breaking news
Funday
-
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి.సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
ఐఎంగా ఏఆర్‌సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్‌కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్‌గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్ కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్‌గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం.∙ -
ఈ వారం కథ: సోల్‌మేట్
‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని. అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్ ఆల్!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్కంఫర్టబుల్గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను. మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు కూడా’’ సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్ క్వీన్ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్ మీ వాట్స్ ద మ్యాటర్?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్‌లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్లో చార్జ్ లేదని గూగుల్‌లో ఏదో సెర్చ్ చేయడానికి అని నాన్న మొబైల్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్‌కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్‌డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నావు. యాక్చువల్‌గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.‘‘నాన్న మొబైల్లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్ వేసుకుని, స్టైల్‌గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా వర్క్ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్ ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్ చేసింది. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు. దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్ పంపింది మానసగంగ, ఐ మీన్ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్‌లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్‌లను కూడా నాన్న డిలీట్ చేయలేదు. నేను అదంతా స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్‌కు ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్ ఇన్ ఎ షాక్. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్‌ల స్క్రీన్ షాట్ నీ మొబైల్‌కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.∙∙ సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్‌కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్ట్రా ఇ¯Œ కమ్ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై, కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు. సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్‌ఫోన్ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!∙∙ కూతురు తన మొబైల్‌కు పంపిన అన్ని మెసేజ్‌లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది. అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్‌లో, వాట్సప్ గ్రూప్‌లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు. ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్‌కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్ మేట్ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి. అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్‌లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్‌గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్‌ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.‘‘నాన్నా, మీకు ఒక సర్ప్రైజ్. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్‌కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్ చేశాడు.కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్‌టాప్‌లో ఏదో వెబ్ సిరీస్ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్‌లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.∙∙ ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్‌కు షేర్ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును నింపింది.మొన్న మొన్ననే తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ! ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్ కూడా చెక్ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది. -
కథాకళి: నాతిచరామి
నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్‌గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మేథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్‌లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్‌లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్తోనే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్‌లో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్. బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్‌లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఓచోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట ‘తుమ్హారీ యాద్ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది. ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. మా ఆవిడకి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్‌లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్‌కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి!
కొందరు మనసు బాగా లేకుంటే బారుకెళతారు. ఇంకొందరు సంతోషాన్ని పట్టలేక బారుకెళతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకోవడానికి సురశాలలు సురక్షితమైన వేదికలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల బార్లు ఉన్నాయి. ఏ బారుకు ఎవరు వెళ్లినా, అక్కడ చేసేదొక్కటే! కాస్త మందు పుచ్చుకుని, మనసును సేదదీర్చుకోవడమే! జపాన్‌లోని యోకోహామాలో ఉన్న ‘తెన్షొకు సొడాన్’ బారు మాత్రం ఇంకొంచెం ప్రయోజనాత్మకమైన బారు. ఉన్న ఉద్యోగాల్లో విసిగిపోయిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారు ఇది. చాలాకాలంగా ఉద్యోగం చేస్తున్నా, ఎదుగూ బొదుగూ లేనివారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే, అలాంటి ఉద్యోగులకు ఈ బారు సరైన వేదిక. ఉన్న ఉద్యోగం వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అలాంటి వారికి ఈ బారులో కెరీర్ కౌన్సెలర్లతో ప్రత్యేకమైన గదుల్లో ప్రైవేటు సిటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. గంట నుంచి గంటన్నర సేపు కొనసాగే ఈ సిటింగ్‌లలో కెరీర్ కౌన్సెలర్లతో కలసి మందేస్తూ, మారబోయే ఉద్యోగాల గురించి మనసు విప్పి చర్చించుకోవచ్చు. అర్హతలు, అదృష్టం బాగుంటే మంచి ఆఫర్ అక్కడికక్కడే పొందవచ్చు కూడా! ఈ విలక్షణమైన బారు ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైంది. -
పట్నం కోతి సలహాలు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. -
బెర్ముడా ట్రయాంగిల్..ముక్కోణపు సుడిగుండం!
ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్‌లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.మీథేన్ తప్ప మిస్టరీ కాదు!బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్‌లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది! సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!త్రిభుజాకార ప్రమాద స్థలిసినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్‌లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్‌జువాన్.. ఈ మూడు పాయింట్లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?ఎందుకు మునుగుతున్నాయి!‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం. ఇప్పుడెందుకు అలా లేదు?! అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది. మీథేన్ కథ కూడా గ్యాసేనా?సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్‌లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు. నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?! ఐదు శతాబ్దాల మిస్టరీ!బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేసేశాయి.లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధనప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.సాక్షి, స్పెషల్ డెస్క్ -
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి. సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
అదే నా ఐడేంటిటీ
సింపుల్‌గా కనిపిస్తుంది. కాని, సీరియస్ డెసిషన్స్ తీసుకోవడం బాగా తెలుసు ఈ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి. అందుకే, గ్లామర్ ట్యాగ్స్కి దూరంగా, పెర్ఫార్మెన్స్ రోల్స్‌కి దగ్గరగా ఉంటూ, చాలా జాగ్రత్తగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే.. ⇒ నేను వరంగల్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. ఎంబీఏ చేశాను. కాలేజీలో ఉండగానే మోడలింగ్ చేసేదాన్ని. ఫేస్బుక్లో నా ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.⇒ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నా మొదటి సినిమా. కాని, ‘అంతకు ముందు ఆ తరువాత’ నన్ను హీరోయిన్ గా గుర్తింపునిచ్చిన సినిమా. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.⇒ హీరోయిన్ అవ్వకముందు నా రోజు చాలా బిజీగా ఉండేది. ఉదయం కాలేజీ, మధ్యాహ్నం సాఫ్ట్వేర్ జాబ్, సాయంత్రం ఇంకో పని. అప్పుడే హార్డ్ వర్క్ అలవాటు అయిపోయింది.⇒ ‘అ!’ సినిమాలో లెస్బియన్ పాత్ర చేశాను. చాలామంది షాక్ అయ్యారు. కాని, నేను మాత్రం కొత్తగా ట్రై చేయాలనే ఫీలింగ్‌తో ఎంతో ఎంజాయ్ చేశాను. రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదు కదా.⇒ నేను తెలంగాణ అమ్మాయినే. కాని, ‘ఓం శాంతి శాంతిః’ సినిమా కోసం తూర్పు గోదావరి యాసలో మాట్లాడాను. యాస మారడం నాకు సరదానే. అదే సినిమాలోని ఒక సీన్ కోసం నిజంగానే హీరో నా చెంపపై కొట్టారు. ఆ సీన్ లో కనిపించే కన్నీళ్లు యాక్టింగ్ కాదు. నా ప్యూర్ రియాక్షన్.⇒ కెరీర్ మొదట్లో నా రంగు గురించి, లుక్స్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో చాలా బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం నా రంగుపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే నా ఐడెంటిటీ.⇒ రిలేషన్ షిప్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. నేను ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. సరైన సమయం వస్తే నేనే చెప్తాను.⇒ కాఫీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. ఖాళీ దొరికితే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం నాకు చాలా ఇష్టం.⇒ ఫిట్నెస్ నాకు సీరియస్ విషయం. యోగా, జిమ్, కిక్‌బాక్సింగ్ రెగ్యులర్. స్ట్రాంగ్‌గా ఉండాలంటే కష్టపడాల్సిందే అని నమ్ముతాను.⇒ ఎప్పటికైనా సరే మహిళా ప్రాధాన్యం ఉన్న చరిత్రాత్మక పాత్ర ఒకటి చేయాలన్న కల నన్ను వెంటాడుతోంది. -
విదేశాల్లో విశ్వనాథుడు
త్రిమూర్తులలో ఒకడైన శివుడు త్రినేత్రుడు. శంకరుడైన శివుడు భక్తవశంకరుడు. అతడే విశ్వనాథుడు. శివారాధన భారత భూభాగానికి మాత్రమే పరిమితం కాదు. పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లోనూ శివారాధన ఉండేది. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఆ దేశాల్లో ఆనాటి శివాలయాలు ఉన్నాయి.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విదేశాల్లో ఉన్న కొన్ని పురాతన శివాలయాల గురించి తెలుసుకుందాం.పశుపతినాథ్ ఆలయంమన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని కఠ్మాండు శివార్లలో బాగ్మతి నదీతీరంలో ఈ ఆలయం ఉంది. పురాతన శైవక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గురించిన ప్రస్తావన పలు పురాణ, చరిత్ర గ్రంథాలలో కూడా ఉంది. ‘గోపాలరాజ వంశావళి’ ప్రకారం దీనిని ప్రచండ దేవ కట్టించాడు. పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు ‘కోటి రుద్రసంహిత’ కథనం. నేవారీ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.ప్రాంబనన్ ఆలయ సముదాయంపురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఇండోనేసియా రాజధాని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంగణంలో త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి. వీటిలో అతి ఎత్తయిన గోపురం ఉన్నది శివాలయం. ఈ ప్రాంగణంలో శివాలయమే ప్రధానమైనది. ఈ ఆలయాలు క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటివి. ఇప్పటి జావా ద్వీపం కేంద్రంగా ఏర్పడిన మాతరం రాజ్యాన్ని ఏలిన రాజులు ఈ ఆలయాలను నిర్మించారు. రాజు రాకాయి పికాతన్ క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు దీనిని విస్తరించారు. ఇందులోని శివాలయాన్ని 856లో ప్రారంభించినట్లు శాసనాధారాలు ఉన్నాయి.మై సన్ సాంక్చుయరీఇది వియత్నాంలో ఉంది. పురాతన చంపా నాగరికతకు చెందిన చామ్ రాజవంశీకులు శివారాధకులు. వారు క్వాన్ నామ్ ప్రావిన్స్‌లో దాదాపు డెబ్బయి శివాలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినవి. వీటిలో చంపా రాజు భద్ర వర్మ నిర్మించిన భద్రేశ్వర ఆలయం ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఆనాటి చంపా రాజ్య రాజధాని ట్రా కీయు నుంచి దక్షిణాన హోయి అన్ వరకు దాదాపు ముప్పయ్యారు కిలోమీటర్ల మార్గంలో ఈ పురాతన ఆలయాలను నిర్మించారు. వీటిని ఇటుకలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాలను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.మున్నేశ్వరం ఆలయంపురాతనమైన ఈ శివాలయం శ్రీలంకలోని పుట్టాళం జిల్లా మున్నేశ్వరం గ్రామంలో ఉంది. వెయ్యేళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే గాథలు స్థలపురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీలంకలోని ఐదు పురాతన శైవక్షేత్రాలైన ‘పంచ ఈశ్వరం’ క్షేత్రాలలో మున్నేశ్వరం ఒకటి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై సరైన ఆధారాలు లేవు. అయితే, క్రీస్తుశకం 1412లో కొట్టె రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి పునరుద్ధరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం దెబ్బతింది. ఆ తర్వాత కాండ్యన్ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ పద్దెనిమిదో శతాబ్దిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.ప్రీహ విహార్పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం కాంబోడియాలో ఉంది. కాంబోడియా– థాయ్‌లండ్ సరిహద్దుల్లోని డాంగ్రేక్ పర్వతశ్రేణులలోని నిటారుగా ఉన్న కొండ మీద దాదాపు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రీహ విహార్ ఆలయ సముదాయం క్రీస్తుశకం పదకొండో శతాబ్ది నాటిది. ‘ప్రీహ విహార్’ అంటే దేవతల విహార స్థలం అని అర్థం. ఖ్మేర్ రాజులు మొదటి సూర్యవర్మ, రెండో సూర్యవర్మ ఇక్కడ శిఖరేశ్వర, భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారు. వీటి చుట్టూ అనేక ఉపాలయాలను కూడా నిర్మించారు. నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తయిన మెట్లతో కూడిన మార్గం ఒక్కటే శరణ్యం. పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. -
నలుపు మెరుపు
స్ట్రాబెర్రీలు సాధారణంగా ఎర్రగా ఉంటాయి. జపాన్‌లో పండించే అరుదైన తెల్లని స్ట్రాబెర్రీలు కూడా కొందరికి తెలుసు. తాజాగా చైనాలో పండే ఈ నల్లని స్ట్రాబెర్రీలు జనాలకు నోరూరిస్తున్నాయి. ఇవి సాధారణ స్ట్రాబెర్రీల కంటే చాలా గాఢమైన రంగులో ఉంటాయి. వీటి పైనుండే తొక్క దాదాపు నల్లగా ఉంటుంది. లోపలి గుజ్జు కూడా గాఢమైన ఎరుపు, ఊదా రంగుల్లో ఉంటుంది. మిగిలిన రకాలకు చెందిన స్ట్రాబెర్రీల కంటే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. సాధారణ స్ట్రాబెర్రీల కంటే వీటిలో దాదాపు ఇరవై శాతం చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఏమాత్రం పులుపు లేకుండా చాలా తీపిగా ఉంటాయి. చైనాలో వీటిని పదేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పండించారు. ఇటీవల ఇవి అంతర్జాతీయ మార్కెట్‌కు చేరి, రుచులూరిస్తున్నాయి. ‘బ్లాక్ పర్ల్’ పేరుతో విక్రయిస్తున్న ఈ నల్లని స్ట్రాబెర్రీల ధర తెలుసుకుంటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఈ రకం స్ట్రాబెర్రీ ఒక్కో పండు ధర 6 డాలర్లు (రూ.550) మాత్రమే! సాధారణ స్ట్రాబెర్రీల కంటే భిన్నమైన రంగులో ఉన్నందున వీటిపై అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు.వీటిని పండించడంలో జన్యుమార్పిడి పద్ధతులేవీ ప్రయోగించలేదని చైనీస్ వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ‘యాంథోసైనైన్’ అనే పదార్థం ఎక్కువగా చేరడం వల్లనే ఈ పండ్లకు గాఢమైన రంగు ఏర్పడుతోందని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యాన విభాగం ప్రొఫెసర్ లి బింగ్‌బింగ్ చెబుతున్నారు. చైనాలో వీటిని ముద్దుగా ‘బిజిన్ హిమె’ (అందాల యువరాణి) అని పిలుచుకుంటున్నారు. -
అవి ఉంటే చాలు రెడీ!
హీల్స్ లేకపోయినా స్టయిల్ తగ్గదు, హెవీ మేకప్ లేకపోయినా గ్లామర్ మిస్ కాదు! అదే నటి సయామీ ఖేర్ మ్యాజిక్. ఫ్యాషన్ రూల్స్ కంటే కంఫర్ట్‌ని సీరియస్‌గా తీసుకునే ఆమె స్టయిలింగ్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం..డ్రెస్.. బ్రాండ్: పునీత్ బలానా ధర రూ. 47,700జ్యూలరీ బ్రాండ్: అమ్రపాలీ జ్యూయెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే కాపీ కాదు, కంఫర్ట్. సంప్రదాయ, పాత ఫ్యాషన్ రూల్స్‌కు నేను బానిసను కాదు. నచ్చిన రంగు, నచ్చిన దుస్తులను ఆత్మవిశ్వాసంతో వేసుకోవడమే నా స్టయిల్. ఒక బ్లాక్ డ్రెస్, మంచి జీన్స్, సింపుల్ డైమండ్ ఇయర్రింగ్స్ ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను. – సయామీ ఖేర్ -
విధ్వంసం విజయం
ప్రకృతి ఇల్లు చిరునవ్వుతో నిలబడి ఉంటే, అమ్మలాంటి చెట్లు నీడనిస్తున్నాయి, నాన్నలాంటి నదులు జీవం పోస్తున్నాయి, అన్నల్లా కొండలు రక్షణ ఇస్తున్నాయి, చెల్లెళ్లలా పూలు రంగులు పూస్తున్నాయి. ఇంతలో... ఘీ.. ఘీ.. ఘీ.. ఘీ.. ఒక భారీ బుల్డోజర్ ఎంట్రీ! దాని పేరు ‘అభివృద్ధి’ అది వచ్చిన వెంటనే చెట్లు పడిపోతాయి, నదులు మురికిదేరుతాయి, ఆకాశం పొగమయమవుతుంది, పక్షులు ‘ఇక్కడ ఉండలేం బాబోయ్!’ అని ఎగిరిపోతాయి.అప్పుడే అభివృద్ధి నివేదికలు స్టేజ్‌పైకి ఎంట్రీ మైక్ పట్టుకుని: ‘ప్రకృతిని కాపాడటానికి 1 డాలర్, ప్రకృతిని నాశనం చేయడానికి 30 డాలర్లు!’ హాల్ మొత్తం నిశ్శబ్దం. అప్పటి వరకు ఉద్ధరిస్తున్నాననే గర్వంతో ఉన్న అభివృద్ధి కూడా షాక్!దావోస్ గ్లాస్ ప్యాలెస్‌లో ప్రపంచ పెద్దలు సూటు బూటు, ల్యాప్‌టాప్‌లతో కూర్చొని ‘భూమిని ఎలా కాపాడాలి?’ అని చర్చలు జరుపుతుండగా, తెర వెనుక నుంచి ఒక్కసారిగా ‘ఆగండి.. ఆగండి.. రియాలిటీ చెబుతున్నా’ అంటూ ఒక బాంబులాంటి రిపోర్ట్ విసిరింది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ ఈపీ). తాజాగా ఇది విడుదల చేసిన ‘ప్రకృతి ఆర్థిక స్థితి 2026’ నివేదిక చదివితే మనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి! 2023లో ప్రపంచం మొత్తంగా ప్రకృతిని నాశనం చేసే పనుల కోసం సుమారు 7.3 ట్రిలియన్ డాలర్లు అంటే (ఆరువందల యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసిందని ఈ నివేదిక వెల్లడించింది.అంటే భారీ పరిశ్రమలు, పొగలు కక్కే కర్మాగారాలు, అడవుల నరికివేత, బొగ్గు, చమురు తవ్వకాలు అన్నీ కలిసి భూమిపై ఒక మహా విధ్వంస యజ్ఞం చేస్తున్నాయి. మరి ప్రకృతిని కాపాడటానికి ఎంత పెట్టారు? అంటే కేవలం 220 బిలియన్ అంటే (పద్దెనిమి లక్షల కోట్ల రూపాయలు) మాత్రమే! అంటే ఒకవైపు అడవులకు నీళ్లు పోసినట్టు నటిస్తూ, మరోవైపు వాటిని అగ్గిపెట్టెలతో కాల్చేస్తున్నారని ఇది స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సరదాగా చెప్పాలంటే మనం ప్రకృతికి ప్రేమగా ఒక గ్లాసు నీళ్లు పోస్తే, వెంటనే దానిమీద ముప్పై బకెట్ల విషం కుమ్మరిస్తున్నాం!ఇది కేవలం గణాంకాల కథ కాదు! ఇది మన భవిష్యత్తు క«థ, మన పిల్లల భవిష్యత్తు కథ, మన గ్రహం బతుకు కథ! ప్రపంచ పెద్దలు మెత్తని కుర్చీల్లో కూర్చుని ‘గ్రీన్ గ్రోత్’ అంటూ ఊరించే మాటలు చెబుతున్న సమయంలోనే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం అకస్మాత్తుగా తెరపైకి వచ్చి, అద్దం పట్టినట్టు ఈ నిజాన్ని బయటపెట్టింది. ఇది అందరినీ ఆలోచింపజేసే విషయం. దీని ప్రకారం మనం ఒక చేత్తో మొక్క నాటుతూ, మరో చేత్తో అడవిని నరికేస్తున్నాం.కార్యాచరణలో కర్మాగారాల పొగ గొట్టాలు; కాగితాల్లో మాత్రం పర్యావరణ ప్రేమ, భూమిపై కాంక్రీటు దాడి. ఇదే మన ఆధునిక అభివృద్ధి విరోధాభాస. అందుకే ఈ నివేదిక ఆషామాషీ హెచ్చరిక కాదు, ఇదొక పెద్ద అలర్ట్ సైరన్. అందరూ త్వరగా గ్రహించించాలని మారుమోగేలా సైలెంట్‌గా చెబుతోంది. పచ్చని భూమిపై కరెన్సీ గాటు!సమస్య అంతా అంకెల్లోనే కాదు. మనిషి ఆలోచన, అమలు చేసే విధానాల్లో ఉంది. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచం ప్రకృతికి నీళ్లు పోయడం కాదు, పెట్రోల్ పోస్తోంది. యూఎన్ పర్యావరణ సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరువందల లక్షల కోట్ల రూపాయలు ప్రకృతికి హానికరమైన పెట్టుబడులు, సబ్సిడీల రూపంలో ప్రవహిస్తున్నాయి. ఇవి అడవుల విధ్వంసం, కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం, జల వనరుల క్షీణతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతున్నాయి.దీనికి వ్యతిరేకంగా, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు అంటే అడవుల పునరుద్ధరణ, పట్టణాల్లో పచ్చదనం పెంపు, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం వంటి చర్యలకు మనం పెట్టింది కేవలం సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలే! అంటే భారీ మంట మీద చిన్న నీటి బొట్టంత! ఒక వైపు డబ్బు చెరకు యంత్రంలా ప్రకృతిని పిండేస్తుంటే, మరోవైపు మన రక్షణ ప్రయత్నాలు చిరుదీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి. ఇదే అసలు ప్రకృతి–నెగటివ్ ఫైనాన్ ్స పరస్పర వైరుధ్యంభారత్లోనూ జీవన్మరణ పోరు!భారత్ ఇప్పుడు అభివృద్ధి రైల్లో వేగంగా దూసుకెళ్తోంది. కాని, ఆ రైలు పట్టాలు ప్రకృతి పక్కటెముకల మీద వేసినట్టే ఉన్నాయి. ఒకవైపు భూమి కూడా ఉడికిపోయేలా చేసే తీవ్రమైన వేడిగాలులు, మరోవైపు ఊహించని అస్థిర వర్షాలు, ఒక్కసారిగా ఊళ్లను మింగేసే వరదలు, ఇంకోచోట నేల బీటలువారే కరవులు. నగరాల్లో నీటి కోసం క్యాన్ల క్యూలు, గ్రామాల్లో భూమి శ్వాస తీసుకోలేని భూక్షయం ఇలా ప్రకృతి మనతో టగ్ ఆఫ్ వార్ ఆడుతోంది.ఇదే సమయంలో మనం మాత్రం అభివృద్ధి పేరిట పట్టణాలను విస్తరిస్తూ, మెరిసే రహదారులు వేస్తూ, పొడవాటి ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మిస్తూ, రియల్ ఎస్టేట్ పేరుతో చెట్లను చెక్కేస్తున్నాం. అంటే ఒక చేత్తో కొత్త ఇల్లు కడుతూనే, మరో చేత్తో ఆ ఇంటి పునాదుల్ని మంటల్లోకి తోసేస్తున్నాం. ఇలా అద్దాల మేడలతో మెరిసే కొత్త ఇల్లునే చూస్తున్నాం. కాని, దాని వేనుకే మట్టిలో కలిసిపోతున్నా మన ఆరోగ్యం, నీడనిచ్చిన నేలతల్లి ఆరోగ్యాన్ని మరచిపోతున్నాం.అసలు సమస్య ఎక్కడ ఉందియూఎన్ ఈపీ గణాంకాల ఆధారంగా 2030 లక్ష్యం ఏడాదికి 571 బిలియన్ డాలర్లు అవసరం. అంటే, 2030 నాటికి పెట్టుబడులు కనీసం 571 బిలియన్ డాలర్లు సంవత్సరానికి చేరాల్సి ఉంటుందని యూఎన్ ఈపీ చెబుతోంది. ఇది ప్రస్తుత స్థాయితో పోలిస్తే 7.5 రెట్లు పెరుగుదల, అయినా ప్రపంచ జీడీపీలో కేవలం 0.5 శాతం మాత్రమే. అంటే, ఆర్థికంగా ఇది అసాధ్యం కాదు. కాని, రాజకీయ సంకల్పం అవసరం. ఎందుకంటే, ఇక్కడ సమస్య డబ్బు కాదు. మన ప్రాధాన్యాలు.ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ ‘విధ్వంసకర ఆర్థిక వ్యవస్థ’ ఎలా పనిచేస్తోందో చూసుకుంటూ ఉండాలి. అలాగే ప్రకృతిపై నెగటివ్‌గా డబ్బు ఎక్కువగా ఎక్కడికి వెళ్తోందో అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అంటే శిలాజ ఇంధనాలు, భారీ పరిశ్రమలు, రసాయనిక ఎరువులు, నిర్మాణ రంగం, రవాణా, వ్యవసాయ సబ్సిడీలు.. ఇలా రోగిని ఆసుపత్రిలో చేర్చాం, కాని, ఇచ్చిన మందులు వ్యాధి నయం చేయడానికి బదులు విషంగా పనిచేస్తున్నాయేమో కూడా చూసుకుంటూ ఉండాలి.మధ్యేమార్గం లేదు.. ప్రపంచ ఆర్థిక చర్చలు సాగే గదుల్లో మాటలు మృదువుగా వినిపిస్తాయి. కాని, యూఎన్ ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ మాత్రం మైక్ పట్టుకుని ఉరుములా మాట్లాడారు. ఆమె మాటల్లో రాజకీయం లేదు, రాజీపడే ధోరణీ లేదు; కేవలం నగ్నసత్యం మాత్రమే! ‘డబ్బు ఎటు వెళుతుందో చూస్తేనే అసలు కథ తెలుస్తుంది,’ అని ఆమె గట్టిగా చెప్పారు. ఒకవైపు ప్రకృతిని కాపాడతామంటూ ఫొటోలు దిగుతామా? లేక మరోవైపు దాన్ని కాల్చేస్తూ పెట్టుబడులు పెడతామా? ఈ రెండింటి మధ్య ఎలాంటి సేఫ్రోడ్ లేదు.ఎందుకంటే, ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది. అదే ప్రకృతిని రక్షించే పెట్టుబడుల్లో దాదాపు 90 శాతం భారాన్ని ప్రభుత్వాలే మోస్తున్నాయి. ప్రైవేట్ రంగం మాత్రం పక్కన నిలబడి చూస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ప్రైవేట్ వారి వాటా కేవలం పదిశాతమే! అంతేకాదు, ప్రకృతికి హాని చేసే పెట్టుబడులు ఎక్కువగా కొన్ని రంగాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా శిలాజ ఇంధనాలు, రసాయనిక ఎరువులు, భారీ మౌలిక సదుపాయాలు. ఇలా చూస్తే వీటన్నింటిలోనూ ప్రభుత్వం పెట్టుబడులే ఎక్కువ శాతం. అందుకే, ఆమె ప్రభుత్వం ఇక మాటల కాలంతో కాదు. ఎంపికలతో చికిత్స చేయాలని సూచిస్తోంది. ప్రకృతిని చంపాలా? లేదా బతికించాలా? అన్నది ఇప్పుడు మొత్తం ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని ఆమె చెప్పారు.ప్రకృతికి వ్యతిరేకంగా ఖర్చవుతున్న ప్రజాధనం!ప్రపంచం వాతావరణ మార్పుల ప్రభావాలతో వణికిపోతున్న ఈ కాలంలో, మనం ప్రకృతిని కాపాడేందుకు ఖర్చు చేయాల్సిన ప్రజాధనం ఆశ్చర్యకరంగా అదే ప్రకృతికి హాని చేసే రంగాలకే ఎక్కువగా ఖర్చవుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో పర్యావరణానికి హానికరమైన సబ్సిడీలు రూ. 149 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2020లో ఇవి స్వల్పంగా తగ్గి రూ. 141 లక్షల కోట్లకు చేరడంతో ‘మార్పు మొదలైందేమో’ అని కనిపించింది. కాని, ఆ తర్వాత అది ఒక చిన్న ఖర్చుల పండుగలా మొదలై, 2022 నుంచి ఇప్పటి వరకు వ్యయ మహోత్సవంలా కొనసాగింది. 2021లో ఖర్చు మళ్లీ పెరిగి రూ. 174 లక్షల కోట్లు, 2022లో అయితే ఏకంగా రూ. 241 లక్షల కోట్లకు చేరింది. శిలాజ ఇంధనాలు – విలన్ కు భారీ పేమెంట్! సినిమాలో విలన్ కి ఇంత బడ్జెట్ పెట్టినట్టు, కాలుష్యానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలకే అత్యధిక సబ్సిడీలు అందాయి. 2022లో అయితే, ఈ ఒక్క రంగానికే సుమారు రూ. 148 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం సబ్సిడీల్లో శిలాజ ఇంధనాల వాటా చాలా పెద్దది. అంటే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన ఇంధనాలకే, వాతావరణాన్ని కాపాడాల్సిన డబ్బు ఎక్కువగా వెళ్తోంది. ఇది అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేస్తున్న అతిపెద్ద అన్యాయం. రవాణా రంగం – మారని స్క్రిప్ట్రవాణా రంగం మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 33 లక్షల కోట్లు తీసుకుంటూ వస్తోంది.ఎలక్ట్రిక్ మార్పులు, పచ్చదనం అన్నీ పక్కన పెడితే, ’ఏ మార్పు లేకుండా, ఎలాంటి పునరాలోచన లేకుండా ఈ ఖర్చు కొనసాగడం గమనార్హం. ఇది పచ్చదనం వైపు మార్పు ఎంత నెమ్మదిగా జరుగుతోందో సూచిస్తుంది.వ్యవసాయ, మత్స్యకార రంగాలు – చివర్లో వినోదం2023లో వ్యవసాయానికి సుమారు రూ. 15 లక్షల కోట్లు, మత్స్యకార రంగానికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. ఆహార భద్రతకు ఇవి అవసరమైనప్పటికీ, పర్యావరణానికి అనుకూలమైన విధానాలతో కాకుండా ఖర్చవుతున్నప్పుడు ఇవి కూడా హానికరంగానే మారతాయి. ఎలాగంటే, ప్రకృతిని దెబ్బతీస్తే, హీరో కూడా నెగటివ్ అయిపోతాడు కదా! చిన్నవే కాని... నిరంతరమైన భారాలుప్లాస్టిక్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు ఒక్కొక్కటికీ ప్రతి సంవత్సరం రూ. 2 నుంచి 5 లక్షల కోట్లు మాత్రమే కేటాయించినప్పటికీ, అవి నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇలా చిన్న చిన్ని ఖర్చులే చివరికి భారీ పర్యావరణ బిల్లులుగా మారాయి. చివరికి, చిన్న చినుకులే చివరికి పెద్ద వరదలా మారతాయన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది.అంకెలు అబద్ధం చెప్పవు. మన డబ్బు ఎక్కడికి వెళుతుందో స్పష్టంగా చూపిస్తాయి. ప్రకృతిని కాపాడాలి అంటూనే, అందుకు హాని చేసే రంగాలకు బడ్జెట్ పెడితే, అది ప్రేమ కాదు. పర్యావరణానికి వేసే ఫైన్! అలాగే, ఈ గణాంకాలు మన ముందు ఒక స్పష్టమైన ప్రశ్నను నిలబెడుతున్నాయి. ప్రకృతని నాశనం చేయకుండా అభివృద్ధి జరగలేదా? ఇలా జరగాలంటే, ప్రజాధనం ఖర్చయ్యే దారి హానికరమైన సబ్సిడీల నుంచి, ప్రకృతి ఆధారిత పరిష్కారాల వైపుకు మళ్లాలి. అప్పుడే రాబోయే తరాలకు మనం నిజమైన సంపదను వదిలివెళ్లగలం. ఒకవైపు మనం అభివృద్ధి అంటూ ఆకాశంలోకి రాకెట్లు ఎగరేస్తుంటే, మరోవైపు భూగోళం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఊపిరాడక తడబడుతోంది. మనం ఇంకా ఇలాగే కొనసాగితే, రేపటి పిల్లలకు మ్యూజియంలో మాత్రమే అడవి తల్లిని చూపించాల్సి వస్తుంది. ‘ఇక్కడ ఒకప్పుడు చెట్లు ఉండేవి’ అని. ఈ భూమి మన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న భవిష్యత్తు. ఆ అప్పును తీర్చే సమయం ఇప్పుడే. అందుకే, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ప్రకృతిని ఒక ఖర్చుగా కాకుండా, జీవన బీమాగా చూడాలి.భారత్‌లో గ్రీన్ షీల్ట్! ఈ అగ్నిపరీక్షలో భారత్‌కు గ్రీన్ షీల్ట్లా నిలుస్తోంది సీఏఎమ్‌పీఏ (పరిహార అటవీ నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ). ఈ సంస్థ రోడ్లు, గనులు, పరిశ్రమలు, డ్యాములు, హైవేలు కోసం అడవులు నరికినప్పుడల్లా ‘సరే, ఈ చెట్లు పోయాయి, మరి కొత్త చెట్లు ఎవరు పెంచుతారు?’ అనే ప్రశ్నతో ముందుకు వచ్చింది. అందుకే, స్వయంగా సీఏఎమ్‌పీఏ (కాంపా) నే రంగంలోకి దిగి, ‘ఒక చెట్టు పడిపోతే, రెండు చెట్లు నాటుదాం’ అనే విధానంతో పనిచేస్తోంది. ఇలా అడవులు నరుక్కుంటే వాటికి బదులుగా కొత్త అడవులు పెంచడం, ఎడారిలా మారిన భూములను మళ్లీ పచ్చగా మార్చడం, గ్రామీణ–గిరిజన ప్రాంతాల్లో అటవీ జీవనాధారాన్ని కాపాడడం చేస్తోంది.అలాగే, నదులు, వాగులు, చెరువుల పక్కన హరిత రక్షణ కవచం నిర్మించడం, వాతావరణ మార్పులకు తట్టుకునే అడవులను రూపొందించడం చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే! ఎవరైనా ప్రాజెక్టు కోసం అడవిని నరికేస్తే, వారు పరిహార నిధి కట్టాలి. ఆ డబ్బు మొత్తం సంస్థ ఖాతాలోకి వెళుతుంది.ఆ నిధితో కొత్త మొక్కలు నాటుతారు, అడవులను పునరుద్ధరిస్తారు, నేలను బతికిస్తారు. అంటే మనం ఒకవైపు చెట్టును నరికేస్తే, మరోవైపు రెండు మొక్కలను నాటే ‘గ్రీన్ రీబూట్ సిస్టమ్’లా పనిచేస్తుంది. ఇలా భారత్‌లోని కాంపా అటవీ పునరుద్ధరణ, జీవవ్యవస్థల రక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను నివేదిక సానుకూలంగా ప్రస్తావించింది. ఇది ఇతర దేశాలకు కూడా అనుసరణీయ మోడల్‌గా నిలవవచ్చని యూఎన్ ఈపీ భారత్ ప్రతినిధి బాలకృష్ణ పిసుపాటి అన్నారు. - దీపిక కొండి -
పిల్లలకు ఫోన్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి?
‘మా అబ్బాయికి ఫోన్ ఎప్పుడు ఇవ్వాలి?’‘మా అమ్మాయి ఫోన్ లేకుండా అన్నం తినడం లేదు, ఏం చేయాలి?’ అని చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు. నేటి హైటెక్ యుగంలో పిల్లలకు ఫోన్ ఇవ్వడం తప్పనిసరి అవసరంగా మారింది. పిల్లలకు సెల్ ఫోన్ పరిచయం చేయడం అనేది కేవలం ఒక పరికరాన్ని ఇవ్వడం కాదు, ఒక అపరిమితమైన, నియంత్రణ లేని ప్రపంచానికి వారిని పరిచయం చేయడం. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, శాస్త్రీయ దృక్పథం, పరిష్కారాల గురించి చర్చిద్దాం.ఏ వయస్సులో, ఎలా పరిచయం చేయాలి?చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వారు అన్నం తినడానికి ఆరు నెలల వయస్సు నుండే ఫోన్ చూపిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.» రెండేళ్ల వరకు మొబైల్ ఫోన్‌కు పూర్తి దూరంగా ఉంచాలి. ఈ దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో వారికి మనుషుల స్పర్శ, మాటలు అవసరం, డిజిటల్ బొమ్మలు కాదు.» రెండు నుంచి ఐదేళ్ల వరకు వారానికి రెండుసార్లు రైమ్స్ లేదా స్టోరీ టెల్లింగ్ వీడియోలు చూపించవచ్చు. అయితే, మీరు పక్కనే ఉండి వివరించాలి.» ఆరు నుంచి పన్నెండేళ్ల వరకూ హోంవర్క్ హెల్ప్ కోసం, కొత్త స్కిల్స్ (కోడింగ్, డ్రాయింగ్) నేర్చుకోవడానికి మాత్రమే. గేమ్స్ అనేవి కేవలం వీకెండ్స్‌లోనే.‘బహుమతి’గా ఇవ్వకండి..చాలామంది తల్లిదండ్రులు పుట్టినరోజుకో లేదా క్లాసులో ఫస్ట్ వచ్చినందుకో స్మార్ట్‌ఫోన్‌ను ఒక రివార్డుగా ఇస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల పిల్లల మెదడులో ఫోన్ అనేది ఒక ‘విలువైన ఆస్తి’గా ముద్రపడిపోతుంది. ఫోన్ కేవలం సమాచారం తెలుసుకోవడానికి, అవసరమైనప్పుడు మాట్లాడుకోవడానికి వాడే ఒక ‘టూల్’ మాత్రమేనని మొదటి నుంచి అర్థమయ్యేలా చెప్పాలి.‘కో–వ్యూయింగ్’ పద్ధతిని పాటించండిపిల్లలకు ఫోన్ ఇచ్చి మీరు వేరే పనిలోకి వెళ్ళిపోవద్దు. మొదట్లో వారు ఏం చూస్తున్నారో వారితో కలిసి చూడండి. పిల్లలు ఒంటరిగా స్క్రీన్ చూస్తున్నప్పుడు వారి మెదడు కేవలం ‘రిసీవింగ్ మోడ్’లో ఉంటుంది. అదే మీరు పక్కన ఉండి, ‘చూడు ఆ పిచుక ఎంత బాగుందో!’, ‘ఆ రంగు ఏంటి?’ అని అడుగుతుంటే వారి మెదడు చురుగ్గా స్పందిస్తుంది. దీనినే ‘జాయింట్ అటెన్షన్’అంటారు.టెక్నాలజీ కాంట్రాక్ట్ ...పిల్లల వయస్సు ఎనిమిదేళ్లు దాటితే, వారికి ఫోన్ ఇచ్చే ముందే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అది సరదాగా ఉన్నా, నియమాలు స్పష్టంగా ఉండాలి.» రోజుకు 30–45 నిమిషాలు మాత్రమే.» సైన్స్ వీడియోలు, క్విజ్ గేమ్స్ మాత్రమే చూడాలి. » రూల్ అతిక్రమిస్తే, మరుసటి రోజు ఫోన్ ఉండదు.ఇలా చేయడం వల్ల పిల్లల్లో ‘సెల్ఫ్ డిసిప్లిన్’ పెరుగుతుంది.కంటెంట్ క్యూరేషన్...సెల్ ఫోన్ పరిచయం చేసేటప్పుడు మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ విషయంలో జాగ్రత్త వహించండి.» ‘ఖాన్ అకాడమీ కిడ్స్’ లేదా ‘డ్యుయోలింగో’ వంటి యాప్స్ ద్వారా భాషా నైపుణ్యాలను పరిచయం చేయండి.» గూగుల్ ‘ఫ్యామిలీ లింక్’ వంటి యాప్స్ వాడండి. ఏది పడితే అది క్లిక్ చేయకుండా ఫిల్టర్లు పెట్టండి.‘నో ఫోన్’ సమయాలు...ఫోన్ పరిచయం చేసే తొలిరోజే.. అది ఎప్పుడు వాడకూడదో కూడా చెప్పాలి.» బాత్రూమ్, బెడ్ రూమ్‌లో ఫోన్ అస్సలు రాకూడదు.» భోజనం సమయంలో నో ఫోన్. ఫోన్ చూస్తూ తినడం వల్ల పిల్లలకు ఆకలి మీద నియంత్రణ ఉండదు, ఇది భవిష్యత్తులో ఈటింగ్ డిజార్డర్లకు దారితీస్తుంది.డిజిటల్ ఎటికెట్స్ నేర్పండిఫోన్ అంటే కేవలం గేమ్స్ కాదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? మెసేజ్ చేసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి? ఫోటోలు తీసేటప్పుడు ఎదుటివారి అనుమతి తీసుకోవడం వంటి ‘డిజిటల్ లిటరసీ’ వారికి పరిచయం చేయండి.‘రియల్ వరల్డ్’ మర్చిపోవద్దు!పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, అంతకంటే అందమైన ప్రపంచం బయట ఉందని మర్చిపోనివ్వకండి. మట్టిలో ఆడటం, వానలో తడవటం, స్నేహితులతో గొడవపడటం.. ఇవన్నీ ఇచ్చే అనుభూతి ఏ హై–డెఫినిషన్ స్క్రీన్ ఇవ్వలేదు. అందుకే ఎక్కువ సమయం బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలను ఫోన్ నుంచి దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కాని, దానిని ‘ఆరోగ్యకరంగా’ వాడేలా మార్చవచ్చు.-సైకాలజిస్ట్ విశేష్- ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
రియో రంగుల సంద్రం
రియో నగరం బ్రెజిల్ దేశపు సంస్కృతికి, ఆనందానికి నిలువుటద్దం. ప్రస్తుతం అది ఒక రంగుల ప్రపంచంగా మెరుస్తోంది. రియోలో ఇప్పుడు ఎటు చూసినా జనమే, ఎక్కడ విన్నా సంగీతమే! రంగురంగుల దుస్తులు, మిరిమిట్లు గొలిపే వెలుగులు, గాలిలో రెపరెపలాడే పించాల మెరుపులతో రియో డి జనిరో రత్నంలా మెరిసిపోతోంది. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు రియో కార్నివాల్ కోసం స్థానిక వీథులన్నీ కళావేదికలుగా మారిపోతాయి. నిశ్శబ్దాన్ని తరిమికొడుతూ గుండె వేగాన్ని పెంచే సాంబా నృత్యాల జోరుతో ప్రపంచాన్ని మెప్పించే సంబరం మొదలైంది.ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్‌గా పిలవబడే ఈ రియో కార్నివాల్ ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బ్రెజీలియన్ల భావోద్వేగం. దాదాపు 20 లక్షల మంది ప్రజలు రోజూ వీథుల్లోకి వచ్చి సంబరాల్లో పాల్గొంటారు. పోర్చుగీసు వారు 18వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం పోర్చుగీసు, ఆఫ్రికన్ సంస్కృతుల కలయికతో ముందుకు సాగుతోంది. క్రైస్తవుల పవిత్ర సీజన్ లెంట్ కాలానికి ముందు ఈ వేడుక జరుగుతుంది.ఈ కార్నివాల్లో సాంబాడ్రోమ్, బ్లాకోస్ అని పిలవబడే వీథి పార్టీలు, విలాసవంతమైన పార్టీలకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్ బాల్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటిలో సాంబా స్కూల్ పరేడ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన సాంబా పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఒకరితో మరొకరు పోటీపడతారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రథాల్లో మెరిసిపోయే దుస్తులు ధరించిన వేలాదిమంది కళాకారులు సాంబాడ్రోమ్ స్టేడియంలో ఇచ్చే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్క పాఠశాల ప్రత్యేకమైన థీమ్‌తో ముందుకు వచ్చి సంగీత నృత్యాలతో వివిధ అంశాలను వివరిస్తారు.సాంబాడ్రోమ్లు టికెట్‌తో కూడినవి అయితే బ్లాకోస్ ప్రదర్శనలు మాత్రం ఉచితంగా నగరం మొత్తం కనిపిస్తాయి. సుమారు ఐదువందలకు పైగా బృందాలు నగరం నలుమూలలా సంగీతంతో సందడి చేస్తారు. వింత వింత దుస్తులు ధరించిన స్థానికులు, పర్యాటకులు మ్యూజిక్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారు. కోపకబానా, ఇపనెమా వంటి బీచ్‌లో బ్లాకోస్ వేడుకలు రాత్రంతా సాగుతాయి. కార్నివాల్లో ఉండే మ్యాజిక్ బాల్స్ అత్యంత విలాసవంతమైనవి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సెలబ్రిటీలు, సంపన్నులు భారీ సెట్టింగుల మధ్య వినోదాల్లో మునిగిపోతారు.కోపకబానా ప్యాలెస్‌లో జరిగే ఈ వేడుకల్లో అతిథులు ఖరీదైన మాస్క్‌లు, డిజైనర్ దుస్తుల్లో సందడి చేస్తారు. రియో కార్నివాల్ కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది బ్రెజిల్ దేశపు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండగలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఈ కార్నివాల్ వల్ల బ్రెజిల్ పర్యాటక రంగానికి భారీ ఆదాయం లభిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త ఇతివృత్తాలతో నిర్వహించే ఈ వేడుకలు పర్యాటకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. -
ఐఎంగా ఏఆర్‌సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్‌కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్‌గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్ కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్‌గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం. -
జైల్ టు జీహాద్!
కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియా నుంచి జీహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీలోకి వెళ్లిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ చివరకు హర్కత్ ఉల్ ముజాహిదీన్‌లో (హెచ్‌యూఎం) చేరాడు. హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్– ముజాహిదీన్ గ్రూపుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలను సెటిల్ చేయడానికి 1994లో భారత్ వచ్చి పట్టుబడ్డాడు. అజర్‌తో పాటు అతడిని విడిపించడానికి ప్రయత్నించిన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, శ్రీనగర్‌లో చిక్కిన మరో ఉగ్రవాది అహ్మద్ జర్గర్... ముగ్గురూ ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరారు. అక్కడే వీరికి కిడ్నాపింగ్ గ్యాంగ్ నిర్వాహకుడు ఆఫ్తాబ్ అన్సారీతో పరిచయం ఏర్పడింది. ఇదే పార్థప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్‌కు కారణమైంది. ఇతడి కుటుంబీకుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరాయి. అదెలాగంటే?ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆఫ్తాబ్ అన్సారీ ముంబైలో ఉంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్లతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకునే అన్సారీ కిడ్నాప్‌లు, స్మగ్లింగ్ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు. ప్రస్తుతం అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని సైతం అన్సారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పుడప్పుడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న గౌతమ్ అదానీ 1998 జనవరిలో తన స్నేహితుడు శాంతిలాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లోని కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తుండగా, అన్సారీ ఆదేశాల మేరకు అక్కడే కాపు కాసిన అతడి అనుచరులు ఫజల్ ఉర్ రెహ్మాన్, భోగీలాల్ దర్జీ తుపాకీతో బెదిరించి కారులో అపహరించారు. వారి విడుదల కోసం రూ.15 కోట్లు డిమాండ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు సాయంత్రం అదానీ, పటేల్ ఇరువురూ విడుదలయ్యారు. ఇలాంటి ఎన్నో నేరాలు చేసిన అన్సారీ అప్పటి వరకు ఓ నేరగాడు మాత్రమే. కోల్‌కతాకు చెందిన ఆసిఫ్ రజా ఖాన్... అన్సారీ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించేవాడు. ఓ కేసులో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేయడంతో తీహార్ జైలుకు చేరారు. ఆ జైలు అధికారులు అజర్, ఒమర్‌లతో పాటు అన్సారీ, ఆసిఫ్‌లను ఒకే హై సెక్యూరిటీ ప్రిజన్లో ఉంచారు. అన్సారీ గ్యాంగ్, అతడి కార్యకలాపాలు తెలుసుకున్న ఆ ఉగ్రద్వయం అతడితో పాటు ఆసిఫ్‌కు బ్రెయిన్ వాష్ చేసి, ఇకపై జీహాద్ కోసం నేరాలు చేసేలా ప్రేరేపించింది. ప్రతి నేరం నుంచి కొంత మొత్తం జీహాదీ కార్యకలాపాలకు విరాళం ఇచ్చేలా వారిని ఒప్పించింది. ఇదిలా ఉండగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ హైజాక్ అయింది. ఇది తమ పనేనంటూ పాకిస్తాన్‌కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ ప్రకటించుకున్నా, కేవలం అజర్ కుటుంబీకులు, ఐఎస్ఐ మద్దతుతో చేశారని నిఘా వర్గాలు చెప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ విమానాశ్రయంలో ఈ విమానాన్ని నిలిపిన ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, వారం రోజుల తర్వాత అజర్, జర్గర్, ఒమర్‌లను విడుదల చేయించారు. తనను విడిపించడంలో హర్కతుల్ ముజాహిదీన్ స్పందన నచ్చని అజర్ తానే సొంతంగా జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు.పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అజర్... అల్ కాయిదాలో చేరిన ఒమర్... అక్కడ ఉన్న అన్సారీ, అసిఫ్‌లతో సంబంధాలు కొనసాగించారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ పలు నేరాలు చేయించారు. అందులో ఒకటే ఖాదిమ్స్ సంస్థ యజమాని, అప్పట్లో దానికి వైస్ చైర్మన్‌గా ఉన్న పార్థ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్. అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దానికి అవసరమైన నిధులు సమీకరించే బాధ్యతలు అనేక మందికి అప్పగించాడు. ఆ ఫండ్ రైజర్స్‌లో ఒమర్ కూడా ఒకడు కావడంతో అన్సారీ, ఆసిఫ్ తెరపైకి వచ్చారు. అమెరికాలో భారీ ఆపరేషన్ చేయనున్నామని, అందుకు విరాళం కావాలంటూ ఒమర్ ఇచ్చిన ఆదేశాలతో అన్సారీ, ఆసిఫ్‌లు 2001 జూలై 25న బర్మన్ను కిడ్నాప్ చేశారు. అప్పటికే దుబాయ్‌కి మకాం మార్చేసిన ఆఫ్తాబ్ అక్కడ నుంచే ఆసిఫ్ గ్యాంగ్‌తో కథ నడిపించాడు. బర్మన్ కోల్‌కతాలోని తిల్జాలాలో ఉన్న తన కంపెనీ గోదాముకు వెళ్తుండగా ఆసిఫ్ గ్యాంగ్ అపహరించింది. అతడిని విడుదల చేయడానికి రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.3.75 కోట్లకు బేరం కుదిరింది. ఈ మొత్తం హవాలా ద్వారా హైదరాబాద్ చేరింది. ఇక్కడ నుంచి రూ.కోటి దుబాయ్ వెళ్లగా, మిగిలిన మొత్తం కోల్‌కతా చేరింది. దుబాయ్ వెళ్లిన రూ.కోటి అక్కడ నుంచి బెల్జియం మీదుగా అమెరికాలో ఉన్న అల్ కాయిదా అనుచరులకు అందింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబర్ 11న జరిగిన ‘9/11 ఎటాక్స్’కు ఈ నగదు కూడా వినియోగించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేన్ (ఎఫ్‌బీఐ) విచారణలో తేలింది. ఈ కారణంగానే బర్నన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు. ఐఎంగా ఏఆర్‌సీఎఫ్!(ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పూర్తిగా ఉగ్రవాద బాటపట్టిన ఆసిఫ్ రజా ఖాన్ 2002లో కోల్‌కతాలో ఉన్న అమెరికన్ కల్చరల్ సెంటర్‌పై దాడి చేశాడు. ఆపై రాజ్‌కోట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఆసిఫ్ సోదరుడు అమీర్ రజా ఖాన్ ఏర్పాటు చేసిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. అదెలా..? దీని ఘాతుకాలు ఏంటి? పార్ట్–3లో...) -
సువ్రతుడి వృత్తాంతం
శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు. అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు. అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, ‘మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి’ అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు. తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు. నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే’ అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. ‘మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ అని మాఘపురాణం చెబుతోంది. మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి’ అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: బూడిద రంగు ఆకాశం
బ్రూనో తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పిస్తున్న బొమ్మల వైపు నిశితంగా చూసింది. ఓ వైపు గులాబీ పువ్వుంది. మరోవైపు రత్నాలహారం... తను సరైన బొమ్మను ఎన్నుకుంటే బనానా మిల్క్‌షేక్ బహుమతిగా లభిస్తుందని తెలుసు. పొరపాటు చేస్తే శిక్ష తప్పదని కూడా తెలుసు.బ్రూనో తన కుడిచేతిని ముందుకు చాపి పొడవాటివేలితో హారం వైపు చూపించింది. గత రెండు వారాలుగా హారంవైపు చూపించిన ప్రతిసారీ దానికి తీయటి మిల్క్‌షేక్ లభించిన విషయం గుర్తుంది. కాని, ఒక్కసారిగా కంటెయినర్లో అంధకారం అలముకుంది. బ్రూనోకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఐదు నిమిషాలు చీకటిలో మగ్గాక లైట్ వెలిగింది. మరోసారి బ్రూనో ముందు కంప్యూటర్ స్క్రీన్ ఉంచబడింది. బ్రూనో మళ్ళా హారం వైపు చూపించింది. దాన్ని ఉంచిన కంటెయినర్ లోపలున్న బల్బ్ వెంటనే ఆరిపోయింది. ఆరుసార్లు ప్రయత్నించినా బ్రూనో తప్పు చేస్తూనే ఉంది. నిన్నటి వరకు హారం సరైన సమాధానమే అయినా ఈరోజు అది మారిపోయిందన్న విషయం దాని మెదడు గ్రహించలేకపోతోంది.అది జతకడుతున్న ఆడకోతి లిల్లీతో అదే ప్రయోగాన్ని చేశాను. నిన్నటి వరకు లిల్లీ హారం బొమ్మ వైపు చూపిస్తే దానికి అరటిపళ్ళు బహుమతిగా ఇచ్చాను. ఈరోజు మొదట అది హారంబొమ్మ చూపించింది. వెంటనే కంటెయినర్లో లైట్ తీసేసి, చీకటి చేశాను. ఐదు నిమిషాల తర్వాత మళ్ళా స్క్రీన్ చూపిస్తే అది గులాబీపువ్వుని చూపించింది. మరో రెండు కోతులు కూడా మొదట హారాన్ని చూపించి, దాని వల్ల శిక్షిస్తారని అర్థమై, రెండోసారి గులాబీపువ్వు వైపు చూపించాయి.బహుమతినందించే బొమ్మలో మార్పు జరిగిందన్న విషయం వీటికి అర్థమైనట్టు బ్రూనోకి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలుసు. అందుక్కారణం నెలరోజుల క్రితం దాని మెదళ్ళోని ఓ భాగంలోకి ఇంజెక్ట్ చేసిన టాక్సిన్. దానివల్ల అక్కడి టిష్యూలు దెబ్బతిని ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముప్పయిరెండు కోతుల్లోకెల్లా బ్రూనో చాలా తెలివైన మగ కోతి. నేను న్యూరో సైంటిస్టుగా ఇక్కడ ఉద్యోగంలో చేరేనాటికి దీని వయసు నాలుగు నెలలు. ఎంత అల్లరి చేసేదో.. ఎంత చురుగ్గా ఉండేదో.. ప్రయోగాలకు అవసరమైన కోతుల్ని ప్రయోగశాలలోనే పెంచుతారు. నాలుగడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల పొడవున్న విశాలమైన బోన్లలో కోతుల జంటతో పాటు వాటికి పుట్టిన పిల్లల్ని కూడా ఉంచుతారు. అవి ఆడుకోడానికి కంటెయినర్లోనే అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.ఏడాది వయసు దాటేవరకు బ్రూనో వాళ్ళమ్మను అంటిపెట్టుకునే ఉండేది. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించసాగింది. నేను ల్యాబ్‌లోకి ప్రవేశిస్తుంటే నావైపు చాలా ఆసక్తిగా చూసేది. దాని కళ్ళలో మెరుపు కన్పించేది. ఆ కళ్ళు పలకరింపుగా నవ్వుతున్నాయేమో అన్పించేది. దానికిపుడు నాలుగేళ్ళు. ఈమధ్య నన్ను చూడగానే బ్రూనో సంతోషం ఆపుకోలేక గెంతుతోంది. దవడలను ముందుకు చాపి, పెదవులను పైకి లాగి, పళ్ళన్నీ కన్పించేలా అదో రకంగా నవ్వుతోంది కూడా. నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటుంది. మెమొరీ పరీక్షల్లో, పజిల్స్‌లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.ఈ ప్రయోగశాలలో పార్కిన్సన్స్కి, ఏడీహెచ్‌డీకి, ఆటిజం డిజార్డర్‌కి సరైన మందులు కనుక్కోవడం కోసం కోతులమీద నాడీసంబంధిత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న కోతులన్నీ రీసస్ మకాక్ జాతికి చెందినవే. రక్తంలోని ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ గురించి తెల్సుకోవడంలో, రేబిస్, పోలియో, మశూచి వంటి జబ్బులకు టీకాలు కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు సహకరించింది ఈ కోతులే. మానవుల డీఎన్ఏ సీక్వెన్స్‌తో పోలిస్తే వీటి డీఎన్ఏ తొంభై మూడు శాతం వరకు ఒకేలా ఉండటం వల్ల వీటిని ప్రయోగశాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.నేను స్వతహాగా జంతు ప్రేమికురాలిని. అందుకే జంతువుల మీద జరిపే ప్రయోగాలకు విరోధిని. మనుషులకొచ్చే రోగాలకు మందుల్ని కనుక్కోవడం కోసం నోరులేని జంతువుల్ని హింసించడం దారుణం కదా. జంతువుల శరీరాల్లోకి రకరకాల మందుల్ని పంపించడంవల్ల ఎన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయో... ఇలా ప్రతియేటా కొన్ని వేల లక్షల ఎలుకలు, గినీ పిగ్స్, కుందేళ్ళు, పందులు, కోతుల్ని బలివ్వడం రాక్షసత్వం కాక మరేమిటి?ఈ ప్రయోగశాలలో కూడా కోతులు హింసకు గురవుతున్నాయి. అయినా మనసుని రాయి చేసుకుని నేనిక్కడ ఉద్యోగంలో చేరడానికి ముఖ్య కారణం స్వార్థమే... కాదనను. కాని, నాకు మరో గత్యంతరం లేదు. నేను చార్జ్ తీసుకున్నాక ఇంతకుముందు అనుసరిస్తున్న పద్ధతుల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాను. తప్పు చేస్తే, ఇంతక్రితం కోతి శరీరానికి మైల్డ్ కరెంట్ షాక్ ఇచ్చేవారు. నేను కంటెయినర్లో లైట్లు ఆర్పేసి చీకటి చేసే పద్ధతిని ప్రవేశపెట్టాను. కోతులు చీకటిలో అసహనానికి లోనవుతాయి. వాటికి ఆపరేషన్లు చేయడానికి వాడే థియేటర్ని శానిటైజ్డ్ కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆపరేషన్ తర్వాత గాయాలు ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోడానికి అనుభవజ్ఞులైన ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను ఏర్పాటు చేయించాను.పార్కిన్సన్స్, ఏడీహెచ్‌డీ, ఆటిజం డిజార్డర్ల గురించి తెల్సుకోవాలంటే మెదళ్లోని ఏ భాగం రోగగ్రస్థం కావడం వల్ల ఆ జబ్బులు సోకుతున్నాయో తెల్సుకోవడం అవసరం. బ్రూనో మెదడు మీద జరుగుతున్న ప్రయోగాల ఉద్దేశం అదే. ఏడాది క్రితం బ్రూనో మెదడుకి శస్త్రచికిత్స జరిగింది. మొదట బ్రూనో తలమీదున్న జుట్టుని షేవ్ చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి, మత్తుమందు ఇచ్చారు. పుర్రెలో ఎనిమిది చోట్ల చిన్నచిన్న రంధ్రాలు చేసి, వాటిలోకి సన్నటి మెటల్ గొట్టాల్ని చొప్పించారు. ఒక ట్యూబ్ ద్వారా నీడిల్ని పంపించి, గులాబీ బూడిద రంగులో ఉండే గ్రేమేటర్లోకి తక్కువ మోతాదులో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశారు. దాని ప్రభావం వల్ల మెదళ్లోని ఆ భాగం చెడిపోయి పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత బ్రూనో ప్రవర్తనలో కలిగే మార్పుల్ని పరిశీలించి రికార్డ్ చేయడం జరుగుతుంది.దానివల్ల పార్కిన్సన్స్ లేదా ఏడీహెచ్‌డీ లేదా ఆటిజం లక్షణాలు ఏర్పడకపోతే, మరో భాగంలోకి టాక్సిన్ను ఇంజెక్ట్ చేసి, మళ్ళా దాని స్వభావంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తారు. పుర్రెలో చేసిన ఎనిమిది రంధ్రాల్ని వినియోగించుకున్నాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే, ఆ కోతిని మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చంపేసి, లోతైన గుంట తవ్వి పూడ్చిపెట్టేస్తారు. బ్రూనోలో నేను ఆశిస్తున్న ఫలితం రాకపోవడంతో, వారం తర్వాత మెదళ్ళోని మరో భాగంలోకి టాక్సిన్ని పంపించి, నెలరోజుల వరకు దాని ప్రవర్తనని గమనించాను. ఫలితం సంతృప్తికరంగా లేకపోవడంతో మరో భాగంలో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశాను.మెదళ్లో ఎనిమిదిచోట్ల ఉన్న టిష్యూలని నాశనం చేశాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే? నాకెందుకో చప్పున భయమేసింది. బ్రూనోని కూడా చంపేస్తారు. ఆ ఆలోచనకే వొళ్ళు జలదరించింది. చప్పున కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.∙∙ ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిదైంది.నాన్నకు రోజూ రాత్రి ఏడింటి లోపలే భోజనం చేయడం అలవాటు. ఆయన సోఫాలో కూచుని టీవీలో వార్తలు వింటున్నాడు. అమ్మ నేనొచ్చే వరకు భోజనం చేయదు.బెడ్రూంలోంచి తుషార్ అరుపులు పెద్దపెద్దగా విన్పిస్తున్నాయి.‘‘వాడేం చేస్తున్నాడు లోపల? అన్నం తిన్నాడా?’’ బెడ్రూం వైపు నడుస్తూనే అడిగాను.‘‘వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. భోజనానికి రెండుసార్లు పిలిచినా రాలేదు’’ అంది అమ్మ.జారవేసి ఉన్న తలుపుని తోసుకుని లోపలికి వెళ్ళాను.ట్రాంపోలీన్ మీద ఎగిరినట్టు మంచంమీద వేసి ఉన్న డన్లప్ పరుపుమీద తుషార్ గెంతుతూ అరుస్తున్నాడు.వాడు నావైపు ఓసారి అభావంగా చూసి, మళ్ళా పెద్దగా కేకలుపెడుతూ గెంతడంలో నిమగ్నమై పోయాడు. ఉదయం బైటికెళ్ళిన అమ్మ రాత్రి ఎనిమిదింటికి తిరిగొస్తే ఏ పిల్లాడైనా సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మను కౌగిలించుకుంటాడు కదా. నాకా అదృష్టం లేదు.‘‘ఇక చాల్లే నాన్నా. ఆపు. ఆకలి వేయడం లేదా? నాకైతే చాలా ఆకలేస్తోంది. అన్నం తిందాం రా’’ గోముగా అన్నాను.వాడు నా మాటల్ని పట్టించుకోలేదు.మంచాన్ని సమీపించి, వాడి చేయి పట్టుకుని ఆపుతూ ‘‘పడిపోతావు నాన్నా... కిందికి దిగు’’ అన్నాను.వాడు కోపంతో వూగిపోయాడు. ఒక్క దూకు దూకి హాల్లోకి పరుగెత్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాడి పింగాణీ ప్లేట్‌ని కిందికి విసిరికొట్టాడు. అది శబ్దం చేస్తూ ముక్కలుగా పగిలిపోయింది. వాటర్ జగ్ని కింద పడేశాడు. నీళ్ళునింపి ఉన్న గాజుగ్లాసుని కూడా విసిరి కొట్టబోతున్న సమయంలో వేగంగా కదిలి, వాడిని గట్టిగా హత్తుకున్నాను. వాడు కొన్ని నిమిషాలు పెనుగులాడాడు. కోపం తగ్గకపో వడంతో రెండు చేతుల్తో గిచ్చాడు. నా చేతిమీద కొరికాడు. భరించాను.కొన్ని నిమిషాల తర్వాత వాడు శాంతించాడు. అమ్మ హాల్ని శుభ్రం చేశాక ముగ్గురం భోజనాలు చేశాం. తుషార్ బెడ్రూంలోకెళ్ళి ఆడుకోసాగాడు.‘‘ఎందుకు తల్లీ ఈ రోజు చాలా అలజడిగా కన్పిస్తున్నావు?’’ అని అడిగాడు నాన్న. ఆయన గొంతులో ధ్వనించిన వాత్సల్యానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.‘‘ఏం లేదు నాన్నా’’ అన్నాను.‘‘తుషార్ చేస్తున్న పనిని ఆపినా, అడ్డుకున్నా. వద్దని చెప్పినా వాడు వయొలెంట్‌గా ప్రవర్తిస్తాడని, ఎదుటి వ్యక్తులకు హాని చేయడమో లేకపోతే తనకు తాను హాని చేసుకోవడమో చేస్తాడని మాకు చెప్తూ ఉంటావుగా. ఈరోజు నువ్వు వాడి ట్యాన్ట్రమ్స్కి కారణమైనావంటేనే తెలుస్తోంది నీ మనసులో ఏదో అలజడి ఉందని. నీ మెదణ్ణి తొలుస్తున్నదేమిటో చెప్పు’’ అన్నాడు.వెళ్ళి నాన్న పక్కనున్న కుర్చీలో కూచున్నాను.‘‘నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏమిటో వూహించగలను తల్లీ. డ్రగ్ టెస్టుల కోసం జంతువుల్ని వాడుకోవడం నీకు నచ్చదు. ప్రయోగాల పేరుతో వాటి మీద జరిగే హింసకు నువ్వు పూర్తి వ్యతిరేకివి. కాని, గత నాలుగేళ్ళుగా నువ్వు పనిచేస్తున్న ల్యాబొరేటరీలో నీ కళ్ళముందే కోతుల్ని హింసకు గురిచేస్తుంటే చూస్తూ తట్టుకోలేకుండా ఉన్నావు’’ అన్నాడు నాన్న.నేను మానసికంగా పడ్తున్న హింసని నాన్న ఎంత బాగా అర్థం చేసుకున్నాడో... మనం పడే మూగవేదన ఆత్మీయులకు తెలిసినట్టు వేరేవాళ్ళకి తెలియదు కదా.‘‘అవున్నాన్నా. నా స్వభావానికి విరుద్ధమైన పని చేస్తున్నాను కదా. అందుకే ఒత్తిడికి లోనవుతున్నా’’ అన్నాను.‘‘మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన రోగాలకు మందులు కనిపెట్టాలంటే కొన్ని జంతువుల ప్రాణాల్ని బలివ్వక తప్పదు కదమ్మా’’ అన్నాడు నాన్న.‘‘తుషార్‌కి ఏడీహెచ్‌డీ సమస్య లేకపోతే, నేనా ల్యాబ్‌లో చేరేదాన్ని కాదు నాన్నా. పార్కిన్సన్స్, ఏడీహెచ్‌డీ, ఆటిజం డిజార్డర్లను పూర్తిగా నయంచేసే మందులకోసం చేస్తున్న ప్రయోగాలు కాబట్టి వాటిల్లో భాగస్వామిని కాక తప్పలేదు. తల్లిని కదా. ఏదో ఆశ... ఏడీహెచ్‌డీకి మందు కనుక్కోగలిగితే నా కొడుకుతో పాటు ఆ జబ్బుతో బాధపడుతున్న లక్షలమంది పిల్లలకు, ఆ భారాన్ని మోస్తున్న వాళ్ళ తల్లులకు ఉపశమనం లభిస్తుందన్న ఆశ.’’‘‘జంతువులమీద పరీక్షలు జరపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రకరకాల ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని విన్నానమ్మా. సెల్ కల్చర్స్, ఆర్గాన్స్ ఆన్ చిప్స్... ఇవే కాకుండా కంప్యూటర్ మోడలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా వాడుకోవచ్చట కదా’’ అన్నాడు‘‘నిజమే నాన్నా. మిగతా అవయవాలకు వచ్చే జబ్బుల విషయంలో ఆర్గాన్స్ ఆన్ చిప్స్, సెల్ కల్చర్ లాంటివి బాగా ఉపయోగపడ్తాయి. కాని, మెదడుకి సంబంధించిన రుగ్మతల విషయంలో వాటి ప్రయోజనం చాలా పరిమితం నాన్నా.’’‘‘ఎందుకలా? నాకర్థమయ్యేలా చెప్పు’’ అన్నాడు.‘‘విశ్వాంతరాళంలో ఉన్న మనకు అర్థంకాని అనేకానేక రహస్యాల్లానే మెదళ్లోని సంక్లిష్టతలు మానవమేధకు పూర్తిగా అందడం లేదు నాన్నా. ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాల్లా సూది మొనంత గ్రే మేటర్, వైట్ మేటర్లలో కోటానుకోట్ల న్యూరాన్లు అల్లుకుని ఉంటాయి. మెదళ్లోని ఒక క్యూబిక్ మిల్లీమీటర్ టిష్యూని శాస్త్రవేత్తలు స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. దాని పూర్తి నిర్మాణాన్ని ఒడిసి పట్టుకోడానికి 1.4 పెటాబైట్స్ అంత డేటా అవసరమైంది. అర్థమయ్యేలా చెప్పాలంటే అధిక నిడివి గల పధ్నాలుగు వేల సినిమాల సమాచారాన్ని ఇసుకరేణువులో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే మెదడు సంబంధిత రుగ్మతల్ని నయం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది’’ అన్నాను.‘‘పార్కిన్సన్స్కి, ఏడీహెచ్‌డీకి కొన్ని మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కదమ్మా. మరి మీ ల్యాబ్‌లో చేస్తున్న ప్రయోగాలేమిటి?’’ ‘‘అవున్నాన్నా. కొన్ని మందులున్నాయి. వాటివల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది తప్ప పూర్తిగా నయంచేసే మందులు లేవు. మెదళ్లోని న్యూరోట్రాన్స్‌మీటర్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ రుగ్మతలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల మెదడు టిష్యూలు దెబ్బతినడం కూడా కారణం కావొచ్చు. మొదట అవి ఏ ప్రాంతంలో దెబ్బతినడం వల్ల ఈ జబ్బులు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. మేము చేస్తున్న పని అదే. దెబ్బతిన్న మెదడు కణాల్ని పునరుజ్జీవింపచేసే పరిజ్ఞానంలో శాస్త్రవేత్తలు వేగంగా అడుగులు కదుపుతున్నారు. తొందర్లోనే విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. అప్పుడు ఇటువంటి న్యూరొలాజికల్ డిజార్డర్స్‌ను పూర్తిగా నయం చేయవచ్చు’’ అన్నాను.బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. బాగా డస్సిపోయిన భావన... శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్ల కాదు, మానసికంగా కుంగుబాటువల్ల కలుగుతున్న అలసట.తుషార్ మంచం చుట్టూ పరుగెత్తుతూ చేతిలో ఉన్న స్కేల్‌తో వార్డ్రోబ్స్ మీద, తలుపు మీద దబదబా బాదుతూ శబ్దం చేస్తున్నాడు.ఎంత అందమైన జీవితాన్ని వూహించుకున్నానో... పీజీలో రాహుల్‌తో ఏర్పడిన పరిచయం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రేమగా మారింది. రాహుల్ ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసేవాడు. నా ఎకౌంట్ అదే బ్యాంకులో ఉండటంతో, పనిమీద వెళ్ళిన ప్రతిసారీ రాహుల్ నవ్వు ఆత్మీయంగా పలకరించేది. ఎంత అందమైన నవ్వో... మెస్మరైజింగ్ స్మయిల్... నాకు శ్రమ లేకుండా అన్ని పనులు చేసిపెట్టేవాడు. నేనంటే అతనికి ఎంతిష్టమో అర్థమవడంతో నేను కూడా ఇష్టపడసాగాను. అందగాడు, మంచి మనసు ఉన్నవాడు, ప్రేమిస్తున్నవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ... ఇంతకన్నా ఏ ఆడపిల్లయినా ఏం కోరుకుంటుంది? పీజీ పూర్తయిన రెండేళ్ళ తర్వాత రాహుల్‌తో నా పెళ్ళి జరిగింది.ఎన్ని మధురమైన అనుభవాలో... ఎన్ని తీయటి అనుభూతులో... స్వర్గం అంటే ఇదే కదా అనిపించేది. వసంతం తాకిన వనంలా విరబూసి, మంజుల వీణానిక్వణంలా రవళించి, మకరందం గ్రోలిన మధుపంలా మత్తిలి... జీవితం నిండా ఎన్ని రంగులో... వేనవేల హరివిల్లులు విరిసినట్టు...తుషార్ పుట్టాక జీవితం మరింత శోభాయమానంగా కనిపించసాగింది.కాని, జీవితంలో సంతోషాల జీవితకాలం తక్కువని తొందర్లోనే తెలిసొచ్చింది.రాహుల్‌కి అదే బ్యాంకులో పనిచేసే హర్షితతో సన్నిహిత సంబంధం ఉందని తెలిసిన రోజు పెద్ద గొడవైంది.‘మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు. ఉత్త పుకారు’ అంటాడనుకుని ఆశపడ్డాను. ఒకవేళ నిజంగానే ఉన్నా, ‘తప్పు చేశాను. క్షమించు. ఇంకెప్పుడూ అటువంటి పొరపాటు చేయను’ అంటూ పశ్చాత్తాప పడతాడనుకున్నాను. సిగ్గులేకుండా ‘అవును. తనంటే నాకిష్టం. హర్షితతో శారీరక సంబంధం ఉన్నమాట వాస్తవమే. అయితే ఏమైంది? నీకేమీ తక్కువ చేయడం లేదు కదా. నిన్నొదిలేసి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు. జస్ట్ ఫర్ ఫన్. అంతే. దానికింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదు’ అన్నాడు.‘ప్రేమించానని కదా వెంటపడ్డావు. నీ ప్రేమ నిజమైందని నమ్మి కదా పెళ్ళి చేసుకున్నాను. ఇలా చేయడం నమ్మక ద్రోహం కాదా?’ అని అడిగాను.‘ఇప్పటికీ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సౌమ్యా. హర్షితమీద నాకున్నది ప్రేమ కాదు. లస్ట్. అంతే. ఆ అమ్మాయికి మరో మూడేళ్ళలో పెళ్ళవుతుంది. అప్పుడు తనెవరో, నేనెవరో! అది టెంపరరీ బంధం. మనది శాశ్వత బంధం డియర్’ అంటూ నవ్వాడు.మొన్నటి వరకు మెస్మరైజింగ్‌గా కనిపించిన నవ్వు ఇప్పుడు మాయలమరాఠీ నవ్వులా వెగటుగా అనిపించింది.‘నేను కూడా కాపురం నీతో చేస్తూ సెక్స్ కోసం మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటావా?’ అన్నాను.నా చెంప పగిలేలా కొట్టి, విసురుగా గదిలోంచి బైటికెళ్ళిపోయాడు.ఇరు కుటుంబాల పెద్దలతో పంచాయతీ జరిగింది.‘నిన్ను వదుల్తాననడం లేదు కదా. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంటున్నాడుగా. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటావు’ అంటూ సలహాలిచ్చే వాళ్ళే అందరూ.ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడింది మా అమ్మ.విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించాను.నాకు విడాకులు మంజూరయ్యే నాటికి తుషార్‌కి మూడేళ్ళు...వాడికి ఏడాది వయసున్నప్పటి నుంచి రాహుల్‌తో మొదలైన గొడవలు, విడాకుల కోసం కోర్టుల చుట్టూ చేసిన ప్రదక్షిణలు, పడిన పాట్లు, పర్యవసానంగా అనుభవించిన మానసిక హింస... వీటివల్ల నేను తుషార్‌ని సరిగ్గా పట్టించుకోలేదనేది వాస్తవం. వాడి ఆలనాపాలనా అన్నీ అమ్మే చూసుకునేది.రాహుల్‌తో విడిపోయాక, ప్రశాంతత చిక్కడంతో తుషార్‌ని దగ్గరకు తీసుకునే అవకాశం దొరికింది. అప్పుడు గమనించాను వాడి స్వభావంలో ఉన్న వైపరీత్యాల్ని. ఒకచోట కుదురుగా కూర్చోడు. హైపర్ యాక్టివ్... మామూలుగా ఆ వయసు పిల్లలు చేసే అల్లరి గురించి నాకు అవగాహన ఉంది. కాని, తుషార్ చేసే అల్లరి దానికి రెట్టింపు స్థాయిలో ఉంటోంది. ఏమైనా చెప్తుంటే అస్సలు వినడు. చెప్పిన పని చేయడు. పిల్లలతో కలిసి ఆడుకోడు. ఆడే ఆటలో నిమిషాల్లోనే ఆసక్తిని కోల్పోయి మరో ఆట మొదలెడ్తాడు. ఇంపల్సివ్గా పనులు చేస్తాడు తప్ప వాటి పర్యవసానాల గురించి ఆలోచించడు. వాడిని నిద్ర పుచ్చడం పెద్ద సమస్య. నిద్ర పట్టినా చాలాసార్లు మధ్యమధ్యలో లేచి కూచుంటాడు. విపరీతమైన అసహనం, కోపం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న విషయానికే అతిగా స్పందించడం, నిర్లక్ష్యం, ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోవడం, హింసాత్మక ప్రవర్తన వంటి లక్షణాలు కన్పించడంతో నాలో ఏదో అనుమానం పడగ విప్పసాగింది. నిర్ధారణ కోసం చైల్డ్ సైకియాట్రిస్ట్‌కి చూపించాను. నా అనుమానం నిజమైంది. తుషార్‌కి ఏడీహెచ్‌డీ సమస్య ఉంది. అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్... రాహుల్ నాకు చేస్తున్న ద్రోహం గురించి తెల్సినపుడు కూడా ఇంత బాధపడ లేదు. విడాకుల తర్వాత సింగిల్ పేరెంట్‌గా మారినపుడు కూడా ఆందోళనకు లోనుకాలేదు. కాని, నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుక్కి ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ కాగానే అంతులేని దుఃఖంలో కూరుకుపోయాను. రెండేళ్ళపాటు బిహేవియరల్ థెరపీ ఇప్పించాను. వాడికిపుడు ఎనిమిదేళ్ళు...ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు పెద్దయ్యాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడొచ్చు. ఎడీహెచ్డీకి, పార్కిన్సన్స్ వ్యాధికి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటరే కారణం. ఆడి ఆడి అలసిపోయి, నాపక్కన పడుకున్న తుషార్ మీద లాలనగా చేయివేసి, కళ్ళు మూసుకున్నాను. అనాయాసంగానే కళ్ళలోంచి నీళ్ళు ఉబికుబికి వచ్చాయి.∙∙ బ్రూనో తలకు చేసిన ఎనిమిదో రంధ్రంలోకి టాక్సిన్ని పంపించాక, దాని ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గమనించసాగాను. వారం గడిచేటప్పటికి దానిలో అసహనం, అలజడి స్పష్టంగా కన్పించసాగాయి. ఒకచోట కుదురుగా కూచోవడం లేదు. కంటెయినర్లో అట్నుంచిటు అవిశ్రాంతంగా తిరుగుతోంది. తనతోపాటు ఉన్న లిల్లీని కొట్టి కొరికి హింసిస్తోంది. నిద్ర కూడా బాగా తగ్గింది.ఇవన్నీ ఏడీహెచ్‌డీ లక్షణాలు కావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెదళ్లోని ఏ భాగంలో ఉన్న న్యూరాన్లు దెబ్బతినడం వల్ల ఏడీహెచ్‌డీ ఏర్పడుతుందో కచ్చితంగా తెలియడం వల్ల ఆ డిజార్డర్‌కి రెండు పద్ధతుల ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు. మెదళ్లోని ఆ భాగంలోకి ఏ మందుని పంపించడం వల్ల అక్కడి న్యూరాన్లు పునరుజ్జీవం పొందుతాయో తెలుసుకోవడం ఓ పద్ధతి. ప్రయోగశాలలో అటువంటి మెదడు కణాల్ని ఉత్పత్తి చేసి, ఆ భాగంలో అమర్చడం ద్వారా నయం చేయడం మరో పద్ధతి.ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయడం కోసం తన శరీరాన్ని పణంగా పెట్టిన బ్రూనో ఇప్పుడు నా కళ్ళకు దేవదూతలా కన్పిస్తోంది.నేను భయపడుతున్న ఘడియలు రానేవచ్చాయి... బ్రూనోని మెర్సీకిల్లింగ్‌కు లోను చేయాల్సిన ఘడియలు... నేను బ్రూనోవైపు జాలిగా చూశాను. ఒకప్పటిలా అది నన్ను గుర్తు పట్టడంలేదు. పెదవుల్ని సాగదీసి నవ్వడం ఎప్పుడో మర్చిపోయింది. దుమికే జలపాతంలా చురుగ్గా కదిలే ఒకప్పటి బ్రూనో కాదిప్పుడు. దాని కదలికల్లోనే కాకుండా, ప్రవర్తనలో కూడా చాలా మార్పులొచ్చాయి. అదిప్పుడు వైద్యశాస్త్ర ప్రరిశోధనలకు పనికిరాని ప్రాణి. దాన్ని చంపొద్దని ల్యాబొరేటరీ డైరెక్టర్ నీరవ్‌ని బతిమాలుకున్నాను.‘‘చంపకుండా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంది? దాని పోషణకయ్యే ఖర్చు వృథా కావడం తప్ప. అదిప్పుడు రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దాని శరీరంలోకి ఎన్ని యాంటీబయోటిక్స్ పంప్ చేశామో గుర్తుందా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దాని అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిని ఉంటాయన్న విషయం మీకు తెలుసుకదా’’ అన్నాడు.‘‘బ్రూనో మానవజాతికి చేసిన మేలు ఎలా మర్చిపోగలం? భవిష్యత్తులో ఏడీహెచ్‌డీకి పరిష్కారం కనుక్కుంటే ఆ క్రెడిట్ బ్రూనోకే దక్కుతుంది. దానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’’ అన్నాను.‘‘దాన్ని చంపడమే మనం దానికి చేయగల మహోపకారం’’ అన్నాడు.‘‘నాకిచ్చేయండి. నేను పెంచుకుంటాను’’ అన్నాను.‘‘మీకేమైనా పిచ్చా? రకరకాల మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్న బ్రూనోని పెంచడం ఎంత కష్టమో, అందులో ఎంత రిస్క్ ఉందో ఆలోచించారా?’’ అన్నాడు.‘‘ఆ విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పర్వాలేదు. నా కొడుకు ఏడీహెచ్‌డీతో బాధపడ్తున్నాడని మీకు తెలుసు. అటువంటి కొన్ని లక్షలమంది పిల్లల కోసం అది శారీరక హింసను భరించింది. నేను దానికోసం ఆ మాత్రం కష్టాన్ని భరించలేనా?’’ అన్నాను.నేనతన్ని ఒప్పించి, బ్రూనోని ఇంటికి తెచ్చుకున్నాను.బ్రూనో కోసం వసారాలో ఉన్న ఖాళీస్థలంలో అల్యూమినియంతో చిన్న గదిలా కట్టించాను.రోజూ రాత్రి యింటికి చేరుకునే సమయానికి బెడ్రూంలో తుషార్ పెద్దగా అరుస్తూ, మంచం పైనుంచి కిందికి జంప్ చేస్తూ గోల చేస్తుంటే, వసారాలో బ్రూనో అల్యూమినియం గదిలో అశాంతిగా, అలజడిగా తిరుగుతూ, కంటెయినర్ గోడల్ని చేతుల్తో బాదుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది.ఇప్పుడు మా యింట్లో ఏడీహెచ్‌డీతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు. ∙సలీం -
కథాకళి: కారణం లేదు
ఆ ఫిర్యాదు అందుకోగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్ స్పెక్టర్ని పిలిచి ఆదేశించాడు.‘‘కొత్తపేటలో ఓ ఇల్లాలు తన భర్తని చంపేసిందని ఫిర్యాదు వచ్చింది. వెళ్ళి చూడు.’’అతను ఓ కానిస్టేబుల్‌తో ఆ చిరునామాకి పావుగంటలో చేరుకున్నాడు. దూరం నుంచే ఆ ఇంటి బయట లైట్ స్తంభం వెలుతురులో గుమిగూడిన జనాన్ని చూశారు. వాహనంలోంచి దిగిన యూనిఫామ్‌లోని ఆ ఇద్దర్ని చూసి జనం పక్కకి తప్పుకున్నారు.‘‘ఫిర్యాదు చేసింది మీలో ఎవరు?’’ ఎస్.ఐ. అడిగాడు.ఒకతను ముందుకి వచ్చి చెప్పాడు.‘‘నేనే. పక్కింట్లో ఉంటాను. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూంటే ఇంట్లోంచి అనివర్తిగారి అరుపులు వినిపించాయి. పరిగెత్తుకు వెళ్ళి చూస్తే ఆయన మంచం మీద రక్తసిక్తమై కనిపించాడు. ఆవిడ చేతిలో కత్తి. ఆయన ఎదురుగా కూర్చుని ఆయన్నే చూస్తోంది. ‘ఏమైంద’ని అడిగితే ‘మా వారిని పొడిచాను’ అని చెప్పింది. వెంటనే మీకు ఫోన్ చేశాను.’’ఎస్.ఐ. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల మంచం మీది హతుడి చొక్కా రక్తంతో తడిసి, నేల మీద కూడా కొంత మడుగు కట్టింది. ఛాతీలో రెండు చోట్ల గాయాలు కనిపించాయి. ఎదురుగా ఏభై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. మంచం మీద రక్తసిక్తమైన కత్తి ఉంది. ఆవిడ పోలీసుల వంక నిర్లిప్తంగా చూసింది.‘‘ఈయన ఎవరు? మీకు ఏమవుతారు?’’ ఎస్.ఐ. అడిగాడు.‘‘నా భర్త.’’‘‘ఈయన్ని మీరే చంపారా?’’‘‘అవును.’’‘‘ఆ కత్తితోనే పొడిచి చంపారా?’’‘‘అవును.’’‘‘ఎందుకు చంపారు?’’ ఎస్.ఐ. ప్రశ్నించాడు.‘‘నాకు తెలీదు.’’‘‘మీకు తెలుసు. కారణం లేకుండా మీరు ఆయన్ని చంపలేరు.’’‘‘ఏమో మరి?’’‘‘ఆయన మీకు తెలీకుండా మరో పెళ్ళి చేసుకోవడం, అక్రమ సంబంధం, ఏ కారణంగానైనా హింసించడం లాంటివి ఏమైనా జరిగాయా?’’‘‘లేవు. ఆయన ఎన్నడూ నా మీద చెయ్యి చేసుకోలేదు.’’‘‘మీరు చంపబోయే ముందు ఏం జరిగింది?’’‘‘పెద్దగా ఏం జరగలేదు. నేను బాత్రూంలోకి వెళ్ళి బయటకి రాగానే ఎందుకో ఆయన మీద కోపం వచ్చి ఉంటుంది. అందుకని పొడిచి ఉంటాను.’’‘‘ఎందుకు కోపం వచ్చిందో గుర్తు తెచ్చుకోగలరా?’’ ఎస్.ఐ. అడిగాడు.పెళ్ళైన కొత్తల్లో అనివర్తి ఆఫీస్ నించి ఆలస్యంగా వచ్చాడు.‘‘ఆలస్యమైనప్పుడు ఓ ఫోన్ కాల్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మీ కోసం వండిన ఉప్మా చల్లారిపోయింది. రీహీట్ చేస్తే మీరు తినరు.’’అనివర్తి చొక్కా విప్పగానే వీపువైపు చినిగిన బనీన్ ని చూసింది.‘‘ఆ చిరుగుల బనీన్ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదని అంతా అనుకుంటారు.’’మరో రోజు. ‘‘స్నానానికి వెళ్తూ మూడు విజిల్స్ రాగానే కుక్కర్‌ని ఆఫ్ చేయమన్నానా? అన్నమంతా ఎలా పొంగిపోయిందో చూడండి. మీరు ఏ పనీ సరిగ్గా చేయరు.’’‘‘ఇంగువ డబ్బా తేలేదే?’’ అనివర్తి సాయంత్రం షాప్‌కి వెళ్ళొచ్చాక సంచీలోవి కిచెన్ ప్లాట్‌ఫాం మీదకి కుమ్మరించి చూసి అడిగింది.‘‘మర్చిపోయాను.’’‘‘అసలు మిమ్మల్ని పంపించిందే అందుకు కదా?’’‘‘గుర్తు లేదు.’’‘‘న్యూస్ పేపర్ చదివాక టీవీ కింద షెల్ఫ్‌లో ఉంచమన్నానా? ఫేన్ గాలికి అవి ఎలా చిందరవందరగా పడ్డాయో చూడండి.’’‘‘రాత్రుళ్ళు మీ మొబైల్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచమన్నానా? టింగ్ టింగ్‌మని మెసేజ్ అలర్ట్స్‌కి మెలకువ వచ్చి తర్వాత నిద్రపట్టి చావటం లేదు.’’‘‘మనిద్దరికీ డయాబెటిస్. ఆ కాజు బర్ఫీ తీసుకురావద్దంటే ఎందుకు తెస్తారు? మీ కౌంట్ పోయినసారి టూట్వంటీకి వెళ్ళింది.’’‘‘బాత్రూం బయట ఆ పట్టా ఎందుకు వేశారు? దాని కింద బట్ట చిరిగి రబ్బర్ బయటకి వచ్చింది. కింద తడికి దాని మీద కాలు వేస్తే జర్రున జారి పడ్డాను. అదృష్టం. నా ఎముకలు విరగలేదు.’’‘‘ఎందుకిలా అనవసరపు ఖర్చులు పెడతారు? కిలో పదహారు వందలు పెట్టి పిస్తా కొనే తాహతు మనకి ఉందా అని ఆలోచించుకోనక్కర్లేదా?’’ఆ అర్ధరాత్రి అనివర్తి భార్యకి మెలకువ వచ్చింది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆవిడకి గుప్పున యూరిన్ వాసన వేసింది. పెళ్ళైన కొత్తల్లో తన భర్తకి చెప్పడానికి ఆమె కొంత సిగ్గు పడింది. తర్వాత చెప్పేప్పుడు ఇబ్బందిగా చెప్పింది.‘‘మీరు బాత్రూంలో నీళ్ళు చక్కగా చుట్టూ కూడా కొట్టండి.’’వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి నిద్రపోయే భర్త ఛాతీలో రెండుసార్లు బలంగా పొడిచింది. తర్వాత ఎటాచ్డ్ బాత్రూంలోకి కాక కామన్ బాత్రూంలోకి వెళ్ళింది. ‘‘లేదు. నేను నా మావారిని చంపడానికి కారణం ఉందనుకోను. నిజానికి కొన్ని కారణాలు ఉన్నా అందులో ఏవీ చంపదగ్గ కారణాలుగా నాకు తోచలేదు. ఎందుకు చంపానో నాకే తెలీదు.’’ ఆవిడ ఎస్.ఐ.కి చెప్పింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
నన్ను పెళ్లి చేసుకుంటావా ?!
‘వాలెంటైన్స్’ వీక్ మొదలైంది. నిన్నంతా గులాబీల పరిమళం (రోజ్ డే). నేడు, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?!’’ అని వేడుకొనే రోజు (ప్రపోజ్ డే). రేపు, మధురమైన చాక్లెట్ డే. 10న టెడ్డీ డే. 11న ప్రామిస్ డే. 12న హగ్ డే. 13న కిస్ డే.14 శనివారం, వాలెంటైన్స్ డే. ఎనిమిది రోజుల ప్రేమవారం.. ఈ వరుసంతా!అన్నిట్లోకి అపురూపమైనది ఇవాళ్టి ప్రపోజ్ డే. ఈ సందర్భంగా –కొందరు తత్వవేత్తల ప్రపోజల్స్ గురించి.తత్త్వవేత్తల ఆలోచనలు సాధారణ ప్రపంచానికి అంతుపట్టవు. వాళ్లకు ఎంతో సరళమైనది, లోకానికి కఠినాతికఠినంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి అనే లాలిత్యమైన భావనలు కూడా వారిలో ‘మేధాగర్భితమై’ ఉంటాయి. మానవ మాత్రులం పూలగుత్తులు, వెన్నెల రాత్రులతో ప్రేమను పండించుకోవాలని చూస్తుంటే... వారు మాత్రం తర్క వితర్కాలు, విడ్డూరమైన ఒప్పందాలతో ప్రేమను ‘కుదుర్చుకోవటం’ చరిత్రలో మనకు కనిపిస్తుంది! పాశ్చాత్య ఫిలాసఫర్లు మాత్రమే కాదు, భారతీయ తాత్త్విక చింతనాపరులూ ప్రేమ / పెళ్లి ‘ప్రపోజల్’ విషయంలో వాళ్లదైన స్థాయిలో సతమతమైనవారే లేదా తమ ప్రియురాళ్లను సతాయించినవారే.ఫ్రెడరిక్ నీషేనీషే 19వ శతాబ్దపు జర్మన్ తత్త్వవేత్త. ఈయన తన ప్రియురాలికి (వన్ సైడ్ లవ్) ముచ్చటగా మూడుసార్లు ప్రపోజ్ చేశారు. ఆ ప్రియురాలు ‘లూ ఆండ్రియాస్ సలోమీ’ అసాధారణ మేధావి! ఈయన్ని మించినావిడ! భావోద్వేగాల పరంగా ఆమె స్థాయి ఎక్కడో ఎగువన ఉంటే, నీషే స్థాయి ఎక్కడో దిగువన ఉండేది. ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఆయన ఆమెను ఒకసారి అడిగి ఊరుకోలేదు. మూడు ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయత్నంలో, నేరుగా అడిగే ధైర్యం లేక తన స్నేహితుడు పాల్ రేని రాయబారిగా పంపారు. అదే అతడు చేసిన పొరపాటు. ఆ రాయబారికి కూడా ఆమె అంటే ప్రాణం! నీషే ప్రేమ గురించి చెప్పకుండా తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. చివరికి ఆమె ఇద్దరికీ ‘నో’ చెప్పేసింది. అలాగని ఆమె ఆ రెండు పురుషాత్మల ఆశా దీపాన్ని ‘ఉఫ్’మనేమీ ఆర్పేయలేదు. ‘‘మన ముగ్గురం కలిసి ఒక ‘పరిశుద్ధ త్రిమూర్తులు’గా బ్రహ్మచర్యం పాటిస్తూ, కేవలం చదువుకు అంకితమై ఒకే ఇంట్లో ఉందాం’’ అని ప్రతిపాదించింది. నీషే మొదట అయిష్టంగానే ఒప్పుకున్నా, ఆ తర్వాత వారి పవిత్ర స్నేహబంధాన్ని ఆమెతో పెళ్లిగా మార్చుకుందామని రెండుసార్లు ప్రయత్నించారు. పాపం ఆయన తర్కం ఆమె దగ్గర చీమంత కూడా పని చేయలేదు.సోరెన్ కిర్కేగార్డ్కిర్కేగార్డ్ 19వ శతాబ్దపు డెన్మార్క్ వేదాంత వేత్త. రెజీన్ ఒల్సెన్ అనే యువతికి ఆయన చేసిన ప్రపోజల్ మొదట్లో చాలా పద్ధతిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన విన్యాసాలే చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయాయి. ఆయన అడిగారు, ఆమె సరేనంది... ఆ ఆనందం కనీసం మూణ్ణాళ్లైనా కాదు కదా, రెణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది! అందుకు కారణం ఆమె కాదు. అతడే. లవ్‌ని ప్రపోజ్ చేశాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తనకున్న అకారణ విషాద భావన తత్వం (మెలంకలీ), దేవుని పట్ల ఉన్న భక్తి... ఒక మంచి భర్తగా ఉండటానికి ఏమాత్రం పనికిరావని ఆయన సిద్ధాంతీకరించుకున్నారు! పోనీ, గౌరవప్రదంగా విడిపోవచ్చు కదా? అదీ లేదు! ఆమెకు తన మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేసుకుని, బ్రేకప్ వల్ల ఆమె బాధపడకూడదనే వింత ఆలోచనతో తన గురించి తనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టుకున్నారు. బయట అందరి ముందు కావాలనే ఒక మూర్ఖుడిలా, దుర్మార్గుడిలా ప్రవర్తిస్తూ తన పరువును తనే తీసుకున్నారు.ఇమ్మాన్యుయేల్ కాంట్ ఈయన 18వ శతాబ్దపు ప్రముఖ భావవాద జర్మనీ తత్త్వవేత్త. సమయాన్ని పాటించడంలో, విషయాలను విశ్లేషించి, వర్గీకరించటంలో మహాజ్ఞాని. సమస్య ఏంటంటే, లవ్ ప్రపోజల్‌ని ఆయన ఒక అందమైన అనుభూతిలా కాకుండా, తాను ఛేదించలేని ఒక క్లిష్టమైన గణిత సమస్యలా చూశారు. సంగతేంటంటే, ఇద్దరు అమ్మాయిలకు (ఒకేసారి కాదు లెండి, ఒకరి తర్వాత ఒకరికి) ఆయన ప్రపోజ్ చేయాలనుకున్నారు కాని, మేధస్సు ఆడిన ఊగిసలాటతో ఆ పని చేయలేకపోయారు. పెళ్లి వల్ల వచ్చే ఆర్థిక లాభనష్టాలు; తార్కికమైన ప్లస్‌లు, మైనస్‌లు లెక్కగట్టడానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారంటే... చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, పెళ్లికి మానసికంగా సిద్ధం అయ్యేనాటికి.. ఒకమ్మాయి ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంకో అమ్మాయి హాయిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పాపం, కాంట్.. తన లోపల ఉండే ప్రాఫిట్ అండ్ లాస్‌ల గడియారం కంటే... మనుషుల జీవ గడియారమే వేగంగా తిరుగుతుందని గుర్తించలేకపోయారు!జి.డబ్ల్యూ.ఎఫ్. హెగెల్ఈయన ఒక తార్కిక ప్రేమికుడు! 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత జర్మన్ తత్త్వవేత్త. ప్రతి పదార్థానికీ చలనం ఉంటుందన్న హెగల్ సూత్రం, మార్క్సిస్టు గతి తార్కిక భౌతికవాదంపై ఎంతో ప్రభావం చూపింది. అర్థం కాని భాషకు, భారమైన సిద్ధాంతాలకు హెగల్ మారుపేరు. ‘మేరీ వాన్ టుచర్’ కి ఆయన చేసిన ప్రపోజల్ కూడా ఆయన శైలిలోనే కొంచెం గంభీరమైనది.ఆమె కోసం ఆయన కవితలు రాశారు. కానీ అవి మెదడుకు మేత పెట్టేలా ఉండేవి తప్ప, మనసున మల్లెల మాలలను ఊగించేవి కావు. ‘‘నిష్కల్మషమైన ప్రేమ అనేది బాగానే ఉంటుంది కానీ, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ‘పెళ్లి’ అనేది ఒక చట్టపరమైన, సామాజికమైన అవసరం. అందుకే మనం పెళ్లి చేసుకుందాం..’’ అని ఆమెతో అనేవారు. అంటే తన లవ్ ప్రపోజల్‌ని కూడా ఆయన తన ‘ఫెనోమెనాలజీ ఆఫ్ స్పిరిట్’ అనే గ్రంథంలోని ఒక క్లిష్టమైన పాఠంలా మార్చేశారు. అదృష్టవశాత్తూ, మేరీకి ఆయన ప్రపోజల్ నచ్చటంతో ఆయన్ని పెళ్లాడింది.జీన్ పాల్ సార్త్రే సార్త్రే 20వ శతాబ్దారంభపు ఫ్రెంచి తత్త్వవేత్త. నాటక రచయిత, రాజకీయ కార్యకర్త, సాహితీ విమర్శకుడు. ‘విడ్డూరం’ అనే పదానికి అసలైన అర్థం సార్త్రే, ఆయన ప్రియురాలు సిమోన్ డిబోవర్. వీరు ప్రేమించుకున్నారు కాని, పెళ్లి చేసుకోలేదు! ‘చేసుకోకపోవడమే ప్రేమ పరమార్థం’ అన్నట్లు ఉండిపోయారు. సార్త్రే, ఆమెకు ఒక వినూత్నమైన ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, ప్రతి రెండేళ్లకు ఒకసారి తమ పెళ్లిని ‘రెన్యువల్’ చేసుకునే ఒక ఒప్పందం! ‘‘మన మధ్య ఉన్నది అత్యంత ‘అవసరమైన’ ప్రేమ (!); కాని లోకంలో ఉన్న ‘అనవసరమైన’ పెళ్లిని కూడా మనం చవి చూడటం మంచిది’’ అని సార్త్రే ఆమెను ఒప్పించారు. ఫలితంగా, వారు రెండేళ్లకోసారి పెళ్లి అనే భావనను (!) పొడిగించుకుంటూ 51 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అలాగని ఏనాడూ ఒకే ఇంట్లో నివసించలేదు. పైగా, తమ తమ ఇతర ప్రేమాయణాల గురించి కాఫీ తాగుతూ హాయిగా చర్చించుకునేవారు. ‘ఓపెన్ రిలేషన్షిప్’ అనే పదం పుట్టకముందే, ఆ కాన్సెప్ట్‌కి వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు!మొత్తానికి ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల ప్రేమకథలు వింటుంటే.. ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట కంటే, ‘ప్రేమ తాత్త్వికమైనది’ అనే మాట కరెక్ట్ ఏమో అనే ఆలోచన కలుగుతుంది.::: భారతీయ తత్త్వవేత్తల ప్రపోజల్స్ :::మనవాళ్ల తాత్త్విక సంప్రదాయాలు ఎక్కువగా వైరాగ్యం, మోక్షం వైపు మొగ్గు చూపుతాయి. అందుకే, ఒక జ్ఞాని సంసార జీవితంలోకి (గృహస్థాశ్రమం) అడుగుపెట్టడం అంటే ప్రాచీన భారతదేశంలో అదొక పెద్ద ‘మేధాపరమైన కల్యాణ వేదిక’! పెళ్లి ప్రపోజల్స్ అంటే కేవలం మనసులు కలవడం మాత్రమే కాదు... అవి ధర్మం గురించి, ఆత్మల అనుసంధానం గురించి జరిగే హై–వోల్టేజ్ డిబేట్లు!యాజ్ఞవల్క్య మహర్షిఉపనిషత్తుల కాలం నాటి మేధావు లందరిలో యాజ్ఞవల్క్యుడు ఒక శిఖరం లాంటి వాడు. పెళ్లి విషయంలో కూడా ఆయనది ఒక రకమైన ‘మెటాఫిజికల్’ (అధిభౌతిక) అప్రోచ్! ఆయన తన రెండో భార్య మైత్రేయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అది ఇప్పట్లో లాగా ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?‘ అని అడిగే మామూలు ప్రపోజల్ కాదు. మైత్రేయి అసామాన్యురాలు. గొప్ప విదుషీమణి. అంటే, మహా పండితురాలు. ఆమెకు కావలసింది నగలు, బంగారం లేదా హోదా కాదు. ఆమెకు ‘అమరత్వ సిద్ధి’ రహస్యం కావాలి. యాజ్ఞవల్క్యుడు ఆమెకు ఒక సంసార బంధాన్ని కాకుండా, ఒక ‘ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని’ ఆఫర్ చేశారు. ఆయన ఆమెతో ఒక మాట అన్నారు. ‘‘భర్తను భర్త కోసం ప్రేమించకూడదు, ఆయనలో ఉన్న ‘ఆత్మ కోసం ప్రేమించాలి’’ అని! అదే, ఆమెకు ఆయన చేసిన పెళ్లి ప్రపోజల్. దానర్థం ఏమిటంటే, మనం హాయిగా అడవికి వెళ్లి కూర్చుని, మోక్షం వచ్చే వరకు ఈ విశ్వం గురించి వాదించుకుంటూ ఉందాం – అని! ఇదొక రకమైన ‘స్టడీ–బడ్డీ’ లేదా క్లాస్మేట్ ప్రపోజల్ లాంటిది. పెళ్లి తర్వాత పార్టీలు, ఫంక్షన్లు కాదు... నేరుగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకునే ప్రణాళిక అన్నమాట.మండన మిశ్రుడు 8వ శతాబ్దంలో, గొప్ప మీమాంస పండితుడైన మండన మిశ్రుడికి ఉభయభారతి అనే తాత్త్వికురాలితో వివాహం జరిగింది. నిజానికి ఆమె తెలివితేటల ముందు ఆయన మేధస్సు కాస్త తక్కువేనని ఆ కాలంలోనే చెప్పుకునేవారు. నిజానికైతే వీరి వివాహాన్ని ఒక ప్రేమ బంధంలా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ‘జ్ఞాన సమ్మేళనం’ లాగా అభివర్ణించాలి. మండన మిశ్రుడి పెళ్లి ప్రపోజల్ కూడా అదే విధంగా జరిగింది. ఇక, వీరి కాపురం ఎలా ఉండేదంటే... అదొక నిరంతర తాత్త్వికాంశాల తరగతి గదిలా ఉండేది. ఒకసారి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదనకు దిగారు. అప్పుడు మండన మిశ్రుడు ఏ మగ పండితుడినీ న్యాయనిర్ణేతగా పెట్టుకోకుండా, తన భార్యనే ఆ స్థానంలో ఉండమన్నారు! ఆ చర్చలో భర్త ఓడిపోతుంటే, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా నిజాన్ని అంగీకరించింది. అయితే, ఆమె అక్కడితో ఆగిపోలేదు. ‘‘నా భర్తను ఓడించినా, ఆయనలో సగభాగమైన నన్ను ఓడిస్తేనే మీ విజయం పూర్తవుతుంది’’ అని శంకరాచార్యుల వారికే సవాలు విసిరింది! పైగా, ‘‘నువ్వు సన్యాసివి, అసలు పెళ్లి చేసుకుంటే వచ్చే జీవితానుభవాలే నీకు తెలియవు. మరి నీకు సంపూర్ణ జ్ఞానం ఉందని ఎలా చెబుతావు?’’ అని శంకరాచార్యుల వారిని ప్రశ్నించింది.మహావీరుడుజైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారినప్పటికీ, ఆయన వివాహం గురించి చరిత్రలో ఒక పెద్ద తాత్త్విక చర్చే నడిచింది. పురాణ గాథల ప్రకారం, ఆయన మనసు లోక కల్యాణం మీద ఉండటంతో, ఆయనను ఈ ప్రాపంచిక బంధాల్లో బంధించాలని తల్లిదండ్రులు యశోదతో పెళ్లి నిశ్చయించారు. అంటే, ఆయన పెళ్లి ప్రపోజల్ వెనుక ఆయన ప్రమేయం కంటే, వారి తల్లిదండ్రుల ప్లానే ఎక్కువగా ఉందన్నమాట! మొత్తానికి మహావీరుడు పెళ్లి చేసుకున్నారు కాని, ఆ సంసార జీవితంలో ఉంటూనే అంతర్గతంగా పూర్తి వైరాగ్యంతో ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి... ‘‘నేను నీ పక్కనే కూర్చొని ఉంటాను కాని, నా మనసు మాత్రం ఎక్కడో విశ్వంలోని అనంతమైన శూన్యంలో విహరిస్తూ ఉంటుంది’’ అని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? సామాన్యులకు బోధపడే తత్త్వం అయితే కాదు.::: ‘సారీ, నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’:::భక్తి, అద్వైత సంప్రదాయాల్లోని కథలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అక్కడి తత్త్వవేత్తలు ప్రపోజ్ చేసే విధానం చాలా భిన్నంగా, విచిత్రంగా ఉంటుంది. వారు తమ భాగస్వామికి ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ‘నిర్లిప్తత’ ఉందో పరీక్షించి కానీ ముందడుగు వేసేవారు కాదు. నాటి పురుష తాత్వికులు ప్రపోజ్ చేయాలంటే, ఒక షరతు పెట్టేవారు. తనకు కాబోయే భార్య తన ‘దైవ చింతన’కు ఏమాత్రం అడ్డంకి కాకూడదు– అని! పెళ్లి్ల సంబంధం అని అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా మన తత్త్వవేత్తలు ఆమె అందం గురించి కాకుండా... జనన మరణాల గురించి, దేహం తాలూకు అశాశ్వతత్వం గురించి అత్యంత కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాపంచికమైన ఆశలతోనో లేదా మామూలు భావోద్వేగాలతోనో సమాధానం చెబితే, ‘‘సారీ... నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’’ అని తిరస్కరించేవారు. అంటే, అది పెళ్లి చూపుల్లా కాకుండా, ఒక ఆత్మకు జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూ లాగా ఉండేది! మొత్తానికి పశ్చిమ దేశాల తత్త్వవేత్తలైనా, మన భారతీయ మేధావులైనా... ప్రపోజల్ విషయంలో వారి లాజిక్కులు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయని అర్థమౌతోంది. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
కనువిప్పు
ఒక అడవిలో ఒక బోదురు కప్ప ఉండేది. ఆ బోదురు కప్ప గొప్పలకి పోవడం మొదలు పెట్టింది. నీటిలో ఉన్న జీవులను నేల మీద ఉండలేరని వెటకారం చేసేది. నేలమీద ఉన్న జీవులను నీటిలో ఉండలేరని ఎగతాళి చేసేది. నీటిలోను, నేల మీద ఉండగల జీవి తానొక్కటేనని విర్రవీగడం మొదలు పెట్టింది. ఓ కాకి ఇదంతా గమనించింది. ఎలాగైనా కప్పకు బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒక రోజు చెరువులోంచి నేల మీదకొచ్చిన కప్పకు, నేలపై అన్నం మెతుకులు తింటున్న కాకి కనిపించింది. ‘ఏం కాకి బావా! ఎంత సేపైనా నేల మీదేనా, నాలాగా నీటిలోకి వచ్చేదేమైనా ఉందా?’ అంటూ వ్యంగ్యంగా అంది కప్ప. ఆ మాటకు కాకి ‘ఎందుకు రాను బావా! నువ్వు మా ఆకాశానికి ఎగురుకుంటూ రా! నేను అలాగే మీ చెరువులోకి ఈదుకుంటూ వస్తా’ అని తడుముకోకుండా అంది. ఆ మాటకు కంగు తిన్నది కప్ప. ‘నిజమే కదా! రెండు చోట్లా ఉండగలను కాని, ఆకాశంలో ఎగరలేను కదా! ఇందులో పెద్ద గొప్ప ఏముంది?ఎలాగైనా ఆకాశంలో కూడా ఎగిరి, మూడు చోట్లా ఉండగలనని నిరూపించుకుని, ఎగిరే పక్షులకు కూడా నా సత్తా ఏమిటో చూపాలి’ అనుకుంది. అనుకున్నదే తడవుగా, ‘ఓస్ అదంత కష్టమేమీ కాదు, నీటిలోనూ, నేలపైనా ఉన్న దాన్ని ఆమాత్రం ఆకాశంలోకి ఎగరలేనా? రేపు ఉదయం ఎగురుతాను చూడు’ అని కాకితో తల ఎగరేస్తూ అంది. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కప్పకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం అని కాకి సరే అంది.ఎగరడానికి ముందు రెక్కలు కావాలి కనుక కప్ప వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళింది. ‘నెమలి మిత్రమా! నీ ఈకలు కొన్ని నాకు కావాలి. దానికి ప్రతిగా నీకు మొక్కల విత్తనాలు ఇస్తాను’ అని అడిగింది. నెమలి కొన్ని ఈకలు ఇచ్చింది. ఆ ఈకలు తీసుకుని దర్జీపిట్ట దగ్గరకు వెళ్ళింది కప్ప.‘దర్జీపిట్ట మిత్రమా! నాకు ఈ ఈకలతో రెక్కలు కుట్టివ్వవా! దానికి బదులుగా నీకు గింజలు ఇస్తాను’ అంది. ‘సరే’నని దర్జీ పిట్ట కప్పకు నెమలి ఈకలతో రంగు రంగుల రెక్కలను కుట్టి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కాకి దగ్గరకు వెళ్లి, ‘చూడు! నాకు రెక్కలు లేవనే కదా, ఎగరలే ననుకున్నావ్. నీ రెక్కలు నల్లవి. నా రెక్కలు చూడు రంగు రంగులవి. నీకన్నా పైకి ఎగరగలను’ అంటూ బలమంతా కూడగట్టుకుని రెక్కలను ఊపుతూ పైకెగిరింది. కప్ప బరువుకి రెక్కలు ఊడిపోయి, గాల్లో ఎగిరిపోయాయి. కప్ప గిరా గిరా గిరికీలు కొడుతూ కిందకు పడబోయింది. కప్పకు కళ్ళు తిరుగుతున్నట్టు, గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది. అహంకారానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని భయంతో బెక బెకమని అరవసాగింది.అంతా గమనిస్తున్న కాకి వెంటనే ఎగిరి తన వీపుపై కప్పను పెట్టుకుని, కింద పడకుండా జాగ్రత్తగా చెరువు గట్టు మీద దించింది. తను గొప్పలకు పోయి అందరినీ హేళన చేసినా, తనను కాపాడిన కాకి ముందు తలదించుకుని, క్షమించమని అడిగింది కప్ప. ‘ప్రతి జీవి శరీర ఆకృతి, నిర్మాణం ఒకో రకంగా ఏర్పడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అది తెలుసుకుని నడుచుకోకపోతే ఏ జీవికైనా ముప్పు తప్పదు. అహంకారపు పొరలు బుద్ధిని కమ్మేస్తాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. ఇకనైనా ఎవరినీ హేళన చేయకుండా బుద్ధిగా ఉండు’ అంటూ కాకి కప్పకు సుద్దులు చెప్పింది. కాకి మాటలను విన్న కప్ప బుద్ధి తెచ్చుకుని, ఎవరినీ ఎగతాళి చేయకుండా అందరినీ గౌరవిస్తూ, స్నేహ పూర్వకంగా మెలగసాగింది. కప్పకు కనువిప్పు కలిగించినందుకు నీటిలోని జీవులు, నేలపైన జీవులు కాకిని అభినందించాయి.కథాకళి25.1.2026 ఫన్డేలో ప్రచురించిన ‘మధురం’ కథకి పాఠకులు సూచించిన టాప్ 5 పేర్లు. హ్యాపీ జర్నీసెడింబి జయలక్ష్మి నరసింహరావుసెకండ్ ఇన్నింగ్స్టి. సూర్య కుమారి (హైదరాబాద్)వైతరణి వెళ్ళొస్తా!డాక్టర్ కోటేశ్వరరావు (గూడూరు)స్వర్గానికి స్మాల్ ట్రిప్ఏ వి సోమయాజులు (కాకినాడ)చావు (అ)భయందీక్షిత (నంద్యాల)-కయ్యూరు బాలసుబ్రమణ్యం -
ప్యాచెస్ కనిపిస్తున్నాయి
నాకిప్పుడు 24 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నాను. ఇటీవల తలపై ఒకటి రెండు చోట్ల గుండ్రంగా జుట్టు పూర్తిగా రాలిపోయిన ప్యాచెస్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నొప్పి లేదా దురద ఏమీ లేదు. ఇది ప్రమాదకరమైన సమస్యా? – రాధిక, గుంటూరురాధిక గారు, మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది అలోపేషియా ఎరియాటా అనే జుట్టు రాలే సమస్యగా భావించవచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలోపేషియా ఎరియాటా అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. ఇందులో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున జుట్టు మూలాలపై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై లేదా జుట్టు ఉన్న ఇతర ప్రాంతాల్లో గుండ్రంగా జుట్టు పూర్తిగా ఊడిపోయిన ప్యాచెస్ కనిపిస్తాయి. ఇది తలకే కాకుండా కనుబొమ్మలు, వెంట్రుకలు, శరీరంపై ఉన్న జుట్టు, పురుషుల్లో గడ్డం భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలో జుట్టు మూలాలు పూర్తిగా నాశనం కావు. అందువల్ల సరైన చికిత్సతో జుట్టు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. అయితే పిల్లలు, యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి, పోషక లోపాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం, శస్త్రచికిత్సల తర్వాత వచ్చే మార్పులు ముఖ్యమైనవి. అలాగే థైరాయిడ్ వ్యాధులు, విటిలిగో వంటి ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నవారిలో కూడా ఇది కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. నూనె వాడటం, షాంపూ మార్చడం లేదా తల శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య కూడా కాదు. కాబట్టి ఈ విషయంలో అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. సమస్యను నిర్ధారించడానికి చర్మవైద్యులు ప్రత్యేకంగా తల చర్మాన్ని పరిశీలించే పరీక్షలు చేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా సూచించవచ్చు. రక్తహీనత, ఐరన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డీ లేదా విటమిన్ బి12 లోపాలు ఉన్నాయా లేదా అనేది పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. చికిత్సలో భాగంగా పోషక లోపాలను సరిచేయడం, తలకు అప్లై చేసే మందులు, అవసరమైతే ప్రత్యేక ఇంజెక్షన్లు వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స ప్రారంభించిన తర్వాత సాధారణంగా ఆరు నుంచి పన్నెండు వారాల్లో జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అర్హత గల చర్మవైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా ఈ సమస్యను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. -డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ -
పెళ్లంత థ్రిల్లింతలు
ఒకప్పుడు పెళ్లి అనగానే ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి’ అనే పాటందుకునేవారు వధూవరులు. ఏ పెళ్లిలోనైనా పీటలపై కూర్చున్న జంట ఒకే రకం పెళ్లి చీర, ఒకేరకం పట్టు లాల్చీతో కనిపించగానే, సంప్రదాయం ఉట్టిపడేది. పురోహితుడి మంత్రాల దగ్గర నుంచి గట్టిమేళం వరకు ఇంచుమించు ఒకే తీరులో పెళ్లివేడుక నడిచేది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊహల్లో ఊగులాడుతూ– ఊరంత పందిరినీ, ఊరంతా సందడినీ కోరుకునేవారు. కాని, ట్రెండ్ మారింది. ఇప్పటి యువత ఎక్కువగా స్పెషల్ అండ్ యూనిక్ మ్యారేజెస్కే ఓటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సాహసాలను కోరుకుంటున్నారు. శుభాశుభాలను, తిథి నక్షత్రాలను పక్కనపెట్టి, పెళ్లిని వ్యక్తిగత వేడుకగా మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తోంది. ఆచారాలు, ఆత్మీయ ఆహ్వానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన యువత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ట్రెండీ లుక్ కోసం సరికొత్త వివాహ పద్ధతుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం ట్రెడిషన్ ఫాలోవర్స్ కంటే ట్రెండ్ సెట్టర్స్ ఎక్కువైపోతున్నారు. వైరల్ కావాలనే కుతూహలం కొందరిది; తమ యవ్వనంలోనే ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న తాపత్రయం మరికొందరిది; మరపురాని మధుర క్షణాలను సృష్టించుకోవాలన్న ఆరాటం ఇంకొందరిది. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లికి సిద్ధమయ్యే యువత– సంప్రదాయాలను పక్కనపెట్టి అనూహ్యంగా ఆలోచిస్తున్నారు. విస్మయకరంగా విచిత్రరీతుల్లో వివాహాలు చేసుకుంటూ ‘ద్యావుడా’ అనిపిస్తున్నారు. తమ పెళ్లి అందరిలా కాకుండా– అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని తపిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి మండపాలు– వింత పందిళ్లను వేçస్తూ, విడ్డూరాలకు తెరలేపుతున్నాయి.పెళ్లి అంటే ప్రమాణం. నీకు నేను, నాకు నువ్వు అనే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ప్రపంచంలోని ఒక్కో ఆచారం– ఒక్కో తంతుతో నిర్వహిస్తుంది. ప్రతి ఆచారంలోనూ పెళ్లి పేరుతో ఏకమైన జంటకు దైవమే సాక్ష్యమంటూ బంధుగణం ఆశీర్వదిస్తుంది. అలాంటి పవిత్రమైన వేడుక రానురాను ట్రెండ్ మార్చుకుంటోంది. కొన్నిసార్లు గతి తప్పుతోంది. మరికొన్నిసార్లు మతులు పోగొడుతోంది.అడ్వెంచరస్ వెడ్డింగ్స్‘సంసార జీవితమంటేనే ఓ సాహసం’ అనే అనుభవజ్ఞుల మాటల్ని ఫాలో అవుతున్నారో ఏమో కాని, చాలామంది యువత తమ పెళ్లి జీవితాన్ని అదే సాహసంతో ప్రారంభిస్తున్నారు. అలాంటి అడ్వెంచరస్ వెడ్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం!స్కైడైవింగ్ వెడ్డింగ్అడ్వెంచరస్ వెడ్డింగ్స్‌లో స్కైడైవింగ్తో కూడిన బేస్ జంపింగ్ పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అవుతున్నాయి కొన్ని కొత్త జంటలు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, హవాయి, మొజూరి వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాస్కా మంచుదారుల్లో ఇలాంటి సాహసాలు అధికంగా తారసపడతాయి. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ స్కైడైవింగ్తో పాటు బేస్ జంపింగ్ వెడ్డింగ్స్‌కు అనుకూలంగా ఉంటాయి.నిజానికి ఆస్ట్రేలియా, న్యూజీలండ్ దేశాలు సాహస క్రీడలకు కేంద్రం కావడంతో పాటు– అక్కడ బీచ్‌లు, పర్వతాలు స్కైడైవింగ్‌కి అనుకూలంగా ఉండటంతో ఈ రకమైన వివాహాలు తరచుగా జరుగుతాయి. మరోవైపు యూకేలో కొందరు వధూవరులు పెళ్లి వేదికకు విమానం, స్కైడైవింగ్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారు. 2023లో ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను థ్రిల్లింగ్‌గా నిర్వహించుకుని ప్రపంచాన్ని అవాక్ చేశారు.ఎత్తైన కొండ అంచున పెళ్లి చేసుకుని, వివాహం పూర్తయిన వెంటనే, ఆ కొండ అంచు నుంచి బేస్ జంపింగ్/ స్కైడైవింగ్ చేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట భీకరంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే త్వరగా పాపులర్ అయ్యింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సాహస ప్రియులైన వ«ధూవరులు– ఈ విధానాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు.స్పేస్‌నెట్ వెడ్డింగ్స్ ఈ స్పేస్‌నెట్ వెడ్డింగ్ సాహసానికి పరాకాష్టగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిమ్ వెగ్లిన్, ర్యాన్ జెంక్స్ అనే జంటను ఈ వివాహానికి ట్రెండ్ సెట్టర్స్‌గా చెబుతుంటారు. వీరు అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని మోయాబ్ ఎడారిలో 400 అడుగుల ఎత్తులో లోయ పైభాగంలో కట్టిన స్పేస్నెట్పై వివాహం చేసుకున్నారు. కిమ్, ర్యాన్ ఇద్దరూ ప్రొఫెషనల్ స్లాక్లైనర్లు. వీరు మోయాబ్లో జరిగే ప్రసిద్ధ హై–లైనింగ్ ఫెస్టివల్లో కలుసుకుని ప్రేమించుకున్నారు. అందుకే, తమ వివాహాన్ని కూడా అదే స్పేస్నెట్లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదిమంది బేస్ జంపర్లు టూటూ దుస్తులు ధరించి, పారాషూట్లలో పూల రేకులను వదులుతూ ఈ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపారు. ఈ వివాహం 2017లో జరిగింది. అంతకు ముందు పర్పుల్, మిక్కీ అనే మరో జంట మోయాబ్లోనే స్పేస్నెట్పై వివాహం చేసుకున్నట్లు సమాచారముంది. ఇంతటి సాహసం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు అరుదుగా ఉన్నప్పటికీ ఈ పెళ్లితంతు ప్రపంచ యువత దృష్టిని ఆకట్టుకుంది.అండర్ వాటర్ వెడ్డింగ్స్సాహస ప్రియులైన జంటలకు అండర్ వాటర్ వెడ్డింగ్ అనేది తమ ప్రేమలోని లోతును ప్రకటించుకునే ఒక అద్భుత అవకాశం. షాంపేన్ కంటే ఎక్కువ బుడగలతో, ప్రశాంతమైన సముద్రపు అడుగున, రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్నాపెద్దా చేపల సాక్షిగా వివాహం చేసుకోవడం ఇవన్నీ ఈ ట్రెండ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారతదేశంలో నీటి అడుగున వివాహాలకు ప్రధాన కేంద్రం అండమాన్ దీవులు. ఇక్కడ హేవ్‌లాక్ ఐలాండ్ ఈ వినూత్న వేడుకలకు వేదికగా మారుతోంది. ఇది దేశంలోనే నీటి అడుగున వివాహాలకు ఆదరణ పొందుతున్న ఏకైక ప్రదేశం. వధూవరులు స్కూబా గేర్ లేదా ఆడియో సిస్టమ్ ఉన్న అండర్ వాటర్ హెల్మెట్లు ధరించి నీటి అడుగుకు వెళ్తారు.ఇక్కడ నోటి మాటలకు బదులు, డైవింగ్ స్లేట్లు ఉపయోగించి ప్రమాణాలు చేసుకుంటారు. అనంతరం ఉంగరాలు మార్చుకుంటారు. అండమాన్ లో ఈ వివాహ ఏర్పాట్లకు ఖర్చు సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. డైవింగ్ మాస్టర్లు, భద్రతా సిబ్బంది, కెమెరామెన్ వివాహం చేసుకోబోయే జంట వెంటే ఉంటారు. నిజానికి అండర్ వాటర్ వెడ్డింగ్స్ గ్లోబల్ ట్రెండ్. అయితే ఈ వివాహానికి మురికి లేని స్వచ్ఛమైన నీరు, పగడపు దిబ్బలు కలిగిన సుందరమైన వాతావరణం ఉండాలి. థాయ్‌లాండ్ ఈ వివాహాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నీటి అడుగున సామూహిక వివాహాలు జరుగుతాయి. 2001లో క్రాదాన్ ద్వీపంలో 22 దేశాల నుంచి 34 జంటలు ఒకేసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు.అక్కడ కొన్ని రిసార్ట్‌లలో ప్రత్యేకంగా నీటి అడుగున వివాహాల కోసం చాపెల్స్ అందుబాటులో ఉంటాయి. కైమాన్ దీవులు, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా కూడా ఈ డైవింగ్‌కు అనుకూలమైన ప్రాంతాలు కాబట్టి, ఈ ట్రెండ్‌ను అక్కడ కూడా అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని ట్రాంగ్ ప్రావిన్స్‌లో 1997లో వార్షిక సామూహిక జలాంతర వివాహ వేడుక ప్రారంభమవడంతో ఈ కాన్సెప్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు, ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ట్రెండ్ తరచుగా అత్యంత విలాసవంతమైన లేదా సాహసోపేతమైన గమ్యస్థానాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డైవింగ్ అనుభవం ఉన్న లేదా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.హాట్ ఎయిర్ బెలూన్ వెడ్డింగ్స్నిజానికి చాలామంది జంటలు పెళ్లి ప్రతిపాదనలు చేసుకోవడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ను ఎక్కుతుంటారు. ఈ వివాహం ఆకాశంలో తేలియాడుతూ, భూమిపై అద్భుతమైన దృశ్యాలను చూస్తూ జరుపుకునే సాహస వేడుక. ఈ రకమైన వివాహం– కేవలం వధూవరులు, పూజారి, ఫొటోగ్రాఫర్ల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద బెలూన్ బాస్కెట్ ఉపయోగిస్తారు. ఈ సాహసానికి టర్కీలోని కప్పడోసియా ప్రత్యేకం. అక్కడి రాతి నిర్మాణాలు, లోయలను పైన హాట్ఎయిర్ బెలూన్ నుంచి చూస్తే కళ్లు చెదురుతాయి.దాంతో చాలామంది ఈ వివాహాలను చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఈజిప్ట్‌లోని లక్సర్‌లో పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల మీదుగా సూర్యోదయాన్ని చూస్తూ బెలూన్ ప్రయాణం చేస్తే అదిరిపోతుంది. అలాగే ఇటలీలోని టస్కనీలో పచ్చని కొండలు, ద్రాక్ష తోటలు, పురాతన కోటల మీదుగా బెలూన్‌పై ప్రయాణించే అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే చాలామంది జంటలు ఆయాప్రాంతాల్లో ఈ ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు జరిగే ప్రదేశాలలోనే ఈ వివాహాలను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ (జైపూర్), గోవా ఈ జాబితాలోకి వస్తాయి.హాట్ ఎయిర్ బెలూన్ చరిత్ర 18వ శతాబ్దంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి మానవ ప్రయాణంతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ విమానం, 1783 నవంబర్ 21న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ప్రయోగించారు. ఆధునిక, సురక్షితమైన ప్రొపేన్ బర్నర్లు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ లు 1950ల చివరలో అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి, బెలూనింగ్ ఒక వినోద కార్యక్రమంగా, ఆపై ఒక రొమాంటిక్ వేదికగా మారింది.డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరిగిన తరువాతే, హాట్ ఎయిర్ బెలూన్ లలో వివాహాలు కూడా క్రమంగా మొదలయ్యాయి. అంటే, సాంకేతికంగా బెలూన్లు చాలా పాతవి అయినప్పటికీ, వాటిలో వివాహాలు జరుపుకోవడం అనేది కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి. భారత్‌లో, కొన్ని కొత్త జంటలు వివాహ వేడుక పూర్తయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి కారుకు బదులుగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ వైరల్ అవుతున్నారు.మంచుశిఖరాల్లో..ఎవరెస్ట్ శిఖరం పైన, మంచుతో నిండిన అంటార్కిటికాలో, మంచు ఎడారులలో లేదా అడవుల లోపల వివాహాలు సాహసోపేతమైన ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఈ రకమైన వివాహాలకు అతిథులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అసలు ఉండరు.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)– ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వివాహ వేదికలలో ఇదొకటి. ఇక్కడ చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అంటార్కిటిక్ క్రూయిజ్–భూమిపై అతి తక్కువ మంది అడుగుపెట్టిన ప్రదేశాలలో ఒకటి అంటార్కిటిక్ ఖండం. అయితే ఇప్పటి ట్రెండీ యూత్‌కి అటుగా ప్రయాణించే క్రూజ్ షిప్స్ కూడా వివాహ వేదికలే. పెంగ్విన్స్, మంచు దిబ్బల మధ్యలో తీరానికి దగ్గరల్లో క్రూయిజ్ నుంచి ఒక చిన్న పడవలోకి మారతారు. అందులో తీరానికి చేరుకుని అక్కడ వివాహం చేసుకుంటున్నారు.ఎడారుల్లో..ఎడారి పెళ్లిళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారిన సాహసోపేతమైన వివాహ వేడుకల్లో ఒకరకం. కాలిఫోర్నియా, జోషువా ట్రీ, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే అరిజోనా, దుబాయ్ ఎడారిలో లగ్జరీ రిసార్ట్లు లేదా ప్రైవేట్ క్యాంపుల్లో విలాసవంతమైన వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక భారత్‌లోని రాజస్థాన్‌లో జైసల్మేర్, జోధ్‌పూర్ వంటి నగరాల్లోని ప్యాలెస్‌లు, డెసర్ట్ క్యాంపులు వివాహవేదికలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి చోట్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం సమయంలో లేదా నక్షత్రాల కింద రాత్రిపూట ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి.‘హడలెత్తించే’ పెళ్లిళ్లుప్రస్తుత పెళ్లిళ్ల నిర్వహణలో సంప్రదాయాలకు ఆధునికత, వ్యక్తిగత ఆశలు తోడై– కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ వివాహ వేదికలకు బదులుగా, కొంతమంది జంటలు తమ వైవాహిక జీవితంలో కొత్త సాహసాన్ని కోరుకుంటూ అసాధారణమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.వనాల మధ్యలో..దట్టమైన అడవిలో లేదా పచ్చని చెట్ల తోటల్లో వివాహం చేసుకోవడం ఇప్పుడు యువత మెచ్చిన ట్రెండ్‌లో ఒకటి. ఈ ఫారెస్ట్ వెడ్డింగ్స్ కాలిఫోర్నియా, యోసెమిటీ నేషనల్ పార్క్‌లో పొడవాటి చెట్లు, గ్రానైట్ కొండల మధ్య పెళ్లి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెనడాలోని కొలంబియా కూడా ఇలాంటి పెళ్లిళ్లకు పందిళ్లు వేస్తోంది. ప్రపంచ యువతను ఆకర్షిస్తోంది. ఇక భారత్‌లో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని కూర్గ్, కబిని వంటి ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి.హాంటెడ్ వెడ్డింగ్స్కొన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ థీమ్‌ల ప్రభావంతో, దయ్యాల కోటలు, పాత జైళ్లు, పాడుబడిన పట్టణాలు లేదా చారిత్రక శ్మశానవాటికల పక్కన వివాహాలు చేసుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు భిన్నంగా, తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే జంటలు ఇలాంటి ప్రత్యేక వేదికలను ఎంచుకుంటున్నారు. హారర్ సినిమాలు, హడలెత్తించే నవలలు, హాలోవీన్ థీమ్‌ల పట్ల ఆసక్తి పెరగడంతో ఈ రకమైన వివాహాలు ప్రాచుర్యం పొందాయి. పాత కోటలు, పాడుబడిన భవనాలు వేదికలుగా మారి, దయ్యాల కథలు జతచేర్చి చిత్రవిచిత్రమైన అనుభవాన్నిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ధోరణిఎక్కువగా కనిపిస్తుంది.కొలరాడోలోని ‘ది స్టాన్లీ హోటల్’– ‘ది షైనింగ్’ నవలకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్నే వివాహ వేదికగా మార్చుకుంటున్నారు చాలామంది వధూవరులు.కాలిఫోర్నియాలో పర్మనెంట్‌గా డాక్ చేసిన ‘ది క్వీన్ మేరీ’ అనే లగ్జరీ నౌకలో ఒకప్పటి సిబ్బంది, ప్రయాణికులంతా దయ్యాలుగా మారారని, అక్కడే సంచరిస్తున్నారని స్థానికుల నమ్మకం. హడలెత్తించే ఈ ప్రాంతం కూడా వివాహ వేదికే. ఇక కాలిఫోర్నియాలో చారిత్రక గోస్ట్ టౌన్ లోని పాత చర్చిలు లేదా ఆయా పరిసరప్రాంతాలు యువతను పెళ్లి చేసుకోమని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.భారతదేశంలో పాత మిల్లులు/పాత భవనాలుకొన్ని ఈవెంట్ సంస్థలు పాత మిల్లులు లేదా పాడుబడిన భవనాలను థీమ్డ్ డెకరేషన్తో వివాహ వేదికలుగా మారుస్తున్నాయి. అందులోనే వివాహాలు చేసుకోవడానికి యువత ఇష్టపడుతున్నారు.‘సోలో వెడ్డింగ్స్’తమ సంతోషానికి మరొకరిపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే నియంత్రించుకుంటామని ప్రకటిస్తూ.. చాలామంది యువత– సోలో వెడ్డింగ్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైన ట్రెండ్. పెళ్లి చేసుకోమని ఇతరులు ఒత్తిడి చేస్తున్నప్పుడు, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తామేనని చెప్పుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సోలో పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పెళ్లిళ్లకు మాదిరిగానే అంగరంగ వైభవంగా, అతిథులతో, కేక్‌తో, రిసెప్షన్ తో జరుగుతాయి. కాని, పార్టనర్ మాత్రమే ఉండరు. ఈ వివాహాలు ప్రస్తుతం జపాన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి.పెళ్లి అనేది ట్రెడిషనల్ ట్రాక్ నుంచి ట్రెండీ ట్రాక్ ఎక్కి చాలాకాలమే అయింది. కొన్ని వెడ్డింగ్స్ ‘అరే భలే జరిగాయి కదా!’ అనిపిస్తుంటే, కొన్ని వెడ్డింగ్స్ మాత్రం ‘అరే పాపం, ఎందుకురా ఇంత కష్టం.. ఏంట్రా ఈ పిచ్చి?’ అనిపించక మానడం లేదు!చైనా వినూత్న ప్రయత్నం..చైనా ప్రభుత్వం తగ్గుతున్న జననాల రేటును అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి పెళ్లి నిబంధనలను సరళతరం చేసింది. పలు సంప్రదాయేతర ప్రదేశాలలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, వివాహ వేదికలను ఏర్పాటు చేసింది. సబ్వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ క్లబ్స్ వరకూ జనసంచారం ఉన్న ప్రతిచోట పెళ్లి బూత్‌లను ప్రారంభించింది. దాంతో అక్కడ పెళ్లి చేసుకునే ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ట్రెండ్‌ని కోరుకునే యువత ఈ విధానానికి అట్రాక్ట్ అవుతోంది.సంహిత నిమ్మన -
నా జీవితంలో స్టార్ ఉన్నాడు!
సొసైటీ ఇచ్చే స్టేట్మెంట్ లేబుల్స్ అంటే అలర్జీ. ఇతరుల అంచనాలన్నింటినీ లైట్‌గా స్కిప్ చేస్తూ, తనదైన దారిలో తన సొంత ప్రపంచంలో జీవిస్తోంది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఆ ప్రపంచం గురించిన విషయాలన్నీ ఆమె మాటల్లోనే...⇒ నా పేరు ఫారియా. చాలామంది ‘ఫైరియా’ అని పిలుస్తారు. నటనకు ముందు ఆరు సంవత్సరాలు హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. అక్కడే నటిగా పునాది పడింది. అంతకంటే ముందే నేను డాన్సర్, మ్యూజీషియన్ , క్రియేటివ్ ఆర్టిస్ట్‌ని.⇒ ‘జాతి రత్నాలు’ వచ్చాక నా జీవితం ఫుల్ టర్న్ తీసుకుంది. ఎంతలా అంటే ‘ఎవరు ఈ అమ్మాయి?’ నుంచి, ‘మన చిట్టి!’ అంటూ ప్రతి కుటుంబం నన్ను వాళ్ల అమ్మాయిలా దగ్గరకు తీసుకుంది.⇒ అవును, నేను రిలేషన్ లో ఉన్నాను. ఇది సీక్రెట్ కాదు, ప్రైవేట్. అతను ఒక కొరియోగ్రాఫర్. నేను ముస్లిం, అతను హిందువు. కాని, మా మధ్య ఇవన్నీ ఎప్పుడూ సమస్య కాలేదు. మాది ప్రేమకథ అనడం కన్నా పార్ట్నర్షిప్ అనడమే నాకు ఇష్టం. నా డాన్స్, నా ర్యాప్‌లో కనిపించే ఎనర్జీ వెనుక అతని సపోర్ట్ బోనస్‌లా పనిచేస్తుంది.⇒ ఇప్పటివరకు అతని పేరు, ముఖం రివీల్ చేయలేదు. కాని, నా వీడియోల్లో క్లూస్ వెతుకుతున్న ఇంటర్నెట్ డిటెక్టివ్‌లను చూస్తే నవ్వొస్తుంది. ‘సారీ గైస్’ మీరు ఇంకా లెవెల్ అప్ కాలేదు.⇒ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఒకప్పుడు మైనస్ అన్నారు. కేవలం గెస్ట్ రోల్స్‌కే సరిపోతావు అని కామెంట్స్ చేసేవారు. నేను మాత్రం నా సినిమాలతోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.⇒ డాన్స్ నా ఫస్ట్ లవ్. నన్ను నేను ‘మూవ్మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటాను. హిప్హాప్, కథక్, బెల్లీ, బీ–బాయింగ్ ఇలా నా శరీరమే నా భాష.⇒ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ ఇలా ప్రతి సినిమా నాకు కొత్త పాఠం నేర్పింది. ఇప్పుడు తమిళంలో ‘వల్లి మయిల్’. అందులో స్టంట్స్ కూడా చేశాను. ఈసారి కొత్త ఫారియాను చూడబోతున్నారు.⇒ నటనతో పాటు సంగీతం కూడా నా ప్రాణం. నేను పాడుతాను, రాస్తాను, కంపోజ్ చేస్తాను. ‘డ్రామా నక్కో మామ’ పాట పూర్తిగా నా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్.⇒ నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ అదే నా గ్లో సీక్రెట్. మేకప్ తీసేయడానికి బేబీ ఆయిల్, హెయిర్‌కు వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి.⇒ తినడంలో బిర్యానీ నా బలహీనత. దోశ, ఇడ్లీ లాంటి సింపుల్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ట్రావెల్ చేసినప్పుడు మక్బూస్, లుకైమాత్ లాంటి రుచులు కూడా ట్రై చేశాను.⇒ నా జీవితంలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే నా పిల్లి ‘సెబాస్టియన్ ’. అతను లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్ అసంతృప్తిగానే ఉంటుంది. -
అదే.. నా బ్యూటీ వెపన్!
బాల నటిగా మొదలైన ప్రయాణం నుంచి, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం వరకు ఆమె ఫ్యాషన్ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంప్రదాయానికి గర్వంగా నిలుస్తూనే, ఆధునిక ప్రయోగాలు చేసే ఆమె స్టయిల్, బ్యూటీ ఫిలాసఫీ ఇదిగో!చీర.. బ్రాండ్: స్వాతికపూర్ లెహంగా ధర రూ. 47,700బ్లౌజ్ ధర రూ. 14,310ఓణీ ధర రూ. 21,200జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూవెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.కళ్ల అందాన్ని హైలైట్ చేయడానికి బ్లాక్ కాజల్ కంటే బ్రౌన్ కాజల్ నా సీక్రెట్ బ్యూటీ వెపన్ . దాన్ని స్వల్పంగా స్మడ్జ్ చేస్తే కళ్లకు సాఫ్ట్, మేజికల్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ లో మాత్రం నేను సేఫ్ గేమ్ ఆడను. సంప్రదాయ దుస్తులు, చీరలు, అనార్కలీలు లాంటి క్లాసిక్ వేర్‌ను ఫ్యూచరిస్టిక్ ఔట్ఫిట్స్గా మలచుకుంటూ, మైథాలజీకి మోడ్రన్ టచ్ ఇచ్చే స్టయిల్‌ను ఫాలో అవుతాను. – సారా అర్జున్ -
మాస్క్‌ల మాయాజాలం
వెనిస్ వీథులు గత చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఆధునిక ప్రపంచపు కోలాహలాన్ని విడిచిపెట్టి ఒక్కసారిగా మధ్యయుగపు రాజవైభవంలోకి చేరిపోయాయి. బంగారు వర్ణపు పట్టు వస్త్రాలు, వెల్వెట్ గౌన్లతో పురాతన రాజులు, రాణుల వేషధారణతో స్ధానిక వీథులన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలోని వెనిస్ నగరం ఒక రంగుల హరివిల్లులా మారింది. ప్రతి మలుపులోనూ ముసుగుల సంబరాలు సందడిగా నడుస్తున్నాయి. ముసుగుల వెనక దాగి ఉన్న నవ్వులు, ప్రత్యేకంగా మెరిసే వస్త్రాలతో వెనిస్ నగరం తళుక్కుమంటోంది. కాలం వెనక్కి వెళ్లిందా అన్నంతగా ఈ సంబరం ఆకట్టుకుంటోంది.ఈ పండగకు 864 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1162వ సంవత్సరంలో వెనిస్ గణతంత్ర రాజ్యం ఆక్విలేయాపై విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రజలందరూ సెయింట్ మార్క్స్ స్క్వేర్ దగ్గర నృత్యాలు చేశారు. ఇదే కాలక్రమేణా కార్నివాల్ ఆఫ్ వెనిస్ ఫెస్టివల్‌గా మారిపోయింది. ఆనాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ అంతే జోరుతో కొనసాగుతున్నాయి. మధ్యలో కొన్నేళ్లు ఆగిపోయినా, 1979 నుంచి అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ కార్నివాల్ కేవలం ఇటలీ సంప్రదాయంలా కాకుండా అంతర్జాతీయ పర్యాటక వేడుకగా మారిపోయింది.ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇటలీలో 2026లో జరగనున్న మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్‌ను పురస్కరించుకొని ఈ కార్నివాల్‌కు ఒలింపస్–ది ఆరిజన్స్ ఆఫ్ ది గేమ్ అనే థీమ్‌ను పెట్టారు. ఈ కార్నివాల్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ప్రధాన వేడుకలు మాత్రం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం అవుతాయి.నిజానికి వెనిస్ నగరానికి కాలువలే ప్రధాన ఆకర్షణ. ఆ కాలువలే ఈ కార్నివాల్‌కు వేదికలు. ఈ కార్నివాల్లో జరిగే వేడుకలన్నీ కాలువల చూట్టూనే జరుగుతాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది గ్రాండ్ వాటర్ పరేడ్. ఈ పరేడ్‌లో అద్దంలా మెరిసే వెనిస్ కాలువల్లో రంగురంగుల పడవలు వందలాదిగా కదులుతూ ఉంటాయి. ఈ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వెనిస్ కార్నివాల్లో మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.మనుషుల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఉత్సవంలో అందరూ కలిసి పాల్గొనేందుకు మాస్క్‌లు ధరిస్తారు. ఈ వేడుకలో బౌటా, మెడికో డెల్లా పెస్టే అనే మాస్క్‌లు చాలా ఫేమస్. వీటితో పాటుగా రాజులు, రాణులు మాదిరిగా స్థానిక కళాకారులు వేషాలు ధరిస్తారు. సెయింట్ మార్క్స్ బెల్ టవర్ నుంచి దేవదూత వేషధారణలో అమ్మాయి కిందకి దిగి వచ్చే ‘ఫ్లైట్ ఆఫ్ ది ఏంజెల్’ అనే ఘట్టం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. వెనిస్ కార్నివాల్ చూసేందుకు ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. ఈ సమయంలో వెనిస్ నగరంలో ప్రత్యేకమైన విందులు, నాటక ప్రదర్శనలు, వాటర్ లైట్ షోలు ఉంటాయి. -
కథాకళి: విలన్
ఆ ఆదివారం, జనవరి పద్దెనిమిదిన ముప్ఫై రెండేళ్ళ ఏగ్నెస్ సెయింట్ ఫిలోమినా చర్చ్లోంచి బయటికి వచ్చి, మెట్రో స్టేషన్స్ దాకా నడిచింది. తన హేండ్‌బేగ్ తెరచి డబ్బు లెక్క చూసుకుని, కొద్దిసేపు ఆలోచించింది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలని అనుకుంటోది. వెళ్ళాక ఏదో కొనాలనిపిస్తుంది. కాని సరిపడా డబ్బు లేదు. ఆ ఆదివారం సాయంత్రం హాస్టల్‌కి వెళ్ళి గదిలో ఒంటరిగా గడపటానికి ఇష్టపడక ఆమె మెట్రో స్టేషన్స్ లోకి నడిచింది. ముప్పావు గంట తర్వాత ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ లోకి టికెట్ కొనుక్కుని వెళ్ళింది. ఒక్కో స్టాల్‌ని చూసుకుంటూ నడవసాగింది. ఆదివారం కాబట్టి అక్కడ బాగా రద్దీగా ఉంది.ఏగ్నెస్ మిరపకాయ బజ్జీల స్టాల్ దగ్గర ఆగింది. బయట అమ్మే ధర కన్నా ఒకోటి నాలుగు రెట్ల ధర. ఆకలిగా ఉండటంతో రెండు కొనుక్కొని తిన్నది. ఆమె తను ఏమేం కొనలేక పోతోందో స్టాల్స్‌లో చూసుకుంటూ సగం దూరం వెళ్ళాక అది జరిగింది. అకస్మాత్తుగా ఒకడు ఆమె హేండ్ బేగ్‌ని లాక్కుని పరిగెత్తాడు.‘‘ఆగు. దొంగ. దొంగ.’’ ఆమె అరుస్తూ అతని వెంట పరిగెత్తింది.అతను మనుషుల్ని పక్కకి తోసుకుంటూ వేగంగా పరిగెత్తాడు. ఏగ్నెస్ ఆ రద్దీలో అతని వెంటపడి పట్టుకోలేకపోయింది. అతను ఎర్ర టీషర్ట్, జీన్స్ తొడుక్కున్నాడని మాత్రం గుర్తించింది. అతని వయసు పాతిక దాకా ఉండచ్చని అనుకుంది. కొందరు ఆమెని ప్రశ్నించసాగారు.‘‘దొంగని గుర్తుపట్టగలరా?’’‘‘ఎంతుంది?’’‘‘పోలీస్ పోస్ట్ ఎంట్రన్స్ గేటు పక్కన ఉంది. వెంటనే రిపోర్ట్ చేయండి.’’ ఓ ముసలాయన సలహా ఇచ్చాడు.ఆమె పాతిక అడుగులు వేశాక, ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి ఆ హేండ్‌బేగ్‌ని అందిస్తూ అడిగాడు.‘‘మీదే కదా ఇది?’’‘‘అవును. మీకు ఎలా దొరికింది?’’ ఏగ్నెస్ సంభ్రమంగా అడిగింది.‘‘మీ అరుపులు విన్నాను. వాడు నా ముందు నుంచే పరిగెత్తాడు. మీ అరుపులు విన్నాక మగాడి చేతిలో లేడీస్ హేండ్‌బేగ్ చూడగానే ఏం జరిగిందో గ్రహించి కాలు అడ్డుపెట్టాను. వాడు పడగానే దీన్ని లాక్కున్నాను. వెధవ. నా దవడమీద కొట్టి పారిపోయాడు.’’‘‘థాంక్స్ అండీ. మీరు నిజంగా హీరో.’’ ఏగ్నెస్ చెప్పింది.‘‘విలన్స్ ఉంటేనే హీరో ఉంటాడు. ఏం పోలేదుగా? చూసుకోండి. ఐనా వాడికి దాన్ని తెరిచి కొట్టేసే సమయం లేదు లెండి.’’‘‘ఇది బీద హేండ్‌బేగ్. అందులో హాస్టల్‌కి వెళ్ళడానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కాకపోతే ఐడీ కార్డ్ గురించి నేను వర్రీ అయ్యాను.’’‘‘మీ పేరు?’’‘‘ఏగ్నెస్.’’‘‘నేను అబిడ్స్‌లో మొబైల్స్ రిపేర్ షాప్ నడుపుతున్నాను.’’‘‘నైస్. థాంక్స్ అగైన్స్ అండీ. మీకు మిర్చిబజ్జీలు కొనిపెట్టాలని ఉంది. కాని అంత డబ్బు లేదు.’’ ఏగ్నెస్ నొచ్చుకుంటూ చెప్పింది.‘‘ఫర్వాలేదు. మీ బేగ్ జాగ్రత్త. బై.’’ చెప్పి అతను వెళ్ళిపోయాడు.ఆమెకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. తిరిగి మెట్రో స్టేషన్స్ కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది. టికెట్ కొనడానికి హేండ్‌బేగ్‌ని తెరిచి చూసి భృకుటి ముడివేసింది. అందులోంచి ఐదువందల రూపాయల నోట్ల కట్టని బయటికి తీసి చూసింది.ఏభై వేల రూపాయలు! ఇది తన హేండ్ బేగ్‌లోకి ఎలా వచ్చింది? ఆ దొంగ పెట్టి ఉంటాడు. ఎందుకు పెట్టినట్లు? బహుశా ఇంకెవరి దగ్గరో కొట్టేసింది తన బేగ్లో ఉంచి ఉంటాడనే ఆలోచన ఆమెకి కలిగింది.ఇప్పుడు తనేం చేయాలి? పోలీసులకి జరిగింది చెప్పి ఆ డబ్బు ఇవ్వటం సబబు. కాని దాదాపు ప్రతి ఇండియన్స్ కి వచ్చే ఆలోచన దాన్ని రద్దు చేసింది. అది దాని యజమానికి కాక పోలీసుల జేబులోకి వెళ్ళే బదులు తనే వాడుకోవచ్చుగా?మెట్రోలో వెళ్తూ ఆ డబ్బుతో ఏం కొనాలో ఆలోచించింది. చాలా గుర్తొచ్చాయి. ముఖ్యంగా సిటీ సెంటర్ మాల్లో, జూడియోలో విండో షాపింగ్‌లో చూసిన గౌన్స్ గుర్తొచ్చింది. ఆమె కూకట్‌పల్లిలో మెట్రోలోంచి బయటికి వచ్చి, పది నిమిషాల దూరంలోని తన వర్కింగ్ విమెన్స్ హాస్టల్‌కి నడవసాగింది. రోడ్లోంచి ఓ సందులోకి, అందులోంచి ఆట్టే రద్దీ లేని మరో చిన్న సందులోకి నడిచాక వినిపించింది.‘‘హలో ఏగ్నెస్.’’ఆమె తల తిప్పి చూస్తే, ఇందాక ఆ హేండ్ బేగ్ ఇచ్చిన వ్యక్తి పక్కనే నడుస్తూ కనిపించాడు.‘‘హలో. మళ్ళీ కలిశాం.’’ ఆశ్చర్యంగా చెప్పింది.‘‘ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లుగా నేను హీరోని కాను. విలన్స్ ని. ఆ డబ్బు ఇవ్వండి.’’ కఠినంగా చెప్పాడు.‘‘డబ్బు? ఏ డబ్బు?’’‘‘మెట్రో స్టేషన్స్ బయట దాన్ని తీసి చూసుకుని, మళ్ళీ నువ్వు హేండ్ బేగ్లో ఉంచిన ఏభైవేలు.’’ఆమె తెల్లబోతూ చూస్తూంటే అతను ఆమె హేండ్‌బేగ్‌ని అందుకుని అందులోంచి ఆ సొమ్ము తీసుకుని చెప్పాడు.‘‘వాడు నా తమ్ముడు. ఓ దుకాణంలో కేష్ బాక్స్‌లోంచి దాన్ని దొంగిలించాడు. పోలీసులు పట్టుకున్నా తన దగ్గర ఆ డబ్బు దొరకకూడదని దీన్ని నీ హేండ్‌బేగ్‌లో ఉంచి నాకు ఇచ్చాడు. నేను దాన్ని నీకు ఇచ్చాను.’’అతను ఆ డబ్బు తన జేబులో ఉంచుకుని వేగంగా వెళ్ళిపోతూంటే, ఏగ్నెస్ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
మృగశృంగుని వృత్తాంతం
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మృగశృంగుడని నామకరణం చేశారు. కుత్సురుడు కుమారుడికి ఐదో ఏట ఉపనయనం చేశాడు. ఆ బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించి, తండ్రి వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. కొంతకాలానికి అతడు యుక్తవయసుకు వచ్చాడు. దేశాటనకు పోవాలనే కోరికతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, ఇంటి నుంచి బయలుదేరాడు. మృగశృంగుడు దేశాటన సాగిస్తూ, మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ కొన్నాళ్లకు మాఘమాసం సమీపిస్తుండగా, కావేరీ తీరానికి చేరుకున్నాడు. ‘ఏమి నా భాగ్యం! మాఘమాసంలో కావేరీ స్నానమాచరించే అవకాశం దొరికింది. మాఘమాసం అంతా ఇక్కడే బస చేస్తాను’ అనుకుని మృగశృంగుడు సంతోషించాడు. నదీ తీరానికి చేరువలోనే ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండటం ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చి ఒకనాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ‘ఓ విప్రకుమారా! నీ తపస్సుకు మెచ్చాను. పవిత్ర మాఘమాసంలో విడువకుండా కావేరీస్నానం సాగిస్తూ వచ్చినందుకు నీ పుణ్యం రెట్టింపైంది. నీకేం కావాలో కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను’ అన్నాడు శ్రీహరి. ‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! నీ దర్శనమాత్రంతోనే నా జన్మ ధన్యమైంది. నాకింకే ఐహిక కాంక్షలూ లేవు. నాకు ఎలా దర్శనమిచ్చావో, ఇదేచోటు కొలువుండి నీ భక్తులకు దర్శనమివ్వు. ఇది చాలు నాకు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి అతడి కోరికను మన్నించి అదేచోట కొలువై వెలిశాడు.కొన్నాళ్లకు మృగశృంగుడు తల్లిదండ్రులను చూడటానికి స్వగ్రామం చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని చూసి సంతోషించారు. మృగశృంగుడికి వివాహం చేయాలని వారు భావించారు. ఇదే సంగతి అతడికి చెబితే, ‘ఆశ్రమాలన్నిటిలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమని దైవజ్ఞులు చెబుతారు. అయితే, భార్య గుణవతి, అనుకూలవతి అయినప్పుడే గృహస్థాశ్రమ ధర్మాన్ని సజావుగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. అలాంటి యువతి దొరికినప్పుడే వివాహం చేసుకుంటాను’ అన్నాడు. ‘కుమారా! నీ మాటలు సమంజసంగా ఉన్నాయి. నీ కోరిక తీరాలంటే, భగవంతుడైన శ్రీహరిపైనే భారం వేయాలి. నీ అభీష్టం నెరవేరుగాక!’ అన్నారు తల్లిదండ్రులు.ఇలా ఉండగా, భోగాపురం అనే గ్రామంలో సదాచారపరాయణుడైన విప్రుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అందాలరాశి. పేరుకు తగినట్లుగానే గుణవంతురాలు. దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన సుశీల నిత్యం ఏదో ఒక వ్రతం చేపడుతూ, పురాణశ్రవణంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆమె గుణగణాలను తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే పెళ్లాడదలచాడు.ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి కావేరీ స్నానానికి బయలుదేరింది. అకస్మాత్తుగా ఒక ఏనుగు అటువైపు వచ్చి, ఆ ముగ్గురు యువతులను తరమసాగింది. భయభ్రాంతులైన ఆ యువతులు దిక్కుతోచక పరుగు లంకించుకున్నారు. పరుగెడుతూ వారు ఒక దిగుడుబావిలో పడి మరణించారు. సంగతి తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్న వారి తల్లిదండ్రులు విగతజీవులైన కుమార్తెలను చూసి భోరున విలపించసాగారు. మృగశృంగుడికి కూడా ఈ వార్త తెలియడంతో అతడు కూడా అక్కడకు చేరుకున్నాడు. వారిని ఎలాగైనా బతికించాలని సంకల్పించుకున్నాడు. తాను వచ్చేంత వరకు మృతదేహాలను చూస్తుండమని వారి తల్లిదండ్రులతో చెప్పి, నేరుగా కావేరి వద్దకు వెళ్లాడు. మెడలోతు నీళ్లలో మునిగి, ధ్యానం ప్రారంభించాడు. ఈలోగా ఆ యువతుల మరణానికి కారణమైన ఏనుగు అక్కడకు ఘీంకరిస్తూ వచ్చింది. మృగశృంగుడి ఎదుట నిలిచి, భీకరంగా ఘీంకరించింది. మృగశృంగుడు చలించలేదు. అది తదేకంగా అతడినే కాసేపు చూసింది. ఉన్నపళాన అతడిని తొండంతో చుట్టి పైకిలేపి, వీపుమీదకు ఎక్కించుకుంది. ఈ పరిణామాన్ని చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేయసాగారు. అయితే, మృగశృంగుడు చలించలేదు. పైగా దీనిని శుభసూచకంగా తలచాడు. ఏనుగు శరీరాన్ని నిమిరి, మంత్రజలాన్ని దానిపై చల్లాడు. తక్షణమే ఏనుగు దేవతారూపం దాల్చి, మృగశృంగుడి ఎదుట నిలిచింది. తనకు శాపవిమోచనం కలిగించినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపి, స్వర్గానికి బయలుదేరింది. శాపవిమోచనం పొందిన ఏనుగు వెళ్లిపోయాక, విగతజీవులైన యువతులను బతికించాలనే సంకల్పంతో మృగశృంగుడు మళ్లీ కావేరిలోకి దిగి, యముడి గురించి ధ్యానం ప్రారంభించాడు. యమధర్మరాజు అతడి దీక్షకు సంతృప్తి చెంది, అతడికి ప్రత్యక్షమయ్యాడు.‘మృగశృంగా! నీ దీక్షకు సంతోషించాను. ఏంకావాలో కోరుకో, తప్పక నెరవేరుస్తాను’ అని పలికాడు.మృగశృంగుడు యమధర్మరాజును వేనోళ్ల స్తుతించి, విగతజీవులైన ముగ్గురు యువతులనూ పునర్జీవితులను చేయమని కోరాడు.యముడు ‘తథాస్తు’ అని పలికాడు.అప్పటివరకు విగతజీవులై పడి ఉన్న ఆ ముగ్గురు యువతులూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచారు. కొంతకాలానికి మృగశృంగుడు సుశీలను పెళ్లాడాడు.∙సాంఖ్యాయన -
బడ్జెట్ భావుకత
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్‌ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.సొగసైన వ్యక్తీకరణలుభారత కేంద్ర బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్‌ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసిద్ధ కవి ఇక్బాల్ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్పియర్ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్’ (క్షణికమైన) వంటి బాలీవుడ్ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!మొరార్జీ ఆశావాదం1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.మన్మోహన్ ఉర్దూ అద్దకం1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్ మరో ఉర్దూ కవి ముజఫర్ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’జస్వంత్.. తీరం, తుఫానుబీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా.. బడ్జెట్‌ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు. గాలి మేడలు.. పునాదులుకాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అరుణ్ జైట్లీ.. పూలు–ముళ్లుజైట్లీ తన బడ్జెట్ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు. 2014–15 బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’. సీతారామన్.. వేకువ పక్షులుఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ దీనానాథ్ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీనానాథ్ కౌల్ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్ తోట వంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్ టాగోర్ కోట్‌ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్‌సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులుసమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. – డాక్టర్ మన్మోహన్ సింగ్మన దేశం వికసించిన శాలిమార్ బాగ్ లాంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.– నిర్మలా సీతారామన్పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? – యశ్వంత్ సిన్హాలక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ – అరుణ్ జైట్లీ -
ఘోస్ట్ ఎంట్రీ!
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్‌కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది. బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్‌లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్‌చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్‌గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు. పాకిస్తాన్‌కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్‌లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్‌కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్‌లో (హెచ్‌యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్‌లోకి రావడానికి మార్గం ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్‌లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్‌కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్‌పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్‌కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్‌మెన్‌ను కేటాయించింది. అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్‌యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్‌మ్యాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్‌నాగ్‌లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్‌మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్‌లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్‌ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అజర్‌ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్‌లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్‌తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్‌ని కూడా తీహార్ జైలుకు తరలించింది. (తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం) -
నా చేతి వేళ్ళు
ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్రమాత్ర కూడా పని చేయడం లేదు. ఏదైనా నవలో, కథో చదువుకుందామంటే కుదరదు. లైట్ వేస్తే, మా ఆవిడ చిరాకు పడుతుంది. పాపం తనకు కూడా నాలాగే వార్ధక్యం ముంచుకొచ్చింది. ఎప్పుడో గాని ఆమెకు నిద్ర పట్టదు. ఆ సమయంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజు కూడా అంతే! మెల్లిగా లేచి బాల్కనీలోకి నడిచాను. నగర సుందరికి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో! రోడ్లన్నీ కదులుతున్న వాహనాల లైట్ల వల్ల దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నప్పుడు మా నాన్న చిటికెన వేలు పట్టుకుని వచ్చినప్పుడు విస్తుపోయి చూశాను, నగర సౌందర్యాన్ని. అప్పటి నుండి చూస్తున్నాను నగరం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంది. ఏ నగరానికీ ఎప్పుడూ వార్ధక్యం రాదు, మనుషుల్లాగా, నాలాగా! నేను వార్ధక్యంలోకి వచ్చాను గాని, తరతరాలుగా నగరాలు యౌవ్వనంగానే ఉంటాయి. నాకైతే శరీరానికి వచ్చిన ఈ ముసలితనం అస్సలు నచ్చడం లేదు. ఇవ్వాళ మరీ ఘోరం! మంచినీళ్ళు తాగుదామని, మంచం పక్కనే ఉన్న నీళ్ళ సీసాను చేతుల్లోకి తీసుకుని, ఎంత ప్రయత్నించినా, దాని మూత తీయలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. చేతుల్లో బలం లేకుండా పోతుందేమో? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను, మరీ ఇవ్వాళే ఎందుకిలా? రోజురోజుకి... మొన్నటికి మొన్న టాబ్లెట్ షీటు నుండి, అల్యూమినియం ఫాయిల్ తుంచి టాబ్లెట్ తీసుకోవడానికి, కత్తెరను ఉపయోగించాల్సి వచ్చింది. నా చేతులు నాకు అన్యాయం చేస్తున్నాయా? నా చేతులను చూసుకున్నాను. నాకేం తేడా కనిపించడం లేదు. కాని, ఎందుకిలా?... నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు చేతులు వణుకుతున్నాయంటే అది పార్కిన్సన్ వ్యాధి లక్షణమని. అప్రయత్నంగానే, నా చేతుల్లో ముఖాన్ని దాచుకుని భోరున ఏడ్చాను. వృద్ధాప్యం మనిషిని ఇంత డొల్లగా మార్చేస్తుందా? నా రెండు చేతులు, నా వేళ్ళు మామూలివి కాదు. అందరూ కాళ్ళ మీద పరిగెడితే, నేను నా చేతి వేళ్ళ మీద పరిగెత్తాను. అటువంటి నా చేతులు బలహీనంగా, దీనంగా మారుతున్నాయా? నా చేతులూ, వేళ్ళూ నన్నింత మోసం చేస్తాయనుకోలేదు. ఆ చేతులను చూస్తూ ఉంటే, మనసు ఒక దృశ్యం వైపు పరిగెత్తుతుంది. నా చదువు మధ్యలో ఉండగానే, మా నాన్న చనిపోయాడు. నడి సముద్రంలో, లంగరు లేని పడవలా, మా బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. కారుణ్య నియామకం కింద దిగువ శ్రేణి గుమాస్తాగా ప్రభుత్వం నన్ను నియమించింది. నేను ఏప్రిల్ 1975 లో ఉద్యోగంలో చేరాను. తినడానికి తిండి దొరికింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్న లేడన్న మాటే గాని, రోజులు యథావిధిగా నడుస్తున్నాయి. ఒక్క రెండు నెలలు గడిస్తే నా బీయస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యేవి. కాని, ఎవరికీ దాని గురించి, నా గురించి పట్టింపే లేదు. నన్ను నరకకూపంలోకి తోసి, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కాని, మా నాన్న మరణించిన ఆఫీసులో, ఆయన కూర్చుని ప్రాణం వదిలిన కుర్చీలోనే కూర్చొని, పని చేయడం నాకు మాత్రం ప్రతి దినం ప్రాణగండంగా ఉండేది. అలా, పంతొమ్మిదేళ్ళ వయసులో ఉన్న నేను మాత్రం లోలోపలే దహించుకు పోయేవాడిని. భవిష్యత్తు గురించి నేను కన్న కలలన్నీ దగ్ధమయిపోయాయి. నాకు మెడిసిన్‌లో సీటు వచ్చినా, నన్ను చదివించలేనని మా నాన్న బాధపడుతుంటే, నేనే ‘ఫర్వాలేదు నాన్నా! బీయస్సీలో చేరుతాను.’ అని ఓదార్చాను. బీయస్సీ తర్వాత యమ్మెస్సీ, అటు తర్వాత కెమిస్ట్రీలో రీసెర్చి చేయాలనీ, లేదా యంబీఏ చేయాలనీ ఎన్నో ఆశలుండేవి. అవన్నీ ఇప్పుడు అందని ద్రాక్షలే! కనీసం బీయస్సీ అయినా పూర్తి చేయగలనా లేదా అన్నదే, ప్రస్తుతం నన్ను పీడిస్తున్న సమస్య. నేను రెండు నెలలు సెలవు పెట్టి బీయస్సీ పరీక్షలు రాస్తానంటే ఇంట్లో, బయటా, ఆఫీసులో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే, నేను సెలవు పెట్టినన్ని రోజులకు జీతం రాదు, అదీ వాళ్ళ బాధ. అలా అందరూ కట్టకట్టుకుని వద్దనే సరికి నాలో మరింత పట్టుదల పెరిగింది. నేను సెలవు పెట్టే తీరుతాననుకున్నాను. అలాగే చేసి, బీయస్సీ పరీక్షలు రాశాను. మొదటి నుంచీ మా నాన్న చెప్పిన ఒక్క సూత్రాన్నే నేను పాటించే వాడిని. పదిసార్లు చదివిన దాని కన్నా ఒకసారి రాయడం వల్ల విషయం గుర్తుంటుందనే వాడు. అందుకే పరీక్ష సమయానికి గంట ముందు వరకు నేను సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే, ఈ పరీక్షలు నాకు జీవన్మరణ సమస్య. ఇప్పుడు బీయస్సీ పాస్ కాకపోతే మళ్ళీ రాసే ఓపికా ఉండదు, వీలు కలగదని నాకు తెలుసు. అందుకే, నా మెదడును నా వేళ్ళల్లో నింపి, ప్రాక్టీసు చేశాను. ఎందుకంటే నాకు ప్రిపరేషన్‌కు ఉన్న సమయం చాలా తక్కువ. మిగిలిన సహాధ్యాయులకున్న ప్రిపరేషన్ లగ్జరీ నాకు లేదు. ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి. రాసుకోవాలి. పరీక్షలు రాయాలి. ఆరు పేపర్లకు ఉన్న మూడు గంటల పరీక్షలను అలవోకగా రాశాను. బీయస్సీ మంచి మార్కులతో పాసయ్యాను. అతి సులభంగా లభించవలసిన విజయం, నాకు అతి కష్టం మీద లభించింది. అయినా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాన్న మరణంతో నేను చాలా కృంగిపోయాను. గుండు చేయించుకోవడంతో న్యూనతభావం నన్ను మరింత దిగజార్చింది. అంతకు ముందు వరకు కాలేజీలో యాక్టివ్‌గా ఉండే నేను, ఒక శిక్ష పడ్డ దోషిలా తలవంచుకుని ఒక మూలలో నిలబడేవాణ్ణి. అటువంటిది నేను బీయస్సీ పాస్ కావడం, కెమిస్ట్రీలో యూనివర్సిటీ రాంక్ రావడంతో నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కెమిస్ట్రీ లెక్చరర్లు నన్ను యంయస్సీ చేయమనీ, లెక్చరర్లంతా కలిసి ఫీజులు కడతామని ఎంతగానో చెప్పారు. కాని, నేను ఆల్రెడీ ఒక భారాన్ని, అవమానాన్ని మోస్తూ బతుకునీడుస్తున్నాను. దానికి అదనంగా మరొకరి దయాదాక్షిణ్యాలను భరించే శక్తి లేదు నాకు. లెక్చరర్లు, యూనివర్సిటీ ఖర్చులు భరించినా, నా మీద ఆధారపడిన నా కుటుంబ సభ్యుల కడుపులు నింపవలసిన బాధ్యతను నేను మరవలేను కదా? అయితే, ఆ పరీక్షలతోనే నా చేతులకు, నా చేతి వేళ్ళకు ఉన్న శక్తి తెలిసింది.అంతకంటే, ముఖ్యంగా నా శక్తి మీద నాకు నమ్మకం కలిగింది. ఎన్ని సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా పరీక్షా సమయంలో అవేవీ నా ఏకాగ్రతను భంగం చేయలేకపోయాయి. నా చేతి వేళ్ళే నా ఆయుధాలుగా మార్చుకుని, జీవితంలో మరో పోరాటానికి సమాయత్తమయ్యాను. 1970, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారానే జరిగేవి. నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. బీయస్సీ గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో కొంత గౌరవం ఉండేది. కాని, మామూలు క్లరికల్ ఉద్యోగాలకు, పదవ తరగతి మాత్రమే విద్యార్హత కాబట్టి, విపరీతమైన పోటీ ఉండేది. అది కూడా సీనియారిటీని బట్టే పిలుపు వస్తుంది. ఎక్సే్ఛంజ్ ముందు నోటీసు బోర్డులో, ఏయే ఆఫీసుల్లో ఏయే ఖాళీలు ఉన్నాయో లిస్టులు పెట్టేవారు. అలా చాలా రోజుల నుంచి ఆ బోర్డులో పెట్టి ఉన్న ఒక నోటీసు నన్ను ఆకర్షించింది. అది కలెక్టర్ కార్యాలయంలో, స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటీసు. ఎంక్వైరీ చేస్తే అది నిజమేనని డిగ్రీ, టైప్ హయ్యర్, షార్టుహ్యాండ్ లోయర్ పాస్ ఉంటే అర్హత లభిస్తుందని చెప్పారు. ‘మరి ఇన్ని నెలల నుంచి నోటీసు బోర్డులో ఉంది. అభ్యర్థులు రావడం లేదా?’ అన్న నా ప్రశ్నకు ‘ఈ రోజుల్లో షార్టుహ్యాండ్ పాసయిన వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటీ? షార్టుహ్యాండ్ పరీక్ష పాస్ కాగానే వారి కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత, ఆ సర్వీస్ వదులుకుని కొత్త పోస్టులోకి ఎందుకు వస్తారు?’ అని చెప్పారు. నేను ఆలోచనల్లో పడ్డాను. మా నాన్న బతికున్న రోజుల్లో బలవంతాన టైపురైటింగులో చేర్పించడంతో, నేను టైప్ హయ్యర్ పాసయ్యాను. అలాగే, ఎక్కడో ఉచిత షార్టుహ్యాండ్ కోచింగ్ అంటే అందులో చేరి అరవయ్యవ ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్నాను. కాని, టెక్నికల్ బోర్డు పరీక్షలు రాయలేకపోయాను. స్టెనో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలిసినప్పటి నుండి నాలో ఒక నూతనోత్సాహం పెరిగింది. స్టెనో ఉద్యోగం పెద్దదేమీ కాకపోవచ్చు. కానీ, ఈ కారుణ్య నియామకం అన్న పదమే నచ్చడం లేదు. నాన్న చనిపోయిన సీట్లో కూర్చుని, ఆయన డీల్ చేసిన ఫైళ్ళలో నోట్ రాయడమంటే, నాకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన విషయాలను ఎవ్వరూ అంత సులభంగా అర్థం చేసుకోరు. కాని, నా భార్య మాత్రం నన్ను ప్రోత్సహించింది. రోజువారీ కుటుంబ బాధ్యతలను చేపట్టడానికి మా ఇంటికి కోడలు కావలసి వచ్చింది. అలా ఇంటికి పెద్దవాడిగా నా పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అనంత సాగరంలో, కాగితపు పడవ మీద, సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. షార్టుహ్యాండ్ పరీక్ష వివరాలు తెలుసుకున్నాను. కాని, ఇన్స్టిట్యూట్లలో చేరి పరీక్ష రాయడానికి సంవత్సరం పడుతుందన్నారు. కాని, నా కంత టైము లేదు. నాకు ఆల్రెడీ అరవై ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్న అనుభవం ఉంది. దేవుణ్ణి తలచుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టాను. షార్టుహ్యాండ్ ప్రాక్టీసు కోసం ముఖ్యంగా కావలసినవి ప్రశాంతమైన, నిశ్శబ్దంగా ఉండే రూము, డబుల్ లైనులో ఉండే ప్రత్యేకమైన నోట్ బుక్స్, పెన్సిళ్ళు. ఒకటి, రెండున్నరేళ్ళ వయసున్న మా అమ్మాయిలను, నా భార్య గొడవ చేయకుండా చూడడం వలన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నేను షాపుల్లో దొరికే ఖరీదైన షార్టుహ్యాండ్ నోటు బుక్కులు కొనలేని పరిస్థితి. కాబట్టి, తెల్ల కాగితాలు, అర ఠావు, పావు ఠావు అని అప్పట్లో హోల్ సేల్‌గా దొరికేవి. అవి తెచ్చి కట్ చేసి, నోటు బుక్కులుగా కుట్టించేది నా భార్య. పెన్సిళ్ళు మాత్రం కొనాల్సిందే. ఎందుకంటే, షార్టుహ్యాండులో రాసే స్ట్రోక్స్ కొన్ని లైట్ కలరులో కొన్ని చిక్కటి కలరులో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, గీత మీద లైటు కలరులో ఏటవాలుగా ఒక పావు ఇంచు గీత లైట్ కలరులో రాస్తే ‘పి’ అనీ, దాన్నే ‘పే’ గా కూడా చదువుకోవచ్చు. అదే ఒత్తుగా రాస్తే ‘బి’ అనీ; అదే ‘బే’ కూడా అవుతుంది. అందుకని మంచి పెన్సిళ్ళు ముఖ్యం. ఆయుధాలన్నీ సర్దుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అది మామూలు ప్రాక్టీసు కాదు. ఒక మహా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా ప్రాక్టీస్ మొదలయింది. లక్ష్యం తొంభై రోజుల్లో జరిగే షార్టుహ్యాండ్ లోయర్ స్పీడ్ ఎగ్జామ్. నిముషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని, ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి లిపిబద్ధం చేసి, రాసి చూపించాలి. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఐదారేళ్ళు క్లర్కుగా పనిచేశాను కాబట్టి, నాకు డ్రాఫ్టింగ్ పట్ల అవగాహన ఉంది. ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణం, వ్యాకరణం, పంక్చుయేషన్ మార్కుల గురించిన పరిజ్ఞానం, నాకు షార్టుహ్యాండ్ పరీక్షకు బాగా ఉపయోగపడింది. నేను ప్రాక్టీస్ మొదలు పెట్టిన పది రోజులకు నాకు ఒక విషయం అవగతమయింది. షార్టుహ్యాండులో, అవతలి వ్యక్తి ఇచ్చిన డిక్టేషన్ ను రాసుకుని, ఇంగ్లీషులోకి ట్రాన్స్క్రైబ్ చేయడమే ముఖ్యం. అందుకోసం షార్టుహ్యాండ్ స్ట్రోక్సే అవసరం లేదు. ఉదాహరణకు, ఒక డిక్టేషన్‌లో ’హైదరాబాద్’ అనే పదాన్ని స్ట్రోక్‌లో రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ స్ట్రోక్ రాసే బదులు ’ఏ’ అని రాసుకుంటే సరిపోతుందని నాకనిపించింది. అట్లాగే చెబుతున్న డిక్టేషన్లోని సబ్జెక్టును బట్టి, ‘పార్లమెంట్’ అని వస్తే, ‘పీ’ అని రాసుకుంటే, తర్వాతి పదాలను సులువుగా రాసుకోవచ్చని నాకర్థమయింది. అయితే అందుకు ఇంగ్లీషు భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివితే, ఆ పరిఙ్ఞానం వస్తుంది. నేను రోజుకు ఇరవై గంటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి. తిండీ తిప్పలు పట్టించుకోలేదు. బాత్రూములో ఉన్నా పదాలను షార్టుహ్యాండులో వేళ్ళ మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. బొటన వేలితో మిగిలిన వేళ్ళ మీద స్ట్రోక్స్ రాసేవాణ్ణి. కళ్ళ ముందు ఏ వస్తువు కనబడ్డా, ఏ మనిషి కనబడ్డా ఆ పేర్లను వేళ్ళ మీద షార్టుహ్యాండులో రాసే ప్రయత్నం చేసేవాణ్ణి. ‘చెంబు’ కనపడితే, చెంబుని స్ట్రోక్సులో బొటన వేలుతో, చూపుడు వేలు మీద రాసేవాణ్ణి. నడుస్తున్నప్పుడూ, భోంచేస్తున్నప్పుడూ, పిల్లలను ఎత్తుకున్నప్పుడూ, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడూ, బొటన వేలు, చూపుడు వేలు మీద చకచకా స్ట్రోక్స్ రాస్తూనే ఉండేవాణ్ణి. విశ్రాంతిగా ప్రాక్టీస్ మీద కూర్చున్నప్పుడు, మా ఆవిడ కుట్టిన పుస్తకాల మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. నేను ప్రాక్టీస్ చేసిన పుస్తకాలు మా చిన్న ఇంట్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చేవి. కొన్ని పుస్తకాల్లోని రాతలను రబ్బరుతో తుడిచేసి మళ్ళీ ప్రాక్టీసుకు సిద్ధం చేసేవారు. షార్టుహ్యాండు పరీక్షలో స్పీడ్ ముఖ్యం. అందుకని, చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని, ఆంగ్ల పత్రికలలో వచ్చే సంపాదకీయాలను, నిమిషానికి వంద పదాలు వచ్చే విధంగా నేనే రికార్డ్ చేసుకుని, వాటిని షార్టుహ్యాండ్లో రాసేవాణ్ణి. కాని, దాని వల్ల నేనే డిక్టేషన్ చెప్పి, నేనే ట్రాన్సై్కబ్ చేయడంతో కొన్ని పదాలు నాకు ముందే తెలిసిపోవడం వలన, నేను సులువుగా రాయగలుగుతున్నానేమోనని నాకే అనిపించింది. దాంతో తెలిసిన వాళ్ళతో డిక్టేషన్ రికార్డు చేయించేవాణ్ణి. ఇన్స్టిట్యూటులో రిక్వెస్టు చేసి, అక్కడి స్పీడ్ డిక్టేషన్లను, రికార్డింగ్ చేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాణ్ణి. ఒకసారి, మా పొరుగున ఉన్న అంకుల్ వచ్చి, ‘అర్ధరాత్రి మీ ఇంట్లో నుండి ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. ఆ టైములో ఎవరు వింటున్నారు?’ అని అడిగాడు. నేను నా షార్టుహ్యాండ్ పరీక్ష గురించి చెప్పాను. ఆయన చాలా సంతోషపడి, ‘బెస్టాఫ్ లక్’ అని చెప్పాడు. మూడు నెలల్లో నేను ఆరు కిలోల బరువు తగ్గాను. బట్టలు లూజు అయిపోయాయి. కళ్ళు గుంటలు పడి, ముఖం పీక్కు పోయింది. గడ్డం పెరిగి, ఒక పిచ్చోడిలా తయారయ్యాను. కాని, నా ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. నిమిషానికి వంద పదాలు సులభంగా రాయగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం నా ముఖంలో తొణికిసలాడుతున్నట్టుగా నాకే తోచింది. పరీక్ష రోజున, పెన్సిల్ ముట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. దేవుడికి నమస్కరించి, పరీక్ష హాలుకు బయల్దేరాను. షార్టుహ్యాండ్ పరీక్షలో, అభ్యర్థులు కంగారు పడడం సహజం. కాని, నేను ఎటువంటి ఆందోళన లేకుండా, రిలాక్స్డ్గా కూర్చున్నాను. పరీక్ష మొదలయింది. కంచుకంఠంతో డిక్టేషన్ మొదలయింది. ఎగ్జామినర్ నోటి నుండి దొర్లుతున్న పదాలను చెవులు నిక్కించి స్పష్టంగా విని వాటికి స్ట్రోక్స్ రాయడం ప్రారంభించాను. నా చెవుల్లోకి వేరే శబ్దమే వినిపించడం లేదు. షార్టుహ్యాండ్ పరీక్ష మిగతా పరీక్షల్లా కాదు. ఒక్క పదం వినడం మిస్ అయితే కంగారు మొదలై తరువాత అనేక పదాలతో లంకె కుదరదు. అందుకని ఒక పక్కన ప్రపంచం బద్దలైపోతున్నా, పట్టించుకోకూడదు. అందుకే, చాలామంది, ఐదారు సార్లు షార్టుహ్యాండ్ ‘లోయర్’ పరీక్ష రాస్తే గానీ ఉత్తీర్ణత సంపాదించరు. ఆ ఎగ్జామ్ హాల్ వాతావరణం, ఆ హడావుడి, ఆ సందడి, ఆందోళన అనుభవంలోకి రావాలి. అప్పుడు గాని, డిక్టేషన్ మీద ఏకాగ్రత కుదరదు. నేను చకచకా ట్రాన్స్క్రైబ్æ చేసి పేపరు ఇచ్చేసి, ఇంటికి వచ్చి, అన్నం తిని, రెండు రోజుల పాటు పడుకున్నాను. నా చేతులూ, వేళ్ళూ ఎంత అలసిపోయాయో నాకే తెలుసు. ఆ మూడు నెలల్లో కొన్ని లక్షల పదాలు రాశాయి నా వేళ్ళు. కొన్ని వేల పుస్తకాలను నా చేతులు పట్టుకున్నాయి. ఒక మహా మరయంత్రంలా, చక్కటి ప్రిసిషన్‌తో మెదడు, చెవులు, చేతులు, వేళ్ళు పనిచేశాయి. రిజల్ట్స్ వచ్చాయి. నేను రాష్ట్రంలో ప్రప్రథముడిగా పాసయి, గోల్డ్ మెడల్ సాధించాను. ఆ క్షణంలో, నా భార్య నా చేతి వేళ్ళను ముద్దు పెట్టుకుంది. అది ఒక ప్రారంభం మాత్రమే. షార్టుహ్యాండులో నా ప్రజæ్ఞ వల్ల ఆ తర్వాత అనేక విజయాలు సాధించాను. బ్యాంకులో స్టెనోగ్రాఫర్, ఐఏయస్ ఇంటర్వ్యూ, గ్రూప్ పరీక్షల్లో ప్రప్రథముడిగా ఉద్యోగం రావడం జరిగిపోయాయి. ఇప్పటికీ, కొత్త పదం కనిపిస్తే నా బొటన వేలు, చూపుడు వేలు మీద రాయడానికి ప్రయత్నిస్తుంది. కాని, ఏం లాభం. ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది. నన్ను జీవితంలో విజేతగా నిలబెట్టిన నా చేతులు – నా మెదడు విన్న ప్రతి మాటను అక్షర రూపంలోకి లిపిబద్ధం చేసిన నా వేళ్ళు– ఇప్పుడు నా మాట వినడం లేదు. రాయడం అటుంచి, పెన్సిల్ కూడా పట్టుకోలేనంతగా వణుకుతున్నాయి. రుజాగ్రస్తుణ్ణయ్యాను అనుకునే సరికి కన్నీరు ఉబికి వచ్చింది. సన్నటి వాన మొదలయింది. బాల్కనీలో నుండి లోపలికి నడిచాను. వర్షానికి తడిస్తే ఆస్త్మా పెరుగుతుంది. అందుకే ఇన్హేలర్ పీల్చి, మంచం మీద కూర్చున్నాను. పక్కనే నా భార్య పడుకుని ఉంది. నాలాగా కాకండా తనెప్పుడూ మంచానికి ఎడమ వైపు పొందికగా పడుకుంటుంది. టైం ఎంతయిందో తెలియదు కాని, అది కచ్చితంగా బ్రాహ్మీముహుర్తమే. నా భార్య అలా ప్రశాంతంగా పడుకుని ఉండడం చూస్తే, మనసు ఆనందంతో నిండిపోయింది. కారణం తెలియదు. కొన్ని సంతోషాలకు కారణం ఉండదు. భగవంతుని దయ వలన ఇన్నేళ్ళూ ఒకరికొకరంగా బతికి సంసారాన్ని నడిపాము. పిల్లలు ప్రయోజకులయ్యారు. నా భార్య జుట్టును ప్రేమగా నిమిరాను. తను నిద్రలోనే, ‘ఏమైనా కావాలా?’ అని అడిగింది. నేను తన చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుని ‘ఏమొద్దు, పడుకో!’ అని నా ఆఫీసు రూములోకి నడిచాను. చాలాసేపు మది నిండా ఒక సంతృప్త భావనతో చీకట్లో మౌనంగా కూర్చుండిపోయాను. ‘నాకేం తక్కువ? జీవితంలో అన్నీ అనుభవించాను. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాను. ఏవో కొన్ని పుస్తకాలు రాశాను. మనిషి జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఈ జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. పండిన ఆకు రాలిపోవడం అత్యంత సహజం. ఆ ప్రక్రియలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. వాటిల్లో అనారోగ్యం కూడా ఒకటి. డెబ్భై ఏళ్ళ వయసులో శరీరం, యౌవ్వనంలో ఉన్నట్టుగా, హుషారుగా ఎలా ఉంటుంది? డెబ్భై ఏళ్ళ తర్వాత లభించిన ప్రతి రోజూ బోనస్ జీవితంగానే భావించాలి.’ నా ఆలోచనల్లో నేనుండగానే, లైటు వెలిగింది. నేను తలెత్తి చూశాను. మా ఆవిడ కాఫీ కప్పుతో నిలబడింది. ‘వద్దన్నానుగా?’ అని అన్నాను. తను నవ్వుతూ, ‘మీకు కావాలని నాకు తెలుసుగా?’ అంది నవ్వుతూ. వర్షం వెలిసిన తర్వాత విరిసిన హరివిల్లులా ఉంది, నిద్రమత్తులో ఉన్న తన ముఖంలోని ఆ నవ్వు. తనలో గొప్పతనం ఏమిటంటే, పడుకుని లేచినా ముఖం తాజాగా ఉంటుంది. జుట్టు చెదరదు. ఆమె ముఖాన్నే చూస్తూ, కాఫీ కప్పు అందుకున్నాను. నేను తన కష్టాన్ని సరిగా గుర్తించలేదేమోనని, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. సుమారు యాభై ఏళ్ళ మా సంసారంలో నాకు ఎన్నడూ ఏ లోటూ రాకుండా చూసుకుంది. పేరుప్రఖ్యాతులు నాకు వచ్చినా తనకొచ్చినంతగా సంబరపడేది. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తన చేతిని స్పృశించాను. ఆ స్పర్శ నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘కాఫీ తాగండి!’ అని వెళ్ళబోతూ, ‘ఏంటి, ఆఫీసు రూములో కూర్చున్నారు? మళ్ళీ ఏమైనా రాయబోతున్నారా?’ అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు నడిచింది. ఆమె మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి, ‘అవును ఎందుకు రాయగూడదు?’ అన్న సందేహం నాలో ఉత్పన్నమయింది. మీరు గమనించారా? నేనైతే ఇప్పుడే గమనించాను. కాఫీ కప్పు తీసుకున్నప్పుడు నా చేతి వేళ్ళు మునుపటంతగా వణక లేదు. నా వేళ్ళను చూశాను. ఏదో కొత్త ఉత్తేజంతో తొణికిసలాడుతున్నట్టుగా, నవనవలాడుతూ కనిపించాయి. ‘ప్లేసిబో ఎఫెక్ట్’ గురించి నేనే ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఆ ప్రయోజనం నాకే అనుభవంలోకి వస్తున్నట్టుగా అనిపించింది. కంప్యూటర్ తెరిచి, స్పీకరులో కథ ‘డిక్టేషన్’ చెపుతుంటే, వాయిస్ రికార్డర్ ద్వారా, కంప్యూటర్ తెర మీద, అక్షరాల రూపంలో కథ పురుడుపోసుకుంటుంది. ఇప్పుడు కూడా షార్టుహ్యాండే, డిక్టేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇప్పుడు చేతివేళ్ళ పనిని కంప్యూటర్ చేసేస్తోంది. -
ఎక్కువగా ఊడిపోతోంది
నా వయసు 29 ఏళ్లు. గత కొంతకాలంగా తల మొత్తం మీద జుట్టు పలచబడుతున్నట్టు అనిపిస్తోంది. దువ్వుకున్నప్పుడు, తల స్నానం చేసినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. మా కుటుంబంలో ఇలాంటి సమస్య ఎవరికి లేదు. ఈ సమస్యను నియంత్రించడానికి ఏ విధమైన పరీక్షలు, చికిత్సలు అవసరం? – స్నేహ, తిరుపతి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది సాధారణంగా డిఫ్యూస్ హెయిర్ ఫాల్ సమస్యగా భావించవచ్చు. రోజుకు సగటున 50 నుంచి 100 జుట్టు ఊడటం సాధారణమే. అయితే దువ్వుకునేటప్పుడు లేదా తల స్నానం చేసినప్పుడు గుప్పెడు జుట్టు ఊడుతున్నట్టు అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఇలాంటి సమస్య లేకపోయినా, ఈ రకమైన జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది టెలోజెన్ ఎఫ్లూవియం. ఇందులో జుట్టు పెరుగుదల దశ నుంచి అకస్మాత్తుగా జుట్టు ఊడే దశకు మారుతుంది. అధిక జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులు, శస్త్రచికిత్సలు, ప్రసవం తరువాత జరిగే శారీరక మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అకస్మాత్తుగా బరువు తగ్గే డైట్లు, శరీరంలో ఐరన్, ప్రొటీన్ , జింక్ లోపాలు, థైరాయిడ్ అసమతుల్యత, కొన్ని మందుల వినియోగం వంటి అంశాలు దీనికి కారణమవుతాయి. సాధారణంగా ఈ కారణాలు జరిగిన రెండు నుంచి మూడు నెలల తర్వాత జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. యువతుల్లో, ముఖ్యంగా మహిళల్లో పోషక లోపాలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా ఉంటాయి. రక్తహీనత, ఐరన్ నిల్వలు తగ్గిపోవడం, ప్రొటీన్ లోపం, విటమిన్ డీ, విటమిన్ – బి12 లోపాలు ఈ సమస్యను మరింత పెంచుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యతలు కూడా డిఫ్యూస్ హెయిర్ ఫాల్‌కు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్, ప్రసవం తరువాత లేదా మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు, కొన్ని హార్మోన్లు అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జుట్టు పలుచబడుతుంది. తల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. తీవ్రమైన చుండ్రు, సెబోరియిక్ డెర్మటైటిస్, సొరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా జుట్టు ఊడవచ్చు. అదేవిధంగా జుట్టును బాగా బిగుతుగా కట్టుకోవడం, అధిక వేడి పరికరాల వినియోగం, తరచు రసాయన చికిత్సలు చేయించుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, పొగతాగడం, నిరంతర మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయి. ఈ సమస్యను నియంత్రించడానికి ముందు అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి రావచ్చు. అలాగే తల చర్మాన్ని ప్రత్యేకంగా పరిశీలించే పరీక్షల ద్వారా కూడా స్పష్టత లభిస్తుంది. పరీక్షల నివేదికలు, వైద్య పరిశీలన ఆధారంగా చర్మవైద్యుడు తగిన చికిత్సను సూచిస్తారు. అవసరమైతే మందులు, పోషక సప్లిమెంట్లు, తలకు అప్లయి చేసే లోషన్లు లేదా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక సీరమ్‌లు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఆధునిక చికిత్స విధానాలు కూడా అవసరం కావచ్చు. జుట్టు చికిత్స ప్రారంభించిన తర్వాత స్పష్టమైన ఫలితాలు కనిపించడానికి కొన్ని నెలలు పడుతుంది. అందుకే ఓర్పుతో, దీర్ఘకాలం చికిత్స కొనసాగించడం అవసరం.అలాగే ప్రొటీన్ , ఐరన్ , ఆకుకూరలు, పండ్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడుతున్నట్లు అనిపించిన వెంటనే చర్మవైద్యులను సంప్రదించడం మంచిది. -డా. ఇందిర పవన్ ,ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ -
నక్క సాయం
అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరుల నుంచి సహాయం పొందేది కాని, ఎన్నడూ ఇతరులకు సాయం చేసేది కాదు. ఏ జంతువో, పక్షో వచ్చి వాగుకో వంకకో దారి అడిగితే, తెలిసినా చెప్పేది కాదు. చెప్పినా దూరం దారి చెప్పి సంబరపడేది.అడవిని పాలించే పులిరాజుకు లేక లేక బిడ్డ పుట్టింది. బాతుల వాగు దగ్గర వేడుక చేస్తున్నట్లు ప్రకటించాడు.వేడుకకు అడవిలోని జంతువులన్నీ వచ్చి విందు ఆరగించవలసిందిగా కోరాడు పులిరాజు. వేడుకకు నక్క బయలుదేరింది. కాని, దానికి బాతుల వాగుకు దారి తెలీదు. అది అలా నడుచుకుంటూ పోతూ ఉండగా, దారిలో మామిడి చెట్టు మీద ఒక కోతి కునుకు తీస్తూ కనిపించింది. చెట్టు నీడలో ఆయాసం తీర్చుకొని, ‘కోతి బావా! కోతి బావా! బాతుల వాగుకు దారి చెబుతావా!’ అడిగింది నక్క.‘నేరుగా వెళ్లి కుడివైపు తిరుగు, చింతచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి నడిస్తే, మర్రిచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నడిస్తే, రావిచెట్టు కనిపిస్తుంది. దానికి ఎదురుగా తాటితోపు కనిపిస్తుంది. తాటితోపు దాటగానే బాతుల వాగు ఉంటుంది’ చెప్పింది కోతి.నక్కకు కోతి చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. అది ఆ దారిలో ఎప్పుడూ వెళ్లనే లేదు. దాంతో బుర్ర గోక్కుంటూ ఆలోచించసాగింది. కోతి కుంటుతూ నెమ్మదిగా చెట్టు దిగి, ‘నక్క బావా! నా కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది. నీ మీద నన్ను ఎక్కించుకుంటే, నేను నీ వెంట వేడుకకు వస్తాను!’ అంది.కోతిని పైనుంచి కిందికి చూసింది నక్క. ‘వేడుకకు రాకుంటే, విందు చేయకుండా పస్తులుండు! నిన్ను మాత్రం నా వీపు మీద ఎక్కించుకొని తీసుకుపోను. నేను నీ బానిసను కాను!’ పెద్దగా అంది నక్క .కోతి మౌనంగా ఉండిపోయింది. నక్క అక్కడి నుంచి వేగంగా ముందుకు పోయింది.కొద్దిసేపటికి ఆ దారి వెంట ఏనుగు వచ్చింది. కుంటుతున్న కోతిని చూసింది ఏనుగు.‘కోతి బావా! నీ కాలికి ఏమైంది?’ అడిగింది ఏనుగు.‘ముల్లు గుచ్చుకొని గాయమైంది. నడవలేక పోతున్నాను!’ అంది కోతి. ‘అయ్యో! అలాగా! నీకు బాతుల వాగుకు దారి తెలుసా?’ అడిగింది ఏనుగు. తెలుసన్నట్లుగా తల ఊపింది కోతి.‘అయితే, నువ్వు నా వీపు మీద కూర్చుని వాగుకి దారి చెప్పు. ఇద్దరం కలిసి వేడుకకు పోదాం!’ అంది ఏనుగు. కోతి ఏనుగు వీపు మీద కూర్చుంది. కోతి దారి చెబుతూ ఉంటే, ఏనుగు ముందుకు పోతూ ఉంది.అవి రెండూ కబుర్లు చెప్పుకుంటూ బాతుల వాగుకు పోతూ ఉండగా, దారిలో దూరం నుంచే మర్రి చెట్టు కింద కూర్చున్న నక్కను చూసింది కోతి.నక్క దారి మరచి, ‘ఎటు వైపు వెళ్లాలా’ అని ఆలోచించసాగింది.ఏనుగు వీపు మీద కూర్చుని వస్తున్న కోతిని గమనించి నక్క సిగ్గుతో కోతికి కనిపించకుండా పొదల్లో నక్కింది. వెనుక నుంచి ఏనుగును అనుసరించి వేడుకకు చేరాలనుకుంది. అవి మర్రిచెట్టు వరకు రాగానే, ‘నక్క బావా! అలా నక్కి కూర్చుంటే వేడుకకు ఎలా చేరుతావు! మా వెంట పద! పోదాం!’ అంది కోతి. నక్క వాటి వెంట వేడుకకు చేరింది. విందులో రకరకాల వంటలు ఘుమ ఘుమలాడుతూ నోరూరించాయి.ఏనుగు తనకు నచ్చిన చెరుకు గడలు, అరటి గెలలు కడుపునిండా తిన్నది.నక్క లొట్టలేసుకుంటూ మాంసాహారం మెక్కి తిన్నది.కోతి మట్టుకు పులిరాజు పక్కన కింద కూర్చున్నది. కోతి ఏమాత్రం ఆహారం ముట్టుకోలేదు . ఏనుగు, నక్క కోతిని గమనిస్తూనే ఉన్నాయి. అవి కోతిని విందు ఎందుకు చేయలేదని అడిగాయి.‘నేను మీ కన్నా ముందే వేడుకకు వచ్చి, విందు ఆరగించాను. తిరిగి ఇంటికి వెళుతుంటే కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది!’ చెప్పింది కోతి. తమకు బాతుల వాగుకు దారి చూపించటానికే వేడుకకు మళ్లీ వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాయి ఏనుగు, నక్క.కోతి మంచితనానికి ఏనుగు పొంగిపోగా, నక్క సిగ్గుతో తలవంచుకుంది. అవి తిరిగి వెళ్లేటప్పుడు, నక్కే తన వీపు మీద కోతిని కూర్చోపెట్టుకుని ఇంటి దగ్గర దింపింది. ఆనాటి నుంచి ఇతరులకు సాయం చేస్తూ ఆనందంగా ఉండసాగింది నక్క. -
క్యాన్సర్‌కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్‌తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్‌కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్‌ను మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్‌కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!‘క్యాన్సర్‌కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్‌కు ఆన్సర్‌గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్‌ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...లిక్విడ్ బయాప్సీ‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్‌ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.ఏఐ ఆధారిత పాథాలజీక్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలుఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీక్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.డిజిటల్ బయో మార్కర్స్ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్‌గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్‌ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...సీఏఆర్–టీ సెల్ థెరపీలుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.టార్గెటెడ్ థెరపీకీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.ప్రెసిషన్ రేడియేషన్ థెరపీరేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్‌కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.నానో మెడిసిన్క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్‌లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.రోబోటిక్ క్యాన్సర్ సర్జరీక్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది. ప్రోటాన్ బీమ్ థెరపీరేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.మరిన్ని చికిత్స పద్ధతులుక్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్‌కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్ససమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్‌ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాక్సిన్లుపలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు -
ఇసుక బ్యాటరీ
ఆధునిక గడియారాలు అందుబాటులో లేకముందు ఇసుక గడియారాలను వాడేవారు. కాని, అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాక ఈ ఇసుక బ్యాటరీ తయారు కావడం వింతగా ఉంది కదూ! నిజానికి ఇది లిథియం అయాన్ బ్యాటరీల కంటే అధునాతనమైనది, అత్యంత సమర్థమైనది కూడా! ఫిన్నిష్ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ ఇసుక బ్యాటరీని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇసుక బ్యాటరీ. ఈ బ్యాటరీ సామర్థ్యం తెలుసుకుంటే, నోరెళ్లబెట్టాల్సిందే!ఈ బ్యాటరీతో ఏకంగా ఐదువేలకు పైచిలుకు ఇళ్లు గల ఒక చిన్న పట్టణానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలుగుతున్నారు. పోర్నాయినెన్ అనే పట్టణంలో ప్రయోగాత్మకంగా దాదాపు యాభై అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ ఇసుక బ్యాటరీని నెలకొల్పారు. ‘లోవీసన్ ల్యాంపో’ అనే కంపెనీ శాస్త్రవేత్తల సహాయంతో ఈ ఇసుక బ్యాటరీని తయారు చేసి, ఈ పట్టణంలో నెలకొల్పింది. పొడిగా చితక్కొట్టిన రాళ్లను ఇసుకగా మార్చి, దానిని విపరీతంగా వేడి చేయడం ద్వారా ఈ బ్యాటరీని రూపొందించారు.అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడెక్కిన ఇసుక దీర్ఘకాలం పాటు వేడిని నిక్షిప్తం చేసుకుని, విద్యుత్తు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఎంత విద్యుత్ సరఫరా ఉన్నా, ఫిన్లండ్‌లో శీతకాలమైతే చాలు, ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కట్టెల వినియోగం కూడా తప్పనిసరి. అయితే, ఈ ఇసుక బ్యాటరీ వల్ల పోర్నాయినెన్ పట్టణంలో ఈ శీతకాలంలో కట్టెల వినియోగం దాదాపు అరవైశాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఫిన్లండ్ తన విద్యుత్తు వినియోగంలో 43 శాతం మేరకు పునర్వినియోగ ఇంధనాల ద్వారానే పొందుతోంది. పునర్వినియోగ ఇంధనాలను మరింతగా పెంచడం ద్వారా 2035 నాటికల్లా పూర్తిగా పర్యావరణ హితమైన విద్యుత్తునే దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని ఫిన్లండ్ ప్రభుత్వం భావిస్తోంది. -
ఆ ఆనందమే వేరు!
మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...⇒ అసలు పేరు నమిత. ‘మమిత’ అనే పేరు సినిమాలు ఇచ్చిన బహుమతి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ పొన్నుమణి, మమ్మే అని పిలుస్తారు. ‘సూపర్ శరణ్య’ తర్వాత ‘సోనా’ కూడా అయ్యాను.⇒ నటనకంటే ముందే నాట్యం నా జీవితంలో ఉంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. స్టేజ్‌పై అడుగులు వేస్తే వచ్చే ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు.⇒ సినిమాల మధ్యలోనూ సైకాలజీ చదవాలని ప్రయత్నించాను. షూటింగ్స్ వలన క్లాసులు మిస్ అయ్యాయి. కాని, నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలాగే ఉంది.⇒ మేకప్ లేకుండా, సింపుల్ దుస్తుల్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. డిజైనర్ డ్రెస్సులు కాదు, నా అల్మరాలో ఉన్న వాటితోనే ఎక్కువగా స్టయిలింగ్ చేసుకుంటాను.⇒ నేనొక ఫూడీ. అందులోనూ నాన్‌వెజ్‌కి నో చెప్పలేను. పంచకర దోశ, బాషి బిర్యానీ నా ఫేవరెట్స్. మలయాళీ వంటకాలంటే ఇల్లు గుర్తు వస్తుంది. కాని, తమిళ సెట్ దోశ, నెయ్యి ఇడ్లీలకు కూడా పెద్ద ఫ్యాన్‌ను. వంకాయ మాత్రం నాకు చాలా బోరింగ్ కూర.⇒ మలయాళం నా మాతృభాష. కాని, ఇతర భాషా చిత్రాల్లో నటించాలంటే భాషను గౌరవించాలి అనిపించింది. ఒక్కో పదం నేర్చుకుని ఇప్పుడు తమిళం, తెలుగు చదవడం, రాయడం కూడా వస్తోంది.⇒ స్క్రీన్‌పై కెమిస్ట్రీ చూసి వచ్చే డేటింగ్ రూమర్స్ నాకు కొత్త కాదు. అవన్నీ సోషల్ మీడియా కథలే! నా రియల్ రిలేషన్ షిప్ నాకు మాత్రమే తెలుసు.⇒ సెట్లో ఉన్నప్పుడు చాలా కామ్‌గా ఉంటాను. కెమెరా ఆన్ అయితే పూర్తిగా మారిపోతాను. ఆ మాయే నన్ను నటన వైపు తీసుకొచ్చింది. పెద్ద కమర్షియల్ హిట్స్ కంటే, మనసును తాకే పాత్రలే నాకు నిజమైన విజయం.⇒ రాబోయే ఒక సినిమా నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ పాత్ర తర్వాత ‘మమిత’ను మరో కోణంలో చూడబోతున్నారు. -
సకుంభ నికుంభుల వధ
కుంభకర్ణుడి కొడుకులు సకుంభ నికుంభులు. రామ రావణ యుద్ధ కాలంలో వారు శాపవశాన మదగజాల రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత పులస్త్యుడి అనుగ్రహంతో శాపవిమోచన పొందారు. పూర్వరూపాలు పొందిన తర్వాత సకుంభ నికుంభులు యథావిధిగా ఇష్టానుసారం సంచరిస్తూ, లోకాలను పీడించడం ప్రారంభించారు. ‘రామ రావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాదులు హతమయ్యారు. వీరు కూడా హతమైపోయి ఉండే బాగుండేది, వీరి పీడ విగడయ్యేది’ అని ఇంద్రాది దేవతలు అనుకోసాగారు.ఇదిలా ఉండగా, ఒకనాడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ సకుంభ నికుంభుల నిలయానికి వచ్చాడు. ఇద్దరు సోదరులూ ఆయనకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, సగౌరవంగా స్వాగతించారు. ‘నారద మహర్షీ! విశేషాలేమిటి?’ అని అడిగారు.‘మహావీరులారా! దానవ వీరుల్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సైతం నేను ఎరుగుదును. వారెవరూ బాహు పరాక్రమంలో మీకు సాటిరారు. మీరు కత్తి ఎత్తారంటే సహస్రాక్షుడు సైతం భయంతో తోక ముడిచి పరుగులు తీస్తాడు. మీ బలపరాక్రమాలకు భయపడి ఇంద్రుడు గజగజలాడుతున్నాడు. ముల్లోకాలలోని జనాలు మీ ధాటికి జడిసి నిద్రలో కూడా ఉలికిపడుతున్నారు’ అన్నాడు.‘ఔను నారద మహర్షీ! నువ్వు పలికినది సత్యం. ముల్లోకాలలోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడు?’ అని గర్వంగా మీసాలు దువ్వుకున్నారు. ‘మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరూ లేకున్నా, జ్ఞాతిద్రోహం చేసి, లంకకు పట్టాభిషిక్తుడైన విభీషణుడు ఉన్నాడు కదా, అతడే మీ శత్రువు. అతడిని జయించి, లంకను స్వాధీనం చేసుకున్నారంటే, మీ లంక మీకు దక్కినట్లవుతుంది’ అని అగ్గి రాజేసి చక్కా వెళ్లిపోయాడు నారదుడు.నారదుడి మాటలు విని సకుంభ నికుంభులు రగిలిపోయారు. వెంటనే ఒక దూతను విభీషణుడి వద్దకు పంపి, యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిక సందేశం పంపారు.విభీషణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సకుంభ నికుంభులకు, విభీషణుడి సేనలకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. సకుంభ నికుంభుల చేతిలో విభీషణుడి సైనికులు పెద్దసంఖ్యలో నేలకొరిగారు. పోరులో వారి ముందు నిలువలేక విభీషణుడు కూడా రథాన్ని వెనక్కు మరలించాడు.యుద్ధంలో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటంతో విభీషణుడు చింతాక్రాంతుడయ్యాడు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితిలో నాకు రాముడే దిక్కు. ముందుగా ఈ సంగతిని హనుమకు తెలుపుతాను’ అనుకుని, వెంటనే ఆకాశమార్గాన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని కలుసుకుని, సకుంభ నికుంభుల దురాగతాన్ని వివరించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘భయపడకు విభీషణా! వెంటనే మనం రామచంద్రుడిని కలుసుకుందాం. ఆయన అండ మనకు ఉన్నంత వరకు సకుంభ నికుంభుల వంటివారు ఎందరు వచ్చినా, నిన్నేమీ చేయలేరు’ అని అభయమిచ్చాడు. విభీషణుడిని వెంటబెట్టుకుని వెంటనే అయోధ్యకు చేరుకున్నాడు. విభీషణాంజనేయులు రాత్రివేళ అకస్మాత్తుగా రావడంతో రాముడు ‘ఇంత రాత్రివేళ మీరిద్దరూ ఇలా రావడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.హనుమంతుడు రాముడికి విభీషణుడి పరిస్థితిని వివరించాడు. విభీషణుడికి రాముడు ధైర్యం చెప్పి, ‘హనుమా! రేపు సూర్యోదయానికల్లా సేనలను సిద్ధం చేయి. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం’ అని ఆజ్ఞాపించాడు. మర్నాడు ఉదయమే లక్ష్మణుడికి అయోధ్యానగర బాధ్యతలను అప్పగించి, భరత శత్రుఘ్నులతో కలసి విభీషణాంజనేయులు, సేనలు వెంటరాగా రాముడు లంకకు బయలుదేరాడు.రాముడి రాకను వేగుల వల్ల తెలుసుకున్న సకుంభ నికుంభులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హోరాహోరీ యుద్ధం మొదలైంది. భరత శత్రుఘ్నులు ముందుకు వెళ్లి సకుంభ నికుంభులను ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు ఎంతకూ వెనక్కు తగ్గకుండా పోరాడుతుండటంతో దానవ సోదరులిద్దరూ తమ తండ్రి కుంభకర్ణుడికి యముడు ఇచ్చిన యమదండాన్ని వారి మీదకు ప్రయోగించారు. యమదండం తాకగానే భరతశత్రుఘ్నులు కుప్పకూలిపోయారు.తన సోదరులు రణరంగంలో కూలిపోవడంతో రాముడు క్రోధావేశంతో కోదండాన్ని అందుకున్నాడు. సకుంభ నికుంభలపైకి వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. వాయువేగంతో దూసుకెళ్లిన ఆ దివ్యాస్త్రం సకుంభ నికుంభులిద్దరినీ యమపురికి పంపింది. అప్పటికీ భరతశత్రుఘ్నులు స్పృహలేకుండా ఉండటంతో రాముడు శోకతప్తుడై దుఃఖించాడు. ‘రామచంద్రా! నువ్విలా శోకించ తగునా! ఇలాంటి ఆపదలను గట్టెక్కించడంలో దిట్ట అయిన హనుమ మన చెంతనే ఉన్నాడు కదా! అతడిని పంపితే, ఇట్టే సంజీవనని సాధించుకు వచ్చి నీ తమ్ములను బతికించగలడు’ అని విభీషణుడు ఊరడించాడు.‘హనుమా! నువ్వే నా సోదరులను బతికించాలి’ వేడుకోలుగా అన్నాడు రాముడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ అయితే, సంజీవనినే కాదు, ఇంద్రుడితో పోరాడి సాక్షాత్తు అమృతాన్నయినా తీసుకొస్తా’ అని పలికి హనుమంతుడు ఆకాశానికెగశాడు.హనుమంతుడు నేరుగా అమరావతికేగి, అక్కడి నుంచి అమృతకలశంతో తిరిగి వచ్చాడు. అమృతాన్ని తాగించడంతో భరత శత్రుఘ్నులు పునర్జీవితులయ్యారు. విభీషణుడికి వీడ్కోలు పలికి రాముడు సోదరులతో కలసి అయోధ్యకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
సెల్ ఫోన్లో సెకండ్ ఫ్యామిలీ
‘‘హాయ్, మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందా?’’ అని అడిగితే ఎవరికైనా కోపమొస్తుంది. ‘‘ఏమ్మాట్లాడుతున్నావ్? సైకాలజిస్టువి కదా, ఆ మాత్రం సెన్స్ లేదా?’’ అని నాపై మండిపడతారు. కాని, చాలామందికి ఇప్పటికే సెకండ్ ఫ్యామిలీ ఉందంటే ఆశ్చర్యపోతారు. ఆ ఫ్యామిలీ మీ సెల్ ఫోన్లోనే ఉంది. ఈ తరంలో రాత్రిపూట గది తలుపులు వేసుకుని స్క్రీన్ ముందు కూర్చుని, వర్చువల్ ప్రపంచంలో కొత్త ‘కుటుంబాలను’ వెతుక్కుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కళ్లముందున్న భార్య, భర్త, తల్లిదండ్రులు విసుగ్గా, భారంగా అనిపిస్తున్న వేళ ముఖం తెలియని గేమింగ్ పార్టనరో, డిస్కార్డ్ గ్రూప్ సభ్యుడో ప్రాణస్నేహితుడిగా మారిపోతున్నాడు. దీనినే సైకాలజీలో ‘సెకండ్ లైఫ్ ఫ్యామిలీస్’ అని పిలుస్తున్నారు. ఇది ఎస్కేపిజమే!మనుషులు ఆన్లైన్ గ్రూపులకు ఎందుకు అతుక్కుపోతారో వివరించడానికి ‘సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ’ ఒక చక్కని ఆధారంగా నిలుస్తుంది. ప్రతి మనిషికి మూడు ప్రాథమిక అవసరాలు ఉంటాయి.1. తన ఇష్టానుసారం జీవించే స్వయంప్రతిపత్తి2. ఏదైనా సాధించగల సామర్థ్యం, సాధించాననే తృప్తి3. ఇతరులతో అనుబంధంనిజ జీవితంలో బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్ల ఈ మూడూ దెబ్బతిన్నప్పుడు, మనిషి ఆన్లైన్ లోకంలో వీటిని వెతుక్కుంటాడు. ఒక మల్టీప్లేయర్ గేమ్‌లో మీరు ఒక సామ్రాజ్యాన్ని ఏలవచ్చు (సామర్థ్యం), అక్కడ మీకు నచ్చిన పేరుతో ఉండవచ్చు (స్వయం ప్రతిపత్తి), మిమ్మల్ని పొగిడే స్నేహితులు ఉంటారు (సంబంధం).మళ్లీ ఇంటికి చేరుకోవడం ఎలా?రోజూ కనీసం రెండు గంటల పాటు ఫోన్లకు దూరంగా ‘నో–టెక్ జోన్’ సమయాన్ని కేటాయించండి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు స్క్రీన్ చూడటం మానేయాలి.మీ కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టి వారి కళ్లలోకి చూస్తూ వినండి. ‘నీ రోజు ఎలా గడిచింది?’ అనే చిన్న ప్రశ్న పెద్ద మార్పును తెస్తుంది.నిజ జీవితం ఎప్పుడూ ఎగై్జటింగ్‌గా ఉండదు. ఆ నిశ్శబ్దాన్ని, ఆ సాదాసీదా సమయాన్ని కుటుంబంతో గడపడం నేర్చుకోండి. బోర్ కొట్టిన ప్రతిసారీ ఫోన్ తీయడం మానేయండి.కేవలం స్క్రీన్లకే పరిమితం కాకుండా కలిసి నడవడం, బోర్డ్ గేమ్స్ ఆడటం లేదా వంట చేయడం వంటి పనులు చేయండి. ఇది ఆన్లైన్ ప్రపంచం ఇచ్చే ‘డోపమైన్’ను సహజంగా అందిస్తుంది.ఒకవేళ మీరు ఆన్లైన్ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతుంటే, అది ‘ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్’ కావచ్చు. అప్పుడు సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.ఆన్లైన్ స్నేహితులు మీ ఒత్తిడిని తగ్గించవచ్చు, కాని, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ పక్కన ఉండి సేవ చేసేది, మీ కన్నీళ్లు తుడిచేది మీ కుటుంబ సభ్యులే. టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని కలపడానికి ఉండాలి కాని, పక్కనే ఉన్న మనసులను విడదీయడానికి కాదు.‘సెకండ్ లైఫ్’లో హీరోగా ఉండటం కంటే, ‘ఫస్ట్ లైఫ్’లో మంచి కొడుకుగా, కూతురుగా లేదా భాగస్వామిగా ఉండటంలోనే నిజమైన సార్థకత ఉంది.కుటుంబం ఎందుకు ‘బోరు’ కొడుతోంది?నిజమైన బంధాలు కష్టంతో కూడుకున్నవి. అక్కడ అలకలు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి, ఆర్థిక లెక్కలు ఉంటాయి. కాని, ఆన్లైన్ బంధాలకు నిబద్ధత అవసరం లేదు. మీకు నచ్చకపోతే లాగౌట్ అయిపోవచ్చు. ఆన్లైన్ ఫ్రెండ్స్ మీతో ఎప్పుడూ సరదాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్లకు మీ ఇంటి సమస్యలతో సంబంధం లేదు. ప్రతి లైక్, ప్రతి విక్టరీ మెసేజ్ మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది, ఇది ఒక డ్రగ్లాంటి వ్యసనంగా మారుతుంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?పర్డ్యూ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, ఆన్లైన్ గేమర్లలో దాదాపు 30శాతం మంది తమ నిజ జీవిత భాగస్వాముల కంటే తమ గేమింగ్ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ మానసిక అనుబంధాన్ని కలిగి ఉన్నారని తేలింది.దాదాపు 60 శాతం మంది యువత తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి సోషల్ మీడియా కమ్యూనిటీలను ‘ప్రత్యామ్నాయ కుటుంబం’గా భావిస్తున్నారు. దీనివల్ల విడాకుల రేట్లు, కుటుంబాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ గత పదేళ్లలో 40శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.సెకండ్ లైఫ్‌తో ప్రమాదాలుఇంట్లో మనుషులు ఉన్నా వారితో మాట్లాడలేకపోవడం వల్ల తీవ్రమైన ఒంటరితనం కలుగుతుంది.కళ్లలోకి చూసి మాట్లాడటం, ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం తగ్గిపోతుంది.ఆన్లైన్ ప్రపంచం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కాని, లాగౌట్ అయిన వెంటనే నిజ జీవితం ఇంకా భయంకరంగా కనిపిస్తుంది. -
కథాకళి: మధురం
చావంటే అందరికీ భయం ఉంటుంది. కాని పాళ్ళల్లోనే తేడా. అమృతనాథానికి చావంటే చాలా భయం. చిన్నప్పుడు శవాన్ని పాడె మీద మోసుకెళ్తూ వాయించే డప్పులని వినలేక చెవులు మూసుకునేవాడు. శవం మీద చల్లిన పూలు రోడ్ మీద కనిపిస్తే, వాటిని తొక్కకుండా వెళ్ళేవాడు. శవం కనిపిస్తే ఆ రోడ్డులోంచి వెంటనే ఇంకో రోడ్డులోకి మళ్ళేవాడు. ఎంత దగ్గరి బంధువు మరణించినా సరే, వారి శవాన్ని చూడటానికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో వెళ్ళి పరామర్శించేవాడు. టెలిగ్రామ్ రోజుల్లో వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వస్తే వెంటనే బయటకి వెళ్ళిపోయి, చాలాసేపటికి తిరిగి వచ్చేవాడు. అతని తొమ్మిదో ఏట పొరపాటున తాత శవం ఉన్న గదిలో రాత్రంతా ఉండటం ఆ భయానికి ప్రధాన కారణం.ఈ భయాన్ని ‘తనటోఫోబియా’ అంటారని ఆయనకి ఓ సందర్భంలో మేనల్లుడు చెప్పి, సైకియాట్రిస్ట్‌ని కలిస్తే, దాన్ని జయించవచ్చని సూచించాడు. కాని ఆయన వెళ్ళలేదు.అలాంటి అమృతనాథానికి ఓరోజు హార్ట్ ఎటాక్ వచ్చి ముచ్చెమటలు పోశాయి. ఇంట్లోనే ఉన్న ఆయన కొడుకు వెంటనే అంబులె న్ ్సకి ఫో న్ చేసాడు. తెల్లవారుఝాము కాబట్టి ట్రాఫిక్ లేక అంబులె న్ ్స పన్నెండు నిమిషాల్లో వచ్చింది. పారామెడిక్స్ ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు.ఇంజక్ష న్ కే భయపడే అమృతనాథం హాస్పిటల్లో చేరాడని తెలిసి ఆయన శ్రేయోభిలాషులంతా బాధపడ్డారు. వైద్య పరీక్షలు చేశాక గుండెకి రక్తాన్ని చేర్చే రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని, ఆపరేష న్ తప్పదని డాక్టర్స్ చెప్పారు. ఆయన మరణిస్తానని భయపడి ఒప్పుకోలేదు. కాని భార్య, అల్లుడు, కొడుకు ఆయనకి నచ్చచెప్పారు.‘‘ఈసారి గుండెపోటు వస్తే పోవటం ఖాయమట! స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం పది శాతం మాత్రమే హార్ట్ సర్జరీలో పోయే అవకాశం ఉంది నాన్న.’’ కొడుకు చెప్పాడు.అంతా నచ్చచెప్పాక అందుకు అంగీకరించి కాగితం మీద సంతకం చేశాడు.అమృతనాథం ఆపరేష న్ ముందు రాత్రి తినటానికి ఏమీ పెట్టలేదు. మర్నాడు ఉదయం మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు. ఆయన్ని వీల్‌చైర్‌లో ఆపరేష న్ థియేటర్‌కి తీసుకెళ్తూంటే ఆయన మొహం చూసిన కొత్తవాళ్ళకి కూడా అందులో చావు భయం స్పష్టంగా కనపడింది. ఆయనని ఆపరేష న్ బల్ల మీద పడుకోబెట్టాక డాక్టర్ నవ్వుతూ భుజం మీద తట్టి చెప్పాడు.‘‘మీరు తేరుకున్నాక మా ఇంటికి స్వీట్స్ డబ్బాతో వస్తారు. నేను కాజూబర్ఫీ అభిమానినని గుర్తుంచుకోండి. అన్నట్లు మీకు అంకెలన్నీ వచ్చా?’’‘‘వచ్చు.’’‘‘వంద దాకా?’’‘‘ఇంకా పైనే వచ్చు.’’‘‘ఐతే ఇక నిశ్చింతగా వంద నించి వెనక్కి బయటకి లెక్క పెట్టండి.’’ఆయన ఆరంభించాడు.‘‘వంద... తొంభైతొమ్మిది... తొంభైఎనిమిది... తొంభైఏడు... తొంభైఆరు...’’తొంభై దాటకుండానే ఆయనకి ఎనస్తీషియాతో çస్పృహ తప్పింది.అమృతనాథానికి మెలకువ వచ్చింది. ఆయనకి శరీరం లేనట్లుగా ఎంతో తేలికగా అనిపించింది. చుట్టూ చూస్తే ఆహ్లాదకరమైన, విశాలమైన తోట కనిపించింది. ఎన్నడూ చూడని రంగుల పువ్వులు, పక్షులతోపాటు ఎన్నడూ వినని అత్యంత మధురమైన సంగీతం వినిపిస్తోంది. ముక్కుకి మధురమైన వాసనలు.‘‘అమృతం.’’ఆయన్ని తల్లి పిలిచే పిలుపది!‘‘అమ్మా... నేను ఎక్కడున్నాను?’’ ఆవిడని చూడగానే అమృతనాథం అడిగాడు.‘‘అత్యంత ఆనందకరమైన చోట. ఈయన్ని గుర్తుపట్టావా? మీ నాన్నగారు. నీ రెండో ఏట పోయారు. కాబట్టి మీరు ఒకరినొకరు గుర్తు పట్టలేరు.’’‘‘ఏరా అమృతం. ఎలా ఉంది నీకు?’’ ఆయన ప్రాణమిత్రుడు పలకరించాడు.‘‘నా మనసు ఎన్నడూ అనుభవించనంత అత్యంత ప్రశాంతంగా, కారణం లేకుండా అత్యంత ఆనందంగా ఉంది. ఇక్కడ నించి ఎక్కడికీ వెళ్ళాలని లేదు.’’ చెప్పాడు.‘‘రా. అందరినీ చూద్దువు గాని.’’అతని చేతిని పట్టుకుని నడిపించసాగారు. సర్జ న్ మాటలు వినపడ్డాయి.‘‘అమృతనాథంగారు... నా మాట వినపడుతోందా? వినపడితే నా వేలిని నొక్కండి... మీకు నా గొంతు వినపడుతోందా? నర్స్ ఆ ఇంజక్ష న్ ఇంకోటి ఇవ్వు.’’ ‘‘నన్నెవరో పిలుస్తున్నారు.’’ అమృతనాథం చెప్పాడు.‘‘ఓ. ఐతే వెళ్ళు.’’ తల్లి చెప్పింది.‘‘కాని నాకు వెళ్ళాలని లేదమ్మా.’’ ఆయన దిగులుగా చెప్పాడు.‘‘తప్పదు. పిలుపు వినపడితే వెళ్ళి తీరాలి. అలా అందరికీ వినపడదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తూంటాం.’’ అమృతనాథం తండ్రి ఆప్యాయంగా చెప్పాడు.‘‘గుడ్‌బై రా.’’ మిత్రుడు కూడా అసంతృప్తిగా చెప్పాడు.‘‘ఎలక్ట్రిక్ షాక్స్, ఆ ఇంజక్ష న్ పని చేశాయి. గుండె మళ్ళీ ఆడుతోంది. రివైవ్ అయ్యారు.’’ సర్జ న్ ఆనందంగా చెప్పాడు.ఆయన త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అమృతనాథంలో చావు భయం పూర్తిగా పోయింది. బదులుగా దాన్ని ఇష్టపడసాగాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఆ ఫొటోతో ఆచూకీ!
ఆర్మ్ రెజ్లర్ నుంచి క్రిమినల్‌గా మారిన ఓ రౌడీషీటర్ ‘మెంటల్’ అవతారం ఎత్తాడు. జైలు నుంచి ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు షిఫ్ట్ అయ్యాడు. రెండో భార్య తనను కలవడానికి ఆస్పత్రి అధికారులు ఒప్పుకోలేదనే కారణంగా ‘నిప్పుపెట్టి’, అదను చూసుకుని మరికొందరితో కలిసి ఎస్కేప్ అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతగాడి ఆచూకీ చిక్కలేదు. ఓపక్క పోలీసులు ఈ ఎస్కేప్డ్ రౌడీషీటర్ కోసం నిద్రాహారాలు మాని గాలిస్తుండగా, సదరు నేరగాడు మాత్రం తన రెండో భార్యతో విహారయాత్రల్లో జల్సాలు సాగిస్తూ, ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేసి చిక్కాడు. 2013 డిసెంబర్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. నాంపల్లి చాపెల్ రోడ్‌కు చెందిన ఖురేషీ గతంలో ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్. 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని, నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. ఇతడిపై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాల కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అబిడ్స్ పోలీసులు ఇతడిపై రౌడీషీట్ తెరిచారు. ఓ డ్రగ్స్ కేసులో 2013 అక్టోబర్ 15న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తన మానసిక స్థి్థతి సరిగ్గా లేనట్లు జైలు అధికారులను నమ్మించిన ఖురేషీ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డుకు చేరాడు. 2013 డిసెంబర్ 2 రాత్రి 9.30 గంటల సమయంలో మీరాలం మండీ ప్రాంతానికి చెందిన ఖురేషీ రెండో భార్య అల్మాస్ అతడిని కలిసేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఈ మేరకు సిబ్బందిని అనుమతి కోరగా, వారు డ్యూటీ ఆర్.ఎం.ఓకు విషయం చెప్పారు. ములాకత్‌కు అది సమయం కాకపోవడంతో ఆయన నిరాకరించారు. ఇదే విషయాన్ని వార్డు సిబ్బంది ఖురేషీకి తెలిపారు. దీంతో తన భార్యను ములాకత్‌కు ఎందుకు అనుమతించడం లేదంటూ చిందులేశాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్‌షీట్స్ తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీంతో తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సమాయత్తమయ్యారు. అప్పటికే వార్డు మొత్తం పొగతో నిండిపోయి రోగులు, సిబ్బంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఎస్కార్టు పోలీసుల సహయంతో 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. సిబ్బంది రోగులను మార్చే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నట్లు గుర్తించిన ఖురేషీ మరో పదిమంది ఖైదీల సహయంతో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గది కిటికీ కింది భాగంలో గోడను ధ్వసం చేసి రంధ్రం చేశాడు. అందులో నుంచి మనిషి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసుకుని ఒక్కోక్కరుగా బయటకు వచ్చి పారిపోయారు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో మాజీ ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. గది గోడను ధ్వంసం చేస్తున్నట్లు శబ్దం రావడంతో వారు బయటికి వచ్చారు. అప్పటికే రంధ్రంలో నుంచి ఖైదీలు బయటకు రావడాన్ని గమనించి దగ్గరికి వెళ్లి ఎవరు, ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారి వద్దకు వచ్చిన ఖురేషీ ‘ఇక్కడి నుంచి వెళ్లండి లేదంటే కత్తితో పొడిచేస్తా’ అంటూ వారిని భయపెట్టాడు. దీంతో భయపడిన వారు ఇంట్లోకి వెళ్లి... గోకుల్ థియేటర్ వైపు ఉన్న మార్గం ద్వారా కొందరు ఖైదీలు బయటకు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్యతో ఐదుగురు పిల్లలు కలిగినప్పటికీ ఖురేషీ ఆ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి విహారయాత్ర ప్రారంభించిన ఖరేషీ వాహనాలతో పాటు విమానాలు, రైళ్లు వినియోగించారు. ఎక్కడా ఒక్క రోజు కంటే ఎక్కువ బస చేయకుండా గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు అన్నీ మర్చిపోయి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడకు వెళ్లాడో తెలియక అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టలేక సతమతం అవుతున్నారు. ఇదిలా ఉండగా, తాను రెండో భార్యతో కలిసి జల్సా చేస్తున్న విషయాన్ని మొదటి భార్యకు తెలిపి, ఆమెను సతాయించాలని ఖురేషీ భావించాడు. దీంతో ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్సాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో ఆమె ఈ ఫొటోలతో పాటు అతడు వినియోగిస్తున్న నంబర్‌ను పోలీసులకు అందించింది. వెంటనే అప్రమత్తమై, సాంకేతిక నిఘా ఉంచిన పోలీసులు ఖురేషీని నగరానికి వచ్చాక అరెస్టు చేయాలని భావించారు. చివరకు 2013 డిసెంబర్ 24న విజయావాడ నుంచి టోలిచౌకి వచ్చిన ఖురేషీ ఆచూకీని సాంకేతికంగా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించడంతో ఆమెనూ నిందితురాలిగా చేశారు. ∙ -
ఈ వారం కథ: తిరిగొచ్చిన అహం
కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకొచ్చి కోపంగా ‘‘అసలు నువు ఆలోచించే చేస్తున్నావా?’’ అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుదిరగకుండానే, ‘‘అన్నీ ఆలోచించే చేశాను.’’ అన్నది ప్రశాంతంగా, ‘అన్నీ’ అన్నపదాన్ని నొక్కిచెపుతూ. రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా ఏమీచేయలేని అశక్తతతో బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటులో తూర్పువైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. అయిదేళ్ల చింటూ రూమ్‌లోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేదతీరటం కృష్ణకు అలవాటు. ఇపుడు సమస్య తండ్రిదే! కాదు,కాదు సమస్య తనదే! కాదు, కాదు– తనే తండ్రికి సమస్య. రోజూలా మాటాడటం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల. తాళ్లూరులో గవర్నమెంటు స్కూలులో అటెండరుగా పనిచేసి, రిటైరైన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్‌కు తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్లడు. రెండు పూటలా స్నాక్స్, భోజనంలో ఏలోటూ చేయదు అరవింద. మూడు నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా! ఆయన తనకు వచ్చిన బెనిఫిట్స్‌తో కొడుకు ఇంటి లోన్‌లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తర్వాత ఈ మధ్య ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ రెండునెలల పెన్షన్‌కు తమ డబ్బు కొంత కలిపి అరవింద తాళ్లూరులోని ఆయన పాత ఇల్లు రీమోడల్ చేయించింది. అందులో అన్ని ఫెసిలిటీలతో ఓ చిన్న రూమ్ వేయించింది. మామగారు అపుడపుడూ తన ఫ్రెండ్స్‌తో ఒకటిరెండు రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అపుడు రెట్టింపైన ప్రేమ, గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతున్నది. అందులో మొదటి స్టెప్. ఈనెల నుండి అయిదువేలు అపార్ట్మెంటు లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ ఎకౌంటు నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే పదహారువేలు. ఆయనకు దానిని ఖర్చుపెట్టే అవసరం లేకపోవచ్చు. కాని ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం; అది కూడా తనకీ విషయం వేరేవారి ద్వార తెలియటం– ఇవన్నీ తలచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతున్నది.. ‘తల్లి దేవత, కనబడే దైవం’ అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగనే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచి పెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వమెలా అవుతంది?’ గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడవి ట్రాష్ అని కొట్టిపడేసినా, ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే ననిపిస్తుంది కృష్ణకు. తండ్రిని పలకరించటానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండు దగ్గర్లోని రత్నమహల్ హాలు వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీసుకు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీసు దరిదాపులలో కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని పట్టించుకోకుండా తన రూమ్‌లో కెళ్లి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తున్నది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్టులో ఇద్దరు హత్యచేయబడ్డారని తెలుసుకుని వచ్చిన íసీఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతుంది. దానిని అతి కష్టంమీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా, పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళతాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు. తర్వాత షాట్లో తెరుచుకుంటున్నపుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటం గూర్చి. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు– మనసు బాలేనపుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడవే నరకంగా అనిపించటంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీథి చివరలోఉన్న కిరాణాషాపు దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను, ‘‘ఆ తెల్లగా ఒడ్డూ పొడుగుండే పంచెకట్టాయన మీ మామగారా?’’ అన్నాడు ఆసక్తిగా.ఇతను మా నాన్నను ఎపుడు చూశాడా అనుకుంటూ, ‘‘దేనికి?’’ అన్నాడు అనుమానంగా. ‘‘మేడంగారు ఏవో సరుకులు కొనుక్కుని, డబ్బులు మర్చిపోయానని నాతో అంటే నేను ఫర్లేదమ్మా తర్వాత ఈయండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన అయిదు వందల నోటు తీసి ఇచ్చాడు’’కృష్ణ కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ, ‘‘ఆయన మా నాన్నగారు’’ అన్నాడు. అతను పట్టించుకోకుండా ‘‘అవునా! చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడమ్ ‘నాకు పెద్ద డైరీమిల్క్ కావాలి అనటం’ ఆయన కూడ భళ్లున నవ్వేసి ‘నీకన్నానా తల్లీ!’ అనటం చూస్తుంటే, తండ్రీ కూతుళ్లు అనుకుంటారు ఎవరైనా’’ అన్నాడు మురిపెంగా. ఆ షాపతని మాటలు గుర్తు కొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టవుతున్నది. డబ్బు... డబ్బు... డబ్బు... నలభైయేళ్లు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరోకోణం పెద్దపెద్ద మేధావులకే అర్థంకాదు. అరవింద దోపిడీ కిరాణాషాపు వాడికేం అర్థమవుతుంది? పోనుపోను భార్యమీద ద్వేషం రెట్టింపవుతున్నది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతున్నది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. ‘భార్యకు తండ్రికి మధ్య కచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది.’ ఏంచేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. ‘‘చింటూగాడి బర్త్‌డే ప్రెజంటేషన్ కొందామని డీమార్ట్ కొచ్చాం. ఆ బ్యాట్లు బాల్‌లు ఏరకం కొనాలో తెలీటం లేదురా!’’ తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమైంది. వారం క్రితం పడ్డ మూడోనెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమంక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతున్నది.ఏంచేయమంటావురా!’’ అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి ‘‘వాడికి తెలుసులే నాన్నా!’’ అన్నాడు కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ. కాని అతని వల్లకాలేదు. భార్యమీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటయింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బపట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోలు చేసుకుని ఆగి తలతిప్పి చూచింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్లతో కృష్ణ. భర్తను భయంభయంగా చూస్తూ, ‘‘ఏమైంది?’’ అన్నది. భార్యను తీవ్రంగా చూస్తూ, ‘‘మా నాన్నను డీమార్టుకు ఎందుకు పంపావు? ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వకుండా’’ పెద్దగా అరుస్తునట్లు అన్నాడు కృష్ణ.అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, ‘‘అదా! ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు. కూల్ అవుతావు’’ అని ఫ్రిజ్ నుంచి బాటిల్ ఇస్తుండగా, కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు.అరవింద కృష్ణ భుజాల మీద రెండు చేతులు వేస్తూ, ‘‘ముందు నింపాదిగా కూర్చో ’’ అన్నది.కృష్ణ చేతులు విదిలించుకుంటూ, ‘‘నీ నటనలు ఆవు. మా నాన్నకు పడేదే పదహారు వేలు. దానికీ ఎసరు పెట్టావా?’’ అన్నాడు రౌద్రంగా.అరవింద కాసేపు మాట్లాడలేదు. తర్వాత నిదానంగా తలెత్తి, ‘‘నీకు ఆయన నాన్న. నాకు మామయ్య. స్వయానా మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే, ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ. నాన్నకన్నా ఎక్కువ’’ అన్నది ‘‘అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు, చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బాలెన్స్ అయిపోయి, డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులు పాలు అయితేగాని నీ కసి తీరదా?’’భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై, ‘‘మాట్టాడవేం?’’ అని గద్దించాడు.అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చో బెడుతూ, ‘‘ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్లం. గుర్తుందా! మామయ్య పట్టులంగాతో ఉన్న ఐదారేళ్ల నన్ను ఎత్తుకుని కిరాణాషాపుకు తీసుకెళ్లేవాడు. దారిలో కనబడ్డవారందరికీ నా మేనగోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్లు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మామయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి, నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ. ‘మామయ్యా! టపాసులకు నువ్వు ఇవ్వొద్దు. నా డబ్బులతోనే కొనుక్కుంటా’ అనేదాన్ని’’ బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అన్నది.కృష్ణ ఏం మాట్టాడలేదు. అరవింద కొనసాగించింది.‘‘కావల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను, ‘ఎంతైంది తాతా?’ అని నేను అడిగితే. పక్కనుంచి మామయ్య, ‘సరిగ్గా రూపాయే విందా’ అనేవాడు తాతకు కన్నుకొడుతూ. నడుం మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు పుణికి పుచ్చుకుంటూ తాత కూడా, ‘అంతే అంతే! రూపాయికి ఒక్కపైసా తక్కువా లేదు ఎక్కువా లేదు’ అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా గర్వాన్ని, ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేం ఇవ్వగలం? అవి తిరిగి ఇవ్వటం తప్ప’’ అన్నది కళ్లు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం, రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో ఆనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, ‘‘నీ డౌట్ అర్థమైంది. ఆ డీమార్ట్ మా కజిన్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా, బిల్లు పదివేలకు ఒక్క రూపాయి తక్కువా ఉండదు, ఎక్కువా ఉండదు’’ అన్నది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ.కృష్ణ మనసు నిండా భార్యపట్ల కృతజ్ఞత చోటుచేసుకుంది. ఏదో సైకాలజీ బుక్‌లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి.నేనొక్కడినే కుటుంబాన్ని నడుపుగలుగుతున్నాననే మగవాడి అహం, మేల్ ఇగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటంలేదనో, విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఇగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసమూ ఊడిపడుతుంది. అది అతనిని వ్యర్థుడిగా మార్చివేసి, తనను తాను వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్ధానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్‌కు ఊపిరిలూదింది ఏ సైకాలజీ చదవని అరవింద’భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలివైపు తలతిప్పి చూచాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతులో బ్యాట్, బాల్ చూపిస్తూ, గొప్పగా ‘‘ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు. నా బర్త్‌డే ప్రజంటేషన్గా. డీమార్ట్‌లో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని, మా ఫ్రెండ్స్‌కు పంపించాను కూడా’’ అన్నాడు గర్వంగా.వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్‌తో వస్తూ, ‘‘అల్లాడిచ్చాడురా నీకొడుకు! మొత్తం పదివేలు మించలేదనుకో. లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా’’ అంటూ ఈ మధ్య కొత్తగా కొన్న చిన్న లాప్టాప్తో తన గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూమ్‌లోకి వెళ్లాడు.నాన్న చేయి మీసం మీదికి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటలలో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి.‘‘లెఫ్ట్ హాండ్ ధంబ్, మిడిల్ఫింగర్లతో లాప్టాప్ మధ్యలో పైభాగాన్ని అదేవిధంగా రైట్హాండ్ తో కింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరక్ట్‌గా చల్లకూడదు. క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు యూజ్ చేయకూడదు’’ శ్రద్ధగా వింటున్న మనవడికి వాడిభాషలో వాడికి అర్థమయ్యేట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ.‘‘ ఏరా! ఏం కావాలి?’’ కృష్ణ ఏం మాట్లాడలేదు.ఒళ్లోని లాప్టాప్ పక్కన పెడుతూ, ‘‘నా దగ్గర మొహమాటమేందిరా! డబ్బులేమైనా కావాలా?’’ అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్నగొంతుతో, ‘‘ఓ అయిదు వందలు’’ ససుగుతుంటే ఆయన భళ్లున నవ్వేసి, ‘‘ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్. తీసుకో’’ అని రెండు అయిదువందల నోట్లు ఇచ్చాడు.వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, ‘‘చూశావా విందా! లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్. ఆఫ్ట్రాల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు’’ అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ‘‘ఇదంతా అప్పుగానే మామయ్యా! జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయిగారికి చెప్పండి’’ అన్నది పెద్దగా అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది.∙ఆర్ వి రాఘవరావు -
కోత అక్కర్లేదు శ్వాస చాలు!
ఈ ఫొటోను చూస్తే, డ్రంకెన్ డ్రైవ్ కేసులా అనిపిస్తోంది కదూ! మీరు అనుకుంటున్నట్లుగా ఇది డ్రంకెన్ డ్రైవ్ కేసు కాదు. గొట్టం ముందు గాలి ఊదుతున్న వ్యక్తి తప్పతాగి బండి నడుపుతూ పోలీసులకు చిక్కిన శాల్తీ కాదు, ఆస్పత్రిలో క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటున్నాడు. క్యాన్సర్ నిర్ధారణకు శ్వాసతో పరీక్ష ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఇది క్యాన్సర్ పరీక్షే! ఇప్పటి వరకు క్యాన్సర్ నిర్ధారణకు చిన్నపాటి కోతతో కూడిన బయాప్సీ పరీక్షలు అవసరమయ్యేవి. ఇప్పుడు కేవలం శ్వాస ఊదితే చాలు, నిశ్వాస ద్వారానే క్యాన్సర్ ఉనికిని గుర్తించగల క్యాన్సర్ బ్రీతలైజర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇది అచ్చంగా డ్రంకెన్ డ్రైవ్ కోసం పోలీసులు ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్లాగానే ఉంటుంది. అయితే, ఇది శ్వాసలోని ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్’ను గుర్తించి, వాటి ఆధారంగా క్యాన్సర్ నిర్ధారణ చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ‘ఔల్స్టోన్ మెడికల్’ ఈ బ్రీతలైజర్‌ను రూపొందించింది. దీని ద్వారా లంగ్ క్యాన్సర్, రకరకాల బ్లడ్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్లను సులువుగాను, చాలా ముందుగాను గుర్తించడానికి వీలవుతుంది. ఈ బ్రీతలైజర్ ద్వారా శ్వాస సేకరించిన గొట్టాన్ని ల్యాబొరేటరీకి పంపుతారు. ల్యాబ్ పరీక్షల్లో ఇందులోని ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్’ ఉనికిని గుర్తించి, వాటి ఆధారంగా క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. ఈ పరికరం విరివిగా అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ నిర్ధారణ సులభతరం అవుతుంది.కొవ్వును కరిగించే నీరు!అధిక బరువు, స్థూలకాయం జనాభాలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్యలు. జీవనశైలి వ్యాధుల్లో స్థూలకాయం కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి చాలామంది ఎన్నో తంటాలు పడుతుంటారు. వారానికి ఒకటి రెండో రోజులు ఉపవాసాలు చేస్తూ డొక్క మాడ్చుకోవడం; ఆచి తూచి కేలరీలు లెక్కించుకుని మరీ తింటూ డైటింగ్ చేయడం; జిమ్‌లకు వెళ్లి బరువులు మోయడం వంటి పనులు చేస్తుంటారు. ఇన్ని చేసినా ఫలితం ఉండకుంటే, ఒంట్లోని కొవ్వును తీసేయించుకోవడానికి చివరకు శస్త్రచికిత్సలకు కూడా సిద్ధపడు తుంటారు. అయితే, ఒంట్లోని కొవ్వును కరిగించుకోవడానికి ఇన్ని తంటాలు అవసరమే లేదని జపానీస్ కంపెనీ చెబుతోంది. ‘మా నీళ్లు తాగండి... ఒంట్లోని కొవ్వును చిటికెలో ఇట్టే కరిగించుకోండి’ అని అట్టహాసంగా ప్రచారం చేసుకుంటోంది. ‘ఏ నీటిలో ఏ మహిమ ఉందో’ అనుకుంటూ జపాన్‌లోని స్థూలకాయులందరూ ఈ నీటి సీసాలను ఎగబడి కొని మరీ తాగుతున్నారు. జపాన్‌లోని పానీయాల తయారీ కంపెనీ ‘సుంటోరీ’ ఇటీవల ‘తొకుసుయి’ పేరుతో ఈ నీటి బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘తొకుసుయి’ అంటే ప్రత్యేకజలం అని అర్థం. తౌడు నానబెట్టిన నీటిని వడగట్టి ఈ నీటిని సీసాలకు ఎక్కిస్తున్నారట! ఈ నీరు ఆరువందల మిల్లీలీటర్ల సీసా ధర 150 యెన్లు (రూ.86) మాత్రమే! ఈ నీరు తాగితే, శరీరంలోని జీవక్రియలు వేగం పుంజుకుని, కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ఈ నీటి మహిమ ఎంతటిదో దీనిని తాగిన వారే చెప్పాలి మరి! -
ఔరా! సౌరా!
లోకానికి వెలుతురు, వెచ్చదనం ఇచ్చేది సూర్యభగవానుడు...సూర్యుడే భూమి మీదనున్న ప్రాణులన్నింటికీ జీవనాధారం...చరిత్రపూర్వ యుగంలో మనుషులు సూర్యుడిని ఆరాధించేవారు.ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు. సూర్యుడిని జ్యోతిషశాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తుంది. మన దేశమంతటా ప్రాచీనకాలంలో వ్యాప్తిలో ఉన్న షణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, ప్రాచీనకాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను పరిశీలిస్తే, ఆదిత్యుడినే ఆదిదేవుడని చెప్పవచ్చు. ప్రాచీన ఈజిప్టు భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుంచే సూర్య ఆరాధన వ్యాప్తిలో ఉండేది. ఈజిప్షియన్ ప్రజలు సూర్యుడిని ‘ర’, ‘రె’ అనే పేర్లతో పూజించేవారు. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ది నాటికి ఈజిప్షియన్ల ప్రధాన దైవాలలో ‘ర’కు ప్రత్యేక స్థానం ఉండేది. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలో వర్ధిల్లిన మెసపొటేమియన్ నాగరికతకు చెందిన ప్రజలు సూర్యుడిని ‘షమాష్’ అనే పేరుతోను, సుమేరియన్లు ‘ఊటూ’ అనే పేరుతోను పూజించేవారు. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలోనే భారత భూభాగంలో మొదలైన వైదిక యుగంలో వైదికార్యులు సూర్యుడిని విశేషంగా ఆరాధించేవారు. సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా వేదాలు కీర్తించాయి. సౌర ఆరాధనకు నిదర్శనంగా పురాతనమైన కొన్ని సూర్య దేవాలయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం...మార్తాండ దేవాలయంఇది కశ్మీర్‌లోని మట్టన్ పట్టణంలో ఉంది. దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇదొకటి. పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ సూర్య దేవాలయం సుమారు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. విదేశీయుల దాడుల్లో కొంత, తర్వాత సంభవించిన భూకంపాలలో కొంత ఈ ఆలయం చాలావరకు ధ్వంసమైంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్ పట్టణంలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన మార్తాండ ఆలయం వద్ద నుంచి తిలకిస్తే, దిగువనున్న కశ్మీర్ లోయ ప్రాంతం అంతా కనిపిస్తుంది. మార్తాండ ఆలయ ప్రాంగణంలో 84 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.కోణార్క దేవాలయం ఈ ఆలయం ఒడిశాలోని కోణార్క పట్టణంలో ఉంది. తూర్పు గంగవంశానికి చెందిన గజపతి లాంగూల నరసింగదేవుడు పదమూడో శతాబ్దిలో దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1238–64 మధ్య కాలంలో జరిగింది. కళింగ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే కోణార్క ఆలయంలో ప్రధానంగా రెండు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి నాట్యమండపం కాగా, మరొకటి గర్భాలయం. ఈ ఆలయం కొంత శిథిలమైనా, చాలావరకు శిల్పసంపద ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయంలో ముప్పయిమూడు అడుగులకు పైగా ఉండే అరుణ స్తంభం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూర్యుడి రథాన్ని పోలిన ఆలయ నిర్మాణం, రథ చక్రాలపై సైతం సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పూరీలో వెలసిన జగన్నాథుడి ఆలయానికి కోణార్క ఆలయాన్ని సింహద్వారంగా భావిస్తారు. ఈ ఆలయంలో పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ వేడుకలతో పాటు కోణార్క సముద్ర తీరంలో ఏటా కోణార్క్ బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది.రహీల్యా సాగర్ సూర్య దేవాలయం ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మహోబా పట్టణంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దికి చెందిన చందేలా రాజు రహీలా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. రహీల్యా సాగర్ తటాకం ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికీ నిలిచి ఉంది. ఈ ఆలయం ఉన్న మహోబా పట్టణాన్ని త్రేతాయుగంలో కేకపురం అని, ద్వాపరయుగంలో పాటనపురం అని పిలిచేవారని చెబుతారు. మహోబా పట్టణం, ఆ పరిసరాలకు సంబంధించి పలు పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్లు గడిపినట్లు చెబుతారు. ఇక్కడకు సమీపంలోని తటాకాన్ని ‘రామకుండ్’ అంటారు. గోరఖ్గిరి కొండ గుహను ‘సీతా రసోయి’ అంటారు. ఈ తటాకంలోనే సీతారాములు స్నానాలు చేసేవారని, గుహలో సీతమ్మవారు వంటచేసేవారని చెబుతారు. చందేలా రాజులు చంద్రవంశీకులైనా, ఈ ప్రదేశానికి సూర్యవంశీయుడైన రాముడితో సంబంధం ఉండటంతో ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో సభా మంటపం, గర్భాలయం ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. వినాయకుడు, త్రిమూర్తులు సహా అనేక దేవతలు, పురాణగాథల శిల్పాలు ఆలయ కుడ్యాలు, స్తంభాలపై కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. మోధేరా సూర్య దేవాలయం ఇది గుజరాత్‌లోని మెహసానా జిల్లా మోధేరా గ్రామంలో ఉంది. చాళుక్య/ సోలంకీ వంశానికి చెందిన ఒకటో భీముడు మోధేరా గ్రామంలో సూర్య దేవాలయాన్ని పుష్పావతీ నదీతీరంలో నిర్మించాడు. ఈ ఆలయం వద్ద నిర్మించిన శిలా శాసనం ప్రకారం దీని నిర్మాణం విక్రమశకం 1083 (క్రీస్తుశకం 1026–27) సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తోంది. మారు గుర్జర వాస్తు శైలిలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి శిల్పకళా వైభావాన్ని నిదర్శనంగా నిలిచి ఉంది. ఈ ఆలయంలో ప్రవేశమార్గంలో కీర్తితోరణం, దానికి ఎదురుగా సభా మండపం, అది దాటిన తర్వాత గూఢమండపం, లోపల గర్భాలయం ఉంటాయి. రాతిగోడలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యకుండం అనే మెట్లబావి కూడా ఉంది. వనవాసకాలంలో సీతారాములు ఇక్కడ గడిపినట్లు గాథలు ప్రచారంలో ఉండటంతో సూర్యకుండాన్నే రామకుండం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ మహోత్సవం, మాఘ శుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాయణ మహోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నాట్యోత్సవం కూడా జరుగుతుంది. మడ్ఖేడా సూర్య దేవాలయం ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని టీకమ్గఢ్ జిల్లా మడ్ఖేడా గ్రామంలో ఉంది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు ఈ సూర్యదేవాలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. నాగర శిల్పకళా శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉండటం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మండపం, ఆ తర్వాత అంతరాలయం, లోపల గర్భగుడి ఉంటాయి. ఆలయం గోడలపైన, స్తంభాలపైన అద్భుత శిల్పాలు కనువిందు చేస్తాయి. గర్భగుడిలోని సూర్యనారాయణమూర్తి విగ్రహంతో పాటు ఆలయ కుడ్యాలపై చెక్కిన శ్రీమహావిష్ణువు దశావతారాలు, శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, అంతరాలయంలోని గంగా యమునల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ సంప్రదాయాలకు చెందిన శిల్పాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణను పర్యవేక్షిస్తోంది.దేవ్ సూర్యమందిరం ఇది బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా దేవ్ పట్టణంలో ఉంది. స్థలపురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి సూర్య ఆరాధన ఉండేదనేందుకు నిదర్శనంగా ఇక్కడ క్రీస్తుశకం 642 నాటి గుప్తుల శాసనం బయటపడింది. అయితే, ఆ శాసనంలో ఈ ఆలయం ప్రస్తావన లేదు. ఈ ఆలయ నిర్మాణంలో నాగర, ద్రావిడ, వేసరా వాస్తు శిల్పశైలులు కనిపిస్తాయి. మిశ్రమ శైలిలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. ఈ ఆలయంలో చంద్రవంశ రాజు భైరవేంద్ర క్రీస్తుశకం 1437లో వేయించిన శాసనం కూడా ఉంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక శుక్ల చవితి నుంచి నాలుగు రోజుల పాటు ‘ఛuЇ పూజ’ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి.సోనాటాపాల్ సూర్య మందిరం ఇది పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా సోనాటాపాల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం కళింగ వాస్తుశైలిలో ఉంటుంది. ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందినదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. శాలివాహనులు దీనిని నిర్మించినట్లు స్థలపురాణ గాథలు ఉన్నా, దీనిని పాల్ వంశానికి చెందిన బిష్ణుపూర్ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో కళింగ శైలిలో నిర్మించిన చాలా దేవాలయాలు పూర్తిగా రాతి నిర్మాణాలు. సోనాటాపాల్లోని ఈ సూర్య మందిరం మాత్రం ఇటుకలతో నిర్మించినది కావడం విశేషం. ఈ ఆలయ పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన పురాతన టెర్రకోట వస్తువుల ఆధారాల ప్రకారం ఇది కోణార్క ఆలయం కంటే పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి గర్భగుడిలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. దీని గురించి రకరకాలుగా స్థలపురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే జరిపిన తవ్వకాలలో పురాతన జైన శిల్పాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఆలయంలో నిత్యపూజలు జరగవు గాని, అప్పుడప్పుడు ఆలయం వద్ద జానపద కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి.సూర్యనార్ కోవిల్ ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లా అడుతురై పట్టణంలో ఉంది. కులోత్తుంగ చోళుడి హయాంలో ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో నిర్మితమైంది. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఐదంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. తమిళనాడులో వెలసిన నవగ్రహ ఆలయాలలో ఇదొకటి. ఇక్కడి నవగ్రహ ఆలయాల గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు ప్రజలు ‘సూర్యనార్ కోవిల్’ అని పిలుచుకునే ఈ ఆలయానికి ఇదివరకు కులోత్తుంగ చోళ మార్తాండాలయం అనే పేరు ఉండేది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు కూడా జరుగుతుంటాయి. ఆదిత్యపురం సూర్య దేవాలయం ఇది కేరళలోని కొట్టాయం జిల్లా ఇరవిమంగళం గ్రామంలో ఉంది. స్థల పురాణ గాథల ప్రకారం ఇక్కడ సూర్యుడి విగ్రహం త్రేతాయుగం నుంచి వెలసి ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చి సూర్యభగవానుడు ఇక్కడ విగ్రహరూపంలో వెలిశాడని చెబుతారు. ఇది కేరళలోని ఏకైక సూర్యదేవాలయం. దీనిని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలిపే చారిత్రక ఆధారాలేవీ లేవు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని సూర్యదేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటే, ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులోని సూర్యభగవానుడి విగ్రహం ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఇది నూనెను పీల్చుకుంటుంది. అందువల్ల ఈ ఆలయంలో తైలాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. వంశపారంపర్యంగా నంబూద్రి బ్రాహ్మణులే ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో విశేషమైన పూజలు, వేడుకలు జరుగుతాయి.ముల్తాన్ సూర్య దేవాలయం ఇది పాకిస్తాన్‌లోని ముల్తాన్ నగరంలో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించిన కచ్చితమైన చారిత్రక ఆధారాలేవీ లేవు. చైనా యాత్రికుడు జువాన్జాంగ్ భారత ఉపఖండంలో పర్యటించే నాటికి ఈ ఆలయం ఉనికిలో ఉంది. సిం«ద్ ప్రాంతంలో ఇదొక్కటే సూర్య దేవాలయం అని జువాన్జాంగ్ క్రీస్తుశకం 641 నాటి తన యాత్రానుభవాల గ్రంథంలో రాశాడు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి చెందిన సాంబపురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. విదేశీయుల దాడిలో పదో శతాబ్ది కాలంలో ఈ ఆలయం కొంత ధ్వంసమైన తర్వాత దీనిని పునర్మించారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో పదిహేడో శతాబ్దిలో జరిగిన దాడుల్లో ఇది బాగా ధ్వంసమై, శిథిలావస్థకు చేరుకుంది. అలనాటి ఆలయం ఇప్పుడు ఒక శిథిల అవశేషంగా మాత్రమే మిగిలి ఉంది.కటార్మల్ సూర్య దేవాలయం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కటార్మల్ గ్రామంలో ఉంది. కత్యూరీ వంశానికి చెందిన రాజు కటార్మల్ ఈ ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ‘వృద్ధాదిత్యుడి’గా కొలువుతీరి ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు చెందిన నలభై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి ఆరువేల అడుగులకు పైగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నుంచి తిలకిస్తే, ధగధగలాడే మంచుకొండలు కనిపిస్తాయి. అరసవల్లి ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఏడాదికి రెండుసార్లు నిర్ణీత దినాలలోని సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టు పాదాలను తాకుతాయి.అరసవల్లి సూర్యనారాయ స్వామి ఆలయంఇది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కళింగ రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతికాలంలో జరిగిన యుద్ధాలు, దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం కావడంతో పద్దెనిమిదో శతాబ్దిలో దీనిని పునరుద్ధరించారు. ప్రస్తుతం కనిపించే కట్టడంలో చాలాభాగం అప్పుడు పునరుద్ధరించిన నిర్మాణమే! కశ్యప మహర్షి స్వయంగా ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ‘పద్మపురాణం’ కథనం. ఈ ఆలయంలోని అద్భుత విశేషం ఏమిటంటే, ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహం పాదాలను తాకుతాయి. ఉత్తరాయణంలో మార్చి 9–11 తేదీలలోను, దక్షిణాయనంలో అక్టోబర్ 1–3 తేదీలలోను సూర్యోదయ సమయంలో ఈ అద్భుతాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరుతారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాల్లో విశేషంగా పూజలు, వేడుకలు జరుగుతాయి. -
భయపెట్టే పాత్రలు కావాలి..
తెరపై కనిపించే అనూ ఇమాన్యుయేల్ కేవలం పాత్ర మాత్రమే!నిజమైన ‘నేను’ మేకప్ తీసేసిన తర్వాత, నిశ్శబ్దంలోనే కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు, ఆమె మాటల్లోనే మీకోసం.. » నా బాల్యం సాధారణంగానే గడిచింది. షికాగోలో పుట్టి, గార్లాండ్, టెక్సాస్‌లో పెరిగాను. కేరళలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, 2011లో మలయాళం సినిమా ‘స్వప్న సంచారి’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. కాని, అదే నా గమ్యం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత చదువు కోసం మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాను.» సైకాలజీ డిగ్రీ చదువుతూ, మనసులు చదవడం నేర్చుకుంటున్నప్పుడు, నా మనసు ఇంకొక దారి చూపింది. కెమెరా మళ్లీ పిలిచింది. ‘యాక్షన్ హీరో బిజు’తో లీడ్ హీరోయిన్ గా కెమెరా ముందుకు వచ్చాను. ఆ రోజు భయం, ఉత్సాహం ఉంది. అంతకన్నా ఎక్కువగా కొత్త జీవితంలో అడుగుపెట్టినట్లు అనిపించింది.» ‘మజ్ను’తో టాలీవుడ్లో అడుగుపెట్టాక నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త భాష, కొత్త ముఖాలు, కొత్త అంచనాలు. అమెరికాలో పెరిగిన అమ్మాయిగా, ఇక్కడ నన్ను నేను మళ్లీ నిరూపించుకోవాల్సి వచ్చింది. అదే నన్ను మరింత స్ట్రాంగ్ చేసింది.» పింక్ కలర్ నా ఫేవరెట్. అది ట్రెండ్ కాదు. పింక్ చీర కట్టుకున్నప్పుడు నన్ను నేను బెస్ట్‌గా ఫీల్ అవుతాను. ఒకరకమైన ప్రశాంతత, కాన్ఫిడెన్స్ రెండూ కలిసి వస్తాయి.» లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ఇష్టం. డ్రైవింగ్ చేస్తూ రోడ్ల మీద వెళ్లడం, డెస్టినేషన్ ముందే నిర్ణయించుకోకుండా దారి మళ్లించడం. అదే నా థెరపీ. అలా ఆ ప్రయాణాల్లోనే నేను నాతోనే ఎక్కువగా మాట్లాడుకుంటాను.» షూటింగ్ లేనప్పుడు నా ప్రపంచం చాలా సింపుల్. పుస్తకాలు చదువుతూ, బ్యాలే డ్యాన్స్ చేస్తూ చాలా సైలెంట్‌గా ఉంటాను. నిశ్శబ్దం నాకు భయం కాదు. అదే నాకు స్పేస్ ఇస్తుంది. » తెరపై నేను చాలా కామ్‌గా కనిపిస్తాను. అది నా ప్రొఫెషనల్ ఫేస్ మాత్రమే. నన్ను దగ్గరగా తెలిసినవాళ్లకు తెలుసు – నేను చాలా ఎనర్జిటిక్, కొంచెం క్రేజీ కూడా.» ‘గర్లఫ్రెండ్’ సినిమాలో దుర్గ పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. కాస్త అమెరికన్ యాక్సెంట్ నాకు సహజంగా అనిపించింది. దాన్ని దాచాలని అనుకోలేదు. ఆ పాత్రకు అదే నిజం అనిపించింది. » గాసిప్స్, రూమర్స్ ఒకప్పుడు ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా అల్లు శిరీష్‌తో వచ్చిన వార్తలు. ఇప్పుడు వాటిని చిరునవ్వుతో వదిలేయడం నేర్చుకున్నాను. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని అర్థమైంది.» నాకు ఇప్పుడు లుక్స్ కోసం పాత్రలు కాదు. లోతున్న పాత్రలు కావాలి. నన్ను భయపెట్టే పాత్రలు కావాలి. కంఫర్ట్ జోన్ లోనే ఉండాలని లేదు. -
మానవ తప్పిదాలు చారిత్రక గాయాలు
తీర్మానాలు వేరు, నిర్ణయాలు వేరు. తీర్మానాలన్నవి.. ‘చేసుకునేవి’. నిర్ణయాలన్నవి.. ‘తీసుకునేవి’. తీర్మానాలు ఫెయిల్ అయితే పోయేదేమీ లేదు. కాని, నిర్ణయాలు మిస్ ఫైర్ అయితేనే... ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకు చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఒక్కోసారి మనం తీసుకునే ‘చెత్త నిర్ణయం’ మన జీవితాన్నే ట్రాజెడీగా చేస్తుంది. అదే నిర్ణయాన్ని ఒక రాజుగారో,ఏ ప్రభుత్వం వారో తీసుకుంటే? చరిత్రలో అది ఒక ‘సీరియస్ కామెడీ’గా మిగిలిపోతుంది. అహంకారం వల్ల కావచ్చు, అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా మన బ్యాడ్ లక్ వల్ల కావచ్చు... చెత్త నిర్ణయం తలపైకి ఎక్కి కూర్చున్నప్పుడు రాజైనా, రాజారావు గారైనా చేసేది ఏమీ ఉండదు. చరిత్రలో ఇలాంటి ట్రాజిక్ కామెడీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. మీ కోసం :::చెంగీజ్ ఖాన్ కి ‘సారీ’ చెప్పనందుకు..!చెంగీజ్ ఖాన్ వీరుడు, శూరుడే కాని, క్రూరుడు మాత్రం కాడు. పైగా స్నేహశీలి. 1218వ సంవత్సరంలో ఒకరోజు ఆయనకు అనిపించింది– ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యంతో (ప్రస్తుత ఇరాన్/ఇరాక్ ప్రాంతం) కలిసి బిజినెస్ చేద్దామని! మంచి విషయమే కదా. అందుకోసం 450 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను పంపించాడు. కాని, అక్కడి లోకల్ గవర్నర్‌కి వాళ్లపై అనుమానం వచ్చి, వాళ్లంతా గూఢచారులేమోనని అందర్నీ చంపేయించాడు. ‘‘ఇట్స్ ఓకే’’ అని చెంగీజ్ ఖాన్ సర్దుకుపోయాడు. ‘‘కనీసం సారీ అయినా చెప్పండి’’ అని ముగ్గురు రాయబారులను ఖ్వారెజ్మియన్కు పంపాడు. అయితే అక్కడి రాజు అతి తెలివి ప్రదర్శించాడు. ముగ్గురిలో ఇద్దరికి గడ్డాలు గీయించి, మూడో రాయబారి తల నరికేయించాడు. ఫలితం: చెంగీజ్ ఖాన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన మంగోల్ సైన్యంతో బయల్దేరి వెళ్లి ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యాన్ని రూపుమాపేశాడు. కోట్లాది మంది ప్రాణాలు పోయాయి.నీతి: పక్కింటి వాళ్లతో గొడవ పడితే పంచాయతీ అవుతుంది. కాని, చెంగీజ్ ఖాన్‌లాంటి వాళ్లతో గొడవ పడితే చరిత్రే మారిపోతుంది! ఇంకోలా చెప్పాలంటే – పులిని నిద్రలేపినా పర్లేదు కాని, చెంగీజ్ ఖాన్ ముఖం మీద చిటికెలు వేయకూడదు.చలికాలంలో దండయాత్రఇదొక క్లాసిక్ హిస్టరీ కామెడీ! 1812లో నెపోలియన్, 1941లో హిట్లర్.. ‘‘రష్యా ఎంత పెద్దదైతే మనకేంటి? ఉఫ్ అని ఊదేసి ఇంటికి వచ్చేద్దాం’’ అని ప్లాన్ వేశారు. ఉఫ్ అని ఊదేసేవారేనేమో కాని, వాళ్లు రెండు విషయాలను అస్సలు అంచనా వేయలేకపోయారు: ఒకటి రష్యా వైశాల్యం (అది ఒక దేశం కాదు, ఒక ప్రపంచం!), రెండోది అక్కడి భయంకరమైన చలి. ఫలితం: రష్యాపైకి నెపోలియన్ పంపిన 6 లక్షల మంది సైన్యంలో చివరికి మిగిలింది కేవలం లక్ష మంది మాత్రమే! అటు హిట్లర్ కూడా అదే తప్పు చేసి, తన నాజీ సామ్రాజ్యం కూలిపోవడానికి పునాది వేసుకున్నాడు.నీతి: రష్యా వాళ్లతో యుద్ధం గెలవొచ్చేమో కాని, వింటర్లో అక్కడి మైనస్ డిగ్రీల చలిని మాత్రం ఎవరూ గెలవలేరు. చలికాలంలో యుద్ధం చేయటం కంటే దుప్పటి కప్పుకుని పడుకోవడం ఉత్తమం అని నెపోలియన్, హిట్లర్ తెలుసుకుని ఉంటారు.కొంప ముంచిన గిఫ్ట్ ప్యాక్!క్రీ.పూ. 12వ శతాబ్దం నాటి సంగతి ఇది. సుమారు 10 ఏళ్లు యుద్ధం చేసినా గ్రీకులు ట్రాయ్ నగరాన్ని (ప్రస్తుతం టర్కీలోని ఒక భాగం) గెలవలేకపోయారు. అప్పుడు ఒక ‘ఐడియా’ వేశారు. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి కోట ముందే వదిలేసి, ‘‘మేం ఓడిపోయాం. ఈ గుర్రాన్ని మీకు మా జ్ఞాపకార్థం కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పి అక్కడి నుంచి పడవల్లో వెళ్లిపోయినట్లు యాక్టింగ్ చేశారు. స్థానిక పూజారులు, జోస్యులు ‘‘ఒరేయ్ నాయనా.. ఇదేదో తేడాగా ఉంది, దీన్ని నమ్మకండి’’ అని అరిచినా, ట్రాయ్ పాలకులు వినలేదు. ‘‘అబ్బే.. గిఫ్ట్ వస్తుంటే వద్దంటారేంటి?’’ అని ఆ చెక్క గుర్రాన్ని లాక్కొచ్చి కోట లోపల పెట్టుకుని గ్రాండ్‌గా విజయోత్సవాలు జరుపుకున్నారు.ఫలితం: అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ చెక్క గుర్రం లోపల గ్రీకు సైనికులు దాక్కుని ఉన్నారు! అందరూ నిద్రపోయాక, వాళ్లు బయటకు వచ్చి కోట గేట్లు తెరిచేశారు. వెళ్లిపోయినట్లుగా మాయ చేసిన గ్రీకు సైన్యం మళ్లీ తిరిగొచ్చి ట్రాయ్ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది.నీతి: శత్రువు సడన్‌గా వచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడంటే– అది ప్రేమతో ఇచ్చింది కాదు, మనకేదో ‘పెద్ద స్కెచ్’ వేశాడని!మావో గారి ‘పిచ్చుకల’ వేటచైనాలో 1958లో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ పేరుతో మావో జెడాంగ్ ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ పిచ్చుకలు మన ధాన్యాన్ని తినేస్తున్నాయి, వీటిని అస్సలు వదలకూడదు. తరిమి కొట్టండి’’ అని ఆర్డర్ వేశారు. దాంతో జనం అంతా గిన్నెలు, డబ్బాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఒకటే గోల.. గోల! ఆ శబ్దానికి పిచ్చుకలు భయపడి ఎక్కడా వాలకుండా గాల్లోనే ఎగురుతూ, ఎగురుతూ అలసిపోయి కిందపడి చనిపోయేవి. అలా లక్షల పిచ్చుకలను ఏరిపారేశారు.ఫలితం: పిచ్చుకలు ఉన్నప్పుడు అవి కేవలం గింజలనే కాదు, పంటను పాడుచేసే మిడతలను కూడా తినేవి. పిచ్చుకలు లేకపోయేసరికి మిడతల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. అవి వచ్చి పిచ్చుకల కంటే వంద రెట్లు వేగంగా పంటనంతా ఊడ్చేశాయి. దీనివల్ల వచ్చిన కరువులో దాదాపు 1.5 కోట్ల నుండి 4.5 కోట్ల మంది చైనా ప్రజలు చనిపోయారు.నీతి: ప్రకృతిని మనం కంట్రోల్ చేయాలనుకుంటే.. అది మనల్ని ‘అవుట్ ఆఫ్ కంట్రోల్’ చేసి పడేస్తుంది. అలాస్కాని ‘అణాపైసలకి’ అమ్మేసిన రష్యా ఇది 1867లో జరిగింది. అప్పట్లో రష్యాకి ఒకటే భయం ఉండేది. ‘‘భవిష్యత్తులో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం వస్తే, ఈ అలాస్కా ప్రాంతాన్ని మనం కాపాడుకోలేం, వాళ్లు ఫ్రీగా లాగేసుకుంటారు’’ అని టెన్షన్ పడ్డారు. అందుకే ఉచితంగా పోయేదానికంటే, ఎంతో కొంతకి అమ్మేద్దాం అని అమెరికాకి ఆఫర్ ఇచ్చారు. ఎంతకో తెలుసా? కేవలం 7.2 మిలియన్ డాలర్లు! అంటే ఎకరం సుమారు రెండు సెంట్లే (మన లెక్కలో చెప్పాలంటే అణాపైసలకి అన్నమాట).ఫలితం: అమ్మేసిన కొన్నేళ్లకే అక్కడ భారీ బంగారు గనులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏకంగా బిలియన్ల కొద్దీ బారెళ్ల ఆయిల్ నిక్షేపాలు దొరికాయి. చరిత్రలోనే ఇది అతిపెద్ద ‘రియల్ ఎస్టేట్ తప్పిదం’ అని చెప్పుకోవచ్చు.నీతి: పనికిరాని మంచుగడ్డ అనుకుని అమ్మేస్తే.. అది కాస్తా ‘బంగారు గని’ అని తర్వాత తెలిసింది. అందుకే ఆస్తి అమ్మే ముందు ఒకటికి పదిసార్లు సర్వే చేయించుకోవాలి!డ్రైవర్ కొట్టిన ‘రాంగ్ టర్న్’ 1914లో ఆస్ట్రియా యువరాజు ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌కి ఆ రోజు లేచిన వేళ అస్సలు బాగోలేదు. ఉదయాన్నే ఆయన మీద ఒక బాంబు దాడి జరిగితే తృటిలో తప్పించుకున్నారు. ఆ వాడితో గాయపడిన తన మనుషులను పరామర్శించాలని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ కొత్త రూట్ కావడంతో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోయి, ఒక చోట పొరపాటున రాంగ్ టర్న్ తీసుకున్నాడు. కారు రివర్స్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోయింది. సరిగ్గా అక్కడే, ఆ ఉదయం బాంబు వేసి విఫలం అయిన హంతకుడు (గావ్రిలో ప్రిన్సిప్) సాండ్విచ్ తింటూ కూర్చున్నాడు.ఫలితం: యువరాజును చూసిన ప్రిన్సిప్, వెంటనే గన్ తీసి యువరాజుని కాల్చేశాడు. ఈ ఒక్క హత్య వల్ల ఐరోపా దేశాల మధ్య గొడవలు ముదిరి, ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం దాపురించింది.నీతి: రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ పడుతుంది అనుకుంటాం.. కానీ రాంగ్ టర్న్ కోట్లాది మంది ప్రాణాలు పోయే యుద్ధానికి దారి తీసింది.బీటిల్స్‌ని కాలదన్నిన డెక్కా టాలెంట్‌ని గుర్తించడంలో ఇంతకంటే దారుణమైన పొరపాటు చరిత్రలో ఇంకొకటి జరిగి ఉండదేమో! అప్పట్లో, అంటే 1962లో అప్పుడే మొదలైన ‘బీటిల్స్’ బ్యాండ్ టీమ్ తమ పాటలు వినిపించడానికి డెక్కా రికార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ కంపెనీ పెద్దాయన డిక్ రోవ్ ఒక ఆణిముత్యం లాంటి మాట అన్నాడు: ‘‘వద్దులే బాబోయ్.. ఈ గిటార్ వాయించే గ్రూపుల కాలం అయిపోయింది..’’ అని, వాళ్లను తిప్పి పంపించేశాడు.ఫలితం: బీటిల్స్ టీమ్ వేరే కంపెనీతో (ఇ.ఎం.ఐ. రికార్డ్స్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత వాళ్లు సృష్టించిన ప్రభంజనం తెలిసిందే! ప్రపంచ సంగీత చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన బ్యాండ్‌గా వాళ్లు రికార్డు సాధించారు. పాపం, ఆ డెక్కా రికార్డ్ వారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది.నీతి: మన దగ్గరికి అదృష్టం గిటార్ వాయిస్తూ వచ్చినా సరే, అది మనకు నచ్చకపోతే ‘కాలం అయిపోయింది’ అని సాకులు చెబుతాం. అప్పుడప్పుడు పాత స్టెయిలే కొత్త ట్రెండ్‌గా అవుతుందేమోనని ఆలోచించాలి.అతి పెద్ద అచ్చుతప్పు ప్రింటింగ్ ప్రెస్‌లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగితే ఏం చేస్తాం? సారీ చెప్పి సరిదిద్దుకుంటాం. కానీ రాబర్ట్ బార్కర్, మార్టిన్ లూకాస్ అనే ప్రింటర్లకు మాత్రం అది దిద్దుకోలేని తప్పు అయింది. 1631లో వాళ్లు బైబిల్ ప్రింట్ చేస్తున్నప్పుడు, బైబిల్లోని పది ఆజ్ఞలలో (టెన్ కమాండ్మెంట్స్) ఒక చిన్న పొరపాటు జరిగింది. ‘వ్యభిచారం చేయరాదు’ (Thou shalt not commit adultery) అనే వాక్యంలో పొరపాటున ’n్టౌ’ అనే పదం ఎగిరిపోయింది.ఫలితం: ఇంకేముంది.. ఆ ఎడిషన్ బైబిల్ కాస్తా ఘోరమైన ఆ అపరాధంతో పబ్లిష్ అయిపోయింది! ఇది చూసి కింగ్ చార్లెస్–1 కోపంతో రాజ›ప్రాసాదంలోని వస్తువులన్నీ విసిరి పారేశారు. ఆ ప్రింటర్ల మీద భారీ ఫైన్ వేసి, వాళ్లని దివాలా తీయించాడు. వాళ్ల లైసెన్సులు రద్దు చేశాడు. తప్పుగా ప్రింట్ అయిన ఆ కాపీలన్నీ తగలబెట్టేయాలని ఆర్డర్ వేశారు. (కానీ కొన్ని ‘కలెక్టర్స్ కాపీలు’ మాత్రం ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయని అంటారు).నీతి: స్పెల్లింగ్ చెక్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే పరువు పోతుంది. అదే మతగ్రంథంలో తప్పు చేస్తే మన చాప్టరే క్లోజ్ అయిపోతుంది! నాసా 125 మి. డాలర్ల మిస్టేక్ మనం కూరగాయలు కొనటానికి వెళ్లి, కిలోలకి బదులు లీటర్ల లెక్కన అడిగితే అంతా వింతగా చూస్తారు. సరిగ్గా అలాంటి తప్పునే నాసా శాస్త్రవేత్తలు చేశారు. 1999లో ‘మార్స్ క్లైమేట్ ఆర్బిటర్’ అనే రాకెట్‌ని అంగారక గ్రహం మీదకి పంపడానికి రెండు టీమ్‌లు పనిచేశాయి. అందులో ఒక టీమ్ లెక్కలన్నీ ఇంగ్లీష్ యూనిట్లలో (పౌండ్లు, ఫోర్స్) వేస్తే, రెండో టీమ్ మాత్రం మెట్రిక్ యూనిట్లను (న్యూటన్స్) వాడారు. దాంతో రెండు టీమ్‌ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు.ఫలితం: రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక, అది అప్లయ్ చేయాల్సిన ‘ఫోర్స్’ లెక్క తప్పింది. దాంతో ఆ రాకెట్ ఉండాల్సిన దానికంటే చాలా కిందకి వెళ్లిపోయి, అంగారక గ్రహ వాతావరణంలో కాలి బూడిదైపోయింది. అలా అప్పట్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు (125 మిలియన్ డాలర్లు) గాలిలో కలిసిపోయాయి.నీతి: లెక్కల్లో తేడా వస్తే కోట్లలో లాస్ వస్తుంది.తగలబడిన అలెగ్జాండ్రియా లైబ్రరీఇది ఏ ఒక్కరో తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదు. వరుస అతి తెలివి నిర్ణయాల వల్ల జరిగిన అనర్థం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాలెడ్జ్ హబ్.. ఈజిప్టులోని ఈ అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రాచీన కాలపు విజ్ఞానమంతా అక్కడే ఉండేది. అయితే, జూలియస్ సీజర్ గారు యుద్ధం చేస్తూ పొరపాటున ఒక భాగాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు ‘‘మాకు ఈ పుస్తకాలతో పనేంటి?’’ అని నిర్లక్ష్యం చేశారు, మరికొందరు రాజకీయం కోసమో, మతం పేరుతోనో మిగిలిన పుస్తకాలను కాల్చిపారేశారు.ఫలితం: ప్రాచీన చరిత్ర, సైన్స్‌కు సంబంధించిన దాదాపు 90 శాతం జ్ఞానం శాశ్వతంగా కాలి బూడిదైపోయింది. మన పూర్వీకులకు ఏమేం తెలుసో, వాళ్లు ఏయే టెక్నాలజీలు వాడారో ఇప్పుడు మనకు కేవలం ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ ఆ లైబ్రరీ సేఫ్‌గా ఉండి ఉంటే, మనం ఈపాటికే అంతరిక్షంలో ఇల్లు కట్టుకుని ఉండేవాళ్లమేమో.నీతి: పుస్తకాన్ని చదివినా చదవకపోయినా పర్లేదు కానీ, దాన్ని పొరపాటున కూడా కాల్చకూడదు. ఎందుకంటే మనం నాశనం చేసేది పేపర్లను కాదు, తరతరాల జ్ఞానాన్ని!దేవుడా! ఈ దారుణమైన తప్పులు, పొరపాట్లు చూస్తుంటే.. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా బెటర్ అనిపిస్తోంది కదా! అలా అని అలక్ష్యంగా ఏ పనీ చేయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఈ వారం కథ: పది రూపాయలు
తెల్లటి ఎండ ఎచ్చంగా కొడుతుంది, సరిగ్గా పన్నెండుగూడా కాలేదు టైము. అప్పటికి రొండుసార్లు అడిగి అడిగి మౌనంగా కూసుకున్నాడు జానుగాడు. రంగిసెట్టి కొట్టుకాడ పిల్లోడ్ని కూసోబెట్టి జొన్నసొప్ప కోయనీకి పోయింది రంగమ్మ. ‘సెట్టి దప్పికైతుంది ఒక్క గలాసు నీళ్లియవూ’ అని మూడోసారి అడగలేక ఎండిపోయిన పెదాల్ని నాలికతో రుద్దుకుంటూ కూసున్నాడు జానుగాడు అనబడే జాన్సన్.రంగమ్మ, ఆనందరావుల కొడుకు జాన్సన్ వయసు పదేళ్ళు. బడి మీన గాలి మల్లినప్పుడో, బడికి పంతులుగారు వచ్చినప్పుడో, ‘అయిదో క్లాస్ అబ్బీ’ నువ్వు అని చెబితే వినడమే తప్ప ఆ మాసిపోయిన పుస్తకాల సంచి వంక ఏనాడూ చూసిందే లేదు. పొద్దుగూకులు బస్టాప్ కాడ ఉండే పిచ్చి తుమ్మసెట్టు కింద సీట్లపేకలాడే వాళ్ల దగ్గర కూకోని పొద్దు ఎల్లబుచ్చుతుంటాడు. ఎప్పుడన్నా వాళ్ళమ్మ గట్టిగా అర్సుకుంటే ఉన్న ఒక్క బర్రెని మేపడానికి పోతాడు.ఆనందరావుకి, రంగమ్మకి పెళ్ళి జరిగి పదేళ్లు దాటింది. ఆనందరావూ అచ్చం జానుగాడిలాగానే ఉండేవాడు. పెళ్లయిన కాణ్ణుంచి రంగమ్మకి అది నచ్చేది కాదు. రంగమ్మ తీరు వేరే, ఉన్నంతలో కాపరాన్ని నడుపుకోవాలని ఆశ. ఎప్పుడో గవర్నమెంట్ వాళ్లు ఇచ్చిన ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది బాగుజేపియాల, ఇంటికి ఒక బలుబైనా కరంటు ఉండాల అని అనుకుంటా మొగుడికి చెవిలో ఇల్లుకట్టుకుని చెబుతా ఉంటది. ఊళ్ళో పనిలేదు. ఉన్న కరువు పనికి పోబుద్దిగాదు. పొద్దునే లేసుడు సీట్లపేక కాడ ఊసుపోని కబుర్లు. రంగమ్మకు ఇంట్లో ఉన్న ఒక్క బర్రెతో కాలం గడిచిపోయేది. దానిమేత, పాలు తీయడం, చల్ల జేసి అమ్మడం వల్లనే ఆ ఇల్లు ఆమాత్రమైనా గడుస్తుంది, నడుస్తుంది. రంగిసెట్టి కొట్టు ఆ ఊరికి ఒక రచ్చబండలాంటిది. బేల్దార్ పనికి కూలోళ్లు కావాలంటే యాడ దొరుకుతారో లోకంలో అందరికి తెల్సిన సంగతే, పల్లెటూళ్ళలో తక్కువ రేటుకు తేరగా దొరుకుతారని అసుమంటి వాళ్లకి రంగిసెట్టి లాంటి వాళ్ళు సాయం చేసి, నాలుగురాళ్లు యెనకేసుకుంటారు. ఊళ్ళోవాళ్ల బలహీనతలన్ని ఎలాగూ ముందే తెల్సిపోయి ఉంటాయి కాబట్టి బేరాలు తేలిగ్గానే తెగుతాయి. సదువు ఉండకూడదు, ఎదురు మాట్లాడితే పద్ధతిగాదు, ఇచ్చిన లెక్క కాడికి తలొంచుకుని ఎల్లిపోవాలో ఇట్టాంటోళ్లని యెతికి యెతికి మరీ పట్టుకుంటారు. కాతాలు రాసుకునే బొక్కులో నుంచి మడతలుపడిన ఒక కాయితాన్ని, సేట్‌కి ఇచ్చాడు రంగిసెట్టి. మాకు తెలుగు రాదు సెట్టి నువ్వే పిలు వాళ్లని అన్నారు వాళ్లు. పదిమందిని పిలిపించాడు రంగిసెట్టి. అందులో ఆనందరావుతో పాటు ఇంకో తొమ్మిదిమంది పేర్లున్నాయి.రంగమ్మకి శానా కుశాలుగా ఉంది. ఈ మడిసిగాని ఆ పనికి ఒప్పుకుని పోతే అనుకున్న పనులన్నీ సక్కంగా అయిపోతాయి. పిల్లోడికి సదువు వస్తది, ఇల్లు బాగుచేసుకోవచ్చనే ఆశ ఆమె కళ్ళలో కనబడుతుంది. ‘ఒదినా నిజంగానే మనోళ్ళు దేశం పోతారంటావా పనికి! మా యన్నకి ఏమి అలవాట్లు లేవు కాని మా ఇంటాయన ఏమంటాడో ఏమో అసలే మిడిమ్యాలపు మడిసి’ అని రంగమ్మ చెవిలో గుసగుసలాడింది ఓబుగాడి పెళ్లాం రాహేలమ్మ. ‘పోతారు లేమ్మే పోక ఈడేం జేత్తారు, గుడ్డి గుర్రానికి పండ్లు తోముతారా?’ అని విసుక్కుంది రంగమ్మ.పిలిచిన అందరూ రంగిసెట్టి కాడ గుమి గూడారు. అదిగో అప్పుడు చూశాడు జానుగాడు హైద్రాబాద్ సేట్ చేతిలో ఒక ఆకుపచ్చని సీసా. ఆగి ఆగి తాగుతున్నాడు సేటు. మధ్య మధ్యలో చిన్నగా తేపుతున్నాడు. రంగమ్మ సేట్ చెప్పబోయే మాటకోసం చూస్తుంటే; ఆనందరావు– ఇల్లు , పిల్లోడు, సీట్లపేక సావాసగాళ్ళని వదిలి వెళ్ళాలా అని దిగులుగా కూసున్నాడు. జానుగాడి చూపులన్నీ ఆ ఆకుపచ్చని సీసా మీదనే ఉన్నాయి. అదేందో కనుక్కోవాలని వాడికి మామూలు కుశాలుగా లేదు, అమ్మనో అయ్యనో అడిగినా చెప్పేలాగా లేరు. పక్కనే ఉన్న సావాసగాడ్ని అడిగాడు ‘ఏందిరా ఆ సీసా’ అని.వాడికి తెల్సి తెలియని మాటల్తో చెప్పాడు ‘ఒరే అది డింకు సీసా సల్లగ ఉంటది. తాగితే దీనబ్బా ఒహటే తేపులు, మొన్న మా అయ్య పెద్ద కూర తిని, ఇది తాగి రొంత నాగూడక ఇచ్చినాడు. ఓ యబ్బ చెప్పెటానికి కాదు, కాని పది రూపాయల్రా’ అని ఊరించాడు. జానుగాడికి అది మనాదిలో పడింది. పది రూపాయలు తెచ్చుకోవాలా ఆ డింకు తాగాలా...!పని చేయగలరు అని నమ్మకం కుదిరి, వాళ్ల కంటికి నదురుగా కనబడేసరికి రంగిసెట్టి ఇచ్చిన లిస్ట్‌కి టిక్కు పెట్టుకుని బేరాలు మొదులు పెట్టారు. ఏడాది ఎగ్రిమెంటు, నాలుగు నెలలకి వారం సెలవు, పెద్ద పండక్కి రొండు జతల బట్టలు, వారం వారం బటోడా, కాకుండా సమచ్చరానికి పదైదు వేలు డబ్బులు, తిండి, ఉండడానికి వసతి. రంగమ్మ కళ్ళు మెరిశాయి.అనందరావుకన్నా ఆ మాటకొస్తే ఆడికి వచ్చిన అందరికన్నా తనే ముందు సరే అని చెప్పేసేలాగా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. రంగిసెట్టి గొంతు సవరించుకుని ‘ఏందిరా సాలవా..? ఇంకేమైనా ఉన్నాయా గొంతెమ్మ కోరికలు అడిగి సావండి’ అని గదమాయించాడు. ఏలియా గాని, యాకోబు గాని ఏం ఉలుకు లేదు పలుకు లేదు, వాళ్లకీ లోపల సంతోషంగానే ఉంది కాని ఇంకా ఎవరైనా ఎక్కువ ఏమైనా అడిగితే బాగుండు అని మెదలకుండా ఉన్నారు. అందరూ గొణుక్కుంటూఉన్న టయానికి దిగ్గున లేశాడు ఓబయ్య ‘ఏంది సేటు నీ సమత్కారం, ఊరుగాని ఊరు పెళ్లాం పిల్లల్ని వొదిలి అంతగాలం ఆడుంటే ఇయ్యేనా మీరిచ్చేది. ఇరవై వేలియ్యి. మిగతా అన్నీ మామూలే. అట్లయితే సెప్పు, లేకపొతే వచ్చిన కారెక్కిపో’ అని అరిసినట్టుగా మాట్లాడి కూకున్నాడు.రంగిసెట్టికి కోపం నెత్తికి అంటుకుంది. సేట్లు ఒద్దంటే తన కమీషన్ ఎక్కడ తనకి రాకుండా పోతుందో అని గుబులు పడ్డాడు. ‘ఏరా ఓబిగా! గతిలేని నా కొడకా! తాగుబోతు వాగుడంతా వాగి నోటి కాడ కూడు లాగేస్తావా ఈళ్లందరిదీ’ అని దిగ్గున లేచి తన్నబోయాడు. అక్కడున్న అందరూ వారించి ‘ఏంది సెట్టినోరు బో లేచ్చాంది తగ్గు తగ్గు’ అని ఆపినాక, నోట్లో ఉన్న పుగాక్కాడ తుప్పుక్కున ఊసి, ‘సూడు సేటు గారూ ఓబిగాడు అడిగిన దాంట్ల ఏమి తప్పులేదు. మీరే ఇంకోపాలి ఆలోసించుకోండి. మాదంతా ఇప్పుడు ఒకటే మాట. కావాలంటే మీరు రంగిసెట్టికిచ్చే కమీసన తక్కువ జేసుకోండి’ అని యాకోబు తగులుకునే తలికి అందరూ ‘అవునవును’ అని గొంతు కలిపారు. ‘మీకు బలిసిందిరా నా కొడకల్లారా ఏదో మీ కుటంబాలు బాగుంటాయని, నాలుగు మెతుకులు తింటారని అనుకుంటే నా కమీసన్ గురించి వాగుతున్నారు. పోండి మీరు ఎట్ట జత్తే నాకెందుకు, మీ సాడు మీరు తాగండి’ అని పైపంచె దులుపుకుని లోపలికి వెళ్ళిపోయాడు. దేశం అంతా తిరిగి పల్లేల్లో నుంచి ఇలా చదువు సంధ్య లేనివాళ్లని ఏరుకొచ్చి పనిలో పెట్టి, వాళ్లతో గొడ్డు చాకిరీ చేపించుకోవడం బాగా తెల్సిన పని. సిటీ బయట నీళ్లు దొరకని చోట కడుతున్న అపార్ట్మెంట్స్కి వీళ్లని తోలి ఆ ఇరవై వేలు ఇస్తే లెక్క సరిగ్గా సరిపోతుందని ఆ సేట్లకి తెల్సు. రంగిసెట్టికి నొప్పి తెలియకుండా మళ్ళీ అందరినీ పిలిపించి, ఓకే మీరు చెప్పినట్టే ఇస్తామని ఒప్పించారు. అలగా వాళ్లతో మాటపడ్డందుకు రంగిసెట్టి ఏమంత సంతోషంగా లేడు. అతని కడుపులో మంట ఇప్పట్లో తగ్గదు. నవ్వు పులుముకుని, ‘మీ కడుపు నేనెందుకు కొడతాన్రా అయ్యలారా’ అని అందరికీ కలిపి ఒకే ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు.జానుగాడు వాళ్ల నాన్న చెయి పట్టుకుని ‘అయ్యా ఆ డింకుసీసా గావాల’ అన్నాడు. అసలే ఊరు వదిలెల్తున్న చికాకు ఎవరి మీద సూపియాలో నెత్తి గోక్కుంటున్న వాడికి ఈ మాట వరంలా చిక్కింది. ‘నా కొడక ఊరొదిలి నేను పోతా ఉంటే నీకు డింకు గావాల్నా గాలికి బుట్టిన నాకొడకా’ అని రొండు జబురుకున్నాడు. గబుక్కున రంగమ్మ లాక్కుని, ‘యాందీ మడిసి ఒక సుకము లేదు దుక్కము లేదు పిల్లోడ్ని సావనూకుతున్నాడు’ అని తిట్లకి లంకించుకుంది. జానుగాడి కళ్ళలో ఏడుపు లేదు, వాడి మనసంతా సీసామీదే ఉంది. రంగిసెట్టి ఆ నల్లటి ఇనపదాంతో ఆ మూత తెరిస్తే చేత్తో పట్టుకుని సల్లగా తాగాలని ఉంది. పది రూపాయలు– పదంటే పది రూపాయలు గావాల. అందర్నీ రేత్రి పదింటికల్లా టేషను కాడికి రమ్మని వాళ్ల ఏజెంటుని అక్కడే పెట్టి సేట్లు కార్లో వెళ్ళిపోయారు. మాపటేలకి యాకోబు, సాలమాను, ఓబయ్య, ఆనందరావు, ఇంకా మిగిలినోళ్ళంతా పాస్టర్ కాడికి బోయి పార్ధన జేపిచ్చుకొని బయలుదేరుతూ, అయ్యగారి సేతిలో తలా ఒక ఇరవై రూపాయలు పెట్టి వొందనాలు జెప్పి బయలుదేరారు. అబ్బా ఆ డబ్బుల్లో నుంచి ఒక్క పది కాగితం జారిపడితేనా దీనెక్క ఇక ఆ సల్లటి సీసా మనదే అనుకున్నాడు జాను గాడు. అయ్యని అడుగుదామా అని అంటే నిన్న తిన్న దెబ్బలు యాదికొచ్చి యెనిక్కి తగ్గాడు.రంగమ్మ దిష్టి తీసింది మొగుడికి. ఇంట్లో ఉన్న రొండు వందకాయితాలు తీసి జేబీలో పెట్టి కళ్లనీళ్లు తిరుగుతుండగా ‘అయ్యో! నెత్తిన ఇత్తులు బడ్డా కాణ్ణుంచి నేను నిన్నేమీ కోరిక కోరలేదు. నువ్వు ఎట్టా తిరిగినా ఏదో నోటి తుత్తర కొద్దీ వసపిట్ట మోయిన వాగుంటా. అదంతా మతిలో బెట్టుకోమాక. పని జేసుకో యాలకి తిను, తాగుడు జోలికి పోమాక. నీకోసం నాలుగు నెలలదాక చూస్తా ఉంటా’ అని కళ్ళు తుడుచుకుంది. జాన్సన్ గాడు మాత్రం నాన్న జేబు వంకే చూస్తున్నాడు. అమ్మ ఇచ్చిన రొండు వందల్లో ఒక్క పది ఇస్తే బాగుండు అనుకున్నాడు కాని, అడగడానికి నిన్న దెబ్బలు ఇంకా మతికి ఉన్నాయి.‘ఓ అన్నా ఈ మడిసి సంగతి నీకు తెల్సుగద! అసలే తాగుడు మడిసి. నువ్వే రొంత కనిపెట్టుకుని నీ పక్కనే ఉంచుకోన్న నీ సెల్లెలు అనుకోని మాట కాసుకోన్నా! అంతా నీ మీన్నే పెడుతున్న రొంత జాగ్రత అన్నా!’ అని కళ్ళలో నీళ్ళు కళ్ళలో పెట్టుకుంది రాహేలమ్మ.‘పోవే నీ... నా గురించి నాకు తెల్వదా? ఏదో పొద్దుగాల పన్జేసి ఆనెక్కాలకి ఒక గుక్కెడు తాగుతా. దానికే ఏందీ ఇంత రంజీబు. అయినా తాగి పడుకోనీకి నేను మా అయ్య కాడికి కాదే పోయేది, పనికి. సేట్ల కాడ ఇయి నడవ్వు’ అని నవ్వుతూ తిడుతూ ముందుకు కదిలాడు. బస్సు పదిమంది వలస కార్మికులని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ప్రతి శనివారం రంగిశెట్టి దుకాణం కాడసందడి సందడిగా ఉంటది ఆడున్న కాయిన్ బాక్స్‌కి పనికి బోయినోళ్లు అందరూ పోన్ జేత్తారు. అందరూ అయిపోయినాకయితే రొంత ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని అట్లనే నిల్చుకోని ఉండేది రంగమ్మ. అదే టైములో ఒకనాడు జానుగాడు పోయి ‘రంగిసెట్టి! మా అయ్య వచ్చాక ఇస్తా గాని సొమ్ములు, ముందు ఆ చల్ల సీసా ఇవ్వు’ అని గాలం వేశాడు. అసలే తనమాట కాదని ఎక్కువ సొమ్ములు పెరుక్కున్నారని కోపంలో ఉన్న రంగిసెట్టి , ‘యాడరా నీ అయ్య వచ్చి ఇచ్చేది? అప్పుడే నువ్వు డింకు తాగే మొగోనివయ్యావా! మీ అయ్యలు ఆడ నానా తిట్లు తిని సంపాదిస్తుంటే ఈడ ఈ గూద నా కొడుకులకు ఏం జేయాలో తెలియడం ల్యా’ అని చెడు తిట్లకి లంకించుకున్నాడు. ఎవురి గొడవలో వాళ్ళుండడం వల్ల జానుగాడికి, రంగిసెట్టికి మజ్జన జరిగింది ఎవురూ సూడలేదు. బిత్తరపోయిన జానుగాడు సల్లగా వొచ్చి అమ్మ పక్కన నిలబడుకొని ఫోను వచ్చేదాకా వాడి సూపంతా ఆడ్నే ఉంది.ఆ గుండ్రటి కుండ అందులో సల్లని నీళ్ల మధ్యలో ఆకుపచ్చని సీసాకాయ. ఆ కంగారులోనే ‘అయ్యా ఎట్లున్నావురా అయ్యా’ అంటే, ‘బాగున్నా’ అన్నాడే గాని, పది రూపాయలు అడగలేదు. రంగమ్మ ఇంట్లో ఎప్పుడు మంచం మీద పక్క శుభ్రంగా ఉంచుతుంది. గొడవ అయినాక దాన్ని కోపంతో చిందరవందర చేస్తూ మంచం మీద పడుకున్నాడు జాను గాడు. వాడికి పది రూపాయలు కావాలి. తలా ఒక రూపాయి అడుగుదామని ఆలోచన జేసీ అడిగాడు. నేరుగా రంగమ్మ కాడికి వచ్చి ‘ఏంది మీ పిల్లోడు రూపాయి అడిగినాడు ఏంది కత’ అని అడిగేతలికి జానుగాడి ఈపు సాపు జేసింది రంగమ్మ. ‘బడికి పోయి సదువుకోమంటే పోడుగాని ఈడికి డింకు సీసా గావాలంట నాకాడ సొమ్ములున్నా ఇప్పియ్యను గాక ఇప్పియన్ను నీ సొయ్యం నీకు అణగాల. ఎవురుకాడైనా చేయిజాపినా, ఇంట్లో రూపాయి కాన్రాకపోయినా నా కొడకా కొడితే మీ జేజవ్వ దిగిరావాల’ అని ఆ రోజంతా తిడతానే ఉంది.జాను గాడికి నిద్రలో అదే, మెలకువలో అదే! పదిరూపాయలు. పెద్ద కూర తిన్న రోజంతా ఆడి ధ్యాసంతా దానిమీన్నే ఉండేది. సీట్లపేక కాడికి కూడ పోవట్లే. ఒక్కొక్క రోజు ఎల్లి రంగిసెట్టి కొట్టు కాన్నే కూసోని, రోజుకి ఎంతమంది తాగుతున్నారా అని లెక్కేలేసే వాడు. దేవుడా ఒక్క పది రూపాయలు దొరికేలా చేయమని సెర్చీ కాడికి బోయి పార్ధన కూడా చేశాడు. ప్చ్.. అయినా గాని వాడికి ఆ వరం దక్కలేదు.ఆనందరావు పనిలో కుదురుకున్నాడు. బటోడ డబ్బులు దాచుకోవడం మొదులు బెట్టాడు. ఒక పక్కన అదిలించే వాళ్ళు లేక ఓబు తాగుడు ఎక్కువైంది. పనికి మూడు రోజులు బోతే మిగతా మూడు రోజులు నాగా లాగా తయారైంది. ముందు ఏజెంట్ చెప్పి జూశాడు. రాహేలుకి పోన్ జేశారు. ఆయమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చి మరి జెప్పింది. నవ్వి నేను తాగలేదు అనేవాడు, ఆ మాట కూడా తాగే చెప్పేవాడు. మెల్లగా పనికి పోకుండా తాగుడుకు బానిసై అప్పులు జేసీ ఒంట్లో బాగోని కాడికి తెచ్చుకున్నాడు.మూడు నెలలు కావడానికి ఇంకో వారం ఉంది అనగా ఒక అర్ధరాత్రి కాడ రంగిసెట్టి పోన్ మోగింది. ‘ఏంది సెట్టి నీ కమీషన్ కోసం తాగుబోతు నాయాల్ని పంపినావు. వాడు తాగి తాగి ఈడ సచ్చిపోయినాడు. వాడికి సొమ్మేం రాదు. ఏదో మళ్లా ఆ ఊరికి పనోళ్ల కోసం రావాలిగాబట్టి రొంత సొమ్ము పంపుతున్నా అక్కడ నువ్వే సెటిల్ జేసుకో’ అని ఏజెంట్ చెడామడా తిట్టి పోన్ పెట్టేసినాడు. రంగిసెట్టికి గుండె దడ పెరిగింది. మాదిగ పల్లె వైపు ఉరికాడు. ముందు సలవాదిరిని లేపుకుని విషయం చెప్పి అందరికి చెబుదాం పదమన్నాడు. పల్లె మొత్తం నిద్ర లేచింది. రాహేలమ్మ స్పృహ కోల్పోయింది. రంగమ్మ పరుగెత్తి కెళ్లి ‘ఊరుకో వదినా’ అంటూ ఊరడిస్తోంది. ఆనందరావు, యాకోబు ఇద్దరు ఓబు శవాన్ని తీసుకుని బయలుదేరారు.మాదిగపల్లె ఓబు శవం కోసం ఎదురు చూస్తోంది. సంగతి తెల్సినకాణ్ణుంచీ జానుగాడు, రంగమ్మ ఆణ్నే ఉన్నారు. రాహేలుని ఆపడం ఎవురుతరం కావటం లేదు. రంగమ్మ పక్కనే కూర్చుని ‘ఊరుకో వొదినా! అంతా మన గాచారం’ అని అనునయిస్తోంది.‘గాచారం గాదు ఒదినా, మన తలరాత. ఈ ఊరిమీన ఉన్నంత ఎండ ఏఊర్లో అయినా ఉందా? ఎన్నడైనా ఇంత మబ్బు తునక చూసినమా, తోవ తడిసే వాన జూసినమా? రొండు బిందెల నీళ్లకు ఎంత దూరం పోతుంటిమీ, నీళ్ల కోసం గడప దాటని ఆడది ఉందా మనూళ్లో. వారానికి ఒక బిందె నీళ్ళు ఇది గదూ మన బతుకు. కాని సారాయి జూడు దానికి నీళ్ల కొదువే ఉండదు. ఇళ్ళూ, ఊళ్ళు ఆర్పి కూసుంటుంది. నీళ్ళు లేకపోయినా ఈ నా బట్టలు ఆ మందు తాగి ఇదిగో ఇట్టా మన తాళ్ళు తెంపుతున్నారు’ అని అంటూ మళ్ళీ ఏడవడం మొదులు బెట్టింది. రంగమ్మ కళ్ళు తుడుచుకుంది.ఆనందరావుకి తాగుడు లేదు. అదొక్కటే సంతోషం తనకి. ఓబు ఇంటికాడ శవాన్ని దించి నీళ్లుబోసుకుని వద్దామని ఆనందరావు, యాకోబు ఇళ్లకి వచ్చారు. రంగమ్మ కళ్లనిండా నీళ్ళు పెట్టుకుని అనందరావుకి ఎదురెళ్ళింది. పొంతలో నీళ్ళు తోడి, గాబులో నీళ్ళు కలిపి రేకుల తలుపున్న దొడ్లో పెట్టింది. జాను గాడికి నాన్న జోబు మీద కన్ను పడింది. ఒక్క పది రూపాయలు అయ్యొచ్చిండు. ఇగ ఇయాలో రేపో చేతిలో సల్లని సీసా గొంతులో తీయగా అబ్బా వాడికి వాడే ఊరించుకుంటున్నాడు.ఏందయ్య ఎందుకు మీరు పోయింది ..? పక్క పొంటి మనిషి అంతగనం తాగుతుంటే మీరు చెప్పొద్దా అంటూ ఆనందరావుని నిలదీసింది రంగమ్మ.‘నువ్వు మా పని కాడికి రావే ఆడజేసే గొడ్డు చాకిరీ నీకు తెలుస్తది. లేచిన కాణ్ణుంచి రేత్రి ఎనిమిది దాకా వొంచిన నడుము ఎత్తేదానికి ఉండదు. బువ్వ ఒక్కసారే పెడతారు. మారన్నం అడిగితే ఇంగ అంతే మా కత, రోజూ పచ్చడి, పప్పే! దానికి తోడు నీళ్ల మజ్జిగ. దీనమ్మ జీవితం ఆణ్నే సచ్చిపోతే బాగుండని ఎన్నితూర్లు అనుకున్నానో తెల్సునా. ఓబుగాడు పోయిన మూడో రొజునుంచే వాని స్యాతగాలే పని, వాడి పని గూడా మేమే జేసి, ఆ నాలుగు రాళ్లు ఇప్పిచ్చినం. వాడి బాదలకి మందు అదే అని తెల్సినాక యాడ్నే ఆపేది. వాడిని ఆసుపత్రికి తీసకపొమ్మని అడిగితే ఆ సేట్ నా కొడుకు తాగుబోతు నాయాళ్లు మాకు అక్కర్లేదు అని ఎల్లిపోయినాడు’ అని కళ్ళు తుడుచుకున్నాడు. రంగమ్మకి విషయం పూర్తిగా అర్థమైంది . ఇంతకి మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మళ్ళీ ఆనందరావు ఎనిక్కి పోడని ఊహించి ఇంకేం మాట్లాడలేదు.ఎప్పటిలానే నేలని ఎండబెట్టడానికి మళ్ళీ ఎండ వచ్చింది. ఓబుని పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీళ్ల టాంకి కోసమని పొయినోళ్లకి దొరకనే లేదు.ఆనందరావు, యాకోబు, ఇంకొంతమంది తలా ఇంత అని వేసుకుని అవసరమైన పెట్టే, తెల్లగుడ్డ, సెంటు సీసాలు, చల్లడానికి చిల్లర అన్ని సమకూర్చారు. పాస్టర్గారికి కబురు వెళ్ళింది.నీళ్ల బండి దొరకని కారణంగా స్నానం లేదు. సెంటు కొట్టి పెట్టెలో పెట్టడమే అని తీరుమానం చేసి పాస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.జానుగాడు లేచేసరికి ఎదురుగుండా నోట్ల కట్టలు కనబడ్డాయి. ఇంట్లో అమ్మా, అయ్యా ఎవురూ లేరు. బయటకి వచ్చి మల్లొకసారి ఎవరూ లేరని సూసుకుని, మెల్లిగా ఒక నోటు లాగి నిక్కర జేబిలో పెట్టుకుని ఒక్క ఉదుటున బయటకి ఉరికాడు. వాడి మనసులో ఒకటే ఆశ ... ఆ సీసా సల్లగా గొంతులోకి పొయే కల. మధ్యలో బడికి పోతున్న తన సావాస గాళ్లని ఆపి, జేబులో నోటు చూపెట్టి సీసా తాగబోయే సంగతి చెప్పాడు. ఒక్కసారిగా వాళ్లంతా నవ్వడం మొదులు పెట్టారు. ‘ఒరే జానుగా! అది అసలు సొమ్ము గాదురా అది పిచ్చి నోటు. ఎవురైనా సచ్చిపొతే వాళ్లమీద జల్లడానికి తెచ్చే సొమ్ములు’ అనేసరికి జానుగాడికి ఎక్కడలేనినీరసం ఆవహించింది. ఉసూరుమంటూ వెనక్కి మరులుకొని ఓబు ఇంటిదగ్గరకి పోయాడు. అక్కడా ఉండబుద్ది గాలేదు. ఇంటికి పోయి ఆ నోటు ఆడ్నే పార్నూకి మంచమెక్కి పొనుకున్నాడు. మజ్జానం అవుతావుంది. రంగమ్మ ఇంటికి బోయి, ఒకమారు జానుగాడికి అన్నం బెట్టి వచ్చింది.సరిగ్గా రొండు గంటలకి బతికినంతకాలం తాగి తాగి సచ్చిపోయిన ఓబు పోయినాక కనీసం నీటిసుక్క గూడా ఒంటిమీన పడకుండా పెట్టెలో పడుకుని పోతున్నాడు. పల్లె పల్లె మొత్తం ఖాళీగా ఉంది. ఓబుని పెట్టెలో పెట్టి తీసుకుపోవడానికి లేపారు. పలకలు మోగుతున్నాయి.సరిగ్గా అదే టయానికి పడుకున్న జానుగాడు నిద్ర లేచాడు, బయటకి వచ్చి చూస్తే జనం పోతా ఉన్నారు.కళ్ళు నుల్చుకున్నాడు. తెల్లటి ఎండలో మిల మిలా మెరుస్తున్న రొండు రూపాయల బిళ్ల. దగ్గరకి వెళ్లాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇది కాగితం కాదు, బిళ్ల– చెల్లుతుంది అనుకుని తీసుకుని జోబిలో వేసుకున్నాడు, ఆనందం ఆగేలా లేదు వాడికి. ఇంకా ముందుకు పోయాడు ఇంకో రూపాయి, ఇంకా ముందుకు పోతే ఇంకో రెండు రూపాయలు... గులాం పూసుకుని కొన్ని పూలు మీదబడి కొన్ని దొరికాయి.సరిగ్గా లెక్క జూసుకున్నాడు మొత్తం పది రూపాయలు.రంగిసెట్టి కొట్టు ఒకటే కళ్లముందు కనబడుతుంది జానుగాడికి, వాడిలో వాడే లోపల్లోపల మాట్లాడుకుంటున్నాడు ‘ఎట్లుంటది? అది సోడాలాగే ఉంటదా. తియ్యగా, పుల్లగా, అసలు ఇంట్లో నీళ్లే తాగడానికి రొండు రోజుల తర్వాత పనికి రావు. ఇన్ని రోజులు ఆ సీసాలో నీళ్లు పాడైపోవా?’ బుర్ర నిండా గందరగోళం. ఇంక కాసేపట్లో ఆ సీసా తన చేతిలో ఉంటది. పరిగెత్తుతున్నాడు, కాళ్లు కాల్తున్నాయి. అయినా ఆగడం ల్యా, పలకల దరువు పెరిగే కొద్ది జానుగాడిలో హుషారు పెరుగుతుంది. దరువు దరువుకి ఒక అంగ వేసుకుంటూ సరిగ్గా రంగిసెట్టి కొట్టు దగ్గర ఆగిపోయాడు జానుగాడు.వీళ్లు అందరూ కనబడకుండా పోయాక తాగుదామని ఆలోచన చేశాడు. మళ్ళీ ఎవురైనా సొమ్ములు యాడివి అంటే దొరికినాయని చెప్పినా నమ్మరు. శవం కాడియి ఏరుకున్నావా అని తన్నినా తంతారని ఆగాడు. ఒక పక్క ఓబుని పాతిపెట్టే కార్యక్రమం నడుస్తోంది, ఏడుపులు ఇనొస్తున్నాయి.రంగిసెట్టి కొట్టుకాడ జేబిలో డబ్బులు తీసి సరిగ్గా లెక్కబెట్టి ‘ఇదిగో రంగిసెట్టి లెక్క. నాకో సీసా ఇయ్యి’ అని దాదాపుగా అరిసినంత పనిజేశాడు జానుగాడు. లెక్క సరిచూసుకున్నాడు సెట్టి, యాడియిరా అని అడగబోయి, యేముందిలే పట్నం సొమ్ము అనుకుని గల్లాలో వేసుకుని సీసా మూత తీసి ఇచ్చాడు.అదే సప్పుడు కోసమే జానుగాడు కలగన్నది. ఆ ఇనుప సువ్వ దీసుకుని రంగిసెట్టి మూత తీస్తుంటే జానుగాడి మనసులో బో కుశాలయింది.చేతిలో చల్లని సీసా, పైన ఎర్రటి ఎండ. నీళ్ళు గుడక ఇంత ప్రేమగా ఏనాడు తాగలేదు. ఓబు కార్యక్రమం అయిపోయింది. అందరూ యెనిక్కి మరలుకుని వస్తున్నారు, ఓబుని తల్సుకుని పనికి పోవాలా వద్దా అని ఆనందరావు గుబులు పడుతున్నాడు. రంగమ్మ కళ్లముందు బాగుజేసుకున్న ఇల్లు, బలుబు ఎల్తురు అగపడతున్నాయి. కళ్ళముందు కుర్చీలో కూర్చుని సల్ల డింకు సీసా తాగుతున్న జానుగాడు అగపడుతున్నాడు.చిరాగ్గా మొహం బెట్టుకుని రంగిసెట్టి ఆ ముగ్గురినీ జూత్తా ఉన్నాడు. -
కథాకళి: టైమ్ ట్రావెల్
జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్ ఉన్న కలర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్ పుస్తకాలని చదివాడు. అతను హెచ్.జి.వెల్స్ 1895లో రాసిన ‘టైమ్ మెషీన్స్ ’ నవలని చదివాక టైమ్ ట్రావెల్ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్టమస్ కేరల్లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్ ట్రావెల్ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్ కాన్సులేట్ ఆఫీసర్ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు. ‘‘వెల్కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్‌తో టైమ్ ట్రావెల్ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్‌ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్‌ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది. చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్ ట్రావెల్ మెషీన్స్ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్ సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్ నేరస్తుడు అల్ కపోన్స్ తో సంబంధం గల ది గ్రీన్స్ మిల్ బార్కి చేరుకున్నాడు. లైవ్ జాజ్ మ్యూజిక్ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్ షేర్ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.‘‘ఇతను మిస్టర్ డేవ్.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్వైజర్ బీర్ ఆర్డర్ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్ స్కాలర్ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు?’’ ‘‘టైమ్ ట్రావెల్.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’ ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్ లైసెన్స్‌ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్ ఫోన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్‌తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు. ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్ చాప్స్ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్‌లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్ ట్రావెల్ చేయలేదు. 2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్ మిల్ బార్లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు. -
రామేశ్వర లింగ ప్రతిష్ఠాపన
రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేనోళ్ల స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, ‘మునులారా! పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే! యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే, ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి’ అని అడిగాడు.‘పరమాత్మా! నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు. అయినా, పరిహారం చెబుతున్నాం విను! ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్ఠాపన చెయ్యి. శివలింగ ప్రతిష్ఠాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే, మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే, నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి వెయ్యిరెట్లు పుణ్యం వస్తుంది’ అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు.‘మరందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి’ అన్నాడు రాముడు.‘మరో నాలుగు ఘడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది’ చెప్పారు మునులు.రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, ‘హనుమా! కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో నాలుగు ఘడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి. తేగలవా?’ అని అడిగాడు.‘స్వామీ! నువ్వు ఆజ్ఞాపించాలే గాని, అదెంత పని?’ అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి, నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరే సరికి, నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు, అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకుని వస్తాడేమోనని కలత చెందారు.హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదికాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనే సరికే గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి, ఒంటికాలిపై నిలబడి, నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపునిలిపి, చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు.హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘నాయనా! ఏం కావాలో కోరుకో! అని అడిగాడు.‘పరమేశ్వరా! శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోక ముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు. తీసుకుపోయి, శ్రీరాముడికి అందిస్తాను’ అన్నాడు.శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి, అంతర్ధానమయ్యాడు.హనుమంతుడు వెనువెంటనే ఆ లింగాన్ని తీసుకుని, ఆకాశ మార్గాన దక్షిణ సముద్రతీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతూ ఉండటంతో, మునులందరూ ‘రామా! ముహూర్తం సమీపించింది. హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు’ అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి, సైకత లింగ ప్రతిష్ఠాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా, రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్ఠాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం కనిపించింది. ‘స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి, ఇక్కడ అన్యలింగ ప్రతిష్ఠాపన చేయడమేమిటి’ అనుకుంటూ లోలోపల కలత చెందాడు. రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. ‘స్వామీ! నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మవ్యర్థం’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పలికాడు.రాముడు అతడిని అనునయించాడు. ‘హనుమా! నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైతబుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికే శోకించడం తగునా! నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా! శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు’ అని పలికాడు.హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.∙సాంఖ్యాయన -
బయట ఆడకపోతే... నాలుగు నష్టాలు
ఒకప్పుడు బాల్యం ఇంట్లో కంటే, ఇంటి బయటే ఎక్కువ ఉండేది. పరుగులాట, కోతికొమ్మచ్చి, బిళ్లంగోడు, గాలిపటాలు, దొంగాట... ఇలా పిల్లలు ఇంటి బయటే ఎక్కువగా ఉండేవారు. చెమటలు కారుతున్నా ఆటలు ఆపకపోవడం, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకపోవడం, ఆకలయ్యేంత వరకు ఇల్లు గుర్తురాకపోవడం, ఒక్కోసారి ఆకలి కూడా మరచిపోయి ఆడుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. ఆ బాల్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈరోజు పిల్లల బాల్యం ఒక చిన్న స్క్రీన్‌లో మొదలై, అదే స్క్రీన్‌లో ముగుస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఒక తరం మౌనంగా కోల్పోతున్న జీవితం.ఇప్పటికీ ఆలస్యం కాలేదు. గేటు తెరవండి. ఫోన్ పక్కన పెట్టండి. పిల్లల బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురండి. బాల్యం ఎందుకు బయటే ఎదగాలి?పిల్లల మెదడు పుస్తకాలతో కాదు, అనుభవాలతో ఎదుగుతుంది. ఆ అనుభవాలు ఎక్కువగా బయట ప్రపంచం నుంచే వస్తాయి. బయట ఆడే ఆటల్లో పిల్లలు కేవలం శరీరాన్ని కాదు, మెదడును కూడా ఉపయోగిస్తారు.ఎక్కడ పరుగెత్తాలి? ఎక్కడ ఆగాలి? ఎవరితో కలిసి ఆడాలి? ఎవరితో తగువుపడాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఎదురు నిలవాలి?... ఇవన్నీ ప్లానింగ్, నిర్ణయాలు, స్వీయ నియంత్రణకు మూలాలు. వీటినే సైకాలజీలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ ప్రకారం, పిల్లలు బయట ఆడే ఆటలు మెదడులో న్యూరల్ కనెక్షన్లను సహజంగా బలపరుస్తాయి. కాని ఇప్పుడా అనుభవాలన్నీ స్క్రీన్కు అతుక్కుపోయియి. స్క్రీన్ ఎందుకు ప్రమాదకరం?స్మార్ట్‌ఫోన్ సమస్య అది చూపే కంటెంట్ కాదు, అది పనిచేసే విధానం. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ల ఉద్దేశం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచడమే, పిల్లలకు ఉపయోగపడాలని కాదు. ఈ యాప్‌లు డోపమైన్ రసాయనాన్ని చిన్న చిన్న మోతాదుల్లో విడుదల చేస్తూ, పిల్లల మెదడును నిరంతర ఉత్సాహంలో ఉంచుతాయి.బయట ఆటల్లో ఆనందం రావాలంటే శ్రమ అవసరం. స్క్రీన్‌లో ఆనందం రావాలంటే ఒక టచ్ చాలు. మెదడు ఈ తేడాను త్వరగా నేర్చుకుంటుంది. దీనివల్ల పిల్లలు తక్షణ ఆనందానికి అలవాటుపడతారు. ఓర్పు తగ్గిపోతుంది. బోర్డమ్ను భరించలేని మనస్తత్వం, అసహనం, చిరాకు పెరుగుతాయి. బోర్ కూడా అవసరం.. ‘మా పిల్లాడు త్వరగా బోర్ అవుతున్నాడు సర్. అందుకే ఫోన్ ఇస్తుంటాం’ అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. వాస్తవానికి బోర్ అవ్వడం పిల్లలకు ఒక అవసరం. బోర్ అవ్వడం అంటే ఖాళీగా ఉండడం కాదు. అది మెదడుకు ఒక విరామం. ఆ విరామంలోనే ఊహాశక్తి పుడుతుంది, కొత్త ఆటలు పుట్టుకొస్తాయి, సృజనాత్మకత మేల్కొంటుంది. స్మార్ట్‌ఫోన్ పిల్లల జీవితంలో బోర్డమ్ను పూర్తిగా తొలగించింది.ప్రతి నిమిషం ఏదో ఒకటి చూపిస్తూ, పిల్లల మెదడును వినోదానికి బానిసగా మార్చేసింది. పరిష్కారాలు... → రోజుకు కనీసం గంట బయట ఆట తప్పనిసరి చేయండి. చలిగా ఉందని, ఎండగా ఉందని సాకులు చెప్పొద్దు. ఆటకు వాతావరణ అడ్డుకాకూడదు. → స్క్రీన్‌ను హక్కుగా కాదు, రివార్డుగా మార్చాలి → డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, పడకగదిలో ఫోన్ అనుమతించకూడదు → పిల్లలతో కలిసి బయటకి వెళ్లండి. ఆడకపోయినా, అక్కడ ఉండండి → పిల్లలు బోర్ అయితే వెంటనే స్క్రీన్ ఇవ్వకండి. ఆ బోర్లోనే ఎదుగుదల ఉంటుందిబయట ఆటలు లేకపోతే... పిల్లలు బయట ఆటలు ఆడకపోతే నాలుగు ముఖ్యమైన సామర్థ్యాలు కోల్పోతారు. → రిస్క్ అంచనా వేసే సామర్థ్యం: ఎక్కితే పడిపోతామో లేదో తెలుసుకోవడం → సోషల్ నెగోషియేషన్: ఆటలో గొడవలు, ఒప్పందాలు, రాజీలు → శరీర అవగాహన: బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్థల జ్ఞానం → నిజమైన విజయ భావన: కష్టపడి సాధించిన ఆనందం ఈ నాలుగు అంశాలను ఏ స్క్రీన్ ఇవ్వలేదు.భయపెట్టే గణాంకాలుప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకుస్క్రీన్ పూర్తిగా నిషిద్ధం. ఐదేళ్ల పిల్లలకు రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ ఉండకూడదు. కాని, మనదేశంలో 3–6 ఏళ్ల పిల్లలు సగటునరోజుకు 3–5 గంటలుస్క్రీన్ చూస్తున్నారు. నగరాల్లో 60 శాతానికి పైగా పిల్లలు రోజుకు 30 నిమిషాలు కూడా బయట ఆడటంలేదు. 1990లతో పోలిస్తే పిల్లల ఔట్‌డోర్ ఆటల సమయం 70 శాతం తగ్గింది. -
ఆహార్యమే ఆధారమై!
నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.బషీర్‌బాగ్‌లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో నివసించేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి. వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు. అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది. అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది. నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్‌మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు. నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్‌మహల్‌లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్‌మహల్‌లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు. శ్రీరంగం కామేష్ -
కురుల సిరులు పదిలం
కురులు నల్లగా ఉంటేనే అందం రెట్టింపవుతుంది. అయితే రసాయనాలు నిండిన షాంపూలు, కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే చాలామందికి జుట్టు తెల్లగా మారుతోంది. నడివయసుకు రాకముందే నెరిసిన జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. జుట్టు తెల్లబడటం మొదలవుతున్నప్పుడే సమస్యను గుర్తిస్తే, జుట్టును నల్లగా మార్చుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు.కెమికల్స్‌తో కూడిన రంగులు వాడకుండా, ఇక్కడ చెప్పిన చిట్కా పాటిస్తే చాలు. ఒక కప్పు తాజా కలబంద గుజ్జును రెండు చెంచాల ఆముదంతో కలిపి జుట్టు కుదుళ్లకు రాసుకోవాలి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ జుట్టులోని మెలనిన్ తగ్గకుండా చూస్తాయి. ఆముదంలో ఉండే ఒమేగా–6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు సరైన పోషణను అందిస్తాయి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా రాసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడంతో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. -
డీప్ డేంజర్.. మనం మనమేనా?
