వినియోగదారుల హక్కులు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల హక్కులు కాపాడాలి

Feb 14 2026 8:01 AM | Updated on Feb 14 2026 8:01 AM

వినియ

వినియోగదారుల హక్కులు కాపాడాలి

వినియోగదారుల హక్కులు కాపాడాలి గుండవరం గ్రామ ప్రభకు వందేళ్ల చరిత్ర

గుంటూరు వెస్ట్‌: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్‌ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్‌ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్‌ కార్యనిర్వహక ఇంజినీర్‌ రమేష్‌, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్‌ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్‌ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

వినియోగదారుల హక్కులు కాపాడాలి 1
1/1

వినియోగదారుల హక్కులు కాపాడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement