breaking news
Woman
-
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్
బెంగళూరు: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్‌గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్ ఇన్‌లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్‌లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్‌పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్ తెలిపారు. -
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్‌లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్‌ప్లేస్‌లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్‌వెజ్ శాండ్‌విచ్‌లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్‌కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్‌కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్‌ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్‌పూర్‌కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్‌ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
మీరు నాకు వద్దు.. ఆమెతోనే కలిసి ఉంటా..!
జమ్మలమడుగు: ‘నా భర్త జైపాల్ రెడ్డి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నా బంగారు నగల్ని, ఆస్తులన్నింటినీ ఆమెకు ఇచ్చాడని.. నన్ను, నా ముగ్గురు ఆడపిల్లల్ని రోడ్డున పడేశాడు. మాకు న్యాయం చేయండి’ అంటూ బాధితురాలు స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో తన కుమార్తెలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘16 సంవత్సరాల క్రితం జైపాల్‌రెడ్డితో నాకు వివాహం జరిగింది. మాకు ముగ్గురు కుమార్తెలు. గీత, పావని, ప్రసన్న. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో జీవనం ప్రశాంతంగా సాగింది. అయితే ఇటీవల కొంత కాలం నుంచి మరో మహిళతో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకని తమని పట్టించుకోవడం మానేశాడు. ఇంటికి కూడా రావడంలేదు. విషయం తెలియడంతో నా భర్తను నిలదీశానని.. ఇలా పిల్లల్నివదిలిపోతే ఎలా అంటూ ప్రశ్నించాను. అయితే మీరు నాకు అవసరం లేదని.. నేను ఉంచుకున్న దాంతోనే ఉంటానని చెప్పి వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలతో ఏం చేయాలో నాకు దిక్కుతోచడం లేదు. పిల్లల పోషణ భారం అవుతోంది. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉంది. నా భర్త తమ కుటుంబాన్ని పోషించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.. న్యాయం చేయండి.. లేకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య ఒక్కటే శరణ్యం’ అంటూ స్వర్ణలత కన్నీటి పర్యంతైమంది. ఈ మేరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్‌ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన స్థానికులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్‌పై కేసు నమోదు చేశారు. కాగా తమకుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి రోదిస్తూ మీడియాకు తెలిపాడు.ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్ మరో షాక్ -
Anju టెర్రస్ గార్డెన్లో తోపు : 600కు పైగా గులాబీలు
మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే ప్రాణం. స్కూల్లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి, పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్‌లలో పెరిగే టేబుల్ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది. 15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్‌పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? ఫేస్బుక్లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి పోస్ట్ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్బుక్ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట. ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు -
రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది. -
వీడియో వైరల్: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, వికారాబాద్: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. -
హైదరాబాద్: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.సీలింగ్ ప్యాన్‌కు కర్టన్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్’.. అభ్యంతరం చెప్పడంతో..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు క్షణికావేశంతో బలవన్మరణాలకు లేదా అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక యువతి తనను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ యువతిని కడతేర్చాడు.ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతికి మరణానికి కారకుడైన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తౌఫిక్గా గుర్తించిన పోలీసులు.. అతనిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండాలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తౌఫిక్ ముందుగా బుర్ఖా ధరించి.. తాను ఎంతగానో ఇష్టపడిన నేహా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడేవున్న నేహా తండ్రిని పక్కకు నెట్టేసి నేరుగా టెర్రస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో నేహా అక్కడ వాటర్ ట్యాంక్‌ను పరిశీలిస్తోంది.అతనిని నేహా గమనించింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తౌఫిక్ ఆమెను ఐదవ అంతస్తు నుంచి తోసివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన నేహాను వెంటనే జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. కాగా నేహా అతనిని సోదరునిగా భావించిందని, అయినా అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.తౌఫిక్ మూడేళ్లుగా తమను తెలుసని, నేహా అతనిని సోదరునిలా చూసుకున్నదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే గతకొంతకాలంగా అతను నేహాను వివాహం చేసుకోవాలని భావిస్తూ, ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే నేహా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. తౌఫిక్ తన సోదరిని నెల్లాళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని నేహా సోదరి మీడియాకు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో నివాసం ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే.. -
భారత్‌లో బిందాస్‌గా బతకొచ్చు..! అమెరికా మహిళ ప్రశంసల జల్లు
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్‌పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్‌కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్‌లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్‌నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్‌ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్‌లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్‌లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్‌కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
అనర్హులకు వందనం..అమ్మల ఆగ్రహం
సోమశిల: తల్లికి వందనం పథకం అర్హుల జాబితా రూపకల్పనలో అధికారులు, ఉపాధ్యాయులు చేసిన తప్పిదాలు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే తల్లిపేరు..ఒక్కరి పేరుతో 20 విద్యుత్ కనెక్షన్లు..విద్యార్థి ఒకరైతే వారికి సంబంధంలేని వారిని తల్లిదండ్రులుగా సూచించడం..ఇలా రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవరంలో ఇలాంటి తప్పిదమే చోటుచేసుకుంది. ఇది చివరికి గ్రామంలోని మహిళల మధ్య వివాదానికి దారితీసింది.వివరాల్లోకి వెళ్తే..అనంతసాగరం మండలం గౌరవరంలో 50 మంది విద్యార్థులకు సంబంధించి 30 మంది తల్లులకు నగదు జమకాలేదు. ఆ విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో వారి తల్లుల పేర్ల నమోదులో ఉపాధ్యాయులు చేసిన తప్పిదం పథకానికి దూరమయ్యేలా చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు పడకపోగా ఆ సొమ్ము అనర్హులైన వారి ఖాతాల్లో జమైంది. దీంతో పథకానికి దూరమైన వారంతా, అనర్హులైన వారిని వెళ్లి ప్రశి్నంచారు. మా ఖాతాల్లో పడాల్సిన సొమ్ము, మీకెలా జమయ్యిందంటూ ప్రశ్నించారు. దీంతో వారంతా మమ్మల్ని అడగడానికి మీరెవరు, పోయి ప్రధానోపాధ్యాయుడిని అడగండి అంటూ సమాధానమిచ్చారు. సమాధానానికి సంతృప్తి పడకపోవడంతో వారి మధ్య గొడవలదాకా దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.నా కొడుకు డబ్బు వేరొకరికి నా కుమారుడు తారకరామ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మా అబ్బాయి పేరు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తల్లిగా నా పేరు బదులు వేరొకరి పేరు పొందుపరిచారు. దీంతో మరొకరి ఖాతాలో నగదు జమయ్యింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – గార్లపాటి సరస్వతి, విద్యార్థి తల్లి ఇలా చేయడం మంచిది కాదు నాకు ఇద్దరు పిల్లలు. స్థానిక పాఠశాలలోనే చదువుతున్నారు. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు వివరాలు మార్చారు. దాంతో మాకు పడాల్సిన తల్లికి వందనం డబ్బు వేరొకరి ఖాతాలో జమయ్యాయి. ఇలా పదుల సంఖ్యలో పథకానికి దూరమైనవారున్నారు. – కాలువ అలివేలు, విద్యార్థి తల్లి గ్రీవెన్స్‌లో పెట్టుకుంటే నగదు రికవరీ చేస్తాం రెండు రోజులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరాలు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకాని వారు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుంటే అనర్హుల నుంచి రికవరీ చేసి మళ్లీ అర్హుల ఖాతాలోకి నగదు జమ చేస్తాం. – కాటంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ–2రూ.10,900లే!రణస్థలం: రోజులు గడుస్తున్న కొద్దీ తల్లికి వందనం డబ్బు క్రమేణా తగ్గిపోతూ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్‌పురం పంచాయతీకి చెందిన దుక్క లక్ష్మి అనే లబ్ధిదారు ఖాతాలో తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలకు కలిపి రూ.26 వేలు జమకావాల్సి ఉండగా, రూ.10,900 మాత్రమే జమ అయ్యాయి. దీంతో ఆమె అవాక్కయ్యారు. దీనిపై సచివాలయానికి వెళ్లి ప్రశ్నించినా లాభం లేకపోయింది. లక్ష్మి చిన్న కుమార్తె షర్మిల 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమారుడు షారోన్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇతనికి కూడా తల్లికి వందనం ఇంకా పడలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తల్లికి వందనంలో వివక్ష కొత్తూరు: తల్లికి వందనం పథకం మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపించింది. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆరి్థక లావాదేవీలు జరుగుతున్నందున పంచాయతీ సర్పంచ్‌లుగా ఉన్న పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది సర్పంచ్ల పిల్లలకు నగదు అందలేదు. కానీ, కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్–1 ఆర్ఆర్ కాలనీ పంచాయతీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అడపాక శంకరరావు ఇద్దరు పిల్లలకు మాత్రం ఈ పథకం మంజూరైంది. ఒక కుమార్తెకు సంబంధించి తండ్రి సర్పంచ్ శంకరరావు పేరున, మరో కుమార్తెకు తల్లి అడపాక రాణి పేరున మంజూరు కావడం మరో విశేషం. వీరు టీడీపీ నాయకులు కాబట్టే డబ్బులు అందాయని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లాఠీలతో బాది.. బెల్టుతో చితగ్గొట్టిన ఎస్ఐ
పుట్టపర్తి టౌన్/గాండ్లపెంట: ఇద్దరు మహిళలపై శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట ఎస్ఐ వలీబాషా రెచ్చిపోయారు. ఓ కేసు విషయంలో మహిళలతో పాటు యువకుడిని విచక్షణారహితంగా చితకబాదారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, బెల్టుతో కొట్టడమే కాకుండా బూటుకాళ్లతో తన్నారు. దీంతో ఓ మహిళకు రెండు దంతాలు విరిగిపోయాయి. ఈ ఘటనపై బాధితులు శనివారం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నంబులపూటకుంటకు చెందిన ప్రశాంత్, రమణ, రఫీ శుక్రవారం ఒకరిపై ఒకరు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే రమణను ప్రశాంత్ అనే వ్యక్తి ‘ఒరేయ్ మామా’ అని సంబోధించాడు. ఈ మాట విన్న రఫీ భార్య హసీనా తన భర్తను ఉద్దేశించి అలా వ్యంగ్యంగా పిలిచాడంటూ ప్రశాంత్‌తో గొడవకు దిగింది. ప్రశాంత్‌కు మద్దతుగా అతడి తల్లి పార్వతమ్మ, అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ రావడంతో అందరూ గొడవపడ్డారు. తర్వాత హసీనా భర్త రఫీ నంబులపూటకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వలీబాషా సూచన మేరకు కానిస్టేబుల్ వెళ్లి ప్రశాంత్‌ను స్టేషన్‌కు రావాలని చెప్పారు. ప్రశాంత్‌తో పాటు అతడి తల్లి పార్వతమ్మ, అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ కూడా స్టేషన్‌కు వెళ్లారు. ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకోకుండా ఎస్ఐ వలీబాషా ఆ ముగ్గురినీ నోటికి వ చ్చినట్టు దుర్భాషలాడారు.స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ ముగ్గురినీ పైగదిలోకి తీసుకువెళ్లి ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ లాఠీలు, బెల్టుతో చితకబాదారు. మహిళలని కూడా చూడకుండా పార్వతమ్మ, లక్ష్మమ్మను ఎస్ఐ బూటు కాళ్లతో తన్ని, మెడ పట్టుకుని మెట్లపై నుంచి కిందకు తోసేశారు. బూటుకాలితో తన్నడంతో పార్వతమ్మకు రెండు దంతాలు విరిగిపోయాయి. వెంకటలక్ష్మమ్మ చెవికమ్మ ఊడిపోయింది. ముగ్గురి చేతులు, కాళ్లు, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అంబులెన్స్‌లో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు శనివారం స్థానికంగా న్యాయం జరగదని భావించి ఎస్ఐపై ఫిర్యాదు చేయడానికి పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ రత్న అందుబాటులో లేకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ సీఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డికి ఫిర్యాదు చేశారు. దండించానంతే..! ఈ విషయమై ఎస్ఐ వలీబాషా మాట్లాడుతూ.. ప్రశాంత్ గతంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. ఈ విషయంపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతన్ని స్టేషన్‌కు పిలిపించి దండించానే తప్ప అతనిపైన, కుటుంబ సభ్యులపైన చేయిచేసుకోలేదన్నారు. -
కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
