యంగ్ బాలీవుడ్ జనరేషన్స్ కి కొత్త స్టయిల్ మూడ్ సెట్ చేస్తున్న అనన్యా పాండే, ఫ్యాషన్స్ లో పెద్ద హంగామా కాకుండా, తానెలా ఫీలవుతుందో అలా ధరించడమే తన సీక్రెట్ అంటోంది. ఆ స్టయిల్ విషయాలే ఇక్కడ మీ కోసం!
‘ఫ్యాషన్స్ అంటే ఓ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ . నేను ఎలా ఫీలవుతున్నానో, అదే నా లుక్. డ్రెస్ ఏదైనా అయినా, నా స్టయిల్ నచ్చేలా ఉన్నప్పుడు అది సింపుల్ అయినా, క్లాసీ అయినా నిజంగా స్టయిలిష్‌గా కనిపిస్తుంది.’
జ్యూలరీ బ్రాండ్: జడావూ జ్యూలర్స్
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
చీర.. బ్రాండ్: మనీష్ మల్హోత్ర ధర రూ. 2,25,000
గ్లామర్ తాళ్లు!
శారీ బ్లౌజ్ వెనుక దారాలు అంటే ఒకప్పుడు కేవలం కట్టుకునేందుకు మాత్రమే ఉండేవి కాని, ఇప్పుడు అవే దారాలు మన లుక్‌ని ‘ఓహ్ వావ్!’ అనిపించే స్టయిల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా వెనుక భాగంలో రకరకాలుగా కట్టే డోరీస్‌కి గంటలు, తారలు, త్రెడ్ టసెల్స్ జత చేస్తే బ్లౌజ్ బ్యాక్ ఒక ఆర్ట్‌లా మెరిసిపోతుంది. అదేవిధంగా సారీ పల్లు దారాలను కూడా డిజైన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రత్యేకంగా పండగలు, పెళ్లిళ్లు, హల్దీ లాంటి ఫంక్షన్లలో ఈ డోరీస్ ఎంత డిజైనర్‌గా ఉంటే అంత రిచ్‌గా కనిపిస్తాయి.
అలాగే ఏ రంగు శారీ అయితే దానికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ లేదా టోన్స్ ఆన్స్ టోన్స్ దారాలు ఎంచుకుంటే బాగా సెట్ అవుతాయి. బ్లౌజ్ డోరీస్ అయితే కొంచెం మృదువుగా ఉండే వెల్వెట్ లేదా సిల్క్ తాళ్లు మంచివి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటే చర్మానికి గాట్లు పడే అవకాశం ఉంటుంది. పల్లు దారాలు మాత్రం కొంచెం బీడ్స్‌తో ఉంటే మంచిది, ఎందుకంటే అవే పల్లు స్లిప్ కాకుండా పట్టేసి ఉంచుతాయి. మొత్తానికి ఈ దారాలు అటూ ఇటూ ఊగుతూ అందరి మనసులు లాగేస్తాయి!