ముఖం మనదే, స్వరం మనదే, శరీరం మనదే. కాని, అది మనం కాదు! డీప్‌ఫేక్ తెరలో మనం ఎవరో మనకు కూడా తెలియని మాయాజాలం నడుస్తోంది. ఇక్కడ మన గుర్తింపును ఎవరైనా కొనవచ్చు, అమ్మవచ్చు, దొంగిలించవచ్చు. అవసరమైతే ఆయుధంలా కూడా ఉపయోగించవచ్చు. అందుకే, నిజమైన గెలుపు ఇప్పుడు అంతా మన నమ్మకంలోనే! - దీపిక కొండిఇప్పుడు ఉదయం లేచి ఫోన్ ఓపెన్ చేస్తే మనకు ఎదురయ్యేది అద్దంలో కనిపించే మన ముఖం కాదు, స్క్రీన్ మీద తిరుగుతున్న మన డూప్లికేట్. అదే మనల్ని చూసి నవ్వుతుంది, మాట్లాడుతుంది, మనం ఎప్పుడూ చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తుంది. దీంతో, ఇప్పుడు మనుషుల అసలైన గుర్తింపు సంక్షోభం ఏర్పడుతోంది. ఒకప్పుడు ‘నువ్వు ఎవరు?’ అనే ప్రశ్నకు పేరు చెబితే సరిపోయేది. ఇప్పుడు మాత్రం ‘నువ్వు నిజంగా నువ్వేనా?’ అని అడగాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖం మనదే, స్వరం మనదే, కాని, మాటలు మనవి కావు. వీడియోలో కనిపించేది మనమే, కాని, ఆ వీడియోలోని మనిషి మనం కాదు. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే మీ ఫొటోను తీసుకుని, మీ వాయిస్‌ను జత చేసి, మీ స్థానంలో ఎవరో మాట్లాడించి నట్లుగా ఏఐ తయారు చేసే డీప్ ఫేక్ డిజిటల్ డ్రామా! ఈ నాటకం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి, మీ అమ్మ చూసినా ‘అయ్యో, నువ్వే కదా!’ అంటుంది. ‘అది నేను కాదు’ అని మీరు ఎంత చెప్పినా ‘అబద్ధం చెప్పొద్దు’ అని గద్దిస్తుంది. ఇంత పవర్ ఉన్న టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే, మన గుర్తింపు ఒక ఫైల్లా మారిపోతుంది.అప్పుడు వారు ఆ ఫైల్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వైరల్ కూడా చేయవచ్చు. ఇదే అసలు సమస్య మన ముఖం మన దగ్గరే ఉంటుంది, కాని, వాడకం మాత్రం వేరేవాళ్ల చేతుల్లో ఉంటుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో భయం ఏంటంటే ఫొటో బాగా రాలేదేమో, ట్రోల్ అవుతామేమో. ఇప్పుడు ఆ భయం వేరే లెవల్‌కు చేరింది. ‘నేను చేయని పనికి నన్ను ఎందుకు తిడుతున్నారు?’, ‘నేను చెప్పని మాటలకు నేను ఎందుకు వివరణ ఇవ్వాలి?’ అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇక్కడే గుర్తింపు సంక్షోభం మొదలవుతుంది. నిజంగా నేను ఎవరు? నేను చేసిన పనులా? లేక నా ముఖంతో ఏఐ చేసిన పనులా? అనే ఎవరి వారు ఒక్కసారి చెక్ చేసుకొని మరీ పోరాటం చేస్తున్నారు. సెలబ్రిటీ కావడమే సమస్య!ఒకప్పుడు ఫ్యాన్ ్స అభిమానమే సెలబ్రిటీలకు బలం. ఇప్పుడు అదే అభిమానం ఏఐ చేతుల్లో పడి ఒక పెద్ద డిజిటల్ బాంబులా మారుతోంది! భారతదేశంలో నటులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలకు ఉన్న అపారమైన అభిమాన బలం ఇప్పుడు డీప్‌ఫేక్ మోసాలకు ఇంధనంగా మారిపోయింది. ఒక వీడియో చూసి ‘అరే, నిజంగానే ఆయనే చెప్పాడు!’ అనిపించిందా? ఒక వాయిస్ విని ‘ఇది కచ్చితంగా ఆయన స్వరమే!’ అని నమ్మేశామా? అంతే, ఆ నమ్మకమే మోసగాళ్లకు పెద్ద ఆయుధం. డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ క్లిప్‌లు ఇక కేవలం టెక్నాలజీ అద్భుతాలు మాత్రమే కాదు.అవి ప్రజల అమాయకత్వాన్ని టార్గెట్ చేసే ప్రమాదకరమైన ట్రిక్కులు. అందుకే కరణ్ జోహార్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వరకూ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, అరిజిత్ సింగ్ లాంటి స్టార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ‘నా ముఖం నాది, నా గొంతు నాది, అనుమతి లేకుండా వాడొద్దు!’ అని చట్ట రక్షణ కోసం వేడుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎదురుచూస్తే, ఇప్పుడు అదే ఫేస్‌తో నకిలీ వెబ్సైట్లు, అనధికార మెర్చండైజ్, ఏఐతో తయారైన అసభ్య కంటెంట్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.స్టార్డమ్ అంటే స్పాట్లైట్ మాత్రమే కాదు, సైబర్ ప్రమాదాల ప్యాకేజీ కూడా! ఇక్కడితో ఆగిపోతే బాగుండేది. నిపుణుల హెచ్చరిక ఏమిటంటే ప్రమాదం ఇంకా పెద్దదే. ముఖ్యంగా ప్రజా నాయకులు, కార్పొరేట్ లీడర్లు మరింత రిస్క్‌లో ఉన్నారు. ఎందుకంటే వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అన్నీ యూట్యూబ్‌లో ఫ్రీగా దొరుకుతాయి. అదే డేటా పట్టుకుని ఏఐ వాయిస్ క్లోనింగ్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం పిల్లల ఆటగా మారుతోంది. మొత్తానికి ఒకప్పుడు సెలబ్రిటీ కావడం గ్లామర్ అయితే, ఇప్పుడు అది ‘హై రిస్క్ ప్రొఫెషన్’గా మారింది. సామాన్యులకు కూడా సమస్యే!ఇది కేవలం స్టార్ల సమస్యే కాదు. ‘వాళ్లకు కోర్టులు, లాయర్లు ఉంటారు మనకేముంది?’ అనుకునే లోపే ఏఐ మోసాలు నేరుగా సామాన్యుడి ఇంటి తలుపు తడుతున్నాయి. సెలబ్రిటీ ముఖాలతో మొదలైన డీప్‌ఫేక్ తంతు ఇప్పుడు మీ అమ్మ, నాన్న, బాస్, పిల్లలు అందరి ముఖాలు, గొంతుల వరకు వచ్చేసింది. మీ తల్లిదండ్రుల స్వరంతో ఫోన్ చేసి ‘అర్జెంటుగా డబ్బు కావాలి’ అని అడిగే కాల్స్; స్కూల్ పిల్లల ఫొటోలు తీసుకుని ఫేక్ వీడియోలు తయారు చేయడం; ఉద్యోగుల ముఖాలతో నకిలీ వీడియో కాల్స్ చేసి ‘మీ మేనేజర్ మాట్లాడుతున్నాడు’ అని నమ్మించడం; మహిళలపై ఏఐ ఆధారిత డిజిటల్ వేధింపులు ఇవన్నీ ఇక అరుదైన వార్తలు కాదు, రోజూ జరుగుతున్న డిజిటల్ డ్రామాలు.ఇలా డీప్‌ఫేక్స్ ఇప్పుడు ప్రజాస్వామ్యం, భద్రత, గౌరవం అన్నింటినీ ఒకేసారి పరీక్షిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్‌లాంటి ప్రముఖులే తమ గుర్తింపును కాపాడుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్లకు లాయర్లు ఉంటారు, తీర్పులు వస్తాయి. మనకు మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధ. చెప్పినా నమ్మేవారు ఉండరు. ఇలా మొత్తానికి ఈ డిజిటల్ యుగంలో ‘చూశాం కదా విన్నాం కదా’ అనేది ఇక సాక్ష్యం కాదు. నమ్మకం కూడా ఒక రిస్క్ అయిపోయింది. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా ఏఐ ముందు అందరం సమానమే! తేడా ఒక్కటే వాళ్లకు పేరు పోతుంది, మనకు డబ్బు, పరువు, మనశ్శాంతి అన్నీ పోతాయి. ఏం చేస్తుందంటే? ఈ రోజుల్లో గుర్తింపు అంటే పేరు, ఊరు, ఆధార్ నంబర్ కాదు. అది ఒక ఫోల్డర్లో దాచిన డేటా. అందులో ఒక ఫొటో, రెండు వీడియోలు, ‘హలో ఎలా ఉన్నారు?’ అన్నంత వాయిస్ ఉంటే చాలు. మిగతా పనంతా ఏఐ చూసుకుంటుంది. మీ ముఖం తీసుకుంటుంది. వేరే మనసు పెడుతుంది. వేరే మాటలు మాట్లాడిస్తుంది. అలా మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించని స్థితిలోకి మనల్ని నెడుతుంది, మన గొంతుతోనే మనం ఎప్పుడూ మాట్లాడని మాటలు మాట్లాడిస్తుంది. ఫలితం? ఆ వీడియో చూసినవాళ్లు ‘ఇది ఫేక్ అయి ఉండదులే, మనవాడే’ అంటూ షేర్ బటన్ కొడతారు. ఎందుకంటే డీప్‌ఫేక్‌లో ఉన్న ముఖం, మాస్క్ కాదు, అసలైన మన ముఖమే! అది నిజమైనదే కాబట్టి, ప్రేక్షకులు కూడా నిజమే అనుకుంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్. సమస్య ఏఐ ఎంత తెలివైనదో కాదు, మనం ఎంత అమాయకులమో. ఒకప్పుడు ‘చూశాను కాబట్టి నిజం’ అనేవాళ్లం. ఇప్పుడు కళ్లతో చూసే వాటిని కూడా నమ్మకూడదు. ఫిల్టర్ లేకుండా కనిపించిన ముఖం నిజమా? లేక ఏఐ సాఫ్ట్‌వేర్‌లో పుట్టిన పర్ఫెక్ట్ సినిమా సీనా? తెలియదు. మన మెదడే కన్ఫ్యూజ్ అవుతోంది. అందుకే, మనమే స్క్రీన్ పై ఉన్నా, మనమేనా కాదా అన్న డౌట్ మనకే క్రియేట్ చేస్తుంది. అందుకే, ఏఐని పూర్తిగా ఆపడం అంటే సముద్రానికి స్టాప్ బోర్డ్ పెట్టినట్టే. మన వివేచన, జాగ్రత్త, చట్టాలు కలిసి పనిచేయకపోతే, రేపు మన ముఖం మనదేనా అనే ప్రశ్నకే సమాధానం చెప్పలేని రోజులు రావచ్చు. న్యాయస్థానం! ఏఐ డిజిటల్ దొంగలా రోజుకో కొత్త వేషం మార్చుకుంటూ పరుగెడుతుంటే, కోర్టు మాత్రం ‘ఒక్క నిమిషం’ అంటూ స్టే ఆర్డర్లు ఇస్తూ హ్యామర్ ఎత్తుతోంది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే కొన్ని కేసుల్లో కఠిన ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఏఐతో తయారైన వీడియోలు, వాయిస్ క్లిప్‌లు ఇకపై సరదా ఆటలు కాదు; అవి నేరాలే! అలాంటి కంటెంట్‌ను ఆపేయాలి, తొలగించాలి, అవసరమైతే తయారుచేసిన వాళ్లను కూడా లాక్కొచ్చి ప్రశ్నించాలి అని న్యాయస్థానం క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. ఒకప్పుడు ‘వైరల్ అవుతుంది’ అనుకున్న వీడియో ఇప్పుడు ‘వారంట్ వచ్చే చాన్స్ ఉంది’ అనే స్థాయికి చేరింది.కాని, చట్టం ఇంకా అలర్ట్ మోడ్‌లోకి పూర్తిగా రాలేదు. ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలు అసభ్య కంటెంట్‌ను నిర్ణీత సమయంలో తొలగించాలంటున్నప్పటికీ, అమలు బలహీనంగా ఉంది. ఏఐ వేగానికి చట్టం వెనుకబడుతోంది. ఆ సమయంలో ఏఐ మాత్రం ఇంకో ఐదు కొత్త వీడియోలు, పది కొత్త ఫేక్ అకౌంట్లు తయారు చేసేస్తుంది. టెక్నాలజీ రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంటే, చట్టం మాత్రం ఫైల్ పట్టుకుని, నోటీసు రాసుకుంటూ ఉంటోంది. ఇలా ఒక వైపు ఏఐ అప్డేట్ నోటిఫికేషన్, ఇంకో వైపు కోర్ట్ హియరింగ్ డేట్ ఇద్దరి మధ్య స్పీడ్ మ్యాచ్ అసలు జరగట్లేదు. అందుకే చట్టాలు మరింత కఠినంగా మారాలి, అమలు బలపడాలి, ఎందుకంటే రేపు కోర్టులు తీర్పులు ఇస్తుండే సమయానికి, ఏఐ మాత్రం ఇంకో కొత్త వేషంలో నవ్వుతూ ముందుకెళ్లిపోతుంది. అసలైన యజమాని ఎవరు?ఈ డీప్‌ఫేక్ గందరగోళం మధ్యలో ఇంకొక పెద్ద ప్రశ్న నిశ్శబ్దంగా నిలబడి చూస్తోంది. ఏఐ యుగంలో ఒక మనిషి వ్యక్తిత్వానికి నిజమైన యజమాని ఎవరు? మనమా, టెక్నాలజీనా, లేక ‘డౌన్ లోడ్ చేసుకున్నాడు కాబట్టి వాడేసుకున్న వాడా?’ న్యాయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, భారతదేశానికి ఇప్పుడిప్పుడే సరిపడే చట్టాలు కాకుండా, ప్రత్యేకంగా ఏఐ కోసం తయారైన స్పష్టమైన చట్టం అవసరం. అనుమతి అంటే ఏంటి? ఒకసారి ఇచ్చిన అనుమతి జీవితాంతం చెల్లుతుందా, లేక ఒక ప్రాజెక్ట్ వరకేనా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకు సరైనది, ఎక్కడి నుంచి దోపిడీగా మారుతుంది? వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతూనే, అతని ముఖం, స్వరం, గుర్తింపును ఎలా రక్షించాలి? ఇవన్నీ ‘కేసు వచ్చినప్పుడు చూస్తాం’ అనే విధంగా కాకుండా, ముందే కచ్చితంగా నిర్వచించాల్సిన ప్రశ్నలు.ఇక్కడే మరో బలమైన ట్విస్ట్. అధిక నియంత్రణ పెడితే సృజనాత్మకత ఊపిరాడకుండా పోతుందా? నియంత్రణ లేకపోతే అసురక్షితంగా మారుతుందా? ఇలా ఇది బ్రేక్–యాక్సిలరేటర్లాగా రెండూ ఒకేసారి బ్యాలెన్ ్స చేయాల్సిన డ్రైవింగ్. అంతే కాదు, మరణానంతర హక్కులు అనే కొత్త అధ్యాయం కూడా తెరమీదకి వస్తోంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని రూపం, స్వరం రక్షణలో ఉండాలా? లేక అతను చరిత్రలోకి వెళ్లగానే ఎవరికైనా వాడుకునే ఫ్రీ డేటాగా మారాలా? డిజిటల్ పునర్జన్మ సాధ్యమైన ఈ కాలంలో, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే ముఖాలు, పాడే గొంతులు కనిపిస్తున్నప్పుడు, ఇది కేవలం న్యాయపరమైన సమస్య కాదు, నైతిక సరిహద్దులపై జరుగుతున్న పెద్ద చర్చ. చివరికి సమాధానం ఒక్కటే కావాలి: ఏఐ ఎంత తెలివైనదైనా, వ్యక్తిత్వానికి అసలైన యజమాని మనిషే అని చట్టం కూడా, సమాజం కూడా స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటం!డీప్‌ఫేక్ అనే వైరస్ నేడు పాస్‌పోర్ట్ లేకుండానే ప్రపంచమంతా తిరుగుతోంది. హాలీవుడ్ నుంచి హైకోర్టుల వరకూ అందరికీ ఇదే ప్రశ్న ‘ఇది నా గొంతేనా, నా ముఖమేనా?’ అమెరికాలో స్కార్లెట్ జోహాన్సన్, టామ్ హ్యాంక్స్, స్టీఫెన్ ఫ్రై లాంటి స్టార్లు తమ వాయిస్, ఇమేజ్ను అనధికారంగా వాడుతున్నారని గట్టిగా గళమెత్తారు. స్టార్ పవర్ ఉన్నవాళ్లే ఇలా మాట్లాడాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, 2025 నాటికి 400 మందికి పైగా అంతర్జాతీయ కళాకారులు ఏఐ కంపెనీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.ప్రస్తుతం ఇదే ఒక గ్లోబల్ అలారంలా మారుమోగుతోంది. కాని, కథ అంతా పోరాటమే కాదు. కొందరు కళాకారులు ఏఐని శత్రువుగా కాకుండా, సరిగ్గా వాడితే శక్తిమంతమైన భాగస్వామిగా చూస్తున్నారు. పాప్ సింగర్ గ్రైమ్స్ తన అధికారిక ఏఐ వాయిస్ మోడల్‌ను విడుదల చేసి ‘ఇది నా గొంతు, నా షరతులపై’ అని స్పష్టం చేసింది. జాన్ లెనన్ పాత రికార్డింగ్‌ను ఏఐ సహాయంతో పాటగా మార్చినప్పుడు కూడా అదే సందేశం కనిపించింది. ఇలా సరైన అనుమతి, సరైన గడులు ఉంటే ఏఐ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో! సమస్య టెక్నాలజీలో కాదు; దాన్ని ఎవరు, ఎలా వాడుతున్నారన్న దానిపైనే ఉంటుందని మరికొందరి వాదన. నిపుణుల మాటల్లో...న్యాయ నిపుణులు ఈ మొత్తం ఏఐ గందరగోళాన్ని చూసి చెప్తున్న మాటలేంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఏఐకి సంబంధించిన అసలు లోపం చట్టాల్లో స్పష్టత లేకపోవడమే. ‘ఏఐ వ్యక్తిత్వ హక్కులు’ కోసం ప్రత్యేక చట్టం లేదు. ఐటీ యాక్ట్ ఉన్నా, అది ఏఐ చేసిన నష్టం తర్వాత మాత్రమే ‘ఈ కంటెంట్ తీసేయండి’ అని చెప్పగలదు. కాని, అది జరగకముందే ఆపే ప్రయత్నాలు చేయలేదు. అంటే ఇది తలుపు పగిలిన తర్వాత తాళం వేసినట్టే! అందుకే, ఇందుకోసం, ప్రత్యేక పర్సనాలిటీ రైట్స్ చట్టం రావాలి. అనుమతులు, వాణిజ్య వినియోగం, శిక్షలు స్పష్టంగా ఉండాలి.ప్యాచ్‌లతో పని జరగదు. ప్రశ్నలు మాత్రం ఇంకా ఉన్నాయి. అనుమతి ఒకసారి ఇచ్చితే జీవితాంతం వర్తించేదా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకే సరైనది, ఎక్కడ దోపిడీగా మారుతుంది? ఉల్లంఘన జరిగితే శిక్షలు నిజంగా భయపడేలా ఉండాలా? ఇవన్నీ కేసు వచ్చినప్పుడు కాకుండా, ముందే స్పష్టంగా రాయాలని సూచిస్తున్నారు. ఏఐ మన భవిష్యత్తు అని చెప్పడం సరైనది, కాని, సరైన దారిలో పెట్టకపోతే, అదే ఏఐ మన అసలైన గుర్తింపునే మెల్లగా మాయ చేసే శక్తిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ఎన్ని వేషాలు వేసినా, ఈ డీప్‌ఫేక్ ప్రపంచంలో చివరి గెలుపు మనదే! ఎందుకంటే ముఖం, స్వరం కాదు, అసలు హీరో మన నమ్మకం, మన పరిధి, మన నియంత్రణ. రష్మిక మందన్న‘‘ఇది భయంకరం. ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు. ప్రతి మహిళ గురించి.’’ అని డీప్‌ఫేక్ వీడియోలపై ఆమె బహిరంగంగా స్పందించడంతో, కేంద్ర ఐటీ శాఖ జోక్యం చేసుకుని ప్లాట్‌ఫామ్‌లకు కంటెంట్ తొలగింపు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగంపై చర్చకు దారి తీసింది.సమంత రూత్ ప్రభు‘‘ఆన్ లైన్ లో మహిళలపై జరిగే డిజిటల్ వేధింపులు సాధారణం కాకూడదు.’’ తన పేరుతో ఫేక్ కంటెంట్, మార్ఫ్ చేసిన చిత్రాలపై ఆమె స్పందించడంతో, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల ప్రాముఖ్యతపై అవగాహన పెరిగింది.కీర్తి సురేష్‘‘డిజిటల్ ప్రపంచంలో గౌరవానికి కూడా రక్షణ అవసరం.’’ మార్ఫ్ చేసిన ఫోటోలు, ఫేక్ అకౌంట్లపై ఆమె స్పందనతో ప్లాట్‌ఫామ్‌లు కంటెంట్ తొలగింపు చర్యలు వేగవంతం చేశాయి.పూజా హెగ్డే‘‘ఇది సరదా కాదు, దుర్వినియోగం.’’ ఫేక్ ప్రొఫైల్స్, మార్ఫ్ చేసిన కంటెంట్‌పై ఆమె జారీ చేసిన హెచ్చరికలతో, సైబర్ ఫిర్యాదులపై చర్చ మొదలైంది. అలా తనతో పాటు చాలామంది తమకు జరిగిన సైబర్ నేరాలను బహిరంగంగా ఫిర్యాదులు చేశారు.నయనతార‘‘నా వ్యక్తిగత జీవితం కంటెంట్ కాదు.’’ అనుమతి లేకుండా తన చిత్రాలు, వీడియోలు వినియోగించిన సందర్భాల్లో ఆమె లీగల్ నోటీసుల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు.నాగార్జున అక్కినేని‘‘నా పేరు, నా ఫోటో పెట్టి ఎలాంటి పెట్టుబడి స్కీమ్స్‌ను నేను ప్రచారం చేయడంలేదు.’’ తన పేరుతో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ విభాగాలు అలాంటి కంటెంట్‌ను తొలగించాయి.విజయ్‘‘నా పేరు పెట్టి ఆర్థిక స్కీమ్స్ ప్రచారం చేయడం మోసం.’’ ఫేక్ క్రిప్టో, ఇన్వెస్ట్మెంట్ యాడ్స్‌పై ఆయన హెచ్చరికలు జారీ చేయడంతో, తమిళనాడులో సైబర్ మోసాలపై అవగాహన పెరిగింది.మహేష్ బాబు‘‘నా పేరు, నా ముఖం పెట్టి పెట్టుబడులు కోరితే నమ్మకండి.’’ ఫేక్ ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో ప్రకటనలు వైరల్ కావడంతో ఆయన అభిమానులను అప్రమత్తం చేశారు.అజిత్ కుమార్‘‘నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ఫేక్ అకౌంట్లను నమ్మవద్దు.’’ అంటూ అభిమానులను ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు.అల్లు అర్జున్‘‘నేను ఎలాంటి ఆన్ లైన్ స్కీమ్స్‌ను ప్రమోట్ చేయడం లేదు.’’ ఫేక్ యాడ్స్, మార్ఫ్ చేసిన వీడియోలపై ఆయన స్పందించడంతో, ఆ ఫేక్ కంటెంట్‌ను తొలగించారు.రజినీకాంత్‘‘నా పేరు వాడుకుని ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమే.’’ ఫేక్ యాడ్స్, రాజకీయ–ఆర్థిక ప్రచారాలపై ఆయన స్పష్టత ఇవ్వడంతో, కంటెంట్ తొలగింపులు జరిగాయి.ప్రభాస్‘‘నా పేరుతో వస్తున్న ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ సోషల్ మీడియా పోస్టులు, యాడ్స్‌లో తన ముఖం వాడిన ఘటనల తర్వాత ఆయన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మోహన్ లాల్‘‘నా పేరు, నా ముఖం వాడిన ఆన్ లైన్ ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ యాడ్స్‌పై ఆయన ఫిర్యాదు చేయడంతో, కేరళలో సైబర్ మోసాలపై చర్చ ఊపందుకుంది.యశ్‘‘నా పేరు పెట్టి జరిగే ఆన్ లైన్ ప్రమోషన్లు నావి కావు.’’ ఫేక్ యాడ్స్‌పై ఆయన హెచ్చరికలతో, కన్నడ ప్రేక్షకుల్లో సైబర్ అవగాహన పెరిగింది.అభిషేక్ బచ్చన్ (2025)‘‘ఆటోగ్రాఫ్ అనేది నా అభిమానులతో నా అనుబంధం. కాని, నకిలీ సంతకాలు, డీప్‌ఫేక్ వీడియోలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.’’ ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేసును స్వీకరించి, ఆయన గుర్తింపును దుర్వినియోగం చేసిన అంశంపై విచారణ చేపట్టింది.ఐశ్వర్యరాయ్ బచ్చన్ (2025)‘‘ఇది నా ముఖం. నా పేరు. నా గుర్తింపు. కాని, ఏఐ దాన్ని తీసుకుని అసభ్య వీడియోలు చేసింది, అనుమతి లేకుండా టీషర్టులు, మగ్స్‌పై వాడింది. నేను నటిని కావచ్చు, కాని, నా గౌరవం సినిమా సీన్ కాదు’’ అంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు అనుమతి లేకుండా ఏఐ ద్వారా తయారైన కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని, తొలగించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.అరిజిత్ సింగ్ (2024)‘‘నా స్వరం నా సాధన. అనుమతి లేకుండా దాన్ని వాడటం సంగీతం కాదు.’’ ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, స్వరాన్ని అనధికారంగా వినియోగించ కుండా స్టే ఆర్డర్ జారీ చేసింది.అనిల్ కపూర్ (2023)‘‘నా డైలాగ్‌లు, నా ముఖం ఏఐ యాప్స్‌లో వాడాలంటే నా అనుమతి కావాలి.’’ ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, రూపం, స్వరం వ్యక్తిగత హక్కులేనని స్పష్టం చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది.కరణ్ జోహార్ (2025)‘‘నా పేరు పెట్టి, నా ముఖం పెట్టి అసభ్య కంటెంట్ ప్రచారం చేస్తున్నారు. ఇది నా కథ కాదు, నా సినిమా కాదు.’’ అంటూ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.‘‘నా స్వరం నా సంతకం. దాన్ని పోలిన ఏఐ వాయిస్‌ను నేను అంగీకరించను.’’ ఈ వివాదం తర్వాత సంబంధిత ఏఐ కంపెనీ ఆ వాయిస్ మోడల్‌ను తొలగించింది. – స్కార్లెట్ జోహాన్సన్‘‘ఆ డెంటల్ యాడ్‌లో నేను లేను. అది నా ముఖం వేసుకున్న ఏఐ మాత్రమే.’’ ఈ ఘటనపై ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేయడంతో, న్యాయ చర్యలపై విస్తృత చర్చ మొదలైంది. – టామ్ హ్యాంక్స్‘‘నా తండ్రి స్వరాన్ని తిరిగి సృష్టించడం భావోద్వేగ దోపిడీ.’’ ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో న్యాయ నైతిక చర్చకు దారి తీశాయి. – జెల్డా విలియమ్స్‘‘నా గొంతు నా జీవితం. అనుమతి లేకుండా వాడటం తప్పు.’’ ఈ వ్యవహారంలో ఆయన యుకే కోర్టులో సంబంధిత ఏఐ కంపెనీపై కేసు వేశారు. – స్టీఫెన్ ఫ్రై -
చిన్న ట్విస్ట్!
చీర.. బ్రాండ్: స్వాతి షాపింగ్మాల్జ్యూలరీ బ్రాండ్: ది జ్యూయల్ గ్యాలరీధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.తల్లి కావడమంటే నన్ను నేనే కోల్పోవడమా? కాదు. గ్లామర్, స్టయిల్, కాన్ఫిడెన్స్ ఇవే నా ఐడెంటిటీ. అందుకే సింపుల్, సంప్రదాయ దుస్తుల్లోనూ చిన్న ట్విస్ట్ ఇస్తాను. కటౌట్ నెక్లైన్ , వన్ సైడ్ ఫ్లేర్ టాప్, ప్రీ–డ్రేప్డ్ చీరలకు బెల్ట్. అలాగే వెస్ట్రన్ వేర్లో లేయరింగ్, హెవీ అఫ్గాన్ జ్యూవెలరీతో ఎడ్జ్ ఇవ్వడం నా సిగ్నేచర్ స్టేట్మెంట్స్. ఇలా బోల్డ్‌గా ఉండటం అవమానం కాదు. నేను మోరల్ పోలీస్ కోసం కాదు, నా కోసం స్టయిల్ అవుతాను.– అనసూయ భరద్వాజ్. -
అవి చూస్తే వణుకు పుడుతుంది
అనుకోకుండా మొదలైన అనశ్వర రాజన్ ప్రయాణం,నేడు ఎన్నో లక్ష్యాలు, ఎన్నో కలలతో నిండిపోయింది. మనసులో ఎన్నో గాయాలను దాచుకుని ముందుకు నడుస్తున్న ఆమె ప్రపంచం గురించిన విషయాలు ఆమె మాటల్లోనే...⇒ నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. కరివెల్లూరులో చదువుతున్న రోజుల్లో, నా తొలి ఆడిషన్ కు ఒక ఫ్రెండ్ నన్ను లాక్కెళ్లింది.⇒ సినిమాల్లోకి వచ్చాక నా స్కూల్ జీవితం ఒంటరిగా మారిపోయింది. కొంతమంది టీచర్లు, పేరెంట్స్ నన్ను వేరుగా చూసేవారు. ‘‘నీకు సినిమాలు ఉన్నాయిగా, చదువు ఎందుకు?’’ అనే మాటలు ఇప్పటికీ బాధిస్తాయి. స్కూల్ మానేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి.⇒ ఐదో తరగతిలో ఉన్నప్పుడు బస్సులో ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పటికీ వెంటాడుతుంది. ఆ సంఘటన నా బాల్యాన్ని పెద్దదిగా చేసింది. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే కొంత ఆందోళనగానే ఉంటుంది.⇒ ఇప్పుడు అంతకంటే భయం కలిగించేది డిజిటల్ ప్రపంచం. ఏఐతో మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే నిజంగా వణుకు పుడుతుంది. వాటిని ఆపలేకపోవడం చాలా బాధగా ఉంటుంది.⇒ గత ఏడాది ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన వివాదం నాకు చాలా నేర్పింది. ఆ సమయంలో నేను బాధితురాలిలా మౌనంగా ఉండలేదు. నా పేరు, నా గౌరవం కోసం నిలబడ్డాను. అదే నా నిజమైన బ్రేక్‌త్రూ.⇒ ‘‘పెళ్లి గురించి కాదు, నీ కెరీర్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించు’’ అని చెప్పే ప్రోగ్రెసివ్ తండ్రి నాకు దొరికారు. ఆయనే నా అతిపెద్ద బలం. ఇప్పుడు నా దుస్తులు, నా ఎంపికల గురించి ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోవడం మానేశాను. నాకు ఎవరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేర్చుకున్నాను.⇒ షూటింగ్ లేనప్పుడు నా బ్యాగ్‌లో తప్పకుండా ఒక పుస్తకం ఉంటుంది. నేను పూర్తిగా రొమాంటిక్ నవలల ఫ్యాన్ ని. చదవకపోయినా, కొనకుండా ఉండలేను.⇒ స్కిన్ కేర్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. మేకప్ తప్పకుండా తీసేస్తాను. ముందుగా ఆయిల్‌తో క్లీనింగ్, తర్వాత మేకప్ రిమూవర్, ఆపై ఫేస్ వాష్ డబుల్ క్లీన్సింగ్ లేకపోతే నిద్రపోను. షూటింగ్ లేనప్పుడు ‘క్లీన్ గర్ల్ లుక్’ ఇష్టం. సింపుల్ స్కిన్, కాస్త డార్క్ కాజల్ అంతే.⇒ మలయాళం వరకు మాత్రమే కాదు, ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాను. ‘చాంపియన్’ నా తొలి తెలుగు సినిమా. మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. -
ఆటపాటల అట్టహాసం
ఆటపాటల అట్టహాసం ఆ నగరంలో సందడి సందడిగా కనిపిస్తుంది. వీథుల్లో ఎక్కడ చూసినా సంప్రదాయ వాద్యాలకు అనుగుణంగా చిన్నా పెద్దా, ఆడా మగా చెట్టా పట్టాలేసుకుని అడుగులో అడుగులు కదుపుతూ నాట్యకేళితో కనువిందు చేస్తారు. ఒకరోజు కాదు, ఏకంగా పదిరోజులు అట్టహాసంగా సాగే ఆటపాటలతో సాగే అద్భుతమైన వేడుక ఇది. ఈ నాట్యోత్సవానికి వేదిక పెరులోని ట్రుజిలో నగరం. ట్రుజిలో నగరంలో ప్రతి ఏటా జనవరి నెలలో ‘ట్రుజిలో మరీనెరా’ పేరిట జరిగే ఈ నాట్యోత్సవాన్ని తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారు. పెరు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే ఈ పదిరోజుల పండుగలో అశ్వికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉరకలేసే పెరూవియన్ పాసో అశ్వాలను అధిరోహించిన అశ్వికులు నాట్యోత్సవం కొనసాగే వీథుల్లో విన్యాసాలు చేస్తూ తిరుగుతుంటారు. చిత్రవిచిత్ర గతులలో నాట్యమాడే నాట్యగత్తెలతో అశ్వాల మీద కూర్చునే సయ్యాటలాడుతుంటారు.పెరూ ప్రభుత్వం ఈ వేడుకను జాతీయ సాంస్కృతిక వేడుకగా గుర్తించింది. ట్రుజిలో నగరంలో జరిగే ఈ పది రోజుల పండుగలో జనాలు పెరూవియన్ సంప్రదాయ ‘మరీనెరా’ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అందువల్ల పెరు ప్రభుత్వం ట్రుజిలో నగరాన్ని ‘మరీనెరా రాజధాని’గా గుర్తించింది. ఈసారి ట్రుజిలోలో ఈ వేడుకలు జనవరి 20 నుంచి 30 వరకు జరగనున్నాయి.ఈ సందర్భంగా జాతీయ మరీనెరా పోటీలను కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకలు జరిగే పది రోజుల్లోనూ ట్రుజిలో నగరం నలుమూలలా వీథుల్లో భారీ స్థాయిలో ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఊరేగింపుల్లో రథాల వంటి వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగిస్తారు. ఈ రథాలపై కొందరు నర్తకీమణులు రాణుల వేషాలలో నర్తిస్తూ జనాలను అలరిస్తారు. వీథుల్లో రథాల వెంట నడుస్తూ ఆడా మగా అన్ని వయసుల వారు జంటలు జంటలుగా నాట్యాలు సాగిస్తుంటారు. -
సుదీర్ఘ సొరంగ రహదారి
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సొరంగ రహదారి. చైనా ప్రభుత్వం గత డిసెంబర్ 16న దీనిని ప్రారంభించింది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద కొండలను తొలిచి నిర్మించిన ఈ సొరంగ రహదారి పొడవు 22.13 కిలోమీటర్లు. ఉరుంకీ నగరం నుంచి కోర్లా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ సొరంగ రహదారిని నిర్మించింది. ఉరుంకీ నుంచి కోర్లాకు ఇదివరకు ఏడుగంటలు పట్టేది.ఈ సొరంగం వల్ల ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గింది. దాదాపు ఏడువందల మీటర్ల లోతున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం వల్ల అతి శీతల వాతావరణంలో సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. పూర్తిగా మంచు నిండిన మార్గంలో వాహనాలు ప్రయాణించడం దుస్సాధ్యంగా ఉండేది. ఈ సొరంగం నిర్మించడం వల్ల మంచు కారణంగా ఆటంకాలు లేకుండా, సురక్షితంగా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. -
బ్రహ్మలోకానికి వెళ్లిన హనుమ
రామ రావణ యుద్ధం ముగిసింది. సుగ్రీవాది వానర ప్రముఖుల సమక్షంలో విభీషణుడిని లంకా«ధిపతిగా రాముడు పట్టాభిషేకం జరిపించాడు. విభీషణుడి అతిథి మర్యాదలు పొందిన తర్వాత రాముడు అయోధ్యకు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. రాముడి ప్రయాణం కోసం విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేయించాడు. సీతా లక్ష్మణ సమేతంగా రాముడు పుష్పకంలోకి అడుగుపెట్టాడు. ఎందరు ఎక్కినా మరొకరికి చోటు మిగిలి ఉండే పుష్పక విమానంలో తమతో పాటు విభీషణుడిని, సుగ్రీవాది వానర వీరులను కూడా రమ్మని రాముడు ఆహ్వానించాడు. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు సహా వానర వీరులంతా పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. విమానంలోకి అందరూ వచ్చారో లేరోనని రాముడు ఒక్కొక్కరినీ పరికించి చూశాడు. వానర వీరుల్లో గంధమాదనుడు కనిపించలేదు.‘గంధమాదనుడు ఏడీ?’ అడిగాడు రాముడు.‘యుద్ధంలో కుంభకర్ణుడి చేతిలో మరణించాడు’ బదులిచ్చాడు విభీషణుడు.‘అయ్యో! నాకు సహాయం చేయడానికి వచ్చి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడా? ఈ దురవస్థను తప్పించేవారే లేరా?’ అని రాముడు ఎంతో విచారించాడు. ‘మన హనుమ చెంతనుండగా దిగులు ఎందుకు స్వామీ’ అన్నాడు జాంబవంతుడు.రాముడు వెంటనే హనుమంతుడిని చెంతకు పిలిచి, ‘హనుమా! గంధమాదనుడు ఏ లోకంలో ఉన్నా, తీసుకురా! ఈ పని నీ ఒక్కడికే సాధ్యం’ అన్నాడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ! గంధమాదనుడు ఎక్కడ ఉన్నా, వెదికి నీ ముందుకు తీసుకొస్తా’ అంటూ హనుమ శరీరాన్ని భారీగా పెంచాడు. ఆకాశాన్ని ఆవరించుకున్న ఇంద్రధనుస్సులా తోకను పెంచాడు. నేలను పాదాలతో తాటించాడు. హనుమ పదఘట్టనలకు నేల కంపించింది. ఒక్కసారిగా హూంకరించి, నింగికెగశాడు హనుమ. నేరుగా యమపురికి చేరుకుని, యముడి కోట ద్వారం వద్ద నిలబడి భీకరంగా సింహనాదం చేశాడు. హనుమంతుడి సింహనాదానికి యముడి సింహాసనం అదిరిపడింది. యముడు క్షణకాలం భయకంపితుడయ్యాడు. పరుగు పరుగున బయటకు వచ్చి, హనుమ ఎదుట నిలిచి, అతడికి సగౌరవంగా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, లోనికి తీసుకువెళ్లి, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు.‘హనుమా! నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు యముడు. ‘రామ రావణ సంగ్రామంలో మరణించిన మా వానరయోధుడు గంధమాదనుడిని నాతో పంపాలి’ అన్నాడు.‘గంధమాదనుడు నా లోకంలో లేడయ్యా! యుద్ధంలో వీరమరణం పొందాక అతడు సత్యలోకానికి చేరుకున్నాడు!’ చెప్పాడు యముడు.యముడి వద్ద సెలవు తీసుకుని, హనుమంతుడు నేరుగా సత్యలోకానికి వెళ్లాడు. సత్యలోకంలో హనుమంతుడు బ్రహ్మదేవుడి సభామంటపానికి చేరుకునే సరికి అక్కడ ద్వాదశాదిత్యులు ముకుళిత హస్తాలతో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తూ నిలుచున్నారు. నారదుడు మహతి మీటుతుండగా, మునీశ్వరులు సృష్టికర్త కీర్తిగానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. సరస్వతీ సమేతంగా బ్రహ్మదేవుడు పద్మాసనంపై ఆసీనుడై ప్రసన్నవదనంతో అంతా తిలకిస్తూ ఉన్నాడు. సభా మంటపంలోకి హనుమంతుడు అకస్మాత్తుగా వచ్చేసరికి అందరూ అతడివైపు చూశారు. హనుమ వినయంగా బ్రహ్మదేవుడికి మొక్కాడు. ‘హనుమా! నీ రాక నాకు సంతోషం కలిగించింది. ఇంతకూ నీ రాకకు కారణమేమిటి?’ అడిగాడు బ్రహ్మదేవుడు.‘తాతా! నీకు తెలియనిదేమున్నది? రామ రావణ సంగ్రామంలో వీరమరణం చెందిన మా వానర యోధుడు గంధమాదనుడు నీ లోకంలోనే ఉన్నాడు. అతడిని వెంటబెట్టుకు రావాలని రామాజ్ఞ! అతడు లేకుండా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరేది లేదని, అతడిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి రాముడు నన్ను పంపాడు. అందువల్ల మా గంధమాదనుడిని నాతో పంపు’ అని చెప్పాడు హనుమంతుడు. ‘హనుమా! రామ కార్యార్థమై యుద్ధంలో శరీరత్యాగం చేసిన గంధమాదనుడు అమరుడయ్యాడు. అతడిని తిరిగి భూలోకానికి పంపకూడదు. అయినా, తనువుడిగిన వానిని తిరిగి తెస్తానని ప్రతినపట్టి మరీ చెల్లించుకోవడం నీకే చెల్లింది. రామాజ్ఞ అని నువ్వు చెబుతున్నావు కనుక కాదనేది ఏముంది?’ అని హనుమంతుడిని పొగిడి, గంధమాదనుడిని అతడితో పంపాడు బ్రహ్మదేవుడు.గంధమాదనుడిని తీసుకుని హనుమంతుడు నేరుగా పుష్పకవిమానంలో ఉన్న రాముడి వద్దకు చేరుకున్నాడు. రాముడు హనుమంతుడిని, గంధమాదనుడిని ఆలింగనం చేసుకున్నాడు. గంధమాదనుడి యోగక్షేమాలను కనుక్కున్నాడు. గంధమాదనుడి రాకతో కపివీరులందరూ సంతోషించారు. పుష్పక విమానం అయోధ్యకు బయలుదేరింది.∙సాంఖ్యాయన -
సిటీలో కొడితే దుబాయ్‌లో తగిలింది!
దుబాయ్ కేంద్రంగా మాఫియా నడిపించిన అలీ భాయ్, 2001లో హైదరాబాద్‌లోని టోలిచౌకి నుంచి పన్నెండేళ్ల సుమేధను తన అనుచరులతో కిడ్నాప్ చేయించాడు. ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ చిన్నారిని రక్షించడానికి ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. అలీ భాయ్ దుబాయ్‌లో ఉండటం; ఇక్కడి అనుచరుల ఆచూకీ తెలియకపోవడం; డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకుంటే చిన్నారిని చంపేస్తామని బెదిరిస్తుండటంతో స్పెషల్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అప్పుడే తనదైన పంథాలో ఆలోచించిన ఓ అధికారి ఇక్కడ కొందరిని ‘టచ్’ చేసి ఆ సౌండ్ దుబాయ్‌కి వినిపించేలా చేశారు. దెబ్బకు దిగివచ్చిన అలీ భాయ్ సుమేధను సురక్షితంగా జహీరాబాద్‌లో విడిచిపెట్టించాడు. అప్పుడు ఏం జరిగిందంటే..!మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన సయ్యద్ అబిద్ హుస్సేన్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. 1993లో దుబాయ్ వెళ్లి వ్యాపారం చేశాడు. అతడికి అక్కడే ముంబైకి చెందిన అబ్దుల్ ఖయ్యూం షేక్ అలియాస్ రాజ్, ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన అల్తాఫ్ ఆలం ఖాన్ అలియాస్ విక్కీతో పరిచయమైంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన ఛోటా రాజన్‌కు ఈ ద్వయం అనుచరులుగా వ్యవహరించింది. వీరి పరిచయంతో అబిద్ తన పేరును అలీ భాయ్‌గా మార్చుకుని విక్కీకి అనుచరుడిగా మారాడు. అంతటితో ఆగకుండా ఆ ద్వయంతో కలిసి బెదిరింపు వసూళ్లు, కిడ్నాప్‌లు చేయాలని పథకం వేశాడు. దీనికి వాళ్లు అంగీకరించడంతో దుబాయ్ నుంచే హైదరాబాద్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొన్ని నేరాలు చేశారు. అక్కడ నుంచే కథ నడిపించిన ఈ ముగ్గురూ ఇక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్ నుంచి అలీ భాయ్ పథకం వేయడం; మిగిలిన ఇద్దరూ తమ అనుచరుల ద్వారా అమలు చేయడం; సెల్ ఫోన్, శాటిలైట్ ఫోన్ల ద్వారా టార్గెట్‌ను బెదిరించి డబ్బు వసూలు చేయడం– ఇలా కొన్నాళ్లు ఓ మాఫియా సామ్రాజ్యాన్నే నడిపారు. ఎక్కడిక్కడ స్థానిక రౌడీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని హడలెత్తించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్జా అసద్ అలీ, మహ్మద్ నవీద్, బుద్వేల్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్ తదితరులు అలీ భాయ్ కోసం పని చేశారు. అలీ భాయ్ 2001 మార్చి 23న జూబ్లీహిల్స్‌కు చెందిన బడా వ్యాపారి కుమార్తె సుమేధను కిడ్నాప్ చేయించాడు. అప్పట్లో తొమ్మిదో తరగతి చదవుతున్న ఆమె పాఠశాలకు వెళ్తుండగా టోలిచౌకిలో అపహరణకు గురైంది. ఈ చిన్నారిని తీసుకువెళ్లిన అలీ భాయ్ అనుచరులు జహీరాబాద్‌లో సిద్ధం చేసుకున్న డెన్‌లో దాచారు. దుబాయ్ నుంచి చిన్నారి తండ్రికి ఫోన్ చేసిన అలీ భాయ్ తమ అధీనంలో ఉన్న సుమేధను సురక్షితంగా విడిచిపెట్టడానికి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడినని, ఈ మొత్తాన్ని డాలర్ల రూపంలో సిద్ధం చేసి ఉంచాలని, ఎక్కడ ఇవ్వాలో చెప్తానని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోయినా చిన్నారిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంలో విక్కీ సైతం సుమేధ తండ్రితో బేరసారాలు చేశాడు. అలీ భాయ్, విక్కీ బెదిరింపులకు భయపడని సుమేధ తండ్రి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే అలీభాయ్ వ్యవహారాలపై సమాచారం ఉన్న ఉన్నతాధికారులు సుమేధ కేసు డీల్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. దీనికి నేతృత్వం వహించిన కీలక అధికారి తనదైన పం«థాలో ముందుకు వెళ్లారు. సుమేధను సురక్షితంగా తీసుకురావాలంటే అలీ భాయ్‌ని ఎమోషనల్‌గా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ బృందాన్ని జహీరాబాద్ పంపి అలీ పూర్వాపరాలు, ఆప్తుల వివరాలు ఆరా తీయించారు. అలీ భాయ్ అమితంగా అభిమానించే ఇద్దరు సమీప బంధువుల విషయం ఇలా పోలీసుల దృష్టికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయని పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటికే శివార్లలో ఓ రహస్య సేఫ్ హౌస్‌ను సిద్ధం చేసి ఉంచారు. అలీ భాయ్ సమీప బంధువులను అక్కడకు తరలించిన పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఇక్కడ సేఫ్ హౌస్‌లో ఉన్న వారిని ఇంటరాగేషన్ చేస్తూ వారి అరుపులు, మాటల్ని ఫోన్ ద్వారా దుబాయ్‌లో ఉన్న అలీ భాయ్‌కి వినిపించారు. ఆ చిన్నారిని చిన్న గాయమైనా వీళ్లను ఎన్కౌంటర్ చేస్తామని, 24 గంటల్లో సుమేధ సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరకుంటే మళ్లీ ఈ ఇద్దరు సన్నిహితులు నీకు కనిపించరంటూ అల్టిమేటం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఈ షాక్‌కు భయపడిన అలీ భాయ్ దిగి వచ్చాడు. సుమేధను వదిలి వెళ్లిపోవాలంటూ తన అనుచరులకు చెప్పి, జహీరాబాద్ చిరునామాను పోలీసులకు అందించాడు. హైదరాబాద్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న మెదక్ పోలీసులు సుమేధను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ తర్వాతే ప్రత్యేక బృందం అలీ భాయ్ సన్నిహితులను తమ సేఫ్ హౌస్ నుంచి బయటకు పంపింది. దీంతో పాటు మరికొన్ని నేరాలు చేసిన అలీ భాయ్, విక్కీలను పోలీసులు దుబాయ్ నుంచి రప్పించారు. అలీ భాయ్‌ని 2007లో హైదరాబాద్, విక్కీని దీనికి ముందే పుణేకు డిపోర్ట్ అయ్యారు. అలీ భాయ్‌ని బలవంతంగా దుబాయ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత సుమేధ కేసు విచారణ కోసం విక్కీని సైతం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో కేవలం ఇద్దరు అధికారులే వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించడానికి సిద్ధం అయ్యారు. ఎలాంటి సాయుధ ఎస్కార్ట్ లేకుండా కేవలం ఇద్దరు అధికారులు ఓ సుమోలో తీసుకువెళ్లడంతో ఆ ద్వయం కంగుతింది. తాము మాఫియా డాన్స్ అని, దావూద్ అనుచరులమని, ఇలా భద్రత లేకుండా తీసుకువెళ్తే ఎలా? అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇవేవీ పట్టించుకోలేదు. దీంతో ఓ దశలో ఇలా సింపుల్‌గా కోర్టుకు రావడానికి అలిగిన అలీ, విక్కీ తప్పనిసరి పరిస్థితిలో సుమో ఎక్కారు. -
ఈ వారం కథ: రైలు పట్టాలపై పదిపైసలు
‘‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుర వేమ!’’ యాభైమంది ఐదో తరగతి పిల్లలతో ఉన్న ఆ క్లాసు కోలాహలంగా ఉంది. టీచర్ దృష్టిలో పడాలని ఒకరిని మించి ఒకరు పెద్దపెద్ద గొంతులతో బోర్డుపైన ఉన్న పద్యాన్ని అందరికంటే ముందు చెప్పడానికి తాపత్రయ పడుతున్నారు. పద్యం చెప్తున్న రమణ ఒక్కసారిగా గొంతు తగ్గించి, పక్కనున్న వెంకట్ డొక్కలో చిన్నగా పొడిచి ‘బయటికి వెళ్దాం’ అన్నట్టుగా కంటితో సైగ చేశాడు.వెంకట్ అతని వంక చూసి ‘వద్ద’న్నట్టుగా కళ్ళతోనే వారించాడు. ‘రాకపోతే నీ అంతు తేలుస్తా’ అన్నట్లుగా వేలు చూపిస్తూ బెదిరించాడు రమణ. కాసేపటికి రీసెస్ బెల్ కొట్టడంతో పుట్టలోంచి చీమలు వచ్చినట్లుగా క్లాసులోంచి పిల్లలంతా బయటకు వచ్చారు. ఒకర్నొకరు తోసుకుంటూ ఆడుకున్నారు. కనిపించే చెట్టుకొమ్మల్ని పట్టుకుని వేలాడారు. చిన్న చిన్న కర్రపుల్లల్ని చేతిలో పట్టుకుని కనిపించిన కుక్కల్ని తరుముతూ కొంతసేపు ఆడుకుని వెనక్కి తిరిగారు. ‘‘ఏరా.. రైలును చూట్టానికి ఎప్పుడెళ్తున్నావు’’ అన్నాడు శ్రీను.ఆ మాటలకు పెద్దగా నవ్వసాగాడు రమణ. వాడెందుకు నవ్వుతున్నాడో అర్థంకాక ‘‘పిచ్చిపట్టిందా... అలా నవ్వుతున్నావ్’’ అన్నాడు శ్రీను. నవ్వడం ఆపి శ్రీను వైపు చూస్తూ ‘‘ఈడిని క్లాసులో నుంచి రమ్మంటేనే బయటికి రావడానికి భయపడ్డాడు. ఇక రైలును చూశాడంటే అక్కడి నుంచి వెనక్కి రాడేమో! వీడొట్టి పిరికోడు..’’ అన్నాడు రమణ. ఆ మాటలకు వెంకట్ ఉక్రోషంగా చూశాడు. మిగతా పిల్లలంతా తన వైపు వేళాకోళంగా చూడడం అవమానంగా అనిపించింది. రమణ వైపు చూస్తూ ‘‘నాకేమీ భయం లేదు. తప్పకుండా రైలును చూసొత్తా’’ అన్నాడు. ఆ మాటలకు మళ్ళీ పెద్దగా నవ్వుతూ ‘‘రైలుని చూడ్డానికే ఇంత భయపడేవాడు ఇక రైలు పట్టాలపై పది పైసల బిళ్లనెలా పెడతాడు?’’ అన్నాడు రమణ. ఏమీ మాట్లాడకుండా వాడివైపు చూశాడు వెంకట్. వాడి చూపుల నిండా వేళాకోళం, వెక్కిరింత కనిపించింది. వెంకట్ వాడి వంక చూస్తూ ‘‘ఈరోజు ఎలాగైనా అక్కడికి వెళ్తాను. రైలును చూస్తాను. రైలు పట్టాలపై పదిపైసల నాణెం పెట్టి తీసుకొచ్చి, నీకు చూపిస్తాను’’ అన్నాడు ఉక్రోషంగా.‘అవేమీ జరిగే పనులు కాదులే... పద పద’ అన్నట్లుగా నవ్వాడు రమణ. పిల్లలంతా క్లాసుకు చేరుకున్నారు.టీచర్ మళ్ళీ పద్యాన్ని వల్లె వేయించసాగింది. ప్రతి పదం దగ్గరా ఆగుతూ, దాని భావాన్ని చెప్తూ, ఎవరైనా పిల్లలు తప్పు చెప్తే దాన్ని సరిచేసి మళ్లీ చెప్పసాగింది. వెంకట్ వింటున్నాడే గాని, కళ్లముందు రైలు కదలాడసాగింది. ఒక్కడే రైలు స్టేషన్ దగ్గరికి నడిచి వెళ్లగలడా? ధైర్యం చేసి వెళ్లినా, రైలు పట్టాలపై పదిపైసల బిళ్లను ఉంచగలడా? అనే ప్రశ్నలతో కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు.వెళ్లగలనో లేదోననే సందేహం వచ్చింది. ఎలాగైనా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. టీచర్ చెప్తున్న పద్యం మనసులో సుడులు తిరగసాగింది.మధ్యాహ్నం భోజనం బెల్ మోగింది. వినయ్ వంక ఒకసారి చూసి ఇంటికి బయల్దేరాడు వెంకట్.ఆవేశంలో కాళ్లకు చెప్పులేసుకోవడం కూడా మర్చిపోయి వచ్చాడు గాని, పగబట్టినట్లుగా తరుముతున్న ఎండను తట్టుకోలేక రోడ్డు పక్కనున్న మొక్కజొన్న చేను గట్టు మీద, దారి పక్కన గుట్టలుగా పేరుకుపోయిన ఎండుటాకుల మీదా నడవసాగాడు.నిర్లక్ష్యంగా గాలికి రేగుతున్న జుట్టును చేత్తో ఎగ దోసుకుంటున్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతోంది. పెదవుల్ని మాటిమాటికీ తడుపుకుంటున్నాడు. ధారగా కారుతున్న చెమటను ఒక చేత్తో తుడుచుకుంటూ, సూటిగా కళ్లమీద ఎండ పడకుండా మరో చేతిని అడ్డుపెట్టుకుంటూ నడకలో వేగం పెంచాడు. ‘ఎప్పుడెప్పుడు వెళ్లి రైలును చూస్తానా’ అనే కోరిక వాడిని నిలబడనీయట్లేదు. కాళ్లకు మొక్కజొన్న మోళ్లు గుచ్చుకుంటున్నాయో, ముళ్ళు గుచ్చుకుంటున్నాయో కూడా తెలియకుండా నడుస్తున్నాడు. వెంకట్ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుమాక రైల్వేస్టేషన్. సింగిల్ ట్రాక్ కావడం వల్ల నిర్దేశించిన సమయాల్లో తప్ప ఎక్కువగా రైళ్ల రాకపోకలుండవు. రైలొచ్చే ముందు కొట్టే గంట గురించి, పట్టాల మీదకి రైలు వచ్చేటప్పుడు చేసే చప్పుడు గురించి, అది వదిలే పొగ గురించి స్నేహితులంతా కథలు కథలుగా చెప్తే క్లాసులో చాలాసార్లు విన్నాడు. పైగా చాలామంది స్నేహితులు ‘రైలును చూడ్డానికి పెద్దవాళ్లతో వెళ్లాలని, ఒక్కరే వెళ్తే చాలా భయంగా ఉంటుందని’ చెప్పడం గుర్తొచ్చింది. మనసులో భయంగానే ఉన్నా ఎలాగైనా ఆ పూటే రైలును చూసి రమణగాడి నోరు మూయించి, అందరి ముందూ తానేంటో నిరూపించుకోవాలనే తపన వెంకట్ ఆశను మరింత బలపరచింది. కాలికేదో గుచ్చుకోవడంతో ‘అమ్మా’ అనుకుంటూ కాలివైపు చూసుకున్నాడు. మొక్కజొన్న మోడు రెండు వేళ్ల సందులో గుచ్చుకుని చర్మం చీరుకుపోయి రక్తం కారసాగింది. ఒక్కసారిగా వెంకట్ నడకలో వేగం తగ్గింది. గట్టుమీద కూర్చుండిపోయి రెండు వేళ్ల మధ్యలోనూ కొంచెం ఉమ్ము రాసుకున్నాడు. కాలి బొటనవేలినీ, తర్వాత వేలినీ మెల్లగా చేతితో రుద్దుకున్నాడు. కొంచెం నొప్పి తగ్గిందనుకున్నాక పైకి లేచి నడక సాగించాడు. అతనితో పాటే తేనెటీగల్లా ఆలోచనలు కూడా వెంబడించాయి. లేత వొంటిని ఎండ కిరణాలు తొలిచేస్తున్నాయి. ముందుకు వంగి కాళ్లవైపు చూసుకున్నాడు. చీరుకుపోయి, దుమ్ము కొట్టుకుపోయిన కాళ్లు కనిపించాయి. గూటం తెగిపోయి ఇంటి దగ్గర వదిలొచ్చిన చెప్పుల్ని వేసుకొచ్చినా బాగుండేదని అనుకున్నాడు మనసులో. మాటిమాటికీ ఆ చెప్పులకు గూటం బిగించుకుంటూ నడిస్తే నడక సాగదని అనుకుని వాటిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాడు.తను వెళ్ళేసరికి రైలు వచ్చి వెళ్ళిపోతే స్నేహితుల ముందు తలవంపులవుతుందని, అందరూ తనను వెక్కిరిస్తారని భయపడ్డాడు. కడుపునిండా అన్నం తింటే ఆలస్యమవుతుందని, తిన్నానన్న పేరుకి నాలుగు మెతుకులు తిని బయల్దేరాడు. ఎలాగైనా రైలుబండిని చూసి, స్నేహితుల ముందు భుజాలెగరేయాలనే ఆశ వాడిని నిలవనీయట్లేదు. పక్కనున్న రోడ్డుమీద ఎడ్లబండ్లు వెళ్తూ కనిపించాయి. ఎద్దులు కదిలినప్పుడల్లా వాటి మెడలోని గంటల చప్పుడు వాడికి ఆహ్లాదంగా అనిపించింది. ఎతై ్తన మూపురాన్ని ముద్దుగా చూశాడు. బండికి ‘జల్ల’ కట్టి ఉంది.మండుతున్న ఎండకు రోడ్డుమీద పెద్దగా జనసంచారం లేదు. అక్కడక్కడా నడుస్తున్నవాళ్ళు గొడుగులు వేసుకుని నడుస్తున్నా చీర కొంగుతోనో, పైపంచెతోనే విసురుకుంటూ వెళ్తున్నారు. అలా ఎదురైనవాళ్ళు అంత ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వెంకట్‌ని పిచ్చివాడిని చూసినట్లుగా చూడసాగారు. వారిని దాటుకుని ముందుకు నడవసాగాడు.ఆకాశానికి కాసేపు కరుణ కలిగి వర్షం పడితే తప్ప భూమాత చల్లబడేలా లేదు. అడుగులు పొయ్యి మీదున్న పెనం మీద పడుతున్నాయో, రోడ్డు మీద పడుతున్నాయో తెలియనంత తీవ్రంగా ఉంది ఎండ. నోరు తడారిపోయింది. నీటికోసం చుట్టూ చూశాడు. దారిలో మొక్కజొన్న తోటలకు దూరంగా పొలంలో ఒకచోట మోటార్ కనిపించింది. అది చూడడంతో వెంకట్ ప్రాణం లేచి వచ్చింది.రెండు చేతులతోనూ చెమట పట్టిన బుగ్గల్ని తుడుచుకుంటూ ఆనందంగా ఆ నీటి మోటార్ వైపు నడిచాడు. గట్టుమీదగా పొలాల మధ్యలో నడుస్తుంటే వాళ్లమ్మ వెనకాల నడుస్తూ చీరచెంగును కప్పుకున్నట్లుగా అనిపించింది. కోతకు సిద్ధమైన మొక్కజొన్న తోట బంగారురంగులో మెరిసిపోతోంది.గబగబా నీటి మోటర్ దగ్గరకెళ్ళి కాసిని నీళ్లతో మొహం కడుక్కుంటే ప్రాణం లేచొచ్చింది. దోసిళ్లతో తీసుకుని తనివితీరా నీళ్ళు తాగాడు. చీరుకుపోయిన కాలివేళ్లను నీళ్లతో శుభ్రంగా కడిగాడు. పైన అంత ఎండకాస్తున్నా నీళ్ళు అంత చల్లగా ఉండడం ఎంతో హాయిగా అనిపించింది.అక్కడినుంచి వెనక్కి తిరిగాడు. బయటికి కనిపిస్తున్న మొక్కజొన్నల మీద పిట్టలేవో వాలి చిట్టి నోటితో అందినంత తింటూ తృప్తి పడుతున్నాయి. వాటివైపు చూస్తూ మళ్లీ గట్టును సమీపించాడు.దారిమధ్యలో ఏవో చిన్నచిన్న పాకలు, ఐస్ ఫ్యాక్టరీ కనిపించాయి. ఐస్ ఫ్యాక్టరీ ముందు ఆగి ఉన్న కొన్ని లారీల్లో పెద్ద పెద్ద ఐస్ బాక్సుల్ని ఎక్కిస్తున్నారు. ఐస్ బాక్సుని చూస్తుంటే వెంకట్ నోట్లో నీళ్లూరాయి.‘పాస్’ బెల్ కొట్టినప్పుడు వాడి స్నేహితుడు రమణ తినే సేమ్యా ఐస్ వాడి కళ్లముందు కదలాడింది. ‘ఉస్’ అని లోపలికీ బయటికీ లాగుతూ వాడు సేమ్యా ఐస్ చప్పరించినప్పుడల్లా వెంకట్ ప్రాణం అలా ఆకాశంలోకి ఎగిరి మళ్లీ నేలమీదకి వచ్చేది. ఒకసారి ధైర్యం చేసి ‘నాకోసారి ఇత్తావా, చప్పరించి ఇచ్చేత్తాను’ అని అడిగాడు.దానికి రమణ నుదురు ముడతలు పడింది. ‘‘ఛీ... అట్టాశేత్తే ఎంగిలి కదూ! నేనివ్వను’’ అన్నాడు. ఆ మాటలకు వెంకట్ ఉత్సాహమంతా వేడి పెనం మీద వేసిన నీటిబొట్టులా ఆవిరయింది. ఎలాగైనా సేమ్యా ఐస్ కొనుక్కుని వాడి ముందే తనివితీరా చప్పరించాలనే ఆలోచన కలిగింది.ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా వాడిలో ఏదో తెలియని అసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు తన కళ్లముందు కనిపిస్తున్న రకరకాల ఐసుల్ని చూస్తుంటే వాడి నోట్లో అప్రయత్నంగా నీళ్లూరాయి. ముందుకు నడుస్తున్నాడే గాని, వాడి ప్రాణమంతా ఐస్ బాక్సుల మీదే ఉంది. దారివంక కాసేపూ, వెనక వైపు కాసేపూ చూస్తూ ముందుకు నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు.దారి చీలిపోయిన దగ్గర నుంచుని దిక్కులు చూశాడు. ఏ దారిలో వెళ్తే రైల్వేస్టేషను తొందరగా వస్తుందో తెలియక తికమకపడసాగాడు. ఎండ కుదురుగా నిలబడనివ్వడం లేదు. ఎండ బాధకంటే కొంచెం దూరం నడిచినా ఏం కాదులే అనుకుని తోచిన దారివైపు నడవసాగాడు.తాటాకు చూరుకింద నులకమంచం వేసుకుని కునికిపాట్లు పడుతున్న అవ్వ కనిపించింది. ఆమెకి దూరంగా నుంచుని ‘‘అవ్వా.. రైలుటేసను దెగ్గిరికి ఇటేపు ఎల్లొచ్చా?’’ అని అడిగాడు ఆయాసపడుతూ. మామ్మ బోసి నోట్లో నుంచి వింత నవ్వొకటి పెదాలపై కనబడకుండా మెరిసింది. కాసేపయ్యాక ‘‘రైలెక్కి ఏ దేశమెల్తన్నా. కాళ్లకి శెప్పులు కూడా లేకుండా బైలెల్లావ్’’ అంది. వెంకట్‌కి ఏమి చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ నిలబడిపోయాడు. వాడి అవస్థను గమనించిన అవ్వ ‘అటే పో’ అన్నట్లుగా చేతిని పైకెత్తి దారివైపు చూపించింది.కాలనీలా ఉన్న ఇళ్లను దాటిన తర్వాత కొంచెం దూరంగా రైలుపట్టాలు కనిపించాయి. వాటిని చూస్తూ ఎదురెదురుగా ఉన్న రైలు పట్టాలు ఎంతదూరం వెళ్తాయో అంచనా వేయసాగాడు. వాడి చిట్టిబుర్రకు తట్టలేదు, ఊహకు అందలేదు. ముందుకు వంగుని నాలుగురాళ్లను చేత్తో తీసుకున్నాడు. కాలుతున్న ఇనుపముద్దని చేత్తో తీసుకున్నట్లుగా చురుక్కు మనిపించి వదిలేశాడు. దూరంగా చెట్టుకింద నీడ కనిపించడంతో అటువైపు నడిచాడు.బరువైన సామాన్లను నెత్తిన మోసుకుంటూ, చంకలో చంటిపిల్లలతో వచ్చిన వాళ్లతో స్టేషనంతా కిటకిటలాడుతోంది. ఆ టైంలో ఒకటే రైలు కావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. పొరుగూరులో పనులకెళ్ళే వాళ్ళు సామాన్లు నింపిన గోతాల్ని తలమీద పెట్టుకుని అటుఇటూ తిరగసాగారు.వాళ్లవైపు చూస్తున్న కొద్దీ వెంకట్లో ఆత్రుత ఎక్కువైంది. అంతవరకూ రైలు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. తర్వాత క్లాసులో ఏదైనా నాణేన్ని రైలుపట్టాలపై పెడితే పెద్దగా అవుతుందని రమణ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎలాగైనా ఆ అనుభూతిని పొందాలనే తపనతో రూపాయి కోసం ఇల్లంతా గాలించాడు. చివరికి ఎక్కడో సత్తు పదిపైసల నాణెం కనిపించింది. దానిని జాగ్రత్తగా నిక్కరు జేబులో వేసుకుని బయల్దేరాడు. అది గుర్తుకొచ్చి జేబుల్ని తడుముకున్నాడు. పదిపైసల బిళ్ల చేతికి తగలడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న స్టేషనులో కలకలం మొదలయింది. టికెట్ తీసుకుని అక్కడక్కడా దూరంగా నిలబడ్డ ప్రయాణికులంతా హడావిడి పడుతూ ట్రైనులో ఎక్కడెక్కడ ఖాళీ ఉంటుందో అంచనా వేసుకుంటూ అక్కడికి చేరుకోసాగారు. మైకులో అనౌన్సుమెంటు వినిపిస్తోంది. రైల్వే కూలీల పరుగులు, తినుబండారాలు అమ్మేవాళ్ల పరుగులతో ప్రశాంతమైన వాతావరణం కాస్తా తిరునాళ్లలా మారిపోయింది.చెట్టు కింద నిల్చున్న వెంకట్ భయంభయంగా రైలుపట్టాల వైపు కదిలాడు. తనను ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశారు. ఎవరి పనుల్లో వారుండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రైలొచ్చేటప్పుడు ఏదైనా స్తంభంలాంటి గట్టి ఇనుప వస్తువును పట్టుకోవాలని, లేకపోతే ఆ వేగానికి ట్రైన్ కిందకి వెళ్ళిపోతామని భయపెట్టిన రమణ గుర్తొచ్చాడు.ఎదురుగా కనిపిస్తున్న ట్రాక్ కొండచిలువలా కనిపించింది. జేబులో నుంచి పదిపైసల బిళ్ల తీసి పట్టా మీద పెట్టాడు. రైలు వేగానికి అదెక్కడికి ఎగిరిపోతుందో తెలియలేదు. దగ్గర నుంచోవాలంటే భయంగా ఉంది. పదిపైసలు బిళ్ళ పెట్టిన ప్రాంతానికి గుర్తుగా ఏమైనా ఉందేమోనని చుట్టూ చూశాడు. సమాంతరంగా ఉన్న రెండు రైలుపట్టాలకు మధ్యలో ఎర్రరంగు రాసిన చెక్కలు కనిపించాయి. చురుగ్గా దాని చుట్టూ చూసి దానికి ఎదురుగా పట్టా మీద పదిపైసలు బిళ్ల పెట్టి దూరంగా వచ్చాడు. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. ప్రయాణికులందరిలో ఆదుర్దా మొదలయింది. దూరంగా నిల్చుని చూస్తున్న వెంకట్లో ఆందోళన ఎక్కువయింది.దుమ్ము రేపుకుంటూ స్టేషనులో ఆగింది ట్రైన్. దిగేవాళ్లతో ఎక్కేవాళ్లతో హడావిడిగా ఉంది. ఒకర్నొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ సామాన్ల బరువుతో కంపార్టుమెంట్లలోకి ఎక్కుతున్న జనాల్ని చూస్తుంటే వెంకట్లో గుండెదడ మొదలయింది.ఒక పెట్టె వెనక ఇంకో పెట్టెతో ఇంటి దగ్గర చూసిన ‘రోకలిబండ’లా అనిపించింది ట్రైన్. ‘ఒక్క రోజులో ఎంతమందిని చేరవేస్తుందో’నని తనలో తానే ఆశ్చర్యపడ్డాడు. ట్రైన్ ఎప్పటికి కదులుతుందో తెలియదు, తన పదిపైసలు బిళ్ల ఎక్కడ పడుతుందో తెలియదు. తనలో తనే కాసేపు ఆరాటపడ్డాడు.ట్రైన్ బయల్దేరుతుందన్నట్లుగా మైకులో ప్రకటన వినిపించింది. ఇంజిన్ పెట్టెలో ఉన్న గార్డు పచ్చ జెండా ఊపడంతో రైలు కదిలింది. వెంకట్ చూపు మొత్తం తాను పెట్టిన పది పైసల బిళ్లవైపు మళ్ళింది. నెమ్మదిగా కదిలినంత సేపూ దృష్టి అక్కడ నిలిచిందిగాని, వేగాన్ని పుంజుకున్నాక చూపు మందగించింది.నెమ్మదిగా ముందుకు కదిలి పది పైసల నాణెం కోసం వెతికాడు. పెట్టిన ప్రాంతంలో కనిపించక కంగారుపడ్డాడు.ఎంతో కష్టపడి ఇల్లంతా వెతికి తెచ్చాడు. ఆ నాణెం పెద్దదైతే బడికెళ్లాక స్నేహితుల ముందు గొప్పగా చూపించాలనుకున్నాడు. కాని, చూస్తుంటే పరిస్థితి అలా జరిగేలా లేదు. నాణెం పెట్టిన ప్రాంతానికి అటూ ఇటూ వెతికాడు. ఎర్రరంగు పూసిన చెక్కదిమ్మకు కొద్ది దూరంలో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. గబగబా పరిగెత్తి ఆ బిళ్లని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు. పెద్దగా కనిపిస్తున్న నాణెం వంక ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ చూస్తుంటే వెంకట్ కళ్ళు పెద్దవయ్యాయి. కళ్లల్లో నీళ్ళు చిప్పిల్లాయి. జాగ్రత్తగా దాన్ని చేతుల్లోకి మార్చి మార్చి తీసుకుని కళ్ల నిండుగా చూసుకున్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని నిక్కరుజేబులో వేసుకున్నాడు. రాళ్లను, పట్టాలను దాటుకుంటూ వచ్చిన దారివైపు నడవసాగాడు. బాల్యంలో పుట్టిన కోరికలు చిరుగాలిలా మొదలై పెనుగాలిలా మారతాయి. తీరిపోయిన తర్వాత ఉత్సాహ తరంగాలై పట్టుకుని ఊపేస్తాయి. కారుతున్న చెమటను చేత్తో తుడుచుకుంటూ జేబులో వెడల్పుగా కనిపిస్తున్న పదిపైసల నాణేన్ని తడుముకున్నాడు.ఆనందంతో అడుగులెలా పడుతున్నాయో తెలియట్లేదు. అన్నం వేళ దాటిపోయినా ఆకలిగా లేదు. ఎండ నిలువునా తగలబెడుతున్నా స్పృహ లేదు. వెంకట్ కళ్లముందు ట్రైన్ చూసిన ఆనందం పదిపైసల నాణెం విస్తరించినట్లుగా రెట్టింపయింది. స్కూలుకెళ్లాక స్నేహితుల ముందు తానొక హీరో, అందరూ తనను ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తారు. తన దగ్గరున్న పెద్దదైన పది పైసల నాణేన్ని చూడడానికి ఎగబడతారు. తాను మాత్రం ఎవరికీ చూపించకుండా కాసేపు దోబూచులాడతాడు. వాళ్లకు ఇచ్చినట్టే ఇచ్చి, చూపించినట్టే చూపించి వెంటనే దాచేస్తాడు. అందరికీ ఉక్రోషం మొదలవుతుంది. ఒక్కసారి జేబులో నాణేన్ని చేతిలోకి తీసుకుని గాల్లోకి ఎగరేశాడు.వాడి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ అది గాల్లో గిరికీలు కొట్టసాగింది. -
ఆత్మలకు ఆలవాలం!
ఆ ఊరు ఆత్మలకు ఆలవాలంగా పేరుమోసింది. నిజానికి ఆ ఊరు తొలిరోజుల్లో ప్రపంచంలో మిగిలిన అన్ని ఊళ్లలాగానే జనసంచారంతో కళకళలాడుతూ ఉండేది. ఇది ఆత్మలకు ఆలవాలంగా మారి, దయ్యాల ఊరిగా పేరుమోయడం వెనుక పెద్ద కథే ఉంది. బ్రెజిల్లో ఉన్న ఈ ఊరి పేరు పారానాపియాకాబా. బ్రిటిష్‌వారు కాఫీ రవాణా కోసం బ్రెజిల్లో రైలుమార్గం నిర్మించారు. సావో పాలో రైల్వే కంపెనీ రవాణా కేంద్రంగా ఇక్కడ 1860లో ఈ ఊరిని నిర్మించారు. అప్పట్లో ఇక్కడి నుంచి భారీ ఎత్తున కాఫీ రవాణా సాగేది.లండన్‌లోని బిగ్‌బెన్ గడియారం నమూనాలోనే ఈ ఊరి నడిబొడ్డున ఒక నిలువెత్తు గడియారాన్ని నెలకొల్పారు. ఊళ్లో ఏ మూల నుంచి చూసినా ఈ గడియారం కనిపిస్తుంది. సెర్రా డూ మార్ పర్వత శ్రేణుల మధ్యనున్న ఈ ఊరు అప్పట్లో ప్రశాంతతకు ఆలవాలంగా ఉండేది. ఈ ఊళ్లోనే లిడియా మాకిన్సన్ ఫాక్స్ అనే బ్రిటిష్ కులీన మహిళ తన పిల్లలతో కలసి కొండపై నిర్మించిన ప్యాలెస్‌లో ఉండేది. ఈ ఊళ్లో 1902లో యెల్లో ఫీవర్ విజృంభించింది. లిడియా తన పిల్లలతో ప్యాలెస్‌లోనే తలుపులు వేసుకుని ఉండిపోయింది. లిడియా, ఆమె పిల్లలు అందులోనే మరణించారు. అప్పటి నుంచి ఈ ఊళ్లో అతీంద్రియ సంఘటనలు జరగడం మొదలైనట్లు స్థానికులు చెబుతారు. ఊరి నడిబొడ్డున ఉన్న గడియారం రాత్రి 11.47 గంటలకు తనంతట తానే ఆగిపోతుందని, అర్ధరాత్రి వేళ చర్చిలోని గంట మోగుతూ ఉంటుందని చెబుతుంటారు. కొందరైతే, రాత్రివేళ లిడియా ఇంటి పరిసరాల్లో ఒక మహిళ, ఆమె నలుగురు పిల్లలు నడుస్తూ ఉండటాన్ని కూడా చూసినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ ఊళ్లో దాదాపు వెయ్యిమంది మాత్రమే మిగిలారు. ఈ ఊళ్లో విక్టోరియన్ నిర్మాణశైలికి అద్దంపట్టే పలు ప్రాచీన భవంతులు ఇప్పుడు పాడుబడిన స్థితికి చేరుకుని, భూత్ బంగ్లాలను తలపిస్తాయి. అతీంద్రియ శక్తులపై ఆసక్తిగల కొందరు పర్యాటకులు అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తూ పోతుంటారు. -
జగమంత సంక్రాంతి
సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకను మన భారతీయులు రకరకాల పద్ధతుల్లో జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజున భోగి పండుగనాడు వీథుల్లో పెద్దపెద్ద చలిమంటలు వేస్తారు. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగనాడు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండే పశువులను పూజిస్తారు. పంటలు చేతికి వచ్చిన తర్వాత రైతాంగానికి కాస్త తీరిక చిక్కి ఆటవిడుపుగా జరుపుకొనే పండుగ ఇది. సంక్రాంతి వేడుకల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకొనే పూజ పురస్కారాలు ఎలా ఉన్నా; విందు వినోదాలు, కోడి పందేల వంటి కాలక్షేపాలు విశేషంగా జరుగుతాయి. మన దేశంలో మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొనే మాదిరిగానే వివిధ దేశాలలో శీతకాల ఆయనాంత దినాలలో ఇదే తరహా వేడుకలు జరుపుకొంటారు. మన దేశంలో జరుపుకొనే మకర సంక్రాంతి వేడుకలతో పాటు ఇతర దేశాల్లో జరిగే సంక్రాంతి తరహా వేడుకల గురించి తెలుసుకుందాం.మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. మిగిలిన పండుగలను మన దేశంలో చాంద్రమానం ప్రకారం జరుపుకొంటే, మకర సంక్రాంతిని సౌరమానం ప్రకారం జరుపుకొంటారు. మకర సంక్రాంతి రోజున అభ్యంగన స్నానాలు చేసి, పితృ తర్పణలు విడిచిపెడతారు. ఈ ఆచారాన్ని పాటించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లకు వచ్చే హరిదాసులు, గంగిరెద్దులవారు తదితరులకు దానాలు చేస్తారు. మకర సంక్రాంతికి ముందు వచ్చే ధనుస్సంక్రాంతి రోజు నుంచి వైష్ణవాలయాల్లో ధనుర్మాసం సందడి మొదలవుతుంది. ఈ నెల పొడవునా ఇళ్ల ముంగిళ్లలో రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది, వాటిలో గొబ్బెమ్మలను కొలువుదీరుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో తయారు చేసిన పిండివంటలను, కొత్తబియ్యంతో వండిన పరవాన్నం వంటి తీపి పదార్థాలను ఆరగిస్తారు.మకర సంక్రాంతి రోజున నువ్వులు, నెయ్యి, బెల్లం, బూడిద గుమ్మడి, గొంగళి పేదలకు దానం చేయడం మంచిదని కొన్ని వ్రతకథనాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి నాటితో మొదలయ్యే ఆరునెలల ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపైకి ఒరిగిన భీష్ముడు మకరసంక్రాంతి తర్వాత మాఘమాసంలోని శుక్ల అష్టమి రోజున స్వచ్ఛంద మరణం పొందాడని మహాభారత కథనం. మకర సంక్రాంతి రోజునే ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించారు. ధనుర్మాసం పొడవునా తిరుప్పావై పాశురాలు పఠిస్తూ పూజలు జరిపే వైష్ణవాలయాల్లో మకర సంక్రాంతి రోజున గోదా కల్యాణం జరిపి, ధనుర్మాస వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు.మకర సంక్రాంతికి ముందురోజైన భోగి పండుగ నాడు వీథులలో భోగిమంటలు వేయడంతో పాటు ఇళ్లల్లోని చిన్నపిల్లల తలపై రేగుపళ్లను భోగిపళ్లుగా పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు పంచదార చిలకలను ఇచ్చిపుచ్చుకుంటారు. చాలా ప్రాంతాల్లో దసరాకు బొమ్మల కొలువులు పెడితే, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే ఆచారం ఉంది. మకర సంక్రాంతి మర్నాడు కనుమ పండుగ నాడు పశువులను పూజించి, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఆ మర్నాడు ముక్కనుమ పండుగ రోజున గ్రామదేవతలకు పూజలు జరిపి, మాంసాహార విందులు చేసుకుంటారు. వివిధ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకొనే మకర సంక్రాంతి వేడుకల్లో అనేక ఆచార, ఆహార వైవిధ్యాలు కనిపిస్తాయి. ⇒ అసోంలో మకర సంక్రాంతిని ‘మాఘ బిహు’ అని, ‘భోగాలి బిహు’ అని పిలుస్తారు. సంక్రాంతికి ముందురోజున ‘మేజి’ పండుగను మన భోగి పండుగ మాదిరిగానే జరుపుకొంటారు. ఊరూరా వీథుల్లో చలిమంటలు వేసుకుని, అగ్నిదేవుడిని పూజిస్తారు. ఊళ్లల్లోని యువకులు ‘మేజి’ పండుగ ముందు రోజున ‘బేళాఘర్’ అనే తాత్కాలిక గుడిసెలను వెదురుబొంగులతో నిర్మించి, వాటిలో విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ‘మేజి’ రోజున వేకువ జామునే వాటిని భోగిమంటల్లా తగలబెడతారు. ‘మాఘ బిహు’ రోజున కొత్త బియ్యం, నువ్వులు, కొబ్బరితో తయారు చేసిన పిండివంటలను ఆరగిస్తారు.⇒ బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మకర సంక్రాంతిని ‘సక్రాత్’ అని, ‘ఖిచిడీ పర్వ్’ అని అంటారు. సంక్రాంతి రోజున ఖిచిడీని తప్పనిసరిగా ఆరగిస్తారు. అలాగే, పెరుగు అటుకులు, నువ్వుల లడ్డూలు ఆరగిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీస్నానాలు ఆచరించి, సూర్యారాధన చేస్తారు. సంక్రాంతికి ముందు రోజున చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో సంబరాలు జరుపుకొంటారు. ⇒ గుజరాత్లో మకర సంక్రాంతిని ‘ఉత్తరాయన్’గా, ఆ మర్నాడు ‘వాసి ఉత్తరాయన్’గా జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలతో పాటు ఆరుబయట పిల్లా పెద్దా చేరి గాలిపటాలను ఎగురవేస్తారు. ⇒ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలలో మకర సంక్రాంతిని ‘సంక్రాంత్’ పేరుతో జరుపుకొంటారు. కురుక్షేత్ర సహా ప్రాచీన తీర్థాలు, సరోవరాలు, నదులలో పవిత్ర స్నానాలను ఆచరించి, పితృతర్పణాలను విడిచిపెడతారు. ఖీర్, చుర్మా, హల్వా వంటి స్థానిక తీపి వంటకాలతో పాటు వేరుశనగ, నువ్వుల లడ్డూలను ఆరగిస్తారు. ⇒ జమ్ములో మకర సంక్రాంతిని ‘ఉత్రాయిన్’ లేదా ‘అత్రాయిన్’ అని పిలుచుకుంటారు. ఈ పండుగను ‘ఖిచిడీవాలా పర్వ్’ అని కూడా అంటారు. సంక్రాంతి రోజున మినప్పప్పుతో తయారు చేసిన ఖిచిడీతో సంతర్పణలు చేస్తారు. అత్తవారిళ్లకు వెళ్లిన ఆడపడుచులకు సారె పంపుతారు. సంక్రాంతి సందర్భంగా జమ్ము ప్రాంతంలో ఊరూరా భారీగా సంతలు జరుగుతాయి. ⇒ కర్ణాటకలో మకర సంక్రాంతి వేడుకలు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే జరుగుతాయి. కన్నడిగులు సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దుతారు. నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి, బెల్లం కలిపి తయారు చేసే ‘ఎళ్లు బెల్ల’, పంచదారతో తయారు చేసే ‘సక్కరె అచ్చు’ ప్రత్యేకంగా ఆరగిస్తారు. ఈ సందర్భంగా ఆరుబయట గాలిపటాలను ఎగురవేస్తారు. ⇒ మహారాష్ట్రలో భోగి, సంక్రాంతి రెండు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ పండుగ రోజుల్లో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటారు. భోగి రోజున ఊరూరా భోగిమంటలు వేస్తారు. సంక్రాంతి రోజున సూర్యుడిని పూజిస్తారు. అలాగే, చిన్న చిన్న మట్టికుండలను శక్తి కలశాలుగా పూజగదుల్లో పెట్టి, వాటికి నల్లపూసల దండలను అలంకరించి, అమ్మవారిని పూజిస్తారు. ⇒ ఒడిశాలో భోగి రోజున ఊరూరా వీథుల్లో భోగిమంటలు వెలిగిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆలయాల్లో పూజలు జరిపి, కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు, కొబ్బరితో తయారు చేసే వంటకాలను, రసగుల్లా, ఛెన్నాపొడా వంటి మిఠాయిలను ఆరగిస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ⇒ పశ్చిమ బెంగాల్లో ‘పౌష సంక్రాంతి’గా జరుపుకొంటారు. హిమాలయాలకు దగ్గరగా ఉన్న డార్జిలింగ్ ప్రాంతంలో ‘మాగే సక్రాతి’ పేరుతో జరుపుకొంటారు. ఈ వేడుకల్లో ఖర్జూరాల పాకం, కొత్తబియ్యంతో పాయసం వండుకుంటారు. అరిసెల్లాంటి ‘పిఠా’ అనే పిండి వంటలను ఆరగిస్తారు. ⇒ పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలను ‘మాఘి’ అని, ‘లోహ్రీ’ అని జరుపుకొంటారు. వీథుల్లో చలిమంటలు వేసుకుని, వాటి చుట్టూ ఆడుతూ పాడుతూ గడుపుతారు. ప్రార్థన మందిరాలు, ఆలయాలలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ⇒ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో ‘సక్రాత్’ పేరుతో ఈ వేడుకలను జరుపుకొంటారు. సంక్రాంతి సందర్భంగా గృహిణులు పదమూడుమంది గృహిణులకు గృహోపకరణాలను ఇస్తారు. గృహోపకరణాలను ఇవ్వడం వల్ల ఐశ్వర్యవృద్ధి జరుగుతుందని వారి నమ్మకం. బంధు మిత్రులతో కలసి విందుభోజనాలు చేస్తారు. పురోహితులకు, పేదలకు దానాలు చేస్తారు. ఆరుబయట చేరి గాలిపటాలను ఎగురవేస్తారు.⇒ ఇక తమిళనాడులో కూడా సంక్రాంతి వేడుకలను నాలుగు రోజుల పాటు జరుపుకొంటారు. ‘పొంగల్’గా జరుపుకొనే ఈ వేడుకల్లో మొదటి రోజైన భోగి పండుగను ‘భోగి పండగై’, రెండో రోజున ‘తాయ్ పొంగల్’, మూడో రోజున ‘మాట్టు పొంగల్’, నాలుగో రోజున ‘కానుమ్ పొంగల్’ పేరుతో వేడుకలు జరుపుకొంటారు. భోగి మంటల్లో పాత వస్తువులను తగులబెడతారు. సంక్రాంతి రోజున చక్కెర పొంగలి దేవతలకు నైవేద్యంగా పెట్టి, శంఖాలు మోగిస్తారు. ‘మాట్టు పొంగల్’ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ పోటీలు నిర్వహిస్తారు. చివరి రోజైన ‘కానుమ్ పొంగల్’నాడు బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. ⇒ కేరళలోని శబరిమలైలో ‘మకరవిళక్కు’ దర్శనానికి అయ్యప్పస్వామి భక్తులు తండోపతండాలుగా చేరుకుంటారు. ఇరుగు పొరుగు దేశాల్లో... మకర సంక్రాంతి పండుగను మన ఇరుగు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోను; భారతీయ సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లోను కూడా జరుపుకొంటారు. ⇒ నేపాల్‌లో ఈ పండుగను ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. ఈ సంక్రాంతిని నేపాలీలు విశేష పర్వదినంగా భావిస్తారు. మకర సంక్రాంతికి సంబంధించి నేపాల్‌లో ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో ఒక వర్తకుడు నువ్వుల వ్యాపారం చేసేవాడట! అతడి దుకాణంలోని నువ్వుల బస్తా అక్షయంగా ఉండేదట! అందులోంచి ఎన్ని నువ్వులు అమ్మినా బస్తా తరిగిపోకుండా ఉండేది. ఒకనాడు తన వద్దనున్న బస్తాలో ఉన్న మహిమకు కారణమేమిటో తెలుసుకోవాలని ఆ వర్తకుడికి కుతూహలం కలిగింది. బస్తాకు రంధ్రం పెట్టి, తవ్వి చూడగా, అందులో బంగారు విష్ణువిగ్రహం బయటపడిందట! అందువల్ల సంక్రాంతి రోజున నువ్వులతో తయారు చేసిన పిండివంటలను తప్పనిసరిగా ఆరగించడం ఆచారంగా మారిందని చెబుతారు. ⇒ ఇక శ్రీలంకలోని తమిళులు తమిళనాడులో మాదిరిగానే నాలుగు రోజులు పొంగల్ వేడుకలను సంబరంగా జరుపుకొంటారు. ⇒ బంగ్లాదేశ్‌లో ఈ పండుగను ‘పౌష సంక్రాంతి’గా, ‘ఘురి ఉత్సబ్’గా జరుపుకొంటారు. భోగి రోజున వీథుల్లో చలిమంటలు వేస్తారు. సంక్రాంతినాడు కొత్తబియ్యం, నువ్వులు, కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన పిండివంటలతో విందులు చేసుకుంటారు. పండుగ రోజుల్లో సాయంత్రం ఆరుబయటకు చేరి గాలిపటాలను ఎగురవేస్తారు. రాత్రి చీకటి పడిన తర్వాత అట్టహాసంగా బాణసంచా కాలుస్తారు.విదేశాల్లో శీతకాల ఆయనాంత వేడుకలు మన దేశంలో శీతకాల ఆయనాంతం మరునాడు వచ్చేరోజును మకర సంక్రాంతిగా జరుపుకోవడం చిరకాల ఆనవాయితీ. సౌరమానం ప్రకారం జరుపుకొనే ఈ పండుగ సాధారణంగా జనవరి 14వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరాల్లోనైతే జనవరి 15న వస్తుంది. పలు పాశ్చాత్య దేశాల్లో ఏటా డిసెంబర్ 22న శీతకాల ఆయనాంత దినంగా పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో శీతకాల ఆయనాంతం సందర్భంగా పురాతన ఆచారాల ప్రకారం విలక్షణమైన పండుగలను జరుపుకొంటారు. దాదాపుగా మన మకర సంక్రాంతి వేడుకలను పోలిన అలాంటి కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం....డోంగ్‌ఝీ: శీతకాల ఆయనాంతాన్ని చైనాలో ‘డోంగ్‌ఝీ’ పేరుతో జరుపుకొంటారు. ఈ పండుగను ఏటా డిసెంబర్ 21–23 తేదీల్లో జరుపుకొంటారు. శీతకాల దీర్ఘరాత్రులు (యిన్) ఈ పండుగతో ముగిసి, పగటి వేళలు క్రమంగా పెరిగే రోజులు (యాంగ్) ప్రారంభం కావడానికి సంకేతంగా ‘డోంగ్‌ఝీ’ని జరుపుకోవడం చైనా ప్రజల సంప్రదాయం. ఈ పండుగ రోజుల్లో ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులందరూ ఒకేచోట కలుసుకుని, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఈ సందర్భంగా కుడుముల్లాంటి ‘జియావోజి’, వరిపిండితో తయారు చేసే ‘టాంగ్యువాన్’ అనే మిఠాయిలను ప్రత్యేకంగా ఆరగిస్తారు.షాబ్ ఏ యాల్దా: శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్ 21న జరుపుకొనే పురాతన పర్షియన్ పండుగ ఇది. ఇరాన్, ఇరాక్ సహా పలుచోట్ల ఉండే జొరాస్ట్రియన్లు ఇప్పటికీ ఈ పండుగను జరుపుకొంటారు. సుదీర్ఘ రాత్రి కలిగిన డిసెంబర్ 21న రాత్రివేళ ప్రత్యేకంగా విందు వినోదాలు, వేడుకలు జరుపుకోవడం జొరాస్ట్రియన్ల ఆనవాయితీ. ‘యాల్దా నైట్’ పేరుతో జరుపుకొనే ఈ రాత్రివేళ విందుల్లో ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలు, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. కవితా పఠనం, సంప్రదాయ గీతాలాపన వంటి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు.సోయల్: అమెరికాలోని అరిజోనా, న్యూమెక్సికో రాష్ట్రాల్లో ఉండే మూలవాసులైన జునీ, హోపీ తెగల వారు శీతకాల ఆయనాంత సందర్భంగా ఏటా డిసెంబర్ 21న ‘సోయల్’ పేరుతో పండుగ జరుపుకొంటారు. ఈనాటితో దీర్ఘరాత్రులు ముగిసి, ప్రకృతిలో వెలుతురు పెరిగే రోజుల రాకతో కొత్త ఆశలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లను, ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులను, పాడి పశువులను అలంకరిస్తారు. సంప్రదాయ వంటకాలతో విందు వినోదాలు జరుపుకొంటారు.టోజి: జపాన్ ప్రజలు శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్ 21న ‘టోజి’ పేరుతో పండుగ జరుపుకొంటారు. చీకటికి సంకేతమైన ‘యిన్’ రోజులు ఈనాటితో ముగిసి, వెలుతురుకు సంకేతమైన ‘యాంగ్’ రోజులు ప్రారంభమవుతాయని వారు భావిస్తారు. ఈ సందర్భంగా నిమ్మజాతికి చెందిన ‘యుజు’ పండ్ల రసాన్ని నీటిలో కలుపుకొని, ఆ నీటితో స్నానాలు చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా గుమ్మడి పండ్లతో తయారు చేసే ‘కబోచా’ అనే రసాన్ని ప్రత్యేకంగా సేవిస్తారు. దీని వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేకంగా విక్రయించే ‘ఇచియు రైఫుకు’ అనే తాయెత్తులను కొనుక్కుని ధరిస్తారు. ఈ తాయెత్తులను ధరిస్తే, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఏర్పడుతుందని నమ్ముతారు. యూల్: ఉత్తర యూరప్, స్కాండినేవియన్, జర్మానిక్ ప్రాంతాల్లో శీతకాల ఆయనాంతం సందర్భంగా ఏటా డిసెంబర్ 21, 22 తేదీల్లో ‘యూల్’ పేరుతో పండుగ జరుపుకొంటారు. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లండ్స్ తదితర దేశాల్లో ఉండే ‘నార్స్’ ప్రజలు ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ‘యూల్’ పండుగను వారు సూర్యుడి పునరుత్థానంగా భావిస్తారు. పలుచోట్ల ‘యూల్’ వేడుకల్లో క్రిస్మస్ ఆచారాల ప్రభావం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అయినా, స్వీడన్ వంటి కొద్దిచోట్ల మాత్రం ‘నార్స్’ ప్రజలు ఇంకా తమ పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ‘యూల్’ పండుగ రోజుల్లో బంధు మిత్రులంతా కలుసుకొని విందు వినోదాలు జరుపుకొంటారు. ఒకరికొకరు కానుకలను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ విందుల్లో ప్రత్యేకంగా మేక, పంది, గుర్రం మాంసాలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. రాత్రివేళల్లో ఆరుబయట ‘యూల్ లాగ్’ పేరుతో భారీ కలపదుంగలను పేర్చి చలిమంటలు వేసుకుంటారు. చలిమంటల చుట్టూ చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. -
సింపుల్ దుస్తులనే కొంటా!
పేరుకే స్టార్ కాని, సింప్లిసిటీ, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ, తను చేసే ఫ్యాషన్ ఎంపికలే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ట్రెండ్స్‌కు దూరంగా, తనకిష్టమైన స్టయిల్‌ను నమ్ముతూ ముందుకెళ్లే కాజల్ అగర్వాల్ ఫాలో అయ్యే ఫ్యాషన్ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!డ్రెస్.. బ్రాండ్: కోరస్ ధర రూ. 36,800జ్యూలరీ బ్రాండ్: హైబా జ్యూవెల్స్ధర: రూ. 40,000బెల్ట్ బ్రాండ్: గూచిధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.వన్ టైమ్ వేర్ నాకు నచ్చదు. సింపుల్ దుస్తులనే కొనుగోలు చేస్తాను. అందులోనూ జ్యూయెల్ టోన్స్ అంటే చాలా ఇష్టం. వాటిల్లోనే గ్లామర్, సౌకర్యం రెండూ దొరుకుతాయి. చర్మ సౌందర్యం కోసం ప్రతి రోజు కోకోనట్ వాటర్‌ను ఐస్ క్యూబ్లా ఫ్రీజ్ చేసి ముఖంపై రుద్దుతాను. అప్పుడు చర్మం హైడ్రేటెడ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. కట్టిపడేసే అందం!కదిలే నడుమును కట్టిపడేసే అందాల మంత్రం ఈ బెల్ట్! ముఖ్యంగా మిడీ డ్రెస్సుకు ప్రాణం పోసే యాక్సెసరీగా ఇది పనిచేస్తుంది. పూర్వం బెల్ట్‌ను బరువులు, ఆయుధాలు తగిలించుకునేందుకు మాత్రమే ఉపయోగించేవారు కాని, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఫార్మల్, ఫంక్షన్ రెండింటినీ మిక్స్ చేస్తూ ఒక స్టేట్మెంట్ పీస్‌గా మారింది. ప్రధానంగా పురుషుల దుస్తుల భాగంగా ప్రాచుర్యం పొందిన బెల్ట్, ఇప్పుడు మహిళల డ్రెస్సులపై నడుము ఆకృతిని హైలైట్ చేసే స్టయిల్ ఎలిమెంట్‌గా నిలుస్తోంది. ఇది నడుమును స్పష్టంగా చూపిస్తూ, మొత్తం అవుట్‌ఫిట్‌ను షేప్‌లోకి తీసుకొచ్చే మ్యాజిక్‌లా పనిచేస్తుంది. బెల్ట్ బకిల్ దగ్గర ఉండే డీటైల్స్, డిజైన్స్ మెరుస్తున్న టచ్‌తో కలిసి అందరి చూపును నేరుగా నడుము వైపు లాక్కుంటాయి. ఫ్లోయీ లేదా ఏలైన్ మిడీ డ్రెస్సులపై ఇలాంటి వైడ్ బెల్ట్‌లు ఎంతో బాగా సూట్ అవుతాయి. అంతేకాదు, లూజ్ డ్రెస్సులకు కూడా ఇవి ఇన్ స్టంట్‌గా హగ్గింగ్ టచ్‌ను ఇస్తాయి. డిజైన్స్, స్టయిల్స్ పరంగా మార్కెట్లో ఎన్నో వెరైటీల్లో ఇవి సులభంగా అందుబాటులో ఉన్నాయి. – కాజల్ అగర్వాల్ . -
పచ్చని మనసున్న యంత్రాలు!
మంచి మనసు ఉంటే అంతా మంచే జరుగుతుంది అన్నట్లు, మంచి మనసున్న యంత్రాలు కూడా మంచి పనులు చేయగలవు అని ఈ సాలెపురుగు రోబోలు నిరూపించాయి. చైనా ఎడారుల్లో 2025లో షాంసీ ప్రావిన్స్‌లో ప్రారంభమైన ‘గ్రీన్ వాకర్స్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రోబోలు ఎడారిని ఒక పచ్చని తోటగా మారుస్తున్నాయి. వీటి చేతుల్లో ఆయుధాలు లేవు. కాని, గుండెల్లో పచ్చదనంపై ప్రేమ కోడ్ కొండంత ఉంది.అందుకే, సూర్యకాంతినే శక్తిగా మార్చుకొని, ప్రతి అడుగుతో ఒక చెట్టును నాటుతూ ముందుకు సాగుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు. ప్రకృతికి తిరిగి ఊపిరి పోసే ప్రయత్నం. భూమిపై అత్యంత కఠినమైన ప్రాంతాల్లో కూడా, సాంకేతికత సరైన దిశలో ఉపయోగిస్తే ఎలా మార్పు తేగలదో చూపించే అందమైన ఉదాహరణ. ఎడారి మధ్యలో మొలకెత్తిన ప్రతి చిన్న మొక్క, భవిష్యత్తు పచ్చగా ఉండబోతుందనే ఆశకు నడిచే సంకేతం. -
ఏఐకి ముసుగు మాయ!
ఒక ముసుగు ఎంత పని చేస్తుందో ఊహించగలరా? నెదర్లండ్స్‌కు చెందిన డిజైనర్ జిప్ వాన్ లీవెన్ స్టెయిన్ రూపొందించిన ఈ పారదర్శకమైన ముసుగు, ముఖాన్ని దాచదు, కాని, యంత్రాల కళ్లను మాత్రం పూర్తిగా మోసం చేస్తుంది. మనిషికి స్పష్టంగా కనిపించే ముఖం, కంప్యూటర్‌కు మాత్రం విరిగిపోయిన మ్యాప్‌లా మారిపోతుంది. ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయంలోని ‘సర్వైలెన్స్ ఎక్స్‌క్లూజన్ ’ ప్రాజెక్ట్‌లో భాగంగా తయారుచేసిన ఈ ముసుగు, ముఖాకృతిని స్వల్పంగా వంకరగా మలుస్తుంది. నవ్వు, కోపం, ఆశ్చర్యం వంటి భావాలు ఎదుటివారికి అచ్చం అలాగే కనిపిస్తాయి.కాని, ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు ఆధారపడే కోణాలు, గీతలు, లెక్కలన్నీ ఇక్కడ గాలిలో కలిసిపోతాయి. మనిషికి ఇది ఒక కళాఖండం అయితే, యంత్రానికి మాత్రం చదవలేని భాష. ఈ ముసుగు ఒక్కసారిగా ఆన్ లైన్ లో వైరల్ అయింది. మీడియా కథనాల నుంచి డిజైన్ , రీసెర్చ్ జర్నల్స్ వరకు దీనిపై చర్చ మొదలైంది. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలకు వ్యతిరేకంగా, ‘బలమైన ఆయుధం శబ్దం కాదు, సృజనాత్మకత’ అని చాటిచెప్పిన తొలి ప్రయత్నాల్లో ఇది ఒకటిగా నిలిచింది. -
ఇది ప్రభాస్ గిఫ్ట్
బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించే హృదయం ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఆమె వ్యక్తిత్వం. భాషలు మారినా, పాత్రలు మారినా తన అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోని నటి రిద్ధి కుమార్. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..⇒ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఫోకస్, దేనికైనా ఈజీగా అడాప్ట్ అవడం అన్నీ సహజంగానే అలవాటయ్యాయి.⇒ భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్ సహా ఏడు భాషలు మాట్లాడగలను. కొత్త భాష అంటే నాకు కొత్త ప్రపంచం.⇒ మిస్ యూనివర్స్ ఇండియా వైల్డ్‌కార్డ్‌గా తిరిగి రావడం నాకే ఒక సర్ప్రైజ్. నటనతో పాటు నేనెవరో మళ్లీ గుర్తు చేసిన అనుభవం అది. అదే నన్ను సినిమాల్లోకి కూడా తీసుకొచ్చింది. ⇒ తొలిసారి ‘లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తర్వాత ‘అనగనగా ఓ అతిథి’, ‘రాధే శ్యామ్’ చేశాను. ఇలా ప్రతి సినిమా నాకు ఒక పాఠమే. ⇒ కెమెరా ముందు నటించడమే కాదు, కెమెరా వెనుక ప్రపంచాన్ని చూడడం కూడా నాకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీ చేస్తూ ‘ఈ క్షణం మళ్లీ రాదు’ అని అనిపిస్తుంది. ⇒ ట్రావెల్ అంటే టూరిస్టు స్పాట్స్ కంటే ‘హిడెన్ జెమ్స్’ నాకు ఎక్కువ ఇష్టం. ఇటీవల అహ్మదాబాద్ ఓల్డ్ సిటీ వైబ్స్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ⇒ పుస్తకాలు నా బలహీనత. చదివే సమయం లేకపోయినా, కొనకుండా ఉండలేను. ఫిలాసఫీ అంటే నాకు చాలా ఆసక్తి.⇒ ఎంత బిజీగా ఉన్నా చదువు మాత్రం వదల్లేదు. 2025లో కూడా మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ చేస్తున్నాను.⇒ స్కిన్ కేర్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. మేకప్‌తోనే నిద్రపోవడం, వేడి నీళ్లతో ముఖం కడగడం ఇవన్నీ ఇప్పుడిప్పుడే మానేసి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాను.⇒ ఫ్యాషన్ విషయంలో నా స్టయిల్ మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం దేసీ స్టయిల్ ఇష్టం. ముఖ్యంగా చీరలో ఉన్న అందం వేరే లెవల్. ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్‌గా ఇచ్చిందే. ఇది వేసుకున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ⇒ నేనొక పెద్ద ఫూడీ. పుణేలోని ఒక టిబెటన్ స్ట్రీట్ ఫుడ్ స్పాట్ నాకు చాలా ఇష్టం. మోమోస్, థుక్పా అంటే ప్రాణం. అలాగే నెయ్యి దోశ, నెయ్యి కారంపొడి ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ ఉంటే చాలు.⇒ ప్రతి ఒక్కరికీ కొన్ని ఆధ్యాత్మిక ట్రిప్స్ చాలా అవసరం. అలా శంకరాచార్య ఆలయంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.⇒ 2025 నాకు చాలా స్పెషల్. ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించడం నా కెరీర్లో పెద్ద అడుగు. అలాగే ఈ న్యూ ఇయర్‌కు మరాఠీ సినిమాతో కొత్త ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నాను. -
సిమ్ లేదు.. సిగ్నల్ లేదు.. అయినా ‘హలో!’
‘నీతో మాట్లాడాలని ఎంతో ఉంది. కాని, నా రీచార్జ్ ప్లాన్ అయిపోయింది’ అని ఫోన్ నోరు మూసేసే బాధ ఒకరిదిదైతే, ప్రతి నెలా మొబైల్ బిల్లుల రిమైండర్‌కి భయపడి ముందుగా చెల్లించే వారిది ఇంకోరకం బాధ. ఇలా రీచార్జ్ కష్టాల మాయలో మునిగిపోయినప్పుడు ఆఫ్రికాలోని ఒక అబ్బాయి నెట్‌వర్క్‌కే నేరుగా ‘గుడ్ బై’ చెప్పేశాడు. సిమ్ లేదు, టవర్ లేదు, డేటా అవసరం అసలే లేదు, అయినా కూడా ఫోన్ లో ‘హలో!’ అన్నాడు. అదే సైమన్ పీట్రస్ కనిపెట్టిన టెక్నాలజీ మ్యాజిక్! ఆఫ్రికాలోని న మీబియాలో ఉండే ఓ చిన్న గ్రామం. అక్కడ గాలి, ఇసుక, నిశ్శబ్దం తప్ప పెద్దగా టెక్నాలజీకి హలో చెప్పేవారు తక్కువ. చాలామంది ఇళ్లలో విద్యుత్ కూడా ఉండదు. ఇక మొబైల్ సిగ్నల్ అంటే లాటరీ కొట్టడం లాంటిది. ఇలా నెట్వర్క్ కూడా లేని ఊరిలో పెరిగిన సైమన్ , అసలు సమస్య సిగ్నల్‌లో లేదని, టెక్నాలజీలో ఉందని నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని సిమ్ లేకుండా కాల్ చేసే ఫోన్ వైపు నడిపించింది. చాలామంది ‘ఇది ఎలా సాధ్యం?’ అంటూ నవ్వుకున్నారు. కాని, అతను మాత్రం పాత రేడియోలు, టీవీలు, మొబైల్ స్క్రాప్స్ అన్నింటినీ కలిపి ఒక కొత్త ఫోన్ తయారు చేశాడు. రేడియో ఫ్రీక్వెన్సీతో రెండు దారులుగా మాట్లాడుకునే సిస్టమ్. వాకీ–టాకీలా కనిపిస్తుంది కాని, కాదు. పూర్తిగా ఫోన్ రూపంలోనే తయారుచేశాడు. ఈ ఫోన్లోనే టీవీ చూడొచ్చు, లైట్ ఆన్ చేయొచ్చు, ఒక ఇన్‌బిల్ట్ సోలార్ చార్జర్‌ని సెట్ చేశాడు. అతని ప్రతిభను మెచ్చి, స్కూల్ సైన్ ్స ఫెయిర్‌లో మొదటి బహుమతి ఇచ్చేశారు. వార్తలు అంతర్జాతీయంగా పాకాయి. కాని, ఆ తర్వాత పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశోధన కేంద్రాలు ఎవరూ ముందుకు రాలేదు. ఇది కొంచెం బాధే. అయినప్పటికీ, చాలామంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, యువ ఆవిష్కర్తలు అతని ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. పునర్వినియోగ టెక్నాలజీలు, నూతన విద్యుత్ పనితీరులు, కమ్యూనికేషన్ రంగాల్లో సైమన్ ప్రయోగం ఒక మంచి ప్రేరణగా నిలుస్తోందని ప్రసంసిస్తున్నారు. కొన్నిసార్లు కోట్ల బడ్జెట్లు, భారీ లాబొరేటరీలు, పెద్ద పెద్ద కంపెనీలు తప్పనిసరి కాదు, కాని, భవిష్యత్తు ఆవిష్కరణలు ఒక చిన్న స్పార్క్‌తోనే మొదలవుతాయి అని సైమన్ అందరికీ రిమైండ్ చేస్తున్నాడు. -
రక్త నమూనాలతో రూఢి!