ఫరీదాబాద్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అత్తామామల వేధింపులకు ఒక మహిళ బలయ్యింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక వీధిలో 10 అడుగుల లోతైన గుంత నుంచి పోలీసులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ నివాసి తనూ(24)గా గుర్తించారు. ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్‌కు చెందిన అరుణ్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతంలో తను భర్త, మామ, అత్త, మరొక దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటిపక్కన మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో తనూను ఆమె భర్త, అత్తామామాలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.తనూకు 2023లో వివాహం జరిగిందని, అనంతరం ఆమె అత్తవారింటిలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైందని ఆమె సోదరి ప్రీతి ఆరోపించింది. వివాహం జరిగిన వెంటనే తనూ భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు డిమాండ్ చేశారని పేర్కొంది. తాము వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఏదో కావాలని తనూను వేధించారని ఆమె తెలిపింది. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తనూ పుట్టింటిలోనే నెల్లాళ్ల పాటు ఉందని, తరువాత ఆమెను తాము అత్తారింటికి పంపామని అప్పటినుంచి తమ సోదరికి మరింతగా వేధింపులు పెరిగాయని ప్రీతి పేర్కొంది.ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె అత్తమామలు తమకు చెప్పారని, దీంతో ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, కాల్ కలవలేదని ప్రీతి తెలిపారు. దీంతో తమకు మరింతగా అనుమానం పెరిగి, పోలీసులను ఆశ్రయించామన్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతలో తనూ ఇంటికి సమీపంలో ఆమె మామ గొయ్యిని తవ్వారు. దానికి మురుగునీటి పారుదలకు అని ఆయన చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఆ తరువాత నుంచి తనూ కనిపించలేదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మీడియాతో మాట్లాడుతూ వారం రోజల క్రితం ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. గుంతలో నుండి తనూ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు -
సీఐ కొట్టారు.. మేము బతకలేము
ప్రొద్దుటూరు క్రైం : ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించాల్సిన పోలీసులే ఇష్టానుసారం వ్యవహరించడమేగాక, ఫిర్యాదురాలి కుమారుడు, భర్తపై చేయిం చేసుకోవడంతో మనస్థాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు... స్థానిక ఈశ్వరరెడ్డి నగర్‌కు చెందిన సుకన్య పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడ పనిచేసే ఏసోబుతో డబ్బు విషయమై గొడవ జరిగింది. సుకన్యకు చదవడం, రాయడం రాకపోవడంతో ఆమె అక్క లక్ష్మమ్మ, ఆమె భర్త విజయ్‌బాబు, కుమారుడు మహీధర్‌ను తీసుకుని ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు పత్రం ఇవ్వగా తీసుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య స్టేషన్ ఆవరణలోనే వాస్మాల్ ద్రావణం తాగింది. ఈ దృశ్యాలు మహీధర్ ఫోన్లో చిత్రీకరించడంతో సీఐ రామకృష్ణారెడ్డి అతడిపై చేయి చేసుకున్నాడు. బాలుడు ఏడ్వడంతో సీఐ వద్దకు వెళ్లి ‘బాబు తెలియక వీడియో తీశాడు తప్పైపోయింది వదిలేయండి’ అని చెప్పిన బాలుడి తండ్రి విజయ్‌బాబుపై సీఐ చేయి చేసుకున్నట్లు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ రెండు ఫోన్లను పోలీసులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తన కళ్ల ముందే కుమారుడు, భర్తను కొట్టడంతో లక్ష్మమ్మ మనస్థాపం చెంది రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని కాపడారు. అయితే ఈ దృశ్యం కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇంటి వద్ద ఉన్న లక్ష్మమ్మ కుమార్తెలు చూశారు. అయితే డబ్బు విషయమై జరిగిన గొడవలో పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. విజయ్‌బాబు ఫిర్యాదు మేరకు ఏసోబు, ఆయన భార్య రాజమ్మ, కుమార్తె గీతికలపై కేసు నమోదు కాగా ఏసోబు ఫిర్యాదు మేరకు విజయ్‌బాబు, భార్య లక్షుమ్మ, అన్న కొడుకుపై కేసు నమోదు చేశామన్నారు.ఆందోళనతో అడిగితే హేళన చేశారుసామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో అందోళనగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాం. తమ తల్దిండ్రులు రైలు పట్టాలపై పడుకున్నట్లు వీడియో వచ్చిందని ఆరా తీయగా.. వారు హేళనగా మాట్లాడి పంపారు. కంప్లైంట్ తీసుకోం.. మీరే వెళ్లి వెతుక్కోపోండి పోలీసులు అన్నారు.– లక్ష్మమ్మ కుమార్తెలు శ్వేత, స్మాటీ, హారికనేను దూషించలేదుసుకన్య వాస్మాల్ తాగిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్ల కుండా వీడియో తీస్తుంటే మహిధర్‌ను కొట్టినట్లు చెప్పారు. సుకన్య ఫిర్యాదును తీసుకోమని చెప్పలేదని, లక్షుమ్మను దూషించలేదని, పోలీసులను భయపెట్టేందుకు ఆమె రైలు పట్టాలపై పడుకుందని సీఐ వివరణ ఇచ్చారు.– రామకృష్ణారెడ్డి, సీఐ -
తల్లికి వందనం నగదు ఇవ్వం
కలువాయి(సైదాపురం): తల్లికి వందనం కింద జమయిన సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళను బ్యాంకు మేనేజర్ నిర్దాక్షిణ్యంగా నగదు ఇవ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటకు పంపేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కుల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన నిప్పట్ల లక్ష్మికి నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు పిల్లలు అంగన్వాడీకి పోతున్నారు. రెండో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లికి వందనం వర్తించింది.ఈ మేరకు పథకం నగదు జమయిందంటూ ఫోన్ సందేశం రావడంతో ఆనందించింది. డబ్బులను తీసుకునేందుకు ఆం«ధ్ర ప్రగతి బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంక్ మేనేజర్ వెంకట నారాయణ జోక్యం చేసుకుంటూ ‘‘మీ అత్త బ్యాంకు పొదుపు నగదు బాకీ ఉంది. నీకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వను’’ అంటూ బ్యాంకు సిబ్బందితో ఆమెను బయటకు పంపేశారు. దీంతో లక్ష్మి బ్యాంకు ఎదుట బోరుమంది. అక్కడే ఉన్న కొందరు ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో చివరికి లక్ష్మికి రూ.7వేలు ఇచ్చి పంపేశాడు. లక్ష్మి అత్త లోను కట్టలేదని రికవరీ చేశాం: బ్యాంక్ మేనేజర్ లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంక్ ద్వారా స్వర్ణ హంస గ్రూప్ నుంచి రుణం తీసుకుని కట్టడం మానేసిందని బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు. మరియమ్మ కోడలు కాబట్టి లక్ష్మి నగదును రికవరీ చేశామన్నారు. తల్లికి వందనం నగదు నుంచి లక్ష్మికి రూ.7వేలు ఇచ్చామని, మిగతా నగదు పొదుపు సంఘం రుణానికి జమ చేస్తామని మేనేజర్ అన్నారు. -
కట్నంగా కిడ్నీ
వరకట్నమా... అదెక్కడుంది? అని పైకి అంటున్నారు గానీ లాంఛనాలు నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఎన్ని అప్పులు చేస్తున్నారో సమాజానికి తెలుసు. తాజాగా బిహార్‌లో ఒక ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వరుడు అడిగిన మోటార్ సైకిల్ని పెళ్లికూతురు ఇవ్వలేననేసరికి ‘పోనీ కిడ్నీ ఇవ్వు.. అమ్ముకుంటాం’ అన్నారు. దాంతో పెద్ద కేసయ్యి పెళ్లి ఆగిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు తగ్గి ఉండాల్సిన అవసరం ఇంకా ఉందా? వాళ్లు మొదట బైక్ అన్నారు. లేదా నాలుగు లక్షల క్యాష్ అన్నారు. లేదా కిడ్నీ అన్నా ఇవ్వు అంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉంటున్న దీప్తి అనే మహిళ ఈ విషయమైన పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయడానికి వస్తే పోలీసులు కూడా డంగై పోయారు. విషయం ఏమిటంటే– దీప్తికి 2021లో పార్థ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో దీప్తి వివరించింది– ‘మా అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారు.అయినా అత్తవారింటిలో అడుగు పెట్టినప్పటి నుంచి కట్నం కోసం సూటి పోటి మాటలు వినిపించేవి. మా అత్తగారు ఆయుర్వేద దుకాణం తెరవడానికి మరో 8 లక్షలు తెమ్మని నన్ను కోరారు. నేను అతి కష్టం మీద 3 లక్షలు నాన్నను అడిగి తెచ్చాను. రెండేళ్ల క్రితం నా భర్తకు కిడ్నీ వ్యాధి ముదిరింది. అది పెళ్లికి ముందే ఉంటే దాచి పెళ్లి చేశారు. మేము ఢిల్లీకి వెళ్లి అక్కడ మా ఆడపడుచు ఇంట్లో ఉండి వైద్యం చేయించాం. అక్కడి నుంచే నాకు సమస్యలు మొదలయ్యాయి’ అని తెలిపిందామె.డబ్బు లేదా కిడ్నీదీప్తిని ఆమె అత్తామామలు మొదట బైక్ అడిగారు. తర్వాత నాలుగు లక్షలు తెమ్మన్నారు. తర్వాత భర్తకు కిడ్నీ అయినా ఇవ్వు అని డిమాండ్ చేశారు. దీప్తి ఇవ్వను అని చెప్పేసరికి పుట్టింటికి తరిమేశారు. దాంతో తట్టుకోలేకపోయిన దీప్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే విడాకులు కావాలని డిమాండ్ కూడా చేసింది. భర్త ఇందుకు నిరాకరించినా దీప్తి మాత్రం ఈ పెళ్లి నుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.మెడకు చుట్టుకుంటున్న లాంఛనాలుకట్నం అనే మాట మన దేశంలో ఎట్టకేలకు అనాగరికంగా మారాక ఆడపెళ్లివారికి ఖర్చులు మరో విధంగా చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది బంగారం. పిల్లకు ఏం పెడతారు అనే విషయం చాలా పెద్ద సమస్య– బంగారం రేటును తలుచుకుంటే! అలాగే కల్యాణ మంటపం, భోజనాలు, ఇతర ఆర్భాటాలు మహామహులను కూడా అప్పుల పాలు చేస్తున్నాయి. పెళ్లయ్యాక కూడా ఆ ఖర్చు అనీ ఈ ఖర్చు అనీ అల్లుళ్లు పిండేస్తున్నారు. కార్లు అడిగే అల్లుళ్లు కొందరైతే వ్యాపారానికి పెట్టుబడి అడిగేవారు కొందరు. ఇటు భర్తకు సర్ది చెప్పలేక అటు తల్లిదండ్రులను అడగలేక ఆడపిల్లలు పోకచెక్కలవుతున్నారు.అమ్మాయికి ఏం తక్కువ?ఇన్నేళ్ల తర్వాత కూడా అమ్మాయి డబ్బు ఇచ్చేదిగా అబ్బాయి డబ్బు తీసుకునేవాడిగా వివాహ వ్యవస్థ ఉండటం విషాదం. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ మరో వైపు కుటుంబంలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నా ‘తగ్గి ఉండే’ ధోరణిని సమాజంప్రోత్సహిస్తూనే ఉంది. విద్యావంతులైన వధూవరులు పెళ్లి విషయంలో పరస్పర గౌరవనీయమైన లాంఛనాలను చర్చించి ఎవరికీ ఇబ్బంది, ఆర్థిక భారం కలిగించని వాటికే చోటిస్తూ వివాహానికి అంగీకరించాలి. అందుకు పెద్దల్ని ఒప్పించాలి. పెద్దలు ఏవేవో డిమాండ్లు పెట్టి, నెరవేర్చుకుని పక్కకు తప్పుకున్నాక కాపురం చేయాల్సింది వధువరులే. కనుక పరస్పర గౌరవానికి చోటుండే వివాహాలపై వారే ముందడుగు వేయాల్సి ఉంది.మరాఠాలు ఇస్తున్న సందేశంమొన్నటి మే నెలలో పుణెలోని వైష్ణవి హగవానె అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం – వరకట్న వేధింపులు. ఈ ఆత్మహత్య మహరాష్ట్రలో సంచలనం సృష్టించింది. దీనికి విరుగుడు కనిపెట్టడానికి మరాఠా సమూహాలు వరకట్నాన్ని, పెళ్లి ఆర్భాటాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. పుణె చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగి రైతుల భూములకు రెక్కలొచ్చాయి. బిల్డర్లకు భూములు అమ్మిన రైతులు భారీగా ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. వీటిని చూసి సగటు మధ్యతరగతి వారు కూడా చేతులు కాల్చుకుని అప్పుల పాలవుతున్నారు. ఎంత ఖర్చయినా పర్లేదు... మంచి కుర్రాణ్ణి తేవాలని వేలానికి దిగుతున్నారు. వీటన్నింటిని నిషేధిస్తూ మరాఠా పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అక్కడి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుండటంతో ప్రభావం కనపడుతోంది. -
130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..
అధిక బరువు సమస్య అనేది అలాంటి ఇలాంటిది కాదు. వచ్చిందంటే తగ్గదు.. అన్నంతగా వేధిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. స్లిమ్‌గా మారాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే స్ట్రాంగ్ మైండ్సైట్తో శరీరంపై ఫోకస్ పెట్టి తగ్గినవారెందరో ఉన్నారు. అదే సమయంలో సత్ఫలితాలను పొందలేక ఢీలా పడ్డవాళ్లు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మనం సిన్సియర్‌గా బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలన్ని అస్సలు వర్కౌట్ కావు. అసలు అలా ఎందుకు జరుగుతుందన్నది క్షణ్ణంగా ఆలోచిస్తేనే..అధిక బరువు సమస్య నుంచి బయటపడగలం లేదంటే అంతే సంగతులు. అచ్చం అలానే చేసింది ఈ 53 ఏళ్ల సారా జేన్ క్లార్క్. ఆమె ఎంత బరువు ఉండేది తెలిస్తే విస్తుపోతారు. ఆమెలాంటి వాళ్లు తగ్గాలంటే బరువు తగ్గించే ఇంజెక్షన్ల సాయంతోనే సాధ్యం. కానీ ఆమె వాటి జోలికి పోకుండానే బరువు తగ్గి చూపించింది. ఎలాగంటే..?..సారా జేన్ క్లార్క్ టీనేజ్ వయసులోనే 130 కిలోల అధిక బరువుతో బాధపడేది. ఆమె ఉదయం క్యాడ్బరీ చాక్లెట్లు, కోకా కోలాతో మొదలయ్యేది. చక్కెర లేని పదార్థాలను ముట్టుకునేదే కాదు. అంతలా స్వీట్లకు బానిసైంది. అయితే కాలేజ్‌లో ఆమె స్నేహితులంతా నువ్వు లావుగా లేకపోతే ఎంతో అందంగా ఉండేదానివి అన్న మాటలు సారాను విపరీతంగా బాధించేవి. 25 ఏళ్లేక మరింత లావైపోయి..పీరియడ్స్ ఆగిపోయి వృద్ధాప్యానికి చేరువైన వ్యక్తుల మాదిరిగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సారా పరిస్థితిని చూసి వైద్యులు కనీసం 40 ఏళ్లు వచ్చే వరకు కూడా బతకడం కష్టమే అని చెప్పేశారు. ఆ మాటలే ఆమెపై పవర్ఫుల్ మంత్రంలా పనిచేశాయి. అప్పడే ఆమె ఎలాంటి క్రాష్ డైట్..వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండానే బరువు తగ్గి చూపించాలని స్ట్రాంగ్గాఐదు నియమాలు..రోజూ 30 నిమిషాల నడక, అధికంగా నీరు తీసుకోవడం. అలాగే ఎలాంటి ఆర్డర్లు వేయకుండా అన్ని పనులు చేసుకోవడంప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించడంతీసుకునే ఆహారంలో అధికంగా ఫుడ్ ఉన్నట్లయితే అస్సలు ముట్టుకోకుండా ఉండటంబరువు తగ్గే క్రమంలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేలా మైండ్సైట్లో మార్పుకాలక్రమేణ ఈ రూల్స్ అద్భుతమైన ఫలితాలను అందుకునేలా చేసి కేవలం 16 నెలల్లో..అనూమ్యంగా 44 కిలోల బరువు తగ్గిపోయింది. అందంగా మారడమే గాక ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెళ్లై ఇద్దరు పిల్లులు పుట్టాక కూడా..అదే పద్ధతిని కొనసాగించింది. అలా సారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్‌తో స్లిమ్‌గా మారిపోయింది. పైగా తన 40వ పుట్టిన రోజుని గ్రాండ్‌గా జరుపుకుంది కూడా. అంతేగాదు ఆరోగ్య స్ప్రూహను కొనసాగిస్తూ..అందరికి అవగాహన కల్పించేలా 5K రన్ వంటి మారథాన్లలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె 62 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.అలా చేస్తే మనకు మనం నచ్చం..బరువు తగ్గించే ఇంజెక్షన్ల క్రేజ్ ఉన్నా..వాటిపట్ల జాగ్రత్త వహించాలంటోంది. ఇంజెక్ట్ చేసుకుని మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం. బరువు తగ్గాకా.. అబ్బా స్లిమ్‌గా మారిపోయే అనే గొప్ప అనుభూతి కలుగుతుందా..? అని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన నియమాలను మనకు సాధ్యమైనవి ఎంపిక చేసుకుని తూచా తప్పకుండా పాటించండి చాలు..అద్భుతాలు సృష్టించొచ్చు అని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Sarah Jane Clark (@stepbystepwithsarahjaneinsta) (చదవండి: లావణ్య బెల్లీ డ్యాన్స్‌కు..నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..) -
సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్పఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్దమొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి.సోమవారం శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేపచెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకుని బీఎన్ఎస్ సెక్షన్లు 341/323/324/506/34 కింద కేసు నమోదు చేశారు.కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం: ఎమ్మెల్సీ భరత్కుప్పంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ‘‘కుప్పంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నా కూడా కనికరించలేదు. నారాయణపురంలో ఈ అనాగరిక ఘటన జరిగింది. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం చేస్తోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. కుప్పంలో మహిళా అధికారులకు కూడా భద్రత లేదు’’ అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎవరీ బ్లేజ్ మెట్రెవెలి? 115 ఏళ్ల చరిత్రలో..
యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు అధికారిణిగా బ్లేజ్ మెట్రెవెలిని బ్రిటన్ నియమించింది. ఈ సీక్రెట్ ఏజెన్సీ 115 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. చెప్పాలంటే మహిళలు ఎలాంటి క్లిష్టతరమైన పదవులనైనా సునాయసంగా అలకరించగలరు అని ఈ మెట్రెవెలిని నియామకంతో నిరూపితమైంది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న సర్ రిచర్డ్ మూర్ నుంచి మెట్రెవెలి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 'సీ' అనే కోడ్‌నేమ్‌తో ఈ సీక్రెట్ ఏజెన్సీ M16 చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అధికారి. అయితే ఆమె ప్రస్తుతం ఇదే సీక్రెట్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ 'Q'గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలతో పూర్తి కార్యాచరణ బాధ్యతను కలిగి ఉంటారు. అంతేగాదు ఆమె నేరుగా విదేశాంగా కార్యదర్శికి తన విధులను నివేదిస్తారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో చూసే గాడ్జెట్ నిపుణుడి మాదిరిగా మెట్రెవెలి MI6లో సాంకేతికత తోపాటు ఆవిష్కరణలను పర్యవేక్షిస్తారు. ఆమె గతంలో MI5లో సీనియర్ పదవిని నిర్వహించారు. నిజానికి దేశీయ నిఘా సంస్థ MI5లో స్టెల్లా రిమింగ్టన్, ఎలిజా మానింగ్‌హామ్-బుల్లర్ అనే ఇద్దరు మహిళా చీఫ్‌లు ఉండగా, మెట్రెవెలి MI6కు నాయకత్వం వహించనున్న తొలి మహిళ మెట్రెవెలి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్లేజ్ మెట్రెవెలి మాట్లాడుతూ.." నాసర్వీస్కు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నందుకు అత్యంత గర్వంగానూ, గౌరవంగానూ ఉంది. ఈ MI6 అనేది MI5, GCHQ లతో పాటు, బ్రిటిష్ ప్రజలను సురక్షితంగా ఉంచడం, విదేశాలలో UK ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అంతేగాదు మా MI6లో పనిచేసే ధైర్యవంతులైన అధికారులు, ఏజెంట్లు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం ". అని వెల్లడించింది మెట్రెవెలి. బ్లేజ్ మెట్రెవేలి నేపథ్యం..బ్లేజ్ మెట్రెవేలి కేంబ్రిడ్జ్‌లోని పెంబ్రోక్ కళాశాలలో ఆంత్రోపాలజీని అభ్యసించింది. ఆ తర్వాత 1999లో కేస్ ఆఫీసర్‌గా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (MI6)లో చేరారు. మెట్రెవేలి తన కెరీర్లో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్, యూరప్ అంతటా ఆపరేషనల్ పాత్రలలో గడిపారు. ఆమె ఈ MI6లో వివిధ బాధత్యలను నిర్వర్తించారు.అంతేగాదు యునైటెడ్ కింగ్డమ్ దేశీయ నిఘా సేవ అయిన MI5లో డైరెక్టర్ స్థాయి పదవులను కూడా నిర్వర్తించారామె. ఆ తర్వాత MI6లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అలాగే బ్రిటిష్ విదేశాంగ విధానానికి ఆమె చేసిన సేవలకు గాను కింగ్స్ బర్త్‌డే ఆనర్స్‌లో సెయింట్ మైఖేల్, సెయింట్ జార్జ్ (CMG)ల కంపానియన్‌గా కూడా నియమితులయ్యారు.MI6 అంటే.. MI6, లేదా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది UK విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాతీయ భద్రత తోపాటు విదేశాంగ విధానానికి మద్దుతు ఇచ్చే బాద్యతను కలిగి ఉంది. దీన్ని 1909లో స్థాపించారు. ఈ ఏజెన్సీ ఉగ్రవాదం, సైబర్ దాడులు, శత్రు దేశాల వంటి బెదిరింపులపై దృష్టిపెడుతుంది. ఈ ఎమ్ఐ6 చీఫ్‌ని 'సీ' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఇది దేశీయ ఇంటెలిజెన్స్ నిర్వహించే MI5 వలె కాకుండా MI6 ప్రత్యేకంగా విదేశాలలో పనిచేస్తుంది.(చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..) -
Dr Asima Chatterjee: సైన్స్ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలు
భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న మహిళ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన స్త్రీమూర్తి, మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యులు కావడం వంటి ప్రత్యేకతలు అసీమా చటర్జీ (Dr Asima Chatterjee) (1917– 2006) సొంతం. ప్రకృతి ఉత్పత్తులైన అల్కలాయిడ్స్, కామెరిన్స్, టెర్పనాయిడ్స్ విషయంలోఆమె కృషి విశేషమైనది. భారతీయ ఔషధ మొక్కలకు సంబంధించి వి.విశ్వాస్ గ్రంథానికి చాలా రకాలుగా అదనపు సమాచారాన్ని జోడించి ‘ట్రీటైస్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్’ను ఆరు భాగాల గ్రంథంగా వెలువరించారు.అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23న బెంగాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1944లో పి.కె. బోస్ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలి భారతీయ మహిళగా డీఎస్సీ పొందారు. వృక్ష ఉత్పత్తులకు సంబంధించి, సేంద్రియ రసాయనాలపై అధ్యయ నమే ఆవిడ పరిశోధన. ఆ సిద్ధాంత గ్రంథాన్ని నోబెల్ బహుమతి గ్రహీత ఎ.ఆర్. టాడ్ పరీక్షించి గొప్పగా అభినందించారు. ఆమె భర్త వరదానంద చటర్జీ భౌతిక రసాయనశాస్త్రంలో దిట్ట.1947లో ఆమె అమెరికా వెళ్లి నాలుగేళ్లలో ముగ్గురు వేరు వేరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల దగ్గర పరిశోధన చేశారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కారర్ ఒకరు. 1950లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, 1975లో ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతీయ ఔషధ మొక్కలు, ఆయుర్వేదానికి సంబంధించి సాల్ట్ లేక్ (కలకత్తా)లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రీజనల్ రీసర్చి ఇన్స్టిట్యూట్ రావడానికి కృషి చేశారు. మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఆయుష్ –56, అలాగే మలేరియాను నిర్మూలించేందుకు ఔషధాలను తయారు చేశారు. అసీమా పొందిన ఎన్నో గౌరవాలు, పురస్కారాలలో 1975లో లభించిన పద్మ విభూషణ్ ఒకటి.ప్రజావళిలో శాస్త్రీయ అభినివేశం లేకపోతే ఫలితం శూన్యమని ఆమె నమ్మే వారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్టణాల వద్దే ఆగిపోతే మంచిది కాదనీ, గ్రామ సీమలలోనూ అది వ్యాప్తి కావాలనీ అనేవారు. రాజ్యసభ సభ్యురాలిగా 1982 నుంచి 8 ఏళ్ల పాటు సేవలు అందించారు. విజ్ఞానమాతకు ఆభరణంగా భాసి ల్లిన అసీమా చటర్జీ 2006 నవంబర్ 22న తన 89వ యేట కన్ను మూశారు.– డా.నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్‌కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్‌పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
గిరిజన బిడ్డ ‘వీల్’ పవర్
సంస్థాన్ నారాయణపురం: మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ సరిత.. ప్రగతి రథం స్టీరింగ్ పట్టి చరిత్ర సృష్టించింది. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్ బస్సు నడిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన వి.రాంకోటి, రుక్కల కుమార్తె సరిత అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యతను తీసుకుంది.ఈ క్రమంలో ఆటో నడపడం నేర్చుకుంది. ఐదేళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. అనంతరం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. రెండేళ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయగా, సరిత ఒక్కతే ఎంపికైంది. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు పొందింది. ఆమె ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చేస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం: తెలంగాణలో ఉద్యోగావకాశం కల్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి సరిత తీసుకెళ్లింది. కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఉద్యోగం సాధించింది. ఎంజీబీఎస్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. -
ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: రాజ్‌తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పిఠాపురం: స్థానిక బైపాస్ రోడ్డులో రాపర్తి జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన మహిళ ఇంటి మమత(32) మృతి చెందింది. పిఠాపురం పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మమత, ఆమె 8 ఏళ్ల కుమారుడు సుహాస్, చెల్లెలు వరసయ్యే జగ్గంపేటకు చెందిన పెనుమర్తి సోమలత కలిసి మోటారు సైకిల్‌పై కాకినాడ నుంచి దుర్గాడ వెళ్తున్నారు. రాపర్తి జంక్షన్ వద్ద వారి వాహనానికి గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి వారు పడిపోయారు. ఈ ప్రమాదంలో మమత తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు, చెల్లెలు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కాకినాడ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేశారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చైత్ర..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నగా అది బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఈఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మూడేళ్లుగా చైత్ర పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించి భోజనంలో విషం కలిపింది. చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైత్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..
గృహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో గృహ రుణ మార్కెట్ కూడా బలపడుతోంది. అర్బన్ మనీ గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాలలో 2025 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల పంపిణీ పరిమాణం 10 శాతం, విలువలు 15 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా రూ.కోటి కంటే ఎక్కువ టికెట్ సైజు ఉన్న రుణాలు ఏడాది కాలంలో గృహ రుణ పంపిణీలో 21 శాతం మేర వృద్ధి చెందాయి. తుది గృహ కొనుగోలుదారుల డిమాండ్, పట్టణీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలతో గృహ రుణాలు సులభతరంగా పంపిణీ అవుతున్నాయి. గృహ రుణ పరిమాణం, విలువలు రెండు అంకెల వృద్ధిని నమోదు స్తోందని అర్బన్ మనీ రీసెర్చ్ వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ప్రధాన నగరాలలో మహిళా గృహ రుణ గ్రహీతలు పెరుగుతున్నారు. ప్రతి ఐదు గృహ రుణాలలో ఒక మహిళా రుణ గ్రహీత ఉంది. గృహరుణ పంపిణీలో పురుషుల వాటా 10 శాతం కాగా.. మహిళ రుణ గ్రహీతల వాటా 9 శాతంగా ఉంది. అదే లోన్ అమౌంట్లో చూస్తే మగవారి వాటా 14 శాతంగా ఉండగా.. మహిళల వాటా 23 శాతంగా ఉంది. అర్బన్ మనీ నివేదిక ప్రకారం ప్రధాన నగరాలలో సగటు రుణం రూ.74 లక్షలుగా ఉంది. ఇది ఏటేటా 5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. సగటు రుణం రూ.70 లక్షలు సగటున పురుషులు రూ.76 లక్షల రుణం తీసుకుంటుంటే.. మహిళా రుణ గ్రహీతలు రూ.70 లక్షల రుణం తీసుకుంటున్నారు. పురుషులు తీసుకునే లోన్ అమౌంట్ ఏటా 3 శాతం వృద్ధి చెందుతుండగా.. మహిళల రుణం ఏకంగా 13 శాతం పెరుగుతోంది. లోన్ అమౌంట్ వారీగా చూస్తే.. రూ.కోటి కంటే ఎక్కువ రుణం వాటా 21 శాతం కాగా.. రూ.45 లక్షల నుంచి రూ.కోటి మధ్య లోన్ వాటా 32 శాతం, రూ.45 లక్షల కంటే తక్కువ లోన్ వాటా 47 శాతంగా ఉంది. -
హైదరాబాద్‌లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్‌తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
చెప్పుతో కొట్టి.. కాళ్ల బేరానికి
శివాజీనగర: ఆవేశంలో కన్నుమిన్ను కానక ఆటో డ్రైవర్‌ను హిందీ మహిళ చెప్పుతో కొట్టింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. జైలు జీవితం తప్పదని గ్రహించిన ఆమె కాళ్ల బేరానికి వచ్చింది. బిహార్‌కు చెందిన వివాహిత పంఖూరి మిశ్రా, ఆమె భర్త ఆటోడ్రైవర్ కాళ్లపై పడి క్షమాపణ చెప్పారు. క్షమించండి ప్లీజ్ రోడ్డుపై తమ స్కూటర్‌కు తగిలాడని ఆటోడ్రైవర్ లోకేశ్‌ను పంఖూరి మిశ్రా చెప్పుతో బాదింది. వీడియో తీస్తావా.. తీయ్ అని కూడా బూతులు తిట్టింది. ఈ వీడియో వైరల్ కాగా మిశ్రా అకృత్యంపై జనం మండిపడ్డారు. ఆటోడ్రైవర్ ఫిర్యాదు మేరకు ఆమె మీద బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆ జంటను పిలిపించి విచారణ జరిపారు. నేను గర్భవతిని, ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో తగిలింది, కోపంతో దాడి చేశాను, ఆటోడ్రైవర్ నాపై దాడికి ప్రయత్నించాడు అని తెలిపింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని బెయిలు ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆటోడ్రైవర్‌కు క్షమాపణలు చెప్పారు. కన్నడిగులు తమను క్షమించాలని, బెంగళూరును, ఇక్కడి సంస్కృతిని ప్రేమిస్తున్నామని, కావాలని చేయలేదని పంఖూరి వివరణ ఇచ్చింది. ఆటోడ్రైవర్ల ధర్నా మరోవైపు చెప్పుల దాడిని ఖండిస్తూ బెంగళూరులో ఆటోడ్రైవర్ల సంఘం ధర్నా చేసింది. ఫ్రీడంపార్క్‌లో వందలాదిగా చేరి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి అనంతరం క్షమాపణ చెప్పిన యువతిబెంగుళూరు పట్టణంలోని బెల్లందూరు పరిధిలో తన స్కూటీపై వెళ్తున్న బీహార్‌కు చెందిన మహిళను వెనక నుండి ఢీకొన్న ఆటోదీంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు… pic.twitter.com/QFu8B3EwC3— Telugu Scribe (@TeluguScribe) June 2, 2025 -
ఆటోడ్రైవర్‌ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్‌ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్‌తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్‌గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్‌కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
స్టేజిపై అడిగిమరీ తన్నించుకున్న బాబు.. పరువు మొత్తం పాయె..
-
డ్రెస్సులు మార్చుతూ చోరీలు చేస్తున్న మహిళ
సికింద్రాబాద్: దొంగతనం చేసే సమయంలో మూడు డ్రెస్సులు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్‌జోన్ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కే.శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన మేరకు.. పార్సిగుట్టకు చెందిన దుర్గ ఇంట్లో ఈనెల 23న 6.7 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.38 వేలు మాయమయ్యాయని బాధితురాలు వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 500 సీసీ కెమెరాల పరిశీలనతో.... వారాసీగూడ పోలీసులు దుర్గ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పార్శిగుట్ట నుంచి మచ్చ»ొల్లారం వరకు ఉన్న సుమారు 500 కెమెరాలను పరిశీలించారు. మొత్తం పుటేజీల్లో ఒక మహిళ ప్రయాణం కనిపించింది. అయితే సీసీ కెమెరాలు మారినకొద్దీ ఆమె ధరించిన దుస్తులు మారుతుండడంతో పోలీసులకు అనుమానం వచి్చంది. మచ్చొల్లారం ప్రాంతంలో వరుస సీసీ కెమెరాలు పరిశీలించే సరికి ఒకే మహిళ «మూడు రకాల దుస్తుల్లో కనిపించడంతో ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడింది మచ్చ»ొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీది విజయ (45)గా గుర్తించారు. విచారణలో మరో రెండు నేరాలుసీసీ పుటేజీలోని మహిళ పోలికల ఆధారంగా విజయను పట్టుకున్న పోలీసులు విచారింగా ఇదే తరహాలో దుస్తులు మార్చుతూ లోగడ మరో రెండు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ పీఎస్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పీఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పేర్కొంది. సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు తాను ఒక్కో దొంగతనం చేయడం కోసం చీర, జీన్స్, నైటీ ఇలా మూడు రకాల దుస్తులు ధరించినట్టు పేర్కొంది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వా«దీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్‌జెండర్‌గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్‌లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. -
నాతో గడుపు.. సర్టిఫికెట్ ఇప్పిస్తా!
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది. విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది. ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం -
గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!
సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కంటెంట్ క్రియేటర్ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్‌గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్‌తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్ లాగా మీరు మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్‌గా షేవ్ చేసుకుంటే బెటర్’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్ టూర్ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్‌కు వెళ్లిందని, అతడిపై సెక్షన్ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది. -
Menstrual Hygiene Day : ‘నెలసరి’పై ఇన్ని అబద్ధాలా?!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగామ్, వా ట్సాప్ తదితర వేదికలపై లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చాలామంది నిపు ణులు సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. డాక్టర్లు సైతం తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ సమాచారం ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కొందరు మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్న సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లో నెలసరికి (పిరియడ్స్) సంబంధించిన వివరాలు, సలహాల కోసం మహిళలు సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం మహిళల నెలసరి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు వెల్లడయ్యింది. అందుకే మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బుధవారం ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’(Menstrual Hygiene Day). ఈ నేపథ్యంలో మహిళల నెలసరి ఆరోగ్యంపై ఇటీవల ‘ఎవర్టీన్ మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే’నిర్వహించారు. సర్వేలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 1,152 మంది మహిళలను ప్రశ్నించారు. వీరిలో 72.4 శాతం మంది 19 నుంచి 35 ఏళ్లలోపువారే ఉన్నారు. 76.6 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈ సర్వేలో ఏం తేలిందంటే. నెలసరికి సంబంధించిన సోషల్ మీడియాలో తగినంత సమాచారం అందుబాటులో ఉన్నట్లు 71.6 శాతం మహిళలు నమ్ముతున్నారు. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. పిరియడ్స్ గురించి ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తున్నారు. నెలసరి శుభ్రతపై వారు చక్కటి అవగాహన కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు. మెన్స్ట్రువల్ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం 11.5 శాతం మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తప్పుదోవ పట్టించే లేదా ప్రమాకరమైన సమాచారం సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీనవల్ల తాము శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు మహిళలు చెప్పారు. పిరియడ్స్ ఆలస్యం కావడం అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్(పీసీఓడీ)కు సంకేతమని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. (పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్) నెలసరి సమయంలో నొప్పి అధికంగా ఉంటే నిమ్మరసం లేదా కాఫీ తాగాలన్నది కొందరి సలహా. కానీ, అలా చేస్తే నొప్పి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. (వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా)నెలసరి వచ్చినప్పుడు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఆ సమయంలో వ్యాయామం చేస్తే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నెలసరిలో విడుదలయ్యే రక్తం అపవిత్రమైందని, ఆ సమయంలో దేవాలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లో పచ్చళ్లు కూడా ముట్టుకోవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికే సమాజంలో పాతుకుపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి మూఢవిశ్వాసాలను మరింత పెంచేస్తున్నారు. కొత్తకొత్తవి జోడిస్తూ మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఫలానా ఆహారం తీసుకోవాలని లేదా తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నెలసరి సమయంలో భాగస్వామితో కలిస్తే గర్భం రాదు అనేది తప్పుడు అభిప్రాయమేనని నిపుణులు అంటున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో కచి్చతత్వం, వాస్తవాలతో కూడిన, నిర్ధారించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాన్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ చిరాగ్పాన్ సూచించారు. నెలసరి శుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు 87.8 శాతం మంది చెప్పారు. 5.7 శాతం మంది డిస్పోజబుల్ పిరియడ్ ప్యాంటీస్, 4.7 శాతం మంది మెన్స్ట్రువల్ కప్స్, 1.6 శాతం మంది టాంపోన్స్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
అయ్యో ఎంత విషాదం! క్షణాల్లోనే..కన్నబిడ్డల ముందే..!
సికింద్రాబాద్: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్ ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్ తీసుకువచ్చిన వెంకటేశ్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్ నంబర్ సరిగా ప్రింట్ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్‌ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్‌ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్లైన్ టికెట్లో ప్రింట్ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. -
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు!
-
వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే నుజ్జు.. నుజ్జేగా!
