ఆ పిల్లల్ని చూస్తే..కన్నీళ్లు వచ్చేశాయ్‌! | How Norway Changed His View On Childhood And Learning Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ పిల్లల్ని చూస్తే..కన్నీళ్లు వచ్చేశాయ్‌! పోస్ట్‌ వైరల్‌

Jul 14 2026 5:16 PM | Updated on Jul 14 2026 5:24 PM

How Norway Changed His View On Childhood And Learning Goes Viral

నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్ట్‌ మన దేశంలోని పిల్లల బాల్యంపై దృష్టి సారించేలా చేసింది. కేరింతలు కొడుతూ సాగాల్సిన బాల్యం మన దేశంలో బ్యాగులు మోస్తూ..చదవడం, రాయడంతో బిజీబిజీగా సాగిపోతుంది. అదికాదు బాల్యం అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. బాల్యం ఎలా సాగితే ప్రయోజకులవ్వుతారో అవగాహన కల్పించేలా ఉండటం విశేషం. 

ఆ పోస్ట్‌ని వినోద్‌ అనే యూజర్‌ పంచుకున్నారు. కేవలం మూడేళ్ల వయసున్న చాలామంది పిల్లలు అప్పటికే స్కూల్‌ బ్యాగులు మోస్తూ..అక్షరాలు గీస్తూ..అంకెలు లెక్కిస్తూ..వర్క్‌షీట్‌లను పూర్తి చేస్తుండటం చూస్తుంటాం. కానీ నార్వేలో అలా కాదు అంటూ పోల్చి చెప్పుకొచ్చారు. నార్వేలో నివశించడం వల్ల పిలల్లు పెంపకం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. నార్వేలో, కిండర్ గార్టెన్‌ను పిల్లలు విద్యాపరంగా ముందుకు సాగే ప్రదేశంగా పరిగణించరని పోస్ట్‌లో రాశారు. 

అది పిల్లలు పిల్లల్లా ఉండటం నేర్చుకునే ప్రదేశమని అన్నారు. అక్కడ పిల్లలు ఏడాది పొడవునా గంటల తరబడి ఆరుబయట గడుపుతూ, అడవులు, పర్వతాలు, ఇతర సహజ ప్రదేశాలను అన్వేషిస్తారని ఆయన పంచుకున్నారు. వాళ్లు రాళ్లు ఎక్కడం, బురదలో ఆడటం, చేతులతో వస్తువులు నిర్మించడం, ప్రకృతిని సంరక్షించడం, విభేదాలను పరిష్కరించుకోవడం, స్వతంత్రంగా ఉండటం వంటి ఆచరణాత్మక జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారని అన్నారు. అదే భారత్‌లో  కేవలం మూడేళ్ళ వయసున్న ఎంతోమంది అప్పటికే స్కూల్ బ్యాగులు మోస్తూ, అక్షరాలను గీస్తూ, అంకెలను లెక్కిస్తూ, వర్క్‌షీట్‌లను పూర్తి చేస్తున్నారని అన్నారు. 

పిల్లలు కేవలం పిల్లల్లా ఉండటానికి బదులుగా, వారిని అప్పుడే తర్వాతి తరగతికి సిద్ధం చేస్తున్నట్లుగా ఉంటుందని అన్నారు. తనకు అక్కడి పిల్లల ఆరుబయట కూర్చొని నేర్చుకునే దృశ్యాలను చూస్తూ..కళ్లు చెమ్మగిల్లాయని అన్నారు. చివరగా ఆయన తన పోస్ట్‌ని ముగిస్తూ..జీవితంలో మొదటి పాఠాలు.. అక్షరాలు, అంకెలు అవ్వాలా, లేక ఆత్మవిశ్వాసం, దయ, పట్టుదల, ఉత్సుకత, ఇంకా కేవలం పిల్లల్లా ఉండటంలోని ఆనందం అవ్వాలా అని అడిగారు. అంతేగాదు ప్రతి బిడ్డకు ఎలాంటి బాల్యం దక్కాలని ప్రశ్నించారు. బ్రో మనసును తాకింది..పిల్లల్లా పెరిగితేనే బాగుటుందంటూ పోస్ట్‌లు పెట్టారు.

 

(చదవండి: వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement