ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి | Director Maruthi Says Sorry at The Raja Saab Movie Blockbuster Success Meet | Sakshi
Sakshi News home page

ఆ సీన్స్‌ యాడ్‌ చేస్తున్నాం .. గుడ్‌న్యూస్‌ చెప్పిన మారుతి

Jan 10 2026 2:27 PM | Updated on Jan 10 2026 3:32 PM

Director Maruthi Says Sorry at The Raja Saab Movie Blockbuster Success Meet

'రాజాసాబ్‌ సినిమా చూసి ప్రభాస్‌ అభిమానులు డిసప్పాయింట్‌ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్‌ గెటప్‌లో చూపించాం. థియేర్‌లో ఆ సీన్స్‌ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన చిత్రం ది రాజాసాబ్‌. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్‌ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. 

బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌
థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్‌ అంటూ సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టింది చిత్రయూనిట్‌. 'రాజాసాబ్‌.. కింగ్‌ సైజ్‌ బ్లాక్‌బస్టర్‌' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్‌ థియేటర్‌లో ప్రీమియర్స్‌ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. 

సారీ
మారుతి మాట్లాడుతూ.. విమల్‌ థియేటర్‌ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్‌ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్‌.

మూడేళ్ల కష్టం
నెక్స్ట్‌.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్‌ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ఒక్కరోజులో డిసైడ్‌ చేయొద్దు
ఇకపోతే సినిమా రిజల్ట్‌ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్‌ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.

రియల్‌ రాజాసాబ్‌
ట్రైలర్‌లో ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ చూపించాం. సినిమాలో ఆ సీన్స్‌ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్‌ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్‌ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్‌ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.

చదవండి: మాట మీద నిలబడ్డ  మెగాస్టార్‌ చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement