your local MLAs, MPs, IAS and the whole system. pic.twitter.com/uETFhAjSvk— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 25, 2026అంత దాకా ఎందుకు..అయితే ఆమె వ్యాఖ్యలకు అందరూ ఏకీభవించలేదు. కొందరు నెటిజన్లు చైనాతో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల్లోని నగరాలను చూసినా భారత్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సదుపాయాల్లో తేడా కనిపిస్తుందని కామెంట్ చేశారు. ‘చైనానే కాదు.. బ్యాంకాక్ వెళ్లినా అభివృద్ధి, పరిశుభ్రత, పౌరస్పృహలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది’ అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు వియత్నాం, ఇండోనేషియా, మలేసియాలను కూడా ప్రస్తావించారు.చైనా మోడల్‌పై మరో వాదనమరోవైపు.. చైనా నగరాల్లో కనిపించే వేగవంతమైన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైస్పీడ్ రైళ్లను ప్రశంసించిన కొందరు నెటిజన్లు.. వాటిని భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థతో నేరుగా పోల్చడం సరికాదని వాదించారు. చైనాలోని వేగవంతమైన అభివృద్ధి వెనుక ఒకే పార్టీ పాలన, కేంద్రీకృత నిర్ణయ వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు. ప్రజా పర్యవేక్షణ, రాజకీయ స్వేచ్ఛ, సోషల్ క్రెడిట్ వ్యవస్థ వంటి అంశాలను కూడా వారు చర్చలోకి తీసుకొచ్చారు.భిన్నాభిప్రాయాలుచైనా హైస్పీడ్ రైళ్లను మెచ్చుకున్న ఒక నెటిజన్.. వాటి నిర్మాణానికి తక్కువ కార్మిక వ్యయం, జపాన్ నుంచి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. రైళ్ల నిర్మాణం ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు రవాణా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంగా సాగిందని పేర్కొన్నారు. కేవలం రైళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య పోటీని అంచనా వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. దుబాయ్‌లాంటి చోట్ల రోడ్లు, భవనాల నిర్మాణానికి మన దేశం నుంచి కార్మికులు వెళ్తారని, వాళ్లనే ఉపయోగించి ఇక్కడ హైక్లాస్ రోడ్లను నిర్మించడం మన ప్రభుత్వాలకు చేత కాదా? అంటూ ఒకరు ప్రశ్నించారు.నెహ్రూ.. మోదీని మాత్రమే నిందించాలా?భారత్‌లో మౌలిక వసతుల సమస్యలకు రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యులను చేయడం సరిపోదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రభుత్వాలను నిందించడం కంటే.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం, అవినీతి, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రాజకీయ సంకల్పంతో పాటు అధికార వ్యవస్థలోనూ మార్పులు అవసరమని ఆ వ్యాఖ్య సారాంశం.ఎవరీ రాజేశ్వరి అయ్యర్?డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్. ఆమె ఎక్స్ ప్రొఫైల్‌లో ఎన్ఐటీ పుదుచ్చేరి, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థినిగా, డైరెక్టర్, ప్రొఫెసర్‌గా వివరాలు ఉన్నాయి. భారత్‌లో రిజర్వేషన్లు, పన్నులు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలపై ఆమె తరచూ పోస్టులు చేస్తుంటారు. గతంలోనూ భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లడానికి కారణాలను వివరిస్తూ ఆమె చేసిన పోస్టులు వార్తల్లో నిలిచాయి.She is visiting the Netherlands. This is how the Netherlands looks.Hope the Bihar MLA can transform Bihar and make it look like this one day. https://t.co/VzRVQ2rmZe pic.twitter.com/8qpU7yTFMi— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 26, 2026చైనా పర్యటన అనుభవం నుంచి మొదలైన ఈ పోస్టు ఇప్పుడు కేవలం చైనా-భారత్ నగరాల పోలికకే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, అధికార యంత్రాంగం, అవినీతి, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై సోషల్ మీడియా చర్చకు దారితీసింది. -
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పనామాతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. పనామా భారత్ కంటే చాలా మెరుగైన జట్టు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు 44వ స్థానంలో ఉండగా.. భారత్ 138వ ర్యాంక్‌లో ఉంది. పైగా పనామా ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది. తమకంటే అన్ని విభాగాల్లో చాలా మెరుగైన జట్టు కావడంతో ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ప్రత్యేంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం భారత్‌కు ఘనతగా చెప్పుకోవాలి.ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. రియాన్ విలియమ్స్ తొలి అర్ధభాగంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. లాంగ్ పాస్‌ను అందుకున్న రియాన్ బాక్స్‌లోకి దూసుకెళ్లి గోల్‌కీపర్‌తో వన్-ఆన్-వన్ పరిస్థితిని సృష్టించాడు. అనంతరం ఎలాంటి తడబాటు లేకుండా బంతిని నెట్లోకి పంపి అద్భుతమైన గోల్‌గా మలిచాడు.రెండో అర్ధభాగంలో పనామా పుంజుకుంది. ఒమర్ వాలెన్సియా అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేశాడు. బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన అతడి షాట్ నేరుగా టాప్ కార్నర్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లు విజయం కోసం ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ మారథాన్‌లో భారత్‌కు రతజం -
భారత్‌కు పాక్ ప్రధాని సంచలన హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదానికి ‘న్యాయమైన, సముచిత పరిష్కారం’ అవసరమని పేర్కొన్న ఆయన.. సింధు నది జలాల విషయంలోనూ భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్‌కు దక్కాల్సిన నీటిని నిలిపివేయడం, అడ్డుకోవడం లేదా మళ్లించే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలు ఎనిమిది దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి హామీ కోసం ఎదురుచూస్తున్నారని షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎదురుచూస్తున్నారు. కశ్మీర్లో తరతరాలుగా ప్రజలు అక్రమ ఆక్రమణ, ఏకపక్ష నిర్బంధాలు, న్యాయబద్ధత లేని హత్యలు, బలవంతపు అదృశ్యాలు, లైంగిక హింస, సామూహిక శిక్షలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కశ్మీర్ వివాదానికి న్యాయమైన, సముచిత పరిష్కారం అవసరం అంటూ వ్యాఖ్యానించారు.అదే సమయంలో సింధు జలాల ఒప్పందం అంశాన్ని కూడా షెహబాజ్ ప్రస్తావించారు. 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడం చట్టబద్ధత లేనిదని ఆయన ఆరోపించారు. సింధు నదీ వ్యవస్థకు చెందిన జలాలు పాకిస్తాన్‌తో పాటు మొత్తం ప్రాంతానికి జీవనాధారమని అన్నారు. ‘నీటిని ఆయుధంగా మార్చకూడదు. నదులు దేశాలను పోషించాలి.. విభజించకూడదు. పాకిస్తాన్‌కు దక్కాల్సిన నీటిని ఆపడం, అడ్డుకోవడం లేదా మళ్లించే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తాం. భారత్ ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు’ అని షెహబాజ్ హెచ్చరించారు.ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ వ్యాఖ్యలు2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్న సమయంలో ట్రంప్ జోక్యం కీలకంగా మారిందని అన్నారు. ఆ సమయంలో ట్రంప్ జోక్యం చేసుకోకపోయి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ తమపై దాడికి దిగిందని షరీఫ్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ హక్కును పాకిస్తాన్ వినియోగించుకుందని చెప్పారు. పాక్ సైన్యం ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ నాయకత్వంలో భారత్ దాడిని తిప్పికొట్టిందని పేర్కొన్నారు. అయితే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను భారత్ గతంలోనే ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ద్వారానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది.#WATCH | New York | Addressing the 81st United Nations General Assembly (UNGA), Pakistan PM Shehbaz Sharif says, "...Any attempt to stop, impede, or divert Pakistan's share of the waters will be treated as an act of war. India must make no mistake about it"(Video Source: United… pic.twitter.com/l7dIO7SxnH— ANI (@ANI) September 26, 2026ఇదిలా ఉండగా.. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే, కశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న వాదనలను భారత్ గతంలో పలుమార్లు తిరస్కరించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని న్యూఢిల్లీ స్పష్టం చేస్తూ వచ్చింది. సింధు జలాల అంశంలోనూ భారత్ తన నిర్ణయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యల్లో భాగంగా సమర్థించింది.ఇదీ చదవండి: షరతులకు అంగీకరిస్తేనే.. హార్ముజ్ ఓపెన్ -
ఏఐ రూపం.. భూమికి శాపం
సాక్షి, అమరావతి : స్మార్ట్‌ఫోన్ తెరపై ఒక్క క్లిక్.. క్షణాల్లో 80ల నాటి రెట్రో రూపం, సరదాగా మాట్లాడే యానిమేషన్ అవతార్, సోషల్ మీడియా రీల్స్‌లో లైకుల వర్షం కురిపించే చిన్న వీడియో క్లిప్.. నేటి ఆధునిక సమాజం ఈ కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న దృశ్య మాయాజాలంలో మైమరచి పోతోంది. అయితే.. వర్చువల్ క్లౌడ్‌లో జరిగే ఈ తేలికపాటి వినోదం వెనుక నేలమీద ఉన్న స్వచ్ఛమైన జలవనరులు నిశ్శబ్దంగా ఆవిరై పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాహం కేకలు మిన్నంటుతున్న తరుణంలో.. మన చేతివేలి కొన చేసే అనవసర క్లిక్కు సమాజాన్ని నీటి కరువు కష్టాల తీరానికి చేరుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనిపించని డిజిటల్ దాహం..కృత్రిమమేధ అనేది కేవలం గాల్లో తేలే అల్గారిథమ్ కాదు. దాని మనుగడకు అంతర్జాతీయంగా విస్తరించిన భారీ డేటా సెంటర్లు, లక్షలాది హై–ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ) నిరంతరం పనిచేయాలి. ఈ సర్వర్లు పనిచేసేటప్పుడు ఉత్పన్నమయ్యే విపరీతమైన వేడిని నియంత్రించడానికి శీతలీకరణ టవర్ల (కూలింగ్ టవర్స్) ద్వారా నీటిని నిరంతరం ప్రవహింపజేస్తారు. ఉష్ణోగ్రతను తగ్గించే క్రమంలో స్వచ్ఛమైన మంచినీరు నేరుగా వాతావరణంలోకి ఆవిరైపోతుంది. డేటా సెంటర్లను 24 గంటలూ నడిపేందుకు అవసరమయ్యే భారీ విద్యుత్ ఉత్పత్తిలో (బొగ్గు ఆధారిత ప్లాంట్లు) అపారమైన నీరు పరోక్షంగా ఖర్చవుతుంది. ప్రత్యక్షంగా డేటా సెంటర్లలోని సర్వర్ల వేడిని తగ్గించడానికి, ఏఐ కోసం అవసరమైన భారీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్లలోను, ఏఐ చిప్‌లు, సెమీ కండక్టర్లను తయారుచేసే ప్లాంట్లలోను అత్యంత స్వచ్ఛమైన అల్ట్రా–ప్యూర్ వాటర్ వినియోగిస్తున్నారు.ఒక క్లిక్.. ఎంత నీటిని హరిస్తోందంటే..అంతర్జాతీయ పరిశోధన సంస్థలైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (జపాన్) ఏఐ ఆధారిత ఒక్కో డిజిటల్ ప్రక్రియకు ఖర్చయ్యే నీటి లెక్కలను వెల్లడించాయి. మనం నిత్యం జెమినీ, చాట్ జీపీటీలను అడిగే సాధారణ టెక్ట్స్ ప్రశ్నకు దాదాపు 25 మిల్లీలీటర్లు, సగటున 20 ప్రశ్నలకు దాదాపు 500 మిల్లీలీటర్ల (అరలీటరు) నీరు ఖర్చవుతోంది. ఇప్పుడు ట్రెండీగా మారిన 80ల నాటి రెట్రో ఏఐ ఫొటో తయారీకి 30 మిల్లీలీటర్లు అంటే రెండుగుక్కల నీరు ఆవిరవుతోంది. మనకు నచ్చినట్టు పరిపూర్ణమైన ఫొటోకోసం ఒకవ్యక్తి సగటున 10 నుంచి 15 సార్లు రీ–ట్రై చేసినప్పుడు సుమారు లీటరు వరకు ఖర్చవుతుంది. 5 నుంచి 10 సెకన్ల నిడివిగల ఒక్క ఏఐ వీడియో కోసం దాదాపు 4.1 లీటర్ల నీరు ఆవిరవుతోంది. వీడియోల్లో ప్రతి ఫ్రేమ్‌ను క్లిష్టమైన డిఫ్యూజన్ మోడళ్ల ద్వారా రెండర్ చేయాల్సిరావడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.మనదేశంలో సంక్షోభ తీవ్రత..మనదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన జలసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా మారబోతున్నట్టు యూఎన్వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. దేశంలో దాదాపు 60 కోట్లమంది ప్రజలు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో వెలికితీసే మొత్తం భూగర్భ జలాల్లో 25 శాతం మన దేశంలోనే జరుగుతోంది. మరోపక్క భారత్ డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, నోయిడా, విశాఖపట్నం వంటి నగరాలు డేటా సెంటర్ల కేంద్రాలుగా శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తాగునీటి కోసం వేసవిలో ట్యాంకర్లపై ఆధారపడే ఈ మెట్రో నగరాల్లో భారీ సర్వర్ల నిర్వహణ స్థానిక ప్రజల తాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మితివీురిన పోకడ నియంత్రణ లేకుండా కొనసాగితే రాబోయే కాలంలో మానవాళికి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.ముందున్నది గడ్డు కాలం..» 2022 చివర్లో జనరేటివ్ ఏఐ విస్తరణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏఐ డేటా సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కోట్ల (ట్రిలియన్) లీటర్ల నీటిని వినియోగించాయి. » యూఎన్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఏడాదికి దాదాపు 4.5 ట్రిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. ఇందులో ఏఐ వాటా దాదాపు 20 శాతం (750 బిలియన్ లీటర్ల నుంచి 900 బిలియన్ లీటర్లు). » నాలుగేళ్లుగా ఏఐ ట్రైనింగ్, ప్రాసెసింగ్, చిప్ తయారీకి 3 ట్రిలియన్ లీటర్లకు పైగా నీటిని వినియోగించారు. » వాటర్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం.. ఏఐ వినియోగం ఇలాగే పెరిగితే 2027 నాటికి ఏటా 6.6 ట్రిలియన్ లీటర్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది డెన్మార్క్ లేదా యూకే వంటి దేశాల వార్షిక గృహావసర నీటి వినియోగంతో సమానం.అంతర్జాతీయంగా జల సంక్షోభం..ఈ వినోద వినియోగం ప్రపంచంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులతో పోల్చినప్పుడు తీవ్రమైన పర్యావరణ అసమానతలను బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. మరో 350 కోట్ల మంది కనీసం సంవత్సరంలో ఒక నెలపాటు తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నారు. చవకైన భూమి, పన్ను మినహాయింపులు, అనుకూల వాతావరణం పేరుతో బహుళజాతి టెక్ సంస్థలు తీవ్ర నీటికొరత ఉన్న ప్రాంతాల్లోనే డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. అమెరికాలోని అయోవా, అరిజోనా వంటి ప్రాంతాల్లో స్థానిక మున్సిపాలిటీల తాగునీటి సరఫరాలో 20 శాతం వరకు ఈ సర్వర్లే లాగేసుకుంటున్నాయి. నీటివనరులు కలుషితమై లేదా అడుగంటిపోవడంవల్ల ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి లక్షలాదిమంది ప్రజలు వలసబాట పడుతుండగా, మరోవైపు విలాసవంతమైన డిజిటల్ వినోదం కోసం రోజూ కోట్లాది లీటర్ల నీటిని ఆవిరి చేసేస్తున్నారు.భారత్‌లో 60% ఏఐ రీల్స్ కోసమే..భారతదేశంలో నిత్యం 7 నుంచి 10 కోట్లమంది క్రియాశీల ఏఐ వినియోగదారులు ఉన్నారు. సేల్స్‌ఫోర్స్, ప్యూ రీసెర్చ్, కాంటర్ సంస్థ గ్లోబల్ సర్వే, అధ్యయనం ప్రకారం భారతదేశంలో చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ, లెన్సా, పర్చాన్స్ వంటివి ఉపయోగించే మొత్తం క్రియాశీల భారతీయుల్లో దాదాపు 3.5 కోట్లమంది (38 శాతం) కేవలం కాలక్షేపం, సరదా, వినోదం కోసమే వాడుతున్నారు. వైరల్ ట్రెండ్స్ నడిచే సమయాల్లో (ఉదా.. మెట్రో ఫిల్టర్లు, యానిమేట్ అవతార్లు వచ్చినప్పుడు) ఈ సంఖ్య 5 కోట్లు దాటుతోంది. సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్లు నడిచే రోజుల్లో ఈ అనవసర వినియోగదారుల సంఖ్య అంతకుమించుతోంది. జెన్–జీ (వయసు 16–24) యువతలో 60% మంది రీల్స్, ఫేస్–స్వాప్, మీమ్స్ కోసమే గంటల తరబడి సర్వర్లను రీ–జనరేట్ చేస్తూ నీటిని కరిగిస్తున్నారు. -
మానవ తప్పిదాలతోనే నీటి సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: మానవ తప్పిదాలతోనే భూమిపై నీటి సంక్షోభం సంభవిస్తోందని..మంచినీటి వనరుల స్థితిగతులపై ఆందోళనకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. నాసా –అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించిన కొత్త గ్లోబల్ మ్యాప్..భూమిపై మానవ కార్యకలాపాల వల్ల విలువైన మంచి నీటి నిల్వలు ఎక్కడెక్కడ పెరిగాయి..ఎక్కడెక్కడ తగ్గాయో స్పష్టం చేసింది. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారి త ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకరంగా పడిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. నాసా, అంతర్జాతీయ పరిశోధకులు ఉమ్మడిగా విడుదల చేసిన ఒక కొత్త హైరిజల్యూషన్ గ్లోబల్ మ్యాప్ ద్వారా తాజాగా ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాసా గ్రేస్ శాటిలైట్ల ద్వారా సేకరించిన గురుత్వాకర్షణ డేటా ఆధారంగా ఈ మ్యాప్‌ను రూపొందించారు. భూగర్భ జలాల నిర్వహణలో తక్షణమే అంతర్జాతీయ విధానాలు మార్చుకోకపోతే, భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభం యుద్ధాలకు దారితీసే ప్రమాదముందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. 2002–2025 మధ్య కాలానికి సంబంధించిన శాటిలైట్ డేటాను విశ్లేíÙంచి నివేదికను రూపొందించారు.అమెరికాకు చెందిన లైవ్ సైన్స్ ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం.. పంటల సాగుకు అవసరానికి మించి భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. భారత్ విషయానికొస్తే... భారత్‌లో తాగునీరు, భూగర్భ జలాల సంక్షోభం ఏకరూపంగా లేదు. భౌగోళిక పరిస్థితులు, పంటల సరళి, పట్టణీకరణ ఆధారంగా వివిధ రాష్ట్రాలపై దీని ప్రభావం విభిన్నంగా ఉంది. నిర్దిష్ట రాష్ట్రాలపై ఈ మంచినీటి క్షీణత ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలు (ఉత్తర, వాయవ్య భారతం)...ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను కోల్పోతున్న ‘హాట్‌స్పాట్’గా నాసా శాటిలైట్లు గుర్తించాయి. ⇒ పంజాబ్, హరియాణాల విషయానికొస్తే... ఇక్కడి హరిత విప్లవ వ్యవసాయ నమూనా పూర్తిగా గొట్టపు బావులు, ఉచిత విద్యుత్‌పై ఆధారపడి ఉంది. వరి, గోధుమల వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం వల్ల ఇక్కడ ఏటా 46 సెం.మీ వరకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బావులు ఎండిపోయి, తాగునీటికి కూడా ముప్పు ఏర్పడింది. ⇒ రాజస్తాన్...ఎడారి ప్రాంతం కావడం, అస్థిరమైన రుతుపవనాల వల్ల ఇక్కడ మంచినీటి కొరత ఎప్పుడూ ఎక్కువే. అయితే, కొన్ని ఇసుకరాయి ఆక్విఫెర్ల వల్ల స్థానికంగా నీటి పునరుద్ధరణ (రీచార్జ్) జరుగుతున్నా, వ్యవసాయ పంపింగ్ కారణంగా నిల్వలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. ⇒ ఉత్తర ప్రదేశ్... ముఖ్యంగా తూర్పు యూపీలో ఏటా దాదాపు 7 సెం.మీ చొప్పున భూగర్భ జలాలు తరిగిపోతున్నట్టు నాసా గ్రేస్ డేటా వెల్లడించింది తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల తీవ్రత నదీజలాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో చూస్తే..వర్షాభావ పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావం తోడైనప్పుడు ఇక్కడ కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి వంటి ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయినప్పుడు హైదరాబాద్ వంటి నగరాలకు తాగునీటి సరఫరా కోసం డెడ్ స్టోరేజీలను వాడాల్సిన పరిస్థితి వస్తోంది ⇒ ఆంధ్రప్రదేశ్... రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాలు) వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడం వల్ల పత్తి, కంది, వేరుశనగ పంటలు ఎండిపోయే ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. అయితే, గత దశాబ్ద కాలంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ జల సంరక్షణ చర్యల వల్ల స్వల్పంగా నీటి మట్టాలు పెరిగినట్టు నాసా గత అధ్యయనాలు చూపించాయి. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చే వరదలు స్థానిక నీటి లభ్యతను తాత్కాలికంగా పెంచుతున్నా, స్థిరమైన నిల్వలు కరువవుతున్నాయి ఆహార భద్రతకు ముప్పు. గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నీటి సంక్షోభం ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారతదేశ జీడీపీ లో 6% వరకు నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ⇒ రాష్ట్రాల మధ్య వివాదాలు: కృష్ణా, కావేరి వంటి నదీ జలాల పంపకాలపై రాష్ట్రాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. -
ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా?
ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వ ప్రతి నిధి సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 22న ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ వేదికపై సాగే ప్రసంగాల ప్రమాణాల ప్రకారం చూసినా కూడా అది అసాధారణమైనదే. ఇరాన్‌తో ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం గురించి అందరూ అనుకున్నట్లు గానే ఆయన ప్రస్తావించారు. ఒప్పందం కుదుర్చుకుంటే పునర్నిర్మాణానికి తెహ్రాన్‌కు అవకాశం చిక్కుతుంది; లేకపోతే ‘నన్ను ఇరాన్‌ను సర్వనాశనం చేయమంటారా? ప్రజల ప్రాణాలు హరించే, దేశాలను ధ్వంసం చేసే అవకాశం దానికి ఎన్న టికీ ఇవ్వకుండా వేగంగా ఆ పనిని పూర్తి చేసేయమంటారా?’ అని ట్రంప్ ప్రశ్నించారు. ‘బతికి బట్ట కట్టనివ్వకుండా దాన్ని నరకంలోని నెట్టేయమంటారా?’ అని కూడా హూంకరించారు. ‘అణ్వస్త్రం’ అనే మాటను ట్రంప్ నేరుగా చెప్పకపోయి ఉండవచ్చుకానీ, ఇరాన్‌ను రూపుమాపుతామని ఆయన చేసిన హెచ్చరిక అసాధారణమైంది. ఇరాన్ తప్పించి, మరి ఏ ఇతర దేశమూ ఇవెక్కడి అనాగరికపు మాటలని ప్రశ్నించకపోవడం మరింత నిర్ఘాంతపరచేదిగా ఉంది. ఆఫ్రికాకు ఇప్పటికీ స్థానం లేదా?ట్రంప్ హెచ్చరిక శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ తన ప్రసంగంలో ఈ చర్చకు తెర లేపారు. దీన్ని ఆయన కడపటి ఉన్నత స్థాయి ప్రసంగంగా చెప్పుకోవచ్చు. ఆయన రెండవ విడత పదవీ కాలం ఈ డిసెంబర్ 31తో ముగుస్తోంది. ఆయన వాషింగ్టన్ పేరును నేరుగా ప్రస్తా వించలేదుకానీ, ‘మన ప్రపంచంలో అభిప్రాయభేదాలు తీవ్రతర మవుతున్నాయి. బీటలు అగాథంగా పరిణమిస్తున్నాయి’ అని అన్నారు. ప్రపంచం పాలనా వ్యవస్థలు ఇప్పటికీ ‘బలాధిక్య వాస్తవి తకతలను, చాలావరకు గతించిన శకానికి చెందిన ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరిగా తేవాలనీ, అది ఏ ప్రపంచాన్ని శాసించాలనుకుంటోందో, దానికి తగ్గ రూపంలో ఎంతమాత్రం లేదనీ కూడా కుండ బద్దలుకొట్టారు. ఆయన సునిశితమైన రీతిలో లేవ నెత్తిని సంస్థాగత అంశానికి కరతాళ ధ్వనులతో ప్రతిస్పందన లభించింది. ‘ఆఫ్రికాయే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఐరాస ఏర్పడి నపుడు, ఆఫ్రికాలో చాలాభాగం వలస పాలనలో ఉంది. ఆఫ్రికాకు నేటికీ మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేదు. ఆఫ్రికాకు శాశ్వత స్థానాలు లేకుండా 21వ శతాబ్దపు భద్రతా మండలి కొనసాగడం అసమంజసం, నిర్హేతుకం’ అని ఆయన అన్నారు. ఐరాసను ‘గొప్ప, గొప్ప సామర్థ్యం’ ఉన్న సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ‘గ్లోబలిస్టు బ్యురోక్రాట్ల తీవ్ర వామపక్ష అజెండాను రుద్దే పనిని’ అది మానుకోవాలని అన్నారు. గాజా ప్రణాళిక–శాంతి బోర్డునకు ఆమోదం తెలిపినందుకు భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతవరకు ఆయన ఐరాస స్థానంలో ఈ బోర్డు ‘పనిచేస్తే చేయవచ్చనే’ ధోరణిని ప్రధర్శించారు.ఫ్రాన్స్ సముచిత వైఖరిఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పదవీకాలం 2027తో ముగుస్తుంది కనుక, ఈ తడవ మాక్రాన్ చేసిన ప్రసంగాన్ని ఆయన చివరి ఐరాస సర్వ ప్రతినిధి సభ ప్రసంగంగా భావించాలి. ఆయన హార్మూజ్ పైకన్నా గాజాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ‘ఏదో శాంతి కుదిర్చినట్లుగా కొందరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, ఆ శాంతి ఒక్క క్షణం కూడా మానవతావాద సాయం అందేందుకు తలుపులు తెరిచింది లేదు’ అని ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించ కుండానే చురకలంటించారు. దేశాలు ‘ఆటవిక న్యాయానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాయా లేక నాగరిక అంతర్జాతీయ సమాజం దిశగానా?’ అని అడిగారు. ఇజ్రాయెల్ భద్రతను ఒక సాకుగా చేసు కుని, పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు దాన్ని ఒక ‘లైసెన్సు’గా మలచుకోవడం ‘వినాశకర’ తప్పిదమవు తుందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశంగా ఫ్రాన్స్ బహుళపక్షీయతకు, మానవతా కారిడార్లకుఎంతో అవసరమైన మద్దతును అలా వ్యక్తపరచిందని చెప్పవచ్చు. శాశ్వత సభ్యత్వం ఉన్న మిగిలిన దేశాల నుంచి స్పందన ఒకే రీతిగాకన్నా అసంపూర్ణంగా ఉందనే భావించాలి. ఇజ్రాయెల్– పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలనే పరిష్కారానికి మద్దతును బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పునరుద్ఘాటించారు. చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 24న శ్వేత సౌధంలో శిఖరాగ్ర సమా వేశం ఉన్న దృష్ట్యా సర్వ ప్రతినిధి సభకు హాజరు కాలేదు. జిన్‌పింగ్ బదులు చైనా ఉపాధ్యక్షుడు హ్యాన్ జెంగ్ హాజరయ్యారు. ఇరాన్ లేదా గాజాల పేరును నేరుగా ప్రస్తావించకుండా, నిర్నిరోధ బల ప్రయోగాన్ని చైనా వ్యతిరేకించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ ఆ దేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విరామం ఇవ్వదలచు కోలేదని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమేనంటూ, ఇతర మార్గాల ద్వారా యుద్ధం కొనసాగుతుందని తేల్చేశారు.ఇండియా ఆచితూచి...భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు(పీ5) ఒకే వైఖరితో లేవని తేటతెల్లమైంది. భారతదేశానికి భద్రతా మండ లిలో శాశ్వత సభ్యత్వం లేదు. వీటో చేయగలిగిన అధికారం చలా యించగలిగినదిగా మండలిలో సభ్యత్వం చేజిక్కించుకోవాలని భారత్ ఉబలాటపడుతోంది. జిన్‌పింగ్, పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ‘సంస్కరణాయుత బహుళ పక్ష వాదానికి’ జై శంకర్ పిలుపునిచ్చారు. బడుగు దేశాలు వాటి ప్రమేయం లేని, అవి ఏ పాపం ఎరుగని సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ఆయన వాదించారు. పశ్చిమాసియాలో సాగర మార్గాలకు భద్రత కల్పించా లనీ, అంతర్జాతీయ చట్టాలను పాటించాలనీ కోరారు. ఇరాన్‌ను ‘రూపుమాపుతా’మని వచ్చిన హెచ్చరికపై భారత్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అమెరికా, రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కాపాడుకుంటోంది. అమెరికావి అనాగరికపు మాటలని అన లేదు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలని కోరింది. సభ్యత్వం పొందేందుకు భారత్‌కు ఉన్న హక్కును చాటుకుంది. పాలస్తీనా ఓట్లు, ఇంధన భద్రత, శక్తిమంతమైన దేశాల నుంచి దెబ్బ తినకుండా కంచె ఏర్పరుచుకోవడం అనే అంశాలను భారత్ ఏనాటి నుంచో మిళితం చేసుకుంటూ వస్తోంది. ఇపుడు అమెరికా నుంచిరెండవ విడత సుంకాల విధింపు బెడద నేపథ్యంలో, ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లోనూ అదే వైఖరిని కొనసాగించింది. విభేదాల బదులు పరస్పరం ఆధారపడటం నేర్చుకోండని గుటెరస్ కోరారు. లొంగదీసుకునేందుకు ఒక మార్గంగా విధ్వంసాన్ని ట్రంప్ ఎంచుకున్నారు. తుది గడువును ఆయనే విధిస్తు న్నారు. ఓ మోస్తరు శక్తి కలిగిన దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్నాయికానీ, నియమ నిబంధనలను పాటించి తీరాలనీ, అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలనీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి. హాజరు పట్టీలకు పరిమితమైతే ప్రయోజనం ఏముంది? ఈ సమస్య భారతదేశానిది మాత్రమే కాదు. ఐరాస ఎదుర్కొంటున్న, ఇంకా జవాబు దొరకని ప్రశ్న.-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ- సి. ఉదయ్ భాస్కర్ -
'గోల్డ్' తెచ్చిన 'గన్'
ఆసియా క్రీడల్లో భారీ సంఖ్యలో పతకాలు వస్తాయని ఆశించిన షూటింగ్లో ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ నిరాశ పెరుగుతూ వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్లంతా విఫలం కావడంతో గత క్రీడల 22 పతకాలకు దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎట్టకేలకు రజత, కాంస్యాలు దక్కినా... పసిడి మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ శుక్రవారం భారత్‌కు ఆ లోటు తీరింది. సురుచి సింగ్–కమల్జీత్ జోడీ షూటింగ్లో స్వర్ణ పతకాన్ని అందించి ఊరటనిచ్చింది. దీనికి తోడు మరో రజతం కూడా షూటర్ల ఖాతాలో చేరింది. మరోవైపు అథ్లెటిక్స్‌లో లాంగ్‌డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 10 వేల మీటర్ల విభాగంలో వెండి పతకంతో మెరిశాడు. మహిళా పోల్‌వాల్టర్ బరానికా ఇలంగోవన్, షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ కూడా కాంస్యాలు అందించారు. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుశ్ షా–దియా చిటాలె ద్వయం కాంస్యం గెలవడంతో ఆసియా క్రీడల ఆరో రోజును భారత్ ఆరు పతకాలతో ముగించింది. నగోయా: ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మహిళల టి20 క్రికెట్లో ఏకైక పసిడి దక్కగా, ఇప్పుడు షూటింగ్ ఆ జాబితాలో చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సురుచి సింగ్–కమల్జీత్ ద్వయం స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో భారత జంట మొత్తంగా 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సురుచి 245.7 పాయింట్లు స్కోర్ చేయగా, కమల్జీత్ 238.9 పాయింట్లు నమోదు చేశాడు. క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత జంట చివరి వరకు అదే జోరును కనబర్చడంలో సఫలమైంది. దక్షిణ కొరియా (478.0 పాయింట్లు) రజతం సాధించగా, ఇరాన్ (415.8)కు కాంస్యం దక్కింది. ఆధిక్యం కోల్పోయి... షూటింగ్లో భారత్ మరో స్వర్ణం గెలుచుకునే ప్రయత్నంలో హోరాహోరీగా తలపడినా... చివరకు రెండో స్థానానికే పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. మన త్రయం ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ ఓవరాల్‌గా 1762 పాయింట్లు సాధించారు. వీటిలో ఐశ్వర్య ప్రతాప్ 589, నీరజ్ 588, రుద్రాంక్ష్ 585 పాయింట్లు స్కోర్ చేశారు. చైనా (1766 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, దక్షిణ కొరియాకు (1751 పాయింట్లు) కాంస్యం లభించింది. ఒకదశలో ఇక్కడి ప్రదర్శనను బట్టే వ్యక్తిగత విభాగంలో ఫైనల్స్‌కు కూడా షూటర్లు అర్హత సాధిస్తారు. దాంతో మూడో స్థానంతో ఐశ్వర్య ప్రతాప్, నాలుగో స్థానంతో నీరజ్ ఫైనల్ చేరారు. 9వ స్థానంతో నిలిచిన రుద్రాంక్ష్ ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. అయితే వ్యక్తిగత ఫైనల్లో భారత షూటర్లు నిరాశపర్చారు. క్వాలిఫయింగ్‌లో ప్రదర్శనను పునరావృతం చేయలేక నీరజ్ 8వ స్థానంలో, ఐశ్వర్య ప్రతాప్ ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించారు. కమల్ కా కమాల్... కమల్జీత్ విజయం కూడా సరిగ్గా ఇదే తరహాలో రెండు ఓటముల తర్వాతే వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 9వ స్థానంతో ఫైనల్ అవకాశాలు చేజారగా, టీమ్ ఈవెంట్లో జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. తొలిసారి పాల్గొన్న ఆసియా క్రీడల్లో పతకం లేకుండానే నిష్క్రమిస్తానని భయపడ్డానని, అయితే తన ఆటకు తోడు అదృష్టం కూడా కలిసొచ్చిందని కమల్జీత్ చెప్పాడు. నిజానికి మిక్స్డ్ ఈవెంట్లో సురుచితో పాటు కేదార్లింగ్ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అతడిని తప్పించి కమల్జీత్కు కోచ్ సమరేశ్ జంగ్ అవకాశం ఇచ్చాడు. దాంతో తనను తాను కచ్చితంగా నిరూపించుకోవాల్సిన స్థితిలో అతను నిలిచాడు.హరియాణాలోని రేవారికి చెందిన 23 ఏళ్ల కమల్జీత్ మెరుగ్గానే ఆరంభించినా... చివరికొచ్చేసరికి కాస్త తడబడ్డాడు. అయితే సురుచి స్కోరు కారణంగా ఇద్దరికీ స్వర్ణం దక్కింది. ఏడేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన కమల్జీత్ 2023లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అదే ఏడాది తాను ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో కాలుకు తీవ్ర గాయమైన అతను కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఇటీవలే ఆర్మీలో హవల్దార్‌గా చేరిన అతను ఇప్పుడు పసిడి పతకంతో వెనుదిరుగుతున్నాడు. స్వర్ణం ‘సురుచి’కరం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 26వ స్థానం... టీమ్ విభాగంలో త్రుటిలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరి... ఈ ఆసియా క్రీడల్లో రెండు వైఫల్యాల తర్వాత శుక్రవారం తీవ్ర ఒత్తిడి మధ్య సురుచి బరిలోకి దిగింది. 