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई। ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు! -
రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
వీడియో వైరల్.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌చేయడంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికారులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి
-
2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, ఆరు నెలలు పాటు నవంబర్ 23 దాకా ఆయన సీజేఐగా సేవలందిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ గవాయ్ ప్రస్తుత సిజెఐ సంజీవ్ ఖన్నా మాదిరిగానే ఆరు నెలల పాటు అత్యున్నత న్యాయాధికారిగా సేవలందిస్తారు. ఇంతకంటే తక్కువ రోజులు పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల గురించి తెలుసు కుందాం.జస్టిస్ బీవీ నాగరత్న ఘనతభారత సుప్రీంకోర్టు స్థాపించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంతవరకు ఏ మహిళకు దక్కలేదు. కానీ ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారతదేశపు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే. 2027, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఆమె ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇదే తక్కువ కాదు. అత్యల్ప కాలం సీజేఐగా పనిచేసిన వారు జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. ఆయన పదవీకాలం కేవలం 17 రోజులు మాత్రమే.సుప్రీంకోర్టులో ఒక మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే 6 సంవత్సరాల 2 నెలల పాటు పనిచేసిన తర్వాత బివి నాగరత్న 54వ సిజెఐగా ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే ఉండనుంది. సెప్టెంబర్ 27, 2027న రికార్డులు మీద రికార్డు సృష్టించనున్నారు జస్టిస్ బీవీ నాగరత్న.75 సంవత్సరాల చరిత్రలో భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే ఆరు సంవత్సరాల రెండు నెలలు పనిచేసిన రికార్డుఅంతేకాదు ఆమె తండ్రి జస్టిస్ ఇఎస్ వెంకటరామయ్య 19వ సీజేఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తొలి తండ్రీ బిడ్డలుగా నిలవనున్నారు. 2008లో జస్టిస్ బీవీ నాగరత్నకర్ణాటక హైకోర్టుకు ఎంపికయ్యారు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మరిన్ని విశేషాలుఅత్యధిక కాలం పనిచేసింది జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 7 సంవత్సరాల 139 రోజులు పనిశారు. అత్యంత తక్కువ రోజులు పనిచేసిన వారిలో కమల్నారాయణ్ సింగ్ తరువాత జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు నిలుస్తారు. రాజేంద్ర బాబు పదవీకాలు 29 రోజులు . సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే, జస్టిస్ బివి నాగరత్న మేడో అతి తక్కువ పదవీకాలం అంటే 36 రోజులు సేవలందించే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారతదేశంలోని 51 మంది 11 మంది చీఫ్ జస్టిస్‌లలో అందరూ పురుషులే. 11 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేశారు.సీనియారిటీకి అనుగుణంగా న్యాయమూర్తులను పదోన్నతి కల్పించాలనే అలిఖిత నియమాన్ని అనుసరిస్తుంది. ఈ నియమం ప్రకారం, సాధారణంగా, పరిశీలనలో ఉన్న న్యాయమూర్తులలో, సీనియర్ న్యాయమూర్తిని అత్యున్నత న్యాయస్థానానికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా, సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఇతర నియమిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలం కూడా కేవలం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఈనేపథ్యంలో మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఎనిమిది మంది ప్రధాన న్యాయమూర్తులను హైకోర్టులకు నియమించారు. వారిలో ప్రధాన న్యాయమూర్తి రాజీవ్ శక్తిధర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుండి కేవలం 24 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు.అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలంపై చర్చ మొదలైంది.భారత 40వ ప్రధాన న్యాయమూర్తి పళనిసామి గౌండర్ సదాశివం, CJIల స్వల్ప పదవీకాలంపై స్పందించారు. "నేను చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి కానీ (నా) స్వల్ప పదవీకాలం కారణంగా చేయలేకపోయాను" అని పదవీ విరమణకు రెండు రోజుల ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈయన దాదాపు తొమ్మిది నెలలపాటు పదవిలో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తులకు స్థిరమైన పదవీకాలం అవసరమని భావించారు.సెప్టెంబర్ 2024లో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ విరమణ చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో మహిళా న్యాయ మూర్తుల సంఖ్య 34 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు. ప్రస్తుతం, జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ బేలాఎం త్రివేది మాత్రమే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు. 1989లో సుప్రీంకోర్టుకు నియమితులైన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ చరిత్ర సృష్టించారు, కానీ ఆమె సుప్రీంకోర్టుకు ఎంపికైన మహిళా న్యాయమూర్తులలో రెండున్నర సంవత్సరాల అతి తక్కువ పదవీకాలం పనిచేశారు.ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తులలో 14శాతం మంది మహిళలు ఉన్నారు. సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉన్నత న్యాయస్థానంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. -
కూలి పనికెళ్తే.. పురుగులమందు తాగి చనిపోయేలా చేసారు
-
లం.. ముం.. చంపేస్తా నిన్ను
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘లం.. ముం.. చంపేస్తా నిన్ను. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మీ వల్ల ఊళ్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. లేదంటే వాళ్లు చంపేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అంటూ కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు ఓ మహిళా రైతుపై చేయి చేసుకుని రెచ్చిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డికి వకాల్తా పుచ్చుకుని బరితెగించారు. సభ్య సమాజం తల దించుకునేలా బాధిత కుటుంబాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు. సంఘటన వివరాలను బాధితులు మంగళవారం రాత్రి కర్నూలులో మీడియాకు వివరించారు.కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన నాగన్నకు 12.84 ఎకరాల భూమి ఉంది. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డి ఈ భూములపై కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఇలాంటి భూములున్న వారిని బెదిరించి ఇప్పటికే 50 ఎకరాల మేర ఆక్రమించుకున్నారు. కాళ్లావేళ్లా పడిన వారికి ఎకరాకు రూ.50–60 వేలు ఇచ్చారు. ఇలా అప్పనంగా భూములు ఇచ్చేందుకు నాగన్న కుటుంబం నిరాకరించింది. దీంతో పోలీసులను అడ్డు పెట్టుకుని వారిపై తప్పుడు కేసులు పెట్టించారు. నాగన్న కుమారులు ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు.ఈ క్రమంలో వారు ఎస్పీకి అర్జీ పెట్టుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలిసి.. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు, ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ.. నాగన్న, ఆయన భార్య, ఇద్దరు కుమారులను మంగళవారం రాత్రి కర్నూలులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ‘మాపైనే ఫిర్యాదు చేస్తారా.. మీకెంత ధైర్యం.. ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’ అంటూ తీవ్రంగా బెదిరించారు.60 ఏళ్లుగా ఈ పొలం చేస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి కేజేరెడ్డికి ఇచ్చేయాలని చెప్పడం న్యాయం కాదని నాగన్న భార్య వాపోయారు. దీంతో సీఐ ఆమెపై ఊగిపోతూ బూతులు తిట్టారు. లం.. ముం.. చంపేస్తానంటూ ఊగిపోయారు. చెంప దెబ్బ కూడా కొట్టారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దౌర్జన్యాన్ని నాగన్న కుటుంబం మీడియాకు వివరించింది. తమకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ, డీఐజీని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోలీసులకు భయపడి కొంత కాలంగా ఊళ్లో ఉండటం లేదని, డోన్ సమీపంలోని కొచ్చెరువులో ఉంటున్నామని తెలిపారు. -
మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేసన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్‌కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్‌లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి
-
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది. -
తలవంచని అమ్మతనం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
మైసూరులో పాకిస్తానీ మహిళ
మైసూరు(కర్ణాటక): మైసూరులో పాకిస్తాన్‌కు చెందిన మహిళ స్వదేశానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో ఉన్న తన భర్త పిలుచుకుపోతాడని ఆమె భారత్– పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లింది, కానీ భర్త రాకపోవడంతో ఒంటరిగా వెళ్లలేక ఉస్సూరంటూ మైసూరుకు తిరిగి వచ్చింది. మైసూరులో నివాసం వివరాలు.. మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాకిస్తాన్‌కు చెందిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కలిసి పాకిస్తాన్లో జీవించింది, పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆమె, పిల్లలతో కలిసి మైసూరుకు వచ్చి ఉంటోంది. పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం తరువాత పాకిస్తాన్ పౌరులందరూ వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఫలితంగా ఆ మహిళ పాకిస్తాన్‌కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భర్తకు ఫోన్ చేయగా పిల్లలతో కలిసి సరిహద్దుల వద్దకు రా, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమె పిల్లలను వెంటేసుకుని సరిహద్దులకు వెళ్లింది. భర్తకు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మళ్లీ మైసూరుకు తిరిగి వచ్చింది. ఆమె విజిటర్స్ వీసాతో మైసూరులో ఉంటోంది. -
విమాన టికెట్‌కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్‌లాండ్ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్‌కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది. శ్రీనగర్ కాలనీలో ఓ ప్లాట్‌లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడని, హోటల్ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల(హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభా‹Ùనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్షి్మకి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచి్చన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మీ బాధలు వినడం మా పని కాదు
సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్): సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల(సీహెచ్‌వో)పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జులుం ప్రదర్శించారు. ‘మీ బాధలు వినడం మా పని కాదు’ అంటూ చిందులు తొక్కారు. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రజలకు వైద్య సేవలందించే సీహెచ్‌వోలు తమను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు తమ గోడు చెప్పుకోవడానికి మహిళా సీహెచ్‌వోలు ఆయనను కలిశారు.వినతిపత్రం అందజేసిన సీహెచ్‌వోలకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్నెవరు లోనికి రానిచ్చారు’ అంటూ రెచ్చిపోయారు. అందరూ వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. లేదంటే ఏఎన్ఎంలతో విలేజ్ క్లినిక్‌లు నడుపుకుంటామన్నారు. సీహెచ్వోలందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్ల భారం తగ్గుతుందన్నారు. ఓ వైపు బెదిరింపు ధోరణితో మాట్లాడుతూనే మీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.కంగుతిన్న సీహెచ్‌ఓలు ‘సార్.. మా బాధలు ఒక్కసారి చెప్పుకోనివ్వండి’ అని బతిమాలుకున్నా మంత్రి వినలేదు. ‘యూనియన్లు పెట్టుకుని వంద మందిని చెడగొడతారు’ అంటూ వారిని కసురుకున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కుటుంబ ఖర్చులు, పిల్లల పోషణకు చాలడం లేదని, జీవన వ్యయం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీహెచ్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యల్ని అర్థం చేసుకోవాలని మంత్రిని సీహెచ్‌వోలు అభ్యరి్థంచగా.. వారి ఆవేదనను చెవికి ఎక్కించుకోలేదు.నోరు, కళ్లు మూసుకుని సీహెచ్‌వోల వినూత్న నిరసన చిలకలపూడి (మచిలీపట్నం): ఆయుష్మాన్ భారత్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌వో)గా పనిచేస్తున్న తమ సమస్యలపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘ నాయకుడు వి.నాగబాబు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న శాంతియుత నిరసన శనివారం ఆరో రోజూ కొనసాగింది. వారంతా నోరు, కళ్లు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. -
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. -
సెంచరీ దాటేసిన బక్కమ్మ.. ఎక్కడ?
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి 105వ జన్మదిన సంబరాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన చీమల బక్కమ్మ 104 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపైకి చేరుకుని శుక్రవారం గ్రామంలో ఆనందోత్సవాల నడుమ జన్మదినాన్ని నిర్వహించారు. బక్కమ్మకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరి తరఫు కుటుంబమంతా (121) మంది బుధరావుపేటలో శుక్రవారం కలుసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించారు.‘‘సెంచరీలు కొట్టే వయసు మాది పాడుకోవడం కాదమ్మా... ‘శతాయుష్షు’ అనే ఆశీస్సుకు అసలైన అర్థంలా బతకాలి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటూ జీవితంలో సెంచరీ కొట్టేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి’’ అంటోంది శతాధిక మహిళ. ఇదీ చదవండి: Vegan ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!నూరేళ్లు బతకాలనే కల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా మన జీవన శైలి ఉండాలి. ఒత్తిడి లేని , సంతోషకరమైన జీవితం. ఎలాంటి కష్టాన్నైనా సానుకూలంగా మల్చుకుంటూ ముందుకు సాగిపోయే తత్వం, చక్కటి ఆహార నియమాలు, వ్యాయామం ఇవన్నీ సుదీర్ఘ కాలం జీవించేందుకు దోహదపడతాయి. -
విశాఖలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్‌కు గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్‌లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.మరో విషాద ఘటనలో..ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి నగలు స్త్రీ ధనమే
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది. -
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!) -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.. పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్‌కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్కోస్ట్కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్. ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్లర్లు, ఇంప్లాంట్లను తొలగించుకుంది. కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
ఇటీవల ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్ చేసే సర్వీస్లకే పరిమితం కావడం లేదు. వాళ్లు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా..అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఉబర్ ఆటోలు, క్యాబ్లే నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కారుని సెట్ చేశాడు ఈ డ్రైవర్. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఒక మహిళ తన ఉబర్ రైడ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారు లోపలి విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్ బెడ్రూం ఫ్లాట్లా ఉంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెటప్ చేసి ఉన్నట్లు కనిపిస్తోంది. కూల్‌డ్రింక్స్,వాటర్ బాటిల్స్, చిప్స్ వంటి స్నాక్స్, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటిన్నంటి తోపాటు డస్ట్‌బిన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విశేషం అంటే..ఫీడ్‌బ్యాక్ డైరీ తోపాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ..ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ కూడా సీటుపై అతికించాడు. నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖధీర్ క్రియేటివిటీ అదుర్స్ అనే చెప్పాలి. నెటిజన్లను సైతం ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంది. ఆతిథ్య బ్రాండ్‌కి పేరుగాంచిన క్యాబ్ అని, ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరూ మాత్రం అకస్తాత్తుగా బ్రేక్ వేస్తే..వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ఆ సెటప్ గాయలపాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. Literally traveling in a 1bhk today. Hands down the coolest Uber ride ever! pic.twitter.com/O3cHSF30o2— Akaanksha Shenoy (@shennoying) April 25, 2025(చదవండి: ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..) -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్‌లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్‌పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ -
అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఓ విదేశీయురాలు భారతీయ పౌరసత్వానికి సరితూగే ఓ హక్కుని సంపాదించుకుంది. ఇక అంతే ఇది వెలకట్టలేని ఆనందం అంటూ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది. విదేశీ గడ్డపై పుట్టిన ఆమె..హే ఇక నేను భారతీయురాలినే అంటూ ఆనందంతో పొంగిపోతూ వీడియోలో చెబుతుండటం కనిపిస్తోంది. నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్నిచూసి విస్తుపోయారు. రష్యన్ జాతీయురాలు మెరీనా ఖర్బానీ ఇన్‌స్టాగ్రాంలో తన సంతోషాన్నివ్యక్తపరిచే వీడియోని షేర్ చేసుకుంది. ఆమె షిల్లాంగ్ నివాసం ఉంటుంది. ఆ వీడియోలో ఒక చేతిలో బిడ్డను పట్టుకుని, మరో చేతిలో OCI కార్డును చూపిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు నేను భారతీయురాలినే అంటూ ఉద్వేగంగా చెబుతుంది ఆ వీడియోలో. మూడున్నర సంవత్సరాల కృషి ఫలితం అని కూడా చెబుతుండటం కనిపిస్తుంది. అలాగే తన తదుపరి లక్ష్యం తన బిడ్డ కూడా ఈ కార్డుని పొందడమే అని ఆ వీడియోలో చెబుతుందామె. అంతేగాదు నెట్టింట షేర్ చేసిన ఆ వీడియోకి "చివరకు నేను భారతీయురాలిని" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారామె. అలాగే నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్ని చూసి ఆశ్యర్యపోవడమే గాక, మీరు ఎల్లప్పుడూ భారతీయులే కాకపోతే ఇప్పుడే ఈ పత్రాలు దాన్ని ధృవీకరించాయి అంతే అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఖర్బానీ ప్రేమ వివాహం అనంతరం షిల్లాంగ్ స్థిరపడ్డానని, తల్లిగా మారడం, ఇక్కడ భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకోవడం తదితరాల గురించి ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె. ఓసీఐ కార్డు అంటే..ఇది పూర్తి భారతీయ పౌరసత్వం కాదు. కానీ భారత సంతతికి చెందిన విదేశీ పౌరులకు అనే హక్కులను మంజూరు చేస్తుంది. అంటే వీసా అవసరం లేకుండానే భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి, పనిచేయడానికి, ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by MARINA KHARBANI Russian in India (@terk_love) (చదవండి: సమ్మర్ హీట్‌ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్‌గ్లాస్ పెట్టాల్సిందే..! ఎలాంటివి బెస్ట్ అంటే..) -
ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Kamala Sohonie భారతీయ తొలి మహిళా డాక్టరేట్
