బాలవనం పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాలవనం పనులు త్వరగా పూర్తి చేయాలి

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌

బాపట్ల టౌన్‌: బాలవనం పార్క్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాపట్ల మున్సిపల్‌ పరిధిలోని ప్యాడిసన్‌ పేట, బాపట్ల – గుంటూరు రోడ్డు ఫ్లైఓవర్‌ కింద ఏర్పాటు చేస్తున్న బాలవనం నిర్మాణ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాథ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆదివారం, సెలవుల రోజుల్లో పిల్లలు వచ్చి చక్కగా గడిపేలా పార్క్‌ను తీర్చిదిద్దాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. వివిధ ఆట పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. వంతెన గోడలకు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే అంశాలను చిత్రీకరించాలన్నారు. భౌగోళిక శాస్త్రంలోని చిత్రాలను వేయాలని, చిన్నారులకు విజ్ఞానాన్ని పెంపొందించేలా ఆ చిత్రాలు ఉండాలన్నారు. పిల్లలతోపాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్‌ చేసే విధంగా ట్రాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. పూల మొక్కలు పెంచాలని, బాలవనం పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ వెంట పురపాలక శాఖ డీఈ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement