న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ముకేశ్ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.
భారత్‌కే చెందిన సూరజ్ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్ ఫవాజ్ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు.
అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో అనీశ్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు.


