సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పీఎస్‌లో ఓ మహిళ చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకట్రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సివిల్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆరోపిస్తున్నారు. సీఐతో పాటు టీడీపీ నాయకులు తన భర్తను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి బలవంతంగా రూ. 10 కోట్లు విలువచేసే ఆస్తులను రాయించుకున్నారని ఆమె తెలిపింది.
ఆ ఆస్తులు సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవడానికి మమ్మల్ని వేధిస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ నన్ను, నా కుమార్తెని అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో నిర్భందించారు. సీఐ ఒక మహిళ అని చూడకుండా నన్ను చెప్పలేని భాషతో దూషించారు.
నిన్న రాత్రి 9:00 సమయంలో మా ఇంటి నుంచి బలవంతంగా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మరోసారి సీఐ వెంకటరావు చెప్పలేని భాషతో దుర్భాషలాడారు. నాకు భయం వేసి చెయ్యి కోసుకునే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. సీఐ వెంకట్రావు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది.. దయచేసి మాకు న్యాయం చేయండి’’ అంటూ బాధితురాలు జ్యోతి వేడుకుంటోంది.