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ పక్కన ఉన్న పార్కులో డిసెంబర్ 14న యూదులపై కాల్పుల సంఘటన తెలిసిందే! ఐసిస్ ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులు జరిపిన ఈ కాల్పుల్లో పద్నాలుగు మంది మరణించారు. కాల్పులు జరిపిన వారిలో తండ్రి సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ పాతబస్తీలోని దూద్‌బౌలి. ఇలాగే అప్పుడప్పుడు జరిగే ఉగ్రవాద చర్యల్లో విదేశాల్లో ఉన్న భారత ఉగ్రవాదుల పాత్రలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటివారిలో జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జిందల్ ఒకడు. ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో కీలక పాత్రధారి. ఇతడి గుర్తింపును రక్తనమూనాల ద్వారా నిఘా వర్గాలు రూఢి చేసుకుని, సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చాయి.ముంబైలో 26/11 దాడులు జరిగిన రెండున్నరేళ్ల వరకు అబు జిందల్ పాత్రను నిఘావర్గాలు గుర్తించలేదు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ నుంచి ఇక్కడి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చిన వారిలో ఇతడూ ఉన్నాడని కనిపెట్టలేకపోయారు. అయితే, తమపై కూడా ఇదే తరహా దాడులు జరగవచ్చనే భయంతో అమెరికా అనేక కోణాల్లో నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా అబు జిందల్ పేరు వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో లొకేట్ అయిన ఈ గజ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించడంలో వాయిస్ శాంపిల్స్, బయోలాజికల్ ఎవిడెన్స్ కీలక పాత్ర పోషించాయి. మహారాష్ట్రంలోని భీండ్ జిల్లాకు చెందిన సయ్యద్ జబియుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జిందల్ నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. నగరంలోని టోలిచౌకీలో కొన్నాళ్లు నివసించిన ఇతగాడు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్సు చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి ఔరంగాబాద్ ఆర్మ్స్ హౌల్ కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న జిందల్ పాకిస్తాన్‌కు మకాం మార్చాడు. ఉగ్రవాద నేత ఇలియాజ్ కశ్మీరీ ద్వారా లష్కరే తోయిబాతో (ఎల్ఈటీ) సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని, తన పేరును రియాసత్ అలీగా మార్చుకున్నాడు. ఎల్ఈటీ కమాండర్ హోదాలో రావల్పిండి యూనివర్సిటీ క్యాంపస్‌లోని సంస్థ కార్యాలయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అబు జిందల్ ఫేస్బుక్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించేవాడు. ఈ నేపథ్యంలోనే 26/11 దాడుల కోసం ఏర్పాటైన ఉగ్రవాద బృందానికి అవసరమైన స్థాయిలో మరాఠీ నేర్పించడంతో పాటు ముంబై భౌగోళిక పరిస్థితులపై అవగాహనæ కలిగించే బాధ్యతలు ఎల్ఈటీ ఇతడికి అప్పగించింది. ముంబై మారణహోమంలో పాల్గొన్న ఉగ్రవాదులకు కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి అనేక సూచనలు ఇచ్చాడు. జిందాల్ ఈ ఆపరేషన్‌లో అబు ఖాషిఫ్ పేరుతో పని చేశాడు. కమ్యూనికేషన్ కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ)ని మార్గంగా ఎంచుకున్నారు. దీంతో భారత నిఘా వర్గాలకు జిందాల్‌కు సంబంధించిన వాయిస్ శాంపిల్స్ సేకరించగలిగారు. అప్పట్లో 26/11 ఉగ్రవాదుల వద్ద నాగోలు చిరునామాతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీ పేరుతో ఉన్న గుర్తింపు కార్డులు లభించాయి. వీటిని తయారు చేసి ఇచ్చింది కూడా అబు జిందలే! ఇలాంటి దాడులు తమపైనా జరగవచ్చని భావించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ భారత్ నుంచి ఉగ్రవాదుల వాయిస్ శాంపిల్స్ సేకరించి, వేట ప్రారంభించింది. మరోపక్క ఎల్ఈటీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్న జిందల్ కదలికలను 2009లో గుర్తించింది. అనేక దేశాల్లో అమెరికా ఏర్పాటు చేసిన పర్సనల్ ఐడెంటిఫికేషన్ సెక్యూర్ కంపర్షన్ అండ్ ఎవల్యూషన్ సిస్టం (పీఐఎస్సీఈఎస్) ద్వారా జిందాల్ కదలికలు పాకిస్తాన్‌తో పాటు సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుసుకుంది. 2009లోనే రియాసత్ అలీ పేరుతో పాకిస్తాన్ నుంచి పొందిన పాస్‌పోర్ట్‌తో జిందల్ సంచరిస్తున్నాడని గుర్తించి రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)కు పూర్తి ఆధారాలతో సమాచారమిచ్చింది. అబు జిందల్ 2011 ఏప్రిల్‌లో పాక్ నుంచి దుబాయ్ చేరుకున్నట్లు గుర్తించిన సీఐఏ ఈ విషయంపై ‘రా’కు సమాచారమిచ్చి అతడిని ట్రాకింగ్‌లో ఉంచింది. సౌదీ–భారత్‌ల మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉన్నా, అందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తప్పనిసరి. తమకు వాంటెడ్‌గా ఉన్న జిందలే ఈ రియాసత్ అలీ అని చెప్పడానికి భారత నిఘా వర్గాల వద్ద వాయిస్ శాంపిల్స్ తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. దీని కోసం జిందల్ సంబంధీకుల రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంది. వీటిని సౌదీలో ఉన్న జిందల్ నమూనాలతో సరిపోల్చి బయోలాజికల్ ఎవిడెన్స్ రూపొందించేందుకు సిద్ధపడి సీఐఏ సహాయం కోరింది. జిందల్ సంబంధీకుల రక్తనమూనాల సేకరణకు ఎన్ఐఏను రంగంలోకి దింపిన ‘రా’ భీండ్ జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అనేక ప్రాంతాలతో పాటు జిందల్ స్వస్థలమైన జియోరాయ్లోనూ వాక్సినేషన్ పేరుతో అనేక మంది రక్తనమూనాలు సేకరించింది. ఈ రకంగా జిందల్ తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించిన అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. దీనికి సంబంధించిన అధికారిక నివేదికలను సీఐఏకు పంపారు. జిందల్ రక్తనమూనాల సేకరణ కోసం సీఐఏ సౌదీ అరేబియా పోలీసుల సహాయం తీసుకుంది. రియాసత్ అలీ పేరుతో బోగస్ పాస్‌పోర్ట్‌తో జిందాల్ ప్రయాణిస్తున్నాడని అక్కడి వారికి సమాచారం ఇవ్వడం ద్వారా అదుపులోకి తీసుకునేలా చేసింది. ఆ దేశ చట్టాల ప్రకారం నిందితులు, అనుమానితులకు సంబంధించిన పూర్తి నమూనాలు తీసుకునే అవకాశం ఉండటంతో సౌదీ పోలీసులు జిందల్ రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయడంతో పాటు నివేదికలను సీఐఏకు అందించారు. వీటిని భారత్ పంపిన జిందల్ కుటుంబీకుల నమూనాలతో పోల్చిన సీఐఏ జబియుద్దీన్ అన్సారీ, అబు జిందల్, అబు ఖాషిఫ్, రియాసత్ అలీ ఒక్కరేనని నిర్ధారిస్తూ ‘రా’కు సమాచారం ఇచ్చింది. ఈ నివేదికల ఆధారంగా సౌదీ పోలీసులను సంప్రదించిన ‘రా’ అధికారులు 2012 జూన్‌లో జిందల్‌ను భారత్ తీసువచ్చి అరెస్టు చేయగలిగారు. ∙ -
ఈ వారం కథ: డార్క్ లైఫ్
రాత్రి పదకొండు గంటలైంది. ఆత్రుతగా కారు బయటకు తీశాడు సంజయ్. అతని ముఖం నిండా ఆందోళన. దారికి ఇరువైపులా జాగ్రత్తగా గమనిస్తూ కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అంతటా నిర్మానుష్యంగా వుంది. ‘ఎటు వెళ్ళాడో?... ఎక్కడ ఉన్నాడో?’ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. క్షణక్షణం గుండె వేగం పెరుగుతోంది. ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేత్తో డాష్ బోర్డ్ మీద నుండి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. నంబర్ డయల్ చేశాడు. ‘‘దిస్ నంబర్ ఈజ్ స్విచ్డాఫ్’’ అని వచ్చింది. చిరాకుగా సెల్ పక్కకు విసిరేసి, కారును మరో వీధివైపు తిప్పాడు. ఆలోచనలతో తడుస్తున్నాడు. రెండు గంటల క్రితం ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా సినిమా రీలులా మెదడులో తిరుగుతున్నాయి. ‘‘ఎంతైనా అలా చేసి ఉండకూడదేమో... కాస్త ఓపిక పట్టాల్సింది... ఇంకోసారి మెల్లగా చెప్పాల్సింది. సహనం కోల్పోయి తప్పు చేశానా?’’ తన వైపు నుంచి కూడా ఆత్మ పరిశీలన చేసుకోసాగాడు. దాదాపుగా టౌన్ అంతా చుట్టేశాడు. అతని అన్వేషణ ఫలించలేదు. ఇక మిగిలింది టౌన్ చివరన ఉన్న బైపాస్ రోడ్డు ఏరియా. అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఎక్కువశాతం గుట్టలు, చెట్లు ఉన్నాయి. దూరం దూరంగా అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు తప్ప పెద్దగా జనావాసం లేదు.‘అటు వెళ్లాలా? వద్దా?’ నిర్ణయించుకోలేక కారు ఆపాడు. తల సీటు మీదకు వాల్చి, జుట్టులోకి చేతివేళ్ళు పోనిస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. ఇంతలో సెల్ రింగైంది. చటుక్కున అందుకున్నాడు. ‘‘హలో.. జానూ..’’ అన్నాడు.‘‘ఏమండీ... కనిపించాడా?’’ దుఃఖ ప్రవాహం కొనసాగుతుందనడానికి సూచనగా ఆమె గొంతు గాద్గదికంగా పలికింది. ‘‘లే...దు... నువ్వు కంగారుపడకు.. దొరకడమే ఆలస్యం బతిమాలి తీసుకొస్తాను...’’ జవాబు చెప్పలేక చెప్పాడు. అతని గుండెలో భారం పెరుగుతోంది. టైం చూశాడు. రాత్రి పన్నెండు. ఫోన్ చేయడానికి సమయం కాకపోయినా, తప్పని పరిస్థితి కాబట్టి, కాంటాక్ట్ నంబర్స్‌లోని కొన్ని నంబర్స్‌కు డయల్ చేశాడు. రింగ్ మోగి మోగి అలసిపోయిందే కాని, అటునుంచి స్పందన లేదు. చిరాకుగా స్క్రీన్ పైకి కిందకు జరుపుతుంటే తెలిసిన నంబర్ ఇంకోటి కనిపించింది. రింగ్ చేశాడు... ఎత్తలేదు. మళ్ళీ రింగ్ చేశాడు... మళ్ళీ... చివరి ప్రయత్నంలో ‘‘హలో... ఎవరండీ...’’ నిద్ర మత్తులో పలికిందా గొంతు.‘‘బాబూ... నేను రాహుల్ వాళ్ళ ఫాదర్‌ని... మావాడు నీ దగ్గరకు ఏమైనా వచ్చాడా?’’‘‘లేదంకుల్... రాలేదు...’’‘‘బాబూ ప్లీజ్... ఒక్క హెల్ప్ చేయవా... వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే వాళ్ళ నంబర్స్ పంపవా..’’ వేడుకోలుగా అడిగాడు.‘‘మేము తప్ప వాడికి ఎవరు లేరు... అయినా ఈ టైం లోపల ఇంటికే వస్తాడు కదా అంకుల్... రాలేదా...?’’‘‘........’’‘‘అంకుల్... ఏమైంది...? మాట్లాడండి...’’చెంపలపై జారిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘‘ఆ.. బాబూ... నైట్ మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు కోపంతో వెళ్ళిపోయాడు.’’‘‘సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలకు వాడలా చేయకూడదు అంకుల్. మేము కూడా చాలాసార్లు చెప్పాం, వాడు వినట్లేదు. ఈ మధ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు.’’‘‘అవును బాబూ... నువ్వన్నది కరెక్టే... ఈరోజూ అలాగే చేశాడు. నేను చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుండి వాడి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. కోపం తగ్గాక వస్తాడులే అని రెండు గంటల సేపు ఎదురు చూశాను. రాకపోగా సెల్ స్విచాఫ్ పెట్టాడు. నాకెందుకో భయంగా వుంది. టౌన్ మొత్తం తిరిగినా వాడు కనిపించలేదు. మీ దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళతాడో నీకేమైనా తెలుసా’’ అతని గొంతులో సన్నటి వణుకు. ‘‘నా....కు... ఆ... పెద్దగా గుర్తు లేదు కానీ ఒక్కసారి మాత్రం బైపాస్ రోడ్ దాటిన తరువాత గుట్ట మీదకు తీసుకుపోయాడు. అదే ఫస్టండ్ లాస్ట్’’ చెప్పడం పూర్తి కాకముందే....‘‘థాంక్యూ బాబూ...’’ ఠక్కున ఫోన్ కట్ చేశాడు. కారు స్టార్ట్ చేసి బైపాస్ రోడ్వైపు పోనిచ్చాడు.మట్టి రోడ్డు కావడం వలన గుంతలు ఎక్కువగా వున్నాయి. అక్కడక్కడా రాళ్ళు... కారు వేగంగా నడపలేకపోతున్నాడు. ఇక లాభం లేదనుకొని... కారు ఆపి నడక మొదలెట్టాడు. వీధిలైట్లు లేవు. ఇల్లు కూడా ఎక్కడో ఒకటి. అవి దాదాపు పూరి పాకలే. వెలుతురు సరిగా లేదని సెల్లులో టార్చిలైట్ ఆన్ చేశాడు. కొంత దూరం పోయాక అడుగుల శబ్దానికి కుక్కలు మేల్కొన్నాయి. ‘‘భౌ.. భౌ..’’మంటూ మొరగసాగాయి. ఒళ్ళు ఝల్లుమంది అతనికి. వెనక్కి పరుగెత్తాలన్నంత భయం వేసింది. చేతిలోని వెలుగును పరిసరాల మీదకు తిప్పాడు. అల్లంత దూరంలో పూరిపాక. దానిముందు ఓ వ్యక్తి కూర్చున్నాడు. ముఖం సరిగ్గా కనపడ్డం లేదు. ఇంత రాత్రి వేళ నిద్ర పోకుండా ఎవరు ఉంటారు? కచ్చితంగా తన కొడుకేనని అనుకున్నాడు.ఈ లోపు కుక్కలు అరుచుకుంటూ మీదకి వురికొస్తున్నాయి. ఐనా భయపడ్లేదు. ఏమైనా గానీ అనుకొని... ‘‘రాహుల్...’’ అనుకుంటూ పరుగు మొదలెట్టాడు. కుక్కల్ని ఎలా దాటాడో అర్థం కాలేదు క్షణాల్లో పాకను చేరుకున్నాడు. అక్కడ రాహుల్ లేడు, వేరే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పాకలోని ఎర్రని బల్బు కాంతి తలుపు సందులోంచి కూర్చున్న వ్యక్తి ముఖంపై సన్నగా పడుతోంది. కళ్ళు ఎండిపోయిన కాలువల్లా వున్నాయి. మాసిన బట్టలు... పెరిగిన జుట్టుతో వున్నాడు. అతని ఆహార్యం చూడగానే తొలుత భయం వేసింది. కాని, అవసరం తనది కాబట్టి మాట్లాడక తప్పలేదు. ‘‘హలో... నాకో హెల్ప్ చేస్తారా?’’ వేడుకోలుగా అడిగాడు సంజయ్.పాకముందు కూర్చున్న వ్యక్తిలో చలనం లేదు. తన ముందు ఎవరూ లేనట్టు, తనకేమీ వినబడనట్టు ఉన్నాడు. ‘‘స్పృహలో వున్నాడా? లేక పిచ్చివాడా?’’ ఆశ్చర్యమూ, అనుమానమూ రెండు కలిగాయి సంజయ్‌లో. ‘‘హలో మిత్రమా మిమ్మల్నే... నాకో హెల్ప్ చేస్తారా?’’ మళ్ళీ అడిగాడు. అదే పరిస్థితి... సమాధానం లేదు... కనీసం చూడనూలేదు. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఈలోపు మెసేజ్ సౌండ్ వినపడింది. రెప్పపాటులో మెసేజ్ చూశాడు. ‘‘సారీ డాడ్ నన్ను క్షమించు...’’. వెన్నులో వణుకు పుట్టింది. గబ గబా ముందుకు నడిచాడు. తెలియని పరిసరాలు. పైగా ఇవన్నీ కొత్త. తన పనే తనకు లోకంగా బతికినవాడు. తానెప్పుడూ ఇలా బయటకు రాలేదు. మరల పాక దగ్గరికి వచ్చాడు. రాహుల్ నంబర్‌కు డయల్ చేశాడు. ‘‘మీరు కాల్ చేస్తున్న నంబర్ కవరేజ్ ఏరియాలో లేదు’’ వాయిస్ రికార్డింగ్ వినపడగానే అతనిలో దుఃఖం ఆగలేదు. ఎలుగెత్తి ఏడ్వసాగాడు. అయినా కూర్చున్న వ్యక్తి కదల్లేదు.. మెదల్లేదు. సంజయ్ ఏడుపుకు పూరిపాక తడిక తెరుచుకుంది. అందులోంచి ఆవులిస్తూ ఒకావిడ బయటకు వచ్చింది. ఎదురుగా కూర్చున్న భర్తను చూసింది. మామూలుగానే ఉన్నాడు. ‘మరి ఏడ్చేదెవరు?’ అనుకుంటూ ఏడుపు వస్తున్న వైపు పరిశీలించింది. ఓ అపరిచిత వ్యక్తి. ‘గొప్పింటాయనలా ఉన్నాడు, పైగా ఏదో కష్టంలో ఉన్నాడు’ అనుకుంది. ‘‘ఇగో నిన్నే పైకి లే...’’ భర్త భుజాలు పట్టుకుని గట్టిగా ఊపింది. మెల్లగా ఈ లోకంలోకొచ్చాడు. ‘‘మూడు నెలల నుంచి ఇదే వరస. నిద్ర పట్టనప్పుడల్లా ఇలా ఆలోచనలో మునిగి నిన్ను నీవే మరచిపోతే ఎలాగయ్యా... త్వరగా పైకి లేవయ్యా! ఎవరో పెద్దాయన కావొచ్చు ఒకటే ఏడుస్తున్నాడు’’ అంటూ తొందర పెట్టింది.తాను ఆనుకున్న పందిరి గుంజను ఆసరాగా పట్టుకుని లేచాడు. ‘‘ఎక్కడ?’’ అంటూ ముందుకు కదిలాడు. ‘‘అదిగో’’ అంటూ దీపం పెట్టి చూపించింది. ఇద్దరూ దగ్గరకు పోయారు. అతన్ని పరిశీలనగా చూసారు. పెద్ద ఆఫీసర్లా ఉన్నాడు. ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. కాసేపు మౌనంగా వున్నారు. పాకతని భార్య నోరు తెరిచింది. ‘‘ఎవరు సార్ మీరు... ఎందుకేడుస్తున్నారు?’’ అన్నది.అంత రాత్రివేళ మనుషుల ఆసరా దొరకడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘నా కొడుకు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పైగా చనిపోతానని బెదిరించాడు. టౌనంతా వెదుకుతూ వచ్చాను. ఎక్కడా లేడు. మిగిలింది ఈ ఏరియా మాత్రమే. ఇక్కడ చూస్తే దారి లేదు. చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. వాడు ఇటు వైపే వచ్చుంటాడని నా అనుమానం... ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా... నా కొడుకు ప్రాణాలు కాపాడరా... వాడు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను’’ ప్రాధేయపడ్డాడు.సంజయ్ నోటి వెంట కొడుకు ప్రాణాలు అనే మాట వినగానే అప్పటి వరకు రాయిలా ఉన్న పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. మరో ఆలోచన లేకుండా భార్యను లోపలికి వెళ్ళమని చెప్పి, ‘‘నాకు తెలియని చోటు లేదు సార్! చూసొద్దాం పదండి’’ అంటూ ఇంట్లోకెళ్ళి టార్చ్ తీసుకొచ్చాడు. తాను ముందు నడుస్తుంటే, సంజయ్ వెనుక నడవసాగాడు. ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను దాటి కొంతదూరం వెళ్ళారు. అక్కడో కారుంది. కారును చూడగానే వెనుక నడుస్తున్న వాడల్లా జింకలా పరుగెత్తాడు సంజయ్. కారు ఖాళీగా వుంది. భయంతో అతని ముఖం నిండా చెమటలు పట్టాయి. ‘‘రాహుల్... నా బంగారం... నన్ను మన్నించరా... నాతో వచ్చెయ్ నిన్నేమీ అనను’’ అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు సంజయ్. ఆ అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు వింటుంటే పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. నోరు తెరవలేకపోయాడు. టార్చ్ వెలుతురు చూపించి పదమన్నట్లు సైగ చేస్తూ ముందుకెళ్ళాడు. సంజయ్ అతన్ని అనుసరించాడు. సుమారు అర కిలోమీటరు దాటిన తరువాత ఎడమ వైపు తిరిగి గుట్ట దగ్గర ఆగాడు పాకతను. అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ‘‘ఏమైంది’’ కంగారుగా అడిగాడు సంజయ్.‘‘ఏమీ లేదు’’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చి, వదిలాడు. ఇద్దరూ ఇంకాస్త ముందుకుబోయారు. ఎదురుగా పురాతనమైన బావి. గబుక్కున బావి గోడ పట్టుకుని లోపలికి తొంగి చూశాడు సంజయ్. పాకతని చేతిలోని టార్చ్ తీసుకొని ఆత్రంగా వెదకసాగాడు. బావి వాడకంలో లేదనడానికి రుజువుగా పెరిగిన చెట్లు దర్శనమిచ్చాయి. బావి కింది భాగంలోనుండి ‘‘అ...మ్మా.. అ...మ్మా...’’ మూలుగులు. ‘‘అదిగో... రాహుల్... నా కొడుకు... ఈ టార్చ్ పట్టుకో...’’ అంటూ లోపలికి దిగే ప్రయత్నం చేయబోయాడు సంజయ్. ‘‘ఓ... ఆగండాగండి... భలేవారే... ఈ బావి గురించి తెలుసా మీకు... మనిషి లోపలికి పోతే ప్రాణాలు పైకి పోవడమే...’’ వెనక్కిలాగాడు పాకతను.‘‘అంత లోతుందా...?!’’ ఆశ్చర్యపోయాడు సంజయ్. ‘‘లోతొక్కటే కాదు... అడుగున తాచు పాములున్నాయి. బావిలో పడితే జీవితం ఖతమే’’ అంటూ టార్చ్ తీసుకొని ప్రక్కనున్న చెట్లవైపు పోయాడు. చాలాసేపు వెతికాడు. ‘హమ్మయ్యా! ఇక్కడే వుంది’ అనుకుంటూ కుప్పలా పడున్న తాడు తీసుకొని బావి దగ్గరకు వచ్చాడు. పక్కనే వున్న చెట్టుకు తాడు కట్టి మిగిలినది బావిలోకి విసిరాడు. తాడు పడిన వెంటనే పాములు బుసలు కొడుతున్న శబ్దం రాసాగింది. ‘‘లోపల ఎలావుందో విన్నారుగా’’ అంటూ బావి చుట్టూ టార్చ్ తిప్పుతూ సంజయ్ కొడుకును చూశాడు.బావి మధ్యలో చెట్ల కొమ్మలకు చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తూ తాడు కట్టిన వైపే వున్నాడు. తనకి గతంలో ఆ బావిలో దిగిన అనుభవం ఉంది. కానీ పొరపాటున జరగరానిదే జరిగితే ఇద్దరి ప్రాణాలకూ ముప్పు. పైగా అర్ధరాత్రి దాటింది. అప్పటికే మూడు రోజులు నుండి సరిగా నిద్ర పోలేదు. నీరసంగా ఉన్నాడు. కానీ కన్నబిఢ్డ కోసం ఓ తండ్రి పడే వేదన తనకు బాగా తెలుసు. అందుకే వెనకా ముందూ ఆలోచించకుండా తువాలును నడుముకు కట్టుకుని, దాని మధ్యలో టార్చ్ పెట్టుకొని చిన్నగా వేలాడాడు. అతి కష్టం మీద అబ్బాయి వున్న చోటికి చేరుకున్నాడు. ఎన్నో ప్రయత్నాల పిదప ఇద్దరి నడుములకు తాడును బిగించాడు. ‘‘పైకి లాగండి... సార్’’ అంటూ గట్టిగా అరిచాడు. ఇద్ధరిని లాగడమంటే చాలా కష్టం. చావు బతుకుల పోరు కాబట్టి శక్తినంతా కూడగట్టుకుని మెల్ల మెల్లగా పైకి లాగాడు సంజయ్. క్షేమంగా కొడుకు బయటకు రావడంతో సంజయ్ ఆనందానికి అవధుల్లేవ్. రాహుల్‌ను వాటేసుకుని ముద్దులు పెట్టాడు. ‘‘మీరు దేవుడండి...! మీరు లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు.’’ పాకతన్ని గుండెలకు హత్తుకొని కృతజ్ఞతలు చెప్పాడు సంజయ్. ఉన్నట్లుండి పాకతని కళ్ళెంట కన్నీటి ధారలు. సన్నగా మొదలైన ఏడుపు బిగ్గరగా ఏడస్తున్నాడు. ఆర్తధ్వని చేస్తున్నాడు. సంజయ్, రాహుల్‌లు స్థాణువులైనారు. అతనికేమైందో అంతుపట్టడం లేదు. ‘‘ఫ్లీజ్...! ఆగండీ...’’ ఓదార్చే ప్రయత్నం చేసాడు సంజయ్. పది నిమిషాలు గడిచాయి. ‘‘ఏమైంది?’’ అన్నాడు మళ్ళీ సంజయ్. ‘‘నా కొడుకయ్యా... కొడుకు....’’ గుండెలు బాదుకోసాగాడు పాకతను.‘‘అయ్యో!.... కంట్రోల్ చేసుకోండి... ఏం జరిగిందో చెప్పండి’’ సంజయ్‌లో ఆత్రుత మొదలైంది. మరికొన్ని నిమిషాలు గడిచాయి. మెల్లగా నోరు తెరిచాడు పాకతను. ‘‘మాది మామూలు పల్లెటూరు. నేను పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేస్తుండేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. చాలా ఆసుపత్రులకు వెళ్ళాము. డాక్టర్లు పరీక్ష చేసి, పిల్లలు పుట్టరని చెప్పారు. నేను, నా భార్య కుమిలిపోయాం. ఏ దేవుడు దయచూపాడో తెలియదు కాని, చాలా యేళ్ళకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. మా ఆనందం అంతా ఇంతా కాదు. వాడికి వినయ్ అని పేరు పెట్టుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మంచి చదువులు చెప్పించాలని ఈ సిటీకి వచ్చి... ఇగో ఈ మూలకు ఓ గుడిసె వేసుకొని బతుకుతున్నాం. మా ప్రయత్నానికి తగ్గట్లుగా నా కొడుకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. పీహెచ్డీ చేయడం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఒకసారి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడు. మాకైతే పెద్ద పండగొచ్చినట్లయింది. నా భార్య వాడికి ఇష్టమైన కారçప్పూస, అరిసెలు, గారెలు నాలుగైదు రకాల పిండివంటలు చేసింది. నేను బట్టల షాపుకు వెళ్ళి మూడువేలు పెట్టి కొత్త బట్టలు తెచ్చాను. వాడు బస్టాండ్‌లో దిగేసరికి రాత్రి పదైంది. ఆరోజు వాడు బస్సు దిగి నా కళ్ళముందు కన్పడగానే నా సంతోషం ఆకాశమంత పెరిగింది. నా కంటే ఎత్తుగా ఎదిగిన కొడుకుని ప్రయాణీకులు అందరూ చూస్తుండగా అమాంతం పైకెత్తుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత కిందకు దించి గుండెలకు హత్తుకున్నాను. మా కోటి ఆశల బంగారాన్ని బండిపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంట్లోకి రాగానే ‘‘ఇలా చిక్కిపోయావేంట్రా వినయ్...?’’ అంటూ కన్నీళ్ళతో దగ్గరకు తీసుకుంది. అప్పటివరకు నేను కూడా గమనించలేదు. వాడి ముఖమంతా పాలిపోయి వుంది. కళ్ళల్లో జీవం తగ్గింది. లావుగా వుండేవాడు, బాగా చిక్కిపోయాడు. మాకేమీ అర్థం కాలేదు.ఆరోగ్యం ఏమైందోనని గుబులు మొదలైంది నాలో. వాడ్ని దగ్గరకు తీసుకొని ‘‘ఏందిరా... కొడకా? జ్వరమేమైనా వచ్చిందా?’’ అన్నాను. ‘‘అలాంటిదేం లేదు నాన్న, నీళ్ళు మారాయి, ఫుడ్ మారింది... దానివల్లనే కాస్త తగ్గాను.... ఇంతమాత్రం దానికే కంగారుపడతారెందుకు’’ తేలికైన సమాధానంతో మా భయాన్ని పోగొట్టాడు. ‘‘ఏయ్... నేనుబోయి చికెన్ తెస్తానే... పిల్లాడికి వేడి నీళ్ళు పెట్టు’’ అంటూ బయటకు వెళ్ళాను. నేనొచ్చేసరికి స్నానం చేశాడు. నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నాడు. నిమిషాల మీద చికెన్ కూర రెడీ అయ్యింది. అందరం కలిసి భోజనం చేశాం. పిండివంటలు కూడా కొసరి కొసరి తినిపించాం. వాడి చదువు గురించి, చేయబోయే ఉద్యోగాల గురించి చెప్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కినట్లేనని సంబరపడుతూ నిద్రలోకి జారుకున్నాము. మాకు చీకటితోనే లేచే అలవాటు. పూర్తిగా తెల్లారలేదు. లేచి చూస్తే మంచం మీద మావాడు లేడు. ఇంత పెందలకడనే ఎటు వెళ్ళాడబ్బా అనుకుంటూ... వాడిని వెతుక్కుంటూ ఈ వైపే వచ్చాను. ఈ బావి వెనకనే రాళ్ళ గుట్టొకటుంది కదా, దాని మీద కూర్చుని ఏదో తాగుతున్నాడు. నేను అడుగులో అడుగేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. నన్ను చూడగానే కంగారుగా పైకి లేచి నిలబడబోయాడు. కానీ నిలబడటం వాడి వల్ల కాలేదు. చూస్తుండగానే కుప్పలా కూలిపోయాడు.నాకు పై ప్రాణాలు పైనే పోయినట్లైంది. వాడి చుట్టూ ఏదో ప్లాస్టిక్ పొట్లాలు... వాటిల్లో తెల్లటి పొడి వుంది. ప్రక్కనే సిగరెట్ బాక్స్, అగ్గిపెట్టె ఉన్నాయి. కదిలించి చూశాను. సోయిలో లేడు. మత్తుగా మూలుగుతున్నాడు. నా గుండె బరువెక్కింది... పైకి లేపి భుజాల మీద వేసుకున్నాను. పరుగు పరుగున ఇంటికి తీసుకొచ్చాను. మంచంలో పడుకోబెట్టాను. మే ఇద్దరం కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగాము. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల ఉండేవారు. కొంతమంది పోగయ్యారు. మాకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్ళమని ఆటోను తీసుకొచ్చి, మమ్మల్ని ఆటో ఎక్కించారు. డాక్టర్ పరిశీలించిన తర్వాత మావాడు డ్రగ్స్‌కు బాగా అలవాటుపడ్డాడని... ఏవేవో టెస్ట్‌లు చేసి, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. గుండెనిండా బాధతో ఇంటికి చేరాము.ఒకసారి నిద్రపోతుండగా వాడి సెల్లులోంచి కాలేజీ సార్‌కు ఫోన్ చేశాను. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే వాడి స్నేహితులే వాడి జీవితాన్ని ఆగం చేశారని, డ్రగ్స్ మత్తులో పడి తన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడని అర్థమైంది మాకు. ఇక చదువు సంగతేమో గాని, వాడు మామూలు మనిషి అయ్యేవరకు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాం.మూడు రోజులు గడిచాయి. ఓ రోజు ఉన్నట్లుండి పిచ్చిపట్టినట్లుగా అరుస్తున్నాడు... కేకలు వేస్తున్నాడు... ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా, మమ్మల్ని నెట్టివేసి రాళ్ళ గుట్ట దగ్గరకు పరుగులు తీసాడు. నేను కూడా వేగంగా పరుగెత్తాను. అతి కష్టం మ్మీద వాడ్ని చేరుకున్నాను. డ్రగ్స్ పాకెట్స్ కోసం కాబోలు చుట్టూరా వెతుకుతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. వాణ్ణా స్థితిలో చూస్తుంటే నేనెందుకు బతికున్నానా? అనిపించింది.‘‘ఒరేయ్! నా బంగారమో... నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు.నేను అనుసరించే క్రమంలో పట్టుతప్పి రాళ్ళ గుట్ట మీద నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చాను. మోచేతులు, మోకాళ్ళ నిండా గాయాలైనాయి. అయినా వాటిని లెక్కచేయక నేను చేరుకునే లోపే బావిలోకి దూకేశాడు. పడీ పడటమే పాములు కాటేసినట్లున్నాయి. ‘‘అమ్మా... నాన్నా...!’’ అంటూ గావుకేకలు పెడ్తూ ప్రాణాలు విడిచాడు. నానా తిప్పలుపడి ఎలాగోలా పైకి తీసుకొచ్చాను. ఎర్రగా మారాయి పాకతని కళ్ళు. ‘‘ఇంత బాధలో కూడా అర్ధరాత్రి వేళ నా కోసం ఇంత చేశారంటే... మీరు మనిషి కాదు... మహానుభావులు. ఊపిరున్నంత కాలం కాలాన్ని ఈదడమొక్కటే మనిషి చేయగలిగిన పని. బాధపడకండి... పోదాం... పదండి..’’ పాక దగ్గరకు తీసుకొచ్చాడు సంజయ్.సంజయ్ కొడుకు దొరికినందుకు సంతోషపడ్తూ... మరో వైపు తన కొడుకు గుర్తుకొచ్చి పాకతని భార్య కూడా కన్నీటిలో మునిగింది. ‘‘చేతికొచ్చిన కొడుకు చూస్తుండగానే వెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు? పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ మత్తు పదార్థాలను ఆపేదెవరయ్యా?’’ ‘‘వూర్కోండమ్మా! ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు... మీరింత దుఃఖంలోనూ నాకు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేను’’ అన్నాడు సంజయ్. రాహూల్ మనసులో పశ్చాత్తాపం మొదలైంది. వినయ్లాగా తన జీవితం కూడా ముగిసిపోతే తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారోననే అవగాహన తనలో కలిగింది. త్వరగా ఈ డ్రగ్స్ మానేయాలనే ఆలోచన చేయసాగాడు. సంజయ్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఒక నంబర్‌కు డయల్ చేశాడు. ‘‘నమస్తే సార్!’’ అన్నాడు అవతలి వ్యక్తి. ‘‘సురేష్... ఇన్ని రోజులు డ్రగ్స్ మహమ్మారికి డబ్బున్న పిల్లలే బలవుతున్నారని అనుకున్నాను కాని, పేద యువకులు కూడా దారుణంగా బలవుతున్నారు. మన నిఘాను బలోపేతం చేయాలి, డ్రగ్స్ రాకెట్‌ను నిర్మూలించాలి’’ అన్నాడు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్. ‘‘ఒరేయ్! నా బంగారమో... నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు. -రాచమళ్ళ ఉపేందర్ -
కథాకళి: ప్రిన్స్
మా ఎదురింటి ఆయన మరణించాక ఆయన వారసులు ఆ ఇంటిని అమ్మేశారు. దాన్ని పడగొట్టి అపార్ట్మెంట్స్ కట్టడం ఆరంభించడానికి మునుపే ఆగాచారి ఆ స్థలానికి వాచ్‌మేన్ గా వచ్చాడు. యాసని బట్టి అతనిది కరీంనగర్ జిల్లా అని, అతని వెంట తిరిగే డాషన్ జాతి కుక్క ప్రిన్స్ అతని పెంపుడు కుక్కని త్వరలో గ్రహించాను. దాని విలువ వేలల్లో ఉండొచ్చు. కాబట్టి దాన్ని అతను కొని ఉండడు. దొంగిలించాడా? లేదా ఎవరిదైనా తప్పిపోయి వచ్చిందా? ఆ కుక్కంటే ఆగాచారికి బాగా ప్రేమని అతని చర్యల ద్వారా తెలిసిపోతూంటుంది.ఆగాచారి భార్య వయసు ముప్ఫై, ముప్ఫై ఐదు మధ్య ఉంటుంది. చూస్తే సినిమాల్లో గ్రూప్ డాన్స్‌ల్లో పాల్గొనే డాన్సర్లా అనిపించింది. కొద్దిగా పక్కకి వెళ్తే, ఆకర్షణీయమైన మొహం, చక్కటి శరీర సౌష్టవం గల డేన్సర్స్ ఎందుకు హీరోయిన్స్ కాలేదా అని నాకు అనిపిస్తూంటుంది.ఓ సోమవారం మధ్యాహ్నం మా ఆవిడ నన్ను అర్జెంట్‌గా కిటికీ దగ్గరికి రమ్మని అరిచింది. తక్షణం నేను వెళ్తే, అపార్ట్మెంట్స్ కట్టే ఎదురు స్థలంలోని ఆగాచారి షెడ్లోంచి ఏభై పైబడ్డ ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. మడత నలగని తెల్లటి ఖాదీ చొక్కా, ఖాదీ పేంట్లోని ఆయన మెడలో బంగారు గొలుసు, చేతికి బంగారు బ్రేస్లెట్ కనిపించాయి. ఆయన బి.ఎం.డబ్ల్యూ. కారు ఎక్కి వెళ్ళాక మా ఆవిడ నిష్టూరంగా చెప్పింది.‘‘చూశారా?’’‘‘ఏమిటి?’’ అడిగాను.‘‘మీకు అర్థం కాలేదా?’’ విసుక్కుంది.దాదాపు రెండున్నర గంటల తర్వాత మా ఆవిడ మళ్ళీ పిలిచింది. కిటికీలోంచి చూస్తే ట్రాలీలో ఇనుప చువ్వలతో వచ్చి వాటిని దింపించే ఆగాచారి కనిపించాడు.‘‘వీడు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న వీడి భార్య దగ్గరకి ఆ బిల్డర్ ఎందుకు వచ్చాడో ఇప్పుడైనా మీ మట్టిబుర్రకి అర్థమైందా?’’ ఎకసెక్కెంగా అడిగింది.‘‘ఇలాంటివి ఆడవాళ్ళే కనిపెట్టగలరు.’’ నవ్వుతూ చెప్పాను.తర్వాత మా ఆవిడ ఆఫీస్ నించి వచ్చిన నాతో అప్పుడప్పుడు ‘ఆ బిల్డర్ మళ్ళీ ఇవాళ వచ్చి వెళ్ళాడు’ అని చెప్పేది.తరచూ ఆగాచారి మాపై అపార్ట్మెంట్కి వచ్చి, వారిని పచ్చడి ఏదైనా ఇవ్వమని అడిగి తీసుకెళ్తూండటం అలవాటు. ఓరోజు ఆ అపార్ట్మెంట్ ఆయన నాతో చెప్పాడు.‘‘ఆగాచారి ప్రిన్స్‌ని వంద రూపాయలకి అమ్ముతాడట. కొంటారా? అని అడిగాడు. నాకు ఆసక్తి లేదు. అది అపార్ట్మెంట్లో పెంచుకోతగ్గది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే కొనొచ్చు.’’‘‘అబ్బే. లేదండి.’’ చెప్పాను.ఆగాచారి మా అపార్ట్మెంట్స్లోని అందర్నీ ప్రిన్స్‌ని కొనమని అడిగాడు. కాని ఎవరూ కొనలేదు. ఆఖరుగా నన్ను అడిగాడు.‘‘అసలు నీకు అది ఎక్కడిది?’’ అడిగాను.‘‘మా ఊళ్ళో ఒకాయన పొలం పని చేసేవాడిని. ఆయన అమెరికా వెళ్తూ దాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. ఊరికే ఇస్తే చాలామంది తీసుకుంటారు సార్. కాని డబ్బు ఇచ్చి కొనే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని.’’ ఆగాచారి చెప్పాడు. ‘‘ఎందుకు అమ్మదల్చుకున్నావు?’’ అడిగాను. అతను జవాబు చెప్పడానికి తబ్బిబ్బుపడ్డాడు.‘‘మా ఆవిడకి ప్రిన్స్ అంటే ఇష్టం లేదు.’’ చివరికి చెప్పాడు.భార్యని కంట్రోల్ చేయలేని అతని అసమర్థతకి నాకు జాలి వేసింది.‘‘అమ్మేటట్లయితే అంత తక్కువకి అమ్మక. దాన్ని ఐదారు వేలకి అమ్మొచ్చు.’’ సలహా ఇచ్చాను.ఆరోజు నేను ఆఫీస్ నుంచి రాగానే మా ఆవిడ చెప్పింది.‘‘మొత్తానికి ఆగాచారి కుక్కని అమ్మాడండి.’’‘‘ఎంతకి?’’ వెంటనే అడిగాను.‘‘తెలీదు. ఎదురు అపార్ట్మెంట్స్ని కొన్నవాళ్ళలో ఒకతను ఉడ్‌వర్క్ చేయించడానికి వచ్చిపోతున్నాడు. అతను కొన్నట్లున్నాడు. ఇందాక కారులో ప్రిన్స్‌ని ఎక్కించి తీసుకెళ్ళడం చూసాను. ఆగాచారి ఎవరో పోయినట్లుగా ఏడ్చాడంటే నమ్మండి.’’ చెప్పింది. ‘‘వాళ్ళ ఆవిడ లోని రెండో చెడ్డ గుణం, ఆ కుక్కని ప్రేమించకపోవడం.’’ చెప్పాను. గంటన్నర తర్వాత మా ఆవిడ టి.వి. చూసే నన్ను పిలిచి చెప్పింది.‘‘చూడండి. మన ఇంటి ముందు పోలీస్ కార్లు ఆగాయి. ఏమైందో కనుక్కురండి.’’నేను వెంటనే చెప్పులు తొడుక్కుని బయటికి వచ్చాను. ఎస్.ఐ. ఆగాచారి షెడ్ ముందు కుర్చీలో కూర్చుని అతని భార్యని ప్రశ్నిస్తూండటం చూసి అక్కడికి వెళ్ళాను.‘‘వాడు కొనుక్కొచ్చింది పురుగుల మందని తెలీదు సారూ. రంగు డబ్బా అనుకున్నా.’’‘‘అది ఎందుకు తాగాడో తెలీదంటావు?’’‘‘తెలీదు సారూ.’’ఆగాచారి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అదిరిపడ్డాను. అపార్ట్మెంట్ టెర్రేస్‌లో అతని శవం ఉందని తెలిసింది. ఆగాచారి భార్యలో భర్త పోయినందుకు సహజంగా కనపడాల్సిన దుఃఖం కనపడలేదు.ఆగాచారి ప్రిన్స్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించాడని, తన భార్యకి గల అక్రమసంబంధం గురించి తెలిశాక చావాలనుకుని ముందుగా దాన్ని అమ్మాడని, ప్రిన్స్‌ని ఎవరూ కొనకుండా ఉంటే అతని ప్రాణం ఇంకొంత కాలం నిలిచేదని నాకు అనిపించింది. -
శంబసాధనుడి వధ
పూర్వం కేసరి అనే వానరుడు ఉండేవాడు. హిమాలయాల దిగువ ప్రాంతంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన అరవైవేల మంది వానర యోధులకు అధినాయకుడు. పార్వతీ పరమేశ్వర భక్తుడైన కేసరి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు ప్రసన్నుడై, ప్రత్యక్షమైన పరమేశ్వరుడి నుంచి అనేక వరాలు పొందాడు. అదేకాలంలో శంబసాధనుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించి, అనేక వరాలు పొందాడు. వరగర్వంతో అతడు ముల్లోకాలలోని లోకులను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను, పన్నగులను, అప్సరకాంతలను హింసించేవాడు.‘నేను తప్ప మణులను మీరెవరూ ధరించరాదు’ అంటూ దేవతాసర్పాల తలలపైనున్న మణులను పెరికివేసి, వాటిని కిరీటంపై ధరించేవాడు. ‘ఇక నుంచి నన్నే కొలవండి’ అంటూ అప్సరకాంతలను కొప్పు పట్టి ఈడ్చుకొచ్చి, తన కొలువులో వారిచేత ఊడిగం చేయించుకునేవాడు. ‘యజ్ఞభాగాలన్నీ ఇకపై నాకే దక్కాలి’ అంటూ దేవతల కిరీటాలను కాళ్లతో తన్నేవాడు. వారిని చిత్రహింసలు పెట్టేవాడు. శంబసాధనుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. దేవతలు అతడిని నిలువరించడానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. వారంతా బితుకు బితుకుమంటూ బతకసాగారు.దేవతలు ఎంతగా ఒదిగి ఉంటున్నా, వారి పట్ల శంబసాధనుడి దాష్టీకాలు నానాటికీ పెరగసాగాయి. అతడి పీడ ఎలా విరగడ అవుతుందోనని దేవతలు మథనపడసాగారు. చివరకు అతడికి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడే తరుణోపాయం చెప్పగలడని తలచి, మూకుమ్మడిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. ‘బ్రహ్మదేవా! నీ వల్ల వరాలు పొందిన శంబసాధనుడు మా పాలిటి పీడగా మారాడు. వాడి సంహారానికి తగిన తరుణోపాయం చెప్పి, మమ్మల్ని అతడి బాధల నుంచి రక్షించు’ అని మొరపెట్టుకున్నారు.దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు, ‘దేవతలారా! దిగులు చెందకండి. శంబసాధనుడు నా వరాలను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అతడికి కాలంతీరే రోజులు ఆసన్నమయ్యాయి. అతడిని సమర్థంగా ఎదుర్కొని, అతడిని అంతమొందించగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే వానరాధిపతి కేసరి. మీరంతా వెళ్లి అతడిని ఆశ్రయించండి. కేసరి తప్పక మీ మనోభీష్టాన్ని నెరవేర్చగలడు’ అని సెలవిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలతో దేవతలంతా కేసరి వద్దకు వెళ్లారు. ‘ఓ మహాత్మా! వానరశ్రేష్ఠా! శంబసాధనుడు మమ్మల్ని పీడిస్తున్నాడు. అతడిని ఎదిరించగల వీరాధి వీరుడవు నువ్వొక్కడివేనని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెబితే, నీ వద్దకు వచ్చాం. శంబసాధనుడిని సంహరించి, నువ్వే మమ్మల్ని రక్షించాలి’ అని అన్నారు. కేసరి వారికి అభయమిచ్చాడు. దేవతలు ఒకవైపు కేసరిని కలుసుకుని, అభయం పొందితే, మరోవైపు నారదుడు మహతి మీటుకుంటూ శంబసాధనుడి వద్దకు వెళ్లాడు. ‘దేవమునీ! ఎక్కడి నుంచి తమరి రాక, లోక విశేషాలేమిటి?’ అని అడిగాడు శంబసాధనుడు. ‘దైత్యశ్రేష్ఠా! నీ సంహారం కోసం దేవతలంతా వానర రాజును ప్రార్థిస్తున్నారు. ఈ సంగతి నీ వరకు రాలేదా? నీ గూఢచారులు ఏం చేస్తున్నారు? నెలగ్రాసం తీసుకుని నిద్రిస్తున్నారా?’ అన్నాడు.నారదుడు ఈ మాట చెప్పడంతోనే శంబసాధనుడు మండిపడ్డాడు. ‘పోనీ జ్ఞాతులే కదా అని ప్రాణాలతో విడిచిపెడితే, దేవతలంతా నా ప్రాణాలకే ఎసరుపెడతారా? కోతిమూకకు రాజైన వాడితో నన్ను అంతం చేయాలనుకుంటారా? వాళ్ల అంతుచూస్తాను’ అంటూ ఆయుధాలు ధరించి, దేవతల మీదకు దండెత్తాడు. శంబసాధనుడిని చూసి, దేవతలు కాలికి బుద్ధి చెప్పారు. కొందరు కొండగుహల్లో తలదాచుకున్నారు. కొందరు కేసరి వద్దకు వెళ్లి, శంబసాధనుడు దండెత్తి వస్తున్న సంగతి చెప్పారు. కేసరి దేవతలకు అండగా, శంబసాధనుడి ఎదుటకు వచ్చి నిలిచాడు.‘ఓరీ! రాక్షసాధమా! లోకకంటకుడవైన నిన్ను అంతం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఓరీ! కోతీ! నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నాతో పోరుకు నిటలాక్షుడే తటపటాయిస్తాడు. నువ్వెంత? చిటికెలలో నిన్ను యమపురికి పంపిస్తాను’ అన్నాడు శంబసాధనుడు. ఇద్దరూ ఒకరితో ఒకరు కలపడ్డారు. శంబసాధనుడి మీదకు కేసరి ఒక బండరాయి విసిరాడు. అతడు తన గదతో బండరాయిని తుత్తునియలు చేశాడు. కేసరి వెంటనే మరో బండరాయి విసిరాడు. అది నేరుగా శంబసాధనుడి రొమ్మును తాకింది. ఆ దెబ్బకు అతడు తూలిపడ్డాడు.‘ఓరీ! వానరా! నువ్వు బలశాలివే, తగినవాడివే! ఈసారి చూడు’ అంటూ తన గదను కేసరి మీదకు విసిరాడు. ఆ గద కేసరిని తాకి పిండి పిండిగా నేల రాలింది. ఈసారి శంబసాధనుడు శూలం విసిరాడు. కేసరి దానిని ఒడిసి పట్టుకుని, ముక్కలుగా విరిచి అవతల పడేశాడు. ఆయుధాల పని అయిపోవడంతో శంబసాధనుడు కేసరితో బాహాబాహీకి తలపడ్డాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ కలబడ్డారు. చివరకు కేసరి పిడికిలి బిగించి, శంబసాధనుడి ఛాతీపై ఒక్కపోటు పొడిచాడు. అతడు నెత్తురు కక్కుకుంటూ అక్కడికక్కడే చచ్చాడు. అది చూసి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు.సాంఖ్యాయన -
స్టయిల్‌గా చెప్తా!
‘నేను ట్రెండ్స్‌ను ఫాలో కాను, సెట్ చేస్తాను’ అని చెప్పకనే చెబుతోంది ఫారియా అబ్దుల్లా. ఆమెకు దుస్తులు కేవలం అలంకారం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఆ స్టయిల్ వెనుక ఉన్న ఫ్యాషన్ టిప్స్ మీకోసం!చీర.. బ్రాండ్: కంకటాల ధర రూ. 22,167జ్యూలరీ బ్రాండ్: ది జ్యూయల్ గ్యాలరీధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఇండోవెస్ట్రన్ ఫ్యూజన్ స్టయిల్ నాకు ఆటస్థలం లాంటిది. చీరలు ఎప్పటికీ ట్రెండీనే కానీ, వాటిని కొత్తగా, సరదాగా మలచడమే నా ఫ్యాషన్ . వేసుకునే ఆభరణాలు, రంగులు కూడా మాట్లాడుతాయన్న నిజం ఈ మధ్యే అర్థమైంది. అందుకే, నేను దుస్తులను, నా వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా చెప్తుంటాను. – ఫారియా అబ్దుల్లా. చిన్న ఆభరణం పెద్ద మెరుపు!ముఖాన్ని చూస్తే ముందుగా కనిపించేది కళ్ల మెరుపు అయితే, ఆ మెరుపును మరింత మాయాజాలంగా మార్చేది ముక్కు పుడకనే చెప్పాలి. సంప్రదాయంలో పుట్టిన ఈ చిన్న ఆభరణం, నేటి రోజుల్లో ఫ్యాషన్ ప్రపంచంలోనూ అడుగుపెట్టి, ఒక సిగ్నేచర్ స్టేట్మెంట్గా మారింది. ఒక సన్నని బంగారు వలయం ముఖానికి సౌమ్యతను ఇస్తే, కుందన్ , పోల్కీ, ముత్యాలు, రంగురాళ్లతో మెరిసే నోస్ రింగ్స్ లుక్‌కి ప్రత్యేకమైన మెరుపు అద్దుతున్నాయి.పట్టు చీరతో పెద్ద డిజైన్ నోస్ రింగ్స్ రాయల్ టచ్ ఇస్తే, కుర్తీ లేదా ఫ్యూజన్ డ్రెస్సులతో చిన్న స్టోన్ రింగ్ ట్రెండీ టచ్‌ను ఇస్తుంది. ఇక మోడ్రన్ డ్రెస్సుల్లో స్లీక్ హూప్ స్టయిల్ నోస్ రింగ్స్ బాగుంటాయి. పింక్, రెడ్ స్టోన్స్, ఓపెన్ డిజైన్స్, లైట్‌వెయిట్ హూప్స్ ఇప్పుడు యువతలో హాట్ ఫేవరెట్. ఇలా వివిధ డిజైన్స్‌తో, బంగారం, వెండి, ఆర్టిఫిషియల్ ఆప్షన్లలో అన్ని బడ్జెట్లకు సరిపోయేలా మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉన్నాయి. -
పగటి వేషాలేనా రాత్రి కలలు?!
‘‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది..’’ అని అబ్దుల్ కలామ్ అనేవారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం రేయింబవళ్లు నిద్రాహారాలు మాని మరీ కృషి చేయటం అనే అర్థంలో చెప్పిన మాట ఇది. ఇక్కడ ‘కల’ అన్నది ఒక లక్ష్యం. లక్ష్యంతో నిమిత్తం లేకుండా వచ్చే కలలు వేరు. అవి దాదాపుగా అందరికీ ప్రతిరోజూ నిద్రలో వస్తూనే ఉంటాయి. అవి మనిషి మానసిక స్థితికి సంకేతాలు అని శాస్త్రవేత్తలు అనటమే కానీ ఇంతవరకు వారికీ ఆ విషయమై ఒక స్పష్టత లేదు. అయితే ప్రతి కలకూ ఒక మూలం ఉంటుందని; అర్థం, అంతరార్థం కూడా ఉంటాయని శాస్త్రవేత్తలలోనే కొందరు విశ్వసిస్తున్నారు! ఆ వివరాల్లోకి వెళ్దాం.ఒక కల సాధారణంగా 5 నుండి 20 నిమిషాల వరకు మాత్రమే కొనసాగుతుంది. అయినప్పటికీ, మనకు పూర్తిస్థాయి సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి సినిమా? ఎలాంటిదైనా కావచ్చు. ఆర్జీవీ ‘రాత్’ లేదా ‘భూత్’లాంటి కల కావచ్చు. లేదా, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఏమాయ చేసావె’లాంటి కమ్మటి ప్రేమ కల కావచ్చు. లేదంటే, ‘ఆదిత్య 369’, ‘ప్లే బ్యాక్’లాంటి టైమ్ ట్రావెల్ కలైనా కావచ్చు.అసలేంటీ కలలు?హాయిగా మన నిద్ర మనం పోతున్నప్పుడు మధ్యలో ఈ కలలకేం పని? పని గట్టుకుని వాటికేం పని లేదు కాని, కలలు కూడా మన నిద్రలో ఒక భాగమే. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు సృష్టించే కథలు, చిత్రాలే ఈ కలలు. మనం నిద్ర పోతున్నా, మనసు మేల్కొనే ఉంటుంది. కలలు అనేవి ప్రధానంగా నిద్రలోని కొన్ని దశలలో ఏర్పడే భ్రాంతి దృశ్యాలు (హెల్యూసినేషన్లు). ఇవి ముఖ్యంగా ‘ఆర్.ఇ.ఎం. నిద్ర’ దశలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే.. ఈ దశలోని కలలు మనకు అంత స్పష్టంగా కనిపిస్తాయా.. తెల్లారగానే, ఎందుకో అవి అస్పష్టంగా కూడా గుర్తుకు రావు. ఏదో కల వచ్చిందన్నత వరకే మైండ్‌లో ఉంటుంది! ‘ఆర్.ఇ.ఎం. స్లీప్’ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. కంటి కదలికలు వేగవంతంగా ఉండే దశలోని నిద్రన్నమాట. కలల అవసరం ఉందా?మనిషికి నిద్ర అవసరం ఏమిటో తెలిసిందే. జీవక్రియ సజావుగా సాగటానికి నిద్ర చాలా అవసరం. జీవక్రియనే ‘మెటబాలిజం’ అంటారు. రోజువారీ పనులు చేసుకోవటానికి అవసరమైన శక్తిని శరీరం ఉత్పత్తి చేసుకోవటంలో, జీవకణాలను ఎప్పటికప్పుడు మరమ్మతు చేయటంలో మెటబాలిజం పాత్ర ముఖ్యమైనది. ఇంకో రెండింటికి కూడా నిద్ర చాలా కీలకమైనది. ఒకటి రక్తపోటు, మరొకటి ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాల నియంత్రణకు! సరిపడా నిద్ర లేదా సౌఖ్యమైన నిద్రలేకుంటే ఈ మెటబాలిజం, రక్తపోటు, తక్కిన దేహధర్మాలు కుంటుపడి ఆరోగ్యం క్రమేణా దెబ్బతింటుంది. నిద్ర వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి కలల అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సమాధానం లేదు. ఏళ్ల తరబడిగా... ‘కలల అవసరం’పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా, వాటి అవసరాన్ని మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.కలల వెనుక కారణాలుశాస్త్రవేత్తలు కలల అవసరం ఏంటో కనిపెట్టలేకపోయారు కాని, కలలు ఎందుకు వస్తాయనే విషయాన్ని మాత్రం కొంతవరకు రాబట్టగలిగారు. అందరికీ తెలిసిన ఒక సిద్ధాంతం ప్రకారం, కలలు మన జ్ఞాపకాల నుండి పుట్టుకొస్తాయి. మేల్కొని ఉన్నప్పుడు మనం ఆలోచిస్తుంటాం కదా, అలా.. నిద్రపోతున్నప్పటి మన ఆలోచనలే కలలు అనే భావన కూడా ఒకటి ఉంది! అయితే అది శాస్త్రీయంగా రూఢీ అవలేదు. ఇంకో సిద్ధాంతం ప్రకారం.. జీవితంలో మనకు ఎదురవబోయే సవాళ్లకు కలలు రిహార్సల్స్‌లా పనిచేస్తాయట! అలాగైతే మంచిదే. రేపు రాబోయే సమస్యకు ఇవాళ్టి కలలో పరిష్కారం దొరికినట్లే. కాని ఇది ఎంతవరకు నిజం?!కలలు పోషించే పాత్రేమిటి?నిపుణులైన కొంతమంది థెరపిస్టుల పరిశీలన ప్రకారం, మనం మేల్కొని ఉన్నప్పుడు (పగటి వేళల్లో) మనస్సు తప్పించుకునే, లేదా వదిలించుకునే ఇబ్బందికరమైన భావోద్వేగాలను తేలిక పరచటానికి కలలు మనకు సహాయపడతాయి. ఇది ఒక థెరపీలా ఉంటుంది. ఉచితమైన థెరపీ, కాస్త విడ్డూరమైన థెరపీ. కలల్లోని ఈ భావోద్వేగ స్థితిలో మన మెదడు, మనం మేల్కొని ఉన్నప్పుడు చేయలేని ఆలోచనలతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. మరొక సిద్ధాంత ప్రకారం, మెదడులోని ‘అమిగ్డాలా’ అనే ఒక నిర్మాణం.. కలలు రావటానికి కారణం అవుతోంది. అమిగ్డాలా అనేది మెదడు మధ్యలో లోతుగా ఒక చిన్న భాగంగా బాదం పప్పు ఆకారంలో ఉంటుంది. అది మనలో అవసరమైన సమయాలలో ఆత్మరక్షణ జాగ్రత్తల్ని ప్రేరేపిస్తుంది. ఊహించని ప్రమాదం ఏదైనా మనకు ఎదురైనప్పుడు... ‘‘పోరాడు, లేదా పారిపో..’’ అనే సహజజ్ఞాన ప్రేరేపణను ఇస్తుంది. మనల్ని నిజ జీవితంలోని సవాళ్లకు సిద్ధం చేయటానికే ఈ అమిగ్డాలా కలల్ని సృష్టిస్తుందని ఒక వర్గం పరిశోధకులు భావిస్తున్నారు.కలల ప్రేరణకు మూలం!అనేకమంది శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు తమలోని సృజనాత్మకతకు కలలు ప్రేరణనిచ్చేవని వెల్లడించిన సందర్భాలూ ఉన్నాయి. ఐన్‌స్టీన్ సైతం తన ఆవిష్కరణలలో కొన్నింటికి కలల నుంచే ఆలోచనలు స్ఫురించాయని తెలిపారు. ఈ మాటను బలపరిచే సిద్ధాంతాలూ ఉన్నాయి. వాటిల్లోని ఒక సిద్ధాంత ప్రకారం, మేల్కొని ఉన్నప్పుడు నిజ జీవితంలోని సృజనాత్మక ప్రవాహాన్ని అడ్డుకునే తర్కపు వడపోత.. నిద్రలో ఉండదు. అందువల్ల నిద్ర సమయంలో ఆలోచనలు, భావనలు స్వేచ్ఛగా పురివిప్పుతాయి. విహరిస్తాయి. ఆ కారణంగానే అత్యద్భుతమైన సృజనలకు కలలు మూలాలు అవుతాయి.జ్ఞాపకాల అలలు, అరలుకలల అధ్యయనవేత్తలు చెబుతున్న దానిని బట్టి.. ఒక వరుస క్రమంలో లేని విషయాలను సక్రమంగా అమర్చు కోవడంలో కలలు మెదడుకు సహాయపడతాయి. ముఖ్యమైన జ్ఞాపకాలను భద్రపరుస్తాయి. అవసరం లేని వాటిని తొలగిస్తాయి. అలాగే క్లిష్టమైన ఆలోచనలకు, భావోద్వేగాలకు ఒక అమరికను కూర్చటంలో కలలు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా, నిద్ర జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక కొత్త విషయం నేర్చుకున్న తర్వాత నిద్రపోతే, తిరిగి లేచాక అది వారికి బాగా గుర్తుంటుంది. విశ్రాంతి లేకుండా ఊరికే గుర్తు పెట్టుకున్న దానికంటే కూడా ఆ జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. దీని వెనుక కూడా కలలు చేసే మ్యాజిక్ ఉండొచ్చని పరిశోధకుల అంచనా.మరి పీడకలల మాటేమిటి?ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్లు, లేదా ఎక్కడో తెలియని ప్రాంతంలో మీరు చిక్కుకుపోయినట్లు, లేదా దెయ్యాలు, భూతాలు మీ కోసం పొంచి ఉన్నట్లు మీకు కల వచ్చి, భయంతో చెమటలు పట్టి, నిద్రలోంచి మీరు దిగ్గున లేచి కూర్చున్నారా? అదే పీడకల! నైట్మేర్. పీడకలలన్నవి కలతపెట్టే భావోద్వేగాలను రేపుతాయి. వాటిని గుర్తు చేసు కోవటానికి కూడా భయపడతాం. విశేషం ఏమిటంటే, మంచి కలల కంటే కూడా పీడకలలే స్పష్టంగా గుర్తిండిపోతాయి. అది మానవ స్వభావం కాదు. అటువంటి కలల స్వభావం.పీడకలలకు కారణాలుపీడకలలకు ప్రధాన కారణాలు వాస్తవ జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, పి.టి.ఎస్.డి. (తీవ్ర మానసిక గాయం తర్వాత ఉండే భయానక స్థితి), భావోద్వేగ సమస్యలు, భయాలు, అనారోగ్యాలు! మీకు తెలుసా? జీవితకాలంలో ఒక్కసారైనా పీడకలలు రానివారు ఉండరు. అమెరికన్ స్లీప్ అసోసియేషన్ అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో కేవలం సుమారు 5 శాతం మందికి ఒక నిద్ర సంబంధ రుగ్మతగా మాత్రమే పీడకలలు వస్తుంటాయి. మామూలు పీడకలలు మిగతా 95 శాతం మందికి వచ్చేవి.కల తెలుస్తూనే ఉంటుంది!కల అని తెలుస్తూనే, కనే కలలను లూసిడ్ డ్రీమ్స్ అంటారు. అంటే, మనం కలగంటున్నామని మనకు తెలుస్తూ ఉంటుంది! అలాంటప్పుడు ఆ కలపై నియంత్రణ కూడా ఉంటుంది. పీడకల అయితే ప్రయత్న పూర్వకంగా కల నుండి మేల్కోవటం సాధ్యం అవుతుంది. అయితే ఈ నియంత్రణ శక్తి వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. కొంతమంది తమకు ఇష్టమైన కలలు కనేందుకు, ‘లూసిడ్ డ్రీమ్స్’ను అనుభవించేందుకు తమకు తాము శిక్షణ ఇచ్చుకుంటారు. అంటే.. ఎలాంటి కల రావాలనుకుంటే అలాంటి కల వచ్చేస్తుంది వారికి!!కలల నిజాలు కొన్ని· ప్రతి ఒక్కరూ ఒక్క రాత్రిలో సుమారు 3 నుండి 6 సార్లు కలలు కంటారు.· ప్రతి కల సుమారు 5–20 నిమిషాల పాటు ఉంటుంది.· ఉదయం కల్లా 95 శాతం మంది కలల్ని మరిచిపోతారు.· చూపులేని వారు ఎక్కువగా శబ్దాలు, వాసనలు, స్పర్శల ద్వారా కలలు కంటారు.· ఆహారం, నిద్ర నాణ్యత, నిద్రించే వ్యవధి, మానసిక ఆరోగ్యం, రోజువారీ కార్యకలాపాలు వంటి అంశాలు కలలపై ప్రభావం చూపుతాయి. సాక్షి, స్పెషల్ డెస్క్ -
వనజీవన స్రవంతి
అడవులు పిలుస్తున్నాయి, జంతువులు వచ్చేస్తున్నాయి.ఆతిథ్యం మెచ్చి, ట్రిప్ అడ్వైజర్‌లో ఐదు గోర్లు మెరుస్తున్నాయి! సంరక్షణ, సౌకర్యాలు చూసి, ఫారెన్ ప్రాణులన్నీ లవ్ సింబల్ చూపిస్తున్నాయి. అంతేకాదు, ‘అతిథి దేవో భవ!’ అనే సంస్కృతికి జతగా, ‘అడవి స్వర్గ అవార్డ్’తో సత్కరిస్తున్నాయి.వన్యప్రాణుల గమ్యస్థానంగా భారత్?‘అతిథి దేవో భవ’ అన్న మాట మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా వర్తిస్తుంది కదా! అందుకే, మన దేశం అందిస్తున్న ఆతిథ్యం, సంరక్షణ చూసి ప్రపంచ దేశాల అడవుల నుంచి వన్యప్రాణులు భారత్ చేరడానికి బ్యాగులు సర్దుకుంటున్నాయి. ఇప్పటికే, ప్రపంచ అడవుల్లో ఉన్న పులులు, సింహాలు, చిరుతలు అన్నీ ‘ఇండియా ట్రిప్ ఎప్పుడు?’ అని ఎదురు చూస్తున్నాయట! ఇందుకు సాక్ష్యంగా ప్రస్తుతం ప్రపంచ వన్యప్రాణుల ట్రావెల్ గైడ్ తెరిస్తే, ఫస్ట్ ర్యాంక్‌లో మెరిసిపోతున్న దేశం మన దేశమే. గత నాలుగేళ్లలోనే 6,400 జంతువులు భారత్‌కు వచ్చాయి అని తాజాగా సీఐటీఈఎస్ (ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతుల పరిరక్షణకు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం) గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే, 1978 నుంచి ఇప్పటి వరకు భారత జంతుప్రదర్శన శాలల్లోకి వచ్చిన జంతువుల్లో తొంభై శాతం కంటే ఎక్కువ, గత నాలుగేళ్లలోనే రావడం గమనార్హం. వీటితోపాటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతుప్రదర్శన శాలలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల నుంచి పక్షులు, సరీసృపాలు, కోతులు మొదలుకుని పెద్ద పులుల వరకూ వేలాది వన్యప్రాణులు ఒక్కొక్కొటిగా తన ఫేవరెట్ డెస్టినేషన్ గా భారత్‌నే ఎంచుకున్నాయి.వీటికి పాస్‌పోర్ట్ స్టాంపులు లేవు, ఫ్లైట్ నంబర్లు గుర్తుండవు. కాని, వాటన్నింటికీ కావాల్సింది మాత్రం ఒక్కటే– విశాలమైన నివాస స్థలం, సహజ వాతావరణం, భద్రత, సంరక్షణ. అవి మన దేశంలో విస్తృతంగా ఉన్నాయి. అయితే, ఈ గణాంకాల్లో 2023 సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక్క ఏడాదిలోనే 4,051 వన్యప్రాణులు భారత్‌కు దిగుమతి కావడం రికార్డు స్థాయిగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో జంతుప్రదర్శన శాలలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విశ్వాసాన్ని భారత్ ఎంతగా సంపాదించిందో ఈ సంఖ్యలే స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా, 2022లో ప్రపంచవ్యాప్తంగా 5,496 జంతువులు వివిధ జంతుప్రదర్శన శాలలకు దిగుమతి అయ్యాయి. వాటిలో, 486 జంతువులు మన దేశంలోని జంతుప్రదర్శన శాలలకు చేరడంతో, వన్యప్రాణుల దిగుమతిలో రెండో స్థానంలో నిలిచింది. ఇక 2023లో మాత్రం 4,051 జంతువులను దిగుమతి చేసుకొని, భారత్ అగ్రస్థానానికి చేరింది. 2024లో కూడా భారత్ నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించింది. ఇలా ఈ గణాంకాలు భారత్ ఇప్పుడు కేవలం వన్యప్రాణుల నిలయమే కాకుండా, ప్రపంచ జూలు, సంరక్షణ కేంద్రాలకు విశ్వసనీయమైన భాగస్వామిగా మారిందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీరొస్తామంటే.. మేమొద్దంటామా?భారతదేశం అంటే భాషల సంగమం, సంస్కృతుల సమ్మేళనం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచ వన్యప్రాణుల కూడలి కూడా! దేశం మారితే జీవితం మారుతుందనుకునే వన్యప్రాణులన్నింటికీ భారత్ ఒక ఓపెన్ డోర్లా మారింది. ఇక్కడికి వచ్చినవారు బతకగలరు, నిలబడగలరు, కొత్త జీవితం మొదలుపెట్టగలరు. అందుకే 1978 నుంచి ఇప్పటివరకు భారత్‌కు అత్యధికంగా వన్యప్రాణులను పంపిన దేశాల్లో దక్షిణాఫ్రికా (2,072) అగ్రస్థానంలో నిలిచింది. అంటే భారత్‌లోకి అడుగుపెట్టిన ప్రతి మూడు జంతువుల్లో ఒకటి దాదాపుగా దక్షిణాఫ్రికా అడవుల నుంచే వచ్చినదన్న మాట! ఆ తర్వాత యూఏఈ (995), చెక్ రిపబ్లిక్ (854), మెక్సికో (816), ఆస్ట్రియా (687) వంటి దేశాలు వరుసలో కనిపిస్తున్నాయి.నిజానికి దక్షిణాఫ్రికా వంటి దేశాలు జంతువులను భారత్‌కు పంపడం వెనుక భావోద్వేగాలకన్నా గట్టి వాస్తవాలే ఉన్నాయి. ఒకప్పుడు అంతులేని అడవులతో ప్రపంచానికి ఊపిరి పోసిన ఆఫ్రికా ఖండం, ఇప్పుడు వేటగాళ్ల దాడులు, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం, రాజకీయ అస్థిరత, మానవ–వన్యప్రాణి ఘర్షణలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జంతువులను కాపాడుకోవాలంటే వాటిని అడవుల్లోనే ఉంచడంతోనే సరిపోవడం లేదు, భద్రత ఉన్న మరో ఆవాసం అవసరం అవుతోంది. ఆ భద్రతను అందించగలిగిన దేశంగా భారత్ నిలిచింది. భారత్ ఎందుకు ముందుంది?మంచుతో కప్పబడే స్విట్జర్లాండ్, ఆకాశాన్ని తాకే భవనాలతో నిండిన సింగపూర్, చల్లని వాతావరణం కలిగిన యునైటెడ్ కింగ్డమ్, ఎడారి వేడితో మండిపోయే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా ఈ దేశాలన్నింటికీ ఒకే సమస్య. జంతువులకు సరిపడే సహజ జీవ వాతావరణం కొరత. అక్కడ స్థలం తగ్గిపోయింది, అడవులు కనుమరుగయ్యాయి, వాతావరణం జంతువుల సహజ జీవితానికి అనుకూలంగా లేకుండా మారింది. అప్పుడు ప్రపంచం చూపు భారత్‌పై పడింది. విస్తారమైన అడవులు, పచ్చని లోయలు, ఉష్ణమండల వాతావరణం, పెరుగుతున్న సంరక్షణ కేంద్రాలు భారత్‌ను జంతువులకు ఒక సేఫ్ హోమ్‌గా మార్చాయి.ఇక్కడ జంతువులు బతకడమే కాదు, పెరుగుతాయి, పిల్లల్ని పెంచుతాయి, మళ్లీ జీవ వైవిధ్యానికి ఊపిరి పోస్తాయి. ఇతర దేశాలు తమ పరిమితుల కారణంగా జంతువులను పంపుతున్నప్పుడు, భారత్ వాటిని బాధ్యతగా స్వీకరించి, జంతువుల మానసిక ఆరోగ్యం, ఆహారం, సహజ వాతావరణం అన్నీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అప్పుడు, ప్రపంచం చూపు భారత్‌పై పడింది. అందుకే సముద్రాలు దాటినా, ఖండాలు మారినా, చివరకు వన్యప్రాణులు తమ చిరునామాగా భారత్‌నే ఎంచుకుంటున్నాయి. చిన్నవాళ్లే పెద్ద ఆకర్షణ! జూకి వెళ్లగానే పిల్లల కళ్లలో ముందుగా మెరిసేవి ఏవో తెలుసా? సింహాలు కాదు, పులులు కాదు! మొదటగా మెరిసేవి మొసళ్లు, తాబేళ్లు, పాములు, రంగురంగుల పక్షులు, చిలిపి కోతులు! నిజానికి ఇవే పిల్లల ఫేవరెట్ స్టార్‌క్యాస్ట్. పెద్ద పులిని చూడాలని, ఫొటోలు దిగాలని అనుకుంటాం కాని, జూ మొత్తం మజాని ఇచ్చేది ఈ చిన్న చిన్న క్యారెక్టర్లే! నిజానికి, ఇవే జూను ‘ఇంకా చూద్దాం.. ఇంకా చూద్దాం’ అని పిల్లలను ఒకచోట నిలబెట్టనివ్వకుండా జూ మొత్తం తిప్పేలా చేస్తాయి. ఎందుకంటే, నెమ్మదిగా నడిచే తాబేలు మన టైమ్‌ను ఆగిపోయేలా చేస్తే, కోతులు గంతులు వేస్తూ లైవ్ కామెడీ షోను చూపిస్తాయి. ఇక పక్షులు రెక్కలు విప్పితే రంగుల పండుగ మొదలైనట్టే! ఇలా ఇవన్నీ అరవవు, హడావుడి చేయవు, సైలెంట్‌గా ప్రకృతి పాఠాలను పిల్లల మెదడులోకి లైవ్ టీచింగ్ చేస్తాయి. ఇలా ఒక హిట్ సినిమా హీరోలా సింహాలు, పులులు ఫ్రేమ్ తీసుకుంటాయి కాని, జూకి ప్రాణం పోసేది, నడిపించేది మాత్రం ఈ చిన్న సైలెంట్ హీరోలే! ఎగుమతుల్లో వెనకుంది! జంతువుల అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా సవాలుగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం చట్టబద్ధంగా చాలా పరిమిత సంఖ్యలోనే వన్యప్రాణులను ఎగుమతి చేసింది. 1976 నుంచి 2024 వరకు దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో భారత్ నుంచి ఎగుమతి అయిన జంతువుల సంఖ్య కేవలం 483 మాత్రమే. ఈ జాబితాలో ‘ఘరియల్ మొసళ్లు’ (102) అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ఒక్క ఏడాదిలో అత్యధికంగా జంతువులు ఎగుమతి అయిన సంవత్సరం 2005, ఆ ఏడాది మొత్తం 47 జంతువులు విదేశాలకు వెళ్లాయి. దిగుమతుల్లో ప్రపంచానికి కేంద్రంగా మారిన భారత్, ఎగుమతుల్లో మాత్రం నియంత్రణతో కూడిన విధానాన్నే అనుసరిస్తున్నదని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. జూ వెనుక జీవితం!ఒకప్పుడు వన్యప్రాణుల అక్రమ వ్యాపారం అంటే అడవుల్లో తుపాకులతో వేటగాళ్లు చేసే నేరమే అనుకుంటాం కాని, ఇప్పుడు ఆ నేరం రూపం మార్చుకుంది. పేపర్లు, అనుమతులు, ప్రొఫెషనల్ పదజాలంతో జరిగే ‘వైట్ క్రైమ్’గా మారింది. బయటకు చూస్తే ‘సంరక్షణ’, లోపల మాత్రం విలువైన అవయవాల లెక్క. ఒక జంతువు జూలోకి చేరేలోపు ఎన్ని సంతకాలు, ఎన్ని అనుమతులు, ఎన్ని ‘ఎక్స్పర్ట్ ఓకేలు’ దాటిందో మనకు కనిపించదు. మనం చూసేదే, కేవలం బోనులో నడిచే జంతువునే. కాని, ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో, మధ్యలో ఏం జరిగిందో మాత్రం కనిపించదు. చాలామందికి తెలియదు, మరికొంతమందికి అనవసరం కూడా! అయితే ఈ అనుమానాలకు, గత సంఘటనలే సాక్ష్యం.2020లో కేరళలో పేలుడు ఆహారంతో గర్భిణి ఏనుగును చంపిన సంఘటన, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బయటపడ్డ పులి చర్మం, దంతాలు, గోర్లు అక్రమ రవాణా కేసులు ఎన్నో నిజాన్ని చూపించాయి. ఇక మానవ రక్షణ పేరుతో మూగజీవులపై జరిగే బహిరంగ హింసలు కూడా మన దేశంలో తక్కువేమీ కాదు. ఇక సరీసృపాల అక్రమ వ్యాపారం మరింత సైలెంట్‌గా జరుగుతోంది. వీటితోపాటు మొసలి పిల్లలు, అరుదైన పాములు వార్తలకెక్కకుండానే అమ్ముడుపోతున్న సంఘటనలు అడపా దడపా బయటపడుతున్నాయి. డిమాండ్ ఉన్నంతవరకూ నేరం దారులు వెతుక్కుంటుంది.అందుకే అసలు ప్రశ్న! భారీగా వస్తున్న ఈ వన్యప్రాణులు నిజంగానే సేఫ్ హ్యాండ్స్లోకే వెళ్తున్నాయా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే, మంచి ఉద్దేశంతో మొదలైన వ్యవస్థ నేరగాళ్ల చేతుల్లోకి జారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. భారత్ వన్యప్రాణులకు డెస్టినేషన్ గా మారిందంటే కారణం ఒక్కటే! ఇక్కడికి అడుగుపెట్టే ప్రతి జంతువును కూడా అతిథితో సమానంగా చూసుకునే మన సంస్కృతి. కాని, ఆ జీవులపై పడే ప్రతి గాయం, ‘అతిథి దేవోభవ’ అనే మాటకు అర్థాన్ని చెరిపేస్తుంది.పెద్ద పిల్లుల రాజ్యం!అడవుల్లో పులుల సంఖ్యలో భారత్ టాప్‌లో ఉంటే, మన దేశంలోని జంతుప్రదర్శన శాలల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం మన దేశ జంతుప్రదర్శన శాలల్లో పులి, సింహం, చిరుత– ఇవే అసలైన స్టార్స్. వాటి వెంట జాగ్వార్, లీపర్డ్, స్నో లీపర్డ్లు సపోర్టింగ్ రోల్స్‌లో మెరిసిపోతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం జంతుప్రదర్శన శాలల్లో పెద్ద పిల్లుల రాజ్యమే కొనసాగుతోంది. భారత దేశపు అడవి వాతావరణం, విశాలమైన నివాస స్థలాలు, సహజ ఆహారం, వెటర్నరీ కేర్, ప్రత్యేకంగా రూపొందించిన డైట్ ప్లాన్లు ఇవన్నీ కలిపి ఈ పెద్ద పిల్లులకు ఎక్కడా లేనంతటి సౌకర్యాన్ని ఫుల్ కంఫర్ట్ అందిస్తున్నాయి. అదే సమయంలో పక్షులు, సరీసృపాలు, కోతులు, తాబేళ్లు, మొసళ్లు సైలెంట్ చెక్–ఇన్ స్టయిల్లో మన జంతుప్రదర్శన శాలల్లోకి అడుగు పెడుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా ఆఫ్రికా అడవుల నుంచి యూరప్ నగరాల జూల నుంచి, అమెరికెన్ నగరాల్లోని వన్యప్రాణులు ఉంటున్నాయి.మనిషి మక్కువే మార్గంగా!వన్యప్రాణుల గమనాన్ని నిర్ణయించేది ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఒప్పందాలే కాదు, వ్యక్తిగత అభిరుచులు కూడా ఇప్పుడు ఆ దిశను మలుపు తిప్పుతున్నాయి. ఒక అరుదైన జంతువుపై ఒక వ్యక్తికి ఏర్పడిన మక్కువ కూడా భారత్‌ను ప్రపంచ వన్యప్రాణుల గమ్యంగా మారుస్తోంది. ఇందుకు, కడాబాంబ్ ఒకామి కథ ఒక సజీవ ఉదాహరణ. కర్ణాటకకు చెందిన ఎస్. సతీష్‌కు అమెరికాలో జన్మించిన ఒక కుక్కపిల్లను చూసిన క్షణమే అది పెంపుడు జంతువులా కాకుండా, ఒక అద్భుతంలా అనిపించింది. తోడేలి ఉనికి, కాక్షియన్ షెపర్డ్ బలం కలిసిన ఒకామిని అన్ని అనుమతులతో విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు.ఇందుకోసం దాదాపు రూ.47 కోట్లు ఖర్చు చేశాడు. ఇదే బాటలో దేశంలోని చాలామంది సంపన్నులు విదేశాల నుంచి తెచ్చిన హస్కీలు, అలాస్కన్ మలామ్యూట్లు, టిబెటన్ మాస్టిఫ్లను తమ స్టేటస్ సింబల్స్‌గా ఫీల్ అవుతున్నారు. ఇలా మరెన్నో యూరప్ నుంచి వచ్చిన అరుదైన గుర్రాలు, దక్షిణ అమెరికా నుంచి తెప్పించిన విదేశీ పక్షులు వ్యక్తిగత సంరక్షణ కేంద్రాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇలా అడవులకే పరిమితమవ్వాల్సిన జీవులు ఇప్పుడు వ్యక్తిగత కలలు, భారీ ఖర్చులు, భిన్నమైన ఆసక్తులతో కొత్త భూభాగాల్లోకి అడుగుపెడుతున్నాయి. -
ముగ్గురు రాజుల జాతర ముచ్చట
క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. చాలా ప్రాంతాల్లో చర్చిలను రంగు రంగుల నక్షత్రాలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు జరపడం మామూలే! కొన్ని చోట్ల మాత్రం ప్రత్యేక సంప్రదాయాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకొంటారు. కొన్ని చోట్ల ఈ వేడుకలు న్యూఇయర్ వరకు, ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఏకబిగిన కొనసాగుతాయి. అలాంటి అరుదైన వేడుకే ముగ్గురు రాజుల జాతర. దీనినే ‘త్రీ కింగ్స్ పరేడ్’ అంటారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం సహా స్పెయిన్‌లోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఏటా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ కూడా జరుగుతుంది. దీనినే ‘కావల్కేడ్ మాగి’ అని, ‘త్రీ మాగి పరేడ్’ అని కూడా అంటారు. ఈ పరేడ్ ఏటా జనవరి 5న జరుగుతుంది. ‘త్రీ కింగ్స్ పరేడ్’ జరిగే రోజున స్పెయిన్‌లోని ప్రతి ఊరూ ఒక బహిరంగ రంగస్థలంలా మారిపోతుంది. బైబిల్లో ప్రస్తావించిన ముగ్గురు జ్ఞానుల వేషధారులను వాహనాలపై నిలిపి, అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుపుతారు. ఊరూరా జరిగే ఈ ఊరేగింపుల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ముఖ్యంగా మాడ్రిడ్‌లో జరిగే ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ను తిలకించడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.ఏసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు వైపు నుంచి ముగ్గురు జ్ఞానులు ఒంటెలపై వచ్చినట్లు బైబిల్ కథనం. వీరు క్రీస్తును వెదుకులాడుతూ ఇల్లిల్లూ గాలిస్తూ, పిల్లలు ఉన్న ఇళ్లలో రకరకాల కానుకలను విడిచి వెళ్లారట! బైబిల్లో ప్రస్తావించిన ఈ గాథను స్పానిష్ ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందువల్ల క్రిస్మస్ రోజుల్లో ఇళ్లలోని పిల్లలు క్రిస్మస్ చెట్ల పక్కనే, శుభ్రం చేసిన పాదరక్షలను ఉంచి, త్వరగానే నిద్రపోవడానికి పక్కల మీదకు చేరుకుంటారు.త్వరగా నిద్రపోతే తాము నిద్రపోతున్నప్పుడు ఇళ్లకు వచ్చే జ్ఞానులు తమ కోసం కానుకలను విడిచిపెట్టి వెళతారని స్పానిష్ పిల్లల నమ్మకం. స్పెయిన్‌లో జరిగే ‘త్రీ కింగ్స్ పరేడ్’లో జ్ఞానుల వేషాలు ధరించి పాల్గొనేవారు పిల్లలకు మిఠాయిలు, ఆటబొమ్మలు వంటివి కానుకలుగా పంచిపెడతారు. ఊరంతా కోలాహలం ఆటపాటలతో సాగే ఈ ఊరేగింపు జనవరి 5న సాయంత్రానికి ముందు మొదలై, జనవరి 6 వేకువజామున ముగుస్తుంది. స్పెయిన్‌లో ఈ ఊరేగింపు జరిపే సంప్రదాయం పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతోంది. -
ఇకపై బట్టతలకు చెక్!
బట్టతల బాధితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి రకరకాల తైలాలు, ఔషధ లేపనాలు రాసుకుంటూ ఎంతకూ రాని జుట్టుకోసం ఎదురు చూస్తుంటారు. ఇకపై బట్టతల బాధితులకు అలాంటి తంటాలు ఉండవు. బట్టతలపై జుట్టు మొలిపించే ఔషధాన్ని విజయవంతంగా రూపొందించినట్లు ఐరిష్ ఔషధ తయారీ సంస్థ ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ ఇటీవల ప్రకటించింది.తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘క్లాస్కోటెరాన్–5%’ సొల్యూషన్‌ను ‘బ్రీజులా’ అనే బ్రాండ్ పేరుతో 2027 నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు దశల్లో విస్తృతంగా జరిపిన క్లినికల్ పరీక్షల్లో ఈ ఔషధం అద్భుత ఫలితాలను సాధించిందని, దీనిని ఉపయోగించిన వారి బట్టతలలపై జుట్టు మొలిచిందని ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ తెలిపింది. మూడో దశ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత దీనిని మార్కెట్లో అందుబాటులోకి తేనున్నామని ప్రకటించింది. -
మా ఇల్లు చూస్తే అర్ధమవుతుంది
బాల్యం నుంచే కెమెరా వెలుగుల్లో పెరిగినా, ఆ వెలుగు ఆమె తలకెక్కలేదు. గ్లామర్‌ను అలవోకగా దాటేసి, క్రమశిక్షణను తన నిజమైన బలంగా మార్చుకుంది. అందుకే హిట్స్, ఫ్లాప్స్‌కు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో సైలెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా స్థానం దక్కించుకుంది నటి మెహ్రీన్ పీర్జాదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..⇒ చిన్నప్పటి నుంచే కెమెరా నాకు కొత్త కాదు. పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై నడిచాను. అప్పట్లో అది సరదా, ఇప్పుడు అదే నా జీవితం.⇒ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నేను భరతనాట్యం డ్యాన్సర్‌ని, ఎయిర్ పిస్టల్ షూటర్ని నాట్యంలోను, పిస్టల్ షూటింగ్లోను నేర్చుకున్న క్రమశిక్షణే నన్ను జీవితంలో బ్యాలెన్స్సడ్గా ఉంచింది.⇒ ‘కృష్ణగాడి వీర ప్రేమగా«థ’ నా ప్రయాణానికి అసలు మలుపు. మొదటి సినిమా భయం, మొదటి విజయపు ఆనందం అన్నీ ఆ ఒక్క సినిమాతోనే.⇒ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ ఇలా ప్రతి సినిమా నాలో కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఒక విధంగా నటనే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకునేలా చేసింది.⇒ ట్రెక్కింగ్ అంటే నాకు ప్రాణం. గోముఖ్ ట్రెక్ చేసిన తర్వాత జీవితం మీద గౌరవం మరింత పెరిగింది. ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అప్పుడు తెలిసింది.⇒ నాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. మా ఇల్లు చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఆ రంగు నాకు ప్రశాంతత ఇస్తుంది.⇒ ప్రయాణాలు నాకు జ్ఞాపకాలే కాదు, ఆనందాలూ ఇస్తాయి. ప్రతి దేశం నుంచి తెచ్చుకున్న చిన్న ఫ్రిజ్ మాగ్నెట్స్ చూస్తేనే చిరునవ్వు వస్తుంది. ఫిన్లండ్‌లో ఇగ్లూ రూమ్ నుంచి చూసిన నార్తర్న్ లైట్స్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతాయి.⇒ లాక్డౌన్ సమయంలో నన్ను నేనే రీడిజైన్ చేసుకున్నాను. ఫిట్నెస్, వంట, పెయింటింగ్ నేర్చుకున్నాను. అప్పుడే మనతో మనమే ఉండటం కూడా అవసరమే అని అర్థమైంది.⇒ 2021లో రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయితో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దుచేసుకున్నప్పడు, వచ్చిన గాసిప్స్‌కు చాలా బాధపడ్డాను. కాని, ఇప్పుడు అవి గాలి లాంటివే వస్తుంటాయి, పోతుంటాయని అర్థమైంది. ఫేక్ హెడ్లైన్స్స నాకు అస్సలు నచ్చవు. చిన్నపాటి ఫేమ్ కోసం అబద్ధాలు సృష్టించేవారికి నేను దూరంగా ఉంటాను.⇒ తెలుగు ఇండస్ట్రీ నాకు ఇల్లులాంటిది. ఇక్కడ ప్రేక్షకులు నటనలో నిజాన్ని వెంటనే గుర్తిస్తారు. అదే నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుతుంది. అందుకే, అభిమానుల నమ్మకమే నాకు అసలు అవార్డు. -
కోతి నిద్ర
ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆవులిస్తూ ఏదో ఆలోచిస్తోంది. అక్కడే తిరుగుతున్న అంజి మిత్రులు ఎలుగుబంటి, నక్క, తోడేలు, నెమలి, కోకిల అంజిని గమనించాయి.‘అంజీ! ఏంటి నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి!?’ అడిగింది ఎలుగుబంటి...‘రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు!’ అంది అంజి . ‘నువ్వు రోజూ సాయంత్రం తాటికల్లు తాగు, హాయిగా నిద్రపడుతుంది!’ అంది నక్క. ‘తాటి కల్లు వద్దు, ఈతకల్లు తాగావంటే మత్తుగా నిద్రపడుతుంది’ అంది తోడేలు.‘కాదు... కాదు నీళ్లలో తేనె కలుపుకొని తాగు! వెంటనే నిద్రలోకి జారుకుంటావు!’ అంది ఎలుగుబంటి. ‘తాగుడు కాదు! నువ్వు ప్రతిరోజూ అరగంట నాట్యం చేశావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది!’ అంది నెమలి.‘నాట్యంకన్నా అరగంట పాటలు విన్నావంటే, వద్దన్నా కునుకు పడుతుంది!’ అంది కోకిల.ఇలా కోతి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి.అంజి అన్నిటి సలహాలు విని బుర్ర గోక్కుంటూ ఇంటికి పోయింది. తెల్లారి అంజి మళ్లీ నల్ల బండకు చేరింది. ‘అంజీ! రాత్రి తాటికల్లు తాగావా?’ ఆత్రంగా అడిగింది నక్క.‘లేదు!’ అంది అంజి.‘అయితే, నేను చెప్పినట్లు ఈత కల్లు తాగుంటావు!’ అంది ఆసక్తిగా తోడేలు.‘కాదు!’ అంది ‘అంజి మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది. నేను చెప్పిన తేనె నీళ్లు తాగుంటుంది’ అంది ఎలుగుబంటి. ‘లేదు... లేదు!’ అంది అంజి. ‘ఓహో! నేను చెప్పినట్లు నాట్యం చేసుంటుంది’ అంది నెమలి. ‘కాదు... కాదు’ అంది అంజి.‘ఇంకేముంది నా మాటకు విలువ యిచ్చి పాటలు విని ఉంటుంది’ అంది కోకిల. అంజికి చికాకు వేసింది. ‘ఆపండి మీగోల! నేను అసలు ఎవరి సలహానూ పాటించలేదు. మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనూ లేదు’ అంది కోపంగా. వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకు దూకి, అక్కడి నుంచి నేరుగా వైద్యుడు ఏనుగు వద్దకు పోయింది. తన సమస్య చెప్పింది. ఏనుగు అంజిని పరీక్షించి, ‘ఇంకా ఆలస్యం చేసి ఉంటే, నీ కంటికి, ఒంటికి ప్రమాదం జరిగేది’ అంటూ కొన్ని వేరు మందులు ఇచ్చింది. ‘వీటిని వాడుతూ, ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది’ చెప్పింది ఏనుగు.‘ఈలోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చే వాళ్లకు లోటులేదు. పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది’ అని తెలుసుకుంది అంజి. -
స్ట్రోక్‌కు సూపర్ హీరోలు!
రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతే వచ్చే స్ట్రోక్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయితే, ఈ ప్రాణహానికి అడ్డుకట్ట వేయడానికి స్విస్ శాస్త్రవేత్తలు కొత్త సూపర్ హీరోలను సృష్టించారు. అవే మన రక్తనాళాల్లో పరిగెత్తే సూక్ష్మ రోబోలు! ఈ చిన్న రోబోలు (Robots) రక్తప్రవాహంలో తేలికగా ప్రయాణిస్తూ, రక్తనాళం ఎక్కడైనా మూసుకుపోయిందని గుర్తిస్తే వెంటనే అక్కడికి చేరి గడ్డను కరిగించే మందును నేరుగా ఆ ప్రదేశానికే పంపిస్తాయి. రక్తం (Blood) ఎంత వేగంగా ప్రవహించినా, ఇవి అంతే వేగంగా, చురుకుగా కదులుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు వీటిని బాహ్య అయస్కాంత క్షేత్రాల సాయంతో కచ్చితంగా నియంత్రించగలమని నిరూపించారు. అంటే వైద్యులు రక్తనాళాల సన్నని దారుల్లో ఈ రోబోలను నిశితంగా నడిపించగలరు. సడన్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఇప్పటి చికిత్సలు, మందులు, శస్త్రచికిత్స సమయం తీసుకుంటాయి. కాని, ఈ రోబోలు, మొదటి నిమిషాల్లోనే గడ్డపై నేరుగా దాడి చేసి, ప్రాణాలను రక్షించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, స్ట్రోక్ చికిత్సలో ప్రాణరక్షక సేనగా మారబోతున్నాయి. -
ఎప్పుడు చేయించాలి?
నా వయస్సు యాభై ఐదు సంవత్సరాలు. మా కుటుంబంలో ఇద్దరికి పూర్వం క్యాన్సర్ వచ్చింది. నాకు రాకుండా ఉండటానికి, లేదా ముందుగా గుర్తించే పరీక్షలు ఈ రోజుల్లో ఉన్నాయని విన్నాను. నిజంగా అలాంటివి ఉన్నాయా? ఎప్పుడు చేయించాలి? – సుమతి, తిరుపతిఇప్పటి వైద్య శాస్త్రం ఎంత ముందుకెళ్లిందంటే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసే పరీక్షలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవారికి ప్రమాదం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, యాభై ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పక చేయించుకోవడం మంచిది. ఇప్పుడు రక్తంతో చేసే చిన్న పరీక్షలతోనే శరీరంలో ప్రమాదం ఉందో లేదో తెలుసుకునే విధానాలు వచ్చాయి. వయస్సును బట్టి ప్రమాదం పెరుగుతుంది కాబట్టి తొందరగా తెలుసుకుంటే చికిత్స కూడా త్వరగా మొదలవుతుంది. పేగు, గర్భసంచి, రొమ్ము, అండాశయాలు, ఊపిరితిత్తులు వంటి అవయవాల్లో వచ్చే క్యాన్సర్లను ముందే కనిపెట్టే పరీక్షలు అందుబాటులోనే ఉన్నాయి. గర్భసంచి భాగంలో వచ్చే వ్యాధిని గుర్తించడానికి పాప్ స్మియర్ పరీక్షను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ల వరకు చేస్తారు. రొమ్ములో వచ్చే వ్యాధిని ముందే తెలుసుకోవడానికి మామోగ్రఫీ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. క్యాన్సర్ కుటుంబంలో ఉన్నవారికి ఇవి మరింత అవసరం. చాలామంది ‘మన ఇంట్లో ఎప్పుడూ ఎవరికీ రాలేదు కాబట్టి నాకు కూడా రాదేమో’ అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా లక్షణాలు లేకుండానే వ్యాధి ప్రారంభమై ఉంటుంది. అలాంటి దశలో రొటీన్ పరీక్షలే దాన్ని గుర్తించగలవు. శరీరంలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే అలాగే వదిలేయకూడదు. మలబద్ధకం, మలంలో రక్తం, అసాధారణ రక్తస్రావం, రొమ్ము పరిమాణం లేదా ఆకారం మారడం, వింతగా గట్టిగా మారడం, నెలసరి కాకుండా మధ్యలో రక్తస్రావం, కారణం లేకుండానే శరీరం బరువు తగ్గడం, తిన్నా తిననట్టుగా అనిపించడం, నిరంతరం అలసిపోవడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే నిపుణుడిని కలవాలి. అవసరమైతే వైద్యులు రక్తపరీక్షలు, స్కాన్లు, మరీ అవసరమైతే మరింత వివరమైన పరీక్షలు కూడా సూచిస్తారు. ముందుగా గుర్తించిన వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వయస్సు పెరిగిన తర్వాత, ముఖ్యంగా కుటుంబంలో ఇలాంటి వ్యాధి ఉన్నవారు అయితే మరింత జాగ్రత్తగా పర్యవేక్షణ చేయించుకోవడం మంచిది. -డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ , హైదరాబాద్ -
కోర్టుపైనా కన్నేశారు!
ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, కర్మాగారాలు, కార్ఖానాలు, బస్సులు, రైళ్లు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలు, చివరకు దేవాలయాల్లో జరిగిన చోరీల కథలు ఎన్నో విన్నాం. అయితే హైదరాబాద్‌కు చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా నాంపల్లి కోర్టులో చోరీకి పథకం వేసింది. రహస్య పత్రాలు, విలువైన వస్తువులు, సాక్ష్యాధారాలను చేజిక్కించుకోవడానికి ఈ పథకం వేసి ఉంటారని భావిస్తే తప్పులో కాలేసినట్లే! దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగిన ‘సిటీ డాన్’ సయ్యద్ అబెద్ హుస్సేన్ అలియాస్ అలీ భాయ్ సూత్రధారిగా జరిగిన ఈ కుట్రను అమలు చేయడం ద్వారా కోర్టు స్వాధీనంలో ఉన్న రూ.2.5 కోట్ల నకిలీ నోట్లు తస్కరించాలని భావించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 ఆగస్టులో ఈ కుట్రను ఛేదించారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన అలీ భాయ్ హైదరాబాద్‌లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడటంతో పాటు అపహరణలకు పథకం వేశాడు. 2001లో టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి కుమార్తెను కిడ్నాప్ చేయించాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు బాలికను రెస్క్యూ చేయడంతో పాటు అలీ భాయ్ అనుచరులను అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నకిలీ పాస్‌పోర్టు సాయంతో దుబాయ్ పారిపోయిన అలీ భాయ్ అక్కడే మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో చేరాడు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని పుణే, ముంబైలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ పలు నేరాలు చేయించాడు. 2007 మార్చిలో హైదరాబాద్ వచ్చిన అలీ భాయ్‌ని అరెస్టు చేసిన పోలీసులు, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదే సవుయంలో అదే జైల్లోనే ఉన్న విప్లవ దేశభక్త పులులు (ఆర్పీటీ) సంస్థ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి జైలు నుంచే బేగంపేటలోని కంట్రీక్లబ్ నిర్వాహకుడు రాజీవ్‌రెడ్డి కిడ్నాప్‌నకు కుట్ర పన్నారు. బయట ఉన్న తమ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలు చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన వుధ్య వుండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి సోదరుడితో పాటు ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు. ఆ ఉదంతం తర్వాత అలీభాయ్‌ని చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి వూర్చారు. అక్కడ అలీ భాయ్ వనస్థలిపురానికి చెందిన మహ్మద్ దావూద్ జకీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇతడిపై కర్ణాటకలోనూ భారీ చోరీలు, దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన దావుద్ అనేకసార్లు ములాఖత్‌కు వచ్చి రహస్యంగా అలీభాయ్‌కి సెల్ఫోన్లు అందించాడు. అలీ వాయిదాల కోసం నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడూ వీరిద్దరూ మాట్లాడుకున్నారు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో 2008లో చోటు చేసుకున్న వ్యాపారవేత్త రాజీవ్ సిసోడియా హత్య కేసులో అరెస్టుయిన వాళ్లల్లో జహీరాబాద్‌కు చెందిన వుక్సూద్ ఒకడు. ఇతనికి జైల్లో ఉండగా అలీభాయ్తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఇతగాడు తాను రయీజ్ అనే నేరగాడితో కలిసి జహీరాబాద్‌లో ఉన్న ఓం ప్రకాష్ దత్తప్ప జ్యువెలర్స్‌లో దోపిడీ చేయాలని 2007లోనే పథకం వేశానని, అయితే కార్యాచరణలో పెట్టలేకపోయానని అలీభాయ్‌కి చెప్పాడు. ఆ పథకాన్ని అమలు చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించాలని భావించిన అలీ భాయ్ అదే విషయాన్ని దావుద్‌కు చెప్పాడు. అలీభాయ్ ఆదేశాల మేరకు దావుద్... రయీజ్‌ను కలిసి జహీరాబాద్‌లోని ఆ జ్యువెలర్స్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆ దుకాణాన్ని యజమాని ప్రతిరోజూ రాత్రి 9.00–9.30 వుధ్య వుూసేసి, విలువైన బంగారు నగలతో ఇంటికి వెళ్తాడని గుర్తించారు. దుకాణం నుంచి ఇంటికెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయనను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని జైలులో ఉన్న అలీ భాయ్‌కు చెప్పి, అతడి ఆదేశాల మేరకు బీదర్‌కు చెందిన సంతోష్‌ను తమతో కలుపుకున్నారు. దోపిడీ కోసం బీదర్‌కు చెందిన జగ్గు అలియాస్ జగదీష్ నుంచి కొన్ని కత్తులు కొన్నారు. ఈ నగల దుకాణంతో పాటు నాంపల్లి కోర్టులోనూ చోరీ చేయాలని అలీభాయ్ పథకం వేశాడు. దీన్ని అవులు చేయాలని దావుద్, వుుస్తాక్లకు ఆదేశాలు ఇచ్చాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ అంతర్జాతీయ నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. దుబాయ్ నుంచి పాత పేపర్ల పేరుతో ముంబై మీదుగా హైదరాబాద్‌కు రూ.2.5 కోట్ల నకిలీ కరెన్సీ వచ్చాయి. పాత న్యూస్ పేపర్ల మధ్యలో ఈ కరెన్సీని ఉంచిన గ్యాంగ్ గుట్టుగా కంటైనర్‌లో పాతబస్తీకి వచ్చిన ఈ ఫేక్ కరెన్సీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉన్న పవర్ ప్రెస్‌లో ముద్రితమైన ఈ కరెన్సీ అసలు నోట్లకు దీటుగా ఉంది. నిపుణులు మినహా ఎవరూ కనిపెట్టే ఆస్కారం లేకుండా ముద్రించారు. అప్పట్లో నగర నేర పరిశోధన విభాగం దర్యాప్తు చేసిన ఆ కేసు విచారణ నాంపల్లి కోర్టులో సాగింది. దీంతో ఆ నకిలీ కరెన్సీని కోర్టులోని ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నోట్లను కూడా చోరీ చేయవుని అలీ భాయ్ చెప్పడంతో దావుద్, వుుస్తాక్లు కోర్టు పరిసరాల్లోనూ రెక్కీ నిర్వహించారు. ఈ రెండు నేరాలు చేయడానికి అనువైన సవుయం కోసం ఎదురుచూశారు. ఈ రెండు పథకాల అమలుకు ముందే కుట్రలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నేరాలు చేయడానికి అవసరమైన కారును చోరీ చేయాలనే ఉద్దేశంతో దావుద్, రయీజ్, సంతోష్‌లు నాంపల్లి ప్రాంతంలో 2009 ఆగస్టు 6న రెక్కీ నిర్వహించారు. అప్పటికే వీరిపై కన్నేసి ఉంచిన టాస్క్‌ఫోర్స్ బృందం ముగ్గురినీ పట్టుకుని, వుూడు కత్తులు స్వాధీనం చేసుకుంది. వీరి వాంగ్మూలం ఆధారంగా జగదీష్‌ను పట్టుకున్నారు. అప్పటికే జైల్లో ఉన్న అలీ భాయ్‌ని ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌పై అరెస్టు చేశారు. జహీరాబాద్ కుట్ర విజయవంతమైనా కాకపోయినా, ఆశించిన మొత్తం దక్కకపోయినా... చేతినిండా డబ్బు ఉండాలనే కోర్టులోని నకిలీ నోట్లను తస్కరించాలని భావించామని, దీన్ని సాధారణ కరెన్సీ మాదిరిగా చలామణి చేయాలని భావించామని నిందితులు బయటపెట్టారు. -
మానవాళి రక్షణకై ప్రబావించిన యేసుక్రీస్తు
‘క్రిస్టోస్’, ‘మాస్సే’ అనే రెండు పదాల నుంచి క్రిస్మస్ అను మాట వచ్చింది. దాని అర్థం క్రీస్తును ఆరాధించుట. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. క్రిస్మస్ పరమార్థాన్ని గుర్తించి దేవుని ఆరాధించుటలో తప్పులేదు గాని దానిని ఆచార ‡సంబంధమైన ఓ పండుగగా భావించి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే! ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినం క్రిస్మస్. క్రిస్మస్ సమయంలో ప్రతి చర్చిలోను, ప్రతి కార్యక్రమాలలోను క్రైస్తవులు ఈ బైబిల్ వాక్యాలను తప్పక చదువుతారు. ‘‘ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంటుండగా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే, ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు.ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు’ అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను’’– (లూకా 2:814).ఇంగ్లండు దేశంలో జన్మించిన చార్లెస్ వెస్లీ తన జీవితకాలంలో సుమారుగా 6500 పాటలు రచించాడు. తన అన్న జాన్‌వెస్లీ తన ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే, చార్లెస్ వెస్లీ తన పాటల ద్వారా అనేకులను దేవునివైపు నడిపించాడు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన చార్లెస్ దేవుని పట్ల అపారమైన భయభక్తులు కలిగియున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చిన సందర్భాన్ని తాను వ్రాసిన పాటలలో అద్భుతంగా వివరించాడు. వాటిల్లో ఒక పాట ఇలా ఉంటుంది. ‘‘దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి... ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందున. భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున మ్రోగుపాట చాటుడి.’’ దాదాపుగా అన్ని సంఘాల్లో ఈ పాట పాడి క్రిస్మస్ ఆత్మీయ అర్థాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ‘నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును’ అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? సకలలోక సృష్టికర్తయైన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన శరణు కోరిన వారిని పవిత్రపరుస్తాడు. పాపము విడిపించి ఆత్మశుద్ధిని దయచేస్తాడు. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకున్నాయి కూడా. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న ‘అపోలో–11’ అనే రాకెట్ మీద అక్షరాలా 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి, మహనీయుడైన దేవుని మనసారా స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘‘నిన్ను కాపాడువాడు’’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టియే ఇంత అద్భుతంగా ఉంటే, దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా!నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళి వచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి, కొన్ని పరిశోధనలు చేసి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు కూడా తీసుకువచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి, ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి.ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణలలో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచారు. ప్రతి సభలోనూ ఆయన ప్రకటించిన సత్యం... ‘‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు అదీ గొప్ప విషయం.’’ నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భువిపై జన్మించారన్నది లేఖన సత్యం. క్రీస్తు ప్రభువు జన్మ స్థలమైన బేత్లెహేము ప్రపంచంలోని కోట్లాదిమంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ బేత్లెహేము ఒకప్పుడు స్వల్ప గ్రామమైనను నేడు అది ప్రత్యేక ప్రదేశంగా విరాజిల్లుతోంది. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). దేవుడు తన ప్రజల జీవితాల్లో తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బేత్లెహేము నుంచి వస్తాడు అని చెప్పబడిన ప్రవచనం చాలా గొప్పది. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. రక్షకుడు పుట్టే స్థలము మాత్రమే గాక ఆయన గుణలక్షణమును, విశిష్ట అధికారాన్ని మీకా తెలియచేశాడు. దేవుడు నిత్యుడు. అందుకే ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరికి నిత్య సంపదలు అనుగ్రహిస్తాడు. నిత్యజీవం ఆయన ఇచ్చే బహుమానములలో ప్రధానమైనది. సృష్టికర్త పుడమిపై పవళించిన ఆ స్థలము పరమ పావనమై పునీతమైంది. బేత్లెహేము చరిత్రను మనం క్లుప్తంగా గమనించగలిగితే ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు విశదమౌతాయి. పరిశుద్ధ గ్రంథంలో బేత్లెహేమునకు విశిష్టమైన స్థానం ఉంది. బేత్లెహేము అనేమాటకు రొట్టెల గృహము (హౌస్ ఆఫ్ బ్రెడ్) అని అర్థం. ఇది జెరూషలేముకు దక్షిణంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాకోబు కాలంలో ఈ ప్రాంతాన్ని ‘ఎఫ్రాతా’ అని పిలిచేవారు. ఇక్కడే యాకోబు తన భార్యయైన రాహేలును పాతిపెట్టాడు. ‘‘రాహేలు మృతిబొంది బేత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.’’ పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఘట్టం రూతు చరిత్ర. రూతు కూడా తన అత్తయైన నయోమితో కలిసి మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చెను. దేవుడు రూతును బహుగా హెచ్చించెను. రూతు బోయజును వివాహమాడి ఓబెదును కనెను. ఓబెదు యెష్షయిని, యెష్షయి దావీదును కనెను. (రూతు 4:21). మోయాబు దేశం నుండి వచ్చిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడం నిజంగా ఆశ్చర్యమే కదా! దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిస్తే తన దివ్య ప్రణాళికలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడతాయి అనడానికి రూతు జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. బేత్లెహేములోని పొలాలను బోయజు పొలాలు అని కూడా పిలుస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు బేత్లెహేములోనే జన్మించి బేత్లెహేమీయుడుగా పిలువబడెను. దానినే దావీదుపురము అని కూడా కొన్ని సందర్భాలలో పిలిచారు. కారణం అది దావీదు జన్మస్థలము కాబట్టి.మరియకు ప్రధానం చేయబడిన యోసేపు కూడా బేత్లెహేములో జన్మించాడు. అది అతని జన్మస్థలము కాబట్టి ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకొనుటకు నజరేతు నుంచి ప్రయాణం చేసి బేత్లెహేము వరకు వచ్చెను. ఏ బేత్లెహేముకైతే అత్యంత పురాతన చరిత్ర ఉన్నదో అదే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించెను. బెత్లెహేము అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం అయితే, యేసుక్రీస్తు ‘‘జీవపు రొట్టె’’గా జీవాహారముగా ఆ ప్రాంతములో జన్మించి ఆ పేరును స్థిరపరచెను.ఈ బేత్లెహేము పొలములోనే గొర్రెల కాపరులు క్రీస్తు ఆగమన సందేశాన్ని పొందారు. రాత్రివేళ భయముతో తన మందను కాచుకొనుచున్న ఆ గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం మాత్రమే గాక వారి జీవితాలను కూడా క్రీస్తు ప్రేమ అనే వెలుగుతో నింపివేసెను. హల్లేలూయ! యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించాడని బైబిల్లో ఆయాచోట్ల తెలియచేయబడింది.రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసుపుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ‘‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి’’ అని చెప్పిరి. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుంచి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుంచి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? అనిరి (యోహాను 7:42). చర్చ్ ఆఫ్ నేటివిటీప్రపంచంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు, కట్టడాలు వున్నాయి. నిత్యం వేలాది యాత్రికులు ఆ ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్, చైనాలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇండియాలో ఉన్న తాజ్‌మహల్– ఇంకా ఎన్నో వింతలుగా పేర్కొనబడుచున్నవి. కాని, వీటికంటే ఉన్నతమైన రీతిలో ఒక ప్రాంతం ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకర్షిస్తూ ఉంది. అదే బేత్లెహేములో ఉన్న చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఎంతో విశాలమైన ప్రాంతంలో నిర్మించబడిన ఈ చర్చ్ ప్రాముఖ్యత మనకందరికి విదితమే! ఇదే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన స్థలం. పుడమిపై శాంతిదూత వెలసిన పుణ్యస్థలం. ఏటా కోట్లాదిమంది అనేక దేశాల నుంచి ఇక్కడకు వచ్చి దైవభక్తితో క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ బేత్లెహేములో ఉంది. ఇది ప్రపంచ నగరాలలో పోలిస్తే చాలా చిన్నది కాని, జగద్రక్షుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టీస్ మార్టెర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా; 3వ శతాబ్ద చరిత్రకారులైన ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. గొప్ప చరిత్రకారుడు, బైబిల్‌ను లాటిన్ భాషలోనికి అనువదించిన సెయింట్ జెరోవ్ు కూడా క్రీ.శ.384 సంవత్సరంలో ఇక్కడే పాతిపెట్టబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. కానీ క్రీ.శ 614వ సం.లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు.ఆశ్చర్యమేమిటంటే వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే ఆ చర్చ్‌లో వారు చూసిన కొన్ని దృశ్యాలు, యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చ్‌ని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చ్‌లో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు ప్రభువువారు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది.ఈ చర్చిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే తల వంచి వెళ్ళాలి. ఆ చర్చి ముఖద్వారం చాలా చిన్నగా ఉండడమే దానికి కారణం. ప్రపంచంలోని ఎంత గొప్పవ్యక్తి అయినా, తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే! మొన్నీ మధ్య అమెరికా ప్రెసిడెంటు కూడా తలవంచి లోపలికి వెళ్ళారు. అయితే చిన్న పిల్లలకు ఆ సమస్య లేదు. వారు చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ‘‘చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి. ఈలాటి వారిదే పరలోక రాజ్యము’’ అని ప్రభువు చెప్పిన మాట ఆ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. బేత్లెహేము నక్షత్రమని పిలువబడిన ఈ నక్షత్రాన్ని అసిస్సి వాసియగు ఫ్రాన్సిస్ సంబంధీకులు క్రీ.శ. 1717లో వుంచారు.అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అని అక్షరాలు చెక్కబడియున్నవి. క్రొత్తనిబంధన కాలంలో ఉన్న మనకు ప్రభువే ముఖ్యుడు. ప్రాంతం మనకు ముఖ్యం కాదు. క్రీస్తు రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేమునందు జన్మించడం వలన ఆ చిన్న గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినట్లుగా నేడు మనం ఆయనను మన హృదయాలలోనికి ఆహ్వానిస్తే కీర్తి, ఘనత, ఆశీర్వాదం మన సొంతమవుతాయి. మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను వ్రాయబడిన క్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీలను చూస్తాం. వాస్తవానికి సమాజంలో కొంతమంది స్త్రీలను చిన్న చూపు చూస్తుంటారు. స్త్రీ బలహీనమైనదని, ఆమెపట్ల పక్షపాతం చూపిస్తారు. యూదుల వైఖరికూడా స్త్రీల పట్ల చులకనగానే వుంటుంది. కానీ దేవుని దృష్టిలో స్త్రీ, పురుషులని భేదం లేదు. అందరికీ సమానంగా తన కృపను చూపించుచున్నాడు అనే విషయం తన వంశావళిలో స్త్రీల పేర్లను ప్రస్తావించుటను బట్టి తేటతెల్లమయ్యింది. ఏ యూదుని వంశావళిలోనూ స్త్రీ పేరు కనబడదు. స్త్రీలకు బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన స్థానం కల్పించబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన తరువాత పురుషులు, దేవదూతలతో పాటు స్త్రీలు కూడా ఆనందించారు. బైబిల్ గ్రంథంలో పురుషులు చేసిన సేవను గుర్తించిన విధంగా స్త్రీలు చేసిన పరిచర్యను కూడా ప్రభువు గుర్తించారు. పాతనిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా సేవలందించారు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా స్త్రీల సహాయం చాలా గొప్పది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతిని శిష్యులకు తెలియజేసినది కూడా స్త్రీలే. అంత గొప్ప ప్రాధాన్యతను ప్రభువు వారికి అనుగ్రహించి, స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ వారు కాదని, వారిపట్ల కూడా దేవుడు అపారదృష్టి కలవాడని నిరూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో కూడా స్త్రీలను ప్రస్తావించుట ద్వారా దేవాదిదేవుడు వారికెంత విలువ, గౌరవం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో క్రొత్తనిబంధనలో ఇద్దరు సువార్తికులు యేసుక్రీస్తు వంశావళిని వ్రాశారు. సువార్తికుడైన లూకా యోసేపు వంశావళి క్రమాన్ని అనుసరించి దావీదు కుమారుడైన నాతాను క్రమం నుంచి వ్రాసుకొస్తే, మత్తయి సువార్తికుడు మాత్రం మరియ వంశ క్రమాన్ని దావీదు కుమారుడైన సొలొమోను క్రమం నుంచి వ్రాసుకుంటూ వచ్చాడు. వీరిద్దరిలో మత్తయి పేర్కొన్న వంశావళిలో ఐదుగురు స్త్రీలను గూర్చి ప్రస్తావించాడు. పరిశుద్ధాత్ముడు అనుమతించాడు గనుకనే వీరిపేర్లు దైవగ్రంథంలో చిరస్మరణీయంగా లిఖించబడినాయి. దేవునిలో లింగభేదం, వయోభేదం, కుల మత భేదాలు లేవని; అందరినీ సమానంగా ప్రేమించుచున్నాడని దానినిబట్టి అవగతమవుతుంది. మత్తయి సువార్తికుడు ప్రస్తావించిన ఐదుగురు స్త్రీలను గూర్చి ధ్యానిద్దాం!మొదటిగా తామారు. ఆమెను గూర్చిన వివరణ ఆదికాండం 38వ అధ్యాయంలో చూడగలం. యూదా కనానీయుని కుమార్తెను పెండ్లి చేసుకొనెను. ఆమె యూదాకు ఏరు, ఓనాను, షేలా, అను ముగ్గురు కుమారులను కనెను. యూదా తన పెద్దకుమారుడైన ఏరుకు తామారును ఇచ్చి వివాహం చేసెను. అయితే ఆమెయందు సంతానమేమీ కలగకుండానే ఏరు చెడునడతను బట్టి చనిపోయాడు. తదుపరి రెండవ కుమారుడైన ఓనానుకు తామారు ఇవ్వబడింది. ఓనాను కూడా తన స్వార్థపు బుద్ధితో సంతానం లేనివాడాయెను. అప్పటికి యూదా మూడవ కుమారుడు షేలా చిన్నవాడై యుండుట వలన తామారును తన తండ్రి ఇంటికి పంపివేసెను. రోజులు గడుచుచుండగా తామారు మారువేషంలో యూదాను కలుసుకొనగా వారిరువురకు పెరెసు, జెరహు అను కుమారులు కలిగి యూదా వంశం కొనసాగించబడింది.ఇక్కడ తామారును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలోనికి అనుమతించడానికి గల కారణం ఆమె యూదాకు సంతతి కలుగజేసి, అతని వంశమును నిలువబెట్టాలనుకోవడమే! ఎందుకంటే మెస్సీయా ఈ గోత్రం నుంచే వస్తాడు గనుక సాతాను ప్రాముఖ్యంగా ఈ గోత్ర నిర్మూలనకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. సంఖ్య 24:17లో వ్రాయబడినట్లు ‘‘నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును’’అను వాక్యం నెరవేరునట్లుగా యూదా సంతతి కొరకు దేవుడు తామారును ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు, యూదా వంశమును కొనసాగించుటకు తామారు తీసుకొన్న నిర్ణయం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే హర్షించదగినదే! యూదా వంశమును కొనసాగించుటకు ఆమె తనకు తాను తగ్గించుకొని అనేకుల చేత నిందలనిపించుకొనుటకైనా సిద్ధపడింది. ఆమె సమాజం దృష్టికి నీచమైనదిగా కనబడినప్పటికీ ప్రభువు ఆమెను, ఆమె తగ్గింపును గుర్తించి తన వంశావళిలో స్థానం కల్పించాడు. రెండవ స్త్రీ రాహాబు. యెరికో ప్రాకారం మీద నివసించిన ఒక వేశ్య. ఈమె ఆ ప్రాంతంలో నివసిస్తూ అనేకులను పాపం వైపు ఆకర్షిస్తుంది. యెరికో అనే మాటకు ‘‘సువాసన’’ అని అర్థం. అయితే ఆ యెరికో ప్రాకారాల మీద నివసించు స్త్రీలు కొంతమంది ఆ సువాసన కల్గించే వాటిని ఉపయోగించి బాటసారులను పాపమునకు ఆకర్షించేవారు. పేరు మంచిదే గాని, దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిదిగా లేదు. మంచి పేరు ఉండడం తప్పు కాదు కాని, ఆ పేరుకు తగ్గ జీవితం వున్నదా లేదా అనేది ముఖ్యం. రాహాబు భయంకర పాపములో జీవిస్తుండేది. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును ముట్టడి వేయడానికి ముందు ఆ పట్టణమును వేగుచూచుటకు రాగా రాహాబు వారిని తన ఇంట చేర్చుకొని ఆ ప్రాంతపు రాజు చేతినుండి తప్పించెను.అందువలన ఇశ్రాయేలీయుల చేతిలో యెరికో పట్టుబడెను గాని రాహాబు, తన కుటుంబము మాత్రమే తప్పించబడెను. రాహాబు ఇశ్రాయేలీయులలోని శల్మాను అను వ్యక్తిని పెండ్లి చేసుకొని క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించెను. లోకరీతిగా వేశ్యలకు అంత విలువ, గౌరవం ఉండదు. కాని, ప్రభువు మాత్రం ఎంతో గొప్ప స్థానం కలుగజేశాడు. ఎందుకనగా రాహాబు జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆమె దేవుని ప్రణాళికలో భాగస్థురాలయింది. రాహాబు తన గతాన్ని సమాధి చేసి ఓ మంచి దైవికమైన భవిష్యత్తు కొరకు తనను తాను సిద్ధపరచుకున్నది. ఒక వ్యక్తి గతమెంత భయంకరమైనదైననూ ఆ వ్యక్తి ప్రభువును అంగీకరించుట ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవచ్చు అని రాహాబు ఋజువు చేసింది. మూడవది రూతు. ఆమె మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. ఇశ్రాయేలు దేశంలో కరవు వచ్చినప్పుడు నయోమి తన భర్తను, కుమారులను తీసుకొని మోయాబుకు వెళ్ళింది. అక్కడ తన కుమారులకు వివాహాలు చేసింది. పది సంవత్సరాలలో భర్త, కొడుకులు చనిపోయారు. తిరిగి బేత్లెహేముకు రావాలని నిర్ణయించుకుంది. ఒక కోడలు అత్తను విడిచి వెళ్లిపోయింది. అయితే, రూతు తన అత్తను హత్తుకొని ఆమె కోసం నిలబడింది. ఇక మంచి అత్తాకోడళ్ళ బంధాన్ని వీరిలో స్పష్టంగా చూడవచ్చు. రూతు తన అత్తతో పాటు యూదా దేశానికి వస్తున్నప్పుడు ‘‘నీ దేవుడే నా దేవుడు’’ అని పలికింది. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉందని, బహుమానం ఇచ్చువాడని గ్రహించి ఆ దేవుని విడువక హత్తుకుంది. మోయాబు దేశాన్ని విడచి దేవుని ప్రజలతో ఉండాలని బెత్లేహేమునకు వచ్చింది. బేత్లెహేములో సంపన్నుడైన బోయజు ఉన్నాడు. అతని పొలంలోకి పరిగె ఏరుకొనుటకు ఒక పరదేశిగా ప్రవేశించింది. పూర్వదినాలలో భూస్వాములు తమ పంటలో కొంత భాగాన్ని పరదేశుల కోసం విడిచిపెట్టేవారు. ఏ పొలంలోనికైతే యవలు ఏరుకొనుటకు వెళ్ళిందో తన సత్ప్రవర్తననుబట్టి ఆ పొలానికి యజమానురాలు అయ్యింది. బోయజు ఆమెను పెండ్లిచేసుకొని, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మోడుబారిన జీవితాలను సర్వశక్తుడైన దేవుడు చిగురింపచేయగలడు అనే సందేశాన్ని రూతు ప్రపంచానికి ఇచ్చింది. నాల్గవదిగా బత్షెబ. ఈమె గూర్చి సువార్తికుడైన మత్తయి ‘‘ఊరియా భార్య’’ అని ప్రస్తావించాడు తప్ప ఆమె పేరును మాత్రం తెలుపలేదు. ఈమెను గూర్చి 2 సమూయేలు 11వ అధ్యాయంలో చదువగలము.ఈమె ఏలీయాము అనువాని కుమార్తె, ఊరియా అను హిత్తీయుని భార్య. ఊరియా దావీదు సైన్యంలోని నమ్మకమైన సైనికుడు. దావీదు ఊరియా భార్యయైన బత్షెబతో పాపం చేసి, దానిని దాచుకొనుటకు తనభర్తయైన ఊరియాను యుద్ధంలో చంపించెను. తరువాత దావీదు బత్షెబను వివాహమాడి ఆమెయందు నాతాను, సొలొమోను అను ఇద్దరు కుమారులను కనెను. దావీదు బత్షెబతో పాపం చేయడం ద్వారా పుట్టిన మొదటి కుమారుడు చనిపోయెను. ప్రవక్తయైన నాతాను ద్వారా దావీదు గద్దింపబడినప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది దేవునివైపు తిరిగెను. దేవుని మహాకనికరం అతని మీద కుమ్మరించబడెను. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా తన సింహాసనం తనకు నిత్యం స్థిరపరచుదునన్న మాటను నెరవేర్చుటకు దేవుడు బత్షెబను దీవించాడు. చివరగా మరియ. గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది’. వివాహం కాకుండా గర్భం ధరించుట వలన ఎన్ని నిందలు అవమానాలు వస్తాయో ఊహించలేనంత పరిస్థితిలో మరియ లేదు. ప్రపంచం ఎదురు తిరిగినా తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంది.దూత ప్రకటన వినిన తదుపరి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని రక్షకుని ఆగమనానికి సహకరించింది. తాను పొందబోయే శ్రమల కంటే దేవుని కృప గొప్పదని గుర్తించింది. ‘‘నీవు కృప పొందితివి’’ (లూకా 1:30). ఆ ఒక్క మాట చాలు! దేవుని కృప ద్వారా ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోవచ్చు. నిండు చూలాలిగా ఉన్నప్పుడు నజరేతు నుంచి బేత్లేహేముకు ప్రయాణం, తమకు తెలియని ఈజిప్టు దేశంలో చిన్నబాలుడైన యేసుతో పాటు రెండు సంవత్సరాలు నివసించడం, అన్ని విషయాల్లో బాలుడైన యేసును అతి జాగ్రత్తగా చూసుకొనే విషయాల్లో మరియ దేవుని కృపమీద ఆధారపడింది. ∙∙ ఇకపోతే, యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే ప్రశ్నను చాలామంది లేవదీస్తున్నారు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘‘యేసు గ్రీకో–రోమన్ తత్త్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల మానసిక ఆవిష్కరణయే గాని, వాస్తవం కాదు. క్రొత్తనిబంధన ఒక పురాణమే గాని, వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు’’. దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు. ‘‘ప్రపంచంలోని చాలా విషయాలకు ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా, కేవలం మనుష్యుల ఆలోచనలపై ఆధారపడియున్నవి.కాని క్రైస్తవ్యం అటువంటిది కాదు’’. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బ్రూస్ అనే వ్యక్తి పరిశీలనాత్మకంగా ప్రకటించిన సత్యమిది. వాస్తవాలను క్రోడీకరించే ప్రతి చరిత్రకారునికి జూలియస్ సీజర్ చారిత్రకత ఎంత స్పష్టమో, యేసుక్రీస్తు చరిత్ర అంతకన్నా ఎక్కువ స్పష్టం.యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు, ఆయన మొదటి శతాబ్దకాలంలో ఈ భూమిపై సంచరించాడని, ఆయన రక్షకుడు మరియు దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రాజకీయవేత్త. రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటు కాలంలో గలిలయలోని తిరుగుబాటు దళమును నడిపిన వ్యక్తి. వెస్పాసియన్ అనే రాజుచేత చెరపట్టబడి మిగిలిన తిరుగుబాటు కాలమంతా రోమీయులకు మధ్యవర్తిగానూ, తర్జుమాదారునిగానూ పనిచేశాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు వ్రాశాడు. అవి: ‘‘ద జ్యూయిష్ వార్స్ ’’, ‘‘జ్యూయిష్ యాంటిక్విటీస్’’ ఫ్లావియస్ అనుపేరు రోమా పేరు కాగా జోసఫస్ అను పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు ‘‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’’ ఫ్లావియస్ జోసఫస్ అత్యంత అద్భుతమైన చరిత్రకారుడు. ఆయన వ్రాసిన చరిత్ర సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జన్మను, మరణాన్ని, పునురుత్థానాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గూర్చి సవివరంగా వ్రాయబడ్డాయి. ఆ సువార్తికులు ఎవరనగా– మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరిచే సువార్తలన్నీ క్రీ.శ. 70వ సంవత్సరంలోపే వ్రాయబడ్డాయి. అనగా యేసు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాలలోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. క్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతి తక్కువ సమయంలోనే వ్రాయబడింది గనుక వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనంగా బైబిల్ నిలిచింది.క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరి దేని గురించి అతడు ఆలోచించడు.కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి; వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుంచి అపరాధముల నుంచి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుచున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘‘ఏ భేదము లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు’’ అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి.పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి తన సిలువ మరణం ద్వారా విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం తరువాత కూడా ఓ ఉన్నతమైన జీవితం ఉందనే సత్యాన్ని తెలిపి మనిషికి నిరీక్షణ ప్రసాదించాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’’ అనే మాట బైబిల్లో ఉంది. ఒక మంచి వ్యక్తిని ప్రేమించడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో గాని, పాడైపోయిన మనిషిని దేవుడు ప్రేమించాడు. నిస్వార్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు లోకప్రేమల వెంటబడి తన జీవితాన్ని వృథాపరచుకోడు. క్రీస్తు ప్రభువు బోధలో చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రేమ. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాట ద్వారా నేడు అనేకులు ప్రేమ ఔన్నత్యాన్ని తెలుసుకొని సమసమాజ నిర్మాణంలో తన బాధ్యతను నెరవేస్తున్నారు.క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కాని, క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. చెట్టి భానుమూర్తి వ్రాసిన శ్రేష్టమైన ఈ పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడు మరచిపోదు. ‘రారె చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానది తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే. బాలుడిడిగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నా«థుడు’. సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.⇒ గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది.⇒ దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.⇒ ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత క్రొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి ఆ వయోలిన్ తనకిమ్మని సంఘ సేవకుణ్ణి అడిగాడు.ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి, దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయించాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సింపుల్ స్వాగ్!