తొమ్మిది దశాబ్దాల క్రితం ఓ యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటమే చేయాల్సివచ్చింది. ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్‌తో! ఆ యువతి కమలా సోహానీ Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ! బొంబాయిలో 1911 జూన్ 18న జన్మించారు కమలా భాగ వత్. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసా యన శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. తర్వాత సీవీ రామన్ డైరెక్టర్‌గా ఉన్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ (నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ ళూరు)లో ఎమ్మెస్సీ చదవాలని ప్రయ త్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదు వుకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించేది. సీవీ రామన్ కూడా దాన్నే నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భాగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత రామన్ మహాశ యుడు కమల పట్టుదలను గమనించ లేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో రామన్ దిగిరాక తప్పలేదు. చివరకు ప్రవేశ మిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో! అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీగా చేరవలసి వచ్చింది. ‘అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు’– ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు! అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎమ్మెస్సీ పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు.దీంతో రామన్ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడంప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్య యనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యారు. పీహెచ్డీ కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో ‘సైటోక్రోమ్ సి’ అనే ఎంజైమ్ ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటు న్నదనీ కనుగొన్నారు. తన పరిశోధనా ఫలితాలను కేవలం 40 పుటలు ఉన్న సిద్ధాంత గ్రంథంగా కేంబ్రిడ్జి యూని వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు. విజ్ఞానశాస్త్ర రంగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమల అవతరించారు.ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఎం.వి. సోహా నీతో 1947లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కమలా భాగవత్‌పేరు కమలా సోహానీగా మారింది. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు, తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగు లేనివి.ఎనభయ్యారేళ్ళ వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 1998 జూన్ 28న ఆమె హఠాత్తుగా మరణించడం ఆమె జీవన యాత్రకు ఆశ్చర్యకరమైన ముగింపు!– డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ చేస్తోంది. -
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
హైదరాబాద్: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది. -
'బెస్ట్ డెసీషన్': భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
మన భారతదేశం ఖ్యాతీ ఖండాంతరాలకు కూడా చేరవవుతోంది. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో పలువురు విదేశీయలు పంచుకున్న తమ భారత పర్యటన అనుభవాలే. ప్రతి విదేశీయుడు ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తుంటే మనమే ఎంత గొప్పవాళ్లం అనిపిస్తోంది. అంతెందుకు మన భారతీయులే ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యి కూడా.. మళ్లీ ఇక్కడకు వచ్చేస్తున్నారు. మాతృభూమే గొప్పదని కితాబిస్తున్నారు. మనం పుట్టిన దేశం కాబట్టి మనకు నచ్చుతుంది. కానీ ప్రాంతాలు, భాష, సంస్కృతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ విదేశీయలు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతుండటమే అత్యంత విశేషం. తాజాగా ఆ కోవలోకి మరో డెన్మార్క్ మహిళ కూడా చేరింది. పైగా ఆమె ఎలాంటి ప్లాన్ చేయకుండానే భారత్‌కి వచ్చి మంచి పనిచేశానంటోంది. మరీ ఆమెకు అంతగా భారత్‌లో ఏం నచ్చాయో చూద్దామా..!.డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్‌హాగన్‌లో నివశించే ఎస్మెరాల్డా అనే మహిళ భారత పర్యటను వెళ్లాలనే నిర్ణయం తీసుకుని మంచి పనిచేశానని అంటోంది. ఆ కోపెన్హాగన్ నగర వాతావరణంతో విసుగొచ్చేసిందని, మంచి మార్పుకావలని కోరుకున్నట్లు చెబుతోంది. అందుకోసమే తానెంతో ఇష్టపడ్డ స్నేహితులు, ఉద్యోగాన్ని, నాకిష్టమైన అపార్ట్మెంట్ తదితరాలన్నింటిని వదిలేసి మరీ భారత్ పర్యటనకు వచ్చేసిందట. ఇది తాను తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ అని చెబుతోంది. వేసవిలో మాత్రమే కోపెన్హాగన్ సరదాగా ఉంటుందే తప్పా..మిగతా సమయాల్లో బోరుగానే ఉంటుందని వాపోతోంది. అంతేగాదు తన నగరాన్ని నిద్రాణమైన ప్రదేశంగా అభివర్ణిస్తోందామె. ఇక భారతదేశంలో రిషికేశ్ నుంచి గోవా, ముంబై అంతటా చేసిన పర్యటనల్లో పొందిన అనుభవాలను డాక్యమెంట్ చేసి మరీ..ఇన్‌స్టాగ్రాంలో వీడియో రూపంలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఎస్మెరాల్డా భారత్‌పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ప్రజల ఆదరణను ఎంతగానో కొనియాడింది. ఈ భారత పర్యటనలో తన గురించి తాను తెలుసుకోగలిగానంటోంది. ఇక్కడ ప్రకృతి, వైవిధ్య భరితమైన సంస్కతి తనను ఎంతగానో కట్టిపడేశాయంటోంది. అంతేగాదు భారతదేశం తనలోని కొత్తకోణాలను పరిచయం చేసిందట. ఇక్కడ జర్నీ ఓ అపూర్వ అనుభవాన్ని అందిచాయట. పైగా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందించిందని అంటోంది. చివరగా ఈ భారత పర్యటన తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది. నిజానికి తాను యూరోపియన్ వేసవి సాహసయాత్రకు బయలుదేరే ముందు అనుకోకుండా భారతదేశ పర్యటనకు వచ్చానని, అనుకోకుండా ఇంకో నెల ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది. ఇలా ఆమె దాదాపు పది నెలలు భారత్‌లో గడిపిందట.అంతేగాదు వర్షాకాలంలో భారత్‌కి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు కూడా ఆల్‌ది బెస్ట్ చెబుతూ..భారతదేశానికి వస్తూ ఉండండి అని ఆమెను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Astrid Esmeralda 🧚🏽♀️ Solo traveler (@astrid__esmeralda) (చదవండి: Train With ATM: దేశంలోనే తొలి ఏటీఎం రైలు..! ఎక్కడంటే..) -
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసి డబ్బు దోచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి, అధికారులు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ యువతి మాత్రం స్కామ్ చేసి మోసం చేద్దామన్న వ్యక్తికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఓ యువతికి స్కామర్ ఫోన్ చేసి, తాను తన తండ్రి ఫ్రెండ్ అని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ యువతి చాలా గౌరవంగా నమస్తే అంకుల్ అంటూ మాట కలిపింది. నేను (స్కామర్) మీ తండ్రికి రూ. 12000 ఇవ్వాలి. ఆ మొత్తాన్ని పంపిస్తున్నా అని చెప్పాడు. నెంబర్ కన్ఫర్మ్ చేసుకుని.. మొదటి 10 రూపాయలు పంపినట్లు టెక్స్ట్ మెసేజ్ చేసాడు.పది రూపాయలు వచ్చాయి అంకుల్ అని.. ఆ యువతి అమాయకంగా సమాధానం చెప్పింది. ఆ తరువాత మరో రూ.12000 పంపిస్తున్నా అంటూ 10,000 రూపాయలు పంపినట్లు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ చేసాడు. రూ. 10వేలు కూడా వచ్చాయని యువతి చెప్పడంతో.. మరో రూ. 2000 పంపిస్తున్న అని చెప్పి.. రూ. 20000 పంపినట్లు మెసేజ్ చేసాడు.అయ్యో అంకుల్ మీరు రూ. 2000 పంపిస్తున్నా అని.. రూ. 20000 పంపించేశారు అని యువతి చెప్పింది. అరెరే.. అనుకోకుండా పొరపాటు జరిగిందంటూ స్కామర్ నటిస్తూ.. రూ. 2000 ఉంచుకుని మిగిలిన రూ. 18000 తనకు యూపీఐ యాప్ ద్వారా పంపాలని చెప్పాడు. ముందే అది స్కామ్ అని గ్రహించిన యువతి.. స్కామర్ పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసి.. రూ. 20వేలు దగ్గర.. రూ. 18000 అని టైప్ చేసి.. అదే నెంబరుకు టెక్స్ మెసేజ్ చేసి.. అంకుల్ మీ అమౌంట్ తిరిగి పంపించేసాను చూసుకోండి అని చెప్పింది.ఇదీ చదవండి: ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!.. వీడియోఆ యువతి చేసిన పనికి స్కామర్.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. చేసేదేమీ లేక స్కామర్ ఊరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ యువతి తెలివిని తెగ పొగిడేస్తున్నారు. స్కామర్ల పని పట్టాలంటే.. ఇలాంటి వారే కరెక్ట్ అని కొందరు చెబుతున్నారు.Kalesh prevented by girl while talking to Scammer pic.twitter.com/d8sNRwjASy— Ghar Ke Kalesh (@gharkekalesh) April 13, 2025 -
క్షుద్ర పూజలు: దడపుట్టించిన నల్లకోడి, ఈకలు, జాకెట్టు
బాపట్ల: మార్టూరులో ఆదివారం ఉదయం క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లను గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. అక్కడ పరిశీలించిన విలేకరులకు ప్రత్యేకంగా కుంకుమ చల్లి దానిపై మహిళకు చెందిన జాకెట్టును పెట్టి ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, సమీపంలో మల్లెపూలు ఉంచి పూజలు చేసినట్లు కనిపించింది. దీని పక్కనే చిన్న సైజు నల్లకోడి పిల్లను కాల్చి దహనం చేసినట్లుగా చిన్నచిన్న ఎముకలతోపాటు కోడి ఈకలు కనిపించటం గమనార్హం. క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి చెందిన ఫొటోను కుంకుమలో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు ఆ సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. నేతాజీ కాలనీకి సమీపంలో జరుగుతున్న ఈ క్షుద్ర పూజల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
నీవు నాకు తెలుసు.. నీ నంబర్ నా దగ్గర ఉంది..!
వట్పల్లి(అందోల్): ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్‌ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై వట్పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్‌డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు. -
సినిమాని తలపించేలా ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి లవ్‌స్టోరీ..!
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది. తాను ఆంద్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్‌స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్లో సవివరంగా వెల్లడించింది. చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్‌ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Jaclyn Forero (@jaclyn.forero) (చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..) -
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే..మా అక్కనే స్ఫూర్తి..నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది.సొంతంగానే చదివా..గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్‌కు అవసరమయ్యే మెటీరియల్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్‌లో నాకు అవసరమైన మెటీరియల్‌ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్‌లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. -
విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఔరంగాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్ -
మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి
మలప్పురం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికీ మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి ఇవి వికటించి, మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కేరళ(Kerala)లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లికుండా ఇంటిలోనే పురుడు పోసుకునేందుకు ప్రయత్నించిన 34 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.కేరళలోని మలప్పురం జిల్లా(Malappuram district)లో ఈస్ట్ కోడూర్ ప్రాంతానికి చెందిన అస్మా(34)కు ఇంటిలోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తన ఐదవ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్మా ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబావూర్‌కు చెందినది. అయితే ఆమె భర్త సిరాజుద్దీన్‌తో కలిసి మలప్పురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం అందకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. అస్మా భర్త సిరాజుద్దీన్ మత సాంప్రదాయాలను పాటిస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే మూఢాచారాలను ఆశ్రయించే ఆయన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటన తర్వాత సిరాజుద్దీన్ తన భార్య మృతదేహాన్ని పెరుంబావూర్‌కు తీసుకెళ్లి, అక్కడ సమాధి చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెరుంబావూర్ పోలీసులు(Perumbavoor Police) వెంటనే రంగంలోకి దిగి, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. కాగా అస్మాకు జన్మించిన నవజాత శిశువు (బాలుడు) ప్రస్తుతం పెరుంబావూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అస్మా మరణంచడానికి గల కారణాలను, ఆమెకు సరైన వైద్య సదుపాయాలు ఎందుకు అందలేదనే అంశంపై విచారిస్తున్నారు. ఈ దుర్ఘటన కేరళలో ఇంటి వద్ద జరిగే ప్రసవాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సరైన వైద్యవ్యవస్థ ఉన్నప్పటికీ, మలప్పురం జిల్లాలో ఇంటి వద్ద ప్రసవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2019-2024) కేరళలో 2,931 ఇంటి ప్రసవాలు నమోదయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో మలప్పురం జిల్లాలోనే 1,244 కేసులు ఉన్నాయి. 18 నవజాత శిశువుల మరణాలు కూడా జిల్లాలో సంభవించాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
177- 95 కిలోలకు!.. బరువు తగ్గడమే శాపమైంది.. చివరికి పాపం ఆమె..!
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్‌గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది. కానీ వర్కౌట్లు, డైట్లతో కష్టపడటం కంటే సులువుగా, త్వరితగతిన తగ్గిపోవడమే నచ్చుతోంది చాలామందికి. అందుకే వారంతా సర్జరీల బాట పడతున్నారు. అయితే ఆధుని వైద్య విధానం ఎంతలా అభివృద్ది చెంది..నిమిషాల్లో శరీరం స్లిమ్‌గా అయిపోయే కొంగొత్త వైద్య విధానాలు వచ్చినప్పటికీ.. అవన్నీ ప్రమాదకరమే అని నిపుణుల పదే పదే హెచ్చరిస్తూన్నారు. కానీ నాజుగ్గా అయిపోవాలన్న ఇంటెన్షన్‌తో వాటన్నింటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అనవసరం అన్నట్లుగా..బరువు తగ్గే సర్జరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. పాపం అలానే చేసి ఓ మహిళ భారీ మూల్యమే చెల్లించుకుంది. తిరిగి మాములు మనిషి కావడానికి ఎంత నరకయాతన అనుభవించిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఏం జరిగిందంటే..యూకేకికి చెందిన 42 ఏళ్ల డేనియల్ పీబుల్స్ అనే మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో 2023లో గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంది. అయితే ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థలు అందుకోసం ఏడేళ్లు నిరీక్షించాలని చెప్పాయి. బాబోయే అన్నేళ్లు వెయిట్ చేయడం ఏంటని.. టర్కీ వెళ్లి మరీ బరువు తగ్గించుకునే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకుంది. నిజానికి ఆమె 177 కిలోల ఊబకాయం సమస్యతో బాధపడుతుంది. ఆమె తన బిడ్డకు పుట్టబోయే చిన్నారితో హాయిగా గడపాలంటే ఇంత భారీ కాయం పనికిరాదని భావించి ఈ శస్త్రచికిత్సకు రెడీ అయ్యింది. అనుకున్నట్లుగా ఈ సర్జరీతో ఆమె ఏకంగా 95 కిలోల బరువు గణనీయంగా తగ్గిపోయింది. డేనియల్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. సదరు టర్కీ ఆస్పత్రి యజమాన్యాన్ని కూడా ప్రశంసలతో ముచ్చెత్తింది. అంతా బాగానే ఉందనుకునేలోపే..రోజులు గడుస్తున్న కొద్దీ డేనియల్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమైంది. అది చివరకి బెడ్‌మీద నుంచి కాలు దించడానికే భయపడేంత పరిస్థితికి చేరుకుంది. అలా ఒకరోజు మెడ నుంచి కింద శరీరం అంతా చచ్చుబడిపోయి పక్షవాతం బారినపడింది. ఇక ఆమె తిరిగి నడవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. బరువు తగ్గానన్నా.. ఆనందం ఆవిరైపోయి..బతుకే భారంగా మారిందనే.. బాధతో విలవిలలాడింది. అసలు తనకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని వైద్యులను ప్రశ్నించగా..ఈ బరువు తగ్గే సర్జరీ కారణంగా నరాల పనితీరుకి సంబంధించిన విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నరాల పనితీరు మెరుగవ్వడం అనేది అంత ఈజీ కాదు..అందువల్ల మళ్లీ తాను యథావిధిగా నడవడం అనేది సాధ్యమా..? అనేది చెప్పడం కష్టమని అన్నారు వైద్యులు. దాంతో ముందు తాను ఈ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్పా..కుంగిపోకూడదని ఫిక్స్ అయ్యింది. ముందుగా నిపుణులైన వైద్యుల సమక్షంలో ఇంటెన్సివ్ చికిత్స తీసుకుంది. చివరకు ఆమె నరాల పనితీరు మెరుగై తిరిగి నడవగలిగేలా కింద ఉన్న ప్రతి అవయవంలో స్పర్శను తిరిగి పొందింది. చూస్తుండగానే..కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడింది. బరువు తగ్గాలనుకుంటే..అందుకు ఇంత మనోబాధను చెల్లించుకుంటానని కలలో కూడా ఊహించలేదని వాపోయింది డేనియల్.ఈ సర్జరీలు ఇంత ప్రమాదకరమా?గ్యాస్ట్రిక్ స్లీవ్ శస్త్రచికిత్స: దీనిని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స (బారియాట్రిక్ సర్జరీ). ఈ శస్త్రచికిత్సలో కడుపును చిన్న అరటిపండు ఆకారంలోకి కుదించి.. ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఆయా వ్యక్తులు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో అప్పుడు పోషకాహార లోపం ఎదురవుతుంది. ఇది కాస్తా.. శరీరానికి తగినంతగా విటమిన్లు తీసుకోకపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా నరాల పనితీరుకు అవసరమై బీ విటమిన్ లోపం ఏర్పడి పలు ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.అక్కడైతే ఖర్చు తక్కువ.. విదేశాల్లో తక్కువ ధరలో ఊబకాయం శస్త్రచికిత్స చేయించుకోవచ్చని..చాలామంది అక్కడకు వెళ్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాల్లో ఇంకా చౌక. అంతేగాదు అక్కడ బ్రిటన్ వాసులు కూడా ఈ సర్జరీ చేయించుకుని పలు అనారోగ్య సమస్యల బారిన పడటం లేదా మరణించడం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఈ శస్త్ర చికిత్స కోసమే సుమారు 5 వేల మందికి పైగా వ్యక్తులు విదేశాలకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయ్. తస్మాత్ జాగ్రత్త..!. ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు తగ్గి..ఆరోగ్యంగా ఉందాం..!.(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై కత్తితో దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో మరో దారుణం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై 19 ఏళ్ల యువతిపై కత్తితో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడికి పాల్పడిన నిందితుడు గతంలో బాధితురాలికి పరిచయం అయిన వ్యక్తి అయివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించడంతోపాటు స్థానికులను విచారిస్తున్నారు.ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రత(Women's safety)పై మరోసారి అనుమానాలను లేవనెత్తింది. ఈ ఘటన దరిమిలా సామాజిక మాధ్యమాల్లో ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆమె చికిత్స పొందుతోందని తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడమేంటని పట్టుపట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని భార్యకు తేల్చిచెప్పాడు. ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. తన మాట విననందుకు కుటుంబ సభ్యుల్ని పిలిపించింది భార్య. ఈ విషయంలో భర్తతో అమీతుమీ తేల్చుకోవడాని సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవపడ్డాడు.. అయితే భర్తపై భార్య తరఫు బంధువులు దాడికి దిగారు. తన కొడుకును ఒక్కడిని చేసి దాడి చేస్తున్నారని తల్లి పరుగెత్తుకొచ్చింది. కొడుకును రక్షించాలని తాపత్రాయపడింది. మరి కోడలు ఊరుకుంటుందా.. అత్తను జట్టు పట్టుకుని కిందకు పడేసింది. పడిపోయిన అత్తపై మళ్లీ మళ్లీ దాడి చేసింది సదరు కోడలు.వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన విశాల్ బత్రా, నీలిక భార్యా భర్తలు. వీరితో కలిసి విశాల్ తల్లి ఉంటోంది. 70 ఏళ్లు పైబడ్డ వయుసులో కొడుకును ఆశ్రయించింది. తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్.. తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే కోడలు ఊరుకోలేదు. ఎంతకాలం ఈ ముసలామెను ఇంట్లో ఉంచుతావంటూ భర్తతో పదే పదే గొడవ పడేది. ఇలా ఏడాదికి పైగానే గడిచింది. ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య.. తన బంధువుల్ని గొడవకు పురామాయించింది. ఎలాగైనా సరే అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకుని కూర్చొంది. విశాల్ ఇంటికి వచ్చిన ‘పెద్దలు’( భార్య తరప/ బంధువులు) అతనిపై దాడికి పూనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ పై దాడికి దిగారు. దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి యత్నించింది. ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆ పెద్దామెను జట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె కిందపడిపోయినా మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనను ఇండియన్ ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ తో సహా పలు జాతీయ చానళ్లు వెలుగులోకి తెచ్చాయి.Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr— IANS (@ians_india) April 4, 2025 నా భార్య వేధిస్తోంది.. చివరకు దాడి చేసింది..దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశాల్.. బయట మీడియాతో మాట్లాడారు. ‘ నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను. సుమారు 10 నుంచి 15 మంది వరకూ నా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మపై దాడి చేశారు. నా తల్లిని బయటకు పంపేయమని నా భార్య వేధిస్తోంది. దీన్ని నేను కాదనడంతో నాపై దాడికి చేయించింది. నీలిక సోదరుడు, తండ్రి కలిసి మమ్మల్ని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజూ తీవ్రంగా తిడుతూ ఉంటోంది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను’ అని విశాల్ తెలిపాడు. -