20 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో ఇప్పటికే వరల్డ్ చాంపియన్‌షి ప్ రజతం, వరల్డ్ కప్ ఫైనల్ స్వర్ణం, 5 వరల్డ్ కప్ స్వర్ణాలు, గత ఏడాదే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్లాంటివి ఉన్నాయి. ఇలాంటి రికార్డు కారణంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సురుచి రెండు ఈవెంట్ల వైఫల్యంతో భారత షూటింగ్ మేనేజ్మెంట్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు తన ప్రదర్శనతోనే ఆమె వాటికి సమాధానం ఇచ్చింది. ఈ క్రీడల షూటింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ప్లేయర్‌గా సురుచి నిలిచింది. క్వాలిఫికేషన్లో 295 పాయింట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన 296 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె... ఫైనల్లో 246 పాయింట్ల లక్ష్యంతో గురి పెట్టి అతి చేరువగా 245.7 పాయింట్లు సాధించగలిగింది. అయితే స్వర్ణం గెలుచుకోవడానికి ఇది సరిపోయింది. హరియాణాలోని ఝఝర్ జిల్లాకు చెందిన సురుచి తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. ‘ఎలాగైనా స్వర్ణమే సాధించాలని బరిలోకి దిగాను. నా ప్రదర్శన పట్ల చాలా ఆనందంగా ఉన్నా. గత రెండు వైఫల్యాలను నా మనసులోంచి చెరిపేసి కొత్తగా మొదలు పెట్టా. నీకు మరో అవకాశం ఉందంటూ కోచ్‌లు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపించింది’ అని సురుచి వ్యాఖ్యానించింది. కాంస్యం నుంచి రజతానికి...భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో అతను రజతాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుల్వీర్ అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాడు. 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్ 28 నిమిషాల 28.38 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బిర్హాను బలెవ్ (బహ్రెయిన్; 28 నిమిషాల 27.51 సెకన్లు) స్వర్ణ పతకం సాధించగా, ఆల్బర్టో కిప్టో (బహ్రెయిన్; 28 నిమిషాల 34.18 సెకన్లు)కు కాంస్యం దక్కింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా గుల్వీర్ 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం అందుకున్నాడు. ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా పని చేస్తున్న గుల్వీర్ పేరిటే ఈ రెండు ఈవెంట్లలో జాతీయ రికార్డులు ఉన్నాయి. 5 వేల మీటర్ల పరుగును 13 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా అతను గుర్తింపు పొందాడు. 36 ఏళ్ల వయసులో... రెండు దశాబ్దాల క్రితం ఆసియా జూనియర్ చాంపియన్‌షి ప్తో అంతర్జాతీయ కెరీర్ మొదలు... కానీ షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌కు విజయాల పరంగా ఎలాంటి గుర్తింపూ రాలేదు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొంటే 9వ, 7వ, 4వ స్థానాలు మాత్రమే దక్కాయి. గత ఆసియా క్రీడల్లో 5వ స్థానం లభిస్తే ఒలింపిక్స్‌లో 23వ స్థానం మాత్రమే! పైగా డోపింగ్ వివాదంతో నాలుగేళ్లపాటు నిషేధం కూడా ఎదుర్కొంది. కానీ పట్టువదలకుండా పోరాడిన ఆమె ఇప్పుడు ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్స్‌లో ఇనుప గుండును 17.17 మీటర్లు విసిరి మన్‌ప్రీత్ మూడో స్థానంలో నిలిచింది. సంగ్ జియాయున్ (చైనా; 19.40 మీటర్లు) పసిడి పతకాన్ని అందుకోగా, జాంగ్ లిన్రు (చైనా; 18.14 మీటర్లు) రజత పతకం సాధించింది. జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్లో ఆసియా క్రీడల అర్హత మార్క్‌ను అందుకొని ఈ పోటీలకు వచ్చిన మన్‌ప్రీత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పతకం సాధించి సగర్వంగా నిలిచింది. బార్బరా వెబ్‌స్టర్ (1951), కిరణ్ బలియాన్ (2023) తర్వాత ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో పతకం నెగ్గిన భారత అథ్లెట్‌గా ఆమె నిలిచింది. బరానిక కొత్త చరిత్రభారత అథ్లెటిక్స్ చరిత్రలో శుక్రవారం కొత్త ఘనత నమోదైంది. ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కసారి కూడా పతకం లభించని పోల్‌వాల్ట్‌లో ఈసారి భారత క్రీడాకారిణి పోడియంపై నిలిచింది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానిక ఇలంగోవన్ ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా తన పేరును లిఖించుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తుకు ఎగిరిన బరానిక కాంస్యం సొంతం చేసుకుంది. కజకిస్తాన్‌కు చెందిన పొలీనా ఇవనోవా కూడా 4.15 మీటర్లు ఎగిరి భారత అథ్లెట్‌తో సమంగా నిలిచింది. ఇద్దరూ కూడా సరిగ్గా 4.25 మీటర్ల ప్రయత్నంలోనే విఫలమయ్యారు. దాంతో ఇద్దరికీ కాంస్యాన్ని ప్రకటించారు. ఈ ఈవెంట్లో మిసాకి మొరోటా (జపాన్; 4.55 మీటర్లు) స్వర్ణాన్ని అందుకోగా, చుంగే నియు (చైనా; 4.50 మీటర్లు) రజతం గెలుచుకుంది. ఈ ఏడాది జాతీయ ఇండోర్ ఓపెన్ ఈవెంట్లో బరానిక 4.23 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. దీనిని అధిగమించలేకపోయినా... పతకం మాత్రం గెలుచుకోవడంలో ఆమె సఫలమైంది. ఆరేళ్ల క్రితం ఏసీఎల్ గాయంతో చాలా కాలం ఆటకు దూరమై కెరీర్ ప్రమాదంలో పడినా... 2023లో రిలయన్స్ హైపర్ఫార్మెన్స్ సెంటర్లో చేరడం ఆమెకు కొత్త ఊపిరి పోసింది. గత మూడేళ్ల కఠోర సాధన తర్వాత ఇప్పుడు ఏషియాడ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా బరానిక సగర్వంగా నిలిచింది. ‘మిక్స్డ్ డబుల్స్’ టీటీలో మనుశ్–దియాలకు కాంస్యంగత ఆసియా క్రీడల్లో ఏకైక పతకం అందించిన టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శుక్రవారం తొలి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ మనుశ్ షా–దియా చిటాలె సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో ముగించింది. సెమీఫైనల్లో భారత జంట 8–11, 5–11, 8–11, 2–11తో చైనాకు చెందిన వాంగ్‌చుక్–సున్ యింగ్షా జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో మనుశ్–దియా 11–6, 13–15, 11–9, 11–5తో ప్రపంచ నాలుగో ర్యాంక్ హాంకాంగ్ జోడీ వాంగ్ టున్ టింగ్–డూ హోయ్ కిమ్‌పై సంచలన విజయంతో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.స్క్వాష్ లో 3 పతకాలు ఖాయంఆసియా క్రీడల స్క్వాష్ లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, మిక్స్డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కుమార్ జోడీ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న జోష్న ఇప్పటికే ఐదు పతకాలు సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జోషా్న... 2014, 2018 క్రీడల్లో టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది. 2010, 2023లో టీమ్ విభాగంలో కాంస్యాలు దక్కించుకుంది. శుక్రవారం మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జోషా్న–సెంథిల్ జోడీ 11–3, 11–5తో డేవిడ్ పెలినో–జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11–2, 11–5, 11–3తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–4, 11–3, 11–6తో ర్యోనోసుకె సుకువే (జపాన్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో వీర్ చోత్రాని 11–6, 8–11, 3–11, 3–11తో ఇర్ఫాన్ (పాకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
జర్నలిస్టుకు జైశంకర్ ఘాటు సమాధానం
ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ జర్నలిస్ట్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదానికి సంబంధించి భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జర్నలిస్ట్ ప్రయత్నించగా జైశంకర్ ఘాటుగా స్పందించారు. “ఉగ్రవాద దేశానికి చెందిన వ్యక్తి నన్నే ఆ ప్రశ్న అడుగుతున్నాడు. రండి” అని అన్నారు.లైబీరియా విదేశాంగ మంత్రి సారా బెయ్సోలో న్యాంటీతో కలిసి జైశంకర్ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నౌకలు, నావికుల భద్రతపై ఏర్పాటైన స్నేహితుల బృందానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగింపు దశలో పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ జైశంకర్‌ను ఉద్దేశించి.. “పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుంది?” అని ప్రశ్నించారు. దీనికి జైశంకర్ పైవిధంగా స్పందించారు.భారత్ చాలాకాలంగా పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందిన తర్వాత భారత్ తన సైనిక చర్యను ఆత్మరక్షణ హక్కులో భాగంగా చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతరం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా భారత్ పేర్కొన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను అమెరికా 2025 జూలై 18న విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పహల్గామ్ దాడిలో ఆ సంస్థ ప్రమేయం ఉందని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 1267 ఆంక్షల కమిటీ నివేదికలోనూ దాడికి సంబంధించి ఆ సంస్థతో ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జైశంకర్, పాకిస్థాన్ జర్నలిస్ట్ మధ్య జరిగిన ఈ పరస్పర ప్రశ్నోత్తరాలు భారత్-పాకిస్థాన్ మధ్య ఉగ్రవాదంపై కొనసాగుతున్న దౌత్యపరమైన విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. జైశంకర్ శనివారం ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి సమావేశంలో ప్రసంగించనున్నారు. -
ఐక్యరాజ్యసమితిలో ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వని పాక్ ప్రధాని
లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్, ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నలకు పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వలేదు. 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనను భారతీయ విలేకరి నేరుగా ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం పాకిస్థాన్ ఎప్పుడు ఆపుతుందని ప్రశ్నించగా.. షెహ్బాజ్ షరీఫ్ స్పందించకుండా చేతిని ఊపుతూ ముందుకు వెళ్లిపోయారు.ఆ తర్వాత ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలోనూ విలేకరి మరోసారి ప్రశ్నించారు. లష్కర్ రేతొయిబా అధినేత హఫీజ్ సయీద్‌పై పాకిస్థాన్ ఎప్పుడు విచారణ చేపట్టి శిక్షిస్తుందని అడిగారు. ఈ ప్రశ్నకు కూడా షెహ్బాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. హఫీజ్ మహ్మద్ సయీద్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధాకు చెందిన వ్యక్తి.లష్కర్ రేతొయిబా వ్యవస్థాపకుడైన ఆయనను భారత చట్టాల ప్రకారం ఉగ్రవాదిగా గుర్తించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసిన లష్కర్ రే తొయిబా కార్యకర్తల కుట్ర ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో సయీద్‌ను నిందితుడు నంబర్ 8గా పేర్కొంది.ఈ పరిణామానికి ఒక రోజు ముందు ఐక్యరాజ్యసమితిలో భారత్ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. పాకిస్థాన్ తన ఆర్థిక, దేశీయ సమస్యలపై దృష్టి పెట్టకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ఆరోపించారు. పాకిస్థాన్ ప్రజలకు అభివృద్ధిపై దృష్టి పెట్టడం మేలు చేస్తుందని, ఇతరుల భూభాగంపై ఆశలు పెట్టుకోవడం లేదా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం వల్ల ఆ దేశ ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్‌పై వచ్చిన ప్రశ్నలకు పాకిస్థాన్ ప్రధాని స్పందించకపోవడం ఐక్యరాజ్యసమితి వేదికపై చర్చకు దారితీసింది. అదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో భేటీలో ఉగ్రవాదంపై చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ రజత పతకం సాధించాడు.శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును గుల్వీర్ 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత హాంగ్జౌ (2022) ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని వెండిని కొల్లగొట్టాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్ (28:27.51 నిమిషాలు) బంగారు పతకాన్ని గెలుచుకోగా.. బహ్రెయిన్‌కే చెందిన ఆల్బర్ట్ కిప్టో (28:34.18 నిమిషాలు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 5వేల మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో నాయబ్ సుబేదార్ అయిన గుల్వీర్ సింగ్ కొంతకాలంగా సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్ 5వేల మీటర్లతో పాటు 10వేల మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 5వేల మీటర్ల రేసును 12:59.77 నిమిషాల్లో పూర్తి చేసిన గుల్వీర్ ఆసియా నుంచి 13 నిమిషాల బారియర్‌ను బ్రేక్ చేసిన మొదటి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.పోల్‌వాల్ట్‌లో తొలిసారి పతకంఆసియా గేమ్స్‌కు పోల్‌వాల్ట్‌లో భారత్‌కు తొలిసారి పతకం లభించింది. భారత అథ్లెట్ బరానికా ఎలన్గోవన్ మహిళల పోల్‌వాల్ట్‌లో కాంస్య పతకం సాధించింది. తన ఐదో ప్రయత్నంలో పోల్వాల్ట్తో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరిన బరానికా తన బెస్ట్ ప్రదర్శనను నమోదు చేసి కాంస్యం ఒడిసిపట్టింది. తొలి ప్రయత్నంలో 3.45 మీటర్లు, రెండో ప్రయత్నంలో 3.65 మీటర్లు, మూడో ప్రయత్నంలో 3.85 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 4 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరింది.షాట్‌పుట్‌లో కాంస్యంమహిళల షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఆమె షాట్‌పుట్‌ను 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్యం ఒడిసిపట్టింది. చైనాకు చెందిన సోంగ్ జియాహున్ (19.40 మీటర్లు), జాంగ్ లిన్రు (18.14 మీటర్లు) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 23వ పతకం కాగా, ఇందులో రెండు స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం -
రజత, కాంస్యాల పరుగు
ఆసియా క్రీడల్లో భారీగా అంచనాలు పెట్టుకున్న అథ్లెటిక్స్‌లో బరిలోకి దిగిన తొలి రోజే రెండు పతకాలతో భారత్ బోణీ చేసింది. గత ఆసియా క్రీడల్లో మన దేశానికి అత్యధికంగా 29 పతకాలు అందించిన అథ్లెటిక్స్‌లో గురువారం రజత, కాంస్యాలు దక్కాయి. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో వెండి దక్కగా, 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారికి కాంస్యం లభించింది. ఆసియా క్రీడల రోయింగ్ చరిత్రలో తొలిసారి భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ జోడీ పతకం అందించగా... షూటింగ్ స్కీట్‌లో కూడా అనంత్‌జీత్–పరీనాజ్ ద్వయం తొలిసారి కాంస్యం గెలుచుకుంది. వుషు ఫైనల్ ఫైట్‌లో ఓడిన రోషిబీనా దేవి చివరకు రజతంతో సంతృప్తి చెందింది. మొత్తంగా పోటీల ఐదో రోజు మన ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మరోవైపు బాక్సింగ్, జిమ్నాస్టిక్స్లలో నిరాశాజనక ఫలితాలు రాగా... హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ లలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ దూసుకుపోతోంది. స్కీట్‌లో గురి కుదిరె...భారత్‌కు షూటింగ్లో మరో పతకం దక్కింది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్–పరీనాజ్ ధలివాల్ ద్వయం మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత జోడీ 44 పాయింట్లు సాధించింది. బుధవారం కాంస్యాలు గెలిచిన పురుషుల, మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లలో భాగంగా ఉన్న అనంత్‌జీత్, పరీనాజ్లకు ఈ క్రీడల్లో ఇది రెండో పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు కమల్జీత్ (9వ స్థానం), ఆకాశ్ భరద్వాజ్ (11వ స్థానం), కేదార్లింగ్ (35వ స్థానం) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. టీమ్ విభాగంలో భారత్ 1727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. తాత, ముత్తాతల స్ఫూర్తితో...పంజాబ్‌లో పటియాలాకు చెందిన 24 ఏళ్ల పరీనాజ్ ధలివాల్ ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు పతకాన్ని గెలుచుకుంది. గత ఆసియా క్రీడల్లో భారత జట్టులో ఉన్నా... త్రుటిలో పతకం చేజారగా, ఇప్పుడు ఆమె తన కల నెరవేర్చుకుంది. మిత్రులు, సన్నిహితులంతా ఆతీ్మయంగా పరీ (దేవకన్య) అని పిలుచుకునే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి షూటింగ్‌పై ఆసక్తి ఉంది. తన తాత, ముత్తాతలు ఇంట్లో గన్స్ ఉంచుకునేవారని, వారు జంతువులను వేటాడిన కథలను వింటూ వచ్చిన ఆమె కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. తన ముత్తాత గుర్కీరత్పాల్ సింగ్ ధలివాల్ ఈ విషయంలో ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు. అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో స్కూల్లోని చదువుతున్నప్పుడే 14 ఏళ్ల వయసులో పరీనాజ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ మొదలు పెట్టింది. తన ఆటకు పదును పెట్టుకున్న ఆమె జూనియర్, సీనియర్ విభాగాల్లో నిలకడగా రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పరీనాజ్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపించాయి. షూటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం ఆమె ముందున్నాయి. అయితే తనకు నచ్చి న పనే చేస్తానంటూ ఆమె చదువును పక్కన పెట్టి షూటింగ్ వైపు మొగ్గింది. 2019లో స్కీట్‌లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఏడాది ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021 ప్రపంచకప్‌లోనూ పాల్గొన్న పరీనాజ్... తర్వాతి ఏడాది జూనియర్ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో ఉంది. ఇప్పుడు రెండు ఆసియా క్రీడల పతకాలు ఆమె స్థాయిని పెంచాయి. సత్తా చాటిన సీమా...మహిళల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ సీమా కుమారి కాంస్యంతో మెరిసింది. సీమా 32 నిమిషాల 50.05 సెకన్లలో పరుగును పూర్తి చేసి మూడో స్థానంతో ముగించింది. ఈ ఈవెంట్లో భారత్‌కు 16 ఏళ్ల తర్వాత పతకం దక్కడం విశేషం. బహ్రెయిన్‌కు చెందిన యావి విన్‌ఫ్రెడ్ (32 నిమిషాల 39.18 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, తనకా నొజొమి (జపాన్; 32 నిమిషాల 41.54 సెకన్లు) రజత పతకాన్ని అందుకుంది.రజతం నిలబెట్టుకున్నారు...నగోయా: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిక్స్డ్ టీమ్ తొలి రజతాన్ని అందించింది. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మను తెక్కినలిల్, విశాల్ తెన్నరసు, విత్య రామ్రాజ్, పూవమ్మ రాజు సభ్యులుగా ఉన్న మన బృందం 3 నిమిషాల 14.46 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. చివరి లెగ్‌లో విత్య దూసుకుపోయి భారత్‌కు పతకం అందించడంలో కీలకపాత్ర పోషించింది. 2023 ఆసియా క్రీడల్లో కూడా ఈ ఈవెంట్లో భారత్‌కు రజతమే దక్కింది. బహ్రెయిన్ (3 నిమిషాల 12.87 సెకన్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా, వియత్నాం జట్టు (3 నిమిషాల 14.54 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది.‘చంబా’కీ రాణిపేదరిక నేపథ్యం... 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడిన కుటుంబం. ఇలాంటి స్థితిలో ఒక అమ్మాయి అథ్లెటిక్స్ గురించి ఆలోచించడం కష్టం. కానీ ఆటలపై ఉన్న ఆసక్తి సీమా కుమారిని ముందుకు తీసుకెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా రీటా గ్రామం ఆమె స్వస్థలం. స్పోర్ట్స్‌లో రాణించి జిల్లా స్థాయికి చేరడంతో ఆమె గురించి స్థానికులకు తెలిసింది. అప్పుడు ‘పరుగుల రాణి’ పీటీ ఉషతో పోలుస్తూ ‘చంబా’కీ రాణి అంటూ అందరూ పిలవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో సీటు లభించడం ఆమె అథ్లెటిక్స్ కెరీర్‌కు పునాది వేసింది. 14 ఏళ్ల వయసులో రాంచీలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో సీమా అందరి దృష్టిలో పడింది. భారత అథ్లెటిక్స్‌లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ప్రాక్టీస్, క్రమశిక్షణ మాత్రమే కాకుండా ఫిట్నెస్ మన ఆటగాళ్ల స్థాయిని నిర్దేశిస్తాయి. మహిళల విభాగంలో అయితే మరింత కష్టంగా మారిపోతుంది. కానీ సీమా ఇక్కడే తన సత్తా చూపించింది. జూనియర్ స్థాయిలో 2 వేల మీటర్లు, 3 వేల మీటర్ల పరుగులో పలు జాతీయ రికార్డులు నెలకొల్పుతూ వచ్చి ఆపై సీనియర్ స్థాయిలో 5000 మీటర్లు, 10,000 మీటర్లకు అనుగుణంగా తన పరుగును మార్చుకుంది. 2017లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమె తల్లి తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి విత్‌డ్రా చేసి ఆమెను పంపించింది. ఇక్కడ సాధించిన కాంస్యం ఆమె భవిష్యత్తుకు పునాది వేసింది. 25 ఏళ్ల సీమా గత కొంత కాలంగా లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా నిలకడగా రాణిస్తూ భారత అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక చోటు సంపాదించుకుంది. 2026లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన సీమా... ఈ ఏడాదే 5 వేల మీటర్లు, 10 వేల మీటర్ల పరుగులో తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి ఆసియా క్రీడలకు సిద్ధమైంది. ఇప్పుడు గెలిచిన పతకం ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది. పతకం అందించిన రోయింగ్...గత నాలుగు ఆసియా క్రీడల నుంచి భారత్‌కు పతకాలు అందిస్తున్న రోయర్లు ఈసారి కూడా ఖాతా తెరిచారు. పురుషుల డబుల్స్ స్కల్స్ ఈవెంట్లో భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరు రేస్‌ను 6 నిమిషాల 13.25 సెకన్లలో పూర్తి చేశారు. ఆసియా క్రీడల ఈ ఈవెంట్లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం గమనార్హం. తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న భారత జోడీ చివరి 500 మీటర్లలో వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైంది. యి యుది–నీ యిడ్ (చైనా; 6 నిమిషాల 09.77 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మెక్రోబెక్–సోరిన్ (ఉజ్బెకిస్తాన్; 6 నిమిషాల 10.49 సెకన్లు) ద్వయం రజతాన్ని అందుకుంది. సత్నామ్ గత ఆసియా క్రీడల్లో కూడా కాంస్యం గెలిచాడు. ఫైనల్లో ఓటమితో...వుషులో భారత ప్లేయర్ రోషిబీనా దేవి వరుసగా మూడో ఏషియాడ్‌లోనూ పతకం గెలుచుకుంది. అయితే ఫైనల్‌కు చేరి స్వర్ణంపై గురి పెట్టిన ఆమెకు తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. మహిళల 60 కేజీల ఫైనల్లో రోషిబీనా చైనాకు చెందిన జాంగ్ జియోయు చేతిలో 0–2తో పరాజయంపాలైంది. -
భారత సముద్ర మార్గం నుంచి అమెరికాపై దాడులు చేస్తాం : ఇరాన్
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అమెరికా తమపై మళ్లీ దాడులకు దిగితే, ఈ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు.ఇరాన్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు బదులుగా.. ఇరాన్ తన సైనిక వ్యూహాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రంలోని హర్మూజ్ జలసంధి వరకే పరిమితమైన దాడులు.. భవిష్యత్తులో అమెరికా స్థావరాలు, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని హిందూ మహాసముద్రం నుంచి తిప్పికొడతామని సఫావీ పేర్కొన్నట్లు ఇరాన్‌కు చెందిన ఫార్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. అమెరికా కవ్వింపు చర్యలు, ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధాన్ని తిప్పికొట్టేందుకే ఈ వ్యూహాత్మక మార్పు చేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ స్పష్టం చేసింది.భారత సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు సఫావీ హెచ్చరికలతో గల్ఫ్ ఆఫ్ ఓమన్, పర్షియన్ గల్ఫ్‌తో పాటు భారత సముద్ర భూభాగమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐరోపాను ఆసియాతో కలిపే బాబ్ అల్-మండెబ్ జలసంధి, ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ తదితర సముద్ర రవాణా మార్గాల్లో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.భారత్‌పై ప్రభావం - దౌత్య యత్నాలు ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే భారత్ యొక్క ముడిచమురు దిగుమతులు, సముద్ర వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ జలాల్లో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. మరోవైపు, ఇరాన్ బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య తెరవెనుక చర్చలు కూడా కొనసాగుతుండటం గమనార్హం. -
ఈసారి కాంస్యంతో సరి
గత ఆసియా క్రీడల ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఈసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 16–21, 18–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ షి యుకీ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–11, 22–20తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 19–21, 13–21తో ప్రపంచ 12వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ జోడీ 16–21, 21–17, 9–21తో చెన్ బొయాంగ్–లియు యి జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, ధ్రువ్ కపిల కూడా సభ్యులుగా ఉన్నారు. -
భారత్-పాకిస్థాన్ వంటి వివాదాలపై అమెరికా కీలక కామెంట్స్
ప్రపంచంలో ప్రధాన సంఘర్షణలను పరిష్కరించేందుకు ప్రస్తుతం సమర్థమైన అంతర్జాతీయ వ్యవస్థ లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తే ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు కూడా ప్రస్తుతం పనిచేసే వ్యవస్థ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఉన్నతస్థాయి వారోత్సవాల సందర్భంగా విలేకరులతో మాట్లాడిన రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ వ్యవస్థకు విలువ ఉందని అమెరికా గుర్తిస్తోందని రూబియో చెప్పారు. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ వ్యవస్థ తన సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయడం లేదని అన్నారు.“అంతర్జాతీయ వ్యవస్థలో ఉపయోగకరమైన అంశాలను మేం చూస్తున్నాం. అందుకే మేం ఇక్కడ ఉన్నాం. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని అధ్యక్షుడు కూడా చెప్పారు” అని రూబియో అన్నారు. అంతర్జాతీయ వ్యవస్థ తన అసలు ఉద్దేశం, పరిధిని దాటి అనేక అంశాల్లో జోక్యం చేసుకుంటోందని రూబియో విమర్శించారు. “అంతర్జాతీయ వ్యవస్థ విఫలమవుతోందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తన పరిధిని, ఉద్దేశాన్ని దాటి వెళ్లడమే అందుకు కారణం. చేయాల్సిన అవసరం లేని అనేక విషయాల్లో అది జోక్యం చేసుకుంటోంది. ప్రపంచంలోని దాదాపు ఏ ప్రధాన సంఘర్షణనూ పరిష్కరించలేకపోతోంది” అని ఆయన అన్నారు.థాయ్‌లాండ్-కంబోడియా మధ్య జరిగిన ఘర్షణ, భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తే అవకాశం ఉన్న సంఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి సమస్యలను పరిష్కరించగల సమర్థమైన అంతర్జాతీయ వ్యవస్థ ఉంటే బాగుండేదని రూబియో అన్నారు. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేదని పేర్కొన్నారు.అంతర్జాతీయ వ్యవస్థ సమర్థంగా పనిచేయనంతకాలం దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయని రూబియో స్పష్టం చేశారు. “అమెరికా ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అంతర్జాతీయ వ్యవస్థ ప్రయోజనాల కోసం అమెరికా ప్రయోజనాలను ఎప్పటికీ పక్కన పెట్టం” అని ఆయన అన్నారు.రూబియో వ్యాఖ్యలు ట్రంప్ ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్-పాకిస్థాన్ గతేడాది ఘర్షణను తానే పరిష్కరించానని మరోసారి చెప్పిన మరుసటి రోజే వెలువడ్డాయి. భారత్ మాత్రం కాల్పుల విరమణపై అవగాహన రెండు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా ఏర్పడిందని స్పష్టం చేస్తోంది. -
ఇరాన్ వెన్ను విరిచేలా.. భారత్ అండతోనే ట్రంప్ మాస్టర్ ప్లాన్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్‌కు అండగా నిలిచారు. ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’(IMEC)కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ చెక్పాయింట్లు, హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల ద్వారా కాకుండా, పైప్లైన్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణాను సురక్షిత ప్రాంతాలకు మార్చడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను అధిగమించే దశలో మనం ఉన్నాం అని పునరుద్ఘాటించారు.జీ20 ఒప్పందం ఇదే..ప్రపంచ చమురు బాండాగారమైన సౌదీ అరేబియా నుంచి భారత్, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా రైలు, నౌకాయాన, ఇంధన, డిజిటల్ రంగాలను అనుసంధానించేలా 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ కారిడార్ ఒప్పందం కుదిరింది.వ్యూహాత్మక ప్రత్యామ్నాయం..ఈ కారిడార్ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా అంతటా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ అలాగే ఇరాన్ నియంత్రిత చెక్పాయింట్లకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, భారత్-ఐరోపా మధ్య రవాణా సమయాన్ని సగానికంటే ఎక్కువగా తగ్గించగలదని భావిస్తున్నారు.ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు..ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేశామని, తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ ఒక దేశంగా మనుగడ కొనసాగించే అవకాశాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. గతంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి
అమెరికాలో స్థిరపడి, సొంత వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ఎన్సారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అదీ 23 ఏళ్ల తర్వాత. ముంబైలో మరింత సురక్షితంగా అనిపించడం' వల్ల 23 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చానని చెప్పిన ఒక ఎన్ఆర్ఐ (NRI) సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశానికి తిరిగి రావాలన్న నిర్ణయం వెనుక అసలు కారణలేంటి?ఆ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తన 15వ ఏట అమెరికా వెళ్లిన ఆయన, న్యూయార్క్ నగరంలో చదువు పూర్తి చేసుకుని బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడి, హెచ్-1బి వీసా పొంది, ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వాన్ని పొందారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయ్యారు. మరి ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు.పెళ్లి కాలేదు, ఒక కుక్క, సొంత ఇల్లుతొ అమెరికన్ డ్రీమ్ లాంటి జీవనశైలితో జీవితం హాయిగా గడుస్తోంది. కానీ అప్పటికీ ఆయన తల్లిదండ్రులు 60 ఏళ్ల వయసు దాటి వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి అమెరికాకు రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. ఇంతలో తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. 70 ఏళ్ల వయసు తండ్రి క్యాన్సర్‌తో మరణించడం, తల్లి ఒంటరిగా ఉండటంతో ఆయనకు భారతదేశానికి తిరిగి వెళ్లాలనే కోరిక బలపడింది. 60 ఏళ్ల పైబడిన తల్లిని చూసుకోవడం, ఆమె వద్దే ఉండాలనే ఉద్దేశంతో ఆయన అమెరికాను వీడాలని నిర్ణయించుకున్నారు.2018, 2020 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చి వెళ్లిన ఆయన, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశ వాతావరణానికి, జీవన శైలికి ఆకర్షితులయ్యారు. 2022లో అమెరికాలో తన వ్యాపారాన్ని విక్రయించి, పెన్సిల్వేనియాలోని తన ఇంటిని అమ్మేసి 2023లో ముంబైకి శాశ్వతంగా తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన భారతీయ కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నారు.ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలుఅమెరికా డ్రీమ్ కంటే స్వదేశమే మిన్నఅమెరికాలోని శుభ్రమైన గాలి, అక్కడి జీవనశైలి కంటే ఇంటి భోజనం, తల్లితో సాయంత్రం వేళల్లో టీ తాగడం, పాత స్నేహితులు, బంధువులతో గడపడంలో లభించే అమూల్యమైన ప్రేమ (అన్‌కండిషనల్ లవ్) ముంబైలో తనకు లభించిందని, అందుకే ఇక్కడే ఎక్కువ భద్రతా భావన కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇంటి ఫుడ్, తల్లిదండ్రుల చిన్ననాటి కథలు వినడం , స్నేహితులతో సరదాగా గడపడం ఆ నిస్వార్థ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే అని వ్యాఖ్యానించారు.అంతేకాదు అమెరికాకు వెళ్లే ముందు వదిలిపెట్టిన నా చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాను. వారు తమ కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, తరచుగా కలుస్తుంటాం, కనీసం ఏడాదికి ఒకసారి ట్రిప్పులు లేదా ట్రెక్కింగ్‌లకు వెళ్తుంటామని సంతోషంగా చెప్పారు. సోషల్ మీడియా స్పందనలు చాలామంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ అభినందించారు. జీవితంలో నూటికి నూరుపాట్లు సంతృప్తే ముఖ్యం. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మళ్లీ అమెరికాకు వెళ్లకండి. సంతోషంగా ఉండండి అని ఒకరు వ్యాఖ్యానించారు. పౌరసత్వం కేవలం కాగితం ముక్క మాత్రమే భారతదేశం అంత చెడ్డది కాదు. యపలకపి మనలను ఈ స్థాయికి తెచ్చిన కుటుంబానికి అండగా ఉండటమే నిజమైన సంతోషం మరొకరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో అమ్మగారితో సమయం గడపండి. ఆ తర్వాత ఇక్కడే ఉండాలా లేక అమెరికా వెళ్ళాలా అన్నది నిర్ణయించుకోవచ్చు అని మరో నెటిజన్ సలహా ఇచ్చారు. ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్ -
‘వైడ్’పై వివాదం!