యంగ్ బాలీవుడ్ జనరేషన్స్ కి కొత్త స్టయిల్ మూడ్ సెట్ చేస్తున్న అనన్యా పాండే, ఫ్యాషన్స్ లో పెద్ద హంగామా కాకుండా, తానెలా ఫీలవుతుందో అలా ధరించడమే తన సీక్రెట్ అంటోంది. ఆ స్టయిల్ విషయాలే ఇక్కడ మీ కోసం!‘ఫ్యాషన్స్ అంటే ఓ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ . నేను ఎలా ఫీలవుతున్నానో, అదే నా లుక్. డ్రెస్ ఏదైనా అయినా, నా స్టయిల్ నచ్చేలా ఉన్నప్పుడు అది సింపుల్ అయినా, క్లాసీ అయినా నిజంగా స్టయిలిష్‌గా కనిపిస్తుంది.’ జ్యూలరీ బ్రాండ్: జడావూ జ్యూలర్స్ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర.. బ్రాండ్: మనీష్ మల్హోత్ర ధర రూ. 2,25,000గ్లామర్ తాళ్లు! శారీ బ్లౌజ్ వెనుక దారాలు అంటే ఒకప్పుడు కేవలం కట్టుకునేందుకు మాత్రమే ఉండేవి కాని, ఇప్పుడు అవే దారాలు మన లుక్‌ని ‘ఓహ్ వావ్!’ అనిపించే స్టయిల్ స్టేట్మెంట్గా మారిపోయాయి. ముఖ్యంగా వెనుక భాగంలో రకరకాలుగా కట్టే డోరీస్కి గంటలు, తారలు, త్రెడ్ టసెల్స్ జత చేస్తే బ్లౌజ్ బ్యాక్ ఒక ఆర్ట్‌లా మెరిసిపోతుంది. అదేవిధంగా సారీ పల్లు దారాలను కూడా డిజైన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రత్యేకంగా పండగలు, పెళ్లిళ్లు, హల్దీ లాంటి ఫంక్షన్లలో ఈ డోరీస్ ఎంత డిజైనర్‌గా ఉంటే అంత రిచ్‌గా కనిపిస్తాయి.అలాగే ఏ రంగు శారీ అయితే దానికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ లేదా టోన్స్ ఆన్స్ టోన్స్ దారాలు ఎంచుకుంటే బాగా సెట్ అవుతాయి. బ్లౌజ్ డోరీస్ అయితే కొంచెం మృదువుగా ఉండే వెల్వెట్ లేదా సిల్క్ తాళ్లు మంచివి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటే చర్మానికి గాట్లు పడే అవకాశం ఉంటుంది. పల్లు దారాలు మాత్రం కొంచెం బీడ్స్‌తో ఉంటే మంచిది, ఎందుకంటే అవే పల్లు స్లిప్ కాకుండా పట్టేసి ఉంచుతాయి. మొత్తానికి ఈ దారాలు అటూ ఇటూ ఊగుతూ అందరి మనసులు లాగేస్తాయి! -
చిన్న ప్రపంచంలో పెద్ద వెలుగులు
క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్బౌల్లో మినియేచర్ డెకర్ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్ డెకర్ బౌల్‌ను టేబుల్, షెల్ఫ్, కార్నర్లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్ క్రిస్మస్ డెకర్ బౌల్స్, జార్స్ రెడీమేడ్‌గా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.గ్లాస్ బౌల్ డెకర్పారదర్శకంగా ఉండే క్రిస్మస్ మినియేచర్ బౌల్స్, జార్స్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆకాశమే హద్దు... నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్ ఆర్ట్‌కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్ ఫిగర్స్, పైన్కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్ఈడీ ఫెయిరీ లైట్స్‌తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు. స్నో గ్లోబ్ స్టయిల్తెల్లటి ఫేక్ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్ ఫిగర్‌తో మినిమలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు. క్రిస్మస్ విలేజ్ థీమ్చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్ పాత్, ఎల్ఈడీ స్ట్రీట్ ల్యాంప్స్‌తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు. ఎక్కడ ఉంచాలంటే.. సిద్ధం చేసుకున్న మినియేచర్ క్రిస్మస్ బౌల్‌ను లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్‌సైడ్ లాంప్ పక్కన, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్‌గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. - ఎన్నార్ -
బర్నింగ్ ది క్లాక్స్
కాలాన్ని ఒడిసి పట్టే గడియారాలను దహనం చేయడమే బ్రిటన్‌లోని ‘బర్నింగ్ ది క్లాక్స్’ ఫెస్టివల్ ప్రత్యేకత. బ్రిటన్స్ లోని ససెక్స్‌లో ఉన్న బ్రైటన్ నగరంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 లేదా 22న జరిగే అద్భుతమైన సామూహిక ఉత్సవమే ‘బర్నింగ్ ది క్లాక్స్’. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ వేడుక జరుగుతుంది. ఇది పాత సంవత్సరాన్ని గౌరవంగా సాగనంపి, రాబోయే కొత్త ఆశలకు, వెలుగులకు స్వాగతం పలికే వేడుక!ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ‘సమ్ స్కై’ అనే స్థానిక కళా సంస్థ నిర్వహిస్తుంది. రకరకాల పోటీలు కూడా ఏర్పాటు చేస్తుంది. శీతకాలపు చీకటిని పోగొట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.సాయంత్రం వేళ జరిగే లాంతర్ల ఊరేగింపు, ఈ ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైనదని చెప్పొచ్చు. బ్రైటన్ స్థానికులు, అక్కడికి వచ్చిన కొందరు ఔత్సాహికులు తమ చేతులతో తయారుచేసిన ప్రత్యేకమైన లాంతర్లను తీసుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా నడుస్తారు. వీటిలో ఎక్కువ శాతం గడియారాలు ఉంటాయి. ఈ లాంతర్లను సాధారణంగా కాగితం లేదా వెదురుతో తయారు చేస్తారు. అవి గడియారాలే కాక చంద్రుడు, నక్షత్రాలు, చిత్రవిచిత్రమైన ఎన్నో రూపాలను పోలి ఉంటాయి. ఈ చూడముచ్చటైన దృశ్యంతో వీధులన్నీ మెరుస్తాయి.ఇక చివరిగా బ్రైటన్ సముద్ర తీరం వద్ద ఈ ఊరేగింపు ముగుస్తుంది. అక్కడ, ప్రతి ఒక్కరూ తమ లాంతర్లను ఒక పెద్ద కొయ్యపై వేసి, అగ్నితో దహనం చేస్తారు. గడియారాలు కాలాన్ని సూచిస్తాయి కాబట్టి వాటిని దహనం చేయడమంటే పాత బాధలను, చెడు జ్ఞాపకాలను, గడిచిన కాలాన్ని విడిచిపెట్టడమే అని అక్కడి వారు భావిస్తారు. ఆ తరువాత, బాణాసంచా ప్రదర్శనతో ఆకాశం కాంతులీనుతుంది. చూపరుల మనసు నిండుతుంది.సంహిత నిమ్మన -
పేరు చెప్పలేను!
యూట్యూబ్ ఫ్రేమ్ నుంచి సినిమా ఫ్రేమ్ దాకా చేరిన నటి వైష్ణవి ప్రయాణం మాటల్లో సులభం, కాని మనసుల్లో మాత్రం అద్భుతం! ఆ మార్గంలో ఆమె చూసిన ఆనందాలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ ఆమె మాటల్లోనే, మీ కోసం!⇒ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన అమ్మాయిని నేను. చిన్నప్పటి నుంచే టీవీలో పాటలు వస్తే డ్యాన్స్ చేస్తూ, పుస్తకాలలో ఉన్న కథలను యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. అదే నన్ను యూట్యూబ్ వీడియోలు చేయించి, ఈరోజు సినిమాల దాకా తీసుకువచ్చాయి.⇒ నా కెరీర్ నిజంగా ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్‌తో మలుపు తిరిగింది. ఆ సిరీస్ నాకు నటిగా నమ్మకం ఇచ్చింది. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిన్న పాత్రలో కనిపించాను. అవకాశం చిన్నదైనా, ఆ సినిమాలో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘బేబీ’ సినిమా నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సినిమాకు వచ్చిన ప్రేమ, గుర్తింపు, అవార్డులు ఇవన్నీ నాకింకా కలలా అనిపిస్తాయి.⇒ ఇష్టమైన హీరో ఎవరని అడిగితే, ఏ పేరూ చెప్పలేను. కాని, కష్టపడి ఎదిగిన నటులంటే చాలా గౌరవం.⇒ నేను పాతబస్తీ గల్లీలలో పెరిగిన అమ్మాయి కాబట్టి, ఆ ప్రదేశం ఇప్పటికీ నాకు హాయిగా అనిపిస్తుంది. తినే విషయానికి వస్తే నేనొక ఫూడీ. మసాలా నాన్ అయితే చాలు, చికెన్ ఉంటే ఇంకా ఇష్టం. టైమ్ దొరికితే సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం నాకు రిలాక్సేషన్లా ఉంటుంది.⇒ అందం గురించి చెప్పాలంటే, నేను చాలా సింపుల్. ఉదయం నీటితోనే ముఖం కడుక్కుంటాను. తేలికపాటి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడతానంతే! ఇదే నా రొటీన్. జుట్టు విషయంలో మాత్రం గోట్ మిల్క్ షాంపూ, హెయిర్ ఆయిల్ వాడతాను.⇒ ఫ్యాషన్ ట్రెండ్లు ఎలా ఉన్నా, నాకు కంఫర్ట్ ఇచ్చే దుస్తులే వేసుకుంటాను. చీరలు, అనార్కలి, లెహెంగాలు వేసుకోవడం చాలా ఇష్టం.⇒ గాసిప్స్ విషయానికి వస్తే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నేను సింగిల్‌నే. రూమర్స్ వచ్చినా వాటికి స్పందించకుండా నేను నా పనిపైనే దృష్టి పెడతాను. ‘బేబీ’ తర్వాత నా రెమ్యునరేషన్ పెరిగిందని చెబుతారు, కాని, నిజంగా పెరిగింది ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, గౌరవం.⇒ ప్రస్తుతం ఒక ఎమోషనల్ స్టోరీ చేస్తున్నా. ఆ పాత్ర కూడా చాలా డీప్‌గా ఉంటుంది. ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కాని, ఇది నా కెరీర్లో మరో ప్రత్యేక పాత్రగా నిలవడం ఖాయం.⇒ నన్ను గుర్తు చేసుకునేప్పుడల్లా నేను చేసిన మంచి పాత్రలే ముందుగా కనిపించాలి. అందుకే, చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. -
కార్తవీర్యార్జునుడి దత్తోపాసన
హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు. -సాంఖ్యాయన -
ఆయ్! నాకేం వద్దండీ!
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు. ‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్‌లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్‌కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్‌కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్‌గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది. ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది. అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు. ‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్‌రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్‌మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్‌లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్‌రావు కూడా తన చాంబర్‌కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు. ‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్‌రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్‌రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్‌కు వచ్చాడు భాస్కర్‌రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్‌కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్‌రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్‌రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్‌రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి. ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్‌రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు. ‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్‌రావు. అతని బ్యాగ్‌లోంచి బాక్స్‌లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్‌రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్‌రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్‌రావు. ‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు. ‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు. ‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్‌రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు. ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్‌రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్‌రావు. భాస్కర్‌రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్‌రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు. ‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి. ‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్‌రావు. తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్‌రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్‌రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్‌రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్‌రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు.నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. -
వైబ్ వావ్!
ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్‌తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!కూల్ పార్టీ!సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్‌లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్లెస్ కరవోకే మైక్‌తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్‌కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్‌లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్‌తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్‌లోనైనా పార్టీ మూడ్‌ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.స్పిరిట్ స్టార్ట్! ఐస్.. గ్లాస్లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్‌తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్‌లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!పాన్ చాట్కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగాకారం– ఒక టీ స్పూన్ , ఆమ్చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగాతయారీ: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.వెలుగుల బుడగలు!బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్‌తో మెరిసి, వేడుకకు రాక్‌స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!ఐస్ క్రీమ్ బర్గర్కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్‌క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్‌లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా బన్స్‌ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.అరటిపువ్వు సమోసాకావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్‌లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్‌గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ఫీల్డ్‌లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్‌శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్‌వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్‌లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్‌లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్‌లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్‌తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్‌గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్‌కు కలర్‌ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్‌గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్‌ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్‌కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్‌కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్‌లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్‌కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్‌కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్‌పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్‌ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్‌ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్‌లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్‌ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్‌కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్‌బాస్‌లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్‌గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్‌హీరో ఫిల్మ్‌లో ఫీమేల్ లీడ్‌గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
ఈ వారం కథ: సముద్రం
మలక్కా జలసంధి ..మలయా ద్వీపకల్పం సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్న 930 కిలోమీటర్లు ఉన్న జలసంధి.అక్కడ నుండి పశ్చిమానికి 90 మైళ్ళ దూరంలో ఒక ఓడ ఆగి ఉంది. ఆ ఓడ మీద ఒక నలజెండా ఎగురుతూ ఉంది. దాని మీద ఒక పుర్రెబొమ్మ ఉంది.ఆ ఓడలో సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు. ఓడ డెక్ మీద కూర్చున్న వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది వాళ్ళ వాలకం. వారందరి చేతుల్లోనూ పుర్రెలతో తయారు చేసిన మద్యం గ్లాసులు ఉన్నాయి. వాటిల్లో పోసిన ‘రమ్’ తాగుతూ వినోదిస్తున్నారు.ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ డెక్ మీదకు కొన్ని చేపలను విసిరేసి సముద్రంలో కలిసిపోయింది.చెవులకు రింగు పెట్టుకుని; తలకు నల్లటి పాగా కట్టుకుని, ఆ పాగాలో పిడిబాకు ఉంచిన ఒక వ్యక్తి తన పక్కన పడి ఉన్న పెద్దచేపను చేతిలోకి తీసుకున్నాడు.దాని నోరు తెరిచి, తాను తాగుతున్న రమ్‌ను నోటిలో పోశాడు. తర్వాత దాన్ని నోటిలో పెట్టుకుని నమలసాగాడు.అదంతా చూస్తున్న మిగిలిన అందరూ ‘హే నాయకా’ అంటూ అరవసాగారు. వాళ్ళందరూ అలా అరుస్తున్న సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి డెక్ మీదకు వచ్చాడు. అందరూ నిశ్శబ్దమై పోయారు. ‘నాయకా!’ అంటూ అతడికి సలాం చేశాడు.తరువాత తాను తెచ్చిన వివరాలతో ఒక మ్యాప్ అతడికి అందించాడు. అది చూసిన అతడు ‘మన ఓడను ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా మళ్లించండి. మనం ఎదురు చూస్తున్న నౌక ఇంకొన్ని గంటల్లో బయల్దేరుతుంది’ అని ఆజ్ఞాపించాడు. ఓడ ముందుకు కదిలింది.అందరూ తమ వద్ద ఉన్న పిడిబాకులను తుపాకులను, కత్తులను పట్టుకుని ఉన్నారు. వారందరూ తమ నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు.వారందరూ స ..ము ..ద్ర.. పు .. దొం.. గ.. లు ... పైరేట్స్!సాల్ శెట్టి ద్వీపం..దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై ఓడరేవు.కదలడానికి సిద్ధంగా ఉన్న కార్గో నౌకలతో; సముద్రతీరానికి చేరుకుంటున్న ఇతర నౌకలతో; ప్రయాణికులతో; అటు ఇటు తిరుగుతూ తమతమ విధులు నిర్వర్తిస్తున్న ఓడల సిబ్బందితో కిటకిటలాడుతోంది.తీరంలో కొద్దిదూరంలో ఒక పెద్ద నౌక లంగరు వేసి ఉంది. అది ముంబై తీరం నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే క్రూజ్ షిప్ అయిన ‘రాయల్ డైమండ్ డాన్’.ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా ఓడలోకి వెళ్తున్నారు. ఎంట్ర¯Œ ్స వద్ద వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వారిని డెక్ మీదకు పంపిస్తున్నారు.ఓడ ఎక్కబోయే ముందు ఒక అందమైన యువతి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నిలబడి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా ముందుకు చూసింది. అక్కడ ఒక వ్యక్తి తన వద్దకే వస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి కలర్ గాగుల్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు. తల పైకెత్తి ఓడను చూస్తూ వస్తున్నట్టు ఆమెకు అర్థమైంది.ఈలోగా ఆ గాగుల్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. ఆ ఢీ కొట్టడంతో ఆమె పట్టుకున్న ఫోన్, అతను పెట్టుకున్న గాగుల్స్ ఒకేసారి కింద పడిపోయాయి. ‘ఏయ్ మిస్టర్ కళ్ళు పైకి పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.’ అంటూ తన ఫోన్ కోసం కిందకు వంగింది. ‘సారీ మిస్’ అంటూ ఆ వ్యక్తి కూడా గాగుల్స్ కోసం కిందకు వంగాడు. అదే సమయంలో ఇద్దరి తలలు మరోసారి ఢీ కొట్టుకున్నాయి.అబ్బా అనుకుంటూ పైకి లేచింది ఆ యువతి. ‘ఏయ్ మిస్టర్ ఇలాంటి పెద్ద ఓడను ఎప్పుడూ చూడలేదా?’చిరుకోపంగా అడిగింది. ‘ఇప్పుడే మొదటిసారి ఇంత పెద్ద ఓడను చూస్తున్నాను.’ అమాయకంగా మొహం పెట్టి ఆమెకు బదులిచ్చాడు. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.ఆమెను చూస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు బాగా సరిపోతారు’ అని ముందుకు నడుస్తూ చెప్పాడు అతడు.‘అయినా నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నట్టు ఇతడికి అర్థమైందా?’ మనసులో అనుకుంటూ, ‘మిస్టర్ పోకిరి’ అనుకుంది ఆమె.తరువాత ఓడ ఎక్కడానికి వెళ్ళింది. మిస్టర్ పోకిరి కూడా డెక్ మీదకు చేరుకున్నాడు.అరగంట తర్వాత మెల్లిగా ‘రాయల్ డైమండ్ డాన్’ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు కదిలి క్రమేణా వేగం పుంజుకుంది.ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్...ఒక బులెట్ ప్రూఫ్ కారు శరవేగంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆ వ్యక్తి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతడిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ‘సెల్యూట్’ చేస్తున్నారు. కాని, అదంతా పట్టించుకోని ఆ వ్యక్తి పరిగెడుతున్నట్టే లోపలకు అడుగు పెట్టాడు.నాలుగు అంతస్తులున్న ఆ భవనంలో మూడవ అంతస్తులో ఉన్న సౌత్ బ్లాక్ వింగ్. లిఫ్ట్ కోసం చూడకుండా క్షణానికి రెండు మెట్లు ఎక్కుతూ వింగ్‌లోకి దూసుకుపోయాడు.సౌండ్ ప్రూఫ్ గది అయిన ఆ గదిలోకి దూసుకువచ్చిన ఆ వ్యక్తిని చూశాడు నేవీ చీఫ్ అగర్వాల్. తన నోట్లో ఉన్న సిగార్‌ను బయటకు తీస్తూ ఆ వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి నేవీ ఆఫీసర్ తరుణ్ మిశ్రా.‘బాస్! అక్కడ దాడి జరగబోతోంది. రాయల్ డైమండ్ డాన్ నౌకను పైరేట్స్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు రహస్య సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళను అలెర్ట్ చేయకపోతే నౌకలో ఉన్న ప్రయాణికులను సముద్ర దొంగలు ప్రాణాలతో వదిలిపెట్టరు.’ తరుణ్ కంగారుగా చెప్పాడు.అంతా వింటున్న అగర్వాల్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ సిగార్ నోట్లో పెట్టుకుని, పైకి లేచాడు. అతడిని చూస్తూ .. ‘ఈ సమాచారం నాకు కొన్ని గంటల కిందటే వచ్చింది’ అన్నాడు తాపీగా.‘బాస్! మరిప్పుడు డైమండ్ డాన్ నౌకను కాపాడటం ఎలా?’ ఆందోళనగా అడిగాడు.‘మరేం పర్వాలేదు. సముద్రదొంగలను వెంటాడి వేటాడడానికి మన మెరైన్ కమాండో విజయ్ రాణా– డైమండ్ డాన్ నౌకలో ఉన్నాడనే సమాచారం కూడా వచ్చింది. పదిహేను రోజులు సెలవు తీసుకున్న విజయ్ ఆ షిప్లో వెళ్తున్నాడని తెలిసింది’ అన్నాడు.ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ మిశ్రా. తమ చీఫ్ కంగారు లేకుండా అలా తాపీగా ఎందుకున్నాడో అర్థమైంది.అనంత సాగర జలాలలో ‘డైమండ్ డాన్’ నౌక 2 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల్లో కొంతమంది తమ తమ క్యాబిన్లలో ఉండిపోయారు. కొంతమంది నౌకలో ఉన్న ఫుడ్ కోర్ట్స్‌లో– నౌకను చూడాలని కుతూహలంతో ఇలా ఎవరికి వారు తమతమ పనులలో ఉన్నారు.‘డైమండ్ డాన్ రెస్టారెంట్’ తాటికాయలంత మెరిసే అక్షరాలతో రాసిన పేరుని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు మిస్టర్ పోకిరి. అలా అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కారణం అక్కడ మిస్ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటూ కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ‘ఈ బ్రహ్మచారి జీవితం ఈ భామకే అంకితం’ అని పాడుతూ.. ఫుడ్ తీసుకుని వెళ్లి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతడిని కళ్ళెత్తి చూసి ‘ఇక్కడకు కూడా వచ్చేసాడు మిస్టర్ పోకిరి’ అనుకుంటూ తినడం మొదలెట్టింది.‘హలో మిస్! నేను మిస్టర్ బ్రహ్మచారిని మాత్రమే కాని, పోకిరిని మాత్రం కాదు’ అన్నాడు. తినడం మొదలుపెడుతూ.తాను మనసులో అనుకున్న మాటలు ఇతడికెలా తెలిశాయనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది.ఉన్నట్టుండి తమను ఎవరో గమనిస్తున్నట్టు బలంగా అనిపించసాగింది అతడికి.వెంటనే అతడు అలెర్ట్ అయ్యాడు. కనుచివరల నుంచి చుట్టూ గమనించాడు. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు కాని, మిస్ ఇంటర్నేషనల్ వెనుక ఉన్న కుర్చీల్లో ఉన్నవారు యథాలాపంగా తమనే గమనిస్తున్నారు.వారు మొత్తం నలుగురు ఉన్నారు. ఏదో తింటూ, తాగుతూ కనురెప్ప వేయకుండా ఆమెనేచూస్తున్నారు. ఆమె తినడం ముగించి, లేచి బయటకు నడిచింది. మిస్టర్ పోకిరి కూడా లేచి, ఆమె వెనుక వెళ్ళడానికి అన్నట్టుగా ముందుకు కదిలాడు.అంతలో ఆ గమనిస్తున్నవారిలో ఒకడు అతడి వద్దకు అడ్డుగా వచ్చాడు. వాడిని చూసిన మిస్టర్ పోకిరి ‘ఎవరు బాస్ నువ్వు? అడ్డు తప్పుకో’ అన్నాడు మిస్ ఇంటర్నేషనల్ వెళ్లిన వైపుగా చూస్తూ...వాడితో ఉన్న మిగిలిన ముగ్గురూ మిస్టర్ పోకిరిని చుట్టుముట్టారు. అప్పుడు గమనించాడు వారందరినీ... వారి వాలకం... వారి మాటల్లో కరుకుదనం... వారి బలిష్టమైన చేతులు... శరీరాలు కనుచివరల నుంచి గమనించాడు అతడు. అక్కడ ఉన్న నలుగురూ అదే తీరులో ఉన్నారు.వాళ్లెవరో అతడికి అర్థమైపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. చుట్టూ చూశాడు. స్త్రీలు, చిన్నపిల్లలతో సహా నౌకలో చాలామంది అక్కడున్నారు.వారందరినీ వీళ్ళు చుట్టుముడితే? అసలు వీళ్ళు నౌకలోకి ఎలా రాగలిగారు?ఎంతమంది వచ్చారు? ఆలోచిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు మిస్టర్ పోకిరి.ఆలోచిస్తూ డెక్ మీదకు వచ్చాడు.అప్పటికే అక్కడ మిస్ ఇంటర్నేషనల్ డెక్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తోంది.అతడిని చూడగానే ఆమె ‘వచ్చేశాడు మిస్టర్ పోకిరి’ అని మనసులోనే తిట్టుకుంది.కాని, అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడి మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది.అతడి వెనగ్గా వచ్చిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు.అది చూసిన మిస్టర్ పోకిరి ఆమె చేయి పట్టుకుని ముందుకు పరుగు తీశాడు.వాళ్లిద్దరూ డెక్ చివరిభాగానికి చేరుకున్నారు. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేరు.తమను చుట్టుముట్టిన ఆ ఇద్దరినీ మిస్టర్ పోకిరి గాలిలోకి డైవ్ చేస్తూ, ఊహించని వేగంతో ఒక్కసారిగా తన్నాడు. ఆ వేగానికి వాళ్లిద్దరూ అల్లంతదూరంలో పడ్డారు.పైకి లేచి అక్కడినుంచి పారిపోయారు. వారిని చూసి మిగిలిన ఇద్దరు కూడా అక్కడినుంచి జారుకున్నారు. అదే సమయంలో అతడి షూ నుంచి జారిపడిన ఐడీ కార్డును చేతిలోకి తీసుకున్న మిస్ ఇంటర్నేషనల్ ఆ కార్డు చూసి, స్థాణువులా అలా నిలబడిపోయింది.ఆమె ముందుకు వచ్చిన మిస్టర్ పోకిరి ‘హలో మిస్!’ అన్నాడు.ఆ మాటలకు ఉలిక్కిపడి తేరుకున్న ఆమె ‘మీరు మెరైన్ కమాండో విజయ్ రాణా’... అంటూ ఆగిపోయింది.తాను మిస్టర్ పోకిరి అనుకుంటున్నవాడు విజయ్ రాణా నా? అతడి గురించి తాను ఎన్నోసార్లు విని ఉంది. ఎన్నో నౌకలను, ఎందరో ప్రయాణికులను కాపాడటంలో విజయ్ రాణాను మించిన సాహసవంతుడు ఎవరూ లేరని ఎన్నోసార్లు విని ఉంది. అలాంటి వ్యక్తి తన ఎదురుగా తనతో పాటే ఉంటూ తనను కాపాడటం అనేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉంది. ‘హలో మిస్!’... చిటికె వేస్తూ మళ్ళీ పిలిచాడు విజయ్ రాణా. తేరుకున్న ఆమె ‘నా పేరు అర్చన. మనదేశం తరపున నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నాను’ అన్నది.‘మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో అంతా నాకు తెలుసు’ అన్నాడు విజయ్ రాణా.ఆ మాటలకు అర్చన ఆశ్చర్యంగా ఉండిపోయింది.‘అర్చనా! మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ నౌకలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడాలి. నువ్వు వెంటనే నీ కేబిన్‌లోకి వెళ్ళిపో, క్విక్!’ అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు విజయ్ రాణా.అర్చన ‘ఏమైంది?’ అని అడిగింది. వెళ్తూ వెళ్తూ ‘ఈ నౌకలో సముద్రపు దొంగలున్నారు’... చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ రాణా.∙∙ దెబ్బ తిన్న దొంగలు కచ్చితంగా ఊరికే ఉండరు. ప్రయాణికులను భయపెట్టడమో, దోచుకోవడమో చేసే పనిలో తప్పకుండా ఉంటారని అనుకున్నాడు విజయ్ రాణా. ముందు ఈ నౌకలోకి పైరేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటూ నౌక కెప్టెన్ శ్రీకర్ వద్దకు వెళ్ళాడు.‘కెప్టెన్ మన నౌకలో సముద్రపు దొంగలు ప్రవేశించారు. వారెంతమంది ఉన్నారో మొదటగా తెలుసుకోవాలి. తరువాత వారినెలా ఎదుర్కోవాలో చూద్దాం’ అన్న రాణా మాటలకు శ్రీకర్ అదిరిపడ్డాడు.‘అట్టే సమయం లేదు’ అని చెబుతున్న రాణా మాటలకు శ్రీకర్ వెంటనే వెళ్లి, నౌకలో ఉన్న కెమెరాల ఫుటేజీ మొత్తం విజయ్ రాణాకు చూపించసాగాడు.కిందటి రాత్రి నౌక ఒకచోట లంగరు వేసినప్పుడు లంగరు కోసం ఉపయోగించిన మోకులాంటి తాడు ద్వారా వాళ్ళందరూ నౌకలోకి సాధారణ ప్రయాణికుల రూపంలో వచ్చారు. వాళ్ళు సుమారు ఇరవై మంది వరకు ఉన్నారని కనిపెట్టాడు విజయ్ రాణా.అది చూడగానే వెంటనే, నౌకలో సిబ్బందిని ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్ చేసే అలారం మోగించాడు.శ్రీకర్ వెంటనే ‘మీరు విజయ్ రాణా కదా!’ అడిగాడు. చిరునవ్వుతో ఔనన్నట్లుగా తలాడించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.ఇక ఎంతమంది సముద్రపుదొంగలు దాడి చేసినా తమకు ఎలాంటి భయం లేదనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీకర్. అతను లోపలకు రాగానే అక్కడే ఉన్న దొంగల నాయకుడు అతడికి తుపాకీ గురి పెట్టాడు. తరువాత అతడిని బందీగా చేసుకుని, నౌకను దారి మళ్ళించమని ఆదేశించాడు.అలారం మోగగానే నౌకలో పై అంతస్తులలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రమాదాన్ని శంకించారు. అన్ని క్యాబిన్లకు ఉన్న లాక్ సిస్టమ్‌ను ఫ్రీజ్ చేసేశారు. దాని వల్ల లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేరు. బయట వాళ్ళు లోపలికి పోలేరు. కాని, భయంతో కేకలు వేస్తున్న మిగిలిన ప్రయాణికులను సముద్రపు దొంగలు చుట్టుముట్టి, అందరి తలలకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరినీ నౌక డెక్ మీదకు తీసుకు వచ్చారు. వారిలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. డెక్ మీద ప్రయాణికులందరినీ నిలబెట్టారు. వారి చుట్టూ దొంగలు చుట్టుముట్టి ఉన్నారు.కెప్టెన్ శ్రీకర్ కాబిన్... దొంగల నాయకుడు అతడి పక్కనే ఉండి తలకు తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. నౌకను తనకు ఇష్టం వచ్చిన దిశలో మళ్లిస్తున్నాడు.శ్రీకర్ చేసేదేమీ లేక అతడు చెప్పినట్టుగానే నౌకను నడుపుతున్నాడు.ఇంతలో ఒక్కసారిగా దొంగలనాయకుడు దూరంగా ఎగిరి పడ్డాడు. అతడి చేతిలోని తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది.మెరుపువేగంతో కదిలి ఆ తుపాకీని అందుకున్నాడు విజయ్ రాణా. దొంగల నాయకుడిని ఇద్దరూ కలిసి పెడరెక్కలు విరిచి కట్టారు. అతడిని చెరోపక్క పట్టుకున్న విజయ్ రాణా, శ్రీకర్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న దొంగలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.దొంగలనాయకుడి తలకు తుపాకీ గురిపెట్టిన విజయ్ వారిని చూస్తూ, ‘అందరూ మీ తుపాకులను, కత్తులను పక్కన పెట్టండి. లేకుంటే మీ నాయకుడి ప్రాణాలకు ముప్పు వస్తుంది’ అన్నాడు.దొంగలందరూ కలిసి తమ తుపాకులను, కత్తులను ఒక చోట పెట్టారు. ‘అందరినీ వదిలేయండి. లేకపోతే...’ అన్నాడు శ్రీకర్.అందరినీ వదిలి దొంగలందరూ ఒకపక్కగా వచ్చారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. అదే సమయంలో తప్పించుకున్న దొంగల నాయకుడు ముందుకు వేగంగా కదిలి తన తలపాగాలో దాచి ఉన్న పిడిబాకును బయటకు తీసి దగ్గరలో ఉన్న అర్చనను ముందుకు లాగి, ఆమె కంఠానికి గురి పెట్టాడు.అది చూసిన విజయ్ రాణా కదలకుండా అక్కడే ఆగిపోయాడు.‘మర్యాదగా మమ్మల్ని ఇక్కడనుండి వెళ్లనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను’ అన్నాడు దొంగల నాయకుడు.అందరూ అక్కడే ఆగిపోయారు. దొంగలందరినీ వదిలిపెట్టారు. అర్చనను ముందుకు తీసుకెళ్తున్నాడు దొంగలనాయకుడు. విజయ్ రాణా ఊహించని మెరుపువేగంతో కదిలి, దొంగలనాయకుడిని వెనుక నుంచి ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకు దొంగల నాయకుడు ముందుకు తూలి పడిపోయాడు. కాని, రెప్పపాటులో మిగిలిన దొంగలందరూ అర్చనను చుట్టుముట్టారు. ఆమెను మధ్యలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు.పైకి లేచిన దొంగలనాయకుడు విజయ్ రాణాను చూసి, వికటంగా నవ్వుతూ ముందుకు కదిలాడు.వారందరూ కలిసి డెక్ అంచుల వరకు వెళ్లారు. అర్చనను తీసుకుని సముద్రంలో ఉన్న తమ మరపడవలో వెళ్లిపోవాలని దొంగల నాయకుడు మిగిలినవారిని ఆదేశించాడు.అలాగే చూస్తూ ఉండిపోయిన విజయ్ రాణా మెరుపువేగంతో కదిలాడు. అతడు ఏం చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రెప్పపాటు వేగంలో డెక్ దగ్గరకు చేరుకోవడం... ఒక పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున లేచి డెక్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.అల ధాటికి కొట్టుకుపోతున్న అర్చనను ఒక చేత్తో గట్టిగా హత్తుకుని, డెక్ మీద ఉన్న బలమైన ఉక్కు పైపును మరొకచేత్తో గట్టిగా పట్టుకున్నాడు విజయ్ రాణా.ఆ అల ధాటికి సముద్రంలోకి కొంతమంది దొంగలు కొట్టుకుపోగా, మిగిలినవారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. సముద్రపు దొంగల దాడికి గురైన నౌకలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక భద్రతతో ఇండియాకు తిరిగి పంపిస్తున్నారు. ఆ నౌక డెక్ మీద విజయ్ రాణా పక్కన అర్చన కూడా ఉంది.ఆమెను చూస్తూ ‘మిస్ ఇంటర్నేషనల్ పోటీలు మిస్ అయిపోయావు’ అన్నాడు విజయ్ రాణా. ‘ఈ మిస్టర్ పోకిరికి మిసెస్ కావాలని.. కావాలనే ఆ పోటీలు మిస్ చేసుకున్నాను’ అన్నది అతడిని చుట్టేసి, అతని ప్రేమకు, సాహసానికి బందీ అవుతూ... ∙శ్రీసుధామయి -
కథాకళి: వన్ బై టు
గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్‌గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్‌లో ఓ ఫామ్ హౌస్‌కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘అతను మా సార్ డ్రైవర్. వెనక ఔట్ హౌస్‌లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్‌కి చెప్తే మీకు ఫోన్ చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్‌తో ఇద్దరు పేరామెడిక్స్ వారిని అనుసరించారు. సర్వెంట్ మెయిడ్ వాళ్ళని ఫామ్ హౌస్ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్‌ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్ ఎటాక్. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి.’’ స్టెతస్కోప్‌తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది. ‘‘రోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌కి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి పోలా?’’అంబులెన్ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.‘‘నర్స్‌గా కాదు సంతోషం.’’హాస్పిటల్‌కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్‌కి షిఫ్ట్ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్ వచ్చి చెప్పింది.‘‘జూనియర్ డాక్టర్‌గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్ మానిటర్ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్ కాలేజ్‌లో నేను బస్‌డ్రైవర్‌గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్ డాక్టర్ వెంటనే కేంటీన్ కి ఫోన్ చేసి వన్ బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్ మానిటర్ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్ డాక్టర్ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్‌లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్ లైన్ గా మారింది. జూనియర్ డాక్టర్ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్ డాక్టర్ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. ‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.సాంఖ్యాయన -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్‌లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్‌పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్‌లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్‌లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్‌కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్‌లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్ -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్‌పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్‌పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్‌కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్‌పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్‌పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్‌లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్‌కు సహాయం అందించాడు. తరువాత మెషిన్‌గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్‌కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్‌ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్‌పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్‌పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
అప్పుడే తెలిసిపోయింది
తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.⇒ హైదరాబాద్‌లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్‌ఫిల్మ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్‌గా మారుతుంది.⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి. -
పేరెంట్స్ చేతిలో ఫోన్లు.. పిల్లలతో పెరుగుతున్న దూరాలు
సాయంత్రం. వర్క్‌ఫ్రమ్– హోమ్ జూమ్ మీటింగ్ ముగిసింది. అమ్మ సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంది. నాన్న యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ బిజీ. ఆరేళ్ల ఆరాధ్య వాళ్ల ముందు కూర్చుని ఉంది. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తోంది. పేరెంట్స్ తమ బిజీలో తామున్నారు. ఆ బిడ్డ కళ్లలో చిన్న నిరాశ. పేరెంట్స్ అది గమనించలేదు. కానీ ఆరాధ్య మెదడు గమనిస్తోంది. ప్రతిరోజూ, ప్రతి నిమిషం పేరెంట్స్ ‘హాజరు’ కన్నా ‘గైర్హాజరు’ను గుర్తించి రికార్డు చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఈ తరానికి సంబంధించిన నిశ్శబ్ద భావోద్వేగ సంక్షోభం. పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు, కానీ ఎమోషనల్‌గా కాదు. పిల్లలతో తాము సరిపడినంత సమయం గడుపుతున్నామని 70శాతం పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ పేరెంట్స్ ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉంటున్నారని 67శాతం పిల్లలు ఫీలవుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి అధ్యయనం చెబుతోంది. భోజనాల సమయంలో పేరెంట్స్ ఫోన్ చూస్తూ ఉండటం పిల్లలకు మరింత దూరం చేస్తుందని మరో అధ్యయనంలో స్పష్టమైంది. భారతదేశంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పిల్లలు సమస్యలు సృష్టిస్తూ పేరెంట్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే పిల్లలది తప్పు ప్రవర్తన కాదు, పేరెంట్స్ అటెన్షన్ కోసం ఆరాటం మాత్రమే.మెదడు ఎలా స్పందిస్తుంది?⇒ అనుబంధం పెరగడానికి ప్రతిస్పందన, ఇచ్చిపుచ్చుకోవడం, పునరావృతం ముఖ్యం. ఫోన్ వల్ల ఈ మూడూ బ్రేక్ అవుతాయి. ⇒ పిల్లలు తమ భావాలను నియంత్రించడానికి మొదటగా తల్లిదండ్రుల ముఖాన్ని, స్పందనను గమనిస్తారు. పేరెంట్స్ చూసి స్పందించకపోతే, వారి మెదడులో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది.⇒ పిల్లలు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. పేరెంట్స్ ఫోన్లో ఉంటే వారు నేరుగా చూడటం, కమ్యూనికేషన్, సహానుభూతి చూడలేరు. దీంతో వారిలో క్రమంగా సామాజిక ఇబ్బంది పెరుగుతుంది. ⇒ పేరెంట్–పిల్లల మధ్య ఇంటరాక్షన్ తగ్గితే పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు మూడురెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తినడం, ఆడటం, మాట్లాడటం– అన్నీ దెబ్బతింటాయి. ⇒ పేరెంట్స్‌తో పదేపదే డిస్కనెక్షన్ అనుభవించిన పిల్లలు తక్కువగా షేర్ చేస్తారు, తక్కువగా నమ్ముతారు, తక్కువగా అటాచ్ అవుతారు.∙ఏం చెయ్యాలి?నోటిఫికేషన్లు, డెడ్ లైన్లు, వాట్సప్ మెసేజ్‌లు రోజూ ఉండేవే. అవి రోజూ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి పిల్లలతో అనుబంధం విరిగిపోతే, తిరిగి రావడానికి సంవత్సరాలు పడతాయి. అందుకే పిల్లలతో బంధానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ఎంత సమయం గడిపారనేది కాదు, ఎంత ప్రెజెన్స్‌తో ఉన్నారనేది ముఖ్యం. 1. ప్రతి రోజూ కేవలం 20 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండేలా నిబంధన పెట్టుకోవాలి. ఆ 20 నిమిషాలు పిల్లలకు క్లాసులు పీకకుండా, సరిదిద్దకుండా వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల అనుబంధాలకు కారణమయ్యే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. 2. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్, పిల్లలు చదువుకునే చోట ఫోన్ ఉపయోగించకూడదు. పిల్లలు మీరు చెప్పేది తక్కువ వింటారు, మీరు చేసేది ఎక్కువ అనుసరిస్తారు. 3. పిల్లలతో బంధం బలపడాలంటే గంటలు గంటలు గడపాల్సిన అవసరంలేదు. ఒక చిరునవ్వు, ఒక స్పర్శ, ఒక చూపు చాలు. ఇలాంటి సూక్ష్మమైన అంశాలు పిల్లల్లో భావోద్వేగ భద్రత కలిగిస్తాయని స్టాన్ఫోర్డ్ సైకాలజిస్ట్ ఎమా సెపాలా చెప్తున్నారు. 4. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లల గొంతు వినిపిస్తే, వెంటనే వారి వైపు చూడాలి. వారి మాటలను వింటున్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. ఈ ఒక్క చిన్న మార్పు పిల్లల్లో అనుబంధానికి భారీ భరోసానిస్తుంది. 5. ఆదివారం కనీసం ఒక గంట పూర్తిగా పిల్లలతో గడపండి. ఆటలు ఆడండి, పాటలు పాడండి, కథలు వినండి, కుటుంబమంతా కలిసి గడపండి. ఈ గంట పిల్లల మనసులో ‘ఫ్యామిలీ ఫస్ట్’ అనే ఫ్రేమ్ వర్క్‌ను బలపరుస్తుంది. 6. ఫోన్ నోటిఫికేషన్లు, వాట్సప్ గ్రూపులు ఆఫ్ చేయండి. సోషల్ మీడియా లాగిన్‌కు సమయాన్ని నిర్ణయించుకోండి. మీ నియంత్రణే మీ పిల్లలకు నమూనా అవుతుంది. 7. ‘‘నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది?’’ అని అడగండి. వారి సమాధానాన్ని శ్రద్ధగా విని, ఆ మేరకు మీ ఫోన్ అలవాట్లలో మార్పులు చేసుకోండి. 8. ‘‘నాకు నువ్వు, నీ మాటలు ముఖ్యం’’ అని పిల్లలకు రోజుకు ఒక్కసారైనా చెప్పండి. అది పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం, భద్రతాభావాన్ని పెంచుతుంది.- సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఆత్మరక్షణకు ‘ఆస్కార్’ నటన!
‘నేచర్ ఆస్కార్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్స్ సర్వైవల్ డ్రామా ట్రోఫీ ఎవరికి దక్కాలంటే, సందేహమే లేదు, ఒపాసమ్కే వస్తుంది! ఎందుకంటే ఈ చిన్న జంతువు సస్పెన్స్ థ్రిల్లర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా నేలపై పడిపోతుంది, శరీరాన్ని పూర్తిగా శవంలా మార్చేసుకుని, కళ్ళు మూసేసుకుని చచ్చిపోయినట్లు నటిస్తుంది.అంతే కాదు, తనను వేటాడటానికి వచ్చిన జంతువులకు తాను చచ్చినట్లు నమ్మకం కలిగించడానికి కుళ్లిన శవం వాసన కూడా విడుదల చేస్తుంది. దీన్ని ఆ పరిస్థితిలో చూసిన క్రూరమృగాలు ‘ఇది చచ్చిపోయింది, పైగా కుళ్లిపోతోంది కూడా!’ అని అనుకుని వెనక్కి తగ్గిపోతాయి. ఈ సీక్రెట్ సర్వైవల్ ట్రిక్‌నే ‘ప్లేయింగ్ పోసమ్’ అంటారు. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణ పద్ధతితో, శత్రువు వెళ్లిపోయాక మన ఒపాసమ్ నెమ్మదిగా కళ్లు తెరచి, డ్రామా పూర్తయ్యిందని తెలుసుకుని, సైలెంట్‌గా జంగిల్లోకి జారిపోతుంది! -
చలివెచ్చని జాగ్రత్తలు
కాలాలన్నింటిలోనూ శీతకాలం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓవైపు చల్లటిగాలి జివ్వుమనిపిస్తుంటే– స్వెటర్ తొడుక్కుని లేదా శాలువలు కప్పుకుని తిరగడం దగ్గర నుంచి, వెచ్చటి చలిమంటల ముందో, రూమ్ హీటర్ ముందో ఒద్దికగా కూర్చోవడం వరకు, ఇవన్నీ ఆస్వాదించాల్సిన సందర్భాలే! త్వరగా చీకటిపడి, ఆలస్యంగా వెలుతురు రావడం, కాలం వేగంగా పరుగులు తీస్తున్న భావన కలగడం– ఈ సీజన్లో మరో ప్రత్యేకత! నిజానికి చాలామంది కాలాలన్నింటిలోనూ పసందైన కాలం చలికాలమే అంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, తక్కువైనా వాటిని భరించలేం కాని, చలికాలంలో స్వెటర్లు, గ్లౌజులు వేసుకుని చలి గజగజలను ఆస్వాదిస్తూ గమ్మత్తుగా గడిపేయవచ్చు మరి! అయితే శీతకాలంలో చలి మాత్రమే కాదు, వ్యాధులు కూడా వణికించేస్తుంటాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు.చలికాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఎంతవరకు అంటువ్యాధులుగా మారతాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వాటి సంగతి ఒకసారి పరిశీలిద్దాం... చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం, అలాగే మనుషులంతా ఇండోర్స్‌లో గుమిగూడటం వలన జలుబు చేసే క్రిములు, ఫ్లూ వైరస్లు, ఇతర శ్వాసకోశ వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందు, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇవి ఇతరులకు సోకే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ – క్లీవ్‌లాండ్ క్లినిక్ వెల్లడించింది. సాధారణంగా వ్యాధి సోకిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఇతరులకు అంటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ క్లినిక్ తేల్చింది. ఈ చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయో ఇప్పుడు చూద్దాం!సాధారణ జలుబుఇది అంటువ్యాధి. లక్షణాలు కనిపించకముందే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు (సుమారు మూడవ రోజు వరకు) ఇతరులకు సులభంగా సోకుతుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాల వరకు వైరస్ ఇతరులకు అంటించే అవకాశవఫ్లూఇది కూడా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! లక్షణాలు కనిపించకముందే ఇతరులకు అంటుతుంది. లక్షణాలు కనిపించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు సోకే అవకాశముంటుంది.కోవిడ్ 19ఇది చాలా సులభంగా, అలాగే వేగంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు, అలాగే లక్షణాలు మొదలైన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది. తేలికపాటి లక్షణాలున్నవారు ఐదు రోజుల వరకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు 20 రోజుల వరకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశముంది.రెస్పిరేటరీ సిన్సిషీయల్ వైరస్ఇది సాధారణంగా ఆరోగ్యవంతులలో జలుబులా ఉన్నప్పటికీ, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారికి ఇది ప్రమాదకరమైన వ్యాధి. లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఇది అంటువ్యాధి. అయితే, శిశువులు, రోగనిరోధక శక్తి లేనివారు నాలుగు వారాల వరకు కూడా ఈ వైరస్‌ని వ్యాప్తి చెయ్యగలరు.చెస్ట్ కోల్డ్ (బ్రోంకైటిస్)బ్రోంకైటిస్ అంటువ్యాధి కాదు. ఇది వస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు, శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం, ఛాతీ బిగువుగా, నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే బ్రోంకైటిస్కు కారణమయ్యే జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరస్లు మాత్రం అంటువ్యాధులే. వేరొకరి నుంచే వైరస్ వ్యాప్తి చెంది చెస్ట్ కోల్డ్లా మారుతుంది.న్యుమోనియావైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇవి రెండూ అంటువ్యాధులే. వైరల్ న్యుమోనియా జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియల్ న్యుమోనియా అయితే, యాంటీబయోటిక్స్ తీసుకున్నా, 48 గంటలు తర్వాతే అంటువ్యాధి తీవ్రత తగ్గుతుంది.పింక్ ఐవైరస్ లేదా బ్యాక్టీరియాతో వచ్చే పింక్ ఐ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. వైరల్ పింక్ ఐ లక్షణాలు ఉన్నంత కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ పింక్ ఐ యాంటీబయోటిక్స్ తీసుకున్న 24 గంటల వరకు లేదా లక్షణాలు పూర్తిగా తగ్గేంత వరకు అంటువ్యాధిగానే పరిగణిస్తారు.సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదు. కానీ, సైనస్‌కు కారణమయ్యే జలుబు మాత్రం ఇతరులకు సోకుతుంది. ఇతరుల వల్లే మనకొస్తుంది.స్ట్రెప్ థ్రోట్గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. ఇది తీవ్రంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి! జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 12 గంటల పాటు యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాతే జనాల్లో తిరగడం ఉత్తమం. అంతవరకు ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.ఆయుర్వేద చిట్కాలు ఆహార నియమాలుఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.అల్లం: ఆయుర్వేదంలో దీనిని ‘సార్వజనీన ఔషధం’ అని పిలుస్తారు. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోను, సూపుల్లోను అల్లం వాడటం మంచిది. అలాగే, అల్పాహారంలో శొంఠి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిదిపసుపు: ముఖ్యంగా శీతకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతకాలంలో కూరల్లోను, పాలల్లోను పసుపు తరచుగా తీసుకోవచ్చు.జాజికాయ : ఇది శరీరానికి వెచ్చదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యం. నిద్ర మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు ఇది బాగా సహాయపడుతుంది. వేడి పాలలోను, మిఠాయిల్లోను, కూరల్లోని మసాలా మిశ్రమాల్లోను జాజికాయ పొడిని వాడుకోవచ్చు. ఉసిరి: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి ఉసిరి రక్షణనిస్తుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజుకి ఒకటైనా పచ్చి ఉసిరిని నేరుగా తినొచ్చు. తేనె లేదా పంచదారతో కలిపి కూడా తినవచ్చు. ఉసిరిని ఊరగాయలా కూడా తీసుకోవచ్చు.నువ్వులు: నువ్వులలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకు రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. రకరకాల వంటకాలపై నువ్వులపొడిని కలుపుకుని తినడం కూడా మంచిదే!బెల్లం: బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే ఉత్తమం.సజ్జలు– రాగులు : ఈ చిరుధాన్యాలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి. వీటితో రొట్టెలు, ఉప్మా, దోసె, అంబలి, లడ్డూలు వంటివి చేసుకోవచ్చు.నెయ్యి: చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్–ఎ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. కిచిడీ, పప్పు, పరాఠాలు, హల్వా లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.మెంతులు–మెంతికూర: ఇవి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తినడం మంచిది. మెంతి ఆకులను పరాఠాలు లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు.గోందు: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే చక్కటి ఆహారం ఇది. తుమ్మచెట్ల నుంచి సేకరించే జిగురును గోందు కటిర అంటారు. ఇది బరువు నియంత్రణకు, కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి, కాల్షియం పెరగడానికి సహాయపడుతుంది. దీంతో లడ్డూలు కూడా చేసుకుంటారు.బాదం – వాల్నట్లు: చలికాలంలో బాదం, వాల్నట్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్లలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలలో కలిపి తినడం మంచిది.చిలగడ దుంపలు – క్యారట్లు: చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారట్లలో విటమిన్ ఎ, చిలగడ దుంపలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూప్‌లలో కూడా వాడుకోవచ్చు. క్యారట్‌ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వా రూపంలోను తీసుకుంటారు.ఆకు కూరలు: పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. వీటిని పప్పు, పరాఠాలు, సూప్‌ల రూపంలో తీసుకోవడం మంచిది.జామకాయ: జామకాయల్లో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండురూపంలో తినొచ్చు.స్టమక్ బగ్ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు సోకే అవకాశముంటుంది. పైగా ఈ వైరస్లు ఉపరితలాలపై వారాల తరబడి జీవించగలవు.ఇలాంటి అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంటువ్యాధులతో పాటు చెవినొప్పి, చలి–జ్వరం, దవడ వాపు వంటివన్నీ చలికాలంలో వచ్చే సాధారణ వ్యాధులే.టాన్సిలైటిస్చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టాన్సిలైటిస్. ఇది అంటువ్యాధి కాదు! గొంతు లోపలి భాగంలో గుండ్రటి కణజాలాలుంటాయి. వాటినే టాన్సిల్స్ అంటారు. బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు వీటికి వాపు రావడాన్నే టాన్సిలైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, ఆహారం, నీళ్లు, లాలాజలం కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది.ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి శీతకాలపు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నొప్పులకు కచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం ఇంకా చెప్పలేకపోతోంది. నొప్పి, వాపు, కండరాలు బిగించినట్లుగా అనిపించడం ఇవన్నీ లక్షణాలే! ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య కాళ్ళ కీళ్లపై భారం పడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. బాడీ మొత్తం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన చలికి గురికావడం కూడా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఆహారం, నీళ్లు, ఇతర వస్తువులను తోటివారితో పంచుకోకపోవడం ఉత్తమం.శీతకాలంలో డీహైడ్రేషన్!సాధారణంగా డీహైడ్రేషన్ అనే మాట మనం వేసవిలో ఎక్కువగా వింటాం. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా, డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చర్మానికి సహజ కాంతిని ఇవ్వడానికి వీటిని తీసుకోవడం ఉత్తమం. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. వీటితో పాటు వెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీలను తరచుగా తీసుకోవడంతో శరీరంలో తేమ శాతం నిలకడగా ఉంటుంది.చలికాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు⇒ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు కాకుండా మోచేతి లోపలి భాగానికి అడ్డు పెట్టుకోవాలి.⇒ తలుపు నాబ్స్, కౌంటర్‌టాప్‌ల వంటి తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయాలి.⇒ వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండాలి.⇒ లక్షణాలు తగ్గేంత వరకు ఇంటికే పరిమితం కావాలి.⇒ తరచుగా సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ⇒ వైరస్లు– టేబుల్స్, డోర్నాబ్లు, కౌంటర్‌టాప్‌లు, ఆఫీస్ సామాగ్రి వంటి ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా రోజులు కూడా జీవించగలవు. ఈ సాధారణంగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి, సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించాలి⇒ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తగినంత నిద్ర అవసరం. పెద్దలు రాత్రికి 7–9 గంటలు, పిల్లలు వారి వయస్సును బట్టి ఎక్కువ నిద్ర పోవాలి. నిద్ర లేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.⇒ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడంతో రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చు. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రోగనిరోధక వ్యవస్థ పుంజుకుంటుంది. జలుబు దగ్గు వంటి లక్షణాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వారంలో ఎక్కువ రోజులు కనీసం30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ⇒ చేతులతో తరచుగా ముఖం, నోరు తాకకుండా ఉండాలి. గొంతును తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ⇒ వైరస్ లేదా బ్యాక్టీరియా బారిన పడితే రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ⇒ ఈ సీజన్లో ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇంటి వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఎయిర్ హ్యూమిడిఫైయర్ గాడ్జెట్ (చర్మం, గొంతు, ముక్కు, పెదవులు పొడిబారకుండా నివారించే పరికరం) ఉపయోగించాలి.ఇక ఈ కాలంలో చర్మం పొడిబారిపోకుండా కళావిహీనంగా మారిపోకుండా ఆలివ్ నూనె, వెన్న, కొబ్బరి నూనె వంటి వాటితో శరీరానికి మర్దన చేసుకున్నాక స్నానం చేయడంతో మంచి ఫలితముంటుంది. ఎక్కువగా క్రీమ్స్, లోషన్స్ వంటి కాస్మెటిక్స్ వాడటం కంటే వంటింటి చిట్కాలను పాటించడమే మేలు. ఆరోగ్యం, ఆహారం, అందం ఈ మూడింటా తగు జాగ్రత్తలు తీసుకుంటే వింటర్‌కి మించి సీజనే ఉండదు. - సంహిత నిమ్మన -
కళాకాంతుల కనుల వేడుక
కనువిందైన కళ– ఆ కళకు తగ్గ కాంతి మిళితమై, చలికాలపు రాత్రుల్లో కళ్లు చెదిరే మాయాజాలాన్ని చూడాలంటే నెదర్లండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కి పోవాల్సిందే! ‘ఆమ్స్టర్డామ్ ఫెస్టివల్’– ఇది ప్రతి సంవత్సరం శీతాకాలంలో నిర్వహించే ఒక అంతర్జాతీయ కాంతి కళా ప్రదర్శన. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం కాంతితో చీకటిని తరిమి, ఆనందాన్ని నింపడమే! ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు డిజైన్ చేసిన ప్రత్యేకమైన లైట్ ఆర్ట్‌వర్క్‌లను ఇక్కడ ప్రదర్శిస్తారు.ఈ ఉత్సవం సాధారణంగా నవంబర్ నెల చివర నుంచి జనవరి నెల మధ్య వరకు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ వెలుగులు ఈ ఏడాది నవంబర్ 27న ప్రారంభమై జనవరి 18న ముగుస్తాయి. ఆమ్స్టర్డామ్ కాలువలు, నదీతీరాలు, పట్టణ ప్రాంతాలు కాంతి కళాకృతులతో మెరుస్తున్నాయి. ఈ కళాఖండాలు కేవలం అలంకరణలు మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం ఎంచుకున్న థీమ్‌కు సంబంధించిన కథలను, ఆలోచనలను తెలియజేస్తాయి. నిజానికి ఈ 2025–26 థీమ్ ‘లెగసీ’– అంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏమి వదిలి వెళ్తున్నాం? అనే ప్రశ్న చుట్టూనే కాంతులు ప్రతిబింబిస్తాయి. మొత్తానికి ఈ ఫెస్టివల్‌ను మూడు పద్ధతుల్లో తిలకించొచ్చు. మొదటిది పడవ ప్రయాణం, రెండవది నడకమార్గం, మూడవది సైకిల్ యాత్ర.పడవ ప్రయాణం ఈ లైట్ ఆర్ట్‌వర్క్‌లను వీక్షించడానికి సౌకర్యవంతమైన మార్గం పడవ ప్రయాణం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘వాటర్ కలర్స్’ మార్గంలో పయనించేటప్పుడు, కాంతి ప్రతిబింబాలు నీటిపై పడి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అనేక క్రూజ్ కంపెనీలు కళాఖండాల గురించి వివరించే ఆడియో గైడ్లను అందిస్తాయి.నడకమార్గం ఫెస్టివల్లో ఆర్ట్‌వర్క్‌లను దగ్గరగా, నిదానంగా చూడాలనుకునే వారికి నడక మార్గమే మంచిది. దీనిని ‘ఇల్యూమినాడే’ అని కూడా పిలుస్తారు. ఈ మార్గం నగరం నడిబొడ్డు గుండా వెళుతుంది. అద్భుతంగా ఉంటుంది.సైకిల్ యాత్ర సైకిల్‌పై నగరంలో లైట్ ఆర్ట్‌వర్క్‌లను చూస్తూ వెళ్ళడం మరొక ఆసక్తికరమైన అనుభవం. ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ కళాకాంతులను చూసి కళ్లు జిగేల్ మనక మానవు! -
అదే.. నా స్టయిల్ హంట్ స్పాట్!
పేరు రితు వర్మ, కానీ ఫీల్? క్లాసీ చార్మ్, ఎలిగెంట్ వైబ్! స్క్రీన్స్ పై ఆమె ఫ్రేమ్ రాగానే కథే కాదు, మొత్తం మూడ్ మారిపోతుంది. మెరిసే ఆ స్పార్క్, గ్రేస్‌తో సైలెంట్‌గా స్టన్నింగ్‌గా అనిపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం!డ్రెస్ బ్రాండ్: గీతిక కానుమిల్లి ధర రూ. 46,800జ్యూలరీ బ్రాండ్: కర్ణిక జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.నేను చాలాప్రైవేట్ పర్సన్స్ . అందుకే నా ఫ్యాషన్స్ కూడా పూర్తిగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ మోడ్‌లోనే ఉంటుంది. దుస్తుల బ్రాండ్ అయినా, స్ట్రీట్ షాప్ అయినా, నచ్చితే చాలు వెంటనే కార్ట్‌లో ఉంటాయి. అయితే, నా స్టయిల్ హంట్ స్పాట్ ఎక్కువగా ఆన్లైన్ స్క్రోలింగ్లోనే! – రీతు వర్మ -
ఈ వారం కథ: కుందేలు కూర
ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. కౌంటర్ కేసులు పెట్టి అందర్నీ జైలుకు పంపారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఊళ్ళో పోలీసు పికెట్ నడుస్తుంది. గ్రామ పంచాయితీ ఆఫీసులో షెల్టర్ తీసుకున్నారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఇంచార్జ్ జందార్ ఉన్నారు. ఒక పోలీసు నిరంతరం తుపాకీ పట్టుకొని పహారాలో ఉంటాడు. మిగతా వారు తమ తుపాకులను పంచాయితీ ఆఫీసు లోపలి గదిలో పెట్టి బయట యాప చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఆఫీస్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో భోజనాలు వండుతున్నారు. వంట వచ్చిన పోలీసు ఆ పనిలో ఉన్నాడు. గ్రామ మస్కురి చికెన్ కడుగుతున్నాడు. పోలీసుకు భోజనానికి కొదువ ఉండదు. కాకపోతే సమయానికి దొరకదు. ఇంతలో ఒక గ్రామస్తుడు వచ్చి జందార్ను పరిచయం చేసుకున్నాడు. ‘‘సర్... ఈరోజు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి సార్’’ అన్నాడు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఉత్సాహం ప్రదర్శించి ‘‘దాందేముంది.. వస్తాం సార్’’ అన్నాడు. జందార్ కానిస్టేబుల్ వైపు గుర్రుగా చూసి ‘‘ఇంకోసారి వస్తాంలే బ్రదర్ ఈరోజుకు వంట అయిపోయింది’’ అని అతనితో అన్నాడు. దాంతో అతను వెళ్ళిపోయాడు. ‘‘ప్రజల్లో పోలీసుకు సహజ అనుకూలురు సహజ వ్యతిరేకులు ఉంటారు. అందుకు ఎవరి కారణాలు వారికుంటాయి. పోలీసుకు భోజనం ఎంత దూరమో అంత ప్రమాదం కూడా’’ అని కొత్త కానిస్టేబుల్‌తో అన్నాడు. కొత్త కానిస్టేబుల్ అయోమయంగా చూసి ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘నీకు అనుభవం లేదు కాబట్టి, ఒక జరిగిన సంఘటన చెబుతా విను’’ అన్నాడు. 1 తుపాకుల నర్సయ్య తన చుట్టూ గుమికూడిన పోరగాండ్లని దూరంగా పొమ్మని గద్దించి, తన భుజానికి గట్టిగా బిగబట్టి ఢామ్మని తుపాకీ పేల్చాడు. తుపాకీ చప్పుడు విన్న వారి గుండెలు కొట్టుకున్నాయి. పిట్టలు దిగ్భ్రాంతి చెంది తుపాకీలోని ఛర్రాల లాగా చెల్లాచెదురయ్యాయి. రాయి చెట్టు మీద ఉన్న పచ్చ గువ్వలు, తపసు పక్షులు, గుడ్లగూబలు చెల్లా చెదురుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. బర్మార్ తుపాకీలో నుండి దూసుకొచ్చిన చర్రాలు పచ్చ గువ్వల వంట్లోకి దూసుకుపోయాయి. ఒక రెండు గువ్వలు చెట్టు మీది నుండి కింద పడ్డాయి. ఇంకో రెండు ఓ వంద గజాలు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి పొలంలో రాలిపోయాయి. తుపాకీని భుజానికి తగిలించుకొని, చెట్టు కింద పడ్డ గువ్వలను చేతిలోకి తీసుకున్నాడు నర్సయ్య. రక్తం ఓడుతున్న రెండిట్లో ఒకటి ఇంకా కదులుతూనే ఉంది. వాటిని తన భుజానికి ఉన్న గుడ్డ సంచిలో వేశాడు. నర్సయ్య వెంట వచ్చిన వెంకన్న పొలంలో పడ్డ రెండు పచ్చ గువ్వలను తెచ్చాడు. వాటిని కూడా సంచిలో వేసుకున్నాడు నర్సయ్య. నర్సయ్య ఆరడుగుల ఎత్తు ఉంటాడు. మోకాళ్ళ వరకు ఖాకీ రంగు నిక్కరు, నిండు చేతుల చొక్కా, కాస్త పెద్దగా ఉండే మీసాలు, కుడి భుజం మీద నుండి ఎడమ వైపుకు వేలాడే మందుగుండు సామగ్రి ఉండే సంచి, పిక్కల కంటే కొంచెం కిందుగా ఉండే నల్లని బూట్లు. చూడ్డానికి బలిష్టమైన జవాను లాగా ఉంటాడు. కాకపోతే ఒక్క ఎర్ర టోపీ మాత్రం ఉండదు. కానీ, ఎర్ర తువాలు నెత్తికి చుట్టుకునేవాడు. నర్సయ్య పోలీసు కంటే కూడా సీరియస్‌గా ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. వారానికోసారి వేటకు బయలుదేరేవాడు. వెంట ముగ్గుర్నో నలుగుర్నో సహాయంగా తెచ్చుకునేవాడు. సహాయకులు మాట్లాడుకునేవారు తప్ప నర్సయ్య మాత్రం మాట్లాడేవాడు కాదు. నర్సయ్య సైన్యాధ్యక్షుడిలా ముందు నడుస్తుంటే సైన్యం వెనకాల పరిగెత్తేది. ఊరి చుట్టుపక్కల చెట్ల మీది పచ్చ గువ్వలు, చమర కాకులు, కముజు పిట్టలను కొట్టేవాడు. నర్సయ్య మోకాళ్ళమీద కూసోని బర్మార్ తుపాకిని మోకాళ్ళ మధ్యన పెట్టుకొని, సంచిలో డబ్బాలో ఉన్న పచ్చటి పొడిని చెంచాలాగా చేసిన తాటాకు ముక్కతో తీసి తుపాకీ గొట్టంలో పోసేవాడు. దానిమీద సైకిల్ చర్రాల వంటి ఇనుప గుండ్లు పోసేవాడు. దానిమీద పిడకల పొడిని వేసేవాడు. తుపాకీకి తగిలించి ఉన్న పొడుగాటి ఇనుప సువ్వ తీసుకొని ఆ గొట్టంలో పెట్టి కూర్చేవాడు. ట్రిగ్గర్ తగిలే దగ్గర గొట్టంలో పచ్చటి పొడిని పోసి నెమ్మదిగా ట్రిగ్గర్ బిగించేవాడు. ఆ ట్రిగ్గర్ను పైకి లాగి వదిలితే తుపాకీ పేలుతుంది. పిట్టల కూర మీద మొహం మొత్తినప్పుడు కుందేళ్ళ వేటకు వెళ్ళేవాడు. అప్పుడు తుపాకీని కుడి చేత్తో పట్టుకుని రంగనాయకుల గుట్ట వైపు వేటకు పోయేవాడు. ఆయన వెంట ఆ ముగ్గురో నలుగురో సైనికుల్లా అనుసరించేవారు. అప్పుడు వాళ్ళలో ఒకరి చేతిలో పెద్ద బ్యాటరీ లైటు ఉండేది. ఆ లైటు ఫోకస్ కుందేళ్ళ మొకం మీద పడితే అవి కదలలేవట మరి. ఊర్లో ఇంకో ముగ్గురికి తుపాకులు ఉన్నాయి. కానీ, ఆ రాజసం మాత్రం ఎవరికీ లేదు. ఒకాయన పంచ కట్టుకొని, ఇంకొకాయన పాయింటు వేసుకొని, ఇంకొకాయన నిక్కరు వేసుకొని వేట చేసేవారు. కానీ, వారి తుపాకులకు ఎలాంటి రాజసమూ లేదు. వారి మీదున్న తుపాకులను చూస్తే పచ్చ గువ్వలు కాదు కదా ఊర పిచుకలు కూడా బెదరవు. వారు పట్టుకున్నందువల్ల మాత్రమే ఆ తుపాకులకు కళ పోయింది. తుపాకులు ఎప్పుడూ పిరికివి కావు. వాళ్ళు తుపాకులు పేల్చినా జనాలు పట్టించుకునేవారు కాదు. అదే నర్సయ్య పేల్చకపోయినా యుద్ధ సన్నద్ధం గోచరించేది. సరిహద్దు సైనికులకుండే నిబద్ధత ఏదో నర్సయ్యలో ఉంది. కేవలం వేట కోసమే తాను పుట్టినట్టు కనపడేవాడు. తనను ఎప్పుడు పేల్చుతాడా అని నర్సయ్య తుపాకీ ఎదురు చూసేది. రాత్రంతా వేటాడి కుందేళ్లు, రకరకాల పిట్టలను సంచిలో మోసుకుంటూ తెచ్చేవారు. రాత్రంతా నిద్ర లేక వారి మొహం అలసిపోయి ఉండేది. నర్సయ్య మొహంలో సంతృప్తో, అసంతృప్తో తెలియని గంభీరత ఉండేది. 2నర్సయ్యకు ఇద్దరు భార్యలు. ఇంటి ముందు గదిలో చిన్నపాటి కిరాణా కొట్టు నడిపేవాడు. ఆ కొట్లో కొన్నిసార్లు చిన్న భార్య, కొన్నిసార్లు పెద్దామె కూర్చునేవారు. చాలా అరుదుగా నర్సయ్య కూడా కొట్లో కూర్చునేవాడు. కొట్లో, ఇంట్లోనూ కూడా పోలీసు నిక్కరు మీదనే ఉండేవాడు. కొట్లో కొనుక్కోడానికి వచ్చే వాళ్లతో కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న తుపాకీ మాదిరిగా గుంభనంగా ఉండేవాడు. పెద్ద మనుషులు ఎవరన్నా పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడేవాడు. నర్సయ్య బయటి ఆడోళ్లవైపు చూసేవాడు కాదు. మొదటి పెండ్లికి ముందు చలాకీగా, రెండో పెండ్లికి ముందు కాస్త తక్కువ చలాకీగా ఉండేవాడని ఆయన వెంట ఉండే సైనికులు చెప్పేవారు. మరి ఇద్దరు భార్యలను ఎందువల్ల చేసుకోవలసి వచ్చిందో సరైన కారణం తెలియదు. మొదటి పెండ్లి తరువాత తగ్గిన చలాకీతనాన్ని ఆయన అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా వేటకు వెళ్లొచ్చిన రోజు తప్పకుండా గొడవ అయ్యేది. మొదటి గొడవ కూర వండను అన్నప్పుడు, రెండోది కూర బాలేకుంటే. అయితే ఆ గొడవ ఒక్కోసారి హఠాత్తుగా ముగిసిపోయేది. నర్సయ్య కాస్త ఎక్కువ తాగిన రోజున తుపాకీ లోడు చేసి భార్యల వైపు గురిపెట్టే వాడని, దాంతో గొడవ హఠాత్తుగా ముగిసిపోయేదని చెప్పుకునేవారు. 3నర్సయ్య ఇంటి పక్కనే బడి ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఆ రోజు మధ్యాహ్నానికే అధికారులు వచ్చి బళ్ళో విడిది చేశారు. ఆ ఊరుకు గతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి నలుగురు పోలీసులను బందోబస్తుకు పంపారు. నలుగురి వద్ద నాలుగు 303 తుపాకులు ఉన్నాయి. వారి బసకు బళ్లో ఒక గదిని కేటాయించారు. తెల్లారితే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అధికారి ఆ ఊరి మస్కురి సహాయంతో భోజన ఏర్పాట్లలో ఉన్నాడు. ఎన్నికల హడావిడి అంతా మాదే అన్నట్టు ఫీల్ అవుతారు ఎన్నికల అధికారులు. కానీ, అది నిజం కాదు. అసలైన హడావిడి అంతా పోలీసుల చుట్టే ఉంటుంది. పోలీసులకు చాలా ముందుచూపు ఉంటుంది. ఆ రాత్రికి పుష్టికరమైన భోజనం ఏర్పాటు చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు లోకల్ పోలీసులు కాదు కాబట్టి ఆ ఊళ్ళో ఎవరూ పరిచయం లేదు. ఒక పోలీసు డ్రెస్ మార్చుకొని నింపాదిగా పక్కనే ఉన్న నర్సయ్య కిరాణం కొట్టుకు వెళ్ళాడు. సిగరెట్ కొనుక్కున్నాడు. నర్సయ్య చిన భార్య ఇచ్చిన అగ్గిపెట్టెతో సిగరెట్ ముట్టించాడు. కొట్టు ముందు అరుగు మీద కూసున్న కుర్రోళ్ల పక్కన కూసోని సిగరెట్ తాగాడు. రెండు సిగరెట్లు అయిపోయే లోపల నర్సయ్య చరిత్ర మొత్తం సేకరించాడు. నర్సయ్య పోలీసుల కంటే మేలైన విలుకాడు అని కూడా గుర్తించాడు. 4ఇంచార్జ్ పోలీసుకు ఉండాల్సింది సమాచారాన్ని వాస్తవ రూపం దాల్చేలా చేయడమే. మస్కురిని పంపి తుపాకుల నర్సయ్యని పిలిపించాడు. ‘‘నీ తుపాకీని స్టేషన్లో డిపాజిట్ చేయాలి కదా! ఎందుకు చేయలేదు?’’ అని గంభీరంగా అడిగాడు నర్సయ్యని. ‘‘నాకు తెలియదు సార్.. నాకు ఎవరూ చెప్పలేదు’’ అన్నాడు నర్సయ్య వినయంగా. ‘‘ఒక గంట లోపల అన్ని తుపాకులూ ఇక్కడికి తెప్పించాలి’’ అని మస్కురికి చెప్పాడు ఇంచార్జ్ పోలీసు. పోలీసు ఆదేశాలపట్ల గౌరవంతో తన తుపాకీ తేవడానికి నర్సయ్య వెళ్ళిపోయాడు. ‘‘మాజీ సర్పంచ్ వెళ్లి ఎస్సైతో మాట్లాడాడంట సార్. అందుకే వీళ్ళు తుపాకులు ఇవ్వలేదు’’ అన్నాడు మస్కురి.‘‘నాగ్గూడా తెలుసులేరా.. మరి పోలీసన్నాకా కొంచెం అన్నా అధారిటీ చూయించకపోతే జనాలకు భయం ఉండదు. రేపు ఓట్లు అయిపోయే వరకూ నేనే కదా ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సింది? అందుకే అందర్నీ పిలువు. నా తడాఖా ఏందో నువ్వు చూద్దువుగానీ’’ అని మీసం మెలేశాడు. దర్పం ప్రదర్శించడంలోనే పోలీసు విలువ ఉందన్న సత్యం మస్కురికి తెలుసు. ఇంతలో ఇంకో పోలీసు వచ్చాడు. ఆయన లోకల్ పోలీసు. నాన్ లోకల్ పోలీసులకు గైడుగా వచ్చాడు. తుపాకులోళ్ళని పిలిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. ‘‘వాళ్ళని పిలిపిస్తే గొడవ అయిద్ది సార్. ఈ వూరు అసలే మంచిది కాదు. తుపాకులోళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి సార్’’ అన్నాడు లోకల్ పోలీసు. ఇంచార్జ్ ఏమీ అనలేదు. ‘‘నర్సయ్య దగ్గర ఏమన్నా కుందేళ్లు ఉన్నాయా?’’ అని మస్కురిని అడిగాడు లోకల్ పోలీసు. ‘‘రాత్రి యాటకు బొయ్యి పొద్దున్నే వచ్చిండు. ఉండొచ్చు సార్’’ అన్నాడు. ఇంతలో నర్సయ్య తుపాకీ తీసుకొని వచ్చాడు.‘‘ఏంది నర్సయ్యా.. ఎలక్షన్ల టైములోతుపాకీ తీసుకొని తిరుగుతున్నావు?’’ అని అడిగాడు లోకల్ పోలీస్. ‘‘బావుండ్రా సార్... మీరెప్పుడొచ్చారు?’’ అని నవ్వుతూ ‘‘మీవోళ్ళే తెమ్మన్నారు సార్’’ అన్నాడు. ‘‘ఏ..హే.. వాళ్లకు నీ గురించి తెల్వదులే.. ఏమి సంగతులు? రాత్తెర యాట బాగ జరిగిందంట గదా?’’ అన్నాడు. ‘ఏం లేదు సార్.. రెండు కుందేళ్లు, ఓ పది గల కముజు పిట్టలు పడ్డయి సార్! అన్నీ అమ్మిన. ఒక్క కుందేలు మాత్రం ఉంది సార్’’ అన్నాడు. ‘‘మరి ఇయ్యాల మాకు కుందేలు కూర తినిపియ్యరాదు. జందార్ సాబ్‌కు ఇష్టమట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘సరే సార్.. దాందేముంది’’ అనుకుంటూ తుపాకీ తీసుకొని వెళ్ళిపోయాడు నర్సయ్య. 5గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఊళ్ళో పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్ పనిలో బిజీగా ఉన్నారు. అసలైన ప్రజాస్వామ్యానికి పునాది పడేది ఆరాత్రే. రాత్రి ఎనిమిదింటి సమయంలో బళ్ళో ఉన్న పోలీసులు రెండు పెగ్గులేసి, కుందేలు కూర సగం తిన్నారో లేదో.. నర్సయ్య ఇంట్లో హఠాత్తుగా గొడవ మొదలయింది. ఎన్నడూ లేనంత తారస్థాయిలో మాటలు పేలుతున్నాయి. నర్సయ్య ఇంట్లో గొడవతో జనాలు ఒక్కొక్కరుగా ఇండ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు. బడికి ప్రహరీ గోడ లేదు. పోలీసులు గ్లాసులు పక్కకునెట్టి బయటకు వచ్చి నిలబడ్డారు. తుపాకీ తీసుకొని వెంటబడడంతో నర్సయ్య ఇద్దరు భార్యలూ ‘‘వామ్మోవ్.. ముండాకొడుకు కాల్చి సంపెట్టుండే’’ అని మొత్తుకుంటూ ఉరికొచ్చి పోలీసుల వెనకాల నిలబడ్డారు. పోలీసులు గద్దాయించినా కూడా నర్సయ్య గన్ను దింపకపోగా.. ‘‘దొంగ ముండల్లారా.. ఇయ్యాల మీరో నేనో తేలిపోవాలి’’ అని నేరుగా జందార్ సాబుకే తుపాకీ గురిపెట్టాడు. జందార్ సాబ్‌కు ఉచ్చ బడ్డది. ‘‘ఒరేయ్... వాని తుపాకీ గుంజుకోరా’’ అని మస్కురికి పురమాయించాడు. ఇంతలో జనం జమయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో ఉన్న కార్యకర్తలూ నాయకులూ ఆ గలాటా దగ్గరికి వచ్చారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సుల గదికి తాళం వేసి ఆన్నే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆందోళనల్లోనుండే ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంటదనే సోయి ఎన్నికల అధికారికి ఉంది. మిగతా సిబ్బంది కర్రలు పట్టుకుని ఆయన చుట్టూ నిలబడ్డారు. పోల్ మేనేజ్మెంట్లోని ఒక వర్గం కార్యకర్తలు నర్సయ్య భార్యల వెనకవైపు వచ్చి ‘‘ఏమైందీ?’’ అని ఆరా తీస్తున్నారు. ఇంకో వర్గం నర్సయ్య వెనకాలకు చేరి ‘‘ఏమైందీ?’’ అని అడిగారు. ‘‘ఈ పోలీసు సారు కుందేలు కూర అడిగితే వండమన్నా.. అదేమో వండనన్నది. ఇదేమో వండింది గని.. వండినంక.. ‘వాడెవనికి బుట్టిండు, వీడెవనికి బుట్టిండు! అన్నది. ఆఖరికి నువ్వెవనికి బుట్టినవు అని కూడా అన్నది. ఎప్పన్నుంచో ఓపికబడుతున్న. ఇయ్యాల ఈ ముండల సంగతి తేలాలి’’ అని భుజానికి తుపాకీని అదిమి పెట్టి పట్టుకున్నాడు. రోజుటికంటే ఇయ్యాల ఒక పెగ్గు ఎక్కువే తాగినట్టుండు నర్సయ్య. పైగా ఇద్దరు పెండ్లాలు ఏకమైనా కూడా కుందేలు కూర తిన్న పోలీసులు తనకే సపోర్ట్ చేస్తారనే ధైర్యం కూడా తోడయినట్టుంది. కొందరు తుపాకీని గుంజుకోవాలని చూసినా నర్సయ్య ఉడుం పట్టు వదలడం లేదు. భార్యల వైపు ఉన్న ఒక కార్యకర్త ‘‘ఇదంతా ఈ పోలీసుల వల్లనే వచ్చింది. కుందేలు కూర దొబ్బితిని మొగుడూ పెండ్లాలకు గొడవ పెట్టిండ్రు’’ అన్నాడు. ‘‘ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మాటలు జాగర్తగా రానియ్యి’’ అని వాని మీదికి పొయ్యాడు జందార్ సాబ్. అంత మంది ముందు పోలీసు తన కార్యకర్త మీదికి పోయేసరికి వాళ్ళ నాయకుడు కోపానికి రావాల్సొచ్చింది. ‘‘ఏదీ.. మావోనిమీద చెయ్ వెయ్ చూస్తా’’ అని పోలీసు ఇంచార్జ్ మీదికి పోయాడు. ప్రత్యర్థి వర్గ నాయకునికి కూడా పౌరుషం వచ్చింది. ఇలాంటి సమయంలో దూసుకొని పోకపోతే రేపు తనకు ఓట్లు పడవు అనే డౌట్ వచ్చిన సర్పంచ్ అభ్యర్థి ‘‘ఏందిరా.. పోలీసు మీదనే చెయ్ వేస్తావా!’’ అని అతని మీదికి పోయాడు. ‘‘నువ్వెవర్రా?.. ఈ పోలీసులు నీవోల్లా?.. రిగ్గింగ్ చేయనీకి తెచ్చుకున్నవా?’’ అని అతని గల్లా పట్టనే పట్టిండు ఒక కార్యకర్త. సహనం కోల్పోయిన నర్సయ్య ఢాం అని తుపాకీ పేల్చాడు. పోలీసు ఇంచార్జ్ పక్కనుండి, ఇద్దరు భార్యల మీదకి గుండ్లు వెళ్ళేవే.. కానీ, ఎవరో తన చెయ్యి పట్టి లాగడం వల్ల అది పైకి గాల్లోకి పేలింది. ఇదే సందని రెండు వర్గాలూ గలాటాకు దిగాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ రోడ్డు మీద నుండి బళ్లోకి వచ్చారు. పోలీసులకు తమ కర్తవ్యం గుర్తొచ్చి, డ్రెస్ వేసుకునే సమయం లేక, లుంగీలు కాశబోసి, లోపలికి ఉరికి తమ తుపాకులు తెచ్చి లోడు చేసి బ్యాలెట్ బాక్సుల ముందు వరుసగా నిలబడ్డారు. ‘‘నన్ను రిగ్గింగ్ చేసేటోడంటావురా’’ అని కర్రలతో కొట్టుకుంటూ, రాళ్లు విసురుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు ఒక వర్గం కార్యకర్త గభాల్న ఉరికి బ్యాలెట్ గది తలుపుని తన్ననే తన్నాడు. బ్యాలెట్‌కు ఏదన్నా అయితే కనీసం ప్రతిఘటన అయినా ఇవ్వలేదని అధికారులు అడుగుతారని పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నర్సయ్య తన ఇంట్లోకి వెళ్ళి మరోసారి గన్ను లోడు చేయడం మొదలు పెట్టాడు. మస్కురి ఉరికి నర్సయ్య బయటకు రాకుండా గొళ్ళెం పెట్టాడు. నర్సయ్య భార్యలు పక్కింట్లో తల దాచుకున్నారు. బీపీ పెరిగి పడిపోయిన ఎన్నికల అధికారికి ఊళ్ళో పేరుమోసిన ఆర్ఎంపీ డాక్టర్ సపర్యలు చేస్తున్నాడు. ఇంతలో అదనపు బలగాలు వచ్చాయి. వీపుకు తుపాకులు, చేతిలో లాఠీలతో డీసీఎం వాన్ నుండి దూకిన స్పెషల్ పోలీసులు అందినకాడికి వీపులు, అందకపోతే పిర్రలు పగలగొట్టారు. అటు సగం మందిని ఇటు సగం మందిని గెదిమి రోడ్డుమీద నిలబడ్డారు పోలీసులు. కొందరు కార్యకర్తలు ఎంతో హుషారుగా ఉంటారు. వాళ్ళు నాయకుల కోసం ఎంతకైనా తెగిస్తారు. పోలీసులు లాఠీఛార్జ్ పనిలో ఉండగా, వారు తెరిచి ఉన్న గదుల్లో జొరబడ్డారు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారోగానీ ముందుగా కనపడ్డ మందు బాటిళ్ళూ, కుందేలు కూర ఎత్తుకుపోయారు. కొత్త కానిస్టేబుల్ తల విదిలించి ఉడుకుతున్న చికెన్ వాసనను గాఢంగా పీల్చుకున్నాడు. తుపాకులు ఉన్నా ఒక్కోసారి మన కూర మనకు దక్కదు అని అనుకున్నాడు. ‘‘వంట అయింది భోజనానికి రండి సార్’’ అని వంట కానిస్టేబుల్ పిలిచాడు. దూరం నుంచి తీవ్రంగా చర్చించుకుంటూ పంచాయితీ ఆఫీసు వైపు వస్తున్న జనాల గుంపును చూసి తుపాకులు తెచ్చుకొని బయట నిలబడ్డారు పోలీసులు. - గోపిరెడ్డి యేదుల -
ఈ సండే రుచికరమైన పొటాటో బైట్స్, పనీర్ టిక్కా టోస్ట్ చేసేద్దాం ఇలా..!
పొటాటో బైట్స్కావలసినవి: బంగాళాదుంప గుజ్జు – ఒక కప్పుఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), పుదీనా తురుము – 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ పొడి – ఒక టీస్పూన్, మ్యాగీ మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ – కొద్దిగా, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, బిస్కట్లు – ఒక చిన్న ప్యాకెట్, కారప్పూస – కొద్దిగా, ఉప్పు – సరిపడా తయారీ: ముందుగా ఒక పాత్రలో బంగాళదుంప గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, మామిడికాయ పొడి, మ్యాగీ మసాలా, కొత్తిమీర చట్నీ, నిమ్మరసం ఇలా అన్నీ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు రెండేసి బిస్కట్స్ తీసుకుని వాటి మధ్యలో కొద్దికొద్దిగా ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి, రెండు బిస్కట్స్ అతుక్కునేలా, చిత్రంలో ఉన్న విధంగా నొక్కాలి. ఆ తర్వాత అంతా సమాంతరం అయ్యేలా చేసుకుని కారప్పూసలో దొర్లించాలి. అనంతరం టొమాటో సాస్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, ఆ బైట్స్ భలే రుచికరంగా ఉంటాయి.పనీర్ టిక్కా టోస్ట్కావలసినవి: పనీర్ ముక్కలు – ఒక కప్పుబ్రెడ్ స్లైసెస్ – 4 లేదా 5, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, నూనె – సరిపడాచిల్లీ సాస్, టొమాటో సాస్ – కొద్దికొద్దిగాక్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి)నూనె, చీజ్ తురుము – సరిపడాతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి, పనీర్ ముక్కలకు బాగా పట్టించి, వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైసెస్పైన చిల్లీ సాస్ కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా పూసుకుని, ఆపైన నాలుగేసి పనీర్ ముక్కలను పరచుకోవాలి. అనంతరం ఒకవైపు క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ప్రతి పనీర్ ముక్కకు ఆనించి, పైన చీజ్ తురుము జల్లుకోవాలి. ఇప్పుడు వాటిని బేకింగ్ ట్రేలో పెట్టుకుని, ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది.స్పెషల్ గువావాకావలసినవి: జామకాయ – ఒకటి (పెద్దది)చాట్ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా – కొద్దికొద్దిగా, పంచదార – 2 టేబుల్ స్పూన్లుచిక్కటి పాలు – కొద్దిగా (కాచి చల్లార్చినవి)తయారీ: ముందుగా పెద్ద జామకాయను ఇరువైపులా కాస్త కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి గుంత తీసి, జామకాయను గిన్నెలా తయారు చేసుకోవాలి. ఆ మధ్యలో తీసిన జామకాయ ముక్కల్లో పంచదార, గరంమసాలా వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకుని, పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు గిన్నెలా మార్చుకున్న జామకాయలో కారం, ఉప్పు జల్లి, ఆ గుంతలో ఈ జామ–పంచదార మిశ్రమాన్ని వేసుకుని నింపుకోవాలి. అనంతరం పైన చాట్ మసాలా జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పండ్లు ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. -
సంయుక్తా మీనన్ ఫ్యాషన్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
చీర కట్టుకుంటే క్లాసిక్ క్వీన్ , గౌన్ వేసుకుంటే గ్లామర్ గర్ల్, కేజువల్ వేర్లో వెళ్తే చీర్‌ఫుల్ చిక్! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి ఉన్న ఫ్యాషన్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్రాలు మీ కోసం... ఫిట్నెస్ విషయంలో నేను చాలా కాన్షియస్! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్ విషయానికి వస్తే, ప్రతి ఔట్ఫిట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉండాలి, అప్పుడు లుక్ కంప్లీట్ ఫీల్ వస్తుంది.సంయుక్తా ముత్యాల వడ్డాణం!‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్ ర్యాంప్ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్ ఫేవరెట్! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డార్క్ కలర్ శారీస్‌పై ఇది పర్ఫెక్ట్ చాయిస్! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్ కలిపిన కాంబినేషన్ . పర్ల్ వర్క్ బ్లౌజ్ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్ స్టయిల్ లోబన్ లేదా ఆప్డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్ కలర్స్‌తో పెయిరప్ చేస్తే లుక్ మరింత హైలైట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ హూప్ లేదా స్టేట్మెంట్ పీస్ ఉంటే మోడర్న్ వైబ్ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్ లిప్ కలర్ వంటి మినిమల్ మేకప్‌తో క్లాసీ లుక్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్ ధరించే చీర..బ్రాండ్: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
సైలెంట్ మ్యారేజ్ కిల్లర్
కిషోర్ మంచం మీద ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాడు. ఆనంది తనతో మాట్లాడాలనుకుంటుంది, అతను ‘ఒక్క నిమిషం’ అన్నాడు. ఆ ‘ఒక్క నిమిషం’తో రాత్రంతా గడిచిపోతుంది. ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో కనిపించే సైలెంట్ డ్రామా. ఇప్పుడు కాపురాలు విడిపోవడంలేదు. కాని, విడిపోయిన రెండు మనసులు ఒకే ఇంట్లో రెండు స్క్రీన్ల మధ్య బతుకుతున్నాయి.కొత్త మూడో వ్యక్తి...ఒకప్పుడు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అంటే అనుమానం. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి పేరు ‘స్మార్ట్‌ఫోన్.’ పనికోసం, కాంటాక్ట్ కోసం, వినోదం కోసం ఇంట్లోకి ప్రవేశించిన స్మార్ట్ ఫోన్ మెల్లగా మనుషుల మధ్యకు చేరి మనసుల్ని వేరు చేసింది.ఇప్పుడు జంటలు రోజుకు సగటున మూడుగంటలకు పైగా ఫోన్లో గడుపుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కనీసం 30 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో దంపతుల మధ్య ‘దూరం’ శారీరకంగా ఉండేది. ఇప్పుడు ఆ దూరం ‘డిజిటల్’గా మారింది. మనుషుల మధ్య ‘మొబైల్ సిగ్నల్’ ఉన్నా, ‘మానసిక సిగ్నల్’ ఉండటం లేదు. ఎమోజీలు ఎక్కువ... ఎమోషన్లు తక్కువ...ఒకప్పుడు భోజనాల వద్ద మాట్లాడుకునేవారు. ఇప్పుడు భోజనం ముందు ఫొటో తీస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్ స్క్రీన్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటి దంపతులు ఎక్కువగా ‘టెక్ట్స్’ చేస్తారు, కాని తక్కువగా ‘టచ్’ చేస్తారు. మెసేజ్‌లు ఎక్కువ, మాటలు తక్కువ. ఎమోజీలు ఎక్కువ, ఎమోషన్లు తక్కువ. దీనివల్ల భావోద్వేగ దూరం పెరుగుతోంది. దగ్గరున్నా దూరమే... ప్రేమంటే ఒకరితో ఒకరుండటం. కాని, ఇప్పుడు జంటలు ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ ఆబ్సెంట్. ‘‘నువ్వు నాతో ఉన్నావు కాని, నీ మనసు ఫోన్లో ఉంది’’ అని భార్య అంటోంది. ఇదేమీ జోక్ కాదు. ఎమోషనల్ నెగ్లిజెన్స్ అనే సైలెంట్ సమస్య. మనం ఒకరిని ప్రేమిస్తున్నా, ఫోన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ప్రేమను ‘పాజ్’ చేస్తున్నాము. ఒక సర్వే ప్రకారం, రాత్రిళ్లు ఫోన్ వాడటం వల్ల మాట్లాడుకోవడం తగ్గిందని 65శాతం జంటలు చెప్పారు. దీనివల్ల చాలా జంటల మధ్య ఎమోషనల్ డిస్కనెక్షన్, అటెన్షన్ డెఫిషిట్, జెలసీ, నిద్ర సమస్యలు, ఇంటిమసీ తగ్గిపోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రేమలు...ప్రేమకు ప్రైవసీ అవసరం. కాని, ఇప్పుడంతా పబ్లిసిటీగా మారింది. ఇంట్లో ఎలా ఉన్నా, ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలున్నా, సోషల్ మీడియాలో ‘హ్యాపీ కపుల్’ పోస్టులు పెడుతుంటారు. ఇదో కొత్తరకం మానసిక మాయ. సోషల్ మీడియాలో ఇతరుల జీవితం చూసి మన జీవితం తక్కువగా అనిపించడం ‘కంపేరిజన్ బర్నవుట్’ను పెంచుతుంది. అది ఈర్ష్య, కోపం లేదా విరక్తిగా బయటపడుతుంది. కాపురంలో ప్రేమ చనిపోదు, దాన్ని చంపేది మౌనం. మాటలు తగ్గిన చోట ఊహలు పెరుగుతాయి. ఆ ఊహల వెనుక అభద్రత ఉంటుంది. సైకలాజికల్‌గా చెప్పాలంటే, జంటలు రోజూ కనీసం 20 నిమిషాలు మనసువిప్పి మాట్లాడుకోకపోతే ఎమోషనల్ డ్రైనెస్ పెరుగుతుంది.జంటలేం చేయాలి?రాత్రి భోజనం తర్వాత ఫోన్ పక్కన పెట్టేయండి. కనీసం గంటైనా ఫోన్ పూర్తిగా దూరంగా ఉంచండి.నిద్రకు ముందు కనీసం పది నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఫోన్లో స్క్రోల్ చేయడం కాదు, హృదయాన్ని స్క్రోల్ చేయండి.సోషల్ మీడియాలో ఒక వారం ‘ఫొటోలెస్ చాలెంజ్’ పెట్టండి. జంటగా గడిపిన సమయాన్ని మీరు మాత్రమే అనుభవించండి.రోజుకు కనీసం ఐదు నిమిషాలు కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. స్క్రీన్ కన్నా కళ్లు చూడటం ఇంటిమసీని తిరిగి తెస్తుంది.ఫోన్ రహస్యాలు పెరగడమంటే దూరం పెరగడం. స్మార్ట్ఫోన్లను కాకుండా, మనసులను ట్రాన్స్పరెంట్ చేయండి.ఫబ్బింగ్ సిండ్రోమ్... మనిషి మెదడు అనుబంధం కోరుకుంటుంది. మనం ‘చూస్తూ మాట్లాడే’ జీవులం. కాని, ఇప్పుడు మన కళ్ళు స్క్రీన్కు, మనసు నోటిఫికేషన్లకు అతుక్కుపోయింది. యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ పరిశోధన ప్రకారం ఫోన్ టేబుల్‌పై పెట్టినా కూడా జంటల మధ్య మాటల్లో భావోద్వేగ గాఢత 30 శాతం తగ్గిపోతుంది. దీన్నే ‘ఫబ్బింగ్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. అంటే భాగస్వామిని పట్టించుకోకుండా ఫోన్‌ను ఎక్కువగా పట్టించుకోవడం. ఈ స్థితిలో ఉన్నామని చాలామందికి తెలియదు కాని, దీనివల్ల జంటల మధ్య ఆప్యాయత, నమ్మకం, సహానుభూతి తగ్గిపోతున్నాయి.సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్‌లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
‘ఎగ్’సలెంట్ లుక్ కోసం!
నిజానికి గోళ్లలో చేరే ఫంగస్‌ను గోరంత సమస్య అనుకుంటే పొరబాటే! అందం, ఆరోగ్యం ఇలా రెండింటిపైనా ప్రభావం చూపించే ఈ సమస్య పూర్తిగా తగ్గాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు! పైనంతా పుచ్చిపోయి, లోపలికంటా పుండుపడిపోయి, ఇబ్బందిగా మారిన గోళ్లు తిరిగి మునుపటి రూపంలోకి రావాలంటే, ఈ అధునాతన పరికరం ఇంట్లో ఉండాల్సిందే!‘ఫంగబీమ్’ అనే ఈ డివైస్ తక్కువ–స్థాయి లేజర్ థెరపీని అందిస్తుంది. డ్యూయల్–వేవ్‌లెంగ్త్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించడం ఈ గాడ్జెట్ ప్రత్యేకత. దీనిలో 905 నానోమీటర్ల ఇన్ఫ్రారెడ్ లైట్, 470 నానోమీటర్ల బ్లూ లైట్– ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది గోరు అడుగు భాగానికి లోతుగా చొచ్చుకుపోయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలాన్ని లక్ష్యంగా చేసుకునేలా పని చేస్తుంది. రెండవది ఉపరితల స్థాయిలో పరిశుభ్రతను పెంచడానికి, గోరు రూపాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రెండు లైట్ థెరపీలు– ఎటువంటి మందులు, రసాయనాలు లేకుండా, నొప్పిలేకుండా ఫంగస్ నిర్మూలనకు సహాయపడతాయి.ఈ పరికరం ప్రధానంగా వినియోగదారులకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌గా పని చేస్తుంది, ఎలాంటి సెట్టింగులు అవసరం లేదు. ఒక్కో గోరుకు కేవలం 7 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి నొప్పి ఉండదు. దీనితో ఇంట్లో లేదా ప్రయాణంలో ఈజీగా చికిత్స చేసుకోవచ్చు. ఈ డివైస్ క్రమం తప్పకుండా వాడటం వలన గోరు రంగు చక్కగా మారుతుంది. గోరు మందం పెరిగి, ఆరోగ్యంగా కనబడుతుంది. ఈజీ చికిత్సను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.‘ఎగ్’సలెంట్ లుక్!సాధారణంగా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గాలంటే ఎగ్ వైట్స్ వాడమంటున్నారు నిపుణులు. ఓ కప్పులోకి ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. దానిలో కలబంద గుజ్జు కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించుకోవాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఎగ్ వైట్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. మృదువుగా మచ్చలు లేకుండా చేస్తుంది. అయితే 20 నిమిషాల పాటు ఉంచుకున్న తరవాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. (చదవండి: అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..! మన ఇండియాలో మాత్రం కాదు..) -
పరుల సొమ్ము
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్లేది. అక్కడ ఆడవారు ధరించే నగలు, చూసి తాను కూడా ఒంటినిండా నగలు ధరించి తిరగాలనుకునేది.ఒక రోజు కోతి అడవికి దగ్గర్లో ఉన్న రామాపురం గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాకుమారి ఆమె మిత్రబృందం రావటం గమనించింది. రాకుమారి తన ఒంటిమీది వజ్రాల హారం చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది.రాకుమారి›స్నానం చేస్తుండగా, కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాకుమారి, ఆమె మిత్రబృందం ‘పట్టుకోండి పట్టుకోండి!!! కోతి వజ్రాలహారం పట్టుకుని పరిగెడుతోంది!’ అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజ భటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరుగెత్తి, పరుగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడే చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస, పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ‘ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది– నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోటానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు’ అనుకుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది.అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడటంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి, వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాలహారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి.పల్లా శైలజ -
యోధుడా.. నీకు సెల్యూట్ ..!
మిలట్రీ వాళ్లను చూసినా, మిలట్రీ డ్రెస్‌ను చూసినా సెల్యూట్ కొట్టాలని అనిపించేంతగా భావావేశానికి లోనవుతాం. అదీ మిలట్రీ పవర్! సాధ్యం కాదు కానీ, అందరికీ దేశ రక్షణ దళాలలో పని చేయాలనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాషన్లన్నీ మిలట్రీ నుంచి వచ్చినవే. దేశాధి నేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఏదో ఒక సందర్భంలోమిలట్రీ దుస్తులు మన ఒంటిపై కవాతు చేస్తూ కనిపిస్తాయి. అంతగా స్ఫూర్తిని ఇస్తున్న సైనిక వస్త్ర, శస్త్ర విశేషాలు.. క్లుప్తంగా మీ కోసం!కార్గో ప్యాంట్లు1930లలో, బ్రిటిష్ సైన్యం కార్గో ప్యాంట్లను యుద్ధ దుస్తులలో భాగంగా ప్రవేశపెట్టింది. తూటాలు, ఇతర మందుగుండు సామగ్రి అమర్చుకోవటానికి సదుపాయంగా ఆ ప్యాంట్లకు ఇరువైపు ‘పక్క తొడ’ల పైన, నడుముకు ముందువైపు రెండు వైపులా జేబులు ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటన్ తర్వాత కార్గో ప్యాంట్లను క్రమంగా యూఎస్ సైన్యం కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. 1990ల నాటికి ఇది సాధారణ పౌరుల ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది. యువతీ యువకులు స్టెయిల్ కోసం వీటిని ధరించటం మొదలు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తరచు కార్గో ప్యాంట్స్‌లో కనిపిస్తుంటారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో జెలెన్స్కీ వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా మారింది! త్రిశూలం గుర్తు ఉన్న నల్లటి, లేదా ఆలివ్ ఆకుపచ్చ టాప్‌తో, కార్గో ప్యాంట్స్ ధరించే జెలెన్స్కీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపించే విషయమై ప్రపంచ దేశాధినేతలతో చర్చిస్తున్నప్పుడు దేశాధ్యక్షుడిగా కాక, కార్గో ప్యాంట్లలో ఒక సైనిక యోధుడిని తలపిస్తుంటారు. మన దగ్గర బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్గో ప్యాంట్స్‌ని ఎక్కువగా ధరిస్తుంటారు.ఏవియేటర్ సన్గ్లాసెస్హాలీవుడ్లోకి ఏవియేటర్ సన్‌గ్లాసెస్ రావటానికి ముందే, యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాటిని ధరించారు. అంతకుముందు వరకు పైలట్లు పాతకాలపు బరువైన గాగుల్స్ వాడేవారు. ఆ తర్వాత వాటికి బదులుగా ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌ను కనిపెట్టారు. ‘పైలట్’ను ‘ఏవియేటర్’ అని కూడా అంటారు. ఆ పేరు మీదే ఏవియేటర్ సన్‌గ్లాసెస్ వాడుకలోకి వచ్చాయి. ఎండ తాకిడి నుంచి అవి బలమైన రక్షణను ఇస్తాయి.ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌కు అధునాతన రూపమే ‘రే–బాన్’ కళ్లద్దాలు. ‘రే’ అంటే సూర్యకిరణాలు. ‘బ్యాన్’ అంటే తెలిసిందే, నిషేధం అని. సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటాయి కనుక అవి రే–బాన్ సన్‌గ్లాసెస్ అయ్యాయి. సంపన్నుల ఫ్యాషన్‌లో ఇప్పుడు ముఖ్య భాగం అయ్యాయి. అమెరికా పూర్వపు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ, రెండో ప్రపంచ యుద్ధపు అమెరికన్ టాప్ కమాండర్ జనరల్ డగ్లస్ మాక్ఆర్థర్, వియత్నాం విప్లవ నాయకుడు హో చి మిన్.. రే–బాన్ గ్లాసులు ధరించేవారు. ప్రస్తుత నాయకులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అప్పుడప్పుడు రే–బాన్‌లో దర్శనం ఇస్తుంటారు టీ–షర్ట్టీ–షర్ట్ నమూనాను తొలిసారిగా అమెరికా నావికాదళం డిజైన్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. బహుశా 1898 స్పెయిన్–అమెరికా యుద్ధ సమయంలో షర్ట్ కింద వేసుకునే అండర్ షర్ట్‌గా దీనికి రూపకల్పన చేశారని అంటారు. టీ షర్ట్ క్రమేణా సైన్యంలో తప్పనిసరి ధారణగా మారింది. అక్కడి నుండి 1950ల నాటికి పాప్ సంస్కృతిలో భాగమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి వార్డ్రోబ్లోకీ ప్రవేశించింది. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్డిగన్కార్డిగన్ ధరించినప్పుడు హాయిగా, సౌఖ్యంగా ఉండే కార్డిగన్ దుస్తులను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధంలో రష్యన్లపై దాడి చేసిన సమయంలో బ్రిటిష్ సైన్యం ధరించింది. నిజానికి ‘కార్డిగన్’ అనేది ఒక బిరుదు. ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ అంటే కార్డిగన్ అనే బిరుదు కలిగిన గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అప్పటి బ్రిటిష్ అశ్విక దళానికి నాయకత్వం వహించిన 7వ ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ జేమ్స్ థామస్ బ్రూడెనెల్ ఆనాటి క్రిమియన్ యుద్ధానికి ఈ దుస్తులను ధరించి సారథ్యం వహించారు కనుక ఆ దుస్తులకు కార్డిగన్ అని పేరు పెట్టారు. కార్డిగన్ డిజైన్, దానిని ధరించిన వారి కార్యాచరణలు బ్రిటిషర్ల దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. కాలర్ లేని స్వెట్టర్ లేదా జాకెట్‌ను ‘కార్డిగన్’ అంటారు. ఫ్రెంచి ఫ్యాషన్ డిజైనర్ కోకో చానల్ 1920లలో మహిళలు ధరించే కార్డిగన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పురుషుల కార్డిగన్లను ధరించేటప్పుడు తన జుట్టు చెదిరిపోతుండటం నచ్చకపోవటంతో ఫ్రంట్ ఓపన్ కార్డిగాన్లను మహిళల కోసమే ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక బల్గేరియన్ రేడియో ఎడిటర్నైతే కార్డిగన్ ఏకంగా ఒక హత్యాయత్నం నుండే కాపాడింది! అతను ధరించిన మందపాటి ఉన్ని కార్డిగన్.. రహస్య ఏజెంటు ఆ ఎడిటర్‌పై పేల్చిన విషపు గుళిక శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నిరోధించింది. హై – హీల్స్అశ్విక దళంలోని సైనికులు గుర్రాలను ఎక్కి రెండు వైపుల బూటు కాలు ఉంచే రింగులలో (అంకేలు) పాదాలకు మరింతగా కుదురును ఇవ్వటం కోసం మొదట పర్షియన్ సైనికులు 10వ శతాబ్దంలో హై హీల్స్‌ను కనిపెట్టారు. యుద్ధ సమయంలో గుర్రాన్ని దౌడు తీయించటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే ఈ హై హీల్స్ కాల క్రమంలో హోదాకు చిహ్నంగా మారాయి. చివరికి గ్లామర్‌కు పర్యాయపదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళల మనసు దోచుకున్నాయి. మహిళా దేశాధినేతలు హైహీల్స్ ధరించటం సర్వ సాధారణమే కానీ, చరిత్రలో హై హీల్స్‌ను ఇష్టపడిన పురుష నాయకులూ ఉన్నారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయీ తన హోదాకు చిహ్నంగా హై హీల్స్ ధరించేవారు. ఐక్యరాజ్య సమితిలో ఓసారి అమెరికా మాజీ రాయబారి (ఐరాసకు) నిక్కీ హేలీ హై హీల్స్ ధరించటం గురించి గళం విప్పారు! ‘‘హై హీల్స్ శక్తిని, సాధికారతను ఇస్తాయి. యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. అందువల్లనే నేను హై హీల్స్ ధరిస్తాను’’ అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో వంటి వారు పొడవుగా కనిపించటానికి హై హీల్స్ ధరిస్తారన్న పుకార్లు ఉన్నాయి. 2023లో, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ‘హోప్ ఇన్ హై హీల్స్’ ప్రచారంలో కెనడా పురుష ఎంపీలు హై హీల్స్ ధరించారు. బాంబర్ జాకెట్బాంబర్ జాకెట్‌ను మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ల కోసం ‘యూఎస్ ఆర్మీ ఏవియేషన్ క్లోతింగ్ బోర్డ్’ సృష్టించింది. ఎ–1 అని వ్యవహరించిన ఆ బాంబర్ జాకెట్‌ను తొలిసారి 1917లో అమెరికన్ పైలట్లు ధరించారు. పైలట్లను వెచ్చగా ఉంచడానికి బోర్డు రూపొందించిన మొదటి ఫ్లయిట్ జాకెట్ అది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్‌పై ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాలలో బాంబు దాడులను నిర్వహించిన యువ అమెరికన్ వైమానిక దళ సభ్యులను ‘బాంబర్ బాయ్స్’ అనే వారు. ఆ పేరు నుంచే బాంబర్ జాకెట్ వాడుకలోకి వచ్చింది.అమెరికన్ మిలిటరీ 1950లలో ఎం.ఎ.–1 అనే బాంబర్ జాకెట్‌ను వృద్ధి చేసింది. అది ప్రకాశవంతమైన నారింజ రంగు లైనింగ్‌తో ఉండేది. ఒకవేళ విమానం కూలిపోతే, రక్షణ బృందాలకు సజీవంగా ఉన్న పైలట్ తేలిగ్గా కనిపించటానికి జాకెట్‌ను తిప్పి వేసుకోవచ్చు. లోపలి లైనింగ్ నారింజ రంగులో ఉంటుంది కనుక క్షతగాత్రుడైన పైలట్ జాడ కనిపెట్టటం వారికి తేలికవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన బాంబర్ జాకెట్లను అమెరికన్ సైన్యం పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాతి నుంచి వాటిని సామాన్యులూ వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా హిప్–హాప్ కళాకారులు. 1980లో బాంబర్ జాకెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం టామ్ క్రూజ్ హిట్ చిత్రం ‘టాప్ గన్’లో ఆయన జి1 మోడల్ బాంబర్ జాకెట్‌ను ధరించటమే. ప్రారంభంలో బాంబర్ జాకెట్లు బరువైన తోలుతో తయారైనప్పటికీ తర్వాత్తర్వాత తేలికపాటి నైలాన్, సిల్క్, రీసైకిల్ చేసిన సముద్రపు ప్లాస్టిక్‌ల వంటి వాటితో విస్తృతంగా తయారై, ఏ సీజన్‌కైనా అనుకూలంగా ఉండేలా మారాయి. డాగ్ ట్యాగ్లుయుద్ధ సమయంలో సైనికులు మరణించినా, గాయపడినా.. వారిని సేవా దళ సభ్యులు గుర్తించటానికి వీలుగా వారి దుస్తులకు తగిలించి ఉండేవే డాగ్ ట్యాగ్లు. ఇవి అండాకారంలో ఉండే రేకు ముక్కలు. వాటిపై ఆ సైనికుల వివరాలు ముద్రించి ఉంటాయి. అమెరికా అంతర్యుద్ధ సమయంలో తొలిసారిగా ఈ డాగ్ ట్యాగ్‌లను అనధికారికంగా ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని సమాధులలో శత్రువులు కనుక తమ వారిని సమాధి చేస్తే వారిని కనిపెట్టేందుకు డాగ్ ట్యాగ్‌లను తగిలించారు.డాక్ ట్యాగ్‌లను ఇప్పుడు సైనికులతో పాటుగా, పౌరులు కూడా తగిలించుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో ఉద్యోగుల మెడలో కనిపించే ఐడీ కార్డులకు ప్రేరణ డాగ్ ట్యాగ్ల నుండి వచ్చిందేనని అంటారు.ట్రెంచ్ కోట్నీటితో తడవని, బరువు ఉండని తేలికపాటి ‘గ్రేట్ కోట్’లకు సమానమైన ట్రెంచ్ కోట్‌ను తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది. సైనికులను కందకాలలో పొడిగా ఉంచే ఈ కోటు కాల క్రమేణా పౌరుల దైనందిన జీవితంలో భాగం అయింది.గ్రేట్ కోట్ పొడవుగా, బరువుగా, వెచ్చని ఓవర్ కోట్లా, ఉన్నితో తయారై ఉంటుంది. మొదట్లో సైనిక సిబ్బంది వీటినే ధరించేవారు. తీవ్రమైన చలి గాలుల నుంచి ఈ గ్రేట్ కోట్లు వారికి రక్షణ కల్పించేవి. వీటి పొడవు సాధారణంగా మోకాలి కింది వరకు ఉంటుంది. ట్రెంచ్ కోట్... గ్రేట్ కోట్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పాలి. వాటర్ ప్రూఫ్ వస్త్రంతో తయారౌతుంది. అదనపు రక్షణను కల్పిస్తుంది. సైనిక చిహ్నాలను తగిలించటానికి భుజం పట్టీలు ఉంటాయి. ట్రెంచ్ కోట్ కూడా మోకాలి కింది వరకు ఉంటుంది. క్రమంగా ఇందులోకీ ఫ్యాషన్ వచ్చి చేరింది. మహిళలకు ప్రత్యేకంగా ట్రెంచ్ కోట్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో ఎక్కువ మంది మోడళ్లు ట్రెంచ్ కోట్లను పోలిన వస్త్రాలను ధరించటం మీరు చూసే ఉంటారు. ట్రెంచ్ అంటే కందకం. కందకాల్లో ఉండి పోరాడే సైనికుల కోసం తయారైన కోట్ కనుక వీటికి ట్రెంచ్ కోట్ అనే పేరు వచ్చింది. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
దారి చూపిన చెప్పులు
దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 10న చోటు చేసుకున్న విధ్వంసం మానవబాంబు దాడిగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ లాంటి నగర పోలీసు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై 2005 అక్టోబర్ 12న రాత్రి 7.20 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఓ చెప్పుల జత ఆధారంగా ముందుకు వెళ్లారు. బేగంపేటలో గ్రీన్లాండ్స్ చౌరస్తాలోని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్‌కు మారింది) 2005 అక్టోబరు 12న మానవబాంబు దాడి జరిగింది. నగరానికి చెందిన గజ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ కుట్రలో బంగ్లాదేశ్‌కు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్ మానవబాంబుగా మారాడు. ముందే పెట్టుకున్న ముహూర్తం ప్రకారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశాడు. ఆ రోజు దసరా పండుగ కావడం, అప్పటికి కొద్ది నిమిషాల ముందే సిబ్బంది సమావేశం ముగించుకుని బయటకు వెళ్లిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పి ఉగ్రవాదుల అంచనాలు తలకిందులయ్యాయి. సెంట్రీ డ్యూటీలో ఉన్న హోంగార్డు ఎ.సత్యనారాయణ చనిపోగా, కానిస్టేబుల్ వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన కొద్దిసేపటి వరకు అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పంజగుట్ట పోలీసులు తొలుత ఇది టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉంచిన బాణసంచా లేదా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వల్ల జరిగిందని భావించారు. కొంత సమయానికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం అనేక కోణాల్లో పరిశీలించి, మృతదేహం శరీరభాగాలు సేకరించి, విశ్లేషించిన తర్వాతే మానవబాంబు దాడిగా నిర్ధారించింది. ఈ ఘాతుకం విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, హోంమంత్రి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చాలా వరకు ధ్వంసమైన టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మొండి గోడల నుంచి అప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల్నే టార్గెట్‌గా చేసిన ఈ దాడి కేసును సవాలుగా తీసుకున్న అధికారులు పంజగుట్ట పోలీసుస్టేషన్ నుంచి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు.ఈ కేసును ఎంత సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినా, తొలి అడుగు వేయడానికి అవసరమైన ఒక్క ఆధారంగా కూడా అప్పటికి పోలీసుల వద్ద లేదు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఓ వ్యక్తి మానవబాంబుగా మారి దాడి చేశాడనే అంశం తప్ప అతడు ఎవరు? ఎక్కడి వాడు? వెనుక ఉన్నది ఎందరు? తదితర వివరాలేవీ అందుబాటులో లేవు. మానవబాంబు ఎవరనేది తెలిస్తేనే అడుగు ముందుకు పడుతుందని భావించిన పోలీసులు మరోసారి ఘటనాస్థలిని సమగ్రంగా పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని రప్పించారు. అక్కడి అణువణువూ పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులకు ఓ జత తోలు చెప్పులు లభించాయి. ఆరో నంబర్ సైజుతో కూడిన వాటిని అంతకు ముందు సేకరించిన మానవబాంబు మృతదేహం పాదాలకు పోల్చిచూడగా సరిగ్గా సరిపోయాయి. దీంతో అవి మానవబాంబువే అని నిర్ధారించిన నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై ఉన్న ‘టీకే 200’ అక్షరాలు నిపుణుల దృష్టిలో పడ్డాయి. అది ఆ చెప్పుల రేటును స్పష్టం చేసే అంశంగా తేల్చిని అధికారులు చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కరెన్సీ వివరాలు ఆరా తీశారు. ఇలా టీకే అంటే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అని గ్రహించిన నిపుణులు సదరు మానవబాంబు బంగ్లాదేశ్‌కు చెందిన వాడని స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం కోణంలో దర్యాప్తు జరిగి కేసు కొలిక్కి వచ్చి, ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పాత్ర వెలుగులోకి వచ్చింది. అలా దొరికిన తీగతో మొదలైన దర్యాప్తు దేశవిదేశీ కోణాలను వెలికి తీసింది. ‘టాస్క్‌ఫోర్స్’ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ విదేశాల్లో, పరారీలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన పది అరెస్టు చేసింది. మూడో నిందితుడిగా ఉన్న మానవబాంబు డాలిన్ ఘటనాస్థలిలోనే మరణించాడు. మిగిలిన తొమ్మిది మందిలో ప్రధాన నిందితుడు గులాం యజ్దానీ అలియాస్ నవీద్ 2006లో ఢిల్లీలో, రెండో నిందితుడిగా ఉన్న షాహెద్ అలియాస్ బిలాల్ 2007లో పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో ఎన్కౌంటర్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫ్, ముతాలిబ్, ఇక్బాల్, అష్రాఫ్, పాకిస్తాన్‌కు చెందిన ఖాన్ అలియాస్ పఠాన్లతో సహా ఏడుగురు చిక్కనే లేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జ్‌షీట్, సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, అదనపు సెక్షన్లు చేర్చే విషయంపై స్టే కారణంగా సుదీర్ఘకాలం విచారణకు బ్రేక్ పడింది. చివరకు 2012లో మళ్లీ నాంపల్లి కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులపై నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది. దీంతో ఈ కేసు వీగిపోయి నిందితులు బయటపడ్డారు. -
నాడు ఆఫీసు బాయ్... నేడు కంపెనీ సీఈఓ
ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది.మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరు తల్లిదండ్రుల కల.. తమ బిడ్డ టెక్నాలజీ రంగంలో రాణించాలని. బీటెక్ చదివిన విద్యార్థుల ఆశలు.. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల్లో ప్యాకేజీ పొందాలని.‘కానీ, ఈ రోజుల్లో నైపుణ్యాల లేమి వల్ల వీరి కలలు నెరవేరడం లేదు’ అంటారు ఫణిరాజు జాలిగామ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అజా (AJA Coding Tutor) కోడింగ్ ట్యూటర్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఫణిరాజు జాలిగామ సాఫ్ట్వేర్ కంపెనీలకు అర్హత కలిగిన ఉద్యోగులను అందించడంలో బిజీగా ఉన్నారు. ‘సాఫ్ట్వేర్ రంగంలో సెట్ అవడానికి ఇతర డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హత సంపాదించుకోవచ్చు’ అంటూ అందుకు తన జీవితమే గొప్ప ఉదాహరణగా చూపుతున్నారు. ఉక్కు నరాలున్న వందమంది యువతను అప్పగిస్తే దేశ తలరాతను మార్చి చూపుతా అన్న వివేకానందుడి మాటలను గుర్తు చేస్తూ ‘ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది’ అంటారు. ఒకప్పుడు జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్‌గా పనిచేయడం నుంచి నేడు కోట్లాది రూపాయల ఐటీ సేవల సంస్థకు అధ్యక్షుడు, సీఈఓగా ఎదిగే వరకు ఫణిరాజ్ జాలిగామ ప్రయాణం అత్యంత స్ఫూర్తితో నిండినది. ఆఫీసు బాయ్‌గా.. డ్రైవర్‌గా! పూర్వ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పట్టణవాసి ఫణిరాజు జాలిగామ. ఆయన తండ్రి అక్కడ రిజిస్ట్రేషన్ స్టాంపులు అమ్మేవారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుడంతో తాతల నాటి కొద్దిపాటి ఆస్తి అమ్ముకొని రోజులు గడపాల్సి వచ్చింది. పదో తరగతి పూర్తయ్యేసరికి ఆ ఆస్తీ కరిగిపోయింది. టెన్త్‌లో 85 శాతం మార్కులు సాధించి, పై చదువులకు వెళ్లాలన్న తపన ఉన్నా ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలా నిలిచాయి. ఎవరినీ చేయి చాపి అడగని మనస్తత్వం. కానీ, ఎదగాలి అంటే ఏదో ఒక పని చేయాలి. ఒక పాన్ షాపులో పనికి కుదిరాడు. ఓ తెలుగు వారపత్రికను ఇల్లిల్లూ చేర్చడానికి ఏజెంట్‌గా మారాడు. ఐటీఐ చేసి, ఎలక్ట్రీషియ¯Œ గా పనిచేశాడు. ఈ అన్ని పనుల ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటర్మీడియట్ చదువును ప్ర«థమ శ్రేణిలో పూర్తి చేశాడు. కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్ ఉద్యోగం సంపాదించాడు. అది అతని మొదటి ప్రభుత్వ ఉద్యోగం. ఎదగాలనే తపనే సోపానంకోర్టులో క్లర్క్ జాబ్‌కు ఉన్న ప్రాధాన్యం చూసి ఆ ఉద్యోగం పొందాలనుకున్నాడు. ఏ టేబుల్ మీద అయితే టీ, కాఫీలు అందిస్తూ వచ్చాడో ఆ టేబుల్ ముందు కూర్చొని వర్క్ చేయాలనుకున్నాడు. తెలిసినవారిని అడిగితే షార్ట్‌హ్యాండ్ పరీక్షలలో పాసైతే అదే హోదాతో కాపీయిస్ట్ ఉద్యోగం పొందవచ్చని సూచించారు. దీంతో బాయ్‌గా పనిచేస్తూనే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయమూర్తి అనుమతితో రాత్రిపూట కోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉదయం షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడు. కొద్ది రోజుల్లోనే షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 225 పదాలు రాయగలిగాడు. ఆ పరీక్షలో డిస్టింక్ష¯Œ లో పాస్ అయ్యాడు. ఆ సంవత్సరం జిల్లా కోర్టులో కాపీరైట్ల పోటీకి హాజరు కావడంతో ఆ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, స్థిరమైన ఆదాయం జీవనం సాఫీగానే సాగిపోతోంది. ఈలోగా ఎంసీఏ చేసిన మేన మరదలు శ్రీలలితతో వివాహం జరిగింది. భార్య ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ‘నేను అప్పటికే కరస్పాండె¯Œ ్స డిగ్రీ పూర్తి చేశాను. నా టాలెంట్‌ను గమనించిన నా భార్య ఐటీ ఉద్యోగం అయితే మంచిదని సూచించడమే కాకుండా, ప్రయత్నించమని చెప్పింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించాను. బంధువులు వద్దని వారించినా ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, పూణేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను‘ అని ఫణిరాజ్ తాను ఐటీ రంగంలోకి ప్రవేశించిన విధానాన్ని వివరిస్తారు.కంపెనీ డైరెక్టర్.. లక్షల్లో జీతం...ఐటీ కంపెనీలో ఫణిరాజ్ మొదటి జీతం రూ. 15,000. చేరిన ఆరు నెలల్లోనే, ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు అని గ్రహించాడు. తర్వాత ఎంబీయే పూర్తి చేసి, టీసీఎస్‌లో సీనియర్ మేనేజర్‌గా చేరి నెలకు రూ. 4.5 లక్షల జీతం పొందాడు. ‘ఆ తర్వాత 2015లో కాగ్నిజెంట్ టెక్నాలజీలో అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘అప్పుడే నా ఫ్రెండ్ సూచనతో స్వంత కంపెనీని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. డబ్బుల కోసం ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న పనిని ఇంకొంత మెరుగ్గా, పదిమందికి ఉపయోగపడాలనేదే ఆలోచన. అప్పటికే సాఫ్ట్‌వేర్‌లోకి ఎంతో మంది ఉద్యోగులను తీసుకోవడం, వారి చేత వర్క్ చేయించడం... ఓ యజ్ఞంలా సాగుతూనే ఉంది.బంగారం అమ్మేసి.. ఎక్కడ చూసినా ప్రతిభావంతులు తక్కువ శాతమే కనిపిస్తున్నారు. సరైన నైపుణ్యాలు లేక ఐటీ రంగంలో జాబ్‌లు పోగొట్టుకున్నవారు ఎందరో. హైదరాబాద్‌లో అమీర్‌పేట్ లాంటి ప్లేసుల్లో రకరకాల టెక్నాలజీ కోర్సుల్లో చేరి, సాధారణ ఉద్యోగాలు పొందేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా గమనించే ‘ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించాను. అయితే, ఇదంత సులువు కాలేదు. సొంత కంపెనీని స్థాపించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. తగినంత మొత్తం సమకూరలేదు. దీంతో మా ఆవిడ నగలు అమ్మేసి, లోన్లు తీసుకొని ఈ కంపెనీని స్థాపించాను. ఐదేళ్లలో 5000 మందికి ఉద్యోగవకాశాలు లభించాయి. కంపెనీ అతి త్వరలోనే ఏడాదికి దాదాపు రూ. 50 కోట్ల టర్నోవర్ పొందే స్థితికి చేరుకుంది. అమెరికాలోని సియమెన్స్, ఇన్ఫ్యూజన్ సాఫ్ట్ .. వంటి పెద్ద కంపెనీలు మా కస్టమర్లు అయ్యారు. మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండటమే. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది’ అంటారు ఈ ఐటీ దిగ్గజం. ఇంజనీర్ డిగ్రీ చేయకపోయినా.. ఉద్యోగంఐటీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను మరచిపోలేదని చెబుతారు ఫణిరాజు. అందుకే, నాన్ టెక్నాలజీ వాళ్లవైపు తమ ఆలోచన ఉండేవని వివరిస్తారు. ‘కాలేజీల్లో టాప్ ర్యాంకర్లను మాత్రమే కాకుండా, అమీర్‌పేట్‌లో కోచింగ్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారిని ఉద్యోగులుగా తీసుకున్నాం. 5 లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చి మేమే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాం. రెండేళ్ల కిందట అజా పేరుతో కోడింగ్ ట్యూటర్‌ను ప్రారంభించాం. దీని ద్వారా బీయే, బీకామ్ చదివి ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కూడా శిక్షణ ఇచ్చి, కంపెనీలకు నియామకాలు చేస్తున్నాం. నేర్చుకోవాలనే తపన ముఖ్యం కానీ, డిగ్రీలు కావు. బీటెక్ చేసిన చాలా మంది విద్యార్థులకు నాలుగు లైన్ల కోడింగ్ రాయడం రాదు. కానీ, నలభై లక్షల ప్యాకేజీ కావాలన్నట్టుగా ఉంటారు. ఏదో విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం తెచ్చుకున్నా మూడు నుంచి ఆరు నెలలలోపే బయటకు వస్తున్నారు. దీని వల్ల ఇటు ఉద్యోగి భవిష్యత్తు, కంపెనీల భవిష్యత్తుకు ప్రమాదంలో పడుతుంది. అందుకే, ముందు స్కిల్స్‌పైన దృష్టి పెట్టాలి. స్కిల్ నేర్చుకున్నవారికి మేమే సరైన కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలను ఇప్పిస్తున్నాం’ అని తెలియజేశారు.జీవితంలో రాణించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే కోరిక అతను కోరుకున్న గమ్యస్థానాలకు దగ్గర చేసింది. ఇంకా, చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి అంటారు ఈ ఐటీ నిపుణుడు. ఉన్న స్థానం నుంచి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన తనను ఎప్పుడూ వెంటాడుతుందని, ఏదైనా సాధించాలనుకున్న ప్రతిసారీ ఈ భావనే ముందుకు నెడుతుందని చెబుతున్నారు ఫణిరాజ్. ఆ తపనే ఆఫీస్‌బాయ్ నుంచి ఐటీ కంపెనీకి సీఈఓగా మార్చిందని వివరించారు. ∙నిర్మలా రెడ్డిఫొటోలు: మోర్ల అనిల్‌కుమార్ -
పాత బొమ్మల కొత్త రి‘స్టోరీ’
గోల్డెన్ క్లాసిక్‌గా నిలిచిన ఆ తరం పాత సినిమాలను నేటి అధునాతన టెక్నాలజీ అయిన 4కే రిజల్యూషన్‌తో పునరుద్ధరించి, సరికొత్తగా జీవం పోస్తున్నారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే తాతయ్య అమ్మమ్మ జ్ఞాపకాలుగా ఇంట్లో ఉన్న పాత మరచెంబును అలా మూలకు పడకుండా చింతపండు వేసి తోమి తళతళా మిలమిలా మెరిపించి కొత్తదానిలా చేయడం. దానితో ఉన్న జ్ఞాపకాలను మరొక్కసారి మననం చేయడమే ఈ రిస్టోరేషన్.1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ సినిమాను ఫోర్ కే రిజల్యూషన్‌లోకి సరికొత్తగా మార్చి, అక్కినేని శత జయంతి సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదల చేశారు. ఒక తాతయ్య తన మనవరాలితో కలిసి ఆ సినిమా చూశాడు. మొదటిసారిగా ఆ సినిమా చూసినప్పుడు తనెంత చిన్న పిల్లాడో, ఆరోజున సినిమా టికెట్ ధర పది పైసలు సంపాదించడానికి తానెంత కష్టపడ్డాడో, ఆ నేల టికెట్ తీసుకొని కింద ఇసుకలో కూర్చున్న సంగతి నుంచి రాజనాల ఎన్టీఆర్ ఫైట్, అక్కినేని తాగి చేసిన అల్లరి, ‘కోలో కోలో’ పాటకు ఆనందంతో తాను చేసిన డ్యాన్స్ , ఆనాటి నుంచి తనతో పాటు ప్రయాణిస్తూ మదిగదిలో తడియారని జ్ఞాపకాలను మనవరాలితో పంచుకున్నాడు. ‘చదువుకోకుండా టీవీలు, సినిమాలు చూస్తే పాడైపోతారని అస్తమానం మందలించే తాతయ్య, తామంతా భయపడే నాన్న కూడా భయపడే తాతయ్యలో ఇంతటి అల్లరి సినీ ప్రేమికుడు ఉన్నాడా?’ అనుకుంటూ ఆ మనవరాలు ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి తాతయ్యకు తనకు బాండింగ్ మునుపటి కంటే ఇంకా చిక్కగా అయ్యింది. ఈ అనుభవం ఒక్క ఆ తాత మనవరాలిదే కాదు. భారతదేశంలో ఉన్న చాలామంది సినీ ప్రేమికులది. దీనికంతటికీ కారణం ఫోర్కే రిజల్యూషన్‌తో రిస్టోర్ చేసిన ఓ సినిమా.వివిధ భాషలకు చెందిన అనేక క్లాసిక్ చిత్రాలను 4కేలో రిస్టోర్ చేసి, థియేటర్లోకి మళ్ళీ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ రిస్టోర్ రీ రిలీజ్‌కు సంబంధించిన కథా కమామిషూ తెలుసుకుందాం!సామాన్యంగా ఏ సినిమా అయినా, అది తీసే నాటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తెరకెక్కిస్తారు. అప్పటికి అందుబాటులో ఉన్న కెమెరాలనే వాడతారు. పిక్చర్ క్వాలిటీ ఆ కెమెరాల పరిధి మేరకే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అని అంటే కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు జనమంతా వాటినే వాడారు. తర్వాత ఆ కీప్యాడ్ ఫోన్లకి ఓ చిన్న కెమెరా అమర్చారు. అప్పటికి ఫోన్లకు కెమెరా ఉండటమే గొప్ప! తరువాత ఆ కెమెరా క్వాలిటీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో కెమెరాతో 4కే లేదా 8కే వరకు వీడియోలు తీయవచ్చు. అప్పటికీ ఇప్పటికీ వీడియో క్లారిటీ చాలా పెరిగింది. ఇదే విధానం ఇప్పుడు సినిమా కెమెరాలకూ వర్తిస్తుంది. కీప్యాడ్ కెమెరాతో తీసిన వీడియోకు, ప్రస్తుతం ఐఫోన్‌తో తీసిన వీడియోకు వ్యత్యాసం ఎంత ఉందో; ఆనాడు మిచెల్ కెమెరాతో ఫిల్మ్ మీద తీసిన సినిమాలకు ఈనాడు అందుబాటులో ఉన్న కెమెరాలతో చీప్ మీద తీసిన సినిమాలకు అంత వ్యత్యాసం ఉంది. పాత కెమెరాలతో తీసిన సినిమాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేయడమే రిస్టోరేషన్ పద్ధతి. సింపుల్‌గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న పాత తాతయ్య ఫోటోను సరికొత్త ఫొటోగా మార్చడం. తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పిన 1989 ‘శివ’ సినిమాను సరికొత్త ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఇలానే విడుదల చేశారు.తొలి ఘనత ‘కల్పన’‘దీని వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పాత సినిమాలను నేటితరం కోసం, తర్వాతి తరాల కోసం జాగ్రత్త చేయడం; రెండు ఈ సరికొత్త చిత్రాన్ని రిలీజ్ చేసి వ్యాపారం చేయడం. ఇందులో పుణ్యం పురుషార్థం రెండూ ఉన్నాయి. వ్యాపారం చేసి, డబ్బులు సంపాదించడం ఒకటైతే; ప్రేక్షకుల జ్ఞాపకాలను మరొక్కసారి తట్టి లేపడం రెండవది. అయితే అన్ని చిత్రాలూ డబ్బు సంపాదించి పెట్టలేకపోవచ్చు’’ అంటున్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ఈ సంస్థ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్ససి స్థాపించిన ఫిల్మ్ రిస్టోరేషన్ సంస్థతో కలిసి పాత సినిమాల పునరుద్ధరణ నిర్వహిస్తుంది. ఈ ఫౌండేషన్ ఉదయ్ శంకర్ 1948లో తీసిన ‘కల్పన’ చిత్రాన్ని ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఆ సినిమాకు పునరుజ్జీవం పోసింది. ‘కల్పన’ రిస్టోర్ అయిన మొదటి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.రిస్టోరేషన్ నేటి తరానికి అవసరంనేటి కమర్షియల్ సినిమాల్లో మితిమీరిన హింస, మతిలేని డ్రామా ఉంటోందని ఆనాటి సినిమా చూసిన పాతతరం ప్రేక్షకులు వాపోతుంటారు. వారి మాటల్లోనే చెప్పాలంటే, ‘కత్తి పట్టుకుంటే నరకటం, గన్ను పట్టుకుంటే కాల్చడం, శత్రువును క్షమించడం కంటే కనపడితే రెండుగా చీల్చడం– ఎలివేషన్లే కాని, ఎమోషన్ లేని సీన్లతో ఈ సినిమాలో కథ ఏముంది? అదే మా కాలంలోని సినిమాలోనైతేనా’ అంటూ ఆనాటి వారి సినిమాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఈ మాటను నేటి యువ సినీ ప్రేక్షకులు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ ఎలివేషన్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ఈలలు, చప్పట్లతో థియేటర్ని హోరెత్తించే నేటి బర్గర్ పిజ్జా బిర్యానీ తరానికి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఈతరం వారి సినిమాలను అప్పటి వారు మెచ్చుకోరు. ఆతరం వారి సినిమాలను ఇప్పటివారు ఒప్పుకోరు. ఫాస్ట్ కట్స్కి అలవాటుపడ్డ వారికి పాత సినిమాలు లాగ్ అనిపిస్తాయి. అయినా నలుపు తెలుపు రెండే రంగులున్న ఆ పాత సినిమాలు చూసేవారెవరు? చూడాలన్నా అందుబాటులో ఉండాలి కదా! అద్దం మొహం ఒక దగ్గర ఉంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకోసమైనా ఆ ఓల్డ్ గోల్డ్ క్లాసిక్స్‌ని నేటి టెక్నాలజీకి అనువుగా మార్చి ఈ జెన్ జీ తరానికి చేరువ చేయాలి. ఆ పాత సినిమాల్లో కథలు ఎలా ఉండేవి? ఆ నటుల నటనాస్థాయి ఏమిటి? హాస్యం, జుగుప్స లేకుండా ఎంత హాయిగా ఉండేది? సంగీతంలో లాలిత్యం, సాహిత్యంలో కవి భావం ఎంత లోతుగా ఉండేదో ఈ తరానికి తెలియాలంటే ఈ ఫోర్ కే రిస్టోరేషన్ అవసరం చాలా ఉంది.‘నేటి ప్రేక్షకుడు సాంకేతికంగా నాణ్యమైన సినిమాని చూడడానికి అలవాటు పడ్డాడు. సినిమా, టీవీ తెరలే కాదు, ఎక్కువ సమయాన్ని గడిపే మొబైల్ స్క్రీన్లు కూడా అద్భుతమైన ఫోర్ కే దృశ్యాలను చూపెడుతున్నాయి. అలాంటి వారికి సెవెంటీ ఎంఎంపై తీసిన సినిమాలు చూడమంటే ఇబ్బందే. అందుకే పాత సినిమాల రిస్టోరేషన్ చేయడం అవసరం’ అని శేమారూ ఎంటర్టైన్మెంట్ సీఈవో హిరేన్ గాడా అభిప్రాయపడ్డారు.‘ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లు ప్రస్తుతం 4కేలో లేని సినిమాలను స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసిన హక్కుదారులకు, అదే పాత సినిమాను నాన్ ఫోర్కే హక్కుదారులకు వ్యాపారపరంగా చాలా అంతరం ఉంది. పాత సినిమాలను పాత పద్ధతిలో ఉంచుకున్న వారికి ఆదాయ మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి’ అని అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు.‘బోల్తా’బొమ్మలతో రిస్టోరేషన్కు వేగంపాత క్లాసిక్స్‌ను ఫోర్ కేలో రిస్టోర్ చేసి, రిలీజ్ చేయడం వలన థియేటర్లో ప్రేక్షకుల రాక మళ్ళీ పెరిగింది. అమితాభ్ బచ్చన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అక్టోబర్‌లో జరిగింది. ఇందులో అమితాభ్ బచ్చన్ పదకొండు హిట్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలీజ్ అయిన హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా పాత సినిమాల 4కే రిస్టోరేషన్ను వేగవంతం చేసింది. మల్టీప్లెక్స్‌లకు కొత్త కంటెంట్ కావాలి. వారాల తరబడి, నెలల తరబడి అవి ఒకే సినిమాను ప్రదర్శించవు. అందులోనూ సినిమా సక్సెస్‌ను బట్టి రిలీజ్ అయిన రెండు వారాలలోపే ఓటీటీలోకి ఆ సినిమాలు వచ్చేస్తుంటే మల్టీప్లెక్స్‌లకు ఆడియన్స్ ఎందుకు వస్తారు? కాబట్టి ఓటీటీలోకి వచ్చిన సినిమాను మల్టీప్లెక్స్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి. అందుకోసమైనా కొత్త కంటెంట్ కావాలి. కంటెంట్ లేమితో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రదర్శించడానికి కూడా మల్టీప్లెక్స్‌లు వెనుకాడటం లేదు. సరిగ్గా ఈ సందర్భాన్ని ఫోర్ కే రిస్టోరేషన్ సినిమాలు సమర్థంగా వాడుకుంటున్నాయి. సౌత్‌లో కూడా ఫోర్ కే రిలీజ్ ట్రెండ్‌గా మారింది. దానికంటూ కొత్తతరంలో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది.కొంతమంది నిర్మాతలు దర్శకులు నటులు తమ తొలినాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ ఫోర్ కే రిస్టోరేషన్ను గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ‘శివ’ సినిమా 4కే విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగార్జున ‘శివ సినిమాను నాన్నగారు చూశారు. ఆరోజు మేమిద్దరం కారులో వెళుతున్నాం. నాన్నగారే డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేసరికి ఆయన నా చేతి మీద చేయి వేస్తూ చాలా బాగా నటించావు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో అంచనా వేయడం చాలా కష్టం’ అని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఈ ట్రెండ్ కొనసాగేనా..?ఆ పాత మధురాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసి రిలీజ్ చేస్తే ప్రస్తుతానికైతే ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని చాలా సినిమాలను ఫోర్ కేలోకి మారుస్తున్నారు. అయితే ఈ ఆదరణ తాత్కాలికమేనా, లేదా దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందా అంటే ‘అది ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి’ అని సినిమా ప్రముఖులు సమాధానం చెబుతున్నారు. కొత్తగా సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాను 4కేలో రిలీజ్ చేయడం ఖర్చుతో పాటు రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. పాత సినిమాలను 4కేలో రిస్టోర్ చేయడానికయ్యే ఖర్చు దాని నెగటివ్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నెగటివ్ నాణ్యతను బట్టి రూ. 20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే కొత్త సినిమా తీయాలంటే కనీసం ఐదు కోట్లయినా కావాలి. దాన్ని కూడా లో బడ్జెట్ చిత్రంగానే పరిగణిస్తారు. ఆ సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవు. హిట్ టాక్ వస్తే ఆడియ¯Œ ్స వస్తారు. లేదంటే పోస్టర్ మైదా ఖర్చులు కూడా రావు. అదే పెద్ద సినిమాలైతే వందల కోట్లు కావాలి. ఎన్ని కోట్లు పెట్టినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు. అదే పాత సినిమాల విషయంలో ఆ భయం అవసరం లేదు. ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ. అలాగని పాత సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని నమ్మకం లేదు.‘మేము గురుదత్ సినిమాలను 4కేలోకి రిస్టోర్ చేశాం. వాటిలో కొన్ని మాత్రమే లాభసాటి బిజినెస్ చేశాయి. ఉదాహరణకు బాజ్ (1953) సినిమాకు ప్రేక్షకులు లేరు. కాని, ప్యాసా (1953) మాత్రం బాగా వర్కౌట్ అయింది’ అని అగర్వాల్ చెప్పారు.ఇప్పుడు పాత సినిమా హక్కుదారులు జాగరూకులయ్యారు. 10–15 రీస్టోర్ చేసిన సినిమాలు దీర్ఘకాలికంగా తమకి ఎంత లాభాలు తీసుకువస్తాయో అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రదర్శన, సినిమా పాపులారిటీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4కే చేసిన పాత సినిమాల రిస్టోరేషన్ తర్వాత మూడు నుండి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రిస్టోరేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది. ప్రేక్షకుడిని చేరుకునే పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా మారి థియేటర్లో ప్రేక్షకుడికి పాత సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. ఫిల్మ్ రిస్టోరేషన్ రంగంలో పనిచేసే కంపెనీలు చెప్పిన దానిని బట్టి ‘ఈ ఫోర్ కే సినిమాల ఆదాయం స్మార్ట్ టీవీలు, యూట్యూబ్‌పై వచ్చే యాడ్స్ ఆదాయం పాత సినిమాల ఆదాయం కంటే అధికంగా ఉంటుంది. ఒక సినిమాని ఫోర్ కేలో చూడాలా లేదా పాత ఫార్మాట్లో చూడాలా అనే సంశయం ప్రేక్షకుడికి అస్సలు లేదు. ఫోర్ కే ఓకే అంటాడు. మారిన ప్రేక్షకుడి అభిరుచి కూడా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం రావడానికి కారణమైంది. ప్రస్తుతం సగటున అగ్రిగేటర్ల లైబ్రరీలో కనీసం 10 శాతం సినిమాలు 4కేలోకి రిస్టోర్ అయ్యాయి. మిగతా 80–90% సినిమాలు కనీసం హెచ్డీ ఫార్మాట్ వరకు అప్డేట్ అయ్యాయి. లభ్యమయ్యే ఆదాయ మార్గాల దృష్ట్యా రాబోయే సంవత్సరాలలో 4కే రిస్టోరేషన్ మరింత పెరుగుతుందని పరిశ్రమ నిపుణుల అంచనా. మరోవైపు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయలేకపోవడం, కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడం వలన సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలకు విడుదల కాకపోవడం, మరో తేదీకి వాయిదా పడడం కూడా ఈ రీ రిలీజ్ సినిమాలకు కలిసి వచ్చే అంశం అయింది. వాళ్ల తేదీలను వీళ్లు ఉపయోగించుకుంటున్నారు.‘క్లాసిక్ సినిమాలకు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఉంటారు. ఒక క్లాసిక్ సినిమాకు ప్రజాదరణ ఉన్నప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారా తక్కువలో తక్కువ 300 నుంచి 400 శాతం లాభం తీసుకు రాగలదు’ అని ‘క్వాలిటీ మేటర్’ వ్యవస్థాపకుడు కౌశిక్ భట్టాచార్య చెప్పారు.అలా 4కే పుట్టింది! 4కేఅంటే సాధారణంగా ‘ఓకే, మంచి క్వాలిటీ’ మాత్రమే కాదు. ఆ స్క్రీన్ లోపల జరుగుతున్న మ్యాజిక్ తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు! 3840 ఎక్స్ 2160 పిక్సెల్స్ అంటే సామాన్యంగా అంటే 8.3 మిలియన్ చుక్కలు! ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ముఖం, రంగు, నీడ అన్నీ ఆ 83 లక్షల పిక్సెల్స్ కలిసి వేసే ఒక అందమైన చిత్రం. అందుకే దీన్నే అల్ట్రా హెచ్డీ అంటారు. ఒకసారి పోల్చితే 720 పిక్సెల్స్ హెచ్డీ నుంచి 1080 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డీ నుంచి దానికి రెట్టింపు 2160 పిక్సెల్స్. ఇప్పుడిది సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1980 నుంచి 1997 వరకు పాత సినిమాలు పాత ఫొటోల్లో ఉండే చిరునవ్వులా స్పష్టత లేని చిత్రాల్లా జీవించాయి. రీల్స్ మీద కాలం వేసిన మరకలు, రంగుల్లో మసక, శబ్దంలో జనాల చప్పట్లు అలా– అవి బతికి ఉండేవి కాని, మెరిసేవి కాదు. తర్వాత 2006లో ఒక్కసారిగా హెచ్డీ టెక్నాలజీతో వాటి రంగు మెరిసింది. ఒక్కో పాత రీల్ మేల్కొంటున్నట్టుగా, పాడైపోయిన ఫ్రేమ్స్‌కు రంగులు పూయడం మొదలయింది. ఇక 2015లో 4కే రాకతో అసలు పండుగ మొదలైంది. పాత సినిమాలకు పునర్జన్మ లభించినట్టుగా– అదే ఏడాదిలో 23 సినిమాలు పుట్టాయి. మరుసటి ఏడాదికి 43 అయ్యాయి. 2022 నాటికి 85. ప్రపంచం మొత్తం పాత ఖజానాలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు పరుగెడుతోంది.ఈ కథ వెనుక నిశ్శబ్ద సూపర్ హీరో మార్టిన్ స్కోర్సేసీ. ఆయన 1990లో స్థాపించిన ఫిల్మ్ ఫౌండేషన్ సంస్థ. నటులు కథలను జీవిస్తే, ఈయన కథలను కాపాడతాడు. ఆయన ఒక్కరితోనే వందలాది సినిమాలు మళ్లీ శ్వాస పీల్చాయి. ఆ జ్వాల భారతదేశానికీ చేరింది. 2015లో నేషనల్ ఫిల్మ్ yð వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) పాడైపోయిన రీల్స్‌ను చేతుల్లోకి తీసుకుని, డిజిటల్ ప్రపంచంలోకి లాగి, 4కే కాంతిలో మళ్లీ నిలబెట్టింది. అప్పటి నుంచే మనం పాత సినిమాలను చూసేటప్పుడు ‘అది పాత సినిమా కాదు, పాత కాలం కొత్తగా పుట్టింది’ అనిపిస్తోంది.సినీ పునరుద్ధరణ ప్రస్థానం∙1980 నుంచి 1997 నెగటివ్ నుంచి ఎస్డీ ఫార్మాట్ ∙2006 నుంచి 2013 హెచ్డీ ఫార్మాట్ ∙2015 2కే ∙2016 4కే ∙2022 8కే ∙1990 ఫిల్మ్ ఫౌండేషన్ అనే సంస్థను హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ స్థాపించారు.∙2015 నుంచి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎఫ్ఏఐ) ఫిల్మ్ రిస్టోరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
కథాకళి: పేపర్ బాయ్
నేను ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతూ సంపాదనకి రోజూ ఉదయం ఆరులోగా వంద ఇళ్ళల్లో దినపత్రికలని సరఫరా చేయసాగాను. అందుకు రెండు గంటల పైనే పడుతుంది. ఆ అదనపు ఆదాయం నా బస్ పాస్‌కి సరిపోతుంది. సమయం అంటే డబ్బు అని ఎందుకు అంటారో అలా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. తక్కువ సమయం తక్కువ డబ్బు, ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు. నా బీట్‌లో అపార్ట్మెంట్స్ తక్కువ. సొంత ఇళ్ళ వాళ్ళు ఎక్కువ. అపార్ట్మెంట్ సబ్స్క్రైబర్స్లోని సౌకర్యం, ఎక్కువ దినపత్రికలని తక్కువ సమయంలో డెలివరీ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఇళ్ళల్లో ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నేను పేపర్లని వేసే ఓ ఇండిపెండెంట్ ఇంటి యజమానిని నెల నెలా కలిస్తే పేపర్ బిల్‌ని కేష్గా చెల్లిస్తూంటాడు. నా కస్టమర్స్ అందరిలోకి ఆయనే ఎక్కువ వయసు గలవాడు. ఆయన మిగిలినవారి కన్నా ప్రేమగా ఉంటాడు. నెల నెలా డబ్బు కలెక్ట్ చేసుకోడానికి వెళ్ళినప్పుడు నా గురించి అడిగి తెలుసుకునేవాడు. నా చదువు ఎలా సాగుతోందని అడిగేవాడు. ప్రతిసారి వాగ్బకరీ ఇన్ స్టంట్ కార్డమమ్ టీని ఇచ్చి కాని పంపేవాడు కాదు. నాలుగు నెలల క్రితం బిల్ కోసం వెళ్తే ఆయన కోరాడు.‘‘రేపటి నుంచి నువ్వు నాకో సహాయం చేయాలి.’’‘‘అలాగే, చెప్పండి.’’‘‘నువ్వు పేపర్ని కాంపౌండ్ గోడ మీంచి విసిరేసి వెళ్తున్నావు. అలా కాకుండా బెల్ కొట్టి నాకు ఇస్తూండు.’’‘‘అలాగే సర్. కాని నేను ఆ పేపర్ సరిగ్గా మీ తలుపుకి తగిలి దాని ముందు పడేలా చక్కగా విసురుతున్నాను. ఇంతదాకా ఎన్నడూ నేను మిస్ అవ్వలేదు. అయ్యానా సర్?’’ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.‘‘లేదు. నీ టాలెంట్‌ని గుర్తించాను. కాని నువ్వా పని చేయాలి. నేను అడిగేది నీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అని నాకు తెలుసు. నీ సమయానికి నీకు నెలకి ఐదు వందలు అదనంగా చెల్లిస్తాను. సరేనా?’’‘‘అది చాలా పెద్ద మొత్తం సర్. నూట ఏభై చాలు.’’ఆయన నవ్వి చెప్పాడు.‘‘నీకు. నాకు కాదు. నిజానికి నాకు అది చాలా చిన్న మొత్తం. ఎందుకంటే...’’ఆయన చెప్పింది విన్నాక మర్నాటి నుంచి ఆయన ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి డోర్ బెల్ కొట్టి తలుపు తెరచిన ఆయనకి ‘గుడ్ మార్నింగ్’ చెప్పి పేపర్ ఇవ్వసాగాను.ఆయన ప్రతిసారి కృతజ్ఞతగా ‘థాంక్యూ. గాడ్ బ్లెస్ యు’ అంటారు. ‘బై సర్. టేక్ కేర్ సర్’ లాంటి మాటలు చెప్పి నేను సైకిల్ ఎక్కుతాను. నెలకి ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయానికి మా ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఎక్కువ ఆనందించింది. ఇంట్లో కుట్టు మెషిన్ తో బ్లౌజులు కుట్టడానికి ఒకో దానికి మా అమ్మ సంపాదించే మొత్తం అది. ఓరోజు తలుపు తట్టినా ఆయన తెరవకపోవడంతో పేపర్ని తలుపు ముందు పడేసి వెళ్ళిపోయాను. నా బీట్ ముగిశాక ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి చూస్తే పేపర్ అక్కడే ఉంది. ఆయన కోరిక ప్రకారం నేను మధ్యాహ్నం పన్నెండున్నరకి మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ఇంటి తలుపు ముందు దినపత్రిక నేను వేసిన చోటే కనిపించింది. ఆ తర్వాత ఆయన కోరింది చేశాను.పోలీసుల దగ్గరకి వెళ్ళి ఆయన ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పాను. ఆ వృద్ధుడు నాకు ఇచ్చిన తన మాజీ కొలీగ్ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ గల కాగితాన్ని నేను ఎస్సైకి ఇచ్చాను. నేను చెప్పింది విని ఎస్సై ఓ కాన్ స్టబుల్ని ఆ పని చూడమన్నాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాము.లోపల టీవీ ఆన్ లో ఉంది. దాని ముందు సోఫాలో కూర్చున్న ఆయన ఒరిగిపోయిన తీరు చూడగానే పోయాడని మాకు అర్థమైంది. ఆయన చేతిలోని రిమోట్ తీసే ప్రయత్నం చేసినా, రాకపోవడంతో కాన్ స్టబుల్ చెప్పాడు.‘‘రిగర్‌మార్టిస్. పోయి చాలా గంటలైంది.’’ఆయన మరణించాడని తెలిసి నేను బాధపడ్డాను. ఓ కస్టమర్‌ని కోల్పోయాననో, నెలకి ఐదు వందలు పోయాయనో కాదు. ఆయన పరిస్థితి గురించి తెలిశాక. ఆయన కొడుకు ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసి ఆ విచారకర వార్త చెప్పాను. అతను వచ్చేలోగా ఆయన మృతదేహాన్ని హాస్పిటల్లో భద్రపరిచే ఏర్పాటు ఆయన కొలీగ్ చేశాడు. ఆయన పోయిన పదమూడో రోజు నాకు ఆయన కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే తనని కలవమని చెప్తే వెళ్ళాను. ఓ కవర్ ఇచ్చాడు. దానిమీద నా పేరుంది. దాన్ని చింపి చదివాను.డియర్ పేపర్ బాయ్, థాంక్స్. నువ్వు డోర్ బెల్ నొక్కినప్పుడు నేను తలుపు తెరవక పోవడానికి కారణం తెలిశాక ఇది నీకు అందుతుంది. నా భార్య ఆరు నెలల క్రితం పోయింది. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాకు వీసా దొరక్క ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నా శవం కుళ్ళిన వాసన వచ్చాక కాక, నేను పైకి వెళ్ళానన్న వార్త మా అబ్బాయికి వెంటనే తెలియచేయడానికి నీతో ఆ ఏర్పాటు చేసుకున్నాను. నన్ను ముఖాముఖి కలిసేవారు, నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు. డోర్ బెల్ మోగి తలుపు తెరవగానే నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాగా చదువుకో బై! గాడ్ బ్లెస్ యు.ఉత్తరానికి పెట్టిన జెమ్ క్లిప్‌కి నా పేర ఏభై వేల రూపాయలకి తారీఖు వేయని చెక్కు కూడా ఉంది. -
బాబాకు ఇష్టమైన ఏనుగు
సాయిగీత అనేది శ్రీ సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఏనుగు. ఈ ఏనుగును సత్యసాయి బాబా ప్రేమగా చూసుకునేవారు. ఆ ఏనుగు చనిపోయిన తర్వాత దానికి పుట్టపర్తిలో ఒక సమాధి నిర్మించారు. ఇక్కడ సాయిగీత (ఏనుగు) సమాధికి నిత్యపూజలు నిర్వహిస్తారు. శ్రీ సత్యసాయిబాబా 1962లో ముదుమలై అటవీ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినప్పుడు, అనాథగా మిగిలిన గున్నటేనుగును అటవీ అధికారులు అప్పగించారు. బాబా దానిని చేరదీసి, దానికి సీసాతో పాలు తాగించారు. తనతో పాటు పుట్టపర్తికి తీసుకొచ్చారు. సాయిగీత అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకునేవారు. సాయిగీత ఎల్లవేళలా శ్రీ సత్యసాయిబాబాను వెన్నంటి ఉండేది. సాయిగీత 2007 మే 22న తుదిశ్వాస విడిచింది. బాబా స్వయంగా దగ్గరుండి శాస్త్రోక్తంగా అంతిమసంస్కారం జరిపించారు. -
నేను సాయిబాబాను
ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేకత ఉంది. మూడు పవిత్రతల సమ్మేళనం భగవాన్ శతజయంతి ఉత్సవాలు, దీపావళి పర్వదినం, అవతార ప్రకటన దినం ఒకేసారి రావడంతో భక్తుల్లో పండుగ వాతావరణం నెలకొంది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల రోజుల ముందు నుంచి పుట్టపర్తి వ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అవతార ప్రకటన దినం ఓ వేడుకలా సాగింది. అదే రోజున దీపావళి పండుగ రావటంతో సందడి వాతావరణం నెలకొంది. నాదస్వరం, వేదఘోష, సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ బ్యాండ్ వాయిద్యాలతో సభా మందిరం సాయి నామస్మరణతో మార్మోగింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ ఉదయం ప్రశాంతి నిలయంలో భక్తి ఆధ్యాత్మికతలు వెల్లివిరిశాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థినులు దేశం నలుమూలల నుంచి చేరి సాయి చరిత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టమైన అవతార ప్రకటన దినోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎనభై ఐదేళ్ల క్రితం ఇదే రోజున పుట్టపర్తికి చెందిన పద్నాలుగేళ్ల దివ్యబాలుడు, చిన్న సత్య తన దివ్య స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ‘నేను సాయిబాబాను’ అని ప్రకటించిన ఆ మాటలు మానవ చరిత్రలో దిశ మార్చిన శబ్దాలుగా మారాయి. అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, దైవ అవతరణకు నిదర్శనంగా అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థులు ‘సాక్షాత్ పరబ్రహ్మ సాయి’ అనే ప్యానల్ చర్చ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవాన్ అవతార లక్ష్యం, మార్గం గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. వేడుకలు సంగీత సమర్పణతో ముగిశాయి. సాయిబాబాపై రాసిన ప్రతి పాటలోనూ.. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం కనిపించాయి. -
శ్రీ సత్యసాయి బాబా సూక్తులు
→ ఆశలకోసం కాదు, ఆశయాలకోసం జీవించు→ నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని ఆశిస్తావో ముందు నీవు వారిని ఆ రీతిగా గౌరవించు.→ అతి భాష మతిహాని, మితభాష అతిహాయి→ సత్యం నా ప్రచారం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావం, ప్రేమ నా స్వరూపం.→ ప్రార్థించే పెదవులకన్న సేవచేసే చేతులు మిన్న→ గ్రామసేవే రామ సేవ, జనసేవే జనార్దన సేవ→ హరికి దాసులు కండి, సిరికి కాదు.→ విద్య జీవిత పరమావధికే గానీ జీవనోపాధికి కాదు→ భక్తి అనేది దేవుని కోసం కన్నీరు పెట్టడం కాదు, దేవుని సంతోషం కోసం జీవించడం.→ భక్తి అంటే నిరంతర ప్రేమ, ప్రతిఫలం ఆశించని ప్రేమ.→ నా భక్తుల ప్రేమే నాకు ఆహారం, వారి సంతోషమే నా శ్వాస.→ నీ దినచర్యను ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం గావించు. దైవ సన్నిధికి మార్గం ఇదే.→ ప్రేమే నా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం.→ ఉన్నది ఒకే కులం – మానవ కులం. ఉన్నది ఒకే మతం –ప్రేమమతం. ఉన్నది ఒకే భాష – హృదయ భాష. ఉన్నది ఒకటే దైవం – ఆయన సర్వాంతర్యామి.→ భగవంతుడు బాహ్యప్రియుడు కాదు. భావ ప్రియుడు→ మతులు మంచివైతే అన్ని మతములూ మంచివే.→ భగవంతుడు నీ మతమును చూడడు, నీ మతిని చూస్తాడు.→ ప్రేమతో ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతాను→ నా జీవితమే నా సందేశం. -
కొనసాగుతున్న బాబా ఆశయాలు
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ç2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.కేజీ నుంచి పీజీ వరకువిద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్‌లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.ఉచిత తాగునీటి సరఫరానిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్‌లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. -
‘అనంత’ భగీరథుడు సత్యసాయి
జలం జీవాధారం. నీరు లేని చోట జీవితం లేదు. ఎక్కడ దాహార్తి ఉందో... అక్కడే సేవ ఉండాలి... -భగవాన్ శ్రీ సత్యసాయి బాబాఅనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రూ.300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1995 నవంబర్ 18న ప్రారంభించారు.దివిజ గంగను భువికి దించిన భగీరథుడు ఎంతటి లోకోపకారం చేశాడో, శ్రీ సత్యసాయిబాబా కూడా తాగునీటికి అల్లాడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు అంతటి ఉపకారం చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1051 గ్రామాలకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 452 ఎత్తయిన ప్రాంతాలు, గిరిజన ఆవాసాలకు, చెన్నై నగరానికి తాగునీటిని అందించడానికి సత్యసాయి గంగ ప్రాజెక్టును, నీటిశుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల దాహార్తి తీరుతోంది.అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టుఆంధ్రప్రదేశ్లోని కరవుపీడిత జిల్లా అనంతపురం. దేశంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండోప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే పెన్నా, హగరి, చిత్రావతి నదులు వేసవిలో ఎండిపోతాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటమే కాకుండా, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలలో శారీరక వైకల్యాలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండేవి. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఫలితంగా విపరీతమైన అలసటకు లోనై కీళ్లనొప్పులతో బాధపడేవారు.అనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. రూ. 300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1995 నవంబర్ 18న ప్రారంభించారు. దీనిని 1997 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణల కోసం లార్సెన్ అండ్ టూబ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండువేల కిలోమీటర్ల పొడవున వివిధ పరిమాణాల్లోని పైప్లైన్లు వేశారు. దాదాపు 100,000 లీటర్ల నుంచి 2,500,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 43 సంపులు నిర్మించారు. అలాగే,3,00,000 లీటర్ల నుంచి 10,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కొండల పైభాగంలో నిర్మించారు. వీటికి తోడు 270 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లను, 125 గ్రౌండ్–లెవల్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో 2500 లీటర్ల సామర్థ్యం కలిగిన 1500 కంటే ఎక్కువ ప్రీకాస్ట్ కాంక్రీట్ సిస్టెర్న్లను ఏర్పాటు చేశారు. ప్రతి సిస్టెర్న్లో ప్రజలు నీటిని సేకరించడానికి నాలుగు కుళాయిలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన ఈ భారీ ప్రాజెక్టు కింద 731 గ్రామాలకు ఉచితంగా తాగునీరు సరఫరా అవుతోంది.భారత ప్రభుత్వం తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పత్రం ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ ట్రస్ట్‌కు ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది, ఆ ప్రశంసాపత్రంలో ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఏ రాష్ట్ర బడ్జెట్ మద్దతు లేకుండా, సొంతంగా ఒక ప్రాజెక్టును అమలు చేయడంలో అసమానమైన ఉదాహరణగా నిలిచింది, ఇది 731 నీటిఎద్దడి, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టణాలకు దాదాపు 18 నెలల కాలపరిమితిలో ప్రయోజనం చేకూర్చేలా రూ. 300 కోట్ల్ల వ్యయంతో ఒక భారీ నీటి సరఫరా ప్రాజెక్టు’ అని శ్లాఘించింది.గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో సత్యసాయి బాబా చేసిన నిరుపమానమైన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ 1999 నవంబర్ 23న ఒక తపాలా బిళ్ళను, ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.జపాన్‌లోని ఒసాకాలో 2003లో జరిగిన మూడవ ప్రపంచ జల వేదికలో సత్యసాయి నీటి ప్రాజెక్టును ప్రస్తుతిస్తూ ఒక ప్రతినిధి దీనిని కేస్ స్టడీగా మాత్రమే కాదు, మానవాళికి ప్రేమను పంచే కథగా కూడా చూడాలని కొనియాడారు. మెక్సికోలో 2006లో జరిగిన నాలుగో ప్రపంచ జల వేదికలో ఈ ప్రాజెక్టు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడే అత్యుత్తమ పది స్థానిక కార్యాచరణలలో ఒకటిగా ఎంపికైంది.సత్యసాయి గంగ కాలువతమిళనాడు రాజధాని చెన్నై (అప్పటి మద్రాస్), దాదాపు 1.19 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం . ‘డెట్రాయిట్ ఆఫ్ ఆసియా’గా పేరుపొందిన చెన్నై మహానగరం– ఆటోమొబైల్స్, బీపీఓ, సాఫ్ట్వేర్, డేటా సెంటర్లు, వస్తూత్పత్తి, వైద్య పర్యాటకం, ఫిన్ టెక్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఈ నగరంలో 2004 డిసెంబర్ వరకు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ప్రజలు మంచినీటి కోసం కుళాయిల వద్ద బారులు తీరి ఉండేవారు. చెన్నై నగరానికి సమీపంలో ప్రధాన నదులేవీ ప్రవహించవు. అందువల్ల చెన్నై పంతొమ్మిదో శతాబ్ది చివరి రోజుల నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉండేది. 2004 సంవత్సరానికి ముందు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేసవిలో ఒక్కోసారి వరుసగా మూడు రోజులు నీటి సరఫరా లేకుండా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నగరానికి రోజుకు దాదాపు 750 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, కేవలం 250 మిలియన్ లీటర్ల సరఫరా మాత్రమే ఉండేది.1960ల ప్రారంభంలో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 15 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి మద్రాసుకు తీసుకువస్తామని ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ వాటా కృష్ణా నీటిలో 5 టీఎంసీలను సమకూరుస్తాయి.శ్రీశైలం జిల్లాలోని సోమశిల జలాశయం నుండి 150 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి, అక్కడి నుండి చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే తమిళనాడులోని పూండి జలాశయానికి తీసుకెళ్లాలి. కండలేరు, పూండి జలాశయాలను కలిపే కండలేరు–పూండి కాలువను తెలుగు గంగ అని పిలుస్తారు. ఇది 1996లో పూర్తయింది.అయితే, ప్రణాళికాబద్ధమైన 15 టీఎంసీల నీటిలో, కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే పూండి జలాశయానికి చేరుకునేది. మిగిలిన నీరు బాష్పీభవనం, నీరు కారడం, కాలువ గోడల కోత కారణంగా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత కాలువ శిథిలావస్థకు చేరుకుంది. లక్షలాది మంది చెన్నై ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రమై, ఈ సమస్యకు పరిష్కారం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తాను దృఢ సంకల్పంతో ఉన్నట్లు శ్రీ సత్యసాయి బాబా 2001 జనవరి 19న ప్రకటించారు.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన చెన్నై నీటి ప్రాజెక్టు జూలై 2002లో ప్రారంభమైంది. ఇది చెన్నైకి తగినంత తాగునీటిని సరఫరా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా శిథిలావస్థలో ఉన్న కండలేరు–పూండి కాలువను పునరుద్ధరించి, కండలేరు జలాశయం సామర్థ్యాన్ని పెంచారు. మొత్తం 150 కి.మీ. పొడవున్న కండలేరు–పూండి కాలువలో 65 కిలోమీటర్లు లైనింగ్ వేశారు. వరదలు సంభవించినప్పుడు నీటిని మళ్లించడానికి మూడు ఎస్కేప్ రూట్లను నిర్మించారు.ఈ ప్రాజెక్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, వేగంగా అభివృద్ధి చెందింది. దీని నిర్మాణానికి దాదాపు నాలుగువేల మంది కార్మికులు అహరహం పనిచేశారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో కేవలం పదహారు నెలల వ్యవధిలోనే పూర్తయింది.ఇప్పుడు చెన్నైకి సరఫరా అయ్యే నీరు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కండలేరు వద్ద ఉన్న జలాశయం నిండిపోవడం విశేషం. చివరగా బాబా 79వ పుట్టినరోజున– 2004 నవంబర్ 23న, కండలేరు జలాశయం గేట్లు తెరిచారు. ఇది వరకు గేట్లు తెరవగానే ఇక్కడ ఉప్పొంగే జలాలు చెన్నై వరకు 150 కిలోమీటర్లు చేరుకోవడానికి దాదాపు పదిరోజులు పట్టేది. పునరుద్ధరణ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే ఈ జలాలు తమిళనాడు సరిహద్దులకు చేరుకుంటుండటం విశేషం. పునరుద్ధరణ తర్వాత నీరు విడుదలైన కొద్ది రోజులకు– 2004 డిసెంబర్ 11న చెన్నై నుంచి పలువురు భక్తులు బాబాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. బాబాకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండలేరు–పూండి కాలువ ప్రాజెక్టును ‘తెలుగు గంగ’కు బదులుగా ‘సత్యసాయి గంగ’గా నామకరణం చేసింది.శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ అవసరాలను తీర్చడానికి శ్రీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ‘శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్’ ఏర్పాటైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 177 జిల్లాల్లో తాగునీటి వనరులు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో కలుషితమయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల దాదాపు 6.2 కోట్ల మందికి పైగా ప్రజలు సతమతం అవుతుండేవారు. ఈ సమస్యను చక్కదిద్దడానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సెంట్రల్ ట్రస్టు నిధులతో నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 2020 నాటికి ఆరు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో రూ.5.4 కోట్ల పెట్టుబడితో 108 నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు నీటి నుంచి కాలుష్య కారకాలైన ఆర్సెనిక్ వంటి భార లోహాలను తొలగించగలవు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈ మిషన్ 10 మండలాల్లోని 350 గ్రామాలకు తాగునీటిని అందించింది, ఈ ప్రాంతంలో 4,40,585 జనాభా ఉంది. ఈ ప్రాజెక్టులో కొండ ప్రాంతాల గుండా పైపులైన్లు వేయడంతో పాటు నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 2018–2019లో కేరళలోని సత్యసాయి సేవా సంస్థ ప్రారంభించిన సత్యసాయి ప్రేమధార ప్రాజెక్ట్ 119 నీటి వడపోత యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 14 జిల్లాల్లోని దాదాపు 1,65,000 మంది పౌరులకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.మెదక్, మహబూబ్ నగర్ ప్రాజెక్ట్అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టు విజయవంతం అయిన తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ట్రస్ట్ ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టింది. దాదాపు 320 గ్రామాలు ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులుగా ఉన్నాయి.ప్రాజెక్ట్ వివరాలు» రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు నోచుకుంది.» దాదాపు 2800 కిలోమీటర్ల పైపులైన్లు వేసి, సుమారు 40 లక్షల మందికి నీటి సరఫరా చేసే సామర్థ్యంతో రూపొందింది.ముఖ్య నిర్మాణాలు» పెద్దకోట్లలో హెడ్‌వర్క్స్ నిర్మాణం» మద్దెల చెరువులో 10 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం» అప్పరా చెరువు, కృష్ణాపురం రోడ్ క్రాస్, కేశాపురం, కొత్తచెరువు ప్రాంతాల్లో 5 సంపులు» కొత్తచెరువు (కొండపై), పెదపల్లి, హెచ్ఎన్ ఎస్ఎస్ టన్నెల్ వద్ద 2 గ్రౌండ్ లెవల్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు» వివిధ ప్రాంతాల్లో 2 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు, పంప్ హౌస్లుతూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వెనుకబడిన కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు, పేద ప్రజలు బోరుబావులు, వాగుల నుంచి నీటిని పొందుతున్నారు. నిత్యం ప్రవహించే గోదావరి, దాని ఉపనది పాములేరు నుంచి నీటిని సేకరించి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తూర్పు గోదావరిలోని 212 జనావాసాలలో సుమారు 2,20,000 మందికి; పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 240 జనావాసాలలో 4,70,000 మందికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రాజెక్టులను చేపట్టింది . రెండు జిల్లాల్లోని ప్రాజెక్టులు పూర్తిచేసి, 2007 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. -
సత్యసాయి ట్రస్ట్ ప్రేమను పంచడంలో ప్రపంచానికి దిక్సూచి
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం తదితర ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా సాయి నామస్మరణ పాటిస్తున్నారు. మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆధ్వర్యంలో బాబా ఆశయాలను ఆధునిక రూపంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచానికి ప్రేమ, సేవా, సత్య సందేశాన్ని విస్తరిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్మించిన ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా, మానవ సేవకు ఉదాహరణగా నిలుస్తోంది.విరివిగా డిజిటల్ వినియోగం» డిజిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భక్తులతో ఆన్ లైన్ సత్సంగాలు, ప్రసంగాలు.» సౌర శక్తి వ్యవస్థల ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి.» స్మార్ట్ కంట్రోల్ యూనిట్స్ ద్వారా ఆశ్రమంలో విద్యుత్, నీటి వినియోగ నియంత్రణ.సూపర్ స్పెషాలిటీ (ప్రశాంతిగ్రామ్ – వైట్‌ఫీల్డ్) ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్, అధునాతన హృద్రోగ శస్త్ర చికిత్సల పరికరాలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్స్.» రోగుల వైద్య వివరాలు పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసి వేగవంతమైన సేవలు అందిస్తున్నారు.» ఇక్కడ అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించడం ప్రపంచానికే ఆదర్శం.» శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకోవడం, కచ్చితమైన ఫలితాలు సాధించడం.» సత్యసాయి విద్యాసంస్థల్లో విలువల ఆధారిత సమగ్ర విద్యను అందించడం.» విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవికాసం, సేవాస్ఫూర్తి కలిగించడం.» విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యాసహాయం.» శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ఆధ్వర్యంలో 9 గ్రామీణ బాల సంరక్షణ కేంద్రాలు (అంగన్వాడీలు) పునర్నిర్మించారు.అంతర్జాతీయ సేవా విస్తరణభారతదేశంతో పాటు విదేశాలలో కూడా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించడం. విద్య, ఆరోగ్య, శాంతి సదస్సులు, ఆహార సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ శ్రీసత్యసాయి బాబా మహా సమాధి తర్వాత కూడా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ నేతృత్వంలో ట్రస్ట్ భగవాన్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది.కొనసాగుతున్న బాబా ఆశయాలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సత్యసాయిట్రస్ట్ ఆధ్వర్యంలోసేవా కార్యక్రమాలు -
సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్ శ్రీసత్యసాయిబాబా
భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఉపాధి కోసం కావలసిన భౌతిక జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. విద్యార్థి జీవితంలో నిజమైన ఆనందం పొందాలంటే, జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని మన ప్రాచీన గురువులు తెలుసుకున్నారు. అందుకే వారు విద్యాబోధనతో పాటు ధార్మికత, బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల సౌశీల్యాన్ని పెంపొందించడమే విద్యకు గల పరమలక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు.‘సా విద్యా యా విముక్తయే’ అని వేదోక్తి. అంటే, విద్యతోనే మనిషికి విముక్తి సాధ్యం. మనిషిని విముక్తి వైపు నడిపించేదే నిజమైన విద్య. నేటికాలంలో విద్య వాణిజ్యంగా మారింది. సమాజం భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతికంగా పతనమవుతోంది. సత్యం, ధర్మం, కృతజ్ఞత, భక్తి వంటి ఉన్నత విలువలు వెనుకబడిపోయి; ధనాసక్తి, అధికారదాహం పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, నిరాశ, ఆందోళన– విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోయిందనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.ఎడ్యుకేర్ – బాబా ఆవిష్కరించిన విద్యా సూత్రంవిద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయిబాబా ‘ఎడ్యుకేర్’ భావనను ప్రవేశపెట్టారు. ‘ఎడ్యుకేర్’ లాటిన్ పదం. దీని అర్థం ‘మనలో దాగి ఉన్నదానిని వెలికి తీయడం’. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో ఈ విధానం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి, వారిలో ఉన్నత విలువలను పాదుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్ విద్య కాదు, మనసు, హృదయం, చేతులు అనే మూడు కోణాల సమగ్రాభివృద్ధి.శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ఆవిర్భావంశ్రీ సత్యసాయిబాబా 1981లో అప్పటికే అనంతపురం, వైట్‌ఫీల్డ్, పుట్టపర్తిలలో ఉన్న కళాశాలలన్నింటినీ ఏకీకృతం చేసి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) నెలకొల్పారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభించారు. ఈ సంస్థల్లో ప్రైమరీ స్థాయి నుంచి పోస్ట్ డాక్టరల్ స్థాయి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఈ సంస్థల్లో విద్య పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల విశిష్టతకు ఇదే నిదర్శనం.శ్రీ సత్యసాయి విద్యావాహిని దేశంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర విద్యను అందించాలనే సంకల్పంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 2010 నవంబర్ 23న ‘శ్రీ సత్యసాయి విద్యావాహిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను, ప్రావీణ్యాన్ని అందించడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల్లో విజయవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, సత్యసాయి విద్యావిధానాన్ని ప్రతి పాఠశాలకు, ప్రతి గురువుకు, ప్రతి విద్యార్థికి చేరవేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవా సంసిద్ధత కలిగిన సచ్ఛీలురైన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులు కేవలం విద్యార్హతలు మాత్రమే కలిగిన వారిగా కాకుండా; దేశసేవ పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌరచైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే దీని సంకల్పం. విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని మూలసిద్ధాంతం. ఈ కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మానవీయ విలువలతో కూడిన పాఠ్యాంశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉచితంగా అందిస్తుంది.సాంకేతిక సహకారంతో సేవ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమంలో ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవకులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ‘అందరికీ సమీకృత విద్య’ అనే బాబా ఆశయాన్ని సాకారం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఇది సాధారణమైన విద్యా కార్యక్రమం కాదు, భారతీయ విద్యా వ్యవస్థను సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనే విలువలతో పునరుజ్జీవింపజేసే మహాయజ్ఞం. ‘విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అది దైవత్వానికి, సేవకు, సమగ్రతకు దారి చూపాలి’ అనే ప్రాచీన భారతీయ మౌలిక సూత్రానికి ఆధునిక కార్యాచరణ ప్రస్థానం.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్యాసంస్థలుపుట్టపర్తి, అనంతపురం, నందిగిరి, బెంగళూరులలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచిత రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. మానవీయ విలువలు, నైతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ విద్యాసంస్థల్లో బోధన కొనసాగుతోంది. పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా, పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి, సామాజిక సేవా నిబద్ధతలను పెంపొందించేలా ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో చదువుకునే విద్యార్థులు తమ విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించి, తప్పనిసరిగా అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాసంస్థలు ఇవీ...శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం ప్రారంభించిన నాన్ రెసిడెన్షియల్ పాఠశాల. తొలుత దీనిని 1972లో తెలుగు మీడియం పాఠశాలగా బాబా తల్లి పేరిట ప్రారంభించారు. తర్వాత 2010లో సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మార్చారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం మొదటి బ్యాచ్ 2010 జూన్ 10న ప్రారంభమైంది. పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు.శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం నెలకొల్పిన రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల. ఇందులో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్–బెంగళూరు, నందిగిరి, అనంతపురం క్యాంపస్‌లలో పనిచేస్తోంది.ఇది విద్యార్థులకు ఉచితంగా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. ఈ క్యాంపస్‌లలోని విద్యా వ్యవస్థ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థను పోలి ఉంటుంది. ఇక్కడ విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి క్యాంపస్‌లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్) ఉంది. అధునాతన పరిశోధన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత. శ్రీ సత్యసాయి మీర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, పుట్టపర్తి ఈ సంగీత కళాశాల 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది వివిధ సంగీత విభాగాలలో ఫౌండేషన్, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్ కోర్సులను అందిస్తుంది. దీనిని 2017లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లోని ఒక విభాగంగా మార్చారు.ఇతర రాష్ట్రాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్టేట్ ట్రస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, ఇండోర్, ముంబై, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. మీ తల్లిదండ్రులను గౌరవించండి.. గురువులను ఆరాధించండి..సమాజానికి సేవ చేయండి..ఇదే నిజమైన విద్యార్థి ధర్మం.‘గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే కాదు, జీవన మార్గం చూపే వెలుగు’ అనేదివిద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తరచుగా చేసే ఉద్బోధ.రతన్ టాటా చేతుల మీదుగా శ్రీ సత్యసాయి విద్యా వాహిని ప్రారంభంశ్రీ సత్యసాయిబాబా 2010లో తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇతోధికంగా సహాయ సహకారాలందించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం కింద 2023 నవంబర్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నైపుణ్యాలను పంచుకోవడానికి ఎన్సీఈఆర్టీ, సీఐఈటీలతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అతున్యత వైద్య సేవలు
వైద్యులు త్యాగ స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలి. దీనికంటే గొప్ప సేవ మరొకటి లేదు. దిక్కులేని వారికి, నిస్సహాయులకు దేవుడే ఏకైక ఆశ్రయం. మానవుడు దేవుని స్వరూపం కాబట్టి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు సహాయం చేయడం అతని ప్రాథమిక కర్తవ్యం. – శ్రీ సత్యసాయి బాబా‘సేవే సత్యసాధన’ అనే సూత్రంతో, సమాజంలో ఆర్థిక, సామాజిక స్థాయులకు అతీతంగా అందరికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విస్తృతంగా కృషి చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, మానవాళి సేవలో అగ్రగామిగా నిలిచిన ఒక పుణ్య సంస్థ. ‘ప్రేమతో చేసే సేవే నిజమైన సేవ’ అనే సూత్రాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఈ ట్రస్ట్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ లక్ష్యాలుపేద ప్రజల ఇంటి ముంగిటకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సాధించడం.ఆరోగ్యం – పరిశుభ్రతతో సహా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడం.ఆరోగ్య సంరక్షణ అమలులో అనుసరించే సూత్రాలు :శ్రీ సత్యసాయి బాబా అమలు చేసిన ఆరోగ్య సంరక్షణకు ఈ కింది ఆరు సూత్రాలే మార్గదర్శకాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్య సంరక్షణ సంస్థల కార్యకలాపాలలో శ్రద్ధగా అనుసరిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ ఉచిత ఆరోగ్య సంరక్షణ కారుణ్య ఆరోగ్య సంరక్షణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడం వైద్యుడికి, రోగికి మధ్య హృదయపూర్వక, ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యసేవల ఉద్దేశం. శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ఈ అంశాన్ని వివరిస్తుంది. శ్రీ సత్యసాయి ఆసుపత్రులలోని సంరక్షణలో మానవీయ అంశ స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ త్రికోణ విధానంశ్రీ సత్యసాయి హెల్త్ కేర్ ఒక సమగ్ర విధానాన్ని కలిగి ఉంది, ఇది కింది మూడు కోణాల విధానం ద్వారా అమలవుతోంది. నివారణ కార్యాచరణ, నివారణ దృష్టి, ఆధ్యాత్మిక స్థావరం వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి వంటి అన్ని స్థాయులలోను ఆరోగ్య విద్యకు సత్యసాయి ఆసుపత్రులు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అలాగే, అన్ని స్థాయులలోనూ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అసంఖ్యాక రోగులకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ సంస్థ అందించే వైద్యసేవలు ఇవీ:వివిధ రాష్ట్రాలలో నిర్వహించే వైద్య శిబిరాలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు, స్పెషాలిటీ శిబిరాలు, గ్రామ సేవలో భాగంగా శిబిరాలు, శ్రీసత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో వైద్య కార్యకలాపాల ఏకీకరణ, వ్యక్తిగత వైద్యుల క్లినిక్‌లు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా ఇందులో భాగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ సర్వీసెస్, టెలీ–మెడిసిన్ సేవలు, రక్తదాన శిబిరాలు (లిక్విడ్ లవ్ డొనేషన్ శిబిరాలు), సాయి పునరావాస కార్యక్రమాలు, పోషకాహార లోపం నిర్మూలన, విపత్తు నిర్వహణ తదితర సేవలను అందించడంలో ముందంజలో ఉంటున్నాయి.నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చికిత్సలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్‌పై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రాథమిక ఆరోగ్య విధానాలపై గ్రామస్థులలో అవగాహన కల్పించడానికి నిపుణులతో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు.జనరల్ హాస్పిటల్స్ గ్రామీణ వైద్య సేవలుపుట్టపర్తిలో 1956లో స్థాపించిన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, 1976లో ప్రారంభమైన వైట్‌ఫీల్డ్ జనరల్ హాస్పిటల్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల దాకా అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఆసుపత్రులు దూర గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలకు వైద్యపరీక్షలు, మందులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి ప్రతీకలు1991 నవంబర్ 22న భగవాన్ బాబా చేత శ్రీ సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ – పుట్టపర్తి ప్రారంభించబడింది.ఈ ఆసుపత్రి గుండె, మూత్రపిండాలు, న్యూరో, యూరాలజీ వంటి క్లిష్టమైన వ్యాధులపై అత్యాధునిక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుంది.ఆ తర్వాత 2001లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించబడింది. అక్కడ కూడా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కేర్ యూనిట్లు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు. ప్రతి రోగికి బాబా ఆశీర్వాదం, వైద్యుల సేవానిరతి కలసిన మానవతా వాతావరణం అక్కడ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.ఉచిత వైద్య శిబిరాలుభగవాన్ నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తోటి మానవులకు సేవ చేయడానికి ప్రేరణ కల్పించారు. భారతదేశంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్యసంరక్షణ అందుబాటులో లేని ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భగవాన్ ప్రేమ, ఆశీస్సులతో ఈ సంస్థల సేవకులు నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఆరోగ్యప్రచారం, విద్య, శస్త్రచికిత్సలు, ఆరోగ్య సంరక్షణ సహా అన్నిరకాల ఆరోగ్యసేవలను నిర్వహించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. లక్షలాది మంది రోగులకు కంటి వ్యాధులకు చికిత్స, వేలాది మందికి కంటిశుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన వివిధ సమితిలు వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్యకేంద్రాలను నిర్వహిస్తున్నాయి.భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలుప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. ఈ శిబిరాలకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారిలో ఎవరికైనా అధునాతన చికిత్స అవసరమైతే, వారిని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి పంపుతారు.ప్రశాంతి నిలయం లేదా ప్రశాంతిగ్రామ్‌లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పురోగతిని సమీక్షించడానికి, శ్రీ సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకోవడానికి వైద్య శిబిరంలోని ప్రతి ఒక్కరితో రోజూ సాయంత్రం సత్సంగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలను విస్తరించడానికి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు పది రోజులు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. సాధారణ శస్త్రచికిత్సలు, కంటిశుక్లం రోగులను సమీప పట్టణాలకు తీసుకువచ్చి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు.శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అనేది మరొక ప్రత్యేకమైన ఉచిత గ్రామీణ ఆరోగ్యసేవ. శ్రీ సత్యసాయి బాబా ఈ సేవలను 2006 మార్చి 3న ప్రారంభించారు. వారానికి ఒకసారి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య క్లినిక్‌లను అనేక సమితిలు నిర్వహిస్తున్నాయి.టెలీమెడిసిన్టెలీమెడిసిన్ కేంద్రాలు నేరుగా వైద్య చికిత్సలను అందించవు. రోగులు ఎవరైనా వీటిని సంప్రదిస్తే, వారికి తగిన ఆసుపత్రులను సూచించడం, అక్కడ లభించే చికిత్స వివరాలను తెలియజేయడం సహా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వివిధ సంస్థలలో వైద్య పరీక్షలువివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీ సత్యసాయి సంస్థల వైద్య బృందాలు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధిగ్రస్థుల నివాసాలు తదితర ప్రదేశాలను తరచు సందర్శించి, అక్కడి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తాయి. సాధారణ వైద్య శిబిరాలతో పాటు స్థానిక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య సేవలతో పాటు వ్యక్తిగత సంరక్షణ, ఉద్యోగ సంరక్షణ, విద్యా సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ, వ్యవసాయ సంరక్షణ, సామాజిక సంరక్షణ వంటి సేవలన్నీ శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో అనుసంధానమై పనిచేస్తుంటాయి.సేవకు ప్రతీక సత్యసాయి వైద్య మిషన్సత్యసాయి ట్రస్ట్ వైద్య సేవలు కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు, ప్రేమతో, కరుణతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే వైద్యు లందరూ సేవా భావంతో పనిచేస్తున్నారు. కుల మత ఆర్థిక వ్యత్యాసాలకు తావు లేకుండా, ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా సూత్రం ప్రకారం ‘మానవుడు దేవుని రూపం’ అనే దృష్టితోనే సేవలను అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆరోగ్య సేవలు ప్రపంచానికి మానవతా దృక్పథానికి ఆదర్శం.‘ప్రేమలోనే వైద్యం ఉంది, సేవలోనే దేవుడు ఉన్నాడు’ అనే బాబా వాక్యం ఈ సంస్థ ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవాయజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షిద్దాం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం. -
ప్రేమ, సేవే లక్ష్యంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబరు 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించిన గొల్లపల్లి– ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడీ సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకొన్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. బాబా బంగారు ఉంగరాలు, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాదిమంది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. కుల మతాలకు అతీతంగా నిలిచారు.సత్యసాయి భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే అపర మేధావిగా, సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు.1940 మే 23న తండ్రి ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు ‘నేను సాయిబాబా’ను అని సమాధానం చెప్పారు. నిదర్శనం చూపమంటే చేతిలో గుప్పెడు మల్లెపూలను తీసుకుని నేలపైకి విసరగా అవి ‘సాయిబాబా’ అనే అక్షరాలుగా ఏర్పడా›్డయి. ఆ చర్యతో బాబా తండ్రి– బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పారు. తాను షిరిడీ సాయికి ప్రతిరూపాన్ని అని, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది.1944లో భక్తులు, బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరం నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయం 1950 నాటికి పూర్తయింది. 1957 సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1956లో చిన్నపాటి జనరల్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పారు. తన వైపు ఎవరినీ తిప్పుకోవాలని రాలేదని, ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. 1973లో హైదరాబాద్‌లో శివం మందిరాన్ని ప్రారంభించారు.అనంతరం 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1991లో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మంచారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో మరొకసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బెంగళూరులో నిర్మించారు. 1965లో సత్యసాయిబాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. దీని ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రజలు సమష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు. ఆయన ప్రసంగంలో లవ్ ఆల్.. సర్వ్ ఆల్ (అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు), హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ (అందరికీ మంచి చేయి.. ఎవరికీ హాని చేయకు) అనే పదాలు ప్రతిసారీ వినిపించేవి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది.ఉచితంగా విద్య, వైద్యంనిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 1972లో ‘శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది. అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అవతార పురుషుడిగా ప్రకటించుకున్న నాటి నుంచి 86 ఏళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన పాటించిన, ప్రారంభించిన విధానాలు నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. -
ట్రెండ్‌గా..మోడర్న్ ఊయలలు..!
ఎంత పెద్దవారైనా బాల్యపు ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటారు. అది సాధ్యం కాదని నిరుత్సాహపడకుండా పెద్దవాళ్లు కూడా ఊయల ఎక్కి చిన్ననాటి ఆనందాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఇంటి అలంకరణలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారిన మోడర్న్ ఉయ్యాలలు ఇంట్లో ఉండటం ఇప్పుడో ట్రెండ్‌గా మారింది.. జూలా లేదా స్వింగ్ అని పిలిచే ఊయలను ఇంట్లో అలంకరించి, ఆనందాన్ని పొందుదాం. ఊయల పెట్టేంత పెద్ద పెద్ద లోగిళ్లు ఈ రోజుల్లో సాధ్యం కాదని నిరుత్సాహం అక్కర్లేదు. చిన్న స్పేస్‌లో కూడా ఏర్పాటు చేసుకోదగిన మోడర్న్ ఊయలలు నేడు అందుబాటులో ఉన్నాయి.ట్రెండ్ ఎందుకు పెరిగిందంటే... చిన్న అపార్ట్మెంట్లు, బాల్కనీలు పెరిగిన నేపథ్యంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగలిగే అవకాశాన్ని ఒక ‘స్వింగ్’ సెటప్ అందిస్తుంది. మోడర్న్ ఫర్నిచర్‌తో కలిపి వుడ్ + మెటల్ చెయిన్ + కాటన్ మెటీరియల్‌తోనూ ఊయలలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులు ఉన్నాయి. ఆన్లైన్–ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇవి లభిస్తున్నాయి. వీటి అమరికకు... ఇంట్లో సర్దుబాటు స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. స్థలాన్ని బట్టి ఊయల ఎంపిక చేసుకోవాలి. అటూ ఇటు తిరుగుతున్నప్పుడు తగలకుండా, ఒక కార్నర్ ప్లేస్ ఊయలకు కేటాయించడం మంచిది.మెటల్ + వుడ్ కలిపి ఉండే ఊయల ఎంచుకున్నప్పుడు కుషన్లు, వాటి రంగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.మ్యాక్రోమేడ్ హ్యాంగింగ్ స్వింగ్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది, లైట్ వెయిట్, మోడర్న్ బోహో లుక్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. టాయ్ స్వింగ్స్ ఇంటి అలంకరణకు మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిని లివింగ్ లేదా డైనింగ్, కిడ్స్ రూమ్, బాల్కనీ కార్నర్ లలో ఉపయోగించవచ్చు. సీలింగ్–మౌంటెడ్ రౌండ్ స్వింగ్ అంటే హాల్ లేదా బాల్కనీలో వీటిని వేలాడదీయవచ్చు. ఇది ఫ్యామిలీ కార్నర్‌గా మారిపోతుంది.ఫోల్డబుల్ ఊయలను అవసరమైనప్పుడు మాత్రమే పెట్టి, తర్వాత తీసి, మడిచి జాగ్రత్త చేయవచ్చు. స్మార్ట్ అర్బన్ లివింగ్‌కి సరైన ఆప్షన్.బాంబూ స్వింగ్స్ నేచురల్ లుక్‌లో కనిపిస్తాయి. ఇవి సస్టెయినబుల్ డెకర్‌లో ఒక భాగం.వాల్–మౌంటెడ్ హ్యాంగింగ్ చెయిర్స్ చిన్న బెడ్రూమ్ లేదా స్టడీ కార్నర్లో కూడా సులభంగా ఫిట్ అవుతాయి.డెకర్ టిప్స్ఊయల చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ పెడితే రిలాక్సింగ్ లుక్ వస్తుంది.కుషన్లు, లైట్ బ్లాంకెట్స్‌తో కంఫర్ట్ టచ్ ఇవ్వచ్చు.ఊయల కింద చిన్న రగ్ లేదా ఫ్లోర్ లాంప్ పెడితే మంచి లుక్ వస్తుంది.ఎకో ఫ్రెండ్లీ టచ్‌తో పాత కుర్చీ ఫ్రేమ్‌ని రీయూజ్ చేసి ఊయలగా మార్చుకోవచ్చు. ‘సస్టైనబుల్ లివింగ్‘కి ఇది ఒక అందమైన ఉదాహరణ. ఊయల అంటే ఒక జ్ఞాపకం. ఒక రిలాక్సేషన్ స్పాట్. మోడర్న్ హోమ్‌లలో ఇది ఇప్పుడు కేవలం సీటింగ్ ఆప్షన్ మాత్రమే కాదు, డిజైన్ స్టేట్మెంట్ కూడా. (చదవండి: గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?) -
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు. ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.ఆధ్యాత్మికతలో ఆదర్శం!బాలీలో మరొక ముఖ్యమైన పండుగ న్యేపి (మౌన దినం) గురించి చెప్పుకోవాల్సిందే! సకా క్యాలెండర్ ప్రకారం బాలి ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుంటూ న్యేపీని ఆత్మపరిశీలన దినంగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో జరుగుతుంటుంది. న్యేపి రోజున, ద్వీపం మొత్తం 24 గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. విమానాశ్రయాలను మూసివేస్తారు. వీధులు నిర్మానుష్యంగా ఉంటాయి. స్థానికులంతా ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి) -
గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!
చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ సింపుల్, క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ అందం వెనక ఉన్న చిన్న చిన్న రహస్యాలు మీకోసం.. జ్యూవెలరీలో నాకు సిల్వర్ ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చిన్న నెక్‌పీస్‌లు అంటే చాలా ఇష్టం! డ్రెస్ ఏదైనా, ఇలాంటి చిన్న చిన్న వాటితోనే లుక్ పూర్తవుతుంది. ఇక చర్మం కాంతిమంతంగా ఉండాలంటే నిద్ర, ఆహారం రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఈ నియమాలనే నేను ఫాలో అవుతానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. గోల్డ్ గ్రేస్!చిన్న చైన్ అయినా, లుక్‌కి రాయల్టీ టచ్! అదే ఈ సింగిల్ లైన్ గోల్డ్ నెక్‌పీస్ మ్యాజిక్. ఈ సున్నితమైన గోల్డ్ చై నెక్‌లైన్‌పై మెరుస్తూ, మీ మొత్తం లుక్‌కి టైమ్‌లెస్ ఎలిగెన్స్ జోడిస్తుంది. ట్రెడిషనల్ చార్మ్‌తో పాటు, మోడర్న్ టచ్ ఉండటమే దీని ప్రత్యేకత. ప్యూర్ గోల్డ్ ఫినిష్, సాఫ్ట్ షైన్ , మినిమల్ డిజైన్‌తో ఏ డ్రెస్సుకైనా ఈ నెక్‌పీస్ సహజంగా బ్లెండ్ అవుతుంది. దీనిని ఓపెన్ హెయిర్, లైట్ మేకప్ కాంబినేషన్‌తో పెయిర్ అప్ చేస్తే ఈ చైన్ లుక్‌కి రిచ్‌నెస్, సాఫ్ట్ గ్లామ్ టచ్ గ్యారంటీ! చిన్న డీటైల్, కానీ పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఓవర్ కాకుండా, పర్ఫెక్ట్గా మెరిసిపోతుంది! దీపిక కొండి (చదవండి: చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?) -
చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?
చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్‌లో ఉండేది. ఒకరోజు చిలక్కి, ఆ పక్షి శాస్త్రవేత్తకీ మాటా మాటా వచ్చింది. చిలుక చికాకును ప్రదర్శించింది. అందుకు ఆ శాస్త్రవేత్త హర్ట్ అయ్యారు. వెంటనే ఆ చిలుక, ‘‘క్షమించండి’’ అంది. నిజానికి చిలుక తప్పేం లేదు. చిలుక అరటి పండు అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏవో గింజల్ని పెట్టారు. చిలుక మౌనంగా ఉంది. ‘‘ఊ, ఇదుగో అరటిపండు. తినూ..’’ అని మళ్లీ గింజల్నే పెట్టి, ఆ చిలుకను మోసం చేసే ప్రయత్నం చేశారు ఆ శాస్త్రవేత్త! చిలుక కోపంగా ఆ గింజల్ని శాస్త్రవేత్తపై విసిరికొట్టింది. చికాకును ప్రదర్శించింది. వెంటనే ‘సారీ’ కూడా చెప్పేసింది! నిజంగా చిలుకలకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా? తెలివితేటలదేముందీ... ఎన్నైనా ఉండొచ్చు. వాటిని ప్రదర్శించటానికి ఈ మూగ జీవులకు మాటలెలా వస్తాయన్నదే ఆశ్చర్యం. ఆ చిలుక పేరు అలెక్స్, ఆ శాస్త్రవేత్త పేరు ఐరీన్ పెప్పర్బర్గ్(Irene Pepperberg). మాటలేనా, భాషలు కూడా!బ్రిటన్‌లో 2010లో ఒక పెంపుడు చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అది మాట్లాడే చిలుక. తన యజమాని మాట్లాడుతుండే బ్రిటిష్ యాసను చక్కగా అనుకరిస్తూ ఉండేది. చిలుక ఎగిరిపోయినందుకు ఆ యజమాని చాలా బాధపడి పోయాడు. తిరిగి నాలుగేళ్ల తర్వాత ఆ చిలుక, యజమాని కలుసుకున్నారు! అయితే చిలుక తన యజమాని మాట్లాడే బ్రిటిష్ భాషను మర్చిపోయింది. బదులుగా స్పానిష్ భాషను మాట్లాడుతోంది! అంటే చిలుకలు మాట్లాడటమే కాకుండా, భాషలు కూడా నేర్చుకుంటాయా? అవును!!మైనాలూ అచ్చు గుద్దేస్తాయిపక్షి జాతిలో మనిషి భాషను అద్భుతంగా అనుకరించేవి చిలుకలతో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి. (బాక్సులలో చూడండి) మనుషుల మాటల్నే కాక, ఇతర శబ్దాలను కూడా గొంతులోంచి అవి అచ్చు గుద్దేయగలవు! వాటిల్లో ప్రధానమైనవి మైనాలు. మైనాల్లో కూడా ముఖ్యంగా ‘కామన్ హిల్’ జాతి మైనాలు మనుషుల స్వర స్థాయులలోని హెచ్చు తగ్గుల్ని పట్టేసి మాట్లాడేయగలవు. స్పష్టత కూడా ఏం తగ్గదు! దక్షిణాసియా, ఆగ్నేయాసియా కొండ ప్రాంతాలు ఈ మైనాల జన్మస్థలాలు. అండమాన్, నికోబార్ దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో మైనాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇండియాలో మరీ అంత విస్తారంగా కనిపించవు కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రపక్షి ఈ‘మైనా’నే. ఇంకా.. స్టార్లింగ్ పక్షులు (ఐరోపా); కాకి జాతిలోని – కోర్విడ్స్, ఆవెన్స్, మేగ్పీస్ (ఆస్ట్రేలియా); జేస్ (బ్రిటన్, కెనడా); లైర్బర్డ్స్, మాకింగ్ బర్డ్స్ (అమెరికా, మెక్సికో); టూయ్ (తేనె భక్షించే న్యూజీలండ్ పక్షి), కానరీ పక్షులు (స్పెయిన్).. మనిషి మాటలనే కాదు.. అలారాలు, ఫోన్ రింగ్టోన్లు, వివిధ రకాల యంత్రాల ధ్వనులను వాటికవి, మంచి మూడ్‌లో చక్కగా మిమిక్రీ చేస్తాయి! ఇదెలా సాధ్యం?!యునీక్ సిరింగ్స్ అనాటమీమాట్లాడే పక్షుల గొంతులోనూ మానవ స్వరాల్లా గమకాలు పలకటానికి ఉన్న సదుపాయం ఏంటంటే.. వాటి శ్వాసనాళ నిర్మాణంలోని ‘యునీక్ సిరింగ్స్ అనాటమీ’! పక్షులకు పెదవులు, దంతాలు ఉండవు. అవి ఉంటేనే కదా, మనకైనా గొంతులోంచి, నోట్లోంచి ధ్వని వెలువడుతుంది. అయితే ఈ మాట్లాడే పక్షుల్లో పెదవులు, దంతాలకు బదులుగా, వాటి శ్వాసనాళం దిగువన ఉండే ‘సిరింక్స్’ అనే స్వరనాళాలు మాట్లాడేందుకు వీలు కల్పిస్తాయి. మనుషులకు స్వరపేటిక ఎలాగో, పక్షులకు స్వరనాళాలు అలాగ! మాటలకు అవసరమైన స్వర తంతువులు మనుషుల్లో వారి ‘లారింక్స్’ (స్వరపేటిక)లో ఉంటే, పక్షుల్లో వాటి ‘సిరింక్స్’ (స్వర నాళాలు)లో ఉంటాయి. మనుషుల స్వర పేటికలోని స్వర తంతువుల మాదిరిగా కాకుండా, పక్షులు శబ్దాలను సృష్టించటానికి తమ ‘సిరింక్స్’లోని మృదువైన కండరాలను నియంత్రించుకుంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఏర్పాటు – పక్షులు భిన్నమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ – శక్తిమంతమైన, వైవిధ్యభరితమైన గాత్రధ్వనులను జనియింపజేయటానికి వీలు కల్పిస్తుంది. వేగవంతమైన పిచ్ స్విచింగ్ఉత్తర అమెరికాలో ‘కార్డినల్’ అనే పక్షి, మాటల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిందా అనిపిస్తుంది! చిలుకల జాతికి ‘చెందని’ ఈ పక్షిలోని సిరింక్స్.. వేగవంతమైన, సంక్లిష్టమైన శబ్దాలను ఉత్పత్తి చేయటానికి వీలు కల్పిస్తుంది. పియానో స్వరాల కంటే కూడా ఎక్కువగా, సెకనులో పదో వంతు లోపు ఈ పక్షులు తమ గొంతును సజావుగా మార్చుకోగలవని పక్షి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటికున్న ఆకట్టుకునే స్వర నియంత్రణ – అధునాతన ధ్వని ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా – వాటిని అప్పటికప్పుడు శబ్దాలను ఉత్పత్తి చేయటానికి అనుమతిస్తుంది. నాలుకలోనే నైపుణ్యమంతా!చిలుకలు తమ నాలుకలను ముందుకు, వెనుకకు కదిలించడం ద్వారా; ముక్కును తెరిచి, మూయటం ద్వారా శబ్దాలను మలచుకుంటాయి. మనుషుల మాటల్ని కూడా ఇదే విధంగా అనుకరిస్తాయి. చిలుకలకు పెదవులు లేనప్పటికీ భాషలోని అచ్చులను, హల్లులను పలకటానికి మానవులు చేసే విధంగా అవి తమ నాలుకలను ప్రత్యేక నైపుణ్యంతో ఉపయోగిస్తాయి. ఈ నైపుణ్యం చిలుకలు, ఇతర మాట్లాడే పక్షులలో అసాధారణమైన స్పష్టతకు, మనుషుల్ని అనుకరించటానికి సహాయ పడుతుంది. చిలుకలు, మరికొన్ని జాతుల పక్షులు మాత్రమే మనుషుల మాటల్ని అనుకరించటానికి కారణం.. మిగతా పక్షుల్లో ఈ విధమైన స్వర నిర్మాణాలు లేకపోవటమే. కలుపుగోలు పలుకులుచిలుకల్లో ప్రకృతి సిద్ధమైన ‘సంభాషణ స్వభావం’ ఉంటుంది. అడవిలో అవి తమ జాతి గుంపులతో బలమైన బంధాలను ఏర్పచుకుంటాయి. ఆ సహజ స్వభావం వల్లనే పంజరాలలో బందీలుగా ఉన్న చిలుకలు కూడా తమ మానవ సహచరులతో బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాయి. మాటా మాటా కలుపుతాయి. మనుషుల మాటల్నే తిరిగి పలుకుతాయి. అన్నవాహిక హెల్ప్ చేస్తుందిమనిషి భాష మాట్లాడటం పక్షులకు అంత తేలికైన పనేమీ కాదు. భాషలో మనకు అచ్చులు, ఉచ్చారణ విధానాలు ఉంటాయి. కొన్నిసార్లు పలకటానికి కొరుకుడు పడని ఉచ్చారణలూ ఉంటాయి. అయితే ఈ ఇబ్బందిని చిలుకలు తమ స్వర మార్గాన్ని మార్చుకోవటం ద్వారా పలుకులో స్పష్టతను సాధిస్తాయి. చిలుకల్లో పెదవులు లేని లోటును తీర్చి, ఉచ్చారణ అడ్డంకులను తొలగించేందుకు, శబ్దాన్ని నోటి ద్వారా బయటికి పంపించటానికి వాటి అన్నవాహిక తోడ్పడుతుంది. అచ్చుల కోసం, అవి తమ నాలుకలను కదిలిస్తాయి. కచ్చితమైన శబ్దాలను బయల్పరచటానికి తమ ముక్కును సర్దుబాటు చేసుకుంటాయి. పాటల పక్షులకు భిన్నంగా..!చిలుకల మెదడులోని నాడీ మండల విద్యుత్ ప్రవాహాలు ప్రత్యేకమైనవిగా ఉన్నందు వల్ల అవి మానవ భాషను వినగలుగుతాయి. గుర్తుపెట్టుకోగలుగుతాయి. సంక్లిష్టమైన ధ్వనులను సైతం ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ సామర్థ్యాలన్నిటినీ అనుసంధానించే వ్యవస్థ చిలుకల మెదడులో ఉంటుంది. పాటలు పాడే పక్షుల్లో ఉండే ఒకే మాదిరి వ్యవస్థ కాకుండా, చిలుకలకు అదనపు సర్క్యూట్ ఉంటుంది. ఇది వాటి జాతుల పిలుపులను, మానవ జాతుల పిలుపులను నేర్చుకోవడానికి వాటికి అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ విధమైన ప్రత్యేక శరీర నిర్మాణంతో చిలుకలు పలకగలవు. అరవగలవు. తిట్టగలవు. ఇక్కడి మాటలు అక్కడ చెప్పనూ గలవు!శిక్షణ ఇస్తే మరింత జ్ఞానం ముఖ్యంగా, శిక్షణ తర్వాత చిలుకలు సందర్భోచితంగా, అర్థవంతంగా పదాలను ఉపయోగించటాన్ని అధ్యయన వేత్తలు గమనించారు. రాత్రి పడుకునే ముందు ‘గుడ్ నైట్’ చెప్పడం, తినేందుకు ఏదైనా పెట్టమని అడగడం, లేదా వస్తువులను లెక్కించడం, వస్తువులను తీసుకురావటం వంటి పనులను చేసే సామర్థ్యం చిలుకల్లో ఉందని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించిన విషయమే. చక్కటి శిక్షణ పొందిన ఆఫ్రికన్ బూడిద రంగు చిలుక ‘అలెక్స్’, తన రంగు గురించి అడిగినప్పుడు శిక్షకులు నివ్వెర పోయారు. తనకు తానుగా ప్రశ్న వేసిన తొలి చిలుకగా అలెక్స్ చరిత్రలో నిలిచిపోయింది. మహా జ్ఞానవతి అలెక్స్!ఫొటోలో కనిపిస్తున్న బూడిద రంగు చిలుక పేరే.. ‘అలెక్స్’. ఈ మహాజ్ఞాని పక్కన ఉన్నది జంతుజ్ఞాన శాస్త్రవేత్త ఐరీన్ పెప్పర్బర్గ్. అలెక్స్‌కు ఏడాది వయసున్నప్పుడు ఐరీనే ఒక దుకాణంలో దానిని కొనుక్కుని అలెక్స్ అని పేరు పెట్టారు. 31 ఏళ్ల వయసులో అలెక్స్ 2007 సెప్టెంబర్ 6న తన పంజరంలోనే విగతజీవిగా కనిపించింది. ఐరీన్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పంజరాలలో ఉండే చిలుకల ఆయుర్దాయం 45 సంవత్సరాలు. (అడవి చిలుకలు అడవిలో ఏదో ఒక ప్రమాదంతో ఇంకా ముందుగానే చనిపోతాయి).‘‘నువ్వంటే నాకిష్టం!’’అలెక్స్ అలా హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో ఐరీన్‌కు అంతుచిక్కలేదు. ఆ ముందు రోజు రాత్రి అలెక్స్ పలికిన చివరి పలుకులు : యు బీ గుడ్ (నువ్వు బాగున్నావు), ఐ లవ్ యు (నువ్వంటే నాకిష్టం), సీ యూ టుమారో (రేపు కలుద్దాం)... అనేవి. ల్యాబ్‌లో పంజరం ఉండేది. ఐరీన్ ఆ ల్యాబ్‌లో పని చేస్తుండేవారు. ల్యాబ్ నుండి ఐరీన్ ఇంటికి వెళ్లే ప్రతి రాత్రీ ఆ చిలుక ఆమెకు ఈ మూడు మాటలతోనే వీడ్కోలు చెబుతుండేది. శవ పరీక్షలో చిలుక మరణానికి స్పష్టమైన కారణాలు బయపడలేదు. ఆ తర్వాతి పరీక్షల్లో ‘గుండెపోటు’ అని నిర్థారణ అయింది.విసిగిస్తే ‘అంతేగా, అంతేగా..’ దాదాపుగా 30 ఏళ్ల పాటు అలెక్స్ సహజజ్ఞానంపై పరిశోధనలు జరిపారు ఐరీన్. అలెక్స్ తెలివి తేటలకు అనేక పరీక్షలు కూడా పెట్టారు. అలెక్స్ 80 శాతం పరీక్షల్లోనెగ్గింది. ఒకసారి అలెక్స్ ముందు రకరకాల రంగుల బ్లాక్స్ (ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనివి కావు) ఉంచి, రెండు ఎరుపు బ్లాకులు, మూడు నీలం బ్లాకులు, నాలుగు ఆకుపచ్చ బ్లాకులు) ఉంచి, ‘‘ఏ రంగు బ్లాకులు మూడు ఉన్నాయి?’’ అని ఐరీన్ ఆ చిలుకను అడిగారు. అలెక్స్ తప్పకుండా నీలం రంగు బ్లాకులు అని చెబుతుందనే అనుకున్నారు ఐరీన్. అయితే అప్పటికే నానా రకాల ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అలెక్స్.. ‘‘ఫైవ్’’ అని చెప్పింది. ఐరీన్ వదలకుండా, ‘‘అవునా? ఆ ఫైవ్ ఏ రంగులో ఉన్నాయి?’’ అని మళ్లీ అడిగారు. సమాధానంగా అలెక్స్, ‘‘ఏవీ లేవు’’ అని చెప్పింది. దాన్ని బట్టి చిలకలు కూడా, అడిగిందే అడుగుతుంటే మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని, కావాలని తప్పుగా సమాధానం చెబుతాయని ఐరీన్ గుర్తించారు. ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’అలెక్స్‌కు 100 కంటే ఎక్కువ పదాలు తెలుసు. ఒకసారి తనను తను అద్దంలోకి చూస్తూ, ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’ అని అలెక్స్ అడగటం ఐరీన్‌ను నివ్వెరపరిచింది. ‘నువ్వు బూడిద రంగు (గ్రే కలర్)లో ఉంటావు అని ఆరుసార్లు చెప్పగానే ఆ రంగు అలెక్స్‌కు గుర్తుండిపోయింది. అదలా ఉంచితే, తనకు తనుగా ఒక ప్రశ్న అడిగిన మానవేతర జీవిగా అలెక్స్ నిలిచిపోయింది! (సంకేత భాషను ఉపయోగించటంలో శిక్షణ పొందిన వానరాలు సైతం ఇప్పటి వరకు వాటికై అవి ఒక్క ప్రశ్ననూ అడగలేకపోయాయి). అలెక్స్ చిలుక మానవ భాషనే కాదు, వాక్య నిర్మాణాన్ని కూడా అర్థం చేసుకోగలిగిందని ఐరీన్ వెల్లడించారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..
ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్ ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్‌కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్ ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్ పేపర్’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్ పేపర్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్ వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్ గ్రైండింగ్ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్‌గా మలుస్తున్నాడు. ఈ పేపర్‌తో బ్యాగులు, బాక్సులు, కార్డ్‌బోర్డులు వంటి ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో కూడాచిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్‌కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్ అంతటా పలు బ్రాండ్లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్ ఫ్రెచ్కా యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2024లో ‘యంగ్ ఇన్వెంటర్స్ ప్రైజ్’ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. వాలెంటిన్ ఇప్పుడు ఫ్రూట్ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్‌గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
ట్రాన్స్‌లేటర్ పెన్.. జేబులోనే థియేటర్!
ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!జేబులోనే థియేటర్!సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్‌లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్‌లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!ఖుషీ ఖుషీగా.. కుషన్! లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్‌తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే! -
అమెరికా లెక్క
నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు.పని చేసేటప్పుడు, తినేటప్పుడు, పదిమందిలో కూర్చొని ఉన్నప్పుడు.. ఒక్కటేమిటి? నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతోంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు, మనవరాళ్లను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెదరాయుడులా దర్జాగా కాలుమీద కాలేసుకొని బతకొచ్చు. అయినా, నారప్పలో ఏదో దిగులు మొదలైంది. చిన్నాపెద్దా లేకుండా ఊళ్లోవాళ్లంతా నారప్పను ‘నక్కజిత్తుల నారప్ప’అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పనీ చేయడనీ, పది పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకూ తెలుసు. అయినా, తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా మొఖమ్మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉంది. నట్టనడి ఊళ్లో ముప్పై రెండు దూలాలు మోసే రాతిమిద్దెలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టేనాటికే వాళ్లకు వందెకరాల వరకు పొలం, వెయ్యికి పైగా జీవాలు ఉండేవి. ఆస్తి దండిగ ఉండడంతోపాటు పుల్లప్ప సర్పంచ్ కావడంతో ఆ ఇల్లు వచ్చేపోయే వాళ్లతో కళకళలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొదవుండదని పేరు తెచ్చింది.కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితమూ అలాగే తిరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప, నారప్ప చదువు ఊళ్లో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్లు చూసి వన్నూరమ్మ– ఆస్తి కరిగిపోక ముందే కూతురికి పెళ్లి చేయాలని పట్టబట్టింది. చివరికి ఊళ్లోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలంచేసింది.ఆలోగా పొలం ఇరవై ఎకరాలకు చేరుకుంది. గొర్లు, గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారీ సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటికి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి, కడప జ్యోతిక్షేత్రంలో కాశినాయన ఆశ్రమం జేరి అక్కడే కాలం చేశాడు.పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దాని కోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రీకొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్న నారప్పకు మాత్రమే తెలుసు. నాన్న, తమ కుటుంబం అనుభవించిన దర్జా, వైభోగం కాలంతోపాటు దూరమైనా నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే, పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తినీతినక కూడబెట్టడం, వడ్డీలకివ్వడం మొదలుపెట్టాడు. ఆ అతితెలివితేటలు, లౌక్యం చూసే ‘నక్కజిత్తుల నారప్ప’ అని పేరు పెట్టారు.నారప్ప భార్య ఎర్రమ్మ అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ల పిల్లను చేసుకున్నాడని కొడుకు మీద కోపమొచ్చినా, కావల్సినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతురిని తహసీల్దారుకిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్లో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులో ఇళ్లు కొన్నాడు. నారప్ప బ్యాంకు అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. అదిగో అప్పటి నుంచే నారప్పకు మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో, దాన్ని ఎలా తీర్సుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి ఆ రెండు సంఘటనలే!ఆ రోజు ఆదివారం. పొద్దున్నే బైక్ మీద తోటకు వెళ్లి, నిమ్మ చెట్లకు డ్రిప్పుతో నీళ్లు విడిచి ఇంటికి బయల్దేరాడు నారప్ప. ఊరికి ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురైంది. అసలే అది ఇరుకు దారి. పైగా ముందురోజు పడిన వానకు బురద ఉండడంతో బైక్ అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కిపడింది. బైక్ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు. మంద వెనకాలే వస్తున్న ఎర్రిసామి అది చూసి ‘‘సచ్చెరా గొర్రె..’’ అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. అదృష్టం కొద్ది గొర్రె బతికే ఉంది. అయితే, పొట్ట, బర్రెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతోపాటు తిట్లు అందుకున్నాడు. ఇద్దరూ కలసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్లనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలసి ఎర్రిసామికి, ఎల్లప్పకు సర్దిచెప్పారు. ఈలోగా కిందపడిన గొర్రె లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బాకొడుకులు. ఇంటికొచ్చి మంచంమీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరినవాళ్లు నవ్వుకోవడం కళ్లలో మెదులుతోంది. కోపం, అవమానం కలసి ఏంచేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికీ లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప.‘‘న్నో.. అప్పుడప్పుడూ ఇట్టాంటివి జరుగుతాంటాయి.. మామూలే! అయన్నీ పట్టిచ్చుకుంటామా? ఎల్లప్ప నీకు మేనమామ వరస. ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్లు ఏదో పొరపాటున మాట జారినారని అనుకోన్నా. లే.. అట్లా కూడేరు దాకా పోయొజ్జాం’’ అంటూ నారప్పను ఓదార్చాడు. ఇద్దరూ బైక్ మీద కూడేరుకు చేరుకునే సరికి ఏడయ్యింది. వైన్‌షాప్‌లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరి చివర తోటలో కూర్చున్నారిద్దరూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప... గొంతులోకి మందుపోగానే నోరు తెరిచాడు. ‘‘ఊరంతా సూచ్చాండంగా వోళ్లుతిట్నారు సెన్నప్పా. రేపట్నుంచి ఊళ్లో తలెత్తుకుని ఎట్ట తిరగల్ల? మానం, పానం రెండూ పోయినట్లు ఉండ్లా్య..’’ అంటూ కాసేపాగి ‘‘వోళ్లను ఏదో ఒకటి జేయాల.. ల్యాకపోతే అవమానంతో సచ్చేలా ఉండా..’’ అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ‘ఎవరెన్ని అన్యా తుడ్సుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటన్నాడు’ అని మనసులో అనుకుంటున్నాడు.‘‘సెప్పు సెన్నప్పా.. వోళ్లను ఏమిజెయ్యాల?’’ చెన్నప్పను కుదుపుతూ మళ్లీ అడిగాడు నారప్ప. ‘‘ఏంజేయాల్సిన పన్లేదులేన్నా.. రెండ్రోజులుంటే అంతా మర్సిపోతారు’’ చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు.‘‘కూడేరు స్టేషన్లో నా బామ్మర్ది ఉండాడు. వానికి సెప్పి ఎస్ఐతో మాట్లాడిజ్జాం. అంతో ఇంతో లెక్క కొడితే వాళ్లే స్టేషన్‌కు తీస్కపోయి అబ్బాకొడుకులకు మర్యాద జేస్తారు’’అన్నాడు చెన్నప్ప. ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. చెన్నప్ప.. బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. బయటికొచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొణిగినాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప ‘‘న్నో.. ఎస్ఐ ఇరవై వేలు అడుగుతనాడంటన్నా..’’ అన్నాడు.ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. ‘‘లెక్క ఐదు వేలు ఎక్కువనే ఇచ్చనాగాని.. రెండ్రోజులు దాంకా ఇడ్సకండా తన్నమను’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు.మరునాడు తెల్లారే సరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిసామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారని, నారప్ప కేసు పెట్టించాడని మాట్లాడుకుంటున్నారు. అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడు లేనిది ఆ రోజు హీరోహోండా పక్కన పెట్టి, రాయల్ ఎన్ఫీల్డ్ మీద తోట వద్దకు బయల్దేరాడు. కూలిపనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచె కట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆరోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిసామిని రెండ్రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్లు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్లు. ఇది జరిగాక ఊళ్లో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. ‘నక్కజిత్తుల నారప్ప’ అని కాకుండా వరుసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలు పెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు, తన బలమేదో తెలిసొచ్చింది.అయితే, నారప్ప పూర్తిగా ఒళ్లు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే!తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప.. ఒక్క తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఒకరిద్దరితో అడిగించినా.. అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు.పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్క పక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్లాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్లాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్లాలంటే చుట్టూ నాలుగు కిలోమీటర్లు కొండ వారగా వెళ్లాలి. రాళ్లూరప్పలు కంపచెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం.ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కొనేశాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు.తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవెందుకని బతిమాలాడు. కాని, నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంట బెట్టుకొని అడ్డుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కాని, ఎవరూ నోరు తెరవడం లేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు.. దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయారు.తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు. కాని, రూపాయి కంటే డాలరుకు బలమెక్కువని ఆయప్పకే కాదు ఊరంతటికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఒకటికి రెండుసార్లు తనదే పైచేయి అయ్యే సరికి నారప్పకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్దిచెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడేకంటే, గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కాని, విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు.పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ.. జరిగేవన్నీ మౌనంగా చూస్తోంది. ‘మీ నాయిన మాదిరే నువ్వూ తయారయితనావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటనావ’ని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు, భర్త అంతిమ లక్ష్యం, దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. భార్యాపిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అదీ తీరేదే.. ఆ మహమ్మారి రాకుంటే. ∙∙ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది. దేశమంతా లాక్డౌన్ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు.ఎవరి వల్ల వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నారప్ప కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా మూడు వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యాడు. టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం ఇదే పని. రెండు వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయల్దేరాడు.సాయంత్రం ఆరు సమయంలో ఊరంతా తెలిసిందా వార్త.. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడం, కాల్ చేసినా కలవకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన ఎర్రమ్మకు.. ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్నబావి పక్కన బైక్, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్లో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం వల్లో, బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్లో తెలియడం లేదు. చివరకు పోలీసులొచ్చి శవం బయటికి తీశారు.నారప్ప అల్లుడు తాసీల్దారు కావడంతో ఎలాగోలా కర్నూలు నుంచి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కాని, కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు.పంచనామా పూర్తిచేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కముకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు, అల్లుడినీ కూడా ఆపింది.∙∙ బ్యాండు మేళం, డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్లో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు, కూతురుతోపాటు కొద్దిమంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన... అసలు నారప్పను కొట్టి చంపి, బావిలో వేసిందెవరు? జైలులో పెట్టించి, కొట్టించినందుకు ఎల్లప్ప, అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే, వావీవరస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్లో తాను చేసే తప్పుడు పనులు గురించి కొడుక్కు చెప్పాడనే అక్కసుతో ఓబుళప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుకా? ....వాళ్ల ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికే.దారిలో.. సోమప్ప ఇంటి బయట.. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది.నారెప్ప పాడె మీద చల్లుతున్న చిల్లరలోని నాణేలు కిందపడి తళతళ మెరుస్తున్నాయి.అవి డాలర్లు... అమెరికా లెక్క. -
అద్దంతో అల్లుకుంటూ!