హైదరాబాద్: టవర్స్‌పై నుంచి దూకిన ఇన్‌కంట్యాక్స్ అధికారిణి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి.. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు సమాచారం. జయలక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. పాటరీ వర్క్షాప్నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది. -
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
బెంగళూరు: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో ఎఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీదేవి రుదాగి అనే టీచర్.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తన ఐదేళ్ల కూతుర్ని 2023లో బెంగళూరులోని ఓ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి సతీష్(పేరు మార్చాం). అయితే అక్కడే అసలు కథ మొదలైంది. పాపను స్కూల్ కు తీసుకొచ్చి, తీసుకెళ్లే క్రమంలో అతనితో టీచర్ శ్రీదేవి సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇలా ఇరువురి మధ్య ప్రారంభమైన వ్యవహారం కాస్తా ముదిరింది. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యంగా ఉండటాన్ని సీక్రెట్ గా వీడియో రికార్డు చేసింది. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తనకు డబ్బులు కావాలంటూ పదే పదే వేధించసాగింది. కాలే, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టింది ఇలా మొత్తం మీద రూ. 4 లక్షల వరకూ లాగేసింది.ఏకంగా ఇంటికి..ఇక తనతో సాన్నిహిత్యం తగ్గించడంతో వ్యాపారి ఇంటికి వచ్చేసింది టీచర్ శ్రీదేవి. తనకు అప్పు కావాలనే వంకతో ఇంటికి వచ్చింది. అక్కడ రూ. 50 వేల అప్పు రూపంలో ఆమెకు ఇస్తున్నట్లు ఇంట్లో నమ్మించాడు సదరు వ్యాపారి. ఆ తర్వాత కూడా ఆమె నుంచి వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.మకాం మార్చాడు..ఇక ఆమె వేధింపులు అధికం కావడంతో గుజరాత్ కు మకాం మార్చాడు సదరు వ్యాపారి. అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది. అలా ఆమె ఆఫీస్ లో చిక్కుపోయాడు వ్యాపారి. అక్కడ వీడియోలు, ఫోటోలు చూపిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది. అక్కడ కాలే, సాగర్ లు కూడా ఉండటంతో చివరకు చేసేది లేక బయటకొచ్చాడు.పోలీసులకు ఫిర్యాదుఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీదేవితో పాటు కాలే, సాగర్ లను కూడా అరెస్ట్ చేయగా,. ఆ ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
మారు తల్లి కర్కశత్వం
ఫిరంగిపురం: ఆరేళ్ల చిన్నారులపై మారు తల్లి కర్కశత్వంగా ప్రవర్తించింది. పిల్లలిద్దరినీ బెల్టు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టింది. ఓ బాలుడిని వేడివేడి పెనంపై కూర్చోపెట్టి.. మరో బాలుడిని గొంతునులిమి చంపేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్‌కు ఇద్దరు కవల పిల్లలు కార్తీక్(6), ఆకాశ్. రెండేళ్ల కిందట భార్య అనారోగ్యంతో చనిపోయింది. అనంతరం సాగర్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ప్రకాశం పంతులునగర్కు చెందిన జి.లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు.వారిద్దరికీ పాప జన్మించింది. లక్ష్మి ప్రతిరోజూ కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలు పెడుతుండేది. శనివారం బెల్టు, కర్రలతో విచక్షణారహితంగా వారిద్దరినీ కొట్టింది. కర్రతో కార్తీక్ తల పగలకొట్టి.. ఆకాశ్‌ను వేడివేడి పెనంపై కూర్చోపెట్టింది. వారికి తీవ్రగాయాలై రోదిస్తున్నా.. వదిలిపెట్టకుండా కార్తీక్‌ను గొంతు పిసికి చంపేసింది. ఈ దారుణం బయటపడకుండా కార్తీక్ మృతదేహాన్ని, తీవ్రగాయాలపాలైన ఆకాశ్‌ను తీసుకొని లక్ష్మి, సాగర్లు కొండవీడుకు వెళ్లిపోయారు.ఈ విషయం తెలిసిన సాగర్ చెల్లెలు ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు. ఆకాశ్‌కు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మి, సాగర్ ఇద్దరూ కలిసి కార్తీక్‌ను చంపేశారని పిల్లల మేనత్త విజయ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు. -
TG: కారులోమహిళ డెడ్ బాడీతో పారిపోయేందుకు యత్నం!
నిజామాబాద్: కారులో డెడ్ బాడీని తీసుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. అది కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను దాటేసిందా కారు. అయితే అసలు కారును ఆపకుండా వెళ్లిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ కారును ఛేజ్ చేశారు. కారును వెంబడించి దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ పద్ద పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అనుమానించి ఆరా తీశారు. ఎంతకీ పెదవి విప్పకపోవడంతో కారు డిక్కీని ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని రాజేష్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు కమలగా గుర్తించారు. -
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్‌మేన్‌లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్‌లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన షోపియన్‌కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్‌మేన్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: పెంపుడు కుక్కను చంపేసి.. విమానం ఎక్కేసింది
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్‌లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్గా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు. -
ఐస్లాండ్ మహిళా మంత్రి రాజీనామా.. 30 ఏళ్ల కిత్రం తప్పు వెంటాడింది
30 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఆమెను వెంటాడింది. ఐస్లాండ్ మహిళా మంత్రి ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ చివరికి తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో పదహారేళ్ల అస్ముండ్సన్ అనే బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారామె. ఈ విషయంపై ఆ దేశంలో తీవ్ర వివాదం చెలరేగింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె తన తప్పులను కూడా అంగీకరించారు.ఐస్లాండ్ విద్యా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ మూడు దశాబ్దాల క్రితం ఆమె ఒక మతపరమైన వర్గానికి కౌన్సిలర్‌గా వ్యవహరించారు. అయితే, ఆ సమయంలో ఓ బాలుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.కాగా, ఐస్లాండ్ చట్టాల ప్రకారం.. ఒక మైనర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. అలాంటివారికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ వ్యవహారంపై అస్ముండ్సన్ బంధువు ఒకరు దేశ ప్రధానికి తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
అక్కా.. దయ్యం పట్టిందా.!
-
వయసు 60..టైలరింగ్‌తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్‌తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్‌ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్‌ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్‌గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్‌కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్‌క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్‌లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్‌క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్‌కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్‌గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
అనకాపల్లిలో మహిళ దారుణ హత్య
అనకాపల్లి: అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండు కాళ్లు, రెండు చేతులను నరికి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..
పట్నా: సోషల్ మీడియాతో కొంతమేరకు ముప్పు పొంచివున్నమాట వాస్తవమే అయినప్పటికీ, ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాను సరైన రీతిలో వినియోగించుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభింస్తుందనడంలో సందేహం లేదు. బీహార్‌లోని రోహతక్ జిల్లాలోని బల్దారీ గ్రామానికి చెందిన లాఖ్‌పాతో దేవి విషయంలో సోషల్ మీడియా ఒక వరంలా మారింది.యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెళ్లిన లాఖ్పతో దేవి అక్కడ తప్పిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే అక్కడ జనసమూహం అధికంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కుంభమేళా ప్రాంతంలోనే రెండు రోజుల పాలు ఉండి, ఆమె కోసం వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.అయితే ఇది జరిగిన 15 రోజుల తరువాత లాఖ్‌పాతో దేవి జార్ఖండ్(Jharkhand)లోని గఢ్వా జిల్లాకు చెందిన బహియాపూర్లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బహియాపూర్ పంచాయతీ సభ్యురాలు సోనీదేవి భర్త వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 60 ఏళ్ల మహిళ తమ ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె బలహీనంగా కనిపించిందన్నారు. దీంతో ఆమెకు ఆహారం అందించి, వసతి కల్పించామన్నారు. ఆమె తన చిరునామా చెప్పలేకపోవడంతో ఆమె ఫొటోను సోషల్ మీడియాలో సంబంధిత వివరాలతో పాటు షేర్ చేశామని తెలిపారు.లాఖ్‌పాతో దేవి కుమారుడు రాహుల్ తల్లి ఫొటోను చూసి, వెంటనే జార్ఖండ్ చేరుకుని తన తల్లిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ మార్చి 10 సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను చూశానని,తరువాత తాను బహియార్ పూర్ చేరుకుని తన తల్లిని కలుసుకున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య -
మద్యం మత్తులో యువతి వీరంగం
భువనేశ్వర్: నగరంలో మద్యం మత్తులో ఓ యువతి వీరంగం చేసింది. స్థానిక చంద్రశేఖర్ పూర్ ప్రాంతం మద్యం దుకాణం ముందు ఈ సన్నివేశం తారస పడింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రయత్నంలో పోలీసులు, ఆస్పత్రి సిబ్బందిని మద్యం మత్తులో ఉన్న మహిళ ముప్పు తిప్పలు పెట్టింది. పోలీసులు, ఇతరులపై దాడి చేసింది. మొత్తం మీద ఏదోలా ఆమెని సాధారణ స్థితికి తీసుకుని వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టారు. మత్తు వీడిన తర్వాత ఆమెను కస్టడీ నుంచి విడుదల చేశారు. View this post on Instagram A post shared by OTV (@otv.khabar) -
AP: జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
కేసముద్రం : కొలంబియా(Colombian) యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని(love marriage) పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో(Australia) ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. -
అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్‌కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్‌లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్‌ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్‌ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్..?) -
కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్చేస్తే వచ్చే ఫ్లేవర్లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్‌గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్‌ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్‌లో డైటెటిక్స్‌లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్‌లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..) -
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
Kanyasulkam నాకు నచ్చిన పాత్ర మధురవాణి-ఓల్గా
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే. -
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్ కూడా ఇచ్చింది.గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే సమాధానం చెప్పానా?’ కామెంట్ చేయాలంటూ నెటిజనులను కోరింది.చదవండి: వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన నెటిజన్లు ఏమన్నారంటేఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్ రాశారు.కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. -
ప్రతి మహిళా సెలిబ్రిటీనే : మిసెస్ ఇండియా తెలంగాణ మిటాలీ
సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని మిసెస్ మిటాలీ అగర్వాల్ తెలిపారు. సెపె్టంబర్లో జరగనున్న మిసెస్ ఇండియా ఫ్యాషన్‌లో పాల్గొంటానని, ఈ పోటీల్లోనూ విజేతగా నిలవడానికి సన్నద్ధమవుతున్నానని ఆమె తెలిపారు. నగరంలోని కూకట్పల్లి వేదికగా వనితల కోసం ఏర్పాటు చేసిన విరజ ఫ్రిల్స్ ఉమెన్స్ వేర్ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు.సాధికారతతో మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ప్రతి మహిళా ఒక సెలిబ్రిటీనే అని మిటాలీ అన్నారు. విరజ ఫ్రిల్స్ వేదికగా స్మార్ట్ క్యాజువల్స్, బిజినెస్ క్యాజువల్స్తో పాటు మహిళల సరికొత్త స్టయిల్ కోసం లేటెస్ట్ ట్రేడింగ్ కలెక్షన్అందుబాటులో ఉందని నిర్వాహకులు అనుషా నామా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మిసెస్ మిటాలీ అధునాతన వ్రస్తాలంకరణతో అలరించారు. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి! ఆకట్టుకుంటున్న టోపోగ్రఫీ బంజారాహిల్స్: రోడ్ నెం.10లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్ర కళాకారులతో పాటు భారతీయ కళాకారుడు, టోపోగ్రఫీస్ ఆఫ్ టెంట్స్ టెర్రకోట అండ్ స్టైమ్ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఔత్సాహిక కళాకారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సృష్టి ఆర్ట్ గ్యాలరీ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గోతేజంత్రం భాగస్వామ్యంతో టోపోగ్రఫీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు ఆర్నాల్డో డ్రెస్ గోన్జాలెజ్, స్వెన్ కహ్లర్ట్తో పాటు భారతీయ చిత్రకారుడు సుధాకర్ చిప్పా వేసిన పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచారు. విభిన్న కళాత్మక భాషలు, జీవిత అనుభవాలను ఈ చిత్రాల్లో కళ్లకు కట్టారు. నెలా 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు ఆలోచనాత్మక రీతిలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. -
మహిళలకు నెలకు రూ.2500.. ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం(ఫిబ్రవరి 24)ప్రారంభమయ్యాయి. తొలి సమావేశాల్లో సీఎం రేఖాగుప్తా సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)తరపున ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిషి ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మహిళలకు నెలకు రూ.2500 నగదు ఇచ్చే అంశంపై సీఎం రేఖాగుప్తా కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యం మహిళలకు నెలకు రూ.2500 స్కీమ్ అమలు చేయడమేనని సీఎం రేఖాగుప్తా అన్నారు. అయితే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయినందున స్కీమ్ అమలు కొంత ఆలస్యం జరగొచ్చని పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత అతిషి అభ్యంతరం తెలిపారు. తాము మంచి స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పగించామని కౌంటర్ ఇచ్చారు.అయితే సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ.2500 బదిలీ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఆమ్ఆద్మీపార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల హామీలను విస్మరించారని మాజీ సీఎం అతిషి ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. తొలి రోజే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సీఎం రేఖాగుప్తా ఆప్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలకు నగదు బదిలీపై ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..
ఢిల్లీ: ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. -
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
అర్ధరాత్రిళ్లు మేసేజ్‌లు.. అశ్లీలతే అవుతుంది!
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్ చేయగా.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు సమర్థించింది. -
గుంటూరు జీజీహెచ్‌లో మరో జీబీఎస్ మరణం
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.ఇవీ లక్షణాలుమెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. -
మెదక్ జిల్లాలో దారుణం.. ప్రియురాలు దూరం పెట్టిందన్న కక్షతో..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల విచారణలో హత్య ఘటన బయటపడింది. తనను దూరం పెట్టిందని ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. హత్య తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకూడా పోయింది. తల్లి కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పీఎస్‌లో కొడుకు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు.విచారణ చేపట్టిన పోలీసులు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నెంబర్ గుర్తించారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోవడంతో రేణుక.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ ఫతేనగర్ ఉంటుంది. ఇంటిపక్కనే ఉంటున్న వ్యక్తితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. రేణుక దూరం పట్టిందనే కక్షతో ప్రియుడు హత్యకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. -
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
Visakhapatnam: ఓటమిని అంగీకరించని ఫర్జానా బేగం
ఎన్ని మేఘాలొచ్చినా..ఆకాశం కదలదు..ఎన్ని తుఫానులైనా..సముద్రం నిలిచిపోదు.. ఎదురయ్యే బాధలన్నీ..ఎగసి పడే తరంగాలే..ఆపదల గాలి ఎంత వేగంగా వీచినా, దృఢమైన మనసు చలించదు. కోల్పోయినవేమీ కన్నీటి కథలవ్వవు..ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా ధైర్యం చేతిలో తలవంచక తప్పదు..నీ ధైర్యమే నీ గెలుపు పతాకం..తట్టుకొనే శక్తి ముందు, ఏ గెలుపైనా తక్కువే. వాడిపోయిన పువ్వుల్లా రాలిపోతాయి..కష్టానికి పూచే పూలే నిజమైన..విజయాలై వికసిస్తాయి. అచ్చం ఫర్జానా బేగంలా..క్యాన్సర్ వచ్చిందని ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఆనందంగా..ఆరోగ్యకరంగా సాగుతున్న జీవితం. శారీరక వ్యాయామ, పోషకాహార నిపుణురాలిగా అందరికీ సూచనలిచ్చే వ్యక్తి. ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా సాగుతున్న కుటుంబం. ఒక్కసారిగా ఆమె శరీరంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించింది. భయపడిన ఆమె వైద్యులు చెప్పిన మాట విని అంతలోనే తేరుకుంది. మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగింది. కాన్సర్ బారిన పడి దానిని అధిగమించి నూతన జీవితాన్ని పొందాలనేవారికి స్ఫూర్తిగా నిలిచారు..నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం.ఆనందంగా సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్‌ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్‌తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్‌గా నిర్ధారించారు.కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని భావించి, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్‌స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్‌ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.ధైర్యం కోల్పోలేదుతొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్నెస్ జిమ్‌లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు. వారే నా ధైర్యం క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు. -
Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన..పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి.. -
ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్‌లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వికృత చేష్టలు.. విశాఖలో నవ వధువు..