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా... భారత్, జపాన్ దేశాల మధ్య ‘ఫ్రెండ్లీ’ సంబంధాల నేపథ్యంలో నిర్వహించిన టి20 మ్యాచ్‌లో అనవసరపు వివాదం భారత్ గెలుపును పలుచన చేసింది. అక్షర్ వేసిన చివరి ఓవర్లో ఒక ‘వైడ్’ అందుకు కారణమైంది. గెలుపు కోసం 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో జపాన్ నిలిచింది. అక్షర్ వేసిన బంతి బ్యాటర్ షిరాయ్ లెగ్‌సైడ్‌కు వెళ్లగా అతను రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అంపైర్ క్రిస్ టర్గెట్ దీనిని వైడ్‌గా ప్రకటించాడు. అక్షర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, కెప్టెన్ శ్రేయస్ కూడా మరో అంపైర్ క్రిస్ బ్రౌన్‌తో వాదించాడు. అంపైర్లిద్దరూ చర్చించిన తర్వాత ఆ వైడ్‌ను వెనక్కి తీసుకుంటూ సరైన బంతిగా ప్రకటించారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారగా, జపాన్ 3 సింగిల్స్ తీసి ఓడింది. నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయంలో తప్పేమీ లేదు. ఐసీసీ నియమావళి ప్రకారం బ్యాటర్ రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ చేయడానికి ప్రయత్నిస్తే అతని లెగ్ సైడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా రెండు వైపులనూ ఆఫ్సైడ్గానే పరిగణిస్తూ ఆఖరి స్టంప్ నుంచి 75 సెంటీమీటర్లు దూరంగా వెళితే వైడ్‌గా ఇవ్వాల్సిందే. పెద్దగా అనుభవం లేని జపాన్ అంపైర్ క్రిస్‌కు మరోవైపు నుంచి ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ బ్రౌన్ ఇది వివరించి ఉంటాడు. దాంతో అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్, రివ్యూలు లేవు కాబట్టి తర్వాతి బంతి వేసే లోపే అంపైర్ తన నిర్ణయం మార్చుకోవచ్చు. అయితే శ్రేయస్ నిరసనతో భారత్ ఏదో ఒత్తిడి తెచ్చినట్లు కనిపించిందే తప్ప వైడ్ ఇవ్వకపోవడం సరైందే! -
అక్కడ బీజేపీకి అసలు సవాల్ ఈ 4,000 కి.మీ యాత్రకంటే పెద్దదే..
పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగంగా బీజేపీ చేపట్టిన ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ 4 మార్గాల్లో దాదాపు 4,000 కిలోమీటర్లు సాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసిన అనంతరం సెప్టెంబర్ 30న జలంధర్‌లో యాత్ర ముగియనుంది. సెప్టెంబర్ 18న పఠాన్‌కోట్‌లోని మాధోపూర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తొలి విడతను ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది.బీజేపీకి ఈ యాత్ర కేవలం మాదకద్రవ్యాల సమస్యపై ప్రచార కార్యక్రమం మాత్రమే కాదని రాజకీయ విశ్లేషణలో పేర్కొంటున్నారు. శిరోమణి అకాలీదళ్‌తో దీర్ఘకాలిక పొత్తు 2020లో ముగిసిన తర్వాత పంజాబ్‌లో స్వతంత్రంగా విస్తరించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. గతంలో సాధారణంగా 117 అసెంబ్లీ స్థానాల్లో 23 చోట్లే బీజేపీ పోటీ చేసేది. ఇప్పుడు మొత్తం 117 స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం చెబుతోంది.గత (2022) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.6 శాతం ఓట్లు సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాల్లోనూ స్వతంత్రంగా పోటీ చేసి ఓట్ల వాటాను సుమారు 18.5 శాతానికి పెంచుకుంది. అయితే ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆధిక్యంలో నిలిచింది.సంస్థాగత బలం పెంచుకోవడం కీలకం ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత బలం పెంచుకోవడం బీజేపీకి కీలకంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్, రాష్ట్ర ఇన్ఛార్జ్ సతీశ్ పూనియా మొత్తం 117 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసే వైఖరిని పునరుద్ఘాటించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల వరకు బృందాలను నిర్మించడంపై ధిల్లాన్ దృష్టి పెట్టారు. రైతుల సంక్షేమం, పారిశ్రామిక పునరుద్ధరణ, మాదకద్రవ్యాల సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు.మాధోపూర్‌లో నితిన్ నబిన్ మాదకద్రవ్యాలపై 5 అంశాల కార్యాచరణను వివరించారు. అక్రమ రవాణాదారులపై చర్యలు, అంతర్రాష్ట్ర-అంతర్జాతీయ సరఫరా మార్గాలను అడ్డుకోవడం, మాదకద్రవ్యాల ద్వారా సంపాదించిన ఆస్తుల స్వాధీనం, వైద్య-మానసిక పునరావాసం, ఉపాధ్యాయులు, వైద్యులు, మత సంస్థలు, క్రీడాకారులు, యువజన సంఘాల భాగస్వామ్యం ఇందులో ఉన్నాయి.అయితే మాదకద్రవ్యాల సమస్యపై గతంలోనూ పంజాబ్‌లో అనేక హామీలు వచ్చాయి. అధికార ఆమ్ఆద్మీ పార్టీ బీజేపీ ప్రచారాన్ని ప్రశ్నిస్తూ, 2007–2017 మధ్య అకాలీదళ్‌తో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. సరిహద్దు దాటి జరిగే అక్రమ రవాణాపై కేంద్ర సంస్థల బాధ్యతను కూడా భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు.అందువల్ల సెప్టెంబర్ 30తో యాత్ర ముగిసిన తర్వాత బీజేపీకి అసలు పరీక్ష మొదలుకానుంది. 4,000 కిలోమీటర్ల యాత్ర ద్వారా ఏర్పడిన రాజకీయ ఉత్సాహాన్ని 117 నియోజకవర్గాల్లో గ్రామ, బూత్ స్థాయి సంస్థగా ఎంతవరకు మార్చగలదన్నదే 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలకంగా మారనుంది. -
భారత్ నుంచి అమెరికా వరకు.. టెక్నాలజీ రంగంలో కిరణ్ కుమార్ కక్కిరేని విజయ ప్రస్థానం!
భారతదేశంలో ఒక Linux Administratorగా ప్రారంభమైన కెరీర్... కాలంతో పాటు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ DevOps, AWS, Cloud Computing, Automation రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్న ప్రయాణం... చివరకు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో నాయకత్వ స్థాయికి చేరుకోవడం. ఇది కిరణ్ కుమార్ కక్కిరేని ప్రొఫెషనల్ జర్నీ.ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న Equinox IT Solutions LLCలో Chief Technology Officer (CTO)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్, తన కెరీర్లో Cloud Computing, AWS, DevOps, Infrastructure Automation వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.కిరణ్ ప్రయాణానికి పునాది భారతదేశంలోనే పడింది. Electronics and Communicationsలో బ్యాచిలర్ విద్య అనంతరం IT రంగంలోకి ప్రవేశించిన ఆయన, తన కెరీర్ ప్రారంభంలో Linux Administrationపై పనిచేశారు. Servers, application environments, deployment processes, networking, system administration వంటి అంశాలపై సంపాదించిన అనుభవం తర్వాతి దశలో DevOps, automation, cloud technologies వైపు అడుగులు వేయడానికి పునాదిగా మారింది.Linux నుంచి DevOps వరకుసాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న అవసరాలను ముందుగానే గుర్తించిన కిరణ్, సంప్రదాయ system administrationకే పరిమితం కాకుండా automation, build and release engineering, Continuous Integration, Continuous Delivery వంటి అంశాలపై దృష్టి పెట్టారు.Jenkins, Ansible, Terraform, Docker, Kubernetes వంటి technologiesతో పాటు CI/CD practicesపై పనిచేస్తూ, software development మరియు IT operations మధ్య automation ఎంత కీలకమో తన కెరీర్లో ప్రత్యక్షంగా చూశారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం Cloud Computing వైపు మళ్లింది.AWSలో EC2, S3, VPC, IAM, RDS, DynamoDB, Lambda, CloudWatch, Auto Scaling, CloudFormation, ECS, SageMaker వంటి విభిన్న servicesతో పనిచేసిన అనుభవంతో scalable, reliable, automated cloud environments నిర్మాణంపై తన expertiseను విస్తరించారు.అమెరికాలో ఉన్నత విద్య... టెక్నాలజీలో తదుపరి అడుగుతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో కిరణ్ అమెరికాలో Computer Science Engineeringలో Master's degree పూర్తి చేశారు. విద్యతో పాటు industry exposure ఆయనకు enterprise-scale technology challengesను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం కల్పించింది.తర్వాతి సంవత్సరాల్లో cloud migration, infrastructure automation, application deployment, monitoring, security, high availability, machine learning infrastructure వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తూ తన professional expertiseను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణమే చివరకు ఆయనను Equinox IT Solutions LLCలో CTO స్థాయికి తీసుకెళ్లింది.AIతో మారుతున్న DevOps ప్రపంచంపై ప్రత్యేక దృష్టికిరణ్ ఆసక్తి ప్రస్తుతం సంప్రదాయ DevOpsతోనే ఆగిపోలేదు. Artificial Intelligence, Machine Learning మరియు DevOps కలయిక భవిష్యత్తులో IT operationsను ఎలా మార్చబోతోందనే అంశంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.Predictive monitoring, intelligent CI/CD, automated testing, anomaly detection, infrastructure optimization, AI-assisted incident management వంటి technologies భవిష్యత్తులో DevOps teams పనిచేసే విధానాన్ని గణనీయంగా మార్చగలవని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఈ అంశాన్నే మరింత విస్తృతంగా professionalsకు అందించేందుకు కిరణ్ “AI-Powered DevOps” పేరుతో పుస్తకాన్ని రచించారు. AI మరియు DevOps కలయిక, intelligent automation, CI/CD, machine learning ఆధారిత infrastructure management, ChatOps, monitoring, security automation, responsible AI వంటి అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.అంతర్జాతీయ వేదికపై గుర్తింపులుTechnology రంగంలో తన ప్రయాణంతో పాటు professional communityతో అనుసంధానాన్ని కొనసాగిస్తున్న కిరణ్ IEEEలో Active Memberగా ఉన్నారు. అలాగే ఆయనకు DevOps Distinction Award 2024, Best Employee of the Year 2023, CTO of the Year by Radio City, Asian Research Excellence Award వంటి గుర్తింపులు లభించినట్లు ఆయన ప్రొఫైల్ పేర్కొంటోంది.ఈ గుర్తింపులతో పాటు Cloud Computing, AWS, DevOps, AI-driven automation వంటి రంగాలపై తన professional knowledgeను articles, research-related activities మరియు technology discussions ద్వారా విస్తరించే దిశగా ఆయన కొనసాగుతున్నారు.భారత యువతకు ఒక సందేశంకిరణ్ ప్రయాణంలో కనిపించే ముఖ్యమైన అంశం నిరంతర అభ్యాసం. Linux Administrationతో ప్రారంభమైన కెరీర్ DevOpsకు, అక్కడి నుంచి Cloud Computingకు, ఇప్పుడు AI-powered infrastructure వరకు విస్తరించింది. Technology రంగంలో ఒక skill నేర్చుకోవడం మాత్రమే విజయానికి సరిపోదని, మారుతున్న technology ecosystemకు అనుగుణంగా నిరంతరం నేర్చుకోవడం అవసరమనే విషయాన్ని ఆయన కెరీర్ ప్రయాణం సూచిస్తుంది.భారతదేశంలో కెరీర్ ప్రారంభించి, అంతర్జాతీయ technology ecosystemలో తనకంటూ ఒక professional identity నిర్మించుకున్న కిరణ్ కుమార్ కక్కిరేని ప్రయాణం.. ప్రత్యేకంగా Cloud, DevOps, AI వంటి emerging technologiesలో కెరీర్ నిర్మించుకోవాలని ఆశించే యువ professionalsకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తోంది.Linux Administratorగా మొదలైన ప్రయాణం నుంచి CTO వరకు, traditional infrastructure నుంచి AI-Powered DevOps వరకు కిరణ్ కుమార్ కక్కిరేని కెరీర్ మారుతున్న టెక్నాలజీతో పాటు మన నైపుణ్యాలు కూడా మారుతూ ఉండాలనే సందేశాన్ని ప్రతిబింబిస్తోంది. -
జపాన్‌లో క్రికెట్‌కు జై
సానో: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఒకటి, డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ భారత్ తమ టి20 చరిత్రలో ఒక చారిత్రాత్మక పోరుకు సిద్ధమైంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో నేడు భారత్, జపాన్ మధ్య ఏకైక టి20 మ్యాచ్ జరగనుంది. నంబర్‌వన్ టీమ్ భారత్, 41వ ర్యాంక్ టీమ్ జపాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలాబలాల్లో భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉంది. అయితే తొలిసారి జపాన్ గడ్డపై భారత్ ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. పైగా టీమిండియా తమ పూర్తి స్థాయి బరిలోకి దిగుతుండటం మరో విశేషం. ‘జపాన్‌లో జపాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడతానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు’ అంటూ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్య దీని గురించి చెబుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రుల మధ్య జరిగిన భేటీలో ఈ మ్యాచ్ ఖరారైంది. జపాన్ కోణంలో చూస్తే ఈ మ్యాచ్ ఆ జట్టుకు ఎంతో ప్రత్యేకం కానుంది. అందుకే జపాన్ క్రికెట్ అసోసియేషన్ కూడా అభిమానుల కోసం ఈ మ్యాచ్‌కు మంచి ప్రచారాన్ని కలి్పంచింది. మంగళవారం ఆ దేశంలో సెలవు దినం కాగా... 3,000–10,000 జపాన్ యెన్లు (సుమారు రూ. 1800–6000) ధరలతో టికెట్లు అమ్మకానికి ఉంచింది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. సోమవారం పడిన వానకు భారత జట్టు ప్రాక్టీస్ కూడా రద్దయింది. జపాన్ టి20 జట్టుకు కెండెల్ కడోవాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
బ్రిక్స్: కొన్ని శేష సంభాషణలు
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఒక బృహత్తరమైన విషయం అయినందున అందు గురించి చర్చించుకోవలసినవి అనేకంఉంటూనే ఉంటాయి. అందులోనూ ఆ సంస్థ కజాన్‌తో ఆరంభించి రియో డి జనేరో మీదుగా ఢిల్లీ వరకు ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తూ వచ్చినపుడు. ఇటు వంటి దశలో మార్గ నిర్దేశనాలను స్థూలమైన రీతిలో ఎన్ని చేసుకున్నా, ప్రశ్నలూ సందేహాలూ కూడా అంతగా మిగిలే ఉండటం సహజం. ఐక్యత సాధ్యమేనా?వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఐక్యత ప్రశ్న. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఆ దేశాల మధ్య ఏకాభిప్రాయాలు. రెండు, వారికి బ్రిక్స్ బయటి దేశాలతో గల సంబంధాలు. ఈ విషయాన్ని కొంత సూటిగా చెప్పుకుందాము. ఢిల్లీ సమావేశాలకు ముందూ, ఆ తర్వాతా పాశ్చాత్య మీడియా, పరిశీల కులతో పాటు ఇక్కడ కూడా పలువురు బ్రిక్స్‌లోని భిన్నత్వాలను చాలా ఎత్తి చూపారు. ఆ కారణంగా ఐక్యత సందేహాస్పదమన్నారు. వారు ఉదాహరించిన వాటిలో ముఖ్యమైనవి భారత–చైనా, ఇరాన్ –అరబ్ రాజ్యాల వివాదాలు.ఇవి ముఖ్యమైనవనటంలో సందేహం లేదు. అయితే, అవి ఉన్నప్పటికీ అందరూ ఒక చోట చేరటం, ఏకగ్రీవ ప్రకటనను విడుదల చేయటాన్ని కూడా విమర్శకులు అదే సమయంలో గుర్తించారు. అట్లా జరగటంలో భారతదేశపు దౌత్యనీతి కొంత పనిచేసిన మాట నిజమే అయినా, అంతకుమించిన మౌలిక కారణాలు ఉన్నాయనేది గమనించాలి. మొదటిది, పరస్పర సమస్యలు ఉన్న బ్రిక్స్ దేశాలకు కూడా బయటి శక్తుల నుంచి అంతకన్న పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. పరస్పర సమస్యల పరిష్కారం కన్నా బయటి సమస్యల పరిష్కారం పెద్ద సవాలు అవుతున్నది. మొదట 2006లో ‘బ్రిక్’ ఏర్పడినా, 2010లో ‘బ్రిక్స్’గా మారినా, ఇపుడు 2026లో మరింత విస్తరించినా సభ్య దేశాల మధ్య కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉన్నవే. ఉదాహరణకు ఇండియా–చైనా వివాదం. అది 2006 నాటికి కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఒక యుద్ధం, కొన్ని ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ బ్రిక్స్లోనే గాక షాంఘై సహకార సంస్థ తదితరాలలోనూ చైనాతో పాటు సభ్య దేశంగా ఉండేందుకు భారత్ ఎందుకు అంగీకరించినట్లు?మూడు ముఖ్య దేశాలుపైన వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇందులోనే లభిస్తుంది. సభ్య దేశాలకు పరస్పర సమస్యలకన్న బయటి శక్తుల నుంచి ఎదు రవుతున్న సమస్యలు పెద్ద సవాళ్లవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, బయటి శక్తుల నుంచి సమస్యలన్నవి వందల సంవత్సరాల వలస పాలనలతో మొదలై, సామ్రాజ్యవాదపు వివిధ చర్యల రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి. అందుకే వీరు ఒకటి అవుతుండటమే గాక, బ్రిక్స్ పట్ల అన్ని ఖండాల దేశాలలో ఆకర్షణలు పెరుగు తున్నాయి. కనుక, ఈ విస్తృత చిత్రాన్ని గమనించినప్పుడు, పరస్పర సమస్యలన్నవి భూతద్దంలో చూడవలసినవిగా తోచదు. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య సమావేశంలో ‘భిన్నాభిప్రాయాలు విభేదాలుగా మారకూడ’దన్న మాట ఒకటి వచ్చింది. అందులోని రెండు పదాలకు చాలా అర్థం ఉంది. అది ఇక్కడ చర్చించలేము. కానీ, వారు అదే అవగాహనతో ముందుకు సాగుతుండటం మాత్రం గమనించదగ్గది. అందులో పరస్పర ప్రయోజనాలతో పాటు బ్రిక్స్ స్ఫూర్తి ఉంది. బ్రిక్స్‌ను చైనా హైజాక్ చేస్తుందా అనే ప్రశ్న ఒకటి ఉన్నది గానీ అది వేరే వివరమైన చర్చ.ఇందుకు పొడిగింపుగా చెప్పుకోవలసింది ఒకటున్నది. బ్రిక్స్‌లో వేర్వేరు ఖండాల నుంచి ప్రధానమైన దేశాలు ఉన్నప్పటికీ, సంస్థకు వెన్నుదన్ను అనదగ్గవి ఇండియా, చైనా, రష్యాలే. ఈ మూడూ ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికపరంగా, సైనికంగా, భౌగోళిక వైశాల్య పరంగా, జనాభా రీత్యా శక్తిమంతమైనవి. రాజకీయంగా చూసి నపుడు భారత్ ప్రజాస్వామికమైనది కాగా, తక్కిన రెండు స్థిరమైన వ్యవస్థలు. ఈ ముగ్గురికి కూడా వలస పాలనల కాలం నుంచి, ఆ తర్వాత వర్తమానంలోనూ వర్ధమాన దేశాలతో వెన్నంటి నిలిచిన పేరున్నది. బ్రిక్స్ పునాదులు కూడా 2006 నుంచి ఈ 2026 వరకు అవే. వర్ధమాన దేశాలకు బయటి శక్తులతో రాగల కాలంలో ఘర్షణాత్మక స్థితి ఏర్పడే కొద్దీ ఈ సంస్థకు నాయకత్వం వహించి నిలబెట్ట గలది, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించగలది, ఇపుడున్న అంతర్జాతీయ సంస్థలను సంస్కరించి వర్ధమాన దేశాలకు అవకా శాలు కల్పించేట్లు చేయగలది ఈ ముగ్గురి నాయకత్వమే. ఇదే సంద ర్భంలో మరొకటి కూడా చెప్పాలి. వర్ధమాన దేశాలకు బయటి శక్తు లతో రక్షణపరమైన సమస్యలు తలెత్తితే, ఈ ముగ్గురిలో ఇండియా, చైనాలు కాదు గానీ తమ సైన్యాలను పంపి ఆదుకునేందుకు సైతం రష్యా సిద్ధమే. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలో అదే జరుగుతున్నది.భారత ప్రభుత్వం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోవ లసిన విషయం ఒకటున్నది. ఇండియా బ్రిక్స్‌లో చేరింది కాంగ్రెస్ అధికారంలో ఉండిన 2006లో కాగా, బీజేపీ గెలిచిన 2014 నుంచి మోదీ ప్రభుత్వ వైఖరి బయటి ప్రపంచపు దృష్టిలో అనుమానా స్పదంగా మారింది. వైఖరిలో మార్పునకు కారణం దేశ ప్రయోజ నాలు అని చెప్పేవి అయితే కావచ్చు గాక, కానీ అనుమానాస్పదంగా మారింది నిజం. వర్ధమాన దేశాలకు హాని కలిగే విధంగా బయటి శక్తులకు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తూ పోయారన్న మాటలు ఇంటాబయటా వినిపించాయి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణలు, వెనిజులా అధ్యక్షుని అపహరణ, ఇరాన్‌పై దాడుల సందర్భాలలో ప్రభుత్వ వైఖరులతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇపుడు ఢిల్లీలో వైఖరి కొంత మారుతున్న సూచనలు కన్పించినందున, ఇది ఇక స్థిరపడుతూ పోగలదేమో చూడాలి. బయటి శక్తులతో ఇండియాకు సమస్యలు క్రమంగా పెరుగుతున్నందున అందుకు అవకాశాలైతే ఉన్నాయి. అసలు ఆయుధీకరణచివరగా చర్చించవలసినవి రెండున్నాయి. స్వేచ్ఛా నౌకా యాన ప్రశ్న, వనరుల ఆయుధీకరణ ప్రశ్న. ఈ రెండూ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మరొకమారు ప్రస్తావనకు వచ్చాయి. స్వేచ్ఛాయానం హార్మూజ్ దిగ్బంధం నుంచీ, ఆయుధీకరణ అమెరికా అధ్యక్షుని ట్యారిఫ్ వార్‌తోనూ మొదలయ్యాయి. హార్మూజ్‌ను ఇరాన్ మూసి వేసింది శత్రు దాడుల నుంచి ఆత్మరక్షణకే తప్ప అంతకు ముందు ఎటువంటి మూసివేతలూ లేవు. దాడులు ఆగకుండా హార్మూజ్‌ను తెరవాలని ఒత్తిడి చేయడమంటే తమ ఆత్మరక్షణ సాధనాన్ని వదలుకుని లొంగిపోవలసిందిగా కోరటమే. స్వేచ్ఛాయానమన్న మాట దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఉన్నా, బ్రిక్స్ చర్చల సంద ర్భం అది కాదు. పోతే, స్వేచ్ఛా యానాన్ని అమెరికా అట్లాంటిక్, పసిఫిక్లలో తమ ప్రత్యర్థులకు అనుమతించక పోవటాన్ని ఏమంటాం?అమెరికా అధ్యక్షుడు ట్యారిఫ్లను, సాంకేతిక పరికరాల ఎగుమతిని ఆయుధాలుగా మార్చటం మొదలు పెట్టినందునే చైనా, కెనడా, యూరప్ వంటివి ఎదురు ట్యారిఫ్‌లతో, కీలకమైన వనరుల ఎగుమతిపై ఆంక్షలతో ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీనంతటిలో ఏది ఆయుధీకరణ అవుతుంది, ఏది కాదు? అందు వల్ల, సమస్యకు గల కారణాలను వదలి సమస్యల గురించి మాత్రమే మాట్లాడటంతో పరిష్కారం లభించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
Asian Games 2026: మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకం
ఏషియన్ గేమ్స్‌లో భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) అథ్లెట్ సుచికా తరియాల్ చరిత్ర సృష్టించింది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి, ఏషియన్ గేమ్స్ ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.సెమీఫైనల్లో ఓటమిసుచికా తరియాల్ సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో చేతిలో 0-2తో ఓటమి పాలైనప్పటికీ.. భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకాన్ని అందించి చరిత్రలో నిలిచింది.ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సుచికా.. మంగోలియాకు చెందిన ఆల్టాన్చిమెగ్ బైగల్మాను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతోనే భారత్‌కు ఏషియన్ గేమ్స్ ఎంఎంఏలో తొలి పతకం ఖాయమైంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం -
సముద్రం మధ్యలో పచ్చని స్వర్గమా?! ఈ దీవి ఎక్కడుందో తెలుసా?
భారత్‌లో ఎన్నో అందమైన దీవులు ఉన్నాయి. అయితే పచ్చని ప్రకృతి, నీలిరంగు సముద్రం, ప్రశాంతమైన వాతావరణంతో అండమాన్ లోని హేవ్‌లాక్ ఐలాండ్‌ను భారతదేశపు ఎమరాల్డ్ ఐలాండ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ దీవిని స్వరాజ్ ద్వీప్ అని కూడా పిలుస్తున్నారు. సముద్రం మధ్యలో పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు కలిసిన ఈ దీవి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవుల సమూహంలో స్వరాజ్ ద్వీప్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఒకప్పుడు హేవ్‌లాక్ ఐలాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ దీవికి 2018లో స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చారు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్రపు నీరు కనిపిస్తాయి. అందుకే ‘ఎమరాల్డ్’ అనే పేరు దీనికి చక్కగా సెట్ అవుతుంది.స్వరాజ్ ద్వీప్‌లో రాధానగర్ బీచ్ ప్రధాన ఆకర్షణ. తెల్లటి ఇసుక, నీలి సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు.. ఇవన్నీ కలిసి పైసా వసూల్ అనుభూతిని అందిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో బీచ్ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఎలిఫెంట్ బీచ్ వద్ద స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్ ట్రై చేయవచ్చు. నీటి అడుగున కనిపించే పగడాలు, రంగురంగుల చేపలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.ఇక్కడికి చాలా మంది వెళ్లే ముందు బీచ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఉదయం పూట పచ్చని చెట్ల మధ్య ప్రయాణించడం, చిన్న చిన్న లోకల్ షాపుల్లో షాపింగ్ చేయడం, సముద్ర తీరంలో కొంతసేపు ప్రశాంతంగా గడపడం కూడా ఈ ప్రయాణంలో భాగమే. అక్టోబర్ నుంచి మే వరకు సాధారణంగా అండమాన్ పర్యటనకు అనుకూలమైన కాలంగా భావిస్తారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఫెర్రీ ద్వారా స్వరాజ్ ద్వీప్ చేరుకోవచ్చు.పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లటి ఇసుక తీరాల కాంబినేషన్ లో కనిపించే ఈ ఎమరాల్డ్ ఐలాండ్.. అంటే ఒకప్పటి హేవ్‌లాక్ ఐలాండ్.. ప్రయాణికులకు ఎవర్గ్రీన్ మెమరీగా మిగిలిపోతుంది.ఇదీ చదవండి: ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే? -
తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపిన జపాన్ వాయుసేన చీఫ్
జోధ్‌పూర్: భారతదేశ భూభాగంపై తొలిసారిగా జపాన్ యుద్ధ విమానాలు కార్యకలాపాలు నిర్వహించడం భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారంలో ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో భారత్, జపాన్ యుద్ధ విమానాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9న ప్రారంభయైన ఈ కార్యక్రమం 22న ముగుస్తుంది. స్వదేశీ తేజస్, ఎస్‌యూ–30ఎంకేఐ, రఫేల్ సహా భారత వైమానిక దళానికి చెందిన అగ్రశ్రేణి విమానాలు, అలాగే జపాన్ వైమానిక స్వీయ–రక్షణ దళానికి చెందిన ఎఫ్–2ఈ యుద్ధ విమానాలు సంయుక్తంగా వీర్ గార్డియన్–2026 పేరిట జరిగిన వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. జపాన్ వాయుసేన స్వీయ–రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకేహిరో మోరితా సైతం ఇందులో భాగస్వాములయ్యారు. టకేహిరో మోరితా ఒక పైలట్‌తో కలిసి తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఒంటరిగా మరో తేజస్ జెట్‌ను నడపడం విశేషం. పరస్పర గౌరవం, భాగస్వామ్యానికి చిహ్నంగా ఇద్దరు వైమానిక దళాధిపతులు బ్యాడ్జ్‌లను మార్చుకున్నారు. భారత్‌కు జపాన్ యుద్ధ విమానాలను పంపడం అనేది ఇరుదేశాల మధ్య రక్షణ సహకారానికి ప్రతీక అని టకేహిరో మోరితా చెప్పారు. -
భారత్ 19 ఉజ్బెకిస్తాన్ 0
కాకామిల్గహారా: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత మహిళల, పురుషుల జట్లు తమ తొలి మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భారత మహిళల జట్టు ఏకంగా 19–0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసింది. భారత స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక సెహ్రావత్ 8 గోల్స్‌తో (8వ, 22, 25వ, 33వ, 36వ, 38వ, 41వ, 54వ నిమిషాల్లో) హడలెత్తించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత మహిళా క్రీడాకారిణిగా దీపిక రికార్డు నెలకొలి్పంది. ఇషిక (11వ, 42వ, 54వ నిమిషాల్లో) మూడు గోల్స్... లాల్థాన్లువాంగి (43వ, 51వ నిమిషాల్లో), నవ్‌నీత్ కౌర్ (23వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. లాల్రెమ్సియామి (7వ ని.లో), బల్జీత్ కౌర్ (12వ ని.లో), నేహా (18వ ని.లో), సాక్షి రాణా (43వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌తో సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (320) ఆడిన ప్లేయర్‌గా వందన కటారియా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది.దిల్‌ప్రీత్ నాలుగు గోల్స్... మరోవైపు భారత పురుషుల జట్టు పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో 13–1 గోల్స్ తేడాతో ఇండోనేసియాను ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (18వ, 19వ, 37వ, 49వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో మెరిశాడు. శిలానంద్ లాక్రా (6వ, 35వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (38వ, 48వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. అభిõÙక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (21వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (28వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (47వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఇండోనేసియా జట్టుకు ఆలియా అల్ అర్ధ్ (33వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఏడు పెనాల్టీ కార్నర్లు రాగా... మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. -
త్రుటిలో పతకాలు చేజారె...
నగోయా: ఆసియా క్రీడల్లో తొలిసారి నిర్వహిస్తున్న టెక్బాల్ క్రీడాంశంలో ఒకేరోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు త్రుటిలో చేజారాయి. మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ క్విమ్సీ డిసౌజా 11–12, 11–12తో యునా సాకామోటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో క్విమ్సీ డిసౌజా–అనస్ బేగ్ (భారత్) జోడీ 9–12, 6–12తో హోంగ్ మిన్ టాన్ నుగుయెన్–గియా ట్రిన్ (వియత్నాం) జంట చేతిలో పరాజయం పాలైంది. భారత టీటీ జట్లకు మిశ్రమ ఫలితాలుటేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై, రెండో మ్యాచ్‌లో 3–2తో సింగపూర్‌పై గెలిచింది. ఇండోనేసియాతో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో గెలిచి...ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0–3తో ఓటమి చవిచూసింది. వుషులో నిరాశ: మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన వుషు క్రీడాంశంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్ ఈవెంట్లో భారత ప్లేయర్ సూరజ్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సాండా ఈవెంట్లో భారత ప్లేయర్లు అపర్ణ దహియా (52 కేజీలు)... విక్రాంత్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. స్విమ్మర్ రిషభ్‌కు ఆరో స్థానం పురుషుల స్విమ్మింగ్‌లో తొలిరోజు భారత్ ఆశించిన ఫలితం లభించలేదు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ రిషభ్ దాస్ ఫైనల్ చేరినా పతకానికి సుదూరంలో నిలిచాడు. ఫైనల్లో రిషభ్ 54.77 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
వేధింపుల బాధితురాలి నుంచి...
పన్నెండేళ్ల వయసులో కుర్రాళ్లు ఏడిపిస్తుంటే... వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆత్మరక్షణ విద్య నేర్చుకున్న ఆ చిన్నది... ఇప్పుడు 36 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల్లో దేశానికి పతకం ఖాయం చేసింది. ‘ఆడపిల్లలు లేడి పిల్లలుగా కాకుండా... పులి పిల్లలుగా మారాలని’ బలంగా నమ్మి ఏళ్ల పాటు దాని కోసం కృషి చేసిన హరియాణాకు చెందిన సుచికా తరియాల్... ఏషియన్ గేమ్స్‌లో కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది.వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండిపోకుండా... పోరాడటం నేర్చుకోవాలని కరాటేలో శిక్షణ తీసుకున్న సుచికా... తాజా ఆసియా క్రీడల్లో సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ‘దేశానికి పతకం అందించబోతుండటం ఆనందంగా ఉంది. సోమవారం స్వర్ణ పతకం కోసం పోరాడతా. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఫైటింగ్ నేర్చుకోవాలనే కల ఉండేది. అందుకే తొలుత జూడోను ఎంచుకున్నా. ఆ ప్రయాణం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మాది సంప్రదాయ కుటుంబం కావడంతో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా... ఆ తర్వాత నా పట్టుదల చూసి అంతా సహకరించారు. ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీని వెనక కఠోర శ్రమ దాగి ఉంది’ అని సుచిక వెల్లడించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి ఎంఎంఏ క్రీడాంశాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో స్ట్రైకింగ్, టేక్‌డౌన్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ ఆధారంగా పాయింట్లు కేటాయించి విజేతను ప్రకటిస్తారు. జూడో నుంచి మొదలై... రోహ్తక్కు చెందిన సుచిక మొదట జూడోలో శిక్షణ తీసుకుంది. అక్కడి నుంచి జు–జుట్సుకు మారిన ఆమె... ఇప్పుడు ఎంఎంఏలో సత్తా చాటింది. భోపాల్ ‘సాయ్’ కేంద్రంలో రాటుదేలిన సుచిక... ఇప్పటి వరకు 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడింది. ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో పాటు పలు పతకాలు ఖాతాలో వేసుకుంది. 2019 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్, 2019 దక్షిణాసియా గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించిన ఈ హరియాణా ఫైటర్... 2018 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో త్రుటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయిన సుచిక... ఎట్టకేలకు తాజా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలవనుంది. జూడో నుంచి జు–జుట్సుకు మారిన అనంతరం... 2024 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గింది. 2017లోనే ఎంఎంఏలో అరంగేట్రం చేసిన ఆమె జూడో మీద దృష్టి పెట్టేందుకు ఏడేళ్ల పాటు ఎంఎంఏకు దూరమైంది. 2024లో ఎంఎంఏలో పునరాగమనం చేసిన సుచిక... బహ్రెయిన్‌లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92లో విజయం సాధించింది. సీఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించిన సుచికా... ప్రస్తుతం హరియాణా క్రీడా శాఖలో జూనియర్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
బుల్లెట్ దించారు
మరోసారి ‘శతక’ పతకాల మైలురాయిని అందుకోవాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజే భారత్ ఖాతాలో రెండు రజత పతకాలు చేరాయి. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. షూటింగ్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ రెండు రజత పతకాలతో మెరిసింది. ముందుగా సోనమ్, విదర్శలతో కలిసి ఇలవేనిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించింది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మహిళా ఫైటర్ సుచిక తరియాల్ 60 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించి స్వర్ణం లేదా రజత పతకాన్ని అందుకోనుంది. హాకీలో భారత జట్లు ఘనవిజయాలతో బోణీ కొట్టగా... టేబుల్ టెన్నిస్‌లో మనోళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నగోయా: పసిడి ఖాతా తెరువకపోయినా... ఆసియా క్రీడల తొలి రోజే భారత్ రెండు రజత పతకాలు సాధించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత షూటర్లు ఈ రెండు పతకాలను అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలారివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన భారత జట్టు 1898 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. 1904.2 పాయింట్లతో చైనా జట్టుకు స్వర్ణం దక్కగా... 1897.1 పాయింట్లతో జపాన్‌కు కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు సోనమ్ మస్కర్ 634.1 పాయింట్లతో మూడో స్థానంలో, ఇలవేనిల్ వలారివన్ 633.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన మరో షూటర్ విదర్శ వినోద్ 640.4 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల ఆధారంగా టీమ్ ఈవెంట్ పతకాలను ఖరారు చేశారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో ఇలవేనిల్ 252.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకుంది. హినాటా తైచీ (జపాన్; 253 పాయింట్లు) బంగారు పతకం నెగ్గగా... హైజిన్ బాన్ (దక్షిణ కొరియా; 230.4 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. భారత షూటర్ సోనమ్ 167 పాయింట్లతో ఆరో స్థానంతో సంతృప్తి పడింది. మరోవైపు మహిళల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత ఫైటర్ సుచిక తరియాల్ 2–0తో బైగల్మా అల్తాన్‌చిమెగ్ (మంగోలియా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
హీరోయిన్‌తో ఫొటోలు, సెల్ఫీలకు ఎగబడ్డ జనం.. కారుపై దాడి
భోజ్‌పురి నటి కాజల్ రాఘవాణి పాల్గొన్న కార్యక్రమంలో భారీగా జనం గుమిగూడడంతో బిహార్‌లోని బిహార్ షరీఫ్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం తాను క్షేమంగానే ఉన్నానని కాజల్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.కాజల్ రాఘవాణి నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె రాకతో దుకాణం వద్ద అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. నటి ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ప్రయత్నించడంతో అక్కడ తోపులాట మొదలైంది. జనాన్ని నియంత్రించడం నిర్వాహకులు, భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో షోరూమ్ నిర్వాహకుడు, భద్రతా సిబ్బంది కాజల్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ గేట్ ద్వారా ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు, కాజల్ ఉందని భావించి ఓ కారుపై జనం దాడి చేయడంతో దాని అద్దాలు దెబ్బతిన్నాయి. కాజల్ ఆ కారులో ఉన్నారా లేదా అనే విషయంలో వివరాలు భిన్నంగా ఉన్నాయి. అయితే ఆమెను సురక్షితంగా తరలించినట్లు జాతీయ మీడియా కథనాలు ధ్రువీకరిస్తున్నాయి.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాజల్ తర్వాత వీడియో విడుదల చేసి తాను క్షేమంగా ఉన్నానని అభిమానులకు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెబుతూ, ఇదే ఆదరణ కొనసాగించాలని కోరారు.కార్యక్రమానికి పరిపాలనా అనుమతి తీసుకున్నారా లేదా అనే అంశంపైనా వివాదం మొదలైంది. అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతుండగా, జిల్లా అధికారులకు కార్యక్రమం గురించి లేఖ ద్వారా సమాచారం ఇచ్చామని, సెప్టెంబర్ 17న అనుమతి కోసం దరఖాస్తు చేశామని షోరూమ్ నిర్వాహకుడు చెబుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై నిర్వాహకులకు నోటీసు ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.కాజల్ రాఘవాణి 2013లో ‘రిహై’ చిత్రంతో భోజ్‌పురి సినిమాల్లోకి ప్రవేశించారు. ఇప్పటివరకు 50కుపైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ‘భోజ్‌పురి బవాల్’లో పాల్గొన్న ఆమె.. త్వరలో ‘రైజ్ అండ్ ఫాల్ 2’లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Kajal Sharda🦋 (@kajalraghwani) -
విమానంలో ఎగరాల్సిన నేహా.. ఇప్పుడు వేల కి.మీ. ట్రక్ నడుపుతూ..
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి చెందిన నేహా ఠాకూర్ చిన్నప్పటి నుంచి ఉన్న భారీ ట్రక్కులపై ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత చండీగఢ్‌లో విమాన సహాయకురాలి శిక్షణ తీసుకున్నప్పటికీ, చివరకు ట్రక్ డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్‌ప్రదేశ్ తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు.నేహాకు చిన్నప్పటి నుంచే పెద్ద టైర్లు, భారీ ట్రక్కులంటే ఆసక్తి ఉండేది. ఆమె తండ్రి కూడా ట్రక్ డ్రైవర్ కావడంతో ఆయన పనితీరు, కష్టపడే విధానం నేహాపై ప్రభావం చూపాయి. తండ్రి తరచూ ట్రక్‌లోనే ఆమెను పాఠశాలకు తీసుకెళ్లేవారు. 2022లో ట్రక్ నడపాలని నేహా నిర్ణయించుకున్నప్పుడు ఆమె తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ట్రక్ డ్రైవింగ్ ప్రారంభించారు. ఆ నిర్ణయంతో హిమాచల్‌ప్రదేశ్‌లో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా నిలిచారు.అయితే అంతకుముందు నేహా మరో వృత్తి వైపు అడుగులు వేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత చండీగఢ్‌కు వెళ్లి విమాన సహాయకురాలి వృత్తిపరమైన శిక్షణ తీసుకున్నారు. విమానయాన రంగంలో కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ట్రక్ డ్రైవింగ్ ఆసక్తినే ఎంచుకున్నారు. ఈ నిర్ణయానికి కుటుంబం కూడా మద్దతు ఇచ్చింది.ట్రక్ నడపడమే కాకుండా తన రోజువారీ జీవితాన్ని కూడా నేహా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ట్రక్కు సంబంధించిన వీడియోలను ఆమె షేర్ చేస్తున్నారు. ట్రక్ ప్రారంభమైన వెంటనే తన కెమెరా కూడా ప్రారంభమవుతుందని ఆమె ఓ వీడియోలో చెప్పింది. ప్రస్తుతం నేహా ట్రక్ డ్రైవింగ్ అనుభవాలు, రోజువారీ ప్రయాణాలను వీడియోల ద్వారా షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె వృత్తి ప్రయాణం సామాజిక మాధ్యమాల్లో మరింతగా దృష్టిని ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by Instagram’s @Creators (@creators) -
Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్
జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది.మరో పతకం ఖాయంమహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభంభారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్‌పై టీమిండియా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్‌తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్ సాధించింది.టేబుల్ టెన్నిస్‌లోనూ ఘనంగా బోణీమహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లోనూ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.నేడు భారత్ కీలక ఈవెంట్లుమహిళల క్రికెట్: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్బ్యాడ్మింటన్: కజకిస్థాన్‌తో మహిళల టీమ్ మ్యాచ్వుషు: భారత్ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలుఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
భారత్‌కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు కరువు కాటకాలు.. ఇంకోవైపు అడవులను బుగ్గిపాలు చేసే కార్చిచ్చులు.. ముప్పు ముంచుకొచ్చేలోపే మేల్కోవాలి.. లేదంటే ప్రకృతి ప్రకోపం తీవ్ర మూల్యం చెల్లించేలా చేస్తుందా? భారత్‌పై ‘సూపర్ ఎల్‌నినో’ రూపంలో పొంచి ఉన్న ముప్పుపై 180 మందికి పైగా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. 2027 ఆరంభం వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ వాతావరణ పరిణామం.. సముద్రాల నుంచి అడవుల వరకు, రైతుల నుంచి మత్స్యకారుల వరకు ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ ఎల్‌నినో ఏంటి? భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది?.. కాగా, రానున్న రోజుల్లో భారత్‌ను తీవ్ర వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టే అవకాశం ఉందని 180 మందికి పైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. రాబోయే నెలల్లో ‘సూపర్ ఎల్‌నినో’ తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో దేశంలోని సహజ పర్యావరణ వ్యవస్థలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఇటీవల వెల్లడించిన అంచనాల ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు రాబోయే నెలల్లో ‘చాలా బలమైన ఎల్‌నినో’గా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.4 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు?ఎల్‌నినో అంటే ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కే వాతావరణ పరిస్థితి. ప్రస్తుతం పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటి పెరుగుతున్నాయి. ఆగస్టులో ఈ అసాధారణ ఉష్ణోగ్రత 2.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు పేర్కొన్నారు. కొన్ని అంచనాల్లో ఇంకా 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు.More than 180 scientists and ecologists in India have signed an appeal urging researchers and field practitioners to prepare for an upcoming “super” El Nino event, which they warn could have severe impacts on the country’s natural systems.#ElNino #SuperElNino #ClimateChange… pic.twitter.com/t1blsyZP4F— Orissa POST Live (@OrissaPOSTLive) September 19, 2026భారత్‌పై ఎలాంటి ప్రభావం?ఇంత బలమైన ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో ప్రకృతి, వ్యవసాయం, జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో విస్తృతంగా పగడపు దిబ్బలు తెల్లబడటం (Coral Bleaching), అడవుల్లో అగ్నిప్రమాదాలు పెరగడం, పెద్ద వర్షారణ్య వృక్షాలు చనిపోవడం, కరువు పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం, తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులపై తీవ్ర ప్రభావం.. ఇలాంటి పరిణామాలు సంభవించే అవకాశముందని వారు హెచ్చరించారు.కనిపించని మార్పులూ కీలకమే..ఎల్‌నినో ప్రభావం కేవలం కరువు, వేడిగాలులు వంటి స్పష్టమైన పరిణామాలకే పరిమితం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్ల ఉత్పత్తి ఆలస్యం కావడం, జంతువుల ప్రవర్తనలో మార్పులు వంటి సూక్ష్మ పరిణామాలు కూడా పర్యావరణ వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.అందుకే ఎల్‌నినో ప్రభావాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలించి, డేటాను సేకరించి, ప్రకృతిపై పడుతున్న ప్రభావాన్ని నమోదు చేయాలని 180 మందికి పైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు తమ విజ్ఞప్తిలో కోరారు.భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (IITM)కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ మాట్లాడుతూ.. ఎల్‌నినో సమయంలో చోటుచేసుకునే మార్పులను నమోదు చేయడంతో పాటు, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న పర్యావరణ వ్యవస్థలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎల్‌నినో నుంచి నేర్చుకునే అంశాలు భవిష్యత్తులో మరింత వేడిగా, అస్థిరంగా మారే వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: సౌదీతో మోగిన హెచ్చరిక సైరన్లు.. -
భారత్‌కు టారిఫ్ ముప్పు!
వాషింగ్టన్: రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించింది. తద్వారా భారత్, చైనాలకు అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉన్నట్లే. ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ల మద్దతుతో అమెరికా ప్రతినిధుల సభ 262–159 ఓట్ల తేడాతో ఆమోదించిన సంగతి తెలిసిందే. చట్టసభలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత ట్రంప్ దీనిపై సంతకం చేశారు. → ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే ఈ కొత్త చట్టం అసలు లక్ష్యం. → ఇది రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన సంస్థలు, మాస్కో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలపై గురిపెట్టింది. → రష్యాకు చెందిన చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. → హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ప్రకారం ఈ చట్టం రష్యన్ ఉత్పత్తులపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపైనా ఆంక్షలు విధించడానికి ఆస్కారం ఉంది. → 100% వరకు సుంకాలు విధించడానికి అర్హమైన దేశాలుగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా పేర్లను స్పష్టంగా పేర్కొనాలని బిల్లులో ఒక సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ బిల్లు భారత్‌పై 100% సుంకాలు విధించాలని నేరుగా చెప్పలేదు. → అధ్యక్షుడు ట్రంప్ తన అధికారాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటే భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఒకవేళ ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తే అది ఇప్పుడున్న 10 శాతం సుంకానికి అదనం అవుతుంది. → అమెరికా సుంకం రేట్లను ప్రకటించిన తర్వాతే భారతీయ ఎగుమతులపై కొత్త సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పగలమని నిపుణులు అంటున్నారు. -
నిరాశ పరిచిన నగాల్
సియోల్: డేవిస్‌కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్స్‌కు చేరాలనుకున్న భారత ఆశలు నెరవేరలేదు. దక్షిణ కొరియాతో క్వాలిఫయర్ రెండో రౌండ్లో భారత జట్టు 1–3 తేడాతో పరాజయం పాలైంది. కొత్త ఫార్మాట్లో నిర్వహిస్తున్న డేవిస్ కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఆసియా దేశంగా నిలిచే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. శుక్రవారం తొలి రోజు ఆడిన రెండు సింగిల్స్‌లోనూ పరాజయం పాలై వెనుకబడిన భారత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రెండో రోజు శనివారం పురుషుల డబుల్స్‌లో విజయం సాధించినా... రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నగాల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–దక్షిణేశ్వర్ 6–3, 3–6, 6–3తో జిసుంగ్ నామ్–యుసింగ్ పార్క్‌పై విజయం సాధించారు. తప్పక గెలవాల్సిన రివర్స్ సింగిల్స్ పోరులో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 1–6, 2–6తో సూన్‌వూ క్వోన్ చేతిలో ఓడాడు. దీంతో కొరియా 3–1తో విజయం సాధించడంతో చివరి సింగిల్స్ మ్యాచ్ నిర్వహించలేదు. ఈ విజయంతో కొరియా జట్టు వరల్డ్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక భారత జట్టు వచ్చే ఏడాది జరగనున్న క్వాలిఫయర్ రౌండ్–1లో పాల్గొననుంది. -
కర్బన ఉద్గారాల పాపం అభివృద్ధి చెందిన దేశాలదే!
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువ తలసరి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, అయినప్పటికీ వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు గాను అభివృద్ధి చెందుతున్న దేశాలను అన్యాయంగా నిందిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణం, వాతావరణంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అణు శక్తి ఉత్పత్తి దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. అయితే, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే కొందరు వ్యక్తులు ప్రభుత్వ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేస్తున్నారని, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను వ్యతిరేకిస్తున్నారని తప్పుపట్టారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాలపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. వాస్తవానికి తలసరి కర్బన ఉద్గారాల విషయంలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగానే ఉందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు అధికంగా కర్బన ఉద్గారాలకు, తద్వారా పర్యావరణ మార్పులకు కారణమవుతున్నాయని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచమంతటా గట్టిగా చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘అణుశక్తి’ పనులను అడ్డుకోవద్దు భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ప్రధాని వివరించారు. భారతదేశ అభివృద్ధి వేగవంతమైనది, సుస్థిరమైనది అని వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, నిర్ణీత గడువు కంటే ముందే పారిస్(కాప్–21) ఒప్పందాల ప్రకారం తన బాధ్యతలను నెరవేర్చిన ఏకైక జీ20 దేశం భారత్ అని పేర్కొన్నారు. నవ భారతం శక్తి ఇదేనని అన్నారు. శిలాజేతర ఇంధనాలు, సౌరశక్తి సామర్థ్యం, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి కీలక అంశాల్లో భారతదేశ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలియజేశారు. గత 12 ఏళ్లలో ఇండియాలో పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైందని, ప్రస్తుతం అణు విద్యుత్ ఉత్పత్తి దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని మోదీ స్పష్టంచేశారు. అణుశక్తికి సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, వీటిని దయచేసి ఎవరూ అడ్డుకోవద్దని కోరారు. అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాల ఫలితంగా భారతదేశపు శిలాజేతర ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. 160 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యం గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ, ప్రతి విభాగంలోనూ భారత్ అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాని వివరించారు. 12 ఏళ్ల క్రితం దేశంలో సౌరశక్తి సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు ఉండేదని, నేడు అది 160 గిగావాట్లను దాటిందని గుర్తుచేశారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా ఇళ్లను సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది అనేక దేశాల్లోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. 2014కు ముందు దేశంలో ఏటా 3,000 ఎల్రక్టానిక్–వాహనాలు(ఈవీ) మాత్రమే అమ్ముడయ్యేవని వెల్లడించారు. గత ఏడాది 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని, ఇది నమ్మశక్యంకాని వృద్ధి అని ఉద్ఘాటించారు. ఇది మన పర్యావరణానికి మేలు చేస్తోందన్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ల వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం, ఇంధన వృథా గణనీయంగా తగ్గాయని ప్రధాని తేల్చిచెప్పారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక ప్రధాన సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు చెప్పారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకల్’ అనే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ షురూ.. ఇకపై..
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19న పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి వెళ్లడం ప్రారంభించినట్లు ఐఎండీ ధ్రువీకరించింది. సాధారణంగా సెప్టెంబర్ 17న ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి రెండు రోజులు ఆలస్యమైంది. వచ్చే 3-4 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర-కచ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.రుతుపవనాలు వాయవ్య భారతదేశం నుంచి నిష్క్రమిస్తున్నప్పటికీ, బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థ బలపడటంతో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. దీంతో సెప్టెంబర్ 20న దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, బలమైన గాలుల పరిస్థితులను ప్రజలు గమనించాల్సి ఉంటుంది.దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు అండమాన్-నికోబార్ దీవుల్లో సెప్టెంబర్ 20, ఆదివారం భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణతో పాటు అండమాన్-నికోబార్ దీవుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షంతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పగటిపూట బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, కొంకణ్-గోవా, మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉరుములు, పిడుగులు ఉంటాయని అంచనా.ఇదిలా ఉండగా, ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత బలపడనుంది. సెప్టెంబర్ 18న అల్పపీడనంగా మారిన ఈ వ్యవస్థ సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, సెప్టెంబర్ 22 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతూ సెప్టెంబర్ 23 ప్రాంతంలో ఆ తీరాన్ని చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చే వారం తూర్పు భారతదేశంలోని వర్షపాతంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్? ఇక విభేదాలన్నీ..
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ భారత్ పర్యటనకు సంబంధించి ఢిల్లీ, ఢాకా మధ్య అధికారికంగా చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. నవంబర్‌లో ఆయన న్యూఢిల్లీ పర్యటనకు సమయాన్ని ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది.ఢాకాలో ఇరు దేశాల అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ పర్యటనకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ నెలలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం తారిఖ్ రహ్మాన్ న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. అనంతరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆయనకు పలు దౌత్యపరమైన కార్యక్రమాలు ఉండనున్నాయి. వీటి మధ్యలో నవంబర్‌లో న్యూఢిల్లీ పర్యటనకు అనువైన తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రతిపాదిత పర్యటనలో భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం, రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించడం, గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ వంటి అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. 1996లో కుదిరిన గంగా జలాల పంపిణీ ఒప్పందం 2026 డిసెంబర్లో ముగియనుంది.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి తారిఖ్ రహ్మాన్ హాజరుకాలేదు. బంగ్లాదేశ్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఆహ్వానం ప్రధానమంత్రిగా కాకుండా బిమ్స్టెక్ చైర్‌గా వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కోబిర్ భారత్‌తో సంబంధాలను “రీ-సెట్” చేసేందుకు అనుకూల వాతావరణంలో ద్వైపాక్షిక పర్యటన జరగాలని గతంలో పేర్కొన్నారు. అయితే పర్యటన తేదీపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగితే నవంబర్‌లో తారిఖ్ రహ్మాన్ పర్యటన ఖరారయ్యే అవకాశంపై స్పష్టత రానుంది. -
బంగారంపై AI ఎఫెక్ట్.. 10 గ్రాములు రూ.3 లక్షలు?
-
పారిస్ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన.. భారత్‌లో తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కార్బన్ ఉద్గారాలు భారత్ కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత్ చేసిన కట్టుబాట్లను నిర్ణీత గడువుకు ముందుగానే సాధించిందని ప్రధాని తెలిపారు. జీ20 దేశాల్లో ఈ లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ విస్తరణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి అంశాల్లో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ’ పథకం ద్వారా ఇళ్లనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ.80 వేల వరకు ప్రభుత్వ సహాయం అందుతున్నట్లు వివరించారు.కుసుమ్ పథకం కింద సుమారు 30 లక్షల మంది రైతుల పొలాల్లో సౌర విద్యుత్ పంపులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. అలాగే ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఉద్గారాల తగ్గింపునకు కూడా సహకారం అందిందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మోదీ తెలిపారు. వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. భారతదేశంలోని ప్రాచీన పర్యావరణ ఆలోచనలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యం కూడా గణనీయంగా విస్తరించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘జెన్ జీ’లో స్లో లివింగ్ క్రేజ్ ఎందుకు పెరుగుతోంది? -
హౌతీల గుప్పిట్లో ‘బాబ్ అల్ మండేబ్’.. చిక్కుల్లో భారత్, చైనా!
హార్ముజ్ జలసంధి ఇప్పటికే మూసుకుపోయిన పరిస్థితుల్లో మరో కీలక సముద్ర మార్గంపై ముప్పు ముదురుతోంది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం బాబ్ అల్ మండేబ్ జలసంధి చుట్టూ పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో భారత్, చైనా సహా ఆసియా దేశాల యూరప్ వాణిజ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారితే, ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లడం ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. అయితే ఈ మార్గం చాలా పొడవుగా ఉండటంతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.మోఖా పోర్ట్‌పైనా హూతీల ఆధిపత్యంయెమెన్లో కొనసాగుతున్న ఘర్షణల్లో హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలపై పైచేయి సాధిస్తూ, పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఎర్ర సముద్ర నౌకాశ్రయ నగరం మోఖాను కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాబ్ అల్ మండేబ్ చుట్టుపక్కల ఉన్న పలు దీవులపై కూడా వారి నియంత్రణ పెరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే భారత్, చైనా సహా ఆసియా దేశాల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దారే మార్గమా?బాబ్ అల్ మండేబ్ మీదుగా యూరప్-ఆసియా మధ్య నౌకాయానం కష్టతరమైతే, నౌకలు ఆఫ్రికా దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మళ్లీ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి. దీంతో నౌకల ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఫలితంగా సరుకు రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.యూరప్ నుంచి భారత్‌కు ఎలా చేరాలి?ఉదాహరణకు ఫ్రాన్స్ లేదా ఇటలీ నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో సరుకులు రవాణా చేయాలంటే ముందుగా మధ్యధరా సముద్రాన్ని దాటాలి. ఆ తర్వాత స్పెయిన్, మొరాకో మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం పశ్చిమ, దక్షిణ తీరాల వెంట సుమారు 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి, దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ను దాటాలి. అనంతరం హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.దూరం దాదాపు రెట్టింపుబాబ్ అల్-మండేబ్ మార్గం ద్వారా భారత్ నుంచి ఫ్రాన్స్‌కు సముద్ర దూరం సుమారు 11 వేల కిలోమీటర్లు ఉంటుందని నివేదిక చెబుతోంది. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగితే ఈ దూరం దాదాపు 22 వేల కిలోమీటర్లకు చేరుతుంది. అంటే ప్రయాణ దూరం దాదాపు రెట్టింపు అవుతుంది. ఆసియా లేదా మధ్యప్రాచ్యం నుంచి యూరప్‌కు నౌకల రాకపోకలకు సాధారణం కంటే మరో 10 నుంచి 30 రోజుల వరకు అదనపు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఉదాహరణగా సౌదీ అరేబియాలోని యాన్బు నుంచి తైవాన్‌కు బాబ్ అల్-మందబ్ మీదుగా సుమారు 19 రోజులు పడుతుండగా, ఆఫ్రికా చుట్టూ తిరిగితే ఈ ప్రయాణం సుమారు 48 రోజులకు చేరవచ్చని నివేదిక పేర్కొంది.భారత్-ఈయూ వాణిజ్యంపై ప్రభావం?కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ గణాంకాల ప్రకారం, 2025లో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య మొత్తం వాణిజ్యం 136.5 బిలియన్ అమెరికా డాలర్లకు పైగా నమోదైంది. ఇందులో ఈయూ నుంచి భారత్‌కు దిగుమతులు, భారత్ నుంచి ఈయూకు ఎగుమతులు రెండూ ఉన్నాయి. భారత్ నుంచి ఈయూకు సుమారు 75.8 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు, భారత్ ఈయూ నుంచి సుమారు 60.7 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే, ఇలాంటి భారీ వాణిజ్య ప్రవాహాలపై రవాణా సమయం, ఖర్చుల పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది.బాబ్ అల్ మండేబ్ ఎందుకంత కీలకం?అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం, హౌతీల డ్రోన్లు, దాడుల భయంతో బాబ్ అల్ మండేబ్ గుండా నౌకల రాకపోకలు సుమారు 88 శాతం తగ్గాయి. హౌతీలు తాము సౌదీ అరేబియా నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, ఇతర దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ సముద్ర మార్గం గుండా సాగుతుంది. అంతేకాకుండా తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీకి హౌతీ ఆధీన ప్రాంతాలు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. జిబౌటీలో అమెరికా సహా పలు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ పరిణామాలు బాబ్ అల్ మండేబ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు! -
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్‌లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్‌దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్‌లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్‌పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్ -
మన ‘ధర్మం’ వేరు.. వారి మతం వేరు!
