రిటర్నుల్లో విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించనందుకే
న్యూఢిల్లీ: 2025–26 అసెస్‌మెంట్ ఇయర్‌కి (ఏవై) గాను దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నుల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి ఆదాయ పన్ను శాఖ త్వరలో ఎస్‌ఎంఎస్‌లు/ఈ–మెయిల్స్ పంపించనుంది. చట్టపరమైన చర్యలను నివారించేందుకు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలంటూ తొలి దశలో 25,000 ‘హై–రిస్‌్క’ కేసులుగా పరిగణిస్తున్న వారికి వీటిని పంపించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో దశలో డిసెంబర్ మధ్య నుంచి మిగతా కేసులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించాయి.
ఆటోమేటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద విదేశీ జ్యూరిస్‌డిక్షన్ల నుంచి వచి్చన సమాచారాన్ని బట్టి, విదేశాల్లో ఆస్తులున్నప్పటికీ ఆ వివరాలను వెల్లడించని నిర్దిష్ట ట్యాక్స్‌పేయర్లకు డిపార్ట్‌మెంట్ గతేడాది కూడా ఇలాగే ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు పంపించింది. దీంతో నోటీసులు వచ్చిన వారు, రాని వారు మొత్తం మీద 24,678 మంది రూ. 29,208 కోట్ల విలువ చేసే విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ వరకు ఆదాయ పన్ను శాఖ 1,080 కేసులను మదింపు చేసి, రూ. 40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే తదితర నగరాల్లో పలు సోదాలు నిర్వహించింది.