‘దర్యాప్తు అధికారికి సునిశిత దృష్టి, ప్రతి విషయాన్నీ అధ్యయనం చేసి, బేరీజు వేసే తత్త్వం ఉన్నట్లయితే; నేరస్థలిలోని లభించే, కనిపించే ప్రతి అంశమూ ఒక ఆధారం అవుతుంది’– ఇది ప్రపంచ వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నమ్మే అంశం. సాధారణంగా సంచలనాత్మక ఉదంతాల్లో మాత్రమే పోలీసులు దీన్ని కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే, హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులు మాత్రం సాధారణ నేరంగా పరిగణించే గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసునూ సంచలనాత్మక నేరం స్థాయిలో దర్యాప్తు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఓ అద్దం (కుడివైపు సైడ్ మిర్రర్) ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అది 2013లో తొలిరోజైన జనవరి 1, సమయం ఉదయం 6.15 గంటలు. చలితో పాటు పొగమంచూ దట్టంగా ఉంది. బొల్లారం ప్రధాన రహదారిలోని సెయింట్ ఆన్స్ హోమ్‌లో ఉన్నవాళ్లు అప్పుడే నిద్రలేస్తున్నారు. అదే సమయంలో ప్రహరీగోడ పైనుంచి హోమ్ ఆవరణలోకి ఓ ఆకారం పడటం గమనించారు. పరుగున వెళ్లి చూసి మహిళ (65)గా గుర్తించారు. ప్రహరీకి ఆవలి వైపున్న రోడ్డు మీద ఓ యువతి (30) తీవ్రగాయాలతో పడినట్లు కలకలం మొదలైంది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించిన దాని ప్రకారం 6037 నెంబర్ కలిగిన తెల్లరంగు స్విఫ్ట్ కారు శామీర్‌పేట వైపు నుంచి వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధమహిళ అప్పటికే మరణించిందని, యువతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసుస్టేషన్లో సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న షేక్ సాదిక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు నివసించేది స్నేహ ఎన్‌క్లేవ్‌లో అని, మృతి చెందిన వృద్ధురాలు ఆశాదేవిగా, క్షతగాత్రురాలు ఆమె కుమార్తె శ్వేత సింగ్‌గా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రధాన రహదారికి క్షుణ్ణంగా పరిశీలించిన సాదిక్ దృష్టి అక్కడ పడున్న ఓ కారు సైడ్ మిర్రర్‌పై పడింది. అది ప్రమాదానికి కారణమైన కారుదే అయి ఉంటుందనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి అదే కీలకాధారం అవుతుందని ఆ సమయంలో ఆయన అనుకోలేదు. అద్దం తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ పని చేస్తున్న టి.లక్ష్మీనారాయణకు కేసు పూర్వాపరాలు వివరించి, ఆ అద్దాన్ని ఆయన ముందుంచారు. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరువురూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికాధికారి కుటుంబానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ విషాదానికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశాదేవి, శ్వేతలను ఢీ కొట్టింది స్విఫ్ట్ కారు అని స్థానికులు చెప్పడంతో ముందుగా ఆ మోడల్స్ పైనే దృష్టి పెట్టారు. ప్రమాద సమయంలో ఆ కారు శామీర్‌పేట వైపు నుంచి వస్తోందని నిర్ధారణ కావడంతో ఆ దిశలో ముందుకు వెళ్లారు. ఆర్టీఓ డేటాబేస్ ఆధారంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో నమోదైన తెల్లరంగు స్విఫ్ట్ కార్ల వివరాలు సేకరించారు. అది భారీగా ఉండటంతో విశ్లేషించే పనిలో పడ్డారు.ఆయా వాహనాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా ఆ రోజు బొల్లారం మీదుగా ప్రయాణించారా? ఇలాంటివి తేల్చడానికి కొంత సమయం తీసుకుంటుందని భావించిన ఇన్స్పెక్టర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టారు. బొల్లారంలో ఉన్న ఓ కార్ మెకానిక్‌ను పిలిపించి ఘటనాస్థలిలో లభించిన అద్దాన్ని చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ మెకానిక్ అది స్విఫ్ట్ కారుది కాదని, ఫోర్డ్ కంపెనీకి చెందిన కారుదని నిర్ధారించారు. దీనికి తోడు రెండుగా విడిపోయిన ఆ అద్దం వెనుక భాగంలో ‘22.6.2012’ అని రాసి ఉండటాన్ని అదే సమయంలో ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఈ ఆధారాలను బేరీజు వేస్తూ సదరు కారు ఆ తేదీ తరవాత వినియోగదారుడికి డెలివరీ అయి ఉంటుందని అంచనా వేశారు. ఆ రోజు తరవాత రిజిస్టర్ అయిన ఫోర్డ్ కార్ల వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వాటిలో నాలుగు తెల్లరంగువి ఉన్నట్లు తేల్చారు. ఆయా కార్ల రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యజమానుల చిరునామాలు గుర్తించారు. ఈ నాలుగు చిరునామాలకు స్వయంగా వెళ్లి, విచారణ చేసి రావడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చందానగర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉన్న కారును వెతుక్కుంటూ వెళ్లిన ఈ టీమ్ ఓ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ‘ఏపీ 29 ఏవీ 6037’ నెంబర్ కారును గుర్తించింది. ఆ కారుకి కుడివైపు సైడ్ మిర్రర్ య«థాతథంగా ఉండటం, ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో తాము వెతుకుతున్న కారు అది కాదేమోనని అనుకుంటూ విషయాన్ని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు చెప్పింది. ఆయన సూచనల మేరకు ఆ కారుకు కొత్తగా రంగు వేసిన దాఖలాలు, దానికి సంబంధించిన ఆధారాల కోసం సమీపంలోకి వెళ్లి పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే ఆ కారుకు కొత్తగా రంగు వేస్తుండగా దాని టైర్‌పై పడిన పెయింట్ చుక్కలు గమనించింది. వెంటనే అప్రమత్తమైన టీమ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానుల్ని పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పింది.అలా వచ్చిన యజమానుల్ని విచారించడంతో జనవరి ఒకటో తేదీన ఆ కారుని తన సమీప బంధువైన ఎంటెక్ విద్యార్థి, నేరేడ్మెట్ వాసి డి.భరద్వాజ్ తీసుకువెళ్లాడని, తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడైంది. దీంతో అతడి కోసం గాలింపు ప్రారంభించారు. తన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారనే విషయం తెలుసుకున్న భరద్వాజ్ నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ రోజు పొగమంచు కారణంగా ఓ ప్రమాదం జరిగిందని, అయితే తాను గొడను ఢీ కొట్టానని భావించానని పోలీసులకు తెలిపారు. ప్రమాదం జరిగినట్లు కారు యజమానులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే కారుకు రంగు వేయించానని అంగీకరించాడు. దీంతో బొల్లారం పోలీసులు భరద్వాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భరద్వాజ్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మరణించడంతో పాటు ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుమార్తె సుదీర్ఘకాలం షాక్‌లో ఉండిపోయి మాట పలుకు లేకుండా తనను తాను మర్చిపోయారు. ఎవరైనా దగ్గరకు వెళ్లి పలకరిస్తే... ‘అమ్మ వెళ్లి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి’ అని మాత్రమే అంటూ కోలుకోవడానికి చాలా రోజులు తీసుకుంది. ∙ -
కంపెనీలు కావు.. కల్పతరువులు
ఉద్యోగులు మంచి కంపెనీలను కోరుకుంటారు. కంపెనీలు మంచి ఉద్యోగులను కోరుకుంటాయి. మంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం, వారిని కాపాడుకోవడం వల్లనే కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మంచి ఉద్యోగులను కాపాడుకోగలిగే కంపెనీలు ఉత్తమ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే వంద అత్యుత్తమ కంపెనీలను ఎంపిక చేసిన ఫార్చూన్ పత్రిక ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’– 2025 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలోని పది అత్యుత్తమ కంపెనీల కథా కమామిషు చూద్దాం. వీటిలో పనిచేయాలని ఉద్యోగులు ఎందుకు ఉవ్విళ్లూరుతుంటారో తెలుసుకుందాం...మంచి కంపెనీలు అంటే అపర కుబేరుల ఆ«ధ్వర్యంలో నడిచే కంపెనీలు అనుకుంటే పొరపాటేనని ‘ఫార్చూన్’ జాబితా రుజువు చేస్తోంది. ఉద్యోగులకు మంచి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం చర్యలు తీసుకోవడం; ఉద్యోగుల అభివృద్ధిలో పైరవీలకు తావు లేకుండా పనితీరుకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం; ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మదింపు వేసి పదోన్నతులు కల్పించడం; పని ప్రదేశంలో ఆహ్లాదకర పని వాతావరణాన్ని కల్పించడం; ఉద్యోగుల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన వెసులుబాట్లు కల్పించడం వంటి మానవీయ చర్యల కారణంగానే ఈ కంపెనీలు అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘ఫార్చూన్’ జాబితాలోని టాప్–10 కంపెనీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...1 హిల్టన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థ హిల్టన్ వరల్డ్‌వైడ్. ఆతిథ్యరంగంలో ఈ కంపెనీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వర్జీనియాలోని మెక్లీన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. కాన్రాడ్ హిల్టన్ 1919లో ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం క్రిస్టఫర్ నాసెట్టా సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో దాదాపు రెండులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడమే కాకుండా, ‘హిల్టన్’ యాజమాన్యం వారి సంక్షేమానికి, అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ‘కేర్ ఫర్ ఆల్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘హిల్టన్ ఫ్లెక్స్’ కార్యక్రమం పేరిట ఉద్యోగులు తమకు అనువైన వేళల్లో వచ్చి పనిచేసి వెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. ‘గో హిల్టన్’ పేరిట ఉద్యోగుల పర్యాటక ఖర్చులను చెల్లిస్తోంది. ‘హిల్టన్’ సంస్థ తన విజయాలకు ఉద్యోగులే కారణమని చెబుతుంది. నిజానికి ఉద్యోగులకు పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని అందించడమే ‘హిల్టన్’ను ‘ఫార్చూన్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిపింది.2 సింక్రనీఅమెరికా కేంద్రంగా ప్రధానంగా ఆర్థిక, బీమా రంగాల్లో పనిచేస్తున్న బహుళజాతి సంస్థ సింక్రనీ. కనెక్టికట్‌లోని స్టామ్ఫర్డ్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీ 1932లో తొలుత ఆర్థిక సేవల సంస్థగా ప్రారంభమైంది. తర్వాతికాలంలో ఆరోగ్య, గృహవసతులు, రీటైల్ తదితర రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇందులో దాదాపు ఇరవైవేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు జరపడానికి వీలుగా విద్యుత్ వాహనాలు, విద్యార్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల చెల్లింపు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఉద్యోగులకు పిల్లలు పుడితే, తల్లిదండ్రులకు వేతనంతో కూడిన సెలవులు, సంతానలేమితో బాధపడే ఉద్యోగులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చులను కూడా చెల్లిస్తోంది. వీలైన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, నిర్ణీత వేళల్లో పనిచేసేవారికి కూడా ప్రతి శుక్రవారం ‘ఫ్లెక్స్ ఫ్రైడే’ వెసులుబాటు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే నిబద్ధత ‘సింక్రనీ’ని ఈ స్థాయికి తెచ్చింది. ఉద్యోగం చేయడానికి ఇది అద్భుతమైన సంస్థ అని ఇందులో పనిచేసే 94 శాతం ఉద్యోగులు చెబుతుండటమే దీని విజయానికి గీటురాయి.3 సిస్కోఇది కూడా అమెరికన్ బహుళజాతి సంస్థల్లో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీ ఐటీ రంగంలో సేవలందిస్తోంది. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సహా పలు సాంకేతిక సేవలు అందించే ఈ కంపెనీ 1984లో ప్రారంభమైంది. ఉద్యోగులకు సంతృప్తికరమైన పనివాతావరణం కల్పించడానికి సిస్కో అనేక చర్యలను అమలు చేస్తోంది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పలు వసతులు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పని ప్రదేశంలో మార్పు చేర్పులను ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపడుతోంది. ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుండటం సిస్కో ప్రత్యేకత. ఉద్యోగుల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన ప్రయోజనాలను అందించడంలో ముందంజలో ఉండటమే సిస్కోను అత్యుత్తమ స్థాయికి చేర్చించింది. తమ అభిప్రాయాలకు యాజమాన్యం విలువనివ్వడం వల్ల ఈ సంస్థలోని ఉద్యోగులు పూర్తి సంతృప్తితో పనిచేసుకోగలుగుతున్నారు.4 అమెరికన్ ఎక్స్ప్రెస్ఆర్థిక సేవల రంగంలో 175 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అమెరికన్ బహుళ జాతి కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు, బీమా, పర్యాటక రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీలో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేయడం తమ అదృష్టంగా ఉద్యోగులు భావిస్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉద్యోగులు కోరుకునే వేళల్లో పనిచేసే వెసులుబాటుతో పాటు వారు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తోంది. సంతృప్తికరమైన వేతనాలు; ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుగా విద్యార్హతలు పొందడానికి చదువుకునే విద్యార్థులకు చదువుల ఖర్చుల చెల్లింపు; ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య బీమా; పారదర్శకమైన నాయకత్వం ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగులందరికీ సమానావకాశాలు కల్పించడం; ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో తోడ్పాటునందించడం వంటి చర్యల ద్వారా ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్’ తన ఉద్యోగుల మనసులను చూరగొంటోంది.5 ఎన్విడీయాఐటీ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ముప్పయ్యేళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైవిధ్యభరితమైన సేవలను అందిస్తోంది. చిప్స్ తయారీ, డిజైనింగ్, గేమింగ్, ఏఐ సహా పలు సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. ఎన్విడీయా కంపెనీలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకసారి ఇందులో ఉద్యోగంలో చేరాక మానేసే వారు అతి తక్కువ. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, సంస్థలోని వివిధ బృందాలు ఉన్నా, ఏ బృందానికి ఆ బృందం స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ప్రతి బృందానికి స్వేచ్ఛాయుత వాతావరణం, ఉద్యోగులు అందరూ ఒకేసారి సెలవులను ఆస్వాదించేలా వారాంతపు సెలవులు మాత్రమే కాకుండా, ప్రతి మూడునెలలకు ఒకసారి వరుసగా రెండు రోజులు సెలవులు, ప్రతి ఏడాదిలో ఇరవైరెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే వెసులుబాటు ఈ సంస్థను ఉద్యోగుల పాలిటి ఉత్తమ సంస్థగా నిలుపుతున్నాయి. ఉద్యోగులకు నచ్చిన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆర్థిక మద్దతు, దిగువ స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానపరమైన మార్పులు చేపట్టడం వంటి చర్యలు ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి.6 వెగ్మాన్జ్రిటైల్ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళ జాతి సంస్థ న్యూయార్క్‌లోని రోషెస్టర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జాన్ వెగ్‌మాన్, వాల్టర్ వెగ్‌మాన్ అనే సోదరులు 1916లో ఈ సంస్థను ప్రారంభించారు. ‘వెగ్మాన్జ్’ సంస్థకు ఇప్పుడు అమెరికాలో మొత్తం 111 సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయి. ‘ఫార్చూన్’ పత్రిక 1998లో ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’ జాబితాను విడుదల చేయడం ప్రారంభించిన నాటి నుంచి వెగ్‌మాన్ ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 54 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రతి ఆరునెలలకు ఒకసారి వేతనాల పెంపు, యాజమాన్య నిర్ణయాల్లో పారదర్శకత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య బీమా, పనివేళలను కోరుకునే రీతిగా ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ‘వెగ్మాన్జ్’ ఉద్యోగులు తమ యాజమాన్యం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.7 యాక్సెంచర్ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈ బహుళ జాతి సంస్థ ఐర్లండ్ రాజధాని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దాదాపు 120 దేశాలలో కార్యాలయాలు ఉన్న ఈ కంపెనీలో 7.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ తదితర సేవలు అందిస్తున్న ఈ కంపెనీ తన క్లయింట్స్‌కు ఎప్పటికప్పుడు కావలసిన పరిష్కారాలను అందించే దిశగా పరిశోధనలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఉద్యోగులను నిరంతర అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్టుల ఎంపికలోను, కెరీర్ రంగాల ఎంపికలోను, పనివేళల ఎంపికలోను ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తుంది. అధ్యయనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఉద్యోగుల పురోభివృద్ధికి భరోసా కల్పిస్తుండటంతో ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలు పుట్టినప్పుడు తల్లి దండ్రులకు వేతనంతో కూడిన సెలవులు మాత్రమే కాకుండా, సంతాన సాఫల్య చికిత్సలు పొందేవారికి, పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుండటం ఈ కంపెనీ ప్రత్యేకత.8 మేరియట్ఆతిథ్య రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మేరీలాండ్‌లోని బతీజ్దా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది మేరియట్ ఇంటర్నేషనల్ సంస్థకు వివిధ దేశాల్లో ఆరువందలకు పైగా హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ‘మనుషులే ప్రధానం’ సిద్ధాంతంతో పనిచేసే మేరియట్ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి, సంతృప్తికి అత్యధికంగా ఖర్చు చేస్తుంది. కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఉద్యోగులతో తరచు సమావేశాలు నిర్వహించడం, ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, విధాన నిర్ణయాలలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా మేరియట్ సంస్థ ఉద్యోగుల విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొంటోంది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు, బహుమతులు ఇవ్వడం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, సెలవులలో ఉద్యోగులు పర్యటనలకు వెళ్లేటప్పుడు తమ హోటళ్లలో డిస్కౌంట్‌కు బస, ఆహార పానీయాలు అందించడం, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ చెల్లింపు, ఉద్యోగులకు కంపెనీలో వాటాల కేటాయింపు వంటి చర్యల ద్వారా మేరియట్లో పనిచేయడాన్ని ఉద్యోగులు గొప్ప అవకాశంగా భావిస్తారు.9 పినాకిల్ఆర్థిక సేవల రంగానికి చెందిన ఈ అమెరికన్ కంపెనీ టెనెసీలోని నాష్విల్లె ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, మార్టిగేజ్ తదితర సేవలను అందించే ఈ కంపెనీలో దాదాపు మూడున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలతో పాటు కంపెనీలో పరిమిత మొత్తాల మేరకు వాటాల కేటాయింపు; ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని పనివేళలు; లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు; ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా; రిటైరైన ఉద్యోగులకు పింఛను చెల్లింపు; వేతనంతో కూడిన సెలవులు; ఉద్యోగులపై ఆధారపడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక అలవెన్సు వంటి చర్యల ద్వారా పినాకిల్ సంస్థ ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనువైన సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండటం దీని విజయానికి నిదర్శనం.10 వరల్డ్ వైడ్ టెక్నాలజీసాంకేతిక రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మిసోరీలోని మేరీలాండ్ హైట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అప్లికేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, స్ట్రాటెజిక్ రిసోర్సింగ్, గ్లోబల్ సప్లై చెయిన్, ఇంటిగ్రేషన్ నెట్వర్కింగ్ తదితర సేవలను అందిస్తున్న ఈ కంపెనీలో దాదాపు పన్నెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలను చెల్లించడంతో పాటు వరల్డ్ వైడ్ టెక్నాలజీ కంపెనీ వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా; ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సజావుగా సాగడానికి రిటైర్మెంట్ పథకం; ఉద్యోగుల్లో ఎవరికైనా పిల్లలు పుడితే తల్లులతో పాటు తండ్రులకు కూడా వేతనంతో కూడిన సెలవులు; సంతాన సాఫల్య చికిత్సల కోసం ఆర్థిక సాయం, సెలవులు, పిల్లలను దత్తత చేసుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు; అనువైన పనివేళలను ఎంపిక చేసుకునే వెసులుబాటు; నాయకత్వ శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో పనిచేసే వారిలో తొంభైఐదు శాతానికి పైగా ఉద్యోగులు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెబుతారు.ఉద్యోగులు లోటులేని జీవితాలను గడపడానికి తగినట్లుగా సంతృప్తికరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పనివేళల్లో వెసులుబాట్లు, వివిధ అవసరాలకు వేతనాలతో కూడిన సెలవులు, పనితీరుకు తగిన గుర్తింపు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల పట్ల పట్టింపు వంటి చర్యల ద్వారానే ఈ కంపెనీలు ఉద్యోగుల పాలిటి కల్పతరువుల్లా ఉంటూ అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి. -
చిన్నదే గాని.. చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. -
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు.ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. -
కార్చిచ్చు
ఆ పారిశ్రామికవాడలో ఓ నేషనలైజ్డ్ బేంక్ బ్రాంచ్ ఉంది. ప్రతినెలా ఏడవ తారీకున అక్కడి ఫేక్టరీ వర్కర్స్‌కి జీతాలు ఇస్తారు. ఆ జీతాల మొత్తం పదిహేడు లక్షల రూపాయలు. ఆరవ తారీకు సాయంత్రానికల్లా ఆ బ్రాంచ్‌కి సమీపంలోని మరో పెద్ద బ్రాంచ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు అందుతూంటాయి. కొంత కాలం ఓ ఫేక్టరీలో పనిచేసి, రాగి తీగల దొంగతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న అద్విక్‌కి అది తెలుసు. ఒకే ఆఖరి దొంగతనంలో దాన్ని సంపాదించి తన రాష్ట్రానికి పారిపోవాలనే నిశ్చయంతో అతను జైల్లో పరిచయమైన తన సహచరుడితో ఏడో తారీకు ఉదయం తొమ్మిదికి ఆ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. లోపల ఐదారుగురు కస్టమర్స్ ఉన్నారు.అద్విక్ సహచరుడు సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాక్కున్నాడు. అద్విక్ కేష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోగా అద్దాల తలుపులోంచి జరిగేది చూసిన మేనేజర్ పోలీసులకి ఫోన్ చేసాడు.తన సహచరుడు సిబ్బందిని, కస్టమర్స్‌ని తుపాకీతో కంట్రోల్ చేస్తూంటే, అద్విక్ తన నాటు రివాల్వర్‌తో బెదిరించి కేషియర్తో బేంక్ వాల్ట్‌లోని డబ్బు కట్టలని తనతో తెచ్చిన రెండు సూట్ కేసులలో నింపించాడు. అతను బయటికి రాగానే అతని సహచరుడు ఓ సూట్ కేస్‌ని అందుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న అద్విక్ తలుపు కొద్దిగా తెరచి చూస్తే ఎదురుగా పోలీస్ వేన్ ఆగటం కనిపించింది. వెంటనే తలుపు మూసి అరిచాడు.‘‘పోలీసులకి ఎలా తెలిసింది? ఎవరు సమాచారం పంపారు?’’ ఎవరూ మాట్లాడలేదు. ‘‘సరే. పోలీసులని వెళ్ళిపొమ్మని ఓ హెచ్చరిక పంపాలి. ఆ హెచ్చరిక మీలోని ఒకరి శవం.’’ అద్విక్ క్రోధంగా చెప్పాడు. వెంటనే బేంక్ సిబ్బంది మొహాల్లో కనపడే భయం రెట్టింపైంది. ఎవరిని ఎన్నుకుంటాడు? ‘‘నువ్వు బయటికి రా.’’ నలభై ఏళ్ళ కేషియర్ని చూస్తూ ఆజ్ఞాపించాడు. అతను వణుకుతూ కేష్ కేబిన్ లోంచి బయటికి వచ్చాడు. రివాల్వర్ గొట్టాన్ని అతని ఛాతీకి ఆనించగానే ఓ లేడీ క్లర్క్ అరిచింది.‘‘అతన్ని కాదు. నన్ను చంపు.’’‘‘నీకు ప్రాణం మీద తీపి లేదా?’’ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన అద్విక్ సహచరుడు అడిగాడు. ‘‘చీమతో సహా ప్రతివారికీ అది ఉంటుంది. ఈయనకి నేను ఋణపడ్డాను. అది తీర్చే సమయం వచ్చింది.’’ ‘‘ఏం ఋణపడ్డావు?’’ అద్విక్ అడిగాడు. ‘‘మావారి కిడ్నీలు పాడయ్యాయి. ఎవరివీ మేచ్ కాలేదు. స్వచ్ఛందంగా ముందుకి వచ్చిన ఇతని టిష్యూస్ మేచ్ ఐతే తన కిడ్నీని దానం చేశాడు. ఇతని వల్లే మావారు జీవించారు కాబట్టి.’’ ‘‘ఈమెని బదులు నన్ను చంపు.’’ ఓ ముసలావిడ రివాల్వర్ బేరల్కి, ఆమెకి మధ్యకి వచ్చి చెప్పింది. అందరి దృష్టి ఆవిడ మీదకి మళ్ళింది. ఆవిడ చెప్పింది. ‘‘ఈమెకి ఇద్దరు పిల్లలు. వారికి ఈమె అవసరం ఉంది. నా అవసరం నా పిల్లలకి తీరింది. ఫైబ్రోసిస్ రోగంతో పోయే కంటే ఓ ప్రయోజనంతో పోవడం వల్ల మరణం పవిత్రం అవుతుంది.’’ ‘‘నిన్ను కాదు. యువకులని చంపితే మాకు ఎదురు తిరిగేవాళ్ళు ఒక్కరైనా తగ్గుతారు.’’ సహచరుడు చెప్పాడు. ‘‘అవును. నువ్వు ఇటు రా.’’ దృఢంగా ఉన్న పాతికేళ్ళ యువకుడిని చూసి అద్విక్ ఆజ్ఞాపించాడు. అంతదాకా భయంతో ఏడుస్తూ నిలబడ్డ ఒకావిడ చెంగుతో కన్నీరు తుడుచుకుని అద్విక్ ముందు వచ్చి నిలబడి చెప్పింది. ‘‘అతన్ని కాదు. అతని బదులు నన్ను చంపు.’’ఈసారి అందరి మొహాల్లో విస్మయం రెట్టింపైంది. ‘‘అతను నీ కొడుకా?’’ అద్విక్ అడిగాడు. ‘‘కాదు.’’ ఆ యువకుడు వెంటనే జవాబు చెప్పాడు. ‘‘మా అమ్మాయి పై చదువులకి జర్మనీకి వెళ్ళింది. అందుకయ్యే అన్ని ఖర్చులని ఇతనే భరిస్తున్నాడు. మాకు బంధువు కాదు. స్నేహం కూడా లేదు. నా అవసరం తెలుసుకుని ఇతనంతట ఇతనే మాకు డబ్బు సహాయం చేశాడు. మీరు ఇతన్ని మాత్రం చంపకండి.’’వెంటనే బేంక్ మేనేజర్ అద్విక్ రివాల్వర్ గొట్టం ముందుకి వచ్చి నిలబడి చెప్పాడు. ‘‘మిస్టర్. నన్ను చంపు. వీళ్ళందరికన్నా నన్ను చంపితే అది పవిత్ర మరణం అవుతుంది.’’ మాట్లాడుతూంటే ఆయన కంఠం గద్గదమైంది. ‘‘నీ కథ ఏమిటి?’’ అద్విక్ ప్రశ్నించాడు. ‘‘వీళ్ళల్లోని మంచితనం నన్ను ప్రభావితం చేసింది. కరోనా సమయంలో నా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. అప్పటినుంచి నిస్సారంగా బతుకుతున్నాను. ఒంటరి బతుకు అర్థం లేనిదని అనుభవపూర్వకంగా గ్రహించాను. నన్ను చంపితే ఓ ఉద్యోగికి ప్రమోషన్ , ఓ నిరుద్యోగికి ఉద్యోగం, మరో మనిషికి ప్రాణాలు లభిస్తాయని అనిపించింది.’’అంతా ఎదురుచూడని సంఘటన జరిగింది. వెంటనే అద్విక్ రివాల్వర్ని ఓ మూలకి విసిరేసి, పోలీసులకి లొంగిపోవడానికి తలుపు తెరచుకుని బయటికి నడిచాడు. అతని సహచరుడు కూడా బయటికి నడుస్తూ చెప్పాడు. ‘‘చిన్నప్పుడు ఆవు, పులి కథలో దూడకి పాలిచ్చి ఆవు తిరిగి రావటం విని, ఆవు తిరిగి రాలేదని అనుకునేవాడిని. కాదని నాకు ఇప్పుడు అర్థమైంది.’’ ఆ రోజు అక్కడ మంచితనం కార్చిచ్చులా వేగంగా పాకింది. -
మళ్లీ అవసరమా?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా? – రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్‌గా ఉంటాయి? – బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్‌లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్‌లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్‌కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్‌లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్‌కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్్స 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్‌గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. -డా‘‘ భావన కాసు ,గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్-హైదరాబాద్ -
నిజమైన ధర్మం
అనగనగా ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి పక్కపక్కనే కాపురముండేవి. ఎవరి ఆహారం అవి సంపాదించుకుని తింటూ కాలక్షేపం చేసేవి. ఒకరోజు కోతి తన బిడ్డను కడుపునకు తగిలించుకుని ఆహారం కోసం బయటకు వెళ్లింది. కానీ ఆ రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలి కడుపుతోనే ఇంటికి తిరిగి వచ్చింది. కనీసం తన బిడ్డకు కూడా ఆహారం పెట్టలేక పోయినందుకు బాధ పడింది. కోతికి పక్కనే ఉన్న నక్క ఇంట్లోంచి కమ్మటి పెసర గారెల వాసన వచ్చింది. ‘అబ్బ! కమ్మటి వాసన! నక్కబావ పెసర గారెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే గారెలు పెడతాడు. దాంతో తన బిడ్డ ఆకలి ఈ పూటకు తీర్చవచ్చు’ అనుకుంది. నక్క ఇంటి తలుపు కొడుతూ, ‘నక్క బావా! నక్క బావా! తలుపు తియ్యవా!’ అంది కోతి. నక్క వెంటనే తలుపు తీయలేదు. తను వండిన పెసర గారెలు కోతికి కనిపించకుండా దాచింది. గారెలు తింటున్న తన పిల్లల్ని పక్క గదిలోకి పంపింది. ఆ తరువాత నెమ్మదిగా తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే కమ్మటి పెసర గారెల వాసన కోతిని చుట్టేసింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగింది. ‘నక్క బావా! ఏంటి విశేషం! మీ ఇంట్లో గారెల వాసన వస్తోంది’ అంది చుట్టూ పరికించి చూస్తూ కోతి.‘గారెలా! బూరెలా! ఎక్కడా ఆహారం దొరకక పోయేసరికి పిల్లల ఆకలి రాగాలు వినలేక ఇంట్లో ఉన్న గుప్పెడు పెసర్లతో మూడంటే మూడే గారెలు చేసి రెండు పిల్లలకి పెట్టి ఇప్పుడే ఒకటి నేను తిన్నా!’ నీరసంగా అంది నక్క. ఆశించిన పెసర గారెలు కోతికి నక్క పెట్టలేదు. నిరాశతో కోతి తన బిడ్డతో వెనక్కి వచ్చేసింది. కోతి వెళ్లటం గమనించిన నక్క దాచు కున్న గారెల్ని బుక్కింది. ఓ రోజు నక్క తన పిల్లలతో అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దాంతో నీరసంగా తన ఇంటికి చేరింది. నక్కకు పక్కనే ఉన్న కోతి ఇంట్లోంచి కమ్మటి బూరెల వాసన వచ్చింది.‘అబ్బ! కమ్మటి వాసన! కోతి బావ బూరెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే బూరెలు పెడతాడు. దాంతో తన బిడ్డల ఆకలి ఈ పూటకు తీర్చవచ్చని’ ఆశించింది నక్క. కోతి ఇంటి తలుపు కొడుతూ, ‘కోతి బావా! కోతి బావా! తలుపు తియ్యవా!’ అంది నక్క. తింటున్న బూరెను పక్కన పెట్టి వెంటనే తలుపు తీసింది కోతి. తలుపు తెరుచుకోగానే కమ్మటి బూరెల వాసన నక్కను చుట్టేసింది. దాంతో దాని ఆకలి మరింత పెరిగింది. కోతి బూరెలు పెడితే బాగుండనుకుంది. గతంలో ఆకలితో వచ్చిన కోతికి ఒక్క గారె ముక్క కూడా పెట్టకుండా పంపిన సంఘటన గుర్తుకు వచ్చింది. కోతి కూడా తన బిడ్డల్ని ఆకలి కడుపుతో వెనక్కి పంపుతుందనుకుంది. కాని, కోతి అలా చేయలేదు. నక్కను, దాని పిల్లల్ని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది. తను తినటానికి పెట్టుకున్న బూరెల్ని నక్కకు, దాని పిల్లలకు పెట్టింది. ‘కోతి బావా! నీకు బూరెలు ఉన్నాయా?’ ప్రశ్నించింది నక్క.‘ఇప్పుడే ఒకటి తిన్నాను. అతిథులైన మిమ్మల్ని తృప్తి పరచటం నా బాధ్యత. ముందు మీరు తినండి’ అంటూ మరో రెండు బూరెలు వడ్డించింది కోతి. నక్క తినలేక పోయింది. కోతి ప్రేమకు చలించిపోయింది. ‘కోతిబావా! చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఆ రోజు నీకు, నీ బిడ్డకు తినటానికి సరిపోను పెసర గారెలున్నా ఆకలి కడుపుతో వెనక్కి పంపాను. గారెలు లేవని అబద్ధం చెప్పాను. ఈ రోజు నువ్వు తినటానికి పెట్టుకున్న బూరెల్ని మాకు అందించి మా ఆకలి తీర్చావు’ ఉబికి వచ్చిన కన్నీటి పొరలను తుడుచుకుంటూ అంది నక్క. కోతి చిరునవ్వుతో నక్కను దగ్గరకు తీసుకుని, ‘నక్క బావా! మనం ఇతరుల నుంచి ఏమి కోరుకుంటామో, ఏమి ఆశిస్తామో వాటినే ఇతరులకు చేయటం నిజమైన ధర్మం’ అంది కోతి. నక్కకు తన తప్పు తెలిసింది. ఆనాటి నుండి ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించడమే కాకుండా, తను ఇతరుల నుండి ఏమేమి కోరుకుంటుందో, వాటిని ముందుగానే ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంది. -
ఏం ఫీలున్నది మామా!
సాధారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూసేవి యాక్షన్, అడ్వెంచర్, డ్రామా; ఇంట్లో ఉండి ఓటీటీల్లో చూసేవి క్రైమ్, కామెడీ, ఫాంటసీ. ఇవి కాకుండా.. ఒక ‘బీభత్స, భయానక, భూత, ప్రేత, పిశాచ’ జానర్ కూడా ఉంది. అదే... హారర్! ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే.. థియేటర్‌కు వెళితే స్నేహితులతో, ఇంట్లోనైతే కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం. ‘బాబోయ్ హారర్!’ అనుకుంటాం కాని, చూడటం మాత్రం మానం. అదొక మజా. ఫీల్. దెయ్యాలతో సయ్యాట!ఎందుకంత పడి చచ్చిపోతాం?!గుండెల్లో దడ పుట్టించే, అరచేతులకు చెమటలు పట్టించే హారర్ సినిమాలను ఎందుకు మనం ఏరి కోరి చూస్తుంటాం? నడిచే శవాలు, భూత్ బంగళాలు కథాంశంగా ఉన్న సినిమాలను క్షణ క్షణం భయపడుతూనే ఎందుకు ఆస్వాదిస్తుంటాం? భయం అన్నది.. నిజ జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. కాని, భయానకమైన సినిమా అనగానే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు! ఎందుకిలా ప్రేక్షకులు భయాన్ని ‘కొని’ చూస్తుంటారు? ఎందుకు కొరివి దెయ్యం లాంటి భయంతో తల గోక్కుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనస్తత్వశాస్త్రంలో లేకపోలేదు. ‘పోరాడు.. లేదా, పారిపో..’భయమంటే మనం ఇష్టపడటానికి ముఖ్య కారణం ‘స్టిమ్యులేషన్’’! మెదడుకు చురుకు పుట్టించే ఇంద్రియ చలనం. సైన్స్ పరిభాషలో నాడీ మండల విద్యుత్ ప్రేరణ. భయం మానసికంగా, శారీరకంగా ఉద్రేకాన్ని జనింపజేస్తుంది. గుండె ఝల్లుమనటం ఇందుకే. థ్రిల్లింగ్ కోసం ‘కోరి తెచ్చుకునే’ భయంలో ఆందోళన, ఉత్సాహం.. రెండూ సమపాళ్లలో మిశ్రమంగా ఉంటాయి. ఊపిరి బిగబట్టి, సినిమాలో ఒక భయానక దృశ్యం చూస్తున్నప్పుడు, హఠాత్తుగా ఎదురయ్యే ఊహించని మలుపుతో మన శరీరంలో ఒక్కసారిగా విడుదలయ్యే అడ్రినలిన్ (ఎపినెఫ్రిన్) హార్మోన్.. ‘పోరాడు లేదా పారిపో’ అని సంకేతాలిస్తుంది. సినిమా కనుక మనం పోరాడేది, సీట్లోంచి పారిపోయేదీ (మరీ భయస్థులు అయితే తప్ప) ఏమీ ఉండదు. బదులుగా ఇంద్రియాలు పదునెక్కి థ్రిల్ కలుగుతుంది. అందుకే హారర్ సినిమాలంటే మనం భయపడుతూనే ఇష్టపడుతుంటాం. ‘హారి దేవుడా.. బయట పడ్డాను..’భయపెట్టే థీమ్‌లో ఉండే ఆసక్తికరమైన అంశం.. ‘కొత్తదనం’. ఆ కొత్తదనమే భయం పట్ల మనకు విపరీతమైన ఆకర్షణను కలుగజేస్తుంది. ‘అపోకలిప్టిక్’ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఉదా : ‘ది డే ఆఫ్టర్ టుమారో’, ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’, ‘ఆర్మగడాన్’ వంటివి. అవి మనకు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా కొత్త భయానక లోకాలను చూపిస్తాయి. భూగోళం సమూలంగా ధ్వంసమైపోయి, మనిషి మళ్లీ మొదట్నుంచి పునరుజ్జీవనం పొందే సినిమాల్లోని (పోస్ట్–అపోకలిప్టిక్) భయానక సన్నివేశాలు కూడా థ్రిల్‌ను రేపుతాయి. భూగోళంపై గ్రహాంతర జీవుల దాడి, సమాధుల్లోంచి పైకి లేచి వచ్చే ‘జాంబీ’లు.. మన లోపల సృష్టించే కల్పిత భయాన్ని ‘తట్టుకోవటం’ అన్నది మనం ఏదో సాహసం చేస్తున్నామన్న భావనను, సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే హారర్ సినిమాలను అంతా ఇష్టపడతారు. సినిమా పూర్తయ్యాక.. ‘హారి దేవుడా.. ప్రాణాలతో భయపడ్డాను..’ అని సినిమా హాలు నుండి పకపకా నవ్వుతూ బయటికి అడుగులు వేయటం కూడా ఓ గొప్ప అనుభూతిలా, ‘‘ఏం ఫీలున్నది మామా?’’ అనిపించేలా ఉంటుంది. బిక్కు బిక్కుమంటూ లుక్కుస్క్రీన్ మీద కనిపించే పాత్రల్లోని భయం, సినిమా చూస్తున్న వాళ్లలో కలిగే భయం ‘సింక్’ అవటం అన్నది ఒక మంచి బీభత్స, భయానక సినిమాలో ఉంటుంది. అందుకే భయం అంటే మనకు అంత క్రేజు. నరమాంస భక్షణ; దౌర్భాగ్యమైన, మానవత్వం లేని హింసాత్మక జీవితాన్ని గడిపే పాత్రలుండే ‘డిస్టోపియన్’ యాక్షన్ చిత్రాల్లోని హారర్ పట్ల ఉండే మన ఆసక్తిని అలాంటి సినిమాలు సంతృప్తి పరుస్తాయి కనుక, పైకి చెప్పకపోయినా లోలోపల ఆ సన్నివేశాలను బిక్కుబిక్కుమంటూనే చూడటానికి ఇష్టపడతాం. సురక్షిత భయాస్వాదనభయానక దృశ్యాలను ఆస్వాదించే మన సామర్థ్యం.. సైకాలజిస్టులు చెబుతున్న దానిని బట్టి ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ (భద్రతా చట్రం), డిటాచ్మెంట్ ఫ్రేమ్ (నిర్లిప్త చట్రం), కంట్రోల్ ఫ్రేమ్ (నియంత్రణ చట్రం) అనే మూడు మానసిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. భయపడుతున్నప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నామని వెనుక నుంచి వెన్ను తట్టి చెబుతుండే చట్రాలు ఇవి. హారర్ సినిమా చూస్తున్నప్పుడు... అదంతా నిజం కాదని, లోపలి పాత్రలు బయటికి వచ్చి మన పీక పట్టుకోవని ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ మనకు చెబుతుంటుంది. ఇక తెరపై కనిపిస్తున్న హారర్ నుంచి భావోద్వేగాల పరంగా మనల్ని నిర్లిప్తంగా ఉంచి, భయంలోని మజాను మాత్రమే మన వరకు తెచ్చేది ‘డిటాచ్మెంట్ ఫ్రేమ్’. మూడవదైన ‘కంట్రోల్ ఫ్రేమ్’... భయం పట్ల మన ధీమాను సడలనివ్వకుండా, థ్రిల్స్‌ని మాత్రం ఆనందించేలా చేస్తుంది.కొందరెందుకు ఇష్టపడరు?హారర్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నట్లే, హారరంటే అస్సలు ఆసక్తి లేని వాళ్లు కూడా ఉంటారు. ఇందుకు కారణం అందరి మెదడూ భయానికి ఒకేలా స్పందించక పోవటం. విపరీత సంచలనాలను, ఉరిమే ఉత్సాహాన్ని కోరుకునే వారు ఈ హారర్ చిత్రాలను లైక్ చేస్తారు. హారర్‌లోని సృజనాత్మకతను, కొత్త అనుభవాలను ఇష్టపడేవారు భయాన్ని కోరుకుంటారు. ‘దయ్యాల్లేవ్, గియ్యాల్లేవ్’ అనుకునేవారు; కల్పనలపై కుతూహలం లేనివారు హారర్ చిత్రాలను పట్టించుకోరు. ‘నీ బాధను అర్థం చేసుకోగలను’‘సహానుభూతి’ కూడా హారర్ చిత్రాల్లోని భయాన్ని ఇష్టపడటానికి ఒక కారణం అవుతుంటుంది. సహానుభూతి స్థాయి ఎక్కువగా ఉన్న వారు భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తెరపై పాత్రలతో తాము సహానుభూతి చెందుతారు. తెరపై బాధను తమ మనసులోపల మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే వయస్సు; స్త్రీ పురుష అంశం కూడా ఇక్కడ ముఖ్యమైనవే. యువ ప్రేక్షకులు, పురుషులు హారర్ చిత్రాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు తరచుగా చెడును ఓడించి, సమాజాన్ని సవ్యంగా ఉంచే కథలను ఇష్టపడతారు.హారర్.. కలవారి కాలక్షేపం!ఇదొక ఆసక్తికరమైన విషయం. సంపన్న దేశాలలోని వారే హారర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారట! దీనినే ఇంకోలా చెప్పాలంటే హారర్ చిత్రాలు చూసే వారు సంపన్నులనే అర్థం తీసుకోవచ్చు. ‘రీసెర్చ్‌గేట్’ సైట్లో పొందుపరచి ఉన్న వివరాలను బట్టి, 2020లో 82 దేశాలలో జరిగిన అధ్యయనంలో సంపన్న దేశాల ప్రజలు (తలసరి జి.డి.పి. ఎక్కువగా ఉన్నవారు) హారర్ చిత్రాలను ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడైంది. దీనర్థం? ఆర్థిక భద్రత అనేది వ్యక్తులకు హారర్ పట్ల ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ని ఏర్పరుస్తోందని! జీవితం సమస్య కానప్పుడు వినోదం కోసం మనం భయంతో ఒక ఆట ఆడుకోవచ్చు. నవ్వులుగా మారే అరుపులుభయం ఇద్దర్ని ఏకం చేయడమే కాదు. మానవ సమూహాల మధ్య బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. భయం లేదా ఒత్తిడి కలిగే సమయంలో విడుదలయ్యే ‘కనెక్షన్ హార్మోన్’ అయిన ఆక్సిటోసిన్ క్రియాశీలం అవుతుంది. అందుకే భయంతో వేసే అరుపులు చివరికి ఉమ్మడి నవ్వులుగా మారుతాయి.భయం తర్వాత ప్రశాంతతహారర్ మూవీలో చివరికి భయానక పాత్ర ఓడిపోయి సినిమా హాల్లో లైట్లు వెలిగినప్పుడు అదొక అద్భుతమైన ప్రపంచంలా ఉంటుంది. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలైన ‘ఎండార్ఫిన్’లను మెదడు విడుదల చేస్తుంది. ఫలితంగా సంతృప్తి, సంతోషం కలుగుతాయి. కుదుపు తర్వాతి స్థిరత్వం అది. కొంతమంది తీవ్ర భయం తర్వాత ఎందుకు ఉల్లాసంగా ఉంటారన్న దానికి ఇదే సమాధానం. ఏమైనా అదొక ఫీల్!· సాక్షి, స్పెషల్ డెస్క్ -
గుజరాతీ సమాచారం!
ఒక్కో కేసుదీ ఒక్కో తీరు. కొన్నిసార్లు చిల్లర దొంగతనం కేసు కూడా నెలల తరబడి పరిష్కారం కాదు. ఒక్కోసారి కోట్లు కొల్లగొట్టిన చోరులు కూడా సొత్తుతో సహా గంటల్లో దొరికేస్తారు. పంజగుట్టలోని అలుకాస్ జ్యూలర్స్లో 2006లో జరిగిన భారీ చోరీ కేసు అటువంటిదే! కేవలం 48 గంటల్లో కొలిక్కి వచ్చిన దీని దర్యాప్తులో తొలి అడుగు ఘటనాస్థలిలో దొరికిన గుజరాతీ పత్రికతో పడింది. అలా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘరానా దొంగ వినోద్ రాంబోలీ సింగ్‌తో పాటు అతడి అనుచుడు శ్రీకాంత్ సింగ్‌ను పట్టుకుని, చోరీ సొత్తు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ నిందితులను న్యాయస్థానంలో 2011లో దోషులుగా నిర్ధారించిన శిక్ష కూడా విధించింది. అది 2006 మే 16.. పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో అలుకాస్ జ్యూలరీ షోరూమ్ అప్పటికి అది ప్రారంభమై రెండు నెలలైనా కాలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఉదయం 11 గంటల సమయంలో హడావుడిగా మారిపోయింది. సైరన్లు కొట్టుకుంటూ వరుసగా వచ్చిన పోలీసు వాహనాలు ఆ షోరూమ్ వద్ద హడావుడి చేస్తుండటంతో చుట్టుపక్కల షాపుల్లో కొనుగోళ్ల కోసం వచ్చిన కస్టమర్లకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే ఓ వార్త ఆ ప్రాంతంతో పాటు నగరమంతటా దావానలంలా వ్యాపించింది. అలుకాస్ షోరూమ్‌లో ముందు రోజు రాత్రి దొంగలు పడి, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారనేది దాని సారాంశం. నాలుగు అంతస్తుల్లో నిర్మించి ఉన్న కార్ప్హౌస్లోని గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో అలుకాస్ షోరూమ్ ఉంది. భవనం వెనుక కుడివైపుగా నిర్మాణంలో ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కిన చోరులు పంజా విసిరేందుకు అనువైన సమయం కోసం అక్కడ మాటు వేశారు. అంతా సద్దుమణిగాక ఆ భవనం టెర్రాస్ పైనుంచి మూడడుగుల దూరంలో ఉన్న అలుకాస్ షోరూమ్ భవనంపైకి చేరుకుని, మెట్ల మార్గంలో రెండో అంతస్తుకు వచ్చారు. షట్టర్ పగులకొట్టి; రెండు, మొదటి అంతస్తుల్లోని డిస్ప్లేల్లో ఉన్న ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. లాకర్ల జోలికి వెళ్లని వీళ్లు దుకాణంలోని లైట్లన్నీ ఆర్పేసి, టార్చ్లైట్ల వెలుతురులో తమ పని పూర్తి చేసుకున్నారు. మళ్లీ రెండో అంతస్తులోకి వెళ్లిన చోరులు అక్కడ నుంచి ఓ తాడు సాయంతో పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పైకి దూకి పరారయ్యారు. మర్నాడు ఉదయం ఈ దొంగతనం విషయం యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత రూ. ఆరు కోట్ల విలువైన సొత్తు చోరుల పాలైనట్లు అధికారులకు తెలిపింది. పోలీసులు సైతం చోరీ జరిగిన తీరును గుర్తించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేయాలని భావించారు. ఆరాతీస్తే, షోరూమ్‌లో ఉన్న 12 కెమెరాలకు ఆ రోజు 10 పని చేయలేదని తేలింది. మిగిలిన రెండు మాత్రం ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు చూపించాయి. చోరీ జరిగిన తీరు, షోరూమ్‌లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పరిశీలించిన పోలీసుల దృష్టి తొలుత సంస్థ ఉద్యోగులపైనే పడింది. వారిలో ఎవరైనా లేదా వారి సహకారంతో ఎవరైనా ఈ నేరం చేశారా అనే దిశగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. చోరులు అలూకాస్లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన నిర్మాణంలో ఉన్న భవనంపై పోలీసుల దృష్టి పడింది. అక్కడే అసంకల్పితంగా వెతకబోయిన తీగ పేపర్ రూపంలో పోలీసుల కాలికి తగిలింది. ఆ భవనం నాలుగో అంతస్తులో ఖాళీ బిర్యానీ పొట్లాలు, సిగరెట్ పీకలు ఉండటాన్ని బట్టి చోరులు అక్కడే వేచి ఉన్నారని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అదే ప్రాంతంలో ‘గుజరాత్ సమాచార్’ దినపత్రిక పడి ఉండటాన్నీ గమనించారు. దానిని చోరులే తెచ్చి ఉంటారని భావించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. ఆ పత్రిక గుజరాత్‌తో పాటు ముంబైలోనూ దొరుకుతుందని తేలడంతో ఆ రెండు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. నగరం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులను కలిసింది. దుకాణంలోని సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్‌ను వారికి చూపించడంతో పాటు నేరం జరిగిన విధానాన్నీ వివరించింది.అవన్నీ చూసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల మదిలో మెదిలిన పేరు వినోద్ రాంబోలీ సింగ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను మహారాష్ట్రలోని సౌత్ ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహిసార్‌లో స్థిరపడ్డాడు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ అప్పటికే అతడిపై ఇరవైకి పైగా చోరీ, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వేగులను ఆరా తీయగా, వారం రోజులుగా అతడు కనిపించలేదని, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిసింది. దీంతో అలుకాస్ భారీ చోరీ అతడి పనిగా నిర్ధారించిన పోలీసులు 2006 మే 18 అర్ధరాత్రి బరివోలిలోని ఓ బార్‌పై దాడి చేశారు. అక్కడ రాంబోలీ సింగ్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలుకు వచ్చిన సూరత్ వజ్రాల వ్యాపారి అజయ్ షా పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను రికవరీ చేశారు. రాంబోలీ సింగ్‌కు సహకరించిన శ్రీకాంత్ సింగ్‌ను కొన్ని రోజుల తరవాత అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు 2011లో శిక్ష విధించింది. 1982 నుంచి నేరాలు చేస్తున్న వినోద్ రాంబోలీ సింగ్ కదలికలు అలుకాస్ నేరం తర్వాత హైదరాబాద్‌లో కనిపించలేదు. 2017లో థానేలోని అంబర్‌నాథ్‌లో ఉన్న జ్యూలరీ షాపు నుంచి రూ.1.7 కోట్ల నగలు, 2022లో దాదర్‌లో ఉన్న పీడీ పెడ్నేకర్ జ్యూలరీ షాపు నుంచి రూ.1.24 కోట్ల విలువైన నగలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. అంబర్నాథ్ చోరీ తన ‘వృత్తి’లో భాగంగానే చేసినా, పీడీ పెడ్నేకర్‌లో మాత్రం ప్రతీకారంతో చేశాడు. 2022 జూలైలో ఆ దుకాణానికి వెళ్లిన రాంబోలీ సింగ్ కొంత బంగారం ఖరీదు చేశాడు. కేవలం రూ.2 వేల డిస్కౌంట్ విషయంలో దాని యజమాని సోనాలీ ముడ్కేఖర్తో వాగ్వాదం జరిగింది. తనకు రాయితీ ఇవ్వని ఆ దుకాణంపై కక్షకట్టిన రాంబోలీ సింగ్ మరో అనుచరుడితో కలిసి ఆ ఏడాది ఆగస్టు 24న ఈ చోరీ చేశాడు. -
మా అమ్మే నా శత్రువు
ఆ టెలిగ్రామ్ చూడగానే రామ్ సదై బాబులో ఆందోళన మొదలైంది. గబుక్కున స్టూలుమీద నుంచి లేచి, ‘‘ఈ ఉద్యోగం మానేయాలి. నా వల్ల కాదు’’ అనుకుంటూ భార్య ఉన్న గదిలోకి ప్రవేశించాడు.ఆమె గర్భవతి. మంచం మీద విశ్రాంతి తీసుకుంటోంది. భర్త చేతిలో టెలిగ్రామ్ చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. ‘‘ఇంతకీ ఏమైంది?’’ భర్తను ఆత్రంగా అడిగింది.‘‘నా సెలవుకు అనుమతి లభించలేదు’’ నిస్పృహగా అన్నాడు రామ్ సదై. ‘‘నీ పరిస్థితి గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాను. వాళ్లకు కనీసం కనికరం కలగలేదు. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరాలి’’ అని ఒక నిముషం ఆగి మళ్లీ చెప్పాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న పొలాన్ని సాగు చేసుకోవటం మంచిదనిపిస్తోంది’’.శశిముఖి మధ్యలోనే అందుకుంది. ‘‘మనిద్దరమే అయితే మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఫరవాలేదు. కానీ ఇప్పుడు..’’ అర్ధోక్తితో ఆగిపోయింది.ఆమె పూర్తిగా చెప్పవలసిన పనేం లేదు. తమ ఆర్థిక పరిస్థితి గురించి రామ్ సదైకి పూర్తి అవగాహన ఉంది. అందుకే వెంటనే స్పృహలోకి వచ్చి, కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తర్వాత కోర్టు పని మీద బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య అడిగింది. ‘‘ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు?’’. ‘‘నేనేం చేయాలో నువ్వే చెప్పు?’’ అన్నాడు రామ్ సదై. ‘‘ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? ఒకవేళ తీసికెళదామనుకున్నా అది దగ్గరా దాపూ కాదు. డాక్టర్లు నిన్ను ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. పోనీ మనకు తెలిసిన వాళ్లను సాయం చేయమని అడుగుదామా?’’‘‘హాస్పిటల్లో పనిచేసే మంత్రసానిని రోజూ రమ్మనమని చెబుతాను. అవసరమైతే తను నీతోనే ఉంటుంది. ఎలాగూ ఏడెనిమిది రోజుల్లో మథుర్ కాకా వచ్చేస్తారు. ఈలోపు నీకు ఇబ్బంది ఉండదు..’’.అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ.. ‘‘నయన్ దీదీని రమ్మని పిలవకూడదూ.. ఇక్కడికి దగ్గరేగా. తనొచ్చి నాకు తోడుగా ఉంటుంది’’ అంది శశి. ‘‘నువ్వు భలే చెప్పావు. నీకు సాయం చేయటానికి ఎవరెవరిని పిలవాలా అని సతమతమవుతున్నాను. నాకెందుకు నయన్ పేరు తట్టలేదో? ఈ మధ్య నా బుర్ర పనిచేయటంలేదు’’తలకొట్టుకుంటూ అన్నాడు రామ్ సదై.నయనతార భర్త హరిపాద గంగూలీ. దర్భంగాలో రైల్వేలో పనిచేస్తున్నాడు. తనకి వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు.రామ్ సదై తన భార్య పరిస్థితిని పూర్తిగా వివరించి నయనతారను వెంటనే బయలుదేరి రావలసిందిగా లేఖ రాశాడు. ఆమె ఖర్చులకు డబ్బులు కూడా పంపాడు. ఆమె శశిముఖికి దూరపు చుట్టం. వరసకు అక్క అవుతుంది. ఓ వైపు డబ్బుకు కటకటలాడటం, మరో వైపు తన కంటే డబ్బు ఉన్న చెల్లెలి కుటుంబానికి సాయపడితే కొంతయినా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో వెనకా ముందు ఆలోచించకుండా ముజారఫ్పూర్ బయలుదేరింది నయన.రామ్ సదై వెళ్లే రైలులోనే ఆమె దిగింది. తల మీద నుంచి మోకాళ్ల వరకూ షాల్ కప్పుకుని పసిపిల్లవాడిని చేతిలో ఉంచుకున్న నయనతారను చూడగానే అతనికి సంతోషం కలిగింది. ‘‘నువ్వొచ్చావు. నాకు కొంచెం ఆందోళన తగ్గింది. ఇద్దరు ఆడవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళుతున్నందుకు దిగులుగానే ఉంది. ఏం చేయను తప్పటం లేదు. కాకా త్వరలోనే వచ్చేస్తాడు. ఈలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నాను’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి ఆమెకి వాహనం సిద్ధం చేయమని చెప్పి రైలెక్కేశాడు. ఆ మర్నాడే శశిముఖికి ప్రసవం అయ్యింది. మరి కాసేపటికే ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. నయనతారకి ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాలేదు.తన పరిస్థితి అర్థం చేసుకున్న శశిముఖి ‘‘అక్కా, ఖోకాను ఒక్కసారి నాకు చూపిస్తావా? అనడిగింది.వెంటనే నయనతార పసిబిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో ఉంచింది. ‘‘దీదీ.. నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నీ బిడ్డ మాదిరిగానే వాడిని సాకుతానని మాటివ్వు’’. అంది శశిముఖి. ‘‘వీడొకటి.. నా బిడ్డకొకటి వేర్వేరు కాదు. ఇద్దరూ నాకు సమానమే.. పైగా ఇప్పడు ఈ మాటలన్నీ ఎందుకు? నీకేం కాదు. నువ్వు బాగానే ఉంటావు. భయపడకు. ఒకవేళ భగవంతుడు అలా రాసిపెట్టి ఉండి ఏదయినా అనుకోనిది జరిగితే, మీ అబ్బాయికి తల్లి లేని లోటు ఉండదు.’’ ధైర్యం చెప్పింది నయన.కానీ అర్ధరాత్రి గడిచేసరికి శశిముఖి ప్రాణాలు విడిచింది. రామ్ సదై బాబుకు రెండు టెలిగ్రామ్‌లు వెంట వెంటనే అందాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనే సమాచారంతో ఒకటి, హఠాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిందన్న విషాదకర వార్తతో మరొకటి. అంతగా వెలుతురు లేని గదిలో ఉంది నయన. శశిముఖికి పరిచయం ఉన్న వాళ్లెవరో పరామర్శకని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తన బిడ్డను మంచం మీద పడుకోబెట్టి శశిముఖి బిడ్డకు పాలిస్తోంది నయన. అదే మంచం మీద వచ్చిన అతిథులను సర్దుకుని కూర్చోమని చెప్పింది. లాంతరు ఒత్తిని కొంచెం పెద్దది చేసింది. గదిలో కొంచెం వెలుతురు ఎక్కువయ్యింది.అక్కడికొచ్చిన వినోద్ బాబు భార్య.. ‘‘ఈ పిల్లవాడు దీదీ బిడ్డ అన్న మాట. అచ్చం అమ్మలాగా ఎంత అందంగా ఉన్నాడు. కనీసం అమ్మను చూసుకోలేకపోయాడు పాపం’’ అంది. అంతలోనే ఆమె పక్కన కూర్చున్న మరో ఆమె అందుకుంది. ‘‘వాడి మొహం చూడు. అచ్చు వాళ్లమ్మలా మిసమిసా మెరిసిపోతుంది. తను ఎంత మంచిది! ఆరోగ్యం సరిగ్గా లేదని మాకు ముందే చెప్పి ఉంటే ఎలాగోలా కాపాడుకునేవాళ్లంగా ’’ ఇలా చెప్పుకుపోతోంది.ఆ బిడ్డ శశిముఖి సంతానం కాదని, తన బిడ్డ అని చెప్పబోయి నయనతార ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎవరి బిడ్డ అని తేల్చి చెప్పటం ఇతరులకు చిక్కు సమస్యే! నల్లగా బలహీనంగా ఉన్న బిడ్డను నయనతార బిడ్డగానూ, అప్పుడే పుట్టిన వాడికంటే బాగా పుష్టిగా ఉన్న నయనతార బిడ్డను శశి బిడ్డగానూ వాళ్లు భావించారు. అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా చాలాసేపు ఆలోచించింది నయన. అసలు చిక్కుముడిని విడతీయకపోతే పోయేది ఏం ఉంది అన్న ఆలోచన చేసింది. తన బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చేస్తానని శశిముఖికి మాటిచ్చాను. దానిని కాపాడుకోవచ్చు.అలాగే మరో వైపు డిప్యూటీ బాబు సంపదతో తన బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. దానికి అడ్డుకోవటం ఎందుకు? తల్లి లేని బిడ్డకు తల్లినవుతున్నాను కదా..? అని తనను తాను సమాధానపరుచుకుంది. శశిముఖి వార్త తెలియగానే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రామ్ సదై. ఆమె మరణించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోయాడు. ఆమె ఉన్నదనే భావనతోనే ఇంట్లో కలియతిరుగుతున్నాడు. డాబా మీద, వంటింట్లో, స్నానాల గదిలో ఇలా ఆమె కోసం వెతుక్కుంటున్నాడు. గుండె బద్దలై పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు.ఇదంతా చూసి కదిలిపోయినట్టుగా నటించింది నయనతార. రాని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’’ అంది.ఆమెను చూడగానే స్పృహలోకొచ్చాడు. ఆమె చెప్పినట్టే స్నానం చేసి, భోజనం చేసి ఆ తర్వాత వాలు కుర్చీలో కూర్చున్నాడు. పనివాడు అందించిన హుక్కాను పీలుస్తూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. నయన్ చేతిలో పసిపిల్లవాడితో అక్కడకి వచ్చింది. ‘‘పిల్లవాడు కాస్త సన్నగా ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి బాగా పోలికలున్నాయి’’ అని చెప్పి పిల్లవాడిని అతని పొత్తిళ్లలో ఉంచబోయింది.రామ్ సదైకి వాడిని చూడాలనిపించలేదు. ‘‘తల్లిని మింగేసిన రాక్షసుడు’’ అన్నాడు పరుషంగా. ‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ వాడిని వదిలేస్తే..’’రామ్ సదై ఆ చిన్నారిని సరిగా ఒడిలో పడుకోబెట్టుకోలేదు. దాంతో అసౌకర్యంగా అనిపించి ఆ పిల్లవాడు ఏడుపు అందుకున్నాడు. ‘‘ఏమిటో ఈ పిల్లాడు.. పెద్దమ్మ అయిన నా దగ్గరకి తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లడు’’ అంటూ నయన ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. ఆ తర్వాత చెల్లెలి భర్తతో భవిష్యత్తు గురించి చర్చించటం మొదలుపెట్టింది.‘‘నువ్వొచ్చేశావ్ కదా? నేను మా ఊరు బయలుదేరతాను. నేను సర్దుకోవలసిన చాలా ఉన్నాయి’’ అంది. ‘‘వద్దొద్దు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేయలేను. ఉద్యోగంలో టూర్లు చేస్తూ వీడిని చూసుకోవటం కాని పని. నువ్విక్కడే ఉండు. మీ ఆయనకు కూడా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను’’ అన్నాడు. అది చాలా భారమైన పని అన్నట్టు ప్రవర్తించింది నయనతార. ‘‘ఇతరుల పిల్లలను సొంత పిల్లల్లా పెంచటం కష్టం. అదీగాక సమాజం కూడా ఏదో ఒక తప్పు ఎంచుతూ ఉంటుంది. కానీ నీ ఇబ్బందిని చూసిన తర్వాత కాదనాలనిపించటం లేదు. నాకు శక్తికి మించిన పనే అయినా చేస్తాను’’ అంటూ రామ్ సదై కి తన పట్ల సానుభూతి కలిగేలా జీవితాంతం అతను తన మీద కృతజ్ఞత చూపేలా మాట్లాడింది. ‘‘శశిముఖి బిడ్డను తన బిడ్డలా సాకుతోంది. అంతే కాదు. తనకు కూడా ఓ పసిబిడ్డ ఉన్నాడన్న స్పృహనే ఆమెకు లేదు’’.చాలామంది నయనతార గురించి గొప్పగా చెప్పటం ప్రారంభించారు. రామ్ సదైలో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది. తన బిడ్డకు లోటు లేకుండా చూస్తున్న ఆమె సాధారణ వ్యక్తి కాదు అనుకునేవాడు. గుండ్రంటి అందమైన తన పిల్లవాడిని అతని బిడ్డగా చెప్పేది. అది అతనూ నిజమేనని భావించేవాడు. రామ్ సదై టూర్‌కి వెళ్లి వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు కొని తెచ్చేవాడు.తన బిడ్డగా ఆమె చెప్పుకుంటున్న పిల్లవాడికి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, ‘‘వాడికి ఇదంతా అలవాటు చేయకు. వాడు పేద ఇంటి పిల్లాడు. అలాగే పెరగనివ్వు. లేకపోతే వాడు పరిస్థితులకు సర్దుకోవటం కష్టం’’ అని వారించేది. దాంతో నయన తారపైన రామ్ సదైకి మరింత అభిమానంపెరిగింది. ఎంత ఆత్మగౌరవం ఉన్న మనిషి అనుకుని ముచ్చటపడేవాడు. దాంతో మరింత ఎక్కువగా అతనికి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రకంగా డిప్యూటీ బాబు కుమారుడు జతిన్, నయనతార కుమారుడు ఉపేన్లు స్థానాలు మార్చుకుని భిన్నమైన పాత్రల్లో పెరగటం మొదలుపెట్టారు. ప్రతిరోజూ పాఠాలు చెప్పటానికి ట్యూటర్ ఇంటికి వచ్చేవాడు. జతిన్ చిన్నతనంలోనే ఓ విషయం గ్రహించాడు. తను పేదింటి బిడ్డ కావటంతో ప్రపంచం పెద్దగా తన పట్ల ఆసక్తిని చూపదు అని సరిపెట్టుకున్నాడు. స్కూలులో అతను ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రధానోపాధ్యాయుల ప్రశంసలన్నీ ఉపేన్ వైపే ఉండేవి. జతిన్ ప్రయత్నాలను, తెలివితేటలను గుర్తించి ట్యూటర్ అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాడు. ఉపేన్ ఒక క్లాసులో తప్పితే అతన్ని అదే క్లాసులో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ నయనతార పోరాడి అతను పై తరగతిలో అడుగుపెట్టేలా చేయగలిగింది. దాని వల్ల అతనికి బహుమతులు లభించాయి. జితిన్ ఇలాంటి అడ్డదారులను నమ్ముకోలేదు.తల్లి ప్రేమకు నోచుకోకుండానే పెరిగి పెద్దవాడయ్యాడు జతిన్. కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అతనికి పుష్కలంగా ఉండేది. దాంతో అతనికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అతనికి ఫీజులు చెల్లించటం మానేయమని, ఏదయినా చిన్న ఉద్యోగంలో అతన్ని చేర్చమని నయనతార అప్పుడప్పుడు రామ్ సదైతో అనేది. అతను ఈ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో జతిన్‌ను పిలిచి మందలించింది. ‘‘ఇంకోళ్ల డబ్బుతో చదువుకోవటానికి సిగ్గులేదా నీకు. ఇప్పటికి చదివింది చాలు. రామ్ సదై మంచివాడు కాబట్టి ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్నాడు. ఇంకొకళ్లయితే నిన్ను వీధిలోకి విసిరేవాళ్లు’’.తల్లి మాటలకు బాగా నొచ్చుకున్న జతిన్– రామ్ సదైని కలిశాడు. తాను కోల్కత్తా వెళుతున్నానని, స్కాలర్ షిప్పు డబ్బులతో చదువుకుంటానని చెప్పాడు. ‘‘ఏమైంది. ఇక్కడ ఏదయినా ఇబ్బంది అనిపిస్తోందా?’’ అడిగాడు రామ్ సదై.‘‘అదేం లేదు. పై చదువులు చదువుకోవటానికి కోల్కత్తా అనుకూలంగా ఉంటుందని..’’ జవాబు చెప్పాడు జతిన్.ఆ తర్వాత కోల్కత్తా వెళ్లి అక్కడ ఒక మెస్సులో ఉన్నాడు. ఎవరి నుంచి పైసా సాయం ఆశించకుండా తన సొంత డబ్బుతో కష్టపడి చదువుకున్నాడు. ముందు బీఏ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత లాయర్ అయ్యాడు.ఉపేన్ అతనికి దరిదాపుల్లో లేడు. చదువులోగానీ, పేరు ప్రఖ్యాతుల్లో గానీ.కానీ అతని పెద్దమ్మగా నయనతార అన్ని విషయాల్లో అతన్ని పొగుడుతూండేది. ఇది ఇంకెంత కాలం కొనసాగేదో గానీ, ఇంతలోనే అనుకోని పరిణామం సంభవించింది.హఠాత్తుగా కలరా వ్యాపించటంతో పనిచేస్తున్న చోటే మృత్యువు పాలయ్యాడు రామ్ సదై. ∙∙ ‘‘ఉపేన్, మనకి ఏమవుతుంది? మీ నాన్న వదిలేసిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తావో కూడా తెలియటం లేదు’’ నయనతార ఆందోళనగా అంది.‘‘ఫరవాలేదు పెద్దమ్మా.. మనం ఉన్నదానితో సర్దుకోగలం’’ జవాబిచ్చాడు ఉపేన్.‘‘అది వీలుకాని పని. మనకు అప్పు ఇచ్చే వాళ్లు కూడా కనిపించటం లేదు’’ దీనంగా చెప్పింది నయన.‘‘ఒకసారి తాతగారిని కలుద్దాం. ఆయన మనకు ఏమైనా సలహా ఇస్తారు’’ అన్నాడు ఉపేన్.ఈ సమయానికి జతిన్ లాయర్‌గా దర్భంగాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. సంపాదన బాగా పెరిగింది. ఉపేన్ని తన సొంత తమ్ముడిలా ప్రేమించేవాడు. వాళ్ల పరిస్థితి తెలిసిన తర్వాత అప్పులన్నీ తీర్చేశాడు. అంతే కాదు. వాళ్లను తనతో వచ్చెయ్యమని కోరాడు.జతిన్ ఆస్తిపాస్తులన్నీ చూసిన తర్వాత నయనతార అసూయ కలిగింది. మాటల్లో వర్ణించలేనంత పశ్చాత్తాపానికి లోనయ్యింది. పిల్లలను అటూ ఇటూ మార్చటం వల్ల తాను సాధించింది ఏమీ లేదని గుర్తించింది. కనీసం తనే అతని తల్లిని అనే మాటను కూడా జతిన్‌కు చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు చింతించింది. ఉపేన్కు చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యారు. ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ జులాయిగా తిరిగేవాడు. ‘‘నీకోసం మంచి ఉద్యోగం చూశాను. అందులో చేరావంటే అంతా సక్రమంగా సాగుతుంది. నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది’’ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు జతిన్.ఉపేన్‌కి ఈ సలహా నచ్చలేదు. నయనతార చాలా రోజులుగా అతనికి బ్రెయిన్ వాష్ చేస్తోంది. జతిన్ తమకు రుణపడ్డాడని. ఉపేన్ అతన్ని ఏమైనా అని సాధించవచ్చని సలహా ఇచ్చింది. ‘‘నువ్వు నన్ను వదుల్చుకోవాలనుకుంటున్నావా?’’ అడిగాడు ఉపేన్.ఈ మాటలకు జతిన్ మనసు గాయపడింది. ‘‘ఇంకెప్పుడూ నిన్ను పనిచేయమని నేను అడగను’’ అని అక్కడ నుంచి చకచకా కదిలి వెళ్లిపోయాడు. హరిపాద, అతని భార్య తీవ్రస్థాయిలో తగువు పడ్డారు. జతిన్‌కి అతను మంచి సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరోజిని. ప్రభుత్వ ప్లీడరు కార్తీకబాబు కుమార్తె. అతను బాగా ఆస్తిపరుడు. జతిన్, సరోజినిల జంట బావుంటుందని, స్వర్గంలో కుదిరిన సంబంధం అని ఎంతగానో భావించాడు. అతను వంశచరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. నయనతార ఈ మాట వినగానే ఇంతెత్తున ఎగిరింది. ‘‘మన జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తిని ఆయన లేనంత మాత్రాన మరచిపోతామా? పాపం ఆయన బిడ్డను అలాగే వదిలేస్తామా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరు ఆ అమ్మాయిని ఉపేన్‌కి ఇచ్చి వివాహం చేయండి. లేకపోతే నేను ఉరిపోసుకుని చస్తా’’ అని హెచ్చరించింది.భార్య ప్రవర్తనతో కంగుతిన్నాడు హరిపాద. ఆమెతో వాదించి ప్రయోజనం లేదనిపించి అక్కడ నుంచి మాయమయ్యాడు.ఎలాగయినా ఈ పెళ్లిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న నయన ముందుగా జతిన్‌కి కబురు పెట్టింది. ఉపేన్‌కి అతను ఎలా రుణపడ్డాడో చెప్పుకొచ్చింది.అతను అనుభవిస్తున్న సంపద అంతా రామ్ సదై బాబు దయ వల్లనే సాధ్యపడిందని, వాళ్లిద్దరి రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని వివరించింది. ‘‘ఇప్పుడు అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావ్’’ అని నిలదీసింది. ‘‘అమ్మా, ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది నాన్న కదా? ఆయనతోనే నువ్వు మాట్లాడు’’ అని జతిన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిపోయాడు.దాంతో నయనతారకు మరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఉపేన్‌ను కలుసుకుని, ‘‘బాబూ, నీతో మాట్లాడాలి’’ అంది.‘‘జతిన్ పెళ్లి గురించి నువ్వు వినే ఉంటావు. నువ్వేం కంగారు పడకు. కిందా మీదా పడయినా సరే, అదే అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తా’’ అని ప్రకటించింది. దాంతో కంగుతిన్నాడతను.‘‘పెద్దమ్మా? ఏమిటి నువ్వు అంటున్నది?’’ గట్టిగా అరిచాడు. ‘‘పూర్వీకులు, వంశ చరిత్ర, సామాజిక స్థితి అన్నింటిని పరిశీలించారు. వాళ్లిద్దరి జాతకాలు కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తన కూతురిని తమ్ముడికి కాకుండా నాలాంటి మూర్ఖుడికివ్వటానికి సిద్ధపడే వాళ్లు ఎవరు ఉంటారు చెప్పు’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏ వంశచరిత్ర, పూర్వీకుల గురించి మాట్లాడేది?’’ ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయటానికి సిద్ధమవుతూ అంది నయన. ‘‘నువ్వు గొప్పగా చెప్పే వంశవృక్షాన్ని జతిన్ నీ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే జతిన్ పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ సవాల్ చేస్తున్నట్టుగా అంది.ఉపేన్ మళ్లీ అరిచాడు. ‘‘నీకేమయినా పిచ్చి పట్టిందా? తను నా వంశచరిత్రను ఎలా గుంజుకోగలుగుతాడు?’’ అన్నాడు.‘‘పిచ్చోడా? నీ వంశచరిత్రకు నువ్వు విలువ ఇవ్వాలి. వంశచరిత్ర ముందు సంపద, సామాజిక స్థాయి ఎందుకూ కొరగావు అనేది నేను అనుకుంటే, నా కొడుకుని ఇంకొకరితో మార్చే దానినా?’’ఉపేన్ మంచం మీద ఎగిరి దూకాడు. ‘‘పెద్దమ్మా..?’’‘‘ఇంకా పెద్దమ్మా ఏమిటి? అమ్మా అని పిలువు. నువ్వెప్పుడూ నన్ను నువ్వు అలా పిలవలేదు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. నేను నీ కోసం ఎంతో చేశాను. చివరికి దీని వల్ల నాకేం మిగిలింది? ఇప్పుడు నేను అందరికీ చెబుతాను. పుట్టినప్పుడు మీ ఇద్దరిని నేను ఎలా మార్చానో? ఈ రోజు వాడికి రెండు డిగ్రీలు ఉన్నందుకు అహంకారం, తలపొగరు నెత్తికెక్కి హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. వంశచరిత్ర.. దాన్ని ఇప్పడే నాశనం చేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి దొరికేలా లేదు’’ అంది గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను నేను చంపేస్తా’’ ఉగ్రుడయ్యాడు ఉపేన్..ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అతని జాడ కనిపించలేదు. అలా అప్పుడప్పుడు అతను మాయం కావటం మామూలే. అందుకే ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సాయంత్రం జతిన్‌కి అతని పేరుతో ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘దాదా, నేను రంగూన్ వెళ్లిపోతున్నాను. మీరంతా సుఖసంతోషాలతో జీవించాలి. అదే నేను మీ నుంచి కోరుకుంటాను. ఇకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావనే అనుకుంటున్నాను. ఉంటున్నాను– ఉపేన్’’ అని ఉంది అందులో. బెంగాలీ మూలం: మాధురీలతా దేవి అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
హిమకరం... హితకరం
స్పీకింగ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, రేడియోథెరపీ, ఫార్మాథెరపీ ఇలా చికిత్స విధానాల పేరు ఏదైనా సమస్య మాత్రం ఒకటే ‘అనారోగ్యం’. నిజానికి ఈ రకమైన థెరపీలు లెక్కకు మించినవి. శారీరక రోగాలకే కాక, మానసిక ఆరోగ్యం కోసం ఉద్దేశించిన సైకోథెరపీ, ఆహార నియమాలతో మెరుగుపరచే డైటరీథెరపీ, రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోథెరపీ వంటివి ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంలో అయినా, ఆధునిక వైద్యంలో అయినా– కాలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతూ, మెరుగుపడుతూ వస్తున్నాయి. నిరంతరం సాగే ప్రయోగాల్లో పరిశోధనల్లో, ఆధునిక విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అన్వేషించిన వాటిని మరింతగా విశ్లేషించి అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో, వైద్య ప్రపంచాన్ని అబ్బురపరచిన సరికొత్త థెరపీనే, క్రయోథెరపీ! ప్రస్తుతం డెర్మటాలజిస్ట్‌లు, ఫిజియోథెరపిస్ట్‌లు, సర్జన్లు ఇలా చాలామంది మెడికల్ స్పెషలిస్ట్‌ల నోట వినిపిస్తున్న వైద్య పద్ధతి క్రయోథెరపీనే!వారంతా ఈ నాన్–ఇన్వేసివ్ (శరీరానికి కత్తి కోతలు, సూది పోట్లు లేని) చికిత్స విధానానికే ఓటేస్తున్నారు.క్రయో అంటే గ్రీకు భాషలో చల్లని లేదా గడ్డకట్టిన మంచు అని అర్థం. చల్లదనంతో చేసే చికిత్స కాబట్టి దీనికి క్రయోథెరపీ అని పేరొచ్చింది. ఇది– ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ఒక ఆధునిక చికిత్స విధానం! మొత్తం శరీరానికి లేదా సమస్య ఉన్న శరీరభాగాలకు అతి శీతల ఉష్ణోగ్రతలను అందించి, చికిత్స చేయడమే ఈ క్రయోథెరపీ పద్ధతి. ఈ చికిత్సతో క్యాన్సర్ వంటి కొన్నిరకాల అసాధారణ కణజాలాలను నాశనం చేయొచ్చు. నైట్రోజన్ లిక్విడ్ లేదా ఆర్గాన్ గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి ప్రమాదకరంగా మారిన కణాలను తొలగించడానికి కావలసిన తీవ్రమైన చలిని పొడిగాలుల రూపంలో ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఇది వెల్నెస్ ట్రీట్మెంట్లలో వినూత్న పద్ధతిగా ప్రాచుర్యం పొందుతోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులకు మాత్రమే పరిమితమైన ఈ హిమ చికిత్స ఇప్పుడు పలు ఆరోగ్య సమస్యల నివారణకు, మానసిక ఉల్లాసానికి, సౌందర్య చికిత్సలకు ఉపయోగపడుతోంది. దీనిలో ప్రధానంగా రెండు రకాల చికిత్స విధానాలు ఉన్నాయి. మొదటిది ‘లోకల్ లేదా ఫోకల్ క్రయోథెరపీ’. ఇది శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉన్న అసాధారణ లేదా ప్రమాదకరమైన కణజాలాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని క్రయో అబ్లేషన్ లేదా క్రయో సర్జరీ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, క్యాన్సర్ కణాలు, పులిపిర్లు లేదా ఇతర చర్మ గాయాలను సరి చేయడం వంటివి ఈ చికిత్సలోకే వస్తాయి.రెండవది ‘హోల్ అండ్ బాడీ క్రయోథెరపీ’. ఈ ట్రీట్మెంట్లో కొన్ని నిమిషాల పాటు క్రయోచాంబర్ అనే ప్రత్యేక గదిలాంటి అతిశీతల పేటికలో ఉంచుతారు. అది కూడా 2 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే చికిత్స ఉంటుంది. ఆ గది చాలా చల్లగా ఉంటుంది. క్రయోథెరపీలో భాగంగా, శరీరంలోని రక్తనాళాలు అతి శీతల వాతావరణంలో (సుమారు మైనస్ 110 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వరకు) సంకోచించి, చికిత్స అవసరమైన అవయవాలకు రక్తప్రసరణను పెంచుతాయి. చికిత్స అనంతరం బయటకు రాగానే – ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా ఉన్న తాజా రక్తం కండరాలకు, చర్మానికి వేగంగా చేరుతుంది. ఈ ప్రక్రియ వాపును తగ్గిస్తుంది, కండరాల రికవరీలో వేగం కనిపిస్తోంది. నిజానికి అంత మైనెస్ డిగ్రీల చలంటే తలచుకుంటేనే వణుకు పుడుతుంది కదా అనే అనుమానం రావచ్చు. అయితే ‘తడి చలిలో ఉండలేం కానీ పొడిగా ఉండే చలిగాలిలో శరీరం కొద్దిసేపు ఉండగలదు’ అని చెబుతున్నారు క్రయోథెరపీ నిపుణులు.ఈ చికిత్సతో ఓపెన్ సర్జరీ లేకుండానే వ్యాధిగ్రస్థ కణజాలాన్ని తొలగించొచ్చు. దాంతో చాలామంది త్వరగా, తక్కువ నొప్పితో కోలుకుంటారు. పులిపిర్లు, మచ్చలు, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిడ్స్ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్), ఎముకల క్యాన్సర్ ఇలా చాలా రకాల సమస్యలను, వ్యాధులను ఈ ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు.ఈ హిమ చికిత్సకు పునాది ఎక్కడ?చికిత్స కోసం చల్లదనాన్ని ఉపయోగించే క్రయోథెరపీ ఇప్పటిది కాదు. ఈ పద్ధతి వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. నిజానికి క్రయోథెరపీ చరిత్ర పురాతన నాగరికతలతో ప్రారంభమైంది. ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లు అసాధారణ వాపులను తగ్గించడానికి, గాయాలకు చికిత్స చేయడానికి మంచుగడ్డను ఉపయోగించేవారు. ప్రసిద్ధ వైద్యుడు హిపోక్రాట్స్ సైతం గాయాలకు, వాపులకు చల్లదనాన్ని ఉపయోగించమని సిఫారసు చేశారట. చల్లని నీటిలో మునగడం, మంచు ముక్కల్లో కూర్చోవడం ఇవన్నీ నాటి మొదటి అడుగులే!1800ల నాటి వైద్యులు ‘ఐస్ బాత్’ను (మంచు స్నానాన్ని) వైద్య చికిత్సలో భాగం చేశారు. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల చికిత్సకు ఐస్ బాన్ క్లినిక్స్ అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలలో సర్వసాధారణమయ్యాయి. అనంతరం వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో కోల్డ్ ప్యాక్‌లను ఉపయోగించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దం మధ్యలో ఆధునిక క్రయోథెరపీకి పునాది వేసిన నాటి ప్రసిద్ధ వైద్యుడు జేమ్స్ ఆర్నాట్ను క్రయోథెరపీ పితామహుడు అంటారు. ఆయన నొప్పులు, కణితుల నివారణకు ఈ శీతల చికిత్సను ప్రారంభించిన మొదటి వ్యక్తి.20వ శతాబ్దం వచ్చేనాటికి క్రయోసర్జికల్ విధానంలో లిక్విడ్ నైట్రోజన్‌ను ఉపయోగించడంతో పరికరాల అభివృద్ధికి దారితీసింది. ఈ చికిత్స ప్రయోజనాలను ప్రాచీన ఈజిప్షియన్లు క్రీ.పూ. 2500 నాటికే గుర్తించారు.హిపోక్రాట్స్– క్రీ.పూ. 400 ప్రాంతంలో, నొప్పి నివారణ, వాపు కోసం మంచుగడ్డలు ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.క్రయోథెరపీ చరిత్రలో కీలక మలుపు 1978లో వచ్చింది. జపాన్ కు చెందిన డా. తోషిమా యమగుచి– రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు చల్లటి గాలి చికిత్సలను ఉపయోగించడం ప్రారంభించారు. చల్లటి నీటిని ఉపయోగించకుండానే గాలిని వాడి– కీళ్ల నొప్పులు, వాపును త్వరగా తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయోగాలు మంచి ఫలితాలను సాధించడంతో క్రయోథెరపీ చాంబర్ ఆవిష్కరణకు దారి తీసింది. ఇందులో రోగులు తక్కువ సమయం పాటు అతి శీతల ప్రదేశంలో నిలబడతారు. ఇదే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.భారతదేశంలో క్రయోథెరపీ అభివృద్ధి– భవిష్యత్తు!ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ పెరుగుతున్న తరుణంలో భారత్ కూడా క్రయోథెరపీవైపు బాగానే మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో హెల్త్ అండ్ వెల్నెస్లో ఈ చికిత్సకు ప్రాధాన్యం పెరుగుతోంది. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి వాటిలో అధునాతన వెల్నెస్ సెంటర్లు, క్రయోథెరపీ క్లినిక్‌లు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రజలు, కొత్త వెల్నెస్ థెరపీలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణికి క్రీడాకారులు, సెలబ్రిటీల మద్దతు కూడా తోడైంది. వారి సానుకూల అనుభవాలే ఇప్పుడు ప్రజల్లో క్రయోథెరపీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి.ప్రధాన ప్రయోజనాలుకండరాల నొప్పిని వేగంగా, పూర్తిగా తగ్గించడం, గాయాలను త్వరగా నయం చేయడం వంటి ఫలితాలతో– క్రీడాకారులలో, ఫిట్నెస్ ఔత్సాహికులలో ఈ చికిత్స బాగా ప్రాచుర్యం పొందింది.ఫైబ్రోమయాల్జియా, కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం అందించడానికి ఈ ట్రీట్మెంట్ సహాయపడుతుంది.డెర్మటాలజిస్టులు, కాస్మెటిక్ క్లినిక్‌లు ఈ థెరపీని యాంటీ–ఏజింగ్ లక్షణాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, వృద్ధాప్యం వల్ల శరీరంపై ఏర్పడే ముడతలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ‘ఇన్ఫ్లమేజింగ్’ (వయసు పెరగడంతో వచ్చే దీర్ఘకాలిక వాపుల సమస్య)ను తగ్గించి, వృద్ధాప్య సంకేతాలను కాస్త దూరం చేయగలుగుతుంది. క్రయోథెరపీతో జీవక్రియ వేగం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొవ్వును కరిగించే చికిత్సగా ఇది ఫిట్నెస్ మెయింటెనెన్స్‌లో భాగమవుతోంది.క్రయోథెరపీ ఎండార్ఫిన్ ల (ఫీల్–గుడ్ కెమికల్స్) విడుదలకు ఉపయోగపడుతుంది. దాంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గుతాయి.నగరాల్లో నివసించే ప్రజలు ఇలాంటి చికిత్సల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇది క్రయోథెరపీకి పెద్ద మార్కెట్‌ను సూచిస్తుంది. అలాగే సోషల్ మీడియా, హెల్త్ బ్లాగులతో ఈ చికిత్స గురించి అవగాహన కూడా బాగానే పెరుగుతోంది.స్పోర్ట్స్–ఫిట్‌నెస్‌ల మీద అవగాహన, ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఈ థెరపీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అథ్లెట్ల తమ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవడానికి, క్రీడా అకాడమీలు ఈ థెరపీని తమ శిక్షణ కార్యక్రమాలలో భాగం చేసుకుంటున్నాయి.ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్, స్పాలు వంటి ఇతర వెల్నెస్ చికిత్సలతో క్రయోథెరపీని అనుసంధానం చేయడంతో భవిష్యత్తులో పూర్తి ఆరోగ్య ప్యాకేజీని కోరుకునే కస్టమర్లను ఆకర్షించవచ్చు.‘తక్కువ ధర, అధిక నాణ్యత’ అనే స్లోగన్‌తో భారత్ ఇప్పటికే చాలా వైద్య విధానాలతో విదేశీ రోగులను ఆకర్షిస్తోంది. క్రయోథెరపీని మెడికల్ టూరిజం ప్యాకేజీలలో చేర్చడంతో అంతర్జాతీయ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.∙ఈ చికిత్సలో సాంకేతిక పురోగతులు వేగంగా వస్తున్నాయి. క్రయో పోర్టబుల్ యంత్రాలలో, మెరుగైన, సురక్షితమైన క్రయో చాంబర్లలో టెక్నాలజీ మరింత అప్డేట్ అవుతోంది.క్రయోథెరపీ మార్కెట్ ఎన్నుకునేవారికి సవాళ్లు–సూచనలుసామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో క్రయోథెరపీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వైద్యరంగాన్ని తనవైపు తిప్పుకోనున్న క్రయోథెరపీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? పెట్టుబడిపరంగా, విద్యపరంగా ఈ రంగాన్ని ఎంచుకునేవారికి ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి?ఆధునిక క్రయోథెరపీ యంత్రాల దిగుమతి, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోంది, ఇది కొత్త పారిశ్రామికవేత్తలకు అడ్డంకిగా మారుతుంది.సాధారణ ప్రజలు, వైద్య నిపుణులలో కూడా క్రయోథెరపీ ప్రయోజనాలు, భద్రత గురించి మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.ఈ క్రయో చికిత్సలకు సంబంధించి – భారత్‌లో సంక్లిష్టమైన చట్టపరమైన నిబంధనలను పాటించడం కాస్త సవాలుగా మారుతుంది.ఈ సవాళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అవసరం. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, అలాగే వ్యాయామశాలలు, వెల్నెస్ రిసార్ట్‌లతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ఈ చికిత్సను ప్రజలకు చేరువ చేయగలవు. అంతేకాకుండా, ప్రారంభ ఖర్చులను తగ్గించడానికి తక్కువ–ధర కలిగిన నాణ్యమైన పరికరాలపై దృష్టి పెట్టాలన్నది ఒక సూచన.లాభనష్టాలు!ఈ చికిత్సతో ఏర్పడిన పుండు సాధారణంగా ఒకటి నుంచి మూడు వారాల్లో నయమవుతుంది. క్రయోసర్జరీ తర్వాత, కొద్ది రోజులు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా పుండ్లు ఉండొచ్చు. కొన్నిసార్లు, అసాధారణ కణజాలాన్ని పూర్తిగా తొలగించడానికి ఒకరికంటే ఎక్కువ క్రయోథెరపీలు అవసరం కావచ్చు. అయితే ఈ థెరపీతో నరాలు దెబ్బతినడం, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఎముకల పగుళ్లు (క్రయోసర్జరీ కారణంగా), గర్భాశయం చుట్టూ రక్తస్రావం లేదా తిమ్మిరి వంటివి తలెత్తొచ్చు. ఇవన్నీ అరుదుగా ఏర్పడే సమస్యలు మాత్రమే! చాలామంది క్రయోథెరపీ తీసుకున్న తర్వాత త్వరగా కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం చాలామంది ఆర్థోపెడిక్స్ నుంచి ఆంకాలజీల వరకూ క్రయోథెరపీ గురించే చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలించగానే ప్రత్యేక శిక్షణలు తీసుకుంటారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి క్రయోటెక్నాలజీని నేర్చుకునేందుకు చొరవ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రయోథెరపీ– అన్ని వైద్య సేవలతో అన్ని అనారోగ్యాలకు తిరుగులేని చికిత్సగా మారితే ఈ ప్రపంచం వైద్యశాస్త్రంలో మరో మెట్టు ఎక్కినట్లే!భారతదేశంలో క్రయోథెరపీ భవిష్యత్తుపై భారీ అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ థెరపీ పాత్ర ఇలా– పలు కారణాలతో ఈ రంగంలో అభివృద్ధికి విస్తృతమైన అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కండరాల రికవరీ, వాపును తగ్గించడం, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ వంటి వివిధ పరిస్థితులకు క్రయోథెరపీని ఉపయోగించడంపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్రయోథెరపీ తప్పకుండా ప్రత్యేక స్థానంలో నిలుస్తుందనేది ఒక అంచనా.గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థల నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రయోథెరపీ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఈ క్రయోథెరపీ మార్కెట్ 2024లో 3.6 మిలియన్ డాలర్ల (రూ.31.74 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ లెక్కన 2030 నాటికి 7.0 మిలియన్ డాలర్ల (రూ.61.72 కోట్లు) ఆదాయాన్ని చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2025 నుంచి 2030 వరకు 11.6% వార్షిక వృద్ధి రేటు ఉంటుందని లెక్కలేస్తున్నారు.ప్రపంచంలో క్రయోథెరపీ మార్కెట్‌పై సర్వేప్రపంచవాప్తంగా ప్రముఖ క్రయోథెరపీ సంస్థలు– డెన్మార్క్, ఐర్లండ్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థలు సర్జికల్, లోకలైజ్, హోల్–బాడీ క్రయోథెరపీ పరికరాలను తయారు చేసి, అన్ని ఆసుపత్రులకు, చికిత్స కేంద్రాలకు అమ్ముతున్నారు. అలాగే నిర్వహణ సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రయోథెరపీ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఎలా అభివృద్ధి చెందబోతుంది? అని ‘డేటా బ్రిడ్జ్ మార్కెట్ రీసర్చ్’ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వేల్లో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఏషియా–పసిఫిక్, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో క్రయోథెరపీ అభివృద్ధి గురించి ఈ రీసెర్చ్ సెంటర్ స్పష్టమైన లెక్కలిచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త దేశాలు, కొత్త వినియోగదారులు పెరుగుతున్నారని తేల్చింది. ఆ వివరాలు ఈ చార్ట్‌లో చూడొచ్చు.క్రయోథెరపీలో పద్ధతులు– జాగ్రత్తలుక్రయో చాంబర్లోకి ప్రవేశించే ముందు, చర్మం పొడిగా, శుభ్రంగా ఉండాలి.చికిత్సకు 6–12 గంటల ముందు రోగి తినడం, తాగడం మానేయమని చెబుతారు. ముందు నుంచి కోల్డ్ అలెర్జీ, రక్తనాళాల సమస్యలు, రేనాడ్స్ వ్యాధి వంటివి ఉన్న వారు ఈ థెరపీ చేయించుకోరాదు.క్రయో చాంబర్కి తడి బట్టలు వేసుకోకూడదు. ఎలాంటి గాడ్జెట్లను తీసుకెళ్లకూడదు.గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారితో పాటు గర్భవతులు కూడా ఈ చికిత్సకు దూరంగా ఉండాలి. -
గంధర్వులను జయించిన భరతుడు
రాముడి అశ్వమేధయాగం విజయవంతంగా పూర్తయిన కొన్నాళ్లకు ఒకనాడు కేకయ దేశాధీశుడు యుధాజిత్తు తన గురువు, అంగిరస పుత్రుడైన గార్గ్యుడిని రాముడి వద్దకు పంపాడు. రాముడికి కానుకగా పదివేల జవనాశ్వాలు, ఐదువేల ఏనుగులు, అరుదైన మణిమాణిక్యాలు, చీనీచీనాంబరాలు, అనేక స్వర్ణాభరణాలను పంపాడు. మహర్షి అయిన గార్గ్యుడు తన రాజ్యంలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకుని రాముడు తన తమ్ములతో కలసి క్రోసు దూరం ఎదురువెళ్లి, గార్గ్యుడికి ఘనస్వాగతం పలికి, ఆయనను పూజించాడు. ఆయనను సగౌరవంగా తన సభామందిరానికి తోడ్కొనిపోయాడు.గార్గ్యుడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టి, ‘మహర్షీ! సాక్షాత్తు బృహస్పతి వంటి మిమ్మల్ని మా మేనమామ నా వద్దకు పంపిన కారణమేమిటి? ఆయన ఏమైనా చెప్పాడా?’ అని అడిగాడు.‘రామా! మీ మేనమామ యుధాజిత్తు నీతో చెప్పమన్న సందేశాన్ని చెబుతున్నాను విను! మా కేకయ రాజ్యానికి ఇరువైపులా గంధర్వ రాజ్యం ఉంది. శైలూషుడనే వాడు గంధర్వులకు రాజు. అమిత బలశాలురు, యుద్ధ విశారదులు, కామరూపధారులు అయిన గంధర్వులు కేకయ రాజ్యానికి చిరకాలంగా సమస్యగా మారారు. అందువల్ల నువ్వు గంధర్వ రాజ్యాన్ని జయించి, అక్కడ నీ అధీనంలో రెండు నగరాలు నిర్మించుకున్నట్లయితే ప్రశస్తంగా ఉండగలదు’ అని చెప్పాడు.‘మహర్షీ! తప్పకుండా మా మేనమామ చెప్పిన ప్రకారమే చేస్తాను. ఈ కార్యభారాన్ని నా సోదరుడు భరతుడికి అప్పగిస్తున్నాను. భరతుడి కుమారులైన తక్షుడు, పుష్కలుడు మా మేనమామ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోగలరు. వీరులైన ఈ కుమారులిద్దరూ భరతుడితో కలసి, గంధర్వరాజ్యాన్ని జయించుకోగలరు. భరతుడు కుమారులిద్దరికీ రెండు నగరాలను నిర్మించి ఇచ్చి, తిరిగి నా వద్దకు రాగలడు’ అని పలికాడు.తర్వాత రాముడు సైన్యాన్ని సమాయత్తం చేసి, భరతుడికి అప్పగించాడు. భరతుడి కుమారులిద్దరికీ గంధర్వరాజ్యంలో నిర్మించబోయే పురాలకు అధిపతులుగా పట్టాభిషేకం జరిపించాడు. సుముహూర్తం చూసుకుని, గార్గ్యుడిని ముందుంచుకుని భరతుడు తన కుమారులను, సైన్యాన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. రాముడు ఆ సైన్యాన్ని అయోధ్య నగరం పొలిమేరల వరకు అనుసరించి, సాగనంపాడు. భరతుడి సైన్యం వెంట వేలాది క్రూరమృగాలు, భయంకరమైన రాక్షసమూకలు కూడా యుద్ధంలో శత్రువుల రక్తం తాగాలనే కోరికతో బయలుదేరాయి. దారిలో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, మూడు పక్షాలు ప్రయాణం చేశాక భరతుడి సైన్యం కేకయ దేశంలోకి ప్రవేశించింది. యుధాజిత్తు భరతుడికి, అతడి సైన్యానికి ఘనస్వాగతం పలికాడు. గార్గ్యుడిని పూజించి, సత్కరించాడు. తర్వాత తన సైన్యాన్ని కూడా సమాయత్తం చేసి, భరతుడి సైన్యంతో కలసి వెళ్లి గంధర్వదేశాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించాడు. యుధాజిత్తు తన మేనల్లుడు భరతుడితో కలసి వచ్చి, రాజ్యాన్ని ముట్టడించిన సంగతి తెలుసుకున్న గంధర్వులు రెచ్చిపోయారు. రథాలను, ఆయుధాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరారు.భరతుడి సైన్యానికి, గంధర్వులకు ఏడురోజులు హోరాహోరీగా యుద్ధం సాగింది. ఇరువైపులా పెద్దసంఖ్యలో సైనికులు నేలకొరిగారు. భరతుడి సైన్యం వెంట వచ్చిన క్రూరమృగాలు నేలకొరిగిన వారిని సుష్టుగా ఆరగించసాగాయి. జయాపజయాలు ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది. సహనం నశించిన భరతుడు చివరకు సంవర్తాస్త్రాన్ని ప్రయోగించాడు. యముడి కాలదండంలాంటి సంవర్తాస్త్రం నిప్పులు చిమ్ముతూ వెళ్లి నిమిషం వ్యవధిలోనే మూడుకోట్ల మంది గంధర్వులను మట్టుబెట్టింది. భరతుడు ఆ ఒక్క నిమిషంలో చేసిన యుద్ధం అంతకు మునుపు దేవతలు కూడా ఏ సందర్భంలోనూ చేసి ఎరుగరు. గంధర్వులపై భరతుడి యుద్ధాన్ని ఆకాశమార్గం నుంచి దేవతలు చకితులై తిలకించారు. యుద్ధం ముగిసిన వెంటనే భరతుడి పరాక్రమానికి నీరాజనంగా పుష్పవృష్టి కురిపించారు. గంధర్వ రాజ్యాన్ని దిగ్విజయంగా స్వాధీనం చేసుకున్న భరతుడు, అక్కడ ఐదేళ్లు ఉన్నాడు. ఆ ఐదేళ్లలో తన కుమారుల కోసం రెండు గొప్ప నగరాలను నిర్మించాడు. విలాసవంతమైన భవంతులు, మనోహరమైన ఉద్యానవనాలు, కళకళలాడే విపణి వీథులు, వినోద మందిరాలు, విశాలమైన రహదారులతో; అజేయమైన అశ్వశాలలు, గజశాలలు, సైనిక స్థావరాలతో; గొప్ప ధనాగారాలతో, ఆయుధాగారాలతో నిర్మించిన ఆ నగరాల నిర్మాణం ఇంద్రుడి అమరావతికి, కుబేరుడి అలకాపురికి తీసిపోని రీతిలో జరిగింది. వాటిలో తక్షశిల అనే నగరానికి తక్షుడిని, పుష్కలావత నగరానికి పుష్కలుడిని రాజులుగా చేశాడు. కొన్నాళ్లు కొడుకుల వద్ద ఉండి, వారికి రాజ్యపాలనలో అనుసరించవలసిన ధర్మసూక్షా్మలను బోధించి, భరతుడు తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకు చేరుకున్న తర్వాత నేరుగా రాముడిని కలుసుకున్నాడు. రాముడికి నమస్కరించి, గంధర్వరాజ్యాన్ని ముట్టడించినది మొదలుకొని, ఏడురోజులు జరిగిన యుద్ధాన్ని సవివరంగా చెప్పాడు. రెండు పురాలను నిర్మించి, తన కుమారులకు అప్పగించిన సంగతిని తెలిపాడు. భరతుడు సాధించిన విజయానికి రాముడు సంతోషించాడు. లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా భరతుడిని అభినందించారు. -
డిజిటల్ ట్రాప్‌లో టీనేజర్లు
నిఖిల్ పుస్తకం తెరిచాడు. కాని, ఒక్క నిమిషం కూడా ఒక్క పేజీపై చూపు నిలవడం లేదు. పక్కనే ఉన్న ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. అదేమిటో చూడాలని ఫోన్ తీసుకున్నాడు. అంతే, అరగంట గడిచిపోయింది. తల్లిదండ్రులు ‘చదువు మీద ఫోకస్ పెట్టు’ అంటారు. కాని, ఒక్క స్క్రోల్ ఆ ఫోకస్‌ను దూరం చేసేస్తోంది. అలా స్మార్ట్ఫోన్లు మెల్లగా మన యువతలోని ప్రతిభను, శ్రద్ధను, స్వీయ నియంత్రణను కమ్మేస్తున్నాయి. కనబడని ఉచ్చు...ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లు రోజుకు సగటున ఏడుగంటలకు పైగా స్క్రీన్ ముందు గడుపుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అందులో చదువుకు సంబంధించిన సమయం కేవలం10 శాతం మాత్రమే! మిగతా సమయం రీల్స్, గేమ్స్, షార్ట్స్, చాట్స్ – ఇవే వారి కొత్త ‘రియాలిటీ’.ఫోన్ మొదట క్యూరియాసిటీగా మొదలవుతుంది. తర్వాత ‘డిస్ట్రాక్షన్’, చివరికి ‘డిపెండెన్సీ’. చివరకు మెదడు ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతుంది. అదే ‘డిజిటల్ డిపెండెన్సీ సిండ్రోమ్’.మార్కులపై తీవ్ర ప్రభావం... రోజుకు నాలుగు గంటలకు పైగా ఫోన్ వాడే విద్యార్థుల జీపీఏ సగటున 0.5 పాయింట్లు తక్కువగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో 2023లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువుకుంటూ మధ్యలో ఫోన్ చెక్ చేసే విద్యార్థుల మెమరీ రిటెన్షన్ (గుర్తుంచుకునే సామర్థ్యం) 40 శాతం వరకు తగ్గుతుందని మరొక పరిశోధన చెప్తోంది. ఎందుకంటే, ప్రతి ‘చెక్’ మెదడును రీసెట్ చేస్తుంది. ఫోకస్‌ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి సగటున 23 నిమిషాలు పడుతుంది. అంటే ఫోన్ కేవలం సమయాన్ని తినేయడమే కాదు, మెదడు పనితీరునే మార్చేస్తుంది. భావోద్వేగ అస్థిరత...ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం,ప్రతి 10 మంది యువతలో ఒకరికి ప్రాబ్లమాటిక్ ఫోన్ యూజ్ లక్షణాలు ఉన్నాయి. ఫోన్ లేకపోతే కలిగే ఆందోళనను ‘నోమోఫోబియా’ అంటారు. ఇది మద్యం వ్యసనానికి సమానంగా ప్రభావితం చేస్తుంది.ఈ వ్యసనం వల్ల కలిగే ప్రధాన లక్షణాలు: చిన్న విషయానికే కోపం, చదువుపై విసుగు, నిద్రలేమి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, స్నేహ సంబంధాలు కోల్పోవడం.భావోద్వేగ గందరగోళంస్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువత తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితికి చేరుతున్నారు.ఎవరూ తన స్టోరీ చూడలేదంటే లోమూడ్. ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదంటే యాంగ్జయిటీ. రీల్‌కు తక్కువ లైక్స్ వస్తే సెల్ఫ్–డౌట్. ఇదే ‘డిజిట్ అప్రూవల్ అడిక్షన్’. దీంతో టీనేజర్లు ఆన్లైన్లో సంతోషంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కాని, ఆఫ్‌లైన్‌లో మనసు లోపల ఖాళీగా ఉంటారు.మరచిపోయిన నిద్ర... టీనేజ్ వయస్కుల్లో 60 శాతంమంది రాత్రి 12 తర్వాత కూడా స్క్రీన్ ముందు ఉంటున్నారని లాన్సెట్ మేగజైన్ 2024లో పేర్కొంది. రాత్రి స్క్రీన్ లైట్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వలన నిద్ర సైకిల్ దెబ్బ తింటుంది. తరువాత రోజు అలసట, ఆందోళన, శ్రద్ధలేమి పెరుగుతాయి.నిద్ర అంటే మెదడు డేటాను ‘సేవ్’ చేసుకునే సమయం. నిద్ర తగ్గితే, నేర్చుకున్నది కూడా తాత్కాలికంగానే మిగులుతుంది. రాత్రి రీల్ చూసి నవ్విన నిమిషం, రేపటి పరీక్షలో గుర్తు రాని సమాధానంగా మారిపోతుంది.తల్లిదండ్రుల ప్రతిబింబంచాలా తల్లిదండ్రులు పిల్లల ఫోన్ అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తారు కాని, తమ సొంత అలవాట్లను గమనించరు. పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తనను ఎక్కువగా కాపీ చేస్తారు. అందుకే, తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్లో ఉంటే, పిల్లల మెదడు అదే నేర్చుకుంటుంది. దాంతో వారి మధ్య ‘ఫోన్’ అడ్డుగోడగా నిలుస్తోంది. డిన్నర్ టేబుల్ సైలెన్స్ గా మారిపోయింది. పలకరింపులు మెసేజ్‌లకు పరిమితమవుతున్నాయి.ఫోను కాదుఅలవాటును మార్చండిఇవన్నీ చూసిన పేరెంట్స్ పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్ లాగేసుకుంటారు. కాని, ఫోన్‌ను నిషేధించడం పరిష్కారం కాదు. ఫోన్‌ను నియంత్రించడం నేర్పడం ముఖ్యం.1 వారంలో కనీసం ఒకరోజు ‘నో ఫోన్ ఈవెనింగ్.’ డిన్నర్ తర్వాత ఒక గంట, ఫోన్ దూరంగా ఉంచి కుటుంబ సంభాషణ చేయండి.2 రాత్రి 9 తర్వాత ఫోన్ దూరంగా ఉంచే నియమం పెట్టండి. నిద్రకు ముందు పుస్తకం, సంగీతం లేదా నిశ్శబ్దం.3 ఫోన్ వాడేటప్పుడు ‘ఇది నాకు అవసరమా లేదా అలవాటా?’ అని అడగాలి. ప్రతి స్క్రోల్‌కు ముందు ఒక క్షణం విరామం తీసుకోండి.4 25 నిమిషాలు చదువు తర్వాత ఐదునిమిషాల బ్రేక్ తీసుకోండి. ఇది మెదడు ఫోకస్‌ను క్రమబద్ధం చేస్తుంది.5 పిల్లలతో భావోద్వేగాల గురించి మాట్లాడండి. వారు ఫోన్‌తో ఎందుకు గడుపుతున్నారో అర్థం చేసుకునేలా చెప్పండి.-సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com