ఉజ్జయిని: ‘ధర్మం’పై భారతీయుల అవగాహనకు, పాశ్చాత్యుల ‘మతం’అన్న ఆలోచనకు మధ్య చాలా తేడా ఉందని ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. వివిధ విశ్వాసాల పట్ల వివక్ష చూపకపోవడాన్నే భారతదేశం మతసామరస్యంగా పరిగణించిందని ఆయన వ్యాఖ్యానించారు. అహంకారం, ఈగోలు ప్రకృతి సహజ నియమాలను కూడా నియంత్రించగలనన్న మనిషి అపోహకు కారణమవుతుందని హెచ్చరించారు. ఉజ్జయినిలో శుక్రవారం సుమారు 1700 మంది జెన్–జీ యువతతో ఏర్పాటు చేసిన ‘యువ ధర్మ సంసద్’ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ధర్మం’అనేది వృద్ధులకు సంబంధించింది అనుకుంటున్న పరిస్థితుల్లో యువత గురించి చర్చించడం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘భారత్‌లో సంస్కృతుల మేళవింపు నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రజల మధ్య వివక్ష చూపదు. పంత్ నిరపేక్షత అర్థం ఇదే’’అని ఆయన చెప్పారు. వ్యక్తుల దర్పం, గర్వం అన్నీ తన నియంత్రణలోనే ఉన్నాయన్న తప్పుడు భావనను కల్పిస్తాయని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల్లో పాలకులు, మతాధికారుల మధ్య ఘర్షణలు సెక్యులరిజమ్ అన్న భావనకు కారణమైందని, కాబట్టి అది మన దేశ సందర్భానికి తగింది కాదని చెప్పారు. జీవితపు భౌతిక, ఆధ్యాత్మిక అంశాలను ఒక్కటిగా చూడటం భారతీయుల సంస్కృతి అన్నారు. ధర్మం అనేది మతాల కంటే ఉన్నతస్థాయిదని, రెండింటినీ ఒకేలా చూడకూడదని చెప్పారు. ధర్మం మోక్షానికి దారినిస్తే... మతం బంధాలకు కారణమవుతుందన్నారు. ఇంగ్లి్లషు భాషలో ధర్మం అనే భారతీయ భావనకు తగిన పదమే లేదని పాశ్చాత్యులకు దీన్ని వివరించేందుకు ‘మతం’అన్న పదాన్ని వాడారని తెలిపారు. ధర్మం నుంచి మతాన్ని వేరు చేస్తే అది విభజనకు దారితీసే అవకాశముంటుందని అన్నారు. సత్యం, సానుభూతి, స్వచ్ఛత, స్వీయ క్రమశిక్షణలే ధర్మానికి ఆధారమని వివరించారు. ‘ధర్మం’అంటే విశ్వాసాన్ని నిలబెట్టే, అందరి అభివృద్ధిని ప్రోత్సహించే, ప్రతి జీవి, వస్తువు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని కర్తవ్యాలను నిర్ణయించే సూత్రమని అన్నారు. అలాగే ఆయన ‘ధర్మం’ను పర్యావరణ బాధ్యతతో కలిపారు. ప్రకృతిని రక్షించడం మానవుల కర్తవ్యమని, అడవులను నాశనం చేయడం పర్యావరణ అసమతౌల్యం, ‘అధర్మం’అవుతుందని అన్నారు. యువత ధర్మాన్ని అర్థం చేసుకునేందుకు ముందస్తు ఆలోచనలను పక్కనబెట్టాలని సూచించారు. సొంత సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే.. ఇతర ప్రార్థన పద్ధతులను గౌరవించాలని కోరారు. -
భారత చెస్ జట్ల ‘హ్యాట్రిక్’ విజయం
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేసి ‘హ్యాట్రిక్’ సాధించాయి. భారత మహిళల జట్టు 3.5–0.5తో గ్రీస్‌ను ఓడించింది. బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 46 ఎత్తుల్లో స్టావ్‌రూలా సొలాకిడూపై గెలిచింది. బోర్డు–2పై దివ్యదేశ్‌ముఖ్, అనస్తాసియా అవ్రామిడూ గేమ్ 49 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బోర్డు–3పై వంతిక అగర్వాల్ 44 ఎత్తుల్లో ఎకతెరీని పావ్లిడూపై... బోర్డు–4పై సవితా శ్రీ 66 ఎత్తుల్లో అంటోనియా క్రిస్టోడులాకీపై గెలుపొందారు. భారత పురుషుల జట్టు 3–1తో ఇటలీపై నెగ్గింది. బోర్డు–1పై ప్రజ్ఞానంద, లొరెంజో లోడికి గేమ్ 41 ఎత్తుల్లో... బోర్డు–2పై ఇరిగేశి అర్జున్–లుకా మొరోని గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. బోర్డు–3పై నిహాల్ సరీన్ 40 ఎత్తుల్లో ఫ్రాన్సెస్కో సోనిస్పై... బోర్డు–4పై దొమ్మరాజు గుకేశ్ 33 ఎత్తుల్లో సబీనో బ్రునెల్లోపై గెలుపొందారు. నేడు జరిగే నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో భారత పురుషుల జట్టు; మంగోలియాతో భారత మహిళల జట్టు తలపడతాయి. -
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మనదేశం నుంచి ఊహించని చిత్రం ఎంపికైంది. దాదాపు 30కి పైగా సినిమాలు పోటీపడగా..ఇండియా నుంచి ఓ చిన్న మూవీ జాక్‌పాట్ కొట్టేసింది. మరాఠీలో తెరకెక్కించిన గోంధాల్ మూవీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డులకు గానూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఎంపిక చేసింది.ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో మై వాపస్ ఆవుంగా, బోర్డర్ 2, ధురందర్, 120 బహదూర్, సింగ్ గీతం, పెద్ది, ఇరుముడి, లాంటి సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఈ చిత్రాలను వెనక్కి నెట్టి గోంధల్ అర్హత సాధించింది. ఈ లిస్ట్‌లో గోంధాల్ తర్వాత స్థానంలో ఇక్కీస్, అంఘ్ సినిమాలు నిలిచాయని జ్యూరీ వెల్లడించింది. గోంధాల్ మూవీ భారతీయ సంస్కృతిని చక్కగా చూపించారని..సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని జ్యూరీ సభ్యుల్లో ఒకరు అన్నారు.ఈ చిత్రం ఒక రాత్రంతా జరిగే జానపద ప్రదర్శన అయిన సాంప్రదాయ మహారాష్ట్ర గోంధాల్ ఆచారం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంతో దర్శకుడు సంతోష్ దావఖర్ అరంగేట్రం చేశారు. ఇది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అక్కడ స్పెషల్ జ్యూరీ గుర్తింపుతో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ పరిమిత వసూళ్లు మాత్రమే సాధించింది. కాగా.. 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది. -
ఈ సంవత్సరం భారత్ లో చలిలేదు, రాదు సూపర్ ఎల్ నినో ప్రభావం
-
పాక్ తీరు మారలేదు.. భారత్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఆరోపించింది. ఒసామా బిన్ లాడెన్ సహా 9/11 ఉగ్రదాడుల కుట్రదారులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాక్కోలేదని, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనూ ఎవరి కంటికీ చిక్కకుండా ఉండిపోయారని, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు, శిక్ష నుంచి మినహాయింపు కల్పించే ఇలాంటి వాతావరణం పాకిస్తాన్లో కొనసాగినంత కాలం.. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు లాభమే చేకూరుతుందని తీవ్రంగా విమర్శించింది.ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై భద్రతా మండలి జరిగిన సమావేశంలో భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, ఖలీద్ షేక్ మహ్మద్ తదితరులు పాకిస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోనే పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఒసామా అబోతాబాద్లో భద్రత కలిగిన నివాస భవనంలో హతమయ్యాడని, 9/11 దాడుల రూపకర్త ఖలీద్ షేక్ మహ్మద్ రావల్పిండిలోని ఇంట్లో పట్టుబడ్డాడని ఆయన వివరించారు. ఈ దాడులకు సంబంధించిన ఉగ్రవాదులు రమ్జీ బినల్షిబ్, వలీద్ బిన్ అతాష్, ముస్తఫా అహ్మద్ అల్ హౌసావీ కూడా పాకిస్థాన్‌లోనే అరెస్టయ్యారని తెలిపారు. ‘‘వీరు గుహల్లో దాక్కోలేదు. పరారీలోనూ లేరు. ఎవరూ గుర్తించకుండా ఉండగలిగారు. ఇలాంటి రాక్షసులు ఎదిగేందుకు సహకరించిన వాతావరణాన్ని తొలగించాలి’’అని పర్వతనేని పాకిస్తాన్‌పై పరోక్ష విమర్శలకు దిగారు. పాకిస్తాన్ 9/11 దాడుల వెనుక ఉన్న వారికి కల్పించినట్టుగానే అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు ఆశ్రయం, మద్దతు ఇస్తూనే ఉందని ఆరోపించారు. ఈ సంస్థలు ఆంక్షల వేటు తప్పించుకునేందుకు పేర్లు మార్చుకుంటున్నాయని అన్నారు.అఫ్గన్ శరణార్థులపై ఆందోళన పలు దేశాల నుంచి అప్గన్లను అఫ్గనిస్థాన్‌కు తిరిగి పంపుతున్న వారిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది 29 లక్షల మంది 2026 ఆగస్టు 22 వరకు మరో 11.5 లక్షల మంది తిరిగి వెళ్లినట్లు ఐరాస నివేదిక చెబుతుండగా వీరిలో అత్యధికులను బలవంతంగా తిప్పి పంపారని భారత్ ఆరోపించింది. ఈ ప్రక్రియ స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా ఉండాలని స్పష్టం చేసింది. పునరావాసం, ఆహారం, నివాసం వంటి అవసరాల కోసం అంతర్జాతీయ సమాజం తగిన తోడ్పాటును అందించాలని, తమవంతుగా ఐరాస, అఫ్గన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా -
రష్యాపై ఆంక్షలు
వాషింగ్టన్: రష్యాపై ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు చేస్తున్న భారత్, చైనాలపై భారీ ఎత్తున టారిఫ్‌లు విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ‘ద లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’పేరున్న ఈ చట్టాన్ని సెనేట్ గత నెలలోనే ఆమోదించింది. తాజాగా బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ 262–159 ఓట్లతో ఓకే చెప్పింది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టిన వెంటనే ఈ బిల్లు కాస్తా చట్టం అవుతుంది. ప్రతినిధుల సభలోని 203 మంది రిపబ్లికన్లతోపాటు 56 మంది డెమొక్రాట్లు, ఒక స్వతంత్ర ప్రతినిధి ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ ప్రతినిధులు ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి పరిమితమయ్యారు. సౌత్ కరొలీనా సెనేటర్, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి లిండ్సే గ్రాహం ఏడాది కాలంగా ఈ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి.. ఈ ఏడాది జూలైలో ఆకస్మిక మరణం పాలయ్యారు. దీంతో బిల్లుకు గ్రాహం పేరునే పెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో డెమొక్రాట్ ప్రతినిధి రిచర్డ్ నీల్ మాట్లాడుతూ ‘‘టారిఫ్‌లు విధించే విషయంలో ట్రంప్‌కు ఎక్కువ అధికారాలు ఇవ్వడంపై మాత్రమే తమ అభ్యంతరం’’అని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా రష్యా నేతలపై మాత్రమే కాకుండా ఇంధన రంగం మొత్తమ్మీద ఆంక్షలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు కట్టబెట్టనుంది. అధికారికంగా ఇంధన సరఫరా చేసే నౌకలతోపాటు ‘షాడో ఫ్లీట్’లకు కూడా ఆంక్షలు వర్తించనున్నాయి. అదే సమయంలో రష్యా సరఫరా చేసే చమురు, గ్యాస్‌లపై భారత్, చైనా వంటి దేశాలు ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలపై టారిఫ్‌లు వడ్డించేందుకు ఈ బిల్లు ట్రంప్‌కు అధికారం ఇస్తుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. సెనేట్ ఈ బిల్లును నెలరోజుల క్రితమే 86–11 ఓట్ల తేడాతో ఆమోదించగా ప్రతినిధుల సభలో కొంత ఆలస్యమైంది. నవంబరు మూడున జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభ సమావేశాల చివరిరోజున మాత్రమే ఆమోదం సాధ్యమవడం విశేషం. -
‘నూరుశాతం’ తప్పుడు చర్య
తీసుకునే నిర్ణయాలన్నీ వికటిస్తున్న వైనం కనబడుతూనే ఉన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తత్వం బోధపడలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించే పేరిట ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించటానికీ... దాన్నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తోడ్పడుతున్న భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు విధించటానికీ అనుమతించే బిల్లును ఆయన ప్రభుత్వం ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకుంది. గత నెల ఇదే బిల్లుకు సెనేట్ ఓకే చెప్పింది. తాజా ఆమోదంతో ఈ ఆంక్షల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్టయింది. దీనిపై ట్రంప్ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. ఆ అధికారాన్ని ట్రంప్ వినియోగిస్తారా లేదా అన్నది చూడాల్సివుంది. రెండోసారి అధికారంలోకొచ్చాక రష్యాపై ట్రంప్ విధించ దల్చుకున్న ఈ ఆంక్షలు అత్యంత కీలకమైనవి. ఈసారి ఆంక్షలన్నీ రష్యా ఇంధన, రక్షణ రంగాలే లక్ష్యంగా రూపొందించారు. తన అభీష్టానికి విరుద్ధంగా ఇరుగు పొరుగు దేశాలు నిర్ణయాలు తీసుకుంటే వాటితో ద్వైపాక్షిక వాణిజ్యంతోసహా వివిధ బంధాలన్నిటినీ తెంచుకోవటం ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ ‘తన చావు జగత్ప్రళయమ’న్న రీతిలో ఆ పనే అందరూ చేసితీరాలనే డిమాండ్ మూర్ఖత్వం. అంతర్జాతీయంగా 80 ఏళ్ల క్రితం కుదిరిన ఒడంబడిక ప్రకారం దురాక్రమణ యుద్ధాలకు పాల్పడే దేశంపై ఎలాంటి చర్యలు అవసరమో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి నిర్ణయిస్తాయి. రష్యా తప్పు చేస్తున్నదని అమెరికా భావిస్తే ఆ వేదికలద్వారా ఒత్తిళ్లు తీసుకురావాలి. అలా చేయలేననుకుంటే తనవరకూ ఇష్టానుసారం చేసుకోవచ్చు. అసలు ట్రంప్ అత్యుత్సాహంతో అమలు చేస్తున్న సుంకాల విధానంపై అమెరికాలోనే ఏకాభిప్రాయం లేదు. రష్యాపై కఠిన చర్యల్ని సమర్థిస్తున్న డెమోక్రాట్లు సైతం ట్రంప్‌కు అతిగా అధికారాలు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకపక్ష అధికారాలు అప్పగిస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.మన దేశం గతంకన్నా దృఢంగా వ్యవహరించటం హర్షించదగ్గది. ప్రస్తుత విధానాన్ని విడనాడబోమనీ, మార్కెట్ చలనాలను నిర్దేశించే ధరవరలు, సరఫరా, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భిన్న మార్గాల్లో చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తామనీ స్పష్టంచేసింది. వంద శాతం సుంకాలపై అమెరికా చర్యకు దిగితే ద్వైపాక్షిక సంబంధాలపై వాటి ప్రభావం పడుతుందని ఇప్పటికే అమెరికాకు తెలియ జేశామని తెలిపింది. అసలు ఈ తీర్మానం చేసే నైతిక హక్కు అమెరికన్ కాంగ్రెస్‌కు ఉందా? ఈ ఆంక్షలు ఒక్కరోజు ఆలస్యమైనా ఉక్రెయిన్‌లో మరింతమంది ప్రజలు మృత్యువుకు బలి అవుతారని తీర్మానం చెప్పడం వంచన. ఈ సూత్రం తనకు వర్తించదా? ఇరాన్‌పై ఇజ్రాయెల్ సాగించిన దురాగతాలను నిలువరించకపోగా, తానూ అందులో పాలుపంచుకుని దేశాధినేతతోసహా అనేకమంది పౌర, సైనిక ముఖ్యుల్ని హతమార్చటం... ఇప్పటికీ పౌర ప్రాంతాలపై బాంబులేస్తూ పదులకొద్దీ మందిని నిత్యం హతమార్చటాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? తీర్మానం చేసేముందు తమ పాలకుడి నిర్వాక మేమిటన్న స్పృహ ఉండొద్దా? తాము అధర్మయుద్ధం కొనసాగిస్తూ ధర్మపన్నాలు వల్లించటం, వేరొకరిని వేలెత్తిచూపటం, అందరూ తననే అనుసరించాలనటం ఏం సబబు?వచ్చేవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా సందర్శనకు రాబోతున్నారు. ఇరు దేశాలమధ్యా శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆంక్షల తీర్మానం తీసుకురావటం, బెదిరింపులకు దిగటం తెలివిమాలిన చర్యగా అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఏఐ విషయంలో సమష్టిగా కదలాలన్న అమెరికా ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఆ విషయంలో ఇరు దేశాలమధ్యా భిన్నాభిప్రాయాలున్నాయని బయటపడింది. ఈ నేపథ్యంలో మరో వివాదాన్ని రగల్చటం వల్ల ఒరిగేదేమిటి? తన పెత్తందారీ పోకడలతో విసిగిన ప్రపంచం ఇప్పటికే దూరం జరిగిందని అమెరికా గ్రహించటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటంలో తెరవెనక తాను నడిపించిన ఎత్తుగడలే కారణమని గుర్తులేదా? అంతర్జాతీయ వేదికల ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తేవటం చట్టవిరుద్ధమని అమెరికా తెలుసుకోవాలి. -
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్‌పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
ఈసారి భారత్‌లోనే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కార్యక్రమం భారత్‌లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్‌లోనే ఉంటుంది. ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్ చైర్మన్‌గా ఎన్నిక కానున్న అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్ వేలం దుబాయ్‌లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు. -
భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. ఈనెల 15న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా, పీఎన్ఎస్ హునైన్ అనే పాక్ పెట్రోలింగ్ నౌక దానిని వెంబడించింది. ప్రమాద సంకేతాలను తెలియజేయడానికి ఉపయోగించే ఛానల్ 16 (సముద్ర రేడియో ఛానల్) ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ పాకిస్తాన్ నౌక అకస్మాత్తుగా వేగం పెంచి, భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కుడి వైపున ఢీకొట్టింది. చివరికి పాకిస్తానీ నౌక ముందు భాగం భారత యుద్ధనౌకను తాకింది. అయితే, భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఈ సంఘటన తర్వాత కూడా భారత యుద్ధనౌక తన కార్యకలాపాలను యథాతథంగా కొనసాగించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం పరిణామం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్(సీడీఏ) సాద్ వరైచ్‌కు సమన్లు జారీ చేసింది. బుధవారం ఆయనను పిలిపించింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకను పాక్ నౌక ఢీకొట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. పాకిస్తాన్‌ది ఆమోదయోగ్యం కాని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైన ప్రవర్తన అంటూ తేల్చిచెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నిబంధనలను గౌరవించాలని సంబంధిత పాకిస్తాన్ అధికారులకు తెలియజేయాలంటూ సాద్ వరైచ్‌కు సూచించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా ఇదే విధమైన నిరసనను తెలియజేయాలని అక్కడి భారత చార్జ్ డి అఫైర్స్‌ను ఆదేశించినట్లు స్పష్టంచేసింది. ‘‘అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన వల్ల పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ.. పాకిస్తాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు మాత్రం సైనిక విన్యాసాలు, కదలికలు, దళాల తరలింపులకు సంబంధించిన ముందస్తు సమాచారంపై 1991 ఏప్రిల్‌లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని 10వ అధికరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది’’అని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. మరోవైపు భారత నావికాదళం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమ ఆందోళనను పాకిస్తాన్ సైన్యానికి తెలియజేసింది. పాకిస్తాన్‌కు చెందిన పీఎన్ఎస్ హునైన్ నౌక 2024 జూలైలో విధుల్లోకి ప్రవేశించింది. ఇందులో నౌకా విధ్వంసక, వైమానిక రక్షణ ఆయుధాలు, సెన్సార్లు, టెర్మినల్ రక్షణ వ్యవస్థ అమర్చారు. -
నూతన సాంకేతికతల్లో భారత్ అగ్రస్థానానికి చేరాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతల విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుధవారం ఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో జరిగిన సెమీకండక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారం అవసరమని తేల్చిచెప్పారు. దేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తుచేశారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావించారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల దశ నుంచి విస్తృత స్థాయి, గొప్ప అవకాశాలు కలిగిన దశకు మారుతోందని అన్నారు. సాంకేతిక పురోగతులు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మన విధానాలు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై సూచనలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలను మోదీ ఆహ్వానించారు. సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. భారతదేశ సెమీకండక్టర్ రంగం వృద్ధికి చొరవ తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికతల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ పిలుపునిచి్చనట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి సెమీ, మైక్రాన్, ఇని్ఫనియోన్, అప్లైడ్ మెటీరియల్స్, ఏఎస్ఎంఎల్, మెర్సెక్, టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్, ఫుజిఫిలిం, ఇంటెల్, టాటా ఎల్రక్టానిక్స్, సెలెస్టా క్యాపిటల్, ఫాక్స్‌కాన్, ఐబీఎం రీసెర్స్ తదితర కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ‘‘సెమీకండక్టర్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు, వ్యాపార వృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల ఉన్నతీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా నిరంతరం కృషి చేయాలి’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా?
అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది. రష్యా, చైనా లాంటి దేశాలు అంతరిక్ష యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నట్లు వార్తలు వస్తూండగా.... అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్ పరిస్థితి ఏమిటి? ఉపగ్రహాలను కూల్చే సత్తా మనకుందా? ఉంటే.. అమెరికా మాదిరిగానే మనమూ అంతరిక్షంలో మనదైన అ్రస్తాన్ని సిద్ధంగా ఉంచగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా భారత్‌కు ఇప్పుడు కాదు... ఏడేళ్ల క్రితం అంటే 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను భారత్ పరీక్షించింది. అగ్రరాజ్యాలు అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో పురుడుపోసుకున్న ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధాల ఆలోచన ఆ తరువాత బహుముఖంగా విస్తరించింది. అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది కూడా. ఇలా క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించని, నిత్యం కదులుతూ ఉండే ఉపగ్రహాలను గుర్తించడం, క్షిపణులతో ఢీకొట్టడం అంతా చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దేశాలు మాత్రమే ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగాయి. 1985లో అమెరికా మొట్టమొదటిసారి ఈ రకమైన వ్యవస్థలను ప్రయోగించి విజయం సాధిస్తే చైనాకు 2007 వరకూ సాధ్యపడలేదు. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్లు ఉన్నాయని ప్రకటించుకుంది. మన పరిస్థితి ఏమిటి? ముందుగా చెప్పుకున్నట్లు మిషన్ శక్తితో మనకు ఉపగ్రహాలను కూల్చేయగల సామర్థ్యం సమకూరింది. ఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. నేరుగా ఢీకొట్టడం ద్వారా మాత్రమే పృథ్వీ క్షిపణి ఉపగ్రహాన్ని నాశనం చేయడం గుర్తించాల్సిన విషయం. అంటే.. క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదన్నమాట. ప్రయోగం తరువాత జరిపిన పరిశీలనల్లో క్షిపణి ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడంలో విజయవంతమైందని స్పష్టంగా తెలిసింది. దీనర్థం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను గుర్తించి.. దాని దారిని పరిశీలిస్తూ... అడ్డుకుని పేల్చేయగల సత్తా భారత్‌కు ఉందీ అని!!! ఇప్పుడు çపృథ్వీ క్షిపణిలో పేలుడు పదార్థం ఉందని ఒక్కసారి ఊహించుకోండి... – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంచులే కేంద్రంగా మారుతున్న కాలం
మోదీ శకంలో చిరకాలం నిలిచిపోయే గొప్ప విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కనిపించకపోవచ్చు. అంతకంటే లోతైన అంశంలో అది ఉంది. భారత ప్రధాన స్రవంతి విస్తరించటమే ఆ విజయం. నేను భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఆయనను ప్రధానమంత్రిగా దగ్గరగా గమనించాను. ఆ అనుభవంతో పాటు ప్రజా జీవితంలో ఆయనతో నాకున్న అనుబంధం ఆధారంగా, ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, 2014 నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఎన్నికైన ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు నాయకత్వం వహించిన ప్రధాని మోదీ... ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సరళమైన, పరివర్తనాత్మక ఆలోచనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఆయన సమ్మిళిత రాజకీయాలకు నిర్వచనంగా మారిన మరో భావన దీనికి కేంద్రం: ‘జిస్కో కిసీ నే నహీ పూఛా, ఉస్కో మోదీ నే పూజా’. అంటే ఎవరూ పట్టించుకోని వారికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి అంచె వరకు అభివృద్ధిని తీసుకెళ్లటమే కాకుండా, ఆ అంచుల్లో ఉన్నవారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావటం మోదీ శకంలో అత్యంత ప్రభావవంతమైన మార్పు కావచ్చు.మారిన ఈశాన్య కథస్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలపాటు భారత అభివృద్ధి ఆలోచనలో ఒక కేంద్రం, దానికి వెలుపల పరిధి ఉన్నట్లు భావించేవారు. కొన్ని ఆకాంక్షలకు జాతీయ చర్చలో అసలు చోటే దక్కలేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. దాని ప్రయోజనం పొందే అవకాశం చివరి వ్యక్తికి నిజంగా చేరిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్పును ఈశాన్య ప్రాంతం కంటే మెరుగ్గా వివరించే ఉదాహరణలు చాలా తక్కువ. దశాబ్దాలపాటు ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంగానే ఎక్కువగా భావించారు. మోదీ నాయకత్వంలో అది భారత్ ముఖంగా, ఆగ్నేయాసియాకు ప్రవేశ ద్వారంగా క్రమంగా గుర్తింపు పొందింది. 2014 నవంబర్ నుంచి ప్రధాని మోదీ 83 సార్లకు పైగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో 12 ప్రధాన శాంతి ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు దశాబ్దంలో దాదాపు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014–15 నుంచి 2025–26 మధ్య అభివృద్ధికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. బోగీబీల్ వంతెన, సెలా సొరంగం... కఠినమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబీ–సైరాంగ్ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాంకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో తొలిసారి నేరుగా రైలు అనుసంధానం లభించింది. స్వాతంత్య్రం తర్వాత నాగాలాండ్‌కు తొలి రైల్వే స్టేషన్ వచ్చింది. గువాహటి ఎయిమ్స్ ఈశాన్య ప్రాంతంలో తొలి ఎయిమ్స్‌గా నిలిచింది. అసోంలోని సెమీకండక్టర్ కేంద్రం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షకు ప్రతీక. ఒకప్పుడు ప్రధానంగా భౌగోళికంగా మారుమూల ప్రాంతంగా భావించిన చోట భారత్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఒకటి ఆవిర్భవించగలదన్న ఆలోచనకు ఇది రూపమిస్తోంది.‘చివరి గ్రామాల’ నుంచి ‘తొలి గ్రామాల’ వరకుఇదే మార్పు భారత సరిహద్దుల వెంబడి కూడా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మారుమూల జనావాసాలను సాధారణంగా దేశంలోని ‘చివరి గ్రామాలు’గా పేర్కొన్నారు. కానీ వైబ్రెంట్ విలేజెస్ కార్య క్రమం మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, అనుసంధానం, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవల ద్వారా ఈ ఆలోచనకు సంస్థాగత రూపం ఇస్తోంది. ఆకాంక్షిత జిల్లాల కార్య క్రమం ద్వారా ఇదే సూత్రం దేశ అంతర్భాగానికీ విస్తరించింది. చరిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలు శాశ్వతంగా వెనుకంజ లోనే ఉంటాయని అంగీకరించకుండా... ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేసేందుకు స్పష్టమైన ఫలితాలు, పథకాల సమన్వయం, పోటీతత్వ అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 బ్లాకు లను ‘ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం’ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఈ విధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లారు. గత దశాబ్దంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ 243 శాతం పెరిగింది. మొత్తం 75 ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలను పీఎం–జన్ మన్ పరిధిలోకి తీసుకొచ్చారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు, పీవీటీజీ ఆవాసాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సమన్వయ ప్రభుత్వ చర్యల ద్వారా పరిష్కరిస్తూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను అందులో భాగం చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. లీకేజీలను అరికట్టడం ద్వారా రూ. 5.14 లక్షల కోట్లకు పైగా మొత్తం ఆదాకు ఇది దోహదం చేసింది. సౌభాగ్య పథకం గ్రామీణ విద్యుదీకరణలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబా లకు స్వచ్ఛ వంట ఇంధనాన్ని అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విస్తరించింది.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే...మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న అంశాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పరిష్కరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో పాల్గొనేందుకు ‘ముద్ర’ పథకం వీలు కల్పించింది. మొత్తం ముద్ర రుణాల్లో మహిళల వాటా 68 శాతం. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లోనూ మహిళలు 46 శాతం ఉన్నారు. గ్రామీణ పరివర్తనలో మహిళల ఆర్థిక సాధికారతకు లఖ్పతి దీదీ కార్యక్రమం కేంద్ర స్థానం కల్పిస్తోంది. విడివిడిగా చూస్తే ఈశాన్య ప్రాంతం, గిరిజన సమాజాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న పౌరులు వేర్వేరు సవాళ్లుగా కనిపిస్తారు. అన్నింటినీ కలిపి చూస్తే మోదీ ప్రభుత్వ పాలనా తత్వంలోని విస్తృత నిర్మాణం స్పష్టమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న వేళ కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ లేదా మరింత సమర్థమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటమే ఆకాంక్ష కాదు. భారత అభివృద్ధి గాథలో ఒకప్పుడు అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమాన భాగస్వామ్యం ఉండేలా చూడటం లక్ష్యం.రామ్‌నాథ్ కోవింద్వ్యాసకర్త భారత మాజీ రాష్ట్రపతి -
యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు.. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం ప్రజలపై ప్రభావం చూపుతుందని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని రాష్ట్రీయ సమాజ్ పక్ష ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్ పేర్కొన్నారు.పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో కొందరు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిని చర్చకు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.స్థాయీ సంఘం సభ్యుడు ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. వ్యాపారులకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందని అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 15) మార్పు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే రూ.2,000కు మించిన బదిలీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేసింది.ఎవరు ఏమన్నారు?యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై రాజకీయంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆరోపించారు. దుకాణదారులు ఈ వ్యయాన్ని వస్తువుల ధరల్లో కలిపితే సాధారణ ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతోందని కూడా ఆయన ఆరోపించారు.మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర నిర్ణయాన్ని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే సామాన్యులపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన ఆరోపించారు.పవన్ ఖేరా: కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా.. కొత్త 0.4 శాతం ఎండీఆర్‌ను “మోదీ ట్యాక్స్”గా పిలవాలని అన్నారు. యూపీఐని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తర్వాత దాని వినియోగంపై పన్ను విధిస్తున్నారని ఆయన విమర్శించారు.హారిస్ బీరన్: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాజ్యసభ సభ్యుడు హారిస్ బీరన్.. ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఎండీఆర్ భారం వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయవచ్చని, దీంతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎండీఆర్ వినియోగదారులపై విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు కూడా ఎండీఆర్ ఉండదని తెలిపింది. చిన్న వ్యాపారులకు సంబంధించిన జీరో-ఎండీఆర్ నిబంధనలు కొనసాగుతాయని, మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కాకుండా ఉంటాయని పేర్కొంది.బీజేపీ వాదన: ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఎండీఆర్ పన్ను కాదు. దీనివల్ల వచ్చే ఆదాయం బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంచబడుతుంది. యూపీఐ మౌలిక వసతులు, భద్రత, విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడమే కొత్త విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని ఎలా నిర్వహిస్తారు, వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందా, డిజిటల్ చెల్లింపుల వినియోగంలో ఏమైనా మార్పు వస్తుందా అనేది తదుపరి పరిశీలించాల్సిన అంశాలుగా మారాయి. -
భారత నౌకను ఢీకొట్టిన పాక్ నౌక
ఢిల్లీ: అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ నౌక భారత నౌకను ఢీకొట్టింది. దీంతో భారత్ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్తతో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళ ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదిగా ఉందని వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఈ ఘటనపై పాకిస్థాన్ తాత్కాలిక రాయబారి సాద్ అహ్మద్ వరిచ్తో భారత విదేశాంగ శాఖ పలు అంశాలను ప్రస్థావించింది. పాకిస్థాన్ నౌకాదళం వ్యవహరించిన తీరు 1991లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన పరస్పర ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొంది. “ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సంబంధిత ఒప్పందాల నిబంధనలను గౌరవించాలి” అని తెలిపింది. భారత్ వ్యక్తం చేసిన ఈ సందేశాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేయాలని పాక్ దౌత్యవేత్తను ఆదేశించింది.ఎలా జరిగిందిఈ ఘటన సెప్టెంబర్ 15 ఒమన్‌కు తూర్పుగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన ఓ ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకకు పాకిస్థాన్ నౌకాదళ నౌక సమీపంగా వచ్చింది. అనంతరం ఢీకొట్టింది. నౌకను నడపడంలో నిర్లక్షంగా వ్యవహరించడం కారణంగానే రెండు నౌకలు ఢీకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారుఅయితే కేవలం నౌకలు ఢీకొట్టడం మాత్రమే కాకుండా అంతర్జాతీయ జలాల్లో సైనిక నౌకలు వ్యవహరించే సమయంలో పాటించాల్సిన భద్రత, జాగ్రత్తలు, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాల నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని భారత్ ప్రస్తావించింది. ముఖ్యంగా, 1991 నాటి భారత్-పాకిస్థాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాకిస్థాన్ నౌకాదళ నౌక ప్రవర్తన ఉల్లంఘించిందని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటన పునరావృతం కాకుండా ఇరు దేశాల సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని భారత్ స్పష్టం చేసింది. -
నెల రోజుల్లో దిగొచ్చిన నిరుద్యోగం!
