క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ | Saket pair in quarterfinals of Chennai Open ATP Challenger tennis tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ

Feb 12 2026 3:47 AM | Updated on Feb 12 2026 3:47 AM

Saket pair in quarterfinals of Chennai Open ATP Challenger tennis tournament

చెన్నై: భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని... చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సాకేత్‌–సిద్ధాంత్‌ (భారత్‌) ద్వయం 2–6, 6–1, 10–2తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఎరిక్‌ వాన్‌షెల్‌బోయిమ్‌ (ఉక్రెయిన్‌)–డెనిస్‌ యెవ్‌సెయెవ్‌ (కజకిస్తాన్‌) జంటను ఓడించింది. మరో మ్యాచ్‌లో గంటా సాయికార్తీక్‌ రెడ్డి–దిగ్విజయ్‌ సింగ్‌ (భారత్‌) జోడీ 4–6, 2–6తో నిక్కీ పునాచా (భారత్‌)–ప్రుచాయో ఇసారో (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement