మహిళలు పెళ్లి, పిల్లలు తరువాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించు కోవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఈ విషయాన్నే అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్‌కు చెందిన దీప్తి హర్షానా. ఆహారం కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. డైటీషియన్ సహాయం లేకుండా, ఖరీదైన డైట్ ప్లాన్స్ జోలికి వెళ్లకుండానే తన బరువును 92 కిలోల నుండి 60 కిలోలకు తగ్గించుకున్నారు. అదెలాగో ఒకసారి చూద్దాం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడినప్పటికీ, బరువు తగ్గాల నుకునే వారికి సరైన ఆహారపు అలవాట్లు (డైట్) చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దీప్తి హర్షానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె కేవలం ఇంట్లో వండుకునే సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో ఈ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా 5 పదార్థాలను తన ఆహారం నుండి పూర్తిగా దూరం పెట్టి ఈ సక్సెస్‌ను సాధించడం విశేషం.
చక్కెర పానీయాలు (Sugary Drinks)
ఇవి శరీరంలో కేలరీలను, బరువును మరియు ముఖం ఉబ్బిపోయేలా చేసే 'వాటర్ రిటెన్షన్'ను పెంచుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు.
వైట్ బ్రెడ్ (White Bread)
మైదాతో చేసే వైట్ బ్రెడ్‌లోని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ లేదా హోల్ వీట్ (గోధుమ) బ్రెడ్, సోర్‌డో (sourdough) బ్రెడ్ మరియు ఓట్స్ ఎంచుకున్నారు.
ప్యాక్ చేసిన స్నాక్స్ (Packaged Snacks)
చిప్స్, కుర్‌కురే లాంటి స్నాక్స్‌లో ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి (bloating, ఇంకా లేనిపోని ఆకలికి కారణమవుతాయి. వీటి స్థానంలో కొద్దిగా వేయించిన శనగలు (roasted chana), డ్రై ఫ్రూట్స్ (nuts), తామర గింజలు (makhana) తిన్నారు.
నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్ (Fried Fast Food)
వీటిలోని అధిక కొవ్వు, ఉప్పు బరువును పెంచడమే కాకుండా శరీరాన్ని బద్ధకంగా మారుస్తాయి. అందుకే ఇంట్లోనే చేసుకునే హెల్తీ వ్రాప్స్ (wraps), పనీర్ లేదా చికెన్ టిక్కా మరియు సాధారణ ఇంటి భోజనాన్ని ప్రాధాన్యత ఇచ్చారు.
ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్
అర్ధరాత్రి స్నాక్స్ (Late-Night Snacking)
రాత్రి వేళల్లో ఆలోచించకుండా ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరం లేని అదనపు కేలరీలు చేరతాయి. ఈ విషయాన్నిగ్రహించిన ఆమె రాత్రి వేళ చిరుతిండ్లను పూర్తిగా దూరం పెట్టాడు. అలాగే ఆకలిగా లేదా ఏదైనా తినాలనిపిస్తే హెర్బల్ టీ తాగాలని ఆమె సూచించారు. ఇంకా రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగడం, 7 గంటల నిద్ర, ప్రతీరోజూ వాకింగ్ చేస్తే, బాడీలో, ముఖ్యంగా మార్పు తప్పకుండా గమనిస్తారు అంటూ చెప్పుకొచ్చారు.
నోట్: కచ్చితమైన ప్రణాళిక, నిపుణుల పర్యవేక్షణ ఉంటే అధిక బరువును తగ్గించుకోవడం సులువే అవుతుంది. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలన్నా ముందుగా వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.
ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?