దేశంలో ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న 15 ఏళ్లు, అంతకుమించి వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగిత రేటు (యూఆర్) ఆగస్టులో 5 శాతానికి దిగొచ్చింది. జూలైలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గింది. గతేడాది (2025) ఆగస్టులోనూ నిరుద్యోగిత రేటు 5.1 శాతంగానే నమోదైనట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీల్ఎల్ఎఫ్ఎస్) నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,70,160 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలవారీ బులెటిన్‌ను రూపొందించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు జూలైలోని 4.5 శాతం నుంచి ఆగస్టు నాటికి 4.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన అతి తక్కువ నిరుద్యోగిత రేటు ఇదే కావడం విశేషం. గతేడాది ఆగస్టులో నమోదైన 4.3 శాతంతో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువ. ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు జూలైలోని 6.7 శాతంతో పోలిస్తే ఆగస్టులో 6.8 శాతానికి స్వల్పంగా పెరిగింది. దేశంలో మొత్తం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) జూలైలోని 55.4 శాతం నుంచి ఆగస్టు నాటికి 55.6 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 58 శాతం నుంచి 58.2 శాతానికి పెరగ్గా, పట్టణాల్లో 50.4 శాతంతో యథాతథంగా ఉంది. గతేడాది ఆగస్టు (55%)తో పోలిస్తే మొత్తం ఎల్ఎఫ్పీఆర్ 0.6 శాతం వృద్ధి చెందింది. మహిళల లేబర్ ఫోర్స్ భాగస్వామ్యం వరుసగా రెండో నెలలోనూ పెరిగి 34.8 శాతానికి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యం జూలైలోని 38.8 శాతం నుంచి ఆగస్టులో 39.4 శాతానికి పెరగడం ఇందుకు తోడ్పడింది. ఏడాది క్రితం ఆగస్టులో ఉన్న 33.7 శాతంతో పోలిస్తే ఇది 1.1 శాతం మేర పుంజుకుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం (39.4%) గణనీయంగా పెరిగినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 25.4 శాతానికే పరిమితం కావడం గమనార్హం. -
భారత్‌లో ఫార్ములావన్ రేసు పునరుద్ధరణకు చర్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధ ఫార్ములావన్ (ఎఫ్1) కారు రేసింగ్‌ను మన దేశంలో తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రేసు పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ యుగల్ కిషోర్ జోషి అధ్యక్షత వహించనున్నారు. ఇందులో క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి కునాల్‌తో పాటు భారత మోటార్ స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు అరిందమ్ ఘోష్ కూడా ఉన్నారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) అధికారులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో చోటు దక్కింది. ‘దేశంలో మోటార్ స్పోర్ట్స్ పునరుద్ధరణలో ఎదురయ్యే సవాళ్లను ఇది క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా విధానపరమైన చర్యలు గుర్తిస్తుంది. పన్ను సంబంధిత సమస్యలతో పాటు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాల అవకాశాలను కూడి పరిశీలిస్తాము. 2028 నాటికి దేశంలో ఫార్ములావన్ రేసును మళ్లీ నిర్వహించడమే మా లక్ష్యం’అని మాండవీయ తెలిపారు.గ్రేటర్ నోయిడాలోని బుధ్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా మనదేశంలో చివరిసారిగా 2013లో ఫార్ములావన్ రేసు జరిగింది. ఆ తర్వాత పరిపాలన, పన్ను సంబంధిత సమస్యలతో రేసు నిలిచిపోయింది. గతేడాది ఎఫ్1 విడుదల చేసిన ప్రకటన ప్రకారం భారత దేశంలో దాదాపు 10 కోట్ల మంది మోటార్ స్పోర్ట్స్ క్రీడాభిమానులు ఉన్నప్పటికీ... ఎఫ్1 నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకుంది. మౌలిక సదుపాయాలు, భద్రతా వంటి పలు కోణాలను పరిశీలించిన తర్వాతే వేదిక ఖరారు చేయనున్నారు. -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
న్యూ–ఏజ్ ఎకానమీ @ రూ.25 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ క్యాపిటల్, డిజిటల్ ఆవిష్కరణల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న భారత ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ (కొత్త తరం ఆర్థిక వ్యవస్థ) వేగంగా విస్తరిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2030–31 (ఎఫ్వై31) నాటికి ఈ రంగం ఆదాయం మూడు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. ఇది ప్రస్తుత భారత ఐటీ పరిశ్రమ స్థాయికి చేరువ కానుంది. దేశీయ న్యూ–ఏజ్ కంపెనీల ఉమ్మడి ఆదాయం ఎఫ్వై22లో 33 బిలియన్ డాలర్ల నుంచి ఎఫ్వై26 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు) నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అక్కడి నుంచి ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్వై31 నాటికి 300 బిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. నివేదికలో మరిన్ని అంశాలు ....ఎఫ్ఎంసీజీ, రిటైల్, లీజర్ వంటి వినియోగ ఆధారిత రంగాలు ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ విస్తరణకు దోహదపడనున్నాయి. ఈ రంగాలు ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్వై31 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరతాయని రెడ్‌సీర్ అంచనా వేసింది. అంటే మొత్తం న్యూ–ఏజ్ ఎకానమీలో దాదాపు సగం వాటా ఈ రంగాలదే కానుంది. మరోవైపు టెక్నాలజీ, మీడియా, టెలికాం (టీఎంటీ), ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలు ఏటా 26 శాతం వృద్ధి చెందనున్నాయి. కంపెనీల కార్యాచరణ పనితీరు మెరుగవడంతో ఆర్థిక సంవత్సరం 2025లో ఈ రంగాలు మళ్లీ లాభాల్లోకి ప్రవేశించి, ఉమ్మడిగా 1.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశాయి. అయితే, ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగానిదే 140 శాతం వాటా కావడం విశేషం. బీఎఫ్ఎస్ఐని మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాలు కలిపినా ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది. డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) ఛానళ్లు, క్విక్ కామర్స్ వేగంగా విస్తరించడంతో వినియోగ వస్తువుల బ్రాండ్లు రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించే సమయం సగానికి తగ్గింది. 2016 నాటి బ్రాండ్లకు రూ. 100 కోట్ల ఆదాయం దాటడానికి 6.8 ఏళ్లు పడితే, 2020లో వచి్చన బ్రాండ్లు కేవలం 3.4 ఏళ్లలోనే ఈ మార్కును చేరుకున్నాయి.ఆర్థిక సంవత్సరం 2022లో రూ.100 కోట్లకు పైగా ఆదాయ ఉన్న బ్రాండ్ల సంఖ్య 90 ఉన్నాయి. ఇవి ఎఫ్వై 2026కి 230కి, ఎఫ్వై 2031 నాటికి 500కి పెరుగుతుందని రెడ్‌సీర్ అంచనా వేసింది. అయితే, ఆఫ్‌లైన్ నెట్వర్క్, నెట్వర్క్ మౌలిక సదుపాయిల సవాళ్ల కారణంగా రూ. 500 కోట్ల ఆదాయం దాటడం మాత్రం కంపెనీలకు ప్రధాన అడ్డంకిగా ఉంది. 2016 తర్వాత రూ. 100 కోట్లు దాటిన 110 బ్రాండ్లలో కేవలం 26 మాత్రమే రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి. -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క. అలాగని ఈ సమావేశాలు సమీప భవిష్యత్తులో బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించలేదు. అలాగే ఎడాపెడా సుంకాలు విధిస్తున్న అమెరికాను నిలదీయలేదు. పశ్చిమాసియా కల్లోలానికి నువ్వే కారణమని వేలెత్తి చూపలేదు. ఈ అంశాల్లో లౌక్యం ప్రదర్శిస్తూనే చేయదల్చుకున్నది చేయటంలో బ్రిక్స్ సఫలీకృతమైంది. ఇవి మాత్రమే కాదు... పరస్పరం కలహించుకుంటున్న ఇరాన్, దాని ప్రత్యర్థులు యూఏఈ, సౌదీలను సమావేశాలకు రప్పించగలిగింది. పైగా ఇరాన్, యూఏఈ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో విభేదాలున్న చైనా, ఫిలిప్పీన్స్ కూడా సదస్సుకు హాజరయ్యాయి. భారత్, చైనాల వివాదం సరేసరి. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల దేశాలన్నీ ఒక ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించటం చిన్న విషయం కాదు. అతిథేయ దేశంగా భారత్ ప్రత్యేక కృషి ఇందులో కనబడుతుంది. సభ్య దేశాలతో ఓపిగ్గా చర్చించాలి. ఒప్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్ ఆ పని చేయగలిగినందుకు అభినందించాలి.ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో దక్షిణార్ధ గోళ దేశాల స్వరం వినిపించటంలో ఏదోమేరకు కృషి చేసిన అలీనోద్యమ సంస్థతో బ్రిక్స్‌కు పోలికలున్నాయి. కానీ వాటిమధ్య వ్యత్యాసం కూడా ఉంది. అప్పటి ద్విధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా మనగలగటానికి అవసరమైన ఆర్థిక సంపత్తి అలీనోద్యమానికి లేదు. బ్రిక్స్ అలా కాదు. అందులో పూర్తి స్థాయి సభ్యత్వంగల 11 దేశాలను చూసినా వాటి ఉమ్మడి దేశీయోత్పత్తి (జీడీపీ) వాటా ప్రపంచ జీడీపీలో 40 శాతం. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. రష్యావద్ద అపారమైన చమురు నిక్షేపాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయి. మనతోసహా బ్రిక్స్ దేశాలన్నీ ఆర్థికంగా చురుగ్గా ఎదుగుతున్న దేశాలు. బ్రెజిల్ అయితే దక్షిణమెరికా ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దది. ఇవన్నీ సమష్టిగా దక్షిణార్ధ గోళ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాయి. ఇన్ని అనుకూలాంశాలున్నా అమెరికాపై నేరుగా ధిక్కార స్వరం వినిపించనప్పుడు ప్రయోజనమేమిటన్న సందేహం వస్తుంది. ఆ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలి. భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత మెరుగైన చోటీయాలని బ్రిక్స్ కోరుతోంది. కానీ అది అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే డిమాండ్‌గా మారకుండా సదస్సు జాగ్రత్తపడింది. డాలర్ వాడకాన్ని క్రమేపీ తగ్గించుకునే ప్రక్రియలోనూ అదే ఎత్తుగడ పాటించింది. ఆ దిశగా అడుగులేస్తే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయటానికి ముందే 2024 డిసెంబర్లో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ బెదిరింపుల్ని ఆయన అడపా దడపా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉనికిలో లేకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది మరి! అందుకే కావొచ్చు... ఆ విషయంలో బ్రిక్స్ సంయమనం పాటించింది. అది వేరే రూపంలో ఇప్పటికే అమలవుతోంది. చైనా, రష్యా 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లో జరుపుకొంటున్నాయి. రష్యా చమురు విక్రయాలకు మన దేశం రూపా యిల్లో చెల్లించింది. డాలర్ రద్దు చేయకుండానే దాని వాడకాన్ని తగ్గించటం బ్రిక్స్ దేశాలు ఎంచుకున్న పద్ధతి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 56.77 శాతం. యూరో కరెన్సీ వాటా 20.25 శాతం. చైనా కరెన్సీ రెన్మిన్బి(ఆర్ఎంబీ) వాటా కేవలం 1.95 శాతం. డాలర్ నిల్వలు పుష్కలంగా ఉన్న చైనా మరో కరెన్సీని వినియోగించాలనుకున్నా దానికే నష్టం. మనకూ ఆ సమస్యవున్నా, అమెరికా ఆధిపత్యం స్థానంలో చైనాను అంగీకరించటానికి సిద్ధపడలేం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వారివి. ఈ దశలో అస్పష్టతతోనైనా బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన వెలువరించటం దానికదే ఘన విజయం. -
లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి!
లండన్: భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి లండన్‌లోని థేమ్స్ నది వేదికైంది. యునైటెడ్ కింగ్డమ్లో తొలిసారిగా థేమ్స్ నదీ తీరంలో గంగా హారతి నిర్వహించారు. లండన్‌లోని గ్రీన్విచ్లో చారిత్రక ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ‘గంగా హారతి ఆన్ ద థేమ్స్: ఎ సెరిమనీ ఆఫ్ లైట్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ యూకే, వార్షిక ‘టోటల్లీ థేమ్స్’ ఉత్సవంతో కలిసి నిర్వహించింది.చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవంలో భాగంగా..1951లో స్థాపించిన చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ హారతిని నిర్వహించారు. వేదాంత జ్ఞానాన్ని, సామాజిక సేవను ప్రోత్సహించే ఆధ్యాత్మిక సంస్థగా చిన్మయ మిషన్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. వారణాసి, హరిద్వార్, రిషికేశ్‌లో గంగానది తీరంలో సాయంత్రం జరిగే హారతులను తలపించేలా థేమ్స్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారులు, భక్తులు సమన్వయంతో మంత్రోచ్ఛారణలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇత్తడి దీపాలతో హారతి ఇచ్చారు.చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపానంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆధ్యాత్మిక నాయకులు, బ్రిటన్‌లోని హిందూ సంస్థల ప్రతినిధులు, దక్షిణాసియా ప్రవాస సమాజానికి చెందిన పలువురు కూడా హాజరయ్యారు. గంగా నది భౌతిక అవసరాలను తీర్చడంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారానికి ప్రతీకగా నిలుస్తుందని చిన్మయ మిషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. థేమ్స్ నదిలో స్థానిక పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా హారతిని పూర్తిగా ఒడ్డునే నిర్వహించారు. నదిలోకి నూనె దీపాలు, పూలు, నైవేద్యాలు లేదా ఇతర పూజా సామగ్రిని వదలలేదు. కార్యక్రమం జరిగిన ప్రాంగణంలో ప్లాస్టిక్‌ను కూడా నిషేధించారు. పవిత్ర నదుల పట్ల సంప్రదాయ గౌరవాన్ని ఆధునిక పర్యావరణ బాధ్యతతో కలపడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. నెల రోజుల పాటు జరిగే ‘టోటల్లీ థేమ్స్’ ఉత్సవంలో భాగంగా తొలిసారి నిర్వహించిన గంగా హారతికి మంచి స్పందన రావడంతో.. ఇకపై లండన్ సాంస్కృతిక క్యాలెండర్లో దీనిని ఏటా నిర్వహించే కార్యక్రమంగా కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్ మరో దురాగతం: 26/11 నిందితుల ఫొటోలు మాయం? -
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలతో జలవిద్యుత్ మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో.. ఆ దేశానికి రోజుకు 18 గంటల చొప్పున విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ విద్యుత్ సరఫరా కొనసాగనుంది. గరిష్ఠంగా 654 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌కు అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.ఇటీవలి వరదల కారణంగా నేపాల్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. సుమారు 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అంచనా. దీంతో దేశీయ విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు, భారత్‌కు నేపాల్ నుంచి జరిగే విద్యుత్ ఎగుమతులు కూడా సుమారు 400 మెగావాట్ల మేర తగ్గాయి.ఈ పరిస్థితుల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలని నేపాల్ కోరింది. ఆ అభ్యర్థనను భారత్ ఆమోదించింది. రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందులో గరిష్ఠంగా 600 మెగావాట్ల విద్యుత్‌ను ముజఫర్‌పూర్-ఢల్కేబర్ 400 కేవీ ప్రసార మార్గం ద్వారా, మరో 54 మెగావాట్లను టనక్పూర్-మహేంద్రనగర్ 132 కేవీ మార్గం ద్వారా అందించనున్నారు.ఈ సరఫరా సమయం ప్రధానంగా పగటి వేళల్లో ఉండేలా నిర్ణయించారు. భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రెండు దేశాల విద్యుత్ వ్యవస్థలకు ప్రయోజనం కలిగేలా ఈ ఏర్పాటును రూపొందించారు. నేపాల్‌లో జలవిద్యుత్ రంగం దేశ విద్యుత్ అవసరాల్లో అత్యంత కీలకమైనది కావడంతో వరదల ప్రభావం అక్కడి విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడింది.డిసెంబర్లో ఈ ఏర్పాటును మరోసారి సమీక్షించనున్నారు. అవసరాన్ని బట్టి 2027 జనవరిలో కూడా సరఫరాను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, భారత్-నేపాల్ మధ్య ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. -
మీ డాక్టర్ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్?
ఒకే ప్రిస్క్రిప్షన్‌లో ఎక్కువ మందులు రాయడం ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మరోసారి మొదలైంది. తాజా అధ్యయనం ప్రకారం పాకిస్థాన్‌లో ఆసుపత్రుల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 4.2 మందులు సూచిస్తున్నట్లు తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే సగటు 1.6 నుంచి 1.8 మందులతో పోలిస్తే చాలా ఎక్కువ.ఇస్లామాబాద్‌లోని హెల్త్ సర్వీసెస్ అకాడమీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ‘డిస్కవర్ పబ్లిక్ హెల్త్’ పత్రికలో ప్రచురితమైంది. పేషావర్‌లోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 10.56 మందులు సూచించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ప్రతి 4 మందుల్లో కేవలం ఒక మందును మాత్రమే జనరిక్ పేరుతో సూచించినట్లు తేలింది.భారత్‌లో.. భారత్‌లోనూ పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదని అందుబాటులో ఉన్న అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, భారతదేశంలో ఔట్‌పేషెంట్ ప్రిస్క్రిప్షన్లపై జరిగిన వివిధ అధ్యయనాల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 2.2 నుంచి 3.9 మందులు సూచించినట్లు నమోదైంది. ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే పరిధి కంటే ఎక్కువ.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్కో ప్రిస్క్రిప్షన్‌లో సగటున 1.6 నుంచి 1.8 మందులు ఉండటం, సాధ్యమైనంత వరకు జనరిక్ పేర్లతో మందులు సూచించడం, అవసరమైనప్పుడే యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు ఉపయోగించడం వంటి అంశాలు ముఖ్యమైనవి.అయితే ప్రతి సందర్భంలో రెండు కంటే ఎక్కువ మందులు రాయడం తప్పు కాదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి పలు సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు, అలాగే క్షయ, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి కొన్ని వ్యాధుల్లో ఒకటి కంటే ఎక్కువ మందులు అవసరం కావచ్చు.అవసరం లేకుండా ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు, ఒక మందు మరో మందుతో ప్రతిక్రియ చెందే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వైద్యులు ఎక్కువ మందులు సూచించినప్పుడు వాటి అవసరం, వాడాల్సిన కాలం గురించి వారిని అడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
కోట్లాది మందికి నేపాల్ వరదల తరహా ముప్పు
హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే మరింత వేగంగా కరుగుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ ప్రాంతం కీలకమైన మలుపు దిశగా వెళ్తోందని, శతాబ్దం మధ్య నాటికి గరిష్ఠ నీటి ప్రవాహ దశకు చేరుకున్న తర్వాత నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల కోట్లాది మంది ప్రజల తాగునీరు, వ్యవసాయం, జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.అధ్యయనం ప్రకారం హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో ఇటీవలి దశాబ్దాల్లో హిమనీనదాల ద్రవ్యరాశి వేగంగా తగ్గుతోంది. ఈ విస్తారమైన పర్వత వ్యవస్థ అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 40,000 హిమనదాలు ఉన్నప్పటికీ భూమిపై కేవలం 21 హిమనదాలనే పర్యవేక్షిస్తున్నారని అధ్యయనం తెలిపింది.భారత్‌లో దాదాపు 200 హిమనీనద సరస్సులను అధిక ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వాటిలో 56 అత్యంత అధిక ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. హిమనీనదాలు వెనక్కి తగ్గడంతో వాటి వెనుక అస్థిరమైన సరస్సులు ఏర్పడుతున్నాయని, అవి ఎప్పుడైనా విరిగి దిగువ ప్రాంతాల్లో భారీ వరదలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆగస్టు చివరలో నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమనీనదం అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల లోయల్లో వరుసగా కొండచరియలు, వరదలు సంభవించిన ఘటనను అధ్యయనం ప్రస్తావించింది. నేపాల్, చైనా-టిబెట్ ప్రాంతాల్లో ఈ ఘటనలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు, 5,300 మందికి పైగా గల్లంతైనట్లు పేర్కొంది.హిమాలయ ప్రాంతం భారత భూభాగంలో సుమారు 18 శాతం ఉన్నప్పటికీ, ప్రకృతి విపత్తుల్లో దాని వాటా దాదాపు 35 శాతంగా ఉందని అధ్యయనం తెలిపింది. హిమనీనదాల కరుగుదలతో వరదలు, కొండచరియలు, కరువులు పెరిగే అవకాశం ఉందని, వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోజువారీ నీటి అవసరాలు ప్రభావితమవుతాయని పేర్కొంది.హిమనదాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రమాదకర సరస్సులను పరిశీలించడం, స్థానిక ప్రజలను విపత్తులకు సిద్ధం చేయడం కీలకంగా మారనుంది. -
లవర్ కోసం రూ.కోట్ల ఖర్చు.. బ్రేకప్ అయ్యాక తిరిగివ్వాలని కేసు
భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త, టీసీఐ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్ తన మాజీ ప్రేయసి ఫెలిషియా లీ నుంచి సుమారు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలంటూ దాఖలు చేసిన కేసును సింగపూర్ హైకోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం రుణంగా ఇచ్చినట్లు నిరూపించే ఆధారాలు లేవని, ఎక్కువ భాగం ఖర్చులు బహుమతులేనని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మాజీ ప్రేయసి న్యాయ ఖర్చులను కూడా చందర్ చెల్లించాలని ఆదేశించింది.చందర్, ఫెలిషియా లీ తొలిసారి 2019లో విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం కొనసాగింది. 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే అంతకుముందు నుంచే చందర్ ఆమె కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని కోర్టులో వెల్లడైంది.లూయీ విట్టాన్ హ్యాండ్‌బ్యాగ్, ప్రాడా వోచర్లు, ఆపిల్ హెర్మిస్ గడియారాలు వంటి ఖరీదైన వస్తువులను ఆయన కొనిచ్చారు. బార్సిలోనా, లిస్బన్, లండన్ పర్యటనలకు సంబంధించిన విమానాలు, హోటళ్లు, షాపింగ్ ఖర్చులను కూడా భరించారు. 2023 డిసెంబర్లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మార్చి 2024లో చందర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి 4,68,090 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇవి బహుమతులు కాదని, వడ్డీ లేని రుణంగా ఇచ్చిన డబ్బు అని ఆయన వాదించారు.అయితే లీ ఆ వాదనను తిరస్కరించారు. సంబంధం కొనసాగిన సమయంలో తనపై చేసిన ఖర్చులన్నీ స్వచ్ఛందంగా ఇచ్చిన బహుమతులేనని, విడిపోయిన తర్వాత తిరిగి చెల్లించాలనే ఒప్పందం ఎప్పుడూ లేదని తెలిపారు. రుణంగా ఇచ్చినట్లు నిరూపించే స్పష్టమైన ఒప్పందం లేదా ఆధారాలు కూడా కోర్టుకు లభించలేదు. సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పులో కోర్టు చందర్ వాదనను తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో ముందుకు వచ్చే అంశం న్యాయస్థానం ఆదేశించిన న్యాయ ఖర్చుల చెల్లింపే. -
అప్పు అడగడం కోసం పాకిస్థాన్ సంచలన ఎత్తుగడ
ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ అప్పుకోసం చేయని ప్రయత్నాలు లేవు. నిజాలను దాచిపెట్టి, మోసం చేసి, పన్నాగాలు పన్నయినా సరే అప్పులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అక్టోబర్‌లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై రూ.70 లక్షల నజరానా ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చింది.ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్యను కేవలం చూపించడానికి చేసిన చర్యగా పలువురు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.గతంలోనూ ఇలాంటి ప్రకటన మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్ గతంలోనూ ఇలాంటి ప్రకటన చేసింది. 2021లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల సమయంలో, మసూద్ అజర్‌పై చర్యల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు అతడు పాకిస్థాన్ నుంచి అదృశ్యమై అఫ్గానిస్థాన్‌కు వెళ్లినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అదే ఏడాది ఎఫ్ఐఏ అతడిపై రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పుడు ఐదు ఏళ్ల తర్వాత విడుదలైన కొత్త రెడ్ బుక్‌లో ఆ మొత్తాన్ని రూ.70 లక్షలకు పెంచింది.మసూద్ అజర్ పాకిస్థాన్‌లో లేడని, అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడని పాకిస్థాన్ పదేపదే చెబుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అతడిపై నజరానా పెంచుతూ ప్రకటన చేయడం ఆ దేశ చర్యపై సందేహాలకు దారితీస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉగ్ర కార్యకలాపాలతో మసూద్ అజర్ పేరు ముడిపడి ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం బహావల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చర్య చేపట్టింది.అక్టోబర్ ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి నెలకొంది. మసూద్ అజర్‌ను పట్టుకునేందుకు ఇది నిజమైన ప్రయత్నమా.. లేక ఎఫ్ఏటీఎఫ్ ముందు చర్యలు తీసుకున్నట్లు చూపించే ప్రయత్నమా అన్నది తదుపరి పరిణామాల్లో తేలనుంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో పాక్ పేరు ఉంటే అప్పులు, పెట్టుబడులపై ప్రభావం పడొచ్చు. అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారులు దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో నిధులు సమకూర్చుకోవడం కష్టతరం. -
ఆసియా కప్ మనదే.. ప్రపంచకప్ బెర్తు ఖరారు
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్-2026 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలిచింది. సౌత్ కొరియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్మోల్ ఎక్కా బృందం.. 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టైటిల్‌ను నిలబెట్టుకున్న భారత జట్టు.. వరుసగా నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన ఘనత సాధించింది. మొత్తంగా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. సెమీస్‌లో మలేషియాపై గెలుపుయూత్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో భారత జట్టు.. ఆసియా కప్ గ్రూప్ దశలో మూడు గెలిచి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. తద్వారా టాపర్‌గా నిలిచింది. ఇక సెమీ ఫైనల్లో మలేషియాను 3-1 గోల్స్ తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్లో సౌత్ కొరియాతో తలపడింది. చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఆధిపత్యం కనబరిచిన భారత జట్టు.. ప్రత్యర్థిని 4-1 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా టైటిల్ గెలవడంతో పాటు.. జూనియర్ హాకీ ప్రపంచప్ బెర్తును ఖరారు చేసుకుంది. గోల్స్ కొట్టింది వీరేభారత్ తరఫున అజిత్ యాదవ్ తొమ్మిదో నిమిషంలో.. అన్మోల్ ఎక్కా 13వ నిమిషంలో.. ప్రభ్‌దీప్ సింగ్ 21వ నిమిషంలో.. అషూ మౌర్య 50వ నిమిషంలో గోల్స్ కొట్టారు. సౌత్ కొరియా తరఫున లీ మిన్హెయోక్ (54వ నిమిషం)లో ఏకైక గోల్ కొట్టాడు. అంతకు ముందు మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు.. చైనాపై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఫైనల్లో భారత జట్టుహర్పాల్, సంజిత్ టిర్కీ, సుఖ్విందర్, ప్రభ్‌దీప్ సింగ్, ఆర్యన్ ఎక్స్, వివేక్ లక్రా (గోల్ కీపర్), అజిత్ యాదవ్, జీత్పాల్, అన్మోల్ ఎక్కా (కెప్టెన్), అషూ మౌర్య, అద్రోహిత్ ఎక్కా.సబ్స్టిట్యూట్స్చిరాగ్, గుర్సేవక్ సింగ్, రోహిత్ కుల్లు, మన్మీత్ సింగ్ రాయ్, లవ్‌నూర్ సింగ్, కునాల్ తెవాటియా, అర్జున్ సంతోష్ హర్గూడే.చదవండి: పిల్లాడి చేష్టలు.. మా మధ్య మంచి అనుబంధం: సంజీవ్ గోయెంకా -
ఆసియా కప్ విజేతగా భారత్
జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది.పాక్‌ను మట్టికరిపించికాగా గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను 19-0తో మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ఫైనల్లో 5-1 గోల్స్ తేడాతో గెలిచిన భారత్.. సెమీ ఫైనల్లో చైనాతో తలపడింది.ఏకైక గోల్ ఎవరిదంటే?మోకీలో జరిగిన టైటిల్ పోరులో సనికా చంద్రకాంత్ పదిహేడో నిమిషంలో గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. ఈ క్రమంలో ఆధిక్యంలో వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత చైనాకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా నిలువరించింది. తద్వారా 1-0 తేడాతో గెలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది.ఇక ఈ విజయంతో భారత మహిళల జూనియర్ జట్టు.. ప్రపంచకప్-2027 టోర్నీకి అర్హత సాధించింది. ఇక భారత్‌తో పాటు పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన చైనా, జపాన్, సౌత్ కొరియా కూడా వరల్డ్‌కప్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. 2023, 2024 సీజన్లలో ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. తాజాగా జరిగిన ఎడిషన్‌లోనూ పతకాన్ని కైవసం చేసుకుంది. నజరానామహిళల జూనియర్ హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతీ ప్లేయర్‌కు రూ. 3 లక్షల చొప్పున.. కోచింగ్, సహాయక సిబ్బందికి రూ. 1.5 లక్షల చొప్పున రివార్డు అందజేయనుంది.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు.. సంజీవ్ గోయెంకా కామెంట్లు వైరల్ 𝗧𝗛𝗘 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗜𝗧 𝗔𝗟𝗟 𝗦𝗜𝗡𝗞𝗦 𝗜𝗡. 🇮🇳🏆From tears to laughter, hugs to unforgettable celebrations, the Indian Junior Women’s Team let it all out after being crowned AHF Junior Asia Cup 2026 champions! 🥇💙#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/NC2OR6Se9k— Hockey India (@TheHockeyIndia) September 13, 2026 -
లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిర్గతం చేశారు.ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు -
మాది అత్యంత పారదర్శక పద్ధతి: సీఈసీ
అహ్మదాబాద్: భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో మొదలుపెట్టి ఓట్ల లెక్కింపు వరకూ ప్రతిదశలోనూ ధ్రువీకరణ జరుగుతూండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీ అటల్ కలామ్ హాల్లో శుక్రవారం బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రతిదశలోనూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిరంతరం ధ్రువీకరణ చేస్తూంటారు కాబట్టి ఇది అత్యంత పారదర్శక ఎన్నికల విధానమని స్పష్టం చేశారు. -
భారత్ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్‌ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్‌లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్‌లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్‌లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్‌కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్‌లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్‌టెక్ స్టార్టప్‌ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్‌ను సందర్శించి డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్‌టెక్ స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్‌లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు. -
జకీర్ నాయక్ అప్పగింతపై చర్చలు..: మలేషియా ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే అంశం న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జకీర్ నాయక్ అప్పగింత అంశంపై చర్చలు జరిగాయని అన్వర్ ఇబ్రహీం జాతీయ మీడియాకు వెల్లడించారు.ఈ అంశంపై చర్చలను ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గోప్యంగా ఉంచామని ఆయన చెప్పారు. భారత్, మలేషియా మధ్య విశ్వాసం, సంబంధాలను బలోపేతం చేసే అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అప్పగింతకు సంబంధించిన డిమాండ్‌పై కొంత అవగాహన ఉందని, అయితే చట్టబద్ధమైన విధానాన్ని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్వర్ ఇబ్రహీం చెప్పారు.జాకీర్ నాయక్ 2016లో భారత్‌లో ఆయనపై, ఆయనకు సంబంధించిన సంస్థలపై దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మలేషియాకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన మలేషియాలో శాశ్వత నివాస హోదాతో ఉంటున్నారు. భారత్‌లో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. భారత్ ఆయనను అప్పగించాలని అధికారికంగా కోరింది. అయితే విశ్వసనీయమైన ఆధారాలు సమర్పిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని మలేషియా చెబుతోంది. -
అంతర్జాతీయ ఖ్యాతి.. అద్భుత ఆకృతి
ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.భరత మండపం నిర్మాణంప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.నటరాజ విగ్రహం ప్రత్యేకతఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.భారత్ మండపంలో వివిధ హాళ్లు150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.కట్టుదిట్టమైన భద్రతభారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్‌లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్‌లో ఉన్న ముఖాలను క్రౌడ్‌లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
భారత్‌కు కీలక దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్కుఆమోదం
భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేళ భారత్‌కు దౌత్య పరంగా కీలక విజయం లభించింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ *"న్యూఢిల్లీ డిక్లరేషన్"*కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. గతంలో పశ్చిమాసియా యుద్ధంపై విభేదాల కారణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోయినా, ఈసారి నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వెలువడనుంది.న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత ప్రధాన సందేశంగా "సంభాషణ (Dialogue), దౌత్యం (Diplomacy) ద్వారానే వివాదాలకు పరిష్కారం" అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో ఇదే భారత్ నిరంతరం చెబుతున్న వైఖరిని ప్రధాని మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధాన అంశాలుఅంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కంటే చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గమని స్పష్టం.ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ దానికి ఎలాంటి సమర్థన ఉండదని పునరుద్ఘాటింపు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలకు మద్దతు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్.వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం.బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్–యూఏఈ వంటి విభేదాలున్న దేశాలను ఒకే ప్రకటనపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. అయినప్పటికీ ఈ పరీక్షలో సభ్యదేశాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడం దౌత్య పరంగా భారత్‌కు కీలక విజయం.బ్రిక్స్ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో కూడిన ఉమ్మడి ప్రకటన అధికారికంగా విడుదల కానుంది. ఇందులో భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థ బలోపేతంపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. -
భారత్‌కు డబుల్ టెన్షన్.. హౌతీల చర్యతో మరో సంక్షోభం!
ఒకవైపు హార్ముజ్ జలసంధి.. మరోవైపు బాబ్ ఎల్-మండేబ్! ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన రెండు సముద్ర ద్వారాలపైనా ముప్పు పెరగడంతో భారత్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. యెమెన్ తీరంలో కేవలం 18 గంటల్లో హౌతీలు చేపట్టిన మెరుపు దాడులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని బాబ్ ఎల్-మండేబ్పైకి మళ్లించాయి. ఈ కీలక జలసంధిపై హౌతీలు పట్టు సాధించారు. దీంతో, గల్ఫ్ చమురు సరఫరాల నుంచి భారత్-యూరప్ వాణిజ్యం వరకు దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ సంక్షోభంతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి ఎదురవుతున్న వేళ.. మరో సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడటం భారత్‌కు డబుల్ షాక్‌గా మారే అవకాశముంది.బాబ్ ఎల్-మండేబ్ ఎందుకంత కీలకం?యెమెన్, జిబౌటీ మధ్య ఉన్న బాబ్ ఎల్-మండేబ్ సుమారు 29 కిలోమీటర్ల వెడల్పు గల కీలక జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆపై అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ మార్గం.. సూయజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియా మధ్య సముద్ర వాణిజ్యానికి ప్రధాన ద్వారం. చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రవాణా అవుతాయి. భారత్‌కు ఈ మార్గం మరింత కీలకం. దేశం నుంచి యూరప్‌కు డీజిల్, ఏవియేషన్ ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు, యంత్ర పరికరాలు సహా అనేక ఉత్పత్తులు సూయజ్ మార్గం మీదుగా వెళ్తాయి. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే భారత ఎగుమతుల రవాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.హౌతీల మెరుపు దాడులుతాజా పరిణామాల్లో హౌతీలు యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో వేగంగా ముందుకు సాగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించగా.. బాబ్ ఎల్-మండేబ్‌లో కీలక స్థానంలో ఉన్న మయూన్ (పెరిమ్) ద్వీపం కూడా హౌతీల ఆధీనంలోకి వెళ్లినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జుకర్, హనిష్ దీవుల వైపునకు కూడా వారు చేరుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ పరిణామాలతో బాబ్ ఎల్-మండేబ్ ప్రవేశ మార్గాలపై హౌతీల నియంత్రణ పెరిగింది. హౌతీ నేతలు ఇప్పటికే ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించారు.మూసుకుపోతే ఏం జరుగుతుంది?బాబ్ ఎల్-మండేబ్‌లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే.. షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని దాటేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సముద్ర బీమా ప్రీమియాలు పెరగడం, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లడం అనివార్యంగా మారొచ్చు. 2023లో హౌతీల దాడుల సమయంలోనే దీనికి ఉదాహరణ కనిపించింది. వందలాది కాదు.. వేలాది నౌకలు సూయజ్ కాలువ మార్గాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.Houthis chant in celebration on the captured Bab el-Mandeb coastMany take a break to cool off with a dip https://t.co/yZxW5lL1pn pic.twitter.com/E3GPN3iO0C— RT (@RT_com) September 11, 2026భారత్‌పై డబుల్ ఎఫెక్ట్?బాబ్ ఎల్-మండేబ్ సంక్షోభం భారత్‌ను రెండు వైపులా దెబ్బతీసే అవకాశం ఉంది. మొదటిది.. ఇంధన ధరలు. సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడితే చమురు సరఫరాలపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఇది భారత్‌కు భారంగా మారొచ్చు.రెండోది.. ఎగుమతులు. భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే సరుకులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు ముంబై నుంచి రోటర్‌డామ్‌కు సూయజ్ మార్గంలో దాదాపు 15,700 కిలోమీటర్ల దూరం ఉండగా.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్లాల్సి వస్తే దాదాపు 23,000 కిలోమీటర్లకు చేరుతుంది. అంటే అదనపు ఇంధనం, ఎక్కువ సమయం, అధిక బీమా, పెరిగిన ఫ్రైట్ ఛార్జీలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే బాబ్ ఎల్-మండేబ్ ఇప్పుడు యెమెన్ తీరంలోని ఓ చిన్న జలసంధి మాత్రమే కాదు.. భారత్ ఇంధన భద్రత, యూరప్ వాణిజ్యం, ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థకు కీలక పరీక్షగా మారింది.ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అథితులు -
డ్రాగన్–ఎలిఫెంట్ నృత్యం... వినోద క్రీడేనా?
డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.దగ్గరకు చేర్చిన అమెరికాకమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో చేరింది. 2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.సంబంధాల్లో ముల్లుకానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది. అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-జయసూర్య -
‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్‌కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్‌కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్‌కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్‌లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్‌కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్‌లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్‌లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్‌కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్‌తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్‌లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్‌కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్‌కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. హర్ముజ్ సహా కీలకమైన సముద్ర మార్గాల్లో వరుస దాడులు, చమురు రవాణాకు అంతరాయాల భయాలు మార్కెట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6 శాతానికి పైగా ఎగబాకిన ధరలు.. శుక్రవారం కూడా పైపైకి కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది. అంటే 110 డాలర్ల మార్క్‌కు అత్యంత చేరువలో ఉంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరింది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా వారాన్ని 100 డాలర్లకు పైన ముగించే దిశగా సాగుతున్నాయి.పశ్చిమాసియాలో ఇటీవలి కాలంలో మళ్లీ తీవ్రత పెరిగిన పోరుతో చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రెంట్, WTI ధరలు రెండూ 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత ప్రాతిపదికన చూస్తే రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినప్పటికీ.. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ రెండూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చన్న అంచనాలు పెరిగాయి.హర్ముజ్ నుంచి ఎర్ర సముద్రం వరకు..ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి. మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్ర మార్గంపై కొత్త ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్ 10న ఒమన్ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఇరాన్ సమీప సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, అనంతరం ఇరాన్ పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీల దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిడిల్ఈస్ట్ నుంచి చమురు సరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.చైనా కొనుగోళ్లతో మరింత మంట..సరఫరా ఆందోళనలకు తోడు డిమాండ్ వైపు పరిణామాలు కూడా క్రూడాయిల్ ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు అయిన చైనా ఇటీవలి వారాల్లో కొనుగోళ్లను పెంచింది. చైనా ఇదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తే.. సరఫరా అంతరాయాల ప్రభావం మరింత పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే సరఫరాపై ఉన్న ఒత్తిడికి ఇది మరింత తోడైంది.క్రూడాయిల్ అంటే.. భూమి నుంచి వెలికితీసే ముడిచమురు. దీన్ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఎల్పీజీతో పాటు ప్లాస్టిక్, పెయింట్లు, రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలను సాధారణంగా బ్యారెల్‌కు లెక్కిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగితే.. దాని ప్రభావం ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.భారత్‌పై ప్రభావం..క్రూడాయిల్ ధరలు ఇలా భారీగా పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తే రవాణా ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకుల ధరలపై పడొచ్చు. దీంతో క్రూడాయిల్ ర్యాలీ భారత్‌లో ద్రవ్యోల్బణ ఆందోళనలను కూడా పెంచే అవకాశం ఉంది.120 డాలర్లకు చేరుతుందా?ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రెంట్ ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 శాతం పెరిగింది. యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ స్థాయి 126 డాలర్లతో పోలిస్తే(ఏప్రిల్ 30న).. ప్రస్తుత ధరలు కూడా ఆ స్థాయికి చేరువలోనే ఉన్నాయి.అయితే ధరల ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రధానంగా యుద్ధ తీవ్రత, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పరిస్థితులు, చైనా కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, ఆ తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సందేహాలను పెంచుతున్నాయి.ఇదీ చదవండి: భారత్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ లెక్క తెలుసా? -
బంగ్లా చిత్తు చిత్తు.. ఫైనల్స్ కు భారత్
-
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
వాషింగ్టన్: భారత్ వద్ద 190 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్ఏఎస్)అనే లాభాపేక్షలేని ఓ సంస్థ ఇందుకు సంబంధించిన ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహాల చిత్రాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వివరించింది. ‘భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్య ప్రయోగ వాహనాల అమరిక, వ్యూహాలకు సంబంధించిన బహిరంగ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన 30 అదనపు వార్హెడ్లు సహా సుమారు 190 అణు వార్హెడ్లను తయారు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఇందులో వాడకంలో ఉన్న ప్రయోగ వేదికల కోసం 160కి పైగా వార్హెడ్లు కూడా ఉన్నాయి’అని ’ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ –2026’ పేరుతో ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఆ నివేదికలో పేర్కొన్నారు.‘భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది. ఇటీవలి కాలంలో అనేక కొత్త ఆయుధ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు, భూమి, గగనతలం నుంచి ప్రయోగించే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఇంకొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి’అని క్రిస్టెన్సన్ తెలిపారు. భారత్ 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా సైనిక అవసరాల ప్లుటోనియంను సిద్ధం చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిల్వలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే, 1998లో పొఖ్రాన్–2 ఆపరేషన్‌లో భాగంగా అణు పరీక్షలు చేపట్టిన భారత్..శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించడంతోపాటు అందుకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 2026 ఆరంభం నాటికి భారత్ వద్ద 730 కిలోల (సుమారు 170 కిలోలు అటూఇటుగా) అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలున్నట్లు ’ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్’ అంచనా వేసినట్లు కూడా క్రిస్టెన్సన్ ఉటంకించారు. -
రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు. షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది. భారత్ బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది. నేడే పుతిన్ రాక రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్‌తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. జిన్‌పింగ్, మోదీ ప్రత్యేక భేటీ! ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్‌పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్‌పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్‌కు అంతా సిద్ధం: మోదీ బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు. -
కడలిని చిలికి.. కలలను వెలికి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, అపారమైన వనరులకు నిలయమైన కడలి గర్భంలో దాగి ఉన్న విశేషాలతోపాటు వాతావరణ గుట్టును విప్పేందుకు భారతదేశం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఒక ‘ఫ్లోటింగ్ రీసెర్చ్ స్టేషన్’ లాంటి భారీ పరిశోధన నౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.840 కోట్ల అంచనా వ్యయంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) ఈ వెసల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్సీపీవోఆర్) అవసరాల కోసం కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పరిశోధన నౌక ‘సాగర్ మంథన్’ రెండు రోజుల క్రితం జలప్రవేశం చేసి సాగర మథనానికి సిద్ధమైంది. కదిలే ప్రయోగశాల సాగర్ మంథన్.. కేవలం సముద్రంపై ప్రయాణించే నౌక మాత్రమే కాదు.. శాస్త్రీయ హంగులు ఉన్న కదిలే ప్రయోగశాల. సముద్రంలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు, ఆన్–బోర్డ్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా శాస్త్రవేత్తలకు ఇందులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించారు. యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు పరిశోధనలపై శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ ఫ్లోటింగ్ రీసెర్చ్ వెసల్ ప్రధాన వేదిక కానుంది. 6 కిలోమీటర్ల లోతు వరకు సర్వేలు సముద్ర గర్భంలో ఏకంగా 6 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లి కచ్చితమైన సర్వేలు చేయగల సామర్థ్యం సాగర్ మంథన్ సొంతం. అండర్‌వే స్వాత్ మలీ్టబీమ్, జియోఫిజికల్ సిస్మిక్ సర్వేల ద్వారా భూమి కింది పొరల్లోని వనరులను, భౌగోళిక పరిస్థితులను సులువుగా గుర్తిస్తుంది. సముద్రపు నీటి వాహకత, ఉష్ణోగ్రత, లోతు వంటి కీలక అంశాలను కచ్చితంగా అంచనా వేస్తుంది. అత్యాధునిక వలలను ఉపయోగించి వివిధ లోతుల్లోని నీటి నమూనాలను, జీవ నమూనాలను ఏకకాలంలో సేకరించడంలో ఈ నౌక సామర్థ్యం అది్వతీయమనే చెప్పవచ్చు.వాతావరణం గుట్టు విప్పేలా.. కోరర్స్, గ్రాబ్స్, చైన్ బ్యాగ్ డ్రెడ్జ్ల ద్వారా సముద్ర గర్భం నుంచి మట్టి, రాళ్ల నమూనాలను సాగర్ మంథన్ నౌక సేకరిస్తుంది. ఉపరితల వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాల వేగాన్ని కొలవడం, ఎగువ వాతావరణ డేటాను నిక్షిప్తం చేయడం వంటి కీలక పనులను ఈ ఫ్లోటింగ్ స్టేషన్ షిప్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తీరప్రాంతాలతో పాటు డీప్సీ మూరింగ్, డేటా బుయ్ ఆపరేషన్స్ చేపట్టడంలో దేశంలో ఇది అత్యంత కీలకంగా మారనుంది. అనేక రికార్డులు సొంతం దీనిని రికార్డు వేగంతో నిర్మించారు. నౌక కీల్ వేసిన కేవలం 5 నెలల వ్యవధిలోనే ఇంత భారీ ప్రాజెక్టును జల ప్రవేశం చేయించడం ఓ రికార్డు. 89.50 మీటర్ల పొడవు, 18.80 మీటర్ల వెడల్పు, 5,900 టన్నుల బరువైన ఈ నౌక.. గరిష్టంగా గంటకు 14 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. దేశీయంగా నౌకానిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు, పెరుగుతున్న మన ఇంజినీరింగ్ సామర్థ్యానికి ‘సాగర్ మంథన్’ నిలువెత్తు నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 75 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ వెసల్.. సముద్ర పరిశోధన రంగంలో స్వయం సమృద్ధిని చాటుతోంది. -
ఏఐ... పైనే ఐ.. పెట్టుబడులు రెట్టింపై..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భారత్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న పలు సంస్థలు ఏఐపై తమ పెట్టుబడులను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన సర్వీస్‌నౌ ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్–2026 ప్రకారం, వ్యాపారసంస్థల ఏఐ పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయి, ఇది ప్రపంచ సగటు అయిన 110% కన్నా కూడా ఎక్కువ కావడం విశేషం. 2027 నాటికి సగటు ఐటీ బడ్జెట్లో ఐదోవంతు కంటే ఎక్కువ వాటా ఏఐ మీదే ఉంటుందని అంచనా. నిర్వహణ సంగతేంటి? ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అపారమైన ఇంజనీరింగ్ ప్రతిభతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎంటర్ప్రైజ్ ఏఐని స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, తదుపరి దశ అనేది సంస్థలు ఏఐని ఎంత వేగంగా అమలు చేస్తాయనే దానిపై కాకుండా, దానిని ఎంత విశ్వాసంతో నిర్వహించగలవనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, కేవలం 22% భారతీయ సంస్థలు మాత్రమే ఏఐ పరీక్ష, ఆడిటింగ్, రిస్్క–అసెస్మెంట్ ప్రక్రియలను అమలు చేయగలుగుతున్నాయని సర్వీస్ నౌ తేల్చింది. ఏఐకి సంబంధించిన ప్రధాన అవరోధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాన్ని 60 శాతం మంది పేర్కొన్నారు. అలాగే 55% మంది నియంత్రణ, నిబంధనల పాటింపులో ఉన్న సంక్లిష్టతను, మరో 50 శాతం మంది డేటా గోప్యత, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తపరిచారు. ప్రస్తుత దేశ సగటు ఐటీ బడ్జెట్లో ఏఐ వాటా 16.6% కాగా, 2027 నాటికి ఇది 21.3 శాతానికి పెరుగుతుందని అంచనా. కొన్ని అంతరాలను పూడ్చడం ద్వారా ప్రస్తుతం 55 శాతంగా ఉన్న భారత్ ఏఐ గవర్నెన్స్ స్కోర్‌ను ఏఐ అగ్రగామి దేశాల స్థాయికి తీసుకెళ్లవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
భారత జట్టు సాధన మొదలు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. జింబాబ్వేపై 3–0తో సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా బరిలోకి దిగుతున్న టి20 సిరీస్ ఇదే. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. ఈ ముగ్గురు మ్యాచ్ ఫిట్‌గా ఉన్నారని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నిర్ధారించింది. భారత జట్టులోని 10 మంది సభ్యులు గురువారం సుదీర్ఘ సమయం పాటు సాధనలో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నెట్ బౌలర్ల సహాయంతో సుందర్ బ్యాటింగ్ కూడా చేశాడు. ఇతర నెట్స్‌లో అక్షర్, బిష్ణోయ్‌ల బౌలింగ్‌లో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ దూకుడైన షాట్లు ఆడుతూ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. బుమ్రా, నితీశ్ శుక్రవారం జట్టుతో చేరతారు. పేస్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈ సెషన్‌కు గైర్హాజరయ్యాడు. భారత్‌లో అతని వర్కింగ్ వీసా గడువు ముగిసిందని, దక్షిణాఫ్రికాకు వెళ్లి రెన్యువల్ చేయించుకున్న తర్వాత తిరిగి వస్తాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి.హర్షిత్ స్థానంలో యశ్ ఠాకూర్... కండరాల గాయంతో భారత జట్టుకు దూరమైన పేసర్ హర్షిత్ రాణా కోలుకోలేదు. సీఓఈలో రీహాబిలిటేషన్‌లో ఉన్న అతనికి ఇప్పుడు కొత్తగా మరో గాయమైంది. దాంతో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలకు కూడా హర్షిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో యశ్ ఠాకూర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల జింబాబ్వేతో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఠాకూర్ 2 టి20లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆదివారం ఢిల్లీలో తొలి టి20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ‘బ్రిక్స్’ సమావేశం కారణంగా స్థానిక పోలీసులు భద్రత కలిగించడం కష్టమవుతుంది కాబట్టి మ్యాచ్‌ను వాయిదా వేయాలనే చర్చ జరిగినా... పోలీసులతో ఢిల్లీ క్రికెట్ సంఘం చర్చల అనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
గూగుల్ కీలక ప్రకటన.. దేశం కోసం 5 కార్యక్రమాలు!
దేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి, జాతీయ వాతావరణ ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ డేటా మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడులను వినియోగిస్తూ, భారతదేశంలో ఐదు కొత్త పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ-ఇంధన కార్యక్రమాలను గూగుల్ ఈరోజు ప్రకటించింది.ఈ ప్రకటనలలో 30 కోట్లకు పైగా భవనాలను కవర్ చేసే డిస్ట్రిబ్యూటెడ్ రూఫ్‌టాప్ సోలార్ ఇంటెలిజెన్స్, రాజస్థాన్‌లో కొత్త 150-మెగావాట్ల (MW) యుటిలిటీ సోలార్ ఒప్పందం, పదివేల మంది చిన్న రైతులకు మద్దతుగా మిట్టి ల్యాబ్స్‌తో కలిసి చేపట్టిన ఒక చారిత్రాత్మక మీథేన్ మరియు నీటి తగ్గింపు కార్యక్రమం, గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ ద్వారా విస్తరించిన పరిశోధన విభాగాలు ఉన్నాయి."భారతదేశం తమ సాంకేతిక, ఏఐ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో, ఈ ఊపు సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధికి దారితీసేలా చూడటం మన ఉమ్మడి భవిష్యత్తుకు కీలకం" అని గూగుల్ క్లైమేట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వృషాలి గౌడ్ అన్నారు. "స్థానిక సౌర విద్యుత్ వ్యవస్థాపకులకు రూఫ్‌టాప్ వినియోగాన్ని పెంచడంలో సహాయపడటానికి జియోస్పేషియల్ ఏఐ ను ఉపయోగించడం నుండి, వాతావరణ అనుకూల నీటి పద్ధతులపై రైతులతో కలిసి పనిచేయడం, జాతీయ గ్రిడ్‌కు కొత్త స్వచ్ఛమైన విద్యుత్‌ను జోడించడం వరకు ఈ కార్యక్రమాలు భారతదేశానికి ఆచరణాత్మకమైన, శాశ్వత ప్రభావాన్ని సృష్టించటానికి డిజిటల్ ఆవిష్కరణ మరియు పర్యావరణ పరిరక్షణ కలిసికట్టుగా ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూపిస్తున్నాయి" అని అన్నారు.భారతదేశంలోని 30 కోట్లకు పైగా రూఫ్‌టాప్‌ల కోసం సోలార్ ఏపిఐను విస్తరించడంగూగుల్ చాలా కాలంగా రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతంగా మరియు సరళంగా చేయడానికి ఏఐ మరియు ఇమేజరీని ఉపయోగిస్తోంది. ఎర్త్ ఏఐ లో భాగమైన సోలార్ ఏపిఐ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్లకు పైగా భవనాలకు మరియు భారతదేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా రూఫ్‌టాప్‌లకు అవసరమైన పరిజ్ఞానం అందించగలదు.ఈ సాంకేతికత ద్వారా ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసే అవకాశాలను ముందుగానే అంచనా వేయొచ్చు. దీంతో ఇన్స్టాలర్లు నేరుగా ఇంటి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆ ఇంటికి ఉన్న సోలార్ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ఫలితంగా కచ్చితమైన డిజైన్లు, తుది కస్టమర్ ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు పట్టే సమయం, ఖర్చు తగ్గుతుంది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన వంటి ప్రభుత్వ ప్రోత్సాహక కార్యక్రమాలతో భారతదేశంలో గృహ సౌరశక్తి రంగం దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సోలార్ లాడర్ మరియు ఓపెన్సోలార్ వంటి స్థానిక ప్లాట్‌ఫారమ్‌లు, 3D సిస్టమ్ లేఅవుట్లను ఆటోమేట్ చేయడానికి, పారాపెట్ మరియు వాటర్ ట్యాంక్ క్లియరెన్స్‌లను మోడల్ చేయడానికి, మొదటి క్లయింట్ సమావేశంలోనే మొబైల్ ప్రతిపాదనలను రూపొందించడానికి, సోలార్ ఏపిఐ డేటాను తమ సాఫ్ట్వేర్ వర్క్‌ఫ్లోలలో ఇప్పటికే అనుసంధానిస్తున్నాయి.రూఫ్‌టాప్ అంచనాలను మరింత వేగంగా, కచ్చితంగా, విస్తృత స్థాయిలో చేపట్టేందుకు సోలార్ ఏపీఐ తోడ్పడుతుంది. మాన్యువల్‌గా పైకప్పు సర్వేలు నిర్వహించడం, ప్రతి ఇంటికి ప్రత్యేక లేఅవుట్లను రూపొందించడం వంటి ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక డేటాను ఇది అందిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇళ్లలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవడం మరింత వేగంగా, అందుబాటులో ఉండే ఖర్చుతో, సులభంగా మారుతుంది.గ్రీన్ వర్క్‌ఫోర్స్ శిక్షణ మరియు తక్కువ-కార్బన్ నిర్మాణ సామగ్రిపై దృష్టి సారించడంతో పాటు, నీటి నిర్వహణ, వ్యర్థాలు మరియు సర్క్యులారిటీపై దృష్టి సారించిన మంథన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొత్త అవకాశాలను అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏఐ ని ఉపయోగిస్తున్న నాలుగు భారతీయ స్టార్టప్‌లతో కూడిన 'గూగుల్ డీప్ మైండ్ యాక్సలరేటర్ : ఏఐ ఫర్ ది ప్లానెట్' కార్యక్రమం యొక్క తొలి బృందంతో సహా, స్వదేశీ వాతావరణ-సంబంధిత ఆవిష్కరణలకు గూగుల్ అందిస్తున్న విస్తృత మద్దతుపై ఈ ప్రయత్నాలు ఆధారపడి ఉన్నాయి.భారతదేశ గ్రిడ్‌కు 150 మెగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని జోడించడంరాజస్థాన్లో 150-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ కోసం రీన్యూ పవర్‌తో చేసుకున్న ఒక కొత్త, దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా భారతదేశ విద్యుత్ గ్రిడ్ పట్ల తమ నిబద్ధతను గూగుల్ విస్తరిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్‌కు సంబంధించిన పర్యావరణ లక్షణాలను పొంది, తన విస్తృత వాల్యూ చైన్ అంతటా విద్యుత్ సంబంధిత ఉద్గారాలను పరిష్కరించడంలో సహాయపడటానికి వాటిని వినియోగించుకుంటుంది.స్వచ్ఛ ఇంధన లక్షణాలను నేరుగా సేకరించడం ద్వారా సరఫరా గొలుసు డీకార్బనైజేషన్ను వేగవంతం చేయాలనే గూగుల్ విధానానికి ఈ ఒప్పందం మరింత బలాన్ని చేకూరుస్తుంది. భారతదేశంలో గూగుల్ చేపట్టిన రెండవ స్కోప్ 3-కేంద్రీకృత సౌర ప్రాజెక్ట్ ఇది. దీనితో, రీన్యూతో ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం సామర్థ్యం, భారతదేశ జాతీయ గ్రిడ్‌పై 300 మెగావాట్ల కొత్త సౌర విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి చేరుకుంది.వరి రైతులకు మీథేన్‌ను తగ్గించడంలో.. నీటిని సంరక్షించడంలో సహాయంతెలంగాణలోని వేలాది మంది సన్నకారు వరి రైతులు వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో సహాయపడే ఒక ప్రాజెక్ట్ కోసం గూగుల్, మిట్టి ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా, మొత్తం మీథేన్ ఉద్గారాలలో 12% వరకు వరి సాగు నుండే వెలువడుతున్నాయి.వరి సాగు నుండి వెలువడే మీథేన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా లభించే క్రెడిట్స్ కొనుగోలు చేయడానికి, ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించిన ఒప్పందాలలో ఇదే అతిపెద్దది. ఈ కార్యక్రమం 'ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్' (AWD) పద్ధతిని పరిచయం చేస్తోంది. పొలాలను నిరంతరం నీటిలో ముంచి ఉంచే బదులు, కాలానుగుణంగా నీటిని తీసివేసి, తిరిగి నీటితో నింపడం ద్వారా, AWD నేలలోకి ఆక్సిజన్‌ను ప్రవేశపెట్టి, మీథేన్‌ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులను అడ్డుకుంటుంది. అదే సమయంలో ఇది నీటిపారుదల అవసరాన్ని గణనీయంగా తగ్గించి, నీటిని సంరక్షించి, కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు నేరుగా చెల్లింపులను అందిస్తుంది.ఈ ప్రాజెక్ట్, 20 సంవత్సరాల గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (GWP20) ప్రాతిపదికన దాదాపు 3 మిలియన్ టన్నుల CO2e (100 సంవత్సరాల GWP100 ప్రాతిపదికన 1 మిలియన్ టన్నులకు సమానం) తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ధృవీకరణకు నాసా-సహాయక ఉపగ్రహ పర్యవేక్షణ మరియు క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌లు తోడ్పడతాయి.గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీకి కొత్త ప్రాధాన్యతా రంగాలను జోడించడంభారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయంతో భాగస్వామ్యంతో ఫిబ్రవరిలో ప్రారంభించబడిన గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ, పర్యావరణ సవాళ్లకు ఏఐ ని వర్తింపజేసే పరిశోధకులకు , ఆవిష్కర్తలకు మద్దతు ఇస్తుంది. 77 దరఖాస్తుల నుండి, ఈ సెంటర్ తన మొదటి మూడు ప్రారంభ గ్రాంట్ గ్రహీతలను రెండు విభాగాలలో ఎంపిక చేసింది: గ్రీన్ వర్క్‌ఫోర్స్ శిక్షణ మరియు తక్కువ-కార్బన్ నిర్మాణ సామగ్రి.గూగుల్ ఇప్పుడు భారత ప్రభుత్వ మంథన్ ప్లాట్‌ఫామ్‌పై పరిశోధన మరియు ఆవిష్కరణ ప్రతిపాదనల కోసం రెండు కొత్త ప్రాధాన్యతా రంగాలను తెరవడం ద్వారా సెంటర్ పరిధిని విస్తరిస్తోంది.➤జల సంరక్షణ: కీలకమైన పరీవాహక ప్రాంత వనరులను రక్షించడానికి , సంరక్షించడానికి, విస్తరించదగిన సాంకేతికతలు మరియు నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పెరుగుతున్న మంచినీటి డిమాండ్‌ను పరిష్కరించడం.➤వ్యర్థాలు మరియు వలయాకార వినియోగం: వనరుల వినియోగానికి మరింత వలయాకార పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి, ఇ-వ్యర్థాలు మరియు బ్యాటరీ రీసైక్లింగ్ ప్రక్రియలపై పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం.భారతదేశపు క్లైమేట్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతుక్షేత్రస్థాయి ఆవిష్కరణలకు తమ మద్దతును పునరుద్టాటిస్తూ, గూగుల్ ఇటీవల 'గూగుల్ డీప్‌మైండ్ యాక్సిలరేటర్: ఏఐ ఫర్ ది ప్లానెట్' యొక్క తొలి బ్యాచ్‌ను స్వాగతించింది. ఇందులో గ్రహాన్ని రక్షించడానికి ఏఐని ఉపయోగించుకుంటున్న నాలుగు మార్గదర్శక భారతీయ స్టార్టప్‌లు ఉన్నాయి.➤టెర్రాస్టాక్, వరాహా క్లైమేట్ : చిన్న, సన్నకారు రైతులకు వారి భూమి స్థాయిలో సమగ్ర భూవివరాలు అందించడంతో పాటు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ధ్రువీకరించిన కార్బన్ క్రెడిట్లను అందుబాటులోకి తీసుకురావడంలో తోడ్పడుతున్నాయి.➤ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ మరియు క్లైమిట్రా కార్బన్, అగ్రోఫారెస్ట్రీని విస్తరించడానికి, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి, మరియు హానికరమైన బయోమాస్‌ను బయోచార్గా మార్చడానికి జియో-ఏఐ, డ్రోన్లు మరియు శాటిలైట్ నమూనాలను ఉపయోగిస్తున్నాయి -
స్పేస్ పరిశోధనల్లో భారత్‌తో చేతులు కలపండి.. ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్‌కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
మామిడి పండు చూడ మేలిమై యుండును.. పొట్ట విప్పి చూడ..
(సాక్షి, స్పెషల్ డెస్క్) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది మన మామిడి సంగతి. ప్రపంచంలోనే రుచికరమైన మామిడి పండ్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రీమియం ఎగుమతి మార్కెట్లలో మన మామిడి తీవ్ర ఆంక్షలు, తిరస్కరణలను ఎదుర్కొంటోంది. విదేశీ వినియోగదారులు మంచి ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, నాణ్యత లోపాల వల్ల భారతీయ రైతులు, ఎగుమతిదారులు ఏటా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సంక్షోభానికి బహుళ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు సాగుతో కష్టాలు దేశంలో సుమారు వెయ్యి మామిడి రకాలున్నప్పటికీ, మార్కెట్లో గిరాకీ కలిగినవి 24 ప్రధాన రకాలు మాత్రమే. వీటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం అగ్రస్థానంలో నిలిచాయి. మామిడి తోటల యజమానుల్లో అత్యధికులు నగరాల్లో నివసిస్తూ తోటలను కాలానికి కాంట్రాక్టర్లకు లీజుకిస్తున్నారు. కేవలం మూడు నెలల సీజన్ లో వచ్చే తాత్కాలిక లాభాలపై తప్ప, తోట దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాంట్రాక్టర్లకు శ్రద్ధ ఉండదు. తక్కువ సమయంలో పంటను కాపాడుకోవటానికి విచక్షణారహితంగా సింథటిక్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు వాడుతున్నారు. నాసిరకం పురుగు మందులను అవసరానికి మించి పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పురుగు మందులను తట్టుకునే శక్తిని చెట్లు పెంచుకుంటున్నాయి. వీటివల్ల కాయ పైకి నిగనిగలాడేలా కనిపించినా, నాణ్యత ఉండటం లేదు. కాయల్లో పండు ఈగ వంటి పురుగులతో పాటు ప్రమాదకర రసాయనాల అవశేషాలు నిండిపోతున్నాయి. ఆంక్షలు.. తిరస్కరణలు పండ్లలో పురుగుల బెడద, అధిక రసాయన అవశేషాల కారణంగా విదేశీ తనిఖీ సంస్థలు భారతీయ మామిడి కన్సైన్మెంట్లను వెనక్కి పంపుతున్నాయి. వేపర్ హీట్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు లోపించటంతో జపాన్ దిగుమతులను నిలిపివేయగా, అధిక పురుగుమందుల అవశేషాలున్నాయనే ఆరోపణలతో నేపాల్ ఇటీవల సరిహద్దుల్లో కఠిన నిబంధనలు తెచ్చింది. గతంలో యూరోపియన్ యూనియన్ కూడా భారతీయ మామిడిపై నిషేధం విధించింది. అమెరికాకు ఎగుమతి చేయడానికి నిర్దేశించిన నాన్–టారిఫ్ ఆంక్షలు దాటటం సాధారణ రైతులు, ఎగుమతిదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుతం మన ఎగుమతుల్లో మూడోవంతు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితమవుతోంది. సాగు పద్ధతి మార్చాలి.. మామిడి రైతులు రసాయన రహిత ఆధునిక సాగు పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. నిరంతర వ్యక్తిగత పర్యవేక్షణ అత్యవసరం. బాధ్యతారహితంగా తోటలను నిర్వహించే కాంట్రాక్టర్ల చేతులకు తోటలను వదిలేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో క్రిమిసంహారకాల వాడకం తగ్గించి, ఫైటోశానిటరీ ప్రమాణాలు పాటిస్తేనే ప్రపంచ మార్కెట్లో భారతీయ మామిడికి అసలైన గిట్టుబాటు ధర లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలి భూయజమానుల నిర్లక్ష్యం, నాణ్యత లేని రసాయన వ్యవసాయం మన మామిడి ఎగుమతులను దెబ్బ తీస్తున్నాయి. బంగినపల్లికి మంచి నిల్వ సామర్థ్యం ఉన్నా ఏపీ, తెలంగాణల్లో ఇర్రేడియేషన్, ప్యాక్‌హౌస్ వసతులు లేవు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పదేళ్లకు పైగా మామిడి సాగు చేస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాం. ఈ ఏడాది యూరప్‌కూ విస్తరిస్తున్నాం. మామిడి ఎగుమతి సీజన్ కేవలం 45–60 రోజులే. పేపర్‌వర్క్, ఎయిర్ ఫ్లైట్‌పై జీఎస్టీ పెనుభారంగా మారాయి. ప్రభు త్వం రసాయనాలకు సబ్సిడీలు ఆపి, సహజ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఎగుమతులు పెంచేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. – గుమ్మడపురం రఫీ, మేనేజింగ్ డైరెక్టర్, ఏఆర్4 ఫ్రెష్ ఇంటర్నేషనల్ -
ఇరవై ట్రిలియన్ల వ్యవస్థ కాగలమా?
