
బాలీవుడ్ నటి అనన్య పాండే న్యూఢిల్లీలో నాలుగు గంటల ఫ్యాషన్ అండ్ గ్లో-అప్ సెషన్‌ను నిర్వహించనున్నారు. 'ది స్టైల్ ఎడిట్' పేరుతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో.. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్, హెయిర్‌స్టైలిస్ట్ ఆంచల్ మోర్వానీ, మేకప్ ఆర్టిస్ట్ రిద్దిమా శర్మ, ఫోటోగ్రాఫర్ రాహుల్ ఝంగియాని వంటి ఆమె ప్రొఫెషనల్ బృందం ఉంటుంది. ఈ సెషన్ న్యూఢిల్లీలోని ఎయిర్‌బీఎన్‌బీ ప్రాపర్టీలో జరుగుతుంది. దీనికోసం బుకింగ్స్ 2025 ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యాయి.
ది స్టైల్ ఎడిట్ కార్యక్రమంలో పాల్గొనాలకునేవారు.. ఆగస్టు 21, 2025న airbnb.com/ananyaలో భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల తరువాత బుక్ చేసుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెషన్‌కు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారే.. ఢిల్లీకి రావడానికి, తిరిగి వెళ్ళడానికి అయ్యే మొత్తం ఖర్చులను భరించుకోవాల్సి ఉంటుంది.
నేను క్యూరేట్ చేసి హోస్ట్ చేసిన "అనన్యస్ స్టైల్ ఎడిట్" ద్వారా నా గ్లిట్జ్.. గ్లామర్ ప్రపంచంలోకి అతిథులను స్వాగతించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఒక నటిగా నా వ్యక్తిత్వంలో ఫ్యాషన్, సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ అతిథులతో పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కోసం నేను వేచి ఉన్నాను, అని అనన్య పాండే అన్నారు.
జెన్ జెడ్ కల్చర్ ఐకాన్‌ను అనన్య పాండేతో కలిసి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులు హోస్ట్ చేసిన అసాధారణ అనుభవాలను దీని ద్వారా అందిస్తున్నాము. దీనికి అనన్య స్టైల్ ఎడిట్ ఒక ఉదాహరణ. ఈ సెషన్‌లో పాల్గొనేవారు మరపురాని అనుభవాలను పొందవచ్చు అని ఇండియా అండ్ ఆగ్నేయాసియా ఎయిర్‌బీఎన్‌బీ హెడ్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.