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీపై దాడికి యత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. పెదకూరపాడు మండలం గార్లపాడులో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లగా.. వారిపై దాడి చేయడానికి టీడీపీ గూండాలు ఆలయాన్ని చుట్టుముట్టారు. గుడి నుంచి బయటికి వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెండు గంటల పాటు జడ్పీటీసీ దంపతులు గుళ్లోనే ఉండిపోయారు. మరోవైపు, పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాల కాశీని రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని కాశీ భార్య రమణ వేడుకుంటోంది.టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజిని భర్తను జూలకంటి శ్రీనివాసరెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పార్టీ మారాలంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసులు వేధిస్తున్నారు. -
సురేష్.. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా..!
కె.కోటపాడు: ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్న తరువాత తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న నెపంతో ముఖం చాటేసిన భర్త గుదే సురేష్ వైఖరికి నిరసనగా స్వాతి(Swathi) అత్తవారింటి వద్ద మౌన పోరాటానికి దిగింది. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా అని ఆమె భర్తను ఆవేదనగా ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. మధురవాడ ప్రాంతానికి చెందిన తాను, రొంగలినాయుడుపాలెం గ్రామానికి చెందిన సురేష్ విశాఖపట్నం కృష్ణా కళాశాలలో కలిసి చదువుకున్నామని, 2013 నుంచి తమకు పరిచయం ఉందని తెలిపింది. తనను ప్రేమిస్తున్నట్లు సురేష్ తెలపడంతో ఇద్దరం ఇష్టపడినట్లు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 9న మధురవాడలో రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నామని, అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో కాపురం సాగించామని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదంటూ సురేష్ తమ ఇంటికి గత ఏడాది డిసెంబర్ నుంచి రావడం లేదని ఆమె పేర్కొంది. దీంతో కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో గ్రామ పెద్దలకు సురేష్‌తో జరిగిన వివాహం గురించి తెలిపి ఇద్దరినీ ఒక్కటి చేయాలని కోరినట్టు స్వాతి తెలిపింది. భర్త నుంచి తనను వేరు చేసి తన జీవితాన్ని అన్యాయం చేయవద్దని ఆమె కోరింది. బాధితురాలికి న్యాయం జ రిగేంత వరకూ పోరాటం చేయనున్నట్లు విశాఖపట్నం, కె.కోటపాడు సీఐటీయూ నాయకులు పి.రాజ్‌కుమా ర్, ఎర్రా దేముడు, గండి నాయుడుబాబు చెప్పారు.రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం -
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
మహిళ ప్యాంట్ జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్: ఒక్కసారిగా మంటలు
బ్రెజిల్‌లోని అనపోలిస్లోని ఒక సూపర్ మార్కెట్ లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్ ఫోన్లు అసలెందుకు పేలతాయి?షాపింగ్ మాల్ భర్తతో కలిసి షాపింగ్‌లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాద ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో, పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల వారు భయంతో పరుగులుతీశారు. దీంతో పక్కనే ఉన్న భర్త పోన్ తీసి బైట పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. View this post on Instagram A post shared by JahTop (@jahtop_)ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఎవరు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే పేలిన ఫోన్ మోటరాలా కంపెనీదని తేలింది. పేలుడుకు కారణమేమిటి?ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్లెబర్ డా సిల్వీరా మోరీరా లిథియం-అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయని, కొన్ని పరిస్థితులలో అవి వేడెక్కడంపల్ల ఒక్కోసారి పేలతాయని నిపుణులు తెలిపారు. ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలుబ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి : ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకు రావడం వల్ల, పేలవచ్చు. షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు.డూప్లికేట్ ఛార్జర్లు: చౌకైన లేదా నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో, బ్యాటరీ దెబ్బతింటుంది.బాగా వేడెక్కడం: ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు.ఛార్జింగ్‌లో ఉండగా వాడకం: గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఫలితంగా మంటలు వ్యాపించవచ్చు.పేలుడుపై కంపెనీ స్పందనపేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు మోటరోలా రంగంలోకి దిగింది. బాధితురాలితో మాట్లాడినట్టు కంపెనీ ధృవీకరించింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల ద్వారా మార్కెట్‌కు వెడతాయని, భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక విశ్లేషణ చేస్తున్నట్టు తెలిపింది. -
కనువిప్పు కలిగించే సలహ..! పోస్ట్ వైరల్
ప్రస్తుతం అందరివి బిజీ బిజీ జీవితాలే. క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా పరుగులు.కనీసం వేళకు తిండి తిప్పలు లేకుండా బతికేస్తున్నాం. పైగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు ఫోజులు కొడుతుంటాం. మన స్థాయి కంటే చిన్నవాళ్లు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు అద్భుతమైన సలహలిస్తుంటారు. వాటిని విన్నప్పుడు ఒక్క క్షణం నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయానా..? అనిపిస్తుంది. మంచి ఆలోచనలనేవి ఉన్నత స్థితి నుంచి కాదు, అంతకుమించిన ఉన్నతమైన మనసు ఉన్నవారికేనని అర్థమవుతుంది. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ మహిళకు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది.ముంబైకి చెందిన మహిళ(Mumbai woman) ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. అది వచ్చేలోపే అక్కడే కొబ్బరిబొండాలు అమ్ముకునే వ్యాపారి(Coconut Seller) వద్దకు వెళ్లి..కొబ్బరి బొండం ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె ఉబర్ఆటో వచ్చేస్తుందని తొందరగా కొబ్బరి బొండం కొట్టివ్వమని చెబుతుంది. దీంతో అతడు మేడమ్ ప్రజలంతా డబ్బు సంపాదించడానికే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు గానీ ఆ సంపాదన కాసేపు నిశ్చంతంగా తినడానికి తాగడానికి అవకాశం ఇవ్వలేప్పుడు వేస్టే కథా మేడమ్ అంటాడు. దీంతో ఆ మహిళకి అతడి మాటలు ఏదో మంత్రం చల్లినట్లుగా అనిపిస్తాయి. నిజమే కదా..అనే భావన కలిగుతుంది ఆమెలో. తానెందుకు ఇలా ఆలోచించలేకపోయాను, ఒక సాధారణ వీధి వ్యాపారి చెబితేగానీ తెలుసుకోలేకపోయానా అని ఫీలవుతుంది. పని.. పని..అంటూ పరుగులు పెట్టేస్తాం. కానీ పనిని కాసేపు వదిలేసినా అలాగే ఉంటుంది. అంతేతప్ప ఏం కాదు. కనీస ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ తర్వాత పని కాదు కదా..మనల్ని చూసుకునేవాడు కావాల్సిన దుస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి వచ్చేలోపే మేల్కొంటే మంచిది అంటూ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరికొందరూ కూడా తమ అనుభవాలను షేర్ చేస్తూ..మన గురించి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం అంటూ తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. కాబట్టి మనం క్షణ తీరిక లేని బిజీ లైఫ్‌తో అనారోగ్యం పాలవ్వడం కంటే..ముందుగానే మేల్కొని కొద్ది సమయమైన మనకోసం కేటాయించడం బెటర్ కదూ..!.told bhaiya to cut my coconut fast because my uber was on the way & man casually said “itna paisa kyu kamate ho? kaam toh chalta rahega lekin khane peene ko time dena chahiye” nice grounding advice pic.twitter.com/wz66mFqnUn— gargi (@archivesbygargi) February 7, 2025 (చదవండి: పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!) -
తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది. ‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.ఇదీ చదవండి: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం -
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్‌రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్‌చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్‌రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్‌రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్‌ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.బాధితురాలు ఏమంటోందంటే..తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్‌రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్కి ఫోన్‌చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.బూతులు తిడుతూ..వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్‌రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్‌లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్‌ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్‌రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్‌రాయల్ తనకు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్‌లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి. -
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు -
వ్యాధిని వరంలా మార్చి..కుటుంటాన్ని పోషించింది..!
ఎదురైన సమస్యనే అనుకూలంగా మార్చుకుని ఎదిగేందుకు సోపానంగా చేసుకోవడం గురించి విన్నారా..?. నిజానికి పరిస్థితులే ఆ మార్గాన్ని అందిస్తాయో లేక వాళ్లలోని స్థ్యైర్యం అంతటి ఘనకార్యాలకు పురిగొల్పితుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం స్ఫూర్తిగా నిలిచిపోతారు. కళ్ల ముందే కలలన్నీ ఆవిరై అడియాశలుగా మిగిలిన వేళ కూడా కనికనిపించని ఆశ అనే వెలుగుని వెతికిపట్టుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు కొందరు. వీళ్లని చూసి.. కష్టానికి కూడా కష్టపెట్టడం ఎలా అనేది క్లిష్టంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె విషాద జీవిత కథ ఎందరికో ప్రేరణ కలిగించడమే గాక చుట్టుముట్టే సమస్యలతో ఎలా పోరాడాలో తెలుపుతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం అసామాన్య ధీరురాలైన ఆ మహిళ గాథ ఏంటో చూద్దామా..!.ఆ మహిళ పేరు మేరీ ఆన్ బేవన్(Mary Ann Bevan). ఆమె 1874లో లండన్‌లోని న్యూహామ్(Newham, London)లో జన్మించింది. ఆమె నర్సుగా పనిచేసేది . అయితే ఆమె థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే వివాహం అయిన 11 ఏళ్లకు అనూహ్యంగా భర్త మరణిస్తాడు. ఒక్కసారిగా ఆ నలుగురి పిల్లల పోషణ ఆమెపై పడిపోతుంది. ఒక పక్క చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం మరోవైపు పిల్లల ఆలనాపాలన, పోషణ అన్ని తానే చూసుకోవడం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసేస్తుంటాయి.సరిగ్గా ఇదే సమయంలో ఆమె అక్రోమెగలీ(Acromegaly) అనే వ్యాధి బారినపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలోని గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యి శారీరక రూపం వికృతంగా మారిపోతుంది. ఆమె శరీరంలో కాళ్లు, చేతులు, ముఖ కవళికలు తదితరాలన్ని అసాధారణంగా పెరిగిపోతాయి. దీంతో బయటకు వెళ్లి పనిచేయలేక తీవ్ర మనో వేదన అనుభవిస్తుంది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే సంపాదించక తప్పనిస్థితి మరోవైపు ఈ అనారోగ్యం రెండూ ఆమెను దారుణంగా బాధిస్తుంటాయి. భర్త పోయిన దుఃఖానికి మించిన వేదనలు ఎదుర్కొంటుంది మేరీ. ఈ అనారోగ్యం కారణంగా కండరాల నొప్పులు మొదలై పనిచేయడమే కష్టంగా మారిపోతుంటుంది. చెప్పాలంటే దురదృష్టం పగబట్టి వెంటాడినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. అయినా ఏదో రకంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతుందో వింటే మనసు ద్రవించిపోతుంది. సరిగ్గా ఆసమయంలో 1920లలో, "హోమిలీయెస్ట్ ఉమెన్" పోటీ పెడతారు. దీన్ని "అగ్లీ ఉమెన్" పోటీ(Ugly Woman contest) అని కూడా పిలుస్తారు. ఇందులో పోటీ చేసి గెలిస్తే తన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవచ్చనేది ఆమె ఆశ. నిజానికి అలాంటి పోటీలో ఏ స్త్రీ పోటీ చేయడం అనేది అంత సులభంకాదు. ఎందుకంటే అందుకు ఎంతో మనో నిబ్బరం, ధైర్యం కావాలి. ఇక్కడ మేరీకి తన చుట్టూ ఉన్న కష్టాలే ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసాన్ని స్థ్యైర్యాన్ని అందించాయి. ఆమె అనుకన్నట్లుగానే ఈ పోటీలో పాల్గొని గెలుపొందింది కూడా. ఆ తర్వాత ఆమె అరుదైన జీవసంబంధ వ్యక్తులకు సంబంధించిన ఐలాండ్ డ్రీమ్‌ల్యాండ్ సైడ్షోలో "ఫ్రీక్ షో ప్రదర్శనకారిణిగా పనిచేసింది. మరికొన్నాళ్లు సర్కస్‌లో పనిచేసింది. ఇలా కుటుంబాన్ని పోషించడానికి తన అసాధారణమైన వైద్య పరిస్థితినే(Medical Condition) తనకు అనుకూలమైనదిగా చేసుకుని కుటుంబాన్ని పోషించింది. చివరికి ఆమె 59 ఏళ్ల వయసులో మరణించింది. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంది. దురదృష్టం కటికి చీకటిలా కమ్ముకున్నప్పుడే దాన్నే జీవితానికి ఆసరాగా మలుచుకుని బతకడం అంటే ఇదే కదా..!. సింపుల్‌గా చెప్పాలంటే దురదృష్టంలోని మొదటి రెండు పదాలను పక్కన పడేసి అదృష్టంగా మార్చుకోవడం అన్నమాట. చెప్పడం సులువు..ఆచరించాలంటే ఎంతో గట్స్ కావలి కదూ..!.(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
బూతులు తిట్టి..బూటు కాలుతో తన్ని..
బంజారాహిల్స్: ప్రియురాలిపై అనుమానంతో ఆమెను పార్కుకు పిలిచి బూతులు తిట్టి..బూటు కాలితో పొత్తి కడుపులో తన్నిన జిమ్ ట్రైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..వైజాగ్‌కు చెందిన కుమొరల్లు ప్రసాద్ జూబ్లీహిల్స్ ఐలాం కాలనీలో జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ ట్రైనర్‌గా పలువురు యువతులను లోబరచుకుని వారిని మోసం చేస్తున్నాడు. ఇదే తరహాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ప్రేమ పేరుతో దగ్గరకు తీసి ఆమెతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. కొద్ది రోజులుగా ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న అతను మాట్లాడుకుందామని జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని పార్కుకు రప్పించాడు. అప్పటికే మద్యం మత్తులో తూలుతున్న ప్రసాద్ ఆమె వచ్చీ రావడంతోనే జట్టు పట్టుకుని నేలకొసి కొట్టాడు. పొత్తి కడుపుతో బూటు కాలితో తన్నాడు. అసభ్యంగా ఆమెను దూషిస్తూ చితక బాదాడు. భయంతో వణికిపోయిన బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె అక్కడికి వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నించగా ఆమెను కూడా దూషిస్తూ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!
పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్‌కి ఇంటి పేరు ఏంటి, తండ్రి ఎవరు అనే రెండు డైలాగులు ఫైర్ అయ్యేలా చేసే బలహీనతలు. ఆ బలహీనతపైనే విలన్ దెబ్బకొడుతుంటే..నో పుష్పగాడు అంటే ప్లవర్ కాదు అదో బ్రాండ్ అని ప్రూవ్ చేస్తాడు. ఈ మూవీలోని డైలాగ్‌లా ప్రతి వ్యక్తి బ్రాండ్లా ఉండాలి. అంటే వర్క్ పరంగా లేదా దేనిలోనైనా మన ముద్ర ఉండేలా చూసుకోవాలి. ఏదో ఇతరులకి హెల్ప్ చేసి మంచివాళ్లు అనిపించుకునే నేమ్ అవసరం లేదు. మనల్ని చూడగానే ఈ వర్క్‌లో అతడికి మించి తోపులేరు అనే బ్రాండ్ సెట్ చేసుకోవాలట. అప్పుడే మనకు ఎందులోనూ తిరుగుండదని చెబుతోంది ఒక పాకిస్తాన్ మహిళ. ఆమెకు ఉద్యోగం రాకపోవడమే కెరీర్‌పై సరైన దృక్పథం ఏర్పడేలా చేసిందట. ఆ ఇంటర్యూలో సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన ఉనికినే కాదు ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది..ఇంతకీ ఆమె ఏం చెబుతుందంటే..పాకిస్తాన్‌కి చెందిన హిబా హనీఫ్ అనే మహాళ తాను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫెయిల్యూర్ అయినా.. ఆ కంపెనీ సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పారు. తాను సోషల్‌మీడియా మేనేజ్మెంట్ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం అని ఒక కంపెనికి వెళ్లినట్లు తెలిపింది. "అక్కడ తనతోపాటు ముగ్గురు ఫైనల్ రౌండ్‌కి రాగా, ముగ్గుర్ని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియా మేనేజర్‌గా తమకున్న వ్యూహాలు, నైపుణ్యాల గురించి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ధీటుగా చెపపేలా తమ వద్ద స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది వారి టెస్ట్..అని చెప్పుకొచ్చారు" హనీఫ్. అయితే తాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు కానీ ఆ కంపెనీ సీఈవో అడిగిన ప్రశ్న తాను ఎలా ఉంటే కెరీర్ బాగుంటుందన్నది తెలియజేసిందని చెబుతోంది. నైపుణ్యాల, మరింత ఇంటిలిజెన్స్ అంటూ కోచింగ్ సెంటర్లకి పరిగెడుతుంటాం కానీ కావాల్సింది అది కాదు నువ్వు ఈ పనిలో బ్రాండ్ అనేలా మన ముద్ర ఉండాలి. అదే ఏ సంస్థకైనా కావాల్సిన స్కిల్ అని చెప్పడంతో.. ఇన్నాళ్లు తన గుర్తింపు ఏంటన్నది ఆలోచించలేకపోయానా..! అనేది గుర్తించానంటూ నాటి ఇంటర్యూని గుర్తుచేసుకున్నారామె. "సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇదే గుర్తింపు అనుకుంటున్నారు కానీ అది కాదు ఐడెంటిటీ. ఏదో కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లిపోవడం కాదు. ఈ పనిలో నీదంటూ బ్రాండ్ కావాలి. అబ్బా ఫలానా పనిలో ఆమె లేదా అతడు ది బెస్ట్ అనిపించుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. పైగా కెరీర్ డెవలప్మెంట్కి కావాల్సిన పెట్టుబడి అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు హనీఫ్. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడంతో తానిన్నాళ్లు స్వంత గుర్తింపునే నిర్లక్ష్యం చేశానన్నా విషయాన్ని గ్రహించనని చెప్పారు. తాను ఈ ఫెయిల్యూర్ని మెల్కొలుపుగా భావించి ఆ దిశగా కృషి చేసి ది బెస్ట్ సోషల్ మీడియా మేనేజర్‌గా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరీ మీరు కూడా మీ వ్యక్తిగత బ్రాండ్ ఏంటన్నది ఆలోచిస్తున్నారా..! అంటూ ముగించారామె. మరీ మనం కూడా మనకంటూ ఓ ఫైర్ బ్రాండ్ ఉండేలా ట్రై చేద్దామా..!.(చదవండి: నిమ్మరసంతో గురకకు చెక్‌పెట్టండి..!) -
వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్ ఆఫర్‌ని కొట్టేసింది..!
కొందరూ కార్పొరేట్ స్కూల్స్‌లో చదవకపోయినా వారికి ధీటుగా కళ్లు చెదిరే రేంజ్లో జాబ్ ఆఫర్లు అందుకుంటారు. కనీసం పట్టణ ప్రాంత నేపథ్యం కాకపోయినా అలవోకగా అందివచ్చిన ప్రతి అవకాశంలోనూ తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటారు. ఎవ్వరూ ఊహించని రీతీలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వాళ్లు నోరువిప్పి చెబితేగానీ తెలియదు వారు అంతటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చారా అని... !. అలాంటి కోవకు చెందిందే అశ్రిత. ఆమెకు డీఆర్డీవో, ఇస్రో వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు జాబ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటిని వద్దనుకుని ఏకంగా అమెరికా మల్టీనేషనల్ కంపెనీలో మంచి వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ని అందుకుని శెభాష్ అనుపించుకుంది. ఎవరా అశ్రిత అంటే..తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అశ్రిత. కుటుంబం జీవనోపాధి వ్యవసాయం. చిన్ననాటి నుంచి సాధారణంగానే చదివేది. ఇంటర్ పూర్తి అయ్యిన వెంటనే ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనే ఆలోచనలు కూడా పెద్దగా ఏమిలేవు. అందిరిలా బీటెక్ చేద్దాం అనుకుంది అంతే. అలా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్‌లో బిటెక్ డిగ్రీ పూర్తి చేసింది. అయితే అశ్రితకి అక్కడ నుంచి ఆమె కెరీర్‌పై సరైన స్పష్టత ఏర్పడింది. అందరూ సాఫ్ట్వేర్ వైపు మళ్లితే ఆమె మాత్రం హార్డ్‌వేర్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం సంపాదించాలనుకుని అటువైపుగా కెరీర్‌ని ఎంచుకుంది. ఆ నేపథ్యంలో ఎంటెక్ చేయడం కోసం గేట్‌కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో మూడువేల ర్యాంకు రావడంతో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జాయిన్ అవకాశం కోల్పోయింది. దీంతో ఆమె మరోసారి గేట్‌కి ప్రిపేరవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలా 2022లో ఆల్ ఇండియా 36 ర్యాంకు సాధించింది. ఈ విజయంతో ఆమెకు ఇస్రో, డీఆర్డీవో, బార్క్, ఎన్పీసీఐఎల్ వంటి అగ్ర సంస్థల్లో ఉద్యోగ ఆఫర్‌ని అందుకుంది. అయితే వాటన్నింటిని కాదనుకుని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేయడం వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఎన్వీఐడీఐఏ(NVIDIA)లో రూ. 52 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగాన్ని పొందింది. వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురు అశ్రిత అసాధారణమైన విజయం సాధించిందంటూ మురిసిపోయారు.(చదవండి: 'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!) -
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్‌తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్‌కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్‌లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్‌చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్‌ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్‌గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్‌లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్‌తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్‌ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
వరకట్న .. వేధింపులు తాళలేక..
హైదరాబాద్, ఉప్పల్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం, పాటిమట్ల గ్రామానికి చెందిన భోరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గుండాల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవళి(25)తో 2019లో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వారు ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా రవళిని అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలు మార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా వారి వైఖరి మారలేదు. ఏడాది క్రితం రాజశేఖర్ రెడ్డి భార్యను వదిలేసి స్వగ్రామానికి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి రవళి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె అత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రజిత ఉప్పల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా పిల్లలిద్దరూ తండ్రి వద్దనే ఉంటున్నట్లు సమాచారం. -
'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!
ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. పాతకాలంలో మ్యూజిక్ వినడానికి దీన్నే ఉపయోగించేవారు. ఆ రోజుల్లో దీని హవా ఎక్కువగా ఉండేది. 1900ల కాలంలో ప్రజల ఇళ్లల్లో ఎక్కువగా ఉండేది. అలాంటి గ్రామఫోన్ కంపెనీకి ప్రదర్శనకారిణిగా తొలి సంతంకం చేసిన భారతీయురాలు ఆమె. మన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని కేవలం మూడు నిమిషాల్లో రికార్డింగ్ చేసిన ఘనతను అందుకుంది కూడా. అంతేగాదు చాలా భాషల్లో పాటు పాడి ఏకంగా 600కు పైగా రికార్డింగ్‌లు చేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం రికార్డింగుల రూపంలో మన మధ్యే చిరంజీవిగా నిలిచిపోయింది. ఎవరామె అంటే.ఆమె పేరు ఏంజెలీనా యోవార్డ్. జూన్ 26, 1873న జన్మించింది. ఆమె అర్మేనియన్ క్రైస్తవ తండ్రి, తల్లి విక్టోరియా హెమ్మింగ్స్లకు జన్మించారు. ఇక ఆమె అమ్మమ్మ హిందూ, తాత బ్రిటిష్. దీంతో ఆమె బాల్యం విభిన్న సంస్కృతుల మేళవింపుతో సాగింది. అయితే ఆమెకు ఇస్లాం మతం అంటే ఇష్టం. ఆ నేపథ్యంలోనే తన పేరు గౌహర్ జాన్‌గా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్న తర్వాత ఆమె తన తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానాలలో స్థిరపడింది. తర్వాత 1887లో దర్భంగా రాజ న్యాయస్థానాలలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఇక అక్కడే బనారస్‌లోని ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ నుంచి విస్తృతమైన నృత్య, సంగీతాల్లో శిక్షణ పొంది ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమితులైంది. అలా ఆమెకు "తొలి నృత్యకారిణి" అనే పేరు వచ్చింది. కానీ ఆకాలంలో రికార్డింగ్ టెక్నాలజీ గ్రామఫోనే కాబట్టి. ఆ కంపెనీకి తన గాత్రం అందించిన తొలి భారతీయురాలుగా గౌహర్ జాన్ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఆ గ్రామఫోన్‌లో ఎన్నో పాటలను రికార్డుచేసింది. ఆ కాలంలో వైశ్యలు బహిరంగా సభలు నిర్వహించి థుమ్రీలు, దాద్రా, కజ్రీ, హోరి, చైతి, భజనలు, ఖయాల్స్ పాడేవారు. ఇక్కడ గౌహర్ కూడా వేశ్య. ఆ కాలం ఆస్థాన నృత్యకారిణులను వేశ్యలగానే పరిగణించేవారు. అయితే ఆమె విలక్షణమైనది ఎందుకంటే బ్రిటిషర్ల గ్రామఫోన్‌లో మన హిందూ సంగీతాన్ని వినేలా చేసింది ఆమెనే. అయితే ఇది మూడు నిమిషాల్లోనే రికార్డు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక డిస్క్ అంత సమయం వరకే రికార్డు చేయగలిగేది. గౌహర్ అంత నిడివిలో మన హిందుస్తానీ మ్యూజిక్‌ని స్వరపరిచి గానం చేయడం విశేషం. అలా ఆమె మొత్తం పది వేర్వేరు భాషల్లో పాటలు పాడి 600కి పైగా రికార్డింగ్‌లు చేశారు. అంతేగాదు కృష్ణ భక్తికి సంబంధించిన రచనలు చేసేది. విలాసవంతంమైన జీవితం..ఇక ఆమె జీవనవిధానం అత్యంత విలాసవంతంగా ఉండేది. ఆ రోజుల్లో నాలుగు గుర్రాలతో నడిచే బగ్గీని కలిగిన సంపన్నుల్లో ఆమె ఒకరిగా ఉండేది. అంతేగాదు ఈ బగ్గీ కారణంగా వైస్రాయ్కి వెయ్యి రూపాయల జరిమానా కూడా చెల్లించేదట. ఇక ఆ రోజుల్లోనే తన పెంపుడు పిల్లికి పిల్లలు పుట్టారని ఏకంగా రూ. 20 వేలు ఖర్చుపెట్టి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి అందర్నీ విస్తుపోయేలా చేసిందట. ప్రేమలో విఫలం..ఆమె ఎంతోమందిని ప్రేమించింది గానీ ఏదీ పెళ్లిపీటల వరకు రాలేదు. వాళ్లంతా ఆమె వెనుకున్న ఉన్న డబ్బు కోసమే తప్ప.. స్వచ్ఛమైన ప్రేమను పొందలేకపోయానని బాధపడుతూ ఉండేదట. ఇక గౌహర్ వయసు మీద పడటంతో నృత్యం, పాటలు పాడటం ఆపేసి ఒంటరిగా కాలం వెళ్లదీస్తుండేది. అయితే అంత్యకాలంలో మహారాజా నల్వాడి కృష్ణరాజ వడియార్ IV రాష్ట్ర అతిథిగా, ఆస్థాన సంగీతకారిణిగా మైసూరుకు ఆహ్వానించారు. అయితే అక్కడకు వెళ్లిన 18 నెలలకే తుది శ్వాస విడిచింది. ఆమె నృత్యం, గానంలో తనదైన ముద్రవేయడంతో ఆ కాలంలోని పోస్ట్‌కార్డ్‌లు, అగ్గిపెట్టేలపై ఆమె ముఖ చిత్రాన్నే ముద్రించి గౌరవించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా రికార్డింగ్ చేసిన పాటల రూపంలో మన మధ్య బతికే ఉంది. (చదవండి: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!) -
యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని..
అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి బంధువులు ఆ యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. తమ కుమారుడిని ఆ యువతి బంధువులు కొట్టి హత్య చేశారని బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాక సీఐ ఎ.పార్థసారథి తెలిపిన వివరాలివీ. విజయనగరం జిల్లాకు చెందిన జి.భాస్కరరావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. గాజువాక శ్రీనగర్‌లోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి యజమానురాలి మనవరాలు ఊరు నుంచి వచ్చింది. పై ఇంట్లో యజమానురాలి బాత్రూమ్ కొంత ఓపెన్‌గా ఉంటుంది. శనివారం మనవరాలు స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీస్తున్నాడని బిగ్గరగా అరిచింది. దీంతో భాస్కరరావు అక్కడ నుంచి తన రూమ్‌లోకి వచ్చేశాడు. అక్కడకి వచ్చిన యువతి బంధువులు భాస్కరరావుపై దాడి చేసి అతడి రూమ్‌లోనే బంధించి తాళం వేశారు. వీడియో విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన భాస్కరరావు తన రూమ్‌లోనే కేబుల్ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరంలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న భాస్కరరావు తండ్రి తాతారావు.. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
స్వీట్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గింది..!
బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారాన్ని త్యాగం చేయడమే. ఒకవేళ నచ్చింది తినాలనిపించినా.. మనస్పూర్తిగా తినలేక డైట్‌ని మధ్యలోనే వదిలేయలేక ఎంతలా తిప్పలు పడతారో చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే వెయిట్ లాస్ జర్నీలో నోరుని కట్టేసుకుని మరీ కఠినమైన డైట్లు, వర్కైట్లపై దృష్టిసారిస్తారు. అధికంగా వ్యాయమాలు చేసి తీపి పదార్థాలు దరిచేరనివ్వకుండా ఉంటేనే బరువు తగ్గుతారనేది చాలమంది అభిప్రాయం. అయితే వాటన్నింటిని కొట్టిపారేసేలా ఈ మహిళ వెయిట్ లాస్ జర్నీ ఉంది. పైగా తీపి పదార్థాలు తింటూనే బరువు తగ్గిందంట. అది నిజమేనా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆమె చెబుతున్న వెయిట్ లాస్ టిప్స్ వింటే నమ్మకుండా ఉండలేరు.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కార్లా విసెంటిన్ వెయిట్ లాస్ జర్నీ చాలా విభిన్నంగా కొత్తగా ఉంది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం కాదని అంటోంది క్లారా. తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను ప్రతిరోజు ఇష్టమైన స్వీట్స్‌ని తింటూనే బరువు తగ్గానని నమ్మకంగా చెబుతోంది. అలా స్వీట్లు తింటూనే తన బరువు వ్యూహాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. తనకు వెయిట్‌లాస్ జర్నీలో హెల్ప్ అయిన చిట్కాలను కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదని అంటోంది క్లారా. కేలరీలను తగ్గించే డైట్ తోపాటు మంచి కదిలకలతో కూడిన శారీరక శ్రమతోనే బరువు తగ్గుతారని అంటోంది. దాహం ఆకలి మారువేషంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకలితో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి తరుచుగా నీరు తాగుతూ ఉండండి. ప్రతిరోజు ఒకే ఆహారం తినడం వల్ల కేలరీలు తీసుకోవడం, ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అదీగాక భోజనం త్వరగా సిద్ధం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. చిన్న ప్లేటుల్లో తింటే..ఎక్కువ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. అలాగే నెమ్మదిగా తినడం తెలియకుండానే వస్తుందట. వ్యాయామం చేసే ముందు మంచి డిటాక్స్ వాటర్‌ని తీసుకుంటే జిమ్‌కి వెళ్లేలా బాడీ సిన్నద్ధం అవుతుందట. అంతేగాదు ఉత్సాహంగా వ్యాయమాలు చేయగలుగుతారు. నచ్చిన ఆహారం వదులుకోకుండా హాయిగా తినాలంటే..కేలరీలను తగ్గించుకునే యత్నం చేయాలి. ఇక్కడ క్లారాకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా తినే అలవాటు ఉందట. అందుకుని తనకు నచ్చిన స్వీట్‌ని హాయిగా తినేసి అదనపు కేలరీలు తీసుకోకుండా చూసుకుంటుందట. ఇలా చేస్తే తినాలనే పిచ్చికోరిక అదుపులో ఉంటుందని చెబుతుంది. స్వీట్స్ అధికంగా తినాలనిపించినా లేదా ఆకలిగా అనిపించినప్పుడల్లా చక్కెర లేని గమ్ నమలాలని సూచిస్తోంది.అలాగే మనల్ని మనం ఇష్టపడితేనే తొందరగా బరువు తగ్గకలుగుతామని అంటోంది.చివరగా అన్నింటికి సానుకూల దృక్పథంతో ఉండాలి అప్పుడే చక్కటి మార్పులు సాధ్యమవుతాయని నమ్మకంగా చెబుతోంది క్లారా.ఇక్కడ పాజిటివ్ ఆటిట్యూడ్ తోపాటు మనల్ని మనం ప్రేమించుకుంటేనే చక్కటి రూపం సొంత చేసుకోగలమని క్లారా కథే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Carla Visentin (@carlavisentin_)(చదవండి: 'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..శాశ్వతంగా కంటి రంగు మారిపోతుంది..!) -
నిస్సి సూసైడ్ నోట్ లభ్యం.. లెటర్లో ఏముందంటే?
సాక్షి, తిరుపతి జిల్లా: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి లెటర్ రాసిన మృతురాలు.. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది.అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు, అందరినీ వదిలి వెళిపోతున్నా.. మిస్ యూ అంటూ నోట్ రాసి ఇంట్లోనే పెట్టింది. యువతి అదృశ్యం అనంతరం.. ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.కాగా, గూడూరులో యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న యువతి వివాహం జరగాల్సి ఉండగా, రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.. ఇవాళ వాగులో మృతదేహం లభ్యమైంది. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర
ఖలీల్‌వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.