ఇటీవలి ఈక్విరస్ ‘వృద్ధి విధాన నివేదిక’ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే నామినల్ రూపాయి వృద్ధి 14.2 శాతంగానూ, సాంవత్సరిక రూపాయి అప్రిషియేషన్ 3–3.6 శాతం అవసరమనీ పేర్కొనడం చర్చనీయాంశంగా నిలిచింది. రాబోవు పదేళ్ల కాలంలో జీడీపీలో 5 రెట్లు పెరుగు దల ఉండాలంటే, దానికి అవసరమైన సగటు వార్షిక డాలర్ – ఆధారిత నామినల్ జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా నివేదిక అంచనా వేసింది. వివిధ రంగాలలో ఉత్పాదకత వృద్ధి తక్కువగా ఉండటం, స్థూల స్థిర మూలధన కల్పన జీడీపీలో 30 శాతానికి పరిమితం కావడం, సంఘటిత రంగంలో ఉపాధి తక్కువగా ఉండటం, ఇంధన ధరలలో పెరుగుదల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, మానవాభివృద్ధిపై పెట్టుబడులు తక్కువగా ఉండటం, ద్రవ్యలోటు పెరుగుదల, సామర్థ్యానికి తగినట్లు ఎగుమతు లలో వృద్ధి లేకపోవడం లాంటి అంశాలు నామినల్ జీడీపీ వృద్ధిలో అనూహ్య పెరుగుదలకు అవరోధాలుగా నిలిచే అవకాశం ఉంది. భారత్ వాస్తవిక జీడీపీ వృద్ధిని 2026–27లో 6.3 శాతంగా, 2027–28లో 6.4 శాతంగా ఓఈసీడీ అంచనా వేస్తుండగా, ప్రపంచ బ్యాంకు 6.6 శాతంగా అంచనా వేసింది. నామినల్ వార్షిక జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా రాబోవు పది సంవత్సరాల కాలంలో నిర్వ హించాలంటే సాంప్రదాయ కోశ విధానం, విత్త మద్దతుతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు అవసరం. అభివృద్ధి దేశాల వృద్ధి నమూనాప్రస్తుతం భారత్ జీడీపీ 3.96 ట్రిలియన్ డాలర్లు కాగా 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే క్రమంలో ప్రపంచంలో అధిక ఆదాయ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపొంద డానికి ఎంత సమయం తీసుకున్నాయి, ఏ అభివృద్ధి వ్యూహాలను అవలంభించాయో పరిశీలించాలి. అధిక ఆదాయ దేశాలుగా రూపొందడానికి అమెరికాకు (వందకు మించిన సంవత్సరాలు), యూకే (100 సం‘‘లు), జర్మనీ (50–100 సం‘‘లు), జపాన్ (50–100 సం‘‘లు), కెనడా (75–100 సం‘‘లు), దక్షిణ కొరియా (30–40 సం‘‘లు) సమయం తీసుకోగా, ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం ఎగువ మధ్య ఆదాయ దేశమైన చైనాలో 1978 తర్వాతి కాలంలో వృద్ధి వేగవంతమై 2026 నాటికి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 20.85 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. చైనా, దక్షిణ కొరియాతో పోల్చినప్పుడు అధిక ఆదాయ దేశంగా రూపొందడానికి అమెరికా అధిక సమయం తీసుకొంది. అతిపెద్ద ఏకీకృత స్వదేశీ మార్కెట్, ప్రైవేటును ప్రోత్సహించడం, మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు, పటిష్టమైన మూలధన మార్కెట్, ప్రఖ్యాత విద్య, పరిశోధనా సంస్థలు, సాంకేతిక నవకల్ప నలు అమెరికాకు సానుకూలంగా పనిచేశాయి. మొదటి పారిశ్రామిక విప్లవం వలన బ్రిటన్; భారీ పరిశ్రమలు, రసాయనాలు, మెషినరీ, తయారీ రంగం అభివృద్ధి కారణంగా జర్మనీ; పారిశ్రామికీకరణ, ఎగుమతులు, సాంకేతికత కారణంగా జపాన్; ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి తయారీ రంగ అభివృద్ధి, విద్య, పారిశ్రామిక విధానం ద్వారా దక్షిణ కొరియా అధిక ఆదాయ దేశాలుగా రూపొందాయి.వివిధ రంగాలలో ఏం మారాలి?20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే వ్యవసాయం, తయారీ, సేవలు, శక్తి, మానవ మూలధనం, సాంకే తిక రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు అవ సరం. ఐఎంఎఫ్ అభిప్రాయంలో భారత్ ఉత్పాదకత పెంపు, నైపు ణ్యత, శ్రామిక మార్కెట్ సరళత, నియంత్రణల సడలింపు, వాణిజ్యం అనుసంధానంపై దృష్టి సారించాలి. పట్టణీకరణ వేగవంతమవుతున్న కారణంగా ప్రస్తుతం జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17 శాతం నుండి రాబోవు కాలంలో తగ్గే సూచనలున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరచడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని విస్తరణ, నిల్వ సౌకర్యం, లాజిస్టిక్స్ అభివృద్ధికి చర్యలు అవసరం. నశ్వర ఉత్పత్తులైన పండ్లు, కూరగాయల మొత్తం ఉత్పత్తిలో 4 శాతంకు మాత్రమే రిఫ్రిజిరేటెడ్ రవాణా సౌకర్యం ఉంది. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు సంబంధించి పది సంవత్సరాల పన్ను విరామాన్ని ప్రకటించాలి. తయారీ రంగంలో అతిపెద్ద నిర్మాణాత్మక మార్పులు అవసరం. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 12.9 శాతం కాగా 2035 నాటికి 25 శాతానికి పెంచాలని జాతీయ తయారీ విధానం లక్ష్యంగా తీసుకుంది. తయారీ రంగంలో చిన్న సంస్థలు, పెద్ద సంస్థ లుగా మారే క్రమంలో చెప్పుకోదగిన ప్రగతి లేదు. ఆగస్ట్ 2026 నాటికి భారత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఉద్యమ్ పోర్టల్‌లో సూక్ష్మ సంస్థలు (9.24 కోట్లు), చిన్న సంస్థలు (5.42 లక్షలు), మధ్య తరహా సంస్థలు (41,775) నమోదయ్యాయి. సంస్థలు చిన్న స్థాయిలో ఉంటే నైపుణ్యత కల్గిన శ్రామికుల లభ్యత, సంస్థాపరమైన పరపతి, సప్లయ్ చెయిన్‌కు అనుసంధానపరచడం, సాంకేతికత లభ్యత క్లిష్టతరమవుతుంది. సక్రమంగా నడుస్తున్న చిన్న సంస్థలకు ఈక్విటీ మార్కెట్లో ప్రవేశం కల్పించి పెద్ద మొత్తంలో నిధులు సేకరించుకొనే అవకాశం కల్పించాలి. కార్పొరేట్ బాండ్లను జారీ చేసే స్వేచ్ఛను కంపెనీలకు ఇవ్వాలి. జీడీపీలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ విలువ భారత్‌లో 15–16 శాతం కాగా, చైనాలో 38 శాతం, మలేషి యాలో 54 శాతం, దక్షిణ కొరియాలో 79 శాతం. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. జీసీసీలు అధిక విలువ కల్గిన కార్య కలాపాలను నిర్వహిస్తున్నందువలన, ఈ రంగాన్ని విస్తరిస్తే భారత్ జీడీపీలో పెరుగుదల ఏర్పడుతుంది. ఉత్పాదక శ్రామికులుగా మార్చాలి!భారత్‌లో తాత్కాలిక కార్మికులు 2029–30 నాటికి 2.35 కోట్లుగా ఉండగలరని అంచనా. ప్రత్యేకమైన శ్రామిక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక వివాదాలను పరిష్కరించాలి. 2036 నాటికి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 70 శాతం, మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 50 శాతం, సంఘటిత రంగంలో ఉపాధి విస్తరణ, అప్రెంటిషిప్స్ ఏడాదికి కోటికి పైగా ఉండేలా తగిన విధానాలను రూపొందించుకోవాలి. పనిచేసే వయో వర్గ జనాభాను అధిక వేతనంతో కూడిన ఉత్పాదక శ్రామికులుగా మార్చడం శ్రామిక మార్కెట్ సంస్కరణలలో కేంద్ర బిందువుగా ఉండాలి. దేశంలో 37 కోట్లకు పైగా ఉన్న యువతకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశోధన, అభివృద్ధి వ్యయం జీడీపీలో 0.6–0.7 శాతంగా ఉండటం వలన ఉత్పాదకత పెంపు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నందువలన ఈ వ్యయాన్ని పెంచాలి. భారత్ అంతర్జాతీయ కంపెనీలకు తక్కువ వ్యయంతో సేవలను అందించేకన్నా ‘ప్రపంచ నవకల్పన, అధిక విలువతో కూడిన సేవల హబ్’గా రూపొందాలి. డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు -
నేపాల్‌కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల పునర్నిర్మాణానికి 4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ల డాలర్ల మధ్య ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.38,000 కోట్ల నుంచి రూ.47,550 కోట్ల మధ్య అవుతుంది.ఈ భారీ మొత్తాన్ని నేపాల్ ప్రభుత్వం ఒక్కటే భరించడం కష్టం కావడంతో.. దేశీయ నిధులు, రుణాలు, బీమా, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇతర దేశాల సాయం, వాతావరణ నిధులు వంటి మార్గాల ద్వారా డబ్బును సమీకరించాల్సి ఉంటుంది.నేపాల్‌లో భోటేకోషి, త్రిశూలీ లోయల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తులో 1,357 మంది మరణించగా, 5,326 మంది గల్లంతయ్యారు. ఆస్తులు, ఇళ్లు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం $2.56 బిలియన్లుగా అంచనా వేశారు. అయితే పూర్తిస్థాయి పునర్నిర్మాణానికి $4 బిలియన్ నుంచి $5 బిలియన్ల వరకు అవసరమవుతుందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు.నేపాల్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఒత్తిడిలో ఉండటంతో మొత్తం ఖర్చును దేశీయంగా సమకూర్చడం సాధ్యం కాదు. ప్రభుత్వం బడ్జెట్‌ను మార్చి కేటాయించడం, రుణాలు తీసుకోవడం, బీమా పరిహారం, ప్రైవేట్ పెట్టుబడులను ఉపయోగించవచ్చు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు, గ్రాంట్లు పొందడం కీలకం కానుంది.బ్రిటన్, దక్షిణ కొరియా, అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే సాయం అందించాయి. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాలకు అందించే అంతర్జాతీయ ‘నష్టం-నష్టపరిహార నిధి’ నుంచి కూడా నేపాల్ సాయం కోరుతోంది. అయితే $4–$5 బిలియన్ల పునర్నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఈ నిధులు చాలా తక్కువగా ఉండటంతో, పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సాయం అవసరం కానుంది. -
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్‌పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్ -
యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు!
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా.. మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లు మార్చడంతో బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS)కు చెందిన ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ సంక్షోభానికి కారణం. లండన్‌లోని హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, సిటీ విమానాశ్రయాలతోపాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, ఎడిన్బర్గ్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టులపై దీని ప్రభావం పడింది. ఒక దశలో విమానాలను ఇతర యూరప్ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమ నిర్ణీత ప్రాంతాల్లో లేకపోవడంతో.. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తొలగిపోలేదు.గంటల తరబడి నిరీక్షణ..సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రన్‌వేలపై విమానాల్లోనే గంటల తరబడి కూర్చోవాల్సి రావడంతో పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ రద్దీ, బ్యాగేజీ సమస్యలు, సమాచార లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ 100కు పైగా విమానాలను రద్దు లేదా దారి మళ్లించగా.. ర్యాన్ఎయిర్ 65 వేల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈజీజెట్ సహా పలు విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం ఏర్పడింది.సమస్య పరిష్కారం కానీ..సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు నాట్స్ ప్రకటించింది. వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని, నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేస్తున్నామని వెల్లడించింది. అయితే అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోలేదు. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి రాకలను నిలిపివేసి.. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు. భారత్-యూకే సర్వీసులపైనా ప్రభావంఈ సాంకేతిక సమస్యతో భారత్ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. విమానాలు, సిబ్బంది వేరే ప్రాంతాల్లో చిక్కుకోవడంతో తదుపరి సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్‌తో నిర్ధారించుకోవాలని సూచించారు. వరుస వైఫల్యాలతో విమర్శలునాట్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఫ్లైట్-ప్లాన్ ప్రాసెసింగ్‌లో లోపంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఆ ఘటనలో ఎయిర్‌లైన్స్‌కు భారీగా రీఫండ్లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా మరోసారి సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో బ్రిటన్ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇటు బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఘటనపై పూర్తి నివేదిక కోరింది. NATS చీఫ్ మార్టిన్ రోల్ఫ్ మాత్రం అసలు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇంకా తమకు తెలియలేదని తెలిపారు.ఇదీ చదవండి: ముంచేసిన మరో విపత్తు.. జలమయంగా జపాన్ -
భారీగా జీతం పెంచుకున్న సింగపూర్ ప్రధాని
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రభుత్వాధినేత ఎవరో తెలుసా?. చాలా దేశాలు అధికారికంగా ఆ విషయం బయటకు చెబుతున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం అలవెన్స్, ఎగస్ట్రాల రూపంలో అడ్డగోలుగా అందుకుంటున్నారు. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాధినేతల జీతాలపై క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.తాజాగా.. సింగపూర్ పార్లమెంట్లో చట్ట సభ్యుల జీతాల సవరణ జరిగింది. అందులో ప్రధాని లారెన్స్ వాంగ్(Lawrence Wong) వార్షిక వేతన ప్యాకేజీని ఏకంగా 64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జీతం 3.6 మిలియన్ డాలర్లకు చేరనుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 కోట్లకు పైగా. ఈ కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.ఒకేసారి అంతా..!!లారెన్స్ వాంగ్ ప్రస్తుత వార్షిక వేతన ప్యాకేజీ 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు కాగా.. కొత్త విధానంతో అది 3.6 మిలియన్ డాలర్లకు పెరగబోతోంది. అంటే.. అదనంగా 1.4 మిలియన్ సింగపూర్ డాలర్ల అదనపు ఆదాయం. సింగపూర్ రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయి. అధిక జీతాల వల్ల ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడంతోపాటు అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు సాధారణ పౌరుల ఆదాయంతో పోలిస్తే రాజకీయ నాయకుల వేతనాలు భారీగా ఉండటంపై దేశంలో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పెంపు మొత్తాన్ని తన పదవీకాలంలో వచ్చే ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.మంత్రుల జీతాలూ పెంపుదాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ రాజకీయ వేతనాల వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ అలవెన్స్‌ను కూడా 13,750 సింగపూర్ డాలర్ల నుంచి 18,500 డాలర్లకు పెంచనున్నారు. ప్రధాని మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పదవుల వేతనాల్లోనూ మార్పులు చేయనున్నారు. డిప్యూటీ ప్రధాని బెంచ్‌మార్క్ వార్షిక వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరగనుంది. మంత్రుల వేతనాలు వారి హోదా, బాధ్యతలను బట్టి 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు ఉండేలా కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్ణయించారు.అయితే మంత్రులందరికీ వెంటనే కొత్త బెంచ్‌మార్క్ వేతనం అందదు. ప్రస్తుత పదవీదారులకు అక్టోబర్ 15 నుంచి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వేతన మార్పులు వ్యక్తిగత పనితీరు, బాధ్యతల ఆధారంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.ప్రపంచంలో అత్యధిక వేతనాలు! వీళ్లే..అంతర్జాతీయ రాజకీయ నేతల వేతనాలను పోల్చే (PoliticalSalaries) డేటా ప్రకారం, 2025లో టాప్-10లో ప్రధానంగా సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మొదటి స్థానంలో ఉన్నారు.1. లారెన్స్ వాంగ్ – సింగపూర్ ప్రధాని2. కరీన్ కెల్లర్-సట్టర్ – స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు3. డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు4. ఫ్రెడ్రిక్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్5. ఆంటోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాని6. క్రిస్టియన్ స్టాకర్ – ఆస్ట్రియా ఛాన్సలర్7. బార్ట్ డి వెవర్ – బెల్జియం ప్రధాని8. క్రిస్టోఫర్ లక్సన్ – న్యూజిలాండ్ ప్రధాని9. మార్క్ కార్నీ – కెనడా ప్రధాని10. లూక్ ఫ్రైడెన్ – లక్సెంబర్గ్ ప్రధానిమరి మోదీ స్థానం ఎంత?ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో లేరు. ఆయన అధికారిక వార్షిక వేతనం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు అమెరికా 30 వేల డాలర్ల పరిధిలో ఉన్నట్లు గత అంతర్జాతీయ వేతనాల డేటాలో నమోదైంది. అయితే కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జీతం, నియోజకవర్గం, విధి నిర్వహణకు సంబంధించిన రోజువారీ భత్యాలను కలిపి చూస్తే మోదీ వార్షిక మొత్తం సుమారు రూ.25-26 లక్షల పరిధిలో ఉంటుంది.ఇదీ చదవండి: సీఎం గొంతుతో మిమిక్రీ చేసి భారీ కుంభకోణం! -
భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు
అహ్మదాబాద్: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్–3 టోర్నిలో భారత ఆర్చర్లు ఐదు పతకాలతో మెరిశారు. మంగళవారం భారత ఆర్చర్లు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తోమన్ కుమార్–శ్యామ్ సుందర్ స్వామి (భారత్) 152–139తో అబ్బాస్–అన్వర్ (ఇరాక్)లపై గెలిచి బంగారు పతకం నెగ్గారు. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో హరి్వందర్ సింగ్–విజయ్ సుంది (భారత్) 6–2 (34–37, 36–31, 38–34, 35–31) సెట్ పాయింట్ల తేడాతో డేవిడ్ ఇవాన్–డెనిస్ ఇవాన్ (స్లొవేకియా)లపై విజయం సాధించి పసిడి పతకం గెలిచారు. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భావన–పూజ (భారత్) 0–6 (23–34, 33–35, 30–31) సెట్ పాయింట్ల తేడాతో లియాంగ్ కియురోంగ్–చెన్ యు (చైనా) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకున్నారు. మిక్స్డ్ టీమ్ డబ్ల్యూ1 రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో స్వాతి–ఆదిల్ మొహమ్మద్ నాజిర్ అన్సారి (భారత్) 1–5 (31–38, 33–37, 33–33) సెట్ పాయింట్లతో సర్కా ముసిలోవా–డేవిడ్ డ్రహోన్స్కయ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలై రజత పతకం కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత డబ్ల్యూ1 కాంస్య పతక మ్యాచ్‌లో స్వాతి 6–2 (28–25, 27–27, 26–26, 26–24) సెట్ పాయింట్లతో ఎలీనా క్రుతోవా (కజకిస్తాన్)పై గెలిచింది. -
11న మోదీ, పుతిన్ భేటీ
న్యూఢిల్లీ: బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇండోనేసియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ‘బ్రిక్స్’శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 12, 13న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే సమావేశానికి కూటమి దేశాల అధినేతలు హాజరుకాబోతున్నాయి. సదస్సు కంటే ఒక రోజు ముందు ఈ నెల 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారం నిర్ధారించారు. ఆయన భారత జర్నలిస్టులతో ఆన్లైన్లో సంభాషించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు దృష్టి పెట్టునున్నట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. అత్యంత సున్నితమైన అంశాలపై బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించేలా మోదీ, పుతిన్ ఆచరణాత్మక దృక్పథం, చిత్తశుద్ధి కలిగి ఉన్నారని పెస్కోవ్ వివరించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులను మోదీకి వివరించడానికి పుతిన్‌కు ఇది మరో అవకాశం కానుందని అభిప్రాయపడ్డారు. రష్యా మార్కెట్లో విస్తరణ చర్యలు చేపట్టడానికి, రష్యా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఆయా కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలియజేశారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణను ముగించడానికి భారత్ చేసే ఎలాంటి శాంతి ప్రయత్నాలనైనా తాము స్వాగతిస్తామని స్పష్టంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం సాధించాలన్న భారత్ వైఖరికి రష్యా వ్యూహం చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. -
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
భారత్‌లో వినియోగ మార్కెట్ తీరు వేగంగా మారుతోంది. వినియోగ మార్కెట్ అంటే సామాన్యులు తమ రోజువారీ సొంత అవసరాల కోసం వస్తువులు, సేవలను కొనుగోలు చేసే మార్కెట్. వస్తువులను వీళ్లు వ్యాపారం చేయడానికి కొనరు. తమ సొంత వినియోగం కోసం మాత్రమే కొంటారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి మహానగరాల చుట్టూనే అధిక వినియోగం కనిపించేది. ఇప్పుడు సూరత్ ఈ తీరును మార్చుతోంది. దేశంలోని టాప్ వినియోగ మార్కెట్లలో సూరత్ 7వ స్థానంలో ఉంది. ఆరు పెద్ద మహానగరాల తర్వాత ఇది అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. సూరత్ వినియోగ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లుగా ఉంది. అహ్మదాబాద్, పుణె కంటే ఇది ముందుంది. ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ నివేదిక ప్రకారం సూరత్‌లో కుటుంబానికి సగటు వినియోగం బెంగళూరును కూడా మించింది.దేశంలోని 100 నగరాల మొత్తం వార్షిక వినియోగం 844 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆరు పెద్ద మహానగరాలు ఇందులో 46 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే సూరత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. ఈ నగరాల్లో గృహ వ్యయం ఏటా 10.4 శాతం పెరుగుతుండగా, దేశవ్యాప్తంగా వృద్ధి 8.5 శాతంగా ఉంది. సూరత్‌ను 19 వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘బూమ్‌టౌన్’ నగరాల్లో చేర్చారు. పుణె, అహ్మదాబాద్, లక్నో, కోయంబత్తూరు, జైపూర్, ఇండోర్, వడోదర ఈ జాబితాలో ఉన్నాయి.సూరత్ సగటు కుటుంబ ఆదాయం హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా కంటే ఎక్కువగా ఉంది. వస్త్ర పరిశ్రమ, వజ్రాల వ్యాపారం, వలస జనాభా ఆర్థిక స్థాయి పెరగడం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. దేశంలోని టాప్ 100 నగరాల్లో రూ.6 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందే మధ్యతరగతి కుటుంబాల వాటా గత దశాబ్దంలో 29 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. 2030-31 నాటికి ఇది 60 శాతానికి చేరుతుందని అంచనా. రూ.36 లక్షలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాల వాటా 3 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.సూరత్‌లో పెరుగుతున్న ఆదాయం వినియోగ అలవాట్లపైనా ప్రభావం చూపుతోంది. 2025-26లో బూమ్‌టౌన్ నగరాల్లో మొత్తం ఖర్చు రూ.20.1 లక్షల కోట్లు కాగా, కుటుంబానికి సగటు వ్యయం రూ.12.2 లక్షలుగా ఉంది. ఈ ఖర్చులో ఆహారానికి 31.1 శాతం, ఇల్లు-యుటిలిటీలకు 25.8 శాతం, రవాణాకు 19.2 శాతం, విద్యకు 6.8 శాతం వెచ్చిస్తున్నారు. కార్ల వినియోగం 32 శాతానికి, మోటార్‌సైకిళ్ల వినియోగం 72 శాతానికి చేరింది. వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వినియోగం కూడా పెద్ద మహానగరాల కంటే ఎక్కువగా ఉంది.ఈ మార్పులు సూరత్ మాత్రమే కాకుండా దేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కొత్త వినియోగ అవకాశాలు పెరుగుతున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయం, యువ జనాభా, బలమైన రిటైల్-సేవల వ్యవస్థ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో వినియోగ వస్తువులు, జీవనశైలి ఉత్పత్తులు, గృహ రంగాల్లో ఈ నగరాల ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. -
Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?
-
నిజరూప పట దర్శనం!
మాటలు కావొచ్చు, చేతలు కావొచ్చు– ఏవీ శూన్యంనుంచి ఊడిపడవు. అనుద్దేశపూర్వకంగా, యథాలాపంగా ఏవీ ఉండవు. వాటిని ఉపయోగించేవారికి ఆ సంగతి తెలియొచ్చు... తెలియకపోవచ్చు. ఒక్కోసారి బాధితులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ వివక్షను ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవటం సంస్కారం. ఈ విషయంలో వ్యక్తుల్ని కొంతవరకూ క్షమించవచ్చు. కానీ ప్రపంచ దేశాల సారథి ఐక్యరాజ్యసమితిని క్షమించగలమా? ప్రపంచ పటంలో మా ఖండాన్ని చిన్నబుచ్చుతున్నారని ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఎత్తిచూపుతున్నాయి. అయినా దాన్ని సరిదిద్దుకోవటానికి దీర్ఘకాలం పట్టింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం దాన్ని సవరించుకుంది. ఏకంగా 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఒటేస్తే, ఎప్పట్లానే అమెరికా ఉలిపికట్టె ధోరణి ప్రదర్శించింది. ఎప్పుడో పదహారో శతాబ్దంనాటి మాట. భౌగోళిక పటాల రూపకర్త గెరార్డస్ మెర్కేటర్ తొలిసారి 1569లో ప్రపంచ పటాన్ని రూపొందించాడు. దక్షిణార్ధ గోళ దేశాలను, ముఖ్యంగా భూమధ్య రేఖ సమీప దేశాలను వాటి వాస్తవ పరిమాణంకన్నా తక్కువగా చూపాడాయన. అప్పటికున్న పరిజ్ఞానం పరిమితుల్లో అలా చేశాడని సరిపెట్టుకోవటానికి లేదు. అదే నిజమైతే ఉత్తరార్ధ గోళ దేశాలనూ, ధ్రువాలకు సమీపంలో ఉన్నవాటినీ పెంచి ఎలా చూపగలిగాడు? ఏమైతేనేం... ప్రపంచపటం ఇన్నాళ్లకు సక్రమమైంది. ఖండాలను వాటి నిష్పత్తికి అనుగుణమైన వైశాల్యాల్లో రూపొందించారు. కానీ ఆ క్రమంలో మన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను ఆ పటం చైనా, పాకిస్తాన్లకు ‘పంచిపెట్టింది’. మన విదేశాంగ శాఖ చెప్పినట్టు ఇదేమీ దేశాల హద్దుల్ని అధికారికంగా నిర్ధారించేది కాకపోవచ్చు. కానీ ఒక తప్పును సరిదిద్దుకునే క్రమంలో కొత్త తప్పుల్ని చేయరాదన్న ఇంగిత జ్ఞానం లోపించింది. అమెరికాలో కొంత భూభాగాన్ని వేరేవాళ్ల ఖాతాలో వేసి ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊరుకునేవారా? అవతలివారిపై ఆధిక్యతాభావం మనిషి నరానరాల్లోనూ వ్యాపించిన జాడ్యం. దీనికి భౌగోళిక హద్దులేమీ లేవు. అది జాత్యహంకారంగా, వర్ణవివక్షగా, ఆర్థికంగా అధికులమనే భావనగా వ్యక్తం కావటం ఎవరికీ తెలియంది కాదు. కులాన్నిబట్టి, మతాన్నిబట్టి మేం అధికులం, అన్యులు అల్పులన్న భావన ప్రబలంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. తెల్లతోలు ఉన్నవాళ్లు అసాధారణ మానవులు, మిగిలినవాళ్లంతా అల్పులనే భావన పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ పోలేదు. హిట్లర్ హయాంలో యూదుల్ని జర్మనీ వెంటాడి, వేటాడి హతమార్చటం వెనుకా... ఎనిమిది దశాబ్దాలపైగా పాలస్తీనాలో మారణహోమాన్ని సాగిస్తున్న అమానుష ఇజ్రాయెల్ వెనకా ఈ జాడ్యం తాలూకు ఛాయలే కనబడతాయి. అమెరికాలో కనబడే శ్వేతజాతి అహంకారం కూడా ఈ బాపతే. మనిషి అంతరాంతరాల్లో ఇలాంటివి గూడు కట్టుకున్నప్పుడు వారి వ్యవహార శైలిలో అది ప్రతిబింబించక మానదు. ఒక ప్రాంత భౌగోళిక వైశాల్యం ఎంతో చెప్పే పటాలు చూడటానికి అన్నిటికీ అతీతంగా, అలీనంగా కనబడతాయి. కానీ పటాల రూపకల్పనలో చోటుచేసుకునే రాజకీయాల గురించి 2020లో కార్నెల్ వర్సిటీ అధ్యాపకురాలు క్రిస్టిన్ లూయెన్బెర్గర్ చాలా సంగతులే చెప్పారు. దృగ్గోచరమయ్యే రాజకీయాలతో పాటు, ప్రచ్ఛన్నంగా, గుట్టుగా ఉండిపోయే రాజకీయాలు కూడా ఈ పటాల రూపకల్పనలో ఉంటాయని ఆమె అభిప్రాయం. ప్రతి పటమూ చూపవల్సినంతగా చూపుతూనే, దాచాల్సింది దాస్తుందనీ, నిర్దిష్ట సమూహం కోసమే ఇదంతా జరుగుతుందనీ క్రిస్టిన్ అంటారు. గుండ్రంగా ఉండే భూమిని చదునైన కాగితంపై చూపితే కొంత వక్రీకరణ ఎలాగూ తప్పదు. కానీ గ్రీన్‌ల్యాండ్ కన్నా 14 రెట్లు పెద్దదైన ఆఫ్రికా... దాని ముందు చిన్నబోవట మేమిటి? యూరప్, అమెరికాలు కూడా తమ వాస్తవ విస్తీర్ణంకన్నా అధికంగా కనబడ తాయెందుకు? ఆఫ్రికాతోపాటు దక్షిణ అమెరికా, భారత్‌లు చిన్నగా ఉంటాయి. కాగితాల్లో తప్పుడు గీతలు గీసి అధికులమనుకోవటం... తరగతి గదుల్లో రూపుదిద్దుకునే తరాలకు అజ్ఞానాన్ని బట్వాడా చేయటం సిగ్గుచేటు కాదా? సమితికి ఇంతకన్నా ప్రాధాన్యం గలవి చాలా ఉన్నాయని ట్రంప్ ఉవాచ. అందుకే తీర్మానాన్ని వ్యతిరేకించారట. నిజమే... ప్రాధాన్యం గలవి ఇంకా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తేలిస్తే అమెరికా వంచన మరింత తేటతెల్లమవుతుంది! -
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్‌బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అక్కడకు వెళ్లాలనుకుంది.. తీరా వెళ్లి చూస్తే..
సోషల్ మీడియాలో ఎంతో అందంగా, ప్రత్యేకంగా కనిపించే పర్యాటక ప్రదేశాలు వాస్తవంగా అక్కడికి వెళ్లినప్పుడు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ చిత్రాలను పదేపదే చూసిన ఓ భారతీయ యువతి చివరకు న్యూయార్క్ వెళ్లి ఆ వంతెనను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో కనిపించినంత అద్భుతంగా అది అనిపించలేదని, కొంత అతిగా ప్రచారం చేసిన పర్యాటక ప్రదేశంలా అనిపించిందని తెలిపింది.నేహా ఆన్లైన్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్‌కు సంబంధించిన ఎన్నో దృశ్యాలను చూసినట్లు తెలుస్తోంది. ప్రముఖ వంతెన, దాని వెనుక న్యూయార్క్ నగర దృశ్యాలతో ఫొటోలకు పోజులిస్తున్న వారిని చూపించే లెక్కలేనన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆమె చూశారు. అయితే చివరకు ఆమె స్వయంగా అక్కడికి వెళ్లినప్పుడు చిరాకు పడ్డారు. దీనికి కారణం భారీ సంఖ్యలో ఉన్న పర్యాటకుల రద్దీ. అందరూ తమకు నచ్చిన ఫొటో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు.పోజు ఇవ్వడానికి స్థలం కోసం ప్రయత్నించి విసిగిపోయిన తర్వాత నేహా బ్రూక్లిన్ బ్రిడ్జ్‌పై కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. అక్కడి పరిస్థితిని సరదాగా తీసుకున్న ఆమె, ఆ ప్రముఖ ప్రదేశంలో కంటెంట్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్యపై చమత్కరించారు.“న్యూయార్క్, బ్రూక్లిన్ బ్రిడ్జ్‌కు సంబంధించిన కనీసం 1,000 రీల్స్ నేను చూసి ఉంటాను. ఇప్పుడు నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. కానీ ఇక్కడి వాళ్లు నన్ను ఫొటో తీసుకోనివ్వడం లేదు. అందుకే విసిగిపోయి ఇక్కడే కూర్చున్నాను. మీరు ఫొటోలు తీసుకోండి. కనీసం ఎవరో ఒకరి రీల్ తయారవుతుంది, ఎవరో ఒకరి పోస్ట్ ఇన్‌స్టాలోకి వెళ్తుంది. దీనితో నేను సంతోషంగా ఉన్నాను. నాకు దృశ్యం కనిపిస్తోంది” అని ఆమె చెప్పారు.ఆమె స్పందన సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఎడిట్ చేసిన రీల్స్‌లో ఓ ప్రదేశాన్ని చూడటానికి, నిజ జీవితంలో భారీ రద్దీ మధ్య అదే ప్రదేశాన్ని అనుభవించడానికి ఉన్న తేడాను ఎదుర్కొన్న వారికి ఆమె అనుభవం బాగా అర్థమైంది.“ఇంతకంటే ఎక్కువగా ప్రచారం చేసిన పర్యాటక ప్రదేశం పేరేదేనా చెప్పండి. నేను అక్కడి వెళ్లడం కోసం వెయిట్ చేస్తుంటాను” అంటూ నేహా తన పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టి పరిస్థితిని సరదాగా ప్రస్తావించారు. ఆ పోస్ట్‌కు వెంటనే పలువురు స్పందించారు. ప్రముఖ ప్రయాణ ఫొటోలను తామూ అదే విధంగా తీయడానికి ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులతో చాలామంది తమకు సంబంధం ఉందని తెలిపారు. View this post on Instagram A post shared by Neha (@n__sees) -
శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..


